విశ్వాసం & విశ్వాస మాధుర్యం [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్
విశ్వాసం & విశ్వాస మాధుర్యం (Emaan & Halawatul Emaan) [34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ అబూబక్ర్ బేగ్ ఉమ్రీ (ఏలూరు) – Speaker : Muhammad Abubaker Baig Omeri (Eluru)
https://youtu.be/nGEEpqhFH9c

విశ్వాసం (ఈమాన్) యొక్క లక్షణాలు, విశ్వాస మాధుర్యాన్ని రుచి చూసేందుకు అవసరమైన మూడు గుణాల గురించి ఈ ప్రసంగం వివరిస్తుంది. విశ్వాసం ఒకసారి హృదయంలో ప్రవేశించాక స్థిరంగా ఉంటుందని, కానీ మంచి పనులు మరియు పాపాలను బట్టి అది హెచ్చుతగ్గులకు లోనవుతుందని సహాబాల ఉదాహరణలతో వివరించబడింది. విశ్వాస మాధుర్యాన్ని రుచి చూడాలంటే అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించడం; కేవలం అల్లాహ్ కొరకే ఒకరినొకరు ప్రేమించడం మరియు ద్వేషించడం; మరియు విశ్వసించిన తర్వాత అవిశ్వాసం వైపు తిరిగి వెళ్లడాన్ని అగ్నిలో పడవేయబడటమంత తీవ్రంగా ద్వేషించడం అనే మూడు లక్షణాలు అవసరమని చెప్పబడింది. హజ్రత్ అబూబక్ర్, ఉమర్, బిలాల్, మరియు హంజలా (రదియల్లాహు అన్హుమ్) వంటి సహాబాల జీవితాల నుండి ఉదాహరణలు వారి ప్రేమ, త్యాగం మరియు విశ్వాస స్థిరత్వాన్ని తెలియజేస్తాయి.

అల్ హమ్దులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅద, అమ్మా బఅద్. ఫ అవూజు బిల్లాహిస్సమీయిల్ అలీమ్ మినష్షైతానిర్రజీమ్ మిన్ హమ్దిహీ వ నఫ్ఖిహీ వ నఫ్సిహీ, బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ
[యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహీ వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్]
(ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడవలసిన విధంగా భయపడండి. మరియు మీరు ముస్లింలుగా తప్ప మరణించకండి.)

سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنْتَ الْعَلِيمُ الْحَكِيمُ
[సుబ్ హా నక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అన్తల్ అలీముల్ హకీమ్]
(ఓ అల్లాహ్! నీవు పవిత్రుడవు. నీవు మాకు నేర్పినది తప్ప మాకు మరే జ్ఞానమూ లేదు. నిశ్చయంగా, నీవే సర్వజ్ఞానివి, వివేకవంతుడవు.)

رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي
[రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్ రీ వహ్ లుల్ ఉఖ్దతమ్ మిల్లిసానీ యఫ్ఖహూ ఖౌలీ]
(ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కోసం విశాలపరచు. మరియు నా కార్యాన్ని నాకు సులభతరం చేయి. మరియు నా నాలుకలోని ముడిని విప్పు, తద్వారా వారు నా మాటను అర్థం చేసుకోగలరు.)

اللهم رب زدني علما
[అల్లాహుమ్మ రబ్బి జిద్నీ ఇల్మా]
(ఓ అల్లాహ్, ఓ నా ప్రభూ, నా జ్ఞానాన్ని వృద్ధి చేయి).

ప్రియ సోదరులారా, తొలగింప బడిన షైతాన్ యొక్క కీడు నుండి రక్షింపబడుటకై అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్ తబారక వ తఆలా యొక్క శుభనామముతో ప్రారంభిస్తున్నాను. అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు, సకల స్తోత్రములు అల్లాహ్ తబారక వ తఆలాకే అంకితము. ఎవరైతే ఈ సమస్త సృష్టిని సృష్టించి తన అధికార పీఠాన్ని అధిష్టించి, ఆయన సృష్టించినటువంటి సృష్టిరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుడిని మలిచాడు.

వారి వైపునకు సందేశాన్ని జారీ చేసేటటువంటి ఉద్దేశముతో ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించాడు. ఈ ప్రవక్తల యొక్క పరంపర హజ్రత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, హృదయాల విజేత, జనాబె ముస్తఫా, అహ్మదే ముజ్తబా, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై తన దైవదౌత్యాన్ని పరిసమాప్తం గావించాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ధరణిపై ఎంతమంది దైవ ప్రవక్తలనైతే ప్రభవింపజేశాడో వారందరిపై కూడా అల్లాహ్ తబారక వ తఆలా యొక్క కారుణ్యాలు కురిపింపజేయుగాక. ముఖ్యంగా, చిట్టచివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ముహమ్మదే అక్రం సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తబారక వ తఆలా యొక్క కోటానుకోట్ల దరూద్‌లూ సలాములూ, శుభాలూ మరియు కారుణ్యాలూ కురిపింపజేయుగాక, ఆమీన్.

సోదర మహాశయులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో మూడో సూరా, సూరా ఆలి ఇమ్రాన్ 102వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ
[యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహీ వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్]
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి.

ఓ విశ్వసించినటువంటి ప్రజలారా! సోదర మహాశయులారా, ఎక్కడైతే అల్లాహ్ తబారక వ తఆలా ఈ పదాలను వినియోగిస్తున్నాడో, యా అయ్యుహల్లజీన ఆమనూ, దాని అర్థము ఓ విశ్వసించినటువంటి ప్రజలారా అని. అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, “ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు ఆ విధంగా భయపడండి, ఏ విధంగానైతే ఆయనకు భయపడాల్సినటువంటి హక్కు ఉన్నదో. వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్, మరియు మీరు విశ్వాసులుగా తప్ప, అవిశ్వాసులుగా మీరు మరణించకండి. సోదర మహాశయులారా, ఈ వాక్యంలో ప్రస్తావించబడినటువంటి విషయము విశ్వాసుల గురించి, విశ్వాసం గురించి.

అయితే, విశ్వాసానికి ఉన్నటువంటి లక్షణాల్లో ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే, విశ్వాసం ఎప్పుడైతే ఒకరిలో ప్రవేశిస్తుందో, దానిని వారి మనసుల నుంచి తీయటము, అది ఎవరి తరం కానటువంటి పని అయిపోతుంది. అబూ సుఫియాన్‌ను హిరకల్ అనేటటువంటి రాజు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు:

قَالَ فَهَلْ يَرْتَدُّ أَحَدٌ مِنْهُمْ سَخْطَةً لِدِينِهِ بَعْدَ أَنْ يَدْخُلَ فِيهِ؟ قُلْتُ لاَ‏.‏ قَالَ وَكَذَلِكَ الإِيمَانُ حِينَ تُخَالِطُ بَشَاشَتُهُ الْقُلُوبَ

ఎవరైతే ఆయనను విశ్వసించారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ఇస్లాంను స్వీకరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అందులో ప్రవేశించిన తర్వాత, అందులో ఉన్నటువంటి వారు ఎవరైనా గాని, వారు వెనక్కు మరలారా? లేకపోతే దాన్ని వదిలివేశారా?

అంటే అబూ సుఫియాన్, ఇస్లాంకు బద్ధశత్రువు అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో, ఆ కాలంలో, ఇంకా ఇస్లాం స్వీకరించనప్పుడు, జవాబు పలుకుతూ అంటున్నాడు, “లా”, వారిలో ఏ ఒక్కరూ కూడా వారు విశ్వసించిన తర్వాత అవిశ్వాస వైఖరికి పాల్పడలేదు, వారు ఏ విధంగా కూడా ఇర్తిదాద్‌కు పాల్పడలేదు, ధర్మభ్రష్టతకు పాల్పడలేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అప్పుడు హిరకల్ రాజు అంటున్నాడు, “కధాలికల్ ఈమాన్ హీన తుఖాలితు బషాషతుహుల్ ఖులూబ్.” విశ్వాసం అంటే ఇదే, అది ఎప్పుడైతే మనిషి యొక్క హృదయంలో ప్రవేశిస్తుందో, దానిని హృదయంలో ఎలా నాటుకుంటుందంటే, దాన్ని తీయటం ఎవరివల్లా కాదు.

అదే విధంగా, విశ్వాసం యొక్క మరొక లక్షణం ఏమిటంటే సోదరులారా, విశ్వాసం అన్నటువంటిది ప్రతి వ్యక్తిలోనూ ఒకే స్థాయిలో ఉండదు. కొందరిలో ఉచ్చ స్థాయికి చెంది ఉంటే, మరికొందరిలో అతి తక్కువ స్థాయికి చెందినదై కూడా ఉండవచ్చు. సహాబాల యొక్క విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే, వారిపై ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుట్రలు చేసినా కూడా, వారిని వారి విశ్వాసం నుంచి ఏ విధంగా ఎవరూ తొలగింపలేకపోయారన్నటువంటి విషయాన్ని అల్లాహ్ సూరా ఇబ్రాహీం, 14వ సూరా, 46వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:

وَقَدْ مَكَرُوا مَكْرَهُمْ وَعِندَ اللَّهِ مَكْرُهُمْ وَإِن كَانَ مَكْرُهُمْ لِتَزُولَ مِنْهُ الْجِبَالُ
[వ ఖద్ మకరూ మక్రహుమ్ వ ఇందల్లాహి మక్రుహుమ్ వ ఇన్ కాన మక్రుహుమ్ లితజూల మిన్హుల్ జిబాల్]
వాళ్ళు తమ ఎత్తుల్ని తాము వేసి చూసుకున్నారు. వారి ఎత్తుగడలన్నీ అల్లాహ్‌ దృష్టిలో ఉన్నాయి. వారి ఎత్తుగడలు పర్వతాలను కదిలించేటంతటి భీకరమైనవేమీ కావు.

అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, వారు ఎన్ని కుట్రలు పన్నారంటే, వారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఈ పర్వతాలను, కొండలను వారి స్థాయి నుంచి, వారి ప్రదేశం నుంచి వారు కదపలేకపోయారన్నటువంటి విషయాన్ని అల్లాహ్ ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ కొండలు, పర్వతాలు అన్నటువంటి విషయాన్ని సహాబాల యొక్క విశ్వాసంతో పోల్చటం జరిగింది. అదే విధంగా అల్లాహ్ తబారక వ తఆలా సూరతుల్ హుజరాత్, 49వ సూరా, మూడో వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:

أُولَٰئِكَ الَّذِينَ امْتَحَنَ اللَّهُ قُلُوبَهُمْ لِلتَّقْوَىٰ ۚ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ
[ఉలాయికల్లజీనమ్ తహనల్లాహు ఖులూబహుమ్ లిత్తఖ్వా లహుమ్ మగ్ఫిరతున్ వ అజ్రున్ అజీమ్]
వారే వీరు, వీరి హృదయాలను అల్లాహ్ తబారక వ తఆలా తఖ్వా, భయభక్తుల కొరకు పరీక్షించి ఉంచాడు, వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉన్నాయి.

విశ్వాసం యొక్క మరొక లక్షణం ఏమిటంటే, విశ్వాసము పెరగటము మరియు తరగటము. అంటే సోదరులారా, విశ్వాసము ఒక్కొక్కసారి మనిషి చేసేటటువంటి ఆచరణకు అది పెరుగుతూ ఉంటుంది. మరి అదే విధంగా, మనిషి చేసేటటువంటి పాప కార్యాలకు గాను విశ్వాసము తరుగుతూ ఉంటుందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది.

అందుకనే, ఖురాన్ గ్రంథంలో ఎన్నోసార్లు, పలుసార్లు అల్లాహ్ తబారక వ తఆలా మన యొక్క విశ్వాసాన్ని పునఃపరిశీలన చేసుకోవలసిందిగా మనకు సెలవిస్తూ, ఖురాన్‌లో సూరా నిసా, నాలుగవ సూరా, 136వ వాక్యంలో ఈ విధంగా అల్లాహ్ తబారక వ తఆలా ప్రస్తావిస్తున్నాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا آمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالْكِتَابِ الَّذِي نَزَّلَ عَلَىٰ رَسُولِهِ وَالْكِتَابِ الَّذِي أَنزَلَ مِن قَبْلُ ۚ وَمَن يَكْفُرْ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ను, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను, ఆయన తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం))పై అవతరింపజేసిన గ్రంథాన్నీ, అంతకు మునుపు ఆయన అవతరింపజేసిన గ్రంథాలన్నిటినీ విశ్వసించండి. ఎవడు అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించాడో వాడు మార్గం తప్పి చాలాదూరం వెళ్ళిపోయాడు.

ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు వాస్తవానికి విశ్వాసులే అయితే, ఏ విధంగానైతే అల్లాహ్ తబారక వ తఆలాపై విశ్వసించాలో, ఆ విధంగా విశ్వసించండి. మరియు ఆ గ్రంథంపై విశ్వసించండి ఏదైతే మీ ప్రవక్తపై అవతరింపజేయబడిందో.

కాబట్టి సోదర మహాశయులారా, అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్‌లో పలుసార్లు మన యొక్క విశ్వాసాన్ని పునఃపరిశీలించుకోవలసిందిగా ఈ విధంగా సెలవిస్తున్నాడంటే, మూడో సూరా 102వ వాక్యం ఏ విధంగానైతే ఈ అంశంలో ప్రారంభంలో పఠించడం జరిగిందో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో అంటున్నాడు:

“యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహీ వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్.”

ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు ఆ విధంగా భయపడండి ఏ విధంగానైతే భయపడాలో, మరియు అవిశ్వాసులుగా మీరు మరణించకండి, విశ్వాస స్థితిలోనే మీరు మరణించండి సుమా అన్నటువంటి విషయాన్ని అల్లాహ్ ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.

తబరానీలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఈ మాటను ఉల్లేఖించడం జరిగింది:

‏ إِنَّ الإِيمَانَ لَيَخْلَقُ فِي جَوْفِ أَحَدِكُمْ كَمَا يَخْلَقُ الثَّوْبُ فَاسْأَلُوا اللَّهَ تَعَالَى أَنْ يُجَدِّدَ الإِيمَانَ فِي قُلُوبِكُمْ ‏

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ విధంగానైతే మీ ఒంటిపై, మీ శరీరంపై దుస్తులు ఏ విధంగానైతే మాసిపోతూ ఉంటాయో, అదే విధంగా మీ విశ్వాసము కూడా మాసిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు దుఆ చేస్తూ ఉండండి, ప్రార్థిస్తూ ఉండండి, “అన్ యుజద్దిదల్ ఈమాన ఫీ ఖులూబికుమ్,” అల్లాహ్ తబారక వ తఆలా మీ హృదయాలలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పునరుద్ధరింపజేయవలసిందిగా మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు వేడుకోండి అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. ఈ హదీసును ఇమామ్ అల్బానీ రహిమహుల్లాహ్ గారు సహీ అల్-జామియాలో సహీ హదీసుగా ధృవీకరించారు.

సహీ ముస్లింలో హదీస్ నెంబర్ 6966లో మనం చూసినట్లయితే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరులలో ఒక సహచరుడైనటువంటి, ఒక అగ్రగణ్యుడైనటువంటి సహచరుడు హజ్రత్ హంజలా రదియల్లాహు తలా అన్హు వారి యొక్క ఒక ప్రస్తావన వస్తుంది. ఎవరండీ ఈ హంజలా అంటే? ఆ హంజలాయే ఎవరి గురించైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారో, “హంజలా గసీలుల్ మలాయికా” (హంజలాను దైవదూతలు స్నానం చేయించారు). ఏ రోజైతే హంజలా రదియల్లాహు తలా అన్హు వారికి వివాహము జరిగిందో, అదే రోజు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రకటించినటువంటి యుద్ధ ప్రకటనకు జవాబిస్తూ ఆయన అందులో పాల్గొని మరణించగా, షహాదత్ పొందగా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “మీరు హంజలాకు శవస్నానము చేయించవలసిన అవసరము లేదు, గుసుల్ స్నానం చేయించిన అవసరము లేదు ఎందుకంటే హంజలా గసీలుల్ మలాయికా, ఎందుకంటే హంజలాకు దైవదూతలే స్వయానా గుసుల్ ఇచ్చి ఉన్నారు అని.”

అటువంటి హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబీ అయినటువంటి అబూబక్ర్ నిస్సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారితో కలిసినప్పుడు,

لَقِيَنِي أَبُو بَكْرٍ فَقَالَ كَيْفَ أَنْتَ يَا حَنْظَلَةُ
అబూబక్ర్ రదియల్లాహు తలా అన్హు వారు నాతో కలిశారు, కలిసిన తర్వాత ఆయన నాతో అడిగారు, “ఓ హంజలా, నీవు ఎలా ఉన్నావు?” అని.

قَالَ قُلْتُ نَافَقَ حَنْظَلَةُ
అప్పుడు హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, నేను హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు గారితో అన్నాను, “హంజలా కపటవిశ్వాసి అయిపోయాడు” అని.

قَالَ سُبْحَانَ اللَّهِ مَا تَقُولُ
“ఓ హంజలా, ఏమంటున్నావ్? అల్లాహ్ తలా యొక్క పవిత్రతను నేను కొనియాడుతున్నాను. నీవు మునాఫిక్ అయిపోవటం ఏమిటి?” అప్పుడు హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు,

قُلْتُ نَكُونُ عِنْدَ رَسُولِ اللَّهِ صلى الله عليه وسلم يُذَكِّرُنَا بِالنَّارِ وَالْجَنَّةِ حَتَّى كَأَنَّا رَأْىَ عَيْنٍ فَإِذَا خَرَجْنَا مِنْ عِنْدِ رَسُولِ اللَّهِ صلى الله عليه وسلم عَافَسْنَا الأَزْوَاجَ وَالأَوْلاَدَ وَالضَّيْعَاتِ فَنَسِينَا كَثِيرًا

మనము దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద కూర్చుని ఉండగా, ఆయన సమక్షంలో ఉన్నప్పుడు, ఆయన మనకు పరలోకం గురించి హితబోధ చేస్తున్న సమయంలో, స్వర్గము మరియు నరకము గురించి ఆయన హితబోధ చేస్తున్న సమయంలో, మా కళ్ళ నుంచి కన్నీళ్లు కారేవి, మా హృదయాలలో మా విశ్వాసము ఉవ్వెళ్లూరుతూ ఉండేటటువంటిది. కానీ, ఎప్పుడైతే మేము అక్కడి నుంచి కదిలి మా ఇళ్లకు వచ్చేసేటటువంటి వాళ్ళమో, మా యొక్క ఇళ్లలో ప్రవేశించేటటువంటి వాళ్ళం, మా భార్య, పిల్లలు, ఇంటివారు ఇందులో పడిపోయే, ఫనసీనా కసీరా (మేము చాలా వరకు మర్చిపోయాము). ఆయన చెప్పినటువంటి మాటల్లో అత్యధికంగా వాటిని మేము మర్చిపోయేటటువంటి వారము. కాబట్టి, మా ఈ పరిస్థితిని గమనించి, నేను అనుకుంటున్నాను నేను మునాఫిక్‌నై పోయాను అని అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారితో హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు.

అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు హంజలా రదియల్లాహు తలా అన్హు వారిని తీసుకుని, ఇలా అయితే మరి మా పరిస్థితి ఏమిటి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తీసుకొచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, “ఓ హంజలా, ఏమయ్యింది?” అని చెప్పేసి అంటే, అప్పుడు హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు, “నాఫఖ హంజలా యా రసూలల్లాహ్,” ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హంజలా మునాఫిక్ అయిపోయాడు, కపటవిశ్వాసి అయిపోయాడు అని. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అదేమిటి? అలా ఎందుకు జరిగింది?” అంటే, హంజలా రదియల్లాహు తలా అన్హు వారు ఆ జరిగినదంతా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హంజలా రదియల్లాహు తలా అన్హు వారికి జవాబు పలుకుతూ అంటున్నారు:

وَالَّذِي نَفْسِي بِيَدِهِ إِنْ لَوْ تَدُومُونَ عَلَى مَا تَكُونُونَ عِنْدِي وَفِي الذِّكْرِ لَصَافَحَتْكُمُ الْمَلاَئِكَةُ عَلَى فُرُشِكُمْ وَفِي طُرُقِكُمْ وَلَكِنْ يَا حَنْظَلَةُ سَاعَةً وَسَاعَةً

“ఆ అల్లాహ్ తబారక వ తఆలా యొక్క సాక్షి, ఎవరి చేతిలో అయితే నా ప్రాణాలు ఉన్నాయో, నేను అల్లాహ్ తబారక వ తఆలాపై ప్రమాణం చేస్తూ అంటున్నాను, మీరు ఏ విధంగానైతే నా సమక్షంలో ఉన్నప్పుడు మీ విశ్వాసం ఏ విధంగా ఉందో, అదే విధంగా గనక ఎల్లప్పుడూ మీరు ఉండగలిగితే, దైవదూతలు మీరు నడిచేటటువంటి మార్గాలలోనూ, మీరు పరుండేటటువంటి మీ పడకల పైనను వారు వచ్చి మీతో కరచాలనం చేయాలనుకునేటటువంటి వారు. కానీ ఓ హంజలా, ఈ విశ్వాసము యొక్క స్థితి ఒక్కొక్కసారి అది ఎలా ఉంటుందంటే, అది ఒక్కొక్కసారి ఉవ్వెళ్లూరుతూ ఉంటుంది ఎప్పుడైతే దాని గురించి ప్రస్తావన జరుగుతూ ఉంటుందో.”

కాబట్టి ఈ హదీస్ ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, విశ్వాసం అన్నటువంటిది ఎప్పుడూ నిలకడగా ఉండదు, అది ఒక్కొక్కసారి, ఎప్పుడైతే మనం విశ్వాసం గురించి ప్రస్తావించుకుంటామో ఆ సమయాల్లో మన యొక్క విశ్వాసము ఉచ్చ స్థాయికి చెందుకుంటుంది, మరి అదే విధంగా ఒక్కొక్కసారి ఆ విశ్వాసము మనము చేసేటటువంటి పాప కార్యాల వల్ల కూడా అది తరుగుతూ ఉంటుందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు.

విశ్వాసం యొక్క మరొక లక్షణం ఏమిటంటే, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించటం. విశ్వాసం యొక్క మాధుర్యం ఏమిటా అని మీరు ఆలోచించినట్లయితే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు:

عَنِ الْعَبَّاسِ بْنِ عَبْدِ الْمُطَّلِبِ، أَنَّهُ سَمِعَ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم يَقُولُ ‏ “‏ ذَاقَ طَعْمَ الإِيمَانِ مَنْ رَضِيَ بِاللَّهِ رَبًّا وَبِالإِسْلاَمِ دِينًا وَبِمُحَمَّدٍ رَسُولاً ‏”
(సహీ అల్-ముస్లిం, కితాబుల్ ఈమాన్, హదీస్ నెంబర్ 34).

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రదియల్లాహు తలా అన్హు వారు ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “ఆ వ్యక్తి విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలడు, ఎవరైతే అల్లాహ్‌ను తన దైవంగా, ఇస్లామును తన ధర్మంగా మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రవక్తగా అంగీకరించి నడుచుకున్నటువంటి వాడు, తన ఆచరణాత్మకంగా తన జీవితాన్ని గడుపుకున్నటువంటి వాడు కచ్చితంగా విశ్వాసం యొక్క మాధుర్యాన్ని, విశ్వాసం యొక్క రుచిని అతను ఆస్వాదించగలడు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు.

సోదర మహాశయులారా, ఎలాగైతే మనము తినేటటువంటి రుచిని ఆస్వాదించగలుగుతున్నామో, ఏదైనా ఒక తియ్యటి పదార్థాన్ని తిని మనం దాని యొక్క తియ్యదనాన్ని రుచి చూడగలుగుతున్నాము. మరి అదే విధంగా, మనము సుగంధ ద్రవ్యాలను కూడా వాసన ద్వారా మనము వాటిని ఆస్వాదించగలుగుతున్నామో, వాటి యొక్క రుచిని మనం ఆస్వాదించగలుగుతున్నాము. మరి అదే విధంగా, ఒక తియ్యటి పలుకులను విని వింటూ కూడా మనము ఆ పలుకులలో ఉన్నటువంటి రుచిని కూడా ఆస్వాదించగలుగుతున్నామో, అదే విధంగా విశ్వాసానికి కూడా ఒక లక్షణం ఉంది, అదేమిటంటే వాస్తవానికి మనం విశ్వాసులమైతే, వాస్తవానికి మనలో ఈ లక్షణాలు ఉంటే, ఏదైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారో, మనం కచ్చితంగా, తప్పకుండా విశ్వాసము యొక్క మాధుర్యాన్ని కూడా రుచి చూడగలము అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో సెలవిస్తున్నారు.

అయితే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడాలి అని అనుకుంటే, మనలో ఏ లక్షణాలు ఉంటే మనం విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలము? ఏ స్థాయికి మన విశ్వాసము చేరుకుంటే మనం విశ్వాసము యొక్క తియ్యదనాన్ని, మాధుర్యాన్ని రుచి చూడగలము? అనేటటువంటి ప్రశ్న మీ మనసులలో కలుగుతుంది కాబట్టి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీసులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు:

عَنْ أَنَسٍ ـ رضى الله عنه ـ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ ‏ “‏ ثَلاَثٌ مَنْ كُنَّ فِيهِ وَجَدَ حَلاَوَةَ الإِيمَانِ

మూడు లక్షణాలు ఉన్నాయి, మూడు లక్షణాలు, మూడు గుణాలు ఉన్నాయి. ఒకవేళ మీలో గనుక ఈ మూడు లక్షణాలను మీరు పెంపొందించుకోగలిగితే, ఒకవేళ మీలో ఈ మూడు లక్షణాలు గనక ఉంటే, మీరు కచ్చితంగా విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలరు అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. ఆ మూడు లక్షణాలు ఏమిటి?

ఒకటి, ఆ మూడు లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏమిటంటే:

أَنْ يَكُونَ اللَّهُ وَرَسُولُهُ أَحَبَّ إِلَيْهِ مِمَّا سِوَاهُمَا
[అన్ యకూనల్లాహు వ రసూలుహూ అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా]
అల్లాహ్ మరియు ప్రవక్త వారి వద్ద అందరికంటే ఎక్కువ ప్రియతములై ఉండాలి అనేది మొదటి లక్షణం.

ఇక, రెండవ లక్షణానికి వచ్చినట్లయితే:

وَأَنْ يُحِبَّ الْمَرْءَ لاَ يُحِبُّهُ إِلاَّ لِلَّهِ
[వ అన్ యుహిబ్బల్ మర్అ లా యుహిబ్బుహూ ఇల్లా లిల్లాహ్]

మరియు ఒక వ్యక్తి తన తోటివారితో అల్లాహ్ తబారక వ తఆలా కొరకు మాత్రమే ప్రేమించగలిగినప్పుడు, అల్లాహ్ తబారక వ తఆలా కోసము ప్రేమించటము, అల్లాహ్ తబారక వ తఆలా కోసమే ద్వేషించటం అన్నటువంటిది రెండవ లక్షణంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారు.

మూడవ లక్షణం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రస్తావిస్తూ అంటున్నారు:

وَأَنْ يَكْرَهَ أَنْ يَعُودَ فِي الْكُفْرِ كَمَا يَكْرَهُ أَنْ يُقْذَفَ فِي النَّارِ ‏”
[వ అన్ యక్రహ అన్ యఊద ఫిల్ కుఫ్రి కమా యక్రహు అన్ యుఖ్దఫ ఫిన్నార్]
ఎలాగైతే విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటము అతనికి అంత అయిష్టకరంగా ఉండాలి, ఎలాగైతే ఒక వ్యక్తిని అగ్నిగుండంలో పడవేయటం ఎంత అయిష్టంగా ఉంటుందో.

(ఈ హదీసు సహీ అల్-బుఖారీ, కితాబుల్ ఈమాన్, బాబు హలావతిల్ ఈమాన్‌లో దీనిని ఇమామ్ బుఖారీ రహిమహుల్లాహ్ గారు అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం ద్వారా ఈ విధంగా పేర్కొనటం జరిగింది).

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో తెలియజేసినటువంటి మూడు లక్షణాలు గనక మనలో మనం పెంపొందించుకోగలిగితే, కచ్చితంగా మనము విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలము అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. అందులో, మొదటి లక్షణాన్ని మనం గమనించినట్లయితే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహ్ మరియు ప్రవక్త అతని వద్ద అత్యధికంగా అందరికంటే ఎక్కువగా ప్రియతములై ఉండాలి అన్నటువంటి విషయాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొట్టమొదటి లక్షణంగా పేర్కొన్నారు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, తొమ్మిదవ సూరా, సూరా తౌబా, 24వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:

قُلْ إِن كَانَ آبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ وَإِخْوَانُكُمْ وَأَزْوَاجُكُمْ وَعَشِيرَتُكُمْ وَأَمْوَالٌ اقْتَرَفْتُمُوهَا وَتِجَارَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَمَسَاكِنُ تَرْضَوْنَهَا أَحَبَّ إِلَيْكُم مِّنَ اللَّهِ وَرَسُولِهِ وَجِهَادٍ فِي سَبِيلِهِ فَتَرَبَّصُوا حَتَّىٰ يَأْتِيَ اللَّهُ بِأَمْرِهِ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمْ الْفَاسِقِينَ

(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, మీరు సంపాదించిన సిరిసంపదలు, కుంటుపడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకం, మీకెంతో ప్రియమైన మీ గృహాలు మీకు అల్లాహ్‌ కన్నా, ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గంలో సలిపే పోరాటం కన్నా ఎక్కువ ప్రియమైనవైతే అల్లాహ్‌ తీసుకువచ్చే తీర్పు (శిక్ష) కొరకు ఎదురుచూడండి. అల్లాహ్‌ అవిధేయులకు సన్మార్గం చూపడు.

అల్లాహ్ ఈ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు: వారితో ఇలా అను, మీ తాతలు, తండ్రులు, కుమారులు, మీ భార్యాపిల్లలు మరియు మీరు సంపాదించేటటువంటి సంపద, మీరు ఎక్కడ నష్టపోతారనుకునేటటువంటి మీ వ్యాపారాలు, అదే విధంగా మీరు ఎంతగానో ఇష్టపడేటటువంటి మీ స్వగృహాలు, ఇవన్నీ కూడా మీకు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గములో పోరాటం కన్నా ఇవన్నీ కూడా మీకు అత్యధికమైనప్పుడు, అల్లాహ్ తన తీర్పును బహిర్గతం చేసే వరకు నిరీక్షించండి. మరియు అల్లాహ్ అవిధేయులైనటువంటి జాతికి సన్మార్గముని చూపడు అని అల్లాహ్ తబారక వ తఆలా ఈ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు.

అల్లాహ్ తబారక వ తఆలా విశ్వాసులు అల్లాహ్ తబారక వ తఆలాను ఎంతగా ప్రేమిస్తారన్నటువంటి విషయాన్ని సెలవిస్తూ సూరా అల్-బఖరా, రెండవ సూరా, 165వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:

وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ ۖ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّهِ
కాని అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించినవారు అల్లాహ్‌ను అంతకంటే ప్రగాఢంగా (అధికంగా) ప్రేమిస్తారు.

ఈ మానవులలో కొందరు ఇతరులను అల్లాహ్‌కు సాటి కల్పించుకుని, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమిస్తున్నారు. కానీ విశ్వాసులు అత్యధికంగా అల్లాహ్ తబారక వ తఆలాను ప్రేమిస్తారు అన్నటువంటి విషయాన్ని అల్లాహ్ తబారక వ తఆలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే, అల్లాహ్ తబారక వ తఆలాను ఒక విశ్వాసి అయినటువంటి వాడు అత్యధికంగా ప్రేమిస్తాడు.

అదే విధంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు:

عَنْ أَنَسٍ قَالَ قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ‏ “‏ لاَ يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى أَكُونَ أَحَبَّ إِلَيْهِ مِنْ وَالِدِهِ وَوَلَدِهِ وَالنَّاسِ أَجْمَعِينَ ‏”

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “మీలో ఏ వ్యక్తి కూడా అప్పటివరకు విశ్వాసి కాలేరు, ఎప్పటివరకైతే నన్ను మీరు అత్యధికంగా ప్రేమించరో, మీ ఆలుబిడ్డల కన్నా, మీ బంధుమిత్రుల కన్నా, సమస్త మానవాళి కన్నా అత్యధికంగా మీరు ఎప్పటివరకైతే నేను మీకు ప్రియతముణ్ణి కానో, అప్పటివరకు మీరు విశ్వాసులు కారు” అన్నటువంటి విషయాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. (సహీ బుఖారీ, హదీస్ నెంబర్ 15).

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారితో కలిసి ఉన్నప్పుడు, హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు ఈ హదీసు విన్న తర్వాత అంటున్నటువంటి మాట ఏమిటంటే, “యా రసూలల్లాహ్, మీరు అన్నట్లుగానే నేను మిమ్మల్ని సమస్త మానవాళి కన్నా, బంధుమిత్రుల కన్నా, తల్లిదండ్రుల కన్నా అత్యధికంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా మనసు, నా ఆత్మ, నా ప్రాణం కన్నా అధికంగా కాదు” అని హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు.

فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ‏”‏ لاَ وَالَّذِي نَفْسِي بِيَدِهِ حَتَّى أَكُونَ أَحَبَّ إِلَيْكَ مِنْ نَفْسِكَ ‏”‏‏.‏ فَقَالَ لَهُ عُمَرُ فَإِنَّهُ الآنَ وَاللَّهِ لأَنْتَ أَحَبُّ إِلَىَّ مِنْ نَفْسِي‏.‏ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ‏”‏ الآنَ يَا عُمَرُ ‏”‏‏.‏

అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “ఓ ఉమర్, నీవు ఎప్పటివరకైతే నీ ప్రాణం కంటే అధికంగా నన్ను మీరు ప్రేమించినటువంటి వారు కారో, అప్పటివరకు కూడా మీరు పూర్తి విశ్వాసి కాలేరు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటే, హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, “ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇప్పుడు నేను మిమ్మల్ని నా ప్రాణం కంటే కూడా అధికంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను” అని హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “అల్ ఆన యా ఉమర్,” ఓ ఉమర్ రదియల్లాహు తలా అన్హు, ఇప్పుడు మీరు పూర్తిగా విశ్వాసి అయ్యారు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడం జరిగింది.

చూశారా సోదర మహాశయులారా, హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి మాటని బట్టి మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, అన్నిటికంటే ముందు ఒక విశ్వాసి అత్యధికంగా అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమను అత్యధికంగా కలిగి ఉండాలి. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇతరుల కంటే అత్యధికంగా ప్రియతములు కానంత వరకు ఏ వ్యక్తి కూడా విశ్వాసి కాలేడు, మరి అదే విధంగా ఏ వ్యక్తి కూడా విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడలేడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు.

సోదర మహాశయులారా, తబూక్ యుద్ధంలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మార్గంలో అల్లాహ్ తబారక వ తఆలా కొరకు తమ యొక్క దానాలను తమ స్తోమత మేరకు అర్పించవలసిందిగా కోరినప్పుడు, ఎంతోమంది సహాబాలు తమ తమ స్తోమత మేరకు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మార్గంలో తమ తమ దానమును అర్పిస్తున్నటువంటి సమయంలో హజ్రత్ అబూబక్ర్ అస్స్సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు తమ ఇంటిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఊడ్చి, ఆయన ముందు సమర్పించుకుంటూ, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు తీసుకొచ్చి పెట్టగా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, “ఓ అబూబక్ర్, నీ ఇంటి వారి కొరకు నీ ఇంటిలో ఏమైనా వదిలి పెట్టావా?” అంటే, హజ్రత్ అబూబక్ర్ నిస్సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, “నేను అల్లాహ్ మరియు ఆయన యొక్క ప్రవక్తను నా ఇంట్లో వదిలిపెట్టి వచ్చాను” అని హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు జవాబు పలికారు.

సోదరీ సోదర మహాశయులారా, అల్లాహ్ తబారక వ తఆలా మరియు ఆయన యొక్క ప్రేమ, సహచరుల యొక్క జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే, ఇటువంటి సంఘటనలు మనకు వేల కొద్దీ దొరుకుతాయి సోదర మహాశయులారా. అదే విషయాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరిలో అయితే మూడు లక్షణాలు ఉంటాయో వారు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క దయతో విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలరు. అందులో మొదటి విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నాము, అదేమిటంటే అల్లాహ్ మరియు ఆయన యొక్క ప్రవక్త పట్ల ప్రేమ, మిగతా వారందరికన్నా కూడా ఎక్కువగా ప్రియతములై ఉండటము.

అయితే సోదర మహాశయులారా, మనం అల్లాహ్ తబారక వ తఆలాను మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తున్నామని నోటితో ఎన్నిసార్లు మనం ప్రకటించినా కూడా, అది కేవలం నోటి మాటే అవుతుంది గానీ, అప్పటివరకు అది నిజం కాదు, ఎప్పటివరకైతే వారు చూపించినటువంటి మార్గంలో మనం నడవమో. అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ గ్రంథంలో, మూడవ సూరా, 31వ వాక్యంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అంటున్నాడు:

قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ”మీకు నిజంగానే అల్లాహ్‌ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ్‌ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు.”

ఇలా అను, మీకు నిజంగా అల్లాహ్ తబారక వ తఆలా పట్ల ప్రేమే ఉన్నట్లయితే, మీరు నాకు విధేయత చూపవలసిందిగా వారికి ఆజ్ఞాపించు. అల్లాహ్ తబారక వ తఆలా వారి పాపాలను క్షమిస్తాడు మరియు నిస్సందేహంగా అల్లాహ్ తబారక వ తఆలా ఎంతో క్షమాశీలి మరియు అనంత కరుణామయుడు అన్నటువంటి విషయాన్ని అల్లాహ్ తబారక వ తఆలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి, నిజంగానే మనం అల్లాహ్ తబారక వ తఆలా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నటువంటి వాళ్ళమే అయితే, అల్లాహ్ తబారక వ తఆలాను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అత్యధికంగా ప్రేమించేటటువంటి వాళ్ళమే అయితే, ఆయన చూపినటువంటి మార్గములో మనం నడుస్తూ మన జీవితాన్ని గడుపుకోవలసినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది.

సోదర మహాశయులారా, అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి హదీస్ ఆధారంగా, అందులో మొట్టమొదటి విషయము అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మిగతా వారందరికన్నా కూడా ఎక్కువ ప్రియతములై ఉండటము.

ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు, ఒక వ్యక్తి తనతో ఉన్నటువంటి వారిని కూడా అల్లాహ్ కొరకు ప్రేమించేటటువంటి వారై ఉండాలి. అదే విధంగా, అల్లాహ్ కొరకే ద్వేషించేటటువంటి వారై ఉండాలి. అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ప్రేమ కారణంగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం ప్రేమిస్తున్నాము. అదే విధంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రేమ కారణంగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులతో మనం ప్రేమిస్తున్నాము. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రేమ కారణంగానే సమస్త మానవాళి విశ్వాసులతో కూడా మనం ప్రేమిస్తున్నాము. ఇదే విషయాన్ని దైవం ప్రస్తావిస్తూ, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రస్తావిస్తూ ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు:

عَنْ أَبِي أُمَامَةَ الْبَاهِلِيِّ عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ مَنْ أَحَبَّ لِلَّهِ وَأَبْغَضَ لِلَّهِ وَأَعْطَى لِلَّهِ وَمَنَعَ لِلَّهِ فَقَدِ اسْتَكْمَلَ الإِيمَانَ

ఎవరైతే అల్లాహ్ తబారక వ తఆలా కొరకు ప్రేమిస్తారో మరియు అల్లాహ్ తబారక వ తఆలా కొరకే ద్వేషిస్తారో మరియు అల్లాహ్ తబారక వ తఆలా కొరకే ప్రసాదిస్తారో మరియు అల్లాహ్ తబారక వ తఆలా కొరకే నిషేధిస్తారో, వీరు వాస్తవానికి తమ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్నటువంటి వారు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి మాట అబూ దావూద్‌లో ఈ విధంగా ప్రస్తావించబడింది.

కాబట్టి దీని ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, సహాబాలు ఏ విధంగా అల్లాహ్ తబారక వ తఆలాను మరియు ఆయన యొక్క ప్రవక్తను ప్రేమించేటటువంటి వారు మరియు వారి యొక్క ప్రేమ, వారి యొక్క ద్వేషము అల్లాహ్ కొరకు మరియు అల్లాహ్ యొక్క మార్గంలోనే ఉండేటటువంటిది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు.

సోదర మహాశయులారా, ఇక మూడో విషయానికి వస్తే, మూడో లక్షణానికి వస్తే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, “మరి విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటం అన్నటువంటిది వారికి ఎంత అయిష్టకరమైనదై ఉండాలంటే ఎలాగైతే వారిని అగ్నిగుండంలో పడవేయటం అయిష్టకరమై ఉంటుందో ఆ విధంగానే అవిశ్వాసానికి పాల్పడటం వారికి అయిష్టకరమై ఉంటుంది” అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు.

ఈ విషయంలో హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారిని చూసుకున్నట్లయితే, హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారు ఎప్పుడైతే ఆయన విశ్వసించారో, ఆయన విశ్వసించిన తర్వాత మలమల మాడేటటువంటి మండుటెండల్లో ఆయనను ఈడ్చి, రాళ్లమయమైనటువంటి ప్రదేశంపై ఆయన్ని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి, ఆయన యొక్క గుండెలపై ఒక పెద్ద బండరాయిని పెట్టి, దేవుడు ఒక్కడే అన్నటువంటి విశ్వాసాన్ని నీవు విడనాడుతావా? ఇప్పుడైనా ఒప్పుకుంటావా దేవుడు ఒక్కడు కాదు అని అన్నప్పుడు, అప్పటికీ కూడా ఆయన హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారు “అల్లాహు అహద్, అల్లాహు అహద్, అల్లాహు ఒక్కడే, అల్లాహు ఒక్కడే, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవరూ లేరు, నేను ఇస్లాంను వదిలిపెట్టను, నా విశ్వాసాన్ని విడనాడను” అని హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారు ఏ విధంగానైతే నిలబడిపోయారో విశ్వాసంపై, ఆ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు.

అదే విధంగా హజ్రత్ సుమయ్య రదియల్లాహు తలా అన్హా, అదే విధంగా హజ్రత్ ఖబ్బాబ్ బిన్ అర్ద్ రదియల్లాహు తలా అన్హు, వీరు చేసుకున్నటువంటి త్యాగాలు మరియు వీరు ఏ విధంగా ఇస్లాంపై నిలకడగా ఉన్నారో, ఎలాగైతే వారు విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటం వారికి ఎంత అయిష్టకరంగా ఉండిందంటే, ఎలాగైతే వారికి జీవించి ఉండటంలోనే వారిని అగ్నిగుండంలో పడవేయటం కంటే ఎక్కువగా వారు అయిష్టకరంగా భావించేటటువంటి వారు.

కాబట్టి సోదర మహాశయులారా, ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే, విశ్వాసము యొక్క లక్షణాలలో ఒక లక్షణము, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడటము. అయితే ఈ విశ్వాసము యొక్క మాధుర్యాన్ని అప్పుడే మనం ఆస్వాదించగలము, అప్పుడే మనం రుచి చూడగలము, ఎప్పుడైతే మనలో ఈ మూడు లక్షణాలు కూడా ఉంటాయో, ఈ మూడు గుణాలు కూడా మనలో ఉంటాయో. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరిలో అయితే ఈ మూడు లక్షణాలు ఉంటాయో, ఈ మూడు గుణాలు ఉంటాయో, వారు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క దయతో విశ్వాసము యొక్క ఉచ్చ స్థాయికి చేరుకోగలరు, విశ్వాసము యొక్క ఉచ్చ స్థాయికి చేరుకున్నవారు విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలరు అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు.

అందులో మొట్టమొదటిది, అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరికంటే ఎక్కువ ప్రియతములై ఉండాలి. ఇక రెండవ విషయము, ఎవరిని ప్రేమించినా కూడా అల్లాహ్ కొరకే ప్రేమించేటటువంటి వారై ఉండాలి, అల్లాహ్ కొరకే ద్వేషించేటటువంటి వారై ఉండాలి. మరి అదే విధంగా మూడో విషయాన్ని, విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటం అన్నటువంటిది ఎంత అయిష్టకరంగా ఉండాలంటే, ఎలాగైతే నిజ జీవితంలోనే వారిని అగ్నిగుండంలో పడవేయటం కంటే బాధగా, అగ్నిగుండంలో పడవేయటం కంటే అయిష్టమైనదిగా ఉండాలి అన్నటువంటి ఈ మూడు లక్షణాల్ని కూడా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హలావతుల్ ఈమాన్, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని గురించి తెలియజేస్తూ పలికినటువంటి పలుకులు ఈరోజు మనం తెలియజేసుకున్నాము.

కాబట్టి అల్లాహ్ తబారక వ తఆలాతో దుఆ ఏమనగా, ఏ విధంగానైతే ఇప్పటి వరకు కూడా మనం మాట్లాడుకున్నామో విశ్వాసము గురించి, విశ్వాసము యొక్క లక్షణాల గురించి, విశ్వాసము యొక్క రుచిని ఆస్వాదించడం గురించి, అల్లాహ్ తబారక వ తఆలా మనకు వీటన్నిటిపై ఆచరించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తబారక వ తఆలా మనలో విశ్వాసాన్ని పెంపొందించుకునేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్.

رَبَّنَا تَقَبَّلْ مِنَّا ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ وَتُبْ عَلَيْنَا ۖ إِنَّكَ أَنتَ التَّوَّابُ الرَّحِيمُ
[రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అన్తస్సమీయుల్ అలీమ్ వ తుబ్ అలైనా ఇన్నక అన్తత్తవ్వాబుర్రహీమ్]

سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[సుబ్ హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్: https://teluguislam.net/?p=17476

జునుబీ’ (అశుద్ద స్థితిలో ఉన్నవారి) పై నిషిద్ధ విషయాలు [వీడియో, టెక్స్ట్]

‘జునుబీ’ (అశుద్ద స్థితిలో ఉన్నవారి) పై నిషిద్ధ విషయాలుఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : పార్ట్ 7A
https://youtu.be/4tRtuTItZkY [30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
శుద్ధి & నమాజు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ‘ఫిఖ్ అత్-తహారా వస్-సలాహ్’ (పారిశుధ్యం మరియు నమాజ్ ఆదేశాలు) అనే అంశంపై ఏడవ తరగతిలో భాగంగా, జునూబీ (అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తి)కి నిషిద్ధమైన పనుల గురించి వివరించబడింది. జునూబీ అంటే స్వప్నస్కలనం లేదా భార్యాభర్తల సంభోగం కారణంగా అశుద్ధతకు లోనైన స్త్రీ లేదా పురుషుడు. వీరికి నిషిద్ధమైనవి నాలుగు ప్రధాన పనులు: 1) నమాజ్ చేయడం, 2) కాబా తవాఫ్ చేయడం, 3) దివ్య ఖుర్ఆన్ గ్రంథాన్ని ముట్టుకోవడం, మరియు 4) మస్జిద్‌లో ఆగడం లేదా నివసించడం. ప్రతి అంశానికి ఖుర్ఆన్ ఆయతులు, హదీసుల నుండి ఆధారాలు, మరియు నలుగురు ఇమామ్‌ల ఏకాభిప్రాయం (ఇజ్మా)తో సహా వివరణ ఇవ్వబడింది. అశుద్ధావస్థలో నమాజ్ చేయరాదు కానీ దాని కోసం నమాజ్‌ను ఆలస్యం చేయడం లేదా వదిలివేయడం తప్పు అని, వెంటనే స్నానం చేసి నమాజ్ ఆచరించాలని స్పష్టం చేయబడింది.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు

أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
(అల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సఃబిహి అజ్మయీన్, అమ్మా బ’ద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయన సహచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

సోదర మహాశయులారా సోదరీమణులారా! ఫిఖ్ అత్-తహారా వస్-సలాహ్ (Fiqh al-Taharah wa’l-Salah), పరిశుభ్రత మరియు నమాజ్‌కు సంబంధించిన ఆదేశాల ఈ క్లాస్ ఏదైతే మనం మొదలుపెట్టామో, అల్లాహ్ యొక్క దయవల్ల ఈ రోజున ఏడవ క్లాస్ మనం మొదలుపెట్టబోతున్నాము.

అయితే ఈనాడు మనం చదివేటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో, పరిశుద్ధ స్థితిలో లేనివారు, ప్రత్యేకంగా అశుద్ధావస్థలో ఉన్నవారు అంటే జునూబీ (Junubi) అని ఎవరినైతే అనడం జరుగుతుందో, వారిపై నిషిద్ధములు ఉన్నవి ఏమిటి మరియు తయమ్ముమ్‌కు సంబంధించి కొన్ని ఆదేశాలు ఖుర్ఆన్ హదీస్ ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

అయితే రండి, ‘జునూబీ‘ అన్న పదం ఏదైతే ఉందో, అరబీలో జునూబీ అన్న పదం స్వప్నస్కలనం వల్ల లేదా భార్యాభర్తల సంభోగం కారణంగా అశుద్ధతకు లోనైన వ్యక్తిని, స్త్రీ అయినా పురుషుడు అయినా, జునూబీ అని అంటారు.

అయితే, ఈ అశుద్ధ స్థితిలో ఎవరైతే ఉంటారో, ఆ కొంత కాలం, ఆ కొంత సమయం ఏదైతే వారు అశుద్ధంగా ఉంటారో అప్పుడు ఏ కార్యాలు చేయడం వారిపై నిషిద్ధంగా ఉంటాయి? అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లు నాలుగు విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఒకటి నమాజ్, రెండవది తవాఫ్, మూడవది దివ్య ఖుర్ఆన్ ను ముట్టుకోవడం, నాలుగవది మస్జిద్ లో ఉండడం, అక్కడ కూర్చోవడం, పడుకోవడం, నిలవడం.

అయితే రండి, ఈ నాలుగు విషయాలకు కొంత వివరణ మనం తెలుసుకుందాము. నమాజ్, తవాఫ్, దివ్య ఖుర్ఆన్ ను ముట్టుకోవడం, మస్జిద్ లో ఆగడం. ఇవి నాలుగు పనులు జునూబీ చేయరాదు.

అయితే, వీటికి సంబంధించి మనం ధర్మాదేశాలు చూస్తే గనక, అక్కడ ఎన్నో దలీల్ (ఆధారాలు), నిదర్శనాలు ఉన్నాయి.

ఉదాహరణకు, అల్లాహు త’ఆలా సూరతున్ నిసా ఆయత్ నెంబర్ 43లో తెలిపాడు:

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَقْرَبُوا۟ ٱلصَّلَوٰةَ وَأَنتُمْ سُكَـٰرَىٰ حَتَّىٰ تَعْلَمُوا۟ مَا تَقُولُونَ وَلَا جُنُبًا إِلَّا عَابِرِى سَبِيلٍ حَتَّىٰ تَغْتَسِلُوا۟

విశ్వసించిన ప్రజలారా! మీరు (తాగిన) మత్తులో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు కూడా పోకండి. మీరు పలికేదేమిటో మీకు అర్థం కాగలిగినప్పుడే (నమాజు చెయ్యాలి). లైంగిక అశుద్ధావస్థలో కూడా – స్నానం చేయనంతవరకూ – నమాజు చేయరాదు. (మస్జిదు) దారిగుండా సాగిపోయేటి పరిస్థితి అయితే అది వేరే విషయం! (4:43)

నమాజ్‌కు సమీపించకూడదు. ఇక్కడ ఎవరు? రెండవ విషయం, వలా జునుబన్ (వలా జునుబన్) – జునూబీ, అశుద్ధావస్థలో ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పటివరకు? హత్తా తఘ్ తసిలూ – స్నానం చేసే వరకు. స్నానం చేసిన తర్వాతనే వారు నమాజ్ చేయాలి, అంతకుముందు నమాజ్ చేయడానికి అవకాశం లేదు. ఈ నమాజ్ చేయడం వారిపై నిషిద్ధం.

ఇక ఈ అశుద్ధ స్థితిలో నమాజ్ చేయడం నిషిద్ధం అని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది యువకులు, యువతులు ఈ ఆదేశం, అల్లాహు త’ఆలా ఏదైతే ఇచ్చాడో, తప్పుడు భావం తీసుకుని నమాజ్‌ను వదులుతూ ఉన్నారు. ఎందరినో చూడడం జరుగుతుంది, వేరే నమాజ్‌లు వారు పూర్తి పాబందీగా చేసినప్పటికీ, రాత్రి అశుద్ధావస్థకు లోనయ్యారు, స్వప్నస్కలనం జరిగింది, వారిని మేల్కొలిపినప్పటికీ, వారు ఫజ్ర్ నమాజ్ జమాఅత్‌తో చేయడానికి రారు. ఇళ్లల్లో తల్లులు లేపినా పిల్లల్ని, వారు చాలా అశ్రద్ధ వహిస్తారు. ఏందంటే నేను స్నానం చేసేది ఉంది, ఇప్పుడు ఈ చల్లదనం, ఇప్పుడు ఇంత తొందరగా చేయాలంటే నాతో కుదరదు, నేను 7 గంటల తర్వాత లేచి స్నానం చేసి అప్పుడు నమాజ్ చేసుకుంటాను.

అయితే సోదర మహాశయులారా, ఈ ఆయత్ ద్వారా చెప్పదలచిన విషయం ఏమిటంటే, అశుద్ధావస్థలో నమాజ్ చేయడం సరియైన విషయం కాదు. ఇలాంటి మనిషి తప్పకుండా స్నానం చేసి నమాజ్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది కానీ, “నమాజ్ ఆలస్యం చేయండి, నమాజ్ దాని సమయం దాటినా పర్వాలేదు, మీరు ఆలస్యంగా చేసుకున్నా అభ్యంతరం లేదు”, అలాంటి మాట ఇక్కడ చెప్పడం జరగలేదు. ఈ విషయం గుర్తుంచుకోవాలి.

అశుద్ధావస్థలో ఉన్న వారిపై నమాజ్ నిషిద్ధం అన్న దాని గురించి హదీసులలో కూడా ఆధారం ఉంది. మనకు సహీహ్ బుఖారీ హదీస్ నెంబర్ 275 మరియు సహీహ్ ముస్లింలో హదీస్ నెంబర్ 605, ఇలా స్పష్టంగా కనబడుతుంది.

అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు:

ఉఖీమతిస్సలాహ్ – నమాజ్ కొరకు ఇఖామత్ చెప్పడం జరిగింది. వ ఉద్దిలతిస్ సుఫూఫు ఖియామా – అందరూ పంక్తుల్లో నిలబడి సఫ్‌లన్నీ కూడా సక్రమంగా చేయబడ్డాయి. ఫ ఖరజ ఇలైనా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం – నమాజ్ చేయించడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేశారు. ఫలమ్మా ఖామ ఫీ ముసల్లా – ప్రవక్త నమాజ్ చేయించే, ఇమామత్ చేయించే స్థలం ఏదైతే ఉందో అక్కడ నిలబడిన నిలబడ్డారు, జకర – అప్పుడు గుర్తుకొచ్చింది అన్నహు జునుబున్ – ప్రవక్త అశుద్ధావస్థలో ఉన్నట్లు, స్నానం చేయవలసిన అవసరం ఉంది అని ప్రవక్త వారికి గుర్తుకొచ్చింది. ఫ ఖాల లనా – అబూ హురైరా అంటున్నారు, ప్రవక్త వారు మా సహాబాలందరినీ ఉద్దేశించి చెప్పారు, మకానకుమ్ – మీరు ఇలాగే నిలబడి ఉండండి. సుమ్మ రజ’అ ఫఘ్ తసల – ప్రవక్త వెళ్ళిపోయారు, స్నానం చేశారు. సుమ్మ ఖరజ ఇలైనా – మళ్ళీ ప్రవక్త మా మధ్యలో వచ్చారు, వ ర’సుహు యఖ్తుర్ – తల నుండి నీళ్లు, నీళ్ల యొక్క చుక్కలు, నీళ్ల బొట్లు పడుతూ ఉన్నాయి. ఫ కబ్బర ఫ సల్లైనా మా’అహు – అల్లాహు అక్బర్ అని తక్బీరె తహ్రీమా అన్నారు. మేము ప్రవక్త వెంట నమాజ్ చేసుకున్నాము.

ఈ హదీస్ ద్వారా కూడా ఏం తెలిసింది? ప్రవక్త మరిచిపోయారు. అయితే, నమాజ్ చేయించడానికి వచ్చేశారు కానీ నిలబడి ముసల్లా మీద నమాజ్ స్టార్ట్ చేసేకి ముందుగా గుర్తుకు వచ్చేసింది, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే ఆ విషయాన్ని, ఏదైతే గుర్తుకు వచ్చిందో, సహాబాలను అక్కడే ఉండమని చెప్పి వెళ్ళిపోయారు మరియు నమాజ్ స్నానం చేసిన తర్వాతనే వచ్చి నమాజ్ చేయించారు.

సోదర మహాశయులారా, కనీసం ఒక ఆధారం మనం తెలుసుకున్నా అల్హందులిల్లాహ్ సరిపోతుంది. కానీ మీకు ఈ హదీసుల పట్ల కూడా మంచి అవగాహన కలిగి ఉండాలి అని నిదానంగా ఇలాంటి దలీల్ అన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అందుకొరకు శ్రద్ధ వహించండి, నోట్స్ తయారు చేసుకుంటూ ఉండండి మరియు పాఠం జరిగిన తర్వాత, క్లాస్ తర్వాత ఈ పాఠాలను మీరు నెమరువేసుకుంటూ ఉండండి, రివ్యూ చేసుకుంటూ ఉండండి. దీని ద్వారా విద్య అనేది ఇంకా బలపడుతుంది, మీ మనసుల్లో నాటుకుపోతుంది, ఇంకా మీరు ఈ విషయాలు మర్చిపోకుండా ఉండాలంటే మీ వెనక వారికి, క్లాసులో పాల్గొనలేని వారికి చెబుతూ ఉండాలి కూడా.

అశుద్ధావస్థలో ఉన్నటువంటి జునూబీపై రెండవది ఏదైతే నిషిద్ధంగా ఉందో, అది కాబతుల్లాహ్ యొక్క తవాఫ్. దీనికి సంబంధించి ఎన్నో ఆధారాలు మనకు కనబడతాయి. సర్వసామాన్యంగా నేను ఏదైతే చెబుతూ ఉంటానో, మన మధ్యలో నాలుగు ఫిఖ్‌లు ఏవైతే ఫేమస్‌గా ఉన్నాయో, అంతకంటే ఎక్కువ ఫిఖ్‌లు కూడా ఇమామ్‌లు కూడా ఉండిరి, కానీ ఇవి నాలుగు ఫేమస్ అయిపోయాయి, హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ. ఈ నాలుగు ఫిఖ్‌లలో కూడా ఏకీభవంగా తవాఫ్ చేసే వ్యక్తి కూడా తప్పకుండా పరిశుద్ధావస్థలో ఉండడం మరియు తవాఫ్ చేసేకి ముందు అతను వుదూ చేసుకోవడం చాలా నొక్కి చెప్పడం జరిగింది.

ఇంతకుముందు నేను ఏదైతే నమాజ్ గురించి ఒక ఆయత్ వినిపించానో, సూరత్ అన్-నిసా ఆయత్ నెంబర్ 43, దాని ద్వారా కూడా ఆధారం తీసుకోవడం జరుగుతుంది.

అలాగే హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా వారికి హజ్ చేసే సందర్భంలో ఆమె నిలవారి ఏదైతే మొదలైపోయిందో, బహిష్టు, ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏం చెప్పారు: ఇఫ్’అలీ మా యఫ్’అలుల్ హాజ్, ఘైర అల్లా తతూఫిల్ బైత్ హత్తా తత్ హురీ – ఇంకో ఉల్లేఖనంలో హత్తా తఘ్ తసిలీ. ఓ ఆయిషా, నీవు ఈ నెలవారి రక్తస్రావంలో ఉన్నావని బాధపడకు, హజ్ విషయంలో నీకు ఏదైనా ఆటంకం కలిగింది అన్నట్లుగా నీవు నొచ్చుకోవద్దు ఎందుకంటే నీవు ఈ స్థితిలో ఉండి కూడా హాజీ ఏ ఏ పనులు చేస్తాడో అవన్నీ చేయవచ్చును నువ్వు, కేవలం ఒక్క తవాఫ్ తప్ప. తవాఫ్ చేయకూడదు, పరిశుద్ధమై స్నానం చేసే వరకు తవాఫ్ చేయకు.

ఈ హదీస్ సహీహ్ బుఖారీలో ఉంది 305, సహీహ్ ముస్లింలో ఉంది 1211. ఈ హదీస్ ద్వారా కూడా ధర్మవేత్తలందరూ ఏకీభవించారు. స్త్రీ నెలవారి రక్తస్రావం జరుగుతుంది అంటే ఆమె అశుద్ధావస్థలో ఉన్నట్లు. అశుద్ధావస్థలో ఉన్నవారు తవాఫ్ చేయకూడదు.

ఇదే కాకుండా హజ్రత్ సఫియా బిన్తె హుయై ఇబ్ను అఖ్తబ్ రదియల్లాహు త’ఆలా అన్హా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య, ఆమెకు సంబంధించిన ఒక హదీస్ ద్వారా కూడా ఈ విషయం తెలుస్తుంది.

మరియు అలాగే ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం ఉంది, సునన్ నసాయిలో, నసాయి కుబ్రా 3944, అలాగే బైహఖీలో 9573 మరియు ఈ హదీసును కొందరు ధర్మవేత్తలు మౌఖూఫ్ మరియు సహీహ్ అని చెప్పారు. కానీ ఈ మాట చెప్పేవారు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు అయినప్పటికీ, హదీస్ పరిభాషలో, ఇస్తిలాహె హదీస్లో దీనిని హుక్ముర్ రఫ్’అ అని అంటారు, హుక్ముల్ మర్ఫూ అని అంటారు. అంటే, ఇలాంటి మాట సహాబీ తన ఇష్టానుసారం చెప్పడానికి హక్కు ఉండదు, వారు ప్రవక్తతో విని ఉంటారు, తెలుసుకొని ఉంటారు కానీ ప్రవక్త చెప్పారు అన్నటువంటి మాట ఆ సందర్భంలో వారు చెప్పలేదు. ఏంటి విషయం?

అత్తవాఫు బిల్ బైతి సలాహ్ – కాబతుల్లాహ్ యొక్క తవాఫ్ కూడా సలాహ్, నమాజ్ లాంటిది. కాకపోతే ఈ తవాఫ్‌లో మాట్లాడే అటువంటి, నడిచే అటువంటి అనుమతి ఇవ్వడం జరిగింది. నమాజ్‌లో మాట్లాడే, నడిచే అనుమతి కూడా లేదు.”

సోదర మహాశయులారా, తవాఫ్ చేయకూడదు అన్నటువంటి ఈ విషయం ఏదైతే ఉందో, దీని గురించి మనకు ఈ ఆధారాలు ఏవైతే తెలిశాయో, వీటిపై మనం తృప్తి ఉండి, ఎప్పుడూ మనం తవాఫ్ చేసినా అశుద్ధావస్థలో ఉండకుండా పరిశుభ్రతలో ఉండి, వుదూ చేసుకొని తవాఫ్ చేసే ప్రయత్నం చేయాలి.

ఇక రండి, మూడో విషయం అశుద్ధావస్థలో ఏమి చేయరాదు? ఖుర్ఆన్ ను తాకకూడదు అన్నటువంటి విషయం. అయితే ఖుర్ఆన్ ను తాకకూడదు అన్నటువంటి విషయం ఏదైతే ఉందో, దీని గురించి కూడా హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ, ఈ నాలుగు ఫిఖ్‌లలో, నాలుగు ఫిఖ్‌లలో జునూబీ – జునూబీ అంటే ఎవరో తెలిసింది కదా, అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తి – ఖుర్ఆన్ ను ముట్టుకోకూడదు, ఖుర్ఆన్ ను తాకకూడదు అని ఏకీభవించారు. మరియు ఇమామ్ ఇబ్ను అబ్దిల్ బర్ర్, ఇమామ్ ఇబ్ను అబ్దిల్ బర్ర్ ఈ విషయంలో అందరి ఏకాభిప్రాయం ఉంది, ఇజ్మా ఉంది అని కూడా స్పష్టంగా తెలిపారు. ఈ విషయం అల్-ఇస్తిద్కార్ లో ఉంది. అలాగే ఇమామ్ షౌకానీ రహిమహుల్లాహ్ కూడా ఈ విషయం తెలిపారు, నైలుల్ అవ్తార్ లో ఈ మాట ఆయన రాశారు.

దీనికి సూరతుల్ వాఖిఆ, ఇందులోని ఆయత్ ద్వారా కూడా దలీల్ తీసుకోవడం జరుగుతుంది. కొందరు సూరత్ అల్-వాఖిఆలో వచ్చిన ఆయత్ ను దేవదూతల గురించి అని, అది లౌహె మహ్ఫూజ్ గురించి అని అంటారు. కానీ సర్వసామాన్యంగా అధికమంది ధర్మవేత్తలు ఈ ఆయత్ నే ఆధారంగా తీసుకున్నారు మరియు ఇమామ్ ఖుర్తుబీ రహిమహుల్లాహ్ తఫ్సీరె ఖుర్తుబీలో చెప్పారు: అన్నహు ఇదా కాన లా యజూజు లహు అల్-లుబ్సు ఫిల్ మస్జిద్, ఫ అహ్రా అల్లా యజూజ లహు మస్సుల్ ముస్హఫ్, వలల్ ఖిరాఅతు ఫీహి ఇద్ హువ అ’జము హుర్మతన్. మనం నాలుగో విషయం తెలుసుకోబోతున్నాము మస్జిద్ లో ఉండకూడదు అని. అక్కడ వివరాలు వస్తాయి దానికి సంబంధించి. అయితే ఇమామ్ ఖుర్తుబీ ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించారు. జునూబీ మస్జిద్ లో ఆగకూడదు, అక్కడ నిలువకూడదు. అయితే, మస్జిద్ లో జునూబీ నిలువకూడదు అని ఆదేశం ఉన్నప్పుడు, ఫ అహ్రా అల్లా యజూజ లహు మస్సుల్ ముస్హఫ్ – అయితే అతను ముస్హఫ్ ను, ఖుర్ఆన్ గ్రంథాన్ని తాకకపోవడం, ముట్టుకోకపోవడం ఇది మరీ చాలా అవసరమైన విషయం. వలల్ ఖిరాఅతు ఫీహి – దానిని ముట్టుకొని, చూసి చదవడం కూడా ఇది యోగ్యం లేదు. ఇద్ హువ అ’జము హుర్మతన్ – ఖుర్ఆన్ గ్రంథం, దీని యొక్క గౌరవప్రదం అనేది మస్జిద్ కంటే కూడా ఎక్కువగా ఉంది.

అంతేకాకుండా, మరొక హదీస్ ద్వారా కూడా దలీల్ తీసుకుంటారు ఎందరో ధర్మవేత్తలు. తబరానీ, దారుఖుత్నీ ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో ఈ హదీస్ వచ్చి ఉంది. షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహుల్ జామిఅలో దీనిని ప్రస్తావించారు. హదీస్ నెంబర్ 7780. ఏంటి హదీస్? లా యమస్సుల్ ఖుర్ఆన ఇల్లా తాహిరున్ – ఖుర్ఆన్ ను పరిశుభ్రంగా ఉన్న వ్యక్తే ముట్టుకోవాలి, తాకాలి. అయితే జునూబీ మనిషి ఖుర్ఆన్ ను ముట్టుకోకూడదు, తాకకూడదు.

అయినా మీరు గమనించండి, ఈ జనాబత్ అనేది ఏదైతే ఉందో, ఈ అశుద్ధావస్థ ఏదైతే ఉందో, అది చాలా తక్కువ సమయమే ఉంటుంది. స్త్రీలకు నెలవారి లేదా ప్రసవ రక్తం స్రవించే సందర్భంలో ఒక కొన్ని రోజుల వరకు వారు ఆ అశుద్ధావస్థలో ఉంటారు, వారి విషయం వేరు. కానీ జనాబత్ అన్నది ఏదైతే ఉందో, స్వప్నస్కలనం లేదా భార్యాభర్తల సంభోగం కారణంగా అశుద్ధావస్థ, ఇది చాలా తక్కువ సమయం ఉంటుంది. అందుకొరకు ఈ సమయంలో ఖుర్ఆన్ ను ముట్టుకోకపోవడం, తాకకుండా ఉండడమే మేలైన విషయం.

ఈ కొన్ని ఆయత్ హదీసులు కాకుండా, సహాబాల యొక్క అతర్, వాటి ద్వారా కూడా దీనికి ఆధారం తీసుకోవడం జరుగుతుంది. ఇందులో సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం ఉంది. ఇమామ్ ఇబ్ను అబీ షైబా తన ముసన్నఫ్‌లో 1106, మరియు ఇమామ్ బైహఖీ మరియు ఇమామ్ దారుఖుత్నీ ఇంకా ఇమామ్ జైల’యీ రహిమహుల్లాహ్ నస్బుర్ రాయాలో కూడా దీనిని ఉల్లేఖించారు.

సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు ఒక ప్రయాణంలో ఉండగా, అబ్దుర్రహ్మాన్ బిన్ యజీద్ బిన్ జాబిర్ ఉల్లేఖిస్తున్నారు, ఆయన చెప్పారు: సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లారు. తిరిగి వచ్చేసిన తర్వాత నేను అడిగాను, మీరు వుదూ చేసుకోండి, ల’అల్లనా నస్’అలుక అన్ ఆయిన్ మినల్ ఖుర్ఆన్ – మేము నీతో ఖుర్ఆన్‌లోని కొన్ని ఆయతుల గురించి అడగాలనుకుంటున్నాము. అప్పుడు సల్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు: సలూనీ, ఫ ఇన్నీ లా అముస్సుహు – అడగండి, నేను ఖుర్ఆన్‌ను ముట్టుకోను, తాకను. ఇన్నహు లా యమస్సుహు ఇల్లల్ ముతహహరూన్ – ఈ ఖుర్ఆన్‌ను తాకడానికి పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండడం తప్పనిసరి. అప్పుడు మేము వారితో అడిగాము, ఫ ఖర’అ అలైనా ఖబ్ల అన్ యతవద్ద’అ – అయితే సల్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు వుదూ చేసుకునేకి ముందు, ఖుర్ఆన్‌ను తాకకుండా, ఖుర్ఆన్ ఆయత్ మాకు చదివి వినిపించారు.

ఈ విధంగా సోదర మహాశయులారా, మనకు అల్లాహ్ యొక్క దయవల్ల ఖుర్ఆన్ ను ముట్టుకోకూడదు అన్నటువంటి విషయం గురించి ఈ ఆధారాలు తెలిసినవి.

జునూబీ, అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తిపై నిషిద్ధం ఉన్న నాలుగో విషయం ఏదైతే ఉందో, మస్జిద్ లో ఆగడం, మస్జిద్ లో నిలవడం. దీనికి సంబంధించి కూడా ఖుర్ఆన్ లోని సూరత్ అన్-నిసాలోని ఆయత్ 43 ఏదైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నామో, వలా జునుబన్ ఇల్లా ఆబిరీ సబీలిన్ హత్తా తఘ్ తసిలూ, ఈ ఆయత్ ద్వారానే దలీల్ తీసుకోవడం జరుగుతుంది.

మాషాఅల్లాహ్. తబారకల్లాహ్. గమనించండి. అందుకొరకే నేను మాటిమాటికి చెబుతూ ఉంటాను. నాకు అరబీ వచ్చయ్యా, అరె ఖుర్ఆన్ అయితే నా భాషలో తర్జుమా, అనువాదం ఉంది కదా నేను చదివి తెలుసుకుంటాను, ఇట్లాంటి మోసాలకు గురి కాకూడదు, నాకు జ్ఞానం ఉంది, నేను స్వయంగా ధర్మ విద్య నేర్చుకుంటాను అన్నటువంటి మాటల్లో పడి మనిషి పెడమార్గంలో పడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఉలమాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటే, క్లాసులలో పాల్గొని ఉండేది ఉంటే, ఇంకా దానికి సంబంధించిన వ్యాఖ్యానాలు చదువుతూ ఉంటే, ఒక్కొక్క ఆయత్ ద్వారా ఎన్ని ధర్మ విషయాలు ధర్మవేత్తలు మనకు తెలియజేస్తూ ఉంటారు.

మస్జిద్ లో నిలవడం జునూబీపై నిషిద్ధం అన్న దాని గురించి ఈ ఆయత్ నుండి ఎలా దలీల్ తీసుకున్నారో చెప్పండి? ఇల్లా ఆబిరీ సబీలిన్. జునూబీ ఎవరైతే ఉన్నారో వారు నమాజ్‌కు, నమాజ్ చేసే స్థలానికి అక్కడికి రాకూడదు. కానీ నమాజ్ చేసే స్థలం ఏదైతే ఉంటుందో, ఇల్లా ఆబిరీ సబీల్ – అలా దాటుతూ వెళ్ళవచ్చు. అయితే, నమాజ్ చేసే స్థలం అంటే ఇక మస్జిద్. సర్వసామాన్యంగా. అయితే ఆ మస్జిద్, దానికి కూడా ఒక గౌరవ స్థానం అల్లాహ్ ప్రసాదించాడు. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ఆయత్ ఏదైతే అవతరించిందో ఇది నమాజ్ గురించి, నమాజ్ చేసే స్థలం గురించి కూడా అని ధర్మవేత్తలు దీని గురించి ఏకీభవించారు. హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ, అందరూ దీనిని ఏకీభవించారు.

ఒకవేళ ఎవరికైనా అనుమానం రావచ్చు, సర్వసామాన్యంగా మేము అంటూ ఉంటాము, మనం కేవలం ఖుర్ఆన్ హదీస్‌ను ఫాలో కావాలి. ఇక ఎవరైతే ఖుర్ఆన్ హదీస్ కాకుండా ఈ మస్లక్‌లలో పడి ఉన్నారో, హనఫీ, షాఫియీ, హంబలీ, మాలికీ, ఈ విధంగా ఇది మంచి విషయం కాదు, అంధీ తఖ్లీద్ (గుడ్డి అనుకరణ) అనేది ఇది చాలా ప్రమాదకరం అని చెబుతూ ఉంటారు. మరి ఈ మస్లే మసాయిల్, ఈ ధర్మ విషయాలు బోధిస్తున్నప్పుడు మాటిమాటికి హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ అందరూ దీనిని ఏకీభవించారు అని వాటిని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఇది తెలుసుకోవాల్సిన విషయం. చూడండి, ఇదే మన్హజె సలఫ్. మనకు సహాబాలు ఎలా ఖుర్ఆన్ హదీసులను అర్థం చేసుకున్నారో, ధర్మవేత్తలు ఎలా అర్థం చేసుకున్నారో, వాటిని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని అదే రకంగా మనం అనుసరించాలి. ఎప్పుడైనా ఎవరైనా, ఎక్కడైనా వారితో పొరపాటు జరిగితే వారి గురించి అల్లాహ్ వారిని మన్నించుగాక అని దుఆ చేస్తూ, ఖుర్ఆన్ హదీస్‌కు చేరువగా, దగ్గరగా ఎవరి మాట ఉందో తీసుకోవాలి, ఖుర్ఆన్ హదీస్‌ను అనుసరించాలి. అల్లాహ్ యొక్క దయ కలిగితే వేరే సందర్భాలలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చెబుదాము.

అయితే, జునూబీ అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తి మస్జిద్ లో నిలవకూడదు. ఈ ఆయత్ ద్వారా దలీల్ తీసుకోవడం జరిగింది. ధర్మ పండితులందరూ కూడా ఏకీభవించారు. తఫ్సీర్ ఇబ్ను కసీర్ లో ఈ మాట ఉంది. అలాగే సౌదీ అరబ్ లోని ఇఫ్తా కమిటీ, ఫత్వా కమిటీ ఏదైతే ఉందో వారు కూడా దీనిని ఏకీభవించారు. కానీ ఇందులో ఒక విషయం, ఖుర్ఆన్ ఆయత్ ద్వారానే మనకు తెలుస్తుంది. ఎవరికైనా వేరే ఏ గత్యంతరం లేక మస్జిద్ నుండి దాటి వెళ్ళవలసిన అవసరం వస్తే, వారు తప్పకుండా అలా వెళ్ళవచ్చు. ఇందులో అనుమానం లేదు. ఫిఖ్ షాఫియీ, హంబలీ అలాగే ఇమామ్ ఇబ్ను తైమియా, ఇబ్ను బాజ్, ఇబ్ను ఉసైమీన్ వీరందరి ఫత్వాలు కూడా ఇలాగే ఉన్నాయి.

ఇక్కడ ఒక విషయం. ఈ రోజుల్లో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు లాక్డౌన్ కారణంగా కాకపోవచ్చు కానీ అంతకుముందు కూడా మస్జిద్ లో పడుకుంటారు కొందరు. అయితే మస్జిద్ లో పడుకోవడం పాపం తప్పేమీ లేదు. కానీ ఎవరైతే మస్జిద్ లో పడుకుంటున్నారో వారు ఈ విషయాన్ని, ఈ అంశాన్ని శ్రద్ధగా ఎల్లవేళల్లో మదిలో నాటుకొని ఉండాలి. అదేమిటి? ఒకవేళ నిద్రలో వారికి స్వప్నస్కలనం జరిగిందంటే, వెంటనే వారు వెళ్లి స్నానం చేసేయాలి. అరె ఫజర్ నమాజ్ కొరకు ఇంకా మూడు గంటలు ఉన్నాయి కదా, ఇంకా రెండు గంటలు ఉన్నాయి కదా అని అలాగే అక్కడ పడుకొని ఉండిపోవడం, ఇది మంచి విషయం కాదు.

సోదర మహాశయులారా, ఈ విధంగా మనం అల్లాహ్ యొక్క దయవల్ల ఈ అశుద్ధావస్థలో ఏ ఏ పనులు చేయరాదు అన్నటువంటి విషయం ఆ మనం తెలుసుకున్నాము. అయితే, ఖుర్ఆన్ చదవవచ్చు కానీ ఖుర్ఆన్ ను తాకకూడదు అని సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క మాట ద్వారా కూడా మనం అర్థం చేసుకున్నాము ఈ మధ్యలో. కానీ ఎలాగైనా అశుద్ధావస్థ అనేది జనాబత్‌కు సంబంధించింది, ఎక్కువ సేపు ఉండదు గనుక మనం కావాలని మరీ ఆలస్యం చేయకూడదు. కావాలని ఖుర్ఆన్ ను తాకడం గాని, చదవడం గాని చేయకుండా ఉండి, అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తూ ఉండడం, ఇందులో అభ్యంతరం లేదు.

మరి ఏ ధర్మ పండితులైతే ఖుర్ఆన్ చూడకుండా చదవవచ్చు అని అన్నారో, వారు తీసుకున్నటువంటి దలీళ్లలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్, అన్న నబి సల్లల్లాహు అలైహి వసల్లం, రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కాన యద్కురుల్లాహ అలా కుల్లి అహ్యానిహి – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎల్లవేళల్లో అల్లాహ్ యొక్క జికర్ చేస్తూ ఉండేవారు. ఇమామ్ బుఖారీ ము’అల్లఖన్ ఈ హదీస్‌ను ప్రస్తావించారు 634 కంటే ముందు, సహీహ్ ముస్లింలో 373లో ఈ హదీస్ ఉంది.

కానీ హజ్రత్ అలీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఆచరణ గురించి ముసన్నఫ్ అబ్దుర్రజాఖ్‌లో అలాగే ఇమామ్ అబూ ను’అయమ్ అస్సలాలో, ఇమామ్ దారుఖుత్నీ సునన్‌లో ఆ మరియు ఇంకా వేరే ధర్మవేత్తలు ప్రస్తావించారు, అలీ రదియల్లాహు త’ఆలా అన్హు ఒక సందర్భంలో చెప్పారు: ఇఖ్ర’ఉల్ ఖుర్ఆన మా లమ్ యుసిబ్ అహదుకుమ్ జనాబ, ఫ ఇన్ అసాబత్హు జనాబతున్ ఫలా, వలా హర్ఫన్ వాహిదా – మీలో ఎవరైనా జనాబత్, అశుద్ధావస్థకు లోనయ్యారంటే వారు ఖుర్ఆన్ లోని ఒక అక్షరం కూడా చదవకూడదు.

అయితే, మరి అలీ రదియల్లాహు త’ఆలా అన్హు చదవకూడదు అని అంటున్నారు కదా? మరి కొందరు ధర్మవేత్తలు ఏమన్నారు? చదవవచ్చు అని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ ద్వారా దలీల్ తీసుకున్నారు. అయితే, అలీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఈ మాట ద్వారా వేరే కొందరు ధర్మవేత్తలు ఏమంటారంటే, అలీ రదియల్లాహు అన్హు చెప్పిన మాట కరెక్టే, చదవకండి అని. కానీ అక్కడ వివరణ లేదు, ఖుర్ఆన్ చూసి చదవడమా లేకుంటే చూడకుండా చదవడమా అని. ఖుర్ఆన్ ను పట్టుకొని చదవడమా లేక మనకు కంఠస్థం ఉన్న దానిలో నుండి చదవడమా? ఈ విధంగా కూడా ఒక దలీల్ ఇవ్వడం జరిగింది.


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు