[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
హునైన్ యుద్ధం జరిగిన రోజున అల్లాహ్ మిమ్మల్ని ఆదుకున్నాడు. ఆ సందర్భంగా మీరు మీ అధిక సంఖ్యపై గర్వపడ్డారు. కాని ఆ సంఖ్యాబలం మీకే విధంగానూ ప్రయోజనం కలిగించలేదు. భూమి విశాలంగా ఉండి కూడా మీకోసం ఇరుకై పోయింది. అప్పుడు మీరు వెన్ను చూపి మరలిపోయారు. ఆ తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై, విశ్వాసులపై తన తరపు నుంచి స్థిమితాన్ని అవతరింపజేశాడు. మీకు కానరాని సేనలను పంపించాడు. సత్య తిరస్కారులను శిక్షించాడు. (9:25,26)
తాయిఫ్ నగరానికి మాజీ నాయ కుడు జురైజ్. ఆయన వయోవృద్ధుడు, అంధుడు. యుద్ధతంత్రాల గురించి ఆయనకు బాగా తెలుసు. ఆయన, ఒక ఒంటె మీద కూర్చొని ఉన్నాడు. సేవకుడు ఒంటె తోలుకొని వెళ్తున్నాడు. ప్రస్తుతం తాము ఏ ప్రదేశంలో ఉన్నామని ఆయన తన సేవకుణ్ణి అడిగాడు. అది ఔతాస్ ప్రదేశమని సేవకుడు చెప్పాడు. అక్కడే విడిది చేయమని జురైజ్ తన ప్రజలకు సలహా ఇచ్చాడు. ఆ ప్రదేశం కొండలేవీ లేకుండా, మరీ సమతలంగాను కాకుండా చాలా అనుకూలంగా ఉంది.
అక్కడికి కొద్దిదూరంలో ఆయనకు స్త్రీల, పిల్లల శబ్దాలు, జంతువుల అరుపులు వినిపించాయి. అక్కడ ఎవరున్నారని ఆయన తన సేవకుల్ని అడిగాడు. “మన కొత్త నాయకుడు మాలిక్ ప్రజలను యుద్ధానికి సమాయత్తం చేస్తున్నాడు. ధనసంపదల్ని, భార్యాబిడ్డల్ని సైతం వెంటబెట్టు కొని ఒక చోట సమావేశం అవమని ఆయన ప్రజలకు ఆదేశించాడు” అని సేవకులు జురైజ్ కు తెలిపారు. తనను ఆ కొత్త నాయకుని వద్దకు తీసుకువెళ్ళమని జురైజ్ సేవకుల్ని కోరాడు. సేవకులు ఆయన్ని మాలిక్ దగ్గరికి తీసుకు వెళ్ళారు. జురైజ్, మాలిక్ ను “ఏం జరుగుతుందిక్కడ?” అని అడిగాడు. దానికి మాలిక్ బదులిస్తూ, “ముహమ్మద్ ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాకుండానే నిక్షేపంగా మక్కాలోకి ప్రవేశించాడు. మక్కా తర్వాత పెద్ద నగరం మాదే. కనుక భవిష్యత్తులో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనపై కూడా దాడి చేయవచ్చు. హవాజిన్, నస్ర్, జుషామ్, సఖీఫ్ మొదలగు తాయిఫ్ తెగలన్నీ కూడా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీద మెరుపుదాడి చేయాలని నిశ్చయించాయి” అని చెప్పాడు. అది విని జురైజ్, “మరయితే ఇక్కడ పశువుల అరుపులు, చిన్న పిల్లల ఏడుపులు ఎందుకు వినపడుతున్నాయి?” అని అడిగాడు. దానికి సమాధానమిస్తూ మాలిక్, “మనవాళ్లు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సైన్యాన్ని చూసి బెదిరిపోయి యుద్ధం చేయకుండా ఉంటారేమోనని నాకు భయంగా ఉంది. అందుకని నేను వారి స్త్రీలను, పిల్లలను యుద్ధ మైదానానికి వెంట తీసుకొచ్చాను. తమ భార్యాబిడ్డల్ని, సిరిసంపదల్ని కాపాడుకోవటానికి అయినా మన సైనికులు తప్పకుండా యుద్ధం చేయవలసి ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. దానికి జురైజ్ తల అడ్డంగా ఆడిస్తూ, “ఈ విషయంలో నేను నీతో ఏకీభవించలేను. మీరు ఓడిపోతే మీ భార్యాబిడ్డల ముందే అవమానం పాలవుతారు. కాబట్టి వీళ్లను యుద్ధమైదానం నుంచి పంపేయండి” అని సలహా ఇచ్చాడు. కాని మాలిక్ మాత్రం తల పొగరుతో, “నీవు ముసలోడివై పోయావు. యుద్ధ తంత్రాలకు సంబంధించి నీ విద్యలకు కాలం చెల్లింది. ఈ విషయాలను నువ్వు పట్టించుకోకు. ‘నీ కన్నా సమర్థవంతులే ఈ వ్యవహారా లను పర్యవేక్షిస్తున్నారు” అన్నాడు.
మొత్తానికి వారు ముస్లింలపై మెరుపుదాడి చేయటానికి గట్టిగా నిశ్చయించుకున్నారు.
ఓటమి తీరంలో…
మక్కాను జయించి మదీనాకు బయలుదేరారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). మార్గ మధ్యంలో ఆయనకు కొన్ని తెగలు తమ మీద దాడి చేయటానికి పూనుకున్నాయన్న వార్త అందింది. మదీనాకు చేరుకున్న తర్వాత ఆయన ముస్లింలకు, ఆయుధాలు దింపవద్దని ఆదేశించారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవటానికి అవకాశం లేదని చెప్పారు. అరేబియాలో అవిశ్వాసులకు గట్టి పట్టు ఉన్న చివరి ప్రాంతం తాయిఫ్. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముస్లిం సైన్యాలను అటు వైపు నడిపించారు. తన తెల్లటి కంచర గాడిదపై స్వారీ చేస్తూ ఉన్నారాయన.
దాని పేరు దుల్ దుల్. ముస్లింలు సూర్యాస్తమయానికి ముందే తాయిఫ్ నగరానికి దగ్గర్లోని హునైన్ పర్వతాల వద్దకు చేరుకున్నారు. అయితే హఠాత్తుగా అవిశ్వాసులు అన్ని వైపుల నుంచి ముస్లింలపై దాడి చేశారు. ఆ హఠాత్పరిణామానికి ముస్లింలు కకావికలయ్యారు. ముస్లిం సైన్యం ఛిన్నాభిన్నమైపోయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆందోళనకు గురయ్యారు. కలసికట్టుగా పోరాడమని ముస్లింలను పిలిచారు. కాని ఆ స్థితిలో ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. వెనక్కి తిరిగి చూస్తే అబూబక్ర్, ఉమర్, అలీ, అబూ సుఫ్యాన్, ఇంకా తన వంశస్తులు మరికొంత మంది మాత్రమే ఆయనకు కనిపించారు. అబూ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హు) తన భావాలను అణచుకోలేకపోయారు. బిగ్గరగా అరుస్తూ, “అల్లాహ్ సాక్షి! ఇక మనం ఓడిపోయినట్లే. అవిశ్వాస సైన్యాలను సముద్ర కెరటాలే ఆపగల్గుతాయి” అన్నారు.
అటు శత్రువుల వైపు నుంచి హంబల్ కుమారుడు కలాదా గట్టిగా అరుస్తూ, “నేటితో ముహమ్మద్ మంత్రజాలం అంతమైపోతుంది” అన్నాడు. అన్సార్లనందరినీ తిరిగి కూడగట్టమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అబ్బాస్ (రదియల్లాహు అన్హు)కు ఆదేశించారు. అబ్బాస్ (రదియల్లాహు అన్హు), “ఓ అన్సార్లారా!, దైవప్రవక్త కోసం ప్రాణార్పణకు సిద్ధపడ్డ వీరుల్లారా!, శత్రువులకు వ్యతిరేకంగా తనకు సహాయపడమని ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు” అని ఎలుగెత్తి ప్రకటించారు. అబ్బాస్ (రదియల్లాహు అన్హు) పిలుపు తమ కర్ణపుటాలకు తాకగానే అన్సార్ యోధులు, పారిపోతున్న వారల్లా వెనక్కి తిరిగి, “లబ్బైక్ యా రసూలల్లాహ్, లబ్బైక్ (దైవప్రవక్తా! వచ్చేస్తున్నాం)” అంటూ పరుగెత్తుకొచ్చారు. క్షణాల్లో ముస్లిం సైన్యం బారులు తీరింది. దృఢచిత్తులైన యోధులతో ముస్లిం సైన్యం అవిశ్వాసులపై ఉవ్వెత్తున ఎగిసిపడింది. ముస్లింల ధైర్యం అవిశ్వాసులకు సముద్రంలో తుఫానులా అగుపించింది. భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని, వెంటతెచ్చిన సామగ్రినంతటిని వదలి పెట్టేసి, యుద్ధమైదానం నుంచి పలాయనం చిత్తగించారు అవిశ్వాసులు. (చదవండి, ఖుర్ఆన్ 9: 25)
తాయిఫ్ ముట్టడి
హునైన్ యుద్ధమైదానం నుంచి పారిపోయిన బనూ సఖీఫ్ తెగ తాయిఫ్ నగరంలోకి జొరబడింది. ఈ నగరంలో పటిష్టమైన కోటలెన్నో ఉన్నాయి. రక్షణ నిమిత్తం నగరం చుట్టూ ఎన్నో ప్రాకారాలు నిర్మించబడి ఉన్నాయి.
ముస్లిం సైనికులు వారిని వెంబడించారు, కాని వారు అప్పటికే తమ కోటల్లోకి వెళ్ళి దాక్కున్నారు. ఒక యేడాదికి సరిపోయే ఆహారం కూడా వారు ముందే కోటలో సమకూర్చుకొని పెట్టుకున్నారు. ముస్లిం సైనికులు సాహసం చేసి ప్రహరీ గోడలు దూకి లోనికి ప్రవేశించారు. కాని అవిశ్వాసులు పైనుంచి వారిపై ధారాపాతంగా బాణాల వర్షం కురిపించారు. దాని వల్ల ఎంతో మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. అయినా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముట్టడిని ఆపలేదు. పగలు, రేయి ఇరవై రోజుల వరకూ ఈ యుద్ధం కొనసాగింది.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక చెక్క ట్యాంకును తయారు చేసి దాన్ని బండి చక్రాలపై బిగించారు. ప్రపంచంలో మొట్టమొదటి యుద్ధ ట్యాంకుగా దీన్ని చెప్పుకోవచ్చు. కొంత మంది సైనికులు ఆ ట్యాంకులో కూర్చున్నారు. తర్వాత ఆ ట్యాంకును ప్రాకారంలోనికి నెట్టటం జరిగింది. అయితే ప్రతిఘటించేవారు కూడా బాగా తెలివైనవారే. ఇనుమును బాగా కాల్చి మండుతున్న ఆ ఇనుప ముక్కల్ని వారు చెక్క ట్యాంకులపై విసరివేయసాగారు. కాలుతున్న చెక్క ట్యాంకుల నుంచి బయటపడి, పారిపోతూ వున్న ముస్లిం సైనికుల్ని శత్రువులు బాణాలతో ఏరివేయటం ప్రారంభించారు.
ఖర్జూర చెట్లను, ద్రాక్ష తోటల్ని నరికివేస్తామని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కోటలోని వారిని బెదిరించారు. దాని వల్ల మరుసటి యేడు శత్రువులకు ధాన్యపు గింజలు ఉండవు. అందుకు భయపడి శత్రువులు లొంగిపోతారేమోనని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆశించారు. అయితే బనూ సఖీఫ్ తెగవారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు రాయబారం పంపించారు. చెట్లు రాతి నేలలో నాటబడి ఉన్నందున వాటిని గనక ఒకసారి ధ్వంసం చేస్తే మళ్లీ ఆ నేలలో చెట్లు పెరగవనీ, అలా చేయకుండా కేవలం పంట వరకు తీసుకోవలసిందని వారు దైవప్రవక్తను కోరారు. చెట్లు నరకటం వల్ల శాశ్వత నష్టం వాటిల్లుతుందని గ్రహించిన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ నిర్ణయం మానుకున్నారు.
తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరో పద్ధతిలో దాడి చేయాలని నిర్ణయించారు. కోటపై నిప్పుల బాణాలు కురిపించి, మెరుపుదాడుల్లో తర్ఫీదైన సైనికుల్ని కోట పైకి వదలాలని అనుకున్నారు అయితే అంతలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఆ నగరంతో ప్రగాఢమైన అనుబంధం ఉంది, తాను ఒక నిస్సహాయ అనాధునిగా ఉన్నప్పుడు తనను పెంచి పోషించిన హలీమా దాది ఆ నగరంలోనే నివసించేవారు. ఆ విషయం గుర్తుకు రాగానే ఆయన మనసు ద్రవించిపోయింది.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఆయన సహచరులు ఇండ్ల నుంచి బయలుదేరి అప్పటికి రెండు మాసాలు గడిచిపోయాయి. త్వరలో జుల్ ఖాదా నెల కూడా ప్రారంభం కానుంది. ఆ నెలలో యుద్ధం చేయటం నిషిద్దం. అందుకని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక నిర్ణయానికి వచ్చారు. శత్రువులకు ఓ సందేశం పంపిస్తూ తాము తాయిఫ్ ముట్టడిని ఎత్తివేస్తున్నామనీ, ఈ విషయమై చర్చించటానికి ఒక ప్రతినిధి బృందాన్ని పంపమని ఆ సందేశంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శత్రువులను కోశారు. అక్కణ్ణుంచి బయలుదేరే ముందు శత్రువుల నగరంపై శాపం పెట్టమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను సహచరులు కోరారు. కాని ఆయన మాత్రం, తాయిఫ్ వాసులకు సత్యాన్ని గ్రహించే సద్బుద్ధిని ప్రసాదించమని అల్లాహ్ ను ప్రార్థించారు.
ముస్లింలు మరుసటి సంవత్సరం తిరిగొచ్చి తమ చెట్లను నరికివేశారంటే ఇక తమకు చావు తప్పదని గ్రహించిన శత్రువులు, ముస్లింలపై దాడి చేయటం, వారిని ఎదిరించటం సముచితం కాదని భావించారు. ఇరువర్గాల మధ్య ఒక ఒప్పందం తీసుకువచ్చే విషయమై చర్చించేందుకు తమ ప్రతినిధి బృందాన్ని మదీనా పంపించారు. వారి రాక గురించి తెలుసుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో సంతోషించారు.
బనూ సఖీఫ్ బృందం మదీనా నగరానికి చేరుకుంది. చూస్తే అక్కడి ప్రజలందరూ ముస్లింలుగా మారి ఉన్నారు. వారి మొండితనం మెత్తబడింది. ఇప్పుడిక తాము ముస్లింల ముందు లొంగిపోవటమే సముచిత మని భావించారు వారు. కాని ఒక షరతు మీద ఇస్లాంలోకి ప్రవేశించాలని వారు భావించారు. మూడు సంవత్సరాల వరకు తమ విగ్రహాలను పూజించుకోవటానికి అనుమతి ఇవ్వాలని వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను కోరారు. కాని దైవప్రభక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి ఈ షరతును అంగీకరించలేదు. కనీసం ఒక్క సంవత్సరమైనా పూజించు కోనివ్వాలని వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను బ్రతిమాలారు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ససేమిరా అన్నారు. కనీసం ఆరు నెలల కోసమైనా అనుమతించండి దైవప్రవక్తా! అని విన్నవించుకున్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), తౌహీద్ (ఏకదైవారాధన) విషయంలో ఎట్టి పరిస్థితిలోనూ తాను రాజీపడేదిలేదని, ఖరాకండిగా చెప్పేశారు. ఎట్టకేలకు తాయిఫ్ వాసులు లొంగిపోయారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాయిఫ్ వాసుల పట్ల ఎంతో కరుణావాత్సల్యాలతో వ్యవహరించారు. హునైన్ యుద్ధంలో పట్టుబడిన వారి బందీలను విడుదల చేశారు. ఒకప్పుడు తాయిఫ్ వాసులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను రాళ్లతో కొట్టి ఆయన రక్తం కళ్లచూశారు. తనకు సహాయం చేయమని కోరటానికి వెళితే అత్యంత పరాభవ స్థితిలో నగరం నుంచి వెడలగొట్టారు. అయినా కూడా ప్రస్తుతం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అవేవీ పట్టించుకోలేదు, బేషరతుగా వారి బందీలను విడిచి పెట్టారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అవలంబించిన ఉదార వైఖరి వారి మనసుల్ని చాలా ప్రభావితం చేసింది. వారి మనసులు ఇస్లాం వైపు మొగ్గాయి. వారందరూ దృఢమైన ముస్లింలుగా మారిపోయారు.
గ్రహించవలసిన పాఠాలు
విధ్వంసంతో కూడిన విజయం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆశయం కాదు. యుద్ధ సమయంలో ఆయన మనుషులనే కాదు, వృక్షజాతి సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. తాయిఫ్ నగరాన్ని చూడగానే ఆయనకు తన బాల్యం గుర్తుకు వచ్చింది. చిన్నతనంలో తనను అల్లారుముద్దుగా పెంచిన ‘హలీమా అమ్మ’ ఆ నగరంలోనే నివసించేదని గుర్తుకురాగానే ఆయన హృదయం ద్రవించిపోయింది. వెంటనే ఆయన యుద్ధ తంత్రంలో మార్పులు చేసుకున్నారు.
ప్రాణ శత్రువులను సైతం శపించకుండా, వారు సన్మార్గంపైకి రావాలని ప్రార్ధించటం ఆయన ఔదార్యాన్ని చాటిచెబుతోంది.
తౌహీద్ విషయంలో ఎన్నటికీ రాజీపడకూడదు.
శత్రువులు వ్యక్తిగతంగా తనను ఎంతో బాధపెట్టారు. అయినప్పటికీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి మీద ప్రతీకారం తీర్చుకోలేదు. పైగా వారిపట్ల కరుణా వాత్సల్యాలతోనే వ్యవహరించారు. ఫలితంగా ప్రాణశత్రువులు సైతం ప్రాణ మిత్రులుగా మారి ఇస్లాంలో దృఢవిశ్వాసులుగా రాణించారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“చివరికి మేము ఖారూన్ ను, అతని నివాసాన్ని నేలలో కూర్చివేశాము. అప్పుడు అల్లాహ్ బారి నుంచి అతన్ని ఆదుకోవటానికి ఏ సమూహమూ లేకపోయింది. మరి వాడు సయితం తనకు ఏ సాయమూ చేసుకోలేకపోయాడు.” ( సూరా అల్ ఖసస్ 28: 81)
ఖారూన్, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వంశానికి చెందినవాడు. చాలా సంపన్నుడు. ఒక మహా ప్రాసాదంలో భోగభాగ్యాలతో జీవించేవాడు. అత్యంత ఖరీదైన దుస్తులు ధరించేవాడు. అసంఖ్యాక బానిసలు ఎల్లప్పుడూ అతని సేవకు సిద్ధంగా ఉండేవారు. అన్ని రకాల సుఖవిలాసాలతో ఆడంబరంగా జీవితం గడిపేవాడు. అపారమైన ధన సంపత్తులు అతనిలో గర్వాన్ని పెంచాయి. అహంకారంతో విర్రవీగేవాడు.
ఖారూన్ బీదలను చూసి అసహ్యించుకునేవాడు. తెలివితేటలు లేకపోవడం వల్లనే వారు బీదరికంలో మగ్గుతున్నారని ఈసడించుకునేవాడు. తన తెలివితేటలు, వ్యాపార నైపుణ్యం వల్లనే తనకు అపార సంపద లభించిం దాని మిడిసిపడేవాడు.
జకాత్* చెల్లించవలసిందిగా ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అతడికి చెప్పారు. జకాత్ అన్నది బీదలకు ఒక హక్కుగా సంపన్నులు చెల్లించవలసిన నిర్ధారిత వాటా. విశ్వాసులందరూ తప్పనిసరిగా జకాత్ చెల్లించాలని అల్లాహ్ ఆదేశించాడు. కాని ఈ సలహా విన్న ఖారూన్ కోపంతో మండిపడ్డాడు. తనపై అల్లాహ్ అనుగ్రహం వర్షిస్తుందని, తన ధన సంపదలే అందుకు నిదర్శనమని ప్రవక్త మూసా (అలైహిస్సలాం)తో చెప్పాడు. తన జీవిత విధానాన్నిఆమోదించినందు వల్లనే అల్లాహ్ తన సంపదను అనునిత్యం పెంచుతున్నాడని వాదించాడు. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అతడికి నచ్చ జెప్పారు. దుర్మార్గపు ఆలోచనల పరిణామాలు నష్టదాయకంగా ఉంటాయని హెచ్చరించారు.
* జకాత్ అంటే పేదల కోసం, సమాజ శ్రేయస్సు కోసం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్ట వలసిన సొమ్ము
చివరకు ఖారూన్ తన సంపదపై జకాత్ లెక్కించాడు. జకాత్ను లెక్కిస్తే తాను చెల్లించవలసిన మొత్తం అతడికి చాలా ఎక్కువగా కనబడింది. అంత మొత్తం చెల్లించాలంటే ప్రాణాలు పోయినట్లనిపించింది. జకాత్ చెల్లించేది లేదని తిరస్కరించడమే కాదు, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తన స్వార్థప్రయోజనాల కోసం జకాత్ చట్టం తీసుకొచ్చారని ప్రచారం మొదలుపెట్టాడు. ప్రవక్త మూసా (అస)కు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టడానికి కొంతమందికి లంచాలు కూడా ఇచ్చాడు. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) గురించి నానావిధాల పుకార్లు వ్యాపించేలా చేశాడు.
ఖారూన్ కుట్రల గురించి అల్లాహ్, ప్రవక్త మూసా (అలైహిస్సలాం)ను హెచ్చరించాడు. ఖారూన్ పిసినారితనానికి, అల్లాహ్ చట్టాల పట్ల అతని తిరస్కారానికిగాను అతడిని శిక్షించాలని ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ ను ప్రార్దించారు. అల్లాహ్ ఆగ్రహం ఖారూన్ పై విరుచుకుపడింది. భూమి ఒక్కసారిగా పగులుబారి ఖారూన్ సహా అతడి భవనాన్ని, యావత్తు సంపదను తనలో కలిపేసుకుంది. ఖారూన్ అనేవాడు ఒకప్పుడు ఉండేవాడన్న చిహ్నాలు కూడా లేకుండా అతడు తుడిచిపెట్టుకు పోయాడు. ఖారూన్ సంఘటన మూసా (అలైహిస్సలాం) జాతి ప్రజలకు ఒక గుణపాఠంగా మిగిలి పోయింది.
ఈ విషయమై దివ్య ఖుర్ఆన్లో ఇంకా ఏముందంటే, ఖారూన్ సంపదను చూసి ఈర్ష్యపడిన వారు, అప్పటి వరకు ఖారూనను కీర్తించడమే ఘనకార్యంగా భావించిన వారు ఈ సంఘటన తర్వాత, “అల్లాహ్ ఎవరికి తలచుకుంటే వారికి సంపద ఇస్తాడు. ఎవరికి తలచుకుంటే వారికి నిరాకరిస్తాడు. మనపై అల్లాహ్ అనుగ్రహం లేనట్లయితే మనల్ని కూడా భూమి మ్రింగేసి ఉండేది. అల్లాహ్ ను తిరస్కరించేవారు పురోభివృద్ధి సాధించలేరు. ఈ ప్రపంచంలో ఔన్నత్యాన్ని కోరుకోని వారికి, దుర్మార్గానికి పాల్పడని వారికి మాత్రమే పరలోక స్వర్గవనాలు లభిస్తాయి” అనడం ప్రారంభించారు.
గ్రహించవలసిన పాఠాలు
ఖారూన్ వంటి వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కొంతమంది నడమంత్రపు సిరి పొంది తమ పాత రోజులను, అప్పటి కష్టాలను మరచి పోతారు. తాము కష్టపడి, శ్రమించి తమ తెలివితేటలతో సంపాదించిందే అంతా అనుకుంటారు. అందులో అల్లాహ్ కారుణ్యం లేదని భావిస్తారు. అల్లాహ్ పట్ల ఏలాంటి కృతజ్ఞత చూపించరు. అల్లాహ్ ఆదేశాలను విస్మరిస్తారు. బీదసాదలకు ఏలాంటి సహాయం అందించడం వారికి ఇష్టం ఉండదు. పైగా తమ సంపదను పెద్ద భవనాలు కట్టడం ద్వారా సంపన్నులకు గొప్ప విందులు ఇవ్వడం ద్వారా, అనవసరమైన ఆడంబరాల ద్వారా, ఖరీదైన దుస్తులు, వాహనాల ద్వారా ప్రదర్శిస్తూ విర్రవీగు తుంటారు. మరికొందరు ఇందుకు విరుద్ధంగా అత్యంత పిసినారులుగా మారిపోతారు. పిల్లికి బిచ్చమెత్తని ధోరణి ప్రదర్శిస్తారు. స్వంతం కోసం, తమ కుటుంబం కోసం ఖర్చుపెట్టడానికి కూడా వెనుకాడుతారు. సంపద పోగుచేయడంలోనే మునిగిపోతారు. కాని ఇలాంటి వారు తాము ఈ ప్రపంచంలో కేవలం కొంత సమయం గడిపి వెళ్ళడానికి వచ్చామన్న వాస్తవాన్ని మరచిపోతుంటారు.
అల్లాహ్ నిర్దేశించిన వాటాను బీదలకు చెల్లించడం ద్వారా మనిషి తన సంపదను పరిశుద్ధం చేసుకుంటాడు. లేనట్లయితే సంపద కలుషితమై పోతుంది. సంపద ఒక శాపంగా మారిపోతుంది. తన మార్గంలో ఖర్చు చేసిన సంపదను అనేక రెట్లు పెంచి ఇస్తానని అల్లాహ్ వాగ్దానం చేస్తున్నాడు. దాన ధర్మాలకు ఖర్చు చేసినది తనకు ఇచ్చిన ఉత్తమమైన రుణంగా అల్లాహ్ అభివర్ణిస్తున్నాడు. అల్లాహ్ కు రుణం ఇచ్చి ఆయన నుంచి తిరిగి పొందడం అన్నది మనిషికి ఎంత గౌరవప్రదం! ఎంత శుభప్రదం!!
అల్లాహ్ మనిషికి ధనసంపదలను ఒక పరీక్షగా అప్పగిస్తాడు (అమానత్-అంటే ఏదన్నా వస్తువును జాగ్రత్తగా ఉంచమని ఎవరికైనా అప్పగించడం), ధనసంపదలు కూడా అల్లాహ్ మనిషికి అప్పగించిన అమానత్ (అప్పగింత). తాను ఇచ్చిన ధనసంపదలతో ఎవరు ఏం చేస్తారన్నది చూడడానికి అల్లాహ్ వాటిని ప్రసాదిస్తాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నూతన సంవత్సర (న్యూ ఇయర్) ఉత్సవాల వాస్తవికత https://youtu.be/oPjBc0636SE [61 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకలను ఇస్లామీయ దృక్కోణంలో విశ్లేషించారు. ముస్లింలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం హరామ్ (నిషిద్ధం) అని, దీనికి అనేక కారణాలున్నాయని వివరించారు. ఇస్లాంకు తనదైన ప్రత్యేక గుర్తింపు ఉందని, అన్యజాతీయుల పండుగలను, ఆచారాలను అనుకరించడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇస్లాంలో కేవలం రెండు పండుగలు (ఈదుల్ ఫితర్, ఈదుల్ అద్’హా) మాత్రమే ఉన్నాయని, వాటిని మినహా వేరే వేడుకలకు అనుమతి లేదని తెలిపారు. ఈ వేడుకలు క్రైస్తవుల క్రిస్మస్ పండుగకు కొనసాగింపుగా జరుగుతాయని, దైవానికి సంతానం ఉందని విశ్వసించే వారి పండుగలో పాలుపంచుకోవడం దైవద్రోహంతో సమానమని హెచ్చరించారు. ఈ వేడుకల సందర్భంగా జరిగే అశ్లీలత, మద్యం సేవనం, సంగీతం, స్త్రీ పురుషుల కలయిక వంటి అనేక నిషిద్ధ కార్యాల గురించి కూడా వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యతగా ఉంటూ, వారిని ఇలాంటి చెడుల నుండి కాపాడాలని, వారికి ఇస్లామీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వాలని సూచించారు.
ప్రియ విద్యార్థులారా! ఈరోజు అల్’హమ్దులిల్లాహ్, నిషిద్ధతలు జాగ్రత్తలు అనేటువంటి మన ఈ శీర్షికలో తొమ్మిదవ క్లాస్. అయితే ఈరోజు ఈ తొమ్మిదవ క్లాస్ ఏదైతే జరగబోతుందో, ప్రారంభం కాబోతుందో, ఈనాడు తేదీ డిసెంబర్ 31, 2023.
ఇప్పటి నుండి సమయ ప్రకారంగా చూసుకుంటే సుమారు ఒక 12న్నర గంటల తర్వాత 2024వ సంవత్సరంలో ఫస్ట్ జనవరిలో ప్రవేశించబోతున్నాము. ఈ నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం, న్యూ ఇయర్ కి సంబంధించి కూడా ఎన్నో రకాల నిషిద్ధతలకు పాల్పడతారు. అందుకని మన క్రమంలో, మనం చదువుతున్నటువంటి పుస్తకంలో, ఏ మూడు అంశాలు ఈరోజు ఉన్నాయో, సమయం మనకు సరియైన రీతిలో అందుబాటులో ఉండేది ఉంటే, అనుకూలంగా ఉంటే, అవి మూడు లేదా వాటిలో కొన్ని ఇన్’షా’అల్లాహ్ తెలుసుకుంటాము. కానీ వాటన్నిటికంటే ముందు న్యూ ఇయర్ సెలబ్రేషన్, కొత్త సంవత్సర ఉత్సవాలు జరుపుకోవడం యొక్క వాస్తవికత ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం.
ఎందుకంటే సోదర మహాశయులారా, వీటి వివరాలు మనం తెలుసుకోకుండా ఆ నిషిద్ధతలకు పాల్పడుతూ ఉంటే ఇహలోక పరంగా, సమాధిలో, పరలోకంలో చాలా చాలా నష్టాలకు మనం గురి కాబోతాం. అందుకొరకే వాటి నుండి జాగ్రత్తగా ఉండండి, ఆ నిషిద్ధతలకు పాల్పడకుండా ఉండండి అని చెప్పడం మా యొక్క బాధ్యత. వినడం, అర్థం చేసుకోవడం, మంచిని ఆచరించడం, చెడును ఖండించడం, చెడును వదులుకోవడం మనందరిపై ఉన్నటువంటి తప్పనిసరి బాధ్యత.
న్యూ ఇయర్ వేడుకలు – ఇస్లామీయ తీర్పు
అయితే సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కొత్త సంవత్సరం సంబరాలు మనం జరుపుకోవచ్చా? ఉత్సవాలు జరుపుకోవచ్చా? న్యూ ఇయర్ హ్యాపీ ఎవరికైనా చెప్పవచ్చా? అంటే ఇది హరామ్, దీనికి ఎలాంటి అనుమతి లేదు. మరి ఇందులో ఉన్న చెడులు చాలా ఉన్నాయి. కానీ ఆ చెడుల గురించి చెప్పేకి ముందు ఒక విన్నపం, ప్రత్యేకంగా ఏ స్త్రీలు, పురుషులు ఇలాంటి సంబరాలు జరుపుకుంటారో, కొత్త సంవత్సరం యొక్క వేడుకలు జరుపుకుంటారో, వారు ప్రత్యేకంగా పూర్తిగా ఈ ప్రసంగాన్ని వినండి. ఉర్దూ అర్థమైతే ‘నయే సాల్ కా జష్న్’ అని మా ఉర్దూ ప్రసంగం కూడా ఉంది. వినండి, అర్థం చేసుకోండి, కారణాలు తెలుసుకోండి. ఇక వీళ్ళు ఈ మౌల్సాబులు హరామ్ అని చెప్పారు. ఇక మీదట వీళ్ళ మాట వినే అవసరమే లేదు, ఈ విధంగా పెడచెవి పెట్టి, విముఖత చూపి తమకు తాము నష్టంలో పడేసుకోకండి.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మనం ఎందుకు జరుపుకోకూడదు?
మొదటి కారణం
మనం ఏ ఇస్లాం ధర్మాన్ని అవలంబించామో, విశ్వసిస్తున్నామో, అది ఎలాంటి ఉత్తమమైన, సంపూర్ణమైన – నా ఈ పదాలను శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి – మనం ఏ ఇస్లాం ధర్మాన్ని అవలంబించి, దీని ప్రకారంగా జీవితం గడపాలన్నట్లుగా పూనుకొని, నిశ్చయించి మనం జీవితం కొనసాగిస్తున్నామో, ఈ ఇస్లాం ధర్మం అత్యుత్తమమైనది, సంపూర్ణమైనది, ప్రళయం వరకు ఉండేది, అన్ని జాతుల వారికి, ప్రతీ కాలం వారికి అనుకూలంగా ఉన్నటువంటి ఉత్తమ ధర్మం. ఈ ఇస్లాం ధర్మం, ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తారో, ఇస్లాం ధర్మాన్ని నమ్ముతారో ఇస్లాం కోరుకుంటున్నది ఏమిటంటే తనదంటూ ఒక వ్యక్తిత్వం, తనదంటూ ఒక ఐడెంటిఫికేషన్, నేను ఒక ముస్లింని అన్నటువంటి తృప్తి, మన యొక్క ప్రత్యేకత మనం తెలియజేయాలి, దానిపై స్థిరంగా ఉండాలి. ఇతరులు కూడా అర్థం చేసుకోవాలి, ముస్లిం అంటే ఇలా ఉంటాడు. ముస్లిం అంటే ఖిచిడీ కాదు, ముస్లిం అంటే బిర్యానీ కాదు, ముస్లిం అంటే ఏదో కొన్ని వస్తువుల, తినే ఆహార పదార్థాల పేర్లు కావు. ముస్లిం తన విశ్వాసంతో, తన ఆరాధనలతో, తన వ్యక్తిత్వంతో, తన యొక్క క్యారెక్టర్ తో అత్యుత్తమ మనిషిగా నిరూపిస్తాడు.
అందుకొరకే ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనేక సందర్భాలలో ఇచ్చినటువంటి బోధనల్లో ఒక మాట, ఎన్నో సందర్భాల్లో ఉంది. ప్రతి జుమాలో మీరు వింటూ ఉంటారు కూడా. హజ్ లో ఒక సందర్భంలో ప్రవక్త చెప్పారు, ‘హదయునా ముఖాలిఫుల్ లిహదియిహిమ్’. మన యొక్క విధానం, మన యొక్క మార్గదర్శకత్వం అందరిలో నేను కూడా ఒకడినే, అందరి మాదిరిగా నేను అన్నట్లుగా కాదు. మన యొక్క విధానం, మన ఇస్లామీయ వ్యక్తిత్వం, మనం ముస్లింలం అన్నటువంటి ఒక ప్రత్యేక చిహ్నం అనేది ఉండాలి. ఎందుకంటే అందరూ అవలంబిస్తున్నటువంటి పద్ధతులు వారి వారి కోరికలకు తగినవి కావచ్చు కానీ, వారి ఇష్ట ప్రకారంగా వారు చేస్తున్నారు కావచ్చు కానీ, మనం ముస్లింలం, అల్లాహ్ ఆదేశానికి, ప్రవక్త విధానానికి కట్టుబడి ఉంటాము. ప్రతి జుమ్మాలో వింటున్నటువంటి విషయం ఏంటి?
فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ (ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్) నిశ్చయంగా అన్నింటికన్నా ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖుర్ఆన్).
وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صلى الله عليه وسلم (వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మార్గం.
ఇది కేవలం జుమ్మా రోజుల్లో చెప్పుకుంటే, కేవలం విని ఒక చెవి నుండి మరో చెవి నుండి వదిలేస్తే ఇది కాదు అసలైన ఇస్లాం. మొదటి కారణం ఏంటి? మన విశ్వాసం నుండి మొదలుకొని, ఆరాధనలు మొదలుకొని, మన జీవితంలోని ప్రతి రంగంలో మనం మనకంటూ ఒక ఇస్లామీయ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాలి, ఆచరించాలి, కనబరచాలి.
రెండవ విషయం
శ్రద్ధగా వినండి, న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎందుకు మనం జరుపుకోకూడదు? సెకండ్ రీజన్, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో జాతులు, సమాజాలే కాదు ప్రభుత్వ పరంగా కూడా దేశాలు దీనిని ఏదైతే జరుపుకుంటున్నాయో అది ఒక పండుగ మాదిరిగా అయిపోయింది, కదా? మరియు ఇస్లాంలో మనకు అల్లాహ్ యే ఇచ్చినటువంటి పండుగలు కేవలం రెండే రెండు పండుగలు సంవత్సరంలో.
అబూ దావూద్ లో వచ్చిన హదీస్ ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు?
إِنَّ اللَّهَ قَدْ أَبْدَلَكُمْ بِهِمَا خَيْرًا مِنْهُمَا (ఇన్నల్లాహ ఖద్ అబ్దలకుం బిహిమా ఖైరమ్ మిన్హుమా) నిశ్చయంగా అల్లాహ్ ఈ రెండు రోజులకు బదులుగా మీకు వీటికన్నా ఉత్తమమైన రెండు రోజులను ప్రసాదించాడు.
అజ్ఞాన కాలంలో రెండు రోజులు వారు జరుపుకునేవారు, ఆటలాడేవాడు, పాటలాడేవారు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? అల్లాహ్ యే మీకు ఆ రెండు రోజులకు బదులుగా మరో రెండు రోజులు ప్రసాదించాడు. కనుక మీరు ఆ అజ్ఞాన కాలంలో పాటిస్తూ వస్తున్నటువంటి రెండు రోజులను మరిచిపొండి, వాటిని వదిలేయండి, వాటిలో ఏ మాత్రం పాలుపంచుకోకండి, అలాంటి వాటిని జరుపుకోకండి. అల్లాహ్ మీకు వాటికి బదులుగా ఏదైతే ప్రసాదించాడో రెండు రోజులు వాటిలో మీరు మీ పండుగ జరుపుకోండి. ఏంటి అవి? యౌముల్ ఫితర్, వ యౌముల్ అద్’హా. సర్వసామాన్యంగా మనం రమదాన్ పండుగ అని, బక్రీద్ పండుగ అని అనుకుంటూ ఉంటాం.
మూడవ రీజన్
థర్డ్ రీజన్ ఏంటి? మనం న్యూ సెలబ్రేషన్ ఎందుకు జరుపుకోకూడదు? ఎందుకంటే ఇతరుల యొక్క ఆచారం అది అయిపోయినది. వారు పండుగ మాదిరిగా దానిని జరుపుకుంటున్నారు. అలా మనం జరుపుకోవడం వల్ల వారి యొక్క విధానాన్ని, పద్ధతులను అవలంబించడం ద్వారా వారిలో కలిసిపోయే, ప్రళయ దినాన వారితో కలిసి లేపబడే, వారితో నరకంలో పోయే అటువంటి ప్రమాదానికి గురవుతాం. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్:
مَنْ تَشَبَّهَ بِقَوْمٍ فَهُوَ مِنْهُمْ (మన్ తషబ్బహ బి’ఖౌమిన్ ఫహువ మిన్హుమ్) ఎవరైతే ఏ జాతిని పోలి నడుచుకుంటారో వారు వారిలోని వారే అయిపోతారు.
గమనించండి ఎంత చెడ్డ విషయం ఇది.
నాలుగవ రీజన్
ఫోర్త్ రీజన్, కారణం, న్యూ సెలబ్రేషన్ జరుపుకోకపోవడానికి, 25వ డిసెంబర్ రోజు ఏ క్రిస్మస్ పండుగలు జరుపుకుంటారో, దానిని అనుసరిస్తూ దాని యొక్క కంటిన్యూషన్ లోనే ఇలాంటి పండుగలు జరుగుతూ ఉంటాయి. ఇంకా వేరే వారు ఏవైతే అందులో చేస్తారో వాటి విషయం వేరు. అయితే, ఎవరైతే మీ తల్లిని తిడతారో, నీవు అతనికి ‘హ్యాపీ, ఎంత మంచి పని చేశావురా’ అని అంటావా? అనవు కదా! అలా మీ తల్లికి తిట్టిన వాడినికి నీవు శుభకాంక్షలు తెలియజేయవు. మరి ఎవరైతే అల్లాహ్ కు సంతానం ఉంది అని, అల్లాహ్ యొక్క సంతానం 25వ డిసెంబర్ నాడు పుట్టాడు అని విశ్వసిస్తున్నారో, దానిని పురస్కరించుకొని పండుగలు జరుపుకుంటున్నారో, అలాంటి వారి ఆ ఉత్సవాలలో మనం ఎలా పాలుపంచుకోగలము? ఎలా వారికి హ్యాపీ చెప్పగలము? విషెస్ ఇవ్వగలము? శుభకాంక్షలు తెలియజేయగలము? ఇదంతా కూడా మనకు తగని పని. ఎందుకంటే అల్లాహ్ ను తిట్టే వారితో మనం సంతోషంగా ఉండి సంబరాలు జరపడం అంటే మనం ఆ తిట్టడంలో పాలు పంచుకున్నట్లు, అల్లాహ్ ను మనం తిడుతున్నట్లు, ఇక మనం ఇస్లాం, మన ఇస్లామీయం ఏమైనా మిగిలి ఉంటుందా?
ఖురాన్ లోనే అల్లాహ్ త’ఆలా ఎంత కఠోరంగా, అల్లాహ్ కు సంతానం అని అన్న వారి పట్ల ఎలాంటి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క కోపం, ఆగ్రహం కురిసింది. అంతేకాదు, ఈ మాట అంటే అల్లాహ్ కు సంతానం ఉంది అనడం ఎంత చెడ్డదంటే ఆకాశాలు దీనిని గ్రహిస్తే బద్దలైపోతాయి. బద్దలైపోతాయి, పగిలిపోతాయి. మరియు భూమి చీలిపోతుంది. అంతటి చెండాలమైన మాట అల్లాహ్ కొరకు ఇది. ఇక అలాంటి వారితో మీరు పాలుపంచుకోవడం, ఇది ఏమైనా సమంజసమేనా?
ఐదవ కారణం
ఫిఫ్త్ రీజన్, న్యూ సెలబ్రేషన్ జరుపుకోకపోవడానికి, అందులో జరుగుతున్నటువంటి నిషిద్ధ కార్యాలు. ఏమిటి ఆ నిషిద్ధ కార్యాలు? వాటి యొక్క స్థానం ఏమిటి? అందులో ఏమేమి చేస్తారో వాటి యొక్క వాస్తవికత ఏమిటి? రండి, సంక్షిప్తంగా అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మొదటి విషయం ఇందులో, ఐదవ రీజన్ కొంచెం పొడుగ్గా సాగుతుంది. ఇందులో మరికొన్ని వేరే పాయింట్స్ చెబుతున్నాను, శ్రద్ధగా అర్థం చేసుకోండి. ఇందుకిగాను ఇది నిషిద్ధం అని మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది.
మొదటి విషయం ఏంటి? 31వ డిసెంబర్ దాటిపోయి ఫస్ట్ జనవరి రావడం, ఇది 30 తర్వాత 31, లేదా ఫస్ట్ జనవరి తర్వాత సెకండ్, సెకండ్ తర్వాత థర్డ్, థర్డ్ తర్వాత ఫోర్, ఎలా దినాలు గడుస్తున్నాయో అదే రీతిలో. దీనికంటూ ఏ ధర్మంలో కూడా ఎలాంటి ప్రత్యేకత లేదు, ఇస్లాం లోనైతే దీని యొక్క ప్రస్తావన ఏ మాత్రం లేదు. ఇక అలాంటి సందర్భంలో మనం రాత్రంతా కాచుకుంటూ వేచి ఉంటూ 11 గంటల 59 నిమిషాల 59 సెకండ్లు పూర్తి అయ్యాయి, 00:00 అని వచ్చిన వెంటనే చప్పట్లు కొట్టడం, కేకలు, నినాదాలు ఇవన్నీ చేసుకుంటూ వెల్కమ్ అన్నటువంటి పదాలు పలకడం, గమనించండి కొంచెం ఆలోచించండి. ప్రతి రాత్రి ఏదైతే 12 అవుతుందో, దినం మారుతుందో, కొత్త సంవత్సరం అని ఏ రీతి మీరు అనుకుంటున్నారో అది 60 సెకండ్ల ఒక నిమిషం, 60 నిమిషాల ఒక గంట, 24 గంటల ఒక రోజు, ఏడు రోజుల ఒక వారం, ఏ ఒక వారం సుమారు నాలుగు వారాలు కొద్ది రోజుల ఒక నెల, 12 నెలల ఒక సంవత్సరం. ఇదే తిరుగుడు ఉంది కదా? ఇందులో కొత్తదనం ఏమిటి? ఇందులో కొత్తదనం ఏమిటి? నీవు ఏదైతే వెల్కమ్ అంటున్నావో, 12 అయిన వెంటనే సంబరాలు జరుపుకుంటున్నావో, దేనికి జరుపుకుంటున్నావు?
మనకు ముస్లింగా గమనించాలంటే అసలు ఆ 12, ఆ సమయంతో మనకు సంబంధమే లేదు. ఇస్లాం పరంగా 24 గంటల దినం ఏదైతే మనం అనుకుంటామో, అది మారుతుంది ఎప్పటినుండి? సూర్యాస్తమయం నుండి. సన్ సెట్ అవుతుంది కదా? అప్పటి నుండి కొత్త తేదీ ప్రారంభమవుతుంది. కొత్త తేదీ అంటున్నాను, కొత్త సంవత్సరం అనడం లేదు. కొత్త రోజు. ముందు రాత్రి వస్తుంది, తర్వాత పగలు వస్తుంది, ఇస్లాం ప్రకారంగా. మరొక విషయం మీరు గమనించండి. బుద్ధిపూర్వకంగా, అల్లాహ్ ఇచ్చిన జ్ఞానంతో ఆలోచించండి.
ఈ జంత్రీ, క్యాలెండర్ మారినంత మాత్రాన ఏ ఏ సంబరాలు జరుపుకోవాలని, ఏ సంతోషాలు వ్యక్తపరచాలని ప్లాన్ చేసుకొని ఈ రాత్రి గురించి వేచిస్తూ ఉంటారో, దీని ప్రస్తావన లేదు అని మనం తెలుసుకున్నాము, అదే చోట మనం గమనిస్తే ఖురాన్ లో, హదీస్ లో, అల్లాహ్ త’ఆలా మనకు ఇస్తున్నటువంటి ఆదేశం ఏమి? ఎప్పుడైనా ఆలోచించామా? ఇలాంటి ఈ వేచి ఉండడం ప్రతి రోజు మన కర్తవ్యం కావాలి. రాత్రి 12 వేచి ఉండడం అంటలేను నేను. ఒక దినం మారుతున్నప్పుడు, ఒక కొత్త రోజు మనకు లభిస్తున్నప్పుడు మన యొక్క కర్తవ్యం ఏమిటి? మన యొక్క బాధ్యత ఏమిటి? ఒక్కసారి సూరతుల్ ఫుర్ఖాన్ లోని ఈ ఆయతును గమనించండి.
وَهُوَ الَّذِي جَعَلَ اللَّيْلَ وَالنَّهَارَ خِلْفَةً لِمَنْ أَرَادَ أَنْ يَذَّكَّرَ أَوْ أَرَادَ شُكُورًا (వహువల్లజీ జ’అలల్లైల వన్నహార ఖిల్ఫతల్ లిమన్ అరాద అం యజ్జక్కర అవ్ అరాద శుకూరా) జ్ఞాపకం చేసుకోవాలనుకునే వాని కొరకు, లేక కృతజ్ఞత చూపదలచిన వాని కొరకు రాత్రింబవళ్లను ఒక దాని తరువాత మరొకటి వచ్చేలా చేసినవాడు ఆయనే. (25:62)
రేయింబవళ్లు మీకు ప్రసాదించిన వాడు ఆ అల్లాహ్ యే. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది, రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి, ఎందుకని? మీలో ఎవరు ఎక్కువగా గుణపాఠం నేర్చుకుంటారు, అల్లాహ్ యొక్క అనుగ్రహాలను తలచుకుంటారు, వాటిని ప్రస్తావించుకొని అల్లాహ్ యొక్క షుక్రియా, అల్లాహ్ యొక్క కృతజ్ఞత ఎక్కువగా తెలుపుతూ ఉంటారు. అల్లాహ్ యొక్క ఈ థాంక్స్, షుక్రియా, కృతజ్ఞత,
اعْمَلُوا آلَ دَاوُودَ شُكْرًا (ఇ’మలూ ఆల దావూద షుక్రా) ఓ దావూదు సంతతి వారలారా! కృతజ్ఞతాపూర్వకంగా పనులు చేయండి. (34:13)
హృదయంతో, మనసుతో, నాలుకతో, ఆచరణతో, ధన రూపంలో అన్ని రకాలుగా. మరి నేను ఏదైతే చెప్పానో, ప్రతి రోజు ఈ మన బాధ్యత అని, ఎప్పుడైనా మనం గమనించామా? ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? మీలోని ప్రతి వ్యక్తి ఎప్పుడైతే ఉదయాన లేస్తాడో, అతని ప్రతి కీలుకు బదులుగా ఒక దానం తప్పకుండా అతను చేయాలి. అల్లాహ్ త’ఆలా రాత్రి పడుకోవడానికి ప్రసాదించాడు, పగటిని శ్రమించడానికి మనకు అనుగ్రహించాడు. నేను ఒక కొత్త దినాన్ని పొందాను, మేల్కొన్నాను, నిద్రలోనే నేను చనిపోలేదు కదా,
الْحَمْدُ لِلَّهِ الَّذِي أَحْيَانَا بَعْدَ مَا أَمَاتَنَا (అల్’హమ్దులిల్లాహిల్లజీ అహ్యానా బ’దమా అమాతనా) మమ్మల్ని మరణింపజేసిన తర్వాత తిరిగి ప్రాణం పోసిన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.
అని అల్లాహ్ యొక్క కృతజ్ఞత చెల్లించుకుంటూ మేల్కోవడం. ఆ తర్వాత ఏమంటున్నారు ప్రవక్త వారు? 360 కీళ్లు మనిషి శరీరంలో ఉన్నాయి. ఈ 360 కీళ్లలో ప్రతి ఒక్క కీలుకు బదులుగా ఒక్క దానం చేయడం, సదకా చేయడం తప్పనిసరి. పేదవాళ్లకు చాలా పెద్ద భారం ఇది ఏర్పడుతుంది కదా? ఎలా మనం రోజుకు 360 దానాలు చేయగలుగుతాము? కానీ అల్లాహ్ త’ఆలా మనకు ప్రవక్త కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా శుభవార్త తెలియజేసి ఎంత సులభతరం ప్రసాదించాడు! ఒక్కసారి సుబ్ హా నల్లాహ్ అంటే ఒక్క సదకా చేసినంత పుణ్యం. ఈ విధంగా ఇంకా విషయాలు ఉన్నాయి. మా జీడీకేనసీర్ YouTube ఛానల్ లో షేక్ జాకిర్ జామి గారు చాలా మంచి ప్రసంగం సదకాల గురించి ఉంది, విని చూడండి. అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, కనీసం రెండు రకాతులు సలాతుద్ దుహా చదివితే 360 దానాలు చేసినటువంటి సదకాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్త తెలియజేశారు. అయితే, ఒక వైపున ఇలాంటి బోధనలు మనకు ఉన్నాయి. ప్రతి రోజు ఒక కొత్త ధనం మనం ఏదైతే పొందుతున్నామో, కొత్త రోజు ఏదైతే పొందుతున్నామో, అందులో ఎలాంటి మనం శుక్రియా అదా చేయాలి, అందులో ఎలాంటి బాధ్యత మనపై ఉన్నది, మరియు రాత్రి ఏ వేళను కాచుకుంటూ వేచి ఉంటూ వెయిట్ చేస్తూ ఉంటారో, ఆ రాత్రి, ప్రత్యేకంగా రాత్రిలోని మూడవ భాగం ఆరంభంలో అల్లాహ్ త’ఆలా ప్రపంచపు ఆకాశం వైపునకు తనకు తగిన రీతిలో వస్తాడు అని, ఎవరు క్షమాపణలు కోరుకుంటారు? ఎవరు దుఆ చేస్తారు? ఎవరికి ఏ అవసరం ఉంది? అల్లాహ్ ను అర్ధిస్తారు, అడుగుతారు అని అల్లాహ్ త’ఆలా కేకలు వేస్తాడు, చాటింపు చేస్తాడు. దాని వైపునకు శ్రద్ధ వహించకుండా, సంవత్సరంలో ఒక్క రాత్రి దాని గురించి సంతోషం వ్యక్తపరచడానికి, దాని పేరున సెలబ్రేట్ చేసుకోవడానికి ఇలా మనం నిద్రను పోగొట్టుకొని వేచి ఉంటూ ఉండడం ఇది అల్లాహ్ యొక్క హకీకత్ లో, వాస్తవంగా శుక్రియా అవుతుందా గమనించండి.
ఇంకా రండి, ఈ విధంగా రాత్రి 12 గంటల కొరకు వేచి ఉంటూ, అప్పుడు ఏ అరుపులు, ఏ కేకలు వేస్తారో, అల్లాహు అక్బర్. దగ్గర ఉన్నవారు కొందరి యొక్క చెవులు గిళ్ళుమనడం కాదు, ఆ శబ్దాలకు ఎవరైనా కొంచెం హార్ట్ లాంటి హార్ట్ పేషెంట్ లాంటి మనుషులు ఉండేది ఉంటే అక్కడ వారి పని పూర్తి అయిపోతుంది. అల్లాహు అక్బర్.
ఈ సంబరాలకు అనుమతి లేదు. ఇంకా ఆ రాత్రి దీపాలు వెలిగించడం, వాటిని ఆర్పడం, క్యాండిల్స్ దానికొక ప్రత్యేకత ఇవ్వడం, ఈ క్యాండిల్స్ కు, మవ్వొత్తులకు ఈ ప్రత్యేకత అగ్ని పూజారులలో ఉంటుంది, మజూసులలో ఉంటుంది. వారి యొక్క పోలిక అవలంబించి మనం ఎటువైపునకు వెళ్తున్నామో ఒకసారి ఇది కూడా ఆలోచించి చూడండి. అంతేకాదు, ఈ రాత్రి వేచి ఉంటూ ఏదైతే ఉంటారో, ఆ తర్వాత కేకులు కట్ చేసుకుంటూ, తినుకుంటూ, వాటి యొక్క క్రీములు తినడమే కాదు, ఆహారం యొక్క ఎంత వేస్టేజ్, మళ్ళీ సంబరాల, సంతోషాల పేరు మీద వాటిని ఎంత అగౌరవ, ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తారంటే క్రీములు తీసుకొని ఒకరు మరొకరికి పూసుకుంటూ ఉంటారు.
ఈ సందర్భంలో గమనించాలి, ఎక్కడెక్కడైతే హోటళ్లలో గాని, పార్కులలో గాని, వేరే కొన్ని ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకొని ఇలాంటి సంబరాలకు ఏదైతే అందరూ హాజరవుతారో, స్త్రీలు, పురుషులు, యువకులు, యువతులు వారి మధ్యలో జరిగేటువంటి ఆ సందర్భంలో అశ్లీల కార్యాలు, అశ్లీల మాటలు, అశ్లీల పనులు ఇవన్నీ కూడా నిజంగా ఏ సోదరుడు తన సోదరి గురించి, ఏ తండ్రి తన బిడ్డ గురించి, ఏ భర్త తన భార్య గురించి సహించలేడు. సహించలేడు. ఏ కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్న కొడుకు తన తల్లి గురించి భరించలేడు. ఇలాంటి విషయాలు వినడం కూడా ఇష్టపడడు. కానీ అలాంటి సందర్భంలో ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? దానికి ఇంకా మించి ఒకరి మీద ఒకరు రంగులు పోసుకోవడం, కలర్స్ రుద్దుకోవడం. ఇంకా ఆ సమయంలో ప్రత్యేకంగా పెద్ద పెద్ద స్పీకర్స్ లాంటివి, బాక్సులు సెట్ చేసుకొని వాటిలో సాంగ్స్, మ్యూజిక్స్ రకరకాలవి పెట్టుకొని ఆనందం వ్యక్తపరచడం. ఈ మ్యూజిక్ విషయంలో ఎప్పుడైనా విన్నారా? ఇది మన కొరకు నిషిద్ధం అన్న విషయం? మరియు ఇలా చేసే వారి గురించి ఎన్ని రకాల హెచ్చరికలు వచ్చాయో వాటి గురించి ఎప్పుడైనా విన్నారా? సూరత్ లుఖ్మాన్ లోని సుమారు ప్రారంభ ఆయత్ లోనే
وَمِنَ النَّاسِ مَنْ يَشْتَرِي لَهْوَ الْحَدِيثِ لِيُضِلَّ عَنْ سَبِيلِ اللَّهِ بِغَيْرِ عِلْمٍ (వ మినన్నాసి మం యష్తరీ లహ్వల్ హదీసి లియుదిల్ల అన్ సబీలిల్లాహి బిగైరి ఇల్మ్) ప్రజలలో కొందరు సరైన జ్ఞానం లేకుండా (ఇతరులను) అల్లాహ్ మార్గం నుండి తప్పించటానికి, దానిని (అల్లాహ్ మార్గాన్ని) ఎగతాళి చేయటానికి పనికిరాని విషయాలను కొంటారు. (31:6)
ఇక్కడ లహ్వల్ హదీస్ యొక్క వ్యాఖ్యానంలో, తఫ్సీర్ లో, అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పిన మాటలు అల్లాహ్ యొక్క ప్రమాణం చేసి మూడేసి సార్లు చెబుతున్నారు. మరి ఇటు మనం ముస్లింలమని భావించుకుంటూ ఇలాంటి సంతోషాల పేరు మీద ఇవన్నీ జరుపుకుంటూ ఉండడం, మన ఇస్లాంపై ఇది, మనం ముస్లింలము అని చెప్పుకోవటంపై ఎంత మచ్చ, ఒక చాలా చెడు, ఒక తప్ప పడిపోతుందో గమనించండి.
మిత్రులారా, సోదర సోదరీమణులారా, ప్రత్యేకంగా ఎవరైతే తమ యొక్క యువకులైన బిడ్డల్ని, కొడుకుల్ని 31వ డిసెంబర్ సాయంకాలం వరకు బయటికి వెళ్ళడానికి అనుమతిస్తున్నారో, వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. తెల్లవారేసరికి ఇంటికి వచ్చేవరకు ఎన్ని పాపాలలో వారు కూరుకుపోయి ఉంటారు, ఎన్ని రకాల అశ్లీల కార్యాలకు పాల్పడి తల్లిదండ్రుల యొక్క ఇహలోకపు బద్నామీ, ఇహలోకంలోనే చెడు పేరు కాకుండా వారి యొక్క పరలోక పరంగా కూడా నష్టం చేకూర్చే అటువంటి ఎన్ని కార్యాలకు వారు పాల్పడతారు. అందుకని తల్లిదండ్రులు ఏం చేయాలి? సోదరులు ఏం చేయాలి? తమ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వారి బాధ్యతలో ఉన్నటువంటి పిల్లల్ని ఇలాంటి చెడు కార్యాల్లో వెళ్లకుండా తాళం వేసి ఉంచడం, మొబైల్ తీసుకొని పెట్టడం, ఏదైనా కేవలం బెదిరించి ఎంతవరకైనా చేయగలుగుతారు? అలా చేయకుండా వారు అలాంటి అశ్లీల కార్యాల్లో, ఇలాంటి సెలబ్రేషన్స్ లో పాల్గొనకుండా ఉండడానికి మీరు ఇంట్లోనే మంచి ప్లాన్ చేయండి. మీరు ఒకవేళ ఫలానా ఫలానా పిల్లలు వెళ్లేవారు ఉన్నారు అన్నట్లుగా మీకు ఏదైనా ఐడియా కలిగి ఉండేది ఉంటే, వారిని తీసుకొని ఏదైనా మంచి పుణ్య కార్యానికి, పుణ్యకార్యం కాకపోయినా చెడు నుండి రక్షింపబడడానికి అల్లాహ్ తో మేలును కోరుతూ, దుఆ చేసుకుంటూ ఎక్కడైనా విహారానికి వెళ్ళండి. మంచి విషయాల గురించి, పెద్ద పాపాల నుండి దూరం ఉండడానికి, కానీ ఇలాంటి వాటిలో మాత్రం పాల్గొనకండి.
ఇంకా ఈ సందర్భంలో ఎవరికైనా మనం హ్యాపీ అని చెప్పడం, హ్యాపీ న్యూ ఇయర్ అని దీనికి కూడా అనుమతి లేదు. షేక్ ఇబ్ను ఉథైమీన్ రహమహుల్లాహ్ తో ప్రశ్నించడం జరిగింది, ఎవరైనా మనకు చెప్పేది ఉంటే ఏం చేయాలి? మీకు కూడా మేలు జరుగుగాక అన్నట్లుగా వదిలేయాలి. కానీ అలాంటి వాటి వైపు ఏ శ్రద్ధ వహించకూడదు. ఇక ఇలాంటి శుభకాంక్షలు తెలియజేయకూడదు అన్నప్పుడు, హ్యాపీ న్యూ ఇయర్ లాంటి స్టేటస్ లు పెట్టుకోవడం, రీల్ ముందునుండే తయారు చేసుకొని మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో అప్లోడ్ చేయడం, వాటిని షేర్ చేయడం, వాటిని లైక్ చేయడం లేదా మన యొక్క మిత్రులకు అలాంటివి సందేశాలు, మెసేజ్లు పంపడం, ఇవన్నీ కూడా తన సమయాన్ని వృధా కార్యంలో గడుపుతూ ఇంకా పెద్ద కార్యాలకు, పెద్ద నష్టాలకు పాల్పడే అటువంటి ప్రమాదం ఉంటుంది.
సోదర మహాశయులారా, ఈ సందర్భంలో ఇంకా ఏ ఏ విషయాలు జరుగుతాయో, ఇప్పుడు మనం ఏదైతే పాఠం మొదలు పెట్టబోతున్నామో, మొదటి పాఠంలోనే కొన్ని విషయాలు రాబోతున్నాయి గనుక, ఇక్కడి వరకు నేను నా ఈ న్యూ ఇయర్ కు సంబంధించిన ఏ సందేశం మీకు ఇవ్వాలనుకున్నానో, దానిని సమాప్తం చేస్తాను. కానీ సమాప్తం చేసే ముందు, గత ఎనిమిదవ పాఠంలో, అంతకుముందు పాఠాలలో మనం కొన్ని విషయాలు విన్నాము, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంలో వాటిని గుర్తుంచుకోవడం చాలా చాలా అవసరం.
పర పురుషులు, పర స్త్రీలు ఈ సందర్భంలో ఏదైతే కలుసుకుంటారో, యువకులు, యువతులు, స్టూడెంట్స్ అందరూ కలిసి ఒకరితో ఒకరు ఏదైతే టచ్ అవుతారో, ఈ సందర్భంలో చూపులకు సంబంధించిన నిషిద్ధతలు ఏమిటి, చదివాము. వాటిని ఒకసారి గుర్తు చేసుకోండి. అవన్నీ ఈ రాత్రి జరుగుతాయి. పర స్త్రీని తాకడం ఎంత ఘోరమైన పాపమో, దాని గురించి హదీస్ లు చదివాము, అవి ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఇంకా ఇలాంటి ఈ సందర్భంలో ఒకరు మరొకరికి శుభకాంక్షల పేరు మీద, సంబరాల పేరు మీద ఏ పదాలు పలుకుతూ ఉంటారో, ఆ పదాల్లో కూడా ఎన్నో అశ్లీల పదాలు ఉంటాయి. ఇక్కడ మనం చెప్పుకోవడం కూడా సమంజసం ఉండదు. కానీ కేవలం తెలియజేస్తున్నాను, అలాంటి వాటన్నిటికీ దూరం ఉండాలంటే అలాంటి ప్రోగ్రాంలలో హాజరు కానే కాకూడదు. మరొక చివరి మాట ఈ సందర్భంలో, కొందరు ఏమంటారు? మేము అలాంటి సెలబ్రేషన్స్ జరుపుకోము. మేము అలాంటి సెలబ్రేషన్ లో పాల్గొనము. అలాంటి సెలబ్రేషన్ చేసే వారికి ఎలాంటి హ్యాపీ అనేది మేము చెప్పము. కానీ ఏం చేస్తారు? టీవీలలో లేదా మొబైల్ ద్వారా, స్మార్ట్ ఫోన్ల ద్వారా కొన్ని ప్రత్యేక వెబ్సైట్లు, కొన్ని ప్రత్యేక యూట్యూబ్ లలో లైవ్ కార్యక్రమాలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇంకా వేరే కొన్ని యాప్స్ లలో లైవ్ ప్రోగ్రాములు దీనికి సంబంధించి జరుగుతాయి, కేవలం అవి చూసుకుంటున్నాము అని అంటారు. అర్థమైందా? స్వయంగా మేము ఏమీ పాల్గొనము, మేము మా ఇంట్లోనే ఉంటాము. కానీ ఏం చేస్తాము? లైవ్ ప్రోగ్రాం, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి ఏవైతే వస్తున్నాయో, వాటిని చూసుకుంటూ ఉంటాము. ఇలాంటివి చూసుకొని ఉండడం కూడా యోగ్యం లేదు.
కనీసం రెండు కారణాలు మీరు అర్థం చేసుకోండి. కనీసం రెండు కారణాలు అర్థం చేసుకోండి. ఒకటి, ఒక కారణం, వారు ఏ తప్పు పనులైతే ఆరోజు చేస్తూ ఉంటారో మీరు చూసి వారిని ప్రోత్సహించిన వారు అవుతారు. మీరు ప్రోత్సహించకున్నా మీ పదాలతో, మీరు వారి యొక్క ఆ వెబ్సైట్ ను, వారి యొక్క ఆ అప్లికేషన్ ను, వారి యొక్క ఆ ఛానల్ ను ఓపెన్ చేసి చూడడమే వారికి ఒక ప్రోత్సాహం. ఎందుకంటే వ్యూవర్స్ పెంచిన వారు అవుతారు. అంతే కాకుండా, అందులో ఏ ఏ చెడులు జరుగుతూ ఉంటాయో, అవి చూస్తూ చూస్తూ మనం ఆ పాపంలో మన కళ్ళతో పాల్గొన్న వారిమి అవుతాం. మనసులో ఏ భావోద్వేగాలు జనిస్తాయో, మనసును ఆ జినాలో, ఆ చెడులో, ఆ పాడులో, రంకులో, గుంపులో మనం మన మనసును కూడా వేసిన వారు అవుతాం. ఇంకా ఏమైనా చెడ్డ పేర్లు ఉండేది ఉంటే చెప్పడం ఇష్టం ఉండదు కానీ మీరు గమనించండి, అంత చెడ్డ విషయాలు జరుగుతూ ఉంటాయి. అయితే కేవలం వాటిని చూడడం కూడా యోగ్యం లేదు.
రెండవ కారణం ఇక్కడ ఏమిటంటే, మనిషి ఒక చెడును చెడు అని భావించాడు. కానీ దానిని చూస్తూ ఉన్నాడంటే, షైతాన్ యొక్క ఇవి ‘ఖుతువాతుష్ షైతాన్’ అని ఏదైతే చదివారో ఇంతకు ముందు ఒక పాఠంలో, అలాంటివి ఇవి ఖుతువాత్. అలాంటి ఈ అడుగులు. ఈ అడుగుజాడల్లో మీరు నడుస్తూ ఉన్నందుకు, అయ్యో వారు అంత పాడు చేస్తారు కదా, నేనైతే అంత చేయను కదా అన్నటువంటి ఏ తృప్తి అయితే వస్తూ ఉంటుందో, చెడులో ఉండి ఒక రకమైన చెడు చేస్తలేము అన్నటువంటి తృప్తిపడి తమకు తాము పుణ్యాత్ములని భావిస్తారు. ఇది చాలా తమకు తాము మోసంలో వేసుకున్న వారు అవుతారు.
సోదర మహాశయులారా, అల్లాహ్ మనందరికీ కూడా హిదాయత్ ఇవ్వు గాక, మనలో ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో అల్లాహ్ త’ఆలా వారికి తమ యొక్క సంతానాన్ని ఇలాంటి సందర్భాల్లో ఎలా శిక్షణ ఇవ్వాలో, ఎలా వారి యొక్క మంచి పద్ధతులు నేర్పాలో, ఆ భాగ్యం వారికి ప్రసాదించి ఇలాంటి చెడు కార్యాల నుండి దూరం ఉంచు గాక.
ఇంట్లో సిగ్గుమాలిన పనులను సహించుట
ఇక రండి, మన యొక్క ఈరోజు తొమ్మిదవ పాఠం, నిషిద్ధతలు, జాగ్రత్తలు అనే ఈ పుస్తకం నుండి 28వ అంశం, ఇంట్లో సిగ్గుమాలిన పనులను సహించుట. చూశారా? నేను చెప్పాను కదా, అది అల్లాహ్ వైపు నుండి మన యొక్క ఈ క్రమంలో ఈరోజే ఈ పాఠం వచ్చింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కు సంబంధించి కూడా ఈ అంశాన్ని మనం మంచి రీతిలో అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. చాలా చాలా అవసరం.
ఒక రెండు సెకండ్లు ఉండండి, ఇప్పుడు అజాన్ అవుతుంది.
ఇక్కడ ఎవరైతే యూట్యూబ్ లో చూస్తున్నారో, జూమ్ లో రావాలని కోరుకుంటారో, జూమ్ లో వస్తే ఒకసారి అది ఫుల్ అయిపోయింది అని మీకు తెలుస్తుందో, అక్కడే మీరు ఊరుకోకండి. మరోసారి, మరికొన్ని క్షణాల తర్వాత ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి. ఎందుకంటే జూమ్ లో వచ్చేవారు ఏదో ఒక పని మీద ఒకరిద్దరు ముగ్గురు ఈ విధంగా వస్తూ పోతూ ఉంటారు. ఈ విధంగా 100 కంటే తక్కువ ఎప్పుడైతే ఉంటుందో, మీరు అందులో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది.
శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి. ఇంట్లో సిగ్గుమాలిన పనులను సహించుట. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. ముగ్గురిపై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు, అల్లాహు అక్బర్. ఎంత ఘోరమైన శిక్షనో ఒకసారి గమనించండి. స్వర్గం మనం కోల్పోయామంటే ఇక ఏం మేలు పొందాము మనం? ఏం మంచితనం మనకు దొరికింది? ఇహలోకంలో గాని, పరలోకంలో గాని స్వర్గం కోల్పోయిన తర్వాత ఇక ఏదైనా మేలు ఉంటుందా మిగిలి? ఈ విషయం ముందు గమనించండి మీరు.
ఏంటి ఆ మూడు పాపాలు, దీని కారణంగా స్వర్గం నిషేధమవుతుంది? ఒకటి, మత్తు పానీయాలకు బానిస అయినవాడు. మత్తు పానీయాలకు సంబంధించి మా యొక్క ప్రసంగం కూడా ఉంది, మా జీడీకే నసీహ్ యూట్యూబ్ ఛానల్ లో, మత్తు పానీయాల ద్వారా ఎన్ని నష్టాలు ఉన్నాయి, ఇహపరలోకాలలో ఏ ఏ చెడులు వారి గురించి చెప్పడం అందులో చెప్పడం జరిగింది.
రెండవది, తల్లిదండ్రులకు అవిధేయుడు, అల్లాహు అక్బర్. ఇది కూడా చాలా ఈనాటి కాలంలో, న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంలో ఏ యువకులు, యువతులు, ఏ స్టూడెంట్స్ తమ తల్లిదండ్రులను ఏడిపించి, తల్లిదండ్రులకు బాధ కలిగించి, తల్లిదండ్రులు వద్దు అన్నా గాని వెళ్తూ ఉన్నారో, మీ ఈ నూతన సంవత్సర శుభకాంక్షలు, నూతన సంవత్సరం యొక్క సంబరాలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా ఆనందకరమైనదా? లేక స్వర్గం చాలా ఆనందకరమైనదా? అల్లాహ్ ఇచ్చిన బుద్ధి జ్ఞానంతో ఒక్కసారి ఆలోచించుకోండి. తల్లిదండ్రులను కాదు అని, వారికి అవిధేయత చూపి మీరు ఇలాంటి వాటిలో పాల్గొన్నారు అంటే, స్వర్గాన్ని కోల్పోయారు అంటే, మీ ఈ సంతోషాలు మీకు ఏం లాభం కలుగజేస్తాయో ఒక్కసారి ఆలోచించండి.
ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో మత్తుకు బానిస అయిపోతారు ఎంతోమంది. కొందరు యువకులు, నవ యువకులు, నవ యువతులు వారికి మొదటిసారిగా ‘అరే ఒక్కసారి త్రాగురా, ఒకటే గుటకరా, ఒకే చిన్న పెగ్గురా, అరే ఈ ఒక్కరోజే కదరా మనం ఆనందం జరుపుకునేది’ అని ఒకరు మరొకరికి ఈ విధంగా చెప్పుకుంటూ ఏదైతే తాగిస్తారో, తర్వాత దానికి అలవాటు పడే అటువంటి పునాది ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంలో జరుగుతుంది. కనుక గమనించండి, మహప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఎలాంటి విషయం తెలిపారు?
مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ (మన్ కాన యు’మిను బిల్లాహి వల్’యౌమిల్ ఆఖిర్) ఎవరైతే అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసిస్తారో
ఎవరికైతే అల్లాహ్ పై మరియు పరలోక దినంపై విశ్వాసం ఉన్నదో, అలాంటి వారు ఏ దస్తర్ ఖాన్ పై, ఏ ఆహార, అన్నపానీయాలు పెట్టిన ఆచోట, ఎక్కడైతే దావత్ జరుగుతుందో, ఎక్కడైతే నలుగురు కూర్చుని తింటున్నారో, అలాంటి దస్తర్ ఖాన్ పై ఒకవేళ ఏదైనా మత్తు ఉన్నది, ఏదైనా సారాయి ఉన్నది, విస్కీ బ్రాండీ లాంటివి ఉన్నాయి అంటే, అలాంటి ఆ దస్తర్ ఖాన్ లో, ఆ భోజనంలో, ఆ సంబరంలో వారితో కలవకూడదు, వారితో పొత్తు ఉండకూడదు, అందులో హాజరు కాకూడదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారైతే, చెప్పేకి ముందు ఏమన్నారు? ‘మన్ కాన యు’మిను బిల్లాహి వల్’యౌమిల్ ఆఖిర్’. అల్లాహ్ ను ఎవరైతే విశ్వసిస్తున్నారో, పరలోక దినాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో. అంటే ఇక గమనించండి, ఈ సెలబ్రేషన్ సందర్భంగా మీరు వెళ్లారు, అక్కడ ఈ గ్లాసులు కూడా పెట్టబడ్డాయి. మీరు త్రాగకున్నా గాని అలాంటి చోట హాజరు కావడం మీ అల్లాహ్ పై విశ్వాసాన్ని తగ్గిస్తుంది, మీ పరలోక విశ్వాసం దీని ద్వారా తగ్గిపోతుంది. కనుక గమనించండి, ఈ హదీస్ ను శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి.
ముగ్గురు ఉన్నారు, వారికి స్వర్గం లభించదు. ఒకరు, మత్తుకు బానిస అయిన వారు, రెండవ వారు తల్లిదండ్రులకు అవిధేయుడు, మూడవ వాడు తన ఇంట్లో అశ్లీలత, సిగ్గుమాలిన వాటిని సహించేవాడు, వాడినే ‘దయ్యూస్’ అని చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో కొందరు ప్రశ్నిస్తారు, దయ్యూస్ అంటే ఎవరు? హదీస్ లో వచ్చింది దయ్యూస్ అంటే ఎవరు? ఇదే హదీస్ లో దాని పక్కనే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమే వివరించారు. తన ఇంటి వారిలో, ‘అహల్’ అంటే ఇంటి వారిలో. ఇక్కడ ‘ఇంట్లో’ అన్న పదం ఏదైతే మీరు చూస్తున్నారో తెలుగులో, దీని ద్వారా మేము ఇంటి బయటికి వెళ్లి ఇలాంటిది ఏమైనా చేసేది ఉంటే పాపం కాదు కదా అని అనుకోకండి. అర్థం కావడానికి ఒక పదం ‘ఇంట్లో’ అని రాయడం జరిగింది. అంటే ఇంటి వారు. ఉదాహరణకు నేను ఇంటి బాధ్యుడిని. నా యొక్క బాధ్యతలో ఎవరెవరు వస్తారో, వారందరి గురించి నాకు సరియైన ఇన్ఫర్మేషన్ ఉండాలి. వారు ఏదైనా అశ్లీల కార్యంలో పడడం లేదు కదా, సిగ్గుమాలిన మాటలు గాని, పనులు గాని ఏమైనా చేస్తున్నారా? అన్నది నేను తెలుసుకుంటూ ఉండాలి.
ఒకవేళ అలాంటి ఏ కొంచెం అనుమానం వచ్చినా, వారికి మంచి రీతిలో నచ్చచెప్పడం, ఆ చేష్టలకు శిక్ష ఏదైతే ఉందో తెలియజేసి ఆ అశ్లీలతకు దూరంగా ఉంచడం తప్పనిసరి విషయం. ఇంట్లో యజమానికి, అంటే అతడు తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, ఇంటి యొక్క పెద్ద కొడుకు కావచ్చు, సోదరీమణుల కొరకు పెద్ద సోదరుడు కావచ్చు. అందుకొరకే ఒక మాట సర్వసామాన్యంగా మీరు వింటూ ఉంటారు చూడండి. ఒక్క పురుషుడిని నలుగురు స్త్రీలు నరకంలోకి తీసుకెళ్తారు అన్నట్లుగా. ఆ పదంతో ఏదైనా హదీస్ ఉందా, నాకు ఇంతవరకు తెలియదు, దొరకలేదు. కానీ ఇక్కడ మాట కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అన్నట్లుగా అనిపిస్తుంది. ఎలా? ఎవరైనా తండ్రి రూపంలో ఉండి సంతానాన్ని, భర్త రూపంలో ఉండి భార్యలను, ఇంకా సోదరిని రూపంలో ఉండి సోదరీమణులను, కొడుకు రూపంలో ఉండి తల్లిని, చెడు చూస్తూ, వ్యభిచారంలో పడుతూ, సిగ్గుమాలిన చేష్టలు చేస్తూ, తమ యొక్క స్మార్ట్ ఫోన్లలో ఇస్లాంకు వ్యతిరేకమైన, అశ్లీలతను స్పష్టపరిచే అటువంటి ఇమేజెస్ గాని, వీడియోస్ గాని, చాటింగ్స్ గాని ఉన్న విషయాలన్నీ కూడా తెలిసి కూడా వారిని ఆ చెడు నుండి ఆపుటలేదంటే అతడే దయ్యూస్.
అయితే, మరెప్పుడైనా ఏదైనా పెద్ద ఉలమాలతో మీరు ఇంకా దీని గురించి డీప్ గా విన్నప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా, షేక్ బిన్ బాజ్ రహమహుల్లాహ్ తెలిపినటువంటి ఒక విషయం తెలుపుతున్నాను. ఈ హదీస్ యొక్క వ్యాఖ్యానంలో షేక్ బిన్ బాజ్ రహమహుల్లాహ్ తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ ఏదైతే చెప్పారో, దయ్యూస్ అంటే, తన ఇంటిలో, తన ఇంటి వారిలో చెడును, అశ్లీలతను, సిగ్గుమాలిన విషయాలను సహించేవాడు. వాస్తవానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో సభ్యత, సంస్కారం పదాలలో కూడా అశ్లీలత ఏమీ రాకుండా ‘అల్’ఖబస్’ అన్నటువంటి మాట చెప్పారు. కానీ వాస్తవానికి ఇక్కడ ఉద్దేశం, వేరే ఇంకా ఈ టాపిక్ కు సంబంధించిన హదీస్ లు ఏవైతే వచ్చి ఉన్నాయో వాటి ద్వారా, సహాబాల యొక్క వ్యాఖ్యానాల ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే, వ్యభిచారం లాంటి చెడుకు పాల్పడే విషయం, పాల్పడబోతున్న విషయం తెలిసి కూడా మౌనం వహించే అటువంటి బాధ్యుడు, అతడు దయ్యూస్. ఈ మాట చెప్పిన తర్వాత షేక్ బిన్ బాజ్ రహమహుల్లాహ్ చెబుతున్నారు, వాస్తవానికి దయ్యూస్ అనేది ఇది, కానీ ఇక్కడి వరకు చేరిపించడానికి ముందు కొన్ని సాధనాలు ఉంటాయి. అయితే వాటిని చేయకుండా ఉన్నప్పుడే మనిషి వీటికి దూరంగా ఉంటాడు. వాటికి పాల్పడ్డాడంటే ఈ చెడుకు పాల్పడేటువంటి ప్రమాదం ఉంటుంది. మనం కూడా ఇంతకుముందు హదీస్ లో చదివాము కదా, కళ్ళు వ్యభిచారం చేస్తాయి. ఆ యొక్క హదీస్ లోని వివరంలో వేరే హదీస్ ల ఆధారంగా నేను చెప్పాను, హదీస్ లో స్పష్టంగా వచ్చి ఉంది, చేతులు వ్యభిచారం చేస్తాయి, కాళ్ళు వ్యభిచారం చేస్తాయి, పెదవులు వ్యభిచారం చేస్తాయి, నాలుక వ్యభిచారం చేస్తుంది, చెవులు వ్యభిచారం చేస్తాయి. ఇవన్నీ కూడా ‘ముకద్దిమాత్’ అంటారు. అసలైన వ్యభిచారం దేన్నైతే అంటారో, దాని వరకు చేరిపించేటువంటి సాధనాలు ఇవి. అయితే, ‘దయ్యూస్’ అన్నది ఆ చివరి విషయాన్ని సహించేవాడు. కానీ ఇవి కూడా అందులో వచ్చేస్తాయి, ఎందుకంటే ఇవే అక్కడి వరకు చేరిపిస్తాయి గనుక. అక్కడి వరకు చేరిపిస్తాయి గనుక.
రండి, మన పాఠంలోని మరికొన్ని విషయాలు ఉన్నాయి, అక్కడ చదివి ఈ విషయాన్ని ఇంకెంత మంచి రీతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కాలం నాటి దయ్యూల్స్ రూపాల్లో ఇంట్లో కూతురు లేక భార్య పర పురుషునితో మొబైల్స్ లో సంభాషిస్తూ ఉండగా, అతను అలాంటి వాటిని సహించుట. తన ఇంట్లో ఉన్న స్త్రీలలో ఏ ఒకరైనా పర పురుషునితో ఏకాంతంలో గడుపుతూ ఉండడం చూసి మౌనం వహించుట. లేక ఆమె ఒంటరిగా మహరం కాని డ్రైవర్ తో వాహనంలో వెళ్ళుటను చూచి నిరాకరించకపోవుట. వారు ధార్మిక పరదా లేకుండా అంటే ఇంట్లోని స్త్రీలు ధార్మిక పరదా లేకుండా బయటికి వెళ్లి ప్రతి వచ్చి పోయే వాని విష చూపులకు గురి అవుతూ ఉండడం గమనించి సహించుట. ఇంకా అశ్లీలత, సిగ్గుమాలిన తనాన్ని ప్రచారం చేసేటువంటి ఫిలిం క్యాసెట్లు, డిష్ కేబుల్లు, ఇంకా ఏ పరికరం అయినా, ఏ సాధనం అయినా, ఏ మ్యాగజైన్స్ అయినా ఇంట్లోకి తీసుకురావటాన్ని చూసి వారిని నిరాకరించకపోవుట. అలాగే కొడుకులు పర స్త్రీలతో సంబంధం పెట్టుకోవడాన్ని చూసి మౌనం వహించుట. పిల్లలు తమ రూముల్లో, ఎందుకంటే ఎవరి వద్దనైతే సౌకర్యాలు పెరిగి ఉన్నాయో, ఒక్కొక్క కొడుకుకు ఒక్కొక్క రూమ్ ఇచ్చేస్తారు, లేదా ఒక రూమ్ కొడుకుల కొరకు, మరొక రూమ్ బిడ్డల కొరకు ఇచ్చేస్తారు. ప్రతి ఒక్కరిది ఒక బెడ్. అందులో అతను దుప్పటి వేసుకొని మొబైల్ తీసుకొని ఏమేం చూస్తున్నారో, తమ సంతానం తమ మొబైల్ ని ఏ చెడులో వాడుతున్నారో ఆ విషయాన్ని గమనించకుండా లేదా తెలిసి కూడా మౌనం వహించుట, ఇవన్నీ కూడా దయ్యూస్ అనే విషయంలోనే వచ్చేస్తాయి. కనుక వీటన్నిటికీ దూరం ఉండడం చాలా అవసరం.
సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఇంకా రెండు అంశాలు ఈనాటి గురించి ఏదైతే మనం అనుకున్నామో, ఉంటాయి, కానీ టైం సరిపడదు గనుక ఇక్కడి వరకే మనం స్టాప్ చేస్తున్నాము. ప్రత్యేకంగా న్యూ ఇయర్ కి సంబంధించి మీ వద్ద ఏమైనా ప్రశ్నలు ఉండేది ఉంటే అవి తీసుకుందాము. ఇన్’షా’అల్లాహ్ మిగతా రెండు పాఠాలు, ఇంకా మరికొన్ని పాఠాలు ఉన్నాయి, తర్వాత రోజుల్లో చదివే ప్రయత్నం చేద్దాము. జజాకుముల్లాహు ఖైరా, విన్న మంచి మాటలను అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. న్యూ ఇయర్ కు సంబంధించి ప్రత్యేకంగా ఏ చెడు విషయాల ప్రస్తావన వచ్చిందో, వాటి నుండి మనం స్వయంగా దూరం ఉండి, మన బాధ్యతలో ఉన్న వారిని దూరం ఉంచేటువంటి సౌభాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, విశ్వాసంలోని ప్రాథమిక అంశాల గురించి వివరించబడింది. ముఖ్యంగా ‘అర్కానుల్ ఈమాన్’ (విశ్వాస మూలస్తంభాలు) లోని మొదటి అంశమైన అల్లాహ్ పట్ల విశ్వాసం గురించి వివరంగా చర్చించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు జిబ్రీల్ అలైహిస్సలాం మధ్య జరిగిన సంభాషణ ద్వారా ఈమాన్ యొక్క ఆరు మూలస్తంభాలు వివరించబడ్డాయి: అల్లాహ్ ను విశ్వసించడం, ఆయన దైవదూతలను, గ్రంథాలను, ప్రవక్తలను, పరలోక దినాన్ని మరియు మంచి చెడు విధిరాతను విశ్వసించడం. అల్లాహ్ అస్తిత్వం, ఆయన సర్వాధికారాలు (తౌహీద్ అర్-రుబూబియ్య), ఆరాధనలకు ఆయన ఒక్కడే అర్హుడు (తౌహీద్ అల్-ఉలూహియ్య), మరియు ఆయన పవిత్ర నామాలు, గుణగణాలు (తౌహీద్ అల్-అస్మా వస్సిఫాత్) అనే మూడు ముఖ్య విషయాలను తెలుసుకోవడం ద్వారా అల్లాహ్ పై సంపూర్ణ విశ్వాసం కలుగుతుందని బోధించబడింది. ఖురాన్ ఆయతుల ఆధారాలతో ఈ అంశాలు స్పష్టంగా వివరించబడ్డాయి.
అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
అర్కానుల్ ఈమాన్ (విశ్వాస ముఖ్యాంశాలు)
అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలలోని మొదటి ముఖ్యాంశం, అల్లాహ్ పట్ల విశ్వాసం గురించి ఈ ప్రసంగంలో మనం తెలుసుకోబోతున్నాం.
చూడండి, దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం మానవ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమావేశంలో వచ్చి, “ఈమాన్ (విశ్వాసం) అంటే ఏమిటి? తెలుపండి” అన్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ, “ఈమాన్ (విశ్వాసం) అంటే అల్లాహ్ ను విశ్వసించాలి, దైవదూతలను విశ్వసించాలి, దైవ గ్రంథాలను విశ్వసించాలి, దైవ ప్రవక్తలను విశ్వసించాలి, పరలోక దినాన్ని విశ్వసించాలి, మంచి చెడు విధివ్రాతను విశ్వసించాలి.” ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని ఈమాన్, విశ్వాసం అంటారు అని చెప్పారు. దానికి దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం వారు, “అవును, మీరు చెప్పింది నిజమే” అన్నారు.
రండి ఈరోజు మనము విశ్వాస ముఖ్యాంశాలలోని మొదటి విషయం, అల్లాహ్ పై విశ్వాసం గురించి తెలుసుకుందాం.
అల్లాహ్ పై విశ్వాసం
అల్లాహ్ ను విశ్వసించడం అంటే అల్లాహ్ ఉన్నాడు అని, అల్లాహ్ సర్వాధికారాలు కలిగి ఉన్నాడు అని, అల్లాహ్ ఆరాధనలన్నింటికీ అర్హుడు అని, అల్లాహ్ కు గొప్ప నామాలు, పేర్లు ఉన్నాయి అని విశ్వసించటం. దీని క్లుప్తమైన వివరణ ఇప్పుడు మీ ముందర ఉంచడం జరుగుతూ ఉంది.
