తయమ్ముమ్ పద్దతి – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో, టెక్స్ట్]

తయమ్ముమ్ పద్దతి
https://youtu.be/Cc_1VB72Sak [9 నిముషాలు]
వక్త: హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ ఆచారమైన ‘తయమ్ముమ్’ (పొడి శుద్ధీకరణ) గురించి వివరించబడింది. ఇందులో తయమ్ముమ్ యొక్క అక్షరార్థం మరియు షరియత్ ప్రకారం దాని అర్థం, సూరహ్ అన్-నిసా మరియు సూరహ్ అల్-మాయిదా నుండి ఖురాన్ ఆధారాలు, నీరు అందుబాటులో లేనప్పుడు లేదా అనారోగ్యం వంటి నిర్దిష్ట పరిస్థితులలో తయమ్ముమ్ ఎప్పుడు అనుమతించబడుతుంది, ఏ పదార్థాలను (స్వచ్ఛమైన మట్టి మరియు దాని రకాలు) ఉపయోగించవచ్చు, దానిని ఆచరించే సరైన పద్ధతి మరియు దానిని చెల్లకుండా చేసే చర్యలు వివరించబడ్డాయి.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్.

అభిమాన సోదరులారా! అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ రోజు మనం తయమ్ముమ్ గురించి తెలుసుకోబోతున్నాం.

తయమ్ముమ్ అంటే సంకల్పించటం అని అర్థం. శాబ్దిక అర్థం.

షరియత్ పరిభాషలో తయమ్ముమ్ అంటే, ప్రయాణంలో ఉన్నప్పుడు గానీ, ప్రయాణికుడు స్థానికంగా గానీ, వుజూ ఘుసుల్ లో మాదిరి పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో రెండు చేతుల్ని మట్టిపై కొట్టి ముఖాన్ని, చేతులను స్పర్శించుకోవడాన్ని కోవటం అని అర్థం.

ఈ తయమ్ముమ్ గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో సూర నిసా అలాగే సూర మాయిదాలో కూడా సెలవిచ్చాడు. తయమ్ముమ్ గురించి. సూర నిసాలో ఆయత్ ఇలా ఉంటుంది.

وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ

(వ ఇన్ కున్ తుమ్ మర్దా అవ్ అలా సఫరిన్ అవ్ జాఅ అహదుమ్ మిన్ కుమ్ మినల్ గాఇతి అవ్ లామస్ తుమున్ నిసాఅ ఫలమ్ తజిదూ మాఅన్ ఫతయమ్మమూ సయీదన్ తయ్యిబన్ ఫమ్ సహూ బివుజూహికుమ్ వ అయ్దీకుమ్)

ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే, లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరయినా మలమూత్ర విసర్జన చేసివస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే – అట్టి స్థితిలో మీకు నీరు లభ్యం కానిపక్షంలో పరిశుభ్రమైన మట్టి(ని ఉపయోగించే) సంకల్పం చేసుకోండి. (దాంతో) మీ ముఖాలను, చేతులను తుడుచుకోండి. నిశ్చయంగా అల్లాహ్‌ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు. (సూర నిసా 4:43)

మీరు ఎప్పుడైనా అస్వస్థులై అయి ఉంటే, అస్వస్థులైతే లేక ప్రయాణంలో ఉంటే, లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జనం చేసి ఉంటే, లేక మీరు మీ స్త్రీలను తాకి ఉంటే అంటే సంభోగం చేసి ఉంటే, మీకు నీరు లభ్యం కాని పక్షంలో, కాలకృత్యాలు తర్వాత మలమూత్ర విసర్జన తర్వాత వుజూ తప్పనిసరి. సంభోగం తర్వాత ఘుసుల్ తప్పనిసరి. నీరు లభ్యం కాని పక్షంలో పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించండి. దానితో మీరు మీ ముఖాలను చేతుల్ని స్పర్శించుకోండి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ ఆయత్లో తెలియజేశాడు. అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ ఆయతులో ఘుసుల్ మరియు వుజూకి బదులు నీరు లేనప్పుడు తయమ్ముమ్ అనే అవకాశాన్ని, భాగ్యాన్ని, అనుమతిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనలకి ప్రసాదించాడు.

ఇక తయమ్ముమ్ ఏ సందర్భాలలో అనుమతి ఉంది? వుజూ మరియు ఘుసుల్ కి బదులు తయమ్ముమ్. కాకపోతే దానికి కొన్ని కండిషన్లు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలలోనే అనుమతి ఉంది.

ఒకటి, నీరు లేనప్పుడు. నమాజ్ కోసం తప్పనిసరిగా వుజూ చేయాలి, నీరు లేదు. తప్పనిసరిగా ఘుసుల్ చేయాలి, నీరు లేదు.

రెండవది, నీరు ఉన్నా త్రాగటానికి సరిపోతుంది. ఎంత నీరు ఉందంటే, తాగితే వుజూకి లేదు, వుజూ చేస్తే తాగటానికి లేదు. అలాంటప్పుడు. నీరు ఉన్నా తాగడానికి సరిపోయినప్పుడు.

మూడవది, నీటి ఉపయోగం మనిషికి హానికరం. అనారోగ్యం మూలంగా, ఏదో ఒక గాయం మూలంగా ఏదైనా సరే. నీటి ఉపయోగం మనిషికి హానికరం. అటువంటి సందర్భంలో.

నాలుగవది, ఒకవేళ నీరు మంచుగా, మంచులాగా చల్లగా ఉంది. వేడి చేసే అవకాశం కూడా లేదు. అటువంటి సందర్భంలో.

అలాగే ఐదవది, నీరు ఉన్నప్పటికీ నీటికి మనిషికి మధ్య ప్రాణ శత్రువు, అడవి మృగం, మరేదైనా ప్రాణాపాయం కలిగించే వస్తువు మధ్యలో ఉంది. అటువంటి సమయంలో తయమ్ముమ్ చేయవచ్చు.

ఈ ఐదు కారణాలు సందర్భాలలో వుజూ మరియు ఘుసుల్ కి బదులు తయమ్ముమ్ ఉంది.

ఏ వస్తువులతో తయమ్ముమ్ చేయాలి? పరిశుభ్రమైన మట్టితో గానీ లేదా మట్టి కోవకు చెందిన ఇతర వస్తువులతో తయమ్ముమ్ చేయాలి. ఉదాహరణకు ఇసుక, ఎండిపోయిన బూడిద, రాయి, కంకరరాళ్ళు మొదలగునవి.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయత్ లో చెప్పిన పదం ఏమిటి?

فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا
(ఫతయమ్మమూ సయీదన్ తయ్యిబా)

పరిశుభ్రమైన మట్టితో అన్నాడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా. అంటే సయీద్ అంటే ఏమిటి? సయీద్ అంటే భూమి ఉపరితల భాగం. అది మట్టి కావచ్చు, మట్టి లాంటి ఇతర వస్తువులు కూడా అవ్వచ్చు.

పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో, సంకల్పంతో బిస్మిల్లా అని పఠించాలి. ఆ తర్వాత రెండు చేతుల్ని పరిశుభ్రమైన మట్టి మీద కొట్టాలి. ఆ తర్వాత చేతుల్ని ఒక్కసారి ఊదాలి. చేతుల్ని ఒకసారి ఊదుకొని ముఖం మీద స్పర్శించుకోవాలి. ఆ తర్వాత చేతుల్ని మణికట్టు వరకు రుద్దుకోవాలి. ఎడమ చేత్తో కుడి చెయ్యి పైన, కుడి చేతితో ఎడమ చెయ్యి పైన.

చేతుల్ని మణికట్ల వరకు రుద్దుకోవాలి. ఎడమ చేత్తో కుడి చేయి పైన, కుడి చేత్తో ఎడమ చేయి పైన. ఆ తర్వాత చివర్లో వుజూ చేసిన తర్వాత పఠించే దుఆ తయమ్ముమ్ తర్వాత కూడా పఠించాలి.

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ. اللَّهُمَّ اجْعَلْنِي مِنَ التَّوَّابِينَ، وَاجْعَلْنِي مِنَ الْمُتَطَهِّرِينَ

(అష్ హదు అల్ లాఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు. అల్లాహుమ్మ జ’అల్నీ మినత్ తవ్వాబీన వ జ’అల్నీ మినల్ ముతతహ్ హిరీన్.)

ఇది తయమ్ముమ్ చేసే పద్ధతి. చాలా సింపుల్ గా, సులభంగా ఉంటుంది.

పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో, సంకల్పంతో బిస్మిల్లా అని పలకాలి. రెండు చేతుల్ని పరిశుభ్రమైన మట్టి మీద కొట్టాలి. చేతుల్ని ఒకసారి ఊదుకొని ముఖం మీద స్పర్శించుకోవాలి. ఆ తర్వాత ఎడమ చేత్తో కుడి చేయి పైన, కుడి చేత్తో ఎడమ చేయి పైన స్పర్శించుకోవాలి. ఆ తర్వాత వుజూ తర్వాత ఏ దుఆ పఠిస్తామో ఆ దుఆ పఠించాలి.

తయమ్ముమ్ దేని వల్ల భంగమైపోతుంది? ఏ కారణాల వల్ల తయమ్ముమ్ భంగమవుతుంది? తయమ్ముమ్ ని భంగపరిచే విషయాలు.

మొదటిది, ఏ కారణాల వల్ల వుజూ భంగం అవుతుందో అదే కారణాల వల్ల తయమ్ముమ్ కూడా భంగం అవుతుంది.

రెండవది, నీరు లభించినా లేదా నీరు ఉపయోగించే స్థితి ఏర్పడినా తయమ్ముమ్ భంగమైపోతుంది.

అభిమాన సోదరులారా! ఇది తయమ్ముమ్ గురించి కొన్ని విషయాలు. తయమ్ముమ్ అంటే శాబ్దిక అర్థం ఏమిటి, షరియత్ పరంగా తయమ్ముమ్ అంటే అర్థం ఏమిటి, ఏ సందర్భాలలో తయమ్ముమ్ చేయాలి, అలాగే ఏ వస్తువుతో తయమ్ముమ్ చేయాలి, తయమ్ముమ్ చేసే పద్ధతి ఏమిటి, తయమ్ముమ్ ని భంగం పరిచే విషయాలు ఇది మనం తెలుసుకున్నాం.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు హదీస్ కి సంబంధించిన జ్ఞానాన్ని ప్రసాదించు గాక. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ప్రతి విషయంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని అనుసరిస్తూ ఆయన సున్నత్ ని ధనాన్ని పాటించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్.

వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహ్.

మూత్ర తుంపరల నుండి అజాగ్రత్తగా ఉండుట | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో| టెక్స్ట్]

మూత్ర తుంపరల నుండి అజాగ్రత్తగా ఉండుట (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/3nniRG7Y6vU (12 నిముషాలు)
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో ఇస్లాంలో పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత, ముఖ్యంగా మూత్ర విసర్జన తర్వాత శుభ్రత గురించి వివరించబడింది. మూత్ర తుంపరల విషయంలో అజాగ్రత్తగా ఉండటం అనేది సమాధి శిక్షకు కారణమయ్యే ఒక పెద్ద పాపమని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీథ్ ద్వారా స్పష్టం చేయబడింది. చాడీలు చెప్పడం కూడా సమాధి శిక్షకు మరో కారణమని పేర్కొనబడింది. చిన్న పిల్లల మూత్రం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇస్లామిక్ ధర్మశాస్త్రపరమైన సులభమైన పరిష్కారాలు మరియు ఆధునిక కాలంలో మూత్రశాలల వాడకంలో ఉన్న ధార్మిక పరమైన ప్రమాదాల గురించి కూడా చర్చించబడింది.

ఇస్లాం యొక్క గొప్పతనం ఏమనగా అది మానవునికి మేలు చేయు ప్రతీ విషయం గురించి ఆదేశించింది. ఆ ఆదేశాల్లో మలినాల్ని, అపరిశుభ్రతను దూరం చేసి, మలమూత్ర విసర్జన తర్వాత నీళ్లతో లేక మట్టి పెడ్డలతో పరిశుద్ధ పరచుకోవాలన్న ఆదేశం కూడా ఉంది. పరిశుద్ధత పొందే విధానం సైతం స్పష్టంగా తెలుపబడినది.

అయితే కొందరు అపరిశుభ్రతను దూరం చేయడంలోనూ, సంపూర్ణ పరిశుభ్రతలోనూ అలక్ష్యం చేస్తారు, అంటే అశ్రద్ధ వహిస్తారు. ఆ కారణంగా వారి దుస్తులు, శరీరం అపరిశుభ్రంగా ఉండిపోతాయి. పైగా వారి నమాజు స్వీకరించబడదు. అంతేకాదు, అది సమాధి శిక్షకు కూడా కారణమవుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు.

مَرَّ النَّبِيُّ ﷺ بِحَائِطٍ مِنْ حِيطَانِ الْمَدِينَةِ فَسَمِعَ صَوْتَ إِنْسَانَيْنِ يُعَذَّبَانِ فِي قُبُورِهِمَا فَقَالَ النَّبِيُّ ﷺ يُعَذَّبَانِ وَمَا يُعَذَّبَانِ فِي كَبِيرٍ ثُمَّ قَالَ بَلَى {وفي رواية: وإنه لَكَبِير} كَانَ أَحَدُهُمَا لَا يَسْتَتِرُ مِنْ بَوْلِهِ وَكَانَ الْآخَرُ يَمْشِي بِالنَّمِيمَةِ…

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీన నగరంలోని ఒక తోట నుండి వెళ్తుండగా ఇద్దరు మనుషులకు వారి సమాధిలో శిక్ష పడుతున్నట్లు విన్నారు. అప్పుడు ఇలా చెప్పారు: “వారిద్దరు శిక్షించబడుతున్నారు, వారు శక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు”. మళ్లీ చెప్పారు: “ఎందుకు కాదు. పెద్ద పాపం చేసి నందుకే. వారిలో ఒకడు తన మూత్రతుంపరల నుండి జాగ్రత్త పడేవాడు కాదు. రెండోవాడు, చాడీలు చెప్పుకుంటు తిరిగేవాడు. (సహీ బుఖారీ 216, సహీ ముస్లిం 292)

ఇక్కడ ఈ హదీథ్ లో మీరు, “వారు శిక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు” అని ఒకసారి చదివి, మళ్ళీ వెంటనే “ఎందుకు కాదు? పెద్ద పాపం చేసినందుకే” దీని ద్వారా ఎలాంటి కన్ఫ్యూజన్ కు గురి కాకండి. ఇక్కడ మాట ఏమిటంటే, ఆ మనుషులు ఎవరికైతే సమాధిలో ఇప్పుడు శిక్ష జరుగుతున్నదో, వారు ఈ పాపానికి ఒడిగట్టినప్పుడు, ఇది పెద్ద పాపం అన్నట్లుగా వారు భావించేవారు కాదు. ఆ మాటను ఇక్కడ చెప్పే ఉద్దేశంతో ఇలాంటి పదాలు వచ్చాయి హదీథ్ లో. అర్థమైందా? అంటే, అసలు చూస్తే దానికి ఎంత శిక్ష ఘోరమైనది ఉన్నదో దాని పరంగా అది పెద్ద పాపమే. కానీ చేసేవారు పెద్ద పాపమని భయపడేవారు కాదు. ఆ పాపం చేసేటప్పుడు వారు అయ్యో ఇలాంటి పాపం జరుగుతుంది కదా అని కాకుండా, “ఏ పర్లేదు. ఈ రోజుల్లో ఎంతోమంది లేరా మన మధ్యలో?” అనుకుంటారు.

ప్రత్యేకంగా కాలేజీల్లో, అటు పనులో ఉండేటువంటి పురుషులు, యువకులు, చివరికి ఎన్నోచోట్ల యువతులు, ఇళ్లల్లో తల్లులు. నమాజ్ సమయం అయిపోయి, దాన్ని దాటి పోయే సమయం వచ్చింది. అంటే నమాజ్ సమయం వెళ్ళిపోతుంది. నమాజ్ చదివారా అంటే, లేదండీ కొంచెం తహారత్ లేదు కదా. ఎందుకు లేదు తహారత్? ఏ లేదు మూత్రం పోయినప్పుడు కొంచెం తుంపరలు పడ్డాయి. లేదా మూత్రం పోసిన తర్వాత నేను కడుక్కోలేకపోయాను.

ఇక ఇళ్లల్లో తల్లులు పిల్లల మూత్రం విషయంలో, “ఆ ఇక పిల్లలు మా సంకలోనే ఉంటారు కదా, మాటిమాటికీ మూత్రం పోస్తూ ఉంటారు, ఇక ఎవరెవరు మాటిమాటికీ వెళ్లి చీర కట్టుకోవడం, మార్చుకోవడం, స్నానం చేయడం ఇదంతా కుదరదు కదా అండీ” అని ఎంతో సులభంగా మాట పలికేస్తారు. కానీ ఎంత ఘోరమైన పాపానికి వారు ఒడిగడుతున్నారు, వారు సమాధి శిక్షకు గురి అయ్యే పాపానికి ఒడిగడుతున్నారు అన్నటువంటి విషయం గ్రహిస్తున్నారా వారు?

ఆ బహుశా ఇప్పుడు ఇక్కడ మన ప్రోగ్రాంలో ఎవరైనా తల్లులు ఉండి వారి వద్ద చిన్న పిల్లలు ఉండేది ఉంటే వారికి ఏదో ప్రశ్న కొంచెం మొదలవుతుంది కావచ్చు మనసులో. అయ్యో ఇంత చిన్న పిల్లల, వారి మూత్రముల నుండి మేము ఎలా భద్రంగా ఉండాలి, దూరంగా ఉండాలి? పిల్లలే కదా, ఎప్పుడైనా పోసేస్తారు, తెలియదు కదా. మీ మాట కరెక్ట్, కానీ నా ఈ చిన్న జీవితంలో నేను చూసిన ఒక విచిత్ర విషయం ఏంటంటే, చిన్నప్పటి నుండే పిల్లలకు మంచి అలవాటు చేయించాలి మనం. ఎందరో తత్వవేత్తలు, మాహిరే నఫ్సియాత్, సైకియాట్రిస్ట్, ప్రత్యేకంగా పిల్లల నిపుణులు చెప్పిన ఒక మాట ఏమిటంటే సర్వసామాన్యంగా మీరు గ్రహించండి, ఎప్పుడైనా ఈ విషయాన్ని మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పుట్టిన పిల్లలు అయినప్పటికీ వారు మూత్రం పోసుకున్నారంటే, స్వాభావికంగా వారు ఏడవడమో, అటూ ఇటూ పక్క మార్చడమో, ఇట్లాంటి ఏదో కదలిక చేస్తూ ఉంటారంట. ఎందుకు? తల్లి తొందరగా గుర్తుపట్టి ఆ పిల్లల్ని, చంటి పాపల్ని త్వరగా శుభ్రపరచాలని. అయితే తల్లులు ఈ విషయాన్ని గమనించాలి మరియు వారు పిల్లలకు చిన్నప్పటి నుండే మంచి అలవాటు చేసే ప్రయత్నం చేయాలి. రెండోది, పిల్లలు చెప్పి మూత్రం పోయరు. ఇంకా చిన్న పిల్లలకైతే చెప్పడం కూడా రాదు, కరెక్టే. కానీ ఇక పోస్తూనే ఉంటారు కదా అని, మీరు అదే అపరిశుభ్ర స్థితిలో, అశుద్ధ స్థితిలో ఉండటం ఇది కూడా సమంజసం కాదు. ఎప్పటికి అప్పుడు మీరు అపరిశుభ్రతను దూరం చేసుకోవాలి.

మూడో విషయం ఇక్కడ గమనించాల్సింది, ఇస్లాం అందుకొరకే చాలా ఉత్తమమైన ధర్మం. మీరు దీని యొక్క బోధనలను చదువుతూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి అని మాటిమాటికీ మేము మొత్తుకుంటూ ఉంటాము. ఎంత ఎక్కువగా ఇస్లాం జ్ఞానం తెలుసుకుంటారో, అల్లాహ్ మనపై ఎంత కరుణ కనుకరించాడో అన్నటువంటి విషయం కూడా మీకు తెలుస్తుంది. ఏంటి? ఎప్పటివరకైతే పిల్లలు కేవలం తల్లి పాల మీదనే ఆధారపడి ఉన్నారో, వేరే ఇంకా బయటి ఏ పోషకం వారికి లభించడం లేదో, అలాంటి పిల్లల విషయంలో మగపిల్లలు అయ్యేదుంటే వారి మూత్రం ఎక్కడ పడినదో మంచంలో గానీ, బొంతలో గానీ, చద్దర్ లో గానీ, మీ యొక్క బట్టల్లో ఎక్కడైనా ఆ చోట కేవలం కొన్ని నీళ్లు చల్లితే సరిపోతుంది. మరియు ఒకవేళ ఆడపిల్ల అయ్యేదుంటే, ఆమె ఎక్కడైతే మూత్రం పోసిందో అక్కడ ఆ మూత్రానికంటే ఎక్కువ మోతాదులో నీళ్లు మీరు దాని మీద పారబోస్తే అంతే సరిపోతుంది. మొత్తం మీరు స్నానం చేసే అవసరం లేదు, పూర్తి చీర మార్చుకునే, పూర్తి షర్ట్ సల్వార్ మార్చుకునే అవసరం లేదు. ఎక్కడైతే ఆ మూత్రం ఎంతవరకైతే మీ బట్టల్లో పడినదో, శరీరం మీద పడినదో అంతవరకు మీరు కడుక్కుంటే సరిపోతుంది.

ఇక పెద్దల విషయానికి వస్తే, వారు మూత్రం పోసే ముందు ఎక్కడ మూత్రం పోస్తున్నారో అక్కడి నుండి తుంపరులు, ఈ మూత్రం యొక్క కొన్ని చుక్కలు తిరిగి మనపై, మన కాళ్లపై, మన బట్టలపై పడే అటువంటి ప్రమాదం లేకుండా నున్నటి మన్ను మీద, లేదా టాయిలెట్లలో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం మూత్రం పోసే ప్రయత్నం చేయాలి. మనం పాటించే అటువంటి జాగ్రత్తలు పాటించిన తర్వాత కూడా ఏమైనా మూత్రం చుక్కలు, తుప్పరులు పడ్డాయి అన్నటువంటి అనుమానమైనా లేక నమ్మకమైనా కలిగితే, ఎంతవరకు పడ్డాయో అంతవరకే కడుక్కుంటే సరిపోతుంది. మొత్తం మనం స్నానం చేయవలసిన, అన్ని బట్టలు మార్చవలసిన అవసరము లేదు.

అయితే ఇలాంటి విషయాల నుండి జాగ్రత్త పడకుండా, ఎవరైతే అశ్రద్ధ వహిస్తున్నారో వారి గురించి మరొక హదీథ్ ఏముంది?

أَكْثَرُ عَذَابِ الْقَبْرِ فِي الْبَوْلِ
(అక్సరు అదాబిల్ ఖబ్రి ఫిల్ బౌల్)
“అధిక శాతం సమాధి శిక్ష మూత్ర విషయంలోనే కలిగేది”. (అహ్మద్:2/326).

మూత్ర విసర్జన పూర్తి కాకముందే నిలబడుట, మూత్ర తుంపరలు తనపై పడవచ్చునని తెలిసి కూడా అదేచోట మూత్ర విసర్జన చేయుట లేక నీళ్లతో లేదా మట్టి పెడ్డలతో పరిశుభ్ర పరచుకోకపోవుట ఇవన్నియు మూత్ర విషయంలో జాగ్రత్త పడకపోవటం కిందే లెక్కించబడతాయి.

ఈ రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళ, అవిశ్వాసుల పోలిక ఎంతవరకు వచ్చేసిందంటే మూత్రశాలల్లో గోడలకు తగిలించి మూత్ర పాత్రలు పెట్టబడ్డాయి. దాని నలువైపులా ఏ అడ్డు ఉండదు. అందరూ వచ్చిపోయే వారి ముందు లజ్జా సిగ్గు లేకుండా మనిషి వచ్చి అందులో మూత్రం చేస్తాడు. మళ్లీ పరిశుభ్రం చేసుకోకుండానే తన బట్టను పైకి లాక్కుంటాడు. అంటే ప్యాంటుని ఈ విధంగా. ఈ విధంగా ఒకే సమయంలో రెండు దుష్ట నిషిద్ధాలకు గురి కావలసి వస్తుంది. ఒకటి, తన మర్మ స్థలాన్ని ప్రజల చూపుల నుండి కాపాడకపోవటం. రెండవది, మూత్ర తుంపరల నుండి జాగ్రత్త వహించకపోవటం.

ఇంతే కాకుండా, అంటే ఈ రెండే కాకుండా, అతను మూత్ర విసర్జన తర్వాత పరిశుభ్రం కాలేదు. అదే స్థితిలో బట్టను పైకి చేసుకున్నందుకు ఆ బట్టలు కూడా అపరిశుభ్రమైనాయి. శరీరము అపరిశుభ్రంగానే ఉంది. అదే స్థితిలో చేయబడే నమాజు అంగీకరింపబడదు. అంతేకాకుండా, సమాధి శిక్షకు కూడా గురి కావలసి వస్తుంది. అల్లాహ్ యే కాపాడాలి. కొంత అలసత్వం, అశ్రద్ధ, అలక్ష్యం వలన ఎన్ని పాపాలు మూటగట్టుకుంటున్నాడు కదా. ఈ విధంగా సోదర మహాశయులారా, ఇంతటి నష్టాలు జరుగుతున్నప్పటికీ మనం ఇంకా అశ్రద్ధగానే ఉండేది ఉంటే గమనించండి, మనకు మనం ఎంత చెడులో పడవేసుకుంటున్నాము.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41051

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ప్రయాణంలో ఉండి అన్నీ నమాజులూ మిస్ అయ్యాయి, వుజూలో కూడా లేను, ఇప్పుడు వాటిని ఎలా చేసుకోవాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[3 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

చేతి వ్రేలికి గాయం అయ్యి కుట్లు పడిఉంటే ఎలా వుజూ చేసుకోవాలి? తయమ్ముము చేసుకుంటే సరిపోతుందా? [వీడియో]

బిస్మిల్లాహ్

[1:13 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

తహారా (శుద్ధి, శుచీశుభ్రత) – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/tahara/

అపానవాయువు (గ్యాస్, గాలి వెళ్లడం,పిత్తు) వెళ్లిందో లేదో అన్న డౌట్ (సందేహం) ఉంటే ఏమి చేయాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[3:06 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

నమాజు నిధులు – పార్ట్ 01 : వుజూ యొక్క ఘనతలు, లాభాలు , గొప్ప పుణ్యాలు [వీడియో]

ఇక్కడ ఆడియో (mp3) వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

[26:10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

నమాజు నిధులు (Treasures of Salah) – పుస్తకం ఇక్కడ చదవండి
https://teluguislam.net/2011/02/24/treasures-of-salah-namaz-telugu-islam/

నమాజు నిధులు

నమాజులో చాలా గొప్ప నిధులు, కోశాగారాలున్నాయి. బహుశా అవి అనేక మందికి తెలియకపోవచ్చు. ఇవి సత్కర్మ, పుణ్యం మరియు హోదా అంతస్తులతో నిండి ఉన్నాయి. షైతాన్ కూడా మనల్ని వాటి నుండి దూరముంచడానికి సిద్ధమై యున్నాడు. మనం మన నిద్ర (అలక్ష్యం) నుండి  మేల్కొనే సరికి తెలుపబోయే అనేక పుణ్యాల నుండి దూరముంచడానికి కొన్నిటిపై మాత్రమే తృప్తి పడేలా చేశాడు. అందువల్ల మనం ఒక్క నమాజు చేసుకొని వెళ్తాము కాని ఒక్క పుణ్యం కూడా మనకు దక్కదు. – ఇలాంటి పరిస్థితి నుండి అల్లాహ్ మనల్ని కాపాడాలి-. అందుకే ‘అల్లాహ్ పై విశ్వాసం’ మరియు ‘వాచా కర్మ’లో చిత్తశుద్ధి ఆయుధంతో సన్నద్ధమై, (అల్లాహ్) ‘సహనం’, ‘స్మరణం’ కోటలో భద్రంగా ఉండి, ‘వినయ’, ‘విమ్రత’ కవచం ధరించి యుధ్ధపతాకం ఎగిరేసి గత కాలంలో కోల్పోయిన మన నమాజులను మరియు దానికి సంబంధించిన అమూల్య నిక్షేపాలను, నిధులను కాపాడుకొనుటకు మనోవాంఛలకు మరియు షైతాన్ కు వ్యతిరేకంగా పోరాడుదాం.

ఇకనైనా సమయం రాలేదా? నిద్ర నుండి మేల్కొనే సమయం, ఏమరుపాటును వదులుకునే సమయం, పుణ్యాత్ముల బృందంలో కలిసే సమయం, సత్కార్యాల అకౌంట్ పెంచుకునే సమయం, కరుణామయుని కరుణ, మన్నింపుకై నిరీక్షించి సజ్జనులతో స్వర్గంలో ప్రవేశించేందుకు ప్రయత్నం చేసే సమయం రాలేదా?

నిశ్చయంగా నమాజు నిధులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని నమాజుకు ముందు పొందవచ్చు. మరి కొన్ని నమాజు మధ్యలో. మిగితావి నమాజు తర్వాత.

ఇక రండి! పయనమవుదాము……..’చిత్తశుద్ధి’ మరియు ‘ధైర్య’ నౌకలో నమాజులోని మూడు గుప్తమైన నిధుల అన్వేషణకై ప్రయాణం మొదలెడదాం.

1- మొదటి నిధిః (నమాజుకు ముందు) నమాజు కొరకు సంసిద్ధత.

2- రెండవ నిధిః (నమాజు సందర్భంలో) నమాజు చేయుట.

3- మూడవ నిధిః (నమాజు తర్వాత) జిక్ర్ మరియు కొన్ని ఆచరణలు.

మొదటి నిధి (నిక్షేపం)

నమాజు కొరకు సంసిద్ధత

ఈ విలువగల నిధిని మనం నమాజులో ప్రవేశించక ముందు నమాజుకు సంబంధించిన ప్రథమ ఏర్పాట్లు మరియు మానసిక, ఆత్మీయ సంసిద్ధతల ద్వారా పొందగలము. దానికి అర్హులమయ్యే మార్గాలు క్రింది విధంగా ఉన్నాయి, శ్రద్ధ వహించండి.

1 – వుజూ:

వుజూ యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. పుణ్యాల సంపాదన, వాటి రెట్టింపులకై ఇది మొదటి మెట్టు. వుజూ ద్వారా ఈ క్రింద తెలుపబడే పుణ్యాలు పొందగలము.

(అ) అల్లాహ్ యొక్క ప్రేమ:  అల్లాహ్ ఆదేశం:

{నిశ్చయంగా తౌబా చేసేవారిని మరియు పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు}. (బఖర 2: 222).

అల్లాహ్ మనల్ని ప్రేమించటం కంటే గొప్ప పుణ్యమేమిటి?

షేఖ్ సఅదీ తన తఫ్సీర్ -తైసీరుల్ కరీమిర్రహ్మాన్ ఫీ తఫ్సీరి కలామిల్ మన్నాన్-లో చెప్పారు: ఈ ఆయతులో ‘పరిశుద్ధతను పాటించేవారు’ అంటే పాపాల నుండి దూరముండడం, అయితే ఇందులో మలినము నుండి శుద్ధి పొందుట కూడా వస్తుంది. పరిశుభ్రత మరియు వుజూ ఒక ధార్మిక విషయం అని దీని ద్వారా తెలుస్తుంది. ఎలా అంటే దాన్ని పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తున్నాడు అని వచ్చింది. అందుకే పరిశుభ్రత, వుజూ నమాజ్, తవాఫ్ మరియు ఖుర్ఆన్ పారాయణానికి ఒక షరతుగా ఉంది.

(ఆ) వుజూ నీళ్ళతో పాపాల తొలగింపు:

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ اللهِ ﷺ قَالَ: (إِذَا تَوَضَّأَ الْعَبْدُ الْمُسْلِمُ أَوْ الْمُؤْمِنُ فَغَسَلَ وَجْهَهُ خَرَجَ مِنْ وَجْهِهِ كُلُّ خَطِيئَةٍ نَظَرَ إِلَيْهَا بِعَيْنَيْهِ مَعَ الْمَاءِ أَوْ مَعَ آخِرِ قَطْرِ الْمَاءِ فَإِذَا غَسَلَ يَدَيْهِ خَرَجَ مِنْ يَدَيْهِ كُلُّ خَطِيئَةٍ كَانَ بَطَشَتْهَا يَدَاهُ مَعَ الْمَاءِ أَوْ مَعَ آخِرِ قَطْرِ الْمَاءِ فَإِذَا غَسَلَ رِجْلَيْهِ خَرَجَتْ كُلُّ خَطِيئَةٍ مَشَتْهَا رِجْلَاهُ مَعَ الْمَاءِ أَوْ مَعَ آخِرِ قَطْرِ الْمَاءِ حَتَّى يَخْرُجَ نَقِيًّا مِنَ الذُّنُوبِ).

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “ముస్లిం లేక మోమిన్ దాసుడు వుజూ చేస్తూ, తన ముఖం కడిగినపుడు ప్రవహించే నీళ్ళతో లేక చివరి నీటి చుక్కతో కళ్ళతో చూసి చేసిన ప్రతి పాపం రాలిపోతుంది (మన్నించబడుతుంది). రెండు చేతులు కడిగినపుడు వెళ్ళే నీళ్ళతో లేక చివరి నీటి చుక్కతో చేయితో పట్టి చేసిన ప్రతి పాపం రాలిపోతుంది. రెండు కాళ్ళు కడిగినపుడు వెళ్ళే నీళ్ళతో లేక చివరి నీటి చుక్కతో కాళ్ళు నడచి చేసిన ప్రతి పాపం రాలిపోతుంది. చివరికి అతను పాపాల నుండి పూర్తిగా పరిశుద్ధుడై వెళ్తాడు“. (ముస్లిం 244).

عَنْ عُثْمَانَ بْنِ عَفَّانَ ÷ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ خَرَجَتْ خَطَايَاهُ مِنْ جَسَدِهِ حَتَّى تَخْرُجَ مِنْ تَحْتِ أَظْفَارِهِ).

ఎవరు సక్రమంగా వుజూ చేస్తారో అతని శరీరం నుండి అతని పాపాలు దూరమయిపోతాయి. చివరికి అతని గోళ్ళ నుండి వెళ్ళిపోతాయి“. (ముస్లిం 245).

మరో గొప్ప ఘనత క్రింద పాదసూచికలో లో చూడండిః([1]).

(ఇ) ప్రళయదినాన వుజూ అంగములు (కాంతిగా) ప్రకాశిస్తాయి:

عن أَبِي هُرَيْرَةَ ÷ قَالَ إِنِّي سَمِعْتُ النَّبِيَّ ﷺ يَقُولُ: (إِنَّ أُمَّتِي يُدْعَوْنَ يَوْمَ الْقِيَامَةِ غُرًّا مُحَجَّلِينَ مِنْ آثَارِ الْوُضُوءِ فَمَنْ اسْتَطَاعَ مِنْكُمْ أَنْ يُطِيلَ غُرَّتَهُ فَلْيَفْعَلْ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను అని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ప్రళయదినాన నా అనుచర సమాజాన్ని (కర్మ విచారణ కోసం) పిలవడం జరుగుతుంది. అప్పుడు వారి ముఖాలు, చేతులు వుజూ ప్రభావంతో తెల్లగా, మహోజ్వలంగా ఉంటాయి. అందువల్ల మీలో ఎవరైనా తమ తెలుపు, తేజస్సులను వృద్ధి చేసుకో దలిస్తే వారు అలా వృద్ధి చేసుకోవచ్చు“. (బుఖారి 136, ముస్లిం 246).

(ఈ) పాపాల తుడిచివేత మరియు ఉన్నత స్థానం:

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ اللهِ ﷺ قَالَ: (أَلَا أَدُلُّكُمْ عَلَى مَا يَمْحُو اللهُ بِهِ الْخَطَايَا وَيَرْفَعُ بِهِ الدَّرَجَاتِ) قَالُوا: بَلَى يَا رَسُولَ اللهِ قَالَ: (إِسْبَاغُ الْوُضُوءِ عَلَى الْـمَكَارِهِ وَكَثْرَةُ الْـخُطَا إِلَى الْـمَسَاجِدِ وَانْتِظَارُ الصَّلَاةِ بَعْدَ الصَّلَاةِ فَذَلِكُمْ الرِّبَاطُ فَذَلِكُمْ الرِّبَاطُ).

అబూహురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో నేను మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారు: “(1) వాతావరణం, పరిస్థితులూ అననుకూలంగా ఉన్నప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం. ఇది రిబాత్ తో సమానం, ఇది రిబాత్ తో సమానం“. (ముస్లిం 251).

పరిస్థితులూ అననుకూలంగా ఉండుటః అంటే చలి కాలంలో చల్ల దనం, లేక అనారోగ్యం వల్ల చలనం, కదలిక కష్టంగా తోచినపుడు వుజూ చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది. అయితే ఇలాంటి సందర్భంలో పాపాల మన్నింపు, పుణ్యాల రెట్టింపు, స్వర్గంలో ప్రవేశముద్దేశంతో పై మూడు కార్యాలు నెరవేర్చువాడిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాపాల మన్నింపు మరియు షహాదత్ అపేక్షతో శత్రువు మధ్యలో పహరా కాయడం (రిబాత్)తో పోల్చారు.

