దైవప్రవక్త జీవితంలో ఒక రోజు [పుస్తకం]

A Day with the Prophet (sallallahu alaihi wasallam) (Telugu)
దైవప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం)  జీవితంలో ఒక రోజు
రచయిత: అహ్మద్ వాన్ డిన్ఫర్
తెలుగు అనువాదం: ముహమ్మద్ అహ్మద్ అలీ
శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాద్

A Day with the Prophet (sallallahu alaihi wasallam) (Telugu)
దైవప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం)  జీవితంలో ఒక రోజు
రచయిత: అహ్మద్ వాన్ డిన్ఫర్
తెలుగు అనువాదం: ముహమ్మద్ అహ్మద్ అలీ
శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాద్

[డౌన్లోడ్ పుస్తకం]
[PDF] [122 పేజీలు] [మొబైల్ ఫ్రెండ్లీ]

  1. ఏ పనినైనా అల్లాహ్ పేరుతో ప్రారంభించడం
  2. క్రమం తప్పని ఆచరణ
  3. తొలి జాములో నిద్ర – ఆఖరి జాములో నమాజు
  4. మంచి పనులన్నీ కుడి చేత్తోనే
  5. కాలకృత్యాలు
  6. “వుజూ” చేయటం
  7. స్నానం చేయటం
  8. ప్రాతఃకాలం ఆచరించవలసిన నమాజు
  9. ప్రతి రోజూ ఆచరించవలసిన నమాజులు
  10. వేడుకోలు
  11. ఫజ్ర్ నమాజు ప్రాతఃకాలం ఆచరించే నమాజు
  12. ప్రాతఃకాలంలో ఖుర్ఆన్ పారాయణం
  13. దేహ సంస్కారం
  14. వస్త్రధారణ
  15. భోజనాదులు
  16. ఇంటి నుండి బయలుదేరటం
  17. సలాం చెప్పటం
  18. తుమ్మడం, ఆవలించటం
  19. ఉపాధి సంపాదించటం
  20. నైతికవర్తన
  21. సంభాషణా మర్యాదలు
  22. జుహ్ర్ (మధ్యాహ్న వేళ చేసే) నమాజు
  23. ప్రజలతో సహజీవనం
  24. సభా మర్యాదలు
  25. ‘అస్ర్’ (పొద్దుగూకే వేళ చేసే) నమాజు
  26. సందర్శనం, పరామర్శ
  27. రోగుల పరామర్శ
  28. సదఖా
  29. దానం
  30. కానుకలు
  31. మగ్రిబ్ – సూర్యాస్తమయం అనంతరం నమాజు
  32. ఇరుగు పొరుగువారు
  33. అతిథులు
  34. కుటుంబం
  35. నేర్పటం, నేర్చుకోవటం
  36. ఇషా (రాత్రి తొలి భాగంలో చేసే) నమాజు
  37. విత్ర్ (బేసి) నమాజు
  38. రతికార్యం
  39. నిద్ర
  40. నిత్యం అల్లాహ్ నామ స్మరణం

హృదయ శోధన – షేఖ్ షరీఫ్ మదనీ [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

హృదయ శోధన
(హృదయ ఆచరణలు – 3వ భాగం)
వక్త: షరీఫ్ (హఫిజహుల్లాహ్), వైజాగ్
https://youtu.be/9ol7QWzS3Fw [14 నిముషాలు]
హృదయ ఆచరణలు (భాగాలు 1 – 12) [2 గంటల 8 నిముషాలు]

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ. نَحْمَدُهُ وَنُصَلِّي عَلَى رَسُولِهِ الْكَرِيمِ أَمَّا بَعْدُ
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. నహ్మదుహు వ నుసల్లీ అలా రసూలిహిల్ కరీమ్ అమ్మాబాద్.

ప్రియమైన ధార్మిక సోదరులారా! ప్రియమైన ధార్మిక సోదరీమణులారా! హృదయ ఆచరణలు అనే ఈ అంశములో మూడవ భాగానికి మీకు స్వాగతం. సోదరులారా ఈరోజు మనము తెలుసుకునే అంశం హృదయము, కన్ను మరియు చెవి. వీటిని అల్లాహ్ మనకు ప్రసాదించాడు. ఇవి మన దేహములో గొప్ప ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. కాబట్టి వీటిని గురించి కూడా మనల్ని ప్రశ్నించటం జరుగుతుంది. అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథములో తెలియజేస్తున్నారు 17వ సూరా, సూరె బనీ ఇస్రాయీల్ వాక్యము సంఖ్య 36. అల్లాహ్ అంటూ ఉన్నారు,

إِنَّ السَّمْعَ وَالْبَصَرَ وَالْفُؤَادَ كُلُّ أُولَٰئِكَ كَانَ عَنْهُ مَسْئُولًا
ఇన్నస్సమ్’అ వల్ బసర వల్ ఫుఆద కుల్లు ఉలాయిక కాన అన్హు మస్’ఊలా
నిశ్చయముగా చెవి, కన్ను, హృదయము వీటన్నింటిని గురించి ప్రశ్నించటం జరుగుతుంది.

కాబట్టి సోదరులారా మనం మన కళ్ళతో మంచిని చూడాలి. మన చెవులతో మంచిని వినాలి. మన హృదయముతో మంచిని గురించి ఆలోచించాలి.

ఆ తర్వాత ప్రియులారా ఈ మూడింటిలో కూడా ఎక్కువ ప్రాధాన్యత హృదయానికి ఉంది అనగా చెవి, కన్ను కంటే హృదయానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నది.

హజరతే ఖాలిద్ బిన్ మాదాన్ రహమహుల్లాహ్ ఇలా తెలియజేస్తున్నారు, ప్రతి వ్యక్తికి నాలుగు కళ్ళు ఉంటాయి. రెండు కళ్ళు అతని ముఖంపై ఉంటాయి వేటితోనైతే అతడు ప్రాపంచిక వ్యవహారాలను చూస్తాడో. ఆ తర్వాత,

وَعَيْنَانِ فِي قَلْبِهِ
వ ఐనాని ఫీ ఖల్బిహీ
మరియు రెండు కళ్ళు అతని హృదయంలో ఉంటాయి.

వాటితో అతడు పరలోక జీవితమును చూస్తాడు ప్రియులారా. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏ దాసునికైనా మేలు చేయాలనుకుంటాడో, మంచి చేయాలనుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయములో ఉన్న ఆ కళ్ళను అల్లాహ్ తెరచి వేస్తాడు ప్రియులారా. అప్పుడు అతడు ఆ హృదయములో ఉన్న ఆ కళ్ళతో అల్లాహ్ యొక్క అనుగ్రహాలన్నింటినీ చూస్తాడు. ఎలాగైతే అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథములో తెలియజేస్తూ ఉన్నారో 47వ సూరా, సూరె ముహమ్మద్ వాక్యము సంఖ్య 24 లో అల్లాహ్ అంటూ ఉన్నారు ప్రియులారా,

أَمْ عَلَىٰ قُلُوبٍ أَقْفَالُهَا
అమ్ అలా కులూబిన్ అఖ్ఫాలుహా
ఏమిటి వారు ఆలోచించరా లేక వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా?

కాబట్టి సోదరులారా దీని ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే, హృదయం యొక్క స్థాయి చాలా గొప్పది ప్రియులారా. దీని గురించి మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఈ హృదయాన్ని భయభక్తి కలిగినదిగా మనం ఎలా తయారు చేసుకోవాలి, మంచి హృదయంగా ఎలా మరల్చుకోవాలి, ఖల్బే సలీం, నిర్మలమైన హృదయంగా దీనిని ఎలా తయారు చేసుకోవాలి, దీని విషయమై మీకు మరియు నాకు చింతింపవలసి ఉన్నది సోదరులారా. ఎందుకంటే ప్రతి హృదయంలోనైతే, ప్రతి శరీరంలోనైతే హృదయం ఉంటుంది ప్రియులారా, కానీ ఎలాంటి హృదయం ఆ శరీరములో ఉంది? మంచి హృదయమా? భయభక్తితో, భయభక్తితో కూడిన హృదయమా? ఎలాంటి హృదయం ఆ శరీరంలో ఉన్నది? మరి అలాంటి హృదయం కోసం మనం ఏమి చేయాలి? పదండి సోదరులారా దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా అయితే మనం మన హృదయాన్ని మంచి హృదయంగా మార్చుకోగలం.

మొదటి విషయం ప్రియులారా, పూర్తి ఇఖ్లాస్, చిత్తశుద్ధితో మనం అల్లాహ్ వైపునకు మరలాలి. ఆ విధంగా మన హృదయం దాని ప్రభువుతో దృఢ సంబంధం ఏర్పరచుకోవాలి. అది దానిని సృష్టించిన వానితో సంబంధం పెట్టుకోవాలి. అంటే పూర్తి విశ్వాసం, చిత్తశుద్ధితో అల్లాహ్ వైపునకు మరలాలి. ఇంకా నేను మీకు ఒక వాస్తవ విషయం గురించి తెలుపుతున్నాను ప్రియులారా. అది మీకు చాలా అవసరమైనది, నాకు చాలా అవసరమైనది. ఆ వాస్తవ విషయం ఏమిటంటే మన హృదయం దానిని సృష్టించిన దాని సృష్టికర్త అల్లాహ్‌తో కాకుండా వేరే వాటితో దాని సంబంధం పెట్టుకుంటే అది రాయి అయినా, స్త్రీ అయినా, ఆస్తిపాస్తులైనా, సిరిసంపదలైనా అవి ఆ హృదయం కొరకు నష్టాన్ని తీసుకువచ్చే కారణాలు అయిపోతాయి ప్రియులారా. ఇది చాలా ముఖ్యమైన విషయం ప్రియులారా. హృదయాన్ని దాని సృష్టికర్త ఎందుకు తయారు చేశాడంటే అది ఆయనతోనే బంధాన్ని ఏర్పరచుకోవటానికి, ఆయనతో కాకుండా వేరే వాటితో మన హృదయం బంధాన్ని ఏర్పరచుకుంటే అది అతనికి ప్రమాద ఘంటిక వంటిది ప్రియులారా. అంటే అల్లాహ్ కంటే ఎక్కువ ప్రాధాన్యత, అల్లాహ్ ఆరాధన కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇతర విషయాలకు గనుక ఇస్తే అది మన కోసం ప్రమాద ఘంటిక ప్రియులారా. కాబట్టి మనం అన్ని విషయాల కంటే ఎక్కువగా ప్రాధాన్యత అల్లాహ్ యొక్క ఆరాధనకే కల్పించాలి.

మన హృదయాలలో మన తండ్రి తాతల కంటే, అన్నదమ్ముల కంటే, భార్యల కంటే, ఆస్తిపాస్తుల కంటే, బంధు మిత్రుల కంటే, వ్యాపారము కంటే, మనం ఎంతగానో ప్రేమించే మన నివాసాల కంటే, సమస్త ప్రాపంచిక విషయాల కంటే ఎక్కువ ప్రేమ మన హృదయంలో అల్లాహ్ పై ఉండాలి ప్రియులారా. అల్లాహ్ పై అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి, అప్పుడే మన హృదయం మహోన్నతమైన హృదయంగా మారుతుంది ప్రియులారా.

ఇక రెండవ విషయం:

اسْتِعْمَالُ الْقَلْبِ فِيمَا خُلِقَ
ఇస్తి’మాలుల్ ఖల్బి ఫీమా ఖులిక
హృదయాన్ని దాని కోసం ఉపయోగించాలి దేనికోసమైతే అల్లాహ్ దానిని పుట్టించాడో.

అల్లాహ్ దానిని అల్లాహ్ దాస్యము కోసం పుట్టించాడు ప్రియులారా. హృదయం గురించి ఇలా చెప్పడం జరుగుతుంది:

سَيِّدُ الْأَعْضَاءِ وَرَأْسُهَا
సయ్యిదుల్ ఆ’దా వ రా’సుహా
అది అవయవాలన్నింటికీ నాయకుని లాంటిది మరియు అవయవాలన్నింటికీ శిరస్సు లాంటిది.

కాబట్టి సోదరులారా ఆ హృదయాన్ని మనం మంచి పనుల కోసం ఉపయోగించాలి, అల్లాహ్ ఆరాధనలో ఉపయోగించాలి, మంచి పనుల కోసం ఆలోచించటంలో ఉపయోగించాలి, అల్లాహ్ యొక్క జిక్ర్ లో ఉపయోగించాలి, ఖురాన్ యొక్క పారాయణములో ఉపయోగించాలి. దానిలోనే ప్రశాంతత ఉంది ప్రియులారా. అల్లాహ్ తెలియజేస్తున్నారు, 13వ సూరా, అర్ రాద్ వాక్యము సంఖ్య 28. అల్లాహ్ అంటూ ఉన్నారు:

أَلَا بِذِكْرِ اللَّهِ تَطْمَئِنُّ الْقُلُوبُ
అలా బి జిక్రిల్లాహి తత్మఇన్నుల్ కులూబ్
తెలుసుకోండి, అల్లాహ్ నామ స్మరణలోనే హృదయాలకు ప్రశాంతత ఉంది.

కాబట్టి మనం జిక్ర్, అల్లాహ్ యొక్క స్మరణలోనే ప్రశాంతత పొందగలం ప్రియులారా. అల్లాహ్‌కు విధేయత చూపే హృదయం అల్లాహ్ యొక్క నామస్మరణలో ప్రశాంతత పొందుతుంది. మరి మనము నేడు అల్లాహ్ యొక్క జిక్ర్ లో ప్రశాంతత పొందుతున్నామా లేక సినిమాలలో, డాన్సులలో, నృత్యాలలో, పాటలు వినటములో, సంగీతములో, టీవీ సీరియల్లు చూడటములో, ఇతరత్రా పనికిమాలిన విషయాలలో ప్రశాంతతను పొందుతున్నామా ప్రియులారా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మనము గనుక ఈ సినిమాలతో, సంగీతముతో మన హృదయానికి ప్రశాంతత గనుక లభిస్తుంటే మన హృదయం ఒక రోగగ్రస్తమైన హృదయం ప్రియులారా.

