నమాజు నిధులు [పుస్తకం & వీడియో పాఠాలు]

బిస్మిల్లాహ్

టైటిల్: నమాజు నిధులు
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

[ఇక్కడ పుస్తకం చదవండి లేక డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [25 పేజీలు]

నమాజులో చాలా గొప్ప నిధులు, కోశాగారాలున్నాయి. బహుశా అవి అనేక మందికి తెలియకపోవచ్చు. ఇవి సత్కర్మ, పుణ్యం మరియు హోదా అంతస్తులతో నిండి ఉన్నాయి. షైతాన్‌ కూడా మనల్ని వాటి నుండి దూరముంచడానికి సిద్ధమై యున్నాడు. మనం మన నిద్ర (అలక్ష్యం) నుండి మేల్కొనే సరికి తెలుపబోయే అనేక పుణ్యాల నుండి దూరముంచడానికి కొన్నిటిపై మాత్రమే తృప్తి పడేలా చేశాడు. అందువల్ల మనం ఒక్క నమాజు చేసుకొని వెళ్తాము కాని ఒక్క పుణ్యం కూడా మనకు దక్కదు. ఇలాంటి పరిస్థితి నుండి అల్లాహ్‌ మనల్ని కాపాడాలి-. అందుకే ‘అల్లాహ్‌ పై విశ్వాసం’ మరియు ‘వాచా కర్మ’లో చిత్తశుద్ధి ఆయుధంతో సన్నద్ధమై, (అల్లాహ్‌) ‘సహనం’, ‘స్మరణం’ కోటలో భద్రంగా ఉండి, ‘వినయ’, ‘విమ్రత’ కవచం ధరించి యుద్ధపతాకం ఎగిరేసి, గత కాలంలో కోల్పోయిన మన నమాజులను మరియు దానికి సంబంధించిన అమూల్య నిక్షేపాలను, నిధులను కాపాడుకొనుటకు మనోవాంఛలకు మరియు షైతాన్‌ కు వ్యతిరేకంగా పోరాడుదాం.

ఇకనైనా సమయం రాలేదా? నిద్ర నుండి మేల్కొనే సమయం, ఏమరుపాటును వదులుకునే సమయం, పుణ్యాత్ముల బృందంలో కలిసేసమయం, సత్కార్యాల అకౌంట్‌ పెంచుకునే సమయం, కరుణామయుని కరుణ, మన్నింపుకై నిరీక్షించి సజ్జనులతో స్వర్గంలో ప్రవేశించేందుకు ప్రయత్నం చేసే సమయం రాలేదా?

నిశ్చయంగా నమాజు నిధులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని నమాజుకు ముందు పొందవచ్చు, మరి కొన్ని నమాజు మధ్యలో, మిగితావి నమాజు తర్వాత.

ఇక రండి! పయనమవుదాము…….చిత్తశుద్ధి’ మరియు ‘ధైర్య’ నౌకలో నమాజులోని మూడు గుప్తమైన నిధుల అన్వేషణకై ప్రయాణం మొదలెడదాం.

1- మొదటి నిధి: (నమాజుకు ముందు) నమాజు కొరకు సిద్ధమవటం.
2- రెండవ నిధి: (నమాజు సందర్భంలో) నమాజు చేయటం.
౩- మూడవ నిధి: (నమాజు తర్వాత) జిక్ర్‌ మరియు కొన్ని ఆచరణలు.

నమాజు నిధులుయూట్యూబ్ ప్లే లిస్ట్ ( 10 వీడియోలు)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV21_VBmKxJdY1QzVcirxEfr

ఈ పుస్తకం మీద వీడియోపాఠాలు:

విషయ సూచిక:

మొదటి నిధి (నిక్షేపం): నమాజు కొరకు సంసిద్దత

1- వుజూ
2- వుజూ తర్వాత దుఆ
౩ మిస్వాక్‌
4- నమాజు కోరకు తొలి సమయంలో వెళ్ళటం
5- అజాన్‌ కు బదులు పలకటం
6- అజాన్‌ తర్వాత దుఆ
7- నమాజ్‌ కొరకు నడచి వెళ్ళడం
8- మొదటి పంక్తి, కుడి పంక్తి
9- సున్నతె ముఅక్కద
10- అజాన్‌ మరియు అఖామత్‌ మధ్వలో దుఆ
11- నమాజు కొరకు వేచియుండుట
12- ఖుర్‌ఆన్‌ పారాయణం, జిక్ర్
13- పంక్తులు సక్రమంగా ఉంచుట

రెండవ నిధి: నమాజు చేయటం

1- నమాజు ఘనత
2- సామూహిక నమాజు ఘనత
౩- ఖుషూ (అణుకువ, వినమత)
4- సనా
5- సూరె ఫాతిహ పారాయణం
6- ఆమీన్‌ పలకడం
7- రుకూ
8- రుకూ నుండి నిలబడిన తర్వాత
9- సజ్దాలు
10- మొదటి తషహ్హుద్
11- చివరి తషహ్హుద్ (ప్రవక్తపై దరూద్‌)
12- సలాంకు ముందు దుఆ

మూడవ నిధి: నమాజు తర్వాత అజ్కార్‌

[క్రింద పూర్తి పుస్తకం చదవండి]

ముందు మాట

అల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అఫ్ జలిల్ ముర్ సలీన్, అమ్మాబాద్:

నిశ్చయంగా నమాజు ఇస్లాం మూల స్తంభాలలో రెండవది. అది ముస్లిం మరియు కాఫిర్ (సత్య తిరస్కారి)ల మధ్య వ్యత్యాస చిహ్నం. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:

[وَأَقِيمُوا الصَّلَاةَ وَلَا تَكُونُوا مِنَ المُشْرِكِينَ] {الرُّوم:31}
నమాజును స్థాపించండి. ముష్రికులలో కలసిపోకండి. (రూం 30: 31).

عَنْ بُرَيْدَةَ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ×: (الْعَهْدُ الَّذِي بَيْنَنَا وَبَيْنَهُمْ الصَّلَاةُ فَمَنْ تَرَكَهَا فَقَدْ كَفَرَ)

బురైద రజియల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఇలా ఉపదేశించారుః

“మనకి వారికి మధ్య ఉన్న ఒడంబడిక నమాజు విషయంలోనే, దాన్ని వదలిన వారు అవిశ్వాసానికి పాల్పడినట్లే”. (అహ్మద్ 5/346, తిర్మిజి 2621).

దానిని కాపాడే మనిషి తన ధర్మాన్ని కాపాడగలడు.

عَنْ نَافِعٍ مَوْلَى عَبْدِ اللهِ بْنِ عُمَرَ ^ أَنَّ عُمَرَ بْنَ الْخَطَّابِ t كَتَبَ إِلَى عُمَّالِهِ: (إِنَّ أَهَمَّ أَمْرِكُمْ عِنْدِي الصَّلَاةُ فَمَنْ حَفِظَهَا وَحَافَظَ عَلَيْهَا حَفِظَ دِينَهُ وَمَنْ ضَيَّعَهَا فَهُوَ لِمَا سِوَاهَا أَضْيَعُ)

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజియల్లాహు అన్హుమా) బానిస నాఫిఅ రహిమహులాహ్ ఉల్లేఖనం ప్రకారం: ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు తన గవర్నర్లకు ఇలా వ్రాసేవారుః “మీ సమస్త వ్యవహారాల్లో నా వద్ద అతి ముఖ్యమైనది నమాజ్. దానిని కాపాడి దానిపై స్థిరంగా ఉన్నవాడే తన ధర్మాన్ని కాపాడేవాడు. దాన్ని వృథా చేసేవాడు ఇతరవాటిని మరింత ఎక్కువగా వృథా చేసేవాడు“(ముఅత్త మాలిక్ 1/5, హ.నం.: 5.).

ఇస్లాం కడియాల్లో అన్నిటికంటే చివరిగా విరిగేది ఇదే. అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః

عَنْ أَبِي أُمَامَةَ الْبَاهِلِيِّ ÷ عَنْ رَسُولِ اللهِ ﷺ قَالَ: (لَيُنْقَضَنَّ عُرَى الْإِسْلَامِ عُرْوَةً عُرْوَةً فَكُلَّمَا انْتَقَضَتْ عُرْوَةٌ تَشَبَّثَ النَّاسُ بِالَّتِي تَلِيهَا وَأَوَّلُهُنَّ نَقْضًا الْـحُكْمُ وَآخِرُهُنَّ الصَّلَاةُ)

ఇస్లాం కడియాలు ఒక్కొక్కటి విరుగుతాయి. ఒక కడియం విరిగిన వెంటనే ప్రజలు దాని వెనక దాన్ని గట్టిగా పట్టుకుంటారు. అన్నిట్లోకెల్లా ముందు విరిగే కడియం “హుకుం” అయితే చివరిగా విరిగేది “నమాజ్“([1]).

[1] అహ్మద్ 5/215, తబ్రానీ కబీర్ 7486, అల్ ఇబానతుల్ కుబ్రా లిబ్ని బత్త 4, ముస్తద్రక్ హాకిం 4/92, (హాకిం దీనిని సహీ అన్నారు). తాజీము కద్రిస్సలా లి ముహమ్మద్ బిన్ నస్ర్ 407, ఇబ్ను హిబ్బాన్ 257, ఇది హసన్ హదీసు.

ఈ హదీసు ఆధారంగానే ఇమాం అహ్మద్ ‘నమాజ్ వదిలేవారు అవిశ్వాసుల’ని సిద్ధాంతీకరించారు. దీనిపై అనేక ఆధారాలున్నాయి. అందుకే ‘నమాజు వదిలేవారు అవిశ్వాసానికి’ పాల్పడుతున్నారన్న విషయంపై ప్రవక్త సహచరులు ఏకీభవించారు.

ముజాహిద్, జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమాను ప్రశ్నించారు: ‘ప్రవక్త కాలంలో మీ వద్ద విశ్వాసం మరియు అవిశ్వాసం మధ్య వ్యత్యాస పరిచే ఆచరణ ఏముండినది’? అని, అందుకు ఆయన “నమాజ్” అని సమాధానం ఇచ్చారు([2]). “మీ వద్ద” అంటే ముస్లిముల వద్ద, వారు ప్రవక్త సహచరులు.

[2] తాజీము కద్రిస్సలా 892, అస్సున్న లిల్ ఖల్లాల్ 1379, అల్ ఇబాన 876, షర్హు ఉసూలి ఇఅతికాది అహ్లిస్సున్న 1538. దీని సనద్ (పరంపర) హసన్, అందులో ఏ అభ్యంతరం లేదు.

అబుజ్జుబైర్ ఉల్లేఖనం ప్రకారం: ‘పాపాన్ని మీరు షిర్క్ అనేవారా?’ అని ఒక వ్యక్తి జాబిర్ రజియల్లాహు అన్హుమాను ప్రశ్నించగా నేను విన్నాను. దానికి ఆయన “లేదు” అని జవాబిచ్చారు. “మనిషి విశ్వాసం మరియు అవిశ్వాసం మధ్యలో బేధం తెలుపునదేమిటి?” అని అడగ్గా “నమాజ్ వదలడం” అని సమాధానమిచ్చారు([3]).

[3] తాజీము కద్రిస్సలా 947.. షర్హు ఉసూలి ఏతిఖాది అహ్లిస్సున్న 1573.

ఇలాంటి మరో ఉల్లేఖనాన్ని అబుజ్జుబైర్ ఉల్లేఖించారు, పాపాన్ని మీరు కుఫ్ర్ (అవిశ్వాసం)గా భావించేవారా? అని జాబిర్ జాబిర్ రజియల్లాహు అన్హుమాను ప్రశ్నించినపుడు, “లేదు” అని జవాబిచ్చి, “మనిషి (విశ్వాసం) మరియు అవిశ్వాసంలో ఉన్న వ్యత్యాసం నమాజును విడనాడడమే” అని చెప్పారాయన(*).

ప్రవక్త సహచరులు ఇలా అనేవారని నాకు తెలిసిందని హసన్ ఉల్లేఖించారు([4]): “మనిషి (విశ్వాసం) మరియు షిర్క్ చేసి అవిశ్వాసుడయ్యే వాని మధ్య వ్యత్యాసం ఏదైనా ఉంటే, ధార్మిక పరమైన ఏ కారణం లేకుండా నమాజు విడనాడడం“. దీని సనద్ (ఆధారం) ప్రామాణికమైనది. హసన్ అంటే హసన్ బస్రీ, అతను అనేక మంది సహాబాలను కలసి వారితో హదీసులు విన్నారన్న విషయం తెలిసినదే.

[4] అస్సున్న 1372, అల్ ఇబాన 877, షర్హు ఉసూలి…..1539.

عَنْ عَبْدِ اللهِ بْنِ شَقِيقٍ الْعُقَيْلِيِّ قَالَ: (كَانَ أَصْحَابُ مُحَمَّدٍ ﷺ لَا يَرَوْنَ شَيْئًا مِنْ الْأَعْمَالِ تَرْكُهُ كُفْرٌ غَيْرَ الصَّلَاةِ)

అబ్దుల్లాహ్ బిన్ షఖీఖ్ ఇలా తెలిపారుః “మనిషి ఏదైనా ఆచరణ విడనాడితే అతను అవిశ్వాసానికి పాల్పడినట్లగునని ప్రవక్త సహచరులు భావించేవారు కాదు. కాని నమాజ్ విడనాడితే మాత్రం అవిశ్వాసానికి గురి అయినట్లని అనుకునేవారు“. దీని సనద్ ప్రామాణికమైనది. మరో ఉల్లేఖనంలోని పదాలు ఇలా ఉన్నాయిః “నమాజ్ తప్ప ఏదైనా ఆచరణ విడనాడితే అది అవిశ్వాసానికి పాల్పడినట్లు అవుతుందనే విషయం మాకు తెలియదు“. (అంటే నమాజు విడనాడుట కుఫ్ర్ కు సమానం అని). (అస్సున్న 1378).

అయ్యూబ్ ఉల్లేఖించారుః “నమాజు విడనాడుట అవిశ్వాసం. ఇందులో ఏలాంటి భేదాభిప్రాయం లేదు“. (తాజీము కద్రిస్సలా 978).

ముహమ్మద్ బిన్ నస్ర్ తన గ్రంథం తాజీము కద్రిస్సలా 990లో ఇలా పేర్కొన్నారుః ఇస్ హాఖ్ చెప్పగా నేను విన్నానుః “సమయం దాటినప్పటికీ ఏ ధార్మిక ఆటంకం లేకుండా ఉద్దేశ్యపూర్వకంగా నమాజ్ చేయనివాడు అవిశ్వాసి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా రుజువైన విషయమే. ఇస్ హాఖ్ అంటే ఇస్ హాఖ్ బిన్ రాహ్ వైహ్. ఇతను సహాబాల తర్వాత వచ్చినవారిలో ఏ కొందరైతే ఈ విషయంలో విభేదించారో వారిలో ఒకరు కారు. అందుకే అతని శిష్యుడు ముహమ్మద్ బిన్ నస్ర్ ఇలా చెప్పాడుః “నమాజు విడనాడేవాడు అవిశ్వాసి (బేనమాజి కాఫిర్), అతను ధర్మ భ్రష్టుడు మరియు దానిని స్థాపించనివానితో యుద్ధం చేయాలని” ఉల్లేఖించబడిన ప్రవక్త సూక్తులను అతను (ఇస్ హాఖ్) ఉల్లేఖించాడు. ప్రవక్త సహచరులతో కూడా ఇలాంటి విషయమే రుజువైనది. సహచరుల్లో ఏ ఒక్కరు కూడా దీనికి భిన్నాభిప్రాయం గలవారని రుజువు లేదు. వారి తర్వాత వచ్చిన విద్వాంసుల్లో కొందరు “బేనమాజి కాఫిర్, దానిని స్థాపించని వానితో యుద్ధం చేయాలని” ప్రవక్త మరియు వారి సహచరులతో ఉల్లేఖించబడిన ఉల్లేఖనాల వేరు భావం తీసి విభేదించారు.

అబ్దుల్లాహ్ “సున్నహ్”లో, ఇబ్ను నస్ర్ “తాజీము కద్రిస్సలా”లో, ఖల్లాల్ “సున్నహ్”లో, ఆజుర్రి “షరీఅ”లో మరియు ఇబ్ను బత్త “ఇబాన”లో ఉల్లేఖించారుః “సహాబాల ఒక పెద్ద సంఖ్య మరియు తదితరులు నమాజు విడనాడినవారిని కాఫిర్ అనేవారు“. మరి కొందరైతే నమాజు వదిలేవాడు కాఫిర్ అనే అధ్యాయం ప్రత్యేకించి దానికి సంబంధించిన నిదర్శనాలు అందులో పేర్కొన్నారు.

సోదరుడు సులైమాన్ బిన్ ఫహ్ ద్ అల్ ఉతైబీ “కునూజుస్సలా” (నమాజు నిధులు) పేరుతో చిరు పుస్తకం వ్రాసి అందులో ఈ గొప్ప విధిని, ఇస్లాంలో దాని స్థానాన్ని స్పష్టపరిచారు. నమాజు యొక్క లాభాల్ని దాని ప్రత్యేకతల్ని సైతం తెలియజేస్తూ ఇతర విధులపై దీని (నమాజ్) ప్రాముఖ్యతను చాటి చెప్పారు. దాన్ని నెరవేర్చే వారికి లభించే పుణ్యాలను కూడా మన ముందుంచారు. అల్లాహ్ వారికి మంచి ప్రతిఫలం నొసంగుగాక! మరింత సద్భాగ్యం ప్రసాదించుగాక!

అబ్దుల్లాహ్ బిన్ అబ్దుర్రహ్మాన్ అస్సఅ’ద్

భూమిక

అల్ హందు లిల్లాహిల్ మలికిల్ జబ్బార్, అల్ వాహిదిల్ ఖహ్హార్, వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లాషరీకలహూ రబ్బుస్సమావాతి వల్ అర్జి వమా బైనహుమల్ అజీజుల్ గఫ్ఫార్. వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ. అల్లాహ్ ప్రవక్తను ఆకాశాల వైపు ఆహ్వానించి విధి నమాజుల బహుమానం ప్రసాదించాడు. అది విశ్వాసం తర్వాత మొదటి విధి. విశ్వాసుల ఉత్తమ, ప్రథమ, ప్రముఖమైన గుణం.

నిశ్చయంగా నమాజ్ మనస్సుకు మంచి శిక్షణ ఇస్తుంది, ఆత్మను శుద్ధి పరుస్తుంది. హృదయాలను ప్రకాశవంతం చేస్తుంది, అందువల్ల మనిషిలో అల్లాహ్ యొక్క గొప్పతనం మొలకెత్తుతుంది. తద్వారా మనిషిని సౌభాగ్యవంతునిగా చేసి, అతని నడవడికలో మంచి మార్పును తీసుకువస్తుంది. ఒకరి వెనుక ఒకరు వచ్చిన అనేక ప్రవక్తల వద్ద తౌహీద్ తర్వాత అతి ముఖ్యమైన సంప్రదాయం ఇది. ఇస్మాఈల్ అలైహిస్సలాం గురించి అల్లాహ్ ఇలా తెలిపాడుః

అతను తన ఇంటివారిని నమాజును పాటించండి అని ఆజ్ఞాపించేవాడు“. (మర్యం 19: 55).

ఈసా అలైహిస్సలాం విషయంలో ఇలా తెలిపాడుః

నేను జీవించి ఉన్నంత కాలం నమాజును, జకాతును పాటించాలని ఆజ్ఞాపించాడు“. (సూరె మర్యం 19: 31).

నమాజ్ ద్వారా ప్రతి రోజూ అల్లాహ్ తో సంబంధం పెరుగుతుంది. ఇలా భక్తునికి ఒక రకమైన ఆత్మబలం లభిస్తుంది. అది అతనికి ఇతర విధుల నిర్వహణకు సహాయపడుతుంది.

నిశ్చయంగా నమాజ్ లోని అమూల్యమైన నిధులు మన కళ్ళ ముందు స్పష్టంగా ఉన్నాయి. కాని గుడ్డివారు ఎలా చూడ గలుగుతారు? నమాజులో గుప్తమైన మూడు నిధులున్నాయి. అల్లాహ్ తో సహాయం కోరిన తర్వాత అన్వేషణ, పరిశీలన మరియు చిత్తశుద్ధి, దృఢ సంకల్పంతో నీవు చేసే ఒకే ఒక్క నమాజు వల్ల సర్వ ముస్లిములోకెల్లా ఎక్కువ ధనసంపత్తి గలవాడవు అవుతావు.

గుప్తమైన మొదటి నిధిః “నమాజు కొరకు సంసిద్ధత”. వుజూ, అజాన్ యొక్క జవాబు మరియు త్వరగా నమాజుకు వెళ్ళడం ద్వారా నీవు ఈ నిధిని పొందగలవు.

దాగి ఉన్న రెండవ నిధిః పూర్తి శ్రధ్ధాభక్తులతో ప్రవక్త పద్దతి ప్రకారం నమాజు చేస్తూ, దాని అంతరంగంలో మునిగి తేలాడుతూ సంపాదించవచ్చు.

ఇక మూడవ నిధిని నమాజు తర్వాత జిక్ర్, దుఆ మరి సున్నతుల ఆచరణ, ఇంకా దాని తర్వాత నమాజు ప్రతీక్షణలో ఉండి పొందవచ్చు.

ఈ రచనలో ఏదైనా లోటు, పొరపాటు జరిగి ఉంటే మన్నించాలని, దీనిని ముస్లిలకు ప్రయోజనకరమైనదిగా చేయాలని అల్లాహ్ నే వేడు కుంటున్నాను. నా ఈ కృషికి బదులుగా రెట్టింపు పుణ్యాలు; (1. ఇజ్తిహాద్, 2. సరియైన దాని పుణ్యం) ప్రసాదించాలని కూడా ఆ కరుణప్రదాతనే వేడుకుంటున్నాను.

 వ ఆఖిరు దఅవానా అనిల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

అబూ సుల్తాన్ సులైమాన్ బిన్ ఫహ్ ద్ అల్ ఉతైబి
పోస్ట్ బాక్స్ నం: 270144. రియాజ్. పిన్ కోడ్: 11352

నమాజు నిధులు

నమాజులో చాలా గొప్ప నిధులు, కోశాగారాలున్నాయి. బహుశా అవి అనేక మందికి తెలియకపోవచ్చు. ఇవి సత్కర్మ, పుణ్యం మరియు హోదా అంతస్తులతో నిండి ఉన్నాయి. షైతాన్ కూడా మనల్ని వాటి నుండి దూరముంచడానికి సిద్ధమై యున్నాడు. మనం మన నిద్ర (అలక్ష్యం) నుండి మేల్కొనే సరికి తెలుపబోయే అనేక పుణ్యాల నుండి దూరముంచడానికి కొన్నిటిపై మాత్రమే తృప్తి పడేలా చేశాడు. అందువల్ల మనం ఒక్క నమాజు చేసుకొని వెళ్తాము కాని ఒక్క పుణ్యం కూడా మనకు దక్కదు. ఇలాంటి పరిస్థితి నుండి అల్లాహ్ మనల్ని కాపాడాలి. అందుకే ‘అల్లాహ్ పై విశ్వాసం’ మరియు ‘వాచా కర్మ’లో చిత్తశుద్ధి ఆయుధంతో సన్నద్ధమై, (అల్లాహ్) ‘సహనం’, ‘స్మరణం’ కోటలో భద్రంగా ఉండి, ‘వినయ’, ‘విమ్రత’ కవచం ధరించి యుధ్ధపతాకం ఎగిరేసి గత కాలంలో కోల్పోయిన మన నమాజులను మరియు దానికి సంబంధించిన అమూల్య నిక్షేపాలను, నిధులను కాపాడుకొనుటకు మనోవాంఛలకు మరియు షైతాన్ కు వ్యతిరేకంగా పోరాడుదాం.

ఇకనైనా సమయం రాలేదా? నిద్ర నుండి మేల్కొనే సమయం, ఏమరుపాటును వదులుకునే సమయం, పుణ్యాత్ముల బృందంలో కలిసే సమయం, సత్కార్యాల అకౌంట్ పెంచుకునే సమయం, కరుణామయుని కరుణ, మన్నింపుకై నిరీక్షించి సజ్జనులతో స్వర్గంలో ప్రవేశించేందుకు ప్రయత్నం చేసే సమయం రాలేదా?

నిశ్చయంగా నమాజు నిధులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని నమాజుకు ముందు పొందవచ్చు. మరి కొన్ని నమాజు మధ్యలో. మిగితావి నమాజు తర్వాత.

ఇక రండి! పయనమవుదాము……..’చిత్తశుద్ధి’ మరియు ‘ధైర్య’ నౌకలో నమాజులోని మూడు గుప్తమైన నిధుల అన్వేషణకై ప్రయాణం మొదలెడదాం.

1- మొదటి నిధిః (నమాజుకు ముందు) నమాజు కొరకు సంసిద్ధత.

2- రెండవ నిధిః (నమాజు సందర్భంలో) నమాజు చేయుట.

3- మూడవ నిధిః (నమాజు తర్వాత) జిక్ర్ మరియు కొన్ని ఆచరణలు.

మొదటి నిధి (నిక్షేపం): నమాజు కొరకు సంసిద్ధత

ఈ విలువగల నిధిని మనం నమాజులో ప్రవేశించక ముందు నమాజుకు సంబంధించిన ప్రథమ ఏర్పాట్లు మరియు మానసిక, ఆత్మీయ సంసిద్ధతల ద్వారా పొందగలము. దానికి అర్హులమయ్యే మార్గాలు క్రింది విధంగా ఉన్నాయి, శ్రద్ధ వహించండి.

1 – వుజూ

వుజూ యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. పుణ్యాల సంపాదన, వాటి రెట్టింపులకై ఇది మొదటి మెట్టు. వుజూ ద్వారా ఈ క్రింద తెలుపబడే పుణ్యాలు పొందగలము.

(అ) అల్లాహ్ యొక్క ప్రేమ

అల్లాహ్ ఆదేశం:

నిశ్చయంగా తౌబా చేసేవారిని మరియు పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు“. (బఖర 2: 222).

అల్లాహ్ మనల్ని ప్రేమించటం కంటే గొప్ప పుణ్యమేమిటి?

షేఖ్ సఅదీ తన తఫ్సీర్ -తైసీరుల్ కరీమిర్రహ్మాన్ ఫీ తఫ్సీరి కలామిల్ మన్నాన్-లో చెప్పారుః “ఈ ఆయతులో ‘పరిశుద్ధతను పాటించేవారు’ అంటే పాపాల నుండి దూరముండడం, అయితే ఇందులో మలినము నుండి శుద్ధి పొందుట కూడా వస్తుంది. పరిశుభ్రత మరియు వుజూ ఒక ధార్మిక విషయం అని దీని ద్వారా తెలుస్తుంది. ఎలా అంటే దాన్ని పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తున్నాడు అని వచ్చింది. అందుకే పరిశుభ్రత, వుజూ నమాజ్, తవాఫ్ మరియు ఖుర్ఆన్ పారాయణానికి ఒక షరతుగా ఉంది.”

(ఆ) వుజూ నీళ్ళతో పాపాల తొలగింపు

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ اللهِ ﷺ قَالَ: (إِذَا تَوَضَّأَ الْعَبْدُ الْمُسْلِمُ أَوْ الْمُؤْمِنُ فَغَسَلَ وَجْهَهُ خَرَجَ مِنْ وَجْهِهِ كُلُّ خَطِيئَةٍ نَظَرَ إِلَيْهَا بِعَيْنَيْهِ مَعَ الْمَاءِ أَوْ مَعَ آخِرِ قَطْرِ الْمَاءِ فَإِذَا غَسَلَ يَدَيْهِ خَرَجَ مِنْ يَدَيْهِ كُلُّ خَطِيئَةٍ كَانَ بَطَشَتْهَا يَدَاهُ مَعَ الْمَاءِ أَوْ مَعَ آخِرِ قَطْرِ الْمَاءِ فَإِذَا غَسَلَ رِجْلَيْهِ خَرَجَتْ كُلُّ خَطِيئَةٍ مَشَتْهَا رِجْلَاهُ مَعَ الْمَاءِ أَوْ مَعَ آخِرِ قَطْرِ الْمَاءِ حَتَّى يَخْرُجَ نَقِيًّا مِنَ الذُّنُوبِ).

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారుః

“ముస్లిం లేక మోమిన్ దాసుడు వుజూ చేస్తూ, తన ముఖం కడిగినపుడు ప్రవహించే నీళ్ళతో లేక చివరి నీటి చుక్కతో కళ్ళతో చూసి చేసిన ప్రతి పాపం రాలిపోతుంది (మన్నించబడుతుంది). రెండు చేతులు కడిగినపుడు వెళ్ళే నీళ్ళతో లేక చివరి నీటి చుక్కతో చేయితో పట్టి చేసిన ప్రతి పాపం రాలిపోతుంది. రెండు కాళ్ళు కడిగినపుడు వెళ్ళే నీళ్ళతో లేక చివరి నీటి చుక్కతో కాళ్ళు నడచి చేసిన ప్రతి పాపం రాలిపోతుంది. చివరికి అతను పాపాల నుండి పూర్తిగా పరిశుద్ధుడై వెళ్తాడు”. (ముస్లిం 244).

عَنْ عُثْمَانَ بْنِ عَفَّانَ ÷ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ خَرَجَتْ خَطَايَاهُ مِنْ جَسَدِهِ حَتَّى تَخْرُجَ مِنْ تَحْتِ أَظْفَارِهِ).

ఎవరు సక్రమంగా వుజూ చేస్తారో అతని శరీరం నుండి అతని పాపాలు దూరమయిపోతాయి. చివరికి అతని గోళ్ళ నుండి వెళ్ళిపోతాయి“. (ముస్లిం 245).

మరో గొప్ప ఘనత క్రింద పాదసూచికలో లో చూడండిః([5]).

[5] వుజూ యొక్క మరో ఘనత ముస్నద్ అహ్మదులో ఇలా ఉందిః

عَن أَبِي أُمَامَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: أَيُّمَا رَجُلٍ قَامَ إِلَى وَضُوئِهِ يُرِيدُ الصَّلَاةَ ثُمَّ غَسَلَ كَفَّيْهِ نَزَلَتْ خَطِيئَتُهُ مِنْ كَفَّيْهِ مَعَ أَوَّلِ قَطْرَةٍ فَإِذَا مَضْمَضَ وَاسْتَنْشَقَ وَاسْتَنْثَرَ نَزَلَتْ خَطِيئَتُهُ مِنْ لِسَانِهِ وَشَفَتَيْهِ مَعَ أَوَّلِ قَطْرَةٍ فَإِذَا غَسَلَ وَجْهَهُ نَزَلَتْ خَطِيئَتُهُ مِنْ سَمْعِهِ وَبَصَرِهِ مَعَ أَوَّلِ قَطْرَةٍ فَإِذَا غَسَلَ يَدَيْهِ إِلَى الْمِرْفَقَيْنِ وَرِجْلَيْهِ إِلَى الْكَعْبَيْنِ سَلِمَ مِنْ كُلِّ ذَنْبٍ هُوَ لَهُ وَمِنْ كُلِّ خَطِيئَةٍ كَهَيْئَتِهِ يَوْمَ وَلَدَتْهُ أُمُّهُ. { أحمد }

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఏ వ్యక్తి నమాజు ఉద్దేశ్యంతో వుజూ చేస్తూ రెండు అరచేతులు కడుగుతాడో నీటి తొలి చుక్క ద్వారా అతని రెండు చేతులతో చేసిన పాపాలు తొలిగిపోవును. నోట్లు నీళ్ళు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్ళు ఎక్కించి చీది శుభ్రపరచుకుంటాడో నీటి మొదటి చుక్క ద్వారా అతని నాలుక మరియు పెదవుల ద్వారా చేసిన పాపాలు తొలిగిపోతాయి. ముఖము కడిగినప్పుడు కళ్ళు మరియు చెవి ద్వారా చేసిన పాపాలు నీటి మొదటి చుక్క ద్వారా తొలిగి పోతాయి. మోచేతుల వరకు చేతులు, మోకాళ్ళ వరకు కాళ్ళు కడినగినప్పుడు సర్వ పాపాల నుండి విముక్తి పొంది తల్లి గర్భం నుండి పుట్టినప్పటి స్థితి మాదిరిగా అయిపోతాడు”. (అహ్మద్ 36/601). [ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ]

(ఇ) ప్రళయదినాన వుజూ అంగములు (కాంతిగా) ప్రకాశిస్తాయి:

عن أَبِي هُرَيْرَةَ ÷ قَالَ إِنِّي سَمِعْتُ النَّبِيَّ ﷺ يَقُولُ: (إِنَّ أُمَّتِي يُدْعَوْنَ يَوْمَ الْقِيَامَةِ غُرًّا مُحَجَّلِينَ مِنْ آثَارِ الْوُضُوءِ فَمَنْ اسْتَطَاعَ مِنْكُمْ أَنْ يُطِيلَ غُرَّتَهُ فَلْيَفْعَلْ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను అని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

“ప్రళయదినాన నా అనుచర సమాజాన్ని (కర్మ విచారణ కోసం) పిలవడం జరుగుతుంది. అప్పుడు వారి ముఖాలు, చేతులు వుజూ ప్రభావంతో తెల్లగా, మహోజ్వలంగా ఉంటాయి. అందువల్ల మీలో ఎవరైనా తమ తెలుపు, తేజస్సులను వృద్ధి చేసుకో దలిస్తే వారు అలా వృద్ధి చేసుకోవచ్చు”. (బుఖారి 136, ముస్లిం 246).

(ఈ) పాపాల తుడిచివేత మరియు ఉన్నత స్థానం:

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ اللهِ ﷺ قَالَ: (أَلَا أَدُلُّكُمْ عَلَى مَا يَمْحُو اللهُ بِهِ الْخَطَايَا وَيَرْفَعُ بِهِ الدَّرَجَاتِ) قَالُوا: بَلَى يَا رَسُولَ اللهِ قَالَ: (إِسْبَاغُ الْوُضُوءِ عَلَى الْـمَكَارِهِ وَكَثْرَةُ الْـخُطَا إِلَى الْـمَسَاجِدِ وَانْتِظَارُ الصَّلَاةِ بَعْدَ الصَّلَاةِ فَذَلِكُمْ الرِّبَاطُ فَذَلِكُمْ الرِّبَاطُ).

అబూహురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారుః

“పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో నేను మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారుః “(1) వాతావరణం, పరిస్థితులూ అననుకూలంగా ఉన్నప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం. ఇది రిబాత్ తో సమానం, ఇది రిబాత్ తో సమానం”. (ముస్లిం 251).

పరిస్థితులూ అననుకూలంగా ఉండుటః అంటే చలి కాలంలో చల్ల దనం, లేక అనారోగ్యం వల్ల చలనం, కదలిక కష్టంగా తోచినపుడు వుజూ చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది. అయితే ఇలాంటి సందర్భంలో పాపాల మన్నింపు, పుణ్యాల రెట్టింపు, స్వర్గంలో ప్రవేశముద్దేశంతో పై మూడు కార్యాలు నెరవేర్చువాడిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాపాల మన్నింపు మరియు షహాదత్ అపేక్షతో శత్రువు మధ్యలో పహరా కాయడం (రిబాత్)తో పోల్చారు.

మరికొందరి అభిప్రాయ ప్రకారం, వీటిని ‘రిబాత్‘ అనటానికి కారణ మేమంటే అవి మనిషిని పాపాల నుండి దూరముంచుతాయి. నిజము దేవుడెరుగును. (అల్ మత్జరుర్రాబిహ్ ఫీ సవాబిల్ అమలిస్సాలిహ్ లిల్ హాఫిజ్ అబూ ముహమ్మద్ షర్ఫొద్దీన్ అబ్దుల్ మోమిన్ అద్దిమ్యాతి).

(ఉ) పాపాల క్షమాపణ మరియు స్వర్గ ప్రవేశం:

عَنْ عُثْمَانَ ÷ أنَّهُ تَوَضَّأَ ثُمَّ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (مَنْ تَوَضَّأَ نَحْوَ وُضُوئِي هَذَا ثُمَّ صَلَّى رَكْعَتَيْنِ لَا يُحَدِّثُ فِيهِمَا نَفْسَهُ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ).

ఉస్మాన్ రజియల్లాహు అన్హు వుజూ చేసి ఇలా చెప్పారుః నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలాగే వుజూ చేస్తూ ఉండగా చూశాను. పిదప ఆయన ఇలా ప్రవచించారుః “ఎవరు నా ఈ పద్ధతి ప్రకారం వుజూ చేసి, మనసులో ఎలాంటి (ప్రాపంచిక) ఆలోచనలు రానివ్వకుండా పూర్తి ఏకాగ్రతతో రెండు రకాతుల నమాజు చేస్తారో అతని గత పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 1934, ముస్లిం 226).

عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ الْجُهَنِيِّ ÷ أَنَّ رَسُولَ اللهِ ﷺ قَالَ: (مَا مِنْ أَحَدٍ يَتَوَضَّأُ فَيُحْسِنُ الْوُضُوءَ وَيُصَلِّي رَكْعَتَيْنِ يُقْبِلُ بِقَلْبِهِ وَوَجْهِهِ عَلَيْهِمَا إِلَّا وَجَبَتْ لَهُ الْجَنَّةُ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని ఉఖ్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరైనా ఒకరు ఉత్తమ రీతిలో వుజూ చేసుకొని, పూర్తి శ్రద్ధాభక్తులతో రెండు రకాతుల నమాజు చేసినచో అతనికి తప్పక స్వర్గం లభిస్తుంది”. (అబూ దావూద్ 906, ముస్లిం 234).

2 – వుజూ తర్వాత దుఆ

వుజూ తర్వాత దుఆ యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. మొదటి నిధిలోని మరికొన్ని పుణ్యాల అన్వేషణలో మనం ఉన్నాము. వుజూ తర్వాత గల ప్రత్యేక దుఆల ద్వారా క్రింది పుణ్యాలు సంపాదించవచ్చు.

(అ) స్వర్గపు ఎనిమిది ద్వారాల్లో ఇష్టమున్న ద్వారము నుండి ప్రవేశించే స్వేచ్ఛ:

عَنْ عُمَرَ بنِ الخَطَّابِ ÷ عَنْ رَسُولِ الله ﷺ قَالَ: (مَا مِنْكُمْ مِنْ أَحَدٍ يَتَوَضَّأُ فَيُسْبِغُ الْوَضُوءَ ثُمَّ يَقُولُ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ إِلَّا فُتِحَتْ لَهُ أَبْوَابُ الْـجَنَّةِ الثَّمَانِيَةُ يَدْخُلُ مِنْ أَيِّهَا شَاءَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసి, “అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ” చదివితే వారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. తాను కోరిన ద్వారము నుండి అతను అందులో ప్రవేశించవచ్చు”. (ముస్లిం 234).

(ఆ) తోలుకాగితంలో పేరు వ్రాయబడి దానిపై ముద్ర వేయబడుతుంది. అది ప్రళయదినం వరకు తీయబడదుః

عَنْ أَبِي سَعِيدِ الخُدرِي ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ تَوَضَّأَ فَقَالَ: سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ أَشْهَدُ أَن لاَ إِلَهَ إِلاَّ أَنتَ أَسْتَغْفِرُكُ وَأَتُوبَ إِلَيكَ، كُتِبَ فِي رِِقٍّ ثُمَّ جُعِلَ فِي طَابِعٍ فَلَمْ يُكسَرْ إِلى يَومِ الْقِيامة).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరైనా వుజూ చేసి, “సుబ్ హానకల్లాహుమ్మ వ బిహందిక అష్ హదు అల్లాఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక” చదువుతారో అతని పేరు తోలు కాగితంలో వ్రాయబడుతుంది. ముద్ర వేయబడుతుంది. ప్రళయదినం వరకు తీయబడదు”([6]).

[6] [సునన్ నిసాయీ అల్ కుబ్రా/ బాబు మా యఖూలు ఇజా ఫరగ మిన్ వుజూఇహీ. 9909. 6/25. సహీహుత్తర్గీబు వత్తర్ హీబ్ 225. సహీహుల్ జామిఅ 6170]

3 – మిస్వాక్

ఒక పుణ్యం తర్వాత మరో పుణ్యం సంపాదించడంలోనే ఉన్నాము, ఇప్పుడు మనం (మిస్వాక్) స్టేషన్ లో ఉన్నాము. ఈ గొప్ప పుణ్యం గురించి చదవండిః మిస్వాక్ నోటిని శుభ్రం చేయునది, అల్లాహ్ ను సంతృష్టి పరచునది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లఖించారుః

السِّوَاكُ مَطْهَرَةٌ لِلْفَمِ مَرْضَاةٌ لِلرَّبِّ

మిస్వాక్ నోటికి శుభ్రత కలుగజేస్తుంది మరియు అల్లాహ్ ను సంతృష్టి పరుస్తుంది[7].

 [7] నిసాయి 5, ఇబ్ను మాజ 289, బుఖారీ ముఅల్లఖన్ హ. నం. 1933 తర్వాత. ముస్నద్ అహ్మద్ 1/3).

4 – నమాజు కొరకు తొలిసమయంలో వెళ్ళటం

నమాజు కొరకు తొలి సమయంలో (త్వరగా, శీఘ్రముగా) బయలుదేరుట చాలా ఘనతగల విషయం. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَمْ يَجِدُوا إِلَّا أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لَاسْتَهَمُوا وَلَوْ يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ لَاسْتَبَقُوا إِلَيْهِ).

“అజాన్ చెప్పడంలో, మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటులు వేసుకునే పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటులు వేసుకుంటారు. అలాగే నమాజ్ వేళ కాగానే తొలి సమయంలో (మస్జిద్) చేరడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీపడతారు”. (బుఖారీ 615, ముస్లిం 437).

జుమా నమాజు కొరకు తొలి సమయంలో వెళ్ళటంలో ప్రత్యేక శ్రేష్ఠత మరియు చెప్పరాని విశిష్ఠత ఉంది. ఈ హదీసుపై శ్రద్ధ వహించండి. ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః

عَنْ أَوسِ بنِ أَوسٍ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ غَسَّلَ وَ اغْتَسَلَ يَومَ الْـجُمُعَةِ وَ بَكَّرَ وَ ابْتَكَرَ وَدَنَا مِنَ الإِمَامِ فَأَنصَتَ، كَانَ لَهُ بِكُلِّ خُطوَةٍ يَخطُوهَا صِيامُ سَنَةٍ وَ قِيامُها وَ ذَلِكَ عَلَى اللهِ يَسير).

ఎవరు జుమా రోజు తలంటు స్నానం చేసి, తొలి సమయంలో అందరికంటే ముందుగా (మస్జిద్ చేరుకుని), ఇమాంకు సమీపంగా నిశ్శబ్దంగా కూర్చున్నాడో, అతను నడిచే ప్రతి అడుగుకు బదులుగా ఒక సంవత్సరపు ఉపవాసాల మరియు ఒక సంవత్సరపు తహజ్జుద్ నమాజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇది అల్లాహ్ కు ఎంతో కష్టం కాదు“([8]).

[8] అల్ ముఅజముల్ కబీర్ లిత్తబ్రానీ 1/214. అహ్మద్ 4/9. దీని భావం అబూ దావూద్ 345. తిర్మిజి 496. నిసాయీ 1381. ఇబ్ను మాజ 1087లో ఉంది

జుమా కొరకు ఒక్కో అడుగుపై ఒక సంవత్సరపు ఉపవాసాల మరియు తహజ్జుద్ చేసినంత పుణ్యం!! ఇంతకంటే గొప్ప శ్రేష్ఠత, ఘనతగల ఫలితం ఇంకేముంది?

నిరంతరం నమాజు కొరకు తొలి సమయంలో వెళ్ళటం మనసంతా మస్జిద్ లోనే ఉందన్నదానికి సంకేతం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఉపదేశించారుః “అల్లాహ్ ఛాయ తప్ప మరెలాంటి ఛాయ లభించని (ప్రళయ)దినాన అల్లాహ్ ఏడుగురు వ్యక్తులను తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. అందులో ఒకడుః మస్జిద్ నుండి వెళ్ళినప్పటి నుండీ అక్కడికి తిరిగి వచ్చే వరకు మనసంతా మస్జిదులోనే ఉండేటటువంటి వ్యక్తి“. (తిర్మిజి 2391, బుఖారి 660, ముస్లిం 1031).

5 – అజాన్ కు బదులు పలకటం

ఇప్పటికీ మనం నమాజుకు సంబంధించిన నిధుల మధ్య ఉత్తమ మైన సుకృతాలు, అమూల్యమైన పుణ్యాల అన్వేషణలో ఉన్నాము. అజాన్ యొక్క జవాబు ద్వారా స్వర్గం పొందవచ్చన్న శుభవార్త ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చియున్నారు. ఈ రెండు హదీసులపై శ్రద్ధ వహించండిః

عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (إِذَا قَالَ الْـمُؤَذِّنُ اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ فَقَالَ أَحَدُكُمْ اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ ثُمَّ قَالَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ قَالَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ ثُمَّ قَالَ أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ قَالَ أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ ثُمَّ قَالَ حَيَّ عَلَى الصَّلَاةِ قَالَ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِالله ثُمَّ قَالَ حَيَّ عَلَى الْفَلَاحِ قَالَ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِالله ثُمَّ قَالَ اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ قَالَ اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ ثُمَّ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ مِنْ قَلْبِهِ دَخَلَ الجَنَّةَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ముఅజ్జిన్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అన్నపుడు దానికి జవాబుగా మీలో ఒకడు తన హృదయాంతరంతో అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అంటే, అతను (ముఅజ్జిన్) అష్ హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్ అన్నపుడు ఇతను (మీలో ఒకడు) అష్ హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్ అంటే, అతను అష్ హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్ అన్నపుడు ఇతను అష్ హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్ అంటే, అతను హయ్య అలస్సలా అన్నపుడు ఇతను లాహౌల వలా ఖవ్వత ఇల్లా బిల్లాహ్ అంటే, అతను హయ్య అలల్ ఫలాహ్ అన్నపుడు ఇతను లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అంటే అతను అల్లాహు అక్బర్ అన్నపుడు ఇతను అల్లాహు అక్బర్ అంటే మళ్ళీ అతను లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నపుడు ఇతను లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఇతను స్వర్గంలో ప్రవేశిస్తాడు”. (ముస్లిం 385).

عًن أَبِي هُرَيْرَةَ ÷ يَقُولُ كُنَّا مَعَ رَسُولِ الله ﷺ بِتَلَعَاتِ الْيَمَنِ فَقَامَ بِلَالٌ يُنَادِي فَلَمَّا سَكَتَ قَالَ رَسُولُ اللهِ ﷺ: (مَنْ قَالَ مِثْلَ مَا قَالَ هَذَا يَقِينًا دَخَلَ الجَنَّةَ).

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో యమన్ వైపున హిజాజులో ఒక ఎత్తైన ప్రదేశంలో ఉండగా, బిలాల్ నిలబడి అజాన్ ఇచ్చాక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః “ఇతను (బిలాల్) చెప్పినట్లు పూర్తి నమ్మకంతో ఎవరు జవాబిస్తారో అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు”. (అహ్మద్ 2/352. నిసాయీ 668).

6 – అజాన్ తర్వాత దుఆ

అజాన్ తర్వాత దుఆ యొక్క ఘనత కూడా గొప్పగా ఉంది. కాని అనేకులు దీని పట్ల అశ్రద్ధ వహిస్తున్నరు. దాని సారాంశం క్రింది విధంగా ఉందిః

(అ) పాపాల మన్నింపుః

عَنْ سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ ÷ عَنْ رَسُولِ الله ﷺ أَنَّهُ قَالَ: (مَنْ قَالَ حِينَ يَسْمَعُ الْـمُؤَذِّنَ وَأَنَا أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ رَضِيتُ بِالله رَبًّا وَبِمُحَمَّدٍ رَسُولًا وَبِالْإِسْلَامِ دِينًا غُفِرَ لَهُ ذَنْبُهُ).

సఅద్ బిన్ వఖ్ఖాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః “ముఅజ్జిన్ అజాన్ విన్నాక ‘వ అన అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రజీతు బిల్లాహి రబ్బా వబి ముహమ్మదిర్ రసూలా వబిల్ ఇస్లామి దీనా’ చదివిన వారి పాపాలు మన్నించబడతాయి”. (ముస్లిం 386, అబూ దావూద్ 525, తిర్మిజీ 210, నిసాయీ 672, ఇబ్ను మాజ 721).

(ఆ) ప్రళయదినాన ప్రవక్త యొక్క సిఫారసుకు అర్హుడవుతాడుః

عَنْ جَابِرِ بْنِ عَبْدِ الله ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (مَنْ قَالَ حِينَ يَسْمَعُ النِّدَاءَ اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ وَالصَّلَاةِ الْقَائِمَةِ آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ حَلَّتْ لَهُ شَفَاعَتِي يَوْمَ الْقِيَامَةِ).

“‘అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్దావతిత్తామ్మతి వస్సలాతిల్ ఖాఇమతి ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలత వబ్అస్ హు మఖామమ్ మహ్మూద నిల్లజీ వఅత్తహూ’. ఈ దుఆ ఎవరు అజాన్ విన్న తర్వాత చదువుతారో వారు ప్రళయదినాన నా సిఫారసుకు అర్హులవు తార”ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చినట్లు జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు)ఉల్లేఖించారు. (బుఖారీ 614).

7 – నమాజ్ కొరకు నడచి వెళ్ళడం

నమాజు కొరకు నడచి వెళ్ళడంలో అమూల్యమైన పుణ్యాలున్నాయి. అవి విశ్వాసి యొక్క సత్కర్మల అకౌంట్ ను పెంచుతాయి. దీనిని సంక్షిప్తంగా క్రింద తెలియజేస్తున్నాముః

(అ) స్వర్గంలో ఆతిథ్యం

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ عَنِ النَّبِيِّ ﷺ قَالَ: (مَنْ غَدَا إِلَى الْـمَسْجِدِ أَوْ رَاحَ أَعَدَّ اللهُ لَهُ فِي الْـجَنَّةِ نُزُلًا كُلَّمَا غَدَا أَوْ رَاحَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో ఆతిథ్యం ఇస్తాడు”. (ముస్లిం 669, బుఖారి 662).

(ఆ) పాపాల మన్నింపు మరియు స్థానాల ఉన్నతం

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ تَطَهَّرَ فِي بَيْتِهِ ثُمَّ مَشَى إِلَى بَيْتٍ مِنْ بُيُوتِ الله لِيَقْضِيَ فَرِيضَةً مِنْ فَرَائِضِ الله كَانَتْ خَطْوَتَاهُ إِحْدَاهُمَا تَحُطُّ خَطِيئَةً وَالْأُخْرَى تَرْفَعُ دَرَجَةً).

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః “ఎవరైనా తనింట్లో వుజూ చేసుకొని అల్లాహ్ గృహాల్లోని ఒక గృహానికి అల్లాహ్ విధుల్లోని ఒక విధి నెరవేర్చడానికి బయలుదేరుతే అతని ఒక అడుగుకు బదులుగా పాప మన్నింపు జరిగితే రెండవ అడుగుకు బదులు అతని స్థానం పెరుగుతుంది”. (ముస్లిం 666).

(ఇ) అతి గొప్ప ప్రతిఫలం

عَنْ أَبِي مُوسَى ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (إِنَّ أَعْظَمَ النَّاسِ أَجْرًا فِي الصَّلَاةِ أَبْعَدُهُمْ إِلَيْهَا مَمْشًى فَأَبْعَدُهُمْ وَالَّذِي يَنْتَظِرُ الصَّلَاةَ حَتَّى يُصَلِّيَهَا مَعَ الْإِمَامِ أَعْظَمُ أَجْرًا مِنَ الَّذِي يُصَلِّيهَا ثُمَّ يَنَامُ).

అబూ మూసా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్తిచ్చారుః “నమాజు విషయంలో అందరికంటే గొప్ప ఫలానికి అర్హుడు అందరికంటే ఎక్కువ దూరం నండి నమాజు కోసం నడిచి వచ్చేవాడు. నమాజు తొందరగా చేసి పడుకునే వ్యక్తి కంటే సామూహిక నమాజు కోసం ఎదురు చూస్తూ ఇమాంతో నమాజు చేసుకునే వ్యక్తి ఎక్కువ పుణ్యానికి అర్హుడవుతాడు”. (ముస్లిం 662, బుఖారీ 651).

(ఈ) ప్రళయదినాన సంపూర్ణ కాంతి

عَنْ بُرَيْدَةَ ÷ عَنَ النَّبِيِّ ﷺ قَالَ: (بَشِّرْ الْـمَشَّائِينَ فِي الظُّلَمِ إِلَى الْـمَسَاجِدِ بِالنُّورِ التَّامِّ يَوْمَ الْقِيَامَةِ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని బురైద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “చీకట్లో నడుచుకుంటూ మస్జిద్ కు వెళ్ళే వారికి ప్రళయదినాన సంపూర్ణ కాంతి శుభవార్త ఇవ్వండి”. (తిర్మిజి 223. అబూ దావూద్ 561).

(ఉ) సదకా

عَن أَبي هُرَيْرَةَ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ :…. (وَالْكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ وَكُلُّ خُطْوَةٍ تَمْشِيهَا إِلَى الصَّلَاةِ صَدَقَةٌ).

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః “మంచి మాట ఒక సదకా (దానం) మరియు నమాజు కొరకు మస్జిదుకు వెళ్తున్నప్పుడు వేసే ప్రతి అడుగు దానమే”. (బుఖారీ 2891, ముస్లిం 1009).

మస్జిద్ లో ప్రవేశిస్తూ ఎవరైనా “అఊజు బిల్లాహిల్ అజీం వబివజ్ హిహిల్ కరీం వసుల్తానిహిల్ కదీం మినష్షైతానిర్రజీం” చదివితే, ‘ఈ రోజంతా ఇతడు నా నుండి కాపాడబడ్డాడు’ అని షైతాన్ అంటాడు. (అబూదావూద్ 466, సహీహుల్ జామి 4715).

8 – మొదటి పంక్తిలో నిలబడటానికి ముందంజ వేయటం

(అ) మొదటి పంక్తిలో ఉండే కాంక్ష

మొదటి పంక్తిలో ఉండే కాంక్షలో కూడా గొప్ప ఘనత ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని నిర్ణీత ఫలితం తెలుపకుండా మౌనం వహించడమే దాని గొప్ప శ్రేష్ఠతను సూచిస్తుంది. ఆయన ప్రవచనం ఇలా ఉందిః

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَمْ يَجِدُوا إِلَّا أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لَاسْتَهَمُوا وَلَوْ يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ لَاسْتَبَقُوا إِلَيْهِ).

“అజాన్ చెప్పడంలో, మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటులు వేసుకునే పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటులు వేసుకుంటారు. అలాగే నమాజ్ వేళ కాగానే తొలి సమయంలో (మస్జిద్) చేరడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీపడతారు”. (బుఖారీ 615, ముస్లిం 437).

(ఆ) దైవదూతలతో పోలిక

عَنْ جَابِرِ بْنِ سَمُرَةَ ÷ قَالَ: خَرَجَ عَلَيْنَا رَسُولُ الله ﷺ فَقَالَ :(أَلَا تَصُفُّونَ كَمَا تَصُفُّ الْـمَلَائِكَةُ عِنْدَ رَبِّهَا فَقُلْنَا يَا رَسُولَ الله وَكَيْفَ تَصُفُّ الْـمَلَائِكَةُ عِنْدَ رَبِّهَا قَالَ يُتِمُّونَ الصُّفُوفَ الْأُوَلَ وَيَتَرَاصُّونَ فِي الصَّفِّ).

జాబిర్ బిన్ సముర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్యలో వచ్చి “దైవదూతలు తమ ప్రభువు ముందు ఏ విధంగా బారులు తీరియుంటారో మీరు ఆ విధంగా మీ పంక్తులను సరి చేసుకోరా?” అని ప్రశ్నించారు. ‘దైవదూతలు తమ ప్రభువు ముందు ఎలా బారులు తీరియుంటారు ప్రవక్తా’ అని మేమడిగాము. “మొదటి పంక్తి పూర్తి చేశాకే దాని తర్వాత పంక్తిలో నిలబడతారు. మరియు దగ్గర దగ్గరగా కట్టు దిట్టంగా నిలబడతారు” అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. (ముస్లిం 430).

(ఇ) పురుషులకు ఏది మేలు?

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (خَيْرُ صُفُوفِ الرِّجَالِ أَوَّلُهَا وَشَرُّهَا آخِرُهَا وَخَيْرُ صُفُوفِ النِّسَاءِ آخِرُهَا وَشَرُّهَا أَوَّلُهَا)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “పురుషుల మేలైన పంక్తి మొదటి పంక్తి, చెడ్డది చివరిది. స్త్రీల మేలైన పంక్తి చివరిది. చెడ్డది మొదటిది”. (ముస్లిం 440).

(ఈ) వెనకుండే వారిని అల్లాహ్ వెనకనే ఉంచాలన్న ప్రవక్త శాపనార్థానికి దూరంగా ఉండవచ్చుః

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ ÷ أَنَّ رَسُولَ الله ﷺ رَأَى فِي أَصْحَابِهِ تَأَخُّرًا فَقَالَ لَهُمْ (تَقَدَّمُوا فَأْتَمُّوا بِي وَلْيَأْتَمَّ بِكُمْ مَنْ بَعْدَكُمْ لَا يَزَالُ قَوْمٌ يَتَأَخَّرُونَ حَتَّى يُؤَخِّرَهُمْ اللهُ).

అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ అనుచరుల్ని నమాజులోని పంక్తుల నుండి వెనక ఉండడాన్ని చూసి ఇలా చెప్పారుః “ముందుకు రండి, మీరు నన్ను అనుసరించండి. మీ వెనక వారు మిమ్మల్ని అనుసరిస్తారు. (జాగ్రత్త!) ప్రజలు గనక ఎప్పుడూ వెనకే ఉంటే అల్లాహ్ కూడా వారిని వెనకబాటుతనానికి గురిచేస్తాడు”. (ముస్లిం 438).

(క) మొదటి పంక్తుల్లో ఉన్నవారిపై అల్లాహ్ మరియు ఆయన దూతల దీవెనలుః

عَنْ الْبَرَاءِ بْنِ عَازِبٍ ÷ قَالَ: كَانَ رَسُولُ الله ﷺ يَتَخَلَّلُ الصَّفَّ مِنْ نَاحِيَةٍ إِلَى نَاحِيَةٍ يَمْسَحُ صُدُورَنَا وَمَنَاكِبَنَا وَيَقُولُ: (لَا تَخْتَلِفُوا فَتَخْتَلِفَ قُلُوبُكُمْ) وَكَانَ يَقُولُ: (إِنَّ اللهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى الصُّفُوفِ الْأُوَلِ).

బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పంక్తుల మధ్య వచ్చి మా భుజాలను, ఛాతిని వెనకా ముందు ఉండ కుండా సరిచేసేవారు. ఇంకా ఇలా అనేవారుః “మీరు పంక్తుల్లో వెనకా మందు విభిన్న రీతిలో నిలబడకండి, అందువల్ల మీలో మనస్పర్థలు ఏర్పడవచ్చు”. ఇంకా ఇలా అనేవారుః “మొదటి పంక్తుల్లో ఉన్నవారిని అల్లాహ్ తనకు అతిసన్నిహితంగా ఉన్న దైవదూతల మధ్య ప్రశంసిస్తాడు మరియు దైవదూతలు వారి కొరకు దుఆ చేస్తారు”. (అబూ దావూద్ 664).

9 – సున్నతె ముఅక్కద

(అ) నిరంతరం సున్నతె ముఅక్కద చదివేవారు స్వర్గంలో ఒక గృహానికి అర్హులవుతారు.

عَنْ أُمِّ حَبِيبَةَ ÷ زَوْجِ النَّبِيِّ ﷺ أَنَّهَا قَالَتْ سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (مَا مِنْ عَبْدٍ مُسْلِمٍ يُصَلِّي لله كُلَّ يَوْمٍ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً تَطَوُّعًا غَيْرَ فَرِيضَةٍ إِلَّا بَنَى اللهُ لَهُ بَيْتًا فِي الْـجَنَّةِ أَوْ إِلَّا بُنِيَ لَهُ بَيْتٌ فِي الْـجَنَّةِ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నానని ఆయన సతీమణి ఉమ్మె హబీబ రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః “ముస్లిం దాసుడు ప్రతి రోజూ ఫర్జ్ నమాజు కాకుండా పన్నెండు రకాతుల నఫిల్ నమాజు అల్లాహ్ కొరకు చేస్తూ ఉంటే అల్లాహ్ అతని కొరకు స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు. లేక ఒక ఇల్లు అతని కొరకు నిర్మించబడుతుంది”. (ముస్లిం 728).

సున్నతె ముఅక్కదలో కొన్ని ఫర్జ్ నమాజుకు ముందున్నాయి, మరి కొన్ని తర్వాతున్నాయి. అవి మొత్తం 12 రకాతులు.

ఫర్జ్ కంటే ముందున్నవిః

1- ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః

عَنْ عَائِشَةَ ÷ عَنِ النَّبِيِّ ﷺ قَالَ: (رَكْعَتَا الْفَجْرِ خَيْرٌ مِنْ الدُّنْيَا وَمَا فِيهَا).

ఫజ్ర్ కు ముందు రెండు రకాతులు ప్రపంచము మరియు అందులో ఉన్నవాటి కంటే ఉత్తమమైనవి“. (ముస్లిం 725).

నాతో పాటు మీరు కూడా ఈ హదీసుపై శ్రద్ధ చూపండిః ఫజ్ర్ సున్నతులు ప్రపంచం, వాటిపై ఉన్న డబ్బు, ధనము, బిల్డింగులు, కార్ల కంటే చాలా మేలైనవి.

2- జొహ్ర్ కు ముందు 4రకాతులు.

ఫర్జ్ తర్వాతవిః

1- జొహ్ర్ తర్వాత రెండు. 2- మగ్రిబ్ తర్వాత రెండు. 3- ఇషా తర్వాత రెండు.

(ఆ) అస్ర్ కు ముందు నాలుగు రకాతులు చేయడం వల్ల అవి చేసేవారికి ప్రవక్త చేసిన రహ్మత్ యొక్క దుఆలో పాలుపంచుకునే భాగ్యం లభిస్తుంది. ఇబ్నె ఉమర్ ﷠ ఉల్లేఖించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః

عَنْ ابْنِ عُمَرَ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (رَحِمَ اللهُ امْرَأً صَلَّى قَبْلَ الْعَصْرِ أَرْبَعًا).

అస్ర్ కు ముందు నాలుగు రకాతులు చదివేవారి పై అల్లాహ్ కరుణ కురియుగాకా!“. (అబూ దావూద్ 1271, తిర్మిజి 430).

10 – అజాన్ మరియు ఇఖామత్ మధ్యలో దుఆ

నమాజు వైపునకు త్వరగా వెళ్ళడం వల్ల అజాన్ మరియు ఇఖామత్ మధ్య దుఆ చేసే భాగ్యం కలుగుతుంది. మరియు ఇది దుఆ అంగీకార సమయం గనుక అదృష్టంగా భావించాలి. సమయమే గాకుండా మస్జిద్ స్థలం గనుక దాని శ్రేష్ఠతను దృష్టిలో ఉంచుకోవాలి. ఇంకా నమాజు కొరకు వేచి ఉండి దుఆ చేయడం అన్నది మరీ ఘనత గల విషయం. (ఇలా దుఆ అంగీకరించబడే అవకాశం ఎన్నో రకాలుగా ఉంది). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారుః

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (الدُّعَاءُ لَا يُرَدُّ بَيْنَ الْأَذَانِ وَالْإِقَامَةِ)

అజాన్ మరియు ఇఖామత్ మధ్యలోని దుఆ త్రోసిపుచ్చబడదు“. (తిర్మిజి 212, ముస్నద్ అహ్మద్ 3/119).

11 – నమాజు కొరకు వేచించుట

నమాజు కొరకు వేచియుండడం అనేక పుణ్యాలకు నిన్ను అర్హునిగా చేస్తుందిః

(అ) నమాజు కొరకు వేచియుండుట నమాజు ఘనతకు సమానం:

عَنْ أَبِي هُرَيْرَةَ ﷜ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (لَا يَزَالُ أَحَدُكُمْ فِي صَلَاةٍ مَا دَامَتْ الصَّلَاةُ تَحْبِسُهُ).

ప్రవక్త ﷺ ప్రవచించారని అబూ హురైరా ﷜ ఉల్లేఖించారుః

“మీలో ఒక వ్యక్తి నమాజు కొరకు వేచి ఉన్నంత కాలం నమాజు చేస్తున్న పుణ్యం పొందుతాడు”. (బుఖారి 659, మస్లిం 649).

(ఆ) దైవదూతల ఇస్తిగ్ఫార్ (క్షమాభిక్షః)

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (لَا يَزَالُ الْعَبْدُ فِي صَلَاةٍ مَا كَانَ فِي مُصَلَّاهُ يَنْتَظِرُ الصَّلَاةَ وَتَقُولُ الْـمَلَائِكَةُ اللَّهُمَّ اغْفِرْ لَهُ اللَّهُمَّ ارْحَمْهُ حَتَّى يَنْصَرِفَ أَوْ يُحْدِثَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

“మనిషి ఎంత వరకు నమాజు చేసుకున్న స్థలంలో కూర్చోని ఉంటాడో అంతవరకూ అతనికి నమాజు చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది. అతను అక్కడి నుండి లేచిపోనంత వరకు లేదా అపానవాయువు వెడిలే వరకు. దైవదూతలు అతని కొరకు ఇలా దీవిస్తారుః అల్లాహ్ ఇతన్ని క్షమించు, ఇతన్ని కరుణించు”. (ముస్లిం 649, బుఖారీ 176). ఒక మనిషి కొరకు దైవదూతలు దుఆ చేస్తున్నారంటే అల్లాహ్ అతని గురించి చేస్తున్న వారి దుఆలను తప్పకుండా అంగీకరిస్తాడు. (అష్షర్హుల్ ముమ్తిఅలి షేఖ్ ఇబ్ను ఉసైమీన్).

(ఇ) పాపాల మన్నింపు, స్థానాల రెట్టింపు

عَنْ أَبِي هُرَيرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: ( أَلاَ أَدُلُّكُم عَلَى مَا يَمْحُو اللهُ بِهِ الْخَطَايَا ، وَيَرْفَعُ بِهِ الدَّرجَاتِ ؟) قَالُوا: بَلَى يَا رَسُولُ الله قاَلَ: ( إسْبَاغُ الْوُضُوءِ عَلَى الْـمَكَارِهِ ، وَكَثرَةُ الْـخُطَا إِلَى الْـمَسَاجِد ، وَانتِظَارُ الصَّلاَةِ بَعدَ الصَّلاَةِ، فَذَلِكُمُ الرِّبَاط ).

అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు ﷺ ఇలా అడిగారుః “పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో నేను మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారుః “(1) వాతావరణం, పరిస్థితులూ అననుకూలంగా ఉన్నప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం – ఇది రిబాత్ తో సమానం”. (ముస్లిం 587). (రిబాత్ భావం పేజి నం. 15లో చూడండి).

12 – ఖుర్ఆన్ పారాయణం మరియు జిక్ర్ (అల్లాహ్ స్మరణ)లో నిమగ్నులై యుండుట

మస్జిద్ లో త్వరగా వచ్చిన వ్యక్తి అల్లాహ్ సాన్నిధ్యం పొందుటకు ఎన్నో రకాల ఆరాధనలు పాటించ గలుగుతాడు. ఉదాః జిక్ర్, ఖుర్ఆన్ పారాయణం మరియు అల్లాహ్ వరాల పట్ల యోచించటం, ఇహలోకం, దానికి సంబంధించిన ఆలోచనల నుండి దూరం ఉండటం. దీని వల్ల మనుసును నమాజులోనే నిలిపి, వినయ వినమ్రత పాటించే అవకాశం ఉండును. అదే వెనక వచ్చే వ్యక్తి (పై లాభాలను నోచుకోలేడు) అతను నమాజు చేసినా అతని మనస్సు ఐహిక విషయాల్లో ఇరుక్కొని ఉంటుంది, నమాజులో లీనమై నమ్రత పాటించకపోవచ్చు. అతని శరీరం మస్జిదులో, నమాజులో ఉన్నా అతని అంతర్యం నమాజులో ఉండకపోవచ్చు.

ముస్లిం సోదరా! నీ పరలోక సేవింగ్ అకౌంట్ పెరుగుదలకై నీవు నమాజు కొరకు నిరీక్షిస్తున్నంత సమయంలో కొన్ని స్వర్ణవకాశాలు ఉదాహరణగా చూపిస్తున్నాను. వాటిపై శ్రద్ధ వహించుః

(అ) దివ్య ఖుర్ఆన్ పారాయణం
పారాయణ పరిమాణంఫలితంవిధానం
1- ప్రతి నమాజు యొక్క అజాన్ మరియు ఇఖామ- తుల మధ్యలో 5పేజిల పారాయణం. ఇలా ప్రతి రోజు 25 పేజిలవుతాయి.24 రోజుల్లో మొత్తం ఖుర్ఆన్ యొక్క పారాయణం అవుతుంది.ఖుర్ఆన్ పేజిలు 604 25 పేజిలు × 24 రోజులు = 600
2- నమాజుకై నిరీక్షిస్తూ ప్రతి రోజు ఒక్క పారా.30 రోజుల్లో పూర్తి ఖుర్ఆన్ పారాయణం ఖుర్ఆన్ పారాలు 30. నెల రోజులు 30.
30 పారాలు ÷ 30 రోజులు = రోజుకు 1 పార
3- నమాజు కొరకు నిరీక్షిస్తూ ప్రతి రోజు 3 ఆయతులు కంఠస్తం చేయుట.ఇన్షా అల్లాహ్ 8 సంవత్సరాల్లో పూర్తి ఖుర్ఆన్ కంఠస్తం.అనుభవ పూర్వకమైన విషయం.
4- నమాజు కొరకు నిరీక్షిస్తున్న వ్యవధిలో ప్రతి రోజు 1 ¼ పేజి కంఠస్తంసుమారు పదహారు మాసాల్లో పూర్తి ఖుర్ఆన్ కంఠస్తం అవుతుంది. ఇన్షాఅల్లాహ్!604 ÷ 1¼ పేజి = 483.2 రోజులు 483.2 ÷ 30 రో. = 16 నెలల 10 రో.
5- నమాజు కొరకు నిరీక్షిస్తున్న వ్యవధిలో ప్రతి రోజు రెండు పేజిలు కంఠస్తంసుమారు 10 నెలల్లో పూర్తి ఖుర్ఆన్ కంఠస్తం ఇన్షాఅల్లాహ్604 ÷ 2 = 302 రోజులు = పది నెలలు.
6- మూడు సార్లు సూరె ఇఖ్లాస్ పారాయణంపూర్తి ఖుర్ఆన్ పారాయణం చేసినంత పుణ్యంఅబూ సఈద్ ఖుద్రీ ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా ఒక రాత్రిలో మూడోవంతు ఖుర్ఆన్ చదవలేడా? అని ప్రవక్త ﷺ ప్రశ్నించారు. ఇది వారికి కష్టంగా ఏర్పడి ‘ఎవరు చదవగలుగుతారు ప్రవక్తా? అని చెప్పారు, అప్పుడు ప్రవక్త “అల్లాహుల్ వాహిదుస్సమద్ (సూరె ఇఖ్లాస్) మూడోవంతు ఖుర్ఆన్ కు సమానం” అని చెప్పారు. (బుఖారిః ఫజాఇలుల్ ఖుర్ఆన్/ ఫజ్లు ఖుల్ హువల్లాహు అహద్ 4628. ముస్లిం 1344).
7- నాలుగు సార్లు సూర ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్.పూర్తి ఖుర్ఆన్ చదివినంత పుణ్యం.ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఇబ్ను ఉమర్ ఉల్లేఖించారుః “సూర ఖుల్ హువల్లాహు అహద్ మూడోవంతు ఖుర్ఆన్ మరియు సూర ఖుల్  యా అయ్యుహల్ కాఫిరూన్ నాలుగోవంతు ఖుర్ఆన్ కు సమానం”. (తబ్రానీ ఔసత్ 1/66. 186. సహీహ లిల్ అల్బానీ 2/132).
8- ఒక్క సారి సూర ముల్క్ పారాయణంపాపాల మన్నింపుప్రవక్త ﷺ ఉపదేశిం-చారని అబూ హురైర ﷜ ఉల్లేఖించారుః “ఖుర్ఆనులో 30 ఆయతుల ఒక సూర ఉంది. (దాన్ని చదివిన వారి పట్ల) అది సిఫారసు చేస్తే దాని సిఫారసు అంగీకరింపబడుతుంది. అది తబారకల్లజీ బియదిహిల్ ముల్క్ (సూర ముల్క్). (తిర్మిజిః ఫజాఇలుల్ ఖుర్ఆన్/ ఫజ్లు సూరతిల్ ముల్క్. 2816).

ఇప్పటికీ మనము పుణ్యాల వనంలోనే ఉన్నాము. నాతో పాటు మీరు కూడా ఖుర్ఆన్ పారాయణం యొక్క ఈ గొప్ప ఘనతపై శ్రద్ధ వహించండి.

عن عَبْدِ الله بْنِ مَسْعُودٍ ÷ يَقُولُ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ الله فَلَهُ بِهِ حَسَنَةٌ وَالْـحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا لَا أَقُولُ الم حَرْفٌ وَلَكِنْ أَلِفٌ حَرْفٌ وَلَامٌ حَرْفٌ وَمِيمٌ حَرْفٌ).

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ ﷜ ఉల్లేఖించారు ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారుః “దివ్యగ్రంథంలోని ఒక అక్షరం చదివినవానికి ఒక పుణ్యం, ఆ ఒక పుణ్యం పది రెట్లు ఎక్కువగా లభించును. అలిఫ్, లామ్, మీమ్ ను ఒక అక్షరం అనడం లేదు. అలిఫ్ ఒక అక్షరం, లాం ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం. (తిర్మిజి 2835).

ఖుర్ఆనులోని అతి చిన్న సూరా ద్వారా దీని ఉదాహరణ చూడండిః

సూర కౌసర్ యొక్క అక్షరాలు 42.

ఒక పుణ్యం పది రెట్లు ఉంటుంది. ఇలా 42×10=420 అవుతాయి.

ఖుర్ఆనులోని అతి చిన్న సూరా కౌసర్ యొక్క ఘనతను గ్రహించు, ఇక నమాజు కొరకు నిరీక్షిస్తున్న సమయంలో నీవు చాలా పేజీలు చదివినప్పుడు నీకు ఎన్ని పుణ్యాలు లభిస్తాయో యోచించు?

(ఆ) అజ్ కార్ (అల్లాహ్ స్మరణ)
జిక్ర్ఘనత/ పుణ్యంనిదర్శనం
1- 100 సార్లు సుబ్ హానల్లాహ్1000 పుణ్యాలు లేదా 1000 పాపాల మన్నింపుసఅద్ తెలిపారుః మేము ప్రవక్త ﷺసన్నిధిలో ఉండగా ఆయన ఇలా ప్రశ్నించారుః ప్రతి రోజు వెయ్యి పుణ్యాలు సంపా దించడం మీలోనెవరితోనైనా కాని పనియా? అచ్చట కూర్చున్నవారిలో ఒకరన్నారుః మాలో ఎవడైనా వెయ్యి పుణ్యాలు ఎలా సంపాదించగల డు? దానికి ప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారుః “100 సార్లు సుబ్ హానల్లాహ్ చదవాలి. దానికి బదులు అతనికి వెయ్యి పుణ్యాలు లిఖించబడతాయి, లేదా వెయ్యి పాపాలు మన్నించబడతాయి”. 
2- లా ఇలాహ ఇల్ల ల్లాహు వహ్ దహూ లా షరీక లహూ ల హుల్ ముల్కు వల హుల్ హందు వహు వ అలా కుల్లి షైఇన్ కదీర్. 100 సార్లు.పది బానిసలను విడుదల చేసినంత పుణ్యం + 100 పుణ్యాలు + 100 పాపాల మన్నింపు + షైతాన్ నుండి రక్షణ.ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా ﷜ ఉల్లేఖిం చారుః “ఎవరైతే ఒక రోజులో 100 సార్లు “లా ఇలాహ ఇల్ల ల్లాహు వహ్ దహూ లా షరీ క లహూ లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్” పఠిస్తాడో, అతనికి పది బానిసల్ని విడుదల చేసిన పుణ్యం ప్రాప్తమవుతుంది. 100 పుణ్యాలు లిఖించబడతాయి. 100 పాపాలు మన్నించబడతాయి. అతనికి సాయంకాలం వరకు షైతాన్ నుండి రక్షణ ఉంటుంది. ఈ వచనాలను వందకు పైగా పఠించేవాడి ఆచరణ తప్ప మరెవరి ఆచరణా ఇతని ఆచరణ కంటే శ్రేష్ఠమైనది కాదు. ‚
3- లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్స్వర్గ కోశాల్లో ఒకటిప్రవక్త ﷺ ఇలా ఉప దేశించారని అబూ మూసా అష్అరీ ﷜ ఉల్లేఖించారుః స్వర్గ కోశాల్లోని ఒక కోశం గురించి నీకు తెలుపనా? అని. తప్పక తెలుపండి ప్రవక్తా! అని నేను విన్నవించు కున్నాను. అప్పుడు చెప్పారుః “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్”.ƒ
4- సుబ్ హా నల్లాహిల్ అజీం వ బి హందిహిఒక్క ఖర్జూ రపు చెట్టు స్వర్గంలో నాట బడు తుందిప్రవక్త ﷺ ఆదేశం: “ఎవరు సుబ్ హానల్లా హిల్ అజీం వ బిహందిహీ” అంటారో వారి కొరకు స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నాట బడుతుంది.
5- విశ్వాసులైన స్త్రీ పురు షుల మన్నింపు కొరకు అల్లాహ్ ను కోరడంప్రతి విశ్వాస స్త్రీ పురుషునికి బదు లుగా ఒక పుణ్యంప్రవక్త ﷺ ఇలా ఆదే శించారుః “ఎవరు విశ్వాస స్త్రీ పురుషుల మన్నింపు కొరకు అల్లాహ్ ను వేడుకుంటారో వారికి ప్రతి విశ్వాస స్త్రీ పురుషునికి బదులు ఒక పుణ్యం లభిస్తుంది.” [ముస్లిం 2698. బుఖారీ 6403. ముస్లిం 2691. ƒ బుఖారీ 6409, ముస్లిం 2704. „ తిర్మిజి 3464. … తబ్రానీ, సహీహుల్ జామి 6026.]

ఒక ముస్లిం ముఖ్యంగా నమాజు కొరకు నిరీక్షిస్తున్న వ్యక్తి ఈ అమూల్యమైన సమయాన్ని ఈ శ్రేష్ఠ స్థలం (మస్జిద్)లో పై అజ్ కార్ చదవడంలో గడపడాన్ని అదృష్టంగా భావించాలి. తద్వారా అనేక పుణ్యాలు లభించవచ్చు.

13 – పంక్తులు సక్రమంగా ఉంచుట

నమాజు చేయుటకు పంక్తులను సరి చేసుకొనుట విధిగా ఉంది. దీని ఘనతలు చాలా ఉన్నాయి.

(అ) మనసుల మరియు ఉద్దేశాల ఐక్యతః

عَنِ النُّعْمَانِ بْنِ بَشِيرٍ ÷ يَقُولُ: قَالَ النَّبِيُّ ﷺ: (لَتُسَوُّنَّ صُفُوفَكُمْ أَوْ لَيُخَالِفَنَّ اللهُ بَيْنَ وُجُوهِكُمْ).

నౌమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః “మీరు మీ పంక్తులను సక్రమంగా ఉంచుకోండి. అలా చేయకపోతే అల్లాహ్ మీ ముఖాలను పరస్పరం వ్యతిరేకంగా మార్చివేస్తాడు”. (బుఖారి 717, ముస్లిం 436).

ఇమాం నవవీ ﷫ ఇలా చెప్పారుః ‘మీ మధ్య విరోధ ద్వేషాలను నాటుతాడు. మీ హృదయాలను పరస్పరం వ్యతిరేకంగా మార్చివేస్తాడు‘.

ఇక పంక్తులను సరి చేయకపోవడం ఎంత పాపమో, ప్రవక్త సంప్ర దాయానికి విరుద్దమో తెలియనిది కాదు.

(ఆ) పంక్తులను సక్రమంగా ఉంచడం నమాజు పరిపూర్ణతలో ఒక భాగం:

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ ÷ عَنِ النَّبِيِّ ﷺ قَالَ: (سَوُّوا صُفُوفَكُمْ فَإِنَّ تَسْوِيَةَ الصُّفُوفِ مِنْ إِقَامَةِ الصَّلَاةِ).

ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారని అనస్ (రదియల్లాహు అన్హు)ఉల్లేఖించారుః “మీ పంక్తులను తిన్నగా, సక్రమంగా ఉంచండి. పంక్తులను సక్రమంగా ఉంచడం నమాజు పరిపూర్ణతలో ఒక భాగం”. (బుఖారీ 723, ముస్లిం 433).

పంక్తులను సక్రమంగా ఉంచడం నమాజు విధుల్లో ఒకటి. నమాజు విధిని విడనాడినవాడు పాపాత్ముడవుతాడు.

(ఇ) షైతాన్ని ఇరకాటంలో పడవేయటం:

عَن عَبدِ الله بْنِ عُمَرَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (أَقِيمُوا الصُّفُوفَ وَحَاذُوا بَيْنَ الْـمَنَاكِبِ وَسُدُّوا الْـخَلَلَ وَلِينُوا بِأَيْدِي إِخْوَانِكُمْ وَلَا تَذَرُوا فُرُجَاتٍ لِلشَّيْطَانِ…).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః “పంక్తులను సరిచేసు కోండి, పరస్పరం భుజాలను కలపండి, సంధులను మూసివేయండి, మీ సోదరుల కొరకు మీ చేతులను మృదువుగా చేసుకోండి, షైతాన్ కొరకు సందులను వదలకండి”. (అబూ దావూద్ 666).

(ఈ) పంక్తులను కలిపి ఉంచిన వారితో అల్లాహ్ కలిసి ఉంటాడుః

عَن عَبدِ الله بْنِ عُمَرَ ﷠ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (…وَمَنْ وَصَلَ صَفًّا وَصَلَهُ اللهُ وَمَنْ قَطَعَ صَفًّا قَطَعَهُ اللهُ).

ప్రవక్త ﷺ ఉపదేశించారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ﷠ ఉల్లేఖించారుః “….. పంక్తులను కలిపి ఉంచినవారితో అల్లాహ్ కలిసి ఉంటాడు. పంక్తు లను తెంచేవారితో అల్లాహ్ కలిసి ఉండడు”. (అబూ దావూద్ 666).

నమాజులోని మొదటి నిధి సారాంశం

కర్మఫలితం
1- వుజూ1) అల్లాహ్ యొక్క ప్రేమ
2) వుజూ నీళ్ళతో పాపాల తొలగింపు
3) ప్రళయదినాన వుజూ అవయవాలు ప్రకాశించటం
4) పాపాల తుడిచివేత మరియు ఉన్నత స్థానం
5) పాపాల మన్నింపు మరియు స్వర్గ ప్రవేశం
2- వుజూ తర్వాత దుఆ(1) స్వర్గపు ఎనిమిది ద్వారాల్లో ఇష్టమున్న ద్వారము గుండా ప్రవేశించే స్వేచ్ఛ
(2) తోలుకాగితంలో పేరు వ్రాయబడి దానిపై ముద్ర వేయబడుతుంది. అది ప్రళయకాలం వరకు తీయబడదు
3- మిస్వాక్నోటి శుభ్రత, అల్లాహ్ సంతుష్టి
4) నమాజు కొరకు శీఘ్రముగా వెళ్ళుట1) గొప్ప ఘనత, శుభము మరియు మేలు
2) ఏలాంటి నీడ లభించని ప్రళయదినాన అల్లాహ్ నీడలో ఆశ్రయం (మస్జిద్లో మనసు నిలిపినతనికి) 3) ప్రతి అడుగుకు బదులు సంవత్సరపు ఉపవాసాలు మరియు తహజ్జుద్ పుణ్యం( జుమా)
5- అజాన్ జవాబుస్వర్గ ప్రవేశం
6- అజాన్ తర్వాత దుఆ1) పాపాల ప్రక్షాళనం
2) ప్రళయదినాన ప్రవక్త సిఫారసు
7- నమాజు కొరకు నడచి వెళ్ళటం1) స్వర్గంలో ఆతిథ్యం
3) గొప్ప పుణ్యం
2) పాపాల తుడిచివేత, ఉన్నత స్థానం
4) ప్రళయదినాన పూర్తి కాంతి
5) పాపాల తుడిచివేత 6) ప్రతి అడుగుపై ఒక సదకా
8- మొదటి పంక్తి, కుడి పంక్తి1) దైవతూతల పోలిక
2) మంచితనం
3) అల్లాహ్, ఆయన దూతల దీవెనలు
4) వెనక ఉండేవారికివ్వబడిన శాపం నుండి దూరం
9- సున్నతె ముఅక్కద1) స్వర్గంలో ఒక గృహం
2) అస్ర్ కు ముందు నాలుగు రకాతుల పై అల్లాహ్ కరుణ
10- అజాన్, ఇఖామత్ మధ్యలో దుఆదుఆ అంగీకరించబడుతుంది
11- నమాజుకై వేచి ఉండటం1) నమాజు ఘనతకు సమానం
2) అల్లాహ్ దూతల ఇస్తిగ్ఫార్
3) పాపాల మన్నింపు, ఉన్నత స్థానం
12- ఖుర్ఆన్ పారాయణం మరియు అజ్ కార్1) సంపూర్ణ ఖుర్ఆన్ పారాయణం
2) ఖుర్ఆన్ కంఠస్తం
3) గొప్ప పుణ్యాలు
1) వెయ్యి పుణ్యాలు, వెయ్యి పాపాల మన్నింపు
2) పది బానిసల విడుదల పుణ్యం + 100 పుణ్యాలు + 100 పాపాల మన్నింపు + షైతాన్ నుండి రక్షణ.
3) స్వర్గ కోశాల్లో ఒకటి.
4) స్వర్గంలో ఒక చెట్టు
13- పంక్తులను తీర్చిదిద్దటం1) మనసుల మరియు ఉద్దేశాల ఐక్యత
2) నమాజు పరిపూర్ణత
3) షైతాన్ని ఇరకాటంలో పడవేయటం
4) పంక్తులను కలిపేవారితో అల్లాహ్ కలిసి ఉంటాడు

రెండవ నిధి (నిక్షేపం): నమాజు చేయటం

నమాజును నిర్ణీత పద్ధతిలో నెరవేరుస్తూ మనం ఈ అమూల్యమైన నిధిని పొందవచ్చు. దీనికి అర్హులయ్యే మార్గం క్రింది విధంగా ఉందిః

1 – నమాజు ఘనత

సామాన్యంగా నమాజు ఘనత చాలా ఉంది. దానితో పాటు ప్రత్యేక నమాజులకు ప్రత్యేక ఘనతలు కూడా ఉన్నాయి. ఉదాః ఫజ్ర్ నమాజు ఘనత, అస్ర్ నమాజు ఘనత, ఇషా నమాజు ఘనత…… దిగువ దీనినే సంక్షిప్తంగా తెలుపుతున్నాము.

నమాజుల సామాన్య ఘనత

దివ్య ఖుర్ఆన్ మరియు ప్రవక్త హదీసుల ద్వారా నమాజు నిక్షేపాలు స్పష్టమై ఉన్నాయి, వాటిని అదృష్టంగా భావించడం, వాటిని సక్రమంగా నెరవేర్చే పూర్తి ప్రయత్నం చేయడం ద్వారా మన పుణ్యాల బ్యాలెన్సును పెంచుకోవచ్చు.

(అ) ఉన్నత స్థానాలు, తప్పుల మన్నింపు, శ్రేష్ఠమైన ఆహారం

{ఎవరు నమాజును స్థాపిస్తారో, వారికి మేమిచ్చిన దాని నుండి (మా మార్గంలో) ఖర్చు పెడతారో అటువంటి వారే నిజమైన విశ్వాసులు. వారి కొరకు వారి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి. తప్పులకు మన్నింపు ఉంది. శ్రేష్ఠమైన ఆహారం ఉంది}. (అన్ఫాల్ 8: 3,4).

{నీ కుటుంబ సభ్యులను నమాజు చెయ్యండి అని ఆజ్ఞాపించు. స్వయంగా నీవు కూడా దానిని పాటించు. మేము నీ నుండి ఉపాధినేమీ కోరడం లేదు. ఉపాధిని మేమే నీకు ఇస్తూ ఉన్నాము. చివరకు మేలు జరిగేది భయభక్తులకే}. (తాహా 20: 132).

(ఆ) తప్పుల ప్రక్షాళనం, పాపాల తుడిచివేత

{నమాజును స్థాపించు, పగటి యొక్క సరిహద్దు సమయాలలోనూ, కొంత రాత్రి గడచిన తరువాతనూ, వాస్తవానికి సత్కార్యాలు దుష్కా ర్యాలను దూరం చేస్తాయి. హితవుగోరే వారికి ఇది ఒక హితబోధ}. (హూద్ 11: 114).

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (أَرَأَيْتُمْ لَوْ أَنَّ نَهْرًا بِبَابِ أَحَدِكُمْ يَغْتَسِلُ مِنْهُ كُلَّ يَوْمٍ خَمْسَ مَرَّاتٍ هَلْ يَبْقَى مِنْ دَرَنِهِ شَيْءٌ؟) قَالُوا لَا يَبْقَى مِنْ دَرَنِهِ شَيْءٌ قَالَ: (فَذَلِكَ مَثَلُ الصَّلَوَاتِ الْخَمْسِ يَمْحُو اللهُ بِهِنَّ الْـخَطَايَا).

ఒక సారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరుల ముందు ఇలా ప్రశ్న వేశారుః “మీలో ఒక వ్యక్తి ఇంటి ముందు ఒక కాలువ ప్రవహిస్తూ ఉండి, అతనా కాలువలో ప్రతి రోజు అయిదు సార్లు స్నానం చేస్తూ ఉంటే, ఇక అతని శరీరం మీద మలినం ఉంటుందా? ‘అతని శరీరం మీద ఎలాంటి మలినం మిగిలి ఉండదు’ అని వారు చెప్పారు, అప్పుడు ప్రవక్త ఇలా బోధించారుః “ఐదు వేళలా నమాజు చేయడం కూడా అంతే. వీటి ద్వారా అల్లాహ్ (ఐదు నమాజులను పాటించే దాసుని) పాపాలను తుడిచివేస్తాడు.” (బుఖారీ 528, ముస్లిం 667).

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ كَانَ يَقُولُ: (الصَّلَوَاتُ الْـخَمْسُ وَالجُمعَةُ إِلَى الْـجُمعَةِ وَرَمَضَانُ إِلَى رَمَضَانَ مُكَفِّرَاتٌ مَا بَيْنَهُنَّ إِذَا اجْتَنَبَ الْكَبَائِرَ).

“ఐదు పూటలా చేసే నమాజులు, ఒక జుమా నుండి మరో జుమా వరకు, రమజాను నుండి మరో రమజాను వరకు ఆ మధ్యలో జరిగిన పాపాలకు అవి పరిహారం అవుతాయి. అయితే పెద్ద పాపాల నుండి దూరంగా ఉండుట తప్పనిసరి.” అని ప్రవక్త ﷺ చెప్పారని అబూ హురైరా ఉల్లేఖించారు. (ముస్లిం 233).

(ఇ) కారుణ్యం

{నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి, అల్లాహ్ ప్రవక్తకు విధేయులుగా ఉండండి. అప్పుడు మీరు కరుణింపబడుతారని ఆశించవచ్చు}. (నూర్ 24: 56).

(ఈ) జన్నతుల్ ఫిర్ దౌస్ లో ప్రవేశం

{వారు తమ నమాజులను శ్రద్ధగా కాపాడుకునే వారు, వారే స్వర్గాన్ని వరసత్వంగా పొందేవారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు}. (మూమినూన్ 23: 9-11).

{తమ నమాజును కాపాడుకునేవారు, ఇలాంటి వారే సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు}. (మఆరిజ్ 70: 34,35).

(ఉ) కాంతి (నూర్)

عَنْ أَبِي مَالِكٍ الْأَشْعَرِيِّ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (… وَالصَّلَاةُ نُورٌ وَالصَّدَقَةُ بُرْهَانٌ وَالصَّبْرُ ضِيَاءٌ وَالْقُرْآنُ حُجَّةٌ لَكَ أَوْ عَلَيْكَ كُلُّ النَّاسِ يَغْدُو فَبَايِعٌ نَفْسَهُ فَمُعْتِقُهَا أَوْ مُوبِقُهَا).

ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ మాలిక్ హారిస్ బిన్ ఆసిం అల్ అష్అరీ ﷜ ఉల్లేఖించారుః “నమాజు నూర్, సదకా నిదర్శనం, సహనం ప్రకాశం మరియు ఖుర్ఆన్ నీకు అనుకూలంగా లేక ప్రతికూలంగా సాక్షి. ప్రతి మానవుడు ఉదయం లేచి తన ఆత్మను విక్రయిస్తాడు, అయితే అల్లాహ్ దాన్ని (శిక్ష నుండి విముక్తి కలిగిస్తాడు) లేదా (కారుణ్యానికి దూరముంచి) నష్టపరుస్తాడు. (ముస్లిం 223).

నమాజు సామాన్యంగా ఒక నూర్ గనక ఇది భక్తిపరులకు కంటి చలువ కూడాను. ఇదే విషయం ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః “నమాజు నా కళ్ళకు చల్లదనంగా చేయబడింది”. (నిసాయి 3940, ముస్నద్ అహ్మద్ 3/285).

ప్రత్యేక నమాజుల ఘనత

1) ఫజ్ర్, అస్ర్ నమాజుల ఘనత

(అ) పగలు దూతలు, రాత్రి దూతలు అందులో హాజరవుతారు

{ప్రాతఃకాలంలో ఖుర్ఆన్ పారాయణం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించు. ఎందుకంటే ప్రాతఃకాలపు ఖుర్ఆన్ పారాయణం సాక్ష్యంగా ఉంటుంది}. (బనీ ఇస్రాఈల్ 17: 78).

ఖుర్ఆను వ్యాఖ్యానకర్తలు దీని వ్యాఖ్యానం ఇలా చెప్పారుః ప్రాతఃకాలపు ఖుర్ఆన్ పారాయణం అంటే ఫజ్ర్ నమాజులోని పారాయణం, అందులో పగటి మరియు రాత్రి పూట దైవదూతలు హాజరవుతారు, దానికి వారు సాక్ష్యంగా ఉంటారు. (బుఖారి 649, ముస్లిం 649).

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (يَتَعَاقَبُونَ فِيكُمْ مَلَائِكَةٌ بِاللَّيْلِ وَمَلَائِكَةٌ بِالنَّهَارِ وَيَجْتَمِعُونَ فِي صَلَاةِ الْفَجْرِ وَصَلَاةِ الْعَصْرِ ثُمَّ يَعْرُجُ الَّذِينَ بَاتُوا فِيكُمْ فَيَسْأَلُهُمْ وَهُوَ أَعْلَمُ بِهِمْ كَيْفَ تَرَكْتُمْ عِبَادِي فَيَقُولُونَ تَرَكْنَاهُمْ وَهُمْ يُصَلُّونَ وَأَتَيْنَاهُمْ وَهُمْ يُصَلُّونَ).

“మీ దగ్గరకు రాత్రి దైవదూతలు, పగటి దైవదూతలు ఒకరి వెనుక మరొకరు వస్తారు. ఈ రెండు బృందాలు ఫజ్ర్, అస్ర్, నమాజులలో మాత్రం కలుస్తారు. రాత్రంతా మీతోపాటు గడిపిన దైవదూతలు తిరిగి ఆకాశానికి వెళ్ళినప్పుడు -ఇదంతా మీ ప్రభువు గుర్తెరిగి ఉంటాడు- అయినా వారినుద్దేశించి “మీరు నా దాసులను ఏ స్థితిలో వదలిపెట్టి వచ్చారని” అడుగుతాడు. దానికి దైవదూతలు మేము వారి దగ్గర్నుంచి బయలుదేరేటప్పుడు వారు నమాజు చేస్తుండటం కనిపించింది. అంతకు ముందు మేము వారి దగ్గరకు చేరుకున్నప్పుడు కూడా వారిని నమాజు స్థితిలో చూశాము” అని సమాధానమిస్తారు అని ప్రవక్త ﷺ తెలుపుతుండగా నేను విన్నానని అబూహూరైరా ﷜ ఉల్లేఖించారు. (బుఖారీ 555, ముస్లిం 632).

(ఆ) స్వర్గ ప్రవేశం

عَنْ أَبِي مُوسَى ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (مَنْ صَلَّى الْبَرْدَيْنِ دَخَلَ الْـجَنَّةَ).

ప్రవక్త ﷺ ఇలా ఆదేశించారని అబూ మూసా ﷜ ఉల్లేఖించారుః “రెండు చల్లని వేళల్లోని నమాజు పాటించేవారు స్వర్గంలో చేరుతారు”. (బుఖారీ 574, ముస్లిం 635). చల్లని వేళలంటే ఫజ్ర్ మరియు అస్ర్.

(ఇ) నరక ప్రవేశం నుండి దూరం

عَن عُمَارَةَ بْنِ رُؤَيْبَةَ ÷ قَالَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (لَنْ يَلِجَ النَّارَ أَحَدٌ صَلَّى قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوبِهَا)

ప్రవక్త సెలవియ్యగా నేను విన్నానని అబూ జుహైర్ ఉమార బిన్ రుఐబ ఉల్లేఖించారుః “సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు గల నమాజులను పాటించినతను నరకంలో ప్రవేశించడు”. (ముస్లిం 634). అంటే ఫజ్ర్, అస్ర్.

(ఈ) అల్లాహ్ రక్షణలో

عَنْ جُنْدُبِ بْنِ سُفْيَانَ الْبَجَلِيِّ ÷ عَن النَّبِيِّ ﷺ أَنَّهُ قَالَ: (مَنْ صَلَّى صَلَاةَ الصُّبْحِ فَهُوَ فِي ذِمَّةِ الله عَزَّ وَجَلَّ فَانْظُرْ يَا ابْنَ آدَمَ لَا يَطْلُبَنَّكَ اللهُ مِنْ ذِمَّتِهِ بِشَيْءٍ)

ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారని జుందుబ్ బిన్ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఫజ్ర్ నమాజు చదివినవారు అల్లాహ్ రక్షణలో ఉంటారు. అయితే ఓ మానవుడా! అల్లాహ్ తన రక్షణలో ఉంచిన దాని గురించి నిన్ను మందలించకుండా ఉండటానికి జాగ్రత్తగా ఉండు”. (ముస్నద్ అహ్మద్ 4/313, ముస్లిం 657).

(ఉ) అల్లాహ్ దర్శనం

عَنْ جَرِيرٍ ÷ قَالَ: كُنَّا جُلُوسًا عِنْدَ النَّبِيِّ ﷺ إِذْ نَظَرَ إِلَى الْقَمَرِ لَيْلَةَ الْبَدْرِ قَالَ: (إِنَّكُمْ سَتَرَوْنَ رَبَّكُمْ كَمَا تَرَوْنَ هَذَا الْقَمَرَ لَا تُضَامُونَ فِي رُؤْيَتِهِ فَإِنْ اسْتَطَعْتُمْ أَنْ لَا تُغْلَبُوا عَلَى صَلَاةٍ قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَصَلَاةٍ قَبْلَ غُرُوبِها فَافْعَلُوا).

జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః మేము ఒకసారి దైవప్రవక్త ﷺ వద్ద కూర్చొని ఉండగా ప్రవక్త ﷺ పున్నమి చంద్రుడ్ని చూసి మాతో ఇలా అన్నారుః “ఇప్పుడు మీరు చంద్రుడ్ని ఎలా స్పష్టంగా చూస్తున్నారో అదే విధంగా త్వరలోనే మీరు (ప్రళయదినాన) మీ ప్రభువుని చూస్తారు. ఆయన్ని దర్శించడంలో మీ ముందు ఎలాంటి అడ్డంకి ఉండదు. అందువల్ల మీరు సూర్యోదయానికి పూర్వం చేయవ లసిన (ఫజ్ర్) నమాజును, సూర్యాస్తమయానికి పూర్వం చేయవలసిన (అస్ర్) నమాజును చేయడంలో వీలయినంత వరకు మీ ముందు ఎలాంటి ఆటంకం ఏర్పడ కుండా ఉండేలా కృషి చేయండి (అశ్రద్ధ, అలసత్వాలకు ఏ మాత్రం తావీయకండి)”. (బుఖారీ 7434, ముస్లిం 633).

(ఊ) ఇషా మరియు ఫజ్ర్ నమాజుల ఘనత

عَنْ عُثْمَان بْن عَفَّان ÷ قاَلَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (مَنْ صَلَّى الْعِشَاءَ فِي جَمَاعَةٍ فَكَأَنَّمَا قَامَ نِصْفَ اللَّيْلِ وَمَنْ صَلَّى الصُّبْحَ فِي جَمَاعَةٍ فَكَأَنَّمَا صَلَّى اللَّيْلَ كُلَّهُ)

నేను ప్రవక్త ﷺ చెప్పగా విన్నానని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైతే ఇషా నమాజ్ సామూహికంగా పాటించారో వారికి అర్థ రాత్రి తహజ్జుద్ చేసినంత పుణ్యం, మరెవరైతే ఫజ్ర్ నమాజ్ సామూహికంగా చేశారో వారికి రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం లభిస్తుంది”. (ముస్లిం 656).

2 -సామూహిక నమాజు ఘనత

నమాజు సామూహికంగా చదవడంలో చాలా పుణ్యముంది. ఈ ఆచరణ ప్రవక్త ﷺ ద్వారా రుజువైనది. మీరు సయితం ఈ హదీసుపై శ్రద్ధ వహించండిః

عَنِ بنِ عُمَرَ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (صَلاَةُ الْـجَمَاعَةِ أَفْضَلُ مِنْ صَلاَةِ الْفَذِّ بِسَبْعٍ وَعِشْرِينَ دَرجَة).

ప్రవక్త ﷺ ఇలా శుభవార్తిచ్చినట్లు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ﷠ ఉల్లేఖించారుః “వ్యక్తిగతంగా చేసే నమాజుకన్నా సామూహికంగా చేసే నమాజు ఇరవై ఏడు రెట్లు శ్రేష్ఠమైనది”. (బుఖారీ 645, ముస్లిం 650). ఒక పుణ్యం పది రెట్లు ఎక్కువగా లభిస్తుంది గనక సామూహిక నమాజు పుణ్యం 27×10=270 ఉంటుంది.

3 – ఖుషూఅ (అణకువ, వినమ్రత)

ఖుషూఅనమాజుకు ప్రాణం లాంటిది, పుణ్యాల రెట్టింపు దానిపై ఆధారపడియుంది. దానికి సంబంధించిన కొన్ని లాభాలను క్రింద పేర్కొంటున్నాము గమనించండిః

(అ) సాఫల్యం (జన్నతుల్ ఫిర్ దౌసులో ప్రవేశ సాఫల్యం, నరకం నుండి విముక్తి)

{నిశ్చయంగా సాఫల్యం పొందే విశ్వాసులు తమ నమాజులో వినమ్రతను పాటిస్తారు, వ్యర్థ విషయాల జోలికి పోరు. …… వారే స్వర్గాన్ని వారసత్వంగా పొందేవారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు}. (మూమినూన్ 23: 1-3, 9-11).

(ఆ) అల్లాహ్ ప్రేమ

{ప్రేమతోనూ, భయంతోనూ మమ్మల్ని ప్రార్థించేవారు, మా సమక్షంలో వినమ్రులై ఉండేవారు}. (అంబియా 21: 90).

ఈ ఆయతులో ‘వినమ్రత’ విశ్వాసులైన అల్లాహ్ దాసుల ప్రశంస నీయమైన గుణముగా పేర్కొనబడింది, అయితే ఈ వినమ్రత గుణం గలవారు అల్లాహ్ ప్రియులని అట్లే తెలుస్తుంది.

(ఇ) ప్రళయదినాన అల్లాహ్ తన నీడలో ఆశ్రయమిస్తాడు

عَنْ أَبِي هُرَيرَةَ ÷ عَنِ النَّبِيِّ ﷺ قَالَ: (سَبْعةٌ يُظِلُّهُمُ الله فِي ظِلّه يَومَ لاَ ظِلَّ إِلاّ ظِلُّه) وَذَكَرَ رَجُلاً: (وَرَجُلٌ ذَكَرَ اللهَ خَالِيًا فَفَاضَتْ عَينَاه).

ప్రవక్త ﷺ తెలిపారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ యొక్క అర్ష్ (సింహాసన) నీడ తప్ప మరెలాంటి నీడా లభించని (ప్రళయ)దినాన అల్లాహ్ ఏడు గుణాలవారిని తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. వారిలో ఒకడుః ఏకాంతములో అల్లాహ్ ను తలచుకొని కంట తడి పెట్టే వ్యక్తి”. (బుఖారీ 660, ముస్లిం 1031).

ఈ హదీసు నిదర్శనంగా ఎలా నిలిచిదంటే, నమాజులో ఖుషూఅ పాటించు వ్యక్తి ఇతర సందర్భాల కంటే ఏకాంతములో ఉన్నప్పుడు ఎక్కువ కంటి తడపెడతాడు. ఇలా ఆ ఎడుగురిలో ఒకడు కావడానికి అర్హుడవుతాడు.

(ఈ) ఖుషూఅ నమాజు పుణ్యాలను పెంచుతుంది.

عن عَمَّارِ بْنِ يَاسِرٍ ÷ قَالَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (إِنَّ الْعَبْدَ لَيُصَلِّي الصَّلَاةَ مَا يُكْتَبُ لَهُ مِنْهَا إِلَّا عُشْرُهَا تُسْعُهَا ثُمُنُهَا سُبُعُهَا سُدُسُهَا خُمُسُهَا رُبُعُهَا ثُلُثُهَا نِصْفُهَا).

ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నానని అమ్మార్ బిన్ యాసిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఒక దాసుడు నమాజు చేస్తాడు కాని అతనికి తన నమాజు యొక్క పదవ వంతు లేక తొమ్మిదవ లేదా ఎనిమిదవ లేదా ఏడవ లేదా ఆరవ లేదా ఐదవ లేదా నాల్గవ లేదా మూడవ లేదా సగం పుణ్యము మాత్రమే వ్రాయబడుతుంది”. (ముస్నద్ అహ్మద్ 4/321 అబూ దావూద్ 796, ఇబ్ను హిబ్బాన్ ఇది సహీ అని ధృవీక రించారు). (దీని భావమేమిటంటే ఎవరిలో ఖుషూఅ ఎంత ఎక్కువ ఉంటుందో అంతే ఎక్కువ పుణ్యాలు వారికి లభిస్తాయి).

(ఉ) పాపాల మన్నింపు మరియు గొప్ప ప్రతిఫలం

అల్లాహ్ ఆదేశం సూర అహ్ జాబ్ 33: 35లో ఇలా ఉందిః

{వినమ్రత పాటించే పురుషులు మరియు స్త్రీలు}… {అల్లాహ్ వారి కొరకు క్షమాభిక్షను, గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు}.

4 -సనా

నమాజు ఆరంభములో సూరె ఫాతిహాకు ముందు తక్బీరె తహ్రీమ తర్వాత అనేక దుఆలున్నాయి. వాటిలో ఈ దుఆను నేను తెలుపు తున్నాను. “అల్లాహు అక్బరు కబీరా, వల్ హందులిల్లాహి కసీరా, వ సుబ్ హాల్లాహి బుక్రతౌఁ వఅసీలా”. దీని ఉద్దేశం దీని గొప్ప ఘనతను చాటడమే తప్ప ఈ ఒక్క దుఆయే అని తెలపడం కాదు. ఆ ఘనత ఏమిటి? దాన్ని చదివిన వారి కొరకు ఆకాశ తలుపులు తెరువబడుతాయి.

عَنْ ابْنِ عُمَرَ ÷ قَالَ: بَيْنَمَا نَحْنُ نُصَلِّي مَعَ رَسُولِ الله ﷺ إِذْ قَالَ رَجُلٌ مِنْ الْقَوْمِ: اللهُ أَكْبَرُ كَبِيرًا وَالْحَمْدُ لله كَثِيرًا وَسُبْحَانَ الله بُكْرَةً وَأَصِيلًا فَقَالَ رَسُولُ الله ﷺ: (مَن الْقَائِلُ كَلِمَةَ كَذَا وَكَذَا) قَالَ رَجُلٌ مِنْ الْقَوْمِ أَنَا يَا رَسُولَ الله قَالَ: (عَجِبْتُ لَهَا فُتِحَتْ لَهَا أَبْوَابُ السَّمَاءِ).

ఇబ్ను ఉమర్ (రదియల్లాహు అన్హు) తెలిపారుః మేము ప్రవక్త ﷺ తో నమాజు చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి “అల్లాహు అక్బరు కబీరా, వల్ హందులిల్లాహి కసీరా, వ సుబ్ హాల్లాహి బుక్రతౌఁ వఅసీలా” అని పలికాడు, (నమాజు ముగించిన తర్వాత) “ఈ పదాలు పలికిన వారెవరు?” అని ప్రవక్త ﷺ అడిగారు. నేనే ఓ ప్రవక్తా! అని అతను చెప్పగా, “నేను ఆశ్చర్య పోయాను. ఆ పదాల వల్ల ఆకాశ తలుపులు తెరువబడ్డాయి” అని ప్రవక్త ﷺ తెలిపారు. ఇబ్ను ఉమర్ ఇలా చెప్పారుః నేను ఈ విషయం ప్రవక్తతో విన్నప్పటి నుండి వాటిని పలకడం మానలేదు. (ముస్లిం 601).

5 -సూరె ఫాతిహ పారాయణం

(అ) ఖుర్ఆనులోని గొప్ప సూరా

నీవు నమాజులో సూరె ఫాతిహ చదువుతున్నప్పుడు ఖుర్ఆనులోని ఒక గొప్ప సూర చదివినవానివవుతావు. నాతో పాటు నీవు కూడా ఈ హదీసుపై శ్రద్ధ వహించుః

عَنْ أَبِي سَعِيدِ بْنِ الْـمُعَلَّى ÷ قَالَ: كُنْتُ أُصَلِّي فِي الْـمَسْجِدِ فَدَعَانِي رَسُولُ الله ﷺ فَلَمْ أُجِبْهُ فَقُلْتُ: يَا رَسُولَ الله إِنِّي كُنْتُ أُصَلِّي فَقَالَ: (أَلَمْ يَقُلِ اللهُ â (#qç7ŠÅftGó™$# ¬! ÉAqߙ§=Ï9ur #sŒÎ) öNä.$tãyŠ $yJÏ9 öNà6‹ÍŠøtä† ( á) ثُمَّ قَالَ لِي لَأُعَلِّمَنَّكَ سُورَةً هِيَ أَعْظَمُ السُّوَرِ فِي الْقُرْآنِ قَبْلَ أَنْ تَخْرُجَ مِنَ الْـمَسْجِدِ ثُمَّ أَخَذَ بِيَدِي فَلَمَّا أَرَادَ أَنْ يَخْرُجَ قُلْتُ لَهُ أَلَمْ تَقُلْ لَأُعَلِّمَنَّكَ سُورَةً هِيَ أَعْظَمُ سُورَةٍ فِي الْقُرْآنِ قَالَ: (الْـحَمْدُ لله رَبِّ الْعَالَمِينَ هِيَ السَّبْعُ الْـمَثَانِي وَالْقُرْآنُ الْعَظِيمُ الَّذِي أُوتِيتُهُ).

అబూ సఈద్ బిన్ ముఅల్లా ﷜ తెలిపారుః నేను మస్జిదులో నమాజు చేస్తుండగా ప్రవక్త ﷺ నన్ను పిలిచారు, వెంటనే నేను హాజరు కాలేకపోయాను, కొంత సేపయ్యాక హజరయి, ‘ప్రవక్తా! నేను నమాజు చేస్తుంటిని’ అని విన్నవించుకోగా, {అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పిలుపుకు జవాబు పలకండి} అని అల్లాహ్ ఆదేశం తెలియదా? అని మందలించి, “నీవు మస్జిద్ నుండి బైటికి వెళ్ళక ముందే నేను నీకు ఒక సూరా నేర్పుతాను, అది ఖుర్ఆనులోని ఒక గొప్ప సూరా” అని చెప్పారు. నా చేతిని పట్టుకున్నారు. ఇక ఎప్పుడైతే మస్జిద్ నుండి మేము బైటికి వెళ్ళబోయామో, అప్పుడు నేను ‘ప్రవక్తా! ఖుర్ఆనులోని ఒక గొప్ప సూరా గురించి తెలుపుతానన్నారు కదా’ అని గుర్తు చేశాను. అప్పుడాయన ఇలా చెప్పారుః “అది ఏడు ఆయతులు గల సూరా, మాటిమాటికి పఠింపదగినది మరియు గొప్ప ఖుర్ఆను నాకు ఇవ్వబడినది”. (బుఖారీ 4474).

(ఆ) ఇది సనా (అల్లాహ్ స్తోత్రం) మరియు దుఆ

ఫాతిహ సూరా పారాయణం అల్లాహ్ మరియు ఆయన దాసుని మధ్యలో రెండు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగంలో అల్లాహ్ స్తోత్రం, ఆయన మహత్తు, గొప్పతనం ఉంది. రెండవ భాగంలో దాసుని అర్ధింపు మరియు దుఆ ఉంది.

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ قَالَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: قَالَ اللهُ تَعَالَى: (قَسَمْتُ الصَّلَاةَ بَيْنِي وَبَيْنَ عَبْدِي نِصْفَيْنِ وَلِعَبْدِي مَا سَأَلَ فَإِذَا قَالَ الْعَبْدُ [الْـحَمْدُ لِله رَبِّ الْعَالَمِينَ] قَالَ اللهُ تَعَالَى: حَمِدَنِي عَبْدِي، وَإِذَا قَالَ: [الرَّحْمَنِ الرَّحِيمِ] قَالَ اللهُ تَعَالَى: أَثْنَى عَلَيَّ عَبْدِي، وَإِذَا قَالَ: [مَالِكِ يَوْمِ الدِّينِ] قَالَ: مَجَّدَنِي عَبْدِي، وَقَالَ: فَإِذَا قَالَ: [إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ] قَالَ: هَذَا بَيْنِي وَبَيْنَ عَبْدِي وَلِعَبْدِي مَا سَأَلَ، فَإِذَا قَالَ [اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ] قَالَ هَذَا لِعَبْدِي وَلِعَبْدِي مَا سَأَلَ).

అబూ హురైరా ﷜ ఉల్లేఖించారుః అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త ﷺ చెప్పారుః “నమాజు (సూరె ఫాతిహా)ను నేను నా మధ్య మరియు నా దాసుని మధ్య రెండు భాగాలుగా జేశాను. నా దాసుడు అర్థించినది అతనికి ప్రాప్తమవుతుంది. అతడు {అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆల మీన్} అన్నప్పుడు, నా దాసుడు నన్ను స్తుతించాడు అని అల్లాహ్ అంటాడు. అతడు {అర్రహ్మానిర్రహీం} అన్నప్పుడు, నా దాసుడు నన్ను ప్రశంసించాడు అని అల్లాహ్ అంటాడు. అతడు {మాలికి యౌమిద్దీన్} అన్నప్పుడు, నా దాసుడు నా గొప్పతనాన్ని చాటాడు అని అల్లాహ్ అంటాడు. అతడు {ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్} అన్న ప్పుడు, ఇది నా మధ్య మరియు నా దాసుని మధ్య ఉన్న సంబంధం, ఇక నా దాసుడు ఏది అడిగినా అతనికి ప్రాప్తమవుతుంది. అతడు {ఇహ్దినస్సిరాతల్ ముస్తఖీం, సిరాతల్లజీన అన్అమ్ త అలైహిం గైరిల్ మగ్ జూబి అలైహిం వలజ్జాల్లీన్} అన్నప్పుడు, ఇది నా దాసుడు అడిగింది, అతడు కోరినది అతనకి ప్రాప్తమవుతుంది అని అల్లాహ్ అంటాడు”. (ముస్లిం 395).

మరో ఘనత పేజి క్రింద పాదసూచికలో చూడండి([9])

[9] సహీ ముస్లింలో మరొక ఘనత ఇలా ఉంది.

عَنْ عَمَرِو بْنِ عَبَسَةَ ÷ قَالَ: قَالَ النَّبِيُّ ﷺ: … فَإِنْ هُوَ قَامَ فَصَلَّى فَحَمِدَ اللهَ وَأَثْنَى عَلَيْهِ وَمَجَّدَهُ بِالَّذِي هُوَ لَهُ أَهْلٌ وَفَرَّغَ قَلْبَهُ لله إِلَّا انْصَرَفَ مِنْ خَطِيئَتِهِ كَهَيْئَتِهِ يَوْمَ وَلَدَتْهُ أُمُّهُ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఉపదేశించారని అమర్ బిన్ అంబస రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అతను (ముస్లిం వ్యక్తి) నమాజు చేయుటకు నిలబడి అల్లాహ్ స్తోత్రము, ప్రశంసలు పఠించి, తగిన రీతిలో ఆయన గొప్పతనాన్ని చాటుతూ, తన హృదయంలో అల్లాహ్ తప్ప మరే ధ్యానం లేకుండా ఉంచుకుంటే తన తల్లి గర్భం నుండి పుట్టినప్పటి స్థితిలో అతను పాపాల నుండి దూరమవుతాడు”. (ముస్లిం 832).

6 -ఆమీన్ పలకడం

నమాజీ సోదరా! శుభవార్త!! ఎవరి ఆమీన్ అల్లాహ్ దూతల ఆమీన్ తో కలిసిపోవునో అతని పూర్వ పాపాలు క్షమించబడతాయి.

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (إِذَا قَالَ الْإِمَامُ: [غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ] فَقُولُوا آمِينَ فَإِنَّهُ مَنْ وَافَقَ قَوْلُهُ قَوْلَ الْـمَلَائِكَةِ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ)

ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “(నమాజులో) ఇమాం గైరిల్ మగ్జూబి అలైహిం వలజ్జాల్లీన్ అని అన్నప్పుడు మీరంతా ఆమీన్ అని చెప్పండి, మీరు చెప్పే ఆమీన్ అల్లాహ్ దూతలు చెప్పే ఆమీన్ కు అనుగుణంగా ఉంటే ఆమీన్ చెప్పే వ్యక్తి పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 782, ముస్లిం 410).

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (إِذَا قَالَ أَحَدُكُمْ آمِينَ وَقَالَتْ الْـمَلَائِكَةُ فِي السَّمَاءِ آمِينَ فَوَافَقَتْ إِحْدَاهُمَا الْأُخْرَى غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ).

ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా ఆమీన్ అని పలకగా, ఆకాశంలో దైవదూతలు కూడా ఆమీన్ అన్నప్పడు ఇలా ఇవి రెండు కలిసిపోతాయి. తద్వారా ఆమీన్ అన్న వ్యక్తి పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 781).

7 -రుకూ

రుకూ కు సంబంధించిన లాభాల్లో పాపాల ప్రక్షాళన ఒకటి.

عَنْ اِبْنِ عُمَرَ ÷ قَالَ : سَمِعْت رَسُولَ الله ﷺ يَقُولُ : (إِنَّ الْعَبْدَ إِذَا قَامَ يُصَلِّي أُتِيَ بِذُنُوبِهِ فَجُعِلَتْ عَلَى رَأْسِهِ وَعَاتِقِهِ فَكُلَّمَا رَكَعَ وَسَجَدَ تَسَاقَطَتْ عَنْه)

ప్రవక్త ﷺ ఉపదేశించారని ఇబ్ను ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మనిషి నమాజు కొరకు లేచినప్పుడు అతని పాపాలు అతని తల మరియు భుజాలపై వేయబడతాయి, అతను రుకూ, సజ్దాలు చేసినపుడల్లా అవి రాలిపోతాయి”. (బైహఖీ 3/10, సహీహుల్ జామిఅ 1671).

8 -రుకూ నుండి నిలబడిన తర్వాత దుఆలు

రుకూ తర్వాత దుఆల ఘనత గొప్పది, పుణ్యం పెద్దది.

(అ) ఎవరి ‘అల్లాహుమ్మ రబ్బనా లకల్ హందు / రబ్బనా వలకల్ హంద్’ పలుకులు దైవదూతల పలుకులతో కలిసిపోవునో అతని పాపాలు క్షమించబడును

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (إِذَا قَالَ الْإِمَامُ سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ فَقُولُوا اللَّهُمَّ رَبَّنَا لَكَ الْحَمْدُ فَإِنَّهُ مَنْ وَافَقَ قَوْلُهُ قَوْلَ الْمَلَائِكَةِ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ).

ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఇమాం నమాజులో ‘సమిఅల్లాహు లిమన్ హమిదహ్’ అన్నపుడు మీరు ‘అల్లాహుమ్మ రబ్బనా లకల్ హంద్’ అనండి, ఎవరి ఈ మాట అల్లాహ్ దూతల మాటకు అనుగుణంగా ఉంటుందో అతని పూర్వ పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 796, ముస్లిం 409). మరో ఉల్లేఖనంలో ‘రబ్బనా వలకల్ హంద్’ అనండి అని ఉంది.

(ఆ) ‘రబ్బనా వ లకల్ హందు హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్’ పదాలను వ్రాయడానికి అల్లాహ్ దూతలు ఒకరిని మించి ఒకరు ముందుకు వెళ్తుంటారు.

రిఫాఅ బిన్ రాఫిఅ అజ్జర్ఖి తెలిపారుః ప్రవక్త వెనక మేము నమాజు చేస్తూ ఉన్నాము, రుకూ నుండి తల లేపుతూ ప్రవక్త ‘సమిఅల్లాహు లిమన్ హమిదహ్’ అన్నారు, వెనక ఒక మనిషి ‘రబ్బనా వలకల్ హందు హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్’ అని అన్నాడు, ప్రవక్త నమాజు ముగించాక, “నమాజులో ఈ పదాలు పలికినవారెవరు?” అని అడిగారు. ‘నేను’ అని ఆ మనిషి అన్నాడు, అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “నేను ముప్ఫై (30) కి పైగా అల్లాహ్ దూతలను చూశాను, ప్రతి ఒక్కరు తానే ముందుగా ఈ పదాలను వ్రాయాలని ఆరాట పడుతున్నాడు”. (బుఖారీ 799).

9 – సజ్దాలు

సజ్దా నమాజులోని అతి గొప్ప భాగం, అందులో అల్లాహ్ కొరకు నమ్రత, సమర్పణ సంపూర్ణ రీతిలో పాటించబడుతుంది. అందుకే అనేక పుణ్యాలు, ఉత్తమ ఫలితాలు సజ్దా విషయంలో చెప్పబడ్డాయి. ఈ గొప్ప పుణ్యాన్ని గమనించండి.

(అ) సాఫల్యం (నరకం నుండి రక్షణ, స్వర్గ ప్రవేశ సఫలత)

అల్లాహ్ ఆదేశం: {విశ్వాసులారా! రుకూ చేయండి, సజ్దా చేయండి, మీ ప్రభువుకు దాస్యం చేయండి, మంచి పనులు చేయండి, దీని ద్వారానే మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చును}. (హజ్ 22: 77).

{లఅల్లకుం తుఫ్లిహూన్} వ్యాఖ్వానంలో అబూ బక్ర్ అల్ జజాయిరీ ఇలా చెప్పారుః ‘అంటే నరకం నుండి రక్షణ పొంది స్వర్గ ప్రవేశ ప్రాప్తమే గొప్ప సాఫల్యం’. (ఐసరుత్తఫాసీర్ లికలామిల్ అలియ్యిల్ కదీర్).

(ఆ) ప్రళయదినాన అల్లాహ్ దయానుగ్రహాలు, ఆయన సంతోషం మరియు కాంతి లభిస్తాయి

{ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త, ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగా ఉంటారు, పరస్పరం కరుణామయులుగా ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు, వారు రుకూ సజ్దాలలో, అల్లాహ్  అనుగ్రహాన్నీ ఆయన ప్రసన్నతనూ అర్థించటంలో నిమగ్నులై ఉండటం కనిపిస్తుంది. సజ్దాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి. వాటి వల్ల వారు ప్రత్యేకంగా గుర్తించ బడతారు}. (ఫత్ హ్ 48: 29).

{సజ్దాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి} యొక్క వ్యాఖ్యానం లో సఅదీ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారుః ‘అధికంగా మరియు మంచిరీతిలో చేసిన దాస్యం (ఇబాదత్) ప్రభావం వారి ముఖాలపై పడింది. చివరికి వారి నమాజుల వల్ల వారి బాహ్యం మెరిసినట్లు వారి ఆంతర్యం సయితం కాంతివంతమైంది. (తైసీరుల్ కరీమిర్రహ్మాన్ ఫీ తఫ్సీరి కలామిల్ మన్నాన్)

(ఇ) స్థానం రెట్టింపు, పాపం మన్నింపు

فَقَالَ النَّبِي صلى الله عليه وسلم: (عَلَيْكَ بِكَثْرَةِ السُّجُودِ لِله فَإِنَّكَ لَا تَسْجُدُ لِله سَجْدَةً إِلَّا رَفَعَكَ اللهُ بِهَا دَرَجَةً وَحَطَّ عَنْكَ بِهَا خَطِيئَةً).

ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారుః “నీవు ఎక్కువగా సజ్దాలు చేయి, నీవు సజ్దా చేసినపుడల్లా నీ ప్రతి సజ్దాకు బదులుగా అల్లాహ్ నీ కొరకు ఒక స్థానం పెంచుతాడు, పాపం మన్నిస్తాడు”. (ముస్లిం 488).

(ఈ) ప్రవక్త సామీప్యం

రబీఅ బిన్ కఅబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః నేను వుజూ నీళ్ళు, మరేదైనా అవసరమున్నవి అందించుటకు ప్రవక్త ﷺ వద్దనే రాత్రి గడపేవాణ్ణి. అయితే ఒకసారి ప్రవక్త ﷺ “అడుగు (నీకిష్టమున్నది అడుగు)” అని అన్నారు. ‘నేను స్వర్గంలో మీ సామీప్యం కోరుతున్నాను’ అని అన్నాను, ఇంకేదైనా? అని ప్రవక్త అడిగాడు, ‘కేవలం అది మాత్రమే’ అని నేన న్నాను. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “నీ స్వప్రయోజనం కోసం నీవు అధిక సజ్దాలు (నమాజులు) చేసి నాకు సహాయపడు”. (ముస్లిం 489).

(ఉ) దుఆ స్వీకారానికి తగిన సమయం

ప్రవక్త ﷺ ప్రబోధించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు)﷜ఉల్లేఖించారుః “దాసుడు తన ప్రభువుకు అతి చేరువుగా ఉండేది సజ్దా స్థితిలో, గనక అందులో ఎక్కువగా దుఆ చేయండి”. (ముస్లిం 482).

మరో ఉల్లేఖనంలో ఆయన ﷺ ఇలా చెప్పారుః “సజ్దాలో దుఆ ఎక్కువగా చేయండి, అది స్వీకారయోగ్యమవుతుందన్న నమ్మకం ఈ స్థితిలో ఎక్కువగా ఉంటుంది”. (ముస్లిం 479).

(ఊ) పాపాల ప్రక్షాళన

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః “మనిషి నమాజు చేయుటకు లేచినప్పుడు అతని పాపాలు అతని తల మరియు భుజాలపై వేయబడతాయి, అతను రుకూ, సజ్దాలు చేసినపుడల్లా అవి రాలిపోతాయి”. (బైహఖీ 3/10, సహీహుల్ జామిఅ 1671).

(క) సజ్దా అంగమును నరకాగ్ని కాల్చదు

ప్రవక్త ﷺ సెలవిచ్చారుః “(మానవ శరీరములో) సజ్దా భాగాన్ని అల్లాహ్ నరకంపై నిషేధించాడు, అంటే అది దాన్ని కాల్చదు”. (బుఖారీ 806, ముస్లిం 182).

విశ్వాసులు చేసిన పాపాల్ని అల్లాహ్ క్షమించనిచో, మరియు వారి పాపాలను అధిగమించే, తుడిచివేసే పుణ్యాలు కూడా వారి వద్ద లేకున్నచో వారు వారి పాపాల పరిమాణాన్ని బట్టి అగ్నిలో శిక్షించబడతారు. అయితే సజ్గా అంగములు చాలా గౌరవనీయమైనవి గనక అగ్ని వాటిని తినదు, వాటిపై ఏలాంటి ప్రభావం పడదు. (అష్షర్హుల్ ముమ్తిఅ…., 3వ సంపుటం: షేఖ్ ఇబ్ను ఉసైమీన్)

10 -మొదటి తషహ్హుద్

భూమ్యాకాశాల్లో ఉన్న అల్లాహ్ దాసులకు సమానంగా పుణ్యం

మొదటి తషహ్హుద్ లో ‘అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లా హిస్సాలిహీన్’ అన్న దుఆ చదువుతున్నప్పుడు గొప్ప ఘనత మనకు తెలుస్తుంది. నాతో పాటు మీరూ గమనించండిః

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః నా చేయి ప్రవక్త ﷺ చేతిలో ఉండగా ఖుర్ఆను సూరాలు నేర్పినట్లు ఆయన నాకు తషహ్హుద్ దుఆ నేర్పారు. ‘అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యి బాతు అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్’ ఈ పదాలు మీరన్నప్పుడు భూమ్యాకాశాల్లో ఉన్న ప్రతి పుణ్య పురు షునికి ఈ దుఆ లభిస్తుంది. ‘వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్డహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు’. (బుఖారీ 831).

నీవు సలాం చేస్తున్నావంటే; భూమ్యాకాశాల్లో బ్రతికి ఉన్న, చని పోయిన పుణ్యపురుషులు, జిన్నాతులు మరియు అల్లాహ్ దూతలు అందరూ అన్ని రకాల లోపాలకు అతీతంగా మరియు ఆపదలకు దూరంగా ఉండాలని దుఆ చేస్తున్నావు అని అర్థం. దీని వల్ల అల్లాహ్ నీపై కరుణించి ఎవరెవరిపై నీవు సలాం చేశావో ప్రతి ఒక్కరికి బదులుగా పుణ్యం ప్రసాదిస్తాడు.

11 -చివరి తషహ్హుద్: (ప్రవక్త పై దరూద్)

ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లంపై దరూద్ చదవడంలో చాలా పుణ్యాలు, రెట్టింపు ప్రతిఫలాలున్నాయి.

(అ) అల్లాహ్ మరియు ఆయన దూతల అనుకరణ

{అల్లాహ్ ఆయన దూతలు ప్రవక్తకై ‘దరూద్’ను పంపుతారు, విశ్వాసులారా! మీరు కూడా ఆయనకై దరూద్, సలామ్ లు పంపండి}. (అహ్ జాబ్ 33: 56).

(ఆ) పది రెట్ల పుణ్యం

عَنْ أَبِي هُرَيْرَةَ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (مَنْ صَلَّى عَلَيَّ وَاحِدَةً صَلَّى اللهُ عَلَيْهِ عَشْرًا).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరు నాపై ఒక సారి దరూద్ పంపుతారో అల్లాహ్ అతనిపై పది సార్లు కరుణిస్తాడు”. (ముస్లిం 408).

(ఇ) పది పుణ్యాలు లిఖించబడతాయి, పది పాపాలు తొలగించ బడతాయి

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశ ప్రకారం: “నాపై ఒక్కసారి దరూద్ పంపిన వానికి అల్లాహ్ పది పుణ్యాలు వ్రాస్తాడు”. (తిర్మిజి 485), మరో ఉల్లేఖనంలోని పదాలు ఇలా ఉన్నాయిః “అతని పది పాపాలు తొలగిస్తాడు”. మరో హదీసు పదాలు ఇవిః “అతని పది పాపాలు తుడిచివేస్తాడు”. (ముస్నద్ అహ్మద్ 3/102, 4/29([10])).

[10] ‘పది స్థానాలు రెట్టింపు చేయబడతాయని’ ముస్నద్ అహ్మద్ 4/29లో ఉంది.

12 -సలాంకు ముందు దుఆ

సలాంకు ముందు దుఆ విషయంలో ఏ ఘనత లేకున్నా అది దుఆ అంగీకార శుభసందర్భమవడమే చాలు. అదెలాగంటే నమాజీ అప్పుడు తన ప్రభువు వైపునకు మరలి, ఆయనతో మొరపెట్టు కుంటాడు. అతను నమాజులోనే ఉన్నాడు గనక ఇది దుఆ అంగీకారానికి ఎంతో ఉత్తమం.

అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః “మీలో ఎవరైనా నమాజు చేస్తున్నప్పుడు ‘అత్తహియ్యాతు లిల్లాహి…’ చదవాలి, దాని పిదప తనకిష్టమున్న దాన్ని అర్థించుకోవాలి”, మరో ఉల్లేఖనంలో ఉంది “ఇంకేదైనా దుఆ ఎంచుకోవాలి”. (బుఖారి, ముస్లిం).

అబూ ఉమామ ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త ﷺ ను ఎవరో అడిగారు, ‘ఏ దుఆ ఎక్కువ వినబడుతుంది’ అని. దానికి ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః “మధ్య రాత్రిలో మరియు ఫర్జ్ నమాజుల చివరి భాగంలో”. (తిర్మిజి 3499). హదీసులో అరబీ పదం ‘దుబురుస్సలవాత్’ అని ఉంది, అయితే సామాన్యంగా దీని భావం నమాజు చివరి భాగం, అంటే సలాంకు ముందు అని. అయితే ఒకప్పుడు నమాజు తర్వాత అని కూడా చెప్పబడుతుంది.

నమాజులోని రెండవ నిధి సారాంశం

కర్మఫలితం
1- నమాజు ఘనత1) ఉన్నత స్థానాలు, పాపాల మన్నింపు, ఉత్తమ ఉపాధి.
2) తప్పుల ప్రక్షాళనం, పాపాల తుడిచివేత
3) కారుణ్యం,
4) జన్నతుల్ ఫిర్ దౌస్ లో ప్రవేశం
5) కాంతి,
6) స్వర్గ ప్రవేశం, (ఫజ్ర్, అస్ర్)
7) పగటి మరియు రాత్రి దూతల ఆగమనం, (ఫజ్ర్, అస్ర్)
8) నరక విముక్తి (ఫజ్ర్, అస్ర్)
9) అల్లాహ్ రక్షణ (ఫజ్ర్).
10) అల్లాహ్ దర్శనం (అస్ర్)
11) అర్థ రాత్రి తహజ్జుద్ చేసినంత పుణ్యం (ఇషా), రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం (ఫజ్ర్).
2- సామూహిక నమాజు270 పుణ్యాలు (27×10=270 పుణ్యాలు)
3- ఖుషూఅ (నమాజు లో అణుకువ)1) స్వర్గ ప్రవేశ సాఫల్యం, నరకం నుండి రక్షణ
2) అల్లాహ్ యొక్క ప్రేమ
3) ఏ నీడా లేని రోజు అల్లాహ్ నీడలో ఆశ్రయం
4) నమాజు పుణ్యాల రెట్టింపు
5) పాపాల మన్నింపు, గొప్ప ప్రతిఫలం.
4- సనాఆకాశ ద్వారాలు తెరవబడుట
5- సూర ఫాతిహా పారాయణం1) ఖుర్ఆనులోని గొప్ప సూరా పారాయణం
2) స్తోత్రము + దుఆ
6- ఆమీన్పాపాల మన్నింపు
7- రుకూపాపాలు రాలిపడుట
8- రుకూ తర్వాత దుఆలు1) పాపాల మన్నింపు.
2) వాటిని వ్రాయటానికి అల్లాహ్ దూతలు ఎగబడతారు
9- సజ్దాలు1) సాఫల్యం.
2) స్థానం రెట్టింపు, పాపం మన్నింపు
3) ప్రళయదినాన అల్లాహ్ దయ, ప్రసన్నత, కాంతి
4) స్వర్గంలో ప్రవక్త సన్నిహితం.
5) పాపాలు రాలిపడుట.
6) పాపాత్ములైన విశ్వాసుల సజ్దా అంగములను నరకాగ్ని కాల్చదు.
10- మొదటి తషహ్హుద్ఏ ఏ పుణ్యాత్ములకు నీవు సలా చేశావో వారందరి పుణ్యం
11- చివరి తషహ్హుద్, ప్రవక్త పై దరూద్1) అల్లాహ్ మరియు ఆయన దూతల అనుకరణ
2) పది రెట్ల వరకు పుణ్యాలు పెరగడం
3) పది పుణ్యాలు లిఖించబడటం, పది పాపాలు తుడిచివేయబటడం
12- సలాం కు ముందు దుఆఅంగీకార సమయం.

మూడవ నిధి  (నిక్షేపం)

నమాజు తర్వాత అజ్కార్

నమాజు తర్వాత చేయవలసిన అజ్కార్ వివిధ వాక్యాల్లో ఉన్నవి. అలాగే వాటి పుణ్యాలు కూడా వివిధ రకాలుగా ఉన్నవి. అందులో కొన్నిః

(అ) పాపాల మన్నింపుః

అబూ హురైరా ﷜ ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారుః “ప్రతి నమాజు తర్వాత ఎవరు 33 సార్లు సుబ్ హానల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, 33 సార్లు అల్ హందులిల్లాహ్, మరి లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్ చదివి వంద పూర్తి చేస్తాడో అతని పాపాలు సముద్రపు నురుగంత ఉన్నా క్షమించబడతాయి”. (ముస్లిం 597).

(ఆ) అనుగ్రహం, ఉన్నత స్థానాలు మరియు భోగబాగ్యాలు + స్వర్గ ప్రవేశం + 1500 పుణ్యాలు

అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః (ఓ రోజు కొందరు పేద ప్రజలు ప్రవక్త ﷺ వద్దకు వచ్చి) ‘ప్రవక్తా! ధనికులు తమ సిరిసంపదల మూలంగా ఉన్నత స్థానాలు అధిరోహించడానికి, శాశ్వతపు భోగభాగ్యా లు పొందడానికి మాకంటే ముందు వెళ్ళారు’ అని ఫిర్యాదు చేశారు. “అది ఎలా?” అని ప్రవక్త ﷺ అడిగారు. వారన్నారుః ‘వారు మా లాగా నమాజు చేస్తారు, మా లాగానే ధర్మ యుద్ధాలు కూడా చేస్తారు. డబ్బు ఉన్నందున వారు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెడుతున్నారు, మా వద్ద ఆ డబ్బు లేదు. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “నేను మీకో విషయం తెలియజేయనా? మీరు దాన్ని పాటించి మిమ్మల్ని మించిపోయిన వాళ్ళతో సమానులవుతారు, మీ కంటే వెనక ఉన్న వాళ్ళతోను మించిపోతారు, మీ లాంటి ఈ పద్దతిని అనుసరించే వాడు తప్ప మీ లాంటి ఆచరణ తెచ్చేవాడు మరొకడు ఉండడు. ఆ విషయం: ప్రతి నమాజు తర్వాత 10 సార్లు సుబ్ హానల్లాహ్, 10 సార్లు అల్ హందులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ పలకండి”. (బుఖారీ 6329).

ప్రవక్త ﷺ ప్రవచించారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “రెండు గుణాలున్నాయి, వాటిని పాటించిన ముస్లిం భక్తుడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అవి తేలికైనవి, కాని వాటిని పాటించేవారు అరుదు. ప్రతి నమాజు తరువాత 10 సార్లు సుబ్ హానల్లాహ్, 10 సార్లు అల్ హందులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ చెప్పాలి. ఇవి (ఐదు నమాజుల్లో చేస్తే) నోటి పై 150 అవుతాయి, కాని (ప్రళయదినాన) త్రాసులో 1500 అవుతాయి”. (అబూ దావూద్ 5065, తిర్మిజి 3410, నిసాయి 1348, ఇబ్ను మాజ 926).

నోటి పై 150, దీని ఫిగర్ ఇలా ఉంటుందిః

10 సుబ్ హానల్లాహ్ + 10 అల్ హందిలిల్లాహ్ + 10 అల్లాహు అక్బర్ = 30.

30 × 5 (నమాజులు) = 150

త్రాసులో 1500 యొక్క ఫిగర్ ఇదిః

150 × 10 పుణ్యాలు = 1500 పుణ్యాలు

(ఇ) ఆయతుల్ కుర్సీ = స్వర్గ ప్రవేశం

అబూ హూరైర(రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ఆదేశించారుః “ఎవరు ప్రతి నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో వారి స్వర్గ ప్రవేశానికి మరణమే అడ్డు”. (నిసాయి ).

(ఈ) సున్నతె ముఅక్కద = స్వర్గంలో ఒక గృహం

సున్నతె ముఅక్కద 12 రకాతులని గత పేజిల్లో మనం తెలుసు కున్నాము.

ప్రవక్త ﷺ చెప్పగా విని ఉమ్మె హబీబ బిన్తె సుఫ్యాన్ రజియల్లాహు అన్హా ఉల్లేఖిస్తున్నారుః “ముస్లిం దాసుడు ప్రతి రోజు ఫర్జ్ నమాజు కాకుండా పన్నెండు రకాతుల నఫిల్ నమాజు అల్లాహ్ కొరకు చేస్తూ ఉంటే అల్లాహ్ అతని కొరకు స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు. లేక ఒక ఇల్లు అతని కొరకు నిర్మించబడుతుంది”. (ముస్లిం 728).

నమాజులోని మూడవ నిధి సారాంశం

కర్మఫలితం
1- సుబ్ హానల్లాహ్, అల్ హందు లిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్పాపాల మన్నింపు + అనుగ్రహం + ఉన్నత స్థానాలు + భోగభాగ్యాలు+ స్వర్గ ప్రవేశం + 1500 పుణ్యాలు
2- ఆయతుల్ కుర్సీ పఠనంస్వర్గ ప్రవేశం
3) సున్నతె ముఅక్కదస్వర్గంలో ఒక గృహం

[1]. అహ్మద్ 5/215, తబ్రానీ కబీర్ 7486, అల్ ఇబానతుల్ కుబ్రా లిబ్ని బత్త 4, ముస్తద్రక్ హాకిం 4/92, (హాకిం దీనిని సహీ అన్నారు). తాజీము కద్రిస్సలా లి ముహమ్మద్ బిన్ నస్ర్ 407, ఇబ్ను హిబ్బాన్ 257, ఇది హసన్ హదీసు.

[2]. తాజీము కద్రిస్సలా 892, అస్సున్న లిల్ ఖల్లాల్ 1379, అల్ ఇబాన 876, షర్హు ఉసూలి ఇఅతికాది అహ్లిస్సున్న 1538. దీని సనద్ (పరంపర) హసన్, అందులో ఏ అభ్యంతరం లేదు.

[3]. తాజీము కద్రిస్సలా 947. *. షర్హు ఉసూలి ఏతిఖాది అహ్లిస్సున్న 1573.

[4]. అస్సున్న 1372, అల్ ఇబాన 877, షర్హు ఉసూలి…..1539.

[5] వుజూ యొక్క మరో ఘనత ముస్నద్ అహ్మదులో ఇలా ఉందిః

عَن أَبِي أُمَامَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: أَيُّمَا رَجُلٍ قَامَ إِلَى وَضُوئِهِ يُرِيدُ الصَّلَاةَ ثُمَّ غَسَلَ كَفَّيْهِ نَزَلَتْ خَطِيئَتُهُ مِنْ كَفَّيْهِ مَعَ أَوَّلِ قَطْرَةٍ فَإِذَا مَضْمَضَ وَاسْتَنْشَقَ وَاسْتَنْثَرَ نَزَلَتْ خَطِيئَتُهُ مِنْ لِسَانِهِ وَشَفَتَيْهِ مَعَ أَوَّلِ قَطْرَةٍ فَإِذَا غَسَلَ وَجْهَهُ نَزَلَتْ خَطِيئَتُهُ مِنْ سَمْعِهِ وَبَصَرِهِ مَعَ أَوَّلِ قَطْرَةٍ فَإِذَا غَسَلَ يَدَيْهِ إِلَى الْمِرْفَقَيْنِ وَرِجْلَيْهِ إِلَى الْكَعْبَيْنِ سَلِمَ مِنْ كُلِّ ذَنْبٍ هُوَ لَهُ وَمِنْ كُلِّ خَطِيئَةٍ كَهَيْئَتِهِ يَوْمَ وَلَدَتْهُ أُمُّهُ. { أحمد }

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఏ వ్యక్తి నమాజు ఉద్దేశ్యంతో వుజూ చేస్తూ రెండు అరచేతులు కడుగుతాడో నీటి తొలి చుక్క ద్వారా అతని రెండు చేతులతో చేసిన పాపాలు తొలిగిపోవును. నోట్లు నీళ్ళు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్ళు ఎక్కించి చీది శుభ్రపరచుకుంటాడో నీటి మొదటి చుక్క ద్వారా అతని నాలుక మరియు పెదవుల ద్వారా చేసిన పాపాలు తొలిగిపోతాయి. ముఖము కడిగినప్పుడు కళ్ళు మరియు చెవి ద్వారా చేసిన పాపాలు నీటి మొదటి చుక్క ద్వారా తొలిగి పోతాయి. మోచేతుల వరకు చేతులు, మోకాళ్ళ వరకు కాళ్ళు కడినగినప్పుడు సర్వ పాపాల నుండి విముక్తి పొంది తల్లి గర్భం నుండి పుట్టినప్పటి స్థితి మాదిరిగా అయిపోతాడు”. (అహ్మద్ 36/601). [ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ]

[6]. (సునన్ నిసాయీ అల్ కుబ్రా/ బాబు మా యఖూలు ఇజా ఫరగ మిన్ వుజూఇహీ. 9909. 6/25. సహీహుత్తర్గీబు వత్తర్ హీబ్ 225. సహీహుల్ జామిఅ 6170).

[7]. నిసాయి 5, ఇబ్ను మాజ 289, బుఖారీ ముఅల్లఖన్ హ. నం. 1933 తర్వాత. ముస్నద్ అహ్మద్ 1/3).

[8]. అల్ ముఅజముల్ కబీర్ లిత్తబ్రానీ 1/214. అహ్మద్ 4/9. దీని భావం అబూ దావూద్ 345. తిర్మిజి 496. నిసాయీ 1381. ఇబ్ను మాజ 1087లో ఉంది.

[9] సహీ ముస్లింలో మరొక ఘనత ఇలా ఉంది.

عَنْ عَمَرِو بْنِ عَبَسَةَ ÷ قَالَ: قَالَ النَّبِيُّ ﷺ: … فَإِنْ هُوَ قَامَ فَصَلَّى فَحَمِدَ اللهَ وَأَثْنَى عَلَيْهِ وَمَجَّدَهُ بِالَّذِي هُوَ لَهُ أَهْلٌ وَفَرَّغَ قَلْبَهُ لله إِلَّا انْصَرَفَ مِنْ خَطِيئَتِهِ كَهَيْئَتِهِ يَوْمَ وَلَدَتْهُ أُمُّهُ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఉపదేశించారని అమర్ బిన్ అంబస రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అతను (ముస్లిం వ్యక్తి) నమాజు చేయుటకు నిలబడి అల్లాహ్ స్తోత్రము, ప్రశంసలు పఠించి, తగిన రీతిలో ఆయన గొప్పతనాన్ని చాటుతూ, తన హృదయంలో అల్లాహ్ తప్ప మరే ధ్యానం లేకుండా ఉంచుకుంటే తన తల్లి గర్భం నుండి పుట్టినప్పటి స్థితిలో అతను పాపాల నుండి దూరమవుతాడు”. (ముస్లిం 832).

1 ‘పది స్థానాలు రెట్టింపు చేయబడతాయని’ ముస్నద్ అహ్మద్ 4/29లో ఉంది.

%d bloggers like this: