సలాంకు ముందు దుఆ విషయంలో ఏ ఘనత లేకున్నా అది దుఆ అంగీకార శుభసందర్భమవడమే చాలు. అదెలాగంటే నమాజీ అప్పుడు తన ప్రభువు వైపునకు మరలి, ఆయనతో మొరపెట్టు కుంటాడు. అతను నమాజులోనే ఉన్నాడు గనక ఇది దుఆ అంగీకారానికి ఎంతో ఉత్తమం.
అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః “మీలో ఎవరైనా నమాజు చేస్తున్నప్పుడు ‘అత్తహియ్యాతు లిల్లాహి…‘ చదవాలి, దాని పిదప తనకిష్టమున్న దాన్ని అర్థించుకోవాలి“, మరో ఉల్లేఖనంలో ఉంది “ఇంకేదైనా దుఆ ఎంచుకోవాలి”. (బుఖారి, ముస్లిం).
అబూ ఉమామ ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త ﷺ ను ఎవరో అడిగారు, ‘ఏ దుఆ ఎక్కువ వినబడుతుంది’ అని. దానికి ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః “మధ్య రాత్రిలో మరియు ఫర్జ్ నమాజుల చివరి భాగంలో”. (తిర్మిజి 3499). హదీసులో అరబీ పదం ‘దుబురుస్సలవాత్’ అని ఉంది, అయితే సామాన్యంగా దీని భావం నమాజు చివరి భాగం, అంటే సలాంకు ముందు అని. అయితే ఒకప్పుడు నమాజు తర్వాత అని కూడా చెప్పబడుతుంది.
మూడవ నిధి (నిక్షేపం)
నమాజు తర్వాత చేయునటువంటి అజ్కార్
నమాజు తర్వాత చేయవలసిన అజ్కార్ వివిధ వాక్యాల్లో ఉన్నవి. అలాగే వాటి పుణ్యాలు కూడా వివిధ రకాలుగా ఉన్నవి. అందులో కొన్నిః
సలాం తర్వాత 3 సార్లు అస్తగ్ ఫిరుల్లాహ్ అనాలి.
اللَّهُمَّ أَعِنِّي عَلَى ذِكْرِكَ وَشُكْرِكَ وَحُسْنِ عِبَادَتِك అల్లాహుమ్మ అఇన్నీ అలా జిక్రిక వ షుక్రిక వ హస్ని ఇబాదతిక. (అబూదావూద్ 1522). (అల్లాహ్! నేను నీ ధ్యానం చేయటానికి, నీకు కృతజ్ఞతలు తెలుపుకోటానికి, తగురీతిలో నిన్ను ఆరాధించటానికి నాకు సహాయం చెయ్యి).
కొన్ని దుఆల గురించి ఇక్కడ చెప్పాము, సలాం తర్వాత పూర్తి దుఆలు తెలుసుకొనుటకు మా పుస్తకం “రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు” అనే పుస్తకం చదవండి.
ఈ నాటి మన ముఖ్య అంశంలోని రెండవ భాగం సలాం తర్వాత జిక్ర్ ఘనత, ఏ జిక్ర్ ఘనత వచ్చి ఉందో ఆ ఘనతల గురించి చెప్పే ముందు చాలా ముఖ్యమైన ఓ విషయం తెలుసుకోండి:
షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ చెప్పారు : شرح منظومة أصول الفقه وقواعده ” (ص176-177) .
నమాజు తర్వాత చేసే జిక్ర్ నాలుగు రకాలుగా వచ్చి ఉంది, ఒక్కోసారి ఒక్కో రకాన్ని పాటించడం ఉత్తమం.
(1) సుబ్ హానల్లాహ్ 10సార్లు, అల్ హందులిల్లాహ్ 10సార్లు, అల్లాహు అక్బర్ 10సార్లు. (అబూదావూద్ 5065). (2) సుబ్ హానల్లాహ్ 33సార్లు, అల్ హందులిల్లాహ్ 33సార్లు, అల్లాహు అక్బర్ 33సార్లు, 1సారి: లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లాషరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. (ముస్లిం 597). అయితే సుబ్ హానల్లాహ్, అల్ హందులిల్లాహ్, అల్లాహు అక్బర్ ఈ మూడు పదాలు కలిపి 33సార్లు చదవవచ్చు. (బుఖారీ 843, ముస్లిం 595). (3) సుబ్ హానల్లాహ్ 33సార్లు, అల్ హందులిల్లాహ్ 33సార్లు, అల్లాహు అక్బర్ 34సార్లు. (ముస్లిం 596). (4) సుబ్ హానల్లాహ్ 25సార్లు, అల్ హందులిల్లాహ్ 25సార్లు, అల్లాహు అక్బర్ 25సార్లు, లాఇలాహ ఇల్లల్లాహ్ 25సార్లు. (నిసాయీ 1350, షేఖ్ అల్బానీ సహీ అన్నారు).
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారుః “ప్రతి నమాజు తర్వాత ఎవరు 33 సార్లు సుబ్ హానల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, 33 సార్లు అల్ హందులిల్లాహ్, మరి లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్ చదివి వంద పూర్తి చేస్తాడో అతని పాపాలు సముద్రపు నురుగంత ఉన్నా క్షమించబడతాయి”. (ముస్లిం 597).
(2) అనుగ్రహం, ఉన్నత స్థానాలు మరియు భోగబాగ్యాలు + స్వర్గ ప్రవేశం + 1500 పుణ్యాలు
అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః (ఓ రోజు కొందరు పేద ప్రజలు ప్రవక్త ﷺ వద్దకు వచ్చి) ‘ప్రవక్తా! ధనికులు తమ సిరిసంపదల మూలంగా ఉన్నత స్థానాలు అధిరోహించడానికి, శాశ్వతపు భోగభాగ్యా లు పొందడానికి మాకంటే ముందు వెళ్ళారు’ అని ఫిర్యాదు చేశారు. “అది ఎలా?” అని ప్రవక్త ﷺ అడిగారు. వారన్నారుః ‘వారు మా లాగా నమాజు చేస్తారు, మా లాగానే ధర్మ యుద్ధాలు కూడా చేస్తారు. డబ్బు ఉన్నందున వారు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెడుతున్నారు, మా వద్ద ఆ డబ్బు లేదు. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “నేను మీకో విషయం తెలియజేయనా? మీరు దాన్ని పాటించి మిమ్మల్ని మించిపోయిన వాళ్ళతో సమానులవుతారు, మీ కంటే వెనక ఉన్న వాళ్ళతోను మించిపోతారు, మీ లాంటి ఈ పద్దతిని అనుసరించే వాడు తప్ప మీ లాంటి ఆచరణ తెచ్చేవాడు మరొకడు ఉండడు. ఆ విషయం: ప్రతి నమాజు తర్వాత 10 సార్లు సుబ్ హానల్లాహ్, 10 సార్లు అల్ హందులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ పలకండి”. (బుఖారీ 6329).
ప్రవక్త ﷺ ప్రవచించారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “రెండు గుణాలున్నాయి, వాటిని పాటించిన ముస్లిం భక్తుడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అవి తేలికైనవి, కాని వాటిని పాటించేవారు అరుదు. ప్రతి నమాజు తరువాత 10 సార్లు సుబ్ హానల్లాహ్, 10 సార్లు అల్ హందులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ చెప్పాలి. ఇవి (ఐదు నమాజుల్లో చేస్తే) నోటి పై 150 అవుతాయి, కాని (ప్రళయదినాన) త్రాసులో 1500 అవుతాయి”. (అబూ దావూద్ 5065, తిర్మిజి 3410, నిసాయి 1348, ఇబ్ను మాజ 926).
నోటి పై 150, దీని సంఖ్య ఇలా ఉంటుంది:
10 సుబ్ హానల్లాహ్ + 10 అల్ హందిలిల్లాహ్ + 10 అల్లాహు అక్బర్ = 30. 30 × 5 (నమాజులు) = 150
త్రాసులో 1500 యొక్క సంఖ్య ఇది: 150 × 10 పుణ్యాలు = 1500 పుణ్యాలు
(3) ఆయతుల్ కుర్సీ = స్వర్గ ప్రవేశం
النسائي الكبرى 9848 – صحيح : عَنْ أَبِي أُمَامَةَ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ قَرَأَ آيَةَ الْكُرْسِيِّ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ مَكْتُوبَةٍ لَمْ يَمْنَعْهُ مِنْ دُخُولِ الْجَنَّةِ إِلَّا أَنْ يَمُوتَ» صحيح الجامع 6464
అబూ హూరైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ఆదేశించారుః “ఎవరు ప్రతి నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో వారి స్వర్గ ప్రవేశానికి మరణమే అడ్డు”. (నిసాయి ).
(4) ప్రత్యేకంగా ఫజ్ర్ మరియు మగ్రిబ్ తర్వాత చేసే జిక్ర్ ఘనత
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సజ్దా నమాజులోని అతి గొప్ప భాగం, అందులో అల్లాహ్ కొరకు నమ్రత, సమర్పణ సంపూర్ణ రీతిలో పాటించబడుతుంది. అందుకే అనేక పుణ్యాలు, ఉత్తమ ఫలితాలు సజ్దా విషయంలో చెప్పబడ్డాయి. ఈ గొప్ప పుణ్యాన్ని గమనించండి.
(9.1) సాఫల్యం (నరకం నుండి రక్షణ, స్వర్గ ప్రవేశ సఫలత)
అల్లాహ్ ఆదేశం: {విశ్వాసులారా! రుకూ చేయండి, సజ్దా చేయండి, మీ ప్రభువుకు దాస్యం చేయండి, మంచి పనులు చేయండి, దీని ద్వారానే మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చును}. (హజ్ 22: 77).
{లఅల్లకుం తుఫ్లిహూన్} వ్యాఖ్వానంలో అబూ బక్ర్ అల్ జజాయిరీ ఇలా చెప్పారు: ‘అంటే నరకం నుండి రక్షణ పొంది స్వర్గ ప్రవేశ ప్రాప్తమే గొప్ప సాఫల్యం‘. (ఐసరుత్తఫాసీర్ లికలామిల్ అలియ్యిల్ కదీర్).
(9.2) ప్రళయదినాన అల్లాహ్ దయానుగ్రహాలు, ఆయన సంతోషం మరియు కాంతి లభిస్తాయి
{ముహమ్మద్ ﷺఅల్లాహ్ ప్రవక్త, ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగా ఉంటారు, పరస్పరం కరుణామయులుగా ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు, వారు రుకూ సజ్దాలలో, అల్లాహ్ అనుగ్రహాన్నీ ఆయన ప్రసన్నతనూ అర్థించటంలో నిమగ్నులై ఉండటం కనిపిస్తుంది. సజ్దాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి. వాటి వల్ల వారు ప్రత్యేకంగా గుర్తించ బడతారు}. (ఫత్ హ్ 48: 29).
{సజ్దాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి} యొక్క వ్యాఖ్యానం లో సఅదీ (రహిమహుల్లాహ్) ఇలా చెప్పారు: ‘అధికంగా మరియు మంచిరీతిలో చేసిన దాస్యం (ఇబాదత్) ప్రభావం వారి ముఖాలపై పడింది. చివరికి వారి నమాజుల వల్ల వారి బాహ్యం మెరిసినట్లు వారి ఆంతర్యం సయితం కాంతివంతమైంది. (తైసీరుల్ కరీమిర్రహ్మాన్ ఫీ తఫ్సీరి కలామిల్ మన్నాన్)
(9.3) స్థానం రెట్టింపు, పాపం మన్నింపు
فَقَالَ النَّبِي صلى الله عليه وسلم: (عَلَيْكَبِكَثْرَةِالسُّجُودِلِلهفَإِنَّكَلَاتَسْجُدُلِلهسَجْدَةًإِلَّارَفَعَكَاللهُبِهَادَرَجَةًوَحَطَّعَنْكَبِهَاخَطِيئَةً).
ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారుః “నీవు ఎక్కువగా సజ్దాలు చేయి, నీవు సజ్దా చేసినపుడల్లా నీ ప్రతి సజ్దాకు బదులుగా అల్లాహ్ నీ కొరకు ఒక స్థానం పెంచుతాడు, పాపం మన్నిస్తాడు”. (ముస్లిం 488).
(9.4) ప్రవక్త సామీప్యం
రబీఅ బిన్ కఅబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: నేను వుజూ నీళ్ళు, మరేదైనా అవసరమున్నవి అందించుటకు ప్రవక్త ﷺ వద్దనే రాత్రి గడపేవాణ్ణి. అయితే ఒకసారి ప్రవక్త ﷺ“అడుగు (నీకిష్టమున్నది అడుగు)” అని అన్నారు. ‘నేను స్వర్గంలో మీ సామీప్యం కోరుతున్నాను’ అని అన్నాను, ఇంకేదైనా? అని ప్రవక్త అడిగాడు, ‘కేవలం అది మాత్రమే’ అని నేనన్నాను. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “నీ స్వప్రయోజనం కోసం నీవు అధిక సజ్దాలు (నమాజులు) చేసి నాకు సహాయపడు”. (ముస్లిం 489).
(9.5) దుఆ స్వీకారానికి తగిన సమయం
ప్రవక్త ﷺ ప్రబోధించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “దాసుడు తన ప్రభువుకు అతి చేరువుగా ఉండేది సజ్దా స్థితిలో, గనక అందులో ఎక్కువగా దుఆ చేయండి”. (ముస్లిం 482).
మరో ఉల్లేఖనంలో ఆయన ﷺ ఇలా చెప్పారు: “సజ్దాలో దుఆ ఎక్కువగా చేయండి, అది స్వీకారయోగ్యమవుతుందన్న నమ్మకం ఈ స్థితిలో ఎక్కువగా ఉంటుంది”. (ముస్లిం 479).
(9.6) పాపాల ప్రక్షాళన
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: “మనిషి నమాజు చేయుటకు లేచినప్పుడు అతని పాపాలు అతని తల మరియు భుజాలపై వేయబడతాయి, అతను రుకూ, సజ్దాలు చేసినపుడల్లా అవి రాలిపోతాయి”. (బైహఖీ 3/10, సహీహుల్ జామిఅ 1671).
(9.7) సజ్దా అంగమును నరకాగ్ని కాల్చదు
ప్రవక్త ﷺ సెలవిచ్చారు: “(మానవ శరీరములో) సజ్దా భాగాన్ని అల్లాహ్ నరకంపై నిషేధించాడు, అంటే అది దాన్ని కాల్చదు”. (బుఖారీ 806, ముస్లిం 182).
విశ్వాసులు చేసిన పాపాల్ని అల్లాహ్ క్షమించనిచో, మరియు వారి పాపాలను అధిగమించే, తుడిచివేసే పుణ్యాలు కూడా వారి వద్ద లేకున్నచో వారు వారి పాపాల పరిమాణాన్ని బట్టి అగ్నిలో శిక్షించబడతారు. అయితే సజ్దా అంగములు చాలా గౌరవనీయమైనవి గనక అగ్ని వాటిని తినదు, వాటిపై ఏలాంటి ప్రభావం పడదు. (అష్షర్హుల్ ముమ్తిఅ. 3వ సంపుటం: షేఖ్ ఇబ్ను ఉసైమీన్)
10 – మొదటి తషహ్హుద్
భూమ్యాకాశాల్లో ఉన్న అల్లాహ్ దాసులకు సమానంగా పుణ్యం
మొదటి తషహ్హుద్ లో ‘అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లా హిస్సాలిహీన్’ అన్న దుఆ చదువుతున్నప్పుడు గొప్ప ఘనత మనకు తెలుస్తుంది. నాతో పాటు మీరూ గమనించండి:
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: నా చేయి ప్రవక్త ﷺ చేతిలో ఉండగా ఖుర్ఆను సూరాలు నేర్పినట్లు ఆయన నాకు తషహ్హుద్ దుఆ నేర్పారు. ‘అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యి బాతు అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్‘ఈ పదాలు మీరన్నప్పుడు భూమ్యాకాశాల్లో ఉన్న ప్రతి పుణ్య పురుషునికి ఈ దుఆ లభిస్తుంది.‘వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు’. (బుఖారీ 831).
నీవు సలాం చేస్తున్నావంటే; భూమ్యాకాశాల్లో బ్రతికి ఉన్న, చని పోయిన పుణ్యపురుషులు, జిన్నాతులు మరియు అల్లాహ్ దూతలు అందరూ అన్ని రకాల లోపాలకు అతీతంగా మరియు ఆపదలకు దూరంగా ఉండాలని దుఆ చేస్తున్నావు అని అర్థం. దీని వల్ల అల్లాహ్ నీపై కరుణించి ఎవరెవరిపై నీవు సలాం చేశావో ప్రతి ఒక్కరికి బదులుగా పుణ్యం ప్రసాదిస్తాడు.
11 – చివరి తషహ్హుద్: (ప్రవక్త పై దరూద్)
ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లంపై దరూద్ చదవడంలో చాలా పుణ్యాలు, రెట్టింపు ప్రతిఫలాలున్నాయి.
{అల్లాహ్ ఆయన దూతలు ప్రవక్తకై ‘దరూద్‘ను పంపుతారు, విశ్వాసులారా! మీరు కూడా ఆయనకై దరూద్, సలామ్‌లు పంపండి}. (అహ్ జాబ్ 33: 56).
(11.2) పది రెట్ల పుణ్యం
عَنْ أَبِي هُرَيْرَةَ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (مَنْصَلَّىعَلَيَّوَاحِدَةًصَلَّىاللهُعَلَيْهِعَشْرًا).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ఎవరు నాపై ఒక సారి దరూద్ పంపుతారో అల్లాహ్ అతనిపై పది సార్లు కరుణిస్తాడు”. (ముస్లిం 408).
(11.3) పది పుణ్యాలు లిఖించబడతాయి, పది పాపాలు తొలగించ బడతాయి
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశ ప్రకారం: “నాపై ఒక్కసారి దరూద్ పంపిన వానికి అల్లాహ్ పది పుణ్యాలు వ్రాస్తాడు”. (తిర్మిజి 485), మరో ఉల్లేఖనంలోని పదాలు ఇలా ఉన్నాయి: “అతని పది పాపాలు తొలగిస్తాడు”. మరో హదీసు పదాలు ఇవి: “అతని పది పాపాలు తుడిచివేస్తాడు”. (ముస్నద్ అహ్మద్ 3/102, 4/29). [పది స్థానాలు రెట్టింపు చేయబడతాయని’ ముస్నద్ అహ్మద్ 4/29లో ఉంది.]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నమాజు ఆరంభములో సూరె ఫాతిహాకు ముందు తక్బీరె తహ్రీమ తర్వాత అనేక దుఆలున్నాయి. వాటిలో ఈ దుఆను నేను తెలుపు తున్నాను. “అల్లాహు అక్బరు కబీరా, వల్ హందులిల్లాహి కసీరా, వ సుబ్ హాల్లాహి బుక్రతౌఁ వఅసీలా”. దీని ఉద్దేశం దీని గొప్ప ఘనతను చాటడమే తప్ప ఈ ఒక్క దుఆయే అని తెలపడం కాదు. ఆ ఘనత ఏమిటి? దాన్ని చదివిన వారి కొరకు ఆకాశ తలుపులు తెరువబడుతాయి.
ఇబ్ను ఉమర్ (రదియల్లాహు అన్హు) తెలిపారుః మేము ప్రవక్త ﷺ తో నమాజు చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి “అల్లాహు అక్బరు కబీరా, వల్ హందులిల్లాహి కసీరా, వ సుబ్ హాల్లాహి బుక్రతౌఁ వఅసీలా” అని పలికాడు, (నమాజు ముగించిన తర్వాత) “ఈ పదాలు పలికిన వారెవరు?” అని ప్రవక్త ﷺ అడిగారు. నేనే ఓ ప్రవక్తా! అని అతను చెప్పగా, “నేను ఆశ్చర్య పోయాను. ఆ పదాల వల్ల ఆకాశ తలుపులు తెరువబడ్డాయి” అని ప్రవక్త ﷺ తెలిపారు. ఇబ్ను ఉమర్ ఇలా చెప్పారుః నేను ఈ విషయం ప్రవక్తతో విన్నప్పటి నుండి వాటిని పలకడం మానలేదు. (ముస్లిం 601).
5 -సూరె ఫాతిహ పారాయణం
(5.1) ఖుర్ఆనులోని గొప్ప సూరా
నీవు నమాజులో సూరె ఫాతిహ చదువుతున్నప్పుడు ఖుర్ఆనులోని
ఒక గొప్ప సూర చదివినవానివవుతావు. నాతో పాటు నీవు కూడా ఈ హదీసుపై శ్రద్ధ వహించు:
అబూ సఈద్ బిన్ ముఅల్లా (రదియల్లాహు అన్హు) తెలిపారు: నేను మస్జిదులో నమాజు చేస్తుండగా ప్రవక్త ﷺ నన్ను పిలిచారు, వెంటనే నేను హాజరు కాలేకపోయాను, కొంత సేపయ్యాక హజరయి, ‘ప్రవక్తా! నేను నమాజు చేస్తుంటిని’ అని విన్నవించుకోగా, {అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పిలుపుకు జవాబు పలకండి} అని అల్లాహ్ ఆదేశం తెలియదా? అని మందలించి, “నీవు మస్జిద్ నుండి బైటికి వెళ్ళక ముందే నేను నీకు ఒక సూరా నేర్పుతాను, అది ఖుర్ఆనులోని ఒక గొప్ప సూరా” అని చెప్పారు. నా చేతిని పట్టుకున్నారు. ఇక ఎప్పుడైతే మస్జిద్ నుండి మేము బైటికి వెళ్ళబోయామో, అప్పుడు నేను ‘ప్రవక్తా! ఖుర్ఆనులోని ఒక గొప్ప సూరా గురించి తెలుపుతానన్నారు కదా’ అని గుర్తు చేశాను. అప్పుడాయన ఇలా చెప్పారు: “అది ఏడు ఆయతులు గల సూరా, మాటిమాటికి పఠింపదగినది మరియు గొప్ప ఖుర్ఆను నాకు ఇవ్వబడినది”. (బుఖారీ 4474).
(5.2) ఇది సనా (అల్లాహ్ స్తోత్రం) మరియు దుఆ
ఫాతిహ సూరా పారాయణం అల్లాహ్ మరియు ఆయన దాసుని మధ్యలో రెండు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగంలో అల్లాహ్ స్తోత్రం, ఆయన మహత్తు, గొప్పతనం ఉంది. రెండవ భాగంలో దాసుని అర్ధింపు మరియు దుఆ ఉంది.
అబూ హురైరా (రదియల్లాహు అన్హు)ఉల్లేఖించారుః అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త ﷺ చెప్పారుః “నమాజు (సూరె ఫాతిహా)ను నేను నా మధ్య మరియు నా దాసుని మధ్య రెండు భాగాలుగా జేశాను. నా దాసుడు అర్థించినది అతనికి ప్రాప్తమవుతుంది. అతడు {అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆల మీన్} అన్నప్పుడు, నా దాసుడు నన్ను స్తుతించాడు అని అల్లాహ్ అంటాడు. అతడు {అర్రహ్మానిర్రహీం} అన్నప్పుడు, నా దాసుడు నన్ను ప్రశంసించాడు అని అల్లాహ్ అంటాడు. అతడు {మాలికి యౌమిద్దీన్} అన్నప్పుడు, నా దాసుడు నా గొప్పతనాన్ని చాటాడు అని అల్లాహ్ అంటాడు. అతడు {ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్} అన్న ప్పుడు, ఇది నా మధ్య మరియు నా దాసుని మధ్య ఉన్న సంబంధం, ఇక నా దాసుడు ఏది అడిగినా అతనికి ప్రాప్తమవుతుంది. అతడు {ఇహ్దినస్సిరాతల్ ముస్తఖీం, సిరాతల్లజీన అన్అమ్ త అలైహిం గైరిల్ మగ్ జూబి అలైహిం వలజ్జాల్లీన్} అన్నప్పుడు, ఇది నా దాసుడు అడిగింది, అతడు కోరినది అతనకి ప్రాప్తమవుతుంది అని అల్లాహ్ అంటాడు”. (ముస్లిం 395). మరిన్ని ఘనతలకై పేజి 69 చూడండి**
6 – ఆమీన్ పలకడం:
నమాజీ సోదరా! శుభవార్త!! ఎవరి ఆమీన్ అల్లాహ్ దూతల ఆమీన్ తో కలిసిపోవునో అతని పూర్వ పాపాలు క్షమించబడతాయి.
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “(నమాజులో) ఇమాం గైరిల్ మగ్జూబి అలైహిం వలజ్జాల్లీన్ అని అన్నప్పుడు మీరంతా ఆమీన్ అని చెప్పండి, మీరు చెప్పే ఆమీన్ అల్లాహ్ దూతలు చెప్పే ఆమీన్ కు అనుగుణంగా ఉంటే ఆమీన్ చెప్పే వ్యక్తి పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 782, ముస్లిం 410).
عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (إِذَاقَالَأَحَدُكُمْآمِينَوَقَالَتْالْـمَلَائِكَةُفِيالسَّمَاءِآمِينَفَوَافَقَتْإِحْدَاهُمَاالْأُخْرَىغُفِرَلَهُمَاتَقَدَّمَمِنْذَنْبِهِ).
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా ఆమీన్ అని పలకగా, ఆకాశంలో దైవదూతలు కూడా ఆమీన్ అన్నప్పడు ఇలా ఇవి రెండు కలిసిపోతాయి. తద్వారా ఆమీన్ అన్న వ్యక్తి పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 781).
ప్రవక్త ﷺ ఉపదేశించారని ఇబ్ను ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మనిషి నమాజు కొరకు లేచినప్పుడు అతని పాపాలు అతని తల మరియు భుజాలపై వేయబడతాయి, అతను రుకూ, సజ్దాలు చేసినపుడల్లా అవి రాలిపోతాయి”. (బైహఖీ 3/10, సహీహుల్ జామిఅ 1671).
8 – రుకూ నుండి నిలబడిన తర్వాత దుఆలు:
రుకూ తర్వాత దుఆల ఘనత గొప్పది, పుణ్యం పెద్దది.
(8.1) ఎవరి ‘అల్లాహుమ్మ రబ్బనా లకల్ హందు / రబ్బనా వలకల్ హంద్’ పలుకులు దైవదూతల పలుకులతో కలిసిపోవునో అతని పాపాలు క్షమించబడును
عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (إِذَاقَالَالْإِمَامُسَمِعَاللهُلِمَنْحَمِدَهُفَقُولُوااللَّهُمَّرَبَّنَالَكَالْحَمْدُفَإِنَّهُمَنْوَافَقَقَوْلُهُقَوْلَالْمَلَائِكَةِغُفِرَلَهُمَاتَقَدَّمَمِنْذَنْبِهِ).
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఇమాం నమాజులో ‘సమిఅల్లాహు లిమన్ హమిదహ్’ అన్నపుడు మీరు ‘అల్లాహుమ్మ రబ్బనా లకల్ హంద్’ అనండి, ఎవరి ఈ మాట అల్లాహ్ దూతల మాటకు అనుగుణంగా ఉంటుందో అతని పూర్వ పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 796, ముస్లిం 409). మరో ఉల్లేఖనంలో ‘రబ్బనా వలకల్ హంద్’ అనండి అని ఉంది.
(8.2) ‘రబ్బనా వ లకల్ హందు హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్’ పదాలను వ్రాయడానికి అల్లాహ్ దూతలు ఒకరిని మించి ఒకరు ముందుకు వెళ్తుంటారు.
రిఫాఅ బిన్ రాఫిఅ (రదియల్లాహు అన్హు) అజ్జర్ఖి తెలిపారుః ప్రవక్త వెనక మేము నమాజు చేస్తూ ఉన్నాము, రుకూ నుండి తల లేపుతూ ప్రవక్త ‘సమిఅల్లాహు లిమన్ హమిదహ్’ అన్నారు, వెనక ఒక మనిషి ‘రబ్బనా వలకల్ హందు హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్’ అని అన్నాడు, ప్రవక్త నమాజు ముగించాక, “నమాజులో ఈ పదాలు పలికినవారెవరు?” అని అడిగారు. ‘నేను’ అని ఆ మనిషి అన్నాడు, అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “నేను ముప్ఫై (30) కి పైగా అల్లాహ్ దూతలను చూశాను, ప్రతి ఒక్కరు తానే ముందుగా ఈ పదాలను వ్రాయాలని ఆరాట పడుతున్నాడు”. (బుఖారీ 799).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
2) ఏ సురాహ్ ఒకసారి చదివితే ఖుర్ఆన్ 1/3 భాగం తో సమానం?
A) సురాహ్ ఫాతిహా B) సురాహ్ యాసీన్ C) సురాహ్ ఇఖ్లాస్ D) సురాహ్ రహ్మాన్
మూడు సార్లు సూరె ఇఖ్లాస్ పారాయణం : పూర్తి ఖుర్ఆన్ పారాయణం చేసినంత పుణ్యం
అబూ సఈద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మీలో ఎవరైనా ఒక రాత్రిలో మూడోవంతు ఖుర్ఆన్ చదవలేడా? అని ప్రవక్త ﷺ ప్రశ్నించారు. ఇది వారికి కష్టంగా ఏర్పడి ‘ఎవరు చదవగలుగుతారు ప్రవక్తా? అని చెప్పారు, అప్పుడు ప్రవక్త “అల్లాహుల్ వాహిదుస్సమద్ (సూరె ఇఖ్లాస్) మూడోవంతు ఖుర్ఆన్ కు సమానం” అని చెప్పారు.
(బుఖారి: ఫజా-ఇలుల్ ఖుర్ఆన్/ ఫజ్లు ఖుల్ హువల్లాహు అహద్ 4628. ముస్లిం 1344).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, నమాజు కొరకు అజాన్ మరియు ఇకామత్ మధ్య నిరీక్షించే సమయం యొక్క ప్రాముఖ్యత మరియు దానిని సద్వినియోగం చేసుకునే మార్గాల గురించి వివరించబడింది. ఈ కొద్ది సమయంలో కూడా అధిక పుణ్యాలు సంపాదించవచ్చని వక్త ఉద్బోధించారు. సున్నత్ నమాజులు చేయడం, ఖుర్ఆన్ పఠించడం, దుఆ చేయడం మరియు అల్లాహ్ యొక్క స్మరణ (ధిక్ర్) చేయడం అనే నాలుగు ముఖ్యమైన పనులను సూచించారు. ముఖ్యంగా, ఖుర్ఆన్ పఠనం యొక్క ఘనతను వివరిస్తూ, ఒక్క అక్షరం చదివినా పది పుణ్యాలు లభిస్తాయని హదీసును ఉదహరించారు. సూరతుల్ ఇఖ్లాస్ (ఖుర్ఆన్‌లోని మూడో వంతుకు సమానం), సూరత్ అల్-కాఫిరూన్ (నాలుగో వంతుకు సమానం) మరియు సూరతుల్ ముల్క్ (సమాధి శిక్ష నుండి రక్షణ) వంటి సూరాల ప్రత్యేక ఘనతలను తెలిపారు. అలాగే, ‘సుబ్ హానల్లాహ్’, ‘అల్ హందులిల్లాహ్’ మరియు ‘అస్తగ్ఫిరుల్లాహ్’ వంటి ధిక్ర్ల యొక్క అపారమైన పుణ్యాల గురించి వివరించి, ఈ పవిత్ర సమయాన్ని వ్యర్థం చేయకుండా పుణ్యాలు సంపాదించుకోవాలని ప్రోత్సహించారు.
అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్, అమ్మాబాద్.
సోదర మహాశయులారా! కేవలం 20 నిమిషాల మన ఈ దర్సె హదీస్ క్లాస్, ఇందులో మనం నమాజు నిధులుఅనే చాలా ముఖ్యమైన అంశం అంటే నమాజుకు సంబంధించిన హదీసులను తెలుసుకుంటూ ఉన్నాము. సోదర మహాశయులారా! ఒకవేళ మీకు గుర్తు ఉండి ఉంటే, మనం ఇంతకుముందు ఐదవ మన ఈ పాఠంలో ఏ విషయాలైతే తెలుసుకున్నామో, ఆ విషయాల తర్వాత ఇప్పుడు,
నమాజు కొరకు నిరీక్షించే సమయాన్ని ఎలా గడపాలి?
నమాజు కొరకు నిరీక్షించే ఘనత ఏముంది హదీసుల్లో, చాలా మంచి హదీసులు తెలుసుకొని ఉన్నాము. అయితే ఈ నిరీక్షించే సమయం ఏదైతే ఉందో, ఇకామత్ అయ్యే వరకు మనం మస్జిద్ లో ఏదైతే నిరీక్షిస్తున్నామో, ఆ నిరీక్షించే ఘనత అయితే తెలుసుకున్నాము. కానీ ఆ నిరీక్షించే సమయాన్ని మనం ఎలా గడపాలి? అందులో మనం ఎలాంటి పుణ్యాలు పొందగలుగుతాము?
అయితే సోదర మహాశయులారా! అల్లాహ్ యొక్క దయవల్ల, అవి కొన్ని క్షణాలే కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఐదు నిమిషాలు కావచ్చు, కొన్ని సందర్భాల్లో పది నిమిషాలు కావచ్చు, కొన్ని సమయాల్లో, సందర్భాల్లో ఐదు నిమిషాల కంటే తక్కువ కావచ్చు. కానీ ఆ తక్కువ సమయంలో కూడా మీరు అధికాను అధిక పుణ్యాలు పొందగలగాలి. ఇదే నా యొక్క కోరిక. అల్లాహ్ ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఎంత ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకోవడంలో గడుపుతామో, అది మనకు ఇహలోకంలో కూడా ఎంతో మేలును కలుగజేస్తుంది. పరలోకంలోనైతే మనం ఇంతకుముందు ఎన్నోసార్లు విని ఉన్నాము. మనిషికి ఒక్కొక్క పుణ్యం అవసరం ఉంటుంది. ఆ సందర్భంలో ఆ మనిషి బంధువులను అడిగినా గాని, స్నేహితులను అడిగినా గాని, ఎక్కడా ఏ పుణ్యం దొరకదు. చివరికి అతడు ఈ పూర్తి ప్రపంచాన్ని ఒకవేళ అల్లాహ్ అతనికి ఇచ్చి ఉండేది ఉంటే, దానిని అతను అక్కడ అల్లాహ్ కు ఇచ్చేసి, దానికి బదులుగా ఏదైనా నరకం నుండి రక్షణ పొందాలనుకుంటే, అది కూడా సాధ్యపడదు. అందుకొరకు ఇహలోకంలో ఇలాంటి అవకాశాలను మనం సద్వినియోగించుకొని పుణ్యాలు అధికంగా సంపాదించాలి.
అయితే ఈ నిరీక్షించే సమయంలో మనం ఏం పుణ్యాలు సంపాదించగలుగుతాము? అల్లాహ్ త’ఆలా మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక! ఈ రోజుల్లో మన సమాజంలో ఉన్న పరిస్థితిని మనం ఏం చూస్తున్నాము? ఈ నిరీక్షించే సమయంలో కూడా, మస్జిద్ లో ఉండి కూడా కొందరు పరస్పరం ప్రపంచ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. మరి కొందరు పరస్పరం ఏదో ఒక విషయంలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో ఎప్పుడైనా ఒక సందర్భంలో పర్వాలేదు, దీనిని మనం అవసరం ఉండి మాట్లాడుకోవడం తప్పుగా, పాపంగా భావించడం సరైన విషయం కూడా కాదు. కానీ మనం కొందరిని చూస్తాము, ప్రతి నమాజులో అజాన్, ఇకామత్ మధ్యలో నిరీక్షిస్తూ ఉన్న ఆ సమయంలో వారు పరస్పరం మాట్లాడుకోవడం లేదా వేరే ఆలోచనల్లో పడి ఉండడం లేదా మౌనంగా ఉండడం ఒక అలవాటుగా అయిపోయింది. ఇది చాలా నష్టకరం సోదరులారా! ఇది చాలా నష్టకరం. అయితే ఈ మధ్యలో మనం ఏం చేయగలుగుతాము?
పుణ్యాలు సంపాదించే మార్గాలు
పుణ్యాలు సంపాదించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. మొదటి మార్గం ఇందులో, నిరీక్షించే సమయంలో మనం సున్నత్ నమాజులు చేసుకుంటే వాటి యొక్క ఘనత చాలా ఉంది. అవి మనం తెలుసుకున్నాము. అంతేకాకుండా, ప్రత్యేకంగా మా ఛానల్ లో సున్నత్ నమాజుల ఘనత విషయంలో వేరే రెండు ప్రత్యేక వీడియోలు ఉన్నాయి, వాటిని మీరు తప్పకుండా చూడండి అని కూడా చెప్పడం జరిగింది.
రెండో విషయం దేని ద్వారానైతే మనం ఆ నిరీక్షించే సమయంలో పుణ్యాలు పొందగలుగుతామో, అది ఖుర్ఆన్ తిలావత్. వాస్తవానికి సోదర మహాశయులారా! ఈ రోజుల్లో ప్రత్యేకంగా మన ప్రాంతాల్లో ఎన్నో మస్జిదులలో మనం చూస్తాము, కేవలం మింబర్ పై అలా తబర్రుక్ కొరకు, శుభం కొరకు ఒక ఖుర్ఆన్ పెట్టి ఉంటుంది. కానీ వచ్చే నమాజీలు చదవడానికి ఎక్కువ సంఖ్యలో ఖుర్ఆన్లు ఉండవు. అంతకంటే బాధాకరమైన విషయం, మన సమాజంలో ఉన్న మనవాళ్లు ఖుర్ఆన్ తిలావత్ చేయాలి మనం అన్నటువంటి తపన లేదు. ఎవరికైతే ఖుర్ఆన్ చదవ వస్తుందో వారికి లేదు, ఎవరికైతే చదవరాదో మనం నేర్చుకోవాలి, మనం దీని గురించి చదివే ప్రయత్నం చేయాలి అన్నటువంటి వారికి కాంక్ష కూడా మనం కనబడటం లేదు. అయితే సోదర మహాశయులారా! వాస్తవానికి ఇది చాలా బాధాకర విషయం.
ఏ ఖుర్ఆన్ అయితే మన పూర్తి జీవితాన్ని మార్చుటకు వచ్చిందో, ఏ ఖుర్ఆన్ అయితే మన జీవితాల్లో ఆనందాలు, సంతోషాలు, శాంతి స్థాపించడానికి వచ్చిందో, ఏ ఖుర్ఆన్ అయితే మన జీవితంలోని అన్ని రకాల ఇబ్బందులను, కష్టాలను మరియు మనం ఇహలోకంలో గాని, పరలోకంలో గాని నష్టపోయే విషయాలను దూరం చేయడానికి వచ్చిందో, అలాంటి ఆ ఖుర్ఆన్ పట్ల మనది ఇంత అశ్రద్ధ? ఇది మంచి విషయం కాదు. ఇన్ షా అల్లాహ్, ఖుర్ఆన్ యొక్క ఘనత, ఖుర్ఆన్ వినడం, చదవడం, దాని పట్ల ఏదైతే ఈ రోజుల్లో శ్రద్ధ వహిస్తున్నామో, దాని యొక్క నష్టం ఎంత, ఇవన్నీ విషయాలు వేరే సందర్భాల్లో తెలుసుకుందాము. కానీ, నమాజు కొరకు నిరీక్షించే ఈ సమయంలో మనం ఖుర్ఆన్ ఎప్పుడైతే చదువుతామో, ఆ ఖుర్ఆన్ చదవడం, చూసి చదవడం గాని లేదా ముందు నుండే మనకు కంఠస్థం ఉన్నటువంటి సూరాలు చదవడం కానీ.
సామాన్యంగా మన ప్రాంతంలో ఉన్న ఎక్కువ మంది ప్రజలు ఖుర్ఆన్ చూసి చదవలేరు కదా. ఏమంటారు? మాకు ఖుర్ఆన్ చదవడం రాదు అని అంటారు. కానీ కనీసం ఒక్క సూరా ఏదైనా గుర్తుండి ఉంటుంది కదా, రెండు సూరాలు గుర్తుండి ఉంటాయి కదా, కనీసం సూరె ఫాతిహా అయినా గుర్తుండి ఉంటుంది కదా. ఆ సమయంలో దాన్ని చదువుకోండి. ఎందుకు? మనం నమాజులో చదువుతున్నాము కదా అని ఆలోచించకండి. మీకు దొరికిన సమయంలో మీరు ఖుర్ఆన్ యొక్క కొన్ని ఆయతులు పఠించడం, తిలావత్ చేయడం ఎంత గొప్ప పుణ్యమో తెలుసా?
తిర్మిజీలోని సహీ హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ‘మన్ కరఅ హర్ఫన్ మిన్ కితాబిల్లాహ్’ – ఎవరైతే అల్లాహ్ గ్రంథంలోని ఒక్క అక్షరం చదువుతారో… ఏమంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం? ఒక పదం, పూర్తి ఒక ఆయత్, పూర్తి ఒక ఖుర్ఆన్ అని కాదు. ఒక్క అక్షరం చదువుతారో, వారికి పదేసి పుణ్యాలు లభిస్తాయి అన్నటువంటి శుభవార్త ఇచ్చారు. ఎన్ని పుణ్యాలు లభిస్తాయి? పది పుణ్యాలు లభిస్తాయి. ఇంకా ఎవరికైనా అర్థం కావడంలో ఇబ్బంది కాకూడదు అని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ, ఒక సామెత మాదిరిగా కూడా తెలిపారు. ఏంటి?
الم (అలిఫ్ లామ్ మీమ్)
అని ఎప్పుడైతే మనం చదువుతామో, ఈ ‘అలిఫ్ లామ్ మీమ్’ అన్నది ఒక్క అక్షరం కాదు. ఇవి మూడు అక్షరాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరింత వివరంగా చెప్పారు. ‘అలిఫ్’ ఒక అక్షరం, ‘లామ్’ ఒక అక్షరం, ‘మీమ్’ ఒక అక్షరం. ఈ మూడు అక్షరాలు చదివారు, మూడు అక్షరాలతో ఒక్క ఆయత్ అయింది. ఈ మూడు అక్షరాలు చదివినందుకు 30 పుణ్యాలు లభించాయి.
గమనించండి! ఈ విధంగా మీరు ఆలోచించారంటే, ఒకవేళ బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అని మీరు చదివారంటే, ‘బిస్మి’ – మూడు అక్షరాలు ఉన్నాయి. ‘అల్లాహ్’లో నాలుగు అక్షరాలు ఉన్నాయి. ‘అర్రహ్మాన్’లో ఐదు అక్షరాలు ఉన్నాయి. ఇంకా ‘అర్రహీమ్’ – అలిఫ్, లామ్ రెండు, రా, హా, యా, మీమ్ – ఆరు అక్షరాలు ఉన్నాయి. ఈ విధంగా గమనించండి, మొత్తం టోటల్ ఎన్ని అయినాయి? ఆ టోటల్ ని మళ్ళీ పది నుండి మీరు ఇంటు చేయండి. ఎన్ని అవుతున్నాయి? అల్లాహు అక్బర్!
ఈ విధంగా మనం, మనకు ఖుర్ఆన్ చూసి చదవడం రాకపోయినా గాని, మనం ఏదైతే గుర్తు ఉన్న, ముందు నుండి మనకు యాద్ ఉన్న, కంఠస్థం ఉన్న సూరాలు అక్కడ ఆ సందర్భంలో నమాజు కొరకు ఏదైతే మనం నిరీక్షిస్తున్నామో ఇమామ్ వచ్చి ఇకామత్ చెప్పి నమాజు కొరకు నిలబడతాడు అని, ఈ సందర్భంలో ఖుర్ఆన్ చదవడం ద్వారా మనం ఎంత గొప్ప పుణ్యం పొందుతాము! అలాగే, ఒకవేళ మనం కొన్ని సూరాల ఘనతను తెలుసుకొని ఉండేది ఉంటే, మరింత ఖుర్ఆన్ తిలావత్ లో మన యొక్క కాంక్ష పెరుగుతుంది. ఉదాహరణకు,
సూరతుల్ ఇఖ్లాస్ (ఖుల్ హువల్లాహు అహద్)
సూరతుల్ ఇఖ్లాస్, ఖుల్ హువల్లాహు అహద్ అన్న సూరా ఏదైతే ఉందో, ఈ ఖుల్ హువల్లాహు అహద్ అనే సూరా ఎంత ఘనత గల సూరా ఇది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలిపారు, ఎవరైతే దీని యొక్క గుణాలు, ఇందులో ఉన్నటువంటి అల్లాహ్ గుణాల గురించి దీనిని ప్రేమిస్తారో, అల్లాహ్ అతన్ని ప్రేమిస్తాడు. ఎవరైతే ఈ సంపూర్ణ ప్రేమతో దీనిని పఠిస్తాడో, అల్లాహు త’ఆలా అతన్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. అంతే కాదు, మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఈ ఖుర్ఆన్ యొక్క సూరా, సూరతుల్ ఇఖ్లాస్ అంటే ఖుల్ హువల్లాహు అహద్ సూరా, ఖుర్ఆన్ లోని మూడో వంతు భాగానికి సమానం. అల్లాహు అక్బర్! అంటే ఖుర్ఆన్ లో 30 పారాలు ఉన్నాయి కదా, సుమారు 10 పారాలకు సమానం అన్నటువంటి దాని భావపరంగా, అందులో ఏ విషయాలైతే ఉన్నాయో, దాని పరంగా.
అయితే ఈ విధంగా ఆలోచించండి. మీరు నమాజు కొరకు నిరీక్షిస్తున్న సమయంలో మస్జిద్ లో కేవలం ఖుల్ హువల్లాహు అహద్ ఈ సూరా పూర్తిగా చదివారంటే, ఒక్కొక్క అక్షరానికి పదేసి పుణ్యాలు లభించాయి. అంతేకాకుండా, ప్రత్యేకంగా ఈ సూరాకు, సహీ బుఖారీ యొక్క హదీస్ ఆధారంగా ఈ మూడు ఘనతలు ఏదైతే మనం తెలుసుకున్నామో, అల్లాహ్ ప్రేమిస్తాడు, స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు మరియు ఖుర్ఆన్ లోని మూడో వంతు భాగానికి సమానం – ఇన్ని గొప్ప పుణ్యాలు కూడా మనం పొందుతాము.
సూరత్ అల్-కాఫిరూన్ (ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్)
అలాగే, ఒకవేళ మనం గమనించామంటే, సూరత్ అల్-కాఫిరూన్, ‘ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్’ సూరా ఏదైతే ఉందో, దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ ఉంది, తబరానీ ఔసత్ లో, షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు. ఏముంది అక్కడ ఘనత? ‘ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్’ – ఈ సూరా ఖుర్ఆన్ లోని నాలుగో భాగానికి సమానం.
ఇక ఈ సూరా ప్రస్తావన వచ్చింది గనుక ఒక మాట చెప్పేస్తున్నాను మీకు గుర్తుండడానికి. ఎందుకంటే ఏ సందర్భంలోనైనా మనం ఖుర్ఆన్ తిలావత్ ఉద్దేశంతో చదివితే, పారాయణం చేస్తే, తిలావత్ చేస్తే, పదేసి పుణ్యాలు దొరుకుతాయి. అంతేకాకుండా, ఏ సూరాకు, ఏ ఆయత్ కు, ఏ ప్రత్యేక ఘనత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో, ఆ ఘనతలు కూడా మనం పొందవచ్చు. ఇక్కడ నమాజు కొరకు, ఇకామత్ కొరకు నిరీక్షిస్తున్న సమయంలో చదివే ప్రస్తావన వచ్చింది, అందుకొరకు ఇక్కడ ఈ విషయం చెప్పాము. కానీ ఇదే ‘ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్’ సూరా, ఎవరైతే పడుకునే ముందు చదువుకుంటారో, అర్థ భావాలతో చదివితే అది విషయం తెలుస్తుంది., వారు షిర్క్ నుండి పూర్తిగా దూరం ఉండి, ఈమాన్, విశ్వాసం స్థితిలో రాత్రి గడిపిన వారు అవుతారు. ఎంత గొప్ప విషయమో గమనించండి. సహీ హదీస్ లో ఈ విషయం రుజువై ఉంది.
సూరతుల్ ముల్క్
అలాగే సూరతుల్ ముల్క్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చినటువంటి శుభవార్త ఏంటి? ఇందులో ముప్పై ఆయతులు ఉన్నాయి. ఎవరైతే ఈ సూరత్ ను చదువుతారో, ఆ సూరా చదివిన వారి పట్ల సిఫారసు చేస్తుంది. ఈ విధంగా ప్రళయ దినాన మనం ఈ సూరా యొక్క సిఫారసుకు అర్హులమవుతాము. ఇక వేరే హదీస్ ద్వారా తెలుస్తుంది, సమాధి శిక్ష నుండి కూడా రక్షణకు ఈ సూరా చాలా గొప్ప సబబుగా నిలుస్తుంది.
ఈ విధంగా సోదరులారా, సోదరీమణులారా! మనం ఇంకా వేరే సూరాల గురించి కూడా ఏ ఘనతలు వచ్చి ఉన్నాయో, అవి తెలుసుకుంటే, మనం నమాజు కొరకు నిరీక్షిస్తున్న ఈ సమయంలో ఖుర్ఆన్ యొక్క కొంత భాగం తిలావత్ చేస్తూ ఉంటే, అల్హందులిల్లాహ్, మనం అనేకానక పుణ్యాలు పొందగలుగుతాము.
ఇంకా సోదర మహాశయులారా! ఈ నమాజు కొరకు నిరీక్షించే ఈ సమయంలో మనం, ఖుర్ఆన్ చదవడం ఒక విషయం. ముందు సున్నతుల విషయం ప్రస్తావన వచ్చింది. అది కాకుంటే, లేదా అది చదివిన తర్వాత ఇంకా సమయం ఉండేది ఉంటే ఖుర్ఆన్ తిలావత్.
3. దుఆ చేయడం
ఎప్పుడైనా ఒకసారి మీరు ఖుర్ఆన్ తిలావత్ చేయకుండా, అజాన్ ఇకామత్ మధ్యలో దుఆ చేస్తే, ఆ దుఆ కూడా స్వీకరించబడుతుంది. ఈ హదీస్ మీరు ఇంతకు ముందే విని ఉన్నారు.
4. అల్లాహ్ యొక్క స్మరణ (ధిక్ర్)
ఇక నాలుగో విషయం, దీనికంటే చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే మనిషి ఐదు పూటల నమాజు ప్రతి రోజు చేయాలి. ప్రతి రోజు తొలి సమయంలో మస్జిద్ కు రావాలి. అయితే ఒక్కోసారి ఖుర్ఆన్ తిలావత్, ఒక్కోసారి సున్నతులు, కొన్ని నమాజుల మధ్యలో నఫిల్లు అధికంగా చేయడం గాని, కొన్ని సందర్భాలలో దుఆలో గడపడం గాని, మరికొన్ని సందర్భాలలో ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని మీరు గుర్తుంచుకోవచ్చు.
ఏంటి అది? అధికంగా అల్లాహ్ యొక్క స్మరణ చేయడం. ఈ నిరీక్షిస్తున్న సమయంలో, అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క ధిక్ర్. సోదర మహాశయులారా! అల్లాహ్ యొక్క ధిక్ర్ గురించి నేను ఏమని చెప్పాలి? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో హదీసులు దీని గురించి ఉన్నాయి. స్వయంగా ఖుర్ఆన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి. కానీ, ఒక్క విషయం ఖుర్ఆన్ లో వచ్చిన ఒక్క విషయం మీరు ఎల్లవేళల్లో మీ మదిలో నాటుకొని ఉన్నారంటే, మీ మదిలో ఎల్లవేళల్లో ఫ్రెష్ గా దాన్ని పెట్టుకున్నారంటే, ధిక్ర్ చేయడంలో ఎప్పుడూ కూడా మీరు అలసిపోరు, ధిక్ర్ చేయడంలో ఎప్పుడూ మతిమరుపు తనానికి గురి కారు. ఏంటి ఆ విషయం? సత్కార్యాలు చాలా ఉన్నాయి కదా! ఏదైనా సత్కార్యం గురించి అల్లాహ్ అధికంగా చేయండి, అధికంగా, అధికంగా, కసీరా, కసీరా అని ఎక్కడైనా వచ్చి ఉంది అంటే, అది కేవలం ఈ ధిక్ర్ గురించే ఉంది.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا اللَّهَ ذِكْرًا كَثِيرًا (యా అయ్యుహల్లజీన ఆమనూ ఉజ్ కురుల్లాహ జిక్రన్ కసీరా) ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను ఎక్కువగా స్మరించండి. (33:41)
ఈ ‘అధికంగా’ అన్న పదం, ఏదైనా సత్కార్యం గురించి అల్లాహ్ చెప్పి ఉన్నాడంటే, కేవలం ఈ ధిక్ర్ గురించే చెప్పి ఉన్నాడు. హదీసుల్లో చాలా హదీసులు వచ్చి ఉన్నాయి. కానీ రెండు హదీసుల సారాంశం నేను చెబుతాను. హదీసుల యొక్క రిఫరెన్స్, వాటి అరబీ యొక్క పదాలతో చెప్పుకుంటూ పోతే సమయం మనకు సరిపోదు. మొదటి ఒక హదీస్ ఏంటి? అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మీరు పర్వతాలకు సమానంగా దానధర్మాలు ఖర్చు చేస్తే అల్లాహ్ మార్గంలో ఎంత పుణ్యం లభిస్తుందో, మీరు యుద్ధ మైదానంలో ఉండి, సత్య అసత్య, ధర్మ అధర్మాల మధ్యలో జరిగే పోరాటంలో పాల్గొంటే ఎంత పుణ్యం లభిస్తుందో, దానధర్మాలు కేవలం డబ్బు రూపంలోనే కాదు, మీ వద్ద పెద్ద పర్వతాలకు సమానంగా వెండి, బంగారాలు ఉంటే దానిని మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడితే ఎంత పుణ్యం లభిస్తుందో, అంత పుణ్యం అల్లాహ్ యొక్క ధిక్ర్ లో లభిస్తుంది. అంతేకాదు, అంతకంటే ఎక్కువ పుణ్యం అల్లాహ్ ధిక్ర్ చేయడంలో మీకు లభిస్తుంది అని చెప్పారు.
నేను ముందే చెప్పాను కదా, హదీసులు ఎన్ని ఉన్నాయంటే, ‘త్రాసును బరువు చేసే సత్కార్యాలు’ అనే మా పుస్తకం ఒకసారి చదివి చూడండి మీరు. నూహ్ అలైహిస్సలాం తన కొడుకుకు ఒక సందర్భంలో చెప్పారు: ‘సుబ్ హానల్లాహి వబిహందిహీ’ అధికంగా నీవు చదువుతూ ఉండు. ఈ రోజుల్లో ఎన్నో అక్రమ సంపాదనల్లో మనం పడిపోతున్నాము. కానీ, ధర్మపరమైన సంపద, సరియైన మార్గాలు మనం అవలంబిస్తూ, అల్లాహ్ యొక్క ధిక్ర్ చేస్తూ ఉండడంలో మన యొక్క ఆహారం, మన యొక్క ఉపాధి దాచబడి ఉన్నది అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాము. నూహ్ అలైహిస్సలాం చెప్పారు:
سُبْحَانَ اللَّهِ وَبِحَمْدِهِ، فَبِهَا تُرْزَقُ الْخَلَائِقُ (సుబ్ హానల్లాహి వబిహందిహీ, ఫబిహా తుర్ జఖుల్ ఖలాయిక్) ‘సుబ్ హానల్లాహి వబిహందిహీ’ (అల్లాహ్ పవిత్రుడు మరియు ఆయనకే సర్వస్తోత్రాలు) – దీని ద్వారానే సర్వ సృష్టికి ఉపాధి లభిస్తుంది.
يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ (యుసబ్బిహు లిల్లాహి మా ఫిస్సమావాతి వ మా ఫిల్ అర్ద్) భూమ్యాకాశాలలో ఉన్న సమస్త వస్తువులు అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి. (62:1)
కొన్ని సందర్భాల్లో ‘సబ్బహ లిల్లాహ్’ అని, కొన్ని సందర్భాల్లో ‘యుసబ్బిహు లిల్లాహ్’ అని, ఏడు సూరాల ఆరంభం ఉంది. అంతేకాకుండా, ఎన్నో సందర్భాలలో, ఎన్నో సందర్భాలలో ఖుర్ఆన్ లో ఈ పదాలు వచ్చి ఉన్నాయి. ఏంటి భావం? సర్వ సృష్టి అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడుతూ ఉన్నాయి. మరి నూహ్ అలైహిస్సలాం ఏం చెప్పారు? సహీ హదీస్ లో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నూహ్ అలైహిస్సలాం తన కొడుకుకు చెప్పారు, సర్వ సృష్టికి ఉపాధి ఏదైతే లభిస్తుందో, రిజ్క్ ఏదైతే అల్లాహు త’ఆలా ఇస్తున్నాడో, రిజ్క్ అని అరబీలో ఏదైతే వస్తుందో పదం ఖుర్ఆన్, హదీస్ లో, అక్కడ కేవలం కడుపు నిండా తిండి కాదు. రిజ్క్ అంటే మన శరీరానికి, కడుపుకు అవసరమైన వస్తువులు, తిండి, త్రాగుడు ఇవి. అంతేకాకుండా, అంతకంటే ముఖ్యమైన మన ఆత్మకు, మన హృదయానికి ఆధ్యాత్మికంగా మన కొరకు కావలసినటువంటి ఆహారం ఏదైతే ఉందో, అది కూడా. దానికే ప్రాముఖ్యత ఎక్కువ. అందుకొరకు సోదరులారా!
అల్లాహ్ యొక్క ధిక్ర్ విషయంలో ఎన్నో ఇంకా హదీసులు వచ్చి ఉన్నాయి. అయితే, ఈ సందర్భంలో, ఏదైతే మనం జమాఅత్ నిలబడడానికి నిరీక్షిస్తూ ఉన్నామో, ఇక్కడ ‘సుబ్ హానల్లాహ్’, ‘వల్ హందులిల్లాహ్’, ‘వ లా ఇలాహ ఇల్లల్లాహ్’, ‘వల్లాహు అక్బర్’, ‘వ లా హౌల వ లా కువ్వత ఇల్లా బిల్లాహ్’, ‘సుబ్ హానల్లాహి వబిహందిహీ’, అలాగే ‘సుబ్ హానల్లాహిల్ అజీమ్’ – ఇలాంటి ఈ పుణ్యాలు, ఇలాంటి ఈ అద్కార్ మనం చేస్తూ, ఎన్నో పుణ్యాలు సంపాదించగలుగుతాము.
ముస్లిం షరీఫ్ లోని సహీ హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీలో ఒక వ్యక్తి వెయ్యి పుణ్యాలు సంపాదించలేడా? సహాబాలు ఆశ్చర్యంగా, వెయ్యి పుణ్యాలు మాలో ఒక వ్యక్తి ఎలా సంపాదించగలడు ప్రవక్తా? అని అడిగినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: ఎవరైతే ‘సుబ్ హానల్లాహ్’ వంద సార్లు చదువుతారో, వారికి వెయ్యి పుణ్యాలు లభిస్తాయి, వారి పాపాల నుండి వెయ్యి పాపాలు తరిగిపోతాయి. అల్లాహు అక్బర్! వెయ్యి పాపాలను అల్లాహ్ మాఫ్ చేస్తాడు. మన్నించేస్తాడు. ఇంకా వెయ్యి పుణ్యాలు మన యొక్క కర్మపత్రంలో రాస్తాడు. ఎంత గొప్ప పుణ్యమో ఆలోచించండి!
ఎవరైతే నమాజు కొరకు నిరీక్షిస్తున్న ఈ సమయంలో ‘అల్ హందులిల్లాహ్’ అని అంటారు. ముస్లిం షరీఫ్ లోని ఒక సహీ హదీస్: ‘సుబ్ హానల్లాహ్ తమ్లఉల్ మీజాన్, వల్ హందులిల్లాహ్ తమ్లఉ మా బైనస్సమాయి వల్ అర్ద్’. ‘సుబ్ హానల్లాహ్’ మీ యొక్క పుణ్యాల త్రాసును నింపేస్తుంది. ‘అల్ హందులిల్లాహ్’ అని మీరు ఎప్పుడైతే అంటారో, ఈ భూమి నుండి ఆకాశాల మధ్యనంతా కూడా నింపేస్తుంది, అంత గొప్ప పుణ్యాలు మీకు లభిస్తాయి.
ఇదే మధ్యలో ‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్’ అని, ‘అస్తగ్ఫిరుల్లాహ్’ అని మనం చదువుతూ ఉంటే… ‘అస్తగ్ఫిరుల్లాహ్’ – ఓ అల్లాహ్, నా పాపాలను నీవు క్షమించు అని పూర్తి అర్థ భావాలతో మనం చదువుతూ ఉండేది ఉంటే, ఎంత గొప్ప పుణ్యం మనకు లభిస్తుందో తెలుసా? సూరె నూహ్ లో నాలుగు లాభాలు తెలుపబడ్డాయి. సూరత్ హూద్ లో రెండు లాభాలు తెలుపబడ్డాయి. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లోనైతే మరికొన్ని లాభాలు తెలుపబడ్డాయి.
మన సమయం సమాప్తం కావస్తుంది. నమాజు కొరకు నిరీక్షిస్తున్న సమయాన్ని ఎలా గడపాలి అనే ఈ నాటి అంశంలో మనం నాలుగు విషయాల గురించి తెలుసుకున్నాము. రెండు విషయాల వివరణ ఇంతకుముందే తెలుసుకున్నాము. సున్నత్ నమాజులు చేయడం, దుఆ చేయడం. మరియు ఈ రోజు మరో రెండు విషయాల గురించి తెలుసుకున్నాము వివరాలతో: ఖుర్ఆన్ చదవడం, అలాగే ధిక్ర్ లో గడపడం.
అల్లాహు త’ఆలా మనందరికీ ఈ సద్భాగ్యం ప్రసాదించు గాక! ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్ వ అహ్సనల్ జజా, వబారకల్లాహు ఫీకుమ్, వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
—
12 – ఖుర్ఆన్ పారాయణం మరియు జిక్ర్ (అల్లాహ్ స్మరణ)లో నిమగ్నులై యుండుట:
మస్జిద్ లో త్వరగా వచ్చిన వ్యక్తి అల్లాహ్ సాన్నిధ్యం పొందుటకు ఎన్నో రకాల ఆరాధనలు పాటించ గలుగుతాడు. ఉదా: జిక్ర్, ఖుర్ఆన్ పారాయణం మరియు అల్లాహ్ వరాల పట్ల యోచించటం, ఇహలోకం, దానికి సంబంధించిన ఆలోచనల నుండి దూరం ఉండటం. దీని వల్ల మనుసును నమాజులోనే నిలిపి, వినయ వినమ్రత పాటించే అవకాశం ఉండును. అదే వెనక వచ్చే వ్యక్తి (పై లాభాలను నోచుకోలేడు) అతను నమాజు చేసినా అతని మనస్సు ఐహిక విషయాల్లో ఇరుక్కొని ఉంటుంది, నమాజులో లీనమై నమ్రత పాటించకపోవచ్చు. అతని శరీరం మస్జిదులో, నమాజులో ఉన్నా అతని అంతర్యం నమాజులో ఉండకపోవచ్చు.
ముస్లిం సోదరా! నీ పరలోక సేవింగ్ అకౌంట్ పెరుగుదలకై నీవు నమాజు కొరకు నిరీక్షిస్తున్నంత సమయంలో కొన్ని స్వర్ణవకాశాలు ఉదాహరణగా చూపిస్తున్నాను. వాటిపై శ్రద్ధ వహించుః
(అ) దివ్య ఖుర్ఆన్ పారాయణం
పారాయణ పరిమాణం
ఫలితం
విధానం
1- ప్రతి నమాజు యొక్క అజాన్ మరియు ఇఖామ- తుల మధ్యలో 5పేజిల పారా- యణం. ఇలా ప్రతి రోజు 25 పేజిలవుతాయి.
24 రోజుల్లో మొత్తం ఖుర్ఆన్ యొక్క పారాయణం అవు- తుంది.
ఖుర్ఆన్ పేజిలు 604 25 పేజిలు × 24 రోజులు = 600
2- నమాజుకై నిరీక్షిస్తూ ప్రతి రోజు ఒక్క పారా.
30 రోజుల్లో పూర్తి ఖుర్ఆన్ పారాయణం
ఖుర్ఆన్ పారాలు 30. నెల రోజులు 30. 30 పారాలు ÷ 30 రోజులు = రోజుకు 1 పార
3- నమాజు కొరకు నిరీక్షిస్తూ ప్రతి రోజు 3 ఆయతులు కంఠస్తం చేయుట.
ఇన్షా అల్లాహ్ 8 సంవత్సరాల్లో పూర్తి ఖుర్ఆన్ కంఠస్తం.
అనుభవ పూర్వకమైన విషయం.
4- నమాజు కొరకు నిరీక్షి- స్తున్న వ్యవధిలో ప్రతి రోజు 1 ¼ పేజి కంఠస్తం
సుమారు పదహారు మాసాల్లో పూర్తి ఖుర్ఆన్ కంఠస్తం అవుతుంది. ఇన్షాఅల్లాహ్!
604 ÷ 1¼ పేజి = 483.2 రోజులు 483.2 ÷ 30రోజులు = 16 నెలల 10 రోజులు
5- నమాజు కొరకు నిరీక్షి- స్తున్న వ్యవధిలో ప్రతి రోజు రెండు పేజిలు
సుమారు పది మాసాల్లో పూర్తి ఖుర్ఆన్ కంఠస్తం ఇన్షాఅల్లాహ్
604 ÷ 2 = 302 రోజులు = పది నెలలు.
6- మూడు సార్లు సూరె ఇఖ్లాస్ పారాయణం
పూర్తి ఖుర్ఆన్ పారాయణం చేసినంత పుణ్యం
అబూ సఈద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా ఒక రాత్రిలో మూడోవంతు ఖుర్ఆన్ చదవలేడా? అని ప్రవక్త ﷺ ప్రశ్నించారు. ఇది వారికి కష్టంగా ఏర్పడి ‘ఎవరు చదవగలుగుతారు ప్రవక్తా? అని చెప్పారు, అప్పుడు ప్రవక్త “అల్లాహుల్ వాహిదుస్సమద్ (సూరె ఇఖ్లాస్) మూడోవంతు ఖుర్ఆన్ కు సమానం” అని చెప్పారు. (బుఖారిః ఫజా-ఇలుల్ ఖుర్ఆన్/ ఫజ్లు ఖుల్ హువల్లాహు అహద్ 4628. ముస్లిం 1344).
ప్రవక్త ﷺ ఉపదేశిం-చారని అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఖుర్ఆనులో 30 ఆయతుల ఒక సూర ఉంది. (దాన్ని చదివిన వారి పట్ల) అది సిఫారసు చేస్తే దాని సిఫారసు అంగీకరింపబడుతుంది. అది తబారకల్లజీ బియదిహిల్ ముల్క్ (సూర ముల్లక్). (తిర్మిజిః ఫజాఇలుల్ ఖుర్ఆన్/ ఫజ్లు సూరతిల్ ముల్క్. 2816).
ఇప్పటికీ మనము పుణ్యాల వనంలోనే ఉన్నాము. నాతో పాటు మీరు సయితం ఖుర్ఆన్ పారాయణం యొక్క ఈ గొప్ప ఘనతపై శ్రద్ధ వహించండి.
عن عَبْدِ الله بْنِ مَسْعُودٍ ÷ يَقُولُ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ الله فَلَهُ بِهِ حَسَنَةٌ وَالْـحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا لَا أَقُولُ الم حَرْفٌ وَلَكِنْ أَلِفٌ حَرْفٌ وَلَامٌ حَرْفٌ وَمِيمٌ حَرْفٌ).
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు: “దివ్యగ్రంథంలోని ఒక అక్షరం చదివినవానికి ఒక పుణ్యం, ఆ ఒక పుణ్యం పది రెట్లు ఎక్కువగా లభించును. అలిఫ్, లామ్, మీమ్ ను ఒక అక్షరం అనడం లేదు. అలిఫ్ ఒక అక్షరం, లాం ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం.” (తిర్మిజి 2835).
ఖుర్ఆనులోని అతి చిన్న సూరా ద్వారా దీని ఉదాహరణ చూడండిః
సూర కౌసర్ యొక్క అక్షరాలు 42.
ఒక పుణ్యం పది రెట్లు ఉంటుంది. ఇలా 42×10=420 అవుతాయి.
ఖుర్ఆనులోని అతి చిన్న సూరా కౌసర్ యొక్క ఘనతను గ్రహించు, ఇక నమాజు కొరకు నిరీక్షిస్తున్న సమయంలో నీవు చాలా పేజీలు చదివినప్పుడు నీకు ఎన్ని పుణ్యాలు లభిస్తాయో యోచించు?
(ఆ) అజ్ కార్ (అల్లాహ్ స్మరణం)
జిక్ర్
ఘనత/ పుణ్యం
నిదర్శనం
1- 100 సార్లు సుబ్ హానల్లాహ్
1000 పుణ్యాలు లేదా 1000 పాపాల మన్నింపు
సాద్ (రదియల్లాహు అన్హు) తెలిపారుః మేము ప్రవక్త ﷺ సన్నిధిలో ఉండగా ఆయన ఇలా ప్రశ్నించారుః ప్రతి రోజు వెయ్యి పుణ్యాలు సంపా దించడం మీలోనెవరితోనైనా కాని పనియా? అచ్చట కూర్చున్నవారిలో ఒకరన్నారుః మాలో ఎవడైనా వెయ్యి పుణ్యాలు ఎలా సంపాదించగల డు? దానికి ప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారుః “100 సార్లు సుబ్ హానల్లాహ్ చదవాలి. దానికి బదులు అతనికి వెయ్యి పుణ్యాలు లిఖించబడతాయి, లేదా వెయ్యి పాపాలు మన్నించబడతాయి”.
2- లా ఇలాహ ఇల్ల ల్లాహు వహ్ దహూ లా షరీక లహూ ల హుల్ ముల్కు వల హుల్ హందు వహు వ అలా కుల్లి షైఇన్ కదీర్. 100 సార్లు.
పది బానిసలను విడుదల చేసినంత పుణ్యం + 100 పుణ్యాలు + 100 పాపాల మన్నింపు + షైతాన్ నుండి రక్షణ.
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖిం చారుః “ఎవరైతే ఒక రోజులో 100 సార్లు “లా ఇలాహ ఇల్ల ల్లాహు వహ్ దహూ లా షరీ క లహూ లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్” పఠిస్తాడో, అతనికి పది బానిసల్ని విడుదల చేసిన పుణ్యం ప్రాప్తమవుతుంది. 100 పుణ్యాలు లిఖించబడతాయి. 100 పాపాలు మన్నించబడతాయి. అతనికి సాయంకాలం వరకు షైతాన్ నుండి రక్షణ ఉంటుంది. ఈ వచనాలను వందకు పైగా పఠించేవాడి ఆచరణ తప్ప మరెవరి ఆచరణా ఇతని ఆచరణ కంటే శ్రేష్ఠమైనది కాదు.
3- లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్
స్వర్గ కోశాల్లో ఒకటి
ప్రవక్త ﷺ ఇలా ఉప దేశించారని అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః స్వర్గ కోశాల్లోని ఒక కోశం గురించి నీకు తెలుపనా? అని. తప్పక తెలుపండి ప్రవక్తా! అని నేను విన్నవించు కున్నాను. అప్పుడు చెప్పారుః “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్”.
4- సుబ్ హా నల్లాహిల్ అజీం వ బి హందిహి
ఒక్క ఖర్జూ రపు చెట్టు స్వర్గంలో నాట బడు తుంది
ప్రవక్త ﷺ ఆదేశం: “ఎవరు సుబ్ హానల్లా హిల్ అజీం వ బిహందిహీ” అంటారో వారి కొరకు స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నాట బడుతుంది.”
5- విశ్వాసులైన స్త్రీ పురు షుల మన్నింపు కొరకు అల్లాహ్ ను కోరడం
ప్రతి విశ్వాస స్త్రీ పురుషునికి బదు లుగా ఒక పుణ్యం
ప్రవక్త ﷺ ఇలా ఆదే శించారుః “ఎవరు విశ్వాస స్త్రీ పురుషుల మన్నింపు కొరకు అల్లాహ్ ను వేడుకుంటారో వారికి ప్రతి విశ్వాస స్త్రీ పురుషునికి బదులు ఒక పుణ్యం లభిస్తుంది“.
ముస్లిం 2698. బుఖారీ 6403. ముస్లిం 2691. బుఖారీ 6409, ముస్లిం 2704. తిర్మిజి 3464. తబ్రానీ, సహీహుల్ జామి 6026.
ఒక ముస్లిం ముఖ్యంగా నమాజు కొరకు నిరీక్షిస్తున్న వ్యక్తి ఈ అమూల్యమైన సమయాన్ని ఈ శ్రేష్ఠ స్థలం (మస్జిద్)లో పై అజ్ కార్ చదవడంలో గడపడాన్ని అదృష్టంగా భావించాలి. తద్వారా అనేక పుణ్యాలు లభించవచ్చు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త ﷺ ప్రవచించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మీలో ఒక వ్యక్తి నమాజు కొరకు వేచి ఉన్నంత కాలం నమాజు చేస్తున్న పుణ్యం పొందుతాడు“. (బుఖారి 659, మస్లిం 649).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“మనిషి ఎంత వరకు నమాజు చేసుకున్న స్థలంలో కూర్చోని ఉంటాడో అంతవరకూ అతనికి నమాజు చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది. అతను అక్కడి నుండి లేచిపోనంత వరకు లేదా అపానవాయువు వెడిలే వరకు. దైవదూతలు అతని కొరకు ఇలా దీవిస్తారు: అల్లాహ్ ఇతన్ని క్షమించు, ఇతన్ని కరుణించు“. (ముస్లిం 649, బుఖారీ 176).
“ఒక మనిషి కొరకు దైవదూతలు దుఆ చేస్తున్నారంటే అల్లాహ్ అతని గురించి చేస్తున్న వారి దుఆలను తప్పకుండా అంగీకరిస్తాడు”. (అష్షర్హుల్ ముమ్తిఅలి షేఖ్ ఇబ్ను ఉసైమీన్).
అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు ﷺ ఇలా అడిగారు: “పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో నేను మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారు: “(1) వాతావరణం, పరిస్థితులూ అననుకూలంగా ఉన్నప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం – ఇది రిబాత్ తో సమానం“. (ముస్లిం 587).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మొదటి పంక్తిలో ఉండే కాంక్షలో కూడా గొప్ప ఘనత ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాని నిర్ణీత ఫలితం తెలుపకుండా మౌనం వహించడమే దాని గొప్ప శ్రేష్ఠతను సూచిస్తుంది. ఆయన ప్రవచనం ఇలా ఉంది:
“అజాన్ చెప్పడంలో, మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటులు వేసుకునే పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటులు వేసుకుంటారు. అలాగే నమాజ్ వేళ కాగానే తొలి సమయంలో (మస్జిద్) చేరడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీపడతారు“. (బుఖారీ 615, ముస్లిం 437).
జాబిర్ బిన్ సముర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా మధ్యలో వచ్చి “దైవదూతలు తమ ప్రభువు ముందు ఏ విధంగా బారులు తీరియుంటారో మీరు ఆ విధంగా మీ పంక్తులను సరి చేసుకోరా?” అని ప్రశ్నించారు. ‘దైవదూతలు తమ ప్రభువు ముందు ఎలా బారులు తీరియుంటారు ప్రవక్తా’ అని మేమడిగాము. “మొదటి పంక్తి పూర్తి చేశాకే దాని తర్వాత పంక్తిలో నిలబడతారు. మరియు దగ్గర దగ్గరగా కట్టు దిట్టంగా నిలబడతారు” అని చెప్పారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). (ముస్లిం 430).
అబూ సఈద్ ఖుద్రీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ అనుచరుల్ని నమాజులోని పంక్తుల నుండి వెనక ఉండడాన్ని చూసి ఇలా చెప్పారు: “ముందుకు రండి, మీరు నన్ను అనుసరించండి. మీ వెనక వారు మిమ్మల్ని అనుసరిస్తారు. (జాగ్రత్త!) ప్రజలు గనక ఎప్పుడూ వెనకే ఉంటే అల్లాహ్ కూడా వారిని వెనకబాటుతనానికి గురిచేస్తాడు“. (ముస్లిం 438).
(క) మొదటి పంక్తుల్లో ఉన్నవారిపై అల్లాహ్ మరియు ఆయన దూతల దీవెనలు:
బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పంక్తుల మధ్య వచ్చి మా భుజాలను, ఛాతిని వెనకా ముందు ఉండ కుండా సరిచేసేవారు. ఇంకా ఇలా అనేవారు: “మీరు పంక్తుల్లో వెనకా మందు విభిన్న రీతిలో నిలబడకండి, అందువల్ల మీలో మనస్పర్థలు ఏర్పడవచ్చు”. ఇంకా ఇలా అనేవారుః “మొదటి పంక్తుల్లో ఉన్నవారిని అల్లాహ్ తనకు అతిసన్నిహితంగా ఉన్న దైవదూతల మధ్య ప్రశంసిస్తాడు మరియు దైవదూతలు వారి కొరకు దుఆ చేస్తారు“. (అబూ దావూద్ 664).
9 – సున్నతె ముఅక్కద
(అ) నిరంతరం సున్నతె ముఅక్కద చదివేవారు స్వర్గంలో ఒక గృహానికి అర్హులవుతారు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నానని ఆయన సతీమణి ఉమ్మె హబీబ (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు: “ముస్లిం దాసుడు ప్రతి రోజూ ఫర్జ్ నమాజు కాకుండా పన్నెండు రకాతుల నఫిల్ నమాజు అల్లాహ్ కొరకు చేస్తూ ఉంటే అల్లాహ్ అతని కొరకు స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు. లేక ఒక ఇల్లు అతని కొరకు నిర్మించబడుతుంది“. (ముస్లిం 728).
సున్నతె ముఅక్కదలో కొన్ని ఫర్జ్ నమాజుకు ముందున్నాయి, మరి కొన్ని తర్వాతున్నాయి. అవి మొత్తం 12 రకాతులు.
ఫర్జ్ కంటే ముందున్నవి:
1- ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు:
“ఫజ్ర్ కు ముందు రెండు రకాతులు ప్రపంచము మరియు అందులో ఉన్నవాటి కంటే ఉత్తమమైనవి“. (ముస్లిం 725).
నాతో పాటు మీరు కూడా ఈ హదీసుపై శ్రద్ధ చూపండి:|
“ఫజ్ర్ సున్నతులు ప్రపంచం, వాటిపై ఉన్న డబ్బు, ధనము, బిల్డింగులు, కార్ల కంటే చాలా మేలైనవి.”
2- జొహ్ర్ కు ముందు 4రకాతులు.
ఫర్జ్ తర్వాతవి:
1- జొహ్ర్ తర్వాత రెండు. 2- మగ్రిబ్ తర్వాత రెండు. 3- ఇషా తర్వాత రెండు.
(ఆ) అస్ర్ కు ముందు నాలుగు రకాతులు చేయడం వల్ల అవి చేసేవారికి ప్రవక్త చేసిన రహ్మత్ యొక్క దుఆలో పాలుపంచుకునే భాగ్యం లభిస్తుంది. ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు:
“అస్ర్ కు ముందు నాలుగు రకాతులు చదివేవారి పై అల్లాహ్ కరుణ కురియుగాకా!”. (అబూ దావూద్ 1271, తిర్మిజి 430).
10 – అజాన్ మరియు ఇఖామత్ మధ్యలో దుఆ:
నమాజు వైపునకు త్వరగా వెళ్ళడం వల్ల అజాన్ మరియు ఇఖామత్ మధ్య దుఆ చేసే భాగ్యం కలుగుతుంది. మరియు ఇది దుఆ అంగీకార సమయం గనుక అదృష్టంగా భావించాలి. సమయమే గాకుండా మస్జిద్ స్థలం గనుక దాని శ్రేష్ఠతను దృష్టిలో ఉంచుకోవాలి. ఇంకా నమాజు కొరకు వేచి ఉండి దుఆ చేయడం అన్నది మరీ ఘనత గల విషయం. (ఇలా దుఆ అంగీకరించబడే అవకాశం ఎన్నో రకాలుగా ఉంది). ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో ఆతిథ్యం ఇస్తాడు“. (ముస్లిం 669, బుఖారి 662).
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు: “ఎవరైనా తనింట్లో వుజూ చేసుకొని అల్లాహ్ గృహాల్లోని ఒక గృహానికి అల్లాహ్ విధుల్లోని ఒక విధి నెరవేర్చడానికి బయలుదేరుతే అతని ఒక అడుగుకు బదులుగా పాప మన్నింపు జరిగితే రెండవ అడుగుకు బదులు అతని స్థానం పెరుగుతుంది“. (ముస్లిం 666).
అబూ మూసా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్తిచ్చారు: “నమాజు విషయంలో అందరికంటే గొప్ప ఫలానికి అర్హుడు అందరికంటే ఎక్కువ దూరం నండి నమాజు కోసం నడిచి వచ్చేవాడు. నమాజు తొందరగా చేసి పడుకునే వ్యక్తి కంటే సామూహిక నమాజు కోసం ఎదురు చూస్తూ ఇమాంతో నమాజు చేసుకునే వ్యక్తి ఎక్కువ పుణ్యానికి అర్హుడవుతాడు“. (ముస్లిం 662, బుఖారీ 651).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని బురైద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “చీకట్లో నడుచుకుంటూ మస్జిద్ కు వెళ్ళే వారికి ప్రళయదినాన సంపూర్ణ కాంతి శుభవార్త ఇవ్వండి“. (తిర్మిజి 223. అబూ దావూద్ 561).
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “మంచి మాట ఒక సదకా (దానం) మరియు నమాజు కొరకు మస్జిదుకు వెళ్తున్నప్పుడు వేసే ప్రతి అడుగు దానమే“. (బుఖారీ 2891, ముస్లిం 1009).
(7.6) మస్జిద్ లో ప్రవేశిస్తూ చేసే దుఆ
మస్జిద్ లో ప్రవేశిస్తూ ఎవరైనా “అఊజు బిల్లాహిల్ అజీం వబివజ్ హిహిల్ కరీం వసుల్తానిహిల్ కదీం మినష్షైతానిర్రజీం” చదివితే, ‘ఈ రోజంతా ఇతడు నా నుండి కాపాడబడ్డాడు’ అని షైతాన్ అంటాడు. (అబూదావూద్ 466, సహీహుల్ జామి 4715).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.