మీలో శ్రేష్ఠులు (ఉత్తములు) ఎవరు? [వీడియో]

మీలో శ్రేష్ఠులు (ఉత్తములు) ఎవరు? [వీడియో]
https://youtu.be/UWBPnXxETVA [20 నిముషాలు]

خَيْرُكُمْ مَنْ تَعَلَّمَ الْقُرْآنَ وَعَلَّمَهُ
మీలో ఖుర్ఆన్ నేర్చుకొని ఇతరులకు నేర్పించినవారే అందరిలోకెల్లా ఉత్తములు”.(బుఖారి-5027)
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్ హు) వారి కథనం:

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు గొడవ పడడం లేదా దుర్భాష మాట్లాడే వారు కారు. వారు ఇలా బోధించేవారు: “మీలో ఉత్తమమైన వారు సత్ప్రవర్తన కలిగిన వారు.”
لَمْ يَكُنِ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَاحِشًا وَلَا مُتَفَحِّشًا وَكَانَ، يَقُولُ:” إِنَّ مِنْ خِيَارِكُمْ أَحْسَنَكُمْ أَخْلَاقًا”
(సహీహ్ బుఖారి 3559)

సయ్యిదా ఆయేషా ( రదియల్లాహు అన్ హా) వారి ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ (ﷺ) వారు ఇలా బోధించారు:

خَيْرُكُمْ خَيْرُكُمْ لِأَهْلِهِ، وَأَنَا خَيْرُكُمْ لِأَهْلِي , وَإِذَا مَاتَ صَاحِبُكُمْ فَدَعُوهُ
మీలో ఉత్తములు, తమ కుటుంబంతో ఉత్తమంగా వ్యవహరించే వారు. నేను నా కుటుంబీకులతో సర్వోత్తమమైన రీతిలో వ్యవహరిస్తాను. మీలో మరణించిన వారిని వదిలివేయండి. (వారి తప్పులను గుర్తుచేయకండి)

(సునన్ తిర్మిజి 3895, అల్లామా అల్బాని వారు సహీహ్ ఖరారు చేశారు)

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్ హు) వారి ఉల్లేఖన, ప్రవక్త ముహమ్మద్ (ﷺ) వారు ఇలా ప్రవచించారు:

خَيْرُ النَّاسِ أَنْفَعُهُمْ لِلنَّاسِ
ఖైరున్నాసి అన్ ఫఉహుమ్ లిన్నాసి
ప్రజలకు ప్రయోజనం కలిగించిన వారే ఉత్తమమైన వారు (సహీహుల్ జామి 3289)

“ముందు సలామ్ చేసేవాడే అల్లాహ్ వద్ద ఉత్తముడు.”
‏ إِنَّ أَوْلَى النَّاسِ بِاللَّهِ مَنْ بَدَأَهُمْ بِالسَّلاَمِ.‏
-అబూదావూద్ (సహీహ్) 5197

Saheeh Muslim 440
خَيْرُ صُفُوفِ الرِّجَالِ أَوَّلُهَا، وَشَرُّهَا آخِرُهَا، وَخَيْرُ صُفُوفِ النِّسَاءِ آخِرُهَا، وَشَرُّهَا أَوَّلُهَا
పురుషుల వరుసల్లో, ఉత్తమమైనది మొదటి వరస మరియు చెడ్డది చివరి వరుస. స్త్రీల వరుసల్లో చెడ్డ వరుస మొదటి వరుస (అవి పురుషుల వరుసలకు దగ్గరగా ఉంటాయి) మరియు ఉత్తమ వరుస వెనుక వరుస (ఇవి పురుషుల వరుసలకు దూరంగా ఉంటాయి)

ఇమ్రాన్ బిన్ హుస్సైన్ (రదియల్లాహు అన్ హు) వారి ఉల్లేఖన, ప్రవక్త ముహమ్మద్ (ﷺ) వారు ఈ విధంగా ప్రవచించారు:

إِنَّ أَفْضَلَ عِبَادِ اللهِ تَبَارَكَ وَتَعَالَى يَوْمَ الْقِيَامَةِ , الْحَمَّادُونَ
ఇన్న అఫ్ దల ఇబాదిల్లాహి తబారక వ తఆలా యౌమల్ ఖియామతి అల్ హమ్మాదూన్
“నిశ్చయంగా అల్లాహ్ ను ఎక్కువగా పొగిడే వారు ప్రళయం రోజున అత్యుత్తమమైన దాసులుగా పరిగణించబడతారు”

(ముసనద్ ఇమామ్ అహ్మద్ 19909, అల్లామా అల్బాని వారు సహీహా 1584లో సహీహ్ ఖరారు చేశారు)

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్ హు) వారి కథనం. ఒకరోజు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిని ఇలా ప్రశ్నించారు:

أَىُّ النَّاسِ أَفْضَلُ قَالَ ‏”‏ كُلُّ مَخْمُومِ الْقَلْبِ صَدُوقِ اللِّسَانِ ‏”‏ ‏.‏ قَالُوا صَدُوقُ اللِّسَانِ نَعْرِفُهُ فَمَا مَخْمُومُ الْقَلْبِ قَالَ ‏”‏ هُوَ التَّقِيُّ النَّقِيُّ لاَ إِثْمَ فِيهِ وَلاَ بَغْىَ وَلاَ غِلَّ وَلاَ حَسَدَ ‏”

ఓ ప్రవక్త! ప్రజల్లో ఉత్తములు ఎవరు? ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా బదులిచ్చారు: “స్వచ్ఛమైన హృదయం మరియు సత్యం పలికేవారు” సహచరులు ఇలా అన్నారు: సత్యం పలకడం అంటే మాకు తెలుసు, కానీ స్వచ్ఛమైన హృదయం అంటే ఏమిటి? ఆయన ఇలా అన్నారు: “భయభీతిగల, పరిశుద్ధమైన, ఎటువంటి పాపము లేని, తిరుగుబాటు, ద్రోహం మరియు అసూయ లేకుండా ఉన్న హృదయం.”

{సునన్ ఇబ్ను మాజః 4216, అల్లామా అల్బానీ వారు సహీహుల్ జామి 3291 లో సహీహ్ గ వర్గీకరించారు}

అబ్దుల్లాహ్ బిన్ బసీర్ (రదియల్లాహు అన్ హు) వారి కథనం, ప్రవక్త ముహమ్మద్ (ﷺ) వారిని ఒక గ్రామీణుడు ఇలా ప్రశ్నించాడు:

ప్రజల్లో మంచి (భాగ్యం ఉన్న) వ్యక్తి ఎవరు? ప్రవక్త (ﷺ) వారు ఇలా బదులిచ్చారు:

مَنْ طَالَ عُمُرُهُ وَحَسُنَ عَمَلُهُ
మన్ తాల ఉమురుహు వ హసున అమలుహు
సుధీర్ఘమైన ఆయుష్షు కలిగిన వాడు మరియు అందులో సత్కార్యాలు చేసేవాడు.

(సునన్ తిర్మిజి 2329, అల్లామా అల్బాని వారు సహీహ్ ఖరారు చేశారు)

యూట్యూబ్ ప్లే లిస్ట్ – షరీఫ్ మదనీ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0AKZXyDn6KYNFu5ok4ZFtb

ఖురాన్ కథామాలిక [పుస్తకం]

ఖురాన్ కథామాలిక [పుస్తకం]

Quran Kadha Malika - Book - ShantiMargam

Qur'an Katha Maalika 
Selected Stories from Qur'an  (Telugu)

Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)

ఖురాన్ కథామాలిక
మూలం: షేఖ్ అబూబకర్ నజార్
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & హాఫిజ్ ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/quran-kadha-malika
[PDF] [374 పేజీలు] [డెస్క్ టాప్ బుక్] [16 MB]

కథా సూచిక

మాలికి యౌమిద్దీన్ (ప్రతిఫల దినానికి యజమాని) – అర్థ భావాలు & తఫ్సీర్ [వీడియో]

మాలికి యౌమిద్దీన్ (ప్రతిఫల దినానికి యజమాని) – అర్థ భావాలు & తఫ్సీర్ [వీడియో]
https://youtu.be/KeeL4HZ0aVE [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

మనిషి ప్రపంచంలోనూ తాను చేసిన కర్మలకు ప్రతిఫలం కొంతవరకు అనుభవించినప్పటికీ పరలోకంలోనే అసలు సిసలు ఫలితం బయటపడుతుంది. సంపూర్ణమైన ప్రతిఫలం అక్కడే ఉనికిలోనికి వస్తుంది. ప్రతి వ్యక్తికీ అతను చేసిన మంచి లేక చెడు పనులను బట్టి అల్లాహ్ అతనికి బహుమానం ఇవ్వటమో, శిక్ష విధించటమో జరిగి తీరుతుంది. ఇదే విధంగా ప్రపంచంలో కూడా తాత్కాలికంగా అనేకమందికి కొన్ని అధికారాలుంటాయి. కాని పరలోకంలో మాత్రం అధికారాలన్నీ అల్లాహ్ హస్తగతం అవుతాయి. తీర్పుదినాన ఆయన తిరుగులేని సార్వభౌమాధికారిగా ఉంటాడు. “ఈ రోజు విశ్వసామ్రాజ్యాధికారం ఎవరిదో చెప్పండి?” అంటూ ఆనాడాయన ప్రశ్నిస్తాడు. “తిరుగులేని వాడు, ఏకైకుడైన అల్లాహ్ దే” అంటూ ఆయనే సమాధానం కూడా ఇస్తాడు (అల్ మోమిన్ – 16) “ఆనాడు, ఏ మనిషీ ఎవరికొరకైనా ఏదన్నా చెయ్యగలగటమన్నది అసంభవం, ఆ రోజు అధికారమంతా అల్లాహ్ చేతుల్లోనే ఉంటుంది.” (ఇన్ ఫితార్ – 19) – అదీ తీర్పుదినమంటే!

తఫ్సీర్ సూరతుల్ ఫాతిహా – ప్రతీ పదానికి అర్థ భావాలు & వివరణ (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0y1S_HJBYajOm3yyF4a16J

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

సహీ జిక్ర్, దుఆలు తెలుగులో – Authentic Islamic Dhikr & Dua in Telugu:
https://telugudua.net/

ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్తయీన్ (మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్నే అర్ధిస్తున్నాము) [వీడియో & టెక్స్ట్]

ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్తయీన్ (మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్నే అర్ధిస్తున్నాము)
https://youtu.be/6PT6tpRuaE4 [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, సూరహ్ అల్-ఫాతిహాలోని ఒక ముఖ్యమైన వాక్యం, ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్, యొక్క లోతైన అర్థం వివరించబడింది. మొదటగా, వాక్యం యొక్క పదాల వారీగా అర్థం, అంటే ‘నిన్ను మాత్రమే మేము ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్ని మాత్రమే మేము అర్థిస్తున్నాము’ అని వివరించబడింది. తరువాత, ‘మాత్రమే’ అనే పదం యొక్క ప్రాముఖ్యతను ఒక భార్యాభర్తల ఉదాహరణతో స్పష్టం చేశారు, ఇది అల్లాహ్ పట్ల ఆరాధనలో సంపూర్ణ ఏకత్వాన్ని నొక్కి చెబుతుంది. వాక్య నిర్మాణంలో ‘ఇయ్యాక’ (నిన్ను మాత్రమే) పదాన్ని ముందు ఉంచడం ద్వారా, ఆరాధన కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకం అని మరియు ఇతరులను ఆరాధించడం ఘోరమైన పాపం అని చెప్పబడింది. చివరగా, ఆరాధన (ఇబాదత్) మరియు సహాయం కోరడం (ఇస్తి’ఆనత్) వేరువేరుగా ఎందుకు ప్రస్తావించబడ్డాయో వివరిస్తూ, అల్లాహ్ సహాయం లేకుండా మనం ఆయనను సరిగ్గా ఆరాధించలేమని, ఇది వినయాన్ని పెంపొందిస్తుందని తెలియజేశారు.

إِيَّاكَ نَعْبُدُ
(ఇయ్యాక న’అబుదు)
నిన్ను మాత్రమే మేము ఆరాధిస్తున్నాము.

సోదర మహాశయులారా, ఇక్కడ ముందు ఈ పదాల యొక్క అర్థం తెలుసుకుందాము. ఆ తర్వాత సరళమైన ఒక భావం దీనికి మనం తెలుసుకుందాం.

إِيَّاكَ
(ఇయ్యాక)
ఇయ్యాక అంటే ఏంటి? నిన్ను మాత్రమే.

نَعْبُدُ
(న’అబుదు)
మేము ఆరాధిస్తున్నాము.

وَإِيَّاكَ
(వ ఇయ్యాక)
మరియు నిన్ను మాత్రమే.

نَسْتَعِينُ
(నస్త’ఈన్)
మేము అర్ధిస్తున్నాము.

అర్థమైందా? ఇయ్యాక అంటే ఏంటి? నిన్ను మాత్రమే. న’అబుదు అంటే? ఆరాధిస్తున్నాము. వ ఇయ్యాక, ‘వ’ మరియు ఇయ్యాక అదే భావం, నిన్ను మాత్రమే.

نَسْتَعِينُ
(నస్త’ఈన్)
మేము అర్ధిస్తున్నాము. మేము సహాయం కొరకు నిన్ను అర్ధిస్తున్నాము. మేము సహాయం కోరుతున్నాము.

సహాయానికై అర్ధిస్తున్నాము. ‘అవ్న్’ అనే పదం నుండి వచ్చింది నస్త’ఈన్. సహాయం అన్న భావం అక్కడ. ఇస్తి’ఆనా ఉంది గనుక, సీన్ వచ్చింది, అందులో ‘తలబ్‘ అనే భావం అంటే కోరడం. సహాయం కోరుతున్నాము, సహాయం కొరకు అర్ధిస్తున్నాము.

ఇక సరళమైన భావం ఏముంటుంది?

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
(ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్)
మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు సహాయం కొరకు నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము.

సోదర మహాశయులారా, ఇక్కడ ఒక మాట కేవలం అర్థం అవ్వడానికి చెప్తున్నా. ఒక సామెతగా. మీలో ఎవరైనా తమ భార్యతో, “నేను నీకు మాత్రమే భర్త,” “నేను నీకు కూడా భర్త.” ఈ రెండిటిలో తేడా ఏదైనా అర్థమవుతుందా మీకు? దీన్ని కొంచెం అపోసిట్ గా, మీ యొక్క భార్య మీతో చెప్పింది, “నేను నీకు మాత్రమే భార్యను.” అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒకవేళ మీ భార్య చెప్పింది అనుకోండి, “నేను నీకు కూడా భార్యను.” అప్పుడు? మీ మైండ్ 180, 360 వరకు తిరిగిపోతుంది కదా, వేడి ఎక్కుతుందిగా. ఇక్కడ ‘కూడా’ మరియు ‘మాత్రమే’ అన్నటువంటి పదాలలో భావం తెలుస్తుందా?

నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన రోజువారీ జీవితంలో ఈ విషయాన్ని మనం గ్రహిస్తాము కదా. కానీ అల్లాహ్ యొక్క ఆరాధన విషయంలో. వలిల్లాహిల్ మసలుల్ అ’అలా. నేను మాటిమాటికీ చెబుతున్నాను, కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఉపమానాలు, ఉదాహరణలు, సామెతలు మనం చెప్పుకున్నప్పుడు న’ఊజుబిల్లాహ్, అల్లాహ్ కొరకు కాదు ఈ సామెతలు, మన బుద్ధి జ్ఞానాలలో మాట సరిగా అర్థం అవ్వడానికి, మన అజ్ఞానం దూరం అవ్వడానికి.

ఎవరైనా ఒక భార్య, “నేను నీకు కూడా భార్య” అంటే మనం సహించము. “ఓ అల్లాహ్ నిన్ను కూడా ఆరాధిస్తున్నాము” అని అంటే ఇది బాగుంటుందా? తప్పు విషయం ఇది. “నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము.”

అందుకొరకే ఇక్కడ, ఇయ్యాక ముందు వచ్చింది, తర్వాత న’అబుదు అని చెప్పారు. తెలుగు సాహిత్య పరంగా మనం చూసుకుంటే సర్వసాధారణంగా ఎలా చెబుతారు? కర్త, కర్మ, క్రియ. రాయడంలో మాట ఈ క్రమంలో వస్తుంది కదా. అరబీలో, అరబీ సాహిత్య పరంగా, న’అబుదుక, ఇలా రావాలి. కానీ ఇక్కడ అల్లాహు త’ఆలా, ఇయ్యాకను ముందు పెట్టాడు అంటే, ఈ ప్రత్యేకతను తెలియజేయడానికి. ఆరాధన అన్నది అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరికీ చెల్లదు. అలా చేసేవారు చాలా ఘోరమైన పాపానికి ఒడిగడుతున్నారు. ఎంతటి ఘోరమైనది? వ్యభిచారం కంటే, మత్తుపానీయాలు సేవించడం కంటే, ఇంకా వేరే ప్రపంచంలో ఉన్న చెడ్డ పనుల కంటే అతి నీచమైన చెడ్డ పని, అల్లాహ్ ను వదలి లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరినైనా ఆరాధించడం.

అలాంటి ఏ భావాలు ఉండకుండా కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తున్నాము అన్న భావం రావడానికి అల్లాహు త’ఆలా, ఇయ్యాక అన్న పదం ముందు ఇక్కడ పేర్కొన్నాడు. అర్థమైందా దీని యొక్క ప్రాముఖ్యత? తెలుస్తుందా?

ఇక ఆ తర్వాత, ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్ లో ఉన్నటువంటి మరో విషయం గమనించండి. అదేంటి?

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
(ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్)

న’అబుదు, ఆరాధన. ఆరాధన అంటే, నాలుక సంబంధమైన, హృదయ సంబంధమైన, మన శరీర సంబంధమైన, శరీరావయవాలకు సంబంధమైన, మన ధన సంబంధమైన అన్ని రకాల ఆరాధనలు వచ్చేసాయి. ఆరాధన అంటే, నమాజు వచ్చింది, ప్రేమ వచ్చింది, నమ్మకం వచ్చింది, భయము వచ్చింది, ఆశ వచ్చింది, ఉపవాసము వచ్చింది, ఖుర్బానీ వచ్చింది, దానధర్మాలు వచ్చినాయి, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. అన్నీ కూడా కేవలం అల్లాహ్ కు మాత్రమే అంకితం చేయాలి.

అయితే, కేవలం అల్లాహ్ తో మాత్రమే సహాయం కోరడం, నస్త’ఈన్ అని ఉంది కదా తర్వాత. ఆరాధనల యొక్క ఎన్నో రకాలు ఇప్పుడు నేను తెలిపాను కదా? నమాజ్, భయము, ఉపవాసాలు, ఇంకా ఆశ ఇట్లాంటివి. వాటిలో ఒకటి, సహాయం కోరడం కూడా. సహాయం కోరడం అనేది ఆరాధనలలోని ఒక రకం. ఇక ఆరాధన అంటే అన్ని వచ్చేసాయి, మళ్లీ ప్రత్యేకంగా సహాయం అన్న దాన్ని ఎందుకు అల్లాహ్ ప్రస్తావించాడు? ఇక్కడ ఒక గొప్ప భావం ఉంది. అదేమిటంటే, అల్లాహ్ యొక్క ఆరాధన మనం సరైన రీతిలో చేయాలంటే, అల్లాహ్ యొక్క సహాయం మనకు అందాలి, అప్పుడే మనం సరైన రీతిలో చేయగలుగుతాం.

అందుకొరకే చూడండి, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సలాం తిప్పిన తర్వాత ఏ దువాలైతే మనకు నేర్పారో, అందులో ఒకటేముంది?

అల్లాహుమ్మ అని కూడా ఉంది, రబ్బీ అని కూడా ఉంది.

“اللَّهمَّ أعنِّي على ذِكْرِكَ، وشُكْرِكَ، وحُسنِ عبادتِكَ
(అల్లాహుమ్మ అ’ఇన్నీ ‘అలా జిక్రిక వ షుక్రిక వ హుస్ని ‘ఇబాదతిక)
ఓ అల్లాహ్ నాకు సహాయం అందించు, ‘అలా జిక్రిక, నీ జిక్రు చేయడంలో, స్మరించడంలో, వ షుక్రిక, నీ యొక్క కృతజ్ఞత చెల్లించడంలో, వ హుస్ని ‘ఇబాదతిక, నీ యొక్క ఆరాధన ఉత్తమమైన రీతిలో చేయడంలో నీవు నాకు సహాయం అందించు.

అయితే ఇక్కడ ఏం తెలుస్తుంది? సహాయం కూడా కేవలం అల్లాహ్ తో కోరాలి అని తెలియడంతో పాటు మరొక గొప్ప విషయం ఏం తెలిసింది? అరే, నేను చేశాను అన్నటువంటి గొప్పలు చెప్పుకోవడం కాదు, అల్లాహ్ సహాయపడ్డాడు, అల్లాహ్ భాగ్యం కలుగజేశాడు, అల్లాహ్ మనకు తోడు ఇచ్చాడు, అల్లాహు త’ఆలా యొక్క దయ కలిగినది, అప్పుడే మనం ఏదైనా చేయగలిగాము అన్నటువంటి భావన ఉండాలి. అందుకొరకు ఎల్లవేళల్లో అల్లాహ్ ముందు మనం వినయ వినమ్రతతో ఎంతో మంచి రీతిలో మనం ఆ అల్లాహ్ యొక్క ఆరాధనలో గడుపుతూ ఉండాలి.

తఫ్సీర్ సూరతుల్ ఫాతిహా – ప్రతీ పదానికి అర్థ భావాలు & వివరణ (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0y1S_HJBYajOm3yyF4a16J

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

సూరహ్ కాఫిరూన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]

సూరహ్ కాఫిరూన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]
https://youtu.be/JAzJL6T-dQY [28 నిముషాలు]

109. సూరా అల్ ఖాఫిరూన్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో

109:1 قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ
ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్
(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు : “ఓ తిరస్కారులారా!”

109:2 لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ
లా అఅబుదు మా తఅబుదూన్
మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు.

109:3 وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ
వలా అన్తుం ఆబిదూన మాఅఅబుద్
నేను ఆరాధిస్తున్న వానిని మీరు ఆరాధించరు.

109:4 وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ
వలా అన ఆబిదుమ్మా అబత్తుం
మీరు ఆరాధించే వాటిని నేను అరాధించబోను.

109:5 وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ
వలా అన్ తుం ఆబిదూన మా అఅబుద్
మరి నేను ఆరాధించేవానిని మీరెలాగూ ఆరాధించరు.

109:6 لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ
లకుం దీనుకుమ్ వ లి యదీన్
మీ ధర్మం మీది, నా ధర్మం నాది.”

ఖుర్ఆన్ మజీద్ | తెలుగులో అరబీ ఉచ్చారణ | 3 భాగాల ఎడిషన్

ఇది తెలుగులో నేటికీ వాడుకలో నున్న మొదటి అనువాదం. [3 భాగాల ఎడిషన్]
మౌల్వీ అబ్దుల్ గపూర్ గారు దీనిని నేరుగా అరబీ భాష నుండి అనువదించినారు.

[తెలుగులో అరబ్బీ ఉచ్చారణ] [ఆయతుల తెలుగు అనువాదం] [తెలుగు వ్యాఖ్య]

పార్ట్ 1 (సూరయే ఫాతిహా నుండి తౌబా వరకు)
[548 పేజీలు] [131 MB]
[పార్ట్ 1 – డౌన్లోడ్ చేసుకోండి]

పార్ట్ 2 (10.సూరయే యూనుస్ నుండి 29.అంకబూత్ వరకు)
[PDF] [542 పేజీలు] [62 MB]

[పార్ట్ 2 – డౌన్లోడ్ చేసుకోండి]

పార్ట్ 3 (21.సూరయే రూమ్ నుండి 114.నాస్ వరకు)
[PDF] [522 పేజీలు] [146 MB]
[పార్ట్ 3 – డౌన్లోడ్ చేసుకోండి]

ఈ పుస్తకాలు మొబైల్లో చదవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీ డెస్కటాప్ లేదా లాప్ టాప్ లో డౌన్లోడ్ చేసుకొని చెదివితే సౌకర్యంగా ఉంటుంది

సూరహ్ అన్ నాస్ – ప్రతీ పదానికి అర్ధ భావాలు మరియు తఫ్సిర్ (Tafsir Surah An-Nas) [వీడియో]

[1/2] సూరహ్ అన్ నాస్ – ప్రతీ పదానికి అర్ధ భావాలు మరియు తఫ్సిర్ (Tafsir Surah An-Nas) – పార్ట్ 01
https://youtu.be/WDUnsY0M44c [40 నిముషాలు]
[2/2] సూరహ్ అన్ నాస్ – ప్రతీ పదానికి అర్ధ భావాలు మరియు తఫ్సిర్ (Tafsir Surah An-Nas) – పార్ట్ 02
https://youtu.be/p3lXJowIp0U [37 నిముషాలు]

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో

114:1  قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్
(ఈ విధంగా) చెప్పు: “నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను.

114:2  مَلِكِ النَّاسِ
మలికిన్నాస్
మానవుల చక్రవర్తిని,

114:3  إِلَٰهِ النَّاسِ
ఇలాహిన్నాస్
మానవుల ఆరాధ్య దైవాన్ని (ఆశ్రయిస్తున్నాను) –

114:4  مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ
మిన్ షర్రిల్ వస్ వాసిల్ ఖన్నాస్
దురాలోచనలను రేకెత్తించే,తప్పించుకునే వాడి కీడు నుండి,

114:5  الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ
అల్లదీ యు వస్ విసు ఫీ శుదూరిన్నాస్
వాడు జనుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు –

114:6  مِنَ الْجِنَّةِ وَالنَّاسِ
మినల్ జిన్నతి వన్నాస్
వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే!

యూట్యూబ్ ప్లే లిస్ట్ – సూరహ్ ఫలఖ్, సూరహ్ నాస్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2HGHU2YlPz7otYjjkVQJDo

సూరహ్ బయ్యినహ్ ఘనత – షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ [వీడియో]

సూరహ్ బయ్యినహ్ ఘనత – షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ [వీడియో]
https://youtu.be/qxwqKWAlKgc [12 నిముషాలు]

98. సూరా అల్ బయ్యినహ్

98:1 لَمْ يَكُنِ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ مُنفَكِّينَ حَتَّىٰ تَأْتِيَهُمُ الْبَيِّنَةُ
గ్రంథవహులకు చెందిన తిరస్కారులు, బహుదైవారాధకులు తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం రానంతవరకూ (తమ తిరస్కార వైఖరిని) మానుకోనివారుగా ఉండేవారు. (ఇంతకీ ఆ నిదర్శనం ఏమిటంటే…)

98:2 رَسُولٌ مِّنَ اللَّهِ يَتْلُو صُحُفًا مُّطَهَّرَةً
పరిశుద్ధమైన గ్రంథ పత్రములను చదివి వినిపించే దైవప్రవక్త తమ వద్దకు రావాలి.

98:3 فِيهَا كُتُبٌ قَيِّمَةٌ
మరి వాటిలో (ఆ గ్రంథ పత్రాలలో) స్థిరమైన, సవ్యమైన ఆదేశాలు ఉండాలి.

98:4 وَمَا تَفَرَّقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَةُ
మరి (ఈ) గ్రంథవహులు తీరా తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చేసిన తరువాతే (విభేదించుకొని) చీలిపోయారు.

98:5 وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ ۚ وَذَٰلِكَ دِينُ الْقَيِّمَةِ
వారు అల్లాహ్ నే ఆరాధించాలని ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలనీ, ఏకాగ్రచిత్తులై – నమాజును నెలకొల్పాలనీ, జకాత్ ను ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం.

98:6 إِنَّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ فِي نَارِ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۚ أُولَٰئِكَ هُمْ شَرُّ الْبَرِيَّةِ
గ్రంథవహులలో తిరస్కారవైఖరికి పాల్పడినవారు, బహుదైవారాధకులు తప్పకుండా నరకాగ్నికి ఆహుతి అవుతారు. వారందులో కలకాలం ఉంటారు. వారు సృష్టితాలలో అందరికంటే చెడ్డవారు.

98:7 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ
అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు; నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు.

98:8 جَزَاؤُهُمْ عِندَ رَبِّهِمْ جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِيَ رَبَّهُ
వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు. ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడే వానికి మాత్రమే.

ప్రజలలో కొంత మంది అల్లాహ్‌కు అతి దగ్గరవారై ఉన్నారు

హజ్రత్ అనస్‌ (రదియల్లాహు అన్హు) కథనం: “ప్రజలలో కొంత మంది అల్లాహ్‌కు అతి దగ్గరవారై ఉన్నారు .” అని ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు.

యా రసూలుల్లాహ్ ! వారెవరూ? అని కొందరు అడిగారు.

దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం): “వారు అహ్‌లుల్‌ ఖుర్‌ఆన్‌ (ఖుర్‌ఆన్‌ (గంథాన్ని పారాయణం చేసేవారు, దానిని నేర్పేవారు, నేర్చుకునేవారు) మరియు వారే అల్లాహ్‌కు అతి దగ్గరవారై ఉంటారు, వారు ఆయనకు ప్రత్యేకులు” అని అన్నారు.

[నసాయి, ఇబ్ను మాజా, హాకిమ్‌: సహీహ్‌ అత్తర్గీబ్‌ వత్తర్హీబ్‌: 1432]
హజ్రత్ అనస్‌ (రదియల్లాహు అన్హు) కథనం: “ప్రజలలో కొంత మంది అల్లాహ్‌కు అతి దగ్గరవారై ఉన్నారు .” అని ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు.
యా రసూలుల్లాహ్ ! వారెవరూ? అని కొందరు అడిగారు.
దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం): “వారు అహ్‌లుల్‌ ఖుర్‌ఆన్‌ (ఖుర్‌ఆన్‌ (గంథాన్ని పారాయణం చేసేవారు, దానిని నేర్పేవారు, నేర్చుకునేవారు) మరియు వారే అల్లాహ్‌కు అతి దగ్గరవారై ఉంటారు, వారు ఆయనకు ప్రత్యేకులు” అని అన్నారు.
[నసాయి, ఇబ్ను మాజా, హాకిమ్‌: సహీహ్‌ అత్తర్గీబ్‌ వత్తర్హీబ్‌: 1432]

https://teluguislam.net/2019/08/24/allah-loves-the-recitation-of-the-quran/

సూరహ్ ఇఖ్లాస్ ఒక్కో పదానికి అర్థాలు & తఫ్సిర్ & ఘనతలు [వీడియో]

సూరహ్ ఇఖ్లాస్ ఒక్కో పదానికి అర్థాలు & తఫ్సిర్ & ఘనతలు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/aCxYsPVUIFY [51 నిముషాలు]

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://telugusialm.net/?p=4259

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1