ఎవరు నా పద్ధతి ప్రకారం వుజూ చేసి, మనసులో ఎలాంటి (ప్రాపంచిక) ఆలోచనలు రానివ్వకుండా పూర్తి ఏకాగ్రతతో రెండు రకాతులు నమాజు చేస్తారో

135. హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) బిన్ అఫ్ఫాన్ గురించి ఉల్లేఖకులు ఇలా తెలిపారు :-

హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) ఒక చెంబులో నీళ్ళు తెప్పించి, మొదట తన రెండు ముంజేతులపై నీళ్ళు పోసి కడుక్కున్నారు. తరువాత కుడి చేతిని చెంబులో ముంచి, (పిడికెడు నీళ్ళతో) నోరు పుక్కిలించారు. అలాగే ముక్కులోకి నీళ్ళు ఎక్కించి శుభ్రపరుచుకున్నారు. ఆ తరువాత మూడుసార్లు ముఖం కడుక్కున్నారు. దాని తరువాత మూడుసార్లు చేతులు మోచేతుల దాకా కడుక్కున్నారు. దాని తరువాత తడి చేతులతో తల తుడుచుకున్నారు. ఆ పై రెండు కాళ్ళు చీలమండలం వరకు మూడుసార్లు కడుక్కున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారని తెలిపారు – ” ఎవరు నా పద్ధతి ప్రకారం వుజూ చేసి, మనసులో ఎలాంటి (ప్రాపంచిక) ఆలోచనలు రానివ్వకుండా పూర్తి ఏకాగ్రతతో రెండు రకాతులు నమాజు చేస్తారో అతని (ఆ తరువాయి నమాజు వరకు) జరగబోయే పాపాలు క్షమించబడతాయి.” (*)

[సహీహ్ బుఖారీ : 4 వ ప్రకరణం – వుజూ, 24 వ అధ్యాయం – అల్ ఉజూయేసలాసన్ సలాసా]

(*) ఇక్కడ ‘పాపాలు’ అంటే చిన్న చిన్న పాపాలు అని అర్ధం; పెద్ద పాపాలు కాదు. (అనువాదకుడు)

శుచి, శుభ్రతల ప్రకరణం – 3 వ అధ్యాయం – వుజూ చేసే విధానం, దాని సమగ్ర స్వరూపం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1, సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

సామూహికంగా చేసే నమాజు పుణ్యం రీత్యా పాతికరెట్లు శ్రేష్ఠమైనది

387. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

మనిషి తన ఇంట్లోనైనా వీధిలోనైనా ఒంటరిగా చేసే నమాజు కన్నా సామూహికంగా చేసే నమాజు పుణ్యం రీత్యా పాతికరెట్లు శ్రేష్ఠమైనది. మనిషి శుభ్రంగా సముచిత రీతిలో వుజూ చేసి కేవలం నమాజు చేసే ఉద్దేశంతో మస్జిద్ కు వెళుతుంటే, మస్జిద్ లో ప్రవేశించే వరకు అతను వేసే ప్రతీ అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతనికి (పరలోకపు) అంతస్తులు పెంచుతాడు. అదీగాక అతని వల్ల జరిగిన ఒక్కొక్క పాపాన్ని తుడిచి వేస్తాడు. ఇక మస్జిద్ లో ప్రవేశించిన తరువాత సామూహిక నమాజు కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో అంతసేపు అతనికి నమాజు చేసినంత పుణ్యం ప్రాప్తమవుతుంది. అతను తన నమాజు స్థానంలో కూర్చుని ఉన్నంతవరకు దైవదూతలు అతని శ్రేయస్సు కోసం ప్రార్ధిస్తూ “దేవా! ఇతని వుజూ భంగం కానంతవరకు ఇతడ్ని క్షమించు, ఇతడ్ని కనికరించు”అని అంటారు.

[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం  – సలాత్, 87 వ అధ్యాయం – అస్సలాతి ఫీ మస్జిదిస్సూఖ్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 49 వ అధ్యాయం – సామూహిక నమాజు ప్రాముఖ్యం, దాని ఔన్నత్యం . మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

అల్లాహ్ దాశీలను అల్లాహ్ ఆలయానికి వెళ్ళడానికి నిరోధించకండి

254. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

హజ్రత్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) భార్యలలో ఒకరు ఫజ్ర్, ఇషా వేళల సామూహిక నమాజులు చేయడానికి మస్జిద్ కు వెళ్ళేవారు. “స్త్రీలు మస్జిద్ కు వెళ్లడాన్ని హజ్రత్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) ఇష్టపడరని, ఈ విషయంలో ఆయన ఎంతో అభిమానం గల వ్యక్తి అని తెలిసి కూడా మీరు ఇంటి నుండి బయటికి ఎందుకు వెళ్తున్నారు?” అని ఆమెను ఒకరు అడిగారు. దానికామె “అయితే ఉమర్ (రధి అల్లాహు అన్హు) నన్నెందుకు నిరోధించడం లేదు?” అని ఎదురు ప్రశ్న వేశారు. “ఎందుకంటే అల్లాహ్ దాశీలను అల్లాహ్ ఆలయానికి వెళ్ళడానికి నిరోధించకండని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. ఈ ప్రవచనమే మిమ్మల్ని నిరోధించకుండా ఆయనకు అడ్డుతగిలింది” అని అన్నాడు ఆ వ్యక్తి.

[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 13 వ అధ్యాయం – హద్దసనా యూసుఫు బిన్ మూసా]

నమాజు ప్రకరణం – 30 వ అధ్యాయం – ఎలాంటి ఉపద్రవం లేదనుకుంటే స్త్రీలు సువాసన పూసుకోకుండా మస్జిద్ కు వెళ్ళవచ్చు.  మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Do not stop Allaah’s Imaa’ (women slaves) from going to Allaah’s mosques

చెట్లను నాటడం, సేద్యం చేయడం గొప్ప పుణ్యకార్యాలు

1001. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ఎవరైనా ముస్లిం ఏదైనా ఒక (పండ్ల) చెట్టు నాటి లేదా పొలంలో ఏదైనా పంట వేస్తే అందులో పక్షులుగాని, పశువులు గాని లేదా మనుషులు గాని (పండ్లు, పంట) తిన్న పక్షంలో అది అతని తరుఫున సదఖా (దానం) అవుతుంది, అతనికి దాని పుణ్యం లభిస్తుంది

[సహీహ్ బుఖారీ : వ ప్రకరణం – మజారా, వ అధ్యాయం – ఫజ్లిజ్జరయి వల్ గర్సి ఇజా ఉకిల మిన్హు]

లావాదేవీల ప్రకరణం – వ అధ్యాయం – చెట్లను నాటడం, సేద్యం చేయడం గొప్ప పుణ్యకార్యాలు. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read the English version of this Hadeeth

నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్తే ఎంత పాపమో తెలిసి ఉంటే

284. హజ్రత్ బసర్ బిన్ సయీద్ (రహ్మతుల్లా అలై) కధనం :- జైద్ బిన్ ఖాలిద్ నన్ను హజ్రత్ అబూ జుహైమ్ (రధి అల్లాహు అన్హు) దగ్గరకు పంపించి, నమాజీ ముందు నుంచి వెళ్ళే వ్యక్తి గురించి ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట ఏం విన్నారో తెలుసుకొని రమ్మన్నారు. హజ్రత్ అబూ జుహైమ్ (రధి అల్లాహు అన్హు) దగ్గరికి వెళ్తే ఆయన ప్రవక్త ప్రవచనాన్ని ఈ విధంగా తెలిపారు :-

నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్తే ఎంత పాపమో తెలిసి ఉంటే, మనిషి అలాంటి చర్యకు పాల్పడడానికి బదులు నలభై (సంవత్సరాలు, నెలలు, రోజుల పాటు – ఉల్లేఖకునికి ఎంత కాలమో సరిగా గుర్తులేదు) వరకు నిలబడి ఉండటం ఎంతో మేలని భావిస్తాడు.

[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం – సలాత్, 101 వ అధ్యాయం – ఇస్ముల్ మర్రిబైన యదయిల్ ముసల్లీ]

నమాజు ప్రకరణం – 48 వ అధ్యాయం – నమాజు చేస్తున్న వారి ముందు నుండి వెళ్ళకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

(నా కోసం) డబ్బు ఖర్చు చేయండి, నేను కూడా మీ కోసం ఖర్చు చేస్తాను

580. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

అల్లాహ్ (నా కోసం) డబ్బు ఖర్చు చేయండి, నేను కూడా మీ కోసం ఖర్చు చేస్తాను” అని అన్నాడు.” అల్లాహ్ చేయి (సకల విధాల సిరిసంపదలతో) నిండుగా ఉంది. దాన్ని రేయింబవళ్ళు నిర్విరామంగా ఖర్చు చేసినా తరగదు.” ” అల్లాహ్ భూమ్యాకాశాలను సృష్టించిన దగ్గర్నుంచి ఎంత ఖర్చు చేశాడో మీరెప్పుడైనా ఆలోచించారా? ఇంత ఖర్చు చేసినా ఆయన చేతిలో ఉన్న నిధి నిక్షేపాలలో రవ్వంత కూడా తగ్గలేదు. ఆయన సింహాసనం నీళ్ళ మీద ఉంది. ఆయన చేతిలో త్రాసు (న్యాయం) ఉంది. ఆయన తలచుకుంటే ఎవరినైనా అధోగతి పాలు చేయగలడు. అలాగే ఆయన తలచుకుంటే ఎవరినైనా ఉచ్ఛ స్థాయికి తీసుకురాగలడు.

[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – అత్తఫ్సీర్, 2 వ అధ్యాయం – ఖౌలిహీవకాన అర్షిహీ అలల్ మాయి]

జకాత్ ప్రకరణం : 11 వ అధ్యాయం – సత్కార్యాల్లో ధన వినియోగం – దాని ప్రతిఫలం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English version of this hadeeth : Spend (O man), and I shall spend on you

Now you can Download the Divya Quran Flash

AsSalam Alaikum wa Rahmatullahi wa Barakaatuhu

Now You can download the Divya Quran Flash (Telugu Quran Flash)  at the below location.

[Download Flash Video of Divya Qur’an Here] – After downloading unzip the file and click on index.html

Baarakallaah feekum

wa salam alaikum wa rahmatullaah
AbdurRahman Meda

రోజుకో హదీసు మీ ఈమెయిలు లో చదవండి

ప్రియమైన సోదర సోదరీ మణు లారా , అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

రోజుకో హదీసు మీ ఈమెయిలు లో చదవటానికి , నేను ఒక కొత్త బ్లాగ్ ను ఏర్పరచాను.
దాని అడ్రస్ :  http://TeluguDailyHadith.Wordpress.com
మీరు ఇష్టపడితే పై బ్లాగ్ ను సందర్శించి subscribe చేసుకోండి.
(Check at the end of the blog page to subscribe)

ఇంకొక పద్దతి :[Google Group] కి వెళ్లి జాయిన్ అవ్వండి.

మీకు  కష్టం అనిపిస్తే ,  నన్ను ఇక్కడ సంప్రదించండి (http://telugudailyhadith.wordpress.com/contact-us/), నేను మిమ్మల్ని జాయిన్ చేస్తాను.

బారకల్లాహ్ ఫీకుం
అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు
అబ్దుర్రహ్మాన్ మేడా @ teluguislam.net

తల్లి గొప్పదనం

1652. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం:-

“ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చిధైవప్రవక్తా! నా సత్ప్రవర్తనకు ఎవరెక్కువ హక్కుదారులు?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీ తల్లి” అని చెప్పారు. “ఆ తరువాత ఎవరూ?” అంటే “నీ తల్లి” అనే చెప్పారు ఆయన. తిరిగి ఆ వ్యక్తి “ఆ తరువాత ఎవరు?” అని అడిగాడు. “నీ తల్లి” అనే చెప్పారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). అతను మళ్ళీ అడిగాడు:- “ఆ తరువాత ఎవరెక్కువ హక్కుదారులు?” అని. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీ తండ్రి” అని అన్నారు.

 (సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – అదబ్,  2వ అధ్యాయం – మన్ అహఖ్కున్నాసి బిహుస్నిస్సుహుబతి)

సామాజిక మర్యాదల ప్రకరణం
1వ అధ్యాయం – తల్లిదండ్రుల సేవే అన్నిటికంటే గొప్పసేవ
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Qur’an 56. Soorah al-Waaqi'ah – Telugu Subtitles [video]

Qur’an 56. Soorah al-Waaqi’ah – Telugu Subtitles

56  సూరహ్ అల్ వాఖి’అహ్

అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో
1. *ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు,
2. అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు.
3. అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది.
4. భూమి తీవ్రకంపనంతో కంపించి నప్పుడు;
5. మరియు పర్వతాలు పొడిగా మార్చబడినప్పుడు;
6. అప్పుడు వాటి దుమ్ము నలువైపులా నిండిపోయినప్పుడు;
7. మరియు మీరు మూడు వర్గాలుగా విభజించబడతారు.
8. ఇక కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత (అదృష్టవంతులు)!
9 . మరికొందరు వామపక్షం వారుంటారు, ఆ వామపక్షపు వారు ఎంత (దౌర్భాగ్యులు)!
10. మరియు (ఇహలోకంలో విశ్వాసంలో) ముందున్న వారు (స్వర్గంలో కూడా) ముందుంటారు.
11. అలాంటి వారు (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందుతారు.
12. వారు సర్వసుఖాలు గల స్వర్గవనాలలో ఉంటారు.
13. మొదటి తరాల వారిలో నుండి చాలామంది;
14. మరియు తరువాత తరాల వారిలో నుండి కొంతమంది.
15. (బంగారు) జలతారు అల్లిన ఆసనాల మీద;
16. ఒకరికొకరు ఎదురెదురుగా, వాటి మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.
17. వారిచుట్టు ప్రక్కలలో చిరంజీవులైన (నిత్య బాల్యం) గల బాలురు (సేవకులు) తిరుగుతూ ఉంటారు.
18. (మధువు) ప్రవహించే చెలమల నుండి నింపిన పాత్రలు, గిన్నెలు మరియు కప్పులతో!
19. దాని వలన వారికి తలనొప్పి గానీ లేక మత్తు గానీ కలుగదు.
20. మరియు వారుకోరే పండ్లూ, ఫలాలు ఉంటాయి.
21. మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం.
22. మరియు అందమైన కన్నులు గల సుందరాంగులు (హూరున్);
23. దాచబడిన ముత్యాలవలే!
24. ఇదంతా వారు చేస్తూ ఉండిన వాటికి (సత్కార్యాలకు) ప్రతిఫలంగా!
25. అందులో వారు వ్యర్ధమైన మాటలు గానీ, పాప విషయాలు గానీ వినరు.
26. “శాంతి (సలాం) శాంతి (సలాం)!” అనే మాటలు తప్ప!
27. మరియు కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత (అదృష్టవంతులు)!
28. వారు ముళ్ళు లేని సిద్ ర వృక్షాల మధ్య!
29. మరియు పండ్లగెలలతో నిండిన అరటిచెట్లు,
30. మరియు వ్యాపించి ఉన్న నీడలు,
31. మరియు ఎల్లప్పుడు ప్రవహించే నీరు,
32. మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు ఫలాలు,
33. ఎడతెగ కుండా మరియు అంతం కాకుండా (ఉండే వనాలలో);
34. మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని ఉంటారు).
35. నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము;
36. మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము;
37. వారు ప్రేమించే వారుగానూ, సమ వయస్సుగల వారుగానూ (ఉంటారు);
38. కుడిపక్షం వారి కొరకు.
39. అందులో చాలా మంది మొదటి తరాలకు చెందిన వారుంటారు;
40. మరియు తరువాత తరాల వారిలో నుండి కూడా చాలా మంది ఉంటారు.
41. ఇక వామ (ఎడమ) పక్షం వారు; ఆ వామపక్షం వారు ఎంత (దౌర్భాగ్యులు)?
42. వారు దహించే నరకాగ్నిలో మరియు సలసల కాగే నీటిలో;
43. మరియు నల్లటి పొగ ఛాయలో (ఉంటారు).
44. అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేదిగానూ ఉండదు;
45. నిశ్చయంగా వారు ఇంతకు ముందు చాలా భోగభాగ్యాలలో పడిఉండిరి;
46. మరియు వారు మూర్ఖపు పట్టుతో ఘోరమైన పాపాలలో పడిఉండిరి;
47. మరియు వారు ఇలా అనేవారు: “ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా?
48. “మరియు పూర్వీకులైన మా తాత ముత్తాతలు కూడానా?”
49. వారితో ఇలా అను: “నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడాను!
50. “వారందరూ ఆ నిర్ణీతరోజు, ఆ సమయమున సమావేశపరచబడతారు.
51. “ఇక నిశ్చయంగా మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా!
52. “మీరు ‘జుఖ్ఖూమ్ చెట్టును (ఫలాలను) తింటారు.
53. “దానితో కడుపులు నింపుకుంటారు.
54. “తరువాత, దానిమీద సలసల కాగే నీరు త్రాగుతారు.
55. “వాస్తవానికి మీరు దానిని దప్పిక గొన్న ఒంటెలవలే త్రాగుతారు.”
56. తీర్పుదినం నాడు (ఈ వామపక్షం) వారికి లభించే ఆతిధ్యం ఇదే!
57. మిమ్మల్ని మేమే సృష్టించాము; అయితే మీరెందుకు ఇది సత్యమని నమ్మరు?
58. ఏమీ? మీరెప్పుడైనా, మీరు విసర్జించే వీర్యబిందువును గమనించారా?
59. ఏమీ? మీరా, దానిని సృష్టించే వారు? లేక మేమా దాని సృష్టికర్తలము?
60. మేమే మీ కోసం మరణం నిర్ణయించాం మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు;
61. మీ రూపాలను మార్చివేసి మీరు ఎరుగని (ఇతర రూపంలో) మిమ్మల్ని సృష్టించటం నుండి.
62. మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు, అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు?
63. మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా?
64. మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించేవారము?
65. మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చివేయగలము, అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడిపోతారు.
66. (మీరు అనేవారు): “నిశ్చయంగా, మేము పాడైపోయాము!
67. “కాదుకాదు, మేము దరిద్రుల మయ్యాము!” అని.
68. ఏమీ? మీరు ఎప్పుడైనా మీరు త్రాగే నీటిని గురించి ఆలోచించారా?
69. మీరా దానిని మేఘాల నుండి కురిపించే వారు? లేక మేమా దానిని కురిపించే వారము?
70. మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పుగా ఉండేలా చేసేవారము! అయినా మీరెందుకు కృతజ్ఞత చూపరు?
71. మీరు రాజేసే అగ్నిని గమనించారా?
72. దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా? లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా?
73. మేము దానిని (నరకాగ్నిని), గుర్తు చేసేదిగా మరియు ప్రయాణీకులకు (అవసరం గలవారికి) ప్రయోజనకారిగా చేశాము.
74. కావున సర్వోత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు.
75. * ఇక నేను నక్షత్రాల స్థానాల (కక్ష్యల) సాక్షిగా చెబుతున్నాను.
76. మరియు నిశ్చయంగా, మీరు గమనించగలిగితే, ఈ శపథం ఎంతో గొప్పది!
77. నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ దివ్యమైనది.
78. సురక్షితమైన గ్రంధంలో ఉన్నది.
79. దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు.
80. ఇది సర్వలోకాల ప్రభువు తరుఫు నుండి అవతరింపజేయబడింది.
81. ఏమీ? మీరు ఈ సందేశాన్ని తేలికగా తీసుకుంటున్నారా?
82. మరియు (అల్లాహ్) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనకు మీరు తిరస్కరిస్తున్నారా?
83. అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)?
84. మరియు అప్పుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండిపోతారు.
85. మరియు అప్పుడు, మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాము, కాని మీరు చూడలేక పోతారు.
86. ఒకవేళ మీరు ఎవరి అదుపాజ్ఞలో (అధీనంలో) లేరనుకుంటే,
87. మీరు సత్యవంతులే అయితే దానిని (ఆ ప్రాణాన్ని) ఎందుకు తిరిగి రప్పించుకోలేరు?
88. కాని అతడు (మరణించే వాడు), (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే!
89. అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానంద కరమైన స్వర్గవనం ఉంటాయి.
90. మరియు ఎవడైతే కుడిపక్షం వారికి చెందిన వాడో!
91. అతనితో: “నీకు శాంతి కలుగుగాక (సలాం)! నీవు కుడిపక్షం వారిలో చేరావు.” (అని అనబడుతుంది).
92. మరియు ఎవడైతే, అసత్యవాదులు, మార్గభ్రష్టులైన వారిలో చేరుతాడో!
93. అతని ఆతిధ్యానికి సలసల కాగే నీరు ఉంటుంది.
94. మరియు భగభగమండే నరకాగ్ని ఉంటుంది.
95. నిశ్చయంగా, ఇది రూడీ అయిన నమ్మదగిన సత్యం!
96. కావున సర్వోత్తముడైన నీ ప్రభువు పేరును స్తుతించు.

Telugu Translation Source: దివ్య ఖురాన్ సందేశం