హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) మస్జిదె నబవి (ప్రవక్త మస్జిదు) ని పునర్నిర్మించినపుడు ప్రజలు ఆయన్ని ఏవేవో మాటలు అన్నారు. హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) ఆ మాటలు విని ఇలా అన్నారు. “మీరు లేనిపోని మాటలు అంటున్నారు గాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏమన్నారో తెలుసా? ‘కేవలం దేవుని ప్రసన్నత కోసం ఎవరైనా మస్జిదు నిర్మిస్తే అతని కోసం దేవుడు అలాంటిదే ఒక ఇల్లు స్వర్గంలో నిర్మిస్తాడు’ అని అన్నారాయన.”
[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం – సలాత్, 65 వ అధ్యాయం – మన్ బనా మస్జిద్]
ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 4 వ అధ్యాయం – మస్జిదుల నిర్మాణం పట్ల ప్రోత్సాహం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
You must be logged in to post a comment.