https://youtu.be/KeeL4HZ0aVE [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మనిషి ప్రపంచంలోనూ తాను చేసిన కర్మలకు ప్రతిఫలం కొంతవరకు అనుభవించినప్పటికీ పరలోకంలోనే అసలు సిసలు ఫలితం బయటపడుతుంది. సంపూర్ణమైన ప్రతిఫలం అక్కడే ఉనికిలోనికి వస్తుంది. ప్రతి వ్యక్తికీ అతను చేసిన మంచి లేక చెడు పనులను బట్టి అల్లాహ్ అతనికి బహుమానం ఇవ్వటమో, శిక్ష విధించటమో జరిగి తీరుతుంది. ఇదే విధంగా ప్రపంచంలో కూడా తాత్కాలికంగా అనేకమందికి కొన్ని అధికారాలుంటాయి. కాని పరలోకంలో మాత్రం అధికారాలన్నీ అల్లాహ్ హస్తగతం అవుతాయి. తీర్పుదినాన ఆయన తిరుగులేని సార్వభౌమాధికారిగా ఉంటాడు. “ఈ రోజు విశ్వసామ్రాజ్యాధికారం ఎవరిదో చెప్పండి?” అంటూ ఆనాడాయన ప్రశ్నిస్తాడు. “తిరుగులేని వాడు, ఏకైకుడైన అల్లాహ్ దే” అంటూ ఆయనే సమాధానం కూడా ఇస్తాడు (అల్ మోమిన్ – 16) “ఆనాడు, ఏ మనిషీ ఎవరికొరకైనా ఏదన్నా చెయ్యగలగటమన్నది అసంభవం, ఆ రోజు అధికారమంతా అల్లాహ్ చేతుల్లోనే ఉంటుంది.” (ఇన్ ఫితార్ – 19) – అదీ తీర్పుదినమంటే!
—
తఫ్సీర్ సూరతుల్ ఫాతిహా – ప్రతీ పదానికి అర్థ భావాలు & వివరణ (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0y1S_HJBYajOm3yyF4a16J
ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259
సహీ జిక్ర్, దుఆలు తెలుగులో – Authentic Islamic Dhikr & Dua in Telugu:
https://telugudua.net/