సత్యం పలకటాన్ని ప్రోత్సహించటం-అసత్యం పలకటాన్ని నిరోధించటం

హదీథ్׃ 06

التَّرغيب في الصَّدق والتَّحذير من الكذب

عَنْ عَبْدِاللهِ بْنِ مَسْعُوْدْ  رَضِي الله عَنْهُ قَالَ:قَالَ رَسُوْلُ اللهِ صَلَّى اللهُ عَلَيهِ وَسَلَّمْ  ” عَلَيْكُمْ بِا لصِّدْقِ فَإِنَّ  الصِّدْقَ يـَهْدِيْ إِلَى الْبِرَّ، وَ إِنَّ الْبِرَّ يَـهْدِيْ إِلَى الْـجَنَّةِ، وَمَا  يَزَالُ الرَّجُلُ يَصْدُقُ وَيَتَحَرَّى  الصِّدْقَ حَتَّى يُكْتَبَ عِنْدَاللِه صِدِّيْقًا، وَ اِيَّاكُمْ وَالْكَذِبَ فَإِنَّ  الْكَذِبَ يَـهْدِيْ إِلَى الْفُجُوْرِ وَإِنَّ الْفُجُوْرَ يَـهْدِيْ إِلَى الْنَّارِ وَمَا يَزَالُ الرَّجُلُ يَكْذِبَ وَ يَتَحَرَّى الْكَذِبُ حَتَّى يُكْتَبَ عِنْدَاللِه  كَذَّابًا   ” رواه مسلم

అన్ అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఖాల : ఖాల రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం “అలైకుమ్ బిశ్శిద్ఖి ఫఇన్న శ్శిద్ఖ యహ్దీ ఇలల్ బిర్ర్, వ ఇన్నల్ బిర్ర యహ్దీ ఇలల్ జన్న, వ మా యజాలుర్రజులు యుశ్దుఖు వ యతహర్ర శ్శిద్ఖ హత్తా యుక్తబ ఇందల్లాహి శిద్ధీఖా, వ ఇయ్యాకుమ్ వల్ కదిజిబ ఫఇన్నల్ కదిబ యహ్దీ ఇలల్ ఫుజూరి, వ ఇన్నల్ ఫుజూర యహ్దీ ఇలన్నారి, వ మా యజాలు ర్రజులు యక్ దిబ వ యతహర్రల్  కదిబు హత్తా యుక్తబ ఇందల్లాహి కద్దాబ” రవాహ్ ముస్లిం

తాత్పర్యం : – అన్ = ఉల్లేఖించారు, అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ = మసూద్ కుమారుడు అబ్దుల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం  యొక్క సహచరుడు. రదియల్లాహు అన్హు = అల్లాహ్ వారిని స్వీకరించుగాక, ఖాల = చెప్పారు, ఖాల రసూలల్లాహ్ =  ప్రవక్త తెలిపారు, అలైకుమ్ = మీ పై, బిశ్శిద్ఖి = సత్యం పలకటం (విధిగా చేయబడినది), ఇన్నశ్శిద్ఖ = నిశ్చయంగా ఈ సత్యశీలగుణం (నిజం పలికే అలవాటు), యహ్దీ = దారిచూపటం, ఇల = వైపుకు, అల్ బిర్ర్ = పుణ్యకార్యాలు, వ = మరియు, ఇన్నల్ బిర్ర = నిశ్చయంగా ఈ పుణ్యకార్యాలు, యహ్దీ = దారి చూపటం, ఇలల్ జన్న = స్వర్గం వైపుకు, వ = మరియు, మా = ఎవరైతే, యŸజాలుర్రజుల = అప్పటి వరకు, యుశ్దుఖు = సత్యమే పలుకుతుండును, హత్తా = వరకు, యుక్తబ = వ్రాయబడును, ఇందల్లాహి = అల్లాహ్ దగ్గర,  శిద్ధీఖా = సత్యవంతుడుగా, వ = మరియు, ఇయ్యాకుమ్ = మీరు ఎట్టిపరిస్థితులలోను , వల్ కదిబ = అసత్యం పలకవద్దు,  ఇన్నల్ కదిబ = నిశ్చయంగా ఈ  అసత్యం పలికే గుణం (అబద్ధం చెప్పే అలవాటు), యహ్దీ = దారి చూపటం, ఇల = వైపుకు, అల్ ఫుజూర్ = పాపాల , వ = మరియు, ఇన్న = నిశ్చయంగా, అల్ ఫుజూర = ఈ పాపాలు, యహ్దీ = దారి చూపటం, ఇల = వైపుకు, అన్నార్ = నరకాగ్ని, వ = మరియు, మా = ఎవరైతే, యŸజాలుర్రజుల = అప్పటి వరకు, యక్ దిబ = అబద్ధాలే చెప్తుండును, హత్తా = వరకు, యుక్తబ = వ్రాయబడును, ఇందల్లాహి = అల్లాహ్ దగ్గర, కద్దాబ = అసత్యవాదిగా.

అనువాదం :- అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు “మీ పై సత్యం పలకటం తప్పనిసరి చేయబడినది. సత్యశీలగుణం పుణ్యకార్యాల వైపునకు దారి చూపుతుంది మరియు పుణ్యకార్యాలు స్వర్గం వైపునకు దారి చూపుతాయి మరియు ఎవరైనా ఎల్లప్పుడూ సత్యమే పలుకుతున్నట్లయితే, అల్లాహ్ దగ్గర అతడి పేరు సత్యవంతుడిగా వ్రాయబడే వరకూ అతడు సత్యమే పలుకుతాడు. మరియు మీరు ఎట్టి పరిస్థితిలోను అబద్ధం పలకవద్దు. అసత్యం పలికే గుణం పాపపు పనుల వైపునకు దారి చూపుతుంది, మరియు పాపపు పనులు నరకాగ్ని వైపునకు దారి చూపుతాయి మరియు ఎవరైనా ఎల్లప్పుడూ అసత్యమే(అబద్ధం) పలుకుతూ ఉన్నట్లయితే, అల్లాహ్ దగ్గర అతడి పేరు అసత్యవంతుడి (బొంకరి) గా వ్రాయబడే వరకూ అతడు అసత్యమే పలుకుతాడు.”  బుఖారి మరియు ముస్లిం.

వివరణ :- ఎవరైనా ఎల్లప్పుడూ నిజం పలుకుతున్నట్లైతే, అతని గుణగణాలలో సత్యం పలికే మంచిగుణం చేరిపోతుంది మరియు ఎవరైనా ఎల్లప్పుడూ కావాలని అబద్ధం పలుకుతున్నట్లైతే, అతని గుణగణాలలో అసత్యం పలికే గుణం చేరిపోతుందనేది ఈ హదీథ్ ద్వారా సూచింపబడుతుంది.  కాబట్టి మంచి, చెడు గుణాలు మన నడవడికను బట్టి, మనం చేసే అమలును బట్టి అలవడతాయి. ఇంకా సత్యశీలమైన ప్రవర్తన స్వర్గానికి చేర్చుతుందనీ, విశ్వాసహీనమైన (అసత్యమైన) ప్రవర్తన నరకానికి చేర్చుతుంది.

ఈ హదీథ్ అమలు చేయటం వలన కలిగే లాభాలు :-

  1. ఎల్లప్పుడూ సత్యం పలకడమనే మంచి గుణం వైపునకు ఇస్లాం ధర్మం పిలుస్తుంది
  2. మన మాటలు మన విశ్వాసాన్ని నిరూపించేవిగా ఉండాలని ఇస్లాం నిర్ధేశిస్తున్నది.
  3. స్వర్గానికి చేరే మార్గాలలో సత్యం పలకటం అనేది కూడా ఒక దారి
  4. ఎల్లప్పుడూ సత్యాన్ని పలికే విశ్వాసిని ప్రజలు మరియు అల్లాహ్ ప్రేమిస్తారు.
  5. మనతో పనిచేసే వారిని, స్నేహితులను సత్యవంతులుగా మారటానికి హితబోధ చేస్తూ, వారిని భయంకరమైన నరకాగ్ని నుండి రక్షించే ప్రయత్నం చేయవలెను
  6. అబద్ధం చెప్పటాన్ని ఇస్లాం నిషేధిస్తున్నది
  7. అసత్యవంతులకు అబద్ధాలు చెప్పే చెడు అలవాటును వదిలివేయమని  సలహా ఇవ్వటం మన బాధ్యత. అసత్యం పలికే అలవాటు నరకానికి చేరవేస్తుంది.

హదీథ్  ఉల్లేఖించినవారి పరిచయం׃

వీరి పూర్తి పేరు అబు అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు. ప్రారంభకాలంలోనే ఇస్లాం స్వీకరించారు. ఆనాటి ప్రసిద్థి చెందిన ఇస్లాం ధర్మవేత్తలు, పండితులు మరియు జ్ఞానవంతులలో వీరొకరు. స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి దాదాపుగా 70 దివ్యఖుర్ఆన్ అధ్యాయాలు (సూరాలు) కంఠస్థం చేశారు. 60యేళ్ళ వయసులో హిజ్రీ 32 వ సంవత్సరం మదీనా లో మరణించారు.

ప్రశ్నలు

1.  “అలైకుమ్ బిశ్శిద్ఖి ఫఇన్న శ్శిద్ఖ యహ్దీ ఇలల్ ________, వ ఇన్నల్ బిర్ర యహ్దీ ఇలల్ ________, వ మా యŸజాలుర్రజులు యుశ్దుఖు వ యతహర్ర శ్శిద్ఖ హత్తా యుక్తబ ఇందల్లాహి ________, వ ఇయ్యాకుమ్ వల్ కదిబ ఫఇన్నల్ కదిబ యహ్దీ ఇలల్ ________, వ ఇన్నల్ ఫుజూర యహ్దీ ఇల________, వ మా యŸజాలు ర్రజులు యక్ ది బ వ యతహర్రల్  కదిబు హత్తా యుక్తబ ఇందల్లాహి ________”

2.  “మీ పై సత్యం పలకటం_______చేయబడినది. సత్యశీలగుణం _______కార్యాల వైపునకు దారి చూపుతుంది మరియు పుణ్యకార్యాలు ________ వైపునకు దారి చూపుతాయి మరియు ఎవరైనా ఎల్లప్పుడూ సత్యమే పలుకుతున్నట్లయితే, అల్లాహ్ దగ్గర అతడి పేరు ________గా వ్రాయబడతాడు. మరియు మీరు ఎట్టి పరిస్థితిలోను ______పలకవద్దు.

3.  ఎవరైనా ఎల్లప్పుడూ నిజం పలుకుతున్నట్లైతే, అతని గుణగణాలలో సత్యం పలికే ________చేరిపోతుంది మరియు ఎవరైనా ఎల్లప్పుడూ కావాలని అబద్ధం పలుకు తున్నట్లైతే, అతని గుణగణాలలో ________పలికే గుణం చేరిపోతుంది.

4.  మంచి, చెడు గుణాలు  _______బట్టి, మనం చేసే పనులను బట్టి అలవడతాయి.

5.  సత్యశీలమైన ప్రవర్తన ________ చేర్చుతుందనీ, విశ్వాసహీనమైన (అసత్యవంతమైన) ప్రవర్తన ________ చేర్చుతుంది.

6.  ఎల్లప్పుడూ______పలకడమనే మంచి గుణం వైపునకు ఇస్లాం ధర్మం పిలునిస్తుంది.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

%d bloggers like this: