(ఓ ప్రవక్తా!) ప్రజలు నిన్ను నెలవంకలను గురించి ప్రశ్నిస్తున్నారు కదూ! ఇది ప్రజల (ఆరాధనల) వేళలను, హజ్ కాలాన్ని నిర్ధారించటానికి (జరిగిన ఏర్పాటు) అని నువ్వు వారికి సమాధానం ఇవ్వు. (ఇహ్రామ్ స్థితిలో) మీరు మీ ఇళ్ళల్లోకి వెనుక వైపు నుంచి రావటం సత్కార్యం కాదు. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి వున్నవాడిదే అసలు సత్కార్యం. మీరు మీ ఇండ్లల్లోకి వాకిళ్ళ నుండే ప్రవేశించండి. సాఫల్యం పొందగలందులకుగాను అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి.
వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో తలపడండి, మిమ్మల్ని ఎక్కడి నుంచి వారు తరిమికొట్టారో, అక్కడి నుంచి మీరు కూడా వారిని తరిమికొట్టండి. ఫిత్నా (కుఫ్ర్, షిర్క్, పీడన) అనేది చంపటం కన్నా తీవ్రమైనది. ‘మస్జిదె హరామ్’ వద్ద వారు మీతో యుద్ధం చేయనంతవరకూ మీరూ వారితో పోరాడకండి. వారు గనక మిమ్మల్ని హతమార్చడానికి ప్రయత్నిస్తే మీరు కూడా దీటైన జవాబు ఇవ్వండి. అవిశ్వాసులకు సరైన సమాధానం ఇదే.
పీడన (ఫిత్నా) సమసిపోనంతవరకూ, దైవధర్మానిది పైచేయి కానంతవరకూ వారితో పోరాడుతూనే ఉండండి. ఒకవేళ వారు యుద్ధాన్ని విరమిస్తే (మీరూ విరమించండి). మెడలు వంచ వలసింది దౌర్జన్యపరులవే.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు, ప్రవక్తపై సూర నస్ర్ అవతరించిన తరువాత రుకూ మరియు సజ్దా లో ఈ దుఆ చదివేవారు:
సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వ బిహందిక అల్లాహుమ్మగ్ ఫిర్లీ (ఓ అల్లా నీవు ఎంతో పరిశుద్ధునివి, పవిత్రునివి, ఓ మా ప్రభువా! నీకే సర్వ స్తోత్రములు, ఓ అల్లాహ్! నన్ను క్షమించు).
సర్వ సామాన్యంగా మనకు తెలిసిన దుఆలలో రుకూలో సుబ్ హాన రబ్బియల్ అజీం మరియు సజ్దా లో సుబ్ హాన రబ్బియల్ అఅలా చదువుతాము.కానీ ఈ ఒక్క దుఆ కాకుండా ఇంకా ఎన్నో దుఆలున్నాయి. మీరు మా చిన్న పుస్తకం ఎల్లవేళలలో మీ వెంట ఉంచుకోండి. దాని పేరు: రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ ను కాకుండా ఇతరుల పేరున మొక్కుకొనుట షిర్క్ అవుతుంది.
البخاري 6696:- عَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ : ” مَنْ نَذَرَ أَنْ يُطِيعَ اللَّهَ فَلْيُطِعْهُ، وَمَنْ نَذَرَ أَنْ يَعْصِيَهُ فَلَا يَعْصِهِ “. ఎవరు అల్లాహ్ యొక్క విధేయత లో ఏదైనా మొక్కుబడి చేసుకుంటారో వారు దానిని పూర్తి చేయాలి మరి ఎవరైతే అల్లాహ్ అవిధేయత లో మొక్కుబడి చేస్తారో వారు దానిని పూర్తి చేయకూడదు
ఈ రోజుల్లో ప్రజలు సమాధిలో ఉన్నవారి పేరున దీపాలు, కొవ్వత్తులు, కోళ్ళు, ఆస్తులు మొదలగునవి ఇస్తానని మొక్కుకుంటారు. అయితే ఇది ఘోరమైన షిర్క్ అన్న విషయం మరచిపోతారు.
జిబహ్ చేయుట:
అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేయుట (జంతువును బలి ఇచ్చుట) షిర్క్. అల్లాహ్ ఆదేశం చదవండి:
فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ నీ ప్రభువు కొరకే నమజు చేయు మరియు ఖుర్బానీ ఇవ్వు (కౌసర్ 108: 2).
అంటే అల్లాహ్ కొరకు మరియు అల్లాహ్ పేరుతో మాత్రమే జిబహ్ చేయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారు:
لَعَنَ اللهُ مَنْ ذَبَحَ لِغَيْرِ الله “అల్లాహ్ కు కాక ఇతరుల కోసం జిబహ్ చేయువానిపై అల్లాహ్ శపించాడు”. (ముస్లిం 1978).
జిబహ్ లో రెండు నిషేధాలు ఏకమవుతాయి. (1) అల్లాహ్ కు తప్ప ఇతరుల కోసం జిబహ్. (2) అల్లాహ్ పేరుతో కాకుండా ఇతరుల పేరుతో జిబహ్. ఈ రెండు కారణాల వల్ల ఆ జంతువు మాంసం తినడం యోగ్యం కాదు.
ఈ రోజుల్లో జిన్నుల పేరు మీద జిబహ్ చేసే షిర్క్ ప్రబలి ఉంది. అదేమనగా; ఇల్లు కొనుగోళు చేసినా, నిర్మించినా అందులో ఎక్కడైనా లేదా ప్రత్యేకించి దాని గడప మీద, అలాగే బావి త్రవ్వినా, అక్కడే ఓ జంతువు జిబహ్ చేస్తారు. అది షైతాన్ (భూతాల)కు భయపడి, వాని నష్టం నుండి దూరముండుటకు వాని పేరు మీద జిబహ్ చేస్తారు. (వాస్తవేమిటంటే అల్లాహ్ ను కాక ఇతరులతో భయపడరాదు. ఇలాంటి జిబహ్ చేయరాదు). (తైసీరుల్ అజీజుల్ హమీద్ 158. దారుల్ ఇఫ్తా ముద్రణ).
(2) గోరీలవద్ద మరియు నూతన భవనం , బోరుబావి , లేదా చెరువు నిర్మించినప్పుడు కీడు పోయేందుకు (అల్లాహ్ యేతరుల కోసం, అల్లాహ్ యేతరుల పేరు మీద) జిబహ్ చెయ్యడం సమ్మతమేనా?
A] చెయ్య కూడదు B] చెయ్యవచ్చు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఓ విశ్వాసులారా! “అల్లాహ్ మార్గంలో బయలుదేరండి” అని మీతో అనబడినప్పుడు మీరు నేలకు అతుక్కుపోతారేమిటి? అసలు మీకేమైపోయిందీ? మీరు పరలోకానికి బదులు ఇహలోక జీవితాన్నే కోరుకున్నారా? అయితే వినండి! ప్రాపంచిక జీవితపు సకల సామగ్రి పరలోకం ముందు అత్యల్పమైనది.
మీరు గనక (దైవమార్గంలో) బయలు దేరకపోతే అల్లాహ్ మీకు బాధాకరమైన శిక్ష విధిస్తాడు. మీకు బదులుగా మరో జాతిని (మీ స్థానంలో) తీసుకువస్తాడు. మీరు అల్లాహ్‌కు ఎంత మాత్రం నష్టం కలిగించలేరు. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు.
మీరు గనక అతనికి (ప్రవక్తకు) తోడ్పడకపోతే (పోనివ్వండి), అవిశ్వాసులు దేశం నుంచి అతనిని వెళ్ళగొట్టినప్పుడు- అతను ఇద్దరిలో రెండవవాడు. వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు, అతను తన సహచరునితో, “బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు” అని ఓదార్చినప్పుడు అల్లాహ్‌యే వారికి తోడ్పడ్డాడు. (ఆ ఘడియలో) అల్లాహ్ తన తరఫునుంచి అతనిపై ప్రశాంతతను అవతరింపజేశాడు. మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు. ఆయన అవిశ్వాసుల మాటను అట్టడుగు స్థితికి దిగజార్చాడు. అల్లాహ్ వాక్కు మాత్రమే సర్వోన్నతమైనది, సదా పైన ఉండేది. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు.
(ఓ ప్రవక్తా!) త్వరగా సొమ్ములు లభించి, ప్రయాణం సులభతరమై ఉంటే వాళ్లు తప్పక నీ వెనుక వచ్చి ఉండేవారే. కాని సుదీర్ఘ ప్రయాణం అనేసరికి అది వారికి దుర్భరంగా తోచింది. ఇప్పుడు వాళ్లు, “మాలోనే గనక శక్తీ స్థోమతలు ఉండి ఉంటే తప్పకుండా మీ వెంట వచ్చి ఉండేవారం” అని అల్లాహ్‌పై ఒట్టేసి మరీ చెబుతారు. వాస్తవానికి వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు. వారు అబద్ధాలకోరులన్న సంగతి అల్లాహ్‌కు బాగా తెలుసు.
(1) మీకు ఇవ్వ బడిన సిలబస్(తౌబా – 9: 40) వివరణ ప్రకారం దైవప్రవక్త (ﷺ) వారితో పాటుగా గుహలో ఉన్న రెండవ వ్యక్తి (సహచరుడు) ఎవరు? A) అబూబక్ర్ సిద్దీక్ (రజియల్లాహు అన్హు) B) అలీ (రజియల్లాహు అన్హు) C) అబూహురైరా (రజియల్లాహు అన్హు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
153 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ ఓ విశ్వాసులారా! సహనం మరియు నమాజు ద్వారా సహాయం అర్థించండి. అల్లాహ్ సహనం పాటించేవారికి తోడుగా ఉంటాడు.
2:154 وَلَا تَقُولُوا لِمَن يُقْتَلُ فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتٌ ۚ بَلْ أَحْيَاءٌ وَلَٰكِن لَّا تَشْعُرُونَ అల్లాహ్ మార్గంలో చంపబడినవారిని మృతులు అని అనకండి. వారు బ్రతికే ఉన్నారు. కాని ఆ విషయం మీకు అర్థం కాదు.
2:155 وَلَنَبْلُوَنَّكُم بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ ۗ وَبَشِّرِ الصَّابِرِينَ మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము – భయంతో, ఆకలిదప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో (పరీక్షిస్తాము)! ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి.
2:156 الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ వారికెప్పుడు ఏ ఆపద వచ్చిపడినా, “మేము ఖుద్దుగా అల్లాహ్‌కు చెందినవారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా!” అని అంటారు.
2:157 أُولَٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُهْتَدُونَ వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే.
2:158 إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِن شَعَائِرِ اللَّهِ ۖ فَمَنْ حَجَّ الْبَيْتَ أَوِ اعْتَمَرَ فَلَا جُنَاحَ عَلَيْهِ أَن يَطَّوَّفَ بِهِمَا ۚ وَمَن تَطَوَّعَ خَيْرًا فَإِنَّ اللَّهَ شَاكِرٌ عَلِيمٌ నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్ చిహ్నాలలోనివి. కనుక కాబా గృహాన్ని (సందర్శించి) హజ్ ఉమ్రహ్‌లు చేసేవారు వాటి మధ్య ప్రదక్షిణ చేస్తే అందులో ఏ మాత్రం తప్పులేదు. స్వచ్ఛందంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్ ఆదరించేవాడు, తెలుసుకునేవాడు.
2:159 إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلْنَا مِنَ الْبَيِّنَاتِ وَالْهُدَىٰ مِن بَعْدِ مَا بَيَّنَّاهُ لِلنَّاسِ فِي الْكِتَابِ ۙ أُولَٰئِكَ يَلْعَنُهُمُ اللَّهُ وَيَلْعَنُهُمُ اللَّاعِنُونَ మేము అవతరింపజేసిన నిదర్శనాలను మరియు సన్మార్గాన్ని ప్రజల కొరకు గ్రంథంలో విశదపరచిన తరువాత కూడా వాటిని దాచిపెట్టే వారిని అల్లాహ్ శపిస్తాడు. ఇంకా, వేరే శపించే వారు కూడా వారిని శపిస్తారు.
2:160 إِلَّا الَّذِينَ تَابُوا وَأَصْلَحُوا وَبَيَّنُوا فَأُولَٰئِكَ أَتُوبُ عَلَيْهِمْ ۚ وَأَنَا التَّوَّابُ الرَّحِيمُ అయితే పశ్చాత్తాపం చెంది, తమ ప్రవర్తనను సంస్కరించుకుని, సత్యాన్ని బహిర్గతం చేసిన వారి పశ్చాత్తాపాన్ని నేను స్వీకరిస్తాను (వారి తప్పును మన్నిస్తాను). నేను పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాణ్ణి, అపారంగా కనికరించేవాణ్ణి.
2:161 إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارٌ أُولَٰئِكَ عَلَيْهِمْ لَعْنَةُ اللَّهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడి, అవిశ్వాస స్థితిలోనే మరణించిన వారిపై అల్లాహ్ మరియు ఆయన దూతల, ఇంకా జనులందరి శాపం పడుతుంది.
2:162 خَالِدِينَ فِيهَا ۖ لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ అందులోనే వారు ఎల్లకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించటం గానీ, వారికి కొంత విడుపు ఇవ్వటంగానీ జరగదు.
2:163 وَإِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ لَّا إِلَٰهَ إِلَّا هُوَ الرَّحْمَٰنُ الرَّحِيمُ మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఆయన అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు.
2:164 إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَالْفُلْكِ الَّتِي تَجْرِي فِي الْبَحْرِ بِمَا يَنفَعُ النَّاسَ وَمَا أَنزَلَ اللَّهُ مِنَ السَّمَاءِ مِن مَّاءٍ فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَبَثَّ فِيهَا مِن كُلِّ دَابَّةٍ وَتَصْرِيفِ الرِّيَاحِ وَالسَّحَابِ الْمُسَخَّرِ بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ భూమ్యాకాశాల సృష్టిలో, రేయింబవళ్ళ (నిరంతర) మార్పిడిలో, ప్రజలకు లాభం చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రాలలో నడిచే ఓడలలో, ఆకాశం నుంచి అల్లాహ్ వర్షపు నీటిని కురిపించి మృతభూమిని బ్రతికించటంలో, ఇంకా అందులో అన్ని రకాల ప్రాణులను వ్యాపింపజేయటంలో, వీచే పవనాల దిశలు మార్చటంలో, భూమ్యాకాశాల మధ్య (దేవుని) నియమ నిబంధనలకు కట్టుబడి మసలుకుంటున్న మేఘాలలో బుద్ధిమంతులకు (దేవుని శక్తి సామర్థ్యాలకు సంబంధించిన) ఎన్నో సూచనలున్నాయి.
2:165 وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ ۖ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّهِ ۗ وَلَوْ يَرَى الَّذِينَ ظَلَمُوا إِذْ يَرَوْنَ الْعَذَابَ أَنَّ الْقُوَّةَ لِلَّهِ جَمِيعًا وَأَنَّ اللَّهَ شَدِيدُ الْعَذَابِ కాని అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించినవారు అల్లాహ్‌ను అంతకంటే ప్రగాఢంగా (అధికంగా) ప్రేమిస్తారు. సర్వశక్తులూ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయనీ, అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడన్న యదార్థాన్ని ముష్రిక్కులు, అల్లాహ్ విధించే శిక్షలను చూసిన తరువాత తెలుసుకునే బదులు, ఇప్పుడే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది! (తెలుసుకుంటే వారు ఈ షిర్క్ పాపానికి ఒడిగట్టరు).
2:166 إِذْ تَبَرَّأَ الَّذِينَ اتُّبِعُوا مِنَ الَّذِينَ اتَّبَعُوا وَرَأَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْأَسْبَابُ ఆ సమయంలో, వీళ్ళచేత అనుసరించబడిన నాయకులు తమ అనుచరులతో తమకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తారు. ఇంకా వారు శిక్షను కళ్ళారా చూసుకుంటారు. వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి.
2:167 وَقَالَ الَّذِينَ اتَّبَعُوا لَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّأَ مِنْهُمْ كَمَا تَبَرَّءُوا مِنَّا ۗ كَذَٰلِكَ يُرِيهِمُ اللَّهُ أَعْمَالَهُمْ حَسَرَاتٍ عَلَيْهِمْ ۖ وَمَا هُم بِخَارِجِينَ مِنَ النَّارِ అప్పుడు (కనువిప్పు కలిగిన) అనుచరులు ఇలా అంటారు: “మేమే గనక మరోసారి ప్రాపంచిక జీవితం వైపుకు మరలించబడటమంటూ జరిగితే వీరు (ఈ అయ్యవార్లు) మా పట్ల ఇక్కడ విసుగును ప్రదర్శించినట్లే మేమూ వీరిపట్ల విసుగును ప్రదర్శించేవారం.” ఈ విధంగా వారు సిగ్గుతో కుంచించుకుపోయే విధంగా అల్లాహ్ వారి కర్మలను వారికి చూపిస్తాడు. అయినాసరే వారు నరకం నుంచి బయట పడటమన్నది అసంభవం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ నామ స్మరణ ఘనత చాలా గొప్పగా ఉంది. అందుకే ముస్లిం జీవితంలో వివిధ సందర్భాలలో “బిస్మిల్లాహ్” అని పలకాలని బోధించడం జరిగింది. వాటిలో కొన్ని సందర్భాలు ఇప్పుడు తెలుసుకుందాము
1- పడుకునే ముందు బిస్మికల్లాహుమ్మ అమూతు వఅహ్ యా అనాలి. (బుఖారీ 6324).
2- మరుగుదొడ్లో ప్రవేశించేకి ముందు బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇస్ (తిర్మిజి 606, బుఖారీ 142). అయితే తిర్మిజి (142)లో వచ్చిన హదీసులో ఉంది: ‘ఎవరైతే మరుగుదొడ్లో ప్రవేశించేకి ముందు “బిస్మిల్లాహ్” అంటారో వారి మర్మాంగాలను జిన్నులు చూడకుండా అడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది.’
3,4- ఇంట్లో ప్రవేశించేకి ముందు, భోజనం చేసేకి ముందు ఎవరు “బిస్మిల్లాహ్” అంటారో వారితో పాటు షైతాన్ వారింట్లో ప్రవేశించడు మరియు వారి భోజనంలో కూడా పాల్గొనడు. (ముస్లిం 2018).
5- శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే అక్కడ చెయ్యి పెట్టి “బిస్మిల్లాహ్” 3సార్లు, “అఊజు బిల్లాహి వఖుద్రతిహి మిన్ షర్రి మా అజిదు వఉహాజిర్” 7సార్లు చదవాలి. (ముస్లిం 2202, అబూదావూద్ 3891). ఇలా చదువుతూ ఉండడం ద్వారా అల్లాహ్ దయతో నొప్పి మాయమైపోతుంది.
ఇంకా వుజూకు ముందు, భార్యభర్తలు కలుసుకునేకి ముందు, వాహనముపై ఎక్కేకి ముందు, జారి పడినప్పుడు, ఇంటి నుండి బైటికి వెళ్ళినప్పుడు, ఉదయసాయంకాలపు దుఆలలో ఇంకా ఎన్నో సందర్భాలున్నాయి ప్రతి ముస్లిం వాటిని తెలుసుకోవాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సమాధులను పూజించడం, మరణించి సమాధుల్లో ఉన్న వలీలు (పుణ్యపురుషులు) అవసరాలను తీరుస్తారని, కష్టాలను తొలిగిస్తారని నమ్మడం మరియు అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నదాని సహాయం వారితో కోరడం, వారితో మొరపెట్టుకోవడం లాంటివి పెద్ద షిర్క్ లో లెక్కించ బడతాయి.
అల్లాహ్ ఆదేశం చదవండి:
وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ మీ ప్రభువు తనను తప్ప ఇతరులను మీరు ఆరాధింపకూడదని ఆదేశించాడు [. (బనీఇస్రాఈల్ 17: 23).
అదే విధంగా చనిపోయిన ప్రవక్తలతో, పుణ్యాత్ములతో ఇంకెవరితోనైనా వారి సిఫారసు పొందుటకు, తమ కష్టాలు దూరమగుటకు వారితో దుఆ చేయడం కూడా షిర్క్. చదవండి అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:
أَمَّنْ يُجِيبُ المُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الأَرْضِ أَإلَهٌ مَعَ اللهِ బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరలను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు? భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగాచేసినవాడు ఎవడు? అల్లాహ్ తో పాటు (ఈ పనులు చేసే) మరొక దేవుడు కూడ ఎవడైనా ఉన్నాడా?(నమ్ల్ 27: 62).
కొందరు కూర్చున్నా, నిలబడినా, జారిపడినా తమ పీర్, ముర్షిదుల నామములను స్మరించుటయే తమ అలవాటుగా చేసుకుంటారు. ఎప్పుడు ఏదైనా క్లిష్టస్థితిలో, కష్టంలో, ఆపదలో చిక్కుకున్నప్పుడు ఒకడు యా ముహమ్మద్ అని, మరొకడు యా అలీ అని, ఇంకొకడు యా హుసైన్ అని, మరి కొందరు యా బదవీ, యా జీలానీ, యా షాజులీ, యా రిఫాఈ, యా ఈద్ రూస్, యా సయ్యద జైనబ్, యా ఇబ్ను ఉల్వాన్ అని, యా గౌస్ అల్ మదద్ అని, యా ముఈనుద్దీన్ చిష్తీ అని, యా గరీబ్ నవాజ్ అని, నానా రకాలుగా పలుకుతారు. కాని అల్లాహ్ ఆదేశం ఏమిటని గమనించరు:
إِنَّ الَّذِينَ تَدْعُونَ مِنْ دُونِ اللهِ عِبَادٌ أَمْثَالُكُمْ فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِنْ كُنْتُمْ صَادِقِينَ అల్లాహ్ ను వదలి మీరు వేడుకుంటున్న వారు మీ మాదిరిగానే కేవలం దాసులు. మీరు వారిని ప్రార్థించి చూడండి. మీకు వారి పట్ల ఉన్న భావాలు నిజమే అయితే మీ ప్రార్థనలకు వారు సమాధానం ఇవ్వాలి (అఅ’రాఫ్ 7: 194).
కొందరు సమాధి పూజారులు సమాధుల ప్రదక్షిణం చేస్తారు. వాటి మూలమూలలను చుంబిస్తారు. చేతులు వాటికి తాకించి తమ శరీరంపై పూసుకుంటారు. వాటి గడపను చుంబిస్తారు. దాని మట్టిని తీసుకొని తమ ముఖాలకు రుద్దుకుంటారు. వాటిని చూసినప్పుడు సాష్టాంగ పడతారు (సజ్దా చేస్తారు). తమ అవసరాలను కోరతూ రోగాల నుండి స్వస్థత పొందుటకు, సంతానం కావాలని, అవసరం తీరాలని వాటి ఎదుట భయభీతితో, వినయవినమ్రతలతో నిలబడతారు. ఒక్కోసారి సమాధిలో ఉన్నవారిని ఉద్దేశించి ఇలా పిలుస్తారు కూడా: యా సయ్యిదీ! ఓ మేరే బాబా! నేను చాలా దూరం నుండి మీ సమక్షంలో హాజరయ్యాను, నాకు ఏమీ ప్రసాదించక వెనక్కు త్రిప్పి పంపుతూ అవమాన పరచకు.
కాని అల్లాహ్ ఆదేశం ఏముందో గమనించారా?
وَمَنْ أَضَلُّ مِمَّنْ يَدْعُو مِنْ دُونِ اللهِ مَنْ لَا يَسْتَجِيبُ لَهُ إِلَى يَوْمِ القِيَامَةِ وَهُمْ عَنْ دُعَائِهِمْ غَافِلُونَ అల్లాహ్ ను వదలి ప్రళయం వరకు తమ ప్రార్థనలను విని సమాధాన మివ్వలేనటువంటి వారిని ప్రార్థించే వారికంటే, ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు వీరి (ప్రార్థించేవారి) ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారు (అహ్ఖాఫ్ 46: 5).
ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:
مَنْ مَاتَ وَهْوَ يَدْعُو مِنْ دُونِ الله نِدًّا دَخَلَ النَّارَ “ఎవరు అల్లాహ్ ను కాదని ఇతరులను ప్రార్థిస్తూ/దుఆ చేస్తూ చనిపోతాడో అతను నరకంలో ప్రవేశిస్తాడు”. (బుఖారి 4497).
కొందరు సమాధుల వద్ద తమ తల గొరిగించుకుంటారు. ‘సమాధుల హజ్ చేసే విధానం’ అన్న పేరుగల పుస్తకాలు కొందరి వద్ద లభిస్తాయి. విశ్వవ్యవస్థ నిర్వహణ శక్తి మరియు లాభనష్టాలు చేకూర్చే శక్తి వలీలకు ఉన్నదని కొందరు నమ్ముతారు. కాని అల్లాహ్ యొక్క ఈ ఆదేశం పట్ల వారు ఎలా అంధులైపోయారో గమనించండి:
وَإِنْ يَمْسَسْكَ اللهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ وَإِنْ يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవరూ లేరు. ఇంకా ఆయన గనక నీ విషయంలో మేలు చేయాలని సంకల్పిస్తే ఆయన అనుగ్రాహన్ని మల్లించే వాడు కూడా ఎవడూ లేడు (యూనుస్ 10: 107).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
18:1 الْحَمْدُ لِلَّهِ الَّذِي أَنزَلَ عَلَىٰ عَبْدِهِ الْكِتَابَ وَلَمْ يَجْعَل لَّهُ عِوَجًا ۜ ప్రశంసలన్నీ అల్లాహ్‌కు మాత్రమే శోభిస్తాయి. ఆయన తన దాసునిపై ఈ (ఖుర్‌ఆన్) గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఇందులో ఎలాంటి వక్రతనూ ఉంచలేదు.
18:2 قَيِّمًا لِّيُنذِرَ بَأْسًا شَدِيدًا مِّن لَّدُنْهُ وَيُبَشِّرَ الْمُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا حَسَنًا పైగా అన్నివిధాలా సరైనదిగా ఉంచాడు – తన వద్దనుంచి విధించబడే కఠినమైన శిక్ష గురించి హెచ్చరించటానికి, మంచి పనులు చేసే విశ్వాసులకు ఉత్తమ ప్రతిఫలం ఉందని శుభవార్తలు ఇవ్వటానికి,
18:3 مَّاكِثِينَ فِيهِ أَبَدًا అందులో వారు శాశ్వతంగా ఉంటారని (తెలుపటానికి),
18:4 وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا అల్లాహ్ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారిని హెచ్చరించటానికి (ఈ గ్రంథం అవతరింపజెయ్యబడింది).
18:5 مَّا لَهُم بِهِ مِنْ عِلْمٍ وَلَا لِآبَائِهِمْ ۚ كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ أَفْوَاهِهِمْ ۚ إِن يَقُولُونَ إِلَّا كَذِبًا యదార్థానికి వారికిగానీ, వారి తాత ముత్తాతలకుగానీ ఈ విషయం ఏమీ తెలియదు. వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే.
18:6 فَلَعَلَّكَ بَاخِعٌ نَّفْسَكَ عَلَىٰ آثَارِهِمْ إِن لَّمْ يُؤْمِنُوا بِهَٰذَا الْحَدِيثِ أَسَفًا (ఓ ముహమ్మద్!) ఒకవేళ ఈ జనులు ఈ మాటను విశ్వసించకపోతే నువ్వు వారి వెనుక దుఃఖంతో కుమిలిపోతూ నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా ఏమి?
18:7 إِنَّا جَعَلْنَا مَا عَلَى الْأَرْضِ زِينَةً لَّهَا لِنَبْلُوَهُمْ أَيُّهُمْ أَحْسَنُ عَمَلًا జనులలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించే నిమిత్తం మేము భూమండలంలో ఉన్న దాన్నంతటినీ భూమికి శోభాయమానంగా చేశాము.
18:8 وَإِنَّا لَجَاعِلُونَ مَا عَلَيْهَا صَعِيدًا جُرُزًا దాని (భూమి)పై ఉన్న దానినంతటినీ మేము (నేలమట్టం చేసి) చదునైన మైదానంగా చేయనున్నాము.
18:9 أَمْ حَسِبْتَ أَنَّ أَصْحَابَ الْكَهْفِ وَالرَّقِيمِ كَانُوا مِنْ آيَاتِنَا عَجَبًا ఏమిటీ, గుహవారిని, శిలాఫలకం వారిని నువ్వు మా శక్తి సూచనలలో మహా విచిత్రమైన సూచనగా తలపోస్తున్నావా?
18:10 إِذْ أَوَى الْفِتْيَةُ إِلَى الْكَهْفِ فَقَالُوا رَبَّنَا آتِنَا مِن لَّدُنكَ رَحْمَةً وَهَيِّئْ لَنَا مِنْ أَمْرِنَا رَشَدًا ఆ యువకులు గుహలో ఆశ్రయం పొందినపుడు ఇలా ప్రార్థించారు: “మా ప్రభూ! నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి.”
18:11 فَضَرَبْنَا عَلَىٰ آذَانِهِمْ فِي الْكَهْفِ سِنِينَ عَدَدًا అంతే! మేము ఆ గుహలో ఎన్నదగ్గ కొన్నేండ్లవరకూ వారి చెవులపై జోకొట్టి పడుకోబెట్టాము.
18:12 ثُمَّ بَعَثْنَاهُمْ لِنَعْلَمَ أَيُّ الْحِزْبَيْنِ أَحْصَىٰ لِمَا لَبِثُوا أَمَدًا ఆ తరువాత, ఆ రెండు వర్గాల వారిలో ఎవరు ఆ స్థితిలో గడిపిన గరిష్ఠకాలాన్ని ఖచ్చితంగా లెక్కగడతారో తెలుసుకుందామని మేము వారిని తిరిగి లేపాము.
18:13 نَّحْنُ نَقُصُّ عَلَيْكَ نَبَأَهُم بِالْحَقِّ ۚ إِنَّهُمْ فِتْيَةٌ آمَنُوا بِرَبِّهِمْ وَزِدْنَاهُمْ هُدًى వారి యదార్ధ గాథను మేము నీకు వివరిస్తున్నాము – తమ ప్రభువును విశ్వసించిన కొంతమంది యువకులు వారు. మేము వారి సన్మార్గంలో వృద్ధినొసగాము.
18:14 وَرَبَطْنَا عَلَىٰ قُلُوبِهِمْ إِذْ قَامُوا فَقَالُوا رَبُّنَا رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ لَن نَّدْعُوَ مِن دُونِهِ إِلَٰهًا ۖ لَّقَدْ قُلْنَا إِذًا شَطَطًا వారు లేచి నిలబడి ఈ ప్రకటన చేసినప్పుడు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలుగజేశాము; “భూమ్యాకాశాలకు ప్రభువైనవాడే మా ప్రభువు. మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటమన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారమవుతాము.”
18:15 هَٰؤُلَاءِ قَوْمُنَا اتَّخَذُوا مِن دُونِهِ آلِهَةً ۖ لَّوْلَا يَأْتُونَ عَلَيْهِم بِسُلْطَانٍ بَيِّنٍ ۖ فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا “ఆయన్ని వదలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్న మన జాతి వారు వారి దైవత్వానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణాన్ని ఎందుకు తీసుకురావటం లేదు? అల్లాహ్‌కు అబద్ధాన్ని అంట గట్టేవాడికన్నా ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు?
18:16 وَإِذِ اعْتَزَلْتُمُوهُمْ وَمَا يَعْبُدُونَ إِلَّا اللَّهَ فَأْوُوا إِلَى الْكَهْفِ يَنشُرْ لَكُمْ رَبُّكُم مِّن رَّحْمَتِهِ وَيُهَيِّئْ لَكُم مِّنْ أَمْرِكُم مِّرْفَقًا “ఇప్పుడు మీరు వాళ్ళతోనూ, అల్లాహ్‌ను గాకుండా వారు పూజిస్తున్న ఇతర దైవాలతోనూ తెగత్రెంపులు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏదన్నా గుహలోకి పోయి కూర్చోండి. మీ ప్రభువు మీపై తన కారుణ్యాన్ని విస్తరింపజేస్తాడు. మీ కార్యసిద్ధికై సౌలభ్యాన్ని సమకూరుస్తాడు.”
18:17 وَتَرَى الشَّمْسَ إِذَا طَلَعَت تَّزَاوَرُ عَن كَهْفِهِمْ ذَاتَ الْيَمِينِ وَإِذَا غَرَبَت تَّقْرِضُهُمْ ذَاتَ الشِّمَالِ وَهُمْ فِي فَجْوَةٍ مِّنْهُ ۚ ذَٰلِكَ مِنْ آيَاتِ اللَّهِ ۗ مَن يَهْدِ اللَّهُ فَهُوَ الْمُهْتَدِ ۖ وَمَن يُضْلِلْ فَلَن تَجِدَ لَهُ وَلِيًّا مُّرْشِدًا సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వారి గుహకు కుడిప్రక్కకు ఒరిగిపోవటాన్ని, అస్తమించే సమయంలో వారికి ఎడమ ప్రక్కకు జరిగిపోవటాన్ని నువ్వు చూస్తావు. వారేమో ఆ గుహలోని విశాలమైన స్థలంలో ఉన్నారు. ఇది అల్లాహ్ సూచనల్లోనిది. అల్లాహ్ సన్మార్గం చూపినవాడు మాత్రమే సన్మార్గాన ఉంటాడు. మరి ఆయన పెడత్రోవ పట్టించిన వానిని ఆదుకుని మార్గదర్శకత్వం వహించే వాడెవడినీ నీవు పొందలేవు.
18:18 وَتَحْسَبُهُمْ أَيْقَاظًا وَهُمْ رُقُودٌ ۚ وَنُقَلِّبُهُمْ ذَاتَ الْيَمِينِ وَذَاتَ الشِّمَالِ ۖ وَكَلْبُهُم بَاسِطٌ ذِرَاعَيْهِ بِالْوَصِيدِ ۚ لَوِ اطَّلَعْتَ عَلَيْهِمْ لَوَلَّيْتَ مِنْهُمْ فِرَارًا وَلَمُلِئْتَ مِنْهُمْ رُعْبًا వారు మేల్కొని ఉన్నారని నువ్వు భావిస్తావు. కాని వారు నిద్రపోతూ ఉంటారు. మేమే వారిని కుడి ప్రక్కకూ, ఎడమ ప్రక్కకూ ఒత్తిగిలి పడుకునేలా చేస్తూ ఉన్నాము. వారి కుక్క కూడా గుహ ముఖద్వారం వద్ద తన ముందు కాళ్ళను చాపి (కూర్చుని) ఉండేది. ఒకవేళ నువ్వు వారిని తొంగి చూస్తే, వెనుతిరిగి పారిపోబోతావు. వారి గాంభీర్యం నిన్ను భయకంపితుణ్ణి చేస్తుంది.
18:19 وَكَذَٰلِكَ بَعَثْنَاهُمْ لِيَتَسَاءَلُوا بَيْنَهُمْ ۚ قَالَ قَائِلٌ مِّنْهُمْ كَمْ لَبِثْتُمْ ۖ قَالُوا لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ ۚ قَالُوا رَبُّكُمْ أَعْلَمُ بِمَا لَبِثْتُمْ فَابْعَثُوا أَحَدَكُم بِوَرِقِكُمْ هَٰذِهِ إِلَى الْمَدِينَةِ فَلْيَنظُرْ أَيُّهَا أَزْكَىٰ طَعَامًا فَلْيَأْتِكُم بِرِزْقٍ مِّنْهُ وَلْيَتَلَطَّفْ وَلَا يُشْعِرَنَّ بِكُمْ أَحَدًا ఇదే విధంగా – వారు పరస్పరం ప్రశ్నించుకోవటానికి మేము వారిని లేపి కూర్చోబెట్టాము. వారిలో ఒకతను “మీరు ఎంతసేపు ఇక్కడ విశ్రమించి ఉంటారు?” అని అడగ్గా, “ఒక రోజో లేక ఒక రోజుకన్నా తక్కువ సమయమో ఉండి ఉంటాం” అని వారు సమాధాన మిచ్చారు. మళ్లీ ఇలా చెప్పారు : “మీరు ఎంతసేపు ఉన్నారన్న విషయం మీ ప్రభువుకే బాగా తెలుసు. సరే, ఇప్పుడు ఈ వెండి (నాణెము)ని ఇచ్చి, మీలో ఒకరిని పట్టణానికి పంపండి – అతను వెళ్ళి అత్యంత పరిశుద్ధమైన భోజనం ఏదో కనుక్కుని, అందులో నుంచి మీ కోసం తినటానికి తీసుకు వస్తాడు. అయితే అతను మృదువుగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ జాడ ఎవరికీ తెలియనివ్వకూడదు.
18:21 وَكَذَٰلِكَ أَعْثَرْنَا عَلَيْهِمْ لِيَعْلَمُوا أَنَّ وَعْدَ اللَّهِ حَقٌّ وَأَنَّ السَّاعَةَ لَا رَيْبَ فِيهَا إِذْ يَتَنَازَعُونَ بَيْنَهُمْ أَمْرَهُمْ ۖ فَقَالُوا ابْنُوا عَلَيْهِم بُنْيَانًا ۖ رَّبُّهُمْ أَعْلَمُ بِهِمْ ۚ قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا ఈ విధంగా అల్లాహ్ వాగ్దానం సత్యమనీ, ప్రళయం (సంభవించటం)లో సందేహానికి తావులేదని ప్రజలు తెలుసుకోవటానికి మేము వారి పరిస్థితిని గురించి ప్రజలకు తెలియజేశాము. మరి వారేమో అప్పుడు ఈ వ్యవహారంలో పరస్పరం తర్జనభర్జన చేసుకోసాగారు – “వీరి గుహపై ఒక కట్టడం కట్టండి” అని కొందరన్నారు. వీరి సంగతి వీరి ప్రభువుకే బాగా తెలుసు. వీళ్ల వ్యవహారంలో పైచేయిగా ఉన్నవారు మాత్రం ఇలా అన్నారు: “మేము వీళ్లు ఉన్నచోట ఒక ఆరాధనాలయం కడతాము.”
18:22 سَيَقُولُونَ ثَلَاثَةٌ رَّابِعُهُمْ كَلْبُهُمْ وَيَقُولُونَ خَمْسَةٌ سَادِسُهُمْ كَلْبُهُمْ رَجْمًا بِالْغَيْبِ ۖ وَيَقُولُونَ سَبْعَةٌ وَثَامِنُهُمْ كَلْبُهُمْ ۚ قُل رَّبِّي أَعْلَمُ بِعِدَّتِهِم مَّا يَعْلَمُهُمْ إِلَّا قَلِيلٌ ۗ فَلَا تُمَارِ فِيهِمْ إِلَّا مِرَاءً ظَاهِرًا وَلَا تَسْتَفْتِ فِيهِم مِّنْهُمْ أَحَدًا “వాళ్లు ముగ్గురు, నాల్గోది వారి కుక్క” అని కొందరంటారు. “వారు అయిదుగురు. ఆరోది వారి కుక్క” అని మరి కొంద రంటారు. వారు తమకు తెలియని విషయంలో ఊహాగానాలు చేస్తున్నారు. “వారు ఏడుగురు, ఎనిమిదోది వారి కుక్క” అని ఇంకా కొంతమంది అంటారు. “వారి సంఖ్య గురించి నా ప్రభువు బాగా ఎరుగు. వారి సంఖ్య గురించి బహుకొద్ది మందికి మాత్రమే తెలుసు” అని వారికి చెప్పు. కాబట్టి నువ్వు వారి విషయంలో స్థూలంగా మాత్రమే వాదించు. ఇంకా (గుహ) వారిని గురించి వీళ్ళలో ఎవరినీ అడగకు.
18:23 وَلَا تَقُولَنَّ لِشَيْءٍ إِنِّي فَاعِلٌ ذَٰلِكَ غَدًا ఏ విషయంలోనయినాసరే “రేపు నేను ఈ పని చేస్తాను” అని ఎట్టిపరిస్థితిలోనూ చెప్పకు.
18:24 إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ وَاذْكُر رَّبَّكَ إِذَا نَسِيتَ وَقُلْ عَسَىٰ أَن يَهْدِيَنِ رَبِّي لِأَقْرَبَ مِنْ هَٰذَا رَشَدًا అయితే “అల్లాహ్ తలిస్తే చేస్తాను (ఇన్‌షాఅల్లాహ్)” అని అనాలి. మరచిపోయినప్పుడల్లా నీ ప్రభువును స్మరించు. “నా ప్రభువు దీనికన్నా సన్మార్గానికి దగ్గరగా ఉండే విషయం వైపుకు నాకు దారి చూపిస్తాడన్న ఆశ వుంది” అని చెబుతూ ఉండు.
18:25 وَلَبِثُوا فِي كَهْفِهِمْ ثَلَاثَ مِائَةٍ سِنِينَ وَازْدَادُوا تِسْعًا వారు తమ గుహలో మూడు వందల సంవత్సరాలు ఉన్నారు. మరో తొమ్మిదేండ్లు అదనం.
18:26 قُلِ اللَّهُ أَعْلَمُ بِمَا لَبِثُوا ۖ لَهُ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ أَبْصِرْ بِهِ وَأَسْمِعْ ۚ مَا لَهُم مِّن دُونِهِ مِن وَلِيٍّ وَلَا يُشْرِكُ فِي حُكْمِهِ أَحَدًا వారికి చెప్పు : “వారు అక్కడ ఖచ్చితంగా ఎంతకాలం ఉన్నారో అల్లాహ్‌కే తెలుసు. భూమ్యాకాశాల రహస్యం ఆయనకు మాత్రమే తెలుసు. ఆయనెంత చక్కగా చూసేవాడు! మరెంత చక్కగా వినేవాడు! అల్లాహ్ తప్ప వారిని ఆదుకునే వాడెవడూ లేడు. అల్లాహ్ తన పరిపాలనాధికారంలో (నిర్ణయాలలో) ఎవరినీ భాగస్వామిగా చేర్చుకోడు.”
18:27 وَاتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِن كِتَابِ رَبِّكَ ۖ لَا مُبَدِّلَ لِكَلِمَاتِهِ وَلَن تَجِدَ مِن دُونِهِ مُلْتَحَدًا నీ వద్దకు వహీ ద్వారా పంపబడిన నీ ప్రభువు గ్రంథాన్ని పఠిస్తూ ఉండు. ఆయన వచనాలను మార్చగలవాడెవడూ లేడు. నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఆయన ఆశ్రయం తప్ప వేరే ఆశ్రయాన్ని పొందజాలవు.
18:28 وَاصْبِرْ نَفْسَكَ مَعَ الَّذِينَ يَدْعُونَ رَبَّهُم بِالْغَدَاةِ وَالْعَشِيِّ يُرِيدُونَ وَجْهَهُ ۖ وَلَا تَعْدُ عَيْنَاكَ عَنْهُمْ تُرِيدُ زِينَةَ الْحَيَاةِ الدُّنْيَا ۖ وَلَا تُطِعْ مَنْ أَغْفَلْنَا قَلْبَهُ عَن ذِكْرِنَا وَاتَّبَعَ هَوَاهُ وَكَانَ أَمْرُهُ فُرُطًا తమ ప్రభువును ఉదయం, సాయంత్రం వేడుకుంటూ, ఆయన ప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో ఉన్నవారి సహచర్యం పట్ల నీ మనసును సంతృప్త పరచుకో. జాగ్రత్త! వారి నుంచి నీ దృష్టిని మరల్చుకోకు. ప్రాపంచిక జీవితపు అందాలను నీవు కోరుకుంటావేమో! చూడు! ఎవరి హృదయాన్ని మేము మా ధ్యానం పట్ల నిర్లక్ష్యానికి లోనుచేశామో, ఎవడు తన మనోవాంఛల వెనుక పరుగులు తీస్తున్నాడో, ఎవడి పనితీరు మితిమీరిపోయిందో అతనికి విధేయత చూపకు.
18:29 وَقُلِ الْحَقُّ مِن رَّبِّكُمْ ۖ فَمَن شَاءَ فَلْيُؤْمِن وَمَن شَاءَ فَلْيَكْفُرْ ۚ إِنَّا أَعْتَدْنَا لِلظَّالِمِينَ نَارًا أَحَاطَ بِهِمْ سُرَادِقُهَا ۚ وَإِن يَسْتَغِيثُوا يُغَاثُوا بِمَاءٍ كَالْمُهْلِ يَشْوِي الْوُجُوهَ ۚ بِئْسَ الشَّرَابُ وَسَاءَتْ مُرْتَفَقًا ఈ విధంగా ప్రకటించు : (ఆసాంతం) సత్యం(తో కూడుకున్న ఈ ఖుర్‌ఆన్) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరినవారు నిరాకరించవచ్చు. (అయితే సత్యాన్ని నిరాకరించిన) దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దాని కీలలు వారిని చుట్టుముడతాయి. ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. అత్యంత అసహ్యకరమైన నీరు అది! అత్యంత దుర్భరమైన నివాసం (నరకం) అది!!
18:30 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ إِنَّا لَا نُضِيعُ أَجْرَ مَنْ أَحْسَنَ عَمَلًا ఇక విశ్వసించి, సత్కార్యాలు చేసినవారి విషయం – నిశ్చయంగా మేము ఉత్తమ ఆచరణ చేసిన వారి ప్రతిఫలాన్ని వృధా కానివ్వము.
18:31 أُولَٰئِكَ لَهُمْ جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِن تَحْتِهِمُ الْأَنْهَارُ يُحَلَّوْنَ فِيهَا مِنْ أَسَاوِرَ مِن ذَهَبٍ وَيَلْبَسُونَ ثِيَابًا خُضْرًا مِّن سُندُسٍ وَإِسْتَبْرَقٍ مُّتَّكِئِينَ فِيهَا عَلَى الْأَرَائِكِ ۚ نِعْمَ الثَّوَابُ وَحَسُنَتْ مُرْتَفَقًا వారి కోసం శాశ్వితమైన స్వర్గవనాలున్నాయి. వారి క్రింది నుంచి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు బంగారు కంకణాలు తొడిగించబడతారు. సన్నగానూ, దళసరిగానూ ఉండే సుతిమెత్తని ఆకుపచ్చ రంగుగల పట్టు వస్త్రాలు ధరిస్తారు. వారక్కడ ఆసనాలపై (దిండ్లకు) ఆనుకుని ఆసీనులై ఉంటారు. ఎంత చక్కటి పుణ్యఫలం అది! ఎంత అమోఘమైన విశ్రాంతి నిలయం అది!!
18:32 وَاضْرِبْ لَهُم مَّثَلًا رَّجُلَيْنِ جَعَلْنَا لِأَحَدِهِمَا جَنَّتَيْنِ مِنْ أَعْنَابٍ وَحَفَفْنَاهُمَا بِنَخْلٍ وَجَعَلْنَا بَيْنَهُمَا زَرْعًا (ఓ ప్రవక్తా!) వారికి ఆ ఇద్దరు వ్యక్తుల ఉదాహరణను కూడా వినిపించు – వారిలో ఒకతనికి మేము రెండు ద్రాక్ష తోటలను ఇచ్చాము. వాటి చుట్టూ ఖర్జూరపు చెట్ల కంచెను నిర్మించాము. ఆ రెంటికీ మధ్య పచ్చని పంట పొలాలను కూడా వొసగాము.
18:33 كِلْتَا الْجَنَّتَيْنِ آتَتْ أُكُلَهَا وَلَمْ تَظْلِم مِّنْهُ شَيْئًا ۚ وَفَجَّرْنَا خِلَالَهُمَا نَهَرًا ఆ రెండు తోటలూ దిట్టంగా పండాయి. అందులో ఏ లోటూ చేయలేదు. ఇంకా, ఆ రెండు తోటల మధ్య మేము ఒక కాలువను కూడా ప్రవహింపజేశాము.
18:34 وَكَانَ لَهُ ثَمَرٌ فَقَالَ لِصَاحِبِهِ وَهُوَ يُحَاوِرُهُ أَنَا أَكْثَرُ مِنكَ مَالًا وَأَعَزُّ نَفَرًا మొత్తానికి అతని పంట పండింది. ఒకనాడతను మాటల సందర్భంగా తన స్నేహితునితో, “నేను నీకన్నా ఎక్కువ ధనవంతుణ్ణి. మందీమార్బలం రీత్యా కూడా నీకంటే ఎక్కువ బలవంతుణ్ణే” అని అన్నాడు.
18:35 وَدَخَلَ جَنَّتَهُ وَهُوَ ظَالِمٌ لِّنَفْسِهِ قَالَ مَا أَظُنُّ أَن تَبِيدَ هَٰذِهِ أَبَدًا ఇలా అతను తన ఆత్మకు అన్యాయం చేసుకున్న స్థితిలో తన తోటలోకి వెళ్ళాడు. ఇలా అన్నాడు: “ఏనాటికైనా ఈ తోట నాశనమై పోతుందని నేననుకోను.”
18:36 وَمَا أَظُنُّ السَّاعَةَ قَائِمَةً وَلَئِن رُّدِدتُّ إِلَىٰ رَبِّي لَأَجِدَنَّ خَيْرًا مِّنْهَا مُنقَلَبًا “ప్రళయ ఘడియ ఆసన్నమవుతుందని కూడా నేను భావించటం లేదు. ఒకవేళ (అలాంటిదేదైనా జరిగి) నేను నా ప్రభువు వద్దకు మరలింపబడినా, నిస్సందేహంగా నేను (ఆ మళ్ళింపు స్థానంలో) ఇంతకన్నా మంచి స్థితిలోనే ఉంటాను.”
18:37 قَالَ لَهُ صَاحِبُهُ وَهُوَ يُحَاوِرُهُ أَكَفَرْتَ بِالَّذِي خَلَقَكَ مِن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ سَوَّاكَ رَجُلًا అప్పుడు అతని స్నేహితుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు : “ఏమిటీ, నిన్ను మట్టితో చేసి, ఆ తరువాత వీర్యపు బిందువుతో సృష్టించి, ఆపైన నిన్ను నిండు మనిషిగా తీర్చిదిద్దిన ఆయననే (ఆ ఆరాధ్య దైవాన్నే) తిరస్కరిస్తున్నావా?
18:38 لَّٰكِنَّا هُوَ اللَّهُ رَبِّي وَلَا أُشْرِكُ بِرَبِّي أَحَدًا “నా మట్టుకు నేను ఆ అల్లాహ్‌యే నా ప్రభువు అని నమ్ముతున్నాను. నేను నా ప్రభువుకు సహవర్తునిగా ఎవరినీ కల్పించను.
18:39 وَلَوْلَا إِذْ دَخَلْتَ جَنَّتَكَ قُلْتَ مَا شَاءَ اللَّهُ لَا قُوَّةَ إِلَّا بِاللَّهِ ۚ إِن تَرَنِ أَنَا أَقَلَّ مِنكَ مَالًا وَوَلَدًا “(మిత్రమా!) నువ్వు నీ తోటలోకి పోతున్నప్పుడు ‘అల్లాహ్ తలచినదే అవుతుంది. అల్లాహ్ ద్వారా లభించే శక్తి తప్ప వేరే శక్తి ఏదీ లేదు’ అని ఎందుకు పలకలేదు? ఒకవేళ నువ్వు నన్ను సంపదలో, సంతానంలో నీకన్నా అల్పునిగా చూస్తున్నట్లయితే,
18:40 فَعَسَىٰ رَبِّي أَن يُؤْتِيَنِ خَيْرًا مِّن جَنَّتِكَ وَيُرْسِلَ عَلَيْهَا حُسْبَانًا مِّنَ السَّمَاءِ فَتُصْبِحَ صَعِيدًا زَلَقًا “(తెలుసుకో!) నా ప్రభువు నాకు నీ తోట కన్నా మేలైనదాన్ని ప్రసాదించి, నీ తోటపై ఆకాశం నుంచి ఏదన్నా శిక్షను పంపినా పంపవచ్చు (ఆశ్చర్యపోనవసరం లేదు). అప్పుడది తెల్లవారేసరికి చదునైన – నున్నని – మైదానంలా అయిపోవచ్చు!
18:41 أَوْ يُصْبِحَ مَاؤُهَا غَوْرًا فَلَن تَسْتَطِيعَ لَهُ طَلَبًا “లేదా దీని నీరు భూమిలో ఇంకిపోనూవచ్చు. దాన్ని వెతికి తీసుకురావటం నీ తరం కాకపోవచ్చు.”
18:42 وَأُحِيطَ بِثَمَرِهِ فَأَصْبَحَ يُقَلِّبُ كَفَّيْهِ عَلَىٰ مَا أَنفَقَ فِيهَا وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا وَيَقُولُ يَا لَيْتَنِي لَمْ أُشْرِكْ بِرَبِّي أَحَدًا అతని పండ్లన్నీ ముట్టడించబడ్డాయి. దాని కోసం పెట్టిన పెట్టుబడిపై అతను చేతులు నలుపుకుంటూ ఉండి పోయాడు. ఆ తోట తలక్రిందులై (తడికెలపై) పడి ఉంది. “అయ్యో! నేను నా ప్రభువుకు సహవర్తులుగా ఎవరినీ నిలబెట్టకుండా ఉంటే ఎంత బావుండేది!” అని (ఆ వ్యక్తి) అన్నాడు.
18:43 وَلَمْ تَكُن لَّهُ فِئَةٌ يَنصُرُونَهُ مِن دُونِ اللَّهِ وَمَا كَانَ مُنتَصِرًا అల్లాహ్ పట్టు నుంచి అతన్ని రక్షించి, సహాయపడటానికి అతని జన సమూహమేదీ రాలేదు. స్వయంగా అతను కూడా ప్రతిఘటించలేకపోయాడు.
18:45 وَاضْرِبْ لَهُم مَّثَلَ الْحَيَاةِ الدُّنْيَا كَمَاءٍ أَنزَلْنَاهُ مِنَ السَّمَاءِ فَاخْتَلَطَ بِهِ نَبَاتُ الْأَرْضِ فَأَصْبَحَ هَشِيمًا تَذْرُوهُ الرِّيَاحُ ۗ وَكَانَ اللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ مُّقْتَدِرًا (ఓ ప్రవక్తా!) ప్రాపంచిక జీవితపు ఉదాహరణను కూడా వారికి తెలుపు. అది మేము ఆకాశం నుంచి కురిపించే వర్షపు నీరు వంటిది. దానివల్ల నేలలో దట్టమైన పచ్చిక మొలిచింది. ఆఖరికి అది పొట్టు పొట్టుగా మారిపోగా, గాలులు దాన్ని లేపుకుపోతాయి. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడు.
18:46 الْمَالُ وَالْبَنُونَ زِينَةُ الْحَيَاةِ الدُّنْيَا ۖ وَالْبَاقِيَاتُ الصَّالِحَاتُ خَيْرٌ عِندَ رَبِّكَ ثَوَابًا وَخَيْرٌ أَمَلًا సిరిసంపదలైనా, సంతానమైనా ప్రాపంచిక జీవితానికి అలంకారం మాత్రమే. అయితే మిగిలివుండే సత్కార్యాలు నీ ప్రభువు దగ్గర ప్రతిఫలం రీత్యా మేలైనవి. అత్యుత్తమం కాగలవని ఆశించబడేవి అవే.
18:47 وَيَوْمَ نُسَيِّرُ الْجِبَالَ وَتَرَى الْأَرْضَ بَارِزَةً وَحَشَرْنَاهُمْ فَلَمْ نُغَادِرْ مِنْهُمْ أَحَدًا మేము పర్వతాలను నడిపిస్తాము, నువ్వు ఆ రోజున భూమిని చదును చేయబడి ఉన్నట్లుగా చూస్తావు. జనులందరినీ మేము (ఒకచోట) సమీకరిస్తాము. వారిలో ఏ ఒక్కరినీ వదలి పెట్టము.
18:48 وَعُرِضُوا عَلَىٰ رَبِّكَ صَفًّا لَّقَدْ جِئْتُمُونَا كَمَا خَلَقْنَاكُمْ أَوَّلَ مَرَّةٍ ۚ بَلْ زَعَمْتُمْ أَلَّن نَّجْعَلَ لَكُم مَّوْعِدًا వారంతా నీ ప్రభువు సమక్షంలో వరుసగా నిలబెట్టబడతారు. “నిశ్చయంగా – మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే మీరు మా వద్దకు వచ్చేశారు. కాని మీరు మాత్రం, మేమెన్నటికీ మీ కోసం వాగ్దాన సమయం నిర్ధారించము అనే తలపోసేవారు.”
18:49 وَوُضِعَ الْكِتَابُ فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ وَيَقُولُونَ يَا وَيْلَتَنَا مَالِ هَٰذَا الْكِتَابِ لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً إِلَّا أَحْصَاهَا ۚ وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا ۗ وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا కర్మల పత్రాలు (వారి) ముందు ఉంచబడతాయి. నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్నదాన్ని చూసి భీతిల్లుతూ, “అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదేమి పత్రం? ఇది ఏ చిన్న విషయాన్నీ,ఏ పెద్ద విషయాన్నీ వదలకుండా నమోదు చేసిందే?!” అని వాపోవటం నువ్వు చూస్తావు. తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు. నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు.
18:50 وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ كَانَ مِنَ الْجِنِّ فَفَسَقَ عَنْ أَمْرِ رَبِّهِ ۗ أَفَتَتَّخِذُونَهُ وَذُرِّيَّتَهُ أَوْلِيَاءَ مِن دُونِي وَهُمْ لَكُمْ عَدُوٌّ ۚ بِئْسَ لِلظَّالِمِينَ بَدَلًا ఆదమ్ ముందు సాష్టాంగపడమని మేము దూతలకు ఆజ్ఞాపించినప్పుడు, ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. అతడు జిన్నాతుల కోవకు చెందినవాడు. వాడు తన ప్రభువు ఆజ్ఞను జవదాటాడు. అయినప్పటికీ మీరు నన్ను వదిలేసి, మీ అందరికీ శత్రువు అయినవాణ్ణీ, వాడి సంతానాన్నీ మీ స్నేహితులుగా చేసుకుంటున్నారా? ఇటువంటి దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఎంత చెడ్డది!
18:51 مَّا أَشْهَدتُّهُمْ خَلْقَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَا خَلْقَ أَنفُسِهِمْ وَمَا كُنتُ مُتَّخِذَ الْمُضِلِّينَ عَضُدًا నేను భూమ్యాకాశాలను సృష్టించినప్పుడుగానీ, స్వయంగా వీళ్ళను పుట్టించినపుడుగానీ వారిని అక్కడ ఉంచలేదు. అపమార్గం పట్టించే వారిని నేను నా సహాయకులుగా చేసుకోను.
18:52 وَيَوْمَ يَقُولُ نَادُوا شُرَكَائِيَ الَّذِينَ زَعَمْتُمْ فَدَعَوْهُمْ فَلَمْ يَسْتَجِيبُوا لَهُمْ وَجَعَلْنَا بَيْنَهُم مَّوْبِقًا “నాకు భాగస్వాములని మీరు భావించిన (వారెక్కడ?) వారిని పిలవండి” అని ఆయన చెప్పిన రోజున వారు (తమ మిధ్యా దైవాలను) పిలుస్తారు. కాని వారిలో ఏ ఒక్కరూ సమాధానం ఇవ్వరు. మేము వారి మధ్యన వినాశాన్ని ఏర్పరుస్తాము.
18:53 وَرَأَى الْمُجْرِمُونَ النَّارَ فَظَنُّوا أَنَّهُم مُّوَاقِعُوهَا وَلَمْ يَجِدُوا عَنْهَا مَصْرِفًا అపరాధులు నరకాన్ని చూడగానే, తాము పడవలసి ఉన్నది అందులోనేనని అర్థం చేసుకుంటారు. దాన్నుంచి తప్పించుకునే మార్గం ఏదీ వారికి కనిపించదు.
18:54 وَلَقَدْ صَرَّفْنَا فِي هَٰذَا الْقُرْآنِ لِلنَّاسِ مِن كُلِّ مَثَلٍ ۚ وَكَانَ الْإِنسَانُ أَكْثَرَ شَيْءٍ جَدَلًا మేము ఈ ఖుర్‌ఆనులో ప్రజల కోసం పలు పలు విధాలుగా ఉపమానాలన్నింటినీ వివరించాము. కాని మానవుడు అందరి కన్నా ఎక్కువ తగవులమారి.
18:55 وَمَا مَنَعَ النَّاسَ أَن يُؤْمِنُوا إِذْ جَاءَهُمُ الْهُدَىٰ وَيَسْتَغْفِرُوا رَبَّهُمْ إِلَّا أَن تَأْتِيَهُمْ سُنَّةُ الْأَوَّلِينَ أَوْ يَأْتِيَهُمُ الْعَذَابُ قُبُلًا ప్రజల వద్దకు మార్గదర్శకత్వం వచ్చేసిన తరువాత కూడా వారు విశ్వసించకుండా, క్షమాభిక్షకై తమ ప్రభువును వేడుకోకుండా వారిని ఆపిన విషయం ఒక్కటే – అదేమిటంటే, గత కాలంలోని ప్రజలకు ఎదురైన వ్యవహారమే తమకూ ఎదురవ్వాలనీ లేదా ప్రత్యక్షంగా తమ ముందుకు శిక్ష రావాలని వారు నిరీక్షించటం.
18:56 وَمَا نُرْسِلُ الْمُرْسَلِينَ إِلَّا مُبَشِّرِينَ وَمُنذِرِينَ ۚ وَيُجَادِلُ الَّذِينَ كَفَرُوا بِالْبَاطِلِ لِيُدْحِضُوا بِهِ الْحَقَّ ۖ وَاتَّخَذُوا آيَاتِي وَمَا أُنذِرُوا هُزُوًا మేము ప్రవక్తలను శుభవార్తలను అందజేయటానికి, హెచ్చరికలు చేయటానికి మాత్రమే పంపిస్తాము. అవిశ్వాసులు అసత్యం ఆధారంగా వాదులాడతారు. దాని ద్వారా సత్యాన్ని ఖండించటానికి (ప్రయత్నిస్తారు.) వారు నా ఆయతులను, వారికి చేస్తున్న హెచ్చరికలను ఆషామాషీగా తీసుకున్నారు.
18:57 وَمَنْ أَظْلَمُ مِمَّن ذُكِّرَ بِآيَاتِ رَبِّهِ فَأَعْرَضَ عَنْهَا وَنَسِيَ مَا قَدَّمَتْ يَدَاهُ ۚ إِنَّا جَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا ۖ وَإِن تَدْعُهُمْ إِلَى الْهُدَىٰ فَلَن يَهْتَدُوا إِذًا أَبَدًا తన ప్రభువు వచనాల ద్వారా హితబోధ చేసినప్పటికీ, విముఖత చూపి, తన చేతులతో ముందుగా చేసి పంపుకున్న దానినే మరచిపోయిన వానికన్నా ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు? వారు దానిని (ఖుర్‌ఆనును) అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసేశాము. వారి చెవులకు చెవుడు కలిగించాము. నువ్వు సన్మార్గం వైపుకు వారిని పిలుస్తూ ఉన్నప్పటికీ, వారు ఎన్నటికీ సన్మార్గం పొందేవారు కారు.
18:58 وَرَبُّكَ الْغَفُورُ ذُو الرَّحْمَةِ ۖ لَوْ يُؤَاخِذُهُم بِمَا كَسَبُوا لَعَجَّلَ لَهُمُ الْعَذَابَ ۚ بَل لَّهُم مَّوْعِدٌ لَّن يَجِدُوا مِن دُونِهِ مَوْئِلًا నీ ప్రభువు క్షమాగుణం కలవాడు, దయాశీలి. వారి చేష్టలకు శిక్షగా ఆయన గనక వారిని పట్టుకున్నట్లయితే, వారిని తొందరగానే శిక్షించి ఉండేవాడు. అసలు విషయం ఏమిటంటే వారి కోసం ఒక వాగ్దాన సమయం నిర్ధారితమై ఉంది. దాన్నుంచి తప్పించుకునిపోయే చోటేదీ వారికి దొరకదు.
18:59 وَتِلْكَ الْقُرَىٰ أَهْلَكْنَاهُمْ لَمَّا ظَلَمُوا وَجَعَلْنَا لِمَهْلِكِهِم مَّوْعِدًا తమ దురాగతాల మూలంగా మేము సర్వనాశనం చేసిన వారి పట్టణాలు ఇవే. వీరి వినాశానికి కూడా మేము ఒక గడువును నిర్ధారించి పెట్టాము.
18:60 وَإِذْ قَالَ مُوسَىٰ لِفَتَاهُ لَا أَبْرَحُ حَتَّىٰ أَبْلُغَ مَجْمَعَ الْبَحْرَيْنِ أَوْ أَمْضِيَ حُقُبًا “ఏళ్ళ తరబడి నడవవలసి వచ్చినా సరే, రెండు సముద్రాలు కలిసే సాగర సంగమానికి చేరుకోనంతవరకూ నేను నడుస్తూనే ఉంటాను” అని మూసా తన వెంటనున్న యువకునితో చెప్పినప్పుడు (జరిగిన సంఘటనను కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి).
18:61 فَلَمَّا بَلَغَا مَجْمَعَ بَيْنِهِمَا نَسِيَا حُوتَهُمَا فَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ سَرَبًا తీరా వారిద్దరు సాగర సంగమానికి చేరుకున్నాక, అక్కడ తమ చేపను మరచి పోయారు. అదేమో సొరంగం మాదిరిగా దారి చేసుకుని సముద్రంలోకి జారుకుంది.
18:62 فَلَمَّا جَاوَزَا قَالَ لِفَتَاهُ آتِنَا غَدَاءَنَا لَقَدْ لَقِينَا مِن سَفَرِنَا هَٰذَا نَصَبًا వారుభయులూ ముందుకు సాగిపోయిన తరువాత మూసా తన (వెంటనున్న) యువకుణ్ణి ఉద్దేశించి, “మా ఉదయ భోజనం తీసుకురా. నిజంగానే ఈ ప్రయాణంలో చాలా ప్రయాస పడాల్సి వచ్చింది” అన్నాడు.
18:63 قَالَ أَرَأَيْتَ إِذْ أَوَيْنَا إِلَى الصَّخْرَةِ فَإِنِّي نَسِيتُ الْحُوتَ وَمَا أَنسَانِيهُ إِلَّا الشَّيْطَانُ أَنْ أَذْكُرَهُ ۚ وَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ عَجَبًا దానికతను, “చూశారా (ఎంత పనయిందో)! మనం రాతి బండకు ఆనుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నేను చేప సంగతి మరచేపోయాను. అసలేం జరిగిందో మీకు చెప్పకుండా షైతానే నన్ను మరుపుకు లోను చేశాడు. ఆ చేప చాలా విచిత్రంగా సముద్రంలోకి దారి చేసుకుని వెళ్ళిపోయింది” అని వివరించాడు.
18:64 قَالَ ذَٰلِكَ مَا كُنَّا نَبْغِ ۚ فَارْتَدَّا عَلَىٰ آثَارِهِمَا قَصَصًا “(అరె!) మనం వెతుక్కుంటూ వచ్చింది ఆ స్థలం కోసమే కదా!” అని మూసా అన్నాడు. ఆ తరువాత వారిద్దరూ తమ పాదచిహ్నాల ఆధారంగా వెనక్కి తిరిగి వచ్చారు.
18:65 فَوَجَدَا عَبْدًا مِّنْ عِبَادِنَا آتَيْنَاهُ رَحْمَةً مِّنْ عِندِنَا وَعَلَّمْنَاهُ مِن لَّدُنَّا عِلْمًا అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుణ్ణి కనుగొన్నారు. మేము అతనికి మా వద్ద నుంచి ఓ ప్రత్యేక కారుణ్యాన్ని ప్రసాదించి ఉన్నాము. ఇంకా మా వద్ద నుంచి అతనికి ఓ ప్రత్యేక విద్యను నేర్పి ఉన్నాము.
18:66 قَالَ لَهُ مُوسَىٰ هَلْ أَتَّبِعُكَ عَلَىٰ أَن تُعَلِّمَنِ مِمَّا عُلِّمْتَ رُشْدًا మూసా అతనితో, “మీకు నేర్పబడిన మంచి విద్యను మీరు నాకు నేర్పడానికి, నేను మీ వెంట ఉండవచ్చా?” అని అభ్యర్థించాడు.
18:67 قَالَ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا దానికతను, “మీరు నా సహచర్యంలో ఉంటూ ఏమాత్రం ఓపిక పట్టలేరు.
18:68 وَكَيْفَ تَصْبِرُ عَلَىٰ مَا لَمْ تُحِطْ بِهِ خُبْرًا “అయినా మీరు మీ జ్ఞానపరిధిలోకి తీసుకోని విషయంపై ఓపిక పట్టడం మీ వల్ల ఎలా సాధ్యమవుతుంది?” అన్నాడు.
18:69 قَالَ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ صَابِرًا وَلَا أَعْصِي لَكَ أَمْرًا “అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు. ఏ విషయంలోనూ నేను మీ ఆజ్ఞను జవదాటను” అని (మూసా) సమాధానమిచ్చాడు.
18:70 قَالَ فَإِنِ اتَّبَعْتَنِي فَلَا تَسْأَلْنِي عَن شَيْءٍ حَتَّىٰ أُحْدِثَ لَكَ مِنْهُ ذِكْرًا “సరే! నా వెంట రావాలన్నదే మీ అభిలాష అయితే (బాగా గుర్తుంచుకోండి!) ఏ విషయం గురించైనాసరే నేను స్వయంగా మీతో ప్రస్తావించనంతవరకూ నన్నేమీ అడగకూడదు” అన్నాడతను.
18:71 فَانطَلَقَا حَتَّىٰ إِذَا رَكِبَا فِي السَّفِينَةِ خَرَقَهَا ۖ قَالَ أَخَرَقْتَهَا لِتُغْرِقَ أَهْلَهَا لَقَدْ جِئْتَ شَيْئًا إِمْرًا వారిద్దరూ బయలుదేరారు. చివరకు ఒక పడవలో పయనమైనప్పుడు అతను (ఖిజరు) దాని చెక్క పలకలను పగులగొట్టారు. దానికి మూసా, “ఇదేమిటీ, పడవ ప్రయాణీకులందరినీ ముంచేయటానికా వీటిని పగులగొట్టారు? మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారు” అని చెప్పనే చెప్పేశాడు.
18:72 قَالَ أَلَمْ أَقُلْ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا “మీరు నా వెంట ఉండి ఓపిక పట్టలేరని ముందే చెప్పానా!?” అని (ఖిజరు) అన్నాడు.
18:73 قَالَ لَا تُؤَاخِذْنِي بِمَا نَسِيتُ وَلَا تُرْهِقْنِي مِنْ أَمْرِي عُسْرًا “నా మరుపుపై నన్ను పట్టుకోకండి. నా విషయంలో కఠినంగా వ్యవహరించకండి” అని మూసా విన్నవించుకున్నాడు.
18:74 فَانطَلَقَا حَتَّىٰ إِذَا لَقِيَا غُلَامًا فَقَتَلَهُ قَالَ أَقَتَلْتَ نَفْسًا زَكِيَّةً بِغَيْرِ نَفْسٍ لَّقَدْ جِئْتَ شَيْئًا نُّكْرًا ఆ తరువాత వారుభయులూ ముందుకు సాగిపోయారు. వారికి ఒక అబ్బాయి తారసపడ్డాడు. అతనా అబ్బాయిని చంపేశాడు. “మీరు పవిత్రమైన ఒక ప్రాణాన్ని తీసేశారు. అతను ఏ ప్రాణినీ హతమార్చి ఉండలేదుకదా! నిశ్చయంగా మీరు అత్యంత ఘోరకృత్యానికి పాల్పడ్డారు” అని మూసా చెప్పాడు.
18:75 قَالَ أَلَمْ أَقُل لَّكَ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا “నా వెంట ఉంటూ మీరు ఏ మాత్రం సహనం పాటించలేరని ముందే చెప్పానా లేదా?” అని ఆయన అన్నాడు.
18:76 قَالَ إِن سَأَلْتُكَ عَن شَيْءٍ بَعْدَهَا فَلَا تُصَاحِبْنِي ۖ قَدْ بَلَغْتَ مِن لَّدُنِّي عُذْرًا “ఒకవేళ దీని తరువాత ఏ విషయంలోనయినా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే నన్ను మీ వెంట ఉండనివ్వకండి. ఇక మీదట నాపై చర్య గైకొనేందుకు తగిన కారణం మీకు లభించింది” అని మూసా ప్రాధేయపడ్డాడు.
18:77 فَانطَلَقَا حَتَّىٰ إِذَا أَتَيَا أَهْلَ قَرْيَةٍ اسْتَطْعَمَا أَهْلَهَا فَأَبَوْا أَن يُضَيِّفُوهُمَا فَوَجَدَا فِيهَا جِدَارًا يُرِيدُ أَن يَنقَضَّ فَأَقَامَهُ ۖ قَالَ لَوْ شِئْتَ لَاتَّخَذْتَ عَلَيْهِ أَجْرًا వారిద్దరూ అక్కణ్ణుంచి బయలుదేరి ఒక పట్టణానికి చేరుకున్నారు. తమ కోసం భోజన ఏర్పాటు చేయమని అక్కడి ప్రజలను అభ్యర్థించగా వారికి ఆతిథ్యమివ్వటానికి స్థానికులు నిరాకరించారు. అంతలో ఆ ఊరిలో కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక గోడపై వారి దృష్టి పడింది. ఆయన ఆ గోడను (యధాతథంగా) నిలబెట్టాడు. “మీరు గనక తలచుకుంటే ఈ పనికి వేతనం తీసుకోవచ్చు కదా!” అని మూసా అన్నాడు.
18:78 قَالَ هَٰذَا فِرَاقُ بَيْنِي وَبَيْنِكَ ۚ سَأُنَبِّئُكَ بِتَأْوِيلِ مَا لَمْ تَسْتَطِع عَّلَيْهِ صَبْرًا దానికతను ఈ విధంగా సమాధానమిచ్చాడు: “ఇక మీకూ- నాకూ మధ్య చీలిక ఏర్పడినట్లే (మన సావాసం చెల్లిపోయింది). మీరు సహించలేకపోయిన ఆ మూడు విషయాల పరమార్థాన్ని కూడా మీకు వివరిస్తాను (వినండి)….”
18:79 أَمَّا السَّفِينَةُ فَكَانَتْ لِمَسَاكِينَ يَعْمَلُونَ فِي الْبَحْرِ فَأَرَدتُّ أَنْ أَعِيبَهَا وَكَانَ وَرَاءَهُم مَّلِكٌ يَأْخُذُ كُلَّ سَفِينَةٍ غَصْبًا “ఆ పడవ సంగతి – అది సముద్రంలో పనిచేసుకునే కొందరు నిరుపేదలది. నేను కావాలనే ఆ పడవలో కొంత లోపం ఏర్పర చాలనుకున్నాను. ఎందుకంటే, ఇంకాస్త ముందుకుపోతే కనిపించిన ప్రతి (మంచి) పడవనూ బలవంతంగా వశపరచుకునే రాజు ఒకడున్నాడు.
18:80 وَأَمَّا الْغُلَامُ فَكَانَ أَبَوَاهُ مُؤْمِنَيْنِ فَخَشِينَا أَن يُرْهِقَهُمَا طُغْيَانًا وَكُفْرًا “ఇకపోతే ఆ అబ్బాయి సంగతి; అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతను తన తలబిరుసుతనంతో, తిరస్కారవైఖరితో వారిని వేధిస్తాడని మాకు భయమేసింది.
18:81 فَأَرَدْنَا أَن يُبْدِلَهُمَا رَبُّهُمَا خَيْرًا مِّنْهُ زَكَاةً وَأَقْرَبَ رُحْمًا “అందుకే వారికి వారి ప్రభువు – అతనికి బదులుగా – అతనికన్నా సౌశీల్యవంతుడైన, దయార్ద్రతకు దగ్గరగా ఉండే బాలుడిని ప్రసాదించాలని మేము కోరుకున్నాము.
18:82 وَأَمَّا الْجِدَارُ فَكَانَ لِغُلَامَيْنِ يَتِيمَيْنِ فِي الْمَدِينَةِ وَكَانَ تَحْتَهُ كَنزٌ لَّهُمَا وَكَانَ أَبُوهُمَا صَالِحًا فَأَرَادَ رَبُّكَ أَن يَبْلُغَا أَشُدَّهُمَا وَيَسْتَخْرِجَا كَنزَهُمَا رَحْمَةً مِّن رَّبِّكَ ۚ وَمَا فَعَلْتُهُ عَنْ أَمْرِي ۚ ذَٰلِكَ تَأْوِيلُ مَا لَمْ تَسْطِع عَّلَيْهِ صَبْرًا “ఇక గోడ సంగతంటారా, ఆ గోడ ఈ పట్టణంలో నివసించే ఇద్దరు అనాధ బాలలది. వారికి చెందవలసిన ఒక నిధి ఆ గోడ క్రింద పాతిపెట్టబడి ఉంది. వారి తండ్రి సజ్జనుడు. ఈ అనాధలిద్దరూ యుక్త వయస్కులై నీ ప్రభువు దయానుగ్రహంతో తమ ఈ నిధిని వెలికి తీసుకోవాలన్నది నీ ప్రభువు సంకల్పం. అంతేగాని నా అంతట నేనుగా ఈ పని చేయలేదు. మీరు సహించలేకపోయిన ఆ సంఘటనల వెనుక దాగివున్న వాస్తవికత ఇదే!”
18:83 وَيَسْأَلُونَكَ عَن ذِي الْقَرْنَيْنِ ۖ قُلْ سَأَتْلُو عَلَيْكُم مِّنْهُ ذِكْرًا (ఓ ప్రవక్తా!) వారు నిన్ను జుల్‌ఖర్‌నైన్ గురించి అడుగుతున్నారు. “నేను మీకు అతని వృత్తాంతం కొద్దిగా చదివి వినిపిస్తాన”ని వారికి చెప్పు.
18:84 إِنَّا مَكَّنَّا لَهُ فِي الْأَرْضِ وَآتَيْنَاهُ مِن كُلِّ شَيْءٍ سَبَبًا మేము అతనికి భువిలో అధికారం ఇచ్చాము. అన్ని రకాల సాధన సంపత్తుల్నికూడా అతనికి సమకూర్చాము.
18:85 فَأَتْبَعَ سَبَبًا అతను ఒక దిశలో పోసాగాడు.
18:86 حَتَّىٰ إِذَا بَلَغَ مَغْرِبَ الشَّمْسِ وَجَدَهَا تَغْرُبُ فِي عَيْنٍ حَمِئَةٍ وَوَجَدَ عِندَهَا قَوْمًا ۗ قُلْنَا يَا ذَا الْقَرْنَيْنِ إِمَّا أَن تُعَذِّبَ وَإِمَّا أَن تَتَّخِذَ فِيهِمْ حُسْنًا చివరకు అతను సూర్యుడు అస్తమించే ప్రదేశానికి చేరుకుని, సూర్యుడు ఒక బురద చెలమలో అస్తమిస్తుండగా చూశాడు. దాని సమీపంలో అతను ఒక జాతి వారిని కూడా కనుగొన్నాడు. “ఓ జుల్‌ఖర్‌నైన్! నువ్వు వీళ్లను శిక్షించవచ్చు. లేదా వీరి విషయంలో మరేదయినా ఉత్తమ వైఖరిని అవలంబించవచ్చు” అని మేమతనికి సెలవిచ్చాము.
18:87 قَالَ أَمَّا مَن ظَلَمَ فَسَوْفَ نُعَذِّبُهُ ثُمَّ يُرَدُّ إِلَىٰ رَبِّهِ فَيُعَذِّبُهُ عَذَابًا نُّكْرًا దానికతను, “దుర్మార్గానికి ఒడిగట్టిన వాణ్ణి మేము శిక్షిస్తాము. తరువాత అతను తన ప్రభువు వద్దకు మరలించబడతాడు. ఆయన అతనికి మరింత తీవ్రమైన శిక్ష విధిస్తాడు” అని అన్నాడు.
18:88 وَأَمَّا مَنْ آمَنَ وَعَمِلَ صَالِحًا فَلَهُ جَزَاءً الْحُسْنَىٰ ۖ وَسَنَقُولُ لَهُ مِنْ أَمْرِنَا يُسْرًا “అయితే విశ్వసించి, మంచిపనులు చేసినవారికి ప్రతి ఫలంగా మేలు కలుగుతుంది. అలాంటి వారికి మేము సయితం మా పనిలో తేలికపాటి ఆదేశాలే ఇస్తాము” (అని అన్నాడు).
18:89 ثُمَّ أَتْبَعَ سَبَبًا ఆ తరువాత అతను మరో దారి పట్టాడు –
18:90 حَتَّىٰ إِذَا بَلَغَ مَطْلِعَ الشَّمْسِ وَجَدَهَا تَطْلُعُ عَلَىٰ قَوْمٍ لَّمْ نَجْعَل لَّهُم مِّن دُونِهَا سِتْرًا అతను సూర్యుడు ఉదయించే ప్రదేశానికి చేరుకున్నప్పుడు, అక్కడ సూర్యుడు ఒక జాతి వారిపై ఉదయించటం చూశాడు. మేము వారికీ – సూర్యునికీ మధ్య ఎలాంటి అడ్డునూ ఉంచలేదు.
18:91 كَذَٰلِكَ وَقَدْ أَحَطْنَا بِمَا لَدَيْهِ خُبْرًا ఇదీ పరిస్థితి! అతనికి సంబంధించిన విషయాలన్నీ మా జ్ఞానపరిధిలో ఉన్నాయి.
18:92 ثُمَّ أَتْبَعَ سَبَبًا ఆ తరువాత అతను ఇంకొక మార్గాన్ని అనుసరించాడు.
18:93 حَتَّىٰ إِذَا بَلَغَ بَيْنَ السَّدَّيْنِ وَجَدَ مِن دُونِهِمَا قَوْمًا لَّا يَكَادُونَ يَفْقَهُونَ قَوْلًا అతను రెండు కొండల మధ్య ప్రదేశానికి చేరుకున్నప్పుడు, ఆ రెంటికీ నడుమ ఒక జాతివారిని చూశాడు. వారు అతని (ఒక్క) మాటనైనా అర్థం చేసుకునే స్థితిలో లేరు.
18:94 قَالُوا يَا ذَا الْقَرْنَيْنِ إِنَّ يَأْجُوجَ وَمَأْجُوجَ مُفْسِدُونَ فِي الْأَرْضِ فَهَلْ نَجْعَلُ لَكَ خَرْجًا عَلَىٰ أَن تَجْعَلَ بَيْنَنَا وَبَيْنَهُمْ سَدًّا “ఓ జుల్ ఖర్‌నైన్! యాజూజ్ మాజూజ్‌లు ఈ దేశంలో కల్లోలాన్ని సృష్టిస్తున్నారు. నువ్వు మాకూ – వారికీ మధ్య ఒక అడ్డుగోడను నిర్మిస్తావా? దానికయ్యే ఖర్చులు నీకు చెల్లించమంటావా?” అని వాళ్లు విన్నవించుకున్నారు.
18:95 قَالَ مَا مَكَّنِّي فِيهِ رَبِّي خَيْرٌ فَأَعِينُونِي بِقُوَّةٍ أَجْعَلْ بَيْنَكُمْ وَبَيْنَهُمْ رَدْمًا అతనిలా సమాధానమిచ్చాడు: “నాకు నా ప్రభువు అనుగ్రహించిన అధికారమే ఎంతో శ్రేష్ఠమైనది. మీరు మీ (శ్రమ) శక్తి ద్వారా నాకు సహాయపడండి చాలు. నేను మీకూ – వారికీ మధ్య ఒక పటిష్టమైన గోడను నిర్మిస్తాను.
18:96 آتُونِي زُبَرَ الْحَدِيدِ ۖ حَتَّىٰ إِذَا سَاوَىٰ بَيْنَ الصَّدَفَيْنِ قَالَ انفُخُوا ۖ حَتَّىٰ إِذَا جَعَلَهُ نَارًا قَالَ آتُونِي أُفْرِغْ عَلَيْهِ قِطْرًا “….నాకు ఇనుపరేకులను తెచ్చి ఇవ్వండి.” ఆ విధంగా అతను ఆ రెండు పర్వతాల మధ్య గోడను – సమానంగా – లేపిన తరువాత, “అగ్నిని రాజేయండి” అని ఆజ్ఞాపించాడు. ఆ ఇనుప రేకులు బాగా కాలి అగ్నిగా మారిన తరువాత “కరిగిన రాగిని తెండి, దానిపై పోస్తాను” అని అన్నాడు.
18:97 فَمَا اسْطَاعُوا أَن يَظْهَرُوهُ وَمَا اسْتَطَاعُوا لَهُ نَقْبًا ఇక వారిలో (యాజూజు మాజూజుల్లో) ఆ గోడను ఎక్కే శక్తి లేకపోయింది. దానికి రంధ్రం వేయటం కూడా వారి తరం కాదు.
18:98 قَالَ هَٰذَا رَحْمَةٌ مِّن رَّبِّي ۖ فَإِذَا جَاءَ وَعْدُ رَبِّي جَعَلَهُ دَكَّاءَ ۖ وَكَانَ وَعْدُ رَبِّي حَقًّا “ఇది కేవలం నా ప్రభువు కటాక్షం. అయితే నా ప్రభువు వాగ్దాన సమయం వచ్చినపుడు ఆయన దాన్ని నేలమట్టం చేసేస్తాడు. నిశ్చయంగా నా ప్రభువు వాగ్దానం నెరవేరటం తథ్యం” అని జుల్‌ఖర్‌నైన్ చెప్పాడు.
18:99 وَتَرَكْنَا بَعْضَهُمْ يَوْمَئِذٍ يَمُوجُ فِي بَعْضٍ ۖ وَنُفِخَ فِي الصُّورِ فَجَمَعْنَاهُمْ جَمْعًا ఆ రోజు మేము వారిని (సముద్రపు అలల మాదిరిగా) ఒండొకరిలో చొచ్చుకుపోయేలా వదలిపెడతాము. శంఖం ఊద బడుతుంది. అంతే! మేము జనులందరినీ ఒకేసారి సమీకరిస్తాము.
18:100 وَعَرَضْنَا جَهَنَّمَ يَوْمَئِذٍ لِّلْكَافِرِينَ عَرْضًا ఆ రోజు మేము నరకాన్ని అవిశ్వాసుల ముందు ప్రత్యక్షపరుస్తాము.
18:101 الَّذِينَ كَانَتْ أَعْيُنُهُمْ فِي غِطَاءٍ عَن ذِكْرِي وَكَانُوا لَا يَسْتَطِيعُونَ سَمْعًا నా స్మరణ పట్ల వారి కళ్లు పొరలు క్రమ్ముకుని ఉండేవి. అప్పుడు వారు (సత్య వాక్కును) వినే స్థితిలో కూడా లేరు.
18:102 أَفَحَسِبَ الَّذِينَ كَفَرُوا أَن يَتَّخِذُوا عِبَادِي مِن دُونِي أَوْلِيَاءَ ۚ إِنَّا أَعْتَدْنَا جَهَنَّمَ لِلْكَافِرِينَ نُزُلًا ఇప్పుడీ అవిశ్వాసులు, నన్ను కాదని నా దాసులను తమ సహాయకులుగా చేసుకుందామని అనుకుంటున్నారా? (వినండి!) మేము ఈ అవిశ్వాసుల ఆతిథ్యం కోసం నరకాన్ని సిద్ధంచేసి ఉంచాము.
18:103 قُلْ هَلْ نُنَبِّئُكُم بِالْأَخْسَرِينَ أَعْمَالًا (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “చేసుకున్న కర్మల రీత్యా మీలో అందరికన్నా ఎక్కువగా నష్టపోయే వారెవరో నేను మీకు చెప్పనా?
18:105 أُولَٰئِكَ الَّذِينَ كَفَرُوا بِآيَاتِ رَبِّهِمْ وَلِقَائِهِ فَحَبِطَتْ أَعْمَالُهُمْ فَلَا نُقِيمُ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ وَزْنًا తమ ప్రభువు ఆయతులను, ఆయన్ని కలుసుకోవలసి ఉందన్న విషయాన్ని త్రోసి పుచ్చినవారు వీరే. అందువల్ల వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. కాబట్టి ప్రళయదినాన మేము వారి కర్మల బరువును తూయము.
18:106 ذَٰلِكَ جَزَاؤُهُمْ جَهَنَّمُ بِمَا كَفَرُوا وَاتَّخَذُوا آيَاتِي وَرُسُلِي هُزُوًا వారికి లభించే ప్రతిఫలం నరకం. ఎందుకంటే వారు (సత్యాన్ని) తిరస్కరించారు. నా ఆయతులను, నా ప్రవక్తలను పరిహసించారు.
18:107 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ كَانَتْ لَهُمْ جَنَّاتُ الْفِرْدَوْسِ نُزُلًا అయితే విశ్వసించి, సత్కార్యాలు కూడా చేసిన వారికి ఆతిథ్యంగా ఫిరదౌసు వనాలు ఉన్నాయి.
18:108 خَالِدِينَ فِيهَا لَا يَبْغُونَ عَنْهَا حِوَلًا వారక్కడ కలకాలం ఉంటారు. ఆ స్థలాన్ని వదలి మరెక్కడి కైనా పోవాలని వారు ఎన్నటికీ కోరుకోరు.
18:109 قُل لَّوْ كَانَ الْبَحْرُ مِدَادًا لِّكَلِمَاتِ رَبِّي لَنَفِدَ الْبَحْرُ قَبْلَ أَن تَنفَدَ كَلِمَاتُ رَبِّي وَلَوْ جِئْنَا بِمِثْلِهِ مَدَدًا (ఓ ప్రవక్తా!) ఈ విధంగా చెప్పు : “ఒకవేళ నా ప్రభువు మాటలను వ్రాయటానికి సముద్రం సిరాగా మారిపోయినా సరే, నా ప్రభువు మాటలు పూర్తి కాకముందే, అది అయి పోతుంది.” – మేము మళ్లీ దాని వంటిదే (మరో సముద్రం) దాని సహాయార్థం తెచ్చినాసరే.”
18:110 قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِّثْلُكُمْ يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا (ఓ ప్రవక్తా!) వారికి ఇలా చెప్పు: “నేనూ మీలాంటి మానవ మాత్రుణ్ణే.(కాకపోతే) ‘మీ అందరి ఆరాధ్యదైవం ఒకే ఆరాధ్య దైవం’ అన్న సందేశం (వహీ) నా వద్దకు పంపబడుతుంది. కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చేయాలి. తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకూడదు.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.