బహిష్టు స్త్రీలకు సంబంధించిన హజ్, ఉమ్రాహ్ ఆదేశాలు – షేక్ ఇబ్న్ ఉసైమీన్

పుస్తకం నుండి: ఋతుకాలం – సందేహాలు & సమాధానాలు
మూల రచయిత (అరబీ): షేఖ్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి హఫిజహుల్లాహ్

మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్

ప్ర-47: బహిష్టు స్త్రీ ‘ఇహ్రామ్’ కట్టుకున్న తరువాత రెండు రకాతులు నమాజు ఎలా చదవాలి? బహిష్టు స్త్రీ మెల్లగా ఖుర్ఆన్ ఆయతుల పారాయణం చేయవచ్చా? 

జ : ముందు మనం రెండు విషయాలు తెలుసుకుందాం. 

ఒకటి: ‘ఇహ్రామ్’ కు సంబంధించి ప్రత్యేక నమాజ్ అంటూ లేదు. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ కు ప్రత్యేక ‘ఇహ్రామ్’ నమాజు గురించి ఆదేశంగా లేక చేసినట్లు లేక దృవీకరించినట్లు ఆధారాలు లేవు. 

రెండు: ఏ స్త్రీ అయితే ఇహ్రం కట్టుకోవటానికి ముందే ఋతుస్రావానికి గురువుతుందో ఆమె అదే స్థితిలో ‘ఇహ్రామ్’ కట్టుకోవచ్చు. 

హ॥ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) సతీమణి అస్మా బిన్తె ఉమైస్ (రజియల్లాహు అన్హా) మక్కా మార్గంలో ‘జుల్ హులైఫా’ ప్రదేశంలో రక్తస్రావానికి గురైయ్యారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెని “స్నానం చేసి తన యోనిపై గుడ్డ కట్టుకుని ‘ఇహ్రామ్’ కట్టుకోవాలని” ఆదేశించారు. 

అయితే ఋతుస్రావంగల స్త్రీకి కూడా ఆదేశం ఇదే. ఇక వారు పరిశుభ్రమయ్యేంత వరకు ‘ఇహ్రామ్’ నిబంధనల్లోనే ఉండాలి. పరిశుద్ధులైన తరువాత కాబా గృహాన్ని (తవాఫ్ చేయాలి) దర్శించాలి. అలాగే ‘సఫా’, ‘మర్వా’ నడుమ ‘సయీ’ (వేగంగా నడవటం) చేయాలి. 

ఇక ఋతుస్రావంగల స్త్రీ ఖుర్ఆన్ పారాయణం చేయవచ్చా..? అనే ప్రశ్నకు సమాధానం ఏమిటంటే అవసరం మేరకు, ముఖ్య కారణంతో పారాయణం చేయవచ్చు. కానీ కేవలం అల్లాహ్ ఆరాధన నిమిత్తం లేక అల్లాహ్ సన్నిధిలో పుణ్యాలు పొందటానికైతే ఆ స్థితిలో చదవకపోవటమే మంచిది. 

గమనిక: అవసరం మేరకు, ముఖ్యకారణం అంటే పిల్లలకు బోధించేటప్పుడు, ఎవరైన చదువుతుంటే తప్పులు దిద్దటం, అలాగే రోజువారి ఖుర్ఆన్ ఆయతులు వస్తే దుఆ పరంగా చదవటంలో ఎలాంటి దోషం లేదు. 

ప్ర-48 : ఒక స్త్రీ హజ్ కొరకు ప్రయాణించింది. ప్రయాణంలో 5వ రోజు ఆమె ఋతుస్రావానికి గురైంది. ‘మీఖాత్’ వద్దకు చేరి ఆమె స్నానం చేసి ‘ఇహ్రామ్’ కట్టుకుంది. ఆమె ఇంకా ఋతుస్రావ స్థితి నుండి పరిశుద్దురాలు కాలేదు. మక్కా చేరుకున్న తరువాత ఆమె ‘హరం” బయటే నిలిచింది (వెలుపలే ఆగింది). ‘హజ్’, ‘ఉమ్రాహ్’కు సంబంధించి ఆమె ఏ ఒక్క పని కూడ చేయలేదు. రెండు రోజులు ఆమె “మినా” (ప్రదేశం)లో కూడ గడిపింది. తరువాత ఆమె నెలసరి నుండి పరిశుద్ధురాలై స్నానం చేసింది. పరిశుద్ధ స్థితిలో ‘ఉమ్రాహ్ ‘కు సంబంధించి అన్ని కార్యాలు, నియమాలు పూర్తి చేసింది. దాని తరువాత మళ్ళీ ఆమె ‘హజ్’ కొరకు ‘తవాఫ్ – ఇఫాజా’ చేస్తుండగా ఆమెకు మళ్ళీ రక్తస్రావం జరిగింది. సిగ్గుతో ఆమె తమ సంరక్షకులకు చెప్పలేదు. అదే స్థితిలో హజ్ విధానాలను పూర్తిచేసి, స్వస్థలానికి చేరుకున్న తరువాత ఆ విషయాన్ని తన సంరక్షకులకు తెలియపరిచింది. అయితే ఇప్పుడు ఆమెకు ఎలాంటి ఆదేశం వర్తిస్తుంది?

జ: పై పేర్కొన్న సమస్యకి పరిష్కారం ఏమిటంటే ఆమె తవాఫె – ఇఫాజా’ (తవాఫ్) చేస్తుండగా వచ్చిన రక్తం ఒకవేళ నెలసరి రక్తమైతే (దాన్ని ఆమె రక్తపు స్థితి, బాధతో పసిగట్టగలుగుతుంది) అప్పుడు ఆమె చేసిన ‘తవాఫె  ఇఫాజా’ సరైనది కాదు. ఆమె తప్పకుండా మరలా మక్కా వెళ్ళి ‘తవాఫె-ఇఫాజా’ పూర్తి చేయాలి. ‘మీఖాత్’ నుండి ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రాం’ కట్టి ‘తవాఫ్ ‘, ‘సయీ’తో సహా ‘ఉమ్రాహ్’ చేయాలి. ‘ఖస్ర్ ‘ చేసి దాని తరువాత ‘తవాఫె  ఇఫాజా’ చేయాలి.

అయితే ఒక వేళ ‘తవాఫె-ఇఫాజా’ చేస్తున్న మధ్యలో వచ్చే రక్తం సహజంగా నెలసరిది కాకుండా జన ప్రవాహం కారణంగా లేదా భయం కారణంగా లేదా మరే కారణంగా ఉన్నప్పుడు ఆమె ‘తవాఫె  – ఇఫాజా’ ‘తవాఫ్ ‘కు పరిశుద్ధత షరతుగా భావించని వారి పద్ధతి ప్రకారం సరైనదే. 

మొదటి విషయంలో : ఆమెకు రెండో సారి మక్కా రావటం అసాధ్యమైనప్పుడు, అంటే ఇతర దేశస్థురాలైనప్పుడు ఆమె ‘హజ్’ సరైనదె. ఎందుకంటే ఆమె ఏదైతే చేసిందో అంతకు మించి చేసే శక్తి, అవకాశం ఆమెకు లేదు. 

ప్ర-49 : ఒక స్త్రీ ఉమ్రాహ్ ఇహ్రాం కట్టుకుంది. ‘మక్కా’ చేరే సరికి ఆమెకు నెలసరి మొదలైంది. ఆమెతో పాటు వున్న ‘మహ్రమ్’ కి వెంటనే తిరుగు ప్రయాణం చేయవలసి వుంది. అక్కడ కొన్ని రోజులు ఉండే సౌకర్యం లేదు. పైగా ఆమె అక్కడ ఉండటానికి మక్కా నగరంలో ఆమెకు బంధువు లెవరూ లేరు. ఇలాంటి సందర్భంలో ఆమె ఏమి చేయాలి? 

జ.) పై పేర్కొనబడిన స్త్రీ ఒక వేళ అదే ప్రాంతానికి (సౌది అరేబియా) కి చెందినదైతే ఆమె తన ‘మహ్రమ్ ‘ (సంరక్షకుడి) తో తిరిగి వెళ్ళిపోవాలి. ‘ఇహ్రాం’ స్థితిలోనే వుండి, పరిశుద్ధురాలైన తరువాత రెండవ సారి మక్కా నగరానికి రావాలి. ఎందుకంటే ఆమెకు రెండవ సారి రావటం సులువైనదే. ఇందులో ఆమెకు ఎలాంటి అడ్డంకులు లేవు. పాస్పోర్టు కూడ అవసరంలేదు. 

కాని ఒకవేళ ఇతర దేశాల నుండి వచ్చివున్నవారైతే ఆమెకు రెండోసారి ప్రయాణం కష్టమైనప్పుడు ఆమె గుడ్డ కట్టుకోవాలి. మరి ‘తవాఫ్ , సయీ’ చేసి ‘ఖస్ర్’ చేసుకొని అదే ప్రయాణంలో తన ‘ఉమ్రాహ్’ పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ‘తవాఫ్’ చేయుట ఒక అత్యవసరమైన ఆదేశంగా భావించబడుతుంది. కనుక అవసరాన్ని బట్టి కొన్ని నిషేధిత అంశాలు కూడా ‘ముబాహ్’ (అనివార్యం) గా పరిగణించ బడతాయి. 

ప్ర – 50 :ఒక స్త్రీకి నిర్దేశించబడిన హజ్ రోజుల్లో నెలసరి ప్రారంభమైంది. ఆమె గురించి ఆదేశం ఏమిటి? ఈ హజ్ ఆమెకై పరిపూర్ణమవుతుందా? 

జ : ఆమె ఎప్పుడు నెలసరికి గురైందనేది తెలియకుండానే ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వటం అసాధ్యం. ఎందుకంటే హజ్ లో కొన్ని కార్యాలు వున్నాయి. వాటికి నెలసరి ఎలాంటి ఆటంకం కల్గించదు. మరి కొన్ని ఉన్నాయి వాటిని నెలసరిలో చేయకూడదు. కనుక ‘తవాఫ్’ పరిశుభ్రత లేనిదే అసాధ్యం (చేయరాదు). ఇది కాకుండా ఇతరత్రా హజ్ కార్యాలు ఋతుస్రావంలో ఉండి కూడా చేసుకోవచ్చు. 

ప్ర- 51 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: ‘నేను గత సంవత్సరం హజ్ చేశాను. అయితే హజ్ కి సంబంధించి అన్ని కార్యాలు చేశాను. కాని ‘ధార్మిక ఆటంకం’ వల్ల “తవాఫ్ – ఇఫాజా”, “తవాఫె-విదాత్” చేయలేకపోయాను. ఆ తరువాత ఏదో ఒక రోజు మక్కాకు వచ్చి “తవాఫె-ఇఫాజా”, “తవాఫె-విదాత్” చేసుకోవాలనుకుని నా స్వస్థలం మదీనాకు తిరిగి వెళ్ళిపోయాను. దాని గురించి సరైన ధార్మిక అవగాహన లేనందువల్ల అన్నింటి నుండి ‘హలాల్’ కూడా అయిపోయాను. ‘ఇస్లామ్’ స్థితిలో ఏ ఏ విషయాలకు దూరంగా (‘హరాం’ అవుతాయో) ఉండాలో వాటికి దూరంగా ఉండలేదు. ఈ విషయమై (మక్కా తిరిగి రావటం, తవాఫ్  చేయటం గురించి)కొందరిని సంప్రదించినప్పుడు వారు ఇలా సమాధానమిచ్చారు: ‘మీరు చేసిన ‘తవాఫ్ ‘ సరైనది కాదు. ఎందుకంటే మీరు మీ ‘హజ్’ను వృధా చేసుకున్నారు. కనుక వచ్చే సంవత్సరము మరో సారి ‘హజ్’ చేయాలి. అంతే కాకుండా దానితో పాటు ఒక ఆవు, లేదా ఒక ఒంటే ఫిద్యహ్’ (పరిహారం)గా ‘జిబహ్’ చేయవలసి వుంటుంది’. సందేహం ఏమిటంటే పై ప్రస్తావించబడిన సమాధానం వ్యాధి సరైనదేనా? లేదా నా సమస్యకు వేరే పరిష్కారం ఏమైనా వుందా? నిజంగా నా ‘హజ్’ వృధాయిపోయిందా? నా పై రెండో సారి హజ్ చేయటం ‘వాజిబ్’ (తప్పని సరా)? ఇప్పుడు నేను ఏమి చేయాలో తెల్పండి. అల్లాహ్ మీకు శుభాలు కలుగ చేయుగాక.! 

జ :నేడు మన సమాజంలో ఇది కూడా ఒక సమస్యగా మారిపోయింది. ప్రజలు జ్ఞానం లేకుండా ‘ఫత్వా’ ఇస్తున్నారు. పై పేర్కొనబడిన విధంగానైతే మీరు మక్కా వెళ్ళి కేవలం ‘తవాఫ్-ఇఫాజా’ మాత్రం చేయటం వాజిబ్ (తప్పనిసరి) అవుతుంది. 

మక్కా నుండి బయలుదేరినప్పుడు మీరు నెలసరితో వున్నారు. కాబట్టి మీపై తవాఫ్-విదాత్ వాజిబ్ (తప్పనిసరి) కాదు. ఎందుకంటే ఋతుస్రావం గల స్త్రీ పై తవాఫ్-విదాత్ లేదు. 

హ॥ ఇబ్నె అబ్బాస్ (రజియల్లాహు అన్ను) ఉల్లేఖించిన ఒక హదీసులో ఇలా ఉంది : 

ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వబడింది ఏమంటే బైతుల్లా (కాబా గృహము) తవాఫ్(కాబా ప్రదక్షిణం) వారి చివరి కార్యం కావాలని, అయితే నెలసరిగల స్త్రీ నుండి అది తప్పించబడింది“. 

అబుదావూద్ హదీసు గ్రంథంలో ఇలా ఉల్లేఖించబడి వుంది: 

“బైతుల్లాహ్ లో ప్రజల (యాత్రికుల) చివరి కార్యం తవాఫ్  కావాలి”

హ॥ ‘సుఫియా’ (రజియల్లాహు అన్హా ) తవాఫె -ఇఫాజా చేసుకున్నారు (దాని తర్వాతే ఆమెకు నెలసరి ప్రారంభమైంది) అనే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసినప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు : “అయితే బయలుదేరండి!” 

ఈ హదీసు ఆధారం ఏమంటే నెలసరి గల స్త్రీ పై ‘తవాఫె -విదాత్’ లేదు. కాని ‘తవాఫె -ఇఫాజా’ తప్పని సరి. 

ఇక మీరు అన్నింటి నుండి ‘హలాల్’ అయిపోయినదాని గురించి ఏమిటంటే ఇది (ధార్మిక జ్ఞానము లేనందున) తెలియనందున జరిగిన విషయం. కనుక ఇది మీకు ఎలాంటి నష్టం కల్గించదు. ఎందుకంటే ఎవరైనా తెలియకుండా ‘ఇహ్రాం’ స్థితిలో నివారించబడిన ఏదైన కార్యానికి పాల్పడితే దానికి ఎలాంటి పరిహారం లేదు. పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِنْ نَسِينَا أَوْ أَخْطَأْنَا 

“ ఓ మా ప్రభువా! మేము మరచిపోయినా, లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు”.(బఖరా 2:286) 

దాసుడు ఇలా అడిగినప్పుడు అల్లాహ్ దానిని అంగీకరించి సమాధానంగా ఇలా సెలవిచ్చాడు: 

وَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ فِيمَا أَخْطَأْتُمْ بِهِ وَلَكِنْ مَا تَعَمَّدَتْ قُلُوبُكُمْ 

“మరుపు వల్ల మీ చేత ఏదైన (తప్పు) జరిగిపోతే దాని పాపం మీపై ఉండదు. అయితే హృదయ పూర్వకంగా చేసిన పక్షంలో అది పాపమే“. (33: అల్ అహ్ జాబ్ :5) 

కనుక జాగ్రత్త పడవలసినవన్నీ దేనినైతే అల్లాహ్ మహ్రమ్ కై వారించాడో ఒకవేళ తెలియకుండా లేదా మరచిపోయి వాటిని చేస్తే లేదా మరో దారి లేని పరిస్థితిలో పాల్పడితే అలాంటి పరిస్థితుల్లో అతని పై ఎలాంటి దోషం లేదు. కానీ ఆ స్థితి మారిపోయినప్పుడు దాని నుండి దూరమవ్వట తప్పనిసరవుతుంది. 

ప్ర-52 : బాలింతదశకు చెందిన రక్తస్రావం గల స్త్రీకి ఒక వేళ ‘తర్వియహ్’ రోజు (జిల్ హిజ్జ 8వ తేది) రక్తస్రావం మొదలైయింది. కాని ఆమె ‘తవాఫ్’, ‘సయీ’ తప్ప ‘హజ్’కు సంబంధించిన అన్నీ పనులు పూర్తిచేసుకుంది. అయితే పది రోజుల తరువాత ఆమె తొలిదశగా పరిశుద్ధురాలైనట్లు భావించింది. అప్పుడు ఆమె స్వయంగా పరిశుద్ధురాలుగా నిర్ధారించుకుని మిగిలిన పనులు అంటే ‘తవాఫె ఇఫాజా’ చేసుకోవచ్చా? 

జ: పై పేర్కొనబడిన స్త్రీకి పరిశుద్ధతపై పూర్తిగా విశ్వాసము కలగనంత వరకు ఆమె స్నానము చేసి తవాఫ్  చేయరాదు. ఎందుకంటే ప్రశ్నలో ప్రస్తావించిన తీరులో ‘తొలిదశ’తో ఆమె ఇంకా పూర్తిగా పరిశుద్ధతకు నోచుకోలేదన్న విషయం వ్యక్తమవుతుంది. కనుక ఆమె పూర్తిగా పరిశుద్ధతను గ్రహించిన తరువాతే స్నానము చేసి ‘తవాఫ్’, ‘సయీ’ చేయాలి. ఒక వే ‘తవాఫ్ ‘ కంటే ముందు ‘సయీ’ చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ‘హజ్జతుల్-వదాత్’ సందర్భములో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ‘ఎవరైన ముందు ‘సయీ’ చేసుకుంటే? అని సంప్రదించినప్పుడు .. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఎలాంటి దోషం లేదు” అని సమాధానమిచ్చారు. 

ప్ర- 53 : ఒక స్త్రీ నెలసరి స్థితిలో “సైల్” ప్రదేశం నుండి హజ్ ‘ఇహ్రాం” కట్టుకుంది. మక్కా వెళ్ళిన తరువాత ఏదో అవసరం పై ‘జిద్దాహ్’ ‘వెళ్ళింది. ‘జిద్దాహ్’ లోనే నెలసరి నుండి పరిశుద్దురాలైంది. స్నానం చేసి తలదువ్వుకుని తరువాత తన ‘హజ్’ను పూర్తిచేసుకుంది. అయితే ఆమె ‘హజ్’ సరైనదేనా? ఆమెపై ఇంకేమైన బాధ్యత వుంటుందా? 

జ : పై ప్రస్తావించబడిన స్త్రీ ‘హజ్’ సరైనదే. ఆమె పై ఎలాంటి బాధ్యత లేదు. 

ప్ర – 54 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: ‘నేను ఉమ్రాహ్ చేయటానికి బయలుదేరాను. ‘మీఖాత్’ చేరుకున్నప్పుడు నేను నెలసరితో వున్నాను కనుక నేను ‘ఇహ్రామ్’ కట్టుకోలేదు. పరిశుద్ధురాలైనంత వరకు మక్కాలోనే ఉన్నాను. తరువాత మక్కానుండి ‘ఇహ్రామ్’ కట్టుకున్నాను. అయితే ఇది సరైనదేనా? నా పై ఏమి వాజిబ్ వుంది? 

జ : పై పేర్కొనబడిన పద్ధతి సరైనది కాదు. ఏ స్త్రీ అయితే ఉమ్రాహ్ సంకల్పం కలిగివుందో ఆమెకు ‘ఇహ్రామ్’ లేకుండా ‘మీఖాత్’ నుండి ముందుకు వెళ్ళటం సరైనది కాదు. ఒకవేళ ఆమె నెలసరితో వున్నా సరే. నెలసరి స్థితిలోనే ఆమె ‘ఇహ్రామ్’ కట్టుకోవాలి. ఆమె కట్టుకునే ఈ ఇహ్రామ్ సరైనదే. 

దీనికి ఆధారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘హజ్జతుల్-వదా (అంతిమ హజ్) సంకల్పంతో ‘జుల్ హులైఫా’ ప్రాంతములో వున్నప్పుడు హ॥ అబూ-బక్ర్ సిద్దీఖ్ (రజియల్లాహు అన్హు) సతీమణి ‘అస్మా బిన్తె ఉమైస్’ (రజియల్లాహు అన్హా) కు ఒక శిశువు జన్మించింది. అప్పుడు ‘అస్మా’ (రజియల్లాహు అన్హా) ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియపరచి ఈ పరిస్థితిలో తాను ఏమి చేయాలి? అని కబురు పంపారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు : 

“స్నానం చేసి (యోనిపై) గుడ్డ కట్టుకోవాలి. తరువాత ‘ఇహ్రామ్’ వేసుకోవాలి”. 

నెలసరి రక్తం కూడ రక్తస్రావం (బాలింతదశ) ఆదేశాల పరిధిలోనే వస్తుంది. కనుక నెలసరిగల స్త్రీకి మా సూచనేమిటంటే ‘ఆమె ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ సంకల్పముతో ‘మీఖాత్’ ప్రదేశము నుండి వెళ్ళినప్పుడు స్నానము చేసి యోని పై గుడ్డ కట్టుకోవాలి. తరువాత ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రామ్’ కట్టుకోవాలి. కాకపోతే ‘ఇహ్రామ్’ కట్టుకొని పవిత్ర మక్కా చేరుకున్న తరువాత పరిశుద్ధురాలైనంత వరకు ‘మస్జిదే-హరామ్’లో ప్రవేశించ కూడదు. కాబా గృహానికి ప్రదక్షిణం చేయరాదు. ఎందుకంటే హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా)కు ‘ఉమ్రాహ్’  మధ్యలోనే ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు (నెలసరి వచ్చినప్పుడు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు  ఇలా సూచించారు: 

హాజీలు చేసినట్టే నీవు కూడ చేయ్యి. కాకపోతే పరిశుద్ధురాలైనంత వరకు కాబా గృహాన్ని ‘తవాఫ్ ‘ చేయకు”. (సహీహ్ బుఖారి, సహీహ్ ముస్లిం) 

‘సహీహ్ బుఖారి’లోని మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది : హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా ) ఇలా తెలిపారు : 

“ఆమె పరిశుద్ధు రాలైనప్పుడు కాబా గృహానికి ప్రదక్షిణం చేశారు. ‘సఫా-మర్వా’ మధ్య ‘సయీ’ కూడా చేశారు”. 

పై ఉల్లేఖనాల ద్వారా తెలిసేదేమిటంటే స్త్రీ నెలసరి కాలంలోనే ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రామ్ కట్టుకోవాలి. లేదా ‘తవాఫ్ ‘ చేయటానికి ముందే నెలసరి ప్రారంభమైనప్పుడు పరిశుద్ధురాలై స్నానం చేయనంత వరకు ‘తవాఫ్ ‘ మరి ‘సయీ’ చేయకూడదు. ఒకవేళ ఆమె పరిశుద్ధ స్థితిలో ‘తవాఫ్ ‘ చేసింది, దాని తరువాత ఆమెకు నెలసరి ప్రారంభమైనప్పుడు ఆమె అదే పరిస్థితిలో తన ‘ఉమ్రహ్ ను పూర్తిచేస్తుంది. ‘సయీ’ చేస్తుంది, తల వెంట్రుకలు కత్రిస్తుంది. ఎందుకంటే సఫా’, ‘మర్వా’ మధ్య ‘సయీ చేయటానికి పరిశుభ్రత అనే షరతు విధించబడలేదు. 

ప్ర – 55: ఒకరు ఇలా ప్రశ్నిస్తున్నారు: ‘నేను నా భార్యతో ‘యమ్ బ’ పట్టణం నుండి ‘ఉమ్రహ్’ కొరకు వచ్చాను. జిద్దాహ్  చేరుకున్నప్పుడు నా భార్యకు ఋతుస్రావం మొదలైంది. కనుక నేను ఒకణ్ణి ‘ఉమ్రహ్’ చేసుకున్నాను. అయితే ఇప్పుడు నా భార్యకు ఎలాంటి ఆదేశాలు వుంటాయి? 

జ: ఇలాంటి పరిస్థితిల్లో మీ భార్య సమస్యకు పరిష్కారం ఏమిటంటే ఆమె పరిశుద్ధురాలైనంత వరకు నిరీక్షించి ఆ తరువాత తన ‘ఉమ్రహ్’ పూర్తి చేయాలి. ఎందుకంటే విశ్వాసులు మాతృమూర్తి హ॥ సఫియ (రదియల్లాహు అన్హా) కు నెలసరి మొదలైనప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి సల్లం) ఇలా అన్నారు: “ఏమిటి మాకు ఈమె ప్రయాణం నుండి ఆపేస్తుందా?” ప్రజలు ఇలా అన్నారు : ఓ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె ‘తవాఫె -ఇఫాజా’ అయితే చేసుకున్నది. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “అయితె బయలుదేరుదాం“. 

పై హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన “ఏమిటి మాకు ఈమె ప్రయాణం నుండి ఆపేస్తుందా?” మాట ఆధారంగా స్త్రీకి ఒకవేళ ‘తవాఫె -ఇఫాజా’ కంటే ముందు నెలసరి వస్తే ఆమె పరిశుద్ధురాలైనంత వరకు నిరీక్షించి దాని తరువాత ‘తవ్వా ఫె-ఇఫాజా చేయటం తప్పనిసరి ‘వాజిబ్’గా గుర్తించబడుతుంది. 

అలాగే ‘తవాఫె-ఉమ్రహ్’ కూడ ”తవాఫె-ఇఫాజా’ ఆదేశంలోనే వుంది. ఎందుకంటే అది ”ఉమ్రహ్ ‘కు మూల సూత్రం. కనుక ‘ఉమ్రహ్’ చేయదలుచుకునే స్త్రీ ఒకవేళ ‘తవాఫె-ఉమ్రహ్’ కంటే ముందే నెలసరికి గురైతే పరిశుద్ధత కలిగేవరకు నిరీక్షించి దాని తరువాత ‘తవాఫ్ ‘ చేయాలి. 

ప్ర – 56 : ‘మస్ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’ (కాబా చుట్టుప్రక్కల కొంత భాగాన్ని అల్లాహ్ పవిత్ర స్థలంగా నిర్దేశించాడు. అందులో ఎలాంటి రక్తపాతాలు, అపవిత్ర కలాపాలకు పాల్పడరాదు. దానిని ‘హరం’ అంటారు) లో భాగమేనా? నెలసరిగల స్త్రీ ‘మస్ఆ’లో ప్రవేశించ గలుగుతుందా? ‘మస్ఆ’ నుండి ‘హరం’లో ప్రవేశించటానికి ‘తహియ్యతుల్ మస్జిద్’ (మసీదులో ప్రవేశించగానే చదివే నమాజు చదువుట ‘వాజిబా’ (తప్పనిసరా)? 

జ: అందరికీ సుపరిచితమైన విషయం ఏమిటంటే ‘మస్ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’లో భాగం కాదు. ఈ కారణంతోనే దానికి ‘మస్జిదె హరాం’కి మధ్య ఒక చిన్న గోడ నిర్మించబడింది. మస్ఆ ‘హరం’ వెలుపల వుండటమే ప్రజలకు మేలు అని భావించడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒకవేళ దీన్ని ‘హరం’లో భాగమేనని నిర్ధారిస్తే అప్పుడు ‘తవాఫ్ ‘, ‘సయీ’ చేస్తున్న సమయంలో నెలసరికి గురైయ్యే స్త్రీని కూడా ‘సయీ’ చేయకుండా వారించడం జరిగేది. 

ఈ విషయంలో నా అభిప్రాయం (‘ఫత్వా’) ఏమిటంటే ఒకవేళ స్త్రీ ‘తవాఫ్ ‘ చేసుకున్న తరువాత ‘సయీ’ చేయటానికి ముందు నెలసరికి గురైతే అప్పుడు ఆమె అదే స్థితిలో ‘సయీ’ చేయవచ్చు. ఎందుకంటే ‘మస్ ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’తో వేరుగా వుంది. 

ఇక ‘తహియ్యతుల్-మస్జిద్’ విషయానికి వస్తే.. ఎవరైన ‘తవాఫ్ ‘ చేసిన తరువాత ‘సయీ’ చేసి, మళ్ళీ ‘మస్జిద్ హరాం’లో రావాలనుకున్నప్పుడు అతనికి  ‘తహియ్యతుల్ మస్జిద్’ చదవవలసి వుంటుంది. ఒకవేళ చదవక పోయినా పర్వాలేదు. కాని అల్లాహ్ ప్రసాదించిన ఈ మహత్తర అవకాశాన్ని వినియోగించుకుంటూ, అక్కడ నమాజు చేయుటలో ఉన్న గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు రకాతుల (తహయ్యతుల్ మస్జిద్) చదువుకోవడమే ఉత్తమమైన కార్యం. 

ప్ర – 57 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది : నేను హజ్ చేశాను. హజ్ లో ఉన్నప్పుడే ఋతుస్రావం ప్రారంభమైంది. సిగ్గు, బిడియం కారణంగా ఎవరికీ చెప్పలేకపోయాను. అదే పరిస్థితిలో ‘హరం’లో కూడ ప్రవేశించాను, నమాజు చదివాను, ‘తవాఫ్ ‘, ‘సయీ’ కూడా చేశాను. అయితే ఇప్పుడు నేను ఏమిచేయాలి? ఒకమాట ఏమిటంటే (బాలింత దశ ) రక్తస్రావం తరువాత నెలసరి వచ్చింది.? 

జ : నెలసరి, రక్తస్రావంగల స్త్రీ నమాజు ఆ స్థితిలో చేయరాదు. అది మక్కాలో నైనా స్వగ్రామంలో నైనా, మరెక్కడైనా సరే. ఎందుకంటే మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్త్రీ గురించి ఇలా అన్నారు: “ఏమిటి ఇలా లేదా (వాస్తవం కాదా)? ఏమంటే స్త్రీ నెలసరితో వున్నప్పుడు నమాజు చదవదు మరి ఉపవాసం పాటించదు.” 

యావత్తు ముస్లిములు ఏకీభవించేది ఏమిటంటే నెలసరి గల స్త్రీ నమాజు చదవకూడదు, ఉపవాసం వుండకూడదు. కనుక పై పేర్కొనబడిన స్త్రీ అల్లాహ్ క్షమాపణ కోరుతూ తనతో జరిగిన ఈ తప్పుకి పశ్చాతాపపడాలి. 

ఇక ఈ స్థితిలో ‘తవాఫ్ ‘ చేసే విషయమైతే ఇలా తవాఫ్  చేయుట కూడా సరికాదు. కాని ‘సయీ’ చేయవచ్చు. ఎందుకంటే ఈ విషయంలో ప్రఖ్యాత అభిప్రాయం ఏమిటంటే ‘హజ్’ సందర్భములో తవాఫ్  కంటే ముందు’సయీ’ చేసుకోవచ్చు. కనుక ఆమె రెండోసారి ‘తవాఫ్ ‘ చేయవలసి వుంటుంది. ఎందుకంటే ‘తవాఫ్-ఇఫాజా’ ‘హజ్’ మూల సూత్రాల్లో ఒకటి. అది లేకుండా ‘హలాల్’ కాలేరు (సమ్మత్వాన్ని పొందలేరు). అందుకని ఆ ఒకవేళ వివాహిత అయితే ‘తవాఫ్ ‘ చేయనంత వరకు తన భర్తతో లైంగికంగా దగ్గరకాకూడదు. ఒకవేళ అవివాహితురాలైతే ‘తవాఫ్ ‘ చేయనంత వరకు ‘నికాహ్’ (వివాహం చేసుకోకూడదు. 

ప్ర – 58: స్త్రీకి ‘అరఫహ్’ రోజున ఋతుస్రావం మొదలైతే ఏమిచేయాలి? 

జ: స్త్రీకి ‘అరఫహ్’ రోజున ఋతుస్రావం మొదలైతే ఇతర హాజీల్లా ఆమె కూడ హజ్జ్ లోని  కార్యాలన్ని పూర్తి చేయాలి. కాకపోతే ‘బైతుల్లాహ్’ (కాబాగృహం) తవాఫ్ ‘ చేయరాదు. పరిశుద్ధులయ్యేంత వరకు నిరీక్షించి, పరిశుద్ధులైన తరువాత ‘బైతుల్లాహ్ ‘ (కాబా గృహం) ‘తవాఫ్  చేయాలి. 

ప్ర – 59: ఒకవేళ స్త్రీ ‘జమరయె-ఉఖ్బహ్’ పై రాళ్ళు రవ్వినంతరం – ‘తవాఫ్-ఇఫాజా’ కంటే ముందు ఋతుస్రావానికి గురైంది. ఆమె, ఆ ఒక బృందముతో కలిసి ఉన్నారు. ఆమె ప్రయాణం తరువాత తిరిగి మక్కాకు రావటం కష్టం లేక అసాధ్యం. అప్పుడు ఆమె ఏమిచేయాలి? 

జ: పై ప్రస్తావించబడిన స్త్రీ మళ్ళీ ‘మక్కా’కు రావటం అసాధ్యమైనప్పుడు అవసర నిమిత్తం ఆమె తన యోనిపై గుడ్డ కట్టుకుని ‘తవాఫ్’ చేసుకోవాలి. అలాగే మిగితా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో ఆమెపై ఎటువంటి పరిహారం వాజిబ్ కాదు. 

ప్ర – 60 : రక్తస్రావం గల స్త్రీ ఒకవేళ 40 రోజులకు ముందే పరిశుద్ధురాలైతే ఆమె ‘హజ్’ సరైనదేనా? ఒక వేళ పరిశుద్ధతను గ్రహించకపోతే ఏమిచేయాలి? గమనించవలసిన విషయం ఏమంటే ఆమె ‘హజ్’కై సంకల్పం చేసి వుంది? 

జ : రక్తస్రావం గల స్త్రీ ఒకవేళ 40 రోజులకు ముందే పరిశుద్దురాలైనప్పుడు స్నానముచేసి నమాజు చదువుకోవాలి. పరిశుద్ధ స్త్రీలు చేసే కార్యాలన్నీ చేయాలి. చివరికి ‘బైతుల్లాహ్’ (కాబాగృహం) ‘తవాఫ్ ‘ కూడ చేయాలి. ఎందుకంటే రక్తస్రావం కనీస కాలానికి ఎలాంటి పరిమితం లేదు. సంకల్పం సరైనదే. కాకపోతే పరిశుద్ధురాలైనంత వరకు ఆమె ‘బైతుల్లాహ్’ పై పేర్కొనబడిన స్త్రీ పరిశుద్ధతను చూడనప్పుడు ఆమె ‘హజ్’ (కాబా గృహం) ‘తవాఫ్’ చేయకూడదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఋతుస్రావంలో గల స్త్రీని బైతుల్లాహ్ (కాబాగృహం) తవాఫ్ ‘ నుండి వారించారు. 

ఈ విషయంలో రక్తస్రావం గల స్త్రీ కూడ నెలసరి గల స్త్రీ ఆదేశంలోనే వుంటుంది

నోట్స్:

  • ఇహ్రామ్ : కాబా దర్శనానికి వెళ్ళేటప్పుడు కట్టుకునే ప్రత్యేక వస్త్రాలు. కానీ స్త్రీలకు ప్రత్యేక వస్త్రాలంటు లేవు. కేవలం పరిమిత కాలంలో తమకు తాముగా ధర్మపరమైన నిబంధనలకు లోబడి ఉండాలి
  • మీఖాత్: పవిత్రం కాబా గృహానికి చుట్టూ నిర్ణయించబడిన పరిధిలో ప్రవేశించడానికి కేటాయించ బడిన పవిత్ర స్థలము ‘హరం’
  • ‘తహియ్యతుల్-మస్జిద్‘ : మసీదులో ప్రవేశించినప్పుడు, మసీదును దర్శించినప్పుడు పాటించ వలసిన రెండు రకాతులను అంటారు. 
  • మస్జిదే హరాం : కాబా చుట్టు నిర్మించబడి వున్న మసీదు. దీనిలో ఒక నమాజు లక్ష నమాజుల పుణ్యంతో సమానం.
  • తవాఫ్  : పవిత్ర ‘కాబా’ గృహానికి ప్రదక్షిణ చేయడం. 
  • తవాఫ్ – ఇఫాజా: ‘జిల్-హిజ్జహ్’ పదో తేది రోజు చేసే ‘కాబా’ ప్రదక్షణం 
  • ఖస్ర్ : తలవెంట్రుకలు కొద్దిగా కత్రించుట. 
  • సయీ : సఫా, మర్వా అనే కొండప్రాంతాల నడుమ వేగంగా నడవడానిని అంటారు. ఇది హజ్, ఉమ్రాహ్ మూలాల్లో ఒకటి. 
  • మహ్రమ్: ఆమెతో వివాహానికి ఆస్కారం లేని వ్యక్తి ఉదాహరణకు : తండ్రి, కుమారుడు, సోదరుడు, మావయ్య లాంటి వారు

జమ్ జమ్ నీటి చరిత్ర, శుభాలు & మహిమలు [ఆడియో & టెక్స్ట్]

జమ్ జమ్ నీటి చరిత్ర, శుభాలు & మహిమలు
https://youtu.be/QQtQPJ1tZWA [53 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
శత సాంప్రదాయాలు [పుస్తకం & వీడియో పాఠాలు]

పృధ్విపై అత్యుత్తమ (పరిశుభ్రమైన, శుభకరమైన) నీరు జమ్ జమ్ నీరు; అది ఆకలిగొన్నవారికి తిండి/భోజనంగా, రోగికి స్వస్థతగా పనిచేస్తుంది. (సహీ తర్గీబ్ 1161. ఉల్లేఖనం: ఇబ్నె అబ్బాస్).

జమ్ జమ్ నీరు ఏ సదుద్దేశ్యంతో తాగడం జరుగుతుందో అది పూర్తవుతుంది. (సహీ తర్గీబ్ 1164, 1165. ఇబ్నె అబ్బాస్, జాబిర్).

الشرب والاستشفاء من ماء زمزم: عَنْ أَبِي ذَرٍّ t قَالَ: قَالَ رَسُولُ الله ﷑ عَنْ مَاءِ زَمْزَمَ: (إِنَّهَا مُبَارَكَةٌ ، إِنَّهَا طَعَامُ طُعْمٍ). رواه مسلم و زاد الطيالسي: (وَشِفَاءُ سُقْمٍ).

అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమ్ జమ్ నీళ్ళ విషయంలో ఇలా బోధించారు:

అది శుభమైన నీరు. అది ఆకలిగొన్నవారికి ఆహారపు పని జేస్తుంది. (ఇది ముస్లిం 2473 ఉల్లేఖనం, తయాలిసిలో అదనంగా ఈ పదాలున్నాయిః) మరియు అది రోగ నివారిణి కూడాను“. 

ఈ ప్రసంగంలో జమ్ జమ్ నీటి యొక్క చరిత్ర, దాని శుభాలు మరియు గొప్పతనం గురించి వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసును ఆధారం చేసుకుని, జమ్ జమ్ నీరు శుభప్రదమైనదని, ఆకలిగొన్నవారికి ఆహారంగా మరియు రోగులకు స్వస్థతగా పనిచేస్తుందని చెప్పబడింది. ఇబ్రాహీం (అలైహిస్సలాం), హాజర్ (అలైహస్సలామ్), మరియు ఇస్మాయిల్ (అలైహిస్సలాం) లతో ముడిపడి ఉన్న జమ్ జమ్ బావి యొక్క చారిత్రక నేపథ్యం, సఫా మరియు మర్వా కొండల మధ్య హాజర్ (అలైహస్సలామ్) పరుగెత్తడం వంటి సంఘటనలు వివరించబడ్డాయి. ఇబ్ను అబ్బాస్, అబ్దుల్లాహ్ ఇబ్నుల్ ముబారక్, ఇమామ్ ఇబ్ను ఖుజైమా, ఇమామ్ హాకిమ్ మరియు హాఫిజ్ ఇబ్ను హజర్ వంటి ఎందరో గొప్ప ఉలమాల జీవితాల నుండి జమ్ జమ్ నీటిని త్రాగుతూ వారు చేసుకున్న దువాలు మరియు వాటి స్వీకరణకు సంబంధించిన సంఘటనలు కూడా పేర్కొనబడ్డాయి. ఈ నీటిని కేవలం రుచి కోసం కాకుండా, ఇబాదత్ గా, పూర్తి నమ్మకంతో, ఇహపరలోకాల మేలు కోరుతూ త్రాగాలని ఉపదేశించబడింది.

السلام عليكم ورحمة الله وبركاته
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు).

الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد
(అల్ హందులిల్లాహి వహదహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅదహు అమ్మా బఅద్).

ప్రియ వీక్షకులారా, విద్యార్థులారా, అల్ హందులిల్లాహి హందన్ కసీరా. ఈరోజు మనం బహుశా కేవలం ఒకే ఒక హదీస్ మన ఈ క్రమంలో అంటే, హదీస్ క్లాస్ ఏదైతే ప్రారంభించామో అందులో జుల్ఫీ దావా సెంటర్ నుండి ప్రింట్ అయినటువంటి ఈ పుస్తకం శత సాంప్రదాయాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతుల జ్ఞానం పొందడానికి, మన జీవితంలో ఆచరిస్తూ ఉండడానికి ఈ పుస్తకం చదువుతున్నాము. ఇందులోని హదీస్ నెంబర్ 56 ఇన్ షా అల్లాహ్ ఇప్పుడు మనం చదువుతున్నాము.

కానీ ఈ హదీస్ 56 వ నెంబర్ జమ్ జమ్ నీటి గురించి ఉంది గనక, ఎన్నో రోజుల నుండి జమ్ జమ్ గురించి ఒక ప్రసంగం చేయాలి అన్నటువంటి ఆలోచన కూడా ఉండింది. అల్లాహ్ యొక్క దయ ఈరోజు ఆ అవకాశం ఏర్పడినది. الحمد لله حمداً كثيراً (అల్ హందులిల్లాహి హందన్ కసీరా). అల్లాహు త’ఆలా ఈ భాగ్యం కలుగజేశాడు. దాని గురించి అవసరం ఉన్నటువంటి కొంత ప్రిపరేషన్ కూడా జరిగింది. అయితే, జమ్ జమ్ నీటి గురించి సంక్షిప్తంగా దాని చరిత్ర మరియు దాని యొక్క శుభాలు మరియు దాని యొక్క మహిమలు, మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్ షా అల్లాహ్ మీరందరూ కూడా చాలా శ్రద్ధగా ఈ విషయాలను వింటారని ఆశిస్తున్నాను.

عَنْ أَبِي ذَرٍّ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ مَاءِ زَمْزَمَ إِنَّهَا مُبَارَكَةٌ إِنَّهَا طَعَامُ طُعْمٍ
رَوَاهُ مُسْلِمٌ. وَزَادَ الطَّيَالِسِيُّ وَشِفَاءُ سُقْمٍ

“నిశ్చయంగా ఇది (జమ్ జమ్ నీరు) శుభప్రదమైనది, ఇది ఆకలిగొన్న వారికి ఆహారంగా పనిచేస్తుంది.” (ముస్లిం) మరియు తయాసిలో “ఇది రోగ నివారిణి” అని అధికంగా ఉంది.

స్వస్థత పొందే ఉద్దేశంతో జమ్ జమ్ నీళ్లు త్రాగటం.

అబూజర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమ్ జమ్ నీళ్ల విషయంలో ఇలా ప్రవచించారు. అది శుభమైన నీరు. శుభప్రదమైన నీరు. మరియు అది ఆకలిగొన్న వారికి ఆహారంగా పనిచేస్తుంది. ఇక్కడి వరకు సహీ ముస్లింలోని పదాలు. హదీస్ నెంబర్ 2473.

ముస్నద్ తయాలిసి అని ఒక హదీస్ పుస్తకం ఉంది. అందులో ఈ రెండు సెంటెన్స్
إِنَّهَا مُبَارَكَةٌ إِنَّهَا طَعَامُ طُعْمٍ (ఇన్నహా ముబారకతున్, ఇన్నహా త’ఆము తుఅమిన్) తో పాటు మరొకటి అదనంగా ఉంది. అదేమిటి?

وَشِفَاءُ سُقْمٍ
(వ షిఫాఉ సుఖ్మ్)
“అది రోగుల కొరకు స్వస్థత, రోగ నివారిణి కూడాను.”

జమ్ జమ్ నీరు, ఇది వాస్తవానికి ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి అద్భుతమైన అల్లాహ్ యొక్క గొప్ప మహిమ. నేను స్టార్టింగ్ లోనే చెప్పినట్లు ఈ హదీస్ ఆధారంగా మూడు విషయాలు తెలియజేస్తాను. సంక్షిప్తంగా దాని చరిత్ర, మరియు దాని యొక్క శుభాలు, మరియు దాని యొక్క మహిమ.

ఒక క్రమంగా కాకుండా మధ్యలో ఈ మూడు విషయాలు కూడా కలిసి రావచ్చు. ఎందుకంటే చరిత్ర చెప్పేటప్పుడు కొన్ని మహిమలు, కొన్ని శుభాలు కూడా మనకు కనబడవచ్చు. అందుకొరకే ఒకటైనకి ఒకటి వస్తుంది అన్నట్టుగా కాకుండా మాటను పూర్తి శ్రద్ధతో వినే ప్రయత్నం చేయండి.

విషయం ఏమిటంటే అల్లాహు త’ఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి మొదటి భార్య సారా అలైహిస్సలాం ద్వారా ఎంతో కాలం వివాహ బంధంలో గడిచినప్పటికీ సంతానం కలగలేదు. అయితే అల్లాహు త’ఆలా ఒక ప్రయాణంలో ఒక పరీక్ష తర్వాత కానుకగా హాజర్ అలైహిస్సలాం ఏదైతే లభించినదో, ఆమెతో మీరు వివాహం చేసుకోండి అని సారా అలైహిస్సలాం యొక్క సలహాతో ఇబ్రాహీం అలైహిస్సలాం వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం పుట్టారు. ఇంకా ఇస్మాయిల్ అలైహిస్సలాం పాలు త్రాగే వయసులోనే ఉన్నారు. అల్లాహ్ యొక్క ఆదేశం మేరకు అక్కడి నుండి ఇప్పుడు ఎక్కడైతే కాబతుల్లా ఉన్నదో అక్కడికి హిజ్రత్ చేయాలని, అక్కడికి తీసుకువచ్చి తన భార్య హాజర్ ను మరియు ఏకైక పుత్రుడైనటువంటి ఇస్మాయిల్ ను వదలాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశం మేరకు ఇబ్రాహీం అలైహిస్సలాం బయలుదేరారు.

సహీ బుఖారి 3364 లో మనకు ఈ హదీస్ కనబడుతుంది. అక్కడ చాలా వివరంగా దీని యొక్క విషయం ఉంది కానీ నేను పూర్తి హదీస్, దాని యొక్క పూర్తి వివరణ ఇప్పుడు చెప్పలేను. అందులో ఏదైతే జమ్ జమ్ కు సంబంధించిన విషయం ఉన్నదో దానిని మాత్రమే ఇప్పుడు ఇక్కడ నేను ప్రస్తావిస్తాను.

ఇబ్రాహీం అలైహిస్సలాం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్ ని మరియు భార్య ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి యొక్క తల్లి హాజర్ ను మక్కాలో ఇప్పుడు కాబా ఉన్న ప్రదేశంలో వదిలేసి వెళ్ళిపోయారు. కేవలం ఒంటరి స్త్రీ, అక్కడ ఎవరూ లేరు. మీరు ఖురాన్ సూరే ఇబ్రాహీంలో చూసినా గాని,

رَّبَّنَا إِنِّي أَسْكَنتُ مِن ذُرِّيَّتِي بِوَادٍ غَيْرِ ذِي زَرْعٍ عِندَ بَيْتِكَ الْمُحَرَّمِ
(రబ్బనా ఇన్నీ అస్కన్తు మిన్ జుర్రియ్యతీ బివాదిన్ గైరి జీ జర్ఇన్ ఇంద బైతికల్ ముహర్రమ్)
ఓ మా ప్రభూ! నీ పవిత్ర గృహం వద్ద, ఏ విధమైన పంటా పండని ఒక లోయలో నేను నా సంతానంలో కొందరిని నివసింపజేశాను. (14:37)

“అక్కడ ఒక పచ్చిక లేదు. అక్కడ ఏ చిన్న చెట్టు లేదు. నీటి సౌకర్యం లేదు. నీ ఆదేశం మేరకు నేను నా సంతానాన్ని అక్కడ వదిలి వెళ్తున్నాను” అని చెప్పారు. దుఆ చేశారు. ఆ దుఆ ప్రస్తావన ఖురాన్ లో కూడా ఉంది. అయితే ఎప్పుడైతే వాళ్ల వద్ద ఉన్నటువంటి ఆ సామాగ్రి చిన్నగా ఏదైతే ఉండినదో, పూర్తిగా అయిపోయినదో అప్పుడు చాలా ఇబ్బంది కలిగింది.

ఏం చేశారు? తినడానికి ఏమీ లేదు, త్రాగడానికి ఏమీ లేదు. చివరికి హాజర్ తల్లి అయినటువంటి ఆమె స్తనాల్లో కూడా పాలు లేకపోయాయి ఆ పాలు త్రాగే బాబు కొరకు. అప్పుడు ఆమె హజరే అస్వద్ నుండి దగ్గరగా ఎత్తైన ప్రదేశం, కొండ సఫా ఉండినది. ఆమె అటువైపునకు వెళ్లారు. సహీ బుఖారిలో హదీస్ నెంబర్ ఇక్కడ మరియు నేను చెప్పినటువంటి ఆయత్ సూరత్ ఇబ్రాహీం ఆయత్ నెంబర్ 37 ఇక్కడ ఉంది.

فَوَجَدَتِ الصَّفَا أَقْرَبَ جَبَلٍ فِي الأَرْضِ يَلِيهَا
(ఫ వజదతిస్సఫా అఖ్రబ జబలిన్ ఫిల్ అర్ది యలీహా)
ఆమెకు దగ్గరగా సఫా కొండ ఉంటే అక్కడికి వెళ్ళింది. నలువైపులా చూసింది, ఎవరూ కనబడటం లేదు. అక్కడి నుండి కిందికి దిగి వచ్చింది. ఎప్పుడైతే కిందికి దిగి వచ్చిందో, లోయ ప్రాంతం, వాది అని అంటారు కదా. అయితే అక్కడ తిరిగి ఎడమవైపునకు చూసేసరికి బాబు కనబడటం లేదు. బాబు ఇస్మాయిల్ అలైహిస్సలాం కనబడటం లేదు. ఆమె అక్కడ పరుగెత్తింది.

ثُمَّ سَعَتْ سَعْيَ الإِنْسَانِ الْمَجْهُودِ حَتَّى جَاوَزَتِ الْوَادِي
(సుమ్మ సఅత్ సఅయల్ ఇన్సానిల్ మజ్హూద్ హత్తా జా వజతిల్ వాది)
అక్కడి నుండి మళ్ళీ మర్వా వైపునకు వచ్చింది.

ఇక్కడ గమనించండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని ఇబ్ను అబ్బాస్ అంటున్నారు.

فَذَلِكَ سَعْيُ النَّاسِ بَيْنَهُمَا
(ఫ జాలిక సఅయున్నాసి బైనహుమా)
ఈ రోజుల్లో హజ్ ఉమ్రాలో ఏదైతే సయీ చేస్తారో దాని యొక్క చారిత్రక ఘట్టం ఇది.

అంటే ఇక్కడ ఒక్క విషయం మీరు గమనించండి శ్రద్ధగా. మధ్య మధ్యలోనే నేను కొన్ని హింట్స్ మనకు బోధ పడుతున్నటువంటి లాభాలు కూడా చెబుతూ వెళ్తాను. ఇబ్రాహీం అలైహిస్సలాం, అతని యొక్క భార్య హాజర్ మరియు కొడుకు ఇస్మాయిల్. ఈ చిన్న కుటుంబాన్ని చూడండి. అల్లాహ్ కొరకు ఎంత త్యాగం చేశారో అల్లాహు త’ఆలా వారు చేసిన ఆ పుణ్యాలను సూరతుస్సాఫాత్ లో కూడా చెప్పినట్లుగా వెనక తరాల వారికి కొరకు కూడా మిగిలి ఉంచి వారి కొరకు ఇది ఒక చారిత్రక ఘట్టమే కాదు, తర్వాత వారు చేస్తూ ఉన్నంత ఈ పుణ్యాల యొక్క పుణ్యం వారికి కూడా లభిస్తూ ఉంటుంది కదా?

ఆ తర్వాత ఈ విధంగా మర్వా పైకి ఎక్కింది. అక్కడి నుండి కూడా నలువైపులా చూసింది ఎవరూ కనబడలేదు. మళ్లీ సఫా వైపునకు వచ్చింది. ఏడవసారి మర్వా పై ఉన్న సందర్భంలో అక్కడ ఆమె ఒక శబ్దం విన్నది. అప్పుడు ఆమె మౌనం వహించి మరోసారి వినే ప్రయత్నం చేసింది. అప్పుడు ఒక దూత యొక్క సప్పుడు వచ్చింది. చూసేసరికి కొడుకు వద్ద అక్కడ నీళ్ల ఊట మొదలైపోయింది. ఇక్కడ ఈ హదీస్ లో వచనం ప్రకారం జిబ్రీల్ అలైహిస్సలాం తమ యొక్క కాలు మడిమతో లేదా తమ యొక్క రెక్క (జనాహ్) తో అక్కడ కొట్టారు. నీళ్ల ఊట మొదలైంది.

حَتَّى ظَهَرَ الْمَاءُ
(హత్తా జహరల్ మా)
అప్పుడు హాజర్ అలైహిస్సలాం తమ చేతులతో నీళ్లు అటు ఇటు దూరంగా పోకుండా మనం మనకు మిగిలి ఉండాలి అని మట్టితో కడతారు కదా, ఆ విధంగా కట్టి నీళ్ళను కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కొన్ని నీళ్లు అక్కడ జమా అయినప్పుడు తీసుకుని రెండు చేతులతో తీసుకుని తమ వద్ద ఉన్నటువంటి నీళ్ళ తిత్తిలో వేసుకోవడం మొదలు పెట్టింది.

ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు,

يَرْحَمُ اللَّهُ أُمَّ إِسْمَاعِيلَ
(యర్హముల్లాహు ఉమ్మ ఇస్మాయిల్)
అల్లాహు త’ఆలా ఇస్మాయిల్ యొక్క తల్లిపై కరుణించుగాక.

لَوْ تَرَكَتْ زَمْزَمَ
(లౌ తరకత్ జమ్ జమ్)

అంటే ఆమె నీళ్లతో ఏదైతే ఆ నీళ్లను కాపాడుకోవడానికి ఒకచోట బంధించే మాదిరిగా చేసినదో, అప్పుడు ఆమెకు తెలియదు కదా ఈ నీళ్ల ఊట ప్రళయం వరకు ఉంటుంది, అల్లాహ్ వైపు నుండి ఒక గొప్ప మహిమగా మాదిరిగా. అక్కడ అల్లాహు త’ఆలా ఇప్పుడు నీళ్లు ఇచ్చాడు, ఆ నీళ్లు దూరంగా పారిపోయి మళ్ళీ రేపటి రోజు మిగిలకుండా ఉండకూడదు అని ఆమె తన ఆలోచనతో చేసింది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం దుఆ ఇచ్చారు? కరుణించుగాక. ఆమె గనుక ఈ విధంగా నీళ్లను బంధించకుంటే అది ఒక పెద్ద దూరంగా పారే అటువంటి చెలమ మాదిరిగా అయిపోయేది.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా ఇక్కడి వరకు సంక్షిప్తంగా మనం జమ్ జమ్ నీటి యొక్క చారిత్రక చరిత్ర తెలుసుకున్నాము. అయితే ఇదే ఈ నీటి గురించి ఆ రోజు ఏ అన్నము లేదు, ఏ పప్పు కూరలు లేవు, ఏ రొట్టెలు బిర్యానీలు లేవు. కేవలం ఈ జమ్ జమ్ నీరు త్రాగి తల్లి కొడుకులు ఎన్నో రోజుల వరకు బ్రతికారు.

మళ్లీ ఆ తర్వాత అక్కడికి జనం రావడం మొదలైంది, అదొక వేరే చరిత్ర, నేను దాని వివరాల్లోకి వెళ్ళను.

అయితే ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విషయం ఏంటి? ఇటు మనం ఇప్పుడు హదీస్ వైపునకు వచ్చి ఈ హదీస్ లో మనం శ్రద్ధగా ఒకసారి గమనిస్తే:

إِنَّهَا مُبَارَكَةٌ
(ఇన్నహా ముబారక)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? శుభప్రదమైన నీరు అది.

ఇక ఈ బరకత్ అన్న పదం, ఈ శుభం అన్న పదం ప్రియులారా, మనం ఏదైనా ఒక్కే ఒక్క అనువాదంలో, ఏదైనా ఒక్క వ్యాఖ్యానంలో బంధించలేము.

ఇది మన విశ్వాసపరంగా కూడా స్వయం మనం త్రాగినందుకు మన ఆరోగ్యంలో గాని, ఏ సదుద్దేశాలతో త్రాగుతామో దాని ప్రకారంగా గాని, అందుకొరకే మరొక హదీస్ ఉంది. షేక్ అల్బాని రహమహుల్లాహ్ సహీ అని చెప్పారు.

مَاءُ زَمْزَمَ لِمَا شُرِبَ لَهُ
(మాఉ జమ్ జమ లిమా షురిబ లహు)
“జమ్ జమ్ నీరు ఏ ఉద్దేశంతో త్రాగడం జరుగుతుందో అల్లాహ్ ఆ సదుద్దేశాన్ని పూర్తి చేస్తాడు.”

మన సలఫె సాలిహీన్లో ఎవరు ఏ ఉద్దేశంతో తాగారు? ఇప్పుడే నేను కొన్ని క్షణాల్లో మీకు తెలియజేస్తాను, కొన్ని సంఘటనలు.ఇన్ షా అల్లాహ్

ఈ ముబారక్ అన్న పదాన్ని విశాలంగా, విస్తృతంగా, పెద్దగా, లోతుగా, డీప్ గా, దూరంగా, ఇహపర ఇహలోకంలోని శుభాలు, పరలోకంలోని శుభాలు అన్ని రకాలుగా ఆలోచించండి.

మరొక గొప్ప విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు?

إِنَّهَا طَعَامُ طُعْمٍ
(ఇన్నహా త’ఆము తుఅమ్)
ఆకలిగా ఉన్న వారి కొరకు ఇది వాస్తవంగా ఒక అన్నముగా, ఆహారంగా, కడుపు నింపే అటువంటి భోజనంగా పనిచేస్తుంది.

మరియు

وَشِفَاءُ سُقْمٍ
(వ షిఫాఉ సుఖ్మ్)
ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో, అనారోగ్యంగా ఉంటారో అలాంటి వారి కొరకు కూడా ఇది నివారణగా, రోగ నివారిణి, స్వస్థత కలిగించేది, షిఫాగా పనిచేస్తుంది.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, మన ఇండియాలో ఉన్నటువంటి ఒక యువకుడైన మంచి పరిశోధనతో, ఎంతో డీప్ రీసెర్చ్ తో ప్రసంగాలు ఇచ్చేటువంటి షేక్ ముహమ్మద్ షేక్ ముఆజ్ అబూ కుహాఫా ఉమ్రీ హఫిదహుల్లాహ్, జమ్ జమ్ నీటి గురించి కూడా అసలైన పుస్తకాల నుండి అంటే అసలు రూట్, అసల్ మస్దర్ ఏదైతే ఉంటుందో మర్జా, మూల పుస్తకాల నుండి ఎన్నో ఇలాంటి సంఘటనలు వెతికి ఒక చిన్న ఆర్టికల్ గా రాశారు. అది కూడా ఇన్ షా అల్లాహ్ నేను మీ ముందు తెలియజేస్తాను. కానీ అంతకు ముందు ఒక చిన్న ముఖ్యమైన మాట. అదేమిటి?

ఒక సందర్భంలో హాఫిజ్ ఇబ్ను హజర్ రహమహుల్లాహ్ తెలుసు కదా, ఒక చాలా మహా గొప్ప హదీసు వేత్త. సహీ బుఖారీ యొక్క ఎన్నో వ్యాఖ్యానాలు రాయబడ్డాయి. కానీ ఈయన రాసిన వ్యాఖ్యానం లాంటిది ఎవరూ రాయలేకపోయారు. హాఫిజ్ ఇబ్ను హజర్ రహమహుల్లాహ్ ఈజిప్ట్, మిసిర్ లో ఉన్నప్పుడు షేక్ ఇబ్ను అరఫా రహమహుల్లాహ్ తో కలిశారు. ఆయనతో అడిగారు, “జమ్ జమ్ నీరు తియ్యగా ఎందుకు లేవు? తీపిగా ఎందుకు లేవు? కొంచెం అందులో తీపితనం తక్కువ ఏర్పడుతుంది.”

ఇబ్ను అరఫా ఏం చక్కగా సమాధానం ఇచ్చారో ఒకసారి గుర్తుంచు ఒకసారి శ్రద్ధగా వినండి. ఇబ్ను అరఫా అన్నారు, “జమ్ జమ్ నీరును త్రాగడం ఇబాదత్ కొరకు, టేస్ట్ కొరకు కాదు.” ఈ సమాధానం విని ఇబ్ను హజర్ రహమహుల్లాహ్ ఆశ్చర్యపోయారు. ఆయన యొక్క జ్ఞానం, హదీసుల విషయంలో ఆయన యొక్క ఇంతటి లోతు అర్థాన్ని విని ఆశ్చర్యపోయారు. ఈ మాట ముఫీదుల్ అనామ్ వ నూరుల్ జలామ్ లిబ్ని జాసిర్ పుస్తకంలో ఉంది.

సోదర మహాశయులారా, సహీహాలో వచ్చినటువంటి హదీస్ లో ఈ జమ్ జమ్ నీటి గురించి మరొక గొప్ప మాట ఉంది. హదీస్ నెంబర్ 1056. ఏంటి?

خَيْرُ مَاءٍ عَلَى وَجْهِ الأَرْضِ
(ఖైరు మాఇన్ అలా వజ్హిల్ అర్ద్)
“ఈ భూమి మీదనే ఈ భూలోకంలో అత్యంత ఉత్తమమైన, చాలా మంచి నీరు, శుభప్రదమైనది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఈ జమ్ జమ్ నీరు మాత్రమే.”

అలాగే సోదర మహాశయులారా, దీని గురించి ఇంకా మీరు వివరంగా చదవాలనుకుంటే, కొన్ని జయీఫ్ హదీసులు కూడా మనకు కనబడుతున్నాయి. కానీ మనం ఆ జయీఫ్ హదీసుల యొక్క వివరాల్లోకి వెళ్లకుండా, హా ఇది జయీఫ్ అన్నట్లుగా కేవలం తెలవడానికి ఎప్పుడైనా మనం ఆ హదీసులను కూడా తెలుసుకుంటే నష్టం లేదు కానీ కేవలం అది జయీఫ్ అని తెలియడానికి.

ఇక

مَاءُ زَمْزَمَ لِمَا شُرِبَ لَهُ
(మాఉ జమ్ జమ లిమా షురిబ లహు)
జమ్ జమ్ నీరు ఎవరు ఏ ఉద్దేశంతో తాగుతారో ఆ ఉద్దేశం వారిది పూర్తి అవుతుంది. ఈ హదీస్ ను కొందరు జయీఫ్ అని చెప్పారు కానీ ఇది రుజువైనది. ఇమామ్ ఇబ్ను హజర్ అస్కలానీ రహమహుల్లాహ్ ఎవరి ప్రస్తావన ఇంతకు ముందు జరిగిందో ఆయన ఈ హదీస్ యొక్క పరిశోధనలో ఎన్నో పేజీల ఒక పుస్తకమే రాసేసారు.

జమ్ జమ్ నీరు, మనం జమ్ జమ్ అన్నటువంటి పేరు చాలా ప్రఖ్యాతి గాంచినది. వేరే పేర్లు కూడా ఉన్నాయని ఎవరికీ తెలియదు కావచ్చు బహుశా. కానీ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు, ఇంకా వేరే కొన్ని సందర్భాల్లో కొన్ని వేరే పేర్లు కూడా వచ్చి ఉన్నాయి. దాని మరొక పేరు దానిది ‘షబ్బాఆ‘. ఇది జూర్ ఆకలికి అపోజిట్. షబ్బాఆ అంటే కడుపు నింపేదిగా. మరొక పేరు ‘ముర్వియా‘. ముర్వియా అంటే దాహానికి వ్యతిరేకం. మరొక పేరు ‘నాఫిఆ‘ అంటే లాభం చేకూర్చేది. జుర్, నష్టానికి అపోజిట్. మరొక పేరు ‘ఆఫియా‘. స్వస్థత కలిగించేది, సంక్షేమం కలిగించేది. ఇది బలా, ముసీబత్, రోగాలు దానికి వ్యతిరేకం. దీని యొక్క మరో పేరు ‘మైమూన్‘. బరకత్, శుభం అన్నటువంటి భావాలు ఇందులో ఉన్నాయి.

అయితే, షేక్ ముఆజ్ అబూ కుహాఫా హఫిదహుల్లాహ్ రాసినటువంటి చిన్న ఆర్టికల్ సంక్షిప్తంగా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన రాస్తున్నారు, “జమ్ జమ్ నీరు, దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఘనత మరియు దాని యొక్క చెప్పలేనటువంటి ప్రభావం, అమూల్యమైన దాని యొక్క బెనిఫిట్ మరియు దాని యొక్క ఎఫెక్టివ్ మరియు అందులో ఉన్నటువంటి అనేక లాభాలు ఎంత గొప్ప విషయాలంటే ఇవన్నీ కూడా అందుకొరకే ఒక స్వచ్ఛమైన ముస్లిం కనీసం ఒక రెండు గుటకలు మాకు దొరికినా గానీ ఎంత బాగుండు అన్నటువంటి భావన ఒక ముస్లింకు ఉంటుంది.

వాస్తవానికి జమ్ జమ్ నీరు చాలా గొప్ప ఘనత గల విషయం కూడా. ఎందుకంటే ఎవరు ఏ ఉద్దేశంతో తాగుతారో, ఏ దుఆ చేసుకొని తాగుతారో వారి ఆ దుఆలు కూడా స్వీకరించబడతాయి.

ఇమామ్ ఇబ్ను మాజా రహమహుల్లాహ్ కితాబుల్ మనాసిక్ హజ్ యొక్క వివ సంబంధించిన హదీసులు చాప్టర్ లో:

بَابُ الشُّرْبِ مِنْ زَمْزَمَ
(బాబుష్షుర్బి మిన్ జమ్ జమ్)
“జమ్ జమ్ యొక్క నీళ్లు త్రాగడం” అన్నటువంటి ఒక బాబ్, చిన్న హెడ్డింగ్ కూడా ఆయన పేర్కొన్నారు. అందులో జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించినటువంటి ఈ హదీస్ ను తీసుకొచ్చారు.

مَاءُ زَمْزَمَ لِمَا شُرِبَ لَهُ
(మాఉ జమ్ జమ లిమా షురిబ లహు).
ఇక, జమ్ జమ్ నీళ్లు త్రాగుతూ దుఆ చేసుకోవడం, ఏ దుఆ చేసుకుంటే అది స్వీకరించబడడం,

షేక్ అల్బాని దీనిని సహీ అని అన్నారు.

ఇది మన మన విశ్వాసాల ప్రకారంగా, మన యొక్క నమ్మకాల ప్రకారంగా, అల్లాహు త’ఆలా తన యొక్క దయానుగ్రహాలతో ప్రసాదిస్తాడు.

షేక్ అబూ కుహాఫా అంటున్నారు, నా యొక్క జ్ఞానం అనుభవంలో అనేకమంది జమ్ జమ్ నీళ్లు వ్యాపారం, వివాహం, సంతానం, ఇలాంటి విషయాల గురించి ఇందులో వారికి శుభం కలగాలన్నటువంటి ఉద్దేశంతో తాగుతూ ఉంటారు. కానీ వాస్తవానికి పరలోక లాభం కూడా మన ముందు ఉండాలి. మన ఉలమాలను మనం చూస్తే వారు ఎంత మంచి దుఆలు చేశారంటే, ఆ దుఆల స్వీకరణ, వారు చేసిన ఆ దుఆలు అంగీకరించబడ్డాయి అని వారి జీవితంలో కూడా వారికి తెలిసింది. అంతే కాదు, వారి ఆ దుఆల బరకత్ ఈ రోజు వరకు కూడా మనము పొందుతున్నాము.

మరోసారి చెబుతున్నాను శ్రద్ధగా వినండి. మన సలఫె సాలిహీన్లో కొందరు జమ్ జమ్ నీరు త్రాగుతూ చేసినటువంటి దుఆలు, అల్లాహు త’ఆలా తన దయ కరుణతో ఏదైతే అంగీకరించాడో, స్వీకరించాడో, ఆ స్వీకరణ యొక్క లాభం, శుభం, దాని యొక్క ఎఫెక్టివ్, తాసీర్, ప్రభావం స్వయం వారు తమ జీవితంలో చూసుకున్నారు, చూసుకున్నారు. అంతే కాదు, ఆ లాభం ఇప్పటి వరకు మన వరకు కూడా చేరుతూ ఉన్నది. ఎంతటి గొప్ప దుఆలు కావచ్చు అండి?

అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా చేసినటువంటి దుఆ, ముస్తద్రక్ హాకింలో వచ్చి ఉంది.

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ عِلْمًا نَافِعًا وَرِزْقًا وَاسِعًا وَشِفَاءً مِنْ كُلِّ دَاءٍ
(అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫిఆ, వ రిజ్ఖన్ వాసిఆ, వ షిఫాఅమ్ మిన్ కుల్లి దా)
“ఓ అల్లాహ్! నేను ప్రయోజనకరమైన విద్య, విస్తృతమైన ఉపాధి మరియు ప్రతీ రోగం నుండి స్వస్థత, ఆరోగ్యం ఈ నీరు త్రాగుతూ నీతో కోరుతున్నాను, నీతో అర్ధిస్తున్నాను.”

అబ్దుల్లాహ్ ఇబ్నుల్ ముబారక్ చాలా గొప్ప పెద్ద ముహద్దిస్. సియర్ అ’లామిన్ నుబలా అని ఇమామ్ జహబీ రహమహుల్లాహ్ రాసినటువంటి చరిత్ర పుస్తకంలో ఈ సంఘటన వచ్చి ఉంది. ఆయన జమ్ జమ్ నీరు త్రాగడానికి వచ్చినప్పుడు జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి ఆ హదీస్
مَاءُ زَمْزَمَ لِمَا شُرِبَ لَهُ
(మాఉ జమ్ జమ లిమా షురిబ లహు)
ప్రస్తావించి,

وَهَذَا أَشْرَبُهُ لِعَطَشِ يَوْمِ الْقِيَامَةِ
(వ హాజా అష్రబుహు లి అత్షి యౌమిల్ ఖియామా)
ఓ అల్లాహ్! నేను ఈ జమ్ జమ్ నీరు త్రాగుతున్నాను, ప్రళయ దినాన నన్ను ఎప్పుడూ కూడా దాహంగా ఉంచకు.”

గమనించండి. పరలోకానికి సంబంధించిన వివరంగా పాఠాలు మీరు విని ఉండేది ఉంటే, అక్కడ ఎన్నో సందర్భాల్లో చాలా దాహం కలుగుతూ ఉంటుంది. అదృష్టవంతులకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హౌజె కౌసర్ నుండి నీరు లభిస్తుంది. అల్లాహ్ అలాంటి వారిలో మనల్ని కూడా చేర్చుగాక. బిదతుల నుండి దూరం ఉంచుగాక. షిర్క్ నుండి దూరం ఉంచుగాక అల్లాహ్ మనందరినీ కూడా.

అలాగే మూడో సంఘటన చూడండి. ఇమామ్ అబూబకర్ ఇబ్ను ఖుజైమా, గొప్ప ముహద్దిస్, సహీ ఇబ్ని ఖుజైమా తెలుసు కదా మీ అందరికీ, ఆయనతో ఒకరు ప్రశ్నించారు,
مِنْ أَيْنَ أُوتِيتَ هَذَا الْعِلْمَ؟
(మిన్ ఐన ఊతీత హాజల్ ఇల్మ్?)
“ఈ మహా సముద్రం లాంటి, విశాలమైన, ఇంత లోతు జ్ఞానం మీరు ఎలా సంపాదించారు?” అప్పుడు ఆయన చెప్పారు, “నేను ఎప్పుడైతే జాబిర్ రదియల్లాహు అన్హు వారి ఈ హదీస్ విన్నానో,
مَاءُ زَمْزَمَ لِمَا شُرِبَ لَهُ
(మాఉ జమ్ జమ లిమా షురిబలహ్),
అప్పుడు నేను
وَإِنِّي لَمَّا شَرِبْتُ مَاءَ زَمْزَمَ سَأَلْتُ اللَّهَ عِلْمًا نَافِعًا
(వ ఇన్నీ లమ్మా షరిబ్తు మాఅ జమ్ జమ సఅల్తుల్లాహ ఇల్మన్ నాఫిఆ),
నేను అల్లాహ్ తో జమ్ జమ్ నీళ్లు త్రాగుతూ దుఆ చేశాను, ఓ అల్లాహ్ నాకు ప్రయోజనకరమైన విద్యా జ్ఞానాన్ని ప్రసాదించు అని.” ఈ విషయం తజ్కిరతుల్ హుఫ్ఫాజ్ లో ఉంది.

అలాగే, అబూ అబ్దుల్లాహ్ ఇమామ్ హాకిం రహమహుల్లాహ్ ఎన్నో పుస్తకాలు ఆయన రాశారు. వందల్లో లెక్కించారు ఉలమాలు ఆయన రాసిన పుస్తకాలను. ఆయన అంటున్నారు, “గమనించండి.” ఇక్కడ షేక్ అబూ ముఆజ్ అబూ కుహాఫా రాశారు, “సుమారు 500 జుజ్, చిన్న చిన్న పుస్తకాలను అంటారు జుజ్ అని, ఆయన రాశారంట.” వాటిలో ఒకటి ప్రఖ్యాతి గాంచినది ముస్తద్రక్ హాకిం. అయితే ఆయన అంటున్నారు,
شَرِبْتُ مَاءَ زَمْزَمَ وَسَأَلْتُ اللَّهَ أَنْ يَرْزُقَنِي حُسْنَ التَّصْنِيفِ
(షరిబ్తు మాఅ జమ్ జమ వ సఅల్తుల్లాహ అన్ యర్జుఖనీ హుస్నత్తస్నీఫ్)
“నేను జమ్ జమ్ నీరు త్రాగుతూ అల్లాహ్ తో దుఆ చేశాను, ఓ అల్లాహ్, నన్ను ఒక మంచి ఉత్తమ రచయితగా…” ఏదో బుకార్ అవార్డు, నోబెల్ అవార్డు, ఇంకా వేరే ఇలాంటి అవార్డుల కొరకు కాదు. అల్లాహ్ వద్ద. అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజల వరకు చేరవేయడానికి, ఒక మంచి ఉత్తమమైన రచయితగా నేను ఎదగాలి అని దుఆ చేశారు. అల్లాహు త’ఆలా అతని యొక్క కోరికను ఎలా తీర్చాడో, వాటి ద్వారా మనం ఈ రోజు కూడా లాభం పొందుతున్నాము కదా ఆ పుస్తకాల ద్వారా?

సోదర మహాశయులారా, టైం సమాప్తం కావస్తుంది కానీ కొన్ని చిన్న చిన్న సంక్షిప్తంగా సంఘటనలు వినిపిస్తాను. శ్రద్ధ వహించండి.

అబుల్ ఫజ్ల్ అబ్దుర్రహ్మాన్ అల్ బుల్కీనీ, చాలా గొప్ప పండితులు,

ఆయన సంఘటన ఇక్కడ ప్రస్తావించారు. ఆయన అరబీ భాషలో ఎదగడం లేదు, ఇంకా చాలా వీక్ గా ఉన్నారు. అయితే 787వ హిజ్రీ శకంలో తన తండ్రి, ఆ తండ్రి కూడా చాలా గొప్ప పెద్ద ఆలిం పండితులు, తండ్రితో హజ్ కు వెళ్లారు. జమ్ జమ్ నీళ్లు త్రాగుతూ అల్లాహ్ తో ఎంతగా దుఆ చేశారంటే, “ఓ అల్లాహ్! నన్ను అరబీ భాషలో…” ఎందుకంటే ఇస్లాం జ్ఞానం యొక్క మొత్తం సంపద అరబీ భాషలో ఉంది కదా, దాన్ని మంచిగా అర్థం చేసుకోవడానికి అరబీ భాష మంచిగా రావడం తప్పనిసరి. అయితే, “ఓ అల్లాహ్ నాకు ఈ భాష మంచిగా అర్థం కావాలి, ఇందులో నేను ఒక నైపుణ్యుని కావాలి. మాహిరే జుబాన్, భాషా ప్రావీణ్యుణ్ణి కావాలి.”
فَلَمَّا رَجَعَ أَدْمَنَ النَّظَرَ فِيهَا فَمَهَرَ فِيهَا فِي مُدَّةٍ يَسِيرَةٍ
(ఫ లమ్మా రజఅ అద్మనన్నజర ఫీహా ఫ మహర ఫీహా ఫీ ముద్దతిన్ యసీరా)
హజ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత చాలా శ్రద్ధగా ఆయన చదవడంలో, స్టడీలో నిమగ్నులయ్యారంటే చాలా కొంత చిన్న కాలంలోనే మాషా అల్లాహ్ గొప్ప ప్రావీణ్యులయ్యారు.

ఇక సోదర మహాశయులారా, హాఫిజ్ ఇబ్ను హజర్ అస్కలానీ రహమతుల్లాహి అలైహి యొక్క మాటేమిటి?

ఇల్ముర్ రిజాల్ అన్నటువంటి ఒక ప్రత్యేక సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అందులో ఆయన ఎంత ప్రావీణ్యులో, గొప్ప పండితులో చెప్పనవసరం లేదు. అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన యొక్క ఇబ్ను హజర్ రహమహుల్లాహ్ యొక్క శిష్యుడు ఆయన గురించి రాశారు ఈ విషయం. “నేను ఎప్పుడైతే ధర్మ విద్య నేర్చుకోవడం మొదలుపెట్టానో, జమ్ జమ్ నీళ్లు తాగుతూ అల్లాహ్ తో చాలా చాలా దుఆ చేశాను. ఏమని దుఆ చేశాను? ఓ అల్లాహ్! హిఫ్జ్ ఇత్ఖాన్, మెమొరైజేషన్ మరియు విద్యను ఉత్తమ రీతిలో, మంచి రీతిలో అర్థం చేసుకునే వారిగా నేను కావాలి. ఎలా? హాఫిజ్ అబూ అబ్దుల్లాహ్ అజ్ జహబీ, ఇమామ్ జహబీ రహమతుల్లాహి అలైహి అంటాము కదా, అలాంటి గొప్ప పండితు మాదిరిగా నేను కావాలి.
وَأَنَا شَرِبْتُهُ فِي بِدَايَةِ طَلَبِ الْحَدِيثِ
(వ అన షరిబ్తుహు ఫీ బిదాయతి తలబిల్ హదీస్)
నేను హదీస్ విద్య నేర్చుకునే ప్రారంభ దశలో ఈ జమ్ జమ్ నీరు తాగుతూ దుఆ చేశాను.
أَنْ يَرْزُقَنِيَ اللَّهُ حَالَةَ الذَّهَبِيِّ فِي حِفْظِ الْحَدِيثِ
(అన్ యర్జుఖనీ అల్లాహు హాలతజ్ జహబీ ఫీ హిఫ్జిల్ హదీస్)
హదీస్ లో అల్లాహు త’ఆలా ఇమామ్ జహబీ లాంటి మనిషిగా నన్ను తీర్చిదిద్దాలి అని. మళ్లీ 20 సంవత్సరాల తర్వాత నేను మళ్లీ హజ్ కు వెళ్లాను. అప్పుడు దుఆ చేశాను, ఓ అల్లాహ్, ఇమామ్ జహబీ కంటే గొప్ప పండితుణ్ణి కావాలి నేను.

గమనించండి. మొదటిసారి దుఆ చేసినప్పుడు ఏం చేశారు? ఇమామ్ జహబీ లాంటి గొప్ప హదీస్ వేత్తగా నేను ఎదగాలి. 20 సంవత్సరాల తర్వాత మళ్లీ హజ్ చేసే అవకాశం దొరికినప్పుడు, ఇమామ్ జహబీ కంటే గొప్ప పండితుణ్ణి కావాలి నేను అన్నటువంటి దుఆ చేశారు.
فَسَأَلْتُ رُتْبَةً أَعْلَى مِنْهَا وَأَرْجُو اللَّهَ أَنْ أَنَالَ ذَلِكَ مِنْهُ
(ఫ సఅల్తు రుత్బతన్ అ’లా మిన్హా, వ అర్జుల్లాహ అన్ అనాల జాలిక మిన్)
అయితే అల్లాహ్ నాకు ఇది కూడా ప్రసాదిస్తాడు అని నాకు నమ్మకం ఉంది అని అంటున్నారు. మరి ఈ రోజు హదీస్ పుస్తకాలు, వాటి యొక్క వ్యాఖ్యానాలు చదివే వారికి తెలుసు ఈ విద్యలో ఎవరు ఎక్కువ గొప్పవారు అని.

అలాగే ఇమామ్ ఇబ్నుల్ హుమామ్ రహమహుల్లాహ్ తన యొక్క గురువు గారి యొక్క సంఘటన తెలియజేస్తున్నారు. ఏమన్నారు?
وَالْعَبْدُ الضَّعِيفُ يَرْجُو اللَّهَ سُبْحَانَهُ شُرْبَهُ لِلإسْتِقَامَةِ وَالْوَفَاةِ عَلَى حَقِيقَةِ الإِسْلامِ مَعَها
(వల్ అబ్దుద్ జయీఫ్ యర్జుల్లాహ సుబ్ హానహు షుర్బహు లిల్ ఇస్తిఖామతి వల్ వఫాతి అలా హఖీఖతిల్ ఇస్లామి మఅహా)
“నేను ఈ నీళ్లు త్రాగుతూ, బ్రతికి ఉన్నంత కాలం ధర్మంపై స్థిరంగా ఉండాలని మరియు నా చావు అల్లాహ్ కు ఇష్టమైనటువంటి సత్యమైన ఇస్లాంపై రావాలని, ఇలాంటి సదుద్దేశంతో తాగాను.”

అలాగే సోదర మహాశయులారా, ఇమామ్ అబూబకర్ ఇబ్నుల్ అరబీ అల్ మాలికీ. నేను ఇంత వివరంగా స్పష్టంగా ఎందుకు చెబుతున్నాను? ఇబ్నె అరబీ అలిఫ్ లామ్ లేకుండా అరబీ, ఇబ్నె అరబీ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, దుష్టుడు చనిపోయాడు. బిదతుల యొక్క మూల పురుషుడు, కారకుడు. అతడు కాదు. ఈయన అబూబకర్ ఇబ్నుల్ అరబీ అల్ మాలికీ రహమహుల్లాహ్. ఈయన ఉందులుస్ లో చాలా గొప్ప పండితులు. ఎన్నో రకాల విద్యలో ఆయన చాలా ఆరితేరి ఉన్నారు. ఆయన కూడా జమ్ జమ్ నీళ్లు త్రాగుతున్నప్పుడు ఇల్మ్, ఈమాన్, ధర్మ విద్య మరియు విశ్వాసం కొరకు అల్లాహ్ తన యొక్క హృదయాన్ని తెరవాలి అని దుఆ చేశారు. ఆయన అంటున్నారు,
وَكُنْتُ أَشْرَبُ مَاءَ زَمْزَمَ كَثِيرًا
(వ కుంతు అష్రబు మాఅ జమ్ జమ కసీరన్)
“నేను అధికంగా ఎక్కువగా జమ్ జమ్ నీళ్లు త్రాగేవాన్ని.
وَكُلَّمَا شَرِبْتُهُ نَوَيْتُ بِهِ الْعِلْمَ وَالإِيمَانَ
(వ కుల్లమా షరిబ్తుహు నవైతు బిహిల్ ఇల్మ వల్ ఈమాన్)
నేను ఎప్పుడెప్పుడు తాగినా గానీ, ఇల్మ్ మరియు ఈమాన్ నాకు లభించాలని నేను నియ్యత్ చేసేవాణ్ణి.
حَتَّى فَتَحَ اللَّهُ عَلَيَّ لِي بَرَكَتَهُ
(హత్తా ఫతహల్లాహు అలైయ్య లీ బరకతహు)
అల్లాహు త’ఆలా నా కొరకు తన శుభాల ద్వారాలను తెరిచాడు.
فِي الْمِقْدَارِ الَّذِي يَسَّرَهُ لِي مِنَ الْعِلْمِ
(ఫిల్ మిఖ్దారిల్లజీ యస్సరహు లీ మినల్ ఇల్మ్).”

సోదర మహాశయులారా, ఇక్కడ ఒక చిన్న జోక్ అంటారా? వాస్తవానికి దీనిని ఒక ఇల్మీ జోక్ అని అంటే మీరు ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఏంటి అది? ఇబ్నుల్ జౌజీ అని ఇమామ్ ఇబ్నుల్ జౌజీ ఆయన కూడా ఒక చాలా గొప్ప పండితుడు. 597 లో చనిపోయారు. అయితే ఆయన యొక్క రచనలు పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి. ఒక పుస్తకం
أخبار الظراف والمتماجنين
(అఖ్బారుజ్ జిరాఫి వల్ ముతమాజినీన్) లో రాస్తున్నారు, ఇమామ్ అబూబకర్ అల్ హుమైదీ, 219లో చనిపోయారు మక్కాలో, ఆయన సుఫ్యాన్ ఇబ్ను ఉయైనా వద్ద కూర్చుండి ఉన్నారు. సుఫ్యాన్ ఇబ్ను ఉయైనా పెద్ద ముహద్దిస్. ఇమామ్ బుఖారీ యొక్క ఉస్తాదుల ఉస్తాదుల వస్తారు. సుఫ్యాన్ ఇబ్ను ఉయైనా శ్రద్ధగా వినండి ఇక్కడి నుండి. సుఫ్యాన్ ఇబ్ను ఉయైనా మక్కాలో ఉన్నారు. హదీసులు ప్రజలకు చెబుతున్నారు. హదీస్ దర్స్ ఇస్తున్నారు. ఇస్తూ ఇస్తూ ఈ జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క హదీస్ ప్రజలకు వినిపించారు. అయితే ఒక వ్యక్తి వెంటనే పక్కకు వెళ్ళాడు, మళ్లీ వచ్చాడు. ఆ తర్వాత వచ్చి, “ఇమామ్ సుఫ్యాన్ ఇబ్ను ఉయైనా గారు, మీరు ఈ హదీస్ మాకు ఇప్పుడే చెప్పారు కదా, అయితే నేను జమ్ జమ్ నీళ్లు త్రాగి, త్రాగుతూ దుఆ చేశాను, సుఫ్యాన్ ఇబ్ను ఉయైనా నాకు వంద హదీసులు వినిపించాలని.”

ఆనాటి కాలంలోని ఇమాములు, ఉస్తాదులు, గురువులు ఎంత ఓపిక సహనాలు గలవారో. ఆయన అన్నారు, “సరే బిడ్డ, కూర్చో. అల్లాహ్ నీ దుఆను స్వీకరించుగాక.”
فَأَقْعَدَهُ فَحَدَّثَهُ بِمِائَةِ حَدِيثٍ
(అఖఅద ఫ హద్దసహు బి మిఅతి హదీస్)
కూర్చోబెట్టి వంద హదీసులు వినిపించారు.

ఇక చివరిలో షేక్ అబూ కుహాఫా అంటున్నారు, శ్రద్ధగా వినండి. ఇవన్నీ సంఘటనలు నేను ఏదైతే పేర్కొన్నానో, వాస్తవానికి ఇవన్నింటినీ ఒకచోట జమా చేయడంలో నేను చాలా కష్టపడ్డాను. ఎందుకంటే నేను కేవలం ఎక్కడ నుండో విని, చూసి కాదు. ప్రతి ఒక్క సంఘటన ఏ మూల పుస్తకంలో ఉందో అక్కడి నుండి నేను చూసి స్వయంగా నేను రాశాను. అయితే కేవలం ఏదో ఒక కోరిక తీరాలని కాదు, ఈ సంఘటనలు మన యొక్క జీవితంలో, మన యొక్క భవిష్యత్తులో ఒక మంచి మార్పు తీసుకురావాలి. వీటిని మన పూర్వీకుల కథలు అన్నట్లుగా మనం చదివి ఊరుకోకూడదు, మౌనం వహించకూడదు. మన ఫ్యూచర్ లో కూడా ఉపయోగపడే విధంగా మన కొరకు ఉండాలి.

సోదర మహాశయులారా, ఇవన్నీ పాత కాలపు నాటి సంఘటనలు అని అనుకోకండి. అల్లాహ్ యొక్క దయతో ఇప్పటికీ కూడా, ఇప్పటికీ కూడా అల్ హందులిల్లాహ్ జమ్ జమ్ నీటి ద్వారా ఇలాంటి లాభాలు ఎంతో మంది పొందుతున్నారు. సమీప కాలంలోనే షహీద్ అయిపోయినటువంటి అల్లామా ఎహ్సాన్ ఇలాహి జహీర్ రహమహుల్లాహ్ తన రాసినటువంటి ఒక పుస్తకంలో స్వయంగా చెప్పారు, “నేను జామియా ఇస్లామియాలో చదువుతున్న కాలంలో నాకు కిడ్నీలో రాళ్లు వచ్చాయి. హాస్పిటల్లో తీసుకువచ్చి అడ్మిట్ చేశారు. ఇంకా కొన్ని గంటల తర్వాత ఆపరేషన్ జరుగుతుంది అని డిక్లేర్ చేశారు. కానీ నేను భయపడిపోయాను. ఆపరేషన్ నాకు ఇష్టం లేదు. అయితే ఎవరూ డాక్టర్లు, నర్సులు దగ్గర లేని సందర్భంలో… ఈ పనులన్నీ కూడా చేయండి అని చెప్పడం లేదు,

జమ్ జమ్ నీటి యొక్క శుభం వస్తుంది కొంచెం ఓపికతో వినండి. నేను అక్కడి నుండి పారిపోయాను, మదీనా. వెంటనే ఒక టాక్సీ ఎక్కి మక్కాలో వచ్చేసాను. అక్కడే కొద్ది రోజులు ఉండిపోయి అల్లాహ్ తో నేను మాటిమాటికి దుఆ చేసుకుంటూ, నఫిల్ నమాజులు చేసుకుంటూ అధికంగా, అధికంగా, అధికంగా నేను జమ్ జమ్ నీరు తాగుతూ ఉండేవాన్ని. ఒకసారి చిన్న వ్యవధిలోనే నాకు ఎంత స్పీడ్ గా మూత్రం వచ్చినట్లు ఏర్పడింది అంటే వెంటనే నేను టాయిలెట్ కి వెళ్ళాను, వాష్ రూమ్ కి వెళ్ళాను. చాలా స్పీడ్ గా వచ్చింది. ఆ అందులోనే అల్ హందులిల్లాహ్ ఆ కిడ్నీలోని స్టోన్స్ పడిపోయాయి. అల్లాహ్ నాకు ఈ విధంగా షఫా ఇచ్చారు.”

ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ యొక్క మాట పేరు మాటిమాటికి వింటూ ఉంటారు కదా, ఆయన కూడా తన యొక్క రచనల్లో ఒకచోట రాశారు, “నేను మక్కాలో వచ్చి ఉన్న సందర్భంలో ఇక్కడి స్టార్టింగ్ లో వాతావరణం నాకు పడక చాలా కడుపు నొప్పులు వస్తూ ఉండేవి. అయితే నేను జమ్ జమ్ నీళ్లు త్రాగుతూ, సూరే ఫాతిహా చదువుతూ మాటిమాటికి దుఆ చేస్తూ ఉండేవాడిని. అల్లాహు త’ఆలా నాకు షఫా ప్రసాదించాడు.” ఇంకా ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి.

ముగింపు

సోదర మహాశయులారా, వాస్తవానికి ఈ జమ్ జమ్ నీరు అల్లాహ్ వైపు నుండి ఒక గొప్ప మహిమ గనుక దీని గురించి సైంటిఫిక్ పరంగా, మెడికల్ పరంగా, ఇప్పుడు డెవలప్మెంట్ ఈ అభివృద్ధి చెందిన కాలంలోని ఏ ఏ రీసెర్చ్ లు అయితే జరిగాయో అవన్నీ చెప్పడానికి ఇక్కడ మనకు సమయం కూడా లేదు, అవకాశం కూడా లేదు. కానీ హదీసుల ద్వారా, ధర్మవేత్తల, ముహద్దిసీన్ల, ఎంతో మంది ఉలమాల ఇమాముల యొక్క సంఘటనల ద్వారా మనకు ఏ విషయం అయితే తెలిసినదో, ఎప్పుడైతే మనకు జమ్ జమ్ నీరు త్రాగే అటువంటి అవకాశం లభిస్తుందో, అల్లాహ్ మనలో ప్రతి ఒక్కరికీ అలాంటి భాగ్యం ప్రసాదించుగాక. ఇలాంటి ఈ హదీస్ ను గుర్తుంచుకోవాలి. అది శుభప్రదమైన నీరు, భూలోకంలోనే అత్యంత శుభ్రమైన, పరిశుద్ధమైన నీరు మరియు ఆకలిగొన్న వారికి ఆహారంగా, రోగంతో ఉన్న వారికి షిఫా, స్వస్థతగా పనిచేస్తుంది మరియు ఇదే ముస్లిం షరీఫ్ లో సహాబియే రసూల్ అబూజర్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క సంఘటన కూడా ఉంది. ఆయన పూర్తి ఒక్క నెల మక్కాలో ఉన్నారు. ప్రవక్త వారి గురించి కనుక్కోవడానికి, ఇది ఇస్లాం యొక్క స్టార్టింగ్ లో, ఎవరైనా కలమా చదివినట్లుగా ప్రవక్త వారిని అనుసరిస్తున్నట్లుగా తెలిస్తే మక్కా యొక్క అవిశ్వాసులు చాలా చిత్రహింసలకు గురి చేసేవారు. ఆ సందర్భంలో అబూజర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఒక నెల మక్కాలో ఉండి కేవలం జమ్ జమ్ నీరు పైనే, నీటి పైనే బ్రతికారు. వేరే ఏదీ కూడా తినడానికి ఆ రోజుల్లో లేకుండే.

చెప్పుకుంటే ఇంకా ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ ఇంతటితో ముగించేస్తున్నాము. ఏదైతే చిన్నపాటి రీసెర్చ్ తో మనం చెప్పే ప్రయత్నం చేశామో, అందులోని మంచి విషయాలు అల్లాహ్ యొక్క దయ, కరుణ, అనుగ్రహంతో అల్లాహ్ వాటిని స్వీకరించుగాక, మనందరి కొరకు, మన తర్వాత వచ్చే తరాల కొరకు లాభదాయకంగా చేయుగాక. ఎక్కడైనా ఏదైనా చెప్పే విషయంలో పొరపాటు జరిగితే అల్లాహ్ నన్ను, అందరినీ కూడా క్షమించుగాక.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ. السلام عليكم ورحمة الله وبركاته
(వా ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు).

ప్రశ్నోత్తరాలు

సంక్షిప్తంగా అంశానికి సంబంధించి ఏదైనా ముఖ్య ప్రశ్న ఉండేది ఉంటే అడగవచ్చును. మైక్ మీ వద్ద నుండి ఆన్ చేసుకొని.

السلام عليكم ورحمة الله وبركاته
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు) గురువు గారు. జమ్ జమ్ వాటర్, జమ్ జమ్ నీళ్లు త్రాగేటప్పుడు
بِسم الله
(బిస్మిల్లాహ్)
అని చెప్పి త్రాగాలి, ఓకే. ఈ దుఆ కూడా మీరు పైన చెప్పారు
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ عِلْمًا نَافِعًا وَرِزْقًا وَاسِعًا وَشِفَاءً مِنْ كُلِّ دَاءٍ
(అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫిఆ వ రిజ్ఖన్ వాసిఆ వ షిఫాఅమ్ మిన్ కుల్లి దా).
ఈ దుఆ కూడా చదవాలి. ఈ దుఆ రానివారు
بِسم الله
(బిస్మిల్లాహ్)
చదివి త్రాగవచ్చా? ఏమైనా ప్రాబ్లం ఉందా?
بِسم الله
(బిస్మిల్లాహ్)
అని తమ భాషలో, తమకు వస్తున్నటువంటి భాషలో ఎవరైనా మాట్లాడని వారు కూడా వారి వారు తమ యొక్క ఆలోచనల ప్రకారంగా ఇలాంటి మంచి విషయాలను మనసులో పెట్టుకొని, నియ్యత్ చేసుకొని, సంకల్పించి త్రాగవచ్చు, అభ్యంతరం లేదు.

بارك الله
(బారకల్లాహ్).
మరొక ప్రశ్న, ఈ ఏదైతే మీరు ఇప్పుడు ప్రోగ్రాం చేశారో, జమ్ జమ్ వాటర్ కి సంబంధించి, ఇది YouTube లో అప్లోడ్ చేశారా? YouTube లైవ్ అయ్యిందా?
అవుతుంది. లైవ్ జరుగుతుంది ఇప్పుడు YouTube లో, Twitter లో లైవ్ జరుగుతుంది.

بارك الله فيك
(బారకల్లాఫిక్).

السلام عليكم ورحمة الله وبركاته
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు).
وعليكم السلام ورحمة الله وبركاته
(వ అలైకుం అస్సలాం వ రహమతుల్లాహి వ బరకాతుహు).
దయచేసి అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడగండి లేదా అంటే సమయం ఎక్కువైపోతుంది. చెప్పండి.

గురూజీ, త్రాగే విధానము, మనం కూర్చొని కిబ్లా వైపు ముఖం పెట్టి దుఆ చేసి తల మీద కప్పుకొని త్రాగాలి కదా గురూజీ?
చూడండి, ఈ విషయాలు ఏదైతే మీరు చెప్పారో, కిబ్లా వైపున ముఖము చేసి, నిలబడి, ఈ విషయాలు కొందరు ధర్మవేత్తలు ప్రస్తావించారు. కానీ సర్వసామాన్యంగా ప్రతీ త్రాగే విషయం, తినే విషయం కూర్చుండి తాగాలని ప్రవక్త వారి ఆదేశం ఉంది. నిలబడి త్రాగకండి అని వారించారు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకొరకు ఉత్తమ విషయం కూర్చుండి త్రాగడమే. ఇక కిబ్లా విషయం ప్రస్తావించారు కొందరు. (జకరల్ ఫుఖహా) కొందరు ఫుఖహాలు వీటిని ప్రస్తావించారు. కానీ మనకు డైరెక్ట్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో, సహాబాల యొక్క ఆచరణలో ఇది స్పష్టంగా మనకు కనబడడం లేదు. కాకపోతే ఇంతకు ముందు నేను నిన్న కూడా చెప్పాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పరిస్థితి అలా ఎదురైంది. జమ్ జమ్ నీరు అక్కడ నిలబడి తాగారు, బుఖారీలో వచ్చిన ప్రస్తావన ఇది. ఎవరైనా అదే అనుకొని తాగితే అది వేరే విషయం. కానీ ఇదే అసలైన సున్నత్ కాదు.
والله أعلم بالصواب
(వల్లాహు అ’లం బిస్సవాబ్).

గురూజీ, తాగిన తర్వాత మరి దుఆ ఏమైనా ఉందా గురూజీ?
ప్రత్యేకంగా వేరే… నేను చెప్పాను కదా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమ్ జమ్ నీరు త్రాగి ఇలాంటి ఇలాంటి దుఆలు చేసుకోండి అని చెప్పలేదు. ప్రత్యేకంగా దుఆ నేర్పలేదు. ప్రవక్త వారు ఏమన్నారు?
مَاءُ زَمْزَمَ لِمَا شُرِبَ لَهُ
(మాఉ జమ్ జమ లిమా షురిబ లహు)
“జమ్ జమ్ నీరు ఎవరు ఏ ఉద్దేశంతో త్రాగుతారో అల్లాహ్ వారి ఉద్దేశాన్ని పూర్తి చేస్తాడు.” అయితే ఎవరికి ఎలాంటి సమస్య ఉందో, ఎవరు అల్లాహ్ తో ఇహపరలోకాల ఏ మేలు కోరుతున్నారో, అవి వారు అడుక్కుంటే తమ భాషలో కూడా సరిపోతుంది. ప్రత్యేకమైన దుఆ ఏమీ లేదు.

గురూజీ, ఒకే దుఆ చేసుకోవాలా, ఎన్నైనా చేసుకోవచ్చా గురూజీ?
ఎన్నైనా చేసుకోండి. అభ్యంతరం లేదు.

السلام عليكم ورحمة الله وبركاته
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు).
وعليكم السلام ورحمة الله وبركاته
(వ అలైకుం అస్సలాం వ రహమతుల్లాహి వ బరకాతుహు).

సార్, ఇప్పుడు జమ్ జమ్ పానీకి మాత్రమే ఆ దుఆ చేసుకొని ప్రేయర్ అంతా అయ్యా చెప్పారు అది లేకపోతే రుఖియా వాటర్ కూడా చేసుకోవచ్చా? అంటే రుఖియా చేసుకునే వాటర్ తాగే ముందు కూడా ఆ దుఆ చేసుకోవచ్చా?
ఇక్కడ చూడండి, రుఖియా యొక్క వాటర్ ఏదైతే ఉందో, మీరు ఏ ఉద్దేశంతో రుఖియా చేయించుకుంటున్నారో అది దాని వరకే పరిమితం. కానీ ఇక్కడ జమ్ జమ్ నీరు దాని యొక్క శుభం ఏదైతే అల్లాహు త’ఆలా అందులో పెట్టాడో దాని కారణంగా ఈ మాట జరుగుతుంది. మీరు ఏ కారణంగా రుఖియా చేసుకుంటున్నారో ఆ ఉద్దేశం అక్కడ సరిపోతుంది దానికి.

جزاك الله
(జజాకల్లాహ్)
సార్.
السلام عليكم
(అస్సలాము అలైకుం).
وعليكم السلام ورحمة الله وبركاته
(వ అలైకుం సలాం వ రహమతుల్లాహి వ బరకాతుహు).
ఇక్కడ ఒక మరో విషయం గమనించండి. రుఖియా వాటర్ అని, రుఖియా వాటర్ అని ఎక్కడైనా ఏదైనా మనకు వాటర్ దొరకడం లేదు. మీ ఇంట్లో ఉన్నటువంటి నీరు ఒక గ్లాసులో, చెంబులో తీసుకొని సూరే ఫాతిహా, సూరత్ ఇఖ్లాస్, సూరత్ ఫలక్, నాస్ మరియు దరూద్ చదివి అందులో ఊదారంటే అది కూడా రుఖియా వాటర్ అయిపోయింది.

సరే సార్.

ఓకే.
جزاك الله خيرا
(జజాకల్లాహు ఖైర్).

ఎవరైతే చెయ్యి ఎత్తి ఉన్నారో, తమ మైక్ ఆన్ చేసుకొని ప్రశ్న అడగండి. బారకల్లాహు ఫీక్.

السلام عليكم ورحمة الله وبركاته
(అస్సలాము అలైకుం రహమతుల్లాహి వ బరకాతుహు).
وعليكم السلام ورحمة الله وبركاته
(వ అలైకుం అస్సలాం వ రహమతుల్లాహి వ బరకాతుహు).

షేక్ బాగున్నారా?
మాషా అల్లాహ్, మాషా అల్లాహ్. హయ్యాకుముల్లాహ్, అహ్లా వ సహ్లా.

షేక్, మన దగ్గర జమ్ జమ్ నీరు తక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో నీరు కూడా కలుపుకొని తాగుతాం కదా, అట్లా చేస్తే?
నన్ను పరీక్షలో వేశారు మీరు. క్షమించాలి. నా దృష్టిలో ఇప్పుడు ఏ పెద్ద ఆలింల ఫత్వా నా ముందు లేదు. చదివి, విని ఉన్నట్లు కూడా నాకు గుర్తు రావట్లేదు. అందుకొరకు క్షమించండి, నేను మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఇవ్వలేను.

సరే.
جزاك الله خيرا
(జజాకల్లాహు ఖైర్).
بارك الله فيكم، بارك الله فيكم
(బారకల్లాహు ఫీకుం, బారకల్లాహు ఫీకుం).

ఇంకా? ఎవరైతే చెయ్యి ఎత్తి ఉన్నారో, ప్రశ్న అడగండి. ఆ, ఎవరు, మన సోదరులు ఎవరు ఎత్తారు కదా ఇక్కడ?

السلام عليكم
(అస్సలాము అలైకుం)
షేక్, క్లియర్ అయింది.
وعليكم السلام ورحمة الله
(వ అలైకుం అస్సలాం వ రహమతుల్లాహ్).

ఆ, అది నేను అడుగుదాం అనుకున్నది అడిగారండి.
క్లియర్ అయిందా, డౌట్?

ఓకే, రైట్.

ఇంకా ఎవరి వద్ద ఏదైనా ప్రశ్న ఉందా?

వాటర్ తాగేటప్పుడు ప్రత్యేకంగా ఏ దుఆ లేదండి. ఇక్కడ రాశారు, “వాటర్ తాగేటప్పుడు దుఆ.”
بِسم الله
(బిస్మిల్లాహ్)
అని తాగాలి, తాగిన తర్వాత
الحمد لله
(అల్ హందులిల్లాహ్)
అనాలి. అంతే.

السلام عليكم
(అస్సలాము అలైకుం).
وعليكم السلام ورحمة الله
(వ అలైకుం అస్సలాం వ రహమతుల్లాహ్).

అడగండి.

ఓకే, సరే మంచిది.
جزاكم الله خيرا، بارك الله فيكم، تقبل الله حضوركم
(జజాకుముల్లాహు ఖైర్. బారకల్లాహు ఫీకుం. తఖబ్బలల్లాహు హుజూరకుం).
మీరు వచ్చి ఏదైతే విన్నారో, అల్లాహు త’ఆలా స్వీకరించుగాక. మీ అందరికీ ఇహపరాల మేలు ప్రసాదించుగాక. ఇంతటితో ప్రోగ్రాం సమాప్తం చేస్తున్నాము.
سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ، أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا أَنْتَ، أَسْتَغْفِرُكَ وَأَتُوبُ إِلَيْكَ
(సుభానకల్లాహుమ్మ వ బిహందిక్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత, అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్).

ఉమ్రా (మెయిన్ పేజీ):
https://teluguislam.net/umrah/

మస్నూన్ హజ్ & ఉమ్రా – ముహమ్మద్ ఇక్బాల్ కైలాని [పుస్తకం]

Masnoon Hajj Umra Iqbal Kailani (Pocket size) 

మస్నూన్  హజ్-ఉమ్రా - ముహమ్మద్ ఇక్బాల్ కైలాని [పుస్తకం]

సంకలనం: ముహమ్మద్ ఇక్బాల్ కైలాని
ప్రకాశకులు: హదీస్ పబ్లికేషన్స్
హైదరాబాద్, ఎ.పి. ఇండియా

[పాకెట్ సైజు బుక్]
[ఇక్కడ బుక్ డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [167 పేజీలు] [ మొబైల్ ఫ్రెండ్లీ] [3.3 MB]

ప్రామాణికమైన హదీసుల ఆధారాలతో, సులభమైన అందరికీ అర్థమయ్యే భాషలో, విలక్షణమైన శైలిలో ముహమ్మద్ ఇక్బాల్ కైలాని గారి సంకలన పుస్తకం“కితాబుల్ హజ్జి వల్ ఉమ్రా” హదీస్ పబ్లికేషన్స్ తరఫున ప్రచురించ బడింది. అల్హమ్దు లిల్లాహ్ దానికి మంచి ఆదరణ కూడా లభించింది.కాని హజ్ యాత్రలో ప్రతి చోటుకీ పెద్ద పుస్తకాన్ని వెంట తీసుకెళ్ళటం కష్టమైన పని. అందుకని “కితాబుల్ హజ్జి వల్ ఉమ్రా”నే సంక్షిప్తం చేసి చిన్న సైజులో ప్రచురించటం జరుగుతోంది.అల్లాహ్ తలిస్తే ఈ ప్రయత్నం ద్వారా జన సామాన్యానికి గొప్ప ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నాం.

విషయసూచిక

  1. ముందుమాట
  2. హజ్ విధింపు
  3. హజ్ ఉమ్రాల గొప్పదనం
  4. హజ్ ప్రాముఖ్యత
  5. హజ్ యాత్ర నియమాలు
  6. మీఖాతు కు సంబంధించిన విషయాలు
  7. ఇహ్రామ్ రకాలు
  8. ఇహ్రాము కు సంబంధించిన విషయాలు
  9. ఇహ్రామ్ స్థితిలో ధర్మసమ్మతమైన విషయాలు
  10. ఇహ్రామ్ స్థితిలో చేయకూడని పనులు
  11. ఫిద్యా ఆదేశాలు
  12. తల్బియా వివరాలు
  13. తవాఫ్ రకాలు
  14. సయీకి సంబంధించిన విషయాలు
  15. సయీకి సంబంధించి సున్నత్ ద్వారా రుజువుకాని విషయాలు
  16. హజ్ యాత్రికుడు తప్పనిసరిగా ఎన్ని సయీలు చేయాలి?
  17. హజ్ దినాలు – జుల్ హిజ్జా 8వ తేదీ
  18. తర్వియా దినపు వివరాలు
  19. జుల్ హిజ్జా 9వ తేది (ఆరఫారోజు) విషయాలు 
  20. జుల్ హిజ్జా 9వ తేది (ముజ్ దలఫా రాత్రి)కి సంబంధించిన విషయాలు
  21. జుల్ హిజ్జా 10వ తేది ముఖ్యాంశాలు 
  22. జమ్ర అఖబాకు రాళ్లు కొట్టడం
  23. ఖుర్బానీ
  24. తల గొరిగించటం, వెంట్రుకలు కత్తిరించటం
  25. తవాఫె జియారత్
  26. తవాఫె విదా
  27. స్త్రీల హజ్ యాత్ర 
  28. పిల్లల హజ్
  29. ఇతరుల తరఫున హజ్ చేయటం (హజ్ బదల్)
  30. మస్నూన్ దుఆలు
  31. స్థూలంగా హజ్ యాత్ర ఆదేశాలు 
  32. ఉమ్రా మస్నూన్ విధానం 
  33. హజ్జె తమత్తూ మస్నూన్ విధానం 
  34. హజ్ ఇఫ్రాద్ మస్నూన్ విధానం 
  35. హజ్జెఖిరాన్ మస్నూన్ విధానం 
  36. మస్జిద్ నబవీ సందర్శనం

ఇతర హజ్ & ఉమ్రా పుస్తకాలు

తవాఫ్ & స్త్రీలు – షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్

స్త్రీలు ముసుగులో ఉండటం మరియు తమ అందచందాలను ప్రదర్శించే విధంగా అలంకరించుకోకుండా ఉండటం తప్పనిసరి.

తవాఫ్ చేసేటపుడు స్త్రీలు అత్తరు లేదా పెర్ఫ్యూమ్ పూసుకోవటం, తమ అందచందాలను ప్రదర్శించటం వంటి వాటికి దూరంగా ఉండటం అనివార్యం. ఇహ్రాం స్థితిలో ఉండి తవాఫ్ చేస్తున్నపుడు కూడా వారు పరాయి పురుషులకు తమ ముఖం కనబడకుండా మరియు తమ సౌందర్యం ప్రదర్శించకుండా జాగ్రత్త వహించవలెను. వారు పురుషులకు దగ్గరగా ఉన్నపుడు, స్త్రీపురుషులు ఒకేచోట కలిసిమెలిసి ఉండే చోట ఇలా జాగ్రత్ర పడటం మరీ ముఖ్యం. ఎందుకంటే స్త్రీల ఆకర్షణ పురుషులను ఉశికొలుపే ఒక ప్రధాన కారణం కావటం వలన స్త్రీలు ముఖంపై ముసుగు వేసుకోవటం ఆవశ్యకం. ఎందుకంటే స్త్రీల అందాన్ని ప్రధానంగా వారి ముఖం ప్రదర్శించటం వలన, పరాయి పురుషుల ముందు వారు తమ ముఖాన్ని ప్రదర్శించటం అనుమతించబడలేదు.

“… మరియు తమ భర్తల ముందు తప్ప తమ అందచందాలను వారు ప్రదర్శించరాదు” 24:31

ఒకవేళ హజ్రె అస్వద్ ను ముద్దాడే సమయంలో పురుషుల చూపు వారిపై ఉంటే, వారు తమ ముఖంపై ముసుగును తొలగించరాదు. ఒకవేళ హజ్రె అస్వద్ ను ముద్దాడే లేదా స్పర్శించే అవకాశం లేనంతగా అక్కడ జనం గుమిగూడి ఉండిన పరిస్థితిలో స్త్రీలు హజ్రె అస్వద్ ను ముద్దాడటానికి పురుషులతో పోటీపడకూడదు. స్త్రీలు తమ పురుషుల వెనుక నడుస్తూ, తవాఫ్ పూర్తి చేయవలెను. కాబా గృహానికి అతి దగ్గరలో నుండి తవాఫ్ చేసే వారిలో చొచ్చుకుని పోయి, రద్దీలో ఇబ్బంది పడే కంటే, కాబా గృహానికి కొంచెం దూరంలో నుండి ప్రశాంతంగా తవాఫ్ చేయటం మంచిది. పైగా దూరంలో నుండి తవాఫ్ చేయటంలో అడుగులు పెరగటం వలన ఎక్కువ పుణ్యాలు కూడా లభించే అవకాశం ఉంది. రమల్ మరియు ఇద్తిబాలను తవాఫ్ లో మాత్రమే పాటించాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా చేరుకున్న తర్వాత చేసిన తన మొదటి తవాఫ్ లోనే రమల్ మరియు ఇద్తిబాలు చేసారు. అయితే స్త్రీలు రమల్ మరియు ఇద్తిబాలను చేయవలసిన అవసరం లేదు.

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
హజ్, ఉమ్రహ్ & జియారహ్ – షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ [పుస్తకం]

ఉమ్రా (మెయిన్ పేజీ):
https://teluguislam.net/umrah/

ఇహ్రాం స్థితిలో అనుమతింపబడిన మరియు నిషేధింపబడిన విషయాలు  – ఇమామ్ ఇబ్నె బాజ్

ఇహ్రాం సంకల్పం చేసుకున్న తరువాత స్త్రీపురుషులు వెంట్రుకలు లేదా గోళ్ళు గొరగటం లేదా కత్తిరించటం, అత్తరు పూసుకోవటం మొదలైనవి చేయరాదు. ఇహ్రాం స్థితిలో ప్రవేశించిన తరువాత అలాంటి పనులకు అనుమతి లేదు. ముఖ్యంగా మగవారికి షర్టు, ప్యాంటు, కుర్తా, పైజామా, మేజోళ్ళు మొదలైన కుట్టబడిన దుస్తులు ధరించే అనుమతి లేదు. ఒకవేళ తన నడుము చుట్టూ కట్టుకోవటానికి ఏదైనా దుప్పటి లాంటి వస్త్రం లభించనపుడు, అతను సుర్వాల్ (పైజామా వంటిది) వంటిది తొడుక్కోవచ్చు. అలాగే, రబ్బరు చెప్పులు లేదా మామూలు చెప్పులు లేకపోతే, అతడు కత్తిరించని చర్మపు మేజోళ్ళు (కుఫ్) తొడుక్కోవచ్చు. బుఖారీ మరియు ముస్లింలలో నమోదు చేయబడిన అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా యొక్క ఈ ఉల్లేఖనలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,

“ఎవరి వద్దనైతే స్లిప్పర్లు లేదా చెప్పులు లేవో, అలాంటివారు చర్మపు మోజోళ్ళు (కుఫ్) తొడుక్కోవచ్చు. మరియు ఎవరి వద్దనైతే ఇజార్ (నడుము చుట్టూ కట్టుకునే దుప్పటి వంటి వస్త్రం) లేదో, అలాంటి వారు పైజామా (సుర్వాల్) తొడుక్కోవచ్చు. ”

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన ప్రకారం, ఒకవేళ అవసరమైతే ‘కత్తిరించబడిన చర్మపు మేజోళ్ళ’ తొడుక్కోవచ్చు అనే విషయంలో ‘కత్తిరించబడటమనేది’ రద్దు చేయబడినది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో అడగబడిన ‘ఇహ్రాంలోని వ్యక్తి ఎలాంటి దుస్తులు ధరించవచ్చనే’ ప్రశ్నకు బదులుగా ఇబ్నె అబ్బాస్ ఉల్లేఖనలో తెలిపినట్లుగా జవాబిచ్చినారు. అయితే ఒకవేళ చెప్పులు లేకపోతే, చర్మపు చెప్పులు (కుఫ్ లు)  తొడుక్కోవచ్చని ఆయన అరఫాత్ ఉపన్యాసంలో పలికినారు. అంతేగాని ఆ చర్మపు చెప్పులు కత్తిరించబడాలని అనలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో పై పలుకులు పలికినపుడు చుట్టు ఉన్నవారిలో కొందరు మదీనా పై పలుకులు పలికినపుడు ఆయన సమీపంలో లేరు. ఆవశ్యక విషయాన్ని ఆలస్యం చేయడం తగదనే విషయం మనకు తెలుసు. కాబట్టి, చర్మపు చెప్పులు కత్తిరించబడాలనే విషయం రద్దు చేయబడినదనే విషయం ఋజువైనది. ఒకవేళ అది అవసరమైన విషయమై ఉంటే, ఆయన దానినితప్పకుండా పలికి ఉండేవారు.

చెప్పుల వలే కాలి చీలమండలం కంటే క్రింద ఉండే చర్మపు మేజోళ్ళు (కుఫ్ లు) తొడుక్కోవటానికి ఇహ్రాంలోని వారికి అనుమతి ఉంది. నడుము చుట్టూ కట్టుకునే ఇజార్ వస్త్రానికి ముడి వేసి, దారంతో (త్రాడుతో) కట్టడానికి అనుమతి ఉంది. ఎందుకంటే అలా చేయకూడదని ఎక్కడా చెప్పబడలేదు. అలాగే ఇహ్రాంలోని వ్యక్తి  స్నానం చేయవచ్చు, తన తల కడుక్కోవచ్చు, మృదువుగా తల గోక్కోవచ్చు. అలా గోక్కోవటం వలన ఒకవేళ వెంట్రుకలేవైనా రాలితే, అందులో ఎలాంటి దోషం లేదు.

ఇహ్రాంలోని స్త్రీల కొరకు ముసుగు వంటి వేరే వస్త్రంతో ముఖం కప్పుకోవటం, చేతులకు చేతిమేజోళ్ళు తొడుక్కోవటం నిషేధించబడింది. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,

“ఇహ్రాంలోని స్త్రీ ముఖంపై ముసుగు వేసుకోకూడదు, చేతులకు చేతి మేజోళ్ళు (ఖుఫ్ఫాజ్) తొడుక్కోకూడదు”  బుఖారీ

ఖుఫ్ఫాజ్ అంటే ఉన్ని లేదా కాటన్ నేయబడిన చేతి మేజోళ్ళు. అయితే స్త్రీల కొరకు ఇహ్రాం స్థితిలో కూడా షర్టులు, ప్యాంట్లు,షల్వార్ ఖమీజులు మేజోళ్ళు మొదలైన ఇతర కుట్టబడిన దుస్తులు తొడుక్కునే అనుమతి ఉంది. అలాగే, పరాయి మగవాళ్ళు ఎదురైనపుడు, ఆమె తన ముఖాన్ని చేతిరుమాలుతో కప్పుకోవచ్చు. తలపై కప్పుకునే తలగుడ్డలో (head scarf) ముఖం దాచుకుంటే తప్పులేదు. ఆయెషా రదియల్లాహు అన్హా ఇలా పలికినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు చేసిన హజ్ లో, పురుష యాత్రికుల సమూహం తమను దాటుతూ, ఎదురు బదురు అయినపుడు, స్త్రీలు తమ తలగుడ్డను క్రిందికి జార్చి, ముఖం కనబడకుండా జాగ్రత్త పడేవారు. ఆ పురుషులు తమను దాటిన తరువాత, వారు తమ ముఖాలపై జార్చుకున్న తలగుడ్డను తొలగించుకునేవారు. (అబూ దావూద్, ఇబ్నె మాజా, అద్దర్ ఖుత్ని)

అలాగే, పరాయి మగవారు తమ పరిసరాలలో ఉన్నపుడు, దేనితోనైనా తన చేతులను కప్పుకోవటానికి వారికి అనుమతి ఉంది. అలాంటి పరిస్థితులలో తమ ముఖాలను మరియు చేతులను కప్పుకోవటం వారి బాధ్యత. అల్లాహ్ యొక్క ఆదేశానుసారం, ఈ శరీర భాగాలు కప్పుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

“మరియు తమ అలంకారాలను తమ భర్తలకు తప్ప ఇతరులకు చూపరాదు” 24:31

చేతులు మరియు ముఖం – రెండూను మగువల ఆకర్షణలను ప్రతిబింబిస్తాయి. మరియు ముఖాలు చేతుల కంటే మరింత ఆకర్షణీయమైనవి. ఈ విషయం ఖుర్ఆన్ వచనంలో స్పష్టంగా తెలుపబడింది:

“మీరు ఏదైనా అడగవలసి వచ్చినపుడు తెర వెనుక నుంచి అడగండి. మీ అంతర్యాల, వారి హృదయాల పరిశుద్ధత కోసం ఇదే మంచిది.” ఖుర్ఆన్ వచన భావానువాదం 33:53

అనేక మంది స్త్రీలు (హజ్ /ఉమ్రహ్ లలో) తలపై కప్పుకునే తలగుడ్డలకు జత చేసే అదనపు వస్త్రానికి ఎలాంటి ఆధారమూ లేదు. తలగుడ్డ ముఖానికి తగలకుండా వారలా చేస్తుంటారు. ఒకవేళ అదే అలా చేయటం అవసరమైతే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సమాజానికి ఆ విధంగా చేయమని బోధించి ఉండేవారు. అంతేగాని ఆయన ఈ విషయం గురించి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండేవారు కాదు. పురుషులు మరియు స్త్రీలు తమ ఇహ్రాం దుస్తులను కడుక్కోవచ్చు మరియు ఇహ్రాం జతను మార్చుకోవచ్చు – ఇది అనుమతించబడింది. కాషాయరంగు అద్దకం వేయబడిన దుస్తులు మాత్రం వాడకూడదు. ఎందుకంటే అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన ఆధారంగా, దీనిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించారనే విషయం స్పష్టమవుతున్నది.

అల్లాహ్ ఆదేశాలను అనుసరించి ఇహ్రాం స్థితిలో ఉన్నవారు అనవరమైన వ్యర్థ సంభాషణలలో పాల్గొనరాదు, పాపాకార్యాలు చేయరాదు, పోరాడరాదు / ఘర్షణ పడరాదు.

“హజ్జ్ నెలలు అందరికీ తెలిసినవే. వాటిలో ఎవరైతే హజ్జ్ చేయుటకు తలపెడతారో, వారు హజ్జ్ సమయంలో (భార్యలతో) లైంగిక కలాపాలకు, పాపపు పనులకు, జగడాలకు దూరంగా ఉండండి. మీరు ఏ సత్కార్యం చేసినా, అది అల్లాహ్ కు తెలియును. ప్రయాణసామాగ్రిని వెంట తీసుకుని వెళ్ళండి. నిశ్చయంగా, అత్యుత్తమ సామగ్రి దైవభీతి మాత్రమే. మరియు ఓ వివేకవంతులారా! కేవలం నాకు మాత్రమే భయపడండి”. 2:197

ఇదే విషయం ఒక హదీథులో కూడా చెప్పబడింది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, “ఎవరైతే హజ్ చేస్తారో, మరియు అశ్లీల, అసభ్య కార్యాలకు (రఫత్) మరియు దౌర్జన్యానికి (ఫుసుఖ్) పాల్బడరో, అలాంటి వారు అప్పుడే పుట్టిన శిశువు వలే (పాపరహితంగా) మరలి వస్తారు”

రఫత్ అంటే లైంగిక కార్యకలాపాలు, శృంగార వ్యవహారాలు మరియు వ్యర్థ సంభాషణలు, పనికిమాలిన వ్యర్థాచరణలు. ఫుసుఖ్ అంటే మామూలుగా పాపకార్యాలని అర్థం. జిదాల్ అంటే అర్థం పర్థం లేని విషయంపై పోట్లాడటం. అయితే, సముచితమైన పద్ధతిలో సత్యాన్ని సమర్ధించే మరియు అసత్యాన్ని ఖండించే సంభాషణలు అనుమతించబడటమే గాక ప్రోత్సహించబడినాయి కూడా. దీని గురించి అల్లాహ్ యొక్క ఆదేశం ఇలా ఉన్నది:

“నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోనూ, చక్కని ఉపదేశంతోనూ పిలువు. అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు. ” 16:125

టోపీ, తలపాగా వంటి తలకు అంటుకుని ఉండే వేటితోనైనా తమ తలను లేదా ముఖాన్ని కప్పుకోవటం పురుషుల కొరకు నిషేధించబడింది. ఒంటె తన్నటం వలన ఒక సహచరుడు అరఫాత్ దినమున చనిపోయినాడు. అతని అంత్యక్రియలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,

“అతని శరీరాన్ని నీటితో మరియు సిద్ర్ తో కడగండి. అతని రెండు ఇహ్రాం వస్త్రాలను కఫన్ వాడి వాటిలో అతనిని చుట్టండి. మరియు అతని తలను మరియు ముఖాన్ని కప్పవద్దు – ఎందుకంటే అంతిమదినాన అతను లబ్బైక్ పలుకుతూ లేస్తాడు.” [ముత్తఫిఖ్ అలైహ్]

అయితే, ఎవరైనా కారు పైకప్పు క్రింద గానీ, గొడుగు క్రింద గానీ తలదాచుకుంటే ఏమీ దోషం లేదు. అలాగే గుడారం లోపల లేదా చెట్టు క్రింద తలదాచుకున్నా ఏ తప్పూ లేదు. జమరతుల్ అఖ్బా పై రాళ్ళు విసురుతున్నపుడు, ఆయన సహచరులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఒక వస్త్రంతో నీడ కల్పించారు. మరో హదీథులో అరఫహ్ దినమున నమిరహ్ వద్ద ఆయన కొరకు ఒక గుడారం వేయబడిందని, ఆయన దానిలో సూర్యాస్తమయం వరకు ఉన్నారని పేర్కొనబడింది.

ఇహ్రాం స్థితిలో ఉన్న స్త్రీ, పురుషుల కొరకు – భూమిపై జంతువులను వేటాడటం, వేటలో పాల్గొనటం లేదా సహాయపడటం, వేటాడుతూ జంతువుల వెనుకబడటం, పెళ్ళాడటం, దాంపత్య సుఖం అనుభవించటం, పెళ్ళి రాయబారం పంపడం, ఎవరైనా స్త్రీని కామంతో స్పర్శించడం మొదలైనవన్నీ నిషేధించబడినాయి. ఉథ్మాన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన క్రింది హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాన్ని ఇలా స్పష్టం చేసారు,

“ఒక ముహ్రిం స్వయంగా తను పెళ్ళాడరాదు, తన తరఫు పెళ్ళి జరిపించుకోవటమూ చేయరాదు, పెళ్ళి రాయబారమూ పంపరాదు.” [ముస్లిం హదీథు గ్రంథం]

అజ్ఞానం వలన (నిషేధాజ్ఞలు తెలియకపోవటం వలన) ఎవరైనా ఇహ్రాం స్థితిలో తలపై ఏదైనా వస్త్రం వేసుకోవటం, టోపీ పెట్టుకోవటం, తలపాగా పెట్టుకోవటం, అత్తరు పూసుకోవటం వంటివి చేస్తే, అతనిపై ఎలాంటి ప్రాయశ్చిత పరిహారమూ (దమ్) లేదు. తనకు వాటి గురించిన నిషేధాజ్ఞలు తెలియగానే లేదా ఎవరైనా అతని తప్పును అతనికి తెలియజేయగానే, అతను తన తప్పును సరిదిద్దుకోవలెను – అంటే తలపై నుండి టోపి వంటి వాటిని, తలగుడ్డను తొలగించవలెను. అలాగే ప్రామాణిక ఉల్లేఖనల ఆధారంగా, మతిమరుపు వలన లేదా అనాలోచితంగా లేదా తెలియక ఎవరైనా వెంట్రుకలు లేదా గోళ్ళు గొరిగించుకున్నా, కత్తిరించుకున్నా అతనిపై ఎలాంటి ప్రాయశ్చిత పరిహారమూ లేదు.

ఏ ముస్లిమైనా – ఇహ్రాం స్థితిలో ఉన్నా లేదా ఇహ్రాం స్థితిలో లేకపోయినా; స్త్రీ అయినా, పురుషుడైనా; జంతువులను వేటాడటం, సంజ్ఞలతో లేదా ఆయుధాలతో లేదా జంతువులను ఒక చోటకు తోలటం మొదలైన వేట పనులలో సహాయపడటం వంటివి కాబాగృహ పవిత్ర హద్దులలో నిషేధించబడింది. ఆ ప్రాంతంలోని చెట్లను నరకటం, పచ్చికను కోయడం మొదలైనవి కూడా నిషేధించబడినాయి. అంతేగాక ఆ పరిధి లోపల పడి ఉన్న ఇతరుల ఏ వస్తువునైనా ఎత్తుకోవటం కూడా నిషేధించబడింది – దాని గురించి చాటింపు వేయటానికైతే తప్ప. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,

“అల్లాహ్ ఆదేశాలనుసారం అంతిమ దినం వరకు ఈ నగరం (మక్కా) పావనమైనది. దీని చెట్లు నరకరాదు. దీని జంతువులను వేటాడరాదు. దీని పచ్చికను కోయరాదు. క్రింద పడి ఉన్న వస్తువులను ఎత్తుకోరాదు – వాటి గురించి అందరికీ తెలిసేలా ప్రకటించే ఉద్దేశ్యంతో ఎత్తుకునే వారు తప్ప.”

ఇక్కడ పచ్చిక అంటే తాజా మొక్కలు, వృక్షసంపద. మీనా మరియు ముజ్దలిఫాలు కూడా కాబా గృహ పవిత్ర సరిహద్దుల లోపలే వస్తాయి. అయితే అరఫాత్ ఈ పవిత్ర కాబా గృహ సరిహద్దులోనికి రాదు.

[1]. హజ్ యాత్రికుడు నిర్దేశించబడిన దుస్తులు ధరించి, హజ్ లేదా ఉమ్రహ్ సంకల్పం చేసుకుని ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించే స్థలం.

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
హజ్, ఉమ్రహ్ & జియారహ్ – షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ [పుస్తకం]

ఉమ్రా (మెయిన్ పేజీ):
https://teluguislam.net/umrah/

సయీ మరియు దాని నియమాలు  – ఇమామ్ ఇబ్నె బాజ్

తవాఫ్ పూర్తి చేసి, (మఖామె ఇబ్రాహీం వద్ద రెండు రకాతుల నమాజు పూర్తి చేసి, జమ్ జమ్ నీరు త్రాగి) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతును అనుసరిస్తూ, హజ్రె అస్వద్ వైపు తిరిగి, వీలయితే దానిని కుడిచేతితో తాకి, సఫా కొండ వైపు సాగిపోవలెను.

సయీ (సఫా మరియు మర్వా కొండల మధ్య నడక) ప్రారంభించటానికి, సపా కొండపై ఎక్కి నిలబడ వలెను.

ఒకవేళ అవకాశం లభిస్తే, అక్కడ అల్లాహ్ ను ధ్యానించేటప్పుడు మరియు ఈ క్రింది దుఆ పఠించేటప్పుడు, సఫా కొండ పైకి ఎక్కవలెను, కాబా గృహం వైపు తిరిగి నిలబడవలెను.

లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు, లహుల్ ముల్కు  లహుల్ హమ్దు, యుహ్ఈ  యుమీతు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు, అంజజ వఆదహు, వ నసర అబ్దుహు, వ హజమ అహ్ జాబ వహదహు

ఆరాధింపబడే అర్హత కలిగిన వాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. అల్లాహ్ యే మహోన్నతుడు. ఆరాధింపబడే అర్హత కలిగిన వాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. ఆయన ఏకైకుడు. ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. విశ్వమంతా ఆయనకే చెందింది మరియు సకల ప్రశంసలు ఆయనకే చెందుతాయి. చావు బ్రతుకులు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ప్రతి దానిపై ఆయనకు ఆధిపత్యం ఉన్నది. ఆరాధింపబడే అర్హత కలిగిన వాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చినాడు, తన దాసునికి సహాయం చేసినాడు, కేవలం ఆయనే ఒంటరిగా అహ్ జాబ్ (అవిశ్వాస తెగల మొత్తం) సమూహాన్ని ఓడించినాడు.

ఇలా పఠించిన తరువాత, రెండు చేతులూ పైకెత్తి, వీలయినన్ని ఎక్కువ దుఆలు చేసుకోవలెను. ఒక్కో దుఆ మూడు సార్లు పఠించవచ్చు. సఫా కొండ పైనుండి క్రిందికి దిగిన తరువాత, మర్వా కొండ వైపు నడక సాగించవలెను. ఆకుపచ్చ రంగు లైటు నుండి మరో ఆకుపచ్చ రంగు లైటు వరకు పురుషులు వడివడిగా (పరుగు పరుగున) నడవ వలెను. అయితే స్త్రీలు అలా చేయవలసిన అవసరం లేదు, సయీ మొత్తాన్ని వారు మామూలు నడకతో పూర్తి చేయవలెను. మర్వా కొండ వద్దకు చేరుకున్న తరువాత, దాని పైకి ఎక్క వలెను, ఒకవేళ అవకాశం లభించక పోతే, కొండ ప్రక్కన నిలుచో వలెను. కొండ పైకి ఎక్కటం ఉత్తమం. సఫా వద్ద పఠించిన విధంగా ఇక్కడ కూడా పఠించవలెను. ఈ విధంగా ఒక సయీ నడక పూర్తవుతుంది.

మర్వా కొండ దిగిన తరువాత, సపా వైపు నడక సాగిస్తూ, వేగంగా నడవ వలసిన ఆకు పచ్చ లైట్లు వచ్చినపుడు వడి వడిగా నడిచి, సఫా కొండ వద్దకు చేరుకోవలెను. ఈ విధంగా రెండో సయీ నడక పూర్తవుతుంది. ఇలా ఏడు సార్లు సఫా మరియు మర్వాల మధ్య నడవ వలెను. సఫా నుండి మర్వా వద్దకు చేరుకోవటం ఒక సయీ నడకగా పరిగణింపబడుతుంది. అలాగే మర్వా నుండి సఫా వద్దకు మరల చేరుకోవటం రెండో సయీ నడకగా పరిగణింప బడుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే విధంగా చేసినారు మరియు ఆయన ఇలా పలికినారు: “ హజ్ నియమాలను నా నుండి నేర్చుకోండి.”

సయీ నడకలో వీలయినంత వరకు అల్లాహ్ ను ధ్యానిస్తూ, దుఆలు చేసుకోవలెను. అన్ని రకాల అపరిశుద్ధతల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించవలెను. వుదూ లేక పోయినా సయీ నడక సాగించడానికి అనుమతి ఇవ్వబడింది. తవాఫ్ పూర్తి చేసిన తరువాత ఒకవేళ ఎవరైనా స్త్రీకి, నెలసరి బహిష్టు వచ్చినా, పురుటి రక్తస్రావం మొదలైనా, ఆమె ఆ స్థితిలోనే సయీ నడక కొనసాగించవచ్చును. ముందు తెలిపినట్లుగా, సయీ నడక కొరకు తప్పనిసరిగా వుదూలోనే ఉండవలసిన అవసరం లేదు. సయీ నడక పూర్తయిన తరువాత, పురుషులు తమ తల వెంట్రుకలు పూర్తిగా గొరిగించు కోవలెను లేదా చిన్నవిగా కత్తిరింపబడేలా క్షవరం చేయించుకోవలెను. పురుషులు తమ తల వెంట్రుకలు పూర్తిగా గొరిగించుకోవటం మంచిది.

తవాఫ్ మరియు సయీల కొరకు ప్రత్యేకమైన దుఆలు ఏమీ లేవు:

మొదటిసారైనా, తర్వాతైనా చేసే తవాఫ్ మరియు సయీలలో ప్రత్యేకమైన దుఆలు పఠించాలనే నియమం ఏదీ లేదు. ప్రతి తవాఫ్ ప్రదక్షిణలో ఒక ప్రత్యేకమైన దుఆ పఠించే పద్ధతిని కనిపెట్టిన కొందరి అలవాటుకు షరిఅహ్ లో ఎలాంటి ఆధారమూ లేదు. మీకు జ్ఞాపకం ఉన్న దుఆలలో నుండి ఏది పఠించినా సరిపోతుంది.

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
హజ్, ఉమ్రహ్ & జియారహ్ – షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ [పుస్తకం]

ఉమ్రా (మెయిన్ పేజీ):
https://teluguislam.net/umrah/

మస్జిద్ అల్ హరమ్ లో ప్రవేశించటం మరియు తవాఫ్  -ఇమామ్ ఇబ్నె బాజ్

మక్కా చేరుకున్నపుడు యాత్రికుడు ఏమి చేయాలి?

మక్కా సరిహద్దులకు చేరుకున్న తరువాత, మక్కాలో ప్రవేశించక ముందు యాత్రికుడు స్నానం చేయటం మంచిది. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం. అల్ మస్జిద్ అల్ హరమ్ చేరుకున్న తరువాత, సున్నతు ప్రకారం, ముందుగా కుడికాలు లోపలకు పెట్టి క్రింది దుఆ చదువుతూ లోపలికి ప్రవేశించవలెను.

బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి, అఊదు బిల్లాహిల్ అజీమ్, వ బివజ్ హిల్ కరీమ్, వ సుల్తానిహిల్ ఖదీమ్, మినష్ షైతానిర్రజీమ్, అల్లాహుమ్మఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక

“అల్లాహ్ పేరుతో, రసూలుల్లాహ్ పై శాంతి మరియు దీవెనలు కురియుగాక, బహిష్కరింపబడిన షైతాను బారి నుండి; ఆయన యొక్క పవిత్ర ముఖము ద్వారా మరియు ఆయన యొక్క అత్యంత ప్రాచీన పరిపాలన మరియు అధికారం ద్వారా సర్వలోక శక్తిమంతుడైన ఆ అల్లాహ్ యొక్క శరణు కోరుతున్నాను. ఓ అల్లాహ్! నీ కారుణ్య ద్వారాలను నా కొరకు తెరుచు”

ఇతర మస్జిదులలో ప్రవేశించేటపుడు కూడా ఇదే దుఆ పఠించవలెను. నాకు తెలిసినంత వరకు, మస్జిద్ అల్ హరమ్ లో ప్రవేశించేటపుడు పఠించమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన ప్రత్యేక దుఆ ఏదీలేదు.

మస్జిద్ అల్ హరమ్ లో ప్రవేశించటం మరియు తవాఫ్ (కాబా గృహ ప్రదక్షిణ)

కాబా గృహాన్ని సమీపించిన తరువాత, ఒకవేళ అతను హజ్జె తమత్తు లేదా ఉమ్రహ్ కొరకు సంకల్పం చేసుకుని ఉన్నట్లయితే, తవాఫ్ ఆరంభించక ముందు లబ్బైక్ పలకటం ఆపివేయవలెను. హజ్రె అస్వద్ (నల్లరాయి) దిశ వైపు నిలబడి, తన కుడి చేతితో దానిని స్పర్శించవలెను, వీలయితే దానిని ముద్దు పెట్టుకోవలెను. అలా  చేయటంలో అతను ఇతరులను త్రోయటం గానీ, అసౌకర్యం కలిగించటం గానీ చేయరాదు. అతను దానిని స్పర్శించేటపుడు, ఇలా పలకవలెను – بسم الله، الله اكبر  – బిస్మిల్లాహ్, అల్లాహు అక్బర్ – అల్లాహ్ పేరుతో, అల్లాహ్ మహోన్నతుడు. ఒకవేళ దానిని ముద్దాడటం కష్టమైతే, తన చేతితో లేదా తన చేతికర్రతో దానిని స్పర్శించి, ఆ చేతిని లేదా చేతికర్రను ముద్దాడవలెను. ఒకవేళ అలా చేయడం కూడా కష్టమైతే, హజ్రె అస్వద్ వైపు చేయితో సైగ చేసి, الله اكبر  – అల్లాహు అక్బర్ – అల్లాహ్ మహోన్నతుడు అని పలుకవలెను. అయితే దూరం నుండి హజ్రె అస్వద్ వైపు ఊపిన చేతిని లేదా చేతికర్రను లేదా ఇతర వస్తువును ముద్దాడరాదు. తవాఫ్ ఆరంభించినపుడు కాబాగృహం అతని ఎడమ వైపు ఉండవలెను. తవాఫ్ ఆరంభించేటపుడు ఇలా పలకటం మంచిది,

అల్లాహుమ్మ ఈమానంబిక,  వ తస్తదీకమ్ బి కితాబిక, వ వఫాఅమ్ బి అహ్దిక, వత్తిబాఅల్ లిసున్నతి నబియ్యిక ముహమ్మద్

“ఓ అల్లాహ్! నీపై విశ్వాసంతో, నీ గ్రంథంపై విశ్వాసంతో, నీకు చేసిన వాగ్దానాన్ని నేరవేరుస్తూ మరియు నీ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) విధానాన్ని అనుసరిస్తూ నేను దీనిని చేస్తున్నాను.”

పై పద్ధతి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వారసత్వంగా సంక్రమించింది. తవాఫ్ లో ఏడు ప్రదక్షిణలు ఉంటాయి. మొదటి మూడు ప్రదక్షిణలలో రమల్ చేయవలెను. మక్కాలో ప్రవేశించిన తరువాత చేసే మొదటి తవాఫ్ లో ఇలా రమల్ చేయవలెను – ఆ తవాఫ్ ఉమ్రహ్ కోసమైనా, హజ్జె తమత్తు ఉమ్రహ్ కోసమైనా లేదా హజ్జె ఖిరాన్ ఉమ్రహ్ కోసమైనా సరే. మిగిలిన నాలుగు ప్రదక్షిణలను మామూలుగా నడుస్తూ పూర్తి చేయ వలెను. ప్రతి ప్రదక్షిణ హజ్రె అస్వద్ నుండి ఆరంభమవుతుంది మరియు హజ్రె అస్వద్ వద్దనే పూర్తవుతుంది. రమల్ అంటే వడివడిగా నడవడం. మొత్తం తవాఫ్ లో ఇద్తిబా చేయవలెను. ఉమ్రహ్ లేదా హజ్ కోసం చేసే తవాఫ్ లను తప్పించి, ఇతర తవాఫ్ లలో ఇద్తిబా చేయరాదు. ఇద్తిబా అంటే పై వస్త్రాన్ని తమ కుడి భుజం అందరికీ కనబడేలా కుడిచేయి చంక క్రింది నుండి తీసుకువచ్చి, ఎడమభుజం పై వాటి రెండు చివరలు ఉంచటం.

ఒకవేళ ఎవరికైనా తాము ఎన్ని ప్రదక్షిణలు చేసామో గుర్తులేక, వాటి సంఖ్య గురించి అనుమానం వస్తే, తాము అనుమానిస్తున్న రెండింటిలో తక్కువ సంఖ్యను తీసుకోవలెను. ఉదాహరణకు, ఒకవేళ ఎవరికైనా తాము మూడు ప్రదక్షిణలు చేసామా లేక నాలుగు ప్రదక్షిణలు చేసామా అనేది గుర్తు లేకపోతే, తాము మూడు ప్రదక్షిణలే చేసామని లెక్కించుకోవాలి. సయీలో కూడా ఇదే విధంగా చేయాలి. తవాఫ్ పూర్తి చేసిన తరువాత, తమ కుడిభుజాన్ని పైవస్త్రంతో కప్పివేయాలి. అంటే తవాఫ్ తరువాత, మఖామె ఇబ్రాహీం వద్ద చేసే రెండు రకాతుల నమాజు కంటే ముందు, తమ రెండు భుజాలను పై వస్త్రంతో నిండుగా కప్పుకోవాలి.

స్త్రీలు ముసుగులో ఉండటం మరియు తమ అందచందాలను ప్రదర్శించే విధంగా అలంకరించుకోకుండా ఉండటం తప్పనిసరి.

తవాఫ్ చేసేటపుడు స్త్రీలు అత్తరు లేదా పెర్ఫ్యూమ్ పూసుకోవటం, తమ అందచందాలను ప్రదర్శించటం వంటి వాటికి దూరంగా ఉండటం అనివార్యం. ఇహ్రాం స్థితిలో ఉండి తవాఫ్ చేస్తున్నపుడు కూడా వారు పరాయి పురుషులకు తమ ముఖం కనబడకుండా మరియు తమ సౌందర్యం ప్రదర్శించకుండా జాగ్రత్త వహించవలెను. వారు పురుషులకు దగ్గరగా ఉన్నపుడు, స్త్రీపురుషులు ఒకేచోట కలిసిమెలిసి ఉండే చోట ఇలా జాగ్రత్ర పడటం మరీ ముఖ్యం. ఎందుకంటే స్త్రీల ఆకర్షణ పురుషులను ఉశికొలుపే ఒక ప్రధాన కారణం కావటం వలన స్త్రీలు ముఖంపై ముసుగు వేసుకోవటం ఆవశ్యకం. ఎందుకంటే స్త్రీల అందాన్ని ప్రధానంగా వారి ముఖం ప్రదర్శించటం వలన, పరాయి పురుషుల ముందు వారు తమ ముఖాన్ని ప్రదర్శించటం అనుమతించబడలేదు.

“… మరియు తమ భర్తల ముందు తప్ప తమ అందచందాలను వారు ప్రదర్శించరాదు” 24:31

ఒకవేళ హజ్రె అస్వద్ ను ముద్దాడే సమయంలో పురుషుల చూపు వారిపై ఉంటే, వారు తమ ముఖంపై ముసుగును తొలగించరాదు. ఒకవేళ హజ్రె అస్వద్ ను ముద్దాడే లేదా స్పర్శించే అవకాశం లేనంతగా అక్కడ జనం గుమిగూడి ఉండిన పరిస్థితిలో స్త్రీలు హజ్రె అస్వద్ ను ముద్దాడటానికి పురుషులతో పోటీపడకూడదు. స్త్రీలు తమ పురుషుల వెనుక నడుస్తూ, తవాఫ్ పూర్తి చేయవలెను. కాబా గృహానికి అతి దగ్గరలో నుండి తవాఫ్ చేసే వారిలో చొచ్చుకుని పోయి, రద్దీలో ఇబ్బంది పడే కంటే, కాబా గృహానికి కొంచెం దూరంలో నుండి ప్రశాంతంగా తవాఫ్ చేయటం మంచిది. పైగా దూరంలో నుండి తవాఫ్ చేయటంలో అడుగులు పెరగటం వలన ఎక్కువ పుణ్యాలు కూడా లభించే అవకాశం ఉంది. రమల్ మరియు ఇద్తిబాలను తవాఫ్ లో మాత్రమే పాటించాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా చేరుకున్న తర్వాత చేసిన తన మొదటి తవాఫ్ లోనే రమల్ మరియు ఇద్తిబాలు చేసారు. అయితే స్త్రీలు రమల్ మరియు ఇద్తిబాలను చేయవలసిన అవసరం లేదు.

తవాఫ్ మరియు సయీల కొరకు ప్రత్యేకమైన దుఆలు ఏమీ లేవు:

మొదటిసారైనా, తర్వాతైనా చేసే తవాఫ్ మరియు సయీలలో ప్రత్యేకమైన దుఆలు పఠించాలనే నియమం ఏదీ లేదు. ప్రతి తవాఫ్ ప్రదక్షిణలో ఒక ప్రత్యేకమైన దుఆ పఠించే పద్ధతిని కనిపెట్టిన కొందరి అలవాటుకు షరిఅహ్ లో ఎలాంటి ఆధారమూ లేదు. మీకు జ్ఞాపకం ఉన్న దుఆలలో నుండి ఏది పఠించినా సరిపోతుంది. రుకునె యమానీ (యమనీ మూల) వద్దకు చేరుకున్న తరువాత “బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో), అల్లాహు అక్బర్(అల్లాహ్ మహోన్నతుడు)” అని పలికి, దానిని కుడి చేత్తో తాకవలెను. అయితే దానిని ముద్దాడకూడదు మరియు దానిని స్పర్శించిన కుడి చేతిని కూడా ముద్దాడకూడదు. ఒకవేళ రద్దీ వలన రుకునె యమానీని తాకటానికి అవకాశం లభించకపోతే, దాని వైపు చేయి ఊపుతూ సైగ చేయకుండా, అలానే తవాఫ్ కొనసాగించవలెను. అంతేగాక దానివైపు తిరిగి అల్లాహు అక్బర్ అని కూడా పలక కూడదు. అలా దూరం నుండి రుకునె యమానీ వైపు తిరిగి అల్లాహు అక్బర్ అని పలకటం నాకు తెలిసినంత వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులో లేదు. రుకునె యమానీ మరియు హజ్రె అస్వద్ ల మధ్య నడిచేటప్పుడు ఈ క్రింది దుఆ పఠించటం వాంఛనీయం.

రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతవ్ వ ఫిల్ ఆఖిరతి హసనతవ్ వ ఖినా అదాబన్నార్ సూరహ్ అల్ బఖరహ్ 2:201

“ఓ మా ప్రభూ! ఈ ప్రాపంచిక జీవితంలో మాకు మంచిని ప్రసాదించు మరియు పరలోక జీవితంలో మాకు మంచిని ప్రసాదించు మరియు మమ్ముల్ని నరకాగ్ని నుండి రక్షించు.”

హజ్రె అస్వద్ కు ఎదురుగా ఉన్నపుడు, దానిని తాకడానికి, ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ, “అల్లాహు అక్బర్ – అల్లాహ్ మహోన్నతుడు” అని పలుకవలెను. ఒకవేళ రద్దీ వలన అలా తాకడం లేదా ముద్దుపెట్టుకోవడం కష్టమైతే, హజ్రె అస్వద్ కు ఎదురుగా వచ్చినపుడల్లా, దాని వైపు సంజ్ఞ చేస్తూ, అల్లాహు అక్బర్ అని పలుకవలెను. మఖామె ఇబ్రాహీం లేదా జమ్ జమ్ బావి వెనుక నుండి తవాఫ్ చేయటంలో ఎలాంటి దోషమూ లేదు ముఖ్యంగా బాగా రద్దీగా ఉన్నపుడు. తప్పనిసరిగా కాబాగృహానికీ మరియు మఖామె ఇబ్రాహీం లేదా జమ్ జమ్ బావిల మధ్య నుండే తవాఫ్ చేయాలనే నియమం ఏదీ లేదు. మస్జిదె హరమ్ మొత్తంలో ఎక్కడి నుండైనా తవాఫ్ చేయవచ్చు. రద్దీ బాగా ఎక్కువగా ఉన్నపుడు, కాబా గృహం చుట్టూ ఉన్న మస్జిదు భవనం కప్పు పై నుండి తవాఫ్ చేయటంలో కూడా ఎలాంటి దోషమూ లేదు. అయితే, అవకాశం ఉంటే కాబా గృహం దగ్గరలో నుండి తవాఫ్ చేయటం ఉత్తమం.

అలాగే, అవకాశం లభిస్తే, తవాఫ్ పూర్తి చేసిన తరువాత మఖామె ఇబ్రాహీం వద్ద రెండు రకాతుల నమాజు చేయటం ఉత్తమం. రద్దీగా ఉండటం వలన ఒకవేళ అలా చేయలేక పోతే, తవాఫ్ పూర్తి చేసిన తరువాత కాబా మస్జిదులో మీకు వీలయిన చోట రెండు రకాతుల నమాజు చేసుకోవలెను.

ఈ రెండు రకాతుల నమాజులో సూరతుల్ ఫాతిహా తరువాత మొదటి రకాతులో సూరతుల్ కాఫిరూన్ మరియు రెండో రకాతులో సూరతుల్ ఇఖ్లాస్ పఠించవలెను. ఇలా పఠించటం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులో ఉన్నది.

తవాఫ్ పూర్తి చేసి, (మఖామె ఇబ్రాహీం వద్ద రెండు రకాతుల నమాజు పూర్తి చేసి, జమ్ జమ్ నీరు త్రాగి) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతును అనుసరిస్తూ, హజ్రె అస్వద్ వైపు తిరిగి, వీలయితే దానిని కుడిచేతితో తాకి, సఫా కొండ వైపు సాగిపోవలెను.

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
హజ్, ఉమ్రహ్ & జియారహ్ – షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ [పుస్తకం]

ఉమ్రా (మెయిన్ పేజీ):
https://teluguislam.net/umrah/

మదీనా లోని జన్నతుల్ బఖీని దర్శించడం – ఇమామ్ ఇబ్నె బాజ్

జన్నతుల్ బఖీ (స్మశానం) దర్శించడం, షహీదుల సమాధులను దర్శించడం మరియు హంజా రదియల్లాహు అన్హు సమాధిని దర్శించడం కూడా సున్నతులోనివే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని దర్శించేవారు మరియు వారి కొరకు ప్రార్థించేవారు. దీని గురించిన హదీథు ఇలా ఉంది:

زُوْرُوْا الْـقُـبُـورَ فَـإِ نَّـهَا تُـذَكِّـرُكُمْ اَلْآخِـرَةَ
జూరుల్ ఖుబూర ఫఇన్నహా తుదక్కిరుకుమ్ అల్ ఆఖిరత
స్మశానాల్ని దర్శించండి. ఎందుకంటే అవి మీకు పరలోకం గురించి జ్ఞాపకం చేస్తాయి.

[ముస్లిం హదీథు]

సమాధులను దర్శించేటపుడు, క్రింది విధంగా పలుకమని ఆయన తన సహచరులకు బోధించారు,

أَلسَّلاَمُ عَلَيْكُمْ أَهْلٌ الدِّيَارْ مِنَ الْـمُؤمِـنِـيْـنَ وَالْـمُسْلِـمِيْنْ وَإِنَّا إِنْ شَاءَ الله بِكُمْ لاَحِقُوْنَ، نَسْأَلُ اللهَ لَنَا وَلَكُمْ الْـعَافِـيَـةٌ

అస్సలాము అలైకుమ్ అహలుద్దియార్  మినల్ మోమినీన్ వల్ ముస్లిమీన్. వ అనా ఇన్ షాఅ అల్లాహ్ బికుమ్ లాహిఖూన్. నస్అలుల్లాహ లనా వ లకుమ్ అల్ ఆఫియహ్.

మోమినుల మరియు ముస్లిముల ప్రాంతంలో ఉన్న నివాసితులారా, అస్సలాము అలైకుమ్. అల్లాహ్ తలిచినపుడు, నేను కూడా మీతో చేరబోతున్నాను. నా కొరకు మరియు మీకొరకు మేలు ప్రసాదించమని నేను అల్లాహ్ ను వేడుకుంటున్నాను. (ముస్లిం హదీథు గ్రంథం)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనహ్ లోని స్మశానం దగ్గర నుండి వెళ్తున్నపుడు, దాని వైపు తిరిగి ఇలా పలికారని అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీథు అత్తిర్మిథీ హదీథు గ్రంథంలో ఇలా నమోదు చేయబడింది:

أَلسَّلاَمُ عَلَـيْكُمْ يَا أَهْلُ الْـقُـبُـورْ يَـغْـفِـرَ اللهُ لَـنَـا وَلَـكُـمْ أَنْـتُـمْ سَلَـفَـنَا وَنَـحْنُ بِالْأَ ثَـرْ
అస్సలాము అలైకుమ్ యా అహలుల్ ఖుబూర్, యగ్ఫిరల్లాహు లనా వ లకుమ్, అంతుమ్ సలఫనా వ నహ్ను బిల్అథర్

సమాధులలో ఉన్న వారలారా! అస్సలాము అలైకుమ్. మమ్ముల్ని మరియు మిమ్ముల్ని అల్లాహ్ క్షమించు గాక. మీరు మా కంటే ముందు వెళ్ళిపోయారు మరియు మేము మీ వెనుక వస్తున్నాము.

ఈ హదీథుల ద్వారా మనం నేర్చుకునేదేమిటంటే సమాధులను సందర్శించమనే షరిఅహ్ ఆదేశం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే దాని ద్వారా మనం మరణానంతర జీవితం గురించి గుర్తు చేసుకోవాలని.

మృతులతో ఉత్తమంగా వ్యవహరించే, వారిపై అల్లాహ్ యొక్క కారుణ్యం కురిపించమని వేడుకునే మరియు వారి కొరకు మరిన్ని దుఆలు చేసే అవకాశాల్ని ఈ సమాధి సందర్శనం కల్పిస్తున్నది.

అయితే, మృతులను వేడుకోవడానికి సమాధులను సందర్శించడం, అక్కడ కూర్చోవడం, తమ అవసరాలు తీర్చమని మృతులను అర్థించడం, రోగుల స్వస్థత కొరకు వారి సహాయాన్ని కోరటం, వారి ద్వారా లేదా వారి స్థాయి ద్వారా అల్లాహ్ ను వేడుకోవడం మొదలైనవి నిషేధించబడినాయి. ఎందుకంటే అలా చేయడం షిర్క్ క్రిందకి వస్తుంది. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అలా చేయడానికి అనుమతించ లేదు. అంతేగాక ముందుతరం సజ్జనులు కూడా అలా చేయలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించిన ఘోరమైన చెడు పనులలో అదొకటి. ఆయన పలుకులు:

زُوْرُوْا الْـقُـبُـورَ وَلاَ تَـقُـوْلُـوْا هُـجْـراً
జూరుల్ ఖుబూర వలా తఖూలు హుజ్ రన్
సమాధులను సందర్శించండి, కానీ చెడు పలుకులు పలుకవద్దు.

ఈ పనులన్నింటిలోనూ కామన్ గా ఉన్న విషయం ఏమిటంటే ఇవి కొత్తగా కనిపెట్టబడిన నూతన కల్పితాలు. అయితే అవి వేర్వేరు స్థాయిలో ఉన్నాయి. వాటిలో కొన్ని పూర్తిగా దారి తప్పిన నూతన కల్పితాలే అయినా ఇంకా షిర్క్ స్థాయికి చేరుకోలేదు. ఉదాహరణకు, సమాధుల వద్ద నిలబడి అల్లాహ్ ను ప్రార్థించడం, మృతుల అంతస్తును పేర్కొంటూ ప్రార్థించడం మొదలైనవి. వాటిలో కొన్ని షిర్క్ అక్బర్ క్రిందికి వస్తాయి, ఉదాహరణకు – మృతులను వేడుకోవడం మరియు వారి సహాయాన్ని అర్థించడం.

ఈ విషయాల గురించి మేము ఇంతకు ముందు వివరంగా చర్చించాము. కాబట్టి వీటి గురించి మనం అప్రమత్తంగా ఉండాలి. సత్యాన్ని మాత్రమే అనుసరించే శక్తిని ప్రసాదించమని మరియు సరైన దారి చూపమని మనం అల్లాహ్ ను ప్రార్థించాలి. కేవలం అల్లాహ్ మాత్రమే మనకు సన్మార్గాన్ని అనుసరించే శక్తిని ప్రసాదించగలడు. అల్లాహ్ తప్ప, నిజమైన వేరే ఆరాధ్యుడు, ప్రభువు ఎవ్వరూ లేరు.

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
హజ్, ఉమ్రహ్ & జియారహ్ – షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ [పుస్తకం]

మస్జిదె ఖుబా (Masjid-e-Quba) ప్రత్యేకతలు [వీడియో]

మస్జిదె ఖూబ ప్రత్యేకతలు – షరీఫ్ మదనీ [3 నిముషాలు]
https://www.youtube.com/watch?v=QOclavePcwo

మదీనాలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మొట్ట మొదట నిర్మించిన మస్జిద్, మస్జిదె ఖుబా.

ఇబ్నుల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) ప్రకారం (జాద్ అల్ మాద్ 3/58) లో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మదీనాలో ప్రవేశించిన సందర్భాన్ని వివరిస్తూ:

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం రాకపై సంతోషపడుతూ, ముస్లింలు తక్బీర్ (అల్లాహు అక్బర్) చెబుతూ, ఆయనను కలవడానికి వెళ్లారు… దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఖుబా వరకు వెళ్లి బనూ అమ్ర్ ఇబ్న్ ఔఫ్ వద్ద ఆగారు. వారి మధ్య దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పద్నాలుగు రోజులు ఆగారు. అప్పుడే ఖుబా మస్జిద్ ను స్థాపించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రవక్తగా నియమించబడ్డాక స్థాపించిన మొదటి మస్జిద్ ఇది.

ప్రఖ్యాత ఇస్లామీయ విద్వాంసులు ముహమ్మద్ అల్ అమీన్ అల్ శంఖీతి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు:

ప్రజానికానికి నిర్మించబడ్డ మస్జిద్ లలో, మొట్ట మొదటి మస్జిద్, మస్జిదె హరాం. ముస్లింల ద్వారా నిర్మించబడ్డ మొదటి మస్జిద్, మస్జిదె ఖుబా. మస్జిదుల్ హరాం ఇబ్రాహీం అలైహిస్సలాం ద్వారా నిర్మించబడ్డది. మస్జిదె ఖుబా అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ద్వారా నిర్మితమయింది.

అల్లాహ్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను మస్జిదె ఖుబాలో ప్రార్ధించండని ప్రోత్సహించారు. ఎందుకంటే, ఈ మస్జిద్ భయభక్తుల పునాదిపై నిర్మించబడింది. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు:

“అయితే తొలినాటి నుంచే భయభక్తుల పునాదిపై నిర్మించబడిన మస్జిదు నువ్వు నిలబడటానికి అన్ని విధాలా తగినది. బాగా పరిశుద్ధతను పొందటాన్ని ఇష్టపడే వారు అందులో ఉన్నారు. బాగా పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు.” (ఖుర్ఆన్ సూరా తౌబా 9:108)

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:

“ఎవరైతే తన ఇంట్లో పరిశుద్ధులై, ఖుబా మస్జిద్ లో నమాజ్ చేస్తారో, వారికి ఉమ్రా చేసినంత ప్రతిఫలం లభిస్తుంది.” (సునన్ ఇబ్న్ మాజా 1476, 1477 & జామి అత్ తిర్మిజి 324)

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నడుస్తూ లేదా స్వారి చేస్తూ ప్రతి శనివారం మస్జిదె ఖుబాకు వెళ్ళేవారు. అక్కడ రెండు రకాతులు నమాజ్ చేసేవారు. (సహీహ్ బుఖారీ vol 2:1191, 1192 & సహీహ్ ముస్లిం 1399)

మదీనాకు వెళ్ళే వారు, అక్కడ నివసించే వారు మస్జిదె ఖుబాకు వెళ్ళడం మరియు అక్కడ నమాజ్ చేయడం వల్ల సున్నత్ ను పాటించిన మరియు ఉమ్రా చేసిన ప్రతిఫలం లభిస్తుంది. సహల్ ఇబ్న్ హనీఫ్ ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఎవరైతే ఈ మస్జిద్ – అంటే మస్జిదె ఖుబా – కు వచ్చి నమాజ్ చేస్తారో, వారికి ఉమ్రాకు సమానమైన ప్రతిఫలం లభిస్తుంది.” (ముస్నద్ అహ్మద్ 3/437; అల్ నసాయి 699; షేక్ అల్బాని గారు దీన్ని సహీహ్ అల్ తర్ఘీబ్ 1180,1181 లో ధృవీకరించారు).

ప్రవక్త ﷺ హజ్జతుల్ విదా (వీడ్కోలు హజ్జ్) ఖుత్బాలు & వాటి వివరణ [జాదుల్ ఖతీబ్ పుస్తకం నుండి]

ప్రవక్త ﷺ హజ్జతుల్ విదా (వీడ్కోలు హజ్జ్) ఖుత్బాలు & వాటి వివరణ
[ఇక్కడ PDF (పిడిఎఫ్) డౌన్లోడ్ చేసుకోండి]

[50 పేజీలు]

జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం [పుస్తకం]
ఉర్దూ గ్రంధకర్త: డాక్టర్ హాఫిజ్ ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్ (హఫిజహుల్లాహ్)

తెలుగు అనువాదం: ముహమ్మద్‌ ఖలీలుర్‌ రహ్మాన్‌, కొత్తగూడెం.
ముద్రణ: అల్‌ ఇదారతుల్‌ ఇస్తామియ, కొత్తగూడెం.

[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [673 పేజీలు]