“నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే“.(ఖురాన్ – 51 : 56)
షాబాన్ నెల ఇది ఇస్లాం నెలలో 8వ నెల ఈ నెల యెుక్క విశిష్టత ఏమిటంటే ఎంతో ఘనత కల్గిన రంజాన్ నెలను తనతో పాటు తెస్తుంది. అంటే ఈ నెల తరువాత వచ్చేది రంజాన్ నెల.
షాబాన్ మాసంలో ఇస్లాం అనుమతిస్తున్న మనం చేయవలసిన సత్కార్యాల్లో అతి ముఖ్యమైనది ఉపవాసం. స్వయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) షాబాన్ లో అత్యధికంగా ఉపవాసాలు పాటించేవారు. చూసేవారికి నెలంతా ఉపవాసమున్నారా అనిపించేది.
ఆయిషా (రజియల్లాహు అన్హా) చెప్పారు: “ప్రవక్తకు ఉపవాసం ఉండటానికి చాలా ప్రీతికరమైన మాసం షాబాన్ మాసం, ఈ మాసంలో ఉపవాసం పాటిస్తూ రమజాను వచ్చేసేది”.(అబూదావూద్ 2431).
وعن عائشة رَضِيَ اللهُ عنها قالت: لَمْ يكن النبي – صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ – يَصُومُ مِنْ شَهْرٍ أكْثَرَ مِنْ شَعْبَانَ، فَإنَّهُ كَانَ يَصُومُ شَعْبَانَ كُلَّهُ
ఆయిషా (రజియల్లాహు అన్హా) ఇలా తెలిపారు: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) షాబాన్ నెలలో (నఫిల్) ఉపవాసాలు పాటించినంతగా మరే ఇతర నెలలోనూ పాటించేవారు కాదు. నిశ్చయంగా ఆయన షాబాన్ నెలసాంతం ఉపవాసం పాటించేవారు. వెరొక ఉల్లేఖనం ప్రకారం షాబాన్ నెలలోని కొన్ని రోజులు మినహాయించి మిగతా రోజులన్నీ ఆయన ఉపవాసం పాటించేవారు”. (బుఖారీ 1969, ముస్లిం 1156)
మానవుల కర్మలు పైకి లేపబడే మాసం
ప్రవక్త షాబాన్ మాసంలో అత్యధికంగా ఉపవాసాలు పాటించటానికి గల కారణాన్ని వేరొక హదీసు ఈ విధంగా వివరించింది:
“ఇది రజబ్ మరియు రమజాను మధ్యలోని మాసం, ప్రజలు దాని పట్ల అశ్రద్ధగా ఉంటారు.దాసుల కర్మలు షాబాన్ మాసంలో అల్లాహ్ సన్నిధిలో ప్రవేశపెట్టబడతాయి. నేను ఉపవాసంలో ఉన్న స్థితిలోనే నా కర్మలు అల్లాహ్ సన్నిధిలో ప్రవేశపెట్టబడాలన్న కోరిక నాది“. (నసాఈ 2357, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ హసన్ అన్నారు.)
“ప్రతి సోమవారము మరియు గురువారాల్లో మానవుల ఆచరణలు ప్రవేశపెట్టబడతాయి”.ఈ హదీసు పైన కూడా శ్రద్ద వహించాలి.
హజ్రత్ అబూహురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:
“సోమ మరియు గురువారాల్లో (అల్లాహ్ సన్నిదిలో దాసుల) ఆచరణలు ప్రవేశపెట్టబడతాయి. అందుకని నేను ఉపవాసిగా ఉన్న స్ధితిలో నా ఆచరణ ప్రవేశపెట్టడాన్ని నేనిష్టపడతాను“.(తిర్మిజి- హసన్ , రియాదుస్ సాలిహీన్ :1257#)
పై హదీసులో రెండు లాభాలున్నాయి.
1. ప్రజలు అశ్రద్ధగా ఉన్నప్పుడు అల్లాహ్ ఆరాధన ఘనత చాలా గొప్పగా ఉంది.
ప్రత్యేకంగా ఉపవాసం, ఇందులో బాహ్యతనం లేదు. ఇఖ్లాస్ (చిత్తశుద్ధి) ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సత్కార్యం అందరూ చేస్తున్నప్పుడు వారిని చూసి చేయని వాడు కూడా ఆ సత్కార్యం చేయడానికి పూనుకుంటాడు, కాని ఎవరు చేయని సమయంలో సత్కార్యం చేయాలని ఆలోచన రావడం, ఆలోచన వచ్చినా నేను ఒక్కణ్ణి చేస్తే ఎవరేమంటారో అనే దురాలోచనకు దూరమైన ప్రత్యేక శ్రధ్ధతో, అల్లాహ్ సంతృష్టి ఉద్దేశ్యంతో చేయడం ఎంతో గొప్ప విషయే కాకుండా అత్యధిక పుణ్యానికి కూడా అర్హత కల్పిస్తుంది. ఇలాంటి వారికి ప్రవక్త ఎంత గొప్ప శుభవార్త ఇచ్చారో ఈ హదీసు చదవండి:
“మీ తర్వాత ఓర్పుసహనాల ఓ కాలం రానుంది, ఆ కాలంలో ధర్మంపై స్థిరంగా ఉన్న వ్యక్తికి 50 మంది అమరవీరుల పుణ్యం ఉంటుంది”. (తబ్రానీ కబీర్ 10394, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 2234లో సహీ అన్నారు.)
అబూ దావూద్ 4341లోని హదీసులో ఉంది:
“మీ తర్వాత ఓర్పు సహనాల ఓ కాలం రానుంది, అప్పుడు (ధర్మంపై స్థిరంగా ఉంటూ) సహనం వహించడం నిప్పులను చేత్తో పట్టుకోవడంతో సమానం. అప్పుడు సత్కార్యాలు చేసే వ్యక్తికి మీలోని 50 మందికి లభించే పుణ్యం లభిస్తుంది.”
2) ఈ మాసంలో సత్కార్యాలు అల్లాహ్ సన్నిధిలో ప్రవేశపెట్టబడతాయి.
అల్లాహు అక్బర్! గమనించండి: సాయంకాలం యజమాని ముందు పొద్దంతా చేసిన పని గురించి లెక్క చెప్పవలసి ఉంది అని తెలిసినప్పుడు ఆ పొద్దంతా ఎలా పనిచేస్తాడు ఆ గుమాస్త? మరి ప్రతి రోజు ఫజ్ర్ మరియు అస్ర్ లో రెండు సార్లు వారంలో ప్రతి సోమ, గురు రెండు రోజులు సంవత్సరంలో ఈ షాబాన్ మాసంలో మన కర్మలన్నీ అల్లాహ్ ముందు ప్రవేశపెట్టబడుతున్నప్పుడు మనం పాపాలకు ఎంత దూరంగా ఉండాలి. సత్కార్యాలు ఎంత ఎక్కువగా చేస్తూ ఉండాలి అర్థమవుతుంది కదా!
కాని ప్రజల సులభతరానికి, వారికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఎంతగా కాంక్షించేవారంటే, షాబాన్ 15రోజులు గడిసిన తర్వాత ఉపవాసం పాటించకూడదని ఆదేశించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “షాబాన్ సగం గడిచిపోయాక ఉపవాసం ఉండకండి”. (అబూదావూద్ 2337)
హదీసు వ్యాఖ్యానకర్తలు చెప్పారు: ప్రజలు షాబాన్ చివరి వరకు ఉపవాసాలు పాటించి, రమజానులో ఫర్జ్ (విధి) ఉపవాసాలు పాటించడంలో బలహీనులు కాకూడదని సగం షాబాన్ తర్వాత ఉపవాసాలు పాటించడం నుండి వారంచబడినది.
అల్లాహ్ మనందరికీ సద్బుద్ధిని మరియు సంపూర్ణ ఇస్లామ్ జ్ఞానాన్ని మరియు దాని మీద జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సంకలనం: ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ ఖతీబ్ అత్ తబ్రీజీ
హదీసుల పరిశీలన: షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ అల్ – అల్బానీ
తెలుగు అనువాదం: డా. అబ్దుర్రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా
విషయ సూచిక
1. రమ’దాన్ నెలవంక చూడటం – హదీస్ 1969 | పేజీ 620 2. ఉపవాసం గురించి వివిధ విషయాలు – హదీస్ 1982 | పేజీ 625 3. ఉపవాసాన్ని శుద్ధిపరచటం – హదీస్ 1999 | పేజీ 629 4. ప్రయాణికుని ఉపవాసం – హదీస్ 2019 | పేజీ 633 5. తప్పిన ఉపవాసాలు పూర్తి చేసుకోవటం – హదీస్ 2030 | పేజీ 636 6. అదనపు ఉపవాసాలు – హదీస్ 2036 | పేజీ 638 7. అదనపు (నఫిల్) ఉపవాసాల విరమణ – హదీస్ 2076|పేజీ 647 8. ఘనతగల రాత్రి (లైలతుల్ ఖద్‌ర్) – హదీస్ 2083 | పేజీ 649 9. ఏ’తెకాఫ్ – హదీస్ 2097|పేజీ 653
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
తీవ్ర ఎండకాలంలో ఉపవాసం పాటించడం మన సహాబాల సదాచారం:
హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ (రజియల్లాహు అన్హు) తీవ్ర ఎండకాలంలో నఫిల్ ఉపవాసాలు ఉండేవారు.
ముఆజ్ (రజియల్లాహు అన్హు) తన మరణ సమయంలో అన్నారు: “చావు వల్ల బాధ లేదు, ప్రతి ఒక్కరికీ రానుందే, కాని ఆ ఎండ తాపాన్ని భరిస్తూ ఉండే ఉపవాసాలు ఇక ఉండలేను కదా అని బాధ.”
ఉమర్ (రజియల్లాహు అన్హు) మరణించే ముందు తన సుకుమారుడైన అబ్దుల్లాహ్ కు చేసిన వసియ్యత్: “నీవు విశ్వాస ఉత్తమ గుణాల్ని అవలంభించు: వాటిలో మొదటిది తీవ్ర ఎండకాలంలో ఉపవాసాలు పాటించు” అని చెప్పారు.
ప్రియపాఠకుల్లారా! పైన సహాబాల కొన్ని ఉదారహణలు ఏవైతే తెలిపానో అవి వారి నఫిల్ ఉపవాసాల విషయం. రమజాను యొక్క ఫర్జ్ ఉపవాసాలైతే ఎలాగైనా ఉండేవారు. ఈ రోజుల్లో మనలో అనేక మంది రమజాను ఉపవాసాలకు ఎండలు బాగున్నాయి కదా అని, ఉండకూడని సాకులు వెతుకుతారు. కాని సహాబాలు ప్రయాణాలు చేసుకుంటూ, అంతే కాదు తీవ్ర ఎండకాలంలో యుద్ధాలు చేసుకుంటూ కూడా ఉపవాసాలు పాటించారు. తబూక్ యుద్ధం ఏ కాలంలో ఏ పరిస్థితుల్లో జరిగిందో తెలుసా? మండుతున్న ఎండలు, పండుతున్న ఖర్జూరాలు, కోతకు వచ్చిన ఖర్జూరాలు గనక చేతులో చిల్లి గవ్వ లేని పరిస్థితి ఎందరిదో! అప్పుడు కొంతమంది కపటవిశ్వాసులు తప్పించుకునే ఉద్దేశంతో ఈ తీవ్ర ఎండల్లో ఎలా బయలుదేరాలి అని సాకులు చెబుతూ,[لَا تَنفِرُوا فِي الْحَرِّ] (ఇంత తీవ్రమైన ఎండ వేడిలో బయలుదేరకండి) అని ఇతరులను ఆపే ప్రయత్నం చేశారు, అప్పుడు అల్లాహ్ తెలిపాడు:
“నరకాగ్ని ఇంతకన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది” అని వారికి చెప్పు. ఆ సంగతిని వారు గ్రహిస్తే ఎంత బావుండు!” (తౌబా 9:81).
హజ్జాజ్ ఒక ప్రయాణంలో మక్కా మదీనాల మధ్య నీళ్ళున్న చోట మజలీ చేశాడు, పగటి భోజనం తీసుకరమ్మని చెప్పాడు, సమీపంలో ఓ ఎడారివాసి (బద్దూ) కనబడగా అతడ్ని పగటి భోజనానికి ఆహ్వానించాడు, అతడన్నాడు: నీకంటే మేలైనవాడు నన్ను ఆహ్వానిస్తే నేను అతని ఆహ్వానాన్ని స్వీకరించాను. అతడెవుడు అని హజ్జాజ్ అడిగాడు, బద్దూ చెప్పాడు: అల్లాహ్! ఉపవాసముండమని చెప్పాడు, నేను ఉపవాసమున్నాను. ఈ మండుతున్న ఎండలోనా ఉపవాసం అని హజ్జాజ్ ఆశ్చర్యంగా అడిగాడు, అతడన్నాడు: “అవును, దీనికంటే మరీ విపరీతమైన ప్రళయం నాటి ఆ వేడి నుండి రక్షణ కొరకు ఉపవాసమున్నాను” అని చెప్పాడు. ఈ సమాధానం విని హజ్జాజ్ చెప్పాడు: “నఫిల్ ఉపవాసమే గనక ఈనాటి ఉపవాసం వదులుకో, నాతో కలసి భోజనం చేయి, రేపటి రోజు ఉపవాసం ఉండు”. అప్పుడు ఆ ఎడారివాసి “రేపటి రోజు వరకు నేను బ్రతికుంటానని జమానతు (గ్యారంటీ) ఇవ్వగలవా” అని అడిగాడు. ఆ జమానతు నేనివ్వలేనని హజ్జాజ్ చెప్పాడు.
గమనించారా పాఠకుల్లారా! మనిషి విశ్వాసపరంగా ఎంత బలంగా ఉండునో, మనస్థైర్యం ఎంత దృఢంగా ఉండునో అంతే ఎండల్ని ఓర్చుకోనైనా ఉపవాసాలు ఉండగలుగుతాడు.
మండుటెండల్లో ఉపవాసం యొక్క మాటే వేరు. దాని రుచి, దాని అనూన్యమైన ఆహ్లాదం సౌభాగ్యులకు, అదృష్టవంతులకే లభిస్తుంది. చెప్పుకుంటు పోతే సలఫె సాలిహీన్ లో ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి.
కాని చివరిలో ఒకే ఒక విషయం గుర్తు చేస్తాను, శ్రద్ధగా బుద్ధిపూర్వకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి: అదేమిటంటే: ప్రళయం నాడు సూర్యుడు అతి సమీపంలో ఉంటాడో, 50 వేల సంవత్సరాలకంటే దీర్ఘకాలం అది, ప్రతి ఒక్కడు తన పాదాన్ని కదిలించలేని స్థితిలో ఉంటాడు, ప్రతి ఒక్కడు తన పాపాల పరిమాణంలో తన చెమటలో మునిగి ఉంటాడు, ఛాయ ఎక్కడా ఉండదు, కేవలం అల్లాహ్ అర్ష్ ఛాయ తప్ప. ఇన్నీ ఘోరమైన పరిస్థితులను ఎదురుకునే శక్తి నీలో ఏమైనా ఉందా? లేదు, ముమ్మాటికీ లేదు!!!
ఇక దేనికి ఆలస్యం ఉపవాసం ఉండడంలో.
కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ ZFGO జుల్ఫీ దావా సెంటర్ – సౌది అరేబియా
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఉపవాసం అంటే: అల్లాహ్ ప్రసన్నత కొరకు, అల్లాహ్ ఆరాధన ఉద్దేశ్యంతో ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలు, సంభోగము మరియు ఉపవాసమును భంగ పరుచు కార్యాలన్నిటినీ విడనాడుట. (దీనినే అరబిలో సౌం, ఉర్దులో రోజా అంటారు).
రమజాను ఉపవాసాలు విధి:
రమజాను ఉపవాసాలు ఇస్లాం ఐదు మూల స్తంభాలలో ఒకటి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఈ ఆదేశానుసారం:
ఇస్లాం పునాది ఐదు మూలస్తంభాలపై ఉంది: (1) సత్య ఆరాధ్యనీయుడు అల్లాహ్ తప్ప మరెవ్వడూ లేడు, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట. (2) నమాజు స్థాపించుట. (3) జకాత్ (విధిదానం) చెల్లించుట. (4) హజ్ చేయుట. (5) రమజాన్ ఉపవాసాలు పాటించుట. (బుఖారి 8, ముస్లిం 16).
రమజాను ఉపవాసాలు విధిగా ఉన్నాయని క్రింది ఆయతు ఆధారంగా ఏకాభిప్రాయం ఉంది:
ప్రతీ తెలివిగల, యుక్తవయస్సుకు చేరిన ముస్లిం స్త్రీ, పురుషునిపై రోజా విధిగా ఉంది. 15 సంవత్సరాలు నిండుట లేదా నాభి క్రింద వెంట్రుకలు మొలుచుట, స్వప్నస్ఖలనమగుట మరియు బాలికలకు పై మూడింటితో పాటు నెలవారి రక్తస్రావమగుట. వీటిలో ఏ ఒక్కటి సంభవించినా యుక్త వయస్సుకు చేరినట్లే.
ఉపవాసం ద్వారా లాభం?
ఉపవాసం ద్వారా మనోవాంఛలకు తెరపడుతుంది. ఐహిక భోగభాగ్యాల వృధా కోరికలు తగ్గుతూ, పరలోక భీతి భావం పెరుగుతుంది. నిరుపేదల పట్ల సానుభూతి కలుగుతుంది. ఉపవాస స్థితిలో కలిగే ఆకలిదప్పులు బీదవాళ్ళ బాధను గుర్తు చేస్తాయి.
రమజాన్ & ఉపవాసాల ఘనత
అల్లాహ్ రమజాను మాసమునకు అనేక ఘనతలు ప్రత్యేకించాడు. ఇతర సమయాల్లో ఆ ఘనతలు లేవు. వాటిలో కొన్ని ఇవి:
9- ఈ తరావీహ్ జమాఅతుతో చేసేవారికి రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం.
10- ఉపవాసం ఉండేవారికి స్వర్గంలో ప్రత్యేకం ద్వారం ఉంది. దాని పేరు: రయ్యాన్. వారు తప్ప ఎవరూ దాని నుండి ప్రవేశించరు.
11 – ఉపవాసం మరియు ఖుర్ఆన్ సిఫారసు చేస్తాయి. వారి సిఫారసు అంగీకరించబడుతుంది.
12- ఒక్క ఉపవాసానికి బదులుగా 70 సం. నరకం నుండి దూరం ఉంచబడుతారు.
ఇంకా ఈ గౌరవ మాసపు ఘనతలో అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఈ శుభవార్త కూడా ఉంది:
ఏ వ్యక్తి సంపూర్ణ విశ్వాసం మరియు పరలోక ప్రతిఫలాపేక్షతో రమజాను ఉపవాసాలు పాటిస్తాడో అతని పూర్వపు పాపాలు మన్నించబడతాయి. (బుఖారి 38, ముస్లిం 760).
ఆదము కుమారుడు చేసే ప్రతీ సత్కార్యానికి రెట్టింపు పుణ్యం ఉంటుంది. అల్లాహ్ చెప్పాడు: “కాని ఉపవాసం, అది నా కొరకు కాబట్టి నేనే స్వయంగా దాని ఫలితమిస్తాను”.(ముస్లిం 1151).
రమజాను నెల ఆరంభ నిదర్శన:
ఈ క్రింది రెండు విషయాల్లో ఏదైనా ఒక దానితో రమజాన్ నెల ప్రారంభమైనదని రుజువగును:
1- రమజాన్ మాసము యొక్క నెలవంక చూసినచో రోజా విధియగును.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశం ఇదే:
నెలవంక చూసి రోజా ఉండండి. నెలవంక చూసి ఇఫ్తార్ (పండుగ) చేయండి. (బుఖారి 1909, ముస్లిం 1081).
విశ్వాసము (నీతి నిజాయితిగల) ఒక వ్యక్తి రమజాన్ నెలవంక చూశానని సాక్ష్యమిస్తే నమ్మాలి. షవ్వల్ నెలవంక విషయంలో మాత్రం విశ్వాసం గల ఇద్దరు వ్యక్తుల సాక్ష్యం తప్పనిసరి.
2- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశం:
మేఘాలు క్రమ్ముకొని ఉన్నప్పుడు మీరు 30 రోజుల లెక్క పూర్తి చేయండి. (బుఖారి 1907, ముస్లిం 1081)
దీని ప్రకారం షాబాన్ నెల 30 రోజులు పూర్తి అయిన తర్వాత 31వ రోజు రమజాన్ యొక్క మొదటి రోజు అగును.
ఎవరిపై రోజా విధిగా లేదు?
1- రోగి: స్వస్థత పొందే నమ్మకం ఉన్న వ్యాదిగ్రస్తుడు. అతనికి ఉపవాసం ఉండుట కష్టంగా ఉంటే, కష్టం ఉన్న రోజుల్లో ఉపవాసం మానుకొని, అన్ని రోజుల ఉపవాసం తర్వాత ఉండాలి.
స్వస్థత పొందే నమ్మకం లేని వ్యాదిగ్రస్తుడు ఉపవాసం ఉండనవసరం లేదు. కాని ప్రతి ఒక్క ఉపవాసానికి బదులుగా ఒక బీదవానికి కడుపు నిండా అన్నం పెట్టాలి. లేదా ఎన్ని రోజుల ఉపవాసం మానేశాడో లెక్కేసుకొని అంత మంది బీదవాళ్ళకు ఒకే రోజు విందు చేయాలి.
2- ప్రయాణికుడు: ఇంటి నుండి వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఉపవాసం మానేయవచ్చును. అయితే అక్కడ నివసించే ఉద్దేశం ఉండకూడదు.
3- గర్భిణి, పసి బిడ్డలకు పాలిచ్చు తల్లి: తనకు లేదా పసిబిడ్డకు అనారోగ్య భయం ఉన్నచో ఉపవాసం మానేసి, ఈ ఆటంకం దూరమయ్యాక అన్ని రోజుల ఉపవాసం వేరే రోజుల్లో ఉండాలి.
4- ఉపవాసముండే శక్తి లేని వృద్ధులు: వారు ఉపవాసం మానుకోవచ్చు. కాని ఒక రోజుకు బదులుగా ఒక బీదవానికి అన్నం పెట్టాలి.
రోజాను భంగ పరుచు విషయాలు:
1- గుర్తుండి తిని త్రాగడం వల్ల రోజా భంగమగును. కాని మరచిపోయి తిన త్రాగటం వల్ల రోజా భంగం కాదు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
ఏ ఉపవాసి అయినా మరచిపోయి ఏదన్నా తిన్నా, త్రాగినా (ఫరవాలేదు) అతను తన రోజాను కొనసాగించాలి. (ముస్లిం 1155).
ముక్కు ద్వారా కడుపులో నీళ్ళు పోయినా రోజా భంగమవుతుంది. నాడి ద్వారా ఏదైనా ఆహారం అందించడం, రక్తం ఎక్కించడం వల్ల రోజా వ్యర్థమవుతుంది. ఇవి ఉపవాసికి ఆహారంగా పని చేస్తాయి.
2- సంభోగించడం. ఉపవాసమున్న వ్యక్తి సంభోగించినచో ఉపవాసం భంగమగును. దానికి బదులుగా రమజాను తర్వాత ఒక రోజు ఉపవాసం ఉంటూ ఈ పరిహారం చెల్లించుటవిధిగా ఉంది. (1) ఒక బానిసకు విముక్తి కలిగించాలి. ఈ శక్తి లేనిచో (2) వరుసగా రెండు నెలల ఉపవాసాలుండాలి. అకారణంగా వరుస తప్పవద్దు. ఉదాః రెండు పండుగలు, ఈదుల్ అజ్హా తర్వాత మూడు రోజులు, లేదా అనారోగ్యం మరియు ప్రయాణం లాంటి కారణాలు. రోజా తప్పాలనే ఉద్దేశంతో ప్రయాణం చేయకూడదు. ఒకవేళ అకారణంగా ఒక రోజు కూడా ఉపవాసం మానుకున్నా మళ్ళీ కొత్త వరుసతో ఉపావాసాలు మొదలు పెట్టాలి. ఒకవేళ రెండు నెలల ఉపవాసాలు కూడా ఉండే శక్తి లేనిచో (3) అరవై మంది పేదలకు అన్నం పెట్టాలి.
3- ముద్దులాట, హస్తప్రయోగం వల్ల వీర్యం పడి పోతే ఉపవాసం భంగమవుతుంది. (హస్త ప్రయోగానికి ఇస్లాంలో అనుమతిలేదు). వాటికి పరిహారం లేదు కాని తర్వతా ఒక రోజా ఉండాలి. ఒకవేళ నిద్రలో స్ఖలనమైనచో రోజా భంగం కాదు.
4- కరిపించి దేహం నుండి రక్తం తీయించుట, లేదా రక్తదానం కొరకు ఆధునిక పద్ధతిలో రక్తం తీయుంచుట వల్ల రోజా భంగమగును. కాని రక్తపరీక్ష ఉద్దేశంతో కొంచం తీయుట వల్ల రోజా భంగం కాదు. అలాగే పుండు నుండి, ముక్కు నుండి రక్తం వెలితే, పన్ను వూడి రక్తం వెలితే రోజా భంగం కాదు.
5- ఉద్దేశ్యంతో కావాలని వాంతి చేస్తే రోజా భంగమవుతుంది. కాని మనిషి తన ప్రమేయం లేకుండా అదే వస్తే రోజా భంగం కాదు.
పై విషయాలు, ఏ మనిషి తెలిసి చేస్తాడో అతని రోజా మాత్రమే భంగమగును. వాటి ధార్మిక ఆదేశాలు తెలియక లేదా సమయం తెలియక (ఉదా: ఉషోదయం కాలేదని అను కొనుట, లేదా సూర్యాస్తమయం అయినది అనుకొనుట లాంటివి) ఏదైనా తప్పు జరిగితే రోజా భంగం కాదు.
గుర్తుండి వాటికి పాల్పడ కూడదు. మతి మరుపుతో జరిగిన విషయంలో కూడా పట్టు బడరు. తాను కావాలని చేయకూడదు. ఎవరైనా అతనిపై ఒత్తిడి, బలవంతం చేసినందు వల్ల అతను వాటికి పాల్పడితే రోజా భంగం కాదు. తర్వాత దాన్ని పూర్తి చేయనవసరం లేదు.
6- ఉపవాస స్థితిలో స్త్రీలకు బహిష్టు వచ్చినా, వారు ప్రసవించినా రోజా భంగమగును. అలాగే రక్తస్రావం ఉన్నన్ని రోజులు ఉపవాసం ఉండరాదు. ఎన్ని రోజుల ఉపవాసం ఉండలేక పోయారో శుద్ధి పొందిన తర్వాత అన్ని రోజుల ఉపవాసం పూర్తి చెయ్యాలి.
రోజాను భంగపరచని విషయాలు:
1- స్నానం చేయుట, ఈతాడుట, వేసవిలో నీళ్ళు పోసుకొని శరీర భాగాన్ని చల్లబరుచుట.
2- ఉషోదయం వరకు తిని త్రాగుట మరియు సంభోగించుట.
3- ఏ సమయములోనైనా మిస్వాక్ చేయుట వల్ల రోజా భంగము కాదు, మక్రూహ్ కాదు. అది ఏ స్థితిలో కూడా చేయుట అభిలషణీయం.
4- ఆహారముగా పని చేయని ధర్మసమ్మతమైన ఏ రకమైన చికిత్స అయినా సరే చేయవచ్చును. ఇంజక్షన్, చెవుల్లో, కళ్ళల్లో మందు వేయించటం, దాని రుచి ఏర్పడినా సరే. ఒకవేళ ఇఫ్తార్ వరకు ఆగటం వల్ల ఏ నష్టం లేకుంటే ఆలస్యం చేయడం మంచిది. ఉబ్బసం (Asthma)తో బాధపడు తున్నవారికి ఆక్సిజన్ (Oxygen) ఎక్కించడం వల్ల రోజా భంగం కాదు. కడుపులో చేరకుండా జాగ్రత్త పడుతూ వంటకాల రుచి చూడడం. అలాగే పుక్కిలించడం, తిన్నగా ముక్కులో నీళ్ళు ఎక్కించడం తప్పు కాదు. అయితే తిన్నగా ఎక్కించే విషయంలో అజాగ్రత్త వల్ల ముక్కు ద్వారా నీళ్ళు కడుపులో పోయే ప్రమాదం ఉంటుంది. సువాసన పూసుకోవడం, దానిని ఆఘ్రాణించడం కూడా తప్పు లేదు.
5- రాత్రి సమయంలో రకస్రావం నిలిచిన బహిష్టురాలు, బాలింతలు అలాగే సంభోగించుకున్న దంపతులు సహరీ తర్వాత ఫజ్ర్ నమాజుకు ముందు గుస్ల్ (స్నానం) చేసినా అభ్యంతరం లేదు.
ముఖ్య విషయాలు:
1- రమజాను మాసములో పగలు ఇస్లాం స్వీకరించిన వ్యక్తి సూర్యస్తమయం వరకు ఏమీ తిన త్రాగకుండా ఉండాలి. కాని ఆ రోజుకు బదులుగా తర్వాత మరో ఉపవాసం ఉండనక్కరలేదు.
2- ఫర్జ్ రోజా సంకల్పం (నియ్యత్) ఉషోదయానికి ముందు వరకు రాత్రి ఏ నమయంలోనైనా చెయ్యాలి. నఫిల్ రోజా సంకల్పం ఏమీ తినత్రాగకుండా ఉన్న వ్యక్తి ఉషోదయమే కాదు పొద్దెక్కిన తర్వాత కూడా చేయవచ్చును.
3- రోజా ఉన్నవారి దుఆ అంగీకరించబడును కనుక ఎక్కవ దుఆ చెయ్యాలి. ఇఫ్తార్ సయమంలో ఈ దుఆ చదవాలి:
“జహబజ్జమఉ వబ్ తల్లతిల్ ఉరూఖు వసబతల్ అజ్రు ఇన్షా అల్లాహ్”. ( దాహం తీరింది, నరాలు తడి అయ్యా యి. అల్లాహ్ దయతో పుణ్యం కూడా లభించును).
4- సూర్యోదయం తర్వాత ఏ సమయంలో గాని ఈ రోజు మొదటి రమజాన్ నెల అని తెలిసినచో సూర్యాస్తమయం వరకు తినత్రాగ కుండా ఉండాలి. రమజాన్ తర్వాత ఈ రోజు ఉపవాసం పూర్తి చేయాలి.
5 – ఖజా (అప్పు) రోజాల భారము తొందరగా దిగిపోవుటకు రమజాను తర్వాత వెంటనే రోజాలు ఉంటే మంచిది. ఆలస్యమైనా అభ్యంతరం లేదు. అలాగే అవి క్రమంగా ఉండవచ్చు, క్రమం తప్పి ఉండవచ్చు. కాని అకారణంగా మరో రమజాన్ వరకు వేచించుట యోగ్యం లేదు.
రోజా ధర్మములు:
1- సహరి చేయడం. అనగా ఉషోదయమున ఉపవాసం ఉద్దేశంతో భుజించడం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
“సహరి భుజించండి. సహరిలో చాలా బర్కత్ (శుభం) ఉంది.” (బుఖారి 1923, ముస్లిం 1095).
సహరి చివరి సమయంలో చేయడం చాలా మేలు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
“ఇఫ్తార్ చేయడంలో తొందరపడండి, సహరి చేయడంలో ఆలస్యం చేయండి.” (సహీహ 1773).
2- సూర్యాస్తమయం అయిన వెంటనే ఇఫ్తార్ చెయ్యాలి. రుతబ్ (ఖర్జూరపు ఆరంభపు పండు) తో ఇఫ్తార్ చేయడం సున్నత్. అవి దొరకనప్పుడు ఖర్జూరాలతో, అవీ లేనప్పుడు నీళ్ళతో, అది కూడా లభించనప్పుడు ఏది సులభంగా లభ్యమగునో దానితోనే ఇఫ్తార్ చేయాలి.
3- రోజా స్థితిలో దుఆ చేస్తూ ఉండాలి. ప్రత్యేకంగా ఇఫ్తార్ సమయంలో.
“పూర్తి విశ్వాసం, పరలోక ప్రతిఫలాపేక్షతో తరావీహ్ నమాజ్ చేయువారి పూర్వం జరిగిన అపరాధాలు మన్నించబడతాయి.”(బుఖారి 37, ముస్లిం 759).
తరావీహ్ నమాజ్ ఇమాం వెనక పూర్తి చేయడం చాలా మంచిది.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“తరావీహ్ నమాజ్ ఇమాంతో చేసినవారికి పూర్తి రాత్రి తరావీహ్ చేసినంత పుణ్యం లిఖించ బడుతుంది” (తిర్మిజి 806, నసాయి వగైరా).
5- రమాజాను నెలలో ముస్లిం అత్యధికంగా చేయవలసిన సత్కార్యాలలో ఒకటి దానధర్మాలు.
6- అలాగే ఖుర్ఆన్ పారాయణం ఎక్కువగా చేయాలి. రమజాను మాసము ఖుర్ఆను మాసం. ఖుర్ఆన్ పాఠకునికి ఒక్కో అక్షరం పై పది పుణ్యాలు లభిస్తాయి.
తరావీహ్ నమాజ్:
దీనినే రాత్రి నమాజ్ మరియు తహజ్జుద్ నమాజ్ అని అంటారు. ఇది రమజాను మాసములో జమాఅతుతో పాటించునది. దీని సమయం ఇషా తరువాత నుండి మొదలుకొని ఉషోదయం వరకుంటుంది. దీనిని పాటించాలని ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) చాలా ప్రోత్సహించారు. పదకుండు రకాతులు చేయుటయే సున్నత్. ప్రతి రెండు రకాతులకు సలాం చెప్పాలి. పదకుండు రకాతులకంటే ఎక్కువగా నఫిల్ ఉద్దేశంతో చేస్తే పరవాలేదు. తరావీహ్ నమజులో దీర్ఘంగా ఖుర్ఆన్ పారాయణం చేయుట కూడా ఒక సున్నత్. కాని వెనక జమాఅతులో ఉన్నవారికి కష్టం కాకుండా ఉండాలి. స్త్రీల కొరకు తగిన సురక్షితం ఉన్నప్పుడు, వారు కూడా ఈ నమాజులో మస్జిదుకు రావచ్చు. కాని ఏ అలంకరణ, సువాసన లేకుండా హాజరు కావాలి.
నఫిల్ ఉపవాసాలు:
ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) ఈ రోజుల్లో ఉపవాసాలుండాలని ప్రోత్సహించారు.
1- షవ్వాల్ మాసములో ఆరు రోజాలు. ఆయన ఆదేశం ఇది:
“ఎవరు రమజాను మాసమెల్లా ఉపవాసాలుండి, షవ్వాల్ మాసములో ఆరు ఉపవాసాలుంటాడో అతనికి సంవత్సరమెల్లా ఉపవాసాలున్నంత పుణ్యం లభిస్తుంది.”(ముస్లిం 1164).
2- ప్రతి సోమవారం, గురువారం.
3- ప్రతి నెల మూడు రోజులు. అవి చంద్రమాస ప్రకారం 13,14,15 తారీకుల్లో ఉంటే మంచిది.
4- ఆషూరా రోజు. అంటే ముహర్రం పదవ తారీకు. అయితే ఒక రోజు ముందు 9,10 లేదా ఒక రోజు తర్వాత 10,11 కలిపి రోజా ఉండడం. మంచిది. ఇందులో యూదుల ఆచారానికి భిన్నత్వం కూడా ఉంది. దీని ఘనతలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రభోదించారని, అబూ ఖతాద (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“ఆషూరా రోజాకు బదులుగా అల్లాహ్ గత ఒక సంవత్సరపు అపరాధాలు మన్నిస్తాడని నా నమ్మకం.”(ముస్లిం 1162).
5- అరఫా రోజు ఉపవాసం. అది జిల్ హిజ్జ మాసంలో 9వ తారీకు. దీని గురించి ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు.
“అరఫా రోజాకు బదులుగా అల్లాహ్ గత ఒక సంవత్సరం మరియు వచ్చే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాపాల్ని మన్నిస్తాడని నా నమ్మకం.” (ముస్లిం 1162).
రోజా ఉండరాని రోజులు:
1- పండుగ రోజుల్లో. ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అజ్ హా
2- ఈదుల్ అజ్ హా తరువాత మూడు రోజులు. కాని హజ్జె ఖిరాన్, హజ్జె తమత్తు చేయువారు ఖుర్బానీ చేయకుంటే, వారు ఈ రోజుల్లో ఉపవాసముండ వచ్చును.
3- బహిష్టురాలు మరియు బాలింతలు తమ గడువులో ఉండరాదు.
4- భర్త ఇంటి వద్ద ఉన్నప్పుడు భార్య తన భర్త అనుమతి లేనిది నఫిల్ ఉపవాసాలుండరాదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు:
ఒక స్త్రీ తన భర్త ఇంటిలో ఉన్నప్పుడు అతని అనుమతి లేనిదే రోజా ఉండకూడదు. రమజాను మాసము తప్ప. (అబూ దావూద్ 2458, బుఖారి 5192, ముస్లిం 1026).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అత్యంత పవిత్రమైన నెలలలో ఒకటైన ముహర్రం నెల త్వరలో మన ముందుకు రాబోతున్నది. ఇటువంటి శుభప్రదమైన నెలలో ఎక్కువ పుణ్యాలు సంపాదించిపెట్టే మంచిపనుల గురించి ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవలెను. దీని ద్వారా వారు తమ ఉన్నత స్థితిని మరింతగా అభివృద్ధి పరచుకోవటానికి, చేసిన పాపాలను క్షమింప జేసుకోవటానికి మరియు అల్లాహ్ మెప్పును పొందటానికి ప్రయత్నించేందుకు ఇది ఒక మంచి అవకాశం.
[6 నిమిషాల వీడియో] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఫర్జ్ ఉపవాసము యొక్క నియ్యత్ (సంకల్పం) ఎప్పుడు చేసుకోవచ్చు? నఫిల్ ఉపవాసము యొక్క నియ్యత్ ఎప్పుడు చేసుకోవచ్చు?
విధిగా ఉండవలసిన ఉపవాస సంకల్పం (నియ్యత్) ఉషోదయానికి(ఫజ్ర్) ముందు రాత్రి వేలలో ఏ సమయంలోనైనా చెయ్యాలి. అయితే నఫిల్ ఉపవాస సంకల్పం ఏమీ తిన త్రాగ కుండా ఉన్న వ్యక్తి పొద్దెక్కిన తర్వాత కూడా చేయవచ్చును.
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అరఫా రోజు ఘనత హజ్ చేసే వారికే పరిమితమా? – ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
1251. హజ్రత్ అబూ ఖతాదా (రధి అల్లాహు అన్హు) కధనం :
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అరఫా నాటి ఉపవాసం గురించి విచారించటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ,
“అది క్రితం యేడు మరియు వచ్చేయేటి పాపాలన్నిటినీ (minor sins – చిన్న పాపాలు) తుడిచి పెట్టేస్తుంది” అని వివరించారు.
[సహీహ్ ముస్లిం లోని ఉపవాసాల ప్రకరణం]
ముఖ్యాంశాలు:-
జుల్ హిజ్జా మాసపు తొమ్మిదో తేదీని ‘అరఫా రోజు’ అని పిలుస్తారు. ఆ రోజు హజ్ యాత్రికులందరూ అరఫాత్ మైదానంలో ఆగుతారు. కనుక ఆ రోజును ‘అరఫాత్ రోజు’ గా వ్యవహరిస్తారు. ఆ విధంగా అరఫాత్ మైదానంలో ఆగటమనేది హజ్ విధులన్నిటిలోనూ అత్యంత ప్రధానమైనది. దాన్ని నిర్వర్తించకపోతే హజ్జే నెరవేరదు. హజ్ యాత్రికులు ఆ రోజున ప్రార్ధనలు, సంకీర్తనల్లో నిమగ్నులై ఉంటారు. ఆనాడు వారికి అదే గొప్ప ఆరాధనగా పరిగణించబడుతుంది. కనుక వారు ఆరోజు ఉపవాసం పాటించటం అభిలషణీయం కాదు. కాని హజ్ యాత్రలో పాల్గొనని వారికి మాత్రం ఆరోజు ఉపవాసం పాటిస్తే గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. ఆ ఒక్క ఉపవాసం రెండేళ్ళ పాపాలను తుడిచిపెట్టేస్తుంది.
227 వ అధ్యాయం – అరఫా రోజు మరియు ముహర్రమ్ మాసపు తొమ్మిదో తేదీల్లో పాటించబడే ఉపవాసాల ఘనత. హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లా అలై)
హజ్జతుల్ విదా (ఆఖరి హజ్) లోని అరఫా రోజు శుక్రవారం వచ్చింది. ఆ రోజు ఖుర్ఆన్ లోని ఈ ఆయతు (వచనం) అవతరించింది: “ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను.” (ఖుర్ఆన్, సూరా మాయిదా 5:3)
అల్లాహ్ ధర్మాన్ని పూర్తిగావించాడు. ఇప్పుడు ఇందులో ఎలాంటి మార్పుచేర్పులకు తావులేదు. అందువల్లే అల్లాహ్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో ప్రవక్తల పరంపరను అపివేశాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చిట్ట చివరి ప్రవక్త. అల్లాహ్ ఇస్లాం ధర్మాన్ని ఆమోదించాడు, అనగా అల్లాహ్ కు ఇస్లాం తప్ప వేరే ఏ ఇతర ధర్మం సమ్మతం కాదు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దిల్ హజ్జ్ మాసపు 9వ రోజున (అరఫా రోజు) ఉపవాసం ఉండేవారు. హునైదహ్ ఇబ్నె ఖాలిద్ తన భార్య ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొందరు భార్యలు ఇలా పలికినారని ఉల్లేఖించెను:
”ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 9వ దిల్ హజ్జ్ దినమున, అషూరహ్ దినమున, ప్రతి నెల మూడు దినములలో మరియు ప్రతి నెల మొదటి రెండు సోమవారాలు మరియు గురువారాలు ఉపవాసం ఉండేవారు.”
(అన్నిసాయి హదీథ్ గ్రంథం, 4/205 మరియు అహూ దావూద్ హదీథ్ గ్రంథం; సహీహ్ అబి దావుద్ గ్రంథంలో, 2/462 దీనిని సహీహ్ హదీథ్ గా షేఖ్ అల్ బానీ వర్గీకరించెను.)
అరఫా రోజు చేసే ప్రార్ధన (దుఆ, తస్బీహ్)
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: అరఫా రోజున చేసే దుఆ అన్నిటికంటే ఉత్తమమైనది. అరఫా రోజున నేను మరియు ఇతర ప్రవక్తలు పలికిన ఉత్తమ పదాలు:
“లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్.”
“కేవలం ఒక్కడైన అల్లాహ్ తప్ప ఆరాధ్యానికి అర్హులు ఎవ్వరూ లేరు. అతనికి సహవర్తులూ ఎవ్వరు లేరు. రాజ్యాధినేత ఆయనే, స్తోత్రములన్నీఆయన కొరకే. అయన అన్నీ చేయగలడు.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు:
“అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించాడు: “ఆదం సంతతి యొక్క ప్రతి కార్యము తన కొరకు. కాని ‘సౌమ్’ (ఉపవాసము) నాకొరకు. నేను దాని ప్రతిఫలం నొసంగుతాను.” ఉపవాసము ఒక ఢాలు. మీలో ఎవరైనా ఉపవాసం ఉన్న యెడల అతను భార్యతో కలువరాదు, తప్పుడు మాటలు పలుకరాదు, ఎవరైన వచ్చి అతనిని తిట్టినా, పోట్లాడినా అతనితో “నేను ఉపవాసము ఉన్నాను” అని చెప్పి తప్పించుకోవాలి. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రాణం ఎవరి చేతిలో ఉందో, ఆయన (అల్లాహ్) సాక్షిగా, ఉపవాసి యొక్క నోటి వాసన అల్లాహ్ దగ్గర కస్తూరి సువాసన కంటే ఎంతో ఉత్తమమైనది. ఉపవాసి రెండు సౌఖ్యాలు పొందుతాడు. ఒక సౌఖ్యం ఇఫ్తార్ సమయంలో పొందుతాడు, రెండవది తన ప్రభువును కలుసుకున్నపుడు.”
పరలోక చింత మాసపత్రిక – సంచిక 4 సెప్టెంబరు 2007
క్లుప్త వివరణ: రోజా (విధి ఉపవాసాలు), ఉపవాసాల ప్రాముఖ్యత, ఉపవాసం ఖుర్ఆన్ వెలుగులో, రమజాన్ నెలవంక చూచే నియమాలు, సంకల్పము, సహ్ రీ మరియు ఇఫ్తారీ (ఉపవాస విరమణ) నియమాలు, తరావీహ్ నమాజు సిద్ధాంతాలు, ఉపవాసాలు వదిలే సందర్భాలు, తప్పిపోయిన రోజాలను పూర్తి చేసుకునే సిద్ధాంతాలు, ఉపవాస స్థితిలో చేయగల పనులు, లైలతుల్ ఖదర్ (మహా శుభరాత్రి) ప్రత్యేకతలు, సమస్యలు, ఫిత్రా దానధర్మాలు, ఈద్ పండుగ నమాజుల సిద్ధాంతాలు, పండుగల తక్బీర్లు, ఉపవాసకులు చేయకూడని పనులు, ఉపవాసాన్ని భంగం చేసే పనులు, ఉపవాసం పాటించకూడని దినములు, అదనపు ఉపవాసాలు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.