షేఖుల్ ఇస్లామ్ ఇబ్నె తైమియా రహమహుల్లాహ్ తెలియజేస్తున్నారు ప్రియులారా, సంగీతం మ్యూజిక్ మనిషి హృదయానికి మద్యపానము లాంటి ఒక వ్యసనము. మ్యూజిక్, సంగీతం వినటము హృదయానికి ఎలాంటిది? మద్యపానము లాంటి ఒక వ్యసనం ప్రియులారా. అది మనిషిని సన్మార్గము నుండి తప్పించేస్తుంది సుబ్ హా నల్లాహ్! అల్లాహు అక్బర్ ప్రియులారా! కానీ జిక్ర్ మనిషి హృదయానికి ఎలాంటిది ప్రియులారా? నీటిలో ఉన్న చేపకు నీరు లాంటిది సుబ్ హా నల్లాహ్!. ఆ నీరు ఉంటేనే ఆ నీరు ఉంటేనే ఆ చేప బ్రతుకుతుంది ప్రియులారా. అదే విధంగా అల్లాహ్ యొక్క జిక్ర్ ఉంటేనే మన హృదయం బ్రతుకుతుంది, అల్లాహ్ యొక్క జిక్ర్ లేకపోతే మన హృదయం కూడా చనిపోతుంది ప్రియులారా. ఏ విధంగానైతే నీళ్లు లేకపోతే చేప చనిపోతుందో, అల్లాహ్ యొక్క జిక్ర్ లేకపోతే మన హృదయం చనిపోతుంది ప్రియులారా. కాబట్టి సోదరులారా, ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన యొక్క హృదయాలకు ప్రశాంతత కచ్చితంగా అల్లాహ్ యొక్క స్మరణలో మాత్రమే, అల్లాహ్ యొక్క జిక్ర్ లో మాత్రమే మన హృదయాలకు ప్రశాంతత రావాలి ప్రియులారా. మనము గనక అల్లాహ్ యొక్క జిక్ర్ చేయకపోతే మన హృదయాలు చనిపోయిన హృదయాలు అవుతాయి ప్రియులారా.

బుఖారీ గ్రంథములో ఒక హదీసు నఖలు చేయబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు ప్రియులారా:

مَثَلُ الَّذِي يَذْكُرُ رَبَّهُ وَالَّذِي لَا يَذْكُرُ رَبَّهُ مَثَلُ الْحَيِّ وَالْمَيِّتِ
మసలుల్లజీ యజ్కురు రబ్బహు వల్లజీ లా యజ్కురు రబ్బహు మసలుల్ హయ్యి వల్ మయ్యితి
అల్లాహ్ యొక్క జిక్ర్ చేసే హృదయం సజీవమైన వారితో సమానము. అల్లాహ్ యొక్క జిక్ర్ చేయని వారి హృదయం, అల్లాహ్ యొక్క జిక్ర్ చేయని వారు మరణించిన వారితో సమానము.

కాబట్టి సోదరులారా మనం జిక్ర్ అలవాటు చేసుకోవాలి, ఎల్లవేళలా అల్లాహ్‌ను స్మరిస్తూ ఉండాలి, “సుబ్ హా నల్లాహ్” దీని అర్థం ప్రియులారా అల్లాహ్ పరమ పవిత్రుడు. “అల్హందులిల్లాహ్” దీని అర్థము సర్వ స్తోత్రములు అల్లాహ్‌కే శోభిస్తాయి. “అల్లాహు అక్బర్” అంటే అల్లాహ్ చాలా గొప్పవాడు ప్రియులారా. మనం అల్లాహ్‌ను జ్ఞాపకం చేసుకుంటే అల్లాహ్ మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ప్రియులారా. అల్లాహ్ సెలవిస్తున్నారు:

فَاذْكُرُونِي أَذْكُرْكُمْ
ఫజ్కురూనీ అజ్కుర్కుమ్
మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను.

కాబట్టి సోదరులారా, చివరిగా జిక్ర్ కు సంబంధించి కొన్ని విషయాలు చెప్పటానికి ప్రయత్నిస్తాను ప్రియులారా. మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, బుఖారీ గ్రంథములో హదీసు నఖలు చేయబడుతుంది. ప్రవక్త వారు అంటూ ఉన్నారు,

రెండు పదాలు, రెండు వచనాలు పలకటానికి చాలా తేలికైనవి, త్రాసులో చాలా బరువైనవి, కరుణామయుడైన అల్లాహ్‌కు చాలా ఇష్టమైనవి. ఆ రెండు పదాలు “సుబ్ హా నల్లాహి వ బిహందిహీ, సుబ్ హా నల్లాహిల్ అజీమ్”.

ఈ రెండు వచనాలు అల్లాహ్‌కు చాలా ఇష్టం ప్రియులారా. ఆ తర్వాత ముస్లిం హదీసు గ్రంథములో ఇలా ఉంది ప్రియులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటూ ఉన్నారు,

“సుబ్ హా నల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లహు అక్బర్” అని పలకటం సూర్యుడు ఉదయించే ఈ ప్రపంచములో ఉన్న వస్తువులన్నింటికంటే నాకు ప్రియమైనది.”

ఏమిటి ప్రియులారా? “సుబ్ హా నల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లహు అక్బర్” అని పలకటం ప్రియులారా సూర్యుడు ఉదయించే ఈ ప్రపంచములో వస్తువులన్నింటికంటే ఎక్కువగా ప్రవక్తకు ప్రియమైనది ప్రియులారా.

అదే విధంగా సోదరులారా, బుఖారీ గ్రంథములో ఇలా ఉంది, ఎవరైతే రోజుకు వంద సార్లు “లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీకలహు లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్” అని పలుకుతారో వారి కోసం వంద పుణ్యాలు లిఖించబడతాయి. వంద పాపాలు క్షమించబడతాయి. ఆ రోజు సాయంత్రం వరకు ఆ పలుకులు వారిని షైతాన్ బారి నుండి రక్షిస్తాయి.

ఆ తర్వాత సోదరులారా బుఖారీ గ్రంథములో ఇలా ఉంది, ఎవరైతే వంద సార్లు “సుబ్ హా నల్లాహి వ బిహందిహీ” అని పలుకుతారో వారి పాపాలు క్షమించబడతాయి ప్రియులారా అవి సముద్రపు నురుగుకు సమానంగా ఉన్నా సరే.

ఆ తర్వాత ప్రవక్త తెలియజేస్తున్నారు ప్రియులారా, అల్హందులిల్లాహ్ అనే పదం త్రాసును నింపి వేస్తుంది. “సుబ్ హా నల్లాహ్, అల్హందులిల్లాహ్” అని పలుకులు భూమి ఆకాశాల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని నింపేస్తాయి ప్రియులారా.

కాబట్టి అల్లాహ్ యొక్క నామస్మరణతో మన హృదయానికి ప్రశాంతత లభిస్తుంది ప్రియులారా. కాబట్టి జిక్ర్ అనే ఆ హృదయ ఆచరణ మనం చేయాలి. ఏదైతే జిక్ర్ మనం చేస్తున్నామో అదే సమయములో దాని యొక్క అర్థము కూడా మన హృదయంలో రావాలి ప్రియులారా. మనం చేసే జిక్ర్ యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకొని ఆ జిక్ర్ చేస్తే మనం దాని యొక్క మాధుర్యాన్ని పొందుతాం ప్రియులారా.

ఇన్షా అల్లాహ్ మరిన్ని విషయాలు తర్వాత దర్సులో మీ ముందు ఉంచటానికి ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ చెప్పటం, వినటం కంటే ఎక్కువగా ఆచరణ చేసే భాగ్యాన్ని ప్రసాదించు గాక.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5Ii

అల్లాహ్ సామీప్య మార్గాలు (వసీలా) – అబ్దుల్ గఫ్ఫార్ ఉమరీ [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ కు దగ్గర కావాలనుకుంటున్నారా? అల్లాహ్ ప్రేమించేవారిలో, ఇష్టపడేవారిలో చేరాలనుకుంటున్నారా? మరి అల్లాహ్ సామీప్యం పొందడానికి మార్గాలు ఏమిటి? అల్లాహ్ సామీప్యం పొందితే కలిగితే గొప్ప ప్రయోజనాలు ఏమిటి? తప్పక విని ప్రయోజనం పొందండి. మరియు మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి ఇన్ షా అల్లాహ్

అల్లాహ్ సామీప్య మార్గాలు
https://youtu.be/CiCtBSNqJAI [38 నిముషాలు]
వక్త: అబ్దుల్ గఫ్ఫార్ ఉమరీ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, అల్లాహ్ సామీప్యాన్ని (వసీలా) ఎలా పొందాలో ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. ప్రసంగం ప్రారంభంలో, విశ్వాసులు అల్లాహ్ సామీప్యాన్ని అన్వేషించాలని సూచించే ఖురాన్ ఆయతును ఉదహరించారు. అల్లాహ్ సామీప్యం పొందడానికి పది ముఖ్యమైన మార్గాలు వివరించబడ్డాయి: సమయానికి నమాజ్ చేయడం, ఫర్జ్ నమాజులతో పాటు సున్నత్ మరియు నఫిల్ నమాజులు అధికంగా చేయడం, అల్లాహ్ పట్ల విధేయత చూపడంలో ఉత్సాహం కలిగి ఉండటం, ఎల్లప్పుడూ అల్లాహ్ ను స్మరించడం (జిక్ర్), అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపవాసం ఉండటం, చేసిన పాపాల పట్ల పశ్చాత్తాపం చెందడం, ఖురాన్ ను పారాయణం చేయడం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపడం, సజ్జనులతో స్నేహం చేయడం, మరియు పేదవారికి దానం చేయడం. ఈ మార్గాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి అల్లాహ్ కు ప్రియమైన వాడిగా మారి, అతని ప్రార్థనలు అంగీకరించబడతాయని మరియు ఇహపరలోకాలలో సాఫల్యం పొందుతాడని నొక్కి చెప్పబడింది.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్.

ఫ అ’ఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్.

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
కరుణామయుడు, కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

سُبْحَٰنَكَ لَا عِلْمَ لَنَآ إِلَّا مَا عَلَّمْتَنَآ ۖ إِنَّكَ أَنتَ ٱلْعَلِيمُ ٱلْحَكِيمُ
(సుబ్ హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అన్తల్ అలీముల్ హకీమ్)
“(ఓ అల్లాహ్‌!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!” (2:32)

వ ఖాలల్లాహు తబారక వ త’ఆలా

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَٱبْتَغُوٓا۟ إِلَيْهِ ٱلْوَسِيلَةَ
(యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగూ ఇలైహిల్ వసీలహ్)
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి.  (5:35)

ప్రియమైన సోదరులారా! సోదరీమణులారా! అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క కృతజ్ఞత, ఆయన దయతో ఈరోజు మనమంతా ఒక కొత్త అంశాన్ని తీసుకొని సమావేశమై ఉన్నాము. అల్లాహ్ తో దుఆ ఏమనగా, ఖురాన్ మరియు హదీసుల ప్రకారం ఏవైతే వాక్యాలు మనకు వినబడతాయో వాటిని అమలుపరిచే భాగ్యాన్ని అల్లాహ్ త’ఆలా మాకు ప్రసాదించు గాక. ఆమీన్. అలాగే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అందరినీ ఒకేచోట సమావేశపరుస్తున్న వారందరికీ అల్లాహ్ త’ఆలా మంచి ఫలితాన్ని ఇహపరలోకాలలో ప్రసాదించు గాక. ఆమీన్.

ప్రియమైన మిత్రులారా! ఖురాన్ గ్రంథంలోని ఒక ఆయత్.

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَٱبْتَغُوٓا۟ إِلَيْهِ ٱلْوَسِيلَةَ
(యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగూ ఇలైహిల్ వసీలహ్)
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క సామీప్యాన్ని మీరు అన్వేషించండి అని అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథంలో సెలవిచ్చాడు.

ఈరోజు మన అంశం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సామీప్య మార్గాలు. అల్లాహ్ సామీప్యం ఎలా పొందగలము? వాటి యొక్క మార్గాలు ఏమిటి? దాని ఫలితంగా మనకు అల్లాహ్ త’ఆలా కల్పించే భాగ్యాలు ఏమిటి? దీనిపై ఈరోజు సవివరంగా మీ ముందు ఉంచబోతున్నాను.

సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ తబారక వ త’ఆలా మనల్ని అందరినీ సృష్టించారు. సరైన మార్గం కూడా అల్లాహ్ తబారక వ త’ఆలా మాకు సూచించాడు. సర్వ జనుల్లో అనేకమంది అనేక అభిప్రాయాలు, అనేక ఆలోచనలతో జీవిస్తున్నారు. కొంతమందికి కొన్ని విషయాల వల్ల ప్రేమ, మరి కొంతమందికి కొన్ని విషయాల పట్ల ఆకర్షణ, మరికొంతమందికి కొన్ని విషయాల పట్ల సంతుష్టి ఉంటుంది. అయితే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఏమి చెబుతున్నాడంటే, ఓ విశ్వాసులారా! నా యొక్క సామీప్యాన్ని మీరు అన్వేషించండి.

అల్లాహ్ యొక్క సామీప్యం ఎంతో ఉన్నతమైన స్థానం. విలువైన స్థానం. ఆ ఉన్నతమైన స్థానానికి, ఆ విలువైన స్థానానికి మనిషి చేరుకోగలిగితే, ఇక అక్కడి నుంచి అల్లాహ్ తబారక వ త’ఆలా ను ఆ మనిషి ఏది కోరుకుంటాడో, ఆ దాసుడు ఏది కోరుకుంటాడో దాన్ని అల్లాహ్ త’ఆలా ప్రసాదిస్తాడు. ఆ విలువైన స్థానం, ఆ విలువైన సామీప్యాన్ని పొందడానికి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక విషయాలు సూచించారు. ఆ సామీప్యం మనిషికి దొరికినట్లయితే ఆ మనిషి యొక్క విలువ కూడా పెరిగిపోతుంది. అతని భక్తి కూడా పెరిగిపోతుంది. అల్లాహ్ వద్ద ఉన్నత స్థానాల్లో ఉంటాడు.

అయితే ఆ సామీప్యం మనకు ఎలా లభిస్తుంది? దాని కోసం మనం ఎన్నుకోవలసిన మార్గాలు ఏమిటి? ఇది మీరు, మేము చెప్పుకుంటే వచ్చేది కాదు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ప్రవక్తా! మీకు ఏ దేవుడైతే, ఏ అల్లాహ్ అయితే మీకు ప్రవక్తగా చేసి పంపించాడో అతని సాక్షిగా నేను చెబుతున్నాను. అల్లాహ్ తబారక వ త’ఆలా మీకు అందజేసిన సందేశం ఏమిటో నాకు వివరించండి.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “షహాదతైన్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్.” దాన్ని “అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్.” నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరి నిజమైన ఏ దేవుడు లేడు. అలాగే నేను సాక్ష్యమిస్తున్నాను మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని. దీని తర్వాతే మిగతా విషయాలన్నీ అక్కడ వస్తాయి. ఆ వ్యక్తి దాన్ని విశ్వసించేవాడు. ఆ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో అంటున్నాడు, రేయింబవళ్ళలో అల్లాహ్ తబారక వ త’ఆలా మాపై విధించిన విషయాలు ఏమిటో చెప్పండి.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆదేశించారు. రేయింబవళ్ళలో అల్లాహ్ తబారక వ త’ఆలా మనపై విధించిన విషయం ఏమిటంటే, ఐదు పూటల నమాజు విధిగా అల్లాహ్ తబారక వ త’ఆలా చేశాడు. ఆ వ్యక్తి అన్నాడు, ప్రవక్తా! ఇంకేమైనా ఉందా? అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఐదు పూటల నమాజు తర్వాత నీకిష్టమైతే ఇంకా ఎక్కువైనా చదువుకోవచ్చు. ఆ తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, ప్రవక్తా! అల్లాహ్ తబారక వ త’ఆలా మీకు అందజేసిన సందేశంలో ఇంకేమైనా చేయవలసి ఉంటే అది కూడా చెప్పండి. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రమజాన్ మాసములో ఉపవాసాలు ఉండుట, పూర్తి మాసంలో ఉపవాసాలు ఉండుట. ఆ వ్యక్తి అన్నాడు, ఇంకేమైనా ఉందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఆ పూర్తి మాసం తర్వాత నీకు ఇష్టమైతే మిగతా రోజుల్లో కూడా నువ్వు ఉపవాసాలు ఉండవచ్చు.

మీకు అందజేసిన ఆదేశాల్లో ఇంకేమైనా ఉందా అని అడిగాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జకాత్ చెల్లించటం, సంవత్సరానికి ఒకసారి జకాత్ చెల్లించటం. ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళు చాలా క్లుప్తంగా వివరించారు. అన్ని విషయాలు విన్న ఆ వ్యక్తి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అన్నాడు, ఓ ప్రవక్తా! ఏవైతే మీరు నాకు వినిపించారో, ఏవైతే సందేశం నాకు ఇచ్చారో ఆ సందేశంలో నేను రవ్వంత కూడా ఎక్కువ చేయను, రవ్వంత కూడా తగ్గించను. ఏదైతే నేను నాపై విధిగా ఉందో అది మాత్రమే నేను చేస్తాను. ఇంకా ఎక్కువ చేయను, ఇంకా తక్కువ చేయను అని ఆ వ్యక్తి పలకరించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వెళ్తుండగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏదైతే ఈ మనిషి అన్నాడో, ఏదైతే ఈ మనిషి వాంగ్మూలం ఇచ్చాడో దాన్ని సరిగ్గా నెరవేరిస్తే ఇతను తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్తను ఇచ్చారు.

ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా! ఇది బుఖారీ, ముస్లింలో ఉంది, ఈ ఒక్క హదీస్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే అల్లాహ్ సామీప్యం పొందటం చాలా సులువు. కానీ మనం కాస్త గ్రహించట్లేదు. ఒకవేళ మనం గ్రహిస్తే అల్లాహ్ సామీప్యం పొందటం చాలా సులువైన విషయం. ఎందుకంటే ఆ వ్యక్తి అడిగిన విషయాల్లో ఏవైతే అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో అవి మాత్రమే నేను చేస్తాను అని చెప్పాడు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్త వినిపించారు, ఈ వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు అని. అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందటానికి మనిషికి కావలసినది ఏమిటంటే, అత్యంత విలువైన, అల్లాహ్ తబారక వ త’ఆలా ఏదైతే అతనిపై విధిగా చేశాడో దాన్ని అమలు పరచటం. అల్లాహ్ త’ఆలా విధిగా చేయనిది మనము ఎంత చేసుకున్నా అది విధికి సమానంగా ఉండదు. ధార్మిక పండితులు, ధార్మిక విద్వాంసులు అనేక విషయాలు దీనికి సంబంధించి చెప్పారు. అందులో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. అవి అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందడానికి మార్గాలు అన్నమాట.

మొట్టమొదటిదిగా అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందటానికి కావలసింది ఏమిటంటే, ‘అదావుస్ సలాతి ఫీ అవ్ఖాతిహా’. నమాజుని దాని యొక్క సమయంలో ఆచరించటం.

ఫజర్ నమాజ్ ఫజర్ సమయంలో, జోహర్ నమాజ్ జోహర్ సమయంలో, అసర్ నమాజ్ అసర్ సమయంలో, మగ్రిబ్ నమాజ్ మగ్రిబ్ సమయంలో, ఇషా నమాజ్ ఇషా సమయంలో. ఏ నమాజ్ ఏ సమయంలో అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో ఆ నమాజ్ ని ఆ సమయంలో విధిగా భావించి ఆచరించాలి. కొంతమంది ఫజర్ నమాజ్ ని హాయిగా పడుకొని జోహర్ నమాజ్ తో కలిపి చదువుతారు. ఇది అల్లాహ్ తబారక వ త’ఆలాకి నచ్చదు. సమయాన్ని తప్పించి నమాజ్ ఆచరించటం అనేది విధిగా అల్లాహ్ తబారక వ త’ఆలా చేయలేదు. కనుక అల్లాహ్ యొక్క సామీప్యం పొందాలంటే ఏదైతే అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో, ఎప్పుడు చేశాడో దాన్ని ఆ ప్రకారంగానే అమలు చేయటం. ఇస్లాం ధర్మంలో రెండో మౌలిక విధి నమాజ్ ది ఉంది. మొదటిది షహాదతైన్, ఆ తరువాత నమాజ్ అన్నమాట. నమాజ్ ని దాని సమయంలో పాటించటం, ఆచరించటం ఉత్తమం.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు, మనిషి చనిపోయిన తర్వాత అన్నిటికంటే ముందు అల్లాహ్ వద్ద అతనితో ప్రశ్నించబడేది నమాజే. నమాజ్ గురించి అతను సమాధానం ఇవ్వగలిగితే మిగతా విషయాల్లో అతను విజయం, సాఫల్యం పొందుతాడు. కనుక ఇది గుర్తుపెట్టుకోవాలి. అల్లాహ్ సామీప్యం పొందడానికి కావలసినది విధిగా చేసి ఉన్న నమాజులని సమయం ప్రకారం ఆచరించటం, పాటించటం.

ఇక రెండోది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఒక వ్యక్తి, ప్రవక్తా! స్వర్గంలో నేను మీతో ఉండాలనుకుంటున్నాను. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అయితే నువ్వు ఎక్కువగా నమాజ్ ఆచరించు. విధిగా ఉన్న నమాజులని ఆచరించిన తర్వాత సున్నత్ నమాజులను, నఫిల్ నమాజులను ఇలాంటి నమాజులను ఎక్కువగా ఆచరించటం వలన అల్లాహ్ యొక్క సామీప్యం మనకు లభిస్తుంది. ఎంతవరకు అయితే మనిషి అల్లాహ్ యొక్క భక్తిని తన హృదయంలో, తన మనసులో పెంపొందించుకుంటాడో, అల్లాహ్ తబారక వ త’ఆలా అతనికి తన సామీప్యానికి దరికి తీసుకుంటాడు. కనుక సున్నత్ నమాజులను, నఫిల్ నమాజులను, అలాగే రాత్రిపూట ఏకాంతంలో చదివే తహజ్జుద్ నమాజులను కూడా వదలకూడదు. ఈ నమాజులు మన స్థాయిని పెంచుతాయి. అల్లాహ్ సన్నిధిలో మన యొక్క విలువ పెరుగుతుంది.

ఆ తర్వాత మూడో మార్గం ఏమిటంటే అల్లాహ్ యొక్క విధేయతను పాటించడంలో ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆశతో ఉండాలి. విధేయత అంటే ఇతాఅత్. ఏదైతే అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ పని చేయమని, ఆ పని చేయమని అల్లాహ్ త’ఆలా మాకు ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞను శిరసా వహించటానికి ఇతాఅత్ అంటాము. ఆ ఇతాఅత్ చేయటానికి మనము ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉండాలి. ఉత్సాహం కలిగి ఉండాలి. ఉత్సాహం లేకుండా ఏదీ మనిషి చేయలేడు, ఇష్టం లేకుండా ఏది మనిషి చేయలేడు. అల్లాహ్ విధేయత పట్ల మనిషి ఉత్సాహం కలిగి ఉంటే ఆ విశ్వాసంలో కలిగే రుచే వేరుగా ఉంటుంది. ఇది మూడో మార్గం అన్నమాట.

ఇక నాలుగో మార్గం ఏమిటంటే అల్లాహ్ తబారక వ త’ఆలాని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. అంటే జిక్ర్. జిక్ర్ అంటే అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామము యొక్క జపము. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక దుఆలతో నామాలతో, జపాలతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించారు. మనిషి కూర్చొని ఉన్నా, నమాజ్ తర్వాత అయినా, ఏదైనా వస్తువు మన చేతి నుండి కింద పడిపోయినా, ఏదైనా వస్తువు మనకు ఆకర్షణను కలిగించినా, అనేక విధాలుగా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, మాషాఅల్లాహ్. ఈ విధంగా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామాలను స్మరిస్తూ ఉండాలి. దీని ద్వారా మన యొక్క విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, తద్వారా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క సామీప్యం మనకు లభిస్తుంది.

ఇక ఐదోది ఏమిటంటే, అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపవాసం ఉండుట. ఉపవాసం అనేది ఎవరికీ కానవచ్చేది కాదు. అల్లాహ్ ప్రసన్నత కోసం మనిషి ఉపవాసం ఉంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి చెప్పారంటే, ఎవరైతే అల్లాహ్ ప్రసన్నత కోసం ఒక రోజు ఉపవాసం ఉండినట్లయితే, అల్లాహ్ తబారక వ త’ఆలా అతని యొక్క ముఖాన్ని 70 సంవత్సరాల దూరంగా నరకాగ్ని నుండి ఉంచుతాడు. ఇది కేవలం ఒక రోజు ఉపవాసం ఉంటే అల్లాహ్ తబారక వ త’ఆలా అతని ముఖాన్ని నరకాగ్ని నుండి 70 సంవత్సరాల దూరం వరకు తప్పిస్తాడు. ఆ విధంగా అల్లాహ్ ప్రసన్నత కోసం ఎన్ని ఉపవాసాలు ఉన్నా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక ఉపవాసాలు చూపించారు. వారంలో రెండు రోజులు ఉపవాసం ఉండుట, ఒక మాసములో, ఒక నెలలో మూడు రోజులు, 13, 14, 15 వ తేదీలలో ఉపవాసాలు ఉండుట. అలాగే అరఫా రోజున ఉపవాసం ఉండుట, ముహర్రం రోజులో 9, 10 ఈ రెండు రోజులు ఉపవాసాలు ఉండుట. రమజాన్ మాసములో విధిగా చేయబడిన ఒక నెల ఉపవాసాలు ఉండుట. ఈ విధంగా అనేక ఉపవాసాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఉపదేశించారు. ఈ ఉపవాసాల ద్వారా మనిషిలో విశ్వాసము, ఈమాన్ పెరుగుతుంది. దాని మూలంగా అతను అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందగలుగుతాడు.

ఇక ఆరోది ఏమిటంటే పశ్చాత్తాపం, ‘అత్తౌబతు అనిల్ మ’ఆసీ’. పశ్చాత్తాపం. ఏవైతే మనము చెడు కర్మలు చేసి ఉన్నామో, నేరాలు చేసి ఉన్నామో, దాని పట్ల పశ్చాత్తాపం చెందుతూ ఉండాలి. అల్లాహ్ త’ఆలాతో ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి. అల్లాహ్ త’ఆలా వైపు మరలుతూ ఉండాలి. ఎల్లప్పుడూ అల్లాహ్ త’ఆలాతో క్షమాపణ, మన్నింపు కోరుతూ ఉండాలి. దీని మూలంగా మన యొక్క పాపాలు అల్లాహ్ తబారక వ త’ఆలా తుడిచి పెడతాడు. దాని ద్వారా మన యొక్క ఈమాన్ పెరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం మనకు కలుగుతుంది. మనిషి ఏ సమయంలో ఎలాంటి పాపం చేస్తాడో అతనికే తెలుసు. కొన్ని సందర్భాలు ఇలాంటివి కూడా ఉంటాయి, అతను పాపాలు చేస్తాడు, ఆ పాపాలు అతనికి గుర్తు ఉండవు. కనుక అల్లాహ్ తబారక వ త’ఆలాతో దుఆ ఏమని చేయాలంటే, ఏ పాపాలైతే నేను తెలిసి చేశానో, తెలియక చేశానో అన్నిటినీ నువ్వు క్షమించు అని అల్లాహ్ త’ఆలాతో మన్నింపు కోరుతూ ఉండాలి.

పశ్చాత్తాపం చేయటానికి, క్షమాపణ కోరటానికి, మన్నింపు కోరటానికి గడువు తీసుకోకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, రాత్రిళ్ళలో ఎవరైతే పాపాలు చేస్తారో, నేరాలు చేస్తారో అతని కోసం అల్లాహ్ తబారక వ త’ఆలా పగలు తన రెండు హస్తాలను చాచి, ఓ నా భక్తులారా! ఎవరైతే రాత్రిళ్ళలో మీరు పాపాలు చేసి ఉన్నారో, నేరాలు చేసి ఉన్నారో, నేను మిమ్మల్ని క్షమిస్తాను, రండి. ఆ సమయంలో ఎవరైతే అల్లాహ్ తబారక వ త’ఆలాతో పశ్చాత్తాపం కోరుతారో, అల్లాహ్ త’ఆలా వారిని క్షమిస్తాడు, మన్నించి వేస్తాడు. అదే విధంగా పగటి పూట ఎవరైతే పాపాలు చేస్తూ ఉంటారో, వారి కోసం అల్లాహ్ తబారక వ త’ఆలా రాత్రి తన హస్తాలు చాచి, ఓ నా దాసులారా! మీరు పగటిపూట ఏమైనా నేరాలు చేసి ఉంటే, పాపాలు చేసి ఉంటే, రండి, క్షమాపణ కోరండి, మీ పాపాలను నేను తుడిచి వేస్తాను, మన్నించి వేస్తాను. కానీ మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు పాపం పట్ల పశ్చాత్తాపం చెందితే మళ్ళీ బహుశా నాతో పాపం జరిగే అవకాశం ఉంది. కనుక ఇప్పుడే పశ్చాత్తాపం చెందకూడదు. జీవితంలో చివరి కాలంలో, శేష జీవితంలో నేను పాపాల నుండి విముక్తి పొందటానికి అల్లాహ్ త’ఆలాతో పశ్చాత్తాపం కోరాలి అనే భావన అతనిలో కలిగి ఉంటుంది. ఇది ముమ్మాటికీ తప్పు, పొరపాటు. మనిషి అన్న తర్వాత చిన్న పాపాలు గాని, పెద్ద పాపాలు గాని, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. కానీ అల్లాహ్ తబారక వ త’ఆలా క్షమిస్తూనే ఉంటాడు. గఫూరుర్ రహీం. ఆయన కరుణించేవాడు, క్షమించేవాడు, అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడు. ఎల్లప్పుడూ తమ పాపాల పట్ల అల్లాహ్ త’ఆలాతో పశ్చాత్తాపం కోరుతూ ఉండాలి.

