
[3:04 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
[3:04 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
Qur’an Surah 78.An-Naba – Telugu Subtitles
78 సూరహ్ అన్-నబా
అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో
1. (*) ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు?
2. ఆ మహా వార్తను గురించేనా?
3. దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారో!
4. అదికాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.
5. ఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.
6. ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా?
7. మరియు పర్వతాలను మేకులుగా?
8. మరియు మేము మిమ్మల్ని (స్త్రీ , పురుషుల) జంటలుగా సృష్టించాము.
9. మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము.
10. మరియు రాత్రిని ఆచ్చాదంగా చేశాము.
11. మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము.
12. మరియు మేము మీపైన పటిష్ఠమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము.
13. మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము.
14. మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము.
15. దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లుచేమలను) పెరిగించటానికి!
16. మరియు దట్టమైన తోటలను.
17. నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం.
18. ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచివస్తారు.
19. మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి;
20. మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమైపోతాయి.
21. నిశ్చయంగా, నరకం ఒక మాటు;
22. ధిక్కారుల గమ్యస్థానం;
23. అందులో వారు యుగాలతరబడి ఉంటారు.
24. అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవిచూడరు.
25. సలసల కాగే నీరు మరియు చీములాంటి మురికి (పానీయం) తప్ప!
26. (వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా!
27. వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు.
28. పైగా వారు మా సూచన (ఆయాత్) లను అసత్యాలని తిరస్కరించారు.
29. మరియు మేము (వారు చేసిన) ప్రతి దానిని ఒక పుస్తకంలో వ్రాసిపెట్టాము.
30. కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవిచూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము.
31. నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది;
32. ఉద్యానవనాలూ, ద్రాక్షతోటలూ!
33. మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందరకన్యలు;
34. మరియు నిండి పొర్లే (మధు) పాత్ర.
35. అందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్ధపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు.
36. (ఇదంతా) నీ ప్రభువు తరుఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం.
37. భూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన అనంత కరుణామయుని (బహుమానం); ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు.
38. ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్) మరియు దేవదూతలు వరుసలలో నిలిచిఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడలేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు.
39. అదే అంతిమ సత్యదినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి!
40. నిశ్చయంగా, మేము అతి సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతిమనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు. మరియు సత్యతిరస్కారి: “అయ్యో, నా పాడుగానూ! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది!” అని వాపోతాడు.
Telugu Translation Source: దివ్య ఖురాన్ సందేశం
Qur’an Telugu – Surah 29. Al Ankaboot (The Spider)
పరిచయం :
ఇది మక్కాలో అవతరించిన సూరా. ఇందులో 69 ఆయతులు ఉన్నాయి. ఎకధైవారాధన, ప్రవక్తల పరంపర, మరణానంతరం మళ్ళీ లేపబడటం, ప్రవక్తలందరినీ విశ్వసించడం, వారు తీసుకు వచ్చిన దైవగ్రంధాలన్నింటిని విశ్వసించడం మొదలైన మౌలిక ధార్మిక విశ్వాసాలను ఇందులో నొక్కిచెప్పడం జరిగింది. ఈ సూరాలో సాలీడు గురించి, దాని సాలెగూటి గురించి ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. అవిశ్వాసులకు – సాలీడుకు మధ్య పోలికలు చెప్పడం జరిగింది. సాలీడు ఒక బలహీనమైన ప్రాణి, అది తన బలహీనమైన సాలెగూటిలో రక్షణ పొందాలని చూస్తుంది. కాని ఈ సాలెగూడు దానిని బయటి ప్రమాదాల నుంచి కాపాడలేదు. అదేవిధంగా అవిశ్వాసులు కూడా బలహీనమైనవారు, తాము ఆరాధించే బలహీనమైన, సామర్ధ్యం లేని విగ్రహాల ద్వారా రక్షణ పొందాలని చూస్తున్నారు. ఈ కుహనా దేవుళ్ళుకాని, మానవులు కాని, కలపతో లేదా రాళ్ళతో చేయబడిన దేవుళ్ళు కాని అవిశ్వాసులకు రక్షణ ఇవ్వలేరు. వారి ప్రయోజనాలు కాపాడలేరు. వారికి హాని కూడా కలిగించలేరు. కాగా విశ్వాసులు విశ్వప్రభువు, సర్వ శక్తిసంపన్నుడైన అల్లాహ్ ను రక్షణ కోరుతారు. అల్లాహ్ వారికి బహుమానాలు ప్రసాదించే శక్తికలిగినవాడు, అహంభావులకు, దేవునికి భాగస్వాములను కల్పించిన వారికి శిక్ష విధించే సామర్ధ్యం కలిగినవాడు.
అల్లాహ్ కే గల ప్రత్యేకమైన సృష్టి సామర్ధ్యాన్ని ఈ సూరా క్లుప్తంగా తెలియజేసింది. ఆయనకున్న శక్తిసామర్ధ్యాలను స్పష్టం చేసింది. అల్లాహ్ ఈ సృష్టిని ప్రారంభించాడు. ఆయనే దీనిని మళ్ళీ పునరావృత్తం చేస్తాడు. ఆయన స్వర్గాన్ని, భూమిని ఒక ఉద్దేశ్యంతో సృష్టించాడు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తం ఆయనకు తెలుసు.
You must be logged in to post a comment.