హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కధనం: “మేము ఒక రోజు దైవ ప్రవక్త సమక్షంలో కూర్చుని ఉన్నాము. ఇంతలో ఒక వ్యక్తి సమావేశంలోకి వచ్చాడు. అతని వస్త్రాలు తెల్లవిగాను, తల వెంట్రుకలు మిక్కిలి నల్లవిగాను ఉన్నాయి. అతనిపై ప్రయాణపు అలసట (యొక్క ఆనవాళ్ళు) కనబడట్లేదు. పైగా మాలో ఎవరూ అతనిని ఎరుగరు కూడ. చివరికి అతను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఆయన మోకాళ్ళకు తన మోకాళ్ళు ఆనించి, ఆయన చేతులు తొడలపై పెట్టుకొని కూర్చున్నాడు.
ఇంకా ఇలా అడిగాడు. ఓ ముహమ్మద్…! (సల్లల్లాహు అలైహి వసల్లం ) ఇస్లాం గురించి తెలుపండి?.దానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: ” ఇస్లాం అంటే నీవు అల్లాహ్ తప్ప మరే ఆరాధ్య దేవుడు లేడని, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం ) అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యమిస్తూ నమాజు స్థాపించాలి, ‘జకాత్’ (ధర్మదానం) చెల్లించాలి, పవిత్ర రమదాన్ మాసపు ఉపవాసాలు పాటించాలి, స్థోమత కల్గివున్నప్పుడు ‘హజ్’ పవిత్ర కాబా (అల్లాహ్ గృహాన్ని) దర్శించాలి”. ఇది విన్న ఆ వ్యక్తి అవును మీరు చెప్పింది నిజమే..’ అన్నాడు. అతని వాక్యాలకు మేము ఆశ్చర్యపోయాము. తనే ప్రశ్నిస్తున్నాడు. తనే దుృవీకరిస్తున్నాడు.
ఆ వ్యక్తి మరలా ‘ఈమాన్‘ గురించి తెల్పండి? అని ప్రశ్నించాడు. దానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “నీవు అల్లాహ్ ను ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, ప్రళయ దినాన్ని మరియు విధిరాత (మేలైనా చెడైనా) ను విశ్వసించాలి”. ఇది విన్న ఆ వ్యక్తి ‘అవును మీరు చెప్పింది నిజమే..’ అన్నాడు.
ఆ వ్యక్తి మరలా ‘ఇహ్ సాన్‘ గురించి తెల్పండి? అని ప్రశ్నించాడు. దానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “నీవు పరిపూర్ణ మనస్సుతో అల్లాహ్ ను చూస్తున్నట్లుగా ఆరాధించు.. ఒకవేళ నీవు ఆయనను చూడక పోయినా ఆయన నిన్ను గమనిస్తూన్నాడని గ్రహించు”.
ఆ వ్యక్తి మరలా ‘అయితే ప్రళయం గురించి (ఎప్పుడు వస్తుంది) తెల్పండి.? అని ప్రశ్నించాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు: “( ప్రళయం ఎప్పుడు వస్తుందనేది) ప్రశ్నించబడే వారికి ప్రశ్నించే వారికంటే ఎక్కువ ఏమి తెలియదు.
ఆ వ్యక్తి మరలా ‘అయితే దాని చిహ్నాలను తెల్పండి ? అని అన్నాడు.. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: ” బానిసరాలు తన యజమానిని కంటుంది, చెప్పులు, వస్త్రాలు కూడా లేని (మేకల) కాపరులు పెద్ద పెద్ద భవనాలు నిర్మించడంలో గర్వపడతారు”.
హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా చెప్పారు : (ఈ సంభాషణ తరువాత) ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. నేను కాసేపు (అక్కడే వున్నాను. అప్పుడు దైవ ప్రవక్త (స) నాతో ఇలా చెప్పారు: ఓ
ఓ ఉమర్..! ఆ ప్రశ్నికుడు ఎవరో తెలుసా..? ‘అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) “ఆయన ‘జిబ్రయీల్’ (దైవదూత), మీ ధర్మాన్ని మీకు బోధించటానికి మీ వద్దకు వచ్చారు” అని సెలవిచ్చారు.
ప్రయాణపు ఆనవాళ్ళు, అంటే ధూళి దుమ్ము, తల జుట్టు చిందరవందరంగా
رَبَّةٌ రబ్బతున్ : (ఏక) :యజమానురాలు
(బహు) ‘రిబాబున్’
الْحُفَاةُ అల్ హుఫాతు : (బహు) :
(ఏక) ‘ అల్ హాఫియు’ కాళ్ళలో చెప్పులు లేని వ్యక్తి
الْعُرَاةُ ‘అల్ ఉరాతు :(బహు) : శరీరముపై ఎటువంటి వస్త్రము, దుస్తులు లేని వాడు. (ఏక) ‘అల్ ఆరియు’ ఇక్కడ ఉద్దేశం: శరీరముపై ఎటువంటి వస్త్రము లేనివా గొప్పవాడుగా పరిగణించబడుతాడు.
1. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పద్ధతి, సహాబాల (అనుచరుల) తో మమేకం, ఆయన ఉన్నత శైలికి నిదర్శనం.
2. శిష్యుడు గురువు ఎదుట సంస్కారవంతుడుగా ఉండుట ఉత్తమం. ఎలాగైతే జిబ్రయీల్ (అలైహిస్సలాం) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు కూర్చున్నారో అదే విధముగా కూర్చోనిపూర్తి ధ్యాసతో జ్ఞానార్జన చేయాలి.
3. “లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అనే రెండు సాక్ష్యాపు వాక్యాల భాగాలను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకే వాక్యంగా పేర్కొన్నారు. ఆరాధన అనేది రెండు విషయాలతో కూడుకున్నది. ఒకటి కేవలం అల్లాహ్ కొరకే అనే చిత్తశుద్ధి ఉండాలి. రెండోది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అనుసరించి వుండాలి.
ఇవి “షహాదతు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్” మరియు “షహాదతు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్” అనే వాక్యాలతో వ్యక్తమవుతున్నాయి.
4. “ఇస్లాం” అనేది 5 విషయాలతో కూడుకున్నది. షహాదత్, (అల్లాహ్ తప్ప మరే నిజఆరాధ్య దేవుడు లేడని, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వడం). నమాజు స్థాపించడం. ‘జకాత్’ (ధర్మదానం) చెల్లించడం. పవిత్ర రమదాన్ మాసపు ఉపవాసాలు పాటించడం. “హజ్ చేయడం.
5. “ఈమాన్” అనేది 6 విషయాలతో కూడుకున్నది. అల్లాహ్ ను ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, ప్రళయ దినాన్ని మరియు విధిరాత (మేలైనా చెడైనా) ను విశ్వసించడం.
6. “ఇహ్ సాన్” కు రెండు స్థాయిలు వున్నాయి : ఒకటి నీవు సంపూర్ణ మనస్సుతో అల్లాహ్ ను చూస్తున్నట్లుగా ఆరాధించు. ఇది అత్యున్నత స్థాయి. రెండోది ‘మురాఖబహ్’ ఆయన నిన్ను గమనిస్తున్నాడనే ధ్యాస.
7. మనిషి విద్యాభ్యాసానికై ప్రశ్నించడం తప్పనిసరి. జిబ్రయీల్ (అలైహిస్సలాం) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రశ్నించి చూపించినట్లు. మీరు ‘నిజమే చెప్పారు’ అనేది జిబ్రయీల్ (అలైహిస్సలాం) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ని ప్రశ్నించినప్పుడు ధార్మిక జ్ఞానము కలిగియున్నారనే దాన్ని సూచిస్తుంది.
8. “ఇస్లాం, ఈమాన్” ఒకే సారి ప్రస్తావించినప్పుడు . ‘ఇస్లాం’ అనేది బాహ్యపరమైనా విషయాలు, ‘ఈమాన్’ అనేది అంతర విషయాలు అని స్పష్టమవుతుంది.
9. ప్రళయ దినపు గురించి జ్ఞానము అల్లాహ్ జ్ఞానములోనిది. ఖుర్ఆన్లో అల్లాహ్ ఉపదేశం: (నిస్సందేహంగా ప్రళయ దినపు గురించి జ్ఞానము అల్లాహ్ వద్దనే వుంది). (సూ31:ఆ34.)
10. ‘ప్రశ్నించబడే వారికి ప్రశ్నికుడి కంటే ఎక్కువ తెలియదు’ అనే వాక్యముతో తెలియ వచ్చేది ఏమిటంటే (అల్లాహు ఆలం) అల్లాహ్ యే సర్వం తెలిసినవాడు.
11. ‘ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్,’ అన్నింటిని ‘దీన్'(ధర్మం) అని పేర్కోనబడింది. దీనికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వాక్యాలు ఆధారం: “ఈయన ‘జిబ్రయీల్’ (అలైహిస్సలాం) మీ వద్దకు ‘దీన్’ ధార్మిక విద్యను బోదించటానికి వచ్చారు”.
12 దైవదూత రూపందాల్చె శక్తి కలిగివుంటాడు, కనుక జిబ్రయీల్ (అలైహిస్సలాం) మనిషి రూపములో అక్కడ దర్శనమిచ్చారు.
13. ‘వహీ’ దైవవాణి రకాలలో దైవదూత మనిషి రూపములో దర్శనమివ్వడం కూడ ఒకటి.
14. విద్యాభ్యాసాన్ని కోరుకునేవాడు పరిశుభ్రముగా వుండవలెను. అవసరానికి ప్రయాణము కూడ చేయవలెను. వినయ వినమ్రతలు పాటించవలెను. గురువునికీ సమీపముగా వుండవలెను. శిష్యునికి ప్రధానమైన విషయాలతో బోధన ప్రారంభించవలెను.
15. గురువు తన శిష్యులతో వారి జ్ఞానాన్ని పెంపొందించటానికి విభిన్న శైలిని ప్రదర్శించి అనుక్షణం వారు మేలుకువతో ఉత్సాహంగా వుండటానికి కృషి చేయాలి. దీనికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వాక్యాలు ఆధారం: ఓ ఉమర్..! (రదియల్లాహు అన్హు) ఆ ప్రశ్నికుడేవరో తెలుసా..?
16. మంచి ప్రశ్న అనేది జ్ఞానము, బోధన. దీనికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వాక్యాలు ఆధారం:
أَتَاكُمْ يُعَلِّمُكُمْ دِينَكُمْ “ఆయన మీ ధార్మిక విద్యను మీకు బోధించటానికి వచ్చారు.”
ఈ హదీసులో చెప్పిన విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడానికి క్రింది వీడియో తప్పక వినండి:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
سَمِعْتُ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم يَقُولُ: ” إنَّمَا الْأَعْمَالُ بِالنِّيَّاتِ، وَإِنَّمَا لِكُلِّ امْرِئٍ مَا نَوَى، فَمَنْ كَانَتْ هِجْرَتُهُ إلَى اللَّهِ وَرَسُولِهِ فَهِجْرَتُهُ إلَى اللَّهِ وَرَسُولِهِ، وَمَنْ كَانَتْ هِجْرَتُهُ لِدُنْيَا يُصِيبُهَا أَوْ امْرَأَةٍ يَنْكِحُهَا فَهِجْرَتُهُ إلَى مَا هَاجَرَ إلَيْهِ
رَوَاهُ إِمَامَا الْمُحَدِّثِينَ أَبُو عَبْدِ اللهِ مُحَمَّدُ بنُ إِسْمَاعِيل بن إِبْرَاهِيم بن الْمُغِيرَة بن بَرْدِزبَه الْبُخَارِيُّ الْجُعْفِيُّ [رقم:1]، وَأَبُو الْحُسَيْنِ مُسْلِمٌ بنُ الْحَجَّاج بن مُسْلِم الْقُشَيْرِيُّ النَّيْسَابُورِيُّ [رقم:1907] رَضِيَ اللهُ عَنْهُمَا فِي “صَحِيحَيْهِمَا” اللذَينِ هُمَا أَصَحُّ الْكُتُبِ الْمُصَنَّفَةِ
అనువాదం
విశ్వాసుల నాయకులు హజ్రత్ అబూ హఫ్స్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కధనం: చెబుతున్నారు: నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఇలా ఉపదేశిస్తుండగా విన్నాను.
“నిశ్చయంగా కర్మలు సంకల్పాల పరంగా ఉంటాయి. ప్రతి మనిషికీ అదే (ప్రతిఫలం) లభిస్తుంది ఏదైతే అతను సంకల్పం చేస్తాడో. ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కోసం (‘హిజ్రత్’) వలసవెళతాడో ఆ వ్యక్తి ప్రస్థానం నిజంగానే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసమే అవుతుంది. మరి ఎవరి ‘హిజ్రత్’ ప్రాపంచిక ప్రయోజనం పొందాలనే ఉద్దేశము లేక ఏ స్త్రీ నైనా వివాహమాడాలనే సంకల్పంతో కూడుకొని వుంటుందో అతని ‘హిజ్రత్’ తాను కోరుకున్న వాటి కోసమే అవుతుంది.”
పుస్తక సూచనలు: సహీహ్ బుఖారీ-1, సహీహ్ ముస్లిం- 1907. తెలుగు రియాజుస్సాలిహీన్ -1, పేజి 1, హ1. (సహీహ్ బుఖారీ, దైవవాణి ఆరంభ ప్రకరణం, సహీహ్ ముస్లిం, పదవుల ప్రకరణం)
పదాల విశ్లేషణ
إنَّمَا ఇన్నమా:
పరిమితముకై, అంటే కేవలం పేర్కొనబడిన దానిలో ఆదేశాన్ని నిరూపించి మిగితా వాటిని విడదీయటం లేక తొలగించడం.
الْأَعْمَالُ అల్ ఆమాలు:
ఇది బహువచనం; దీనికి అల్ అమలు ఏకవచనం. దీని అర్ధం: కర్మ, పని, కార్యం. ‘అల్ ఆమాలు’లో ( అలిఫ్ లామ్ ) సంబంధిత దానికై, కర్మలకి సంబంధించిన.
بِالنِّيَّاتِ బిన్నియ్యాతి:
‘బ’కారణానికి : అంటే కర్మల యొక్క అంగీకారం సంకల్పము కారణంగా.
يَنْكِحُ యని కిహు: వివాహమాడుతున్నాడు/ మాడబోతున్నాడు. పెళ్ళి చేసుకుంటున్నాడు. చేసుకోబోతున్నాడు.
النِّيَّاتِ అన్నియ్యాతు:
అన్నియ్యతు దీనికి ఏకవచనం. భాషా పరంగా అర్ధం: ఉద్దేశం ఏదేని పైనను నిర్ణయం. ధార్మిక పరంగా : అల్లాహ్ సామిప్యాన్ని పొందుటకై ఏదైన కార్యము పట్ల సంకల్పము చేయడం .
అల్ హిజరతు:
భాషా పరంగా అర్ధం: వదులుట, విడనాడుట. వలస వెళ్ళుట. ధార్మిక పరంగా : షిర్క్ గల పట్టణం నుండి ఇస్లాం గల పట్టణం వైపుకు మారటం. నేరాల ప్రదేశము నుండి స్థిరత్వం గల ప్రదేశమునకు మారటం.
يُصِيبُ యుసీబు:
లభిస్తుంది / లభించబోతుంది, సోకుతుంది/ సోకబోతుంది.
హదీసు ప్రయోజనాలు
1. మనిషికి తన సంకల్పం ప్రకారం పుణ్యము గాని పాపము గాని ఇవ్వబడుతుంది, లేదా ఏదీ దక్కకుండా పోతుంది. దీనికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వాక్యము:
“ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసం వలసవెళతారో, ఆవ్యక్తి ప్రస్థానం నిజంగానే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసమే అవుతుంది.’
2. కర్మలు సంకల్ప పరంగా ఫలితానికి దారి తీస్తాయి, ఒక విషయం వాస్తవానికి మెచ్చుకోదగినదిగా వుంటుంది. కాని మనషి సుసంకల్పం చేసుకుంటే అది విధేయత అవుతుంది. ఉదా: మనిషి సంకల్పం చేస్తాడు తినడం, త్రాగడం, మరియు అల్లాహు విధేయత చూపటం పట్ల భయభీతి కలిగి వుండాలని. అందుకే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశిస్తున్నారు:
« تَسَخَرُوا فَإِنَّ فِي السَّحُورِ بَرَكَةً
“సహరి చేయ్యండి, సహరిలో ‘బర్కత్ ‘ ఉంది.” ఈ హదీసును ఆచరించటంలో విధేయత వుంది.
3. హిజ్రత్ ప్రాముఖ్యత, దాని పట్ల ప్రవక్త ఉపమానం ఇవ్వటం తెలుస్తుంది. ఇంకా దాని ఘనతను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూచిస్తూ చెప్పారు:
‘ఏమిటి నీకు తెలియదా హిజ్రత్ మునుపటి పాపాలను తుడిచి వేస్తుందని.”
4. సహాబాల పేరు వచ్చినప్పుడు రదియల్లాహు అన్హు చెప్పాలని తెలుస్తుంది.
5. కర్మల్లో ఇవి కేవలం అల్లాహ్ కే అనే చిత్తశుద్ధి వుండాలి.
6. ఆరాధనల్లో ‘రియా’ (ప్రదర్శనా బుద్ధి) వుండకూడదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రకారం « إنَّمَا الْأَعْمَالُ بِالنِّيَّاتِ » “నిశ్చయంగా కర్మలు సంకల్పాల పరంగా ఉంటాయి.” ఎందుకంటే ‘రియా’ చిత్తశుద్ధికి విరుద్ధం.
7. ప్రాపంచిక ప్రలోభాలకు దూరంగా వుండాలి.
8. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఉత్తమ బోధన, సూత్రాలుగాను, ఉదాహరణలుగాను.
9. సంకల్పమును చక్కదిద్దుకుంటూ వుండాలి. సుఫియాన్ అస్సౌరి అంటున్నారు: ‘నా సంకల్పాన్ని చక్క దిద్దుకోవటం కంటే ఎక్కువ కఠినమైనది ఏది లేదు. ఎందుకంటే అది నా మీద తిరగబడుతుంది.’
10. స్వచ్ఛమైన హిజ్రత్ ఏమంటే అల్లాహ్ వారించిన వాటిని విడనాడాలి. ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వాఖ్యం: “فَهِجْرَتُهُ إلَى مَا هَاجَرَ إلَيْهِ” “అతని వలస తాను కోరుకున్న వాటి కోసమే అవుతుంది.” అని చెప్పారు. అంతేకాని పరిధిని నిర్ధారించలేదు. ‘ఎవరి (హిజ్రత్) ప్రాపంచిక ప్రయోజనం పొందాలనే ఉద్దేశము లేక ఏ స్త్రీ నయినా వివాహమాడాలనే సంకల్పంతో కూడుకొని వుంటుందో” అని చెప్పలేదు.
హదీసు ఉల్లేఖులు
హజ్రత్ అబూ హఫ్స్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు):
విశ్వాసుల నాయకులు, అబూ హఫ్స్ ఉమర్ బిన్ ఖత్తాబ్ బిన్ నుఫైల్ బిన్ అబ్దుల్ ఉజ్జా అల్ ఖరషి, అల్ అదవి. వీరు ముస్లింల యొక్క రెండో ఖలీఫా (ధార్మిక పాలకులు). అజ్ఞాత కాలములో ‘ఖురైష్’ యొక్క రాయబారిగా ఉండేవారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవ సందేశహరులుగా ప్రకటించిన తరువాత ముస్లింల పట్ల అందరికన్న కఠోరంగా వున్నవారు వీరే. దైవ సందేశము వచ్చిన 6వ సంవత్సరములో వీరు ఇస్లాం స్వీకరించి ఇస్లాంకు మరియు ముస్లింలకు గొప్ప శక్తిగా మారారు. ఈయన ‘ఖురైష్’ మరియు ముష్రికీన్ల ముందు భహిరంగంగా ‘హిజ్రత్’ చేసారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తోపాటు అన్ని యుద్ధాల్లో పాల్గొన్నారు. సిద్దీఖీ సామ్రాజ్య కాలము తరువాత 13వ హిజ్రి శకంలో ఆయన ఖలీఫాగా ప్రమాణము తీసుకోబడింది. ఈయన కాలములో ఇస్లామియ విజయాల పరిధి ఇరువై రెండున్నర లక్షల చదరపు మైళ్ళు వరకు విస్తరించుకుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దుఅ కారణంగా అల్లాహ్ ‘ఉమర్ ఫారూఖ్’ (రదియల్లాహు అన్హు) ద్వారా ఇస్లాంకు గౌరవాన్ని ప్రసాదించాడు. వీరి గురించే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “నా తరువాత ఎవరైన ప్రవక్త వుంటే అది ఉమర్ అయ్యేవారు”. ఇస్లాం యొక్క ఈ దీపం ఫజర్ నమాజు చదువుతుండంగా ‘అబు లూలు మజూసి’ యొక్క దాడిలో ముహర్రం ఒకటవ తేది హి.శ 24న ‘షహీద్’ (అమరగతులై) య్యారు. (రి.సా. ఉర్దు – 1, పేజి:35)
ఈ హదీసులో చెప్పిన విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడానికి క్రింది వీడియో తప్పక వినండి:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[1] మక్కా ముకర్రమ మహత్యాలు [2] మదీనా మునవ్వర మహత్యాలు
మొదటి ఖుత్బా
ఇస్లామీయ సోదరులారా!
ఎందరో అదృష్టవంతులు ఈ రోజుల్లో బైతుల్లాహ్ హజ్ (అల్లాహ్ గృహం సందర్శన) యాత్రను పురస్కరించుకొని బిజీగా వున్నారు. అల్లాహ్ వారందరికీ మరియు మనందరికీ ఆమోదయోగ్యమయ్యే హజ్ ను అనుగ్రహించుగాక! మరియు మాటిమాటికి (పలుసార్లు) హరమైన షరీఫైన్ (మక్కా, మదీనాల) సందర్శన అవకాశాన్ని కలిగించుగాక! ఆమీన్!!
నేటి ఖుత్బాలో ఇన్షా అల్లాహ్ మేము హరమైన షరీఫైన్ల కొన్ని మహత్యాలు వివరిస్తాం. కాగా, రాబోయే శుక్రవారం ఖుత్బాలో హజ్ విధిత్వము, దాని మహత్యాలు, విశేషాలను క్షుణ్ణంగా వివరిస్తాం.
అన్నిటి కన్నా ముందుగా మేము పవిత్ర మక్కా పట్టణ మహత్యాలను గురించి వివరిస్తాం. ఎందుకంటే, హజ్ యాత్రలోని ఆచారాలన్నీ మక్కా ముకర్రమ లోనే ఆచరించబడతాయి. పవిత్ర మక్కా పట్టణం యావత్ భూభాగంలో అన్నిటికన్నా శ్రేష్ఠమైన పట్టణం. ఈ పట్టణమే అల్లాహు కు అన్నిటికన్నా ప్రియ మైనది. అందుకే అల్లాహ్, అందరికన్నా శ్రేష్ఠమైన తన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ఈ పట్టణంలోనే పుట్టించాడు మరియు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఇక్కడే దైవదౌత్యాన్ని అనుగ్రహించాడు.
అల్లాహ్ ఈ పట్టణం ప్రాధాన్యత, మహత్యాన్ని దృష్టిలో వుంచుకొని దీని పేరుతో ప్రమాణం చేశాడు.
وَهَٰذَا الْبَلَدِ الْأَمِينِ “శాంతియుతమైన ఈ నగరం (మక్కా) సాక్షిగా!”. (తీన్ 95:3)
అబ్దుల్లా బిన్ అదీ (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం ఆయన, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ‘అల్ హజ్వర’ అనే ప్రదేశంలో నిలబడి (మక్కా పట్టణాన్ని సంబోధిస్తూ) ఇలా సెలవీయడం చూశారు-
‘అల్లాహ్ సాక్షి! నువ్వు అల్లాహ్ యొక్క శ్రేష్ఠమైన మరియు ఆయనకు అత్యంత ప్రియమైన భూభాగానివి. ఒకవేళ నన్ను నీ నుండి బయటికి తీసి వుండకపోతే, నేను ఎప్పుడూ నిన్ను వదిలే వాణ్ణి కాను‘. (తిర్మిజీ: 3925, సహీహ్ -అల్బానీ)
అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పవిత్ర మక్కా పట్టణాన్ని సంబోధిస్తూ ఇలా సెలవిచ్చారు:
“నువ్వు ఎంత చక్కటి పట్టణానివి మరియు నాకెంత ప్రియమైన దానివి! ఒకవేళ నా జాతి గనక, నిన్ను వదిలి పెట్టడానికి నన్ను బలవంత పెట్టి వుండకపోతే, నేను నీ వద్ద తప్ప మరే భూభాగంలోనూ ప్రశాంతత పోందేవాణ్ణి కాదు”. (తిర్మిజి: 3926, సహీహ్ -అల్బానీ)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1) పండుగ ఎవరి కోసం? 2) (ఉపవాసాల) నిర్ణీత సంఖ్య పూర్తయ్యాక అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపడం. 3) దుఆ స్వీకారము. 4) సదాచరణలపై స్థిరంగా వుంటూ అవిధేయతకు దూరంగా వుండడం. 5) పండుగ దినాల్లో ధర్మయుక్తమైన కార్యాలు. 6) పండుగ దినాల్లో చెడు కార్యాలు చేయడం.
ఈ రోజు ఎవరికి ఆనందకరమైనదంటే – ఎవరైతే శుభప్రద రమజాన్ మాసపు ఉపవాసాలన్నింటినీ పాటించారో మరియు సరైన షరీయత్తు పరమైన కారణం లేకుండా వాటిని విడిచిపెట్టలేదో ఆ వ్యక్తికి. ఎందుకంటే, అలాంటి వ్యక్తి గురించే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చి వున్నారు: “ఎవరైనా విశ్వాసస్థితిలో, అల్లాహ్ ద్వారా పుణ్యఫలాన్ని ఆశిస్తూ రమజాన్ మాసపు ఉపవాసాలు పాటిస్తారో, అతని గత పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ, ముస్లిం)
నిశ్చయంగా ఈ రోజు ఎవరికి ఆనందకరమైనదంటే – ఎవరైతే ఈ నెలలో ఉపవాసాలు పాటిస్తూ క్రమం తప్పకుండా తరావీహ్ నమాజ్ చదివారో ఆ వ్యక్తికి. ఎందుకంటే, అలాంటి వ్యక్తి గురించే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఎవరైనా విశ్వాస స్థితిలో, అల్లాహ్ సంతృప్తిని అశిస్తూ రమజాన్ మాసంలో ఖియాం చేశారో, అతని గత పాపాలు మన్నించ బడతాయి.” (బుఖారీ: 37, 2008, ముస్లిం: 759)
రమజాన్ ఉపవాసాలు పాటించి, దానిలో ఖియాం చేసిన అదృష్టవంతు లైన నా ముస్లిం సోదరులారా! మన ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మీకు పాపాల మన్నింపును గురించిన శుభవార్త వినిపించేశారు. ఈ రోజు మీ అందరికీ ఎంతో సంతోషకరమైన దినం. మీరు ఉపవాసాలన్నీ పాటించారు. దీనికి తోడు తరావీహ్ నమాజ్ కూడా చదివారు. అల్లాహ్ వీటన్నింటినీ స్వీకరించు గాక!
ఈ రోజు నిజంగానే ఎవరు సంతోషపడాలంటే – ఎవరైతే లైలతుల్ ఖద్ర్ ఆరాధన పుణ్యఫలాన్ని ఆశిస్తూ ఆఖరి పదిరోజులు బేసి రాత్రులలో ఎంతో శ్రమించి, ఈ రాత్రులలో ప్రత్యేకంగా ఖియాం చేసారో వారు (సంతోషపడాలి). ఎందుకంటే, వీరి గురించే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఎవరైనా విశ్వాస స్థితిలో, పుణ్యఫలాన్ని ఆశిస్తూ, లైలతుల్ ఖద్ర్ ఖియాం చేశారో అతని గతపాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ: 2014, ముస్లిం: 760)
ఈ రోజు నిజంగానే పండుగ రోజు ఎవరికంటే, ఎవరైతే రమజాన్ మాసంలో మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెంది, అల్లాహ్ ను సంతృప్తి పరచారో (వారికే ఈ రోజు పండుగ రోజు).
ఈ రోజు నిజంగానే సంతోషకరమైన దినం ఎవరి కంటే, ఎవరైతే శు భప్రద రమజాన్ మాసాన్ని పొందారో మరియు దానిలో అల్లాహు కు క్షమాపణలు వేడుకొని తమ పాపాలను మన్నింపజేసుకున్నారో (వారికి నిజంగానే ఈ దినం (సంతోషకరమైనది).
నిశ్చయంగా, అత్యంత దురదృష్టవంతుడెవరంటే, రమజాన్ లాంటి మహోన్నత మాసాన్ని పొంది కూడా తన పాపాలను మన్నింప జేసుకోలేక పోయాడో (అతనే అత్యంత దురదృష్టవంతుడు).
ఒక వ్యక్తి పండుగ రోజు విశ్వాసులు నాయకుడు (అమీరుల్ మోమినీన్) అలీ బిన్ అబూ తాలిబ్ (రదియల్లాహుఅన్హు) సన్నిధికి రాగా, ఆయన ఎండిన రొట్టెను జైతూన్తో కలిపి తింటూ వుండడం చూసాడు. అతను- ఓ విశ్వాసుల నాయకా! పండుగ రోజు మీరు ఈ ఎండిన రొట్టెను (భుజిస్తున్నారు? అని అడిగాడు. అలీ (రదియల్లాహు అన్హు) జవాబిస్తూ – “ఓ ఫలానా వ్యక్తీ! పండుగ, మంచి బట్టలు తొడిగి, సరీద్ (మంచి ఆహారం) తినే వారిది కాదు. పైగా ఎవరి ఉపవాసాలు స్వీకరించబడ్డాయో, ఎవరి ఖియాములైల్ ఆమోదించ బడిందో, ఎవరి పాపాలు మన్నించబడ్డాయో మరియు ఎవరి శ్రమకు గౌరవం దక్కిందో వారిదే అసలైన పండుగ. మా కోసమైతే ఈ రోజూ పండుగే, రేపు కూడా పండుగే మరియు అల్లాహ్ అవిధేయతకు దూరంగా వున్న ప్రతి రోజూ పండుగే” అని అన్నారు.
అలాగే, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లాహ్ ఇలా సెలవిచ్చారు: “పండుగ – ఉత్తమ వస్త్రాలు ధరించిన వారిది కాదు, పైగా ప్రళయదినం గురించి భయపడేవారిదే పండుగ”.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
కాలం సాక్షిగా! నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించినవారు, ఒండొకరికి సహనం (స్థయిర్యం) గురించి తాకీదు చేసినవారు మాత్రం నష్టపోరు. (సూర అస్ర్ 103).
ఈ సూర గురించి ఇమాం షాఫిఈ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు:
لو مَا أَنزَلَ اللهُ حُجَّةً على خَلقهِ إلا هَذهِ السُّورةَ لكَفَتهُم “అల్లాహ్ మానవులపై ప్రమాణంగా కేవలం ఈ ఒక్క సూరాను అవతరింపజేసినా, ఇది వారి కొరకు సరిపోయేది“
ఇమాం బుఖారీ రహిమహుల్లాహ్ చెప్పారు: వాచ, కర్మ (మాట మరియు ఆచరణ) కంటే ముందు జ్ఞానం తప్పనిసరి. దీనికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1- దానం చేసిన వారికి ఎన్ని రెట్లు ఎక్కువ ప్రతి ఫలం ఇస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు ? 2- దానం చేసిన వారికి, ప్రపంచంలో ఏమి ప్రయోజనం కలుగుతుంది? సమాధిలో ఏమి ప్రయోజనం కలుగుతుంది ? పరలోకంలో ఏమి ఫలితం దక్కుతుంది ? 3- దానం చేసే వారి కోసం దైవ దూతలు ఏమని దుఆ చేస్తారు ? 4- దానం చేస్తే ధనం తరుగుతుందా ? పెరుగుతుందా ? 5- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంత గొప్పగా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ? 6- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబీకులు ఎలా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ? 7- సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ఎలా దానం చేసే వారో కొన్ని ఉదాహరణలు చెప్పండి ? 8- దాన ధర్మాలు చేయుటకు కొన్ని మంచి మార్గాలు ఏమిటి ? 9- మరణించిన వారి తరుపున వారసులు దానం చేయవచ్చా ? 10- దాన ధర్మాలు చేయు వారు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ?
ఈ ప్రసంగంలో, ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల యొక్క విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. దానధర్మాలు చేయడం ద్వారా లభించే అనేక ప్రయోజనాలు, అవి సంపదను తగ్గించకపోగా పెంచుతాయని, అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి చెడ్డ చావు నుండి కాపాడుతాయని, సమాధిలో మరియు తీర్పు దినాన రక్షణ కల్పిస్తాయని పేర్కొనబడింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆయన కుటుంబ సభ్యులు మరియు సహచరుల జీవితాల నుండి దానశీలతకు సంబంధించిన ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. చివరగా, ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలు, దానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు మరియు జాగ్రత్తలను కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.
అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల విశిష్టత
ఈనాటి ప్రసంగంలో మనం ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల విశిష్టత అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో దాన ధర్మాల విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.
చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసులకు దానధర్మాలు చేయాలని ఆదేశిస్తూ ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 254వ వాక్యంలో మనం చూచినట్లయితే అల్లాహ్ ఈ విధంగా ఆదేశించాడు:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم ఓ విశ్వాసులారా! మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి.
అల్లాహ్ ఇచ్చిన సొమ్ములో నుంచి అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయాలన్న ఆదేశము ఈ వాక్యంలో ఉంది. అయితే దానధర్మాలు చేస్తే కలిగే ప్రయోజనాలు, ఘనత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ పొగిడి ఉన్నాడు.
ఖురాన్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము, మూడు మరియు నాలుగు వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:
వారు నమాజును నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు పెడతారు. నిజమైన విశ్వాసులంటే వీరే
అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేవారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయతులో, ఈ వాక్యంలో పొగిడి ఉన్నాడు.
అలాగే ఎవరైతే అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తారో వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 700 రెట్లు ఎక్కువ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని ఉదాహరించి మరీ తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 261వ వాక్యాన్ని చూడండి:
అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసే వారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక విత్తనాన్ని నాటగా, అది మొలకెత్తి అందులో నుంచి ఏడు వెన్నులు పుట్టుకు వస్తాయి. ప్రతి వెన్నులోనూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరిన వారికి సమృద్ధి వొసగుతాడు. అల్లాహ్ పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతీదీ తెలిసినవాడు.
మనిషి ఒక్క గింజ భూమిలో నాటితే అందులో నుంచి ఒక చెట్టు పుడుతుంది. ఆ చెట్టుకు ఏడు కొమ్మలు ఉంటాయి. ప్రతి కొమ్మకు ఒక్కొక్క వెన్నుగా, ఏడు కొమ్మలకు ఏడు వెన్నులు ఉంటాయి. ప్రతి వెన్నులో వందేసి గింజలు ఉంటాయి అంటే ఏడు వెన్నులకు 700 గింజలు ఆ మనిషికి దక్కుతాయి. నాటింది ఒక్క గింజ కానీ పొందింది 700 గింజలు. ఆ ప్రకారంగా ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక్క దీనారు గానీ, ఒక్క దిర్హము గానీ, ఒక్క రియాలు గానీ, ఒక్క రూపాయి గానీ చిత్తశుద్ధితో దానము చేస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని దానాన్ని మెచ్చుకొని అతనికి 700 రెట్లు ప్రతిఫలము ప్రసాదిస్తాడు అన్నమాట ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది.
దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారి సమస్యలు పరిష్కరించబడటానికి అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడని తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, 92వ అధ్యాయము ఐదు నుండి ఏడు వరకు ఉన్న వాక్యాలను ఒకసారి మనము చూచినట్లయితే:
فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ وَصَدَّقَ بِالْحُسْنَىٰ فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ ఎవరైతే దైవ మార్గంలో ఇచ్చాడో, తన ప్రభువుకు భయపడుతూ ఉన్నాడో ఇంకా సత్ఫలితాన్ని సత్యమని ధ్రువపరిచాడో, అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యము వొసగుతాము.
సమస్యల పరిష్కారము కోసము ప్రజలు టెన్షన్ పడుతూ ఎక్కడెక్కడికో తిరుగుతూ చాలా అగచాట్లు పడుతూ ఉంటారు. అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తే సమస్యల పరిష్కారము కోసము అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి, సమస్యలు పరిష్కరించబడాలంటే దానధర్మాలు చేసుకోవాలన్న విషయం ఇక్కడ మనకు బోధపడింది.
అలాగే దానధర్మాలు చేసే వారికి లభించే మరొక విశిష్టత ఏమిటంటే మరణించిన తర్వాత సమాధిలో అగ్ని వేడి నుండి వారిని కాపాడటం జరుగుతుంది. మనం సమాధి సంగతులు అన్న ప్రసంగంలో వివరంగా విని ఉన్నాం. ఈ సమాధి ఎలాంటిది అంటే కొంతమంది కోసము అది స్వర్గపు లోయలాగా ఉంటుంది. వారు అక్కడ ప్రశాంతంగా పడుకుంటారు. అదే సమాధి మరికొంతమందికి నరక బావి లాగా మారిపోతుంది. వారు అక్కడ కఠినమైన శిక్షలు పొందుతూ ఉంటారు. ఇదంతా వివరంగా మనము సమాధి సంగతులు అనే ప్రసంగంలో విని ఉన్నాం. కాకపోతే ఇక్కడ మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేసిన వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దయా కృపతో సమాధి అగ్ని వేడి నుండి రక్షిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం అస్సహీహా గ్రంథంలోనిది, ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:
إن الصدقة لتطفئ عن أهلها حر القبور (ఇన్న స్సదఖత లతుత్ఫిఉ అన్ అహ్లిహా హర్రల్ ఖుబూర్) నిశ్చయంగా దానధర్మాలు, దానధర్మాలు చేసే వారి కొరకు సమాధి అగ్నిని చల్లార్చి వేస్తుంది.
అంటే దానధర్మాలు చేసిన వారు సమాధిలోని అగ్ని వేడి నుండి రక్షించబడతాడు అన్నమాట.
దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, లెక్కింపు రోజున హషర్ మైదానంలో వారికి నీడ కల్పించడం జరుగుతుంది. పరలోకం అన్న ప్రసంగంలో మనం విని ఉన్నాం వివరంగా. లెక్కింపు రోజున హషర్ మైదానంలో ప్రజలందరినీ ప్రోగు చేయడం జరుగుతుంది. సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. వేడి తీవ్రతతో ప్రజలు అల్లాడుతూ ఉంటారు. చెమటలో కొంతమంది మునుగుతూ ఉంటారు. అక్కడ చెట్టు నీడ గానీ, భవనం నీడ గానీ, పర్వతం నీడ గానీ ఉండదు. కేవలం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సింహాసనం నీడ మాత్రమే ఉంటుంది. అయితే అక్కడ నీడ కొంతమందికి ప్రసాదించబడుతుంది. వారిలో ఒకరు ఎవరంటే ఎవరైతే ప్రపంచంలో దానధర్మాలు చేస్తారో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం సహీ అల్ జామే గ్రంథంలోనిది. ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:
كل امرئ في ظل صدقته حتى يقضى بين الناس (కుల్లుమ్ రిఇన్ ఫీ జిల్లి సదఖతిహీ హత్తా యుఖ్జా బైనన్నాస్) ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు మనిషి తాను చేసిన దానధర్మం యొక్క నీడలో ఉంచబడతాడు.
అంటే ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు అతను ప్రశాంతంగా, అతను ప్రపంచంలో చేసుకున్న దానధర్మాలకు బదులుగా నీడ కల్పించబడి అతను అక్కడ ప్రశాంతంగా ఉంటాడు అన్నమాట.
అలాగే మిత్రులారా, దానధర్మాలు చేయటం వల్ల అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మరియు దానధర్మాలు చేసే వారు చెడ్డ చావు నుండి రక్షించబడతారు అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేసి ఉన్నారు. ఇబ్నె హిబ్బాన్ మరియు తబరానీ గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేశారు:
إن الصدقة لتطفئ غضب الرب وتدفع ميتة السوء (ఇన్న స్సదఖత లతుత్ఫిఉ గజబర్రబ్బి వతద్ఫఉ మీతతస్సూ) నిశ్చయంగా దానధర్మాలు అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి వేస్తాయి మరియు చెడ్డ చావు నుండి రక్షిస్తాయి.
మనం చూస్తూ ఉన్నాం, వార్తల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లలో చదువుతూ ఉన్నాం, ప్రజలు భయంకరమైన చావు చస్తూ ఉన్నారు. దానధర్మాలు చేసే వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భయంకరమైన చావు నుండి కాపాడుతాడు. దానధర్మాలు చేస్తే అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మిత్రులారా.
దానధర్మాలకు ఉన్న మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, దానధర్మాలు చేసే వారి కోసం దైవదూతలు, ఇద్దరు దైవదూతలు దుఆ చేస్తారు, ప్రార్థన చేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఉల్లేఖనం సహీ అత్తర్గీబ్ గ్రంథంలోనిది, ఈ విధంగా ప్రవక్త వారు తెలియజేశారు:
ملكان يناديان (మలకాని యునాదియాని) ఇద్దరు దైవదూతలు పుకారిస్తూ ఉంటారు.
అంటే ఇద్దరు దైవదూతలు వేడుకుంటూ ఉంటారు, అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉంటారు. ఏమని?
اللهم أعط منفقا خلفا (అల్లాహుమ్మ ఆతి మున్ఫిఖన్ ఖలఫన్) ఖర్చు పెట్టే వానికి, ఓ అల్లాహ్! నువ్వు వెంటనే ప్రతిఫలం ప్రసాదించు అని వేడుకుంటూ ఉంటారు.
దైవదూతలు ఆ భక్తుని కోసము దుఆ చేయటం అంటే ఇది గొప్ప విశిష్టత కలిగిన విషయం మిత్రులారా.
ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేమిటంటే విశ్వాస బలహీనత కలిగిన కొంతమంది దానధర్మాలు చేసుకుంటూ పోతే సొమ్ము, ధనము తరిగిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. వాస్తవం అది కాదు. నిజం ఏమిటంటే దానధర్మాలు చేయటం వలన మనిషి యొక్క ధనము పెరుగుతుంది, తరగదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ముస్లిం గ్రంథంలో ఉంది. ప్రవక్త వారు సూటిగా తెలియజేశారు:
ما نقصت صدقة من مال (మా నఖసత్ సదఖతుమ్ మిమ్మాల్) దానధర్మం వల్ల ఏ భక్తుని సొమ్ము, ధనము తరగదు.
తరగదు అంటే పెరుగుతుంది తప్పనిసరిగా అని అర్థం. ఇదే విషయం బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారి నోట తెలియజేశాడు:
قال الله: أنفق يا ابن آدم أنفق عليك (ఖాలల్లాహ్: అన్ఫిఖ్ యా ఇబ్న ఆదమ్ ఉన్ఫిఖ్ అలైక్) ఓ ఆదమ్ కుమారుడా (మానవుడా) నువ్వు ఖర్చు చేయి, నేను నీకు ప్రసాదిస్తాను అన్నాడు.
ఇంతకుముందు కూడా మనం విని ఉన్నాం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మార్గంలో మనం ఒకటి ఇస్తే 700 రెట్లు అల్లాహ్ పెంచి మాకు ఇస్తాడని. ఇక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీరు నా మార్గంలో దానధర్మాలు చేయండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు కాబట్టి మనం కొంచెం ఇస్తే అల్లాహ్ మాకు ఎక్కువగా ఇస్తాడు కాబట్టి, కొంచెం ఇచ్చి ఎక్కువ పొందుతున్నాము కదా? ఆ ప్రకారంగా మన సొమ్ము తరుగుతూ ఉందా, పెరుగుతూ ఉందా? పెరుగుతూ ఉంది. కాబట్టి అదే ప్రవక్త వారు తెలియజేశారు, దానధర్మాల వల్ల సొమ్ము తరగదు గానీ పెరుగుతుంది. చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్తాను అని వాగ్దానం చేశాడు కాబట్టి అల్లాహ్ ఎక్కువ ఇస్తాడు అన్నమాట.
అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శిష్యులకు, మీరు అల్లాహ్ మార్గంలో నిర్భయంగా దానధర్మాలు చేయండి, ఖర్చు పెట్టండి అని ఆదేశించేవారు. ముఖ్యంగా బిలాల్ రజియల్లాహు అన్హు వారి గురించి చూచినట్లయితే, బిలాల్ రజియల్లాహు అన్హు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు, మిష్కాత్ గ్రంథంలోని ఉల్లేఖనంలో, ప్రవక్త వారు అంటున్నారు:
أَنْفِقْ يَا بِلَالُ، وَلَا تَخْشَ مِنْ ذِي الْعَرْشِ إِقْلَالًا (అన్ఫిఖ్ యా బిలాల్, వలా తఖ్ష మిన్ జిల్ అర్షి ఇఖ్లాలా) ఓ బిలాల్, అల్లాహ్ మార్గంలో నువ్వు ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపో, ఆ సింహాసనం మీద ఉన్న అల్లాహ్ పట్ల నువ్వు లేమికి భయపడకు.
అంటే నేను ఇచ్చుకుంటూ పోతే నాకు అల్లాహ్ ఇస్తాడో లేదో అని నువ్వు భయపడవద్దు, నిర్భయంగా నువ్వు అల్లాహ్ మీద నమ్మకంతో దానధర్మాలు చేసుకుంటూ ముందుకు సాగిపో అని ప్రవక్త వారు శిష్యులకు బోధించారు.
మిత్రులారా, ఇప్పటివరకు మనము తెలుసుకున్న విషయం ఏమిటంటే ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ప్రకారంగా అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయడం వలన ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అనేక అనుగ్రహాలు భక్తులు పొందుతారు.
దానశీలురైన భక్తుల ఉదాహరణలు
ఇక రండి, దానధర్మాలు చేసిన కొంతమంది భక్తుల ఉదాహరణలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలోనే గొప్ప భక్తులు ఎవరంటే మన అందరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన చేసిన దానధర్మాలలో ఒక రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచుతూ ఉన్నాను.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితకాలంలో హునైన్ సంగ్రామం జరిగినప్పుడు ప్రవక్త వారి చేతికి 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 1,000 గొర్రెలు, 125 kg ల వెండి వచ్చింది. ఆ పూర్తి సొమ్ము ప్రవక్త వారు వినియోగించుకోవడానికి అవకాశము ఉంది. కానీ ప్రవక్త వారు ఏం చేశారంటే, ప్రజల మధ్య 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 100 గొర్రెలు, 125 kg ల వెండి మొత్తం పంచేశారు. ఒక్క బానిసను గాని వెంట తీసుకెళ్లలేదు, ఒక్క ఒంటెను గాని, ఒక్క గొర్రెను గాని వెంట తీసుకెళ్లలేదు. అంతెందుకు, ఒక్క వెండి నాణెము కూడా ప్రవక్త వారు చేతిలో పెట్టుకొని తీసుకెళ్లలేదు. మొత్తం పంచేసి ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. చూశారా? ప్రవక్త వారు ఎంతగా దానధర్మాలు చేసేవారు, ప్రజలకు పంచిపెట్టేవారో.
మరొక ఉదాహరణ చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “అల్లాహ్ మార్గం చూపిస్తాడు, కూర్చోండి” అని కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మరొక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అన్నారు. అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు, అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ముగ్గురు వచ్చారు, ముగ్గురిని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపు గడిచింది, ఒక శిష్యుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి నాలుగు వెండి నాణేలు బహుమానంగా, హదియాగా ఇచ్చి వెళ్ళాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే అక్కడ కూర్చొని ఉన్న ముగ్గురికి ఒక్కొక్క నాణెము, ఒక్కొక్క నాణెము ఇచ్చేయగా వారు సంతోషంగా తిరిగి వెళ్లిపోయారు. ప్రవక్త వారి వద్ద ఒక్క నాణెం మిగిలిపోయింది. ఎవరైనా వస్తారేమో, అవసరార్థులు వచ్చి అడుగుతారేమో ఇద్దాము అని ఎదురుచూశారు గాని ఎవరూ రాలేదు. ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి సమయంలో ప్రవక్త వారికి నిద్ర పట్టట్లేదు. లేస్తున్నారు, నమాజ్ ఆచరిస్తున్నారు, మళ్లీ పడుకునే ప్రయత్నం చేస్తున్నారు, నిద్ర పట్టట్లేదు, మళ్లీ లేస్తున్నారు నమాజ్ ఆచరిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు చూసి ప్రవక్త వారితో ప్రశ్నించారు: “ఓ దైవ ప్రవక్తా, ఏమైందండి? మీరు చాలా కంగారు పడుతూ ఉన్నారు. కొత్త నిబంధనలు ఏమైనా వచ్చాయా? కొత్త రూల్స్ ఏమైనా వచ్చాయా? వాటిని తలుచుకొని మీరు ఏమైనా కంగారు పడుతూ ఉన్నారా?” అని అడిగితే, ప్రవక్త వారు ఆ ఒక్క వెండి నాణెము తీసి, “ఇదిగో, ఈ వెండి నాణెం వల్ల నేను కంగారు పడుతూ ఉన్నాను. దీన్ని నేను దానం చేయకముందే ఒకవేళ మరణిస్తే, అల్లాహ్ నాకు ఈ ఒక్క నాణెం గురించి అడిగితే నేను ఏమి సమాధానం చెప్పాలి? అది నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను కంగారు పడుతున్నాను” అన్నారు. అల్లాహు అక్బర్! ఒక్క వెండి నాణెము అల్లాహ్ మార్గంలో దానం చేయకపోతే నాకేం గతి పడుతుందో అని ప్రవక్త వారు అంతగా భయపడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు దాన్ని దానం చేసేయాలని ఎదురుచూస్తున్నారంటే, ప్రవక్త వారు ఎంతగా దానం చేసేవారో చూడండి మిత్రులారా. అందుకోసమే చూసిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, ప్రవక్త వారు చాలా అమితంగా, పరిమితి లేకుండా దానధర్మాలు చేసేవారు. ముఖ్యంగా రమజాన్ మాసంలో అయితే గట్టిగా వీస్తున్న గాలి కంటే వేగంగా దానధర్మాలు చేసేవారు అని చూసిన వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు.
ఇక ప్రవక్త వారి కుటుంబీకులను గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త వారి మరణానంతరం, ప్రవక్త వారి సతీమణి, విశ్వాసుల మాత ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి వద్దకు లక్ష దిర్హములు వచ్చాయి కానుకగా. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ఆ రోజు ఉపవాసంతో ఉన్నారు. ఆ లక్ష దిర్హములు కూడా ఆ విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రజల మధ్య పంచేశారు. మొత్తం పంచేసి ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్లారో, సేవకురాలు ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారితో అడుగుతూ ఉన్నారు: “ఏమమ్మా, ఆ దిర్హములలో నుంచి, అనగా ఆ లక్ష దిర్హములలో నుంచి ఏమైనా మిగుల్చుకున్నారా? ఎందుకంటే ఈ రోజు ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి, ఇఫ్తారీ చేయటానికి కూడా ఏమీ లేదు” అన్నారు. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు అన్నారు, “నేను ఒక్క దిర్హము కూడా మిగుల్చుకోలేదు, మొత్తం పంచేశాను” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో కూడా వారు నిర్భయంగా, ఎంత విశాలమైన హృదయంతో ప్రజలకు దానధర్మాలు చేసేవారో చూడండి ప్రవక్త వారి కుటుంబీకులు.
ఇక ప్రవక్త వారి శిష్యుల గురించి మనం చూచినట్లయితే, ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు తబూక్ యుద్ధ సమయంలో ఇంట్లోని సగం సామాగ్రి తీసుకొని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఉంచేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమయ్యా, ఇంట్లో ఏమి మిగిల్చావు?” అంటే, “సగం సామాగ్రి మిగిల్చి, మిగతా సగం తీసుకొని వచ్చి మీ ముందర ఉంచేశాను, ఓ దైవ ప్రవక్తా” అన్నారు. తర్వాత అబూబకర్ రజియల్లాహు అన్హు వారు తీసుకొని వచ్చి సామాగ్రి ప్రవక్త వారి ముందర ఉంచారు. ఆయనతో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమండీ, ఇంట్లో ఏమి మిగిల్చి వచ్చారు?” అంటే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మరియు ప్రవక్త వారి మీద ఉన్న విశ్వాసము, అభిమానము మాత్రమే ఇంట్లో ఉంచి, మిగతా సొమ్ము మొత్తం పట్టుకొని వచ్చి మీ ముందర ఉంచేశానండి” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో ఇద్దరి గురించి చెప్పడం జరిగింది.
మరొక శిష్యుని గురించి మనం చూచినట్లయితే ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు వారు. ప్రవక్త వారి మరణానంతరం అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఖలీఫాగా పరిపాలన చేస్తున్న రోజుల్లో మదీనాలో ఒకసారి కరువు ఏర్పడింది. ప్రజలు వచ్చి అబూబకర్ రజియల్లాహు అన్హు వారితో, “ధాన్యము లేక ప్రజలు ఆకలితో ఉన్నారు, వారి సమస్యను పరిష్కరించండి” అని కోరినప్పుడు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఒక్క రోజు మీరు ఓపిక పట్టండి, రేపు మీ సమస్య తీరిపోతుంది” అన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెలు సిరియా దేశము నుండి ధాన్యం మోసుకొని మదీనాకు చేరాయి. ఆ రోజుల్లో ట్రక్కులు, లారీలు, గూడ్స్ రైళ్లు ఇవన్నీ లేవు కదండీ. ఒంటెల మీద, గుర్రాల మీద సామానులు, ధాన్యము వచ్చేది. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెల మీద సిరియా దేశం నుంచి ధాన్యము మదీనాకు చేరింది. వ్యాపారవేత్తలు ఏం చేశారంటే పరుగెత్తుకుంటూ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వచ్చి, “ఏమండీ, ఈ ధాన్యము మాకు అమ్మండి, మేము మీకు లాభం ఇస్తాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు వారిని అడిగారు, “ఎంత ఇస్తారు మీరు?” అని. ఆ వ్యాపారవేత్తలు ఏమన్నారంటే, “మీరు పదికి కొన్న దాన్ని పదమూడు ఇచ్చి తీసుకుంటాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారు” అన్నారు. వ్యాపారవేత్తలు కొద్దిసేపు ఆలోచించుకొని, “సరేనండి, మీరు పదికి కొన్న దాన్ని పదిహేను ఇచ్చి మేము కొంటాము, మాకు ఇచ్చేయండి” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు మళ్ళీ అదే మాట అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారండి” అన్నారు. వ్యాపారవేత్తలు ఆశ్చర్యపోయారు. “మదీనాలో మేమే పెద్ద వ్యాపారవేత్తలము, మాకంటే ఎక్కువ లాభము మీకు ఇచ్చి ఈ ధాన్యం కొనుగోలు చేసేవాడు ఎవడు ఉన్నాడు, చెప్పండి?” అని అడిగారు. అప్పుడు ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు ఈ విధంగా ప్రకటించారు: “చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన మార్గంలో ఒకటి ఇస్తే 700 రెట్లు ఎక్కువగా ఇస్తాను అని వాగ్దానము చేసి ఉన్నాడు కాబట్టి, మీరందరూ సాక్షిగా ఉండండి, ఈ ఒంటెల మీద ఉన్న పూర్తి ధాన్యాన్ని నేను మదీనా వాసుల కోసము దానం చేసేస్తూ ఉన్నాను, అల్లాహ్ కోసము” అని దానం చేసేశారు. అల్లాహు అక్బర్! చూశారా? ఇది ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఉదాహరణ.
అలాగే అబూ దహ్దా రజియల్లాహు అన్హు అని ఒక సహాబీ ఉండేవారు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని రెండవ అధ్యాయము 245వ వాక్యాన్ని అవతరింపజేశాడో:
مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ أَضْعَافًا كَثِيرَةً అల్లాహ్‌కు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దాన్ని ఆయన ఎన్నోరెట్లు పెంచి తిరిగి ఇస్తాడు.
ఎవరు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసి అల్లాహ్ కు అప్పు ఇస్తాడో, దాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన వద్ద పెంచి పోషించి పెద్దదిగా చేసేస్తాడు, భక్తుడు మరణించి అల్లాహ్ వద్దకు చేరినప్పుడు పెద్ద ప్రతిఫల రూపంలో అతనికి అది ఇవ్వబడుతుంది” అని ఆ వాక్యంలో తెలియజేయబడింది.
కాబట్టి ఆ వాక్యాన్ని విన్న తర్వాత ఆ సహాబీ అబూ దహ్దా రజియల్లాహు తాలా అన్హు వారు ప్రవక్త వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా ప్రకటించి ఉన్నాడు కాబట్టి, మీరు సాక్షిగా ఉండండి, మదీనాలో నాకు 600 ఖర్జూరపు చెట్లు కలిగిన ఒక తోట ఉంది. ఆ తోటను నేను అల్లాహ్ మార్గంలో దానం చేసేస్తున్నాను, అల్లాహ్ కు అప్పు ఇచ్చేస్తూ ఉన్నాను” అని ప్రకటించేశారు. తర్వాత ఆ తోట వద్దకు వెళ్లి తోట లోపల అడుగు కూడా పెట్టకుండా బయట నుంచే నిలబడిపోయి, కుటుంబ సభ్యులు తోట లోపల ఉంటే, “ఏమండీ, మీరందరూ బయటికి వచ్చేయండి, నేను అల్లాహ్ మార్గంలో ఈ తోటను దానం చేసేశాను” అని చెప్పగా కుటుంబ సభ్యులు అందరూ బయటికి వచ్చేసారు. అల్లాహు అక్బర్! ఇవన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులు, సహాబాలు చేసిన దానధర్మాలకు కొన్ని నిదర్శనాలు.
ఇక అలనాటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంనాటి కొంతమంది మహిళల గురించి మనం చూచినట్లయితే, ఇంతకుముందు మనం ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి గురించి విన్నాం. మిగతా వేరే సహాబియాత్ ల గురించి, మహిళల గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మహిళల మధ్య వెళ్లి ప్రసంగించారు. ప్రసంగించిన తర్వాత దానధర్మాలు చేసుకొని మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి అని చెప్పినప్పుడు, మహిళలు దానధర్మాలు చేశారు. చూసిన వారు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, అక్కడ ఉన్న మహిళల్లో కొంతమంది వారు తొడుగుతూ ఉన్న, ధరిస్తూ ఉన్న నగలు సైతము దానం చేసేశారు అని చెప్పారు. ఇవన్నీ కొంతమంది భక్తులు చేసిన దానధర్మాల ఉదాహరణలు మిత్రులారా.
దానధర్మాలు చేసే ఉత్తమ మార్గాలు
అయితే ఖురాన్ మరియు హదీసులలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి దానధర్మాలు చేసుకోవటం మంచిది అని విశిష్టతలు తెలియజేసి ఉన్నారు? రండి ఇప్పుడు మనము కొన్ని ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలను తెలుసుకుందాం.
మొదటి మార్గం: సదకా జారియా అని అరబీలో అంటారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం అని తెలుగులో దాన్ని అనువాదం చేస్తారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం ఏమిటి అంటే ఒక రెండు మూడు విషయాలు మీ ముందర ఉంచుతున్నాను చూడండి.
ఒక వ్యక్తి ఒక మస్జిద్ నిర్మించాడు. ఆ మస్జిద్ నిర్మించిన తర్వాత అతను మరణించినా, ప్రపంచంలో ఆ మస్జిద్ మిగిలి ఉన్నన్ని రోజులు, ప్రజలు అందులో నమాజ్ ఆచరిస్తున్నన్ని రోజులు, మస్జిద్ నిర్మించిన ఆ వ్యక్తి సమాధిలో ఉన్నా గాని అతనికి నిరంతరము పుణ్యము చేరుతూనే ఉంటుంది.
అలాగే ఒక వ్యక్తి ప్రజల దాహం తీర్చడానికి నీటి బావి తవ్వించాడు. తర్వాత అందులో నీళ్లు ప్రజలు తీసుకోవటం కోసము సౌకర్యాలు కల్పించాడు. ఆ తర్వాత అతను మరణించాడు. అతను మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, ఈ బావి ఉన్నన్ని రోజులు, ఆ బావి నీళ్లు ప్రజలు వాడినన్ని రోజులు ఆ వ్యక్తికి నిరంతరం పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది, చేరుతూనే ఉంటుంది. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయండి.
అలాగే ధార్మిక విద్య ఉంది. ఒక గురువుగారు శిష్యులకు ధార్మిక విద్య నేర్పించారు. గురువుగారు మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, శిష్యులు ప్రపంచంలో గురువు వద్ద నేర్చుకున్న విద్యను వారు ఎన్ని రోజులు అయితే అమలుపరుస్తూ ఉంటారో, ఇతరులకు బోధిస్తూ ఉంటారో ఆయనకు నిరంతరము, ఎలాంటి విరామం లేకుండా పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది మిత్రులారా. ఇవి సదకా జారియాకు కొన్ని ఉదాహరణలు. ఇలాంటి సదకా జారియా చేసుకోవాలి. ఇది మొదటి మార్గం.
మరొక మార్గం ఏమిటంటే అనాథలను పోషించాలి. తల్లిదండ్రులు మరణించిన తర్వాత అనాథలు ఎవరైతే ఉంటారో వారిని పోషించటము కూడా గొప్ప పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
أنا وكافل اليتيم كهاتين في الجنة وأشار بالسبابة والوسطى (అనా వకాఫిలుల్ యతీమి కహాతైని ఫిల్ జన్న వ అషార బిస్సబ్బాబతి వల్ వుస్తా) నేను మరియు అనాథ బిడ్డకు పోషించే వ్యక్తి ఇద్దరము స్వర్గంలో పక్కపక్కనే ఉంటాము అని చూపుడు వేలు మరియు మధ్య వేలు ఇలా చూపించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. (అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం)
ఎంత గొప్ప విషయం అండి! ప్రవక్త వారి పొరుగులో మనము ఉండవచ్చు. అల్లాహు అక్బర్! కాబట్టి మనం చేసే దానధర్మాలలో ఒక మంచి మార్గం ఏది అంటే అనాథలను పోషించటం.
అలాగే దానధర్మాలు చేసుకోవటానికి మరొక గొప్ప మార్గం, ప్రజల ఆకలి తీర్చటం, ప్రజల దాహము తీర్చటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు, అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం సారాంశం ఏమిటంటే: “ఎవరైతే విశ్వాసులలో ఆకలితో ఉన్న వారిని అన్నం పెట్టి వారి ఆకలి తీరుస్తాడో, విశ్వాసులలో నీళ్ల కోసము తపిస్తూ ఉన్న విశ్వాసుల దాహాన్ని తీరుస్తాడో, అలాంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గంలోని పండ్లు, ఫలాలు తినిపిస్తాడు, స్వర్గంలోని నదుల నుండి త్రాపిస్తాడు” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఆకలితో ఉన్నవారి ఆకలి తీరిస్తే, దాహంతో ఉన్న వారి దాహము తీరిస్తే ప్రతిఫలంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గపు పళ్ళ ఫలాలు, స్వర్గపు నదుల నీరు త్రాపిస్తాడు, ప్రసాదిస్తాడు మిత్రులారా.
అలాగే ఎవరైతే నిరుపేదలు, సరైన బట్టలు లేవు, నగ్నంగా ఉంటూ ఉన్నారు, అలాంటి వారికి బట్టలు తొడిగించడం కూడా గొప్ప సత్కార్యము, దానధర్మాలు చూసుకోవడానికి ఇది కూడా ఒక ఉత్తమమైన మార్గం. ప్రవక్త వారు తెలియజేశారు:
أَيُّمَا مُسْلِمٍ كَسَا مُسْلِمًا ثَوْبًا عَلَى عُرْيٍ كَسَاهُ اللَّهُ مِنْ خُضْرِ الْجَنَّةِ (అయ్యుమా ముస్లిమ్ కసా ముస్లిమన్ సౌబన్ అలా ఉరన్ కసాహుల్లాహు మిన్ ఖుజ్రిల్ జన్న) ఏ భక్తుడైతే నగ్నంగా ఉన్న వారికి బట్టలు తొడిగిస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలంగా స్వర్గంలోని పచ్చని దుస్తులు ధరింపజేస్తాడు అన్నారు. ( అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం)
అల్లాహు అక్బర్! స్వర్గంలోని మంచి బట్టలు, ఉత్తమమైన బట్టలు, పచ్చని బట్టలు అల్లాహ్ ఆ భక్తునికి ఇస్తాడని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.
అలాగే దానధర్మాలు చేసుకోవటం కోసము మరొక సౌకర్యవంతమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రుల తరఫున, వారు మరణించిన తర్వాత వారి బిడ్డలు దానధర్మాలు చేసుకోవచ్చు. చూడండి దీనికి ఉదాహరణగా తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనం ప్రామాణికమైనది. సాద్ రజియల్లాహు తాలా అన్హు వారు, ఒక సహాబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారు:
يا رسول الله إن أمي توفيت أفينفعها إن تصدقت عنها (యా రసూలల్లాహ్ ఇన్న ఉమ్మీ తువఫియత్ అఫయన్ఫఉహా ఇన్ తసద్దఖ్తు అన్హా) ఓ దైవ ప్రవక్తా! నా తల్లి మరణించింది. నేను ఆవిడ తరపున సదఖా చేస్తే, దానధర్మాలు చేస్తే ఆవిడకు ప్రయోజనము చేకూరుతుందా? అని అడిగారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “నఅమ్. అవును, తప్పనిసరిగా ఆవిడ పేరున నువ్వు దానధర్మాలు చేసుకోవచ్చు, ఆవిడకు ప్రయోజనము చేకూరుతుంది” అని అనుమతి ఇచ్చేశారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన వద్ద ఒక తోట ఉండింది, ఆ తోటను ఆయన వారి తల్లి పేరు మీద దానం చేసేశారు. అల్లాహు అక్బర్! ఈ ఉల్లేఖనం ప్రకారంగా మనకు స్పష్టమైన విషయం ఏమిటంటే మన తల్లిదండ్రుల్లో ఎవరు మరణించి ఉన్నా వారి బిడ్డలుగా మనము ప్రపంచంలో వారి పేరు మీద దానధర్మాలు చేయవచ్చు, వారికి పుణ్యము దక్కేలాగా ప్రయత్నించవచ్చు.
ఎప్పుడు దానధర్మాలు చేయాలి?
ఇక దానధర్మాలు ఎప్పుడు చేసుకోవాలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
أن تصدق وأنت صحيح شحيح تخشى الفقر وتأمل الغنى (అన్ తసద్దఖ వఅన్త సహీహున్ షహీహున్ తఖ్ షల్ ఫఖర వతఅమలుల్ గినా)
నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడు, బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నాకు ఏమైనా ఇంకా తక్కువ పడుతుందేమో అన్న భయము కలుగుతూ ఉన్నప్పుడు, నాకు ఇంకా డబ్బు కావాలి ధనము కావాలి అని ఆశిస్తున్నప్పుడు, నువ్వు దానధర్మము చేస్తే అది నీ కొరకు ఉత్తమమైన సందర్భము అన్నారు. (బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం)
ఎప్పుడైతే మనిషి యవ్వనంగా ఉన్నప్పుడు ఎక్కువ సొమ్ము కావాలి అని అతనికి ఎక్కువ కోరికలు ఉంటాయి కాబట్టి ఎక్కువ సొమ్ము కావాలని కోరుకుంటాడు. చాలా అవసరాలు ఉంటాయి, ఆస్తులు కావాలి, ఇల్లు నిర్మించుకోవాలి, భార్య బిడ్డలకు నగలు తొడిగించుకోవాలి, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. అప్పుడు సొమ్ము కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో మనిషి తన అవసరాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ కూడా అల్లాహ్ మార్గంలో దానం చేసినట్లయితే అది ఉత్తమమైన సందర్భం అని ప్రవక్త వారు తెలియజేశారు. అదే ముసలివారు అయిపోయిన తర్వాత, చావు దగ్గరికి వచ్చేసిన తర్వాత మనిషి ఏం చేస్తాడండి? ఎలాంటి కోరికలు ఉండవు. ఇంక ఎలాగూ ప్రపంచం వదిలేసి వెళ్ళిపోతున్నాము కదా, వెంట తీసుకొని వెళ్ళము కదా అని అప్పుడు దానం చేయటం కంటే కూడా అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు, కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో దానధర్మాలు చేస్తే అది ఎక్కువ ప్రయోజనం కల్పించే విషయం అని ప్రవక్త వారు అన్నారు.
దానధర్మాలలో పాటించవలసిన జాగ్రత్తలు
ఇక చివర్లో, దానధర్మాలు చేసే వారికి కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, మొదటి విషయం, దానధర్మాలు చేసే వారు ధర్మసమ్మతమైన, హలాల్ సంపాదనతో మాత్రమే దానధర్మాలు చేయాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనం:
إن الله عز وجل لا يقبل صلاة بغير طهور ولا صدقة من غلول (ఇన్నల్లాహ అజ్జవజల్ లా యఖ్బలు సలాతన్ బిగైరి తహూరిన్ వలా సదఖతన్ మిన్ గలూలిన్) ఉజూ లేకుండా నమాజు చేస్తే అలాంటి నమాజు అల్లాహ్ ఆమోదించడు, హరామ్ సంపాదనతో దానధర్మాలు చేస్తే అలాంటి దానధర్మాలను కూడా అల్లాహ్ ఆమోదించడు అన్నారు.
కాబట్టి హరామ్ సంపాదనతో కాదు, హలాల్ సంపాదన, ధర్మసమ్మతమైన సంపాదనతో దానధర్మాలు చేసుకోవాలి.
రెండవ సూచన ఏమిటంటే, దానధర్మాలు చేసే వారు ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు. కేవలం అల్లాహ్ చిత్తం కోసం మాత్రమే దానధర్మాలు చేయాలి. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే నేడు ప్రజలు ఏం చేస్తారంటే, డబ్బు లేదా ఇతర వస్తువులు ఇతరులకు దానం చేస్తూ ఉన్నారంటే ఎన్ని సెల్ఫీలు, ఎన్ని ఫోటోలు, ఎన్ని వీడియోలు తీసుకుంటారంటే ఇక దాన్ని సోషల్ మీడియాలో, ప్రతి ప్లాట్‌ఫామ్‌లో, స్టేటస్‌లలో వేరే వేరే చోట ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో నాకంటే గొప్ప దానకర్త ఎవరైనా ఉన్నారో లేదో చూడండి అని చూపిస్తూ ఉంటారు. ఇది కాదండి కావాల్సింది. ప్రపంచానికి చూపించటం, స్టేటస్‌లలో పెట్టుకోవడం కాదు, అల్లాహ్ కు నచ్చాలి. దాని కోసం మనం దానధర్మం చేయాలి. ప్రజలకు చూపించటానికి, ప్రజల దృష్టిలో నేను దాతను అనిపించుకోవడానికి కాదండి. అల్లాహ్ మెచ్చుకోవాలన్న ఉద్దేశంతో చేయాలి. ప్రదర్శనా బుద్ధితో దానం చేస్తే దాని పుణ్యం వృధా అయిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం:
ومن تصدق يرائي فقد أشرك (వమన్ తసద్దఖ యురాయీ ఫఖద్ అష్రక) ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో, చూపించటానికి దానధర్మాలు చేస్తాడో, అతను బహుదైవారాధనకు పాల్పడినట్లు అవుతుంది అన్నారు.
అల్లాహు అక్బర్! కాబట్టి ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు.
మూడవ విషయం, దానధర్మాలు చేసిన తర్వాత ఉపకారము చాటకూడదు. దెప్పి పొడవటం అంటారు కదండీ. ఉపకారము చాటకూడదు. ఇచ్చిన తర్వాత నేను నీకు ఇచ్చాను కదా, అది ఇచ్చాను కదా, ఇది ఇచ్చాను కదా అని కొంతమంది వారి మీద ఉపకారం చాటుతూ ఉంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే చేసిన ఆ దానధర్మాల పుణ్యం మొత్తం వృధా అయిపోతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు.
ఇక చివర్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానం ఇచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా కఠినంగా హెచ్చరించారు. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, “ఎవరైతే దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటారో వారు కక్కిన దాన్ని మళ్ళీ నోట్లో వేసుకున్న దానికి సమానం అన్నారు”. అల్లాహు అక్బర్!
ఇవి దానధర్మాలు చేసుకోవటానికి, దానధర్మాలు చేసే వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు. నేను చివర్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన అందరికీ అన్న, విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఉపవాసం పాటించే వారు ఎందరో? కానీ పుణ్యాలు పొందే వారు కొందరే! ఎందుకో తెలుసుకోండి https://youtu.be/JC8rwimqiyw [1 నిముషం] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లా చెప్పారు, ప్రతి ఆరాధనలో ఎందులోనైతే ఎక్కువగా అల్లాహ్ యొక్క జిక్ర్ (స్మరణ) ఉంటుందో దాని యొక్క ఘనత పుణ్య పరంగా ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం తో ప్రశ్నించడం జరిగింది, జీహాద్ లో ఎక్కువ పుణ్యం ఎవరికి లభిస్తుంది అంటే అల్లాహ్ యొక్క జిక్ర్ ఎక్కువ చేసిన వారికి. అలాగే నమాజ్, జకాత్, హజ్ విషయాల్లో కూడా ప్రశ్నించడం జరిగింది. అలాగే “అయ్యుస్-సాయిమీన ఆజము అజ్రా”, ఉపవాసంలో ఎవరికి ఎక్కువగా పుణ్య ఫలితం లభిస్తుంది అన్నటువంటి ప్రశ్నకు కూడా “అక్సరుహుమ్ లిల్లాహి జిక్రా”, ఎవరైతే ఎక్కువగా అల్లాహ్ ను స్మరిస్తారో.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.