
[7:33 నిముషాలు]
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 25
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
3) “పరమ పవిత్రుడు” అనే భావంను ఈ క్రింది వాటిలో ఏ పేరు సూచిస్తుంది?
A) అల్ ఖాలిఖ్
B) అల్ ఖహ్హర్
C) అల్ ఖుద్దూస్
అల్ ఖుద్దూస్: పవిత్రుడు, పరిశుద్ధుడు, అన్ని లోపాలకు దోషాలకు అతీతుడు.
59:23 هُوَ اللَّهُ الَّذِي لَا إِلَٰهَ إِلَّا هُوَ الْمَلِكُ الْقُدُّوسُ السَّلَامُ الْمُؤْمِنُ الْمُهَيْمِنُ الْعَزِيزُ الْجَبَّارُ الْمُتَكَبِّرُ ۚ سُبْحَانَ اللَّهِ عَمَّا يُشْرِكُونَ
“ఆయనే అల్లాహ్. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే రాజాధిరాజు, (పరమ పవిత్రుడు), లోపాలన్నింటికీ అతీతుడు, శాంతి (భద్రతల) ప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు, బలపరాక్రమాలు గలవాడు, పెద్దరికం గలవాడు. ప్రజలు ఆయనకు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్ పవిత్రంగా ఉన్నాడు.”
62:1 يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ الْمَلِكِ الْقُدُّوسِ الْعَزِيزِ الْحَكِيمِ
“భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్నీ సార్వభౌముడు, పరిశుద్ధుడు, శక్తిశాలి, వివేచనాశీలి అయిన అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి.”
مسلم 487 – أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَقُولُ: «فِي رُكُوعِهِ وَسُجُودِهِ سُبُّوحٌ قُدُّوسٌ، رَبُّ الْمَلَائِكَةِ وَالرُّوحِ»
సహీ ముస్లిం 487లో ఉంది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రుకూ, సజ్దాలో ఇలా అనే వారు:
“సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాఇకతి వర్రూహ్”
أبوداود 1430 –صحيح:- عَنْ أُبَيِّ بْنِ كَعْبٍ، قَالَ: كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا سَلَّمَ فِي الْوِتْرِ، قَالَ: «سُبْحَانَ الْمَلِكِ الْقُدُّوسِ»
అబూ దావూద్ 1430 (సహీ) లో ఉంది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విత్ర్ తర్వాత “సుబ్ హానల్ మలికిల్ ఖుద్దూస్” అని చదివే వారు.
أبوداود 5085 – حسن صحيح:- قَال شَرِيقٌ الْهَوْزَنِيُّ: دَخَلْتُ عَلَى عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا، فَسَأَلْتُهَا: بِمَ كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَفْتَتِحُ إِذَا هَبَّ مِنَ اللَّيْلِ؟ فَقَالَتْ: لَقَدْ سَأَلْتَنِي عَنْ شَيْءٍ مَا سَأَلَنِي عَنْهُ أَحَدٌ قَبْلَكَ، كَانَ إِذَا هَبَّ مِنَ اللَّيْلِ كَبَّرَ عَشْرًا، وَحَمَّدَ عَشْرًا، وَقَالَ: «سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ عَشْرًا» وَقَالَ: «سُبْحَانَ الْمَلِكِ الْقُدُّوسِ عَشْرًا» وَاسْتَغْفَرَ عَشْرًا [ص:323]، وَهَلَّلَ عَشْرًا، ثُمَّ قَالَ: «اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ ضِيقِ الدُّنْيَا، وَضِيقِ يَوْمِ الْقِيَامَةِ عَشْرًا» ثُمَّ يَفْتَتِحُ الصَّلَاةَ
అబూ దావూద్ 5085 (హసన్, సహీ) లో ఉంది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రి మేల్కొన్నప్పుడు ఏ దుఆ చదివి నమాజు ప్రారంభించేవారు అని షురైఖ్ హౌజనీ ఆయిషా (రజియల్లాహు అన్హా)ను అడిగారు, ఆయిషా (రజియల్లాహు అన్హా) చెప్పారు: నీవడిగిన ప్రశ్న నీకంటే ముందు ఎవరూ అడగలేదు. ప్రవక్త రాత్రి వేళ మేల్కొని నమాజు ఆరంభంలో పదిసార్లు “అల్లాహు అక్బర్“, పదిసార్లు “అల్ హందులిల్లాహ్“, పది సార్లు “సుబ్ హానల్లాహి వబిహందిహీ“, పది సార్లు “సుబ్ హానల్ మలికిల్ ఖుద్దూస్“, పది సార్లు “అస్తగ్ ఫిరుల్లాహ్,” పది సార్లు “లాఇలాహ ఇల్లల్లాహ్” పలికేవారు. మళ్ళీ పది సార్లు “అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ జీఖిద్దున్యా వ జీఖి యౌమిల్ ఖియామహ్” చదివేవారు.
You must be logged in to post a comment.