عَنْ أَبِي عَبْدِ اللَّهِ النُّعْمَانِ بْنِ بَشِيرٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا، قَالَ: سَمِعْت رَسُولَ اللَّهِ صلى الله عليه و سلم يَقُولُ: “إنَّ الْحَلَالَ بَيِّنٌ، وَإِنَّ الْحَرَامَ بَيِّنٌ، وَبَيْنَهُمَا أُمُورٌ مُشْتَبِهَاتٌ لَا يَعْلَمُهُنَّ كَثِيرٌ مِنْ النَّاسِ، فَمَنْ اتَّقَى الشُّبُهَاتِ فَقْد اسْتَبْرَأَ لِدِينِهِ وَعِرْضِهِ، وَمَنْ وَقَعَ فِي الشُّبُهَاتِ وَقَعَ فِي الْحَرَامِ، كَالرَّاعِي يَرْعَى حَوْلَ الْحِمَى يُوشِكُ أَنْ يَرْتَعَ فِيهِ، أَلَا وَإِنَّ لِكُلِّ مَلِكٍ حِمًى، أَلَا وَإِنَّ حِمَى اللَّهِ مَحَارِمُهُ، أَلَا وَإِنَّ فِي الْجَسَدِ مُضْغَةً إذَا صَلَحَتْ صَلَحَ الْجَسَدُ كُلُّهُ، وَإذَا فَسَدَتْ فَسَدَ الْجَسَدُ كُلُّهُ، أَلَا وَهِيَ الْقَلْبُ
[رَوَاهُ الْبُخَارِيُّ]، [وَمُسْلِمٌ]

అనువాదం
నోమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెబుతుండగా నేను విన్నాను:
“నిశ్చయముగా ‘హలాల్’ (ధర్మ సమ్మతమైన) విషయాలు స్పష్టంగా తెలుపబడ్డాయి, ‘హరామ్’ (నిషేధిత) విషయాలు కూడా స్పష్టంగా తెలుపబడ్డాయి. అయితే ఆ రెండింటి మధ్య కొన్ని అస్పష్ట విషయాలు ఉన్నాయి. వాటి గురించి చాలా మంది ఎరుగరు. అయితే ఎవరైతే అస్పష్ట విషయాలకు దూరంగా ఉంటారో, వారు తమ ధర్మాన్ని, గౌరవాన్ని కాపాడుకున్న వారవుతారు. మరి ఎవరైతే అస్పష్ట విషయాల్లో పడిపోతారో వారు ‘హరాం’ నిషిద్ధ విషయాల్లో పడిపోతారు. పశువుల్ని మేపుకుంటున్న కాపరిలా, అతను గరిక గట్టుపై పశువుల్ని మేపు కుంటుంటాడు. అతని పశువులు ప్రక్కనున్న పొలములోకి చొరబడే అవకాశం అతి దగ్గరలోనే వుంది. గుర్తుంచుకోండి! నిశ్చయంగా ప్రతి రాజుకి కాపాడుకునే సరిహద్దులుంటాయి. గుర్తుంచుకోండి! మరి నిశ్చయంగా అల్లాహ్ (సామ్రాజ్య) సరిహద్దులంటే ఆయన నిషేధించి (హరాం చేసి)న విషయాలే. వినండి.! నిశ్చయంగా మానవ శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది. అది క్షేమముగా వుంటే మొత్తం శరీరం క్షేమముగా వుంటుంది. ఒక వేళ అది చెడిపోతే మొత్తం మానవ శరీరమే చెడిపోతుంది. బాగా గుర్తుంచుకోండి! ఆ మాంసపు ముద్దే మానవ హృదయం”.
పుస్తక సూచనలు
సహీహ్ బుఖారీ – 52, సహీహ్ ముస్లిం-1599.
తెలుగు రియాజుస్సాలిహీన్ 1 పేజి 780, హ588.
(సహీహ్ బుఖారీ, విశ్వాస ప్రకరణం. సహీహ్ ముస్లిం, లావాదేవీల ప్రకరణం)
హదీసు ప్రయోజనాలు
1. ‘షరీఅత్’లో హలాల్ (సమ్మత), మరియు హరామ్ (అసమ్మత) విషయాలను వివరించబడింది. ఇక అస్పష్టమైన అంశాలు కొన్ని వున్నాయి, వాటి గురించి లోతైన అవగాహన కొందరికే ఉంటుంది.
2. ప్రవక్త వారి ఉన్నతమైన బోధనా ఉదాహరణలతో కూడి ఉన్నది.
3. బుద్ధి (ఆలోచన) అనేది హృదయంలో వుంటుంది. ప్రవక్త వారి అదేశం: వినండి.! నిశ్చయంగా మానవ శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది. అది బాగుంటే మొత్తం శరీరం బాగుంటుంది. ఒకవేళ అది చెడిపోతే మొత్తం మానవ శరీరమే చెడిపోతుంది. బాగా గుర్తుంచుకోండి! అదే మానవ హృదయం”.
4. అలజడి గాని, దిద్దుబాటు గాని, హృదయం చుట్టూ తిరుగుతుంటుంది. అందుకనే ప్రతి చక్కబెట్టే విషయంతో హృదయాన్ని చక్కబెట్టడానికి ప్రయత్నిస్తూవుండాలి.
5 అన్ని అవయవాల కంటే హృదయం ఉన్నతమైనది.
6. బాహ్య విషయాల్లో అలజడి అంతర విషయాల్లోని అలజడిని దృవీకరిస్తూంది. “వినండి.! నిశ్చయంగా మానవ శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది. అది క్షేమముగా వుంటే మొత్తం శరీరం క్షేమముగా వుంటుంది. ఒకవేళ అది చెడిపోతే మొత్తం మానవ శరీరమే చెడిపోతుంది. బాగా గుర్తుంచుకోండి! అదే మానవ హృదయం”.
7. అస్పష్ఠ విషయాల్లో పడకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే స్పష్టమైన (హరాం) విషయాలకు గురికాకుండ ఉండటానికి.
8. ధార్మిక విషయాలను మరియు మానవాళికి సౌలభ్యం చేకూర్చె వాటిని కాపాడాలి.
9. అనుమానాలు రేకెత్తించే విషయాలకు దూరంగా వుండాలి.
10. ఎవరైతే అస్పష్ఠ విషయాలలో జాగ్రత్త వహించరో వారు తమకు తాము వాటితో మిళితం చేసుకుంటారు లేక హరాం (నిషేధిత) విషయాలకు లోనవుతారు.
11. హరాం (నిషేధిత) విషయాల వైపుకు ప్రేరేపించే వాటికి అడ్డుకట్ట. ప్రవక్త ( సల్లల్లాహు అలైహి వసల్లం) వాక్యం: “గుర్తుంచుకోండి! నిశ్చయంగా ప్రతి రాజుకి ఒక కాపాడుకునే కంచె ఉంటుంది. గుర్తుంచుకోండి! మరి నిశ్చయంగా అల్లాహ్ (సామ్రాజ్య) సరిహద్దులంటే ఆయన నిషేధించి (హరాం చేసి)న విషయాలే”.
12. మంచి వృత్తిని ఎన్నుకోవడంలో హృదయము యొక్క దిద్దుబాటు వుంటుంది.
13. ధార్మిక జ్ఞానములో స్పష్టత సాధించాలని ప్రోత్సహించబడింది.
14. ‘ముర్జియా’ (ఒక వర్గం పేరు) యొక్క విశ్వాస’ భావనలను ఖండించబడింది. వారి భావన: “ఈమాన్ ఉంటే పాపాలు (దుష్కార్యాలు) నష్టపర్చలేవు”.
హదీసు ఉల్లేఖులు
హజ్రత్ అబూ అబ్దుల్లాహ్ నౌమాన్ బిన్ బషీర్ (రజియల్లాహు అన్హు):
నౌమాన్ బిన్ బషీర్ బిన్ సఅలబ బిన్ సఅద్ బిన్ ఖల్లాస్, అల్ అన్సారి, అల్ ఖజ్ రజి పేరు. ‘కున్నియత్’ ‘అబూ అబ్దుల్లాహ్ ‘. వీరి తల్లి దండ్రులు ఇద్దరు సహాబీలుగా పేరుగావించినవారు. ‘హిజ్రత్’ యొక్క 14వ మాసములో జన్మించారు, మదీన అన్సారుల్లో వున్నందున అన్సారి మరియు మదనిగా పిలవబడ్డారు. ‘షామ్’ లో నివాసము ఏర్పర్చుకున్నారు. ‘ముఆవియహ్’ తరపున తొలుత ‘కూఫా’ తరువాత ‘హిమ్స్’ ప్రాంతాల యొక్క అధికారి, మరియు గవర్నరుగా నిర్ణయించబడ్డారు. 64వ హి.శ. లో ‘రాహిత్’ నాడు ‘ఖాలిద్ బిన్ ఖలీ, కలాయి’ చేతుల్లో ‘షహీద్’ (అమరగతులు) అయ్యారు. హదీసు గ్రంథాల్లో వారి ఉల్లేఖనాల సంఖ్య 114గా చెప్పబడుతుంది.
(రి.సా. ఉర్దు – 1, పేజి:232)
–
అల్ అర్బయీన్ అన్నవవియ్యహ్ – 40 హదీసుల సమాహారం (మెయిన్ పేజీ)
https://teluguislam.net/40h/
You must be logged in to post a comment.