
ఇక్కడ ఆడియో (mp3) వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
[23:14 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
నమాజు నిధులు (Treasures of Salah) – పూర్వపు పాఠాలు మరియు పుస్తకం ఇక్కడ వినండి/చదవండి
https://teluguislam.net/2011/02/24/treasures-of-salah-namaz-telugu-islam/
4 -సనా
నమాజు ఆరంభములో సూరె ఫాతిహాకు ముందు తక్బీరె తహ్రీమ తర్వాత అనేక దుఆలున్నాయి. వాటిలో ఈ దుఆను నేను తెలుపు తున్నాను. “అల్లాహు అక్బరు కబీరా, వల్ హందులిల్లాహి కసీరా, వ సుబ్ హాల్లాహి బుక్రతౌఁ వఅసీలా”. దీని ఉద్దేశం దీని గొప్ప ఘనతను చాటడమే తప్ప ఈ ఒక్క దుఆయే అని తెలపడం కాదు. ఆ ఘనత ఏమిటి? దాన్ని చదివిన వారి కొరకు ఆకాశ తలుపులు తెరువబడుతాయి.
عَنْ ابْنِ عُمَرَ ÷ قَالَ: بَيْنَمَا نَحْنُ نُصَلِّي مَعَ رَسُولِ الله ﷺ إِذْ قَالَ رَجُلٌ مِنْ الْقَوْمِ: اللهُ أَكْبَرُ كَبِيرًا وَالْحَمْدُ لله كَثِيرًا وَسُبْحَانَ الله بُكْرَةً وَأَصِيلًا فَقَالَ رَسُولُ الله ﷺ: (مَن الْقَائِلُ كَلِمَةَ كَذَا وَكَذَا) قَالَ رَجُلٌ مِنْ الْقَوْمِ أَنَا يَا رَسُولَ الله قَالَ: (عَجِبْتُ لَهَا فُتِحَتْ لَهَا أَبْوَابُ السَّمَاءِ).
ఇబ్ను ఉమర్ (రదియల్లాహు అన్హు) తెలిపారుః మేము ప్రవక్త ﷺ తో నమాజు చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి “అల్లాహు అక్బరు కబీరా, వల్ హందులిల్లాహి కసీరా, వ సుబ్ హాల్లాహి బుక్రతౌఁ వఅసీలా” అని పలికాడు, (నమాజు ముగించిన తర్వాత) “ఈ పదాలు పలికిన వారెవరు?” అని ప్రవక్త ﷺ అడిగారు. నేనే ఓ ప్రవక్తా! అని అతను చెప్పగా, “నేను ఆశ్చర్య పోయాను. ఆ పదాల వల్ల ఆకాశ తలుపులు తెరువబడ్డాయి” అని ప్రవక్త ﷺ తెలిపారు. ఇబ్ను ఉమర్ ఇలా చెప్పారుః నేను ఈ విషయం ప్రవక్తతో విన్నప్పటి నుండి వాటిని పలకడం మానలేదు. (ముస్లిం 601).
5 -సూరె ఫాతిహ పారాయణం
(5.1) ఖుర్ఆనులోని గొప్ప సూరా
నీవు నమాజులో సూరె ఫాతిహ చదువుతున్నప్పుడు ఖుర్ఆనులోని
ఒక గొప్ప సూర చదివినవానివవుతావు. నాతో పాటు నీవు కూడా ఈ హదీసుపై శ్రద్ధ వహించు:
صحيح البخاري 4474 – عَنْ أَبِي سَعِيدِ بْنِ المُعَلَّى، قَالَ: كُنْتُ أُصَلِّي فِي المَسْجِدِ، فَدَعَانِي رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَلَمْ أُجِبْهُ، فَقُلْتُ: يَا رَسُولَ اللَّهِ، إِنِّي كُنْتُ أُصَلِّي، فَقَالَ: ” أَلَمْ يَقُلِ اللَّهُ: {اسْتَجِيبُوا لِلَّهِ وَلِلرَّسُولِ إِذَا دَعَاكُمْ لِمَا يُحْيِيكُمْ} [الأنفال: 24]. ثُمَّ قَالَ لِي: «لَأُعَلِّمَنَّكَ سُورَةً هِيَ أَعْظَمُ السُّوَرِ فِي القُرْآنِ، قَبْلَ أَنْ تَخْرُجَ مِنَ المَسْجِدِ». ثُمَّ أَخَذَ بِيَدِي، فَلَمَّا أَرَادَ أَنْ يَخْرُجَ، قُلْتُ لَهُ: «أَلَمْ تَقُلْ لَأُعَلِّمَنَّكَ سُورَةً هِيَ أَعْظَمُ سُورَةٍ فِي القُرْآنِ»، قَالَ: {الحَمْدُ لِلَّهِ رَبِّ العَالَمِينَ} [الفاتحة: 2] «هِيَ السَّبْعُ المَثَانِي، وَالقُرْآنُ العَظِيمُ الَّذِي أُوتِيتُهُ»
అబూ సఈద్ బిన్ ముఅల్లా (రదియల్లాహు అన్హు) తెలిపారు: నేను మస్జిదులో నమాజు చేస్తుండగా ప్రవక్త ﷺ నన్ను పిలిచారు, వెంటనే నేను హాజరు కాలేకపోయాను, కొంత సేపయ్యాక హజరయి, ‘ప్రవక్తా! నేను నమాజు చేస్తుంటిని’ అని విన్నవించుకోగా, {అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పిలుపుకు జవాబు పలకండి} అని అల్లాహ్ ఆదేశం తెలియదా? అని మందలించి, “నీవు మస్జిద్ నుండి బైటికి వెళ్ళక ముందే నేను నీకు ఒక సూరా నేర్పుతాను, అది ఖుర్ఆనులోని ఒక గొప్ప సూరా” అని చెప్పారు. నా చేతిని పట్టుకున్నారు. ఇక ఎప్పుడైతే మస్జిద్ నుండి మేము బైటికి వెళ్ళబోయామో, అప్పుడు నేను ‘ప్రవక్తా! ఖుర్ఆనులోని ఒక గొప్ప సూరా గురించి తెలుపుతానన్నారు కదా’ అని గుర్తు చేశాను. అప్పుడాయన ఇలా చెప్పారు: “అది ఏడు ఆయతులు గల సూరా, మాటిమాటికి పఠింపదగినది మరియు గొప్ప ఖుర్ఆను నాకు ఇవ్వబడినది”. (బుఖారీ 4474).
(5.2) ఇది సనా (అల్లాహ్ స్తోత్రం) మరియు దుఆ
ఫాతిహ సూరా పారాయణం అల్లాహ్ మరియు ఆయన దాసుని మధ్యలో రెండు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగంలో అల్లాహ్ స్తోత్రం, ఆయన మహత్తు, గొప్పతనం ఉంది. రెండవ భాగంలో దాసుని అర్ధింపు మరియు దుఆ ఉంది.
عَنْ أَبِي هُرَيْرَةَ ÷ قَالَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: قَالَ اللهُ تَعَالَى: (قَسَمْتُ الصَّلَاةَ بَيْنِي وَبَيْنَ عَبْدِي نِصْفَيْنِ وَلِعَبْدِي مَا سَأَلَ فَإِذَا قَالَ الْعَبْدُ [الْـحَمْدُ لِله رَبِّ الْعَالَمِينَ]قَالَ اللهُ تَعَالَى: حَمِدَنِي عَبْدِي، وَإِذَا قَالَ: [الرَّحْمَنِ الرَّحِيمِ]قَالَ اللهُ تَعَالَى: أَثْنَى عَلَيَّ عَبْدِي، وَإِذَا قَالَ: [مَالِكِ يَوْمِ الدِّينِ]قَالَ: مَجَّدَنِي عَبْدِي، وَقَالَ: فَإِذَا قَالَ: [إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ]قَالَ: هَذَا بَيْنِي وَبَيْنَ عَبْدِي وَلِعَبْدِي مَا سَأَلَ، فَإِذَا قَالَ [اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ]قَالَ هَذَا لِعَبْدِي وَلِعَبْدِي مَا سَأَلَ).
అబూ హురైరా (రదియల్లాహు అన్హు)ఉల్లేఖించారుః అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త ﷺ చెప్పారుః “నమాజు (సూరె ఫాతిహా)ను నేను నా మధ్య మరియు నా దాసుని మధ్య రెండు భాగాలుగా జేశాను. నా దాసుడు అర్థించినది అతనికి ప్రాప్తమవుతుంది. అతడు {అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆల మీన్} అన్నప్పుడు, నా దాసుడు నన్ను స్తుతించాడు అని అల్లాహ్ అంటాడు. అతడు {అర్రహ్మానిర్రహీం} అన్నప్పుడు, నా దాసుడు నన్ను ప్రశంసించాడు అని అల్లాహ్ అంటాడు. అతడు {మాలికి యౌమిద్దీన్} అన్నప్పుడు, నా దాసుడు నా గొప్పతనాన్ని చాటాడు అని అల్లాహ్ అంటాడు. అతడు {ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్} అన్న ప్పుడు, ఇది నా మధ్య మరియు నా దాసుని మధ్య ఉన్న సంబంధం, ఇక నా దాసుడు ఏది అడిగినా అతనికి ప్రాప్తమవుతుంది. అతడు {ఇహ్దినస్సిరాతల్ ముస్తఖీం, సిరాతల్లజీన అన్అమ్ త అలైహిం గైరిల్ మగ్ జూబి అలైహిం వలజ్జాల్లీన్} అన్నప్పుడు, ఇది నా దాసుడు అడిగింది, అతడు కోరినది అతనకి ప్రాప్తమవుతుంది అని అల్లాహ్ అంటాడు”. (ముస్లిం 395). మరిన్ని ఘనతలకై పేజి 69 చూడండి**
6 – ఆమీన్ పలకడం:
నమాజీ సోదరా! శుభవార్త!! ఎవరి ఆమీన్ అల్లాహ్ దూతల ఆమీన్ తో కలిసిపోవునో అతని పూర్వ పాపాలు క్షమించబడతాయి.
عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (إِذَا قَالَ الْإِمَامُ: [غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ]فَقُولُوا آمِينَ فَإِنَّهُ مَنْ وَافَقَ قَوْلُهُ قَوْلَ الْـمَلَائِكَةِ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ)
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “(నమాజులో) ఇమాం గైరిల్ మగ్జూబి అలైహిం వలజ్జాల్లీన్ అని అన్నప్పుడు మీరంతా ఆమీన్ అని చెప్పండి, మీరు చెప్పే ఆమీన్ అల్లాహ్ దూతలు చెప్పే ఆమీన్ కు అనుగుణంగా ఉంటే ఆమీన్ చెప్పే వ్యక్తి పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 782, ముస్లిం 410).
عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (إِذَا قَالَ أَحَدُكُمْ آمِينَ وَقَالَتْ الْـمَلَائِكَةُ فِي السَّمَاءِ آمِينَ فَوَافَقَتْ إِحْدَاهُمَا الْأُخْرَى غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ).
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా ఆమీన్ అని పలకగా, ఆకాశంలో దైవదూతలు కూడా ఆమీన్ అన్నప్పడు ఇలా ఇవి రెండు కలిసిపోతాయి. తద్వారా ఆమీన్ అన్న వ్యక్తి పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 781).
7 – రుకూ:
రుకూ కు సంబంధించిన లాభాల్లో పాపాల ప్రక్షాళన ఒకటి.
عَنْ اِبْنِ عُمَرَ ÷ قَالَ : سَمِعْت رَسُولَ الله ﷺ يَقُولُ : (إِنَّ الْعَبْدَ إِذَا قَامَ يُصَلِّي أُتِيَ بِذُنُوبِهِ فَجُعِلَتْ عَلَى رَأْسِهِ وَعَاتِقِهِ فَكُلَّمَا رَكَعَ وَسَجَدَ تَسَاقَطَتْ عَنْه)
ప్రవక్త ﷺ ఉపదేశించారని ఇబ్ను ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మనిషి నమాజు కొరకు లేచినప్పుడు అతని పాపాలు అతని తల మరియు భుజాలపై వేయబడతాయి, అతను రుకూ, సజ్దాలు చేసినపుడల్లా అవి రాలిపోతాయి”. (బైహఖీ 3/10, సహీహుల్ జామిఅ 1671).
8 – రుకూ నుండి నిలబడిన తర్వాత దుఆలు:
రుకూ తర్వాత దుఆల ఘనత గొప్పది, పుణ్యం పెద్దది.
(8.1) ఎవరి ‘అల్లాహుమ్మ రబ్బనా లకల్ హందు / రబ్బనా వలకల్ హంద్’ పలుకులు దైవదూతల పలుకులతో కలిసిపోవునో అతని పాపాలు క్షమించబడును
عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (إِذَا قَالَ الْإِمَامُ سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ فَقُولُوا اللَّهُمَّ رَبَّنَا لَكَ الْحَمْدُ فَإِنَّهُ مَنْ وَافَقَ قَوْلُهُ قَوْلَ الْمَلَائِكَةِ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ).
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఇమాం నమాజులో ‘సమిఅల్లాహు లిమన్ హమిదహ్’ అన్నపుడు మీరు ‘అల్లాహుమ్మ రబ్బనా లకల్ హంద్’ అనండి, ఎవరి ఈ మాట అల్లాహ్ దూతల మాటకు అనుగుణంగా ఉంటుందో అతని పూర్వ పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 796, ముస్లిం 409). మరో ఉల్లేఖనంలో ‘రబ్బనా వలకల్ హంద్’ అనండి అని ఉంది.
(8.2) ‘రబ్బనా వ లకల్ హందు హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్’ పదాలను వ్రాయడానికి అల్లాహ్ దూతలు ఒకరిని మించి ఒకరు ముందుకు వెళ్తుంటారు.
రిఫాఅ బిన్ రాఫిఅ (రదియల్లాహు అన్హు) అజ్జర్ఖి తెలిపారుః ప్రవక్త వెనక మేము నమాజు చేస్తూ ఉన్నాము, రుకూ నుండి తల లేపుతూ ప్రవక్త ‘సమిఅల్లాహు లిమన్ హమిదహ్’ అన్నారు, వెనక ఒక మనిషి ‘రబ్బనా వలకల్ హందు హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్’ అని అన్నాడు, ప్రవక్త నమాజు ముగించాక, “నమాజులో ఈ పదాలు పలికినవారెవరు?” అని అడిగారు. ‘నేను’ అని ఆ మనిషి అన్నాడు, అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “నేను ముప్ఫై (30) కి పైగా అల్లాహ్ దూతలను చూశాను, ప్రతి ఒక్కరు తానే ముందుగా ఈ పదాలను వ్రాయాలని ఆరాట పడుతున్నాడు”. (బుఖారీ 799).
You must be logged in to post a comment.