ఇక ఏడో మార్గం ఏమిటంటే, అల్లాహ్ తబారక వ త’ఆలా అవతరింపజేసిన ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి, కంఠస్థం చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అల్లాహ్ తబారక వ త’ఆలా మహత్తరమైన గ్రంథాన్ని అవతరింపజేశాడు. మన సాఫల్యం కోసం, పరలోకంలో మనం విజయం సాధించాలనే ఉద్దేశ్యముతో అల్లాహ్ త’ఆలా మన కోసం ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఈనాడు మన స్థితి కాస్త గ్రహించినట్లయితే మనకు అర్థమవుతుంది, అదేమిటంటే ఖురాన్ చదవటం వచ్చిన వాళ్ళు అయినా సరే, ఖురాన్ చదవటం రాని వాళ్ళు అయినా సరే సమానమయ్యారు. ఖురాన్ చదవటానికి వారి వద్ద సమయం లేదు. ఖురాన్ నేర్చుకోవడానికి వారి వద్ద సమయం లేదు. ఇది అంతిమ దైవ గ్రంథం. నిజమైన గ్రంథం. ఈ భూమండలంలో ఏదైనా నిజమైన గ్రంథం, అల్లాహ్ యొక్క దైవ గ్రంథం ఉండినట్లయితే అది కేవలం ఖురాన్ గ్రంథం మాత్రమే. అసలైన స్థితిలో అలాగే భద్రంగా ఉంది.

ఎంత అభాగ్యులు వారు, ఎవరైతే ఈ గ్రంథాన్ని విడిచిపెట్టి తన జీవితాన్ని సాగిస్తున్నారో. చాలా దురదృష్టవంతులు. అల్లాహ్ యొక్క గ్రంథం ఈ భూమండలం మీద ఉన్నప్పుడు మనలో విశ్వాసం దాన్ని చదవడానికి, దాన్ని పారాయణం చేయడానికి, కంఠస్థం చేయడానికి ఎలా తహతహలాడాలంటే అంత ఉత్సాహంతో ఉండాలి. ఖురాన్ గ్రంథం పట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి ఉన్నారు, ఎవరైతే ఒక అక్షరం చదువుతాడో దానికి బదులుగా అల్లాహ్ తబారక వ త’ఆలా పది పుణ్యాలు లభింపజేస్తాడు. ఖురాన్ గ్రంథంలో వాక్యాలు, పదాలు అనేక అక్షరాలతో కూడి ఉన్నాయి. అది చదవంగానే అల్లాహ్ తబారక వ త’ఆలా వారికి ఎంతో విలువైన పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. దాని మూలంగా వారి యొక్క విశ్వాసం పెరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం వారికి లభిస్తుంది. కనుక ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి. ఏదైతే మనకు వస్తుందో, ఒక సూరా వచ్చినా, మొత్తం ఖురాన్ వచ్చినా, నిరంతరంగా చదువుతూ ఉండాలి.

అల్లాహ్ తబారక వ త’ఆలా సూరె ఫుర్ఖాన్ లో ఈ విధంగా చెప్తున్నాడు, ప్రళయ దినం నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సన్నిధిలో అంటారు, “యా రబ్బీ ఇన్న హాజల్ కౌమీత్తఖజూ ఖురాన మహ్జూరా”. ఓ నా ప్రభువా! ఈ నా జాతి వారు ఖురాన్ గ్రంథాన్ని చదవటం విడిచిపెట్టారు. కనుక ఈ స్థితి రాకుండా మనం ఏం చేయాలంటే, ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. దాని దాని కారణంగా మనకు మేలు జరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం దొరుకుతుంది.

ఎనిమిదో మార్గం ఏమిటంటే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తబారక వ త’ఆలా మన సన్మార్గం కోసం పంపించాడు. ఆయన్ని ప్రవక్తగా చేసిన అల్లాహ్ తబారక వ త’ఆలా మనపై పెద్ద ఉపకారమే చేశాడు. ఆయన చెప్పకపోతే, ఆయన మార్గాన్ని సూచించకపోతే నిజమైన మార్గం మనకు దొరికేది కాదు. అర్థమయ్యేది కాదు. కనుక మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అత్యధికంగా దరూద్ చదువుతూ ఉండాలి.

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా సల్లయిత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్.

ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై చదివే దరూద్, పంపే దరూద్ అన్నమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించి ఉన్నారు, మీలో ఎవరైతే నాపై ఎక్కువ దరూద్ పంపుతారో, చదువుతారో అతను నాకు సమీపంగా ఉంటాడు. అల్లాహ్ సామీప్యం పొందడానికి ఈ దరూద్ కూడా మనకు తోడ్పాటు అవుతుంది.

అలాగే తొమ్మిదో మార్గం ఏమిటంటే, మంచి వ్యక్తులతో స్నేహం కలిగి ఉండాలి. స్నేహం అన్నది కేవలం ప్రపంచంలో మనం చెప్పుకుంటా స్నేహం కాదు. సద్వర్తుల స్నేహం. ఎవరైతే అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఉంటాడో, ఎల్లప్పుడూ అల్లాహ్ ని గుర్తు చేస్తూ ఉంటాడో, అల్లాహ్ యొక్క విధేయతను పాటిస్తూ ఉంటాడో, అల్లాహ్ తో ఎవరైతే భయపడుతూ ఉంటారో వారి యొక్క స్నేహాన్ని మనము చేసుకోవాలి. మనము ఇటువంటి వారిని స్నేహించము. మన జీవిత కాలంలో మనకున్న స్నేహాలు, స్నేహితులు వేరు. అల్లాహ్ తబారక వ త’ఆలా ఏదైతే సూచిస్తున్నాడో అది వేరు. కనుక గుర్తుంచుకోవాలి, స్నేహం చేసేటప్పుడు మనలో ఉన్న గుణం ఏమిటి, అది మన స్నేహం ద్వారా వ్యక్తమవుతుంది. ఒక మంచి మనిషి అల్లాహ్ తో భయపడేవాడు, అల్లాహ్ పట్ల సంతుష్టుడయ్యేవాడు, అల్లాహ్ యొక్క దాసులతో ప్రేమిస్తాడు, స్నేహం చేస్తాడు. కనుక మంచి స్నేహితులని ఎన్నుకోవాలి. దాని మూలంగా వారు చేస్తున్న ఆచారాలు, వారు చేస్తున్న కర్మలు మనకు కూడా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. దాని ద్వారా మన విశ్వాసం కూడా, ఈమాన్ కూడా పెరుగుతుంది. తద్వారా అల్లాహ్ సన్నిధిలో మనము కూడా ఒక సామీప్యాన్ని పొందగలుగుతాం.

పదోది ఏమిటంటే, దానము చేయటం, పేదవారిపై దానము చేయటం. దానం చేయడాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా ఎంతో మెచ్చుకుంటాడు. అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా చెప్పి ఉన్నాడు, ఏదైతే మీకు నేను ప్రసాదించి ఉన్నానో అందులో నుంచి మీరు ఖర్చు పెట్టండి పేదవారిపై. ఇక్కడ చెప్పవలసిన విషయం ఏమిటంటే, మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు, ఏదైతే అల్లాహ్ త’ఆలా మనకు ప్రసాదించి ఉన్నాడో, అది కొంత అయినా ఎంతైనా సరే, అందులో నుంచి ఖర్చు పెట్టి అల్లాహ్ ప్రసన్నత కోరటం అనేది ఇక్కడ మాట. ఎల్లప్పుడూ అల్లాహ్ తబారక వ త’ఆలా కోసం, అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం మనము దానధర్మాలు చేస్తూ ఉండాలి. దీని మూలంగా అల్లాహ్ యొక్క సామీప్యం మనకు దొరుకుతుంది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు, సహాబాలు ఎంతో శ్రమపడి అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క ప్రసన్నత కోరేవారు. ఒక సందర్భంలో హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆయన వద్ద ఉన్న అన్ని వస్తువులు తీసుకొచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ప్రవేశపెట్టారు. వారి స్థితిని గమనించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు తో అన్నారు, ఓ అబూబకర్! ఇవన్నీ ఇక్కడికి తీసుకువచ్చావు, ఇంట్లో ఏమి పెట్టుకున్నావు? ఆయన అన్నారు, ప్రవక్తా! నేను ఇంట్లో అల్లాహ్ మరియు ప్రవక్తను వదిలేసి వచ్చాను.

ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు అల్లాహ్ ప్రసన్నత కోసం అనేక విధాలుగా ఖర్చు పెట్టేవారు. అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందాలని.

ఈ పది సూత్రాలు, పది మార్గాలు ఉన్నాయి అల్లాహ్ యొక్క సామీప్యం పొందడానికి.

అయితే ఇప్పుడు చెప్పవలసిన విషయం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సామీప్యం మనం పొందినట్లయితే, అప్పుడు అల్లాహ్ తబారక వ త’ఆలా మా యొక్క ప్రతి మాటను వింటూ ఉంటాడు, మేము కోరేదానికి అల్లాహ్ తబారక వ త’ఆలా ప్రసాదిస్తూ ఉంటాడు. ఒక హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ‘లవ్ అఖ్సమ అలల్లాహి ల అబర్రహ్’. అల్లాహ్ సామీప్యం పొందినవాడు ఎప్పుడైనా అల్లాహ్ మీద ప్రమాణం చేస్తే అల్లాహ్ తబారక వ త’ఆలా అతని యొక్క ప్రమాణాన్ని పూర్తి చేస్తాడు.

అదే విధంగా మరో హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క సామీప్యం పొందినవాడు అల్లాహ్ యొక్క స్నేహితుడు అవుతాడు, వలీ అవుతాడు. ఎవరైతే అల్లాహ్ యొక్క వలీతో ఏదైనా విషయం పట్ల హాని కలిగించినట్లయితే అల్లాహ్ తబారక వ త’ఆలా అంటున్నాడు, అతను తోనే అతనితో నేను యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్నాను. అల్లాహ్ మిత్రుల పట్ల, అల్లాహ్ యొక్క సామీప్యం పొందిన వారి పట్ల అల్లాహ్ తబారక వ త’ఆలా ఏం చెప్తున్నాడంటే, అతనిని నేను మెచ్చుకుంటాను, అతనిని నేను ఇష్టపడతాను, అతను ఏ చేతిలోనైతే పట్టుకుంటుంటాడో ఆ చేతిని నేను అయిపోతాను. ఏ కాలి ద్వారా అయితే అతను నడుస్తూ ఉంటాడో ఆ కాలును నేను అయిపోతాను. ఏ కళ్ళ ద్వారా అతను చూస్తూ ఉంటాడో ఆ కళ్ళు నేను అయిపోతాను. అని ఎంతో ప్రేమతో, ఎంతో ప్రసన్నతతో అల్లాహ్ తబారక వ త’ఆలా చెప్తున్నాడు.

అల్లాహ్ యొక్క సామీప్యం మనం పొందినట్లయితే మన యొక్క ప్రతి మాట అల్లాహ్ తబారక వ త’ఆలా వింటాడు. మేము ఏది కోరితే అల్లాహ్ తబారక వ త’ఆలా అది మాకు ప్రసాదిస్తాడు.

కనుక చివరిగా అల్లాహ్ తబారక వ త’ఆలా తో దుఆ ఏమనగా, ఏవైతే మనం విన్నామో ఆ మాటలని గుర్తించి సరైన మార్గంపై నడిచే భాగ్యాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా మాకు ప్రసాదించు గాక. అల్లాహ్ తబారక వ త’ఆలా ఏవైతే విధిగా చేసి ఉన్నాడో వాటిని ఆచరించి అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే భాగ్యాన్ని అల్లాహ్ త’ఆలా మనకు ప్రసాదించు గాక. ఆమీన్.

వ ఆఖిరు ద’అవానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17147


అల్లాహ్ స్మరణ యొక్క ఘనత [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

అల్లాహ్ స్మరణ యొక్క ఘనత – The Excellence of the Remembrance of Allah
https://youtu.be/M-AgVCyt-Qg
[36 నిముషాలు]
వక్త: షరీఫ్ (హఫిజహుల్లాహ్) వైజాగ్

ప్రపంచంలో మానవుడు డబ్బు, ఐశ్వర్యం వంటి సకల భోగభాగ్యాలు పొందుతున్నప్పటికీ, నిజమైన మనశ్శాంతికి దూరమవుతున్నాడు. వాస్తవమైన మనశ్శాంతి సంగీతం, సినిమాలు లేదా ప్రాపంచిక సుఖాలలో లేదు, కానీ సృష్టికర్త అయిన అల్లాహ్ స్మరణ (ధిక్ర్)లో మాత్రమే ఉంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అత్యంత అవసరం, మరియు ఈ మానసిక బలాన్ని, ప్రశాంతతను అల్లాహ్ ధిక్ర్ అందిస్తుంది. ధిక్ర్ యొక్క ఘనత, దాని వల్ల కలిగే ప్రయోజనాలు, మరియు ప్రవక్త (స) నేర్పించిన నిర్దిష్టమైన ధిక్ర్ పదాలు, వాటి ప్రతిఫలాల గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది.

ఖురాన్ మరియు హదీసుల వెలుగులో చూసినట్లయితే, అల్లాహ్ యొక్క స్మరణకు విశిష్టమైన ఘనత ఉంది ప్రియులారా. వాస్తవానికి, నేటి ప్రపంచములో మానవులకు కావలసినది ఏమిటి? మనం ప్రపంచంలో మనుషుల్ని చూస్తూ ఉన్నాం. మనిషికి డబ్బు ఉంది, మనిషికి అన్ని రకాల వనరులు ఉన్నాయి, కానీ అనేక మంది మానవులకు ఈ రోజు మనశ్శాంతి కరువైపోయింది. మనశ్శాంతి లేదంటున్నారు. డబ్బు ఉందండి, ఆస్తి ఉందండి, అంతస్తు ఉందండి, ఐశ్వర్యం ఉంది, అన్ని రకాల భోగ భాగ్యాలు ప్రపంచంలో మానవుడు పొందుతున్నాడు, కానీ వాస్తవానికి అనేక మంది మానవులు పొందలేక పోతున్న విషయం మనశ్శాంతి ప్రియులారా.

మనసుకు ప్రశాంతత లభించటం. వాస్తవానికి మనస్సుకు ప్రశాంతత దేని ద్వారా లభిస్తుంది? ఈ రోజు మనిషి అనుకుంటాడు, మనసుకు ప్రశాంతత లభించాలంటే సంగీత వాయిద్యాల ద్వారా మనిషికి ప్రశాంతత లభిస్తుంది అనుకుంటున్నాడు. చలన చిత్రాలను వీక్షించటం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది అనుకుంటున్నాడు. వాస్తవమైన మనశ్శాంతి ప్రియులారా, ఈ ప్రపంచంలో డబ్బులో లేదు, ఈ ప్రపంచపు సుఖాలలో లేదు, ఈ ప్రపంచములో ఈ సంగీత వాయిద్యాలలో లేదు, చలన చిత్రాలలో లేదు ప్రియులారా.

వాస్తవమైన మనశ్శాంతి, అల్లాహ్ సుబ్ హాన వ తఆలా, ఏ జాతి అయితే మనిషిని సృష్టించిందో, ఎవరైతే మనిషిని సృష్టించి, మనిషిని పోషించి, మనిషి కోసం ఈ ప్రపంచంలో సకల ఏర్పాట్లను చేశాడో, ఎవడైతే మనిషిని తల్లి గర్భములో వీర్యపు చుక్క వలే ప్రవేశింపజేశాడో, ఎవరైతే తల్లి గర్భములో 40 రోజుల పాటు రక్తపు ముద్ద వలే ఉంచాడో, ఎవరైతే ఆ 40 రోజుల తరువాత ఆ మనిషి గర్భములో ఉన్న మనల్ని రక్తపు ముద్ద నుండి మాంసపు ముద్దగా మార్చి, ఎముకను జత చేసి, మనకు అందమైన రూపాన్ని ఇచ్చి, వినే చెవులు ప్రసాదించి, చూసే కనులు ప్రసాదించి, ఆలోచించే హృదయాన్ని ప్రసాదించాడో, ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క స్మరణలో మనిషికి ప్రశాంతత ఉంది.

అదే విషయాన్ని పవిత్ర ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది ప్రియులారా.

أَلَا بِذِكْرِ اللَّهِ تَطْمَئِنُّ الْقُلُوبُ
అలా బి జిక్రిల్లాహి తత్మఇన్నుల్ ఖులూబ్
వినండి, అల్లాహ్ యొక్క స్మరణలో మాత్రమే మనిషికి ప్రశాంతత లభిస్తుంది.

ప్రియమైన ధార్మిక సోదరులారా, ప్రియమైన ధార్మిక సోదరీమణులారా, ఈ ప్రస్తుత ప్రపంచములో, నేటి సమాజములో, ప్రత్యేకించి నేటి కాలములో మనిషి శారీరకంగా, దానితో పాటు ఎక్కువగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఈ కరోనా కాలం, ఇలాంటి కాలాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేహ దారుఢ్యం కలిగినవారు, యవ్వనములో ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు, శారీరక ఆరోగ్యం ఉన్నవారు, అనేక మంది ప్రాణాలు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతున్నాయి. వాస్తవానికి ఈ కష్ట కాలములో ప్రియులారా, మానవుడు శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండటం మనిషికి అత్యంత అవసరదాయకమైనది. ఎందుకంటే సోదరులారా, మనిషికి శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యమే ఎక్కువ బలాన్ని చేకూరుస్తుంది. అలాంటి మానసిక ఆరోగ్యం మనిషికి అల్లాహ్ యొక్క స్మరణలో మాత్రమే లభిస్తుంది ప్రియులారా.

అనేక మంది ప్రపంచంలో అనుకోవచ్చు, నాకు సంగీత వాయిద్యాలలో నాకు ప్రశాంతత లభిస్తుంది. షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియా రహిమహుల్లా తెలుపుతున్నారు ప్రియులారా, మనిషి హృదయానికి ఏదైతే సంగీతం ఉందో, అది మనిషి హృదయానికి సంబంధించిన మద్యపానం లాంటిది. మనిషి యొక్క హృదయానికి మద్యపానం లాంటిది సంగీతం ప్రియులారా. మనిషి గనక దానికి అడిక్ట్ అయిపోతే, అది మద్యం వలే మనిషి హృదయాన్ని పట్టుకుంటుంది. అంటే, ఆ విధంగా మనిషిని సర్వనాశనం చేస్తుంది. ఏదేమైనప్పటికీ, మనకున్న ముఖ్తసరి సమయంలో నేను మీకు మీ ముందు ఉంచే విషయాలు ఏమిటి అంటే, అల్లాహ్ స్మరణ యొక్క ఘనత. మనిషి అల్లాహ్ ను స్మరించటం ద్వారా మనిషికి ఒనగూరే ప్రయోజనాలు ఏమిటి?

మొట్టమొదటి ప్రయోజనం, ఏదైతే నేను మీ ముందు వాక్యాన్ని పఠించానో,

أَلَا بِذِكْرِ اللَّهِ تَطْمَئِنُّ الْقُلُوبُ
అలా బి జికిరిల్లాహి తత్మఇన్నుల్ ఖులూబ్
అల్లాహ్ యొక్క స్మరణ ద్వారా మనిషి హృదయానికి ప్రశాంతత లభిస్తుంది.

రెండవ ఘనత ఏమిటి ప్రియులారా? మనల్ని అల్లాహ్ జ్ఞాపకం చేసుకుంటాడు.

فَاذْكُرُونِي أَذْكُرْكُمْ وَاشْكُرُوا لِي وَلَا تَكْفُرُونِ
ఫజ్కురూనీ అజ్కుర్కుం వష్కురూలీ వలా తక్ఫురూన్
అల్లాహ్ ఏమంటున్నాడు? మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను.

అల్లాహ్ సుబ్ హాన వత’ఆలా ఒక హదీసె ఖుద్సీలో తయారు చేస్తుంటున్నాడు. అల్లాహ్ సుబ్ హాన వత’ఆలా మనిషి యొక్క ఆలోచనకు దగ్గరలో ఉంటాడు ప్రియులారా. మనిషి అల్లాహ్ ను స్మరిస్తే, అల్లాహ్ కూడా ఆ మనిషిని గుర్తు చేసుకుంటాడు. ఒకవేళ మనిషి గనక లోలోపల అల్లాహ్ ను గుర్తు చేసుకుంటే, అల్లాహ్ కూడా తన లోపల మనల్ని గుర్తుకు చేసుకుంటాడు. మనిషి అల్లాహ్ ను గురించిన గొప్పతనం, అల్లాహ్ యొక్క జిక్ర్ ఒక సమావేశంలో చేస్తే, దానికంటే గొప్ప సమావేశములో అల్లాహ్ ఆ మనిషి యొక్క ప్రస్తావన చేస్తాడు ప్రియులారా.

ఆ పిదప, మనం జిక్ర్ యొక్క ఘనతను చూస్తే, అల్లాహ్ యొక్క నామ స్మరణ యొక్క ఘనతను చూస్తే, ఎలాంటి ఘనత ఉందండి? అల్లాహ్ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నారు:

وَالذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّهُ لَهُمْ مَغْفِرَةً وَأَجْرًا عَظِيمًا
వజ్జాకిరీనల్లాహ కసీరన్ వజ్జాకిరాత్, అఅద్దల్లాహు లహుం మగ్ఫిరతన్ వ అజ్రన్ అజీమా
ఎవరైతే అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే స్త్రీలు, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు, వారికి కోసం అల్లాహ్ వద్ద క్షమాభిక్ష ఉంది.

మనం ఇంకాస్త ముందుకు వెళ్తే సోదరులారా, అల్లాహ్ తఆలా జిక్ర్ యొక్క ఘనత ఖురాన్ గ్రంథంలో ఏమి తెలియజేస్తున్నారు? అల్లాహ్ అంటూ ఉన్నారు, అల్లాహ్ ఏమంటున్నారు?

وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَعَلَّكُمْ تُفْلِحُونَ
వజ్కురుల్లాహ కసీరల్ లఅల్లకుం తుఫ్లిహూన్
మీరు అల్లాహ్ ను ఎక్కువగా స్మరించండి, బహుశా మీరు సాఫల్యం పొందవచ్చు.

కాబట్టి ప్రియులారా, సాఫల్యం అల్లాహ్ యొక్క జిక్ర్ లో ఉంది, క్షమాభిక్ష అల్లాహ్ యొక్క జిక్ర్ లో ఉంది, మనుషుల హృదయాలకు ప్రశాంతత అల్లాహ్ యొక్క జిక్ర్ లో ఉంది, అల్లాహ్ మనల్ని జ్ఞాపకం చేసుకోవటం అల్లాహ్ యొక్క జిక్ర్ లో ఉంది. సుబ్ హా నల్లాహ్.

అలాంటి జిక్ర్ ఈ రోజు మనిషి చేస్తున్నాడా? మనిషి అల్లాహ్ యొక్క జిక్ర్ లో ప్రశాంతత పొందుతున్నాడా? ఈ రోజు మనిషి అనుకుంటాడు, నాకు ప్రశాంతత సినిమాలలో ఉంది, నాకు ప్రశాంతత మొబైల్ ఫోన్లలో ఆటలు ఆడటంలో ఉంది, నాకు ప్రశాంతత పాటలు వినటంలో ఉంది, నాకు ప్రశాంతత సంగీత వాయిద్యాలలో ఉంది. نَعُوْذُ بِاللهِ (నవూజుబిల్లాహ్) మేము అల్లాహ్ శరణు వేడుతున్నాము. ఏ హృదయానికైతే అల్లాహ్ యొక్క స్మరణలో ప్రశాంతత లేదో, అది రోగగ్రస్తమైన హృదయం ప్రియులారా. జ్ఞాపకం పెట్టుకోండి.

ఈ రోజు మనం, మనం అనుకుంటాం ప్రియులారా, మనలో అనేక మంది ఏమనుకుంటారు, జిక్ర్ అంటే తసవ్వుఫ్ అండి, అది మనది కాదు. ఈ రోజు ఎలాగైపోయిందంటే, దరూద్ చదివే వాళ్ళు అదొక పార్టీ అండి, దరూద్ చదివే వాళ్ళకు మాకు సంబంధం లేదు. نَعُوْذُ بِاللهِ (నవూజుబిల్లాహ్). ఎక్కువగా జిక్ర్ గురించి మాట్లాడితే, ఏమి సూఫీలు జిక్ర్ చేసుకుంటారండి, మాకేం అవసరం జిక్ర్ ఇది, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. జిక్ర్ ఎలాంటి ఆరాధన ప్రియులారా?

ఒక హదీస్ గనక మనం పరిశీలించినట్లయితే, తిర్మిజీ గ్రంథంలో అబూ దర్దా (రదియల్లాహు అన్హు) వారి ఒక ఉల్లేఖనం వస్తుంది ప్రియులారా. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేస్తున్నారు, నేను మీ ఆచరణల అన్నింటిలోకెల్లా ఒక గొప్ప ఆచరణ గురించి, ఒక మేలైన ఆచరణ గురించి మీకు తెలియజేయనా? అది ఎలాంటి ఆచరణ అంటే, మీ యొక్క ప్రభువు దృష్టిలో, అల్లాహ్ దృష్టిలో అత్యంత పవిత్రమైన ఆచరణ. మీరు అల్లాహ్ మార్గములో బంగారం, వెండి ఖర్చు పెట్టటము కంటే గొప్ప ఆచరణ. మీరు శత్రువుతో పోరాటము చేసి, శత్రువు తలలు తీయటము కంటే గొప్ప ఆచరణ. దైవ ప్రవక్త యొక్క సహాబాలు అడుగుతున్నారు, చెప్పండి ప్రవక్త, అది ఏ ఆచరణ? అల్లాహు అక్బర్. అల్లాహ్ మార్గంలో బంగారం, వెండి ఖర్చు చేయటము కంటే గొప్ప ఆచరణ. అల్లాహ్ వద్ద అత్యంత పవిత్రమైన ఆచరణ. శత్రువుతో పోరాటము చేయటము కంటే గొప్ప ఆచరణ. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేస్తున్నారు ప్రియులారా,

ذِكْرُ اللَّهِ تَعَالَى
జిక్రుల్లాహి తఆలా

అల్లాహ్ యొక్క స్మరణ చేయటం అల్లాహ్ మార్గంలో బంగారం దానము చేయటము కంటే గొప్పది. అల్లాహ్ యొక్క జిక్ర్ చేయటం, అల్లాహ్ మార్గములో వెండి దానము చేయటము కంటే గొప్పది. అల్లాహ్ యొక్క జిక్ర్ చేయటం శత్రువుతో పోరాటము చేయటము కంటే గొప్పది, సుబ్ హా నల్లాహ్.

అలాంటి జిక్ర్ ఈ రోజు మన వద్ద ఉందా ప్రియులారా? అల్లాహు అక్బర్. అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) హదీస్ ఉల్లేఖిస్తున్నారు. సహీహ్ ముస్లిం గ్రంథంలో హదీస్ నఖలు చేయబడుతుంది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేస్తున్నారు:

مَثَلُ الَّذِي يَذْكُرُ رَبَّهُ وَالَّذِي لَا يَذْكُرُ رَبَّهُ مَثَلُ الْحَيِّ وَالْمَيِّتِ
మసలుల్లజీ యజ్కురు రబ్బహూ వల్లజీ లా యజ్కురు, మసలుల్ హయ్యి వల్ మయ్యిత్

ప్రవక్త అంటున్నారు, అల్లాహ్ యొక్క స్మరణ చేసేవాడు, అల్లాహ్ యొక్క స్మరణ చేయనివాడు, వీరిద్దరి ఉపమానం ఎలాంటిదంటే, అల్లాహ్ యొక్క స్మరణ చేసేవాడు సజీవమైన వాడితో సమానము, అల్లాహ్ యొక్క స్మరణ చేయనివాడు నిర్జీవమైన వాడితో సమానం. సుబ్ హా నల్లాహ్. అల్లాహ్ యొక్క స్మరణ చేసేవాడు సజీవమైన వాడితో సమానం, అల్లాహ్ యొక్క స్మరణ చేయనివాడు నిర్జీవునితో సమానం ప్రియులారా. ఆలోచించండి.

ఈ రోజు ఎంత మంది అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తున్నారు? అల్లాహ్ తఆలాను జ్ఞాపకం చేసుకుంటున్నారు? మనం బ్రతికి ఉన్నాం ప్రియులారా, మన హృదయాలు బ్రతికి ఉన్నాయి సోదరులారా. మన హృదయాలను బ్రతికి ఉండగా మనం సజీవమైన వారిగా జీవితం గడుపుదామా? లేక బ్రతికి ఉండగానే మన హృదయాలు చనిపోయిన వారి వలే జీవితాన్ని గడుపుదామా? అల్లాహ్ యొక్క జిక్ర్ చేసేవాడు సజీవమైన వాడితో సమానం, అల్లాహ్ యొక్క జిక్ర్ చేయనివాడు నిర్జీవునితో సమానం ప్రియులారా.

ఒక చిన్న ఉదాహరణ మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రియులారా. ఒక వ్యక్తి అట తన ఇంటి బాల్కనీ నుండి బయట ప్రపంచాన్ని చూస్తున్నాడు. తన ఇంటి బాల్కనీ నుండి రోడ్డు వైపునకు, రోడ్డు పై చూస్తున్నాడు. ఎవరో వచ్చి రోడ్డు మీద ఉన్న ఒక చెత్త కుండీలో ఆహారాన్ని, పాడైపోయిన ఆహారం బహుశా, పడేసి వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏదైతే పాడైపోయిన ఆహారం చెత్త కుండీ వద్ద పడవేయబడిందో, ఆ ఆహారాన్ని ఎత్తుకొని త్వర త్వరగా తినేస్తున్నాడు. బాల్కనీ నుండి చూస్తున్న వ్యక్తి అంటున్నాడు, الْحَمْدُ لِلَّهِ అల్హమ్దులిల్లాహ్సర్వ స్తోత్రములు అల్లాహ్ కే. అల్లాహ్ అతగాడి కంటే మంచి జీవితాన్ని నాకు ప్రసాదించాడు, దీనికి అల్లాహ్ కు స్తోత్రం. ఇక ఎవరైతే చెత్తకుండీ వద్ద పాడైపోయిన ఆహారాన్ని ఏరుకొని తింటున్నాడో, అతగాడు చూస్తున్నాడు రోడ్డు మీద ఒక వ్యక్తి సరిగ్గా బట్టలు కూడా లేవు, అంతగా మతస్థిమితం లేని వాడి వలే రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అతగాడిని చూసి పాడైపోయిన ఆహారం తింటున్న వాడు అంటున్నాడు, الْحَمْدُ لِلَّهِ అల్హమ్దులిల్లాహ్ సర్వ స్తోత్రములు అల్లాహ్ కే. అల్లాహ్ అతగాడి కంటే మంచి స్థితిలో నన్ను ఉంచాడు, అల్లాహ్ కు స్తోత్రము. ఇక ఎవడైతే పిచ్చివాడి వలే రోడ్డు పై పరిగెత్తుతున్నాడో, అతగాడు చూస్తున్నాడు అంబులెన్స్ లో ఒక పేషెంటును హాస్పిటల్ కు తరలించటం జరుగుతుంది. ఆ పిచ్చివాడి వలే రోడ్డు పై గెంతులు వేస్తున్న వాడు ఆ అంబులెన్స్ లో ఉన్న రోగిని చూసి అంటున్నాడు, الْحَمْدُ لِلَّهِ అల్హమ్దులిల్లాహ్ సర్వ స్తోత్రములు అల్లాహ్ కే. అతడు అనారోగ్యం పాలైపోయాడు, అల్లాహ్ నాకైతే ఆరోగ్యాన్ని ప్రసాదించాడు, దీని కోసం అల్లాహ్ కు సర్వ స్తోత్రములు. ఇక ఎవడైతే అంబులెన్స్ లో నుండి హాస్పిటల్ వద్దకు చేరుకొని స్ట్రెచర్ మీద హాస్పిటల్ లోకి అడ్మిట్ అవుతున్న ఆ రోగి, అవతల పక్క స్ట్రెచర్ మీద ఒక డెడ్ బాడీని బయటకు తీసుకురావటాన్ని చూస్తున్నాడు. ఆ పేషెంటు ఆ డెడ్ బాడీ బయటకు వస్తుండగా చూసి అంటున్నాడు, الْحَمْدُ لِلَّهِ అల్హమ్దులిల్లాహ్ సర్వ స్తోత్రములు అల్లాహ్ కే. అల్లాహ్ నా దేహంలోనైతే ప్రాణం ఉంచాడు, అతడి దేహములో ప్రాణము కూడా లేదే, అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ అనారోగి అయితే తన ఆరోగ్యం, ఆ వ్యక్తి అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుతున్నాడే. ఇక పలకగలుగుతున్నాడే. ఇక స్ట్రెచర్ మీద బయటకు తీసుకు రాబడుతున్న వ్యక్తి అల్హందులిల్లాహ్ చెప్పగలడా ప్రియులారా? ఏ వ్యక్తి అయితే మరణించి బయటకు వస్తున్నాడో, అతగాడు అల్హందులిల్లాహ్ పలకలేడు ప్రియులారా. ఎందుకంటే వాడు చనిపోయి ఉన్నాడు కాబట్టి, సుబ్ హా నల్లాహ్.

ప్రియులారా, కాబట్టి బ్రతికి ఉండగా అల్లాహ్ తఆలాకు కృతజ్ఞత తెలిపే వారిగా, అల్లాహ్ యొక్క జిక్ర్ చేసే వారిగా మన జీవితాలను మనం మార్చుకుంటే, ఇది మన కోసం మేలైనది ప్రియులారా. అల్లాహ్ వద్ద అంతస్తులను తీసుకు వచ్చి పెట్టే మహోన్నత సాధనం. కాబట్టి ప్రియులారా, అల్లాహ్ యొక్క జిక్ర్ చేద్దాం, అల్లాహ్ ను స్మరిద్దాం. అల్లాహ్ అంటూ ఉన్నారు కదా ఏదైతే తిలావత్ లో చదివారు,

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا اللَّهَ ذِكْرًا كَثِيرًا
యా అయ్యుహల్లజీన ఆమనూజ్కురుల్లాహ జిక్రన్ కసీరా
ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించండి, సుబ్ హా నల్లాహ్.

కాబట్టి పదండి ఈ రోజున అంశంలో ముఖ్తసరిగా గురువుగారు మీరంటున్నారు అల్లాహ్ ను స్మరించమని. మీరు అంటున్నారు అల్లాహ్ ను స్మరించేవాడు మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటాడని, హృదయపరంగా ఆరోగ్యంగా ఉంటాడని. సుబ్ హా నల్లాహ్. వాస్తవం ప్రియులారా. మనిషి యొక్క హృదయానికి ఆహారం అల్లాహ్ యొక్క జిక్ర్. మన శరీరానికి ఆహారం ప్రియులారా ప్రపంచంలో అన్నపానీయాలు, కానీ మన హృదయానికి ఆహారం అల్లాహ్ యొక్క జిక్ర్ ప్రియులారా, సుబ్ హా నల్లాహ్.

కాబట్టి, అల్లాహ్ యొక్క జిక్ర్ మన హృదయానికి ఎలాంటిదండి? షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియా రహమహుల్లా తెలియజేస్తున్నారు, మనిషి హృదయానికి అల్లాహ్ యొక్క జిక్ర్ ఎలాంటిదంటే, చేపకు నీరు లాంటిది. ఏ విధంగానైతే నీరు లేకపోతే చేప మరణిస్తుందో, అల్లాహ్ యొక్క జిక్ర్ లేకపోతే మనిషి హృదయం మరణిస్తుంది. సుబ్ హా నల్లాహ్. ఏ విధంగానైతే నీరు లేకపోతే చేప మరణిస్తుందో, అల్లాహ్ యొక్క జిక్ర్ లేకపోతే, అల్లాహు అక్బర్, మనిషి హృదయం మరణిస్తుంది ప్రియులారా.

అల్లాహ్ యొక్క జిక్ర్ చేయకపోవటం, అల్లాహ్ ను స్మరించకపోవటం, ఇది ఎవరి లక్షణం ప్రియులారా? ఇది కపట విశ్వాసుల లక్షణం. సుబ్ హా నల్లాహ్. అల్లాహ్ ఏమన్నారు? కపట విశ్వాసుల యొక్క లక్షణాల గురించి ఖురాన్ గ్రంథములో అల్లాహ్ ప్రస్తావించిన మాట ఏమిటి?

وَإِذَا قَامُوا إِلَى الصَّلَاةِ قَامُوا كُسَالَىٰ
వ ఇజా కామూ ఇలస్సలాతి కామూ కుసాలా

అల్లాహ్ దానికంటే ముందు అన్నాడు,
يُرَاءُونَ النَّاسَ وَلَا يَذْكُرُونَ اللَّهَ إِلَّا قَلِيلًا
యురాఊనన్నాస, వలా యజ్కురూనల్లాహ ఇల్లా ఖలీలా

అల్లాహ్ ఏమన్నాడు? వారు, ఎవరంటే కపట విశ్వాసులు, నమాజు కోసం నిలబడినప్పుడు అతి బద్ధకంతో నిలబడతారు. ఒకవేళ నిలబడినా, ప్రజలకు చూపించటానికి నిల్చుంటారు. వారు అల్లాహ్ ను స్మరించరు, కానీ బహు తక్కువగా స్మరిస్తారు. సుబ్ హా నల్లాహ్. అల్లాహ్ తఆలా బహు తక్కువగా అల్లాహ్ ను స్మరించటాన్ని ఏ లక్షణం అంటున్నాడు? ఈ రోజు మనం అల్లాహ్ ను ఎంత వరకు స్మరిస్తున్నాం? ఈ రోజు అల్లాహ్ ఈ ఉమ్మత్ లో చాలా మందికి హిదాయత్ ప్రసాదించు గాక. కనీసం తుమ్ము వచ్చినప్పుడు అల్హందులిల్లాహ్ చెప్పే భాగ్యము కూడా ఈ ఉమ్మత్ లో చాలా మంది కోల్పోతున్నారు. లేదు ప్రియులారా. అల్లాహ్ కు కృతజ్ఞత, అల్లాహ్ యొక్క జిక్ర్ చేద్దాం, దాని ద్వారా మన జీవితంలో అనేక రకాలైన సమస్యలకు అల్లాహ్ పరిష్కారం చూపుతాడు, సుబ్ హా నల్లాహ్.

ఒక వ్యక్తి వచ్చాడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో అడిగాడు, ప్రవక్త, నాకు ఇస్లాం యొక్క ఆచరణలు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి, నాకు ఒక ఆచరణ చెప్పండి దానిపై నేను స్థిరంగా ఉంటాను. ప్రవక్త ఏమన్నారు?

لَا يَزَالُ لِسَانُكَ رَطْبًا مِنْ ذِكْرِ اللَّهِ
లా యజాలు లిసాను కరత్బమ్ మిన్ జికిరిల్లాహ్
నీ యొక్క నాలుకను ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క స్మరణలో నిలిపి ఉంచు.

అల్లాహు అక్బర్. అల్లాహ్ యొక్క స్మరణలో నిలిపి ఉంచు. దాని వల్ల చాలా లాభాలు ఉన్నాయి ప్రియులారా.

ఇప్పుడు పదండి, మన ముఖ్తసరిగా జిక్ర్ ఏంటి? ఎలాంటి జిక్ర్ చేయాలి? మీరు అంటున్నారు గురువుగారు ఇందాకటి బట్టి అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క స్మరణ. అల్లాహ్ యొక్క స్మరణ ఏం చేయాలి? మనం గనక హదీసులు పరిశీలించినట్లయితే, హదీసులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. నిర్దిష్టమైన వాక్యాలు ఉన్నాయి హదీసులలో అల్లాహ్ యొక్క స్మరణ గురించి.

మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, బుఖారీ, ముస్లిం గ్రంథాలలో హదీస్ నకలు చేయబడుతుంది. హజ్రతే అబూ హురైరా (రదియల్లాహు అన్హు) హదీస్ ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త వారు ఏమన్నారు? కలిమతాన్. రెండు వచనాలు ఉన్నాయి. ఖఫీఫతాని అలల్ లిసాన్ – పెదవులతో పలకటానికి చాలా తేలికైనవి. సఖీలతాని ఫిల్ మీజాన్ – త్రాసులో చాలా బరువైనవి. హబీబతాని ఇలర్రహ్మాన్ – కరుణామయుడైన అల్లాహ్ కు చాలా ప్రీతి పాత్రమైనవి. రెండే వచనాలు.

سُبْحَانَ اللَّهِ وَبِحَمْدِهِ، سُبْحَانَ اللَّهِ الْعَظِيمِ
సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ, సుబ్ హా నల్లాహిల్ అజీమ్
అల్లాహ్ పవిత్రుడు మరియు ఆయనకే సర్వ స్తోత్రములు, మహోన్నతుడైన అల్లాహ్ పవిత్రుడు.

అల్లాహు అక్బర్. మనం రోజులో ఎంత సమయాన్ని తీస్తున్నామండి ఈ పదాలు పలకటానికి? అల్లాహ్ మనకు హిదాయత్ ప్రసాదించు గాక, ఆమీన్. ప్రియులారా, అల్లాహు అక్బర్. అల్లాహ్ యొక్క స్మరణ. విశ్వాసి ఎవరు?

يَذْكُرُونَ اللَّهَ قِيَامًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِهِمْ
యజ్కురూనల్లాహ ఖియామన్ వఖుఊదన్ వఅలా జునూబిహిమ్

అల్లాహ్ యొక్క దాసుడు పరుండినా, కూర్చుండినా, నిల్చున్నా, అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తూ ఉంటాడు. అల్లాహు అక్బర్.

ప్రియులారా, ఆ తరువాత పదండి. సహీహ్ ముస్లిం గ్రంథంలో అబూ హురైరా (రదియల్లాహు అన్హు) హదీస్ ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేస్తున్నారు. ఏమన్నారు ప్రవక్త వారు? సూర్యుడు ఉదయించే ఈ భూమిపై నాకు అన్నింటికంటే, నాకు అన్నింటికంటే ఇష్టమైనది,

سُبْحَانَ اللَّهِ، وَالْحَمْدُ لِلَّهِ، وَلَا إِلَهَ إِلَّا اللَّهُ، وَاللَّهُ أَكْبَرُ
సుబ్ హా నల్లాహ్, వల్ హమ్దులిల్లాహ్, వ లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లహు అక్బర్ పలకటం.

దీని ఘనత ఎలాంటిది? ఒక రివాయత్ వస్తుంది ప్రియులారా, ఎవరైతే సుబ్ హా నల్లాహి వల్ హమ్దులిల్లాహి వ లా ఇలాహ ఇల్లల్లాహి వల్లహు అక్బర్ అని పలుకుతారో, వారి కోసం స్వర్గములో ఒక చెట్టు నాటబడటం జరుగుతుంది. అల్లాహు అక్బర్.

ఈ రోజు మన ఇంట్లో పిల్లలు పాటలు పాడితే తల్లి తండ్రి సంతోషపడిపోతారు. మా వాడు పాట పాడుతున్నాడండి, ఇక సంవత్సరం రాలేదు, ఇంకా రెండేళ్ళండి, వీడు పాట పాడుతున్నాడు. ఎంత మంది తల్లి తండ్రి పిల్లలకు లా ఇలాహ ఇల్లల్లాహ్ జిక్ర్ నేర్పిస్తున్నారు? అఫ్జలుజ్ జిక్ర్. శ్రేష్టమైన జిక్ర్ ఏమిటి?

لَا إِلَهَ إِلَّا اللَّهُ
లా ఇలాహ ఇల్లల్లాహ్
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు.

పిల్లలు మాట్లాడటం ప్రారంభించగానే, పిల్లలు చాలా చిన్నప్పుడు అందంగా మాట్లాడుతారు, తొత్తి తొత్తి మాటలు అంటారు మన వాళ్ళు. ఎప్పుడైతే పిల్లవారు మాట్లాడటం ప్రారంభమిస్తున్నారో, వారికి నేర్పించాల్సింది లా ఇలాహ ఇల్లల్లాహ్ పలకటం ప్రియులారా. అల్లాహు అక్బర్.

హజ్రతే అబూ హురైరా (రదియల్లాహు అన్హు) హదీస్ ఉల్లేఖిస్తున్నారు, బుఖారీ ముస్లిం గ్రంథాలలో హదీస్ ఉల్లేఖించబడుతుంది. ప్రవక్త వారు ఏమన్నారు?

لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ، وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ
లా ఇలాహ ఇల్లల్లాహు వహదహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వామి లేడు. సార్వభౌమత్వం ఆయనదే, సర్వ స్తోత్రములు ఆయనకే. ఆయన ప్రతి దానిపై శక్తిమంతుడు.

ఎవరైతే రోజుకు 100 సార్లు అంటారో, వారితో ఏమవుతుందండి? వారికి ఎంత పుణ్యం లభిస్తుంది? పది మంది బానిసలను విడుదల చేసినంత పుణ్యం. హదీస్ లో ఉన్నాయి బానిసలను విడుదల చేయించండి, మనం విడుదల చేయించలేకపోతున్నాం. మరి ఈ యొక్క జిక్ర్ చేస్తే పది మంది బానిసలను విడుదల చేసినంత పుణ్యం. అతడి యొక్క కర్మల జాబితాలో వంద పుణ్యాలు లిఖించబడతాయి, అతడి కర్మల జాబితాలో వంద పాపాలు తుడిచిపెట్టబడతాయి, ఆ రోజు సాయంత్రం వరకు అతడు షైతాను బారి నుండి రక్షింపబడతాడు, ప్రళయ దినాన అల్లాహ్ వద్ద విశిష్ట స్థానములో, సుబ్ హా నల్లాహ్, అల్లాహ్ వద్ద చాలా గొప్ప ప్రాధాన్యత వస్తాడు. కానీ అతడి కంటే ఎవరైతే ఎక్కువగా జిక్ర్ చేస్తారో, వారు అతడి కంటే గొప్ప ప్రాధాన్యత. దేనితో? రోజుకు 100 సార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. వంద సార్లు లెక్కపెట్టండి. 10 మంది బానిసలను విడుదల చేసినంత పుణ్యం, 100 పుణ్యాలు లిఖించబడతాయి, 100 పాపాలు క్షమించబడతాయి, ఆ రోజు సాయంత్రం వరకు షైతాను యొక్క కీడు నుండి రక్షింపబడతాడు. సుబ్ హా నల్లాహ్.

గురువుగారు 100 సార్లు లెక్కపెట్టే సమయం లేదండి. 10 సార్లు లెక్కపెట్టండి. అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) రివాయత్ ఉంది. ఎవరైతే రోజుకు పది సార్లు లా ఇలాహ ఇల్లల్లాహు వహదహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ పది సార్లు లెక్కపెడతారో, వారు ఇస్మాయిల్ (అలైహిస్సలాం) వంశములో నలుగురు బానిసలను విడుదల చేసినంత పుణ్యాన్ని పొందుతారు ప్రియులారా. అల్లాహు అక్బర్.

ప్రవక్త వారు అంటున్నారు, ఎవరైతే రోజుకు 100 సార్లు

سُبْحَانَ اللَّهِ وَبِحَمْدِهِ
సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ
అల్లాహ్ పవిత్రుడు మరియు ఆయనకే సర్వ స్తోత్రములు.

అంటారో, ఎవరైతే రోజుకు 100 సార్లు సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ అంటారో, వారి పాపాలు క్షమించబడతాయి. ఆ పాపాలు సముద్రపు నురుగు అంత ఉన్నా సరే. సుబ్ హా నల్లాహ్. అల్లాహు అక్బర్. వంద సార్లు సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ పలికితే సముద్రపు నురుగు అంత పాపాలు ఉన్నా అవి క్షమించబడతాయి. వేరే హదీస్ లో ప్రవక్త అంటున్నారు, పరిశుద్ధత సగ విశ్వాసం.
الْحَمْدُ لِلَّهِ అల్హమ్దులిల్లాహ్అ నే పదం త్రాసును నింపేస్తుంది. దాని యొక్క పుణ్యాన్ని గనక మనం weight చేయాలనుకుంటే, అల్హమ్దులిల్లాహ్ అన్న పదం త్రాసును నింపేస్తుంది. الْحَمْدُ لِلَّهِ، سُبْحَانَ اللَّهِ అల్హమ్దులిల్లాహ్, సుబ్ హా నల్లాహ్అ నే పదాలు భూమి ఆకాశాల మధ్య పూర్తి స్థానాలు నింపేస్తాయి. అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విశిష్టత ప్రియులారా, అల్లాహ్ యొక్క నామ స్మరణది.

ఈ రోజు మన సమాజం ఎటు వెళ్ళిపోతుంది ప్రియులారా? మన మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది, نَعُوْذُ بِاللهِ నవూజుబిల్లాహ్. ఈ రోజు మనం సామాజిక మాధ్యమాలలో, అల్లాహ్ తఆలా మనకు హిదాయత్ ను ప్రసాదించు గాక. అల్లాహ్ తఆలా నీ యొక్క జిక్ర్ చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించు, సుబ్ హా నల్లాహ్. ఈ రోజు మన యొక్క ఉనికి ఏంటంటే, నమాజ్ తర్వాత మన ఉనికి ఏంటంటే, అరే ఏంటి మన ఉనికి? ఏమంటారు గురువుగారు? ఇమాం గారు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అని తిప్పిన వెంటనే లెగిచిపోవటం. ఏమండీ? ఖురాన్ హదీస్ తో ఏ ఆచరణ చేసేవాళ్ళం? మా యొక్క సంకేతం, మేము ఖురాన్ హదీస్ ను ఆచరించేవాళ్ళం, ఇమాం సలాం తిప్పిన వెంటనే మేము లేచి వెళ్ళిపోతాం. అల్లాహు అక్బర్.

ఒక రివాయత్ వస్తుందండి, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) హదీస్ ఉల్లేఖిస్తున్నారు. పేద ముహాజిర్లు ప్రవక్త వద్దకు వచ్చి అంటున్నారు, ప్రవక్తా! శాశ్వత వనాలు, ఉన్నత స్థానాలు డబ్బు ఉన్నవారికే లభిస్తాయా ప్రవక్త? చూస్తే వారు కూడా మాలాగే నమాజ్ చేస్తారు, మాలాగే ఉపవాసాలు ఉంటారు, కానీ వారి వద్ద డబ్బు ఉన్న మూలంగా వారు ఏం చేస్తారంటే జిహాద్ చేస్తారు, దానధర్మాలు చేస్తారు, హజ్ చేస్తారు, ఉమ్రా చేస్తారు. మా వద్ద డబ్బు లేదు, మేము చేయలేకపోతున్నాం. హదీస్ సారాంశం చూసినట్లయితే, ఏమంటున్నారు? గొప్పవాళ్ళకే ఉన్నత స్థానాలు, శాశ్వత వరాలు లభిస్తాయా? వారు కూడా మాలాగే నమాజ్ చేస్తారు, మాలాగే ఉపవాసం పెడతారు, కానీ డబ్బు మూలంగా వారేం చేస్తారు? ఉమ్రా చేస్తారు, హజ్ చేస్తారు, దానధర్మాలు చేస్తారు, జిహాద్ చేస్తారు. ప్రవక్త వారు అన్నారు, మీకు ఇలాంటి ఆచరణ తెలపనా? దేని ద్వారానైతే ఎవరి గురించి అయితే మీరు అంటున్నారో, వారు చేసిన పుణ్యాలను మీరు కూడా అందుకుంటారు. సుబ్ హా నల్లాహ్. ప్రవక్త ఏమన్నారు? ప్రతి నమాజు తరువాత 33 సార్లు సుబ్ హా నల్లాహ్ పలకండి, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్ పలకండి, 33 సార్లు అల్లాహు అక్బర్ పలకండి. వారి యొక్క పుణ్యాలు మీకు కూడా లభిస్తాయి అని ప్రవక్త వారు చెప్పారు ప్రియులారా.

రెండో మాట వినండి ప్రియులారా, జిక్ర్ ద్వారా, జిక్ర్ ద్వారా మనిషికి కేవలం మానసిక ప్రశాంతత మాత్రమే లభించదు, శారీరక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఆధారం? హజ్రతే ఫాతిమా (రదియల్లాహు అన్హు) ప్రవక్త వద్దకు కబురు పంపించారు కదా, ఇంట్లో పనులు చేసుకోలేక చేతివేళ్ళు పాడైపోయాయి. తెలిసింది ఫాతిమా (రదియల్లాహు అన్హు) వారికి ప్రవక్త వద్ద కొంతమంది బానిసలు వచ్చి ఉన్నారని కబురు పంపించారు. ప్రవక్త ఏమన్నారు? ఫాతిమా, ప్రతి రోజూ రాత్రి పడుకోవటానికి ముందు 33 సార్లు సుబ్ హా నల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్ పఠించమన్నారు, దేని కోసం? శారీరక బలం కోసం ప్రియులారా. అల్లాహు అక్బర్. ఈ రోజు ఈ జిక్ర్ తో మనం ఎంత వరకు లాభం పడుతున్నాం?

వేరే రివాయత్ లో వస్తుంది ప్రియులారా, ప్రవక్త వారు సహాబాలతో ప్రశ్నించారు, మీలో ఎవరైనా రోజుకు వెయ్యి పుణ్యాలు పొందగలరా? సహాబాలు ప్రశ్నించారు, ప్రవక్త, రోజుకు వెయ్యి పుణ్యాలు ఎలా పొందగలం? ప్రవక్త వారు అన్నారు, అయితే రోజుకు 100 సార్లు سُبْحَانَ اللَّهِ సుబ్ హా నల్లాహ్అ ని పలకండి, మీకు వెయ్యి పుణ్యాలు లిఖించటం జరుగుతుంది, లేక వెయ్యి పాపాలు క్షమించటం జరుగుతుంది. అల్లాహు అక్బర్. కాబట్టి ప్రియ సోదర సమాజమా, మనం జిక్ర్ అలవాటు చేసుకోవాలి. ప్రవక్త మాట:

لَا يَزَالُ لِسَانُكَ رَطْبًا مِنْ ذِكْرِ اللَّهِ
లా యజాలు లిసాను కరత్బమ్ మిన్ జికిరిల్లాహ్
నీ యొక్క నాలుక ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క స్మరణలో ఉండాలి, ప్రవక్త చెప్పిన మాట. మన జీవితాలలో మనం నిత్య కృత్యంగా చేసుకోవాలి.

రోజు వారి దువాలు. ఈ కరోనా మహమ్మారి ప్రపంచం భయపడుతున్నాం. అరే, ప్రవక్త చెప్పలేదా?

بِسْمِ اللهِ الَّذِي لَا يَضُرُّ مَعَ اسْمِهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ، وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
బిస్మిల్లాహిల్లజీ లా యదుర్రు మఅస్మిహీ షైఉన్ ఫిల్ అర్ది వలా ఫిస్సమాఇ వహువస్ సమీఉల్ అలీమ్

ఎవరైతే ఉదయం మూడు సార్లు, సాయంత్రం మూడు సార్లు ఈ దువా పఠించాడో, వారికి ఎలాంటి కీడు కలగదు. ఎంత మంది నేర్చుకున్నారు? అల్లాహు అక్బర్. ఈ దువా నేర్చుకున్నాం, ఉదయం మూడు సార్లు, సాయంత్రం మూడు సార్లు చదువుతున్నాం, అయినా కరోనా వచ్చింది, చనిపోయాను. ఉలమాలు అంటున్నారు, ఇన్షాఅల్లాహ్ నువ్వు అల్లాహ్ పై విశ్వాసముతో ఉండి అల్లాహ్ యొక్క పరీక్ష వచ్చినప్పుడు విశ్వాసముతో ఉండి నువ్వు చనిపోతే, ఈ కరోనా మూలంగా చనిపోతే ఇన్షాఅల్లాహ్, ఇన్షాఅల్లాహ్ అల్లాహ్ నీకు షహీద్ యొక్క స్థానాన్ని ప్రసాదిస్తాడు. మనం అల్లాహ్ పై నమ్మకం కలిగి ఉండాలి కదా.

ఒక వ్యక్తి వచ్చాడు, ప్రవక్తా నాకు తేలు కుట్టింది అన్నాడు. ప్రవక్త వారు ఏమన్నారు? నువ్వు రోజుకు సాయంత్రం మూడు సార్లు

أَعُوذُ بِكَلِمَاتِ اللهِ التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ
అవూజు బికలిమాతిల్లాహిత్ తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్

అన్న దువా చేయమన్నారు. రోజుకు మూడు సార్లు జిక్ర్ చేయమన్నారు. ఎంత మంది ఈ దువా నేర్చుకున్నాం? అల్లాహు అక్బర్.

ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ. ప్రవక్త ఏమన్నారు? ఎవరైతే ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతాడో, అతడికి స్వర్గానికి మధ్య మరణం మాత్రమే అడ్డు ఉంటుంది.

సయ్యదుల్ ఇస్తిగ్ఫార్. అల్లాహుమ్మ అన్త రబ్బీ లా ఇలాహ ఇల్లా అన్త, ఖలఖ్తనీ వ అన అబ్దుక, అల్లాహు అక్బర్. ఎవరైతే సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ ఉదయం విశ్వాసంతో చదివి సాయంత్రం మరణిస్తే అతగాడు స్వర్గానికి వెళ్తాడు అన్నారు ప్రవక్త. ఎవరైనా సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ సాయంత్రం విశ్వాసముతో పఠించి ఉదయం మరణిస్తే స్వర్గానికి వెళ్తారు అన్నారు ప్రవక్త.

ఎవరైతే ఉదయం, సాయంత్రం ఏడు సార్లు:

حَسْبِيَ اللَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ ۖ عَلَيْهِ تَوَكَّلْتُ ۖ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ
హస్బియల్లాహు లా ఇలాహ ఇల్లా హువ, అలైహి తవక్కల్తు వహువ రబ్బుల్ అర్షిల్ అజీమ్
ఎవరైతే ఏడు సార్లు పఠిస్తారో, ఎలాంటి కీడు జరగదు అన్నారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

కాబట్టి సోదర సమాజమా, జిక్ర్ తో మహోన్నతమైన లాభాలు ఉన్నాయి, విపరీతమైన లాభాలు ఉన్నాయి. మనకు తెలియకుండా అల్లాహ్ తఆలా మనల్ని రక్షిస్తూ ఉంటాడు ప్రియులారా. ఇలాంటి జిక్ర్ చేయటంలో మీరు నేను ఈ రోజు ఎంత ముందున్నాం? నేను ప్రతిసారీ ప్రశ్నించే ప్రశ్న ప్రియులారా. నేను 30 ఏళ్ల నమాజీని, కానీ నాకు జిక్ర్ రాదు. మస్జిద్ లోపలికి వచ్చే దువా రాదు, మస్జిద్ నుండి బయటకు వెళ్ళే దువా రాదు. లాక్డౌన్ సమయం నడుస్తుంది ప్రియులారా, నెలన్నర నుండి మధ్యాహ్నం 12 వరకు, మొన్నటి వరకు ఇప్పుడు రెండు గంటల వరకు. ఈ లాక్డౌన్ సమయాన్ని ఎంత చక్కగా సద్వినియోగ పరుచుకుంటున్నాం? కాబట్టి జిక్ర్ చేయటం నేర్చుకుందాం. అల్లాహ్ తఆలా యొక్క జిక్ర్ చేద్దాం ప్రియులారా. దీనితో చాలా లాభాలు ఉన్నాయి.

చివరిగా ఒక్క మాట చెప్పి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను ప్రియులారా. జిక్ర్ ద్వారా మనకు లభించే లాభాలు ఏమిటి? అల్లాహు అక్బర్. అల్లాహ్ యొక్క నామ స్మరణ చేయటం మూలాన మనకు లభించే లాభాలు, ఒకే ఒక సంఘటన చెప్పి నా యొక్క మాటను ముగిస్తున్నాను ప్రియులారా.

జిక్ర్ యొక్క ఘనత ప్రియులారా. మనసులో నమ్మకం ఉండి, విశ్వాసం ఉండి, మనం అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తూ దువా చేస్తే అల్లాహ్ మన ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి సోదరులారా, నేను చివరిగా చెప్పే మాట, జిక్ర్ యొక్క పదాలు నేర్చుకుందాం. మన వద్ద పుస్తకాలు ఉన్నాయి, ఉదయం సాయంత్రం దువాలు నేర్చుకుందాం ప్రియులారా. జిక్ర్ చేస్తూ ఉందాం. దీని ద్వారా మన జీవితాలలో అనేక లాభాలు ఉన్నాయి. మన హృదయానికి ప్రశాంతత సోషల్ మీడియాలో, Facebook లో, YouTube లో, సంగీత వాయిద్యాలలో, అనవసరపు విషయాలలో లేదు ప్రియులారా. అల్లాహ్ యొక్క స్మరణలో, ఖురాన్ గ్రంథం యొక్క పఠనలో, నమాజ్ ఆచరించటంలో, అల్లాహ్ తఆలా యొక్క నామ స్మరణలో మన హృదయాలకు ప్రశాంతత ఉంది. అది ఇహలోకంలోనూ, పరలోకంలోనూ సాఫల్యాన్ని చేకూరుస్తుంది. అందుకే అల్లాహ్ అన్నాడు,

وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَعَلَّكُمْ تُفْلِحُونَ
వజ్కురుల్లాహ కసీరల్ లఅల్లకుం తుఫ్లిహూన్
అల్లాహ్ యొక్క స్మరణ అత్యధికంగా చేయండి, తద్వారా మీరు సాఫల్యం పొందుతారు.

అల్లాహ్ సుబ్ హాన వత’ఆలా మనందరికీ అల్లాహ్ యొక్క నామ స్మరణ ఎక్కువగా చేసే సద్భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.


ఐదు విషయాల కంటే ఎంతో మేలైన, ఉత్తమ ఆ ఒక్క విషయమేమిటి? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఐదు విషయాల కంటే ఎంతో మేలైన, ఉత్తమ ఆ ఒక్క విషయమేమిటి?
https://youtu.be/w7ANEdrN2IU [6:53 నిమిషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఈ ప్రసంగంలో యజమాని-దాసుడి సంబంధాన్ని ఉదాహరణగా తీసుకుని, మానవునికి మరియు సృష్టికర్త అయిన అల్లాహ్‌కు మధ్య ఉండవలసిన దాస్యత్వం గురించి వివరించబడింది. నిజమైన దాస్యత్వం అంటే ప్రతి క్షణం, ప్రతి స్థితిలో అల్లాహ్‌ను స్మరించుకోవడం (ధిక్ర్ చేయడం) మరియు ఆయనకు ఇష్టమైన పనులే చేయడం. అల్లాహ్ స్మరణ (ధిక్ర్) యొక్క గొప్పతనాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఒక హదీథ్ ద్వారా నొక్కిచెప్పబడింది. బంగారం, వెండి దానం చేయడం మరియు ధర్మయుద్ధంలో పాల్గొనడం కన్నా అల్లాహ్ స్మరణ ఎంతో ఉత్తమమైనదని, అది హోదాలను పెంచి, ప్రభువు వద్ద అత్యంత పరిశుద్ధమైనదిగా పరిగణించబడుతుందని ఈ హదీథ్ స్పష్టం చేస్తుంది.

అబూ దర్దా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అడిగారు:

మీ సదాచరణాల్లో అత్యుత్తమమైనది, మీ చక్రవర్తి అయిన అల్లాహ్ వద్ద ఎంతో పరిశుద్ధమైనది, మీ స్థానాలను ఎంతో రెట్టింపు చేయునది, మరి మీరు వెండి బంగారాలు ఖర్చు పెట్టే దాని కంటే ఉత్తమమైనది మరియు మీరు మీ శత్రువులను కలిసి మీరు వారి మెడలను వారు మీ మెడలను నరుకుతూ ఉండే దానికంటే ఉత్తమమైనది తెలియజేయనా?” వారన్నారు ఎందుకు లేదు! తప్పకుండా తెలియజేయండి, అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: అల్లాహ్ స్మరణ

[సహీహ్ హదీథ్] [సునన్ ఇబ్నె మాజ 3790, మువత్త మాలిక్ 564, ముస్నద్ అహ్మద్ 21702,21704,27525]

سنن الترمذي أبواب الدعوات عن رسول الله صلى الله عليه وسلم | باب منه

3377 – عَنْ أَبِي الدَّرْدَاءِ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ : قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : ” أَلَا أُنَبِّئُكُمْ بِخَيْرِ أَعْمَالِكُمْ، وَأَزْكَاهَا عِنْدَ مَلِيكِكُمْ، وَأَرْفَعِهَا فِي دَرَجَاتِكُمْ، وَخَيْرٌ لَكُمْ مِنْ إِنْفَاقِ الذَّهَبِ وَالْوَرِقِ، وَخَيْرٌ لَكُمْ مِنْ أَنْ تَلْقَوْا عَدُوَّكُمْ، فَتَضْرِبُوا أَعْنَاقَهُمْ، وَيَضْرِبُوا أَعْنَاقَكُمْ “. قَالُوا : بَلَى. قَالَ : ” ذِكْرُ اللَّهِ تَعَالَى “.

حكم الحديث: صحيح
سنن ابن ماجه ( 3790 )، موطأ مالك ( 564 )، مسند أحمد ( 21702, 21704, 27525 ).

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

الْحَمْدُ لِلَّهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ اللَّهِ، أَمَّا بَعْدُ
(అల్ హందులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి, అమ్మా బాద్)
సర్వస్తోత్రాలు అల్లాహ్ కే శోభాయమానం. అల్లాహ్ యొక్క ప్రవక్తపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఇక ఆ తర్వాత…

ప్రియ వీక్షకుల్లారా, యజమాని మరియు దాసుడు. వారిద్దరి మధ్యలో సంబంధం ఎలాంటిది ఉంటుంది? దాసుడు ఎల్లవేళల్లో చాలా చురుకుగా, ఎప్పుడు ఏ సమయంలో యజమాని ఆదేశం ఏముంటుంది, నేను దానిని పాటించాలి, ఆజ్ఞాపాలన చేయాలి అన్నటువంటి ధ్యానంలో ఉంటాడు. అలాంటి వారినే మనం మెచ్చుకుంటాము. అవునా కాదా?

అయితే ఈ రోజుల్లో మనం మన అసలైన యజమాని, సర్వ సృష్టికి సృష్టికర్త, ఈ సర్వ సృష్టికి పోషణకర్త అల్లాహ్, ఎంతటి గొప్పవాడు! ఆయనే సార్వభౌమాధికారుడు. ఆయనే చక్రవర్తి. సోదర మహాశయులారా, ఎల్లవేళల్లో మనం అల్లాహ్ యొక్క ధ్యానంలో ఉండటం, అల్లాహ్‌ను గుర్తు చేసుకుంటూ ఉండటం, అల్లాహ్ యొక్క స్మరణలో ఉండటం, మనం ఎక్కడ ఉన్నా ఏ సందర్భంలో ఉన్నా గానీ అక్కడ ఆ సందర్భంలో, ఆ స్థితిలో మన సృష్టికర్త అల్లాహ్ మనం ఎలా ఉండటం, మనం ఎలా మాట్లాడటం, మనం ఎలా చూడటం, మనం ఎలా వినడం ఇష్టపడతాడో, ఆయనకు ఇష్టమైనవే మనం చేసుకుంటూ ఉండటం, ఇదే అసలైన నిజమైన దాస్యత్వం. దీన్నే ఈ రోజుల్లో చాలా మంది మరిచిపోయి ఉన్నారు.

అయితే, ఇలాంటి స్మరణలో ఉంటూ ప్రత్యేకంగా ఆయన యొక్క గొప్పతనాలను కీర్తిస్తూ, ఆయన యొక్క పరిశుద్ధత, పవిత్రతలను కొనియాడుతూ, ఆయన యొక్క ప్రశంసలు, పొగడ్తలను మనం స్తుతిస్తూ,

سُبْحَانَ اللَّهِ
(సుబ్ హా నల్లాహ్)
అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు.

الْحَمْدُ لِلَّهِ
(అల్ హందులిల్లాహ్)
సర్వస్తోత్రాలు అల్లాహ్ కే శోభాయమానం.

اللَّهُ أَكْبَرُ
(అల్లాహు అక్బర్)
అల్లాహ్ యే గొప్పవాడు.

لَا إِلَهَ إِلَّا اللَّهُ
(లా ఇలాహ ఇల్లల్లాహ్)
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు.

ఇంకా ఇలాంటి పలుకులు పలుకుతూ ఉంటే, ఇహలోకంలో మనకు ఎంత లాభం కలుగుతుందో, పరలోకంలో దీని యొక్క సత్ఫలితం ఎంత గొప్పగా లభిస్తుందో మనం ఊహించలేము.

అల్లాహ్ స్మరణ (ధిక్ర్) యొక్క గొప్పతనం

రండి, ఒకే ఒక హదీథ్ వినిపిస్తాను. ఆ తర్వాత మీరు సెలవు తీసుకోవచ్చు. శ్రద్ధగా వినండి. హజ్రత్ అబూ దర్దా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. సునన్ తిర్మిజీలో వచ్చిన హదీథ్, 3377 హదీథ్ నంబర్. షేఖ్ అల్బానీ రహిమహుల్లా దీనిని ప్రామాణికమైనదిగా చెప్పారు.

ఏంటి హదీథ్? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ స్మరణ గురించి, అల్లాహ్ ధ్యానంలో ఉండటం గురించి ఎంత గొప్ప శుభవార్త ఇస్తున్నారో మీరే గమనించండి. ఐదు రకాలుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి ఎలా ప్రోత్సహిస్తూ చెబుతున్నారో గమనించండి.

أَلَا أُنَبِّئُكُمْ بِخَيْرِ أَعْمَالِكُمْ
(అలా ఉనబ్బిఉకుమ్ బి ఖైరి అఅమాలికుమ్)
మీ కర్మలలో అత్యుత్తమమైనది ఏమిటో మీకు తెలుపనా?

وَأَزْكَاهَا عِنْدَ مَلِيكِكُمْ
(వ అజ్కాహా ఇంద మలీకికుమ్)
మీ ప్రభువైన అల్లాహ్ వద్ద అత్యంత పరిశుద్ధమైనది,

وَأَرْفَعِهَا فِي دَرَجَاتِكُمْ
(వ అర్ఫఇహా ఫీ దరజాతికుమ్)
మీ హోదాలను అత్యున్నతంగా చేయునది,

وَخَيْرٌ لَكُمْ مِنْ أَنْ تُنْفِقُوا الذَّهَبَ وَالْوَرِقَ
(వ ఖైరుల్ లకుమ్ మిన్ అన్ తున్ఫికూ అజ్జహబ వల్ వరిఖ్)
మీరు వెండి బంగారాలు ఖర్చు పెట్టే దానికంటే కూడా ఉత్తమమైనది,

وَخَيْرٌ لَكُمْ مِنْ أَنْ تَلْقَوْا عَدُوَّكُمْ فَتَضْرِبُوا أَعْنَاقَهُمْ وَيَضْرِبُوا أَعْنَاقَكُمْ
(వ ఖైరుల్ లకుమ్ మిన్ అన్ తల్ ఖౌ అదువ్వకుమ్ ఫ తజ్రిబూ అఅనాఖహుమ్ వ యజ్రిబూ అఅనాఖకుమ్)
మరియు మీరు మీ యొక్క శత్రువులను ధర్మపరమైన యుద్ధంలో కలుసుకోవడం, వారు మీ మెడలను నరుకుతూ ఉండటం, మీరు వారి మెడలను నరుకుతూ ఉండటం, దీనికంటే కూడా ఎంతో ఉత్తమమైనది.

అల్లాహు అక్బర్! అల్లాహు అక్బర్! గమనించారా? ఎన్ని విషయాలు చెప్పారు ప్రవక్త? ఐదు విషయాలు. మీ సదాచరణల్లో అన్నిటికంటే ఉత్తమమైనది, మరియు ప్రభువు అల్లాహ్ వద్ద ఎంతో పరిశుద్ధమైనది, మరియు మీ యొక్క స్థానాలను ఉన్నతంగా చేయునది, మీరు వెండి బంగారాలు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టే దానికంటే ఉత్తమమైనది, మీరు అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయడానికి కంటే కూడా ఎంతో ఉత్తమమైనది, మీకు తెలుపనా? అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు.

ఈ ఐదు విషయాల కంటే ఉత్తమమైన మరో విషయం మీకు తెలపాలా? అని ప్రశ్నించారు. సహాబాలు, ప్రవక్త సహచరులు ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆతృత కలిగి ఉండేవారు. వారందరూ ఏకంగా అన్నారు,

بَلَى يَا رَسُولَ اللَّهِ
(బలా యా రసూలల్లాహ్)
తప్పకుండా, ఓ అల్లాహ్ ప్రవక్తా! ప్రవక్తా ఎందుకు తెలుపరు? తప్పకుండా తెలుపండి!

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

ذِكْرُ اللَّهِ
(ధిక్రుల్లాహ్)
అల్లాహ్ యొక్క ధిక్ర్. అల్లాహ్ యొక్క స్మరణ.

చూశారా? గమనించారా? ఈ హదీథ్‌ను ఎల్లవేళల్లో మదిలో నాటుకోండి. ఇలాంటి ఈ ధిక్ర్ ద్వారా ఈ ఐదు రకాల మంచి విషయాల కంటే గొప్ప పుణ్యం పొందగలుగుతారు. అల్లాహ్ మనందరికీ ఎల్లవేళల్లో, అన్ని సమయ సందర్భాల్లో, అన్ని స్థితుల్లో కేవలం అల్లాహ్‌ను మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉండేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. అన్ని రకాల షిర్క్‌ల నుండి, అన్ని రకాల బిద్అత్‌ల నుండి అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై శాంతి, అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన శుభాలు వర్షించుగాక.

జిక్ర్ (అల్లాహ్ నామ స్మరణ)