ఒక ముస్లింకు మరొక ముస్లిం యెడల ఆరు బాధ్యతలున్నాయి | బులూగుల్ మరాం | హదీస్ 1236 వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/0kMzDmvxUmI – 36 minutes
1236. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: ఒక ముస్లింకు మరొక ముస్లిం యెడల ఆరు బాధ్యతలున్నాయి. అవేమంటే; (1) అన్ని కలుసుకున్నప్పుడునువ్వు అతనికి సలాం చెయ్యి (2) అతనెప్పడయినా నిన్ను ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని స్వీకరించు. (3) అతనెప్పుడయినా సలహా కోరితే -శ్రేయోభిలాషిగా- మంచి సలహా ఇవ్వు. (4) అతనెప్పుడయినా తుమ్మిన మీదట ‘అల్హమ్దులిల్లాహ్’ అని అంటే, సమాధానంగా నువ్వు ‘యర్ హముకల్లాహ్’ అని పలుకు. (5) అతను రోగగ్రస్తుడైతే నువ్వతన్ని పరామర్శించు. (6) అతను మరణిస్తే నువ్వతని అంత్యక్రియలలోపాల్గొను.
(ముస్లిం)
సారాంశం: ఈ హదీసులో ఒక ముస్లిం యొక్క ఆరు హక్కులు సూచించబడ్డాయి. ‘ముస్లిం’లోని వేరొక ఉల్లేఖనంలో ఐదింటి ప్రస్తావనే వచ్చింది. అందులో ‘శ్రేయోభిలాష’ గురించి లేదు. ఏదైనా వ్యవహారంలో ప్రమాణం చేయమని నిన్ను అతను కోరితే – అది నిజమయిన పక్షంలో – ప్రమాణం కూడా చెయ్యమని ఇంకొక హదీసులో ఉంది.మొత్తం మీద ఈ హదీసు ద్వారా బోధపడేదేమంటే సాటి ముస్లిం యెడల తనపై ఉన్న ఈ ఆరు బాధ్యతలను ప్రతి ముస్లిం నెరవేర్చాలి. వీటిని నెరవేర్చటం తప్పనిసరి (వాజిబ్) అని కొంతమంది పండితులు అభిప్రాయపడగా, నెరవేర్చటం వాంఛనీయం (ముస్తహబ్)అని మరి కొంతమంది వ్యాఖ్యానించారు. అయితే హదీసులోని పదజాలాన్నిబట్టి వాటిని నెరవేర్చటం తప్పనిసరి అని అనటమే సమంజసం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి బులూగుల్ మరాం | హదీస్ 1237 https://youtu.be/ScQ39BtR9Fg [13 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1237. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు`;
“ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి. ఇదే మీ కొరకు శ్రేయస్కరం. (ఎందుకంటే మీరిలా చేసినపుడు) అల్లాహ్ యొక్క ఏ అనుగ్రహం కూడా మీ దృష్టిలో అల్పంగా ఉండదు.” (బుఖారి , ముస్లిం)
సారాంశం:
అల్లాహ్ ను విశ్వసించే వ్యక్తిలో సతతం తృప్తి, కృతజ్ఞతా భావం ఉండాలని ఈ హదీసు చెబుతోంది. ప్రాపంచికంగా తనకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారిని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మనసులో అసూయాద్వేషాలు జనిస్తాయి. ఏ విధంగానయినా ఎదుటి వారిని మించిపోవాలన్న పేరాశ పుట్టుకు వస్తుంది. మరి ఈ ప్రాపంచిక లక్ష్యం కోసం అతడు ఎంతకైనా తెగిస్తాడు. ధర్మమార్గాన్ని పరిత్యజిస్తాడు. దీనికి బదులు మనిషి ఆర్థికంగా తనకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూసినపుడు అల్లాహ్ పట్ల అతనిలో కృతజ్ఞతాభావం జనిస్తుంది. పేదలపట్ల దయ, జాలి ప్రేమ వంటి సకారాత్మక భావాలు పెంపొందుతాయి. వాళ్ల మంచీచెబ్బరల పట్ల అతను శ్రద్ధ వహించటం మొదలెడతాడు. పర్యవసానంగా సమాజంలోని ప్రజల దృష్టిలో కూడా అతనొక దయాశీలిగా, సత్పౌరునిగా ఉంటాడు
—
ఈ ప్రసంగంలో, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ఒక ముఖ్యమైన హదీద్ వివరించబడింది. ప్రాపంచిక విషయాలలో మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూడటం ద్వారా అల్లాహ్ మనకు ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అదే సమయంలో, ధార్మిక విషయాలలో మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారిని చూసి, వారిలా పుణ్యకార్యాలలో పురోగమించడానికి ప్రయత్నించాలని సూచించారు. ఈ సూత్రం అసూయ, అసంతృప్తి వంటి సామాజిక రుగ్మతలకు విరుగుడుగా పనిచేస్తుందని వక్త నొక్కి చెప్పారు. సోషల్ మీడియా ప్రభావంతో ఇతరుల ఐశ్వర్యాన్ని చూసి అసంతృప్తికి లోనవ్వకుండా, పేదవారిని, అవసరమైన వారిని చూసి మనకున్నదానిపై సంతృప్తి చెంది, అల్లాహ్ పట్ల కృతజ్ఞతతో జీవించాలని ఆయన ఉద్భోదించారు. ఈ రెండు గుణాలు (కృతజ్ఞత మరియు సహనం) ఉన్నవారిని అల్లాహ్ తన ప్రత్యేక దాసుల జాబితాలో చేర్చుతాడని కూడా వివరించారు.
انْظُرُوا إِلَى مَنْ هُوَ أَسْفَلَ مِنْكُمْ (ఉన్ జురూ ఇలా మన్ హువ అస్ ఫల మిన్కుమ్) మీరు ఎల్లప్పుడూ మీకన్నా క్రింది స్థాయిలో ఉన్న వారిని మాత్రమే చూడండి.
وَلَا تَنْظُرُوا إِلَى مَنْ هُوَ فَوْقَكُمْ (వలా తన్ జురూ ఇలా మన్ హువ ఫౌఖకుమ్) మీకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వారి వైపు చూడకండి.
فَهُوَ أَجْدَرُ أَنْ لَا تَزْدَرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ (ఫహువ అజ్ దరు అల్ లా తజ్ దరూ ని’మతల్లాహి అలైకుమ్) మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మీరు అల్పదృష్టితో చూడకుండా ఉండడానికి ఇదే ఉత్తమ మార్గం.
ఏంటి దీని భావం? హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. ఎల్లప్పుడూ, మీరు ఎల్లప్పుడూ మీకన్నా క్రింది స్థాయిలో ఉన్న వారిని మాత్రమే చూడండి. మీరు ప్రాపంచిక సిరిసంపదల రీత్యా మీకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారి వైపు చూడండి, అంతేగాని మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్నవారి వైపు చూడకండి. గమనిస్తున్నారు కదా? హదీద్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నారో వారి వైపు చూడండి. ఎక్కువ స్థాయిలో ఉన్నారో వారి వైపుకు చూడకండి. మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మీరు అల్పదృష్టితో చూడకుండా ఉండడానికి ఇదే ఉత్తమ మార్గం.
ఇక ఒకవేళ మీరు హదీద్ లోని అరబీ పదాలు అర్థం చేసుకోవాలి శ్రద్ధగా అంటే చూడండి ఇక్కడ, ఉన్ జురూ – మీరు చూడండి. ఇలా మన్ హువ అస్ ఫల మిన్కుమ్ – మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి వైపున. వలా తన్ జురూ – చూడకండి. ఇలా మన్ హువ ఫౌఖకుమ్ – ఎవరైతే పై స్థాయిలో ఉన్నారో. ఫహువ అజ్ దరు – ఇదే ఉత్తమ విధానం, ఉత్తమ మార్గం. ఫహువ అజ్ దరు, అది మీ కొరకు ఎంతో మేలు, ఉత్తమ మార్గం. దేని కొరకు? అల్ లా తజ్ దరూ – మీరు చిన్నచూపుతో చూడకుండా, మీరు తమకు తాము అల్పంగా భావించకుండా, దేనిని? ని’మతల్లాహి అలైకుమ్ – మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని.
సోదర మహాశయులారా, సభ్యతా, సంస్కారాలు, మర్యాదలు వీటికి సంబంధించి హదీద్ లు మనం తెలుసుకుంటున్నాము. ఇందులో ఈ హదీద్ కూడా ఎంత ముఖ్యమైనది ఈనాటి మన సమాజంలో ఒకసారి అర్థం చేసుకోండి. హదీద్ లో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఇచ్చిన బోధనలని గనక మనం గ్రహించామంటే, పరస్పరం ఎంతో ప్రేమగా, ఒకరు మరొకరితో ఎంతో మంచి రీతిలో కలిసిమెలిసి ఉండవచ్చును. ఈ రోజుల్లో అసూయ, ఈర్ష్య, జిగస్సు, పరస్పరం కపటం, ద్వేషం లాంటి ఈ సామాజిక రోగాలు ఏవైతే పెరిగిపోతున్నాయో, ఇలాంటి హదీథులను చదవకపోవడం వల్ల.
ఈ హదీద్ లో మీకు మూడు విషయాలు తెలుస్తున్నాయి కదా. ఆ మూడు విషయాలు ఏంటి? ఈ హదీద్ ద్వారా మనకు కలిగిన లాభాలు, ప్రయోజనాలు ఏంటి? చివర్లో సంక్షిప్తంగా తెలుసుకుందాము. అయితే రండి.
ధార్మిక మరియు ప్రాపంచిక విషయాలలో మన దృక్పథం
ఒక హదీద్ లో వస్తుంది, ఈ భావాన్ని మీరు మరో హదీస్ ఆధారంగా మంచి రీతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
رَحِمَ اللَّهُ عَبْدًا (రహిమల్లాహు అబ్దన్) అల్లాహ్ ఆ దాసున్ని కరుణించు గాక! చూడండి.
ఇంతకుముందు చదివిన హదీస్ లో ఒక ఆదేశం ఉంది. ఇలా చేయండి, ఇలా చేయకండి, ఇందు ఈ లాభం, ఇలా తెలపబడింది. కానీ ఆ హదీద్ ను విడమరిచి చెప్పేటువంటి మరికొన్ని హదీద్ లలో ఘనతలు, లాభాలు ఎలా ఉన్నాయో గమనించండి. అక్కడ ఏముంది? రహిమల్లాహ్, అల్లాహ్ కరుణించు గాక! ఈ గుణం గనక నేను, మీరు అవలంబించుకున్నామంటే అల్లాహ్ యొక్క కరుణ మనపై కురుస్తుంది. ఏంటి? రహిమల్లాహు అబ్దన్, అల్లాహ్ ఆ వ్యక్తిని కరుణించు గాక!
نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ دُونَهُ (నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ దూనహు) ప్రాపంచిక రీత్యా తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి వైపున చూస్తాడు.
فَحَمِدَ اللَّهَ وَشَكَرَهُ (ఫ హమిదల్లాహ వ షకరహ్) ఓ అల్లాహ్! అతనికంటే నేను ఎంతో మేలు ఉన్నాను. నేను ఎంతో బాగున్నాను. అతనికంటే ఎంతో మంచి స్థితిలో ఉన్నాను. నీకే సర్వ స్తోత్రములు! నీకే అన్ని రకాల పొగడ్తలు! నీకే అన్ని రకాల కృతజ్ఞతలు!
وَفِي دِينِهِ إِلَى مَنْ هُوَ فَوْقَهُ (వ ఫీ దీనిహి ఇలా మన్ హువ ఫౌఖహు) మరి ఎవరైతే ధర్మపరంగా తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడో అతన్ని చూస్తాడు.
فَجَدَّ وَاجْتَهَدَ (ఫ జద్ద వజ్తహద్) ఆ తర్వాత అతను చాలా చాలా అలాంటి పుణ్యాలు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా త్యాగం, ప్రయాస, ప్రయత్నం, కష్టపడతాడు, స్ట్రగుల్ చేస్తాడు దేనికొరకు? ధర్మ కార్యాల్లో, పుణ్య విషయాల్లో అలాంటి వారి స్థానానికి చేరుకోవడానికి, వారికంటే ఇంకా ముందుకు ఉండడానికి.
అమర్ బిన్ షు’ఐబ్ ఉల్లేఖించిన ఒక హదీద్ లో ఇలా కూడా వస్తుంది:
خَصْلَتَانِ (ఖస్లతాని) రెండు ఉత్తమ గుణాలు ఉన్నాయి. ఆ రెండు గుణాలు ఎవరిలో ఉంటాయో, అల్లాహ్ వారిని
شَاكِرًا صَابِرًا (షాకిరన్ సాబిరా) కృతజ్ఞత చెల్లించే వారిలో, ఓపిక సహనాలు వహించే వారిలో అతన్ని కూడా లిఖింపజేస్తాడు. షుక్ర్ చేసేవారు, సబ్ర్ చేసేవారు, కృతజ్ఞత చెల్లించేవారు, సహనాలు పాటించేవారు పుణ్యదాసులు ఎవరైతే ఉన్నారో, అలాంటి వారి జాబితాలో అల్లాహ్ త’ఆలా ఇతన్ని కూడా చేర్చుతాడు. ఎ
వరిని? ఎవరిలోనైతే ఈ రెండు గుణాలు ఉంటాయో. ఏంటి ఆ రెండు గుణాలు?
مَنْ نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ دُونَهُ فَحَمِدَ اللَّهَ عَلَى مَا فَضَّلَهُ بِهِ (మన్ నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ దూనహు ఫ హమిదల్లాహ అలా మా ఫద్దలహు బిహ్) ఎవరైతే ప్రాపంచిక విషయాలలో తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూసి, అల్లాహ్ అతనికంటే ఎక్కువగా అతనికి ఏదైతే అనుగ్రహించాడో దానిని చూసి అల్లాహ్ యొక్క స్తోత్రం పఠిస్తాడు.
وَمَنْ نَظَرَ فِي دِينِهِ إِلَى مَنْ هُوَ فَوْقَهُ فَاقْتَدَى بِهِ (వ మన్ నజర ఫీ దీనిహి ఇలా మన్ హువ ఫౌఖహు ఫక్ తదా బిహ్) మరియు ధర్మ విషయాల్లో తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారిని చూసి వారి లాంటి ఆ సత్కార్యాలు చేసే ప్రయత్నం చేస్తాడు.
وَأَمَّا مَنْ نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ فَوْقَهُ (వ అమ్మా మన్ నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ ఫౌఖహు) కానీ ఎవరైతే దీనికి భిన్నంగా, ప్రపంచ రీత్యా తనకంటే ఎక్కువ స్థానంలో ఉన్న వారిని చూస్తాడో,
وَآسَفَ عَلَى مَا فَاتَهُ (వ ఆసఫ అలా మా ఫాతహు) అతని వద్ద ఉన్న దానిని చూసి, అయ్యో నాకు ఇది దొరకపాయె, నాకు ఇది ఇవ్వకపాయె, అయ్యో దేవుడు నాకు ఎందుకు ఇంత తక్కువ చేస్తున్నాడో, ఇట్లా బాధపడుతూ ఉంటాడు.
فَإِنَّهُ لَا يُكْتَبُ شَاكِرًا وَلَا صَابِرًا (ఫ ఇన్నహు లా యుక్తబు షాకిరన్ వలా సాబిరా) ఇలాంటి వ్యక్తి, షాకిరీన్, సాబిరీన్ లో, కృతజ్ఞత చెల్లించే, సహనాలు పాటించే వారి జాబితాలో లిఖించబడడు.
అందుకొరకే మన సలఫె సాలిహీన్ రహిమహుముల్లాహ్ ఏమనేవారో తెలుసా? నీవు ప్రపంచ రీత్యా నీకంటే పై స్థాయిలో ఉన్నవారితో ఎక్కువగా కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయకు. దీనివల్ల నీలో ఒక న్యూనతాభావం, అయ్యో నాకు లేకపాయె ఇంత గొప్ప స్థితి, నాకు లేకపాయె ఇంత గొప్ప సంపద, నాకు లేకపాయె ఇలాంటి అందం, నాకు లేకపాయె ఇలాంటి… ఈ బాధ అనేది అతనిలో అతన్ని కుమిలిపోయే విధంగా చేస్తుంది.
అందుకొరకు ఏమి చేయాలి? బీదవాళ్ళు, పేదవాళ్ళు, అలాంటి వారిని చూడాలి. వారి వద్ద ధర్మం ఎక్కువ ఉండి, ప్రపంచ పరంగా ఏమంత ఎక్కువ లేకున్నా గానీ, వారికి తోడుగా ఉండే ప్రయత్నం చేయాలి. దీనివల్ల అల్లాహ్ వారికంటే మంచి స్థితిలో మనల్ని ఉంచాడు అని అల్లాహ్ యొక్క కృతజ్ఞతాభావం కలుగుతుంది.
ఆధునిక కాలంలో హదీద్ యొక్క ప్రాముఖ్యత
ఈ సందర్భంలో ఈనాటి టెక్నాలజీ కాలంలో, మరొక ఈ హదీద్ ద్వారా మనకు కలిగేటువంటి గొప్ప బోధన ఏమిటంటే, ఇక ఏం పనిపాట లేదు కదా అని కొందరు యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, టిక్ టాక్ లో, చాట్… షేర్ చాట్, ఏమేమో సోషల్ మీడియాలో ఏం చూస్తారండీ? మన అవ్వలు, మన అక్కలు అందరూ, ఆ… వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఫ్రిడ్జ్ ఉన్నది. ఆ ఫ్రిడ్జ్ లో ఎట్లా పెట్టాలంట, అవంతా చూపిస్తున్నారు. కిచెన్ ను ఎలా డిజైన్ చేసుకోవాలో అంతా చూపిస్తున్నారు. ఆ… నెలకు ఒకసారి జీతం దొరికినప్పుడు, ఆమె భర్త ఎంతగానో మంచి బట్టలు ఆమెకు కొనిస్తాడో, అవన్నీ వాళ్ళు వ్లోగ్ లు అంట, ఇంకా ఏమేమో యూట్యూబ్ లలో అంతా కచరా పెడుతున్నారు కదా పెట్టేవాళ్ళు. ఈ పని పాట లేని వాళ్ళు అవన్నీ చూసుకుంటూ కూర్చుంటారు.
తర్వాత, ఏమండీ ఈసారి నెల జీతం దొరికిన తర్వాత ఇంట్లో ఫలానా తెచ్చుకుందామా? అని మెల్లగా మొదలవుతాయి మాటలు. ఇక ఒక్కొక్కటి, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఈ విధంగా శక్తి సామర్థ్యము లేకున్నా పర్లేదండీ, ఫలానా ఫైనాన్స్ వాళ్ళు ఇస్తున్నారట లోన్, ఫలానా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారంట.
ఇవన్నీ ఇలాంటి కోరికలు ఎందుకు పెరుగుతున్నాయి? అలాంటి ఛానెల్ లను చూడకూడదు. ఏ ఛానెల్ ద్వారా అయితే, అయ్యో మన వద్ద ఇది లేకపాయే, ఇది ఉంటే ఎంత బాగుండు అని మనం కుమిలిపోతామో, అలాంటి ఛానెల్ లు చూసుకుంటూ మన ఇల్లులు పాడు చేసుకోవద్దు.
ప్రపంచ రీత్యా, ఈ విషయమైనా గానీ, హోదా, అంతస్తు, విద్య, ఇంకా అందచందాలు, సిరిసంపదలు, సౌకర్యాలు, ఏ విషయంలోనైనా ప్రపంచ రీత్యా మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారిని, వారి యొక్క ఛానెల్ లను, వారి యొక్క ప్రోగ్రాంలను చూసుకుంటూ ఉండి, అయ్యో నాకు లేకపాయె, నాకు లేకపాయె అన్నటువంటి బాధల్లో ఉండకూడదు.
ఈ ప్రపంచ రీత్యా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసి, అల్హందులిల్లాహ్ ఓ అల్లాహ్ నీ యొక్క ఎంత అనుగ్రహం! కొందరైతే ఇల్లు లేక గుడిసెల్లో ఉంటున్నారు, నేను ఇంత మంచి ఇంట్లో ఉన్నాను. అయ్యో ఫలానా సిటీలో నేను వెళ్ళినప్పుడేదో చూశాను, పైపులలో ఉంటున్నారు, చెట్ల కింద ఉంటున్నారు. నాకైతే దానికంటే మంచిగా కనీసం కిరాయి ఇల్లు అయినా గానీ ఉంది కదా ఓ అల్లాహ్! ఇలాంటి కృతజ్ఞతాభావంలో జీవితం గడపాలి.
కానీ ధర్మపర విషయానికి వస్తే, ధర్మ విషయాలలో, మంచి కార్యాలలో, పుణ్య విషయాలలో మనకంటే ఎక్కువ స్థాయిలో ఎవరున్నారో వారిని చూసి, అలాంటి మార్గం అవలంబించే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే మనకు చాలా మేలు కలుగుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి | బులూగుల్ మరాం | హదీసు 1280 https://youtu.be/K3wcOKsHcp8 [ 9 నిముషాలు ] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1280. హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రభోదించారు:
“అన్యాయానికి దూరంగా ఉండండి ఎందుకంటే అన్యాయం ప్రళయదినాన తమస్సుకు, చిమ్మచీకట్లకు కారణభూత మవుతుంది. ఇంకా పిసినారితనం నుండి నుండి మిమ్మల్ని కాపాడుకోండి. మీకు పూర్వం గతించినవారు దీని (పిసినిగొట్టు తనం) మూలంగానే నాశనమయ్యారు.”
సారాంశం:
ఈ హదీసులో అన్యాయంతో పాటు, పీనాసితనం పట్ల అప్రమత్తంగా ఉండాలని తాకీదు చేయబడింది. ‘అన్యాయం’ తీర్పుదినాన అన్యాయం చేసిన మనిషి పాలిట అంధకారబంధురంగా పరిణమిస్తుంది. అతనికి వెలుతురు , కాంతి కావలసిన తరుణంలో దట్టమైన చీకట్లు అతన్ని అలుముకుంటాయి పిసినారితనం కూడా ఒక దుర్గుణమే. పేరాశకు లోనైనవాడు, పిసినిగొట్టుగా తయారైన వాడు సమాజానికి మేలు చేకూర్చకపోగా, సమాజంలో అత్యంత హీనుడుగా భావించబడతాడు. పిసినారితనం నిత్యం మనస్పర్థలకు, కాఠిన్యానికి కారణభూతమవుతుంది, దుష్పరిణామాలకు దారితీస్తుంది.
—
ఈ ప్రసంగంలో, హదీథ్ నంబర్ 1280 ఆధారంగా ‘జుల్మ్’ (అణచివేత) మరియు ‘షుహ్’ (తీవ్రమైన పిసినారితనం లేదా దురాశ) అనే రెండు వినాశకరమైన పాపాల గురించి వివరించబడింది. ప్రళయదినాన అణచివేత చీకట్లుగా మారుతుందని, మరియు ‘షుహ్’ పూర్వపు జాతులను నాశనం చేసిందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. సాధారణ పిసినారితనం ‘బుఖుల్’ కు మరియు తీవ్రమైన దురాశ ‘షుహ్’ కు మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టం చేయబడింది. ‘షుహ్’ అనేది కేవలం తన వద్ద ఉన్నదాన్ని ఖర్చు చేయకపోవడమే కాక, ఇతరుల సంపదను అక్రమంగా పొందాలనే కోరికను కూడా కలిగి ఉంటుందని, ఇది హత్యలు, పాపాలు మరియు బంధుత్వాలను తెంచడం వంటి ఘోరాలకు దారితీస్తుందని వివరించబడింది. చివరగా, సూరత్ అల్-హష్ర్ లోని ఒక ఆయత్ ను ఉటంకిస్తూ, ఎవరైతే తమ ఆత్మల పిసినారితనం నుండి కాపాడబడతారో వారే నిజమైన సాఫల్యం పొందుతారని నొక్కి చెప్పబడింది.
హదీథ్ వివరణ: అణచివేత (జుల్మ్) మరియు పిసినారితనం (షుహ్)
హజ్రత్ జాబిర్ రజియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, జుల్మ్ కీ దూరంగా ఉండండి. ఎందుకంటే జుల్మ్ ప్రళయ దినాన తమస్సుకు, చిమ్మ చీకట్లకు కారణభూతమవుతుంది. ఇంకా షుహ్, పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి. మీకు పూర్వం గతించిన వారు దీనిని, అంటే పిసినిగొట్టుతనం మూలంగానే నాశనమయ్యారు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఏ విషయంలో వినాశనం ఉన్నదో దాని నుండి మనం దూరం కాకపోతే మనమే చాలా ఘోరమైన నష్టంలో పడిపోతాము.
ఈ హదీథ్ లో జుల్మ్ గురించి వచ్చింది. ఇంతకుముందే మనం హదీథ్ నంబర్ 1279 లో దాని వివరాలు తెలుసుకున్నాం. అయితే ఇందులో మరొక విషయం ఏముంది? వత్తఖుష్షుహ్. షుహ్.
షుహ్ (الشُّحّ) మరియు బుఖుల్ (بخل) మధ్య వ్యత్యాసం
షుహ్, ఒక ఒత్తి ఉన్నది ఈ పదం, మరొకటి ఉన్నది బుఖుల్. బుఖుల్ అంటే కంజూసీతనం, పిసినారితనం. చేతిలో డబ్బులు ఉన్నాయి, అల్లాహ్ మార్గంలో, అవసరం ఉన్నవారికి, పేదవారికి దానం చేయకుండా, ఇవ్వకుండా స్వయం తన భార్యాపిల్లలపై, తల్లిదండ్రులపై ఏ మధ్య రకంలో ఖర్చు పెట్టాలో పెట్టకుండా పిసినారితనం వహించడం. ఇదేమిటి? బుఖుల్.
ఇక్కడ హదీథ్ లో వచ్చిన పదం ఏంటి? షుహ్. ధర్మవేత్తలు ఏమంటున్నారంటే, ఈ బుఖుల్ అనేది ఎప్పుడైతే మనిషిలో మితిమీరిపోతుందో, చివరికి అతడు ఖర్చు పెట్టే విషయంలోనే కాదు, డబ్బు, ధనం యొక్క పిశాచి ఎంతగా అయ్యాడంటే ఉన్నదానిని ఖర్చు పెట్టకుండా ఆపుకొని ఉంచుకుంటున్నాడు, అంతే కాదు, ఇంకా కావాలి, కావాలి, కావాలి అన్నటువంటి ఈ పెరాశ అనేది అక్రమంగా సంపాదించడంలో కూడా అతన్ని పడవేస్తుంది. ఇంతటి ఘోర స్థితికి ఎదిగిన వారిని అతడు షుహ్ లో పడ్డాడు అని అంటారు.
అర్థమైంది కదా? అయితే బుఖుల్ అనేది ఏదైతే ఉందో పిసినారితనం, అందులో మరింత ఓ నాలుగు అడుగులు ముందుగా ఉండడం దీనిని షుహ్ అంటారు.
మరొక భావం దీని గురించి కొందరు ధర్మవేత్తలు ఏం చెప్పారంటే, షుహ్ అన్నది మనసుతో. అటు లేనిదాన్ని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు, అందులో అడ్డమార్గాలు తొక్కవలసి వచ్చినా, పాపం చేయవలసి వచ్చినా ఏ భయం లేకుండా చేసి సంపాదించడం మరియు ఖర్చు చేసే విషయంలో అంటే ప్రాక్టికల్ గా ఖర్చు చేసే విషయంలో బఖీల్, ఆపుకొని ఉంచడం, దీన్ని బుఖుల్, ముందు దాన్ని షుహ్ అని అంటారు.
పిసినారితనం (షుహ్) యొక్క వినాశకరమైన పరిణామాలు
కానీ ఇక్కడ గమనించండి, ప్రవక్త వారు ఏమంటున్నారు? ఇలాంటి ఈ పిసినారితనాన్ని మీరు వదులుకోండి. ఇలాంటి ఈ పిసినారితనం మీలో రాకుండా జాగ్రత్తపడండి. ఎందుకు? ఇంతకుముందు జాతి వారి వినాశనానికి ఇది కారణమైంది. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్.
ఎలా అండి ఇది? ఎలా అంటే, గమనించండి. ఈ రోజుల్లో కూడా మనం కుబేరులను చూస్తున్నాము. మిలియనీర్, బిలియనీర్, కోట్లాధిపతులను కూడా చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మనిషిలో ఈ పిసినారితనం చోటు చేసుకుంటుందో, ఏం చేస్తాడు? బంధుత్వాలను లెక్క కట్టడు. ఈ విధంగా మాట్లాడతాడు.
ఇస్లాం ధర్మం పేరుతో ఎందరికీ ఎలర్జీగా ఉంది. ఏ మానవత్వం ముందండి అని అంటారు. కానీ ఇలాంటి పిసినారులు మన సమాజంలో ఎంతోమంది కనబడతారు. మానవత్వత్వం ముందు అన్న వాళ్ళు డబ్బు విషయం వచ్చేసరికి బంధుత్వాలను, స్వయం మానవులను మరిచిపోయి దానికే ఎంత ప్రాధాన్యతను ఇస్తారంటే, చివరికి హత్యలు, ఘోరమైన పాపాలు, నేరాలు చేయవలసి వచ్చినా నాలుగు పైసల కొరకు అవన్నీ చేయడానికి కూడా సిద్ధమవుతారు. ఈ విధంగా ఇంతకుముందు జాతి వారిని వినాశనానికి గురిచేసింది.
ఈ ఇంతకుముందు జాతి వారిని వినాశనానికి గురిచేసింది అంటే ఇహలోకంలో ఇప్పుడు చెప్పిన రీతిలో. ఇది పరలోకంలో కూడా వినాశనం. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే డబ్బును, ధనాన్ని, ప్రజలకు అవసరమున్న విషయాలను, వస్తువులను ఆపుకొని స్వయం లాభం పొందుతూ, కొన్ని సందర్భాలలోనైతే పిసినారితనం ఎంతగా ఉంటుందంటే స్వయం కూడా లాభం పొందడు. స్వయం కూడా లాభం పొందకుండా డబ్బు సంపాదించడంలో ఎంత ముందుకు వెళుగుతారంటే వారి వద్ద దొంగతనం, అక్రమ సంపాదన, హత్య చేయడం మరియు మోసంతో డబ్బు కాజేసుకోవడం ఇవన్నీ ఎలాంటి పాపంగా భావించరు. ఇంకా దానిపై బంధుత్వాలను తెంచడం, ఇవన్నీ పాపాలకు గురి అవుతారు. చివరికి ఏమవుతుంది? ఈ పాపాలన్నీ కూడా పరలోకంలో అతన్ని నష్టంలో పడవేస్తాయి.
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజియల్లాహు అన్హు) గారి వివరణ
ఒకసారి అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు తన శిష్యులతో, తన దగ్గర కూర్చున్న వారితో అడిగారు, “అయ్యుహుమా అషద్ద్, అల్-బుఖుల్ అవిష్-షుహ్?” (ఈ రెండిటిలో ఏది తీవ్రమైనది, బుఖుల్ ఆ లేక షుహ్ ఆ?). నేను ఇంతకుముందే చెప్పాను కదా రెండు పదాలు ఉన్నాయని. అల్-బుఖుల్, దీని యొక్క అసలైన భావం పిసినారితనం. దానిపై మరొకటి షుహ్. ఈ రెండిటిలో చాలా చెడ్డది ఏమిటి? అని అడిగారు.
అయితే అక్కడ ఉన్నవారు విభేదాల్లో పడ్డారు. కొందరు ఇలా అంటుంటే, కొందరు అది అంటున్నారు. అప్పుడు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ అన్నారు, “అష్-షుహ్హు అషద్దు మినల్-బుఖుల్” (షుహ్ అనేది బుఖుల్ కంటే తీవ్రమైనది). షుహ్ అన్నది బుఖుల్ కంటే చాలా చెడ్డది. “లిఅన్నష్-షహీహ యషుహ్హు అలా మా ఫీ యదైహి ఫయహ్బిసుహూ, వ యషుహ్హు అలా మా ఫీ ఐదిన్-నాసి హత్తా య’ఖుజహూ. వ అమ్మల్-బఖీలు ఫహువ యబ్ఖలు అలా మా ఫీ యదైహి” (ఎందుకంటే ‘షహీహ్’ (షుహ్ గుణం ఉన్నవాడు) తన చేతిలో ఉన్న దానిపై పిసినారితనం చూపి దాన్ని బంధిస్తాడు, మరియు ప్రజల చేతుల్లో ఉన్న దానిపై కూడా దురాశ పడతాడు, దాన్ని తీసుకునేంత వరకు. అయితే ‘బఖీల్’ (బుఖుల్ గుణం ఉన్నవాడు) కేవలం తన చేతిలో ఉన్న దానిపై మాత్రమే పిసినారితనం చూపిస్తాడు).
షుహ్ ఉన్న వ్యక్తి తన చేతిలో ఉన్నదానిని ఆపేస్తాడు, ఇతరులకు ఇవ్వకుండా. అంతేకాదు, ప్రజల చేతుల్లో ఉన్నదాన్ని కూడా మంచి మనసుతో చూడడు, ఎప్పుడు నా చేతిలోకి వచ్చి పడుతుందో, ఎప్పుడు నా దగ్గరికి వచ్చేస్తుందో అని. కానీ బఖీల్ కేవలం తన వద్ద ఉన్నదానిని ఇతరులకు ఖర్చు చేయకుండా ఆపుకునేవాడు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు ఈ విధంగా దీనిని, ఈ రెండు పదాలను వివరించారు.
ఖురాన్ సూచన
అయితే ఖురాన్ సూరతుల్-హష్ర్, 28వ ఖండంలో ఉంది, ఆయత్ నంబర్ తొమ్మిదిని గనక మనం చూస్తే, షుహ్ అన్నది ఎన్నో ఇతర పాపాలకు కారణమవుతుంది అని కూడా తెలుస్తుంది. అందుకొరకే దాని నుండి దూరం ఉన్నవాడే సాఫల్యం పొందుతాడని అల్లాహ్ అక్కడ మనకు తెలియజేస్తున్నాడు.
وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ఎవరైతే తమ ఆత్మల పిసినారితనం నుండి కాపాడబడ్డారో, అట్టివారే సాఫల్యం పొందేవారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1277. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారు: “అసూయకు దూరంగా ఉండండి ఎందుకంటే అగ్ని కట్టెలను భస్మీపటలం చేసినట్లే అసూయ సత్కార్యాలను హరించి వేస్తుంది.” (దీనిని అబూదావూద్ సేకరించారు-ఇబ్నెమాజాలోనూ హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు)చే ఈ విధంగానే ఉల్లేఖించ బడింది)
సారాంశం: అసూయ లేక ఈర్య పెద్ద పాపాల కోవకు చెందినది. ఈర్ష్య మూలంగానే షైతాన్ తొలిసారిగా అల్లాహ్ ను ధిక్కరించాడు. ఖాబిల్ తన సోదరుడైన హాబిల్ ని అసూయతోనే హత్య చేశాడు. దైవప్రవక్త హజ్రత్ యూసుఫ్ (అలైహిస్సలాం) సోదరులు ఆయన యెడల చేసిన చెడు వ్యవహారానికి అసలు కారణం ఈ అసూయే. యూద పండితులు, అబ్దుల్లాహ్ బిన్ ఉబై వంటి కపటులు మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పట్ల చేసిన కపట చేష్టలన్నింటికీ మూలం ఈర్ష్యే. దీనికి సంబంధించిన ఉల్లేఖనాలనేకం ఉన్నాయి. ఇది విశ్వాసానికి విరుద్ధాంశం. అందుకే దీనికి దూరంగా ఉండమని మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) చాలా గట్టిగా తాకీదు చేశారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రళయదినాన జుల్మ్ అనేక అంధకారాలకు, కారుచీకట్లకు హేతువు అవుతుంది | బులూగుల్ మరాం | హదీస్ 1279 https://youtu.be/FgFHZq8iK5M వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1279. హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు:
“ప్రళయదినాన జుల్మ్ (‘అన్యాయం’) అనేక అంధకారాలకు, కారుచీకట్లకు హేతువు అవుతుంది”. (బుఖారి, ముస్లిం)
సారాంశం: హదీసులో ‘జులుం’ అనే పదం వాడబడింది. జులుం అంటే అన్యాయం అనీ, వేరొకరి హక్కును కొల్లగొట్టడమనీ అర్థం. ఈ దౌర్జన్యానికి పాల్పడినవాడు ప్రళయదినాన గాఢాంధ కారాల్లో తచ్చాడుతూ, అలుముకున్న చీకట్లలో అలమటిస్తూ ఉంటాడని హదీసు హెచ్చరిస్తోంది. జులుం అనేక రకాలు. ఈ జులుం ఒకరి ప్రాణం పట్ల జరిగినా, ధనం పట్ల జరిగినా,అల్లాహ్ యొక్క హక్కుల విషయంలో జులుం జరిగినా, దాసుల హక్కుల విషయంలో జులుం జరిగినా మొత్తానికి జులుం జులుమే. అది ముమ్మాటికీ నిషిద్ధమే (హరామే)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మిత్రులారా! అల్హందులిల్లాహ్ మరొక ముఖ్యమైన మరియు తప్పకుండా వినాల్సిన వీడియో. ఇది స్త్రీలకోసమే కాదు, పురుషులు కూడా తప్పకుండా వినండి. మీ బంధు మిత్రులకు కూడా షేర్ చెయ్యండి తప్పనిసరిగా ఇన్ షా అల్లాహ్.
ఈ వీడియో లో పరదా గురుంచి ఒక అమెరికా స్త్రీ గురుంచిన కథ వింటే, మీరు కన్నీరు పెట్టటం ఖాయం
{ఓ ప్రవక్తా! నీ భార్యలకు, నీ కూతుళ్ళకు, విశ్వాసుల స్త్రీలకు తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడ తీసుకోమని చెప్పు. వారు గుర్తింప బడటానికీ, వేధింపబడకుండా ఉండేందుకు ఇది ఎంతో సముచితమైన పద్దతి, అల్లాహ్ క్షమించేవాడు కరుణించువాడునూ} (33: అహ్ జాబ్: 59).
(ఓ ప్రవక్తా!) ముస్లిం స్త్రీలు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలనీ, బహిర్గతమై ఉండేది తప్ప – తమ అలంకరణను బహిర్గతం చేయరాదనీ, తమ వక్షస్థలాలపై ఓణీలు వేసుకోవాలనీ, తమ భర్త లేక తమ తండ్రి లేక తమ మామగారు లేక తమ కొడుకులు లేక తమ భర్త కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కుమారులు లేక తమ అక్కాచెల్లెళ్ల కొడుకులు లేక తమతో కలిసిమెలిసి ఉండే స్త్రీలు, లేక తమ బానిసలు లేక ఇతరత్రా ఉద్దేశాలు లేకుండా తమకు లోబడి ఉన్న పురుష సేవకులు లేక స్త్రీల గుప్త విషయాల గురించి ఇంకా తెలియని బాలురు – వీళ్ల ఎదుట తప్ప ఇతరుల ఎదుట తమ అలంకరణలను (అంద చందాలను) కనబడనివ్వకూడదనీ, దాగివున్న తమ అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్ళను నేలపై కొడుతూ నడవరాదని వారితో చెప్పు. ముస్లింలారా! మీరంతా కలసి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు (24: నూర్ :31).
—
ఈ ప్రసంగంలో, వక్త ఇస్లాం అనేది మానవాళి కోసం అల్లాహ్ నిర్దేశించిన సంపూర్ణ జీవన విధానమని, అది పుట్టుక నుండి మరణం వరకు ప్రతి అంశాన్ని బోధిస్తుందని వివరించారు. ముఖ్యంగా, స్త్రీల గౌరవం మరియు రక్షణ కోసం అల్లాహ్ విధించిన పరదా (హిజాబ్) యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. పరదా అనేది స్త్రీకి రక్షణ కవచమని, గౌరవాన్ని ఇస్తుందని ఖురాన్ ఆయతుల ద్వారా మరియు ప్రవక్త జీవిత సంఘటనల ద్వారా స్పష్టం చేశారు. పరదా ఎవరి ముందు పాటించాలి, దాని నియమాలు ఏమిటి అనే విషయాలను వివరించారు. అల్లాహ్ భీతి, విశ్వాసం మరియు త్యాగాలకు నిలువుటద్దంగా నిలిచిన సహాబీల మరియు ఒక క్రైస్తవ స్త్రీ ఇస్లాం స్వీకరించిన సంఘటనలను ఉదాహరణలుగా చెప్పి, శ్రోతలను ఇహపరలోకాల సాఫల్యం కోసం ఇస్లామీయ జీవన విధానాన్ని, ముఖ్యంగా పరదాను ఆచరించమని ప్రబోధించారు.
وخير الهدي هدي محمد صلى الله عليه وسلم (వ ఖైరల్ హదీ హదీ ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఉత్తమమైన మార్గదర్శకత్వం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మార్గదర్శకత్వం.
وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار (వ షర్రల్ ఉమూరి ముహ్ దసాతుహా వ కుల్లు ముహ్ దసతిన్ బిద్’అ వ కుల్లు బిద్’అతిన్ జలాలా వ కుల్లు జలాలతిన్ ఫిన్నార్) విషయాలలో చెడ్డవి కొత్తగా కల్పించబడినవి, ప్రతి కొత్త కల్పన బిద్అత్, ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వం మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకంలోకి తీసుకువెళ్తుంది.
فأعوذ بالله من الشيطان الرجيم (ఫ అ’ఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్) శపించబడిన షైతాన్ నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
بسم الله الرحمن الرحيم (బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్) అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో (ప్రారంభిస్తున్నాను).
يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّأَزْوَاجِكَ وَبَنَاتِكَ وَنِسَاءِ الْمُؤْمِنِينَ يُدْنِينَ عَلَيْهِنَّ مِن جَلَابِيبِهِنَّ ۚ ذَٰلِكَ أَدْنَىٰ أَن يُعْرَفْنَ فَلَا يُؤْذَيْنَ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا (యా అయ్యుహన్ నబియ్యు ఖుల్ లి అజ్వాజిక వ బనాతీక వ నిసాఇల్ మూమినీన యుద్ నీన అలైహిన్న మిన్ జలాబీ బిహిన్న, జాలిక అద్నా అన్ యు’రఫ్న ఫలా యు’జైన వ కానల్లాహు గఫూరన్ రహీమా) ఓ ప్రవక్తా! నీ భార్యలతో, నీ కుమార్తెలతో, విశ్వసించిన స్త్రీలతో చెప్పు: వారు తమ పై వస్త్రాలను తమపై జారవిడుచుకోవాలి. దీనితో వారు గౌరవనీయులుగా గుర్తింపబడి, బాధలకు గురికాకుండా ఉంటారు. నిశ్చయముగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు.
رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي (రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్లీ అమ్ రీ వహ్ లుల్ ఉఖ్ దతమ్ మిల్ లిసానీ యఫ్ ఖహూ ఖౌలీ) ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కోసం విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభం చేయి. నా నాలుకలోని ముడిని విప్పు, తద్వారా వారు నా మాటను అర్థం చేసుకోగలరు.
رَبِّ زِدْنِي عِلْمًا, رَبِّ زِدْنِي عِلْمًا, اللَّهُمَّ رَبِّ زِدْنِي عِلْمًا (రబ్బి జిద్నీ ఇల్మా, రబ్బి జిద్నీ ఇల్మా, అల్లాహుమ్మ రబ్బి జిద్నీ ఇల్మా) ఓ నా ప్రభూ! నా జ్ఞానాన్ని అధికం చేయి. ఓ నా ప్రభూ! నా జ్ఞానాన్ని అధికం చేయి. ఓ అల్లాహ్! నా ప్రభూ! నా జ్ఞానాన్ని అధికం చేయి.
سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ (సుబ్ హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్ తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్) నీవు పవిత్రుడవు. నీవు మాకు నేర్పినది తప్ప మాకు ఏ జ్ఞానమూ లేదు. నిశ్చయంగా నీవే సర్వజ్ఞుడు, వివేకవంతుడవు.
అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ ఉన్నాను, షైతాన్ యొక్క కీడు నుండి, షైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రియ సోదరులారా, ప్రియమైన సోదరీమణులారా, ముందుగా సర్వ స్తోత్రములు సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్ కే ప్రత్యేకము, అల్హమ్దులిల్లాహ్. ఆ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సమస్తాన్ని సృష్టించినవాడు, సమస్తమును నడిపిస్తున్నవాడు. ఆ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాత్రమే ఈ విశ్వ సామ్రాజ్యానికి అధిపతి, ఆయన ఆధిపత్యము మాత్రమే దీనిపై చెల్లుతుంది ప్రియులారా. ఆయనే అల్లాహ్, ఆయన తప్ప వేరే నిజ ఆరాధ్యుడు లేడు. అల్లాహ్ సజీవుడు, అల్లాహ్ నిత్యుడు, అల్లాహ్ విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు, అల్లాహ్ కునుకు తీయనివాడు, అల్లాహ్ నిదుర పోనివాడు సోదరులారా.
ఆయనే అల్లాహ్, కేవలం ఒకే ఒక్కడు, ఎవరి అవసరము లేనివాడు. ఆయన ఎవరికీ సంతానము కానటువంటి వాడు, అల్లాహ్ సంతానము కలిగి లేనటువంటి వాడు. ఆ అల్లాహ్ కు సరి సమానమైనది విశ్వములో ఏదీ లేదు ప్రియులారా. ఆ అల్లాహ్ యే తల్లి గర్భాలలో చిన్న వీర్యపు బిందువుగా ప్రవేశించిన మనల్ని మంచి ఆకృతి ప్రసాదించినవాడు. నా ప్రియ సోదరులారా, నా ప్రియ సోదరీమణులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను పోల్చుకోండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను గుర్తించండి. అల్లాహ్ ను ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించండి. నేను అన్నింటికంటే మొట్టమొదటి మాట మీ ముందు ఉంచుతున్నాను సోదరులారా, ప్రియమైన సోదరీమణులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఏకత్వాన్ని గుర్తించండి.
అల్లాహ్ ను పోల్చుకోండి ప్రియులారా. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యము లేనిదే ఈ రోజు ప్రపంచములో ఎవరి మనుగడ సాధ్యము కాదు సోదరులారా. సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, ఆ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏ విధంగా సర్వాన్ని సృష్టించాడో, సుబ్ హా నల్లాహ్. మనము గనుక అల్లాహ్ యొక్క అనుగ్రహాలను లెక్కబెట్టదలిస్తే, అల్లాహ్ యొక్క అనుగ్రహాలను లెక్కబెట్టలేము సోదరులారా. ఏమని లెక్కబెడతాం? అల్హమ్దులిల్లాహ్. ఈ మానవ దేహము చూడండి, ఇది అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం, సుబ్ హా నల్లాహ్. అల్లాహ్ చూసే కనులు ప్రసాదించాడు, వినే చెవులు ప్రసాదించాడు. అల్హమ్దులిల్లాహ్, ప్రతీది అల్లాహ్ యొక్క అనుగ్రహం. మరి మనలో ఎంతమంది ఆ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు కృతజ్ఞత తెలుపుతూ జీవితము గడుపుతున్నాం? ఈ రోజు కృతజ్ఞతా భావం మనలో ఉందా?
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ రోజు నాకు కుటుంబాన్ని ప్రసాదించాడు, కుటుంబంలో నలుగురి మధ్య జీవితము గడుపుతున్నాను, అల్హమ్దులిల్లాహ్ పలకండి. ప్రపంచములో ఎందరో అనాధలుగా దిక్కులేని జీవితం గడుపుతూ ఉన్నారు. ఈ రోజు వేళకు అల్హమ్దులిల్లాహ్ ఆహారం భుజిస్తూ ఉన్నాను, అల్లాహ్ కు కృతజ్ఞత తెలపండి. ఈ రోజు ప్రపంచములో ఎంతో మంది ఆహారము లేక విలవిలలాడుతున్నారు ప్రియులారా. సుబ్ హా నల్లాహ్. ప్రియ సోదరులారా, ప్రియమైన సోదరీమణులారా, అల్లాహ్ యొక్క కారుణ్యం పట్ల, అల్లాహ్ యొక్క అనుగ్రహాల పట్ల కృతజ్ఞత తెలిపేవారిగా జీవితం గడపడం ప్రారంభించండి.
ఒక ఉదాహరణ, నేను అనేక సందర్భాలలో ఇస్తూ ఉంటాను సోదరులారా, మీ ముందు కూడా ఆ ఉదాహరణతో నేను నా మాటను ముందుకు తీసుకు వెళ్తున్నాను. ఒక అబ్బాయి వాళ్ల నాన్నగారితో మారం చేస్తున్నాడు, “నాన్నగారు, నాకు కొత్త బూట్లు కొనివ్వండి, మీరు కొత్త బూట్లు కొనివ్వకపోతే నేను రోడ్డు మీదకు అడుగు పెట్టను” అన్నాడు. వాళ్ల నాన్న ఏదో కష్టపడి ఆ అబ్బాయికి కొత్త బూట్లు కొనిచ్చాడు. ఆ అబ్బాయి కొత్త బూట్లు తొడుక్కున్నాడు. కొత్త బూట్లు తొడుక్కున్న తర్వాత, ఆ అబ్బాయి రోడ్డు మీదకు వెళ్తున్నాడు. రోడ్డు మీదకు వెళ్లిన కాసేపటికే, ఆ అబ్బాయి ఏడ్చుకుంటూ ఒక పక్కన కూర్చుండిపోతున్నాడు. కాసేపటి తర్వాత, వాళ్ల నాన్నగారు రోడ్డు మీదకు వెళ్తున్నారు, అబ్బాయి ఒక పక్కన ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. తండ్రి కుమారునితో ప్రశ్నిస్తూ ఉన్నాడు, “ఏం నాన్న, బూట్లు అడిగావు కదా, కొనిచ్చాను కదా, అయినా ఎందుకు ఏడుస్తున్నావు?” కుమారుడు ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు, “నాన్నగారు, తమరు ఇచ్చిన కొత్త బూట్లు తొడుక్కొని నేను రోడ్డు మీదకు వెళ్ళాను. రోడ్డు మీదకు వెళ్ళిన వెంటనే, ఒక అవిటి వ్యక్తిని చూశాను. ఆ అవిటి వ్యక్తి మోకాళ్ళ వరకు రెండు కాళ్ళు లేకుండా రోడ్డు మీద పడి ఉన్నాడు. నాకు రెండు కాళ్ళు ఉన్నాయి కాబట్టి నేను బూట్లు కోరుకున్నానే, ఆ అవిటి వ్యక్తికి రెండు కాళ్ళే లేవు కదా, అతడు దేన్ని కోరుకుంటాడు?” సుబ్ హా నల్లాహ్.
ప్రియ సోదరులారా, ప్రియమైన సోదరీమణులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను స్మరిస్తూ జీవితం గడపండి. అల్లాహ్ యొక్క నామ స్మరణ చేస్తూ జీవితము గడపండి. మన హృదయాలు ఏ విధంగా మరణించిన వారి హృదయాలు కాకూడదు ప్రియులారా. అల్లాహ్ యొక్క జిక్ర్ చేయండి. అల్లాహ్ యొక్క జిక్ర్ చేసే వారు ఎలాగంటి వారు? సజీవమైన వారితో సమానం. ఎవరైతే అల్లాహ్ యొక్క జిక్ర్ చెయ్యరో, వారు చనిపోయిన వారితో సమానం. మహాప్రవక్త అంటున్నారు, “మసలుల్లజీ యజ్కురు రబ్బహూ వల్లజీ లా యజ్కురు రబ్బహూ మసలుల్ హయ్యి వల్ మయ్యితీ“. ఎవరైతే అల్లాహ్ ను స్మరిస్తూ ఉంటారో, ఎవరైతే అల్లాహ్ ను స్మరించరో, వీరిద్దరి ఉదాహరణ ఎలాంటిది అంటే, అల్లాహ్ ను స్మరించేవాడు బ్రతికున్న మనిషితో సమానము. ఎవరైతే అల్లాహ్ ను స్మరించడో వాడు చనిపోయిన వాడితో సమానము. ఈ రోజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్మరణ మనలో ఎంత ఉంది? ఆలోచించండి.
ఏదేమైనప్పటికీ, ముందుగా సర్వ స్తోత్రములు సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్ కే ప్రత్యేకము, అల్హమ్దులిల్లాహ్. పిదప అల్లాహ్ యొక్క సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క కారుణ్యములు, శుభములు మరియు శాంతి వర్షించును గాక. ప్రత్యేకముగా చిట్టచివరి దైవప్రవక్త, ఆదర్శ మూర్తి, హృదయాల విజేత, అంతిమ దైవప్రవక్త, హజరతే ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, అల్లాహుమ్మ సల్లీ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్, కమా సల్లయితా అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్, కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్ మజీద్. పిదప మనందరిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యము మరియు శుభములు వర్షించును గాక. ఆమీన్.
ప్రియ సోదరులారా, ప్రియమైన సోదరీమణులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వ సృష్టికర్త, యజమాని, పాలకుడు, పోషకుడు. మనిషిని సృష్టించాడు సోదరులారా. ఆ మనిషి ఏ విధంగా జీవితము గడపాలి అని ఆయనే బోధించి ఉన్నాడు సోదరులారా. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదం అలైహిస్సలాతు వస్సలాము నుండి చిట్టచివరి దైవప్రవక్త హజరతే ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ప్రతి ప్రవక్తను ఈ భూలోకం పైకి పంపించి, ఆ ప్రవక్తకు ఒక జీవన విధానం నిర్దేశించాడు. ఎందుకంటే, అల్లాహ్ కు బాగా తెలుసు, మనిషి ఏ విధమైన జీవితాన్ని గడిపితే వాడు సాఫల్యం పొందుతాడో. ఉదాహరణకు, మనం మార్కెట్ లోనికి వెళ్లి ఒక వాషింగ్ మెషిన్ కొన్నాం. ఆ వాషింగ్ మెషీనో, ఫలానా ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ కొన్నాం. ఎలక్ట్రానిక్ ఐటమ్ కొన్న తర్వాత, ఆ కంపెనీ వాడు ఏం చేస్తాడు? మనము ఏ ఐటమ్ అయితే మార్కెట్ లో కొన్నామో, ఆ ఐటమ్ కు సంబంధించి చిన్న బుక్లెట్ ఇస్తాడు. ఆ బుక్లెట్ లో ఏముంటుంది? ఈ వాషింగ్ మెషిన్ ఎలా ఉపయోగించాలి? దీన్ని ఏ విధంగా వాడాలి? ఏ విధంగా ఉంచాలి? ఫలానా విషయాలు చెబుతాడు ఎందుకు? వాడు దానిని తయారు చేశాడు కాబట్టి, దానిని ఏ విధంగా ఉపయోగిస్తే అది ఎక్కువ మన్నిక వస్తుందో వాడికి తెలుసు. మరి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సర్వ మానవాళిని సృష్టించాడు కదా? మరి ఈ మానవులు ఎలాంటి జీవితము గడిపితే సాఫల్యం పొందుతారు? అల్లాహ్ కు బాగా తెలుసు. కాబట్టి అల్లాహ్ మానవాళి కొరకు ఒక జీవన విధానం నిర్దేశించాడు, దాని పేరు ఇస్లాం.
ఇస్లాం – సంపూర్ణ జీవన విధానం
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎవరైతే మానవాళిని సృష్టించాడో, మానవాళి జీవన విధానము కూడా ఆ అల్లాహ్ నిశ్చయించాడు, దాని పేరే ఇస్లాం సోదరులారా. పవిత్ర ఖురాన్ గ్రంథము, మూడవ అధ్యాయము, సూరే ఆలే ఇమ్రాన్, వాక్యము సంఖ్య 19లో అల్లాహ్ అంటున్నారు, “ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం“. ఆ అల్లాహ్ వద్ద ఏదైనా జీవన విధానం స్వీకరింపబడుతుంది అంటే అది ఇస్లాం.
ఇస్లాం అంటే అర్థం ఏమిటండీ? ఇస్లాం అంటే అర్థం, మనల్ని సృష్టించిన మన సృష్టికర్తకు మనం విధేయత చూపుతూ, ఆయన ఇచ్చిన ఆజ్ఞ అనుగుణంగా జీవితము గడపటానినే ఇస్లాం అంటారు ప్రియులారా. మరి మనలో ఎంతమంది ఈ రోజు ఇస్లాం ప్రకారం జీవితాన్ని గడుపుతున్నాం? “నేను ముస్లింనండీ, నా పేరు అబ్దుర్రహ్మాన్ అండీ, నా పేరు ఫాతిమా అండీ, నా పేరు ఆయిషా అండీ, నా పేరు అబ్దుల్ జబ్బార్ అండీ. నేను ముస్లింనండీ, కానీ ఇస్లాం విధానం మా జీవితాలలో లేదండీ, ఇస్లాం పద్ధతులు మా జీవితాలలో లేవండీ. ఖురాన్ గ్రంథం చదవటమా? ఆ మాట మాకు చెప్పకండి. నమాజు చేయటమా? ఆ మాటలు మాకొద్దండీ. తాత ముత్తాతల నుండి ముస్లింలుగా పుట్టామండీ. ఆ పేర్లు పెట్టుకుంటూ సమాజంలో వెళ్లిపోదామా? లేక మన జీవితాలలో పరలోకము కోసం సామాగ్రి తయారు చేసుకుందామా?”
ప్రియ సోదరులారా, ప్రియమైన సోదరీమణులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనల్ని సృష్టించిన ఉద్దేశ్యము ఏమిటి? అల్లాహ్ మన ఇష్టం వచ్చినట్లు జీవితము గడపటానికి సృష్టించాడా? అల్లాహ్ దేనికోసం సృష్టించాడు ప్రియులారా? పవిత్ర ఖురాన్ గ్రంథం అంటుంది,
وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ (వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లి య’అబుదూన్) మేము మానవులను, జిన్నాతులను కేవలం మా ఆరాధన కోసం సృష్టించాము.
అల్లాహ్ అంటున్నారు. మేము మానవులను జిన్నాతులను కేవలం మా ఆరాధన కోసం సృష్టించాము. ఈ రోజు ఆరాధన పద్ధతిలో మనం పూర్తిగా ముందుకు వెళ్తున్నామా? సోదరులారా, ఇస్లాం ధర్మములో పూర్తిగా ప్రవేశించండి. షైతాన్ యొక్క అడుగుజాడలోనికి వెళ్ళకండి. పవిత్ర ఖురాన్ గ్రంథం అంటుంది, రెండవ సూరా, సూరే బఖరా, వాక్యము సంఖ్య 208లో,
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا ادْخُلُوا فِي السِّلْمِ كَافَّةً وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ ఓ విశ్వసించిన ప్రజలారా, ధర్మములోనికి పూర్తిగా ప్రవేశించండి. షైతాన్ యొక్క అడుగుజాడలను అనుసరించకండి, నిశ్చయముగా వాడు మీకు బహిరంగ శత్రువు.
అల్లాహ్ అంటున్నారు. ఓ విశ్వసించిన ప్రజలారా, ధర్మములోనికి పూర్తిగా ప్రవేశించండి. సగం సగం ప్రవేశం వద్దు ప్రియులారా. కొంతమంది ఉంటారు, సోమవారం అక్కడికి, లక్ష్మివారం అక్కడికి, శుక్రవారం మసీదుకు, ఈ విధంగా జీవితాలు గడపకూడదు. ఆ కొన్ని రోజులు నమాజు, మనసు చెప్తే నమాజు లేకపోతే నిద్ర, ఇలాంటి జీవితం అల్లాహ్ కు పనికిరాదు ప్రియులారా. అల్లాహ్ అంటున్నారు, “షైతాన్ అడుగుజాడలను అనుసరించకండి“. షైతాన్ ను అనుసరించకండి. షైతాన్ ఎన్నో తీసుకువస్తాడు ప్రియులారా. ఎందుకంటే అల్లాహ్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. నేను వారిని మార్గభ్రష్టత్వంలోనికి తీసుకువెళ్లిపోతాను. కానీ నిజమైన దాసులు షైతాన్ కు లోను కారు ప్రియులారా. వాడి యొక్క ఏదైతే పన్నాగాలు పన్నుతాడో అసలైన అల్లాహ్ విశ్వాసులు షైతాన్ పన్నాగాలలోనికి రారు. మరి ఈ రోజు మనం షైతాన్ ను స్నేహితుడిగా చేసుకున్నామా? లేక అల్లాహ్ కు స్నేహితుడిగా మారి ఉన్నామా? మనం అల్లాహ్ కు స్నేహితులుగా మారి ఉంటే, అల్లాహ్ ఏదైతే ఇస్లాం ధర్మశాస్త్రం మన కోసం పెట్టాడో, దాని గీత కూడా దాటి అవతలకు వెళ్ళము సోదరులారా. పదండి చూద్దాం. ఈ రోజు మనం ఆలోచించవలసిన అవసరం ఉంది సోదరులారా. పురుషులు మరియు స్త్రీలు అల్లాహ్ ఏదైతే ఆజ్ఞాపాలన చేయమన్నాడో, అల్లాహ్ యొక్క ఆజ్ఞాపాలన చేస్తున్నామా లేదా?
ఇస్లాం ధర్మశాస్త్రం మనిషి జీవితంలో ప్రతి విధానమును బోధించింది. ఒక మనిషి ఏ విధంగా జీవితము గడపాలి? ఒక మనిషి ఏ విధంగా తన జీవితంలో తన రోజువారీ విషయాలు పాటించాలి? ఇస్లాం దేనిని నేర్పలేదు? సుబ్ హా నల్లాహ్. అసూయపడేవారు ప్రజలు. “ఈ ప్రవక్త ఎవరండీ బాబు, ప్రతి మాట బోధిస్తున్నాడు. వాస్తవానికి, మలమూత్ర విసర్జన నియమాలు సైతం బోధిస్తున్నాడు.” ప్రజలు నవ్వేవారు. కానీ ఇస్లాం, ఒక మనిషి జీవితంలో, ఒక మనిషి తల్లి గర్భము నుండి ఒక పసివానిగా బయటకు వచ్చినప్పటి నుండి, సమాధిలోనికి వెళ్లిపోయేంత వరకు ఏ విధమైన జీవితము గడపాలి, ప్రతి విషయములోనూ ఇస్లాం బోధిస్తుంది ప్రియులారా. ప్రతి విషయాన్ని ఇస్లాం కూలంకషంగా చర్చిస్తుంది.
అదే మార్గములో స్త్రీల కోసం, సుబ్ హా నల్లాహ్, స్త్రీల కోసం ఇస్లాం, ఈ రోజు ప్రపంచంలో చూస్తున్నామండీ స్త్రీల గురించి ఎలాంటి మాటలు వస్తున్నాయి, స్త్రీలపై అనేక రకాలైన అత్యాచారాలు జరుగుతున్నాయి, స్త్రీ గౌరవానికి భంగం వాటిల్లుతుంది. ఆ విధంగా స్త్రీ ప్రపంచంలో అనేక రకాల బాధలకు గురి అవుతుంది. ఎందుకండీ? ఈ రోజు ప్రపంచంలోని స్త్రీలు అల్లాహ్ ఏదైతే నిర్దేశించాడో ఆ విధానానికి దూరం కావడం వల్ల. నేను ముఖ్తసరిగా మీ ముందు చెప్పబోతున్న మాట ఏమిటంటే, పరదా.
పరదా (హిజాబ్) యొక్క ప్రాముఖ్యత
హిజాబ్ అంటే ఏమిటి? అల్లాహ్ స్త్రీని సృష్టించాడు. ఆ స్త్రీ రక్షణ కోసం అల్లాహ్ ఆ స్త్రీకి హిజాబ్ పెట్టాడు. హిజాబ్ అంటే ఏమిటి? మన సాధారణ పరిభాషక పదములో హిజాబ్ అనగా బురఖా ప్రియులారా. హిజాబ్ అంటే అర్థం ఏమిటి? పవిత్ర ఖురాన్ గ్రంథములో అల్లాహ్ అంటూ ఉన్నారు, 33వ సూరా, సూరే అహ్జాబ్, వాక్యము నెంబర్ 59లో.
يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّأَزْوَاجِكَ وَبَنَاتِكَ وَنِسَاءِ الْمُؤْمِنِينَ يُدْنِينَ عَلَيْهِنَّ مِن جَلَابِيبِهِنَّ ۚ ذَٰلِكَ أَدْنَىٰ أَن يُعْرَفْنَ فَلَا يُؤْذَيْنَ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا ఓ ప్రవక్తా, చెప్పండి, మీ భార్యలకు, మీ కుమార్తెలకు, విశ్వసించిన స్త్రీలకు, వారు తల నుండి పాదము వరకు వస్త్రముతో కప్పుకోవాలని. దీనితో వారు గౌరవనీయులుగా గుర్తింపబడి, బాధలకు గురి కాకుండా ఉంటారు. నిశ్చయముగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు
సోదరులారా. మరి అల్లాహ్ ఇచ్చిన ఈ ధర్మశాస్త్రాన్ని మనం ఎంతవరకు అవలంబిస్తున్నాము? సోదరీమణులారా, చాలామంది ఉన్నారు, పరదా అంటే వారికి తెలియదు. హిజాబ్ అంటే వారికి తెలియదు. ఈ రోజు చాలా మంది సోదరీమణులు పేరుకు మాత్రం పరదా వేసేవారు ఉన్నారు. ఇస్లాం ధర్మములో స్త్రీ యొక్క స్థానం చాలా గొప్పది సోదరులారా, ప్రియమైన సోదరీమణులారా. అలాంటి స్త్రీకి రక్షణ లభించాలి అంటే, ఆమె అల్లాహ్ నిర్దేశించిన పరదా విధానాన్ని కచ్చితంగా అవలంబించి తీరాలి. ఈ పరదాలో స్త్రీకి ఏమున్నది? పరదాలో స్త్రీకి గౌరవం ఉన్నది. పరదాలో స్త్రీకి సమాజములో గౌరవ మర్యాద ఉన్నది. ఎలా?
ఈ రోజు పరదా, అల్లాహ్ తరఫున రక్షక కవచం ప్రియ సోదరులారా. అనేకమంది అంటారు, పరదాలో స్త్రీ నలిగిపోతుంది. ఈ రోజు ప్రపంచం ఏమంటుందంటే, ముస్లింలు స్త్రీలకు అన్యాయానికి గురి చేస్తున్నారు, వారిని నల్లటి బట్టలలో కప్పేస్తున్నారు, ఏమిటి మరి స్వేచ్ఛ? పాశ్చాత్య దేశాల వలె స్త్రీ చిన్న చిన్న బట్టలు వేసుకోవటం స్త్రీ స్వేచ్ఛ?. అడ్వర్టైజ్మెంట్లో స్త్రీ లేకుండా అడ్వర్టైజ్మెంట్లే రావు, అది స్త్రీ స్వేచ్ఛ?. లేదు సోదరులారా, స్త్రీకి ఇస్లాంలో ఎంత గౌరవం అంటే, మాషాఅల్లాహ్ త’ఆలా, ఆమె అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిర్దేశించిన పరదాతో అటు ఆఖిరత్ కోసం జీవితము తయారు చేసుకుంటుంది. ఆమెకు సమాజములో గౌరవం లభిస్తుంది.
వాస్తవానికి పరదా కేవలం వంటి మీద బురఖా వేసుకుంటే అయిపోయిందా? స్త్రీలకు పరదా ఎన్ని రకాలుగా ఉంది షరియతులో? స్త్రీకి పరదా, ఆమె యొక్క శబ్దంపై ఉంది సోదరులారా. స్త్రీకి పరదా ఆమె శబ్దంపై ఉన్నది. ప్రవక్త యొక్క భార్యలకు అల్లాహ్ అంటున్నాడు, “ఓ ప్రవక్త భార్యలారా, మీరు ఎప్పుడైనా పరపురుషులతో మాట్లాడినప్పుడు, మీ యొక్క శబ్దములో సుతిమెత్తని శబ్దంతో మాట్లాడకండి”. స్త్రీ యొక్క శబ్దంపై పరదా ఉన్నది. స్త్రీ యొక్క అలంకరణపై పరదా ఉన్నది. స్త్రీ ఏదైతే అలంకరించుకుంటుందో, ఆమె వేసుకున్న వస్తువులు, ఆభరణాలపై పరదా ఉంటుంది. సుబ్ హా నల్లాహ్, అల్లాహు అక్బర్.
ఈ రోజు ఆ పరదా ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను మాట్లాడితే అంశం ఎటో వెళ్తుంది సోదరులారా, కానీ చెప్పబోయే అంశం, ఈ రోజు బురఖాలు ఏవైతే ఉన్నాయో, అది స్త్రీ యొక్క అలంకరణ దాచి పెట్టాలి, కానీ స్వతహాగా బురఖాలు ఈ రోజు అలంకార ప్రాయమైపోయాయి. ఎలాగైపోయాయి బురఖాలండీ? బురఖా అనేది స్త్రీ దేహాన్ని కప్పాలి. కానీ చాలా శోచనీయమైన మాట ఏమిటంటే, ఈ రోజు బురఖా స్వయంగా ఒక అలంకారం వలె తయారు చేసేశారు. ఖైర్, అల్లాహ్ మనందరికీ మార్గదర్శకత్వాన్ని ప్రసాదించును గాక. నేను చెప్పే మాట అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
పదండి చూద్దాం. పరదా ఎవరి ముందు చేయాలి? పరదా ఎవరి ముందు మనం పాటించాలి? ఎవరి ముందు పాటించక్కరలేదు? పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని తీయండి. పవిత్ర ఖురాన్ గ్రంథము 24వ సూరా, సూరే నూర్, వాక్యము నెంబర్ 31లో 30లో అల్లాహ్ త’ఆలా ఈ విధంగా తెలియజేస్తున్నారు, “ఓ ప్రవక్తా, చెప్పండి. విశ్వసించిన పురుషులకు, వారు తమ చూపులు కిందకి దించి ఉంచాలని. విశ్వసించిన పురుషులకు చెప్పండి, వారి చూపులు కిందకి పెట్టి దించి నడవాలని. వారి మర్మాంగాలను రక్షించుకోవాలని. ఇదే వారి కోసం శ్రేష్టమైనది.” ఆ తర్వాత అల్లాహ్ అంటున్నారు, 31వ వాక్యంలో, “ఓ ప్రవక్తా, చెప్పండి. విశ్వసించిన స్త్రీలతో, వారు తమ మర్మాంగాలను రక్షించుకోవాలని, వారి చూపులను కిందకి ఉంచాలని. వారి అలంకరణ ఎదుట వ్యక్తుల ముందు ప్రదర్శించకూడదని, దానంతట అదే ఏదైతే ప్రదర్శితమవుతుందో అంటే కళ్ళు గాని, చేతులు గాని, మీరు వేసుకున్న బురఖా గాని. బురఖాను దాయలేరు కదా? అది దానంతట అదే బయటకి ప్రదర్శితమవుతుంది. కాబట్టి అది తప్ప, మీరు మీ అలంకరణ ఎదుట వ్యక్తుల ముందు చూపించకూడదు.
మీ అలంకరణ ఎవరి ముందు మీరు చూపించవచ్చు?” మీరు ముఖంపై పరదా లేకుండా సాధారణంగా ఇంట్లో బురఖా వేసుకోకుండా, సాధారణంగా ఆభరణాలు వేసుకున్నా సరే, ఎవరి ముందు మీరు మీ అలంకరణ ఆ విధంగా చూపించవచ్చు, సాధారణ దుస్తులతో అలంకరించుకొని. అల్లాహ్ ఖురాన్ గ్రంథములో అంటున్నాడు, ఎవరి ముందు మీ అలంకరణ చూపించడం ధర్మసమ్మతము?
మీ భర్తల ముందు, రెండో మాట అల్లాహ్ అంటున్నాడు, మీ భర్తల తండ్రుల ముందు అంటే భర్త తండ్రి ముందు ముఖానికి గాని ఆ విధంగా పూర్తి బురఖా వేసుకుని ఉండక్కర్లేదు. వారి మీద మీరు అలంకరణ చూపించవచ్చు. మీ భర్తలకు, మీ భర్తల తండ్రులు అంటే మీ మావయ్యలు. ఆ తర్వాత అల్లాహ్ అంటున్నారు, మీ భర్తలు, రెండవది మీ భర్తల తండ్రులు, మూడవది మీ సొంత తండ్రులు, నాలుగవది మీ కుమారులు, ఐదవది మీ భర్త కుమారులు అంటే భర్త వేరే నికాహ్ చేసుకుంటే ఆమెతో పుట్టిన సంతానము. ఎవరి ముందు మీ యొక్క అలంకరణ చూపించవచ్చండీ? మీ యొక్క తండ్రులు, రెండవది మీ యొక్క భర్తలు, మూడవది మీ తండ్రుల భర్తలు, నాలుగవది మీ కుమారులు, ఐదవది మీ భర్త యొక్క కుమారులు, ఆరవది మీ సోదరులు అంటే అన్న, తమ్ముడు వాళ్ల ముందు అలంకారం చూపించవచ్చు. ఏడవది, మీ సోదరుల తమ్ములు, మీ సోదరుల కుమారులు, ఎవరైతే సోదరుల కుమారులు ఉంటారో మేనల్లుడు అలాంటి వారి ముందు మీరు చూపించవచ్చు. ఆ తర్వాత అల్లాహ్ అంటున్నారు ఖురాన్ గ్రంథములో, మీ తోటి స్త్రీలు, ఆ తర్వాత మీ వద్ద పనిచేస్తున్న బానిస స్త్రీలు, ఆ తర్వాత కామ ఇచ్చలేని మగ బానిసలు, ఆ తర్వాత స్త్రీల గుప్త అవయవాల గురించి తెలియని బాలురు. ఎవరండీ? మీ తండ్రులు, రెండవది మీ భర్తలు, మూడవది మీ భర్త తండ్రులు, నాలుగవది మీ కుమారులు, ఐదవది మీ భర్త కుమారులు, ఆరవది మీ సోదరులు, ఏడవది మీ సోదరుల కుమార్ కుమారులు, ఎనిమిదవది మీ యొక్క మీతో ఉన్న చెలికత్తెలు, ఆ తర్వాత మీ వద్ద ఉన్న బానిసలు, ఎవరైతే కామ ఇచ్చ లేదో అలాంటి బానిసలు, అదే విధంగా స్త్రీల గుప్త అవయవాల కోసం తెలియని వాళ్ళు. వీరి ముందు తప్ప ఇతరుల ముందు మీరు మీ యొక్క అలంకరణ చూపించటం నిషిద్ధము సోదరీమణులారా.
ఈ రోజు సమాజం ఎలా ఉందండీ? మనం పరదాయేట్లేదు, మనకి పరదానే తెలీదు. “గురువుగారు ఇంకా మీరేదో అంటున్నారు, మాకు పరదా అంటేనే తెలియదు.” లేదు సోదరీమణులారా, మీ దేహాన్ని కప్పి ఉంచండి. “మీరు ఎక్కడో చెప్తున్నారు, నాన్నకు చూపించొచ్చు, తండ్రికి చూపించొచ్చు, భర్తకు చూపించొచ్చు, పిల్లల ముఖం చూడొచ్చు.” ఈ రోజైతే పరదా వేసుకోకుండానే రోడ్డు మీదకు వెళ్లిపోతున్నాం. అమ్మా, ఆఖిరత్ పై భయం ఉందా? అల్లాహ్ అంటే భయం ఉందా లేదా? అల్లాహ్ నిర్దేశించిన గీత వాస్తవంగా ఆషామాషీయా? ఈ రోజు మనకు ఖయామత్ పై విశ్వాసం ఉంటే, ప్రియ సోదరిమని, నీ దేహంపై వస్త్రము లేకుండా, నీ దేహంపై పరదా లేకుండా, నీ దేహంపై హిజాబు లేకుండా, నువ్వు రోడ్డు మీదకు అడుగు పెట్టవమ్మా. ఈ రోజు భయం ఎందుకు?
చాలామంది అంటారు, “గురువుగారు, మా పల్లెటూరండీ, మా పల్లెటూరులో చాలామంది పరదా వెయ్యరండీ. నేను వాళ్ళని చూసి ఒక్కదాన్ని పరదా వేసుకుంటే, ఒక్కదాన్ని బురఖా వేసుకుంటే పది మంది మధ్యలో ఎలాగో అనిపిస్తుంది.” ఏంటమ్మా? ఈ ప్రాపంచిక జీవితం కోసమే జీవిస్తున్నావా? లేకపోతే పరలోకం కోసం జీవిస్తున్నావా? పరలోకం కోసం జీవించే విశ్వాసి ఎప్పుడూ ప్రపంచాన్ని పట్టించుకోదు. వాస్తవానికి ఖయామత్ ఎంత? పరలోకం ఉందా లేదా? విశ్వాసం ఉందా లేదా? మరణాంతర జీవితంపై? “లేదండీ, అలాగ ముస్లిములుగా ఉన్నాం. మరణించిన తర్వాత తిరిగి లెగ…” అనుకుంటున్నారా? చనిపోయిన తర్వాత జీవితం లేదా? చనిపోయిన తర్వాత ఎంత జీవితం ఉందండీ? చనిపోయిన తర్వాత ఉన్న జీవితం ముందు, ఈ ప్రాపంచిక జీవితం ఎలాంటిది అంటే, ప్రవక్త వారు సెలవిస్తూ ఉన్నారు. సహీ ముస్లిం గ్రంథములో హదీసు నకలు చేయబడుతుంది. ప్రవక్త వారు అంటున్నారు, “మీలో ఎవరైనా సముద్రములో, సముద్రములో మీ చేతి వేలును ముంచి బయటకు తీసినట్లయితే, మీ చేతి వేలికి అంటుకున్న నీరు ఈ ప్రాపంచిక జీవితం అయితే, సముద్రములో మిగిలి ఉన్న నీరు మరణాంతర జీవితము, పరలోకపు జీవితము.” ఒక్కసారి ఆలోచించండి, సముద్రములో మన చేతి వేలిని ముంచి బయటకు తీసినట్లయితే, మన చేతికి ఎంత నీరు అంటుకుంటుంది సోదరులారా? సముద్రములో ఎంత నీరు మిగిలి ఉంటుంది? మరి సముద్రములో మిగిలి ఉన్న నీరు ఆఖిరత్ జీవితమే. ఆ ఆఖిరత్ కోసం నువ్వు నీ జీవితంలో ఏం త్యాగము చేస్తున్నావ్? ప్రియ సోదరీమణులారా, మీతో విన్నవించుకుంటున్నాను, మీ మరణాంతర జీవితాన్ని నాశనము చేసుకోకండి. అల్లాహ్ విధించిన కట్టుబాట్లకు లోబడి జీవితము గడపండి. మీ యొక్క ఇహలోకపు జీవితము, మీ పరలోకపు జీవితములో మీరు సాఫల్యం పొందుతారు. సుబ్ హా నల్లాహ్.
ఎలాంటి సహాబాలు ఉండేవారు, ఎలాంటి సహాబియాలు ఉండేవారు? మాషాఅల్లాహ్. సహీ బుఖారీ గ్రంథములో ఆ హదీసు నకలు చేయబడుతుంది. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆ హదీసు ఉల్లేఖిస్తున్నారు. ఒక వ్యక్తితో అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు అంటున్నారు, “ఏమిటి? నీకు నేను స్వర్గానికి వెళ్ళే స్త్రీని చూపించనా?” ఒక నల్లటి నీగ్రో స్త్రీని చూపిస్తున్నారు. ఒక నల్లటి నీగ్రో స్త్రీ ప్రవక్త వద్దకు వచ్చి, ప్రవక్తతో విన్నవించుకుంటుంది, “ప్రవక్తా, నాకు మూర్ఛ వ్యాధి ఉంది ప్రవక్తా.. నాకు మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు నేను కిందన పడిపోతాను ప్రవక్తా. నా దేహంపై బట్టలు చిందరవందర అయిపోతాయి. అది పక్కన పెడితే, ప్రవక్తతో అంటుంది, “ప్రవక్తా, నా కోసం అల్లాహ్ తో దుఆ చేయండి, ఈ మూర్ఛ వ్యాధి తగ్గిపోవాలని.” ప్రవక్త వారు అంటున్నారు, “అమ్మా, నువ్వు ఆ మూర్ఛ వ్యాధిపై ఓర్పు వహించు. నువ్వు గనుక మూర్ఛ వ్యాధిపై ఓర్పు వహిస్తే, నీకు అల్లాహ్ స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. అలా కాకుంటే, నేను నీ కోసం దుఆ చేస్తాను. కానీ స్వర్గము యొక్క వాగ్దానం మాత్రము చెయ్యలేను” అన్నారు. ఆ స్త్రీ ఏమంటుందో తెలుసా? “ప్రవక్తా, అయితే నేను ఈ మూర్ఛ వ్యాధిపై ఓర్పునే వహిస్తాను. కానీ తమరు అల్లాహ్ తో ఒక్క దుఆ చేసి పెట్టండి. ఎప్పుడైతే నాకు మూర్ఛ వ్యాధి వస్తుందో, నేను ఎప్పుడైతే కిందన పడిపోతానో, నా దేహంపై ఉన్న బట్టలు చిందరవందర కాకూడదు అని తమరు దుఆ చేయండి.” సుబ్ హా నల్లాహ్. ఏమంటుంది? “నా దేహంపై ఉన్న బట్టలు చిందరవందర కాకూడదు.” ఎక్కడైనా బజారులో వెళ్తుంది, మూర్ఛ వ్యాధి వచ్చేస్తుంది. పరపురుషుల ముందు ఆచ్ఛాదన తొలగిపోతుంది. ఆమె అల్లాహ్ తో ప్రవక్త వారికి దుఆ చేయమంటుంది, “ఈ మూర్ఛ వ్యాధిపై ఓర్పును వహిస్తాను కానీ, నాకు మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు నా దేహంపై బట్టలు చిందరవందర కాకూడదు” అని అల్లాహ్ తో దుఆ చేయండి.
ఎలాంటి విశ్వాసము సోదరులారా, అల్లాహ్ యొక్క ఆజ్ఞకు కట్టుబడి ఉండే ఎలాంటి జీవితం వారు గడిపి ఉన్నారు? ఈ రోజు మనం విచ్చలవిడిగా బజారులలో ఎటువంటి బురఖా లేకుండా, దేహంపై వస్త్రము లేకుండా ఈ రోజు సమాజంలో తిరుగుతున్నామే, మనం స్వర్గాన్ని కాంక్షించగలమా? చనిపోతే స్వర్గానికి వెళ్ళగలమా? అల్లాహ్ నిషిద్ధం చేసినది ధర్మసమ్మతం చేస్తున్నాం. అరే, ఈ రోజైతే ఎక్కడో ఉన్నామండీ మనం. కొన్ని మాటలు చెబితే, “వీళ్ళు పిచ్చివాళ్ళేమో” అంటారు. బురఖా, పరదా అంతవరకు విధించబడింది, మనము మన అత్త కొడుకుల ముందు పరదా పాటించాలి. మన చిన్నాన్న కొడుకుల ముందు పరదా పాటించాలి. పెద్దమ్మ, చిన్నమ్మ కొడుకుల ముందు పరదా పాటించాలి. చెబితే, “ఈయన ఎంటండీ బాబు, ఆ, మా బావ ముందు పరదా చేయమంటున్నారు.” వాస్తవానికి, బావ గైర్ మహ్రమ్. మీరు మీ పెద్దమ్మ కొడుకుతో పరదా చేయాలి. మీ మావయ్య కొడుకుతో పరదా చేయాలి. మీ చిన్నమ్మ కొడుకుతో పరదా చేయాలి. నాన్న వాళ్ళ తమ్ముడు కొడుకుతో పరదా చేయాలి.
చెబితే, ఈ రోజు మనం ఎక్కడున్నామండీ? ఈ రోజు పరదా లేకుండా బయటకే వెళ్ళిపోతున్నాము. లేదు సోదరీమణులారా, మీ ఆఖిరత్ గనక బాగుండాలి అనుకుంటే, మీరు కచ్చితంగా ఇన్షాఅల్లాహ్ త’ఆలా, పరదా వ్యవస్థలోనికి రండమ్మా. పరదా వ్యవస్థ పాటించండి. ఇలాంటి పరదాలు వేయకండి. ఈ రోజు పరదా విధానం చెబుతున్నాను కదా, పరదా స్వతహాగా స్త్రీని కప్పటం, అలంకరణ కప్పటం. ఈ రోజు పరదా స్వతహాగా ఒక అలంకారం అయిపోయినది. లేదు, మీ యొక్క పరదా చాలా వదులుగా ఉండాలి. మీ దేహాన్ని టైట్ గా పట్టి ఉంచితే అది పరదా కాదు, అది స్వతహాగా అలంకరణ అయిపోతుంది. ఏ స్త్రీ అయితే వంటి మీద పరదా వేస్తుంది, కానీ స్వతహాగా పరదా ఆమె దేహాన్ని చూపించే విధంగా ఉంటే, అది పరదా ఎక్కడ అయింది? అది ఇతరులను ఆకర్షించే విధంగా అలంకరణ అయిపోయినది. కాబట్టి, మీ యొక్క పరదా వదులుగా ఉండాలి. మీ యొక్క పరదా బట్ట, అల్హమ్దులిల్లాహ్, మీ దేహములో ఉన్న బట్ట, ఒక సహాబీకి ప్రవక్త వారు ఒక బట్ట రెండు ముక్కలు చించి ఇస్తున్నారు. ఇది నువ్వు పెట్టుకో, ఇది నీ భార్యకు ఇవ్వు, ఆమెపై కప్పుకోవటానికి, దాని లోపల ఇంకో వస్త్రము కప్పి, దానిని కప్పమని చెప్పు అన్నారు ప్రవక్త అంటే, స్త్రీపై అలాంటి పరదా ఉంటుంది. బయట ఏదో కనిపిస్తుందండీ పరదా. కానీ పలుచటి వస్త్రాలు పరదాలోనికి రావు.
ఈ విధంగా అనేక మాటలు ఉన్నాయి. నేను జ్ఞానపరమైన విషయాలలోకి వెళ్ళిపోతే, ఇక్కడ మనం అర్థం మాటలు చేసుకోలేము గానీ, నేను చెబుతున్నాను. మనము అల్లాహ్ కోసం జీవిస్తున్నాం, మనం ఆఖిరత్ కోసం జీవిస్తున్నాం. మన యొక్క ఆరాధన విధానములో, మనము గనక మారకపోతే, “పరదా రేపు వేస్తానండి, అదిగో ఎల్లుండి వేస్తానండి.” మనం మారటానికి ప్రయత్నించాలి. షైతాన్ అడ్డుతూ ఉంటాడు. షైతాన్ పని అది కదా, “అమ్మా, పరదా వేయద్దమ్మా, నువ్వు బురఖా వేస్తే నీకు ఎలాగో ఉంటాది. అమ్మో, బురఖా వేస్తే ప్రజలు ఎక్కిరిస్తారు. అమ్మో, బురఖా వేసుకుంటే ఎలాగో ఉంటుంది.” అల్లాహు అక్బర్. లేదు. ఈ రోజు ముస్లిం స్త్రీ పరదా యొక్క ఘనతను పోల్చుకోలేదు. ప్రపంచాన్ని అడగండి. సుబ్ హా నల్లాహ్. ప్రపంచములో ముస్లిం ఏతరులు పరదా యొక్క ఘనతను పోల్చుకుంటున్నారు. పరదా యొక్క వాస్తవికత పోల్చుకుంటున్నారు.
ఒక సంఘటన మీకు చెబుతాను. పరదా స్త్రీకి ఎలాంటి రక్షణ? అల్లాహ్ ఖురాన్లో చెప్పిన మాట ఒకసారి మళ్ళీ చెబుతున్నాను, “ఓ ప్రవక్తా, చెప్పండి మీ కుమార్తెలకు, మీ భార్యలకు, విశ్వసించిన స్త్రీలకు, వారు తల నుండి పాదము వరకు వస్త్రముతో కప్పుకోవాలని, దీనితో వారు గౌరవనీయులుగా గుర్తింపబడి, బాధలకు గురి కాకుండా ఉంటారు.”
2007వ సంవత్సరం, జనవరి 22వ తారీఖున ఆంధ్రజ్యోతి దినపత్రికలో, నవ్య ఎడిషన్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ ఏమిటి? హైదరాబాద్ మహానగరంలో ఒక అమ్మాయి బస్సులో ప్రయాణం చేస్తుంది. బస్సులో కూర్చున్న అమ్మాయి బురఖా వేసుకొని కూర్చుంది. ఇంతలోనే, వేరొక స్త్రీ ఆ బస్సు ఎక్కింది. వేరొక స్త్రీ బస్సు ఎక్కిన వెంటనే, ఏ అమ్మాయి అయితే బురఖా వేసుకొని కూర్చుందో, ఆ అమ్మాయి తన ముఖం మీద ఉన్న ముసుగును తీసి, “ఆంటీగారు, బాగున్నారా?” అని వేరే స్త్రీని ప్రశ్నించింది. ఆ స్త్రీ అంటుంది, “ఏమిటే, నువ్వెప్పుడే ఇస్లాం స్వీకరించావు? నువ్వెప్పుడు ముస్లిం గా మారిపోయావు? నువ్వెంటే బురఖా ధరించావు?” ఆశ్చర్యంగా ఆ స్త్రీ అడుగుతుంది. ఈ అమ్మాయి సమాధానం చెబుతుంది, “ఆంటీగారు, కంగారు పడిపోకండి. నేను ఇస్లాం స్వీకరించలేదు, నేను ముస్లిం గా కూడా మారిపోలేదు. మీకు తెలుసు కదా, నేను వెళ్ళే ఆఫీస్ కు మరియు నా బస్టాప్ కు మధ్య చాలా దూరం నడుచుకొని వెళ్ళాలి. నేను బస్టాప్ లో దిగేదానిని, మా ఆఫీస్ కు నడుచుకుంటూ వెళ్ళేదానిని. ప్రతి రోజూ ఎందరో అబ్బాయిలు నన్ను ఏడిపించేవారు. నాపై ఆకతాయి వేషాలు వేసేవారు. నేను భరించాను. పోలీసు కంప్లైంట్ చేశాను. ఏమీ లాభం లేకపోయింది. నేను చూశాను చూశాను, కొంతమంది అమ్మాయిలు నా పక్కనుండి బురఖా వేసుకొని వెళ్ళేవారు. ఏ అమ్మాయిలు అయితే బురఖా ధరించి వెళ్తున్నారో, ఆ అమ్మాయిని ఒక్కడు కూడా ఏమాత్రము ఏడిపించేవాడు కాదు. ఏ ఆకతాయి కూడా వారిపై వేషాలు వేసేవాడు కాదు. ఆ బురఖా వేసుకున్న అమ్మాయిలు ప్రశాంతంగా వెళ్ళేవారు. చూశాను, చూశాను, చూశాను, నేను విసిగిపోయాను ఆంటీ. నేను కూడా బురఖా వేసుకొని ఆఫీస్ కు వెళ్ళటం ప్రారంభించాను. ఏ రోజు నుండైతే బురఖా వేసుకొని ఆఫీస్ కు వెళ్తున్నానో, ప్రశాంతంగా ఆఫీస్ కు వెళ్తున్నాను, ప్రశాంతంగా ఇంటికి వస్తున్నాను.”
ఒక ముస్లిం ఏతర స్త్రీ బురఖా యొక్క ఘనతను తెలుసుకుంటుంది. ఈ రోజు ముస్లిం కుటుంబంలో పుట్టిన మనం, బురఖా విధానాన్ని సైతం వ్యతిరేకిస్తున్నాం. లేదమ్మా, బురఖా వివక్ష ఎంత మాత్రము కాదు. బురఖా అల్లాహ్ తరఫున మీకు రక్షణ కవచము తల్లి. కాబట్టి ఎవరైతే మాట విని, దాని ప్రకారం ఆచరిస్తారో ఇన్షాఅల్లాహ్ త’ఆలా, మీరు కచ్చితంగా ఒక్కసారి అల్లాహ్ పై నమ్మకం ఉంచి ప్రారంభించండి. ఈ రోజు ఏదో మన స్త్రీలు చిన్న చిన్న వాణీలు వేసేసుకుంటున్నారు. అది కూడా, అల్లాహు అక్బర్, ఇలాంటి విధానం. మేము తిరుగుతున్న అనుభవంతో చెబుతున్నాము, గురువుగారిని చూస్తేనే తల మీద కూడా అది వస్త్రం పడుతుంది, లేకపోతే అది ఉండదు. అరే, గురువుగారికి భయపడుతున్నారా? చాలామంది చూస్తుంటాం, కూర్చొని రోడ్డు మీద అంట్లు తోముతూ ఉంటారు అక్కడ ఇక్కడ ఉంటారు. గురువుగారు అదిగో వస్తున్నారంటే వెంటనే తలపై పైట వచ్చి పడిపోద్ది. అరే, గురువుగారికి భయపడుతున్నారా, అల్లాహ్ కి భయపడుతున్నారా? ఈ రోజు చూస్తున్నాం చాలా చోట్ల. అరే గురువుగారు వస్తున్నారు, జమాతులో నుండి వస్తున్నారు, పెద్దలు వస్తున్నారంటే వెంటనే తల మీద లేకపోతే అరే, పరపురుషుడు నిన్ను చూడకూడదు అంటే, గురువుగారు చూడకూడదా? గురువుగారు వచ్చినప్పుడు వేసుకొని, ఇది కాదమ్మా, అల్లాహ్ కు భయపడండి. మీరు ఏకాంతములో ఉన్నా, నలుగురిలో ఉన్నా, అల్లాహ్ కు భయపడండి, అల్లాహ్ అప్పుడు ప్రేమిస్తాడు. “అరే, గురువుగారు చూస్తున్నారు, బాయి గారు చూస్తున్నారు, ఫలానా వ్యక్తి చూస్తున్నాడు” పరదా వేద్దాం. లేదమ్మా, లేదు అల్లాహు అక్బర్. చాలామంది ఇలాంటి స్త్రీలు కూడా ఉన్నారు, మసీదుకు వస్తే ఏదో ఆ చిన్న ఓణీ వేసుకొని వస్తున్నారు. అదే పెళ్లిళ్లకు, బజార్లకు, మార్కెట్ లో వెళ్తే అది కూడా లేకుండా వెళ్తున్నారు. ఏమమ్మా, మసీదుకు వచ్చేటప్పుడు అల్లాహ్ బురఖా వేసుకోండి, మార్కెట్ లోకి వెళ్తే బురఖా ఏం లేకుండా వెళ్ళిపోండి అని చెప్పాడా? దీనిని బట్టి మనకేం తెలుస్తుంది? మనం అల్లాహ్ కు భయపడట్లేదు. నేను అల్లాహ్ కు భయపడే దానిని అయితే, నేను ఎక్కడున్నా సరే, అల్లాహ్ నాపై విధించిన పరదాను పాటించి తీరుతాను. భయముందా? ఒక్కసారి ఆలోచించండి, భయముందా? సోదరీమణులారా, నేను నొక్కి చెబుతున్నాను మీ కోసం. మీరు భయపడండమ్మా, దేనికోసం? మీ ఆఖిరత్ కోసం, మీ పరలోకపు జీవితం కోసం, మీ స్వర్గము కోసం తల్లి. కాబట్టి ఎవరైతే బురఖా వేయటము లేదో, నేను కచ్చితంగా చెబుతున్నాను సోదరీమణులారా, మీ పూర్తి దేహాన్ని కప్పే విధంగా మీరు బురఖా వేయండి. మీ యొక్క ముఖాలు కప్పుకునే విధంగా మీరు బురఖాలు వేయండి. అల్లాహ్ కు భయపడండి. నలుగురిలో ఉన్నా, ఏకాంతంలో ఉన్నా ప్రియులారా.
ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరీమణులారా, కాబట్టి ఆలోచించండి, ఎలాంటి భయభక్తి కలిగి ఉండాలి? భయభక్తి ఉందా? నేను చెబుతున్నాను వాస్తవంగా. అతడు చూస్తున్నాడు, ఇతడు చూస్తున్నాడు లేదు. అల్లాహ్ చూడాలి, అల్లాహ్ చూస్తున్నాడు, అల్లాహ్ కు భయపడతాను, ఇలాంటి భయభక్తి. ఎలాంటి భయభక్తి అండీ?
ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు కాలంలో ఆ స్త్రీని చూడండి సుబ్ హా నల్లాహ్. ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఖలీఫాగా ఉన్నారు. ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఖలీఫాగా ఉన్నారు. ఇస్లాం ప్రపంచానికి ఆయన ఖలీఫా. అతని రాజధాని మదీనా పట్టణము. రాత్రి పూట ముఖానికి బట్ట కట్టుకొని, మారువేషములో ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు మదీనా వీధుల్లో తిరిగేవారు. మదీనాలో నా ప్రజలు ఎలా ఉన్నారో చూసేవారు, వారి మంచి చెడులు తెలుసుకునేవారు. ఒక రోజు ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు రాత్రి పూట వెళ్తున్నారు, ఒక ఇంటి నుండి శబ్దం వినిపిస్తుంది. తల్లి కూతురు ఇంట్లో సంభాషించుకుంటున్నారు. తల్లి కూతురు పాల వ్యాపారం చేసుకునేవారు. తల్లి కూతురితో అంటుంది, “ఓ నా కూతురా, ఈ రోజు మన ఒంటెలు చాలా తక్కువగా పాలు ఇచ్చాయి. ఈ పాలు ప్రజలకు అమ్మటానికి సరిపోవు. కాబట్టి పాలలో నీళ్ళు కలిపి ప్రజలకు అమ్మేయి.” కూతురు అంటుంది, “అమ్మా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమి చెప్పారమ్మా? మోసము చేసేవారు మాలోని వారు కాదు అని చెప్పారు కదా. అయినా మన ఖలీఫా ఉమర్ న్యాయానికి మారుపేరు అమ్మ. నేను పాలలో నీళ్ళు కలుపుతున్నాను అన్న విషయం ఉమర్ కి తెలిస్తే ఏదైనా ఉందా?” అమ్మో, ఆ తల్లి అంటుంది, “ఏంటే, పెద్ద మాట్లాడుతున్నావ్? ఈ రాత్రి, ఈ సమయంలో, ఈ రాత్రి చీకటిలో ఉమర్ నిన్ను చూస్తున్నాడా? ఉమర్ నిన్ను వింటున్నాడా? ఉమర్ ఇక్కడ ఉన్నాడా? ఉమర్ లేడు కదా. నువ్వు పాలలో నీళ్లు కలిపేయి.” ఆ అమ్మాయి అంటుంది, “అమ్మా, నువ్వు నిజమే చెబుతున్నావు. ఈ రాత్రి సమయంలో ఉమర్ ఇక్కడ లేడమ్మా. ఈ రాత్రి సమయంలో ఉమర్ మనల్ని చూడటము లేదమ్మా. ఈ రాత్రి సమయంలో ఉమర్ మనల్ని వినటము కూడా లేదమ్మా. కానీ ఉమర్ ని సృష్టించిన ఆ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఈ సమయంలో నిన్నూ, నన్నూ చూస్తున్నాడు కదమ్మా.” ఆ స్త్రీ తన తల్లితో అంటుంది.
ఇలాంటి భయభక్తి మన జీవితాలలోనికి ఎప్పుడు వస్తుంది? అల్లాహ్ చూస్తున్నాడు, అల్లాహ్ కోసం మనం ఆరాధన చేద్దాం. అల్లాహ్ ను ఇష్టపెట్టే ఉద్దేశ్యముతో, ఖయామత్ దినాన సుబ్ హా నల్లాహ్ సోదరీమణులారా, అల్లాహు అక్బర్. బురఖా లేకపోతే, ఈ రోజు ప్రపంచంలో ఫితనా చెలరేగుతుంది. మీరు పరదా వేసుకోకపోతే, ప్రపంచంలో అనేక రకాలైన చెడు విషయాలు మీ వెంట పడతాయి. కాబట్టి పరదా వేయండి. ఎన్ని అవమానాలు భరించినా కూడా, ప్రపంచం చూడండి. మీకు తెలుసా? ప్రపంచ దేశాలలో, ఫ్రాన్స్ అనే దేశం ఉంది. ఫ్రాన్స్ అనే దేశంలో, ముస్లిం స్త్రీలు బురఖా వెయ్యకూడదు, బురఖాను బ్యాన్ చేశారు. అక్కడ సోదరీమణులు డాన్స్ చేస్తున్నారా? “అమ్మో, పరదాను తీశారు చాలు మాకు.” లేదు సోదరీమణులారా, ఫ్రాన్స్ దేశంలో ఉన్న సోదరీమణులు పరదా వేస్తే, వారికి ఫ్రాన్స్ దేశం ఏం చేస్తుంది? ఫైన్లు విధిస్తుంది. సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్. ఫ్రాన్స్ దేశంలో ఇలాంటి విశ్వాస సోదరీమణులు ఉన్నారు. ఇంట్లో బురఖా వేసుకుంటున్నారు, చేతిలో డబ్బులు పట్టుకొని రోడ్డు మీదకి వస్తున్నారు. నేను బురఖా అయితే వేస్తాను గానీ, బురఖాను తీయను. కానీ ఎంత ఫైన్ రాసుకుంటారో రాసుకోండి. ఇంట్లో నుండి పరదా వేసుకొని బయలుదేరుతున్నారు, చేతిలో ఫైన్ పట్టుకొని బయటకు వస్తున్నారు. ఫైన్ అడిగిన వెంటనే, ఫైన్ చెల్లించడానికి సిద్ధము తప్ప, అల్లాహ్ విధించిన పరదా తీయటానికి ఎంతమాత్రము వారి విశ్వాసము వారిని ఆ విధంగా చేయనివ్వటము లేదు. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. ఈ రోజు ప్రపంచం సుబ్ హా నల్లాహ్, ఇస్లాం కోసం తెలుసుకుంటుంది. నేను ఒక్క సంఘటన చెప్పి ఇన్షాఅల్లాహ్ త’ఆలా, నా మాట ముగిస్తాను.
మనము ఈ రోజు ఇస్లాం కోసం, అల్లాహ్ ధర్మ మార్గములో ఎలాంటి త్యాగాలు చేస్తున్నాం? సుబ్ హా నల్లాహ్. ఒక సోదరిమని ప్రియులారా, అమెరికా దేశములో జీవించేది. ఆమె పేరు అసిల్మి ప్రియులారా. ఒక క్రైస్తవ స్త్రీ. అమెరికా దేశంలో ఒక క్రైస్తవ స్త్రీ ఉండేది. ఆమె ఉద్దేశం, అమెరికాలో ఉన్న ముస్లింలందరినీ క్రైస్తవులుగా మార్చేయాలి. ఆమె టార్గెట్ ప్రియులారా. చాలా పెద్ద కథ ఉన్నది. నేను తక్కువ చేసి చెబుతున్నాను మీ ముందు. ఆమె ఒక క్లాస్ కు అటెండ్ కావలసి ఉన్నది. కంప్యూటర్ మిస్టేక్ వలన, ఆ క్లాసు పేరు కాస్త తప్పుగా ప్రింట్ అయ్యి, ఆమె థియేటర్ క్లాసు లోనికి వెళ్ళిపోయింది. అంటే అక్కడ ప్రజలందరి ముందు నిలబడి చెప్పవలసి ఉంటుంది. అసిల్మి క్రైస్తవ సోదరి చెప్పటానికి వెళ్ళింది. క్లాసులో అంతా ముస్లింలే ఉన్నారు. అసహ్యించుకుంది. ఇంటికి వచ్చేసింది. భర్తతో అంటుంది, “ఏమండీ, ఆ క్లాసులో అంతా ముస్లింలే ఉన్నారు.” భర్త అంటున్నాడు, “లేదు లేదు, వెళ్ళు నువ్వు. వెళ్లి వారికి క్రైస్తవం యొక్క సందేశాన్ని అందజెయ్యు. నీకు ట్యూషన్ ఫీజు కూడా కట్టక్కర్లేదు కదా. నువ్వు ఫ్రీగా చదువుకుంటావు కాబట్టి వెళ్ళమన్నాడు.” ఆమె వెళ్ళేది, ముస్లింలతో చెప్పేది, ముస్లింలతో చెప్పేది, “ఈసాను దైవముగా మీరు స్వీకరించండి.” ముస్లింలు అనేవారు, “అవునమ్మా, ఈసా అల్లాహ్ యొక్క ప్రవక్త” అన్న మాటతో వారు మాట్లాడేవారు. రోజులు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. ఆమెకు ఎవరో ఖురాన్ బహుకరించారు. ఆమె ఖురాన్ చదువుతుంది, మాషాఅల్లాహ్. ఇంతకుముందు భర్తతో కలిసి అమెరికా దేశంలో, ఆమె నైట్ పార్టీలకు, ఫలానా పార్టీలకు వెళ్ళేది. ఖురాన్ ఎప్పుడైతే చదవటం ప్రారంభించిందో, ఆమె పార్టీలకు వెళ్ళటం మానేసింది. భర్తతో ఇంతకుముందు ఎలా తిరిగేదో, తిరగటం మానేసింది. భర్తకు సందేహం వచ్చింది. “నా భార్య జీవితంలో ఎవరో మూడో వ్యక్తి ప్రవేశించాడు. కాబట్టి ఈమె ఇంతకుముందులా నాతో ప్రవర్తించటము లేదు.” రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు ఒక వ్యక్తి ఆమె ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఆమె తలుపు తెరిచింది. ఆమె అంటుంది, “ఒక మేము రాత్రి పూట పడుకునే తెల్లటి గౌను లాంటి, తెల్లటి గౌను వేసుకొని, తలపై ఎరుపు మరియు తెలుపు రంగుల గళ్ళ ఒక క్లాత్ ను వేసుకొని, టేబుల్ క్లాత్ లాంటిది తలపై వేసుకొని ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. నేను అసహ్యించుకున్నాను. ఆ వ్యక్తి అన్నాడు, ‘మీరు ఇస్లాం స్వీకరించాలనుకుంటున్నారు.’ ” ఆమె చెప్పింది, “నేనైతే ఒక క్రైస్తవ మతంలో ఉన్నదానిని, నేను అమెరికన్ క్రైస్తవురాలిని, నేను ఎలా ఇస్లాం స్వీకరిస్తాను? అయినా కొన్ని కొన్ని ప్రశ్నలు ప్రశ్నిస్తాను.” ఆమె కొన్ని ప్రశ్నలు ప్రశ్నించేది. అల్హమ్దులిల్లాహ్, ఎవరైతే వ్యక్తి వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడో, అతని పేరు అబ్దుల్ అజీజ్. చాలా చక్కగా సమాధానం చెప్పేవాడు మాషాఅల్లాహ్ త’ఆలా. ఆమెతో మాట్లాడుతూ, మాట్లాడుతూ ప్రశ్నించాడు. ఏమిటి? “మీరు నమ్ముతున్నారా అల్లాహ్ ను దైవంగా?” ఆమె చెప్పింది, “అవును, అల్లాహ్ ను దైవంగా నమ్ముతున్నాను.” “ఏమీ, ప్రవక్త ముహమ్మద్ ని ప్రవక్తగా నమ్ముతున్నారా?” “అవును, నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రవక్తగా నమ్ముతున్నాను.” “అయితే సుబ్ హా నల్లాహ్, మీరు ముస్లిం అయిపోయారు.” ఆమె చేత కలిమా పఠింపజేశాడు. కానీ షరతు పెట్టింది ఆమె. “నేనైతే కలిమా పఠిస్తున్నాను గానీ, నేను బురఖా వేసుకోను. నేను హిజాబ్ ధరించను.” ఆమె మానాన ఆమెను విడిచి పెట్టేశారు. భర్త తెలుసుకున్నాడు, భర్త భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఎప్పుడైతే ఇస్లాం స్వీకరించిందో, ఆమీనా పేరు మార్చుకుంది, ఆమీనా అస్సిల్మి అయిపోయింది, భర్త విడాకులు ఇచ్చేశాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు భర్తతో పాటు వెళ్లిపోతున్నారు. కోర్టుకు ఎక్కింది, కోర్టుకు అంటుంది, “నేను ఇద్దరు పిల్లలకు తల్లిని, పిల్లలు నాకు కావాలి.” కోర్టు అంటుంది, “అమ్మా, ఈ అమెరికా చట్టం ప్రకారం, ఒకవేళ ఎవరైనా కొత్త మతాన్ని స్వీకరిస్తే, వారితో పాటు పిల్లలు వెళ్ళలేరు. నీకు పిల్లలు కావాలా, ఇస్లాం ధర్మాన్ని విడిచిపెట్టుకో. ఇస్లాం ధర్మం కావాలా, నీ ఇద్దరు పిల్లలు నీతో పాటు ఉండరు.” ఏ తల్లికైనా చాలా కఠినమైన ఎంపిక, అల్లాహు అక్బర్. పిల్లలు కావాలా, ఇస్లాం కావాలా? ఆ తల్లి మాత్రం ఇస్లాంని ఎంచుకుంది అల్హమ్దులిల్లాహ్. ఇద్దరు పిల్లలను సైతం విడిచిపెట్టింది, సుబ్ హా నల్లాహ్. ఏ స్త్రీ అయితే పరదా ధరించను అని చెప్పిందో, ఏ స్త్రీ అయితే బురఖా వేయను అని చెప్పిందో, సంవత్సరం తిరిగేలోపు ఆమె బురఖా ధరించింది, ఆమె హిజాబ్ ధరించింది, ఆమె పరదా ధరించింది. ఆమె జర్నలిస్ట్ గా కూడా పని చేసేది. ఏ రోజు అయితే బురఖా వేసుకొని వెళ్ళిందో, ఆ జర్నలిజం ఎవరైతే కంపెనీ వారు ఉన్నారో, ఆమె చేతిలోనికి డిస్మిస్ లెటర్ పెట్టేశారు. అల్లాహ్ పై నమ్మకం ఉంచుకుంది. అల్లాహ్ పై విశ్వాసం ఉంచింది, ఓర్పు వహించింది. ఒక రోజు బురఖా వేసుకొని బ్యాంకు వెళ్ళింది, చెక్కు మార్చటానికి. ఈమె బురఖా వేసుకొని బ్యాంకు వెళ్ళిన వెంటనే, బ్యాంకులో ఉన్న సెక్యూరిటీ గార్డు ఈమెను కాల్చటానికి గన్ తీసి పట్టుకున్నాడు, బురఖా వేసుకున్నందుకు గాను. అయినా ఓర్పు వహించింది. అల్లాహ్ పై నమ్మకం పెట్టుకుంది, ఆఖిరత్ పై విశ్వాసం పెట్టుకుంది. సుబ్ హా నల్లాహ్. ఆమె యొక్క విశ్వాసం, మాషాఅల్లాహ్. ఆ బురఖాలో జీవితం ప్రారంభించింది. తల్లి వద్దకు వెళ్ళింది, తల్లి చీత్కరించుకుంది. తండ్రి వద్దకు వెళ్ళింది, తండ్రి అన్నాడు, “నువ్వు ప్రపంచంలో ఉండే నరకంలోనికి వెళ్ళిపోయావే.” తండ్రి చీత్కరించుకున్నాడు. చెల్లి దగ్గరకు వెళ్ళింది, చెల్లి అంటుంది, “అక్కా, నువ్వు పిచ్చిదానివైపోయావే.” అయినా సుబ్ హా నల్లాహ్, ఇస్లాం పద్ధతిలో బురఖా వేసుకుంటూ, మనలో సిగ్గుపడతారు చాలామంది. ఆమె చూడండి, బురఖా వేసుకొని జీవితం గడుపుతుంది. సుబ్ హా నల్లాహ్. తల్లికి, తండ్రికి, చెల్లికి పోస్ట్ కార్డులపై ఖురాన్ గ్రంథం రాసి పంపేది. ఈ సందర్భంగా ఒక మాట కూడా చెబుతున్నారు. ఆమె తన జీవిత హిస్టరీ రాస్తుంది, “ఇస్లాం నా ధర్మం, ఇస్లాం నా బలం, ఇస్లాం నా శ్వాస, ఇస్లాం నా గుండె చప్పుడు, ఇస్లాం నా రక్త నాళాలలో ప్రవహిస్తున్న రక్తం, ఇస్లాం నా అందమైన జీవితం. ఇస్లాం లేనిదే నా జీవితము లేదు. నా వైపు నుండి అల్లాహ్ ముఖాన్ని తిప్పుకుంటే, నా జీవితమే వ్యర్థం అనుకుంటాను.” సుబ్ హా నల్లాహ్. ఆ సమయంలో ఒక మాట అంటుంది, “ప్రపంచం మొత్తం నన్ను చీత్కరించుకుంది. కానీ నాకు విశ్వాసం, నాకు ఓర్పు, ధైర్యము, స్థైర్యము, పవిత్ర ఖురాన్ గ్రంథం ఇచ్చింది. నేను ప్రపంచమే వేస్ట్ అనుకున్నాను నా కోసం. కానీ ఖురాన్ నాలో ఆత్మవిశ్వాసం నింపింది.” మాషాఅల్లాహ్. ఆ బురఖా ధరిస్తూ జీవితం గడిపేది. రోజులు గడుస్తున్నాయి. అల్లాహ్ పై నమ్మకం పెట్టుకుంది, మాషాఅల్లాహ్ త’ఆలా. అందరికంటే ముందు ఆమె యొక్క జీవిత విశ్వాసాన్ని చూసి, ఇస్లాం నిజమైన ధర్మం అని తెలుసుకొని, వాళ్ళ బామ్మ ఆమె చేతిలో కలిమా పఠించి చనిపోయింది. సుబ్ హా నల్లాహ్. తల్లికి తెలియకుండా, తండ్రి కూతురు వద్ద ఇస్లాం స్వీకరిస్తున్నాడు. తండ్రికి తెలియకుండా, తల్లి కూతురు దగ్గర ఇస్లాం స్వీకరించింది. చెల్లి అంటుంది, “అక్క, నువ్వే ప్రపంచములో ఉన్నతమైన మహిళవు నేను అనుకుంటున్నాను అక్క.” 16 ఏళ్లు గడుస్తున్నాయి, భర్త కబురు పంపుతున్నాడు, “ఓ ఆమీనా, నేను కూడా నీతో పాటు ఇస్లాం ధర్మంలోనికి వచ్చేస్తాను.” ఇద్దరు పిల్లలు అంటున్నారు, “అమ్మా, మేము కూడా నీతో పాటు ముస్లింలుగా జీవితాన్ని గడుపుతాం.”
సుబ్ హా నల్లాహ్. ప్రియులారా, మనం అల్లాహ్ పై నమ్మకం ఉంచుకుంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన విశ్వాస ఫలితంగా ఇహపరలోకాల్లో సాఫల్యాన్ని ఇస్తాడు ప్రియులారా. కాబట్టి నా ప్రియ సోదరీమణులారా, నేను ఎక్కువ అంశం మీ ముందు ఏమి ఉంచలేదు కానీ, ముఖ్తసరిగా చెబుతున్నాను. మీ కోసం అల్లాహ్ తరఫున వచ్చిన రక్షక కవచం బురఖా. కాబట్టి పరదా ధరించండి. మీరు సిగ్గుపడకండి. చూడండి, ఆమీనా సిల్మి, మాషాఅల్లాహ్, గన్ తీసి కాల్చబోయాడు, అల్లాహ్ కోసం సబర్ వహించింది. ఉద్యోగం నుండి డిస్మిస్ చేసేసారు, అల్లాహ్ కోసం సబర్ వహించింది. ఎలాంటి జీవితాలు? మాషాఅల్లాహ్.
ఆ సహాబీ, మాషాఅల్లాహ్, తన యొక్క మూర్ఛ వ్యాధి వస్తే కిందన పడిపోవచ్చు అనుకుంది తప్ప, బట్టలు చిందరవందర కాకూడదు అని అల్లాహ్ తో దుఆ చేయండి ప్రవక్తా అని చెబుతుంది. ఎలాంటి విశ్వాసము? సుబ్ హా నల్లాహ్. ఆ సహాబియాత్ ల విశ్వాసము చూడండి. అల్లాహు అక్బర్. కాబట్టి పరదా ధరించండమ్మా. ఇది మీ కోసం, చెప్పడం మా బాధ్యత. ఈ రోజు ప్రపంచంలో వింటారా? “గురువుగారు చెప్పుకుంటున్నారు రా, బురఖా వేయమంటున్నారు. మాకు అలవాటు లేదు. ఏమండీ, మాకు అలవాటు లేదు, వేయము. మీరు చెప్పుకుంది చెప్పుకోండి సార్. మేము వేయము.” ఎవరైతే ఇలాంటి స్త్రీలు ఉన్నారో, చెప్పిన తర్వాత కూడా, అల్లాహ్ ఆజ్ఞ మీ ముందు పెట్టిన తర్వాత కూడా, ఎవరైతే పరదా వేయకుండా.
పురుషుల్లారా, మీరు కూడా బాధ్యులు. “కుల్లుకుమ్ రాయిన్, వ కుల్లుకుమ్ మస్ఊలున్ అన్ రయియతిహి.” మీలో ప్రతి ఒక్కరూ బాధ్యులు. మీలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యత గురించి ప్రశ్నింపబడతారు. పురుషుడు తన ఇంట్లో భార్య కోసం, పిల్లల కోసం ప్రశ్నింపబడతాడు. మీ స్త్రీ గనుక పరదా లేని విధంగా జీవితం గడిపితే, మీపై విధి అవుతుంది, మీ స్త్రీతో పరదా ధరింపజేయండి. ఆమెకు నచ్చజెప్పండి. మీరిద్దరూ స్వర్గానికి వెళ్ళాలి అంటే, మీరిద్దరిలో ఆచరణ ఉండాలి. “నేను పురుషుడినండి, నమాజ్ చేసేస్తాను ఐదు పూటలా. కానీ నా భార్య పరదా లేకుండా తిరుగుతుంది. నేను ఏమీ చెప్పను” అంటే, నువ్వు ఖయామత్ రోజు పట్టుబడిపోతావు, జాగ్రత్త. కాబట్టి మీరు బాధ్యులు. ప్రేమతో చెప్పండి, ఇన్షాఅల్లాహ్ త’ఆలా, వారికి వివరించండి. ఇస్లాం ధర్మశాస్త్రాన్ని బోధించండి. అయినా ఎవరైతే వినట్లేదో, చెప్పేవాడు చెబుతూనే ఉన్నాడు రా, వినరు, జీవితాల్లో మార్పు తెచ్చుకోరు, ఇలాంటి వారు ఏమిటి? ప్రళయ దినాన బాధపడతారు అల్లాహ్ దగ్గరికి వెళ్లి. అల్లాహ్ వద్దకు వెళ్లి అంటారు, అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు.
وَلَوْ تَرَىٰ إِذِ الْمُجْرِمُونَ نَاكِسُو رُءُوسِهِمْ عِندَ رَبِّهِمْ رَبَّنَا أَبْصَرْنَا وَسَمِعْنَا فَارْجِعْنَا نَعْمَلْ صَالِحًا إِنَّا مُوقِنُونَ ఓ ప్రభూ! మేము చూస్తున్నాం మరియు వింటున్నాం. మమ్మల్ని తిరిగి పంపించు, మేము మంచి పనులు చేసి వస్తాం, ఇప్పుడు మాకు నమ్మకం కుదిరింది.
وَلَوْ شِئْنَا لَآتَيْنَا كُلَّ نَفْسٍ هُدَاهَا وَلَٰكِنْ حَقَّ الْقَوْلُ مِنِّي لَأَمْلَأَنَّ نَرَكَ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ أَجْمَعِينَ మేము తలచుకుంటే ప్రతి ఆత్మకు మార్గదర్శకత్వం ఇచ్చేవాళ్ళం. కానీ నా మాట నిజమైంది: నేను నరకాన్ని జిన్నాతులతో మరియు మానవులతో నింపుతాను.
فَذُوقُوا بِمَا نَسِيتُمْ لِقَاءَ يَوْمِكُمْ هَٰذَا إِنَّا نَسِينَاكُمْ ۖ وَذُوقُوا عَذَابَ الْخُلْدِ بِمَا كُنتُمْ تَعْمَلُونَ కాబట్టి రుచి చూడండి, ఈ దినాన్ని మీరు మరచిపోయినందుకు మేము మిమ్మల్ని మరచిపోయాము. మీరు చేసే కర్మల ఫలితంగా శాశ్వత శిక్షను అనుభవించండి.
అల్లాహ్ తో అంటారు. ప్రపంచంలో పరదా ధరించలేదు. అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞ పాటించలేదు. ప్రళయ దినాన అల్లాహ్ తో అంటారు, “అల్లాహ్, మేము చూస్తున్నాం. అల్లాహ్, ఈ శిక్షలు చూస్తున్నాం, ఈ శిక్షలు వింటున్నాం. అల్లాహ్, ప్రపంచంలోనికి తిరిగి పంపించేయి. మంచి పనులు చేసి అల్లాహ్ నీ వద్దకు వచ్చేస్తాం.” జీవితం ఇచ్చినప్పుడు చేయలేదు, జీవితం ఉన్నప్పుడు ఆచరించలేదు. ప్రళయ దినాన అల్లాహ్ తో అంటారు, “అల్లాహ్, ప్రపంచంలో తిరిగి పంపించేయి, మంచి పనులు చేసుకొని వచ్చేస్తాం. పరదా ధరించేస్తాం, మంచిగా ఆచరించేస్తాం.” అల్లాహ్ ఏమంటాడు? “నా ప్రవక్త నీ వద్దకు వచ్చి, నా మాట నీ ముందు పెట్టినప్పుడు, నువ్వు చెవిటిదానిగా, చెవిటి దానిగా నా మాటను మరచిపోయావు. ఆ రోజు నువ్వు నన్ను ఎలా మరచిపోయావో, ఈ రోజు నేను నిన్ను అలా మరచిపోతున్నాను. నా మాట నీ ముందు చెప్పిన తర్వాత కూడా, నువ్వు ఎలా అయితే నన్ను మరచిపోయావో, ఈ రోజు నేను నిన్ను మరచిపోతున్నాను. నరకంలోనికి వెళ్ళు” అంటాడు.
నరకం ఎలా ఉంటుందండీ? చివరిగా నరకం, స్వర్గం గురించి చెప్పి నా మాట ముగిస్తున్నాను. నరకం ఎలా ఉంటుందండీ? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటున్నారు. సహీ ముస్లిం గ్రంథములో హదీసు నకలు చేయబడుతుంది. హజరతే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ప్రవక్త వారిని అడుగుతున్నారు, “ప్రవక్తా, మీ చిన్నన్న అబూ తాలిబ్ మీకు చాలా సహాయము చేశారు కదా ధర్మ విషయంలో, కానీ ఇస్లాం స్వీకరించలేదు.”ప్రవక్తా, ఆయన కోసం మీరు అల్లాహ్ తో ఏం సిఫారసు చేస్తారు?” “నా చిన్నాన్న అబూ తాలిబ్ కోసం నేను అల్లాహ్ తో ఈ విధంగా అడుగుతాను, నరకపు శిక్షలన్నింటిలోనూ, నరకపు శిక్షలన్నింటిలోనూ అతి స్వల్పమైన శిక్ష నా చిన్నాన్నకు విధించు అల్లాహ్ అని అడుగుతాను.” ప్రవక్తా, నరకపు శిక్షలన్నింటిలో ఆ చిన్న శిక్ష ఏమై ఉంటుంది? ప్రవక్త వారు అంటున్నారు, “అతడి పాదాలకు అగ్నితో తయారు చేసిన చెప్పులు తొడిగించటం జరుగుతుంది. దాని వలన అతని మెదడు కుతకుతలాడుతూ ఉడుకుతుంటుంది.” నరకములో అతి స్వల్పమైన శిక్ష. కాబట్టి ఆఖిరత్ కోసం ఏం తయారు చేసుకుంటున్నాం?
మరణము చెప్పి రాదు. మరణము చెప్పి రాదు సోదరులారా. చెప్పి వస్తుందా? ఒక గంట తర్వాత ప్రపంచంలో నేను ఉంటానో లేక ప్రపంచంలో నా పేరు చనిపోయిన వ్యక్తిగా వినిపిస్తుందో నాకు తెలియదు ప్రియులారా. తెలుసా ఎవరికైనా? ఒక గంట తర్వాత ఉంటానా ప్రపంచంలో? సుబ్ హా నల్లాహ్. అరే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, వచ్చే సంవత్సరం చేద్దాం. అల్లాహు అక్బర్. మన ప్రాణం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. మనం ఇంత నిర్భయంగా అల్లాహ్ తో ఉన్నామే. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు ఏం సమాధానం చెబుతాం ప్రియులారా? కాబట్టి వినండి, ఎప్పుడైతే విన్నారో, “సమి’నా వ అత’అనా”. మేము విన్నాము, ఆచరించాము అన్న జీవితాలు మనలోనికి రావాలి.
స్వర్గం ఎదురుచూస్తుంది మాషాఅల్లాహ్. ఎలాంటి స్వర్గం అండీ? బుఖారీ గ్రంథములో హదీసు నకలు చేయబడుతుంది. ప్రవక్త వారు అంటున్నారు, “స్వర్గములో ఒక చెట్టు ఉంది. దాని పేరు తూబా. స్వర్గములో ఒక చెట్టు నీడను, ఒక గుర్రంపై వెళ్తున్న గుర్రపు రౌతు, స్వర్గములో ఉన్న చెట్టు నీడ దాటించాలి అంటే, 100 సంవత్సరాలు పడుతుంది.” అల్లాహు అక్బర్. ఈ స్వర్గంపై నమ్మకం ఉందా లేదా? కాబట్టి ఆలోచించండి. అల్లాహ్ ఆచరించండి. ఇహపరలోకాల్లో సాఫల్యం పొందండి.
ప్రజలారా, మరణము రాకముందే జీవితాన్ని మహాభాగ్యంగా భావించండి. ముసలితనము రాకముందే యవ్వనాన్ని మహాభాగ్యంగా భావించండి. మీకు ఒకవేళ అనారోగ్యం రాకముందే, ఆరోగ్యాన్ని మహాభాగ్యంగా భావించుకోండి. ఆచరించండి నా సోదరీమణులారా. మీరు ఇన్షాఅల్లాహ్ త’ఆలా, విన్నారు. విన్న తర్వాత ఆచరిస్తే గనక, ఇహపర లోకాల సాఫల్యం ఉన్నది.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ చెప్పటము కంటే, వినటము కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించును గాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, మేమంతా మా జీవితపు చివరి శ్వాస వరకు ఇస్లాం ధర్మముపై స్థిరముగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ విశ్వాసంపై మరణించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్, జీవితపు చివరి ఘడియలలో “లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం” పఠించి, తుది శ్వాస విడిచిపెట్టే భాగ్యాన్ని ప్రసాదించు. మాలో ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి మేలైన ఉపాధిని ప్రసాదించు. అల్లాహ్, ఇహపర లోకాల్లో మేలైన జీవితమును ప్రసాదించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.
వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[46 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
[సూరా అన్ నస్ర్]
110:1 إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ ఇదా జాఅ నస్రుల్లాహి వల్ ఫత్ హ్ (ఓ ప్రవక్తా!) అల్లాహ్ సహాయం అందినప్పుడు, విజయం వరించినప్పుడు,
110:2 وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّهِ أَفْوَاجًا వ రఅయ్ తన్నాస యద్ ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్ వాజా ప్రజలు గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మంలోకి వచ్చి చేరటాన్ని నీవు చూసినప్పుడు,
110:3 فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ ۚ إِنَّهُ كَانَ تَوَّابًا ఫసబ్బిహ్ బిహమ్ ది రబ్బిక వస్ తగ్ ఫిర్ హు, ఇన్నహూ కాన తవ్వాబా నీవు నీ ప్రభువు స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు, మన్నింపుకై ఆయన్ని ప్రార్ధించు. నిస్సందేహంగా ఆయన మహా గొప్పగా పశ్చాత్తాపాన్ని ఆమోదించే వాడు.
[క్రింది వ్యాఖ్య అహ్ సనుల్ బయాన్ నుండి తీసుకోబడింది]
ఈ సూరా మదీనా కాలానికి చెందినది. ఇందులో మొత్తం ౩ ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా విశ్వాసులకు హామీ ఇవ్వబడిన అల్లాహ్ సహాయం గురించి ప్రస్తావించింది. మొదటి ఆయతులో వచ్చిన నస్ర్ (సహాయం) అన్న ప్రస్తావననే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ప్రజలు తండోపతండాలుగా సత్యధర్మాన్ని స్వీకరిస్తారని ఈ సూరా తెలిపింది. అల్లాహ్ ఔన్నత్యాన్ని స్తుతిస్తూ, ఆయన పవిత్రతను కొనియాడుతూ, ఆయన సన్నిధిలో పొరబాట్లకు క్షమాపణ కోరుకుంటూ విధేయంగా ఉండాలని ఈసూరా ఉద్బోధించింది.
ఖుర్‌ఆన్ అవతరణా క్రమం ప్రకారం ఇది చివరి సూరా (సహీహ్ ముస్లిం – వ్యాఖ్యాన ప్రకరణం). ఈ సూరా అవతరించినప్పుడు; దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణకాలం సమీపించిందని, అందుకే అల్లాహ్ స్తోత్రం, క్షమాపణ గురించి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఆజ్ఞాపించబడిందని కొంతమంది సహాబీలకు అర్ధమైపోయింది. బుఖారీలో ప్రస్తావించబడిన హజ్రత్ ఇబ్నె అబ్బాస్, హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్‌హుమా)ల సంఘటనే దీనికి నిదర్శనం. ( అన్ నస్ర్ సూరా వ్యాఖ్యానం).
“అల్లాహ్ సహాయం” ( نَصْرُ اللَّهِ ) అంటే మిథ్యావాదంపై, మిథ్యావాదులపై ఇస్లాం మరియు ముస్లింలకు లభించిన తిరుగులేని ఆధిక్యం. “విజయం” అంటే మక్కా విజయం అన్నమాట! మక్కా నగరం దైవప్రవక్త జన్మస్థలం. కాని అవిశ్వాసులు ఆయన్ని అక్కడ ప్రశాంతంగా ఉందనివ్వలేదు. ఆయన్ని ఆయన ప్రియసహచరులను వలసపోక తప్పని పరిస్థితులను సృష్టించారు. కాని దైవప్రవక్త హిజ్రీ శకం 8వ ఏట మక్కాలో విజేతగా తిరిగి వచ్చినప్పుడు జనులు జట్లు జట్లుగా వచ్చి ఇస్లాంలో ప్రవేశించసాగారు. అంతకు ముందు ఈ విధంగా భారీ సంఖ్యలో ప్రజలు ఇస్లాంలో చేరేవారు కాదు. మక్కా విజయం తరువాత పరిస్థితి అనూహ్యంగా మారింది. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)అల్లాహ్ నిజ ప్రవక్త అనీ, ఇస్లాం నిజధర్మమని ప్రజలు తెలుసుకున్నారు. తమ మోక్షానికి ఇస్లాం తప్ప మార్గాంతరంలేదని వారు గ్రహించారు. ఈ నేపథ్యంలోనే అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు.
ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)! అల్లాహ్ సందేశాన్ని జనులకు చేరవేయవలసిన నీ బాధ్యత పూర్తికావచ్చింది. నీవు ఇహలోకం నుండి ప్రస్థానం చేయవలసిన సమయం కూడా దగ్గర పడింది. కాబట్టి నువ్వు సాధ్యమైనంత ఎక్కువగా అల్లాహ్ స్తోత్రంలో నిమగ్నుడవైఉండు. పొరపాట్ల మన్నింపు కోసం నీ ప్రభువును వేడుకుంటూ ఉండు. ఈ దైవోపదేశాన్నిబట్టి అవగతమయ్యే దేమిటంటే జీవితపు చరమదశలో మనిషి వీలైనంతఅధికంగా దైవధ్యానం చేయాలి. క్షమాభిక్షకై వేడుకుంటూ ఉండాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
విశ్వాసం & విశ్వాస మాధుర్యం (Emaan & Halawatul Emaan) [34 నిముషాలు] వక్త: ముహమ్మద్ అబూబక్ర్ బేగ్ ఉమ్రీ (ఏలూరు) – Speaker : Muhammad Abubaker Baig Omeri (Eluru) https://youtu.be/nGEEpqhFH9c
విశ్వాసం (ఈమాన్) యొక్క లక్షణాలు, విశ్వాస మాధుర్యాన్ని రుచి చూసేందుకు అవసరమైన మూడు గుణాల గురించి ఈ ప్రసంగం వివరిస్తుంది. విశ్వాసం ఒకసారి హృదయంలో ప్రవేశించాక స్థిరంగా ఉంటుందని, కానీ మంచి పనులు మరియు పాపాలను బట్టి అది హెచ్చుతగ్గులకు లోనవుతుందని సహాబాల ఉదాహరణలతో వివరించబడింది. విశ్వాస మాధుర్యాన్ని రుచి చూడాలంటే అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించడం; కేవలం అల్లాహ్ కొరకే ఒకరినొకరు ప్రేమించడం మరియు ద్వేషించడం; మరియు విశ్వసించిన తర్వాత అవిశ్వాసం వైపు తిరిగి వెళ్లడాన్ని అగ్నిలో పడవేయబడటమంత తీవ్రంగా ద్వేషించడం అనే మూడు లక్షణాలు అవసరమని చెప్పబడింది. హజ్రత్ అబూబక్ర్, ఉమర్, బిలాల్, మరియు హంజలా (రదియల్లాహు అన్హుమ్) వంటి సహాబాల జీవితాల నుండి ఉదాహరణలు వారి ప్రేమ, త్యాగం మరియు విశ్వాస స్థిరత్వాన్ని తెలియజేస్తాయి.
అల్ హమ్దులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅద, అమ్మా బఅద్. ఫ అవూజు బిల్లాహిస్సమీయిల్ అలీమ్ మినష్షైతానిర్రజీమ్ మిన్ హమ్దిహీ వ నఫ్ఖిహీ వ నఫ్సిహీ, బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ [యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహీ వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్] (ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడవలసిన విధంగా భయపడండి. మరియు మీరు ముస్లింలుగా తప్ప మరణించకండి.)
سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنْتَ الْعَلِيمُ الْحَكِيمُ [సుబ్ హా నక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అన్తల్ అలీముల్ హకీమ్] (ఓ అల్లాహ్! నీవు పవిత్రుడవు. నీవు మాకు నేర్పినది తప్ప మాకు మరే జ్ఞానమూ లేదు. నిశ్చయంగా, నీవే సర్వజ్ఞానివి, వివేకవంతుడవు.)
رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي [రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్ రీ వహ్ లుల్ ఉఖ్దతమ్ మిల్లిసానీ యఫ్ఖహూ ఖౌలీ] (ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కోసం విశాలపరచు. మరియు నా కార్యాన్ని నాకు సులభతరం చేయి. మరియు నా నాలుకలోని ముడిని విప్పు, తద్వారా వారు నా మాటను అర్థం చేసుకోగలరు.)
اللهم رب زدني علما [అల్లాహుమ్మ రబ్బి జిద్నీ ఇల్మా] (ఓ అల్లాహ్, ఓ నా ప్రభూ, నా జ్ఞానాన్ని వృద్ధి చేయి).
ప్రియ సోదరులారా, తొలగింప బడిన షైతాన్ యొక్క కీడు నుండి రక్షింపబడుటకై అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్ తబారక వ తఆలా యొక్క శుభనామముతో ప్రారంభిస్తున్నాను. అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు, సకల స్తోత్రములు అల్లాహ్ తబారక వ తఆలాకే అంకితము. ఎవరైతే ఈ సమస్త సృష్టిని సృష్టించి తన అధికార పీఠాన్ని అధిష్టించి, ఆయన సృష్టించినటువంటి సృష్టిరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుడిని మలిచాడు.
వారి వైపునకు సందేశాన్ని జారీ చేసేటటువంటి ఉద్దేశముతో ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించాడు. ఈ ప్రవక్తల యొక్క పరంపర హజ్రత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, హృదయాల విజేత, జనాబె ముస్తఫా, అహ్మదే ముజ్తబా, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై తన దైవదౌత్యాన్ని పరిసమాప్తం గావించాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ధరణిపై ఎంతమంది దైవ ప్రవక్తలనైతే ప్రభవింపజేశాడో వారందరిపై కూడా అల్లాహ్ తబారక వ తఆలా యొక్క కారుణ్యాలు కురిపింపజేయుగాక. ముఖ్యంగా, చిట్టచివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ముహమ్మదే అక్రం సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తబారక వ తఆలా యొక్క కోటానుకోట్ల దరూద్‌లూ సలాములూ, శుభాలూ మరియు కారుణ్యాలూ కురిపింపజేయుగాక, ఆమీన్.
సోదర మహాశయులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో మూడో సూరా, సూరా ఆలి ఇమ్రాన్ 102వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ [యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహీ వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్] ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి.
ఓ విశ్వసించినటువంటి ప్రజలారా! సోదర మహాశయులారా, ఎక్కడైతే అల్లాహ్ తబారక వ తఆలా ఈ పదాలను వినియోగిస్తున్నాడో, యా అయ్యుహల్లజీన ఆమనూ, దాని అర్థము ఓ విశ్వసించినటువంటి ప్రజలారా అని. అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, “ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు ఆ విధంగా భయపడండి, ఏ విధంగానైతే ఆయనకు భయపడాల్సినటువంటి హక్కు ఉన్నదో. వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్, మరియు మీరు విశ్వాసులుగా తప్ప, అవిశ్వాసులుగా మీరు మరణించకండి. సోదర మహాశయులారా, ఈ వాక్యంలో ప్రస్తావించబడినటువంటి విషయము విశ్వాసుల గురించి, విశ్వాసం గురించి.
విశ్వాసం (ఈమాన్) యొక్క లక్షణాలు
అయితే, విశ్వాసానికి ఉన్నటువంటి లక్షణాల్లో ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే, విశ్వాసం ఎప్పుడైతే ఒకరిలో ప్రవేశిస్తుందో, దానిని వారి మనసుల నుంచి తీయటము, అది ఎవరి తరం కానటువంటి పని అయిపోతుంది. అబూ సుఫియాన్‌ను హిరకల్ అనేటటువంటి రాజు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు:
ఎవరైతే ఆయనను విశ్వసించారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ఇస్లాంను స్వీకరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అందులో ప్రవేశించిన తర్వాత, అందులో ఉన్నటువంటి వారు ఎవరైనా గాని, వారు వెనక్కు మరలారా? లేకపోతే దాన్ని వదిలివేశారా?
అంటే అబూ సుఫియాన్, ఇస్లాంకు బద్ధశత్రువు అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో, ఆ కాలంలో, ఇంకా ఇస్లాం స్వీకరించనప్పుడు, జవాబు పలుకుతూ అంటున్నాడు, “లా”, వారిలో ఏ ఒక్కరూ కూడా వారు విశ్వసించిన తర్వాత అవిశ్వాస వైఖరికి పాల్పడలేదు, వారు ఏ విధంగా కూడా ఇర్తిదాద్‌కు పాల్పడలేదు, ధర్మభ్రష్టతకు పాల్పడలేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అప్పుడు హిరకల్ రాజు అంటున్నాడు, “కధాలికల్ ఈమాన్ హీన తుఖాలితు బషాషతుహుల్ ఖులూబ్.” విశ్వాసం అంటే ఇదే, అది ఎప్పుడైతే మనిషి యొక్క హృదయంలో ప్రవేశిస్తుందో, దానిని హృదయంలో ఎలా నాటుకుంటుందంటే, దాన్ని తీయటం ఎవరివల్లా కాదు.
అదే విధంగా, విశ్వాసం యొక్క మరొక లక్షణం ఏమిటంటే సోదరులారా, విశ్వాసం అన్నటువంటిది ప్రతి వ్యక్తిలోనూ ఒకే స్థాయిలో ఉండదు. కొందరిలో ఉచ్చ స్థాయికి చెంది ఉంటే, మరికొందరిలో అతి తక్కువ స్థాయికి చెందినదై కూడా ఉండవచ్చు. సహాబాల యొక్క విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే, వారిపై ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుట్రలు చేసినా కూడా, వారిని వారి విశ్వాసం నుంచి ఏ విధంగా ఎవరూ తొలగింపలేకపోయారన్నటువంటి విషయాన్ని అల్లాహ్ సూరా ఇబ్రాహీం, 14వ సూరా, 46వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
وَقَدْ مَكَرُوا مَكْرَهُمْ وَعِندَ اللَّهِ مَكْرُهُمْ وَإِن كَانَ مَكْرُهُمْ لِتَزُولَ مِنْهُ الْجِبَالُ [వ ఖద్ మకరూ మక్రహుమ్ వ ఇందల్లాహి మక్రుహుమ్ వ ఇన్ కాన మక్రుహుమ్ లితజూల మిన్హుల్ జిబాల్] వాళ్ళు తమ ఎత్తుల్ని తాము వేసి చూసుకున్నారు. వారి ఎత్తుగడలన్నీ అల్లాహ్ దృష్టిలో ఉన్నాయి. వారి ఎత్తుగడలు పర్వతాలను కదిలించేటంతటి భీకరమైనవేమీ కావు.
అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, వారు ఎన్ని కుట్రలు పన్నారంటే, వారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఈ పర్వతాలను, కొండలను వారి స్థాయి నుంచి, వారి ప్రదేశం నుంచి వారు కదపలేకపోయారన్నటువంటి విషయాన్ని అల్లాహ్ ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ కొండలు, పర్వతాలు అన్నటువంటి విషయాన్ని సహాబాల యొక్క విశ్వాసంతో పోల్చటం జరిగింది. అదే విధంగా అల్లాహ్ తబారక వ తఆలా సూరతుల్ హుజరాత్, 49వ సూరా, మూడో వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
أُولَٰئِكَ الَّذِينَ امْتَحَنَ اللَّهُ قُلُوبَهُمْ لِلتَّقْوَىٰ ۚ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ [ఉలాయికల్లజీనమ్ తహనల్లాహు ఖులూబహుమ్ లిత్తఖ్వా లహుమ్ మగ్ఫిరతున్ వ అజ్రున్ అజీమ్] వారే వీరు, వీరి హృదయాలను అల్లాహ్ తబారక వ తఆలా తఖ్వా, భయభక్తుల కొరకు పరీక్షించి ఉంచాడు, వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉన్నాయి.
విశ్వాసం యొక్క మరొక లక్షణం ఏమిటంటే, విశ్వాసము పెరగటము మరియు తరగటము. అంటే సోదరులారా, విశ్వాసము ఒక్కొక్కసారి మనిషి చేసేటటువంటి ఆచరణకు అది పెరుగుతూ ఉంటుంది. మరి అదే విధంగా, మనిషి చేసేటటువంటి పాప కార్యాలకు గాను విశ్వాసము తరుగుతూ ఉంటుందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది.
అందుకనే, ఖురాన్ గ్రంథంలో ఎన్నోసార్లు, పలుసార్లు అల్లాహ్ తబారక వ తఆలా మన యొక్క విశ్వాసాన్ని పునఃపరిశీలన చేసుకోవలసిందిగా మనకు సెలవిస్తూ, ఖురాన్‌లో సూరా నిసా, నాలుగవ సూరా, 136వ వాక్యంలో ఈ విధంగా అల్లాహ్ తబారక వ తఆలా ప్రస్తావిస్తున్నాడు:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا آمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالْكِتَابِ الَّذِي نَزَّلَ عَلَىٰ رَسُولِهِ وَالْكِتَابِ الَّذِي أَنزَلَ مِن قَبْلُ ۚ وَمَن يَكْفُرْ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ను, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను, ఆయన తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం))పై అవతరింపజేసిన గ్రంథాన్నీ, అంతకు మునుపు ఆయన అవతరింపజేసిన గ్రంథాలన్నిటినీ విశ్వసించండి. ఎవడు అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించాడో వాడు మార్గం తప్పి చాలాదూరం వెళ్ళిపోయాడు.
ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు వాస్తవానికి విశ్వాసులే అయితే, ఏ విధంగానైతే అల్లాహ్ తబారక వ తఆలాపై విశ్వసించాలో, ఆ విధంగా విశ్వసించండి. మరియు ఆ గ్రంథంపై విశ్వసించండి ఏదైతే మీ ప్రవక్తపై అవతరింపజేయబడిందో.
కాబట్టి సోదర మహాశయులారా, అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్‌లో పలుసార్లు మన యొక్క విశ్వాసాన్ని పునఃపరిశీలించుకోవలసిందిగా ఈ విధంగా సెలవిస్తున్నాడంటే, మూడో సూరా 102వ వాక్యం ఏ విధంగానైతే ఈ అంశంలో ప్రారంభంలో పఠించడం జరిగిందో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో అంటున్నాడు:
ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు ఆ విధంగా భయపడండి ఏ విధంగానైతే భయపడాలో, మరియు అవిశ్వాసులుగా మీరు మరణించకండి, విశ్వాస స్థితిలోనే మీరు మరణించండి సుమా అన్నటువంటి విషయాన్ని అల్లాహ్ ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.
తబరానీలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఈ మాటను ఉల్లేఖించడం జరిగింది:
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ విధంగానైతే మీ ఒంటిపై, మీ శరీరంపై దుస్తులు ఏ విధంగానైతే మాసిపోతూ ఉంటాయో, అదే విధంగా మీ విశ్వాసము కూడా మాసిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు దుఆ చేస్తూ ఉండండి, ప్రార్థిస్తూ ఉండండి, “అన్ యుజద్దిదల్ ఈమాన ఫీ ఖులూబికుమ్,” అల్లాహ్ తబారక వ తఆలా మీ హృదయాలలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పునరుద్ధరింపజేయవలసిందిగా మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు వేడుకోండి అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. ఈ హదీసును ఇమామ్ అల్బానీ రహిమహుల్లాహ్ గారు సహీ అల్-జామియాలో సహీ హదీసుగా ధృవీకరించారు.
సహీ ముస్లింలో హదీస్ నెంబర్ 6966లో మనం చూసినట్లయితే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరులలో ఒక సహచరుడైనటువంటి, ఒక అగ్రగణ్యుడైనటువంటి సహచరుడు హజ్రత్ హంజలా రదియల్లాహు తలా అన్హు వారి యొక్క ఒక ప్రస్తావన వస్తుంది. ఎవరండీ ఈ హంజలా అంటే? ఆ హంజలాయే ఎవరి గురించైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారో, “హంజలా గసీలుల్ మలాయికా” (హంజలాను దైవదూతలు స్నానం చేయించారు). ఏ రోజైతే హంజలా రదియల్లాహు తలా అన్హు వారికి వివాహము జరిగిందో, అదే రోజు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రకటించినటువంటి యుద్ధ ప్రకటనకు జవాబిస్తూ ఆయన అందులో పాల్గొని మరణించగా, షహాదత్ పొందగా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “మీరు హంజలాకు శవస్నానము చేయించవలసిన అవసరము లేదు, గుసుల్ స్నానం చేయించిన అవసరము లేదు ఎందుకంటే హంజలా గసీలుల్ మలాయికా, ఎందుకంటే హంజలాకు దైవదూతలే స్వయానా గుసుల్ ఇచ్చి ఉన్నారు అని.”
అటువంటి హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబీ అయినటువంటి అబూబక్ర్ నిస్సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారితో కలిసినప్పుడు,
لَقِيَنِي أَبُو بَكْرٍ فَقَالَ كَيْفَ أَنْتَ يَا حَنْظَلَةُ అబూబక్ర్ రదియల్లాహు తలా అన్హు వారు నాతో కలిశారు, కలిసిన తర్వాత ఆయన నాతో అడిగారు, “ఓ హంజలా, నీవు ఎలా ఉన్నావు?” అని.
قَالَ قُلْتُ نَافَقَ حَنْظَلَةُ అప్పుడు హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, నేను హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు గారితో అన్నాను, “హంజలా కపటవిశ్వాసి అయిపోయాడు” అని.
قَالَ سُبْحَانَ اللَّهِ مَا تَقُولُ “ఓ హంజలా, ఏమంటున్నావ్? అల్లాహ్ తలా యొక్క పవిత్రతను నేను కొనియాడుతున్నాను. నీవు మునాఫిక్ అయిపోవటం ఏమిటి?” అప్పుడు హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు,
قُلْتُ نَكُونُ عِنْدَ رَسُولِ اللَّهِ صلى الله عليه وسلم يُذَكِّرُنَا بِالنَّارِ وَالْجَنَّةِ حَتَّى كَأَنَّا رَأْىَ عَيْنٍ فَإِذَا خَرَجْنَا مِنْ عِنْدِ رَسُولِ اللَّهِ صلى الله عليه وسلم عَافَسْنَا الأَزْوَاجَ وَالأَوْلاَدَ وَالضَّيْعَاتِ فَنَسِينَا كَثِيرًا
మనము దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద కూర్చుని ఉండగా, ఆయన సమక్షంలో ఉన్నప్పుడు, ఆయన మనకు పరలోకం గురించి హితబోధ చేస్తున్న సమయంలో, స్వర్గము మరియు నరకము గురించి ఆయన హితబోధ చేస్తున్న సమయంలో, మా కళ్ళ నుంచి కన్నీళ్లు కారేవి, మా హృదయాలలో మా విశ్వాసము ఉవ్వెళ్లూరుతూ ఉండేటటువంటిది. కానీ, ఎప్పుడైతే మేము అక్కడి నుంచి కదిలి మా ఇళ్లకు వచ్చేసేటటువంటి వాళ్ళమో, మా యొక్క ఇళ్లలో ప్రవేశించేటటువంటి వాళ్ళం, మా భార్య, పిల్లలు, ఇంటివారు ఇందులో పడిపోయే, ఫనసీనా కసీరా (మేము చాలా వరకు మర్చిపోయాము). ఆయన చెప్పినటువంటి మాటల్లో అత్యధికంగా వాటిని మేము మర్చిపోయేటటువంటి వారము. కాబట్టి, మా ఈ పరిస్థితిని గమనించి, నేను అనుకుంటున్నాను నేను మునాఫిక్‌నై పోయాను అని అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారితో హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు.
అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు హంజలా రదియల్లాహు తలా అన్హు వారిని తీసుకుని, ఇలా అయితే మరి మా పరిస్థితి ఏమిటి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తీసుకొచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, “ఓ హంజలా, ఏమయ్యింది?” అని చెప్పేసి అంటే, అప్పుడు హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు, “నాఫఖ హంజలా యా రసూలల్లాహ్,” ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హంజలా మునాఫిక్ అయిపోయాడు, కపటవిశ్వాసి అయిపోయాడు అని. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అదేమిటి? అలా ఎందుకు జరిగింది?” అంటే, హంజలా రదియల్లాహు తలా అన్హు వారు ఆ జరిగినదంతా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హంజలా రదియల్లాహు తలా అన్హు వారికి జవాబు పలుకుతూ అంటున్నారు:
“ఆ అల్లాహ్ తబారక వ తఆలా యొక్క సాక్షి, ఎవరి చేతిలో అయితే నా ప్రాణాలు ఉన్నాయో, నేను అల్లాహ్ తబారక వ తఆలాపై ప్రమాణం చేస్తూ అంటున్నాను, మీరు ఏ విధంగానైతే నా సమక్షంలో ఉన్నప్పుడు మీ విశ్వాసం ఏ విధంగా ఉందో, అదే విధంగా గనక ఎల్లప్పుడూ మీరు ఉండగలిగితే, దైవదూతలు మీరు నడిచేటటువంటి మార్గాలలోనూ, మీరు పరుండేటటువంటి మీ పడకల పైనను వారు వచ్చి మీతో కరచాలనం చేయాలనుకునేటటువంటి వారు. కానీ ఓ హంజలా, ఈ విశ్వాసము యొక్క స్థితి ఒక్కొక్కసారి అది ఎలా ఉంటుందంటే, అది ఒక్కొక్కసారి ఉవ్వెళ్లూరుతూ ఉంటుంది ఎప్పుడైతే దాని గురించి ప్రస్తావన జరుగుతూ ఉంటుందో.”
కాబట్టి ఈ హదీస్ ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, విశ్వాసం అన్నటువంటిది ఎప్పుడూ నిలకడగా ఉండదు, అది ఒక్కొక్కసారి, ఎప్పుడైతే మనం విశ్వాసం గురించి ప్రస్తావించుకుంటామో ఆ సమయాల్లో మన యొక్క విశ్వాసము ఉచ్చ స్థాయికి చెందుకుంటుంది, మరి అదే విధంగా ఒక్కొక్కసారి ఆ విశ్వాసము మనము చేసేటటువంటి పాప కార్యాల వల్ల కూడా అది తరుగుతూ ఉంటుందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు.
విశ్వాస మాధుర్యాన్ని రుచి చూచుటకు మూడు లక్షణాలు
విశ్వాసం యొక్క మరొక లక్షణం ఏమిటంటే, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించటం. విశ్వాసం యొక్క మాధుర్యం ఏమిటా అని మీరు ఆలోచించినట్లయితే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు:
عَنِ الْعَبَّاسِ بْنِ عَبْدِ الْمُطَّلِبِ، أَنَّهُ سَمِعَ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم يَقُولُ “ ذَاقَ طَعْمَ الإِيمَانِ مَنْ رَضِيَ بِاللَّهِ رَبًّا وَبِالإِسْلاَمِ دِينًا وَبِمُحَمَّدٍ رَسُولاً ” (సహీ అల్-ముస్లిం, కితాబుల్ ఈమాన్, హదీస్ నెంబర్ 34).
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రదియల్లాహు తలా అన్హు వారు ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “ఆ వ్యక్తి విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలడు, ఎవరైతే అల్లాహ్‌ను తన దైవంగా, ఇస్లామును తన ధర్మంగా మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రవక్తగా అంగీకరించి నడుచుకున్నటువంటి వాడు, తన ఆచరణాత్మకంగా తన జీవితాన్ని గడుపుకున్నటువంటి వాడు కచ్చితంగా విశ్వాసం యొక్క మాధుర్యాన్ని, విశ్వాసం యొక్క రుచిని అతను ఆస్వాదించగలడు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు.
సోదర మహాశయులారా, ఎలాగైతే మనము తినేటటువంటి రుచిని ఆస్వాదించగలుగుతున్నామో, ఏదైనా ఒక తియ్యటి పదార్థాన్ని తిని మనం దాని యొక్క తియ్యదనాన్ని రుచి చూడగలుగుతున్నాము. మరి అదే విధంగా, మనము సుగంధ ద్రవ్యాలను కూడా వాసన ద్వారా మనము వాటిని ఆస్వాదించగలుగుతున్నామో, వాటి యొక్క రుచిని మనం ఆస్వాదించగలుగుతున్నాము. మరి అదే విధంగా, ఒక తియ్యటి పలుకులను విని వింటూ కూడా మనము ఆ పలుకులలో ఉన్నటువంటి రుచిని కూడా ఆస్వాదించగలుగుతున్నామో, అదే విధంగా విశ్వాసానికి కూడా ఒక లక్షణం ఉంది, అదేమిటంటే వాస్తవానికి మనం విశ్వాసులమైతే, వాస్తవానికి మనలో ఈ లక్షణాలు ఉంటే, ఏదైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారో, మనం కచ్చితంగా, తప్పకుండా విశ్వాసము యొక్క మాధుర్యాన్ని కూడా రుచి చూడగలము అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో సెలవిస్తున్నారు.
అయితే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడాలి అని అనుకుంటే, మనలో ఏ లక్షణాలు ఉంటే మనం విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలము? ఏ స్థాయికి మన విశ్వాసము చేరుకుంటే మనం విశ్వాసము యొక్క తియ్యదనాన్ని, మాధుర్యాన్ని రుచి చూడగలము? అనేటటువంటి ప్రశ్న మీ మనసులలో కలుగుతుంది కాబట్టి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీసులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు:
عَنْ أَنَسٍ ـ رضى الله عنه ـ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ “ ثَلاَثٌ مَنْ كُنَّ فِيهِ وَجَدَ حَلاَوَةَ الإِيمَانِ
మూడు లక్షణాలు ఉన్నాయి, మూడు లక్షణాలు, మూడు గుణాలు ఉన్నాయి. ఒకవేళ మీలో గనుక ఈ మూడు లక్షణాలను మీరు పెంపొందించుకోగలిగితే, ఒకవేళ మీలో ఈ మూడు లక్షణాలు గనక ఉంటే, మీరు కచ్చితంగా విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలరు అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. ఆ మూడు లక్షణాలు ఏమిటి?
ఒకటి, ఆ మూడు లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏమిటంటే:
أَنْ يَكُونَ اللَّهُ وَرَسُولُهُ أَحَبَّ إِلَيْهِ مِمَّا سِوَاهُمَا [అన్ యకూనల్లాహు వ రసూలుహూ అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా] అల్లాహ్ మరియు ప్రవక్త వారి వద్ద అందరికంటే ఎక్కువ ప్రియతములై ఉండాలి అనేది మొదటి లక్షణం.
మరియు ఒక వ్యక్తి తన తోటివారితో అల్లాహ్ తబారక వ తఆలా కొరకు మాత్రమే ప్రేమించగలిగినప్పుడు, అల్లాహ్ తబారక వ తఆలా కోసము ప్రేమించటము, అల్లాహ్ తబారక వ తఆలా కోసమే ద్వేషించటం అన్నటువంటిది రెండవ లక్షణంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారు.
మూడవ లక్షణం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రస్తావిస్తూ అంటున్నారు:
وَأَنْ يَكْرَهَ أَنْ يَعُودَ فِي الْكُفْرِ كَمَا يَكْرَهُ أَنْ يُقْذَفَ فِي النَّارِ ” [వ అన్ యక్రహ అన్ యఊద ఫిల్ కుఫ్రి కమా యక్రహు అన్ యుఖ్దఫ ఫిన్నార్] ఎలాగైతే విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటము అతనికి అంత అయిష్టకరంగా ఉండాలి, ఎలాగైతే ఒక వ్యక్తిని అగ్నిగుండంలో పడవేయటం ఎంత అయిష్టంగా ఉంటుందో.
(ఈ హదీసు సహీ అల్-బుఖారీ, కితాబుల్ ఈమాన్, బాబు హలావతిల్ ఈమాన్‌లో దీనిని ఇమామ్ బుఖారీ రహిమహుల్లాహ్ గారు అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం ద్వారా ఈ విధంగా పేర్కొనటం జరిగింది).
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో తెలియజేసినటువంటి మూడు లక్షణాలు గనక మనలో మనం పెంపొందించుకోగలిగితే, కచ్చితంగా మనము విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలము అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. అందులో, మొదటి లక్షణాన్ని మనం గమనించినట్లయితే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహ్ మరియు ప్రవక్త అతని వద్ద అత్యధికంగా అందరికంటే ఎక్కువగా ప్రియతములై ఉండాలి అన్నటువంటి విషయాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొట్టమొదటి లక్షణంగా పేర్కొన్నారు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, తొమ్మిదవ సూరా, సూరా తౌబా, 24వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, మీరు సంపాదించిన సిరిసంపదలు, కుంటుపడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకం, మీకెంతో ప్రియమైన మీ గృహాలు మీకు అల్లాహ్ కన్నా, ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గంలో సలిపే పోరాటం కన్నా ఎక్కువ ప్రియమైనవైతే అల్లాహ్ తీసుకువచ్చే తీర్పు (శిక్ష) కొరకు ఎదురుచూడండి. అల్లాహ్ అవిధేయులకు సన్మార్గం చూపడు.
అల్లాహ్ ఈ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు: వారితో ఇలా అను, మీ తాతలు, తండ్రులు, కుమారులు, మీ భార్యాపిల్లలు మరియు మీరు సంపాదించేటటువంటి సంపద, మీరు ఎక్కడ నష్టపోతారనుకునేటటువంటి మీ వ్యాపారాలు, అదే విధంగా మీరు ఎంతగానో ఇష్టపడేటటువంటి మీ స్వగృహాలు, ఇవన్నీ కూడా మీకు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గములో పోరాటం కన్నా ఇవన్నీ కూడా మీకు అత్యధికమైనప్పుడు, అల్లాహ్ తన తీర్పును బహిర్గతం చేసే వరకు నిరీక్షించండి. మరియు అల్లాహ్ అవిధేయులైనటువంటి జాతికి సన్మార్గముని చూపడు అని అల్లాహ్ తబారక వ తఆలా ఈ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు.
అల్లాహ్ తబారక వ తఆలా విశ్వాసులు అల్లాహ్ తబారక వ తఆలాను ఎంతగా ప్రేమిస్తారన్నటువంటి విషయాన్ని సెలవిస్తూ సూరా అల్-బఖరా, రెండవ సూరా, 165వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ ۖ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّهِ కాని అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించినవారు అల్లాహ్‌ను అంతకంటే ప్రగాఢంగా (అధికంగా) ప్రేమిస్తారు.
ఈ మానవులలో కొందరు ఇతరులను అల్లాహ్‌కు సాటి కల్పించుకుని, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమిస్తున్నారు. కానీ విశ్వాసులు అత్యధికంగా అల్లాహ్ తబారక వ తఆలాను ప్రేమిస్తారు అన్నటువంటి విషయాన్ని అల్లాహ్ తబారక వ తఆలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే, అల్లాహ్ తబారక వ తఆలాను ఒక విశ్వాసి అయినటువంటి వాడు అత్యధికంగా ప్రేమిస్తాడు.
అదే విధంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు:
عَنْ أَنَسٍ قَالَ قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم “ لاَ يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى أَكُونَ أَحَبَّ إِلَيْهِ مِنْ وَالِدِهِ وَوَلَدِهِ وَالنَّاسِ أَجْمَعِينَ ”
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “మీలో ఏ వ్యక్తి కూడా అప్పటివరకు విశ్వాసి కాలేరు, ఎప్పటివరకైతే నన్ను మీరు అత్యధికంగా ప్రేమించరో, మీ ఆలుబిడ్డల కన్నా, మీ బంధుమిత్రుల కన్నా, సమస్త మానవాళి కన్నా అత్యధికంగా మీరు ఎప్పటివరకైతే నేను మీకు ప్రియతముణ్ణి కానో, అప్పటివరకు మీరు విశ్వాసులు కారు” అన్నటువంటి విషయాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. (సహీ బుఖారీ, హదీస్ నెంబర్ 15).
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారితో కలిసి ఉన్నప్పుడు, హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు ఈ హదీసు విన్న తర్వాత అంటున్నటువంటి మాట ఏమిటంటే, “యా రసూలల్లాహ్, మీరు అన్నట్లుగానే నేను మిమ్మల్ని సమస్త మానవాళి కన్నా, బంధుమిత్రుల కన్నా, తల్లిదండ్రుల కన్నా అత్యధికంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా మనసు, నా ఆత్మ, నా ప్రాణం కన్నా అధికంగా కాదు” అని హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు.
فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ” لاَ وَالَّذِي نَفْسِي بِيَدِهِ حَتَّى أَكُونَ أَحَبَّ إِلَيْكَ مِنْ نَفْسِكَ ”. فَقَالَ لَهُ عُمَرُ فَإِنَّهُ الآنَ وَاللَّهِ لأَنْتَ أَحَبُّ إِلَىَّ مِنْ نَفْسِي. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ” الآنَ يَا عُمَرُ ”.
అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “ఓ ఉమర్, నీవు ఎప్పటివరకైతే నీ ప్రాణం కంటే అధికంగా నన్ను మీరు ప్రేమించినటువంటి వారు కారో, అప్పటివరకు కూడా మీరు పూర్తి విశ్వాసి కాలేరు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటే, హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, “ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇప్పుడు నేను మిమ్మల్ని నా ప్రాణం కంటే కూడా అధికంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను” అని హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “అల్ ఆన యా ఉమర్,” ఓ ఉమర్ రదియల్లాహు తలా అన్హు, ఇప్పుడు మీరు పూర్తిగా విశ్వాసి అయ్యారు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడం జరిగింది.
చూశారా సోదర మహాశయులారా, హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి మాటని బట్టి మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, అన్నిటికంటే ముందు ఒక విశ్వాసి అత్యధికంగా అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమను అత్యధికంగా కలిగి ఉండాలి. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇతరుల కంటే అత్యధికంగా ప్రియతములు కానంత వరకు ఏ వ్యక్తి కూడా విశ్వాసి కాలేడు, మరి అదే విధంగా ఏ వ్యక్తి కూడా విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడలేడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు.
సోదర మహాశయులారా, తబూక్ యుద్ధంలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మార్గంలో అల్లాహ్ తబారక వ తఆలా కొరకు తమ యొక్క దానాలను తమ స్తోమత మేరకు అర్పించవలసిందిగా కోరినప్పుడు, ఎంతోమంది సహాబాలు తమ తమ స్తోమత మేరకు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మార్గంలో తమ తమ దానమును అర్పిస్తున్నటువంటి సమయంలో హజ్రత్ అబూబక్ర్ అస్స్సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు తమ ఇంటిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఊడ్చి, ఆయన ముందు సమర్పించుకుంటూ, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు తీసుకొచ్చి పెట్టగా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, “ఓ అబూబక్ర్, నీ ఇంటి వారి కొరకు నీ ఇంటిలో ఏమైనా వదిలి పెట్టావా?” అంటే, హజ్రత్ అబూబక్ర్ నిస్సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, “నేను అల్లాహ్ మరియు ఆయన యొక్క ప్రవక్తను నా ఇంట్లో వదిలిపెట్టి వచ్చాను” అని హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు జవాబు పలికారు.
సోదరీ సోదర మహాశయులారా, అల్లాహ్ తబారక వ తఆలా మరియు ఆయన యొక్క ప్రేమ, సహచరుల యొక్క జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే, ఇటువంటి సంఘటనలు మనకు వేల కొద్దీ దొరుకుతాయి సోదర మహాశయులారా. అదే విషయాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరిలో అయితే మూడు లక్షణాలు ఉంటాయో వారు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క దయతో విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలరు. అందులో మొదటి విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నాము, అదేమిటంటే అల్లాహ్ మరియు ఆయన యొక్క ప్రవక్త పట్ల ప్రేమ, మిగతా వారందరికన్నా కూడా ఎక్కువగా ప్రియతములై ఉండటము.
అయితే సోదర మహాశయులారా, మనం అల్లాహ్ తబారక వ తఆలాను మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తున్నామని నోటితో ఎన్నిసార్లు మనం ప్రకటించినా కూడా, అది కేవలం నోటి మాటే అవుతుంది గానీ, అప్పటివరకు అది నిజం కాదు, ఎప్పటివరకైతే వారు చూపించినటువంటి మార్గంలో మనం నడవమో. అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ గ్రంథంలో, మూడవ సూరా, 31వ వాక్యంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అంటున్నాడు:
قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ”మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు.”
ఇలా అను, మీకు నిజంగా అల్లాహ్ తబారక వ తఆలా పట్ల ప్రేమే ఉన్నట్లయితే, మీరు నాకు విధేయత చూపవలసిందిగా వారికి ఆజ్ఞాపించు. అల్లాహ్ తబారక వ తఆలా వారి పాపాలను క్షమిస్తాడు మరియు నిస్సందేహంగా అల్లాహ్ తబారక వ తఆలా ఎంతో క్షమాశీలి మరియు అనంత కరుణామయుడు అన్నటువంటి విషయాన్ని అల్లాహ్ తబారక వ తఆలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి, నిజంగానే మనం అల్లాహ్ తబారక వ తఆలా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నటువంటి వాళ్ళమే అయితే, అల్లాహ్ తబారక వ తఆలాను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అత్యధికంగా ప్రేమించేటటువంటి వాళ్ళమే అయితే, ఆయన చూపినటువంటి మార్గములో మనం నడుస్తూ మన జీవితాన్ని గడుపుకోవలసినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది.
సోదర మహాశయులారా, అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి హదీస్ ఆధారంగా, అందులో మొట్టమొదటి విషయము అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మిగతా వారందరికన్నా కూడా ఎక్కువ ప్రియతములై ఉండటము.
ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు, ఒక వ్యక్తి తనతో ఉన్నటువంటి వారిని కూడా అల్లాహ్ కొరకు ప్రేమించేటటువంటి వారై ఉండాలి. అదే విధంగా, అల్లాహ్ కొరకే ద్వేషించేటటువంటి వారై ఉండాలి. అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ప్రేమ కారణంగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం ప్రేమిస్తున్నాము. అదే విధంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రేమ కారణంగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులతో మనం ప్రేమిస్తున్నాము. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రేమ కారణంగానే సమస్త మానవాళి విశ్వాసులతో కూడా మనం ప్రేమిస్తున్నాము. ఇదే విషయాన్ని దైవం ప్రస్తావిస్తూ, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రస్తావిస్తూ ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు:
“ఎవరైతే అల్లాహ్ తబారక వ తఆలా కొరకు ప్రేమిస్తారో మరియు అల్లాహ్ తబారక వ తఆలా కొరకే ద్వేషిస్తారో మరియు అల్లాహ్ తబారక వ తఆలా కొరకే ప్రసాదిస్తారో మరియు అల్లాహ్ తబారక వ తఆలా కొరకే నిషేధిస్తారో, వీరు వాస్తవానికి తమ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్నటువంటి వారు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి మాట అబూ దావూద్‌లో ఈ విధంగా ప్రస్తావించబడింది.
కాబట్టి దీని ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, సహాబాలు ఏ విధంగా అల్లాహ్ తబారక వ తఆలాను మరియు ఆయన యొక్క ప్రవక్తను ప్రేమించేటటువంటి వారు మరియు వారి యొక్క ప్రేమ, వారి యొక్క ద్వేషము అల్లాహ్ కొరకు మరియు అల్లాహ్ యొక్క మార్గంలోనే ఉండేటటువంటిది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు.
సోదర మహాశయులారా, ఇక మూడో విషయానికి వస్తే, మూడో లక్షణానికి వస్తే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, “మరి విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటం అన్నటువంటిది వారికి ఎంత అయిష్టకరమైనదై ఉండాలంటే ఎలాగైతే వారిని అగ్నిగుండంలో పడవేయటం అయిష్టకరమై ఉంటుందో ఆ విధంగానే అవిశ్వాసానికి పాల్పడటం వారికి అయిష్టకరమై ఉంటుంది” అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు.
ఈ విషయంలో హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారిని చూసుకున్నట్లయితే, హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారు ఎప్పుడైతే ఆయన విశ్వసించారో, ఆయన విశ్వసించిన తర్వాత మలమల మాడేటటువంటి మండుటెండల్లో ఆయనను ఈడ్చి, రాళ్లమయమైనటువంటి ప్రదేశంపై ఆయన్ని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి, ఆయన యొక్క గుండెలపై ఒక పెద్ద బండరాయిని పెట్టి, దేవుడు ఒక్కడే అన్నటువంటి విశ్వాసాన్ని నీవు విడనాడుతావా? ఇప్పుడైనా ఒప్పుకుంటావా దేవుడు ఒక్కడు కాదు అని అన్నప్పుడు, అప్పటికీ కూడా ఆయన హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారు “అల్లాహు అహద్, అల్లాహు అహద్, అల్లాహు ఒక్కడే, అల్లాహు ఒక్కడే, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవరూ లేరు, నేను ఇస్లాంను వదిలిపెట్టను, నా విశ్వాసాన్ని విడనాడను” అని హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారు ఏ విధంగానైతే నిలబడిపోయారో విశ్వాసంపై, ఆ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు.
అదే విధంగా హజ్రత్ సుమయ్య రదియల్లాహు తలా అన్హా, అదే విధంగా హజ్రత్ ఖబ్బాబ్ బిన్ అర్ద్ రదియల్లాహు తలా అన్హు, వీరు చేసుకున్నటువంటి త్యాగాలు మరియు వీరు ఏ విధంగా ఇస్లాంపై నిలకడగా ఉన్నారో, ఎలాగైతే వారు విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటం వారికి ఎంత అయిష్టకరంగా ఉండిందంటే, ఎలాగైతే వారికి జీవించి ఉండటంలోనే వారిని అగ్నిగుండంలో పడవేయటం కంటే ఎక్కువగా వారు అయిష్టకరంగా భావించేటటువంటి వారు.
కాబట్టి సోదర మహాశయులారా, ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే, విశ్వాసము యొక్క లక్షణాలలో ఒక లక్షణము, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడటము. అయితే ఈ విశ్వాసము యొక్క మాధుర్యాన్ని అప్పుడే మనం ఆస్వాదించగలము, అప్పుడే మనం రుచి చూడగలము, ఎప్పుడైతే మనలో ఈ మూడు లక్షణాలు కూడా ఉంటాయో, ఈ మూడు గుణాలు కూడా మనలో ఉంటాయో. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరిలో అయితే ఈ మూడు లక్షణాలు ఉంటాయో, ఈ మూడు గుణాలు ఉంటాయో, వారు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క దయతో విశ్వాసము యొక్క ఉచ్చ స్థాయికి చేరుకోగలరు, విశ్వాసము యొక్క ఉచ్చ స్థాయికి చేరుకున్నవారు విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలరు అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు.
అందులో మొట్టమొదటిది, అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరికంటే ఎక్కువ ప్రియతములై ఉండాలి. ఇక రెండవ విషయము, ఎవరిని ప్రేమించినా కూడా అల్లాహ్ కొరకే ప్రేమించేటటువంటి వారై ఉండాలి, అల్లాహ్ కొరకే ద్వేషించేటటువంటి వారై ఉండాలి. మరి అదే విధంగా మూడో విషయాన్ని, విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటం అన్నటువంటిది ఎంత అయిష్టకరంగా ఉండాలంటే, ఎలాగైతే నిజ జీవితంలోనే వారిని అగ్నిగుండంలో పడవేయటం కంటే బాధగా, అగ్నిగుండంలో పడవేయటం కంటే అయిష్టమైనదిగా ఉండాలి అన్నటువంటి ఈ మూడు లక్షణాల్ని కూడా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హలావతుల్ ఈమాన్, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని గురించి తెలియజేస్తూ పలికినటువంటి పలుకులు ఈరోజు మనం తెలియజేసుకున్నాము.
కాబట్టి అల్లాహ్ తబారక వ తఆలాతో దుఆ ఏమనగా, ఏ విధంగానైతే ఇప్పటి వరకు కూడా మనం మాట్లాడుకున్నామో విశ్వాసము గురించి, విశ్వాసము యొక్క లక్షణాల గురించి, విశ్వాసము యొక్క రుచిని ఆస్వాదించడం గురించి, అల్లాహ్ తబారక వ తఆలా మనకు వీటన్నిటిపై ఆచరించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తబారక వ తఆలా మనలో విశ్వాసాన్ని పెంపొందించుకునేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.