లాభనష్టాల అధికారం కేవలం అల్లాహ్ కే ఉంది

ఇస్లామీయ సోదరులారా! 

లాభనష్టాల అధికారం కేవలం అల్లాహ్ కే వుందని ప్రతి ముస్లిం మనస్ఫూర్తిగా విశ్వసించాలి. అతనికి తప్ప మరెవరికీ ఈ అధికారం లేదు. ఏ ‘వలీ‘ దగ్గరా లేదు, ఏ ‘బుజుర్గ్‘ దగ్గరా లేదు. ఏ ‘పీర్‘, ‘ముర్షద్‘ దగ్గరా లేదు. ఏ ప్రవక్త దగ్గరా లేదు. చివరికి ప్రవక్తలలో శ్రేష్ఠులు, ఆదమ్ సంతతికి నాయకులు మరియు ప్రవక్తల ఇమామ్ అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు కూడా. ఇతరులకు లాభనష్టాలు చేకూర్చడం అటుంచి, స్వయానా తమకు కలిగే లాభనష్టాలపై సయితం వారు అధికారం కలిగిలేరు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

قُل لَّآ أَمْلِكُ لِنَفْسِى نَفْعًۭا وَلَا ضَرًّا إِلَّا مَا شَآءَ ٱللَّهُ ۚ وَلَوْ كُنتُ أَعْلَمُ ٱلْغَيْبَ لَٱسْتَكْثَرْتُ مِنَ ٱلْخَيْرِ وَمَا مَسَّنِىَ ٱلسُّوٓءُ ۚ إِنْ أَنَا۠ إِلَّا نَذِيرٌۭ وَبَشِيرٌۭ لِّقَوْمٍۢ يُؤْمِنُونَ

“ప్రవక్తా! వారితో ఇలా అను: నాకు సంబంధించిన లాభనష్టాలపై నాకు ఏ అధికారమూ లేదు. అల్లాహ్ కోరింది మాత్రమే అవుతుంది. నాకే గనక అగోచర విషయ జ్ఞానం వున్నట్లయితే, నేను ఎన్నో ప్రయోజనాలను నా కొరకు పొంది ఉండేవాణ్ణి. నాకు ఎన్నటికీ ఏ నష్టమూ వాటిల్లేది కాదు. నేను నా మాటను నమ్మేవారి కొరకు కేవలం హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే, శుభవార్త వినిపించేవాణ్ణి మాత్రమే.” (ఆరాఫ్ 7:188) 

ఈ ఆయతుపై దృష్టి సారిస్తే తెలిసేదేమిటంటే – 

స్వయానా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనకు కలిగే లాభనష్టాలపై అధికారం కలిగి లేకపోతే – మరి ఆయన కన్నా తక్కువ స్థాయి గల వలీ గానీ, బుజుర్గ్ గానీ, పీర్ గానీ- ఎవరి సమాధులనయితే ప్రజలు గట్టిగా నమ్మి సందర్శిస్తుంటారో- ఈ అధికారాన్ని ఎలా కలిగి వుంటారు? తమకు ప్రయోజనం చేకూర్చే మరియు నష్టాన్ని కలిగించే వారుగా ప్రజలు తలపోసే వారి గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ لَيَقُولُنَّ ٱللَّهُ ۚ قُلْ أَفَرَءَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ ٱللَّهِ إِنْ أَرَادَنِىَ ٱللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَـٰشِفَـٰتُ ضُرِّهِۦٓ أَوْ أَرَادَنِى بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكَـٰتُ رَحْمَتِهِۦ ۚ قُلْ حَسْبِىَ ٱللَّهُ ۖ عَلَيْهِ يَتَوَكَّلُ ٱلْمُتَوَكِّلُونَ

“వారిని ఇలా అడుగు: ఒకవేళ అల్లాహ్ నాకేదైనా నష్టాన్ని కలిగించగోరితే, మీరు అల్లాహ్ ను కాదని వేడుకొనే ఆరాధ్యులు, ఆయన కలిగించే నష్టం నుండి నన్ను కాపాడగలరా? లేదా అల్లాహ్ నాపై కనికరం చూపగోరితే, వారు ఆయన కారుణ్యాన్ని అడ్డుకోగలరా? మీ అభిప్రాయం ఏమిటి? కనుక వారితో ఇలా అను, నాకు అల్లాహ్ ఒక్కడే చాలు, నమ్ముకునేవారు ఆయననే నమ్ముకుంటారు.” (జుమర్ 39 : 38) 

ఈ ఆయత్ లో అల్లాహ్ ఇలా ఛాలెంజ్ చేస్తున్నాడు: దైవేతరులెవరి దగ్గరైనా లాభనష్టాల అధికారం గనక వుంటే – అల్లాహ్ నష్టం కలిగించదలచిన వాడిని, తను, ఆ నష్టం కలగకుండా కాపాడ మనండి మరియు అల్లాహ్ ప్రయోజనం చేకూర్చదలచిన వాడికి ఆ ప్రయోజనం కలగకుండా ఆపమనండి. అంటే – వారలా చేయలేరు. మరి వారలా చేయలేరంటే – దాని అర్థం వారికి లాభనష్టాల అధికారం లేదు అని. 

అలాగే, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

مَّا يَفْتَحِ ٱللَّهُ لِلنَّاسِ مِن رَّحْمَةٍۢ فَلَا مُمْسِكَ لَهَا ۖ وَمَا يُمْسِكْ فَلَا مُرْسِلَ لَهُۥ مِنۢ بَعْدِهِۦ ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

“అల్లాహ్ ప్రజల కొరకు ఏ కారుణ్య ద్వారాన్ని తెరచినా, దానిని అడ్డుకొనే  వాడెవ్వడూలేదు. ఆయన మూసివేసిన దానిని అల్లాహ్ తరువాత మళ్ళీ తెరిచేవాడూ ఎవ్వడూ లేడు. ఆయన శక్తిమంతుడు, వివేచన కలవాడు.” (ఫాతిర్ 35: 2) 

అందుకే, అల్లాహ్- తనను తప్ప ఇతరులను వేడుకోవడం నుండి వారించాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَلَا تَدْعُ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَنفَعُكَ وَلَا يَضُرُّكَ ۖ فَإِن فَعَلْتَ فَإِنَّكَ إِذًۭا مِّنَ ٱلظَّـٰلِمِينَ وَإِن يَمْسَسْكَ ٱللَّهُ بِضُرٍّۢ فَلَا كَاشِفَ لَهُۥٓ إِلَّا هُوَ ۖ وَإِن يُرِدْكَ بِخَيْرٍۢ فَلَا رَآدَّ لِفَضْلِهِۦ ۚ يُصِيبُ بِهِۦ مَن يَشَآءُ مِنْ عِبَادِهِۦ ۚ وَهُوَ ٱلْغَفُورُ ٱلرَّحِيمُ

“అల్లాహ్ ను వదలి నీకు నష్టాన్ని గానీ లాభాన్ని గానీ కలిగించలేని ఏ శక్తినీ వేడుకోకు. ఒకవేళ అలా చేస్తే నీవూ దుర్మార్గుడవై పోతావు. అల్లాహ్ గనక నిన్ను ఏదైనా ఆపదకు గురిచేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవ్వరూ లేరు. ఇంకా, ఆయన గనక నీ విషయంలో ఏదైనా మేలు చెయ్యాలని సంకల్పిస్తే, ఆయన అనుగ్రహాన్ని మళ్ళించేవాడు కూడా ఎవ్వడూ లేడు. ఆయన తన దాసులలో తాను కోరిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆయన క్షమించేవాడూ, కరుణించేవాడూను.” (యూనుస్ 10: 106 -107) 

ఈ ఆయతులలో అల్లాహ్ – దైవేతరులెవరికీ లాభనష్టాల అధికారం లేదు, వారిని వేడుకోవడాన్ని వారిస్తూ, ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)! ఒకవేళ నీవు గనక ఇలా చేస్తే (అల్లాహ్ శరణు) నీవు కూడా దుర్మార్గులలో కలసి పోతావు – అని సెలవియ్యడంతోపాటు, తన ప్రియ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఆయన నష్టం కలిగించదలిస్తే దాన్ని ఆపగలిగే వాడెవడూ లేడు మరియు ఒకవేళ తన కృపతో ఆయన దేన్నయినా ప్రసాదిస్తే ఆయన అనుగ్రహాన్ని కూడా ఎవరూ అడ్డుకోలేరు అని సెలవిచ్చాడు. దీనితో – రుజువయ్యిందేమిటంటే – ఈ అధికారాలు కేవలం అల్లాహ్ కే వున్నాయి. 

కాస్త ఆలోచించండి! 

మరి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అల్లాహ్ తప్ప మరెవ్వరూ నష్టం కలిగించలేనప్పుడు, సాధారణ ముస్లిములకు అల్లాహ్ తప్ప మరెవరు నష్టం కలిగించగలరు? అందుకే, దైవేతరులెవరైనా సరే, వారితో లాభనష్టాలను ఆశించకూడదు. ఎందుకంటే – దైవేతరుల గురించి -తన సంకల్పంతో, అధికారంతో ఎవరికైనా తను కోరుకున్న నష్టం కలిగించగలడు – అని భావించడం పెద్ద షిర్క్ (షిర్కె అక్బర్). 

అందుకే ఇబ్రాహీం (అలైహిస్సలాం) ఇలా సెలవిచ్చి వున్నారు: 

وَحَآجَّهُۥ قَوْمُهُۥ ۚ قَالَ أَتُحَـٰٓجُّوٓنِّى فِى ٱللَّهِ وَقَدْ هَدَىٰنِ ۚ وَلَآ أَخَافُ مَا تُشْرِكُونَ بِهِۦٓ إِلَّآ أَن يَشَآءَ رَبِّى شَيْـًۭٔا ۗ وَسِعَ رَبِّى كُلَّ شَىْءٍ عِلْمًا ۗ أَفَلَا تَتَذَكَّرُونَ وَكَيْفَ أَخَافُ مَآ أَشْرَكْتُمْ وَلَا تَخَافُونَ أَنَّكُمْ أَشْرَكْتُم بِٱللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِۦ عَلَيْكُمْ سُلْطَـٰنًۭا ۚ فَأَىُّ ٱلْفَرِيقَيْنِ أَحَقُّ بِٱلْأَمْنِ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ

“(అల్లాహ్ కు వ్యతిరేకంగా) మీరు నిలబెట్టిన భాగస్వాములకు నేను భయపడను. అయితే నా ప్రభువు ఏదైనా కోరితే అది తప్పకుండా జరుగుతుంది. నా ప్రభువు జ్ఞానం ప్రతి దానినీ ఆవరించి వున్నది. మీరు స్పృహలోకి రారా? నేను అసలు మీరు నిలబెట్టే భాగస్వాములకు ఎందుకు భయపడాలి?వాటి విషయంలో అల్లాహ్ మీపై ఏ ప్రమాణాన్ని అవతరింపజేయనప్పటికీ వాటిని మీరు ఆయన తోపాటు దైవత్వంలో భాగస్వాములుగా చేస్తూ భయపడనప్పుడు.” (అన్ఆమ్ 6: 80-81) 

ఈ ఆయతుల ద్వారా తెలిసిందేమిటంటే – 

పీర్లు, ఫకీర్లు, ‘బుజుర్గ్’ లో ఎవరిని గురించి కూడా (వారేదో చేసేస్తారని) భయాందోళనలకు గురి కాకూడదు. అల్లాహ్ అభీష్టానికి వ్యతిరేకంగా ఎవరు కూడా ఏ మాత్రం నష్టం కలిగించలేరు. ఇలాంటి భయాందోళనలు కేవలం అల్లాహ్ పట్ల కలిగి వుండాలి. కారణం – తన సంకల్పానికి అనుగుణంగా ఎవరికైనా నష్టం కలిగించే శక్తి సామర్థ్యాలు కేవలం ఆయనకే ఉన్నాయి కాబట్టి. ఒకవేళ అల్లాహ్ సంకల్పించకుంటే ప్రపంచంలోని ఏ వలీ, బుజుర్గ్, పీర్ లేదా సజ్జాదా నషీన్ అయినా ఏ మాత్రం నష్టం కలిగించలేడు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

قُل لَّن يُصِيبَنَآ إِلَّا مَا كَتَبَ ٱللَّهُ لَنَا هُوَ مَوْلَىٰنَا ۚ وَعَلَى ٱللَّهِ فَلْيَتَوَكَّلِ ٱلْمُؤْمِنُونَ

“వారితో ఇలా అను: అల్లాహ్ మాకొరకు వ్రాసి వుంచింది తప్ప మాకు ఏదీ (చెడుగానీ, మంచిగానీ) ఏ మాత్రం కలుగదు. అల్లాహ్ యే మా సంరక్షకుడు. విశ్వసించేవారు ఆయననే నమ్ముకోవాలి.” (తౌబా 9: 51) 

అలాగే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

“యావత్ మానవజాతి ఏకమై నీకేదైనా ప్రయోజనం చేకూర్చాలన్నా ఇదివరకే నీ అదృష్టంలో అల్లాహ్ వ్రాసిపెట్టి వున్నంత వరకే ప్రయోజనం చేకూర్చ గలదు. అలాగే, యావత్తు మానవజాతి ఏకమై నీకేదైనా కీడు కలిగించాలనుకొన్నా – అది కూడా, ఇదివరకే నీ అదృష్టంలో అల్లాహ్ వ్రాసి పెట్టినంతవరకే కీడు తలపెట్టగలదు అని దృఢంగా విశ్వసించు.” (తిర్మిజి : 2516, సహీ ఉల్ జామె : 7957)  

ఈ పోస్ట్ క్రింది ఖుత్బా పుస్తకం నుండి తీసుకోబడింది.

సఫర్ నెల మరియు దుశ్శకునాలు (ఖుత్బా)
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

ఆదర్శ ముస్లిం (Ideal Muslim) [వీడియో సిరీస్]

పార్ట్ 1: ఆదర్శ ముస్లిం – తన ప్రభువుతో, స్వయం తనపట్ల

పార్ట్ 1: ఆదర్శ ముస్లిం – తన ప్రభువుతో, స్వయం తనపట్ల [24 వీడియోలు]
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3YqH11iMo0S3cNAEmlI2qz

పార్ట్ 2: ఆదర్శ ముస్లిం – తన భార్య, బిడ్డలు & బంధువులతో

పార్ట్ 2: ఆదర్శ ముస్లిం – తన భార్య, బిడ్డలు & బంధువులతో [22 వీడియోలు]
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV17BmiYDsxrdj1aCiLeb2bU

పార్ట్ 3: త్వరలో రాబోతుంది ఇన్ షా అల్లాహ్ ..

సహాబాల (ప్రవక్త సహచరులు) మహత్యం | జాదుల్ ఖతీబ్

[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/virtues-of-sahaba
[PDF] [27 పేజీలు]

ఖుత్బాయందలి ముఖ్యాంశాలు:

  • 1) సహాబీ పరిచయం. 
  • 2) దివ్య ఖుర్ఆన్ వెలుగులో సహాబాల మహత్యం. 
  • 3) హదీసుల వెలుగులో సహాబాల మహత్యం. 
  • 4) అన్సారీ సహాబాల మహత్యం. 
  • 5) బదర్ వాసుల (బదర్ యుద్ధంలో పాల్గొన్నవారి) మహత్యం. 
  • 6) ఉహద్ వాసుల మహత్యం. 
  • 7) బైతే రిజ్వాన్ లో పాలుపంచుకున్న సహాబాల మహత్యం. 
  • 8) సహాబాల గురించి ‘అహఁలే  సున్నత్ వల్ జమాత్’ విశ్వాసము. 

షుక్ర్ (కృతజ్ఞతా భావం): దాని శుభాలు | ఖుత్ బాతే నబవీ ﷺ

وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِن شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ ۖ وَلَئِن كَفَرْتُمْ إِنَّ عَذَابِى لَشَدِيدٌۭ

“మీరు గనక కృతజ్ఞులుగా మెలిగితే, నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను. ఒకవేళ మీరు గనక (చేసిన) మేలును మరచిపోతే నిశ్చయంగా నా శిక్ష చాలా కఠినమైనది (అని మరువకండి)” అని మీ ప్రభువు మిమ్మల్ని సావధానపరచిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి! (అల్ ఇబ్రాహీమ్ 14: 7)

ప్రియ సోదరులారా..!

అల్లాహ్ పట్ల కృతజ్ఞతా భావం: దాని శుభాల గురించి ఈ రోజు ఖుత్బాలో తెలుసుకుందాం. మనం నోటితో, ఆచరణతో అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండటం తప్పనిసరి. నోటితో అల్ హమ్దులిల్లాహ్ పలకటం, ఆ అనుగ్రహాన్ని ఆచరణతో కాపాడుకోవటం, గుర్తించటం. దీనినే షుక్ర్ (కృతజ్ఞత) అంటారు. కృతజ్ఞతలు తెలుపుకునే వారికి అల్లాహ్ సమృద్ధిని, శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు. ఖుత్బాలో పఠించిన వాక్యం అర్థం అదే అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

“మీరు గనక కృతజ్ఞులుగా మెలిగితే, నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను. ఒకవేళ మీరు గనక (చేసిన) మేలును మరచిపోతే నిశ్చయంగా నా శిక్ష చాలా కఠినమైనది (అని మరువకండి)” అని మీ ప్రభువు మిమ్మల్ని సావధానపరచిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి! (అల్ ఇబ్రాహీమ్ 14 : 07)

ఈ ఆయత్ హజ్రత్ మూసా (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సంబంధించినది. మూసా (అలైహిస్సలాం) తమజాతి వారితో ఇలా అన్నారు:

“ఓ ప్రజలారా! అల్లాహ్ మీకు ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించాడు. ఇప్పుడు మీ ప్రభువు ఇలా ప్రకటించాడు: ఒకవేళ మీరు అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటే అల్లాహ్ మరింత సమృద్ధిని, శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు. కాని ఒకవేళ మీరు అనుగ్రహాల పట్ల ఏమరుపాటుగా ఉంటే, అశ్రద్ధ చేస్తే మరి అల్లాహ్ ఆజ్ఞ ఇలా ఉంది: “నా శిక్ష కూడా చాలా వ్యధాభరితంగా ఉంటుంది”。

సఫ్ (లైన్)లో ఖాలీ స్థలం వదలకండి, స్వర్గంలో గృహం పొందండి

జనాజా నమాజ్ ఆదేశాలు | ఖుత్ బాతే నబవీ ﷺ

وَٱتَّقُوا۟ يَوْمًۭا تُرْجَعُونَ فِيهِ إِلَى ٱللَّهِ ۖ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفْسٍۢ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ

మీరు అంతా అల్లాహ్ వైపుకు మరలింపబడే రోజుకు భయపడండి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికీ తాను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం వొసగ బడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. (అల్ బఖర 2:281)

ధార్మిక సోదరులారా….

ఈ రోజు జుమా ప్రసంగంలో జనాజా నమాజ్ ఘనత, ఆదేశాల గురించి తెలుసుకుందాం. ఇది ఎలాంటి గమ్యం అంటే ఏదో ఒకరోజు పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ గమ్యానికే చేరుకోవాలి. అల్లాహ్ కూడా ఆ దినం గురించే ఇలా భయపెడు తున్నాడు: “మీరు తిరిగి అల్లాహ్ సమక్షానికి చేరుకోబోయే ఆ దినానికి భయపడండి. అప్పుడు ప్రతి వ్యక్తికి తన కర్మల ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు.” (అల్ బఖర 2: 287)

ప్రియసోదరులారా..

జనాజా పూర్తిగా తయారయిన తర్వాత ఖనన విషయంలో ఎలాంటి ఆలస్యమూ చేయకూడదు. ఒకవేళ మంచి వ్యక్తి అయితే తన నివాసాన్ని చేరుకోవటంలో త్వరగా విజయం పొందుతాడు. ఒకవేళ చెడ్డవాడైతే అతని బరువును మోయటం నుండి మీ భుజాల త్వరగా బరువు తగ్గించుకుంటాయి. జనాజా వెంట వెళ్ళడంలోనే అధిక పుణ్యాలు ఉన్నాయి. అకారణంగా జనాజా కంటే ముందు వాహనం మీద వెళ్ళటం మంచిది కాదు. జనాజాను మోస్తూ వెంట వెంటనే వెళ్ళటం ఉత్తమం. దగ్గరగా ఉంటూ మూడు సార్లు మోస్తే అతని భాధ్యత పూర్తయినట్లే ఇక ఎన్ని సార్లు మోస్తే అన్ని పుణ్యాలు ఎక్కువగా లభిస్తాయి. జనాజా ఎవరిదైనా కూడా దాన్ని చూసి నిలబడటం ఉత్తమం. జనాజా నమాజ్ అయ్యేంత వరకు మృతుని వద్ద ఉండే వానికి ఉహద్ పర్వతం మాదిరిగా ఒక రాశి పుణ్యఫలం పొందుతారు. ఖనన సంస్కారం అయ్యేంత వరకు వేచి ఉన్న వానికి రెండు రాశుల పుణ్యఫలం పొందుతారు. శవపేటికను నేలపై ఉంచే వరకూ ఎవరూ కూర్చోకూడదు.

మాలికి యౌమిద్దీన్ (ప్రతిఫల దినానికి యజమాని) – అర్థ భావాలు & తఫ్సీర్ [వీడియో]

మాలికి యౌమిద్దీన్ (ప్రతిఫల దినానికి యజమాని) – అర్థ భావాలు & తఫ్సీర్ [వీడియో]
https://youtu.be/KeeL4HZ0aVE [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

మనిషి ప్రపంచంలోనూ తాను చేసిన కర్మలకు ప్రతిఫలం కొంతవరకు అనుభవించినప్పటికీ పరలోకంలోనే అసలు సిసలు ఫలితం బయటపడుతుంది. సంపూర్ణమైన ప్రతిఫలం అక్కడే ఉనికిలోనికి వస్తుంది. ప్రతి వ్యక్తికీ అతను చేసిన మంచి లేక చెడు పనులను బట్టి అల్లాహ్ అతనికి బహుమానం ఇవ్వటమో, శిక్ష విధించటమో జరిగి తీరుతుంది. ఇదే విధంగా ప్రపంచంలో కూడా తాత్కాలికంగా అనేకమందికి కొన్ని అధికారాలుంటాయి. కాని పరలోకంలో మాత్రం అధికారాలన్నీ అల్లాహ్ హస్తగతం అవుతాయి. తీర్పుదినాన ఆయన తిరుగులేని సార్వభౌమాధికారిగా ఉంటాడు. “ఈ రోజు విశ్వసామ్రాజ్యాధికారం ఎవరిదో చెప్పండి?” అంటూ ఆనాడాయన ప్రశ్నిస్తాడు. “తిరుగులేని వాడు, ఏకైకుడైన అల్లాహ్ దే” అంటూ ఆయనే సమాధానం కూడా ఇస్తాడు (అల్ మోమిన్ – 16) “ఆనాడు, ఏ మనిషీ ఎవరికొరకైనా ఏదన్నా చెయ్యగలగటమన్నది అసంభవం, ఆ రోజు అధికారమంతా అల్లాహ్ చేతుల్లోనే ఉంటుంది.” (ఇన్ ఫితార్ – 19) – అదీ తీర్పుదినమంటే!

తఫ్సీర్ సూరతుల్ ఫాతిహా – ప్రతీ పదానికి అర్థ భావాలు & వివరణ (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0y1S_HJBYajOm3yyF4a16J

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

సహీ జిక్ర్, దుఆలు తెలుగులో – Authentic Islamic Dhikr & Dua in Telugu:
https://telugudua.net/

ఖుత్ బాతే నబవీ ﷺ (పార్ట్ 1) – మర్కజ్ దారుల్ బిర్ర్ [పుస్తకం]

ఖుత్ బాతే నబవీ ﷺ (పార్ట్ 1) - మర్కజ్ దారులు బిర్ర్ [పుస్తకం]

ఖుత్ బాతే నబవీ ﷺ
దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రసంగాలు – (మొదటి భాగం)

సంకలనం: మౌలానా ముహమ్మద్ దావూద్ రాజ్
అనువాదం: అబూ హయ్యాన్ హమ్మాద్ ఉమరీ
ఎడిటింగ్: డా. సయీద్ అహ్మద్ ఉమరీ , మదనీ

పబ్లిషర్స్: మర్కజ్ దారులు బిర్ర్, పెడన, ఏ.పీ ,ఇండియా

[మొబైల్ ఫ్రెండ్లీ బుక్ వెర్షన్]
[PDF] [204 పేజీలు] [10 MB]

[డెస్క్ టాప్ బుక్ వెర్షన్]
[PDF] [204 పేజీలు] [10 MB]

విషయ సూచిక

అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.

  1. ఇస్లాం మౌలికాంశాలు [7p]
  2. మంచిని పెంచండి, చెడును నిర్మూలించండి [7p]
  3. ఈదుల్ అజ్ హా ఆదేశాలు [4p]
  4. హజ్ ఆదేశాలు [6p]
  5. జీవనోపాధి గురించి ఖుర్ఆన్, హదీసుల వెలుగులో [6p] – [పోస్ట్ లింక్]
  6. నమాజ్ విశిష్ఠత, ఆదేశాలు [7p]
  7. మహాప్రవక్త ﷺ ఆదర్శ జీవితం [3p]
  8. ముహర్రం మాస ఆదేశాలు [3p]
  9. ఇస్లాం అమర వీరులు [6p] – [పోస్ట్ లింక్]
  10. హషర్ మైదానంలో దైవకారుణ్యం [6p] – [పోస్ట్ లింక్]
  11. పశ్చాత్తాపం మానవ గుణం [7p]
  12. ప్రళయ సూచనలు [5p]
  13. పవిత్ర ఖుర్ఆన్ విశిష్ఠత [6p]
  14. హదీసు విశిష్ఠత [6p]
  15. హితబోధనలు [4p]
  16. దుఆ ఘనత [6p]
  17. హిజ్రత్ తరువాత తొలి చారిత్రక ప్రసంగం [6p] – [పోస్ట్ లింక్]
  18. వీడ్కోలు హజ్ ప్రసంగం [5p]
  19. సఫర్ మాస నవీన పోకడలు [5p]
  20. ఐక్యత – సోదరభావం [6p]
  21. ప్రవక్త ﷺ వారి నమాజ్ [7p]
  22. దురాచారాలను త్యజించండి [6p]
  23. కృతజ్ఞతాభావం, దాని శుభాలు – [పోస్ట్ లింక్] [5p]
  24. మద్యపానం, జూదం, వ్యభిచారం ఖండన [7p]
  25. షఫాఅతే కుబ్రా [4p]
  26. రమాజాన్ ఆదేశాలు [4p]
  27. రమజాన్ మాస విశిష్ఠత [4p]
  28. లైలతుల్ ఖద్ర్ ఘనత [3p]
  29. జకాత్ విశిష్ఠత [4p]
  30. ఇస్లాం జీవనశైలి [5p]
  31. ఇస్రా మరియు మేరాజ్ [5p]
  32. తబూక్ యుద్ధం [6p]
  33. వివాహ విధానం [2p]
  34. వసీలా వాస్తవికత [4p]
  35. జనాజా నమాజ్ ఆదేశాలు – [పోస్ట్ లింక్] [8p]
  36. దైవప్రవక్త ﷺ మరణం [6p]
  37. ఖుర్ఆన్ సందేశం [5p]

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

హదీసు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన పుస్తకాలు క్రింది లింక్ దర్శించి డౌన్లోడ్ చేసుకోగలరు.
https://teluguislam.net/hadith-publications-books/

ప్రవక్త ﷺ సున్నత్ అనుసరణ – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

ఉర్దూ మూలం : మౌలానా ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
ప్రకాశకులు : హదీస్ పబ్లికేషన్స్

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[మొబైల్ ఫ్రెండ్లీ బుక్ ][PDF] [120 పేజీలు] [5.13 MB]

విషయ సూచిక (డౌన్లోడ్)

  1. తొలి పలుకులు [13p]
  2. బిద్ అత్ (కొత్త పోకడలు) [22p]
  3. హదీసు వివరాల సంక్షిప్త బోధన [3p]
  4. సంకల్పం [1p]
  5. సున్నత్ నిర్వచనం [3p]
  6. సున్నత్ – ఖుర్ఆన్ వెలుగులో [6p]
  7. సున్నత్ మహత్తు [4p]
  8. సున్నత్ ప్రాముఖ్యం [9p]
  9. సున్నత్ యెడల భక్తి ప్రపత్తులు [3p]
  10. సున్నత్ వుండగా సొంత అభిప్రాయమా? [4p]
  11. ఖుర్ఆన్ అవగాహనకై సున్నత్ ఆవశ్యకత [8p]
  12. సున్నత్ను పాటించటం అవశ్యం [10p]
  13. ప్రవక్త సహచరుల దృష్టిలో సున్నత్ [8p]
  14. ఇమాముల దృష్టిలో సున్నత్ [4p]
  15. బిద్అత్ నిర్వచనం [2p]
  16. బిద్అత్ ఖండించదగినది [7p]
  17. బలహీనమైన, కాల్పనికమైన హదీసులు [2p]

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

హదీసు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన పుస్తకాలు క్రింది లింక్ దర్శించి డౌన్లోడ్ చేసుకోగలరు.
https://teluguislam.net/hadith-publications-books/

నికాహ్ (పెళ్లి) ఆదేశాలు – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

ఉర్దూ మూలం : మౌలానా ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
ప్రకాశకులు : హదీస్ పబ్లికేషన్స్

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[మొబైల్ ఫ్రెండ్లీ బుక్ ] [PDF] [152 పేజీలు] [14.7 MB]

విషయ సూచిక

అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

హదీసు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన పుస్తకాలు క్రింది లింక్ దర్శించి డౌన్లోడ్ చేసుకోగలరు.
https://teluguislam.net/hadith-publications-books/