నమాజు నిధులు – పార్ట్ 05: నమాజు కొరకు నిరీక్షిస్తూ ఉండే ఘనత [వీడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ ఆడియో (mp3) వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

[20:57 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

నమాజు నిధులు (Treasures of Salah) – పుస్తకం ఇక్కడ చదవండి
https://teluguislam.net/2011/02/24/treasures-of-salah-namaz-telugu-islam/

11 – నమాజు కొరకు వేచియుండుట:

నమాజు కొరకు వేచియుండడం అనేక పుణ్యాలకు నిన్ను అర్హునిగా చేస్తుందిః

(అ)      నమాజు కొరకు వేచియుండుట నమాజు ఘనతకు సమానం:

عَنْ أَبِي هُرَيْرَةَ ﷜ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (لَا يَزَالُ أَحَدُكُمْ فِي صَلَاةٍ مَا دَامَتْ الصَّلَاةُ تَحْبِسُهُ).

ప్రవక్త ﷺ ప్రవచించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మీలో ఒక వ్యక్తి నమాజు కొరకు వేచి ఉన్నంత కాలం నమాజు చేస్తున్న పుణ్యం పొందుతాడు“. (బుఖారి 659, మస్లిం 649).

(ఆ)      దైవదూతల ఇస్తిగ్ఫార్ (క్షమాభిక్షః)

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (لَا يَزَالُ الْعَبْدُ فِي صَلَاةٍ مَا كَانَ فِي مُصَلَّاهُ يَنْتَظِرُ الصَّلَاةَ وَتَقُولُ الْـمَلَائِكَةُ اللَّهُمَّ اغْفِرْ لَهُ اللَّهُمَّ ارْحَمْهُ حَتَّى يَنْصَرِفَ أَوْ يُحْدِثَ).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

మనిషి ఎంత వరకు నమాజు చేసుకున్న స్థలంలో కూర్చోని ఉంటాడో అంతవరకూ అతనికి నమాజు చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది. అతను అక్కడి నుండి లేచిపోనంత వరకు లేదా అపానవాయువు వెడిలే వరకు. దైవదూతలు అతని కొరకు ఇలా దీవిస్తారు: అల్లాహ్ ఇతన్ని క్షమించు, ఇతన్ని కరుణించు“. (ముస్లిం 649, బుఖారీ 176).

“ఒక మనిషి కొరకు దైవదూతలు దుఆ చేస్తున్నారంటే అల్లాహ్ అతని గురించి చేస్తున్న వారి దుఆలను తప్పకుండా అంగీకరిస్తాడు”. (అష్షర్హుల్ ముమ్తిఅలి షేఖ్ ఇబ్ను ఉసైమీన్).

(ఇ)      పాపాల మన్నింపు, స్థానాల రెట్టింపుః

عَنْ أَبِي هُرَيرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: ( أَلاَ أَدُلُّكُم عَلَى مَا يَمْحُو اللهُ بِهِ الْخَطَايَا ، وَيَرْفَعُ بِهِ الدَّرجَاتِ ؟) قَالُوا: بَلَى يَا رَسُولُ الله قاَلَ: ( إسْبَاغُ الْوُضُوءِ عَلَى الْـمَكَارِهِ ، وَكَثرَةُ الْـخُطَا إِلَى الْـمَسَاجِد ، وَانتِظَارُ الصَّلاَةِ بَعدَ الصَّلاَةِ، فَذَلِكُمُ الرِّبَاط ).

అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు ﷺ ఇలా అడిగారు: “పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో నేను మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారు: “(1) వాతావరణం, పరిస్థితులూ అననుకూలంగా ఉన్నప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం – ఇది రిబాత్ తో సమానం“. (ముస్లిం 587).

%d bloggers like this: