పరలోక విశ్వాసం – 1: మరణం, సమాధి సంగతులు [వీడియో]

బిస్మిల్లాహ్

[29:04 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
పుస్తక మూలం: పరలోకం (Aakhir)

పరలోకం (اليوم الآخر)

సర్వ లోకాలకు పోషకుడైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు, అల్లాహ్ కరుణ మరియు శాంతి ఘనత గల ప్రవక్తపై, ఆయన కుటుంబీకులపై, ఆయన అనుచరులపై కురువుగాకా! అమీన్.

విశ్వాస ఆరు స్థంబాల్లో పరలోక విశ్వాసం ఒక మూల స్థంబం. మానవుడు దివ్య గ్రంథం ఖుర్ఆన్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహీ హదీసుల్లో పరలోకము గురించి తెలుపబడిన రీతిలో విశ్వసించనంత వరకు విశ్వాసి కాజాలడు.

పరలోక విషయాలను తెలుసుకొనుట, ఎల్లపుడూ దాని జ్ఞప్తిలో ఉండుట చాలా ముఖ్యం. ఈ మూలంగా ఆత్మ శుద్ధి, దైవ భీతి మరియు ఇస్లాంపై స్థిరంగా ఉండే భాగ్యం కలుగుతుంది. ఆ నాటి కష్టాల, బాధల జ్ఞాపకం పట్ల అశ్రద్ధ కంటే కఠిన హృదయులుగా మార్చునది మరియు పాపానికి ఒడిగట్టే ధైర్యం ఇచ్చునది మరొకటి లేదు. అల్లాహ్ ఇలా తెలిపాడు:

[يَوْمًا يَجْعَلُ الوِلْدَانَ شِيبًا] {المزمل:17}

ఆ దినము బాలురను ముసలి వానిగా చేసివేయునట్టి దినము“. (ముజమ్మిల్ 73: 17). మరో చోట ఇలా తెలిపాడు:

[يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ، يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَى وَمَا هُمْ بِسُكَارَى وَلَكِنَّ عَذَابَ اللهِ شَدِيدٌ] {الحج:1، 2}

ఓ ప్రజలారా! మీరు మీ ప్రభువునకు భయపడండి, నిశ్చయంగా ప్రళయ కాలం నాటి భూకంపం చాలా గొప్ప విషయం. మీరు ఆ దినమును చూచునపుడు ప్రతి పాలిచ్చు స్త్రీ తన చంటిబిడ్డను మరచి పోవును. ప్రతి గర్భిణికి గర్భము జారిపడును. ప్రజలు మత్తులుగా కనబడుదురు. వాస్తవంగా వారు మత్తులో ఉండరు. కాని అల్లాహ్ శిక్ష చాలా కఠినమైనది“. (హజ్ 22:1,2).

మరణం

1- ప్రతి జీవికి ఇహలోకములో అది చివరి మెట్టు. అల్లహ్ ఆదేశం:

كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ

ప్రతి మనిషి చావును చవి చూస్తాడు“. (ఆలె ఇమ్రాన్ 3: 185).

كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ – 55:26

భూమి పై ఉన్నవారందరూ నశింతురు“. (రహ్మాన్ 55: 26).

[إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُمْ مَيِّتُونَ] {الزُّمر:30}

నీవు చావవలసి ఉన్నది. మరి వారూ చావ వలసి ఉన్నది“. (జుమర్ 39: 30).

ఇహలోకములో ఏ మానవునికీ శాశ్వతం లేదు. అల్లాహ్ ఆదేశం:

كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ – 55:26

నీకు పూర్వం ఏ మానవుడు శాశ్వతంగా జీవించియుండు నట్లుగా మేము చేయలేదు“. (అంబియా 21: 34).

1- చావు ఖచ్చితమైన విషయం. అందులో సందేహానికి చోటు లేదు. అయినా అనేక మంది అశ్రద్ధగా ఉన్నారు. కాని ముస్లిం అధికంగా దాన్ని జ్ఞప్తిలో ఉంచాలి. దానికి సిద్ధమై ఉండాలి. వృధా గా సమయం దాటక ముందే ఇహలోకంలోనే పరలోక సామాగ్రి తయారు చేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః

(اغْتَنِمْ خَمْسًا قَبْلَ خَمسٍ: حَياتَكَ قَبلَ مَوتِك، وَ صِحَّتَكَ قَبْلَ سَقمِكَ، وَ فَراغَكَ قَبلَ شُغلِكَ، وَ شَبَابَكَ قَبلَ هَرمِكَ، وَ غِناكَ قَبلَ فَقرِكَ)

“ఐదు విషయాలను మరో ఐదు విషయాలకంటే ఎంతో ఉత్తమమైనవని తెలుసుకో: జీవితాన్ని చావు రాక ముందు. ఆరోగ్యమును వ్యాది, అనా రోగ్యముకు ముందు. తీరికను పనులు మోపు కాక ముందు. యౌవనాన్ని వృద్ధాప్యముకు ముందు మరియు కలిమిని (సిరివంతమును) బీదరికంకు ముందు”. (హాకిం, బైహకీ ఫీ షొఅబిల్ ఈమాన్).

గమనార్హమైన విషయమేమనగా: శవం తన వెంట సమాధిలో ఇహలోక సామాగ్రి తీసుకెళ్ళదు. తన ఆచరణ మట్టుకే తనతో ఉంటుంది. అందుకు సత్కార్యాల సామాగ్రి వెంట తీసుకెళ్ళే ప్రయత్నం చేయు. దాని మూలంగానే నీవు అచ్చట సుఖాలు పొందుతావు. అల్లాహ్ కరుణతో ఆ శిక్షల నుండి రక్షణ కూడా పొందుతావు.

2- మనిషి చావు గుప్తముగా ఉంది. అది అల్లాహ్ కు తప్ప ఎవరికీ తెలియదు. ఎవరి చావు ఎక్కడ వచ్చునో ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు. ఎందుకనగా ఇది అగోచర జ్ఞానంలో ఒకటి. అందుకే అల్లాహ్ కు మాత్రమే తెలియును.

3- చావు వచ్చిన తరువాత దానిని నెట్టేయడం, ఆలస్యం చేయడం మరియు చావు రాకుండా పరిగెత్తడం కాని పని. అల్లాహ్ ఆదేశం:

وَلِكُلِّ أُمَّةٍ أَجَلٌ ۖ فَإِذَا جَاءَ أَجَلُهُمْ لَا يَسْتَأْخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ – 7:34

ప్రతి జాతి వారికొక గడువు నియమింపబడియున్నది. మరియు వారి గడువు వచ్చినపుడు ఒక గడియ వెనుక గాని ముందు గాని వారు కానేరరు“. (ఆరాఫ్ 7: 34).

4- విశ్వాసుని వద్దకు ప్రాణం తీయు దూత అందమైన ముఖము, సువాసన దుస్తులతో వస్తాడు. అతనితో కరుణ దూతలు స్వర్గము యొక్క శుభవార్తలు వినిపిస్తూ హాజరవుతారు. అదే విషయాన్ని అల్లాహ్ ఇలా తెలిపాడు:

إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّهُ ثُمَّ اسْتَقَامُوا تَتَنَزَّلُ عَلَيْهِمُ الْمَلَائِكَةُ أَلَّا تَخَافُوا وَلَا تَحْزَنُوا وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنتُمْ تُوعَدُونَ – 41:30

ఎవరైతే మా ప్రభువు అల్లాహ్ అని పలికిరో, మరల అందు స్థిరముగా ఉండిరో వారి యొద్దకు దేవదూతలు దిగివచ్చి ‘మీరు భయపడకండి. మరియు చింత పడకండి మీతో వాగ్దానం చేయబడుతున్న స్వర్గంతో సంతోషపడండి’ అని పలుకుదురు“. (హామ్మీం అస్సజ్దా 41: 30).

అవిశ్వాసుని వద్దకు ప్రాణం తీయు దూత భయంకరమైన నల్లటి రూపములో దుర్వాసన దుస్తులతో వస్తాడు. అతనితో శిక్ష దూతలు శిక్షల శుభవార్తతో హాజరవుతారు. ఈ విషయమే అల్లాహ్ ఇలా తెలిపాడుః

وَلَوْ تَرَىٰ إِذِ الظَّالِمُونَ فِي غَمَرَاتِ الْمَوْتِ وَالْمَلَائِكَةُ بَاسِطُو أَيْدِيهِمْ أَخْرِجُوا أَنفُسَكُمُ ۖ الْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُونِ بِمَا كُنتُمْ تَقُولُونَ عَلَى اللَّهِ غَيْرَ الْحَقِّ وَكُنتُمْ عَنْ آيَاتِهِ تَسْتَكْبِرُونَ

ఈ దుర్మార్గులు మరణవేదనలో మునిగి తేలుతూ ఉండగా, దైవదూతలు తమ హస్తాలను చాచి, ఇటు తెండి, బయటకు తీయండి మీ ప్రాణాలను, అల్లాహ్ పై అపనిందను మోపి అన్యా యంగా కూసిన కూతలకూ, ఆయన ఆయతుల పట్ల తలబిరుసు తనం ప్రదర్శించినందుకూ ఫలితంగా ఈ రోజు మీకు అవమానకర మైన శిక్ష విధించబడుతుంది అని అంటూ ఉండగా ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుంటుంది!”. (అన్ఆమ్ 6: 93).

చావు వచ్చినపుడు వాస్తవము స్పష్టమయి అసలు సంగతే మిటో ప్రతీ ఒకరికీ తెలుస్తుంది. అల్లాహ్ ఇలా తెలిపాడు:

حَتَّىٰ إِذَا جَاءَ أَحَدَهُمُ الْمَوْتُ قَالَ رَبِّ ارْجِعُونِ لَعَلِّي أَعْمَلُ صَالِحًا فِيمَا تَرَكْتُ ۚ كَلَّا ۚ إِنَّهَا كَلِمَةٌ هُوَ قَائِلُهَا ۖ وَمِن وَرَائِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ

తుదకు వారిలోనొకనికి చావు వచ్చునపుడు ఓ నాప్రభువా! నన్ను తిరిగి పంపి వేయుము. నేను వదలి వచ్చిన దానిలో సత్కార్యము చేయుదును అని పలుకును. అట్లు కానేరదు. అది ఒక మాట, దానిని అతడు పలుకుచున్నాడు. వారు మరల సజీవులై లేచు దినము వరకు వారి ముందర అడ్డు ఉన్నది“. (మూమినూన్ 23: 99-100).

అవిశ్వాసులు మరియు పాపాత్ములు ఇహలోకానికి తిరిగి వచ్చి సత్కార్యములు చేయాలని కోరుదురు కాని అపుడు ఆ పశ్చాత్తాపం ఏమీ పనికి రాదు. అల్లాహ్ ఆదేశం చదవండి:

وَتَرَى الظَّالِمِينَ لَمَّا رَأَوُا الْعَذَابَ يَقُولُونَ هَلْ إِلَىٰ مَرَدٍّ مِّن سَبِيلٍ

మరియు నీవు పాపాత్ములను చూచెదవు, వారు బాధను చూచునపుడు తాము తిరిగి పోవుటకు మార్గము గలదా? అని పలుకుదురు“. (షూరా 42: 44).

5- తన దాసులపై అల్లాహ్ కరుణ ఒకటేమనగా: మరణానికి ముందు ఎవరి చివరి మాట “లాఇలాహ ఇల్లల్లాహ్” ఉండునో అతను స్వర్గ ప్రాప్తుడవుతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

(مَنْ كَانَ آخِرُ كَلاَمِهِ ، لآ إله إلا الله دَخَلَ الْجَنَّة)

“ఈ ప్రపంచములో ఎవరి చివరి పలుకులు “లాఇలాహ ఇల్లల్లాహ్” ఉండునో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు”. (అబూ దావూద్ 3114).

ఎందుకనగా ఈ క్లిష్ట సమయంలో మనిషి కలిమహ్ పఠించడం అసాధ్యం. అది తను మనుస్ఫూర్తిగా పఠించి దాని ప్రకారం ఆచరించినవాడయితే తప్ప. మనుస్ఫూర్తిగా పఠించని వ్యక్తి మరణ వేదనలో గల కష్టాలను భరించ లేక అది మరచిపోవును. అందుకు సక్రాత్ లో ఉన్న వ్యక్తికి దగ్గర కూర్చున్నవారు అతనికి కలిమహ్ తల్ ఖీన్ చేయడం (ఉపదేశించడం) పుణ్యకార్యం.

సమాధి

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

శవాన్ని సమాధిలో పెట్టి అతని బంధువులు తిరిగి పోతుండగా అతడు వారి చెప్పుల శబ్దం వింటాడు. అప్పుడు ఇద్దరు దూతలు వచ్చి అతన్ని కూర్చోబెట్టి ‘ఇతని గురించి నీ విశ్వాసం ఏమిటి’? అని ప్రశ్నిస్తారు. ‘అతను అల్లాహ్ దాసుడు మరియ అల్లాహ్ ప్రవక్త’ అని నేను సాక్ష్యమిస్తున్నానని విశ్వాసి బదులిస్తాడు. ‘ఇదిగో నరకంలో నీ ఈ స్థలాన్ని చూడు దానికి బదులుగా స్వర్గంలో ఈ స్థలం అల్లాహ్ నీకు ప్రసాదించాడు’ అని అతనికి చెప్పబడుతుంది. అతడు స్వర్గము నరకము రెండూ చూస్తాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మరియు అవిశ్వాసి లేదా వంచకున్ని ‘ఇతని గురించి నీ విశ్వాసం ఏమిటి’? అని ప్రశ్నిస్తారు. ‘నాకు తెలియదు. లోకముతీరు నేనన్నాను’ అని అతను సమాధానమిస్తాడు. ‘నీవు తెలుసుకోలేదు మరియు ఖుర్ఆన్ పఠించలేదంటూ ఇనుప గదాలతో ఒక్క సారి కొడితే అతడు దాన్ని భరించలేక అరుస్తాడు. అతని కేకను ఇరుజాతులు తప్ప సమీపములోనున్న వారందరు వింటారు’. (బుఖారి 1338, ముస్లిం 2870).

ఆత్మను సమాధిలో ఉన్న దేహంలో పంపడమనేది పరలోక విషయం. మనిషి ఊహలకు అందనిది. అయినా సమాధిలో శుభాలకు, వరాలకు అర్హులైన విశ్వాసులకు శుభాలు మరియు శిక్షలకు అర్హులైన అవిశ్వాసులకు శిక్షలు జరగడం వాస్తవమేనని ముస్లిములందరూ ఏకీభవించారు. అల్లాహ్ ఇలా తెలిపాడు:

వారు ఉదయం, సాయంత్రం నరకాగ్ని ముందు ఉంచబడుతూ ఉంటారు. ప్రళయ గడియ వచ్చినపుడు ‘ఫిర్ఔను ప్రజలను తీవ్రమైన శిక్షలో ప్రవేశింపజెయ్యండి’ అని ఆజ్ఞాపించబడుతుంది“. (మోమిన్ 40: 46).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు:

(تَعَوَّذُوا بِاللهِ مِن عَذَابِ الْقَبر)

సమాధి శిక్షల నుండి అల్లాహ్ శరణు కోరండి“. (ముస్లిం 2867).

బుద్ధీ జ్ఞానాలతో గమనిస్తే ఇది తిరస్కరించలేని విషయం. ఇలాంటి ఉదాహరణాలు మానవుడు ఎన్నో చూస్తాడు. నిద్ర పోయిన వ్యక్తి కలలో ఎంతో శిక్షించబడుతున్నట్లుగా చూస్తాడు, అరుస్తాడు, సహాయం కోరుతాడు. కాని అతని ప్రక్కనే ఉన్న వ్యక్తికి అతని గురించి ఏమీ తెలియదు. ఇహలోకములోనే ఇలా ఉన్నప్పుడు చావు బ్రతుకుల్లో ఎంతో తేడా ఉన్న ఆ మరణాంతర విషయాన్ని ఊహించ గలమా? సమాధిలో శిక్ష ఆత్మ, దేహము రెండింటికగును. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “సమాధి పరలోకము యొక్క మొదటి మెట్టు అది క్షేమంగా దాటిన వారికి ఆ తరువాత చాలా సుఖము గలదు. మరియు క్షేమంగా దాటని వారికి ఆ తర్వాత చాలా కష్టము గలదు“. (తిర్మిజి 2308).

అందుకని విశ్వాసి అధికంగా సమాధి శిక్షల నుండి అల్లాహ్ శరణు కోరుతుండాలి. ప్రత్యేకంగా నమాజులో సలాంకు ముందు. మరియు పాపాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. పాపాలే సమాధి శిక్షలకు మరియు నరక శిక్షలకు మూల కారణం.

సమాధి శిక్షలు: అనేక మంది సమాధి చేయబడుతారు కాబట్టి సమాధి శిక్ష అనబడింది. నీట మునిగి పోయినవారు, కాలి పోయినవారు మరియు క్రూర జంతువులకు ఆహారముగానైన వారందరికి శిక్షలు బర్ జఖ్ (ఇహపర లోకాల మధ్య స్థానం)లో తప్పవు. సమాధి శిక్షలు అనేక రకాలుగా ఉండును. ఇనుప గదాలతో కొట్టబడును. సమాధి చీకటితో నిండిపోవును. నరక పడకలు వేయబడి నరక ద్వారములు తెరువబడును. చెడు కార్యములు దుర్వాసన, అందవికారంగా మరియు భయంకరమైన రూపములో తోడుగా ఉండును. ఈ శిక్షలు అవిశ్వాసులకు మరియు వంచకులకు శాశ్వతంగా ఉండును. కాని విశ్వాసి అయిన పాపాత్మునికి పాపాల ప్రకారంగా శిక్ష జరిగిన తర్వాత అంతమై పోవును.

సమాధి వరాలు: స్వచ్ఛమైన విశ్వాసుని సమాధి విస్తీర్ణము చేయబడి నూర్ (కాంతి)తో నింపబడును. మరియు స్వర్గ ద్వారములతో సువాసన, స్వర్గము యొక్క గాలి వీస్తుండగా స్వర్గ పడకలు వేసి యుండును. మరియు సత్కార్యాలు సువాసనతో నిండి అందమైన రూపములో తోడుగానుండును.

ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన వీడియో పాఠాలు :

%d bloggers like this: