ఈ ప్రసంగంలో, వక్త ఇస్లాంలో నిషిద్ధమైన ‘బిదాత్’ (మతంలో నూతన ఆవిష్కరణ) యొక్క వివిధ రకాలను వివరిస్తారు. బిదాత్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు: విశ్వాసానికి సంబంధించినది (బిదాత్ అల్-ఇ’తిఖాదియ్యా) మరియు ఆరాధనలకు సంబంధించినది (బిదాత్ అల్-అమలియ్యా). విశ్వాసపరమైన బిదాత్, జహ్మియా, ముతజిలా వంటి మార్గం తప్పిన సమూహాల సిద్ధాంతాలను ఉదాహరణగా చూపిస్తుంది. ఆరాధనలలో బిదాత్‌ను నాలుగు విభాగాలుగా వివరిస్తారు: 1) షరియత్‌లో ఆధారం లేని కొత్త ఆరాధనను సృష్టించడం (ఉదా: మీలాద్-ఉన్-నబీ ఉత్సవం), 2) నిర్ధారిత ఆరాధనలకు అదనంగా చేర్చడం (ఉదా: ఫర్జ్ నమాజ్‌లో రకాతుల సంఖ్యను పెంచడం), 3) ఆరాధన పద్ధతిని మార్చడం (ఉదా: వ్యక్తిగత ధిక్ర్‌ను సామూహికంగా చేయడం), 4) సాధారణ ఆరాధనలకు షరియత్ నిర్దేశించని ప్రత్యేక సమయం లేదా తేదీని కేటాయించడం (ఉదా: షాబాన్ 15న ప్రత్యేక ఉపవాసం మరియు జాగరణ). ప్రతి రకమైన బిదాత్ నుండి దూరంగా ఉండాలని మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గాన్ని మాత్రమే అనుసరించాలని వక్త నొక్కిచెప్పారు.
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.
గత ఎపిసోడ్ లో బిదాత్ అంటే ఏమిటి? దాని అర్థం తెలుసుకున్నాం. ఈరోజు బిదాత్ రకాలు తెలుసుకుందాం, కొన్ని రకాలు.
బిదాత్ రకాలు
ముఖ్యంగా బిదాత్ రెండు రకాలు.
మొదటి రకం విశ్వాసపరమైన బిదాత్. విశ్వాసానికి, ఈమాన్ కి సంబంధించిన బిదాత్. అంటే ఈ బిదాత్ సంబంధం వ్యక్తుల విశ్వాసాలతో ఉంటుంది. ఉదాహరణకు, జహ్మియా అనే ఒక వర్గం ఉంది, ముతజిలా అనే ఒక వర్గం ఉంది, రవాఫిజ్ అనే వర్గం ఉంది, తదితర మార్గ విహీన వర్గాల వారి సిద్ధాంతాలు. వారు అల్లాహ్ విషయంలో, అల్లాహ్ యొక్క అస్మాయె హుస్నా (ఉత్తమమైన పేర్లు) విషయంలో, అలాగే తఖ్దీర్ (విధి వ్రాత) విషయంలో, మన కర్మల విషయంలో వాళ్ళు కొత్త కొత్త విషయాలు కల్పించుకున్నారు. ఇప్పుడు దాని వివరం అవసరం లేదు. ఇది విశ్వాసానికి సంబంధించిన బిదాత్. ముతజిలా, జహ్మియా, రవాఫిజ్ తదితర మార్గ విహీన వర్గాల సిద్ధాంతాలు.
ఇక రెండవ రకం, ఆరాధనకి సంబంధించిన బిదాత్. ఆరాధన. నమాజ్ చేయటం, జికిర్ చేయటం, దుఆ చేయటం, హజ్ ఉమ్రా చేయటం, ఉపవాసం ఉండటం, పండుగ జరుపుకోవటం. హృదయానికి సంబంధించిన ఆరాధనలు, శారీరానికి సంబంధించిన ఆరాధనలు, నాలుకకి సంబంధించిన ఆరాధనలు. అంటే ఆరాధనకి సంబంధించిన బిదాత్, ఇది రెండవ రకం. అంటే ఇబాదత్ గా, ఆరాధనగా చెల్లుబాటు అవుతున్న బిదాత్. అది ఆరాధన కాదు, అది ఇబాదత్ కాదు, అది ప్రవక్త గారి విధానం కాదు. కానీ ఇబాదత్ గా, ఆరాధనగా చెల్లుబాటు అవుతా ఉంది.
ఉదాహరణకు, షరియత్ తో ఏ ప్రాతిపదిక కూడా లేని ఆరాధనను ఎవరైనా సృష్టించుకొని దానిని సమాజంలో ప్రవేశపెట్టడం. అంటే లేని నమాజు, లేని ఉపవాసం, లేని పండుగలను కల్పించుకోవటం అన్నమాట. ఉదాహరణకు, మీలాదున్నబీ, ఈద్ మీలాదున్నబీ ఉత్సవం. అది ఇబాదత్ గా, దీన్ లోని, ధర్మంలోని ఒక పండుగగా జరుపుకుంటారు. కానీ అది ఇబాదత్ కాదు. ఇది ఇబాదత్ లో బిదాత్ అవుతుంది.
అలాగే, ఇంకో రకం, చేయవలసి ఉన్న ఆరాధనకు అదనంగా ఏదన్నా చేర్చటం. ఉదాహరణకు, ఫర్జ్ నమాజులో ఒక రకాతును అదనంగా చేర్చటం. జుహర్ నమాజ్ నాలుగు రకాతులు ఫర్జ్. ఐదు చేయవచ్చా? చేయకూడదు. ఉద్దేశ్యపూర్వకంగా పుణ్యమే కదా, ఆరాధనే కదా, మంచి పనే కదా అని ఉద్దేశ్యంతో చేస్తే అది బిదాత్ అయిపోతుంది. అలాగే అసర్ లో నాలుగు, ఐదు చేయలేము. మగ్రిబ్ లో మూడు, నాలుగు చేయలేము. ఇషాలో నాలుగు, ఐదు చేయలేము. ఫజర్ లో రెండే, మూడు చేయలేము. మరి నమాజ్ మంచిదే కదా, నమాజ్ పుణ్యమే కదా అని చెప్పి ప్రవక్త గారు చూపించిన విధానం కాకుండా వేరే విధానం, కొత్తగా ఆవిష్కరిస్తే, ప్రవేశ పెడితే అది ఆరాధనలో బిదాత్ అవుతుంది.
అలాగే ఇంకో రకం ఏమిటంటే, ఆరాధన చేయవలసిన రీతిలో చేయకుండా, సంప్రదాయేతర పద్ధతిలో చేయటం. ఉదాహరణకు, వ్యక్తిగతంగా చేసుకోవలసిన దుఆలను, దైవ ధ్యానమును, జికిర్ ను సామూహికంగా చేయటం. ఏ ఆరాధన అయితే ప్రవక్త గారు వ్యక్తిగతంగా చేసుకోండి అని చేసి చూపించారో, వాటిని మనం సామూహికంగా చేయటం. దాని కోసం ప్రత్యేక సదనాలను ఏర్పాటు చేసుకోవటం, ఆరాధనలు చేసేందుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవలంబించిన సులభమైన విధానాన్ని కాదని, కష్టతరమైన పద్ధతులను పాటించటం అన్నమాట.
అలాగే ఇంకో రకం ఏమిటంటే, ధర్మ సమ్మతమైన ఏ దేని ఆరాధనలను ఫలానా తేదీ లేక ఫలానా సమయం కొరకు కేటాయించుకోవటం. ఆ ఆరాధన మాత్రం ధర్మ సమ్మతమే. కానీ ఆ ధర్మ సమ్మతమైన ఆ ఆరాధనలను ఫలానా తేదీ లేక ఫలానా సమయం కొరకు ప్రత్యేకించుకోవటం. అది కూడా బిదాతే. ఎందుకంటే ఈ ఆరాధనలను షరియత్ ఆ మేరకు నిర్ధారించి ఉండదు. ఉదాహరణకు, షాబాన్ నెల 15వ తేదీ పగలు ఉపవాసం ఉండాలని, ఆ రాత్రి పూట జాగారం చేయాలని నిశ్చయించుకోవటం. ఇది బిదాత్. ఉపవాసం ఉండటం, రాత్రి జాగారం చేయటం ఇది సమ్మతమే. ఎప్పుడైనా ఉపవాసం ఉండవచ్చు, ఏ రాత్రి అయినా జాగారం చేసి ప్రార్థన చేయవచ్చు. ఉపవాసం ఉండటం, రాత్రి పూట జాగారం చేయటం సమ్మతమే. కానీ వాటిని ఒకానొక రాత్రి కోసమో, పగలు కోసమో ప్రత్యేకించుకోవటం సమ్మతం కాదు. దానికి ఆధారం లేదు అన్నమాట.
ఇది బిదాత్ కి సంబంధించిన కొన్ని రకాలు మనము తెలుసుకున్నాము. మన సమాజంలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అల్లాహ్ మనందరినీ ప్రతి బిదాత్ నుండి కాపాడుగాక. ఇక బిదాతుల ఆదేశం ఏమిటి? అది ఇన్షాఅల్లాహ్ మనం వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“ఐ లవ్ ముహమ్మద్ ﷺ” మనతో ఏమి కోరుతుంది? ప్రవక్త ముహమ్మద్ ﷺ వారి మీద ఉన్న ప్రేమ మనతో ఏమి కోరుతుంది? https://youtu.be/HVwTB7FS8Dw [46 నిముషాలు] షేఖ్ సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, షేక్ సలీం జమఈ హఫిజహుల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ యొక్క నిజమైన అర్థాన్ని వివరిస్తారు. కేవలం బ్యానర్లు, సోషల్ మీడియా స్టేటస్‌ల ద్వారా ప్రేమను ప్రదర్శించడం కాకుండా, ఆ ప్రేమ మన నుండి ఏమి ఆశిస్తుందో ఆయన విశ్లేషించారు. ప్రవక్త ప్రేమకు నిజమైన నిదర్శనం, ఆయన తెచ్చిన ధర్మాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించడం, ఆయన ఆజ్ఞలను పాటించడం (ఇతా’అత్), ఆయనపై దరూద్ పఠించడం, ఆయన జీవిత చరిత్ర (సీరత్)ను తెలుసుకోవడం, ఆయన ప్రవర్తనను మన జీవితంలో అలవర్చుకోవడం, ఆయన ఇష్టపడిన వాటిని ఇష్టపడటం మరియు ఆయన కుటుంబీకులను (అహలె బైత్) గౌరవించడం అని స్పష్టం చేశారు. హంజా (రదియల్లాహు అన్హు)), అబ్దుల్లాహ్ బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు) వంటి సహాబాల ఉదాహరణలతో నిజమైన విధేయతను వివరిస్తూ, కేకులు కోయడం, ర్యాలీలు చేయడం వంటివి ప్రవక్త ప్రేమకు నిదర్శనం కాదని, అవి ధర్మంలో లేని పనులని ఆయన హెచ్చరించారు.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియా ఇవల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వఆలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
నేటి కార్యక్రమానికి హాజరైన సోదర సోదరీమణులందరికీ నా ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదర సోదరీమణులారా, ఇదివరకే మీరు ఈనాటి ప్రసంగ అంశాన్ని విని ఉన్నారు. ఈరోజు మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అభిమానం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఉన్న ప్రేమ మనతో ఏమి కోరుతుంది? అనే అంశం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం.
మనమంతా సోషల్ మీడియాలో, అంతర్జాల మాధ్యమాలలో గత కొద్ది రోజులుగా ఒక హాట్ టాపిక్ చూస్తూ వస్తూ ఉన్నాం. ప్రతిచోట ‘ఐ లవ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం’ అని బ్యానర్లు, జెండాలు దర్శనమిస్తూ ఉన్నాయి. అలాగే స్టేటస్‌లలో, ప్రొఫైల్ పిక్చర్లలో కూడా ‘ఐ లవ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం’ అనే ఇమేజ్‌లు ప్రదర్శించబడుతూ ఉన్నాయి. చాలా చోట్ల ర్యాలీలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలాచోట్ల కొన్ని ఊహించని సంఘటనలు కూడా చోటు చేసుకుని ఉన్నాయి.
అయితే మిత్రులారా, ఒక్క విషయం మాత్రము ప్రపంచానికి అర్థమయింది. అదేమిటంటే, ముఖ్యంగా మనము ఏ దేశంలో అయితే నివసిస్తూ ఉన్నామో ఆ దేశ ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద చాలా ప్రేమ, అభిమానం కలిగి ఉన్నారు అన్న విషయాన్ని ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది, గమనిస్తూ ఉంది. అయితే మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మనకు ఉన్న ప్రేమ, అభిమానం ఏమి కోరుతూ ఉంది? ప్రవక్త వారి ప్రేమ మాకు ఏమి కోరుతూ ఉంది, ఏమి చేయమని చెబుతూ ఉంది? మనము ఏమి చేస్తున్నాం? ప్రవక్త వారు, ప్రవక్త వారి ప్రేమ మాతో ఏమి కోరుతూ ఉంది, మేము ఏమి చేయాలి వాస్తవానికి? కానీ చేయాల్సిన పనులు చేయకుండా పక్కన పెట్టేసి మేము ఏమి చేస్తున్నాం అనేది ఆత్మ విమర్శ చేసుకుంటారన్న ఉద్దేశము, అలాగే సరైన విధంగా ప్రవక్త వారిని అభిమానిస్తారు అన్న ఉద్దేశంతో ఈ టాపిక్ ఎన్నుకోబడింది. ఎవరినీ ఉద్దేశించటమో లేదా ఎవరినీ కించపరచటమో లేదంటే ఎవరి మనోభావాలను మనము బాధపరచటము గాని, గాయపరచటము గాని ఉద్దేశము కానేకాదు. ఇది నేను ముందుగానే వ్యక్తపరుస్తూ ఉన్నాను, తెలియజేసేస్తూ ఉన్నాను.
చూడండి, మనమంతా పండితుల నోట అనేక సందర్భాలలో, అనేక ప్రసంగాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించటం ప్రతి విశ్వాసి యొక్క కర్తవ్యం అని విన్నాం. అవునా కాదా? ఆ ప్రకారంగా పండితులు మనకు ఖురాన్‌లోని వాక్యాలు వినిపించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు వినిపించారు. ముఖ్యంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా తౌబా 24 వ వాక్యంలో తెలియజేశాడు, మీరు ప్రవక్త వారి కంటే ఎక్కువగా మీ వర్తకాన్ని లేదంటే మీ ఆస్తిపాస్తుల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ఇలాంటి వారిని మీరు అభిమానించేటట్లయితే మీరు అల్లాహ్ శిక్ష కొరకు ఎదురు చూడండి అని అల్లాహ్ హెచ్చరించి ఉన్నాడు. అంటే మనము ప్రవక్త వారినే ఎక్కువగా అభిమానించాలి కానీ ప్రాపంచిక విషయాలు లేదంటే ఇతర వ్యక్తులను ఎక్కువగా అభిమానించరాదు, అందరికంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించాలి అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆజ్ఞ అని ఆ వాక్యం ద్వారా మనకు పండితులు వివరించారు.
అలాగే ప్రవక్త వారి ఒక హదీస్, ప్రవక్త వారి ఉల్లేఖనం, ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఒకానొక సందర్భంలో ప్రవక్త వారి చేయి పట్టుకొని ఉండి ప్రవక్త పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఓ దైవ ప్రవక్త, నేను ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని అభిమానిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అయితే నా ప్రాణము నాకు మీకంటే ప్రియమైనది అని చెప్పగానే ప్రవక్త వారు ఏమన్నారు ఆయనకి? ఓ ఉమర్, లేదు లేదు, ఏ వ్యక్తి కూడాను ప్రపంచంలో ఉన్న వారందరికంటే ఎక్కువగా చివరికి తన ప్రాణము కంటే ఎక్కువగా నన్ను అభిమానిస్తేనే సంపూర్ణ విశ్వాసి అవగలుగుతాడు లేదంటే అతని విశ్వాసం అసంపూర్ణం అవుతుంది జాగ్రత్త అని హెచ్చరించినప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు వారు వారిని వారు సంస్కరించుకున్నారు. ప్రవక్త వారిని తన ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించడం ప్రారంభించేశారు. ఆ విషయాన్ని మళ్ళీ ప్రవక్త వారితో తెలియజేశారు. ఓ ప్రవక్త, ఇప్పుడు నేను నా ప్రాణము కంటే ఎక్కువగా మిమ్మల్ని అభిమానిస్తున్నాను అని చెప్పగానే ప్రవక్త వారు ఏమన్నారంటే, ఓ ఉమర్ ఇప్పుడు నీ విశ్వాసము సంపూర్ణమైంది అన్నారు.
ఇలాంటి సంఘటనలు తెలియజేసి ధార్మిక పండితులు మనకు ఏమని చెప్పారంటే, మనము ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా, మన భార్యాబిడ్డల కంటే ఎక్కువగా, బంధుమిత్రుల కంటే ఎక్కువగా, మన ఆస్తిపాస్తుల కంటే ఎక్కువగా, మన ప్రాణము కంటే ఎక్కువగా ప్రవక్త వారిని ప్రేమించాలి, అభిమానించాలి అని తెలియజేశారు. అల్హమ్దులిల్లాహ్ ఆ విషయాలను మనం బాగా అర్థం చేసుకున్నాము. ప్రతి యువకుడు, ప్రతి మహిళ, ప్రతి పురుషుడు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానిస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అయితే ఈ అభిమానం మనకు కొన్ని శుభవార్తలు కూడా ఇస్తూ ఉంది, మనతో కొన్ని విషయాలు కూడా కోరుతూ ఉంది.
ప్రవక్త వారి అభిమానం మనకు ఇస్తున్న శుభవార్త ఏమిటి? మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనసారా ప్రేమిస్తే, అభిమానిస్తే మనము స్వర్గానికి చేరుకుంటాము అని శుభవార్త ఇస్తూ ఉంది. దానికి ఆధారము, ఒక పల్లెటూరి వాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేను, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుగాంతం ఎప్పుడు సంభవిస్తుంది? అంటే ఖియామత్, యుగాంతం ఎప్పుడు సంభవిస్తుంది అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, నువ్వు యుగాంతం గురించి ప్రశ్నిస్తూ ఉన్నావు, బాగానే ఉంది. అయితే దాని కొరకు నువ్వు ఏమి సిద్ధము చేశావు? అని అడిగారు. యుగాంతం గురించి అడుగుతున్నావ్, పరలోకం గురించి, ప్రళయం గురించి అడుగుతున్నావ్ బాగానే ఉంది. అయితే ఆ ప్రళయం కొరకు, ఆ యుగాంతం కొరకు, ఆ పరలోకం కొరకు నువ్వు ఏమి సిద్ధం చేసుకున్నావ్, అది చెప్పు అన్నారు. దానికి ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఎక్కువగా చెప్పుకోదగ్గ నమాజులు, చెప్పుకోదగ్గ దానధర్మాలు ఏమి చేసుకోలేదు కానీ అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల హృదయము నిండా అభిమానము, ప్రేమ కలిగి ఉన్నాను అని చెప్పాడు.
దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతనికి శుభవార్త ఇచ్చారు. ఏమని?
قَالَ أَنْتَ مَعَ مَنْ أَحْبَبْتَ (ఖాల అంత మ’అ మన్ అహబబ్త) “నీవు ప్రేమించిన వారితోనే ఉంటావు.” అన్నారు.
అల్లాహు అక్బర్. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉండే స్థలం స్వర్గం. ప్రవక్త వారి అభిమానులు కూడా ఇన్షాఅల్లాహ్ చేరుకునే స్థలం స్వర్గం ఇన్షాఅల్లాహ్. అల్లాహ్ సుబ్ హాన వ త’లా మనందరికీ ప్రవక్త వారి అభిమానంతో పాటు ప్రవక్త వారితో పాటు స్వర్గంలో చేరుకునే భాగ్యం ప్రసాదించుగాక, ఆమీన్.
అయితే మిత్రులారా, ప్రవక్త వారి అభిమానము మనకు స్వర్గానికి చేర్చుతుంది అన్న శుభవార్త ఇస్తూ ఉంది. ఆ అభిమానంతోనే, ఆ ఆశతోనే మనము ప్రవక్త వారిని ప్రేమిస్తున్నాము, అభిమానిస్తూ ఉన్నాం. మన విశ్వాసం కోసం, స్వర్గం కోసం, అల్లాహ్ ను ప్రవక్త వారిని నమ్ముతూ ఉన్నాము, ప్రేమిస్తూ ఉన్నాము, అభిమానిస్తున్నాం, ఓకే బాగానే ఉంది. అయితే మరి ఆ ప్రేమ ఏమి కోరుతుందో అది తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ప్రవక్త వారి పేరు మీద ర్యాలీలు చేస్తూ ఉన్నారో, జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారో, బ్యానర్లు పెట్టుకుంటూ ఉన్నారో, స్టేటస్‌లు పెడుతూ ఉన్నారో, ప్రొఫైల్ పిక్చర్లు పెడుతూ ఉన్నారో, వారిలో ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలలో ఎన్ని విషయాలు చేస్తూ ఉన్నారు అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఈ విషయాలు మనము జాగ్రత్తగా విని ఇన్షాఅల్లాహ్ ఆత్మ పరిశీలన చేసుకుందాం.
1. ప్రవక్త తెచ్చిన ధర్మాన్ని విశ్వసించడం
చూడండి, ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలలో ప్రథమ విషయం ఏమిటంటే, ఏ ధర్మాన్ని, ఏ శాసనాన్ని అయితే ప్రవక్త వారు తీసుకుని వచ్చారో ఆ ధర్మాన్ని, ఆ శాసనాన్ని మనమంతా మనసారా స్వీకరించాలి, ఆమోదించాలి, విశ్వసించాలి, నమ్మాలి.
దీనికి ఒక రెండు ఉదాహరణలు మనము ఇన్షాఅల్లాహ్ తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శాసనము తీసుకుని వచ్చి ప్రజల ముందర వినిపించినప్పుడు, ముఖ్యంగా మక్కా వారిలో కొంతమంది ఇస్లాం స్వీకరించారు. అధిక శాతం ప్రజలు ప్రవక్త వారి మీద తిరగబడ్డారు.
ఇలాంటి సందర్భాలలో ఒకసారి ఏమైందంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలోని కాబా పుణ్యక్షేత్రం వద్ద నమాజ్ ఆచరించుకుంటూ ఉన్నారు. అంతలోనే ముస్లింల బద్ధ శత్రువు, ప్రవక్త వారి బద్ధ శత్రువు అయిన అబూ జహల్ చూసుకున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్కరే ఉన్నారు, నమాజ్ చేసుకుంటూ ఉన్నారు. అది చూసి ఎంతగా అతనికి మండింది అంటే, అతను ప్రవక్త వారి మీద నోరు పారేసుకున్నారు, లేనిపోని మాటలు ప్రవక్త వారి గురించి మాట్లాడాడు. కానీ ప్రవక్త వారు ఎలాంటి ఏకాగ్రతను కోల్పోకుండా ప్రశాంతంగా, ఏకాగ్రతతో నమాజ్ ఆచరించుకుంటూ ఉన్నారు.
అతనికి సైతాను ఎంతగా రెచ్చగొట్టాడంటే, నోటికి పని చెప్పినవాడు అక్కడికి సంతృప్తి పడలేదు. తర్వాత పక్కనే ఉన్న ఒక రాయి తీసుకుని ప్రవక్త వారి మీద విసిరి, చేయికి పని చెప్పాడు. ముందు నోటికి పని చెప్పాడు, కానీ మనసు కుదుట పడల, మనశ్శాంతి దొరకలా అతనికి. తర్వాత చేయికి పని చెప్పాడు, రాయి తీసుకుని ప్రవక్త వారి మీద విసిరాడు. ప్రవక్త వారికి గాయమయింది. ఆయన కారుణ్యమూర్తి కదా, ప్రజల కోసం కరుణగా పంపించబడ్డారు కదా, ఆయన మాటలు భరించారు, బాధను కూడా భరించారు, గాయాన్ని కూడా ఆయన భరించారు.
ఇదంతా ఒక బానిసరాలైన మహిళ చూసుకున్నారు. ఆమె ఏమి చేశారంటే, ప్రవక్త వారి మీద జరుగుతున్న ఆ దౌర్జన్యాన్ని చూసి ఊరుకుండలేక, చక్కగా ప్రవక్త వారి బంధువు అయిన హంజా రజియల్లాహు అన్హు వారి దగ్గరికి వెళ్లారు. హంజా రజియల్లాహు అన్హు వారు ఎవరండీ? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్వయాన పినతండ్రి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పినతండ్రి దగ్గరకు వెళ్లి, “ఏవండీ, మీ తమ్ముడి కుమారుడు మక్కాలోని కాబా పుణ్యక్షేత్రం వద్ద నమాజ్ ఆచరించుకుంటూ ఉంటే, ఈ దుర్మార్గుడు అబూ జహల్ వచ్చి ముందు తిట్టాడు, ఆ తర్వాత మీ తమ్ముడి కుమారుడి మీద చేయి చేసుకుని కొట్టాడండి” అని చెప్పేశారు.
ఆయన ఏమన్నారంటే, “నా తమ్ముడి కుమారుడు ఏం తప్పు చేశాడబ్బా? ఎందుకు అతను ఆ విధంగా ప్రవర్తించాడు?” అని అడిగారు. ఆవిడ ఏమన్నారంటే, “లేదండీ, ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన ఒక్కరే ఒంటరిగా అక్కడ నమాజ్ ఆచరించుకుంటున్నారు అంతే. ఎవరితో ఏమీ మాట్లాడలేదు, ఎవరితో ఆయన ఏమీ చేయలేదు. ఆయన చేసిన తప్పు, నేరం ఏమీ లేదు. కానీ అనవసరంగా ఆయన మీద నోరు పారేసుకున్నాడు, ఆ తర్వాత కొట్టి గాయపరిచాడు” అని చెప్పగానే, ఆయనలో కుటుంబీకుల పట్ల ఉన్న ప్రేమ, అభిమానం ఎంతగా ఉప్పొంగిందంటే, అక్కడి నుంచి విల్లు తీసుకొని చక్కగా అక్కడికి వచ్చేశారు కాబతుల్లాహ్ దగ్గరికి.
ఆ సమయానికి ప్రవక్త వారు అక్కడ నమాజ్ ముగించుకొని వెళ్లిపోయారు ఇంటికి. ప్రవక్త వారు లేరు. కానీ ఈ అబూ జహల్ మాత్రము అక్కడ వేరే వాళ్లతో పాటు కూర్చొని మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉన్నాడు. హంజా, అప్పటికి ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేదు, ప్రవక్త వారి పినతండ్రి, చక్కగా అబూ జహల్ దగ్గరికి వెళ్లి విల్లు తీసుకొని తల మీద కొట్టగా గాయమైంది, రక్తం కారింది, కింద పడి విలవిల్లాడాడు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, “నీకు అంతగా పోరాడాలని, కొట్లాడాలని ఉంటే నాతో తలపడురా మూర్ఖుడా! నా తమ్ముని కుమారుడి మీద ఏందిరా నువ్వు చూపించేది నీ మగతనము? నాతో ఉంటే, నీకు అంతగా ఉంటే నాతో తలపడు, నాతో పోరాడు చూద్దాము” అని చెప్పారు. ఆయన బలవంతుడు హంజా రజియల్లాహు అన్హు, అప్పటికీ ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేదు కానీ మక్కాలోనే బలవంతులలో ఒక బలవంతుడు ఆయన. కాబట్టి అబూ జహల్ కి నూట మాట రాలేదు, గమ్మునుండి పోయాడు.
తర్వాత హంజా రజియల్లాహు అన్హు వారు చక్కగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఇంటికి వెళ్లి, “బిడ్డా, నువ్వు సంతోషించు, నువ్వు బాధపడవద్దు. నీ మీద చేయి చేసుకున్న వ్యక్తితో నేను ప్రతికారము తీర్చుకున్నాను, నువ్వు సంతోషించు” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిన్నగా చిరునవ్వు చిందిస్తూ పినతండ్రితో ఏమన్నారో తెలుసా? “చిన్నాన్నా, మీరు ప్రతికారము తీర్చుకున్నారు అని చెబుతున్నారు, ఆ విషయము నాకు సంతోషం కలిగించదు. నిజంగా మీరు నన్ను సంతోషపరచాలనుకుంటుంటే నేను తీసుకుని వచ్చిన శాసనాన్ని, ధర్మాన్ని మీరు అంగీకరిస్తే, ఆమోదిస్తే, నమ్మితే, విశ్వసిస్తే అప్పుడు నేను సంతోషిస్తాను చిన్నాన్నా” అన్నారు. అల్లాహు అక్బర్. అప్పటికప్పుడే హంజా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోనే కలిమా చదివి ఇస్లాం స్వీకరించారు, విశ్వాసిగా మారారు, అల్హమ్దులిల్లాహ్.
అయితే ప్రవక్త వారి పినతండ్రులలోనే మరొక పినతండ్రి ఉన్నారండి. ఆయన పేరు అబూ తాలిబ్. ఆయన గురించి తెలియని వ్యక్తి ఉండరు. అయితే అబూ తాలిబ్ వారు ఎలా మరణించారో ఒకసారి మనము చూద్దాం. అబూ తాలిబ్ వారు మరణ సమయం వచ్చింది, కొద్దిసేపు తర్వాత ఆయన ప్రాణం పోతుంది అన్నట్టుగా ఉంది. చివరి ఘడియలు అంటాము కదా? ఆ చివరి ఘడియల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పినతండ్రి అయిన అబూ తాలిబ్ దగ్గరికి వెళ్లి, “చిన్నాన్నా, ఒక్కసారి మీరు నోటితో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్’ సాక్ష్య వచనము పలకండి. నేను అల్లాహ్ వద్ద మీ కొరకు సిఫారసు చేస్తాను” అని కోరారు.
అంతలోనే ఈ మక్కా పెద్దలు అనిపించుకునే కొంతమంది అబూ తాలిబ్ వారి సహచరులు వచ్చేశారు. వచ్చేసి ఆ పెద్ద మనుషులు అనిపించుకునే, స్నేహితులు అనిపించుకునే వాళ్ళు ఏమి చేశారంటే, “ఏమండీ, మీరు బ్రతికినంత కాలము తాత ముత్తాతల ధర్మం మీద బ్రతికి, మరణించే సమయాన మీరు తాత ముత్తాతల ధర్మానికి ద్రోహం చేసి వెళ్తారా? ఇది మీకు సమంజసమేనా? ఇది మీకు సరిపోతుందా?” అని రెచ్చగొట్టేశారు. చివరికి ఏమైందంటే, ఆయన “నేను తాత ముత్తాతల ధర్మం మీదనే ఉంటున్నాను” అని చెప్పేసి శ్వాస విడిచారు. అంటే ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మాన్ని ఆయన అంగీకరించలేదు, విశ్వసించలేదు. సరే. ఆయన మరణం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బంధువుల్లో ఎవరైతే ఇస్లాం స్వీకరించిన వారు ఉన్నారో వారిలో ఒకరు ప్రవక్త వారితో ప్రశ్నించారు. ఏమండీ, మీ చిన్నాన్న అబూ తాలిబ్ వారు మీకు ఇంచుమించు 40 సంవత్సరాలు సేవలు చేశారు, సపోర్ట్‌గా నిలబడ్డారు, మీ కొరకు మక్కా వారి శత్రుత్వాన్ని కొనుక్కున్నారు, మీకు మాత్రము ఆయన సపోర్ట్‌గా నిలబడ్డారు కదా? అంతగా మీకు పోషించిన, మీకు సపోర్ట్ చేసిన మీ చిన్నాన్నకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆయన స్వర్గవాసా లేదంటే నరకవాససా? అని అడిగారు.
ప్రవక్త వారు ఏమన్నారండి? ఆయన నరకానికే వెళ్తారు. అయితే నరకంలోనే చిన్న శిక్ష ఉంటుంది అన్నారు. అది వేరే విషయం. కానీ ఎక్కడికి వెళ్తారు అన్నారు? ఆయన నరకానికే వెళ్తారు అని చెప్పారు. ఇక్కడ ప్రవక్త వారి ఇద్దరు పినతండ్రులు. ఒకరు హంజా రజియల్లాహు అన్హు వారు, ఒకరు అబూ తాలిబ్ వారు. హంజా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి శాసనాన్ని, ఆయన తీసుకుని వచ్చిన ధర్మాన్ని విశ్వసించారు. అబూ తాలిబ్ వారు ప్రవక్త వారిని ప్రేమించారు, అభిమానించారు, సపోర్ట్‌గా నిలబడ్డారు కానీ ప్రవక్త వారు తీసుకుని వచ్చిన ధర్మాన్ని మాత్రము ఆమోదించలేదు, విశ్వసించలేదు. ఏమైందండి ఫలితం? హంజా రజియల్లాహు అన్హు వారేమో స్వర్గవాసి అయ్యారు, అబూ తాలిబ్ వారు మాత్రము నరకానికి చేరుకున్నారు.
దీన్నిబట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటండీ? ప్రవక్త వారి ప్రేమ ఏమి కోరుకుంటుంది అంటే ప్రవక్త వారు తీసుకుని వచ్చిన ధర్మాన్ని మనసారా మనము స్వీకరించాలి, విశ్వసించాలి, నమ్మాలి. అప్పుడే ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలలో ఒక విషయాన్ని మనము పాటించిన వాళ్ళం అవుతాం, లేదంటే నష్టపోతాం. ఇప్పుడు చెప్తారు మీరు చాలామంది. “ఆ, మేమంతా ముస్లింలమే కదండీ, మేమంతా కలిమా చదివిన వాళ్ళమే కదండీ, ఈరోజు ఐ లవ్ ముహమ్మద్ అని చెప్పుకుంటున్న వాళ్ళము, మరి మాకు ఇవన్నీ విషయాలు చెప్తున్నారు ఏంటి మీరు?” అంటారు. ఆ, అవ్వలేదు, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయండి. ఒక్క విషయంతోనే సరిపోదు. ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి. అవి కూడా తెలుసుకుందాం. అప్పుడు మాట్లాడదాం ఇన్షాఅల్లాహ్. అప్పుడు ఆత్మ విమర్శ చేసుకుందాం.
2. ప్రవక్తను అనుసరించడం (ఇతా’అత్)
ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలలో మరొక విషయం ఏమిటంటే, మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి, ఇతా’అత్ చేయాలి. ప్రవక్త వారిని అనుసరించాలి.
చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని 59 వ అధ్యాయము ఏడవ వాక్యంలో తెలియజేశాడు,
అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఇచ్చిన దానిని పుచ్చుకోండి, ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే దాన్ని వదిలి పెట్టేయండి. ఎవరు చెబుతున్నారు? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రవక్త వారిని అనుసరించాలి అంటే అర్థం ఏమిటి? ప్రవక్త వారు ఏ పని అయితే చేయమని చెప్పారో అది మనము చేయాలంట. ప్రవక్త వారు ఏ పని అయితే చేయవద్దు అని వరించారో అది మనము వదిలేయాలంట. ఇది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్లో ఆ వాక్యంలో మాకు తెలియజేస్తున్న విషయం.
అలాగే రెండవచోట ఖురాన్ గ్రంథం మూడవ అధ్యాయం 31వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’లా తెలియజేశాడు,
قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ (ఖుల్ ఇన్ కున్తుమ్ తుహిబ్బూనల్లాహ ఫత్తబి’ఊనీ యుహ్బిబ్కుముల్లాహ్) ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పండి, “మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి, తత్ఫలితంగా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు.” (3:31)
అంటే అర్థం ఏమిటండీ? మనమంతా అల్లాహ్ దాసులం. మనము అల్లాహ్ ప్రేమ పొందాలి అంటే ప్రవక్త వారి అడుగుజాడల్లో నడుచుకోవాలి. ప్రవక్త వారి అడుగుజాడల్లో నడుచుకుంటే, ప్రవక్త వారిని అనుసరిస్తే మనకు అల్లాహ్ యొక్క ప్రేమ దక్కుతుంది అని ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది. అల్లాహు అక్బర్.
అంటే అర్థం ఏమిటండీ? అర్థం ఏమిటంటే మనము అల్లాహ్ ప్రేమ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ కలిగి ఉన్న వాళ్ళమైతే అల్లాహ్ చెప్పినట్టు విని నడుచుకోవాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్టు విని నడుచుకోవాలి అనేది మనకు స్పష్టమవుతుంది. ఏ విధంగా నడుచుకోవాలి? దానికి కొన్ని ఉదాహరణలు పెడతాను చూడండి. ఏ విధంగా ప్రవక్త వారి మాట విని మనము నడుచుకోవాలో దానికి కొన్ని ఉదాహరణలు మీ ముందర పెడతాను. దాన్నిబట్టి ఇన్షాఅల్లాహ్ మనము విషయం బాగా వివరంగా తెలుసుకుందాం.
మొదటి ఉదాహరణ అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వారిది. ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసంగించటానికి మింబర్ పైకి ఎక్కారు. ఎక్కి ప్రజలను ఉద్దేశించి “అందరూ కూర్చోండి” అని ప్రకటించారు. ఆ పలుకు వినగానే అందరూ ప్రశాంతంగా, ఎవరు నిలబడి ఉన్నచోట వాళ్ళు అక్కడ కూర్చున్నారు.
ప్రవక్త వారు ఎప్పుడైతే ఈ మాట “అందరూ కూర్చోండి” అని పలికారో ఆ సమయానికి అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వారు వుజూ చేసుకొని మస్జిద్ లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఒక అడుగు మస్జిద్ లోపల ఉంది, ఒక అడుగు మస్జిద్ బయట ఉంది. అంటే గుమ్మం దగ్గర ఉన్నారు ఆయన. ప్రవక్త వారి మాట ఎప్పుడైతే చెవిలో పడిందో “అందరూ కూర్చోండి” అని, అక్కడే గుమ్మం మీద కూర్చుండిపోయారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసంగం ప్రారంభించేసి, ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ అటు ఇటు చూస్తూ ఆయన్ని చూసుకున్నారు. ఆయన్ని చూసుకొని, “ఏంటయ్యా మీరు అక్కడే కూర్చున్నారు, లోపలికి వచ్చేయండి” అని చెప్పగానే అప్పుడు ఆయన వెంటనే లోపలికి వస్తూ, “ఓ దైవ ప్రవక్త, నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నాను అంటే, మీరు కూర్చోండి అని చెప్పగానే వెంటనే మీ మాటను అనుసరిస్తూ నేను ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా ఇక్కడే కూర్చుండి పోయాను” అని చెప్పేశారు.
మొత్తానికి ప్రవక్త వారు ఆయనను లోపలికి రమ్మని చెప్పారు. ఆయన ఆ ప్రవక్త వారి ఆదేశంతో ఆయన లోపలికి వచ్చేశారు. కాకపోతే, మనము తెలుసుకోవలసిన, అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త వారి మాట వచ్చిన తర్వాత ఆయన తన ఇష్టానుసారంగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు చూశారా? అలా మనము ప్రవక్త వారి మాటను అనుసరించాలి.
ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త వారు చెప్పారు, ప్రవక్త వారి పద్ధతి ఇది అని మనము ప్రజలకు చెబితే, వారు వెంటనే ప్రవక్త వారి మాట మీద అనుసరించరు. ఏమి చేస్తారు? వారి కోరికలు వారికి అడ్డుపడతాయి. వారి కుటుంబ సభ్యుల ప్రేమ వారికి అడ్డుపడుతుంది. తత్కారణంగా వారు ప్రవక్త వారి మాటల్ని, ప్రవక్త వారి పద్ధతుల్ని వెనక్కి పెట్టేసి కోరికలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అల్లాహు అక్బర్.
ఇక్కడ అబ్దుల్లాహ్ బిన్ మసూద్ వారు చూడండి. ప్రవక్త వారి మాట వచ్చిన తర్వాత తన ఇష్టానుసారంగా ఒక అడుగైనా ముందుకు వేశారా? లేదే. వెంటనే అమలు పరిచేశారు. మనము కూడా ఆ విధంగా ఉండాలి. ఏదైనా ప్రవక్త వారి హదీస్, ఏదైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ మన ముందర చెప్పబడింది, వినిపించబడింది అంటే అది విని మనము వెంటనే అమలు పరచాలి గాని, ప్రవక్త వారి మాటను పక్కన పెట్టేసి మా కోరికలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం, భార్య బిడ్డల కోరికలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం, కుటుంబ సభ్యుల మాటలు వింటూ ముందుకు వెళ్ళిపోవటం, ప్రవక్త వారి మాటను మాత్రం పక్కన పెట్టేయడం ఇలా చేయడం సరికాదండి.
అలాగే ప్రవక్త వారి మాట ఎంతగా వినాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనేది సహాబాలు ఆ రోజుల్లో చేసి చూపించారు. ఒక ఉదాహరణ విన్నాము అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వారి గారిది. మరొక ఉదాహరణ…
ప్రారంభంలో అక్కడ మక్కా పరిసరాలలో, మక్కా వాసులు మరియు పరిసరాల వాసులు విపరీతంగా సారాయి తాగేవారు. వారిలో ఆ అలవాటు ఉండింది ముందు నుంచి. అజ్ఞానపు కాలం నుండి ఆ అలవాటు నడుస్తూ వస్తూ ఉంది. చాలా విపరీతంగా వారు సారాయి తాగేవారు. పోటాపోటీగా వారు మద్యాలు సేవించేవారు. అయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎప్పుడైతే మద్యం సేవించడం నిషేధం అని నిషేధ ఆజ్ఞ అవతరింపజేశాడో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి చేశారంటే, శిష్యుల్ని పిలిపించి ప్రకటన చేయించేశారు. “మీరు వెళ్ళండి, అందరికీ ఈ మాట వినిపించేయండి” అని చెప్పగానే, ప్రవక్త వారి శిష్యులు వీధుల్లో తిరిగి పరిసరాల్లో ఉన్న వారందరికీ కూడా “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అల్లాహ్ వద్ద నుంచి ఆజ్ఞ వచ్చేసింది, మద్యం నిషేధం, మద్యం సేవించరాదు” అని చెప్పేశారు.
ప్రవక్త వారి మాట, ప్రవక్త వారి శిష్యులు వినిపిస్తూ ఉంటే ఆ సమయానికి కొంతమంది కూర్చొని మద్యం సేవిస్తూ ఉన్నారు, కొంతమంది ఇండ్లలో మద్యం స్టాక్ చేసి పెట్టుకొని ఉన్నారు. కొంతమంది అయితే సభలు ఏర్పాటు చేసుకొని, మన మొరటు భాషలో చెప్పాలంటే పార్టీలు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ప్రవక్త వారి ప్రకటన వినిపించింది. వెంటనే ఏం చేశారండి? ఇది లాస్ట్ పెగ్గులే, ఈ ఒక్క పెగ్గు తాగేసి తర్వాత మానేద్దాం అనుకోలేదు. వెంటనే అప్పటికప్పుడే వారి ముందర ఉన్న సారాయిని పక్కన పడేశారు. తాగుతున్న వ్యక్తి కూడా అప్పటికప్పుడే ఆపేసి ఆ మిగిలిన సారాయి మొత్తం కింద పడేశాడు. ఇళ్లల్లో స్టాక్ చేసి పెట్టుకున్న ఆ సారాయి మొత్తం వీధుల్లోకి కుమ్మరించేశారు. అలాగే దాచిపెట్టుకున్న మద్యం మొత్తము కూడా తీసి వీధుల్లో కుమ్మరించేశారు. చరిత్రకారులు తెలియజేశారు, ఈ ప్రకటన తెలియజేసిన తర్వాత ఆ రోజు వీధుల్లో మద్యము ఏరులై పారింది, ఆ విధంగా అసహ్యించుకుని వెంటనే అది ఇక నిషేధం మనకు పనికిరాదు దాన్ని మనము ముట్టుకోరాదు, సేవించరాదు, మన ఇళ్లల్లో పెట్టుకోకూడదు అని చెప్పేసి ఆనాటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు, సహాబాలు వీధుల్లో దాన్ని కుమ్మరించేశారు. అల్లాహు అక్బర్.
చూసారా? ఈ రోజు తాగుతాంలే రేపటి నుంచి ఆపుదాంలే, ఇది ఒక్కటి తాగుదాంలే ఆ తర్వాత ఆపుదాంలే, ఈ వారము తాగేసి వచ్చే వారం నుంచి ఆపేద్దాంలే, అలా వారు సాకులు వెతకలేదండి. ప్రవక్త వారి ఆదేశం వచ్చిందా? వెంటనే అమలు పరిచేశారు. సాకులు వెతకలేదు. అలా ఉండాలి. ఆ విధంగా మనము చేస్తూ ఉన్నామా? ఈరోజు మనము ప్రవక్త వారి ప్రేమికులము, అభిమానులము అని చెప్పేసి ప్రవక్త వారి ప్రేమ ప్రకటన చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాము. సరే, ప్రవక్త వారి మాట వినడానికి, ప్రవక్త వారి పద్ధతిని ఆచరించడానికి అంతే ప్రేమతో మనము ముందుకు వస్తూ ఉన్నామా? ప్రవక్త వారి ప్రేమ మనకు ప్రవక్త వారిని అనుసరించండి అని చెబుతూ ఉంది. మరి మనం అనుసరించట్లేదే? ప్రేమ ప్రకటించడానికి ముందుకు వస్తున్నాం. కానీ ప్రవక్త వారిని అనుసరించడానికి మాత్రం వెనకడుగు వేస్తూ ఉన్నాం, సాకులు వెతుకుతూ ఉన్నాం, ఏమేమో చెబుతూ ఉన్నాం. ఇది సరైన విధానము కాదు, గమనించండి మిత్రులారా.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో ఒక శిష్యుడు తెలియక ఒకసారి బంగారపు ఉంగరాన్ని ధరించి ఉన్నారు. బంగారపు ఉంగరాన్ని ధరించి ఉన్న ఆయన ఒకసారి ఒకచోట ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొద్దిసేపటికి అక్కడి నుంచి వస్తూ వస్తూ ఆయన్ని చూసి ఆయన చేతిలో ఉన్న ఉంగరాన్ని గమనించారు.
ఆయనతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దగ్గరికి వచ్చి ఆ ఉంగరము తీసేసి ఏమన్నారంటే, పురుషులు బంగారం ధరించటం నిషేధం అని చెప్పి ఆయన తొడిగి ఉన్న ఆ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు బోధించాల్సిన విషయాలు బోధించేశారు. పురుషులు బంగారము ధరించరాదు అన్న విషయాన్ని బోధించేసి అక్కడి నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంటికి వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఈయన, ఎవరి చేతిలో నుంచి అయితే ప్రవక్త వారు బంగారపు ఉంగరాన్ని తీసి పక్కన పడేశారో, ఆయన కూడా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. అది చూసిన కొంతమంది ఆయన మిత్రులు ఆయనతో ఏమన్నారంటే, “ఏమండీ, మీ బంగారపు ఉంగరం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది మీరు మీ వెంట తీసుకెళ్ళండి, ఏదైనా పనుల కోసం, అవసరాల కోసం ఉపయోగించుకోండి” అని చెప్పారు.
దానికి ఆయన ఏమన్నారో తెలుసా? “ఏ వస్తువుని అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి స్వ హస్తాలతో తీసి పక్కన పడేశారో దాన్ని నేను ముట్టుకోను అంటే ముట్టుకోను” అని చెప్పేశారు. అల్లాహు అక్బర్.
అదండీ ప్రవక్త వారి మాట పట్ల, ప్రవక్త వారి ఆదేశం పట్ల గౌరవం అంటే. చూశారా? కాబట్టి ఈ విషయాల ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏమిటండీ? ప్రవక్త వారి ప్రేమ, ప్రవక్త వారిని అనుసరించండి, ప్రవక్త వారి ఆదేశాలను పాటించండి అని మనతో కోరుతూ ఉంది. అది మనము చేయాలి. అది మనము చేస్తున్నామా? గమనించండి మిత్రులారా.
3. ప్రవక్త వారు తీసుకు వచ్చిన ధర్మాన్ని ప్రజల వద్దకు చేర్చాలి
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తున్న మనము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకు వచ్చిన ధర్మాన్ని ప్రజల వద్దకు చేర్చాలి. ఇది మన బాధ్యత అండి. అవును. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి ప్రవక్త. ఆయన తర్వాత ఇక ప్రళయం వరకు ప్రవక్తలు రారు. మరి ధర్మ ప్రచార బాధ్యత ఎవరు నిర్వహించాలి? ఆ బాధ్యత ఎవరు నిర్వహించమని ప్రవక్త వారు మనకు తెలియజేసి వెళ్లారు? నేను వెళ్తూ ఉన్నాను. నా తర్వాత మీరు, మీలో ఎవరికి ఎంత తెలుసో ఆ విషయాలను మీరు తెలియని వారి వద్దకు చేర్చండి, తెలియపరచండి. ఒక్క విషయం అయినా మీకు తెలిస్తే, ఆ ఒక్క విషయాన్నే మీరు ఇతరుల వరకు తెలియని వారికి నేర్పండి, తెలియజేయండి అని బోధించి వెళ్లారు. అల్లాహ్ సుభానహు వ తఆలా కూడా మనకు మీరు ఉత్తమమైన సమాజం, మీరు ప్రజలకు మంచిని ఆదేశిస్తారు, చెడు నుంచి వారిస్తారు అని చెప్పి బాధ్యత ఇచ్చి ఉన్నాడు. అల్లాహ్ మరియు ప్రవక్త వారు ఇచ్చిన బాధ్యత మనము నెరవేర్చాలి. ప్రవక్త వారి ప్రేమ మనతో ఆ విషయం కోరుతూ ఉంది. మనము నిజమైన ప్రవక్త వారి ప్రేమికులమైతే, ప్రవక్త వారి అభిమానులమైతే, ప్రవక్త వారి ధర్మాన్ని, ప్రవక్త వారు తీసుకొని వచ్చిన ధర్మాన్ని ప్రజల వద్దకు చేరవేయాలి. మరి ఆ పని మనము చేస్తున్నామా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తీసుకొని వచ్చిన ధర్మాన్ని మన నోటితో మనము చేయగలిగితే నోటితో చేయాలి. వెళ్లి ప్రజలకు విషయాలు బోధించాలి. అంత శక్తి లేదండీ. ఆ విధంగా మీకు మాట్లాడడానికి రాదు అని మీరు భావిస్తూ ఉన్నట్లయితే, అల్హందులిల్లాహ్ పుస్తకాలు ఉన్నాయి, కరపత్రాలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి. అవి మీరు ఇతరుల వద్దకు చేరవేయండి అయ్యా. ఆ విధంగా ప్రవక్త వారి నిజమైన అభిమానులనిపించుకోండి. కానీ ఆ విధంగా చేస్తున్నామా? స్టేటస్ లు పెడుతున్నాం. స్టేటస్ లు పెట్టడం కాదండి. ప్రవక్త వారి సందేశాలు, ఆ ధర్మాన్ని ఇతరుల వరకు చేరవేయండి. ఇది ప్రవక్త వారి ప్రేమ మనతో కోరుతున్న మరొక విషయం.
4. ప్రవక్తపై దరూద్ పఠించడం
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న మరొక విషయం ఏమిటంటే, ప్రవక్త వారి మీద మనము ఎక్కువగా దరూద్ పఠిస్తూ ఉండాలి. ఎంతమందికి దరూద్ వస్తుందండి? అల్హమ్దులిల్లాహ్, చాలా మందికి వస్తుందండి, నేను ఆ విధంగా విమర్శించట్లేదు. ముఖ్యంగా ఎవరైతే వీధుల్లో ర్యాలీలు చేస్తూ ఉన్నారో, జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారో, వారిలో మీరు వెళ్లి అడిగి చూడండి. ఒకసారి దరూద్ పఠించి వినిపించండయ్యా అని అడిగి చూడండి. దరూద్ వస్తుందేమో వాళ్ళకి? ప్రేమికులము, మేము ప్రవక్త వారి అభిమానులము అని ఏమేమో చేస్తూ ఉన్నారే, అలా చేసే వారు ఒక్కసారి ప్రవక్త వారి మీద దరూద్ పఠించి వినిపించండి అని చెప్పండి. వస్తుందేమో చూద్దాం? చాలా మందికి రాదండి. అయినా మేము ప్రవక్త వారి ప్రేమికులమని నోటితో చెప్పుకుంటూ ఉంటారు. నోటితో చెప్పుకుంటే సరిపోదండి, ఇవన్నీ చేయాలి. ప్రవక్త వారి మీద ప్రేమ ఉంటే దరూద్ నేర్చుకొని దాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉండాలి. ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు దరూద్ పఠిస్తూ ఉండాలి. దరూద్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఒక ప్రసంగం ఉందండి, ‘దరూద్ లాభాలు’ అని, అది వినండి తెలుస్తుంది ఇన్షాఅల్లాహ్. అయితే మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటండీ ఇక్కడ? మనము నిజమైన ప్రవక్త ప్రేమికులమైతే, అభిమానులమైతే మనము ప్రవక్త వారి మీద ఎక్కువగా దరూద్ పఠించాలి.
5. ప్రవక్త జీవిత చరిత్ర (సీరత్) తెలుసుకోవడం
అలాగే ప్రవక్త వారి అభిమానులమైనప్పుడు, ప్రవక్త వారి ప్రేమ మనతో కోరుతున్న విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర మనము తెలుసుకోవాలి. అవును, మనం ప్రవక్త వారి అనుచర సమాజం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అభిమానులం, ఓకే. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులమైనందుకు, ప్రవక్త వారి అభిమానులము అయినందుకు మనకు ప్రవక్త వారి చరిత్ర తెలియకపోతే ఎలా? మీరు ప్రవక్త వారి ప్రేమికులు అనుకుంటున్నారు, మరి ప్రవక్త వారి గురించి మీకు ఏమి తెలుసయ్యా? మీ ప్రవక్త వారి చరిత్ర క్లుప్తంగా రెండు మాటల్లో చెప్పండి అని ఎవరైనా అడిగాడు అనుకోండి, తల ఎక్కడ పెట్టుకోవాలి అప్పుడు మనం? కదా? కాబట్టి ప్రవక్త వారి ప్రేమ ఏమి కోరుతూ ఉంది అంటే ప్రవక్త వారి జీవిత చరిత్రను మనము తెలుసుకోవాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు జన్మించారు, ఎక్కడ జన్మించారు, వారి తల్లిదండ్రులు ఎవరు, వారి తాతలు ఎవరు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాల్యము ఎలా గడిచింది, ప్రవక్త వారి యవ్వనము ఎలా గడిచింది, ప్రవక్త వారు ఎక్కడ వివాహం చేసుకున్నారు, ఎంతమంది బిడ్డలు కలిగారు, ఎప్పుడు ఆయనకు దైవదౌత్య పదవి దక్కింది, ఆయన దైవదౌత్య పదవి దక్కిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఏ విధంగా ధర్మ సేవ చేశారు, తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఆ తర్వాత ఆయన జీవితంలో ఎలాంటి ఘట్టాలు ఎదురయ్యాయి, చివరికి ఆయన ఎక్కడికి చేరుకున్నారు, ఆ తర్వాత ఎప్పుడు ఆయన మరణం సంభవించింది, ఎక్కడ ఆయన సమాధి ఉంది, ఇవన్నీ విషయాలు ఒక ప్రవక్త వారి అనుచరునిగా, ప్రవక్త వారి అభిమానిగా, ప్రేమికునిగా ప్రతి వ్యక్తి తెలుసుకోవలసి ఉంది మిత్రులారా. అయితే అల్లాహ్ దయ ఏమిటంటే ప్రవక్త వారి జీవిత చరిత్ర చదువు వచ్చిన వాళ్ళు పుస్తకాలలో ‘అర్రహీఖుల్ మఖ్తూమ్‘ అని ఒక పుస్తకం ఉంది. అది ఉర్దూలో, అలాగే తెలుగులో అనేక భాషల్లో అల్హమ్దులిల్లాహ్ అనువాదం చేయబడి ఉంది. అది చదివి తెలుసుకోవచ్చు. చదువు రాని వాళ్ళు వారి వారి భాషల్లో ప్రవక్త వారి జీవిత చరిత్రను వీడియోల రూపంలో విని తెలుసుకోవచ్చు. అల్హమ్దులిల్లాహ్ ‘మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర’అని పూర్తి ప్రవక్త వారి జీవిత చరిత్ర అల్హమ్దులిల్లాహ్ YouTube లో తెలుగు భాషలో ఉంది. అది కూడా మీరు వినవచ్చు, ఇతరులకు అల్హమ్దులిల్లాహ్ షేర్ చేయవచ్చు. అలాగే హిందీలో, అలాగే ఇంగ్లీష్ లో ప్రతి భాషలో ప్రవక్త వారి జీవిత చరిత్ర ఉంది. అది తెలుసుకోవాలి.
6. ప్రవక్త ప్రవర్తనను అలవర్చుకోవడం
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న మరొక విషయం ఏమిటంటే, ప్రవక్త వారి ప్రవర్తన ఎలా ఉండేదో మన ప్రవర్తనను కూడా మనము ఆ విధంగా మార్చుకోవాలి. మూర్ఖత్వంగా ప్రవర్తించటం, ఆ తర్వాత మేము ప్రవక్త వారి అభిమానులం అని చెప్పుకోవటం అది సరికాదు. మూర్ఖత్వం ప్రదర్శించటం, తర్వాత మేము ప్రవక్త వారి అభిమానులం అని చెప్పుకోవటం సరికాదండి.
ప్రవక్త వారి అభిమానులు అయితే, ప్రవక్త వారి ప్రేమికులు అయితే, ప్రవక్త వారి మీద ఉన్న మీ ప్రేమ నిజమైనది అయితే, ప్రవక్త వారి వ్యక్తిత్వం ఎలా ఉండేదో, ఆయన వ్యవహారాలు ఏ విధంగా ఉండేవో, ఆ విధంగా మన వ్యక్తిత్వాన్ని, మన వ్యవహారాలను మనము మార్చుకోవాలి. ప్రవక్త వారు కుటుంబీకులతో ఎలా ప్రవర్తించేవారు? ప్రవక్త వారు ఇరుగుపొరుగు వారితో ఎలా ప్రవర్తించేవారు? పిల్లలతో ఎలా ప్రవర్తించేవారు? పెద్దలతో ఎలా ప్రవర్తించేవారు? మహిళలతో ఎలా ప్రవర్తించేవారు? ముస్లింలతో ఎలా ప్రవర్తించేవారు? ముస్లిమేతరులతో ఎలా ప్రవర్తించేవారు? బంధువులతో ఎలా ప్రవర్తించేవారు? శత్రువులతో ఎలా ప్రవర్తించేవారు? అలాంటి ప్రవర్తన మనము కూడా కలిగి ఉండాలి.
మరి మనం అలా ఉన్నామా? ప్రవక్త వారి ప్రేమికులం అని చెప్పుకుంటున్నాం, ఒక పక్క బిడ్డల్ని హింసిస్తూ ఉన్నాం, ఒక పక్క భార్యని హింసిస్తూ ఉన్నాం, ఒక పక్క తల్లిదండ్రులకు సేవ చేయట్లేదు, పెద్దల్ని గౌరవించట్లేదు, అన్నీ పక్కన పెట్టేశాం, ప్రవక్త వారి ప్రేమికులమని చెప్పి మళ్ళా స్టేటస్ పెట్టుకుంటూ ఉన్నాం. ఇది ఎంతవరకు సబబు అండి? కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యక్తిత్వం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యవహారం ఎవరితో ఏ విధంగా ఉండేదో తెలుసుకొని మనము కూడా ఆ విధంగా మనల్ని మనము సంస్కరించుకోవాలి, మార్చుకోవాలండి. ఇది ప్రవక్త వారి ప్రేమ మనతో కోరుతున్న విషయం.
7. ప్రవక్త ఇష్టాఇష్టాలను పాటించడం
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న మరొక విషయం ఏమిటంటే, ప్రవక్త వారు ఏ విషయాలను ప్రేమించారో, ఇష్టపడ్డారో, ఆ విషయాలను మనము కూడా ఇష్టపడాలి. ప్రవక్త వారు ఏ విషయాలను అయితే అసహ్యించుకున్నారో, ప్రవక్త వారికి ఏ పనులు, ఏ విషయాలు నచ్చలేదో, ఆ పనులు, ఆ విషయాలను కూడా మనము వదిలేయాలి, మనము కూడా వాటిని ఇష్టపడకూడదు.
ప్రవక్త వారు ఇష్టపడిన విషయాన్ని మనం కూడా ఇష్టపడతాం. ప్రవక్త వారికి నచ్చని విషయాలను కూడా మనము పక్కన పెట్టేద్దాం, మనము ఆ విషయాలను ఇష్టపడకూడదు. ఈరోజు మనం ఏమి చేస్తున్నాం? ప్రవక్త వారికి నచ్చిన విషయాలు మనకు నచ్చట్లేదు. ప్రవక్త వారికి నచ్చని విషయాలు మనకు నచ్చుతా ఉన్నాయి. మాకు నచ్చుతూ ఉన్నాయి, మా బిడ్డలకు నచ్చుతూ ఉన్నాయి, మా కుటుంబీకులకు నచ్చుతూ ఉన్నాయి. ఏమన్నా చెప్తే ఇది చేయకూడదు కదా, ఇది ప్రవక్త వారు చేయవద్దు అని వరించారు కదా మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్తే, “హజరత్, అలా కాదు హజరత్. మా బిడ్డ అలా కోరుతూ ఉంటే అలా చేశాను హజరత్. లేదంటే మా తల్లిదండ్రులు చెప్తే చేశాను హజరత్. లేదంటే మా ఇంట్లో చెప్తే నేను చేశాను హజరత్” అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు అండి? ప్రవక్త వారి ప్రేమికులు అని చెప్పేవాళ్ళు చెప్తున్న మాట ఇది. ప్రవక్త వారిని మీరు నిజంగానే ప్రేమిస్తూ ఉంటే ప్రవక్త వారు ఇష్టపడిన విషయాలను ఇష్టపడండి, వాటిని అభిమానించండి, వాటిని మీ జీవితంలోకి తీసుకొని రండి. ప్రవక్త వారికి నచ్చని విషయాలు వాటిని చేయటం, ఆ తర్వాత వారు చెప్పిన కారణంగా చేశాను, వీళ్ళు చెప్పిన కారణంగా చేశాను అని చెప్పటం సరికాదు.
8. ప్రవక్త కుటుంబీకులను (అహలె బైత్) గౌరవించడం
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకుల్ని మనము గౌరవించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులు ఎవరు? అహలె బైత్ అంటారు. ఒక ప్రత్యేకమైన ప్రసంగము ఉంది, అది కూడా మీరు వినవచ్చు. అహలె బైత్ అంటే ఎవరు? అహలె బైత్ వారి యొక్క విశిష్టతలు అని ప్రసంగాలు ఉన్నాయండి, అవి వినండి ఇన్షాఅల్లాహ్, విషయాలు వివరంగా తెలుస్తాయి. కాబట్టి ప్రవక్త వారి ప్రేమ మనతో కోరుతున్న విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకుల్ని మనము ప్రేమించాలి, అభిమానించాలి, గౌరవించాలి. ఏ ఒక్కరినీ కూడా కించపరచటం సబబు కాదు, సరికాదు. నిజమైన ప్రేమికులమైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకుల్ని మనము గౌరవించాలి, అభిమానించాలి.
ప్రవక్త వారి ప్రేమ కోరని విషయాలు చాలామంది చేస్తూ ఉన్నారు
మిత్రులారా, ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న విషయాలు అనే అంశం మీద కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీ ముందర ఉంచాను. అయితే నేడు ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలు ఎంతమంది చేస్తూ ఉన్నారు అనేది మనము ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనం ఆ విధంగా చేస్తూ ఉన్నామా లేదా అనేది మనము ఆత్మ విమర్శ చేసుకోవాలి. అయితే సమాజాన్ని చూస్తే మాత్రము ఒక విషయం మన ముందర వస్తుంది, అదేమిటంటే, ప్రవక్త వారి ప్రేమ ఏ విషయాలు అయితే మనతో కోరుతూ ఉందో, ఆ విషయాలు చేస్తున్న వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ప్రవక్త వారి ప్రేమ కోరని విషయాలు చాలామంది చేస్తూ ఉన్నారు.
ప్రవక్త వారి ప్రేమ ర్యాలీలు చేయమని చెప్పలేదండి. ప్రవక్త వారి ప్రేమ డీజేలు వాయిస్తూ పచ్చని జెండాలు చేతిలో పట్టుకొని ట్రాఫిక్ జామ్ చేసి అక్కడ ఎగరండి, అక్కడ పాడండి అని మనకు చెప్పలేదండి. కానీ చేస్తున్నారు, ఏమంటే ప్రవక్త వారి ప్రేమ అంటూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మసీదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు బ్యానర్ మీద పెట్టి, స్టేజ్ ని అలంకరించి, ఆ తర్వాత అక్కడ అశ్లీలమైన పాటలు వాయిస్తూ అక్కడ నృత్యాలు చేస్తూ ఉన్నారు. ప్రవక్త వారి ప్రేమ ఈ పనులు చేయమని చెప్పిందా అండి మనకు? లేదు లేదు. ఇది ప్రవక్త వారి ప్రేమకు విరుద్ధమైన విషయాలు.
అలాగే ప్రవక్త వారి ప్రేమ అని చెప్పి చాలామంది ఏమి చేస్తున్నారంటే, పెద్ద పెద్ద కేకులు తయారు చేస్తూ ఉన్నారు. ఆ కేకులు తయారు చేస్తూ, అల్లాహ్ మన్నించు గాక, ఇంగ్లీష్ లో “హ్యాపీ బర్త్డే యా రసూలుల్లాహ్” అని చెప్పి కూడా కేకులు కోస్తూ ఉన్నారు, అదేదో పెద్ద ఘన కార్యం అని చెప్పేసి మళ్లీ దాన్ని సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. ఇది చేయమని చెప్పిందండి మన ప్రవక్త వారి ప్రేమ మనకు? కేకులు సింగారించి “హ్యాపీ బర్త్డే యా రసూలుల్లాహ్” అని చేయమని మనకు ప్రవక్త వారి ప్రేమ చెప్పిందా అండి? లేదు మిత్రులారా.
ప్రవక్త వారి ప్రేమ సాకుతో అసభ్యమైన కార్యాలు చేయరాదు, ప్రజలకు ఇబ్బంది పెట్టే పనులు చేయరాదు, అలాగే అసంఘాకికమైన విషయాలకు దరిదాపుగా వెళ్ళకూడదు, అలాగే మన ధర్మంలో లేని విషయాలకు కూడా మనము చేయకూడదు ప్రవక్త వారి ప్రేమ సాకుతో.
ఇంతటితో నా మాటలు ముగిస్తూ, నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ నిజమైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అభిమానుల్లాగా తీర్చిదిద్దు గాక. ప్రవక్త వారి ప్రేమ ఏ విషయాలైతే కోరుతూ ఉందో ఆ విషయాలను తూచా తప్పకుండా మనందరికీ పాటించే భాగ్యం ప్రసాదించు గాక. ప్రవక్త వారి ప్రేమ ఏ విషయాలైతే కోరట్లేదో అలాంటి విషయాల నుండి దూరంగా ఉండే అనుగ్రహం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు, ముఖ్యంగా మన యువకులకు ప్రసాదించు గాక. ఆమీన్.
వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, వక్త ‘బిద్అత్’ అనే పదం యొక్క అర్థాన్ని వివరిస్తారు. భాషాపరంగా, బిద్అత్ అంటే గతంలో ఉదాహరణ లేని ఒక కొత్త ఆవిష్కరణ అని ఆయన వివరిస్తారు. దీనిని స్పష్టం చేయడానికి ఖుర్ఆన్ నుండి సూరా అల్-బఖర (2:117) మరియు సూరా అల్-అహ్కాఫ్ (46:9) ఆయతులను ఉదాహరిస్తారు. తరువాత, ఆయన బిద్అత్‌ను రెండు రకాలుగా వర్గీకరిస్తారు: మొదటిది, ప్రాపంచిక విషయాలు మరియు అలవాట్లలోని ఆవిష్కరణలు (ఉదాహరణకు సాంకేతికత, దుస్తులు), ఇవి అనుమతించబడినవి. రెండవది, ధార్మిక (దీన్) విషయాలలో చేసే కొత్త ఆవిష్కరణలు, ఇవి నిషిద్ధం (హరామ్) మరియు తిరస్కరించబడినవి. ఈ విషయాన్ని ధృవీకరించడానికి ఆయన సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం నుండి రెండు హదీసులను ఉదహరిస్తారు. ప్రసంగం యొక్క సారాంశం ఏమిటంటే, ప్రాపంచిక ఆవిష్కరణలు ఆమోదయోగ్యమైనప్పటికీ, ఇస్లాం ధర్మంలో కొత్త పద్ధతులను చేర్చడం తీవ్రమైన తప్పు.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్.
అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఈ రోజు మనం బిద్అత్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. బిద్అత్, దీనికి చాలా వివరాలు ఉన్నాయి. ఒక రెండు, మూడు ఎపిసోడ్ లలో దీనిని మనం తెలుసుకుందాం. ఈరోజు అయితే, బిద్అత్ అంటే అర్థం ఏమిటి? బిద్అత్ కి అర్థం తెలుసుకుందాం. తర్వాత ఒక రెండు, మూడు ఎపిసోడ్ లలో బిద్అత్ రకాలు, బిద్అత్ యొక్క ఆదేశాలు అవి తెలుసుకుందాం. ఈరోజు బిద్అత్ అంటే ఏమిటి?
బిద్అత్ (Bid’ah) యొక్క భాషాపరమైన అర్థం
నిఘంటువు ప్రకారం బిద్అత్ అంటే గత కాలపు ఉపమానం ఏదీ లేకుండానే, ఏదేని ఒక వస్తువును అపూర్వంగా, ప్రప్రథమంగా ఆవిష్కరించటం. ఇది బిద్అత్ పదానికి అర్థం. నిఘంటువు ప్రకారం.
ఉదాహరణకు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ లో సూర బఖర, ఆయత్ 117 లో ఇలా సెలవిచ్చాడు,
ఇక్కడ బదీఅ అనే పదం ఉంది. దీని నుంచే బిద్అత్. అంటే భూమ్యాకాశాలను మొట్టమొదట సృష్టించినవాడు ఆయనే, అల్లాహ్ యే. అంటే పూర్వపు ఉపమానం ఏదీ లేకుండానే భూమ్యాకాశాలకు ఉనికిని ప్రసాదించాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా.
అలాగే సూర అహ్కాఫ్, ఆయత్ 9 లో, ఒక ఆయత్ ఇలా ఉంటుంది,
قُلْ مَا كُنتُ بِدْعًا مِّنَ الرُّسُلِ (ఖుల్ మా కున్తు బిద్అమ్ మినర్రుసుల్) (ఓ ముహమ్మద్!) వారికి చెప్పు : “నేను కొత్తగా వచ్చిన ప్రవక్తనేమీ కాను. (46:9)
అంటే, ఓ ప్రవక్తా, వారితో అను, నేను కొత్తగా వచ్చిన ప్రవక్తనేమీ కాను. అంటే, అల్లాహ్ తరఫున ప్రజలకు దైవ సందేశం అందజేసే మొట్టమొదటి వ్యక్తిని కాను. నాకు ముందు ఎందరో ప్రవక్తలు వచ్చారు.
అంటే ఈ రెండు ఆయత్ లలో బిద్అ అనే పదానికి అర్థం ఉంది. గత కాలపు ఉపమానం ఏదీ లేకుండానే ఏదైనా ఒక వస్తువును అపూర్వంగా, ప్రప్రథమంగా ఆవిష్కరించటం అన్నమాట.
“ఇబ్తద’అ ఫులానున్ బిద్అతన్” అని అరబీలో అంటారు. దానికి అర్థం ఏమిటి? అంటే అతను అంతకు ముందు లేని ఒక కొత్త పద్ధతిని సృష్టించాడు అని అర్థం.
రెండు రకాల ఆవిష్కరణలు
ఇక, ఈ లేని కొత్త పద్ధతులు, ఆవిష్కరించటం, ఆరంభం అనేది రెండు రకాలుగా ఉంటుంది.
ఒకటి, అలవాట్లలో ఆవిష్కరణ. కొత్త కొత్త విషయాలు వెతకటం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటం, ప్రారంభించటం. అలవాట్లలో. రెండవది, ధర్మం, దీన్ లో క్రొంగొత్త ఆవిష్కరణ.
అలవాట్లలో ఆవిష్కారం, ఉదాహరణకు దైనందిన జీవితం కొరకు అవసరమైన వాటిని కొత్తగా కనుగోవటం లేదా ఆవిష్కరించటం. ఇది ధర్మసమ్మతమే. ఎందుకంటే ఇది అలవాట్లకు సంబంధించినది. దుస్తులు, మనం వాడే వాహనాలు, అలాగే మన జీవితానికి, అలవాట్లకి సంబంధించిన అనేక విషయాలు, మొబైల్ ఉంది, కారు ఉంది. అలవాట్లకు సంబంధించిన విషయాలలో కొత్తది రావటం, కొత్త విధానాన్ని తెలుసుకోవటం, కొత్త విషయం ఆవిష్కరించటం ఇవన్నీ ధర్మసమ్మతమే.
రెండవ రకం, దీన్ లో, ధర్మంలో, ఇస్లాం లో క్రొంగొత్త ఆవిష్కరణ. అంటే ధర్మంలో నూతన విధానాలను, పనులను సృష్టించటం. ఇది నిషిద్ధం. దీనికి ఇస్లాంలో అనుమతి ఉండదు. ఎందుకంటే ధర్మావలంబన విషయంలో ఖుర్ఆన్ మరియు ప్రామాణిక హదీసుల ద్వారా రూఢీ అయిన విషయాల వరకే సరిపెట్టుకోవాలి. అందులో ఎలాంటి హెచ్చుతగ్గులు చేయకూడదు, చేయటం ధర్మసమ్మతం కాదు.
మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,
مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ (మన్ అహదస ఫీ అమ్ రినా హాదా మా లైస మిన్హు ఫహువ రద్) (రవాహుల్ బుఖారీ వ ముస్లిం) ఎవరైనా మా ఈ షరీఅత్ విషయంలో లేని వస్తువును సృష్టిస్తే అది త్రోసిపుచ్చదగుతుంది
అంటే ఎవరైనా మా ఈ షరీఅత్ విషయంలో – ప్రవక్త గారు “మా” అన్నారు, ఫీ అమ్ రినా – మా ఈ షరీఅత్ విషయంలో (ఫీ అమ్ రినా అంటే ధర్మం విషయంలో, దీన్ విషయంలో, షరీఅత్ విషయంలో) లేని వస్తువును సృష్టిస్తే అది త్రోసిపుచ్చదగుతుంది, అది రద్దు చేయబడుతుంది, ఫహువ రద్, రద్దు చేయబడుతుంది.
అలాగే ఇంకో హదీస్ లో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,
مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ (మన్ అమిల అమలన్ లైస అలైహి అమ్ రునా ఫహువ రద్) (రవాహు ముస్లిం) ఎవడైనా మా షరీఅత్ కు అనుగుణంగా లేని ఆచరణ ఏదైనా చేస్తే అది త్రోసిపుచ్చదగినది, రద్దు చేయబడుతుంది.
అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే, బిద్అత్ అనే పదానికి అర్థం ఏమిటి? లేని విధానాన్ని సృష్టించటం. కొత్తగా, ప్రప్రథమంగా ఆవిష్కరించటం, ఆరంభం చేయటం. ఇది అలవాట్లలో అయితే ధర్మసమ్మతమే. ఇక రెండవది, దీన్ పరంగా. దీన్ లో కొత్త విధానం ఆవిష్కరించటం, ప్రారంభం చేయటం. ఇది ధర్మసమ్మతం కాదు.
ఈ బిద్అత్ యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాం. బిద్అత్ యొక్క రకాలు, అవి ఇన్ షా అల్లాహ్ మనం వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.
వ ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, వక్త సహాబాల విధానం (మన్హజ్) మరియు దాని ఆవశ్యకత గురించి వివరిస్తారు. సహాబీ అనే పదానికి అర్థం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఈమాన్ స్థితిలో కలుసుకుని, అదే స్థితిలో మరణించిన వారని నిర్వచించారు. సహాబాలు ముస్లిం సమాజంలో అత్యంత శ్రేష్ఠులని, వారి విశ్వాసం (ఈమాన్) మరియు అఖీదా ఖురాన్ ద్వారా ధృవీకరించబడిందని నొక్కి చెప్పారు. మన విశ్వాసం మరియు ఆచరణా విధానం సహాబాల వలె ఉండాలని, ఖురాన్ మరియు హదీసులను వారు అర్థం చేసుకున్న విధంగానే మనం అర్థం చేసుకోవాలని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేశారు. సహాబాల మార్గాన్ని విడిచిపెట్టడం నరకానికి దారితీస్తుందని హెచ్చరించారు. సహాబాల విధానాన్ని అనుసరించడమే నిజమైన సన్మార్గమని, వారి ఇత్తిబా (అనుసరణ) యొక్క ప్రాముఖ్యతను ఉదాహరణలతో వివరించారు.
وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْاَنْۢبِيَآءِ وَالْمُرْسَلِيْنَ (వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్) ప్రవక్తల నాయకునిపై మరియు దైవప్రవక్తలపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.
وَمَنْ تَبِعَهُمْ بِاِحْسَانٍ اِلٰى يَوْمِ الدِّيْنِ اَمَّا بَعْدُ (వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బఅద్) మరియు ప్రళయదినం వరకు వారిని ఉత్తమ రీతిలో అనుసరించేవారిపై కూడా (శాంతి మరియు శుభాలు వర్షించుగాక). ఆ తర్వాత…
رَبِّ اشْرَحْ لِيْ صَدْرِيْ وَيَسِّرْ لِيْٓ اَمْرِيْ وَاحْلُلْ عُقْدَةً مِّنْ لِّسَانِيْ يَفْقَهُوْا قَوْلِيْ (రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్ రీ వహ్ లుల్ ఉఖ్దతమ్ మిల్ లిసానీ యఫ్ఖహూ ఖవ్ లీ) “ఓ నా ప్రభూ! నా హృదయాన్ని విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుకలోని ముడిని విప్పు. ప్రజలు నా మాటను అర్థం చేసుకోగలగాలి.” (20:25-28)
సహాబాల విధానం, దాని అవసరం
మన్హజుస్ సహాబా. సహాబా ఈ పదం సహాబీ పదానికి బహువచనం. ఉర్దూలో సహాబీ ఏకవచనం, సహాబా అనేది బహువచనం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు. ఈమాన్ స్థితిలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలుసుకొని, ఈమాన్ స్థితిలోనే మరణించిన వారంతా సహాబా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు అనబడతారు. ఇది సహాబా లేదా సహాబీ అనే పదానికి అర్థం.
వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్ఠులు. ఇస్లాం వైపు ముందంజ వేసినవారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్య భాగ్యం పొందినవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి జిహాద్ చేసినవారు. షరీఅత్ బాధ్యతలను మోయటమే గాక దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులు. ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం వాజిబ్. తప్పనిసరి. అంటే సహాబాల గురించి ఇలా అఖీదా, విశ్వాసం మనం కలిగి ఉండాలి.
సహాబాల విధానం కంటే ముందు, ముందుమాటగా నేను రెండు మూడు విషయాలు, ఈ సహాబాల యొక్క ఔన్నత్యం గురించి చెప్పదలిచాను. సహాబాల గురించి ఖురాన్‌లో అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలలో చాలా నొక్కి చెప్పడం జరిగింది. వారు ఎవరు, వారి విశ్వాసం ఏమిటి, వారి గొప్పతనం ఏమిటి అనేది. ఉదాహరణకు సూరా తౌబాలో ఆయత్ నెంబర్ 100.
“ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తర్వాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలను అల్లాహ్ వారి కోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే.” (9:100)
ఈ ఆయతులో మూడు వర్గాల గురించి చెప్పడం జరిగింది. ముహాజిర్లు ఒక వర్గం, అన్సార్లు ఒక వర్గం. అంటే సహాబాలలో ఇది రెండు వర్గాలు. ముహాజిర్లు, అన్సార్లు. మూడవది, వారి తర్వాత వారిని చిత్తశుద్ధితో అనుసరించేవారు. వారెవరు? కొంతమంది పండితులు తాబయీన్లు అయి ఉండవచ్చు అని చెప్పారు. కాకపోతే ప్రళయం వరకు వచ్చే విశ్వాసులందరూ దీనిలో వస్తారు. చిత్తశుద్ధితో వారిని అనుసరించేవారు. ఎవరిని? సహాబాలను. ముహాజిర్లను, సహాబాలను చిత్తశుద్ధితో అనుసరించేవారు కూడా ఈ కోవకి వస్తారు. ఇది సహాబాల యొక్క గొప్పతనం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
విశ్వాసులతో స్నేహం అంటే ఏమిటి? https://youtu.be/VIPOLPgJOa4 [8 నిముషాలు] వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగం ఇస్లాంలో విశ్వాసుల మధ్య స్నేహం యొక్క భావనను వివరిస్తుంది. ఈ స్నేహం ఏకేశ్వరోపాసన (తౌహీద్) కోసం పరస్పర ప్రేమ మరియు సహకారంపై ఆధారపడి ఉంటుందని ఇది నొక్కి చెబుతుంది. వక్త సూరా అత్-తౌబా, 71వ ఆయతును ఉటంకిస్తూ, విశ్వాసులను మంచిని ఆజ్ఞాపించే, చెడును నిషేధించే, నమాజ్ స్థాపించే, జకాత్ ఇచ్చే, మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపే పరస్పర మిత్రులుగా వర్ణించారు. ఇంకా, ఈ బంధాన్ని వివరించడానికి రెండు హదీసులు సమర్పించబడ్డాయి: మొదటిది విశ్వాసులను ఒక గోడలోని ఇటుకలతో పోలుస్తుంది, ప్రతి ఒక్కటి మరొకదాన్ని బలపరుస్తుంది, రెండవది విశ్వాసుల సమాజాన్ని సమిష్టిగా నొప్పిని అనుభవించే ఒకే శరీరంతో పోలుస్తుంది. విశ్వాసులు ఒకరికొకరు బలం, మద్దతు మరియు కరుణకు మూలంగా ఉండాలనేది ప్రధాన సందేశం.
విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడు వాదోడుగా) ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్‌ను చెల్లిస్తారు. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్ అతిత్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేచనాశీలి.(9:71)
ఈ ఆయతులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసుల సద్గుణాల ప్రస్తావన చేశాడు. విశ్వాసుల యొక్క సద్గుణాలను ప్రస్తావించాడు. మొదటి సద్గుణం ఏమిటంటే వారు, అంటే విశ్వాసులు, పురుషులైనా, స్త్రీలైనా, విశ్వాసులు, విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు, వారు పరస్పరం స్నేహితులుగా మసులుకుంటారు. ఒండొకరికి సహాయ సహకారాలు అందించుకుంటారు. సుఖదుఃఖాలలో పాలుపంచుకుంటారు అన్నమాట.
ప్రవక్త ప్రవచనాలు
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.
الْمُؤْمِنُ لِلْمُؤْمِنِ كَالْبُنْيَانِ يَشُدُّ بَعْضُهُ بَعْضًا (అల్ ముఅమిను లిల్ ముఅమిని కల్ బున్యాన్, యషుద్దు బ’అదుహు బా’దా) ఒక విశ్వాసి, సాటి విశ్వాసికి గోడ లాంటివాడు. ఆ గోడలోని ఒక ఇటుక, ఇంకో ఇటుకకు పుష్టినిస్తుంది. (బుఖారీ మరియు ముస్లిం)
అంటే ఒక విశ్వాసి, సాటి విశ్వాసికి గోడ లాంటివాడు. ఆ గోడలోని ఒక ఇటుక ఇంకో ఇటుకకు పుష్టినిస్తుంది. సుబ్ హా నల్లాహ్! అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విశ్వాసికి మరో విశ్వాసికి మధ్య ఉండే సంబంధాన్ని ఈ హదీసులో వివరించారు. అల్ ముఅమిను లిల్ ముఅమిని కల్ బున్యాన్. కట్టడం లాంటివాడు. ఒక విశ్వాసి ఇంకో విశ్వాసికి కట్టడం లాంటివాడు, గోడ లాంటివాడు. ఎందుకంటే ఒక గోడలో ఒక ఇటుక, ఇంకో ఇటుకకు బలం ఇస్తుంది, పుష్టినిస్తుంది. విశ్వాసులు కూడా పరస్పరం అలాగే ఉంటారు, ఉండాలి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించిన మాట. అలాగే, అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకో హదీసులో ఇలా సెలవిచ్చారు.
పరస్పర ప్రేమానురాగాలను పంచుకోవటంలో, ఒండొకరిపై దయ చూపటంలోనూ, విశ్వాసుల (ముఅమినీన్‌ల) ఉపమానం ఒక శరీరం లాంటిది. శరీరంలోని ఏదైనా ఒక అవయవం బాధకు గురైనప్పుడు, మొత్తం శరీరానికి నొప్పి కలుగుతుంది. శరీరమంతా వ్యాకులతకు లోనవుతుంది. (ముస్లిం)
ఈ హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రేమానురాగాల విషయంలో, దయ చూపే విషయంలో ఒండొకరికి ఒకరు సహాయం చేసుకునే విషయంలో, చేదోడు వాదోడుగా ఉండే విషయంలో, పరస్పరం కలిసిమెలిసి ఉండే విషయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరూ ఒక శరీరం లాంటి వారు. శరీరంలోని ఒక భాగానికి బాధ అయితే, మొత్తం శరీరం బాధపడుతుంది. అదే ఉపమానం ఒక విశ్వాసిది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అత్మీయ సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ నిజమైన విశ్వాసిగా జీవించే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. మరిన్ని వివరాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, వక్త ‘వసీలా’ (అల్లాహ్‌కు సాన్నిహిత్యం కోరే సాధనం) అనే భావనను వివరిస్తున్నారు. ధర్మ సమ్మతమైన మరియు అధర్మమైన వసీలాల మధ్య వ్యత్యాసాన్ని ఆయన స్పష్టం చేశారు. ధర్మబద్ధమైన మార్గం కేవలం ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ద్వారానే నిర్దేశించబడిందని నొక్కిచెప్పారు. ముఖ్యంగా, మరణించిన వారి ద్వారా, వారు ప్రవక్తలు లేదా పుణ్యాత్ములు అయినప్పటికీ, సహాయం కోరడం లేదా దుఆ చేయడం నిషిద్ధమని వివరించారు. ఆరాధన “ఎవరి కోసం” మరియు “ఎలా” అనే ఇబ్నె తైమియా సూత్రాన్ని ఉటంకించారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కాలంలో కరువు ఏర్పడినప్పుడు, వర్షం కోసం దుఆ చేయడానికి మరణించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కాకుండా, జీవించి ఉన్న ప్రవక్త పినతండ్రి అబ్బాస్ (రదియల్లాహు అన్హు)ను వసీలాగా చేసుకున్న చారిత్రక ఉదాహరణను అందించారు. దీని ద్వారా జీవించి ఉన్న పుణ్యాత్ముల ద్వారా మధ్యవర్తిత్వం కోరవచ్చని, కానీ మృతుల ద్వారా కాదని స్పష్టం చేశారు. అలాగే, ‘ఇస్తిఆనత్’ (ప్రాపంచిక విషయాలలో అనుమతించబడిన సహాయం) మరియు ‘ఇస్తిగాసా’ (కేవలం అల్లాహ్ మాత్రమే చేయగల విషయాలలో సహాయం కోరడం) మధ్య తేడాను వివరిస్తూ, రెండోది అల్లాహ్ యేతరుల నుండి కోరడం హరామ్ అని తేల్చిచెప్పారు.
(అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, వ మన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్.)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు. అంతిమ విజయం దైవభీతిపరులకే. ప్రవక్తల నాయకులు, దైవసందేశహరులందరిపై మరియు ప్రళయదినం వరకు వారిని సన్మార్గంలో అనుసరించేవారిపై అల్లాహ్ కారుణ్యం మరియు శాంతి కురుపించుగాక. ఆ తర్వాత…
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహన అనే ఈ కార్యక్రమములోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
అధర్మమైన వసీలా
అభిమాన సోదరులారా! గత ఎపిసోడ్లో మనం ధర్మ సమ్మతమైన వసీలా గురించి తెలుసుకున్నాం. అవి తప్ప వేరే ఇతర పద్ధతుల ద్వారా ఆశ్రయం పొందటం అది అధర్మమైన వసీలా అవుతుంది.
ప్రియ సోదరులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన రుజుమార్గం కొరకు, సత్యమార్గం కొరకు ఒక మార్గాన్ని, ఒక దారిని, ఒక గీటురాయిని తెలియజేశాడు, చూపించాడు. సత్యం ఏమిటి? అసత్యం ఏమిటి? న్యాయం ఏమిటి? అన్యాయం ఏమిటి? ధర్మం ఏమిటి? అధర్మం ఏమిటి? స్వర్గానికి పోయే దారి ఏమిటి? నరకానికి పోయే దారి ఏమిటి? మన ఇహపర లోకాల సాఫల్యం కొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ గ్రంథం, దివ్య గ్రంథం ఖురాన్ మజీద్ ని అవతరింపజేశాడు. అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు, ప్రవచనాలు. ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసులలో మన జీవన విధానం, ఈ లోకంలో, ప్రపంచంలో, ఇహంలో మనము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థన చేయకూడదు, అల్లాహ్ ను ఎలా వేడుకోవాలి, ఎలా వేడుకోకూడదు, ఇవన్నీ మనకు తెలియజేయడం జరిగింది ఖురాన్ లో మరియు హదీస్ లో.
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తప్ప ఇతర మార్గం ఎన్నుకుంటే, అది మన బుద్ధికి, మన తెలివికి సరైనది అని అనిపించినా, అది ఖురాన్ పరంగా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పరంగా లేకపోతే, అది ధర్మ సమ్మతం కాదు అని మనము స్పష్టంగా తెలుసుకోవాలి.
ఆరాధన ఎవరి కోసం? ఎలా?
అందుకే షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియా రహ్మతుల్లాహి అలై ఒక చక్కని సూత్రం చెప్పారు. అది ఏమిటంటే:
مَنْ تَعْبُدُ؟ كَيْفَ تَعْبُدُ؟ (మన్ త’అబుద్? కైఫ త’అబుద్?) ఎవరిని ఆరాధించాలి? ఆ ఆరాధన ఎలా చేయాలి?
ఎవరిని ఆరాధించాలి? ఆరాధన ఎవరి కొరకు? కైఫ త’అబుద్, ఆ ఆరాధన ఎలా చేయాలి? సూటిగా చెప్పాలంటే, ఆరాధన, ఇబాదత్ ఎవరి కోసం? ఆ ఇబాదత్ ఎలా చేయాలి? రెండే రెండు విషయాలు. దీనికి సూటిగా చెప్పాలంటే చక్కని సమాధానం: ఆరాధన కేవలం అల్లాహ్ కొరకు మరియు ఆ ఆరాధన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విధానం ప్రకారమే.
మృతులను వసీలాగా తీసుకోవటం
అభిమాన సోదరులారా! కావున ఈ ధర్మ సమ్మతం కాని విషయాలలో, ధర్మ సమ్మతం కాని వసీలాలలో ఉదాహరణకు ఒకటి ఏమిటి? మృతులను దుఆ చేయమని కోరటం. మృతులను, పరమపదించిన వారిని దుఆ చేయమని కోరటం, వారిని వసీలాగా తీసుకోవటం, వాస్తాగా తీసుకోవటం, ఇది ఇస్లాంలో అధర్మం అని మనం తెలుసుకోవాలి.
అది ఎవరైనా సరే, పుణ్య పురుషులు కావచ్చు, ఔలియాలు కావచ్చు, అలాగే దైవ ప్రవక్తలు కూడా కావచ్చు. ఎవరైనా సరే, మరణించిన వారి సహాయం కోరటం, వారి వసీలాను కోరటం, వారి వసీలా ద్వారా దుఆ చేయటం ఇది ఇస్లాంలో సమ్మతం కాదు. ఎందుకంటే, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు – ఇది ప్రామాణికమైన హదీస్, అనేక హదీస్ గ్రంథాలలో ఈ హదీస్ ఉంది, సహీహ్ హదీస్ ఇది, ప్రామాణికమైన హదీస్ ఇది.
ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు, ముఆవియా బిన్ అబూ సుఫ్యాన్ రదియల్లాహు అన్హులు వారు గానీ, ఇతర సహాబాలు గానీ, తాబయీన్లు గానీ, కరువు కాటకాలు వచ్చినప్పుడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత వారి ద్వారా దుఆ చేయలేదు, వారి వసీలా తీసుకోలేదు. ఇది ముఖ్యమైన విషయం, గమనించాల్సిన విషయం ఇది. మనకంటే ఎక్కువ జ్ఞానం గలవారు, మనకంటే ఎక్కువ ఖురాన్, హదీస్ తెలిసినవారు, మనకంటే ఎక్కువ అల్లాహ్‌కు భయపడేవారు, మనకంటే ఎక్కువ దైవభీతి కలిగినవారు, మనకంటే ఎక్కువ అల్లాహ్‌ను ఆరాధించేవారు, మనకంటే ఎక్కువ ధర్మ జ్ఞానం కలిగినవారు, సహాబాలు, తాబయీన్లు, ధర్మ పండితులు, ముహద్దసీన్లు, వారు కరువు కాటకాలు వచ్చినప్పుడు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను వసీలాగా తీసుకున్నారా? తీసుకోలేదు.
ఇంకా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత కాలం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా దుఆ చేసేవారు. పోయి, “ఓ దైవ ప్రవక్త! కరువు వచ్చింది, వర్షం లేదు, నీరు వలన మనుషులు, జంతువులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ దైవ ప్రవక్త, దుఆ చేయండి” అని కోరేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు. ఇది మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం.
కాకపోతే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత సహాబాలు, ఆ తర్వాత కాలానికి చెందిన వారు, వారెవరైనా ప్రవక్తల, మృతుల, చనిపోయిన పుణ్యాత్ముల వసీలా తీసుకునేవారా? కాదు. ఒక హదీస్ ఇలా ఉంటుంది.
ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు యొక్క వేడుక: “ఓ అల్లాహ్! గతంలో మేము మా ప్రవక్త ద్వారా నిన్ను అర్థించే వారము, నీవు వర్షం కురిపించి మా కరువు తీర్చే వాడివి. ఇప్పుడు మేము మా ప్రవక్త బాబాయి గారిని ఆశ్రయించి నిన్ను ప్రార్థిస్తున్నాము. కనుక మాపై వర్షం కురిపించు” అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ప్రార్థించేవారు.
దీంట్లో స్పష్టంగా ఏముంది? స్పష్టంగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు తెలియజేస్తున్నారు. “ఓ అల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత వరకు ప్రవక్త ద్వారా నిన్ను అర్థించే వారము.” అంటే ఇప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేరు కాబట్టి, పరమపదించారు కాబట్టి, ఇప్పుడు మనము ప్రవక్త గారి బాబాయి అయిన, పినతండ్రి అయిన అబ్బాస్ రదియల్లాహు అన్హు గారిని ఆశ్రయించి, అబ్బాస్ గారి ద్వారా నిన్ను వేడుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే అప్పుడు అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు బ్రతికి ఉన్నారు. ఇది గమనించాల్సిన విషయం.
అంటే దీని సారాంశం ఏమిటి అభిమాన సోదరులారా? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉన్నంత వరకు సహాబాలు ప్రవక్త ద్వారా ప్రార్థించేవారు. ఆయన పరమపదించిన తర్వాత కరువు వస్తే, ప్రవక్తగారి పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు అన్హు ద్వారా దుఆ చేసేవారు. దీనితో అర్థం ఏమైందంటే, చనిపోయిన వారి ద్వారా దుఆ చేయకూడదు. వారిని వసీలాగా తీసుకోకూడదు. ఎవరైతే పుణ్యాత్ములు, దైవభీతిపరులు, తఖ్వా గలవారు బ్రతికి ఉన్నారో, వారి ద్వారా దుఆ చేయవచ్చుమని మనకు అర్థమవుతుంది.
దైవ ప్రవక్త హోదాను వసీలాగా చేసుకోవడం
అలాగే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతస్తు, వేరే ఇతరుల అంతస్తులను వసీలాగా కూడా చేసుకోకూడదు. ప్రవక్త గారి అంతస్తును, ఇతర వారి అంతస్తులను కూడా ఆసరాగా చేసుకోకూడదు, వసీలాగా చేసుకోకూడదు. ఒక్క హదీస్ ఉంది, ఆ హదీస్ కి కొందరు ఆధారంగా తీసుకుంటారు, అది సమంజసం కాదు. ఆ హదీస్ ఏమిటంటే:
ఈ హదీస్, దీని అర్థం ఏమిటి? “మీరు అల్లాహ్ ను అడిగితే నా హోదాను, అంతస్తులను ఆసరాగా చేసుకుని అడగండి, ఎందుకంటే నా స్థాయి చాలా గొప్పది” అని ఇది ఆ ఒక ఉల్లేఖనం ఉంది. ఇది కాల్పనిక హదీస్, ‘మౌజూ’, ‘మన్ ఘడత్’. ఇది కాల్పనిక హదీస్, సత్యం లేశమైనా దీంట్లో లేదు అని గ్రహించాలి. ఈ హదీస్‌ను ఆధారంగా తీసుకోవటం కరెక్ట్ కాదు, సమ్మతం కాదు, న్యాయం కాదు. ఎందుకంటే ఇది ‘మౌజూ’, ‘మన్ ఘడత్’ హదీస్ ఇది.
అలాగే, సృష్టితాలలో ఏ ఒక్కరి అస్తిత్వాన్నైనా ఆధారంగా చేసుకోవటం ధర్మ సమ్మతం కాదు. ఎందుకంటే, ఎటువంటి ఆధారాలు ఖురాన్ లో గానీ, ప్రామాణికమైన హదీసులలో గానీ లేవు.
సహాయం కోరటంలోని రకాలు
అభిమాన సోదరులారా! అలాగే సృష్టితాలను సహాయం చేయమని కోరటం రెండు రకాలు. ఒకటి ఇస్తిఆనత్, ఇది సమ్మతమే. ఇస్తిఆనత్ అంటే ఏమిటి? ఏదైనీ వ్యవహారములో సహాయం కోరటం. ఉదాహరణకు స్నేహితులు, అమ్మ నాన్న, భార్య, భర్త, సంతానము, పిల్లలు… బ్రతికి ఉన్నారు, వారితో మనం జీవిస్తున్నాము, ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ఇచ్చు పుచ్చుకోవటం. ఇది సమ్మతమే. ఇంకా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో ఇలా తెలియజేశాడు:
وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَى (వ తఆవనూ అలల్ బిర్రి వత్తఖ్వా) పుణ్యకార్యాలలో, దైవభీతితో కూడిన విషయాలలో పరస్పరం సహకరించుకోండి. (సూరె మాయిదా: 2)
ఒకరి సహాయం కోరటము, “నాకు ఈ పని చేసి పెట్టండి, ఫలానా వస్తువు తీసుకొని రండి, ఇది వారికి ఇచ్చివేయండి”, అంటే ఇది ఇస్తిఆనత్. పరస్పరం ఇటువంటి విషయాలలో సహాయం చేసుకోవచ్చు. ఇది దాంట్లో రాదు.
సృష్టితాల సహాయంలో రెండవది ఏమిటి? ఇస్తిగాసా. ఇస్తిగాసా అంటే, అల్లాహ్ మాత్రమే చేయగలిగే పనులను, అల్లాహ్ మాత్రమే చేయగలిగే విషయాలను మృతులను కోరటం. ఏ పని అయితే అల్లాహ్ మాత్రమే చేస్తాడో, ఏది అయితే అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమో, అటువంటివి సృష్టితాలతో కోరటం, ఇది కూడా అధర్మం కిందకి వస్తుంది. కేవలం అల్లాహ్‌కు సాధ్యమైన విషయాల కొరకు, బ్రతికి ఉన్న వారిని అర్థించటం ఇది కూడా ధర్మ సమ్మతం కాదు.
అభిమాన సోదరులారా! నా ఈ ప్రసంగానికి సారాంశం ఏమిటంటే, వసీలా రెండు రకాలు: ధర్మ సమ్మతం – గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రెండవది అధర్మమైన వసీలా, అంటే మృతులను దుఆ చేయమని కోరటం, దైవ ప్రవక్త అంతస్తు లేదా ఇతరుల, పుణ్యాత్ముల అంతస్తులను వసీలాగా చేసుకోవటం, చనిపోయిన వారిని సహాయం కోరటం, ఇవన్నీ అధర్మమైన వసీలా. ఇది ఇస్లాం ధర్మంలో ముమ్మాటికీ కరెక్ట్ కాదు, నిషిద్ధము, ఇది తప్పు, అధర్మం, అన్యాయం, పాపం.
ఇక సహాయం వస్తే ఇది రెండు రకాలు. ఇస్తిఆనత్, పరస్పరం సహాయం చేసుకోవటం, వ్యవహారంలో ఏమైనా వస్తువులలో, లావాదేవీల్లో, తినే తాగే విషయాలలో ఇది ధర్మ సమ్మతమే. కాకపోతే ఇస్తిగాసా, ఏదైతే అల్లాహ్ మాత్రమే చేయగలుగుతాడో, కేవలం అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమైన విషయాల కొరకు సృష్టితలతో కోరటం, ఇది అధర్మమైన వసీలాగా పరిగణిస్తుంది.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల పరంగా జీవించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) “సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు” అన్నదే మా చివరి మాట. మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత మరియు దానిని ఆచరించవలసిన సరైన పద్ధతి గురించి వివరించబడింది. దుఆ ఆరాధనలలో ఒక ముఖ్యమైన భాగమని, దానిని ఎలా చేయాలో అల్లాహ్ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారని చెప్పబడింది. ప్రవక్త గారి జీవితం నుండి రెండు సంఘటనలను ఉదాహరణగా చూపిస్తూ, అల్లాహ్ ను స్తుతించకుండా మరియు ప్రవక్తపై దరూద్ పంపకుండా నేరుగా అభ్యర్థించడం తొందరపాటు అవుతుందని, అయితే అల్లాహ్ యొక్క ఉత్తమమైన నామాలు మరియు గుణగణాల ద్వారా వేడుకోవడం సరైన పద్ధతి అని స్పష్టం చేయబడింది. అల్లాహ్ యొక్క 99 పేర్ల ప్రాముఖ్యత మరియు వాటిని గణించడం అంటే కేవలం లెక్కించడం కాదని, వాటిని విశ్వసించి, అర్థం చేసుకుని, జీవితంలో ప్రతిబింబించేలా చేయాలని వివరించబడింది. ప్రార్థన చేయడానికి మధ్యవర్తి (వసీలా) అవసరమా అనే అంశం తదుపరి ప్రసంగంలో చర్చించబడుతుందని చెప్పబడింది.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియా ఇ వల్ ముర్సలీన్, వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్.
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం ఈ కార్యక్రమంలో మనం అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను సృష్టించి వారికి సన్మార్గం చూపడానికి ప్రవక్తలను పంపాడు. దివ్యమైన ఆ పరంపరలో చివరి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ప్రతి సమస్య విషయంలో తన ఉమ్మత్ కు స్పష్టమైన మార్గదర్శనం ప్రసాదించారు. ఇతర ఆరాధనా పద్ధతులు తెలిపినట్లే, ప్రార్థించే విషయంలో కూడా, దుఆ చేసే విషయంలో కూడా మార్గదర్శులయ్యారు.
అభిమాన సోదరులారా! వేడుకోవటం, దుఆ చేయటం ఒక ముఖ్యమైన ఆరాధన.
దుఆ యొక్క ప్రాముఖ్యత
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ గురించి ఇలా సెలవిచ్చారు,
اَلدُّعَاءُ هُوَ الْعِبَادَةُ (అద్దుఆ హువల్ ఇబాదహ్) దుఆ యే అసలైన ఆరాధన.
ఈ హదీస్ అహ్మద్ గ్రంథంలో ఉంది, తిర్మిజీ లో ఉంది, అబూ దావూద్ లో ఉంది, ఇంకా అనేక హదీస్ గ్రంథాలలో ఈ హదీస్ ఉంది.
దుఆ తప్పక చేయవలసిన ఆరాధన. కావున, దుఆ ముఖ్యమైన ఆరాధన కాబట్టి, తప్పనిసరిగా చేయవలసిన ఆరాధన కాబట్టి, ఆ దుఆ చేసే విధానం కూడా స్వయంగా ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రవచనాల ద్వారా మనల్ని దుఆ చేసే విధానం, పద్ధతి నేర్పించారు.
దుఆ చేసే సరైన పద్ధతి
అబూ దావూద్ లో ఒక హదీస్ ఉంది, ఫుజాలా బిన్ ఉబైద్ రదియల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ లో ఉన్నారు, ఒక వ్యక్తి వచ్చాడు. నమాజ్ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి డైరెక్ట్ ఇలా దుఆ చేశాడు, ‘నాకు మోక్షం ఇవ్వు, ఓ అల్లాహ్ నన్ను కరుణించు’ అని డైరెక్ట్ గా దుఆ చేశాడు. ఇది విని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “మీరు తొందరపడ్డారు, ముందు అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడు, ఆ తర్వాత నాపై దరూద్ పంపించు, ఆ తర్వాత నువ్వు ఏమి కోరుకుంటావో అది కోరుకో, నువ్వు చేసుకోదలచుకున్న దుఆ చేసుకో” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
కాసేపటి తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి దుఆ చేసే విధానం ఇలా ఉండింది. ఆ వ్యక్తి తన అవసరాలను అడగక ముందు, తన అవసరాలను అల్లాహ్ ముందు పెట్టక ముందు, తన దుఆ ఈ విధంగా అతను ప్రార్థన చేశాడు:
“ఓ అల్లాహ్! నేను నిన్నే అర్థిస్తున్నాను. అల్లాహ్ నువ్వు మాత్రమే. సకల లోకాలకు ప్రభువు, పాలకుడు, పోషకుడు. ఆరాధ్య దైవం నువ్వు మాత్రమే. లా ఇలాహ ఇల్లా అంత్, నువ్వు తప్ప ఏ దేవుడూ లేడు. అల్ అహద్, నువ్వు ఒకే ఒక్కడివి. అస్సమద్, నిరపేక్షాపరుడివి, అవసరాలు, అక్కర్లు లేనివాడివి. నీకు తల్లిదండ్రులు గానీ, సంతానం గానీ లేరు. నీకు సరిసమానం ఎవ్వరూ లేరు.”
ఇలా అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడి ఆ తర్వాత ఆ వ్యక్తి తాను చేసుకున్న దుఆ చేసుకున్నాడు. ఇది విని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తికి ఇలా బదులిచ్చారు:
لَقَدْ سَأَلْتَ اللّٰهَ بِالِاسْمِ الَّذِيْ إِذَا سُئِلَ بِهِ أَعْطٰى وَإِذَا دُعِيَ بِهِ أَجَابَ (లఖద్ సఅల్తల్లాహ బిల్ ఇస్మిల్లదీ ఇదా సుఇల బిహీ అఅతా వ ఇదా దుఇయ బిహీ అజాబ్) “ఏ పేరుతో అర్థిస్తే ఆయన ప్రసాదిస్తాడో, ఏ పేరు ద్వారా దుఆ చేస్తే ఆ దుఆ స్వీకరించబడుతుందో, ఆ పేరుతోనే నువ్వు అడిగావు.”
అంటే ఇక్కడ రెండు విషయాలు మన ముందుగా ఉన్నాయి ఈ హదీస్ లో. మొదటి వ్యక్తి డైరెక్ట్ గా అల్లాహ్ ఘనత లేకుండా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించకుండా, పంపించకుండా డైరెక్ట్ దుఆ ప్రారంభం చేశాడు, ‘ఓ అల్లాహ్ నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, కరుణించు, క్షమించు’ అని చెప్పి స్టార్ట్ చేసేశాడు. అందుకు ఆ వ్యక్తికి సమాధానం ప్రవక్త గారు ఏమి ఇచ్చారు? “ఓ నాయనా! నువ్వు తొందరపడ్డావు” అని చెప్పారు. మరో వ్యక్తికి అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా మెచ్చుకున్నారు. “ఏ పేరుతో అర్థిస్తే ఆ అల్లాహ్ ప్రసాదిస్తాడో, ఏ పేరు ద్వారా దుఆ చేస్తే దుఆ స్వీకరించబడుతుందో ఆ పేరుతోనే నువ్వు అడిగావు” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని మెచ్చుకొని ఇలా సమాధానం ఇచ్చారు.
ప్రియ వీక్షకులారా! మనకు అర్థమైంది ఏమిటంటే, దుఆ ఒక ముఖ్యమైన ఆరాధన కాబట్టి, ఆ దుఆ చేసే విధానం స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ఆరాఫ్, ఆయత్ 180 లో తెలియజేశాడు, ఏ విధంగా అల్లాహ్ ను వేడుకోవాలి అనటానికి.
وَلِلّٰهِ الْاَسْمَاۤءُ الْحُسْنٰى فَادْعُوْهُ بِهَاۖ (వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా) అల్లాహ్ కు ఉత్తమమైన పేర్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతోనే ఆయనను ప్రార్థించండి. (7:180)
అభిమాన సోదరులారా! బుఖారీ, కితాబుద్ దావాత్, అలాగే ముస్లిం గ్రంథం కితాబుద్ దికిర్ లో ఒక హదీస్ ఉంది. అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. ఎవరైతే వాటిని గణిస్తూ ఉంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అల్లాహ్ బేసి సంఖ్యలో ఉన్నాడు, బేసి సంఖ్యను ఆయన ఎంతో ఇష్టపడతాడు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది ఈ హదీస్.
ఈ హదీస్ లో ముఖ్యంగా రెండు విషయాలు తెలియపరచాలనుకుంటున్నాను. మొదటి విషయం ఏమిటి ఈ హదీస్ లో? అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. అంటే దీనికి అర్థము 99 మాత్రమే ఉన్నాయి అని కాదు, ఈ విషయం గమనించుకోండి. హదీస్ లో 99 పేర్లు తెలియజేయడం జరిగింది, దానికి అర్థం అల్లాహ్ కు 99 పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు. అంటే ఈ పేర్ల ద్వారా గణిస్తే, లెక్కిస్తే, అడిగితే దుఆ స్వీకరించబడుతుంది అని అర్థం వస్తుంది కానీ, అల్లాహ్ కు 99 పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు. అల్లాహ్ కు పేర్లు అసంఖ్యాకమైనవి, కొన్ని పేర్లు అది అల్లాహ్ యొక్క ఇల్మె గైబ్ లోనే ఉన్నాయి, మనకు తెలియవు. అందుకు 99 మాత్రమే కాదు అనే విషయం తెలుసుకోవాలి.
రెండవ విషయం ఈ హదీస్ లో, ఎవరైతే అల్లాహ్ యొక్క నామాలను గణిస్తూ ఉంటాడో అంటే, గణించటం అంటే అర్థం కేవలం లెక్కించటం అని భావం కాదు. గణించడంతో పాటు వాటిని దృఢంగా విశ్వసించాలి, చిత్తశుద్ధితో, భక్తితో ఈ నామాలను స్మరించాలి, ఒక్కో నామంలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలి, వాటిని కంఠస్థం చేసుకోవాలి, ఆ గుణగణాలు తమ వ్యక్తిగత జీవితంలో ప్రతిబింబించేలా ప్రవర్తించాలి. ఇది భావం అల్లాహ్ యొక్క నామాలను లెక్కించడం అంటే, గణించడం అంటే.
అభిమాన సోదరులారా! అలాగే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా దుఆ చేసేవారు, అల్లాహ్ నామాలను గణించేవారు, లెక్కించేవారు, అల్లాహ్ యొక్క నామాల ద్వారా, గుణ విశేషాల ద్వారా కూడా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకునేవారు. ఉదాహరణకు ఒక హదీస్ ఉంది, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసే దుఆలలో ఒక దుఆ యొక్క ఒక్క భాగం ఇలా ఉంటుంది:
أَسْأَلُكَ بِكُلِّ اسْمٍ هُوَ لَكَ سَمَّيْتَ بِهِ نَفْسَكَ (అస్ అలుక బికొల్లి ఇస్మిన్ హువ లక సమ్మైత బిహీ నఫ్సక్) ఓ అల్లాహ్! నువ్వు నీ కోసం పెట్టుకున్న ప్రతి పేరు ద్వారా నేను నిన్ను పిలుస్తున్నాను.
అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకునేవారు. ప్రియ వీక్షకులారా! ఈ… ఇంతకీ నా మాటలకి సారాంశం ఏమిటంటే దుఆ చేయటం, అల్లాహ్ ను వేడుకోవటం, ఇది ముఖ్యమైన ఆరాధన కాబట్టి, దీని విధానం ఏమిటి? అల్లాహ్ యొక్క నామాల ద్వారా, ఆయన గుణ విశేషాల ద్వారా మనము అల్లాహ్ ను పిలవాలి, వేడుకోవాలి, దుఆ చేయాలి. ఆ, ఇది కొన్ని ముఖ్యమైన విషయాలు మనం అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి.
ప్రియ సోదరులారా! ఇక ఈ అంశానికి సంబంధించిన విషయమే, అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అల్లాహ్ ను వేడుకోవటానికి, దుఆ చేయటానికి, ఆ దుఆ స్వీకరించబడటానికి ఎవరి సహాయమైనా అవసరమా? మధ్యవర్తి అవసరమా? సింపుల్ గా చెప్పాలంటే వసీలా అవసరమా? అసలు వసీలా అంటే ఏమిటి? వసీలా వాస్తవికత ఏమిటి? వసీలా ధర్మసమ్మతమా కాదా? వసీలా గురించి వివరాలు, వసీలా గురించి వాస్తవికత ఏమిటో ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో లంచగొండితనం అనే ఘోరమైన పాపం గురించి వివరించబడింది. లంచం అంటే అన్యాయంగా ఒక లక్ష్యాన్ని సాధించడానికి లేదా అక్రమమైన కోరికను నెరవేర్చుకోవడానికి అధికారికి ఏదైనా ఇవ్వడం అని ప్రవక్త నిర్వచించారు. ఇస్లాంకు ముందు కూడా ఈ అవినీతి యూదులలో ఉండేదని, వారు ప్రాపంచిక ప్రయోజనాల కోసం తమ గ్రంథాలను మార్చారని ఆయన వివరించారు. లంచాన్ని ఇస్లాం తీవ్రంగా నిషేధించిందని, సూరా అల్-బఖరా మరియు సూరా అల్-మాఇదాలోని వచనాలను ఉటంకిస్తూ, లంచం ఇచ్చేవారిని మరియు తీసుకునేవారిని ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శపించారని ఒక హదీసును ఉదహరించారు. ఒక వ్యక్తి యొక్క నిజమైన సంపద అతను తిన్నది, ధరించినది లేదా పరలోకం కోసం దానధర్మాలు చేసినది మాత్రమేనని, మిగిలినది వారసుల కోసం విడిచిపెట్టబడుతుందని ప్రవక్త స్పష్టం చేశారు. లంచం వంటి అక్రమ సంపాదన తినడం వల్ల ప్రార్థనలు (దుఆ) అంగీకరించబడవని మరియు అది దైవిక శిక్షకు దారి తీస్తుందని హెచ్చరించారు.
نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ (నహ్మదుహు వ నస్త’ఈనుహు వ నస్తగ్ఫిరుహు) మేము ఆయననే స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్నే అర్థిస్తున్నాము మరియు ఆయన క్షమాపణనే వేడుకుంటున్నాము.
وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا (వ న’ఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వమిన్ సయ్యిఆతి అ’అమాయలినా) మా ఆత్మల కీడు నుండి మరియు మా చెడు కార్యాల నుండి మేము అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము.
مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ (మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహు) అల్లాహ్ మార్గనిర్దేశం చేసిన వారిని ఎవరూ తప్పుదారి పట్టించలేరు, మరియు ఆయన తప్పుదారి పట్టించిన వారికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.
وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ (వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు) మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారని, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు లేరు.
وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ (వ అష్హదు అన్న ముహమ్మదన్ ‘అబ్దుహు వ రసూలుహు) మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ (యా అయ్యుహల్లదీన ఆమను త్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహి వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్) “ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడవలసిన విధంగా భయపడండి. మరియు ముస్లింలుగా తప్ప మరణించకండి.” (3:102)
“మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి సృష్టించాడు. దాని నుండే దాని జతను కూడా సృష్టించాడు. మరి వారిద్దరి నుండి ఎంతోమంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేశాడు. మీరు ఎవరి పేరుతో ఒకరినొకరు కోరుకుంటారో ఆ అల్లాహ్‌కు భయపడండి. బంధుత్వ సంబంధాలను తెంచటానికి భయపడండి. నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు.” (4:1)
“ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడండి. మరియు సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. ఆయన మీ కార్యాలను చక్కబరుస్తాడు. మరియు మీ పాపాలను క్షమిస్తాడు. ఇక అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపినవాడు గొప్ప విజయాన్ని సాధించినట్లే.” (33:70-71)
أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صلى الله عليه وسلم وَشَرَّ الأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلالَةٌ وَكُلَّ ضَلالَةٍ فِي النَّارِ
ఇక ఆ తర్వాత, నిశ్చయంగా, మాటలలోకెల్లా ఉత్తమమైనది అల్లాహ్ గ్రంథం (ఖుర్‌ఆన్), మరియు మార్గాలలోకెల్లా ఉత్తమమైనది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం. కార్యాలలోకెల్లా చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. ప్రతి కొత్తగా కల్పించబడినది బిద్అత్ (ధర్మంలో నూతన ఆచారం). ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
లంచగొండితనం
అభిమాన సోదరులారా! లంచగొండితనం అనే అంశంపై ఈరోజు మనం ఇస్లాం ధర్మం ఏమి చెబుతుంది అని కొన్ని విషయాలు తెలుసుకుందాం.
లంచం లేదా లంచగొండితనం అంటే అధర్మమైన ఏదైనా లక్ష్యాన్ని, ఏదైనా పనిని న్యాయ విరుద్ధమైన తన కోరికను నెరవేర్చుకోవడానికి ఎవరైనా అధికారికి లేక తత్సంబంధితమైన వ్యక్తికి ఎంతో కొంత ఇచ్చి ఆ పనిని చేయించుకోవటం లంచం. దీనిని కొందరు లాంఛనం అని, మరికొందరు దక్షిణం అని, ఇంకొందరు బహుమతి అని, గిఫ్ట్ అని అంటారు. ఏ పేరుతో పిలుచుకున్నా ఉద్దేశం మాత్రం దురుద్దేశమే కాబట్టి, పద్ధతి మాత్రం అక్రమ పద్ధతి కాబట్టి ఇది నూటికి నూరు శాతం లంచమే అవుతుంది.
ఖురాన్ అవతరణ పూర్వం, అలాగే మదీనాలోని యూదులలో కూడా ఈ గుణం ఉండేది. లంచగొండితనం అనేది ఉండేది. తౌరాతు గ్రంథంలో జరిగిన ప్రక్షిప్తాల (మార్పుల) వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి ఈ లంచమే. అరేబియాలో యూదుల వ్యాజ్యాలపై వారి మతాధిపతులు, తెగల సర్దారులు తీర్పులు చేసేవారు. వారి స్వార్థ బుద్ధి కారణంగా న్యాయ సమత్వం లేకుండా పోయింది. అయిన వారికి ఆకులో, కాని వారికి కంచంలో అన్నట్లు యూద విద్వాంసులు ఆశ్రిత పక్షపాతం వహించేవారు. ఈ వ్యవహారంలో వారు తౌరాతు గ్రంథంలో ఉన్న ధర్మాదేశాలను కూడా కట్టిపుచ్చేవారు.
ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ సూరా బఖరా ఆయత్ 174లో ఇలా సెలవిచ్చాడు:
“అల్లాహ్ తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాలను దాచేవారు, వాటిని కొద్దిపాటి ధరకు అమ్ముకునేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినాన అల్లాహ్ వారితో అస్సలు మాట్లాడడు. వారిని పరిశుద్ధపరచడు. పైపెచ్చు వారికి బాధాకరమైన శిక్ష కలదు.” (2:174)
అంటే, అల్లాహ్ తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాన్ని ఆ యూదులు, ఆ యూదుల ధర్మ పండితులు దాచిపెట్టేవారు. దానిని కొద్దిపాటి మూల్యానికి అమ్ముకునేవారు. తమ పొట్టలను అగ్నితో నింపుకునేవారు. ప్రళయ దినాన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారితో మాట్లాడటం గానీ, వారిని పరిశుద్ధ పరచటం గానీ చేయడు. వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. అంటే యూదులు లంచం తీసుకుని వారి గ్రంథాలలో ఉన్న విషయాలను దాచి పెట్టేవారని స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయత్లో తెలియజేశాడు. ఇంకా అల్లాహ్ సూరా మాఇదాలో ఇలా అన్నాడు:
“వారిలో చాలామందిని నీవు చూస్తావు, వారు పాపకార్యాల వైపుకు, దౌర్జన్యం వైపుకు, అధర్మమయిన సొమ్మును స్వాహా చేయటం వైపుకు ఎగబడుతూ ఉంటారు. వారు చేసే ఈ చేష్టలన్నీ పరమ చెడ్డవి.“ (5:62)
అంటే లంచం తీసుకుని వారు న్యాయం, అన్యాయం, పాపం, పుణ్యం పట్టించుకునేవారు కాదు.
ఇస్లాంలో లంచం నిషేధం
లంచగొండితనం ఇస్లాంలో చాలా స్పష్టంగా నిషేధించబడినది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా బఖరా ఆయత్ 188లో ఇలా సెలవిచ్చాడు:
“ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంతభాగం కాజేయటం కోసం అధికారులకు ముడుపులు చెల్లించకండి. అది (న్యాయం కాదన్న సంగతి) మీకూ తెలిసినదే.“ (2:188)
అంటే ఈ ఆయత్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, మీరు ఒకరి సొమ్మును ఇంకొకరు అధర్మంగా తినకండి. ఇతరుల సొమ్ములోని కొంత భాగం అక్రమంగా స్వాహా చేసేందుకు ఆ వ్యవహారాన్ని అధికారుల వద్దకు తీసుకుపోకండి. అది అన్యాయం అన్న సంగతి స్వయంగా మీకు తెలుసు. అంటే లంచం ఇచ్చి, అధికారులకు లంచం ఇచ్చి అన్యాయంగా సొమ్ము కాజేయకండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయత్లో హెచ్చరించాడు.
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
لَعَنَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم الرَّاشِيَ وَالْمُرْتَشِيَ (ల’అన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ అర్రాషి వల్ ముర్తషి) “లంచం పుచ్చుకునేవానిని మరియు లంచం ఇచ్చేవానిని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు.”
లంచం పుచ్చుకునే వానిని, లంచం ఇచ్చే వానిని పుచ్చుకునేవాడు ఇచ్చేవాడు వారిద్దరినీ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ల’అనత్ చేశారు, వారి పైన శపించారు. అంటే, ఏ విషయం పైన అల్లాహ్ శాపం ఉంటుందో, దేని పైన ప్రవక్త గారి శాపం ఉంటుందో, అది ఘోరమైన పాపం అని అర్థం. దానికి తప్పనిసరిగా శిక్ష ఉంటుందని అర్థం. అంటే ఘోర పాపాలలో ఒక ఘోరమైన పాపం లంచం. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లంచం పుచ్చుకునే వానిని, లంచం ఇచ్చే వానిని శపించారు. ఎందుకంటే వారు అన్యాయంగా, అనైతికంగా సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇతరుల సంపదను నిషిద్ధమైన పద్ధతిలో సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక లంచం ద్వారా వచ్చే ఆ డబ్బు, లంచం ద్వారా వచ్చే ఆ ధనం, లంచం ద్వారా వచ్చే ఆ పదవి, ఆ వస్తువు ఏదైనా సరే అది అధర్మం, హరాం అని స్పష్టమవుతుంది.
అభిమాన సోదరులారా! ప్రతి చిన్న బాధ్యుడు, చిన్న పోస్ట్, పియాన్ నుంచి, ఫర్రాష్ నుంచి పెద్ద స్థాయి వరకు లంచం అనేది సర్వసామాన్యం అయిపోయింది సమాజంలో. అసలు లంచం ఇచ్చేవారు దానికి తప్పుగా అని కూడా భావించడం లేదు. ఇంత సర్వసామాన్యం అయిపోయింది. ఇది ఒక అమానత్. అల్లాహ్ మనకి ఇచ్చింది ప్రతీది అమానత్. అది మన శరీర అవయవాలు కావచ్చు, అతను తన ఇంట్లో యజమాని అయితే, తన అధీనంలో ఉన్న భార్యాపిల్లలు కావచ్చు. అల్లాహ్ ఏదైతే మనకి ఇచ్చాడో అది అమానత్, అప్పగింత. దానిని మనం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాల ప్రకారంగానే మనము జీవించాలి ప్రతి విషయంలో. వ్యవహారం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాణిజ్యం కావచ్చు, క్రయవిక్రయాలు కావచ్చు, లావాదేవీలు కావచ్చు, ఏదైనా సరే. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు సూరా నిసా ఆయత్ 58 లో:
إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَن تُؤَدُّوا الْأَمَانَاتِ إِلَىٰ أَهْلِهَا (ఇన్నల్లాహ య’మురుకుమ్ అన్ తుఅద్దుల్ అమానాతి ఇలా అహ్లిహా) “ఎవరి అమానతులను వారికి అప్పగించండి… ” అని అల్లాహ్ మిమ్మల్ని గట్టిగా ఆదేశిస్తున్నాడు (4:58)
ఈ ఆయత్లో అమానత్, విశ్వసనీయత ఇవి రెండు రకాలు.
ఒకటి, ఒకరు ఇంకొకరి వద్ద భద్రపరచమని పెట్టిన సొమ్ము. అది ఏదైనా కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, కరెన్సీ రూపంలో కావచ్చు, వెండి, బంగారం రూపంలో కావచ్చు, భూమి కాగితాలు కావచ్చు, తినే వస్తువు ఏదైనా సరే భద్రపరచమని పెట్టిన సొమ్ము. ఆ సొమ్ము ఆ వ్యక్తి వచ్చి అడిగినప్పుడు ఎవరి సొమ్ముని వారికి తిరిగి ఇచ్చేయాలి. ఇది ఒక అమానత్.
రెండవ రకపు అమానతు పదవులకు సంబంధించినది. ఒకటి, అర్హత కలిగిన వారికే బాధ్యత అప్పగించాలి. రెండవది, బాధ్యత తీసుకున్న వారు తమ బాధ్యతను, తన డ్యూటీని న్యాయంగా, ధర్మంగా, షరియత్ పరంగా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాల పరంగా అతను బాధ్యత వహించాలి. ఇది అమానత్. లంచం తీసుకుంటున్నాడు అంటే తన బాధ్యతలో లోపం జరుగుతుంది. అంటే డబ్బు తీసుకుని, సొమ్ము తీసుకుని అన్యాయంగా, అక్రమంగా, మోసపూరితంగా అతను తన బాధ్యత వహిస్తున్నాడు. సొమ్ము కాజేస్తున్నాడు. దీనినే లంచం అంటారు. అది ఒక పైసా కావచ్చు, కోట్లు కావచ్చు. ఒక్క పైసా హరాంతో కూడిన మన కడుపులోకి పోతే, దానివల్ల మన శరీరం ఎదుగుతుంది కదా, మాంసము, ఎముకలు, రక్తము ఇవన్నీ హరాంతో అవుతుంది. అటువంటి శరీరం స్వర్గంలో ప్రవేశించదని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు ఉన్నాయి.
ధనం యొక్క వాస్తవికత
అభిమాన సోదరులారా! అసలు మనిషి అన్యాయంగా, అక్రమంగా డబ్బులు సంపాదిస్తాడు. కానీ ఆ డబ్బు వలన ఈ లోకములో అతనికి మనశ్శాంతి ఉండదు. పరలోకంలో శిక్ష ఉంటుంది. ఈ విషయం మరిచిపోతున్నాడు.
ఈ ధనం గురించి మన ప్రవక్తగారు ఏం చెప్పారో ఒక హదీస్ తెలుసుకుందాం. తిర్మిదిలో ఈ హదీస్ ఉంది.
عَنْ كَعْبِ بْنِ عِيَاضٍ، قَالَ سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُولُ (అన్ కా’బ్ ఇబ్ని ‘ఇయాదిన్, ఖాల సమీ’తు అన్నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లమ యఖూలు) కాబ్ బిన్ ఇయాజ్ రదియల్లాహు అన్హు కథనం: నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా విన్నాను:
إِنَّ لِكُلِّ أُمَّةٍ فِتْنَةً وَفِتْنَةُ أُمَّتِي الْمَالُ (ఇన్న లికుల్లి ఉమ్మతిన్ ఫితనతున్, వ ఫితనతు ఉమ్మతీ అల్-మాల్) “నిశ్చయంగా, ప్రతీ ఉమ్మత్ (సముదాయం) కొరకు ఒక ఫితనా (పరీక్ష) ఉంది. మరియు నా ఉమ్మత్ యొక్క ఫితనా ధనం.” (జామి అత్-తిర్మిది)
కాబ్ బిన్ ఇయాజ్ రదియల్లాహు అన్హు కథనం, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతుండగా నేను విన్నానని అంటున్నారు. ప్రవక్తగారు ఏం చెప్పారు? ప్రతి ఉమ్మత్ కి ఒక ప్రత్యేకమైన పరీక్ష ఉంటుంది. అలాగే నా అనుచర సమాజానికి పరీక్ష సంపద, డబ్బు, మాల్ అన్నారు. ఎందుకంటే రేపు ప్రళయ దినాన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ధనం గురించి ప్రశ్నిస్తాడు, లెక్క ఉంది. న్యాయంగా సంపాదించావా, అన్యాయంగా సంపాదించావా? లంచంతో సంపాదిస్తే అది అన్యాయం, అధర్మం, నిషిద్ధం, పాపం, నేరం అది. ఒక హదీస్లో ఇలా ఉంది:
అబూ బర్జా అల్-అస్లమీ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
“ప్రళయ దినాన ఒక దాసుడు నాలుగు విషయాల గురించి ప్రశ్నించబడే వరకు తన పాదాలను కదల్చలేడు: తన జీవితాన్ని దేనిలో గడిపాడని, తన జ్ఞానంతో ఏమి ఆచరించాడని, తన ధనాన్ని ఎక్కడి నుండి సంపాదించి ఎక్కడ ఖర్చు పెట్టాడని, మరియు తన శరీరాన్ని దేనిలో ఉపయోగించాడని.” (జామి అత్-తిర్మిది)
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
لَا تَزُولُ قَدَمَا عَبْدٍ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُسْأَلَ عَنْ أَرْبَعٍ (లా తజూలు ఖదమా అబ్దిన్ యౌమల్ ఖియామతి హత్తా యుస్అల అన్ అర్బ’ఇన్) రేపు ప్రళయ దినాన నాలుగు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అల్లాహ్ దాసుడు ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు.
ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. ఎప్పుడు? నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినంత వరకు. ఆ నాలుగు ప్రశ్నలు ఏమిటి?
మొదటి విషయం, తన జీవితం, తన వయసు ఎలా గడిచింది. ధర్మంలోనా, అధర్మంలోనా? ధర్మపరంగా, అధర్మపరంగా? అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయతలోనా, అవిధేయతలోనా?
రెండవ ప్రశ్న, వ’అన్ ‘ఇల్మిహి ఫీమా ఫ’అల్ (తన జ్ఞానం విషయంలో ఏమి ఆచరించాడు). జ్ఞానం గురించి. అతనికి అల్లాహ్ గురించి, అల్లాహ్ ప్రవక్త గురించి, ఖురాన్ గురించి, ఇస్లాం గురించి ఎంత వరకు జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంలో అతను ఎంతవరకు ఆచరించాడు.
మూడవది, వ’అన్ మాలిహి మిన్ ఐన ఇక్తసబహు వ ఫీమా అన్ఫఖహు (తన ధనాన్ని ఎక్కడి నుండి సంపాదించాడు మరియు దేనిలో ఖర్చు పెట్టాడు). ధనం గురించి, సొమ్ము గురించి, ఆస్తి గురించి, డబ్బు గురించి ఎలా సంపాదించావు, ఎలా ఖర్చు పెట్టావు. ఎలా వచ్చింది, అది కూడా, ఎలా పోయింది అది కూడా, రెండు కూడా. కొందరు కష్టంగా సంపాదిస్తారు, ధర్మ సమ్మతంగా సంపాదిస్తారు, న్యాయంగా సంపాదిస్తారు. కష్టార్జితమే, కానీ ఖర్చు పెట్టేది అధర్మం అవుతుంది. కావున ఈ ఎలా సంపాదించావు, న్యాయంగా, అన్యాయంగా, ధర్మంగా, అధర్మంగా, అలాగే ఎలా ఖర్చు పెట్టావు.
నాలుగవది, వ’అన్ జిస్మిహి ఫీమా అబ్లాహ్ (తన శరీరాన్ని దేనిలో ఉపయోగించాడు). శరీరం గురించి. చేతులు, కాళ్లు, కళ్లు, హృదయం, కడుపు, పాదాలు, ఇవన్నీ, చెవులు వారికి ఎలా పోషించావు. నీ శరీరం ఎలా పెరిగింది? హరాం సొమ్ముతోనా, హలాల్ సొమ్ముతోనా? ఏ విధంగా ఖర్చు పెట్టావు? చెవులతో ఖురాన్ విన్నావా, న్యాయం విన్నావా, ఇంకేమైనా బూతులు, చెడు విషయాలు? ఇవన్నీ అల్లాహ్ అడుగుతాడు.
అందుకే ఒక విషయం, రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తున్నాను. మొదటి విషయం ఏమిటంటే, అరఫా మైదానం. చాలాసార్లు విన్నాం మనం ఈ హదీస్. అరఫా మైదానం, ఇప్పుడు కూడా ఇన్ని సౌకర్యాలు ఉండి కూడా హజ్ చేస్తే చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. ఇన్ని సౌకర్యాలు ఉండి, ఏసీ బస్సులు, విమానంలో ఏసీ, ఎయిర్ పోర్టులో ఏసీ, గుడారాలు, ఇంటి నుంచి తవాఫ్ వరకు, మినాకి, ముజ్దలిఫాకి అన్నిచోట్ల ప్రయాణ సౌకర్యాలు, సవారీలు అయినప్పటికీ చాలా ఇబ్బందులు పడతారు మనుషులు. కానీ ప్రవక్త గారి కాలంలో ఉన్నవారు ఒంటెల పైన, లేనివారు కాలి నడక పోయి హజ్ చేసేవారు. అటువంటి ఒక వ్యక్తి అరఫా మైదానంలో దుస్తులు సరిగా లేవు, తల వెంట్రుకలు గాలితో, దుమ్ముతో నిండిపోయినాయి. ఒకరకంగా ఉంది. ఆ వ్యక్తి అరఫా మైదానంలో చేతులు ఎత్తి ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కార్చి దుఆ చేస్తున్నాడు. ఆ వ్యక్తి గురించి ప్రవక్త గారు ఏమన్నారంటే, అతని దుఆ స్వీకరించబడదు అన్నారు. ఒక వ్యక్తి ఎన్నో వందల, వేల మైళ్ల దూరంతో ప్రయాణం చేసి హజ్ కోసం ప్రయాణం చేస్తే అరఫా మైదానంలో హదీస్ లో ఏముంది, అరఫా మైదానంలో చేయబడిన దుఆ రద్దు చేయబడదు అని ఉంది కదా. అల్-హజ్జు అరఫా అన్నారు ప్రవక్తగారు కదా. అయినా అరఫా మైదానంలో దుఆ చేస్తే ఆ దుఆ క్యాన్సిల్. ప్రవక్తగారు అన్నారు, ఎందుకు? దానికి వివరం ప్రవక్తగారు చెప్పారు. ఆ వ్యక్తి తినే సొమ్ము హరాం, తొడిగే దుస్తులు హరాం, తాగేది హరాం. అతని దుఆ ఎలా అల్లాహ్ స్వీకరిస్తాడు? అంటే ఇది చెప్పటం నా ఉద్దేశం ఏమిటంటే, లంచం హరాం. లంచం తీసుకునే వ్యక్తి యొక్క దుఆ ఎలా స్వీకరించబడుతుంది? దుఆ స్వీకరించబడదు. ఈ లోకంలో మనశ్శాంతి ఉండదు, పరలోకంలో కఠినమైన శిక్ష ఉంటుంది అని మనం తెలుసుకోవాలి.
అసలు ప్రవక్త గారు ఒక విషయం చెప్పారు. మనిషి సంపాదించే సంపాదనలో ఆ వ్యక్తి యొక్క వాటా ఎంత? వేరే వాళ్ళ వాటా కాదు. ఒక వ్యక్తి సంపాదిస్తాడు, తన వారసుల వాటా కాదు. ఒక వ్యక్తి చనిపోతే భార్యకు వాటా ఎంత, పిల్లలకి వాటా ఎంత, అమ్మానాన్నకి వాటా ఎంత దీని గురించి కాదు. ఒక వ్యక్తి కష్టార్జితం, కష్టంతో సంపాదిస్తున్నాడు. ఆ సంపదలో అతని వాటా ఎంత? ఇది ప్రాపంచిక యొక్క యదార్థం ఇది. తెలుసుకుందాం.
అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, దాసుడు నా ధనము, నా ధనము అంటూ ఉంటాడు. ఎల్లప్పుడూ నా దాసుడు నా ధనము, నా సంపాదన, నా ధనము, నా విల్లా, నా బంగ్లా, నా సేవింగ్ అకౌంట్, నాది, నాది అంటాడు కదా. వాస్తవానికి సంపాదనలో, సంపాదించే వ్యక్తిలో మూడు భాగాలే ఉంటాయి. నాలుగో భాగం ఉండదు. మొదటి భాగం, మా అకల ఫ అఫ్నా (తిన్నాడు మరియు దానిని జీర్ణం చేసుకున్నాడు). తిన్నాడు, ఆ తర్వాత అది అరిగిపోయింది. అతను వాడాడు. తిన్నాడు, ఆ తిండి వలన తన శరీరంలో రక్తం వచ్చింది, మాంసం వచ్చింది, ఇది వచ్చింది. తిన్నాడు. ఆ తిన్నదే అతని వాటా. రెండవది, అవ్ లబిస ఫ అబ్లా (ధరించాడు మరియు దానిని పాతదిగా చేశాడు). తొడిగాడు, చించేసాడు. కొన్నాడు, బట్టలు కొన్నాడు, దుస్తులు కొన్నాడు, తొడుక్కున్నాడు, యూస్ చేశాడు. ఇది అతని వాటా. మూడవది, అవ్ అ’తా ఫఖ్తనా (ఇచ్చాడు మరియు దానిని పరలోకం కోసం దాచుకున్నాడు). అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాడు. ఈ మూడే అతనికి వాటా. ఈ మూడింటిలో రెండు వాటాలు అతను అనుభవిస్తాడు, ప్రపంచంలోనే అయిపోతాయి. మూడో వాటా శాశ్వతంగా అతనికి మిగిలిపోతుంది. ఇవి కాక అతని ధనంలో, అతని సొమ్ములో, అతని ఆస్తిలో, అతని సంపదలో ఏదైనా మిగిలినా అది అతనిది కాదు. ఎందుకంటే అదంతా అతను విడిచిపెట్టి చనిపోతాడు. వేరేవాళ్లు అక్రమంగా తీసుకోవచ్చు, అధర్మంగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి పోకపోయినా, తన సంతానము, బంధువులు అది తీసేసుకుంటారు. చివరికి ఒక ఉంగరమో, ఏదైనా రాకపోయినా కట్ చేసి తీసేసుకుంటారు కానీ వదలరు. మనిషి యొక్క సంపాదనలో ఇవి మూడే వాటాలు. ఇది మనం గ్రహించాలి.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ హలాల్ సంపదను సంపాదించే కృషిని, సద్బుద్ధిని ప్రసాదించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
శాంతిభద్రతల విలువ & ఐక్యత ప్రాముఖ్యత – జుమా ఖుత్బా ఖతీబ్ ఫజీలతుష్ షేక్ రాషిద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్-బిదా హఫిజహుల్లాహ్ https://youtu.be/SnCZ5FgZV0U [22 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ఖుత్బాలో ఇస్లాం ధర్మంలో శాంతి భద్రతల ప్రాముఖ్యతను, ముస్లిం పాలకుల పట్ల విధేయతను మరియు సామాజిక ఐక్యతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి వివేకవంతమైన నిర్ణయాన్ని ఉదహరిస్తూ, అంతర్యుద్ధం (ఫిత్నా) మరియు రక్తపాతాన్ని నివారించడానికి పాలకుల పట్ల విధేయత ఎంత ముఖ్యమో వివరించారు. సౌదీ అరేబియాలో నెలకొన్న శాంతిని అల్లాహ్ గొప్ప వరంగా పేర్కొంటూ, కృతజ్ఞతా భావం, దైవభీతి మరియు ఐక్యమత్యం ద్వారానే ఈ భద్రత రక్షించబడుతుందని, అనవసరమైన విభేదాలు మరియు ముఠా తగాదాలకు దూరంగా ఉండాలని ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారంగా హెచ్చరించారు.
అల్హమ్దులిల్లాహ్! ఓ అల్లాహ్ నీవు మా ఉపాధి విస్తృతం చేశావు, మాకు భద్రత ప్రసాదించావు, మా మధ్య ఐక్యత కలిగించావు. నీవు తప్ప సత్య ఆరాధ్యుడు ఎవడూ లేడని సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు, ప్రవక్త అని కూడా సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అనేక అనేక లెక్కలేనన్ని సలాతు సలామ్ మరియు శుభాలు, బర్కత్ లు పంపించు గాక.
ఈరోజు జుమా ఖుత్బా యొక్క అంశం మన ఐక్యత మరియు మన పాలకులు. మరొక రకంగా చెప్పాలంటే ఇస్లాంలో శాంతి భద్రతల విలువ మరియు ముస్లిం పాలకుల యొక్క విధేయత, ప్రాముఖ్యత మరియు ఐక్యతతో ఉండటంలోని లాభాలు ఏమిటో సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వివేకం
విశ్వాసులారా! అల్లాహ్ మీపై కరుణించు గాక. మీ చావుకు ముందే అధికంగా సత్కార్యాల్లో ముందుగా ఉండండి. మీకు ఒక అర్థవంతమైన, బోధన కలిగించే సంఘటన వినిపిస్తాను. అది సహీహ్ బుఖారీలో ఉంది. వివేకవంతులైన సహాబీ, దృఢ విజ్ఞానులైన సహాబీ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి గురించి.
ఏమిటి ఆ సంఘటన? అలీ (రదియల్లాహు అన్హు) మరియు ముఆవియా (రదియల్లాహు అన్హు) మధ్య యుద్ధం జరిగిన సమయంలో ప్రజలు విభేదాల్లో పడ్డారు. అయితే వారి విభేదాలను ముగించడానికి హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వైపు నుండి హజ్రత్ అబూ మూసా అషరీ (రదియల్లాహు అన్హు) మరియు హజ్రత్ అమీర్ ముఆవియా వైపు నుండి హజ్రత్ అమర్ ఇబ్నె ఆస్ (రదియల్లాహు అన్హు) హకమ్ – న్యాయ నిర్ణేతలుగా ముందుకు వచ్చారు. అయితే ఆ సమయంలో ముఆవియా (రదియల్లాహు అన్హు) ఒక ప్రసంగంలో ఇలా అన్నారు: “ఈ వ్యవహారం అంటే ఖిలాఫత్ గురించి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే తన తల లేపి మాట్లాడాలి. ఎందుకంటే మేమే ఈ వ్యవహారానికి అతని కన్నా, అతని తండ్రి కన్నా ఎక్కువ అర్హులం.”
అప్పుడు ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) అన్నారు: “నేను నా దుస్తులను సరిచేసుకొని నిలబడి మాట్లాడి చెబుదాము అనుకున్నాను: “‘“నీకంటే ఎక్కువ అర్హుడు ఇస్లాం కోసం నీతో, నీ తండ్రితో యుద్ధం చేసిన వారే’ (అంటే మీరైతే ఫతహ్ మక్కా వరకు ఇస్లాంలో ప్రవేశించలేదు, కానీ హజ్రత్ అలీ రదియల్లాహు అన్హు అప్పటికే ముస్లిం గా ఉన్నారు మరియు ఫతహ్ మక్కా కంటే ముందు మీరు మరియు మీ తండ్రి అవిశ్వాసులుగా ఉన్నప్పుడు హజ్రత్ అలీ రదియల్లాహు అన్హు ఇస్లాం కొరకు మీతో పోరాడారు కదా)” అన్నటువంటి మాట చెబుదాము అని అనుకున్నాను. కానీ వెంటనే ఆలోచించాను. (హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ అంటున్నారు), వెంటనే ఆలోచించాను: ‘నేను ఇప్పుడే మాట్లాడితే, ఈ విషయాలు చెప్పబోతే ప్రజల్లో అల్లకల్లోలం ఏర్పడుతుంది. రక్తపాతం జరుగుతుంది. నా మాటలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పే పదాలకు నాది మంచి ఉద్దేశం ఎంతగా ఉన్నప్పటికీ ప్రజలు దానిని నా ఉద్దేశ్య ప్రకారంగా కాకుండా వేరుగా అర్థం చేసుకోవచ్చు.’ అయితే వెంటనే జన్నతులో, స్వర్గంలో ఓపిక సహనాలకు బదులుగా ఉన్న అల్లాహ్ వాగ్దానం గుర్తు వచ్చింది. నేను ఆ మాట చెప్పలేదు.”
అప్పుడే ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కి దగ్గర ఉన్న వారిలో ఒకరు అన్నారు: “అల్లాహ్ నిన్ను రక్షించాడు. నీవు బహుదూరంగా ఈ ఫిత్నా నుండి తప్పించుకున్నావు. ఇది అల్లాహ్ దయ తర్వాత సరైన జ్ఞానం మరియు బలమైన విశ్వాసం నీ వద్ద ఉన్నందువల్ల.” ఎవరు చెప్పారు ? హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కు దగ్గరగా ఆ సమయంలో ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మాట చెప్పారు.
అయితే ఇక్కడ గమనించండి. మనిషి దగ్గర బలమైన విశ్వాసంతో పాటు సరైన జ్ఞానం ఉండి, ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో, అది కూడా అల్లాహ్ దయతో ప్రసాదించబడింది అంటే ఇది ఎంత గొప్ప వరం? సూరతుల్ ముజాదిల ఆయత్ నంబర్ 11 ద్వారా గమనించండి:
ఈ విధంగా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారి యొక్క గౌరవం కూడా ఈ సందర్భంలో తెలిసి వచ్చింది. ఇప్పుడు మీరు విన్నటువంటి ఈ సంఘటన సహీహ్ బుఖారీలో ఉంది. గమనించారా! జ్ఞానం, వివేకం ఎలా శాంతి ఐక్యతకు దారి చూపుతుందో, మరియు అజ్ఞానం, మూర్ఖత్వం అశాంతి అలజడులకు దారి తీస్తుంది.
శాంతి భద్రతల ఆవశ్యకత
ఓ విశ్వాసులారా! అల్లాహ్ మన దేశం, దేశవాసులపై చాలా గొప్ప వరం అనుగ్రహించాడు.
[ఇది అరబ్బీ ఖుత్బా యొక్క అనువాదం కదా, సౌదియాలో జుమా రోజు (19 సెప్టెంబర్ 2025) కు జరిగినటువంటి జుమా ప్రసంగం ఇది. ఇక్కడి వారిని ప్రత్యేకంగా ఉద్దేశించి ఖతీబ్ ఫజీలతుష్ షేక్ రాషిద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్-బిదా హఫిజహుల్లాహ్ జామియ బిన్ ఉసైమీన్ లో ప్రసంగించారు]
ఓ విశ్వాసులారా! అల్లాహ్ మన దేశం, దేశవాసులపై చాలా గొప్ప వరం అనుగ్రహించాడు. మనం ఖుర్ఆన్ సున్నత్ మార్గదర్శకత్వంలో మన నాయకులకు విధేయులుగా మరియు ఐక్యతతో ఉన్నాము. అల్లాహ్ మనల్ని పెద్ద ఫిత్నాల సంక్షోభాల నుండి కాపాడాడు. చుట్టుపక్కల్లో చూడండి పరిస్థితి ఎలా ఉంది?
مِنَ الَّذِينَ فَرَّقُوا دِينَهُمْ وَكَانُوا شِيَعًا ۖ كُلُّ حِزْبٍ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ [మినల్లజీన ఫర్రఖూ దీనహుమ్ వ కానూ షియఅన్, కుల్లు హిజ్బిన్ బిమా లదైహిమ్ ఫరిహూన్] “వారు తమ ధర్మాన్ని ముక్కచెక్కలు చేసేశారు. వారు సయితం విభిన్న ముఠాలుగా చీలిపోయారు. ప్రతి ముఠా తన దగ్గర ఉన్న దానితోనే తెగ సంబరపడిపోతోంది.” (30:32)
విశ్వాసులారా! మన దేశం (అంటే సౌదీ అరేబియా) అలజడులు, విభేదాలు లేకుండా సురక్షితంగా ఉన్న ప్రాంతం. ఇది ఖుర్ఆన్ అవతరించిన భూమి కాదా? ఈమాన్ (విశ్వాస) గూడు కాదా? వీరుల జయాల ప్రదేశం మరియు విశ్వవ్యాప్తంగా ప్రజలకు మేలు చేకూర్చే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే దేశం కాదా? అవును తప్పకుండా. అల్లాహ్ అనుగ్రహాల్లో గొప్ప అనుగ్రహం మనం స్నేహభావం, శాంతి సంపదల మరియు ఉదార గుణాలతో జీవిస్తున్నాం. అల్హమ్దులిల్లాహ్!
ఏమిటి? మేము వారికి సురక్షితమైన, పవిత్రమైన చోట స్థిరనివాసం కల్పించలేదా? అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మావద్ద నుంచి సరఫరా చేయబడలేదా? కాని వారిలోని చాలా మంది (ఈ యదార్థాన్ని) తెలుసుకోరు.(28:57)
ఇబ్రాహీం (అలైహిస్సలాం) దుఆ
వేలాది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను గుర్తుంచుకుందాం. అప్పుడు ఇబ్రాహీం (అలైహిస్సలాం) కాబా స్థలానికి వచ్చి, అది ఇంకా నిర్మించబడక ముందే ఇలా దుఆ చేశారు:
رَبِّ اجْعَلْ هَـٰذَا بَلَدًا آمِنًا [రబ్బిజ్ అల్ హాజా బలదన్ ఆమినా] “నా ప్రభూ! నీవు ఈ ప్రదేశాన్ని శాంతి నగరంగా చెయ్యి.“ (2:126)
ఇక్కడ గమనించండి దుఆలో ఉన్న పదాన్ని “రబ్బిజ్ అల్ హాజా ‘బలదన్’ ఆమినా” (నకిరా అంటారు). సూరతుల్ బకరాలోని ఆయత్ నంబర్ 126. ఆ తర్వాత ఆయన కాబాను నిర్మించారు. చుట్టూ ప్రజల హృదయాలు ఆకర్షితమయ్యే నగరం ఏర్పడినప్పుడు మళ్లీ ఇలా దుఆ చేశారు:
رَبِّ اجْعَلْ هَـذَا الْبَلَدَ آمِنًا [రబ్బిజ్ అల్ హాజల్ బలద ఆమినా] ““నా ప్రభూ! ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి!” (14:35)
ఇక్కడ “అల్-బలద” అని వచ్చి ఉంది. పైన ఏముంది? “బలదన్”. అంటే అప్పటికి అది ప్రజలు నివసించలేదు, అప్పుడు కూడా దుఆ చేశారు. ప్రజలు అక్కడ నివసించిన తర్వాత కూడా దుఆ చేశారు. ఏమని? “నా ప్రభు ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి” (సూరత్ ఇబ్రాహీం ఆయత్ నంబర్ 35). అంటే ఏం తెలిసింది? భద్రత, శాంతి, అమ్నో-అమాన్, పీస్ ఫుల్ లైఫ్ – ఇది నిర్మాణానికి ముందు అవసరం, నిర్మాణం తర్వాత కూడా అవసరమే.
అల్లాహు అక్బర్! ఇస్లాం ఎలా శాంతి భద్రతలకు ప్రాముఖ్యత ఇస్తుందో గమనించారా!
అల్లాహ్ అనుగ్రహం
ఇంకా గుర్తుంచుకుందాం. అరబ్ ద్వీపకల్పం దోపిడీలు, హత్యలు, లూటీలకు రంగస్థలంగా ఉన్న రోజుల్లో అల్లాహ్ మనపై చేసిన ఉపకారం గుర్తుంచుకుందాం.
“ఒకప్పటి మీ పరిస్థితిని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పట్లో మీరు అవనిలో అల్ప సంఖ్యలో ఉండేవారు. మరీ బలహీనులుగా పరిగణించబడేవారు. ప్రజలు మిమ్మల్ని మట్టుబెడతారేమోనని మీరు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితిలో అల్లాహ్ మీకు ఆశ్రయమిచ్చి, తన సహాయంతో మీకు బలిమిని ఇచ్చాడు. మీకు పరిశుభ్రమైన, పరిశుద్ధమైన ఆహార వస్తువులను ప్రసాదించాడు – మీరు కృతజ్ఞులై ఉండేందుకు.“ (8:26)
ఇప్పటి రోజుల్లో కూడా ప్రతి అంతర్జాతీయ, ప్రాంతీయ సంఘటన మన నాయకుల చుట్టూ మరియు జ్ఞానవంతుల చుట్టూ మనం ఏకతాటిపై ఉండాల్సిన అవసరాన్ని మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది. భద్రత అనేది చర్చకు గురయ్యే అంశం కాదు అని మనం పూర్తిగా విశ్వసించాలి. ఎందుకంటే భద్రత పోయిన వెంటనే జీవితం తన అందాన్ని కోల్పోతుంది.
అందుకే సౌదీ అరేబియా రాజ్యం శక్తివంతంగా, గౌరవంగా నిలవాలి మరియు ప్రతి దురుద్దేశం మరియు కుతంత్రం నుంచి సురక్షితంగా ఉండాలి. ఇది మానవ సమాజం కోసం ప్రేమతో గమనించే కన్నుగా, సహాయం చేసే చేతిగా ఉండాలి.
మనం మన ప్రాంతంలో ఈ ప్రయత్నం చేయాలి. తౌహీద్, సున్నత్ కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అల్లాహుతాలా మనకు ఈ శాంతి భద్రతలు ప్రసాదిస్తాడు. సూరతుల్ నూర్ లో కూడా ఈ విషయాన్ని చూడవచ్చు. ఇక్కడికి మొదటి ఖుత్బా పూర్తయింది.
మన దేశ భద్రత మరియు అభివృద్ధిని కాపాడే విధంగా మన తరం పిల్లల్ని పెంపకం చేయడం అత్యంత ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి. అలాగే అహ్లుస్ సున్నత్ యొక్క మన్హజ్ మరియు అఖీదాలోని ఒక కీలక విషయాన్ని కూడా వారికి (పిల్లలకు) నేర్పాలి. ఏమిటి అది? తమ నాయకుల మాట వినడం, వారికి విధేయత చూపడం విధిగా ఉంది అని, వారి నాయకత్వపు శపథాన్ని (బైఅతుల్ ఇమామ్) భంగపరచకుండా ఉండడం కూడా విధిగా ఉంది అని. అలాగే వారి (అంటే ముస్లిం నాయకుల) మేలు కోరుతూ అల్లాహ్ వారికి సద్భాగ్యం ప్రసాదించాలని దుఆ కూడా చేస్తూ ఉండాలి.
ఈ భావాన్ని బలపరిచే అర్థవంతమైన ఓ సంఘటన మీకు వినిపిస్తాను. ఇది కూడా ‘సహీహ్ బుఖారీ’లో ఉంది (7111 హదీథ్ నెంబర్). శ్రద్ధగా వినండి.
శాంతి భద్రతల గురించి, ముస్లిం నాయకుని పట్ల మనమందరము ఐక్యతగా ఉండడం ఎంత ముఖ్యమో ‘సహీహ్ బుఖారీ’లోని ఈ హదీథ్ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ కూడా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) వారి యొక్క సంఘటన వినండి.
మదీనాలో ప్రజలు యజీద్ బిన్ ముఆవియా బైఅతును విరమించుకున్నారు. అప్పుడు తెలివైన ఉపాధ్యాయుడైన హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) వారు ఏదైతే బైఅతును విరమించుకున్నారో దాని భయంకర ప్రమాదాన్ని మరియు చాలా ప్రమాదకరమైన అఖీదా లోపాన్ని గ్రహించారు. ఆయన మొదట తన సొంత కుటుంబాన్ని హెచ్చరించడం మొదలుపెట్టారు. తన సేవకుల్ని మరియు పిల్లల్ని కూర్చోబెట్టి ఇలా అన్నారు: “మేము ఈ వ్యక్తి (అంటే యజీద్) కి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞానుసారంగా బైఅతు ఇచ్చాము. మీలో ఎవరైనా ఈ నాయకుడిని బైఅతు నుండి తొలగిపోతే లేదా ఇంకెవరికైనా బైఅతు ఇస్తే అతనితో నా సంబంధం అంతే (ఇక తెగిపోతుంది). ఇక నా పక్షాన అతనికి ఏమీ ఉండదు.” అంటే ఆయన అలాంటి వారిని బహిష్కరిస్తారు, మాట్లాడరు కూడా. ఈ విధంగా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హెచ్చరించారు.
ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) – సహీహ్ బుఖారీ వ్యాఖ్యానం రాసిన వారు – ఈ హదీస్ (7111) వ్యాఖ్యానంలో చెప్పారు: “ఈ సంఘటన సారాంశం ఏమిటంటే బైఅతు జరిగిన నాయకుడికి విధేయత చూపడం విధి. అతనిపై తిరుగుబాటు నిషిద్ధం (హరామ్). ఎంతవరకు హరామ్? ఆ నాయకుడు అన్యాయంగా వ్యవహరించినా సరే అతనికి తిరుగుబాటుగా ఉండడం ఇది న్యాయం కాదు. కేవలం అతని పాపాల కారణంగా అతని బైఅతును విరమించుకోవడం సరైన మాట కాదు” అని హాఫిజ్ ఇబ్ను హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) తెలియజేశారు.
ఐక్యంగా ఉండాలన్న ఆజ్ఞ
సోదర మహాశయులారా! ఓ సౌదీ అరేబియా ముస్లిములారా! (ఖతీబ్ గారు అలా అంటున్నారు కనుక తెలుగులో అలా అనువదించడం జరిగింది. మనం ప్రతి దేశంలో ఉన్న ప్రతి ముస్లిం కి ఈ మాట చెబుతున్నాం). మన దేశంలో పాలకులు మరియు ప్రజల మధ్య ఉన్న ఐక్యత మరియు పరస్పర ప్రేమ శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఇది కేవలం అల్లాహ్ యొక్క దయానుగ్రహం. ఆయన తాడును (అంటే ధర్మాన్ని) పట్టుకొని ఉండడమే గాక, నిలకడగా ఉన్న ఉలమా (అల్-ఉలమా ఉర్-రాసిఖూన్ – దృఢంగా నిలబడిన నాయకులు) మరియు ప్రజల శ్రేయోభిలాష మరియు వారి నిజమైన దుఆలు – వీటితో కూడి సాధ్యమైంది. ఇదే అల్లాహ్ ఆదేశం కూడా:
“అల్లాహ్ త్రాడును అందరూ కలసి గట్టిగా పట్టుకోండి. చీలిపోకండి. అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పుడు మీరు ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను సృజించాడు. దాంతో ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒకరి కొకరు అన్నదమ్ములుగా మారారు. .” (3:103)
ముగింపు దుఆ
اللهم يا من حَفِظتَ بلادَنا طيلةَ هذهِ القرونِ، وكفيتَها شرَ العادياتِ الكثيراتِ المدبَّراتِ الماكراتِ، ఓ అల్లాహ్! నువ్వు ఈ శతాబ్దాలంతా మా దేశాన్ని కాపాడినవాడివి, అనేక plotting చేసిన శత్రువుల చెడునుండి దాన్ని రక్షించినవాడివి,
اللهم فأدِمْ بفضلِكَ ورحمتِكَ حِفْظَها من كل سوءٍ ومكروهٍ، وأدِمْ عليها نعمةَ الإخاءِ والرخاءِ. ఓ అల్లాహ్! నీ దయ మరియు కరుణతో మమ్మల్ని ప్రతి చెడు మరియు నష్టం నుండి ఎప్పటికీ కాపాడుతూ ఉండు, మరియు మాకు సోదరభావం, శాంతి ఆశీర్వాదాలు ప్రసాదించు.
• اللهم احفظْ دينَنا وأمنَنا، واحفَظْ أرجاءَنا وأجواءَنا، وحدودَنا وجنودَنا، واقتصادَنا وعتادَنا، واحفظْ مملكتَنا وخليجَنا، وسائرَ بلادِ المسلمينَ. ఓ అల్లాహ్! మా దీన్‌ను, మా భద్రతను, మా దేశపు అన్ని భాగాలనూ, వాతావరణాన్ని, సరిహద్దులనూ, సైనికులనూ, ఆర్థిక వ్యవస్థనూ, సమస్త సామాగ్రిని కాపాడు, మా రాజ్యమైన సౌదీ అరేబియాను మరియు గల్ఫ్ ప్రాంతాన్నీ, మరియు ముస్లింల దేశాలన్నిటినీ కాపాడు.
اللهم صُدَّ عنا غاراتِ أعدائِنا المخذولينَ وعصاباتِهِم المتخوِّنينَ. ఓ అల్లాహ్! మమ్మల్ని మా ఓడిపోయిన శత్రువుల దాడుల నుండి మరియు వాళ్ల కుట్రా గుంపుల నుండి కాపాడు.
اللهم اكفِنا شرَ طوارقِ الليلِ والنهارِ، إلا طارقًا يَطرقُ بخيرٍ يا رحمنُ. ఓ అల్లాహ్! రాత్రి, పగలు దుష్ట శత్రువుల చెడు నుండీ మమ్మల్ని కాపాడు – కేవలం మంచి వార్తలతో వచ్చే అతిథిని రానివ్వు – ఓ రహ్మాన్!
اللهم وانصرْ إخوانَنا بأكنافِ بيتِ المقدسِ، واهزِمْ إخوانَ القردةِ والخنازيرِ. ఓ అల్లాహ్! బైతుల్ మక్దిస్ పరిసరాల్లో ఉన్న మా సోదరులను నీవు గెలిపించు, వారికి సహాయం అందించు. మరియు కోతులు, పందులు వంటి వారిని ఓడించు.
اللهم وفِّقْ وليَ أمرِنا ووليَ عهدِه لهُداكَ. واجعلْ عمَلَهُما في رضاكَ. ఓ అల్లాహ్! మా నాయకుడిని మరియు ఆయన వారసుడిని నీ హిదాయత్ వైపు నడిపించు, వారి కార్యాలు నీ సంతోషానికి కారణమయ్యేలా చేయు.
اللهم سدِّدهُمْ في قراراتِهِمْ ومؤتمراتِهِمْ. ఓ అల్లాహ్! వారి నిర్ణయాలలోను, సమావేశాలలోను వారికి సరైన దారిని చూపు.
اَللَّهُمَّ صَلِّ وَسَلِّمَ عَلَى عَبْدِكَ وَرَسُولِكَ مُحَمَّدٍ. ఓ అల్లాహ్! నీ బానిస మరియు ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పైన శాంతి మరియు దీవెనలు వర్శించు గాక!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో వక్త సూరా అల్-ఇఖ్లాస్ యొక్క గొప్పతనాన్ని మరియు వివిధ సందర్భాలలో దానిని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్, మగ్రిబ్, విత్ర్ మరియు తవాఫ్ నమాజులలో ఈ సూరాను పఠించేవారని తెలిపారు. నిద్రపోయే ముందు ఈ సూరాను మువ్వజతైన్ (సూరా ఫలక్, సూరా నాస్)లతో కలిపి మూడు సార్లు చదివి శరీరంపై తుడుచుకోవడం వల్ల కీడుల నుండి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. ఉదయం మరియు సాయంత్రం అజ్కార్‌లలో, అలాగే ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత దీనిని పఠించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, రోజుకు సుమారు 14 సార్లు ఈ సూరాను పఠించడం ద్వారా అల్లాహ్ ప్రసన్నతను పొందవచ్చని సూచించారు.
సూరా యొక్క ప్రాముఖ్యత మరియు నమాజులలో పఠనం
ఈ సూరాకు ఇంత గొప్ప ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏదైతే ఉందో, దాని కారణంగానే ఒక్క రోజులోనే అనేక సందర్భాల్లో చదవడానికి చెప్పడం జరిగింది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజులోని రెండవ రకాతు సున్నత్ లో ఈ సూరా చదివేవారు. తవాఫ్ చేసిన తర్వాత రెండు రకాతులు చేస్తారు కదా, అందులో రెండవ రకాతు సున్నత్ తర్వాత చదివేవారు. కొన్ని సందర్భాల్లో మగ్రిబ్ నమాజు లోని రెండవ రకాతులో కూడా చదివేవారు. విత్ర్ నమాజు లోని మూడవ రకాతులో కూడా ఈ సూరా చదువుతూ ఉండేవారు. ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయి.
నిద్రపోయే ముందు పాటించవలసిన సున్నత్
అలాగే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యొక్క సూరా ప్రతి ముస్లిం పడుకునే ముందు మూడు సార్లు చదవాలి. దీనితో పాటు సూరతుల్ ఫలక్ మరియు సూరతుల్ నాస్ కూడా చదవాలి అని చెప్పారు. ఇది మనం చదివి ఊదుకున్నామంటే, ఎక్కడి వరకు మన చెయ్యి చేరుతుందో తల పై నుండి, ముఖము మరియు శరీర భాగము, అక్కడ వరకు స్పర్శ చేసుకుంటూ, తుడుచుకుంటూ వెళ్ళాలి, మసాహ్ చేసుకుంటూ. ఈ విధంగా అన్ని రకాల చెడుల నుండి, కీడుల నుండి మనం కాపాడబడతాము అన్నటువంటి శుభవార్త కూడా మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.
ఉదయం, సాయంత్రం మరియు ఫర్జ్ నమాజుల తర్వాత
అలాగే ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఒక్కసారి ఈ సూరా మరియు రెండు సూరాలు (ఫలక్, నాస్) కూడా చదవాలని చెప్పడం జరిగింది. అలాగే ఉదయం అజ్కార్ ఏవైతే ఉన్నాయో వాటిలో మూడేసి సార్లు, సాయంకాలం అజ్కార్ ఏవైతే ఉన్నాయో వాటిలో మూడేసి సార్లు చదవాలి. అబూ దావూద్ యొక్క సహీహ్ హదీథ్, “తక్ఫీక మిన్ కుల్లి షై” (నీవు ఉదయం, సాయంత్రం మూడేసి సార్లు ఈ మూడు సూరాలు చదివావంటే, అది నీకు అన్ని రకాల కీడుల నుండి కాపాడడానికి సరిపోతుంది).
ఆత్మపరిశీలన మరియు ముగింపు
ఈ విధంగా మీరు ఆలోచించండి, ఈ సూరా యొక్క ఘనత ఇంత గొప్పగా ఉంది గనక అల్హమ్దులిల్లాహ్, సుమ్మ అల్హమ్దులిల్లాహ్ ఇన్ని సార్లు… టోటల్ ఎన్ని సార్లు అయిందో ఒకసారి ఆలోచించారా మీరు. ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఒక్కసారి (ఐదు), ఉదయం మూడు సార్లు, సాయంకాలం మూడు సార్లు, రాత్రి పడుకునే ముందు మూడు సార్లు. తొమ్మిది ప్లస్ ఐదు, పద్నాలుగు సార్లు ఈ సూరా మనం చదువుతున్నామా? మనలో ఎవరైనా చదువుతలేరంటే వారు ఎన్ని మేళ్లను కోల్పోతున్నారు? ఎన్ని రకాల శుభాలను కోల్పోతున్నారు? స్వయంగా వారే ఆలోచించుకోవాలి.
అల్లాహ్ యే మనందరికీ ఈ సూరా యొక్క ఘనతను, గొప్పతనాన్ని అర్థం చేసుకొని, దాని యొక్క అర్థ భావాలను మంచి రీతిలో అవగాహన చేసుకొని, దాని ప్రకారంగా మన విశ్వాసాన్ని దృఢపరచుకొని, ఆచరణకు సంబంధించిన విషయాలను సంపూర్ణంగా అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు ఆచరించే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. మరియు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.