నమాజు నిధులు – పార్ట్ 10 (చివరి భాగం): సలాంకు ముందు మరియు తర్వాత చేసే దుఆలు, జిక్ర్ ఘనతలు [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ ఆడియో (mp3) వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

[27:53 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

నమాజు నిధులు (Treasures of Salah) – పూర్వపు పాఠాలు మరియు పుస్తకం ఇక్కడ వినండి/చదవండి
https://teluguislam.net/2011/02/24/treasures-of-salah-namaz-telugu-islam/

12 – సలాంకు ముందు దుఆ:

సలాంకు ముందు దుఆ విషయంలో ఏ ఘనత లేకున్నా అది దుఆ అంగీకార శుభసందర్భమవడమే చాలు. అదెలాగంటే నమాజీ అప్పుడు తన ప్రభువు వైపునకు మరలి, ఆయనతో మొరపెట్టు కుంటాడు. అతను నమాజులోనే ఉన్నాడు గనక ఇది దుఆ అంగీకారానికి ఎంతో ఉత్తమం.

అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః “మీలో ఎవరైనా నమాజు చేస్తున్నప్పుడు అత్తహియ్యాతు లిల్లాహి… చదవాలి, దాని పిదప తనకిష్టమున్న దాన్ని అర్థించుకోవాలి, మరో ఉల్లేఖనంలో ఉంది “ఇంకేదైనా దుఆ ఎంచుకోవాలి”. (బుఖారి, ముస్లిం).

అబూ ఉమామ ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త ను ఎవరో అడిగారు, ‘ఏ దుఆ ఎక్కువ వినబడుతుంది’ అని. దానికి ప్రవక్త ఇలా చెప్పారుః “మధ్య రాత్రిలో మరియు ఫర్జ్ నమాజుల చివరి భాగంలో”. (తిర్మిజి 3499). హదీసులో అరబీ పదం ‘దుబురుస్సలవాత్’ అని ఉంది, అయితే సామాన్యంగా దీని భావం నమాజు చివరి భాగం, అంటే సలాంకు ముందు అని. అయితే ఒకప్పుడు నమాజు తర్వాత అని కూడా చెప్పబడుతుంది.

మూడవ నిధి  (నిక్షేపం)

నమాజు తర్వాత చేయునటువంటి అజ్కార్

నమాజు తర్వాత చేయవలసిన అజ్కార్ వివిధ వాక్యాల్లో ఉన్నవి. అలాగే వాటి పుణ్యాలు కూడా వివిధ రకాలుగా ఉన్నవి. అందులో కొన్నిః

సలాం తర్వాత 3 సార్లు అస్తగ్ ఫిరుల్లాహ్ అనాలి.

اللَّهُمَّ أَعِنِّي عَلَى ذِكْرِكَ وَشُكْرِكَ وَحُسْنِ عِبَادَتِك
అల్లాహుమ్మ అఇన్నీ అలా జిక్రిక వ షుక్రిక వ హస్ని ఇబాదతిక. (అబూదావూద్ 1522).
(అల్లాహ్! నేను నీ ధ్యానం చేయటానికి, నీకు కృతజ్ఞతలు తెలుపుకోటానికి, తగురీతిలో నిన్ను ఆరాధించటానికి నాకు సహాయం చెయ్యి).

కొన్ని దుఆల గురించి ఇక్కడ చెప్పాము, సలాం తర్వాత పూర్తి దుఆలు తెలుసుకొనుటకు మా పుస్తకం “రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు” అనే పుస్తకం చదవండి.

ఈ నాటి మన ముఖ్య అంశంలోని రెండవ భాగం సలాం తర్వాత జిక్ర్ ఘనత, ఏ జిక్ర్ ఘనత వచ్చి ఉందో ఆ ఘనతల గురించి చెప్పే ముందు చాలా ముఖ్యమైన ఓ విషయం తెలుసుకోండి:

షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ చెప్పారు : شرح منظومة أصول الفقه وقواعده ” (ص176-177) .

నమాజు తర్వాత చేసే జిక్ర్ నాలుగు రకాలుగా వచ్చి ఉంది, ఒక్కోసారి ఒక్కో రకాన్ని పాటించడం ఉత్తమం.

(1) సుబ్ హానల్లాహ్ 10సార్లు, అల్ హందులిల్లాహ్ 10సార్లు, అల్లాహు అక్బర్ 10సార్లు. (అబూదావూద్ 5065).
(2) సుబ్ హానల్లాహ్ 33సార్లు, అల్ హందులిల్లాహ్ 33సార్లు, అల్లాహు అక్బర్ 33సార్లు, 1సారి: లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లాషరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. (ముస్లిం 597). అయితే సుబ్ హానల్లాహ్, అల్ హందులిల్లాహ్, అల్లాహు అక్బర్ ఈ మూడు పదాలు కలిపి 33సార్లు చదవవచ్చు. (బుఖారీ 843, ముస్లిం 595).
(3) సుబ్ హానల్లాహ్ 33సార్లు, అల్ హందులిల్లాహ్ 33సార్లు, అల్లాహు అక్బర్ 34సార్లు. (ముస్లిం 596).
(4) సుబ్ హానల్లాహ్ 25సార్లు, అల్ హందులిల్లాహ్ 25సార్లు, అల్లాహు అక్బర్ 25సార్లు, లాఇలాహ ఇల్లల్లాహ్ 25సార్లు. (నిసాయీ 1350, షేఖ్ అల్బానీ సహీ అన్నారు).

(1)  పాపాల మన్నింపు:

صحيح مسلم 597 مَنْ سَبَّحَ اللهَ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ ثَلَاثًا وَثَلَاثِينَ، وَحَمِدَ اللهَ ثَلَاثًا وَثَلَاثِينَ، وَكَبَّرَ اللهَ ثَلَاثًا وَثَلَاثِينَ، فَتْلِكَ تِسْعَةٌ وَتِسْعُونَ، وَقَالَ: تَمَامَ الْمِائَةِ: لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ غُفِرَتْ خَطَايَاهُ وَإِنْ كَانَتْ مِثْلَ زَبَدِ الْبَحْرِ

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ఇలా సెలవిచ్చారుః “ప్రతి నమాజు తర్వాత ఎవరు 33 సార్లు సుబ్ హానల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, 33 సార్లు అల్ హందులిల్లాహ్, మరి లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్ చదివి వంద పూర్తి చేస్తాడో అతని పాపాలు సముద్రపు నురుగంత ఉన్నా క్షమించబడతాయి”. (ముస్లిం 597).

(2) అనుగ్రహం, ఉన్నత స్థానాలు మరియు భోగబాగ్యాలు + స్వర్గ ప్రవేశం + 1500 పుణ్యాలు

صحيح البخاري 6329 عَنْ أَبِي هُرَيْرَةَ، قَالُوا: يَا رَسُولَ اللَّهِ ذَهَبَ أَهْلُ الدُّثُورِ بِالدَّرَجَاتِ وَالنَّعِيمِ المُقِيمِ. قَالَ: «كَيْفَ ذَاكَ؟» قَالُوا: صَلَّوْا كَمَا صَلَّيْنَا، وَجَاهَدُوا كَمَا جَاهَدْنَا، وَأَنْفَقُوا مِنْ فُضُولِ أَمْوَالِهِمْ، وَلَيْسَتْ لَنَا أَمْوَالٌ. قَالَ: «أَفَلاَ أُخْبِرُكُمْ بِأَمْرٍ تُدْرِكُونَ مَنْ كَانَ قَبْلَكُمْ، وَتَسْبِقُونَ مَنْ جَاءَ بَعْدَكُمْ، وَلاَ يَأْتِي أَحَدٌ بِمِثْلِ مَا جِئْتُمْ بِهِ إِلَّا مَنْ جَاءَ بِمِثْلِهِ؟ تُسَبِّحُونَ فِي دُبُرِ كُلِّ صَلاَةٍ عَشْرًا، وَتَحْمَدُونَ عَشْرًا، وَتُكَبِّرُونَ عَشْرًا»

అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః (ఓ రోజు కొందరు పేద ప్రజలు ప్రవక్త వద్దకు వచ్చి) ‘ప్రవక్తా! ధనికులు తమ సిరిసంపదల మూలంగా ఉన్నత స్థానాలు అధిరోహించడానికి, శాశ్వతపు భోగభాగ్యా లు పొందడానికి మాకంటే ముందు వెళ్ళారు’ అని ఫిర్యాదు చేశారు. “అది ఎలా?” అని ప్రవక్త అడిగారు. వారన్నారుః ‘వారు మా లాగా నమాజు చేస్తారు, మా లాగానే ధర్మ యుద్ధాలు కూడా చేస్తారు. డబ్బు ఉన్నందున వారు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెడుతున్నారు, మా వద్ద ఆ డబ్బు లేదు. అప్పుడు ప్రవక్త చెప్పారుః “నేను మీకో విషయం తెలియజేయనా? మీరు దాన్ని పాటించి మిమ్మల్ని మించిపోయిన వాళ్ళతో సమానులవుతారు, మీ కంటే వెనక ఉన్న వాళ్ళతోను మించిపోతారు, మీ లాంటి ఈ పద్దతిని అనుసరించే వాడు తప్ప మీ లాంటి ఆచరణ తెచ్చేవాడు మరొకడు ఉండడు. ఆ విషయం: ప్రతి నమాజు తర్వాత 10 సార్లు సుబ్ హానల్లాహ్, 10 సార్లు అల్ హందులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ పలకండి”. (బుఖారీ 6329).

أبو داود 5065 – صحيح: عنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: «خَصْلَتَانِ، أَوْ خَلَّتَانِ لَا يُحَافِظُ عَلَيْهِمَا عَبْدٌ مُسْلِمٌ إِلَّا دَخَلَ الْجَنَّةَ، هُمَا يَسِيرٌ، وَمَنْ يَعْمَلُ بِهِمَا قَلِيلٌ، يُسَبِّحُ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ عَشْرًا، وَيَحْمَدُ عَشْرًا، وَيُكَبِّرُ عَشْرًا، فَذَلِكَ خَمْسُونَ وَمِائَةٌ بِاللِّسَانِ، وَأَلْفٌ وَخَمْسُ مِائَةٍ فِي الْمِيزَانِ، … قَالُوا: يَا رَسُولَ اللَّهِ كَيْفَ هُمَا يَسِيرٌ وَمَنْ يَعْمَلُ بِهِمَا قَلِيلٌ؟ قَالَ: «… وَيَأْتِيهِ فِي صَلَاتِهِ فَيُذَكِّرُهُ حَاجَةً قَبْلَ أَنْ يَقُولَهَا»

ప్రవక్త ప్రవచించారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “రెండు గుణాలున్నాయి, వాటిని పాటించిన ముస్లిం భక్తుడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అవి తేలికైనవి, కాని వాటిని పాటించేవారు అరుదు. ప్రతి నమాజు తరువాత 10 సార్లు సుబ్ హానల్లాహ్, 10 సార్లు అల్ హందులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ చెప్పాలి. ఇవి (ఐదు నమాజుల్లో చేస్తే) నోటి పై 150 అవుతాయి, కాని (ప్రళయదినాన) త్రాసులో 1500 అవుతాయి”. (అబూ దావూద్ 5065, తిర్మిజి 3410, నిసాయి 1348, ఇబ్ను మాజ 926).

నోటి పై 150, దీని సంఖ్య ఇలా ఉంటుంది:

10 సుబ్ హానల్లాహ్ + 10 అల్ హందిలిల్లాహ్ + 10 అల్లాహు అక్బర్ = 30.
30 × 5 (నమాజులు) = 150

త్రాసులో 1500 యొక్క సంఖ్య ఇది:
150 × 10 పుణ్యాలు = 1500 పుణ్యాలు

(3) ఆయతుల్ కుర్సీ = స్వర్గ ప్రవేశం

النسائي الكبرى 9848 – صحيح : عَنْ أَبِي أُمَامَةَ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ قَرَأَ آيَةَ الْكُرْسِيِّ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ مَكْتُوبَةٍ لَمْ يَمْنَعْهُ مِنْ دُخُولِ الْجَنَّةِ إِلَّا أَنْ يَمُوتَ» صحيح الجامع 6464

అబూ హూరైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ఆదేశించారుః “ఎవరు ప్రతి నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో వారి స్వర్గ ప్రవేశానికి మరణమే అడ్డు”. (నిసాయి ).

(4) ప్రత్యేకంగా ఫజ్ర్ మరియు మగ్రిబ్ తర్వాత చేసే జిక్ర్ ఘనత

النسائي 1354 –صحيح: عَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ سَبَّحَ فِي دُبُرِ صَلَاةِ الْغَدَاةِ مِائَةَ تَسْبِيحَةٍ، وَهَلَّلَ مِائَةَ تَهْلِيلَةٍ، غُفِرَتْ لَهُ ذُنُوبُهُ، وَلَوْ كَانَتْ مِثْلَ زَبَدِ الْبَحْرِ»

షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ వారి సహీహుత్ తర్గీబ్ హదీసు నం. 472-477లో “లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లాషరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు యుహ్ యీ వయుమీతు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్” ఘనతలో వచ్చిన హదీసుల సారాంశం:

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، يُحْيِي وَيُمِيتُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ
లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లాషరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు యుహ్ యీ వయుమీతు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్

ఈ జిక్ర్ ఫజ్ర్, మగ్రిబ్ తర్వాత 10 సార్లు చదవాలి. (కొన్ని ఉల్లేఖనాల్లో అస్ర్ తర్వాత అని ఉంది). అయితే ఒక్కసారి చదివినందుకు లభించే ఘనతలు ఇలా ఉన్నాయి:

  • 1️⃣ ఒక్క విశ్వాస బానిసను విముక్తి కలిగించినంత పుణ్యం,
  • 2️⃣ 10 పుణ్యాలు లిఖించబడతాయి, موجبات
  • 3️⃣ 10 పాపాలు మన్నించబడతాయి, موبقات
  • 4️⃣ 10 స్థానాలు పెంచబడతాయి,
  • 5️⃣ ప్రతి చెడు (مكروه) నుండి కాపాడుకోవడం జరుగుతుంది,
  • 6️⃣ షైతాన్ నుండి రక్షించబడతుంది,
  • 7️⃣ ఆ రోజు షిర్క్ తప్ప ఏ పాపం వల్ల అతను పట్టుబడడు,
  • 8️⃣ ఉదయం వరకు అల్లాహ్, షైతాన్ నుండి అతని రక్షణ కొరకు ఆయుధాలు ధరించిఉన్న దైవదూతలను పంపుతాడు
  • 9️⃣ ఆ రోజు అతనికంటే ఉత్తముడు, ఘనతగలవాడు మరెవడూ ఉండడు.

(కొన్ని ఉల్లేఖనాల్లో రెండు కాళ్ళు మలుచుకునేకి ముందు చదవాలన్న ప్రస్తావన ఉంది).

దుఆలు పుస్తకాలు

%d bloggers like this: