ఓ ముస్లింలారా! అల్లాహ్ యొక్క దైవభీతిని కలిగి ఉండండి ఎల్లవేళలా ఆయన భయాన్ని కలిగి ఉండండి మరియు తెలుసుకోండి అల్లాహ్ ఈ సృష్టి ప్రదాత ఆయన ఎవరికి కోరుతాడో ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు వారు మనుషులైనా లేక ప్రదేశమైన లేక ఏదైనా సందర్భం అయినా లేక ఏదైనా ఆరాధన అయిన అది ఆయన వివేకంపై ఆధారపడి ఉంది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నారు:
وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ (నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.) ( అల్ ఖసస్ 28:68)
అల్లాహ్ ప్రజలలో నుండి ప్రవక్తలను ఎన్నుకున్నాడు. మరియు ఆ ప్రవక్తలలో ఐదుగురు ఉన్నతమైనటువంటి వారు ఇబ్రహీం, నూహ్, మూసా, ఈసా, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం). మరియు ఈ ఐదుగురిలో కూడా ఇద్దరినీ తన స్నేహితులుగా చేసుకున్నాడు. వారు ఇబ్రహీం మరియు ముహమ్మద్. మరియు ఆ ఇద్దరిలో నుండి కూడా అల్లాహ్ మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ఎన్నుకున్నాడు కనుక ఈయన ప్రవక్తల అందరిలో గొప్పవాడు.
అదేవిధంగా ప్రదేశాలలో ఘనత కలిగినటువంటిది మక్కా. అల్లాహ్ సమస్త భూమండలం నుండి మక్కాను పవిత్ర స్థలంగా ఎన్నుకున్నాడు. దాని తర్వాత మదీనా. ఈ రెండు మసీదులలో చదువుబడే నమాజుకు ఎన్నో రేట్ల పుణ్యఫలం లభిస్తుంది.
అదేవిధంగా సమయాలలో అల్లాహ్ జుమా రోజుని ఎన్నుకున్నాడు. ఈ జుమా రోజులన్నింటికీ సర్దార్. అల్లాహ్ ఈ జుమాకు ఎన్నో ప్రాధాన్యతలను ప్రసాదించాడు. కొన్ని కారణాల రీత్యా ఇతర దినాల కంటే జుమాకు ఎక్కువ ప్రాధాన్యత వొసగబడింది, వాటిలో కొన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది.
1. ఆ రోజున పెద్ద పెద్ద సంఘటనలు సంభవించాయి. ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు; “మీ రోజులలో అతి ఉన్నతమైనటువంటి రోజు జుమా రోజు, ఆరోజున ఆదం అలైహి స్సలాం పుట్టించబడ్డారు మరియు అదే రోజున ఆయన మరణించారు మరియు అదే రోజున శంఖం పూరించడం జరుగుతుంది. మరియు అదే రోజున మైకం సంభవిస్తుంది”.(అబూ దావూద్)
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)వారు ఇలా ప్రవచించారు: “సూర్యుడు ఉదయించే దినాల్లో అన్నిటికంటే శ్రేష్టమైనది జుమా రోజు, ఆ రోజున ఆదం అలైహి స్సలాం పుట్టించబడ్డారు మరియు అదే రోజున స్వర్గంలోనికి ప్రవేశించబడ్డారు మరియు అదే రోజున అక్కడి నుండి తొలగించబడ్డారు మరియు ప్రళయం కూడా జుమా రోజునే సంభవిస్తుంది”.(ముస్లిం)
2. జుమా యొక్క ప్రత్యేకత ఏమిటంటే; ఇది ప్రజలందరిని సమావేశపరిచే రోజు. అల్లాహ్ తఆల ప్రతి ఉమ్మత్ కొరకు వారంలో ఒక రోజుని ఆరాధన కొరకు నియమించాడు. ప్రజలు ఆరోజున ఆరాధన కొరకు తమను సిద్ధం చేసుకునేవారు. మరియు సృష్టి ప్రారంభం మరియు ముగింపు శిక్ష లేక ప్రతిఫలం గురించి తెలుసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేసుకునేవారు. అయితే ఇలా అతిపెద్ద సమావేశం అల్లాహ్ ముందు హాజరు అవుతుంది, కాబట్టి వారి యొక్క లక్ష్యాలను, ఉద్దేశాలను పూర్తి చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రోజు శుక్రవారం.
కావున అల్లాహ్ ఈ ఉమ్మత్ యొక్క గొప్పదనం దృష్ట్యా ఆరాధన మరియు విధేయత కొరకు మరియు మానవ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడం కొరకు ఈ ప్రపంచక జీవితం యొక్క వాస్తవికతను తెలుసుకొనుట కొరకు మరియు ఈ ఆకాశం మరియు భూమి ఒక రోజు అంతమైపోతుందన్నటువంటి విషయాన్ని గ్రహించడం కొరకు మరియు ప్రతి వస్తువు తిరిగి ఆ సృష్టికర్త వైపు మరలి వెళ్ళవలసింది అన్న విషయాన్ని తెలుసుకోవడం కొరకు అల్లాహ్ జుమా రోజును చట్టబద్ధం చేశాడు.
మరియు అదే విధంగా మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు కూడా ఈ జుమా రోజున ఫజర్ నమాజులో (అలీఫ్ లామ్ మీమ్ సజ్దహ్) మరియు (సూరయే ఇన్సాన్) పారాయణం చేసేవారు ఎందుకంటే ఈ రెండు సూరాలలో సృష్టి ప్రారంభం మరియు అంతం గురించి, ప్రళయ దినం రోజున సమావేశం అవడం గురించి, సమాధుల నుండి లేవడం గురించి, స్వర్గ నరకాల గురించి ప్రస్తావించబడింది.
3. జుమా యొక్క ప్రత్యేకత ఏమిటంటే; ఈ జుమా వారంలో ఒకసారి వచ్చేటువంటి పండుగ. హదీసులో ఈ విధంగా ఉంది. ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియచేశారు: “నిశ్చయంగా ఇది ఒక పండుగ. అల్లాహ్ విశ్వాసుల కొరకు శుక్రవారం పండుగ దినంగా చేశాడు. కావున ఎవరైతే ఈ జుమాకు రావాలనుకుంటారో వారు తప్పక గుసుల్ చేసి మరియు సుగంధ పరిమళాలను పూసుకొని రావాలి. మరియు ఇలా అన్నారు మీరు మిస్వాక్ ను తప్పని సరి చేసుకోండి”. (ఇబ్నె మాజా)
4. జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే; అల్లాహ్ అందరికంటే ఉత్తమ సమాజానికి ఈ జుమా యొక్క ఘనతను ప్రసాదించాడు. ఇది మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఉమ్మత్. వేరే ఇతర ఉమ్మతులకు దీనిని ప్రసాదించలేదు. అబూ హురైరా మరియు హుజైఫా వారి ఉల్లేఖనాల ప్రకారం ప్రవక్త వారు ఇలా తెలియచేశారు: “మనకంటే ముందు గతించిన వారిని అల్లాహ్ ఈ శుక్రవారం నాడు నుంచి తప్పించాడు, యూదుల కొరకు శనివారాన్ని మరియు క్రైస్తవుల కొరకు ఆదివారాన్ని ఇచ్చాడు మరియు అల్లాహ్ మన కొరకు ఈ ఘనత కలిగిన శుక్రవారాన్ని ప్రసాదించాడు”. (ముస్లిం)
5. జుమా యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే; ఆ రోజున ఫజర్ నమాజ్ జమాతుతో ఆచరించడం అన్ని నమాజుల కంటే ఉత్తమమైనది. ఇబ్నే ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త గారు ఇలా ప్రవచించారు: “అల్లాహ్ వద్ద నమాజులన్నింటిలో కెల్లా ఘనత కలిగినటువంటిది జుమా రోజున ఫజర్ నమాజ్ జమాతుతో ఆచరించడం”. (సహీహుల్ జామె)
6. జుమా యొక్క మరో ప్రత్యేకత; జుమా రోజున ఫజర్ నమాజులో మొదటి రకాతులు (సూర సజ్దా) మరియు రెండవ రకాతులు (సూర ఇన్సాన్) పారాయణం చేయడం. అబూ హురైరా కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు జుమా రోజున ఫజర్ నమాజులో మొదటి రకాతులో “అలీఫ్ లామ్ మీమ్ తన్జీల్” మరియు రెండవ రకాతులు సుర ఇన్సాన్ పారాయణం చేసేవారు (బుఖారి, ముస్లిం)
షేఖుల్ ఇస్లాం ఇమామ్ ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) ఈ విధంగా తెలియజేశారు; ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు జుమా యొక్క ఫజర్ నమాజులో ఈ రెండు సూరాల పారాయణం ఎందుకు చేసేవారు అంటే ఆ రోజున ఏదైతే జరిగిందో మరియు జరగబోతుందో దాని సమాచారం అందులో ఉంది వాటిలో ఆదం అలైహిస్సలాం పుట్టుక పుట్టుక గురించి అంతిమ దినం గురించి మరణాంతర దినం గురించి ఇవన్నీ శుక్రవారం రోజునే సంభవించాయి మరియు సంభవిస్తాయి. కాబట్టి ఈ రెండు సూరాల ద్వారా ఉమ్మత్ వీటిని గుర్తు చేయడం జరుగుతుంది.
7. జుమా యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజున ప్రత్యేకంగా సూరె కహఫ్ పారాయణం జరుగుతుంది. అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియచేసారు: “ఏ వ్యక్తి అయితే జుమా రోజున సుర కహఫ్ పారాయణం చేస్తాడు అతని కొరకు రెండు జుమాల మధ్య (నూర్) ప్రసాదించబడుతుంది” (హాకిం)
8. జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే; జుమా రోజున ఒక ప్రత్యేకమైన ఘడియ ఉంది, అందులో ఎవరైనా అల్లాహ్ తో దువా వేడుకుంటే అల్లాహ్ దాన్ని తప్పక స్వీకరిస్తాడు. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారు చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకసారి జుమా గురించి చెబుతూ ఇలా అన్నారు: “ఆ రోజులో ఒక ఘడియ ఉంది. ఏ ముస్లిం దాసుడయినా ఆ ఘడియను పొంది, ఆ సమయంలో అతను నిలబడి నమాజు చేస్తూ అల్లాహ్ ను ఏదయినా అడిగితే అల్లాహ్హ్ తప్పకుండా ఇస్తాడు.” ఆ సమయం చాలా తక్కువగా ఉంటుందని ఆయన తన చేత్తో సంజ్ఞ చేసి చూపించారు”.(బుఖారి ముస్లిం)
9. జుమా యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే; ఎవరైనా జుమా రోజున రాత్రి లేక పగలు మరణిస్తారో అల్లాహ్ తఆల వారిని సమాధి విపత్తు నుండి రక్షిస్తాడు. అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా తెలియజేశారు: “ముస్లింలలో నుండి ఎవరైనా జుమా రోజు రాత్రి లేక పగలు మరణిస్తే అల్లాహ్ వారిని సమాధి విపత్తు నుంచి రక్షిస్తాడు”. (తిర్మిజి)
10. జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే అందులో జుమా నమాజు జరుగుతుంది. అది అత్యంత ఘనత కలిగినటువంటి నమాజు అల్లాహ్ తఆల ఖురాన్ లో ప్రత్యేకంగా ఈ నమాజ్ కు పిలవడం గురించి ప్రస్తావన చేశాడు అల్లాహ్ ఇలా అంటున్నాడు:
(ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్ (పిలుపు) ఇవ్వబడినప్పుడు, మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరుగెత్తండి. క్రయవిక్రయాలను వదలి పెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది.) (అల్ జుమా:9)
11. జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే; ఆ రోజున చేయబడేటువంటి దానధర్మాల యొక్క పుణ్యఫలం రెట్టింపు చేయబడుతుంది అబ్దుల్ రజాక్ తమ పుస్తకం ముసన్నఫ్ లో కఆబ్ (రదియల్లాహు అన్హు) గారి ద్వారా ఉల్లేఖించారు ఆయన ఇలా అంటున్నారు, జుమా రోజున చేసేటువంటి దానధర్మాలు వేరే దినాలలో చేసేటువంటి దానధర్మాల కంటే ఉత్తమం
ఇబ్నె ఖయ్యిం (రహిమహుల్లాహ్) తెలియపరుస్తున్నారు; “జుమా రోజున చేసేటువంటి దానధర్మాలు వేరే ఇతర దినాలలో చేసేటువంటి దానధర్మాల కంటే ఎంతో ఉన్నతమైనవి, ఎందుకంటే వారంలోని దినాలన్నింటిలో కెల్లా జుమా రోజు దానం చేయడం యొక్క ఉపమానం వేరే ఇతర నెలల్లో దానధర్మాలు చేయడం కన్నా రంజాన్ మాసంలో దానధర్మాలు చేయడం లాంటిది“
నేను షేఖుల్ ఇస్లాం ఇమామ్ ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) ను గమనించాను, ఆయన జుమా రోజున నమాజ్ కొరకు ఇంటి వద్ద నుండి బయలుదేరేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి రొట్టెలను తీసుకొని వెళ్లేవారు మరియు దారి మధ్యలో వాటిని గుప్త దానం చేసేవారు.
12. జుమా రోజు యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే; ఆ రోజున ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిపై అతి ఎక్కువగా దరూద్ పంపడం అభిలాషనీయం. ఎందుకంటే ఆ రోజున పంపబడేటువంటి దరూద్ యొక్క ఘనత మరే ఇతర ఆచరణకు లేదు. అది ఎందుకంటే ఈ ఉమ్మత్ సమాజానికి ఇహపరలోకాలలో ఏవైతే మేళ్ళు మరియు లాభాలు చేకూరాయో, అవి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ద్వారానే లభించాయి, కనుక ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ ఆయన హక్కును నెరవేర్చాలి మరియు జుమా యొక్క రాత్రిలో మరియు పగటిపూట అతిగా దరూద్ పటిస్తూ ఉండాలి, మరియు అందులో ఉన్నటువంటి అర్ధాన్ని భావాన్ని తెలుసుకోవాలి.
ఇవి జుమా కు సంభందించినటువంటి కొన్ని ప్రత్యేకతలు. వీటి ద్వారానే జుమా కు అల్లాహ్ వద్ద మరియు విశ్వాసుల వద్ద గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది.
అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక ,ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక ,అల్లాహ్ మనందరినీ క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాత్తాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత
ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి, అల్లాహ్ మీ పై కరుణించుగాక! అల్లాహ్ మీకు ఒక పెద్ద ఆచరణకై అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి మరియు దైవదూతలకు కూడా ఇదే ఆజ్ఞాపించాడు అల్లాహ్ ఇలా అన్నాడు:
إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا (నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.) (అల్ అహ్ జాబ్ 33:56)
ఓ అల్లాహ్ నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు,తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు మరియు ప్రేమించు. ఓ అల్లాహ్! ఇస్లాం ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్ ,ముష్రిక్ లను అవమానబరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపాశకులకు నీ సహాయాన్ని అందించు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, సూరతుల్ జుముఆ (అధ్యాయం 62), ఆయతులు 9 నుండి 11 వరకు వివరించబడ్డాయి. శుక్రవారం నమాజు కొరకు పిలుపు వచ్చినప్పుడు వ్యాపారాలు మరియు ఇతర ప్రాపంచిక పనులను విడిచిపెట్టి అల్లాహ్ ధ్యానం వైపునకు పరుగెత్తాలని విశ్వాసులకు ఇచ్చిన ఆదేశంపై దృష్టి సారించబడింది. ఖురాన్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడానికి మరియు ఆచరించడానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసులు ఎంత అవసరమో నొక్కి చెప్పబడింది; హదీసును తిరస్కరించడం అంటే పరోక్షంగా ఖురాన్‌ను తిరస్కరించడమే అని స్పష్టం చేయబడింది. శుక్రవారం రోజు యొక్క ఘనత, ఆ రోజున స్నానం చేయడం, త్వరగా మస్జిద్‌కు రావడం, మరియు నిశ్శబ్దంగా ఖుత్బా వినడం వల్ల కలిగే గొప్ప పుణ్యాల గురించి హదీసుల ఆధారంగా వివరించబడింది. ప్రవక్త ఖుత్బా ఇస్తుండగా ఒక వ్యాపార బృందం రాకతో కొందరు సహాబాలు పరధ్యానంలో పడిన చారిత్రక సంఘటనను ప్రస్తావిస్తూ, వినోదం మరియు వ్యాపారం కంటే అల్లాహ్ వద్ద ