
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 21
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (7 నిముషాలు )
సూరా 71. నూహ్ , ఆయతులు 10 నుండి 12
71:10 فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا
“నేనిలా అన్నాను – క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు.”
71:11 يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا
“ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు.”
71:12 وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا
“మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని వొసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.”
సూరా 11.హూద్ , అయతులు 3, 52
11:3 وَأَنِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُمَتِّعْكُم مَّتَاعًا حَسَنًا إِلَىٰ أَجَلٍ مُّسَمًّى وَيُؤْتِ كُلَّ ذِي فَضْلٍ فَضْلَهُ ۖ وَإِن تَوَلَّوْا فَإِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ كَبِيرٍ
ఇంకా మీరు మీతప్పుల మన్నింపుకోసం మీప్రభువును వేడుకోండి. తర్వాత (పశ్చాత్తాపంతో) ఆయన వైపుకే మరలండి. ఒక నిర్థారిత కాలం వరకూ ఆయన మీకు మంచి (జీవన) సామగ్రిని సమకూరుస్తాడు. ఎక్కువగా ఆచరణచేసే ప్రతిఒక్కరికీ ఎక్కువ పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఒకవేళ మీరు గనక విముఖత ప్రదర్శించిన పక్షంలో ఒకానొక మహాదినాన మిమ్మల్ని చుట్టుముట్టే శిక్ష గురించి నేను భయపడుతున్నాను.
11:52 وَيَا قَوْمِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا وَيَزِدْكُمْ قُوَّةً إِلَىٰ قُوَّتِكُمْ وَلَا تَتَوَلَّوْا مُجْرِمِينَ
“ఓ నా జాతి వారలారా! మీ పోషకుని (అంటే అల్లాహ్) సమక్షంలో మీ తప్పుల మన్నింపుకై ప్రార్థించండి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. ఆయన మీపై (ఆకాశం నుండి) ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీకున్న బలిమికి మరింత శక్తినీ, బలాన్నీ చేకూరుస్తాడు. మీరు మాత్రం అపరాధులుగా తిరిగిపోకండి.”
క్రింద ఇచ్చిన లింకులు సందర్శించి మరింత జ్ఞానం పెంచుకోండి:
- ఇస్తిగ్ ఫార్ మరియు తౌబా వచనాలు – హిస్న్ అల్ ముస్లిం నుండి
- అప్పుల బాధల్లో చిక్కుకొని, వ్యాపారంలో నష్టాల్లో కూరుకుపోయినవారికి ఇస్లామీయ సూచనలు [ఆడియో]
- తౌబా (పశ్చాత్తాపం), ఇస్తిగ్ ఫార్ అంటే ఏమిటి? వాటి లాభాలు ఏమిటి? [ఆడియో]
- తౌబా, ఇస్తిగ్ ఫార్ చేయాలనుకుంటున్నాను కాని…! [ఆడియో]
- పశ్చాత్తాపం (తౌబా) (Touba) (పుస్తకం)
- అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపం (తౌబా) పట్ల చెందే ఆనందం
- పశ్చాత్తాపం (తౌబా):రియాదుస్ సాలిహీన్ [ఆడియో సిరీస్]
You must be logged in to post a comment.