“నిఫాఖ్” అనేది నిఘంటువు ప్రకారం “నాఫఖ” అనె క్రియతో ముడిపడి ఉంది. నాఫఖ యునాఫిఖు నిఫాఖన్ వ మునాఫఖతన్ అని అనబడుతుంది – ఈ పదం “అన్నాఫిఖాఅ” నుండి గ్రహించబడినది. అంటే ఉడుము తన కన్నం నుండి బయటపడే రహస్యమార్గం అని భావం. కన్నంలో ఉన్న ఉడుమును ఒక మార్గం నుంది పట్టుకోటానికి ప్రయత్నించినపుడు అది రెండో వైపు నుండి పారిపోతుంది. మరో ఉవాచ ప్రకారం ఇది ‘నఖఫ‘ నుండి సంగ్రహించబడినది. ఉడుము దాక్కున్న కన్నాన్ని నఫఖ అంటారు. (అన్నిహాయతుల్ ఇబ్బ్నుల్ అసీర్ – 5/98)
షరీయత్ ప్రకారం ‘నిఫాఖ్’ అంటే:
ఇస్లాం గురించి, మంచి గురించి ప్రకటించటం. దాంతోపాటే తిరస్కారభావాన్ని, కపటత్వాన్ని మనసులో దాచి పెట్టడం. దీనికి నిఫాఖ్ అనే నామకరణం ఎందుకు చేయబడిందంటే మునాఫిఖ్ (కపటవిశ్వాసి, వంచకుడు) షరీయతులో ఒక ద్వారం గుండా ప్రవేశించి, మరో ద్వారం గుండా షరీయత్ నుండి బయటికెళ్ళిపోతాడు. దీనిపై అల్లాహ్ ఈ విధంగా హెచ్చరించాడు –
“వారు అల్లాహ్‌ను, విశ్వాసులనూ మోసపుచ్చుతున్నారు. అయితే వాస్తవానికి వారు స్వయంగా – తమను తామే – మోసపుచ్చుకుంటున్నారు. కాని ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు. వారి హృదయాలలో రోగం ఉంది. ఆ రోగాన్ని అల్లాహ్ మరింతగా పెంచాడు. వారు చెప్పే అబద్ధం మూలంగా వారి కొరకు వ్యధాభరితమయిన శిక్ష ఉంది.” (అల్ బఖర – 9, 10)
(2) నిఫాఖ్ (కాపట్యం) రకాలు ;
నిఫాఖ్ (కపటత్వం) రెండు రకాలు : (1) విశ్వాసపరమైన కపటత్వం (2) క్రియాత్మకమైన కపటత్వం.
మొదటిది: విశ్వాసపరమైన కపటత్వం
ఇదే నిఫాఖె అక్బర్.అంటే పెద్ద తరహా కపటత్వం. దీనికి ఆలవాలమై ఉన్న వ్యక్తి పైకి ఇస్లాం స్వీకరించినట్లు ప్రకటిస్తాడు. లోపల కుఫ్ర్ని (అవిశ్వాసాన్ని) దాచిపెట్టుకుంటాడు. ఈ రకమయిన కపటత్వం కలవాడు ఇస్లాం నుండి పూర్తిగా బహిష్క్రుతుడైనట్లే. దీనికి పాల్పడినవాడు నరకంలోని అట్టడుగు వర్గీయుల్లో చేరతాడు. అల్లాహ్ కపటులను అత్యంత చెడ్డవారుగా అభివర్ణించాడు. ఉదాహరణకు : అవిశ్వాసం, అవినీతి, ధర్మాన్ని ధర్మావలంబీకులను పరిహసించటం, వారిని చూసి వెకిలి సైగలు చేయటం, ఇస్లాం విరోధులతో కుమ్మక్కు అవటం వారిలోని దుర్గుణాలు. కపట విశ్వాసులు శత్రుత్వంలో ఇస్లాం శత్రువులకు సమ ఉజ్జీలుగా ఉంటారు. ఈ కపటులు అన్ని కాలాల్లో ఉన్నారు, ఉంటారు. ముఖ్యంగా ఇస్లాం ప్రాబల్యం వహించినపుడు ఓర్చుకోలేకపోతారు. బహిరంగంగా ముస్లింలను ఎదిరించే శక్తి వారిలో ఉండదు. అందుకే ఇస్లాంకు, ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రలు పన్నే ఉద్దేశంతో ఇస్లాం స్వీకరిస్తున్నట్లు ప్రకటిస్తారు. ఆ విధంగా ఇస్లాం ముసుగులో ఎసరుపెడతారు. అలా ఉండటం వల్ల తమ ధన ప్రాణాలకు రక్షణ ఉంటుందన్న స్వార్ధం కూడా వారి అంతరంగంలో దాగి ఉంటుంది.
అందుకే కపట విశ్వాసి (మునాఫిఖ్) అల్లాహ్‌ను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని విశ్వసించినట్లు పైకి ప్రకటిస్తాడు. కాని అతని అంతరంగంలో తిరస్కరణాభావం తిష్టవేసి ఉంటుంది. నిజానికి అతనికి అల్లాహ్ పై విశ్వాసముండదు. ఖుర్‌ఆన్ దైవప్రోక్తమని, ఆయన దానిని ఒక మానవమాత్రుని (ముహమ్మద్ – సల్లలాహు అలైహి వ సల్లం) పై అవతరింపజేశాడని, ఆయన్ని సమస్త మానవుల వైపు సందేశహరునిగా పంపాడనీ, ఆ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అల్లాహ్ ఆదేశానుసారం ప్రజలకు మార్గదర్శకత్వం వహిస్తారని, ఆయన విధించే శిక్ష గురించి సావధానపరుస్తారని స్వయంగా అల్లాహ్ తెలియజేశాడు. అయినప్పటికీ కపట విశ్వాసికి ఇదేమీ పట్టదు. అల్లాహ్ దివ్య ఖుర్‌ఆన్‌లో కపటుల బండారాన్ని బట్టబయలు చేశాడు. వారి లోగుట్టును రట్టు చేశాడు. వారి విషయంలో అప్రమత్తంగా ఉండమని తన దాసులను సావధానపరిచాడు.
అల్ బఖరా సూరాలోని తొలి వాక్యాలలోనే మానవుల లోని మూడు వర్గాల ప్రస్తావన తేబడింది – (1) విశ్వాసులు (2) అవిశ్వాసులు (3) కపటులు. విశ్వాసుల ప్రస్తావన 4 సూక్తులలో, అవిశ్వాసుల ప్రస్తావన 2 సూక్తులలో వస్తే కపటుల ప్రస్తావన 13 సూక్తులలో వచ్చింది. ఎందుకంటే కపటులు అధిక సంఖ్యలో ఉన్నారు – నివురు గప్పిన నిప్పులా ఉంటారు. వారెక్కడ ఉన్నా అక్కడి ప్రజల పాలిట ఒక పరీక్షగా, ఉపద్రవంగానే ఉంటారు. కాగా; ఇస్లాం మరియు ముస్లింల పాలిట వారి బెడద తీవ్రమైనది. ఎందుకంటే వారి మూలంగా సదా ఇస్లాంకు ఎన్నో కష్టాలు వచ్చిపడ్డాయి. వారు బాహ్యంలో ఇస్లాం అనుయాయులుగా కనిపిస్తారు. సమర్థకులుగా ముందుకు వస్తారు. యదార్దానికి వారు ఇస్లాం ధర్మానికి బద్ధశత్రువులుగా ఉంటారు. సర్వవిధాలా వారు ఇస్లాంకు తూట్లు పొడుస్తుంటారు. అమాయకులు, అవివేకులు వారిని చూసి మంచివారుగా తలపోస్తారు. వారి మాటల్ని సంస్కరణతో కూడిన మాటలుగా భావిస్తారు. కాని వారి మాటల్లో అజ్ఞానం, కల్లోలం కలగలసి ఉంటుంది.
(‘సిఫాతుల్ మునాఫిఖీన్ లి ఇబ్బ్నుల్ ఖయ్యిమ్’ నుండి సేకరించబడింది. )
విశ్వాసపరమైన కపటత్వం ఆరు రకాలు :
మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ను ధిక్కరించటం.
మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) షరీయతులోని కొన్ని విషయాలను అసత్యమంటూ త్రోసిపుచ్చటం.
మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పై అక్కసును వెళ్ళగ్రక్కటం, విరోధ భావం కలిగి ఉండటం.
మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెచ్చిన షరీయతులోని కొన్ని విషయాల పట్ల ఓర్వలేనితనాన్ని ప్రదర్శించటం.
మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ధర్మం అధోగతిలో ఉన్నట్టు అనిపిస్తే సంతోషించటం.
మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ధర్మానికి చేకూరిన ప్రాబల్యాన్ని చూసి సహించలేకపోవటం.
(మజ్మూఅతుత్తౌహీద్ – పేజి : 9)
రెండవ రకం – క్రియాత్మకమైన కపటత్వం (నిఫాఖె అమలీ) :
అంటే మనిషి హృదయంలో విశ్వాస (ఈమాన్) మైతే ఉంటుంది గాని అతని ఆచరణల్లో కపటత్వం తొంగి చూస్తుంటుంది. ఇటువంటి ఆచరణ మనిషిని ఇస్లాం పరిధి నుండి బయటికి నెట్టదు. కాని కపటత్వం ముదిరే ప్రమాదం మాత్రం పొంచి ఉంటుంది. ఇలాంటి వ్యక్తిలో విశ్వాసం, కాపట్యం – రెండూ ఉంటాయి. అయితే కాపట్యం మోతాదు పెరిగిపోయినపుడు అతను పక్కా కపటిగా తయారవుతాడు. దీనికి ప్రమాణం ప్రవక్త మహనీయుల (సల్లలాహు అలైహి వ సల్లం) వారి ఈ ప్రవచనం.
“నాలుగు లక్షణాలున్నాయి. అవి గనక ఎవరిలోనయినా ఉంటే అతను పక్కా కపట విశ్వాసి అవుతాడు. ఎవరిలోనయినా వాటిలో ఏ ఒక్క లక్షణమైనా ఉంటే కాపట్యానికి సంబంధించిన ఒక లక్షణం అతనిలో ఉన్నట్లు లెక్క – దానిని అతను విడిచిపెట్టనంత వరకూ (ఆ అవగుణం కారణంగా అతను నిందార్హుడే). అవేమంటే;
(3) నమ్మి ఒడంబడిక చేసుకున్నప్పుడు నమ్మక (ద్రోహం చేస్తాడు.
(4) పోట్లాట జరిగినపుడు దుర్భాషకు దిగుతాడు.”
(బుఖారీ, ముస్లిం)
కనుక ఏ మనిషిలోనయినా ఈ నాలుగు అవ లక్షణాలు ఏకకాలంలో తిష్టవే స్తే, అతనిలో చెడు పూర్తిగా జొరబడినట్లే. అతనిలో కపట లక్షణాలన్నీ పొడసూపినట్లె. మరెవరిలోనయినా వీటిలో ఒక అవలక్షణం ఉంటే, అతనిలో కాపట్యానికి సంబంధించిన ఒక ఆనవాలు ఉందన్నమాట! ఒక్కోసారి ఒక దాసునిలో మంచి లక్షణాలు – చెడు లక్షణాలు, విశ్వాస లక్షణాలు – అవిశ్వాస, కాపట్య లక్షణాలు – రెండూ చోటు చేసుకుంటాయి. తత్కారణంగా అతను బహుమానంతో పాటు శిక్షకు కూడా అర్హుడవుతుంటాడు. మస్జిదులో జరిగే సామూహిక నమాజ్ పట్ల అనాసక్తత, బద్దకం కూడా ఈ కాపట్య లక్షణాలలో ఒకటి.
కపటత్వం (నిఫాఖ్) మహా చెడ్డ వస్తువు. అందుకే ప్రవక్త ప్రియసహచరులు (రది అల్లాహు అన్హుమ్) కాపట్యానికి లోనయ్యె విషయం పట్ల నిత్యం భయపడుతూ ఉండేవారు. ఇబ్నె అబీ ములైకా ఇలా అంటున్నారు :
“నేను ముప్పయి మంది సహాబా (ప్రవక్త సహచరుల)ను కలుసుకున్నాను. వారంతా తమను కాపట్యం ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడుతూ ఉండేవారు.”
నిఫాఖె అక్బర్ – నిఫాఖె అస్గర్‌కి మధ్య గల తేడాలు :
(1) నిఫాఖె అక్బర్ (పెద్ద తరహా కాపట్యం) మనిషిని ఇస్లామీయ సమాజం నుండి బహిష్కరిస్తుంది. నిఫాఖె అస్గర్ (చిన్న తరహా కాపట్యం) సమాజం నుండి బహిష్మరించదు.
(2) విశ్వాసాలలోని అంతర్బాహ్యాలలో గల విభేదానికి మరో పేరె నిఫాఖె అక్బర్. కాగా ఆచరణల్లోని అంతర్బాహ్యాలలో గల వైరుధ్యమే నిఫాఖె అస్గర్.
(3) ఒక విశ్వాసి వల్ల పెద్ద తరహా కపట చేష్ట జరగదు. చిన్న తరహా కపట చేష్టలే అతని వల్ల జరిగేందుకు ఆస్కారముంటుంది.
(4) పెద్ద తరహా కాపట్యానికి (నిఫాఖె అక్బర్‌కి) ఒడిగట్టిన వ్యక్తి చాలా వరకు పశ్చాత్తాపం ప్రకటించడు. ఒకవేళ అతను పరిపాలకుని సమక్షంలో పశ్చాత్తాపం చెందితే అతని పశ్చాత్తాపం స్వీకారయోగ్యమవుతుందా? లేదా? అనే విషయంలో విద్వాంసుల మధ్య భేదాభిప్రాయం ఉంది. తద్భిన్నంగా చిన్న తరహా కాపట్యానికి పాల్పడిన వ్యక్తి ఒక్కోసారి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపపడుతుంటాడు. అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు.
షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు :
“తరచూ జరిగేదేమిటంటే ఒక విశ్వాసి కాపట్యానికి సంబంధించిన ఏదో ఒక విషయానికి లోనవుతాడు. తరువాత అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు. ఒక్కోసారి అతని ఆంతర్యంలో కొన్ని విషయాలు జనిస్తుంటాయి. అవి కాపట్యానికి ఆనవాలుగా ఉంటాయి. ఎట్టకేలకు అల్లాహ్ అతని ఆ స్థితిని కూడా రూపుమాపు తాడు. ఒక విశ్వాసి ఒక్కోసారి పైశాచిక ప్రేరణలకు, అవిశ్వాస శంకలకు లోనవుతుంటాడు. తత్కారణంగా అతని మనసు కుంచించుకుపోతూ ఉంటుంది. అతను తీవ్రంగా మనస్తాపానికి గురవుతాడు. ఆ విషయమే ఒకసారి ప్రియ సహచరులు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తో చెప్పుకున్నారు :
“దైవప్రవక్తా (సల్లలాహు అలైహి వ సల్లం)! మాలో కొందరి హృదయాలలో కలిగే భావాలు ఎంత తీవ్రమైనవంటే, వాటిని గురించి నోటితో చెప్పటం కన్నా నింగి నుంచి నేలపై పడిపోవటమే మిన్న అని అనుకుంటున్నాము”. దానికి ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు : “ఈ భావనే అసలు విశ్వాసం (ఈమాన్).” (ముస్నదె అహ్మద్, ముస్లిం)
మరో ఉల్లేఖనంలోని పదాలు ఇలా ఉన్నాయి :
‘వాటిని నోటితో చెప్పటం కష్టమని భావిస్తున్నాడు.’
దానికి ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు : “షైతాన్ ఎత్తుగడలను శంకలుగా మార్చివేసిన అల్లాహ్‌కే సకల స్తోత్రాలు.” అంటే ఆంతర్యంలో జనించే ఇలాంటి దుష్ప్రేరణలపై అయిష్టతను వ్యక్తపరచటం, వాటీని మనసులో నుంచి తీసిపడవెయ్యటం విశ్వాసానికి చిహ్నం అన్నమాట!” (కితాబుల్ ఈమాన్, పేజీ – 288)
నిఫాఖె అక్బర్ (పెద్ద తరహా కాపట్యం) సంగతి వేరు. అలాంటి వారి గురించి అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి:
“ఏమిటీ, ప్రతి ఏటా ఒకసారో, రెండుసార్లో తాము ఏదో ఒక ఆపదలో చిక్కుకుపోవటాన్ని వారు గమనించటం లేదా? అయినాసరే, వారు పశ్చాత్తాపాపడటంగానీ, గుణపాఠం నేర్చుకోవటంగానీ జరగటం లేదు.” (అత్ తౌబా : 126)
షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు :
“వారి పశ్చాత్తాపం స్వీకరించబడే విషయంలో విద్వాంసుల మధ్య భిన్నాభిప్రాయం ఉంది. ఎందుకంటే అందులోని వాస్తవికత ఏపాటిదో తెలీదు. ఎందుచేతనంటే వారు నిత్యం తమను ఇస్లాం అనుయాయులుగానే చెప్పుకుంటూ ఉంటారు.” (మజ్మూఅ ఫతావా – 28/434, 435)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మానవ జీవితంలో, విశ్వంలో సంభవించే సంఘటనల్లో నక్షత్రాల ప్రభావం ఉంటుందని విశ్వసించుట కూడా షిర్క్.
జైద్ బిన్ ఖాలిద్ జుహనీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: హుదైబియా ప్రాంతంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు నమాజు చేయించారు. అదే రాత్రి వర్షం కురిసింది. నమాజు ముగించి ప్రజల వైపునకు తిరిగి “మీ ప్రభువు ఏమన్నాడో మీకు తెలుసా?” అని అడిగారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కే బాగా తెలుసు అని సహచరులు సమాధానం పలికారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ఇలా తెలిపాడని విశదీకరించారు: “ఈ రోజు ఉదయం నా దాసుల్లో కొందరు విశ్వాసులయ్యారు, మరికొందరు అవిశ్వాసులయ్యారు. ‘అల్లాహ్ దయవలన మాకు వర్షం కురిసింది’ అని అన్నవారు తారాబలాన్ని నిరాకరించి, నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలాన నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసింది అన్నవారు నక్షత్ర విశ్వాసులయి, నన్ను తిరస్కరించిన వారయ్యారు”. (బుఖారి 846, ముస్లిం 71).
అదే విధంగా పత్రిక, మ్యాగజైన్లలో వచ్చే రాశిచక్ర వివరాలను చదివి, అవి నక్షత్రాల ప్రభావంతోనే ఉంటాయని విశ్వసిస్తే అతను బహుదైవారాధకుడవుతాడు. ఒకవేళ అతను తృప్తి కొరకు చదివితే పాపాత్ముడవుతాడు. ఎందుకనగా? షిర్క్ విషయాలను చదివి తృప్తి పొందడం యోగ్యం కాదు, దానిని విశ్వసించాలని షైతాన్ ప్రేరేపించవచ్చు కూడా, అప్పడు అది చదవడం ఒక షిర్క్ పని కోసం ఆధారంగా మారిపోతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[నెల్లూరు రొట్టెల పండగ పేరుతో జరిగే షిర్క్ మరియు అధర్మ కార్యాల గురుంచి ఈ పోస్టులో వివరించబడింది]
నెల్లూరు ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఒక జిల్లా, సముద్రం ఒడ్డున ఉన్న ఒక అందమైన పట్టణము. 12వందల సంవత్సరాల క్రితం పన్నెండు మంది అరబ్ ముస్లిములు వలస వచ్చారు అని కథనాలు చెప్పుకుంటారు. వారందరూ జాతులకు, మతాలకు అతీతంగా శాంతిని నెలకొల్పాలని వచ్చినట్లు భావిస్తారు. మరియు కొన్ని రోజుల తరువాత వారందరూ షహీద్ కాబడ్డారనీ అంటారు. ఆ తరువాత వారందరినీ ఆ సెలయేరు (ఒక పెద్ద చెరువు) వద్దనే సమాధి చేసారు. తరువాత కొంత మంది ప్రజలు ఆ సమాధులనే దర్గాలుగా నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ పన్నెండు దర్గాలను కలిపి “బారా షహీద్ మజార్ షరీఫ్” అని పేర్కొంటారు. అక్కడే మరొక దర్గా “సయ్యద్ బాబా” అని “లాల్ దర్గా” పేరుతో ఉంది.
రొట్టెల పండుగ పేరుతో 10 నుండి 15 లక్షల మంది ప్రజలు ధర్మాలకు అతీతంగా, ప్రతి ఏట ముహర్రం నెలలో సందర్శిస్తారు. అక్కడ ఉత్సవాల పేరుతో ముహర్రం నెల 10, 11, 12వ తేదిలలో రొట్టెల మార్పిడి జరుగుతుంది. అలా మూడు నాలుగు రోజుల పాటు ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు.
అంటే అక్కడ వచ్ఛేవారి వివిధ మొక్కుబడుల ప్రకారం రొట్టెలకు పేర్లు కేటాయించుకుంటారు. ఉదాహరణకు “పిల్లల రొట్టెలు” – ఎవరికైన సంతానం లేకపోతే ఆ నదిలో నిలబడి తలపై ఆ నది నీళ్ళను తీర్ధంలా చల్లుకొని, సంతానం లేనివారు సంతానం కలిగినవారి నుండి రొట్టెలను తీసుకొని తింటారు. అలా చేస్తే సంతాన ప్రాప్తి జరుగుతుందని వారి మూఢ నమ్మకం. అలా సంతానం లేనివారు రొట్టెలను తిన్న తరువాత వారికి సంతానము కలిగితే, తిరిగి వచ్చి వారుకూడా రొట్టెలను ఇతరులకు ఇస్తారు. అలా అనేక మంది ప్రజలు తమ తమ మ్రొక్కుబడుల ప్రకారం ప్రతి ఏట రొట్టెల మార్పిడి జరిపే ఆచారాన్ని “నెల్లురు రొట్టెల పండుగ” అని అంటారు.
ప్రజల సమస్యలకు అనుగుణంగా రొట్టెలకు పేర్లు పెట్టుకుంటారు. అంటే; ఉద్యోగం రొట్టెలు, ధనం రొట్టెలు, విదేశాలకు పోయే వీసా రొట్టెలు, అసెంబ్లీ రొట్టెలు, ఆరోగ్యం రొట్టెలు, వివాహం రొట్టెలు అని వివిధ సమస్యల పేర్లతో రొట్టెల మార్పిడి జరుగుతుంది. తరువాత అక్కడికి వచ్చేవారు అక్కడ ఉన్న దర్గాలను కూడా ఆరాధిస్తారు. ప్రతి దర్గా వద్ద జరిగే షిర్క్ మరియు బిద్‌అత్ వంటి అధర్మ కార్యాలను బహిరంగా పాటిస్తారు.
“బారా షహీద్ మజార్ షరీఫ్”కు వచ్చే ప్రజలు తమ నమ్మకాల ప్రకారం నాణల రూపంలో ఆ దర్గాలపై నాణెములను(చిల్లరడబ్బులు) విసురుతారు. దర్గాల నిర్వాహకులు దర్గాలపై నుండి రూపాయి లేక రెండు రూపాయి బిళ్లలను తీసుకుని, ఎర్రటి లేక పచ్చటి రంగుల గుడ్డపేలికలలో చుట్టి, ప్రజల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకొని, ఆ ఒక్క రూపాయిని పది రూపాయిలకు లేక ఇరవై రూపాయిలకు విక్రయిస్తారు. ఎందుకంటే? ఆ నాణెములను ప్రజలు తమ దగ్గర ఉంచుకుంటే ధనంలో శుభాలు కలుగుతాయని నమ్మిస్తారు.
అధికమైన సంఖ్యలో స్త్రీలు అక్కడ సమావేశమవుతారు. ఎందుకంటే? మూఢ నమ్మకాల వలలో స్త్రీలే అతి ఎక్కువగా చిక్కుకుంటారు. మరియు ఇస్లాం ధర్మం తెలియని అజ్ఞాన ముస్లింలు మరియు బలహీన విశ్వాసులు అలాంటి మూఢ విశ్వాసాలకు తొందరగా ప్రభావితులవుతారు. ఎందుకంటే? ఎదో విధంగా తమ అదృష్టాలను పరిక్షించుకొని, కష్టాలను దూరం చేసుకోవాలని వారి తపన. మన సమాజంలో అలాంటి మూఢ విశ్వాసాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. మరియు వారు దేశ, విదేశాల దర్గాలను సందర్శించి ఆరాధిస్తూ ఉంటారు.
“ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి, తాతలు పెట్టిన పేర్లు మాత్రమే, అల్లాహ్ వీటిని గురించి ఎట్టి ప్రమాణం అవతరింప జేయలేదు. వారు కేవలం తము ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు తరపునుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది?” (సూరతున్ నజ్మ్:23)
(ఓ ప్రవక్తా!)వారికి ఇలా చెప్పు: “అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవ్వంత అధికారంగానీ వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాదు” (సూరతుస్ సబా:22).
అల్లాహ్‌ను మాత్రమే ప్రార్ధించాలి. భయం, భక్తి ఆశ, ప్రేమానురాగం, మొరపెట్టుకోవడం, అణుకువ, అశక్తత, శరణు వేడుకోవడం, జిబహ్ చేయడము, మొక్కుబడులు చెల్లించడం, ఉపాధిని కోరడం వంటి కార్యాలన్నీ ఆరాధనలే. కనుక ఆ ఆరాధనలు అల్లాహ్‌కే సొంతం చేసి ఆరాధించాలి. అల్లాహ్‌ను తప్ప మరెవరినీ ఆరాధించకూడదు.
“మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తనూ పంపినా: “నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! కావున మీరు నన్నే ( అల్లాహ్‌నే) ఆరాధించండి” అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చి పంపాము.” (సూరతుల్ అంబియా:25)
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ఎప్పుడైతే మీరు సహయం కొరకై మొరపెట్టుకుంటారో అప్పుడు అల్లాహ్‌ను మాత్రమే సహాయానికై ఆర్థించండి.” (తిర్మిజీ:2516, జిలాలుల్ జన్నహ్: 316-318).
ముఖ్య గమనిక: “రొట్టెల పండుగ పేరున మనం చేసే ఆచారాలు, ఆరాధనలు, మొక్కుబడులు ధర్మం కానే కావు. ఎవరైనా అల్లాహ్ పేరుపై తప్ప ఇతరులెవరి పేరుపై నైనా మొక్కుబడులు చెల్లిస్తే అది “షిర్క్” ఆచారమే అవుతుంది. ఒక వేళ ఎవరైనా తెలిసి తెలియక మొక్కుబడులు చేసుకొని ఉంటే, వాటిని నెరవేర్చకూడదు. దాని వల్ల ఎలాంటి నష్టంగాని లేక కీడుగాని జరగదు. కనుక ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ఎవరైతే అల్లాహ్ విధేయత పట్ల మొక్కుబడి చేసుకున్నారో వారు ఆ మొక్కుబడిని తీర్చాలి. మరియు ఎవరైతే అల్లాహ్ అవిధేయత పట్ల మొక్కుకున్నారో వారు ఆ మొక్కబడిని తీర్చకూడదు.”” (బుఖారి :2602).
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 67-70). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1- దర్గాలు అంటే; కొంత మంది ప్రజలు ఒక పుణ్యాత్ముని సమాధిని ఎన్నుకొని, అక్కడ మహిమలు జరుగుతున్నాయని దానిపై గుంబద్‌లు, గోపురాలు నిర్మించి, అక్కడ అర్చకులుగా కొంత మంది కూర్చుని కొన్ని కార్యకలాపాలను నిర్వహించుకొనే స్థలాలను “దర్గాలు” అంటారు.
2- సమాధి చేయబడి ఉన్న వారి సంతానం నుండి ఒక వారసుణ్ణి “సజ్జాదా నషీన్” (పీఠాధిపతి) గా ఎన్నుకుంటారు. వారినే “పీర్ సాహెబ్” అంటారు. మరియు సమాధి చేయబడిన వ్యక్తిని “వలీఅల్లాహ్” గా భావించి దర్గా నిర్మాణం చేస్తారు.
౩- కొంత మంది స్వార్థపరులు అడవుల్లో, కొండల్లో, లేక పట్టణము యొక్క పొలిమేరన ఒక సమాధిని ఉద్బవింపజేసుకొని, దానికి ఒక పుణ్యాత్ముని పేరుపెట్టి, ఆ సమాధి వల్ల అనేక “కరామత్‌లు” (మహిమలు) జరుగుతున్నాయంటూ కట్టుకథలు చెప్పుకుంటారు. ఇలా వివిధ రకాలుగా ‘దర్గా’లను నిర్మంచుకుంటారు.
దర్గాల అలంకరణ:
దర్గాల నిర్వాహకులు దర్గాల అలంకరణ కొరకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. మొట్ట మొదట సమాధులను పటిష్టవంతం చేస్తారు. తరువాత దానిపై ఒక మహా కట్టడాన్ని నిర్మిస్తారు. మశీదుల గుంబద్‌ల వలే దానిపై కూడా గుంబద్‌లు నిర్మిస్తారు. పచ్చటి మరియు కాషాయ రంగులతో సమాధిని కలర్ చేస్తారు. చివరికి ఒక పటిష్టవంతమైన ఆరాధన నిలయంగా నిర్మిస్తారు. తరువాత ప్రతి ఏట ఆ సమాధులను ఆకర్ణణీయకంగా, మనోరంజకంగా రూపుదిద్దుతారు. దర్గాలను మరియు వాటిలో ఉన్న సమాధులను నీళ్ళతో కడిగి శుభ్రపరుస్తారు. తరువాత వాటిపైన సిల్కు చాదర్లు మరియు పూల దండలు కప్పుతారు, దర్గా మొత్తం ఎర్రటి మరియు పచ్చటి లైట్లతో అలంకరిస్తారు. పవిత్రంగా భావించి సమాధి చుట్టు దీపాలు వెలిగిస్తారు, సాంబ్రాణి పొగలు రేకెత్తిస్తుంటారు. అక్కడ “ముజావర్” గౌరవ మర్యాదలతో కూర్చొని, అక్కడికి ఆరాధన భావంతో వచ్చేవారి కోసం సమాధి పూజలు (ఫాతిహాలు) జరుపుతుంటారు.
ఉరుస్ ఆచారాలు:
అరబీ నిఘంటువులో “ఉర్స్” అర్దం: పెళ్ళి కొడుకు లేక పెళ్ళి మరియు సంతోషం అన్న అర్దాలున్నాయి. దీనినే ప్రజలు ఉరుస్ అని అంటుంటారు.
మన సమాజంలో ప్రసిద్ది చెందిన ‘ఉరుస్‘ అంటే: పుణ్యాత్ముల పేరున నిర్మించబడిన దర్గాల (సమాధుల) వద్ద ప్రతి ఏట మరణదినం (వర్ధంతి) ఉత్సవాలు నెరవేర్చి ‘ఉరుస్’ అనే వ్యతిరేకమైన పదాన్ని వాడుతున్నారు.
పుణ్యాత్ముడని భావించిన వ్యక్తి మరణించిన తేది ప్రకారం అతని సమాధిపై ‘సందల్ కి రస్మ్‘ పేరుతో పూల పందిరిని తయారు చేసుకొని ఊరంతా ఊరేగిస్తూ, మహా హంగామా చేసుకుంటూ, దర్గాకి చేరుకొని అక్కడున్న సమాధిపై దానిని ఉంచుతారు. అలాగే జండాను కూడా ఊరంతా ఊరేగిస్తూ తీసుకొచ్చి ఆ దర్గాలోనే ఒక చెట్టున పాతి పెడతారు. దానిని ‘ఝoడా చెట్టు’ అంటారు. మరియు “మలంగ్” అనే వ్యక్తి మూడు రోజుల వరకు కాళ్ళను, చేతులను దారాలతో బంధించుకొని ఆ దర్గాలోనే బస చేస్తాడు. ఆ మూడు రోజుల వరకు తినుటకై అతను పండ్లు ఫలాలు మరియు పాలు తీసుకుంటాడు. తరువాత చివరి రోజున ఫకీర్లు “జర్బ్” పేరున తమ శరీరాలలో కమ్మీలు, కత్తులు పొడుచుకునే ‘కనికట్టు‘ నాటకాలు బహిరంగంగా నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాలను మూడురోజుల పాటు జరుపుతారు. తరువాత జనసంఖ్య రాకను బట్టి ఉరుసును 15 రోజుల వరకు పెంచుకుంటారు. మరియు ఆ రోజుల్లో సమాధి చుట్టుప్రక్కల మహా సంతను ఏర్పాటు చేస్తారు. ఆ సంతలో నలువైపుల నుండి వ్యాపారస్తులు అక్కడికి చేరుకొని తమ సామగ్రి అమ్మకాలు జోరుగా జరుపుకుంటారు. ఆ దర్గా సిబ్బంది ఆ వ్యాపారస్తుల నుండి బాడుగ పేరుతో సొమ్మును వసూలు చేస్తారు. ఆ సంతలో ప్రత్యేకమైన, ఆకర్షనీయమైన ఖవ్వాలీ పాడే గాయని, గాయకులు ఆటపాటల కచ్చేరీలు రాత్రంతా నిర్వహిస్తారు. ఆ రాత్రుల్లో మద్య పానీయాలు సేవించి, మతిపోయే గంజాయి త్రాగుడుతో అనేక మంది ప్రజలు ఊగుతూ తూగుతుంటారు. ఆ ‘ఉరుసుల’లో పిల్లలు, పెద్దలు మరియు వృద్దులు, ఆడా మగా, హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు పాల్గొంటారు. దీనిని పుణ్యాత్ముల పేరిట ‘“ఉరుస్” ఉత్సవాలు అని జరుపుకుంటారు.
ఈ ఆచారాలకు మరియు ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. కనుక ఇది ఇస్లామీయ ధర్మ ఆచారం అనటం కూడా ఘోరమైన పాపమే.
దర్గాల గురువులు మరియు వారి వాస్తవికత
సమాధి ఆధిపత్యానికి చెందిన పీర్‌సాహెబ్ (పీఠాధిపతి) చుట్టూ కొందరు ప్రత్యేకమైన శిష్యులు ఉంటారు, వారిని ‘ముజావర్లు” అంటారు. వీరే అక్కడికి వచ్చే ప్రజలకు గురువులు, ఆ సమాధులకు అర్చకులు. వీరు ఇస్లామీయ ధర్మఙ్ఞానం లేని మూర్ఖులు, మత్తుపానీయాలు సేవించే మస్తాన్లు, గంజాయి సిగరెట్లు కాల్చే గుణహీనులు, తంబాకు మరియు పాన్‌పరాక్ నమిలే అసమర్థులు, ప్రజల విశ్వాసాలతో ఆడుకునే మంత్రగాళ్ళు, భయంభక్తి లేని షైతానులు, మోసగాళ్ళకే మోసగాళ్ళు, అమాయక ప్రజల సొమ్మును దోచుకొనే గజదొంగలు, పొట్టకొస్తే అక్షరం ముక్కరాని అజ్ఞానులు, లేనిపోని కట్టు కథలు “ఔలియాల కరామతులు” (మహిమలు) అంటూ ఉపన్యాసాలు పీకుతారు. అమాయక ప్రజలను మూఢ విశ్వాసాల లోయలోకి నెట్టుతారు. అలా సమాధి చేయబడి ఉన్నవారిని మరియు ఆ పీఠాధిపతిని దేవుని స్థాయికి పెంచి స్పష్టమైన షిర్క్ కార్యాకాలాపాలు నిర్వహస్తుంటారు.
అలాంటి గుణహీనులు సంతానం లేనివారికి సంతాన ప్రాప్తిని, నిరుద్యోగులకు ఉద్యోగాలను, కష్టాల నుండి రక్షణను, నష్టాల నుండి లాభాలను, దుఃఖాల నుండి సుఖాలను, అశాంతి నుండి శాంతిని, అస్వస్థత నుండి స్వస్థతను, చేతబడి నుండి రక్షణను, అపజయాల నుండి విజయాలను, అగౌరవం నుండి గౌరవాలను ప్రసాదిస్తారా! అంతే కాదు, దేవుని ఆరాధన లేకుండానే పరలోక మోక్షాన్ని, స్వర్గ ప్రవేశ పత్రాలను సయితం ప్రసాదిస్తామంటూ, ఆ పత్రాలను కొన్నవారికి స్వర్గమే నిలయమంటూ ప్రచారం కూడా చేస్తుంటారు.
ఇస్లాం ధర్మంలో సమాధుల కట్టడాలు , వాటిపై ముజావర్లుగా కూర్చోవటం నిషిద్ధం:
సమాధులను సున్నంతో లేక సిమెంట్‌తో పటిష్టవంతంగా నిర్మించడం, వాటిని గొప్ప స్థానానికి పెంచడం, అక్కడ పీఠాధీపతులు (ముజావర్)గా కూర్చోవడం అధర్మమైనది. మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వాటి గురించి కఠినంగా హెచ్చరించారు.
హజ్రత్ జాబిర్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం):
“సమాధిని పటిష్టవంతం చేయడాన్ని, దానిపై (ముజావర్లుగా) కూర్చోవటాన్ని, దానిపై కట్టడం నిర్మించడాన్ని నిషేధించారు” (ముస్లిం :970)
హజ్రత్ అలీ (రజియల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో ఇలా అన్నారు:
“ప్రతి ఆరాధ్య విగ్రహాన్ని పగలగొట్టు మరియు ప్రతి ఎత్తుగా ఉన్న సమాధిని నేలమట్టం చెయ్యి.” (ముస్లిం :969)
ఇక్కడ ఎత్తుగా కట్టబడిన సమాధిని సహితం నేలమట్టం చేయవలసిందిగా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేసారు. అయిన మన అమాయక ముస్లింలు పుణ్యాత్ముల పేరుతో లేక మహానీయుల పేరుతో సమాధుల్ని ఎత్తుగా కట్టడమే కాకుండా, వాటిపై పటిష్టవంతమైన గోపురాలు కట్టి, ఆరాధ్య నిలయాలుగా చేసుకున్నారు. మరియు వాటి వద్ద ముజావర్లగా నియుక్తులై అమాయక ప్రజలను ధర్మం పేరుతో మోసగిస్తున్నారు.
సమాధుల ఆరాధన
అనేక మంది ప్రజలు మూఢ విశ్వాసాలకు గురికాబడి, సమాధుల వద్దకు జియారత్ పేరున, వాటి ఆరాధనకై పలు ప్రదేశాలకు ప్రయాణిస్తుంటారు. మరియు కొంత మంది ప్రజలు హజ్ ఆరాధనకు ప్రయాణించినట్లు సమాధుల ఆరాధనకై ప్రయాణిస్తారు. ఏ విధంగానయితే ఒక్క అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలో అదే విధంగా ఆ సమాధులను ఆరాధిస్తారు. అంటే: “దర్గాల వద్ద సజ్దాలు చేయటం, వాటి చుట్టూ ప్రదక్షణలు చేయటం, అక్కడ తలనీలాలు అర్పించటం, వాటి ముందు భయంభక్తిని చూపటం, అక్కడ నమాజులు చదవటం, ఖుర్‌ఆన్ పారాయణం చేయటం, వారిని మొరపెట్టుకోవటం, వారి పేరుతో మొక్కుబడులు చెల్లించటం, వారి పేరున జంతువులను బలినివ్వటం, అక్కడ అన్నదానాల ఏర్పాటు చేయటం, తమ మొక్కుబడుల ప్రకారం అక్కడ బస చేయటం వంటి అనేక విధాల ఆరాధనలు పాటిస్తారు.
ఆ సమాధుల పట్ల అతిగా ప్రవర్తిస్తూ వాటిని చుంబించటం, అక్కడ కాల్చబడిన అగరబత్తీల వీబూదిని తబ్బరుక్‌గా భావించి తినడం, దానిని శరీరంపై రుద్దుకోవటం, అక్కడ దీపాలుగా వెలిగించబడిఉన్న నూనెను, సమాధిపై ఉన్న పూలను తబ్బరుక్‌గా తీసుకోవటం, టెంకాయలు మరియు తీపు వస్తువులు ఆ సమాధుల కొరకు అర్పించి, వాటిపై ఫాతిహాలు చదివిన తరువాత తబ్బరుక్‌గా భావించటం వంటి అనేక విధాల కార్యకలాపాలు జరుపుతారు. దాని ప్రతిఫలంగా సమాధిలో ఉన్న ఆ “వలీఅల్లాహ్” సిఫారసు అల్లాహ్ వద్ద వారికి ప్రాప్తిస్తుందని విశ్వసిస్తారు. మరియు అల్లాహ్ వద్ద వారు ఎవరికైనా సిఫారసు చేస్తే, వారి సిఫారసును అల్లాహ్ ధిక్కరించడని భావిస్తారు.
మరియు కొంత మంది ప్రజలు: అల్లాహ్‌కు చెందిన కొన్ని అద్భుతమైన శక్తులకు ‘ఔలియాలు‘ కూడా అర్హులని విశ్వసిస్తారు. మరియు ఆ పుణ్యాత్ములే వారిని నష్టాల నుండి ఆదుకుంటారు, కష్టాల నుండి రక్షిస్తారు అని విశ్వసిస్తారు. అందుకని వారు దేశవిదేశాలలో పేరు ప్రతిష్టలు పాందిన దర్గాలకు “జియారత్” పేరున తిరుగుతుంటారు. మరియు యా అలీ మదద్, యా ముష్కిల్ కుషా దస్తగీర్ , యా గౌస్ మదద్, యా ఖాజా గరీబున్ నవాజ్ వంటి షిర్క్ పదాలను వాడుతుంటారు.
దర్గాల నిర్మాణం మరియు వాటి సందర్శనం, వాటి కొరకు ప్రయాణించడం మరియు అక్కడ నిర్వహించే ఏ ఒక్క కార్యానికీ ఖుర్‌ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు. అలైహి వసల్లం) ద్వారా ఎలాంటి ప్రామాణికమైన సాక్ష్యాధారాలు లేవు. పైగా ఆరాధన భావంతో ఇలాంటి ప్రదేశాలకు ప్రయాణించడం లేక సందర్శించడం ఇస్లాం ధర్మంలో నిషేధించడం జరిగింది. కనుక ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు;
“మీరు మూడు మసీదులకు తప్ప మరేచోటుకు (ఆరాధన భావంతో) ప్రయాణం చేయకండి. ఒకటి కాబతుల్లాహ్ (మక్కా మసీదు), రెండు మస్జిదే నబవి (మదీనా మసీదు), మూడు మస్జిదే అఖ్సా (జెరూసలేం మసీదు) ” (బుఖారీ:1115, ముస్లిం: 2475)
హజ్రత్ అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“మీ ఇండ్లను స్మశానవాటిక చేయకండి, నా సమాధిని మీరు (ప్రజలు) ఉత్సవ కేంద్రంగా చేయకండి. అయితే నా కొరకు దరూద్ దుఆ చేయండి, మీరు ఎక్కడ ఉన్నా మీప్రార్ధన నాకు చేరుతుంది.”(అబూదావూద్: 2042)
హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హ) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణ సమయాన ఇలా ప్రవచించారు:
“అల్లాహ్ యూదుల్ని, క్రైస్తవుల్ని శపించాడు. వారు తమ ప్రవక్తల సమాధుల్ని సజ్‌దా (ఆరాధ్య) నిలయాలుగా చేసుకున్నారు.” (బుఖారీ)
పైన ఇవ్వబడిన హదీసులను గమనించినట్లయితే ప్రవక్తల సమాధులను ఆరాధ్య నిలయాలుగా చేసుకోకూడదని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాంటప్పుడు పుణ్యాత్ముల సమాధులను ఆరాధన పరంగా గౌరవించడం, ఆరాధన పరంగా సమాధుల వద్దకు ప్రయాణించడం, అక్కడ ఉరుసుల పేరుతో సంబరాలు జరపడం వంటి అధర్మ కార్యాలు ధర్మం ఎలా ఔతుంది? మరియు యూదులు, క్రైస్తవులు అల్లాహ్ ఆగ్రహానికి మరియు మార్గభ్రష్ఠత్వానికి గురికాబడిన ముఖ్య కారణం సమాధులను ఆరాధ్య నిలయాలుగా చేసుకోవడమే అన్న విషయం కూడా స్పష్టంగా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసుల ద్వారా తెలుస్తున్నది.
అలాగే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సమాధి వద్దకు సహితం సంబరాల (ఉరుసు) కొరకు సమావేశం కాకూడదని హెచ్చరించారు. చివరకు ఆయనపై దరూద్ పంపాలనుకున్నా సమాధి వద్దకు రావలసిన అక్కర లేదు. మీరెక్కడ నుండి ఐనా నా కొరకు దరూద్ చదవండి, అది నా వద్దకు చేర్చబడుతుంది అన్న విషయాన్ని కూడా తెలియజేశారు.
ఇస్లామీయ సోదరులారా! ప్రవక్తల సమాధులనే ఉత్సవ స్థలాలుగా, ఆరాధ్య నిలయాలుగా చేసుకోవడం తప్పయితే, ‘ఔలియాల’ సమాధుల్ని ఉత్సవ కేంద్రాలుగా, ఆరాధ్య నిలయాలుగా చేసుకొనే ప్రశ్న ఎలా జనిస్తుంది? యదార్ధం ఏమిటంటే, కొంత మంది ప్రజలు తమ స్వార్ధాల కొరకు ఇస్లామీయ హద్దుల్ని దాటి దర్గాల సందర్శన పేరుతో వాటిని ఆరాధ్య నిలయాలుగా, ఉత్సవ ప్రదేశాలుగా చేసుకున్నారు. అలాంటివారంతా ప్రవక్త ముహమ్మద్ ( సల్లల్లాహు అలైహి వసల్లం) హితవుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అందువలన సమాధుల కట్టడాలు, అక్కడ నిర్వహించే ఆరాధ్య కార్యాలు, ఖవ్వాలీల కచ్చేరీలు పూర్తిగా ఇస్లామీయ ధర్మానికి విరుద్ధం. కనుక ‘ఉరుసు’లను నిర్వహించడం, ఉరుసుల కొరకు చందాలు ఇవ్వటం, వారికి సహాయం చేయటం వంటి కార్యాలన్నీ ఇస్లామీయ నిజ ధర్మానికి వ్యతిరేకంగా సహాయం చేయటంతో సమానమే.
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 100-108). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగం ఖురాన్‌లోని సూరా రూమ్, 40వ ఆయతుపై దృష్టి పెడుతుంది. అల్లాహ్‌కు మాత్రమే ఉన్న నాలుగు ప్రత్యేక శక్తులను ఇది వివరిస్తుంది: సృష్టించడం, జీవనోపాధిని ప్రసాదించడం, మరణాన్ని ఇవ్వడం మరియు పునరుత్థానం చేయడం (తిరిగి బ్రతికించడం). అల్లాహ్‌తో పాటు పూజించబడే ఇతర భాగస్వాములు (దైవాలు) ఈ పనులలో ఏ ఒక్కటైనా చేయగలరా అని ఈ ఆయతు ప్రశ్నిస్తుందని వక్త నొక్కిచెప్పారు. వారు ఏమీ చేయలేరని, కాబట్టి అలాంటి భాగస్వామ్యాల నుండి అల్లాహ్ పవిత్రుడు మరియు ఉన్నతుడని స్పష్టం చేశారు. అందువల్ల, మానవులు ఈ నాలుగు గుణాలు ఉన్న ఏకైక సత్య దేవుడైన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలని, ఎందుకంటే మరణం తర్వాత ప్రతి ఒక్కరూ ఆయన వద్దకే తిరిగి వెళ్ళాలని మరియు అక్కడ ఆయనే తప్ప మరెవరూ సహాయం చేయలేరని ఇది ఒక శక్తివంతమైన పిలుపు.
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ (అ’ఊజు బిల్లాహి మినష్-షైతానిర్-రజీమ్) (శపించబడిన షైతాన్ నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను).
సూరా రూమ్‌లోని ఆయతు నంబర్ 40లో అల్లాహుతాలా చెప్పాడు,
“అల్లాహ్! ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. ఆయనే మీకు ఉపాధి ప్రసాదించాడు. మరియు ఆయనే మీకు మరణం ప్రసాదిస్తాడు. ఆ తర్వాత మళ్లీ మిమ్మల్ని బ్రతికిస్తాడు.”
ఈ నాలుగు విషయాలు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తెలిపిన తర్వాత ఏమంటున్నాడో కొంచెం గమనించండి: هَلْ مِن شُرَكَائِكُم مَّن يَفْعَلُ مِن ذَٰلِكُم مِّن شَيْءٍ (హల్ మిన్ షురకా’ఇకుమ్ మన్ యఫ్’అలు మిన్ జాలికుమ్ మిన్ షై’)
“మీరు ఆ అల్లాహ్‌ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో, ఎవరెవరినైతే సాటి కల్పిస్తున్నారో, వారిలో ఏ ఒక్కరైనా ఈ నాలుగు, నాలుగిటిలో ఏ ఒక్క విషయం చేసేటటువంటి శక్తి గలవారా?”
ఏంటి ఈ నాలుగు? సృష్టించడం, మరియు ఉపాధిని ప్రసాదించడం, బ్రతికి ఉన్న వారికి మరణం ప్రసాదించడం, మరియు అందరూ చనిపోయిన తర్వాత ప్రళయం సంభవించిన తర్వాత మరోసారి వారందరినీ బ్రతికింపజేసి, వారందరినీ లేపి, సమూహపరచి, వారితో లెక్క తీసుకోవడం. ఈ నాలుగు విషయాలు గానీ, నాలుగిటిలో ఏదైనా ఒకటి గానీ, మీ ఈ సాటి కల్పింపబడేవారు ఎవరైనా చేయగలుగుతారా? వాస్తవానికి ఎవరూ చేయలేరు. అందు గురించే అల్లాహ్ స్వయంగా ఏమంటున్నాడు:
سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ (సుబ్హానహూ వ త’ఆలా అమ్మా యుష్రికూన్) “వారు ఆ అల్లాహ్‌తో పాటు ఎవరెవరినైతే సాటి కల్పిస్తున్నారో, భాగస్వాములుగా చేస్తున్నారో, అలాంటి భాగస్వామ్యానికి ఆ అల్లాహ్ ఎంతో అతీతుడు మరియు ఎంతో ఉన్నతుడు. అలాంటి ఏ అవసరం అల్లాహ్‌కు లేదు.”
అందుగురించే మానవులారా! మానవులారా! ఇలాంటి నాలుగు రకాల క్వాలిటీస్ ఉన్న ఆ సత్య ప్రభువును మాత్రమే మీరు పూజించండి. ఎవరెవరినైతే పూజిస్తున్నారో, వారిలో ఇలాంటి శక్తి ఏదైనా ఉందా లేదా ముందే మీరు పరిశీలించుకోండి. లేదా అంటే, ఒక రోజు కాకున్నా ఒక రోజు మనం చనిపోయేవాళ్ళం. ఆ తర్వాత ఆ సృష్టికర్త వద్దకే మనం మరలింపబడతాము. అక్కడ మనకు ఆ అల్లాహ్ తప్ప ఇంకా ఎవరూ కూడా పనికిరారు. అల్లాహ్ మనందరికీ సన్మార్గం చూపుగాక.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) (మరియు మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు).
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ (అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్) (మీపై శాంతి మరియు అల్లాహ్ కారుణ్యం కురియుగాక).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహ్మతుల్లాహి అలైహి) యొక్క సంక్షిప్త జీవిత చరిత్ర, మరియు ప్రత్యేకంగా గ్యారవీ(రబీఉస్సానీ నెల 11 వ రోజు)గురించి నిజమైన వివరాలు ఈ వీడియోలో తెలుసుకోగలరు
ఈ ప్రసంగంలో, వక్త షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) గారి జీవిత చరిత్ర, ఆయన వంశం మరియు విద్య గురించి క్లుప్తంగా వివరిస్తారు. ఆయన తౌహీద్ (ఏకదైవారాధన) మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని అనుసరించడంపై చేసిన స్పష్టమైన బోధనలను ఉటంకిస్తారు. అనంతరం, రబీఉల్-ఆఖర్ నెలలో ఆయన పేరు మీద జరిగే ‘గ్యారవీ’ మరియు జెండాలు ఎగురవేయడం వంటి ఆచారాలను తీవ్రంగా ఖండిస్తారు. ఈ పనులు షిర్క్ మరియు బిద్అత్ (ధర్మంలో నూతన కల్పనలు) అని, ఇస్లాం బోధనలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేస్తారు. ఆయన పట్ల గౌరవం చూపించడం మరియు ఆయన విషయంలో అతిశయోక్తికి పాల్పడటం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ, సరైన మధ్య మార్గాన్ని అనుసరించాలని ఉద్బోధిస్తారు. చివరగా, ఇటువంటి మూఢనమ్మకాలకు, కల్పిత కథలకు దూరంగా ఉండి, ఖుర్ఆన్ మరియు సున్నత్‌ను మాత్రమే అనుసరించాలని ముస్లిం సమాజానికి పిలుపునిస్తారు.
السلام عليكم ورحمة الله وبركاته [అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్] మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.
الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد [అల్ హందులిల్లాహి వహ్దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు అమ్మా బ’అద్] సర్వ స్తోత్రాలు ఏకైకుడైన అల్లాహ్ కే. ఆయన తర్వాత ఏ ప్రవక్త లేరో, ఆయనపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఇక అసలు విషయానికొస్తే…
మహాశయులారా, పీరానే పీర్, మహబూబే సుబ్ హానీ, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్ వారి యొక్క జీవితం మరియు సంక్షిప్తంగా వారి జీవిత చరిత్రతో పాటు వారి యొక్క ముఖ్య బోధనలు ఇంకా రబీఉస్సానీ, రబీఉల్-ఆఖర్ ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఈ నాలుగోవ నెల ఇందులో సామాన్యంగా మన దేశాల్లో పీరానే పీర్ పేరు మీద కొత్త జెండాలు పెట్టడం, గ్యారవీలు చేయడం, ఇంకా ఇలాంటి దురాచారాలు ఏదైతే చేస్తున్నారో వాటి వాస్తవికత ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
సోదర మహాశయులారా, పీరానే పీర్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై హిజ్రీ శకం 470 లేదా 471లో జన్మించారు. ఆయన జన్మించిన స్థలం ఇరాక్ లో జీలాన్ మరియు అలాగే కీలాన్ అని కూడా అనబడింది. కానీ జీలానీ అన్న పేరుతో చాలా ప్రఖ్యాతి గాంచారు.
షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారి జీవితం
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇద్దరు మనమలు హజ్రత్ హసన్ మరియు హజ్రత్ హుసైన్ రదియల్లాహు అన్హుమా వీరిద్దరిలో హజ్రత్ హుసైన్ రదియల్లాహు తాలా అన్హు వంశానికి చెందినవారు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై.
యవ్వనంలో చేరిన తర్వాత ఇంచుమించు సుమారు 17, 18 సంవత్సరాల వయసులో బగ్దాద్ లో వచ్చారు. ఆనాటి కాలంలో బగ్దాద్ లో ప్రఖ్యాతిగాంచిన చాలా గొప్ప పండితులు ఉన్నారు. వారితో విద్య అభ్యసించారు.
[నేను ఎక్కువ వివరాల్లో వెళ్లకుండా, మూడు విషయాలు మీ ముందు తెలియజేస్తాను అని చెప్పాను గనుక ప్రతి దాంట్లో కొంత భాగాన్ని తీసుకుని, ఆయన పేరు మీద జరుగుతున్న దురాచారాల గురించి కొంత వివరంగా, స్పష్టంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.]
షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై సుమారు 90 సంవత్సరాల వయసు అల్లాహ్ వారికి ఇచ్చారు. ఇంచుమించు 40 నుండి 50 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన చాలా లోతుగా, మరీ ఎంతో శ్రమించి, కష్టపడి విద్య నేర్చుకున్నారు. ధర్మ విద్యలో ఎన్నో రకాలు కేవలం ఖుర్ఆన్ హిఫ్జ్ మరియు కొన్ని హదీసులు హిఫ్జ్ చేసుకోవడమే కాదు, ఇందులో ఉసూలె తఫ్సీర్, తఫ్సీర్, ఉసూలె హదీస్, హదీస్, ఫిఖ్, ఉసూలె ఫిఖ్ ఇవన్నీ కూడా వస్తాయి. అంతేకాకుండా తజ్కియె నఫ్స్ అంటే మనశ్శుద్ధి, మనిషి యొక్క మనసు ఎల్లప్పుడూ పరలోక విషయంలో ఆలోచిస్తూ ఉండే విధంగా, ఇహలోక జీవితంలోని క్షణం క్షణం కూడా పరలోక లాభానికై గడిపేటువంటి ఆలోచన మనసులో రావాలి. దాని గురించి కొన్ని ప్రత్యేక శిక్షణలు ఇస్లాం ఇచ్చిన ఆదేశ ప్రకారం, వేరే తసవ్వుఫ్ మరియు కొన్ని బిద్అతులు తసవ్వుఫ్ పేరు మీద ఏదైతే మొదలయ్యాయో అలా కాకుండా, అందులో కూడా షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ప్రఖ్యాతిగాంచారు.
ఇంకా మహాశయులారా, విద్య అభ్యసించే కాలంలో ఆయనపై ఎన్నో ఆపదలు వచ్చాయి. ఎన్నెన్నో రోజులు తినడానికి బుక్కెడు కూడు దొరికేది కాదు. అలాంటి కష్టాలను కూడా ఆయన భరించారు. ఆ తర్వాత అల్లాహు తఆలా ఇంచుమించు 40 సంవత్సరాల కన్నా కొంచెం ఎక్కువగా ఆయన ప్రజలకు ఇక విద్య నేర్పడం మొదలుపెట్టారు అంటే అందులో కూడా అల్హందులిల్లాహ్ అల్లాహు తఆలా చాలా సేవలు ఆయన నుండి తీసుకున్నాడు. అల్లాహ్ తఆలా వాటన్నిటినీ స్వీకరించి, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై సమాధిని అల్లాహ్ నూర్ తో, కాంతితో నింపుగాక. అల్లాహు తఆలా ఆయన యొక్క సమాధిలో స్వర్గపు ద్వారాలు తెరువగాక. ఎల్లవేళల్లో అల్లాహు తఆలా తన కరుణా కటాక్షాలు ఆయనపై కురిపిస్తూ ఉండుగాక. మరియు అల్లాహు తఆలా ఆయనతో సంతోషించి ఆయన ఇహలోకంలో ఇన్ని సత్కార్యాలు చేశారో వాటన్నిటిని స్వీకరించి, ఆయనతో జరిగిన పొరపాట్లను అల్లాహ్ క్షమించుగాక, మన్నించుగాక. ఆమీన్.
మహాశయులారా, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై గారు కొన్ని పుస్తకాలు, గ్రంథాలు కూడా రచించారు. అందులో “గునియతుత్ తాలిబీన్” అని చాలా ప్రఖ్యాతిగాంచింది. ఇంకా వేరే కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. మరియు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై వారు వారి యొక్క బోధనలు, వారు తమ గ్రంథంలో రాసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే, చదివితే మరియు వారి పేరు తీసుకొని ఈ రోజుల్లో ఎవరెవరైతే గ్యారవీలు, జెండాలు ఇట్లా అన్నీ చేస్తున్నారో వారి యొక్క పరిస్థితి చూస్తే చాలా భిన్నంగా కనబడుతుంది.
తౌహీద్, సున్నత్ పై ఆయన బోధనలు
ఉదాహరణకు, తౌహీద్ విషయంలో ఒక సందర్భంలో షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై చెప్పారు, “ఓ ప్రజలారా, ఏ సృష్టి చేతిలో కూడా ఎలాంటి అధికారం లేదు. అందరూ కూడా బలహీనులు మరియు ఇహలోకంలో ఎవరైనా రాజు అయినా, ప్రజా అయినా, సిరిసంపదలు గలవాడైనా లేక పేదవాడైనా అందరూ కూడా అల్లాహ్ విధివ్రాతకు లొంగిబడి ఉన్నారు. వారందరి యొక్క హృదయాలు కేవలం అల్లాహ్ చేతిలోనే ఉన్నాయి. అల్లాహ్ తాను కోరినట్లు వారి యొక్క హృదయాలను మారుస్తూ ఉంటాడు.” ఈ విషయం ఆయన రచించిన ఒక గ్రంథం “అల్-ఫత్హుర్ రబ్బానీ” అని 88వ పేజీలో ఉంది.
ఇంకా మహాశయులారా, ఇదే గ్రంథంలోని 191వ పేజీలో,
“ఓ ప్రజలారా, షరీఅత్ ను అనుసరించండి. బిద్అత్లను మీరు కల్పించకండి. మీరు షరీఅత్ ను అనుసరిస్తూ దాని వ్యతిరేకత నుండి దూరం ఉండండి. అల్లాహ్ యొక్క మాట విని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించండి. ఎప్పుడూ కూడా అల్లాహ్ కు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తకు అవిధేయులుగా కాకండి. తమలో ఇఖ్లాస్, సంకల్ప శుద్ధి మీరు పాటించే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితిలో కూడా షిర్క్ మరియు దాని దరిదాపులకు తాకకండి. ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని చాటుతూ ఉండండి. అల్లాహ్ యొక్క దర్బార్, అల్లాహ్ యొక్క ముందు నుండి మీరు దూరం కాకండి. కేవలం అల్లాహ్ తో మాత్రమే అర్ధించండి. అల్లాహ్ తప్ప ఇంకా ఎవరి ముందు కూడా మీరు మీ చెయ్యి చాపకండి. ఏ సహాయమైనా గాని అల్లాహ్ తప్ప ఇంకా ఎవరితో కోరకండి. కేవలం అల్లాహ్ మీద మాత్రమే మీరు నమ్మకం, భారం వేసి ఉండండి. అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరి మీద కూడా మీరు మీ నమ్మకాన్ని ఉంచుకోకండి.”
ఇంకా, ఒక సందర్భంలో షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై తమ యొక్క శిష్యునికి బోధ చేస్తూ, “వాస్తవమైన సాఫల్యం పొందడానికి ఒక ఉత్తమమైన చిట్కా తెలుసుకో” అని ఇలా తెలిపారు, “ఒకవేళ నీవు సాఫల్యం కోరితే, నీ మనసులో నుండి, నీ హృదయంలో నుండి అల్లాహ్ తప్ప ఇతరులందరినీ కూడా తీసేసెయ్. అంటే, అల్లాహ్ తప్ప ఇంకా ఎవరితో కూడా భయపడకు. అల్లాహ్ తప్ప ఇంకా ఎవరి మీద కూడా ఎలాంటి ఆశ పెట్టుకోకు. అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరితోనైనా నీకు ఏదైనా శాంతి లభిస్తుంది అని కూడా నీవు ఆశించకు. ఇంకా, అన్ని విధాలుగా, అన్ని రకాలుగా నీవు అందరినీ అసహ్యించుకొని కేవలం అల్లాహ్ ను మాత్రమే ఇష్టపడి, ఆయన ప్రేమను మాత్రమే పొందే ప్రయత్నం చెయ్.” ఇక్కడ అందరినీ అసహ్యించుకోవడము అంటే అల్లాహ్ ఎదుట. అంటే అల్లాహ్ కంటే ఎక్కువగా వేరే ఎవరినైనా ప్రేమించడం, అల్లాహ్ కంటే ఎక్కువగా ఎవరితోనైనా భయపడడం, దీన్ని ఖండిస్తున్నారు. “గమనించు, నీవు అల్లాహ్ ను కాకుండా ఎవరిదైనా ప్రేమ నీ మనసులో వచ్చింది అంటే, నీవు ఒక ముర్దార్, ఒక శవాన్ని, ఒక చనిపోయిన దానిని ఎలా చూసి నీ మనసులో ఛీ అనుకుంటావో అలా భావించు. ఎందుకంటే అల్లాహ్ యొక్క జిక్ర్, అల్లాహ్ యొక్క స్మరణ తప్ప నీకు ఎక్కడా కూడా ఆత్మశాంతి అనేది లభించదు. అల్లాహ్ ను వదిలి నీవు ఇతరులను స్మరిస్తూ ఉంటే, అల్లాహ్ ను వదిలి నీవు ఇతరులను నీవు ఇష్టపడినావంటే నీకు ఎప్పుడూ కూడా సుఖము, శాంతి లభించదు.”
ఈ విధంగా మహాశయులారా, చెబుతూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇత్తిబా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించే విషయంలో కూడా ఎంతో ఖరాఖండిగా, ఎంతో క్లియర్ గా చెప్పేశారు. “ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించడం లేదో, అంటే ప్రవక్త తీసుకువచ్చిన ధర్మానిని అనుసరించకుండా ఆయన యొక్క అనుసరణను వదిలి ఇంకా వేరే ఎవరినైనా అనుసరణను అతడు అవలంబిస్తాడో, అతడు ఎన్నటికీ అల్లాహ్ వద్దకు చేరుకోలేడు. అల్లాహ్ యొక్క ప్రవక్త అల్లాహ్ వద్ద చేరుకోవడానికి ఒక మాధ్యమంగా వచ్చారు. ఆయనను అనుసరించడం తప్పనిసరి. ఆయన అనుసరణ ఎవరైతే వదులుకుంటారో, అతడు నాశనమైపోతాడు. నాశనమైపోతాడు, నాశనమైపోతాడు. అతడు దుర్మార్గంలో పడిపోతాడు, దుర్మార్గంలో పడిపోతాడు.” ఈ విషయం “అల్-ఫత్హుర్ రబ్బానీ” పేజీ నంబర్ 115 లో రాసి ఉంది.
ఇంతేకాకుండా ఇంకా షిర్క్ నుండి, అల్లాహ్ ను కాకుండా వేరే వారిపై నమ్మకాలు ఉంచుకునే దాని గురించి కూడా ఇంకా ఎంతో స్పష్టంగా తెలిపారు. అయితే మహాశయులారా, ఇక రండి మనం కొన్ని క్షణాల్లో ఈ రోజుల్లో జరుగుతున్న గ్యారవీ మరియు జెండాలు, గుండాలు వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మార్గభ్రష్ట ఆచారాలు – గ్యారవీ
మహాశయులారా, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై విషయంలో మన సమాజంలో ఒక రకం ప్రజలలో ఎలా ఉన్నారు? ఆయనను ఎంతో గొప్పగా భావించి, నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ అల్లాహ్ యొక్క వలీ, అల్లాహ్ యొక్క భక్తుడు అని అంటారు కానీ, ఆయన గురించి నమ్మకం, ఆయన గురించి విశ్వాసం, ఆయన గురించి మనసులో ప్రేమ, ఆయన గురించి తమ మనసులో భయం అల్లాహ్ పట్ల ఎలా ఉండాలో అలా ఉంటుంది కొందరికి. ఇది చాలా తప్పు విషయం. చెప్పడానికి నోటితో చెబుతారు, నేను ఈ మాట అన్నందుకు “లేదు నువ్వు తప్పు చెబుతున్నావు” అని తిరుగబడతారు. కానీ నేను చెప్పే ఈ మాట వారి యొక్క రోజువారీ జీవితం ఏదైతే ఉందో, దైనందిన జీవితంలో వారి యొక్క పరిస్థితి ఏదైతే మనం కళ్ళారా చూసామో దానిని చూసి నేను చెబుతున్నాను.
ఉదాహరణకు, మన సమాజంలో చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. గ్యారవీ చేయకుంటే ఈ సంవత్సరం మనకు ఏదైనా నష్టం చేకూరుతుంది. పీరానే పీర్ సాబ్ యొక్క గ్యారవీ అది చేస్తేనే కదా మనకు అన్ని రకాల బాగులు, అన్ని రకాల మంచితనాలు మన ఇంట్లో జరిగేది. చివరికి ప్రతి ఈ నెలలో కొత్త జెండాలు ఏదైతే నాటుతారో, పచ్చ జెండాలు ఏదైతే తమ ఇంటి మీద ఎగురవేస్తారో ఈ జెండాలు ఎప్పటివరకైతే పచ్చగా ఉంటాయో అప్పటివరకు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై గారి యొక్క దీవెనలు, ఆయన యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయి. చివరికి కొందరు పల్లెటూర్లలోని విషయం, గ్రామాల్లోని విషయం స్వయంగా నేను ఎందరో గ్రామస్థులతో విన్న విషయం. ఈ సంవత్సరం మా బర్రె ఏదైతే చనిపోయిందో, ఈ సంవత్సరం మా పంటలో, పొలంలో ఏదైతే నష్టం జరిగిందో ఎవడో మొల్వి సాబ్ అట వాడు వచ్చి చెప్పిండు గ్యారవీ చేయొద్దు అని. అందు గురించి మేము చేయడం మానేసుకున్నాము. మాకు ఇదంతా నష్టం జరిగింది. పీరానే పీర్ సాబ్ మా మీద ఎంత కోపంగా ఉన్నాడో ఏమో మేము ఆయన పేరు మీద ఈ సంవత్సరం గ్యారవీ చేయలేదని. ఈ విధంగా వారి యొక్క నమ్మకాలు ఉన్నాయి.
వారు అల్లాహ్ ఎవరు అని అడిగితే మీరు “అల్లాహ్ ఒక్కడే, మన యొక్క దేవుడు” అని అంటారు. మన యొక్క ఆరాధనీయుడు అని అంటారు. అందరికంటే ఎక్కువగా ఎవరితో భయపడతావు అని అంటే “అల్లాహ్ తో” అని అంటారు. ఎవరి మీద నీకు నమ్మకం అనేది ఉంటే “అల్లాహ్ మీద” అని అంటారు. అయితే కేవలం నోటితో అనడం సరిపోదు సోదరులారా. వారి యొక్క జీవితంలో వ్యవహారం ఎలా ఉంది? ఏదైనా నష్టం జరిగింది అంటే “అయ్యో ఫలానా దర్గా కాడికి మేము పోలే కదా. మేము ఫలానా పీరానే పీర్ సాబ్ యొక్క చిల్లాఖానా నుండి మేము దాటాము కానీ కనీసం మేము అక్కడ కొంచెం చందా కూడా ఇయ్యలేదేమో, నజరానా వేయలేదు. అందుగురించి వాళ్ళ యొక్క పీడ మా మీద పడింది.” ఇది ఏంటి? లాభనష్టాలు అల్లాహ్ కాకుండా, అల్లాహ్ చేతిలో కాకుండా ఇంకా వేరే వారి చేతిలో కూడా ఉన్నాయి అని నమ్మడమే కదా! అందు గురించి మనం మహాశయులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వయంగా షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఏమంటున్నారు? “నీ మనసులో నుండి అల్లాహ్ తప్ప ఇతరులందరినీ తీసేసెయ్. అల్లాహ్ పట్ల మాత్రమే ప్రేమ, అల్లాహ్ తో మాత్రమే భయం, అల్లాహ్ తో మాత్రమే ఆశ, అల్లాహ్ మీదనే నమ్మకం నీవు ఉంచుకో. అప్పుడే నీవు సాఫల్యం పొందుతావు” అని పీరానే పీర్ రహమతుల్లాహి అలై గారు తెలుపుతున్నారు.
సరైన మధ్య మార్గం
ఒక రకం మన ప్రజలలో ఇలాంటి వారు. ప్రజలు కొందరు ఇలా చేస్తున్నారు అని మరికొందరు ఏక్ దం అపోజిట్ గా మారుతారు. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ ప్రవక్తనా? ఏమైనా నబీనా? మనం వారిని అంతగా పొగడడానికి, అంతగా వారిని ప్రశంసించడానికి, ఆయన యొక్క పేరు అంతగా తీసుకోవడానికి, ఆయన కూడా ఒక సామాన్య మనిషి, ఆయన యొక్క ప్రస్తావనే ఎందుకు మనం తీసుకురావాలి? అని ఏ మాత్రం విలువ లేకుండా కూడా చేస్తూ ఉంటారు. అయితే మధ్యే మార్గం అదే సరైన మార్గం ఏమిటంటే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై అల్లాహ్ యొక్క దాసుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచర సంఘంలోని ఒక ఉత్తమ వ్యక్తి మరియు ఆయన ఇన్ షా అల్లాహ్ అల్లాహ్ యొక్క గొప్ప వలీ అని కూడా మనం నమ్మవచ్చు. ఆయన చేసిన సేవలను బట్టి, ఆయన ఇస్లాం ధర్మ వ్యాప్తి కొరకు ఏ సేవలైతే అందించారో వాటిని బట్టి మనం అల్లాహ్ యొక్క గొప్ప వలీ అని అనడంలో కూడా ఇన్ షా అల్లాహ్ ఎలాంటి అభ్యంతరం లేదు.
కల్పిత కథలు
కానీ ఎన్నో చరిత్ర పుటల్లో మరియు ఈ రోజుల్లో రాయబడే ఎన్నో పుస్తకాల్లో కూడా ఆయన గురించి ఎన్నో మితిమీరిన విషయాలు రాయబడ్డాయి. ఎన్నో మితిమీరిన విషయాలు రాయబడ్డాయి. వాస్తవానికి కొన్ని సందర్భాలలో వింటే కూడా ఆ విషయాలు వింటే మన విశ్వాసం ఎక్కడ పాడైపోతుందో అన్నటువంటి భయం కూడా కలుగుతుంది.
మాకు అప్పుడు అంత జ్ఞానం లేదు ధర్మం గురించి. ఇంకా చాలా చిన్న వారిమి. బహుశా 13-14 సంవత్సరాల వయసు ఉండవచ్చు, బహుశా. రోడ్డు మీద వెళ్తున్నాము, ఒక మస్జిద్ లో ప్రసంగం జరుగుతుంది. ఈ రోజు ఇంత రాత్రి ప్రసంగం ఏంటి? ఇషా నమాజ్ అయిపోయి గంట, రెండు గంటలు అయిపోయింది కదా అని అక్కడ కొంతసేపు వెళ్లి కూర్చున్నాము. బహుశా అది ఈ రబీఉల్ ఆఖర్ నెల, ప్రజలు కొందరు ఏమంటారు దీన్ని? గ్యారవీ కా మహినా. రబీఉల్ ఆఖర్, రబీఉస్సానీ అని కూడా గుర్తు లేదు. అయితే అక్కడ మౌల్వీ సాబ్ ప్రసంగం చేస్తూ చేస్తూ నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై గారి యొక్క కరామతులు తెలుపుతూ నఊదు బిల్లాహ్, సుమ్మ నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ ఒక వ్యక్తి ఏమన్నాడు మాట్లాడుతూ, అల్లాహు తఆలా మరియు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఇద్దరూ, మన వాడుక భాషలో ఈ రోజుల్లో చెప్పాలనుకుంటే, వాకింగ్ చేస్తున్నారు ఆకాశం మీద. నడుస్తూ నడుస్తూ నఊదు బిల్లాహ్, సుమ్మ నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ నకలె కుఫ్ర్ కుఫ్ర్ న బాషద్, అల్లాహ్ యొక్క కాలు జారిపడిందంట నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. అప్పుడు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ అల్లాహ్ ను పట్టుకున్నాడంట. అందు గురించే అప్పటి నుండి ఆయన పేరు దస్తగీర్ అని పడ్డది. ఈ బిరుదు ఆయనకు లభించినది. దస్తగీర్ ఈ పేరు, ఈ బిరుదు ఎలా లభించినది అని వావ్ వావ్ అస్తగ్ఫిరుల్లాహ్ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పట్ల ఎలాంటి పరిహాసం జరుగుతుంది? ఎలాంటి అవిశ్వాస మాటలు మాట్లాడుతున్నారో ప్రజలు దీన్ని గమనించడం లేదు.
కానీ అస్తగ్ఫిరుల్లాహ్ మనం నేను ఈ మాట చెప్పినప్పుడు ఇలాంటి మాటలు ఎవరూ చెప్పరు అని అంటారు. కానీ అక్కడ వారి పండితులు చెప్పే యొక్క ఆ విధానం, ఉర్దూలో సామాన్యంగా మేము విన్న విషయాలు కదా ఇవి, ఇప్పుడు నేను వాటిని తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఆ ఉర్దూలో పాడుకుంటూ ఎంతో ఆ..ఆ అనుకుంటూ ఏదైతే చెబుతారో దాంట్లో ప్రజలు అల్లాహ్ పట్ల ఎలాంటి అవిశ్వాస మాటలు, పరిహాసం జరుగుతుంది అది ఆలోచించరు. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై గారి యొక్క గొప్పతనం గురించి ఆలోచించుకుంటూ వారు వెళ్తారు. అదే ధోరణిలో వారికి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఆయనను ప్రశంసించడం, ఆయన యొక్క గొప్ప విషయాలు అన్నట్టుగా వారు అర్థం చేసుకుంటారు. కానీ సోదరులారా, ఇప్పటికీ ఉన్నాయి ఇలాంటి తప్పుడు భావనలు.
ఇంకో మాట కొందరితో విన్నాను. నేను స్వయంగా వినలేదు కానీ ఎంతోమంది చెప్పారు. వారు విన్నారు ప్రసంగాలలో అని. ఒక ముసలామె ఆమెకు కేవలం ఒకే ఒక కొడుకు ఉండేనట. అయితే ఆ కొడుకు చనిపోతే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ వద్దకు ఆమె వచ్చింది. చాలా బతిమిలాడింది. అప్పుడు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ డైరెక్ట్ ఆదేశించాడంట మలకుల్ మౌత్ కు. ప్రాణాలు తీసే ఆత్మ దూత ఎవరైతే ఉన్నారో ఆయనకు మలకుల్ మౌత్ కు “నీవు ఈ రోజు ఆ అబ్బాయి యొక్క ప్రాణం ఏదైతే తీసుకున్నావో తిరిగి వేసెయ్. ఆ అబ్బాయి యొక్క అవసరం ఆ అతని యొక్క తల్లి ముసలామెకు చాలా ఉంది అని.” నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. మలకుల్ మౌత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మాట వినలేదంట. దాని మూలంగా షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ కోపంతో ఆయన ఆ రోజు ఎవరెవరి ప్రాణాలైతే తీసుకుని పోతున్నాడో ఆ సంచిని కొట్టేస్తే, ఎంతమంది ప్రాణాలు ఆ రోజు తీసుకోబడ్డాయో వారందరూ బ్రతికిపోయారంట నఊదు బిల్లాహ్. ఇంకా ఇదే సంఘటనను ఇంకా వేరే ఎన్నో రకాలుగా కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు కొందరు.
ఏంటి ఇవన్నీ విషయాలు? ఇలాంటి అతిశయం, ఇలాంటి మితిమీరిన మాటలు, ధర్మానికి వ్యతిరేకమైన మాటలు, ధర్మానికి వ్యతిరేకమైన విశ్వాసాలు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఇలాంటి మాసాల్లో ఈ గ్యారవీల యొక్క మహఫిల్లు, సమావేశాలు ఏదైతే జరుగుతాయో అందరూ కొందరు ప్రసంగం చేసేవారు, ప్రసంగిస్తూ ఈ మాటలు చెబుతూ ఉంటారు.
గ్యారవీకి సమర్థనల ఖండన
అయితే మహాశయులారా, ఇలాంటి విశ్వాసాలకు, ఇలాంటి తప్పుడు ధోరణికి, ఇలాంటి మూఢనమ్మకాలకు మనం చాలా దూరం ఉండాలి. ఆయన అల్లాహ్ యొక్క మంచి భక్తులు, ఇస్లాం వ్యాప్తి కొరకు చాలా ప్రయత్నం చేశారు, చాలా కృషిపడ్డారు. ఇస్లాం అభ్యాసన గురించి మరియు తర్వాత ఇస్లాం యొక్క శిక్షణ ప్రజలకు ఇవ్వడానికి చాలా ఆయన యొక్క త్యాగాలు ఉన్నాయి. అల్లాహ్ తఆలా వాటన్నిటినీ స్వీకరించుగాక అని మనం చెప్పాలి. కానీ ఇలాంటి మూఢనమ్మకాలలో మనం వెళ్ళకూడదు.
ఇక గ్యారవీ విషయం నఊదు బిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. కొందరు రాశారు కొన్ని పుస్తకాలలో. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చాలీస్వా చేసేవారంట. అంటే వారి యొక్క నమ్మకం ప్రకారంగా ఈ మాటనే తప్పు. మరియు ఒకవేళ ఈ మాట చెప్పినా గాని కొంచెం ఆలోచించి చెప్పలేదు గనుక ఆ తప్పు మరింత స్పష్టంగా కనబడుతుంది. ఏంటి? గ్యారహ్, పదకొండు రబీఉస్సానీకి చాలీస్వా చేసేవారు. పదకొండు రబీఉస్సానీకి చాలీస్వా చేసేవారు అనేది ఉంటే ఎక్కడ కుదురుతుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పన్నెండు రబీఉల్ అవ్వల్ కు చనిపోయారు కదా. పన్నెండు తర్వాత చాలీస్వా ఎప్పుడు వస్తుంది? నలభైవ రోజులు ఎప్పుడు వస్తాయి? రబీఉస్సానీ 22వ తారీఖు, 23వ తారీఖు. కానీ మరి ఇక రాసేవాళ్ళు ఎలాంటి ఆలోచనలో రాశారో. అందు గురించేమంటారు? బిద్అతులు ఏవైతే ఉంటాయో, దురాచారాలు ఏవైతే ఉంటాయో వాటికి కాళ్ళు, రెక్కలు, వాటికి పునాదులు అనేటివి ఉండవు.
అయితే, రాసిన విషయం ఏంటంటే, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఈ రబీఉస్సానీలో ప్రతి సంవత్సరం 11వ తారీఖుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు మీద చాలీస్వా చేసేవారంట. అది ప్రజలకు ఎంత ఇష్టమైంది అంటే, ప్రజలు ఎంత ఇష్టపడ్డారు అంటే చివరికి ప్రతి నెల 11వ తారీఖుకు చేయడం మొదలు పెట్టారంట. అరబీ హిజ్రీ ప్రకారంగా ప్రతి అరబీ నెల 11వ తారీఖుకు. ఇక షేఖ్ అబ్దుల్ ఖాదిర్ రహమతుల్లాహి అలై చనిపోయిన తర్వాత ప్రజలు ఆయన పేరు మీదనే ఉరుసు మొదలుపెట్టి, ఆయన పేరు మీదనే గ్యారవీలు చేయడం మొదలు పెట్టారు అని. వాస్తవానికి ఇవన్నీ కూడా అబద్ధాలు, అసత్యాలు. ఎందుకంటే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఇలాంటి ఏ పనులు చేయలేదు, ఇలాంటి పనులు చేయాలని ఎప్పుడూ కూడా చెప్పలేదు. ఆయన తన జీవితంలో చెప్పిన మాట ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించండి. మీరు సాఫల్యం పొందాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. ఆయన అనుసరణను వదిలారంటే మీరు నాశనమైపోతారు, మీరు దుర్మార్గంలో పడిపోతారు అని చెప్పారు.
ఇంకా మహాశయులారా, గ్యారవీ ఎప్పటి నుండి మొదలైంది దీని గురించి ఖచ్చితంగా ఆధారం అనేది లేదు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా కొందరు రాశారు పుస్తకాలలో, కానీ అది ఏ మాత్రం నిజమైన మాట కాదు. మరొక విచిత్ర విషయం ఏంటో తెలుసా? షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఇరాక్ లో పుట్టారు, అక్కడే జన్మించారు, అక్కడే మరణించారు, అక్కడే ఆయన బుగ్దాద్ లో ఉండి సేవలు, ధర్మ సేవలు అన్నీ కూడా అందించారు. అయితే ఆయన పేరు మీద దురాచారాలు ఎన్నో జరుగుతాయి ఇటు అరబ్ దేశాల్లో కూడా. కానీ గ్యారవీ యొక్క బిద్అత్ అరబ్ దేశంలో లేదు. కేవలం మన దేశాల్లోనే ఉంది. అంటే ఆయన పేరు మీద మన దేశంలో ఇది కొందరు ఎవరైనా మొదలుపెట్టి ఉంటారు.
మరి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా, గ్యారవీ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై వారి పేరు మీద చేయడం తప్పు లేదు అని మన వద్ద కొందరు మౌల్వీ సాబులు అంటారు. ఎందుకు? అంటే ముర్దోం కె నామ్ కా ఈసాలె సవాబ్ కర్ సక్తే. అంటే మన బంధువుల్లో గాని, ఇస్లాం ప్రకారంగా ఎవరైనా చనిపోయిన వాళ్ళ పేరు మీద వారి యొక్క ఆత్మలకు, వారికి పుణ్యం లభించాలి అని మనం ఏదైనా సత్కార్యం చేయవచ్చు. దానధర్మాలు, సద్కాలు లాంటివి. ఈ గ్యారవీ కూడా అలాంటి ఈసాలె సవాబ్ అని ప్రజలతో చేయించడానికి వారు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఇది ఈసాలె సవాబ్ కూడా కాదు. కేవలం కొందరు మౌల్వీ సాబులు చెబుతున్నారు ప్రజలు చేయాలి అని. కానీ ప్రజలు చేస్తున్నది ఏమిటి? ప్రజలు చేస్తున్నది నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లు, ఈ రోజు మనం గ్యారవీ చేస్తే, ఈ సంవత్సరం మనం గ్యారవీ చేస్తే మన ఇంట్లో అంత శుభాలు ఉంటాయి, మన ఇంట్లో అన్ని కరుణా కటాక్షాలు కురుస్తూ ఉంటాయి, మన పంట పొలాలు అన్నీ బాగుపడతాయి, మన బర్రెలు, మన ఆవులు అన్నీ మంచిగా పాలు ఇస్తూ ఉంటాయి, మంచిగా వాటికి కూడా ఈ విధంగా లాభాలు కలుగుతాయి అన్నటువంటి అయితే ఎందరో ముస్లింలలో వారి యొక్క నమ్మకాలు ఏంటి? ఇవన్నీ మనం చేస్తే ఈ లాభాలన్నీ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ద్వారా లేక ఆయన మాధ్యమంతో, ఉన్కె తవస్సుల్ సే మనకు లభిస్తాయి అని. ఒకవేళ చేయకుంటే మనకు ఏదైనా నష్టం వాటిల్లుతుంది. ఈ విధంగా వాస్తవానికి తఖర్రుబ్ ఇలల్లాహ్, అల్లాహ్ యొక్క ఆరాధన, అల్లాహ్ యొక్క సంతృప్తి పొందడానికి మనం ఏ పుణ్య కార్యాలు అయితే చేస్తామో, ఏ దానధర్మాలు అయితే చేస్తామో, అలాంటిది ఇది గైరుల్లాహ్ (అల్లాహ్ యేతరుల ) కొరకు చేయడం జరుగుతుంది. దీనికి కేవలం పేరు మార్చినంత మాత్రాన ఇది ఈసాలె సవాబ్ పేరు కింద లెక్కింపబడదు. ఎవరైనా బ్రాందీ, విస్కీ ఇది చాలా ఆత్మ శుద్ధి చేస్తుంది, మన యొక్క రక్తంలో చాలా బలం చేకూరుస్తుంది విటమిన్ B మాదిరిగా అనుకుంటూ తాగితే దానిని హలాల్ అని అనవచ్చా? అనరాదు. అందు గురించి ఈ గ్యారవీ అనేది ఈసాలె సవాబ్ కింద లెక్కింపబడదు.
మరొక విషయం నేను ఇంతకు ముందు చెప్పాను కదా? అరబ్ దేశంలో ఇది లేదు. గ్యారవీ అని దీనిని ఏదైతే అంటున్నారో దానికి అరబీలో ఏం పదం వస్తుంది? హాదీ అషర్ అని వస్తుంది. యెహ్దా అషర్ పదకొండు. గ్యారహ్. గ్యారవీ, పదకొండవది. హాదీ అషర్ అని అంటారు. హాదీ అషర్ పేరుతో ఇస్లాంలో ఏదైనా ఈసాలె సవాబ్ కార్యం, ఇస్లాంలో ఏదైనా దానధర్మాల కార్యం ఏదైనా ఉందా? ఏదీ లేదు.
మరొక విషయం మనం ఆలోచించాలి, అదేమిటంటే ఈసాలె సవాబ్ అని ఏదైతే అంటున్నారో సామాన్యంగా ఈసాలె సవాబ్ ఏం జరుగుద్ది? మనం మన తండ్రి వైపు నుండి, మన తల్లికి ఏదైనా పుణ్యం దొరకాలి అని బీదవాళ్లకు బట్టలు కుట్టిస్తాము. ఎవరైనా బీదవాళ్లు వారికి నెలంతా గడవడానికి వారి వద్ద ఎలాంటి తిండి సౌకర్యాలు లేకుంటే వారికి రేషన్ ఇప్పిస్తాము. లేదా ఇంకా ఎవరికైనా నీళ్ళు త్రాగడానికి కష్టంగా ఉండేది ఉంటే బోర్ వెల్, బావి అలాంటిది ఏదైనా వారికి చేసిస్తాము. వాటి యొక్క పుణ్యం మన ఆ తల్లికి, తండ్రికి, మనం ఎవరి గురించి ఆలోచించుకుంటున్నామో, దుఆ చేస్తున్నామో వారికి దొరుకుద్ది. కానీ ఈ గ్యారవీలో చేసినప్పుడు ఏం జరుగుద్ది? అందరూ మనోళ్ళు, మన బంధువులు, మన మౌల్వీ సాబు, వాళ్ళకే, వాళ్ళే తిని వెళ్తూ ఉంటారు. బీదవాళ్లకు ప్రత్యేకంగా ఇక్కడ ఎక్కడ జరుగుతుంది? అయితే “ఈ రోజు నుండి మేము బీదవాళ్లకి ఇచ్చి గ్యారవీ చేస్తాము” అని అనకండి. అలా చేస్తే కూడా ఇది యోగ్యం కాదు.
మరొక విషయం గమనించాలి మహాశయులారా, అదేమిటంటే కొందరిని ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ ఈసాలె సవాబ్ చేసేది ఉంటే మీ తల్లిదండ్రుల హక్కు మీకు ఎక్కువ ఉంది గనుక వారి పేరు మీద చేయండి. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ పేరు మీదనే ఎందుకు? “ఏ లేదు, ఆయన అల్లాహ్ యొక్క చాలా గొప్ప వలీ. ఆయన ధర్మ వ్యాప్తి కొరకు చాలా త్యాగాలు చేశారు. అందు గురించి ఆయన గురించి చేస్తున్నాము.” మరి అంతకంటే ఎక్కువ ఇస్లాం సేవలు చేసిన వారు ఇంకా వేరే ఇమాములు కూడా ఉన్నారు. అంతకంటే ఎక్కువ చేసిన వారు సహాబాలు ఉన్నారు. అంతకంటే ఎక్కువ చేసిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. వారందరి పేరు మీద కూడా ఈసాలె సవాబ్ లు చేసుకుంటూ పోతే ఏదైనా ఒక రోజు మనకు మిగులుద్దా? ఒకసారి గ్యారవీ ఉంటుంది, ఒకసారి బారవీ ఉంటుంది, ఇంకోసారి తేరవీ ఉంటుంది, ఇంకోసారి చౌదవీ ఉంటుంది. ఇక ప్రతి రోజు ఏదో ఒకటి చేస్తూనే పోవాలి. అల్లాహ్ మనకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.
ముగింపు
అందు గురించి చెప్పే విషయం ఏంటంటే, మహాశయులారా, మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ మీరు చేస్తూ ఉంటే ఇలాంటి కార్యాలు, గ్యారవీలు, ఆ జెండాలు గిట్ల పెట్టడం, ఇలాంటి చేస్తూ ఉండేది ఉంటే మాకు వ్యతిరేకంగా చెప్పాడు అని మాట వినడం వదులుకోకండి. అల్లాహ్ ఇచ్చిన బుద్ధి జ్ఞానంతో ఆలోచించండి. అల్లాహ్ మనకు ఒక ఖుర్ఆన్ ఇచ్చాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసులు ఇచ్చాడు. మనం
لا إله إلا الله محمد رسول الله [లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్] అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు, ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త.
అని చదువుతున్నాము. ఈ జెండాలు పెట్టాలి అని ఎక్కడైనా ఖుర్ఆన్ లో ఉందా? ఎక్కడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు హదీస్ లో చెప్పారా? ఈ గ్యారవీలు చేయాలి అని ఎక్కడైనా ఖుర్ఆన్ లో ఉందా? మనకు ఎక్కడైనా హదీస్ లో ఉందా?
ఈ రోజు ఒక వెబ్సైట్ చూస్తున్నాను నేను, ఎవరైతే సామాన్యంగా తమకు తాము అహ్లె సున్నత్ వల్ జమాఅత్ అని అనుకుంటూ ఉంటారో, అలాంటి వారి ఒక వెబ్సైట్. వారు తమ వెబ్సైట్ లో ఏం రాశారు? “గ్యారవీ చేయడం చాలా సున్నత్ పని, ముస్తహబ్ పని, మంచి కార్యం.” ఎందుకు? అందులో మనం అన్నీ మంచి కార్యాలు చేస్తూ ఉంటాము. ఏంటి? అందులో మనం జమా అయి ఖుర్ఆన్ చదువుతూ ఉంటాము. ఖుర్ఆన్ చదవడం తప్పా? అందులో ఆ ఆ రోజు మనం జమా అయి ఒకచోట మనం ఒకరికొకరు బోధ చేసుకుని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చరిత్ర చెప్పుకుంటాము, ఆఖిరత్ గురించి, పరలోకం గురించి గుర్తు చేసుకుంటాము. ఇది తప్పా? ఆ రోజు ఏదైనా కొంచెం మంచి వంటకాలు వండుకొని స్వయం మనం తింటాము మరియు బీదవాళ్లకు తినిపిస్తాము. ఇది తప్పా? ఇలాంటి విషయాలు రాసి ప్రజలను ప్రోత్సహిస్తున్నారు గ్యారవీ చేయాలి అని.
కానీ మీరే బుద్ధిపూర్వకంగా ఆలోచించండి. ఖుర్ఆన్ చదవడం తప్పు అని ఎవరైనా అంటారా? కాదు కదా! దానికి ప్రత్యేకంగా గ్యారవీ అనే పేరు పెట్టుకోవడం ఎందుకు? ప్రతి రోజూ ఖుర్ఆన్ చదవండి. నలుగురు ఎక్కడైనా జమా అయి, సమకూరి ఏదైనా మనం ఖుర్ఆన్ విద్య నేర్చుకోవడం, పరలోక విషయం నేర్చుకోవడం, పరలోకం గుర్తించే అటువంటి విషయాలు మనం తెలుసుకోవడం ఇది తప్పా? కాదు. మరి దాని గురించి గ్యారవీ అని పేరు పెట్టి ఒకచోట ఎందుకు జమా కావడం? ప్రతి రోజూ లేక మీకు వీలున్నప్పుడు వారంలో ఒకసారి, నెలకొకసారి, పదిహేను రోజులకొకసారి మీరు కూర్చోండి, జమా అయి మీ యొక్క విద్యా గురువును పిలిచుకుని కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండండి. గ్యారవీ అని దానికి పేరు పెట్టే అవసరం ఏంటి? అలాగే దానధర్మాలు చేయడం, మంచి వంటకాలు వండుకోవడం, ఇస్లాం మనల్ని నిరాకరిస్తుందా? లేదు. మీరు మీ ఇంట్లో మీ బంధువులకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఎంతగా చెప్పారు? మీరు వండుకున్న కూరలో కొన్ని నీళ్లు ఎక్కువ పోసి మీ పొరుగువారికి ఇవ్వండి. సంతోషంలో పాలు పంచుకోండి. అయితే మనం మనకు ఇష్టమున్న రోజు ఇవన్నీ చేసుకోవచ్చు. దానికి గ్యారవీ అని పేరు పెట్టుకుని ఇవన్నీ ఎందుకు చేయడం? గ్యారవీ అని, పీరానే పీర్ పేరు మీద అని, ప్రజలు వారిలో ఉన్నటువంటి విశ్వాసం అది వేరు. ఇక్కడ మొల్వి సాబులు చెబుతున్న విషయం వేరు. దానికి ఈసాలె సవాబ్ అని పేరు ఇవ్వడం, ఖుర్ఆనే కదా, ఇదే కదా, ఇదే కదా అని కొన్ని పుణ్యాలను లెక్కించడం, ఈ పుణ్యాలు చేస్తూ ఉండడానికి గ్యారవీ అన్న పేరు దాని గురించి ఎందుకు? ఆలోచించండి, గ్రహించండి, ఇస్లాం నుండి, ఇస్లాం పేరు మీద దూరం అయ్యే ప్రయత్నం చేయకండి. ఎప్పటివరకైతే మనం ఖుర్ఆన్ హదీసును చదవడం మానుకుంటామో, చదవడం లేదో, ఇలాంటి కొందరు ఇస్లాం మీద వ్యాపారం చేసి మనల్ని ఇస్లాం నుండి దూరం చేస్తూ ఉంటారు కానీ మనం గ్రహించలేకపోతాము. అల్లాహ్ తఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఇలాంటి దురాచారాల నుండి దూరం ఉంచుగాక.
جزاكم الله خيرا والسلام عليكم ورحمة الله وبركاته [జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్] అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక, మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.
ముఖ్య సూచనలు
షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ వంటి ధార్మిక శ్రేష్ఠులను గౌరవించాలి, కానీ వారి విషయంలో అతిశయోక్తికి పాల్పడి, అల్లాహ్ కు ఇవ్వాల్సిన స్థానాన్ని వారికి ఇవ్వకూడదు.
‘గ్యారవీ’ మరియు జెండాలు ఎగురవేయడం వంటివి ధర్మంలో నూతనంగా కల్పించబడిన ఆచారాలు (బిద్అత్). వాటికి ఖుర్ఆన్ మరియు సున్నత్‌లో ఎలాంటి ఆధారం లేదు, కనుక వాటికి దూరంగా ఉండాలి.
లాభనష్టాలు కేవలం అల్లాహ్ చేతిలో మాత్రమే ఉన్నాయి. ఆయన తప్ప మరెవరూ మనకు మేలు గానీ, కీడు గానీ చేయలేరని దృఢంగా విశ్వసించాలి.
ధర్మంలో ఏ ఆచరణ అయినా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మార్గనిర్దేశం ప్రకారమే ఉండాలి. ఆయనను అనుసరించడంలోనే సాఫల్యం ఉంది.
ధార్మిక విషయాలను గుడ్డిగా అనుసరించకుండా, ఖుర్ఆన్ మరియు సహీ హదీసుల వెలుగులో విశ్లేషించి, అర్థం చేసుకోవాలి.
దానధర్మాలు మరియు పుణ్యకార్యాలు ఏ ప్రత్యేక రోజుకో పరిమితం చేయకుండా, నిరంతరం చేస్తూ ఉండాలి.
అల్లాహ్ మీ కొరకు నిషేధించినవి ఇవే: చచ్చిన జంతువులు, (ప్రవహించిన) రక్తం, పందిమాంసం, ఇంకా అల్లాహ్ తప్ప ఇతరుల పేరు ఉచ్చరించబడినది. ఎవరయినా ఉద్దేశపూర్వకంగా కాకుండా, హద్దులను అతిక్రమించకుండా – గత్యంతరం లేని స్థితిలో – తింటే పాపం కాదు. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, జాలి చూపేవాడు. (సూరా అల్ బఖర 2:173)
ప్రియ సోదరులారా! ఇది ఇస్లామీయ నాల్గవ నెల రబీఉస్సానీ కొందరు ఈ నెలను గ్యారవీ నెలగా గుర్తిస్తారు. ఈ నెలలో అబ్దుల్ ఖాదిర్ జీలానీ పేరు మీద మొక్క బడులు, నైవేద్యాలు చెల్లిస్తారు. అతని పేరుపై పెంచబడిన పశువులను అతని పేరుతో జబహ్ చేస్తారు. ఎందుకంటే ఈ నెలలోనే 11వ తేదీనాడు అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణించారు. వారి సాన్నిహిత్యం పొందటానికి, వారిని సంతోష పరచటానికి ఈ మూఢాచారాలను నెరవేరుస్తారు. దీని ప్రాముఖ్యతను ఎంత గొప్పగా చెప్పుకుంటారంటే నమాజ్, రోజాలను ఆచరించనివాడు కూడా వీళ్ళ దృష్టిలో పాపాత్ముడేమీ కాదు. కానీ గ్యారవీ చేయని వాడిని మాత్రం మహా పాపాత్ముడుగా భావించి దూషిస్తారు.
గ్యారవీ అనే ఈ మూఢాచారాన్ని కల్పించిన వాడు మౌల్వీ అహ్మద్ రజాఖాన్ బరేల్వీ. వీడు అజ్ఞానకాలం నాటి ఒక ధర్మాన్ని స్థాపించాడు. దీన్ని నిర్మూలించటానికే అనేక మంది ప్రవక్తలు పంపబడ్డారు. చివరిగా మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చి ప్రజలకు దైవ ధర్మసందేశాన్ని అందజేసారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించిన 1260 సంవత్సరాల తర్వాత బరేల్వియత్ స్థాపించబడింది. అయినా ప్రజలు దీన్ని ధర్మంగా భావించి స్వీకరించారు.
గ్యారవీ స్థాపకుడు మౌల్వీ అహ్మద్ రజాఖాన్ బరేల్వి ఈ మూఢాచారాన్ని స్థాపించి అబ్దుల్ ఖాదిర్ జీలానీని దైవస్థానానికి చేర్చివేసాడు. బరేల్వీ గ్రంధాల ప్రకారం అహ్మద్ రజాఖాన్ తన రచన కితాబుబరకాతి ఇమ్ దాద్ లో ఇలా వ్రాసాడు. “కష్టాల్లో, ఆపదల్లో ఎవరైనా నన్ను సహాయం అర్ధిస్తే, నేను అతని కష్టాలను దూరం చేస్తానని, ఇంకా పిలిచేవాని పిలుపు విని అతని విన్నపాన్ని స్వీకరిస్తానని, మరియు అల్లాహ్ సాన్నిహిత్యం . మన కు పొందటానికి నన్ను మధ్యవర్తిగా భావించడం తప్పని సరి అని అబ్దుల్ ఖాదిర్ జీలానీ అన్నారు”. మరోచోట ఇలా వ్రాసాడు- “నేను నా జీవితంలో అబ్దుల్ ఖాదిర్ జీలానీని వదలి ఇతరులను ఎన్నడూ మొరపెట్టుకోలేదు. సహాయం అర్ధించలేదు. ఒకసారి ఇతన్ని వదలి మహబూబ్ అలీని పిలిచే ప్రయత్నం చేసాను. కాని నా నోట యాగౌస్ పాక్ అనే రాసాగింది.” (మల్ పూజాజ్ అహ్మద్ రజా/ 307)
ఇటువంటి అనేక చిన్న చిన్న కల్పిత సంఘటనలు అబ్దుల్ ఖాదిర్ జీలానీ పై మోపబడ్డాయి. వాస్తవం ఏమిటంటే వీరందరూ అల్లాహ్ దాసులే వీరి బలహీనత, అసహాయతకు సంబంధించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకి – షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ ఒకసారి ఇలా అన్నారు. “నాకు అన్నిటికంటే ప్రజలకు అన్నం పెట్టటమంటే చాలా ఇష్టం. కాని ఏంచేయను బలహీనుణ్ణి, ప్రతి రోజు ప్రజలకు అన్నం పెట్టేంత ధనం నాదగ్గర లేదు.’ (ఫత్ హుర్రబ్బానీ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ).
ఈసంఘటన వల్ల తెలిసిన విషయం ఏమిటంటే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ కి తన జీవితంలో తాను కోరింది చేసే శక్తి ఉండేది కాదు. ఎందుకంటే అల్లాహ్ శక్తి ముందు మానవులందరూ అసహాయులే అటువంటప్పుడు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణానంతరం ప్రజల కష్టాలను దుఃఖాలను, కోరికలను ఏలా తీర్చగలరు?
ఈ గ్యారవీ మూఢాచారాన్ని ప్రోత్సహించే నిమిత్తం అనేక నిరాధారమైన కాల్పనిక కధలు ప్రచారం చేయబడ్డాయి. అంతేగాక ఇవి పరలోక సాఫల్యానికి సాధనాలుగా భావించ డ్డాయి.
ఈ మూఢాచారానికి సంబంధించిన వాస్తవాలు అవాస్తవాలు ఇవి :
షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణం రబీ ఉస్సానీ 11వ తేదీన సంభవించింది అని భావిస్తారు. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ జయంతి జరుపుకోవటం ఆయన ప్రీతి పొందే ఒక విధానం అనే మూఢాచారాన్ని నమ్ముతారు. అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణ తేదీ గురించి సంబలీ గారు కితాబుహాలాత్ షేక్ లో ఇలా రచించారు – “అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారి మరణ తేదీలో, నెలలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొందరు సఫర్ మాసంగా మరికొందరు రబీఉస్సానీగా మరికొందరు 27వ తేదిగా 8వ తేదిగా, 9వ తేదీగా, 11వ తేదీగా మరికొందరు 13, 14 గా పేర్కొన్నారు. భారతదేశంలో దీన్ని 11 రబీఉస్సానీ నాడు జరుపు కుంటారు”. భాగ్దాద్లో 17 రబీఉస్సానీ నాడు జరుపుకుంటారు. మరణ తేదిలో ఇన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా భారత దేశంలో మాత్రం 11వ తేదీన గ్యారవీగా జరుపుకుంటారు.
అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణతేది గురించి హాఫిజ్ అబ్దుల్ అజీజ్ నక్ష్ బందీ ముహమ్మద్ ముర్తుజాయీ ఇలా పేర్కొన్నారు – “షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ తన జీవితంలోని అధిక భాగం బాగ్దాద్ లో గడిపారు. 91 సంవత్సరాల వయస్సులో 561 హిజ్రీ లో 8 రబీ ఉస్సానీ ఆదివారం నాడు మరణించారు. తన మదరసాలో ఖననం చేయబడ్డారు. మరికొందరు ఆయన మరణం శుక్రవారం జరిగిందని పేర్కొన్నారు“. (హదియదస్తగీర్/7)
ఇప్పుడు అసలు విషయం అంటే ఆయన్ను సంతోషపరచటానికి ఆయన మరణది నాన్ని జరుపుకోవటం గురించి ఆయన బోధనలను పరిశీలిస్తే ఆయన ఏ ఒక్కరి వర్ధంతిని జరుపుకోమని బోధించడం గానీ, చెప్పడంగానీ, ఉత్సాహం చూపడం గానీ చేయలేదని తెలుస్తుంది. చివరికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూబకర్ (రదియల్లాహు అన్హు), ఉమర్ (రదియల్లాహు అన్హు), హుసైన్ (రదియల్లాహు అన్హు) ల మరణదినాన్ని కూడా జరుపుకునే వారు కారు. అందువల్లే ఆయన ఇలా అన్నారు.-
“అంటే ఒకవేళ హుసైన్ (రదియల్లాహు అన్హు) మరణదినాన్ని జరుపుకోవటం ధర్మ సమ్మతమే అయితే అంతకుముందు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), అబూబకర్ (రదియల్లాహు అన్హు),ల మరణదినాన్ని కూడా జరుపుకోవడం ధర్మసమ్మతం అయి ఉండేది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల ఆచరణ కూడా కొనసాగుతూ ఉండేది.” (గునియతుత్తాలిబీన్)
షేఫ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ యొక్క ఈ అభిప్రాయం వల్ల ఆయన ఎవరి వర్ధంతిని జరుపుకోవడాన్ని ఏకీభవించేవారు కారని ఇతరులకు ఆదేశించేవారు కారని తేలిపోయింది. వాస్తవం ఏమిటంటే ఈ మూఢాచారాల్లో కొన్ని అల్లాహ్ కు సాటి కల్పించేపనులు, దాసులై ధర్మాన్ని మార్పులు చేర్పులకు గురిచేయడం, ఇవన్ని అల్లాహ్ కు సాటి కల్పించడానికి, ధర్మంలో అధర్మకార్యాలకు చోటు కల్పించడంతో సమానం, ఈ వేడుక, ఇటువంటి కార్యాలు ఇతని బోధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి.
అబ్దుల్ ఖాదిర్ జీలానీ ఇలా ఉపదేశించారు.
“అంటే అల్లాహ్ గ్రంధాన్నీ, ప్రవక్త సాంప్రదాయాన్ని అనుసరించండి. ధర్మంలో వింత విషయాలను కల్పించకండి. అల్లాహ్ కూ ఆయన ప్రవక్తకూ విధేయత చూపండి. అవిధేయతకు పాల్పడకండి”
తన సంతానానికి కూడా ఈ విధంగానే బోధించారు. దీన్ని గురించి ఈ క్రింది వీలునామాలో పేర్కొనడం జరిగింది.
వీలునామా
షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ 470 హిజ్రీ లో జన్మించారు. 18 సంవత్సరాల వరకు విద్యాభ్యాసంలో నిమగ్నమయి ఉన్నారు. విద్యాభ్యాసం తరువాత 488 హిజ్రీలో బాగ్దాద్ చేరుకున్నారు. 91 సంవత్సరాల వరకు ఇస్లామ్ మరియు ముస్లిముల సేవచేసి 561 హిజ్రీ లో మరణించారు. మరణానికి కొన్ని రోజుల ముందు తన కొడుకు అబ్దుల్ వహ్హాబ్ కు హితబోధ చేసారు. ఇవి సువర్ణాక్షరాలతో వ్రాయదగినవి.
ఇలా బోధించారు :–
“కుమారా! అల్లాహ్ పై తప్ప ఇతరులెవ్వరి పైననూ ఆశలు పెట్టుకోకూడదు. అవసరం ఎటువంటిదైనా అల్లాహ్ యే తీర్చగలడు. కుమారా! అల్లాహ్ నే నమ్ముకోవాలి. ప్రపంచ ప్రజలందరూ కలసి నీకు లాభం చేకూర్చదలచినా అల్లాహ్ అభీష్టానికి వ్యతిరేకంగా రవ్వంత లాభం కూడా చేకూర్చలేరు. అదేవిధంగా అల్లాహ్ నీకు లాభం చేకూర్చదలిస్తే ప్రపంచంలోని ఏశక్తి నీకు నష్టం కలిగించ లేదు. కుమారా! ఏకత్వం (తౌహీద్) పైనే స్థిరంగా ఉండాలి. ఇందులోనే నీ సాఫల్యం ఉంది”. (ఫత్ హుర్రబ్బానీ: అబ్దుల్ ఖాదిర్ జీలానీ)
పై వీలునామాలో పేర్కొన్న ఒకొక్క పదం ఏకత్వాన్నే సూచిస్తుంది ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనూ మతి మరుపువల్ల కూడా తన సంతానానికి గ్యారవీ చేయమని ఆదేశించలేదు.
మనం అబ్దుల్ ఖాదిర్ జీలానీ బోధనలను తెలుసుకొని వారు చూపిన మార్గాన్నే అనుసరించి ఉంటే ఎంత బాగుండేది?. వారి బోధనలకు వ్యతిరేకంగా, వారి పేరనే మొక్కుబడులు నైవేద్యాలు చెల్లిస్తున్నాం. అయితే మొక్కుబడులు నైవేద్యాలు కూడా ఆరాధనే. ఇవన్నీ అల్లాహ్ కే సొంతం ఇతరులకు ఇవి ఎంతమాత్రం చెల్లవు.
ఇమ్రాన్ భార్య అల్లాహ్ ను ఇలా ప్రార్ధించినపుడు – ‘ప్రభూ! నాగర్భంలో ఉన్న శిశువును నేను నీకు సమర్పించు కుంటున్నాను. అది నీ సేవకే అంకితం నా ఈ కానుకను స్వీకరించు నీవు అన్నీ వినేవాడవు, అన్ని తెలిసినవాడవూను‘. (ఆలిఇమ్రాన్ – 35)
“చివరకు ఆమె ప్రభువు ఆ బాలికను సంతోషంతో స్వీకరించి ఆమెను ఒక ఉత్తమ బాలికగా తీర్చి దిద్దాడు.” (ఆలిఇమ్రాన్ – 37)
ఖుర్ఆన్లోని ఈ వాక్యం ద్వారా తెలిసిందేమిటంటే మొక్కుబడులు, నైవేద్యాలు, సమర్పణలు మొదలైనవన్నీ కేవలం అల్లాహ్ కే చెందుతాయి. స్వీకరించబడతాయి కూడా. నిర్ణయం పాఠకులకు వదలి పెడుతున్నాము. ఈ గ్యారవీ ఆచారం షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ బోధనలకు, ఉపదేశాలకు అభిప్రాయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఉందా? ఉంటే సరే కాని ఒక వేళ వీటికీ విరుద్ధంగా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీటిని వదలి వేయడం తప్పనిసరి.
అల్లాహ్ (త’ఆలా) మనం దరికీ సన్మార్గం ప్రసాదించుగాక! అల్లాహ్ (త’ఆలా) మనందరికి ఏకత్వం పై ఏకదైవారాధన పై స్థిరంగా ఉంచుగాక! అల్లాహ్ మనందరికీ అల్లాహ్ కూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపే భాగ్యం ప్రసాదించుగాక! అల్లాహ్ (త’ఆలా) మనందరికీ షిర్క్ కి, కల్పితాలకూ, బిద్ఆత్ లకూ దూరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక! అల్లాహ్ (త’ఆలా) మనందరికీ సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించుగాక! అల్లాహ్ (త’ఆలా) మనందరికీ స్వర్గ ప్రవేశ భాగ్యం ప్రసాదించు గాక! ఆమీన్!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
18. హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రది అల్లాహు అన్హు) కథనం:- నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక ఆయన ఒంటె మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నాను. నాకు, ఆయనకు మధ్య అంబారీ కర్ర మాత్రమే అడ్డుగా ఉంది. హఠాత్తుగా ఆయన “ఓ ముఆజ్!’ అని పిలిచారు. నేను వెంటనే “(చెప్పండి) దైవప్రవక్తా! నేను మీ సేవ కోసం సిద్ధంగా ఉన్నాను” అన్నాను. కొంచెం దూరం నడిచిన తరువాత ఆయన మళ్ళీ “ఓ ముఆజ్!” అని పిలిచారు. “(సెలవియ్యండి) దైవప్రవక్తా! నేను మీ సేవ కోసం సిద్దంగా ఉన్నాను” అన్నాను. ఆ తరువాత మరి కొంచెం దూరం పోయాక మూడవసారి మళ్ళీ “ముఆజ్!” అని పిలిచారు. “(ఆజ్ఞాపించండి) దైవప్రవక్తా! నేను మీ సేవ కోసం సిద్ధంగా ఉన్నాను” అన్నాను నేను.
అప్పుడాయన “దాసుల మీద అల్లాహ్ హక్కు ఏముందో నీకు తెలుసా?” అని అడిగారు. అందుకు నేను “అల్లాహ్ కు , దైవప్రవక్తకే బాగా తెలుసు” అన్నాను. “దాసుల మీదున్న అల్లాహ్ హక్కు ఏమిటంటే, వారు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి, మరెవరినీ ఆరాధించకూడదు. దైవత్వంలో ఆయనకు మరెవరినీ సాటి కల్పించకూడదు” అన్నారు ఆయన. ఇలా చెప్పి కాస్సేపు మౌనంగా నడిచారు.
ఆ తరువాత “ఓ ముఆజ్ బిన్ జబల్!” అని పిలిచారు. నేను (వెంటనే సెలవియ్యండి) “దైవప్రవక్తా! మీ సేవ కోసం సిద్దంగా ఉన్నాను” అని అన్నాను. “దాసులు అల్లాహ్ హక్కు నెరవేర్చిన తరువాత, అల్లాహ్ పై దాసులకు ఉండే హక్కేమిటో నీకు తెలుసా?” అని అడిగారు ఆయన. నేను “అల్లాహ్ కు , దైవప్రవక్తకు మాత్రమే బాగా తెలుసు” అన్నాను. “అప్పుడు అల్లాహ్ (తన) దాసులను శిక్షించకపోవడమే ఆయనపై వారికున్న హక్కు” అని తెలిపారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, వక్త దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత మరియు దానిని సరైన పద్ధతిలో ఎలా చేయాలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరిస్తున్నారు. దుఆ కేవలం అల్లాహ్ కే చెందాలని, ఆయనను కాకుండా ఇతరులను ప్రార్థించడం షిర్క్ (బహుదైవారాధన) మరియు కుఫ్ర్ (అవిశ్వాసం) అవుతుందని స్పష్టం చేస్తున్నారు. దుఆయే అసలైన ఇబాదత్ (ఆరాధన) అని, ఇతరులతో దుఆ చేయడం మహా అన్యాయం మరియు దౌర్జన్యం అని నొక్కిచెప్పారు. అల్లాహ్ ను వదిలి ప్రార్థించబడే వారికి ఎలాంటి శక్తి లేదని, వారు మన మొరలు వినలేరని, సహాయం చేయలేరని మరియు ప్రళయ దినాన మనకు శత్రువులుగా మారిపోతారని ఖురాన్ ఆయతుల ద్వారా హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ కష్టసుఖాలలో కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే వేడుకోవాలని ఈ ప్రసంగం యొక్క సారాంశం.
సోదర సోదరీమణులారా! దుఆ అల్లాహ్ యేతరులతో చేయడం ఎంత నష్టమో ఎప్పుడైనా మనం గమనించామా? ఈరోజు ఈ అతి ముఖ్యమైన శీర్షికకు సంబంధించిన కొన్ని ఆయతులు దివ్య ఖురాన్ ద్వారా మరియు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక రెండు హదీసులు కూడా మనం విందాము.
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఎందరు ప్రవక్తలు గతించారో, వారందరి జాతి వారు ఏ రకమైన షిర్క్ కు పాల్పడ్డారో అందులో అతి భయంకరమైనది, వారిని నరకంలో పడవేసినది అది దుఆ మిన్ దూనిల్లాహ్. అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయడం. ఉదాహరణకు ఎవరైనా అనారోగ్యానికి గురవుతారు, ఎవరిపైనా ఏదైనా కష్టాలు ఆపదలు వస్తాయి, ఎవరికైనా సంతానం కలగదు. ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నాము, వారు అల్లాహ్ ను కాకుండా ఇతరులను అర్ధిస్తారు, ఇతరులను ప్రార్థిస్తారు, ఇతరులతో దుఆ చేస్తారు. వారికి సంతానం కలగాలని, వారికి ఆరోగ్యం ప్రాప్తించాలని, వారి కష్టాలు దూరమైపోవాలని. ఇది ఎంత ఘోరమైన పాపమో ఎప్పుడైనా మనం ఆలోచించామా? అయితే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఖురాన్ ఆయతుల ఆధారంగా కొన్ని ముఖ్య విషయాలు చెబుతున్నాను, ఈ ముఖ్యమైన శీర్షికకు సంబంధించినది. మీరు శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను.
దుఆ హక్కు కేవలం అల్లాహ్ కే
ఇందులో మొదటి విషయం, అసలు దుఆ ఎవరి హక్కు? అంటే మనం దాసులము, ఎవరితో దుఆ చేయాలి? దీని గురించి ఖురాన్ చాలా స్పష్టంగా మనకు తెలియజేసింది.
సూరతుర్ రాద్, సూర నెంబర్ 13, ఆయత్ నెంబర్ 14 లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు:
لَهُ دَعْوَةُ الْحَقِّ (లహు ద’వతుల్ హఖ్) “దుఆ యొక్క హక్కు కేవలం అల్లాహ్ ది మాత్రమే.” (13:14)
ఆయన తప్ప ఇంకా ఎవరితో దుఆ చేయడం ఇది న్యాయం, ధర్మం ఎంత మాత్రం కాదు.
ఇంకా, సూరె లుఖ్మాన్, ఆయత్ నెంబర్ 30 లో అల్లాహ్ తెలిపాడు:
وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ الْبَاطِلُ (వ అన్న మా యద్ఊన మిన్ దూనిహిల్ బాతిల్) “అల్లాహ్ తప్ప వారు ఎవరెవరితో దుఆ చేస్తున్నారో ఇదంతా కూడా వ్యర్థం, వృధా, అసత్యం.” (31:30)
అల్లాహు అక్బర్, గమనించారా? స్వయంగా మన సృష్టికర్త అయిన అల్లాహ్, మనం ఎవరితో దుఆ చేయాలని మనకు ఆదేశించాడు? ఈ విషయానికి వస్తే, ఖురాన్ లో ఒక సందర్భంలో కాదు, ఎన్నో చోట్ల. ఉదాహరణకు, సూరతు గాఫిర్, దాని యొక్క మరొక పేరు సూరతుల్ మూమిన్, ఆయత్ నెంబర్ 60 లో తెలిపాడు:
وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ (వ ఖాల రబ్బుకుముద్ ఊనీ అస్తజిబ్ లకుమ్) “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను” (40:60)
వ ఖాల రబ్బుకుమ్, మీ ప్రభువు మీకు ఈ ఆదేశం ఇస్తున్నాడు, ఉద్’ఊనీ, మీరు నాతో మాత్రమే దుఆ చేయండి, అస్తజిబ్ లకుమ్, నేను మీ దుఆలను అంగీకరిస్తాను. అల్లాహు అక్బర్, గమనించారా? నేను మీ దుఆలను అంగీకరిస్తాను అంటున్నాడు అల్లాహ్ త’ఆలా.
దుఆ అసలైన ఇబాదత్ (ఆరాధన)
ఇంకా సోదర మహాశయులారా, దుఆ ఇది అసలైన ఇబాదత్, అసలైన ఆరాధన, అసలైన ప్రార్థన, దుఆ. ఇదే సూరత్, సూరత్ గాఫిర్, సూరతుల్ మూమిన్ ఆయత్ నెంబర్ 60 లో, అల్లాహ్ ఇలా తెలియజేశాడు:
“మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం తథ్యం.”( 40:60)
దుఆ యొక్క ఆదేశం ఇచ్చిన వెంటనే, నా ఆరాధన పట్ల ఎవరైతే అహంకారానికి గురి అవుతాడో అని అంటున్నాడు అల్లాహ్ త’ఆలా, దుఆను ఆరాధన, దుఆ అసలైన ఇబాదత్ అని తెలిపాడు. ఎవరైతే దుఆ చేయరో అల్లాహ్ త’ఆలా తో, ఏం జరుగుతుంది? సయద్ ఖులూన జహన్నమ దాఖిరీన్. అవమానకరంగా వారు నరకంలో ప్రవేశిస్తారు. అల్లాహు అక్బర్. ఇంకా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,
الدُّعَاءُ هُوَ الْعِبَادَةُ (అద్దుఆఉ హువల్ ఇబాదహ్) దుఆ అసలైన ఇబాదత్.
మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే సూర గాఫిర్ యొక్క ఆయత్ పారాయణం చేశారు.
ఇతరులతో దుఆ చేయడం నిషేధం
అంతేకాదు సోదరులారా, ఒకవైపున అల్లాహ్ త’ఆలా నాతోనే దుఆ చేయండి అని ఏదైతే ఆదేశించాడో, ఇతరుల ఎవరితోనీ దుఆ చేయకండి అని కూడా చెప్పాడు. ఇతరులతో దుఆ చేయడం నిషేధించాడు, వారించాడు. ఉదాహరణకు, సూరత్ యూనుస్ ఆయత్ నెంబర్ 106 లో తెలిపాడు:
وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ (వలా తద్’ఉ మిన్ దూనిల్లాహ్) “అల్లాహ్ ను వదిలి మీరు ఎవరినీ అర్ధించకండి, ఎవరితో దుఆ చేయకండి.” (10:106)
సూరతుల్ ఖసస్ ఆయత్ నెంబర్ 88 లో చెప్పాడు:
وَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ (వలా తద్’ఉ మ’అల్లాహి ఇలాహన్ ఆఖర్) అల్లాహ్‌తో పాటు మరే దేవుణ్ణీ మొరపెట్టుకోకు. (28:88)
అల్లాహ్ తో పాటు ఇంకా ఎవరితోనీ కూడా, అల్లాహ్ తో పాటు వేరే ఏ దైవమైనా ఉన్నాడు అని భావించి వారితో మీరు దుఆ చేయకండి. సోదర మహాశయులారా, సూరత్ యూనుస్ మరియు సూరతుల్ ఖసస్ లోని ఈ రెండు ఆయతుల ద్వారా మనకు విషయం ఏం తెలిసింది? అల్లాహ్ తో దుఆ చేయడంతో పాటు ఇతరులతో చేయడం ఇది కూడా నిషేధం. అల్లాహ్ ను వదిలి వేరే ఎవరితోనైనా చేయడం ఇది కూడా నిషిద్ధం. మరి చేయవలసింది ఏంటిది? సూర గాఫిర్ లో మనం తెలుసుకున్నాము, కేవలం అల్లాహ్ తో మాత్రమే దుఆ చేయాలి.
అల్లాహ్ ను వదిలి ఇతరులను ప్రార్థించడం వల్ల కలిగే నష్టాలు
అయితే, అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయడం వల్ల మనకు నష్టం ఏమిటి? మహా భయంకరమైన నష్టం. అల్లాహ్ తో పాటు ఇతరులతో దుఆ చేయడం గాని, అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేయడం గాని, ఇది షిర్క్ మరియు కుఫ్ర్ లోకి వస్తుంది. బహుదైవారాధనలో లెక్కించడం జరుగుతుంది. సత్య తిరస్కారంలో లెక్కించడం జరుగుతుంది.
సూరతున్ నహల్ ఆయత్ నెంబర్ 86 గమనించండి.
وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ (వ ఇదా ర అల్లజీన అష్రకూ షురకాఅహుమ్) “ఈ ముష్రిక్కులు తాము (అల్లాహ్‌కు) భాగస్వాములుగా నిలబెట్టే వారిని చూడగానే..”
షిర్క్ చేసినటువంటి వారు, అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వాములుగా కల్పించిన వారు తమ భాగస్వాములను చూస్తారు. ఎప్పుడు ఇది? ప్రళయ దినాన. చూసి ఏమంటారు?
قَالُوا رَبَّنَا هَٰؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِن دُونِكَ (ఖాలూ రబ్బనా హాఉలాఇ షురకాఉనల్లజీన కున్నా నద్’ఊ మిన్ దూనిక్) “ఓ మా ప్రభూ! మేము నిన్ను వదిలేసి మొరపెట్టుకున్న మా భాగస్వాములు వీరే” అని అంటారు” (16:86)
గమనిస్తున్నారా సోదరులారా? చదవండి మీరు సూరతున్ నహల్, సూర నెంబర్ 16, ఆయత్ నెంబర్ 86. ప్రళయ దినాన అందరూ హాజరవుతారు కదా, దుఆ చేసిన వారు ఎవరితోనైతే దుఆ చేయడం జరిగిందో. ఎప్పుడైతే వారిని చూస్తారో, “ఓ మా ప్రభువా, నిన్ను వదిలి మేము వారితో దుఆ చేసాము, వారిని మేము నీకు భాగస్వామిగా చేసాము. ఈరోజు వారు మాకు ఏమీ లాభం చేయడం లేదు” అని మొరపెట్టుకుంటారు. అయితే ఈ ఆయత్ లో మనకు చాలా స్పష్టంగా తెలిసింది, వారు స్వయంగా ఒప్పుకుంటున్నారు మేము ఈ షిర్క్ పని చేసాము అని.
అయితే, సూరతుల్ ఆరాఫ్, సూర నెంబర్ 7, ఆయత్ నెంబర్ 37 కూడా మీరు గమనించండి. మీరు కూడా స్వయంగా తెలుగు ఖురాన్ అనువాదాలు తీసి చదవండి, చూడండి, పరిశీలించండి. ఒక విషయం.. క్షమించండి, నేను నా టాపిక్ కు కొంచెం దూరమై ఒక విషయం మీకు అర్థం కావడానికి తెలియజేస్తున్నాను. మనం జానెడు కడుపులో పోయే కూడు తినడానికి మార్కెట్ లోకి వెళ్లి బియ్యం ఏ రకమైనది, ఈ టమాటాలు పాడు అయినాయా, మంచియా, ఉల్లిగడ్డ మంచిగుందా లేదా, ఈ కూరగాయలు మంచియా లేవా, ఒక్కొక్కటి ఏరుకొని మంచి మంచివి తీసుకొని వస్తాము కదా. మన స్వర్గం విషయానికి, ఏ ధర్మ జ్ఞానం మనం నేర్చుకోవాల్సి ఉందో దానిని కూడా మనం వెతకాలి, పరిశీలించాలి, సత్యం ఏదో తెలుసుకోవాలి. సూరతుల్ ఆరాఫ్ ఆయత్ నెంబర్ 37:
ఆఖరికి మా దూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకోవటానికి వారివద్దకు వచ్చినప్పుడు “అల్లాహ్‌ను వదలి మీరు ఆరాధిస్తూ ఉన్నవారు ఇప్పుడెక్కడున్నారు?” అని అడుగుతారు. “వారంతా మా వద్ద నుంచి మటుమాయమై పోయారు” అని వాళ్ళు చెబుతారు. తాము అవిశ్వాసులుగా ఉండేవారన్న విషయాన్ని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు.. (7:37)
అప్పుడు వారు తమకు తాము సాక్ష్యం పలుకుతారు, “అయ్యో, మేము ఎంత కుఫ్ర్ పని చేసాము, ఎంత అవిశ్వాసానికి పాల్పడే పని చేసాము, సత్య తిరస్కారంలో మేము పడి ఉన్నాము“. అయితే ఏం తెలిసింది? అల్లాహ్ తో కాకుండా లేదా అల్లాహ్ తో పాటు ఇతరులతో దుఆ చేయడం షిర్క్, కుఫ్ర్ లో వస్తుంది మరియు వారు ఏమీ వారికి లాభం చేకూర్చలేదు. వారు ఏమీ లాభం చేకూర్చరు అన్న విషయం ఇంకా ఎన్నో ఆయతుల ద్వారా ఇన్ షా అల్లాహ్ నేను తెలియజేస్తున్నాను.
దుఆలో షిర్క్ చేయడం మహా దౌర్జన్యం
అంతేకాదు సోదర మహాశయులారా, అల్లాహ్ ను వదిలి లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే వారితో కూడా దుఆ చేయడం ఇది మహా అన్యాయం, మహా దౌర్జన్యం. ఏ కొందరు యువకులు తమ జాతి వారిని ఎదిరించి, జాతి వారందరూ కూడా షిర్క్ పనులు చేస్తున్నారు, తౌహీద్ కు దూరమై ఉన్నారు, వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి అన్న తపనతో తమ గ్రామం నుండి కూడా దూరమయ్యారు. ఆ సందర్భంలో వారు ఏమంటారు, సూరతుల్ కహఫ్ ఆయత్ నెంబర్ 14:
لَّن نَّدْعُوَ مِن دُونِهِ إِلَٰهًا ۖ لَّقَدْ قُلْنَا إِذًا شَطَطًا (లన్ నద్’ఉవ మిన్ దూనిహి ఇలాహన్, లఖద్ ఖుల్నా ఇదన్ షతతా) “మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటమన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారమవుతాము.” (18:14)
లన్ నద్’ఉవ మిన్ దూనిహీ ఇలాహా. మేము అల్లాహ్ ను వదిలి వేరే ఏ భూటకపు దైవాలను మేము ఆరాధించము. అల్లాహ్ ను వదిలి వేరే ఏ దైవంతో మేము దుఆ చేయము. ప్రజలు ఎవరెవరినైతే దైవాలుగా భావిస్తున్నారో, వారి దృష్టిలో, వారి యొక్క అభిప్రాయం ప్రకారం వారు దేవుళ్ళు కావచ్చు, కానీ సత్యమైన దేవుడు కేవలం అల్లాహ్. సత్యమైన ఆరాధ్యుడు కేవలం అల్లాహ్. ఆయన్ని తప్ప మేము ఇంకా ఎవరితో దుఆ చేయము. లఖద్ ఖుల్నా ఇజన్ షతతా. ఒకవేళ మేము ఇలా చేసి ఉంటే ఇది మహా దౌర్జన్యం అయిపోతుంది. గమనించారా?
అల్లాహ్ శిక్షకు గురిచేసే విషయం
అంతేకాదు, అల్లాహ్ ను తప్ప వేరే ఎవరితోనైనా దుఆ చేయడం, అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరితోనైనా దుఆ చేయడం… మహాశయులారా, ఇది అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేసే విషయం. అవును, అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేసే విషయం. చదవండి ఖురాన్ లో. సూరతుష్ షుఅరా ఆయత్ నెంబర్ 213 లో అల్లాహ్ తెలిపాడు:
فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ (ఫలా తద్’ఉ మ’అల్లాహి ఇలాహన్ ఆఖర ఫతకూన మినల్ ము’అద్దబీన్) “కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అల్లాహ్‌తోపాటు మరే ఇతర దైవాన్నీ మొరపెట్టుకోకు. నువ్వుగాని అలా చేశావంటే శిక్షించబడేవారిలో చేరిపోతావు సుమా!” (26:213)
ఫలా తద్వు మఅల్లాహి ఇలాహన్ ఆఖర్. అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఏ దైవంతో మీరు దుఆ చేయకండి. ఫతకూన మినల్ ముఅజ్జబీన్. అలా చేశావంటే, అలా చేశారంటే శిక్ష ఇవ్వబడిన వారిలో ఎవరికైతే శిక్ష పడుతుందో వారిలో మీరు కలిసిపోతారు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరిని ఇహలోకం, పరలోకం అన్ని రకాల శిక్షల నుండి దూరం చేయుగాక, దూరం ఉంచుగాక. మరియు శిక్షలకు గురి చేసే ప్రతి పాపం నుండి కూడా అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక.
అల్లాహ్ ను వదిలి ప్రార్థించబడే వారికి ఎలాంటి శక్తి లేదు
అంతేకాదు, చివరిలో ఒక రెండు ముఖ్యమైన విషయాలు అవేమిటంటే, అల్లాహ్ ను కాకుండా ఎవరినైతే ఆరాధిస్తారో, అల్లాహ్ ను కాకుండా లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరితోనైతే దుఆ చేస్తారో, వారిలో ఏ శక్తి లేదు. మన మొరలు వినడానికి, మనం వేడుకునే వాటిని ఇవ్వడానికి, మన కష్ట దుఃఖాలు దూరం చేయడానికి, సుఖాలు ప్రసాదించడానికి, ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వడానికి వారిలో ఏ శక్తి లేదు అని అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిపాడు. ఒకవేళ వాస్తవంగా అల్లాహ్ ను నమ్మేవారయ్యేది ఉంటే ఈ ఆయతులను చాలా శ్రద్ధగా మనం అర్థం చేసుకోవాలి. సూరత్ ఫాతిర్, ఆయత్ నెంబర్ 13, 14.
وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ (వల్లదీన తద్’ఊన మిన్ దూనిహి మా యమ్లికూన మిన్ ఖిత్మీర్) “ఆయన్ని వదలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు.” (35:13)
إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ ఒకవేళ మీరు వారిని మొర పెట్టుకున్నా, వారు మీ మొరను ఆలకించరు. ఒకవేళ ఆలకించినా, మీ అక్కరను తీర్చలేరు. పైపెచ్చు ప్రళయదినాన మీరు కల్పించే భాగస్వామ్యాన్ని (షిర్క్‌ను) వారు (సూటిగా) త్రోసిపుచ్చుతారు. అన్నీ తెలిసిన దేవుని మాదిరిగా (సావధానపరిచే సమాచారాన్ని) నీకు తెలిపే వాడెవడూ ఉండడు సుమా! (35:14)
(వల్లజీన తద్వూన మిన్ దూనిహీ). మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే దుఆ చేస్తారో, ఎవరితోనైతే దుఆ చేస్తారో, (మా యమ్లికూన మిన్ కిత్మీర్). ఖర్జూరపు బీజము మీద ఉండేటువంటి సన్నని ఆ పొర. అంతమాత్రం కూడా వారికి ఏ శక్తి లేదు. (ఇన్ తద్వూహుం లా యస్మవూ దుఆఅకుం). మీరు వారితో దుఆ చేస్తే మీ దుఆలను వారు వినలేరు. గమనించండి. సూరత్ ఫాతిర్ ఆయత్ 13, 14. మీరు అల్లాహ్ ను వదిలి ఎవరితోనైతే దుఆ చేస్తారో, వారు ఖర్జూరపు బీజము మీద ఉండేటువంటి సన్నని ఆ పొర ఏదైతే ఉంటుందో అంత మందం కూడా శక్తి కలిగి లేరు. మీరు వారిని అడిగితే, వారితో దుఆ చేస్తే వారు వినరు. కానీ ఈ రోజుల్లో ఎంతో మంది ఉన్నారు కదా, వింటారు అన్నటువంటి మూఢనమ్మకంలో. అయితే అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి. (వలవ్ సమీవూ మస్తజాబూ లకుం). మీ మూఢనమ్మకాల ప్రకారంగా వారు వింటారు అని ఏదైతే అనుకుంటున్నారో, అలా జరిగినా ఎప్పుడైనా, ఏదైనా సందర్భంలో ఒక పరీక్షగా మేము వారికి వినిపించినా, వారు మీ దుఆలకు సమాధానం చెప్పలేరు.
(వ యౌమల్ ఖియామతి యక్ఫురూన బిషిర్కికుం). మీరు ఈ షిర్క్ ఏదైతే చేస్తున్నారో, దుఆ ఇతరులతో చేసి ఏ భాగస్వామ్యం కల్పింపజేస్తున్నారో, దీనిని వారు ప్రళయ దినాన తిరస్కరిస్తారు. (వలా యునబ్బిఉక మిస్లు ఖబీర్). సూక్ష్మ జ్ఞాని అయిన అల్లాహ్ ఆయన తెలిపినటువంటి విషయాలు మీకు తెలిపేవాడు ఇంకా వేరే ఎవడు లేడు.
అలాగే సోదర మహాశయులారా, సూరత్ సబా ఆయత్ నెంబర్ 22 ఒకసారి గమనించండి మీరు.
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవంత అధికారంగానీ, వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాడు. (34:22)
(ఖులిద్ వుల్లజీన జఅంతుం మిన్ దూనిల్లాహ్). మీ మూఢనమ్మకం ప్రకారం అల్లాహ్ ను వదిలి ఎవరెవరిని మీరు ఆరాధిస్తారో, ఎవరెవరిని పూజిస్తారో, ఎవరెవరితో దుఆ చేస్తారో, (ఉద్వూ), మీరు దుఆ చేసి చూడండి. వారిలో ఏముంది? (లా యమ్లికూన మిస్కాల జర్రతిన్ ఫిస్సమావాతి వలా ఫిల్ అర్జ్). ఆకాశాల్లో, భూమిలో రవ్వంత దానికి వారు అధికారం కలిగి లేరు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఇంతకుముందు ఏం చెప్పాడు? సూరె ఫాతిర్ లో, ఖర్జూరపు బీజం మీద ఉండేటువంటి ఒక పొర అంతటి అధికారం కూడా వారికి లేదు. ఇక్కడ జర్రహ్, అణువు. కళ్ళతో కనబడదు మనకు. అంతటి అధికారం కూడా వారిలో లేదు. ఇంకా, (వమాలహుం ఫీహిమా మిన్ షిర్క్). భూమి ఆకాశాల్లో వారికి ఏ భాగస్వామ్యం లేదు.
అల్లాహ్ క్షమించుగాక, అల్లాహ్ కు కాదు ఒక ఉదాహరణ, పోలిక, మనకు అర్థం కావడానికి ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాను. కొన్ని సందర్భంలో ఏమవుతుంది? నా వద్ద ఒక్క పైసా కూడా లేకపోవచ్చు. కానీ నేను ఒకరితో బిజినెస్ లో పార్ట్నర్ కావచ్చు కదా. ఏదైనా పనిలో నేను పొత్తు కలవవచ్చు కదా. ఈ విధంగా ప్రజలు ఏమనుకుంటారు? అరే, అతడు ఫలానా కంపెనీలో ఒక పార్ట్నర్ గా ఉన్నాడు, ఎంతటి మహానుభావుడో అని అనుకుంటాం కదా. అయితే అల్లాహ్ ఇలాంటి భావాన్ని కూడా ఎట్లా దూరం చేస్తున్నాడో గమనించండి. వారికి అణువంత అధికారం కూడా లేదు ఆకాశాల్లో గాని, భూమిలో గాని. అంతేకాదు వారు ఈ భూమి ఆకాశాల్లో అల్లాహ్ కు ఏ పార్ట్నర్ కారు, ఏ భాగస్వామి కారు. అంతెందుకు, కొందరు ఇహలోకం ప్రకారంగా చూసుకుంటే ఏ అధికారం ఉండదు, పార్ట్నర్ ఉండడు. కానీ ఒకరి కంపెనీ నడపడానికి, ఒకరి పని పూర్తి అవ్వడానికి ఏదో తన ఛాయాశక్తి కొంచెం సపోర్ట్ అయినా ఇస్తాడు కదా. అల్లాహ్ ఇలాంటి దానిని కూడా ఖండించాడు. ఏం చెప్పాడు? (వమాలహుం మిన్హుం మిన్ జహీర్). మీరు ఎవరెవరితోనైతే దుఆలు చేస్తున్నారో వారిలో ఏ ఒక్కడు కూడా అల్లాహ్ కు ఎలాంటి మద్దతునిచ్చేవాడు కాదు, ఎలాంటి సహాయం అందించేవాడు కాదు.
ఇక మీరు అలాంటి వారితో ఎందుకు దుఆ చేస్తున్నారు అని అల్లా రబ్బుల్ ఆలమీన్ హెచ్చరిస్తున్నాడు. అల్లాహు అక్బర్. గమనించండి సోదరులారా.
ప్రళయ దినాన వారు శత్రువులుగా మారిపోతారు
ప్రత్యేకంగా ఎవరైతే అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో, పూజిస్తున్నారో, దుఆలు చేస్తున్నారో, అర్ధిస్తున్నారో, వారి యొక్క స్థితి ఏమిటి? ఇంకా, వారు ఏమైనా ప్రళయ దినాన మనకు లాభం కలగజేస్తారా? ఉపయోగపడతారా? అది కూడా జరగదు. సూరతుల్ అహ్కాఫ్ ఆయత్ నెంబర్ ఐదు, ఆరు వినండి.
وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ అల్లాహ్ ను వదలి ప్రళయదినం వరకూ తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునేవానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు? (46:5)
وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ మానవులంతా సమీకరించబడినపుడు వారు వారికి (తమ భక్తులకు) శత్రువులై పోతారు. వీళ్ళ పూజాపురస్కారాలను కూడా వాళ్ళు త్రోసిపుచ్చుతారు. (46:6)
(వ మన్ అదల్లు మిమ్మన్ యద్వూ మిన్ దూనిల్లాహ్). ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేస్తున్నారో వారి కంటే మార్గభ్రష్టులు ఇంకా వేరే ఎవరు లేరు. నేననడం లేదు, ఖురాన్ తీసి చూడండి మీరు. వ మన్ అదల్లు, అతని కంటే మార్గభ్రష్టత్వంలో ఇంకా ఎవరు లేరు. ఎవరు? ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేస్తున్నాడో. ఎలాంటి వారితో దుఆ చేస్తున్నాడు? (మల్లా యస్తజీబు లహు ఇలా యౌమిల్ ఖియామ). ప్రళయ దినం వరకు అతని దుఆలను అంగీకరించడం గాని, దుఆకు సమాధానం గాని చెప్పలేని వారు. అంతేకాదు, (వహుం అన్ దుఆఇహిం గాఫిలూన్). వారు వీరు చేసే దుఆలకు ఏ సంబంధం లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. వారికి తెలియనే తెలియదు, ఎవరో వచ్చి మా సమాధుల వద్ద, ఎవరో మా పేరును తీసుకొని దుఆలు చేస్తున్నారు అని.
(వ ఇజా హుషిరన్నాస్). ప్రళయ దినాన ఎప్పుడైతే సమూహ పరచడం జరుగుతుందో, (కానూ లహుం అదాఅ). ఈ దుఆ చేసేవారు, ఎవరితోనైతే దుఆ చేయడం జరిగిందో వారందరూ పరస్పరం శత్రువులైపోతారు. (వ కానూ బి ఇబాదతిహిం కాఫిరీన్). మరియు వారి యొక్క ఆరాధనలో, వారి యొక్క దుఆలు వాటి గురించి ఇంకార్ చేస్తారు, రద్దు చేస్తారు. వీరు మమ్మల్ని ఆరాధించలేదు, మాతోని దుఆ చేయలేదు అని స్పష్టంగా తెలియజేస్తారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహ్ క్షమించుగాక, ఇహలోక ప్రకారంగా నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను, గమనించండి.
ఉదాహరణకు నీవు ఏదైనా ఆపదలో ఇరుక్కున్నావు. కోర్టులో వెళ్ళవలసి వచ్చింది. ఏం జరిగింది? ఫలానా వకీల్ చాలా పేరు గలవాడు. ఫలానా లాయర్ ఎంతో పేరు గాంచిన వాడు. అతనిని నేను పిలిపించుకుంటే నన్ను ఎట్లనైనా ఈ కేసులో నుండి బయటికి తీసేస్తాడు అని అనుకున్నావు. అతడు వచ్చాడు. వచ్చిన తర్వాత, నీవు అనుకుంటున్నావు ఈ కేసు ఈ కోర్టులో ఆ వకీల్, ఆ లాయర్ నీకు సపోర్ట్ చేసి నీ తరఫు నుండి మాట్లాడి నిన్ను జైలు పాలు కాకుండా, శిక్షకు గురి కాకుండా కాపాడుకుంటాడు అని. తీరా సమయం వచ్చే వరకు ఏం జరిగింది? నీకు వ్యతిరేకమైపోయాడు. అతడు నీకు వ్యతిరేకమైపోయాడు. నీవు ఇంకా పాపంలో ఉన్నావు, నీ పై ఈ అపరాధం అన్నట్టుగా ఎన్నో సాక్షాలు తెచ్చి ఇరికించే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి గమనించండి. ఇంతకంటే మరీ భయంకరమైన, ఘోరమైన పరిస్థితి అక్కడ రానుంది. అల్లాహ్ మనందరిని కూడా కాపాడుగాక.
ఖురాన్ లో మనం గమనిస్తే, ఆదం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం, సులేమాన్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, షుఐబ్ అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, జకరియా అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుమారు 16 ప్రవక్తలు, వారు అల్లాహ్ తో ఏ దుఆ చేశారో, ఎలా ఎలా మొరపెట్టుకున్నారో ఆ దుఆల ప్రస్తావనలన్నీ కూడా ఖురాన్ లో ఉన్నాయి. ఎక్కడా కూడా వారు అల్లాహ్ తప్ప ఇతరులతో మొరపెట్టుకోలేదు. నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను? ఈ ప్రవక్తల సరైన మార్గాన్ని మనం అవలంబించినప్పుడే కదా మనకు మోక్షం లభించేది.
అంతేకాదు, అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఎందరో పుణ్యాత్ముల గురించి కూడా తెలిపాడు. ఉదాహరణకు, ఇమ్రాన్ యొక్క భార్య, ఫిరౌన్ యొక్క భార్య మరియు బిల్ఖీస్ రాణి మరియు ఆ గుహలో, సూర కహఫ్ లో వచ్చిన ప్రస్తావన ఉన్నవారు. ఇంకా విశ్వాసులు, ఎవరైతే ఒక తోటకు అధికారి అయ్యారో వారి యొక్క సంఘటన ఉంది. ఈ విధంగా ఇంకా ఎందరో సంఘటనలు ఖురాన్ లో ఉన్నాయి. వారందరూ కూడా వారి కష్ట సమయాల్లో కేవలం ఏకభాగస్వామ్యం లేకుండా అల్లాహ్ తోనే దుఆ చేశారు, అల్లాహ్ నే మొరపెట్టుకున్నారు.
అందు గురించి సోదరులారా, ఇదే పని మనం కూడా చేయాలి. ఒకవేళ అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరినైనా మనం మొరపెట్టుకున్నామో, వేరే ఎవరితోనైనా దుఆ చేసాము అంటే షిర్క్ లో పడిపోతాము, కుఫ్ర్ లో పడిపోతాము, మహా దౌర్జన్యం చేసిన వారమవుతాము, అల్లాహ్ యొక్క శిక్షకు గురి కావలసి వస్తుంది. అంతేకాకుండా అల్లాహ్ ను కాదని మనం ఎవరెవరినీ మొరపెట్టుకుంటామో ఎవరూ కూడా మనకు ఇహలోకంలో పనికిరారు. పరలోకంలోనైతే ఏమాత్రం మనకు లాభం చేకూర్చరు.
అల్లాహ్ మనందరినీ కాపాడుగాక, రక్షించుగాక. ఎల్లవేళల్లో కేవలం అల్లాహ్ తో మాత్రమే దుఆ చేస్తూ ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తప్ప వేరే ఎవరెవరితో మనం ఇంతవరకు తెలిసి తెలియక, అజ్ఞానంలో ఉండి ఏమైతే చేసామో, అల్లాహ్ ఆ పాపాలన్నిటినీ కూడా క్షమించి, మన్నించి మనల్ని తన యొక్క పవిత్రమైన పుణ్య దాసుల్లో చేర్చుగాక.
వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.