అల్లాహ్ ఉన్నాడు అని ప్రతి వ్యక్తి నమ్మాలి. ఇదే వాస్తవము కూడా. అల్లాహ్ ఉన్నాడు అని మనందరి ఆత్మ సాక్ష్యమిస్తుంది. సమస్యలు, బాధలు వచ్చినప్పుడు “దేవుడా” అని విన్నవించుకుంటుంది మన ఆత్మ. సృష్టిలో గొప్ప గొప్ప నిదర్శనాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉంచి ఉన్నాడు. ఆ నిదర్శనాలను చూసి, అల్లాహ్ ఉన్నాడు, సృష్టికర్త అయిన ప్రభువైన అల్లాహ్ ఉన్నాడు అని మనము గుర్తించాలి. ఉదాహరణకు, భూమి, ఆకాశాలు, పర్వతాలు, సముద్రాలు, సూర్యచంద్రులు, ఇవన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించినవి. అల్లాహ్ కాకుండా ప్రపంచంలోని ఏ సామ్రాజ్యంలో, ఏ ఫ్యాక్టరీలో ఇవన్నీ తయారు అవ్వవు. వీటన్నింటినీ సృష్టించిన వాడు గొప్ప శక్తిమంతుడు, ఆయనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. మానవుల ద్వారా భూమి, ఆకాశాలను, సముద్రాలను, వీటిని పుట్టించడమో, సృష్టించటమో వీలుకాని పని. కాబట్టి, ఇది మానవులు సృష్టించిన సృష్టి కాదు, సృష్టికర్త, ప్రభువు అల్లాహ్ సృష్టించిన సృష్టి అని ఈ సృష్టిలో ఉన్న నిదర్శనాలు చూసి మనము అల్లాహ్ ఉన్నాడు అని గుర్తించాలి.
ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము, ఒకవేళ సృష్టిలో ఉన్న నిదర్శనాలను చూసి మనము తెలుసుకోకపోయినా, మన శరీరంలో ఉన్న అవయవాలను బట్టి కూడా మనము మహాప్రభువు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నాడని తెలుసుకోవచ్చు. మన శరీరంలో ఉన్న అవయవాలలో నుంచి ఏ ఒక్క అవయవము పాడైపోయినా, అలాంటి అవయవము ప్రపంచంలోని ఏ సామ్రాజ్యంలో కూడా తయారు కాబడదు. మళ్ళీ అల్లాహ్ సృష్టించిన వేరే మనిషి శరీరం నుండి తీసుకుని మనము ఒకవేళ దాన్ని అతికించుకున్నా గానీ, అది అల్లాహ్ ఇచ్చిన అవయవం లాగా పని చేయదు. కాబట్టి మన శరీర అవయవాలే సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క గొప్పతనాన్ని మనకు సూచిస్తూ ఉన్నాయి. ఆ ప్రకారంగా మనము అల్లాహ్, సృష్టికర్త ఉన్నాడు అని మనం నమ్మాలి. ఇదే నిజమైన నమ్మకం.
చూడండి, ఖురాను గ్రంథం 52వ అధ్యాయం, 35వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:
أَمْ خُلِقُوا مِنْ غَيْرِ شَيْءٍ أَمْ هُمُ الْخَالِقُونَ (అమ్ ఖులిఖూ మిన్ ఘైరి షైఇన్ అమ్ హుముల్ ఖాలిఖూన్) “ఏమిటి, వీరు (పుట్టించేవాడు) ఎవరూ లేకుండానే వారంతట వారే పుట్టుకు వచ్చారా? లేక వారే స్వయంగా సృష్టికర్తలా?” (52:35)
అంటే, ఎవరికి వారు స్వయంగా సృష్టించబడలేదు, వారిని సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు అని ఆలోచింపజేస్తున్నాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా.
అలాగే, ఖురాను గ్రంథం 51వ అధ్యాయం, 20 మరియు 21 వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:
وَفِي الْأَرْضِ آيَاتٌ لِّلْمُوقِنِينَ (వఫిల్ అర్ది ఆయాతుల్ లిల్ మూఖినీన్) “నమ్మేవారికి భూమిలో పలు నిదర్శనాలున్నాయి.” (51:20)
وَفِي أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ (వఫీ అన్ఫుసికుమ్ అఫలా తుబ్సిరూన్) “స్వయంగా మీ ఆత్మల్లో (అస్తిత్వంలో) కూడా ఉన్నాయి. మరి మీరు పరిశీలనగా చూడటం లేదా?” (51:21)
చూశారా? మన శరీరంలోనే నిదర్శనాలు ఉన్నాయి. అవి చూసి అల్లాహ్ ను గుర్తుపట్టండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తెలియజేసి ఉన్నాడు. మొత్తానికి, సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నాడు. అదే విషయం మన ఆత్మ సాక్ష్యమిస్తుంది, అదే విషయం సృష్టిలో ఉన్న నిదర్శనాలు, సూచనలు మనకు సూచిస్తూ ఉన్నాయి.
ఇక, అల్లాహ్ ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మూడు విషయాలను బాగా అవగాహన చేసుకోవాలి. ఆ మూడు విషయాలు ఏమిటంటే:
1. అల్లాహ్ సర్వాధికారాలు కలిగి ఉన్నాడు (తౌహీద్ అర్-రుబూబియ్య)
మొదటి విషయం: అల్లాహ్ సర్వాధికారాలు కలిగి ఉన్నాడు అని నమ్మాలి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టికర్త, వస్తువులన్నింటినీ ఆయనే సృష్టించాడు, అన్నింటికీ ఆయనే యజమాని, ఆయన వద్దే సర్వాధికారాలు ఉన్నాయి అని విశ్వసించాలి. దీనిని అరబీ భాషలో తౌహీద్ అర్-రుబూబియ్య అంటారు.
ఖురాను గ్రంథం 39వ అధ్యాయం, 62వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:
జనన మరణాలను ప్రసాదించువాడు, ఉపాధి ప్రసాదించువాడు, లాభనష్టాలు కలిగించువాడు, సంతానము ప్రసాదించువాడు, వర్షాలు కురిపించువాడు, పంటలు పండించువాడు, సర్వాధికారాలు కలిగి ఉన్నవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అని మనము తెలుసుకొని విశ్వసించాలి.
2. ఆరాధనలన్నింటికీ అల్లాహ్ ఒక్కడే అర్హుడు (తౌహీద్ అల్-ఉలూహియ్య)
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గురించి తెలుసుకోవటానికి మరో రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ ఒక్కడే ఆరాధనలన్నింటికీ అర్హుడు అని నమ్మాలి. దీనిని అరబీ భాషలో తౌహీద్ ఉలూహియ్య అంటారు.
ఆరాధనలు ప్రత్యక్షమైన ఆరాధనలు ఉన్నాయి, గుప్తమైన ఆరాధనలు ఉన్నాయి, చిన్న ఆరాధనలు ఉన్నాయి, పెద్ద ఆరాధనలు ఉన్నాయి. ఆరాధన ఏదైనా సరే, ప్రతి ఆరాధనకు అర్హుడు అల్లాహ్ ఒక్కడే అని మనము తెలుసుకొని నమ్మాలి. ఆ తర్వాత ప్రతి చిన్న, పెద్ద, బహిరంగమైనది, గుప్తమైనది ఆరాధన ఏదైననూ అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి, ఎందుకంటే ఆరాధనలకు అర్హుడు ఆయన ఒక్కడే కాబట్టి.
ప్రత్యక్ష ఆరాధనలు ఏవి? గుప్తమైన ఆరాధనలు ఏవి? అంటే నమాజు, ఉపవాసము, దుఆ, జంతుబలి, ఉమ్రా, హజ్, ఇవన్నీ ప్రత్యక్షంగా కంటికి కనిపించే ఆరాధనలు. గుప్తమైన ఆరాధనలు అంటే అల్లాహ్ పట్ల అభిమానం, అల్లాహ్ మీద నమ్మకం, అల్లాహ్ తో భయపడటం, ఇవి పైకి కనిపించని రహస్యంగా, గుప్తంగా ఉండే ఆరాధనలు. ఈ ఆరాధనలు అన్నీ కూడాను మనము కేవలం అల్లాహ్ కోసమే చేయాలి.
ఆరాధనల గురించి ఒక రెండు ముఖ్యమైన విషయాలు మీ ముందర ఉంచి నా మాటను ఇన్షా అల్లాహ్ ముందుకు కొనసాగిస్తాను. అసలు ఆరాధన ఎంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను, జిన్నాతులను ఈ ఆరాధన కోసమే సృష్టించాడు అని తెలియజేసి ఉన్నాడు.
ఖురాను గ్రంథం 51వ అధ్యాయము, 56వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:
చూశారా? మానవులు మరియు జిన్నాతులు అల్లాహ్ ను ఆరాధించటానికి సృష్టించబడ్డారు. మరి ఏ విషయం కోసం అయితే మానవులు సృష్టించబడ్డారో, అదే విషయాన్ని విస్మరిస్తే ఎలాగ? కాబట్టి ఆరాధన ముఖ్యమైన విషయం, మన పుట్టుక అందుకోసమే జరిగింది కాబట్టి, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ ఉండాలి.
అలాగే, ప్రవక్తలు పంపించబడినది మరియు దైవ గ్రంథాలు అవతరింపజేయబడినది కూడా మానవులు అల్లాహ్ ను ఆరాధించటం కోసమే. మానవులు షైతాను వలలో చిక్కి, ఎప్పుడైతే అల్లాహ్ ను మరిచిపోయారో, అల్లాహ్ ను ఆరాధించటం మానేశారో, అల్లాహ్ ను వదిలి బహుదైవారాధన, మిథ్యా దేవుళ్ళను ఆరాధించడం ప్రారంభించారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలను మళ్ళీ రుజుమార్గం పైకి తీసుకురావటానికి, అల్లాహ్ ను ఆరాధించే వారిలాగా చేయటానికి ప్రవక్తలను పంపించాడు, దైవ గ్రంథాలు అవతరింపజేశాడు.
చూడండి ఖురాను గ్రంథం 16వ అధ్యాయం, 36వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:
“మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) “అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి” అని బోధపరచాము. గా ఉండండి” అని బోధపరచాము.” (16:36)
చూశారా? ప్రవక్తలు వచ్చింది ఎందుకోసం అంటే అల్లాహ్ ఒక్కడే ఆరాధనలకు అర్హుడు, ఆయననే ఆరాధించండి, మిథ్యా దేవుళ్ళను ఆరాధించకండి అని చెప్పటానికే వచ్చారు. అందుకోసమే గ్రంథాలు అవతరింపజేయబడ్డాయి. కాబట్టి ఆరాధన ముఖ్యమైనది. ఆరాధనలు మనము అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి.
ఇక, ఆరాధన స్వీకరించబడాలంటే రెండు ముఖ్యమైన షరతులు ఉంటాయండి. ఒక షరతు ఏమిటంటే అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే ఆరాధనలు చేయాలి, దీనిని అరబీ భాషలో ఇఖ్లాస్ లిల్లాహ్ అంటారు. రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ప్రకారమే ఆరాధనలు చేయాలి. అరబీ భాషలో దీనిని ముతాబి’అతు సున్నతి రసూలిల్లాహ్ అంటారు. ఆరాధన స్వీకరించబడాలంటే మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజము కాబట్టి, ప్రతి ఆరాధన అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే చేయాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసి చూపించిన పద్ధతి ప్రకారము చేయాలి. అప్పుడే ఆ ఆరాధన స్వీకరించబడుతుంది.
ఇక, అల్లాహ్ ను కాకుండా ఇతరులను ఆరాధిస్తే, అది బహుదైవారాధన అనిపించుకుంటుంది, దానిని అరబీ భాషలో షిర్క్ అంటారో. బహుదైవారాధన, షిర్క్, పెద్ద నేరము, క్షమించరాని నేరము. ఎట్టి పరిస్థితిలో ఆ నేరానికి పాల్పడకూడదు అని తెలియజేయడం జరిగింది.
3. అల్లాహ్ కు పవిత్ర నామాలు, గుణగణాలు ఉన్నాయి (తౌహీద్ అల్-అస్మా వస్సిఫాత్)
ఇక, అల్లాహ్ ను తెలుసుకోవటానికి మూడవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ కు పవిత్రమైన నామాలు, పేర్లు ఉన్నాయి, వాటిని ఉన్నది ఉన్నట్టుగానే విశ్వసించాలి. దీనిని అరబీ భాషలో తౌహీదుల్ అస్మా వస్సిఫాత్ అంటారు. ఈ పేర్లలో అల్లాహ్ యొక్క గుణాలు తెలియజేయడం జరిగి ఉంది. కాబట్టి అందులో ఎలాంటి వక్రీకరణ చేయకుండా, మన ఇష్టానుసారంగా అర్థాలు తేకుండా, ఏ విధంగా అయితే అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేసి ఉన్నారో, ఆ ప్రకారము ఉన్నది ఉన్నట్టుగానే విశ్వసించాలి.
ఉదాహరణకు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు రహ్మాన్, రహీమ్ అని పేర్లు ఉన్నాయి. రహ్మాన్, రహీమ్ అంటే అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అని. అలాగే అల్లాహ్ కు సమీ’, బసీర్ అనే పేర్లు ఉన్నాయి. సమీ’ అంటే వినేవాడు, బసీర్ అంటే చూసేవాడు అని అర్థం. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు రజ్జాఖ్, గఫూర్ అని పేర్లు ఉన్నాయి. రజ్జాఖ్ అంటే ఉపాధి ప్రదాత, గఫూర్ అంటే మన్నించేవాడు, క్షమించేవాడు. ఆ ప్రకారంగా, అల్లాహ్ యొక్క గుణాలను, అల్లాహ్ యొక్క లక్షణాలను తెలిపే చాలా పేర్లు ఉన్నాయి. అవి ఉన్నది ఉన్నట్టుగానే మనము విశ్వసించాలి.
ఇక, ఈ అల్లాహ్ యొక్క నామాల ద్వారా మనము అల్లాహ్ తో దుఆ చేస్తే, ఆ దుఆ తొందరగా స్వీకరించబడటానికి అవకాశం ఉంటుంది.
ఖురాను గ్రంథం 7వ అధ్యాయం, 180 వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:
وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا (వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్’ఊహు బిహా) “అల్లాహ్‌కు మంచి మంచి పేర్లున్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి.” (7:180)
అల్లాహ్ కు ఉన్న పేర్లతో ఆయన్నే పిలవండి అని అల్లాహ్ చెప్పాడు కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు, ఉదాహరణకు మనతో పాపము దొర్లింది, మన్నించమని మనం అల్లాహ్ తో వేడుకుంటున్నామంటే, “ఓ పాపాలను మన్నించే ప్రభువు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, యా గఫూర్, ఓ పాపాలను మన్నించే ప్రభువా, ఓ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, నీవు గఫూర్, పాపాలను మన్నించేవాడివి, నన్ను మన్నించు” అని వేడుకోవాలి. అలా వేడుకుంటే చూడండి, ప్రార్థనలో ఎంత విశిష్టత వస్తూ ఉందో చూశారా? ఆ ప్రకారంగా మనము వేడుకోవాలి.
ఇవి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను పూర్తిగా విశ్వసించటానికి ఈ మూడు ముఖ్యమైన విషయాలు. అల్లాహ్ సర్వాధికారాలు కలిగి ఉన్నాడు అని, అల్లాహ్ ఒక్కడే ఆరాధనలన్నింటికీ అర్హుడు అని, అల్లాహ్ కు పేర్లు ఉన్నాయి అని, ఈ మూడు విషయాలను మనం అవగాహన చేసుకుంటే అల్లాహ్ మీద మనకు సంపూర్ణ విశ్వాసం కలుగుతుంది.
ఈ మూడింటిలో నుండి ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాము, మిగతా రెండు విషయాలని మనము వదిలేశాము అంటే అప్పుడు మన విశ్వాసము అల్లాహ్ మీద సంపూర్ణము కాజాలదు. ఉదాహరణకు, మక్కా వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవి లభించే సమయానికి అల్లాహ్ గురించి తెలుసుకొని ఉన్నారు. ఒక విషయం మాత్రమే తెలుసుకున్నారు: సృష్టి మొత్తానికి అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త, ఆయన వద్దే సర్వాధికారాలు ఉన్నాయని ఆ ఒక్క విషయాన్ని మాత్రమే వారు తెలుసుకున్నారు. కానీ ఆరాధనల విషయంలో మాత్రం వారు తప్పు చేసేవారు, విగ్రహాలను ఆరాధించేవారు. అల్లాహ్ కు గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయన్న విషయాన్ని వారు విశ్వసించే వారు కాదు. కాబట్టి వారి విశ్వాసము అసంపూర్ణము అని చెప్పబడింది, వారు విశ్వాసులు కారు అని చెప్పబడింది. కాబట్టి, అల్లాహ్ మీద మన విశ్వాసము పూర్తి అవ్వాలంటే, అల్లాహ్ గురించి ఈ మూడు విషయాల అవగాహన చేసుకుని మనము నమ్మాలి, ఆచరించాలి.
అల్లాహ్ మీద విశ్వాసం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ను తెలుసుకొని విశ్వసిస్తాడో అతనిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదుకుంటాడు, సహకరిస్తాడు, అతని కోరికలు తీరుస్తాడు, సమస్యలు పరిష్కరిస్తాడు. అలాగే, అల్లాహ్ ను విశ్వసించిన వ్యక్తి మంచి జీవితం గడుపుతాడు. మార్గభ్రష్టత్వానికి గురి అయ్యి పశువుల్లాగా, చాలామంది చేస్తున్న చేష్టలకు దూరంగా ఉంటాడు. అలాగే మనిషి అల్లాహ్ ను విశ్వసించటము ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ప్రసన్నత పొందుతాడు.
ఇవి అల్లాహ్ పట్ల విశ్వాసం గురించి మనము తెలుసుకొనవలసిన ముఖ్యమైన విషయాలు. నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ అన్న, విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, వక్త ఇస్లాంలో విశ్వాసం యొక్క మూడవ ముఖ్యమైన అంశం గురించి వివరిస్తారు: దైవ గ్రంథాలను విశ్వసించడం. ప్రారంభంలో, అతను అల్లాహ్ యొక్క ఏకత్వం మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. దైవ గ్రంథాలు అంటే ఏమిటి, అవి ఎందుకు అవతరింపబడ్డాయి, మరియు ఖురాన్ ప్రకారం ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అనే విషయాలను చర్చిస్తారు. ఈ గ్రంథాలలో ఇబ్రాహీం (అలైహిస్సలాం) యొక్క సహీఫాలు, తౌరాత్, జబూర్, ఇంజీల్ మరియు ఖురాన్ ఉన్నాయి. ఒక ముస్లింగా ఖురాన్‌ను అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను మరియు దాని ప్రత్యేకతలను కూడా వివరిస్తారు. చివరిగా, పూర్వ గ్రంథాల పట్ల ఒక ముస్లిం యొక్క వైఖరి ఎలా ఉండాలి, అంటే వాటి అసలు రూపాన్ని విశ్వసించడం, కానీ కాలక్రమేణా వాటిలో జరిగిన మార్పులను గుర్తించడం గురించి వివరిస్తారు.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్. నబియినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
అర్కానుల్ ఈమాన్ – విశ్వాసం యొక్క మూలస్తంభాలు
అర్కానుల్ ఈమాన్, ఈమాన్ ముఖ్యాంశాలలోని మూడవ ముఖ్యాంశం దైవ గ్రంథాలపై విశ్వాసం గురించి ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనం తెలుసుకోబోతున్నాం.
దైవ గ్రంథాలు అంటే ఏమిటి? మొత్తం ఎన్ని దైవ గ్రంథాలు భూమండలం మీద అవతరించబడ్డాయి? ఖురాన్ లో ఎన్ని గ్రంథాల ప్రస్తావన వచ్చి ఉంది? మనము ఏ గ్రంథాన్ని అనుసరించాలి? అలాగే పూర్వపు అవతరింపబడిన గ్రంథాల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి?
ఈ విషయాలన్నీ ఇన్షా అల్లాహ్ మనము ఈ ప్రసంగంలో తెలుసుకోబోతున్నాం.
ముందుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు దైవ ప్రవక్త జిబ్రయీల్ (అలైహిస్సలాం) వారు మానవ ఆకారంలో వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతూ విశ్వాసం అంటే ఏమిటి ఓ దైవ ప్రవక్త అని అడిగినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆరు విషయాలను నమ్మటం, విశ్వసించటం ఈమాన్ అంటారు అని ఆరు విషయాలను ప్రస్తావించారు. అల్లాహ్ ను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, గ్రంథాలను విశ్వసించటం, పరలోక దినాన్ని విశ్వసించటం, మంచి చెడు విధివ్రాతలను విశ్వసించటం. మొత్తం ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని విశ్వాసం ఈమాన్ అంటారు అని ప్రవక్త వారు తెలియజేశారు కదండీ. అందులో మూడవ విషయం, మూడవ విషయం దైవ గ్రంథాల పట్ల విశ్వాసం అని ప్రవక్త వారు తెలియజేశారు. ఆ దైవ గ్రంథాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.
దైవ గ్రంథాలు అంటే ఏమిటి?
అసలు ఈ దైవ గ్రంథాలు అని వేటిని అంటారు అంటే, చూడండి మానవులను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భూమండలం మీద పంపించిన తర్వాత మానవులు వారి సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చిత్తం ప్రకారము జీవించాలి అనేది మానవుల మీద అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒక బాధ్యత నిర్ణయించాడు. మరి మానవులకు ఏ పని అల్లాహ్ చిత్తం ప్రకారము జరుగుతుంది మరియు ఏ పని అల్లాహ్ చిత్తానికి విరుద్ధంగా జరుగుతుంది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తేనే కదా వారు తెలుసుకుంటారు. లేదంటే మానవులు చేసే ఏ పని అల్లాహ్ కు నచ్చుతున్నది ఏ పని అల్లాహ్ కు నచ్చటం లేదు అనేది వారికి ఎలా తెలుస్తుందండి? అలా తెలియజేయటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భూమండలంలో నివసిస్తున్న మానవుల్లోనే కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకొని వివిధ యుగాలలో, వివిధ ప్రదేశాలలో వారి వద్దకు దైవదూత ద్వారా వాక్యాలు పంపించాడు.
ఆ వాక్యాలలో మానవులు ఏ పనులు చేస్తే పుణ్యం అనిపించుకుంటుంది, ఏ పనులు చేస్తే పాపం అనిపించుకుంటుంది, వారు ఏ విధంగా జీవించుకుంటే ప్రశాంతంగా జీవిస్తారు, ఏ విధంగా చేస్తే వారు పాపాలకు, అక్రమాలకు పాల్పడి అశాంతికి గురయ్యి అల్లకల్లోలానికి గురైపోతారు, తర్వాత ఏ పనిలో వారికి పుణ్యము దక్కుతుంది, ఏ పనిలో వారికి పాపము దక్కుతుంది అనే విషయాలన్నీ కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వాక్యాలలో ప్రవక్తల వద్దకు పంపించగా, ప్రవక్తలు ఆ దైవ వాక్యాలన్నింటినీ వారి వారి యుగాలలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవో ఆ సౌకర్యాల ప్రకారము వాటన్నింటినీ ఒకచోట భద్రపరిచారు. అది ఆకులు కావచ్చు, చర్మము కావచ్చు, వేరే విషయాలైనా కావచ్చు. అలా భద్రపరచబడిన ఆ దైవ వాక్యాలన్నింటినీ కలిపి దైవ గ్రంథము అంటారు. దైవ గ్రంథంలో మొత్తం దైవ నియమాలు ఉంటాయి, అల్లాహ్ వాక్యాలు ఉంటాయి, ఏది పాపము, ఏది పుణ్యము, ఏది సత్కార్యము అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందులో వివరంగా విడమరిచి తెలియజేసి ఉంటాడు.
అయితే మొత్తం ఎన్ని దైవ గ్రంథాలు భూమండలం మీదికి అవతరించబడ్డాయి అంటే వాటి సరైన సంఖ్య అల్లాహ్ కు మాత్రమే తెలుసు. మనకు అటు ఖురాన్ లో గాని, అటు ప్రామాణికమైన హదీసు గ్రంథాలలో కానీ ఎక్కడా కూడా ఎన్ని దైవ గ్రంథాలు భూమండలం మీద అవతరించబడ్డాయి అనేది పూర్తి దైవ గ్రంథాల సంఖ్యా వివరాలు తెలుపబడలేదు.
ఖురాన్లో ప్రస్తావించబడిన గ్రంథాలు
సరే మరి ఖురాన్ గ్రంథంలో ఎన్ని దైవ గ్రంథాల ప్రస్తావన వచ్చి ఉన్నది అని మనం చూచినట్లయితే, ఖురాన్ లో ఇంచుమించు ఐదు గ్రంథాల గురించి ప్రస్తావన వచ్చి ఉంది.
ఒకటి, సుహుఫు ఇబ్రాహీం – ఇబ్రాహీం (అలైహిస్సలాం) వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన కొన్ని సహీఫాలు, గ్రంథాలు. వాటిని సుహుఫు ఇబ్రాహీం అంటారు. రెండవది తౌరాత్ గ్రంథము. ఈ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూసా (అలైహిస్సలాం) వారికి ఇచ్చి ఉన్నాడు. మూడవది, జబూర్ గ్రంథము. ఈ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) వారికి ఇచ్చి ఉన్నాడు. నాలుగవది ఇంజీల్ గ్రంథము. ఈ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) వారికి ఇచ్చి ఉన్నాడు. ఇక ఐదవ గ్రంథము, ఖురాన్ గ్రంథము. ఈ ఖురాన్ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చి ఉన్నాడు. ఖురాన్ లో ఈ ఐదు గ్రంథాల గురించి ప్రస్తావన వచ్చి ఉన్నది.
ఇక హదీసులలో మనం చూచినట్లయితే, ప్రవక్త షీస్ (అలైహిస్సలాం) వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సహీఫాలు ఇచ్చి ఉన్నాడు అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. అలాగే ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సహీఫాలు ఇచ్చి ఉన్నాడు అని ప్రవక్త వారు మనకు తెలియజేసి ఉన్నారు.
ఏ గ్రంథాన్ని అనుసరించాలి?
మనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులము కదండీ. మరి మనము ఏ గ్రంథాన్ని అనుసరించాలి అంటే, మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులము కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేయబడిన ఖురాన్ గ్రంథాన్ని అనుసరించాలి. ఖురాన్ గ్రంథాన్ని అనుసరించటం మనందరి బాధ్యత.
మరి ఈ ఖురాన్ గ్రంథం యొక్క కొన్ని ప్రత్యేకతలు దృష్టిలో ఉంచుకోండి. ఖురాన్ గ్రంథము చివరి ఆకాశ గ్రంథము, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేయబడింది. ఖురాన్ గ్రంథము అప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే అది అవతరింపజేయబడిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి కల్పితాలకు గురి కాకుండగా సురక్షితంగా ఉంది. ఇన్షా అల్లాహ్ ప్రళయం వరకు కూడా అది సురక్షితంగానే ఉంటుంది. ఖురాన్ గ్రంథము చదివి, అర్థం చేసుకుని ఆచరించటము ప్రతీ విశ్వాసి యొక్క కర్తవ్యము.
ఖురాన్ అల్లాహ్ వాక్యము కాబట్టి దానిని ప్రేమాభిమానాలతో మనము చదవటంతో పాటు ఎంతో గౌరవించాలి మరియు ఆచరించాలి. నేడు ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతి భాషలన్నింటిలో కూడా ఖురాన్ యొక్క అనువాదము చేయబడి ఉన్నది కాబట్టి విశ్వాసి, మానవుడు ప్రపంచపు ఏ మూలన నివసించిన వాడైనా సరే అతను అతనికి ఏ భాష వస్తుందో ఆ భాషలోనే ఖురాన్ గ్రంథాన్ని చదివి అల్లాహ్ ఏమి తెలియజేస్తున్నాడు మానవులకి అనేది తెలుసుకొని అల్లాహ్ ను విశ్వసించి అల్లాహ్ తెలియజేసిన నియమాల అనుసారంగా జీవించుకోవలసిన బాధ్యత ప్రతి మానవుని మీద ఉంది.
పూర్వ గ్రంథాల పట్ల మన వైఖరి
ఇక చివర్లో ఖురాన్ కంటే పూర్వము దైవ గ్రంథాలు అవతరించబడ్డాయి కదా, ఆ దైవ గ్రంథాల పట్ల మన వైఖరి ఏ విధంగా ఉండాలి అనేది తెలుసుకుందాం. చూడండి, ఖురాన్ కంటే ముందు ప్రవక్తలకు దైవ గ్రంథాలు ఇవ్వబడ్డాయి, ఇది వాస్తవం. ఈసా (అలైహిస్సలాం) వారికి గ్రంథం ఇవ్వబడింది, దావూద్ (అలైహిస్సలాం) వారికి గ్రంథం ఇవ్వబడింది, మూసా (అలైహిస్సలాం) వారికి గ్రంథం ఇవ్వబడింది, ఇబ్రాహీం (అలైహిస్సలాం) వారికి గ్రంథం ఇవ్వబడింది కదా. మరి ఆ గ్రంథాల పట్ల మన వైఖరి ఏమిటంటే అవన్నీ దైవ గ్రంథాలు అని మనం విశ్వసించాలి. అలాగే అవి ప్రవక్తల వద్ద పంపబడిన రోజుల్లో సురక్షితంగానే ఉండేవి. వాటిలో మొత్తము దైవ వాక్యాలే ఉండేవి. కానీ ఆ ప్రవక్తలు మరణించిన తర్వాత ఆ ప్రవక్తల అనుచరులు ఆ ఆ గ్రంథాలలో కల్పితాలు చేసేశారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తెలియజేసి ఉన్నాడు కాబట్టి, అవి సురక్షితమైన గ్రంథాలు కావు, సురక్షితమైన రూపంలో నేడు ప్రపంచంలో ఎక్కడా నిలబడి లేవు అని మనం తెలుసుకోవాలి. అలాగే విశ్వసించాలి కూడా.
మనం చూచినట్లయితే నేడు తౌరాత్ గ్రంథము అని ఒక గ్రంథం కనిపిస్తుంది. నేడు మనం చూస్తున్న ఆ తౌరాత్ గ్రంథము ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వారికి ఇవ్వబడిన అలనాటి కాలంలో ఉన్న వాక్యాలతో నిండిన గ్రంథము కాదు. అది నేడు మన దగ్గరికి చేరే సరికి చాలా కల్పితాలకు గురైపోయి ఉంది. ఆ విషయాన్ని మనం నమ్మాలి. అలాగే ఇంజీల్ గ్రంథము అని ఒక గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) వారికి ఆ రోజుల్లో ఇవ్వబడిన ఆ ఇంజీల్ గ్రంథము అది అలాగే నేడు భద్రంగా లేదు. మన సమయానికి వచ్చేసరికి అవి చాలా కల్పితాలకు గురై మన దగ్గరికి చేరింది. కాబట్టి ఆ విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఒక్క ఖురాన్ గ్రంథము మాత్రమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలము నుండి నేటి వరకు ఇన్షా అల్లాహ్ ప్రళయం వరకు కూడా సురక్షితంగా ఉంది, సురక్షితంగా ఉంటుంది.
ఇక పూర్వపు గ్రంథాలలో కొన్ని విషయాలు ఉన్నాయి కదా, అవి మూడు రకాల విషయాలు. ఒక రకమైన విషయాలు ఏమిటంటే అవి సత్యాలు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా లేదంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ధ్రువీకరించి ఉన్నారు. ఆ విషయాలను మనం అవి సత్యాలు అని ధ్రువీకరించాలి. కొన్ని విషయాలు ఎలాంటివి అంటే అవి అసత్యాలు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తెలియజేసి ఉన్నాడు లేదంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేసి ఉన్నారు. అవన్నీ అసత్యాలు అని మనము వాటిని ఖండించాలి. మరి కొన్ని విషయాలు ఎలాంటివి అంటే వాటి గురించి అటు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గాని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గాని మనకు వాటి గురించి ఏమీ తెలియజేయలేదు. అలాంటి విషయాల గురించి మనం కూడా నిశ్శబ్దం పాటించాలి. అవి సత్యము అని ధ్రువీకరించకూడదు, అసత్యాలు అని ఖండించనూ కూడదు. ఎందుకంటే వాటి గురించి సరైన సమాచారము మనకు ఇవ్వబడలేదు కాబట్టి మనము వాటిని ధ్రువీకరించము అలాగే ఖండించము. నిశ్శబ్దం పాటిస్తాము. ఇది ఒక విశ్వాసి పూర్వపు గ్రంథాల పట్ల ఉండవలసిన వైఖరి.
ఇక నేను చివర్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ దైవ గ్రంథాల పట్ల సరైన అవగాహన కలిగి మరియు దైవ గ్రంథాలను ఏ విధంగా అయితే విశ్వసించాలని తెలుపబడిందో ఆ విధంగా విశ్వసించి నడుచుకునే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో విశ్వాస ముఖ్యాంశాలలోని నాలుగవ ముఖ్యాంశం, దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం గురించి మనం తెలుసుకోబోతున్నాం. దైవ ప్రవక్తలు అంటే ఎవరు, వారి సంఖ్య, ఖుర్‌ఆన్‌లో పేర్కొనబడిన 25 మంది ప్రవక్తల పేర్లు, మరియు వారిలో ఐదుగురు ముఖ్యమైన ప్రవక్తల (ఉలుల్ అజ్మ్) గురించి చర్చించబడింది. ప్రవక్తలందరూ అల్లాహ్ చేత ఎన్నుకోబడిన మానవులని, వారు దైవత్వాన్ని పంచుకోరని స్పష్టం చేయబడింది. చివరి ప్రవక్త అయిన ముహమ్మమ్ సల్లల్లాహు అలైహి వసల్లం యావత్ మానవాళికి మార్గదర్శకుడని, నేటి ప్రజలు ఆయనను అనుసరించాలని ఉద్బోధించబడింది. ప్రవక్తలకు ఇవ్వబడిన మహిమలు (అద్భుతాలు) వారి సొంత శక్తి కాదని, అవి అల్లాహ్ యొక్క శక్తి ద్వారా ప్రదర్శించబడ్డాయని కూడా వివరించబడింది.
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ దైవప్రవక్తలలో అత్యంత శ్రేష్ఠుడు, దైవసందేశహరులలో అత్యుత్తముడైన మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన అనుచరులందరిపై శాంతి శుభాలు వర్షించుగాక.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు) “మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం, శుభాలు వర్షించుగాక.”
అర్కానుల్ ఈమాన్: దైవ ప్రవక్తలపై విశ్వాసం
అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలలోని నాలుగవ ముఖ్యాంశం, దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం గురించి ఈ ప్రసంగంలో మనం తెలుసుకోబోతున్నాం.
ఆ హదీస్ పదేపదే మనం వింటూ వస్తున్నాము చూడండి, జిబ్రీల్ అలైహిస్సలాం వారు, దైవదూత, మానవ ఆకారంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్తా, విశ్వాసం (ఈమాన్) అంటే ఏమిటి అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ, “అల్లాహ్‌ను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, ఆకాశ గ్రంథాలను విశ్వసించటం, పరలోక దినాన్ని విశ్వసించటం, మంచి చెడు విధి వ్రాతలను విశ్వసించటం,” ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని ఈమాన్, విశ్వాసం అంటారు అని తెలియజేసినప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం దైవదూత, మీరు నిజం చెప్పారు అని ధ్రువీకరించారు.
ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఆ ఆరు విషయాలలో నుంచి ఒక విషయం, దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం కలిగి ఉండటం.. కాబట్టి ఈ ప్రసంగంలో మనము కొన్ని ముఖ్యమైన విషయాలు దైవ ప్రవక్తల పట్ల తెలుసుకుందాం.
దైవ ప్రవక్తలు అంటే ఎవరు?
ముందుగా, దైవ ప్రవక్తలు అంటే ఎవరు? అది తెలుసుకుందాం. దైవ ప్రవక్తలు అంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచంలో మానవులు ఎప్పుడెప్పుడైతే మార్గభ్రష్టత్వానికి గురయ్యారో, ఆ సందర్భములో మానవులను మళ్లీ రుజుమార్గం పైకి తీసుకురావటానికి, మానవులలో నుంచే ఒక భక్తుడిని ఎన్నుకున్నాడు. ఆ భక్తుని వద్దకు దూతల ద్వారా దైవ వాక్యాలు పంపించగా, ఆ దైవ వాక్యాలు దూతల ద్వారా పొందిన ఆ ఎన్నుకోబడిన దైవభక్తులు ప్రజలకు ఆ దైవ వాక్యాలు బోధించారు, వినిపించారు. అల్లాహ్ వైపుకి, అల్లాహ్ మార్గం వైపుకి ప్రజలను ఆహ్వానించారు. ఆ తర్వాత, ఏ విధంగా అల్లాహ్ మార్గంలో నడుచుకోవాలో ఆచరించి చూపించారు. అలా చేసిన వారిని, అల్లాహ్ వాక్యాలు ప్రజలకు వినిపించి, అల్లాహ్ మార్గంలో ఎలా నడుచుకోవాలో ఆచరించి చూపించిన ఆ అల్లాహ్ తరఫున ఎన్నుకోబడిన భక్తులను దైవ ప్రవక్తలు అంటారు, బోధకులు అంటారు, నబీ, రసూల్ అని అరబీలో కూడా అంటారు.
అయితే, ఈ ప్రపంచంలో ఎంతమంది దైవ ప్రవక్తలు వచ్చారు అంటే, ఈ ప్రపంచంలో ఆదిమానవుడైన ఆదం అలైహిస్సలాం వద్ద నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నాటికి ఇంచుమించు 1,24,000 మంది దైవ ప్రవక్తలు వేరేవేరే యుగాలలో, ప్రపంచంలోని భూమండలంలోని వేరేవేరే ప్రదేశాలలో అవసరాన్నికి తగ్గట్టుగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపిస్తూ వచ్చాడు. మొదటి దైవ ప్రవక్త పేరు ఆదం అలైహిస్సలాం. అంతిమ దైవ ప్రవక్త పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
ఖుర్ఆన్లో ప్రస్తావించబడిన ప్రవక్తలు
ఇక, ఖుర్‌ఆన్ గ్రంథంలో ఎంతమంది దైవ ప్రవక్తల ప్రస్తావన వచ్చి ఉంది అని మనం చూసినట్లయితే, ధార్మిక పండితులు లెక్కించి తెలియజేసిన విషయం ఏమిటంటే, ఖుర్‌ఆన్ గ్రంథంలో 25 దైవ ప్రవక్తల ప్రస్తావన వచ్చి ఉన్నది. ఎవరు వారు అంటే, ఆదం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, సాలిహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయీల్ అలైహిస్సలాం, ఇస్ హాఖ్ అలైహిస్సలాం, యాఖూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, షుఐబ్ అలైహిస్సలాం, ధుల్ కిఫ్ల్ అలైహిస్సలాం, దావూద్ అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాం, ఇలియాస్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం, అల్ యస అలైహిస్సలాం, జకరియ్యా అలైహిస్సలాం, యహ్యా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మొత్తం 25 దైవ ప్రవక్తల ప్రస్తావన ఖుర్‌ఆన్ గ్రంథంలో వచ్చి ఉంది. వారి పేర్లన్నీ మీ ముందర నేను ఇప్పుడు వినిపించటం జరిగింది.
ఇక ఈ 1,24,000 ప్రవక్తలలో నుంచి 25 ప్రవక్తల ప్రస్తావన ఖుర్‌ఆన్‌లో వచ్చింది కదా, వారందరిలో నుంచి ఐదుగురు దైవ ప్రవక్తలకు, ప్రవక్తలందరి మీద ఒక గౌరవ స్థానం ఇవ్వబడింది. వారిని అరబీ భాషలో “ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్” అని బిరుదు ఇవ్వబడింది ప్రత్యేకంగా. తెలుగు భాషలో దానికి అనువాదము సహనమూర్తులు అని, వజ్ర సంకల్పము గల ప్రవక్తలు అని అనువాదం చేసి ఉన్నారు. వజ్ర సంకల్పము గల దైవ ప్రవక్తలు అన్న బిరుదు పొందిన ప్రవక్తలు ఎంతమంది అంటే ఐదు మంది ఉన్నారు. ఆ ఐదు మంది ఎవరంటే నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ ఐదు మందిని “ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్” అని తెలియజేయడం జరిగింది.
అంతిమ ప్రవక్తను అనుసరించటం
ఇక, మనము ఏ ప్రవక్తను అనుసరించాలి? నేడు ప్రపంచంలో ఉన్నవారు, ప్రజలందరూ ఏ ప్రవక్తను అనుసరించాలి అంటే, మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత ప్రపంచంలో పుట్టిన వారము కాబట్టి, నేడు మన మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించే బాధ్యత వేయబడి ఉన్నది. మనమంతా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుయాయులు అని అంటారు.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనము ముఖ్యంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి ఏమిటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ప్రవక్త, చివరి ప్రవక్త. ఇక ప్రళయం వరకు మరొక ప్రవక్త ఎవరూ రాజాలరు. ఆయనే చివరి ప్రవక్త. ఎవరైనా నేను ప్రవక్తను అని ఇప్పుడు గానీ, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత గానీ ఎవరైనా ప్రకటన చేస్తే, అతను అబద్ధం పలుకుతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక ప్రళయం వరకు ప్రవక్తలు రారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా ఖుర్‌ఆన్‌లో తెలియజేసి ఉన్నాడు కాబట్టి, ఇంకా అల్లాహ్ తరఫు నుంచి ప్రవక్తలు రారు.
అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన మాట ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక దేశానికి లేదా ఒక జాతి వారికి ప్రవక్త కాదండి, పూర్తి ప్రపంచానికి ఆయన ప్రవక్తగా పంపించబడ్డారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికంటే ముందు వచ్చిన ప్రవక్తలు ఒక దేశానికి లేదా ఒక జాతి వారికి, ఒక ప్రదేశానికి మాత్రమే ప్రవక్తలుగా పంపించబడేవారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పూర్తి ప్రపంచానికి ప్రవక్తగా చేసి పంపించాడు కాబట్టి, భూమండలంలో ఏ మూలన నివసిస్తున్న వారైనా సరే వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా విశ్వసించాలి.
అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వ ప్రవక్తల నాయకుడిగా చేసి ఉన్నాడు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శాసనము ఇచ్చి ఉన్నాడు. ఆ శాసనాన్ని మనము అనుసరించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము ప్రవక్తగా అభిమానించాలి, ఆయనను గౌరవించాలి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము అనుసరించాలి, అంటే ఆయన చూపిన మార్గంలో మనం నడుచుకోవాలి. ఏ విషయాలు అయితే ఆయన చేయమని మనకు తెలియజేశారో, అవన్నీ మనము పుణ్యకార్యాలు, సత్కార్యాలు అని తెలుసుకొని వాటిని అమలు పరచాలి. ఏ విషయాల నుండి అయితే ఆయన వారించాడో, ఆగిపోమని తెలియజేశారో, ఆ విషయాల జోలికి వెళ్ళకుండా మనము దూరంగా ఉండాలి. ఎందుకంటే, ఆయన ఏ విషయాల గురించి అయితే వారించారో అవన్నీ దుష్కార్యాలు, పాపాలు కాబట్టి వాటికి మనము దూరంగా ఉండాలి.
పూర్వ ప్రవక్తల పట్ల మన వైఖరి
ఇక, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికంటే పూర్వము కొంతమంది ప్రవక్తలు వచ్చారు కదా. ఆ ప్రవక్తల గురించి మన విశ్వాసం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా వైఖరి కలిగి ఉండాలి అంటే, ధార్మిక పండితులు తెలియజేశారు, చాలా చక్కగా మరియు జాగ్రత్తగా ఆలోచించండి.
ప్రవక్తలందరూ కూడా మానవులు అని మనము విశ్వసించాలి. అలాగే, ప్రవక్తలందరూ కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తరఫున ఎన్నుకోబడిన వారు అని వారందరినీ మనము గౌరవించాలి. అలాగే ప్రవక్తలందరి వద్దకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతల ద్వారా వాక్యాలు పంపించగా, వారు ఆ వాక్యాలు ప్రజలకు తూచా తప్పకుండా పూర్తిగా వివరించారు. వారు ఆ బాధ్యతలో రవ్వంత కూడా జాప్యము చేయలేదు, పూర్తిగా ఆ కార్యాన్ని వారు నిర్వహించారు అని మనము విశ్వసించాలి.
అలాగే ప్రవక్తలందరూ కూడా మానవులలోనే ఉత్తములు, పుణ్యాత్ములు, సజ్జనులు అని కూడా మనము గౌరవించాలి. అలాగే, ధర్మ ప్రచారపు మార్గంలో ప్రవక్తలు బాధలు ఎదుర్కొన్నారు, విమర్శలు ఎదుర్కొన్నారు, హింసలు భరించారు, చివరికి ప్రాణత్యాగాలు కూడా కొంతమంది ప్రవక్తలు చేశారు. అవన్నీ మనకు చరిత్రలో తెలుపబడి ఉన్నాయి కాబట్టి, వారందరూ గొప్ప దైవభీతిపరులు, భక్తులు మరియు అల్లాహ్ వారికి అప్పగించిన కార్యము కోసము అవమానాలు భరించిన వారు, బాధలు భరించిన వారు, ప్రాణత్యాగాలు చేసిన వారు అని వారి భక్తి గురించి మనము తెలుసుకోవాలి, అలాగే వారిని భక్తులు అని మనం వారిని గౌరవించాలి.
ఏ ప్రవక్తను కూడా కించపరచరాదు. ప్రవక్తలను కించపరచటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ అనుమతి లేదు. ప్రవక్తలందరినీ గౌరవించాలి, ఏ ప్రవక్తను కూడా కించపరచరాదు.
మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుయాయులము, ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, చివర్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాకతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పూర్వం వచ్చిన ప్రవక్తలందరి శాసనాలు మన్సూఖ్ చేయబడ్డాయి, అనగా రద్దు చేయబడ్డాయి. కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనం మాత్రమే అమలుపరుచుకోవటానికి అనుమతి ఇవ్వబడి ఉంది. ఇది మనం ముఖ్యంగా తెలుసుకొని విశ్వసించాలి మిత్రులారా.
ప్రవక్తల మహిమలు (అద్భుతాలు)
ఇక చివరిలో, ప్రవక్తలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని మహిమలు ఇచ్చి ఉన్నాడు, ఆ మహిమల గురించి తెలుసుకొని మాటను ముగిద్దాం. చూడండి, ప్రవక్తలలో కొన్ని ప్రవక్తలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సందర్భానుసారంగా కొన్ని మహిమలు ఇచ్చాడు. ఉదాహరణకు, మూసా అలైహిస్సలాం వారి కాలంలో అలనాటి ప్రజలు మూసా అలైహిస్సలాం వారితో మహిమలు అడిగినప్పుడు, ఆయన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు కొన్ని మహిమలు ఇచ్చాడు. అందులో ఒక మహిమ ఏమిటంటే చేతికర్ర. అది కింద పడవేస్తే పెద్ద సర్పంలాగా మారిపోతుంది, మళ్లీ ముట్టుకుంటే అది మామూలు కర్రగా మారిపోతుంది. అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఇచ్చిన ఒక మహిమ.
అలాగే, ఈసా అలైహిస్సలాం వారికి కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మహిమలు ఇచ్చారు. ఆయన పుట్టుకతో గుడ్డివారిగా ఉన్న వారిని స్పర్శించి అల్లాహ్ తో దుఆ చేస్తే, పుట్టుకతో గుడ్డివాడిగా ఉన్న వారికి కంటి చూపు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చేసేవాడు. కఠినమైన వ్యాధిగ్రస్తులను కూడా ఆయన స్పర్శించి అల్లాహ్ తో దుఆ చేస్తే వారందరికీ స్వస్థత లభించేది. అంటే, ఈసా అలైహిస్సలాం వారికి కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని మహిమలు ఇచ్చాడు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా మహిమలు ఇచ్చాడు. ఆయన అల్లాహ్ తో దుఆ చేయగా చంద్రుడు రెండు ముక్కలయ్యాడు. ఆయన వేళ్ళ మధ్య నుండి నీళ్లు ప్రవహించాయి. ఇలా అవన్నీ ఇన్ షా అల్లాహ్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహిమలు అన్న ప్రసంగంలో మనం వింటే వివరాలు తెలుస్తాయి. కాకపోతే, ఈ మహిమల గురించి మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మహిమలు ప్రవక్తల సొంత శక్తులు కానే కావు. వారు అల్లాహ్ తో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన శక్తితో అవన్నీ ప్రజల ముందర చేసి చూపించాడు.
ప్రవక్తలు దేవుళ్ళు కారు, దేవునిలో భాగస్థులు కారు, దేవునికి సరిసమానులు కూడా కారు. అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు. ప్రవక్తలు అల్లాహ్ లో భాగము కాదు, అల్లాహ్ కుమారులు కాదు మరియు అల్లాహ్ కు సరిసమానులు కాదు. వారు మానవులు, మానవులలోనే ఉత్తములు, అల్లాహ్ ద్వారా ఎన్నుకోబడిన వారు.
ప్రవక్తలను ప్రతి ప్రవక్తను వారి వారి సమాజం వారు అనుసరించాల్సిన బాధ్యత ఉండేది. మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుయాయులము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి, రండి అల్లాహ్ వైపు, రండి అల్లాహ్ ను విశ్వసించండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా విశ్వసించండి. అల్లాహ్ మరియు ప్రవక్త చూపించిన మార్గం, ఇస్లాం మార్గంలో వచ్చి చేరండి. మీకు అందరికీ ఇదే నా ఆహ్వానం.
అల్లాహ్ తో నేను దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనలందరికీ అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్.
وَجَزَاكُمُ اللهُ خَيْرًا (వ జజాకుముల్లాహు ఖైరన్) “అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ప్రసాదించుగాక.”
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు) “మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం, శుభాలు వర్షించుగాక.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అంతిమ శ్వాస ఆగిపోక ముందే … https://youtu.be/dCyoPq6SI4U [14:24 నిముషాలు] వక్త: ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ధర్మ శాస్త్ర శాసనాలు (పుస్తకం) నుండి తీసుకోబడింది అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
1- వధువరుల అంగీకారం: ఒక వ్యక్తి తనకు ఇష్టం లేని స్త్రీతో వివాహం చేసుకొనుటకు అతడ్ని ఒత్తిడి చేయడం, అలాగే ఒక స్త్రీ తనకు ఇష్టం లేని వ్యక్తితో వివాహం చేసుకొనుటకు ఆమెను ఒత్తిడి చేయడం సమంజసం కాదు. స్త్రీ అంగీకారం, ఇష్టాల్ని తెలుసుకోకుండా ఆమె వివాహం చేయుట నుండి ఇస్లాం వారించింది. ఆమె ఏ వ్యక్తితో పెళ్ళి చేసుకోనంటుందో, అతనితోనే చేసుకొనుటకు ఆమెపై ఒత్తిడి వేయడం ఆమె తండ్రికి కూడా యోగ్యం లేదు. (యువతులు తల్లిదండ్రుల్ని ధిక్కరించి వారు ఇష్టపడిన వారితో పెళ్ళి చేసుకోవచ్చు అని దీని భావం ఎంత మాత్రం కాదు).
2- “వలీ”: వలీ లేనిదే పెళ్ళి కాదు. ఎవరైనా చేసుకున్నా అది సరికాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారుః
لاَ نِكَاحَ اِلاَّ بِوَلِيٍّ వలీ లేనిదే వివాహం కాజాలదు. (తిర్మిజి 1101).
ఎవరైనా స్త్రీ తనంతట తానే వివాహం చేసుకున్నచో ఆ వివాహం సరియైనది కాదు. ఆమె స్వయంగా అఖ్దె నికాహ్ (వివాహ ఒప్పందం) జరుపుకున్నా, లేదా ఎవరినైనా వకీలుగా నియమించి చేసుకున్నా, ఎట్టి పరిస్థితిలో అది నెరవేరదు. ముస్లిం స్త్రీ యొక్క వలీ గా అవిశ్వాసి ఉండలేకూడదు . ఏదైనా మహిళకు వలీ లేని పక్షంలో ఆ మహిళ ఉన్న ప్రాంత ముస్లిం నాయకుడు ఆమెకు వలీగా ఉండి ఆమె వివాహ కార్యాలు నిర్వహిస్తాడు.
వలీ యుక్త వయసుగల, తెలివిగల, నీతిమంతుడైన వధువు యొక్క దగ్గరి బంధువు అయి ఉండాలి. అతను ఆమె తండ్రి, లేదా అతని ‘వసీ’ (వధువు తండ్రి ఎవరికైతే బాధ్యత అప్పగించాడో అతను), లేదా ఆమె తాత (తండ్రి యొక్క తండ్రి), పై వరుసలో ఎంత దగ్గరివారైతే అంత మంచిది. క్రింది వరుసలో ఆమె కొడుకు, అతని కొడుకులు.
వధువు యొక్క స్వంత సోదరుడు. తండ్రి వరుస సోదరుడు, స్వంత సోదరుని కొడుకులు. తండ్రి వరుస సోదరుల కొడుకులు. ఎంత దగ్గరి వారైతే అంత మంచిది.
స్వంత పిన తండ్రి, తండ్రి వరుస పిన తండ్రి, వారి సంతానంలో ఎంత దగ్గరి వారైతే అంత మంచిది. తండ్రి యొక్క పినతండ్రి, అతని సంతానంలో ఎవరైనా. తాత పినతండ్రి, అతని సంతానంలో ఎవరైనా. వీరిలో ఎవరు వలీగా ఉంటాడో అతను తన బాధ్యతలో ఉన్న వధువు అనుమతి తీసుకొని ఆమె అంగీకారం మేరకు వివాహం జరపాలి.
వలీ ఉండడంలో లాభం, ఔచిత్యం వ్యభిచార ద్వారాలను మూసివేయడం. ఎవడైనా వ్యభిచారి ఏదైనా స్త్రీని మోసగించి వచ్చేసెయి మనం పెళ్ళి చేసుకుందామని చెప్పి, వాడే స్వయంగా తన స్నేహితుల్లో ఇద్దర్ని సాక్షులుగా పెట్టి వివాహం చేసుకోలేడు.
3- ఇద్దరు సాక్షులు: నీతినిజాయితీ గల ఇద్దరు, ఇద్దరికన్నా ఎక్కవ ముస్లిములు అఖ్దె నికాహ్ సందర్భంలో తప్పక పాల్గొనాలి. వారు నమ్మదగినవారై ఉండాలి. వ్యభిచారం, మధ్యం సేవించండం లాంటి ఘోర పాపాల (కబీరా గునాహ్)కు గురిఅయినవారు కాకూడదు.
వరుడు లేదా అతని వకీల్ అఖ్ద్ పదాలు ఇలా పలకాలిః మీ కూతురు లేదా మీ బాధ్యతలో ఉన్న ఫలాన స్త్రీ యొక్క వివాహం నాతో చేయండి. వలీ ఇలా అనాలిః నా కూతురు లేదా నా బాధ్యతలో ఉన్న స్త్రీ వివాహం నీతో చేశాను. మళ్ళీ వరుడు ఇలా అనాలిః నేను ఆమెతో వివాహాన్ని అంగీకరించాను. పెండ్లి కుమారుడు తన తరఫున వకీలును నియమించకుంటే అభ్యంతరం లేదు.
4- మహర్ చెల్లించుట విధిగా ఉందిః మహర్ తక్కువ నిర్ణయించుట ధర్మం. ఎంత తక్కువ ఉండి, చెల్లించడం సులభంగా ఉండునో అంతే ఉత్తమం. అఖ్దె నికాహ్ సందర్భంలో మహర్ పరిమాణాన్ని స్పష్టపరచడం, మరియు అప్పుడే నగదు చెల్లించడమే సున్నత్. పూర్తి మహర్, లేదా కొంత మహర్ తర్వాత చెల్లించినా ఫర్వా లేదు.
ఒకవేళ వధువరులు తొలి రాత్రిలో కలుసుకోక ముందే అతను ఆమెకు విడాకులిస్తే ఆమె సగము మహరుకు హక్కుదారు అవుతుంది. తొలి రాత్రిలో కలుసుకోక ముందే భర్త చనిపోతే ఆమె సంపూర్ణ మహరుకు అధికారిణి అవుతుంది. అలాగే అతని ఆస్తిలో కూడా ఆమె భాగస్తురాలవుతుంది.
భర్త ఇంటి యజమాని, తను సంపాదించి భార్యపిల్లలపై ఖర్చు చేయాలి. అయితే అతను లేదా అతని ఇంటివారు భార్యతో లేదా ఆమె ఇంటివారితో డబ్బు లేదా ఇతర సామాగ్రి డిమాండ్ చేసి, అడగడం, తీసుకోవడం ఎంతమాత్రం న్యాయం కాదు. వాస్తవానికి ఇది పురుషుత్వానికే మహా సిగ్గుచేటు. దీని విషయంలో ప్రళయదినాన ప్రశ్నించబడతాడు.
వివాహానంతరం
1- నఫఖ (పోషణం): అనగా భార్యకు సముచితమైన రీతిలో తిండి, బట్ట మరియు ఇల్లు సౌకర్యాలు కలిపించడం భర్త బాధ్యత. ఈ విధిలో పిసినారితనం వహించినవాడు పాపాత్ముడు అవుతాడు. భర్త స్వయంగా ఆమెకు ఖర్చులు ఇవ్వనప్పుడు, భార్య తనకు సరిపడు ఖర్చులు భర్త నుండి తీసుకోవచ్చును. ఒకవేళ ఆమె అప్పు తీసుకున్నా దానిని భర్తే చెల్లించాలి.
నఫఖలో వలీమ కూడా వస్తుంది. అంటే పెళ్ళైన తర్వాత వరుడు ప్రజల్ని ఆహ్వానించి వారికి విందు ఏర్పాటు చేయాలి. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం. ఎందుకనగా ఆయన ఇలా చేశారు. చేయాలని ఆదేశించారు.
2- వారసత్వం: ఎవరైనా ధర్మ పద్ధతిలో ఒక స్త్రీతో వివాహమాడితే వారిద్దరు భార్యభర్తలయ్యారు. పరస్పరం వారసులయ్యారు. అల్లాహ్ ఈ ఆదేశానుసారం:
మీ భార్యకు సంతానం లేని పక్షంలో, వారు విడిచిపోయిన ఆస్తిలో మీకు అర్థభాగం లభిస్తుంది. కాని వారికి సంతానం ఉంటే అప్పుడు వారు విడిచివెళ్ళిన ఆస్తిలో మీకు నాలుగోభాగం లభిస్తుంది. ఇది వారు వ్రాసిపోయిన వీలునామా అమలుజరిపిన తరువాత, వారు చేసిపోయిన అప్పులు తీర్చిన తరువాత జరగాలి. మీకు సంతానం లేనిపక్షంలో మీరు విడిచిపోయే ఆస్తిలోని నాలుగో భాగానికి వారు (మీ భార్యలు) హక్కుదారులౌతారు. కాని మీరు సంతానవంతులైతే అప్పుడు వారికి ఎనిమిదో భాగం లభిస్తుంది. ఇది మీరు వ్రాసిన వీలునామాను అమలుజరిపిన తరువాత, మీరు చేసిన అప్పులు తీర్చిన తరువాత జరగాలి. (సూరె నిసా 4: 12).
వారిద్దరి మధ్య సంభోగం జరిగినా జరగకపోయినా, వారిద్దరూ ఏకాంతములో కలుసుకున్నా కలుసుకోకపోయినా సరే పరస్పరం వారసలవుతారు.
వివాహ పద్ధతులు, దాని ధర్మములు
1- ప్రకటనః వివాహం గురించి ప్రకటించుట సున్నత్. వివాహంలో పాల్గొన్నవారు వధువరులను దీవిస్తూ ఈ దుఆ చదవాలిః
బారకల్లాహు లక వ బారక అలైక వ జమఅ బైనకుమా ఫీ ఖైర్. (అల్లాహ్ యొక్క శుభం మీపై ఎల్లప్పుడూ ఉండుగాక, మీ ఇద్దరి వధువరుల మధ్య అల్లాహ్ సర్వ మేళ్ళను సమకూర్చు గాక).
2- దుఆః ఇద్దరూ సంభోగించుకునే ముందు ఈ దుఆ చదువు కోవాలి:
బిస్మిల్లాహి, అల్లాహుమ్మ జన్నిబ్ నష్షైతాన వ జన్నిబిష్షైతాన మా రజఖ్తనా.
(అల్లాహ్ నామముతో, ఓ అల్లాహ్! మమ్మల్ని మరియు మాకు ప్రసాదించు దానిని (సంతానాన్ని) షైతాను నుండి కాపాడు”.
3- భార్యభర్తలిద్దరూ తమ మధ్య జరిగిన సంభోగ విషయాల గురించి ఎవరికీ చెప్పుకోవద్దు. ఇది చాలా నీచమైన అలవాటు.
4- భార్య హైజ్ (బహిష్టు) లేదా నిఫాస్ (కాన్పు తర్వాత జరుగు రక్త స్రావ కాలం)లో ఉన్నప్పుడు సంభోగించడం నిషిద్ధం. రక్తస్రావం నిలిచాక, ఆమె స్నానం చేయనంత వరకు ఆమెతో సంభోగించ రాదు.
5- భార్య మలద్వారం గుండా సంభోగించడం నిషిద్ధం. అది ఘోర పాపాల్లో లెక్కించబడుతుంది. ఇస్లాం దీనిని కఠినంగా నిషేధించింది.
6- సంభోగంలో భార్యకు సంపూర్ణ తృప్తినివ్వడం తప్పనిసరి. భార్య గర్భం దాల్చకూడదన్న ఉద్దేశంతో భర్తకు వీర్యము వెళ్తున్నప్పుడు పక్కకు జరిగి వీర్యం పడవేయడం మంచిది కాదు. (దీని వల్ల భార్య సుఖం పొందదు). అలా చేయడం భర్త తప్పనిసరి అని భావిస్తే భార్య అనుమతితో చేయాలి. ఏదైనా అవసరానికే చేయాలి.
భార్య గుణాలు
వివాహ ఉద్దేశం ఒకరు మరొకరితో ప్రయోజనం పొందడం, సత్సమాజ ఏర్పాటు, ఉత్తమ కుటుంబం ఉనికిలోకి రావడం. అందుకు మనిషి ఏ స్త్రీతో వివాహమాడబోతున్నాడో ఆమెలో ఈ ఉద్దేశాలు పూర్తి చేసే అర్హత కలిగి ఉండాలి. దానికి ఆమెలో శారీరక అందముతో పాటు ఆధ్యాత్మిక సుందరం కూడా ఉండాలి. అంటే శారీరకంగా ఏ లోపం లేకుండా ఉండాలి. ఆధ్యాత్మికంగా అంటే సంపూర్ణ ధార్మికురాళుగా, సద్గుణ సంపన్నురాలయి ఉండాలి. ఇలాంటి గుణాల స్త్రీలు లభించిన వారికి మహాభాగ్యం లభించినట్లే. అందుకే ధార్మికురాలు, సుగుణ సంపన్నురాలికే ప్రాముఖ్యత ఇవ్వాలి. అదే విధంగా స్త్రీ కూడా తనకు కాబోయే భర్త అల్లాహ్ భయభీతి గలవాడు, సద్గుణసంపన్నుడయిన వాడు కావాలని కాంక్షించాలి.
వివాహనిషిద్ధమైన స్త్రీలు
ఏ స్త్రీలతో వివాహమాడడం నిషిద్ధమో (వారిని మహ్రమాత్ అంటారు) వారు రెండు విధాలుగా ఉన్నారు.
(1) శాశ్వతంగా నిషిద్ధం ఉన్నవారు. (2) తాత్కాలికంగా నిషిద్ధమున్నవారు.
(1) శాశ్వతంగా నిషిద్ధమున్నవారు 3 రకాలు
వంశిక బంధుత్వం:
ఇందులో ఏడు రకాల స్త్రీలున్నారు. వారి ప్రస్తావన అల్లాహ్ సూరె నిసా (4:23)లో చేశాడుః
మీకు ఈ స్త్రీలు నిషేధించబడ్డారుః మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ సోదరీమణులు, మీ తండ్రి సోదరీమణులు (మేనత్తలు), మీ తల్లి సోదరీమణులు, మీ సోదరుల కుమార్తెలు, మీ సోదరీమణుల కుమార్తెలు.
(a) తల్లులు అనగా స్వంత తల్లితో పాటు తండ్రి యొక్క తల్లి (నానమ్మ) మరియు తల్లి యొక్క తల్లి (అమ్మమ్మ).
(b) కుమార్తెలు అనగా స్వంత కుమార్తెలు, కొడుకు మరియు కూతుళ్ళ కుమార్తెలు (మనమరాళ్ళు). ఇలాగే క్రింది వరకు.
(c) చెల్లెళ్ళు అనగా స్వంత చెల్లెళ్ళు తండ్రి మరియు తల్లి వరుస చెల్లెళ్ళు.
(d) మేనత్తలు అనగా స్వంత మేనత్తలు, తండ్రి మేనత్తలు, తాత మేనత్తలు, తల్లి మేనత్తలు, తాతమ్మల మేనత్తలు.
(e) తల్లి సోదరీమణులు అనగా తల్లి యొక్క స్వంత సోదరీ మణులు, నానమ్మ సోదరీమణులు, తాత చిన్నమ్మలు, అమ్మమ్మ సోదరీమణులు, అమ్మమ్మ చిన్నమ్మలు. ఇలాగే పై వరకు.
(f) సోదరుల కుమార్తెలు అనగా స్వంత సోదరుల కుమార్తెలు, తండ్రి మరియు తల్లి వరుస గల సోదరుల కుమార్తెలు, సోదరుల మనమరాళ్ళు. ఇలా క్రింది వరకు.
(g) సోదరీమణుల కుమార్తెలు అనగా స్వంత సోదరీమణుల కుమార్తెలు, తండ్రి మరియు తల్లి వరుస గల సోదరీమణుల కుమార్తెలు, వారి మనమరాళ్ళు. ఇలా క్రింది వరకు.
పాల సంబంధం బంధుత్వం
వంశిక బంధుత్వం వల్ల ఏ స్త్రీలు నిషేధింపబడ్డారో స్తన్య (పాల) సంబంధం వల్ల ఆ స్త్రీలే నిషేధింపబడ్డారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని బుఖారి 2645, ముస్లిం 1447లో ఉంది:
“అనువంశిక బంధుత్వం వల్ల ఏ విధంగా నిషేధం ఏర్పడుతుందో స్తన్య సంబంధం వల్ల కూడా పరస్పర వివాహం నిషిద్ధమవుతుంది.
కొన్ని నిబంధనలున్నాయి, అవి పూర్తి అయినప్పుడే పాల సంబంధం ఏర్పడుతుంది. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయిః
ఐదు సార్లకంటే ఎక్కువ పాలు త్రాగి ఉండాలి. ఏ బాలుడైనా ఒక స్త్రీ పాలు నాలుగు సార్లు మాత్రమే త్రాగి ఉంటే ఆమె అతనికి తల్లి కాదు.
పాల వయసు దాటక ముందు త్రాగి యుండాలి. అంటే ఐదు సార్లు త్రాగడం అనేది పాల వయసు దాటక ముందు అయి ఉండాలి. ఐదిట్లో కొన్ని, పాల వయసులో మరి కొన్ని తర్వాత త్రాగి ఉంటే పాల సంబంధం ఏర్పడదు. ఆమె అతనికి తల్లి కాదు.
పై నిబంధనలు పూర్తయినప్పుడు పాలు త్రాగిన బాలుడు కొడుకు, పాలిచ్చిన స్త్రీ అతనికి తల్లి అవుతుంది. ఆమె సంతానం అతనికి సోదర సోదరీమణులవుతారు. వారు ఇతనికి ముందు పుట్టిన వారైనా తర్వాత పుట్టిన వారైనా. అలాగే ఆమె భర్త సంతానం కూడా అతనికి సోదర సోదరీమణులవుతారు. వారు ఇతను పాలు త్రాగిన తల్లితో పుట్టినవారైనా లేదా ఇతర భార్యలతో పుట్టినవారైనా. ఇక్కడ ఒక విషయం తప్పక గ్రహించాలి (గమనిక): ఈ పాల సంబంధ బంధుత్వం పాలు త్రాగిన బాలుని మరియు అతని సంతానం వరకే పరిమితం. ఆ బాలుని ఇతర బంధువులకు వర్తించదు.
శ్వశుర బంధుత్వం
(a) తండ్రి భార్యలు, తాత భార్యలుః ఒక వ్యక్తి ఏ స్త్రీతో అఖ్ద్ చేసుకున్నాడో ఆ స్త్రీ అతని కొడుకులకు, మనమళ్ళకు నిషిద్ధం. ఇలాగే క్రింది వరకు. అఖ్ద్ చేసుకున్న వ్యక్తి ఆమెతో సంభోగించినా, సంభోగించకపోయినా కేవలం అఖ్ద్ వల్ల ఆమె నిషిద్ధమవుతుంది.
(b) కోడళ్ళుః ఒక వ్యక్తి ఏ స్త్రీతోనయితే అఖ్ద్ చేసుకున్నాడో ఆ స్త్రీ అతని తండ్రి మరియు తాతలకు నిషిద్ధం. తాతలు అంటే తండ్రి యొక్క తండ్రి మరియు తల్లి యొక్క తండ్రి. ఇలాగే పై వరకు. అతను ఆమెతో సంభోగించినా, సంభోగించక పోయినా కేవలం అఖ్ద్ చేసుకున్నంత మాత్రాన ఆమె వారిపై నిషిద్ధం.
(c) భార్య తల్లి, భార్య నానమ్మలు, అమ్మమ్మలుః ఒక వ్యక్తి ఏ స్త్రీతో అఖ్ద్ చేసుకున్నాడో, సంభోగించక పోయినా అఖ్ద్ చేసుకున్నంత మాత్రాన, ఆ స్త్రీ యొక్క తల్లి, ఆమె నానమ్మ, అమ్మమ్మలు అతనిపై నిషిద్ధమవుతారు.
(d) భార్య కూతుళ్ళు, భార్య మనమరాళ్ళుః ఒక వ్యక్తి ఏ స్త్రీతోనయితే పెళ్ళి చేసుకొని, ఆమెతో సంభోగించాడో ఆమె కూతుళ్ళు, మనమరాళ్ళు, ఇలా క్రింది వరకు అతని కొరకు నిషిద్ధం. వారు ఇతనికంటే ముందు భర్తతో అయినా, లేదా అతని తర్వాత భర్తతోనయినా. ఒకవేళ అతను ఆమెతో సంభోగించక ముందే విడాకులిస్తే పై పేర్కొన్నవారు అతని కొరకు నిషిద్ధం కారు.
(2) తాత్కలింగా నిషిద్ధమున్న స్త్రీలు
వారు ఈ క్రింది విధంగా ఉన్నారుః
(a) భార్య సోదరీమణి, భార్య మేనత్త, భార్య తల్లి యొక్క సోదరీమణిః భార్య ఉండగా వీరితో వివాహం చేసుకోరాదు. భార్య చనిపోతే లేదా ఆమెకు విడాకులిస్తే ఆమె విడాకుల గడువు పూర్తి అయిన తర్వాత వారిని పెళ్ళాడవచ్చును.
(b) ఏ స్త్రీ (తన భర్త చనిపోయినందుకు, లేదా విడాకులు పొందినందుకు) గడువులో ఉందో ఆమె ఆ గడువు పూర్తి కాక ముందు ఆమెతో వివాహ- మాడడం, లేదా ఆమెకు వివాహ సందేశం పంపడడం ధర్మసమ్మతం కాదు.
(c) హజ్ లేదా ఉమ్రా కొరకు ఇహ్రామ్ స్థితిలో ఉన్న స్త్రీతో వివాహమాడడం ధర్మ సమ్మతం కాదు. ఆమె తన హజ్ లేదా ఉమ్రా సంపూర్ణంగా చేసుకొని ఇహ్రామ్ నుండి హలాల్ అయిన తరువాతనే వివాహమాడాలి.
విడాకులు
విడాకులు ఇష్టమైన కార్యమేమి కాదు. అయినా కొన్ని సందర్భాల్లో అనివార్యం. ఉదాః భార్యకు భర్తతో, లేదా భర్తకు భార్యతో జీవితం గడపడం కష్టతరమైనప్పుడు. లేదా మరే కారణమైనా సంభవించినప్పుడు అల్లాహ్ తన దయ, కరుణతో దీనిని తన దాసుల కొరకు ధర్మసమ్మతం చేశాడు. ఎవరికైనా ఇలాంటి అవసరం పడినప్పుడు విడాకులివ్వచ్చును. కాని అప్పుడు క్రింది విషయాలను దృష్టిలో ఉంచుకొనుట చాలా ముఖ్యం.
1- భార్య బహిష్టుగా ఉన్నప్పుడు విడాకులివ్వ కూడదు. అప్పుడు విడాకులిచ్చా డంటే అతను అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవిధేయతకు మరియు నిషిద్ధ కార్యానికి పాల్పడినట్లే. అందుకు అతను విడాకులని చెప్పిన తన మాటను వెనక్కి తీసుకొని ఆమెను తన వద్దే ఉంచుకోవాలి. పరిశుద్ధమయిన తర్వాత విడాకులి వ్వాలి. ఇప్పుడు కూడా ఇవ్వకుండా మరో సారి బహిష్టు వచ్చి పరిశుభ్రమయ్యాక తలచుకుంటే విడాకులివ్వాలి లేదా తన వద్దే ఉంచుకోవాలి.
2- పరిశుద్ధంగా ఉన్న రోజుల్లో ఆమెతో సంభోగిస్తే విడాకులివ్వకూడదు. కాని అప్పుడు ఆమె గర్భవతి అని తెలిస్తే విడాకు- లివ్వచ్చును. ఒకవేళ ఆమె గర్భం దాల్చకుంటే, వచ్చే నెలలో ఆమె బహిష్టురాళయి పరిశుభ్రమయ్యే వరకు ఓపిక వహించి, ఆ పరిశుభ్రత రోజుల్లో ఆమెతో సంభోగించకుండా విడాకులివ్వాలి.
విడాకులైన తరువాత
విడాకుల వల్ల భార్య భర్తతో విడిపోతుంది గనక కొన్ని ఆదేశాలు వర్తిస్తాయి వాటిని పాటించటం అవసరం.
1- భర్త సంభోగించి, లేదా కేవలం ఏకాంతంలో ఆమెతో ఉండి విడాకులిస్తే నిర్ణీత గడువు కాలం పూర్తి చేయుట ఆమెపై విధి. సంభోగించక, ఏకాంతంలో ఉండక విడాకులిస్తే ఆమెపై ఏ గడువూ లేదు. బహిష్టురాళ్ళ గడువు కాలం మూడు సార్లు బహిష్టు రావడం. బహిష్టు రాని స్త్రీల గడువు కాలం మూడు నెలలు. గర్భిణీల గడువు కాలం ప్రసవించే వరకు.
గడువు కాలం నిర్ణయించడంలో గొప్ప లాభం ఉందిః విడాకులిచ్చిన స్త్రీని తిరిగి తమ దాంపత్యంలోకి మరలించు- కునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆమె గర్భిణీయా లేదా అనేదీ తెలుస్తుంది.
2- ఇప్పుడిచ్చే విడాకులకు మునుపు రెండు విడాకులిచ్చి ఉంటే ఈ విడాకుల తర్వాత భార్య అతనిపై నిషిద్ధమవుతుంది. అంటే భర్త ఒకసారి విడాకులిచ్చి నిర్ణీత గడువులో మరలించుకున్నాడు లేదా నిర్ణీత గడువు కాలం దాటినందుకు పునర్వివాహం చేసుకున్నాడు. మళ్ళీ రెండవసారి విడాకులిచ్చాడు, నిర్ణీత గడువులో మరలించుకున్నాడు లేదా అది దాటినందుకు పునర్వివాహం చేసుకున్నాడు. ఇక మూడవసారి విడాకులిచ్చి- నట్లయితే ఆమె అతనికి ధర్మసమ్మతం కాదు. (మరలించుకునే హక్కు సయితం అతనికీ ఉండదు). ఆమె మరో వ్యక్తితో సవ్యమైన రీతిలో వివాహం చేసుకోవాలి. అతను ఆమెతో కాపురం చేయాలి. మళ్ళీ అతను ఆమెను ఇష్టపడక, ఆమెతో జీవితం గడపడం సంభవం కాక తనిష్టంతో విడాకులిచ్చిన సందర్భంలో ఆమె మొదటి వ్యక్తి కొరకు ధర్మసమ్మతం అవుతుంది. (అయితే మరో వ్యక్తి పెళ్ళి చేసుకునే, విడాకులిచ్చే ఉద్ధేశం ఆమెను మొదటి వ్యక్తి కొరకు హలాల్ చేయడమైతే మరి అందులో ఆ మొదటి వ్యక్తి ప్రోత్సాహం కూడా ఉంటే వారిద్దరూ ప్రవక్త నోట వెలువడిన శాపనానికి గురవుతారు. (అబూ దావూద్, కితాబున్నికాహ్, బాబున్ ఫిత్తహ్ లీల్). ఏ భర్త తన భార్యకు మూడు సార్లు విడాకులిచ్చాడో, అతను తిరిగి ఆమెను భార్యగా చేసుకునే విషయాన్ని అల్లాహ్ నిషిద్ధ పరచి స్త్రీ జాతిపై చాలా కనికరించాడు. వారిని వారి భర్తల అత్యాచారాల నుండి కాపాడాడు.
“ఖులఅ”
“ఖులఅ” అంటేః భర్తతో జీవితం గడపడం ఇష్టంలేని స్త్రీ, భర్త నుండి తీసుకున్న మహరు సొమ్ము (కన్యాశులకం) అతనికి వాపసు చేసి, అతని వివాహ బంధం నుండి విముక్తి పొంద- దలుచుకొనుట. ఒకవేళ భర్త ఆమెను ఇష్టపడక భార్యను విడిచిపెట్టాలనుకుంటే భార్య నుండి ఏ సొమ్ము తీసుకునే హక్కుండదు. అతను ఓపికతో ఆమెను సంస్కరిస్తూ జీవితం గడపాలి. లేదా మంచి విధంగా విడాకులివ్వాలి.
భర్తతో జీవితం గడపడం వాస్తవంగా దుర్భరమై, సహనం వహించడం కష్టతరమైతేనే తప్ప ఏ స్త్రీ కూడా తన భర్తతో ఖులఅ కోరుట మంచిది కాదు. అలాగే భార్య తన నోట ఖులఅ కోరాలనే ఉద్దేశంతో ఆమెను హింసించడం భర్తకూ ధర్మసమ్మతం కాదు. ఖులఅ కోరడంలో స్త్రీ న్యాయంపై ఉంటే భర్త సంతోషంగా విడాకు- లివ్వాలి. మరియు అతను ఇచ్చిన మహరు కంటే ఎక్కువగా ఆమె నుండి తీసుకోవడం కూడా మంచిది కాదు. ఒకవేళ అతను ఆమెకు ఇచ్చిన మహరు వాపసు తీసుకోకుంటే మరీ మంచిది.
వివాహబంధాన్ని నిలుపుకునే, తెంచుకునే స్వేచ్ఛ
ఈ క్రింది కారణాల్లో ఏ ఒకటైనా భర్త భార్యలో లేదా భార్య భర్తలో చూసినచో వారు తమ వివాహ బంధాన్ని నిలుపుకునే లేదా తెంచుకునే స్వేచ్ఛ కలిగి ఉంటారు.
అఖ్ద్ సందర్భంలో తెలియని ఏదైనా వ్యాది, శారీరక లోపం భర్త భార్యలో లేదా భార్య భర్తలో తర్వాత చూసినచో తమ వివాహ బంధాన్ని నిలుపుకునే లేదా తెంచుకునే హక్కు వారికుంది. ఉదాః
1- ఇద్దరిలో ఏ ఒకరైనా పిచ్చివారు లేదా వ్యాదిగ్రస్తులయి రెండో వారి హక్కు నెరవేర్చ లేని స్థితిలో ఉంటే రెండో వారు వివాహ బంధం నుండి విముక్తి పొందవచ్చు. ఈ విషయం పరస్పర సంభోగానికి ముందు జరిగితే భర్త భార్యకు మహరు ఇచ్చి యుంటే దానిని తిరిగి తీసుకోవచ్చు.
2- భర్త వద్ద మహరు నగదు ఇచ్చే శక్తి లేనప్పుడు మరియు వారిద్దరిలో సంభోగం జరగక ముందు భార్యకు భర్త నుండి విడిపోయే హక్కుంటుంది. సంభోగం జరిగిన తర్వాత మాత్రం ఈ హక్కు ఉండదు.
3- భర్త వద్ద పోషణ ఖర్చులు ఇచ్చే శక్తి లేనప్పుడు భార్య కొద్ది రోజులు వేచి చూడాలి. ఏమీ ప్రయోజనం ఏర్పడకుంటే న్యాయ- వంతులైన ముస్లిం పెద్దల సమక్షంలో మాట పెట్టి విడిపోయే హక్కుంటుంది.
4- ఆచూకీ తెలియకుండా పరారీలో ఉన్న భర్త ఇల్లాలు పిల్లలకు ఏమీ ఖర్చులు ఉంచలేదు. ఎవరికీ వారి ఖర్చుల బాధ్యత అప్పజెప్పలేదు. వారి ఖర్చులు భరించువారెవరు లేరు. తన ఖర్చులకు ఆమె వద్ద కూడా ఏమీ లేదు. అలాంటప్పుడు ముస్లిం న్యాయశీలులైన పెద్దల మధ్యవర్తిత్వంతో ఆ వివాహ బంధం నుండి విడిపోవచ్చును.
అవిశ్వాసులతో వివాహం
ముస్లిం పురుషుడు అవిశ్వాస స్త్రీలను (హిందు, బుద్ధ తదితర మత స్త్రీలను) వివాహమాడుట నిషిద్ధం. యూద, క్రైస్తవ స్త్రీలను పెళ్ళాడడం యోగ్యమే. కాని ముస్లిం స్త్రీ వివాహం ముస్లిం పురుషునితో తప్ప ఎవ్వరితో ధర్మ సమ్మతం కాదు. యూదుడు, క్రైస్తవుడైనా సరే యోగ్యం కాదు.
ముస్లిమేతర జంటలో భార్య ముందుగా ఇస్లాం స్వీకరిస్తే భర్త ఇస్లాం స్వీకరించే వరకు ఆమె అతనితో సంభోగానికి ఒప్పుకొనుట ధర్మసమ్మతం కాదు.
అవిశ్వాసులతో వివాహ విషయంలో ప్రత్యేక ధర్మాలు క్రింద తెలుపబడుచున్నవి:
1- భార్యాభర్తలిద్దరూ ఒకేసారి ఇస్లాం స్వీకరిస్తే వారు అదే నికాహ్ పై ఉందురు (అంటే కోత్తగా మరోసారి “అఖ్దె నికాహ్” వివాహ ఒప్పందం అవసరం లేదు). ధార్మిక ఆటంకం ఏదైనా ఉంటే తప్ప. ఉదాః భర్తకు ఆమె మహ్రమాతులో అయి యుండవచ్చు. లేదా ఆమెతో వివాహం చేసుకొనుట అతనికి యోగ్యం లేకుండవచ్చు. అలాంటప్పుడు వారిద్దరు విడిపోవాలి.
2- యూద, క్రైస్తవ జంటల్లో కేవలం భర్త ఇస్లాం స్వీకరిస్తే వారు అదే నికాహ్ పై ఉందురు.
3- యూద, క్రైస్తవుల్లో గాకుండా వేరే మతఅవలంభికుల జంట ల్లో ఏ ఒక్కరైనా సంభోగానికి ముందే ఇస్లాం స్వీకరిస్తే వారి వివాహ బంధం తెగిపోతుంది. వారు భార్యాభర్తలుగా ఉండలేరు.
4- ముస్లిమేతర జంటల్లో భార్య సంభోగముకు ముందే ఇస్లాం స్వీకరిస్తే ఆమె అతని వివాహ బంధం నుండి విడిపోవును. ఎందుకనగా ముస్లిం స్త్రీ అవిశ్వాసులకు భార్యగా ఉండడం ధర్మ సమ్మతం కాదు.
5- ముస్లిమేతర జంటల్లో భార్య సంభోగం తర్వాత ఇస్లాం స్వీకరిస్తే ఆమె “ఇద్దత్” (గడువు) పూర్తి అయ్యే లోపులో భర్త ఇస్లాం స్వీకరించకున్నట్లయితే గడువు పూర్తి కాగానే వారి వివాహ- బంధం తెగిపోతుంది. ఆమె మరే ముస్లిం వ్యక్తితోనైనా వివాహం చేసుకోవాలనుంటే చేసుకోవచ్చును. భర్త ఇస్లాం స్వీకరణకై వేచించదలుచుకుంటే ఆమె ఇష్టం. అయితే ఈ మధ్యలో భర్తపై ఆమె ఏ హక్కూ ఉండదు. అలాగే అతను ఆమెకు ఏ ఆదేశం ఇవ్వలేడు. అతడు ఇస్లాం స్వీకరించిన వెంటనే ఆమె అతనికి భార్య అయి పోతుంది. పునర్వివాహ అవసరం ఉండదు. ఇందుకొరకు ఆమె సంవత్సరాల తరబడి నిరీక్షించినా ఆమె ఇష్టంపై ఆధార పడియుంది. అలాగే యూద, క్రైస్తవ గాకుండా వేరే మతాన్ని అవలంభించిన స్త్రీ యొక్క భర్త ఇస్లాం స్వీకరిస్తే పై ఆదేశమే వర్తించును. (అనగా వారి మధ్య వివాహ బంధం తెగిపోవును. ఒకవేళ భార్య ఇస్లాం స్వీకరించు వరకు వేచి చూడదలచుకుంటే భర్త వేచించవచ్చును).
6- సంభోగానికి ముందు భార్య మతభ్రష్టురాలైనచో వారి వివాహ బంధం తెగిపోవును. ఆమెకు మహరు కూడా దొరకదు. భర్త మతభ్రష్టుడయితే ఆమెకు సగం మహరు లభించును. మతభ్రష్టులైన వారు తిరిగి ఇస్లాం స్వీకరిస్తే వారు అదే నికాహ్ పై ఉందురు. ఇది వారి మధ్య విడాకులు కానప్పుడు.
యూద క్రైస్తవ స్త్రీలతో వివాహం వల్ల కలిగే నష్టాలు
అల్లాహు తఆలా వివాహాన్ని ధర్మ సమ్మతంగా చేసిన ముఖ్యోద్దేశం: ప్రవర్తనల్లో సంస్కారం, అశ్లీలత నుండి సమాజ పరిశుద్ధత మరియు శీలమానాలకు సంరక్షణ లభించాలని. సమాజంలో స్వచ్ఛమైన ఇస్లామీయ వ్యవస్థ స్థాపించబడాలని. అల్లాహ్ మాత్రమే సత్య ఆరాధ్యుడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చే సత్సమాజం ఉనికిలోకి రావాలని. ఇంతటి గొప్ప లాభాలు పొందాలంటే ధార్మికురాలు, సద్గుణసంపన్నురాలైన ఉత్తమ స్త్రీతో పెళ్ళి చేసుకుంటే తప్ప పూర్తి కావు. ఇక యూద, క్రైస్తవ స్త్రీలతో వివాహం వల్ల కలిగే నష్టాలు ఏలాంటివనేవి క్రింద సంక్షిప్తంగా తెలుసుకుందాముః
1- కుటుంబ రంగములోః చిన్న కుటుంబాల్లో భర్త శక్తివంతుడై ఉంటే భార్యపై అతని ప్రభావం పడుతుంది. ఆమె ఇస్లాం స్వీకరించవచ్చు అన్న ఆశ కూడా ఉంటుంది. ఒకప్పుడు దీనికి విరుద్ధంగా జరుగుతుంది. భర్త అధికారం చెల్లదు. అలాంటప్పుడు భార్య తన ధర్మంలో యోగ్యమని భావించేవాటికి అలవాటు పడుతుంది. ఉదాః మత్తు సేవించడం, పంది మాంసం తినడం, దొంగచాటు సంబంధాలు ఏర్పరుచుకొనడం లాంటివి. అందువల్ల ముస్లిం కుటుంబం చెల్లాచెదురైపోతుంది. సంతానం శిక్షణ మంచివిధంగా జరగదు. పరిస్థితి మరింత మితిమీరిపోతుంది; భార్య గనకా మతపక్షపాతం, మతకక్షల్లాంటి దుర్గుణురాలై సంతానాన్ని తన వెంట చర్చులకు తీసుకుపోతున్నప్పుడు. వారి ప్రార్థనలు, వారి చేష్టలు చిన్నతనం నుండే చూస్తూ చూస్తూ అదే మార్గంపై వారు పెరుగుతారు. సామెత కూడా ఉంది కదా: ‘ఎవరు ఏ అలవాటులపై పెరిగాడో వాటిపైనే చస్తాడు’. (తెలుగు సామెత: మ్రొక్కయి వంగనిది మానయి వంగునా).
2- సమాజిక నష్టాలుః ముస్లిం సమాజంలో యూద, క్రైస్తవ స్త్రీల సంఖ్య పెరగడం చాలా గంభీరమైన విషయం. ఆ స్త్రీలు ముస్లిం సమాజంలో విచార యుద్ధానికి పునాదులవుతారు. దాని వెనక వారి దురలవాటుల వల్ల ముస్లిం సమాజం కుళ్ళిబోతుంది, క్షీణించిపోతుంది. దానికి తొలిమెట్టుగా స్త్రీపురుషుల కలయిక, నగ్నత్వాన్ని పెంపొందించే దుస్తులు అధికమవడం. ఇస్లాంకు వ్యతిరేకమైన ఇతర విషయాలు ప్రభలడం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.