
ఇక్కడ ఆడియో (mp3) వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
[26:46 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
నమాజు నిధులు (Treasures of Salah) – పుస్తకం ఇక్కడ చదవండి
https://teluguislam.net/2011/02/24/treasures-of-salah-namaz-telugu-islam/
8 – మొదటి పంక్తిలో నిలబడటానికి ముందంజ వేయటం
(అ) మొదటి పంక్తిలో ఉండే కాంక్ష:
మొదటి పంక్తిలో ఉండే కాంక్షలో కూడా గొప్ప ఘనత ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాని నిర్ణీత ఫలితం తెలుపకుండా మౌనం వహించడమే దాని గొప్ప శ్రేష్ఠతను సూచిస్తుంది. ఆయన ప్రవచనం ఇలా ఉంది:
عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَمْ يَجِدُوا إِلَّا أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لَاسْتَهَمُوا وَلَوْ يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ لَاسْتَبَقُوا إِلَيْهِ).
“అజాన్ చెప్పడంలో, మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటులు వేసుకునే పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటులు వేసుకుంటారు. అలాగే నమాజ్ వేళ కాగానే తొలి సమయంలో (మస్జిద్) చేరడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీపడతారు“. (బుఖారీ 615, ముస్లిం 437).
(ఆ) దైవదూతలతో పోలిక:
عَنْ جَابِرِ بْنِ سَمُرَةَ ÷ قَالَ: خَرَجَ عَلَيْنَا رَسُولُ الله ﷺ فَقَالَ :(أَلَا تَصُفُّونَ كَمَا تَصُفُّ الْـمَلَائِكَةُ عِنْدَ رَبِّهَا فَقُلْنَا يَا رَسُولَ الله وَكَيْفَ تَصُفُّ الْـمَلَائِكَةُ عِنْدَ رَبِّهَا قَالَ يُتِمُّونَ الصُّفُوفَ الْأُوَلَ وَيَتَرَاصُّونَ فِي الصَّفِّ).
జాబిర్ బిన్ సముర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా మధ్యలో వచ్చి “దైవదూతలు తమ ప్రభువు ముందు ఏ విధంగా బారులు తీరియుంటారో మీరు ఆ విధంగా మీ పంక్తులను సరి చేసుకోరా?” అని ప్రశ్నించారు. ‘దైవదూతలు తమ ప్రభువు ముందు ఎలా బారులు తీరియుంటారు ప్రవక్తా’ అని మేమడిగాము. “మొదటి పంక్తి పూర్తి చేశాకే దాని తర్వాత పంక్తిలో నిలబడతారు. మరియు దగ్గర దగ్గరగా కట్టు దిట్టంగా నిలబడతారు” అని చెప్పారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). (ముస్లిం 430).
(ఇ) పురుషులకు ఏది మేలు?
عَنْ أَبِي هُرَيْرَةَ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (خَيْرُ صُفُوفِ الرِّجَالِ أَوَّلُهَا وَشَرُّهَا آخِرُهَا وَخَيْرُ صُفُوفِ النِّسَاءِ آخِرُهَا وَشَرُّهَا أَوَّلُهَا)
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “పురుషుల మేలైన పంక్తి మొదటి పంక్తి, చెడ్డది చివరిది. స్త్రీల మేలైన పంక్తి చివరిది. చెడ్డది మొదటిది“. (ముస్లిం 440).
(ఈ) వెనకుండే వారిని అల్లాహ్ వెనకనే ఉంచాలన్న ప్రవక్త శాపనార్థానికి దూరంగా ఉండవచ్చు:
عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ ÷ أَنَّ رَسُولَ الله ﷺ رَأَى فِي أَصْحَابِهِ تَأَخُّرًا فَقَالَ لَهُمْ (تَقَدَّمُوا فَأْتَمُّوا بِي وَلْيَأْتَمَّ بِكُمْ مَنْ بَعْدَكُمْ لَا يَزَالُ قَوْمٌ يَتَأَخَّرُونَ حَتَّى يُؤَخِّرَهُمْ اللهُ).
అబూ సఈద్ ఖుద్రీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ అనుచరుల్ని నమాజులోని పంక్తుల నుండి వెనక ఉండడాన్ని చూసి ఇలా చెప్పారు: “ముందుకు రండి, మీరు నన్ను అనుసరించండి. మీ వెనక వారు మిమ్మల్ని అనుసరిస్తారు. (జాగ్రత్త!) ప్రజలు గనక ఎప్పుడూ వెనకే ఉంటే అల్లాహ్ కూడా వారిని వెనకబాటుతనానికి గురిచేస్తాడు“. (ముస్లిం 438).
(క) మొదటి పంక్తుల్లో ఉన్నవారిపై అల్లాహ్ మరియు ఆయన దూతల దీవెనలు:
عَنْ الْبَرَاءِ بْنِ عَازِبٍ ÷ قَالَ: كَانَ رَسُولُ الله ﷺ يَتَخَلَّلُ الصَّفَّ مِنْ نَاحِيَةٍ إِلَى نَاحِيَةٍ يَمْسَحُ صُدُورَنَا وَمَنَاكِبَنَا وَيَقُولُ: (لَا تَخْتَلِفُوا فَتَخْتَلِفَ قُلُوبُكُمْ) وَكَانَ يَقُولُ: (إِنَّ اللهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى الصُّفُوفِ الْأُوَلِ).
బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పంక్తుల మధ్య వచ్చి మా భుజాలను, ఛాతిని వెనకా ముందు ఉండ కుండా సరిచేసేవారు. ఇంకా ఇలా అనేవారు: “మీరు పంక్తుల్లో వెనకా మందు విభిన్న రీతిలో నిలబడకండి, అందువల్ల మీలో మనస్పర్థలు ఏర్పడవచ్చు”. ఇంకా ఇలా అనేవారుః “మొదటి పంక్తుల్లో ఉన్నవారిని అల్లాహ్ తనకు అతిసన్నిహితంగా ఉన్న దైవదూతల మధ్య ప్రశంసిస్తాడు మరియు దైవదూతలు వారి కొరకు దుఆ చేస్తారు“. (అబూ దావూద్ 664).
9 – సున్నతె ముఅక్కద
(అ) నిరంతరం సున్నతె ముఅక్కద చదివేవారు స్వర్గంలో ఒక గృహానికి అర్హులవుతారు.
عَنْ أُمِّ حَبِيبَةَ ÷ زَوْجِ النَّبِيِّ ﷺ أَنَّهَا قَالَتْ سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (مَا مِنْ عَبْدٍ مُسْلِمٍ يُصَلِّي لله كُلَّ يَوْمٍ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً تَطَوُّعًا غَيْرَ فَرِيضَةٍ إِلَّا بَنَى اللهُ لَهُ بَيْتًا فِي الْـجَنَّةِ أَوْ إِلَّا بُنِيَ لَهُ بَيْتٌ فِي الْـجَنَّةِ).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నానని ఆయన సతీమణి ఉమ్మె హబీబ (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు: “ముస్లిం దాసుడు ప్రతి రోజూ ఫర్జ్ నమాజు కాకుండా పన్నెండు రకాతుల నఫిల్ నమాజు అల్లాహ్ కొరకు చేస్తూ ఉంటే అల్లాహ్ అతని కొరకు స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు. లేక ఒక ఇల్లు అతని కొరకు నిర్మించబడుతుంది“. (ముస్లిం 728).
సున్నతె ముఅక్కదలో కొన్ని ఫర్జ్ నమాజుకు ముందున్నాయి, మరి కొన్ని తర్వాతున్నాయి. అవి మొత్తం 12 రకాతులు.
ఫర్జ్ కంటే ముందున్నవి:
1- ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు:
عَنْ عَائِشَةَ ÷ عَنِ النَّبِيِّ ﷺ قَالَ: (رَكْعَتَا الْفَجْرِ خَيْرٌ مِنْ الدُّنْيَا وَمَا فِيهَا
“ఫజ్ర్ కు ముందు రెండు రకాతులు ప్రపంచము మరియు అందులో ఉన్నవాటి కంటే ఉత్తమమైనవి“. (ముస్లిం 725).
నాతో పాటు మీరు కూడా ఈ హదీసుపై శ్రద్ధ చూపండి:|
“ఫజ్ర్ సున్నతులు ప్రపంచం, వాటిపై ఉన్న డబ్బు, ధనము, బిల్డింగులు, కార్ల కంటే చాలా మేలైనవి.”
2- జొహ్ర్ కు ముందు 4రకాతులు.
ఫర్జ్ తర్వాతవి:
1- జొహ్ర్ తర్వాత రెండు. 2- మగ్రిబ్ తర్వాత రెండు. 3- ఇషా తర్వాత రెండు.
(ఆ) అస్ర్ కు ముందు నాలుగు రకాతులు చేయడం వల్ల అవి చేసేవారికి ప్రవక్త చేసిన రహ్మత్ యొక్క దుఆలో పాలుపంచుకునే భాగ్యం లభిస్తుంది. ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు:
عَنْ ابْنِ عُمَرَ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (رَحِمَ اللهُ امْرَأً صَلَّى قَبْلَ الْعَصْرِ أَرْبَعًا).
“అస్ర్ కు ముందు నాలుగు రకాతులు చదివేవారి పై అల్లాహ్ కరుణ కురియుగాకా!”. (అబూ దావూద్ 1271, తిర్మిజి 430).
10 – అజాన్ మరియు ఇఖామత్ మధ్యలో దుఆ:
నమాజు వైపునకు త్వరగా వెళ్ళడం వల్ల అజాన్ మరియు ఇఖామత్ మధ్య దుఆ చేసే భాగ్యం కలుగుతుంది. మరియు ఇది దుఆ అంగీకార సమయం గనుక అదృష్టంగా భావించాలి. సమయమే గాకుండా మస్జిద్ స్థలం గనుక దాని శ్రేష్ఠతను దృష్టిలో ఉంచుకోవాలి. ఇంకా నమాజు కొరకు వేచి ఉండి దుఆ చేయడం అన్నది మరీ ఘనత గల విషయం. (ఇలా దుఆ అంగీకరించబడే అవకాశం ఎన్నో రకాలుగా ఉంది). ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు:
عَنْ أَنَسِ بْنِ مَالِكٍ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (الدُّعَاءُ لَا يُرَدُّ بَيْنَ الْأَذَانِ وَالْإِقَامَةِ)
“అజాన్ మరియు ఇఖామత్ మధ్యలోని దుఆ త్రోసిపుచ్చబడదు“. (తిర్మిజి 212, ముస్నద్ అహ్మద్ 3/119).
You must be logged in to post a comment.