ఖాదియాని (అహ్మది ముస్లిం) లను కాఫిర్ లాగా ఎందుకు అంటారు? [వీడియో]

బిస్మిల్లాహ్

[4:41 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ హఫిజహుల్లాహ్

మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ

బిద్అత్ (కల్పితాచారం) – Bidah – మెయిన్ పేజీ

https://teluguislam.net/others/bidah/

తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 18 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 18
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 18

1 ) అల్లాహ్ ఏ ప్రవక్తను ఖలీల్ (అత్యంత ప్రియుడు) అని అన్నాడు?

A) మూసా (అలైహిస్సలాం)
B) ఇబ్రాహీం (అలైహిస్సలాం)
C) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)
D) ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)

2 ) ఏ జిక్ర్ గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వర్గ నిధులలో ఒక నిధి అని చెప్పారు ?

A) లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్
B) సుబ్ హానల్లాహ్
C) లా ఇలాహ ఇల్లల్లాహ్

3 ) నేనూ ప్రవక్తను అని ఆరోపన చేసిన అబద్దీకులలో వీడు ఒకడు ?

A) మిర్జా గులామ్ అహ్మద్
B) అబూ లహాబ్
C) హామాన్

సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [26 నిమిషాలు]


1) అల్లాహ్ ఏ ప్రవక్తను ఖలీల్ (అత్యంత ప్రియుడు) అని అన్నాడు?

JAWAB: D) ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)

ఖుర్ఆనులో ఇబ్రాహీం అలైహిస్సలాంను ఖలీల్ గా చేసిన ప్రస్తావన ఉంది

4:125 وَاتَّخَذَ اللَّهُ إِبْرَاهِيمَ خَلِيلًا
ఇబ్రాహీమ్‌ (అలైహిస్సలాం)ను అల్లాహ్‌ తన మిత్రునిగా చేసుకున్నాడు.
صحيح البخاري 6565 … ائْتُوا إِبْرَاهِيمَ الَّذِي اتَّخَذَهُ اللَّهُ خَلِيلًا،

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: ప్రళయదినాన ప్రజలందరూ హషర్ మైదానంలో ఓపిక వహించలేక, అల్లాహ్ వద్ద సిఫారసు చేయాలని ముందు ఆదం అలైహిస్సలాం వద్దకు, ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం వద్దకు వస్తారు, అయితే నూహ్ సిఫారసు చేయరు. ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు వెళ్లండి అల్లాహ్ ఆయన్ని ఖలీల్ గా చేసుకున్నాడు అని అంటారు.

అయితే హదీసులో ఇబ్రాహీం అలైహిస్సలాంతో పాటు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కూడా ఖలీల్ గా చేసుకున్నాడు అని ఉంది అయితే ఇద్దరూ కూడా ఖలీల్ అవడంలో రవ్వంత సందేహం లేదు. కాకపోతే ప్రజలలో ఫేమస్ మాట ఇబ్రాహీం ఖలీల్, మూసా కలీం అని.
సహీ ముస్లిం 532లో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ మరణానికి కేవలం 5 రోజుల ముందు ఇలా చెప్పగా నేను విన్నానని, జుందుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

مسلم 532 … «إِنِّي أَبْرَأُ إِلَى اللهِ أَنْ يَكُونَ لِي مِنْكُمْ خَلِيلٌ، فَإِنَّ اللهِ تَعَالَى قَدِ اتَّخَذَنِي خَلِيلًا، كَمَا اتَّخَذَ إِبْرَاهِيمَ خَلِيلًا، وَلَوْ كُنْتُ مُتَّخِذًا مِنْ أُمَّتِي خَلِيلًا لَاتَّخَذْتُ أَبَا بَكْرٍ خَلِيلًا، أَلَا وَإِنَّ مَنْ كَانَ قَبْلَكُمْ كَانُوا يَتَّخِذُونَ قُبُورَ أَنْبِيَائِهِمْ وَصَالِحِيهِمْ مَسَاجِدَ، أَلَا فَلَا تَتَّخِذُوا الْقُبُورَ مَسَاجِدَ، إِنِّي أَنْهَاكُمْ عَنْ ذَلِكَ

మీలో ఎవరు నాకు ఖలీల్ కారని స్పష్టంగా తెలియజేస్తున్నాను, ఎందుకనగా అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంని ఖలీల్ గా చేసుకున్నట్లు నన్ను కూడా ఖలీల్ గా చేసుకున్నాడు. ఒకవేళ నేను ఎవరినైనా ఖలీల్ గా చేసుకునేవాడినేనైతే అబూ బక్ర్ ని ఖలీల్ గా చేసుకునేవాడిని. వినండీ! మీకంటే ముందు గడిసినవారు తమ ప్రవక్తల, పుణ్యపురుషుల సమాధులను మస్జిదులుగా (ఆరాధనాలాయంగా) చేసుకునేవారు! జాగ్రత్తగా వినండి! మీరు సమాధులను మస్జిదులుగా చేసుకోకండి. ఇలా చేయడం నుండి నేను మిమ్మల్ని వారిస్తున్నాను.

ఇబ్రాహీం అలైహిస్సలాంను ఖలీల్ గా ఎన్నుకున్నది ఆయనలో ఉన్న ఎన్నో అత్యుత్తమ గుణాల కారణంగా:

1- ఇమాం, ఒంటరిగానైనప్పటికీ నాయకత్వం గుణాలు ఆయనలో ఇమిడి ఉండినవి. సూర నహల్ 16:120,121
2- వఫాదార్, అల్లాహ్ యొక్క ఆదేశాలన్నిటినీ నెరవేర్చారు. సూర నజ్మ్ 53: 37
3- హలీం (సహనశీలి)
4- అవ్వాహ్ (అధికంగా అల్లాహ్ ముందు వినమ్రులై, జిక్ర్, ఇస్తిగ్ఫార్, దుఆలో ఉండేవారు
5- అల్లాహ్ ను గుర్తెరిగి సంపూర్ణ ప్రేమతో ఆయన వైపుకు మరలేవారు, ఇతరుల పట్ల ఏ ఆశ లేకుండా ఉండేవారు. సూర హూద్ 11:75
6- చాలా ఉపకారం చేసేవారు, అతిథికి మర్యాదనిచ్చేవారు. సూర జారియాత్ 51:24-27
7- ఓపిక సహనాల్లో ఉన్నత శిఖరానికి చేరినవారు. సూర అహ్ ఖాఫ్ 46:35, సూర షూరా 42:13
 ఆయన ఉత్తమ గుణాల్లోని రెండు గుణాలు అతిముఖ్యమైనవి, మనం వాటిని మరవకూడదు :  ఎవరూ తోడులేనప్పుడు, ఒంటరిగా ఉండి కూడా తౌహీద్ పై ఉన్నారు, షిర్క్ కు వ్యెతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. ముమ్ తహన 60:4
 వయస్సు పై బడిన తర్వాత కలిగిన ఏకైక సంతానం యొక్క ప్రేమ ఎంతగా ఉంటుందో చెప్పనవసరం లేదు, అలాంటి ఏకైక పుత్రుడిని అల్లాహ్ ప్రేమలో బలిచేయుటకు సిద్ధమయ్యారు. సాఫ్ఫాత్ 37:100-111


2) ఏ జిక్ర్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గ నిధులలో ఒక నిధి అని చెప్పారు

JAWAB: A ] లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్

وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ قَالَ: قَالَ النبي: “يَا عَبْدَ اللهِ بْنِ قَيْسٍ :أَلَا أَدُلُّكَ عَلَى كَنْزِ مِّنْ كُنُوْزِ الْجَنَّةِ ؟” فَقُلْتُ: بَلَى يَا رَسُوْلَ اللهِ قَالَ : “لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ”.

అబూ మూసా అష్’అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ”ఓ ‘అబ్దుల్లా బిన్ ఖైస్! నేను నీకు స్వర్గనిధుల్లో ఒక నిధిని చూపనా?” అని అన్నారు. దానికి నేను, ‘చూపండి ఓ అల్లాహ్ ప్రవక్తా!’ అని అన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ”లా ‘హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” స్వర్గ నిధుల్లోని ఒక నిధి అని ప్రవచించారు. (బు’ఖారీ 4205, ముస్లిమ్ 2704)
సుబ్ హానల్లాహ్, వల్ హందులిల్లాహ్, వలాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వలాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ చదివిన పాపాలు మన్నించబడతాయి, అవి సముద్రపు నురుగంత ఉన్నా సరే. (తిర్మిజి 3460, హసన్)

ఇవి మరియు వీటితో పాటు అల్లాహుమ్మగ్ ఫిర్లీ వర్ హమ్నీ వఆఫినీ వర్ జుక్నీ వహ్దినీ దుఆ ఒక గ్రామినుడికి నేర్పి ఇతను సర్వ మేళ్ళను తీసుకుళ్తున్నాడు అని ప్రవక్త చెప్పారు. (అబూదావూద్ 832). ప్రవక్త దీనిని గిరాసుల్ జన్నహ్ అన్నారు. (ఇబ్ను హిబ్బాన్ 821)


2) నేనూ ప్రవక్తను అని ఆరోపణ చేసిన అబద్దీకులలో వీడు ఒకడు ?

A ] మిర్జా గులామ్

అబూ దావూద్ 4333 లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

«لَا تَقُومُ السَّاعَةُ حَتَّى يَخْرُجَ ثَلَاثُونَ دَجَّالُونَ، كُلُّهُمْ يَزْعُمُ أَنَّهُ رَسُولُ اللَّهِ»

30 అబద్ధాల కోరులు అసత్యవాదులు రానంత వరకు ప్రళయం సంభవించదు, ప్రతి ఒక్కడు తన భ్రమలో పడి తాను దైవప్రవక్త అన్న ఆరోపణ చేసుకుంటాడు.

వారిలో ఒకడు అబుల్ అస్వద్ అల్ అనసీ యమన్ లో రెండోవాడు ముసైలమా కజ్జాబ్ యమామలో ప్రవక్త కాలంలోనే దావా చేశారు. అబుల్ అస్వద్ అనతికాలంలోనే హతమార్చబడ్డాడు. మసైలమా ప్రవక్త వద్దకు వచ్చిన సంగతి సహీ బుఖారీ 3620లో ఉంది

عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا، قَالَ: قَدِمَ مُسَيْلِمَةُ الكَذَّابُ عَلَى عَهْدِ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَجَعَلَ يَقُولُ: إِنْ جَعَلَ لِي مُحَمَّدٌ الأَمْرَ مِنْ بَعْدِهِ تَبِعْتُهُ، وَقَدِمَهَا فِي بَشَرٍ كَثِيرٍ مِنْ قَوْمِهِ، فَأَقْبَلَ إِلَيْهِ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَمَعَهُ ثَابِتُ بْنُ قَيْسِ بْنِ شَمَّاسٍ وَفِي يَدِ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قِطْعَةُ جَرِيدٍ، حَتَّى وَقَفَ عَلَى مُسَيْلِمَةَ فِي أَصْحَابِهِ، فَقَالَ: «لَوْ سَأَلْتَنِي هَذِهِ القِطْعَةَ مَا أَعْطَيْتُكَهَا، وَلَنْ تَعْدُوَ أَمْرَ اللَّهِ فِيكَ، وَلَئِنْ أَدْبَرْتَ ليَعْقِرَنَّكَ اللَّهُ، وَإِنِّي لَأَرَاكَ الَّذِي أُرِيتُ فِيكَ مَا رَأَيْتُ»

ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ముసైలమా కజ్జాబ్ ప్రవక్త కాలంలో వచ్చి, ముహమ్మద్ గనక తన తర్వాత నాకు ఖిలాఫత్ మాట ఇచ్చాడంటే నేను ఆయన్ని అనుసరిస్తాను, అతని వెంట అతని జాతి వారు కూడా ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాబిత్ బిన్ ఖైస్ తో సహా అతని వద్దకు వచ్చారు, అప్పుడు ప్రవక్త చేతిలో ఒక ఖర్జూరపు కర్ర ముక్క ఉంది, ముసైలమా మరియు అతని అనుచరుల దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు: నీవు ఈ కర్ర ముక్క అడిగినా, నేను అది నీకివ్వను. అల్లాహ్ నీ కోసం నిర్ణయించిన దాన్నుండి నీవు ఏ మాత్రం తప్పించుకోలేవు. నీవు నా నుండి ముఖం తిప్పుకున్నావు. అందుచేత అల్లాహ్ నిన్ను (త్వరలోనే) అంతమొందిస్తాడు. నీవు నా కలలో ఎలా కన్పించావో ఇప్పుడు నేను నిన్ను అదేవిధంగా చూస్తున్నాను. అతని హత్య విషయం కూడా సహీ బుఖారీ 4072లో ఉంది

హజ్రత్ హంజా రజియల్లాహు అహు గానికి హతమార్చిన వహ్ షీ తర్వాత ఇస్లాం స్వీకరించారు, అయితే అబూ బక్ర్ రజియల్లాహు అన్హు పరిపాలన కాలంలో యమామా యుద్ధంలో పాల్గొన్నారు. ముసైలమాను హతమార్చారు.

చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అసత్యవాదులు వచ్చారు, వారిలో ఒకడు మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ.ఇతడు 13 ఫిబ్రవరీ 1835లో ప్రస్తుత పంజాబ్ రాష్టం, గోర్దాస్ పూర్ జిల్లాహ్ ఖాదీయన్ గ్రామంలో పుట్టాడు. 26 మే 1908లో ప్రస్తుత పాకిస్తాన్ లో చాలా హీనంగా చనిపోయాడు.ఇతని గురించి ఈ లింక్ లో మరిన్ని వివరాలు తెలుసుకోగలరు

https://teluguislam.net/2015/04/07/the-lies-of-mirza-ghulam-ahmad-qadiayni/

ప్రారంభంలో అతడు ముస్లిమేతరులో ఇస్లాం సపోర్టులో డిబేట్లు చేస్తున్నట్లు ప్రదర్శించాడు, చేశాడు కూడా తర్వాత మెల్లమెల్లగా అతని అసలు నల్లరూపం బయటపడింది. అతని వాక్చాతుర్యాన్ని చూసి బ్రిటిష్ వారు వాడుకున్నారు, కాని వానికి అది తెలియలేదా, లేక ప్రాపంచిక వ్యామోహానికి లోనై అమ్ముడుపోయాడా కాని పరలోకానికి ముందు ఇహలోకంలోనే అల్లాహ్ వాడిని అవమానపరిచాడు

అతడు ప్రవక్త అన్న ఆరోపణ ఒక్కట కాదు చేసింది, ఎన్నో రంగులు మార్చాడు, ఎన్నో రూపుల వేశాడు ఎన్నో ఆరోపణలు చేశాడు, వాని కాలంలో వానికి ధీటుగా నిలబడిన ధర్మపండితులు మాలానా సనాఉల్లా అమ్రత్సరీ రహిమహుల్లాహ్. అతని ప్రతి అసత్యవాదానికి జవాబిస్తూ పోయారు పై లింకులో తప్పక వివరాలు చూడగలరు.

సంక్షిప్తంగా వాడు చేసిన ఆరోపణల్లో కొన్ని:

* అల్లాహ్ అర్ష్ పీఠంపై నన్ను ప్రశంసిస్తున్నాడు (అంజామె ఆథమ్ 55)
* మృతులకు ప్రాణం పోసే, జీవులను మరణింపజేసే శక్తి నాకు ప్రసాదించబడింది. (ఖుత్బయే ఇల్హామియా 23)
* మీరు తెలుసుకోండి! అల్లాహ్ కరుణ కటాక్షాలు నాతోనే ఉన్నాయి. అల్లాహ్ ఆత్మ నాలోన చెబుతుంది. (అంజామె ఆథమ్ 176).
* తానె మసీహె మౌఊద్ అని చెప్పుకున్నాడు. అంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బుఖారీ 2222, ముస్లిం 155లో ఇచ్చిన శుభవార్త

«وَالَّذِي نَفْسِي بِيَدِهِ، لَيُوشِكَنَّ أَنْ يَنْزِلَ فِيكُمْ ابْنُ مَرْيَمَ حَكَمًا مُقْسِطًا، فَيَكْسِرَ الصَّلِيبَ، وَيَقْتُلَ الخِنْزِيرَ، وَيَضَعَ الجِزْيَةَ، وَيَفِيضَ المَالُ حَتَّى لاَ يَقْبَلَهُ أَحَدٌ» وفي رواية: فَيَطْلُبُهُ حَتَّى يُدْرِكَهُ بِبَابِ لُدٍّ، فَيَقْتُلُهُ 2937

ఈ ఈసా నేనే అని అంటాడు. ఒక ఖాదీయాని సోదరుడు నాతో చర్చలో ఉన్నప్పుడు ఈ హదీసు తెలిపి మీరు నమ్మే మిర్జా న్యాయశీలి నాయకుడయ్యాడా? శిలువను విరగ్గొట్టారా? పందిని చంపారా? జిజ్ యా పన్ను లేకుండా చేశారా ? జకాత్ తీసుకునేవాడు లేని విధంగా ధనం వృద్ధి అయిందా? దజ్జాల్ ను హతమార్చాడా? అని అడిగాను. ఇప్పటికీ ఏ సమాధానం రాలేదు.

..ప్రస్తుతానికి కూడా వారి అనుచరులు ఉన్నారు వారిని మనం కూడా ఖండిస్తూనే ఉండాలి వారి ఉచ్చులో పడకుండా ఉండడానికి జాగ్రత్త వహించాలి.


ఇతరములు 

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

ఖాదియానియత్ (Khadiyaniat) [పుస్తకం]

డా. సయీద్ అహ్మద్ ఉమ్రీ మదనీ గారు ఈ పుస్తకంలో పరస్పరం విభేదిస్తున్న అసత్య పలుకులతో, ప్రజలను అయోమయంలో పడవేసి, తప్పుడు దారి పట్టిస్తున్న ఖాదియానియత్ గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా క్షుణ్ణంగా చర్చించారు. సత్యం తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు తప్పకుండా చదవ వలసిన మంచి రిసెర్చ్ పుస్తకమిది.

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
PDF – mobile friendly ( మొబైల్ ఫ్రెండ్లీ పీడీఎఫ్) – 98 పేజీలు

ఖాదియానీల వాస్తవికత – డాక్టర్ సయీద్ అహ్మద్ ఉమరీ మదనీ హఫిజహుల్లాహ్
https://youtu.be/XwpnAVo0Oew [65 నిముషాలు]

విషయ సూచిక

అధ్యాయాలు

మొదటి అధ్యాయం:సంవాదనలు [PDF]

 • ఒక ఖాదియాని ఇమామ్‌తో సౌమ్యంగా సంభాషణ
 • ఒక ఖాదియానీ ప్రెసిడెంట్‌ అమాయకపు సంభాషణ
 • పశ్చిమ గోదావరిలో ఖాదియానీల కేంద్రం
 • ఖాదియానియత్‌ ఇస్లాం కాదని, దానికి ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదని నిరూపించే రెండు గట్టి ఆధారాలు
 • ఖాదియానీలతో నిర్మొహమాటంగా సంవాదం

రెండవ అధ్యాయం: ఖాదియాని స్వరూప స్వభావాలు [PDF]

 • అసలు ఖాదియానియత్‌ అంటే ఏమిటి?
 • ఖాదియానీ మతంలో వర్గాలు
 • ఖాదియాని మతస్థాపకుని జననం, అతని వంశం
 • మిర్జా  వంశం బ్రిటీషు సైనిక శిబిరంలా పనిచేసింది
 • బాల్యం, విద్యాభ్యాసం
 • మిర్జా  గులాం అహ్మద్‌ ఖాదియాని ఉద్యోగం
 • యవ్వనంలో ఆయన వ్యాపకాలు
 • ‘బరాహీనె అహ్మదియా’ రచన, అబద్ధ ప్రకటనలకు ఆరంభం
 • దశలవారీగా మిర్జా విచిత్ర ప్రకటనల పర్వం
 • మిర్జా  రచనలు
 • హేయమైన మరణం
 • ఖాదియానీల ఉనికిలో వాస్తవ కారణాలు
 • అబద్ధపు దైవదౌత్యం కోసం విక్టోరియా ప్రభుత్వ ప్రణాళిక
 • పాశ్చాత్యవాదులు మరియు గులామ్‌ అహ్మద్‌ ఖాదియానీ దైవదౌత్యం
 • హిస్టీరియా వ్యాధి, అబద్ధపు దైవదౌత్య సోపానం
 • గులామ్‌ అహ్మద్‌ ఖాదియానీని అసత్య ప్రవక్తగా రూపొందించడంలో ప్రముఖ మేధావుల పాత్ర
 • ఖాదియానీ వర్గంలోని కొందరు ప్రముఖులు
 • ఖాదియానియ్యత్‌ తొలి ఖలీఫా నూరుద్దీన్‌
 • లాహోరు వర్గ స్థాపకుడు ముహమ్మద్‌ అలీ లాహోరీ
 • నాకు కానుకగా ఇచ్చిన మిర్జా గులామ్‌ అహ్మద్‌
 • ముహమ్మద్‌ అలీ లాహోరీ మరియు ఇతరుల రచనలు

ఖాదియానీ విశ్వాసాలు [PDF]

 • గులాం అహ్‌మద్‌ గురించి ఖాదియానీల విశ్వాసాలు, పుస్తకాలు
 • అల్లాహ్‌ గురించి ఖాదియానీల విశ్వాసం
 • ఈసా బిన్‌ మర్యమ్‌ (అలైహిస్సలామ్‌) గురించి వారి విశ్వాసం
 • దైవదౌత్యం & దైవదౌత్య సమాప్తం గురించి ఖాదియానీల వైఖరి
 • ఖుర్‌ఆన్‌ మరియు దైవవాణి గురించి వారి విశ్వాసం
 • ఖాదియాన్‌ నగరం గురించి వారి విశ్వాసం
 • ఖాదియానియత్‌ ఒక నూతన మతం మరియు ప్రత్యేక షరీఅత్‌

పాద సూచికలు [PDF]

ఖాదియాని ఇస్లాంమత వర్గం కాదు, అదో కల్పిత మతం – రుజువులు [PDF]

 • తాను దైవప్రవక్తనని మిర్జా వాదన
 • దైవవాణి తనపై అవతరిస్తుందని మిర్జా ఉద్దాటన
 • “దైవదౌత్య పరిసమాప్తి (ఖత్మె నుబువ్వత్‌) ఒక తప్పుడు విశ్వాసం, ఇస్లాం ఒక పైశాచిక మతం” అంటూ వ్యర్థ ప్రేలాపనలు
 • మిర్జాను తిరస్కరించినవారు నరకవాసులవుతారని హెచ్చరిక
 • తన దగ్గరకు జిబ్రయీల్‌ దూత వచ్చారని మిర్జా డాంబికాలు
 • తనపై వర్షం లాగా వహీ అవతరించిందని మిర్జా ఉద్దాటన
 • తనను విశ్వసించనివారు అక్రమ సంతానంగా పుట్టినవారని నోరుపారేసుకోవటం
 • ఖుర్‌ఆన్‌ ఆకాశంపైకి ఎత్తుకోబడిందని, ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వా సల్లం) మళ్లీ ఈ లోకంలోకి పంపబడతారని మిర్జా చేసిన అర్థరహిత వాదనలు
 • “మగవారు పందులు, స్రీలు ఆడకుక్కలు” అంటూ మిర్జా పలికిన అతి హీనమైన మాటలు
 • ఖాదియాన్‌ పేరు ఖుర్‌ఆన్‌లో ఉందని వితండవాదం
 • మస్జిదె అఖ్సా  అంటే మస్జిదె ఖాదియాన్‌ … వింత వాదన
 • ఖాదియాన్‌ డెమాస్కస్‌ను పోలివుందని అర్దరహిత వ్యాఖ్యలు
 • అల్లాహ్‌ సంతకం చేశాడని బొంకటం
 • అల్లాహ్‌ పురుషుడు, తాను స్త్రీ అంటూ మిర్జా వ్యర్థ ప్రసంగం
 • తాను గర్భం దాల్చానని మిర్జా గాలిమాటలు
 • తాను దేవుణ్ణి అని బొంకటం
 • ఈసా (అలైహిస్సలామ్‌) పరుల్ని దూషించేవారని, అబద్ధం చెప్పేవారని నిందలు
 • ఈసా (అలైహిస్సలామ్‌) గ్రంథచౌర్యం చేసి ఇంజీలు రాశారని అపవాదు
 • ఈసా (అలైహిస్సలామ్‌) వద్ద మహిమలు ఏవీ ఉండేవి కావని దుష్ప్రచారం
 • ఈసా (అలైహిస్సలామ్‌) మద్యం సేవించేవారని నీలాపనింద
 • తాను ఈసా (అలైహిస్సలామ్‌), హుస్సేన్‌ (రది అల్లాహు అన్హు)లను మించిన వాణ్ణని మిర్జా  గొప్పలు
 • మర్యమ్‌(అలైహస్సలామ్‌)పై నీలాపనింద
 • హజ్రత్‌ అబూహురైరా (రది అల్లాహు అన్హు)ను కించపరచటం
 • హజ్రత్‌ ఫాతిమా (రది అల్లాహు అన్హా) పట్ల అవమానకర ధోరణి

– ఖాదియాని వహీ (కితాబె ముబీన్‌)లోని కొన్ని నమూనాలు

– ఆంగ్లంలో వహీ

%d bloggers like this: