మానవుని వద్దకు షైతాన్ వచ్చి “నీ ప్రభువును ఎవరు సృష్టించారు” అని దుష్ప్రేరణ కల్పిస్తే ఏమని పలకాలి [ఆడియో]

బిస్మిల్లాహ్

[9:15 నిముషాలు]
తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 25[ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

1) మానవుని వద్దకు షైతాన్ వచ్చి “నీ ప్రభువును ఎవరు సృష్టించారు” అని దుష్ప్రేరణ కల్పిస్తే ఏమని పలకాలి ?

A)  అల్లాహ్ శరణు అర్జించాలి
B) “నేను అల్లాహ్ ను విశ్వసించాను” అని పలకాలి
C) పై రెండూ యదార్థమే

వివరణ:

షైతాన్ మన శాశ్వత శత్రువు, అల్లాహ్ ఖుర్అన్ లో ఈ విషయం స్పష్టంగా తెలిపాడు,

إِنَّ الشَّيْطَانَ لَكُمْ عَدُوٌّ فَاتَّخِذُوهُ عَدُوًّا ۚ إِنَّمَا يَدْعُو حِزْبَهُ لِيَكُونُوا مِنْ أَصْحَابِ السَّعِيرِ (فاطر 35:6)

“నిశ్చయంగా షైతాను మీ శత్రువు. కనుక మీరు కూడా వాణ్ణి శత్రువుగానే పరిగణించండి. వాడు తన సమూహాన్ని, వారంతా నరకవాసులలో చేరిపోవటానికే పిలుస్తున్నాడు.”

వాని ప్రయత్నాల్లో అతి ముఖ్యమైనది, అల్లాహ్ గురించి మన విశ్వాసాన్ని పాడుచేయడం. అందుకే ఈ సృష్టంతటిని అల్లాహ్ పుట్టించాడు, మరి అల్లాహ్ ను ఎవరు పుట్టించాడు అని సందేహం కలుగజేస్తాడు. అలాంటప్పుడు ఈ పనులు చేయండి, వాని సందేహాలకు దూరంగా ఉండండి:

1- ఆమంతు బిల్లాహ్ అనాలి, అంటే నేను అల్లాహ్ ను విశ్వసించాను, కనుక అల్లాహ్ గురించి ఇలాంటి ఆలోచనల్లో పడను.

2- అల్లాహు అహద్, అల్లాహుస్సమద్, లమ్ యలిద్, వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్ చదవాలి.

3- ఎడమ ప్రక్కన మూడు సార్లు ఉమ్మి వేయాలి.

4- షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరాలి.

5- ఇలాంటి సందేహాలు, అనుమానాలు, చెడు ఆలోచనలను మనస్సులో నుంచి తొలగించాలి. (సహీహా అల్బానీ 134).

ఈ ఐదు విషయాలు హదీసు ద్వారా రుజువైనవి :

సహీ ముస్లిం 134లో ఉంది, హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

“لَا يَزَالُ النَّاسُ يَتَسَاءَلُونَ حَتَّى يُقَالَ: هَذَا خَلَقَ اللهُ الْخَلْقَ، فَمَنْ خَلَقَ اللهَ؟ فَمَنْ وَجَدَ مِنْ ذَلِكَ شَيْئًا، فَلْيَقُلْ: آمَنْتُ بِاللهِ”
وفي رواية مسلم 134:- “يَأْتِي الشَّيْطَانُ أَحَدَكُمْ فَيَقُولَ: مَنْ خَلَقَ كَذَا وَكَذَا؟ حَتَّى يَقُولَ لَهُ: مَنْ خَلَقَ رَبَّكَ؟ فَإِذَا بَلَغَ ذَلِكَ، فَلْيَسْتَعِذْ بِاللهِ وَلْيَنْتَهِ”.
وفي رواية أبي داود 4722:- فَإِذَا قَالُوا ذَلِكَ فَقُولُوا: اللَّهُ أَحَدٌ اللَّهُ الصَّمَدُ لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ ثُمَّ لِيَتْفُلْ عَنْ يَسَارِهِ ثَلَاثًا وَلْيَسْتَعِذْ مِنَ الشَّيْطَانِ “

ప్రజలు పరస్పరం ప్రశ్నించుకుంటారు, చివరికి ఈ సృష్టిని అల్లాహ్ సృష్టించాడు, అయితే అల్లాహ్ ను ఎవరు సృష్టించాడు అన్న వరకు పోతారు. ఇలాంటి విషయం ఎవరైనా చూసినప్పుడు వెంటనే ఆమంతు బిల్లాహ్ చదవాలి, అంటే నేను అల్లాహ్ ను విశ్వసించాను.

మరో ఉల్లేఖనంలో ఉంది: షైతాన్ మీలో ఎవరి వద్దకైనా వచ్చి దీనిని ఎవరు పుట్టించారు, ఫలానా దానిని ఎవరు పుట్టించారు అని ప్రేరణ కలిగిస్తాడు, చివరికి నీ ప్రభువుని ఎవరు పుట్టించాడు అని మాట వేస్తాడు, ఈ స్థితికి చేరుకున్నప్పుడు వెంటనే అల్లాహ్ శరణులోకి రావాలి, ఈ దురాలోచనను వీడాలి.

అబూదావూద్ 4722లోని ఉల్లేఖనంలో ఉంది “… మరి అల్లాహ్ను ఎవరు సృష్టించారు?” అని చెప్పటం జరుగుతుంది. ప్రజలు ఇలా అన్నప్పుడు, మీరు ‘అల్లాహ్ ఒక్కడే, ఆయన అక్కర లేనివాడు, ఆయనకు సంతానం లేదు, ఆయన కూడా ఎవరి సంతానం కాడు, ఆయనకు సరిసమానుడెవడూ లేడు’ అని పలికి, మూడుసార్లు ఎడమవైపు ఉమ్మి, షై’తాన్ కుతంత్రాల నుండి అల్లాహ్ను శరణుకోరండి.’

ఈ దురాలోచన కలిగితే చేయవలసిన మన బాధ్యత తెలుసుకున్నాము. అయితే అల్లాహ్ అందరికంటే ముందు ఆయనకు ముందు ఏదీ లేదు అని కూడా ఆధారాలున్నాయి:

సహీ ముస్లిం 2713లో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: మీలో ఎవరైనా నిద్రించేకి ముందు కుడి ప్రక్కన పడుకొని ఈ దుఆ చదవాలి:

«اللهُمَّ رَبَّ السَّمَاوَاتِ وَرَبَّ الْأَرْضِ وَرَبَّ الْعَرْشِ الْعَظِيمِ، رَبَّنَا وَرَبَّ كُلِّ شَيْءٍ، فَالِقَ الْحَبِّ وَالنَّوَى، وَمُنْزِلَ التَّوْرَاةِ وَالْإِنْجِيلِ وَالْفُرْقَانِ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ كُلِّ شَيْءٍ أَنْتَ آخِذٌ بِنَاصِيَتِهِ، اللهُمَّ أَنْتَ الْأَوَّلُ فَلَيْسَ قَبْلَكَ شَيْءٌ، وَأَنْتَ الْآخِرُ فَلَيْسَ بَعْدَكَ شَيْءٌ، وَأَنْتَ الظَّاهِرُ فَلَيْسَ فَوْقَكَ شَيْءٌ، وَأَنْتَ الْبَاطِنُ فَلَيْسَ دُونَكَ شَيْءٌ، اقْضِ عَنَّا الدَّيْنَ، وَأَغْنِنَا مِنَ الْفَقْرِ»

”అల్లాహుమ్మ రబ్బి స్సమావాతి వ రబ్బల్ అర్’ది వ రబ్బ కుల్లి షయ్ఇన్ ఫాలిఖల్ ‘హబ్బి వన్నవా, వ మున్’జిల త్తౌరాతి వల్ ఇన్జీలి, వల్ ఖుర్ఆని. అ’ఊజు’బిక మిన్ షర్రి కుల్లి జీ’ షర్రిన్, అంత ఆ’ఖిజు’న్ బి నా’సియతిహీ. అంతల్ అవ్వలు ఫలైస ఖబ్లక షైఉన్, వ అంతల్ ఆ’ఖిరు ఫలైస బ’అదక షయ్ఉన్, వ అంత ”జ్జాహిరు ఫలైస ఫౌఖక షయ్ఉన్ వ అంతల్ బా’తిను ఫలైస దూనక షయ్ఉన్ ఇఖ్’ది అన్నిద్దైన. వ అ’గ్నినీ మినల్ ఫఖ్రి!”

‘ఓ అల్లాహ్! సప్తాకాశాలకు భూమికి ప్రభువు నువ్వే అన్నిటికీ ప్రభువువీ, బీజాన్ని చీల్చేవాడా! గింజలను మొలకెత్తించే వాడా, తౌరాతు, ఇంజీలు, ఖుర్ఆన్ను అవతరింపజేసిన వాడా! నిన్ను నేను శరణుకోరు తున్నాను. ప్రతి చెడు వస్తువు యొక్క చెడు నుండి అంటే ప్రతి హాని తలపెట్టే వస్తువు నుండి. దాని నుదురు నీ చేతిలోనే ఉంది. నీవే అందరికంటే ముందు వాడవు. నీ కంటే ముందు ఏదీలేదు. నీవే అందరికంటే చివరి వాడవు. నీ తర్వాత ఏదీ లేదు. నీవు బహిర్గతుడవు, నీవు అంతర్గతుడవు. నీకంటే రహస్యమైనది ఏదీలేదు. నీవు నన్ను రుణం తీర్చివేయడంలో, దారిద్య్రం దూరం కావడంలో నాకు సహాయం చేయి.


%d bloggers like this: