వివాహ ఆదేశాలు – 2: విడాకులు, ఖుల, ముస్లిమేతరులతో వివాహం [వీడియో]

బిస్మిల్లాహ్

[31: 28 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

విడాకులు ఇచ్చే హక్కు ఎవరిది ❓
భార్యకు భర్త నుండి విడిపోయే హక్కు ఉందా ❓దాన్ని ఏమంటారు❓
ముస్లిమేతరుల తో వివాహ ఆదేశాలు ఏమిటి❓ లాభ నష్టాలు ఏమిటి ❓

మొదటి భాగం క్రింద వినవచ్చు
వివాహ ఆదేశాలు -1: నిబంధనలు, ధర్మములు, నిషిద్ధతలు [వీడియో]

విడాకులు

విడాకులు ఇష్టమైన కార్యమేమి కాదు. అయినా కొన్ని సందర్భాల్లో అనివార్యం. ఉదా: భార్యకు భర్తతో, లేదా భర్తకు భార్యతో జీవితం గడపడం కష్టతరమైనప్పుడు. లేదా మరే కారణమైనా సంభవించినప్పుడు అల్లాహ్ తన దయ, కరుణతో దీనిని తన దాసుల కొరకు ధర్మసమ్మతం చేశాడు. ఎవరికైనా ఇలాంటి అవసరం పడినప్పుడు విడాకులివ్వచ్చును. కాని అప్పుడు క్రింది విషయాలను దృష్టిలో ఉంచుకొనుట చాలా ముఖ్యం.

1- భార్య బహిష్టుగా ఉన్నప్పుడు విడాకులివ్వకూడదు. అప్పుడు విడాకులిచ్చాడంటే అతను అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవిధేయతకు మరియు నిషిద్ధ కార్యానికి పాల్పడినట్లే. అందుకు అతను విడాకులని చెప్పిన తన మాటను వెనక్కి తీసుకొని ఆమెను తన వద్దే ఉంచుకోవాలి. పరిశుద్ధమయిన తర్వాత విడాకులివ్వాలి. ఇప్పుడు కూడా ఇవ్వకుండా మరో సారి బహిష్టు వచ్చి పరిశుభ్రమయ్యాక తలచుకుంటే విడాకులివ్వాలి లేదా తన వద్దే ఉంచుకోవాలి.

2- పరిశుద్ధంగా ఉన్న రోజుల్లో ఆమెతో సంభోగిస్తే విడాకులివ్వకూడదు. కాని అప్పుడు ఆమె గర్భవతి అని తెలిస్తే విడాకు- లివ్వచ్చును. ఒకవేళ ఆమె గర్భం దాల్చకుంటే, వచ్చే నెలలో ఆమె బహిష్టురాళయి పరిశుభ్రమయ్యే వరకు ఓపిక వహించి, ఆ పరిశుభ్రత రోజుల్లో ఆమెతో సంభోగించకుండా విడాకులివ్వాలి.

విడాకులైన తరువాత

విడాకుల వల్ల భార్య భర్తతో విడిపోతుంది గనక కొన్ని ఆదేశాలు వర్తిస్తాయి వాటిని పాటించటం అవసరం.

1- భర్త సంభోగించి, లేదా కేవలం ఏకాంతంలో ఆమెతో ఉండి విడాకులిస్తే నిర్ణీత గడువు కాలం పూర్తి చేయుట ఆమెపై విధి. సంభోగించక, ఏకాంతంలో ఉండక విడాకులిస్తే ఆమెపై ఏ గడువూ లేదు. బహిష్టురాళ్ళ గడువు కాలం మూడు సార్లు బహిష్టు రావడం. బహిష్టు రాని స్త్రీల గడువు కాలం మూడు నెలలు. గర్భిణీల గడువు కాలం ప్రసవించే వరకు.

గడువు కాలం నిర్ణయించడంలో గొప్ప లాభం ఉందిః విడాకులిచ్చిన స్త్రీని తిరిగి తమ దాంపత్యంలోకి మరలించు- కునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆమె గర్భిణీయా లేదా అనేదీ తెలుస్తుంది.

2- ఇప్పుడిచ్చే విడాకులకు మునుపు రెండు విడాకులిచ్చి ఉంటే ఈ విడాకుల తర్వాత భార్య అతనిపై నిషిద్ధమవుతుంది. అంటే భర్త ఒకసారి విడాకులిచ్చి నిర్ణీత గడువులో మరలించుకున్నాడు లేదా నిర్ణీత గడువు కాలం దాటినందుకు పునర్వివాహం చేసుకున్నాడు. మళ్ళీ రెండవసారి విడాకులిచ్చాడు, నిర్ణీత గడువులో మరలించుకున్నాడు లేదా అది దాటినందుకు పునర్వివాహం చేసుకున్నాడు. ఇక మూడవసారి విడాకులిచ్చి- నట్లయితే ఆమె అతనికి ధర్మసమ్మతం కాదు. (మరలించుకునే హక్కు సయితం అతనికీ ఉండదు). ఆమె మరో వ్యక్తితో సవ్యమైన రీతిలో వివాహం చేసుకోవాలి. అతను ఆమెతో కాపురం చేయాలి. మళ్ళీ అతను ఆమెను ఇష్టపడక, ఆమెతో జీవితం గడపడం సంభవం కాక తనిష్టంతో విడాకులిచ్చిన సందర్భంలో ఆమె మొదటి వ్యక్తి కొరకు ధర్మసమ్మతం అవుతుంది. (అయితే మరో వ్యక్తి పెళ్ళి చేసుకునే, విడాకులిచ్చే ఉద్ధేశం ఆమెను మొదటి వ్యక్తి కొరకు హలాల్ చేయడమైతే మరి అందులో ఆ మొదటి వ్యక్తి ప్రోత్సాహం కూడా ఉంటే వారిద్దరూ ప్రవక్త నోట వెలువడిన శాపనానికి గురవుతారు. (అబూ దావూద్, కితాబున్నికాహ్, బాబున్ ఫిత్తహ్ లీల్). ఏ భర్త తన భార్యకు మూడు సార్లు విడాకులిచ్చాడో, అతను తిరిగి ఆమెను భార్యగా చేసుకునే విషయాన్ని అల్లాహ్ నిషిద్ధ పరచి స్త్రీ జాతిపై చాలా కనికరించాడు. వారిని వారి భర్తల అత్యాచారాల నుండి కాపాడాడు.

“ఖులఅ”

“ఖులఅ” అంటేః భర్తతో జీవితం గడపడం ఇష్టంలేని స్త్రీ, భర్త నుండి తీసుకున్న మహరు సొమ్ము (కన్యాశులకం) అతనికి వాపసు చేసి, అతని వివాహ బంధం నుండి విముక్తి పొందదలుచుకొనుట. ఒకవేళ భర్త ఆమెను ఇష్టపడక భార్యను విడిచిపెట్టాలనుకుంటే భార్య నుండి ఏ సొమ్ము తీసుకునే హక్కుండదు. అతను ఓపికతో ఆమెను సంస్కరిస్తూ జీవితం గడపాలి. లేదా మంచి విధంగా విడాకులివ్వాలి.

భర్తతో జీవితం గడపడం వాస్తవంగా దుర్భరమై, సహనం వహించడం కష్టతరమైతేనే తప్ప ఏ స్త్రీ కూడా తన భర్తతో ఖులఅ కోరుట మంచిది కాదు. అలాగే భార్య తన నోట ఖులఅ కోరాలనే ఉద్దేశంతో ఆమెను హింసించడం భర్తకూ ధర్మసమ్మతం కాదు. ఖులఅ కోరడంలో స్త్రీ న్యాయంపై ఉంటే భర్త సంతోషంగా విడాకు- లివ్వాలి. మరియు అతను ఇచ్చిన మహరు కంటే ఎక్కువగా ఆమె నుండి తీసుకోవడం కూడా మంచిది కాదు. ఒకవేళ అతను ఆమెకు ఇచ్చిన మహరు వాపసు తీసుకోకుంటే మరీ మంచిది.

వివాహ బంధాన్ని నిలుపుకునే, తెంచుకునే స్వేచ్ఛ

ఈ క్రింది కారణాల్లో ఏ ఒకటైనా భర్త భార్యలో లేదా భార్య భర్తలో చూసినచో వారు తమ వివాహ బంధాన్ని నిలుపుకునే లేదా తెంచుకునే స్వేచ్ఛ కలిగి ఉంటారు.

అఖ్ద్ సందర్భంలో తెలియని ఏదైనా వ్యాది, శారీరక లోపం భర్త భార్యలో లేదా భార్య భర్తలో తర్వాత చూసినచో తమ వివాహ బంధాన్ని నిలుపుకునే లేదా తెంచుకునే హక్కు వారికుంది. ఉదాః

1- ఇద్దరిలో ఏ ఒకరైనా పిచ్చివారు లేదా వ్యాదిగ్రస్తులయి రెండో వారి హక్కు నెరవేర్చ లేని స్థితిలో ఉంటే రెండో వారు వివాహ బంధం నుండి విముక్తి పొందవచ్చు. ఈ విషయం పరస్పర సంభోగానికి ముందు జరిగితే భర్త భార్యకు మహరు ఇచ్చి యుంటే దానిని తిరిగి తీసుకోవచ్చు.

2- భర్త వద్ద మహరు నగదు ఇచ్చే శక్తి లేనప్పుడు మరియు వారిద్దరిలో సంభోగం జరగక ముందు భార్యకు భర్త నుండి విడిపోయే హక్కుంటుంది. సంభోగం జరిగిన తర్వాత మాత్రం ఈ హక్కు ఉండదు.

3- భర్త వద్ద పోషణ ఖర్చులు ఇచ్చే శక్తి లేనప్పుడు భార్య కొద్ది రోజులు వేచి చూడాలి. ఏమీ ప్రయోజనం ఏర్పడకుంటే న్యాయ- వంతులైన ముస్లిం పెద్దల సమక్షంలో మాట పెట్టి విడిపోయే హక్కుంటుంది.

4- ఆచూకీ తెలియకుండా పరారీలో ఉన్న భర్త ఇల్లాలు పిల్లలకు ఏమీ ఖర్చులు ఉంచలేదు. ఎవరికీ వారి ఖర్చుల బాధ్యత అప్పజెప్పలేదు. వారి ఖర్చులు భరించువారెవరు లేరు. తన ఖర్చులకు ఆమె వద్ద కూడా ఏమీ లేదు. అలాంటప్పుడు ముస్లిం న్యాయశీలులైన పెద్దల మధ్యవర్తిత్వంతో ఆ వివాహ బంధం నుండి విడిపోవచ్చును.

అవిశ్వాసులతో వివాహం

ముస్లిం పురుషుడు అవిశ్వాసిరాళ్ళను (హిందు, బుద్ధ తదితర మత స్త్రీలను) వివాహమాడుట ధర్మసమ్మతం కాదు. యూద, క్రైస్తవ స్త్రీలను పెళ్ళాడడం యోగ్యమే. అయితే ముస్లిం స్త్రీ వివాహం ముస్లిం పురుషునితో తప్ప ఎవ్వరితో ధర్మ సమ్మతం కాదు. యూదుడు, క్రైస్తవుడైనా సరే యోగ్యం కాదు.

ముస్లిమేతర జంటలో భార్య ముందుగా ఇస్లాం స్వీకరిస్తే భర్త ఇస్లాం స్వీకరించే వరకు ఆమె అతనితో సంభోగానికి ఒప్పుకొనుట ధర్మసమ్మతం కాదు. అవిశ్వాసులతో వివాహ విషయంలో ప్రత్యేక ధర్మాలు క్రింద తెలుపబడుచున్నవిః

1- భార్యాభర్తలిద్దరూ ఒకేసారి ఇస్లాం స్వీకరిస్తే వారు అదే నికాహ్ పై ఉందురు (అంటే కోత్తగా మరోసారి “అఖ్దె నికాహ్” వివాహ ఒప్పందం అవసరం లేదు). ధార్మిక ఆటంకం ఏదైనా ఉంటే తప్ప. ఉదాః భర్తకు ఆమె మహ్రమాతులో అయి యుండవచ్చు. లేదా ఆమెతో వివాహం చేసుకొనుట అతనికి యోగ్యం లేకుండవచ్చు. అలాంటప్పుడు వారిద్దరు విడిపోవాలి.

2- యూద, క్రైస్తవ జంటల్లో కేవలం భర్త ఇస్లాం స్వీకరిస్తే వారు అదే నికాహ్ పై ఉందురు.

3- యూద, క్రైస్తవుల్లో గాకుండా వేరే మతఅవలంభికుల జంట ల్లో ఏ ఒక్కరైనా సంభోగానికి ముందే ఇస్లాం స్వీకరిస్తే వారి వివాహ బంధం తెగిపోతుంది. వారు భార్యాభర్తలుగా ఉండలేరు.

4- ముస్లిమేతర జంటల్లో భార్య సంభోగముకు ముందే ఇస్లాం స్వీకరిస్తే ఆమె అతని వివాహ బంధం నుండి విడిపోవును. ఎందుకనగా ముస్లిం స్త్రీ అవిశ్వాసులకు భార్యగా ఉండడం ధర్మ సమ్మతం కాదు.

5- ముస్లిమేతర జంటల్లో భార్య సంభోగం తర్వాత ఇస్లాం స్వీకరిస్తే ఆమె “ఇద్దత్” (గడువు) పూర్తి అయ్యే లోపులో భర్త ఇస్లాం స్వీకరించకున్నట్లయితే గడువు పూర్తి కాగానే వారి వివాహ- బంధం తెగిపోతుంది. ఆమె మరే ముస్లిం వ్యక్తితోనైనా వివాహం చేసుకోవాలనుంటే చేసుకోవచ్చును. భర్త ఇస్లాం స్వీకరణకై వేచించదలుచుకుంటే ఆమె ఇష్టం. అయితే ఈ మధ్యలో భర్తపై ఆమె ఏ హక్కూ ఉండదు. అలాగే అతను ఆమెకు ఏ ఆదేశం ఇవ్వలేడు. అతడు ఇస్లాం స్వీకరించిన వెంటనే ఆమె అతనికి భార్య అయి పోతుంది. పునర్వివాహ అవసరం ఉండదు. ఇందుకొరకు ఆమె సంవత్సరాల తరబడి నిరీక్షించినా ఆమె ఇష్టంపై ఆధార పడియుంది. అలాగే యూద, క్రైస్తవ గాకుండా వేరే మతాన్ని అవలంభించిన స్త్రీ యొక్క భర్త ఇస్లాం స్వీకరిస్తే పై ఆదేశమే వర్తించును. (అనగా వారి మధ్య వివాహ బంధం తెగిపోవును. ఒకవేళ భార్య ఇస్లాం స్వీకరించు వరకు వేచి చూడదలచుకుంటే భర్త వేచించవచ్చును).

6- సంభోగానికి ముందు భార్య మతభ్రష్టురాలైనచో వారి వివాహ బంధం తెగిపోవును. ఆమెకు మహరు కూడా దొరకదు. భర్త మతభ్రష్టుడయితే ఆమెకు సగం మహరు లభించును. మతభ్రష్టులైన వారు తిరిగి ఇస్లాం స్వీకరిస్తే వారు అదే నికాహ్ పై ఉందురు. ఇది వారి మధ్య విడాకులు కానప్పుడు.

యూద క్రైస్తవ స్త్రీలతో వివాహం వల్ల కలిగే నష్టాలు

అల్లాహు తఆలా వివాహాన్ని ధర్మ సమ్మతంగా చేసిన ముఖ్యోద్దేశం: ప్రవర్తనల్లో సంస్కారం, అశ్లీలత నుండి సమాజ పరిశుద్ధత మరియు శీలమానాలకు సంరక్షణ లభించాలని. సమాజంలో స్వచ్ఛమైన ఇస్లామీయ వ్యవస్థ స్థాపించబడాలని. అల్లాహ్ మాత్రమే సత్య ఆరాధ్యుడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చే సత్సమాజం ఉనికిలోకి రావాలని. ఇంతటి గొప్ప లాభాలు పొందాలంటే ధార్మికురాలు, సద్గుణసంపన్నురాలైన ఉత్తమ స్త్రీతో పెళ్ళి చేసుకుంటే తప్ప పూర్తి కావు. ఇక యూద, క్రైస్తవ స్త్రీలతో వివాహం వల్ల కలిగే నష్టాలు ఏలాంటివనేవి క్రింద సంక్షిప్తంగా తెలుసుకుందాముః

1- కుటుంబ రంగములోః చిన్న కుటుంబాల్లో భర్త శక్తివంతుడై ఉంటే భార్యపై అతని ప్రభావం పడుతుంది. ఆమె ఇస్లాం స్వీకరించవచ్చు అన్న ఆశ కూడా ఉంటుంది. ఒకప్పుడు దీనికి విరుద్ధంగా జరుగుతుంది. భర్త అధికారం చెల్లదు. అలాంటప్పుడు భార్య తన ధర్మంలో యోగ్యమని భావించేవాటికి అలవాటు పడుతుంది. ఉదాః మత్తు సేవించడం, పంది మాంసం తినడం, దొంగచాటు సంబంధాలు ఏర్పరుచుకొనడం లాంటివి. అందువల్ల ముస్లిం కుటుంబం చెల్లాచెదురైపోతుంది. సంతానం శిక్షణ మంచివిధంగా జరగదు. పరిస్థితి మరింత మితిమీరిపోతుంది; భార్య గనకా మతపక్షపాతం, మతకక్షల్లాంటి దుర్గుణురాలై సంతానాన్ని తన వెంట చర్చులకు తీసుకుపోతున్నప్పుడు. వారి ప్రార్థనలు, వారి చేష్టలు చిన్నతనం నుండే చూస్తూ చూస్తూ అదే మార్గంపై వారు పెరుగుతారు. సామెత కూడా ఉంది కదా: ‘ఎవరు ఏ అలవాటులపై పెరిగాడో వాటిపైనే చస్తాడు’. (తెలుగు సామెత: మ్రొక్కయి వంగనిది మానయి వంగునా).

2- సామాజిక నష్టాలు: ముస్లిం సమాజంలో యూద, క్రైస్తవ స్త్రీల సంఖ్య పెరగడం చాలా గంభీరమైన విషయం. ఆ స్త్రీలు ముస్లిం సమాజంలో విచార యుద్ధానికి పునాదులవుతారు. దాని వెనక వారి దురలవాటుల వల్ల ముస్లిం సమాజం కుళ్ళిబోతుంది, క్షీణించిపోతుంది. దానికి తొలిమెట్టుగా స్త్రీపురుషుల కలయిక, నగ్నత్వాన్ని పెంపొందించే దుస్తులు అధికమవడం. ఇస్లాంకు వ్యతిరేకమైన ఇతర విషయాలు ప్రభలడం.


%d bloggers like this: