అల్లాహ్ అర్ష్ నీడలో.. (In the Shade of Allah’s Throne)

shade-of-allah

దైవ సింహాసనపు నీడలో..
పుస్తకం నుండి:  కలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ,
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

English version of this hadeeth:

The Prophet said: “There are seven whom Allah will shade in His Shade on the Day when there is no shade except His Shade: a just ruler; a youth who grew up in the worship of Allah, the Mighty and Majestic; a man whose heart is attached to the mosques; two men who love each other for Allah’s sake, meeting for that and parting upon that; a man who is called by a woman of beauty and position [for illegal intercourse], but be says: ‘I fear Allah’, a man who gives in charity and hides it, such that his left hand does not know what his right hand gives in charity; and a man who remembered Allah in private and so his eyes shed tears.”

Narrated by Abu Hurairah & collected in Saheeh al-Bukhari (english trans.) vol.1, p.356, no.629 & Saheeh Muslim (english trans.) vol.2, p.493, no.2248

కపటుడి చిహ్నాలు (Signs of Hypocrite)

al-munafiqun-telugu-islamహదీథ్׃ 12

علامـــــــــة المـنـــــــــافــــق కపటుడి చిహ్నాలు –

حَدَّثَنَا سُلَيْمَانُ أَبو الرَّبِيعَ قال: حَدَّثَنَا إِسْمَاعِيلُ بْنُ جَعْفَرٍ قَالَ:حَدَّثَنَا نَافِعُ بْنُ مَالِكِ بْنُ أَبِي عَامِرٍ أَبو سُهَيْلٍ عَنْ أَبِيهِ عَنْ أَبِي هُرَيرَة

” عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:آيَةُ المُنَافِقِ ثَلاَثٌ إِذَا حَدَّثَ كَذَبَ، وَإِذَا وَعَدَ أَخْلَفَ، وَإِذَا اُؤْتُمِنَ خَانَ “  رواة صحيح البخاري

హద్దథనా సులైమాను అబు అర్రబీఅ ఖాల హద్దథనా ఇస్మాయీలుబ్ను జాఁఫరిన్ ఖాల హద్దథనా నాఫిఉబ్ను మాలికిబ్ను అబి ఆమిరిన్ అబు సుహైలిన్ అన్ అబీహి అన్ అబీహురైరత అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వ సల్లమ ఖాల   “ఆయతుల్ మునాఫిఖి థలాథున్, ఇదా హద్దథ కదబ, వ ఇదా వఆఁద అఖ్లఫ, వ ఇదా ఉఁతుమిన ఖాన” రవాహ్ సహీ బుఖారి..

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ బుఖారి హదీథ్ గ్రంధంకర్త   ← సులైమాను అబు అర్రబీఅ ← ఇస్మాయీలుబ్ను జాఁఫరిన్ ← నాఫిఉబ్ను మాలికిబ్ను అబి ఆమిరిన్ అబు సుహైలిన్  అబీహి (మాలికిబ్ను అబి ఆమిరిన్ అబు సుహైలిన్) ← అబీహురైరత (రదియల్లాహుఅన్హు) ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు “కపటుడి చిహ్నాలు మూడు”, 1) ఎప్పుడు మాట్లాడినా – అబధ్ధం పలుకుతాడు. 2) మరియు ఎప్పుడు వాగ్దానం చేసినా – దానిని పూర్తి చేయడు. 3) మరియు ఏ వస్తువునైతే అతని దగ్గర నమ్మకంగా ఉంచుతారో – దానిని అతడు నిజాయితిగా తిరిగి ఇవ్వడు. సహీ బుఖారి హదీథ్ గ్రంధం.

హదీథ్ వివరణ

కపటత్వానికి చేర్చే వివిధ విషయాల గురించి ఇస్లాం ధర్మం తీవ్రంగా హెచ్చరిస్తున్నది. చూడటానికి చిన్న చిన్నవిగా కనబడినా అవి కపటత్వం దగ్గరికి చేర్చుతాయి. ఇక్కడ థఅతబ బిన్ హాతిబ్ అల్ అన్సారీ యొక్క వృత్తాంతాన్ని ఒక మంచి ఉదాహరణగా వివరించటం జరిగినది. దివ్యఖుర్ఆన్ లోని సూరతు అత్తౌబా అధ్యాయంలో 77వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –

فَأَعْقَبَهُمْ نِفَاقًا فِي قُلُوبِهِمْ إِلَى يَوْمِ يَلْقَوْنَهُ بِمَا أَخْلَفُوا اللهَ مَا وَعَدُوهُ وَبِمَا كَانُوا يَكْذِبُونَ(77)

అనువాదం – “వారు అల్లాహ్ యెడల చేసిన ఈ ప్రమాణభంగం కారణంగా, వారు చెబుతూ వచ్చిన అబద్ధాల కారణంగా, అల్లాహ్ వారి హృదయాలలో కాపట్యాన్ని నాటాడు. అది ఆయన సమక్షంలో హాజరయ్యే వరకు వారిని వెంటాడటం మానదు.”

ఉల్లేఖకుని పరిచయం: అబు హురైరా రదియల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీ సంవత్సరంలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం ఉంచిన వారిలో సహచరులలో (సహాబాలలో) ఒకరు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

  1. అబద్ధం చెప్పటం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోక పోవటం, నిజాయితీని పాటించక పోవటం వంటి చెడు అలవాట్లతో, చెడు లక్షణాలతో ఎల్లప్పుడూ యుద్ధం చేస్తుండమని ఇస్లాం ధర్మం నిర్దేశిస్తున్నది.
  2. కపటత్వం నుండి మనం కాపాడుకోవటానికి ప్రయత్నించ వలెను. ఎందుకంటే అల్లాహ్ దగ్గర ఇది షిర్క్ అంటే ఏకదైవత్వ భాగస్వామ్యం లేదా బహుదైవారాధన కంటే ఘోరమైన పాపం.
  3. కపటత్వపు చిహ్నాల నుండి దైనినైనా సరే ఎట్టి పరిస్థితిలోను అలవర్చుకోకూడదు.
  4. ఎవరైతే కపటత్వపు లక్షణాలను అలవర్చుకున్నారో వారు, అల్లాహ్ దృష్టిలో  మరియు ఇతరుల దృష్టిలో చాలా హీనంగా దిగజారిపోతారు.
  5. మాట్లాడేటప్పుడు సత్యం పలకటం, ఇచ్చిన మాటను తప్పక పోవటం, నిజాయితీ తన దగ్గర ఉంచిన వస్తువులను వాటి యజమానికి సరిగ్గా తిరిగి ఇవ్వటం వంటి మంచి అలవాట్లు దైవవిశ్వాసుల చిహ్నాలలో కనబడతాయి.

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

ఇస్లాంలో పరిశుభ్రత (Cleanliness in Islam)

cleanliless-telugu-islamహదీథ్׃ 11

ఇస్లాంలో పరిశుభ్రత – النظافة من الإسلام

حَدَّثَنَا مُحَمَّدُ بْنُ الْمُثَنَّى وَ مُحمَّدُ بْنُ بَشَّارٍ وَ إِبْرَاهِيمُ بْنُ دِينَارٍ جَمِيعاً عَنْ يَحْيَىٰ بْنِ حَمَّادٍ . قَالَ ابْنُ الْمُثَنَّى : حَدَّثَنِي يَحْيَىٰ بْنُ حَمَّادٍ . أَخْبَرَنَا شُعْبَةُ عَنْ أَبَانُ بْنِ تَغْلِبَ عَنْ فُضَيْلٍ الْفُقَيْمِيِّ عَنْ إِبْرَاهِيمَ النَّخَعِيِّ عَنْ عَلْقَمَةَ عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ ، عَنِ النَّبِيِّ قَالَ:”  لاَ  يَدْخُلُ الْجَنَّةَ مَنْ كَانَ فِي قَلْبِهِ مِثْقَالُ ذَرَّةٍ مِنْ كِبْرٍ. قَالَ رَجُلٌ: إِنَّ الرَّجُلَ يُحِبُّ أَنْ يَكُونَ ثَوْبُهُ حَسَناً، وَنَعْلُهُ حَسَنَةً. قَالَ: إِنَّ اللَّهَ جَمِيلٌ يُحِبُّ الْجَمَالَ.اَلْكِبْرُ: بَطَرُ الْحَقِّ وَغَمْطُ النَّاسِ“رواة صحيح مسلم

హద్దథనా ముహమ్మదుబ్ను అల్ ముథన్నా వ ముహమ్మదుబ్ను బష్షారిన్ వ ఇబ్రాహీముబ్ను దీనారిన్ జమీఅన్ అన్ యహ్యాబ్ని హమ్మాదిన్, ఖాల ఇబ్ను అల్ ముథన్నా, హద్దథనీ యహ్యాబ్ను హమ్మాదిన్, అఖ్బరనా షొబతు అన్ అబానుబ్ని తగ్లిబ అన్ ఫుదైలిన్ అల్ ఫుఖైమియ్యీ అన్ ఇబ్రాహీమ అన్నఖఇయ్యి అన్ అల్ఖమత అన్ అబ్దిల్లాహిబ్ని మస్ఊదిన్, అనిన్నబియ్యి ఖాల “లా యద్ఖులు అల్ జన్నత మన్ కాన ఫీ ఖల్బిహి మిథ్ఖాలు దర్రతిన్ మిన్ కిబ్రిన్” ఖాల రజులున్ “ఇన్న అర్రజుల యుహిబ్బు అయ్యకూన థౌబుహు హసనన్, వ నఅలుహు హసనతన్” ఖాల “ఇన్నల్లాహ జమీలున్ యుహిబ్బుల్ జమాల, అల్ కిబ్రు, బతరుల్ హఖ్ఖి వ గమ్తున్నాసి ” రవాహ్ సహీ ముస్లిం.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ ముస్లిం హదీథ్ గ్రంధకర్త ← ముహమ్మదుబ్ను అల్ ముథన్నా,  ముహమ్మదుబ్ను బష్షారిన్ , ఇబ్రాహీముబ్ను దీనారిన్  (వీరందరు) ← యహ్యాబ్ని హమ్మాదిన్  ← ఇబ్ను అల్ ముథన్నా ← యహ్యాబ్ను హమ్మాదిన్ ← షొబతు ← అబానుబ్ని తగ్లిబ ← ఫుదైలిన్ ఫుఖైమియ్యి  ← ఇబ్రాహీమ అన్నఖయియ్యి ← అలఖమత ← అబ్దిల్లాహిబ్ని మస్ఊదిన్ (రదియల్లాహుఅన్హు) ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు “ఎవరి హృదయములో నైతే అణువంత అహంభావం (గర్వం) ఉంటుందో అతడు స్వర్గంలో ప్రవేశించలేడు. అప్పుడు ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడు”, (అప్పుడు అక్కడ ఉన్న) ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడు “ మరి మానవుడు నిశ్చయంగా మంచి దుస్తులు ధరించాలని, మరియు మంచి పాదరక్షలు (చెప్పులు,బూట్లు) తొడగాలని ఇష్టపడతాడు కదా!” ప్రవక్త ఇలా స్పష్టం చేశారు, ఖచ్చితంగా అల్లాహ్ సౌందర్యవంతుడు మరియు సౌందర్యాన్ని ఇష్టపడతాడు. అహంభావం (గర్వం) అంటే ఏమిటంటే వాస్తవాన్ని తిరస్కరించడము మరియు ప్రజలను నీచంగా (హీనంగా) భావించడము”. సహీ ముస్లిం హదీథ్ గ్రంధం.

హదీథ్ వివరణ

ఈ హదీథ్ పరిశుభ్రతను ప్రోత్సహిస్తుంది మరియు దురహంకారాన్ని, గర్వాన్ని నిరోధిస్తున్నది. హృదయంలో అణువంత అహంకారం (గర్వం) ఉన్నా సరే అతడు స్వర్గం లోనికి ప్రవేశించలేడు. ఒకవేళ అదే అహంకారం అతడిని అల్లాహ్ యొక్క ఉనికిని మరియు అల్లాహ్ యొక్క దివ్యవాణిని తిరస్కరించేటట్లు చేస్తే, అతడు తప్పక నరకాగ్నిలోనికి విసిరి వేయబడతాడు. దివ్యసందేశం గురించి అయిష్టం చూపటం, ఇంకా ఐశ్వర్యం, భౌతిక సౌందర్యం, సామాజిక మరియు ప్రాపంచిక ఔన్నత్యం మరియు పేరుప్రఖ్యాతులున్న వంశమని గర్వపడటం మొదలైనవి అతడిలో గర్వాన్ని, దురహంకారాన్ని పెంచి, ఇతరులను తక్కువగా, నీచంగా చూడటం వైపుకు మళ్ళిస్తుంది. తర్వాత తర్వాత వీటి వలన దివ్యసందేశాన్ని కూడా తిరస్కరించటం మొదలు పెడతాడు. మొదట అతడు నరకశిక్ష అనుభవిస్తాడు,  అతడు ముస్లిం అవటం వలన ఆ తర్వాత స్వర్గంలోనికి చేర్చబడతాడు. ఏదేమైనా గాని చక్కని మంచి దుస్తులు అహంకారానికి, గర్వానికి చిహ్నం కాజాలదు. ఇంకా ఇస్లాం పరిశుభ్రంగా, హుందాగా ఉండటాన్ని ప్రోత్సహిస్తుంది.

ఈ హదీథ్ ఉల్లేఖకుని పరిచయం: అబు అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు,  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవసందేశాన్ని ప్రాంరంభంలోనే స్వీకరించిన ప్రముఖులలో ఒకరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం నుండి ఖుర్ఆన్ లోని 70 అధ్యాయములు (సూరహ్ లు) కంఠస్థం చేసినారు. 32వ హిజ్రీ సంవత్సరంలో దాదాపు 70 సంవత్సరాల వయస్సులో మదీనా పట్టణంలో చనిపోయారు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

  1. అహంకారం మరియు ప్రజలను నిర్లక్ష్యం చెయ్యటం నిషేధించబడినది.
  2. పరిశుభ్రత అంటే ప్రతి దానికీ సంబంధించనది – ధరించే దుస్తులు, వాడే ఇతర వస్తువులతో సహా.
  3. ఇంటిని, పాఠశాలను, వీధులను పరిశుభ్రంగా ఉంచటం పై జాగ్రత్త వహించవలెను.
  4. వారానికి కనీసం ఒక్కసారైనా స్నానం చేయటం మెచ్చుకో దగిన విషయం.

ప్రశ్నలు

  1. ఈ హదీథ్ నుండి మీరు నేర్చుకున్న విషయాలు క్లుప్తంగా వ్రాయండి.
  2. ఈ హదీథ్ ఉల్లేఖకుడి గురించి వ్రాయండి.
  3. అహంకారం వలన కలిగే నష్టాల గురించి వ్రాయండి.

అనవసరపు విషయాల జోలికి పోకూడదు (Leaving off unnecessary matters)

హదీథ్׃ 10

అనవసరపు విషయాల జోలికి పోకూడదు – ترك المسلم ما لا يعنيه

حَدَّثَنَا أَحمَدُ بْنُ نَصْرٍ النَّيْسَابُورِيُّ وَغَيرُ وَاحِدٍ قَالوا حَدَّثَنَا أَبو مُسْهِرٍ عَنْ إسماعِيلَ بنِ عَبْدِ اللهِ بْنِ سَمَاعَةَ ، عَنْ الأوْزَاعيِّ ، عَنْ قُرَّةَ ، عَنْ الزُّهْرِيِّ عَنْ أَبي سَلَمَةَ عَنْ أَبي هُرَيْرَةَ قال.  قَالَ رَسُولُ اللَّه ”مِنْ حُسْنِ إِسْلاَمِ المَرْءِ تَرْكُهُ مَا لاَ يَعْنِيهِ “ رواه الترمذي

హద్దథనా అహ్మదుబ్ను నశ్రిన్ అన్నైసాబూరియ్యు వ గైరు వాహిదిన్ ఖాలూ, హద్దథనా అబుముస్హిరిన్ అన్ ఇస్మాయీలబ్ని అబ్దిల్లాహిబ్ని సమాఅత,  అన్ అల్ అవ్జాయ్యి,  అన్ ఖుర్రత , అన్ అజ్జుహ్రియ్యి , అన్ అబి సలమత అన్ అబి హురైరత ఖాల, ఖాల రసూలుల్లాహి “మిన్ హుస్ని ఇస్లామి అల్ మర్ఇ తర్కుహు మా లా యనీహి” రవాహ్ అత్తిర్మిది .

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) అత్తిర్మిది హదీథ్ గ్రంధకర్త   ← అహ్మదుబ్ను నశ్రిన్ అన్నైసాబూరియ్యు  & గైరువాహిదిన్  ← అబుముస్హిరిన్  ← ఇస్మాయీలబ్ని అబ్దిల్లాహిబ్ని సమాఅత ← అల్ అవ్జాయ్యి  ← అన్ ఖుర్రత ← అన్ అజ్జుహ్రియ్యి ← అబి సలమత ← అబి హురైరత (రదియల్లాహుఅన్హు) ← ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు “ఇస్లాం లోని ఉన్నతమైన లక్షణాలలో ఒక లక్షణం ఏమిటంటే, మానవుడు అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం” అత్తిర్మిది హదీథ్ గ్రంధం.

అబుహురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీథ్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఒకసారి ఇలా బోధించారు –  “మిన్ హుస్నల్ ఇస్లాం, అల్ మరఅఁ తరకహ్ మా లా యఅఁనీహి” అంటే “అనవసర విషయాల జోలికి పోకుండా ఉండటం కూడా ‘మంచి ముస్లిం’ కావటానికి ఒక నిదర్శనం”  అత్ తిర్మిథి హదీథ్ గ్రంథం

హదీథ్ వివరణ

సందేశం మరియు ఆచరణ పరంగా ఇది ఒక ముఖ్యమైన హదీథ్. తనకు సంబంధించిన విషయాల గురించి తప్ప, ఒక ముస్లిం ప్రతిదాని గురించి మాట్లాడకూడదు. ఇతరుల వ్యక్తిగత విషయాలలో తలదూర్చకూడదని, వాటి జోలికి పోకూడదని కూడా ఈ హదీథ్ బోధిస్తున్నది. కేవలం ధనం సంపాదించటానికి మరియు ఉన్నత స్థానాలకు చేరటానికి మాత్రమే మన జీవితం వెచ్చించకూడదు.  ముస్లింలు పొగడ్తలను ఆశ్రయించకూడదు, ధర్మపరం గాను మరియు ప్రాపంచిక జీవితంలోను ఇది ఎంత మాత్రమూ ప్రయోజనకరం కాదు.

ఉల్లేఖకుని పరిచయం: అబు హురైరా రదియల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీ సంవత్సరంలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం ఉంచిన వారిలో సహచరులలో (సహాబాలలో) ఒకరు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

  1. తమకు సంబంధించని అనవసర విషయాలను వదిలి వేయమని ఇస్లాం ప్రోత్సహిస్తున్నది.
  2. మస్లింలు తమకు సంబంధించని విషయాలను – అవి మాటలు అయినా లేక చేతలు (పనులు) అయినా సరే
  3. వదిలివేయటం ఇస్లాం లోని అత్యుత్తమ నడవడికలో ఒక ముఖ్యమైన భాగం. అడగకపోయినా, స్వయంగా కల్పించుకుని సమాధానం చెప్పేటందుకు మీరు ప్రయత్నించవద్దు.
  4. మంచి వైపుకు దారి చూపటం పై ముస్లింలు ధ్యానం ఉంచవలెను.

ప్రశ్నలు

  1. ‘తమకు సంబంధించని అనవసర విషయాలు’ అంటే ఏమిటో వివరంగా వ్రాయండి.
  2. ఈ హదీథ్ ను ఆచరించటం వలన కలిగే లాభాలను వివరించండి.
  3. ఈ హదీథ్ ద్వారా సమాజానికి కలిగే ఉపయోగం గురించి తెలుపండి.

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

ఇరుగు పొరుగు (పొరుగింటి) వారి హక్కులు (Rights of neighbours)

హదీథ్׃ 09

ఇరుగు పొరుగు (పొరుగింటి) వారి హక్కులు – حق الجار على الجار

حَدَّثَنَا أَبُو بَكْرِ بْنُ أَبِي شَيْبَةَ: حَدَّثَنَا أَبُو الأَحْوَصِ عَنْ أَبِي حَصِينٍ عَنْ أَبِي صَالِحٍ عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُولُ اللّهِ:  ” مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ فَلاَ يُؤْذِ جَارَهُ. وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيُكْرِمْ ضَيْفَهُ.  وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيَقُلْ خَيْراً أَوْ لِيَسْكُتْ “ رواة صحيح مسلم

హద్దథనా అబుబక్రిబ్ను అబి షైబత, హద్దథనా అబు అల్అహ్వశి అన్ అబిహశీనిన్ అన్ అబిశాలిహిన్ అన్ అబిహురైరత ఖాల, ఖాల రసూలిల్లాహి “మన్ కాన యుఁమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫలా యూది జారహు, వమన్ కాన యుఁమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యుక్రిమ్ దైఫహు, వమన్ కాన యుఁమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యఖుల్ ఖైరన్ అవ్ లియస్కుత్ ” రవాహ్ సహీ ముస్లిం.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ ముస్లిం హదీథ్ గ్రంధంకర్త   ← అబుబక్రిబ్ను అబిషైబత ← అబు అల్అహ్వశి ← అబిహశీనిన్ ← అబిశాలిహిన్ ← అబిహురైరత (రదియల్లాహుఅన్హు) ← ప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు. “ఎవరైతే అల్లాహ్ పై మరియు ప్రళయదినం పై విశ్వాసము ఉంచుతారో వారు తమ యొక్క పొరుగు వారికి కష్టము కలిగించ కూడదు. మరియు ఎవరైతే అల్లాహ్ పై మరియు ప్రళయదినం పై విశ్వాసము ఉంచుతారో వారు తమ ఇంటికి వచ్చిన అతిధులకు మంచి ఆతిధ్యముతో గౌరవిచవలెను. ఎవరైతే అల్లాహ్ మీద మరియు ప్రళయదినం పై విశ్వాసము ఉంచుతారో వారు వీలైతే మంచి మాటలు చెప్పవలెను లేకుంటే మౌనము వహించవలెను”. సహీ ముస్లిం హదీథ్ గ్రంధం.

హదీథ్ వివరణ

ఇరుగు పొరుగు వారి హక్కులను కాపాడటం కూడా దైవ విశ్వాసం లోని ఒక ముఖ్యమైన భాగమని మరియు వారికి హాని కలిగించటం కూడా ఒక ఘోరమైన మహాపాపమని  ఈ హదీథ్ ప్రకటిస్తున్నది. ఇతర పొరుగింటి వారి కంటే సత్యసంధులైన, ధర్మాత్ములైన పొరుగింటి వారి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపవలెను. ఇంకా ముస్లిం పొరుగింటి వారినందరికీ మంచి చేయవలెను, దయతో మంచి సలహాలివ్వవలెను, వారు సరైన మార్గాన్ని అనుసరించేటట్లుగా ప్రార్థించ వలెను, మరియు వారికి హాని కలిగించకూడదు.

ఉల్లేఖకుని పరిచయం: అబు హురైరా రదియల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం చేసినవారిలో సహచరులలో (సహాబాలలో) ఒకరు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

  1. పరస్పరం ప్రేమ మరియు సహాయసహకారాలు పెంపొందుకునే దిశగా ప్రజలను ఇస్లాం ప్రోత్సహిస్తుంది.
  2. ఇరుగు పొరుగు వారి మధ్య సహాయసహకారాలు వారి మధ్య బంధుత్వాన్ని పటిష్టపరుస్తాయి.
  3. పొరుగింటి పిల్లలను మాటలతో లేదా చేతలతో (పనులతో) నొప్పించకుండా ఉండటం ద్వారా వారిపై దయ చూపినట్లవుతుంది.
  4. ఇంటి కప్పు పై నుండి లేదా తలుపు రంధ్రాల నుండి పొరుగింటిలోనికి తొంగిచూడటం నిషేధించబడినది.
  5. పొరుగువారికి ఎలాంటి అపకారం, కీడు, హాని కలిగించటం నిషేధించబడినది.
  6. అతిథులను మర్యాదపూర్వకంగా సత్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యత.
  7. అనవసరపు సంభాషణలు సంపూర్ణమైన దైవవిశ్వాసం (ఈమాన్) నుండి దూరం చేస్తాయి.

ప్రశ్నలు

  1. తప్పక చేయమని దైవప్రవక్త ఆదేశించిన మూడుపనులు వ్రాయండి.
  2. పొరుగువారి హక్కులు ఏవి?
  3. పొరుగువారి పిల్లలతో ఎలా మెలగాలి?
  4. దేని వలన దైవ విశ్వాసానికి (ఈమాన్) దూరమవుతారు.
  5. పొరుగువారితో ఎలా ప్రవర్తించ వలెను?

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

అపనిందలు వేయటం (Gheebah & Slander)

హదీథ్׃ 08

تحريم الغيبة అపనిందలు వేయటం –

حَدَّثَنَا يَحْيَىٰ بْنُ أَيُّوبَ وَ شِيْبَةَ وَ ابْنُ حُجْرٍ قَالُوا: حَدَّثَنَا إِسْمَاعِيلُ عَنِ الْعَلاَءِ عَنْ أَبِيهِ، عَنْ أَبِي هُرَيْرَةَ

أَنَّ رَسُولَ اللَّهِ قَالَ  ” أَتَدْرُونَ مَا الْغِيبَةُ؟ “ قَالُوا” اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ“ قَالَ”ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ“ قِيلَ  ”أَفَرَأَيْتَ إِنْ كَانَ فِي أَخِي مَا أَقُولُ؟   “قَالَ ” إِن كَانَ فِيهِ مَا تَقُولُ، فَقَدِاغْتَبْتَهُ. وَإِنْ لَمْ يَكُنْ فِيهِ، فَقَدْ بَهَتَّهُ “   رواة صحيح مسلم

హద్దథనా యహ్యా ఇబ్ను అయ్యూబ వ షీబత వ ఇబ్ను హుజ్రిన్ ఖాలూ, హద్దథనా ఇస్మాయీలు అనిల్ అలాయి అన్ అబిహి,  అన్ అబి హురైరత అన్న రసూలల్లాహి ఖాల, “అతద్రూన మా అల్ గీబతు ?” ఖాలూ, “అల్లాహు వ రసూలుహు ఆలము”. ఖాల, “దిక్రుక అఖాక బిమా యక్రహు”. ఖీల, “అఫరాయ్త ఇన్ కాన ఫీ అఖి మా అఖూలు ?” ఖాల, “ఇన్ కాన ఫీహి మా తఖూలు, ఫఖదిగ్ తబ్తహు. వ ఇన్ లమ్ యకున్ ఫీహి, ఫఖద్ బహత్తహు”. రవాహ్ సహీ ముస్లిం .

దైవవిశ్వాసపు తియ్యటి మాధుర్యం (Sweetness of Iman)

tree-iman-telugu-islamహదీథ్ ׃ 13

حلاوة الإيمان దైవవిశ్వాసపు తియ్యటి మాధుర్యం –

حَدَّثَنا مُحَمَّدُ بْنُ المُثَنَّى قَالَ: حَدَّثَنَا عَبْدُ الْوَهَّابِ الثَّقَفِيُّ قَالَ: حَدَّثَنَا أَيُّوبُ عَنْ أَبي قِلابَةَ عَنْ أَنْسٍ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: ”ثَلاثٌ مَنْ كُنَّ فِيهِ وَجَدَ حَلاوَةَ الإِيمَانِ أَنْ يَكونَ اللَّهُ وَرَسُولُهُ أَحَبَّ إلَيْهِ مِمَّا سِواهُمَا، وَأَنْ يُحِبَّ المَرْءَ لاَ يُحِبُّهُ إلاَّ للَّهِ ، وَأَنْ يَكْرَهَ أَنْ يَعُودَ فِي الْكُفْرِ كَمَا يَكْرَهُ أَنْ يُقْذَفَ فِي النَّارِ “ رواة صحيح البخاري

హద్దథనా ముహమ్మదుబ్ను అల్ ముథన్నా ఖాల, హద్దథనా అబ్దుల్ వహ్హాబి అథ్థఖఫియ్యు ఖాల హద్దథనా అయ్యూబు అన్ అబి ఖిలాబత అన్ అన్సిన్ అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వ సల్లమ ఖాల “థలాథున్ మన్ కున్న ఫీహి వజద హలావత అల్ఈమాని – అన్ యకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా, వ అన్ యుహిబ్బ అల్మర్ఆ లా యుబ్బుహు ఇల్లల్లాహి, వ అన్ యక్రహ అన్ యఊద ఫిల్కుఫ్రి కమా యక్రహు అన్ యుఖ్దఫ ఫిన్నారి” రవాహ్ సహీ బుఖారి.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ బుఖారి హదీథ్ గ్రంధంకర్త   ← ముహమ్మదుబ్ను అల్ ముథన్నా ← అబ్దుల్ వహ్హాబి అథ్థఖఫియ్యు ← హద్దథనా అయ్యూబు ←  అబి ఖిలాబత ← అన్సిన్ (రదియల్లాహుఅన్హు) ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు “మూడు (గుణములు) ఎవరి దగ్గరైతే ఉంటాయో వారు విశ్వాసం యొక్క తియ్యటి మాధుర్యాన్ని రుచి చూస్తారు – 1)వారు కేవలం అల్లాహ్ ను మరియు దైవప్రవక్తను మాత్రమే అన్నింటి కంటే ఎక్కువగా ఇష్టపడతారు. 2)మరియు ఎదుటి మనిషిని కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకే ప్రేమిస్తారు. 3)మరియు నరకాగ్ని భయంతో తిరిగి మళ్ళీ అవిశ్వాసిగా మారటాన్ని ఇష్టపడరు”. సహీ బుఖారి హదీథ్ గ్రంధం

హదీథ్ వివరణ

విశ్వాసి యొక్క దైవవిశ్వాసపు కోరికను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) తీపిదనపు మాధుర్యం కోసం తపించే ఆకాంక్షతో పోల్చినారు. ఒక వ్యాధిగ్రస్థుడి మరియు ఒక ఆరోగ్యవంతుడి మధ్య ఉండే తేడాని ఈ హదీథ్ జ్ఞాపకానికి తీసుకు వస్తున్నది. వ్యాధిగ్రస్థుడికి తేనె కూడా చేదుగా అనిపిస్తుంది, కాని అదే తేనెలోని తియ్యదనాన్ని ఆరోగ్యవంతుడు మాధుర్యంతో రుచిచూస్తాడు. ఎప్పుడైతే ఆరోగ్యం క్షీణిస్తుంటుందో, రుచి చూసే శక్తి కూడా క్షీణిస్తుంది. ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) మాధుర్యం (తియ్యదనం) అనే పదాన్ని వినియోగించారు ఎందుకంటే దైవవిశ్వాసాన్ని ఒక చెట్టుతో అల్లాహ్ పోల్చినాడు. దివ్యఖుర్ఆన్ లోని సూరహ్ ఇబ్రహీం 14:24 లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:“అల్లాహ్ ఉపమానాలను ఎలా ముందు ఉంచుతున్నాడో మీరు చూడటం లేదా? – ఒక మంచి మాట ఒక మంచి చెట్టు వంటిది, దేని వ్రేళ్ళు అయితే బాగా పాతుకుపోయి ఉంటాయో మరియు దేని కొమ్మలు అయితే ఆకాశానికి చేరి పోతాయో” ఇక్కడ మంచి పదం అంటే చిత్తశుద్ధితో కూడిన హృదయపూర్వకమైన దైవవిశ్వాసం. అదే ఏకదైవత్వపు (తౌహీద్) ప్రకటన. ఇక్కడ చెట్టు అనే పదం దైవవిశ్వాసానికి మూలబిందువు వంటిది, దాని కొమ్మలు అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించటం మరియు ఏవైతే అల్లాహ్ నిషేధించాడో వాటి నుండి దూరంగా ఉండటం వంటిది, మరియు దాని ఆకులు దైవవిశ్వాసి జాగ్రత్త వహించే ప్రతి మంచి విషయం వంటిది, మరియు దాని ప్రతిఫలమే అల్లాహ్ కు విధేయత చూపటం. ఇంకా దాని పర్యవసానంలోని మాధుర్యమే దాని ఫలాలు మరియు ఆ ఫలాలలోని తియ్యదనం.

ఉల్లేఖకుని పరిచయం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క సేవకుడిగా అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు తన సేవలందించారు. అనేక హదీథ్ లను ఉల్లేఖించారు. 92వ హిజ్రీ సంవత్సరంలో చనిపోయారు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

  1. సృష్టిలోని అన్నింటి కంటే అల్లాహ్ ను మరియు అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ను ప్రేమించటం యొక్క ఆవశ్యకతను ఈ హదీథ్ తెలుపుతుంది.
  2. అల్లాహ్ కు మరియు అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్తకు అవిధేయత చూపుతూ, ప్రజలకు విధేయులుగా ఉండటం తగదు.
  3. దైవవిశ్వాసం పరిపూర్తి కావటానికి ఒక మార్గం – ప్రతి ముస్లిం తన తోటి ముస్లిం సోదరుడిని కేవలం అల్లాహ్ కోసం తప్పక ప్రేమించ వలెను.
  4. ప్రతి ముస్లిం అవిశ్వాసాన్ని నరకంలో పడవేయటాన్ని అసహ్యించుకున్నట్లుగా అసహ్యించుకో వలెను.
  5. ఎవరి దగ్గర అయితే పై మూడు మంచి లక్షణాలు ఉన్నాయో వారు శాంతియుతంగా మరియు సురక్షితంగా ఉన్నట్లుగా అనుభూతి పొందుతారు.

ప్రశ్నలు

  1. దైవవిశ్వాసపు తీపిదనం ఎవరిలో ఉంటుంది?
  2. ప్రతి ముస్లిం అవిశ్వాసాన్ని ఏ విధంగా అసహ్యించుకోవలెను?
  3. ఈ హదీథ్ యొక్క ఉల్లేఖకుని గురించి క్లుప్తంగా వ్రాయండి?
  4. ప్రతి ముస్లిం తోటి ముస్లిం సోదరుడిని ఎవరి కోసం ప్రేమించాలి?
  5. శాంతియుతంగా మరియు సురక్షితంగా ఉండటానికి ఏ ఏ లక్షణాలు ఉండవలెను?

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

చాడీలు చెప్పటం నిషేధించబడినది (Prohibition of Backbiting)

backbiting-telugu-islamహదీథ్׃ 07

تحريم النميمة చాడీలు చెప్పటం నిషేధించబడినది –

حدّثنا مُحَمَّدُ بْنُ الْمُثَنَّى وَ ابْنُ بَشَّارٍ قَالاَ: حَدَّثَنَا مُحَمَّدُ بْنُ جَعْفٍ  حَدَّثَنَا شُعْبَةُ . سَمِعْتُ أَبَا إِسْحَـٰقَ يُحَدِّثُ عَنْ أَبِي الأَحْوَصِ عَنْ عَبْدِاللّهِ بْنِ مَسْعُودٍ قَالَ: ” إِنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَ سَلَّمَ قَالَ: أَلاَ أُنَبِّئُكُمْ مَا الْعَضْهُ؟ هِيَ النَّمِيمَةُ الْقَالَةُ بَيْنَ النَّاس. “رواة صحيح مسلم

హద్దథనా ముహమ్మద్ ఇబ్ను అల్ ముథన్న వ ఇబ్ను బష్షారిన్ ఖాల హద్దథనా ముహమ్మద్ ఇబ్ను జఅఫిన్ హద్దథనా షుఅబతు సమియ్ తు అబా ఇస్హాఖ యుహద్దిథు అన్అబి అల్అహ్వశి అన్ అబ్దిల్లాహ్ ఇబ్ని మస్ఊదిన్ ఖాల, ఇన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వ సల్లమ ఖాల “ఆలా ఉనబ్బి ఉకుమ్ మా అల్ అద్హు? హియన్నమీమతు అల్ ఖాలతు బైనన్నాసి” రవాహ్ సహీ ముస్లిం.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ ముస్లిం హదీథ్ గ్రంధంకర్త ← ముహమ్మద్ ఇబ్ను అల్ ముథన్న← ఇబ్ను బష్షారిన్← ముహమ్మద్ ఇబ్ను జఅఫిన్ ← షుఅబతు ← అబా ఇస్హాఖ ← అబి అల్అహ్వశి ← అబ్దిల్లాహ్ ఇబ్ని మస్ఊదిన్ (రదియల్లాహుఅన్హు) ← ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిశ్చయంగా ఇలా ఉపదేశించినారు. “మీకు అల్ అద్హు అంటే ఏమిటో తెలుపనా? అది మానవుల మధ్య చాడీలు విస్తరింప చేయడము”. సహీ ముస్లిం హదీథ్ గ్రంధం.

హదీథ్ ఉల్లేఖకుని పరిచయం – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క ఇస్లాం ధర్మం సందేశాన్ని ప్రారంభంలోనే స్వీకరంచిన వారిలో ఉత్తమములలో అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఒకరు.  వీరు ప్రముఖ ధర్మనిష్ఠాపరుల, ఖుర్ఆన్ పారాయణుల, ధర్మజ్ఞానకోవిదుల ప్రసిద్ధులలో ఒకరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం దగ్గర దాదాపుగా 70 ఖుర్ఆన్ అధ్యాయాలను కంఠస్థం చేసారు. 32వ హిజ్రీ సంవత్సరంలో, 60 సంవత్సరాల వయస్సులో మదీనా పట్టణంలో వీరు మరణించారు.

హదీథ్ వివరణ

ఇస్లాం ధర్మం ప్రజలకు పరస్పర ప్రేమాభిమానాలతో, సోదర భావంతో, కలిసిమెలిసి ఆదర్శవంతంగా జీవితం గడపే మంచి మార్గం వైపునకు దారిచూపుతున్నది. ఇంకా పరస్పర వైషమ్యాలు, ఈర్ష్యాద్వేషాలు, కోపతాపాలు, భేదాలు కూడదని నివారిస్తున్నది. ప్రజల మధ్య ప్రేమాభిమానాలను తుడిచిపెట్టి, వారిలో సంఘీభావాన్ని, కలిసిమెలిసి జీవించటాన్ని ముక్కలుముక్కలు చేసే అత్యంత ప్రమాదకరమైన దురలవాటు చాడీలు చెప్పటం. దీని వలన ప్రజల హృదయాలలో కోపతాపాలు భగ్గుమంటాయి. ఒకరినొకరు అసహ్యించుకోవటం మొదలవుతుంది.  మంత్రగాళ్ళు సంవతర్సరకాలంలో లేపలేని అలజడిని, అపోహలను, అల్లర్లను ఒక్కోసారి చాడీలు మరియు అబద్ధాలు చెప్పేవారు కేవలం ఒక గంటలోనే లేపుతారు. కాబట్టి, ధర్మవిద్య నేర్చుకునే సోదరులారా! మీరేదైనా విషయం విన్నప్పుడు దానిలోని సత్యాసత్యాలను, నిజానిజాలను, వాస్తవాలను బాగా పరిశోధించ వలెను, పరిశీలించ వలెను మరియు, పరీక్షించ వలెను. తెలిసిన వారు చెబుతున్నారు కాదా అని గ్రుడ్డిగా నమ్మరాదు. కేవలం సందేహం మరియు అనుమానం మీద ఆధార పడవద్దు. ఖుర్ఆన్ లోని అల్ హుజురాత్ అనే అధ్యాయంలో 6వ వచనంలో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు –

يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا إِنْ جَاءَكُمْ فَاسِقٌ بِنَبَأٍ فَتَبَيَّنُوا أَنْ تُصِيبُوا قَوْمًا بِجَهَالَةٍ فَتُصْبِحُوا عَلَى مَا فَعَلْتُمْ نَادِمِينَ(6)

దైవవిశ్వాసులారా!  ఎవరైనా దుర్మార్గుడు మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని తీసుకువస్తే, నిజానిజాలు విచారించి తెలుసుకోండి. అలా చేయకపోతే, మీకు తెలియకుండానే మీరు ఏదైనా వర్గానికి నష్టం కలిగించవచ్చు, తర్వాత చేసినదానికి పశ్చాత్తాప పడవలసి రావచ్చు.

కాబట్టి ఎల్లప్పుడూ చాడీలు చెప్పేవారితో చాలా జాగ్రత్తగా ఉండండి. అంటువంటి వారికి సమాజంలో గౌరవమర్యాదలు ఉండవు. ఇంకా అటువంటి వారిలో మంచి నడవడిక కూడా ఉండదు. అటువంటి వారి యొక్క ఏకైక లక్ష్యం ప్రజలు కష్టం కలిగించటం మరియు బాధలకు గురిచేయటం. ఎదుటి వారు కష్టనష్టాలలో కూరుకు పోవటం చూసి సంతోషపడతారు. అటువంటి నుండి అల్లాహ్ మమ్ముల్ని కాపాడు గాక! ఆమీన్.

ఈ హదీథ్ వలన కలిగే లాభాలు:

  1. చాడీలు చెప్పటం మరియు అపవాదాలు వేయటం హరామ్, ఇస్లాం ధర్మం పూర్తిగా నిషేధించినది.
  2. చాడీలు చెప్పటమనేది అత్యంత ఘోరమైన పాపాలలో పరిగణించబడుతుంది.

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

మోసం చేయటం నిషేధించబడినది (Prohibition of deceiving)

హదీథ్׃ 06

تحريم الغش మోసం చేయటం నిషేధించబడినది –

حَدَّثَنِي يَحْيَىٰ بْنُ أَيُّوبَ وَ قُتَيْبَةُ وَ ابْنُ حُجْرٍ . جَمِيعا عَنْ إِسْمَاعِيلَ بْنِ جَعْفَرٍ . قَالَ ابْنُ أَيُّوبَ : حَدَّثَنَا إِسْمَاعِيلُ . قَالَ: أَخْبَرَنِي الْعَلاَءُ عَنْ أَبِيْهِ، عَنْ أَبِي هُرَيْرَةَ   ”أَنَّ رَسُولَ اللَّهِ مَرَّ عَلَى صُبْرَةِ طَعَامٍ، فَأَدْخَلَ يَدَهُ فِيهَا، فَنَالَتْ أَصَابـِعُهُ بَلَلاً،فَقَالَ: مَا هذَا يَا صَاحِبَ الطَّعَامِ ؟ قَالَ: أَصَابَتْهُ السَّمَاءُ يَا رَسُولَ اللَّهِ ! قَالَ: أَفَلاَ جَعَلْتَهُ فَوْقَ الطَّعَامِ كَيْ يَرَاهُ النَّاسُ، “مَنْ غَشَّ فَلَيْسَ مِنِّي “ رواة صحيح مسلم

హద్దథని యహ్యా ఇబ్ను అయ్యూబ వ ఖుతైబతు వ ఇబ్ను హుజ్రిన్, జమీఆన్ అన్ ఇస్మాయీల ఇబ్ని జాఫరిన్, ఖాల ఇబ్ను అయ్యూబ, హద్దథనా ఇస్మాయీలు, ఖాల అఖ్బరనీ అల్ అలాఉ అన్ అబీహి, అన్ అబీ హురైరత  అన్న రసూలుల్లాహి మర్ర అలా శుబ్రతి తఆమిన్, ఫఅద్ఖల యదహు ఫీహా, ఫనాలత్ అశాబిఉహు బలలన్, ఫఖాల “మాహాదా యా శాహిబత్తాఆమి”? ఖాల “అశాబత్ హుస్సమాఉ యా రసూలల్లాహ్” ఖాల “అఫలా జఅల్తహు ఫౌఖ అత్తఆమి కై యరాహు అన్నాసు, మన్ గష్ష ఫలైస మిన్నీ” రవాహ్ సహీ ముస్లిం.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ ముస్లిం హదీథ్ గ్రంధంకర్త ← యహ్యా ఇబ్ను అయ్యూబ ← ఖుతైబతు వ ఇబ్ను హుజ్రిన్ ← జమీఆన్ అన్ ఇస్మాయీల ఇబ్ని జాఫరిన్ ← ఇబ్ను అయ్యూబ ← ఇస్మాయీలు ← అల్ అలాఉ అన్ అబీహి ← అబీ హురైరత (రదియల్లాహుఅన్హు) ← అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) ఒకసారి అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆహార ధాన్యపు గుట్ట దగ్గర నుండి పోవటము జరిగినది, అప్పుడు వారు తమచేతిని ఆధాన్యం లోనికి జొప్పినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క చేతివ్రేళ్ళకు తేమ తగిలినది(నీటితో తనవ్రేళ్ళు తడిసిపోయినవి) అప్పుడు వారు ఆహర ధాన్యం విక్రయించే వాడితో “ఏమిటి ఇది?” అని అడిగినారు. అతను ఇలా జవాబు చెప్పినాడు  “ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! ఇది ఆకాశం నుండి కురిసిన వర్షం వలన నెమ్ము అయినది”. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రశ్నించినారు, “నీవు ఈ తడిసిన ధాన్యమును అందరికి కనపడే విధంగా పైన ఎందుకు ఉంచలేదు?,  దానిని ప్రజలందరు చూడగలిగేవారు కదా! ఎవరైతే మోసం చేస్తాడో అతడు నావాడు కాజాలడు”. సహీ ముస్లిం హదీథ్ గ్రంధం.

ఉల్లేఖకుని పరిచయం:

అబు హురైరా రదియల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీ సంవత్సరంలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం ఉంచిన వారిలో సహచరులలో (సహాబాలలో) ఒకరు.

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

అవిధేయత మరియు అబద్ధపు సాక్ష్యం నిషేధింపబడినది (Disobedience and Lying)

హదీథ్׃ 05

تحريم العقوق وشهادة الزور

అవిధేయత మరియు అబద్ధపు సాక్ష్యం నిషేధింపబడినది

حَدَّثَني عَمْرُو بْنَ مُحمَّدُ بْنُ بُكَيرِ بْنِ مُحمَّدٍ النَّاقِدُ . حَدَّثَنَا إِسْمَاعِيلُ بْنُ عُلَيَّةَ عَنْ سَعِيدٍ الْجُرَيْرِيِّ . حَدَّثَنَا عَبْدُ الرَّحْمٰنِ بْنُ أَبِي بَكْرَةَ عَنْ أَبِيهِ قَالَ: كُنَّا عِنْدَ رَسُولِ اللّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَ سَلَّمَ  فَقَالَ:   ”أَلاَ أُنَبِّئُكُمْ بِأَكْبَرِ الْكَبَائِرِ؟ ثَلاَثاً :ا‌‌لإِشْرَاكُ بِاللَّهِ. وَعُقُوقُ الْوَالِدَيْنِ. وَشَهَادَةُ الزُّورِ، أَوْ قَوْلُ الزُّورِ “ وَكَانَ رَسُولُ اللَّهِ صَلَّىاللَّهُ عَلَيْهِ وَ سَلَّمَ مُتَّكِئًا فَجَلَسَ. فَمَا زَالَ يُكَرِّرُهَا حَتَّى قُلْنَا: لَيْتَهُ سَكَتَ ! : متفق عليه

హద్దథని అమ్రు ఇబ్న ముహమ్మదు ఇబ్ను బుకైరి ఇబ్ని ముహమ్మదిన్ అన్నాఖిదు, హద్దథనా ఇస్మాయీలు ఇబ్ను ఉలైయ్యత అన్ సయీదిన్ అల్ జురైరియ్యి, హద్దథనా అబ్దుర్రహ్మాని ఇబ్ను అబి బకరత అన్ అబిహి ఖాలా కున్నా ఇంద రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఫఖాల “అలా ఉనబ్బిఉకుమ్ బిఅక్బరి అల్ కబాయిరి థలాథ, అల్ ఇష్రాకు బిల్లాహి, వ ఉఖూఖుల్ వాలిదైని, వ షహాదతుజ్జూరి, అవ్ ఖౌలుజ్జూరి” వ కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ముత్తకిఅన్ ఫజలస ఫమా జాల యుకర్రిరుహా హత్తా ఖుల్నా లైతహు సకత! ముత్తఫఖున్ అలైహ్

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీబుఖారీ మరియు సహీముస్లిం హదీథ్ గ్రంధకర్తలు ← అమర్ ఇబ్ను ముహమ్మద్ ఇబ్ను బుకైరి ఇబ్ని ముహమ్మదిన్ అన్నాఖిదు ← ఇస్మాయీలు ఇబ్ను ఉలైయ్యత అన్ సయీదిన్ అల్ జురైరియ్యి ← అబ్దుర్రహ్మాన్ ఇబ్ను అబి బకరత ← అబి బకరత (రదియల్లాహుఅన్హు) ← అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) – ఒకసారి మేము అల్లాహ్ యొక్క  ప్రవక్త సన్నిధిలో ఉన్నాము, అప్పుడు వారు“ఘోరాతి ఘోరమైన పాపముల గురించి మీకు తెలుపనా? అవి మూడు –

  1. అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించటం.
  2. తల్లిదండ్రులకు అవిధేయత చూపటం.
  3. అబద్దపుసాక్ష్యంపలకటం” అనిబోధించారు.

 

అప్పటి వరకు ఏటవాలుగా ఒకవైపు ఒరిగి కూర్చుని ఉన్న దైవప్రవక్త, ఒకేసారి నిటారుగా కూర్చున్నారు మరియు వారు ఆ మాటలనే మళ్ళీమళ్ళీ “అలా పలకటం ఆపివేసి, నిశ్శబ్దంగా ఉంటే ఎంత బాగుండును” అని మేము కోరుకునేటంతటి వరకు అనేక సార్లు పలికారు. ముత్తఫఖున్ అలైహ్

హదీథ్ వివరణ

ఘోరమైన మహాపాపములు అనేకం ఉన్నాయి మరియు అన్నింటి కంటే ఘోరాతిఘోరమైన మహాపాపం – ‘అల్లాహ్ కు అతడి దివ్యకార్యములలో లేక అతడిని ఆరాధించటంలో లేక అతడి శుభమైన నామములలో లేక అతడి అత్యున్నతమైన గుణములలో భాగస్వామిని కల్పించటం.’ ఇస్లాం ధర్మంలో ఇది అత్యంత ఘోరాతి ఘోరమైన మహాపాపం గనుక, దైవప్రవక్త ఈ మహాపాపంతో మొదలుపెట్టారు. ఆ తర్వాత, వారు తల్లిదండ్రులకు అవిధేయత చూపటం అనే మరో ఘోరమైన మహా పాపం గురించి తెలిపారు. తల్లిదండ్రులకు అవిధేయత చూపే ప్రజలు భయంకర శిక్ష అనుభవిస్తారని అల్లాహ్ హెచ్చరించెను. బాల్యం నుండి జాగ్రత్తగా, కరుణతో పెంచి పోషించినందుకు, ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రులను తప్పనిసరిగా గౌరవించవలెను, మర్యాదగా చూడవలెను. మరియు వినయవిధేయతలతో, నమ్రతగా వారితో మెలగమని అల్లాహ్ మనల్ని ఆదేశించెను. మరియు వారికి అవిధేయత చూపటాన్ని అల్లాహ్ నిషేధించెను.  ఖుర్ఆన్ సూరహ్ అల్ ఇస్రా 17: 23-24 లోని క్రింది వచనాలు-

“నీ ప్రభువు ఇలా నిర్ణయించాడు: మీరు కేవలం ఆయనను తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి. తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించండి. ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరు గాని ఇద్దరు గాని ముసలివారై ఉంటే, వారి ముందు విసుగ్గా “ఉహ్ (లేక ఛీ)” అని కూడా అనకండి. వారిని కసురుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి. మృదుత్వమూ, దయ కలిగి, వారి ముందు వినమ్రులై ఉండండి. ఇలా ప్రార్థిస్తూ ఉండండి “యా రబ్ (ఓ ప్రభూ)! వారిపై కరుణ జూపు, బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించినట్లు”

ప్రతి ముస్లిం తప్పనిసరిగా తన తల్లిదండ్రుల మాట వినవలెను, వారికి విధేయత చూపవలెను, వారిని గౌరవించవలెను. ఎందుకంటే పాపపు పని చేయమని ఆదేశించనంత వరకు, వారు చెప్పినట్లు నడుచుకోవటం మీ బాధ్యత. వారికి అవిధేయత చూపటం ఇస్లాం ధర్మంలో పూర్తిగా నిషేధించబడినది.

మరొక నిషేధింపబడిన పని – అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం మరియు నిజం పలకటం నుండి కావాలని (సంకల్ప పూర్వకంగా) దూరంగా పోవటం.  అబద్ధం చెప్పటం మరియు అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం అనే తీవ్రమైన తప్పు గురించి తన సహచరులకు బోధించటంలో దైవప్రవక్త ఎక్కువ ధ్యాస చూపేవారు. ఎందుకంటే మాట జారటం నాలుకకు చాలా తేలికైన పని మరియు ప్రజలు ఈ భయంకరమైన మహాపాపం గురించి తరచుగా అజాగ్రత్త వహిస్తారు. ఈ ఘోరమైన మహాపాపానికి అసూయ, వోర్వలేని తనం, ద్వేషం, ఈర్ష్య, శత్రుత్వం, దుష్టభావం, పగ వంటి అనేక చెడు విషయాలు కారణం కావచ్చును. ‘ఈ హెచ్చరికను ఇక ఆపరేమో’ అని తోటి సహచరులు అనుకునే వరకు దైవప్రవక్త దీనిని అనేక సార్లు పలికారు.

కాబట్టి ముస్లింలు అల్లాహ్ యొక్క ఆగ్రహానికి మరియు కఠినశిక్షకు గురిచేసే ఈ ఘోరాతి ఘోరమైన ఈ మహాపాపములలో ఏ ఒక్కటీ చేయకుండా జాగ్రత్త వహిస్తూ, తమను తాము కాపాడుకోవలెను మరియు ఇతరులను కూడా కాపాడటానికి ప్రయత్నించవలెను.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

  1. దైవప్రవక్త తన సహచరులకు బోధించిన మార్గదర్శకత్వం మరియు హితవులు మొత్తం మానవజాతికి కూడా వర్తిస్తాయి, వాటిని ఆచరిస్తే తప్పక ప్రయోజనం కలుగుతుంది.
  2. అల్లాహ్ కు భాగస్వామ్యం కలిగించటం మరియు తల్లిదండ్రులకు అవిధేయత చూపటం నిషేధించబడినది.
  3. అబద్ధం చెప్పటం మరియు తప్పుడు సాక్ష్యం ఇవ్వటం నిషేధించబడినది.
  4. దైవప్రవక్త పై వారి సహచరులు చూపించిన భక్తి మరియు దైవప్రవక్తను చికాకు పెట్టకుండా సహనంతో ప్రవర్తించటం ద్వారా సహచరులలోని గొప్ప లక్షణాలు తెలుస్తున్నాయి.

ప్రశ్నలు

  1. దైవప్రవక్త తెలిపిన ఘోరాతిఘోరమైన మహాపాపములు ఎన్ని? అవి ఏవి?
  2. అబద్ధం చెప్పటం లేక తప్పుడు సాక్ష్యమివ్వటానికి గల కారణాలేమిటి?
  3. తల్లిదండ్రుల కోసం మనం ఏమని ప్రార్థించవలెను?(ఖుర్ఆన్ ఆధారంగా)
  4. ఈ హదీథ్ ద్వారా మీరు గ్రహించిన విషయాలేమిటి?

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్