[14 నిముషాలు]
అబూ బక్ర్ బేగ్ ఉమ్రీ హఫిజహుల్లాహ్
Speaker: Abubaker Baig omeri
లాక్ డౌన్ 5.0 మరియు మస్జిద్ లలో సామూహిక నమాజులు.
Lockdown 5 & How to pray namaz in masajid
అల్ మజ్లిసుల్ ఇల్మీ ధార్మిక పండితుల సూచనలు
1. అల్లాహ్ వైపునకు మరలి అత్యధికంగా క్షమాపణ మరియు ఇస్తిగ్ఫార్ లాంటి ప్రార్ధనలు చేస్తూండండి.
2. కొత్త సూచనల వెలుగులో జుమా మరియు జమాత్ నెలకొల్పండి.
3. పరిస్థితులు పూర్తిగా మారనంత వరకు మస్జిదుల మరుగు దొడ్లను, వుజూ ఖానాలను మూసి ఉంచండి.
4. తువాలు ఇతర సామూహిక వస్తువులు మస్జిద్ లలో ఉంచకండి.
5. వీలైనంత వరకు కార్పెట్, మ్యాట్ లను మస్జిద్ లలో వినియోగించకండి.
6. తమ ఇంటి వద్దే తమ అవసరాలను పూర్తి చేసుకొని, వుజూ చేసుకుని మస్జిద్ లకు రండి.
7. మస్జిద్ లకు విచ్చేసేటప్పుడు మాస్క్ ను ధరించండి.
8. మస్జిద్ లకు విచ్చేసేటప్పుడు గుంపులు గా నిలబడకండి. మరియు సామాజిక దూరాన్ని పాఠించండి.
9. వృద్దులు. పిల్లలు, మరియు వ్యాధిగ్రస్తులు తమ ఇంటి వద్దనే నమాజు ఆచరించండి.
10. స్త్రీలు కూడా తమ ఇంటి వద్దనే నమాజు ఆచరించండి.
11. జుమా నమాజులు తమ ఇంటి వద్ద నమాజు ఆచరించేవారు జుమా బదులు జుహర్ నమాజ్ చదవండి.
12. జలుబు, జ్వరం ఉన్న వారు తమ ఇంటి వద్దనే నమాజు ఆచరించండి.
13. ఒకవేళ సామాజిక దూరాన్ని పాఠించి మాత్రమే నమాజు ఆచరించాల్సిందిగా ప్రభుత్వ ఆదేశాలు జారీ అయినచో సాధ్యమైనంత దూరాన్ని పాఠించి నమాజు ఆచరించవచ్చు.
14.సఫ్ (పంక్తుల) లో దూరాన్ని పాఠించడం వలన స్థలం సరిపోని పక్షంలో జుమా మరియు జమాత్ నమాజులు ఒకటికి రెండుసార్లు జమాత్ చేయవచ్చు.
15. మస్జిద్ ఇమాములు మరియు దాయీలు జుమా ఖుత్బాలను సంక్షిప్తం చేయండి.
16.నమాజుకు సరిగ్గా కొంత సమయం ముందు మస్జిద్ లకు విచ్చేయండి. నమాజు అయిన వెంటనే తమ తమ ఇంటికి వెళ్ళండి. సున్నతులు ఇంటి వద్ద ఆచరించడమే ఉన్నతం.
17. సామాజిక దూరాన్ని పాఠించకుండా, ఆదేశాలను సూచనలకు వ్యతిరేక వైఖరితో మహమ్మారికి గురై మీరు నష్టపోకండి, మరియు దయ చేసి సమాజానికి చెడ్డ పేరు తీసుకురాకండి.
18. మస్జిద్ ఇమాములు, మౌజన్ తదితరులతో ముసాఫహా, షేక్ హ్యాండ్ (shake hand) నుంచి దూరంగా ఉండండి.
19. అల్లాహ్ ఆగ్రహం నుండి రక్షణకు మంచిని ప్రోత్సహించండి, చెడును నిర్మూలించండి.
20. అవసరార్ధులకు వీలైనంత సహాయం అందించండి.
21. ఈ కోవిడ్ మహమ్మారి నుండి రక్షణకు ప్రార్ధనలు చేస్తూ ఉండండి. అల్లాహ్ అందరికీ మహమ్మారి నుండి రక్షణను మరియు ఆయురారోగ్యాలను ప్రసాధించుగాక. (ఆమీన్ )