దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నిశ్చయంగా షైతాను మీ శత్రువు. కనుక మీరు కూడా వాణ్ణి శత్రువుగానే పరిగణించండి. వాడు తన సమూహాన్ని, వారంతా నరకవాసులలో చేరిపోవటానికే పిలుస్తున్నాడు.
వాని ప్రయత్నాల్లో అతి ముఖ్యమైనది, అల్లాహ్ గురించి మన విశ్వాసాన్ని పాడుచేయడం. అందుకే ఈ సృష్టంతటిని అల్లాహ్ పుట్టించాడు, మరి అల్లాహ్ ను ఎవరు పుట్టించాడు అని సందేహం కలుగజేస్తాడు. అలాంటప్పుడు ఈ పనులు చేయండి, వాని సందేహాలకు దూరంగా ఉండండి: 1- ఆమంతు బిల్లాహ్ అనాలి, అంటే నేను అల్లాహ్ ను విశ్వసించాను, కనుక అల్లాహ్ గురించి ఇలాంటి ఆలోచనల్లో పడను. 2- అల్లాహు అహద్, అల్లాహుస్సమద్, లమ్ యలిద్, వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్ చదవాలి. 3- ఎడమ ప్రక్కన మూడు సార్లు ఉమ్మి వేయాలి. 4- షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరాలి. 5- ఇలాంటి సందేహాలు, అనుమానాలు, చెడు ఆలోచనలను మనస్సులో నుంచి తొలగించాలి. (సహీహా అల్బానీ 134).
ఈ ఐదు విషయాలు హదీసు ద్వారా రుజువైనవి :
సహీ ముస్లిం 134లో ఉంది, హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
ప్రజలు పరస్పరం ప్రశ్నించుకుంటారు, చివరికి ఈ సృష్టిని అల్లాహ్ సృష్టించాడు, అయితే అల్లాహ్ ను ఎవరు సృష్టించాడు అన్న వరకు పోతారు. ఇలాంటి విషయం ఎవరైనా చూసినప్పుడు వెంటనే ఆమంతు బిల్లాహ్ చదవాలి, అంటే నేను అల్లాహ్ ను విశ్వసించాను.
మరో ఉల్లేఖనంలో ఉంది: షైతాన్ మీలో ఎవరి వద్దకైనా వచ్చి దీనిని ఎవరు పుట్టించారు, ఫలానా దానిని ఎవరు పుట్టించారు అని ప్రేరణ కలిగిస్తాడు, చివరికి నీ ప్రభువుని ఎవరు పుట్టించాడు అని మాట వేస్తాడు, ఈ స్థితికి చేరుకున్నప్పుడు వెంటనే అల్లాహ్ శరణులోకి రావాలి, ఈ దురాలోచనను వీడాలి.
అబూదావూద్ 4722లోని ఉల్లేఖనంలో ఉంది … మరి అల్లాహ్ను ఎవరు సృష్టించారు?’ అని చెప్పటం జరుగుతుంది. ప్రజలు ఇలా అన్నప్పుడు, మీరు ‘అల్లాహ్ ఒక్కడే, ఆయన అక్కర లేనివాడు, ఆయనకు సంతానం లేదు, ఆయన కూడా ఎవరి సంతానం కాడు, ఆయనకు సరిసమానుడెవడూ లేడు’ అని పలికి, మూడుసార్లు ఎడమవైపు ఉమ్మి, షై’తాన్ కుతంత్రాల నుండి అల్లాహ్ను శరణుకోరండి.’
ఈ దురాలోచన కలిగితే చేయవలసిన మన బాధ్యత తెలుసుకున్నాము. అయితే అల్లాహ్ అందరికంటే ముందు ఆయనకు ముందు ఏదీ లేదు అని కూడా ఆధారాలున్నాయి:
సహీ ముస్లిం 2713లో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: మీలో ఎవరైనా నిద్రించేకి ముందు కుడి ప్రక్కన పడుకొని ఈ దుఆ చదవాలి:
”అల్లాహుమ్మ రబ్బి స్సమావాతి వ రబ్బల్ అర్’ది వ రబ్బ కుల్లి షయ్ఇన్ ఫాలిఖల్ ‘హబ్బి వన్నవా, వ మున్’జిల త్తౌరాతి వల్ ఇన్జీలి, వల్ ఖుర్ఆని. అ’ఊజు’బిక మిన్ షర్రి కుల్లి జీ’ షర్రిన్, అంత ఆ’ఖిజు’న్ బి నా’సియతిహీ. అంతల్ అవ్వలు ఫలైస ఖబ్లక షైఉన్, వ అంతల్ ఆ’ఖిరు ఫలైస బ’అదక షయ్ఉన్, వ అంత ”జ్జాహిరు ఫలైస ఫౌఖక షయ్ఉన్ వ అంతల్ బా’తిను ఫలైస దూనక షయ్ఉన్ ఇఖ్’ది అన్నిద్దైన. వ అ’గ్నినీ మినల్ ఫఖ్రి!”
‘ఓ అల్లాహ్! సప్తాకాశాలకు భూమికి ప్రభువు నువ్వే అన్నిటికీ ప్రభువువీ, బీజాన్ని చీల్చేవాడా! గింజలను మొలకెత్తించే వాడా, తౌరాతు, ఇంజీలు, ఖుర్ఆన్ను అవతరింపజేసిన వాడా! నిన్ను నేను శరణుకోరు తున్నాను. ప్రతి చెడు వస్తువు యొక్క చెడు నుండి అంటే ప్రతి హాని తలపెట్టే వస్తువు నుండి. దాని నుదురు నీ చేతిలోనే ఉంది. నీవే అందరికంటే ముందు వాడవు. నీ కంటే ముందు ఏదీలేదు. నీవే అందరికంటే చివరి వాడవు. నీ తర్వాత ఏదీ లేదు. నీవు బహిర్గతుడవు, నీవు అంతర్గతుడవు. నీకంటే రహస్యమైనది ఏదీలేదు. నీవు నన్ను రుణం తీర్చివేయడంలో, దారిద్య్రం దూరం కావడంలో నాకు సహాయం చేయి.
2 ] దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) గారిచే మదీనాలో నిర్మించబడిన తొలి మస్జిద్ ఏది ?
A]మస్జిదె ఖుబా – మదీనా
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనా వైపునకు హిజ్రత్ చేసినప్పుడు మదీనాకు సుమారు 6 లేదా 7 కిలో మీటర్ల ముందు ఖుబా అను ప్రాంతం ఉంది, అక్కడ కొద్ది రోజులు బస చేశారు, అక్కడే మస్జిద్ నిర్మించారు. ఆ మస్జిద్ మరియు దానిని నిర్మించినవారి ప్రశంసన ఖుర్ఆనులో కూడా ఉంది
9:108 لَمَسْجِدٌ أُسِّسَ عَلَى التَّقْوَىٰ مِنْ أَوَّلِ يَوْمٍ أَحَقُّ أَن تَقُومَ فِيهِ ۚ فِيهِ رِجَالٌ يُحِبُّونَ أَن يَتَطَهَّرُوا ۚ وَاللَّهُ يُحِبُّ الْمُطَّهِّرِينَ అయితే తొలినాటి నుంచే భయభక్తుల పునాదిపై నిర్మించబడిన మస్జిదు నువ్వు నిలబడటానికి అన్ని విధాలా తగినది. బాగా పరిశుద్ధతను పొందటాన్ని ఇష్టపడే వారు అందులో ఉన్నారు. బాగా పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు.
సహీ బుఖారీ 3906లో ఉంది, ఇది ఇస్లాంలోని తొలి మస్జిద్ అని.
3] “పరమ పవిత్రుడు” అనే భావంను ఈ క్రింది వాటిలో ఏ పేరు సూచిస్తుంది ?
C] అల్ ఖుద్దూస్
పవిత్రుడు, పరిశుద్ధుడు, అన్ని లోపాలకు దోషాలకు అతీతుడు.
ఆయనే అల్లాహ్. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే రాజాధిరాజు, (పరమ పవిత్రుడు), లోపాలన్నింటికీ అతీతుడు, శాంతి (భద్రతల) ప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు, బలపరాక్రమాలు గలవాడు, పెద్దరికం గలవాడు. ప్రజలు ఆయనకు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్ పవిత్రంగా ఉన్నాడు.
అబూ దావూద్ 5085 (హసన్, సహీ) లో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి మేల్కొన్నప్పుడు ఏ దుఆ చదివి నమాజు ప్రారంభించేవారు అని షురైఖ్ హౌజనీ ఆయిషా రజియల్లాహు అన్హాను అడిగారు, ఆయిషా రజియల్లాహు అన్హా చెప్పారు: నీవడిగిన ప్రశ్న నీకంటే ముందు ఎవరూ అడగలేదు. ప్రవక్త రాత్రి వేళ మేల్కొని నమాజు ఆరంభంలో పదిసార్లు అల్లాహు అక్బర్, పదిసార్లు అల్ హందులిల్లాహ్, పది సార్లు సుబ్ హానల్లాహి వబిహందిహీ, పది సార్లు సుబ్ హానల్ మలికిల్ ఖుద్దూస్, పది సార్లు అస్తగ్ ఫిరుల్లాహ్, పది సార్లు లాఇలాహ ఇల్లల్లాహ్ పలికేవారు. మళ్ళీ పది సార్లు అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ జీఖిద్దున్యా వ జీఖి యౌమిల్ ఖియామహ్ చదివేవారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“సామిరీ! ఇక నీ సంగతేమిటీ?” అని (మూసా) అడిగాడు. “వారు చూడని దాన్ని నేను చూశాను. నేను దైవసందేశవాహకుని పాద ముద్రలో నుంచి ఒక పిడికెడు మన్ను తీసుకుని అందులో వేశాను. నా మనసు కూడా నాకు దీనిని సరైనదిగా సూచింపజేసింది” అని అతను జవాబిచ్చాడు. అప్పుడు మూసా,”సరే! ఇక్కణ్ణుంచి వెళ్ళిపో. నీకు శిక్ష ఏమిటంటే, నీవు జీవితాంతం ‘అమ్మో నన్ను ముట్టుకోకండి’ అని అంటూ ఉంటావు. నీ నుంచి ఎట్టి పరిస్థితిలోనూ తప్పిపోని వాగ్దానం మరొకటి కూడా నీ కోసం ఉంది. ఇన్నాళ్ళూ నువ్వు అంటిపెట్టుకుని ఉన్న నీ ఆరాధ్య దేవునికి పట్టే గతేమిటో కూడా చూసుకో. మేము దాన్ని కాల్చి, భస్మం చేసి సముద్రంలో విసిరేస్తాము” అన్నాడు. యదార్థమేమిటంటే మీ అందరి ఆరాధ్యదైవం అల్లాహ్ మాత్రమే. ఆయన తప్ప వేరొక ఆరాధ్య దైవం లేనే లేడు. ఆయన జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది” (అని చెప్పాడు).
ఇమాం బిఖాఈ చెప్పారు: ఐక్యంగా ధర్మంపై ఉన్న బనీఇస్రాఈల్ ను సామిరీ విడగొట్టాడు, దుర్మార్గ చేష్టను ఉనికిలోకి తెచ్చి లీడరయ్యాడు, అందుకే అతను పాల్పడిన చేష్టకు తగిన శిక్ష అతనికివ్వడం జరిగింది, అంతకంటే ఘోర శిక్ష మరేముంటుంది? అందరికీ దూరమయ్యాడు, ఎవడిని కలుసుకోలేడు, ఎవడు వానితో కలవలేడు. ఆయుషున్నన్ని రోజులు ధూత్కరింపబడి ఒంటరితనంతో జీవించడమే.
Quarantine అంటే ఇదేనేమో ఈ రోజుల్లో చాలా వినబడుతుంది కదా, కొంచెం దూరపు, లోతు ఆలోచనతో యోచించండి. టైం సరిపోదు వివరాల్లోకి వెల్లడానికి. ప్రత్యేకంగా మా సైన్యం, మా శక్తి, మా పార్టీ, మా బాస్, మా మా అన్ని లెక్కించుకుంటూ గర్వించేవారు ఇకనైనా గుణపాఠం నేర్చుకోండి!!
వానికి ఇలా ఎందుకు జరిగింది? ఇమాం బిఖాఈ చెప్పారు: సర్వ శక్తిమంతుడు, నిజ సృష్టి కర్త అయిన అల్లాహ్ ను వదలి ఏ శక్తి లేనిదానిని ఆరాధ్యదైవంగా చేసుకున్నందుకు. అంతే కాదు అమాయక ప్రజలను సైతం ఈ దుర్మార్గం వైపునకు ఆహ్వానించినందుకు.
2 ] “అస్సలాముఅలైకుం వ రహ్మాతుల్లాహి వ బరకాతుహ్ అని చెబితే ఎన్ని పుణ్యాలు లభిస్తాయి?
C] 30 పుణ్యాలు
అబూ దావూద్ 5195లో ఉంది, షేఖ్ అల్బానీ సహీ అన్నారు: ఇమ్రాన్ బిన్ హుసైన్ ఉల్లేఖించారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి అస్సలాముఅలైకుమ్ అని అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తి కూర్చున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 10 పుణ్యాలు అన్నారు. ఆ తరువాత మరో వ్యక్తి వచ్చాడు, అతడు అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తి కూర్చున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 20 పుణ్యాలు అన్నారు. మరో వ్యక్తి వచ్చి అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అని అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సమాధానం ఇచ్చారు. అతడు కూర్చున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 30 పుణ్యాలు అన్నారు.
సహీ బుఖారీ యొక్క ప్రక్యాతి గాంచిన వ్యాఖ్యానకర్త ఇమాం ఇబ్ను హజర్ అస్కలానీ ఫత్హుల్ బారీ 2/317లో తెలిపారు: ఇమాం ఖఫ్ఫాల్ రహిమహుల్లాహ్ తన ఒక ఫత్వాలో చెప్పారు: ఒక్క వ్యక్తి నమాజు వదలడం వల్ల ముస్లిములందరికీ నష్టం జరుగుతుంది, ఎందుకనగా నమాజీ … తషహ్హుద్ లో అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్ అనడం తప్పనిసరి, నమాజు చేయని వ్యక్తి ఇది అనలేదు గనక అతడు, అల్లాహ్ పట్ల, ప్రవక్త పట్ల, స్వయం తన పట్ల మరియు ముస్లిములందరి పట్ల కొరత చేసినవాడయ్యాడు. అందుకే నమాజు వదలడం మహా ఘోరమైన పాపంగా పరిగణించడం జరిగింది.
ఇమాం సుబ్కీ రహిమహుల్లాహ్ చెప్పారు: నమాజులో అల్లాహ్ హక్కుతో పాటు దాసుల హక్కు కూడా ఉంది. ఎవరు దానిని వదిలారో అతడు గతంలో చనిపోయిన మరియు ప్రళయం వరకు వచ్చే విశ్వాసులందరి హక్కును కాజేసినవాడవుతాడు. ఎందుకనగా తషహ్హుద్ లో అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్ అనడం విధిగా ఉంది.
3 ] స్వస్థత లభించే ఈ 3 విధానాలలో దైవప్రవక్త (ﷺ) వారు ఇష్టపడని ఆ ఒక్కటి ఏది?
B] కాల్చి వాతలు పెట్టె ప్రక్రియ
“يجوز كي المريض بالنار لعلاجه إذا احتاج إلى ذلك ، ويرجى أن ينفعه الله به ؛ لما ثبت عن جابر بن عبد الله قال : بعث رسول الله صلى الله عليه وسلم إلى أبي بن كعب طبيباً فقطع منه عرقاً ثم كواه عليه ، وما ثبت من أن سعد بن معاذ رضي الله عنه لما رُمي ، كواه النبي صلى الله عليه وسلم . بمشقص (نوع من السهام) في أكحله ، ولما رواه الترمذي عن أنس رضي الله عنه ، أن النبي صلى الله عليه وسلم كوى أسعد بن زرارة من الشوكة ، وقال : حسن غريب ، ولما رواه البخاري ومسلم عن ابن عباس رضي الله عنهما أن النبي صلى الله عليه وسلم قال : (الشفاء في ثلاثة : شربة عسل ، وشرطة محجم ، وكية نار ، وأنهى أمتي عن الكي) وفي لفظ آخر : ( وما أحب أن أكتوي ) فدل فعله وإخباره صلى الله عليه وسلم ، بأنه من أسباب الشفاء على جواز العلاج به عند الحاجة إليه ، وأما نهيه أمته عن الكي فيحمل على ما إذا لم يحتج إليه المريض ؛ لإمكان العلاج بغيره ، أو على أن العلاج به خلاف الأولى والأفضل ؛ لما فيه من زيادة الألم والشبه بتعذيب الله العصاة بالنار ، ولهذا أخبر النبي صلى الله عليه وسلم عن نفسه بأنه لا يحب أن يكتوي ، وأثنى على الذين لا يكتون ؛ لكمال توكلهم على الله ، وينبغي أن يتولى ذلك خبير بشؤون الكي ؛ ليكوي من يحتاج إلى هذا النوع من العلاج في الموضع المناسب من جسده ، ويراعى ظروف المريض وأحواله ” انتهى . “فتاوى اللجنة الدائمة للبحوث العلمية والإفتاء” ( 25/6(.
కాల్చి వాతలు పెట్టి చికిత్స చేయించడం హరాం (నిషిద్ధం) ఏమీ కాదు. అందుకే ప్రశ్నలో కూడా ఇష్టపడని అని పెట్టడం జరిగింది. సహీ బుఖారీ 5680, మరియు సహీ ముస్లిం 2205లో చికిత్స కొరకు ఈ మూడు పద్ధతులు ఉపయోగించవచ్చు అని చెప్పారు ప్రవక్త: తేనె త్రాగడం, కప్పించడం (Cupping, సూదులు పొడిచి, కప్ పెట్టి చెడు రక్తం తీయడం). వేడి వాతలు పెట్టడం. వెంటనే చెప్పారు. నేను వాతలు పెట్టడాన్ని ఇష్టపడను (బుఖారీ 5683, ముస్లిం 2205), మరో ఉల్లేఖనంలో ఉంది: మిమ్మల్ని కూడా వాతలు పెట్టడడం నుండి ఆపుతున్నాను.
కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా అస్అద్ బిన్ జురారాకు వాతలు పెట్టారు. (తిర్మిజి 2050, మిష్కాత్ 4534). «أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَوَى أَسْعَدَ بْنَ زُرَارَةَ مِنَ الشَّوْكَةِ»
అలాగే సహీ ముస్లిం 2207లో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉబై బిన్ కఅబ్ వద్దకు ఒక వైద్యుడిని పంపారు, అతను నరాన్ని కోసి అక్కడ వాత పెట్టాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
A) దైవప్రవక్త (ﷺ) కొరకే దువా ఉన్నట్లు B) దైవప్రవక్త (ﷺ) వారి ఉమ్మత్ అందరి కొరకు దువా ఉన్నట్లు C) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు ఇబ్రహీం (అలైహిస్సలాం) ఈ ఇరువురి పై వీరి కుటుంబీకులపై శాంతి – శుభాలు కురవాలని మరియు అల్లాహ్ ను కొనియాడుతున్నాము
1) స్వర్గప్రవేశం పొందినప్పుడు లభించే తొలి ఆహారం ఏమిటి ?
జవాబు: B) చేప కాలేయం
అవును, సహీ ముస్లిం 315లో ఉంది. సౌబాన్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, యూదుల్లోని ఒక ఆలిం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగాడు, వాటిలో ఒకటి:
قَالَ الْيَهُودِيُّ: فَمَا تُحْفَتُهُمْ حِينَ يَدْخُلُونَ الْجَنَّةَ؟ قَالَ: «زِيَادَةُ كَبِدِ النُّونِ»، స్వర్గంలో చేరిన వెంటనే వారి కొరకు తొలి బహుమానంగా తినడానికి ఏమివ్వబడుతుంది?
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: చేప కాలేయంలోని అదనపు భాగం. (زائدة الكبد وهي القطعة المنفردة المتعلقة في الكبد ، وهي أطيبها (شرح مسلم
ఇలాంటి విషయాలు సహీ హదీసులో వచ్చాయి, వీటిని తెలుసుకొని స్వర్గాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. స్వర్గంలో చేర్పించే సత్కార్యాలు అధికంగా చేయాలి.
2) మానవుడు చేసే ప్రతీ పనిని వ్రాసిపెట్టే దైవ దూతలను ఏమంటారు ?
నిశ్చయంగా మీ పైన పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. (వారు మీ కర్మలను నమోదు చేసే) గౌరవనీయులైన లేఖకులు. మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా!
ఈ భావం గల ఆయతులు ఖుర్ఆన్ లో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు చూడండి సూర రఅద్ 13:10-11 అలాగే సూర ఖాఫ్ 50:16-18.
వీటి ద్వార మనం నేర్చుకోవలసిన గుణపాఠం: ఎల్లవేళల్లో మన ప్రతి మాట, చేష్ట, వాచకర్మ మన ప్రతీ కదలిక మరియు మౌనం అంతా నమోదవుతున్నప్పుడు మనం క్షణం పాటు కొరకైనా మన సృష్టికర్త అయిన అల్లాహ్ కు అవిధేయత పాటించవచ్చా గమనించండి!
మనం ఖుర్ఆన్ శ్రద్ధతో చదువుతున్నామా?
ఒక్కసారి నాతో సూర జాసియా 45:29లోనీ ఈ ఆయతుపై లోతుగా పరిశీలించే అవగాహన చేసే ప్రయత్నం చేయండి
45:29 هَٰذَا كِتَابُنَا يَنطِقُ عَلَيْكُم بِالْحَقِّ ۚ إِنَّا كُنَّا نَسْتَنسِخُ مَا كُنتُمْ تَعْمَلُونَ “ఇదిగో, ఇదీ మా రికార్డు. మీ గురించి (ఇది) ఉన్నదున్నట్లుగా చెబుతోంది. మేము మీ కర్మలన్నింటినీ నమోదు చేయించేవాళ్ళం”
ఎలా అనిపిస్తుంది? తప్పించుకునే మార్గం ఉందా ఏమైనా? ప్రళయదినాన ఆ కర్మలపత్రాన్ని చూసి స్వయం ఎలా నమ్మకుంటాడో, ఒప్పుకుంటాడో సూర కహఫ్ 18:49లోని ఈ ఆయతును గమనించండి:
కర్మల పత్రాలు (వారి) ముందు ఉంచబడతాయి. నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్నదాన్ని చూసి భీతిల్లుతూ, “అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదేమి పత్రం? ఇది ఏ చిన్న విషయాన్నీ,ఏ పెద్ద విషయాన్నీ వదలకుండా నమోదు చేసిందే?!” అని వాపోవటం నువ్వు చూస్తావు. తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు. నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు.
3) ‘దరూదే ఇబ్రహీం’ యొక్క అర్థము ద్వారా ఏమి తెలుస్తుంది?
జవాబు C) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు ఇబ్రహీం (అలైహిస్సలాం) ఈ ఇరువురి పై వీరి కుటుంబీకులపై శాంతి – శుభాలు కురవాలని మరియు అల్లాహ్ ను కొనియాడుతున్నాము
’అబ్దుర్రహ్మాన్ బిన్ అబీ లైలా ఉల్లేఖించారు: క’అబ్ బిన్ ’ఉజ్ర (రజియల్లాహు అన్హు) నన్ను కలిశారు. ‘ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా విషయం మీకు తెలియపరచనా!’ అని అన్నారు. దానికి నేను తప్ప కుండా వినిపించండి,’ అని అన్నాను. అప్పుడతను, ‘మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, ఓ ప్రవక్తా! తమరిపై, తమ ఇంటి వారిపై ఎలా దరూద్ పంపాలి. ఎందుకంటే అల్లాహ్ సలామ్ పంపించే పద్ధతి మాకు నేర్పాడు,’ అని విన్నవించుకున్నాం. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పంపాలి అని అన్నారు:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1) అల్లాహ్ ప్రమేయం లేకుండా ఏదయినా అంటువ్యాధి ఇతరులకు సోకుతుందా ?
B] లేదు
عَنْ أبي هُريرة رضي الله عنه قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا عَدْوَى وَلَا هَامَةَ ولَاَ صَفَرَ”. فَقَالَ أَعْرَابِيّ: يَا رَسُوْلَ فَمَا بَالَ الْإِبِلِ تَكُوْنُ فِي الرَّمْلِ لَكَأَنَّهَا الظِّبَّاءُ فَيُخَالِطُهَا الْبَعِيْرُالْأَجْرَبُ فَيُجْرِبُهَا؟ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فَمَنْ أَعْدَى الْأَوَّلَ”. رَوَاهُ الْبُخَارِيُّ .
(బు’ఖారీ 5770, మిష్కాత్ 4578, ప్రవక్త మహితోక్తులు 1435)
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచచించారు, ”ఒకరి వ్యాధి మరొకరికి అంటదు, గుడ్లగూబ అపశకునం కాదు. ‘సఫర్ నెల అపశకునం కాదు.” అది విని ఒక గ్రామీణుడు, ‘ఓ ప్రవక్తా! మా ఒంటెలు జింకల మాదిరిగా ఎడారిలో ఆరోగ్యంగా, చురుకుగా ఉంటాయి. కాని గజ్జి ఉన్న ఒక ఒంటె వాటిలో కలసిపోగానే ఒంటెలన్నిటికీ ఆ గజ్జి తగులుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అని అడిగాడు. ఇది నువ్వనుకుంటున్నట్లు అంటు వల్లనే వచ్చి ఉంటే ఆ మొదటి ఒంటెకు దేని అంటు తగిలింది?.” (అంటే విధివ్రాత ప్రకారంగా, అల్లాహ్ ఇష్టంతోనే ఇదంతా జరిగిందని, అంటు ఒక కారణం కావచ్చు అది కూడా అల్లాహ్ ప్రమేయంతోనే, కాని అదే మూలం ఎంత మాత్రం కాదు).
ఏ ఆపద అయినాసరే – అది భూమిలో వచ్చేదైనా, స్వయంగా మీ ప్రాణాలపైకి వచ్చేదైనా – మేము దానిని పుట్టించకమునుపే అదొక ప్రత్యేక గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇలా చేయటం అల్లాహ్ కు చాలా తేలిక.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: విశ్వాసులు పరస్పరం అభిమానించుకోవటంలో, కనికరించుకోవటంలో, ప్రేమావాత్సల్యాలతో మెలగటంలో ఒక దేహం లాంటివారు. దేహంలో ఒక అవయవానికి బాధకలిగినప్పుడు మొత్త దేహమంతా బాధతో, జబ్బుతో మూలుగుతుంది.
విశ్వాసుల పరస్పరం సంబంధాన్ని అల్లాహ్ ఖుర్ఆనులో కూడా తెలియజేశాడు. సూర ఫత్ హ్ 48:29లో: رُحَمَاءُ بَيْنَهُمْ ۖ అంటే ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. అని చెప్పడం జరిగింది.
సూర మాఇద 5:54లో అల్లాహ్ ను ప్రేమించేవారు మరియు అల్లాహ్ ప్రియుల ఒక గుణం ఇలా తెలుపబడినది: أَذِلَّةٍ عَلَى الْمُؤْمِنِينَ ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు.
3) జున్నూన్ (చేపవాడు) అని పిలువబడ్డ ప్రవక్త ఎవరు ?
చేపవాడు (యూనుస్ అలైహిస్సలాం) కోపగించుకుని వెళ్ళిపోయినప్పటి స్థితి(ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి.) మేము తనను పట్టుకోలేమని అతడు భావించాడు. ఆఖరికి అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి” అని మొరపెట్టుకున్నాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
కేవలం ఆశ సరియైనది కాదు. కేవలం భయం కూడా సరియైనది కాదు.వాస్తవానికి మనం అత్యధికంగా అల్లాహ్ ను ప్రేమిస్తూ, ఆశ మరియు భయంతో అల్లాహ్ ను ఆరాధించాలి. మన జీవితంలోని ప్రతి క్షణం అల్లాహ్ శిక్ష నుండి భయపడతూ ఉండాలి, ఈ విధంగా శిక్షకు గురి చేసే పనుల నుండి దూరముండ గలుగుతాము. అలాగే అల్లాహ్ కారుణ్యం పట్ల ఆశ కలిగి ఉండాలి, ఈ విధంగా కారుణ్యం పొందే సత్కార్యాలు చేయగలుగుతాము.
స్టూడెంట్ పాస్ అవ్వాలన్న ఆశ తో, ఫెయిల్ అవుతానేమోనన్న భయం తో చదువులో యలా శ్రమ పడతాడు? అలాగే విశ్వాసి కూడా ఆశ మరియు భయం తో ఇంకా సంపూర్ణ ప్రేమతో అల్లాహ్ ఆరాధనలో, విధేయతలో తన జీవితం గడుపుతాడు.
ఈ భావంలో అనేక ఖుర్ఆన్ ఆయతులున్నాయి. నమూనాకు ఒక రెండు ప్రస్తావిస్తాను.
ఏమిటి, ఏ వ్యక్తి అయితే రాత్రి వేళల్లో సాష్టాంగప్రణామం (సజ్దా) చేస్తూ, దైవారాధనలో నిలబడుతున్నాడో, పరలోకానికి భయపడుతూ, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తున్నాడో అతను (మరియు దానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు – ఇద్దరూ సమానులు కాగలరా?). చెప్పండి – తెలిసినవారు, తెలియనివారు ఒక్కటేనా? బుద్ధిమంతులు మాత్రమే ఉపదేశాన్ని గ్రహిస్తారు.
السجدة 32:16 يَدْعُونَ رَبَّهُمْ خَوْفًا وَطَمَعًا
వారు తమ ప్రభువును భయంతోనూ, ఆశతోనూ ప్రార్థిస్తారు.
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక యువకుని వద్దకు వెళ్ళారు. అప్పుడతను మరణావస్థలో ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని ‘ఇప్పుడు నీ మనసులో ఏముంది? (అంటే దైవ కారుణ్యం పట్ల ఆశ ఉందా లేక అల్లాహ్ ఆగ్రహం పట్ల భయం ఉందా) అని అడిగారు. దానికి ఆ యువకుడు, ‘ప్రవక్తా! నేను దైవకారుణ్యాన్ని కోరుకుంటున్నాను. నా పాపాల పట్ల భయపడుతున్నాను’ అని అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ దాసుని హృదయంలో అయితే ఇటువంటి స్థితిలో ఈ రెండు విషయాలు జమ అయితే అల్లాహ్ తఆలా అతను కోరింది ప్రసాదిస్తాడు. ఇంకా అతడు భయపడుతున్న దాని నుండి రక్షిస్తాడు’ అని అన్నారు.
ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు: అల్లాహ్ వైపుకు పయనంలో ఉన్న హృదయం పక్షి లాంటిది. ప్రేమ దాని తల, భయం మరియు ఆశ దాని రెండు రెక్కలు. ఎప్పుడైతే తల మరియు రెండు రెక్కలు మంచిగుంటాయో, ఆ పక్షి మంచిగా ఎగురుతుంది, తల తీసేస్తే పక్షి చనిపోతుంది, రెక్కలు లేకపోతే ఏ వేటగాడైనా సులభంగా వేటాడుతాడు.
(2) నమాజ్ తర్వాత ఏమి చదివితే మరణం వెంటనే స్వర్గం లభిస్తుంది?
జవాబు : C) ఆయతుల్ కుర్సీ
النسائي الكبرى 9848 و صحيح الترغيب 1595: عَنْ أَبِي أُمَامَةَ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ قَرَأَ آيَةَ الْكُرْسِيِّ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ مَكْتُوبَةٍ لَمْ يَمْنَعْهُ مِنْ دُخُولِ الْجَنَّةِ إِلَّا أَنْ يَمُوتَ»
ఎవరు ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో అతను స్వర్గంలో ప్రవేశించుటకు అతని చావే అడ్డము.
ప్రతి ముస్లిం ప్రతీ రోజు కనీసం 8 సార్లు దీనిని చదువాలి. కొంత షార్ట్ కట్ అంటే కనీసం 6 సార్లు. ఎప్పుడెప్పుడూ అనేదీ మరో క్విజ్ లో తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్
(3) ఆకు రాలని & ముస్లింతో పోలిన చెట్టు ఏది?
జవాబు: B) ఖర్జూరం చెట్టు.
సహీ బుఖారీ 61లో మరియు సహీ ముస్లిం 2811లో ఉంది అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
«إِنَّ مِنَ الشَّجَرِ شَجَرَةً لاَ يَسْقُطُ وَرَقُهَا، وَإِنَّهَا مَثَلُ المُسْلِمِ، فَحَدِّثُونِي مَا هِيَ»
చెట్లలో ఒక చెట్టుంది దాని ఆకు రాలదు, ముస్లిం ఆ చెట్టు లాంటివాడు
బుఖారీ 5444లోనే మరో ఉల్లేఖనంలో ఉంది:
«… لَمَا بَرَكَتُهُ كَبَرَكَةِ المُسْلِمِ»
ఆ చెట్టు బర్కత్ (శుభం) ముస్లిం బర్కత్ లాంటిది.
సహీ ఇబ్ను హిబ్బాన్ 243లోని ఓ ఉల్లేఖనంలో ఉంది:
أَصْلُهَا ثَابِتٌ وَفَرْعُهَا فِي السَّمَاءِ
అది బాగా వ్రేళ్లూనుకుని ఉంది. దాని శాఖలు ఆకాశంలో ఉన్నాయి.
చెప్పండీ ఆ చెట్టు పేరేమిటో: అప్పుడు అక్కడున్న సహాబాలలో కేవలం పది సంవత్సరాల వయస్కుడైన అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ కే అది తెలిసిందంట, కాని సమావేశంలో మా నాన్న ఉన్నారు, అబూ బక్ర్, ఉమర్ లాంటి పెద్దవారు మాట్లాడనప్పుడు నేనెలా చెప్పాలని సిగ్గుపడ్డారంట. తర్వాత సహాబాలు ప్రవక్తనే అడిగితే ప్రవక్త: అది ఖర్జూరపు చెట్టు అని చెప్పారు.
ఆ చెట్టు ముస్లిం లాంటిది అని చెప్పడం జరిగింది ఇది చాలా గమానార్హమైన విషయం.ఖర్జూరపు చెట్టు ఆకు రాలదు అలాగే ముస్లిం ధర్మపరంగా ఎన్నడూ పతనంలోకి పోడు. అతని ఏ దుఆ వృధా కాదు. ఈ చెట్టు బర్కత్ దాని ప్రతి భాగంలో ఉంది, చెట్టు పరంగానైనా, ఆకు పరంగానైనా, దాని పువ్వు నుండి మొదలుకొని పూర్తి పండు అయ్యే వరకు ఎన్ని దశలుంటాయి ప్రతీది తినబడుతుంది సామాన్యంగా అరబ్బులో ఖర్జూరపు తోటలో పనిచేసే మనవాళ్ళకు కూడా ఈ విషయం తెలిసి ఉంటుంది. బల్హ్ (بَلح), రుతబ్ (رُطَب), తమ్ర్ (تمر), విశ్వాసి కూడా అన్ని కాలాల్లో, సమయాల్లో లాభదాయకంగా ఉంటాడు, అతని మాటలు, పనులు, అతని ప్రవర్తన, అతని మౌనం మరియు అతని చలనం అన్నీ కూడా అల్లాహ్ ఆదేశాలకనుగుణంగా స్వయానికి, ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాయి. అంతే కాదు ఖర్జురపు చెట్టు పండ్లు ఇవ్వలేని ముసలిదై చావుదలకు వచ్చినా, చచ్చిపోయినా దాని ద్వారా లాభం పొందడం జరుగుతుంది. అలాగే విశ్వాసి చావు తర్వాత అతను వదలి వెళ్ళిన విద్య ద్వారా, వదలి వెళ్ళిన మంచి పనుల ద్వారా, మంచి శిక్షణ ఇచ్చి వదలి వెళ్ళిన సంతానం ద్వారా, వారసుల కొరకు వదలి వెళ్ళిన ఆస్తి ద్వారా ప్రయోజనం పొందడం జరుగుతుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే ఖర్జూరపు చెట్టు వ్రేళ్ళు ఇతర చెట్ల వ్రేళ్ళ మాదిరిగా నలువైపులా పారుతూ జారుతూ పక్కవారి గోడను బద్దలు జేయవు, ఎవరి ఇళ్ళును పడగొట్టవు, నేరుగా భూమిలోకి వెళ్ళిపోతాయి. దాని కొమ్మలు, మండలు, శాఖలు పైకి నేరుగా వెళ్తాయి ఎవరికీ ఇబ్బంది కలిగించవు అలాగే ఒక నిజ విశ్వాసి ద్వారా ఎవరికీ ఏ హానీ జరగదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 18
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ప్రశ్నల పత్రం – 18
1 ) అల్లాహ్ ఏ ప్రవక్తను ఖలీల్ (అత్యంత ప్రియుడు) అని అన్నాడు?
A) మూసా (అలైహిస్సలాం)
B) ఇబ్రాహీం (అలైహిస్సలాం)
C) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)
D) ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)
2 ) ఏ జిక్ర్ గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వర్గ నిధులలో ఒక నిధి అని చెప్పారు ?
A) లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్
B) సుబ్ హానల్లాహ్
C) లా ఇలాహ ఇల్లల్లాహ్
3 ) నేనూ ప్రవక్తను అని ఆరోపన చేసిన అబద్దీకులలో వీడు ఒకడు ?
1) అల్లాహ్ ఏ ప్రవక్తను ఖలీల్ (అత్యంత ప్రియుడు) అని అన్నాడు?
JAWAB: D) ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)
ఖుర్ఆనులో ఇబ్రాహీం అలైహిస్సలాంను ఖలీల్ గా చేసిన ప్రస్తావన ఉంది
4:125 وَاتَّخَذَ اللَّهُ إِبْرَاهِيمَ خَلِيلًا
ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)ను అల్లాహ్ తన మిత్రునిగా చేసుకున్నాడు.
صحيح البخاري 6565 … ائْتُوا إِبْرَاهِيمَ الَّذِي اتَّخَذَهُ اللَّهُ خَلِيلًا،
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: ప్రళయదినాన ప్రజలందరూ హషర్ మైదానంలో ఓపిక వహించలేక, అల్లాహ్ వద్ద సిఫారసు చేయాలని ముందు ఆదం అలైహిస్సలాం వద్దకు, ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం వద్దకు వస్తారు, అయితే నూహ్ సిఫారసు చేయరు. ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు వెళ్లండి అల్లాహ్ ఆయన్ని ఖలీల్ గా చేసుకున్నాడు అని అంటారు.
అయితే హదీసులో ఇబ్రాహీం అలైహిస్సలాంతో పాటు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కూడా ఖలీల్ గా చేసుకున్నాడు అని ఉంది అయితే ఇద్దరూ కూడా ఖలీల్ అవడంలో రవ్వంత సందేహం లేదు. కాకపోతే ప్రజలలో ఫేమస్ మాట ఇబ్రాహీం ఖలీల్, మూసా కలీం అని.
సహీ ముస్లిం 532లో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ మరణానికి కేవలం 5 రోజుల ముందు ఇలా చెప్పగా నేను విన్నానని, జుందుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
మీలో ఎవరు నాకు ఖలీల్ కారని స్పష్టంగా తెలియజేస్తున్నాను, ఎందుకనగా అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంని ఖలీల్ గా చేసుకున్నట్లు నన్ను కూడా ఖలీల్ గా చేసుకున్నాడు. ఒకవేళ నేను ఎవరినైనా ఖలీల్ గా చేసుకునేవాడినేనైతే అబూ బక్ర్ ని ఖలీల్ గా చేసుకునేవాడిని. వినండీ! మీకంటే ముందు గడిసినవారు తమ ప్రవక్తల, పుణ్యపురుషుల సమాధులను మస్జిదులుగా (ఆరాధనాలాయంగా) చేసుకునేవారు! జాగ్రత్తగా వినండి! మీరు సమాధులను మస్జిదులుగా చేసుకోకండి. ఇలా చేయడం నుండి నేను మిమ్మల్ని వారిస్తున్నాను.
ఇబ్రాహీం అలైహిస్సలాంను ఖలీల్ గా ఎన్నుకున్నది ఆయనలో ఉన్న ఎన్నో అత్యుత్తమ గుణాల కారణంగా:
1- ఇమాం, ఒంటరిగానైనప్పటికీ నాయకత్వం గుణాలు ఆయనలో ఇమిడి ఉండినవి. సూర నహల్ 16:120,121
2- వఫాదార్, అల్లాహ్ యొక్క ఆదేశాలన్నిటినీ నెరవేర్చారు. సూర నజ్మ్ 53: 37
3- హలీం (సహనశీలి)
4- అవ్వాహ్ (అధికంగా అల్లాహ్ ముందు వినమ్రులై, జిక్ర్, ఇస్తిగ్ఫార్, దుఆలో ఉండేవారు
5- అల్లాహ్ ను గుర్తెరిగి సంపూర్ణ ప్రేమతో ఆయన వైపుకు మరలేవారు, ఇతరుల పట్ల ఏ ఆశ లేకుండా ఉండేవారు. సూర హూద్ 11:75
6- చాలా ఉపకారం చేసేవారు, అతిథికి మర్యాదనిచ్చేవారు. సూర జారియాత్ 51:24-27
7- ఓపిక సహనాల్లో ఉన్నత శిఖరానికి చేరినవారు. సూర అహ్ ఖాఫ్ 46:35, సూర షూరా 42:13
ఆయన ఉత్తమ గుణాల్లోని రెండు గుణాలు అతిముఖ్యమైనవి, మనం వాటిని మరవకూడదు : ఎవరూ తోడులేనప్పుడు, ఒంటరిగా ఉండి కూడా తౌహీద్ పై ఉన్నారు, షిర్క్ కు వ్యెతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. ముమ్ తహన 60:4
వయస్సు పై బడిన తర్వాత కలిగిన ఏకైక సంతానం యొక్క ప్రేమ ఎంతగా ఉంటుందో చెప్పనవసరం లేదు, అలాంటి ఏకైక పుత్రుడిని అల్లాహ్ ప్రేమలో బలిచేయుటకు సిద్ధమయ్యారు. సాఫ్ఫాత్ 37:100-111
2) ఏ జిక్ర్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గ నిధులలో ఒక నిధి అని చెప్పారు
అబూ మూసా అష్’అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ”ఓ ‘అబ్దుల్లా బిన్ ఖైస్! నేను నీకు స్వర్గనిధుల్లో ఒక నిధిని చూపనా?” అని అన్నారు. దానికి నేను, ‘చూపండి ఓ అల్లాహ్ ప్రవక్తా!’ అని అన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ”లా ‘హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” స్వర్గ నిధుల్లోని ఒక నిధి అని ప్రవచించారు. (బు’ఖారీ 4205, ముస్లిమ్ 2704)
సుబ్ హానల్లాహ్, వల్ హందులిల్లాహ్, వలాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వలాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ చదివిన పాపాలు మన్నించబడతాయి, అవి సముద్రపు నురుగంత ఉన్నా సరే. (తిర్మిజి 3460, హసన్)
ఇవి మరియు వీటితో పాటు అల్లాహుమ్మగ్ ఫిర్లీ వర్ హమ్నీ వఆఫినీ వర్ జుక్నీ వహ్దినీ దుఆ ఒక గ్రామినుడికి నేర్పి ఇతను సర్వ మేళ్ళను తీసుకుళ్తున్నాడు అని ప్రవక్త చెప్పారు. (అబూదావూద్ 832). ప్రవక్త దీనిని గిరాసుల్ జన్నహ్ అన్నారు. (ఇబ్ను హిబ్బాన్ 821)
2) నేనూ ప్రవక్తను అని ఆరోపణ చేసిన అబద్దీకులలో వీడు ఒకడు ?
A ] మిర్జా గులామ్
అబూ దావూద్ 4333 లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
30 అబద్ధాల కోరులు అసత్యవాదులు రానంత వరకు ప్రళయం సంభవించదు, ప్రతి ఒక్కడు తన భ్రమలో పడి తాను దైవప్రవక్త అన్న ఆరోపణ చేసుకుంటాడు.
వారిలో ఒకడు అబుల్ అస్వద్ అల్ అనసీ యమన్ లో రెండోవాడు ముసైలమా కజ్జాబ్ యమామలో ప్రవక్త కాలంలోనే దావా చేశారు. అబుల్ అస్వద్ అనతికాలంలోనే హతమార్చబడ్డాడు. మసైలమా ప్రవక్త వద్దకు వచ్చిన సంగతి సహీ బుఖారీ 3620లో ఉంది
ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ముసైలమా కజ్జాబ్ ప్రవక్త కాలంలో వచ్చి, ముహమ్మద్ గనక తన తర్వాత నాకు ఖిలాఫత్ మాట ఇచ్చాడంటే నేను ఆయన్ని అనుసరిస్తాను, అతని వెంట అతని జాతి వారు కూడా ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాబిత్ బిన్ ఖైస్ తో సహా అతని వద్దకు వచ్చారు, అప్పుడు ప్రవక్త చేతిలో ఒక ఖర్జూరపు కర్ర ముక్క ఉంది, ముసైలమా మరియు అతని అనుచరుల దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు: నీవు ఈ కర్ర ముక్క అడిగినా, నేను అది నీకివ్వను. అల్లాహ్ నీ కోసం నిర్ణయించిన దాన్నుండి నీవు ఏ మాత్రం తప్పించుకోలేవు. నీవు నా నుండి ముఖం తిప్పుకున్నావు. అందుచేత అల్లాహ్ నిన్ను (త్వరలోనే) అంతమొందిస్తాడు. నీవు నా కలలో ఎలా కన్పించావో ఇప్పుడు నేను నిన్ను అదేవిధంగా చూస్తున్నాను. అతని హత్య విషయం కూడా సహీ బుఖారీ 4072లో ఉంది
హజ్రత్ హంజా రజియల్లాహు అహు గానికి హతమార్చిన వహ్ షీ తర్వాత ఇస్లాం స్వీకరించారు, అయితే అబూ బక్ర్ రజియల్లాహు అన్హు పరిపాలన కాలంలో యమామా యుద్ధంలో పాల్గొన్నారు. ముసైలమాను హతమార్చారు.
చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అసత్యవాదులు వచ్చారు, వారిలో ఒకడు మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ.ఇతడు 13 ఫిబ్రవరీ 1835లో ప్రస్తుత పంజాబ్ రాష్టం, గోర్దాస్ పూర్ జిల్లాహ్ ఖాదీయన్ గ్రామంలో పుట్టాడు. 26 మే 1908లో ప్రస్తుత పాకిస్తాన్ లో చాలా హీనంగా చనిపోయాడు.ఇతని గురించి ఈ లింక్ లో మరిన్ని వివరాలు తెలుసుకోగలరు
ప్రారంభంలో అతడు ముస్లిమేతరులో ఇస్లాం సపోర్టులో డిబేట్లు చేస్తున్నట్లు ప్రదర్శించాడు, చేశాడు కూడా తర్వాత మెల్లమెల్లగా అతని అసలు నల్లరూపం బయటపడింది. అతని వాక్చాతుర్యాన్ని చూసి బ్రిటిష్ వారు వాడుకున్నారు, కాని వానికి అది తెలియలేదా, లేక ప్రాపంచిక వ్యామోహానికి లోనై అమ్ముడుపోయాడా కాని పరలోకానికి ముందు ఇహలోకంలోనే అల్లాహ్ వాడిని అవమానపరిచాడు
అతడు ప్రవక్త అన్న ఆరోపణ ఒక్కట కాదు చేసింది, ఎన్నో రంగులు మార్చాడు, ఎన్నో రూపుల వేశాడు ఎన్నో ఆరోపణలు చేశాడు, వాని కాలంలో వానికి ధీటుగా నిలబడిన ధర్మపండితులు మాలానా సనాఉల్లా అమ్రత్సరీ రహిమహుల్లాహ్. అతని ప్రతి అసత్యవాదానికి జవాబిస్తూ పోయారు పై లింకులో తప్పక వివరాలు చూడగలరు.
సంక్షిప్తంగా వాడు చేసిన ఆరోపణల్లో కొన్ని:
* అల్లాహ్ అర్ష్ పీఠంపై నన్ను ప్రశంసిస్తున్నాడు (అంజామె ఆథమ్ 55)
* మృతులకు ప్రాణం పోసే, జీవులను మరణింపజేసే శక్తి నాకు ప్రసాదించబడింది. (ఖుత్బయే ఇల్హామియా 23)
* మీరు తెలుసుకోండి! అల్లాహ్ కరుణ కటాక్షాలు నాతోనే ఉన్నాయి. అల్లాహ్ ఆత్మ నాలోన చెబుతుంది. (అంజామె ఆథమ్ 176).
* తానె మసీహె మౌఊద్ అని చెప్పుకున్నాడు. అంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బుఖారీ 2222, ముస్లిం 155లో ఇచ్చిన శుభవార్త
ఈ ఈసా నేనే అని అంటాడు. ఒక ఖాదీయాని సోదరుడు నాతో చర్చలో ఉన్నప్పుడు ఈ హదీసు తెలిపి మీరు నమ్మే మిర్జా న్యాయశీలి నాయకుడయ్యాడా? శిలువను విరగ్గొట్టారా? పందిని చంపారా? జిజ్ యా పన్ను లేకుండా చేశారా ? జకాత్ తీసుకునేవాడు లేని విధంగా ధనం వృద్ధి అయిందా? దజ్జాల్ ను హతమార్చాడా? అని అడిగాను. ఇప్పటికీ ఏ సమాధానం రాలేదు.
..ప్రస్తుతానికి కూడా వారి అనుచరులు ఉన్నారు వారిని మనం కూడా ఖండిస్తూనే ఉండాలి వారి ఉచ్చులో పడకుండా ఉండడానికి జాగ్రత్త వహించాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.