ఖుర్ఆన్ ఘనత – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ఖుర్ఆన్ ఘనత – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/hvciJxQhK5Y [35 నిముషాలు]

ఈ ప్రసంగంలో వక్త పవిత్ర ఖురాన్ యొక్క ఘనత, విశిష్టత మరియు ప్రాముఖ్యతను వివరించారు. ఖురాన్ అల్లాహ్ చేత పంపబడిన చివరి ఆకాశ గ్రంథమని, ఇది మానవాళికి రుజుమార్గం చూపే మార్గదర్శకమని తెలిపారు. పూర్వపు గ్రంథాలైన తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ కాలగర్భంలో కలిసిపోయినా లేదా మార్పులకు లోనైనా, ఖురాన్ మాత్రం అల్లాహ్ సంరక్షణలో సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. ఖురాన్ పఠనం ద్వారా కలిగే పుణ్యాలు, అది కఠినమైన హృదయాలను కూడా ఎలా మెత్తబరుస్తుందో ఉమర్ (రజిyయల్లాహు అన్హు), తుఫైల్ బిన్ అమర్ దౌసీ వంటి వారి జీవిత ఉదాహరణల ద్వారా వివరించారు. ఖురాన్ ను కంఠస్థం చేయడం (హిఫ్జ్) వల్ల కలిగే గొప్పతనం, ఇహపర లోకాలలో లభించే గౌరవం, మరియు ఇది ఆత్మకు, శరీరానికి ఔషధంగా ఎలా పనిచేస్తుందో తెలియజేశారు. చివరగా, ఖురాన్ ను చదవడం, అర్థం చేసుకోవడం మరియు ఆచరించడం ద్వారా ముస్లింలు పొందే సాఫల్యాన్ని గుర్తుచేశారు.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త పాలకుడు, పోషకుడైన అల్లాహ్ యే కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా! మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం ఖురాన్ ఘనతల గురించి తెలుసుకోబోతున్నాం.

ఖురాన్ చివరి ఆకాశ గ్రంథము, ఇది మనందరికీ తెలిసిన విషయము. అయితే ఆకాశ గ్రంథము అని దేనిని అంటారు అన్న విషయాన్ని తెలుసుకొని మనం మాటను ఇన్షా అల్లాహ్ ముందుకు కొనసాగిద్దాం.

ఆకాశ గ్రంథము అంటే, భూమండలం మీద మానవులు ఎప్పుడెప్పుడైతే దారి తప్పిపోయి మార్గభ్రష్టులు అయిపోయారో, అలా దారి తప్పిపోయిన మానవులను మళ్లీ రుజుమార్గం పైకి తీసుకొని రావడానికి సుబ్ హాన వ త’ఆలా మానవుల్లోనే కొంతమంది ప్రవక్తలను ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్తల వద్దకు దైవదూత ద్వారా వాక్యాలు పంపించాడు. దైవదూత తీసుకొని వచ్చిన వాక్యాలు ప్రవక్త మానవులకు తెలియజేసి శిష్యుల ద్వారా రాయించారు, ఒకచోట భద్రపరిచారు. అలా భద్రపరచబడిన దైవ వాక్యాల సమూహాన్ని ఆకాశ గ్రంథము అంటారు, దైవ గ్రంథము అని అంటారు.

ఇలాంటి గ్రంథాల ప్రస్తావన మనకు ఖురాన్ లో అనేక చోట్ల అనేక గ్రంథాల ప్రస్తావన కనిపిస్తుంది. సుహుఫ్ ఇబ్రాహీమ్ అని, అలాగే తౌరాత్ అని, ఇంజీల్ అని, జబూర్ అని, ఖురాన్ అని ఇలా కొన్ని ఆకాశ గ్రంథాల దైవ గ్రంథాల ప్రస్తావన మనకు ఖురాన్ లో కనబడుతుంది.

సుహుఫ్ ఇబ్రాహీమ్, ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఇవ్వబడ్డాయి. తౌరాత్ గ్రంథము మూసా అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. జబూర్ గ్రంథము దావూద్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. ఇంజీల్ గ్రంథము ఈసా అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. ఖురాన్ గ్రంథము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వబడింది.

అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఖురాన్ కు పూర్వం వచ్చిన దైవ గ్రంథాలు, అది ఇంజీల్ కావచ్చు, జబూర్ కావచ్చు, తౌరాత్ కావచ్చు, సుహుఫ్ ఇబ్రాహీమ్ కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు, అవి ఏవీ కూడా నేడు ప్రపంచంలో అసలు రూపంలో భద్రంగా లేవు. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి, మరికొన్ని మానవుల కల్పితాలకు గురి అయిపోయాయి. కానీ, ఖురాన్ లో మాత్రం అలా జరగలేదు. ఖురాన్ సురక్షితంగా ఉంది. ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో ఖురాన్ ని సుబ్ హాన వ త’ఆలా ఎలా సురక్షితంగా ఉంచాడో వివరంగా నేను కొన్ని విషయాలు మీకు తెలుపుతాను.

మొత్తానికి ఆకాశ గ్రంథం అంటే ఏమిటో అన్నది మనం తెలుసుకున్నాం. ఖురాన్ చివరి ఆకాశ గ్రంథము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వబడింది. ఆయన ద్వారా మనందరి వరకు సుబ్ హాన వ త’ఆలా ఆ గ్రంథాన్ని, ఆ గ్రంథంలో ఉన్న వాక్యాలని చేరవేర్చాడు.

అయితే ఈ ఖురాన్ గ్రంథానికి అనేక ఘనతలు ఉన్నాయండి. మొదటి ఘనత ఏమిటంటే, ఈ ఖురాన్ లోని ప్రతి అక్షరానికి బదులుగా పారాయణము చేస్తున్న భక్తునికి పది పుణ్యాల చొప్పున ఇవ్వబడతాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ఉదాహరించి మరి తెలియజేసి ఉన్నారు. ఒక వ్యక్తి ‘అలిఫ్ లామ్ మీమ్’ అని పఠిస్తే, అతనికి ‘అలిఫ్’ కి బదులుగా పది పుణ్యాలు, ‘లామ్’ కి బదులుగా పది పుణ్యాలు, ‘మీమ్’ కి బదులుగా పది పుణ్యాలు, మొత్తం ముప్పై పుణ్యాలు అతనికి దక్కుతాయి అని ప్రవక్త వారు ఉదాహరించి మరి తెలియజేశారు.

ఆ ప్రకారంగా ఒక భక్తుడు ఖురాన్ లోని ఒక సూరా ఒక అధ్యాయం పఠిస్తే ఎన్ని పుణ్యాలు పొందుతాడు? ఒక్క పేజీ చదివితే ఎన్ని పుణ్యాలు దక్కించుకుంటాడు? ఒక్క పారా చదివితే ఎన్ని పుణ్యాలు అతనికి దక్కుతాయి? పూర్తి ఖురాన్ పారాయణము పూర్తి చేస్తే, అతను ఎన్ని లక్షల కోట్ల పుణ్యాలు సంపాదించుకుంటాడో ఆలోచించండి మిత్రులారా! ఇంతటి పుణ్యాలు మనిషికి దక్కేలా చేస్తున్న గ్రంథం ఒక ఖురాన్ మాత్రమే. ఇతర గ్రంథాలకు ప్రతి అక్షరానికి బదులుగా పదేసి పుణ్యాలు దక్కుతాయి అన్న ఘనత, విశిష్టత లేదు. ఒక్క ఖురాన్ కు మాత్రమే ఉంది కాబట్టి, ఇది ఖురాన్ యొక్క ఘనత, ప్రత్యేకత మిత్రులారా.

అలాగే ఖురాన్ మానవులకు రుజుమార్గం వైపుకు మార్గదర్శకత్వం చేస్తుంది. దీనికి ఆధారంగా మనం చూస్తే, ఖురాన్ గ్రంథము రెండవ అధ్యాయము, నూట ఎనభై ఐదవ వాక్యంలో సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు.

شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ
[హుదల్ లిన్నాసి వబయ్యినాతిమ్ మినల్ హుదా వల్ ఫుర్ ఖాన్]
అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతోపాటు, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి.” (2:185)

స్వయంగా అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఈ ఖురాన్ మానవులకు రుజుమార్గం వైపు దారి చూపిస్తుంది. ఏది సత్యం, ఏది అసత్యం అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ లో స్పష్టం చేసేసి ఉన్నాడు అని అల్లాహ్ తెలియజేశాడు. కాబట్టి ఈ ఖురాన్ మానవులందరికీ రుజుమార్గం వైపు దారి చూపిస్తుంది, మార్గదర్శకత్వం చేస్తుంది. దీనికి ప్రవక్త వారి కాలం నాటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. నేటికీ కూడా అనేక ఉదాహరణలు మనము చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడు మనం ప్రవక్త వారి జీవిత కాలంలోని ఒక రెండు ఉదాహరణలు మనం తెలుసుకుంటున్నాం ఇన్షా అల్లాహ్.

మొదటి ఉదాహరణ తుఫైల్ బిన్ అమర్ దౌసీ రజియల్లాహు అన్హు వారిది. ఈయన దౌస్ తెగకు చెందిన వ్యక్తి, మక్కాకు ఒకసారి వచ్చారు. చదువుకున్న వ్యక్తి, జ్ఞానం ఉన్న వ్యక్తి. అయితే మక్కా పెద్దలు ఆ రోజుల్లో ప్రవక్త వారికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్న రోజులవి. మక్కా పెద్దలు ఈయన దగ్గరికి కూడా వెళ్లి, “ముహమ్మద్ వారి మాట వినకండి, ముహమ్మద్ వారి మాట వింటే మీరు దారి తప్పిపోతారు, భార్య బిడ్డలకు దూరమైపోతారు, తల్లిదండ్రులకు దూరమైపోతారు” అని రకరకాలుగా ఆయనకు చెప్పి భయపెట్టేశారు. ఆయన ఆ మాటలన్నీ నిజమేమో అని నమ్మేసి, ప్రవక్త వారి మాటలు వినకూడదు అని నిర్ణయించుకున్నారు. కానీ, అల్లాహ్ తలిచిందే జరుగుతుంది అన్నట్టుగా, ఒకరోజు కాబా పుణ్యక్షేత్రం వద్ద ఆయన ప్రదర్శనలు చేస్తూ ఉంటే, సమీపంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ పారాయణము చేస్తూ ఉన్నారు. ఆ శబ్దం ఆయన చెవిలో పడింది.

ఆ శబ్దాన్ని ఎప్పుడైతే ఆయన వినేశారో, ఆయన మనసులో ఒక ఆలోచన కలిగింది. “నేను చదువుకున్న వ్యక్తిని, ఏది మంచి ఏది చెడు అని నేను నిర్ణయించుకోగలను. అలాంటప్పుడు ముహమ్మద్ వారి మాట నేను వినడానికి ఎందుకు భయపడాలి? ఎందుకు దూరంగా ఉండాలి? ఆయన మాట విని చూస్తాను, మంచిదా కాదా అని నిర్ణయించుకుంటాను. అంతమాత్రాన నేను కంగారు పడటం ఎందుకు, దూరంగా ఉండే ప్రయత్నం చేయడం ఎందుకు?” అని ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో అక్కడికి వెళ్లారు. చూస్తే ప్రవక్త వారు ఉన్నారు.

ప్రవక్త వారి వద్దకు వెళ్లి, “ఏమండీ! మీరు ప్రజలకు ఏమి చెబుతున్నారు? మీరు చెబుతున్న ఏ మాటలను బట్టి ప్రజలు మీ గురించి ఈ విధంగా చెబుతున్నారు? ఆ మాటలు నాకు కూడా చెప్పండి” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనను కూర్చోబెట్టుకొని, అటు ఇటు ఏమీ మాట్లాడకుండా ఖురాన్ లోని దైవ వాక్యాలు పఠించి వినిపించారు. ఖురాన్ పారాయణము చేస్తూ ఉంటే, ఖురాన్ లోని దైవ వాక్యాలు ఆయన విన్న తర్వాత ఏమన్నారంటే: “నేను సాక్ష్యం ఇస్తున్నాను, మీరు చెబుతున్నది ఇది కవిత్వము కాదు, మీరు చెబుతున్నది ఇది మంత్రతంత్రము కాదు. నేను కవిత్వము విని ఉన్నాను, నేను మంత్రతంత్రాలు ఎలా ఉంటాయో తెలిసినవాడిని. కానీ మీరు పలుకుతున్నది మాత్రం అది కవిత్వము కాదు, మంత్రతంత్రము కాదు, ముమ్మాటికీ ఇది దేవుని వాక్యము” అని అప్పటికప్పుడే ఆయన కలిమా చదివి ఇస్లాం స్వీకరించారు, ముస్లిం అయిపోయారు అల్హందులిల్లాహ్.

చూసారా! ఖురాన్ ద్వారా దారి తప్పిపోయిన వాళ్లు మళ్లీ దారి పైకి వచ్చేస్తారు. ఈ ఖురాన్ రుజుమార్గం వైపుకి దారి చూపిస్తుంది.

మరొక ఉదాహరణ విందాం. జిమాద్ అజ్దీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు. ఈయన అజ్ద్ తెగకు చెందిన వాళ్లు. ఈయన కూడా మక్కాకు వచ్చారు. కాకపోతే ప్రవక్త వారితో ఆయనకు పరిచయం ఉంది. మక్కా పెద్దలు ఈయన దగ్గరికి కూడా వెళ్లారు. ఈయన దగ్గరికి వెళ్లి ఏమన్నారంటే, “ఏమండీ! మీకు మంత్రించడం వచ్చు కాబట్టి, మీ మిత్రునికి పిచ్చి పట్టినట్లు ఉంది, ఏదేదో వాగుతూ ఉన్నాడు, కొంచెం మంత్రించి వైద్యము చేయొచ్చు కదా” అని చెప్పారు. ఆయన నిజమేమో అని నమ్మి, ప్రవక్త వారితో పరిచయం ఉండింది కాబట్టి చక్కగా ప్రవక్త వారి దగ్గరికి వెళ్లి, “ప్రజలు ఈ విధంగా మీ గురించి చెబుతున్నారు, అలాంటిది ఏమైనా మీకు సమస్య ఉంటే చెప్పండి, నేను మంత్రించి మీకు వైద్యం చేస్తాను” అన్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు కూడా కూర్చోబెట్టుకొని, నేను ఏమి చెబుతున్నానో నువ్వు విను అని సూరా ఇఖ్లాస్, సూరా ఫలఖ్, చిన్న చిన్న సూరాలు – ‘ఖుల్ హువల్లాహు అహద్’ అని ఒక సూరా ఉంది కదా, అలాగే ‘ఖుల్ అరూజు బి రబ్బిల్ ఫలఖ్’ అని సూరా ఉంది కదా – ఈ చిన్న చిన్న సూరాలు పఠించి వినిపించగానే, వెంటనే ఆయన కూడా ప్రవక్త వారి సమక్షంలో సాక్ష్యం పలికారు. “అయ్యా! మంత్రతంత్రాలు ఎలా ఉంటాయో నేను మంత్రాలు నేర్చుకొని ఉన్న వాడిని కాబట్టి, విని ఉన్న వాడిని కాబట్టి నాకు తెలుసు. మీరు చెబుతున్నది ఇది మంత్రతంత్రము ఎప్పటికీ కానే కాదు. అలాగే మీరు చెబుతున్నది ఇది కవిత్వము కూడా కాదు. ఇది స్పష్టమైన దేవుని వాక్యమే” అని ఆయన కూడా సాక్ష్యం ఇచ్చి, కలిమా చదివి, అప్పటికప్పుడే ఆయన కూడా ముస్లిం అయిపోయారు, ఇస్లాం స్వీకరించారు అల్లాహు అక్బర్.

రెండు ఉదాహరణలు ప్రవక్త వారి జీవిత కాలం నుండి నేను వినిపించానండి. నేటికీ కూడా అనేకమంది వివిధ భాషలలో అనువాదం చేయబడి ఉన్న దైవ గ్రంథం ఖురాన్ ని చదువుతూ ఉన్నారు. చదివి అల్హందులిల్లాహ్ రుజుమార్గాన్ని పొందుతూ ఉన్నారు. అల్హందులిల్లాహ్ ఇస్లాం స్వీకరించి ముస్లింలు అయిపోయాము, ఖురాన్ ను చదివి తెలుసుకున్నాము అని సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. అనేక ఉదాహరణలు మీరు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో చూడవచ్చు మిత్రులారా.

మొత్తానికి ఖురాన్ కి ఉన్న ఘనత ఏమిటంటే, ఖురాన్ ద్వారా ప్రజలు రుజుమార్గం పైకి వస్తారు.

అలాగే ఖురాన్ ఎలాంటి తప్పులు లేని సురక్షితమైన గ్రంథము. ఖురాన్ గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ
[జాలికల్ కితాబు లా రైబ ఫీహ్]
ఈ గ్రంథం (అల్లాహ్‌ గ్రంథం అన్న విషయం) లో ఎంతమాత్రం సందేహం లేదు.” (2:2)

అంటే ఇవి దైవ వాక్యాలు అన్న విషయంలో అనుమానానికి తావే లేదు అన్నారు. మరి అనుమానానికే తావు లేనప్పుడు తప్పులు దాంట్లో ఎక్కడి నుంచి వస్తాయి? అసలు తప్పులు లేని గ్రంథము ఈ ఖురాన్ గ్రంథం.

గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఖురాన్ లో తప్పులు ఉన్నాయి అని ప్రవక్త వారి కాలంలో కూడా ఎవరూ నిరూపించలేకపోయారు. ఆయన తర్వాత నుండి ఇప్పటివరకు కూడా ఎవరూ ఖురాన్ లో తప్పులు ఉన్నాయి అని నిరూపించలేకపోయారు. ఇన్షా అల్లాహ్ ప్రళయం వరకు కూడా ఇందులో తప్పులు ఉన్నాయి అని ఎవరూ నిరూపించలేరు.

కానీ ఆశ్చర్యకరమైన ఒక విషయం చెబుతాను. అదేమిటంటే, ఖురాన్ లో తప్పులు ఉన్నాయి అని ప్రపంచానికి నిరూపించడానికి కొంతమంది ముస్లిమేతరులు, పండితులు ఖురాన్ ని పఠించారు. తప్పులు వెతకడానికి పఠించారు. పఠిస్తూ ఉన్నారు, తప్పులు వెతుకుతూ ఉన్నారు, చదువుతూ పోతూ ఉన్నారు. చివరికి ప్రభావితులైపోయి సురక్షితమైన గ్రంథం ఖురాన్, దైవ వాక్యాలతో నిండిన గ్రంథం ఖురాన్, సత్యమైన దేవుని గ్రంథం ఖురాన్ అని వారు కూడా అల్హందులిల్లాహ్ కలిమా చదివి ఇస్లాం స్వీకరించేశారు. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలామంది పండితులు తప్పులు వెతకడానికి మాత్రమే ఖురాన్ చదివారు. కానీ అల్హందులిల్లాహ్ దారి పైకి వచ్చేశారు, ఇస్లాం స్వీకరించేశారు. ఇది ఖురాన్ యొక్క ఘనత మిత్రులారా.

అలాగే ఖురాన్ ద్వారా హృదయాలు మెత్తబడతాయి. కొంతమంది యొక్క మనస్తత్వం మరియు వారి గుండె చాలా గట్టిది. కానీ ఖురాన్ చదివితే ప్రజల గుండెలు, ప్రజల హృదయాలు మెత్తబడతాయి. దీనికి ఉదాహరణగా మనం చూసినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోని ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు వారు. గొప్ప బలవంతుడు, ధైర్యవంతుడు మరియు కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తి, గట్టి మనుస్కుడు.

ఒకరోజు అనుకోకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట దైవ వాక్యాలు వినేశారు. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పఠిస్తూ ఉన్నారు. అల్లాహ్ తెలియజేసిన సూరా హాక్కా లోని వాక్యాలు.

وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ۚ قَلِيلًا مَّا تُؤْمِنُونَ – وَلَا بِقَوْلِ كَاهِنٍ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ – تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ
ఏ కవి పుంగవుడో పలికిన మాట కానే కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ. ఇది ఏ జ్యోతిష్యుని పలుకో అంతకన్నా కాదు. మీరు హితబోధను గ్రహించేది బహుస్వల్పం. నిజానికి సకల లోకాల ప్రభువు తరఫున అవతరించింది.” (69:41-43)

అవి విన్న తర్వాత కొంచెం ఇస్లాం వైపుకి, ప్రవక్త వారి వైపుకి మొగ్గు చూపించారు. కానీ మళ్లీ ఉదయాన్ని చూస్తే, మక్కా పెద్దలు రకరకాలుగా ప్రవక్త వారి గురించి చెబుతూ ఉంటే అయోమయంలో పడిపోయారు. మక్కా పెద్దలు చెబుతున్నది నమ్మాలా? లేదా ప్రవక్త ముహమ్మద్ వారు చెబుతున్నది నమ్మాలా? తేల్చుకోలేకపోతున్నారు, అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు, చిరాకు వచ్చేసింది. దీనికి పరిష్కారం ఏమిటంటే ముహమ్మద్ వారిని చంపేస్తే సరిపోతుంది అని కత్తి పట్టుకొని బయలుదేరిపోయారు.

దారిలో నుఐమ్ అనే ఒక వ్యక్తి చూసుకున్నారు. చూసుకొని “ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగారు. “ముహమ్మద్ వారిని చంపడానికి” అని చెప్పేశారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, “అయ్యా, ముహమ్మద్ వారి విషయం తర్వాత, ముందు మీ చెల్లెలు ఫాతిమా, మీ బావ సయీద్, వాళ్లిద్దరూ కూడా ఇస్లాం స్వీకరించేశారు, నీకు తెలుసా?” అని చెప్పారు. ముందే కోపంలో ఉన్నారు. కుటుంబ సభ్యుల్లో చెల్లెలు, బావ ఇద్దరు కూడా ఆయనకు తెలియకుండానే ఇస్లాం స్వీకరించేశారు అన్న మాట వినగానే, కోపం రెట్టింపు అయిపోయింది. మరింత కోపంలో ఆయన అక్కడి నుంచి చక్కగా చెల్లెలి ఇంటికి వెళ్లిపోయారు.

ఆ సమయానికి ఖబ్బాబ్ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఉమర్ వారి చెల్లెలకు, బావకు ఖురాన్ నేర్పిస్తూ ఉన్నారు. శబ్దం విని ఆయన, ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి ఇంట్లో దాక్కున్నారు. చెల్లెలు బావ ఇద్దరూ కూడా ఆ ఖురాన్ పత్రాలు దాచిపెట్టేసి తర్వాత తలుపు తెరిచారు.

ఉమర్ రజియల్లాహు అన్హు వారు కోపంలో ఉన్నారు, ఆ పారాయణము చేసే శబ్దం కూడా వినేసి ఉన్నారు. “నేను శబ్దం విన్నాను, అలాగే మీ గురించి కూడా నేను తెలుసుకున్నాను. మీరు తాతముత్తాతల ధర్మాన్ని వదిలేశారంట, ముహమ్మద్ తీసుకొని వచ్చిన కొత్త ధర్మాన్ని మీరు అంగీకరించేశారంట. ఏదో మీరు చదువుతూ ఉన్నారు, నేను శబ్దం బయటి నుంచి విన్నాను” అని అలా ఎందుకు చేశారు అని కొట్టడం ప్రారంభించేశారు. బావను చితకబాదేశారు, చెల్లెలను చితకబాదేశారు. చివరికి చెల్లె తలకు గాయమయింది. ఆమె తిరగబడి ఉమర్ రజియల్లాహు అన్హు వారికి సమాధానం ఇస్తూ, “ఓ ఉమర్! నువ్వు వినింది నిజమే. మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను విన్నాము, నమ్మాము, విశ్వసించాము. ఇక నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో. ఇక మేము మాత్రము ఆ మార్గాన్ని వదిలేది లేదు, ఆ ధర్మాన్ని వదిలేది లేదు” అని చెప్పేశారు.

చెల్లెలు తిరగబడి మాట్లాడుతూ ఉంటే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు కొంచెం వెనక్కి తగ్గి, ఆశ్చర్యపోయి, “ఏంటమ్మా! మీలో ఇంత మార్పు తీసుకొని వచ్చిన ఆ మాటలు ఏమిటి? నాకు కూడా వినిపించండి” అన్నారు. “చెల్లెలు ముందు మీరు వెళ్లి స్నానం చేసుకొని రండి” అంటే, వెళ్లి స్నానం చేసుకొని వచ్చారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఖురాన్ పత్రాలలో సూరా తాహా కు చెందిన కొన్ని వాక్యాలు ఉన్నాయి, అవి ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ఆ వాక్యాలు చదివారు. ఆ వాక్యాలు చదివి ఎంత ప్రభావితులైపోయారంటే, “ముహమ్మద్ వారు ఎక్కడున్నారో చెప్పండి, నేను కూడా వెళ్లి ఆయన మాటను అంగీకరించాలనుకుంటున్నాను” అని చెప్పారు.

ఆ మాట వినగానే అక్కడ దాక్కొని ఉన్న ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు వారు బయటికి వచ్చి ఉమర్ రజియల్లాహు అన్హు వారికి శుభవార్త తెలియజేశారు. “ఓ ఉమర్! మీకు శుభవార్త ఏమిటంటే, కొద్ది రోజుల క్రితమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో దుఆ చేసి ఉన్నారు. ‘ఓ అల్లాహ్! ముస్లింలకు, ఇస్లాంకు ఉమర్ లేదా అబూ జహల్ వీరిద్దరిలో ఎవరికో ఒకరికి హిదాయత్ ప్రసాదించి బలం ఇవ్వు’ అని కోరి ఉన్నారు. అల్లాహ్ మీ అదృష్టంలో, మీ విధిరాతలో ఇస్లాం యొక్క భాగ్యం రాసాడని నాకు తెలుస్తూ ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దారే అరఖమ్ లో ఫలానా చోట సహాబాలతో సమావేశమై ఉన్నారు, మీరు అక్కడికి వెళ్లండి” అనగానే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు అక్కడికి వెళ్లారు.

అక్కడ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద శిక్షణ పొందుతూ ఉన్నారు, విద్య నేర్చుకుంటూ ఉన్నారు, ఇస్లామీయ విద్యలు నేర్చుకుంటూ ఉన్నారు. ఉమర్ వచ్చేసాడు అని తెలియగానే కంగారు పడిపోయారు. ఎందుకంటే ఆయన కోపిష్టుడు, ఇస్లాం స్వీకరించలేదు. ఏం ఉద్దేశంతో వచ్చారో, ఏం చేస్తారో ఏమో అని కంగారు పడిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “ఆయన్ని నా దగ్గరికి రానియ్యండి” అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఆయన వెళ్లారు. వెళ్లిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో కలిమా చదివి ఇస్లాం స్వీకరించేశారు.

ఆయన కలిమా చదివి ఇస్లాం స్వీకరిస్తున్న దృశ్యాన్ని, అక్కడ కూర్చొని భయపడుతూ ఉన్న ఆ శిష్యులందరూ, సహాబాలు చూసి ఒక్కసారిగా ఎంత సంతోషపడిపోయారంటే, బిగ్గరగా “అల్లాహు అక్బర్” అని పలికారు. వారందరూ పలికిన ఆ శబ్దము మక్కా వీధుల వరకు కూడా వెళ్లింది.

అంటే అర్థం ఏమిటండీ? ఖురాన్ చదివి, అప్పటికే చంపాలి అనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి ఎంత మారుమనసు పొందారంటే, ఆయన హృదయం ఎంతగా మెత్తబడిపోయింది అంటే, వచ్చి ప్రవక్త వారి శిష్యుడిగా మారిపోయారు. ప్రవక్త వారిని హతమార్చడానికి వచ్చిన వ్యక్తి, దారిలో ఖురాన్ వాక్యాలు చదివారు, ప్రవక్త వారి వద్దకు వచ్చి శిష్యుడిగా మారిపోయారు. చూసారా! కాబట్టి ఖురాన్ పారాయణము ద్వారా హృదయాలు మెత్తబడతాయి అనటానికి ఇది గొప్ప ఉదాహరణ మిత్రులారా.

అలాగే ఖురాన్ కి చాలా ఘనతలు ఉన్నాయండి. చాలా విషయాలు ఇంకా తెలుసుకోవలసి ఉంది కాబట్టి, క్లుప్తంగా ఇన్షా అల్లాహ్ మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తాను. ఖురాన్ సురక్షితమైన గ్రంథం. ఇంతవరకే మనం విని ఉన్నాం, ఇతర గ్రంథాలన్నీ కూడా కల్పితాలకు గురైపోయాయి, లేదా కాలగర్భంలో కలిసిపోయాయి అని. కానీ ఖురాన్ అలా కాదు. ఖురాన్ గ్రంథం సురక్షితంగా ఉంది. ఖురాన్ గ్రంథంలోని పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
[ఇన్నా నహ్ను నజ్జల్ నజ్జిక్ర వ ఇన్నా లహూ లహాఫిజూన్]
మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము.” (15:9)

మేమే ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాము మరియు మేమే దీనిని సురక్షితంగా ఉంచుతూ ఉన్నాము అన్నారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ గ్రంథాన్ని ఎలా సురక్షితంగా ఉంచుతూ వస్తూ ఉన్నాడు అన్నది రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచుతున్నాను చూడండి ఇన్షా అల్లాహ్.

మొదటి ఉదాహరణ ఏమిటంటే, మీరు ఇండియాలో ఖురాన్ చూడండి, అరేబియా దేశాలలోని ఖురాన్ చూడండి, యూరప్ దేశాలలో ఖురాన్ చూడండి, ఇతర ఖండాలలో, ప్రపంచంలో ఏ మూలన ఏ దేశంలో ఖురాన్ ఉన్నా మీరు చూడండి, ప్రతి చోట మీకు ఒకే రకమైన ఖురాన్ కనిపిస్తుంది.

ఒక దేశంలో వంద సూరాల ఖురాన్, మరొక దేశంలో యాభై సూరాల ఖురాన్, మరొక దేశంలో నూట పద్నాలుగు సూరాల ఖురాన్ – కనిపించదు. పూర్తి ప్రపంచంలో నూట పద్నాలుగు సూరాలు, నూట పద్నాలుగు అధ్యాయాలు కలిగిన ఖురాన్ మాత్రమే మీకు కనిపిస్తుంది. అదే మీరు వేరే గ్రంథాలని చూడండి. వేరే గ్రంథాలు మీరు చూస్తే, ఒక దేశంలో కొన్ని పుస్తకాలతో నిండిన గ్రంథము కనిపిస్తే, మరొక దేశంలో అంతకు మించిన పుస్తకాలతో నిండిన గ్రంథము కనిపిస్తుంది. ఒకచోట ఎక్కువ పుస్తకాలు ఉన్న గ్రంథము, మరొక చోట తక్కువ పుస్తకాలు ఉన్న గ్రంథము. వీళ్లేమంటారంటే అందులో ఎక్కువైపోయింది అంటారు. వాళ్లేమంటారంటే అందులో కొన్ని తీసేశారు అంటారు. మొత్తానికి తీయటమో లేదా జొప్పించటమో జరిగింది స్పష్టంగా.

కానీ ఖురాన్ లో అలా జరగలేదు. పూర్తి ప్రపంచంలో అల్హందులిల్లాహ్ ఒకే రకమైన ఖురాన్ కనిపిస్తుంది. ఇది ఖురాన్ సురక్షితంగా ఉంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ.

మరొక ఉదాహరణ, అదేంటంటే: నేడు భూమండలం మీద మస్జిద్ లలో గాని, మదరసాలలో గాని, లైబ్రరీలలో గాని, ఇంకా ఎక్కడైనా గాని ఖురాన్ ఉంది అంటే, ఆ ఖురాన్ గ్రంథాలన్నీ తీసుకొని వెళ్లి ఒక సముద్రంలో పడవేసేస్తే, ఖురాన్ గ్రంథము ప్రపంచంలో నుంచి తొలగిపోదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే కాగితాలలోనే ఈ ఖురాన్ భద్రంగా లేదు, మానవుల గుండెల్లో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గ్రంథాన్ని భద్రంగా ఉంచి ఉన్నాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఏడు సంవత్సరాల కుర్రాడు, తొమ్మిది సంవత్సరాల అమ్మాయి, పూర్తి ఖురాన్ గ్రంథం “అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్” నుంచి మొదలెట్టి “ఖుల్ అరూజు బి రబ్బిన్ నాస్” అనే సూరా వరకు పూర్తి ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసేసి ఉన్నారు. ఇలా ఖురాన్ కంఠస్థం చేసిన వాళ్లను ‘హుఫ్ఫాజ్‘ అని అంటారు. ఇలాంటి హుఫ్ఫాజ్ లు ప్రతి దేశంలో అల్హందులిల్లాహ్ వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఉన్నారు పూర్తి ప్రపంచంలో అల్హందులిల్లాహ్.

పూర్తి కాగితాలలో ఉన్న ఖురాన్ గ్రంథాలన్నీ తీసుకొని పోయి సముద్రంలో పడవేసినా, ఈ ఖురాన్ ని కంఠస్థం చేసిన ఈ హుఫ్ఫాజ్ లు ప్రతి దేశంలో ఉన్నారు, వాళ్లు మళ్లీ మరుసటి రోజే ఖురాన్ ని మళ్లీ రాయగలరు, ముద్రించగలరు, సిద్ధం చేసుకోగలరు. కాబట్టి ఖురాన్ ప్రపంచంలో నుంచి తొలగిపోదు, అది కాగితాలలోనే కాదు, హృదయాలలో కూడా భద్రంగా ఉంది. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ఖురాన్ ని సురక్షితంగా ఉంచుతూ వస్తూ ఉన్నాడు.

ఒక ప్రశ్న, అదేమిటంటే: ఖురాన్ గురించి ఇంత గొప్పగా చెప్పాను కదా, ఒక్కసారి ఆలోచించి చూడండి. ఖురాన్ కాకుండా వేరే గ్రంథాలు ఇవి కూడా దేవుని గ్రంథమే అని పలుకుతున్నారు కదా, అందులోని సగం గ్రంథం ప్రపంచం లోనుంచి తీసుకొని వెళ్లి సముద్రంలో పడవేస్తే, ఆ సగం గ్రంథాన్ని కంఠస్థం చేసిన వాళ్లు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారా? లేదా పావు గ్రంథాన్ని కూడా చూడకుండా కంఠస్థం చేసిన వాళ్లు ప్రపంచంలో ఉన్నారా? అంటే లేరు అనే సమాధానం వస్తుంది. కాబట్టి ఖురాన్ ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంత భద్రంగా ఏ విధంగా ఉంచాడో చూడండి, ఇది ఖురాన్ యొక్క ఘనత మరియు ప్రత్యేకత.

అలాగే ఖురాన్ ద్వారా ప్రపంచంలో కూడా గౌరవం, పరలోకంలో కూడా గౌరవం దక్కించుకుంటాడు భక్తుడు, విశ్వాసుడు. ఎలాగంటే చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క విధానాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

إِنَّ اللَّهَ يَرْفَعُ بِهَذَا الْكِتَابِ أَقْوَامًا
[ఇన్నల్లాహ యర్ ఫఉ బిహాజల్ కితాబి అఖ్వామన్]
“నిశ్చయంగా అల్లాహ్ ఈ గ్రంథం ద్వారా ఎన్నో జాతులకు (లేదా సముదాయాలకు) సాఫల్యం ప్రసాదిస్తాడు (గౌరవం ప్రసాదిస్తాడు).”

మరొక ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేశారు:

خَيْرُكُمْ مَنْ تَعَلَّمَ الْقُرْآنَ وَعَلَّمَهُ
[ఖైరుకుమ్ మన్ తఅల్లమల్ ఖుర్ఆన వ అల్లమహు]
“మీలో ఎవరైతే ఖురాన్ ను నేర్చుకుంటారో మరియు ఇతరులకు నేర్పిస్తారో, వారు సమాజంలోని ఉత్తమమైన వాళ్లు” అని చెప్పేశారు.

ఉత్తమమైన వారు అన్న యొక్క ఘనత, గౌరవం వారికి ప్రపంచంలో దక్కింది. దీనికి ప్రాక్టికల్ గా ఒక మాట చెబుతాను చూడండి. మనం ప్రతిరోజు మస్జిద్ కి వెళ్తాం. నమాజు ఐదు పూటలా ఆచరిస్తాం. ఇమాం గారు ఫర్జ్ నమాజు ఆచరిస్తున్నప్పుడు ఒక్క విషయాన్ని గమనించండి. వెనకాల నిలబడిన వాళ్లలో ఇంజనీర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, టీచర్లు ఉంటారు, ప్రిన్సిపల్ లు ఉంటారు, పండితులు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు, ఇంకా ఏదేదో నేర్చుకొని ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు. కానీ వాళ్లందరూ వెనుక ఉంటే, వారి ముందర ఒక వ్యక్తి ఇమాం గా నిలబడి అందరికీ నమాజు చేయిస్తారు. ఆయన దగ్గర ఇంజనీరింగ్ పట్టా ఉండదు, అలాగే డాక్టర్ పట్టా ఉండదు, ఆయన గొప్ప కోటీశ్వరుడు కూడా కాడు. కానీ అందరి ముందర నిలబడి అందరికీ నమాజు చేయించే గౌరవం ఆయనకు దక్కుతా ఉంది అంటే ఆయన దగ్గర ఏముందో తెలుసా? ఆయన హృదయంలో ఖురాన్ వాక్యాలు ఉన్నాయి. ఖురాన్ వాక్యాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ఆయనకు ఆ గౌరవం ఇచ్చాడు. ఆయన గురువుగా అందరికీ నమాజు చేయిస్తారు, అందరూ ఆయనను గౌరవిస్తూ ఆయన వెనకాల నమాజు చేసుకొని వస్తారు. అల్హందులిల్లాహ్, ప్రపంచంలో ఇది అల్లాహ్ ఇచ్చిన గౌరవం.

పరలోకంలో కూడా గౌరవం దక్కుతుంది. అదేంటో కూడా ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు: ఎప్పుడైతే లెక్కంపు రోజు వస్తుందో, ఆ లెక్కంపు రోజున ఖురాన్ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో సిఫారసు చేస్తుంది. “ఓ అల్లాహ్! ఫలానా భక్తుడు ప్రపంచంలో ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకున్నాడు, పఠించాడు, అందులో ఉన్న విషయాల ప్రకారం అమలు పరిచాడు కాబట్టి ప్రజలందరి ముందర ఆయనకు గౌరవం వచ్చేలాగా చేయండి”.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలందరి ముందర ఆయనకు గౌరవం వచ్చేలాగా గౌరవ కిరీటము ధరింపజేస్తాడు. అల్లాహు అక్బర్! ఒక రాజు పిలిచి ఒక వ్యక్తికి అవార్డు ఇచ్చేస్తే దాన్ని ఎంత గౌరవంగా భావిస్తాడు మనిషి? పేపర్లలో, న్యూస్ ఛానల్ లలో ప్రతి చోట అదే సంచలనమైన వార్తగా మారిపోతుంది. ఆయన ఫలానా అవార్డు దక్కించుకున్నాడు, ఫలానా ప్రధాని చేతి మీద లేదా రాజు చేతి మీద ఆ అవార్డు ఆయన తీసుకున్నాడు చూడండి, చూడండి అని ప్రతి వీడియోలో ఆయనదే వీడియో, ప్రతి పేపర్లలో ఆయనదే ఫోటో కనిపిస్తుంది. కానీ పూర్తి ప్రపంచానికి రారాజు, విశ్వానికి మొత్తానికి రారాజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఆ రోజు మానవులందరి ముందర ఆ భక్తుని తల మీద కిరీటం ధరింపజేస్తాడు.

అంతేకాదండి, మళ్లీ ఖురాన్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో అంటుంది: “ఓ అల్లాహ్! మరింత గౌరవం వచ్చేలాగా ఆయనకి గౌరవించండి” అంటే, అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఖరీదైన బట్టలు ధరింపజేస్తాడు.

అంతేకాదండి, మళ్లీ ఖురాన్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో అడుగుతుంది: “ఓ అల్లాహ్! ఇతని తల్లిదండ్రులకు కూడా గౌరవం వచ్చేలాగా చేయండి” అంటే, అప్పుడు ఆ భక్తుని యొక్క తల్లిదండ్రులకు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులందరి ముందర కిరీటము ధరింపజేస్తాడు. అల్లాహు అక్బర్! ఏ తల్లిదండ్రులైతే వారి బిడ్డలకు ప్రపంచంలో ఖురాన్ నేర్పిస్తారో, ఖురాన్ ప్రకారంగా జీవించుకోవడానికి మార్గదర్శకత్వం చేస్తారో, అలాంటి తల్లిదండ్రులు కూడా పరలోకంలో లెక్కంపు రోజున గౌరవం పొందుతారు మిత్రులారా.

ఒక్కసారి ఆలోచించండి. ఒక్క ఖురాన్ ద్వారా ప్రపంచంలో కూడా గౌరవము ఉంది, పరలోకంలో కూడా గౌరవము ఉంది. ఖురాన్ ను కాకుండా వేరే గ్రంథాల వలన ఇలాంటి గౌరవం కలుగుతుంది అన్న విశిష్టత ఉందా? లేదు. ఒక ఖురాన్ కు మాత్రమే ఉంది, ఇది ఖురాన్ యొక్క ఘనత మిత్రులారా.

అంతేకాదండి, ఖురాన్ కి ఉన్న మరో ఘనత ఏమిటంటే, ఖురాన్ ద్వారా మానవుడు స్వర్గంలోని ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటాడు. ఎలాగా? ఎలాగంటే తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు: స్వర్గవాసులు స్వర్గానికి చేరినప్పుడు, ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకొని, కంఠస్థం చేసి, పఠించి, దాని ప్రకారంగా అమలు పరిచిన భక్తులతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంటాడు: “ఓ భక్తుడా! ఎలాగైతే నీవు ప్రపంచంలో ప్రశాంతంగా ఖురాన్ పారాయణము చేసేవాడివో, ఈరోజు స్వర్గంలో కూడా ఖురాన్ పారాయణము చేస్తూ పో మరియు స్వర్గం యొక్క స్థానాలు ఎక్కుతా పో” అని చెప్పేస్తాడు. అతను ఖురాన్ పారాయణము మొదలెట్టి, స్వర్గపు యొక్క స్థాయులు ఎక్కుతా పోతాడు. ఎక్కడైతే ఆయన ఖురాన్ పారాయణము పూర్తి అయిపోతుందో, అప్పటివరకు ఎంత పైకి వెళ్ళిపోతాడో, అంత పైకి వెళ్లిపోయి అక్కడ స్థిరపడిపోతాడు. అల్లాహు అక్బర్! ఇది ఖురాన్ యొక్క ఘనత మిత్రులారా.

అంతే కాదండి, ఖుర్ఆను ద్వారా సమాధి శిక్షల నుండి రక్షణ లభిస్తుంది అని కూడా తెలియజేయడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ప్రపంచంలో ఖుర్ఆన్ పారాయణం చేస్తారో, ముఖ్యంగా ప్రతిరోజు పడుకునే ముందు సూరా ముల్క్ 67వ అధ్యాయాన్ని పఠిస్తారో అలాంటి భక్తులకు సమాధి శిక్షల నుండి రక్షణ లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

చూశారా? ప్రపంచంలో గౌరవం, సమాధి శిక్షల నుండి రక్షణ, మరియు పరలోకంలో గౌరవం, స్వర్గంలోని ఉన్నత స్థానాలు, ఎన్ని ఘనతలు దక్కుతున్నాయో చూడండి మిత్రులారా ఈ ఖుర్ఆన్ ద్వారా. మరి,

ఖుర్ఆను ద్వారా మనుషులు స్వస్థత కూడా పొందగలరు. పదిహేడవ అధ్యాయం 82వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِلْمُؤْمِنِينَ
మేము అవతరింపజేసే ఈ ఖుర్‌ఆన్‌ విశ్వాసుల కొరకు ఆసాంతం స్వస్థత, కారుణ్య ప్రదాయిని.” (17:82)

అంటే, ఇది స్వస్థత ఇస్తుంది అని అన్నారు. మనిషికి శారీరక వ్యాధులు ఉంటాయి, మానసిక వ్యాధులు కూడా ఉంటాయి. హృదయాలలో మనిషికి అసూయ, అహంకారం, ఇలాంటి కుళ్ళు బుద్దులు, కొన్ని దురలక్షణాలు ఉంటాయి, అవి హృదయాలలో ఉంటాయి. ఖుర్ఆన్ పఠిస్తే, ఖుర్ఆన్ ప్రకారంగా నడుచుకుంటే ఆ రోగాలన్నీ దూరమైపోతాయి, మనిషి స్వస్థత పొందుతాడు, మంచి స్వభావము కలిగిన వ్యక్తిగా మారిపోతాడు. అలాగే శారీరక వ్యాధులకు కూడా ఖుర్ఆన్ పారాయణము ద్వారా స్వస్థత లభిస్తుంది అని తెలియజేయడం జరిగి ఉంది.

అంతే కాదండి, మనిషికి మేలు చేసే అన్ని విషయాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ లో తెలియజేసి ఉన్నాడు. కాకపోతే దాని బాగా లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఖుర్ఆన్ చదివి చూడండి. ప్రపంచం ఎలా మొదలైందో కూడా తెలియజేయడం జరిగింది. ప్రపంచం మొదలైన తర్వాత నేటి వరకు ఏ విధంగా నడుచుకుంటూ వస్తూ ఉంది అనేది కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ప్రళయం వరకు ఏమేమి సంభవిస్తాయో అది కూడా చెప్పడం జరిగింది. ప్రళయం తర్వాత మరణానంతరం ఏమేమి జరుగుతుందో అవి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనిషికి అవసరమైన అన్ని విషయాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇందులో తెలియజేశేశాడు. ఇప్పుడు ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఏమంటారంటే, ఏమండీ, సైన్స్ గురించి కూడా ఉందా ఖుర్ఆన్ లో అంటారు. సైన్స్ గురించి కూడా ఉంది. ఖుర్ఆన్ మరియు సైన్స్ అనే ఒక పుస్తకం ఉంది, అది చదవండి ఇన్ షా అల్లాహ్ తెలుస్తుంది. మరిన్ని విషయాలు కూడా ఉన్నాయి. అవి పరిశీలించి ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది మిత్రులారా.

ఇక చివరిగా మనం చూసినట్లయితే, ఖుర్ఆన్ లాంటి మరొక గ్రంథము ఎవ్వరూ సృష్టించలేరు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పదిహేడవ అధ్యాయము 88వ వాక్యంలో తెలియజేశాడు, మానవులందరూ కలిసిపోయినా, మానవులతో పాటు జిన్నాతులు, షైతానులు కూడా కలిసిపోయినా, అందరూ కలిసి ప్రయత్నించినా ఖుర్ఆన్ లాంటి మరొక గ్రంథము తయారు చేయలేరు.

అలాగే, ఖుర్ఆన్ సులభమైన గ్రంథము. యాభై నాలుగవ అధ్యాయము 22వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు, వలఖద్ యస్సర్నల్ ఖుర్ఆన. మేము ఖుర్ఆన్ గ్రంథాన్ని సులభతరం చేసేశాము అని అన్నారు. కాబట్టి ఖుర్ఆను గ్రంథాన్ని పిల్లలు కూడా నేర్చుకోవచ్చు, పెద్దలు కూడా నేర్చుకోవచ్చు, పురుషులు, మహిళలు, అందరూ కూడా ఖుర్ఆను గ్రంథాన్ని నేర్చుకోవచ్చు, చదవవచ్చు, కంఠస్థం చేయవచ్చు, అర్థం చేసుకోవచ్చు, అల్ హందులిల్లాహ్.

మిత్రులారా, నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను, ఇలాంటి మహిమలు, ఘనతలు, ప్రత్యేకతలు కలిగిన ఖుర్ఆను గ్రంథాన్ని చదువుకొని, కంఠస్థం చేసుకొని, అర్థం చేసుకొని, దాని ప్రకారంగా నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఖుర్ఆను ద్వారా ప్రపంచంలోనూ, పరలోకంలోనూ గౌరవమైన స్థానాల వద్దకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ చేర్చుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30451

ఖురాన్ మెయిన్ పేజీ:
https://teluguislam.net/quran/

58. సూరతుల్ ముజాదిలహ్ తఫ్సీర్ – నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

58:1 قَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّتِي تُجَادِلُكَ فِي زَوْجِهَا وَتَشْتَكِي إِلَى اللَّهِ وَاللَّهُ يَسْمَعُ تَحَاوُرَكُمَا ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ بَصِيرٌ

(ఓ ప్రవక్తా!) తన భర్త విషయమై నీతో వాదిస్తూ, అల్లాహ్ కు ఫిర్యాదు చేసుకుంటూ ఉన్న ఆ స్త్రీ మాటను అల్లాహ్ విన్నాడు. ఇంకా, అల్లాహ్ మీరిద్దరి మధ్య జరిగిన సంవాదనను (కూడా) విన్నాడు. నిశ్చయంగా అల్లాహ్ (అంతా) వినేవాడు, చూసేవాడు.

58:2 الَّذِينَ يُظَاهِرُونَ مِنكُم مِّن نِّسَائِهِم مَّا هُنَّ أُمَّهَاتِهِمْ ۖ إِنْ أُمَّهَاتُهُمْ إِلَّا اللَّائِي وَلَدْنَهُمْ ۚ وَإِنَّهُمْ لَيَقُولُونَ مُنكَرًا مِّنَ الْقَوْلِ وَزُورًا ۚ وَإِنَّ اللَّهَ لَعَفُوٌّ غَفُورٌ

మీలో ఎవరైనాసరే తమ భార్యలపై ‘జిహార్’ను ప్రయోగించినంత మాత్రాన (నీవు నా తల్లి వీపు లాంటి దానివి అని నోరు జారినంత మాత్రాన) వారు వారికి తల్లులైపోరు. వారిని కన్నవారు మాత్రమే వాస్తవానికి వారి తల్లులు. నిజానికి ఈ విధంగా పలికేవారు అసహ్యమైన మాటను, అబద్ధాన్ని పలికారు. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్షపెట్టేవాడూను.

58:3 وَالَّذِينَ يُظَاهِرُونَ مِن نِّسَائِهِمْ ثُمَّ يَعُودُونَ لِمَا قَالُوا فَتَحْرِيرُ رَقَبَةٍ مِّن قَبْلِ أَن يَتَمَاسَّا ۚ ذَٰلِكُمْ تُوعَظُونَ بِهِ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ

మరెవరైనా తమ భార్యలపై ‘జిహార్’ను ప్రయోగించి, తమ నోటి ద్వారా జారిపోయిన (తప్పుడు) మాటను ఉపసంహరించదలచుకుంటే వారు ఒకరినొకరు తాకకముందే అతను ఒక బానిసకు స్వేచ్ఛను ప్రసాదించాలి. దీని ద్వారా మీకు గుణపాఠం నేర్పబడుతున్నది. మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు.

58:4 فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ مِن قَبْلِ أَن يَتَمَاسَّا ۖ فَمَن لَّمْ يَسْتَطِعْ فَإِطْعَامُ سِتِّينَ مِسْكِينًا ۚ ذَٰلِكَ لِتُؤْمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ ۚ وَتِلْكَ حُدُودُ اللَّهِ ۗ وَلِلْكَافِرِينَ عَذَابٌ أَلِيمٌ

ఈ స్థోమత లేనివాడు, భార్యాభర్తలు పరస్పరం ముట్టుకోకముందే అతను రెండు మాసాలపాటు ఎడతెగకుండా ఉపవాసాలు పాటించాలి. ఈపాటి శక్తి కూడా లేనివాడు అరవై మంది అగత్యపరులకు అన్నం పెట్టాలి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై మీ పరిపూర్ణ విశ్వాసం రూడీ కావటానికే ఇది మీపై విధించబడింది. ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. అవిశ్వాసులకు బాధాకరమైన శిక్ష ఖాయం.

58:5 إِنَّ الَّذِينَ يُحَادُّونَ اللَّهَ وَرَسُولَهُ كُبِتُوا كَمَا كُبِتَ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ وَقَدْ أَنزَلْنَا آيَاتٍ بَيِّنَاتٍ ۚ وَلِلْكَافِرِينَ عَذَابٌ مُّهِينٌ

అల్లాహ్ ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు వారి పూర్వీకులు పరాభవం పాలైనట్లే పరాభవం పాలవుతారు. నిశ్చయంగా మేము స్పష్టమైన నిదర్శనాలను అవతరింపజేసి ఉన్నాము. అవిశ్వాసులకు అవమానకరమయిన శిక్ష తథ్యం.

58:6 يَوْمَ يَبْعَثُهُمُ اللَّهُ جَمِيعًا فَيُنَبِّئُهُم بِمَا عَمِلُوا ۚ أَحْصَاهُ اللَّهُ وَنَسُوهُ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ

ఏ రోజున అల్లాహ్ వారందరినీ తిరిగి లేపుతాడో అప్పుడు వారికి వారు చేసుకున్న కర్మలను తెలియపరుస్తాడు. అల్లాహ్ దాన్ని లెక్కించి పెట్టాడు. వారు మాత్రం దానిని మరచిపోయారు. కాని అల్లాహ్ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు.

58:7 أَلَمْ تَرَ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ مَا يَكُونُ مِن نَّجْوَىٰ ثَلَاثَةٍ إِلَّا هُوَ رَابِعُهُمْ وَلَا خَمْسَةٍ إِلَّا هُوَ سَادِسُهُمْ وَلَا أَدْنَىٰ مِن ذَٰلِكَ وَلَا أَكْثَرَ إِلَّا هُوَ مَعَهُمْ أَيْنَ مَا كَانُوا ۖ ثُمَّ يُنَبِّئُهُم بِمَا عَمِلُوا يَوْمَ الْقِيَامَةِ ۚ إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ

భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు గురించి అల్లాహ్ కు తెలుసన్నది నీవు చూడటం లేదా? నాల్గవవాడుగా అల్లాహ్ లేకుండా ఏ ముగ్గురి మధ్య కూడా రహస్య మంతనాలు జరగవు. అరవవాడుగా అల్లాహ్ లేకుండా ఏ ఐదుగురి మధ్యన కూడా (రహస్య సమాలోచనలు సాగవు). అంతకన్నా తక్కువ మంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా – వారెక్కడ ఉన్నా – ఆయన వారితో ఉంటాడు. మరి వారు చేసుకున్నవన్నీ ప్రళయదినాన వారికి తెలియపరుస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు.

58:8 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ نُهُوا عَنِ النَّجْوَىٰ ثُمَّ يَعُودُونَ لِمَا نُهُوا عَنْهُ وَيَتَنَاجَوْنَ بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِيَتِ الرَّسُولِ وَإِذَا جَاءُوكَ حَيَّوْكَ بِمَا لَمْ يُحَيِّكَ بِهِ اللَّهُ وَيَقُولُونَ فِي أَنفُسِهِمْ لَوْلَا يُعَذِّبُنَا اللَّهُ بِمَا نَقُولُ ۚ حَسْبُهُمْ جَهَنَّمُ يَصْلَوْنَهَا ۖ فَبِئْسَ الْمَصِيرُ

రహస్య మంతనాలు జరపరాదని వారించబడినవారిని నీవు చూడలేదా? అయినాసరే వారు వారింపబడిన దానికే మళ్ళి పాల్పడుతున్నారు. వారు పాపం, అత్యాచారం, ప్రవక్త పట్ల అవిధేయతలకు సంబంధించిన రహస్య మంతనాలను సాగిస్తున్నారు. వారు నీ దగ్గరకు వచ్చినపుడు, అల్లాహ్ నీకు ఏ పదజాలంతో సలాం చెయ్యలేదో ఆ పదజాలంతో నీకు సలాం చేస్తారు. పైపెచ్చు, “మనం పలికే ఈ మాటలపై అల్లాహ్ మనల్ని ఎందుకు శిక్షించటం లేదు?!” అని లోలోపలే చెప్పుకుంటారు. వారికి నరకం (యాతన) సరిపోతుంది. వారు అందులోకి ప్రవేశిస్తారు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం.

58:9 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا تَنَاجَيْتُمْ فَلَا تَتَنَاجَوْا بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِيَتِ الرَّسُولِ وَتَنَاجَوْا بِالْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَاتَّقُوا اللَّهَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ

ఓ విశ్వాసులారా! మీరు గనక (పరస్పరం) రహస్య సమాలోచన జరిపితే పాపం, అత్యాచారం, ప్రవక్త పట్ల అవిధేయత గురించిన సమాలోచన జరపకండి. దానికి బదులు సత్కార్యం, భయ భక్తులకు సంబంధించిన సమాలోచన జరపండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. ఆయన వద్దకే మీరంతా సమీకరించబడతారు.

58:10 إِنَّمَا النَّجْوَىٰ مِنَ الشَّيْطَانِ لِيَحْزُنَ الَّذِينَ آمَنُوا وَلَيْسَ بِضَارِّهِمْ شَيْئًا إِلَّا بِإِذْنِ اللَّهِ ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ

విశ్వాసులను వ్యాకుల పరచాలనుకునే (కుత్సిత) సమాలోచనలు షైతాను ప్రేరణలే. అల్లాహ్ అనుజ్ఞ కానంత వరకూ వాడు వారికి ఎలాంటి కీడు కలిగించలేడన్నది నిజం. విశ్వాసులు మాత్రం అల్లాహ్ నే నమ్ముకోవాలి.

58:11 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا قِيلَ لَكُمْ تَفَسَّحُوا فِي الْمَجَالِسِ فَافْسَحُوا يَفْسَحِ اللَّهُ لَكُمْ ۖ وَإِذَا قِيلَ انشُزُوا فَانشُزُوا يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ

ఓ విశ్వాసులారా! సమావేశాలలో కాస్త ఎడంగా కూర్చోండి అని మీతో అనబడినప్పుడు, మీరు కాస్త ఎడంగా కూర్చోండి. అల్లాహ్ మీకు విశాలాన్ని ప్రసాదిస్తాడు. ‘లేవండి’ అని మీతో అనబడినప్పుడు మీరు లేచినిలబడండి. మీలో విశ్వసించినవారి, జ్ఞానం ప్రసాదించబడినవారి అంతస్థులను అల్లాహ్ పెంచుతాడు. మీరు చేసే ప్రతి పనీ అల్లాహ్ జ్ఞాన పరిధిలో ఉంది.

58:12 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نَاجَيْتُمُ الرَّسُولَ فَقَدِّمُوا بَيْنَ يَدَيْ نَجْوَاكُمْ صَدَقَةً ۚ ذَٰلِكَ خَيْرٌ لَّكُمْ وَأَطْهَرُ ۚ فَإِن لَّمْ تَجِدُوا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ

విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తో రహస్య సమాలోచన చేయదలిస్తే, మీరు రహస్య సమాలోచనకు ముందు ఎంతో కొంత దానం చేయండి. ఇది మీ కొరకు ఎంతో ఉత్తమమైనది, పవిత్రమైనది. ఒకవేళ మీకు ఆ స్థోమత లేకపోతే అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు.

58:13 أَأَشْفَقْتُمْ أَن تُقَدِّمُوا بَيْنَ يَدَيْ نَجْوَاكُمْ صَدَقَاتٍ ۚ فَإِذْ لَمْ تَفْعَلُوا وَتَابَ اللَّهُ عَلَيْكُمْ فَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ ۚ وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ

ఏమిటి, మీ రహస్య సమాలోచనకు ముందు మీరు దానం చేయాలి అనేసరికి భయపడిపోయారా? మీరు ఈ దానధర్మము చేయలేకపోయినప్పుడు అల్లాహ్ కూడా మిమ్మల్ని మన్నించాడు. అందుకే ఇప్పుడు నమాజులను (సజావుగా) నెలకొల్పండి. జకాత్ ను (విధిగా) ఇస్తూ ఉండండి. అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. మీరు చేసేదంతా అల్లాహ్ కు పూర్తిగా ఎరుకే.

58:14 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ تَوَلَّوْا قَوْمًا غَضِبَ اللَّهُ عَلَيْهِم مَّا هُم مِّنكُمْ وَلَا مِنْهُمْ وَيَحْلِفُونَ عَلَى الْكَذِبِ وَهُمْ يَعْلَمُونَ

ఏమిటి, అల్లాహ్ ఆగ్రహానికి గురైన వారితో కుమ్మక్కు అయిన వారిని నీవు చూడలేదా? అసలు వీరు (ఈ కపటులు) మీ వారూ కారు. వాళ్ళ పక్షాన చేరినవారూ కారు. తెలిసి కూడా వారు – ఉద్దేశ్యపూర్వకంగా – అసత్య విషయాలపై ప్రమాణం చేస్తున్నారు.

58:15 أَعَدَّ اللَّهُ لَهُمْ عَذَابًا شَدِيدًا ۖ إِنَّهُمْ سَاءَ مَا كَانُوا يَعْمَلُونَ

వారికోసం అల్లాహ్ అత్యంత కఠినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. వారు చేసేవి ముమ్మాటికీ చెడుపనులే.

58:16 اتَّخَذُوا أَيْمَانَهُمْ جُنَّةً فَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ فَلَهُمْ عَذَابٌ مُّهِينٌ

వారు తమ ప్రమాణాలను ఆసరా (డాలు)గా చేసుకున్నారు. పైగా అల్లాహ్ మార్గం నుండి ఆపుతున్నారు. వారికి అవమానకరమైన శిక్ష తథ్యం.

58:17 لَّن تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُم مِّنَ اللَّهِ شَيْئًا ۚ أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ

వారి సిరిసంపదలుగానీ, వారి సంతానం గానీ అల్లాహ్ కు వ్యతిరేకంగా వారికేమాత్రం పనికిరావు. వారు నరక వాసులు. వారందులో కలకాలం ఉంటారు.

58:18 يَوْمَ يَبْعَثُهُمُ اللَّهُ جَمِيعًا فَيَحْلِفُونَ لَهُ كَمَا يَحْلِفُونَ لَكُمْ ۖ وَيَحْسَبُونَ أَنَّهُمْ عَلَىٰ شَيْءٍ ۚ أَلَا إِنَّهُمْ هُمُ الْكَاذِبُونَ

వారందరినీ అల్లాహ్ తిరిగి లేపిన రోజున, వారు మీ ముందు ప్రమాణాలు చేసినట్లే ఆయన ముందు కూడా ప్రమాణాలు చేస్తారు. తమకూ ఏదో ఒక ఆధారం ఉందని తలపోస్తారు. బాగా తెలుసుకోండి! వారు పచ్చి అబద్ధాల కోరులు.

58:19 اسْتَحْوَذَ عَلَيْهِمُ الشَّيْطَانُ فَأَنسَاهُمْ ذِكْرَ اللَّهِ ۚ أُولَٰئِكَ حِزْبُ الشَّيْطَانِ ۚ أَلَا إِنَّ حِزْبَ الشَّيْطَانِ هُمُ الْخَاسِرُونَ

షైతాను వారిని లొంగదీసుకున్నాడు. వారు అల్లాహ్ ధ్యానాన్ని మరచి పోయేలా చేశాడు. వాళ్ళు షైతాను ముఠాకు చెందినవారు. బాగా తెలుసుకోండి! ఎట్టకేలకు నష్టపోయేది షైతాను ముఠాయే.

58:20 إِنَّ الَّذِينَ يُحَادُّونَ اللَّهَ وَرَسُولَهُ أُولَٰئِكَ فِي الْأَذَلِّينَ

ఎవరైతే అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల వైరవైఖరిని అవలంబిస్తారో వారు అత్యంత ఎక్కువగా పరాభవం పాలయ్యేవారిలో ఉంటారు.

58:21 كَتَبَ اللَّهُ لَأَغْلِبَنَّ أَنَا وَرُسُلِي ۚ إِنَّ اللَّهَ قَوِيٌّ عَزِيزٌ

“నేనూ, నా ప్రవక్తలు మాత్రమే ఆధిపత్యం వహిస్తాము” అని అల్లాహ్ వ్రాసిపెట్టేశాడు. నిశ్చయంగా అల్లాహ్ మహాబలుడు, తిరుగులేనివాడు.

58:22 لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ ۚ أُولَٰئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ الْإِيمَانَ وَأَيَّدَهُم بِرُوحٍ مِّنْهُ ۖ وَيُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ رَضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ أُولَٰئِكَ حِزْبُ اللَّهِ ۚ أَلَا إِنَّ حِزْبَ اللَّهِ هُمُ الْمُفْلِحُونَ

అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించేవారు అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల శత్రుత్వం వహించేవారిని ప్రేమిస్తున్నట్లు నీవు ఎక్కడా చూడవు – ఆఖరికి వారు తమ తండ్రులైనాసరే, తమ కొడుకులైనాసరే, తమ అన్నదమ్ములైనాసరే, తమ పరివారజనులైనా సరే (ససేమిరా వారిని ప్రేమించరు). అల్లాహ్ విశ్వాసాన్ని రాసి పెట్టినది ఇలాంటి వారి హృదయాలలోనే! ఆయన తన ఆత్మ ద్వారా వీరిని ప్రత్యేకంగా బలపరిచాడు. ఇంకా వీరికి, క్రింద సెలయేరులు పారే స్వర్గ వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. అందులో వీరు కలకాలం ఉంటారు. అల్లాహ్ వీరి పట్ల ప్రసన్నుడయ్యాడు. వీరు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. అల్లాహ్ పక్షానికి చెందిన వారంటే వీరే. నిశ్చయంగా సాఫల్యం పొందేవారు అల్లాహ్ పక్షం వారే.

ఖుర్’ఆన్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/quran/

రమజాన్ తర్వాత ఖుర్ఆన్ తో మన సంబంధం [వీడియో]

రమజాన్ తర్వాత ఖుర్ఆన్ తో మన సంబంధం [వీడియో]
ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/bCAEVhTRSkA [45 నిముషాలు]

రమదాన్ తర్వాత (After Ramadhan)

దివ్య ఖుర్ఆన్ మహత్యాలు | జాదుల్ ఖతీబ్

[డౌన్ లోడ్ ఖుత్బా PDF] [26 పేజీలు]

ఖుత్బాయందలి ముఖ్యాంశాలు 

1) రమజాన్ మాసం మరియు దివ్య ఖురాన్. 
2) దివ్య ఖురాన్ విశిష్టత మరియు ఔన్నత్యం.
3) దివ్య ఖురాన్ కొన్ని మహత్యాలు. 
4) దివ్య ఖురాన్ ఎందుకు అవతరించబడింది?
5) దివ్య ఖురాన్ ప్రభావాలు. 
6) దివ్య ఖురాన్ ను గట్టిగా పట్టుకోమని ఆదేశం. 

మొదటి ఖుత్బా 

ఇస్లామీయ సోదరులారా! 

అల్లాహ్, ఆకాశ గ్రంథాలలో అన్నింటికన్నా ఉత్తమమైన గ్రంథాన్ని (ఖురాను) అన్నింటికన్నా శ్రేష్టమైన మాసంలో (రమజాన్ మాసం) అవతరింప జేశాడు. అంతేకాక, ఈ శుభప్రదమాసంలోని శ్రేష్టమైన రాత్రి (లైలతుల్ ఖద్ర్) యందు దీనిని ‘లౌహే మహ్ ఫూజ్ ‘ నుండి ఒక్కసారిగా ఇహలోకపు ఆకాశంపైకి అవతరింపజేసి ‘బైతుల్ ఇజ్జ’ (మొదటి ఆకాశంలోని ఒక ప్రదేశం) నందు పొందుపరిచాడు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ

“రమజాన్ నెల, ఖురాను అవతరింపజేయబడిన నెల. ఇది మానవు లందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతో పాటు, సత్కార్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలు వున్నాయి”. (బఖర 2:185) 

ఇంకా ఇలా సెలవిచ్చాడు: 

إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ

“నిశ్చయంగా మేము దీనిని (ఈ ఖురానును) ఘనమైన రాత్రి (లైలతుల్ ఖద్ర్) నందు అవతరింపజేశాము.” (ఖద్ర్ 97 :1) 

దీని ద్వారా తెలిసిందేమిటంటే, దివ్య ఖురాన్ కు రమజాన్ మాసంతో ప్రగాఢ సంబంధం వుంది. అందుకే ఈ మాసంలో వీలైనంత ఎక్కువగా దివ్య ఖురాన్ పారాయణం చెయ్యాలి. స్వయానా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా దీని గురించి తగు జాగ్రత్త వహించేవారు. 

శుభప్రద రమజాన్ మాసం ప్రతి రాత్రి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జిబ్రయీల్ (అలైహిస్సలాం)కు ఖురాన్ వినిపించేవారు. సహీహ్ బుఖారీ లోని ఒక హదీసులో అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రజియల్లాహు అన్హుమా) కథనం ఇలా వుంది: 

“దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రజలందరి కన్నా ఎక్కువగా సత్కార్యాలు చేసేవారు. ఆయన, అన్నింటికన్నా ఎక్కువగా సత్కార్యాలను రమజాన్ మాసంలో చేసేవారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) వచ్చి ఆయనను కలిసేవారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) రమజాన్ మాసపు ప్రతి రాత్రి ఆయనను కలిసేవారు. అప్పుడు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయనకు ఖురాన్ ను వినిపించేవారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) ను కలిసాక, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సుడిగాలి కన్నా వేగంగా సత్కార్యాల వైపునకు పరుగెత్తేవారు”. (బుఖారీ: 1902) 

ఇక రండి! ఎంతో మహోన్నతమైన ఈ గ్రంథం మహత్యాలను విని మన విశ్వాసాన్ని మరింత తాజాగా చేసుకుందాం! 

మనం ఖుర్ఆన్ ఎందుకు కంఠస్థం చేయాలి? [ఆడియో]

మనం ఖుర్ఆన్ ఎందుకు కంఠస్థం చేయాలి? [ఆడియో]
https://youtu.be/xe-0DyNUTCQ [18 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
జామిఅ్ హుసైన్ బిన్ అలీ రజియల్లాహు అన్హుమా జుల్ఫీ(KSA)లో షేఖ్ సాలిహ్ బిన్ ఫురైహ్ అల్ బహ్‌లాల్ ఇచ్చిన జుమా ఖుత్బా అనువాదం

ఖుర్’అన్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/quran/

అహ్సనుల్ బయాన్ (దివ్య ఖుర్’ఆన్) | తెలుగులో అరబీ ఉచ్చారణ (తెలుగు ఆవాజ్) [పుస్తకం]

అహ్సనుల్ బయాన్ (దివ్య ఖుర్'ఆన్) | తెలుగులో అరబీ ఉచ్చారణ (తెలుగు ఆవాజ్) [పుస్తకం]

ahsanul-bayan-telugu-awaz

Qur'an Transliteration in Telugu Script

టైటిల్: అంతిమ దైవగ్రంథం ఖుర్ఆన్ (అనువాదం, వ్యాఖ్యానం) – అహ్సనుల్ బయాన్ (తెలుగు ఆవాజ్)
Ahsanul Bayan Qur’an Transliteration in Telugu Script
శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాదు వారు ప్రచురించినారు

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [1328 పేజీలు] [134 MB]

నోట్ : ప్రతి సూరాను విడివిడిగా చదవడానికి లేదా డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ పేజీ చివరలో చూడండి

అహ్సనుల్ బయాన్ – తెలుగులో అరబీ ఉచ్చారణ (తెలుగు ఆవాజ్) [పుస్తకం]
Qur’an Transliteration in Telugu Script
https://youtu.be/HNDhgdhAP7Y

ఎన్నో సంవత్సరాలుగా తెలుగు పాఠకులు ఎదురు చూస్తున్న ఖుర్ఆన్ వచ్చేసింది.

👇 ఈ ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకతలు.

తెలుగు నాట మారుమూల గ్రామల్లో అరబీ భాష చదవటం రానివారికి. నేర్చుకునే కనీస సౌకర్యాలు కూడ లేనివారికి అమూల్యమైన వరం ఈ ఖుర్ ఆన్ గ్రంథం.

తజ్ వీద్ (శాస్త్రబద్ద పఠనం) సూత్రాల ప్రాకారం తెలుగులో అరబీ ఉచ్చారణ తో అచ్చతెలుగు అనువాదం.

ఖుర్ ఆన్ పదాలు అరబీ బాష ప్రకారంగా విడివిడిగా పొందపరచబడ్డాయి. అరబీ బాష నేర్చుకోవాలనే ఆసక్తి గలవారికి ఇది ఎంతో ఉపయోగకరం.

మీరు ఫోన్ కాల్ ద్వారా మీ ఆర్డర్ బుక్ చేయించి, మీ ఇంటి వద్దకే ఖుర్ఆన్ పొందవచ్చు. వెంటనే సంప్రదించండి. 995 995 9008, 9949 455 740

ముఖ్య గమనిక (తప్పని సరిగా చదవండి)

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం

ఇది ప్రయత్నమే…ప్రత్యామ్నాయం కాదు!

దివ్యఖుర్ఆన్ వాక్యాల భావాలను అర్థం చేసుకుంటూ అధ్యయనం చేయటం ఎంతో ప్రాముఖ్యత కలిగిన విషయం! అదే సమయంలో దాని ఆయతులను శాస్త్ర ప్రకారంగా ఇంపైన స్వరంతో పారాయణం చేయటం కూడా చాలా పుణ్యప్రదం.

ధర్మం కోరే విధంగా దివ్యఖుర్ఆన్ ను శాస్త్రబద్ధంగా పారాయణం చేయాలంటే ప్రతి ఒక్కరూ నేరుగా అరబీ భాష నేర్చుకోవటం తప్ప మరోమార్గం లేదు. ఖుర్ఆన్ పఠనశాస్త్రం (ఇల్మె ఖిరాత్) నేర్చుకొని దాని ప్రకారంగా పారాయణం చేసినప్పుడు మాత్రమే దివ్యఖుర్ఆన్ పఠనానికి నూటికి నూరుపాళ్ళు న్యాయం జరుగుతుంది. ఈ గ్రంథంలో అనుసరించబడిన ఉచ్చారణ విధానం పాఠకులను ఆ పఠనశాస్త్రం (ఇల్మె ఖిరాత్)కు దగ్గర చేసే ప్రయత్నమే కాని మూల విధానానికి దూరం చేసే ప్రక్రియ ఇది ఎంతమాత్రం కాదు.

ఇలా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, దివ్యఖుర్ఆన్ గ్రంథాన్ని ఉస్మానీ రాతలో (ముస్ హఫ్ ఉస్మానీలో) తప్ప మరో రూపంలో రాయటాన్ని పండితులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వారి ఆందోళన సహేతుకమే మరి! ప్రపంచవ్యాప్తంగా ఎవరికి వారు దివ్యఖుర్ఆన్ ను వివిధ స్క్రిప్ట్ లలో రాసుకొని వాటిని అరబీ ఖుర్ఆన్ కు ప్రత్యామ్నాయంగా భావిస్తూ, దానినే అంటి పెట్టుకుంటే భవిష్యత్తులో ముస్లిం సమాజం దానికి భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.

ఖుర్ఆన్ పరిరక్షణా బాధ్యతను అల్లాహ్ స్వయంగా తీసుకున్నాడు. అందుకే 1400 యేండ్ల నుంచి ఖుర్ఆన్ పండితుల ద్వారా ఆ బాధ్యత నెరవేరుతూ వస్తోంది. ఇన్షా అల్లాహ్ ప్రళయం వరకూ దివ్య ఖుర్ఆన్ సురక్షితంగా ఉంటుంది. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా అంటున్నాడు:

“ఇన్నా నహ్ ను నజ్జలన జిక్ర వ ఇన్నా లహూ ల హాఫిజూన్”
మేమే ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము. (ఖుర్ఆన్ 15 : 9)

అయితే మన నాట మారుమూల గ్రామాల్లో అరబీ విద్య రానివాళ్ళు, నేర్చుకోలేనివాళ్ళు, నేర్చుకునే కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేకపోతున్న అభాగ్యులు కోట్లాదిమంది ఉన్నారు. అటువంటి మారుమూల ప్రాంతాలకు చేరుకొని ఖుర్ఆన్ పారాయణం కోసం తపించిపోతున్న తోటి విశ్వాసులకు చేయూతనిచ్చే పండితులు మన నాట ఎంతమంది ఉన్నారు చెప్పండి? మరి వారి ఖుర్ఆన్ పఠనా జిజ్ఞాస ఎలా నెరవేరుతుంది?

ఖుర్ఆన్ నేర్పించే గురువులు అందుబాటులో లేని చోట్ల పాఠకులు సొంతంగా కనీస ‘తజీవీద్’ (శాస్త్రబద్ధ పఠన) సూత్రాలను అనుసరించి ఖుర్ఆన్ పారాయణం చేసుకునేందుకు వీలుగా ఈ గ్రంథాన్ని రూపొందించటం జరిగింది. అరబీ నేర్చుకునే సౌకర్యం కలిగినవారు సులువుగా ఖుర్ఆన్ పఠించుకోగలుగుతారు. కాని ఆ సౌలభ్యం లేని తెలుగువారు కష్టపడి అయినా సరే; ఈ గ్రంథం ద్వారా దివ్య ఖుర్ఆన్ ను దాదాపు చక్కగా పఠించుకోగలుగుతారు. ఇది దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వివరించిన ఉదాహరణకు సాకారమని చెప్పవచ్చు.

ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: ఖుర్ఆన్ పండితుడయి ఉండి, దాన్ని పఠించే వ్యక్తి (ప్రళయ దినాన) గౌరవనీయులు పుణ్యాత్ములయిన దైవదూతల వెంట ఉంటాడు. ఖుర్ఆన్ ను పఠించడంలో తడబడుతూ, శ్రమకోర్చి పారాయణం చేసేవాడు రెట్టింపు పుణ్యాన్ని పొందుతాడు. (బుఖారీ, ముస్లిం)

అరబీ నేర్చుకునే వీలులేని తెలుగు పాఠకుల చేత సక్రమంగా ఖుర్ఆన్ ను పఠింపజేసే మా ప్రయత్నం ఇంతటితో అయిపోలేదు. భవిష్యత్తులో మరిన్ని రకాలుగా ఈ మార్గంలో ముందడుగులు వేసేందుకు మా పబ్లికేషన్ ప్రయత్నిస్తోంది. అల్లాహ్ తలిస్తే, అతి త్వరలో మరిన్ని మెరుగులతో దృశ్య (వీడియో), శ్రవణ (ఆడియో) మాధ్యమాల ద్వారా కూడా ఖుర్ఆన్ పఠనాన్ని తెలుగు ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని కృతనిశ్చయంతో ఉన్నాం.

పాఠకుల ముందు మరో మారు విన్నవించుకుంటున్నాం! ఈ గ్రంథంలో అనుసరించబడిన ఉచ్చారణ విధానం పాఠకులను పఠనశాస్త్రం (ఇల్మె ఖిరాత్)కు దగ్గర చేసే ప్రయత్నమే కాని మూల విధానానికి దూరం చేసే ప్రకియ ఇది ఎంతమాత్రం కాదు.

అల్లాహ్ మా ఈ కృషిని ఆమోదించాలని, అల్లాహ్ కృపతో ఈ గ్రంథం ప్రజాదరణకు నోచుకోవాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ…

ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ

క్రింది లింక్ తప్పనిసరిగా వినండి:
అరబీ రాని వారు ఖురాన్ ను తెలుగులో చదవవచ్చా? – నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) [YT వీడియో]

ప్రతి సూరాను విడివిడిగా చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

సూరా పేరు డౌన్లోడ్ లింక్
అల్ ఫాతిహా001
అల్ బఖర002
అలి ఇమ్రాన్003
అన్ నిసా004
అల్ మాయిద005
అల్ అన్ ఆం006
అల్ ఆరాఫ్007
అల్ అన్ ఫాల్008
అత్ తౌబా009
యూనుస్010
హూద్011
యూసుఫ్012
అర్ రాద్013
ఇబ్రాహీమ్014
అల్ హిజ్ర్015
అన్ నహ్ల్016
బనీ ఇస్రాయీల్017
అల్ కహఫ్018
మర్యమ్019
తాహా020
అల్ అంబియా021
అల్ హజ్022
అల్ మూ’మినూన్023
అన్ నూర్024
అల్ ఫుర్ఖాన్025
అష్ షుఅరా026
అన్ నమ్ల్027
అల్ ఖసస్028
అల్ అన్ కబూత్029
అర్ రూమ్030
లుఖ్మాన్031
అన్ సజ్ దహ్032
అల్ అహ జాబ్033
సబా034
ఫాతిర్035
యాసీన్036
అస్ సాఫ్ఫాత్037
సాద్038
అజ్ జుమర్039
అల్ మూ’మిన్040
హా మీమ్ అన్ సజ్ దహ్041
అష్ షూరా042
అజ్ జుఖ్ రుఫ్043
అద్ దుఖాన్044
అల్ జాసియహ్045
అల్ అహ్ ఖాఫ్046
ముహమ్మద్047
అల్ ఫత్ హ్048
అల్ హుజురాత్049
ఖాఫ్050
అజ్ జారియాత్051
అత్ తూర్052
అన్ నజ్మ్053
అల్ ఖమర్054
అర్ రహ్మాన్055
అల్ వాఖి అహ్056
అల్ హదీద్057
అల్ ముజాదలహ్058
అల్ హష్ర్059
అల్ ముమ్ తహినహ్060
అస్ సఫ్061
అల్ జుముఅహ్062
అల్ మునాఫిఖూన్063
అత్ తగాబున్064
అత్ తలాఖ్065
అత్ తహ్రీమ్066
అల్ ముల్క్067
అల్ ఖలమ్068
అల్ హాఖ్ఖహ్069
అల్ మఆరిజ్070
నూహ్071
అల్ జిన్న్072
అల్ ముజ్జమ్మిల్073
అల్ ముద్ధస్సిర్074
అల్ ఖియామహ్075
అద్ దహ్ర్076
అల్ ముర్సలాత్077
అన్ నబా078
అన్ నాజి ఆత్079
అబస080
అత్ తక్వీర్081
అల్ ఇన్ ఫితార్082
అల్ ముతఫ్ఫిఫీన్083
అల్ ఇన్ షిఖాఖ్084
అల్ బురూజ్085
అత్ తారిఖ్086
అల్ ఆలా087
అల్ గాషియహ్088
అల్ ఫజ్ర్089
అల్ బలద్090
అష్ షమ్స్091
అల్ లైల్092
అజ్ జుహా093
అలమ్ నష్రహ్094
అత్ తీన్095
అల్ అలఖ్096
అల్ ఖద్ర్097
అల్ బయ్యినహ్098
అజ్ జిల్ జాల్099
అల్ ఆదియాత్100
అల్ ఖారిఅహ్101
అత్ తకాసుర్102
అల్ అస్ర్103
అల్ హుమజహ్104
అల్ ఫీల్105
ఖురైష్106
అల్ మాఊన్107
అల్ కౌసర్108
అల్ కాఫిరూన్109
అన్ నస్ర్110
అల్ లహబ్111
అల్ ఇఖ్లాస్112
అల్ ఫలఖ్113
అన్ నాస్114

ఖుర్ఆన్ పారాయణ మహత్యం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

ఖుర్ఆన్ పారాయణ మహత్యం
హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/s24pAH6baPY [23 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త ఖురాన్ యొక్క ప్రాముఖ్యత మరియు ఘనత గురించి వివరించారు. ఖురాన్ అనేది హితోపదేశం, స్వస్థత, మార్గదర్శకత్వం మరియు కారుణ్యంతో కూడిన అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం అని ఆయన పేర్కొన్నారు. ఖురాన్ పారాయణం చేసేవారికి, దాన్ని నేర్చుకుని, నేర్పించేవారికి లభించే గొప్ప ప్రతిఫలాలను ఖురాన్ ఆయతులు మరియు ప్రవక్త హదీసుల ద్వారా వివరించారు. ఖురాన్ పారాయణ సభల యొక్క ఘనత, ప్రళయ దినాన ఖురాన్ తన సహచరులకు సిఫారసు చేయడం, మరియు స్వర్గంలో ఖురాన్ సహచరుడి ఉన్నత హోదా గురించి కూడా చర్చించారు. ఖురాన్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి పట్ల మరియు అల్లాహ్ మార్గంలో ధనాన్ని ఖర్చు చేసే వ్యక్తి పట్ల అసూయ పడటం అనుమతించబడిందని తెలిపారు. చివరగా, ఖురాన్‌ను విడిచిపెట్టిన వారి పశ్చాత్తాపాన్ని మరియు ‘ఖురాన్ నేర్చుకుని, ఇతరులకు నేర్పించేవారే మీలో ఉత్తములు’ అనే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుతో ప్రసంగాన్ని ముగించారు.

أَلْحَمْدُ لِلّٰهِ نَحْمَدُهُ وَنَسْتَعِيْنُهُ وَنَسْتَغْفِرُهُ وَنُؤْمِنُ بِهِ وَنَتَوَكَّلُ عَلَيْهِ
[అల్ హందులిల్లాహి నహ్మదుహూ వ నస్త’ఈనుహూ వ నస్తగ్ఫిరుహూ వ ను’మిను బిహీ వ నతవక్కలు అలైహ్]
సర్వ స్తోత్రములు అల్లాహ్ కే. మేము ఆయననే స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్నే అర్థిస్తున్నాము మరియు ఆయననే క్షమాపణ కోరుతున్నాము, ఆయనపైనే విశ్వసిస్తున్నాము మరియు ఆయనపైనే భారం మోపుతున్నాము.

وَنَعُوْذُ بِاللهِ مِنْ شُرُوْرِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا
[వ న’ఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అ’మాలినా]
మరియు మేము మా ఆత్మల కీడుల నుండి మరియు మా చెడు కార్యాల నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము.

مَنْ يَهْدِهِ اللهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ
[మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ, వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహ్]
అల్లాహ్ ఎవరికైతే మార్గనిర్దేశం చేస్తాడో, అతనిని ఎవరూ తప్పుదారి పట్టించలేరు, మరియు ఆయన ఎవరిని తప్పుదారి పట్టిస్తాడో, అతనికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.

وَأَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ
[వ అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహ్]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని, ఆయన ఏకైక దేవుడు మరియు ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ
[వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త.

أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيْثِ كِتَابُ اللهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ
[అమ్మా బ’ద్ ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్, వ ఖైరల్ హద్ యి హద్ యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం]
ఇక ఆ తర్వాత, నిశ్చయంగా అన్ని మాటలలో కెల్లా ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖురాన్). మరియు అన్ని మార్గాలలో కెల్లా ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గం.

وَشَرَّ الْأُمُوْرِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ
[వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా, వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అహ్, వ కుల్ల బిద్’అతిన్ దలాలహ్, వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్]
మరియు అన్ని విషయాలలో కెల్లా చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. మరియు ప్రతి కొత్తగా కల్పించబడిన విషయం బిద్అత్ (ధర్మంలో నూతన ఆవిష్కరణ). మరియు ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన, సకల లోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయు గాక.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనపై అసంఖ్యాకమైన వరాలను ప్రసాదించాడు, ఉపకారం చేశాడు. వాటిలో ఒకటి ముఖ్యమైనది ఖురాన్ గ్రంథం అవతరణ. ఖురాన్ అవతరణ ద్వారా ఈ ఉమ్మత్ పైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చేసిన గొప్ప ఉపకారాలలో ఒకటి. ఈ ఖురాన్ గ్రంథంలో మౌఇదా, హితోపదేశం ఉంది. షిఫా, స్వస్థత ఉంది. హుదా, మార్గదర్శకం ఉంది. రహ్మా, కారుణ్యం ఉంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర యూనుస్ లో ఇలా తెలియజేశాడు.

يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاءٌ لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ
“ఓ ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుండి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థత నొసుగుతుంది. మరియు నమ్మే వారి కోసం మార్గదర్శకం చూపుతుంది (మరియు కారుణ్యం).”

ఈ ఖురాన్ జ్యోతి, స్పష్టమైన గ్రంథం. దానిలో ఏముంది? అది మనం తెలుసుకోవాలి. చదివి, అర్థం చేసుకొని. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు.

قَدْ جَاءَكُم مِّنَ اللَّهِ نُورٌ وَكِتَابٌ مُّبِينٌ
“అల్లాహ్ తరఫు నుంచి మీ వద్దకు జ్యోతి వచ్చేసింది, అంటే స్పష్టమైన గ్రంథం వచ్చేసింది.”

يَهْدِي بِهِ اللَّهُ مَنِ اتَّبَعَ رِضْوَانَهُ سُبُلَ السَّلَامِ وَيُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ بِإِذْنِهِ وَيَهْدِيهِمْ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ

అంటే ఈ ఖురాన్ జ్యోతి, స్పష్టమైన గ్రంథం. దాని ద్వారా, ఖురాన్ ద్వారా, ఈ జ్యోతి ద్వారా, ఈ నూర్ ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ప్రసన్నతను అనుసరించే వారికి శాంతి మార్గాలను చూపుతాడు. తన కోరిక మేరకు వారిని చీకట్లో నుంచి, అంధకారంలో నుంచి వెలికి తీసి కాంతి వైపుకు తీసుకువస్తాడు. రుజుమార్గం వైపుకు దర్శకత్వం వహిస్తాడు, ఈ ఖురాన్ ద్వారా, ఈ నూర్, ఈ జ్యోతి ద్వారా.

ఇంకా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు.

إِنَّ الَّذِينَ يَتْلُونَ كِتَابَ اللَّهِ وَأَقامُوا الصَّلَاةَ وَأَنفَقُوا مِمَّا رَزَقْنَاهُمْ سِرًّا وَعَلَانِيَةً يَرْجُونَ تِجَارَةً لَّن تَبُورَ
దైవగ్రంథాన్ని పఠిస్తూ నమాజును నెలకొల్పేవారు, మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ, బహిరంగంగానూ ఖర్చు చేసేవారు ఎన్నటికీ నష్టం కలుగని వర్తకాన్ని ఆశిస్తున్నారు. (35:29)

అంటే, ఈ జ్యోతిని, ఈ స్పష్టమైన గ్రంథాన్ని, ఈ ఖురాన్‌ని పఠిస్తూ నమాజును నెలకొల్పే వారు, ఖురాన్ పారాయణం, ఖురాన్ పఠనం, అలాగే నమాజును నెలకొల్పే వారు, వారిని మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగాను, బహిరంగంగాను ఖర్చు చేసేవారు. అంటే ఈ ఆయత్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూడు విషయాలు తెలియజేశాడు. ఒకటి, ఖురాన్ గ్రంథాన్ని పఠించేవారు, పారాయణం చేసేవారు. రెండవది, నమాజును నెలకొల్పేవారు. మూడవది, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించిన వాటిలో గోప్యంగా, బహిరంగంగా దానం చేసేవారు, ఖర్చు పెట్టేవారు. వారు ఎన్నటికీ నష్టం కలుగని వర్తకాన్ని ఆశిస్తున్నారు.

దీని సారాంశం ఈ ఆయత్ యొక్క.

لِيُوَفِّيَهُمْ أُجُورَهُمْ وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۚ إِنَّهُ غَفُورٌ شَكُورٌ

వారికి వారి ప్రతిఫలాలు పూర్తిగా ఇవ్వటానికి, తన కృపతో ఆయన వారికి మరింతగా ప్రసాదించటానికి గాను, (అంటే ఈ గుణాలు, ఈ లక్షణాలు కలిగిన వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పూర్తిగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు.) నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు, సన్మానించేవాడు.(35:30)

అభిమాన సోదరులారా, ఇప్పటివరకు మనం ఖురాన్ ఆయతులు లో కొన్ని ఖురాన్ గురించి, దైవ గ్రంథం గురించి తెలుసుకున్నాం.

ఈ ఖురాన్ పఠనం, ఖురాన్ నేర్చుకోవటం, ఖురాన్‌ని నేర్పించటం. దీని గురించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. అబూ హురైరా రది అల్లాహు త’ఆలా అన్హు కథనం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.

وَمَا اجْتَمَعَ قَوْمٌ فِي بَيْتٍ مِنْ بُيُوتِ اللَّهِ يَتْلُونَ كِتَابَ اللَّهِ وَيَتَدَارَسُونَهُ بَيْنَهُمْ إِلَّا نَزَلَتْ عَلَيْهِمُ السَّكِينَةُ وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ وَحَفَّتْهُمُ الْمَلَائِكَةُ وَذَكَرَهُمُ اللَّهُ فِيمَنْ عِنْدَهُ
[వ మజ్తమ’అ ఖౌమున్ ఫీ బైతిమ్ మిమ్ బుయూతిల్లాహి యత్లూన కితాబల్లాహి వ యతదారసూనహూ బైనహుమ్ ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనతు, వ గషియతుహుముర్ రహ్మతు, వ హఫ్ఫత్హుముల్ మలాయికతు, వ దకరహుముల్లాహు ఫీమన్ ఇందహ్]

ఈ జ్యోతి గురించి, ఈ ఖురాన్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు,

అల్లాహ్ గృహాలలోని ఏదైనా ఒక గృహంలో కొంతమంది గుమిగూడి, జమా అయి, దైవ గ్రంథాన్ని పారాయణం చేస్తూ కేవలం పారాయణం మాత్రమే కాదు. యతదారసూనహూ దాన్ని గురించి పరస్పరం చర్చించుకునేవారు అంటే నేర్చుకునేవారు, నేర్పించేవారు. ఒకరికొకరు అర్థం చేసుకునేవారు, అర్థం చెప్పేవారు, నేర్చుకునేవారు, నేర్పించేవారు. అల్లాహ్ తరఫు నుండి వారి మీద ప్రశాంతత ఆవరిస్తుంది, మొదటి ప్రయోజనం, మొదటి ప్రతిఫలం. ఒకచోట జమా అయి ఖురాన్ పారాయణం చేస్తూ దాన్ని చర్చించుకుంటూ, నేర్చుకుంటూ, నేర్పిస్తూ ఉంటే అల్లాహ్ యొక్క ప్రశాంతత వారి మీద ఆవరిస్తుంది, అల్లాహ్ తరఫు నుండి. రెండవది, అల్లాహ్ కారుణ్యం వారిని కమ్ముకుంటుంది. మూడవది, దైవదూతలు వారిని చుట్టుముడతారు. నాలుగవది, ఇంకా వారిని గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ఆస్థానములోని దైవదూతల దగ్గర వారికి పరిచయం చేస్తాడు.

ఇది ఖురాన్ పఠనం, ఖురాన్ నేర్పించడం గురించి.

అలాగే ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను ఉద్దేశించి ఇలా అన్నారు, “ఇన్న లిల్లాహి అహ్లీన మినన్నాస్” (నిశ్చయంగా ప్రజలలో అల్లాహ్ కు చెందిన వారు ఉన్నారు). జనులలో అల్లాహ్ దాసులలో కొందరు అహ్లుల్లాహ్ (అల్లాహ్ ప్రజలు) ఉన్నారు. అల్లాహ్ కు చెందిన వారు. ఈ మాట విని సహాబాలు ప్రశ్నించారు, “ఓ దైవ ప్రవక్తా, మన్ హుమ్?” (వారెవరు?). ఆ అహ్లుల్లాహ్ అనే వారు, అహ్లుల్లాహ్ అనబడే వారు, అల్లాహ్ కు చెందిన వారు, వారెవరు? అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. వారు, “హుమ్ అహ్లుల్ ఖురాన్” (వారు ఖురాన్ ప్రజలు). వారే అహ్లె ఖురాన్, ఖురాన్ వారు అల్లాహ్ కు చెందిన వారు. ఇక్కడ ఖురాన్ వారు అంటే ఎవరు? ఖురాన్ పఠించే వారు, ఖురాన్ పారాయణం చేసే వారు, ఖురాన్ ని నేర్చుకునే వారు, ఖురాన్ ని అర్థం చేసుకునే వారు, ఖురాన్ ని నేర్పించే వారు, వారు అహ్లుల్ ఖురాన్. వారి జీవితం ఖురాన్ పరంగా ఉంటుంది. వారే, “అహ్లుల్లాహి వ ఖాస్సతుహు” (అల్లాహ్ యొక్క ప్రజలు మరియు ఆయన ప్రత్యేకమైన వారు). వారే అల్లాహ్ కు చెందిన వారు, వారే అల్లాహ్ కు ప్రత్యేక దాసులు. ఇది ఖురాన్ పారాయణం యొక్క మహత్యం.

అభిమాన సోదరులారా, ఉమర్ బిన్ ఖత్తాబ్ రది అల్లాహు త’ఆలా అన్హు కథనం, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.

إِنَّ اللَّهَ يَرْفَعُ بِهَذَا الْكِتَابِ أَقْوَامًا وَيَضَعُ بِهِ آخَرِينَ
[ఇన్నల్లాహ యర్ఫ’ఉ బి హాదల్ కితాబి అఖ్వామవ్ వ యద’ఉ బిహీ ఆఖరీన్]
నిశ్చయంగా, నిస్సందేహంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గ్రంథం ఆధారంగా, ఈ ఖురాన్ మూలంగా కొన్ని జాతుల్ని ఉన్నత స్థితికి లేపుతాడు. ఈ ఖురాన్ మూలంగానే కొన్ని జాతుల్ని అధోగతి పాలు చేస్తాడు.

అంటే ఖురాన్ పారాయణం చేసే వారికి, ఖురాన్ అర్థం చేసుకునే వారికి, ఖురాన్ ని నేర్పించే వారికి, ఖురాన్ పరంగా తమ జీవితం గడిపే వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నత స్థితి, ఉన్నత స్థాయిని ప్రసాదిస్తాడు. గౌరవాన్ని ప్రసాదిస్తాడు. ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే ఎవరైతే ఖురాన్ ని విడనాడుతారో, వదిలేస్తారో, ప్రక్కన పెట్టేస్తారో, పట్టించుకోరో అటువంటి వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అధోగతి పాలు చేస్తాడు, అగౌరవాన్ని పాలు చేస్తాడు.

ఈ ఖురాన్ గ్రంథం ఇహలోకంలో మరియు పరలోకంలో, ఈ ఇహపరలోకాలలో ఖురాన్ మూలంగా మనుషుల గౌరవం, స్థానం ఎన్నో రెట్లు, ఎంతగానో పెరిగిపోతుంది.

ప్రళయ దినాన ఖురాన్ గురించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. అబూ ఉమామా రది అల్లాహు అన్హు అంటున్నారు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతుండగా నేను విన్నాను.

اقْرَءُوا الْقُرْآنَ فَإِنَّهُ يَأْتِي يَوْمَ الْقِيَامَةِ شَفِيعًا لِأَصْحَابِهِ
[ఇఖ్రవుల్ ఖురాన ఫ ఇన్నహూ య’తీ యౌమల్ ఖియామతి షఫీ’అన్ లి అస్ హాబిహీ]
“ఓ దైవ దాసులారా, ఖురాన్‌ను పఠించండి, పఠిస్తూ ఉండండి. అత్యధికంగా ఖురాన్ పారాయణం చేయండి. ఎందుకంటే ప్రళయ దినాన ఖురాన్ గ్రంథం తనను పారాయణం చేసిన వారి కొరకు సిఫారసు దారుగా వస్తుంది.”

అల్లాహు అక్బర్. రేపు ప్రళయ దినాన భయంకరమైన రోజు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు కుడి చేతిలో కర్మల పుస్తకం ఇస్తాడో, ఎడమ చేతిలో ఇస్తాడో తెలియదు. ఆ రోజు స్వయంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా వేరే వారి గురించి పట్టించుకోరు. కొన్ని ముఖ్యమైన సందర్భాలలో, ఇందస్ సిరాత్ (పుల్ సిరాత్ దాటే సమయంలో), ఇందల్ కితాబ్ (కర్మల పుస్తకం ఇచ్చే సమయంలో), ఇందల్ మీజాన్ (కర్మలు తూచే సమయంలో). కర్మలు ఇది చేసే సమయంలో, ఎవరి కర్మలు ఎక్కువగా ఉన్నాయి, ఎవరి కర్మలు తక్కువగా ఉన్నాయి, త్రాసులు, కర్మల, కర్మల త్రాసులు వేసే సమయంలో. ఈ మూడు సందర్భాలలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆ మూడు సందర్భాలలో నేను నా గురించి తప్ప ఇతరుల గురించి నాకు ఆలోచన రాదు అని ఎవరికి అంటున్నారు? ఉమ్ముల్ ము’మినీన్ ఆయిషా సిద్దీఖా రది అల్లాహు త’ఆలా అన్హా గారిని అంటున్నారు. అటువంటి సమయంలో ఖురాన్ అత్యధికంగా పఠించే వారికి ఖురాన్ ఆ రోజు సిఫారసు చేస్తుంది.

అభిమాన సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు.

يُقَالُ لِصَاحِبِ الْقُرْآنِ اقْرَأْ وَارْتَقِ وَرَتِّلْ كَمَا كُنْتَ تُرَتِّلُ فِي الدُّنْيَا فَإِنَّ مَنْزِلَتَكَ عِنْدَ آخِرِ آيَةٍ تَقْرَأُ بِهَا
[యుఖాలు లి సాహిబిల్ ఖురాన్, ఇఖ్ర’ వర్తఖి వర్రత్తిల్ కమా కున్త తురత్తిలు ఫిద్దున్యా, ఫ ఇన్న మన్జిలతక ఇంద ఆఖిరి ఆయతిన్ తఖ్రవుహా]

“రేపు ప్రళయ దినాన ఖురాన్ వారితో ఇలా అనడం జరుగుతుంది. ఇక్కడ ఖురాన్ వారు అంటే ఎవరు? ఖురాన్ ని పఠించేవారు. ఖురాన్ పారాయణం చేసేవారు అత్యధికంగా. ఖురాన్ ను అర్థం చేసుకునేవారు. ఖురాన్ పరంగా ఆచరించే వారు. సాహిబె ఖురాన్ తో, ఖురాన్ వానితో ఇలా అనబడుతుంది, ఏమని? ‘ఇఖ్ర’’, ఓ ఖురాన్ వాడా, ఓ ఖురాన్ కి చెందిన వాడా, ‘ఇఖ్ర’’ పఠిస్తూ ఉండు. ‘వర్తఖి’, ‘వరత్తిల్ కమా కున్త తురత్తిలు ఫిద్దున్యా’ నువ్వు ప్రపంచంలో నెమ్మదిగా ఖురాన్ పఠించినట్లు ఎప్పుడూ కూడా అలాగే పఠిస్తూ పైకెళ్తూ ఉండు. అలా పఠిస్తూ వెళ్తూ ఎక్కడ పఠనం, పారాయణం చేయటం ఆపుతావో ఆ చివరి ఆయత్ దగ్గరే నీ అంతస్తు ఉంటుంది.”

అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, పాపాలలో అసూయ అనేది ఘోరమైన పాపం. పెద్ద పాపం. కానీ రెండు విషయాలలో లేదా రెండు వ్యక్తుల, రెండు రకాల వ్యక్తుల విషయంలో అసూయ చెందవచ్చు, అనుమతి ఉంది. అదేమిటి?

لَا حَسَدَ إِلَّا فِي اثْنَتَيْنِ
[లా హసద ఇల్లా ఫిస్నతైన్]
“ఇద్దరు వ్యక్తుల పట్ల తప్ప మరెవ్వరి పట్ల అసూయ చెందకూడదు”

ఘోరమైన పాపం అసూయ. కానీ ఇద్దరి పట్ల అసూయ చెందవచ్చు.

رَجُلٌ آتَاهُ اللَّهُ الْقُرْآنَ فَهُوَ يَقُومُ بِهِ آنَاءَ اللَّيْلِ وَآنَاءَ النَّهَارِ
[రజులున్ ఆతాహుల్లాహుల్ ఖురాన ఫహువ యఖూము బిహీ ఆనాఅల్లైలి వ ఆనాఅన్నహార్]
ఒకడు, అల్లాహ్ ఖురాన్ జ్ఞానాన్ని ప్రసాదించాడు, రేయింబవళ్ళు దాన్ని ఆచరించే వ్యక్తి.

ఖురాన్ పఠించే వ్యక్తి, ఖురాన్ పరంగా ఆచరించే వ్యక్తి, ఖురాన్ నేర్పించే వ్యక్తి విషయంలో అసూయ చెందవచ్చు. అలాగే రెండో వ్యక్తి ఎవరు?

وَرَجُلٌ آتَاهُ اللَّهُ مَالًا فَهُوَ يُنْفِقُهُ آنَاءَ اللَّيْلِ وَآنَاءَ النَّهَارِ
[వ రజులున్ ఆతాహుల్లాహు మాలన్ ఫహువ యున్ఫిఖుహూ ఆనాఅల్లైలి వ ఆనాఅన్నహార్]
రెండవ వ్యక్తి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సిరిసంపదలు అనుగ్రహించగా వాటిని రేయింబవళ్ళు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టే వ్యక్తి.

ఈ ఖురాన్ కి చెందిన వ్యక్తి, ఈ దానం చేసే వ్యక్తి, వీరిద్దరి విషయంలో అసూయ పడవచ్చు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, ఇక చివర్లో ఖురాన్ లో కొన్ని ఆయతుల అర్థం తెలుసుకుని ముగిద్దాం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. దుర్మార్గుడు పరలోకంలో వాడు ఎవడు అనేది మనకు తెలుస్తుంది.

وَيَوْمَ يَعَضُّ الظَّالِمُ عَلَىٰ يَدَيْهِ يَقُولُ يَا لَيْتَنِي اتَّخَذْتُ مَعَ الرَّسُولِ سَبِيلًا

ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: “అయ్యో! నేను దైవప్రవక్త (సఅసం) మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బావుందేది!” (25″27)

ఆ రోజు, ప్రళయ దినాన, ఎవ్వరూ ఎవరికీ పనికి రారు. సహాయం చేయరు, చేయలేరు. భార్య అయినా, సంతానం అయినా, అమ్మ నాన్న అయినా, బంధువులైనా ఎవ్వరైనా సరే, సిరిసంపదలైనా, హోదా అయినా ఏదీ పనికి రాదు. ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ, బాధతో, దుఃఖంతో తనను తాను నిందించుకుంటూ, “అయ్యో, నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బాగుండేది.”

يَا وَيْلَتَىٰ لَيْتَنِي لَمْ أَتَّخِذْ فُلَانًا خَلِيلًا
“అయ్యో నా పాడుగాను, నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది.” (25:28)

لَّقَدْ أَضَلَّنِي عَنِ الذِّكْرِ بَعْدَ إِذْ جَاءَنِي ۗ وَكَانَ الشَّيْطَانُ لِلْإِنسانِ خَذُولًا
“నా వద్దకు ఉపదేశం వచ్చిన తరువాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే! ఎంతయినా షైతాను మనిషికి (అదను చూసి) ద్రోహం చేసేవాడే!” (25:29)

“నా వద్దకు ఉపదేశం వచ్చింది. ‘అద్-దిక్ర్’ వచ్చింది, ఖురాన్ వచ్చింది. కానీ వాడు నాకు ఖురాన్ నుంచి దూరం చేశాడు. నా దగ్గరకు అల్లాహ్ ‘దిక్ర్’ పంపించాడు. ఖురాన్ వచ్చింది, హితోపదేశం వచ్చింది, ‘దిక్ర్’ వచ్చింది, మౌఇదా వచ్చింది, రహ్మా వచ్చింది. ఇవన్నీ ఖురాన్. కానీ వాడు నాకు వీటి నుంచి దూరం చేశాడు. ఎంతైనా షైతాను మనిషికి ద్రోహం చేసేవాడే.” కానీ అక్కడ తెలుసుకుని ఏం ప్రయోజనం లేదు. అది ఇక్కడ తెలుసుకోవాలి.

ఆ సందర్భంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోరు విప్పుతారు. వాడు బాధపడుతున్నాడు, “నా పాడుగాను”, తన్ను తాను నిందించుకుంటున్నాడు, కుమిలిపోతున్నాడు. ఆ సందర్భంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తారు.

وَقَالَ الرَّسُولُ يَا رَبِّ إِنَّ قَوْمِي اتَّخَذُوا هَٰذَا الْقُرْآنَ مَهْجُورًا
“ఓ నా ప్రభువా! నిశ్చయంగా నా జాతి వారు ఈ ఖురాన్‌ను వదిలిపెట్టారు.”

అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకుతారు. అంటే పరలోకంలో పరాజయం, అవమానం, దుర్భర స్థితి, శిక్షకు కారణం ఏమిటి? ఖురాన్‌ను విడనాడటం, వదిలివేయటం.

కావున, అభిమాన సోదరులారా, ఈ ప్రపంచంలో అందరికంటే ఉత్తములు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఇచ్చారు. ఈ ప్రపంచంలో, అందరికంటే ఉత్తములు, ప్రవక్త గారు సెలవిచ్చారు, బుఖారీ గ్రంథంలోని హదీస్ ఇది.

خَيْرُكُمْ مَنْ تَعَلَّمَ الْقُرْآنَ وَعَلَّمَهُ
[ఖైరుకుమ్ మన్ త’అల్లమల్ ఖురాన వ అల్లమహూ]
“మీలో ఖురాన్‌ను నేర్చుకుని ఇతరులను నేర్పించేవారు అందరిలోకెల్లా ఉత్తములు.”

అంటే ఈ భూమండలంలో మానవులలో, అల్లాహ్ దాసులలో, ఈ ఉమ్మత్ లో అందరికంటే శ్రేష్టమైన వారు, ఉన్నతమైన వారు, ఉన్నత స్థితికి చెందిన వారు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట పరంగా ఎవరు? ఖురాన్ నేర్చుకునేవారు, ఖురాన్ నేర్పించేవారు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేసే సౌభాగ్యం ప్రసాదించు గాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ అహ్లె ఖురాన్ లో చేర్చుగాక. మన జీవితాంతం ఖురాన్ ను పఠించే, ఖురాన్ ను అర్థం చేసుకునే, ఖురాన్ ను ఆచరించే సౌభాగ్యం ప్రసాదించు గాక.

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ
[అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్, కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్ మజీద్]
ఓ అల్లాహ్! ముహమ్మద్ పై మరియు ఆయన కుటుంబంపై కారుణ్యం కురిపించు, ఇబ్రాహీం మరియు ఆయన కుటుంబంపై నువ్వు కారుణ్యం కురిపించినట్లు. నిశ్చయంగా నువ్వు ప్రశంసనీయుడవు, ఘనత గలవాడవు.

اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّdٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ
[అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్, కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్ మజీద్]
ఓ అల్లాహ్! ముహమ్మద్ పై మరియు ఆయన కుటుంబంపై శుభాలు కురిపించు, ఇబ్రాహీం మరియు ఆయన కుటుంబంపై నువ్వు శుభాలు కురిపించినట్లు. నిశ్చయంగా నువ్వు ప్రశంసనీయుడవు, ఘనత గలవాడవు.

رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ
[రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతవ్ వ ఫిల్ ఆఖిరతి హసనతవ్ వ ఖినా అదాబన్నార్]
ఓ మా ప్రభూ! మాకు ఇహలోకంలో మంచిని ప్రసాదించు మరియు పరలోకంలోనూ మంచిని ప్రసాదించు మరియు మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు.

رَبَّنَا لَا تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً ۚ إِنَّكَ أَنتَ الْوَهَّابُ
[రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బ’ద ఇద్ హదైతనా వ హబ్ లనా మిల్ లదున్క రహ్మా, ఇన్నక అంతల్ వహ్హాబ్]
ఓ మా ప్రభూ! మాకు సన్మార్గం చూపిన తర్వాత మా హృదయాలను వక్రమార్గం వైపు త్రిప్పకు. మరియు నీ వద్ద నుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే గొప్ప దాతవు.

رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ وَلَا تَجْعَلْ فِي قُلُوبِنَا غِلًّا لِّلَّذِينَ آمَنُوا رَبَّنَا إِنَّكَ رَءُوفٌ رَّحِيمٌ
[రబ్బనగ్ ఫిర్ లనా వ లి ఇఖ్వానినల్లదీన సబఖూనా బిల్ ఈమాని వలా తజ్’అల్ ఫీ ఖులూబినా గిల్లల్ లిల్లదీన ఆమనూ రబ్బనా ఇన్నక రవూఫుర్ రహీమ్]
ఓ మా ప్రభూ! మమ్మల్ని మరియు విశ్వాసంలో మా కంటే ముందు గడిచిపోయిన మా సోదరులను క్షమించు. మరియు మా హృదయాలలో విశ్వసించిన వారి పట్ల ఎలాంటి ద్వేషాన్ని ఉంచకు. ఓ మా ప్రభూ! నిశ్చయంగా నువ్వు దయగలవాడవు, కరుణామయుడవు.

رَّبِّ ارْحَمْهُمَا كَمَا رَبَّيَانِي صَغِيرًا
[రబ్బిర్ హమ్హుమా కమా రబ్బయానీ సగీరా]
ఓ నా ప్రభూ! నా తల్లిదండ్రులు చిన్నప్పుడు నన్ను ఎలా కారుణ్యంతో పెంచారో, నువ్వు కూడా వారిపై అలాగే కారుణ్యం చూపు.

سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَسْتَغْفِرُكَ وَأَتُوبُ إِلَيْكَ
[సుబ్ హానకల్లాహుమ్మ వ బిహందిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అన్త అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్]
ఓ అల్లాహ్! నీవు పవిత్రుడవు మరియు నీకే సర్వ స్తోత్రాలు. నీవు తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను మరియు నీ వైపుకే పశ్చాత్తాపంతో మరలుతున్నాను.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[ఆఖిరు ద’వానా అనిల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
మరియు మా చివరి ప్రార్థన, సర్వ స్తోత్రాలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే.

  1. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – అత్తఫ్సీర్ ఖుర్ఆన్, 80 వ అధ్యాయం – ‘అబస’ సూరా]
ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం – 38 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఖుర్’ఆన్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/quran/

సూర హుమజహ్ – అనువాదం, సంక్షిప్త వ్యాఖ్యానం [ఆడియో]

సూర హుమజహ్ – అనువాదం, సంక్షిప్త వ్యాఖ్యానం [ఆడియో]
https://youtu.be/-_8eq2jkC8M [10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
  1. సూరా అల్ హుమజహ్

104:1 وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ
(ఇతరుల) తప్పులెన్నుతూ, పరోక్ష నిందకు పాల్పడే ప్రతి ఒక్కడికీ మూడుతుంది.

104:2 الَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُ
వాడు ధనాన్ని పోగుచేసి, పదే పదే లెక్కపెడుతూ ఉంటాడు.

104:3 يَحْسَبُ أَنَّ مَالَهُ أَخْلَدَهُ
తన ధనం ఎల్లకాలం తన వెంటే ఉంటుందని వాడనుకుంటున్నాడు.

104:4 كَلَّا ۖ لَيُنبَذَنَّ فِي الْحُطَمَةِ
ఎన్నటికీ అలా జరగదు. వాడు తుత్తునియలు చేసివేసే దాంట్లో విసిరివేయబడతాడు.

104:5 وَمَا أَدْرَاكَ مَا الْحُطَمَةُ
ఆ తుత్తునియలు చేసివేసే దాన్ని గురించి ఏమనుకున్నావు?

104:6 نَارُ اللَّهِ الْمُوقَدَةُ
అది అల్లాహ్ రాజేసినటువంటి అగ్ని.

104:7 الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ
అది హృదయాల వరకూ చొచ్చుకు పోయేటటువంటిది.

104:8 إِنَّهَا عَلَيْهِم مُّؤْصَدَةٌ
ఆ అగ్ని వారిపై అన్ని వైపుల నుండీ మూసివేయబడుతుంది.

104:9 فِي عَمَدٍ مُّمَدَّدَةٍ
వారు పొడవాటి స్తంభాల (అగ్నికీలల) మధ్య (చిక్కుకుని ఉంటారు).

మీ పిల్లలకు ఖుర్ఆన్ నేర్పిస్తున్నారా? అయితే మీకు ఎలాంటి ప్రయోజనం లభిస్తుందో తెలుసా? [వీడియో]

మీ పిల్లలకు ఖుర్ఆన్ నేర్పిస్తున్నారా? అయితే మీకు ఎలాంటి ప్రయోజనం లభిస్తుందో తెలుసా? [వీడియో]
https://youtu.be/wkL5OjKiSxY [2 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

సూర కాఫిరూన్ అనువాదం, సంక్షిప్త వ్యాఖ్యానం – నసీరుద్దీన్ జామి’ఈ [ఆడియో & టెక్స్ట్]

సూర కాఫిరూన్ అనువాదం, సంక్షిప్త వ్యాఖ్యానం
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
https://youtu.be/q7wEERbzMKU [7 నిముషాలు]

సూరత్ అల్-కాఫిరూన్ (అధ్యాయం 109) యొక్క ప్రాముఖ్యత, ఘనతలు మరియు ప్రధాన బోధనలపై ఈ ప్రసంగం దృష్టి పెడుతుంది. ఈ సూరాను నిద్రపోయే ముందు పఠించడం వలన షిర్క్ (బహుదైవారాధన) నుండి రక్షణ లభిస్తుందని మరియు తౌహీద్ (ఏకేశ్వరోపాసన) పై మరణం సంభవిస్తుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు వివరించబడింది. ఇది ఖురాన్‌లో నాలుగో వంతుకు సమానమని, మరియు ప్రవక్త దీనిని ఫజ్ర్ మరియు మగ్రిబ్ సున్నత్ నమాజులలో పఠించేవారని హదీసుల ద్వారా తెలియజేయబడింది. మక్కా అవిశ్వాసులు ప్రవక్తతో మతపరమైన రాజీకి ప్రయత్నించినప్పుడు, ఈ సూరా అవతరించి, విశ్వాసంలో ఎలాంటి రాజీకి తావులేదని స్పష్టం చేసింది. ఇస్లాం మానవ వ్యవహారాల్లో ఇతరులతో సత్ప్రవర్తనను ప్రోత్సహిస్తుందని, కానీ అల్లాహ్ ఆరాధనలో భాగస్వామ్యాన్ని (షిర్క్) తీవ్రంగా ఖండిస్తుందని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.

109. సూరా అల్ ఖాఫిరూన్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో

109:1 قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ
ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్
(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు : “ఓ తిరస్కారులారా!”

109:2 لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ
లా అఅబుదు మా తఅబుదూన్
మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు.

109:3 وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ
వలా అన్తుం ఆబిదూన మాఅఅబుద్
నేను ఆరాధిస్తున్న వానిని మీరు ఆరాధించరు.

109:4 وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ
వలా అన ఆబిదుమ్మా అబత్తుం
మీరు ఆరాధించే వాటిని నేను అరాధించబోను.

109:5 وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ
వలా అన్ తుం ఆబిదూన మా అఅబుద్
మరి నేను ఆరాధించేవానిని మీరెలాగూ ఆరాధించరు.

109:6 لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ
లకుం దీనుకుమ్ వ లి యదీన్
మీ ధర్మం మీది, నా ధర్మం నాది.”

ఈ సూరాకు ఎన్నో ఘనతలు మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, పడుకునే ముందు ఎవరైతే ఈ సూరా చదువుకుంటారో, దీని అర్థ భావాలను గ్రహిస్తారో, వాస్తవానికి వారు షిర్క్ నుండి మొత్తానికి దూరమై తౌహీద్ పై మరణిస్తారన్నటువంటి శుభవార్త ఇచ్చారు. సునన్ అబీ దావూద్ 5055 యొక్క సహీ హదీస్.

అలాగే ఈ సూరా నాలుగో వంతు ఖురాన్‌కు సమానం అని సహీ హదీస్‌లో వచ్చి ఉంది. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు. హదీస్ నంబర్ 586.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ కంటే ముందు సున్నతులలోని మొదటి రకాతులో మరియు మగ్రిబ్ తర్వాత రెండు రకాతుల సున్నతులోని మొదటి రకాతులో ఈ సూరా ఎక్కువగా చదువుతూ ఉండేవారు అని సునన్ నిసాయిలో హదీస్ వచ్చి ఉంది. 992 హదీస్ నంబర్.

హజ్రత్ జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం ఒక సహాబీ ఫజ్ర్ కంటే ముందు సున్నతులలోని మొదటి రకాతులో ‘ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్’ మరియు రెండో రకాతులో ‘ఖుల్ హువల్లాహు అహద్’ తిలావత్ చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని మెచ్చుకున్నారు, ప్రశంసించారు. చెప్పారు: “హాదా అబ్దున్ ఆమన బిరబ్బిహ్” – ఈ వ్యక్తి తన ప్రభువును విశ్వసించాడు. ఈ విషయం సహీ ఇబ్నె హిబ్బాన్‌లో ఉంది 2460, అలాగే షుఅబుల్ ఈమాన్ బైహఖీలో ఉంది 2524, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సిఫతుస్ సలాలో ప్రస్తావించారు.

ఇందులోని కొన్ని ముఖ్యమైన బోధనలను మనం గ్రహించే ప్రయత్నం చేద్దాము.

అల్లాహు త’ఆలా ఇస్లాం ధర్మం సర్వమానవాళికి ప్రసాదించాడు. సర్వ ప్రవక్తలు తీసుకొచ్చినటువంటి ఈ ఇస్లాం యొక్క అసలైన బోధన ఏమిటి? మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలి. ఆయన ఆరాధనలో ఎలాంటి భాగస్వామి, ఏ సాటి కల్పించకూడదు.

ప్రవక్తల పరంపరలో చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవాళికి ఇదే సందేశం ఇచ్చారు. అయితే ఆయన కాలంలో, ఆయన ఇచ్చేటువంటి ఈ సత్య సందేశాన్ని అడ్డుకోవడానికి విరోధులు, అవిశ్వాసులు, సత్య తిరస్కారులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడ్డుకోలేరు మరియు ఈ సత్యధర్మం వ్యాప్తి చెందకుండా ఎలాంటి వారి ప్రయత్నం సఫలీకృతం కాలేదు.

అప్పుడు ఒక పన్నాగం వారు ఏం పన్నారంటే, “ఓ ముహమ్మద్! సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక సంవత్సరం మీరు మా దేవుళ్లను ఆరాధించండి, ఒక సంవత్సరం మేము మీ అల్లాహ్‌ను ఆరాధిస్తాము”. అయితే, అల్లాహు త’ఆలా ఈ సూరా అవతరింపజేసి, ముమ్మాటికీ ఇలా జరగదు, మీరు అల్లాహ్‌ను ఎంత ఆరాధించినా బహుదైవారాధనను వదులుకోకుంటే మీ యొక్క ఆరాధన నిజమైన ఆరాధన కానే కాదు.

మరియు ఈ సూరాలోని మొదటి ఆయత్‌లో యా అయ్యుహల్ కాఫిరూన్, ఓ కాఫిరులారా అని అంటే ఇది ఏదైనా దూషణం, తిట్టు కాదు. కొందరు ఇలా అనుకుంటారు. వాస్తవానికి విషయం ఏమంటే, ఎవరైతే అల్లాహ్‌ను ఏకైక సత్యమైన ఆరాధ్యునిగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అల్లాహ్ యొక్క సత్య ప్రవక్తగా నమ్మలేదో, విశ్వసించలేదో వారితో చెప్పడం జరుగుతుంది, ఓ సత్య తిరస్కారులారా అని. ఇక ఎవరైతే అల్లాహ్ ఆరాధనలో ఏకత్వాన్ని పాటించకుండా వేరే ఎవరినైనా భాగస్వామిగా కలుపుతారో, వాస్తవం ఏమిటంటే వారి ఆరాధన కూడా అల్లాహ్ కొరకు కాదు. వారికి దాని యొక్క సరైన ప్రతిఫలం లభించదు.

ఈ రోజుల్లో మత సామరస్యం అన్నటువంటి పేరు మీద కొందరు కొన్ని అవిస్వాసుల పండుగల్లో పాల్గొని, వారిలాంటి వేషధారణ వేసుకొని, వారి యొక్క విగ్రహాల ముందు కొబ్బరికాయ కొట్టడం గానీ, లేదా అక్కడ ఏదైనా వంగడం గానీ, ఇలాంటి కొన్ని పనులు చేసుకుంటూ ఇది మత సామరస్యం అని ఏదైతే చూపుతున్నారో, ఇది అసలైన సామరస్యం కాదు.

ఇస్లాం ధర్మం ముస్లింలకు అవిశ్వాసుల పట్ల మానవ రీత్యా ఉత్తమ నడవడిక అవలంబించి సత్ప్రవర్తనలతో వారితో మెలగాలని ఆదేశిస్తుంది. కానీ అల్లాహ్ ఆరాధనలో ఎలాంటి భాగస్వామ్యం అనేది ఇస్లాం ఒప్పుకోదు. ఈ అసలైన సందేశాన్ని ఈ సూరా ద్వారా గ్రహించాలి మరియు పడుకునే ముందు, ఇంకా మగ్రిబ్, ఫజ్ర్ నమాజులలో ఇలా దీనిని ఖురాన్‌లోని నాలుగో భాగానికి సమానం అన్నటువంటి ఘనతలు ఏవైతే ప్రసాదించబడ్డాయో, దీని కారణంగా అన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించి తౌహీద్ పై స్థిరంగా ఉండాలి. అల్లాహ్ అందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

ఖుర్’ఆన్ (మెయిన్ పేజీ)
https://teluguislam.net/quran/