మరికొందరి అభిప్రాయ ప్రకారం, వీటిని ‘రిబాత్’ అనటానికి కారణ మేమంటే అవి మనిషిని పాపాల నుండి దూరముంచుతాయి. నిజము దేవుడెరుగును. (అల్ మత్జరుర్రాబిహ్ ఫీ సవాబిల్ అమలిస్సాలిహ్ లిల్ హాఫిజ్ అబూ ముహమ్మద్ షర్ఫొద్దీన్ అబ్దుల్ మోమిన్ అద్దిమ్యాతి).

(ఉ) పాపాల క్షమాపణ మరియు స్వర్గ ప్రవేశం:

عَنْ عُثْمَانَ ÷ أنَّهُ تَوَضَّأَ ثُمَّ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (مَنْ تَوَضَّأَ نَحْوَ وُضُوئِي هَذَا ثُمَّ صَلَّى رَكْعَتَيْنِ لَا يُحَدِّثُ فِيهِمَا نَفْسَهُ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ).

ఉస్మాన్ రజియల్లాహు అన్హు వుజూ చేసి ఇలా చెప్పారు: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలాగే వుజూ చేస్తూ ఉండగా చూశాను. పిదప ఆయన ఇలా ప్రవచించారు: “ఎవరు నా ఈ పద్ధతి ప్రకారం వుజూ చేసి, మనసులో ఎలాంటి (ప్రాపంచిక) ఆలోచనలు రానివ్వకుండా పూర్తి ఏకాగ్రతతో రెండు రకాతుల నమాజు చేస్తారో అతని గత పాపాలు క్షమించబడతాయి“. (బుఖారీ 1934, ముస్లిం 226).

عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ الْجُهَنِيِّ ÷ أَنَّ رَسُولَ اللهِ ﷺ قَالَ: (مَا مِنْ أَحَدٍ يَتَوَضَّأُ فَيُحْسِنُ الْوُضُوءَ وَيُصَلِّي رَكْعَتَيْنِ يُقْبِلُ بِقَلْبِهِ وَوَجْهِهِ عَلَيْهِمَا إِلَّا وَجَبَتْ لَهُ الْجَنَّةُ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని ఉఖ్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ఎవరైనా ఒకరు ఉత్తమ రీతిలో వుజూ చేసుకొని, పూర్తి శ్రద్ధాభక్తులతో రెండు రకాతుల నమాజు చేసినచో అతనికి తప్పక స్వర్గం లభిస్తుంది“. (అబూ దావూద్ 906, ముస్లిం 234).

2 – వుజూ తర్వాత దుఆ:

వుజూ తర్వాత దుఆ యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. మొదటి నిధిలోని మరికొన్ని పుణ్యాల అన్వేషణలో మనం ఉన్నాము. వుజూ తర్వాత గల ప్రత్యేక దుఆల ద్వారా క్రింది పుణ్యాలు సంపాదించవచ్చు.

(అ) స్వర్గపు ఎనిమిది ద్వారాల్లో ఇష్టమున్న ద్వారము నుండి ప్రవేశించే స్వేచ్ఛ:

عَنْ عُمَرَ بنِ الخَطَّابِ ÷ عَنْ رَسُولِ الله ﷺ قَالَ: (مَا مِنْكُمْ مِنْ أَحَدٍ يَتَوَضَّأُ فَيُسْبِغُ الْوَضُوءَ ثُمَّ يَقُولُ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ إِلَّا فُتِحَتْ لَهُ أَبْوَابُ الْـجَنَّةِ الثَّمَانِيَةُ يَدْخُلُ مِنْ أَيِّهَا شَاءَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసి, “అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ” చదివితే వారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. తాను కోరిన ద్వారము నుండి అతను అందులో ప్రవేశించవచ్చు“. (ముస్లిం 234).

(ఆ) తోలుకాగితంలో పేరు వ్రాయబడి దానిపై ముద్ర వేయబడుతుంది. అది ప్రళయదినం వరకు తీయబడదు:

عَنْ أَبِي سَعِيدِ الخُدرِي ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ تَوَضَّأَ فَقَالَ: سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ أَشْهَدُ أَن لاَ إِلَهَ إِلاَّ أَنتَ أَسْتَغْفِرُكُ وَأَتُوبَ إِلَيكَ، كُتِبَ فِي رِِقٍّ ثُمَّ جُعِلَ فِي طَابِعٍ فَلَمْ يُكسَرْ إِلى يَومِ الْقِيامة).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ఎవరైనా వుజూ చేసి, “సుబ్ హానకల్లాహుమ్మ వ బిహందిక అష్ హదు అల్లాఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక” చదువుతారో అతని పేరు తోలు కాగితంలో వ్రాయబడుతుంది. ముద్ర వేయబడుతుంది. ప్రళయదినం వరకు తీయబడదు“([2]).

3 – మిస్వాక్ :

ఒక పుణ్యం తర్వాత మరో పుణ్యం సంపాదించడంలోనే ఉన్నాము, ఇప్పుడు మనం (మిస్వాక్) స్టేషన్ లో ఉన్నాము. ఈ గొప్ప పుణ్యం గురించి చదవండిః మిస్వాక్ నోటిని శుభ్రం చేయునది, అల్లాహ్ ను సంతృష్టి పరచునది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లఖించారుః

السِّوَاكُ مَطْهَرَةٌ لِلْفَمِ مَرْضَاةٌ لِلرَّبِّ

మిస్వాక్ నోటికి శుభ్రత కలుగజేస్తుంది మరియు అల్లాహ్ ను సంతృష్టి పరుస్తుంది“([3]).


[1] వుజూ యొక్క మరో ఘనత ముస్నద్ అహ్మదులో ఇలా ఉందిః

عَن أَبِي أُمَامَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: أَيُّمَا رَجُلٍ قَامَ إِلَى وَضُوئِهِ يُرِيدُ الصَّلَاةَ ثُمَّ غَسَلَ كَفَّيْهِ نَزَلَتْ خَطِيئَتُهُ مِنْ كَفَّيْهِ مَعَ أَوَّلِ قَطْرَةٍ فَإِذَا مَضْمَضَ وَاسْتَنْشَقَ وَاسْتَنْثَرَ نَزَلَتْ خَطِيئَتُهُ مِنْ لِسَانِهِ وَشَفَتَيْهِ مَعَ أَوَّلِ قَطْرَةٍ فَإِذَا غَسَلَ وَجْهَهُ نَزَلَتْ خَطِيئَتُهُ مِنْ سَمْعِهِ وَبَصَرِهِ مَعَ أَوَّلِ قَطْرَةٍ فَإِذَا غَسَلَ يَدَيْهِ إِلَى الْمِرْفَقَيْنِ وَرِجْلَيْهِ إِلَى الْكَعْبَيْنِ سَلِمَ مِنْ كُلِّ ذَنْبٍ هُوَ لَهُ وَمِنْ كُلِّ خَطِيئَةٍ كَهَيْئَتِهِ يَوْمَ وَلَدَتْهُ أُمُّهُ. { أحمد }

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ఏ వ్యక్తి నమాజు ఉద్దేశ్యంతో వుజూ చేస్తూ రెండు అరచేతులు కడుగుతాడో నీటి తొలి చుక్క ద్వారా అతని రెండు చేతులతో చేసిన పాపాలు తొలిగిపోవును. నోట్లు నీళ్ళు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్ళు ఎక్కించి చీది శుభ్రపరచుకుంటాడో నీటి మొదటి చుక్క ద్వారా అతని నాలుక మరియు పెదవుల ద్వారా చేసిన పాపాలు తొలిగిపోతాయి. ముఖము కడిగినప్పుడు కళ్ళు మరియు చెవి ద్వారా చేసిన పాపాలు నీటి మొదటి చుక్క ద్వారా తొలిగి పోతాయి. మోచేతుల వరకు చేతులు, మోకాళ్ళ వరకు కాళ్ళు కడినగినప్పుడు సర్వ పాపాల నుండి విముక్తి పొంది తల్లి గర్భం నుండి పుట్టినప్పటి స్థితి మాదిరిగా అయిపోతాడు”. (అహ్మద్ 36/601). [ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ]

[2]. (సునన్ నిసాయీ అల్ కుబ్రా/ బాబు మా యఖూలు ఇజా ఫరగ మిన్ వుజూఇహీ. 9909. 6/25. సహీహుత్తర్గీబు వత్తర్ హీబ్ 225. సహీహుల్ జామిఅ 6170).

