దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగం మోక్షానికి మార్గాన్ని వివరిస్తుంది, దీనిని మూడు ప్రాథమిక సూత్రాలుగా విభజించారు: జ్ఞానం (ఇల్మ్), ఆచరణ (అమల్), మరియు ప్రచారం (దావత్). మొదటిది, ధార్మిక విద్య యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది, ఖురాన్ మరియు హదీసుల నుండి సరైన అవగాహన పొందడం విశ్వాసానికి పునాది అని వివరిస్తుంది. రెండవది, పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం, స్థిరత్వంతో ధర్మ మార్గంలో నడవడం యొక్క ఆవశ్యకతను చర్చిస్తుంది. మూడవది, నేర్చుకున్న సత్యాన్ని ఇతరులకు వివేకంతో, ఉత్తమ రీతిలో అందజేయడం కూడా మోక్ష మార్గంలో ఒక ముఖ్యమైన భాగమని స్పష్టం చేస్తుంది. ఈ మూడు అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, వీటిని అనుసరించడం ద్వారానే ఇహపరలోకాల సాఫల్యం సాధ్యమవుతుందని ప్రసంగం సారాంశం.
అభిమాన సోదరులారా, సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్‌కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయు గాక.
హమ్ద్ మరియు సనా తర్వాత, అభిమాన సోదర సోదరీమణులారా, ఈ రోజు నా ప్రసంగాంశం ‘మోక్షానికి మార్గం’ అని మీకందరికీ తెలిసిన విషయమే.ఈ అంశానికి సంబంధించిన అనేక విషయాలు, వివరాలు ఉన్నాయి. కాకపోతే ఈ రోజు నేను ఈ అంశానికి సంబంధించిన ముఖ్యమైన మూడు విషయాలు చెప్పదలిచాను.
ఒకటి – أَلتَّعَلُّمُ بِالدِّينْ (అత్తఅల్లుము బిద్దీన్) – ధర్మ అవగాహనం. రెండవది– أَلْإِلْتِزَامُ بِهَا (అల్ ఇల్తిజాము బిహా) – దానికి కట్టుబడి ఉండటం, స్థిరత్వం. మూడవది – أَلدَّعْوَةُ إِلَيْهَا (అద్దఅవతు ఇలైహా) – ఇతరులకు అందజేయటం.
మోక్షానికి మార్గం అనే ఈ అంశం పైన ముఖ్యమైన ఈ మూడు విషయాల గురించి మనము తెలుసుకోబోతున్నాం. సారాంశం చెప్పాలంటే, ఇల్మ్, అమల్, దావత్. (జ్ఞానం, ఆచరణ, ప్రచారం)
జ్ఞానం (విజ్ఞానం)
మొదటగా జ్ఞానం గురించి. జ్ఞానం మహిమను చాటే ఖురాన్ ఆయతులు, హదీసులు ఎన్నో ఉన్నాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం,
طَلَبُ الْعِلْمِ فَرِيضَةٌ عَلَى كُلِّ مُسْلِمٍ (తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం) అంటే, జ్ఞానాన్ని ఆర్జించడం ప్రతి ముస్లిం పై విధి అని అన్నారు. పురుషులైనా, స్త్రీలైనా. ఈ హదీస్ సహీహ్ ఇబ్నె మాజాలో ఉంది మరియు ఈ హదీస్ సహీహ్ హదీస్.
జ్ఞానం అంటే కేవలం సర్టిఫికెట్లను సంపాదించడం కాదు. అల్లాహ్ పట్ల భీతిని హృదయంలో జనింపజేసేదే నిజమైన జ్ఞానం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ఫాతిర్, ఆయత్ నంబర్ 28లో ఇలా సెలవిచ్చాడు:
إِنَّمَا يَخْشَى اللَّهَ مِنْ عِبَادِهِ الْعُلَمَاءُ (ఇన్నమా యఖ్షల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమా) నిస్సందేహంగా అల్లాహ్ దాసులలో జ్ఞానులు మాత్రమే ఆయనకు భయపడతారు. (సూరా ఫాతిర్, ఆయత్ నంబర్ 28)
జ్ఞానాన్ని ఆర్జించే ప్రక్రియ తల్లి ఒడి నుంచి మొదలై సమాధి వరకు కొనసాగుతుంది. జ్ఞానం అధ్యయనం ద్వారా, అనుసరణ ద్వారా, ధార్మిక పండితుల సాహచర్యం ద్వారా జ్ఞానం పెరుగుతుంది, సజీవంగా ఉంటుంది. అలాగే, జ్ఞాన అధ్యయనం చేయటం, పుస్తక పఠనం, జ్ఞానుల సాహచర్యాన్ని విడిచిపెట్టడం ద్వారా జ్ఞానం అనేది అంతరిస్తుంది. ఈ విషయం మనము గమనించాలి. కావున, మానవుడు ఎల్లప్పుడూ తన జ్ఞానాన్ని పెంచుకునేందుకై కృషి చేస్తూనే ఉండాలి.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నేర్పిన దుఆ, సూరా తాహా ఆయత్ నంబర్ 114:
رَّبِّ زِدْنِي عِلْمًا (రబ్బీ జిద్నీ ఇల్మా) ఓ నా ప్రభువా, నా జ్ఞానాన్ని పెంచు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది. అదేమంటే, మానవులలో అందరికంటే ఎక్కువ జ్ఞానం ఎవరికి ఉంటుంది? ప్రవక్తలకి. ప్రవక్తలలో ప్రథమంగా ఎవరు ఉన్నారు? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ గురించి, విశ్వాసం గురించి, ఇస్లాం గురించి, ఖురాన్ గురించి, అన్ని విషయాల గురించి ఎక్కువ జ్ఞానం కలిగిన వారు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అయినప్పటికీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన సొంతం కోసం చేసుకునేందుకు ఏ దుఆ నేర్పించాడు? ‘రబ్బీ జిద్నీ ఇల్మా’ జ్ఞానం గురించి దుఆ నేర్పించాడు. ఓ నా ప్రభువా, నా జ్ఞానాన్ని పెంచు. అంటే మహాజ్ఞాని అయిన, ఇమాముల్ అంబియా అయిన, రహ్మతుల్లిల్ ఆలమీన్ అయిన మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం దుఆ చేస్తున్నారు తన కోసం? జ్ఞానం పెరగటానికి దుఆ చేస్తున్నారు. దీంతో మనకు అర్థం అవుతుంది, మోక్షానికి మార్గం కోసం జ్ఞానం ప్రథమంగా ఉంటుంది.
పూర్వ కాలానికి చెందిన మహానుభావులు వైజ్ఞానిక ఔన్నత్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, తమ చివరి శ్వాస వరకు ఈ పవిత్రమైన కార్యాన్ని కొనసాగించారు. ఈ విషయాన్నీ మరొకసారి గమనించి వినండి , పూర్వ కాలానికి చెందిన మహానుభావులు, మన పూర్వీకులు, సలఫ్ సాలెహీన్లు, ముహద్దసీన్లు, అయిమ్మాలు, సహాబాలు, తాబయీన్లు, వారు వైజ్ఞానిక ఔన్నత్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, తమ చివరి శ్వాస వరకు ఈ పవిత్రమైన కార్యాన్ని కొనసాగించారు.
ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి ఇలా అన్నారు: ఏ వ్యక్తి వద్దైతే జ్ఞానం ఉన్నదో, ఎవరి దగ్గర జ్ఞానం ఉన్నదో, అతడు జ్ఞానాన్ని ఆర్జించడాన్ని విడిచిపెట్టకూడదు. జ్ఞానం ఉన్నా కూడా జ్ఞానాన్ని ఆర్జించుకుంటూనే ఉండాలి అని ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి సెలవిచ్చారు.
అలాగే, ఇమాం అబూ అమ్ర్ బిన్ అల్-అలా రహమతుల్లాహి అలైహిని ఎవరో ప్రశ్నించారు: ఏమని? మానవుడు ఎప్పటి వరకు జ్ఞానాన్ని ఆర్జించాలి? అని అడిగితే ఆ మహానుభావుడు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఎప్పుడు వరకు జ్ఞానాన్ని ఆర్జించాలి? అతడు ఆరోగ్యంగా ఉన్నంత వరకు, ఆరోగ్యవంతునిగా, శక్తిమంతునిగా ఉన్నంత వరకు జ్ఞానాన్ని ఆర్జిస్తూనే ఉండాలి.
అలాగే, ఇమాం ఇబ్నె అబ్దుల్ బర్ర్ రహమతుల్లాహి అలైహి, ఇబ్నె అబీ గస్సాన్ రహమతుల్లాహి అలైహి యొక్క వ్యాఖ్యను ఈ విధంగా ఉల్లేఖించారు: ఎప్పుడైతే మీరు జ్ఞానం పట్ల నిరపేక్షాపరులైపోతారో, అప్పుడు అజ్ఞానులైపోతారు. అల్లాహు అక్బర్. ఎప్పుడైతే జ్ఞానం పట్ల నిరపేక్షాపరులు అవుతామో, అప్పుడు వారు ఏమైపోతారు? అజ్ఞానులు అయిపోతారని ఇమాం ఇబ్నె అబ్దుల్ బర్ర్ రహమతుల్లాహి అలైహి సెలవిచ్చారు.
అలాగే, ప్రజల్లో జ్ఞానాన్ని ఆర్జించే అవసరాన్ని అందరికంటే ఎక్కువగా ఎవరు కలిగి ఉన్నాడు? ఈ ప్రశ్న గమనించి వినండి. ప్రజల్లో జ్ఞానాన్ని ఆర్జించే అవసరాన్ని అందరికంటే ఎక్కువగా ఎవరు కలిగి ఉన్నాడు? అని ఇమాం సుఫియాన్ బిన్ ఉయైనా రహమతుల్లాహి అలైహిను ఎవరో ప్రశ్నించారు. ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే, వారిలో అందరికంటే గొప్ప పండితుడు అయిన వ్యక్తి. గొప్ప పండితుడు, ఎవరి దగ్గర ఆల్రెడీ జ్ఞానం ఉందో అటువంటి వ్యక్తి ఇంకా జ్ఞానాన్ని ఆర్జించాలి అని అన్నారు ఆయన. ఎందుకు అని మళ్ళీ ప్రశ్నిస్తే, ఎందుకంటే అటువంటి వ్యక్తి తన జ్ఞానం వలన ఏదైనా చిన్న తప్పు చేసినా, అది ఎంతో పెద్ద చెడ్డ విషయంగా పరిగణించబడుతుంది. కనుక, ఎల్లప్పుడూ జ్ఞానాన్ని ఆర్జించేందుకై నిరంతరాయంగా కృషి చేస్తూనే ఉండాలి.
అభిమాన సోదరులారా, ఇక ధార్మిక విద్య ఎందుకు అవసరం అంటే, ముఖ్యంగా ధార్మిక విద్య గురించి నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ధార్మిక విద్య ఎందుకు అవసరం అంటే, ఇస్లాం ధర్మం విద్యపై స్థాపించబడింది. విద్య లేనిదే ఇస్లాం లేదు. ఇస్లాం పై నడిచే ప్రతి వ్యక్తికి విద్య అవసరం. ధార్మిక విద్య అంటే ఖురాన్, హదీసుల అవగాహన. అదే మనకు సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క ఆరాధన పద్ధతి నేర్పుతుంది. అసలు అల్లాహ్ అంటే ఎవరు? సృష్టికర్త అంటే ఎవరు? అల్లాహ్ పట్ల విశ్వాసం అంటే ఏమిటి? ఇంకా ఏ ఏ విషయాల పైన విశ్వసించాలి? ఏ విధంగా విశ్వసించాలి? ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి? అల్లాహ్ మనతో ఏమి కోరుతున్నాడు? మన జీవన విధానం ఏ విధంగా ఉండాలి? మన జీవిత లక్ష్యం ఏమిటి? మరణానంతర జీవితం ఏమిటి? అనేది ధార్మిక విద్య వలనే తెలుస్తుంది.
అభిమాన సోదరులారా, స్వర్గానికి పోయే దారి, మోక్షానికి మార్గం చూపేది కూడా ధార్మిక విద్యే. ఇస్లాం ధర్మం గురించి సరైన అవగాహన ఉన్న వ్యక్తి షిర్క్, కుఫ్ర్, బిద్అత్, ఇతర దురాచారాలు, సామాజిక రుగ్మతలు, అన్యాయాలు, ఘోరాలు, నేరాలు, పాపాలు వాటి నుంచి తెలుసుకుంటాడు, వాటితో దూరంగా ఉంటాడు. సారాంశం ఏమిటంటే ఇహపరలోకాల సాఫల్యం ధార్మిక విద్య వల్లే దక్కుతుంది. ఈ విషయం మనము గ్రహించాలి.
అలాగే, అభిమాన సోదరులారా, ధార్మిక విద్య రెండు రకాలు. ధార్మిక విద్య రెండు రకాలు. ఒకటి ఇల్మె ఖాస్, ప్రత్యేకమైన విద్య. రెండవది ఇల్మె ఆమ్. ఇల్మె ఖాస్ అంటే అది ఫర్జె కిఫాయా. ఉమ్మత్‌లో కొంతమంది నేర్చుకుంటే సరిపోతుంది, అది ప్రతి ఒక్కరికీ సాధ్యం కూడా కాదు. ప్రతి వ్యక్తికి అది సాధ్యం కాదు. ఉమ్మత్‌లో కొంతమంది దానిని నేర్చుకుంటే సరిపోతుంది. అంటే, ఖురాన్ మరియు హదీసుల లోతుకి వెళ్ళడం. తఖస్సుస్ ఫిల్ లుగా, భాషలో ప్రావీణ్యత, తఫ్సీర్, ఉసూలె తఫ్సీర్, హదీస్, ఉసూలె హదీస్, ఫిఖ్, ఉసూలె ఫిఖ్, నహూ, సర్ఫ్ అంటే అరబీ గ్రామర్, ఫిఖ్, ఉసూలె ఫిఖ్, అల్-బలాగా, ఇల్ముల్ మఆనీ, ఇల్ముల్ బయాన్, ఇల్ముల్ ఫరాయిజ్, వగైరా మొదలగునవి.
అలాగే, ఈ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా తౌబా ఆయత్ నంబర్ 122లో ఇలా సెలవిచ్చాడు:
فَلَوْلَا نَفَرَ مِن كُلِّ فِرْقَةٍ مِّنْهُمْ طَائِفَةٌ لِّيَتَفَقَّهُوا فِي الدِّينِ وَلِيُنذِرُوا قَوْمَهُمْ إِذَا رَجَعُوا إِلَيْهِمْ لَعَلَّهُمْ يَحْذَرُونَ ప్రతి పెద్ద సమూహంలో నుంచి ఒక చిన్న సమూహం బయలుదేరి ధర్మ అవగాహనను పెంపొందించుకోవాలి. పెంపొందించుకుని వారు తమ వద్దకు తిరిగి వచ్చినప్పుడు, వారు భయభక్తులను అలవరుచుకునేందుకు గాను వారికి భయబోధ చేయాల్సింది.
ధర్మ జ్ఞానాన్ని ఆర్జించాలని ఈ ఆయత్ మనకు నొక్కి చెబుతుంది. ధర్మ విద్య కోసం ప్రతి పెద్ద జన సమూహం నుంచి, ప్రతి తెగ నుంచి కొంతమంది తమ ఇల్లు వాకిలిని వదలి జ్ఞాన పీఠాలకు, ధార్మిక విశ్వవిద్యాలయాలకు వెళ్ళాలి. ధర్మ జ్ఞానానికి సంబంధించిన వివిధ విభాగాలలో పాండిత్యాన్ని పెంపొందించుకోవాలి. ఆ తర్వాత తమ తమ ప్రదేశాలకు తిరిగి వెళ్లి ప్రజలకు ధర్మ ధర్మాలను విడమరిచి చెప్పాలి, మంచిని ప్రబోధించాలి, చెడుల నుంచి వారించాలి. ధర్మ అవగాహన అంటే ఇదే.
అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు ఆలి ఇమ్రాన్‌లో ఆయత్ నంబర్ ఏడు, సూరా ఆలి ఇమ్రాన్.
నీపై గ్రంథాన్ని అవతరింపజేసిన వాడు ఆయనే. అందులో సుస్పష్టమైన ముహ్కమాత్ వచనాలు ఉన్నాయి, స్పష్టమైన వచనాలు, ఆయతులు ఉన్నాయి, అవి గ్రంథానికి మూలం. వ ఉఖరు ముతషాబిహాత్. మరికొన్ని ముతషాబిహాత్ ఆయతులు ఉన్నాయి, అంటే బహువిధ భావంతో కూడిన వచనాలు. ఫ అమ్మల్లజీన ఫీ కులూబిహిమ్ జైగున్, ఎవరి హృదయాలలో వక్రత ఉంటుందో, వారు ఏం చేస్తారు? ఫయత్తబిఊన మా తషాబహ మిన్హుబ్తిగా అల్ ఫిత్నతి వబ్తిగా అతఅవీలిహి, వారు అందులోని అంటే ఆ ముతషాబిహాత్‌లోని బహువిధ భావ వచనాల వెంటపడి ప్రజలను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తారు. తమ ఉద్దేశాలకు అనుగుణంగా తాత్పర్యాలు చేస్తారు. నిజానికి వాటి వాస్తవికత అల్లాహ్‌కు తప్ప మరెవరికీ తెలియదు. కాకపోతే ఆ తర్వాత అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: వర్రాసిఖూన ఫిల్ ఇల్మి యకూలూన ఆమన్నా బిహి కుల్లుమ్ మిన్ ఇంది రబ్బినా వమా యజ్జక్కరు ఇల్లా ఉలుల్ అల్బాబ్. అంటే, అయితే జ్ఞానంలో పరిపక్వత పొందిన వారు, ధర్మ అవగాహనం కలిగిన వారు, జ్ఞానంలో పరిపక్వత కలిగిన వారు, పొందిన వారు మాత్రం, మేము వీటిని విశ్వసించాము, ఇవన్నీ మా ప్రభువు తరపు నుంచి వచ్చినవే అని అంటారు. వాస్తవానికి బుద్ధిజ్ఞానులు కలవారు మాత్రమే హితబోధను గ్రహిస్తారు. ఇది ఇల్మె ఖాస్ గురించి కొన్ని విషయాలు చెప్పాను నేను, ఇంకా వివరణకి అంత సమయం లేదు కాబట్టి.
ఇక ఇల్మె ఆమ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇల్మె ఆమ్. ఇది ప్రతి వ్యక్తి నేర్చుకోవలసిన జ్ఞానం. ప్రతి వ్యక్తి, ప్రతి ముస్లిం నేర్చుకోవలసిన జ్ఞానం ఇల్మె ఆమ్. దీని గురించే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. ముస్లిం అయిన ప్రతి స్త్రీ పురుషునిపై జ్ఞానాన్ని ఆర్జించటం విధి, తప్పనిసరి అన్నారు. అంటే, తౌహీద్ అంటే ఏమిటి? షిర్క్ అంటే ఏమిటి? బిద్అత్ అంటే ఏమిటి? సున్నత్ అంటే ఏమిటి? నమాజ్ విధానం, దాని వివరాలు, ఉపవాసం, దాని వివరాలు, హజ్, ఉమ్రా, హలాల్ సంపాదన, వ్యవహార సరళి, జీవన విధానం, ధర్మ సమ్మతం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి, హలాల్ సంపాదన ఏమిటి, హరామ్ సంపాదన దేనిని అంటారు? అమ్మ నాన్నకి సంబంధించిన హక్కులు, భార్యాభర్తలకు సంబంధించిన హక్కులు, సంతానానికి సంబంధించిన హక్కులు, ఇరుగుపొరుగు వారి హక్కులు, జంతువుల హక్కులు, ఈ విధంగా ఈ విషయాలు ఇల్మె ఆమ్ కిందికి వస్తాయి.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ముహమ్మద్ ఆయత్ 19లో ఇలా సెలవిచ్చాడు:
فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ ఓ ప్రవక్తా, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో. అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి, తౌహీద్ గురించి, ఏకదైవ ఆరాధన గురించి, ఏకత్వం గురించి, షిర్క్ ఖండన గురించి బాగా తెలుసుకో, స్పష్టంగా తెలుసుకో, నీ పొరపాట్లకు గాను క్షమాపణ వేడుకుంటూ ఉండు. ఈ ఆయత్ ఆధారంగా ఇమాముల్ ముహద్దసీన్, ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి తన సహీహ్ బుఖారీలో ఈ చాప్టర్ ఈ విధంగా ఆయన తీసుకొని వచ్చారు:
بَابُ الْعِلْمِ قَبْلَ الْقَوْلِ وَالْعَمَلِ చెప్పకంటే ముందు, ఆచరించటం కంటే ముందు జ్ఞానం అవసరం అని ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి సహీహ్ బుఖారీలో ఒక చాప్టర్ తీసుకొని వచ్చారు.
అభిమాన సోదరులారా, జ్ఞానం, ధర్మ అవగాహన విశిష్టత గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ముజాదలా, ఖురాన్‌లోని 28వ భాగంలోని మొదటి సూరా, ఆయత్ 18లో ఇలా సెలవిచ్చాడు:
يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ (యర్ఫఇల్లాహుల్లజీన ఆమనూ మిన్కుమ్ వల్లజీన ఊతుల్ ఇల్మ దరజాత్) మీలో విశ్వసించిన వారి, జ్ఞానం ప్రసాదించబడిన వారి అంతస్తులను అల్లాహ్ పెంచుతాడు.
అంటే ఈ ఆయత్‌లో ప్రత్యేకంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెండు విషయాలు తెలియజేశాడు. ఒకటి విశ్వాసం, ఆ తర్వాత జ్ఞానం ప్రసాదించబడిన వారు. వారిద్దరి అంతస్తులను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెంచుతాడు.
అలాగే, సూరా ఆలి ఇమ్రాన్, ఆయత్ నంబర్ 18లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
شَهِدَ اللَّهُ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ وَالْمَلَائِكَةُ وَأُولُو الْعِلْمِ قَائِمًا بِالْقِسْطِ (షహిదల్లాహు అన్నహూ లా ఇలాహ ఇల్లా హువ వల్ మలాఇకతు వ ఉలుల్ ఇల్మి కాఇమం బిల్ కిస్త్) అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని స్వయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులు, జ్ఞానులు, ధార్మిక పండితులు, ధర్మ అవగాహన కలిగిన వారు సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వం, సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిచి ఉంచాడు, నిలిపి ఉంచాడు.
అలాగే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా అన్‌కబూత్ ఆయత్ 43లో ఇలా సెలవిచ్చాడు:
وَتِلْكَ الْأَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ ۖ وَمَا يَعْقِلُهَا إِلَّا الْعَالِمُونَ ప్రజలకు బోధ పరచడానికి మేము ఈ ఉపమానాలను ఇస్తున్నాము. అయితే జ్ఞానం కలవారు మాత్రమే వీటిని అర్థం చేసుకోగలుగుతారు.
అభిమాన సోదరులారా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆయతులు, ప్రామాణిక హదీసులు ఉన్నాయి. మోక్షానికి మార్గం, స్వర్గానికి దారి, నరకము నుంచి కాపాడుకోవటం దీనికి ప్రథమంగా ఉండేది జ్ఞానం. నేను రెండు ఉదాహరణలు ఇచ్చి రెండవ అంశం పైన నేను పోతాను.
మొదటి ఉదాహరణ ఆదం అలైహిస్సలాం ఉదాహరణ. సూరా బఖరా ప్రారంభంలోనే మనకు ఆ ఆయతులు ఉంటాయి.
وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَى الْمَلَائِكَةِ فَقَالَ أَنبِئُونِي بِأَسْمَاءِ هَٰؤُلَاءِ إِن كُنتُمْ صَادِقِينَ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదం అలైహిస్సలాంను సృష్టించిన తర్వాత మొదటి పని ఏమిటి? ఆదం అలైహిస్సలాంకు జ్ఞానాన్ని నేర్పించాడు. వఅల్లమ ఆదమల్ అస్మా కుల్లహా. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదం అలైహిస్సలాంను సృష్టించిన తర్వాత, అంటే మొదటి మానవుడు, మొదటి వ్యక్తి. సృష్టి తర్వాత ప్రథమంగా అల్లాహ్ చేసిన పని ఏమిటి? జ్ఞానం నేర్పించాడు. ఆ జ్ఞానం కారణంగానే ఆదం అలైహిస్సలాం మస్జూదే మలాయికా అయ్యారు. ఆ వివరానికి నేను పోవ దల్చుకోలేదు. ఇది ఒక ఉదాహరణ.
రెండవ ఉదాహరణ, ఇమాముల్ అంబియా, రహమతుల్లిల్ ఆలమీన్, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి వాణి, దేనికి సంబంధించిన వాణి వచ్చింది? జ్ఞానం గురించే వచ్చింది. సూరా అలఖ్ మొదటి ఐదు ఆయతులు. ఇఖ్రా బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్. ఇఖ్రాతో ఖురాన్ మొదటి ఆయత్ అవతరించింది. జ్ఞానంతో.
అభిమాన సోదరులారా, ఇవి ఉదాహరణగా నేను చెప్పాను. మోక్షానికి మార్గం అనే ఈ అంశం పైన మొదటి ముఖ్యమైన విషయం జ్ఞానం. ఎందుకంటే జ్ఞానం లేనిదే ఇస్లాం లేదు, ఇస్లాం విద్య పైనే స్థాపించబడింది. ఇది మొదటి విషయం, సరైన అవగాహన కలిగి ఉండాలి. దేని గురించి? ధర్మం గురించి, ఖురాన్ గురించి, అల్లాహ్ గురించి, విశ్వాసాల గురించి సరైన జ్ఞానం కలిగి ఉండాలి. ఇది మొదటి విషయం.
ఆచరణ (దానికి కట్టుబడి ఉండటం)
ఇక ఈ రోజుకి అంశానికి సంబంధించిన రెండవ అంశం, రెండవ విషయం, అది అల్ ఇల్తిజాము బిహా. అమల్, ఆచరణ, స్థిరత్వం. అంటే దానికి కట్టుబడి ఉండటం. ఏదైతే ఆర్జించామో, నేర్చుకున్నామో దానిపై స్థిరంగా ఉండాలి.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:
وَالْعَصْرِ إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ (వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లజీన ఆమనూ వ అమిలుస్సాలిహాతి వతవాసవ్ బిల్ హక్కి వతవాసవ్ బిస్సబ్ర్) నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించిన వారు, ఒండొకరికి సహనం గురించి తాకీదు చేసిన వారు మాత్రం నష్టపోరు.
ఈ సూరా యొక్క తఫ్సీర్, వివరణలోకి నేను పోవటం లేదు. ఈ సూరాలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాలుగు విషయాలు వివరించాడు. ఈమాన్, విశ్వాసం. రెండవది ఆచరణ, అల్ ఇల్తిజాము బిహా, ఆచరణ, అమల్. మూడవది, సత్యం, ఒకరి గురించి ఒకరికి చెప్పుకోవటం, అంటే అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్కర్, దావత్, ప్రచారం చేయటం. నాలుగవది, సబర్, సహనం. అంటే విద్యను, జ్ఞానాన్ని ఆర్జించే సమయంలో, విషయంలో, ఆ ప్రక్రియలో, విశ్వాసపరంగా జీవించే సందర్భంలో, ఆచరించే విషయంలో, అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్కర్, దావత్ విషయంలో ఆపదలు రావచ్చు, సమస్యలు రావచ్చు, కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, సహనంతో ఉండాలి అనేది ఈ నాలుగు ముఖ్యమైన విషయాలు అల్లాహ్ ఈ సూరాలో తెలియజేశాడు. అంటే జ్ఞానం తర్వాత, విశ్వాసం తర్వాత, ఆచరణ, కట్టుబడి ఉండటం, ఆచరించటం.
ఈ విషయం గురించి ఖురాన్‌లో ఒకచోట కాదు, రెండు సార్లు కాదు, పది సార్లు కాదు, అనేక సార్లు, 40-50 సార్ల కంటే ఎక్కువ ఆయతులు ఉన్నాయి దీనికి సంబంధించినవి. నేను ఒక ఐదు ఆరు ఉదాహరణగా చెప్తాను. సూరా కహఫ్, ఆయత్ నంబర్ 107. ఈ రోజు ఈ ప్రోగ్రాం ప్రారంభమైంది సూరా కహఫ్‌లోని చివరి నాలుగు ఆయతుల పారాయణంతో. ఈ ఆయత్, సూరా కహఫ్, ఆయత్ నంబర్ 107.
إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ كَانَتْ لَهُمْ جَنَّاتُ الْفِرْدَوْسِ نُزُلًا విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి ఆతిథ్యంగా ఫిరదౌస్ వనాలు ఉంటాయి.
అభిమాన సోదరులారా, ఇక్కడ ఒక గమనిక, ఇప్పుడు నేను ఆచరణ అనే విషయానికి చెప్తున్నాను, విషయం చెప్తున్నాను. విశ్వాసం అంటే ధర్మ పండితులు, జ్ఞానం జ్ఞానంతో పోల్చారు. విశ్వాసం అంటే జ్ఞానం అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఓకే, విశ్వాసం, జ్ఞానం. ఆ తర్వాత ఆచరణ. ఈ ఆయత్‌లో అల్లాహ్ ఏం సెలవిచ్చాడు? విశ్వసించి, విశ్వాసం తర్వాత, జ్ఞానం తర్వాత, సత్కార్యాలు చేసిన వారికి ఆతిథ్యంగా ఫిరదౌస్ వనాలు ఉన్నాయి. ఫిరదౌస్ వనం అనేది స్వర్గంలోని అత్యున్నత స్థానం. అందుకే మీరు అల్లాహ్‌ను స్వర్గం కోరినప్పుడల్లా జన్నతుల్ ఫిరదౌస్‌ను కోరండి, ఎందుకంటే అది స్వర్గంలోని అత్యున్నత స్థలం, స్వర్గంలోని సెలయేరులన్నీ అక్కడి నుంచే పుడతాయి అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ కితాబుత్తౌహీద్‌లో ఉంది.
అలాగే, సూరా కహఫ్‌లోనే ఆయత్ నంబర్ 30లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ إِنَّا لَا نُضِيعُ أَجْرَ مَنْ أَحْسَنَ عَمَلًا విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి విషయం, నిశ్చయంగా మేము ఉత్తమ ఆచరణ చేసిన వారి ప్రతిఫలాన్ని వృథా కానివ్వము.
ఎవరి కర్మలు, ఎవరి ప్రతిఫలం వృథా కాదు? ఈ ఆయత్ యొక్క అనువాదం గమనించండి. ఇన్నల్లజీన ఆమనూ వ అమిలుస్సాలిహాత్. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు, ఆచరించే వారు, ఏదైతే నేర్చుకున్నారో, ధర్మ అవగాహనం కలిగి ఉన్నారో, ఆ తర్వాత జ్ఞానం తర్వాత దానిపై కట్టుబడి ఉన్నారో, స్థిరంగా ఉన్నారో వారి ప్రతిఫలాన్ని అల్లాహ్ వృథా చేయడు. ఈ ఆయత్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు.
అలాగే, సూరా బఖరా ఆయత్ నంబర్ 277లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ لَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ విశ్వసించి (సున్నత్ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్‌ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు.
ఈ ఆయత్ యొక్క అర్థాన్ని గమనించండి. విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి, విశ్వసించిన తర్వాత, ఆర్జించిన తర్వాత, అవగాహన కలిగిన తర్వాత, దానిపైన స్థిరంగా ఉండేవారికి, కట్టుబడి ఉండేవారికి, నమాజులను నెలకొల్పే వారికి, జకాతులను చెల్లించే వారికి, తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది, వారికి ఎలాంటి భయం గానీ, చీకూచింత గానీ ఉండదు. అభిమాన సోదర సోదరీమణులారా,
ఈ ఆయత్‌లో నేను ముఖ్యంగా రెండు విషయాలు చెప్పదలిచాను, బాగా గమనించి వింటారని ఆశిస్తున్నాను, గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ఈ ఆయత్‌లో రెండు విషయాలు ఉన్నాయి, ఒకటి ఉంది ఖౌఫ్, రెండవది ఉంది హుజ్న్. ఖౌఫ్ అంటే ఉర్దూలో డర్, తెలుగులో భయం. హుజ్న్ అంటే ఉర్దూలో గమ్, తెలుగులో దుఃఖం, చింత. ఇక దీనికి మనము అసలు ఖౌఫ్ దేనిని అంటారు, హుజ్న్ దేనిని అంటారు? భయం అంటే ఏమిటి, హుజ్న్, దుఃఖం, చింత అంటే ఏమిటి? ఇది మనం తెలుసుకోవాలి.
ఖౌఫ్ అంటే భవిష్యత్తులో ప్రమాదానికి సంబంధించినది. భవిష్యత్తులో, రాబోయే కాలంలో. ప్రమాదానికి సంబంధించినది. గతంలో జరిగిన ప్రమాదం వల్ల కలిగే బాధను హుజ్న్ అంటారు. తేడా చూడండి. ఖౌఫ్ అంటే భవిష్యత్తులో ప్రమాదానికి సంబంధించిన విషయం. హుజ్న్ అంటే చింత అంటే, దుఃఖం అంటే, గతంలో జరిగిన ప్రమాదం వల్ల కలిగే బాధకు సంబంధించినది. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ధర్మ పండితుల వివరణ ఏమిటంటే, భయం, ఖౌఫ్ అనేది గ్రహించిన ప్రమాదం వల్ల కలిగే ఆటంకం. హుజ్న్, గమ్, చింతన అంటే మానసిక క్షోభ లేదా గుండె యొక్క డిప్రెషన్ ని అంటారు. అల్లాహు అక్బర్. అంటే, ధర్మ అవగాహన తర్వాత, జ్ఞానం తర్వాత, కట్టుబడి ఉంటే ఈ రెండు ఉండవు. ఖౌఫ్ ఉండదు, హుజ్న్ ఉండదు. భయము ఉండదు, దుఃఖం ఉండదు. గతం గురించి, భవిష్యత్తు గురించి. ఇంత వివరం ఉంది ఈ ఆయత్‌లో.
అభిమాన సోదరులారా, అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా యూనుస్, సూరా యూనుస్ ఆయత్ నంబర్ తొమ్మిదిలో ఇలా సెలవిచ్చాడు:
إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ يَهْدِيهِمْ رَبُّهُم بِإِيمَانِهِمْ ۖ تَجْرِي مِن تَحْتِهِمُ الْأَنْهَارُ فِي جَنَّاتِ النَّعِيمِ నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి వారి ప్రభువు వారి విశ్వాసం కారణంగా వారిని గమ్యస్థానానికి చేరుస్తాడు. క్రింద కాలువలు ప్రవహించే అనుగ్రహభరితమైన స్వర్గ వనాలలోకి.
అభిమాన సోదరులారా, సమయం అయిపోతా ఉంది నేను తొందర తొందరగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను.
إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَيَجْعَلُ لَهُمُ الرَّحْمَٰنُ وُدًّا విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి యెడల కరుణామయుడైన అల్లాహ్ ప్రేమానురాగాలను సృజిస్తాడు. (సూరా మర్యం ఆయత్ 96)
సుబ్ హా నల్లాహ్. విశ్వసించి, దానిపై కట్టుబడి ఉంటే, స్థిరత్వంగా ఉంటే, ఆచరిస్తే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రేమానురాగాలను సృజిస్తాడు. అంటే, ప్రజల హృదయాలలో వారి పట్ల ప్రేమను, గౌరవ భావాన్ని జనింపజేస్తాడు అన్నమాట.
అలాగే సూరా బయినా ఆయత్ ఏడులో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు; నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు.(98:7)
మానవులలో, ప్రజలలో, మనుషులలో అందరికంటే ఉత్తమమైన వారు, గొప్పమైన వారు, ఉన్నత స్థాయికి చేరిన వారు ఎవరు? విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు. నిశ్చయంగా సృష్టిలో వారే అందరికంటే ఉత్తములు అని సాక్ష్యం ఎవరు ఇస్తున్నారు? సకల లోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా.
అభిమాన సోదరులారా, అబూ అమర్ లేదా అబీ అమ్రా సుఫియాన్ బిన్ అబ్దుల్లా కథనం, నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగాను. ఆయన ఏం అడిగారు ప్రవక్త గారితో? నాకు ఇస్లాం గురించి ఏమైనా బోధించండి. అయితే దాని గురించి నేను మిమ్మల్ని తప్ప వేరొకళ్ళని అడగవలసిన అవసరం రాకూడదు. ఒక విషయం చెప్పండి అది విని నేను ఆచరించిన తర్వాత ఇంకెవ్వరికీ అడిగే నాకు అవసరమే రాకూడదు, అటువంటి విషయం ఏమైనా బోధించండి అని ఆయన కోరితే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు: ఒకే ఒక వాక్యం. దాంట్లో రెండు విషయాలు ఉన్నాయి.
అంటే, నేను అల్లాహ్‌ను నమ్ముతున్నాను, నేను అల్లాహ్‌ను విశ్వసిస్తున్నాను, అల్లాహ్ పట్ల విశ్వాసం, ఈమాన్ కలిగి ఉన్నాను అని చెప్పు. తర్వాత ఆ మాట పైనే స్థిరంగా, నిలకడగా ఉండు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. అంటే చివరి శ్వాస వరకు ఈమాన్ పైనే స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి అన్నమాట. అభిమాన సోదరులారా, ఈ విధంగా దీనికి సంబంధించిన ఆయతులు, ఖురాన్ ఆయతులు, హదీసులు చాలా ఉన్నాయి.
ప్రచారం (ఇతరులకు అందజేయటం)
ఇక, మోక్షానికి మార్గం ఈ అంశానికి సంబంధించిన నేను మూడు విషయాలు చెప్తానని ప్రారంభంలో అన్నాను. ఒకటి జ్ఞానం, కొన్ని విషయాలు తెలుసుకున్నాము. రెండవది దానిపై కట్టుబడి ఉండటం. ఇల్మ్ తర్వాత అమల్. జ్ఞానం తర్వాత ఆచరణ. ఇక ఈ రోజు నా మూడవ విషయం ఏమిటంటే,
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ఆలి ఇమ్రాన్, ఆయత్ 104లో ఇలా సెలవిచ్చాడు:
وَلْتَكُن مِّنكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ ۚ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ మేలు వైపుకు పిలిచే, మంచిని చేయమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యాన్ని పొందుతారు.
అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా నహల్‌లో ఆయత్ 125లో ఇలా సెలవిచ్చాడు:
ادْعُ إِلَىٰ سَبِيلِ رَبِّكَ بِالْحِكْمَةِ وَالْمَوْعِظَةِ الْحَسَنَةِ ۖ وَجَادِلْهُم بِالَّتِي هِيَ أَحْسَنُ నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోను, చక్కని ఉపదేశంతోను పిలువు. అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు. అంటే, ధర్మ పరిచయ, దావత్ కార్యక్రమానికి సంబంధించిన మూల సూత్రాలు తెలుపబడ్డాయి. ఏ విధంగా ఆహ్వానించాలి? అది వివేకం, మంచి హితబోధ, మృదుత్వంతో కూడుకున్నవి. అత్యుత్తమ రీతిలో మాట్లాడాలి. నగుమోముతోనే విషయాన్ని విడమరిచి చెప్పాలి. మీరు వారి శ్రేయాన్ని అభిలషించే వారన్న అభిప్రాయాన్ని ఎదుటి వారితో కలిగించాలి. దురుసు వైఖరి ఎంత మాత్రం తగదు.
అలాగే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ఫుస్సిలత్ ఆయత్ 33లో ఇలా సెలవిచ్చాడు:
وَمَنْ أَحْسَنُ قَوْلًا مِّمَّن دَعَا إِلَى اللَّهِ وَعَمِلَ صَالِحًا وَقَالَ إِنَّنِي مِنَ الْمُسْلِمِينَ అల్లాహ్ వైపు పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ, నేను విధేయులలో ఒకడను అని పలికే వాని మాట కంటే మంచి మాట మరెవరిది కాజాలదు, కాగలదు. అంటే ఎవరైతే అల్లాహ్ వైపు పిలుస్తాడో, అంటే దావత్ పని చేస్తాడో, ఇతరులకు అందజేస్తాడో, అటువంటి మాట కంటే మంచి మాట, గొప్ప మాట, ఉత్తమమైన మాట ఎవరిది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంటున్నాడు.
అభిమాన సోదరులారా, సూరా మాయిదా ఆయత్ నంబర్ 78. ఈ విషయం చాలా ముఖ్యమైనది.
لُعِنَ الَّذِينَ كَفَرُوا مِن بَنِي إِسْرَائِيلَ عَلَىٰ لِسَانِ دَاوُودَ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۚ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ كَانُوا لَا يَتَنَاهَوْنَ عَن مُّنكَرٍ فَعَلُوهُ ۚ لَبِئْسَ مَا كَانُوا يَفْعَلُونَ బనీ ఇస్రాయీల్‌లోని అవిశ్వాసులు దావూద్ నోట, మర్యం పుత్రుడైన ఈసా అలైహిస్సలాం నోట, దావూద్ అలైహిస్సలాం నోట, ఈసా అలైహిస్సలాం నోట శపించబడ్డారు, శాపానికి గురయ్యారు. ఎందుకంటే, ఎందుకు? కారణం ఏమిటి? వారు అవిధేయతకు పాల్పడేవారు, హద్దు మీరి ప్రవర్తించేవారు. అంతేకాకుండా చివర్లో అల్లాహ్ ఈ ముఖ్యమైన కారణం చెప్పాడు. అది ఏమిటి? కానూ లా యతనాహౌన అమ్ మున్కరిన్ ఫఅలూహు లబిఅస మా కానూ యఫ్అలూన్. వారు తాము చేసే చెడు పనుల నుండి ఒండొకరిని నిరోధించే వారు కారు. వారు చేస్తూ ఉండినది బహు చెడ్డది. ఈ ఆయత్‌లో బనీ ఇస్రాయీల్‌లోని ఒక వర్గానికి దావూద్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం నోట శపించబడ్డారు, శపించబడటం జరిగింది, ఒక వర్గం శపించబడ్డారు. కారణం ఏమిటి? ముఖ్యమైన మూడు కారణాల వల్ల వారు శాపానికి గురయ్యారు, ప్రవక్తల ద్వారా. ఆ ముఖ్యమైన మూడు విషయాలు ఏమిటి? ఒకటి, అల్లాహ్ విధిని నెరవేర్చకుండా ఉండటం. ఒకటి అల్లాహ్ విధిని వారు నెరవేర్చలేదు. అంటే ఆచరించలేదు. వారికి ఏ ధర్మ జ్ఞానం అల్లాహ్ ఇచ్చాడో, ఏ జ్ఞానాన్ని అల్లాహ్ వారికి ఇచ్చాడో, ఏ ఆదేశాలు అల్లాహ్ వారికి ఇచ్చాడో, ఏ జ్ఞానం వారికి తెలుసో దానిపైన వారు ఆచరించలేదు, జ్ఞానం తర్వాత ఆచరణ లేదు.
రెండవ కారణం ఏమిటి? ధర్మం విషయంలో అతిశయించటం, గులూ చేయటం. మూడవ విషయం ఏమిటి? చెడుల నుంచి ఆపే పని చేయకపోవటం. అంటే అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్కర్, దావా పని వారు చేయలేదు. ముఖ్యమైన ఈ మూడు కారణాల వల్ల బనీ ఇస్రాయీల్‌లోని ఒక వర్గం దావూద్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం నోట శపించబడ్డారు. ఇది మనము గ్రహించాల్సిన విషయం.
అభిమాన సోదరులారా, ఇక దావత్ విషయంలో, ఇతరులను, ధర్మాన్ని, జ్ఞానాన్ని అందజేసే విషయంలో, ముఖ్యమైన ఒక విషయం ఉంది. అది మనం గమనించాలి. అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా యూసుఫ్ ఆయత్ 108లో ఇలా సెలవిచ్చాడు:
قُلْ هَٰذِهِ سَبِيلِي أَدْعُو إِلَى اللَّهِ ۚ عَلَىٰ بَصِيرَةٍ أَنَا وَمَنِ اتَّبَعَنِي ۖ وَسُبْحَانَ اللَّهِ وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ అల్లాహు అక్బర్. ఈ ఆయత్ యొక్క పూర్తి నేను వివరణలోకి పోను అంత సమయం కూడా లేదు. క్లుప్తంగా దీని అర్థం తెలుసుకుందాము. ఓ ప్రవక్తా, ఇలా చెప్పు, నా మార్గం అయితే ఇదే. నేను, నా అనుయాయులు పూర్తి అవగాహనతో, దృఢ నమ్మకంతో అల్లాహ్ వైపుకు పిలుస్తున్నాము. అల్లాహ్ పరమ పవిత్రుడు. నేను అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించే వారిలోని వాడిని కాను, అంటే నేను ముష్రిక్‌ను కాను. అంటే, తౌహీద్ మార్గమే నా మార్గం, మొదటి విషయం. రెండవది, నేనే కాదు ప్రవక్తలందరి మార్గం కూడా ఇదే. మూడవది, నేను ఈ మార్గం వైపు ప్రజలని ఆహ్వానిస్తున్నాను, దావా పని చేస్తున్నాను కదా, పూర్తి విశ్వాసంతోను, ప్రమాణబద్ధమైన ఆధారాలతోను, నేను ఈ మార్గం వైపునకు పిలుస్తున్నాను. నేను మాత్రమే కాదు, నన్ను అనుసరించే వారు కూడా ఈ మార్గం వైపుకే పిలుస్తున్నారు. అల్లాహ్ పరిశుద్ధుడు, దోషరహితుడు, సాటిలేని వాడు, ప్రజలు కల్పించే భాగస్వామ్యాలకు, పోలికలకు ఆయన అతీతుడు. అంటే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దావత్ విధానం, గూగుల్ సార్‌ని ఆధారంగా తీసుకొని, నాలుగు పుస్తకాలు లేకపోతే నాలుగు విషయాల, నాలుగు సబ్జెక్టుల, నాలుగు సబ్జెక్టులు కంఠస్థం చేసుకొని లేదా నాలుగు ఆడియోలు, వీడియోల క్లిప్పులు చేసి అది కంఠస్థం చేసుకొని సూటు బూటు వేసుకొని ధర్మ పండితులు అవ్వరు. సరైన ధర్మ అవగాహనం కలిగి ఉండాలి. అదఊ ఇలా ఇలల్లాహి అలా బసీరతిన్, పూర్తి విశ్వాసం తర్వాత ప్రమాణబద్ధమైన ఆధారాలతోను.
అభిమాన సోదరులారా, ఇక చివర్లో నేను ఒక్క హదీస్ చెప్పి నా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది. చిన్న హదీస్, మూడే మూడు పదాలు ఉన్నాయి ఆ హదీస్‌లో. అది ఏమిటంటే, కాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
بَلِّغُوا عَنِّي وَلَوْ آيَةً (బల్లిగూ అన్నీ వలవ్ ఆయహ్)
నా తరఫు నుండి ఒక్క ఆయత్ అయినా సరే మీకు తెలిస్తే, అది ఇతరులకు అందజేసే బాధ్యత మీ పైన ఉంది. ఈ హదీస్‌లో మూడు ముఖ్యమైన విషయాలు ఇమాం హసన్ బసరీ రహమతుల్లాహి అలైహి వివరించారు. బల్లిగూ అనే పదంలో తక్లీఫ్ ఉంది. అన్నీ అనే పదంలో తష్రీఫ్ ఉంది. వలవ్ ఆయహ్ అనే పదంలో తస్హీల్ ఉంది. తక్లీఫ్ అంటే బాధ్యత. బల్లిగూ అనే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. ఆదేశం అది, ఆర్డర్. బల్లిగూ. అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాధ్యత ఇస్తున్నారు, ముకల్లఫ్ చేస్తున్నారు. ఇతరులను అందజేసే బాధ్యత మీపై ఉంది, మీపై మోపుతున్నాను, ఈ విషయం గ్రహించండి. ఈ పదంలో తక్లీఫ్ ఉంది. ఆ బాధ్యతను మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. రెండవది అన్నీలో తష్రీఫ్ ఉంది. తష్రీఫ్ అంటే గౌరవం. నా తరఫు నుంచి వచ్చిన విషయాలు, నా తరఫు నుంచి, గమనించాలి, వివరణకి పోవటానికి సమయం లేదు, నా తరఫు నుంచి అంటే ఖురాన్, ప్రామాణికమైన హదీసులు మాత్రమే. అన్నీ. ఏ హదీస్ కి ప్రామాణికం లేదో, ఆ విషయాలు చర్చించకూడదు. మౌజూ హదీస్, మన్ఘడత్ హదీస్, ఖురాఫాత్, ఇస్రాయీలియాత్, వారి వెంట పడకూడదు. అన్నీ నా తరఫు నుంచి స్పష్టంగా ఈ వాక్యం నేను చెప్పాను. ఖురాన్ గురించి సందేహం లేదు. కాకపోతే ఖురాన్ యొక్క అవగాహన, ఈ వాక్యానికి భావం ఏమిటి? ఈ వాక్యానికి అర్థం సహాబాలు ఎలా చేసుకున్నారు? ఈ వాక్యానికి అర్థం ప్రవక్త గారు ఎలా చెప్పారు? ఆ వాక్యానికి అర్థం సహాబాలు, తాబయీన్లు, ముహద్దసీన్లు, సలఫ్‌లు ఏ అర్థం తీసుకున్నారో ఆ అర్థమే మనం తీసుకోవాలి. హదీస్ విషయంలో, ప్రవక్త గారి ప్రవచనాల విషయంలో అన్నీ, నా తరఫు నుంచి, ఈ హదీస్ సహీహ్, ఈ హదీస్ ప్రామాణికమైనది, ఇది హసన్ అని మీకు నమ్మకం అయితేనే మీరు చెప్పాలి. అన్నీ ఎందుకంటే అది గౌరవంతో పాటు ప్రవక్త గారు కండిషన్ పెట్టారు, నా తరఫు నుంచి వచ్చే హదీసులు చెప్పండి. అంటే ఏ విషయం గురించి స్పష్టత లేదో, ఇది ప్రవక్త గారి వాక్యం కాదు, స్పష్టత లేదు, మౌజూ హదీస్, మున్కర్ హదీస్, జయీఫ్ హదీస్, మన్ఘడత్ హదీస్ అంటే ఏంటి? అది ప్రవక్త గారు చెప్పారని రుజువు లేదు. అటువంటి విషయాలు మనం చెప్పకూడదు. బల్లిగూ అన్నీ వలవ్ ఆయాలో మొదటిది బాధ్యత ప్రవక్త గారు మాకు అప్పగిస్తున్నారు. అల్లాహు అక్బర్. రెండవది అన్నీ, ప్రవక్త గారు మాకు గౌరవాన్ని ప్రసాదిస్తున్నారు. వలవ్ ఆయహ్ ఈ పదం చెప్పి ప్రవక్త గారు మాకు సులభం చేశారు. శక్తికి మించిన బరువు మోపలేదు. మీకు ఎంత శక్తి ఉందో, ఎంత సామర్థ్యం ఉందో, ఎంత స్తోమత ఉందో, ఎంత జ్ఞానం ఉందో అంతవరకే మీరు బాధ్యులు. ఈ మూడు విషయాలు ఈ హదీస్‌లో చెప్పబడింది.
అభిమాన సోదరులారా, ఈ విధంగా ఈ రోజు నేను మోక్షానికి మార్గం, సాఫల్యం, ఇహపరలోకాల సాఫల్యం, స్వర్గానికి పోయే దారి, నరకం నుండి ఎలా కాపాడుకోవాలి, మోక్షానికి మార్గం సారాంశం, దానికి సంబంధించిన మూడు విషయాలు క్లుప్తంగా చెప్పాను. ఒకటిది జ్ఞానం, ఇల్మ్, అమల్, దావత్. జ్ఞానం, ఆచరణ, దావత్. క్లుప్తంగా చెప్పాలంటే నా ఈ రోజు ప్రసంగానికి సారాంశం ఏమిటి? అత్తఅల్లుము బిద్దీన్, ధర్మ అవగాహన, జ్ఞానం, ఇల్మ్, ఆర్జించటం, ధార్మిక విద్య నేర్చుకోవటం. వల్ ఇల్తిజాము బిహా, నేర్చుకున్న తర్వాత కట్టుబడి ఉండటం, స్థిరత్వం కలిగి ఉండటం, ఆపదలు వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, ముఖ్యంగా ఎంత ఎక్కువ స్థానంలో మనము ఇస్లాంని ఆచరిస్తామో, ఎంత ఉన్నత స్థాయిలో మన విశ్వాసం ఉంటుందో, ఆ విశ్వాస పరంగానే మనకు బాధలు వస్తాయి. అప్పుడు ఆ బాధల్లో, సమస్యల్లో, కష్టాల్లో, నష్టాల్లో మనము మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. విశ్వాసంలో లోపం రానివ్వకూడదు. చాలా, దానికి మనకు ఆదర్శం ప్రవక్తలు, సహాబాలు, తాబయీన్లు. వారిని మనము ఆదర్శంగా తీసుకోవాలి, వారికి ఏ విధంగా కష్టాలు వచ్చాయి. వారికి వచ్చే కష్టాలలో ఒక్క శాతం కూడా మాకు రావు, అయినా కూడా వారు, సుమయ్యా రదియల్లాహు అన్హా. మోక్షానికి మార్గం మేము సుమయ్యా రదియల్లాహు అన్హా యొక్క ఉదాహరణ మనం వివరిస్తే సరిపోతుంది కదా. సుమయ్యా రదియల్లాహు అన్హా ప్రారంభంలోనే ఇస్లాం స్వీకరించారు. సన్మార్గ భాగ్యం దక్కింది. ఆ తర్వాత ఆవిడ పైన ఎన్ని కష్టాలు వచ్చాయి. ఒక పక్కన భర్త, ఒక పక్కన తనయుడు. వారికి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని బాధలు వచ్చాయి, మనం ఊహించలేము. కానీ వారి విశ్వాసంలో కొంచెమైనా తేడా వచ్చిందా? కొంచెమైనా తేడా? చివరికి కొడుకు చూస్తున్నాడు, తనయుడు అమ్మార్ రదియల్లాహు అన్హా కళ్ల ఎదుట సుమయ్యా రదియల్లాహు అన్హాను దుర్మార్గుడైన అబూ జహల్ నాభి కింద పొడిచి హత్య చేశాడు. కానీ వారి విశ్వాసంలో తేడా వచ్చిందా? ఈ రోజు మనము చిన్న చిన్న విషయాలలో, చిన్న చిన్న ప్రాపంచిక లబ్ధి కోసము, చిన్న చిన్న సమస్యలు వచ్చినా మన విశ్వాసంలో తేడా జరిగిపోతా ఉంది.
అభిమాన సోదరులారా, ఆ విధంగా, మొదటి విషయం, అత్తఅల్లుము బిద్దీన్, ధర్మ అవగాహన, జ్ఞానం, ఇల్మ్. రెండవది, అల్ ఇల్తిజాము బిహా, ఆచరణం, కట్టుబడి ఉండటం. మూడవది, వద్దఅవతు ఇలైహా, ధర్మ ప్రచారం చేయటం. ఈ మూడు విషయాల సారాంశం, ఇవాళ తెలుసుకున్నాము.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ చెప్పటం కంటే ఎక్కువ, వినటం కంటే ఎక్కువ, ఇస్లాం ధర్మాన్ని నేర్చుకుని, సరైన అవగాహన కలిగి, ఆ విధంగా ఆచరించి, అలాగే ఇతరులకు ప్రచారం చేసే, అందజేసే సద్బుద్ధిని, శక్తిని, యుక్తిని అల్లాహ్ ప్రసాదించు గాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో జ్యోతిష్యం మరియు భవిష్యవాణి యొక్క నిషేధం గురించి చర్చించబడింది. భవిష్యత్తు మరియు అగోచర విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉందని, ప్రవక్తలకు కూడా ఆ జ్ఞానం లేదని ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేయబడింది. జ్యోతిష్కులను సంప్రదించడం మరియు వారి మాటలను విశ్వసించడం ఇస్లాంలో తీవ్రమైన పాపంగా పరిగణించబడుతుందని, అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించడంతో సమానమని హెచ్చరించబడింది.
ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహ్, అమ్మా బ’అద్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ 14వ ఎపిసోడ్ లో జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం.
జ్యోతిష్యం అంటే ఏమిటి?
జ్యోతిష్యం అంటే ఇతరుల భవిష్యత్తు గురించి చెప్పడం. కొందరు తమకు కానరాని వాటి గురించి, భవిష్యత్తు గురించి జ్ఞానం ఉందని అంటారు. ఇటువంటి వారిని జ్యోతిష్కుడు, మాంత్రికుడు అని అంటారు.
జ్యోతిష్యం చెప్పడం గురించి ఇస్లాంలో నిషేధించబడింది. అలాగే జ్యోతిష్కుని దగ్గరకు వెళ్ళటం కూడా పాపమే. భవిష్యత్తు మరియు కానరాని విషయాలు అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ తెలియదు.
ఈ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ అన్ఆమ్ లో ఇలా తెలియజేశాడు,
وَعِندَهُ مَفَاتِحُ الْغَيْبِ لَا يَعْلَمُهَا إِلَّا هُوَ (వ ఇందహూ మఫాతిహుల్ గైబి లా య’అలముహా ఇల్లా హువ) “అగోచర విషయాల తాళం చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. ఆయన తప్ప మరెవరూ వాటిని ఎరుగరు.” (6:59)
అంటే అగోచర జ్ఞానం, ఇల్మె గైబ్ గురించి అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ తెలియదు. దైవ ప్రవక్తలకు కూడా తెలియదు.
అభిమాన సోదరులారా, ఈ విషయం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ అ’అరాఫ్ లో ఇలా తెలియజేశాడు,
قُل لَّا أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَاءَ اللَّهُ (ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. (7:188)
ఓ దైవ ప్రవక్తా, నువ్వు చెప్పు, అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశిస్తున్నాడు, ఓ దైవ ప్రవక్తా నువ్వు చెప్పు, (ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. అల్లాహ్ యే కోరితే తప్ప, స్వయంగా నాకు నేను ఏ లాభమూ చేకూర్చుకోలేను, ఏ నష్టమూ నివారించుకోలేను.”
అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు కూడా లాభం చేయటం, నష్టం చేకూర్చటం అనే అధికారం లేదు. అలాగే, నాకే గనక,
وَلَوْ كُنتُ أَعْلَمُ الْغَيْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَيْرِ وَمَا مَسَّنِيَ السُّوءُ ۚ إِنْ أَنَا إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ “నాకే గనక అగోచర విషయాలు తెలిసివుంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి. ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే.” (7:188)
అని ఈ ఆయత్ లో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి ఎన్నో సందర్భాలలో సమస్యలు వచ్చాయి, నష్టం జరిగింది. ఒకవేళ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి అగోచర జ్ఞానం ఉండి ఉంటే, ఇల్మె గైబ్ తెలిసి ఉంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కి ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ కష్టాలు వచ్చేవి కావు.
కావున, జ్యోతిష్యం అనేది తర్వాత జరగబోయే విషయాలు, అగోచర జ్ఞానం ఉందని, కానరాని విషయాలు చెప్తారని, ఆ విద్య ఉందని, అది నమ్మటము, అలా చెప్పటము, అది ఇస్లాం ధర్మంలో హరామ్, అధర్మం. ఇది కేవలం ఇల్మె గైబ్ అనేది అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ తెలియదు.
హదీసు వెలుగులో
అభిమాన సోదరులారా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ జ్యోతిష్యం గురించి ఇలా తెలియజేశారు,
مَنْ أَتَى كَاهِنًا، أَوْ عَرَّافًا، فَصَدَّقَهُ بِمَا يَقُولُ، فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ صلى الله عليه وسلم “ఎవరైతే జ్యోతిష్కుని వద్దకు వెళ్ళి అతడు చెప్పిన మాటల్ని నమ్మితే, జ్యోతిష్యుని దగ్గరికి పోయి ఆ జ్యోతిష్కుడు చెప్పే మాటలు నమ్మితే, అతడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన వాటిని తిరస్కరించిన వాడవుతాడు.”
అంటే ఎవరైతే ఈ జ్యోతిష్యాన్ని నమ్ముతాడో, అతను చెప్పిన మాటల్ని నమ్ముతాడో, ఆ వ్యక్తి వాస్తవానికి ఏం చేస్తున్నాడు, అంతిమ దైవ ప్రవక్తపై అల్లాహ్ ఏది అవతరింపజేశాడో, వహీని, ఖుర్ఆన్ ని దాన్ని తిరస్కరించినట్టు అని అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ లో స్పష్టంగా తెలియజేశారు.
అభిమాన సోదరులారా, కావున మన సమాజంలో అప్పుడప్పుడు మనము చూస్తూ ఉంటాం, పోయి చేతులు చూపించి, ఏదో చూపించి, నష్టం జరుగుతుందని, రాబోయే కాలంలో ఏం జరుగుతుందని వివరించుకుంటారు. ఇది హరామ్, ఇస్లాం ధర్మంలో దీన్ని ఖుర్ఆన్ మరియు హదీసులో చాలా కఠినంగా ఖండించడం జరిగింది.
అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఈ పాపం నుంచి కాపాడు గాక. సరైన మార్గాన్ని చూపించు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.