అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ఆ మహా మైదానంలో ఒక వైపున ఆరాధ్యనీయులు, మరోవైపు ఎవరినైతే ఆరాధించడం జరిగిందో వారి మధ్యలో జరుగుతున్న వివాదాలను మనం వింటున్నాము, తెలుసుకుంటున్నాము. ఏ పుణ్యాత్ములనైతే ఆరాధించడం జరిగినదో వారు ఇలాంటి ఆరాధనతో తమ జీవితంలో ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. అలాంటి వారు ఆ మైదానంలో ఎవరినైతే మేము మిమ్మల్ని ఆరాధించాము అని అంటారో, అలాంటి వారికి ఏమి సమాధానం ఇస్తారు? వినండి “షిర్క్ చేసిన వాళ్ళు ఎవరినైతే అల్లాహ్ తో పాటు భాగస్వామిగా కలిపి షిర్క్ చేశారో వారిని చూసినప్పుడు అల్లాహ్ వైపునకు తిరిగి ఓ మా ప్రభువా! వీరు! వీరే, వీరినే మేము నిన్ను కాకుండా భాగస్వామిగా చేసి, నిన్ను వదిలి వీరిని మేము ఆరాధిస్తూ ఉంటిమి. వీరితో మేము దుఆలు చేస్తూ ఉంటిమి, వీరిని మేము అర్థిస్తూ ఉంటిమి. అప్పుడు వారు తిరిగి మాట వారి వైపునకు వేసి, మీరు అసత్యం పలుకుతున్నారు, మీరు అసత్యం పలుకుతున్నారు“. మరోచోట ఆయత్ ఉంది. “మీరు మమ్మల్ని ఆరాధించేవారు కాదు“. ఈ విధంగా పరస్పరం వివాదం జరుగుతుంది. వారు వీరిని తిరస్కరిస్తారు.
ఎవరైనా గాని, ఈ రోజుల్లో ఎందరో కలిమా చదివిన ముస్లిం సోదర సోదరీమణులు కూడా అల్లాహ్ ను కాకుండా ఎవరెవరితో దుఆ చేస్తున్నారు. ఆరాధనకు సంబంధించిన ఎన్నో విషయాలు అల్లాహ్ ను కాకుండా, ఎవరెవరితో ఆ ఆరాధన యొక్క కొన్ని భాగాలు, కొన్ని రకాలు వారి ముందు పాటిస్తూ ఉన్నారు. అయితే పరలోకమున మైదానే మెహ్ షర్ లో వెళ్ళిన తరువాత ఏమి జరుగుతుంది? ఈ ఆయతులను చదివి తెలుసుకొని వీటి ద్వారా గుణపాఠం పొందే ప్రయత్నం చేయాలి.
ఇంకా ఈ ఇహలోకంలో ఆరాధనా సంబంధమైన విషయాల్లోనే కాకుండా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల్లో సత్య మార్గాన్ని విడనాడి, సృష్టికర్త పంపినటువంటి సన్మార్గాన్ని వదిలేసి, కొందరి నాయకులను, కొందరి పెద్దలను ఏదైతే అనుసరిస్తూ ఉంటారో, ప్రళయ దినాన, ఆ మహా మైదానంలో వచ్చిన తర్వాత వారిని కూడా వారు తిరస్కరించి, మీరు మమ్మల్ని మీ వైపునకు ఇహలోకంలో లాక్కొనే ప్రయత్నం చేశారు. మీరు మమ్మల్ని ఇహలోకంలో పురికొల్పి, అల్లాహ్ ను వదిలి అల్లాహ్ పంపిన మార్గాన్ని వదిలి మీ వెనుక నడవాలి అని చెప్పారు. కానీ ఏమిటి? ఈ రోజు మాకు ఏమి సహాయం చేయడం లేదు.?
ఒకసారి మీరు సూర సాఫ్ఫాత్ ఆయత్ నెంబర్ పంతొమ్మిది నుండి ముప్పై ఐదు వరకు చదివి చూడండి. ఎంత స్పష్టంగా అల్లాహ్ (తఆలా) అక్కడ జరిగే పరస్పరం వారి యొక్క వాగ్విదానాన్ని, ప్రశ్నోత్తరాలని, వారి మధ్యలో జరిగేటువంటి మాటల్ని ఎంత స్పష్టంగా అల్లాహ్ (తఆలా) తెలియజేసాడు. పరిస్థితి ఇంకా ఎప్పుడైతే ముదిరి పోతుందో, దీర్ఘకాలం అవిశ్వాసానికి గురి అయినందుకు ఆ కాలం మరింత కష్టంగా గడుస్తూ ఉంటుంది. ఇహలోకంలో ఎవరు ఎవరినైతే పూజించడం జరిగిందో, ఎవరెవరి వెనుక నడవడం జరిగిందో, వారందరినీ చూస్తున్నప్పటికీ వారు సహాయానికి రావట్లేదు. మరింత పరిస్థితి ఎప్పుడైతే దారుణంగా మారుతుందో, బలహీనులు, బలహీన వర్గాలు, ఏ బలం ఉన్న వారిని అనుసరించేవారో, ఏ ఏ ప్రజలు తమ నాయకుల్ని అనుసరించేవారో, ఏ ఏ ఆరాధించేవారు తమతమ వారిని ఎవరినైతే ఆరాధించేదో వాళ్ళందరినీ చూస్తూ వారి యొక్క సహాయం ఏమాత్రం పొందని యెడల శాపనార్థాలు కూడా మొదలుపెడతారు ఆ మైదానే మెహ్ షర్ లో, ఆ మహా మైదానంలో. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.
ఒకసారి సూరయే ఇబ్రహీం ఆయత్ నెంబర్ ఇరవై ఒకటి చూడండి. “వారందరూ అల్లాహ్ ఎదుట స్పష్టంగా హాజరవుతారు. బలహీనులు, బలవంతులతో గర్వంగా తమకు తాము నాయకులుగా అనుకున్న వాళ్ళతో అంటారు. మేము ఇహలోకంలో మీ వెనుక వెనుక ఉంటిమి. మిమ్మల్ని అనుసరించుకుంటూ ఉంటిమి. అయితే, ఈ రోజు మీరు అల్లాహ్ యొక్క శిక్ష నుండి ఏ కొంచెమైనా దూరం చేసేఅటువంటి ఏదైనా అధికారం మీకు ఉందా? అలాంటిది ఏదైనా సహాయం మాకు చేయగలుగుతారా? ఆ నాయకులు, ఆ పెద్ద వారందరూ ఏమంటారు? అల్లాహ్ మాకు మార్గం చూపి ఉండేది ఉంటే, మేము కూడా మీకు మార్గం చూపి ఉండేవారిమి. అస్తగ్ ఫిరుల్లా! అబద్దం ఇది. అక్కడ కూడా అబద్ధం పలుకుతున్నారు. ఇహలోకంలో అల్లాహ్ (తఆలా) సన్మార్గం మనకు స్పష్టం చేసి పంపలేదా? ఇప్పుడు ఇక్కడ మనకు సహనం వహించినా, సహనం వహించక పోయినా అంతా సమానమే“. అనుసరించే వాళ్లు, బలహీనులు, ప్రజలు తమ నాయకులకు ఏ శాపనాలు అయితే కురిపిస్తారో వాటి యొక్క కొన్ని ఉదాహరణలు కూడా ఖురాన్ లో మీరు చూడండి.
సూరయే అహ్ జాబ్ ఆయత్ నెంబర్ అరవై ఆరు నుండి అరవై ఎనిమిది వరకు – “ఆనాడు ఎప్పుడైతే నరకంలో వారి యొక్క ముఖాలు కాల్చుకుంటూ, తిప్పబడుతూ కాల్చడం జరుగుతుందో, అయ్యో! మేము అల్లాహ్ ను, అల్లాహ్ కు విధేయత చూపి, ప్రవక్తకు విధేయత చూపి ఉండేది ఉంటే ఎంత బాగుండును! వారంటారు – ఓ మా ప్రభువా! మేము మా నాయకులను, మా పెద్దవారిని అనుసరిస్తూ వచ్చాము. వారు మమ్మల్ని సన్మార్గం నుండి దూరం చేసి మార్గభ్రష్టత్వం లో పడవేశారు. ఓ ప్రభువా! ఇప్పుడు వారికి రెట్టింపు రెట్టింపు శిక్షలు ఇవ్వు. పెద్ద పెద్ద శాపనార్థాలు వారిపై కురిపించు.“ఇలా శపిస్తూ ఉంటారు.
ఇంకా పరిస్థితి ఎంత ఘోరంగా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజుల్లో సన్మార్గం మన వద్దకు వచ్చినప్పటికీ మనం దాన్ని స్వీకరించకుండా ఉంటాము. మా పెద్దలు మమ్మల్ని వద్దంటున్నారు, మా నాయకులు సత్యాన్ని స్వీకరించ వద్దు అంటున్నారు. ఈవిధంగా మనం ఎవరెవరినో అనుసరించి సన్మార్గం నుండి దూరమవుతాము. కానీ ఆనాడు ఎప్పుడైతే పరిస్థితి అంతా స్పష్టంగా మనకు అర్థమవుతుందో శాపనాలు కురిపించడం కూడా సరిపోయినట్లు ఏర్పడదు. మనసుకు శాంతి ఏర్పడదు. ఆ సందర్భంలో అప్పుడు ఏమంటారు? మీరే స్వయంగా చదవండి, గమనించండి, శ్రద్ధగా వినండి.
సూరయే హామీమ్ వస్సజ్దా, ఫుస్సిలత్ అని కూడా దానిని అంటారు. ఆయత్ నెంబర్ ఇరవై తొమ్మిదిలో ఉంది. “ఓ మా ప్రభువా! జిన్నాతులలో, మానవులలో ఎవరెవరైతే మమ్మల్ని మార్గభ్రష్టత్వానికి గురి చేశారో వారందరినీ మాకు చూపించు. మేము వారిని మా కాళ్ళ కింద వేసి త్రొక్కుతాము. వారు నీచులుగా అయిపోవాలి“. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.
సోదరులారా! ఇంతటి ఘోరమైన పరిస్థితి ఆ రోజు రానుంది. అవన్నీ వివరాలు అల్లాహ్ మనకు తెలియజేశాడు. ఇకనైనా మనం గుణపాఠం నేర్చుకోకూడదా? మహాశయులారా! సోదర సోదరీమణులారా! సమాధుల నుండి లేపబడిన తర్వాత, ఆ మైదానంలో సమీకరింపబడిన తరువాత ఏ పరిస్థితులు దొరుకుతాయి? ఎవరు ఎవరికి ఎలాంటి సమాధానాలు చెప్పుకుంటారు? ఇవన్నీ వివరాలు ఏదైతే మనం వింటున్నామో ఆ కరుణామయుడైన, సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క గొప్ప దయ, కరుణ మనపై ఎంత గొప్పగా ఉందో ఒకసారి ఆలోచించండి. మనం నరకంలో పోకూడదని మనం ఆనాటి ఆ కష్టాలు అన్నిటినీ భరించకూడదని అక్కడ జరుగుతున్న ప్రతి చిన్న చిన్న విషయాల్ని కూడా ఎంత స్పష్టంగా మనకు తెలియచేస్తున్నాడంటే, ఇకనైనా మనం సన్మార్గం వైపునకు రాకుండా ఆ ఏకైక సృష్టికర్త యొక్క మార్గాన్ని అవలంబించకుండా జీవితం గడిపితే ఎంత నష్టంలో కూరుకు పోతామో మీరే ఆలోచించండి. ఈనాడు ఈ మాటలు, పనికిమాలినవి, ఏం లాభం లేవు అని కొన్ని సందర్భాల్లో షైతాన్ ఆలోచన వల్ల ఎవరి మనసులో వచ్చినా ఈ పరిస్థితులు అన్నిటినీ కూడా ఎదుర్కొనేది ఉంది. ఎందుకంటే సృష్టికర్త అయిన ఆ అల్లాహ్ మనకు ఈ విషయాలు తెలిపాడు గనుక తప్పకుండా ఇది సంభవించనున్నాయి.
అల్లాహ్ ను కాకుండా, ఆ సృష్టికర్తను కాకుండా ఎవరెవరినైతే మనం ఈరోజు గొప్పగా భావిస్తున్నామో వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత చిన్నవాళ్ళుగా అవుతారు. ఆ రోజు సృష్టికర్త ఆకాశాలను తన ఒక చేతిలో చుట్టుకుంటాడు, భూమిని తన పిడికిలిలో పట్టుకుంటాడు. ఆ తరువాత ఎక్కడ ఉన్నారు? ఇహలోకంలో గర్వం, అహంకారంలో పడి తమకు తాము పెద్ద నాయకులుగా భావించేవాళ్ళు ఎక్కడున్నారు? కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు రాజు అయినంత మాత్రాన తన రాజ్యాధికారం ఎంత గొప్పది? నన్ను ఎదిరించే వారు ఎవరూలేరుగా భావించేవారు ఎక్కడున్నారు? ఎవరి వైపు నుండి ఏ యొక్క శబ్దం కూడా రాదు. ఎవరి నుండి ఏ మాట వినబడరాదు. అప్పుడు స్వయంగా అల్లాహ్ అంటాడు. “నేను మాత్రమే ఈరోజు రాజును. నాకే సర్వాధికారం ఉన్నది“.
సర్వ సృష్టిలో ప్రవక్తలు, అల్లాహ్ కు అతి ప్రియులైన వారు. ఆ మైదానంలో ఎప్పుడైతే ఒక దీర్ఘకాలం గడిచిపోతుంది. ప్రజలందరూ ఇంకా సృష్టికర్త అయిన అల్లాహ్ తీర్పు చేయడానికి ఎప్పుడు వస్తాడు? అని వేచిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో పదండి మనమందరం కలసి ఆదమ్ (అలైహిస్సలాం) వద్దకు వెళ్దాము. ఆయన అల్లాహ్ వద్ద మన గురించి సిఫారసు చేస్తే అల్లాహ్ మనలో తీర్పు చేయడానికి వస్తాడు అని వెళ్తే, ఆదమ్ (అలైహిస్సలాం), ఎవరినైతే అల్లాహ్ స్వయంగా తన చేతులతో శుభ హస్తాలతో సృష్టించాడో, ఆ ఆదమ్ (అలైహిస్సలాం) కూడా చాలా బాధలో ఉంటారు. నాతో జరిగిన తప్పు, ఆయనతో జరిగిన చిన్నపాటి పొరపాటు. కానీ దానికి ఎంత భయపడుతూ ఉంటారంటే ఆ సమయంలో నేను అల్లాహ్ యందు సిఫారసు చేయడానికి ఏమాత్రం హక్కు కలిగి లేను. నేను చేయలేను. మీరు వెళ్ళండి, కావాలంటే ప్రవక్త నూహ్ దగ్గరికి వెళ్ళండి అని అంటారు. కానీ ఆయన స్వయంగా మాట్లాడడానికి కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి ఈ మహా మైదానం, అలాంటి అక్కడ జరిగే ఈ పరిస్థితులు ఎవరెవరి మీద మనం ఆశ పెట్టుకుని ఉన్నాము? ప్రవక్త నూహ్, ప్రవక్త ఇబ్రాహీం, ప్రవక్త మోసే, ప్రవక్త యేసు అలైహిముస్సలాం అజ్మయీన్ ఎవరు కూడా అల్లాహ్ ముందు మాట్లాడడానికి ధైర్యం చేయలేకపోతారు. మరి ఈ రోజు స్వర్గాలు రాసి మనకు కొందరు పేపర్లు ఇస్తున్నారు. మీరు చనిపోయిన తర్వాత మీ వారిని తీసుకెళ్ళి ఖననం చేసేటప్పుడు నేను రాసిచ్చిన ఈ సంతకం తో పాటు ఉన్న ఈ పేపర్ ని తీసుకెళ్లి సమాధిలో పెట్టండి. ఎవరు కూడా వచ్చి ప్రశ్నలు అడగరు. ఎవరు కూడా వచ్చి ఏమీ ప్రశ్నించరు. డైరెక్ట్ స్వర్గంలో వెళ్ళిపోతారు. ఇవన్నీ అబద్ధాలు. ఇలాంటి కల్పిత విషయాలలో మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఆ పరలోక దినం పట్ల మనం భయపడాలి. ఆ పరలోకం పట్ల మన విశ్వాసం బలంగా ఉండాలి. ఆ విశ్వాసమే ఇహలోకంలో మనల్ని ఆయన మార్గంలో నడిపించడానికి ఎంతో దోహద పడుతుంది.
సహీహ్ ముస్లిం షరీఫ్ హదీస్ నెంబర్ ఇరవై తొమ్మిది, అరవై తొమ్మిదిలో హజరత్ అబూ సాయీద్ ఖుద్రి మరియు హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీస్ ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఆ మైదానంలో అల్లాహ్ ఒక దాసుడ్ని కలుస్తాడు. అల్లాహ్ ప్రశ్నిస్తాడు. నేను నీకో హోదా, అంతస్తు ఇచ్చి పెళ్లి, పేరంటాలు జరిపించి అన్ని వరాలు ఇహలోకంలో నీకు ప్రసాదించలేదా? గుర్రాలు, ఒంటెలు, ఎన్నో రకాల జంతువులు నీ ఆధీనంలో ఉండే విధంగా నేను చెయ్యలేదా? నీవు కొందరిపై నాయకత్వం వహించి కొందరు నీ మాట వినే విధంగా నీకు పరపతి, హోదా ఇవ్వలేదా? ఆ వ్యక్తి ఇవన్నీ విషయాలని స్వీకరిస్తాడు. అవును అల్లాహ్! నీవు ఇవన్నీ నాకు ప్రసాదించావు. అప్పుడు అల్లాహ్ మరో ప్రశ్న అడుగుతాడు. ఈ రోజు నాతో కలిసే రోజు ఒక రోజు ఉంది అని నీవు నమ్మేవానివా? అప్పుడు అతను సమాధానం పలుకుతాడు – ఓ అల్లాహ్ లేదు. ఇహలోకంలో లభించిన ఈ హోదా, అంతస్తులు, ఇహలోకంలో లభించిన ఈ వరాలు, ఇవన్నిటినీ చూసుకొని మురిసిపోయి ఎక్కడ పరలోకం? ఎక్కడ అల్లాహ్ ను కలుసుకోవడం? ఎక్కడ చనిపోయిన తర్వాత మరోసారి లేవడం? ఈ రోజుల్లో మనం అంటున్నాము కదా! మనలో ఎంతోమంది ఇలాంటి భ్రమకు గురిఅయి ఉన్నాముకదా? లేదు అల్లాహ్ నీతో కలిసే ఒక రోజు ఉంది అని నాకు నమ్మకం లేకుండినది అని అంటాడు. అప్పుడు అల్లాహ్ అంటాడు – ఇహ లోకంలో నీవు నన్ను ఎలా మర్చిపోయావో ఇక ఇక్కడ కూడా నేను నిన్ను మర్చిపోతాను. అంటే ఇక నా స్వర్గంలో చేరలేవు. ఈ మైదానంలో ఎలాంటి సుఖాలు, వరాలు కొందరు పుణ్యాత్ములకు, విశ్వాసులకు లభించనున్నాయో వాటిలో నీకు ఏభాగము లభించదు. అల్లాహు అక్బర్.
ఈ విధంగా అల్లాహ్ మరో వ్యక్తితో కలుస్తాడు. మూడో వ్యక్తితో కలుస్తాడు. నాలుగు వ్యక్తితో కలుస్తాడు. ఈ మధ్యలో ఒక వ్యక్తి వస్తాడు. అతను ఇహలోకంలో లభించిన వరాలన్నిటినీ కూడా స్వీకరిస్తాడు. ఆ తర్వాత అతను అంటాడు. నేను నిన్ను విశ్వసించాను. నీ ప్రవక్తను విశ్వసించాను. నువ్వు పంపిన గ్రంథాన్ని విశ్వసించాను. నేను నమాజ్ చేశాను. ఉపవాసాలు ఉన్నాను. దానధర్మాలు కూడా చేశాను. సాధ్యమైనంతవరకు ఎంత అతనికి సాధ్యపడుతుందో అంతా తాను చేసిన మంచితనాన్ని అంతా చెప్పుకుంటాడు. అప్పుడు అల్లాహ్ అంటాడు. మా యొక్క సాక్షిని మీ ముందుకు తీసుకు రావాలా? అప్పుడు ఆ వ్యక్తి భయపడతాడు, ఆలోచిస్తాడు. అప్పుడు. ఎవ్వరు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం పలకడానికి అని. అప్పుడు అతని మూతి మీద ముద్ర వేయబడుతుంది. ఆ తరువాత అతని తొడ మాట్లాడుతుంది, అతని ఎముకలు మాట్లాడుతూ ఉంటాయి. అప్పుడు ఈ వ్యక్తి వంచకుడు, కపటవిశ్వాసుడు అని స్పష్టం అవుతుంది. కానీ అతను చెప్పుకున్న మంచితనాలన్నీ కూడా ఒక సాకుగా చెప్పుకుంటాడు. ఆనాటి ఆ గాంభీర్య పరిస్థితి నుండి బయటికి వచ్చే ఏదైనా అవకాశం ఉంటుందో ఏమో అని”.
చెప్పే విషయం ఏమిటంటే, చూడడానికి కొందరు కొన్ని సత్కార్యాలు చేసినా పరలోకంపై విశ్వాసం బలంగా లేకుంటే అల్లాహ్ ను కలుసుకునేది ఉన్నది. అల్లాహ్ ఒక్కొక్క విషయం గురించి నన్ను ప్రశ్నించనున్నాడు అన్నటువంటి బలమైన విశ్వాసం, బలమైన నమ్మకంతో ఏ సత్కార్యాలు చేయకుంటే చాలా చాలా నష్టపోతారు.
అల్లాహ్ (తఆలా) మనందరికీ సత్భాగ్యం ప్రసాదించుగాక! ప్రళయ దినాన ఆ తరువాత మజిలీలు ఏమిటి? అక్కడ ఏమి జరగనుంది? ఆ వివరాలు ఇన్షా అల్లాహ్ తరువాయి భాగాలలో మనం వింటూ ఉందాము. అల్లాహ్ (తఆలా) మనందరి పరలోక విశ్వాసాన్ని మరింత బలంగా చేయుగాక. ఇహలోకంలో ఉన్నన్ని రోజులు పరలోక విశ్వాస నమ్మకంతో సత్కార్యాలలో జీవితం గడుపుతూ విశ్వాసమార్గం మీద నడిచేటటువంటి సత్భాగ్యం ప్రసాదించుగాక!
జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ఈనాటి మన శీర్షిక అవిశ్వాసులు ఇహలోకంలో చేసే సత్కార్యాలు, వారి యొక్క విశ్వాసాలు, వారి యొక్క కర్మలు, వాటి యొక్క ఫలం ఏమిటి?
మహాశయులారా! మనం ఇహలోకంలో ఏమి చేసినా, ఏ రవ్వంత, అంతకంటే మరీ చిన్నది, అణువంత, అంతకంటే తక్కువ ఏ సత్కార్యమైనా, దుష్కార్యమైనా అది విశ్వాసానికి సంబంధించినా, అది నాలుక సంబంధమైన కర్మ అయినా, అది హృదయ సంబంధ కర్మ అయినా, ఏ రకమైనదిగా, ఒకవేళ రవ్వంత ఏ కార్యం అయినా గానీ అల్లాహ్ (తఆలా) దానిని హాజరు పరుస్తాడు.
అందుగురించి ప్రళయ దినాన ఎప్పుడైతే సర్వ మానవులను సమాధుల నుండి లేపి లెక్క తీర్పు జరగడానికి, వారి యొక్క కర్మలు తూకం చేయడానికి ఇంకా ఎన్నో మజిలీలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి కంటే ముందు ఆ మైదానములో ఎక్కడైతే అందరినీ సమీకరించబడుతుందో, అక్కడ ఇహలోకంలో అవిశ్వాసులు పాటించిన, అవిశ్వాసానికి వారి కర్మలకు స్వయంగా వారు ఎప్పుడైతే వాటిని చూసుకుంటారో వారి యొక్క పరిస్థితి ఏముంటుంది?
అయితే సామాన్యంగా మనిషి పాటించే లేక మనిషి చేసే కర్మలలో ఒకటి విశ్వాసానికి సంబంధించింది ఉంటుంది. ఇక అవిశ్వాసులు సృష్టికర్త అయిన అల్లాహ్ ను నమ్మలేదు గనుక, సృష్టికర్త అయిన ఏకేశ్వరుడ్ని, ఏకేశ్వరుని ఆరాధన, ఏకేశ్వరోపాసనలో తమ జీవితం గడపలేదు గనుక ఇది మహా పాపాల్లో లెక్కించబడుతుంది. దానికి ఏదైనా పుణ్యం దొరకడం దూరం వారికి దాని గురించి భయంకరమైన శిక్ష ఉంటుంది. కానీ అవిశ్వాసులు ఇహలోకంలో తల్లిదండ్రుల సేవలు, అనాధల పట్ల, నిరుపేదల పట్ల ఇంకా ఏ పుణ్యాలు, సత్కార్యాలైతే వారు చేసుకున్నారో, వాటి యొక్క ఫలితం అక్కడ దొరుకుతుందా? లేదా ఆ రోజు వారికి ఎప్పుడైతే స్వయంగా ఆ మైదానంలో హాజరు అవుతారో వారికి, వారి ఆ సత్కార్యాలు ఎలా కనబడతాయి? దాని గురించి ఖురాన్ లో అల్లాహ్ కొన్ని ఉపమానాల ద్వారా ఆ విషయాన్ని విశదీకరించారు.
“ఎవరైతే సత్య తిరస్కారానికి గురి అయ్యారో, అవిశ్వాసానికి పాల్పడ్డారో, వారి యొక్క కర్మలు, వారి యొక్క సత్కార్యాలు ఇహలోకంలో వారు ఏదైతే చేస్తున్నారో, దూరం దారిలో మైదానంలో ఎండమావులు ఎలా కనబడతాయో దాహంతో తల్లడిస్తున్న వ్యక్తి దానిని చూసి ఎలాగైతే నీళ్ళు అని భావిస్తాడో అలాగే వీరి పరిస్థితి ఉంటుంది“. వీరు ఏ సత్కార్యాలు అయితే ఇహలోకంలో చేశారో వాటి యొక్క పుణ్యం కనీసం మాకు దొరుకుతుంది కదా! అని అక్కడ వారు ఆశిస్తారు. ఎందుకంటే వారు ఏ అవిశ్వాసానికి పాల్పడ్డారో దాని యొక్క నష్టం ముందే చూసుకున్నారు కదా!
గత భాగాల్లో మీరు విని కూడా ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఆ సత్కార్యాల పుణ్యం కనీసం మాకు లభించి మాకు ఏదైనా లాభం కలుగుతుంది అని భావిస్తారు. కానీ ఆ లాభం ఈవిధంగా మారిపోతుంది. ఎలాగైతే ఎండమావులు దాహంతో ఉన్న వ్యక్తికి దూరంగా నీళ్ల మాదిరిగా కనబడుతుందో, అక్కడికి వెళ్ళిన తర్వాత నా యొక్క దాహం తీరుతుంది అని అనుకుంటాడో అలాగే వారి పరిస్థితి అవుతుంది. అయితే ఇక్కడ ఎవరైనా అడగవచ్చు. ఇహలోకంలో కూడా కనీసం ఏదైనా లాభం కలుగుతుందా? ఇహలోకంలో ఏదైనా లాభం కలగవచ్చు! కానీ పరలోకంలో ఈ సత్కార్యాల లాభం కలగడానికి విశ్వాసం, నిజమైన విశ్వాసం ఉండడం, బహు దైవారాధన కు దూరంగా ఉండడం తప్పనిసరి.
అంతేకాదు కేవలం అవిశ్వాసుల విషయమే కాదు. ఎవరైతే తమకు తాము విశ్వాసులమని అనుకుంటారో మరియు మేము ఇస్లాం పై ఉన్నాము అని సంతోషపడుతున్నారో కానీ షిర్క్,, బిదాత్ ఇంకా ఇలాంటి ఘోరమైన పాపాలు, ఏ పాపాలు అయితే వేరే పుణ్యాలను కూడా, సత్కార్యాలను కూడా నాశనం చేసేస్తాయో అలాంటి పాపాలకు పాల్పడి ఉన్నారో వారు కూడా ప్రళయ దినాన ఆ మైదానంలో హాజరైన తరువాత తమకుతాము చాలా నష్టం లో పడి చూసుకుంటారు. తమకు తాము చాలా నష్టం లో పడి ఉన్నట్లుగా చూసుకుంటారు.
సూరయే కహఫ్ ప్రతి జుమా రోజున చదవాలి అన్నట్లుగా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మనల్ని ప్రోత్సహించారు, ఆదేశించారు. ఆ సూరయే కహఫ్ లో “వారికి తెలియజేయండి. స్వయంగా తాము చేసుకున్న సత్కార్యాలు వాటిని నష్టంలో పడవేసుకున్న వారు ఎవరో మీకు తెలియ చేయాలా? ఎవరి ఆ కష్టాలు అయితే ఇహ లోకంలోనే వృధా అయిపోయాయి. వారు ఏమి అనుకుంటారు. మేము చాలా మంచి కార్యాలు చేస్తున్నాము. మేము చేసే పనులు చాలా ఉత్తమమైనవి అని తమకు తాము భ్రమలో పడి ఉన్నారు“. కానీ ఏ షిర్క్ పనులు అయితే వారు చేస్తున్నారో ఎలాంటి బిదాత్ లకైతే వారు పాల్పడి ఉన్నారో వాటి మూలంగా ఈ సత్కార్యాల పుణ్యం అక్కడ వారికి ఏమాత్రం లభించకుండా ఉంటుంది.
ఆ తరువాత నూట ఐదవ ఆయత్ లో అల్లాహ్ అంటున్నాడు – “ఇలా వారు చేసుకున్న సత్కార్యాలు ఎందుకు వృధా అయ్యాయి. ఎందుకంటే వారు అల్లాహ్ పంపినటువంటి ఆయతులను తిరస్కరించారు. పరలోక దినాన అల్లాహ్ ను కలుసుకునేది ఉన్నది అన్న విషయాన్ని కూడా వారు తిరస్కరించారు“.
గమనించారా! సోదరులారా, సోదరీమణులారా! పరలోక విశ్వాసం ఎంత ముఖ్యం? ఆనాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి జరుగుతుందో ఆ వివరాలు అన్నీ అల్లాహ్ మనకు ఎందుకు తెలియజేసాడు? ఇంతకు ముందే నేను ఒక ఉదాహరణ ఇచ్చాను కదా! నాన్నా!, పరీక్షలు రాబోతున్నాయి కష్టపడి చదువుకుంటేనే ఇక్కడ పాస్ అవుతావు అని ఎలా అయితే మనం పిల్లలకు తెలియచేస్తామో, అంతకంటే గొప్ప మన కరుణామయుడైన, సృష్టికర్త అయిన అల్లాహ్ మనకు ఇలా బోధిస్తున్నాడు. ఎన్నో ఉపమానాలు, ఎన్నో ఉదాహరణలు తెలియజేస్తూ ఇలా సత్కార్యాలు ఎందుకు వృధా అయ్యాయి? అల్లాహ్ పంపిన ఆయతులు, సూచనలు వీటి ద్వారా మన సృష్టికర్త ఒక్కడే మన ఆరాధ్యుడు, ఆరాధ్య నీయుడు ఒక్కడే మరియు మన యొక్క ఆరాధనల్లో మనం ఆయనతో పాటు ఎవరినీ భాగస్వామిగా కలపవద్దు అన్న విషయాలు తెలుసుకునేది ఉంటే, అలా తెలుసుకోలేదు. వాటిని తిరస్కరించారు. చివరికి పరలోక దినం, ఏ దినం అయితే మనకు ఇక్కడ చేసుకున్న సత్ కర్మల ఫలితం లభించాలో దానిని కూడా బలంగా విశ్వసించనందుకు వారి యొక్క సత్కార్యాలు అన్నీ వృధా అయిపోయాయి. “వారి యొక్క సత్కార్యాలు అన్నీ కూడా వృధా అయిపోయాయి. ఇక అవన్నీ వృధా అయిపోయిన తర్వాత తూకం లో ఎప్పుడైతే పెట్టడం జరుగుతుందో అప్పుడు వాటికీ ఏ మాత్రం బరువు ఉండదు“.
ఈ విధంగా మహాశయులారా! మనం ఆ పరిస్థితి రాకముందే మనల్ని మనం చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి.
మహాశయులారా! సమాధుల నుండి లేపబడిన తర్వాత ఆదిమానవుడు నుండి మొదలుకొని ప్రళయం వరకు వచ్చిన మానవులందరినీ ఒక మైదానంలో ఏదైతే సమీకరించబడుతుందో, అక్కడ ఎవరికి ఎలా పరిస్థితి ఉంటుంది? అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాము. అక్కడ యొక్క గాంభీర్యం, అక్కడ అవిశ్వాస స్థితిలో ఎవరైతే చనిపోయారో వారు ఎలా లేసి వస్తారు? వారు చేసుకున్న సత్కార్యాలకు ఉత్తమ ఫలితం లభించాలని ఏదైతే వారు ఆశిస్తారో కనీసం ఆ సందర్భంలో వారి యొక్క గతి ఏమవుతుందో? అలాగే తమకు తాము ముస్లింలు అని భావించి ఇస్లాం పై సరైన విధంగా వారి జీవితం గడవనందుకు వారి యొక్క పరిస్థితి ఏమవుతుంది? మనం తెలుసుకుంటూ వస్తున్నాము.
ఇదే మైదానంలో లేచి హాజరైన తర్వాత పరిస్థితి ఏముంటుంది? ఎవరైతే ఆ సృష్టికర్తను కాకుండా ఇంకెవరినెవరినైతే పూజించారో, ఆరాధించారో, ప్రళయ దినాన అక్కడ హాజరు అయినప్పుడు పరస్పరం వారు ఒకరికి ఒకరు వివాదానికి దిగుతారు. అవునండి! ఈ రోజుల్లో షిర్క్ పై మరియు అల్లాహ్ ఆరాధనను వదిలి ఎంత ఐక్యమత్యం చూపుకోవడం జరుగుతుందో ఎంత పరస్పరం ప్రేమ, ప్రేమాభిమానాలు చూసుకోవడం జరుగుతుందో ఆ ప్రళయ దినాన “ఇహలోకంలో ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు కూడా పరలోక దినాన ఏమవుతుంది? విడిపోతారు, దూరం అవుతారు, శత్రువులుగా మారుతారు. ఒకవేళ ఏదైనా స్నేహితం మిగిలి ఉంటే అల్లాహ్ యొక్క విశ్వాసం, అల్లాహ్ యొక్క భయభీతి ఆధారంగా ఏ స్నేహితం జరిగిందో అది మాత్రమే మిగిలి ఉంటుంది“.
అల్లాహ్ ను వదిలి ఎవరెవరినైతే ఆరాధించారో ఆరాధించిన వారు హాజరవుతారు, ఆ ఆరాధ్యనీయులు కూడా, ఎవరినైతే ఆరాధించడం జరిగిందో, వారు కూడా హాజరవుతారు. చదవండి ఖురాన్ యొక్క ఈ ఆయత్ :
“అపరాధుల కొరకు నరకాన్ని దగ్గరగా చేయబడుతుంది. మీరు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవారు? అని వారిని ప్రశ్నించడం జరుగుతుంది. మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తూ ఉండేవారో వారు మీకు ఈరోజు ఏదైనా సహాయం చేయగలుగుతారా? లేదా స్వయంగా తమకు తాము వారు ఏదైనా సహాయం చేసుకోగలుగుతారా? ఆరాధింపబడిన వారు మరియు ఈ అపరాధులు అందరినీ కలిసి నరకంలో బోర్ల వేయబడటం జరుగుతుంది“.
అల్లాహ్ మనందరిని అలాంటి పరిస్థితుల నుండి కాపాడుగాక.
“అల్లాహ్ యొక్క ఆరాధన నుండి దూరం చేసి, ఇతరుల ఆరాధన వైపునకు పురికొల్పిన ఇబ్లీస్ మరియు అతని యొక్క అనుయాయులు, అతని యొక్క సైన్యం అందరినీ కూడా ఆ నరకంలో వేయడం జరుగుతుంది. అప్పుడు వారు పరస్పరం వివాదానికి దిగి ఇలా అంటారు. అల్లాహ్ సాక్షిగా మేము ఇహలోకం లో చాలా స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉంటిమి. మేము అల్లాహ్ ను వదిలి అల్లాహ్ కు, ఆ సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్ తో పాటు మిమ్మల్ని మేము భాగస్వాములుగా చేశాము. అల్లాహ్ కు చేయునటువంటి ఆరాధన మిమ్మల్ని అల్లాహ్ కు సమానులుగా చేసి, మీకు ఆ ఆరాధనలు చేస్తూ ఉన్నాము“.
ఈవిధంగా ఆ ప్రళయ దినాన ఎప్పుడైతే నరకంలో పోకముందు ఆ మైదానంలో ఒక దృశ్యం ఏదైతే చూపడం జరుగుతుందో దానిని వారు చూసి అక్కడ మేము ఇహలోకంలో ఎంత తప్పు చేసామో కదా! ఆ ఏకైక సృష్టికర్త ఆరాధనలు వదులుకొని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము కదా అని అక్కడ వారితో వివాదానికి దిగుతారు. కానీ ఏమి ప్రయోజనం ఉండదు.
అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమిటంటే ఏ పుణ్యాత్ములు, ప్రవక్తలు, అల్లాహ్ యొక్క భక్తులు వారు ఎవరిని కూడా మమ్మల్ని ఆరాధించండి అని చెప్పలేదు. ప్రజలే స్వయంగా వారికి ఇష్టం లేని ఈ షిర్క్ కార్యం చేస్తూ అల్లాహ్ తో పాటు వారిని ఏదైతే సాటి కల్పించారో అలాంటి పుణ్యాత్ముల్ని నరకంలో వేయడం జరగదు. ఏ ఆరాధ్యనీయులైతే ప్రజల్ని పురిగొలిపి మార్గభ్రష్టత్వం లో పడవేసి అల్లాహ్ ను వదిలి వారిని ఆరాధించాలని, వారి ద్వారా ఆరాధన చేయించుకుంటున్నారో అలాంటి వారినే నరకంలో పంపడం జరుగుతుంది. కానీ ఎవరైతే పుణ్యాత్ములుగా జీవించి, ఏకైక సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తూ ఉండి, ప్రజల్ని స్వయంగా షిర్క్ నుండి ఆపుతూ వచ్చారో అలాంటి పుణ్యాత్ముల్ని నరకంలో వేయడం జరగదు.
అయితే ఆ మైదానంలో ఈ ఆరాధించిన వాళ్ళు హాజరవుతారు. ఎవరినైతే ఆరాధించారో వారిని చూసి మేము మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము. ఈరోజు మమ్మల్ని కాపాడుకోండి. మాకు సహాయం చేయండి అని అరుస్తారు. కానీ వారు స్పష్టంగా చెప్పేస్తారు. మీరు మమ్మల్ని ఆరాధించేవారు కాదు. మీరు జిన్నులను ఆరాధించేవారు, షైతానులను ఆరాధించేవారు. షైతాను మిమ్మల్ని ఇలాంటి పెడమార్గంలో పడవేసాడు, అతన్ని మీరు ఆరాధిస్తూ ఉన్నారు అని ఎలాంటి సహాయం చేయకుండా వారి నుండి తప్పించుకుంటారు.
చదవండి ఈ ఆయత్. ఎన్నో ఆయత్ లు ఇలాంటివి ఉన్నాయి కానీ ఉదాహరణకు ఒక ఆయత్ నేను చదువుతున్నాను – “ఆ రోజు అల్లాహ్ (తఆలా) ఆ మహా మైదానంలో అందరిని సమీకరిస్తాడు. మళ్ళీ అల్లాహ్ (తఆలా) దైవదూతలతో ప్రశ్నిస్తాడు. ఏమి? వీరు మిమ్మల్ని ఆరాధించేవారా? దైవ దూతలు సమాధానం చెబుతారు. నీవు అన్ని రకాల షిర్క్, బహు దైవారాధన నుండి అతీతునివి. నీవు మాకు సాన్నిహిత్యునివి మరియు నీవు మాకు వలి. ఇలాంటి వారిని ఎవరైతే నీతో పాటు ఇతరులను షిర్క్ చేశారో వారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. వారు కాదు మాకు స్నేహితులు. సాన్నిహిత్యానికి మేము నిన్ను వేడుకుంటాము. నీవు అన్ని రకాల షిర్క్ లకు అతీతునివి. వారు జిన్నులను ఆరాధించేవారు. వారిలో అనేకమంది అధిక సంఖ్యలో ఆ జిన్నుల మీదనే వారికి నమ్మకం ఉండింది. వారిపై విశ్వాసం ఉండింది“.
అలాగే ఏసుక్రీస్తు, హజరత్ ఈసా (అలైహిస్సలాం) “మీరు కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి” అని తెలియజేశారు. కానీ ఈ రోజుల్లో ఆయన్ను కూడా పూజించడం జరుగుతుంది. అయితే ప్రళయ దినాన యేసు క్రీస్తు హాజరవుతారు. ఈసా (అలైహిస్సలాం) హాజరవుతారు. వారిని ఆరాధించిన వారు కూడా హాజరవుతారు. ఏమి జరుగుతుంది అప్పుడు – “అప్పుడు అల్లాహ్ (తఆలా) మర్యమ్ కుమారుడైన ఈసా అలైహిస్సలాం ని ప్రశ్నిస్తాడు. అల్లాహ్ ను వదిలి “నన్ను, నా తల్లిని మీరు ఆరాధ్య దైవంగా చేసుకోండి” అని ఓ ఈసా, ఓ యేసు నీవు ప్రజలకు చెప్పావా? అని అల్లాహ్ (తఆలా) మందలిస్తాడు“. అప్పుడు ఆ సందర్భంలో యేసుక్రీస్తు ఏమంటారు? ఎంతో వినయ వినమ్రతతో ఇలా సమాధానం తెలుపుకుంటారు? “నీవు పవిత్రునివి, అన్ని రకాల బహు దైవారాధనకు అతీతునివి. ఏ మాట పలకడం నాకు ఏ మాత్రం హక్కు లేదో అలాంటి మాట నేను ఎందుకు పలుకుతాను? అలాంటి మాట నేను ఎందుకు చెపుతాను? నేను ఒకవేళ చెప్పి ఉంటె నీకు తెలుసు ఆ విషయం. నేను వారికి చెప్పి ఉంటె నీకు తెలుసు. ఎందుకంటే నా మనసులో ఏముందో నీకు తెలుసు కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియదు. నీవు నాకు ఏ ఆదేశం ఇచ్చావో అదే ఆదేశాన్ని నేను వారికి తెలియజేశాను. ఆ ఆదేశం చాలా స్పష్టంగా ఉండింది. అదేమిటి! నా యొక్క ప్రభు, మీ యొక్క ప్రభువు అల్లాహ్ మాత్రమే గనుక మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించండి. ఇదే బోధ నేను నా ప్రజలందరికీ చేశాను అని స్పష్టంగా ఏసుక్రీస్తు (అలైహిస్సలాం) తెలియజేస్తారు“.
ఇంకా ఏమి జరగనుంది? ఇన్షా అల్లాహ్ తరవాయి భాగంలో మనం తెలుసుకుందాము.
జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్.అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ఈనాటి శీర్షికలో ప్రళయ దినాన ఎలాంటి గాంభీర్యం ఉండును?, ప్రజల పరిస్థితి ఆరోజు ఎలా ఉండును? అనే విషయాలు మనం గత భాగంలో నుండి తెలుసుకుంటూ వస్తున్నాము దాని తరువాయి భాగం ఇది.
మహాశయులారా! ఆ ప్రళయ దినాన అక్కడి ఒక్కరోజు ఇహలోకంలోని యాబై వేల సంవత్సరాల పరిమాణం. యాభై వేల సంవత్సరాలు ఇహలోకంలో గడిస్తే అక్కడి ఒక్కరోజు గడిచినట్టు. గమనించండి! అంత దీర్ఘకాలం ఇది ఎప్పుడు, ఎప్పుడైతే మనం సమాధుల నుండి లేపబడి అల్లాహ్ ఎదుట సమీకరింపబడతామో ఆ సమయాన. అల్లాహ్ (తఆలా) ఆ విషయాన్ని సూరతుల్ మఆరిజ్ లో (70:4) ఇలా తెలియపరిచాడు –
تَعْرُجُ الْمَلَائِكَةُ وَالرُّوحُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ – 70:4 యాభై వేల సంవత్సరాల పరిమాణం గల రోజున దైవదూతలు మరియు ఆత్మ (జిబ్రయీల్) ఆయన వైపునకు అధిరోహిస్తారు.
యాబై వేల సంవత్సరాల పరిమాణం గల ఆ రోజున దైవదూతలు మరియు రూహ్ (ఆత్మ), అంటే జిబ్రిల్ అమీన్ ఆయన వైపునకు అధిరోహిస్తారు. అందుకే అక్కడికి చేరుకున్న తర్వాత అవిశ్వాసులు, పాపాత్ములు ఇహదినాన్ని గుర్తు చేసుకుంటూ మేము ఒకపొద్దు మాత్రము లేదా ఒక సాయంకాలం మాత్రమే ఇహలోకం లో ఉన్నాము అని భావిస్తారు.
ఈ రోజుల్లో ముప్పై, నలబై, యాబై సంవత్సరాలు జీవిస్తున్నాము. రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి వస్తూ ఉంది. పగలుశ్రమిస్తున్నాము. రాత్రి పడుకుంటున్నాము. ఈ విధంగా జీవితం ఇహలోక వ్యామోహంలో గడిచిపోతూ ఉంది.. పరలోకం గురించి రవ్వంత కూడా మనం ఆలోచించడం లేదు. ఆలోచించండి!, దాని గురించి సిద్ధపడండి! లేదా అంటే ఆ రోజు ఎలాంటి పరిస్థితి అవుతుంది?. ఈ ఆయతులను శ్రద్ధగా విని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేయండి. సూరయే యూనుస్ ఆయత్ నెంబర్ నలబై ఐదు లో అల్లాహ్ (తఆలా) ఇలా తెలిపాడు –
وَيَوْمَ يَحْشُرُهُمْ كَأَن لَّمْ يَلْبَثُوا إِلَّا سَاعَةً مِّنَ النَّهَارِ – 10:45 అల్లాహ్ వారిని సమీకరించే ఆ రోజు గురించి జ్ఞాపకం చెయ్యి. అప్పుడు వారికి తాము (ప్రపంచ జీవితంలో) దినములో ఒక గడియకాలం ఆగి ఉన్నామేమో!? అనిపిస్తుంది.
“ఎప్పుడు ఏ రోజున అయితే వారిని సమీకరిస్తామో, పోగు చేస్తామో ఆ రోజున వారు ఏమంటారు? పగలు యొక్క కొంత భాగం మాత్రమే మేము ఇహలోకంలో ఉన్నాము”. ఆ అంటే పరలోక దినాన్ని ఎప్పుడైతే వారు తమ కన్నులారా చూస్తారో అప్పుడు ఇహలోకం చాలా సంక్షిప్తమైన జీవితం, పరలోకానికి ఎదుట దీని యొక్క లెక్క ఏ మాత్రం లేకుండా ఉంది అన్నట్లుగా అప్పుడు వారికి అర్థమవుతుంది. అందుగురించి క్షణం పాటు ఈజీవితంలో మన కోరికల్ని తీర్చుకుంటూ, పాపంలో జీవితం గడుపుతూ ఆ శాశ్వత జీవితాన్ని ఎప్పుడూ పాడు చేసుకోవద్దు. అక్కడ ఆ పరిస్థితిని తట్టుకోలేక, ఆ దీర్ఘ కాలాన్ని భరించలేక మనిషి స్వయంగా తనకు అతి ప్రియమైన వారిని, తన బంధువులలో అతి దగ్గరగా ఉన్న వారిని కూడా ఆనాటి శిక్షకు బదులుగా, పరిహారంగా చెల్లించి తాను శిక్ష నుండి తప్పించుకోవాలి అని కోరుతాడు.
సూరయే మఆరిజ్ పదకొండు నుండి పద్నాలుగు వరకు ఆయతులు ఒకసారి మీరు చదవండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
يَوَدُّ الْمُجْرِمُ لَوْ يَفْتَدِي مِنْ عَذَابِ يَوْمِئِذٍ بِبَنِيهِ – 70:11 నేరస్థుడు ఆ రోజు (తనకు పడే) శిక్ష నుంచి తప్పించుకోవటానికి పరిహారంగా తన కుమారులను,
وَصَاحِبَتِهِ وَأَخِيهِ – 70:12 తన ఇల్లాలినీ, తన సోదరుణ్ణి,
وَفَصِيلَتِهِ الَّتِي تُؤْوِيهِ – 70:13 తనకు ఆశ్రయమిచ్చిన తన కుటుంబాన్నీ,
وَمَن فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ يُنجِيهِ – 70:14 భూమండలంలోని సమస్త జనులనూ ఇచ్చేసి, తాను మాత్రం బయటపడాలని కోరుకుంటాడు.
అపరాధి ఆ రోజు ఇలా కోరుతాడు – ఆనాటి శిక్షకు బదులుగా, పరిహారంగా చెల్లించాలి ఎవరిని సంతానాన్ని, తన సహవాసిని, ఏ వంశం, ఏ కుటుంబం అతనికి రక్షణ ఇచ్చిందో, శరణ ఇచ్చిందో స్వయంగా వారిని కూడా నరకంలో తోసేయ్యాలి. ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా అతనికి బదులుగా నరకంలో పడ వేయాలి. ఆ తర్వాత అతన్ని అతనికి మోక్షం కలిగించాలి, అతనికి దాని నుండి రక్షణ కలిగించాలి – అని అపరాధి ఆ రోజు కోరుతాడు. సమాధానం ఏమి వస్తుంది అల్లాహ్ వైపు నుండి? “ముమ్మాటికి అలా జరగదు”. అందుగురించి ఆ రోజు రాకముందే మనం సిద్దపడాలి. దానికి సిద్ధమై ఆ రోజు మనపై అంత కష్టంగా గడవకుండా మనం అతి త్వరగా ఆ సమయం మనకు దాటే విధంగా మనం చూసుకోవాలి.
ఇదే సూరయే మఆరిజ్ లో అల్లాహ్ (తఆలా) తెలిపాడు.
إِنَّهُمْ يَرَوْنَهُ بَعِيدًا – 70:6 అది (ఆ శిక్ష) చాలా దూరాన ఉందని వారు భావిస్తున్నారు.
وَنَرَاهُ قَرِيبًا – 70:7 కాని అది మాకు చాలా దగ్గరే కనిపిస్తున్నది.
అవిశ్వాసులకు, సత్యతిరస్కారులకు, అపరాధాలు చేసినవారికి ఆ రోజు అంత దీర్ఘంగా ఏర్పడుతుంది. కానీ, మాకు, విశ్వాసం అవలంభించిన వారికి, సత్కార్యాలు చేస్తున్న వారికి, అల్లాహ్ ఇష్టప్రకారం తమ జీవితం గడుపుతున్న వారికి, అది చాలా తక్కువ సమయంగా, కొన్ని హదీతు లలో చెప్పడం జరిగింది, ఒక ఫర్ద్ నమాజ్ (విధి నమాజ్) చేయడంలో ఎంత సమయం అవుతుందో అంతే వారికి ఏర్పడుతుంది.
ఈ విధంగా మహాశయులారా! ఎన్ని పాపాలు పెరుగుతాయో, ఎన్ని కష్టాలు పెరుగుతాయో, ఎంత మనం అవిశ్వాసానికి ఒడికడతామో, దైవ ధిక్కారానికి, అల్లాహ్ ఏకత్వ ఆరాధనకు దూరంగా ఉంటామో, ఆ రోజు మనకు అంతే దూరంగా, దీర్ఘంగా, పొడుగ్గా ఏర్పడుతుంది. ఎంత మనం అల్లాహ్ కు చేరువుగా ఉంటామో, ఆయనకు విధేయత పాటిస్తూ ఉంటామో, కేవలం ఆయన యొక్క ఆయన ఆరాధనలోనే మన జీవితం గడుపుతామో అది మనకు చాలా తక్కువ సమయంగా ఏర్పడుతూ ఉంటుంది.
ఆ రోజు ప్రజలు మూడు స్థితులుగా ముందుకు వస్తారు. ఒకరు అవిశ్వాసానికి ఒడిగట్టిన వారు. మరొకరు విశ్వాసమార్గాన్ని అవలంబించారు కానీ దానిపై స్థిరంగా నడవలేదు. పాపాలలో కూరుకుపోయి పేరుకు మాత్రమే ఇస్లాంను అవలంబించినట్లుగా జీవితం గడిపేవారు. మూడోవారు పుణ్యాత్ములు, సదాచారణ చేసేవారు, విశ్వాసులు, అల్లాహ్ యొక్క భక్తులు. ఈ ముగ్గురు స్థితులు ఎలా ఉంటాయో, వాటి గురించి ఖురాన్లో ఏ ప్రస్తావన తెలపడం జరిగిందో, ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి ఏ విషయాలు తెలిపారో అది ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకో బోతున్నాము.
ఎవరైతే అవిశ్వాసానికి ఒడికడతారో, సత్య తిరస్కారానికి పాల్పడతారో వారి యొక్క పరిస్థితి ఏముంటుంది? ఎవరు ఏ స్థితిలో చనిపోయినా, ఎవరు ఎక్కడ దేనికి గురి అయినా, క్రూర జంతువులకు ఆహారంగా అయిపోయినా, నీళ్ళల్లో కొట్టుకుపోయినా, కాల్చబడి బూడిద అయిపోయినా, ఏ స్థితిలో ఎవరు ఉన్నాగాని అల్లాహ్ వారందరినీ వెలికి తీస్తాడు. ఎప్పుడైతే వారు బయటకి వస్తారో, ఆ మహా మైదానంలో సమీకరింపబడతారో అప్పుడు ఆ సందర్భంలో అవిశ్వాసులు –
مُّهْطِعِينَ إِلَى الدَّاعِ ۖ يَقُولُ الْكَافِرُونَ هَٰذَا يَوْمٌ عَسِرٌ – 54:8 తమను పిలిచేవాని వైపు పరుగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు అవిశ్వాసులు “ఇది చాలా గడ్డు రోజు” అనంటారు.
అవిశ్వాసులు, సత్య తిరస్కారాలు అంటారు – “ఈ రోజు చాలా కఠినమైనరోజు, చాలా కష్టతరమైన రోజు.” అంతే కాదు ఆనాటి గాంభీర్యాన్ని చూసి తమకుతాము శాపం కురిపించు కుంటూ అయ్యో నా పాడుగాను అనుకుంటూ అరుస్తారు.
సూరయే యాసీన్, ఏ సూరాలోనైతే ప్రళయ దినానికి సంబంధించిన ఎన్నో సత్య విషయాల్ని, ఎన్నో వివరాలను అల్లాహ్ (తఆలా) స్పష్ట పరిచాడో ఆ సూరయే యాసీన్ ను ఈరోజుల్లో బ్రతికి ఉన్న వారు చదివి గుణపాఠం నేర్చుకునే కి బదులుగా దానిని మృత్తులపై చదువుతూ ఉంటారు. ఈ సూరయే యాసీన్ ఈ ఖురాన్ లో అవతరింప చేయటానికి ముఖ్య కారణం బ్రతికి ఉన్నవారికి ఒక హెచ్చరిక, వారు దాని నుండి గుణపాఠం నేర్చుకోవాలి. అయితే అదే సూరాలో ఖురాన్ లో అల్లాహ్ అంటున్నాడు:
وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُم مِّنَ الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنسِلُونَ – 36:51 మరి శంఖం పూరించబడగానే అందరూ తమ తమ గోరీల నుంచి లేచి, తమ ప్రభువు వైపునకు వడివడిగా వస్తారు
قَالُوا يَا وَيْلَنَا مَن بَعَثَنَا مِن مَّرْقَدِنَا ۜ ۗ هَٰذَا مَا وَعَدَ الرَّحْمَٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ – 36:52 “అయ్యో మా దౌర్భాగ్యం! మమ్మల్ని మా శయనాగారాల నుంచి లేపినదెవరు?” అని వారు వాపోతారు. “కరుణామయుడు (అయిన అల్లాహ్) చేసిన వాగ్దానమిదే. ప్రవక్తలు చెప్పింది నిజం” (అని వారితో అనబడుతుంది).
శంఖము ఉదబడినప్పుడు వారు తమ సమాధుల నుండి లేచి పరుగెడుతూ వస్తారు. అయ్యో! మా పాడుగాను అని తమకు తాము శపించుకుంటారు. మా ఈ పడక గదుల నుండి మమ్మల్ని ఎవరు లేపారు? అని అంటారు. అప్పుడు వారితో చెప్పడం జరుగుతుంది. రహ్మాన్ కరుణామయుడైన అల్లాహ్ చేసిన వాగ్దానం ఇది. ఈ రోజు తప్పకుండా మీరు ఆయన ఎదుట సమీకరింపబడతారు. ప్రవక్తలు కూడా ఈనాటి దినం గురించి మీకు ఏదైతే చెప్పారో అది సత్యం జరిగితీరింది. ఇప్పుడు మీరుకు మీరు శపించి కున్నా, మీకు మీరు బాధ పడ్డా అయ్యో! మమ్మల్ని ఎవరు లేపారు? ఎందుకు లేపారు? అని ఎంత మీరు కేకలు పెట్టినా ఏమి లాభం లేదు.
ఎవరైతే ఈ లోకంలో అల్లాహ్ ఆరాధనను ధిక్కరించారో, పుణ్య మార్గంలో నడవడానికి ఇది మాపని కాదు అంటూ పుణ్యాన్ని గురించి, సత్కార్యాల్ని గురించి, మంచిని గురించి బోధించే వారిని అడ్డుకునే వారు. అలాంటి వారి పరిస్థితి ఏమి జరుగుతుంది? సూరయే ఇబ్రాహీం నలబై ఎనిమిది నుంచి యాబై వరకు చదివి చూడండి –
يَوْمَ تُبَدَّلُ الْأَرْضُ غَيْرَ الْأَرْضِ وَالسَّمَاوَاتُ ۖ وَبَرَزُوا لِلَّهِ الْوَاحِدِ الْقَهَّارِ – 14:48 ఏ రోజున ఈ భూమి మరో భూమిగా మార్చివేయబడుతుందో, ఆకాశం సయితం (మారిపోతుందో), అప్పుడు అందరూ సర్వశక్తిమంతుడు, ఒకే ఒక్కడైన అల్లాహ్ ముందుకు వస్తారు
وَتَرَى الْمُجْرِمِينَ يَوْمَئِذٍ مُّقَرَّنِينَ فِي الْأَصْفَادِ – 14:49 ఆ రోజు అపరాధులంతా ఒకచోట సంకెళ్ళతో బంధించబడి ఉండటం నువ్వు చూస్తావు.
سَرَابِيلُهُم مِّن قَطِرَانٍ وَتَغْشَىٰ وُجُوهَهُمُ النَّارُ – 14:50 వారి దుస్తులు గంధకంతో చేయబడిన దుస్తులై ఉంటాయి. అగ్నిజ్వాలలు వారి ముఖాలను సయితం ఆవరించి ఉంటాయి.
“ఏ రోజు అయితే భూమి మార్చివేయడం జరుగుతుంది, ఈ భూమి ఉండదు మరియు ఆకాశాలు కూడా అవన్నీ మార్చివేయడం జరుగుతుంది. అందరూ ఆ ఏకైక, మరియు ఎంతో శక్తిశాలి అయినా అందరి పై గెలుపొందినటువంటి ఆ సృష్టికర్త ఎదుటకు హాజరవుతారు, వెలికి వస్తారు. అపరాధులను, అల్లాహ్ ఆరాధనలు దిక్కరించిన వారిని నువ్వు చూస్తావు. వారిని సంకెళ్లలో బంధించబడి తీసుకురావడం జరుగుతుంది. వారి యొక్క దుస్తులు, గంధకం తో చేయబడిన దుస్తులు గా ఉంటాయి మరియు వారిని అగ్ని కమ్ముకొని ఉంటుంది”. అల్లాహ్ ఇలాంటి అన్ని శిక్షల నుండి ఇలాంటి భయంకరమైన ఆ పరిస్థితి నుండి మనందరినీ కూడా కాపాడుగాక!
మరొక బాధకరమైన మరియు ఆశ్చర్యకరమైన, గాంభీర్యం అయిన విషయం మరొకటి ఏమిటంటే, ఆ రోజు సూర్యుడు కేవలం ఒక మీల్ (మైల్) అంత దూరంలోనే ఉంటారు. అల్లాహు అక్బర్! గమనించండి ఈరోజు సూర్యుడు మన నుండి ఎంత దూరంలో ఉన్నాడో దానికంటే కొంచెం దగ్గరయ్యాడంటే మనం కాలి మసి బొగ్గుల్లా మారుతాము. కానీ ఆరోజు వేడి యొక్క, ఆనాటి శిక్ష యొక్క రుచి చూపించడానికి ఈ శరీరాలు భరించేటువంటి అల్లాహ్ (తఆలా) అటువంటి శరీరాలను పుట్టిస్తాడు. మరియు సూర్యుడు ఇంత దగ్గరగా ఉండి, దాని యొక్క తాపం, దాని యొక్క వేడి వల్ల మనిషి పరిస్థితి ఏమవుతుంది? ఆ వేడి వల్ల మరియు ఇహలోకంలో వారి యొక్క కర్మలు ఎలా ఉండెనో దాని ప్రకారంగా వారి నుండి చెమట వెళ్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. చివరికి కొందరి పరిస్థితి ఏముంటుంది?
సహీ ముస్లింలో హదీత్ ఉంది – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చెప్పారు: సూర్యుడు ఒక మైల్ దూరంలో ఉంటాడు. ఆ రోజు సూర్యుడు సమీపిస్తాడు అది కేవలం పరిమాణం అనేది కేవలం ఒక మైల్ అంత దూరం లో ఉంటుంది“. ఒక ఉల్లేఖనంలో ఉంది – “ఆ రోజు ప్రజలు వారి కర్మల ప్రకారంగా చెమటలో మునిగి ఉంటారు. కొందరు తమ చెమటలో చీలమండలాల వరకు మునిగి ఉంటారు. మరి కొందరు తమ చెమటలో మోకాళ్ళ వరకు మునిగి ఉంటారు. మరికొందరు తమ చెమటలో నడుము వరకు మునిగి ఉంటారు. మరికొందరు తమ చెమటలో పూర్తిగా మునిగి ఉంటారు“.
సూరయే ముతఫ్ఫిఫీన్ ఆయత్ يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ – 83:6 (ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు) యొక్క వ్యాఖ్యానంలో ఒక సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చెప్పారు. “ప్రజలు ఆ రోజు తమ కర్మల ప్రకారంగా తమ చెమట లో మునిగి ఉంటారు. కొందరు అయితే ఈ చెవుల మధ్యలో వరకు మునిగి ఉంటారు“.
సహీ బుఖారి మరియు సహీ ముస్లిం లోని హదీత్ లో ఉంది. “ప్రళయ దినాన ప్రజలకు చెమటలు కారుతూ ఉంటాయి. కారుతూ ఉంటాయి. చివరికి వారి చెమట వారి వెనక డెబ్బై గజాల దూరం వరకు కూడా పారుతూ ఉంటుంది“. అల్లాహు అక్బర్! గమనించండి ఇది స్వయంగా మన చెమట. ఆరోజు ఆ పరిస్థితి ఉంటుంది.
ప్రళయ దినాల ప్రజలందరూ కూడా లేచి వచ్చినప్పుడు అల్లాహ్ యొక్క మాటలు ధిక్కరించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క బాటను అవలంబించని వారు, ప్రవక్త బాటకు వ్యతిరేకంగా వారి యొక్క మిత్రులు, వారి యొక్క స్నేహితులు, వారి యొక్క ఫ్రెండ్ వారి మాటలకు ప్రాధాన్యతను ఇచ్చువారు ఎలా వాపోతారో, బాధపడతారో ఈ ఆయతులను విని గమనించండి.
وَيَوْمَ يَعَضُّ الظَّالِمُ عَلَىٰ يَدَيْهِ يَقُولُ يَا لَيْتَنِي اتَّخَذْتُ مَعَ الرَّسُولِ سَبِيلًا – 25:27 ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: “అయ్యో! నేను దైవప్రవక్త (సఅసం) మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బావుందేది!”
يَا وَيْلَتَىٰ لَيْتَنِي لَمْ أَتَّخِذْ فُلَانًا خَلِيلًا – 25:28 “అయ్యో! నా పాడుగాను. నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బావుండేది!
لَّقَدْ أَضَلَّنِي عَنِ الذِّكْرِ بَعْدَ إِذْ جَاءَنِي ۗ وَكَانَ الشَّيْطَانُ لِلْإِنسَانِ خَذُولًا – 25:29 “నా వద్దకు ఉపదేశం వచ్చిన తరువాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే! ఎంతయినా షైతాను మనిషికి (అదను చూసి) ద్రోహం చేసేవాడే!”
“ఆ రోజు అపరాధి, దౌర్జన్య పరుడు స్వయంగా తన చేతులను కొరుకుతాడు. మరి అంటాడు – అయ్యో! నా పాడుగాను. నేను ప్రవక్త బాటను అనుసరించి ఉంటే ఎంత బాగుండిపోను, ఓ నా పాడుగాను ఫలానా వ్యక్తిని నేను స్నేహితుడిగా చేసుకోకుంటే బాగుండును. నా దోస్తు, నా ఫ్రెండ్, నా యొక్క మిత్రుడు బోధ నా వద్దకు వచ్చిన తరువాత నన్ను మార్గభ్రష్టత్వం లోకి పడవేశాడు. ఈవిధంగా తీరా సమయం వచ్చినప్పుడు షైతాను మానవుణ్ణి అవమానం పాలు చేస్తాడు”.
అల్లాహ్ (తఆలా) మనందరి సృష్టికర్త ఆ రోజు సంభవించే విషయాల్ని విశదీకరిస్తూ మన గురించి ఇంత గొప్ప మేలు చేసాడో గమనించండి. ఇకనైనా సత్యాన్ని, ధర్మాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవితం గడిపే ప్రయత్నం మనం చేద్దాం. ఈ పరిస్థితి అంతా చూసి అప్పుడు వారికి అర్థమవుతుంది – “ఈ రోజు మనకు ఎవరు సిఫారసు చేసేవాడు లేడు. ఎవరి సహాయం మనకు అందదు. ఈరోజు మనం అల్లాహ్ యొక్క మన్నింపును, అల్లాహ్ యొక్క క్షమాపణను నోచుకోలేము” అన్నటువంటి నిరాశ వారికి అప్పుడు కలుగుతుంది.
సూరయే రూమ్ ఆయత్ నెంబర్ పన్నెండులో అల్లాహ్ చెప్పాడు –
ప్రళయం సంభవించిన రోజున అపరాధములు పూర్తిగా నిరాశ చెంది పోతారు – ఇక వారి యొక్క మన్నింపు జరగదు అని, వారు ఇహ లోకంలో చేసుకున్న పుణ్యాలు ఏ మాత్రం పనికి రావు అని. విశ్వాసం లేనిది ఏ పుణ్యము అంగీకరించబడదు. అందుకే ఆ రోజు అవిశ్వాసులు ఇదే కోరుతారు – “నా వద్దనైతే విశ్వాసం లేదు, నా వద్దనైతే సత్కార్యాలు లేవు. నేను అల్లాహ్ కు ఏమని సమాధానం పలకాలి? అయ్యో! ఈరోజు నేను మట్టిని అయిపోయి ఎలాంటి లెక్క ఇవ్వకుండా, ఎలాంటి అల్లాహ్ వద్ద నిలబడేటువంటి పరిస్థితి రాకుండా ఉంటె బాగుండును” అని. కానీ అలాంటి కోరికలు పూర్తి కావు.
ఇలా సూరయే నబాలో ఇలా తెలియపరిచారు.
وَيَقُولُ الْكَافِرُ يَا لَيْتَنِي كُنتُ تُرَابًا – 78:40 అప్పుడు అవిశ్వాసి, “అయ్యో! నేను మట్టినైపోయినా బావుండేదే!” అనంటాడు.
ఆ రోజు అవిశ్వాసుడు అంటాడు – అయ్యో! నేను మట్టిగా మారిపోతే ఎంత బాగుండేది! అని వాపోతాడు. కానీ అతనికి ఏ ప్రయోజనం చేకూర్చదు దానివల్ల. అందుగురించి మహాశయులారా! ఇలాంటి పరిస్థితులు మనకు జరగకూడదు. ఇలాంటి పరిస్థితి మనది కాకూడదు అంటే విశ్వాసమార్గాన్ని అవలంబించి సత్కార్యాలు చేస్తూ ఉండాలి. అల్లాహ్ (తఆలా) మనందరికీ అలాంటి సౌభాగ్యం ప్రసాదించుగాక!
జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్.అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ఈనాటి శీర్షిక ప్రళయం సంభవించినప్పుడు ఎలాంటి ఆందోళనకర పరిస్థితి ఉంటుందో దానిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.
మహాశయులారా! ప్రళయం, పునరుత్థానదినం, పరలోకం మరోసారి అందరూ బ్రతికించబడి అల్లాహ్ యందు సమీకరించబడే రోజు. ఆ రోజు గురించి వెంటనే భయకంపితులై ఆ రోజు రాకముందే దాని గురించి మనం విశ్వాసం, పుణ్యాలతో, సత్కార్యాలతో సిద్ధంగా ఉండేటటువంటి ప్రయత్నం మనలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేయాలి.
ఈ రోజుల్లో మనకు ఎన్నో అనుభవాలు కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రదేశాల్లో వెళ్తాము లేదా ఏదైనా సంఘటన సంభవిస్తుంది. చాలా బాధకు గురి అవుతాము. అప్పుడు మనం ఒకవేళ ముందు నుండే జాగ్రత్తపడి ఉండేది ఉంటే ఈనాటి రోజు చూసే రోజు కాకపోవచ్చు. ఎలాగైతే రిజల్ట్ వచ్చే సందర్భంలో ఏ స్టూడెంట్ అయితే చదువు కాలంలో సమయాన్ని వృధా చేసి తల్లిదండ్రులు, అటువైపున సార్లు, టీచర్ లు, మరోవైపున శిక్షణ ఇచ్చే వారు ఎన్నో రకాలుగా బోధ చేసినప్పటికీ పెడచెవిన పెట్టి వారి యొక్క బోధనలను ఏ మాత్రం విలువ నివ్వకుండా, సమయాన్ని వృధా చేశాడో రిజల్ట్ వచ్చే రోజు ఎలా పశ్చాత్తాప పడతాడు. ఈ ఉదాహరణలు, ఈ అనుభవాలు మనకు ఎందుకు ఇక్కడ కలుగుతున్నాయి? ఆ పరలోక దినం, అక్కడ పశ్చాత్తాపపడే ఆ రోజు గతాన్ని గుర్తు చేసుకొని బాధపడే ఆ రోజు మనం కూడా అలాంటి దురదృష్టవంతుల్లో కలవకూడదని.
అందుకు మహాశయులారా! ఆ పునరుత్థాన దినం మనమందరము సమాధుల నుండి లేపబడి ఏదైతే అల్లాహ్ ఎదురునకు సమీకరింప బడతామో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఖురాన్ లో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. దానిని ఈరోజు మనం అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తాము. ఆ రోజును అల్లాహ్ (తఆలా) ఎంతో గొప్ప రోజుగా, గొప్ప దినంగా, ఎంతో గాంభీర్యమైన ఒక దినంగా పేర్కొన్నాడు. ఆ గొప్ప దినాన, ఏ దినాన అయితే ప్రజలందరూ సర్వ లోకాల ప్రభువు ఎదుట నిలబడడానికి వెళ్తారు. మరియు ఆ రోజు అవిశ్వాసుల కొరకు సృష్టికర్త అయిన అల్లాహ్ ని విశ్వసించని వారి గురించి ఎంతో కఠినంగా, ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.
సూరతుల్ ముద్దస్సిర్ ఆయత్ తొమ్మిది, పదిలో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియపరిచాడు: “ఆ రోజు చాలా కష్టతరమైన రోజు. విశ్వాసాన్ని నమ్మని తిరస్కరించిన వారి గురించి అది ఏమాత్రం సులభతరంగా ఉండదు“.
అది ఎంత భయంకరమైన మరియు మన యొక్క ఆలోచనా విధానాన్ని కూడా మార్చి వేసే అంతటి భయంకరమైన రోజు అంటే ఏ తల్లి కూడా ఈ లోకంలో తన పసికందును, పాలు త్రాగే పిల్లని మర్చిపోదు. కానీ ఆ రోజున పరిస్థితి ఏమవుతుంది? సూరతుల్ హజ్ లోని తొలి ఆయత్ లోనే అల్లాహ్ (తఆలా) ఈ విషయాన్ని ఇలా స్పష్టపరిచాడు – “ఓ ప్రజలారా! మీ ప్రభువు తో మీరు భయపడండి. నిశ్చయంగా ఆ ప్రళయ దినం అనేది చాలా భయంకరమైన, చాలా గొప్ప దినం“. ఆనాటి విషయమే చాలా గొప్ప విషయం, భయంకరమైన విషయం. ఆరోజు భూమి కంపించి పోతుంది. అందులో ప్రకంపనలు ఏర్పడతాయి. దాని మూలంగా ఒక ఆందోళన ఏర్పడుతుంది. “ప్రళయ దినాన ఏ ప్రకంపనలు అయితే జరుగుతాయో చాలా గొప్ప విషయం అది. ఆ రోజు ప్రతి పాలిచ్చు తల్లి పాలు త్రాగే తన పసికందును మర్చిపోతుంది. మరియు ప్రతి గర్భిణి స్త్రీ ఆమె యొక్క గర్భం పడిపోతుంది“. గమనించారా! “మరియు ప్రజలు మత్తులో ఉన్నట్లుగా కనబడతారు. ఏదో మత్తు సేవించడం వల్ల ఎలాగైతే సొమ్మసిల్లి పోతారో అందువల్ల కాదు. కానీ ఆరోజు అల్లాహ్ యొక్క శిక్ష చాలా కఠినంగా ఉంటుంది“. అందుగురించి అలాంటి భయంకరమైన ఆ ప్రళయదినం రాకముందే విశ్వాస మార్గాన్ని అవలంబిస్తే ఆరోజు విశ్వాసులకు కొరకు ఎంతో సులభతరంగా గడిచిపోతుంది.
ఆనాటి గాంభీర్యం, ఆనాటి యొక్క ఆ భయంకరం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మనిషి పరిస్థితి ఏమవుతుందో సూరయే ఇబ్రాహీం లో అల్లాహ్ (తఆలా) ఈ విధంగా తెలియజేసాడు. మరియు ప్రత్యేకంగా ఎవరైతే ఇహలోకంలో సన్మార్గాన్ని విడనాడి దుర్మామార్గంలో పడి ఉన్నారో, ఏకత్వ మార్గాన్ని వదిలి బహుదైవత్వంలో పడి ఉన్నారో, మరియు ఎవరైతే శాంతి మార్గాన్ని విడనాడి అశాంతి జీవితం గడుపుతున్నారో గమనించండి ఈ ఆయత్ ను: దుర్మార్గులు, దౌర్జన్య పరులు, షిర్క్ చేసేవారు, పాపాల్లో మునిగి తేలాడుతున్న వారు, వారి యొక్క పాపాల్ని వారి యొక్క షిర్క్ పనులను, వారి యొక్క దుర్మార్గాన్ని అల్లాహ్ చూడటం లేదు, అల్లాహ్ కు తెలియదు అన్నటువంటి భ్రమలో మీరు పడి ఉండకండి. అల్లాహ్ (తఆలా) వారికి కొంత వ్యవధిని ఇస్తున్నాడు. ఈ వ్యవధి ఎప్పటివరకు కొందరికైతే ప్రపంచంలోనే గుణపాఠం దొరుకుతుంది. కానీ ఎంతోమంది ఆనాటి వరకు ఏనాడైతే వారి యొక్క చూపులు చాలా క్రిందికి అయిపోతాయి. పరిగెడుతూ ఉంటారు. సమాధుల నుండి లేచిన తర్వాత పరిగెత్తుతారు. వారి తలలు కూడా క్రిందికి వంగి ఉంటాయి. కనురెప్పలు ఎత్తి కూడా చూడడానికి అవకాశం అనేది ఉండదు. అంత భయకంపితులై ఉంటారు. ఆనాటి పరిస్థితిలో అవిశ్వాసంగా ఇక్కడికి చేరుకున్నాము కదా!అని సిగ్గుతో, పశ్చాత్తాపంతో తలఎత్తడం, కళ్ళు ఎత్తి చూడడం అది కూడా వారికి సిగ్గుగా అనిపిస్తుంది మరియు ఆనాటి యొక్క భయంకరం, గాంభీర్యంతో వారి యొక్క హృదయాలు బయటికి వస్తాయా అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కొందరు పాపాత్ములు వారి పరిస్థితి ఇంతకంటే మరీ ఘోరంగా వారి యొక్క హృదయాలు బయటికి వచ్చి పడతాయా? అన్నటువంటి పరిస్థితి ఉంటుంది.
మహాశయులారా!, మరి కొందరి పరిస్థితి ఆనాడు ఎలా ఉంటుందో సూరయే గాఫిర్ ఆయత్ నెంబర్ పద్దెనిమిదిలో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియజేసాడు: “అతి సమీపంలో రానున్న ఆ భయంకరమైన రోజు గురించి వారిని హెచ్చరించండి. వారి యొక్క హృదయాలు గొంతు వరకు వస్తున్నాయి. దానిని వారు ఇటు మింగ లేక పోతున్నారు అంటు బయటికి రాలేక పోతుంది”. అంత గాంభీర్యం అయిన పరిస్థితి ఉంటుంది. అంతెందుకండీ చిన్న పిల్లలు, వారు అయితే ఇంకా ఏ పాపం చెయ్యలేదు. వారు చేసేటటువంటి పని వారి గురించి రాయబడదు. అయినా గాని ఆ ప్రళయం సంభవించే రోజు ఎంతటి భయంకరమైన రోజు అంటే ఆ పిల్లల యొక్క వెంట్రుకలు కూడా తెల్ల పడిపోతాయి.
సూరయే ముజ్జమ్మిల్ లో అల్లాహ్ (తఆలా) తెలియపరిచాడు: “మీరు ఒకవేళ ఆ ప్రళయ దినాన్ని నిరాకరిస్తే, తిరస్కరిస్తే మరి ఆ శిక్ష నుండి మీరు ఎలా బయటపడతారు, ఎలా రక్షింపబడతారు. ఆ ప్రళయ దినం నాటి యొక్క భయంకరత్వం ఎలా ఉంది? పిల్లలు సైతం ముసలివారు గా ఏర్పడతారు”. అంతటి గాంభీర్యం.
ఆ రోజు మనిషి యొక్క పరిస్థితి ఎంతవరకు చేరుకుంటుంది అంటే తనను తాను తప్ప మరి ఎవరి గురించి కూడా ఆలోచించలేడు. చివరికి మనిషి అతని యొక్క భార్యను గాని లేదా భార్య తన యొక్క భర్తను గాని, తల్లి కొడుకును గాని, కొడుకు తల్లిని గాని, కూతురు తండ్రిని గాని, తండ్రి కూతురును గాని, సోదరులు పరస్పరం, సోదరీమణులు పరస్పరం ఎవరు కూడా ఎవరైతే ఇహలోకంలో క్లోజ్ ఫ్రెండ్ అని, సుఖదుఃఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండేవాళ్ళు, ప్రాణానికి ప్రాణం ఇచ్చేటటువంటి మాటలు చెప్పుకునేవారు సైతం ఆ ప్రళయదినాన తమను తప్ప మరెవరి గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి ఉండదు. ఒకసారి ఖురాన్ లో ఈయొక్క విషయాన్ని ఎలా స్పష్టంగా తెలుపడం జరిగిందో గమనించండి. సూరత్ అబస ఆయత్ నెంబర్ ముప్పై మూడు నుండి ముప్పై ఏడు వరకు: “ఆ ప్రళయదినం సంభవించినప్పుడు మనిషి తన సోదరునితో పారిపోతాడు. తన తల్లిదండ్రులతో కూడా పారిపోతాడు. తన భార్య, స్త్రీ అయితే తన భర్త మరియు సంతానం నుండి పారిపోతారు. ఆ రోజు ప్రతి ఒక్కరికీ స్వయం తన గురించి ఎంత బాధ, ఎంత పశ్చాత్తాపం, ఎంత రంది ఉంటుందో ఇతరుల గురించి ఆలోచించే ఆ పరిస్థితిని రానివ్వదు.”
ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. సహీ బుఖారీ లో హదీత్ ఉంది. ప్రళయ దినాన శంకు ఊదబడిన తరువాత అందరూ సమాధుల నుండి లేచి వచ్చినప్పుడు వారి శరీరంపై దుస్తులు ఉండవు, కాళ్ళకు చెప్పులు ఉండవు మరియు పురుషులు ఒడుగులు చేయబడిన స్థితిలో ఖత్న, సున్నతీ లేకుండా లేప బడతారు. అందరూ ఈవిధంగా నగ్నంగా వస్తారు అన్న విషయం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలుపుతూ ఉన్నప్పుడు హజ్రత్ ఆయిషా సిద్దీక (రదియల్లాహు అన్హా) గారు అడిగారు: “ప్రవక్తా! మరి ఆ సందర్భంలో పురుషులు, స్త్రీల యొక్క దృష్టి ఒకరిపై ఒకరికి పడదా?” అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “ఆయేషా! ఆనాటి పరిస్థితి అంతకంటే మరీ ఘోరంగా ఉంటుంది. ఎవరికీ ఎవరి గురించి ఏ ఆలోచన ఉండదు. ఇలా దృష్టి ఒకరిపై వేసి చూడాలి అన్నటువంటి ఆ ఆలోచన రానే రాదు”.
ఆ రోజు అవిశ్వాసులు, సత్య తిరస్కారాలు పాపాల్లో కూరుకుపోయి తమ జీవితం సత్కార్యాలు నుండి దూరం ఉంచినవారు నరక శిక్ష గురించి, ప్రళయం యొక్క ఆ గాంభీర్యం గురించి అవన్నీ వారికి ఆ రోజున ఎప్పుడైతే సత్యాలు తెలుస్తాయో వారికి కోరిక ఏముంటుంది? భూమి నిండా బంగారం కానీ, ఇంకా ఏదైనా వారికి లభిస్తే వారు దానిని ఒక పరిహారంగా అల్లాహ్ ఎదుట ఇచ్చి, ఆనాటి గాంభీర్యం, ఆనాటి యొక్క భయంకరత్వం దాని నుండి రక్షించుకోవాలని, తప్పించుకోవాలని ఆలోచిస్తారు. సూరయే యూనుస్ ఆయత్ నెంబర్ యాబై నాలుగులో అల్లాహ్ (తఆలా) తెలిపాడు: ఇహలోకంలో షిర్క్ చేస్తూ, పాపాలు చేస్తూ అల్లాహ్ అవిధేయత లో జీవితం గడిపిన ప్రతి మనిషి భూమి నిండా ధనం అతనికి లభిస్తే అదంతా కూడా ఆనాటి గాంభీర్యం మరియు శిక్ష నుండి తప్పించుకోవటానికి ఒక పరిహారంగా ఇచ్ఛేద్దామా అని ఆలోచిస్తాడు. సూరయే రఆద్ ఆయత్ నెంబర్ పద్దెనిమిదిలో అల్లాహ్ మరి కొందరి గురించి ఏమని తెలిపాడంటే – వారి వద్ద ఈ భూమి కాదు ఈ భూమి యొక్క రెండింతలు ఉన్నాకానీ, ఈ భూమి యొక్క రెండింతలు ఉన్నా కానీ దానిని పరిహారంగా చెల్లించి ఆనాటి శిక్షల నుండి, ఆనాటి ఆందోళనకరల నుండి తప్పించుకుందాం అన్నటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇది ఏమాత్రం సాధ్యపడదు. ఆ రోజు ఏ డబ్బు, ఏ ధనము, ఏ బంగారం, ఏ వెండీ, ఏ డైమండ్స్ ఏదీ కూడా చెల్లదు. ఆ రోజు విశ్వాసం మరియు సత్కార్యాల ఆధారంగా తీర్పు జరుగుతుంది. ఎవరు విశ్వాసాన్ని అవలంభించి సత్కార్యాలు చేసి ఉన్నారో వారి కొరకే సుఖాలు, ఐశ్వర్యాలు, అన్ని రకాల లాభాలు, భోగభాగ్యాలు ఉంటాయి. అల్లాహ్ ఎవరి నుండి ధనము, డబ్బు స్వీకరించడు వారిని ఆ శిక్ష నుండి తప్పించడానికి, ఆ శిక్ష నుండి రక్షించడానికి. గమనించండి, సూరయే ఆలె ఇమ్రాన్ ఆయత్ నెంబర్ తొంబై ఒకటిలో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియపరిచాడు – “ఎవరైతే సత్యాన్ని తిరస్కరించారో, అవిశ్వాసానికి ఒడిగట్టారో, వారు అ విశ్వాసులుగా ఉన్నప్పుడే వారికి చావు వచ్చిందో భూమి నిండా బంగారం కూడా వారు ప్రాయశ్చితంగా ఇవ్వాలి అని అనుకుంటే అది స్వీకరించబడదు. వారికి ఆ రోజు కఠినమైన శిక్ష ఉంటుంది, బాధాకరమైన శిక్ష ఉంటుంది. ఎవరు కూడా వారికీ ఎలాంటి సహాయం చేసేవారు ఉండరు.” ఇలాంటి ఆయతులతో, ఇలాంటి బోధనలతో గుణపాఠం నేర్చుకొని మనలో వెంటనే మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ ఈ సత్భాగ్యం నాకు మీకు అందరికి ప్రసాదించు గాకా!
సహీ బుఖారీ లో హదీత్ ఉంది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – సత్య తిరస్కారిని, అవిశ్వాసిని ప్రళయ దినాన తీసుకురావడం జరుగుతుంది. అతనితో ఇలా ప్రశ్నించడం జరుగుతుంది. ఏమీ! నీ వద్ద ఈభూమి నిండా బంగారం ఉంటే నీవు దానిని పరిహారంగా చెల్లించి ఈ శిక్షల నుండి తప్పించుకుందామని అనుకుంటివా? అతను అంటాడు, అవును. అప్పుడు అతనికి సమాధానం చెప్పడం జరుగుతుంది. నేనైతే ఇహలోకంలో నీవు ఉన్నప్పుడు దీనికంటే ఎంతో తేలికమైన విషయం నీతో నేను కోరాను. విశ్వాసాన్ని అవలంభించు, సత్కార్యాలు చేస్తూపో. ఇదే నీతో నేను కోరబడినది ఇహలోకంలో, కానీ అది మాత్రం చేయలేదు. ఇప్పుడు నీ వద్ద భూమి నిండా బంగారం ఉంటే దాన్ని పరిహారంగా చెల్లించాలి అనుకుంటున్నావు. ఇది ఎక్కడ సాధ్యపడుతుంది?
ఇంకా ఆ ప్రళయదిన గాంభీర్య విషయాలు మరిన్ని తెలుసుకునేటివి చాలా ఉన్నాయి. తరువాయి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్.అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
మహాశయులారా! లెక్క తీసుకునే విధానాలు ప్రళయ దినాన ప్రతి ఒక్కరితో వేరు వేరుగా ఉండవచ్చు. అల్లాహ్ (తఆలా) కొందరిని తన దగ్గరికి పిలుచుకొని తాను చేసిన ఒక్కొక్క పాపాన్ని, ఒక్కొక్క సత్కార్యాన్ని గుర్తు చేసి, పాపాలు ఏదైతే అతని నుండి జరిగినవో అతని ద్వారా ఒప్పిస్తాడు. ప్రజల్లో కొందరు ఒప్పుకుంటారు. మరి కొందరు స్వయంగా వారు చేసిన పాపాల్ని అబద్దం చెప్పి మేము చేయలేదు అని అంటారు. అలాంటి వారికి అల్లాహ్ (తఆలా) వారి ముందు కొన్ని, కొందరు సాక్షులను తీసుకొస్తాడు. చివరికి స్వయంగా వారి శరీర భాగాలు కూడా మాట్లాడుతాయి మరియు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయి.
ఈ విధంగా సోదరులారా సహీ బుఖారిలో ఒక హదీత్ వచ్చి ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: ప్రళయ దినాన అల్లాహ్ (తఆలా) ఒక వ్యక్తిని ప్రజలందరి మధ్యలో నుండి హాజరు పరుస్తాడు మరియు తనకు మరియు అతనికి మధ్యలో ఎలాంటి అనువాదం చేసే వాని అవసరం లేకుండా స్వయంగా అల్లాహ్ (తఆలా) అతనితో మాట్లాడుతాడు. అతడు చేసిన పాపాల్ని అతనికి గుర్తు చేస్తాడు. అతడు తన పాపాలు అన్నిటిని కూడా ఒప్పుకుంటాడు. అప్పుడు అల్లాహ్ (తఆలా) అతనితో అంటాడు: “ఇహలోకంలో నీవు ఈ పాపాలు చేసినప్పుడు నిన్ను అవమాన పరచకుండా నీతో జరిగిన ఈ పాపాల విషయంలో ఎవరికి తెలియకుండా నేను కప్పి ఉంచాను. ఈ రోజు కూడా ప్రజలందరి ముందు నిన్ను అవమాన పరచకుండా నేను నిన్ను క్షమిస్తున్నాను, మన్నించేస్తున్నాను” అని అల్లాహ్ (తఆలా) శుభవార్త తెలియపరుస్తాడు.
దీనికి భిన్నంగా ఖురాన్ లోని ఆయత్ మనం చదివామంటే ఒళ్ళు కంపించిపోతుంది. ఒక వ్యక్తి వస్తాడు. ఎన్నో పాపాలు చేసి ఉంటాడు. కానీ ఏ ఒక్క పాపాన్ని ఒప్పుకోడు. “నీవు చేసిన పాపాలు ఒప్పించడానికి సాక్ష్యం పలికే వారిని తీసుకొస్తాను” అని అంటే “ఈ రోజు నేను నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే వారిని ఎవరినీ స్వీకరించను. నా శరీరం నాకు సాక్ష్యం పలుకుతే నేను స్వీకరిస్తాను”. అప్పుడు అల్లాహ్ (తఆలా) శరీరం యొక్క తోలు ఏదైతే ఉందో దానిని ఆదేశిస్తాడు. మనిషి యొక్క తోలు మాట్లాడుతూ ఉంటుంది. వారు తమ శరీర తోలును ఎప్పుడైతే మాట్లాడడం వ్యతిరేకంగా సాక్ష్యం పలకడం చూస్తారో, వారు తోలుతో అంటారు: “ఏమైంది? నాకు వ్యతిరేకంగా మీరు ఎందుకు సాక్ష్యం పలుకుతున్నారు?” “ప్రతి మాట్లాడే వారికి మాట్లాడే శక్తి అల్లాహ్ ఎలా ప్రసాదించాడో ఈరోజు మాకు మాట్లాడే శక్తి అల్లాహ్ అలాగే ప్రసాదించాడు” అని ఆ తోళ్ళు పలుకుతాయి.
సూరయే యాసీన్ లోని ఆయతులు చదవండి – “మేము ఆ రోజు ప్రళయ దినాన వారి యొక్క నోళ్ళపై ముద్ర వేసేస్తాం. అప్పుడు వారి యొక్క చేతులు మాట్లాడుతూ ఉంటాయి. వారి యొక్క కాళ్లు సాక్ష్యం పలుకుతాయి. వారు చేసిన వాటన్నిటి గురించి చెపుతూ ఉంటాయి”. మహాశయులారా! అల్లాహ్ ఒకవేళ తన దాసులపై అన్యాయం చేసి నరకంలో పంపినా గానీ, అతన్ని ఎవరూ అడిగేవారు లేరు. అంతటి శక్తిశాలి. అయినా అది అతని యొక్క అన్యాయం అనబడదు కూడా. ఎందుకంటే మనందరం అతని ఆధీనంలో ఉన్నాము. అతని యొక్క దాసులము. కానీ, “నీ ప్రభువు తన దాసులపై ఏ రవ్వంత అన్యాయం చేసేవాడు కాదు“. ఆనాడు లెక్క తీసుకోబడటం ఏదైతే జరుగుతుందో అందులో అల్లాహ్ ఏ ఒక్కరిపై కూడా రవ్వంత అన్యాయం, దౌర్జన్యం చేయనే చేయడు. అల్లాహ్ ఎలా దౌర్జన్యం చేయగలుగుతాడు? అస్తగ్ఫిరుల్లాహ్! అల్లాహ్ ఎలా అన్యాయం చేయగలుగుతాడు? ఆయనే స్వయంగా చెబుతున్నాడు, ముస్లిం షరీఫ్ లోని హదీత్ ఖుద్సీ, “అన్యాయాన్ని దౌర్జన్యాన్ని నేను నాపై నిషేధించాను మరియు మీ మధ్యలో కూడా దానిని నిషేధించి ఉన్నాను. మీరు కూడా పరస్పరం దౌర్జన్యం చేసుకోకండి, అన్యాయాలు చేసుకోకండి“.
లెక్క తీసుకునే విషయంలో అల్లాహ్ వద్ద ఉన్నటువంటి మరొక నియమం ఏమిటంటే ఆయన ఒకరి పాపాల గురించి మరొకరిని పట్టుకోడు. ఒకరి పాపాల భారం మరొకరిపై వేయడు. ఒకరు చేసిన పాపానికి మరొకరిని శిక్షించడు.
అంతేకాకుండా లెక్క తీసుకునే విషయంలో మరొక నియమం అల్లాహ్ ఏదైతే పాటిస్తాడో – దాసులు వారు చేసిన కర్మలన్నీ వారికి స్వయంగా చూపిస్తాడు. “ఎవరైతే అణువంత పుణ్యం చేసుకున్నారో వారు కూడా దానిని చూసుకుంటారు. మరి ఎవరైతే అణువంత పాపం చేశారో వారు కూడా దానిని చూసుకుంటారు“. సూరయే ఆలె ఇమ్రాన్ లో అల్లాహ్ (తఆలా) తెలిపాడు: “ఆనాడు ప్రతీ ప్రాణి, ప్రతీ ఒక్కరు తాను చేసుకున్న మంచిగానీ, చెడ్డ గానీ, సత్కార్యం గానీ, దుష్కార్యం కానీ దానిని వారు చూస్తారు. దానిని వారు పొందుతారు. ప్రతీ కార్యం వారికి తెలియజేయడం జరుగుతుంది.”
లెక్క తీసుకునే విషయంలో అల్లాహ్ వద్ద ఉన్నటువంటి మరొక నియమం ఏమిటంటే – అల్లాహ్ (తఆలా) సత్కార్యాల సత్ఫలితం ఎన్నో రెట్లుగాపెంచి ఇస్తాడు. కానీ అదే దుష్కార్యాలు వాటి యొక్క శిక్ష ఏ రవ్వంత పెంచి ఇవ్వడు. దీని గురించి ఎన్నో హదీతులు వచ్చి ఉన్నాయి. ఒక సహీ హదీత్ లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఎప్పుడైతే ఒక మనిషి ఒక సత్కార్యం చేయాలని మనసులో అనుకుంటాడో అల్లాహ్ అతనికి ఒక పుణ్యం రాస్తాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ సత్కార్యాన్ని ఆచరణ రూపంలో చేస్తాడో అల్లాహ్ అతనికి ఆ సత్కార్యానికి బదులుగా పది రెట్లు నుండి ఏడు వందల రెట్ల వరకు పుణ్యాలు రాస్తాడు. దాసుడు ఒకవేళ దుష్కార్యం గురించి మనసులో అనుకుంటే అల్లాహ్ అతనికి ఒక పాపం రాయడు. ఒకవేళ అతను ఆ దుష్కార్యం చేస్తే ఒక్క పాపం మాత్రమే రాస్తాడు. అదే ఒకవేళ అతను ఆ దుష్కార్యం ఆలోచనను వదులుకుంటే అతనికి ఒక పుణ్యం రాస్తాడు“. ఈ హదీత్ కు సాక్షాధారం చదవాలనుకుంటే ఖురాన్ లోని ఈ ఆయత్ కూడా చదవవచ్చు. “ఎవరైతే ఒక సత్కార్యం చేస్తారో వారికి దాని పది రెట్ల కు ఎక్కువగా వారికి పుణ్యం లభిస్తుంది“
అలాగే లెక్క తీసుకోవడంలో ఒక నియమం ఏమిటంటే – అల్లాహ్ (తఆలా) ఒకరు చేసిన పాపానికి బదులుగా మరొకరిని శిక్షించడు. ఒకరు చేసిన పాపానికి బదులుగా మరొకరిని పట్టుకోవడం జరగదు. ఖురాన్ లోని ఈ ఆయత్ చదవండి – “ఒకరి పాపాల భారం మరో ఒకరిపై వేయడం జరగదు“. మరోచోట అల్లాహ్ (తఆలా) తెలిపాడు – “ప్రతి మనిషి తాను ఏమి సంపాదించాడో దాని ప్రకారమే అతనికి ప్రతిఫలం లభిస్తుంది“. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒకరు చేసిన పాపానికి బదులుగా మరొకరు శిక్ష పొందడం ఇలా జరగదు కానీ ఎవరైనా ఇతరులకు చెడు చేయాలని చెప్పి, చెడు వైపునకు ప్రేరేపిస్తే వారు చెడు చేసినందుకు ఇతని కారణంగా అతను ఆ చెడు చేశాడు కనుక అతను చేసిన చెడులోని పాప భారం అతనిపై ఏమాత్రం తగ్గకుండా, ఇతను చెడు వైపునకు పురికొల్పినందుకు ఇతను కూడా ఆ పాప భారాన్ని మోస్తాడు. అతని యొక్క పాప భారంలో ఏ మాత్రం తగ్గింపు జరగదు. లెక్క జరిగే విషయాల కొన్ని వివరాలు మనం తెలుసుకుంటున్నాము. అలాగే సోదరులారా, చెడు వైపునకు ప్రేరేపిస్తే, ప్రేరేపించిన వారికి ఆ చెడు యొక్క పాపం కలుగును. దాని యొక్క శిక్ష అతను పొందాలి. అలాగే ఎవరైనా మంచి కార్యం వైపునకు, పుణ్యకార్యం వైపునకు ఇతరులను ఆహ్వానిస్తే, ఆ ఆహ్వానం మేరకు ఎవరెవరు ఆ పుణ్యం వైపునకు వస్తారో, దానిని ఆచరిస్తారో వారికి వారి ప్రకారంగా సత్ఫలితం లభిస్తుంది. కానీ పుణ్యం వైపునకు ఆహ్వానించే వారికి కూడా ఆ పుణ్యం చేసినంత సత్ఫలితం వారికి లభిస్తుంది.
లెక్క తీసుకునే విషయంలో మరొక నియమం ఏమిటంటే – అల్లాహ్ (తఆలా) అవిశ్వాసులకు, కపటవిశ్వాసులకు, వంచకులకు, మరెందరో పాపాలు చేసేటటువంటి దుర్మార్గులకు వారు తిరస్కరించినందుకు, వారికి వ్యతిరేకంగా ఎన్నో రకాల సాక్షులను వారి ముందు నిలబెట్టడం జరుగుతుంది. వాటి యొక్క వివరాలు తర్వాత ఎపిసోడ్ లలో ఇన్షాఅల్లాహ్ మనం విననున్నాము.
అయితే లెక్క విషయంలో మరొక విషయం మనం తెలుసుకోవలసినది ఏమిటంటే – ఆదమ్ (అలైహిస్సలాం) నుండి మొదులుకొని చిట్టచివరి ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వరకు ఎందరు ప్రవక్తలు వచ్చారో, వారందరి ప్రవక్తల జాతుల్లో అందరికంటే మొట్టమొదటి సారిగా లెక్క తీసుకోవడం జరిగేది మన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క అనుచర సంఘం. దీనికి సంబంధించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – “మనం ఇతర జాతులను చూస్తే వారికంటే చివరిలో వచ్చిన వారిమి. కానీ ప్రళయ దినాన అందరికంటే ముందు మనం ఉంటాము. సర్వ ప్రజల్లో అందరికంటే ముందు లెక్క, తీర్పు జరిగేది మన అనుచర సంఘం యొక్క లెక్క తీర్పు.” ఇది కూడా మన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై మరియు మనపై అల్లాహ్ యొక్క గొప్ప కరుణ. దీనిని మనం గ్రహించాలి.
ఈ హదీత్ సహీ బుఖారి మరియు సహీ ముస్లిం లో ఉంది మరియు ముస్నద్ అహ్మద్ ఇంకా ఇబ్నెమాజా లో ఉంది – ఇబ్నె అబ్బాస్ (రది యల్లాహు తఆలా అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపినట్లుగా చెప్పారు – “ఇతర అనుచర సంఘాల్లో మనం అందరికంటే చివరి వారిమి. కానీ లెక్క జరిగే ప్రకారంగా మొట్టమొదటి వాళ్ళం. మన నుండే లెక్క మొదలవుతుంది. మన లెక్క అయిన తర్వాతనే ఇతర జాతుల లెక్క జరుగుతుంది.”
మరి సోదరులారా!, సోదరీమణులారా!, లెక్క జరిగే ఆ ప్రళయదినాన మొట్టమొదటి లెక్క దేని గురించి జరుగునో ఎప్పుడైనా మనం గమనించామా? హదీతుల్లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ విషయం కూడా చాలా స్పష్టంగా మనకి తెలియజేసారు. ఎందుకూ? అలాంటి సత్కార్యాలు చేయడంలో మనం వెనుక ఉండకూడదు అని. ప్రళయ దినాన లెక్క తీసుకోబడే రోజు మనం అక్కడ మోక్షం పొందాలి, ఆ లెక్కలో పాస్ అవ్వాలి అని. ఇబ్నెమాజా లోని సహీ హదీత్ – “ప్రళయ దినాన ఆరాధనల్లో అందరికంటే ముందు నమాజ్ యొక్క లెక్క తీసుకోబడును. నమాజ్ సరిగ్గా ఉంటే అందులో అతడు పాస్ అయ్యాడు అంటే ఇతర వేరే కర్మలు కూడా సరి అయినట్లు. అతను నమాజ్ లో ఫెయిల్ అయ్యాడు అంటే ఇతర విషయాల్లో కూడా ఫెయిల్ అయినట్లే“, అందుగురించి మహాశయులారా!, ఇకనైనా నమాజ్ విషయంలో మనం శ్రద్ధ వహించాలి. ప్రత్యేకంగా పురుషులు సామూహికంగా మస్జిద్ లో నమాజ్ చేయాలి. ప్రత్యేకంగా ఫజర్ నమాజ్ లో ఏ బద్ధకం వహిస్తున్నామో, రాత్రి పడుకోవడంలో ఆలస్యం చేసి ఫజర్ నమాజ్ ను వదిలేస్తున్నామో, మనం డ్యూటీ వెళ్ళే సమయంలో చదవడం లేదా జోహార్ తో పాటు కలిపి చదవడం లాంటి ఏ తప్పులు అయితే చేస్తున్నామో వాటిని వదులుకోవాలి. తొలిసారిగా లెక్క జరిగేది నమాజ్ గురించి. ఈ నమాజ్ లో పాస్ కాకుంటే మనం చాలా నష్టపోతాము, ఫెయిల్ అయిన వాళ్ళల్లో లెక్కించబడుతుంది. అందుగురించి నమాజ్ పట్ల శ్రద్ధ వహించండి.
ఇంకా మహాశయులారా!, తీర్పుల్లో మొట్టమొదటి తీర్పు, సహీ బుఖారీ, సహీ ముస్లిం లోని హదీత్, “ప్రళయ దినాన ప్రజలందరి మధ్యలో మొట్టమొదటి తీర్పు రక్తాల గురించి జరుగును. ఎవరు ఎవరిని అన్యాయంగా హత్య చేశారో, ఎవరు ఎవరిని హత్య చేయడానికి ప్లాన్ లు వేసాడో, ఎవరు ఎవరిని హత్య చేయడానికి సహాయ పడ్డాడో” ఈ విధంగా ఇస్లాంలో ఆరాధనల్లో మొట్ట మొదటి విషయం నమాజ్ అయితే సామాజిక వ్యవహారాల్లో, సామాజిక విషయాల్లో రక్తానికి చాలా గొప్ప విలువ ఉన్నది. మహాశయులారా!, ఇకనైనా గమనించండి. ఇస్లాం పై బురద చల్లకండి. ఇస్లాం పై అజ్ఞానంతో వేరే రకంగా దాన్ని చిత్రీకరించకండి. ప్రాణాలకు ఎంత విలువనిస్తుంది. అన్యాయంగా, అకారణంగా, దౌర్జన్యంగా ఎవరైతే ఎవరిని హత మారుస్తారో వారికి స్వర్గం కూడా లభించదు. స్వర్గం యొక్క సువాసన నలభై సంవత్సరాల ప్రయాణం గల దూరం నుండి ఆఘ్రానించ బడుతుంది. కానీ అలాంటి వారికి ఆ సువాసన కూడా లభించదు అని ఇస్లాం స్పష్టపరిచింది. అయితే ప్రళయదినాన ఈ రక్తాలు గురించి మొట్టమొదటి తీర్పు జరుగును. అందుగురించే ఇస్లాం “ఎవరైనా అన్యాయంగా ఒక ప్రాణిని చంపారంటే మానవత్వం మొత్తాన్ని మట్టిలో కలిపినట్లు” అని వారి గురించి హెచ్చరించింది.
ఈ విధంగా లెక్క జరిగే ఆ రోజున దానికి సంబంధించిన వివరాలు మనం అల్లాహ్ యొక్క దయ వల్ల ఈనాటి కార్యక్రమంలో విన్నాము, తెలుసుకున్నాము. అయితే ఆ లెక్క జరిగే రోజు రాకముందే మనం ఇక్కడే దాని గురించి సిద్దపడాలి. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారు చెప్పిన ఈ మాటలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి: “ప్రళయ దినాన అక్కడ మీ లెక్క జరిగే కి ముందు మీరు ఇక్కడే మీలెక్క తీసుకుంటూ ఉండండి. మీకు అక్కడ సులభతరం కలుగుతుంది“.
అల్లాహ్ మనందరికీ ప్రతిరోజు మనం చేస్తున్న ప్రతికార్యం గురించి లెక్క తీసుకుంటూ ఆ లెక్క రోజు గురించి సిద్ధపడేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలిహందులిల్లాహి వహద వస్సలాతు వస్సలామ్ అలా నబియ్యునా బ’ద అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
సోదర సోదరీమణులారా! పరలోకం సత్యం. మరోసారి లేపబడటం అనుమానం, సందేహం లేని విషయం. దీని గురించి ఖురాన్ లో అల్లాహ్ (తఆలా) ఎన్నో రకాలుగా మనకు ఉదాహరణలు ఇచ్చి ఉపమానాల ద్వారా దీని యొక్క వాస్తవికతను తెలియపరిచాడు. ఒక రకమైన నిదర్శన దీని గురించి ఏమిటంటే, సామాన్యంగా మనం మన జీవితంలో చూస్తూ ఉంటాము: ఒక్కసారి ఏదైనా వస్తువు తయారు చేయడం లేదా అనండి, మొదటిసారి ఏదైనా వస్తువు తయారు చేయడంలో మనకి ఏదైనా కష్టం కావచ్చు. కానీ దానినే మరోసారి తయారు చేయడంలో అంత కష్టం ఉండదు. ఇది మన విషయం, నవూదుబిల్లాహ్, మనకు మరియు అల్లాహ్ కు ఎలాంటి పొంతన లేదు. కానీ మన తక్కువ జ్ఞానానికి, మన అల్పబుద్ధులకు కూడా విషయం అర్థం కావడానికి మన యొక్క ఈ ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆ బ్రహ్మాండమైన సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త ఈ ఆకాశాల ముందు, ఇంత పెద్ద భూమి ముందు, ఇంత గొప్ప పర్వతాల ముందు ఐదు అడుగుల మనం మానవులం ఇంత పెద్ద విషయం. అయితే తొలిసారిగా ఒక ఇంద్రియపు బిందువుతో అందమైన ఇంతటి గొప్ప మనిషిని సృష్టించగల ఆ సృష్టికర్త చనిపోయిన తర్వాత మరోసారి సృష్టించడం కష్టమా? ఎంత మాత్రం కష్టం కాదు. ఎంత మాత్రం కష్టం కాదు.
సూర రూమ్ ఆయత్ నెంబర్ 27 లో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు.
وَهُوَ الَّذِي يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَهُوَ أَهْوَنُ عَلَيْهِ – 30:27 “ఆయనే సృష్టి (ప్రక్రియ)ని ప్రారంభిస్తున్నాడు. మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు. ఇది ఆయనకు చాలా తేలిక”
ఆయనే సృష్టిని తొలిసారిగా పుట్టించిన వాడు, ఆయన తప్పకుండా తిరిగి పుట్టించ గలడు. తిరిగి పుట్టించడం అనేది అతనికి ఎంతో సులభతరమైన విషయం.
సూరతుల్ అంబియా ఆయత్ నెంబర్ 104 లో ఇలా తెలియపరిచాడు.
كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُّعِيدُهُ ۚ وَعْدًا عَلَيْنَا ۚ إِنَّا كُنَّا فَاعِلِينَ – 21:104 “ఏ విధంగా మేము మొదటిసారి సృష్టించామో అదేవిధంగా మలిసారి కూడా చేస్తాము. ఈ వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాపైన ఉంది. దాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తాము.”
గమనించారా? తొలిసారిగా పుట్టించడం దానికంటే మలిసారి సృష్టించడంలో ఎలాంటి కష్టతరమైన పని కాదు.
ఒక వ్యక్తి ప్రస్తావన సూరయే యాసీన్ లో వచ్చి ఉంది. అతను ఎంతో విర్రవీగుతూ “మా శరీరమంతా మట్టిలో కలిసిపోయిన తరువాత మా ఎముకలు సైతం బూడిద అయిపోయిన తర్వాత ఎలా పుట్టించ గలుగుతాడు, ఎలా తిరిగి లేప గలుగుతాడు?” అన్నటువంటి అడ్డ ప్రశ్నలు వేశాడు. అల్లాహ్ (తఆలా) అతనికి సమాధానం ఇస్తూ “మాకు ఉపమానాలు చూపించి ఎలా లేపుతాడు? అని ప్రశ్నిస్తున్నాడా? తాను తన స్వయంగా సృష్టిని మరిచిపోయాడా?” ఆ తరువాత ఆయత్ నెంబర్ 79 లో అల్లాహ్ ఇలా తెలిపాడు.
قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۖ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ – 36:79 (వారికి) సమాధానం ఇవ్వు : “వాటిని తొలిసారి సృష్టించిన వాడే (మలిసారి కూడా) బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు.”
తొలిసారిగా ఎలా మిమ్మల్ని పుట్టించాడో అలా మలిసారిగా పుట్టించడం తప్పనిసరి. ఇందులో అతనికి ఏ మాత్రం ఇబ్బందికరం ఉండదు. అందుకు సోదరులారా ఇందులో అనుమానపడే విషయం లేదు.
ఇక బుద్ధి పూర్వకమైన మరికొన్ని నిదర్శనాలు మరోరకంగా చూపించాడు. ఒకసారి గమనించండి. ఎండకాలం వచ్చిందంటే బీడు వారిన భూములను మనం చూస్తాం. ఏ మాత్రం అందులో జీవం లేని విషయాన్ని మనం గమనిస్తాము. కానీ అదే నిర్జీవ భూమిలో ఒక్కసారి ఒక వర్షం యొక్క జల్లు పడిందంటే అందులో మళ్ళీ జీవం పోసేది ఎవరు? ఆ సృష్టికర్తయే. ఆ భూమి నుండి పంటలు పండించేది ఎవరు? ఆ సృష్టికర్తయే. ఎలాగైతే నిర్జీవ భూమిలో జీవం పోసి, అక్కడి నుండి పంటలు పండించే శక్తి ఆ సృష్టికర్త కు ఉందో, అలాగే చనిపోయిన మనిషిని, మట్టిలో కలిసిపోయిన శరీరాన్ని, బూడిదగా మారినా ఎముకల్ని సైతం కలిపి మరోసారి జీవింప చేయడం ఏమాత్రం కష్టతరమైన విషయం కాదు.
ఆయన యొక్క సూచనలలో ఒక సూచన ఏమిటంటే, నీవు భూమిని ఎండిపోయినదిగా, బీడుబారినదిగా చూస్తావు. ఎప్పుడైతే మేము ఆ భూమిపై వర్షాన్ని కురిపిస్తామో, ఆ తర్వాత పచ్చని పైర్లతో అది ఎంతో అందంగా కనబడుతూ ఉంటుంది. ఆ నిర్జీవ భూమిని ఎవరైతే బ్రతికించాడో ఆ భూమిలో జీవం పోసాడో అతడే మృతులను కూడా మరోసారి లేపుతాడు. వారికి కూడా జీవం ప్రసాదిస్తాడు.
ఇలాంటి ఆయత్ లు ఖురాన్ లో మరి ఎన్నో ఉన్నాయి. మరొక గమనించగల విషయం ఏమిటంటే, ఎండిపోయిన భూమి, చూడడానికి చనిపోయిన భూమి, అందులో నీటి వర్షం, వర్షం యొక్క నీరు పడిన తరువాత ఎలా పచ్చగా అవుతుందో, మొలకలు ఎత్తుతాయో ఇలాంటి ఉదాహరణలే మృతులను లేపబడే విషయంలో కూడా అల్లాహ్ (తఆలా) తెలియపరిచాడు.
సహీ ముస్లింలోని హదీత్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియపరిచారు. “మొదటిసారి ఇస్రాఫీల్ శంఖు ఊదినప్పుడు ఒక వైపునకు మెడలు వాలి పోతాయి. ప్రజలు సొమ్మసిల్లి పోతారు. ఆ తర్వాత ప్రళయం సంభవించి ఈ ప్రపంచమంతా నాశనం అయిపోతుంది. మళ్ళీ అల్లాహ్ (తఆలా) ఒక వర్షం కురిపిస్తాడు. వెన్నుముక లోని చివరి భాగం ఏది అయితే మిగిలి ఉంటుందో, దాని ద్వారా మరోసారి ఎలాగైతే వర్షం ద్వారా మొలకలు ఎత్తుతాయో అలాగే మనుషులు కూడా పుట్టుకొస్తారు. రెండవ శంఖు ఊదిన తర్వాత అందరూ కూడా అల్లాహ్ ఎదుట హాజరవుతారు”. ఈ ప్రళయ దినాన్ని విశ్వసించడం, ప్రళయ దినాన్ని నమ్మడం మన విశ్వాసంలోని అతి ముఖ్యమైన భాగం. ఇందులో మనం ఏ మాత్రం ఆలస్యం కానీ, ఏ మాత్రం సందేహం గాని, అనుమానం గాని ఉంచుకోకూడదు. దీని వల్ల మనకే నష్టం కలుగుతుంది. ఒకవేళ మనం పరలోక దినాన్ని విశ్వసించామో ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ మరోసారి లేపుతాడు, బ్రతికిస్తాడు అని ఎప్పుడైతే నమ్ముతామో మనకే ఇందువల్ల మేలు కలుగుతుంది.
మరొక విషయం గమనించండి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. ఎందరో ఎన్నో రకాల అన్యాయాలు చేస్తున్నారు. ఎన్నో రకాల దౌర్జన్యాలు చేస్తున్నారు. వారికీ వారి దౌర్జన్యం వారు చేసే అంతటి పాపాల శిక్ష ఇహ లోకంలో ఎక్కడైనా దొరుకుతుందా? లేదు. వారు ఎవరిపైన అయితే దౌర్జన్యం చేస్తున్నారో ఆ బాధితులకు వారి యొక్క న్యాయం లభిస్తుందా? లేదు. అందుగురించి కూడా పరలోక దినం తప్పనిసరి. అక్కడ సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వ మానవుల మధ్య న్యాయం చేకూరుస్తారు. బాధితునికి అతని హక్కు దౌర్జన్యపరుడు నుండి తప్పకుండా ఇప్పిస్తాడు. అంతే కాదు సహీ హదీత్ లో వచ్చి ఉంది ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెలిపారు: “ఒకవేళ కొమ్ము ఉన్న మేక కొమ్ము లేని మేకను అన్యాయంగా కొట్టిందంటే రెండు మేకల్ని కూడా అల్లాహ్ (తఆలా) ప్రళయ దినాన హాజరు పరుస్తాడు. దౌర్జన్యం చేసిన మేక నుండి దౌర్జన్యానికి గురి అయిన మేకకు న్యాయం ఇప్పించి ఆ తర్వాత వారిని మట్టిగా మార్చేస్తాడు”. చెప్పే విషయం ఏంటంటే జంతువుల మధ్య లో కూడా న్యాయం చేకూర్చ గలిగే ఆ సృష్టికర్త, మానవుల మధ్య తప్పకుండా న్యాయం చేకూర్చ గలుగుతాడు. ఆ న్యాయం, ప్రతిఫల దినం తప్పని సరిగా రావలసి ఉంది. మనం దానిని ఎంత తిరస్కరించినా అది తప్పక వస్తుంది. నిశ్చయంగా ప్రళయ దినం వచ్చి ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అల్లాహ్ దీని విషయంలో మనందరి విశ్వాసంలో మరింత బలం చేకూర్చు గాక.
ప్రళయ దినం రావడం ఆ రోజు మనందరి లెక్క తీసుకోవడం ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అల్లాహ్ (తఆలా) ఆదిమానవుడు నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు వచ్చే మానవులందరినీ కూడా ఒక చోట జమ చేసి, వారిలో ఎవరికీ ఎన్ని సంవత్సరాల జీవితం ప్రసాదించాడో వాటి గురించి తప్పకుండా లెక్క తీసుకుంటాడు.
సూరతుల్ ఘాషియా ఆయత్ నెంబర్ 25, 26 లో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు:
إِنَّ إِلَيْنَا إِيَابَهُمْ – 88:25 ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم – 88:26 “వారందరూ మా వైపునకు తిరిగి రావలసి ఉన్నది. మరి ఆ తర్వాత మేము వారందరి యొక్క లెక్క తప్పకుండా తీసుకొని ఉంటాము.”
లెక్క తీసుకోవడం అనేది అల్లాహ్ (తఆలా) మనకు ఇచ్చిన జీవితంలోని ఒక్కొక్క క్షణానికి ఆరోజు లెక్క తీసుకోవడం అనేది సత్యం. కొన్ని సందర్భాల్లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “అల్లాహుమ్మ హాసిబ్నీ హిసాబయ్ యసీరా” అని దుఆ చేసేవారు. అంటే “ఓ అల్లాహ్! నా యొక్క లెక్క చాలా తేలికగా నీవు తీసుకో. ఎలాంటి ఇబ్బందికి నన్ను గురిచేయకుండా నా లెక్క తీసుకో.” అయితే ఒక సందర్భంలో ఆయిషా (రదియల్లాహు అన్హా) ప్రశ్నించారు: “ప్రవక్తా! చాలా సులభతరమైన లెక్క ఏమిటి” అని? అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సమాధానం పలికారు: “తేలికమైన, చాలా సులభతరమైన లెక్క అంటే ఆయేషా అల్లాహ్ దాసుని యొక్క కర్మ పత్రాలను కేవలం అలా చూసి అతన్ని మన్నించి వేయడం“. ఈ హదీత్ ముస్నద్ అహ్మద్ లోనిది సహీ హదీత్.
అయితే సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో మరొక హదీత్ ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు” “ఎవరి లెక్క తీసుకోబడుతుందో అతడు అయితే శిక్షలో పడినట్లే”. అప్పుడు ఆయేషా (రదియల్లాహు అన్హా) మరోసారి ప్రశ్నించారు: “ప్రవక్తా! అల్లాహ్ (తఆలా) ఖురాన్ లో తెలిపాడు కదా! అతనితో చాలా సులభతరమైన లెక్క తీసుకోవడం జరుగుతుంది అని”. దీనికి సమాధానంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: “ఆయిషా! ఇది కేవలం అతని కర్మ పత్రాల్లో చూడడం, దానిని లెక్క తీసుకోవడం అని చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా లెక్క తీసుకోవడం అంటే ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క కార్యాన్ని పట్టి అడగడం, దాని గురించి మందలించడం. ఇలా ఎవరైతే ఒక్కొక్క విషయాన్ని గురించి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో, అతడు అయితే నాశనం అయినట్లే కదా!” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు చెప్పారు.
అంటే ఈ హదీతుల ద్వారా ఏం బోధపడుతుంది మనకు? లెక్క తీసుకోవడం తప్పకుండా జరుగుతుంది అని, దానికి మనం ఇక్కడే సిద్దపడాలి అని మరియు అల్లాహ్ తో దుఆ కూడా చేస్తూ ఉండాలి – “ఓ అల్లాహ్ సత్కార్యాలు చేస్తూ జీవితం గడిపే సత్ భాగ్యం నాకు ప్రసాదించు మరియు ప్రళయ దినాన మా యొక్క లెక్క, తీర్పులు అన్నీ కూడా చాలా సులభతరంగా జరగాలి. నీ యొక్క మన్నింపు కు మీ యొక్క క్షమాపణకు, నీ యొక్క కరుణ కటాక్షాలను మేము నోచుకోవాలి” అని దుఆ చేస్తూ ఉండాలి.
ఇప్పటికీ సమాజంలో కొందరు ప్రళయదినం ఎందుకు? ఆ రోజు ఎందుకు లెక్క తీసుకోవడం? ఇలాంటి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే అల్లాహ్ (తఆలా) ఏ ఉద్దేశంతో మనల్ని ఇహలోకంలోకి పంపాడో అది ఆయన్ను ఆరాధించడం మాత్రమే. ఆయన ఆరాధన పద్ధతులను తెలియపరచడానికి ప్రవక్తల్ని పంపాడు. గ్రంధాలను కూడా అవతరింపజేశాడు. ఇక అల్లాహ్ తన బాధ్యత పూర్తి చేసి మానవునికి సన్మార్గం ఎందులో ఉందో తెలియజేసి అతను దానిని అవలంబించాలి, దాని ప్రకారం జీవితం గడపాలి అని ఆదేశించాడు. ఇక ఆ పరలోకం,, ఇహలోకంలో ఎవరు ఎలా జీవించారు? ఆ లెక్క తీసుకోవడానికి, ఎవరు న్యాయం చేశారో, వారి యొక్క న్యాయానికి ప్రతిఫలం ఇవ్వడానికి, ఎవరైతే అన్యాయం చేశారో, దౌర్జన్యం చేశారో వారి యొక్క శిక్ష వారికి ఆ రోజు ఇవ్వడానికి. ఎవరు ప్రవక్తల యొక్క బాటను అనుసరించారు? అల్లాహ్ పంపిన గ్రంధాలని స్వీకరించి వాటి ప్రకారం తమ జీవితం మలుచుకున్నారు? ఇవన్నీ కూడా ఆ రోజు తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది.
సూరతుల్ ఆరాఫ్ లో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు:
“మేము ప్రవక్తల్ని కూడా ప్రశ్నిస్తాము మరియు ప్రవక్తల్ని ఎవరి వైపునకు పంపామో ఆ జాతి వారిని కూడా ప్రశ్నిస్తాము.”
ఈ లెక్క విషయంలో ప్రజలందరూ కూడా సమానంగా ఉండరు. వారి వారి కర్మల ప్రకారం, వారి వారి విశ్వాసాల ప్రకారం, వారు ఇహలోకంలో అల్లాహ్ ఆజ్ఞలను, అల్లాహ్ ఆదేశాలను పాటించి, వాటి ప్రకారం ఏదైతే జీవితం గడిపారో, వాటి ప్రకారం కొందరి యొక్క లెక్క చాలా కష్టతరంగా ఉంటుంది. మరికొందరికి సులభతరంగా ఉంటుంది. కొందరిపట్ల మన్నింపు వైఖరి అల్లాహ్ వహిస్తాడు. మరి కొందరిని అల్లాహ్ (తఆలా) వారితో ఒక్కొక్క లెక్క తీసుకుంటాడు.
ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సందర్భంలో తెలిపారు. సహీ బుఖారి మరియు సహీ ముస్లిం లో వచ్చిన హదీత్ ఆ పొడుగైన హదీతులో చివరి మాట ఏంటంటే – “గత జాతులు నాకు చూపబడటం జరిగింది, నా అనుచర సంఘాన్ని కూడా నేను చూశాను. వారిలో డెబ్బై వేల మంది వారు ఎంత అదృష్టవంతులు అంటే, వారు ఎలాంటి లెక్కలేకుండా, ఎలాంటి శిక్ష లేకుండా స్వర్గంలోనికి వెళ్తారు.” అల్లాహు అక్బర్. అల్లాహ్ (తఆలా) మనందరినీ కూడా ఆ డెబ్బై వేలలో కలపాలి, ఆ డెబ్బై వేలలో జోడించాలి అని మనం దుఆ చేస్తూ ఉండాలి. ఆ ప్రకారంగా మనం ఆచరిస్తూ కూడా ఉండాలి.
ఇన్షా అల్లాహ్, పరలోకానికి సంబంధించిన ఎన్నో మజిలీలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుంటూ పోతూఉన్నాము . మా ఈ కార్యక్రమాలను ఎడతెగకుండా చూస్తూ ఉండండి. అల్లాహ్ (తఆలా) పరలోకం పట్ల మన విశ్వాసాన్ని మరింత బలం చేయుగాక, సత్కార్యాలు చేస్తూ ఉండి, కలిమా “లా ఇలాహ ఇల్లల్లాహ్” చదువుతూ, అదే పుణ్య స్థితిలో అల్లాహ్ మన ప్రాణాలు వీడే అటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలిహందులిల్లాహి వహద వస్సలాతు వస్సలామ్ అలా నబియ్యునా బ’ద అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశం లో స్వాగతం.
ఈనాటి శీర్షిక సమాధుల నుండి లేపబడటం
మహాశయులారా! చావు ఎంత నిజమో, సత్యమో, తిరస్కరించలేని విషయమో అంతే అంత కంటే ఎక్కువ నగ్నసత్యం ఏమిటంటే, మనం చనిపోయి సంవత్సరాలు గడిచినా మరోసారి అల్లాహ్ (తఆలా) తప్పకుండా మనల్ని బ్రతికిస్తాడు మరియు తప్పకుండా మనం రెండవసారి జన్మను ఎత్తి అల్లాహ్ ముందు నిలబడేది ఉన్నది ఇహలోకంలో కాదు. ఇప్పుడు చావు వస్తుంది. మనం చనిపోతున్నాము. మన చావుతోనే మన ప్రళయం మనపై సంభవిస్తుంది.
కానీ ఒక రోజు రానుంది. అప్పుడు అల్లాహ్ తఆలా శంఖు ఊదడానికి నియమింపబడిన దూత ఇస్రాఫీల్ (అలైహిస్సలాం)ను ఆదేశిస్తాడు. ఆయన శంఖును పూరిస్తాడు, శంఖును ఊదుతాడు. అందువల్ల ఈ విశ్వమంతా నశించిపోతుంది. వాటి యొక్క ప్రస్తావన సూరతుల్ తక్వీర్, సూరతుల్ ఇన్ఫితార్, సూరతుల్ ఖారిఅహ్, సూరతుల్ జిల్ జాల్ ఇంకా వేరే సూరాలలో కూడా చాలా స్పష్టంగా ఉంది. అయితే ఆ తరువాత అందరికంటే ముందు హజ్రత్ ఇస్రాఫీల్ (అలైహిస్సలాం)ని అల్లాహ్ (తఆలా) బ్రతికిస్తాడు. ఆయన కూడా చనిపోతారు. ఆ తర్వాత అల్లాహ్ మళ్ళీ ఆయనలో జీవం పోసి ఆయన్ని బ్రతికిస్తాడు. ఆయనకు ఆదేశం ఇస్తాడు – మరోసారి శంఖు ఉదాలని. ఆయన మరోసారి శంఖు ఊదుతాడు. అప్పుడు ఆదిమానవుడు నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు ఈ విశ్వమంతా నాశనం అయ్యే వరకు ఎందరు మానవులు ఈ లోకంలో వచ్చారో, వారందరూ కూడా అల్లాహ్ ఎదుట హాజరు కావడానికి లేచి వస్తారు. అది ఎలా జరుగుతుంది? దాని కొన్ని వివరాలు మనం ఈ రోజు ఇన్షా అల్లాహ్ తెలుసుకోవడంతో పాటు పునరుత్థాన దినం, పరలోకం, మరోసారి లేపబడటం, ఇవన్నీ ఎలా సత్యమో, ఖురాన్, హదీసుల ఆధారాలతో పాటు బుద్ధిపూర్వకమైన కొన్ని నిదర్శనాలు కూడా ఇన్షా అల్లాహ్ మీకు తెలుపబడతాయి. నమ్మడానికి ఇంతవరకు ఏదైనా సందేహం, అనుమానం ఉన్నా ఇన్షా అల్లాహ్, ఆ అల్లాహ్ దయతో తప్పకుండా వీరు నమ్మి తీరుతారు. మీరు ఈవిషయాలు చాలా శ్రద్దగా వింటారు అని ఆశిస్తున్నాను.
సహీ బుఖారీలో వచ్చిన హదీసు ప్రకారం, మొదటిసారి శంఖు ఊదబడిన తరువాత విశ్వమంతా నాశనం అయిపోతుంది. ఎలాగైతే విత్తనం ద్వారా మళ్ళీ ఒక వర్షం కురిసింది అంటే విత్తనంలో, విత్తనం ఏదైతే మనం భూమిలో నాటుతామో ఒక చిన్న వర్షం కురిసిన తరువాత ఎలా అది మొలక ఎత్తుతుందో, ఆతరువాత ఏ విత్తనం ఉంటుందో, దాని యొక్క చెట్టు బయటికి వస్తుందో, ఆ విధంగా మనిషి ఏ స్థితిలో చనిపోయినా, ఎక్కడ చనిపోయినా వెన్నెముకలోని కింది చివరి భాగంలో ఒక చిన్న ఎముక ముక్కను అల్లాహ్ (తఆలా) అలాగే నశించి పోకుండా కాపాడి ఉంచుతాడు. ఆ రోజు అల్లాహ్ (తఆలా) ఒక వర్షం కురిపిస్తాడు. ఇస్రాఫీల్ (అలైహిస్సలాం) కు రెండోసారి శంఖు ఊదడానికి ఆదేశిస్తాడు. ఈవిధంగా ఆ వెన్నెముక ద్వారా వర్షం కురిసిన తరువాత మొక్కలు ఎలా మొలకెత్తుతాయో ఆ విధంగా ఇస్రాఫీల్ (అలైహిస్సలాం) శంఖు ఊదిన తర్వాత మరోసారి అందరు మానవులు లేచి నిలబడి అల్లాహ్ ఎదుటకు హాజరవుతారు.
దీనికి సంబంధించిన కొన్ని ఆయతులు మనం ఇప్పుడు విందాం శ్రద్ద వహించండి. సూరయే జుమర్ ఆయత్ నెంబర్ 68 లో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియజేసాడు.
శంఖు ఊదడం జరుగుతుంది. ఆకాశాల్లో ఉన్నవారు, భూమిలో ఉన్న వారు అందరూ సొమ్మసిల్లి పోతారు. కేవలం అల్లాహ్ తలుచుకున్న వారు తప్ప. మరోసారి శంఖు ఉందడం జరుగుతుంది. అప్పుడు వారందరూ చూసుకుంటూ నిలబడి హాజరవుతారు.
ఈ విధంగా మహాశయులారా! రెండో సారి అల్లాహ్ (తఆలా) నిర్జీవులందరినీ కూడా జీవులుగా చేసి లేపడం అనేది సత్యం. సూరతుల్ మూ’మినూన్ లోని చివరిలో అల్లాహ్ తఆలా ఇలా తెలిపాడు.
దశల వారుగా మీరు ఏదైతే పుట్టించ బడ్డారో ఆతరువాత ఇహలోకంలో వచ్చాక బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం కొందరు యవ్వనంలో మరికొందరు బాల్యంలో మరికొందరు వృద్ధాప్యంలో ఈధంగా ఒక రోజు కాకున్నా ఒకరోజు మీరు చనిపోవాల్సిన వున్నది. ఆ తరువాత ప్రళయ దినాన మరోసారి మిమ్మల్ని లేపడం జరుగుతుంది.
అయితే సోదర సోదరీమణులారా! చనిపోయిన వారిని మనం చూస్తూ ఉంటాము. సమాధిలో పెట్టబడిన కాలాలు గడిచిన కొద్దీ ఆ శవం మట్టిలో కలిసిపోతుంది. మరికొందరు కాల్చేస్తారు. అయితే ఎలా మరోసారి వారిని పుట్టించడం జరుగుతుంది?, లేపడం జరుగుతుంది? అన్నటువంటి అనుమానం కొందరికి వస్తుంది కదా.! అయితే ఈ కొన్ని ఉదాహరణలు, ఈ కొన్ని సత్యాలు శ్రద్ధగా వినండి. ఇక మీకు ఎలాంటి అనుమానం ఇన్షా అల్లాహ్ ఉండదు. మొట్ట మొదటి విషయం ఎవరైతే మరోసారి లేపబడటం విషయంలో సందేహపడుతున్నారో అల్లాహ్ (తఆలా) దివ్య ఖురాన్ లో మూడు నాలుగు రకాల తాకీదు పదాలతో, లేపబడటం సత్యం. ఇందులో అనుమానం లేదు అని స్వయంగా అల్లాహ్ తన ప్రమాణం చేసి చెప్తున్నాడు.
అవిశ్వాసులు భ్రమపడి ఉన్నారు. వారు మరోసారి లేపబడరు అని. మీరు చెప్పండి. ఎందుకు లేదు? ఒక రకంగా ఇది కూడా తాకీదు పదం. ఇలా కాదు, ఎందుకు కాదు, తప్పకుండా అవుతుంది. నా ప్రభువు సాక్షిగా ప్రమాణం చేయడం జరిగింది. ఇది కూడా ఒక రకమైన తాకీదు. మళ్ళీ ఇది కూడా తాకీదు పదం. చివరిలో ఏదైతే ఒత్తు “న్న” ఉన్నదో అది కూడా అరబీ గ్రామర్ ప్రకారంగా తాకీదు పదం. అల్లాహ్ (తఆలా) ఒకే ఆయత్, ఆయత్ లోని చిన్నపాటి భాగంలోనే నాలుగు రకాల తాకీదు పదాలతో “చెప్పండి ఎందుకు లేదు నా ప్రభువు సాక్షిగా మీరు తప్పకుండా మరోసారి లేపబడతారు“. ఈ తాకీదు లతో కూడిన ఈ ఆయత్ కాకుండా ఇంకా వేరే ఎన్నోరకాలుగా అల్లాహ్ (తఆలా) ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా స్పష్టపరిచాడు.
గత కాలాల్లో కూడా మన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కంటే ముందు గడిచిన ప్రవక్తల కాలాల్లో కూడా ఎందరో అవిశ్వాసులు పునరుత్థాన దినాన్ని, పరలోక దినాన్ని తిరస్కరించే వారు. అయితే అల్లాహ్ వారికి నమ్మకం కలగడానికి ఇలాంటి కొన్ని వాస్తవికతలను వారి కళ్ళముందు వారికి చూపించాడు. అవి ఏమిటి?
ప్రవక్త మూసా (అలైహిస్సలాం) కాలంలో కొందరు “ఓ మూసా! మేము అల్లాహ్ ను మా కళ్లారా చూసినంత వరకు నిన్నువిశ్వసించము, నమ్మము” అని చెప్పారు. అయితే అల్లాహ్ తన యొక్క నూర్ (కాంతి)లోని చిన్న భాగాన్ని పర్వతంపై ప్రదర్శించాడు. అల్లాహ్ చెప్పాడు – “అది గనక ఒకవేళ భరించగలిగి ఉంటే ఆ తర్వాత విషయం మీరు నన్ను చూసేది“. ఎప్పుడైతే ఆ కాంతి ఆ పర్వతం మీద పడినదో వీరందరూ ఆ విషయాన్ని చూసి అక్కడికక్కడే చనిపోయారు. ఆ విషయాన్ని అల్లాహ్ తఆలా ఇలా తెలిపాడు? ఏ కొంతమందిని మూసా (అలైహిస్సలాం) ఎన్నుకొని తూర్ పర్వతానికి తీసుకెళ్లారో వారికే ఇలాంటి విషయం జరిగింది. పర్వతంపై పడినటువంటి కాంతిని వారు చూడలేకపోయారు. ఆ ప్రకాశవంతమైన కాంతిని భరించలేక పోయారు. అందరు కూడా చనిపోయారు. మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో దుఆ చేశారు. “ఓ అల్లాహ్! వెనుక నా జాతివారు ఏదైతే ఇంతటి గొప్పమాట అన్నారో వీరు నాతో వెంట వచ్చారు. వీరిని గనుక నీవు మరోసారి బ్రతికించి, వారి వరకు పంపకుంటే వారు నన్ను ఎలా నమ్ముతారు?” అప్పుడు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వీరిని ఎవరైతే చనిపోయారో మరోసారి బ్రతికించాడు. అయితే అల్లాహ్ చనిపోయిన వారిని బ్రతికించ గలుగుతాడు అన్నటువంటి వాస్తవికతలను ఇహలోకంలో కూడా చూపించాడు.
ఇలాంటి మరో సంఘటన స్వయంగా ఖురాన్ లో కూడా ఉంది. ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క శిక్ష వచ్చి పడినటువంటి ఒక గ్రామం నుండి వెళ్తున్నాడు. వెళుతూ వెళుతూ ఈ బస్తీ వాళ్ళు, కొంతకాలం ముందు వారు ఈ బస్తీలో జీవిస్తున్నారు. ఇప్పుడు వీరందరూ చనిపోయారు కదా? ప్రళయదినాన అల్లాహ్ వీరిని ఎలా బ్రతికిస్తాడు? ఈ బస్తీ వాసులను అల్లాహు (తఆలా) మరోసారి ఎలా బతికిస్తాడు? ఎలా వారికి జీవం పోసి లేపుతాడు? అని అతని నోట ఈ మాట వెళ్ళింది. ఆ వ్యక్తి ఏ గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడో, తనవెంట తన యొక్క తినడానికి కావలసిన సామాగ్రి కూడా ఉంది. అయితే ఆ వ్యక్తిని అల్లాహ్ (తఆలా) అక్కడే చంపేశాడు. వంద సంవత్సరాల వరకు ఆ మనిషి చనిపోయి ఉన్నాడు. ఆ తరువాత అల్లాహ్ (తఆలా) అతన్ని బ్రతికించాడు, లేపాడు. అల్లాహ్ అతన్ని అడిగాడు. “నీవు చనిపోయిన తర్వాత ఈ స్థితిలో ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల వరకు ఉన్నావు?” “ఒక రోజు లేదా ఒక రోజు కంటే కొంచెం తక్కువగా నేను చనిపోయిన స్థితిలో ఉంటిని” అని చెప్పాడు. అల్లాహ్ చెప్పాడు – “కాదు, నీవు పూర్తిగా వంద సంవత్సరాల వరకు ఈ నిర్జీవ అవస్థలో ఉంటివి. చూడు! కావాలంటే నీ గాడిద ఏది? ఏ దానిమీద ఐతే నువ్వు ప్రయాణం చేసుకుంటూ వచ్చావో దాని పరిస్థితి ఏమైంది? ఒక రోజు అయ్యేది ఉంటే, ఒక రోజులో దాని శరీరమంతా మట్టిలో కలసిపోయి కేవలం ఎముకలు మిగిలి ఉంటాయా? ఇప్పుడు చూడు నీ కళ్ళ ముంగట నీ గాడిద యొక్క ఎముకలు కనపడుతున్నాయి కదా! కానీ అల్లాహ్ తన శక్తిని ఇలా చూపిస్తున్నాడో గమనించు. అదే గాడిద యొక్క ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ దాని మీద నీ తినుసామాగ్రి ఏదైతే ఉందో అది కొంచెం కూడా పాడవ్వకుండా, అందులో ఎలాంటి మార్పు రాకుండా అదే నీ యొక్క తిను పదార్థాలను, త్రాగు పదార్థాలను చూడు, అందులో ఎలాంటి మార్పు రాలేదు. నీ గాడిదను, మరి నిన్ను ప్రజల కొరకు కూడా మేము ఒక గుర్తుగా, ఒక సూచనగా, ఒక మహిమగా ఏదైతే చేయదలిచామో ఈ విషయాన్ని నీ కళ్లారా చూడు. కొంతసేపటిలో అల్లాహ్ (తఆలా) అతని గాడిదను కూడా అతని కళ్ళ ముంగటే బ్రతికించాడు. అందులో మాంసం, తోలు అన్ని ఏర్పడి ఒక సంపూర్ణమైన ఒక గాడిద అతని ముందు నిలబడి ఉన్నది. అల్లాహ్ (తఆలా) అన్ని రకాల శక్తి గలవాడు. ఎప్పుడు ఏది చేయదలచిన చేయగలవాడు. స్వయంగా మనం మానవులం. ఒకసారి మనం పుట్టించబడ్డామంటే రెండవ సారి పుట్టించడం ఆయనకు ఏదైనా కష్టమా? ఎంత మాత్రం కాదు.
మూడవ సంఘటన కూడా సూరయే బకరాలోనే ఉంది. అది కూడా మూసా (అలైహిస్సలాం) కాలంలోనే జరిగింది. మూసా (అలైహిస్సలాం) కాలంలో ఒక వ్యక్తి తన పినతండ్రిని, అతని యొక్క ఆస్తికి హక్కుదారుడు కావాలన్న దురాశతో చంపేశాడు. కానీ గుప్తంగా చంపాడు. ఎవరికీ తెలియకుండా హతుని యొక్క బంధువులు మూసా (అలైహిస్సలాం) వద్దకు వచ్చి, “మూసా! నీవు అల్లాహ్ తో దుఆ చెయ్యి. మా మనిషిని చంపింది ఎవరో మాకు తెలిసి రావాలి”. అయితే అల్లాహ్ (తఆలా) మూసా (అలైహిస్సలాం)కు ఒక పరిష్కారం తెలియపరిచాడు. ఆ పరిష్కారాన్ని వారు సునాయాసంగా ఆచరించి ఉండేది ఉంటే చాల బాగుండు. కానీ వారు ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి మరింత ఇబ్బందికి పాలయ్యారు. చివరికి అల్లాహ్ ఇచ్చిన ఆదేశం ప్రకారం “మాంసపు ముక్కను ఆ హతునికి తాకించండి. అతడు బ్రతికి అతన్ని చంపింది ఎవరో తెలియపరుస్తాడు, ఆ తర్వాత మళ్ళీ చనిపోతాడు” అని చెప్పడం జరిగింది. మరియు వాస్తవానికి అలా జరిగింది. సూరయే బకరా లోనే ఈ విషయం అల్లాహ్ (తఆలా) తెలియపరిచాడు.
అయితే మహాశయులారా! చెప్పే విషయం ఏమిటంటే అల్లాహ్ (తఆలా) చనిపోయిన వారిని బ్రతికించగలుగుతాడు అన్న వాస్తవికతలను ఇహలోకంలోనే కొందరి ప్రజలకు చూపించాడు. మరియు వాటిని దివ్య ఖురాన్ గ్రంధంలో సురక్షితంగా ఆ సంఘటనలు పేర్కొనడం జరిగింది. ఇలాంటి మరో సంఘటన కూడా సూరయే బకరాలో ఉంది. కానీ సంఘటనలు ఎన్ని విన్నా, దివ్య ఖురాన్ లాంటి సందేహం లేని సత్యగ్రంథం ద్వారా విన్నా, మన లోపల ఉన్నటువంటి అనుమానాలు, సందేహాలు దూరం చేసుకోనంతవరకు మనకు నమ్మకం కలగదు. అయితే సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వశక్తిమంతుడు గనుక అన్నీ చేయగల శక్తి గలవాడు కనుక వీటిని మనం నమ్మాలి.
అల్లాహ్ చనిపోయిన వారిని బ్రతికించ గలుగుతాడు అన్న విషయానికి మరికొన్ని బుద్ధిపూర్వకమైన ఆధారాలు, నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఇన్షా అల్లాహ్ వాటిని మనం తరువాయి భాగంలో తెలుసుకోబోతున్నాము.
జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బారకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 68
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
(1) దైవప్రవక్త (ﷺ) వారికి స్వప్నం లో శత్రుసైన్యాన్ని తక్కువ మందిగా చూపించింది ఏ యుద్ధ సందర్భంగా తెలపండి?
A) ఉహద్ యుద్ధం
B) బద్ర్ యుద్ధం
C) తబూక్ యుద్ధం
(2) ప్రళయదినం నాడు అల్లాహ్ మనల్ని ప్రశ్నించే 5 ప్రశ్నల క్రమంలో ఈ క్రింది వాటిలో ఒక ప్రశ్న ఉంది అదేమిటి?
A) తెలుసుకున్న విషయాలపై ఎంత వరకు ఆచరించావు ?
B) ఎంత వరకు తెలుసుకున్నావు ?
C) ఎంత ఎక్కువ మందికి తెల్పావు ?
(3) “భయపడినవాడు తెల్లవారుజామునే ప్రయాణం మొదలు పెట్టాడు ఇలాంటి వ్యక్తి గమ్యాన్ని చేరుకుంటాడు , వినండి ! అల్లాహ్ యొక్క సామగ్రి అమూల్యమైనది , జాగ్రత్తగా వినండి ! అల్లాహ్ సామగ్రి అనగా స్వర్గం ” [తిర్మిజీ ] దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి ఈ ప్రవచనం ద్వారా మనకు లభించే గుణపాఠం ఏమిటి?
A) తెల్లవారు జామున మాత్రమే ప్రయాణం చెయ్యాలి
B) అల్లాహ్ విధేయత కొరకు పుణ్యాలు చెయ్యడం లో ఆలస్యం చెయ్యకూడదు
C) పై రెండూ యధార్థమే
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
షిర్క్ అవుతుందని ఏదైతే సమాధానం మీరు చదివారో, దీని వివరం తెలుసుకునేకి ముందు ఒక హదీసు విందాము :
ముఆవియా (రజియల్లాహు అన్హు) ఒక చోట వచ్చారు, ఆయన్ని చూసి అబ్దుల్లాహ్ బిన్ ఆమిర్ (తాబిఈ) నిలబడ్డారు, అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ (రజియల్లాహు అన్హుమా) (సహాబి బిన్ సహాబీ) కూర్చొని ఉన్నారు. ఇది చూసి ముఆవియ (రజియల్లాహు అన్హు) అబ్దుల్లాహ్ బిన్ ఆమిర్ తో చెప్పారు : “కూర్చో, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను:
“ప్రజలు తన కొరకు నిలబడాలని ఎవడు ఇష్టపడతాడో అతను తన నివాసం నరకంలో ఏర్పరుచుకోవాలి”. అబు దావూద్ లో ‘అహబ్బ’అనే పదం ఉంది అంటే ఇష్టపడతాడో, కోరుకుంటాడో, తిర్మిజిలో ఉంది: ‘సర్ర’అంటే నచ్చుతుందో, సంతోషం ఏర్పడుతుందో. అంటే అతడ్ని చూసి నిలబడని వారిని సంతోషంగా చూడడు, వారితో ప్రేమగా ఉండడు, నిలబడినవారి పట్ల సంతోషంగా వ్యవహరిస్తాడు.
ఈ సమస్య అంటే “ఒకరిని చూసి నిలబడటం” అనే విషయంలో కొన్ని వివరాలు ఉన్నాయి తెలుసుకోవడం చాలా అవసరం.
1- నేను ఏదైనా సమావేశంలో వస్తే, లేదా ప్రజలు నన్ను చూస్తే నిలబడాలని ఇష్టపడడం, కాంక్షించడం నిషిద్ధం.
ఇది గర్వానికి దారి తీస్తుంది, అప్పుడు గర్వం లేకున్నా గర్వ చిహ్నాల్లోకి వస్తుంది.
2- మనిషి ఇలాంటి కోరిక, కాంక్ష వల్ల నరకం పాలవుతాడని హెచ్చరించడం జరిగింది.
3- ఈ కోరిక, కాంక్ష ఉన్నవారిని చూసి నిలబడేవారు, ఓ నిషిద్ధ కార్యానికి సహాయం చేసినవారవుతారు.
4- ఇలాంటి కోరిక లేనివారి కొరకు కూడా నిలబడకూడదు, ఈ నిలబడటం అనే అలవాటు వారిలో ఆ కోరికను జనింపజేసే ప్రమాదముంది.
5- ఇక ఎవరైతే తమ ధర్మపరమైన బడాయితనాన్ని చాటుకుంటున్నారో, అనుయాయులు వారిని గౌరవించాలి, మర్యాద పాటించాలని కోరుకుంటున్నారో వారు నిజసృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క గౌరవమర్యాదలో జోక్యం చేసుకుంటున్నారు, కనుక అలాంటివారి కొరకు నిలబడుట షిర్క్ లోకి నెట్టేసే ప్రమాదం ఉంది.
6- ఇంట్లో పెద్దలు వస్తే పిల్లలు, నిలబడుట లేదా టీచర్లు క్లాస్ రూంలోకి వస్తే స్టూడెంట్స్ నిలబడుట కూడా మంచి అలవాటు కాదు.
7- కొందరు ఒక చోట ఉన్నారు ఎవరైనా వారి బంధువు, గురువు లాంటి పెద్దలు వచ్చారు అప్పుడు వారు నిలబడి, రెండు అడుగులు ముందుకు వచ్చి వచ్చే వ్యక్తికి స్వాగతం పలుకుతే పాపం కాదు. సహీ బుఖారీ 3043లో ఉంది: ఒక సందర్భంలో సఅద్ (రజియల్లాహు అన్హు) వచ్చినప్పుడు ప్రవక్త ఔస్ వంశంవారితో మీ నాయకుడైన సఅద్ వచ్చారు నిలబడి స్వాగతించండని ఆదేశించారు.
అలాగే ప్రయాణం నుండి వచ్చినవారిని స్వాగతించడానికి నిలబడి సలాం చేయడం, ముసాఫహా (కరచాలనం), ముఆనఖ (హగ్, అలాయిబలాయి) చేయడం యోగ్యమే. ప్రవక్త తమ కూతురింటికి వెళ్ళినప్పడూ, కూతురు ప్రవక్త ఇంటికి వచ్చినప్పుడు నిలబడి స్వాగతం పలికేవారని అబూ దావూద్ 5217 మరియు ఇతర హదీసుల్లో ఉంది.
(ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఉన్నాయి, ఫత్ హుల్ బారీ 11/49-51 మరియు షేఖ్ అల్బానీ గారి సహీహాలోని హదీసు 357, మరియు షేఖ్ ఇబ్ను ఉసైమీన్ గారి మజ్మూఉల్ ఫతావా 24/2 చూడవచ్చును)
2) మనకు ఏదయినా నష్టం జరిగినప్పుడు “నేను ఒక వేళ అలా చెయ్యకపోతే బాగుండేది” అని అనవచ్చునా?
”దృఢమైన, పరిపూర్ణ విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కంటే గొప్పవాడు. వాడి ప్రతిపనిలో మేలు ఉంటుంది. కావున లాభం చేకూర్చే దాన్ని కోరుకో, అల్లాహ్ తఆలా సహాయంకోరు. బలహీనత ప్రదర్శించకు. ఒకవేళ ఏదైనా ఆపదవస్తే, ”ఒకవేళ నేను అలా చేస్తే ఇలా అయ్యేదని అనకు.” అల్లాహ్ తఆల కోరింది అయ్యిందని, నా విధిలో ఉన్నది జరిగిందని భావించు. ఎందుకంటే ఒకవేళ అనేది షై’తాన్ ద్వారాన్ని తెరచి వేస్తుంది”.(సహీ ముస్లిం).
3) ప్రళయదినం నాడు అత్యధిక శిక్ష పడేది వీరిలో ఎవరికి ?
A) బొమ్మలు గీసే వాళ్లకు
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “أَشَدُّ النَّاسِ عَذَابًا عِنْدَ اللهِ الْمُصَوِّرُوْنَ”.
4497. ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రాణుల చిత్రాలు తయారుచేసే వారిని తీర్పుదినం నాడు అందరి కంటే కఠినంగా శిక్షించడం జరుగుతుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)
وَعَنْهَا عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “أَشَدُّ النَّاسِ عَذَابًا يَوْمَ الْقِيَامَةِ الَّذِيْنَ يُضَاهُوْنَ بِخَلْقِ اللهِ”.
4495. ‘ఆయి’షహ్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం, ”తీర్పు దినం నాడు అల్లాహ్ తఆలా సృష్టించిన ప్రాణుల నకిలీ చిత్రాలు చేసేవారిని, అంటే ప్రాణుల చిత్రాలు తయారుచేసే వారిని అందరికంటే కఠినంగా శిక్షించటం జరుగుతుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “قَالَ اللهُ تَعَالى: )وَمَنْ أَظْلَمُ مِمَّن ذَهَبَ يَخْلُقُ كَخَلْقِيْ فَلْيَخْلُقُوْا ذَرَّةً أَوْ لِيَخْلُقُوْا حَبَّةً أَوْ شَعِيْرَةً”(. متفق عليه.
4496. అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. అల్లాహ్ ఆదేశం, ”నేను సృష్టించే వాటిలా సృష్టించే అంటే చిత్రాలు వేసేవాడి కంటే దుర్మార్గుడు మరెవడు కాగలడు? అతడిని ఒక చీమ లేదా ఒక గోధుమ గింజ సృష్టించి చూపమనండి.” (బు’ఖారీ, ముస్లిమ్)
వివరణ-4496: ఇలా ఎందుకు ఆగ్రహించడం జరిగిందంటే, చీమను లేదా గోధుమ గింజను సృష్టించలేడు. అందు వల్ల ప్రాణుల చిత్రాలుగానీ ఫోటోలను గానీ తీయ రాదు అని హెచ్చరించడం జరిగింది
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “كُلُّ مُصَوِّرٍفِي النَّارِيَجْعَلُ لَهُ بِكُلِّ صُوْرَةٍ صَوَّرَهَا نَفْسًا فَيُعَذِّبُهُ فِيْ جَهَنَّمَ”. قَالَ ابْنُ عَبَّاسٍ: فَإِنْ كُنْتُ لَابُدَّ فَاعِلًا فَاصْنَعِ الشَّجَرَوَمَا لَا رُوْحَ فِيْهِ.
4498.’అబ్దుల్లాహ్ బిన్ ‘అబ్బాస్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రాణుల చిత్రాలు తయారు చేసే ప్రతి ఒక్కరినీ నరకంలో వేయబడును. ఇంకా వారితో, చేసిన చిత్రాలన్నింటిలో ప్రాణం పోయమని ఆదేశించటం జరుగును. వారు ఎలాగూ ప్రాణం పోయలేరు, అందువల్ల నరకంలోనే ఉండవలసి వస్తుంది”. ఇబ్నె ‘అబ్బాస్ (రజియల్లాహు అన్హు) అభిప్రాయం, ”ఒకవేళ చిత్రం వేసే అవసరం వస్తే చెట్లు, నిర్జీవ వస్తువుల చిత్రాలు వేసుకోండి.” (బు’ఖారీ, ముస్లిమ్) అంటే బట్టలపై, దుస్తులపై నిర్జీవ ఫలాల, ఆకుల, వస్తువుల చిత్రాలు వేసుకోవచ్చును.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ అంటే ఎవరు? ఇస్లాం అంటే ఏమిటి? https://youtu.be/e6YALKM5wwU [33 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, అల్లాహ్ యొక్క ఏకత్వం, ఆయన గుణగణాలు మరియు సృష్టిలో ఆయన పాత్ర గురించి వివరించబడింది. అల్లాహ్ యే ఈ సృష్టి అంతటికీ మూలాధారుడని, ఆయనే జీవన్మరణాలకు అధిపతి అని మరియు సర్వ మానవాళికి ఉపాధిని ప్రసాదించేవాడని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేయబడింది. మానవులకు మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ ప్రవక్తలను పంపాడని, వారిలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పబడింది. ఇస్లాం అంటే అల్లాహ్ కు లొంగిపోవడమని, ఇది కేవలం ఒక మతవర్గానికి చెందినది కాదని, సర్వ మానవాళికి చెందిన సత్య ధర్మమని నొక్కి చెప్పబడింది. భారతదేశంలో ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే ప్రవేశించిందని, ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం కూడా భారత ఖండంలోనే అవతరించారని చారిత్రక ఆధారాలతో వివరించబడింది. చివరగా, ఇస్లాంను కాదని మరో మార్గాన్ని అనుసరించేవారు పరలోకంలో నష్టపోతారని ఖురాన్ హెచ్చరికతో ప్రసంగం ముగించబడింది.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.
అల్లాహ్ యొక్క పరిచయం
అల్లాహ్ త’ఆలా ఈ సృష్టి అంతటికీ మూలాధారుడు. ఆది నుండి ఉన్నవాడు, అంతము వరకు ఉండేవాడు. సర్వ ప్రాణి, సర్వ సృష్టికి సమాప్తము, వినాశనము అనేది ఉంటుంది. కానీ అల్లాహ్, అతనికి ఎలాంటి మరణము గానీ, ఎలాంటి సమాప్తము గానీ లేదు.
అల్లాహ్, ఏ అస్తిత్వాన్ని, ఎవరినైతే మనం అల్లాహ్ అని అంటామో ఆయన గురించి ఖురాన్ దివ్య గ్రంథంలో ఎన్నో ఆయతులలో ఆయన యొక్క పరిచయం చాలా వివరంగా ఉంది.
اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ (అల్లాహుల్లదీ ఖలకకుమ్, సుమ్మ రజఖకుమ్, సుమ్మ యుమీతుకుమ్, సుమ్మ యుహ్యీకుమ్) ఆయనే మిమ్మల్ని సృష్టించినవాడు. అల్లాహ్ ఆయనే మీ అందరికీ ఆహారం ప్రసాదించేవాడు. ఆ అల్లాహ్ యే మీ అందరికీ మరణం ప్రసాదిస్తాడు మరియు ఆ తర్వాత మరోసారి మిమ్మల్ని బ్రతికిస్తాడు, తిరిగి లేపుతాడు. (30:40)
ఈ విధంగా చూసుకుంటూ పోతే అల్లాహ్ గురించి ఖురాన్ గ్రంథంలో ప్రత్యేకంగా సూర రూమ్, ఇంకా వేరే కొన్ని సూరాలలో చాలా స్పష్టంగా ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఆరాఫ్, ఆయత్ నంబర్ 54.
إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్ అపారమైన శుభాలు కలవాడు.(7:54)
ఆయనే రాత్రిని పగటిపై కప్పుతున్నాడు. మరియు ఈ పగలు అనేది రాత్రి వెంట పడుతుంది. మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఉన్నాయి. వినండి, ఈ లోకంలో ఆదేశం చెల్లేది, ఆజ్ఞ పాలన జరిగేది అల్లాహ్ ది మాత్రమే. సృష్టి ఆయనదే గనక ఆజ్ఞా పాలన కూడా ఆయనదే జరుగును. ఆ అల్లాహ్ సర్వ విశ్వ విశ్వాసాలకు, ఈ సర్వ లోకాలకు ప్రభువు, చాలా శుభము కలవాడు.
ఇంకా ఖురాన్ గ్రంథంలో మనం చూసినట్లయితే,
اللَّهُ الَّذِي رَفَعَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا (అల్లాహుల్లదీ రఫ అస్సమావాత్ బిగైరి అమదిన్ తరౌనహా) స్తంభాలు లేకుండా (నే) ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లాహ్. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. (13:2)
ఆ ఆకాశాలను ఎలాంటి పిల్లర్ లేకుండా ఏ ఒక్క పిల్లర్ లేకుండా పైకి లేపి నిలిపాడు, తరౌనహా, దీనికి ఏ ఒక్క పిల్లర్ లేని విషయం మీరు చూస్తున్నారు. మరోచోట సూర ఇబ్రాహీంలో,
اللَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ (అల్లాహుల్లదీ లహూ మా ఫిస్సమావాతి వ మా ఫిల్ అర్ద్) ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ ఆ అల్లాహ్‌దే. (14:2)
وَوَيْلٌ لِلْكَافِرِينَ مِنْ عَذَابٍ شَدِيدٍ (వ వైలున్ లిల్ కాఫిరీన మిన్ అదాబిన్ షదీద్) తిరస్కారుల కొరకు కఠిన శిక్ష మూలంగా వినాశం ఉంది. (14:2)
మరి ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తున్నారో, అల్లాహ్ ను తిరస్కరిస్తున్నారో అలాంటి వారికి వినాశనం ఉంది మరియు చాలా భయంకరమైన శిక్ష ఉంది. ఇంకా ఈ రకంగా చూసుకుంటే ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఇబ్రాహీం.
اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ وَسَخَّرَ لَكُمُ الْفُلْكَ لِتَجْرِيَ فِي الْبَحْرِ بِأَمْرِهِ ۖ وَسَخَّرَ لَكُمُ الْأَنْهَارَ భూమ్యాకాశాలను సృష్టించి, ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీ ఆహారం కోసం పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసినవాడే అల్లాహ్. ఆయనే తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడవటానికి వాటిని మీకు లోబరచాడు. ఆయనే నదీ నదాలను మీ అధీనంలో ఉంచాడు. (14:32)
మానవ సృష్టి మరియు మార్గదర్శకత్వం
అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, ఆ సృష్టికర్త, పోషణకర్త, జీవన్మరణాల ప్రధాత, ఈ సర్వ సృష్టికి మూలం ఆయనే. అయితే సర్వ సృష్టిని మన సేవ కొరకు, మనం వాటి ద్వారా లాభం పొందడానికి సృష్టించాడు. సూర బఖరాలోని మూడవ రుకూలో,
هُوَ الَّذِي خَلَقَ لَكُمْ مَا فِي الْأَرْضِ جَمِيعًا (అల్లదీ ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ) భూమిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకే సృష్టించినవాడు ఆయనే. (2:29)
ఆ అల్లాహు త’ఆలా ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని, ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ, సమస్తాన్ని మీ కొరకు పుట్టించాడు. కానీ మనల్ని కేవలం ఆయన్ని ఆరాధించుటకే పుట్టించాడు. ఆయన్ను ఎలా ఆరాధించాలి? అందుకొరకు ఆయన స్వయంగా ఏదైనా అవతారం ఎత్తి ఈ లోకంలో రాలేదు. ఎలాగైతే వేరే కొందరు తప్పుడు మార్గాల్లో ఉన్నారో, కొందరు ఏమనుకుంటారు, స్వయంగా అల్లాహ్ లేదా వారి వారి భాషల్లో వారు అల్లాహ్ ను దేవుడు అని, ఈశ్వరుడు అని ఏదైతే అనుకుంటారో వారి యొక్క తప్పుడు విశ్వాస ప్రకారం, ఆ సృష్టికర్త మానవులకు మార్గం చూపడానికి అవతారం ఎత్తి వస్తాడు అని, లేదా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక దేవుడై వారిలో ఒకరిని మానవులకు మార్గం చూపడానికి పంపాడు అని, ఇవన్నీ కూడా తప్పుడు విశ్వాసాలు.
ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ ఏం చేశాడు? ఆయన మానవుల్లోనే అతి ఉత్తమ నడవడిక గల మరియు మానవుల్లోనే అందరికీ తెలిసి ఉన్న ఒక మంచి వ్యక్తిని తనకు మరియు తన దాసులకు మధ్య ప్రవక్తగా, ఒక సందేశ దూతగా ఎన్నుకున్నాడు.
اللَّهُ يَصْطَفِي مِنَ الْمَلَائِكَةِ رُسُلًا وَمِنَ النَّاسِ (అల్లాహు యస్తఫీ మినల్ మలాఇకతి రుసులన్ వ మినన్నాస్) అల్లాహ్ తన సందేశహరులుగా దైవదూతలలో నుండి, మానవులలో నుండి ఎన్నుకుంటాడు. (22:75)
అల్లాహు త’ఆలా దైవదూతల్లో కూడా సందేశ దూతలను ఎన్నుకుంటాడు, అలాగే మానవుల్లో కూడా అల్లాహు త’ఆలా తనకిష్టమైన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. ఎన్నుకొని అతని వద్దకు తన దూత ద్వారా గాని లేదా డైరెక్ట్ అతని హృదయ ఫలకం మీద తన యొక్క సందేశాన్ని అవతరింపజేస్తాడు. ఆ ప్రవక్త అల్లాహ్ యొక్క ఆ సందేశాన్ని తీసుకొని, స్వీకరించి, నేర్చుకొని, తర్వాత ప్రజలకు వినిపిస్తారు.
ఈ విధంగా ఖురాన్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎన్నో సందర్భాల్లో ఈ విషయం తెలిపి ఉన్నాడు. అల్లాహు త’ఆలా తనకిష్టమైన ప్రజల్లోని ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత ఆ ప్రవక్తగా చేసిన తర్వాత అతని వద్దకు దైవదూతను పంపి గానీ, అతని వద్దకు దివ్యవాణి పంపి గానీ, వహీ. మరి లేదా ఏదైనా పర్దా, హిజాబ్ అడ్డులో ఉండి మాట్లాడి గానీ అల్లాహు త’ఆలా తన యొక్క సందేశాన్ని అతని వద్దకు చేర్పిస్తాడు. ఈ విధంగా మానవులు ఎలా అల్లాహ్ ను ఆరాధించాలి, ఆ ఆరాధన మార్గాన్ని తన ప్రవక్తల ద్వారా వారికి నేర్పుతాడు.
ఇక ఎవరైతే వక్రమార్గంలో పడి, స్వాభావిక వారి యొక్క ఫిత్రత్, స్వాభావికం, ప్రకృతి విధానాన్ని వదిలేసి తప్పుడు ఆచారాల్లో, దురాచారాల్లో పడి ఉంటారో, వారు ఏమంటారు, ఈ మాలాంటి ఒక మనిషి మమ్మల్ని ఎందుకు మంచి గురించి చెప్పాలి? ఎందరో ప్రవక్త కాలాల్లో ప్రవక్తను తిరస్కరించినవారు,
أَبَشَرٌ يَهْدُونَنَا (అ బషరున్ యహ్దూననా) ‘ఏమిటి, సాటి మానవులు మాకు మార్గదర్శకత్వం చేస్తారా?!’ (64:6)
మాలాంటి మనిషే కదా ఇతను, ఇతని మీదనే అల్లాహు త’ఆలా ఎందుకు వహీ పంపాడు? ఇతన్నే ప్రవక్తగా ఎందుకు ఎన్నుకున్నాడు? మాలో ఇంకా వేరే ఎవరు లేకుండేనా? అంటే దీని భావం ఏంటి? ఈ విధంగా వ్యతిరేకించడం మనిషిలో ఈ వ్యతిరేక గుణం మొదలైంది అంటే, ప్రతి దాన్ని, స్వయంగా తన తండ్రిని అనవచ్చు. నువ్వే నాకు ఎందుకు తండ్రిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే నాకు ఎందుకు తల్లిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే మాకు ఎందుకు రాజుగా ఉన్నావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? ఇతడే ఎందుకు మాకు ప్రవక్తగా వచ్చాడు అన్న విషయం, దాని గురించి అల్లాహు త’ఆలా ఒక సమాధానం ఏమి చెప్పాడు? అల్లాహ్ అతనిదే సృష్టి, అతనిదే ఆజ్ఞా పాలన జరుగును. అతడు తాను కోరిన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. అల్లాహ్ యొక్క సృష్టిలో అల్లాహ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడిగే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే అల్లాహ్ చేసేది మానవుల మేలు కొరకు, అది ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఇలాంటి అడ్డ ప్రశ్నలు వేస్తారో వారు ప్రకృతి సిద్ధాంతాలకు దూరమై వక్రమార్గంలో నడుస్తూ ఉంటారు.
మరికొందరు ఏమన్నారు? సరే, మాకు సన్మార్గం చూపడానికి అల్లాహ్ యొక్క ఇష్టం ఉండేది ఉంటే, ఏదైనా దైవదూతలను పంపే, పంపకపోయేదా? దైవదూతలను ఎందుకు పంపలేదు? అయితే సూర అన్ఆమ్ లో దాని యొక్క సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. వలౌ జఅల్నాహు మలకన్, ఒకవేళ దైవదూతలను మేము వారి మధ్యలో ప్రవక్తగా చేసి పంపినా, వారిని ఆ దైవదూత రూపంలో ఉంచలేము. వారిని ఒక మనిషిగా చేసి వారికి ఎందుకంటే గమనించండి, మానవుల అవసరాలు దైవదూతల అవసరాలకు భిన్నంగా ఉంటాయి. అయితే మానవులకు సన్మార్గం చూపడానికి మానవుల్లోనే ఒక జ్ఞానం ఉన్న, మంచి నడవడిక గల, ఇతరులకు ఆదర్శంగా ఉండగలిగే అటువంటి వారినే అల్లాహు త’ఆలా ఎన్నుకుంటాడు.
ఇస్లాం – సర్వ సృష్టి యొక్క ధర్మం
అయితే సోదరులారా, చెప్పే విషయం ఏంటంటే, అల్లాహ్, ఆయన ఎలాంటి అవతారం ఎత్తడు. ఆయన ఒకరి ఏదైనా వేషంలో ఇహలోకంలోకి రాడు, మానవులకు మార్గం చూపడానికి. ఆయన సిద్ధాంతం ఏంటి? ఇంతకుముందు గ్రంథాల్లో కూడా ఆ విషయాల్ని తెలియబరిచాడు. చిట్టచివరి గ్రంథం ఖురాన్ లో కూడా స్పష్టపరిచాడు. అయితే మానవులకు మార్గం చూపడానికి అల్లాహు త’ఆలా ప్రవక్తల పరంపర ఏదైతే మొదలుపెట్టాడో ఆదం అలైహిస్సలాం నుండి, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఈ పరంపర సాగుతూ వచ్చింది. ముహమ్మద్ ప్రవక్త ద్వారా ఈ ప్రవక్తల పరంపరను అల్లాహు త’ఆలా అంతం చేశాడు. ఆయనను చివరి ప్రవక్తగా పంపాడు. మరియు ప్రళయం సంభవించే వరకు ఆ ప్రవక్తనే మనం ఆదర్శంగా, మనం అంటే సర్వ మానవులం, ఆదర్శంగా చేసుకొని అల్లాహ్ ఆయనపై పంపినటువంటి దివ్య ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకొని, ఆ దివ్య ఖురాన్ ను ప్రవక్త ముహమ్మద్ వారు ఎలా ఆచరించారో అలా ఆచరించే ప్రయత్నం చేయాలి అని అల్లాహ్ మనకు ఆదేశించాడు. అందు గురించి సూర ఇబ్రాహీం గానీ ఇంకా వేరే సూరాలు మనం చూసేది ఉంటే,
كِتَابٌ أَنْزَلْنَاهُ إِلَيْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ (కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస మినజ్జులుమాతి ఇలన్నూర్) (ఇది) ఒక గ్రంథం. దీనిని మేము నీపై అవతరింపజేశాము – నీవు ప్రజలను వారి ప్రభువు అనుమతితో చీకట్లలో నుంచి వెలుగులోకి తీసుకురావటానికి. (14:1)
సర్వ ప్రజల్ని మీరు చీకట్లలో నుండి తీసి వెలుతురులోకి, ప్రకాశంలోకి తీసుకురావాలి అని. అయితే ఈ రోజుల్లో ఎంతోమంది ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోలేదో, వారు ఏమనుకుంటారు, ఇస్లాం ధర్మం అన్నది ప్రవక్త ముహమ్మద్ ది. ఇది కేవలం ముస్లింల ప్రవక్త, కేవలం ముస్లింల ధర్మం మరియు ఖురాన్ ఇది కేవలం ముస్లింల ధర్మం. కానీ ఇది నిజమైన మాట కాదు.
స్వయంగా ఒకవేళ మనం ఖురాన్ లో చూసి ఉంటే, ఇక్కడ ఎన్నో సందర్భాల్లో అల్లాహు త’ఆలా ఖురాన్ గురించి, ప్రవక్త ముహమ్మద్ గురించి, ఇస్లాం ధర్మం గురించి, అల్లాహ్ గురించి, అల్లాహ్ అంటే అల్లాహ్ స్వయంగా తన గురించి, అల్లాహ్ అనే అతను ముస్లింల దేవుడే కాదు. సర్వ మానవుల దేవుడు. అందు గురించి ఖురాన్ స్టార్టింగ్ లోనే మొట్టమొదటి ఆదేశం అని అనబడుతుంది. రెండో రుకూ పూర్తయిన తర్వాత మూడో రుకూ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో,
يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ (యా అయ్యుహన్నాస్ ఉ’బుదూ రబ్బకుమ్) ఓ ప్రజలారా! మిమ్మల్ని, మీకు పూర్వం గడిచిన వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. తద్వారా మీరు దైవభీతిపరులు కాగలరు. (2:21)
ఓ ప్రజలారా, ముస్లింలారా, అరబ్బులారా, ఈ విధంగా అనబడలేదు. యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా, ఉ’బుదూ రబ్బకుమ్, మీ ప్రభువుని మీరు ఆరాధించండి. ఎవరు ఆ ప్రభువు? అల్లదీ ఖలకకుమ్, ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, వల్లదీన మిన్ కబ్లికుమ్, మీ కంటే ముందు ఉన్న వారిని, ముందు గతించిన వారిని పుట్టించాడో. లఅల్లకుమ్ తత్తకూన్, ఈ విధంగా మీరు నరకం నుండి తమకు తాము రక్షించుకోవచ్చు.
అయితే ఇక్కడ సర్వ ప్రజల్ని అల్లాహ్ ఉద్దేశించి కేవలం ఆ ఏకైక సృష్టికర్తను, అల్లాహ్ ను మాత్రమే పూజించాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా,
يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا (యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ) “ఓ మానవులారా! నేను మీ అందరి వైపునకు అల్లాహ్ పంపిన ప్రవక్తను.” (7:158)
ఓ జనులారా, ఓ మానవులారా, నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. సందేశ దూతగా పంపబడ్డాను. ఎవరి వైపు నుండి? ఆ అల్లాహ్ వైపు నుండి,
ఈ సర్వ ఆకాశాల మరియు భూమిలో ఉన్న సర్వానికి అధికారి ఆయన మాత్రమే.
ఇక ఖురాన్ గ్రంథం, ఇంతకుముందు నేను సూర ఇబ్రాహీం ఒక ఆయత్ మీకు ముందు చదివాను, కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస్. ఈ గ్రంథం ఏదైతే మీపై అవతరింపజేశామో, దీని ద్వారా మీరు ప్రజలను, అరబ్బులను అని అనలేదు, ప్రజలను మిమ్మల్ని చీకట్ల నుండి వెలుతురు వైపునకు తీయడానికి పంపాము. అంతేకాకుండా ఒక చాలా ప్రఖ్యాతి గాంచిన ఆయత్, సర్వసామాన్యంగా ఎందరో హిందువులకు కూడా ఇది తెలిసి ఉంటుంది కావచ్చు.
شَهْرُ رَمَضَانَ الَّذِي أُنْزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِلنَّاسِ (షహ్రు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్, హుదల్లిన్నాస్) రమజాను నెల – ఆ నెలలోనే ఖుర్ఆన్ అవతరించింది. అది మానవులందరికీ మార్గదర్శకత్వం వహించేది. (2:185)
రమదాన్ మాసంలో ఖురాన్ అవతరించింది, హుదల్లిన్నాస్, ఈ ఖురాన్ సర్వ మానవాళికి మార్గదర్శకత్వం.
అయితే సోదరులారా, ఈ రోజుల్లో సర్వ మానవులు కేవలం అల్లాహ్ ను మాత్రమే విశ్వసించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని విశ్వసించాలి, ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించాలి, తమ జీవితం అల్లాహ్ పంపిన ఈ గ్రంథం, అల్లాహ్ పంపిన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శ ప్రకారంగానే గడపాలి.
ఇస్లాం పై అపోహలు
కానీ, మన, సామాన్యంగా మనం, మన తెలుగు దేశంలో అనండి, తెలుగుదేశం అంటున్నాను, అంటే పార్టీ అనట్లే నేను, ఆంధ్ర, తెలంగాణ అని ఇక రెండు పేర్లు చెప్పేదానికి బదులుగా, లేక మొత్తం భారతదేశంలో అనండి, సామాన్యంగా ఏమంటారు, ఈ ఇస్లాం దేశం ఒక 700 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం మన ఇండియాలోకి వచ్చింది. అంతకుముందు ఇస్లాం అనేది లేదు. అందు గురించి మధ్యంతరంలో పుట్టుకొచ్చిన విషయం ఇది, దీన్ని ఎందుకు మనం స్వీకరించాలి? మన తాత ముత్తాతలు పాతకాలం నుండి ఏ ఆచారం మీద ఉన్నారో, ఏ ధర్మం మీద ఉన్నారో అలాగే ఉండాలి అని ఒక మాట అంటారు. విన్నారు కదా ఎన్నోసార్లు.
అయితే దీంతో మనకు గొడవ అవసరం లేదు. ప్రేమపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా, గ్రంథాల ఆధారంతో మీరు సత్యాన్ని తెలుసుకోండి అని వారికి నచ్చచెబుదాము. దానికి మనం ఏ పద్ధతిలో వారికి నచ్చ చెప్పాలి? మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇస్లాం అంటే ఏంటి? దాని అర్థం, దాని భావం ఏంటో నచ్చచెప్పాలి. ఇస్లాం అంటే ఏదో కొత్త ధర్మం కాదు. ఇస్లాం అంటే ఒకరికి ఏదైనా శత్రుత్వం వహించే లేదా ఒకరి గురించి ఏదైనా చెడు చూపించేటువంటి విషయం కాదు. ఇస్లాం అన్నదానికి భావం, మనం మన సృష్టికర్తకు లొంగబడి ఆయన ముందు తలవంచి ఆయన ఇష్ట ప్రకారం జీవితం గడపడం. ఇంకా నేను వివరంలో లోతుగా వెళ్ళలేను, సలము నుండి ఒక భావం దీని గురించి లొంగిపోవట అని వస్తుంది. శాంతిని పొందుట అని కూడా వస్తుంది. ఈ రెండిటినీ కలిపితే, మీరు మీ సృష్టికర్తకు లొంగిపోయి ఇహపరలోకాల్లో శాంతిని పొందండి.
ఈ రకంగా చూసుకుంటే, సీన్, లామ్, మీమ్ అన్న ఈ మూడు అక్షరాలు మూల పదం ఏదైతే ఉందో ఇస్లాంకి, దానికి అనుగుణంగా ఈ పదం ఎన్నో రకాలుగా ఏదైతే వాడబడుతుందో, అస్లమ, యుస్లిము, యుస్లిమూన, ముస్లిమూన, ఈ విధంగా ఖురాన్ లో మీరు చూసి ఉంటే, ఒక సందర్భంలో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడో గమనించండి.
أَفَغَيْرَ دِينِ اللَّهِ يَبْغُونَ (అఫగైర దీనిల్లాహి యబ్గూన్) ఏమిటి, వీరు అల్లాహ్ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? (3:83)
ఏమైంది ఈ ప్రజలకు? అల్లాహ్ పంపినటువంటి సత్య ధర్మాన్ని మాకు వద్దు, మేము ఈ సత్య ధర్మాన్ని స్వీకరించమని అంటున్నారా, తిరస్కరిస్తున్నారా, ఇష్టం లేదు అని అంటున్నారా?
وَلَهُ أَسْلَمَ مَنْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا (వలహూ అస్లమ మన్ ఫిస్సమావాతి వల్ అర్ది తౌఅన్ వ కర్హా) వాస్తవానికి భూమ్యాకాశాలలోని సమస్త వస్తువులు – ఇష్టపూర్వకంగా గానీ, అయిష్టంగా గానీ – ఆయనకే విధేయత చూపుతున్నాయి. (3:83)
మీరు మానవులు, ఐదు ఫిట్ల మనిషి, నాలుగున్నర ఫిట్ల మనిషి, మీ సంగతేంటి? మీకంటే పెద్ద పెద్ద సృష్టి రాశులు, ఆకాశం, ఆకాశాల్లో ఉన్న సర్వము, భూమి, భూమిలో ఉన్న సర్వము, అవన్నీ కూడా అస్లమ, లొంగిపోయి ఉన్నాయి. విధేయత పాటిస్తున్నాయి. అల్లాహ్ ఆజ్ఞా పాలన చేస్తున్నాయి, వారికి ఇష్టమైనా, ఇష్టం కాకపోయినా. అస్లమ, వారందరూ ఇస్లాంలోకి వచ్చారు, అంటే ఏంటిది? ఈ సర్వ సృష్టి మనం చూస్తున్నాము, సూర్యుడిని అల్లాహ్ పుట్టించినప్పటి నుండి ఒక్కసారైనా దైవం, అంటే అల్లాహ్ యొక్క నిర్ణయం, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆ సూర్యుని గురించి నిర్ణయించిన దారిని, మార్గాన్ని ధిక్కరించి, వ్యతిరేకించి నడుస్తుందా? నడుస్తున్నాడా? అలా అయితే ఇప్పటివరకు ఎప్పుడో నాశనం అయిపోయేది.
సోదరులారా, ఈ ఒక్క విషయం చెప్పాను సూర్యుడని. ఇస్లాం ధర్మం అంటే ఏంటిది? ఇది ఏదో కొత్త 400 సంవత్సరాల క్రితం, 1400 సంవత్సరాల క్రితం, 700 సంవత్సరాల క్రితం వచ్చిన ధర్మం కాదు. ఆది మానవుడి నుండే కాదు, అంతకు ముందు నుండి ఉంది. ప్రతి సృష్టి అల్లాహ్ కు లొంగి ఉన్నది. అయితే మానవులను కూడా అల్లాహ్ పుట్టించింది ఆయన ఆదేశం పాటించి, ఆయనను మాత్రమే ఆరాధించుటకు.
అయితే చివరిగా ఈ సందేశం సంపూర్ణం చేయబడింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద. అందుగురించే ఇప్పుడు ఇదియే ఇస్లాం, అంటే ఖురాన్, అల్లాహ్, ముహమ్మద్ ప్రవక్త. వీటిని ఈ ముగ్గురిని, మూడింటిని మనం స్వీకరించడం, అంగీకరించడం, ఒప్పుకోవడం ప్రకారంగా జీవితం గడపడం తప్పనిసరి.
ఇక ఏదైతే పుకారు ఉందో, వెయ్యి సంవత్సరాల క్రితమని, ఇది కూడా తప్పు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగరంలో ఉన్నప్పుడే భారత ఖండంలో ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం అంటే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిచయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన సత్య ధర్మం అప్పుడే ఇండియాలో చేరింది. ఇప్పటికీ దాని యొక్క గుర్తులు, దాని యొక్క చిహ్నాలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించిన సహాబాలు, వారిలో ఇద్దరి సమాధులు ఇప్పటికీ ఇండియాలో ఉన్నాయి. కానీ చరిత్ర నుండి కూడా దూరమై, కళ్ళు మూసుకొని లేదా తెలిసినప్పటికీ వాటి మీద ముసుగు వేసి సత్యాన్ని స్వీకరించకపోతే అది వేరే విషయం.
మరొక చారిత్రక విషయం, దాని గురించి ఖురాన్ లో, హదీస్ లో ఎలాంటి ప్రూఫ్ అనేది లేదు, కానీ చారిత్రకంగా ఒక విషయం చాలా ప్రఖ్యాతి గాంచి ఉంది. అదేమిటంటే ఆది మానవుడు అని ఎవరినైతే అనడం జరుగుతుందో, అంటే ఆదం అలైహిస్సలాం మరియు ఆయన యొక్క భార్య హవ్వా అలైహిస్సలాం, వీరిద్దరినీ అల్లాహు త’ఆలా స్వర్గం నుండి ఏదైతే దించాడో అప్పుడు ఆదం అలైహిస్సలాం ఆ కాలంలో ఇండియా, ఇప్పుడు ఉన్న ఇండియా, శ్రీలంక ఇదంతా కలిసి ఉండే, అయితే సరాందీప్ అనే ప్రాంతంలో వచ్చారు, దిగారు, తర్వాత అక్కడి నుండి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్లి మక్కాలో చేరుకున్నారు అని కూడా చారిత్రకంగా ఒక మాట ఉంది. దీన్ని నిరాకరించడానికి ఇంతకంటే బలమైన ఏదైనా విషయం ఉండేది ఉంటే అది వేరే విషయం. కానీ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను? అయితే మన భారత ఖండంలోనే ఆది మానవుడు అవతరించాడు. ఆ ఆది మానవుడు అల్లాహ్ యొక్క దాసుడు. అతను ముస్లిం. అతని నుండి వచ్చిన సర్వ సంతానము ఇస్లాం ధర్మ ప్రకారంగానే ఉంటుంది. అల్లాహ్ ఖురాన్ లో ఏమి చెప్పాడు?
فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا (ఫిత్ రతల్లాహిల్లతీ ఫతరన్నాస అలైహా) అల్లాహ్ మానవులను ఏ ప్రకృతిపై పుట్టించాడో దానినే అవలంబించు. (30:30)
మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, “కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్రా.” పుట్టే ప్రతి పిల్లవాడు ఫిత్రత్, ప్రకృతి ధర్మం, స్వాభావిక ధర్మంపై పుడతాడు. కానీ అతనికి మాటలు రావు, ఇంకా ఏమీ అనుభవం ఉండదు గనక, ఫ అబవాహు యుహవ్విదానిహి. అతని యొక్క తల్లిదండ్రి యూదులైతే, అబ్బాయిని కూడా యూదునిగా చేసేస్తారు. తల్లిదండ్రులు ఒకవేళ అగ్ని పూజారులైతే, ఆ పిల్లవాడు కూడా అలాగే మారిపోతాడు. కానీ ఎప్పుడైతే అతడు పెరుగుతాడో, బుద్ధి జ్ఞానం గలవాడైతాడో, సత్యాన్ని తెలుసుకుంటాడో, ధర్మాన్ని వెతుకుతాడో, అతనికి సత్యం అనేది తెలిసి రావచ్చు. ఒకవేళ ఇహలోక ఏదైనా ఆశలు, ఇహలోక ఏవైనా భయాలు, లేదా హోదా, అంతస్తుల దురాశలు, ఇలాంటివి ఏవీ అడ్డు రాకుంటే, తప్పకుండా మనిషి సత్యం విన్న తర్వాత, అతనికి మాట అర్థమవుతుంది, స్వీకరించగలడు. ఎందుకంటే ఇహలోకంలో నేనే రాజుని అని కాదు, నేనే మీ ప్రభువుని, నా ముందే మీరు తలవంచాలి అన్నటువంటి గర్వానికి గురియై ఎంతో గర్వంతో విర్రవీగుతూ కొంతకాలం ప్రజల్ని తన ముందు, తమ ముందు వంచించుకున్న అలాంటి పెద్ద పెద్ద నాయకులు స్వయంగా వారి ప్రాణం పోయే సందర్భంలో ఏమన్నారు? ఫిరౌన్, అతని కంటే దుర్మార్గుడు, దౌర్జన్యుడు బహుశా ఇంకా వేరే ఒకడు రాలేదు. అతడు కూడా ఏమన్నాడు? మూసా మరియు హారూన్ ల యొక్క ప్రభువు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రభువుని నేను విశ్వసిస్తున్నాను అన్నాడు.
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ప్రవక్త. ఆయన కాలంలో ఎవరైతే ప్రవక్తకు వ్యతిరేకంగా నాయకత్వం వహించారో, వారిలో ఒకరి పేరు అబూ జహల్. ప్రవక్త అతని గురించి ఏమన్నాడు ఒకసారి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ జహల్ గురించి ఒకసారి ఏమన్నారు? ఈ అబూ జహల్ ఈ కాలానికి ఫిరౌన్ లాంటివాడు. కానీ అంతటి ఆ దుర్మార్గుడు దొంగచాటుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ పఠించేటప్పుడు వినేవాడు. విన్నాడు. విని, సత్యం అతనికి తెలిసింది. అతని యొక్క దగ్గరి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు లాంటి వాడు, అతన్ని అడిగాడు కూడా, రాత్రి నేను కూడా ఖురాన్ విన్నాను, నువ్వు కూడా దొంగచాటుగా విన్నావు అంటే నేను వినలేదు అని ముందు అన్నాడు. తర్వాత చెప్పాడు, చెప్పే మాట అతనిది బాగానే అనిపిస్తుంది, కానీ ఇతడి వంశం, అబూ జహల్ యొక్క వంశం ముత్తాతల్లో ఒకరి వైపు నుండి వస్తుంది, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దే మునాఫ్ నుండి వస్తారు. వీరి యొక్క వంశంలో వారు ఎలాంటి అన్ని మంచి కార్యాలు చేసుకుంటూ వచ్చారో, మనం కూడా చేసుకుంటూ వచ్చాము. కానీ ఈరోజు ఇతడు కొత్త ఏదో మాట మొదలు పెట్టాడు కదా, అలాంటి హోదా అంతస్తు మనకు దొరకదు కదా. అంటే కేవలం ప్రపంచ దురాశలకు లోనై సత్యాన్ని తిరస్కరించలేదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చిన తర్వాత, మదీనా వలస వచ్చిన తర్వాత అక్కడ ప్రవక్తకు శత్రువుల్లో చాలా కఠినంగా వ్యతిరేకించిన వారిలో ఒకతని పేరు హుయై బిన్ అఖ్తబ్, యూదుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్యల్లో ఒక భార్య ఎవరు? సఫియ్యా రదియల్లాహు అన్హా. ఆ నాయకుని యొక్క కుమార్తె. ఆమె ఇస్లాం స్వీకరించింది. ప్రవక్తకు భార్యగా అయింది. ఆమె ఒక సందర్భంలో చెప్తుంది, నేను ఇంకా చాలా నా చిన్న వయసు నాది. ప్రవక్త ఆ రోజుల్లో మదీనాలో వచ్చే సందర్భంలో మా నాన్న మరియు మా చిన్న తండ్రి, చాచా, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అతడు వచ్చేసాడు మదీనాలో అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి. మరి ఏంటి ఉద్దేశం? అతని గురించి మన గ్రంథాల్లో కూడా వచ్చింది ఉంది కదా, చిట్టచివరి ప్రవక్త అని. ఇద్దరు ఆ సత్య విషయాలన్నీ తెలుసు వారికి. ఎందుకంటే యూద గ్రంథాల్లో కూడా ప్రవక్త ముహమ్మద్ గురించి వచ్చింది ఉంది ప్రస్తావన. కానీ వారు ఏమన్నారు? లేదు, లేదు, లేదు, మనం ప్రాణం ఉన్నంతవరకు అతన్ని వ్యతిరేకించి, అతనికి తిరుగుబాటుగా, ఎదురుగానే మనం ఉండాలి, అంటే ఈ రోజుల్లో ఏమనవచ్చు మనం, అపోజిషన్ పార్టీలోనే ఉండాలి, ఎప్పుడు కూడా వారితో కలవవద్దు.
అయితే ప్రపంచ దురాశాలకు గురై కూడా ఎందరో ఇలాంటి సత్యాన్ని తిరస్కరించిన వారు ఉన్నారు. అందు గురించి సోదరులారా, ఇవన్నీ మనకు ఇహలోకంలో కొద్ది రోజులు మాత్రమే పనికి వస్తే రావచ్చు, అందరికీ కూడా రావు. కానీ చివరికి చనిపోయే సందర్భంలో కూడా సత్యాన్ని తిరస్కరించడం, ధర్మాన్ని వ్యతిరేకించడం, ఏ మాట మనకు తెలిసిందో అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు నుండి దాన్ని అమలు చేయనందుకు, అమలు పరచనందుకు, తప్పకుండా దీని గురించి ప్రశ్నించబడుతుంది మరియు పరలోకంలోనైతే చాలా నష్టపోతాము. అందు గురించి ఖురాన్ లో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడు?
وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ (వ మన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుఖ్బల మిన్హు) ఎవడైనా ఇస్లాంను కాదని మరో ధర్మాన్ని అవలంబించదలిస్తే, అది అతని నుండి ఎంతమాత్రం స్వీకరించబడదు. మరి అతను పరలోకంలో నష్టపోయే వారిలో చేరతాడు. (3:85)
ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని తనకు ధర్మంగా ఒప్పుకుంటాడో, దాన్ని స్వీకరించి బ్రతుకుతాడో, ఫలన్ యుఖ్బల మిన్హ్, అది అతని నుండి ఎన్నటికీ స్వీకరించబడదు. వహువ ఫిల్ ఆఖిరతి, ఇక్కడ ఒక విషయం గమనించండి. అల్లాహ్ ఏమంటున్నాడు? వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. అతడు పరలోకంలో చాలా నష్టపోయే వారిలో కలుస్తాడు. ఇహలోకం గురించి చెప్పలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొందరు తప్పుడు మార్గంలో ఉన్నప్పటికీ అల్లాహ్ తొందరగా పట్టి శిక్షించడు. కొంత వెసులుబాటుని ఇస్తూ ఉంటాడు. అందు గురించి ఇలాంటి వెసులుబాటుని పొంది తప్పుడు భావంలో పడకూడదు. అల్లాహు త’ఆలా మనందరికీ సన్మార్గం చూపుగాక. ఇస్లాం ధర్మం స్వయంగా అర్థం చేసుకొని ఇతరులకు దానిని అర్థం మంచిగా నచ్చచెప్పే భాగ్యం ప్రసాదించుగాక.
జజాకుముల్లాహు ఖైరన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.