తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 20 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 20
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 20

1 ] అల్లాహ్ ప్రమేయం లేకుండా ఏదయినా అంటువ్యాధి ఇతరులకు సోకుతుందా ?

A) అవును
B) లేదు
C) తెలీదు

2) సమస్త ముస్లింల పోలిక వీటిలో దేనివంటిది ?

A) గొలుసు
B) మానవశరీరం
C) నక్షత్రం

3) జున్నూన్ (చేపవాడు) అని పిలువబడ్డ ప్రవక్త ఎవరు ?

A) యహ్య (అలైహిస్సలాం)
B) యూసుఫ్ (అలైహిస్సలాం)
C) యూనుస్ (అలైహిస్సలాం)

క్విజ్ 20: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [12:55 నిమిషాలు]


1) అల్లాహ్ ప్రమేయం లేకుండా ఏదయినా అంటువ్యాధి ఇతరులకు సోకుతుందా ?

B] లేదు

عَنْ أبي هُريرة رضي الله عنه قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا عَدْوَى وَلَا هَامَةَ ولَاَ صَفَرَ”. فَقَالَ أَعْرَابِيّ: يَا رَسُوْلَ فَمَا بَالَ الْإِبِلِ تَكُوْنُ فِي الرَّمْلِ لَكَأَنَّهَا الظِّبَّاءُ فَيُخَالِطُهَا الْبَعِيْرُالْأَجْرَبُ فَيُجْرِبُهَا؟ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فَمَنْ أَعْدَى الْأَوَّلَ”. رَوَاهُ الْبُخَارِيُّ .

(బు’ఖారీ 5770, మిష్కాత్ 4578, ప్రవక్త మహితోక్తులు 1435)

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచచించారు, ”ఒకరి వ్యాధి మరొకరికి అంటదు, గుడ్లగూబ అపశకునం కాదు. ‘సఫర్ నెల అపశకునం కాదు.” అది విని ఒక గ్రామీణుడు, ‘ఓ ప్రవక్తా! మా ఒంటెలు జింకల మాదిరిగా ఎడారిలో ఆరోగ్యంగా, చురుకుగా ఉంటాయి. కాని గజ్జి ఉన్న ఒక ఒంటె వాటిలో కలసిపోగానే ఒంటెలన్నిటికీ ఆ గజ్జి తగులుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అని అడిగాడు. ఇది నువ్వనుకుంటున్నట్లు అంటు వల్లనే వచ్చి ఉంటే ఆ మొదటి ఒంటెకు దేని అంటు తగిలింది?.” (అంటే విధివ్రాత ప్రకారంగా, అల్లాహ్ ఇష్టంతోనే ఇదంతా జరిగిందని, అంటు ఒక కారణం కావచ్చు అది కూడా అల్లాహ్ ప్రమేయంతోనే, కాని అదే మూలం ఎంత మాత్రం కాదు).

57:22 مَا أَصَابَ مِن مُّصِيبَةٍ فِي الْأَرْضِ وَلَا فِي أَنفُسِكُمْ إِلَّا فِي كِتَابٍ مِّن قَبْلِ أَن نَّبْرَأَهَا ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ

ఏ ఆపద అయినాసరే – అది భూమిలో వచ్చేదైనా, స్వయంగా మీ ప్రాణాలపైకి వచ్చేదైనా – మేము దానిని పుట్టించకమునుపే అదొక ప్రత్యేక గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇలా చేయటం అల్లాహ్ కు చాలా తేలిక.

2) సమస్త ముస్లింల పోలిక వీటిలో దేనివంటిది ?

B]మానవశరీరం

عَنِ النُّعْمَانِ بْنِ بَشِيرٍ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: ” مَثَلُ الْمُؤْمِنِينَ فِي تَوَادِّهِمْ، وَتَرَاحُمِهِمْ، وَتَعَاطُفِهِمْ مَثَلُ الْجَسَدِ إِذَا اشْتَكَى مِنْهُ عُضْوٌ تَدَاعَى لَهُ سَائِرُ الْجَسَدِ بِالسَّهَرِ وَالْحُمَّى
(ముస్లిం 2586, హదీసు కిరణాలు 226)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: విశ్వాసులు పరస్పరం అభిమానించుకోవటంలో, కనికరించుకోవటంలో, ప్రేమావాత్సల్యాలతో మెలగటంలో ఒక దేహం లాంటివారు. దేహంలో ఒక అవయవానికి బాధకలిగినప్పుడు మొత్త దేహమంతా బాధతో, జబ్బుతో మూలుగుతుంది.

విశ్వాసుల పరస్పరం సంబంధాన్ని అల్లాహ్ ఖుర్ఆనులో కూడా తెలియజేశాడు. సూర ఫత్ హ్ 48:29లో: رُحَمَاءُ بَيْنَهُمْ ۖ అంటే ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. అని చెప్పడం జరిగింది.

సూర మాఇద 5:54లో అల్లాహ్ ను ప్రేమించేవారు మరియు అల్లాహ్ ప్రియుల ఒక గుణం ఇలా తెలుపబడినది: أَذِلَّةٍ عَلَى الْمُؤْمِنِينَ ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు.

3) జున్నూన్ (చేపవాడు) అని పిలువబడ్డ ప్రవక్త ఎవరు ?

C] యూనుస్ (అలైహిస్సలాం)

21:87 وَذَا النُّونِ إِذ ذَّهَبَ مُغَاضِبًا فَظَنَّ أَن لَّن نَّقْدِرَ عَلَيْهِ فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ إِنِّي كُنتُ مِنَ الظَّالِمِينَ

చేపవాడు (యూనుస్‌ అలైహిస్సలాం) కోపగించుకుని వెళ్ళిపోయినప్పటి స్థితి(ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి.) మేము తనను పట్టుకోలేమని అతడు భావించాడు. ఆఖరికి అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్‌! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి” అని మొరపెట్టుకున్నాడు.

సూర సాఫ్ఫాత్ 37:139-147 లో ఇలా చెప్పబడింది.

37:139 وَإِنَّ يُونُسَ لَمِنَ الْمُرْسَلِينَ
నిస్సందేహంగా యూనుస్‌ (కూడా) మా ప్రవక్తలలోని వాడే.

37:140 إِذْ أَبَقَ إِلَى الْفُلْكِ الْمَشْحُونِ
అతను (తన జనుల నుండి) పలాయనం చిత్తగించి నిండు నౌక వద్దకు చేరుకున్నప్పుడు,

37:141 فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِينَ
చీటీలు వేయటం జరిగింది. చివరకు అతనే ఓడిపోయాడు.

37:142 فَالْتَقَمَهُ الْحُوتُ وَهُوَ مُلِيمٌ
తరువాత అతన్ని చేప మ్రింగేసింది. అప్పుడు అతను తన్ను తానే నిందించుకోసాగాడు.

37:143 فَلَوْلَا أَنَّهُ كَانَ مِنَ الْمُسَبِّحِينَ
ఒకవేళ అతను గనక (అల్లాహ్‌) పవిత్రతను కొనియాడటంలో నిమగ్నుడై ఉండకపోతే…

37:144 لَلَبِثَ فِي بَطْنِهِ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
పునరుత్థానదినం వరకు చేప కడుపులోనే ఉండిపోయేవాడు.

37:145 فَنَبَذْنَاهُ بِالْعَرَاءِ وَهُوَ سَقِيمٌ
తరువాత మేమతన్ని (సముద్ర తీర) మైదానంలో పడవేశాము. అప్పుడతను అస్వస్థతకు గురై ఉన్నాడు.

37:146 وَأَنبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِّن يَقْطِينٍ
అతనికి నీడనిచ్చే ఒక తీగచెట్టును అతనిపై మొలకెత్తించాము.

37:147 وَأَرْسَلْنَاهُ إِلَىٰ مِائَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ
మరి మేమతన్ని ఒక లక్షమంది, అంతకన్నా ఎక్కువ మంది వైపుకే (ప్రవక్తగా) పంపాము.

37:148 فَآمَنُوا فَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ
వారు విశ్వసించారు. అందువల్ల మేము వారిని కొంత కాలంపాటు సుఖ సౌఖ్యాలతో వర్థిల్లజేశాము.

అల్లాహ్ మనందరికీ ధర్మజ్ఞానం నేర్చుకునే, దాని ప్రకారం ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక..ఆమీన్


ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

%d bloggers like this: