1708. హజ్రత్ ఉమ్మె సలమ (రధి అల్లాహు అన్హ) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈవిధంగా ప్రవచించారు :-
ఖుర్బానీ కొరకు పశువు ఉండి ఖుర్బానీ చేయదలుచుకునే వారు జుల్ హిజ్జా మాసపు నెలవంక కనిపించినప్పటి నుంచి ఖుర్బానీ ఇచ్చేవరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను కొంచమైనా కత్తిరించుకోరాదు.
[సహీహ్ ముస్లింలోని అజాహీ ప్రకరణం]
313 వ అధ్యాయం : ఖుర్బానీ చేయదలుచుకునే వారు జుల్ హిజ్జా మాసపు నెలవంక కనిపించినప్పటి నుంచి ఖుర్బానీ ఇచ్చేవరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను కొంచమైనా కత్తిరించుకోరాదు. హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లా అలై)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అరఫా నాటి ఉపవాసం గురించి విచారించటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ, “అది క్రితం యేడు మరియు వచ్చేయేటి పాపాలన్నిటినీ (minor sins – చిన్న పాపాలు) తుడిచి పెట్టేస్తుంది” అని వివరించారు.
[సహీహ్ ముస్లిం లోని ఉపవాసాల ప్రకరణం]
ముఖ్యాంశాలు:-
జుల్ హిజ్జా మాసపు తొమ్మిదో తేదీని ‘అరఫా రోజు’ అని పిలుస్తారు. ఆ రోజు హజ్ యాత్రికులందరూ అరఫాత్ మైదానంలో ఆగుతారు. కనుక ఆ రోజును ‘అరఫాత్ రోజు’ గా వ్యవహరిస్తారు. ఆ విధంగా అరఫాత్ మైదానంలో ఆగటమనేది హజ్ విధులన్నిటిలోనూ అత్యంత ప్రధానమైనది. దాన్ని నిర్వర్తించకపోతే హజ్జే నెరవేరదు. హజ్ యాత్రికులు ఆ రోజున ప్రార్ధనలు, సంకీర్తనల్లో నిమగ్నులై ఉంటారు. ఆనాడు వారికి అదే గొప్ప ఆరాధనగా పరిగణించబడుతుంది. కనుక వారు ఆరోజు ఉపవాసం పాటించటం అభిలషణీయం కాదు. కాని హజ్ యాత్రలో పాల్గొనని వారికి మాత్రం ఆరోజు ఉపవాసం పాటిస్తే గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. ఆ ఒక్క ఉపవాసం రెండేళ్ళ పాపాలను తుడిచిపెట్టేస్తుంది.
227 వ అధ్యాయం – అరఫా రోజు మరియు ముహర్రమ్ మాసపు తొమ్మిదో, పదో తేదీల్లో పాటించబడే ఉపవాసాల ఘనత
హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లా అలై)
నోట్: సఊది అరేబియా కాలమానం ప్రకారం అరఫా రోజు 25/10/2012. ఇండియా లో 26/10/2012 ఉండవచ్చు. కాబట్టి 25 మరియు 26 తారీఖు లలో ఉపవాసం ఉండి ఈ గొప్ప అవకాశాన్ని వదులుకోకుండా చూసుకోండి. బారకల్లః ఫీకుం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు
హజ్ నెల ప్రారంభ మైనది, మొదటి పది రోజులు ఎంతో ముఖ్యమైనవి. ఈ పది రోజులలో చేసిన మంచి పనులకు అల్లాహ్ ఎంతో గొప్ప పుణ్యం ప్రసాదిస్తాడు.
1250. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :-
జిల్ హిజ్జా మాసపు తొలి పదిరోజుల్లో చేయబడిన సత్కార్యాల కన్నా ఇతర దినాల్లో చేసిన సత్కార్యాలేవీ దేవుని దృష్టిలో అత్యంత ప్రియమైనవి కావు. అది విని సహచరులు సందేహపడుతూ, “ధైవప్రవక్తా! అల్లాహ్ మార్గంలో చేయబడే పోరాటం కూడా (దాని కన్నా ప్రియమైనది) కాదా? అని అడిగారు. దానికి సమాధానమిస్తూ, “అల్లాహ్ మార్గంలో చేయబడిన పోరాటం కూడా (ప్రియమైనది) కాదు. ఒకవేళ ఎవరయినా ధనప్రాణాలు సమేతంగా బయలుదేరి వాటిలో ఏదీ తిరిగిరాకపోతే (అంటే దైవమార్గంలో వీరమరణం పొందితే మాత్రం నిశ్చయంగా అతను శ్రేష్టుడే)” అని చెప్పారు. [బుఖారీ]
[సహీహ్ బుఖారీలోని పండుగ ప్రకరణం]
ముఖ్యాంశాలు :
జిల్ హిజ్జా మాసపు మొదటి పది రోజుల్లో హజ్ యాత్రికులు ప్రత్యేక ఆరాధనా కార్యకలాపాలు నిర్వర్తిస్తారు. కాని హజ్ చేయలేక పోతున్నవారు ఆ పుణ్యానికి నోచుకోలేరు. అందుకని అలాంటివారు తమ స్వంత ప్రదేశాల్లోనే ఉండి నఫీల్ ఉపవాసాలు ఇతర ఆరాధనా కార్యకలాపాలు చేసుకొని వీలైనంత ఎక్కువగా పుణ్యాన్ని సంపాదించుకోగలగాలన్నా ఉద్దేశ్యంతో జిల్ హిజ్జా మాసపు తొలి పది రోజుల్లో చేయబడే సత్కార్యాలు దేవునికి అత్యంత ప్రియమైనవని ప్రకటించడం జరిగింది. ఇస్లాం లో ‘జిహాద్’ కు చాలా ప్రాముఖ్యత ఉందన్న విషయం కూడా ఈ హదీసు ద్వారా బోధనపడుతున్నది.
హదీసు కిరణాలు (RiyadusSaliheen) రెండవ సంపుటం సంకలనం: ఇమాం నవవి (రహిమహుల్లః )
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో “దైవప్రవక్తా! సఫియా బిన్తే హుయ్యి (రధి అల్లాహు అన్హు) బహిష్టు అయి ఉంది” అని తెలిపాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మనం ఆగిపోవడానికి ఈమె కారకురాలవుతుందేమో!” అని అన్నారు. ఆ తరువాత “ఆమె మీ అందరితో పాటు ఏదైనా ఒకసారి కాబా ప్రదక్షిణ చేయలేదా?” అని అడిగారు. “ఎందుకు చెయ్యలేదు, చేసింది (సందర్శనా ప్రదక్షిణ)” అన్నా నేను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అయితే ఇక పరవాలేదు. మనం బయలుదేరవచ్చు” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 6 వ ప్రకరణం – హైజ్, 27 వ అధ్యాయం – అల్ మర అతి తహైజు బాదల్ ఇఫాజా]
హజ్ ప్రకరణం – 67 వ అధ్యాయం – వీడ్కోలు ప్రదక్షిణ చేయడం తప్పనిసరి, అయితే రుతుమతికి మినహాయింపు ఉంది. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హజ్జ్, ఉమ్రా ఆదేశాలు – Rulings of Hajj and Umrah అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
ఇస్లాం మూల స్తంభాలు ఐదున్నవి: అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట. నమాజు స్థాపించుట. విధి దానము (జకాత్) చెల్లించుట. హజ్ చేయుట. రమజాను నెల ఉపవాసం ఉండుట. (బుఖారి 8, ముస్లిం 16).
దాని ఘనతః అల్లాహ్ సాన్నిధ్యంలో చేర్పించు సత్కార్యాలలో హజ్ అతిగొప్పది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః
ఎవరైతే ఏలాంటి వాంఛలకు లోనవకుండా, దైవ ఆజ్ఞల్ని ఉల్లంఘించకుండా హజ్ చేసి తిరిగి వెళ్తారో, వారు తమ తల్లి గర్భము నుంచి పుట్టినప్పటి స్థతిలో తిరిగి వెళ్తారు. (బుఖారి 1819, ముస్లిం 1350).
హజ్ నిబంధనలు
తెలివిగల, యుక్తవయస్సుకు చేరిన ప్రతి ముస్లింపై హజ్ విధిగా ఉంది. అతను దానికి అర్హుడైనప్పుడు. అంటే తన బాధ్యతలో ఉన్నవారి ఖర్చులు చెల్లించాక, అతని వద్ద మక్కా రాను, పోను పూర్తి ప్రయాణ ఖర్చులు ఉండాలి. ప్రయాణ దారి నిర్భయంగా ఉండాలి. శారీరకంగా ఆరోగ్యవంతుడై యుండాలి. హజ్ చేయుటకు ఆటంకం కలిగించే అంగవైకల్యం మరే శారీరక రోగం ఉండ కూడదు. ఇక స్త్రీ విషయంలో గత నిబంధనలతో పాటు తనతో తన ‘మహ్రమ్’ (వివాహ నిషిద్ధమైన బంధువు) ఉండాలి. అంటే భర్త, లేక ఆమె దగ్గరి మహ్రమ్ లో ఏవరైనా ఒకరు ఉండాలి. ఆమె (తన భర్త చనిపోయినందుకు లేదా విడాకులు పొంది- నందుకు) గడువులో కూడా ఉండ కూడదు. ఎందుకనగా గడువులో ఉన్నవారు ఇంటి బైటికి వెళ్ళుట అల్లాహ్ నిషేధించాడు. ఎవరికి ఇలాంటి ఆటంకాలు ఎదురగునో వారిపై హజ్ విధిగా లేదు.
హజ్ సిద్ధాంతములు
1- హాజి హజ్ కొరకు పయణమయ్యే ముందు హజ్, ఉమ్రా పద్ధతులను తెలుసుకొని ఉండాలి. దానికి సంబంధించిన పుస్తకాలు చదివి లేదా పండితులతో ప్రశ్నించి ఇంకే విధంగానైనా సరే తెలుసుకోవాలి.
2- మేలు విషయాల్లో సహాయపడే మంచి మిత్రుని వెంట వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఒక వేళ ధర్మజ్ఞాని, లేదా ధర్మజ్ఞాన విద్యార్థి తనకు తోడుగా ఉంటే మరీ మంచిది.
3- హజ్ ఉద్దేశం అల్లాహ్ అభీష్టాన్ని, ఆయన సన్నిధానమును పొందుటయే ఉండాలి.
4- వృధా మాటల నుండి నాలుకను కాపాడాలి.
5- ఎవరికీ బాధ కలిగించకుండా ఉండాలి.
6- స్త్రీ పర్ద చేయు విషయంలో, జన సమ్మూహం నుండి దూరముండుటకు అన్ని రకాల ప్రయత్నం చేయాలి.
7- హాజి తనకు తాను అల్లాహ్ ఆరాధనలో ఉన్నట్లు, లోక సంచారములో కాదని భావించాలి. కొందరు హజ్ యాత్రికులు అల్లాహ్ వారికి సన్మార్గము చూపుగాకా! వారు హజ్ యాత్రను వినోద విహారమునకు, ఫోటోలు, వీడియోలు తీయుటకు సదావకాశముగా భావిస్తారు. (ఇది తప్పు).
ఇహ్రామ్
‘ఇహ్రామ్’ హజ్ ఆరాధనలోకి ప్రవేశము. హజ్ లేక ఉమ్రా చేయాలనుకున్న ప్రతి వ్యక్తిపై ‘ఇహ్రామ్’ విధిగా ఉంది. హజ్ లేక ఉమ్రా చేయు వ్యక్తి మక్కా బయటి నుండి వచ్చే వారయితే ప్రవక్త నియమించిన మీఖాతుల్లో ఏ ఒక మీఖాతు నుండైనా ఇహ్రామ్ చేయాలి. ఆ మీఖాతులు ఇవిః
1- ‘జుల్ హులైఫ’: ఇది మదీనకు సమీపంలో ఒక చిన్న పల్లెటూరు. ఇప్పుడు దాని పేరు ‘అబ్ యారె అలీ’. ఇది మదీనవాసుల మీఖాత్. 2- ‘అల్ జుహ్ ఫ’: అది రాబిగ్ సమీపంలో ఒక పల్లెటూరు. ఈ రోజుల్లో రాబిగ్ నుంచే ఇహ్రామ్ చేస్తున్నారు. ఇది సిరీయా వారి మీఖాతు. 3- ‘ఖర్నుల్ మనాజిల్’ (‘అస్సైలుల్ కబీర్’): ఇది తాయిఫ్ కు సమీపాన ఒక ప్రాంతం. ఇది నజ్ద్ వారి మీఖాత్. 4- ‘యలమ్ లమ్’: ఇది యమన్ వారి మీఖాత్. 5- ‘జాతు ఇర్ఖ్’: ఇది ఇరాఖ్ వారి మీఖాత్.
పై మీఖాతులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నియమించారు. అవి మేము తెలిపిన వారి ప్రాంత నివాసుల మరియు వారి తప్ప ఎవరైతే హజ్ లేక ఉమ్రా చేయుటకు వాటి నుండి దాటుతారో వారికి కూడాను. ఇక మక్కా నివాసులు మరియు ‘అహ్లుల్ హిల్ల్’ (మక్కా నగరానికి బయట మరియు మీఖాతు లోపల నివసించువారు) తమ ఇంటి నుండే ఇహ్రామ్ చేయాలి.
ఇహ్రామ్ ధర్మములు
ఇహ్రామ్ కు ముందు చేయవలసిన ధర్మములు:
1- గోర్లు, చంకల మరియు నాభి క్రింది వెంట్రుకలు తీయాలి. మీసాలు కత్తిరించాలి. స్నానం చేసి, సువాసన శరీరానికి పూసుకోవాలి. ఇహ్రామ్ దుస్తులకు పూసుకోవద్దు.
2- కుట్టిన బట్టలు తీసి, ఒక పంచి కట్టుకొని, ఒక దుప్పటి వేసుకోవాలి. స్త్రీ తనకిష్టమైన బట్టలు ధరించవచ్చును. అయితే పూర్తి పర్ద చేయాలి. అలంకరణ ప్రదర్శించకుండా ఉండాలి. పరపురు- షులు ఎదురయ్యే సమయాన ముఖము, అరచేతుల పర్ద కూడా చేయుటకు ప్రయత్నిం- చాలి. చేతుల్లో గ్లౌసులు, ముఖముపై నఖాబ్ వేయ కూడదు.
3- మస్జిద్ కు వెళ్ళి నమాజ్ సమయమయితే జమాఅతుతో నమాజు చేసుకోవాలి. లేనిచో రెండు రకాతులు ‘తహియ్యతుల్ వుజూ’ చేసుకోవచ్చు. ఆ తరువాత ఇహ్రామ్ చేయాలి.
అన్సాకుల్ హజ్ మూడు రకాలు
1- హజ్జె తమత్తుఅ: ముందు ఉమ్రా యొక్క ఇహ్రామ్ మాత్రమే చేయాలి. ఉమ్రా చేసిన తరువాత హలాల్ అయిపోయి, మళ్లీ హజ్ రోజున మక్కాలో తానున్న ప్రాంతము నుండే హజ్ కొరకు ఇహ్రామ్ చెయ్యాలి. మీఖాతులో ఇలా అనాలి. లబ్బైక్ ఉమ్రతన్ ముతమత్తిఅన్ బిహా ఇలల్ హజ్. హజ్జె తమత్తుఅ మిగిత రెండు రకాల కంటే చాలా శ్రేష్ఠమైనది. అది ముఖ్యంగా హాజి హజ్ సమయానికి ముందుగా మక్కాలో వచ్చి ఉంటే. ఇందులో హాజీ ఒక బలిదానము తప్పక ఇవ్వాలి. ఒక వ్యక్తి తరఫున ఒక మేక మరియు ఏడుగురి తరఫున ఒక ఒంటె లేక ఒక ఆవు సరిపోతుంది.
2- ‘హజ్జె ఖిరాన్’: ఒకే సమయంలో ఉమ్రా మరి
హజ్ ఇహ్రామ్ చేయాలి. లబ్బైక్ ఉమ్రతన్ వ హజ్జన్ అనాలి. ముందు ఉమ్రా చేసి (అంటే తావాఫ్, సఈ చేసి, తల వెంట్రుకలు తీయకుండా) అదే ఇహ్రామ్ లో ‘యౌమున్నహర్’ (10వ తేది) వరకు ఉండాలి. ఇలా ఉమ్రా తరువాత హలాల్ గాకుండా హజ్ లో చేరడం అవుతుంది. ఈ రకమైన హజ్ సామాన్యంగా హజ్ ఆరంభానికి అతి సమీపంలో వచ్చినవారు చేస్తారు. ఉమ్రా చేసి హలాల్ అయి మళ్ళీ హజ్ కొరకు ఇహ్రామ్ చేసే సమయం ఉండదు గనక. లేదా బలి జంతువు తమ వెంట తీసుకొచ్చిన వారు చేస్తారు. ఈ హజ్ లో కూడా బలిదానం తప్పనిసరి.
3- ‘హజ్జె ఇఫ్రాద్’: కేవలం హజ్ సంకల్పం మాత్రమే చేయాలి. మీఖాత్ లో లబ్బైక్ హజ్జన్ అనాలి. ఇందులో బలిదానం అవసరం లేదు.
విమానంలో ప్రయాణించువారు మీఖాత్ కు సమాన ప్రాంతం వద్దనే ఇహ్రామ్ చేయాలి. మీఖాత్ ఏర్పాటు కష్టంగా ఉంటే దానికి కొంచెం ముందు కూడా చేయవచ్చును. ఇక మీఖాత్ వద్ద చేసే పనులు; గోళ్ళు తీయడం, స్నానం చేసి, శరీరానికి సువాసన పూసుకోవడం మరియు ఇహ్రామ్ దుస్తులు ధరించడం లాంటివన్నీ విమానంలో లేదా అందులో పయనమయ్యే ముందు పూర్తి చేసుకోవాలి. మీఖాత్ వద్ద లేదా దానికి కొంచెం ముందు చేరుకున్నప్పుడు ఇహ్రాం సంకంల్పం చేయాలి.
ఇహ్రామ్ స్థితిలో ఉన్న వ్యక్తిపై ఇహ్రామ్ కు ముందు యోగ్యమున్న కొన్ని విషయాలు నిషిద్ధం అగును. ఎందుకనగా అతడు ఒక ఆరాధనలో ప్రవేశించాడు. అతనిపై క్రింది విషయాలు నిషిద్ధం:
1- తల వెంట్రుకలు మరియు శరీర వెంట్రుకలు తీయడం నిషిద్ధం. కాని అవసరమున్నప్పుడు మెల్లగా తల గోకుట నేరం కాదు.
2- గోళ్ళు తీయుట నిషిద్ధం. కాని గోరు విరిగినా, నొప్పి ఉన్నా దానిని తీయుట పాపం కాదు.
3- సుగంధం మరియు సువాసన సబ్బుల ఉపయోగం నిషిద్ధం.
4- సంభోగం మరియు దానికి సంబంధించిన విషయాలు నిషిద్ధం. ఉదా: పెళ్ళి చేసుకొనుట, చేయించుట, భార్యభర్తల సరసాలడడం వగైరా.
5- చేతులలో గ్లౌసులు వేసుకొనుట నిషిద్ధం.
6- వేటాడుట నిషిద్ధం.
పై ఆరు విషయాలు స్త్రీ పురుషులందరిపై నిషిద్ధం. ఇక ప్రత్యేకంగా పురుషులపై నిషిద్ధం ఉన్న విషయాలు దిగువ తెలుపబడుతున్నవి.
1- కుట్టిన బట్టలు ధరించడం నిషిద్ధం. కాని అవసరముంటే బెల్ట్, గడియారం మరియు కళ్ళ జోళ్ళు ఉపయోగించవచ్చును.
2- తలకు అంటుకొని ఉండే ఏదైనా వస్తువు ఉపయోగించడం నిషిద్ధం. కాని అంటుకొని ఉండని గొడుగు, వాహణము మరియు గుడారాలు లాంటివి ఉపయోగించడం యోగ్యం.
3- మేజోళ్ళు తొడుగుట నిషిద్ధం. కాని సైండిల్ మరియు చెప్పులు లేనప్పుడు మడమలు కనబడే బూట్లు ఉపయోగించ వచ్చును.
పై నిషిద్ధ కార్యాలు చేసినవాని 3 స్థితులు:
1- అకారణంగా చేసిన వ్యక్తి పాపాత్ముడగును. ఇంకా అతనిపై ‘ఫిద్య’ (ప్రాయశ్చితం) కూడా విధియగును.
2- ఏదైనా అవసరం ఉండి చేసిన వ్యక్తి పాపా- త్ముడు కాడు. కాని ప్రాయశ్చితం చెల్లించాలి.
3- ఏదో కారణంగా -ఉదా: తెలియక, మరచి- పోయి, లేదా ఒకరి ఒత్తిడితో నిస్సహాయుడై- చేసిన వ్యక్తి పాపాత్ముడూ కాడు, అతనిపై ప్రాయశ్చితమూ లేదు.
తవాఫ్
ఇతర మస్జిదుల మాదిరిగా మస్జిదె హరాంలో కూడా కుడి కాలుతో ప్రవేశిస్తూ ఈ దుఆ చదవడం ధర్మం. బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అల్లాహుమ్మగ్ ఫిర్లీ జునూబి వఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక.
بِسْمِ الله وَالصَّلاَةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ الله اللَّهُمَّ اغْفِرْ لِي ذُنُوبِي وَافْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ
కాబా తవాఫ్ చేయుటకు దానివైపున వెళ్ళాలి.
తవాఫ్: అంటే అల్లాహ్ యొక్క ఇబాదత్ ఉద్దేశ్యంతో కాబా చుట్టున ఏడు సార్లు ప్రదక్షిణం చేయుట. అది హజ్రె అస్వద్ నుండి ప్రారంభించి అక్కడే ముగించాలి. మొదటి మూడిట్లో దగ్గర దగ్గర అడుగులు వేసి పరుగెత్తుట ధర్మం. కాని ఎవరికీ ఇబ్బంది కలగించకూడదు. దీనినే ‘రమ్ల్’ అంటారు. పైన కప్పుకున్న దుప్పటిని కుడి భుజము క్రింది నుండి తీసుకొని ఎడమ భుజముపై వేసుకోవాలి. అంటే కుడి భుజము పైన బట్ట ఉండకూడదు. దీనిని ‘ఇజ్తిబాఅ’ అంటారు. ఇవి రెండు (రమ్ల్, ఇజ్తిబాఅ) ఉమ్రా లేక హజ్ ఉద్దేశ్యంతో మక్కా వచ్చి చేసే తొలి తవాఫ్ లో మాత్రమే చేయాలి. కాబా ఎడమ వైపు ఉండాలి. తవాఫ్ వుజూ స్థితిలో చేయుట తప్పనిసరి. ఇక తవాఫ్ ఈ విధంగా చేయాలి:
1- హజ్రె అస్వద్ వద్దకు వెళ్ళి కుడి చేయితో దానిని ముట్టుకొని బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. వీలవుతే దాన్ని చుంబించాలి. చుంబిం- చడం వీలు కాకుంటే దాన్ని చెయ్యితో ముట్టుకొని చెయ్యిని చుంబించాలి. చెయ్యితో ముట్టుకొనుట కూడా సాధ్యపడకుంటే దాని సూటిగా నిలబడి దాని వైపు చెయ్యితో సైగ చేస్తూ బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. కాని చెయ్యిని చుంబించకూడదు. ఇక తవాఫ్ ప్రారంభించాలి. ఇష్టానుసారం, తన భాషలో తన కొరకు, తను కోరినవారి కొరకు దుఆ చేస్తూ లేదా ఖుర్ఆన్ పారయణం చేస్తూ ఉండాలి. ఇచ్చట ప్రత్యేకంగా ఏ దుఆ లేదు.
2- రుక్నె యమాని వద్ద చేరుకున్నాక వీలవుతే దాన్ని ముట్టుకుంటూ అల్లాహు అక్బర్ అనాలి. కాని చెయ్యిని చుంబించకూడదు. వీలు కాకుంటే (తవాఫ్ చేస్తూ ఉండాలి). చెయ్యితో సైగ చేయకూడదు. అల్లాహు అక్బర్ అనకూడదు. ఈ రుక్నె యమాని మరియు హజ్రె అస్వద్ మధ్య ఈ దుఆ చదవాలి: రబ్బనా ఆతినా ఫిద్దున్ యా హసనతౌఁ వఫిల్ ఆఖిరతి హసనతౌఁ వఖినా అజాబన్నార్. (చూడండి సూర బఖర 2:201).
3- హజ్రె అస్వద్ వద్ద చేరుకొని దాన్ని చెయ్యితో ముట్టుకుంటూ, వీలు కాకుంటే దాని వైపు చెయ్యితో సైగ చేస్తూ అల్లాహు అక్బర్ అనాలి.
ఈ విధంగా 7 ప్రదక్షిణాల్లో ఒకటి పూర్తయింది.
4- మిగితవి మొదటి దాని లాగే చేస్తూ, హజ్రె అస్వద్ చేరుకున్నప్పుడల్లా మరియు ఏడవది పూర్త- యిన తరువాత కూడా అల్లాహు అక్బర్ అనాలి.
తవాఫ్ తరువాత:
తవాఫ్ తరువాత మఖామె ఇబ్రాహీం వెనక – అనగా అది తనకు మరియు కాబాకు మధ్యలో ఉన్నట్లుగా- నిలబడి రెండు రకాతుల నమాజు చేయుట ధర్మం. నమాజు చేస్తున్నప్పుడు దుప్పటి రెండు భుజాలపై ఉండుట తప్పనిసరి. ఏ ఒక్క భుజము నగ్నంగా ఉండకుడదు. మొదటి రకాతులో సూరె ఫాతిహా తరువాత ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ రెండవ రకాతులో సూరె ఫాతిహా తరువాత ఖుల్ హువల్లాహు అహద్ చదవాలి. జనసమ్మర్థంలో దాని వెనక నమాజ్ చేయుట సాధ్యపడకుంటే మస్జిదె హరాంలో ఏక్కడైనా చేయవచ్చును.
సఈ
ఇక ‘మస్అ’ (సఫా, మర్వాల మధ్యలో ‘సఈ’ చేసే స్థలం) వైపుకు వెళ్ళి సఫా దగ్గరికి చేరుకుం- టూ “ఇన్నస్సఫా వల్ మర్వత మిన్ షఆఇరిల్లాహ్” చదివాలి. సఫా కొండపై ఎక్కి కాబా దిశలో నిలబడి చేతులు ఎత్తి అల్లాహ్ స్తోత్రము పఠించి, ఈ దుఆ మూడు సార్లు చదవాలి. దాని మధ్యలో రెండు సార్లు తనిష్టానుసారం దుఆ చేసుకోవాలిః లాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లాషరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యుహ్ యీ వయుమీతు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లాఇలాహ ఇల్ల- ల్లాహు వహ్ దహూ అంజజ వఅదహూ వనసర అబ్ దహూ వహజమల్ అహ్ జాబ వహ్ దహూ.
ఆ తరువాత సఫా నుండి దిగి మర్వా వైపు నడవాలి. పచ్చరంగు గుర్తులు ఉన్న స్థలంలో శక్తి ప్రకారం పరుగుతీయడం ధర్మం. ఇతరులకు బాధ కలిగించకూడదన్న షరతును మరవవద్దు. ఈ పరుగు పురుషులకే ప్రత్యేకం. స్త్రీలకు దీని అనుమతి లేదు. మర్వా చేరుకొని దానిపై ఎక్కి ఖిబ్లా దిశలో నిలబడి చేతులు ఎత్తి సఫాపై చేసినటువంటి దుఆ చెయ్యాలి. అయితే మన భాషలో మనకిష్టమున్న దుఆ కూడా చేసు కోవాలి. ఇక్కడికి ఏడిట్లో ఒకటి పూర్తయింది. మిగిత ఆరు ఇలాగే పూర్తి చేయాలి. ప్రతీ సారి సఫా మరియు మర్వాల వద్ద దుఆ చేయాలి. పచ్చ రంగు స్తంభాల మధ్య పరుగుతీయాలి. సఈ మధ్యలో దుఆ ఎక్కువగా చేయాలి. ఏడిట్లో ప్రతీ ఒక దానికొక వేరు దుఆ అంటూ ప్రవక్తతో రుజువు లేదు.
హాజి తమత్తుఅ చేయువాడైతే సఈ తర్వాత తల వెంట్రుకలు తీయించుకొని ఉమ్రా ముగించాలి. సాధారణ దుస్తులు ధరించి ఇహ్రామ్ నుండి హలాల్ అవ్వాలి. జిల్ హిజ్జ ఎనిమిదవ రోజున జొహ్ర్ నమాజుకు కొంచెం ముందు తనున్న ప్రాంతం నుండే హజ్ కొరకు ఇహ్రాం చేస్తూ, ఉమ్రా కొరకు ఇహ్రామ్ చేయు సందర్భంలో చేసిన పనులు ఇప్పుడు చేసి హజ్ సంకంల్పం మనుసులో చేసుకొని లబ్బైక్ హజ్జన్ అనాలి. ఆ తరువాత తల్ బియ చదవాలి. కాని ఖిరాన్, ఇఫ్రాద్ చేయువారు సఫా మర్వాల మధ్య సఈ పూర్తి చేసి, వెంట్రుకలు తీయకుండా, ఇహ్రాం స్థితిలోనే ఉండాలి.
జిల్ హిజ్జ ఎనిమిదవ రోజు
ఈ రోజు హాజి మినా వెళ్ళి జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా మరియు ఫజ్ర్ నమాజులు చేయాలి. ప్రతి నమాజు దాని సమయంలో మరియు నాలుగు రకాతుల నమాజు ఖస్ర్ చేసి రెండు రకాతులు చేయాలి.
తొమ్మిదవ రోజు (అరఫ రోజు)
ఈ రోజు చేయు ధర్మములు ఇవి:
1- సూర్యోదయము తరువాత హాజి అరఫాత్ వెళ్ళి అచ్చట సూర్యాస్తమయం వరకు ఉండాలి. పొద్దు వాలిన తరువాత జొహ్ర్, అస్ర్ కలిపి ఖస్ర్ చేయాలి. నమాజ్ తరువాత అల్లాహ్ స్మరణము, దుఆ మరియు తల్ బియలో నిమగ్నులై, వినయ వినమ్రతతో అల్లాహ్ ను వేడుకుంటూ తన కొరకు మరియు ముస్లిముల కొరకు అల్లాహ్ తో అడుగుతూ తనిష్ట ప్రకారం దుఆ చేసుకోవాలి. చేతులు ఎత్తి దుఆ చేయడం చాలా మంచిది. అరఫాత్ లో నిలవడం హజ్ రుకున్ లలో ఒకటి. ఇచ్చట నిలవనివారి హజ్ కానేకాదు. ఇచ్చట నిలుచు సమయం 9వ జిల్ హిజ్జ సూర్యోదయం నుండి 10వ జిల్ హిజ్జ ఉషోదయం వరకు. ఎవరైతే ఈ పగలు మరియు రాత్రిలో ఏ కొంత సమయం నిలిచినా వారి హజ్ సరియగును. హాజి అరఫాత్ హద్దు లోపల ఉండుట తప్పనిసరి. ఆ రోజున హద్దు లోపల ఉండకుండా బైట ఉన్నవారి హజ్ నెరవేరదు.
2- అరఫ రోజు కచ్చితంగా సూర్యాస్తమయం అయిన పిదప అరఫాత్ నుండి ముజ్ దలిఫా వైపునకు పూర్తి శాంతి, మర్యాదతో ఘనమైన శబ్దముతో తల్ బియ చదువుతూ వెళ్ళాలి.
ముజ్ దలిఫా
ముజ్ దలిఫా చేరుకొని మగ్రిబ్ మరియు ఇషా నమాజులు కలిపి ఖస్ర్ చేయాలి. నమాజు తరువాత తన స్వంత పనులు చేసుకోవచ్చును. అది భోజనం తయారీ, తదితర పనులు. చురుకుదనంతో ఫజ్ర్ నమాజుకు మేల్కొనుటకు తొందరగా పడు కోవడం చాలా మంచిది.
పదవ రోజు (పండుగ రోజు)
1- ఫజ్ర్ నమాజు సమయమయిన వెంటనే నమాజు చేసుకొని అక్కడే కూర్చోని ప్రకాశమాన వరకు అధికంగా జిక్ర్, దుఆలు చేస్తూ ఉండాలి.
2- ఏడు చిన్న రాళ్ళు తీసుకొని సూర్యోదయాని- కి ముందే తల్ బియ చదువుతూ మినా వెళ్ళాలి.
3- జమ్ర అఖబ (జమ్ర కుబ్రా, సామాన్యాంగా ప్రజలు దాన్ని పెద్ద షైతాన్ అంటారు) చేరుకునే వరకు తల్ బియ చదువుతూ ఉండాలి. ఏడు రాళ్ళు, ప్రతి రాయి అల్లాహు అక్బర్ అంటూ ఒక్కొక్కటేసి జమ్ర అఖబపై విసరాలి.
4- రాళ్ళు విసిరిన తరువాత తమత్తుఅ, మరి ఖిరాన్ చేసేవారు ఖుర్బానీ చెయ్యాలి. మరియు అందులో నుంచి వారు స్వయంగా తినడం, ఇతరు లకు దానం చేయడం, బహుకరించడం మంచిది.
5- ఖుర్బానీ తరువాత తల కొరిగించాలి. లేదా కటింగ్ చేయించుకోవాలి. తల కొరిగించడం ఎక్కువ పుణ్యం. స్త్రీలు కూడా తమ తల వెంట్రుకలను వ్రేలు మందము అనగా మూడు సెంటిమీటర్లు కత్తిరించుకోవాలి.
ఇప్పుడు హాజి స్నానం చేసి, సువాసన పూసుకొనుట, దుస్తులు ధరించుట మంచిది. ఎందుకనగా ఇప్పుడు హాజిపై ఇహ్రామ్ వలన నిషిద్ధమున్న; కుట్టిన బట్టలు ధరించడం, సువాసన పూసుకోవడం, గోళ్ళు, వెంట్రుకలు తీయడం లాంటి విషయాలు యోగ్యమగును. కాని భార్యభర్తల సంభోగ నిషిద్ధత కాబా యొక్క తవాఫ్ ముగిసే వరకు ఉండును.
6- కాబా వద్దకు వెళ్ళి తవాఫె హజ్ (తవాఫె ఇఫాజ) చెయ్యాలి. అది ఈ విధంగా: ముందు కాబా చుట్టున ఏడు సార్లు ప్రదక్షిణం చెయ్యాలి. మఖామె ఇబ్రాహీం వద్ద రెండు రకాతుల నమాజు చెయ్యాలి. హజ్జె తమత్తుఅ చేయువారు సఫా మర్వాల మధ్య సఈ చెయ్యాలి. కాని ఖిరాన్ హజ్ లేదా ఇఫ్రాద్ హజ్ చేయువారు తొలి తవాఫ్ తో సఈ చేసియుంటే ఇప్పుడు సఈ చేయవలసిన అవసరం లేదు. అదే హజ్ యొక్క సఈ అగును. అప్పుడు సఈ చేయకున్నట్లయితే ఇప్పుడు తప్పక చేయాలి.
సఈ తరువాత ఇహ్రాం నిషిద్ధతలన్నీ ముగి- స్తాయి. భార్యాభర్తల మధ్య నిషిద్ధత కూడా.
7- హాజీ 11వ, 12వ రాత్రి మినాలో గడపటం తప్పనిసరి. (ఇష్టమున్నవారు 13వ రాత్రి కూడా ఉండవచ్చును). రాత్రి గడపటం అంటే రాత్రి యొక్క అధిక భాగం మినాలో ఉండాలి.
రాళ్ళు విసరడం, ఖుర్బానీ చేయడం, క్షౌరం, తర్వాత తవాఫ్. ఈ నాలుగు పనులు ఇదే క్రమంగా చేయడం సున్నత్. ఒక వేళ ఇందులో వెనకా ముందు జరిగినా ఏమీ అభ్యంతరం లేదు.
పదకుండవ రోజు
ఈ రోజు హాజి రమె జిమార్ (రాళ్లు విసురుట) ఆవశ్యకం. దాని సమయం పొద్దు వాలిన వెంటనే మొదలవుతుంది. అంతకు ముందు విసురుట యోగ్యం లేదు. మరుసటి రోజు ఉషోదయం వరకు దీని సమయం ఉంటుంది. ముందు చిన్న జమరపై, తర్వాత మధ్య దానిపై, ఆ తరువాత అఖబ అంటే పెద్ద దానిపై విసరాలి. క్రింద తెలుపబడే రీతిలో రమె జిమార్ చెయ్యాలి.
1- తన వెంట చిన్న 21 రాళ్ళు (పెద్ద శనగ గింజంత) తీసుకొని ముందు చిన్న జమరపై ఒక్కొక్కటేసి ఏడు రాళ్ళు విసరాలి. ప్రతి రాయితో అల్లాహు అక్బర్ అనాలి. ప్రతి రాయి చిన్న జమర చుట్టున్న హౌజులో పడునట్లు విసిరే ప్రయత్నం చేయాలి. పిదప ఆ జమరకు కొంచం కుడి వైపున జరిగి నిలబడి దీర్ఘంగా దుఆ చేయుట సున్నత్.
2- మధ్యలో నున్న జమర వద్దకు వెళ్ళి ఒక్కొ క్కటేసి ఏడు రాళ్ళు దానిపై విసరాలి. ప్రతి రాయిపై అల్లాహు అక్బర్ అనాలి. దానికి కొంచెం ఎడమ వైపుకు జరిగి దీర్ఘంగా దుఆ చేయాలి.
3- ఆ తరువాత పెద్ద జమర వద్దకు వెళ్ళి ఏడు రాళ్ళు ఒక్కొక్కటేసి విసరాలి. ప్రతి రాయితో అల్లాహు అక్బర్ అనాలి. ఇక అక్కడ ఆగకుండా వెళ్ళిపోవాలి.
పన్నెండవ రోజు
1- ఈ రోజు పదకుండవ రోజు చేసిన తీరు చేయాలి. హాజి 13వ రోజు ఉండాలనుకుంటే చాలా మంచిది. ఆ రోజు 11 మరియు 12వ రోజు చేసినట్లే చేయాలి.
2- 12వ రోజు (మరియు 13వ రోజు ఉన్న వారు ఆ రోజు) రాళ్ళు విసిరిన తరువాత కాబా వద్దకు వెళ్ళి తవాఫె విదాఅ చెయ్యాలి. తర్వాత మఖామె ఇబ్రాహీం వెనక, అక్కడ సాధ్యపడకుంటే ఎక్కడైనా రెండు రకాతులు చెయ్యాలి. బహిష్టు మరియు బాలంత స్త్రీలు ఈ తవాఫ్ చేయకుండా తిరిగి తమ దేశానికి వెళ్ళినా పాపమేమి లేదు.
ఎవరైనా పదవ తారీకున చేయవలసిన తవాఫె ఇఫాజ అప్పుడు చేయకుండా ఇప్పుడు చేసినా ఫరవా లేదు, యోగ్యమే. అదే ఈ తవాఫె విదాఅ కు బదులుగా సరిపోతుంది. అంటే తమ దేశానికి తిరిగి వెళ్ళే ముందు చేసే తవాఫె విదాఅ కు బదులుగా ఈ తవాఫె ఇఫాజ సరిపోతుంది. అయితే ఇలా చేసేవారు తవాఫె విదాఅ సంకల్పం తో కాకుండా, తవాఫె ఇఫాజ సంకల్పం చేసుకోవాలి.
3- ఆ తరువాత హాజి ఆలస్యం చేయకుండా తన సమయాన్ని జిక్ర్, దుఆ మరియు తనకు లాభం చేకూర్చే విషయాల్లో గడుపుతూ మక్కా నుండి వెళ్ళిపోవాలి. అయితే ఎవరైనా ఏదైనా అవసరంగా, ఉదాః తన మిత్రుని కొరకు వేచిస్తూ, లేదా తనకు దారిలో అవసరముండే సామానుల కొనుగోళు వగైరాలకై కొంత సమయం మాత్రమే ఆగుతే పాపం లేదు. కాని దూర దేశాల నుండి వచ్చినవారు హజ్ తరువాత మక్కాలో కొద్ది రోజుల నివాసం చేస్తే వారు మక్కాను వదలి వెళ్ళిపోయే రోజున తవాఫె విదాఅ చేయాలి.
హజ్ యొక్క రుకున్ లు
1- ఇహ్రామ్.
2- అరఫాత్ లో నిలవడం.
3- తవాఫె హజ్.
4- సఫా మర్వా మధ్యలో సఈ.
పై నాలిగిట్లో ఏ ఒక్క రుకున్ వదలినా, తిరిగి దానిని చేయని వరకు హజ్ నెరవేరదు.
హజ్ యొక్క వాజిబులు
1- మీఖాత్ నుండి ఇహ్రాం చేయడం.
2- పగలు వచ్చినవారు సూర్యాస్తమయం వరకు అరఫాత్ లో నిలవడం.
3- ముజ్ దలిఫాలో ఫజ్ర్ తరువాత ప్రకాశ మాన వరకు రాత్రి గడపడం. అయితే వృద్ధు లు, స్త్రీలు అర్థ రాత్రి వరకు ఉండి తరలిపోతే పాపం లేదు.
4- 11, 12, (13) రాత్రులు మినాలో గడపడం.
5- పై మూడు రోజుల్లో రాళ్ళు విసరడం.
6- క్షౌరం చేయించుకోవడం.
7- తవాఫె విదాఅ.
పై ఏడిట్లో ఏ ఒక్క వాజిబ్ వదలినా అతనిపై ‘దమ్’ విధిగా అవుతుంది. అంటే ఒక మేక లేదా ఆవు మరియు ఒంటెలో ఏడవ వంతు బలి ఇచ్చి హరంలోని బీదవారికి దానం చేయాలి.
మస్జిదె నబవి దర్శనం
నమాజ్ చేసే ఉద్దేశ్యంతో మస్జిదె నబవి దర్శనం పుణ్యకార్యం. సహీ హదీసు ప్రకారం అందులో చేసే ఒక నమాజ్ పుణ్యం ఇతర మస్జిదులలో చేసే వెయ్యి నమాజుల కన్నా అతిఉత్తమం. మస్జిదె హరాం మక్కా తప్ప. (అందులో ఒక నమాజు పుణ్యం మస్జిదె నబవిలోని వంద నమాజులకు, ఇతర మస్జిదుల్లోని లక్ష నమాజుల కంటే ఉత్తమం). మస్జిదె నబవి దర్శనం సంవత్నరమెల్లా ఎప్పుడు చేసినా పుణ్యమే. దానికొక ప్రత్యేక సమయమేమి లేదు. అది హజ్ లో ఒక భాగం కూడా ఎంత మాత్రం కాదు. మస్జిదె నబవీలో ఉన్నంత సేపట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి ఉత్తమ సహచరులైన అబూ బక్ర్, ఉమర్ రజియల్లాహు అన్హుమాల సమాధుల దర్శనం చేయడం పుణ్యకార్యం. సమాధుల దర్శనం ప్రత్యేకంగా పురుషులకు మాత్రమే, స్త్రీలకు లేదు. మస్జిదె నబవి యొక్క ఏ వస్తువును కూడా ముట్టుకొని శరీరానికి తుడుచుకొనుట, బర్కత్ (శుభం)గా భావించుట, సమాధి యొక్క తవాఫ్ చేయుట, దుఆ సమయాన దాని వైపు ముఖము చేయుట లాంటి పనులు ధర్మానికి విరుద్ధమైనవి గనక యోగ్యం లేవు.
అల్లాహ్ మీ హజ్ మరియు సర్వ సత్కార్యాలు స్వీకరించి, రెట్టింపు పుణ్యాలు ప్రసాదించుగాక!
—
ఉమ్రా విధానం
ప్రతీ ముస్లిం స్త్రీ పురుషునిపై జీవితంలో ఒకసారి ఉమ్రా చేయుట విధిగా ఉంది. అల్లాహ్ ఆదేశం సూర బఖర (2:196)లో ఇలా ఉంది:
అల్లాహ్ కొరకు హజ్, ఉమ్రా పూర్తి చేయండి.
అది సర్వ సత్కార్యాల్లో అతి ఉత్తమమైనది గనక శక్తిగల ముస్లిం మరే మరీ చేస్తూ ఉండుట పుణ్య కార్యం. ‘ముఅతమిర్’ (ఉమ్రా చేయు వ్యక్తి) ఉమ్రా విధుల్లో అన్నిటికి ముందు ఇహ్రామ్ చేయాలి.
ఇహ్రామ్:
అంటే ఉమ్రా ఆరాధనలోకి ప్రవేశం. ముహ్రిమ్ (ఇహ్రామ్ స్థితిలో ఉన్న వ్యక్తి)పై ఇహ్రామ్ కు ముందు యోగ్యమున్న కొన్ని విషయాలు నిషిద్ధమగును. ఎందుకనగా అతడు ఒక ఆరాధన లో ప్రవేశించాడు. ఉమ్రా చేయాలనుకున్న ప్రతి వ్యక్తిపై ‘ఇహ్రామ్’ విధిగా ఉంది. ముఅతమిర్ మక్కా వెలుపలి నుండి వచ్చే వారయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నియమించిన మీఖాతుల్లో ఏ ఒక మీఖాతు నుండైనా ఇహ్రామ్ చెయ్యాలి. ఆ మీఖాతులు ఇవి:
1- ‘జుల్ హులైఫ’: అది మదీనకు సమీపం లో ఒక చిన్న పల్లెటూరు. ఇప్పుడు దాని పేరు ‘అబ్ యారె అలీ’. అది మదీనవాసుల మీఖాతు.
2- ‘అల్ జుహ్ ఫ’: అది రాబిగ్ సమీపంలో ఒక పల్లెటూరు. ఈ రోజుల్లో రాబిగ్ నుంచే ఇహ్రామ్ చేస్తున్నారు. అది సిరీయా వారి మీఖాతు.
3- ‘అస్సైలుల్ కబీర్’: తాయిఫ్ కు సమీపం లో ఒక ప్రాంతం. అది నజ్ద్ వారి మీఖాతు.
4- ‘యలమ్ లమ్’: ఇది యమన్ వారి మీఖాతు.
5- ‘జాతు ఇర్ఖ్’: ఇది ఇరాఖ్ వారి మీఖాత్.
పై మీఖాతులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నియమించారు. అవి మేము తెలిపిన వారి ప్రాంత నివాసుల మరియు వారి తప్ప ఎవరైతే హజ్ లేక ఉమ్రా చేయుటకు వాటి నుండి దాటుతారో వారికి కూడాను. ఇక మక్కా నివాసులు మరియు ‘అహ్లుల్ హిల్ల్’ (మక్కా నగరానికి వెలుపల మరియు మీఖాతు లోపల నివసించువారు) తమ ఇంటి నుండి ఇహ్రామ్ చేయాలి.
ఇహ్రామ్ ధర్మములు
ఇహ్రామ్ కు ముందు చేయవలసిన ధర్మములు:
1- గోర్లు, చంకల మరియు నాభి క్రింది వెంట్రుకలు తీయాలి. మీసాలు కత్తిరించాలి. స్నానం చేసి, సువాసన శరీరానికి పూసుకోవాలి. ఇహ్రామ్ దుస్తులకు పూసుకోవద్దు.
2- కుట్టిన బట్టలు తీసి, ఒక పంచి కట్టుకొని, ఒక దుప్పటి వేసుకోవాలి. స్త్రీ తనకిష్టమైన బట్టలు ధరించవచ్చును. అయితే పూర్తి పర్ద చేయాలి. అలంకరణ ప్రదర్శించకుండా ఉండాలి. పరపురు- షులు ఎదురయ్యే సమయాన ముఖము, అరచేతుల పర్ద కూడా చేయుటకు ప్రయత్నిం- చాలి. చేతుల్లో గ్లౌసులు, ముఖముపై నఖాబ్ వేసుకోకూడదు.
3- మస్జిద్ కు వెళ్ళి నమాజ్ సమయమయితే జమాఅతుతో నమాజు చేసుకోవాలి. లేనిచో రెండు రకాతులు ‘తహియ్యతుల్ వుజూ’ చేసుకోవచ్చు. ఆ తరువాత ఇహ్రామ్ చేయాలి.
విమానంలో ప్రయాణించువారు మీఖాత్ కు సమాన ప్రాంతం వద్దనే ఇహ్రామ్ చేయాలి. మీఖాత్ ఏర్పాటు కష్టంగా ఉంటే దానికి కొంచెం ముందు కూడా చేయవచ్చును. ఇక మీఖాత్ వద్ద చేసే పనులు; గోళ్ళు తీయడం, స్నానం చేసి, శరీరానికి సువాసన పూసుకోవడం మరియు ఇహ్రామ్ దుస్తులు ధరించడం లాంటివన్నీ విమానంలో లేదా అందులో పయనమయ్యే ముందు పూర్తి చేసుకోవాలి. మీఖాత్ వద్ద లేదా దానికి కొంచెం ముందు చేరుకున్నప్పుడు ఇహ్రాం సంకంల్పం చేయాలి.
ఇహ్రమ్ నుండి మొదలుకొని కాబా ప్రదక్షిణం ప్రారంభించే వరకు “తల్ బియ” చదువుతూ ఉండాలి: లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హంద వన్నిఅమత లక వల్ ముల్క, లా షరీక లక.
ఇహ్రామ్ స్థితిలో ఉన్న వ్యక్తిపై ఇహ్రామ్ కు ముందు యోగ్యమున్న కొన్ని విషయాలు నిషిద్ధం అగును. ఎందుకనగా అతడు ఒక ఆరాధనలో ప్రవేశించాడు. అతనిపై క్రింది విషయాలు నిషిద్ధం:
1- తల వెంట్రుకలు మరియు శరీర వెంట్రుకలు తీయడం నిషిద్ధం. కాని అవసరమున్నప్పుడు మెల్లగా తల గోకుట నేరం కాదు.
2- గోళ్ళు తీయుట నిషిద్ధం. కాని గోరు విరిగినా, నొప్పి ఉన్నా దానిని తీయుట పాపం కాదు.
3- సుగంధం మరియు సువాసన సబ్బుల ఉపయోగం నిషిద్ధం.
4- సంభోగం మరియు దానికి సంబంధించిన విషయాలు నిషిద్ధం. ఉదా: పెళ్ళి చేసుకొనుట, చేయించుట, భార్యభర్తల సరసాలడడం వగైరా.
5- చేతులలో గ్లౌసులు వేసుకొనుట నిషిద్ధం.
6- వేటాడుట నిషిద్ధం.
పై ఆరు విషయాలు స్త్రీ పురుషులందరిపై నిషిద్ధం. ఇక ప్రత్యేకంగా పురుషులపై నిషిద్ధం ఉన్న విషయాలు దిగువ తెలుపబడుతున్నవి.
1- కుట్టిన బట్టలు ధరించడం నిషిద్ధం. కాని అవసరముంటే బెల్ట్, గడియారం మరియు కళ్ళ జోళ్ళు ఉపయోగించవచ్చును.
2- తలకు అంటుకొని ఉండే ఏదైనా వస్తువు ఉప- యోగించడం నిషిద్ధం. కాని అంటుకొని ఉండని గొడుగు, వాహణము మరియు గుడారాలు లాంటివి ఉపయోగించడం యోగ్యం.
3- మేజోళ్ళు తొడుగుట నిషిద్ధం. కాని సైండిల్ మరియు చెప్పులు లేనప్పుడు మడమలు కనబడే బూట్లు ఉపయోగించ వచ్చును.
పై నిషిద్ధ కార్యాలు చేసినవాని 3 స్థితులు:
1- అకారణంగా చేసిన వ్యక్తి పాపాత్ముడగును. ఇంకా అతనిపై ‘ఫిద్య’ (ప్రాయశ్చితం) కూడా విధియగును.
2- ఏదైనా అవసరం ఉండి చేసిన వ్యక్తి పాపాత్ముడు కాడు. కాని ప్రాయశ్చితం చెల్లించాలి.
3- ఏదో కారణంగా -ఉదా: తెలియక, మరచి- పోయి, లేదా ఒకరి ఒత్తిడితో నిస్సహాయుడై- చేసిన వ్యక్తి పాపాత్ముడూ కాడు, అతనిపై ప్రాయశ్చితమూ లేదు.
తవాఫ్
ఇతర మస్జిదుల మాదిరిగా మస్జిదె హరాంలో కూడా కుడి కాలుతో ప్రవేశిస్తూ ఈ దుఆ చదవడం ధర్మం. బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అల్లాహుమ్మగ్ ఫిర్లీ జునూబి వఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక.
بِسْمِ الله وَالصَّلاَةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ الله اللَّهُمَّ اغْفِرْلِي ذُنُوبِي وَافْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ
కాబా తవాఫ్ చేయుటకు దానివైపున వెళ్ళాలి.
తవాఫ్: అంటే అల్లాహ్ యొక్క ఇబాదత్ ఉద్దేశ్యంతో కాబా చుట్టున ఏడు సార్లు ప్రదక్షిణం చేయుట. అది హజ్రె అస్వద్ నుండి ప్రారంభించి అక్కడే ముగించాలి. మొదటి మూడిట్లో దగ్గర దగ్గర అడుగులు వేసి పరుగెత్తుట ధర్మం. కాని ఎవరికీ ఇబ్బంది కలగించకూడదు. దీనినే ‘రమ్ల్’ అంటారు. పైన కప్పుకున్న దుప్పటిని కుడి భుజము క్రింది నుండి తీసుకొని ఎడమ భుజముపై వేసుకోవాలి. అంటే కుడి భుజము పైన బట్ట ఉండకూడదు. దీనిని ‘ఇజ్తిబాఅ’ అంటారు. ఇవి రెండు (రమ్ల్, ఇజ్తిబాఅ) ఉమ్రా లేక హజ్ ఉద్దేశ్యంతో మక్కా వచ్చి చేసే తొలి తవాఫ్ లో మాత్రమే చేయాలి. కాబా ఎడమ వైపు ఉండాలి. తవాఫ్ వుజూ స్థితిలో చేయుట తప్పనిసరి. ఇక తవాఫ్ ఈ విధంగా చేయాలి:
1- హజ్రె అస్వద్ వద్దకు వెళ్ళి కుడి చేయితో దానిని ముట్టుకొని బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. వీలవుతే దాన్ని చుంబించాలి. చుంబించడం వీలు కాకుంటే దాన్ని చెయ్యితో ముట్టుకొని చెయ్యిని చుంబించాలి. చెయ్యితో ముట్టుకొనుట కూడా సాధ్యపడకుంటే దాని సూటిగా నిలబడి దాని వైపు చెయ్యితో సైగ చేస్తూ బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. కాని చెయ్యిని చుంబించ- కూడదు. ఇక తవాఫ్ ప్రారంభించాలి. ఇష్టానుసా రం, తన భాషలో తన కొరకు, తను కోరినవారి కొరకు దుఆ చేస్తూ లేదా ఖుర్ఆన్ పారయణం చేస్తూ ఉండాలి. ఇచ్చట ప్రత్యేకంగా ఏ దుఆ లేదు.
2- రుక్నె యమాని వద్ద చేరుకున్నాక వీలవుతే దాన్ని ముట్టుకుంటూ అల్లాహు అక్బర్ అనాలి. కాని చెయ్యిని చుంబించకూడదు. వీలు కాకుంటే (తవాఫ్ చేస్తూ ఉండాలి). చెయ్యితో సైగ చేయకూడదు. అల్లాహు అక్బర్ అనకూడదు. ఈ రుక్నె యమాని మరియు హజ్రె అస్వద్ మధ్య ఈ దుఆ చదవాలి: రబ్బనా ఆతినా ఫిద్దున్ యా హసనతౌఁ వఫిల్ ఆఖిరతి హసనతౌఁ వఖినా అజాబన్నార్.
3- హజ్రె అస్వద్ వద్ద చేరుకొని దాన్ని చెయ్యితో ముట్టుకుంటూ, వీలు కాకుంటే దాని వైపు చెయ్యితో సైగ చేస్తూ అల్లాహు అక్బర్ అనాలి.
ఈ విధంగా ఏడు ప్రదక్షిణాల్లో ఒకటి పూర్తయింది.
4- మిగితవి మొదటి దాని లాగే చేస్తూ, హజ్రె అస్వద్ చేరుకున్నప్పుడల్లా మరియు ఏడవది పూర్త-యిన తరువాత కూడా అల్లాహు అక్బర్ అనాలి.
తవాఫ్ తరువాత
తవాఫ్ తరువాత మఖామె ఇబ్రాహీం వెనక – అనగా అది తనకు మరియు కాబాకు మధ్యలో ఉన్నట్లుగా- నిలబడి రెండు రకాతుల నమాజు చేయుట ధర్మం. నమాజు చేస్తున్నప్పుడు దుప్పటి రెండు భుజాలపై ఉండుట తప్పనిసరి. ఏ ఒక్క భుజము నగ్నంగా ఉండకుడదు. మొదటి రకాతులో సూరె ఫాతిహా తరువాత ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ రెండవ రకాతులో సూరె ఫాతిహా తరువాత ఖుల్ హువల్లాహు అహద్ చదవాలి. జనసమ్మర్థంలో దాని వెనక నమాజ్ చేయుట సాధ్యపడకుంటే మస్జిదె హరాంలో ఏక్కడైనా చేయవచ్చును.
సఈ
ఇక ‘మస్అ’ (సఫా, మర్వాల మధ్యలో ‘సఈ’ చేసే స్థలం) వైపుకు వెళ్ళి సఫా దగ్గరికి చేరుకుంటూ “ఇన్నస్సఫా వల్ మర్వత మిన్ షఆఇరిల్లాహ్” చదివాలి. సఫా కొండపై ఎక్కి కాబా దిశలో నిలబడి చేతులు ఎత్తి అల్లాహ్ స్తోత్రము పఠించి, ఈ దుఆ మూడు సార్లు చదవాలి. దాని మధ్యలో రెండు సార్లు తనిష్టానుసారం దుఆ చేసుకోవాలిః లాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లాషరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యుహ్ యీ వ యుమీతు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ అంజజ వఅదహూ వనసర అబ్దహూ వహజమల్ అహ్ జాబ వహ్దహూ.
ఆ తరువాత సఫా నుండి దిగి మర్వా వైపు నడవాలి. పచ్చరంగు స్తంభం వద్దకు చేరినప్పుడు శక్తి ప్రకారం పరుగుతీయడం ధర్మం. ఇలా రెండవ పచ్చరంగు స్తంభం వరకు. ఇతరులకు బాధ కలిగించకూడదన్న షరతును మరవవద్దు. ఈ పరుగు పురుషులకే ప్రత్యేకం. స్త్రీలకు దీని అనుమతి లేదు. మర్వా చేరుకొని దానిపై ఎక్కి ఖిబ్లా దిశలో నిలబడి చేతులు ఎత్తి సఫాపై చేసినటువంటి దుఆ చెయ్యాలి. అయితే మన భాషలో మనకిష్టమున్న దుఆ కూడా చేసు కోవాలి. ఇక్కడికి ఏడిట్లో ఒకటి పూర్తయింది. మిగిత ఆరు ఇలాగే పూర్తి చేయాలి. ప్రతీ సారి సఫా మరియు మర్వాల వద్ద దుఆ చేయాలి. పచ్చ రంగు స్తంభాల మధ్య పరుగుతీయాలి. సఈ మధ్యలో దుఆ ఎక్కువగా చేయాలి. ఏడిట్లో ప్రతీ ఒక దానికొక వేరు దుఆ అంటూ ప్రవక్తతో రుజువు లేదు. (సఫా నుండి మర్వా వరకు ఒకటి. మర్వా నుండి సఫా వరకు రెండు పరుగులగును. ఇలా మొదటి పరుగు సఫా నుండి మొదలై ఏడవ పరుగు మర్వాపై ముగియును).
సఈ తురవాత శిరోముండనం చేయించు- కోవాలి. ఇందులో ఎక్కువ పుణ్యం ఉంది. కటింగ్ కూడా చేయించుకోవచ్చు. ఇక ఇహ్రామ్ దుస్తులు తీసి ఉమ్రా ముగించాలి. ఇహ్రామ్ కు సంబంధిం- చిన నిషిద్ధతలు ఇక ముగించాయి.
అర్కానె ఉమ్రా
1- ఇహ్రామ్.
2- తవాఫ్.
3- సఈ.
ఇందులో ఏ ఒక్క రుకున్ వదలినా తిరిగి అది చేయనంత వరకు ఉమ్రా నెరవేరదు.
వాజిబాతె ఉమ్రా
1- మీఖాత్ నుండి ఇహ్రామ్ చేయుట.
2- శిరోముండనం.
వీటిలో ఏ ఒక్కటి వదలినా అతనిపై దమ్ విధి అవుతుంది. అంటే ఒక మేక జిబహ్ చేసి లేదా ఒంటె మరియు ఆవులోని ఏడిట్లో ఒక భాగం హరమ్ లో ఉండే బీదవాళ్ళకు దానం చేయాలి.
అల్లాహ్ మనందరికి ప్రవక్త చూపిన పద్ధతిలో ప్రతి ఆరాధన చేసే భాగ్యం ప్రసాదించుగాక! ఆమీన్
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన జేష్ఠ పుత్రుడైన ఇస్మాయీల్ ను, సతీమణి అయిన హజ్రత్ హాజిరా అలైహస్సలాం ను కాబా ఎగువ భాగాన వదలివెళ్లిన తర్వాత ఉన్న ఆ కాసిన్ని ఖర్జూరాలు, నీళ్ళూ అయిపోయాయి. ఏ ప్రాణి నివసించని ఆ రాతి నేలలో తీవ్రమయిన దాహంతో నాలుక పీక్కుపోయింది. చివరికి పసికందుని తాపించేందుకు పాలు కూడా లేకుండా ఇంకిపోయాయి. ఏం చేయాలో, ఎలా దాహం తీర్చుకోవాలో, ఏ విధంగా బాలుడ్ని రక్షించుకోవాలో తోచని అయోమయ స్థితిలో పడిఉన్నారు హజ్రత్ హాజిరా అలైహస్సలాం.
అయినా తాను నిరాశ చెందలేదు. నిస్పృహకు లోనవ్వలేదు. తమ వంతు కృషి ప్రారంభించారు. ఒకసారి సఫా కొండపైకి ఎక్కి చూస్తే, మరోసారి మర్వా కొండపైకెక్కి ‘నీళ్ళు లభించే మార్గం దొరక్కపోతుందా!’ అని ఎదురు చూపులు చూస్తున్నారు. ఇలా సఫా నుండి మర్వా వరకు, మర్వా నుండి సఫా వరకు ఏడు సార్లు దౌడు తీశారు హజ్రత్ హాజిరా అలైహస్సలాం చివరికి మర్వా కొండపై ఉండగా ఏదో అలికిడి …! ఏమై ఉంటుందా…!! అని బాల ఇస్మాయీల్ వద్దకు చేరుకున్నారు. పసికందు మండుటెండల్లో భరించలేని ఆకలితో అల్లాడిపోతున్నాడు పాపం! అప్పుడే దైవదూత ప్రత్యక్షమై తన రెక్కలతో నేలలో రాజేయంగా చుక్క నీరు కూడా లభ్యం కాని ఆ నల్లరాతి నేల నుండి జలనిధి పెల్లుబికింది. హజ్రత్ హాజిరా అలైహస్సలాం గారు ముందు బాల ఇస్మాయీల్ దాహాన్ని తీర్చి తర్వాత తానూ దాహం తీర్చుకున్నారు. తన అన్వేషణ ఫలించినందుకు, తన శ్రమకు మించిన వరాన్ని అల్లాహ్ అనుగ్రహించినందుకు దైవానికి మనసారా కృతజ్ఞతాభివందనలు తెలుపుకున్నారు.
జమ్ జమ్ పేరు ఎలా పడింది?
ఆ పిదప పారే ఆ జలనిధిని చూసి “ఇది ఇలానే పారుతూ ఉంటే అతి తొందరగా అంతమైపోతుంద”ని భావించి, దాని చుట్టూ మట్టితో గట్టు వేస్తూ ఈ జలనిధిని ఎలాగైనా కాపాడుకోవాలన్న తీవ్ర తపనతో ఆమె నోట అప్రయత్నంగా వెలువడిన అమృత వాక్కు ‘జమ్ జమ్’ (అంటే అప్పటి భాషలో ఆగిపో, ఆగిపో అని అర్ధం). ఆ చిన్నపాటి గట్టులో ఆ మహత్తర జలనిధిని ఆపే శక్తి లేకపోయినా ఆమె నోట అపూర్వ విశ్వాసంతో వెలువడిన పలుకు మహిమతో ఆ జలం జలనిధిగా ఓ చోట నిలిచిపోయింది. అదే జమ్ జమ్ బావిగా ప్రసిద్ధి చెందింది.
ఓ సందర్భాన దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ ఇస్మాయీల్ తల్లిని కరుణించుగాక! ఆమె గనక ఈ జలనిధికి గట్టు వేసి ఆపి ఉండకపోతే ప్రళయం వరకూ జమ్ జమ్ జలం పారే సెలయేరయ్యేది.”
జమ్ జమ్ జల నిధి
జమ్ జమ్ బావి స్వర్గపు సెలయేర్లలోని ఓ సెలయేరు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కా కోసం చేసిన దుఆ తర్వాత అల్లాహ్ అనుగ్రహించి ప్రసాదించిన తొలి బహుమతి ఈ జలం. మక్కా అంతటి పవిత్ర నగరం ఉనికిలోకి రావడానికి, జనవాహినితో, దైవదాసుల రాకపోకలతో అలరారడానికి కారణమయ్యింది ఈ మహత్తర జలం. కొన్ని వేల సంవత్సరాలుగా లభ్యమవుతున్న అల్లాహ్ మహిమ ఈ జలం. ఇహలోకంలో దైవ సూచనల్లోని ఓ సూచన ఈ జలం. ఇక్కడికి వచ్చే ప్రతీ యాచకుడు, ప్రతీ బాటసారి తనివితీరా సేవించే అద్భుత ద్రవం ఈ జలం. ఇంతటి మధురమైన నీరు లోకంలో మరో చోట లేదు. ఈ నీటిలో గొప్ప శుభం ఉంది. అది త్రాగే ప్రతీ వారికి ప్రాప్తమవుతుంది. పరిశుద్ధాత్మ అయిన దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా ఉనికిలోకి వచ్చిన అనంత జల సంపద ఈ జమ్ జమ్. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయం పలుమార్లు ఈ పవిత్ర జలంతో కడగబడింది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం నుండి అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం వరకు వచ్చిన ప్రవక్తలందరూ త్రాగాలని తహతహలాడిన జలం జమ్ జమ్. ఏ జలానికీ లేని ప్రత్యేకత ఈ జలానికి ఏమిటంటే – ఇది ఆకలి గొన్న వ్యక్తి ఆకలిని తీరుస్తుంది, రోగాన్ని నయం చేస్తుంది, తలనొప్పి, కడుపునొప్పికి ఇది దివ్య ఔషధం. ఈ జలం వల్ల కoటి చూపు మెరుగవుతుంది. అందుకే దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ప్రవచించారు: “మావు జమ్ జమ్ లిమా షరిబ లహూ” (ఏ సదుద్దేశంతో జమ్ జమ్ త్రాగుతారో వారి ఆ ఉద్దేశం సిద్ధిస్తుంది).
జమ్ జమ్ విశేషాలు
ఈ జలాన్ని కడుపు నిండా త్రాగటం విశ్వాసానికి చిహ్నం. కాపట్యానికి విరుగుడు. ఇది పుణ్యాత్ముల కోసం మహోన్నత పానీయం. బంధు మిత్రుల కోసం గొప్ప బహుమానం. అతిథుల అతిథ్యం కోసం అద్వితీయ ద్రవ పదార్థం. శరీరానికి శక్తినీ, హాయినీ ఇచ్చే అద్భుత వరప్రసాదం. ఎంత వాడినా అది తరగదు. దాదాపు నాలుగు వేల సంవత్సరాల నుండి ఈ జలం ఇలానే నిర్విరామంగా పెల్లుబుకుతూనే ఉంది. ప్రస్తుతం యావత్ ప్రపంచంలో అతి ప్రాచీనమైన బావి ఇదేనన్న నానుడీ ఉంది.
జమ్ జమ్ సేవించే సున్నత్ విధానం
జమ్ జమ్ జలాన్ని సేవించే సున్నత్ విధానం; ఈ జలాన్ని కుడి చేత్తో బిస్మిల్లాహ్ అని త్రాగాలి. ఈ శుభప్రదమైన జలాన్ని నిలబడి త్రాగటం ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వారి సంప్రదాయం. తనివితీరా ఈ జలాన్ని త్రాగాలి. త్రాగే ముందు మంచి సంకల్పం చేసుకొని మరీ త్రాగాలి. త్రాగిన తరువాత కృతజ్ఞతగా ‘అల్ హందులిల్లాహ్’ అనాలి. ఈ జలాన్ని కనీసం మూడు శ్వాసల్లో త్రాగాలి. ఈ జలాన్ని సేవించిన పిదప ఇహపరాల సాఫల్యం, సౌభాగ్యం, శుభం కోసం దుఆ చేయాలి. ఆ సమయంలో చేసే ఏ మంచి దుఆ అయినా స్వికరించబడుతుంది.
జమ్ జమ్ జలం త్రాగే ఓ సౌభాగ్యవంతుడా!
శుభాకాంక్షలు!!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
హజ్యాత్రికులకోసంకొన్నిముఖ్యసూచనలు
1. కేవలంఅల్లాహ్కోసమేమీసంకల్పాన్నినిశ్చయించుకోవటం.
ఉమ్రా లేక హజ్ యాత్ర కేవలం అల్లాహ్ కోసమే చేస్తున్నామని దృఢసంకల్పం చేసుకోవలెను. ఈ పుణ్యయాత్రలో వెచ్చించే సమయానికి, సంపదకు, శారీరక ప్రయాసలకు ప్రసాదించబడే ప్రతిఫలితం మీ సంకల్పంలోని చిత్తశుద్ధి మరయు అల్లాహ్ ను మెప్పించే మీ ప్రయత్నంలోని దైవసమర్పణ, భయభక్తుల పై ఆధారపడి ఉంటుంది. దివ్యఖుర్ఆన్ లో సూరహ్ బఖరా 2:197 లో అల్లాహ్ హజ్ యాత్రికులను ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు – ‘హజ్యాత్రకుప్రయాణసామగ్రినితీసుకువెళ్ళండి. భయభక్తులుఅన్నింటికంటేఉత్తమమైనసామగ్రి’. ఇంకా ఇదే వచనంలో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు ‘అరఫాత్నుండిబయలుదేరి, మష్అఁరెహరామ్వద్దఆగి, అల్లాహ్నుస్మరించండి. అల్లాహ్మీకుహితోపదేశంచేసినవిధంగాఆయననుధ్యానించండి’. చేసిన పాపాల గురించి పశ్చాత్తాపం, తౌబా (క్షమాపణ వేడుకోవటం), అల్లాహ్ ధ్యానం, నమాజు, ఖుర్ఆన్ పఠనం, ఇంకా మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని అల్లాహ్ తప్పక చూస్తున్నాడని జ్ఞాపకం ఉంచుకోవటం, మరియు తోటివారికి కష్టం, నష్టం కలిగించకుండా సహనంతో , ఓర్పుతో మెలగటం, వీలయినంత ఎక్కువగా సహాయసహకారాలు అందించటం మొదలైన వాటిని మీరు అత్యుత్తమైన విధంగా ఆచరించటానికి ప్రయత్నించవలెను. సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథంలోని ‘హజ్జె మబ్రూర్ (అంటే సున్నత్ ప్రకారం చేసిన హజ్) వలన గతంలో చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి’ అనే ముఖ్యవిషయం తప్పక గుర్తుంచుకోవలెను. కాబట్టి హజ్ యాత్రను చాలా జాగ్రత్తగా, ప్రతి అడుగు అల్లాహ్ స్వీకరించే విధంగా వేయవలెను. ప్రతి మాట అల్లాహ్ మెచ్చే విధంగా పలక వలెను. అల్లాహ్ యొక్క ధ్యానం, ఆయా ఆరాధనా పద్ధతులతో పాటు ఇతరులకు ఎటువంటి కష్టం కలిగించకుండా హజ్ యాత్ర పూర్తి చేయటానికి మనస్పూర్తిగా ప్రయత్నించవలెను.
ప్రతి ఒక్కరు హజ్ యొక్క షరతులు మరియు తప్పని సరిగా ఆచరించవలసిన ఆచరణలు, హజ్ యొక్క మూలస్థంభాలు మరియు సున్నత్ విధానములు పూర్తిగా నేర్చుకుని అల్లాహ్ ఆదేశించిన ఈ ఆరాధనను సరైన జ్ఞానంతో ఉత్తమంగా నెరవేర్చటానికి ప్రయత్నించవలెను. హజ్ గురించి తెలుసుకునే అన్ని సౌకర్యాలు ఉన్నా, స్వయంగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా, అజ్ఞానంతోనే ఏదో విధంగా పూర్తిచేయాలనుకోవటం ఎంతటి అవివేకం. అజ్ఞానం వలన చేయవలసిన ఆచరణలు వదిలివేయటం లేక చేయకూడని పనులు చేయటం ద్వారా తప్పులు జరిగి, పాపములు జరిగి, హజ్ నిర్వీర్యం కావటానికి అవకాశం ఉన్నది. పూర్వకాలంలోను మరియు ప్రస్తుత కాలంలోను అనేక మంది ఇస్లామీయ పండితులు (ఉలేమాలు) హజ్ యాత్ర గురించి వివరంగా వ్రాసిన అనేక పుస్తకములు వివిధ భాషలలో మనకు అందుబాటులో ఉన్నాయి. హజ్ యాత్రికులు వీటిని చదవ వలెను. ఏదైనా విషయం అర్థం కాకపోతే, పండితులను(ఉలేమాలను) లేక జ్ఞానవంతులను సంప్రదించి తెలుసుకోవలెను.
3. పాపములనుండిక్షమాపణవేడుకోవటం (తౌబాచేయటం)
దివ్యఖుర్ఆన్ సూరహ్ అత్ తహ్రీమ్ 66:8 – అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు – “ఓవిశ్వసులారా! చిత్తశుద్ధితోక్షమాపణవేడుకుంటూఅల్లాహ్వైపుకుమరలండి”
నిజమైన తౌబా (అంటే పశ్చాత్తాపంతో కూడిన క్షమాపణ) యొక్క చిహ్నాలు:-
ü చెడు పనున్నింటినీ మరియు పాపములన్నింటినీ వదిలివేయటం.
ü చేసిన చెడు పనుల మరియు పాపముల గురించి చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడటం.
ü మరల అటువంటి చెడు పనులు, పాపములు తిరిగి చేయకుండా దృఢంగా నిర్ణయించికోవటం.
ü ఇతరులకు చెందిన సంపద, గౌరవమర్యాదలు..మొదలైన వాటిని తిరిగి వారికి అప్పగించడం.
ü హజ్ యాత్ర ఖర్చుల కోసం ధర్మబద్ధమైన (హలాల్) సంపాదనను ఎన్నుకోవడం.
ప్రతి ఒక్కరు హజ్ చేయటం కోసం ధర్మబద్ధమైన (హలాల్) పద్ధతి ద్వారా సంపాదించిన ధనాన్ని మాత్రమే ఎన్నుకోవలెను. ఎవరైనా హజ్ యాత్ర పూర్తిచేసినా గాని, ఒకవేళ వారి సంపాదన అధర్మ పద్ధతుల ద్వారా సంపాదించినదైతే, వారి హజ్ స్వీకరించబడినదనటానికి ఎటువంటి గ్యారంటీ లేదు. ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా బోధించారు “ఒకవేళఎవరైనాపవిత్రమైనసంపాదనతోహజ్యాత్రకుబయలుదేరినట్లయితే, వాహనంలోమొదటిఅడుగుపెట్టి‘లబ్బైక్, అల్లాహుమ్మలబ్బైక్’ అనిపలకగానే, ‘లబ్బైక్వశ్శాదిఖ్, మీసామానులుపవిత్రమైనవి, మీవాహనంపవిత్రమైనదిమరియుమీహజ్స్వీకరించబడుతుంది’ అనిఆకాశంనుండిజవాబువస్తుంది.” కానిఒకవేళఎవరైనాఅధర్మపద్ధతిలోసంపాదించినధనంతోహజ్యాత్రకుబయలుదేరినట్లయితే, వాహనంలోమొదటిఅడుగుపెట్టి‘లబ్బైక్, అల్లాహుమ్మలబ్బైక్’ అనిపలకగానే, ‘లాలబ్బైక్వశ్శాదిఖ్, మీసామానులుఅపవిత్రమైనవి, మీవాహనంఅపవిత్రమైనదిమరియుమీహజ్పాపములతోనిండిఉన్నదిమరియుఅదిస్వీకరించబడదు’ అనిఆకాశంనుండిజవాబువస్తుంది.” కాబట్టి హజ్ యాత్ర ఖర్చులకు కేవలం పవిత్రమైన, ధర్మంగా మరియు ఇతరుల హక్కులను ఉల్లంఘించకుండా సంపాదించిన ధనం మాత్రమే వెచ్చించవలెను. హజ్ ప్రయాణం కోసం మంచి నడవడిక గల స్నేహితులను ఎన్నుకోండి. ప్రయాణ సంప్రదాయములు (ఆదాబె సఫర్), ప్రయాణంలో చేసే వివిధ దుఆ (ప్రార్థన) లు ముందుగా తెలుసుకోవలెను. ప్రయాణ ప్రారంభంలో చేయవలసిన ప్రార్థనలు మీకు తెలుపబడును. వాహనం ఎత్తుగా ఉండే ప్రదేశం వైపుకు ప్రయాణించేటప్పుడు ‘అల్లాహ్అక్బర్’ అని, పల్లం వైపుకు ప్రయాణించేటప్పుడు ‘సుభహానల్లాహ్’ అని, దారిలో విరామం కోసం ఆగినప్పుడు ‘అఊదుబికలిమాతిల్లాహిత్తామతమిన్షర్రిమాఖలఖ్’ అంటే ‘అతడేసృష్టించినదుష్టశక్తులబారినుండినేనుపవిత్రమైన,సంపూర్ణమైనఅల్లాహ్యొక్కపదాలద్వారారక్షణవేడుకుంటున్నాను’ అని ప్రార్థించినట్లయితే విశ్రాంతి ప్రదేశాలలో వారికి అల్లాహ్ కృప వలన ఎటువంటి హాని కలుగదు.
4. హజ్ యాత్రికులకు కొన్ని ముఖ్యసూచనలు
1. నమాజు సమయం అయినప్పుడు, వెంటనే చేస్తున్న పని ఆపి, నమాజు కోసం తయారు కావలెను. నమాజును ఆలస్యం చేసే లేక నమాజు ను నిరోధించే ఏ పనిలోను అల్లాహ్ యొక్క శుభాలు ఉండవు.
2. మీ ఖాళీ సమయాలలో, వీలయినంత ఎక్కువగా ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థం చేయటానికి ప్రయత్నించవలెను. మీరు చదివే ప్రతి ఒక్క అక్షరానికి కనీసం 10 పుణ్యాలు ప్రసాదించబడతాయనే హదీథ్ ను మరిచిపోవద్దు.
3. తోటి వారితో మంచిగా ప్రవర్తించండి, ఉత్తమమైన పద్ధతిలో వ్యవహరించండి.
4. ఎటువంటి ప్రయోజనం కలిగించని అనవసర విషయాల గురించిన వాదనలు, ఘర్షణలు చేయవద్దు. దీని వలన మీ అమూల్యమైన దుఆల సమయం వృధా అయిపోతుంది. అల్లాహ్ వీటిని నిషేధించాడు. సూరహ్ బఖరా 2:197 వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు ‘హజ్సమయంలోఅతడుకామచేష్టలకూ, దుష్కార్యాలకూ, ఘర్షణలకూదూరంగాఉండాలి. మీరుచేసేప్రతిపుణ్యకార్యంఅల్లాహ్కుతెలుస్తుంది’. కాబట్టి హజ్ యాత్రకోసం సంకల్పం (నియత్) చేసుకున్న ప్రతి ఒక్కరు, అన్ని విధాల తప్పుడు మాటలను, అశ్లీలపు (బూతు) పదాలను పలుకరాదు. నాలుకను పూర్తిగా అదుపులో ఉంచుకోవలెను. ఏదేని కారణం వలన అల్లాహ్ యొక్క ధ్యానంలో, స్మరణలో నాలుకను బిజీగా ఉంచలేకపోయినా, అనవరపు నిషేధించబడిన మాటలలో దానిని బిజీ చేయవద్దు. కాబట్టి ప్రతి హజ్ యాత్రికుడు అరఫాత్, మీనా, ముజ్దలిఫాలలోని ఈ ఉత్తమమైన సమయాన్ని తమకు ఇహపరలోకాలలో ప్రయోజనం కలిగించే ఇస్లామీయ ధర్మవిషయాలు నేర్చుకోవటంలో, తోటివారికి సహాయ పడటంలో, అల్లాహ్ యొక్క ధ్యానంలో, వివిధ ఆరాధనలలో, ప్రార్థనలలో పూర్తిగా గడపవలెను. హాని కలిగించే విషయాల నుండి, మాటల నుండి, సమయాన్ని వృధా చేయటం నుండి దూరంగా ఉండవలెను.
5. ఇస్లాం ధర్మం ప్రకారం జీవిస్తున్న స్నేహితుడితో హజ్ యాత్ర చేయటానికి ప్రయత్నించండి. తోటివారిలో అటువంటి వ్యక్తిని కనిపెట్టి వారితో ఎక్కువగా ఉండటానికి ప్రయత్నించవలెను.
6. మీకు అందజేయబడిని వివధ ఇస్లామీయ కార్యక్రమముల నుండి ప్రయోజనం పొందటానికి ప్రయత్నించవలెను.
7. మీ గ్రూపులోని ముఅఁల్లిమ్ (బాధ్యులైన వారు) అనుమతి లేకుండా ఆయా ప్రాంతాల నుండి వేరే చోటుకి వెళ్ళవద్దు. మీకు వేరే చోటుకి వెళ్ళవలసిన అవసరం ఏర్పడినట్లయితే, ఆరోగ్యం పాడైతే, అలసిపోతే, మీ గ్రూపు ముఅఁల్లిమ్ (సూపర్ వైజరు)కు వెంటనే తెలియజేయవలెను. దీని వలన మీకు త్వరగా సహాయం అందించటానికి అవకాశం ఉంటుంది.
8. ప్రయాణ సౌలభ్యం కోసం మన కేంద్రం నుండి హజ్ కు వెళ్ళుతున్న వారందరినీ కొన్ని గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూపుకు ఒక్కో ముఅఁల్లిమ్ (సూపర్ వైజర్)ను నియమించటం జరుగుతుంది. మీకు కేటాయించబడిన గ్రూపు పేరు (నెంబరు), ముఅఁల్లిమ్ పేరు, మొబైల్ నెంబరు, మీనాలోని టెంట్ నెంబరు తప్పక గుర్తుంచుకోవలెను. ఒక గ్రూపులోని వారు వేరే గ్రూపువారితో అనుమతి లేకుండా ఎక్కువ సమయం గడపటం నిషేధించబడినది.
9. హజ్ యాత్ర మొదలైనప్పటి నుండి తిరిగి వచ్చేవరకు పొగత్రాగటం (సిగరెట్) పూర్తిగా నిషేధించబడినది. ఒంటరిగా ఉన్నా (బాత్రూమ్ లోనైనా సరే), అందరితో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, తమ తమ టెంట్ లలో ఉన్నా – ఏ సమయంలోను మొత్తం హజ్ యాత్రలో అస్సలు పొగత్రాగరాదు.
10. విశ్రాంతి, విరామ సమయాలలో పూర్తి నిశ్శబ్దాన్ని పాటించవలెను.
11. మీకు ఏదైనా సందేహం కలిగినా, ఏదైనా సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా, మీ గ్రూపుకు బాధ్యత వహిస్తున్న ధర్మ ప్రచారకుడిని (దాయిని) వెంటనే సంప్రదించవలెను. ఇన్షా అల్లాహ్ మీకు సరైన సహాయం ఉత్తమమైన రీతిలో వెంటనే లభిస్తుంది. అలా వీలుపడక పోతే కనీసం మీతో ఉన్న ముఅఁల్లిమ్ (సూపర్ వైజర్) నైనా సంప్రదించ వలెను.
5. క్రిందివిషయాలనుమరచిపోవద్దు.
1. ఇన్షా అల్లాహ్ మన హజ్ ప్రయాణం జిల్ హజ్ నెల 6వతేదీ అంటే 15th Dec 2007, శనివారం నాడు ప్రారంభం కాబోతున్నది.
2. మీతో పాటు ఒరిజినల్ ఇఖామా తో పాటు దాని ఫోటోకాపీ కూడా తీసుకు రావలెను.
3. ఉదయం 11.30 గంటలకు మస్జిదె సుదైరీ, రబువా ప్రచార కేంద్రం దగ్గర తప్పక హాజరు కావలెను.
4. స్వంత బట్టలు, ఇహ్రామ్, బెల్టు, సబ్బు, రబ్బరు చెప్పులు, టూత్ బ్రష్, టూత్ పేష్టు మొదలైన పర్సనల్ వస్తువులు ఒక చిన్న బ్యాగులో సర్దుకుని వెంట తీసుకు రావలెను. దీనిని బస్సు క్రింది భాగంలోని లగేజీ ప్రాంతంలో ఉంచవలెను. ఇంకో ఇహ్రామ్ మరియు బెల్టు మాత్రం వేరే చేతిసంచి (ప్లాష్టిక్) లో బస్సులోని తమ తమ సీటు పై భాగంలో ఉంచవలెను.
5. హజ్ యాత్రకోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన పుస్తకాలు ముందుగానే మీకివ్వబడును. దీనితో పాటు దివ్యఖుర్ఆన్ భావం యొక్క తెలుగు అనువాదం కూడా ఇవ్వబడును.
6. హజ్ లో ఖుర్బానీ ఇవ్వటం కోసం అవసరమైన ధనం మీతో పాటు ఉంచుకో వలెను.
7. మీతో పాటు బ్లాంకెట్లు, పరుపులు తీసుకు రావద్దు. అవసరమైన చోట అందజేయబడును.
8. ప్రతి ఒక్కరు తోటి ప్రయాణికుడికి వీలయినంతగా సహాయసహకారాలు అందజేయటానికి మనస్పూర్తిగా ప్రయత్నించవలెను. వారు కూడా మీలాగే అల్లాహ్ యొక్క గౌరవ అతిథులనే విషయం మరచిపోవద్దు.
6. అత్యంతముఖ్యమైనవిషయం
ఇక్కడ నుండి మా గ్రూపులో బయలుదేరిన హజ్ యాత్రికులందరూ, తిరిగి ఇక్కడకు వచ్చే వరకు ఎట్టిపరిస్థితులలోను ఎటువంటి కారణం వలనైనా సరే, గ్రూపును వదలకూడదు. ఎవరైనా తమ దూరదేశాల నుండి హజ్ కోసం వచ్చిన బంధువులను, స్నేహితులను కలవాలనే ఆలోచనలతో ఉన్నట్లయితే, ఇప్పుడే మాకు తెలియజేయవలెను. మక్కా చేరిన తర్వాత, మా గ్రూపును వదిలి వేరే వారితో గడపటం పూర్తిగా నిషేధించబడినది. ఇది మనందరి శ్రేయస్సుకోసం లాభదాయకం.
హజ్ యాత్రలో ఎక్కువ సమయం స్మరిస్తూ, పలుకుతూ, వింటూ గడిపిన తల్బియా (లబ్బైక్, అల్లాహుమ్మలబ్బైక్, లబ్బైక్లాషరీకలకలబ్బైక్, ఇన్నల్హమ్ద, వన్నేమత, లకవుల్ముల్క్, లాషరీకలక్) లోని లాషరీక లక్ అనే పవిత్ర ప్రవచనాన్ని జీవితాంతం పాటించాలనే దృఢసంకల్పం. ఇక నుండి కేవలం ఒక్క అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ దాస్యం చేయననే తిరుగులేని నిర్ణయం. ఏ చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా ఇక నుండి కేవలం అల్లాహ్ నే వేడుకోవాలనే కృతనిశ్చయం – ఇయ్యాకనాఅఁబుదువఇయ్యాకనస్తయీన్ (కేవలం నిన్నే ఆరాధిస్తాను మరియు సహాయం కోసం కేవలం నిన్నే అర్థిస్తాను) పై అచంచల విశ్వాసం. లబ్బైక్ – అల్లాహుమ్ లబ్బైక్ (హాజరయ్యాము, యా అల్లాహ్ హాజరయ్యాము) – అనే పవిత్ర ప్రవచనాలను అల్లాహ్ కు డైరక్టుగా ఎటువంటి మధ్యవర్తులు (ఇమాములు, ముజావర్లు, పూజారులు) లేకుండా విన్నవించుకుంటున్నామో, హజ్ నుండి మరలి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా సుఖసంతోషాలలో, కష్టనష్టాలలో మన వేడుకోళ్ళను కేవలం అల్లాహ్ కే సమర్పించుకోవాలనే ఏకైక లక్ష్యం. మనల్ని ప్రతి క్షణం గమనిస్తాడనే కఠోర సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకుని, అల్లాహ్ ఇష్టపడే విధంగా మన శేషజీవితాన్ని ఇస్లాం ధర్మం ప్రకారం జీవించాలనే తపన & కృషి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
క్లుప్త వివరణ: ఈ పుస్తకంలో మొత్తం సంవత్సరంలోనే అత్యంత పవిత్ర దినాలైన దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాల ప్రాముఖ్యత, వాటిలో చేయవలసిన శుభకార్యాలు వివరంగా చర్చించబడినాయి.
మొత్తం సంవత్సరంలోని ఇతర దినాల కంటే దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలు ఎలా విభిన్నమైనవి?
కాలాన్ని సృష్టించిన అల్లాహ్ కే సకల ప్రశంసలు చెందును. ఆయనే కొన్ని ప్రత్యేక సమయాలను ఇతర సమయాల కంటే శుభప్రదమైనవిగా మరియు కొన్ని ప్రత్యేక నెలలను, దినాలను, రాత్రులను ఇతర నెలల, దినాల, రాత్రుల కంటే శుభప్రదమైనవిగా చేసెను. ఈ శుభకాలములో తన దాసుల పై అల్లాహ్ చూపుతున్న ప్రత్యేక కారుణ్యం వలన వారి పుణ్యాలు అనేక రెట్లు గుణింపబడును. ఇది వారిని మరిన్ని పుణ్యకార్యాలు చేయటానికి ప్రోత్సహించి, అల్లాహ్ ను ఇంకా ఎక్కువగా ఆరాధించే ఆసక్తిని వారిలో కలిగించును. అలా ఎక్కువ పుణ్యాలు సంపాదించటానికి చేయవలసిన ప్రయత్నాలను ముస్లింలలో పునరుద్ధరించి, తన మరణాన్ని తద్వారా తీర్పుదినాన్ని ఎదుర్కొనటానికి తయారుగా ఉండేటట్లు చేయును.
ఈ ఆరాధనా కాలం అనేక శుభాలను తెచ్చుచున్నది. వాటిలో కొన్ని శుభాలు – తమ తప్పులను, పాపాలను సరిదిద్దుకుని ప్రాయశ్చతం చేసుకునే అవకాశాలు, తమ ఆరాధనలలోని మరియు ధర్మాచరణలలోని కొరతలను, లోపములను భర్తీ చేసుకునే అవకాశాలు. ఈ ప్రత్యేక సమయాలు కొన్ని ప్రత్యేక ఆరాధనలను కలిగి ఉంటాయి. వీటిని మనస్పూర్తిగా, చిత్తశుద్ధితో ఆచరించటం ద్వారా దాసులు తమ ప్రభువైన అల్లాహ్ కు దగ్గరయ్యే అవకాశాన్ని పొందుతారు. ఇంకా అల్లాహ్ తన ఇష్టానుసారం ప్రసాదించే ప్రత్యేక దీవెనలను, కరుణాకటాక్షాలను కూడా పొందుతారు. ఈ ప్రత్యేక నెలలలో, దినాలలో, ఘడియలలో వీలయినన్ని ఎక్కువ ఆరాధనలు చేస్తూ, అధిక పుణ్యాలు సంపాదించటానికి మరియు తన ప్రభువైన అల్లాహ్ సారూప్యాన్ని పొందటానికి గట్టిగా ప్రయత్నిస్తున్న వ్యక్తులే ఇహపరలోకాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతారు. అల్లాహ్ ప్రత్యేక దీవెనల ప్రసరణ వలన, తాము భయంకరమైన నరకాగ్ని జ్వాలల నుండి సురక్షితంగా ఉన్నానని ఆశిస్తూ, సంతోషంతో ఉంటారు. (ఇబ్నె రజబ్, అల్ లతాయిఫ్, p.8)
ప్రతి ముస్లిం తమ జీవితపు విలువను తప్పకుండా గ్రహించవలెను. చనిపోయేలోగా అల్లాహ్ ను సాధ్యమైనంత ఎక్కువగా ఆరాధిస్తూ, అనేక పుణ్యాలు సంపాదించటానికి తీవ్రంగా ప్రయత్నించవలెను. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:
“మరియు మీపై రూఢీ అయినది రానంత వరకు, మీ ప్రభువును ఆరాధించండి.” [సూరహ్ అల్ హిజ్ర్ 15:99] ముఫస్సిరీన్ (ఖుర్ఆన్ వ్యాఖ్యానకర్తలు) ఇలా తెలిపినారు: “రూఢీ అయినది రానంత వరకు అంటే ఖచ్చితమైన, నిస్సందేహమైన మరణము సమీపించనంత వరకు.”
ఆరాధనల కోసం ప్రత్యేకింపబడిన అటువంటి శుభసమయాలలో దిల్ హజ్జ్ మాసంలోని మొదటి పది దినాలు కూడా వస్తాయి. అల్లాహ్ వీటిని సంవత్సరంలోని మిగతా దినాల కంటే ఉత్తమమైనవిగా, ఉన్నతమైనవిగా ఎన్నుకొనెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఉపదేశించిన ఈ హదీథ్ ను వారి సహచరుడైన ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించినారు: “మంచి పనుల (పుణ్యకార్యాల) ను అల్లాహ్ ఎక్కువగా ఇష్టపడే దినాలలో ఈ పది దినాలు కాకుండా వేరే దినాలేమీ లేవు.” అప్పుడు సహచరులు ఇలా ప్రశ్నించారు, “అల్లాహ్ కోసం ధర్మయుద్ధం చేయటం కంటేనా?” వారు ఇలా సమాధానమిచ్చినారు, “అల్లాహ్ కోసం ధర్మయుద్ధం చేయటం కూడా కాదు, అయితే తనను మరియు తన సంపదను అల్లాహ్ కోసం చేసే ధర్మయుద్ధంలో పూర్తిగా సమర్పించుకుని, ఖాళీ చేతులతో మరలి వచ్చినతను తప్ప” (సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథం, 2/457).
ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఇంకో హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: “బలిదానపు (ఖుర్బానీ) పది దినాలలో చేసే పుణ్యకార్యాల కంటే ఎక్కువ విలువైనదీ, ఉత్తమమైనదీ అల్లాహ్ దృష్టిలో మరేదీ లేదు.” అప్పుడు సహచరులు ఇలా ప్రశ్నించినారు, “అల్లాహ్ కోసం చేసే ధర్మయుద్ధం కంటేనా?” (దారిమి గ్రంథం, 1/357; అల్ ఇర్వాలో తెలుపబడినట్లు దీని ఉల్లేఖకుల పరంపర హసన్ వర్గీకరణలోనికి వచ్చును, 3/398).
ఈ పవిత్ర ఉపదేశాలు మరియు ఇటువంటివే ఇతర ఉపదేశాలు సూచిస్తున్న దానిని బట్టి, ‘సంవత్సరంలోని మిగిలిన అన్ని దినాల కంటే ఈ పది దినాలు ఎంతో ఉత్తమమైనవి’ అనటానికి ఎటువంటి సందేహామూ లేదు. ఇవి రమదాన్ నెలలోని చివరి పది దినాల కంటే కూడా ఉత్తమమైనవి. కాని రమదాన్ నెలలోని చివరి పది రాత్రులు తమలో వెయ్యి నెలల కంటే ఉన్నతమమైన లైలతుల్ ఖదర్ అనే రాత్రిని కలిగి ఉండటం వలన ఎంతో ఉత్తమమైనవి. అంటే సంవత్సరం మొత్తం దినాలలో దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలు మిగిలిన అన్ని దినాల కంటే ఎంతో ఉత్తమమైనవి మరియు సంవత్సరం మొత్తం రాత్రులలో రమదాన్ మాసపు చివరి పది రాత్రులు మిగిలిన అన్ని రాత్రుల కంటే. ఈ విధంగా వేర్వేరు వ్యాఖ్యానాల, ఉల్లేఖనల మధ్య సమతుల్యాన్ని, పరిష్కారాన్ని సాధించవచ్చును. (తఫ్సీర్ ఇబ్నె కథీర్, 5/412).
ఈ పది దినాలు ప్రత్యేకమైనవి అనటానికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి:
అల్లాహ్ ఖుర్ఆన్ లో కొన్నిచోట్ల ఆ ప్రత్యేక పది దినాలపై ప్రమాణం చేసియున్నాడు. వేటిపైనైనా ప్రమాణం చేయటమంటే అది వాటి ప్రత్యేకతను, గొప్పతనాన్ని, ప్రయోజనాల్ని సూచిస్తుంది. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ఉషోదయాల ప్రమాణంగా; పది రాత్రుల ప్రమాణంగా” [సూరహ్ అల్ ఫజర్ 89:1-2]. ఇక్కడ ఉషోదయాలంటే దుల్ హజ్జ్ లోని మొదటి పది దినాలని ఇబ్నె అబ్బాస్, ఇబ్నె అజ్జుబేర్, ముజాహిద్, ఇంకా ముందు తరం మరియు తర్వాత తరం వారు అభిప్రాయపడినారు. “ఇదే సరైన అభిప్రాయం.” అని ఇబ్నె కథీర్ తెలిపినారు (తఫ్సీర్ ఇబ్నె కథీర్, 8/413)పైన తెలిపిన సహీహ్ హదీథ్ లలో ఈ పది దినాలను ఇహపరలోకాలలో అత్యుత్తమమైన దినాలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధృవీకరించినట్లు తెలుసుకున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఈ పది దినాల ప్రత్యేకతల మరియు హజ్ యాత్రికులు ఈ సమయంలో పవిత్ర కాబాగృహం దగ్గర చేస్తున్న ప్రత్యేక ఆరాధనల కారణంగా ఈ ఉత్తమ సమయంలో మంచి పనులు, పుణ్యకార్యాలు సాధ్యమైనంత ఎక్కువగా చేయాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను ప్రోత్సహించినారు. ఈ మంచి సమయంలో తస్బీహ్ (“సుభహానల్లాహ్”), తహ్మీద్ (“అల్ హమ్దులిల్లాహ్”) మరియు తక్బీర్ (“అల్లాహ్ అక్బర్”) ఎక్కువగా ఉచ్ఛరించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించినారు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఈ హదీథ్ లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: “తను పుణ్యకార్యాలను అమితంగా ఇష్టపడే దినాలలో ఈ పది దినాలు కాకుండా అల్లాహ్ దృష్టిలో వేరే దినాలేమీ లేవు. కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్), తక్బీర్ (అల్లాహ్ అక్బర్), తహ్మీద్ (అల్ హమ్దులిల్లాహ్) ఉచ్ఛరించవలెను” (అహ్మద్ హదీథ్ గ్రంథం, 7/224; అహ్మద్ షాకిర్ దీనిని సహీహ్ గా వర్గీకరించెను).ఈ పది విశిష్ట దినాలలో యౌమ్ అరఫాహ్ అంటే అరఫాహ్ దినం కూడా ఉన్నది. అల్లాహ్ ఇదే దినమున తన ధర్మాన్ని సంపూర్ణం చేసినాడు. ఈ ఉత్తమ దినమున ఉండే ఉపవాసము రెండు సంవత్సరాల పాపాలను ప్రక్షాళన చేయును. ఈ ఉత్తమ దినాలలో యౌమ్ అన్నహర్ (బలిదానపు దినం అంటే ఖుర్బానీ దినం) కూడా ఉన్నది. ఇది సంవత్సరం మొత్తం దినాలలో అత్యుత్తమమైన దినం మరియు హజ్జ్ దినాలలో అత్యుత్తమమైన దినం. ఈ దినము ఇతర అన్ని దినాల మాదిరిగా కాకుండా ఆరాధనలను ప్రత్యేక పద్ధతిలో ఒక చోటికి చేర్చును. ఈ పది దినాలలో బలిదానపు దినం అంటే ఖుర్బానీ దినం మరియు హజ్జ్ దినాలు కూడా ఉన్నాయి.
ప్రశ్న: ఉద్ హియహ్ (బలిదానం – ఖుర్బానీ) ఇవ్వాలనుకునే వ్యక్తి ఈ పది దినాలలో వేటినుండి దూరంగా ఉండవలెను?
సున్నహ్ ప్రకారం (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాల ప్రకారం) బలిదానం (ఖుర్బానీ) ఇవ్వాలనుకునే వ్యక్తి తన వెంట్రుకలను, గోళ్ళను కత్తిరించడం మరియు తన చర్మం నుండి దేన్నైనా సరే తొలగించడం మొదలైనవి ఈ దిల్ హజ్జ్ పది దినాల ఆరంభం నుండి బలిదానం సమర్పించే వరకు (ఖుర్బానీ చేసే వరకు) మానివేయవలెను. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించి ఉన్నారు: “దిల్ హజ్జ్ యొక్క క్రొత్త నెలవంక చూడగానే, మీలో ఎవరైనా ఉద్ హియహ్ (బలిదానం – ఖుర్బానీ) సమర్పించాలనుకుంటే, అది పూర్తి చేసే వరకు (పశుబలి పూర్తి చేసే వరకు) తన వెంట్రుకలను మరియు గోళ్ళను కత్తిరించడం మానివేయవలెను.” ఇంకో ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినట్లు నమోదు చేయబడినది: “అతను తన వెంట్రుకలు లేక చర్మం నుండి (దానిని అంటిపెట్టుకుని ఉన్న వాటిని) దేనినీ తొలగించకూడదు.” (నలుగురు ఉల్లేఖకులతో సహీహ్ ముస్లిం హదీథ్ గ్రంథంలో నమోదు చేయబడినది, 13/146)
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ ఆదేశాలు ఒక దానిని తప్పని సరిగా చేయమంటున్నాయి (ఖుర్బానీని). ఇంకా వారి యొక్క నిషేధాజ్ఞలు ఇంకో దానిని (వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించటాన్ని) హరామ్ (ఎట్టి పరిస్థితులలోను చేయకూడదు) అని ప్రకటిస్తున్నాయి. సరైన అభిప్రాయం ప్రకారం ఈ ఆదేశాలు మరియు నిషేధాజ్ఞలు బేషరతుగా మరియు తప్పించుకోలేనివిగా ఉన్నాయి. అయితే, ఎవరైనా వ్యక్తి ఈ నిషేధించిన వాటిని కావాలని చేసినట్లయితే, అతను వెంటనే అల్లాహ్ యొక్క క్షమాభిక్ష అర్థించవలెను. అతని బలిదానం(ఖుర్బానీ) స్వీకరించబడును. అంతే కాని దానికి ప్రాయశ్చితంగా అదనపు బలిదానం (ఖుర్బానీ) సమర్పించుకోవలసిన అవసరంలేదు; హాని కలిగిస్తున్న కారణంగా ఉదాహరణకు చీలిపోయిన గోరు బాధపెట్టటం, వెంట్రుకలున్నచోట గాయం కావటం మొదలైన అత్యవసర పరిస్థితుల వలన కొన్ని వెంట్రుకలు లేక గోరు తొలగించవలసి వస్తే, అటువంటి వారు వాటిని తొలగించవచ్చును. అలా చేయటంలో ఎటువంటి తప్పూ, పాపమూ లేదు. ఇహ్రాం స్థితి ఎంతో ముఖ్యమైనదప్పటికీ, వెంట్రుకలు లేక గోళ్ళు వదిలివేయటం వలన హాని కలుగుతున్నట్లయితే, వాటిని కత్తిరించటానికి అనుమతి ఇవ్వబడినది. దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలలో స్త్రీలు గాని, పురుషులు గాని తమ తల వెంట్రుకలను కడగటంలో ఎటువంటి తప్పూ లేదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాాహు అలైహి వసల్లం వాటిని కత్తిరించటాన్నే నిరోధించినారు గాని వాటిని కడగటాన్ని నిరోధించలేదు.
వెంట్రుకలు లేక గోళ్ళు తీయటం పై ఉన్న నిషేధం వెనుక ఉన్న వివేచన ఏమిటంటే బలిదానం సమర్పిస్తున్నతని అల్లాహ్ కు దగ్గర కావాలనుకుని చేస్తున్న ఈ పశుబలి వంటి కొన్ని ధర్మాచరణలు, హజ్జ్ లేక ఉమ్రా యాత్రలో ఇహ్రాం స్థితిలో ఉన్నవారితో సమానం. కాబట్టి వెంట్రుకలు, గోళ్ళు తీయటం వంటి కొన్ని ఇహ్రాం స్థితిలోని నిబంధనలు పశుబలి ఇస్తున్న వారికి కూడా వర్తిస్తాయి. దీనిని పాటించటం వలన అల్లాహ్ అతనిని నరకాగ్ని నుండి విముక్తి చేస్తాడని ఒక ఆశ. అల్లాహ్ యే అత్యుత్తమమైన జ్ఞానం కలిగినవాడు.
ఒకవేళ ఎవరైనా దుల్ హజ్జ్ నెలలోని మొదటి పది దినాలలో ఉదియహ్ (బలిదానం) ఇవ్వాలనే సంకల్పం లేకపోవటం వలన తన వెంట్రుకలు లేక గోళ్ళు తీసి, ఆ తర్వాత ఉదియహ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లయితే, ఆ క్షణం నుండి అతను వెంట్రుకలు లేక గోళ్ళు తీయకుండా ఉండవలెను.
కొందరు స్త్రీలు దుల్ హజ్జ్ లోని మొదటి పది దినాలలో తమ వెంట్రుకలను కత్తిరించుకునేందుకు వీలుగా, తమ బలిదానాన్నిచ్చే బాధ్యతను తమ సోదరులకు లేక కొడుకులకు అప్పగిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే, బలిదానం సమర్పిస్తున్న వారికే ఈ నిబంధన వర్తిస్తుంది – అసలు పశుబలిని పూర్తి చేసే బాధ్యత ఇతరులకు అప్పగించినా, అప్పగించకపోయినా. ఎవరికైతే ఆ బాధ్యత ఇవ్వబడినదో వారికి ఈ నిబంధన వర్తించదు. స్వయంగా ఇష్టపడి ఇతరుల పశుబలి చేస్తున్నా లేక ఇతరులు తమకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేస్తున్నా, అటువంటి వారి పై ఈ నిషేధము వర్తించదు.
ఇంకా, ఈ నిబంధన బలిదానం (ఖుర్బానీ) చేస్తున్నతని పైనే ఉంటుంది గాని అతని భార్యాబిడ్డలకు వారు కూడా వేరుగా బలిదానం(ఖుర్బానీ) చేస్తున్నట్లయితేనే తప్ప వర్తించదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ కుటుంబం తరఫున బలిదానం సమర్పించేవారు కాని వారిని తమ వెంట్రుకలు, గోళ్ళు తీయకుండా ఈ నిబంధనలు పాటించమని ఆదేశించినట్లు ఎక్కడా సాక్ష్యాధారాలు లేవు.
ఎవరైనా బలిదానం(ఖుర్బానీ) సమర్పించాలని నిశ్చయించుకుని, ఆ తర్వాత హజ్జ్ యాత్ర చేయటానికి నిర్ణయించుకున్నట్లయితే, వారు ఇహ్రాం స్థితిలో ప్రవేశించేటప్పుడు వెంట్రుకలు గాని గోళ్ళు గాని తీయకూడదు. ఎందుకంటే ఇహ్రాం స్థితిలో ప్రవేశించేటప్పుడు అవసరమైనప్పుడు వెంట్రుకలు లేక గోళ్ళు తీయటమనేది సాధారణ సమయాలలో మాత్రమే పాటించే ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచారం. కాని ఒకవేళ “తమత్తు” పద్ధతి ప్రకారం హజ్జ్ చేస్తున్నట్లయితే, [ఉమ్రా పూర్తి చేసి, ఇహ్రాం స్థితి నుండి బయటకు వచ్చి, మరల హజ్జ్ కోసం క్రొత్తగా ఇహ్రాం స్థితిలో ప్రవేశించేవారు], ఉమ్రా పూర్తి చేసిన తర్వాత తన వెంట్రుకలను చిన్నగా కత్తిరించకోవలెను. ఎందుకంటే వెంట్రుకలు తీయటమనేది ఉమ్రాలోని ఒక ఆచరణ.
పైన తెలిపిన హదీథ్ లో బలిదానం(ఖుర్బానీ) ఇచ్చేవారికి వర్తించే నిబంధనలన్నీ తెలియజేయబడినవి. సుగంధద్రవ్యాల వాడకంలో లేక భార్యతో సంభోగం చేయటంలో లేక కుట్టబడిన దుస్తులు ధరించటంలో ఎటువంటి నిషేధాజ్ఞలు లేవు. అల్లాహ్ కే ప్రతిదీ తెలియును.
ఈ పది దినాలలో ఆచరించవలసిన ఆరాధనా పద్ధతులు: అల్లాహ్ తరఫు నుండి ఈ పది దినాలు తన దాసుల వైపునకు ఒక గొప్ప దీవెనగా గ్రహించవలెను. మంచి పనులలో, శుభకార్యాలలో, దానధర్మాలలో చైతన్యవంతంగా, క్రియాత్మకంగా పాల్గొనటం ద్వారా వీటికి విలువనిచ్చినట్లగును. ఈ దీవెనకు తగిన ప్రాధాన్యతనివ్వటం ముస్లింల కనీస బాధ్యత. పూర్తి ఏకాగ్రతతో, వివిధ దైవారాధనలలో ఎక్కువ సమయం గడపటానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఈ పది దినాలలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించటానికి స్వయంగా తనను తాను అంకితం చేసుకోవలెను. మంచి పనులు చేయటానికి మరియు వివిధ ఆరాధనలు చేయటానికి ప్రసాదించబడిన రకరకాల అవకాశాలు కూడా అల్లాహ్ తన దాసులపై అవతరింపజేసిన ప్రత్యేక దీవెనలలోనికే వస్తాయి. ఈ శుభకార్యాల ద్వారా ముస్లింలు ఎల్లప్పుడూ చైత్యవంతంగా, క్రియాత్మకంగా మరియు నిరంతరాయంగా తమ అల్లాహ్ ను ఆరాధించటానికి అవకాశం ఉన్నది.
దిల్ హజ్జ్ మాసపు మొదటి పది పవిత్రదినాలలో ముస్లింలు ఆచరించటానికి ప్రయత్నించవలసిన కొన్ని మంచి పనులు:
ఉపవాసం. దిల్ హజ్జ్ 9వ తేదీన ఉపవాసం ఉండటమనేది ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఆచరించి మార్గదర్శకత్వం వహించిన ఆచరణలలోనిది. ఈ శుభసమయంలో మంచి పనులు చేయవలెనని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించి ఉన్నారు. మరి, ఉపవాసమనేది పుణ్యకార్యాలలో ఒక మహోన్నతమైన పుణ్యకార్యం కదా. సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథపు ఒక హదీథ్ ఖుద్సీలో ఉపవాసాన్ని తను ఎన్నుకున్న ఆరాధనగా అల్లాహ్ ప్రకటించెను: “అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: ‘ఒక్క ఉపవాసం తప్ప, ఆదం సంతానపు పుణ్యకార్యాలన్నీ వారి కోసమే. అది మాత్రం నా కోసం. మరియు దాని ప్రతిఫలాన్ని నేను స్వయంగా అతనికి ప్రసాదిస్తాను.'”ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దిల్ హజ్జ్ మాసపు 9వ రోజున ఉపవాసం ఉండేవారు. హునైదహ్ ఇబ్నె ఖాలిద్ తన భార్య ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొందరు భార్యలు ఇలా పలికినారని ఉల్లేఖించెను: ” ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 9వ దిల్ హజ్జ్ దినమున, అషూరహ్ దినమున, ప్రతి నెల మూడు దినములలో మరియు ప్రతి నెల మొదటి రెండు సోమవారాలు మరియు గురువారాలు ఉపవాసం ఉండేవారు.” (అన్నిసాయి హదీథ్ గ్రంథం, 4/205 మరియు అహూ దావూద్ హదీథ్ గ్రంథం; సహీహ్ అబి దావుద్ గ్రంథంలో, 2/462 దీనిని సహీహ్ హదీథ్ గా షేఖ్ అల్ బానీ వర్గీకరించెను.) తక్బీర్. దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలలో తక్బీర్ (“అల్లాహు అక్బర్”), తహ్మీద్ (“అల్హమ్దులిల్లాహ్”), తహ్లీల్ (“లా ఇలాహ ఇల్లల్లాహ్”) మరియు తస్బీహ్ (“సుభహానల్లాహ్”) అని బిగ్గరగా ఉచ్ఛరించవలెను. ఇది మస్జిద్ లలో, ఇంటిలో, దారిలో, ఇంకా ఆరాధనలో భాగంగా మరియు అల్లాహ్ యొక్క మహోన్నత్వాన్ని మరియు సార్వభౌమత్వాన్ని ప్రకటించటంలో భాగంగా అల్లాహ్ పేరు స్మరించటానికి మరియు బిగ్గరగా ఉచ్ఛరించటానికి అనుమతింపబడిన ప్రతి చోట ఉచ్ఛరించలెను. పురుషులు దీనిని బిగ్గరగా మరియు మహిళలు నిదానంగా ఉచ్ఛరించవలెను. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:
“వారు తమ కొరకు అక్కడ ఉంచబడిన ప్రయోజనాలను చూసుకోవాలని, అల్లాహ్ వారికి ప్రసాదించబడిన పశువులపై కొన్ని నిర్ణీత దినాలలో ఆయన పేరును స్మరించాలి (అల్లాహ్ పేరుతో బలిదానం చేయాలని) స్వయంగా తినాలి, లేమికి గురి అయిన ఆగత్యపరులకు పెట్టాలి…” [సూరహ్ అల్ హజ్జ్ 22:28]
నిర్ణీత దినాలంటే దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలని మెజారిటీ పండితులు అంగీకరించినారు. ఎందుకంటే ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఒక హదీథ్ లోని పదాలలో “(దిల్ హజ్జ్ మాసపు) మొదటి పది దినాలు నిర్ణీత దినాలని” ఉన్నది.
తక్బీర్ లో “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహ్;వల్లాహు అక్బర్ వ లిల్లాహిల్ హమ్ద్(అల్లాహ్ యే మహోన్నతుడు, అల్లాహ్ యే మహోన్నతుడు, అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడెవరూ లేరు; అల్లాహ్ యే మహోన్నతుడు మరియు సకల స్తోత్రములు అల్లాహ్ కే చెందును)” మరియు ఇలాంటి ఇతర పదాలు కూడా పలక వచ్చును.
తక్బీర్ పలకటమనేది ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణా విధానం. కాని నేటి కాలంలో దీనిని ప్రజలు పూర్తిగా మరచిపోయినారు. ఈ రోజులలో చాలా అరుదుగా అతి కొద్ది మంది మాత్రమే తక్బీర్ పదాలు పలుకు తున్నారు. ఈ తక్బీర్ ను బిగ్గరగా ఉచ్ఛరించ వలెను. దీని ద్వారా నిర్లక్ష్యం చేయబడుతున్న ఒక సున్నహ్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచారాన్ని)ను తిరిగి పునరుద్ధరింపవలసిన అవసరాన్ని గుర్తు చేసినట్లవుతుంది. ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా మరియు అబు హురైరా రదియల్లాహు అన్హు లు దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలలో మార్కెట్ ప్రాంతాలకు వెళ్ళి, అక్కడ బిగ్గరగా తక్బీర్ ఉచ్ఛరించేవారని మరియు వారి తక్బీర్ పలుకులు వినగానే ప్రజలు కూడా బిగ్గరగా తక్బీర్ పలుకులు ఉచ్ఛరించే వారని స్పష్టమైన సాక్ష్యాధారాలతో నమోదు చేయబడినది. ప్రజలను తక్బీర్ పలుకలు ఉచ్ఛరించమని గుర్తు చేయటం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, ప్రతి ఒక్కరూ స్వయంగా తక్బీర్ ఉచ్ఛరించమనేగాని అందరూ కలిసి సమశ్రుతిలో ఒకేసారి తక్బీర్ ఉచ్ఛరించమని కాదు. ఇలా ఒకేసారి అందరూ కలిసి ఒకే గొంతులో ఉచ్ఛరించే విధానానికి షరిఅహ్ లో ఎటువంటి ఆధారం లభించదు.
పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన సున్నహ్ ను అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచారాన్ని మరల పునరుద్ధరించటమనే చర్యకు అనేకమైన పుణ్యాలు లభించును. దీనికి ఆధారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించి ఈ హదీథ్: “ఎవరైతే నా మరణం తర్వాత ప్రజలు మరచిపోయిన నా సున్నహ్ ను (ఆచారాన్ని) తిరిగి పునరుద్ధిరంచారో, వారు ఆ సున్నహ్ ను ఆచరిస్తున్న ప్రజల పుణ్యాలలో ఎటువంటి తగ్గింపూ లేకుండా, వారూ (పునరుద్ధరించినవారూ) అన్ని పుణ్యాలు పొందుతారు.” (అత్తిర్మిథీ హదీథ్ గ్రంథం, 7/443; ఉల్లేఖకుల పరంపర ఆధారంగా ఇది హసన్ హదీథ్ గా వర్గీకరింపబడినది.)
హజ్జ్ మరియు ఉమ్రా యాత్ర చేయటం. ఈ పవిత్ర పది దినాలలో ఎవరైనా చేయగలిగే ఉత్తమ శుభకార్యాలలో అల్లాహ్ యొక్క గృహాన్ని హజ్జ్ యాత్ర కోసం సందర్శించటం. ఎవరికైతే అల్లాహ్ తన పవిత్ర గృహాన్ని సందర్శించే మరియు సరైన పద్ధతిలో అన్ని ఆరాధనలు పూర్తి చేయటానికి సహాయ పడుతున్నాడో వారి ఔన్నత్యాన్ని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీథ్ ఇలా ప్రకటించినారు: “స్వీకరింపబడిన హజ్జ్ యాత్ర తెచ్చే పుణ్యఫలం స్వర్గం కంటే తక్కువ ఉండదు.”మంచి పనులు అధికంగా చేయటం. ఎందుకంటే అల్లాహ్ కు మంచి పనులంటే ఇష్టం మరియు అవి అల్లాహ్ నుండి అమితమైన పుణ్యాలను సంపాదించి పెట్టును. ఎవరైతే హజ్జ్ యాత్రకు వెళ్ళలేక పోయారో, వారు ఈ పవిత్ర సమయంలో అల్లాహ్ ధ్యానంలో, ప్రార్థనలలో, నమాజలలో, ఖుర్ఆన్ పఠనంలో, అల్లాహ్ ను స్మరించటంలో, దానధర్మాలలో, తల్లిదండ్రులను గౌరవించటంలో, బంధువులతో సంబంధాలు మెరుగు పరచటంలో, సమాజంలో మంచిని ప్రోత్సహించటంలో మరియు చెడును నిరోధించటంలో, ఇంకా ఇతర వివిధ రకాల మంచి పనులు, పుణ్యకార్యాలలో, ఆరాధనలలో మునిగి పోవలెను. ఖుర్బానీ – బలిదానం సమర్పించటం. ఈ పవిత్ర పది దినాలలో ఎవరినైనా అల్లాహ్ కు దగ్గర చేర్చే శుభకార్యాలలో పశుబలి సమర్పించటం, దాని కోసం ఒక ఉత్తమమైన పశువును ఎన్నుకోవటం, దానిని బాగా మేపటం, అల్లాహ్ కోసం ఖర్చు పెట్టటం అనేలి కూడా ఉన్నాయి. చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడటం మరియు క్షమాపణ వేడుకోవటం. ఈ పది పవిత్ర దినాలలో ఎవరైనా చేయగలిగే మంచి శుభకార్యాలలో ఒకటి – తాము చేసిన తప్పులకు, పాపములకు పశ్చాత్తాప పడుతూ, అల్లాహ్ ను చిత్తశుద్ధితో క్షమాపణ వేడుకోవటం. తమలోని అని అవిధేయతా పనులను, పాపపు పనులను, చెడు అలవాట్లను వదిలివేయటానికి గట్టిగా నిర్ణయించుకోవటం. పశ్చాత్తాపపడటమంటే అల్లాహ్ వైపునకు తిరిగి మరలటం మరియు అల్లాహ్ ఇష్టపడని అన్ని తప్పుడు పనులను అవి రహస్యమైనవైనా లేక బహిరంగమైనవైనా సరే వదిలివేయటం. ఏ పాపాలైతే జరిగి పోయినవో, వెంటనే వాటిని పూర్తిగా వదిలి వేసి, మరల వాటి వైపు మరలమని గట్టిగా నిశ్చయించుకుని, అల్లాహ్ ఇష్టపడే పుణ్యకార్యాలనే మనస్పూర్తిగా చేయటానికి ప్రయత్నించ వలెను.
ఒకవేళ ఎవరైనా ముస్లిం పాపం చేసినట్లయితే, ఆలస్యం చేయకుండా వెనువెంటనే పశ్చాత్తాప పడవలెను. దీనికి మొదటి కారణం చావు ఏ క్షణాన వస్తుందో ఎవరికీ తెలియక పోవటం. రెండోది ఒక పాపపు కార్యం ఇంకో పాపపు కార్యానికి దారి చూపుతుందనే వాస్తవ అనుభవం.
ప్రత్యేక సమయాలలో పశ్చాత్తాపపడటం, అల్లాహ్ ను క్షమాపణ వేడుకోవటంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే ఆయా శుభసమయాలలో ప్రజల ఆలోచనలు ఆరాధనల వైపునకు మరలి, మంచి పనులు చేయాలనే ఆసక్తి కలిగి, తమలోని తప్పులను, పాపాలను గుర్తించటానికి దారి చూపును. తద్వారా వారిలో గతం గురించిన పశ్చాత్తాప భావనలు కలుగును. పశ్చాత్తాప పడటమనేది అన్ని సమయాలలోనూ తప్పని సరియే. కాని, ఒక ముస్లిం అత్యంత శుభప్రదమైన దినాలలో మంచి పనులతో పాటు, ఆరాధనలతో పాటు పశ్చాత్తాపాన్ని జత పరచటమనేది అల్లాహ్ ఆమోదిస్తే (ఇన్షాఅల్లాహ్) సాఫల్యానికి చిహ్నమగును. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “కాని, ఎవరు ఇక్కడ పశ్చాత్తాప పడతాడో, విశ్వసించి మంచి పనులు చేస్తేడో, అతడు అక్కడ సాఫల్యం పొందే వారి మధ్య ఉండగలను అని ఆశించగలుగుతాడు.” [సూరహ్ అల్ ఖశశ్ 28:67]
సమయం త్వరత్వరగా గడిపోతుండటం వలన, ఈ ముఖ్యసమయాలలోని శుభాలను ముస్లింలు కోల్పోకుండా చూసుకోవలెను. తనకు అవసరమైనప్పుడు పనికి వచ్చేవి మంచి పనుల ద్వారా సంపాదించుకున్న పుణ్యాలే. ఎన్ని పుణ్యాలున్నా సరే, అక్కడి అవసరాలకు చాలవు. కాబట్టి ఇలాంటి శుభసమాయలలో అధిక పుణ్యాలు సంపాదించుకుంటూ, రాబోయే సుదీర్ఘ ప్రయాణానికి స్వయంగా తయారు కావలెను. ఏ క్షణంలో బయలుదేరటానికైనా సరే సిద్ధంగా ఉండవలెను. గమ్యస్థానం చాలా దూరంగా ఉన్నది. ఏ ఒక్కరూ తప్పించుకోలేని సుదీర్ఘ ప్రయాణము భయభ్రాంతుల్ని కలిగిస్తున్నాయి. మోసం, దగా, వంచన నలుమూలలా వ్యాపించి ఉన్నాయి. కాని, అల్లాహ్ ప్రతి క్షణాన్ని గమనిస్తున్నాడు. ఆయన వైపునకే మనము మరల వలసి ఉన్నది మరియు ఆయనకే మన కర్మలు సమర్పించవలసి ఉన్నది. దీని గురించి దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “కాబట్టి ఎవరైతే అణువంత మంచిని చేసారో, వారు దానిని చూస్తారు. మరియు ఎవరైతే అణువంత చెడును చేసారో, వారు దానిని చూస్తారు.” [సూరహ్ అజ్జల్ జలాహ్99:7-8]
కూడగట్ట వలసిన పుణ్యఫలాలు చాలా ఉన్నాయి. కాబట్టి విలువ కట్టలేని మరియు ప్రత్యామ్నాయం లేని ఈ పది శుభదినాలలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవలెను. చావు సమీపించక ముందే, సరైన సమయంలో ప్రతిస్పందించక, మంచి అవకాశాన్ని చేజార్చుకోక ముందే, ఏ ప్రార్థనలూ స్వీకరించబడని చోటుకు చేరుకోమని ఆదేశింపబడక ముందే, ఆశించుతున్న వానికి మరియు అతను ఆశించిన వాటికి మధ్య చావు అడ్డుపడక ముందే, నీ కర్మలతో సమాధిలో చిక్కుకోక ముందే మంచి పనులు, శుభకార్యాలు చేయటానికి త్వరపడవలెను.
గాఢాంధకారంతో నిండిన హృదయం గలవాడా, నీ హృదయాన్ని వెలుగుకిరణాలతో నింపి, మెత్తపరచే సమయం ఇంకా ఆసన్నం కాలేదా? ఈ పది శుభదినాలలో మీ ప్రభువైన అల్లాహ్ తరఫు నుండి వీస్తున్న చల్లటి దీవెనల ఆహ్లాదాన్ని కోల్పోవద్దు. అల్లాహ్ తను ఇష్టపడిన వారికి ఈ చల్లటి పవనాలు తప్పక స్పర్శించేటట్లు చేస్తాడు. అటువంటి పుణ్యాత్ములు తీర్పుదినాన ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను మరియు వారి కుటుంబాన్ని మరియు వారి సహచరులను అల్లాహ్ మరింతగా దీవించు గాక.
అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్, రివ్యూ: షేఖ్ నజీర్ అహ్మద్
ఇస్లాంహౌస్ వారి సౌజన్యంతో
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.