[3]. నిసాయి 5, ఇబ్ను మాజ 289, బుఖారీ ముఅల్లఖన్ హ. నం. 1933 తర్వాత. ముస్నద్ అహ్మద్ 1/3).

క్విజ్: 76: ప్రశ్న 03: అల్లాహ్ నామ స్మరణ: వివిధ సందర్భాలలో “బిస్మిల్లాహ్” అని పలకడం [ఆడియో]

బిస్మిల్లాహ్

3వ ప్రశ్న సిలబస్:

అల్లాహ్ నామ స్మరణ ఘనత చాలా గొప్పగా ఉంది. అందుకే ముస్లిం జీవితంలో వివిధ సందర్భాలలో “బిస్మిల్లాహ్” అని పలకాలని బోధించడం జరిగింది. వాటిలో కొన్ని సందర్భాలు ఇప్పుడు తెలుసుకుందాము

1- పడుకునే ముందు బిస్మికల్లాహుమ్మ అమూతు వఅహ్ యా అనాలి. (బుఖారీ 6324).

2- మరుగుదొడ్లో ప్రవేశించేకి ముందు బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇస్ (తిర్మిజి 606, బుఖారీ 142). అయితే తిర్మిజి (142)లో వచ్చిన హదీసులో ఉంది: ‘ఎవరైతే మరుగుదొడ్లో ప్రవేశించేకి ముందు “బిస్మిల్లాహ్” అంటారో వారి మర్మాంగాలను జిన్నులు చూడకుండా అడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది.’

3,4- ఇంట్లో ప్రవేశించేకి ముందు, భోజనం చేసేకి ముందు ఎవరు “బిస్మిల్లాహ్” అంటారో వారితో పాటు షైతాన్ వారింట్లో ప్రవేశించడు మరియు వారి భోజనంలో కూడా పాల్గొనడు. (ముస్లిం 2018).

5- శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే అక్కడ చెయ్యి పెట్టి “బిస్మిల్లాహ్” 3సార్లు, “అఊజు బిల్లాహి వఖుద్రతిహి మిన్ షర్రి మా అజిదు వఉహాజిర్” 7సార్లు చదవాలి. (ముస్లిం 2202, అబూదావూద్ 3891). ఇలా చదువుతూ ఉండడం ద్వారా అల్లాహ్ దయతో నొప్పి మాయమైపోతుంది.

ఇంకా వుజూకు ముందు, భార్యభర్తలు కలుసుకునేకి ముందు, వాహనముపై ఎక్కేకి ముందు, జారి పడినప్పుడు, ఇంటి నుండి బైటికి వెళ్ళినప్పుడు, ఉదయసాయంకాలపు దుఆలలో ఇంకా ఎన్నో సందర్భాలున్నాయి ప్రతి ముస్లిం వాటిని తెలుసుకోవాలి.

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (5:11 నిముషాలు)

ఆడియో విన్న తర్వాత క్రింది ప్రశ్న ట్రై చెయ్యండి

(3) కాల కృత్యాలు తీర్చుకునే సమయంలో షైతానులు మన మర్మాంగాలను చూడకుండా ఉండేందుకు ఏమి చెయ్యాలి?

A) బలమైన తావీజు వేసుకోవాలి
B) అల్లాహ్ పేరుతో దుఆ చేసి కాల కృత్యాలకు వెళ్ళాలి
C) చీకటిలోనే వెళ్ళాలి

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

పుస్తకాలు: 

[వుజూ తర్వాత దుఆ] స్వర్గపు ఎనిమిది ద్వారాల్లో ఇష్టమున్న ద్వారము నుండి ప్రవేశించే స్వేచ్ఛ

స్వర్గపు ఎనిమిది ద్వారాల్లో ఇష్టమున్న ద్వారము నుండి ప్రవేశించే స్వేచ్ఛ: عَنْ عُمَرَ بنِ الخَطَّابِ ÷ عَنْ رَسُولِ الله ﷺ قَالَ: (مَا مِنْكُمْ مِنْ أَحَدٍ يَتَوَضَّأُ فَيُسْبِغُ الْوَضُوءَ ثُمَّ يَقُولُ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ إِلَّا فُتِحَتْ لَهُ أَبْوَابُ الْـجَنَّةِ الثَّمَانِيَةُ يَدْخُلُ مِنْ أَيِّهَا شَاءَ). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః "మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసి, "అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ" చదివితే వారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. తాను కోరిన ద్వారము నుండి అతను అందులో ప్రవేశించవచ్చు". (ముస్లిం 234).

స్వర్గపు ఎనిమిది ద్వారాల్లో ఇష్టమున్న ద్వారము నుండి ప్రవేశించే స్వేచ్ఛ:

عَنْ عُمَرَ بنِ الخَطَّابِ ÷ عَنْ رَسُولِ الله ﷺ قَالَ: (مَا مِنْكُمْ مِنْ أَحَدٍ يَتَوَضَّأُ فَيُسْبِغُ الْوَضُوءَ ثُمَّ يَقُولُ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ إِلَّا فُتِحَتْ لَهُ أَبْوَابُ الْـجَنَّةِ الثَّمَانِيَةُ يَدْخُلُ
مِنْ أَيِّهَا شَاءَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసి, “అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ” చదివితే వారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. తాను కోరిన ద్వారము నుండి అతను అందులో ప్రవేశించవచ్చు”. (ముస్లిం 234).

నమాజు నిధులు (Treasures of Salah)
https://teluguislam.net/2011/02/24/treasures-of-salah-namaz-telugu-islam/

తయమ్ముమ్ విధానం, ప్రాక్టికల్ గా [వీడియో]

బిస్మిల్లాహ్

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

తయమ్ముమ్ 

శుచీశభ్రత – మొదటి పాఠం: వుజూ, మసహ్ విధానం [వీడియో]

బిస్మిల్లాహ్

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


వుజూ

వుజూ లేని నమాజు స్వీకరించబడదు. అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

“మీలో ఎవనికైనా అపానవాయువు జరిగితే, వుజూ భంగమయితే అతను వుజూ చేసుకోనంత వరకు అల్లాహ్‌ అతని నమాజును స్వీకరించడు”. (బుఖారి 6954, ముస్లిం 225).

“మీలో ఎవనికైనా అపానవాయువు జరిగితే, వుజూ భంగమయితే అతను వుజూ చేసుకోనంత వరకు అల్లాహ్‌ అతని నమాజును స్వీకరించడు”. (బుఖారి 6954, ముస్లిం 225).

అందుకే ముస్లిం వ్యక్తి నమాజుకు ముందు వుజూ చేయడం తప్పనిసరి. వుజూ ఘనతలు చాలా ఉన్నాయి, మనిషి వాటిని తెలుసుకోవడం చాలా అవసరం. ఈ రెండుహదీసులు శ్రద్ధగా వినండి:

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా శుభవార్త ఇచ్చారని, ఉస్మాన్‌ బిన్‌ అఫ్ఫాన్‌ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు:

"ఎవరు వుజూ చేసినప్పుడు పూర్తి శ్రద్ధతో మంచి విధంగా చేస్తారో అతని శరీరం నుండి అతని పాపాలన్నీ రాలిపోతాయి. చివరికి గోళ్ళ నుండి కూడా రాలిపోతాయి". (ముస్లిం 245).

“ఎవరు వుజూ చేసినప్పుడు పూర్తి శ్రద్ధతో మంచి విధంగా చేస్తారో అతని శరీరం నుండి అతని పాపాలన్నీ రాలిపోతాయి. చివరికి గోళ్ళ నుండి కూడా రాలిపోతాయి”. (ముస్లిం 245).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని, ఉస్మాన్‌ బిన్‌ అఫ్ఫాన్‌ (రజియల్లాహు అన్హు )ఉల్లేఖించారు:

"అల్లాహ్‌ ఆదేశించిన విధంగా సంపూర్ణంగా వుజూ చేసేవారు, వారి ఫర్డ్‌ నమాజులు వాటి మధ్య జరిగే పాపాల ప్రక్షాళనకు కారణభూతమవుతాయి". (ముస్లిం 231).

“అల్లాహ్‌ ఆదేశించిన విధంగా సంపూర్ణంగా వుజూ చేసేవారు, వారి ఫర్డ్‌ నమాజులు వాటి మధ్య జరిగే పాపాల ప్రక్షాళనకు కారణభూతమవుతాయి”. (ముస్లిం 231).

వుజూ విధానం:

1- వుజూ నియ్యత్‌ (సంకల్పం) నోటితో పలుకకుండా మనుసులోనే చేయాలి. ఒక పని చేయుటకు మనుసులో నిర్ణయించుకోవడమే ‘నియ్యత్‌’. మళ్ళీ బిస్మిల్లాహ్‌ అనాలి.

2- రెండు అరచేతులను మణికట్ల వరకు మూడు సార్లు కడగాలి.

3- మూడు సార్లు నోట్లో నీళ్ళు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్ళు ఎక్కించి శుభ్రం చేయాలి.

4- మూడు సార్లు ముఖము కడగాలి. అడ్డంలో కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు, నిలువులో నొసటి పై భాగం నుండి గదువ క్రింది వరకు.

5- రెండు చేతులు మూడేసి సార్లు కడగాలి. వ్రేలు మొదటి భాగము నుండి మోచేతుల వరకు. ముందు కుడి చెయ్యి, తరువాత ఎడమ చెయ్యి.

6- ఒక సారి తల ‘మసహ్‌’ చేయాలి. అంటే రెండు చేతులను తడి చేసి తల మొదటి (నుదుటి) భాగము నుండి వెనక మెడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ వెనక నుండి మొదటి (నుదుటి) వరకు తలను స్పర్శిస్తూ తీసుకురావాలి.

7- ఒక సారి రెండు చెవుల ‘మసహ్‌’ చేయాలి. అంటే రెండు చూపుడు వ్రేళ్ళతో చెవి లోపలి భాగాన్ని, బొటన వ్రేళ్ళతో పై భాగాన్ని స్పర్శించాలి.

8- రెండు కాళ్ళను వ్రేళ్ళ నుండి చీలమండల వరకు మూడేసి సార్లు కడగాలి. ముందు కుడి కాలు తరువాత ఎడమ కాలు. అవయవాలు ఒకసారి లేదా రెండు సార్లు కడిగినా పరవాలేదు, కాని ఆ అవయవం సంపూర్ణంగా కడగబడడం తప్పనిసరి.

9- తర్వాత ఈ మస్నూన్‌ దుఆ చదవాలి: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసుకొని

'అష్‌ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదన్‌ అబ్దుహూ వరసూలుహ్‌'

‘అష్‌ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదన్‌ అబ్దుహూ వరసూలుహ్‌’

(నేను సాక్ష్యమిస్తున్నాను; అల్లాహ్‌ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడని, మరియు ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ యొక్క దాసుడు మరియు ప్రవక్త).

చదువుతారో అతని కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి, ఎందులో నుండి ప్రవేశించగోరినా అతని ఇష్టం’. (ముస్లిం 234).

వుజూలో ఒక అవయవం తరాఇత మరో అవయవం క్రమ ప్రకారంగా మరియు వెంటవెంటనే కడుగుట తప్పనిసరి(*)

(*) క్రమ ప్రకారంగా అంటే: 1 నుండి 8 వరకు ఉన్న క్రమం ప్రకారం వీటిలో వెనకా ముందు చేయకూడదు. వెంటవెంటనే అంటే: పై క్రమం ప్రకారం, ఒక అవయవం కడిగాక, దాని తడి ఆరక ముందే వెంటనే దాని వెనక అవయవం కడగాలి. మరీ ఆలస్యం చేయవద్దు.

వుజూను భంగపరిచే విషయాలు:

  • 1- మలమూత్రపు మార్గాల నుండి ఏదీ వెలువడినా సరే అందు వలన వుజూ భంగమవుతుంది: మలము, మూత్రము, అపానవాయువు (పిత్తు), ‘మజీ’, ‘వదీ’ రక్తము మరియు ‘మనీ’. ‘మనీ’ వలన స్నానం చేయడం కూడా విధి అవుతుంది.
  • 2- నిద్ర.
  • ౩- ఒంటె మాంసం తినడం.
  • 4- స్పృహ తప్పటం మరియు బుద్ధి క్షీణించడం.

మేజోళ్ళ పై ‘మసహ్‌’

ఇస్లాం ధర్మం యొక్క సులువైన ఉత్తమ విషయం ఒకటి: మేజోళ్ళపై ‘మసహ్‌’ చేసే అనుమతివ్వడం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ‘మసహ్‌’ చేసేవారని రుజువైనది. అమ్ర్  బిన్‌ ఉమయ్య (రజియల్లాహు అన్హు) చెప్పారు:

"ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ తలపాగ మరియు మేజోళ్ళపైన 'మసహ్‌' చేస్తున్నది నేను చూశాను." (బుఖారి 205).

“ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ తలపాగ మరియు మేజోళ్ళపైన ‘మసహ్‌’ చేస్తున్నది నేను చూశాను.” (బుఖారి 205).

వాటి పై ‘మసహ్‌’ చేయుటకు ఒక నిబంధన ఏమిటంటే అవి వుజూ చేసిన తర్వాత తొడిగి యుండాలి.

తడి చేసిన చెయ్యితో పాదాల పై భాగాన ‘మసహ్‌’ చేయాలి, క్రింది భాగాన కాదు.

ఇక ‘మసహ్‌’ గడువు విషయానికి వస్తే; స్థానికులు ఒక పగలు ఒక రాత్రి. ఏ ప్రయాణంలో నమాజ్‌ ఖస్ర్ చేయవచ్చునో ఆ ప్రయాణంలో ఉన్నవారు మూడు రేయింబవళ్ళు మేజోళ్ళపై ‘మసహ్‌’ చేయవచ్చును. (వుజూ చేసి తొడిగన తరువాత మొదట సారి మసహ్‌ చేసిన  క్షణం నుంచీ గడువు మొదలవుతుంది).

‘మసహ్‌’ భంగమయే కారణాలు:

  • గడువు ముగిసిన మరుక్షణం నుంచే ‘మసహ్‌’ భంగమైపోతుంది.
  • ‘మసహ్‌’ చేసిన తరువాత కనీసం ఒకసారైనా తీసినట్లయితే ‘మసహ్‌’ భంగమవుతుంది.
  • లేదా మనిషి (స్వప్నస్థలనం లేదా భార్యభర్తల సంభోగం కారణంగా) అశుద్ధతకు లోనైతే ‘మసహ్‌’ భంగమవుతుంది.
  • స్నానం చేయుటకై అవి తీయడం తప్పనిసరి.

ఇతరములు : [తహారా]