తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 19 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 19
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 19

1) మనం అల్లాహ్ దాస్యం ఎలా చేయాలి?

A) ఆశతో చేయాలి
B) ఆశ మరియు భయంతో చేయాలి
C) భయంతో చెయాలి

2) నమాజ్ తర్వాత ఏమి చదివితే మరణం వెంటనే స్వర్గం లభిస్తుంది?

A) ఫాతిహా
B) ఆయతె కరీమా
C) ఆయతుల్ కుర్సీ

3) ఆకు రాలని మరియు ముస్లింను పోలిన చెట్టు ఏది?

A) జైతూన్ చెట్టు
B) ఖర్జూరం చెట్టు
C) మామిడి చెట్టు

క్విజ్ 19: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [19 నిమిషాలు]


(1) మనం అల్లాహ్ దాస్యం ఎలా చేయాలి?

జవాబు: B) ఆశ మరియు భయంతో చేయాలి.

అవును B సరియైన సమాధానం.

కేవలం ఆశ సరియైనది కాదు. కేవలం భయం కూడా సరియైనది కాదు.వాస్తవానికి మనం అత్యధికంగా అల్లాహ్ ను ప్రేమిస్తూ, ఆశ మరియు భయంతో అల్లాహ్ ను ఆరాధించాలి. మన జీవితంలోని ప్రతి క్షణం అల్లాహ్ శిక్ష నుండి భయపడతూ ఉండాలి, ఈ విధంగా శిక్షకు గురి చేసే పనుల నుండి దూరముండ గలుగుతాము. అలాగే అల్లాహ్ కారుణ్యం పట్ల ఆశ కలిగి ఉండాలి, ఈ విధంగా కారుణ్యం పొందే సత్కార్యాలు చేయగలుగుతాము.

స్టూడెంట్ పాస్ అవ్వాలన్న ఆశ తో, ఫెయిల్ అవుతానేమోనన్న భయం తో చదువులో యలా శ్రమ పడతాడు? అలాగే విశ్వాసి కూడా ఆశ మరియు భయం తో ఇంకా సంపూర్ణ ప్రేమతో అల్లాహ్ ఆరాధనలో, విధేయతలో తన జీవితం గడుపుతాడు.

ఈ భావంలో అనేక ఖుర్ఆన్ ఆయతులున్నాయి. నమూనాకు ఒక రెండు ప్రస్తావిస్తాను.

أَمَّنْ هُوَ قَانِتٌ آنَاءَ اللَّيْلِ سَاجِدًا وَقَائِمًا يَحْذَرُ الْآخِرَةَ وَيَرْجُو رَحْمَةَ رَبِّهِ ۗ قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ ۗ إِنَّمَا يَتَذَكَّرُ أُولُو الْأَلْبَابِ. (الزمر 39:9)

ఏమిటి, ఏ వ్యక్తి అయితే రాత్రి వేళల్లో సాష్టాంగప్రణామం (సజ్దా) చేస్తూ, దైవారాధనలో నిలబడుతున్నాడో, పరలోకానికి భయపడుతూ, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తున్నాడో అతను (మరియు దానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు – ఇద్దరూ సమానులు కాగలరా?). చెప్పండి – తెలిసినవారు, తెలియనివారు ఒక్కటేనా? బుద్ధిమంతులు మాత్రమే ఉపదేశాన్ని గ్రహిస్తారు.

السجدة 32:16 يَدْعُونَ رَبَّهُمْ خَوْفًا وَطَمَعًا
వారు తమ ప్రభువును భయంతోనూ, ఆశతోనూ ప్రార్థిస్తారు.

الترمذي 983 – حسن: عَنْ أَنَسٍ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ دَخَلَ عَلَى شَابٍّ وَهُوَ فِي المَوْتِ، فَقَالَ: «كَيْفَ تَجِدُكَ؟»، قَالَ: وَاللَّهِ يَا رَسُولَ اللَّهِ، إِنِّي أَرْجُو اللَّهَ، وَإِنِّي أَخَافُ ذُنُوبِي، فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «لَا يَجْتَمِعَانِ فِي قَلْبِ عَبْدٍ فِي مِثْلِ هَذَا المَوْطِنِ إِلَّا أَعْطَاهُ اللَّهُ مَا يَرْجُو وَآمَنَهُ مِمَّا يَخَافُ»

అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక యువకుని వద్దకు వెళ్ళారు. అప్పుడతను మరణావస్థలో ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని ‘ఇప్పుడు నీ మనసులో ఏముంది? (అంటే దైవ కారుణ్యం పట్ల ఆశ ఉందా లేక అల్లాహ్ ఆగ్రహం పట్ల భయం ఉందా) అని అడిగారు. దానికి ఆ యువకుడు, ‘ప్రవక్తా! నేను దైవకారుణ్యాన్ని కోరుకుంటున్నాను. నా పాపాల పట్ల భయపడుతున్నాను’ అని అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ దాసుని హృదయంలో అయితే ఇటువంటి స్థితిలో ఈ రెండు విషయాలు జమ అయితే అల్లాహ్ తఆలా అతను కోరింది ప్రసాదిస్తాడు. ఇంకా అతడు భయపడుతున్న దాని నుండి రక్షిస్తాడు’ అని అన్నారు.

ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు: అల్లాహ్ వైపుకు పయనంలో ఉన్న హృదయం పక్షి లాంటిది. ప్రేమ దాని తల, భయం మరియు ఆశ దాని రెండు రెక్కలు. ఎప్పుడైతే తల మరియు రెండు రెక్కలు మంచిగుంటాయో, ఆ పక్షి మంచిగా ఎగురుతుంది, తల తీసేస్తే పక్షి చనిపోతుంది, రెక్కలు లేకపోతే ఏ వేటగాడైనా సులభంగా వేటాడుతాడు.

(2) నమాజ్ తర్వాత ఏమి చదివితే మరణం వెంటనే స్వర్గం లభిస్తుంది?

జవాబు : C) ఆయతుల్ కుర్సీ

النسائي الكبرى 9848 و صحيح الترغيب 1595: عَنْ أَبِي أُمَامَةَ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ قَرَأَ آيَةَ الْكُرْسِيِّ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ مَكْتُوبَةٍ لَمْ يَمْنَعْهُ مِنْ دُخُولِ الْجَنَّةِ إِلَّا أَنْ يَمُوتَ»
ఎవరు ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో అతను స్వర్గంలో ప్రవేశించుటకు అతని చావే అడ్డము.

ఆయతుల్ కుర్సీ ఖుర్ఆన్ లోని అతిగోప్ప ఆయతు. مسلم 810 «يَا أَبَا الْمُنْذِرِ أَتَدْرِي أَيُّ آيَةٍ مِنْ كِتَابِ اللهِ مَعَكَ أَعْظَمُ؟»
పడుకునే ముందు పఠిస్తే خ2311 فَإِنَّكَ لَنْ يَزَالَ عَلَيْكَ مِنَ اللَّهِ حَافِظٌ، وَلاَ يَقْرَبَنَّكَ شَيْطَانٌ حَتَّى تُصْبِح

ప్రతి ముస్లిం ప్రతీ రోజు కనీసం 8 సార్లు దీనిని చదువాలి. కొంత షార్ట్ కట్ అంటే కనీసం 6 సార్లు. ఎప్పుడెప్పుడూ అనేదీ మరో క్విజ్ లో తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్

(3) ఆకు రాలని & ముస్లింతో పోలిన చెట్టు ఏది?

జవాబు: B) ఖర్జూరం చెట్టు.

సహీ బుఖారీ 61లో మరియు సహీ ముస్లిం 2811లో ఉంది అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

«إِنَّ مِنَ الشَّجَرِ شَجَرَةً لاَ يَسْقُطُ وَرَقُهَا، وَإِنَّهَا مَثَلُ المُسْلِمِ، فَحَدِّثُونِي مَا هِيَ»
చెట్లలో ఒక చెట్టుంది దాని ఆకు రాలదు, ముస్లిం ఆ చెట్టు లాంటివాడు

బుఖారీ 5444లోనే మరో ఉల్లేఖనంలో ఉంది:

«… لَمَا بَرَكَتُهُ كَبَرَكَةِ المُسْلِمِ»
ఆ చెట్టు బర్కత్ (శుభం) ముస్లిం బర్కత్ లాంటిది.

సహీ ఇబ్ను హిబ్బాన్ 243లోని ఓ ఉల్లేఖనంలో ఉంది:

أَصْلُهَا ثَابِتٌ وَفَرْعُهَا فِي السَّمَاءِ
అది బాగా వ్రేళ్లూనుకుని ఉంది. దాని శాఖలు ఆకాశంలో ఉన్నాయి.

చెప్పండీ ఆ చెట్టు పేరేమిటో: అప్పుడు అక్కడున్న సహాబాలలో కేవలం పది సంవత్సరాల వయస్కుడైన అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ కే అది తెలిసిందంట, కాని సమావేశంలో మా నాన్న ఉన్నారు, అబూ బక్ర్, ఉమర్ లాంటి పెద్దవారు మాట్లాడనప్పుడు నేనెలా చెప్పాలని సిగ్గుపడ్డారంట. తర్వాత సహాబాలు ప్రవక్తనే అడిగితే ప్రవక్త: అది ఖర్జూరపు చెట్టు అని చెప్పారు.

ఆ చెట్టు ముస్లిం లాంటిది అని చెప్పడం జరిగింది ఇది చాలా గమానార్హమైన విషయం.ఖర్జూరపు చెట్టు ఆకు రాలదు అలాగే ముస్లిం ధర్మపరంగా ఎన్నడూ పతనంలోకి పోడు. అతని ఏ దుఆ వృధా కాదు. ఈ చెట్టు బర్కత్ దాని ప్రతి భాగంలో ఉంది, చెట్టు పరంగానైనా, ఆకు పరంగానైనా, దాని పువ్వు నుండి మొదలుకొని పూర్తి పండు అయ్యే వరకు ఎన్ని దశలుంటాయి ప్రతీది తినబడుతుంది సామాన్యంగా అరబ్బులో ఖర్జూరపు తోటలో పనిచేసే మనవాళ్ళకు కూడా ఈ విషయం తెలిసి ఉంటుంది. బల్హ్ (بَلح), రుతబ్ (رُطَب), తమ్ర్ (تمر), విశ్వాసి కూడా అన్ని కాలాల్లో, సమయాల్లో లాభదాయకంగా ఉంటాడు, అతని మాటలు, పనులు, అతని ప్రవర్తన, అతని మౌనం మరియు అతని చలనం అన్నీ కూడా అల్లాహ్ ఆదేశాలకనుగుణంగా స్వయానికి, ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాయి. అంతే కాదు ఖర్జురపు చెట్టు పండ్లు ఇవ్వలేని ముసలిదై చావుదలకు వచ్చినా, చచ్చిపోయినా దాని ద్వారా లాభం పొందడం జరుగుతుంది. అలాగే విశ్వాసి చావు తర్వాత అతను వదలి వెళ్ళిన విద్య ద్వారా, వదలి వెళ్ళిన మంచి పనుల ద్వారా, మంచి శిక్షణ ఇచ్చి వదలి వెళ్ళిన సంతానం ద్వారా, వారసుల కొరకు వదలి వెళ్ళిన ఆస్తి ద్వారా ప్రయోజనం పొందడం జరుగుతుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే ఖర్జూరపు చెట్టు వ్రేళ్ళు ఇతర చెట్ల వ్రేళ్ళ మాదిరిగా నలువైపులా పారుతూ జారుతూ పక్కవారి గోడను బద్దలు జేయవు, ఎవరి ఇళ్ళును పడగొట్టవు, నేరుగా భూమిలోకి వెళ్ళిపోతాయి. దాని కొమ్మలు, మండలు, శాఖలు పైకి నేరుగా వెళ్తాయి ఎవరికీ ఇబ్బంది కలిగించవు అలాగే ఒక నిజ విశ్వాసి ద్వారా ఎవరికీ ఏ హానీ జరగదు.


ఇతరములు 

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

%d bloggers like this: