అన్నింటి కంటే పెద్ద పాపం ఏది ? వక్త: హబీబుర్రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/oCuJTzug-YA [ 4 నిముషాలు]
ఈ ప్రసంగంలో, పాపం యొక్క నిర్వచనం, దాని రకాలు మరియు ఇస్లాంలో అన్నింటికంటే పెద్ద పాపం గురించి వివరించబడింది. ఒకరి మనస్సాక్షిని ఇబ్బంది పెట్టే మరియు ఇతరులకు తెలియకూడదని కోరుకునే చర్యే పాపం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. పాపాలు పెద్దవి (కబాయిర్) మరియు చిన్నవి (సఘాయిర్) అని రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి. హత్య, వ్యభిచారం, దొంగతనం వంటివి పెద్ద పాపాల జాబితాలోకి వస్తాయి. అయితే, ఈ అన్నింటికంటే ఘోరమైన, అల్లాహ్ ఎప్పటికీ క్షమించని పాపం ‘షిర్క్’ – అంటే అల్లాహ్ కు భాగస్వాములను కల్పించడం లేదా బహుదైవారాధన చేయడం. పవిత్ర ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారంగా, సృష్టికర్త అయిన అల్లాహ్ తో ఇతరులను సాటి కల్పించడమే అత్యంత ఘోరమైన పాపమని స్పష్టం చేయబడింది.
అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ ఆరవ ఎపిసోడ్ లో, మనం అన్నింటికంటే పెద్ద పాపం ఏది అనేది తెలుసుకుందాం.
అసలు పాపం దేనిని అంటారు? ఓ ఉల్లేఖనంలో, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం గురించి ఇలా తెలియజేశారు.
الْإِثْمُ مَا حَاكَ فِي صَدْرِكَ، وَكَرِهْتَ أَنْ يَطَّلِعَ عَلَيْهِ النَّاسُ (అల్ ఇస్ము మా హాక ఫీ సద్రిక్, వ కరిహ్త అన్ యత్తలిఅ అలైహిన్నాస్) పాపమంటే నీ హృదయంలో సంకోచం, సందేహం కలిగించేది మరియు ఇతరులకు తెలియటాన్ని నీవు ఇష్టపడనిది.
ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. ఏ పని పట్ల నీ మనసులో శంక కలుగుతుందో, మరీ దేని గురించి ప్రజలు తెలుసుకోవటం నీకు ఇష్టం లేదో, దీన్ని దురాచరణ అంటారు, పాపం అంటారు.
ఇక పాపం రెండు రకాలు. అల్ కబాయిర్ (పెద్దవి) వ స్సఘాయిర్ (చిన్నవి). పెద్ద పాపాలలో మనిషి చాలా రకాలుగా పాపాలు చేస్తాడు. అన్యాయం, మోసం, వ్యభిచారం, దగా, ద్రోహం, హత్య, దొంగతనం, సారాయి, జూదం ఇలాంటి ఎన్నో రకరకాల పాపాలు చేస్తాడు.
కాకపోతే, ఈ పాపాలలో అన్నింటికంటే, అతి పెద్ద పాపం, అది బహుదైవారాధన. పెద్ద షిర్క్ చేయటం. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేయటం.
ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతున్ నిసాలో తెలియజేశారు.
إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ (ఇన్నల్లాహ లా యఘ్ ఫిరు అన్ యుష్రక బిహీ వ యఘ్ ఫిరు మా దూన జాలిక లిమన్ యషా)
“తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.” (4:48)
నిస్సందేహంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా క్షమించనిది కేవలం అది షిర్క్, బహుదైవారాధన. బహుదైవారాధనను, షిర్కును అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా క్షమించడు. అది తప్ప ఏ పాపాన్నయినా తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు.
అభిమాన సోదరులారా, ఓ సందర్భంలో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దర్యాప్తు చేయడం జరిగింది.
أَىُّ الذَّنْبِ أَعْظَمُ عِنْدَ اللَّهِ؟ (అయ్యు జ్జంబి అ’అజము ఇందల్లాహ్?) ఓ ప్రవక్తా, ఏ పాపం అల్లాహ్ వద్ద అన్నింటికంటే పెద్దది?
అతి పెద్ద పాపం అల్లాహ్ దగ్గర ఏది? ఈ ప్రశ్నకి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారు.
أَنْ تَجْعَلَ لِلَّهِ نِدًّا وَهْوَ خَلَقَكَ (అన్ తజ్ అల లిల్లాహి నిద్దన్ వహువ ఖలఖక) నిన్ను సృష్టించిన అల్లాహ్ కు వేరొకరిని సాటి కల్పించటం.
అల్లాహ్ కు భాగస్వాములుగా చేయటం, వాస్తవానికి ఆయన మిమ్మల్ని సృష్టించాడు. అంటే షిర్క్ చేయటం అల్లాహ్ వద్ద అన్నింటికంటే ఘోరమైన పాపం, పెద్ద పాపం అని ఈ హదీస్ మరియు ఆయత్ ద్వారా మనకు అర్థమయింది.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ షిర్క్ నుండి రక్షించు గాక, కాపాడు గాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (6) [మరణానంతర జీవితం – పార్ట్ 47] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://www.youtube.com/watch?v=rCFxyKebOx8 [22 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ప్రళయ దినాన కర్మల త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి వివరించబడింది. ప్రధానంగా, అల్లాహ్ మార్గంలో పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీలను కాపాడకుండా వారికి ద్రోహం చేయడం, ఆత్మహత్య చేసుకోవడం, అకారణంగా భర్తకు అవిధేయత చూపడం, ప్రజలు ఇష్టపడని ఇమామ్, మరియు యజమాని నుండి పారిపోయిన బానిస వంటి వారి నమాజులు స్వీకరించబడకపోవడం, దానధర్మాలు చేసి వాటిని చెప్పుకుని బాధపెట్టడం, గర్వంతో చీలమండలాల కిందికి దుస్తులు ధరించడం, మరియు అమ్మకాలలో అబద్ధపు ప్రమాణాలు చేయడం వంటి పాపాల తీవ్రత గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో చర్చించబడింది. ఈ పాపాలు కర్మల త్రాసును తేలికగా చేయడమే కాక, అల్లాహ్ యొక్క ఆగ్రహానికి మరియు కఠినమైన శిక్షకు కారణమవుతాయని హెచ్చరించబడింది.
అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్ హమ్దులిల్లాహి కఫా వ సలామున్ అలా ఇబాదిల్లజీనస్ తఫా అమ్మా బ’అద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము.
అల్లాహ్ మార్గంలో పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీలను కాపాడకుండా వారికి ద్రోహం చేయడం
వాటిలో 14వ విషయం, అల్లాహ్ మార్గంలో పోరాడడానికి వెళ్ళిన వారి యొక్క స్త్రీలను కాపాడకుండా, వారి విషయంలో అపహరణలకు, అక్రమానికి పాల్పడడం.
మహాశయులారా, అల్లాహ్ మార్గంలో పోరాడడానికి అని అంటే, అల్లాహ్ పంపినటువంటి సత్య ధర్మం మరియు అసత్య ధర్మాల మధ్య ఎప్పుడైనా ఏదైనా పోరాటం జరిగితే, అందులో పాల్గొనడం అని భావం వస్తుంది. అయితే, అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వారు అని అంటే, ఇందులో పోరాడడానికి వెళ్ళిన వారు మాత్రమే కాకుండా, అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రచారం చేయడానికి మరియు అల్లాహ్ యొక్క సత్య ధర్మాన్ని తెలుసుకోవడానికి, విద్య అభ్యసించడానికి ప్రయాణం చేసేవారు, ఈ విధంగా ఇంకా ఎన్నో పుణ్య కార్యాల గురించి కూడా ఈ పదం ఉపయోగపడుతుంది. అయితే మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా తెలిపారు.
ఎలాగైతే అల్లాహ్ మార్గంలో పోరాడేందుకు వెళ్ళడానికి శక్తి లేని వారు తమ నగరాల్లో, గ్రామాల్లో, తమ ఇంట్లో కూర్చుండి ఉంటారో, వారి తల్లులు వారిపై ఎలా నిషిద్ధమో, అలాగే పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీల యొక్క పరువు కూడా అలాగే నిషిద్ధం.
అంటే, స్వయం మనం మన తల్లులను ఎలా గౌరవిస్తామో, వారి విషయంలో ఎలాంటి చెడును ఎప్పుడూ ఊహించకుండా మనం ఉంటామో, అలాగే అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వారి స్త్రీలను కూడా ఆ విధంగా భావించాలి, వారికి రక్షణ ఇవ్వాలి, వారి యొక్క అవసరాలు తీర్చాలి. ఇది మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో ఒకటి. కానీ అలా చేయకుండా, ఎవరైతే అపహరణకు గురి చేస్తారో, వారి మాన పరువుల్లో జోక్యం చేసుకుంటారో, వారికి ఏ రకమైన ఇబ్బంది కలుగజేస్తారో, ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా ఆ అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వ్యక్తిని పిలుస్తాడు. ఎవరి స్త్రీల విషయంలో జోక్యం చేసుకోవడం జరిగిందో, అతన్ని పిలుస్తాడు. పిలిచి, ఈ దౌర్జన్యం చేసిన వ్యక్తి పుణ్యాల్లో నుండి నీకు ఇష్టమైన పుణ్యాలు తీసుకోమని ఆదేశిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం తెలియజేస్తూ,
فما ظنكم (ఫమా జన్నుకుమ్)
చెప్పండి, ఇతని పుణ్యాల నుండి నీకు ఇష్టమైన పుణ్యాలు తీసుకో అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, అలాంటప్పుడు ఇతని పరిస్థితి ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. ఇతడు పుణ్యాల నుండి తన పుణ్యాలను కోల్పోయి ఆ సమయంలో ఎంత బాధకు గురి కావచ్చు.
ఇక్కడ కూడా మీరు గమనించండి, ఇస్లాం యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకోండి. ఈ రోజుల్లో భర్తలు ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత, ఉద్యోగానికైనా, ఆ బయటికి వెళ్ళడం ఇంటి నుండి సేమ్ అదే సిటీలోనైనా, లేదా ఇంటి నుండి బయటికి వెళ్ళడం అంటే దేశం నుండి బయటికి వెళ్లి ఏదైనా సంపాదించే ప్రయత్నం చేయడం గానీ, ఆ ఇంటి యొక్క చుట్టుపక్కన ఉన్నవారు ఆ ఇంటి స్త్రీలను కాపాడుతున్నారా? వారికి రక్షణ కలుగజేస్తున్నారా? ఇంకా ఎవరైతే బయటికి వెళ్లి అల్లాహ్ మార్గంలో ఉంటున్నారో, అల్లాహ్ యొక్క సత్య ధర్మం గురించి ఏదైతే వారు ప్రయత్నం చేస్తున్నారో, అలాంటి వారి ఇళ్లల్లో వారి యొక్క స్త్రీలకు రక్షణ కల్పించడం, వారి యొక్క మాన పరువులను భద్రంగా ఉండే విధంగా చూసుకోవడం చుట్టుపక్కన ఉన్నవారందరి యొక్క బాధ్యత.
ఆత్మహత్య (Suicide)
ఇంకా మహాశయులారా! ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో 15వ విషయం, ఆత్మహత్య చేసుకోవడం. అల్లాహు అక్బర్! ఈ రోజుల్లో చాలా మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అల్లాహ్ పై విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్న వారిలో కూడా ఎంతోమంది తమ ఉద్యోగంలో, తమ చదువులో, ఇహలోకపు బూటకపు ప్రేమల్లో, ఇంకా వేరే ఎన్నో విషయాల్లో తమకు తాము ఫెయిల్యూర్ అనుకొని వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కానీ, ఆత్మహత్యకు పాల్పడడం ఇది తమను తాము ఎంతో నష్టంలో పడవేసుకోవడం.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక వ్యక్తి ఎంతో ధైర్యంతో యుద్ధంలో పాల్గొని చాలా ధీటుగా పోరాడుతున్నాడు. ఆ సందర్భంలో అతన్ని చూసిన వారు మెచ్చుకుంటూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు అతన్ని ప్రశంసించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అతడు నరకవాసి అని. కొందరు సహచరులకు, ఏంటి, అంత ధైర్యంగా పోరాడుతున్న వ్యక్తిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకవాసి అని అన్నారు అని ఒక బాధగా ఏర్పడింది. కానీ వారిలోనే ఒక వ్యక్తి ఆ ధైర్యంతో పోరాడే వ్యక్తి వెనక ఉండి అతన్ని చూడడం మొదలుపెట్టాడు. చివరికి ఏం జరిగింది? ఎంతో మందిని అతను హత్య చేసి, ధైర్యంగా పోరాడుతూ ఉన్న ఆ వ్యక్తి, ఏదో ఒక బాణం వచ్చి అతనికి గుచ్చుకుంది. దాన్ని అతను భరించలేక, స్వయంగా తన బాణంతోనే తనను తాను చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన వెంటనే అతను పరుగెత్తుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “ప్రవక్తా, మీరు చెప్పిన మాట నిజమైంది. అల్లాహ్ సాక్షిగా మీరు సత్య ప్రవక్త, ఇందులో ఎలాంటి అనుమానం లేదు.” ప్రవక్త అడిగారు, “ఏమైంది విషయం? ఏం చూశావు? ఏం జరిగింది?” అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, “ప్రవక్తా, ఎవరి గురించైతే, ఏ మనిషి గురించైతే కొందరు సహచరులు ప్రశంసిస్తూ, పొగుడుతూ ఉండగా, మీరు అతని గురించి నరకవాసి అని చెప్పారో, అతన్ని నేను నా కళ్ళారా చూశాను, తనకు తాను చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. తన బాణంతోనే తన యొక్క ఛాతిలో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా అల్లాహ్ త’ఆలా మీ యొక్క మాటను సత్యపరిచాడు,” అని తెలియపరిచాడు.
ఈ విధంగా మహాశయులారా, అందుగురించే అనేకమంది సహాబాయే కిరామ్ రదియల్లాహు అన్హుమ్ వారి యొక్క దృష్టిలో ఆత్మహత్య చేసుకున్న వారి యొక్క కర్మలు వృధా అవుతాయి. అందుకొరకే అతడు నరకంలో వెళ్తాడు అని చెప్పడం జరిగింది.
అయితే ఈ విధంగా మహాశయులారా, ఆత్మహత్యకు పాల్పడకూడదు. ఆత్మహత్య అన్నది ఏమిటి? వాస్తవానికి, ఆత్మహత్య గురించి మనకు తెలిస్తే ఎప్పుడూ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడం. ఎందుకంటే సహీ హదీసులో వచ్చి ఉంది,
ఎవరైతే ఏ మార్గంతో, ఏ విధంగా, ఏ వస్తువుతో ఆత్మహత్య చేసుకుంటాడో, అతను చనిపోయిన తర్వాత నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు, తీర్పు దినాన తీర్పు సంపూర్ణమయ్యే వరకు అతనికి అలాంటి శిక్షనే జరుగుతూ ఉంటుంది. చివరికి అతడు, అయ్యో, నేను ఆత్మహత్య చేసుకోకుంటే ఎంత బాగుండు అని చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ ఆ బాధ ఆ సందర్భంలో అతనికి ఏమీకి పనికి రాదు.
మళ్ళీ ఇక్కడ ఒక విషయం గమనించారా మీరు? ప్రవక్త కాలంలో, ప్రవక్త తోడుగా ఉండి, ప్రవక్తతో యుద్ధంలో పాల్గొని, ఎంతో ధైర్యంగా పోరాడి, ఎందరో ప్రజల ప్రశంసలను అందుకొని, ఇవన్నీ రకాల లాభాలు ఉన్నప్పటికీ ఆ మనిషి నరకంలోకి వెళ్ళాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, అతను చేసుకున్న అంతటి సత్కార్యాలన్నీ కూడా వృధా అయినవి అనే కదా భావం. అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్మార్గం చూపుగాక.
నమాజు స్వీకరించబడని పాపాలు
మహాశయులారా, ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో అకారణంగా భార్య భర్తకు అవిధేయురాలై పోవుట మరియు అకారణంగా ప్రజలు వారికి నమాజు చేయించే ఇమాము పట్ల అసహ్యించుకొనుట, ఇంకా దాసుడు తన యజమానికి తెలియకుండా అపహరణం చేసి అతని నుండి పారిపోవుట. ఈ మూడు పాపాలు ఎలాంటివి అంటే, దీని మూలంగా వారి యొక్క నమాజు అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. ఇక నమాజ్ త్రాసును బరువు చేసే సత్కార్యాల్లో చాలా గొప్ప సత్కార్యం. ఎప్పుడైతే ఆ నమాజ్ స్వీకరించబడదో, త్రాసు బరువు అనేది కాజాలదు, తేలికగా అవుతుంది. ఈ విధంగా మనిషి కష్టపడి చేసుకున్న పుణ్యాన్ని కూడా నోచుకోకుండా అయిపోతుంది. వినండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసు.
ثَلَاثَةٌ لَا تُجَاوِزُ صَلَاتُهُمْ آذَانَهُمْ (సలాసతున్ లా తుజావిజు సలాతుహుమ్ ఆజానహుమ్) మూడు రకాల వారు, వారి యొక్క నమాజ్ వారి చెవులకు పైగా కూడా పోదు.
అంటే, అల్లాహ్ వద్దకు వెళ్లి అక్కడ అల్లాహ్ స్వీకరించడం, అది ఇంకా దూరం. వారి మీదికే వెళ్ళదు. అంటే భావం, స్వీకరించబడదు. ఎవరు ఆ ముగ్గురు? ఆ మూడు రకాల వారు ఎవరు?
తన యజమాని నుండి పారిపోయిన దాసుడు, అతను తిరిగి వచ్చేంత వరకు అతని నమాజు స్వీకరించబడదు. మరియు ఏ రాత్రి భర్త తన భార్యపై కోపగించుకొని ఉంటాడో, అకారణంగా భార్య భర్తకు అవిధేయురాలై, భర్త ఆగ్రహానికి, రాత్రంతా కోపంగా భార్యపై గడపడానికి కారణంగా మారిందో, ఆ భార్య యొక్క నమాజు కూడా స్వీకరించబడదు. మరియు ఏ ప్రజలు తమ ఇమామును అసహ్యించుకుంటున్నారో, ఒకవేళ వారి అసహనం, వారు అసహ్యించుకొనడం హక్కుగా ఉంటే, అలాంటి ఇమామ్ యొక్క నమాజు కూడా స్వీకరించబడదు. అకారణంగా ఉంటే ప్రజలు పాపంలో పడిపోతారు.
ఈ విధంగా మహాశయులారా, ఈ హదీస్ తిర్మిజీలో ఉంది. హదీస్ నెంబర్ 360. మరియు షేక్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుల్ జామేలో పేర్కొన్నారు. హదీస్ నెంబర్ 3057.
కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ఇలాంటి భార్యలు, ఇలాంటి ఇమాములు, ఎప్పుడైతే మా నమాజు స్వీకరించబడటం లేదో, మేము ఎందుకు నమాజు చేయాలి అని నమాజును విడనాడకూడదు. నమాజు స్వీకరించకపోవడానికి కారణం ఏ పాపమైతే ఉందో, అలాంటి పాపాన్ని వదులుకొని నమాజు స్వీకరించబడే విధంగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి.
దానధర్మాలు చేసి బాధపెట్టడం
17వ కార్యం, దీనివల్లనైతే త్రాసు తేలికగా అయిపోతుందో అది, దానధర్మాలు చేసి ఒకరి పట్ల ఏదైనా మేలు చేసి అతనికి బాధ కలిగించడం. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. మనందరికీ సంకల్ప శుద్ధి ప్రసాదించుగాక. ఈ రోజుల్లో ఈ చెడు గుణం చాలా మందిలో చూడడం జరుగుతుంది. ఒకరి పట్ల ఏదైనా మేలు చేస్తారు, ఒకరికి ఏదైనా దానధర్మాలు చేస్తారు, ఒకరికి అతను ఏదైనా విషయంలో సహాయపడతారు, ఒకరి కష్టంలో వారిని ఆదుకుంటారు, తర్వాత ఎద్దేవా చేయడం, తర్వాత మనసు నొప్పించే మాటలు మాట్లాడడం, తర్వాత నేను చేయడం వల్ల, నేను నీకు సహకరించడం వల్ల, నేను నిన్ను నీ కష్టంలో ఆదుకోవడం వల్ల ఈరోజు నువ్వు ఇంత పైకి వచ్చావు అని వారికి బాధ కలిగిస్తారు. ఇలా బాధ కలిగించే వారి ఆ దానధర్మాలు, ఆ మేలు చేసిన కార్యాలు పుణ్యం లేకుండా అయిపోతాయి. వాటి యొక్క ఫలితం అనేది వారికి దక్కదు.
ఖురాన్లో అల్లాహ్ త’ఆలా ఈ విధంగా తెలియపరిచాడు.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُمْ بِالْمَنِّ وَالْأَذَىٰ (యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుబ్తిలూ సదఖాతికుమ్ బిల్ మన్ని వల్ అజా)
“ఓ విశ్వాసులారా! మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి.”(2:264)
దీనివల్ల మీ యొక్క పుణ్యం అనేది నశించిపోతుంది. మీరు చేసిన ఆ దానం, దానికి ఏ సత్ఫలితం లభించాలో అది మీకు లభించదు. ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో కూడా తెలిపారు. ఆ హదీసు ఇన్ షా అల్లాహ్ దీని తర్వాత ప్రస్తావిస్తాను.
చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించడం, ఏదైనా మేలు చేసి చెప్పుకొని బాధ కలిగించడం, సామాను విక్రయిస్తూ అసత్య ప్రమాణాలు చేయడం
18వ కార్యం, దీనివల్లనైతే మన త్రాసు ప్రళయ దినాన తేలికంగా అయిపోతుందో, చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించడం మరియు ఎవరికైనా ఏదైనా మేలు చేసి చెప్పుకొని బాధ కలిగించడం మరియు ఏదైనా సామాను విక్రయిస్తూ అసత్య ప్రమాణాలు చేయడం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలిపారు, “సలాసతున్” మూడు రకాల మనుషులు ఉన్నారు, అల్లాహ్ త’ఆలా వారితో మాట్లాడడు, ప్రళయ దినాన అల్లాహ్ వారి వైపున చూడడు, వారిని పరిశుద్ధ పరచడు మరియు వారికి కఠినమైన శిక్ష విధిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడుసార్లు ప్రస్తావించారు. అబూజర్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు,
خَابُوا وَخَسِرُوا، مَنْ هُمْ يَا رَسُولَ اللَّهِ؟ (ఖాబూ వ ఖసిరూ, మన్ హుమ్ యా రసూలల్లాహ్?) “ప్రవక్తా, వారైతే నాశనమైపోయారు, వారైతే చాలా నష్టపోయారు. ఎవరు అలాంటి వారు?”
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,
“చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించేవాడు, ఎవరికైనా ఏదైనా మేలు చేసి చెప్పుకునేవాడు, మరియు సామాను విక్రయిస్తున్నప్పుడు అసత్య ప్రమాణాలు చేసేవాడు” అని. ఈ హదీస్ ముస్లిం షరీఫ్లో ఉంది, హదీస్ నెంబర్ 106.
ఈ రోజుల్లో మనలోని ఎంతమందికి ఈ విషయం గుర్తుంది? దీనివల్ల ప్రళయ దినాన మన త్రాసు తేలికగా అవుతుంది అన్నటువంటి భయం ఉందా? మనలో ఎంతోమంది ఎలాంటి కారణం లేకుండా చీలమండలానికి కిందిగా దుస్తులు ధరిస్తూ ఉన్నారు. దీనివల్ల నాలుగు రకాల శిక్షలకు గురి అవుతాము అన్నటువంటి భయం కూడా మనలో లేకపోయింది. ఒకటి, అల్లాహ్ మన వైపున చూడడు. రెండవది, అల్లాహ్ మనతో మాట్లాడడు. మూడవది, అల్లాహ్ మనల్ని పరిశుద్ధ పరచడు. నాలుగవది, అల్లాహ్ త’ఆలా కఠిన శిక్ష ఇస్తాడు. ఈ విధంగా మహాశయులారా, ఈ నాలుగు శిక్షలు ఎవరి గురించి? ఎవరైతే దుస్తులు కిందికి ధరిస్తున్నారో, ఒకరికి ఉపకారము చేసి వారి మనసు నొప్పిస్తున్నారో, మరియు సామాను విక్రయిస్తున్న సందర్భంలో అసత్య ప్రమాణాలు చేస్తున్నారో.
ఈ విధంగా మహాశయులారా, అల్లాహ్ యొక్క దయవల్ల మనం మరణానంతర జీవితంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం, త్రాసు నెలకొల్పడం, త్రాసును నెలకొల్పడం, న్యాయంగా తూకం చేయడం మరియు ఆ త్రాసులో ఏ విషయాల వల్ల, ఏ సత్కార్యాల వల్ల త్రాసు బరువుగా ఉంటుంది, ఏ దుష్కార్యాల వల్ల త్రాసు తేలికగా అవుతుందో అన్ని వివరాలు తెలుసుకున్నాము. ఇక మిగిలినది ఏమిటి? మనము సత్కార్యాలు చేయడంలో ముందుకు వెళ్ళాలి. మన త్రాసు బరువుగా ఉండే విధంగా ఆలోచించాలి. దుష్కార్యాలకు దూరంగా ఉండాలి. తేలికగా ఉండకుండా, త్రాసు తేలికగా ఉండకుండా మనం ప్రయత్నించాలి. అప్పుడే మనం సాఫల్యం పొందగలుగుతాము. ఈ విషయాలు మీరు తెలుసుకున్నారు, మీకు చెప్పడం, తెలపడం జరిగింది. ఇక మీ బాధ్యత, మీరు దీనిపై ఆచరించి ఇతరులకు తెలియజేస్తూ ఉండాలి. దీనివల్ల మనకు కూడా ఇంకా లాభాలు కలుగుతాయి. ఎంతమందికి మనం ఈ సత్కార్యాల గురించి తెలుపుతామో, అంతే ఎక్కువగా మన యొక్క త్రాసు కూడా బరువుగా అవుతూ ఉంటుంది.
అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ప్రతిరోజు మనం పడుకునే ముందు, బిస్మిల్లాహి, ఓ అల్లాహ్ నీ యొక్క పేరుతో నేను నిద్రపోతున్నాను. ప్రళయ దినాన నా యొక్క త్రాసును నీవు బరువుగా చేయి అని దుఆ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి ఒక దుఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా కూడా రుజువై ఉన్నది.
అల్లాహ్ మనందరి త్రాసును ప్రళయ దినాన బరువుగా చేయుగాక. అల్లాహ్ త’ఆలా మనందరినీ మన త్రాసు బరువుగా అయ్యే సత్కార్యాలు చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. మరియు ఏ దుష్కార్యాల వల్ల మన త్రాసు తేలికగా అవుతుందో, అలాంటి దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం ప్రసాదించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు(1) [మరణానంతర జీవితం – పార్ట్ 42] https://www.youtube.com/watch?v=lATws_WFGpM [22 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, ప్రళయదినాన కర్మల త్రాసు (మీజాన్) గురించి మరియు దానిని తేలికగా చేసే కార్యాల గురించి వివరించబడింది. పుణ్యాల బరువును పెంచుకోవాలనే ఆకాంక్షతో పాటు, పాపాల వల్ల త్రాసు తేలిక అవుతుందనే భయం కూడా విశ్వాసికి ఉండాలి. పాపాలు రెండు రకాలు: పెద్ద పాపాలు (గునాహె కబీరా) మరియు చిన్న పాపాలు (గునాహె సగీరా). పెద్ద పాపాలు క్షమించబడాలంటే స్వచ్ఛమైన పశ్చాత్తాపం అవసరం, అయితే చిన్న పాపాలు సత్కార్యాల ద్వారా క్షమించబడతాయి. ప్రసంగం ముగింపులో, కొన్ని ఘోరమైన పాపాల ఉదాహరణలు ఇవ్వబడ్డాయి మరియు అన్ని రకాల పాపాల నుండి దూరంగా ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పబడింది.
అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, వ’అలా ఆలిహీ వ’సహ్బిహీ వ’మన్ వాలా, అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ఈనాటి నుండి మనం త్రాసును తేలికగా చేసే కార్యాల గురించి తెలుసుకుందాము. త్రాసు పుణ్యాలతో బరువుగా ఉండాలి అన్నటువంటి కాంక్ష, కోరిక, తపన, ఆలోచన కలిగి ఉన్న విశ్వాసి, త్రాసును తేలికగా చేసే కార్యాల గురించి తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే పుణ్యాలతో త్రాసు బరువుగా అవుతూ ఉంటే, పాపాలు పెరుగుతూ ఉండడం వల్ల మన పుణ్యాల త్రాసు తేలికగా అవుతూ ఉంటుంది. అందుకు ఇహలోకంలో మన ఆత్మ శరీరాన్ని వీడక ముందే పాపాల నుండి స్వచ్ఛమైన తౌబా చేసుకోవాలి. మాటిమాటికీ అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉండాలి.
ఈ శీర్షిక వింటూ మీరు ఎలాంటి బాధ, చింత, ఆవేదనకు గురి కాకండి. ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం. మీలో ప్రతి ఒక్కరూ ఏదైనా చిన్నపాటి వ్యాపారంలో ఉన్నారు లేదా చేసి ఉన్నారు లేదా కనీసం దాని యొక్క అవగాహన ఉంది కదా? కొంత డబ్బు పెట్టి ఒక చిన్న కొట్టు తెరుచుకున్న తర్వాత అందులో ఒకటి మూలధనం, ఆ మూలధనంతో కొంత సరుకు తీసుకొచ్చాము. ఒక్కొక్కటి అమ్మడం ప్రారంభం చేశాము. ప్రతి సరుకుపై ఏదో కొంత లాభం, ప్రాఫిట్ దాన్ని నిర్ణయించాము. అయితే సామాన్, సరుకు అంతా అమ్ముడు పోతూ ఉన్నది, పోతూ ఉన్నది, మంచి లాభాలు వస్తున్నాయి అని సంతోషపడిపోతామా? లేక మరేదైనా విషయంలో మనం జాగ్రత్త కూడా పడుతూ ఉంటామా? జాగ్రత్త పడుతూ ఉంటాము కదా? ఏదైనా సామాన్ చెడిపోయి, అమ్ముడు కాకుండా అలా నష్టపోతామా అని, దుకాన్లో సామాన్ ఏదైనా ఎలుకలు కొరికి, ఇంకా వేరే రకంగా నష్టమై మనకు ఏదైనా లాస్ జరుగుతుందా? లేదా ప్రాఫిట్ మంచిగానే ఉంది, దందా చాలా మంచిగా నడుస్తూ ఉన్నది, కానీ మన యొక్క ఖర్చులు ఎలా ఉన్నాయి? ఆ ఖర్చుల విషయంలో కూడా మనం తప్పకుండా శ్రద్ధ తీసుకుంటాము. తీసుకుంటామా లేదా?
అలాగే విశ్వాసం ఒక మూలధనం అయితే, సత్కార్యాలన్నీ కూడా మనకు ప్రాఫిట్ ని, లాభాన్ని, మంచి ఆదాయాన్ని తీసుకొస్తూ ఉంటే, ఈ పాపాలు అనేటివి లాస్ కు గురి చేసేవి. అయితే వాటి నుండి జాగ్రత్త పడి ఉండడం, ఎల్లప్పుడూ శ్రద్ధగా ఉండి పాపాలు చేయకుండా ఉండడం, ఏదైనా పాపం జరిగిన వెంటనే దాని పరిహారం ఏంటో తెలుసుకొని దాన్ని చెల్లించి, పశ్చాత్తాప రూపంలో గాని, వేరే సత్కార్యాలు చేసే రూపంలో కానీ, ఏ రూపంలో ఉన్నా గానీ మరింత పెద్ద లాస్ కు గురి కాకుండా వెంటనే సర్దుకోవడం చాలా అవసరం.
ఒక సందర్భంలో ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా ఇలా తెలిపారు. “నీవు పరలోకాన అల్లాహ్ తో కలుసుకున్నప్పుడు ఎంత తక్కువ పాపాలతో కలుసుకుంటావో అంతే నీ కొరకు మేలు. ఇహలోకంలో ఎవరైనా పుణ్యాత్ములను చూసి వారికంటే మరీ ముందుగా మనం ఉండాలి అన్నటువంటి కోరిక గల వ్యక్తి పాపాల నుండి తప్పకుండా దూరం ఉండాలి.”
ప్రళయదినాన త్రాసు
ప్రళయదినాన త్రాసు నెలకోల్పడం జరుగుతుంది. దానికి రెండు పళ్ళాలు ఉంటాయి. ఒక పళ్లెంలో పుణ్యాలు, మరొక పళ్లెంలో పాపాలు. ఒక పళ్లెంలో సత్కార్యాలు, మరో పళ్లెంలో దుష్కార్యాలు తూకం చేయడం జరుగుతుంది. ఆ సమయంలో పాపాలు ఎక్కువగా ఉండేది ఉంటే, ఆ పళ్లెం బరువుగా కిందికి జారిపోతుంది మరియు ఈ పుణ్యాల త్రాసు తేలికగా అయి మీదికి పోతుంది. అప్పుడు ఏం జరుగుద్ది?
101:6 فَأَمَّا مَن ثَقُلَتْ مَوَازِينُهُ ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో.
101:7 فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ అతను మనసు మెచ్చిన భోగ భాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు.
ఎవరి పుణ్యాల త్రాసు బరువుగా ఉంటుందో అతను తనకు ఇష్టమైన మనోహరమైన జీవితం గడుపుతాడు. మరెవరి పుణ్యాల త్రాసు తేలికగా ఉంటుందో అతని స్థానం హావియా అవుతుంది. ఏంటి హావియా? నారున్ హామియా. అది చాలా రగులుతున్నటువంటి అగ్ని. అందులో పడవలసి వస్తుంది.
అయితే పాపాలు అనేటివి రెండు రకాలుగా ఉన్నాయి. పెద్ద పాపాలు, చిన్న పాపాలు. గునాహె కబీరా, గునాహె సగీరా. ఘోరమైన పాపాలు, పెద్ద పాపాలు చాలా ఘోరమైనవి. మరికొన్ని చిన్న పాపాలు అని అనబడతాయి. ఘోర పాపాల జాబితా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేశారు. వాటిలో కొన్ని ఘోర పాపాలు ఎంత ఘోరంగా ఉంటాయి అంటే సర్వ సత్కార్యాల్ని భస్మం చేసేస్తాయి, చివరికి ఏ ఒక్క పుణ్యం కూడా మిగలదు. ఇక పుణ్యమే లేనప్పుడు, పుణ్యాల త్రాసులో ఏమి మిగులుతుంది? అందుకు మనిషి స్వర్గంలో పోవడానికి అవకాశం కూడా నశించిపోతుంది.
అయితే గమనించండి, మరిన్ని వివరాలు ఇక ముందుకు రానున్నాయి. కానీ చిన్న పాపాలు అంటే, అయ్యో చిన్నవియే కదా అని విలువ లేకుండా మీరు చూడకండి. ఎలాంటి భయం లేకుండా మెదలకండి. చిన్న పాపాల విషయంలో ఒక భయంకరమైన విషయం ఏమిటంటే, ఒక సామెత ద్వారా చెప్పాలా? ఒక్కొక్క పుల్ల కలిసి మోపెడు అవుతాయి. ఒక్కొక్క చుక్కనే కదా వర్షపు పడేది? వర్షం ఎలా కురుస్తుంది? కానీ ఆ ఒక్కొక్క చుక్కనే సముద్రం, సైలాబ్, పెద్ద తుఫాన్ తీసుకొస్తుంది. పర్వతం దేన్ని అంటారు? ఒక్క రాయినా? కొన్ని రాళ్ల సముదాయాన్ని. మహాశయులారా, చిన్న పాపాల్ని మాటిమాటికీ చేస్తూ ఉంటే అవి కూడా ఘోర పాపాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది.
అయితే ఇక ముందు కార్యక్రమాల్లో మనం ఘోర పాపాలు, వాటి నష్టాలతో పాటు, ఆ ఘోర పాపాలు ఏమేమి ఉన్నాయి? ఏ పాపాలు పుణ్యాలను నశింపజేసి, త్రాసు బరువును తగ్గిస్తాయి, అవి ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.
మహాశయులారా, పాపాలు రెండు రకాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాము. అయితే ముందు చిన్న పాపాల గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాము. చిన్న పాపాలు, వీటి గురించి అల్లాహు త’ఆలా మనకు ఒక వాగ్దానం చేశాడు, శుభవార్త ఇచ్చాడు. అదేమిటంటే చిన్న పాపాల్ని మన్నించేస్తాడు, క్షమించేస్తాడు అని మనకు తెలిపాడు. మరి ఈ క్షమించడం, ఈ మన్నించడం అనేది స్వయంగా అల్లాహ్ తరఫున, అంటే ఏ పుణ్యానికి బదులుగా కాకుండా స్వయంగా అల్లాహ్ యే క్షమించడం, అట్లనే. మరొక రకం, మనం కొన్ని విధులు నిర్వహిస్తాము, కొన్ని పుణ్యాలు చేస్తాము, ఉదాహరణకు ఉదూ చేయడం, నమాజ్ చేయడం, ఉపవాసం ఉండడం, హజ్ చేయడం, ఇంకా. అలాంటి సత్కార్యాల ద్వారా కూడా చిన్న పాపాలు మన్నించబడతాయి అని కూడా మనకు అల్లాహు త’ఆలా శుభవార్త ఇచ్చాడు.
కానీ ఈ శుభవార్త మనం అందుకోవడానికి రెండు షరతులు, రెండు నిబంధనలు కూడా ఉన్నాయి. ఏమిటి అవి? మొదటి నిబంధన, చిన్న పాపాలు మన్నించబడాలంటే, మొదటి నిబంధన, ఘోర పాపాల నుండి మనం దూరం ఉండాలి. ఘోర పాపాలు చేస్తూ ఉన్నాము, చిన్న పాపాలు కూడా మన్నించబడవు. రెండవ నిబంధన, ఈ చిన్న పాపాల్ని కూడా చిన్నవియే కదా అన్నటువంటి భావన ఉండకూడదు. దీనికి ఒక చిన్న సామెత ఇవ్వాలా? ఒక మనిషి మీ ముందు ఒక చిన్న తప్పు చేశాడు అనుకుందాం. చేసి, మీరు చూసిన వెంటనే, “సారీ, క్షమించండి” అతను “సారీ” అని నోటితో చెప్పక ముందు అతని యొక్క, “అరె, సారీ చెప్తున్నట్లు ఉంది”. “లేదండి, పర్వాలేదు, పర్వాలేదు, అట్లేం లేదు” అని స్వయంగా మనమే అతన్ని క్షమించేసే ప్రయత్నం చేస్తాము.
చేసింది అతను చిన్న తప్పే కావచ్చు, కానీ మీరు అతని వెంట చూస్తేనే, “ఏంటి?” తిరిగేసి, గుడ్లు తెరిచి, అయితే ఏంది? ఈ విధంగా ఎదురుమాట, అంటే చేసింది చిన్నదైనప్పటికీ, “అయ్యో, తప్పు జరిగింది కదా” అన్న భావన లేకుండా విర్రవీగడం, గర్వం చూపడం ఇది మన మానవులకే నచ్చదు. విషయం అర్థమైంది అనుకుంటాను.
ఈ విధంగా మహాశయులారా, మన చిన్న పాపాలు మన్నించబడాలంటే, ఘోర పాపాల నుండి మనం దూరం ఉండాలి మరియు చిన్న పాపాల్ని “అరె, చిన్నవియే కదా” అన్నటువంటి భావనలో ఉండకూడదు. చదవండి ఖుర్ఆన్ యొక్క ఈ ఆయత్:
“ఎవరైతే పెద్ద పాపాలకు దూరంగా ఉంటారో, చిన్న చిన్న తప్పులు మినహా నీతిబాహ్యతను కూడా విడనాడతారో (వారి పాలిట) నిశ్చయంగా నీ ప్రభువు ఎంతో ఉదారంగా క్షమించేవాడు.” (53:32)
ఎవరైతే చిన్న చిన్న తప్పులు, పాపాలు తప్ప ఘోరమైన పాపాల నుండి మరియు అశ్లీలమైన కార్యాల నుండి దూరంగా ఉంటారో, అలాంటి వారి పట్ల నీ ప్రభువు ఎంతో ఉదారంగా క్షమించేవాడు, కరుణించేవాడు. ఏమర్థమైంది? పెద్ద పాపాల నుండి, మహా అశ్లీల కార్యాల నుండి దూరం ఉంటేనే చిన్న పాపాలను మన్నిస్తాడు అన్నటువంటి శుభవార్త ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇది సూర నజ్మ్ లోని ఆయత్, ఆయత్ నంబర్ 32.
అయితే సూర నిసా, ఆయత్ నంబర్ 31 లో ఇలా తెలియబరిచాడు:
“మీకు వారించబడే మహాపరాధాలకు గనక మీరు దూరంగా ఉన్నట్లయితే, మీ చిన్న చిన్న పాపాలను మేము మీ (లెక్క) నుండి తీసేస్తాము. ఇంకా మిమ్మల్ని గౌరవప్రద స్థానాల్లో (స్వర్గాలలో) ప్రవేశింపజేస్తాము”. (4:31)
ఈ రెండు ఆయతులకు తోడుగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ హదీసును కూడా వినండి. మ’జమ్ కబీర్, తబరానీలో ఈ హదీస్ ఉంది, షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుల్ జామి’ లో ప్రస్తావించారు, 2687.
إِيَّاكُمْ وَمُحَقَّرَاتِ الذُّنُوبِ [ఇయ్యాకుమ్ వ ముహఖ్ఖరాతిజ్ జునూబ్]
మీరు చిన్న పాపాలను అల్పమైనవిగా భావించడం మానుకోండి. అల్పమైనవియే కదా, చిన్నవియే కదా అనుకోవడం ఎంత భయంకరమో దాని యొక్క దృష్టాంతం ఇలా ఉంది. కొందరు ఒక ప్రాంతంలో దిగారు, వారు అక్కడ వంట చేసుకోవడానికి ఏ అగ్ని లేదు. కొంతమందిని పంపారు, ఒక వ్యక్తి ఒక పుల్ల, మరొక వ్యక్తి ఒక చిన్న కట్టె, ఈ విధంగా కొందరు కొన్ని పుల్లలు, కొన్ని చిన్న చిన్న కట్టెలు, కొన్ని ముక్కలు తీసుకొని వచ్చారు. అవన్నీ జమా చేసిన తర్వాత ఏమైంది? మంచి మంట, మంచి వంటకాలు చేసుకున్నారు. ఈ విధంగా చిన్న పాపాలను కూడా అల్లాహు త’ఆలా పట్టడం, వాటి గురించి మందలించడం మొదలుపెట్టాడంటే, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి కలిసి అవన్నీ మనిషిని వినాశనానికి కూడా గురి చేస్తాయి. అందుగురించి చిన్నవియే కదా అన్నటువంటి అల్పమైన భావంలో పడకూడదు. మనిషి చిన్న పాపాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం.
హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు అన్హు తెలిపారు, ఒక వ్యక్తి కొన్ని పాపాలు చేసి మరిచిపోతాడు, సత్కార్యాల్లో ఉంటాడు, ఆ పాపాల పట్ల క్షమాపణ కోరుకోవడం, మన్నింపు వైఖరి అవలంబించడం ఏదీ పాటించడు. అదే స్థితిలో అల్లాహ్ ను కలుసుకుంటాడు, చివరికి ఆ పాపాలు అతన్ని వినాశనానికి గురి చేస్తాయి. మరొక వ్యక్తి, అతని నుండి పాపం జరుగుతుంది, కానీ అతడు భయపడుతూ ఉంటాడు, అల్లాహ్ తో క్షమాపణ కోరుతూ ఉంటాడు, చివరికి అల్లాహ్ ను కలుసుకున్నప్పుడు అల్లాహు త’ఆలా అతన్ని మన్నించి, అతనికి మోక్షం కలిగిస్తాడు. హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు త’అన్హు గారి యొక్క ఈ కొటేషన్ ని హాఫిజ్ ఇబ్నె హజర్ అస్కలానీ రహమతుల్లాహ్ అలైహ్ ఫత్హుల్ బారీలో ప్రస్తావించారు, సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 6492 యొక్క వ్యాఖ్యానంలో.
ఇప్పుడు మహాశయులారా, ఘోర పాపాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఘోర పాపాన్ని దేన్ని అంటారు? ఈ విషయం అర్థమైంది అంటే మిగితవి చిన్న పాపాల్లో లెక్కించబడతాయి అన్న విషయం కూడా బోధపడుతుంది. ఖుర్ఆన్ మరియు హదీస్ లో ఏ పాపాన్ని ఘోర పాపం అని తెలపడం జరిగిందో, పెద్ద పాపం అని తెలపడం జరిగిందో, అవి ఘోర పాపాలు. మరియు ఏ పాపం గురించి అయితే ఇహలోకంలో హద్దు నిర్ణయించడం జరిగినదో, ఉదాహరణకు, దొంగ యొక్క చేతులు కట్ చేయడం, వ్యభిచారం చేసిన వారిని వంద కొరడా దెబ్బలు, ఒకవేళ వివాహితుడైతే రాళ్లతో కొట్టి చంపడం, ఇలాంటి హద్దులు ఏవైతే నిర్ణయించబడినవో ఆ పాపాలు, మరియు ఏ పాపాల గురించి అయితే నరకం యొక్క శిక్ష అని హెచ్చరించబడిందో, మరియు ఏ పాపాలు చేసే వారి గురించి అయితే శాపనార్థాలు పెట్టడం జరిగినదో, ఇవన్నీ కూడా ఘోర పాపాల్లో లెక్కించబడతాయి. అలాగే ఏ పాపాలు చేసే వారిని ఫాసిఖ్, అపరాధి, అని అనడం జరిగిందో ఆ పాపాలు కూడా ఘోర పాపాల్లో లెక్కించడం జరిగింది. అయితే ఇక మన బాధ్యత ఏమిటి? అలాంటి హదీసులను, అలాంటి ఆయతులను మనం చదివినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి, వాటికి దూరం ఉండే ప్రయత్నం చేయాలి.
ఉదాహరణకు ఒక హదీస్ వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,
إِنَّ أَعْظَمَ الذُّنُوبِ عِنْدَ اللَّهِ [ఇన్న అ’జమజ్ జునూబి ఇందల్లాహ్] అల్లాహ్ వద్ద పాపాల్లో అతి ఘోరమైనవి,
رَجُلٌ تَزَوَّجَ امْرَأَةً [రజులున్ తజవ్వజమ్ ర అతన్] ఒక వ్యక్తి ఒక స్త్రీతో పెండ్లాడాడు,
فَلَمَّا قَضَى حَاجَتَهُ مِنْهَا طَلَّقَهَا [ఫలమ్మా ఖదా హాజతహూ మిన్హా తల్లఖహా] అతను ఆమెతో రాత్రి గడిపి ఆమెకు విడాకులు ఇచ్చేశాడు,
وَذَهَبَ بِمَهْرِهَا [వ జహబ బి మహ్రిహా] ఆమె యొక్క మహర్ ను కూడా తినేశాడు, మహర్ కూడా తీసుకున్నాడు రిటర్న్, లేదా ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వలేదు. ఇది కూడా ఘోర పాపాల్లో లెక్కించబడింది.
وَرَجُلٌ اسْتَعْمَلَ رَجُلًا فَذَهَبَ بِأُجْرَتِهِ [వ రజులున్ ఇస్త’మల రజులన్ ఫ జహబ బి ఉజ్రతిహి] ఒక మనిషి మరో మనిషికి, మనిషిని ఒక మజ్దూరీగా తీసుకున్నాడు, మరి అతనికి ఇచ్చే మజూరీ ఏదైతే ఉందో, బత్తెం ఏదైతే ఉందో అది ఇవ్వకుండా తానే ఉంచుకున్నాడు, తినేశాడు.
మూడో వ్యక్తి,
وَآخَرُ يَقْتُلُ دَابَّةً عَبَثًا [వ ఆఖరు యఖ్తులు దాబ్బతన్ అబసన్] ఎవరైతే ఏదైనా పశువును, ఏదైనా పక్షిని వృధాగా చంపేస్తున్నాడు. షికారీ చేయడం పేరుతో, లేదా కొందరికి అలవాటు ఉంటుంది, కుక్కలను, పిల్లులను పరిగెత్తించి, వెనక రాళ్లతో కొట్టి ఇంకా వేరే విధంగా.
అయితే మహాశయులారా, ఇవన్నీ కూడా ఘోర పాపాల్లో లెక్కించబడతాయి. ఇది ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మహాశయులారా, పాపాల విషయాల్లో ఖుర్ఆన్ లో గాని, హదీస్ లో గాని మరొక విషయం కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వాటిని అంటారు,
వాటి నుండి కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఇన్షా అల్లాహ్, తర్వాయి భాగాల్లో అలాంటి కార్యాల గురించి, దేని ద్వారానైతే మన త్రాసు తేలికగా అవుతుందో, దేని ద్వారానైతే త్రాసు యొక్క బరువు తగ్గిపోతుందో, ఆ పాపాలను తెలుసుకొని, వాటి నుండి దూరం ఉండే మనం ప్రయత్నం చేద్దాము.
అల్లాహు త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. అన్ని రకాల పాపాల నుండి, ఘోర పాపాల నుండి, చిన్న పాపాల నుండి మరియు مُحْبِطَاتُ الْأَعْمَالِ [ముహ్బితాతుల్ అ’మాల్] సత్కార్యాలను నశింపజేసే పాపాల నుండి కూడా అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హాఫిజ్ అబ్దుల్ హసీబ్ ఉమ్రీ మదనీ రాసిన మరియు నసీరుద్దీన్ జామిఈ అనువదించిన ఒక వ్యాసంలో, మంచి చెడులతో సహా అన్ని వస్తువులకు సృష్టికర్త అల్లాహ్ యే అని వివరించబడింది, ఈ భావనకు ఖురాన్ మద్దతు ఇస్తుంది. సృష్టి వెనుక ఉన్న అల్లాహ్ జ్ఞానాన్ని (హిక్మత్) గ్రహించడంలో విఫలం కావడం వల్లే ఈ నమ్మకం తరచుగా అపార్థానికి దారితీస్తుందని రచయిత పేర్కొన్నారు. చెడు అనేది దానికదే లేదా “సంపూర్ణ చెడు”గా సృష్టించబడలేదని, బదులుగా అది మానవాళికి పెట్టే అల్లాహ్ పరీక్షలో ఒక ఉన్నత ప్రయోజనం కోసం పనిచేస్తుందని ఈ రచన స్పష్టం చేస్తుంది. ఈ ప్రపంచం ఒక పరీక్షా స్థలం, ఇక్కడ పరీక్షకు అర్థం ఉండాలంటే స్వేచ్ఛా సంకల్పం చాలా అవసరం. ఈ స్వేచ్ఛ అల్లాహ్ యొక్క పరిపూర్ణ న్యాయం ద్వారా సమతుల్యం చేయబడింది, ప్రతి వ్యక్తి తన చర్యలకు ఈ లోకంలో గానీ లేదా పరలోకంలో గానీ జవాబుదారీగా ఉంటాడని ఇది నిర్ధారిస్తుంది. మానవ జ్ఞానం యొక్క పరిమితులను అంగీకరిస్తూ, అల్లాహ్ పరిపూర్ణ న్యాయం మరియు జ్ఞానంపై విశ్వాసం, అలాగే పరలోకంపై నమ్మకం, చెడు యొక్క ఉనికిని కూడా కలిగి ఉన్న అల్లహ్ విధి (తక్దీర్) అల్లాహ్ యొక్క సంపూర్ణ శక్తికి మరియు గొప్పతనానికి నిదర్శనమని అర్థం చేసుకోవడానికి అవసరమని రచయిత ముగించారు.
మేలు (మంచి) లాగే కీడు (చెడు) కు కూడా సృష్టికర్త అల్లాహ్ యే.
{اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ} (అల్లాహ్ ప్రతి వస్తువుకూ సృష్టికర్త). [అల్-జుమర్ 39:62]
అది ఇబ్లీస్ (షైతాన్) అయినా, వాడి దుశ్చర్యలైనా లేదా దాసుల చెడ్డ పనులైనా సరే, ఈ విశ్వంలో ప్రతిదీ అల్లాహ్ అనుమతితోనే జరుగుతుంది. అసలు సృణులను (జీవరాశులను) మరియు వారి కర్మలను సృష్టించింది కూడా అల్లాహ్ యే. (సూర సాఫ్ఫాత్ 37:96).
وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ “మరి (చూడబోతే) మిమ్మల్నీ, మీరు చేసిన వాటినీ సృష్టించిన వాడు అల్లాహ్‌యే కదా!” (సూర సాఫ్ఫాత్ 37:96).
ఈ సమస్య తరచుగా నాస్తికులలో, ఆ మాటకొస్తే చాలా మంది ముస్లింలలో కూడా అల్లాహ్ పట్ల అపార్థానికి (దురభిప్రాయానికి) కారణమవుతోంది. దీనికి ప్రధాన కారణం ఈ సృష్టి వెనుక దాగి ఉన్న అల్లాహ్ జ్ఞానాన్ని (హిక్మత్) గ్రహించలేకపోవడం లేదా మనుషుల అల్పజ్ఞానం మరియు అజ్ఞానం.
ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకుంటే విషయం స్పష్టమవుతుంది:
అల్లాహు తఆలా కీడును (చెడును) సృష్టించాడు మరియు సృష్టిస్తూనే ఉంటాడు, అయితే వీటిలో ఏ కీడు కూడా “పూర్తిగా కీడు” (షర్రె మహజ్ / Pure Evil) కాదు.
కీడు అనేది స్వతహాగా ఉద్దేశించబడినది కాదు, బదులుగా కీడు యొక్క సృష్టి “మరొక ప్రయోజనం కోసం” (మక్సూద్ లి-గైరిహి) చేయబడింది.
దీనినే ఇలా కూడా అంటారు: “కీడు అనేది అల్లాహ్ యొక్క చర్యలలో (అఫ్ ఆల్) లేదు, అది ఆయన సృష్టించిన ఫలితాలలో (వస్తువులలో) ఉంది.”
అందుకే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
«وَالْخَيْرُ كُلُّهُ فِي يَدَيْكَ، وَالشَّرُّ لَيْسَ إِلَيْكَ» (మేలు అంతా నీ చేతుల్లోనే ఉంది, మరియు కీడు నీ వైపు ఆపాదించబడదు). [సహీహ్ ముస్లిం: 771]
ఈ విశ్వం ఒక పరీక్షా కేంద్రం (దారుల్ ఇమ్ తిహాన్). ఇక్కడ ఇబ్లీస్ నుండి ఆదమ్ సంతానం వరకు అందరికీ స్వేచ్ఛ ఇవ్వబడింది ఎందుకంటే ఇక్కడ పరీక్ష జరగాలి కాబట్టి. ఈ స్వేచ్ఛ (మినహాయింపు) లేకపోతే ఇక పరీక్ష ఏముంది?
అయితే అల్లాహు తఆలా యొక్క పరిపూర్ణ న్యాయం ఏమిటంటే ఆయన ప్రతి అణువుకు లెక్క తీసుకుంటాడు. అందుకే పై ఆయతులోని తర్వాత భాగం చదవండి:
{إِنَّا أَعْتَدْنَا لِلظَّالِمِينَ نَارًا أَحَاطَ بِهِمْ سُرَادِقُهَا} (నిశ్చయంగా మేము (తిరస్కరించిన) దుర్మార్గుల కోసం నరకాగ్నిని సిద్ధం చేసి ఉంచాము, దాని మంటలు వారిని చుట్టుముడతాయి). [అల్-కహఫ్: 29]
మరియు ఇంకా ఇలా కూడా అన్నాడు:
{وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ} (మరియు ఎవరైతే ఒక అణువంత కీడు చేస్తారో, వారు దానిని [దాని ఫలితాన్ని] చూసుకుంటారు). [అల్-జల్ జలా: 8]
ప్రతి చెడ్డ మనిషి తన చెడును మరియు ప్రతి దుర్మార్గుడు తన పర్యవసానాన్ని తప్పక చూడాల్సిందే. అది ఈ ప్రపంచంలో కర్మఫలం రూపంలోనైనా లేదా పరలోకంలో నరకం రూపంలోనైనా సరే.
పరలోకంపై నమ్మకం లేకుండా, కీడు సృష్టి వెనుక ఉన్న సర్వలోక ప్రభువు (రబ్బుల్ ఆలమీన్) యొక్క వివేకాన్ని (హిక్మత్) మరియు ఆయన న్యాయాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం.
పైన చెప్పబడిన విషయాలు కూడా మనిషికి ఇవ్వబడిన పరిమిత జ్ఞానం వెలుగులోనే ఉన్నాయి. లేకపోతే అల్లాహు తఆలా యొక్క అన్ని పనుల వెనుక ఉన్న పూర్తి వివేకాన్ని గ్రహించడం మనిషి సామర్థ్యానికి మించిన పని.
{وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ} (మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానంలోని ఏ విషయాన్నీ వారు గ్రహించలేరు). [అల్-బఖరా: 255]
అయితే మనిషికి ఈ రెండు కచ్చితమైన సత్యాలు చెప్పబడ్డాయి:
ఒకటి: {وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا} (మరియు నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు). [అల్-కహఫ్: 49]
రెండు: {وَمَا رَبُّكَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ} (మరియు నీ ప్రభువు దాసులకు అన్యాయం చేసేవాడు కాడు). [ఫుస్సిలాత్: 46]
ఈ కొన్ని వాస్తవాలను మనిషి పద్ధతిగా అర్థం చేసుకుంటే సందేహాలు తొలగిపోతాయి, పైగా అవి విశ్వాసం (ఈమాన్) పెరగడానికి కారణమవుతాయి.
వాస్తవం ఏమిటంటే, సృష్టి లాగే, ఇంకా చెప్పాలంటే అంతకంటే గొప్పగా విధి (తక్దీర్) కూడా (దీనిలో ఒక భాగం లేదా అంశం కీడు యొక్క సృష్టి కూడా) సర్వలోక ప్రభువు యొక్క అద్భుత కళాఖండం. ఇది ఆయన ఉనికికి మించి, ఆయన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఆయన పరిపూర్ణ అధికారాన్ని మరియు ఆయన పరిపూర్ణ న్యాయాన్ని తెలిపే చాలా గొప్ప నిదర్శనం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో లంచగొండితనం అనే ఘోరమైన పాపం గురించి వివరించబడింది. లంచం అంటే అన్యాయంగా ఒక లక్ష్యాన్ని సాధించడానికి లేదా అక్రమమైన కోరికను నెరవేర్చుకోవడానికి అధికారికి ఏదైనా ఇవ్వడం అని ప్రవక్త నిర్వచించారు. ఇస్లాంకు ముందు కూడా ఈ అవినీతి యూదులలో ఉండేదని, వారు ప్రాపంచిక ప్రయోజనాల కోసం తమ గ్రంథాలను మార్చారని ఆయన వివరించారు. లంచాన్ని ఇస్లాం తీవ్రంగా నిషేధించిందని, సూరా అల్-బఖరా మరియు సూరా అల్-మాఇదాలోని వచనాలను ఉటంకిస్తూ, లంచం ఇచ్చేవారిని మరియు తీసుకునేవారిని ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శపించారని ఒక హదీసును ఉదహరించారు. ఒక వ్యక్తి యొక్క నిజమైన సంపద అతను తిన్నది, ధరించినది లేదా పరలోకం కోసం దానధర్మాలు చేసినది మాత్రమేనని, మిగిలినది వారసుల కోసం విడిచిపెట్టబడుతుందని ప్రవక్త స్పష్టం చేశారు. లంచం వంటి అక్రమ సంపాదన తినడం వల్ల ప్రార్థనలు (దుఆ) అంగీకరించబడవని మరియు అది దైవిక శిక్షకు దారి తీస్తుందని హెచ్చరించారు.
نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ (నహ్మదుహు వ నస్త’ఈనుహు వ నస్తగ్ఫిరుహు) మేము ఆయననే స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్నే అర్థిస్తున్నాము మరియు ఆయన క్షమాపణనే వేడుకుంటున్నాము.
وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا (వ న’ఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వమిన్ సయ్యిఆతి అ’అమాయలినా) మా ఆత్మల కీడు నుండి మరియు మా చెడు కార్యాల నుండి మేము అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము.
مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ (మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహు) అల్లాహ్ మార్గనిర్దేశం చేసిన వారిని ఎవరూ తప్పుదారి పట్టించలేరు, మరియు ఆయన తప్పుదారి పట్టించిన వారికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.
وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ (వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు) మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారని, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు లేరు.
وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ (వ అష్హదు అన్న ముహమ్మదన్ ‘అబ్దుహు వ రసూలుహు) మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ (యా అయ్యుహల్లదీన ఆమను త్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహి వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్) “ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడవలసిన విధంగా భయపడండి. మరియు ముస్లింలుగా తప్ప మరణించకండి.” (3:102)
“మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి సృష్టించాడు. దాని నుండే దాని జతను కూడా సృష్టించాడు. మరి వారిద్దరి నుండి ఎంతోమంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేశాడు. మీరు ఎవరి పేరుతో ఒకరినొకరు కోరుకుంటారో ఆ అల్లాహ్‌కు భయపడండి. బంధుత్వ సంబంధాలను తెంచటానికి భయపడండి. నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు.” (4:1)
“ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడండి. మరియు సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. ఆయన మీ కార్యాలను చక్కబరుస్తాడు. మరియు మీ పాపాలను క్షమిస్తాడు. ఇక అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపినవాడు గొప్ప విజయాన్ని సాధించినట్లే.” (33:70-71)
أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صلى الله عليه وسلم وَشَرَّ الأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلالَةٌ وَكُلَّ ضَلالَةٍ فِي النَّارِ
ఇక ఆ తర్వాత, నిశ్చయంగా, మాటలలోకెల్లా ఉత్తమమైనది అల్లాహ్ గ్రంథం (ఖుర్‌ఆన్), మరియు మార్గాలలోకెల్లా ఉత్తమమైనది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం. కార్యాలలోకెల్లా చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. ప్రతి కొత్తగా కల్పించబడినది బిద్అత్ (ధర్మంలో నూతన ఆచారం). ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
లంచగొండితనం
అభిమాన సోదరులారా! లంచగొండితనం అనే అంశంపై ఈరోజు మనం ఇస్లాం ధర్మం ఏమి చెబుతుంది అని కొన్ని విషయాలు తెలుసుకుందాం.
లంచం లేదా లంచగొండితనం అంటే అధర్మమైన ఏదైనా లక్ష్యాన్ని, ఏదైనా పనిని న్యాయ విరుద్ధమైన తన కోరికను నెరవేర్చుకోవడానికి ఎవరైనా అధికారికి లేక తత్సంబంధితమైన వ్యక్తికి ఎంతో కొంత ఇచ్చి ఆ పనిని చేయించుకోవటం లంచం. దీనిని కొందరు లాంఛనం అని, మరికొందరు దక్షిణం అని, ఇంకొందరు బహుమతి అని, గిఫ్ట్ అని అంటారు. ఏ పేరుతో పిలుచుకున్నా ఉద్దేశం మాత్రం దురుద్దేశమే కాబట్టి, పద్ధతి మాత్రం అక్రమ పద్ధతి కాబట్టి ఇది నూటికి నూరు శాతం లంచమే అవుతుంది.
ఖురాన్ అవతరణ పూర్వం, అలాగే మదీనాలోని యూదులలో కూడా ఈ గుణం ఉండేది. లంచగొండితనం అనేది ఉండేది. తౌరాతు గ్రంథంలో జరిగిన ప్రక్షిప్తాల (మార్పుల) వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి ఈ లంచమే. అరేబియాలో యూదుల వ్యాజ్యాలపై వారి మతాధిపతులు, తెగల సర్దారులు తీర్పులు చేసేవారు. వారి స్వార్థ బుద్ధి కారణంగా న్యాయ సమత్వం లేకుండా పోయింది. అయిన వారికి ఆకులో, కాని వారికి కంచంలో అన్నట్లు యూద విద్వాంసులు ఆశ్రిత పక్షపాతం వహించేవారు. ఈ వ్యవహారంలో వారు తౌరాతు గ్రంథంలో ఉన్న ధర్మాదేశాలను కూడా కట్టిపుచ్చేవారు.
ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ సూరా బఖరా ఆయత్ 174లో ఇలా సెలవిచ్చాడు:
“అల్లాహ్ తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాలను దాచేవారు, వాటిని కొద్దిపాటి ధరకు అమ్ముకునేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినాన అల్లాహ్ వారితో అస్సలు మాట్లాడడు. వారిని పరిశుద్ధపరచడు. పైపెచ్చు వారికి బాధాకరమైన శిక్ష కలదు.” (2:174)
అంటే, అల్లాహ్ తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాన్ని ఆ యూదులు, ఆ యూదుల ధర్మ పండితులు దాచిపెట్టేవారు. దానిని కొద్దిపాటి మూల్యానికి అమ్ముకునేవారు. తమ పొట్టలను అగ్నితో నింపుకునేవారు. ప్రళయ దినాన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారితో మాట్లాడటం గానీ, వారిని పరిశుద్ధ పరచటం గానీ చేయడు. వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. అంటే యూదులు లంచం తీసుకుని వారి గ్రంథాలలో ఉన్న విషయాలను దాచి పెట్టేవారని స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయత్లో తెలియజేశాడు. ఇంకా అల్లాహ్ సూరా మాఇదాలో ఇలా అన్నాడు:
“వారిలో చాలామందిని నీవు చూస్తావు, వారు పాపకార్యాల వైపుకు, దౌర్జన్యం వైపుకు, అధర్మమయిన సొమ్మును స్వాహా చేయటం వైపుకు ఎగబడుతూ ఉంటారు. వారు చేసే ఈ చేష్టలన్నీ పరమ చెడ్డవి.“ (5:62)
అంటే లంచం తీసుకుని వారు న్యాయం, అన్యాయం, పాపం, పుణ్యం పట్టించుకునేవారు కాదు.
ఇస్లాంలో లంచం నిషేధం
లంచగొండితనం ఇస్లాంలో చాలా స్పష్టంగా నిషేధించబడినది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా బఖరా ఆయత్ 188లో ఇలా సెలవిచ్చాడు:
“ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంతభాగం కాజేయటం కోసం అధికారులకు ముడుపులు చెల్లించకండి. అది (న్యాయం కాదన్న సంగతి) మీకూ తెలిసినదే.“ (2:188)
అంటే ఈ ఆయత్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, మీరు ఒకరి సొమ్మును ఇంకొకరు అధర్మంగా తినకండి. ఇతరుల సొమ్ములోని కొంత భాగం అక్రమంగా స్వాహా చేసేందుకు ఆ వ్యవహారాన్ని అధికారుల వద్దకు తీసుకుపోకండి. అది అన్యాయం అన్న సంగతి స్వయంగా మీకు తెలుసు. అంటే లంచం ఇచ్చి, అధికారులకు లంచం ఇచ్చి అన్యాయంగా సొమ్ము కాజేయకండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయత్లో హెచ్చరించాడు.
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
لَعَنَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم الرَّاشِيَ وَالْمُرْتَشِيَ (ల’అన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ అర్రాషి వల్ ముర్తషి) “లంచం పుచ్చుకునేవానిని మరియు లంచం ఇచ్చేవానిని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు.”
లంచం పుచ్చుకునే వానిని, లంచం ఇచ్చే వానిని పుచ్చుకునేవాడు ఇచ్చేవాడు వారిద్దరినీ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ల’అనత్ చేశారు, వారి పైన శపించారు. అంటే, ఏ విషయం పైన అల్లాహ్ శాపం ఉంటుందో, దేని పైన ప్రవక్త గారి శాపం ఉంటుందో, అది ఘోరమైన పాపం అని అర్థం. దానికి తప్పనిసరిగా శిక్ష ఉంటుందని అర్థం. అంటే ఘోర పాపాలలో ఒక ఘోరమైన పాపం లంచం. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లంచం పుచ్చుకునే వానిని, లంచం ఇచ్చే వానిని శపించారు. ఎందుకంటే వారు అన్యాయంగా, అనైతికంగా సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇతరుల సంపదను నిషిద్ధమైన పద్ధతిలో సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక లంచం ద్వారా వచ్చే ఆ డబ్బు, లంచం ద్వారా వచ్చే ఆ ధనం, లంచం ద్వారా వచ్చే ఆ పదవి, ఆ వస్తువు ఏదైనా సరే అది అధర్మం, హరాం అని స్పష్టమవుతుంది.
అభిమాన సోదరులారా! ప్రతి చిన్న బాధ్యుడు, చిన్న పోస్ట్, పియాన్ నుంచి, ఫర్రాష్ నుంచి పెద్ద స్థాయి వరకు లంచం అనేది సర్వసామాన్యం అయిపోయింది సమాజంలో. అసలు లంచం ఇచ్చేవారు దానికి తప్పుగా అని కూడా భావించడం లేదు. ఇంత సర్వసామాన్యం అయిపోయింది. ఇది ఒక అమానత్. అల్లాహ్ మనకి ఇచ్చింది ప్రతీది అమానత్. అది మన శరీర అవయవాలు కావచ్చు, అతను తన ఇంట్లో యజమాని అయితే, తన అధీనంలో ఉన్న భార్యాపిల్లలు కావచ్చు. అల్లాహ్ ఏదైతే మనకి ఇచ్చాడో అది అమానత్, అప్పగింత. దానిని మనం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాల ప్రకారంగానే మనము జీవించాలి ప్రతి విషయంలో. వ్యవహారం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాణిజ్యం కావచ్చు, క్రయవిక్రయాలు కావచ్చు, లావాదేవీలు కావచ్చు, ఏదైనా సరే. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు సూరా నిసా ఆయత్ 58 లో:
إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَن تُؤَدُّوا الْأَمَانَاتِ إِلَىٰ أَهْلِهَا (ఇన్నల్లాహ య’మురుకుమ్ అన్ తుఅద్దుల్ అమానాతి ఇలా అహ్లిహా) “ఎవరి అమానతులను వారికి అప్పగించండి… ” అని అల్లాహ్ మిమ్మల్ని గట్టిగా ఆదేశిస్తున్నాడు (4:58)
ఈ ఆయత్లో అమానత్, విశ్వసనీయత ఇవి రెండు రకాలు.
ఒకటి, ఒకరు ఇంకొకరి వద్ద భద్రపరచమని పెట్టిన సొమ్ము. అది ఏదైనా కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, కరెన్సీ రూపంలో కావచ్చు, వెండి, బంగారం రూపంలో కావచ్చు, భూమి కాగితాలు కావచ్చు, తినే వస్తువు ఏదైనా సరే భద్రపరచమని పెట్టిన సొమ్ము. ఆ సొమ్ము ఆ వ్యక్తి వచ్చి అడిగినప్పుడు ఎవరి సొమ్ముని వారికి తిరిగి ఇచ్చేయాలి. ఇది ఒక అమానత్.
రెండవ రకపు అమానతు పదవులకు సంబంధించినది. ఒకటి, అర్హత కలిగిన వారికే బాధ్యత అప్పగించాలి. రెండవది, బాధ్యత తీసుకున్న వారు తమ బాధ్యతను, తన డ్యూటీని న్యాయంగా, ధర్మంగా, షరియత్ పరంగా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాల పరంగా అతను బాధ్యత వహించాలి. ఇది అమానత్. లంచం తీసుకుంటున్నాడు అంటే తన బాధ్యతలో లోపం జరుగుతుంది. అంటే డబ్బు తీసుకుని, సొమ్ము తీసుకుని అన్యాయంగా, అక్రమంగా, మోసపూరితంగా అతను తన బాధ్యత వహిస్తున్నాడు. సొమ్ము కాజేస్తున్నాడు. దీనినే లంచం అంటారు. అది ఒక పైసా కావచ్చు, కోట్లు కావచ్చు. ఒక్క పైసా హరాంతో కూడిన మన కడుపులోకి పోతే, దానివల్ల మన శరీరం ఎదుగుతుంది కదా, మాంసము, ఎముకలు, రక్తము ఇవన్నీ హరాంతో అవుతుంది. అటువంటి శరీరం స్వర్గంలో ప్రవేశించదని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు ఉన్నాయి.
ధనం యొక్క వాస్తవికత
అభిమాన సోదరులారా! అసలు మనిషి అన్యాయంగా, అక్రమంగా డబ్బులు సంపాదిస్తాడు. కానీ ఆ డబ్బు వలన ఈ లోకములో అతనికి మనశ్శాంతి ఉండదు. పరలోకంలో శిక్ష ఉంటుంది. ఈ విషయం మరిచిపోతున్నాడు.
ఈ ధనం గురించి మన ప్రవక్తగారు ఏం చెప్పారో ఒక హదీస్ తెలుసుకుందాం. తిర్మిదిలో ఈ హదీస్ ఉంది.
عَنْ كَعْبِ بْنِ عِيَاضٍ، قَالَ سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُولُ (అన్ కా’బ్ ఇబ్ని ‘ఇయాదిన్, ఖాల సమీ’తు అన్నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లమ యఖూలు) కాబ్ బిన్ ఇయాజ్ రదియల్లాహు అన్హు కథనం: నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా విన్నాను:
إِنَّ لِكُلِّ أُمَّةٍ فِتْنَةً وَفِتْنَةُ أُمَّتِي الْمَالُ (ఇన్న లికుల్లి ఉమ్మతిన్ ఫితనతున్, వ ఫితనతు ఉమ్మతీ అల్-మాల్) “నిశ్చయంగా, ప్రతీ ఉమ్మత్ (సముదాయం) కొరకు ఒక ఫితనా (పరీక్ష) ఉంది. మరియు నా ఉమ్మత్ యొక్క ఫితనా ధనం.” (జామి అత్-తిర్మిది)
కాబ్ బిన్ ఇయాజ్ రదియల్లాహు అన్హు కథనం, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతుండగా నేను విన్నానని అంటున్నారు. ప్రవక్తగారు ఏం చెప్పారు? ప్రతి ఉమ్మత్ కి ఒక ప్రత్యేకమైన పరీక్ష ఉంటుంది. అలాగే నా అనుచర సమాజానికి పరీక్ష సంపద, డబ్బు, మాల్ అన్నారు. ఎందుకంటే రేపు ప్రళయ దినాన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ధనం గురించి ప్రశ్నిస్తాడు, లెక్క ఉంది. న్యాయంగా సంపాదించావా, అన్యాయంగా సంపాదించావా? లంచంతో సంపాదిస్తే అది అన్యాయం, అధర్మం, నిషిద్ధం, పాపం, నేరం అది. ఒక హదీస్లో ఇలా ఉంది:
అబూ బర్జా అల్-అస్లమీ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
“ప్రళయ దినాన ఒక దాసుడు నాలుగు విషయాల గురించి ప్రశ్నించబడే వరకు తన పాదాలను కదల్చలేడు: తన జీవితాన్ని దేనిలో గడిపాడని, తన జ్ఞానంతో ఏమి ఆచరించాడని, తన ధనాన్ని ఎక్కడి నుండి సంపాదించి ఎక్కడ ఖర్చు పెట్టాడని, మరియు తన శరీరాన్ని దేనిలో ఉపయోగించాడని.” (జామి అత్-తిర్మిది)
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
لَا تَزُولُ قَدَمَا عَبْدٍ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُسْأَلَ عَنْ أَرْبَعٍ (లా తజూలు ఖదమా అబ్దిన్ యౌమల్ ఖియామతి హత్తా యుస్అల అన్ అర్బ’ఇన్) రేపు ప్రళయ దినాన నాలుగు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అల్లాహ్ దాసుడు ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు.
ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. ఎప్పుడు? నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినంత వరకు. ఆ నాలుగు ప్రశ్నలు ఏమిటి?
మొదటి విషయం, తన జీవితం, తన వయసు ఎలా గడిచింది. ధర్మంలోనా, అధర్మంలోనా? ధర్మపరంగా, అధర్మపరంగా? అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయతలోనా, అవిధేయతలోనా?
రెండవ ప్రశ్న, వ’అన్ ‘ఇల్మిహి ఫీమా ఫ’అల్ (తన జ్ఞానం విషయంలో ఏమి ఆచరించాడు). జ్ఞానం గురించి. అతనికి అల్లాహ్ గురించి, అల్లాహ్ ప్రవక్త గురించి, ఖురాన్ గురించి, ఇస్లాం గురించి ఎంత వరకు జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంలో అతను ఎంతవరకు ఆచరించాడు.
మూడవది, వ’అన్ మాలిహి మిన్ ఐన ఇక్తసబహు వ ఫీమా అన్ఫఖహు (తన ధనాన్ని ఎక్కడి నుండి సంపాదించాడు మరియు దేనిలో ఖర్చు పెట్టాడు). ధనం గురించి, సొమ్ము గురించి, ఆస్తి గురించి, డబ్బు గురించి ఎలా సంపాదించావు, ఎలా ఖర్చు పెట్టావు. ఎలా వచ్చింది, అది కూడా, ఎలా పోయింది అది కూడా, రెండు కూడా. కొందరు కష్టంగా సంపాదిస్తారు, ధర్మ సమ్మతంగా సంపాదిస్తారు, న్యాయంగా సంపాదిస్తారు. కష్టార్జితమే, కానీ ఖర్చు పెట్టేది అధర్మం అవుతుంది. కావున ఈ ఎలా సంపాదించావు, న్యాయంగా, అన్యాయంగా, ధర్మంగా, అధర్మంగా, అలాగే ఎలా ఖర్చు పెట్టావు.
నాలుగవది, వ’అన్ జిస్మిహి ఫీమా అబ్లాహ్ (తన శరీరాన్ని దేనిలో ఉపయోగించాడు). శరీరం గురించి. చేతులు, కాళ్లు, కళ్లు, హృదయం, కడుపు, పాదాలు, ఇవన్నీ, చెవులు వారికి ఎలా పోషించావు. నీ శరీరం ఎలా పెరిగింది? హరాం సొమ్ముతోనా, హలాల్ సొమ్ముతోనా? ఏ విధంగా ఖర్చు పెట్టావు? చెవులతో ఖురాన్ విన్నావా, న్యాయం విన్నావా, ఇంకేమైనా బూతులు, చెడు విషయాలు? ఇవన్నీ అల్లాహ్ అడుగుతాడు.
అందుకే ఒక విషయం, రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తున్నాను. మొదటి విషయం ఏమిటంటే, అరఫా మైదానం. చాలాసార్లు విన్నాం మనం ఈ హదీస్. అరఫా మైదానం, ఇప్పుడు కూడా ఇన్ని సౌకర్యాలు ఉండి కూడా హజ్ చేస్తే చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. ఇన్ని సౌకర్యాలు ఉండి, ఏసీ బస్సులు, విమానంలో ఏసీ, ఎయిర్ పోర్టులో ఏసీ, గుడారాలు, ఇంటి నుంచి తవాఫ్ వరకు, మినాకి, ముజ్దలిఫాకి అన్నిచోట్ల ప్రయాణ సౌకర్యాలు, సవారీలు అయినప్పటికీ చాలా ఇబ్బందులు పడతారు మనుషులు. కానీ ప్రవక్త గారి కాలంలో ఉన్నవారు ఒంటెల పైన, లేనివారు కాలి నడక పోయి హజ్ చేసేవారు. అటువంటి ఒక వ్యక్తి అరఫా మైదానంలో దుస్తులు సరిగా లేవు, తల వెంట్రుకలు గాలితో, దుమ్ముతో నిండిపోయినాయి. ఒకరకంగా ఉంది. ఆ వ్యక్తి అరఫా మైదానంలో చేతులు ఎత్తి ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కార్చి దుఆ చేస్తున్నాడు. ఆ వ్యక్తి గురించి ప్రవక్త గారు ఏమన్నారంటే, అతని దుఆ స్వీకరించబడదు అన్నారు. ఒక వ్యక్తి ఎన్నో వందల, వేల మైళ్ల దూరంతో ప్రయాణం చేసి హజ్ కోసం ప్రయాణం చేస్తే అరఫా మైదానంలో హదీస్ లో ఏముంది, అరఫా మైదానంలో చేయబడిన దుఆ రద్దు చేయబడదు అని ఉంది కదా. అల్-హజ్జు అరఫా అన్నారు ప్రవక్తగారు కదా. అయినా అరఫా మైదానంలో దుఆ చేస్తే ఆ దుఆ క్యాన్సిల్. ప్రవక్తగారు అన్నారు, ఎందుకు? దానికి వివరం ప్రవక్తగారు చెప్పారు. ఆ వ్యక్తి తినే సొమ్ము హరాం, తొడిగే దుస్తులు హరాం, తాగేది హరాం. అతని దుఆ ఎలా అల్లాహ్ స్వీకరిస్తాడు? అంటే ఇది చెప్పటం నా ఉద్దేశం ఏమిటంటే, లంచం హరాం. లంచం తీసుకునే వ్యక్తి యొక్క దుఆ ఎలా స్వీకరించబడుతుంది? దుఆ స్వీకరించబడదు. ఈ లోకంలో మనశ్శాంతి ఉండదు, పరలోకంలో కఠినమైన శిక్ష ఉంటుంది అని మనం తెలుసుకోవాలి.
అసలు ప్రవక్త గారు ఒక విషయం చెప్పారు. మనిషి సంపాదించే సంపాదనలో ఆ వ్యక్తి యొక్క వాటా ఎంత? వేరే వాళ్ళ వాటా కాదు. ఒక వ్యక్తి సంపాదిస్తాడు, తన వారసుల వాటా కాదు. ఒక వ్యక్తి చనిపోతే భార్యకు వాటా ఎంత, పిల్లలకి వాటా ఎంత, అమ్మానాన్నకి వాటా ఎంత దీని గురించి కాదు. ఒక వ్యక్తి కష్టార్జితం, కష్టంతో సంపాదిస్తున్నాడు. ఆ సంపదలో అతని వాటా ఎంత? ఇది ప్రాపంచిక యొక్క యదార్థం ఇది. తెలుసుకుందాం.
అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, దాసుడు నా ధనము, నా ధనము అంటూ ఉంటాడు. ఎల్లప్పుడూ నా దాసుడు నా ధనము, నా సంపాదన, నా ధనము, నా విల్లా, నా బంగ్లా, నా సేవింగ్ అకౌంట్, నాది, నాది అంటాడు కదా. వాస్తవానికి సంపాదనలో, సంపాదించే వ్యక్తిలో మూడు భాగాలే ఉంటాయి. నాలుగో భాగం ఉండదు. మొదటి భాగం, మా అకల ఫ అఫ్నా (తిన్నాడు మరియు దానిని జీర్ణం చేసుకున్నాడు). తిన్నాడు, ఆ తర్వాత అది అరిగిపోయింది. అతను వాడాడు. తిన్నాడు, ఆ తిండి వలన తన శరీరంలో రక్తం వచ్చింది, మాంసం వచ్చింది, ఇది వచ్చింది. తిన్నాడు. ఆ తిన్నదే అతని వాటా. రెండవది, అవ్ లబిస ఫ అబ్లా (ధరించాడు మరియు దానిని పాతదిగా చేశాడు). తొడిగాడు, చించేసాడు. కొన్నాడు, బట్టలు కొన్నాడు, దుస్తులు కొన్నాడు, తొడుక్కున్నాడు, యూస్ చేశాడు. ఇది అతని వాటా. మూడవది, అవ్ అ’తా ఫఖ్తనా (ఇచ్చాడు మరియు దానిని పరలోకం కోసం దాచుకున్నాడు). అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాడు. ఈ మూడే అతనికి వాటా. ఈ మూడింటిలో రెండు వాటాలు అతను అనుభవిస్తాడు, ప్రపంచంలోనే అయిపోతాయి. మూడో వాటా శాశ్వతంగా అతనికి మిగిలిపోతుంది. ఇవి కాక అతని ధనంలో, అతని సొమ్ములో, అతని ఆస్తిలో, అతని సంపదలో ఏదైనా మిగిలినా అది అతనిది కాదు. ఎందుకంటే అదంతా అతను విడిచిపెట్టి చనిపోతాడు. వేరేవాళ్లు అక్రమంగా తీసుకోవచ్చు, అధర్మంగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి పోకపోయినా, తన సంతానము, బంధువులు అది తీసేసుకుంటారు. చివరికి ఒక ఉంగరమో, ఏదైనా రాకపోయినా కట్ చేసి తీసేసుకుంటారు కానీ వదలరు. మనిషి యొక్క సంపాదనలో ఇవి మూడే వాటాలు. ఇది మనం గ్రహించాలి.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ హలాల్ సంపదను సంపాదించే కృషిని, సద్బుద్ధిని ప్రసాదించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో ఏడు ఘోరమైన, ప్రాణాంతకమైన పాపాల గురించి వివరించబడింది. మునుపటి ప్రసంగంలో చర్చించిన ఏడు రకాల పుణ్యకార్యాలకు విరుద్ధంగా, ఈ పాపాలు ఒక వ్యక్తిని నాశనం చేస్తాయని చెప్పబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసును ఉటంకిస్తూ, ఈ ఏడు పాపాలను జాబితా చేశారు: 1) అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించడం (షిర్క్), 2) చేతబడి (సిహ్ర్), 3) అన్యాయంగా ఒక ప్రాణాన్ని తీయడం, 4) వడ్డీ తినడం (రిబా), 5) అనాథ ఆస్తిని తినడం, 6) ధర్మయుద్ధం నుండి పారిపోవడం, మరియు 7) పవిత్రులైన విశ్వాస స్త్రీలపై అపనిందలు వేయడం. ఈ పాపాలు ఎంత తీవ్రమైనవో, వాటికి కేవలం సాధారణ పుణ్యకార్యాలు కాకుండా, ప్రత్యేక పశ్చాత్తాపం (తౌబా) అవసరమని నొక్కి చెప్పబడింది. ఈ ఘోరమైన పాపాల నుండి రక్షణ పొందాలని అల్లాహ్‌ను ప్రార్థిస్తూ ప్రసంగం ముగుస్తుంది.
అభిమాన సోదరులారా! కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
అభిమాన సోదరులారా! ఈ రోజు మనం ప్రాణాంతకమైన ఏడు విషయాలు తెలుసుకుందాం. నిన్న ఎపిసోడ్ లో మనం ప్రళయ దినాన ఏడు రకాల మనుషులకి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన నీడను ప్రసాదిస్తాడు అని తెలుసుకున్నాము. అంటే నిన్న తెలుసుకుంది కావలసిన ఏడు విషయాలు. న్యాయం కావాలి, నమాజ్ చేయాలి, యవ్వనం అల్లాహ్ మార్గంలో గడపాలి, గుప్తంగా దానం చేయాలి, వ్యభిచారానికి దూరంగా ఉండాలి, ఏకాంతంలో అల్లాహ్ కు భయపడాలి, ఏడవాలి భయపడి, కలుసుకుంటే అల్లాహ్ ప్రసన్నత, విడిపోతే అల్లాహ్ ప్రసన్నత – ఈ ఏడు కావలసిన, చేయవలసిన విషయాలు నిన్న తెలుసుకున్నాము.
ఈ రోజు ఏడు విషయాలని వదులుకోవాలి. ప్రాణాంతకమైన ఏడు విషయాలు. పాపంతో కూడుకున్న ఏడు విషయాలు. ఘోరమైన పాపంతో కూడుకున్న ఏడు విషయాలు. అందుకే, దానికి ప్రాణాంతకమైన విషయాలు అని చెప్పడం జరిగింది. ఆ హదీస్ ఏమిటంటే, అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు:
اجْتَنِبُوا السَّبْعَ الْمُوبِقَاتِ (ఇజ్తనిబు అస్సబ్’అల్ మూబికాత్) “ప్రాణాంతకమైన ఏడు విషయాలకు దూరంగా ఉండండి” అని అన్నారు.
ఇది విన్న సహాబాలు రిజ్వానుల్లాహి అలైహిం అజ్మయీన్
قَالُوا يَا رَسُولَ اللهِ وَمَا هُنَّ (ఖాలూ యా రసూలల్లాహ్, వమా హున్) “ఓ దైవ ప్రవక్తా! ఆ ప్రాణాంతకమైన ఏడు విషయాలు ఏమిటి?” అని అడిగారు.
దానికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఏడు విషయాలు వివరించారు. వాటిల్లో మొదటి విషయం
ప్రియ వీక్షకుల్లారా! షిర్క్ అంటే ఏమిటి? అల్లాహ్ అస్తిత్వములో లేదా అల్లాహ్‌కు కొరకు మాత్రమే ప్రత్యేకమైన ఉన్న భావములో ఆయన గుణగణాలలో లేదా ఆయన హక్కులలో ఎవరినైనా సహవర్తునిగా ఎంచటమే షిర్క్. వాడుక భాషలో చెప్పాలంటే, అల్లాహ్‌ను నమ్ముతూ, అల్లాహ్ తో పాటు ఇతరులని కూడా పూజ చేయటం, ఆరాధించటం. ఆరాధన అల్లాహ్‌కే ప్రత్యేకం కదా, కానీ ఆ ఆరాధన ఇతరులకు కూడా చేయటం. ఇది కూడా షిర్క్ అవుతుంది. అంటే బహుదైవారాధన.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో సూరె లుఖ్మాన్ లో ఇలా తెలియజేశాడు:
يَا بُنَيَّ لَا تُشْرِكْ بِاللَّهِ ۖ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ (యా బునయ్య లా తుష్రిక్ బిల్లాహ్, ఇన్నష్షిర్క ల జుల్మున్ అజీమ్) “ఓ నా కుమారా! అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించకు. నిశ్చయంగా షిర్క్ చాలా పెద్ద దుర్మార్గం.” (31:13)
ఇది లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి హితోపదేశిస్తూ చెప్పిన విషయం ఇది. “యా బునయ్య! ఓ నా ముద్దుల పుత్రుడా! లా తుష్రిక్ బిల్లాహ్ – అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించకు. అల్లాహ్ తో షిర్క్ చేయవద్దు, సాటి కల్పించవద్దు. ఇన్నష్షిర్క ల జుల్మున్ అజీమ్ – ఎందుకంటే నిస్సందేహంగా షిర్క్ అనేది మహా పాపం, ఘోరమైన అన్యాయం.”
ఇది క్లుప్తంగా షిర్క్. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రాణాంతకమైన ఏడు విషయాలలో ఇది మొట్టమొదటిది, చాలా ఘోరమైనది – షిర్క్. షిర్క్ చేస్తూ చనిపోతే అటువంటి వారికి క్షమాపణ లేదని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి షిర్క్ నుండి – పెద్ద షిర్క్, చిన్న షిర్క్, అన్ని రకాల షిర్క్ నుండి అల్లాహ్ మనల్ని రక్షించు గాక, కాపాడు గాక.
ఇది మొదటి విషయం. ప్రాణాంతకమైన ఏడు విషయాలలో మొదటి విషయం షిర్క్ చేయటం. అల్లాహ్‌కు భాగస్వాములు నిలబెట్టడం.
وَقَتْلُ النَّفْسِ الَّتِي حَرَّمَ اللهُ إِلَّا بِالْحَقِّ (వ కత్లున్-నఫ్సిల్లతీ హర్రమల్లాహు ఇల్లా బిల్-హఖ్) అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిషిద్ధం చేసిన ప్రాణిని అన్యాయంగా చంపటం.
హత్య చేయటం ఘోరమైన పాపం.
అలాగే నాలుగవది:
وَأَكْلُ الرِّبَا (వ అకులుర్-రిబా) వడ్డీ తినటం.
ఇస్లాం ధర్మంలో వడ్డీ సమంజసం కాదు. అధర్మం, నిషిద్ధం, హరాం, ఘోరమైన పాపం, అన్యాయం, దగా, మోసం కిందకి లెక్కించబడుతుంది. ఇస్లాం ధర్మంలో వడ్డీ ఇచ్చినా, వడ్డీ పుచ్చుకున్నా, దానికి సాక్ష్యంగా ఉన్నా, అందరూ పాపములో సమానులే అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
ఎవరి సొమ్మయినా సరే అన్యాయంగా తినేస్తే, కాజేస్తే అది అధర్మమే, అది పాపమే. దాంట్లో ముఖ్యంగా అనాథుని సొమ్ము తినేస్తే ఇది ఇంకా ఘోరమైన పాపం.
ఆరవది:
وَالتَّوَلِّي يَوْمَ الزَّحْفِ (వత్-తవల్లీ యౌమజ్-జహ్ఫి) దైవ తిరస్కారులతో యుద్ధం జరిగినప్పుడు వెన్ను చూపి పారిపోవటం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ధర్మయుద్ధం అది. ఎక్కడైతే అక్కడ గొడవ చేయటం, ధర్మయుద్ధం కిందకి రాదు. బాంబులు వేసేయటం, ధర్మయుద్ధం కిందకి రాదు. ఇది అపోహ. దానికి కొన్ని రూల్స్, కండిషన్లు ఉన్నాయి. అల్లాహ్ మార్గంలో యుద్ధం జరిగినప్పుడు వెన్ను చూపి పారిపోవటం.
అలాగే ఏడవది:
وَقَذْفُ الْمُحْصَنَاتِ الْمُؤْمِنَاتِ الْغَافِلَاتِ (వ కజ్ఫుల్ ముహ్సినాతిల్ ము’మినాతిల్ గాఫిలాత్) అమాయకులు, శీలవంతులు అయిన విశ్వాస స్త్రీల మీద అభాండాలు వేయటం, అపనిందలు మోపటం.
ఈ ఏడు రకాల పాపాలు ప్రాణాంతకమైనవి. పాపాలలో అతి ఘోరమైనవి. దీనికి పెద్ద పాపాలు అంటారు, కబాయిర్ అంటారు. అంటే, ఈ పాపాలు నమాజ్ వల్ల, దుఆ వల్ల, వేరే పుణ్యాల వల్ల క్షమించబడవు. దీనికి తప్పనిసరిగా పశ్చాత్తాపం చెందాల్సిందే, తౌబా చేసుకోవాల్సిందే. ఈ పాపాలకి తప్పనిసరిగా తౌబా చేసుకోవాలి, పశ్చాత్తాప పడాలి. అప్పుడే ఇవి క్షమించబడతాయి.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఈ ఘోరమైన పాపాల నుండి రక్షించు గాక! అల్లాహ్ మనందరినీ షిర్క్ నుండి కాపాడు గాక! వడ్డీ నుండి కాపాడు గాక! చేతబడి చేయటం, చేయించటం నుండి కాపాడు గాక! అనాథుని సొమ్ముని కాజేయటం నుండి అల్లాహ్ మనల్ని రక్షించు గాక! ప్రతి పాపం నుండి, ఆ పాపం పెద్దదైనా, ఆ పాపం చిన్నదైనా, అల్లాహ్ మనందరినీ రక్షించు గాక! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనల్ని అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించు గాక! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించు గాక! ఆమీన్.
వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో నిషిద్ధమైన రెండవ ప్రధాన విషయం గురించి వివరించబడింది. అల్లాహ్ హలాల్ (ధర్మసమ్మతం) చేసిన దానిని హరామ్ (నిషిద్ధం)గా లేదా హరామ్ చేసిన దానిని హలాల్‌గా మార్చడం ఎంత పెద్ద పాపమో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా స్పష్టం చేయబడింది. యూదులు మరియు క్రైస్తవులు తమ పండితులను, సన్యాసులను అల్లాహ్ ను వదిలి ప్రభువులుగా చేసుకోవడం అంటే, వారు హలాల్-హరామ్ నిర్ణయాలలో వారిని గుడ్డిగా అనుసరించడమే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు. ఈ అధికారం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉందని, ఇతరులకు ఈ హక్కును ఆపాదించడం లేదా అనుసరించడం అవిశ్వాసానికి దారితీస్తుందని హెచ్చరించారు. ముస్లింలు తమ జీవితంలోని అన్ని విషయాలలో, ముఖ్యంగా వివాదాల పరిష్కారంలో, ఖురాన్ మరియు సున్నత్‌లను మాత్రమే అనుసరించాలని, మానవ నిర్మిత చట్టాలను ఆశ్రయించకూడదని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.
నిషిద్ధ విషయాలలో మొదటి విషయం షిర్క్ అని, దానిలో కొన్ని రకాలు చదివాము. అయితే ఈ రోజు మూడవ పాఠంలో, నిషిద్ధ విషయాలలో రెండవది అల్లాహ్ హరామ్ చేసిన దానిని హలాల్ చేయుట లేదా అల్లాహ్ హలాల్ చేసిన దానిని హరామ్ చేయుట. శ్రద్ధ వహించండి. అల్లాహ్ ఒక వస్తువును హరామ్ చేశాడు, దానిని హలాల్ చేయుట. లేదా అల్లాహ్ ఒక వస్తువును హలాల్ చేశాడు, దానిని హరామ్ చేయుట.
అల్లాహ్ హరామ్ చేసిన దానిని హలాల్ చేయుట లేదా అల్లాహ్ హలాల్ చేసిన దానిని హరామ్ చేయుట లేదా ఇలాంటి హక్కు అల్లాహ్ తప్ప ఇతరులకు ఉంది అని నమ్ముట. గమనిస్తున్నారా? స్వయంగా మనిషి, ఒక మనిషి అల్లాహ్ హలాల్ చేసిన దాన్ని హరామ్ చేస్తున్నాడు. లేదా అల్లాహ్ హరామ్ చేసిన దానిని హలాల్ చేస్తున్నాడు. మూడో మాట దీంట్లో ఏమిటి? అల్లాహ్ తప్ప ఈ హలాల్, హరామ్ చేసేటటువంటి హక్కు ఎవరికైనా ఉంది అని నమ్మటం. ఒక వ్యక్తి స్వయంగా హలాల్‌ను హరామ్ చేయట్లేదు. కానీ ఎవరైనా చేస్తూ ఉంటే అతన్ని సహీగా, కరెక్ట్‌గా నమ్ముతున్నాడు. అలా చేయడం అతనికి తగును, అతనికి ఆ హక్కు ఉంది అన్నటువంటి నమ్మకం ఉంది. ఇక ఇలా ఈ నమ్మడం అనేది కూడా అవిశ్వాసంలో వస్తుంది. అల్లాహు త’ఆలా నిషేధించాడు. అంతేకాదు, ఇంకా శ్రద్ధ వహించండి.
సమస్యల తీర్పు కొరకు అల్లాహ్ పంపిన ఇస్లాం ధర్మం కాకుండా ఇతర న్యాయస్థానాలకు వెళ్ళుట. సర్వసామాన్యంగా ఈ రోజుల్లో ముస్లింలలో పరస్పరం ఏదైతే గొడవలు, ప్రత్యేకంగా భార్యాభర్తల గొడవల విషయాలలో ముస్లిం కమ్యూనిటీ, ముస్లిం పంచాయతీ, ముస్లిం వారి యొక్క వారి జమాతుల్లో ఉన్నటువంటి ధర్మవేత్తల పర్యవేక్షణలో ఒక కమిటీ ఏర్పాటు చేసి, వారి యొక్క అధ్వర్యంలో తమ గొడవలకు మంచి పరిష్కారం ఖురాన్, హదీసుల ఆధారంగా తీసుకునే ప్రయత్నం చేయకుండా ఏం చేస్తూ ఉంటారు? ఏదైనా గొడవ జరిగింది, వెంటనే లంచాలు ఇచ్చి తమ ఎదుటి వారిపై కేసులు నమోదు చేయిస్తారు. తమకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారి గురించి కోర్టుల యొక్క మెట్లు ఎక్కుతారు. అయితే ఇలా చేయడం అంతా కూడా సమంజసం, మంచి విషయమే అని భావించడం, ఎక్కడైతే ఖురాన్, హదీస్ ప్రకారంగా తీర్పులు జరగవో అలాంటి చోట వెళ్ళడం, అలాంటి చోట వారితో తీర్పులు చేయించుకోవడం, ఇవన్నీ కూడా ఎంత ఘోరమైన విషయం! ఇంకా శ్రద్ధగా వినండి. మరియు ఇస్లామీయ చట్టాలతో కాకుండా ఇతర చట్టాలతో తీర్పు కోరుట లేదా అది యోగ్యమైనదని సంతోషంగా నమ్ముట, ఎంతటి భయంకరమైన అవిశ్వాసంలో పడవేస్తుందో ఖురాన్‌లోని ఈ ఆయతు ద్వారా తెలుసుకోండి. మరియు ఈ ఆయతు సూరతు తౌబా, సూర నెంబర్ తొమ్మిది, ఆయతు నెంబర్ 31. శ్రద్ధగా వినండి.
అల్లాహ్ తెలుపుతున్నాడు:
اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِّن دُونِ اللَّهِ (ఇత్తఖజూ అహ్బారహుమ్ వ రుహ్బానహుమ్ అర్బాబమ్ మిన్ దూనిల్లాహ్) వారు అల్లాహ్‌ను వదలి తమ పండితులను, తమ సన్యాసులను ప్రభువులుగా చేసుకున్నారు. (9:31)
వారు అంటే, యూదులు, క్రైస్తవులు. అల్లాహ్‌ను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. యూదులు, క్రైస్తవులు అల్లాహ్‌ను వదిలి ఎవరిని? తమ యొక్క పండితులను, తమ యొక్క సన్యాసులను ఏం చేశారు? ప్రభువులుగా చేసుకున్నారు. أَرْبَابًا مِّن دُونِ اللَّهِ (అర్బాబమ్ మిన్ దూనిల్లాహ్) రబ్ ఏకవచనం, అర్బాబ్ ఇది బహువచనం. ఇక మనం చూస్తూ ఉంటాము, చర్చిలో ఉండేటువంటి పాస్టర్లు, వారినైతే ప్రభువుగా నమ్మరు కదా? లేక వారి యొక్క పెద్ద పండితులను సామాన్య క్రైస్తవులు ప్రభువుగా నమ్మరు కదా అని ఈ రోజుల్లో కూడా ఎంతో మంది అనుకుంటారు, కదా? రండి, తిర్మిజీ మరియు ముస్తద్రక్ హాకింలోని హదీస్ ద్వారా దీని యొక్క వివరణ వినండి.
ఈ ఆయతు, సూరత్ తౌబా ఆయతు నెంబర్ 31, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పఠిస్తుండగా అదీ బిన్ హాతిమ్ రదియల్లాహు అన్హు విని, “ప్రవక్తా! యూదులు, క్రైస్తవులు తమ పండితులను, సన్యాసులను ఆరాధించేవారు కారు కదా?” సామాన్య యూదులు మరియు క్రైస్తవులు వారి యొక్క పండితులను, వారి యొక్క సన్యాసులను, పాస్టర్లను పూజించరు కదా? ఆరాధించరు కదా? మరి ప్రభువుగా చేసుకున్నారని ఆయతులో చెప్పబడింది? అతని యొక్క ప్రశ్న విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, “అవును, నువ్వు అంటున్నావు ఆరాధించేవారు కాదు. అవును, ఆరాధించేవారు కాదు. కానీ అల్లాహ్ హరామ్ చేసిన దానిని వారి పండితులు, సన్యాసులు హలాల్ చేస్తే వారు దానిని హలాల్‌గానే భావించేవారు. ఇంకా అల్లాహ్ హలాల్ చేసిన దానిని వారి పండితులు, సన్యాసులు హరామ్ చేస్తే వారు దానిని హరామ్‌గానే భావించేవారు. కనుక ఇది వారిని ఆరాధించినట్లు. అందుకని వారు తమ సన్యాసులను, పండితులను ప్రభువులుగా చేసుకున్నారు” అన్నటువంటి సమాధానం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సహీహ్ హదీస్. షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ వారు కూడా గాయతుల్ మరాంలో సహీహ్ అని తెలిపారు. అయితే అర్థమైంది కదా సోదర మహాశయులారా?
అంతేకాదు. మరొక ఆయత్ సూరత్ తౌబాలోనే ఉంది. కొంచెం శ్రద్ధగా వినండి. అంతకంటే ముందు, అల్లాహ్ నిషేధించిన వాటిని నిషిద్ధంగా నమ్మని వారు, నిషిద్ధతలను నిషిద్ధంగా నమ్మని వారు యూదులు, క్రైస్తవులు మరియు బహుదైవారాధకులు. కానీ ఈ పని ఒక ముస్లింగా తమకు తాము అనుకునే వాళ్ళు, తమ పేర్లు ముస్లింలుగా పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తే మరి వారి గతి ఏమవుతుంది? అల్లాహు అక్బర్. చూడండి, సూరత్ తౌబా ఆయత్ నెంబర్ 29.
وَلَا يُحَرِّمُونَ مَا حَرَّمَ اللَّهُ وَرَسُولُهُ وَلَا يَدِينُونَ دِينَ الْحَقِّ (వ లా యుహర్రిమూన మా హర్రమల్లాహు వ రసూలుహు వ లా యదీనూన దీనల్ హఖ్) అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషిద్ధం చేసిన వాటిని వారు నిషిద్ధంగా భావించరు, మరియు సత్య ధర్మాన్ని అవలంబించరు. (9:29)
యూదులు, క్రైస్తవులు, బహుదైవారాధకులు, వీరందరూ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించిన వాటిని వారు నిషిద్ధంగా భావించరు మరియు సత్య ధర్మాన్ని అవలంబించరు. ఒకవేళ ఎవరైనా ముస్లిం ఈ పని చేశాడంటే చాలా, చాలా నష్టంలో పడిపోతాడు. ఎలాంటి నష్టం? అల్లాహ్ పై చాలా పెద్ద అభాండం మోపినట్లు. చూడండి, సూర యూనుస్‌లోని ఆయతు నెంబర్ 59, అల్లాహు త’ఆలా తెలుపుతున్నాడు.
قُلْ أَرَأَيْتُم مَّا أَنزَلَ اللَّهُ لَكُم مِّن رِّزْقٍ فَجَعَلْتُم مِّنْهُ حَرَامًا وَحَلَالًا قُلْ آللَّهُ أَذِنَ لَكُمْ ۖ أَمْ عَلَى اللَّهِ تَفْتَرُونَ (ఓ ప్రవక్తా!) ఇలా అను: “ఏమిటి? మీరు ఆలోచించారా? అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే కొన్నింటిని హరామ్‌గానూ, మరి కొన్నింటిని హలాల్‌గానూ నిర్ధారించుకున్నారు.” వారినిలా అడుగు: “ఇలా చేయడానికి అల్లాహ్ మీకు అనుమతించాడా? లేక మీరు అల్లాహ్‌కు అబద్ధాలను అంటగడుతున్నారా?” (10:59)
ఈ ఆయతు ద్వారా ఏం తెలుస్తుంది? అల్లాహు త’ఆలా ప్రజల్లో ఎవరికీ కూడా ఏదైనా వస్తువును హలాల్ చేసే, ఏదైనా వస్తువును హరామ్ చేసే అటువంటి హక్కు ఇవ్వలేదు. ఇది వాస్తవం, ఇవ్వలేదు. ఇది కేవలం అల్లాహ్ యొక్క హక్కు మాత్రమే. ఇంతకుముందు కూడా దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు మొదటి పాఠంలో, మొదటి క్లాస్‌లో విన్నాము మనం. మీలో ఎవరికైనా గుర్తు లేకుంటే ఒకసారి ఆ పాఠాన్ని తర్వాత మీరు చూడండి, వినండి. అయితే అల్లాహ్ అయితే ఎవరికీ ఈ హక్కు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఎవరైనా ఈ హక్కును దుర్వినియోగం చేసుకుంటున్నాడు, అతడు దౌర్జన్యపరుడు అవుతున్నాడు, అంతేకాదు అల్లాహ్ పై అబద్ధాలు మోపేవాడు అవుతున్నాడు.
అర్థమైంది కదా? ఎంత ఘోరమైన పాపం? అందుకొరకే ఈ రోజుల్లో కూడా ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్లుగా కొన్ని వస్తువులను ఇది హలాల్ అని, ఇది హరామ్ అని లేదా వారి యొక్క పెద్దలు, గురువులు, “అరే హమారే బాబా బోలే జీ,” “మా పీర్ సాబ్ చెప్పారు,” “మేము ఫలానా ముర్షిదులను నమ్ముతున్నాము, ఆయన చెప్పినట్లే మేము వింటాము” ఇక వారు హరామ్ చేసిందే హరామ్, వారు హలాల్ అని చెప్పిందే హలాల్. ఈ విధంగా మనం అల్లాహ్ మరియు ప్రవక్తకు వ్యతిరేకంగా ఒక మార్గంలో వెళ్తున్నామంటే అది మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుందా? మనమే మంచిగా ఆలోచించాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, సమాధులతో (ఖబ్రిస్తాన్) ముస్లింలు పాటించవలసిన మర్యాదల గురించి వివరించబడింది. సమాధిపై కూర్చోవడం, దానిపై నడవడం, దానిని అగౌరవపరచడం తీవ్రమైన పాపాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుల ఆధారంగా స్పష్టం చేయబడింది. నిప్పుల మీద కూర్చోవడం ఒక సమాధిపై కూర్చోవడం కన్నా మేలని, కత్తి మీద నడవడం ఒక ముస్లిం సమాధిపై నడవడం కన్నా మేలని చెప్పిన హదీసులను ఉటంకించారు. సమాధుల స్థలాన్ని ఆక్రమించడం, వాటిని మరుగుదొడ్లుగా ఉపయోగించడం, చెత్త వేయడం వంటివి బహిరంగ బజారులో మర్మాంగాలను ప్రదర్శించి అవమానకరమైన పనులు చేయడం లాంటిదని హెచ్చరించారు. ముస్లిం మరణించిన తర్వాత కూడా వారి దేహానికి, వారి సమాధికి గౌరవం ఇవ్వడం తప్పనిసరి అని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.
సమాధిపై కూర్చుండుట, దానిపై నడుచుట, శ్మశానాన్ని మరుగుదొడ్డిగా ఉపయోగించుట – వీటన్నిటి నుండి చాలా భయంకరమైన నిషేధాలు వచ్చి ఉన్నాయి. శ్రద్ధగా వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు.
لَأَنْ يَجْلِسَ أَحَدُكُمْ عَلَى جَمْرَةٍ فَتُحْرِقَ ثِيَابَهُ فَتَخْلُصَ إِلَى جِلْدِهِ خَيْرٌ لَهُ مِنْ أَنْ يَجْلِسَ عَلَى قَبْرٍ (లా యజ్లిస అహదుకుం అలా జమ్రతిన్ ఫతహ్రిక సియాబహు ఫతఖ్లుస ఇలా జిల్దిహి ఖైరున్ లహు మిన్ అన్ యజ్లిస అలా కబ్ర్) “మీలో ఒక వ్యక్తి నిప్పులపై కూర్చొని, ఆ నిప్పులు అతని బట్టలను కాల్చి దాని సెగ శరీరానికి కల్గినప్పటికినీ అది సమాధి పై కూర్చునే దానికంటే మేలు”. (ముస్లిం 971).
మీలో ఒక వ్యక్తి, మీలో ఒక వ్యక్తి నిప్పులపై కూర్చుని ఆ నిప్పులు అతని బట్టలను కాల్చి దాని సెగ శరీరానికి కలిగినప్పటికిని, అర్థమవుతుందా? మీరు, మీలో ఎవరైనా ఒక వ్యక్తి నిప్పులపై కూర్చోవడం మంచిది. దాని వల్ల అతని బట్టలు కాలిపోయి దాని యొక్క సెగ, దాని యొక్క వేడి, ఆ కాల్చడం అనేది శరీరం వరకు చేరినా గానీ అది మంచిది, దేని నుండి? సమాధిపై కూర్చునే దాని కంటే. గమనించండి.
ఇది చెప్పే ధోరణి గమనించండి మీరు, అంటే మనం ఏదైనా అగ్నిపై, నిప్పులపై కూర్చుని అది మన బట్టల్ని, మన శరీరాన్ని కాల్చడం అంత పెద్ద నష్టం కాదు మన కొరకు, ఏదైనా సమాధి మీద కూర్చోవడంతో పోలిస్తే. అంత ఘోరమైన పాపం మరియు నష్టం అని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది.
కొందరు శవాన్ని ఖననం చేయడానికి వెళ్ళినప్పుడు సమాధులపై నడుస్తారు. ఒక్కోసారి చెప్పులతో వాటిని త్రొక్కుకుంటూ వెళ్తారు. ముస్లిం శవం యొక్క గౌరవాన్ని కొంచెం కూడా పట్టించుకోరు. ఇది పెద్ద పాపం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భయకంపితలన్ని చేశారు. ఈ హదీద్ వినే కంటే ముందు, ఇప్పుడు ఏ హదీద్ అయితే మనం విన్నామో, సహీహ్ ముస్లిం, 971 హదీస్, చూస్తున్నారు కదా? మీ బట్టలు కాలిపోయి మీరు మీ శరీరానికి కూడా ఆ అగ్ని చేరే అటువంటి పరిస్థితి ఎదురవ్వడం అది మంచిది కానీ, సమాధిపై కూర్చోవడం. ఇది మహా ఘోరమైన పాపం.
ఈ కూర్చోవడం, ఈ రోజుల్లో ఎవరైనా పెద్దవారు చనిపోయారని సమాధిని ఒక పెద్ద మజార్‌గా, దర్బార్‌గా, దానిపై గోపురాలు, దానిపై గుంబదులు కట్టి అక్కడ ముజావరీ చేయడానికి ఏదైతే కూర్చుంటారో, ఇది కూడా అందులోనే వస్తుంది, అని కొందరు ధర్మవేత్తలు చెప్పి ఉన్నారు.
సమాధులపై నడవడం మరియు దానిపై అజాగ్రత్తలు
ఇక మీరు కింద సమాధుల పై నడవడం, సమాధులపై చెప్పులతో నడవడం ప్రస్తావన ఏదైతే వచ్చిందో ఇది కూడా చాలా ఘోరమైన పాపం. కానీ సమాధుల్లో అనవసరమైన చెట్లు, ముళ్ల కంపలు ఉండి, మనం ఎవరైనా ఒక విశ్వాసిని అక్కడ ఖననం చేయడానికి వెళ్ళినప్పుడు మన కాళ్లకు ముల్లు గుచ్చుకుంటాయి అనుకుంటే చెప్పులు వేసుకొని ఖబరిస్తాన్‌లో, శ్మశాన వాటికలో వెళ్ళవచ్చు. శ్రద్ధగా వినండి. వెళ్ళవచ్చు. కానీ సమాధిపై మన కాలు పడకుండా. సమాధుల మధ్యలో దారి ఉంటుంది కదా, ఆ దారిలో నడవడం అంత పెద్ద పాపం కాదు. కానీ మన కాళ్ళ కింద సమాధి రాకుండా, లేదా ఫలానా సమాధి ఉంది అని తెలిసి కూడా, అయ్యే, లోపల ఓ మనిషి ఉన్నాడా, లోపట ఓ రెండు ఫీట్లు, నాలుగు ఫీట్ల లోపట ఉన్నాడు, అతనికి ఏమైనా అవుతుందా? ఈ విధంగా కొందరు అనుకొని ఏదైతే సమాధులను కూడా తొక్కుకుంటూ, వాటిపై నడుచుకుంటూ వెళ్తారో, కొందరు కొన్ని సందర్భాల్లో అక్కడ ఖననం చేయడం ఆలస్యం జరిగితే, కొందరు సమాధిపై కూర్చుంటారు. అలా సమాధిపై కూర్చోకూడదు. పక్కన సమాధి లేని చోట ఎవరైనా పెద్ద మనిషి వచ్చారు స్మశాన వాటికకు, లేదా ఇంకా ఎవరైనా ఏదైనా కాళ్ళల్లో నొప్పి బాధ ఉన్నవారు వచ్చారు. అయితే ఏదైనా చిన్న కుర్చీ వేసి అక్కడ కొన్ని క్షణాలు కూర్చోబెట్టడం పాపం కాదు. కానీ అది ఎక్కడ ఉండాలి? ఎగ్జాక్ట్లీ సమాధిపై ఉండకూడదు. శవాన్ని ఎక్కడైతే పాతి పెట్టడం జరిగిందో, ఖననం చేయడం జరిగిందో ఆ ఖబ్ర్ మీద కూర్చోవడం గానీ, నడవడం గానీ, కాళ్లతో తొక్కడం గానీ ఇలాంటివి ఏదీ చేయకూడదు. ఎందుకు? ముస్లిం శవం కూడా గౌరవం, మర్యాదకు అర్హత కలిగి ఉన్నది.
لَأَنْ أَمْشِيَ عَلَى جَمْرَةٍ أَوْ سَيْفٍ أَوْ أَخْصِفَ نَعْلِي بِرِجْلِي أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَمْشِيَ عَلَى قَبْرِ مُسْلِمٍ (ల అన్ అమ్షియ అలా జమ్రతిన్, అవ్ సైఫిన్, అవ్ అఖ్సిఫ నాలి బిరిజ్లి, అహబ్బు ఇలయ్య మిన్ అన్ అమ్షియ అలా కబ్రి ముస్లిం) “నిప్పులపై, లేక ఖడ్గం యొక్క చురుకుదనంపై నడుచుట, లేక నా చెప్పు ను పాదంతో సహా కుట్టుకొనుట ఒక ముస్లిం సమాధిపై నడుచుట కంటే ఇష్టమైనది”. (ఇబ్ను మాజ 1567, సహీహుల్ జామి 5038).
శ్రద్ధగా వినండి. షేక్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుల్ జామేలో ప్రస్తావించారు 5038, ఇబ్ను మాజాలోని హదీస్ 1567. నిప్పులపై లేక ఖడ్గం యొక్క చురుకుదనంపై అది కొచ్చగా ఏదైతే ఉంటుందో కదా దేని ద్వారానైతే కోయడం జరుగుతుందో, నిప్పులపై లేక ఖడ్గం యొక్క చురుకుదనంపై నడుచుట, లేక నా చెప్పును నా పాదంతో సహా కుట్టుకొనుట. అయితే పాదంతో సహా చెప్పును కుట్టేస్తే ఏం జరుగుతుంది? ఒక పెద్ద సూదిని కాళ్ళల్లో గుచ్చినటువంటి అవస్థ, బాధ కలుగుతుంది కదా. ఇదంతా కూడా ఒక ముస్లిం సమాధిపై నడుచుట కంటే ఇష్టమైనది. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా? అంటే ఒక ముస్లిం సమాధిపై నడుచుట, ఆ, ఈ పనులు ఏవైతే మనకు బాధాకరంగా ఏర్పడతాయో, నష్టం ఇందులో జరుగుతుంది అని ఏర్పడుతుందో, నిప్పుల మీద నడవడం అంటే ఏదైనా సులభతరమా? మళ్ళీ చాలా పదునుగా ఉన్నటువంటి కత్తి మీద కాలు పెట్టి నడవడం అంటే? చెప్పు, ఉదాహరణకు దాని యొక్క గూడ తెగింది లేదా చెప్పు దాని యొక్క ఏదైనా పక్క మనం నడవడం కష్టమవుతుంది, చెప్పును పాదాన్ని కలిపి కుట్టేయడం. ఎంత ఇబ్బందికర విషయం! కానీ ఇక్కడ ప్రవక్త వారు ఏం చెబుతున్నారు? అంతకంటే ఎక్కువ నష్టం దేని ద్వారా? సమాధిపై నడవడం. అల్లాహు అక్బర్.
శ్మశాన వాటికను అగౌరవపరచడం
ప్రతి బుద్ధిమంతుడు ఆలోచించదగ్గ విషయం, సమాధులపై కూర్చుండుట, నడుచుట ఇంత పెద్ద పాపమైనప్పుడు, శ్మశాన భూమిని, ఖబరిస్తాన్‌ని ఆక్రమించుకొని దానిపై కమర్షియల్ లేక రెసిడెన్షియల్ స్కీమ్ ల ప్లాన్‌లు వేయుట ఎంత ఘోరమైన పాపమో ఆలోచించండి.
మరికొందరు దురదృష్టవంతులు శ్మశాన గోడలు కూడా దాటి తమ కాలకృత్యాలు తీర్చుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఇంటింటికీ టాయిలెట్ లాంటి సౌకర్యాల ఏర్పాటు జరిగిన తర్వాత తక్కువైంది కానీ అంతకుముందు, ఖబరిస్తాన్‌ని ఒక కాలకృత్యాలు తీర్చుకునే స్థలంగా మార్చుకునేవారు. కానీ దీని గురించి హదీస్ ఎంత కఠినంగా ఉందో గమనించండి, ఇబ్ను మాజా 1567:
అంటే ఏమిటి దీని అర్థం ఏంటి? నడి బజారులో తమ మర్మాంగాన్ని తెరిచి అవసరం తీర్చుకొనుట ఎంత అశ్లీలమో, చెడో, శ్మశానంలో చేయుట కూడా అంతే అశ్లీలం, అంతే చెడు.
అదే విధంగా, శ్మశానంలో చెత్తాచెదారం వేయువారు కూడా, ప్రత్యేకంగా ప్రహారీ గోడలు లేని శ్మశానాల్లో లేదా గోడలు చిన్నగా ఉన్నచోట, తీసుకొచ్చి ఎత్తి అటు పడేస్తారు. ఇలాంటి వారందరిపై ఇలాంటి హెచ్చరికలే వర్తిస్తాయి అన్న విషయం వారు గమనించాలి. మరియు శ్మశాన స్థలాన్ని, ఖబరిస్తాన్ యొక్క స్థలాన్ని ఆక్రమించుకునే ఎన్నో వార్తలు ఇప్పటికీ వస్తూ ఉంటాయి. అలాంటి వారికి ఈ హదీసులు వినిపించాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో వ్యభిచారం (జినా) యొక్క నిషేధం గురించి, దాని తీవ్రత, అది దారితీసే మార్గాలను ఇస్లాం ఎలా నిరోధిస్తుంది, మరియు ఈ పాపానికి పాల్పడిన వారికి ప్రపంచంలో మరియు మరణానంతరం విధించబడే కఠిన శిక్షల గురించి చర్చించబడింది. హిజాబ్ (పరదా) యొక్క ఆవశ్యకత, చూపులను అదుపులో ఉంచుకోవడం, మరియు ఒంటరిగా పర స్త్రీ-పురుషులు కలవడాన్ని ఇస్లాం ఎందుకు నిషేధించిందో వివరించబడింది. వివాహితులు మరియు అవివాహితులు చేసే వ్యభిచారానికి గల శిక్షలలో తేడా, వృద్ధాప్యంలో ఈ పాపానికి పాల్పడటం యొక్క తీవ్రత, మరియు పేదరికాన్ని కారణంగా చూపి ఈ పాపంలో మునిగిపోవడాన్ని ఇస్లాం అంగీకరించదని స్పష్టం చేయబడింది. ఆధునిక సమాజంలో వ్యభిచారానికి దారితీసే కారణాలను వివరిస్తూ, ఈ చెడు నుండి దూరంగా ఉండేందుకు అల్లాహ్‌ను ప్రార్థించడం జరిగింది.
ఇక రండి ఈనాటి కాలంలో చాలా ప్రబలుతున్నటువంటి, ప్రత్యేకంగా ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత, నెట్ టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఏ నిషేధాల్లో అనేకమంది ప్రజలు పడుతున్నారో దాని గురించి తెలుసుకుందాము. అది వ్యభిచారం.
ఇస్లాం ధర్మ ఉద్దేశాల్లో మానము మరియు గౌరవముల రక్షణ మరియు సంతానోత్పత్తి రక్షణ చాలా ముఖ్యమైనది. అందుకే ఇస్లాం వ్యభిచారాన్ని నిషేధించింది. అల్లాహ్ త’ఆలా సూరత్ బనీ ఇస్రాయీల్ ఆయత్ నంబర్ 32 లో తెలిపాడు,
وَلَا تَقْرَبُوا الزِّنَا ۖ إِنَّهُ كَانَ فَاحِشَةً وَسَاءَ سَبِيلًا “వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదు సుమా! ఎందుకంటే అది నీతి బాహ్యమైన చేష్ట. మహా చెడ్డమార్గం” (17:32)
వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకండి. ఇక్కడ గమనించండి ఆయతులో ‘లా తఖ్రబు’ అని చెప్పబడింది. ‘లా తజ్నూ’ వ్యభిచారం చేయకండి అని డైరెక్ట్ గా చెప్పలేదు. ‘లా తఖ్రబు’ అంటే ఆ వ్యభిచారం వరకు చేర్పించే ఏ ఏ మార్గాలు ఉంటాయో అవన్నిటినీ వదులుకోండి, వాటి దగ్గరికి వెళ్ళకండి.
నిశ్చయంగా అది అతి దుష్టకార్యం మరియు చాలా బహు చెడ్డ మార్గం. షేక్ ఉథైమీన్ రహిమహుల్లాహ్ ఈ రెండు పదాల యొక్క మంచి వ్యాఖ్యానం కూడా చేసి ఉన్నారు. ఎందుకు దీనిని చెడ్డ మార్గం అనడం జరిగింది? ఎందుకు దీనిని అశ్లీలం, అతి దుష్టకార్యం అని చెప్పడం జరిగింది? అయితే సోదర మహాశయులారా, ఇన్షాఅల్లాహ్ దానికి సంబంధించి ప్రత్యేకమైన దర్స్ ఇచ్చినప్పుడు ఇంకా వివరాలు విందాము.
సర్వసామాన్యంగా వ్యభిచారానికి పాల్పడే అటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? దానికంటే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించనందువల్ల. అందుకే దాని వరకు చేర్పించే మార్గాలను ఇస్లాం నిషేధించింది. దాని వరకు చేర్పించే సాధనాలను కూడా మూసివేసింది.
హిజాబ్ (పరదా) యొక్క ఆవశ్యకత
ఈ మార్గాలను, వ్యభిచారం వరకు చేర్పించే సాధనాలను ఏదైతే మూసివేశాడో, వాటిలో ఒకటి ఏమిటి? అల్లాహ్ త’ఆలా హిజాబ్ యొక్క ఆదేశం ఇచ్చాడు, పరదా యొక్క ఆదేశం ఇచ్చాడు. నేను ప్రత్యేకంగా దీనిని కూడా హెడ్ లైన్ గా, రెడ్ లైన్ గా, రెడ్ కలర్ లో ఇచ్చి దానికి లింక్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పటికీ మన సమాజంలో ప్రబలి ఉన్నటువంటి గోదీ మీడియా అనండి లేదా స్వార్థపరులైన పత్రికా రిప్రజెంటేటివ్స్, టీవీ ఛానల్స్ వాళ్ళు ఇస్లాం జ్ఞానం మొత్తానికే లేదు వారికి, ఇస్లాంలో ఎక్కడా కూడా పరదా యొక్క ఆదేశం లేదు అని అంటారు, అస్తగ్ఫిరుల్లాహ్.
ఇక్కడ చూడండి, సూరతుల్ అహ్ జాబ్, సూరా నంబర్ 33, ఆయత్ నంబర్ 53. అలాగే సూరతుల్ అహ్ జాబ్ ఆయత్ నంబర్ 59 లో అల్లాహ్ త’ఆలా పరదా యొక్క ఆదేశం ఇచ్చాడు. ఈ ఆదేశం చాలా స్పష్టంగా ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా చెబుతున్నాడు, మీరు స్త్రీలతో ఏదైనా అడగాలనుకుంటే,
فَسْـَٔلُوْهُنَّ مِنْ وَّرَاۤءِ حِجَابٍ (ఫస్ అలూహున్న మివ్ వరా’ఇ హిజాబ్) “పరదా వెనుక ఉండి అడగాలి.” (33:53)
హిజాబ్ వెనుక ఉండి అడగాలి. ముంగటగా అటు ఒక స్త్రీ ఉంది, ఇటు నేను ఉన్నాను, డైరెక్ట్ గా అడగకూడదు. ఏదైనా ఇద్దరి మధ్యలో అడ్డు ఉండాలి, పరదా ఉండాలి, హిజాబ్ ఉండాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ‘ఫస్ అలూహున్న’ అనేది అమ్ర్ (ఆర్డర్, ఆదేశం). అంతేకాకుండా ‘మివ్ వరా’ఇ హిజాబ్’ అని చెప్పాడు అల్లాహ్ త’ఆలా. ఇది డైరెక్ట్ ఆదేశమే ఉన్నది. ఇక ఖుర్ఆన్లో ఎక్కడా కూడా పరదా ఆదేశం లేదు అని అంటారు? ఇది వారి యొక్క అజ్ఞానం. వాస్తవానికి ఇది వారి యొక్క అజ్ఞానం.
అలాగే సోదర మహాశయులారా, సోదరీమణులారా, మరొక విషయం చాలా స్పష్టంగా తెలుసుకోండి. ఆయత్ నంబర్ 59 లో కనబడుతుంది. అక్కడ అల్లాహ్ త’ఆలా అంటున్నాడు,
قُلْ (ఖుల్) “ఓ ప్రవక్త, మీరు చెప్పండి.” (33:59)
వారికి ఆదేశం ఇవ్వండి. ఎంత స్పష్టంగా ఉంది! చెప్పండి, ఆదేశం ఇవ్వండి,
ఆదేశం ఇవ్వండి అని ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత, ఇది ఇష్టంపై ఆధారపడి ఉంది అని ఎలా చెప్పగలుగుతాము? మరియు వాటన్నిటికంటే ముందు ఎక్కడైనా ఏదైనా అవసరంతో ఎవరైనా స్త్రీ బయటికి వెళ్లాలంటే స్త్రీల యొక్క చూపులు ఎక్కడ ఉండాలి? పురుషుల యొక్క చూపులు ఎక్కడ ఉండాలి? సూరతున్ నూర్, ఆయత్ నంబర్ 31లో స్పష్టంగా చెప్పడం జరిగింది.
మన యొక్క ఈనాటి అంశం పరదా గురించి కాదు, కానీ మాట వచ్చింది గనుక కొన్ని వివరాలను మీకు తెలియజేశాను. ఇవి సరిపోతాయి, మరిన్ని మీరు అక్కడ లింక్ ని క్లిక్ చేసి ఇన్షాఅల్లాహ్ తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా ‘సాధనాలను’ అని ఏదైతే మీరు పదం చూస్తున్నారో రెడ్ కలర్ లో, దాన్ని క్లిక్ చేస్తే పరదాకు సంబంధించిన పూర్తి ఒక వీడియో మీకు ఇన్షాఅల్లాహ్ ఓపెన్ అవుతుంది.
వ్యభిచారం వరకు చేరవేసే సాధనాలను, అక్కడి వరకు కూడా చేరుకోకూడదు అని అల్లాహ్ త’ఆలా పరదా యొక్క ఆదేశం చాలా స్పష్టంగా ఇచ్చాడు. చూపులను క్రిందికి ఉంచాలి అని ఆదేశం ఇచ్చాడు. పరస్త్రీలతో ఒంటరిగా, ఏకాంతంలో ఉండడాన్ని నిషేధించాడు. అంతేకాదు, ఆ తర్వాత కూడా ఎవరైనా ఇన్ని కండిషన్లను దాటేసి, మితిమీరి వ్యభిచారానికి పాల్పడ్డాడంటే, ఇక వారికి శిక్ష విధించడం జరిగింది. ఈ శిక్ష వారు చేసుకున్న కర్మలకు ఫలితంగా మరియు ఆ శిక్ష అందరి ముందు ఇవ్వాలని చెప్పడం జరిగింది, ఇతరులందరికీ కూడా గుణపాఠం లభించాలని.
వ్యభిచారానికి శిక్షలు
శ్రద్ధగా వినండి. వివాహితుడైన వ్యభిచారికి అతి కఠినమైన శిక్ష విధించింది ఇస్లాం. అతను చనిపోయేవరకు అతనిపై రాళ్లు రువ్వబడాలి. ఎందుకంటే తాను చేసిన చెడు కార్యపు ఫలితాన్ని అతడు చవి చూడాలి. అతని శరీరము యొక్క ప్రతీ భాగం, అంగం ఆ నిషిద్ధ కార్యం చేస్తూ ఎలా సుఖాన్ని అనుభవించినదో, అలాగే ఈ శిక్ష ద్వారా బాధను, నొప్పిని అనుభవించాలి. ఇది ఎవరి కొరకు? వివాహితుడైన, పెళ్లి అయిన తర్వాత భార్యతో అతడు సంసారం చేసేసాడు, ఆ తర్వాత మళ్లీ వ్యభిచారానికి పాల్పడ్డాడు, అలాంటి వానికి ఈ శిక్ష.
కానీ ఇక ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో, వివాహం కాని వ్యభిచారిపై వంద కొరడా దెబ్బల శిక్ష విధించాలి. ఇది ఇస్లామీయ శిక్షల్లో నియమించబడిన అతి ఎక్కువ శిక్ష. వేరే కొన్ని రకాల పాపాలకు కొన్ని రకాల కొరడా దెబ్బలు ఉన్నాయి, కానీ వాటి సంఖ్య తక్కువ. ఇక్కడ వివాహం కాని యువకుడు, యువతి వ్యభిచారానికి పాల్పడితే వంద కొరడా దెబ్బల శిక్ష, ఇది చాలా ఎక్కువ సంఖ్య, ఈనాటి ఈ పాపానికే విధించబడినది.
అంతేకాదు, విశ్వాసుల సమూహ సమక్షంలో అతనిపై ఈ శిక్ష విధించి, ఆ తర్వాత పూర్తి ఒక సంవత్సరం వరకు ఈ నేరానికి పాల్పడిన స్థలం నుండి దూరం చేసి మరింత అవమానం, అగౌరవం పాలు చేయాలి. ఇది ప్రాపంచిక శిక్ష.
చెప్పేకి ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. వివాహితునికైనా, వివాహం కాని వానికైనా ఈ శిక్ష విధించాలని ఏదైతే చెప్పడం జరిగిందో, మనం సామాన్య మనుషులం, ఎవరికి ఇష్టం ఉంటే వారు ఆ విధంగా కాదు. ఒక ప్రభుత్వం, అధికారం చేతిలో ఉన్నవారు ఈ శిక్షను విధిస్తారు.
సమాధిలో శిక్ష
ఇక రండి, ఎవరైతే ఇహలోకంలో ఏదో రకంగా తప్పించుకున్నారు, శిక్ష పడలేదు, అలాంటి వారికి సమాధిలో ఎలాంటి ఘోరమైన శిక్ష ఉంటుందో గమనించండి.
పైన ఇరుకుగా, కింద వెడల్పుగా ఉండే కుండ లాంటి ఆవంలో వారు నగ్నంగావేయబడతారు, అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహుమ్మ అజిర్నా మిన్హు. ఓ అల్లాహ్ మమ్మల్ని రక్షించు ఇలాంటి పాపాల నుండి, ఇలాంటి శిక్షల నుండి. దాని కింద అగ్ని మండుతూ ఉంటుంది. అందులో జ్వాలలను ప్రజ్వలింప జేసినప్పుడల్లా వారు అరుస్తూ దాని నుండి బయట పడడానికి పైకి వస్తారు. కానీ అప్పుడే మంటలు చల్లారి వారు మళ్ళీ లోపలికి పడిపోతారు. ఇలా పైకి రావడం, జ్వాలలు ఎగిరినప్పుడు, అవి చల్లారినప్పుడు కిందికి పోవడం, అగ్నిలో కాలుతూ ఉండడం, అరుస్తూ ఉండడం, ఇది జరుగుతూనే ఉంటుంది ప్రళయం వరకు.
క్షణాల సుఖం కొరకు సంవత్సరాల తరబడి శిక్ష, ఇది ఏదైనా బుద్ధి జ్ఞానంలో వచ్చే మాటేనా? కానీ ప్రపంచ వ్యామోహంలో పడి, స్త్రీల యొక్క ఫితనాలలో పడి ఎందరో దీనికి పాల్పడుతున్నారు. ఎందరో స్త్రీలు సోషల్ మీడియాల ద్వారా ఇలాంటి పాపానికి పాల్పడుతున్నారు. అల్లాహ్ అందరికీ హిదాయత్ ప్రసాదించుగాక.
వృద్ధాప్యంలో చేసే పాపం యొక్క తీవ్రత
పరిస్థితి మరింత ఘోరంగా మారేది ఎప్పుడు? మనిషి వృద్ధాప్యానికి చేరుకొని సమాధికి సమీపించే సమయం వచ్చినప్పటికీ, అల్లాహ్ శిక్షించకుండా అతనికి ఇచ్చిన వ్యవధిని తౌబా కొరకు, అల్లాహ్ తో మాఫీ కొరకు ఉపయోగించుకోకుండా, దుర్వినియోగం చేసుకొని వ్యభిచారంలోనే మునిగి తేలుతున్నప్పుడు. ఏంటి ఆ విషయం? వినండి హదీస్ ద్వారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారని అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు.
“ప్రళయదినాన ముగ్గురితో అల్లాహ్ మాట్లాడడు, వారిని శుద్ధపరచడు మరియు వారి వైపు చూడడు. వారికి కఠిన శిక్ష కలుగునుః వృద్ధ వ్యభిచారి. అబద్ధం పలికే రాజు. అహంకారం చూపే పేదవాడు”. (ముస్లిం 107).
గమనించారా? వృద్ధాప్యానికి చేరుకోబోతూ కూడా ఈ దుర్గుణాలకు దూరం కాకుంటే, అల్లాహ్ వైపు నుండి ఎంతటి కఠినమైన శిక్ష ఉందో గమనించండి.
వ్యభిచారం ద్వారా సంపాదన
సంపదల్లో అతి చెడ్డది వ్యభిచార సంపద. ఏ వ్యభిచారిణి తన వ్యభి చారం ద్వారా డబ్బు సంపాదిస్తుందో అర్థ రాత్రి ఆకాశ ద్వారాలు తెరువ బడే సమయాన ఆమె దుఆ స్వకరించబడదు. (సహీహుల్ జామి 2971).
ఇక దీని గురించి మరొక విషయం, సంపదల్లో అతి చెడ్డది వ్యభిచార సంపద. ఈ రోజుల్లో ఎందరో దీనిని సంపాదన మార్గంగా చేసుకున్నారు. అల్లాహ్ హిదాయత్ ఇవ్వుగాక. అయితే అలాంటి సంపద చాలా చెడ్డది. ఏ వ్యభిచారిని తన వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదిస్తుందో, అర్ధరాత్రి ఆకాశ ద్వారాలు తెరువబడే సమయాన, అల్లాహ్ త’ఆలా అందరి యొక్క దుఆలను అంగీకరించే సమయాన, అల్లాహ్ త’ఆలా అందరి యొక్క రోదనలను, వారి యొక్క ఆర్ధింపులను వింటున్న సమయాన ఆ వ్యభిచారి యొక్క దుఆ స్వీకరించబడదు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎంత ఘోరమైన శిక్ష చూడండి ఇది కూడా. అందుకొరకు ఇలాంటి పాపాల నుండి స్వచ్ఛమైన తౌబా చేసికోవాలి.
ఇక పేదరికం, అవసరం కొందరంటారు కదా, పేదరికం ఉన్నది, ఎక్కడా మాకు ఏ మార్గం లేదు, మా బ్రతుకు తెరువు ఎలా గడవాలి, మేము చాలా గత్యంతరం లేని పరిస్థితిలో ఉన్నాము, అందుకొరకే ఈ చెడుకు పాల్పడ్డాము. అయితే, పేదరికం, అవసరం అల్లాహ్ హద్దులను మీరడానికి ఎంతమాత్రం ధార్మిక సబబు కావు. అరబ్బుల్లో జాహిలియ్యత్ లో, ఇస్లాం రాకముందు అరబ్బులో ఒక సామెత ఉండేది, “స్వతంత్రు రాలైన స్త్రీ ఆకలిగొన్నప్పుడు తన రొమ్ముల వ్యాపారం చేసి (పాలు అమ్మి) తినదు అలాంటప్పుడు తన మానాన్ని అమ్మి ఎలా తింటుంది“.
ముగింపు
నేటి కాలంలో ఈ అశ్లీల కార్యానికి ప్రతి ద్వారము తెరువబడింది. షైతాన్ తన మరియు తన అనుచరుల కుట్రలతో ఈ మార్గాలను సులభం చేశాడు. అవిధేయులు, దుష్టులు వానిని అనుసరించారు. ఇప్పుడు పరదా లేకుండా తిరగడం, చూపులు నలువైపుల్లో లేపి నిషిద్ధమైన వాటిని చూడటం, స్త్రీలు పురుషులు విచ్చలవిడిగా కలుసుకోవడం సర్వసాధారణమయ్యాయి. కామవాంఛల్ని రేకెత్తించే మ్యాగజిన్లు, నీలి చిత్రాలు సర్వసామాన్యమయ్యాయి. దుర్మార్గ ప్రదేశాలకు ప్రయాణాలు అధికమయ్యాయి. వేశ్యా గృహాలు లైసెన్సులు ఇచ్చి తెరువబడుతున్నాయి, అల్లాహు అక్బర్. ఎందుకంటే ఆర్థికంగా వారికి అందులో కమిషన్ దొరుకుతున్నాయని. మానభంగాలు పెచ్చరిల్లుతున్నాయి, అసంఖ్యాక అక్రమ సంతానాలు కలుగుతున్నాయి, అబార్షన్ల ద్వారా పిండాలను హతమార్చడం జరుగుతుంది.
ఓ అల్లాహ్, మేము నీ దయా కరుణ ద్వారా మా దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం కోరుతున్నాము. ఇంకా మా హృదయాలను శుద్ధపరచి, మా మానాలను కాపాడుము, మాకు నిషిద్ధ కార్యాలకు మధ్య పటిష్టమైన అడ్డు నిలుపుము. ఆమీన్. అందుకొరకే దుఆ చేసుకుంటూ ఉండాలి.
اَللّٰهُمَّ طَهِّرْ قُلُوْبَنَا (అల్లాహుమ్మ తహ్హిర్ ఖులూబనా) ఓ అల్లాహ్ మా హృదయాలను శుద్ధిపరచు
اَللّٰهُمَّ أَحْصِنْ فُرُوْجَنَا (అల్లాహుమ్మ అహ్సిన్ ఫురూజనా) మా మర్మాంగాలను కాపాడు.
ఓ అల్లాహ్ మా చూపులను మేము కిందికి వాలించి, కిందికి వేసి ఉండే విధంగా మాపై ఎల్లప్పుడూ భాగ్యం ప్రసాదించు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో చూపును అదుపులో ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పబడింది. పర స్త్రీని లేదా పర పురుషుడిని దురుద్దేశంతో చూడటం అనేది పాపమని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరించబడింది. చూపును అదుపులో ఉంచుకోవడం ద్వారా మర్మాంగాలను కాపాడుకోవచ్చని, ఇది పవిత్రమైన పద్ధతి అని అల్లాహ్ ఆదేశించారని చెప్పబడింది. చూపు అనేది వ్యభిచారానికి మొదటి బీజం అని, దానిని అదుపులో ఉంచుకోకపోతే అది పెద్ద పాపాలకు దారితీస్తుందని హెచ్చరించబడింది. ధార్మిక అవసరాలైన పెళ్లి చూపులు, వైద్య చికిత్స వంటి సందర్భాల్లో పర స్త్రీని చూడవచ్చని, అయితే కొన్ని నియమాలను పాటించాలని సూచించబడింది. ఆధునిక కాలంలో సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్ల ద్వారా అశ్లీల చిత్రాలు చూడటం కూడా పాపమని, వాటికి దూరంగా ఉండాలని ఉద్బోధించబడింది.
పర స్త్రీని ఉద్దేశపూర్వకంగా చూచుట, అలాగే ఎవరైనా స్త్రీ పర పురుషుడిని ఉద్దేశపూర్వకంగా చూచుట.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతున్ నూర్ ఆయత్ నంబర్ 30లో ఆదేశించాడు.
قُل لِّلْمُؤْمِنِينَ يَغُضُّوا مِنْ أَبْصَارِهِمْ وَيَحْفَظُوا فُرُوجَهُمْ ۚ ذَٰلِكَ أَزْكَىٰ لَهُمْ ۗ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا يَصْنَعُونَ “ప్రవక్తా! విశ్వసించిన పురుషులకు తమ చూపులను క్రిందికి దించుకోండి (అదుపులో ఉంచుకోండి), తమ మర్మాంగాలను కాపాడుకోండి అని మీరు ఆదేశించండి. వారికి చెప్పండి. ఇది వారికి ఎంతో పరిశుద్ధమైన పద్ధతి. వారు చేసే దాని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు.”
ఆ తర్వాత గమనించండి,
ذَٰلِكَ أَزْكَىٰ لَهُمْ (జాలిక అజ్కాలహుమ్) ఇది వారికి ఎంతో పరిశుద్ధమైన పద్ధతి.
ఈ ఆయత్, ఇది మనసులో నాటుకోండి. మనం ఏదైనా అవసరానికి బయటికి వెళ్ళాము, ఎవరైనా స్త్రీ ముఖముపై పరదా లేకుండా, లేదా టైట్ బురఖా వేసుకొని, లేదా ఏ అలంకరణను దాచి పెట్టడానికి బురఖా ఉందో, ఆ బురఖాయే మొత్తం అలంకరణతో, డిజైన్లతో, ఎంబ్రాయిడింగ్ తో, అక్కడ ఓ కలర్, ఇక్కడ ఓ కలర్, ఈ విధంగా, ఇలా ఒకవేళ ఎవరైనా స్త్రీలు ఎదురైతే, వారిని చూడకుండా మన యొక్క చూపును కాపాడుకోవడం.
సేమ్ ఇలాంటి ఆదేశమే స్త్రీలకు ఉంది, ఆ విషయం వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి. కళ్ళు అదుపులో ఉంచుకుంటే మర్మాంగం కూడా రక్షణలో ఉంటుంది అన్నటువంటి విషయం ఇక్కడ అల్లాహ్ ఏదైతే చెబుతున్నాడో, దీని ద్వారా మీరు గమనించండి. మర్మాంగాల కలయిక ద్వారా ఏ వ్యభిచారం అయితే సంభవిస్తుందో, దానికి మొట్టమొదటి బీజం, పునాది ఎక్కడి నుండి అయితే ఈ చెడు ప్రారంభమవుతుందో, చూపు. దానినే ఎలా అదుపులో ఉంచుకోవాలని ఇస్లాం ఆదేశించింది.
అసలైన అశ్లీలత అక్కడి వరకు తీసుకువెళ్ళడానికి షైతాన్ యొక్క అడుగుజాడలు ఎన్ని ఉంటాయో గమనించండి. చూపే కదా ముందు? చూసిన తర్వాత, ఇక్కడ (మైండ్ లో ) కదులుతుంది. ఇది (హృదయం) శాంతంగా ఉండదు. ఆ తర్వాత కలుసుకోవాలి అన్నటువంటి ఆలోచనలు, ఆ తర్వాత అడుగులు, ఆ తర్వాత మాటలు, ఆ తర్వాత వినికిడి, ఆ తర్వాత చేతులు, నాలుక, పెదవులు, ఎన్ని జరుగుతాయి, ఆ తర్వాత చివరి అశ్లీలం జరిగినప్పటికీ, అయ్యో ఛీ! ఆ ముందు చూపే చాలా పాడు, అది జరగకుండా ఉంటే ఎంత బాగుండు అని తల పట్టుకుంటే ఏమైనా లాభమా? గమనించండి.
అల్లాహ్ ఏమంటున్నాడు?
ذَٰلِكَ أَزْكَىٰ لَهُمْ (జాలిక అజ్కాలహుమ్) చూపును క్రిందకి ఉంచుకోవడం ద్వారా, అందులో వారి యొక్క పరిశుద్ధత ఉంది.
ఆ తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడు?
إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا يَصْنَعُونَ (ఇన్నల్లాహ ఖబీరుమ్ బిమా యస్నఊన్) “వారు చేసే దాని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు.”
సోదర మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఉపదేశించారని సహీ బుఖారీలో హదీస్ ఉంది. హదీస్ నెంబర్ 6243. ఏంటి?
فَزِنَا الْعَيْنِ النَّظَرُ (ఫజినల్ ఐని అన్నజర్) “(నిషిద్ధమైన వాటి వైపునకు) చూచుట, ఇది కళ్ళ వ్యభిచారం అవుతుంది.”
అల్లాహు అక్బర్. అసలు వ్యభిచారానికి కంటే ముందు, ఈ పనులు ఏవైతే ఉన్నాయో, వీటిని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యభిచారం అన్నటువంటి పేరు ఇచ్చారంటే, వీటికి మనం దూరం ఉండడం ఎంత అవసరమో గమనించండి.
ధార్మిక అవసరంతో పర స్త్రీని చూచుట
ధార్మిక అవసరంతో పర స్త్రీని చూచుట తప్పు కాదు. ధార్మిక అవసరం ఏంటి? పెళ్లి చూపులు అని ఏదైతే మనం అనుకుంటామో. పెళ్లి చేసుకునే ఉద్దేశంతో మంగేతర్ (నిశ్చితార్ధమైన స్త్రీ) అంటే, ఏ అమ్మాయి నిశ్చితార్థమైనదో, సంబంధం ఇక అన్నీ ఓకే అయినాయి, కేవలం చివరి ఒక చూపు అన్నట్లుగా, అది దాని కొరకు అనుమతి ఉంది హదీసుల ద్వారా. లేక డాక్టర్ రోగిని చూచుట. కానీ ఏకాంతంలో కాకుండా, ఎవరైనా మహరమ్ ఆమెతో పాటు ఆ సందర్భంలో ఉండాలి.
ఈ రోజుల్లో, ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాను, మీరు గమనించే ప్రయత్నం చేయండి. మహరమ్ వెంబడి ఉన్నాడు. పళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది ఒక స్త్రీకి. అలాంటప్పుడు, మొత్తం పరదా తీసేస్తారు ట్రీట్మెంట్ కొరకు. కదా? సర్వసాధారణంగా జరుగుతుంది కదా? కానీ ఇలాంటి చోట, కొంచెం ఆ డాక్టర్ చూడకుండా ఉండే సందర్భంలో, భర్త లేదా సోదరుడు వెంబడి ఉన్నాడు, ఆ సమయంలో, కళ్ళు కనబడడానికి ఏ స్కార్ఫ్ అయితే కట్టుకున్నారో, ఆ స్కార్ఫ్, ఆ ప్రదేశం ఏదైతే ఉందో, దాన్ని ఉల్టా గాని, కొంచెం కిందికి గాని కట్టుకొని, ఇక్కడి వరకు ఇలా ఓపెన్ ఉండి, మిగతా మొత్తం బంద్ ఉండేది ఉంటే, అలా కూడా ట్రీట్మెంట్ జరగవచ్చు కదా? సాధ్యం కాదా? అవుతుంది, ఎందుకు కాదు? తెలుసు మన తల్లులకు, మన సోదరీమణులకు, కడుపు చోట లేదా నాభి కింద ఏదైనా అవసరం ఉన్నప్పుడు, ముందు నర్స్ పేషెంట్ ని తీసుకెళ్ళి, శరీరంపై ఉన్న వస్త్రాలు ఇక్కడి వరకు తీసేసి, ఒక గ్రీన్ లాంటిది కప్పుతారు, అక్కడ కొంచెం రంధ్రం ఉంటుంది, ఎక్కడైతే డాక్టర్ చూసే అవసరం ఉంటుందో. అవునా లేదా? అలాంటి విషయాలు వాటితో గుణపాఠం నేర్చుకొని, వేరే సందర్భంలో మనం అనవసరంగా మన ముఖం ఒక పర పురుషుడు చూడకుండా స్త్రీ స్వయంగా ఈ పద్ధతి పాటించే, ఇలాంటి ఘైరత్, హమియ్యత్ ఉంచుకునే ప్రయత్నం రేషం అనేది ఉండాలి, ఆమె దీని కొరకు ప్రయత్నం చేయాలి.
మరొక విషయం ఈ సందర్భంలో, పెళ్లి చూపుల గురించి ఏదైతే మాట వచ్చిందో, అల్లాహ్ హిదాయత్ ఇవ్వు గాక! కొందరు యువకులు, ఆ యువకుల యొక్క తల్లులు, కొడుకు సంబంధం విషయం అని ఎందరో అమ్మాయిలను చూచుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి అనుమతి లేదు. నీ బిడ్డ విషయంలో ఈ రోజు నీ కొడుకు గురించి 10 ఇండ్లల్లో తిరిగి 10 అమ్మాయిలను కేవలం ఒక స్త్రీ చూడటమే కాకుండా, ఆ అబ్బాయికి, అబ్బాయి యొక్క తండ్రికి, అబ్బాయి యొక్క పెద్ద అన్న ఉండేది ఉంటే వారికి కూడా చూపించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, ఒక్కసారి ఇలాంటి స్త్రీలు, తల్లులు ఆలోచించాలి, ఆమె బిడ్డను చూడడానికి 10 మంది వచ్చి తిరస్కరిస్తే ఆ అమ్మాయి యొక్క మైండ్ సెట్ ఎలా అవుతుంది? ఆమె ఆలోచనా విధానం ఎలా అవుతుంది? ఎంత ఆమె మనస్తాపానికి గురి అవుతుంది? అసలు విషయం చూసుకోవడానికి ఏమిటి? తల్లుల ద్వారా, సోదరీమణుల ద్వారా, పిన్నమ్మల ద్వారా, మేనత్తల ద్వారా ఎవరైనా అమ్మాయి గురించి, ఆమె యొక్క డిటైల్స్ అన్నీ ఏవేవైతే ఒక సంబంధం మంచిగా ప్రేమగా కుదిరి ఉండడానికి అవసరం ఉన్నాయో, తెలుసుకున్న తర్వాత, కేవలం కాబోయే పెళ్లి కుమారుడు, కాబోయే ఈ యువకుడు, భర్తగా కాబోయే ఈ యువకుడు ఒకసారి చూసుకోవడం, దీని ద్వారా ప్రేమ పెరుగుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక శుభవార్త, ఒక శుభ సూచన ఇచ్చారు. కానీ అక్కడ ఆ సదుద్దేశాన్ని మరచి, ఈ రోజుల్లో, అమ్మా, ఏక్ బార్ ఖోల్ కే, మూతి ఇంత పెద్దగా ఇప్పి పళ్ళన్నీ చూపించమని అంటారు. ఆ సమయంలో, ఒక స్త్రీ ఈ మాట చెప్పినప్పుడు, స్వయంగా గమనించాలి. ఆ తల్లి ఎవరైతే ఇలాంటి విషయాలు అడుగుతారో, మీ బిడ్డ విషయంలో ఇలా అడిగినప్పుడు మీకు ఎంత బాధ కలుగవచ్చు? చెప్పాలంటే ఈ పెళ్లిళ్ల విషయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, జరుగుతున్నటువంటి దురాచారాలు, సమయం సరిపోదు. ముందుకు సాగుదాము.
అలాగే స్త్రీలు పురుషుని వైపు కూడా దురుద్దేశంతో చూడటం నిషిద్ధం. అల్లాహ్ ఇచ్చినటువంటి ఆదేశం సూరతున్ నూర్ ఆయత్ నంబర్ 31.
وَقُل لِّلْمُؤْمِنَاتِ يَغْضُضْنَ مِنْ أَبْصَارِهِنَّ وَيَحْفَظْنَ فُرُوجَهُنَّ “ప్రవక్తా! విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు, తమ చూపులను క్రిందికి దించుకోండి, అదుపులో ఉంచుకోండి, తమ మర్మాంగాలను రక్షించుకోండి.”
అదే విధంగా, గడ్డం, మీసాలు మొలవని అందమైన నవ యువకుని వైపు కామోద్దేశంతో చూచుట కూడా నిషిద్ధం. ఇంకా, ఒక పురుషుడు ఇంకొక పురుషుని మర్మాంగాన్ని, ఒక స్త్రీ ఇంకొక స్త్రీ మర్మాంగాన్ని చూచుట నిషిద్ధం. ఏ మర్మాంగాన్ని అయితే చూచుట నిషిద్ధమో, దాన్ని ముట్టుకొనుట కూడా నిషిద్ధం. అది ఏదైనా అడ్డు నుంచైనా సరే.
ఇక సోషల్ మీడియాలో, స్మార్ట్ ఫోన్ లు ఇంట్లో వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? కొందరు పత్రికల్లో, సంచికల్లో, మ్యాగజైన్ లలో, ఫిలింలలో, ఇంకా వారి యొక్క మొబైల్ లలో, ఏ ఫోటోలు అయితే చూస్తూ ఉంటారో, వాటిని ఏమనుకుంటారు? కేవలం ఇవి బొమ్మలు. వాస్తవికతలు కావు అన్న భ్రమలో షైతాన్ వారిని పడవేస్తున్నాడు. నగ్న, అర్ధనగ్న ఫోటోలను మ్యాగజైన్ లలో, టీవీ, థియేటర్లలో, మొబైల్ లలో, స్మార్ట్ ఫోన్ లలో చూడడం వలన భావోద్రేకాలలో ఎలాంటి ఉత్తేజం కలుగుతుందో, ప్రతి తెలివి గలవాడు గ్రహించగలడు. అందుకే, వాటికి దూరంగా ఉండాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.