https://youtu.be/F2yNYWRr5NQ [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
ఖురాన్ కథామాలిక
మూలం: షేఖ్ అబూబకర్ నజార్
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & హాఫిజ్ ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్
[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/quran-kadha-malika
[PDF] [374 పేజీలు] [డెస్క్ టాప్ బుక్] [16 MB]
[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/qaida-darulbirr
[PDF] [36పేజీలు] [మొబైల్ ఫ్రెండ్లీ బుక్]
అరబ్బీ అక్షరాలు, గుణింతాల చార్టులు క్రింద డౌన్లోడ్ చేసుకోండి
[అన్నీ చార్టులు పేజీ 1 నుండి 11 వరకు] [PDF]
[ఫస్ట్ చార్ట్ – అలిఫ్, బ,త] [PDF]
[బ గుణింతం – బ, బి, బు …] [PDF]
అత్ తబర్రుక్ అంటే; శుభాలను ఆశించడం. మేళ్ళు, శుభాలు కలగడం మరియు శుభాలు ప్రాప్తించడం. ఎవరికైతే మేళ్ళను మరియు శుభాలను ప్రసాదించే అధికారం ఉందో, వారితోనే కోరడం సమంజసం. శుభాలను ప్రసాదించే అధికారం ఎవరికైతే లేదో, వారి ద్వారా శుభాలు ఆశించడం లేక కోరడం అవివేకం. కనుక మేళ్ళను మరియు శుభాలను ప్రసాదించగలిగే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది. సర్వసృష్టిలో ఉన్న ఏ వ్యక్తికి మేళ్ళను మరియు శుభాలను ప్రసాదించే శక్తిగాని, ఆధికారంగాని లేదు.
ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمْ لَهُ ٱلْمُلْكُ ۚ وَٱلَّذِينَ تَدْعُونَ مِن دُونِهِۦ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا۟ دُعَآءَكُمْ وَلَوْ سَمِعُوا۟ مَا ٱسْتَجَابُوا۟ لَكُمْ ۖ
కనుక అల్లాహ్ ఇలా తెలియజేసాడు: “ఆయనే అల్లాహ్ మీ ప్రభువు, విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే! మరియు ఆయనను పదిలి మీరు వేడుకొనే వారు, ఖర్జూర బీజంపై నున్న పొరకు కూడా యజమానులు కారు- మీరు వారిని వేడుకున్నప్పటికీ, వారు మీ ప్రార్థనలను విసలేరు, ఒక వేళ విన్నా, వారు మీకు జవాబివ్వలేరు” (సూరతుల్ ఫాతిర్ 35:13-14).
మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: ”ఓ అల్లాహ్ నీవు ఎవరికైన ప్రసాదిస్తే దానిని నివారించేవారు ఎవరూ లేరు. నీకృపే లేకపోతే కృషి చేయువాని కృషికి ప్రతి ఫలము ఏమియు లేదు.” (బుఖారీ:799, ముస్లిం:725)
ప్రత్యేక స్థలాల్లో మరియు బ్రతికున్న లేక మరణించిన పుణ్యప్రజల యందు శుభాలను ఆశించడం ధర్మసమ్మతం కాదు. ఒకవేళ వారి ద్వారా శుభాలు ప్రాప్తిస్తాయని విశ్వసిస్తే అది షిర్క్ అవుతుంది. మరియు కొన్ని వస్తువులను పవిత్రంగా భావించి వాటి తాకిడి వల్ల శుభాలు ప్రాప్తిస్తాయని, ప్రత్యేకమైన స్థలాలలో బస చేయడం వల్ల శుభాలు ప్రాప్తిస్తాయని నమ్మడం షిర్క్ వైపుకే దారి తీస్తోంది.
ముఖ్య గమనిక: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బ్రతికుండగా ఆయన శిరోజాలను, ఆయన చమటను, మరియు ఆయన దుస్తులను శుభాలుగా భావించి సహాబాలు వాటితో ప్రయోజనం పొందేవారు. ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వ్యక్తిత్వంతో మాత్రమే శుభాలను ఆశించడం ధర్మం. మరియు ఆయన శరీరానికి సంబంధించిన ఏ ఒక్క వస్తువు (వెంట్రుకలు, తలపాగ, దుస్తులు, ఉంగరం వంటివి) మనకు లభించిన వాటిని పవిత్రంగా భావించి శుభాలను ఆశించడం కూడా ధర్మమే. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చనిపోయిన తరువాత ఆయనకు సంబంధించిన వస్తువులు ప్రస్తుత కాలంలో లేవు, కాబట్టి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వనల్లం)వ్యక్తిత్వం ద్వారా మరియు వారి వస్తువుల ద్వారా శుభాలను ఆశించడం అనేది కూడా లేదు. ఒక వేళ పవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారికి సంభందించిన వస్తువు ప్రామాణి కమైన ఆధారాలతో లభించినట్లయితే శుభంగా ఉపయోగించడం ధర్మం.
కాని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటిని లేక సమాధిని మరియు ఆయన నమాజు చేసే చోటును లేక ఆయన కూర్చునే చోటును శుభాల కొరకు ప్రత్యేకించలేదు. అలాగే హిరా కొండను, సౌర్ కొండను, జబలుర్ రహ్మా (అరాఫాత్) మైదానంలో నిలబిడి ప్రసంగించిన) కొండను శుభాలుగా ఆశించి ఎక్కడం లేక బస చేయడం మరియు అక్కడ నమాజు కొరకు ప్రధాన్యత ఇవ్వడం కూడా ధర్మం కాదు. ప్రపంచంలో మక్కా మరియు మదీనా పవిత్రమైన స్థలాలు. అక్కడ ఉన్న కాబతుల్లాహ్ మసీదు, మరియు మదీనాలో ఉన్న మస్జిద్ నబవీ మరింత పవిత్రమైనవి. అలాగే మజ్జిదే అఖ్సా కూడా పవిత్రమైనది. మరియు మక్కా మసీదులో ఉన్న జమ్ జమ్ నీరు అతి పవిత్రమైనది. మదీనా లో పండే ‘అజ్వా’ ఖర్జూరాలు శుభమైనవి.
హజ్రత్ అబూబకర్ మరియు హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీ, హజ్రత్ హసన్, హుసైన్ వంటి ఉత్తమమైన సహాబాలు, మరియు వారిలో కొందరు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబానికి చెందినవారు కూడా ఉన్నారు. అంతేకాక వారందరితో అల్లాహ్ ప్రసన్నుడ య్యాడు. మరియు వారు కూడా అల్లాహ్ తో సంతుష్టులయ్యారు. అనే విషయం దైవ గ్రంథం ఖుర్ఆన్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి మహా పుణ్యాత్ములైన సహాబాలను, వారు ఉపయోగించిన వస్తువులను ఆ నాటి ప్రజలు శుభాల కొరకు ప్రత్యేకించలేదంటే, వారి తరువాత తరాల ప్రజల నుండి శుభాలను ఆశించడం ఎంతవరకు ధర్మం?
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి తరానికి చెందినవారు సహాబాలు మరియు సహబాల తరానికి చెందినవారు తాబయీన్లు, తబా తాబయీన్లు. వారందరూ పవిత్రమైన తరాలకు మరియు కుటుంబాలకు చెందినవారు. కనుక ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు:
“ప్రజలందరిలోకెల్లా నా తరం ప్రజలు ఉత్తములు (పుణ్యాత్ములు) మరియు ఆ తరువాతి తరంవారు, మరియు ఆ తరువాతి తరంవారు” (బుఖారీ:2457, ముస్లిం:4603)
అంటే; వారందరు పుణ్యాత్ములనీ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ధృవీకరించారు. అయినా వారి నుండి, వారి సమాధుల నుండి మనం ఎలాంటి శుభాలను ఆశించడం లేదు మరియు ఆశించకూడదు.
వారి తరువాత జ్ఞానవంతులైన ఇమాములు, హదీసు జ్ఞానం కలిగిన ముహద్ధిసీన్లు (హదీసు ధర్మవేత్తలు), ధర్మాన్ని తూచతప్పకుండా అనుసరించే ఔలియాలు (పుణ్యాత్ములు) మరియు సాధారణ ముస్లింలు ప్రళయం వరకూ సమాజంలో ఉంటారు. వారిలో మనం కొందరినీ ఔలియాలనీ నిర్ణయించుకొని వారిద్వారా శుభాలను ఆశించడం మరియు వారు తిని త్రాగి వదలిన వస్తువులను, వారు ధరించే వస్త్రాలను, లేక వారికి సంబంధించిన ఇతర వస్తువులను శుభాలుగా భావించటం ఎంతవరకు సమంజసం? మరియు వారు మరణిస్తే వారి సమాధులను దర్గాలుగా నిర్మించి ప్రత్యేకంగా దర్శించటం, వాటి ద్వారా శుభాలను ఆశించటం మరియు అక్కడ భయం భక్తిని చూపటం ఎంతవరకు ధర్మసమ్మతం? అందుకనే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ఇలా హెచ్చరించారు:
“ఎవరైనా మేము ఆదేశించని పని ఏదైనా చేస్తే అది త్రోసిపుచ్చదగినది” (బుఖారీ:2499, ముస్లిం:3242).
—
ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/meraj-kanuna-namaz
[PDF] [27 పేజీలు]
ఖుత్బా యందలి ముఖ్యాంశాలు:
ఇస్లామీయ సోదరులారా!
ఈ రోజు జుమా ఖుత్బాలో (ఇన్షా అల్లాహ్) అల్లాహ్ సామీప్యం పొందడానికి అన్నింటికన్నా గొప్ప మాధ్యమం, కంటి చలువ మరియు హృదయ ప్రశాంతత అయిన ఒక (ముఖ్యమైన) ఆచరణ గురించి తెలుసుకుందాం. ఒకవేళ ఏ ముస్లిమ్ అయినా ప్రాపంచిక ఆందోళనలకు, దు:ఖానికి గురై నిరుత్సాహ స్థితిలో ఈ ఆచరణ నిమిత్తం అల్లాహ్ ముందు నిలబడితే అతని ఆందోళన, దు:ఖాల భారం తగ్గి అతనికి అసలైన హృదయ ప్రశాంతత లభిస్తుంది. ఆ ఆచరణ పేరు నమాజ్. అల్లాహ్ దీనిని అర్హత కలిగిన ప్రతి ముస్లిమ్ పై విధిగా ఖరారు చేశాడు.
విధిగా చేయబడిన ఆచరణలన్నీ ఈ భూమి మీదే విధిగా గావించబడగా, నమాజ్ ను మాత్రం అల్లాహ్ తన ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తన వైపునకు పిలిచి, ఆకాశాలపై తాను అనుకొన్న చోట దానిని విధి (ఫర్జ్)గా చేయడం దీని ప్రాముఖ్యత, ప్రాధాన్యతలను సూచిస్తుంది. .
మేరాజ్ సంఘటనను గూర్చి చెబుతూ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు:
Read More “మేరాజ్ కానుక – నమాజ్ (కంటి చలువ మరియు హృదయ ప్రశాంతత) | జాదుల్ ఖతీబ్”
నికాహ్ (వివాహం లేక శుభ లగ్నం) కొరకు వధువు తండ్రిగానీ లేక ఆమె తరపు పెద్ద మనిషిగానీ సంరక్షకుడు (వలీ)గా ఉండి తన సమ్మతిని తెలియజేస్తాడు. వధూవరుల తరఫు బంధుమిత్రులు. శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలిపి గౌరవప్రదమైన రీతిలో వధువును తీసుకుని వెళతారు. ఇప్పటి వరకూ ముస్లిం సమాజంలోనూ, ప్రాచ్య దేశాల ఇతర మతవర్గాల వారిలోనూ ఇదే పద్ధతి నడుస్తూ వస్తోంది. కాని లజ్జావిహీనమైన పాశ్చాత్య సంస్కృతి మూలంగా మన సంప్రదాయానికి విఘాతం ఏర్పడింది. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడిన అబ్బాయిలు- అమ్మాయిలు దొంగచాటుగా ప్రేమ వ్యవహారం నడిపి ఇద్దరూ కలిసి జీవిస్తామని, కలిసి మరణిస్తామని ఊసులాడుకుంటారు. పెద్దలకు చెప్పాపెట్టకుండా ఇంటి నుండి పారిపోయి నాలుగైదు రోజులు మాయమైపోతారు. ఆ తరువాత నేరుగా కోర్టుకు వచ్చి పెళ్లి చేసుకుంటారు. “వలీ లేకుండా కూడా నికాహ్ అయిపోతుంది” అన్న ఫత్వా ఆసరాగా కోర్టు నికాహ్ ధృవపత్రం జారీ చేస్తుంది. కన్నవారు అవమానభారంతో కృంగిపోతారు. ఈ రకమయిన నికాహ్ను ‘కోర్టు మ్యారేజ్’ గా వ్యవహరిస్తున్నారు. ఈ రకమయిన చేష్ట ఒక ఇస్లామీయ ప్రబోధనల పైనేకాదు, యావత్ ప్రాచ్య సంస్కృతి పైనే తిరుగుబాటుకు ప్రతీక. దీని ఉద్దేశం. వివాహాది శుభకార్యాలలో ఇస్లామీయ సంప్రదాయానికి తిలోదకాలిచ్చి దేశంలో పాశ్చాత్య తరహా సంస్కృతిని ప్రవేశ పెట్టడమే.
నికాహ్ సమయంలో ‘వలీ’ (సంరక్షకుడు) ఉండటం, అతని సమ్మతి లభించటం గురించి ఖుర్ఆన్ హదీసులలో స్పష్టమైన ఆదేశాలున్నాయి. స్త్రీల వివాహ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ప్రత్యక్షంగా స్త్రీలను సంబోధించకుండా వారి ‘వలీ’లను సంబోధించటం జరిగింది. ఉదాహరణకు:
“షిర్కుకు ఒడిగట్టే పురుషులు విశ్వసించి మోమిన్లు కానంతవరకూ మీ స్త్రీలను వారి వివాహ బంధంలోకి ఇవ్వకండి.“(అల్ బఖర: 221)
దీన్నిబట్టి స్పష్టంగా అవగతమయ్యేదేమిటంటే స్త్రీ తనంతట తానుగా నికాహ్ చేసుకోజాలదు. అందుకే ఆమె సంరక్షకులనుద్దేశించి ‘ఆదేశం’ ఇవ్వబడింది – ఆమెను ముష్రిక్కు పురుషునికిచ్చి వివాహం చెయ్యకూడదని. వలీ (సంరక్షకుని) అంగీకారం గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కొన్ని ప్రవచనాలను కూడా గమనిద్దాం: ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:
“వలీ (అనుమతి) లేకుండా వివాహమే అవదు” (అబూదావూద్, తిర్మిజీ, ఇబ్నుమాజా).
మరొక హదీసులో ఇలా ఉంది:
“ఏ స్త్రీ అయితే వలీ అనుమతి లేకుండానే నికాహ్ చేసుకుందో ఆమె నికాహ్ మిథ్య. ఆమె నికాహ్ మిథ్య. ఆమె నికాహ్ మిథ్య.” (అహ్మద్, అబూ దావూద్, తిర్మిజీ, ఇబ్సుమాజా).
ఇమామ్ ఇబ్ను మాజా (రహిమహుల్లాహ్) పొందుపరచిన ఒక హదీసులోని పదజాలం మరింత తీవ్రంగా వుంది. అల్లాహ్ ను, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విశ్వసించే ఏ విశ్వాసురాలు కూడా ‘వలీ’ లేకుండా నికాహ్ చేసుకోవటం గురించి ఊహించనైనా లేదు. ఇంతకీ హదీసులో ఏమనబడిందంటే- “తన నికాహ్ ను స్వయంగా చేసుకునే స్త్రీ వ్యభిచారిణి మాత్రమే.”
ఇక్కడ గమనార్హమైన రెండు విషయాలు ఉన్నాయి. –
ఒకటి; ఒకవేళ ఏ స్త్రీ సంరక్షకుడైనా నిజంగానే దుర్మార్గుడు, స్వార్ధపరుడై ఉండి ఆ స్త్రీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పక్షంలో షరీయత్ ప్రకారం అటువంటి వ్యక్తి గార్డియన్‌గా అనర్హుడైపోతాడు. అతని స్థానంలో ఆమె సమీప బంధువుల్లోని వేరొక వ్యక్తి వలీ’గా ఖరారవుతాడు. ఒకవేళ ఆమె కుటుంబీకుల్లో ఏ ఒక్కరూ ఆమెకు శ్రేయోభిలాషులు కారని తేలినప్పుడు ఆ ఊరి పెద్దగానీ, రాజ్యాధికారిగానీ ఆమె తరపున ‘వలీ’గా ఉంటాడు. ఈ నేపథ్యంలో మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “వలీ అన్నవాడే లేని స్త్రీకి రాజ్యాధికారి వలీగా ఉంటాడు.”(తిర్మిజీ)
రెండు; సంరక్షకుని అనుమతి లేకుండా వివాహమాడరాదని తాకీదు చేసిన ఇస్లాం, స్త్రీ అంగీకారంతో నిమిత్తం లేకుండా ఆమె వివాహం తన ఇష్టానుసారం జరిపించరాదని సంరక్షకునికి కూడా ఆంక్ష విధించింది. “కన్య అయిన ఒక స్త్రీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి తన తండ్రి తనకు ఇష్టం లేని వ్యక్తితో తన వివాహం జరిపించాడని ఫిర్యాదు చేసింది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) – ఆమె కోరుకుంటే ఆ నికాహ్ కు కట్టుబడి ఉండవచ్చనీ, లేదంటే రద్దు పరచుకోవచ్చని ఆమెకు అధికారం ఇచ్చారు.” (అబూ దావూద్, నసాయి, ఇబ్నుమాజా),
అలాగే ఒక వ్యక్తి వితంతువు అయిన తన కుమార్తె వివాహం తన ఇష్టంతో జరిపించగా, ఆ వివాహాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రద్దుపరిచారు. (బుఖారి)
దీని భావమేమిటంటే నికాహ్ సందర్భంగా వలీ అనుమతితో పాటు వధువు అంగీకారం అనివార్యం. ఒకవేళ ఏ కారణంగానయినా వారిద్దరి మధ్య అభిప్రాయ భేదం పొడసూపితే జీవితంలోని మెట్టపల్లాల గురించి వలీ ఆమెకు నచ్చజెప్పి ఆమె తన అభిప్రాయాన్ని మార్చుకునేలా యత్నించాలి. ఒకవేళ ఈ ప్రయత్నం ఫలించకపోతే అమ్మాయి. ఇష్టపడే మరో సంబంధం చూసి పెళ్ళి జరిపించాలి.
నికాహ్ లో అటు గార్డియన్, ఇటు వధువు- ఇరువురి అంగీకారాన్ని పరస్పరం అనివార్య అంశం ఖరారు చేసి ఇస్లామీయ షరియత్ ఒక మధ్యేమార్గాన్ని తెరచింది. తద్వారా వారిరువురి భావావేశాలను, ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకుని ఏ ఒక్కరికీ తలవంపు జరగకుండా చూడటం జరిగింది.
ఖుర్ఆన్ హదీసులు ఇంత స్పష్టంగా ఆదేశాలిచ్చిన తరువాత కూడా అబ్బాయిలు అమ్మాయిలు తమ తల్లిదండ్రుల మాటను ఖాతరు చెయ్యకపోవలసిన ఖర్మ ఏం పట్టింది? చెప్పాపెట్టకుండా ఇంట్లోనుంచి పారిపోవటమెందుకు? వివాహానికి ముందే చాటుమాటు సరసాలెందుకు? వివాహం (నికాహ్) పేరుతో కోర్టులో నాటకమెందుకు? సంరక్షకుడు (వలీ) లేకుండా నికాహ్ చేసుకోవటం ధర్మసమ్మతమే అనుకుంటే పాశ్చాత్య తరహా పెళ్లిళ్లకు ఇస్లామీయ పెళ్లిళ్లకు మధ్య వ్యత్యాసం ఏం మిగిలిందీ? పాశ్చాత్య సమాజంలో స్త్రీకి ఇవ్వబడిన ఈ ‘స్వాతంత్రమే’ అక్కడి కొంపల్ని కూల్చేస్తున్నది. చిందరవందర అవుతున్న తమ బ్రతుకుల్ని చూసి పాశ్చాత్య వివేచనాపరులు సయితం ఆవేదనకు లోనవుతున్నారు. 1995లో అమెరికా ప్రధమ మహిళ అయిన హిల్లరీ క్లింటన్ పాకిస్తాన్లో పర్యటించినప్పుడు ఆమె ఇస్లామాబాద్ లోని కాలేజ్ ఫర్ వుమెన్ విద్యార్ధినులతో మాట్లాడుతూ ఉద్వేగపూరితంగా ఇలా అన్నారు: “అమెరికాలో ప్రస్తుతం అతి పెద్ద సమస్య ఏమిటంటే అవివాహిత విద్యార్థినులు గర్భవతులై పోతున్నారు. ఈ సమస్యకు ఏకైక పరిష్కారం ఏమిటంటే యువతీయువకులు తమ మతపరమైన, సామాజికమైన విలువలపై తిరుగుబాటు చేయకూడదు. వారు ముస్లిములైనా సరే, క్రైస్తవులయినాసరే తమ ధార్మిక సామాజిక నియమ నిబంధనలకు కట్టుబడి వివాహాలు చేసుకోవాలి. వారు తమ తల్లిదండ్రుల గౌరవ మర్యాదలను మంటగలపకూడదు. వారి సుఖశాంతులను హరించకూడదు.”. (‘జంగ్’ దినపత్రిక: 28-3-1995)
—
ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
సంకలనం: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [163 పేజీలు] [ఫైల్ సైజు: 2.5 MB] [మొబైల్ ఫ్రెండ్లీ]
అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.
You must be logged in to post a comment.