ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం [మరణానంతర జీవితం – పార్ట్ 49] https://www.youtube.com/watch?v=LJvDCtqg1H0 [23 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహిల్లజీ హదానా లిహాదా వమా కున్నా లినహ్తదియ లవ్లా అన్ హదానల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ వఅలా ఆలిహి వమన్ వాలాహ్. అమ్మాబాద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం ఈ విషయాల వివరణలు మనం తెలుసు కుంటున్నాము.
అయితే మహాశయులారా, గత కార్యక్రమంలో మనం ఇహలోకంలో మన కర్మలన్నీ కూడా వ్రాయబడుతున్నాయి అనే విషయానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము. ఎప్పుడైతే పరలోకంలో మనం హాజరవుతామో అక్కడ మన కర్మ పత్రాలు మన ముందు తెరవబడటం జరుగుతుంది. ప్రతీ మనిషి ఇహలోకంలో అతను చదువుకున్నా, చదువుకోకున్నా అతడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ప్రళయ దినాన అతని మెడలో అతని యొక్క కర్మ పత్రం ఉంటుంది. స్వయంగా దానిని అతను చదువుకోవచ్చు కూడా. స్వయంగా అతను దానిని చదువుకునే అటువంటి శక్తి కూడా ఆ రోజు అల్లాహు తఆలా అతనికి ప్రసాదిస్తాడు.
ఒకసారి సూరత్ బనీ ఇస్రాయీల్, దాని మరొక పేరు సూరతుల్ ఇస్రా. సూరతుల్ ఇస్రాలోని ఈ ఆయతు చదవండి.
మేము ప్రతీ మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలో వ్రేలాడదీశాము. ప్రళయ దినాన మేము అతని కర్మ పత్రాలను వెలికి తీస్తాము. అతను దానిని ఒక తెరువబడిన పుస్తకం మాదిరిగా స్పష్టంగా చూస్తాడు పొందుతాడు. అప్పుడు అతనితో చెప్పడం జరుగుతుంది. నీవు నీ ఈ కర్మ పత్రాన్ని చదువుకో. ఈ రోజు నీ లెక్క తీసుకోవటానికి నీవే చాలు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 4 నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? [మరణానంతర జీవితం – పార్ట్ 54] [23 నిముషాలు] https://www.youtube.com/watch?v=vnw-1Kcariw వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక కూడా నరకంపై వేయబడే వంతెన.
నరకంపై వేయబడే వంతెన క్షేమంగా, సురక్షితంగా దాటడానికి అల్లాహ్ యొక్క దయ, ఆయన కరుణ తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు తర్వాత మన సత్కార్యాలు కూడా చాలా దోహదపడతాయి. అయితే ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? ఆ విషయాలు తెలుసుకోబోతున్నాము.
కానీ అంతకంటే ముందు మరొక చిన్న విషయం. అదేమిటంటే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత అటువైపున స్వర్గం ఉంటుంది. ఎవరైతే స్వర్గంలో ప్రవేశించే వారు కారో వారు నరకంలో పడిపోతారు. కానీ ఎవరైతే స్వర్గంలో ప్రవేశించేవారో వారే నరకంపై వేయబడిన వంతెనను దాటిపోతారు. దాటిపోయిన వెంటనే స్వర్గంలో ప్రవేశించలేరు. అక్కడ మరో చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. మరో చిన్న వంతెన ఉంటుంది. దానిని కూడా తప్పకుండా దాటవలసి ఉంటుంది.
ఆ వంతెన దేని గురించి? స్వర్గంలో ఎవరు కూడా ప్రవేశించాలంటే బాహ్యంగా పరిశుద్ధంగా ఉండడంతో పాటు ఆంతర్యం కూడా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి. అంటే, ఎవరి మనసులో కూడా ఏ రవ్వంత కపటం, ఏ రవ్వంత జిగస్సు, ఏ రవ్వంత చెడు అనేది మరొకరి గురించి ఉండకూడదు.
అయితే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత, పరస్పరం ఎవరి మధ్యలోనైనా ఏదైనా మనస్సులో చెడు మిగిలి ఉంటే, దానిని శుభ్రపరచి, వారి యొక్క హృదయాలను అన్ని రకాల మలినాల నుండి, అన్ని రకాల చెడుల నుండి శుభ్రపరిచి ఆ తర్వాత స్వర్గంలో చేర్పించడం జరుగుతుంది.
సహీ బుఖారీలో హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “విశ్వాసులు నరకంపై వేయబడిన వంతెన దాటి వెళ్ళిన తర్వాత, ఇటు నరకం అటు స్వర్గం మధ్యలో ఆపుకోబడతారు. ప్రపంచంలో ఏ కొంచెం వారి హృదయాల్లో ఏ చెడు ఉన్నా వాటిని శుభ్రపరచడం జరుగుతుంది. ఎవరి పట్ల ఏ కొంచెం అన్యాయం ఉన్నా, అన్యాయం చేసిన వానికి స్వర్గపు స్థానాలు తగ్గించబడతాయి, మరీ ఎవరిపైనైతే అన్యాయం జరిగిందో ఆ బాధితుల స్వర్గ స్థానాలు పెంచడం జరుగుతుంది.”
మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత ఎవరు కూడా స్వర్గంలో ప్రవేశించలేరు, ఎవరి హృదయాలలోనైతే ఏ కొంచెమైనా కపటం, ఏదైనా జిగస్సు, చెడు ఒకరి గురించి ఉందో. వారిని శుభ్రపరిచి ఆ తర్వాత వారిని స్వర్గంలో చేర్చడం జరుగుతుంది. ఎందుకంటే స్వర్గంలో ప్రవేశించేవారు, వారి హృదయాలు శుభ్రంగా, అందులోఎలాంటి కీడు లేకుండా ఉంటుంది.” ఎందుకంటే వారి హృదయాలు వాటిలో ఎలాంటి కీడు, ఎలాంటి చెడు లేకుండా ఉండాలి, అప్పుడే వారు స్వర్గంలో ప్రవేశించగలుగుతారు. అందుకని మహాశయులారా, ఇహలోకంలోనే మనం ఒకరిపై ఏదైనా అన్యాయం చేసి ఉంటే, ఒకరిది ఏదైనా హక్కు తిని ఉంటే, ఒకరికి ఏదైనా బాధ మనం కలిగించి ఉంటే, క్షమాపణ కోరుకొని లేదా వారి యొక్క హక్కు చెల్లించి హృదయాలలో ఎలాంటి మలినము మనం ఉంచుకోకూడదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మూసా, ఖిజర్ లు బయలు దేరారు. చివరకు ఒక పడవలో పయనమైనప్పుడు అతను (ఖిజరు) దాని చెక్క పలకలను పగుల గొట్టారు. దానికి మూసా, “ఇదేమిటీ, పడవ ప్రయాణీకులందరి ముంచేయటానికా వీటిని పగులగొట్టారు? మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారు” అని చెప్పనే చెప్పేశాడు. (సూరా అల్ కహఫ్ 18: 71)
ఒ క రోజు, మూసా (అలైహిస్సలాం) ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే ఒక ప్రభావవంతమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం వారిపై తీవ్రమైన ప్రభావం వేసింది. ప్రజల్లో ఒక వ్యక్తి, “దైవప్రవక్తా! భూమిపై మీకన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి ఉన్నాడా?” అని ప్రశ్నించాడు. అల్లాహ్ తనకు మహత్యాలు ప్రదర్శించే శక్తి ఇచ్చాడు, తౌరాత్ గ్రంథాన్ని ప్రసాదించాడు కాబట్టి తానే అందరికన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాడినని భావిస్తూ మూసా (అలైహిస్సలాం) ఆ వ్యక్తితో, “లేడు” అని జవాబిచ్చారు. కాని తెలుసుకోవలసినదంతా తెలుసుకున్న వ్యక్తి ఎవరూ లేరని, సంపూర్ణ జ్ఞానానికి ఒకే దైవప్రవక్త కేంద్రం కావడం కూడా జరగదని, ఒక వ్యక్తికి తెలియని విషయాలు తెలిసిన మరో వ్యక్తి ఎల్లప్పుడు ఉంటాడని అల్లాహ్ ఆయనకు తెలియజేశాడు. అప్పుడు మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో, “ప్రభూ! ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు? నేను ఆయన్ను కలుసుకుని ఆయన నుంచి విద్య నేర్చు కోవాలని భావిస్తున్నాను” అన్నారు. ఆ వ్యక్తిని గుర్తించడానికి గుర్తు చెప్పమని కూడా అల్లాహ్ ను కోరారు.
అల్లాహ్ ఆయనకు మార్గం చూపుతూ, నీటితో నిండిన ఒక పాత్రలో ఓ చేపను తీసుకుని బయలుదేరాలని, ఆ చేప పాత్ర నుంచి మాయమైన ప్రదేశంలో ఆ వ్యక్తి కనబడతాడని చెప్పాడు. మూసా (అలైహిస్సలాం) ఆ వ్యక్తిని కలుసుకోవడానికి బయలుదేరారు. ఆయన వెంట ఒక అనుచరుడు చేపవున్న నీటిపాత్రను పట్టుకుని రాసాగాడు. వారిద్దరు రెండు నదులు కలసిన సంగమ ప్రదేశానికి చేరు కున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకోవాలని భావించారు. మూసా (అలైహిస్సలాం) అక్కడ నిద్రలోకి జారుకున్నారు.
ఆయన నిద్రపోతున్నప్పుడు, నీటి పాత్రలోని చేప ఎగిరి నదిలో దూకడాన్ని ఆయన అనుచరుడు చూశాడు. కాని అతడు ఈ సంఘటన గురించి మూసా (అలైహిస్సలాం)కు చెప్పడం మరచిపోయాడు. మూసా (అలైహిస్సలాం) లేచిన తర్వాత ఇద్దరూ ప్రయాణం కొనసాగించారు. వారు బాగా అలసిపోయారు, చాలా ఆకలితో ఉన్నారు. మూసా(అలైహిస్సలాం) తన అనుచరునితో ఆహారం గురించి అడిగారు. అప్పుడు అనుచరునికి నీటి పాత్రలోని చేప నదిలో దూకి వెళ్ళిపోయిన విషయం గుర్తుకువచ్చింది. ఆ విషయాన్ని మూసా (అలైహిస్సలాం)కు తెలియజేశాడు. మూసా (అలైహిస్సలాం), “అర్రర్రె.. మనం వెదుకుతున్న ప్రదేశం అదే” అన్నారు. వారు త్వరత్వరగా వెనక్కి వచ్చారు. రెండు నదులు కలసిన ప్రదేశానికి, చేప నదిలో దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఒక వ్యక్తి కనిపించాడు. అతని ముఖం సగ భాగాన్ని ఒక వస్త్రం కప్పిఉంది. ఆయనే ఖిజర్ (అలైహిస్సలాం)… మార్గదర్శి!
వింత మనిషి
మూసా (అలైహిస్సలాం) ఆయనకు అభివాదం చేశారు. “అస్సలాము అలైకుమ్ (మీపై శాంతి కలుగుగాక!)” అన్నారు. ఆ వ్యక్తి తన ముఖంపై ఉన్న వస్త్రాన్ని తప్పించి వారిని చూశారు. “మీరు నాకు శాంతి కలగాలని అభివాదం చేశారు. కాని ఈ దేశంలో శాంతి ఉందా? అసలు మీరెవరు?” అని ప్రశ్నించారు. మూసా (అలైహిస్సలాం) జవాబిస్తూ, “నేను ఇస్రాయీల్ వారి ప్రవక్తను” అన్నారు. ఆ వ్యక్తి తిరిగి, “మీకు బోధనలు ఎవరు చేశారు? ఎవరు మిమ్మల్ని ఇక్కడకు పంపించారు?” అనడిగారు. మూసా (అలైహిస్సలాం) జరిగిన విషయాన్ని ఆయనకు వివరించారు. చాలా మర్యాదగా, “నేను మీతో రావచ్చా.. ఆ విధంగా మీరు మీ వద్ద ఉన్న జ్ఞానాన్ని నాకు బోధించగలరు. మిమ్మల్ని కలవడానికి నేను చాలా ప్రయాసపడి ఇక్కడకు వచ్చాను. నేను మీకు అవిధేయత చూపను” అన్నారు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆయనకు జవాబిస్తూ, “మీరు నన్ను భరిస్తారని నేను అనుకోవడంలేదు. ఎందుకంటే మీరు అనేక విచిత్రమైన విషయాలను చూడవచ్చు. చాలా విచిత్రమైన వాటిని చూసి మీరు నన్ను విమర్శించకుండా ఉండలేరు. ఎందుకంటే మీ అవగాహన పరిమితమైనది. అందువల్ల మీరు వాదనకు దిగుతారు” అన్నారు. మూసా (అలైహిస్సలాం) చాలా నిజాయితీగా, “అల్లాహ్ తలిస్తే… నేను సహనంతో ఉంటాను. మీ పట్ల అవిధేయత చూపను” అన్నారు. చివరకు ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన్ను వెంట తీసుకువెళ్లడానికి అంగీకరిస్తూ ఒక షరతు పెట్టారు. తాను ఏం చేసినా ప్రశ్నించరాదని అన్నారు. మూసా (అలైహిస్సలాం) తన అనుచరుడిని వెనక్కు పంపి తాను ఖిజర్ (అలైహిస్సలాం)తో పాటు బయలుదేరారు.
పడవకు నష్టం కలిగించడం
వారు ఒక నది వద్దకు చేరుకున్నారు. ఇద్దరూ ఒక పడవలోకి ఎక్కారు. ఆ పడవ యజమాని వారిద్దరి పట్ల ఒక విధమైన అభిమానాన్ని చూపించాడు. వారిద్దరిని అభిమానంగా పడవలోకి ఆహ్వానించాడు. పడవలోకి ఎక్కిన తర్వాత ఖిజర్ (అలైహిస్సలాం) చాలా వింతగా వ్యవహరించారు. పడవ ప్రక్కల బిగించి ఉన్న కొన్ని చెక్కలను పీకిపారేశారు. దాని వల్ల పడవకు ఒకవైపు పెద్ద రంధ్రంలా ఏర్పడింది. ఈ విచిత్ర ప్రవర్తనను చూసి నిర్ఘాంతపోయిన మూసా (అలైహిస్సలాం), “అరె, ఎందుకు పడవను నాశనం చేస్తున్నారు? మన పట్ల అభిమానంగా ఆహ్వానించిన పడవ యజమానికి ఇదా మనం ఇచ్చే ప్రతిఫలం? పైగా మనమంతా మునిగిపోయే ప్రమాదం కూడా ఉందని మీరు గ్రహించడం లేదా? మీరు చేసిన పని చాలా అనుచితమైనది” అన్నారు.
ఖిజర్ (అలైహిస్సలాం) ఆయనకు తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని గుర్తుచేశారు. మూసా (అలైహిస్సలాం)కు వెంటనే తాను చేసిన పొరపాటు గుర్తుకువచ్చింది. ఆయన్ను క్షమాపణలు కోరుకున్నారు. “నా మతిమరుపుకు కోపం తెచ్చుకోవద్దు, నా బలహీనత విషయంలో కఠినంగా వ్యవహరించవద్దు. మీతో రాకుండా నివారించవద్దు. నేను నా మాటకు కట్టుబడి ఉండడానికి ఈసారి పూర్తిగా ప్రయత్నం చేస్తాను” అన్నారు. అందుకు అంగీకరించి ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన్ను వెంటతీసుకుని బయలుదేరారు.
పిల్లవాడిని హతమార్చడం
దారిలో వారికి ఒక పిల్లవాడు తన మిత్రులతో ఆడుకుంటూ కనబడ్డాడు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆ పిల్లవాడిని మిత్రబృందం నుంచి వేరు చేసి ఒక ప్రక్కకు తీసుకు వెళ్ళి హతమార్చారు. ఈ అఘాయిత్యం చూసి మూసా (అలైహిస్సలాం) నిర్ఘాంతపోయారు. “మీరు ఒక అమాయక పిల్లవాడిని చంపేశారు. ఇది నిజంగా అమానుషం” అని అరిచారు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన వైపు తీక్షణంగా చూసి తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని గుర్తుచేశారు. తన పనులను మరోసారి ప్రశ్నిస్తే ఇక తనతో రావడం ఉండదని హెచ్చరించారు. మూసా (అలైహిస్సలాం) మళ్ళీ క్షమాపణ కోరుకున్నారు. “నేను మరోసారి ఈ పొరపాటు చేస్తే నన్ను మీ వెంట రాకుండా చేయండి” అన్నారు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన్ను మన్నించారు.
ఖిజర్ (అలైహిస్సలాం) చేసిన మంచి పని
వారిద్దరు ఒక గ్రామానికి చేరుకున్నారు. అక్కడి గ్రామస్తులతో వారు ఆశ్రయాన్ని, ఆహారాన్ని కోరారు. కాని పిసినారి ప్రజలు వారికి ఏదీ ఇవ్వలేదు. అందువల్ల వాళ్ళిద్దరూ అలాగే ప్రయాణం కొనసాగించవలసి వచ్చింది. వారిద్దరూ వెడుతున్నప్పుడు ఒక చోట ఒక గోడ కూలడానికి సిద్ధంగా ఉండడాన్ని వాళ్ళు చూశారు. వెంటనే ఖిజర్ (అలైహిస్సలాం) ఆ గోడను మరమ్మత్తు చేయడానికి పూను కున్నారు. ఇది చూసిన మూసా (అలైహిస్సలాం) ఉండబట్టలేక, “మీరు భలే విచిత్రమైన మనిషి. ఈ స్వార్థపరుల పట్ల మీరు సానుభూతి చూపుతున్నారు. పైగా మీరు చేస్తున్న కష్టానికి ప్రతిఫలం కూడా కోరడం లేదు. మనం చేసిన కష్టానికి వారి నుంచి ప్రతిఫలం తీసుకుని మన ప్రయాణానికి కొద్దిగా ఆహారాన్ని సమకూర్చుకో గలిగే వాళ్ళం” అన్నారు. తన పనులకు తగిన వివరణ ఇచ్చే వరకు వాటిని మూసా (అలైహిస్సలాం) భరించలేరని ఖిజర్ (అలైహిస్సలాం)కు అర్థమయ్యింది. “ఇక చాలు… ఇక మనం ఎవరి దారి వారు వేరవ్వడం మంచిది. మీకు సహనం లేదు. అయితే మనం వేరయ్యే ముందు నేను చేసిన పనులకు కారణాలు వివరిస్తాను” అన్నారు. మూసా సిగ్గుపడుతూ తల వంచుకున్నారు.
1. నేను నష్టపరచిన పడవను కిరాయికి నడుపుకుని ఆ పడవ యజమాని, అతని భార్య బ్రతుకుతున్నారు. నేను ఆ పడవను ఎందుకు నష్టపరిచానంటే, వారి రాజు పడవలను స్వాధీనం చేసుకుని పెద్ద నౌకాదళాన్ని తయారు చేయాలని చూస్తున్నాడు. ఈ పడవను నష్టపరచడం వల్ల దీన్ని చూసినా కూడా పనికిరానిదిగా భావించి రాజు దాన్ని వదలివేస్తాడు. మూసా! నేను చేసిన పని చూడడానికి బాధ్యత లేని పనిగా కనబడినా… నేను నిజానికి ఆ పడవను కాపాడడానికి, పడవ యజమానిపై సానుభూతితో చేసిన పని.
2. నేను చంపిన పిల్లవాడి తల్లిదండ్రులు నిజమైన విశ్వాసులు. కాని ఆ పిల్లవాడిలో ఉన్న దుర్మార్గం గురించి నాకు తెలిసింది. కన్నకొడుకు కాబట్టి ఆ తల్లి దండ్రులు అతడి దుర్మార్గాన్ని భరిస్తారు. కాని, చివరకు వాడి దుర్మార్గాలు ఆ తల్లిదండ్రులను కూడా ప్రభావితం చేస్తాయని నేను గ్రహించాను. అతడిని చంపి నేను వారి విశ్వాసాన్ని కాపాడాను. అల్లాహ్ వారికి మంచి సంతానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
3. నేను ఆ గోడను నిర్మించినది స్వార్థపరులైన గ్రామస్తుల కోసం కాదు, ఆ గోడ ఇద్దరు అనాధలైన బాలలది. ఆ గోడ క్రింద గుప్తనిధి ఉందని అల్లాహ్ నాకు తెలియజేశాడు. ఆ పిల్లల తండ్రి పుణ్యాత్ముడు, దానధర్మాలు చేసేవాడు. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు ఆ గుప్తనిధి రహస్యంగా ఉండడం చాలా అవసరం. వారు పెద్దయిన తర్వాత అల్లాహ్ వారికి ఆ నిధిని చూపిస్తాడు. ఆ గోడ పడిపోతే స్వార్థపరులైన గ్రామస్తులు ఆ నిధిని దోచుకుంటారు. కాబట్టి నేను చేసిన ప్రతీ పని నా ప్రభువు కారుణ్యం వల్ల చేసిన పని. నేను ఏ పనీ నా స్వంతంగా చేయలేదు. ఈ మాటలు చెప్పి ఖిజర్ (అలైహిస్సలాం) వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
(చదవండి దివ్యఖుర్ఆన్: 18:60-82)
గ్రహించవలసిన పాఠాలు
జ్ఞానం పొందిన వ్యక్తి తానొక్కడే కాదన్న విషయం తెలిసిన వెంటనే మూసా (అలైహిస్సలాం) మరింత జ్ఞానం సంపాదించడానికి కష్టసాధ్యమైన ప్రయాణానికి పూనుకున్నారు. జ్ఞానం సులభసాధ్యంగా లభించేది కాదు. జీవితంలో విజయం సాధించాలంటే మనిషి కష్టపడి పనిచేయవలసి ఉంటుంది.
అల్లాహ్ ఆదేశాల మర్మాలన్నింటినీ మనం అర్థం చేసుకోలేము. మనకు తప్పుగా కనబడుతున్న విషయం నిజానికి ఒక అనుగ్రహం కావచ్చు. “తాను చేసేది అల్లాహ్ కు బాగా తెలుసు”.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారిని హెచ్చరించటానికి (ఈ ఖురాన్ గ్రంథం అవతరింపజెయ్యబడింది) https://youtu.be/IjbFjYK0z3c [10 నిముషాలు]
సూరా అల్ కహఫ్ (ఆయతులు 4 – 5)
18:4 وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا అల్లాహ్ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారిని హెచ్చరించటానికి (ఈ గ్రంథం అవతరింపజెయ్యబడింది).
18:5 مَّا لَهُم بِهِ مِنْ عِلْمٍ وَلَا لِآبَائِهِمْ ۚ كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ أَفْوَاهِهِمْ ۚ إِن يَقُولُونَ إِلَّا كَذِبًا యదార్థానికి వారికిగానీ, వారి తాత ముత్తాతలకుగానీ ఈ విషయం ఏమీ తెలియదు. వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే.
ఈ ప్రసంగంలో, అల్లాహ్‌కు సంతానం ఉందని చెప్పేవారిని హెచ్చరించమని ఆదేశించే ఖురాన్ (సూరహ్ అల్-కహఫ్, ఆయత్ 4-5) ఆయతులపై వివరణ ఇవ్వబడింది. ఇది ఎటువంటి జ్ఞానం లేదా ఆధారం లేని తీవ్రమైన పాపమని, కేవలం అజ్ఞానంతో పలికే మాట అని వక్త నొక్కిచెప్పారు. యూదులు, క్రైస్తవులు, మక్కా ముష్రికులు గతంలో ఇలాంటి వాదనలు చేశారని ఉదహరించారు. దీనికి విరుద్ధంగా, అల్లాహ్‌కు తల్లిదండ్రులు, భార్య లేదా సంతానం లేరని, ఆయన ఏకైకుడని సూరహ్ అల్-ఇఖ్లాస్ స్పష్టం చేస్తుందని తెలిపారు. ఈ సత్యాన్ని ఇతరులకు తెలియజేయడం (దావత్) ప్రతీ ముస్లిం బాధ్యత అని, దీనికోసం కనీసం సూరహ్ అల్-ఇఖ్లాస్ మరియు ఆయతుల్ కుర్సీ యొక్క భావాన్ని తెలుసుకుని చెప్పినా సరిపోతుందని అన్నారు. అయితే, ఇతరుల వాదన ఎంత మూర్ఖంగా ఉన్నప్పటికీ, వారితో మృదువుగా, గౌరవప్రదంగా సంభాషిస్తూ దావత్ ఇవ్వాలని, ఈ పద్ధతులను తెలుసుకోవడం తప్పనిసరి అని బోధించారు.
وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا వయున్దిరల్లదీన ఖాలుత్తఖదల్లాహు వలదా ఈ ఖురాన్ ద్వారా (యున్దిర్) హెచ్చరించాలి.
اتَّخَذَ اللَّهُ وَلَدًا ఇత్తఖదల్లాహు వలదా నవూజుబిల్లాహ్. అల్లాహ్ తన కొరకు సంతానం చేసుకున్నాడు అని ఎవరైతే అంటున్నారో, అలాంటి వారిని కూడా మీరు ఈ ఖురాన్ ద్వారా హెచ్చరించాలి.
ఇక మీరు ఈ ఆయతును గమనించండి. మనం ఈ బాధ్యతలు నెరవేరుస్తున్నామా?
అల్లాహ్ ఏమంటున్నాడు? ఎవరైతే అల్లాహ్‌కు సంతానం ఉంది అని అంటున్నారో, ఈ ఖురాన్ ద్వారా మీరు వారిని హెచ్చరించండి – “మీకు జ్ఞానం లేని మాటలు అల్లాహ్ విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారు? అల్లాహ్ ఎవరినీ కూడా తనకు సంతానంగా చేసుకోలేదు. అల్లాహ్ ఎవరినీ కూడా తనకు భార్యగా చేసుకోలేదు”
యూదులు ఉజైర్ అలైహిస్సలాంని అల్లాహ్ యొక్క కుమారుడు అని అన్నారు. క్రైస్తవులు ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తును అల్లాహ్ యొక్క కుమారుడు అని అన్నారు. మక్కా యొక్క ముష్రికులు దైవదూతలను అల్లాహ్ యొక్క కుమార్తెలు అని అనేవారు. మరియు ఈ రోజుల్లో మన భారతదేశంలో ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాము. పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, మహేశ్వరుడు అన్నటువంటి పదాలు ఆ ఏకైక సృష్టికర్త గురించే మేము అంటున్నాము అని అంటారు. కానీ మళ్ళీ ఆ సృష్టికర్తకు సంతానాలు ఉంటాయి. ఆ సృష్టికర్తకు ఎందరో భార్యలు ఉంటారు. అంతేకాదు, వాళ్ళ యొక్క దేవుళ్ళ సంగతి ఎలా అంటే, పెద్ద దేవుడు కొన్ని సందర్భాల్లో చిన్న దేవుళ్ళపై కోపగించి వారిపై శాపం కూడా కురిపిస్తాడు మరియు శాపం పడిన వారిని కరుణించి వరాలు కూడా కురిపిస్తాడు. ఈ విధంగా ఎన్నో విచిత్ర సంఘటనలు మనం వింటూ చూస్తూ ఉన్నాము.
నిజంగా, వాస్తవంగా మనందరి సృష్టికర్త ఎవరు అంటే, అతనికి తల్లి లేదు, తండ్రి లేడు, సంతాన భార్య లేదు, సంతానమూ లేరు, అతనికి ఏ కుటుంబము, పరివారము అని లేరు.
(ఓ ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం!) వారికి ఇలా చెప్పు: అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు.(ఏ అక్కరా లేనివాడు). ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు. (సూరా అల్ ఇఖ్లాస్)
మనందరికీ ఈ సూరా గుర్తుంటుంది కదా. దీని యొక్క అనువాదం తెలుసుకొని ప్రేమగా ఒక్కసారైనా గానీ మనం మన చుట్టుపక్క ఉన్నటువంటి బహుదైవారాధకులకు, అవిశ్వాసులకు, సత్య తిరస్కారులకు, అల్లాహ్‌తో పాటు వేరే వారిని పూజించే వారికి ఈ సూరత్ యొక్క అనువాదం మనం వినిపించాలి.
ఈ రోజుల్లో చాలా మంది అడుగుతూ ఉంటారు. మేము మేము అవిశ్వాసులకు దావత్ ఇవ్వాలి అని అనుకుంటాము, కానీ మాకు ఎక్కువ జ్ఞానం ఏమీ లేదు. ఎలా వారికి దావత్ ఇవ్వాలి? చూడండి, దావత్ యొక్క విషయం కొన్ని సందర్భాలలో, కొన్ని సందర్భాలలో ఇది లోతైన జ్ఞానం, చాలా పటిష్టమైన ఆధారాలతో కూడిన జ్ఞానం కూడా అవసరం ఉంటుంది. మరెన్నో సందర్భాలలో కేవలం ఖుల్ హువల్లాహు అహద్ ఈ మొత్తం సూరా మరియు ఆయతుల్ కుర్సీ, ఆయతుల్ కుర్సీ మీకు గుర్తు ఉంది అంటే దాని అనువాదం చూసుకోండి. ఆయతల్ కుర్సీలో 10 విషయాలు అల్లాహ్ ఏకత్వం గురించి తెలుపబడ్డాయి. మీరు దాని యొక్క అనువాదం కనీసం తెలియజేశారు అంటే ఎంతో ఒక గొప్ప సత్యాన్ని, మీరు సత్కార్యాల్లో చాలా ఉన్నత శిఖరానికి చెందిన ఒక సత్కార్యం గురించి ప్రజలకు బోధించిన వారు అవుతారు.
అయితే ఈ లోకంలో చూడటానికి పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నవారు, ఎంతో తమకు తాము మేధావులు అనుకునేవారు నిజ సృష్టికర్త అయిన అల్లాహ్‌కు సంతానం ఉంది అని అంటున్నారంటే, ఆ తర్వాత ఆయతు నంబర్ ఐదు చదవండి.
నవూజుబిల్లాహ్, అస్తగ్‌ఫిరుల్లాహ్. అల్లాహ్‌కు సంతానం ఉంది అని ఎవరైతే అంటున్నారో, ఈ మాట చెప్పడానికి వారి నోరు ఎలా విప్పారు?ఎందుకంటే:
مَّا لَهُم بِهِ مِنْ عِلْمٍ మా లహుమ్ బిహీ మిన్ ఇల్మ్ వారికి దీని గురించి ఎలాంటి జ్ఞానం లేదు
وَلَا لِآبَائِهِمْ ۚ వలా లిఆబాఇహిమ్ ఇలాంటి మాట పలికిన వారి తాత ముత్తాతలకు కూడా ఈ జ్ఞానం నిజ జ్ఞానం లేదు.
ఈ మాట ఎంత భయంకరమైనదో తెలుసా? ఎంత ఘోరమైనదో తెలుసా?
كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ أَفْوَاهِهِمْ కబురత్ కలిమతన్ తఖ్రుజు మిన్ అఫ్వాహిహిమ్ వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది.
ఖురాన్‌లో వేరే కొన్ని సందర్భాలలో అల్లాహ్ తఆలా ఏం చెప్పాడు?
تَكَادُ السَّمَاوَاتُ يَتَفَطَّرْنَ తకాదుస్-సమావాతు యతఫత్తర్న అల్లాహ్‌కు సంతానం ఉన్నది అని వారు పలికే మాట ఎంత చెండాలమైనది, ఎంత తప్పు మాట, ఎంత దారుణమైనది అంటే భూమ్యాకాశాలు బ్రద్దలైపోతాయి.
ఎందుకంటే ఈ మానవుడు మరియు జిన్నాతులలో షైతానులు తప్ప సర్వ సృష్టి అల్లాహ్ ఏకత్వాన్ని నమ్ముతుంది.
وَلَهُ أَسْلَمَ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَإِلَيْهِ يُرْجَعُونَ వలహూ అస్లమ మన్ ఫిస్సమావాతి వల్ అర్ద్, తౌఅన్ వ కర్హా, వ ఇలైహి యుర్జాఊన్ ఆకాశాల్లో, భూమిలో ఉన్న సమస్తము కూడా అల్లాహ్‌కు మాత్రమే వారు ఇస్లాం ముస్లింలుగా ఉన్నారు.
అస్లమ అంటే వారు విధేయులై ఉన్నారు. శిరసావహించి ఉన్నారు. అల్లాహ్ ఏకత్వాన్ని నమ్మి ఉన్నారు. అల్లాహ్ యొక్క ఏకత్వంలో వారు ఏమాత్రం భాగస్వామి కలగజేయరు. కానీ సర్వ సృష్టిలో అతి ఉత్తముడైన ఈ మానవుడే అల్లాహ్ పట్ల ఎంతటి అబద్ధపు మాట పలుకుతున్నాడో అల్లాహ్ స్వయంగా చెప్పాడు:
إِن يَقُولُونَ إِلَّا كَذِبًا ఇన్ యఖూలూన ఇల్లా కదిబా వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే.
అయితే ఇక్కడ ఒక సత్యం మీరు తెలుసుకోండి. ఖురాన్ చదువుతూ ఉంటాము కానీ మనం అర్థం చేసుకో చేసుకుంటూ ఉండము. అందుకొరకే ఎన్నో విషయాలు పై నుండే మనకు దాటిపోతూ ఉంటాయి.
ఎవరైతే షిర్క్ చేస్తున్నారో, ఎవరైతే అల్లాహ్‌కు సంతానం ఉంది అని అంటున్నారో, ఎవరైతే అల్లాహ్‌తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తున్నారో స్వయం వారి వద్ద ఈ షిర్క్ గురించి ఎలాంటి ఆధారం లేదు. వారు చెబుతున్న ఈ మాట ఎలాంటి సత్యంతో కూడినది కాదు. అల్లాహ్‌కు వేరే భాగస్వాములు ఉన్నారు, సంతానం ఉంది అని అనడం ఇది అజ్ఞానంతో, మూర్ఖత్వంతో కూడిన మాట.
అందుకొరకే ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హా బ్ రహిమహుల్లాహ్ యొక్క మనమడు కితాబు తౌహీద్ యొక్క వ్యాఖ్యానం ఏదైతే రాశారో అందులో ఒక మాట ఇది కూడా చెబుతున్నారు ఆరంభంలోనే. – “ఎవరు ఎంత పెద్ద ప్రపంచపు చదువులు చదివినా, అల్లాహ్‌తో పాటు ఇతరులను సాటి కలుపుతున్నాడంటే అతడు అసలైన జ్ఞానానికి దూరం, అజ్ఞానంలో, మూర్ఖత్వంలో పడి ఉన్నాడు.”
కానీ ఇక్కడ వారి ఆ మాట మూర్ఖత్వంతో కూడినది. కానీ వారికి దావత్ ఇచ్చే విషయంలో, సందర్భంలో మనం ప్రతి ఒక్కరితో వారి యొక్క తగిన స్థానానిని, వారి యొక్క ఏ హోదా అంతస్తు ఉందో ఈ లోకంలో వారిని గౌరవిస్తూ, గౌరవిస్తూ అంటే వారితో ఎలా సంభాషించాలి, ఎలా మాట్లాడాలి, దావత్ ఇచ్చే విషయంలో ఎలా మనం వారిని మృదు వైఖరితో, తీపి మాటతో మాట్లాడాలి ఆ విషయాలు కూడా మనం తెలుసుకొని ఉండడం తప్పనిసరి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[53 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
సూరా అల్ కహఫ్ (ఆయతులు 100 – 110)
18:100 وَعَرَضْنَا جَهَنَّمَ يَوْمَئِذٍ لِّلْكَافِرِينَ عَرْضًا ఆ రోజు మేము నరకాన్ని అవిశ్వాసుల ముందు ప్రత్యక్షపరుస్తాము.
18:101 الَّذِينَ كَانَتْ أَعْيُنُهُمْ فِي غِطَاءٍ عَن ذِكْرِي وَكَانُوا لَا يَسْتَطِيعُونَ سَمْعًا నా స్మరణ పట్ల వారి కళ్లు పొరలు క్రమ్ముకుని ఉండేవి. అప్పుడు వారు (సత్య వాక్కును) వినే స్థితిలో కూడా లేరు.
18:102 أَفَحَسِبَ الَّذِينَ كَفَرُوا أَن يَتَّخِذُوا عِبَادِي مِن دُونِي أَوْلِيَاءَ ۚ إِنَّا أَعْتَدْنَا جَهَنَّمَ لِلْكَافِرِينَ نُزُلًا ఇప్పుడీ అవిశ్వాసులు, నన్ను కాదని నా దాసులను తమ సహాయకులుగా చేసుకుందామని అనుకుంటున్నారా? (వినండి!) మేము ఈ అవిశ్వాసుల ఆతిథ్యం కోసం నరకాన్ని సిద్ధంచేసి ఉంచాము.
18:103 قُلْ هَلْ نُنَبِّئُكُم بِالْأَخْسَرِينَ أَعْمَالًا (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “చేసుకున్న కర్మల రీత్యా మీలో అందరికన్నా ఎక్కువగా నష్టపోయే వారెవరో నేను మీకు చెప్పనా?
18:105 أُولَٰئِكَ الَّذِينَ كَفَرُوا بِآيَاتِ رَبِّهِمْ وَلِقَائِهِ فَحَبِطَتْ أَعْمَالُهُمْ فَلَا نُقِيمُ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ وَزْنًا తమ ప్రభువు ఆయతులను, ఆయన్ని కలుసుకోవలసి ఉందన్న విషయాన్ని త్రోసి పుచ్చినవారు వీరే. అందువల్ల వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. కాబట్టి ప్రళయదినాన మేము వారి కర్మల బరువును తూయము.
18:106 ذَٰلِكَ جَزَاؤُهُمْ جَهَنَّمُ بِمَا كَفَرُوا وَاتَّخَذُوا آيَاتِي وَرُسُلِي هُزُوًا వారికి లభించే ప్రతిఫలం నరకం. ఎందుకంటే వారు (సత్యాన్ని) తిరస్కరించారు. నా ఆయతులను, నా ప్రవక్తలను పరిహసించారు.
18:107 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ كَانَتْ لَهُمْ جَنَّاتُ الْفِرْدَوْسِ نُزُلًا అయితే విశ్వసించి, సత్కార్యాలు కూడా చేసిన వారికి ఆతిథ్యంగా ఫిరదౌసు వనాలు ఉన్నాయి.
18:108 خَالِدِينَ فِيهَا لَا يَبْغُونَ عَنْهَا حِوَلًا వారక్కడ కలకాలం ఉంటారు. ఆ స్థలాన్ని వదలి మరెక్కడి కైనా పోవాలని వారు ఎన్నటికీ కోరుకోరు.
18:109 قُل لَّوْ كَانَ الْبَحْرُ مِدَادًا لِّكَلِمَاتِ رَبِّي لَنَفِدَ الْبَحْرُ قَبْلَ أَن تَنفَدَ كَلِمَاتُ رَبِّي وَلَوْ جِئْنَا بِمِثْلِهِ مَدَدًا (ఓ ప్రవక్తా!) ఈ విధంగా చెప్పు : “ఒకవేళ నా ప్రభువు మాటలను వ్రాయటానికి సముద్రం సిరాగా మారిపోయినా సరే, నా ప్రభువు మాటలు పూర్తి కాకముందే, అది అయి పోతుంది.” – మేము మళ్లీ దాని వంటిదే (మరో సముద్రం) దాని సహాయార్థం తెచ్చినాసరే.”
18:110 قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِّثْلُكُمْ يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا (ఓ ప్రవక్తా!) వారికి ఇలా చెప్పు: “నేనూ మీలాంటి మానవ మాత్రుణ్ణే.(కాకపోతే) ‘మీ అందరి ఆరాధ్యదైవం ఒకే ఆరాధ్య దైవం’ అన్న సందేశం (వహీ) నా వద్దకు పంపబడుతుంది. కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చేయాలి. తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకూడదు.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[47 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
రెండవ భాగం
[42 నిముషాలు]
మూడవ భాగం
[48 నిముషాలు]
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
జుల్ ఖర్నైన్ (మహా సాహసవంతుడు)
“నా ప్రభువు వాగ్దాన సమయం వచ్చినపుడు ఆయన దీనిని (ఈ గోడను) నేలమట్టం చేసేస్తాడు” అని జుల్ ఖర్నైన్ చెప్పాడు. (దివ్యఖుర్ఆన్ 18 : 98)
జుల్ ఖర్నైన్ వద్ద అతిపెద్ద సైన్యం, ఒక మహాసామ్రాజ్యం ఉండేవి. అల్లాహ్ అతడికి భూమిపై అధికారం ప్రసాదించాడు. అతడికి కావలసిన సమస్తమూ ఇచ్చాడు. ఆ మహాసైన్యం అతడి ఆజ్ఞను జవదాటేది కాదు. అతడికి లొంగని దేశం లేదు. అతడికి అనువు కాని ప్రదేశం అంటూ ఏదీ లేదు. ఎలాంటి సాహసమైనా అతడికి సాధ్యం కానిది కాదు. అతడు పాల్గొన్న ప్రతి యుద్ధం లోనూ విజేతగా నిలిచాడు.
అప్పటి ప్రపంచంలో నలు మూలలా అతడు పర్యటించాడు. తూర్పు నుంచి పడమరకు ప్రతీ చోటికి వెళ్ళాడు. ఒక ప్రదేశంలో ఒక పెద్ద సరస్సు వద్ద నీరు బురదతో కలసి బుడగలుగా వస్తుండడాన్ని చూశాడు. ఈ ప్రదేశం ప్రపంచానికి చివరిదా లేక ఈ ప్రదేశం తర్వాత కూడా ప్రపంచం ఉందా అని ఆలోచించ సాగాడు. ఆ ప్రదేశంలో కొందరు మనుష్యులు కనబడ్డారు. వాళ్ళు దైవం గురించి తెలియని అవిశ్వాసులు. పరమ దుర్మార్గులు. ప్రజలను దోచుకోవడం, హత్యలు చేయడం వృత్తిగా బ్రతుకుతున్నవాళ్ళు. జుల్ ఖర్నైన్ అల్లాహ్ ను ప్రార్థించి మార్గ దర్శకత్వం కోసం మొర పెట్టుకున్నాడు. అల్లాహ్ అతడికి రెండు మార్గాలలో ఒకదాన్ని ఎంచుకోమన్నాడు. “జుల్ ఖర్నైన్ వారిని శిక్షించు లేదా వారిపై దయచూపు”. జుల్ ఖర్నైన్ తన సైనికులతో, “మనం ఇక్కడ దుర్మార్గులను శిక్షిద్దాం. వాళ్ళు ప్రభువు వద్దకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తగిన శిక్ష పొందుతారు. అయితే మనం మంచివారిని దయతో చూద్దాం” అన్నాడు. జుల్ ఖర్నైన్ ఆ ప్రజలను సంస్కరిస్తూ అక్కడ కొంతకాలం గడిపాడు. అక్కడ న్యాయాన్ని స్థాపించిన తర్వాత, మంచివారిని అక్కడ పాలకులుగా నియమించిన తర్వాత వారి నుంచి సెలవు తీసుకుని వెళ్లిపోయాడు.
యాజూజ్, మాజూజ్
జుల్ ఖర్నైన్ మహాసాహసి అయిన పాలకుడు. తూర్పు దిశగా ప్రయాణం చేశాడు. అవిశ్వాసులను సంస్కరిస్తూ, వారితో యుద్ధాలు చేస్తూ తన సైన్యంతో యాత్ర కొనసాగించాడు. ఆయన ప్రతి యుద్ధంలోనూ విజేతగా నిలిచాడు. అలా ప్రయాణిస్తూ అతను ఒక ప్రదేశానికి వచ్చాడు. ఆ ప్రదేశం నాగరికతకు ఆఖరుగా భావించాడు. అక్కడ ప్రజలకు నివాస గృహాలు లేవు. ఎలాంటి ఆశ్రయం లేదు. కనీసం చెట్టు నీడ కూడా వారికి లేదు. వారంతా పరమ అజ్ఞానంలో బ్రతుకు తున్నారు. ఆయన వారి మధ్య కొంతకాలం నివసించాడు. వారికి సంస్కారాన్ని నేర్పాడు. నాగరికతను నేర్పాడు. వారికి అల్లాహ్ గురించి బోధించాడు. వారి కోసం ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత అతను పశ్చిమ దిశగా ప్రయాణం ప్రారంభించాడు.
ఆ విధంగా జుల్ ఖర్నైన్ ఒక దేశానికి చేరుకున్నాడు. ఆ దేశం రెండు కొండల నడుమ ఉంది. చాలా అభివృద్ధి చెందిన దేశం అది. అక్కడి ప్రజలు జుల్ ఖర్నైన్ ను తమకు, తమ పొరుగు దేశానికి మధ్య ఒక గోడ కట్టాలని అభ్యర్థించారు. పొరుగు దేశం ప్రజలు తమపై దాడి చేసి తమ సంపద దోచుకుని హత్యాకాండకు పాల్పడుతున్నారని అన్నారు. పొరుగున ఉంటున్నది యాజూజ్, మాజూజ్ తెగలు. అడ్డుగోడ కట్టినందుకు ప్రతిగా సుంకం చెల్లిస్తామని కూడా వారన్నారు. కాని జుల్ ఖర్నైన్ వారికి జవాబిస్తూ, “నాకు అల్లాహ్ చాలినంత ధనం ప్రసాదించాడు. కనుక మీ శ్రమ తప్ప మరేమీ నాకు అవసరంలేదు. మీకు దురాక్రమణ దారులకు మధ్య పటిష్టమైన అడ్డుగోడ నేను నిర్మిస్తాను” అన్నాడు. వారు సంతో షంగా ఒప్పుకున్నారు.
ఇనుమును భారీగా ఉపయోగించి జుల్ ఖర్నైన్ రెండు కొండల మధ్య ప్రదేశాన్ని పూరించాడు. ఒక భారీ గోడను నిర్మించి ఆ గోడపై కరిగిన లోహాన్నిపోతపోసాడు. దురాక్రమణదారులు ఆ లోహపు నునుపైన గోడపైకి ఎక్కడం కాని, గోడను పగులకొట్టి చొరబడడం కాని సాధ్యపడని విధంగా తయారుచేశాడు. ఆ దేశ ప్రజలు సంతోషించారు. గోడ నిర్మాణం పూర్తయిన తర్వాత జుల్ ఖర్నైన్ అల్లాహ్ కు కృతజ్ఞతగా నమాజు చేశాడు. “ఇది కేవలం నా ప్రభువు కటాక్షం. అయితే నా ప్రభువు వాగ్దాన సమయం వచ్చినపుడు ఆయన దాన్ని నేలమట్టం చేసేస్తాడు. నిశ్చయంగా నా ప్రభువు వాగ్దానం నెరవేరటం తథ్యం” అన్నాడు. (దివ్యఖుర్ఆన్ 18:83-98, ఇంతకు ముందు చెప్పబడిన కథ కూడా ఈ రిఫరెన్సులో ఉంది)
సూరా అల్ కహఫ్ – జుల్‌ఖర్‌నైన్ వృత్తాంతము (ఆయతులు 83 – 99)
చివరకు అతను సూర్యుడు అస్తమించే ప్రదేశానికి చేరుకుని, సూర్యుడు ఒక బురద చెలమలో అస్తమిస్తుండగా చూశాడు. దాని సమీపంలో అతను ఒక జాతి వారిని కూడా కనుగొన్నాడు. “ఓ జుల్‌ఖర్‌నైన్! నువ్వు వీళ్లను శిక్షించవచ్చు. లేదా వీరి విషయంలో మరేదయినా ఉత్తమ వైఖరిని అవలంబించవచ్చు” అని మేమతనికి సెలవిచ్చాము.
దానికతను, “దుర్మార్గానికి ఒడిగట్టిన వాణ్ణి మేము శిక్షిస్తాము. తరువాత అతను తన ప్రభువు వద్దకు మరలించబడతాడు. ఆయన అతనికి మరింత తీవ్రమైన శిక్ష విధిస్తాడు” అని అన్నాడు.
అతను సూర్యుడు ఉదయించే ప్రదేశానికి చేరుకున్నప్పుడు, అక్కడ సూర్యుడు ఒక జాతి వారిపై ఉదయించటం చూశాడు. మేము వారికీ – సూర్యునికీ మధ్య ఎలాంటి అడ్డునూ ఉంచలేదు.
“ఓ జుల్ ఖర్‌నైన్! యాజూజ్ మాజూజ్‌లు ఈ దేశంలో కల్లోలాన్ని సృష్టిస్తున్నారు. నువ్వు మాకూ – వారికీ మధ్య ఒక అడ్డుగోడను నిర్మిస్తావా? దానికయ్యే ఖర్చులు నీకు చెల్లించమంటావా?” అని వాళ్లు విన్నవించుకున్నారు.
అతనిలా సమాధానమిచ్చాడు: “నాకు నా ప్రభువు అనుగ్రహించిన అధికారమే ఎంతో శ్రేష్ఠమైనది. మీరు మీ (శ్రమ) శక్తి ద్వారా నాకు సహాయపడండి చాలు. నేను మీకూ – వారికీ మధ్య ఒక పటిష్టమైన గోడను నిర్మిస్తాను.
“….నాకు ఇనుపరేకులను తెచ్చి ఇవ్వండి.” ఆ విధంగా అతను ఆ రెండు పర్వతాల మధ్య గోడను – సమానంగా – లేపిన తరువాత, “అగ్నిని రాజేయండి” అని ఆజ్ఞాపించాడు. ఆ ఇనుప రేకులు బాగా కాలి అగ్నిగా మారిన తరువాత “కరిగిన రాగిని తెండి, దానిపై పోస్తాను” అని అన్నాడు.
“ఇది కేవలం నా ప్రభువు కటాక్షం. అయితే నా ప్రభువు వాగ్దాన సమయం వచ్చినపుడు ఆయన దాన్ని నేలమట్టం చేసేస్తాడు. నిశ్చయంగా నా ప్రభువు వాగ్దానం నెరవేరటం తథ్యం” అని జుల్‌ఖర్‌నైన్ చెప్పాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
18వ భాగం:(ఆయతులు 60 – 82) – పూర్తి వృత్తాంతము సంక్షిప్తంగా
[43 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
19వ భాగం:(ఆయతులు 60 – 62)
20వ భాగం: (ఆయతులు 63 – 70)
21వ భాగం: (ఆయతులు 71 – 78)
22వ భాగం: (ఆయతులు 79 – 82)
సూరా అల్ కహఫ్ (ఆయతులు 60 – 82)
18:60 وَإِذْ قَالَ مُوسَىٰ لِفَتَاهُ لَا أَبْرَحُ حَتَّىٰ أَبْلُغَ مَجْمَعَ الْبَحْرَيْنِ أَوْ أَمْضِيَ حُقُبًا “ఏళ్ళ తరబడి నడవవలసి వచ్చినా సరే, రెండు సముద్రాలు కలిసే సాగర సంగమానికి చేరుకోనంతవరకూ నేను నడుస్తూనే ఉంటాను” అని మూసా తన వెంటనున్న యువకునితో చెప్పినప్పుడు (జరిగిన సంఘటనను కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి).
18:61 فَلَمَّا بَلَغَا مَجْمَعَ بَيْنِهِمَا نَسِيَا حُوتَهُمَا فَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ سَرَبًا తీరా వారిద్దరు సాగర సంగమానికి చేరుకున్నాక, అక్కడ తమ చేపను మరచి పోయారు. అదేమో సొరంగం మాదిరిగా దారి చేసుకుని సముద్రంలోకి జారుకుంది.
18:62 فَلَمَّا جَاوَزَا قَالَ لِفَتَاهُ آتِنَا غَدَاءَنَا لَقَدْ لَقِينَا مِن سَفَرِنَا هَٰذَا نَصَبًا వారుభయులూ ముందుకు సాగిపోయిన తరువాత మూసా తన (వెంటనున్న) యువకుణ్ణి ఉద్దేశించి, “మా ఉదయ భోజనం తీసుకురా. నిజంగానే ఈ ప్రయాణంలో చాలా ప్రయాస పడాల్సి వచ్చింది” అన్నాడు.
18:63 قَالَ أَرَأَيْتَ إِذْ أَوَيْنَا إِلَى الصَّخْرَةِ فَإِنِّي نَسِيتُ الْحُوتَ وَمَا أَنسَانِيهُ إِلَّا الشَّيْطَانُ أَنْ أَذْكُرَهُ ۚ وَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ عَجَبًا దానికతను, “చూశారా (ఎంత పనయిందో)! మనం రాతి బండకు ఆనుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నేను చేప సంగతి మరచేపోయాను. అసలేం జరిగిందో మీకు చెప్పకుండా షైతానే నన్ను మరుపుకు లోను చేశాడు. ఆ చేప చాలా విచిత్రంగా సముద్రంలోకి దారి చేసుకుని వెళ్ళిపోయింది” అని వివరించాడు.
18:64 قَالَ ذَٰلِكَ مَا كُنَّا نَبْغِ ۚ فَارْتَدَّا عَلَىٰ آثَارِهِمَا قَصَصًا “(అరె!) మనం వెతుక్కుంటూ వచ్చింది ఆ స్థలం కోసమే కదా!” అని మూసా అన్నాడు. ఆ తరువాత వారిద్దరూ తమ పాదచిహ్నాల ఆధారంగా వెనక్కి తిరిగి వచ్చారు.
18:65 فَوَجَدَا عَبْدًا مِّنْ عِبَادِنَا آتَيْنَاهُ رَحْمَةً مِّنْ عِندِنَا وَعَلَّمْنَاهُ مِن لَّدُنَّا عِلْمًا అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుణ్ణి కనుగొన్నారు. మేము అతనికి మా వద్ద నుంచి ఓ ప్రత్యేక కారుణ్యాన్ని ప్రసాదించి ఉన్నాము. ఇంకా మా వద్ద నుంచి అతనికి ఓ ప్రత్యేక విద్యను నేర్పి ఉన్నాము.
18:66 قَالَ لَهُ مُوسَىٰ هَلْ أَتَّبِعُكَ عَلَىٰ أَن تُعَلِّمَنِ مِمَّا عُلِّمْتَ رُشْدًا మూసా అతనితో, “మీకు నేర్పబడిన మంచి విద్యను మీరు నాకు నేర్పడానికి, నేను మీ వెంట ఉండవచ్చా?” అని అభ్యర్థించాడు.
18:67 قَالَ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا దానికతను, “మీరు నా సహచర్యంలో ఉంటూ ఏమాత్రం ఓపిక పట్టలేరు.
18:68 وَكَيْفَ تَصْبِرُ عَلَىٰ مَا لَمْ تُحِطْ بِهِ خُبْرًا “అయినా మీరు మీ జ్ఞానపరిధిలోకి తీసుకోని విషయంపై ఓపిక పట్టడం మీ వల్ల ఎలా సాధ్యమవుతుంది?” అన్నాడు.
18:69 قَالَ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ صَابِرًا وَلَا أَعْصِي لَكَ أَمْرًا “అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు. ఏ విషయంలోనూ నేను మీ ఆజ్ఞను జవదాటను” అని (మూసా) సమాధానమిచ్చాడు.
18:70 قَالَ فَإِنِ اتَّبَعْتَنِي فَلَا تَسْأَلْنِي عَن شَيْءٍ حَتَّىٰ أُحْدِثَ لَكَ مِنْهُ ذِكْرًا “సరే! నా వెంట రావాలన్నదే మీ అభిలాష అయితే (బాగా గుర్తుంచుకోండి!) ఏ విషయం గురించైనాసరే నేను స్వయంగా మీతో ప్రస్తావించనంతవరకూ నన్నేమీ అడగకూడదు” అన్నాడతను.
18:71 فَانطَلَقَا حَتَّىٰ إِذَا رَكِبَا فِي السَّفِينَةِ خَرَقَهَا ۖ قَالَ أَخَرَقْتَهَا لِتُغْرِقَ أَهْلَهَا لَقَدْ جِئْتَ شَيْئًا إِمْرًا వారిద్దరూ బయలుదేరారు. చివరకు ఒక పడవలో పయనమైనప్పుడు అతను (ఖిజరు) దాని చెక్క పలకలను పగులగొట్టారు. దానికి మూసా, “ఇదేమిటీ, పడవ ప్రయాణీకులందరినీ ముంచేయటానికా వీటిని పగులగొట్టారు? మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారు” అని చెప్పనే చెప్పేశాడు.
18:72 قَالَ أَلَمْ أَقُلْ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا “మీరు నా వెంట ఉండి ఓపిక పట్టలేరని ముందే చెప్పానా!?” అని (ఖిజరు) అన్నాడు.
18:73 قَالَ لَا تُؤَاخِذْنِي بِمَا نَسِيتُ وَلَا تُرْهِقْنِي مِنْ أَمْرِي عُسْرًا “నా మరుపుపై నన్ను పట్టుకోకండి. నా విషయంలో కఠినంగా వ్యవహరించకండి” అని మూసా విన్నవించుకున్నాడు.
18:74 فَانطَلَقَا حَتَّىٰ إِذَا لَقِيَا غُلَامًا فَقَتَلَهُ قَالَ أَقَتَلْتَ نَفْسًا زَكِيَّةً بِغَيْرِ نَفْسٍ لَّقَدْ جِئْتَ شَيْئًا نُّكْرًا ఆ తరువాత వారుభయులూ ముందుకు సాగిపోయారు. వారికి ఒక అబ్బాయి తారసపడ్డాడు. అతనా అబ్బాయిని చంపేశాడు. “మీరు పవిత్రమైన ఒక ప్రాణాన్ని తీసేశారు. అతను ఏ ప్రాణినీ హతమార్చి ఉండలేదుకదా! నిశ్చయంగా మీరు అత్యంత ఘోరకృత్యానికి పాల్పడ్డారు” అని మూసా చెప్పాడు.
18:75 قَالَ أَلَمْ أَقُل لَّكَ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا “నా వెంట ఉంటూ మీరు ఏ మాత్రం సహనం పాటించలేరని ముందే చెప్పానా లేదా?” అని ఆయన అన్నాడు.
18:76 قَالَ إِن سَأَلْتُكَ عَن شَيْءٍ بَعْدَهَا فَلَا تُصَاحِبْنِي ۖ قَدْ بَلَغْتَ مِن لَّدُنِّي عُذْرًا “ఒకవేళ దీని తరువాత ఏ విషయంలోనయినా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే నన్ను మీ వెంట ఉండనివ్వకండి. ఇక మీదట నాపై చర్య గైకొనేందుకు తగిన కారణం మీకు లభించింది” అని మూసా ప్రాధేయపడ్డాడు.
18:77 فَانطَلَقَا حَتَّىٰ إِذَا أَتَيَا أَهْلَ قَرْيَةٍ اسْتَطْعَمَا أَهْلَهَا فَأَبَوْا أَن يُضَيِّفُوهُمَا فَوَجَدَا فِيهَا جِدَارًا يُرِيدُ أَن يَنقَضَّ فَأَقَامَهُ ۖ قَالَ لَوْ شِئْتَ لَاتَّخَذْتَ عَلَيْهِ أَجْرًا వారిద్దరూ అక్కణ్ణుంచి బయలుదేరి ఒక పట్టణానికి చేరుకున్నారు. తమ కోసం భోజన ఏర్పాటు చేయమని అక్కడి ప్రజలను అభ్యర్థించగా వారికి ఆతిథ్యమివ్వటానికి స్థానికులు నిరాకరించారు. అంతలో ఆ ఊరిలో కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక గోడపై వారి దృష్టి పడింది. ఆయన ఆ గోడను (యధాతథంగా) నిలబెట్టాడు. “మీరు గనక తలచుకుంటే ఈ పనికి వేతనం తీసుకోవచ్చు కదా!” అని మూసా అన్నాడు.
18:78 قَالَ هَٰذَا فِرَاقُ بَيْنِي وَبَيْنِكَ ۚ سَأُنَبِّئُكَ بِتَأْوِيلِ مَا لَمْ تَسْتَطِع عَّلَيْهِ صَبْرًا దానికతను ఈ విధంగా సమాధానమిచ్చాడు: “ఇక మీకూ- నాకూ మధ్య చీలిక ఏర్పడినట్లే (మన సావాసం చెల్లిపోయింది). మీరు సహించలేకపోయిన ఆ మూడు విషయాల పరమార్థాన్ని కూడా మీకు వివరిస్తాను (వినండి)….”
18:79 أَمَّا السَّفِينَةُ فَكَانَتْ لِمَسَاكِينَ يَعْمَلُونَ فِي الْبَحْرِ فَأَرَدتُّ أَنْ أَعِيبَهَا وَكَانَ وَرَاءَهُم مَّلِكٌ يَأْخُذُ كُلَّ سَفِينَةٍ غَصْبًا “ఆ పడవ సంగతి – అది సముద్రంలో పనిచేసుకునే కొందరు నిరుపేదలది. నేను కావాలనే ఆ పడవలో కొంత లోపం ఏర్పర చాలనుకున్నాను. ఎందుకంటే, ఇంకాస్త ముందుకుపోతే కనిపించిన ప్రతి (మంచి) పడవనూ బలవంతంగా వశపరచుకునే రాజు ఒకడున్నాడు.
18:80 وَأَمَّا الْغُلَامُ فَكَانَ أَبَوَاهُ مُؤْمِنَيْنِ فَخَشِينَا أَن يُرْهِقَهُمَا طُغْيَانًا وَكُفْرًا “ఇకపోతే ఆ అబ్బాయి సంగతి; అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతను తన తలబిరుసుతనంతో, తిరస్కారవైఖరితో వారిని వేధిస్తాడని మాకు భయమేసింది.
18:81 فَأَرَدْنَا أَن يُبْدِلَهُمَا رَبُّهُمَا خَيْرًا مِّنْهُ زَكَاةً وَأَقْرَبَ رُحْمًا “అందుకే వారికి వారి ప్రభువు – అతనికి బదులుగా – అతనికన్నా సౌశీల్యవంతుడైన, దయార్ద్రతకు దగ్గరగా ఉండే బాలుడిని ప్రసాదించాలని మేము కోరుకున్నాము.
18:82 وَأَمَّا الْجِدَارُ فَكَانَ لِغُلَامَيْنِ يَتِيمَيْنِ فِي الْمَدِينَةِ وَكَانَ تَحْتَهُ كَنزٌ لَّهُمَا وَكَانَ أَبُوهُمَا صَالِحًا فَأَرَادَ رَبُّكَ أَن يَبْلُغَا أَشُدَّهُمَا وَيَسْتَخْرِجَا كَنزَهُمَا رَحْمَةً مِّن رَّبِّكَ ۚ وَمَا فَعَلْتُهُ عَنْ أَمْرِي ۚ ذَٰلِكَ تَأْوِيلُ مَا لَمْ تَسْطِع عَّلَيْهِ صَبْرًا “ఇక గోడ సంగతంటారా, ఆ గోడ ఈ పట్టణంలో నివసించే ఇద్దరు అనాధ బాలలది. వారికి చెందవలసిన ఒక నిధి ఆ గోడ క్రింద పాతిపెట్టబడి ఉంది. వారి తండ్రి సజ్జనుడు. ఈ అనాధలిద్దరూ యుక్త వయస్కులై నీ ప్రభువు దయానుగ్రహంతో తమ ఈ నిధిని వెలికి తీసుకోవాలన్నది నీ ప్రభువు సంకల్పం. అంతేగాని నా అంతట నేనుగా ఈ పని చేయలేదు. మీరు సహించలేకపోయిన ఆ సంఘటనల వెనుక దాగివున్న వాస్తవికత ఇదే!”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
తన ప్రభువు వచనాల ద్వారా హితబోధ చేసినప్పటికీ, విముఖత చూపి, తన చేతులతో ముందుగా చేసి పంపుకున్న దానినే మరచిపోయిన వానికన్నా ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు? వారు దానిని (ఖుర్‌ఆనును) అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసేశాము. వారి చెవులకు చెవుడు కలిగించాము. నువ్వు సన్మార్గం వైపుకు వారిని పిలుస్తూ ఉన్నప్పటికీ, వారు ఎన్నటికీ సన్మార్గం పొందేవారు కారు
నీ ప్రభువు క్షమాగుణం కలవాడు, దయాశీలి. వారి చేష్టలకు శిక్షగా ఆయన గనక వారిని పట్టుకున్నట్లయితే, వారిని తొందరగానే శిక్షించి ఉండేవాడు. అసలు విషయం ఏమిటంటే వారి కోసం ఒక వాగ్దాన సమయం నిర్ధారితమై ఉంది. దాన్నుంచి తప్పించుకునిపోయే చోటేదీ వారికి దొరకదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రజల వద్దకు మార్గదర్శకత్వం వచ్చేసిన తరువాత కూడా వారు విశ్వసించకుండా, క్షమాభిక్షకై తమ ప్రభువును వేడుకోకుండా వారిని ఆపిన విషయం ఒక్కటే – అదేమిటంటే, గత కాలంలోని ప్రజలకు ఎదురైన వ్యవహారమే తమకూ ఎదురవ్వాలనీ లేదా ప్రత్యక్షంగా తమ ముందుకు శిక్ష రావాలని వారు నిరీక్షించటం.
మేము ప్రవక్తలను శుభవార్తలను అందజేయటానికి, హెచ్చరికలు చేయటానికి మాత్రమే పంపిస్తాము. అవిశ్వాసులు అసత్యం ఆధారంగా వాదులాడతారు. దాని ద్వారా సత్యాన్ని ఖండించటానికి (ప్రయత్నిస్తారు.) వారు నా ఆయతులను, వారికి చేస్తున్న హెచ్చరికలను ఆషామాషీగా తీసుకున్నారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఆదమ్ ముందు సాష్టాంగపడమని మేము దూతలకు ఆజ్ఞాపించినప్పుడు, ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. అతడు జిన్నాతుల కోవకు చెందినవాడు. వాడు తన ప్రభువు ఆజ్ఞను జవదాటాడు.అయినప్పటికీ మీరు నన్ను వదిలేసి, మీ అందరికీ శత్రువు అయినవాణ్ణీ, వాడి సంతానాన్నీ మీ స్నేహితులుగా చేసుకుంటున్నారా? ఇటువంటి దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఎంత చెడ్డది!
నేను భూమ్యాకాశాలను సృష్టించినప్పుడుగానీ, స్వయంగా వీళ్ళను పుట్టించినపుడుగానీ వారిని అక్కడ ఉంచలేదు. అపమార్గం పట్టించే వారిని నేను నా సహాయకులుగా చేసుకోను.
నాకు భాగస్వాములని మీరు భావించిన (వారెక్కడ?) వారిని పిలవండి” అని ఆయన చెప్పిన రోజున వారు (తమ మిధ్యా దైవాలను) పిలుస్తారు. కాని వారిలో ఏ ఒక్కరూ సమాధానం ఇవ్వరు. మేము వారి మధ్యన వినాశాన్ని ఏర్పరుస్తాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.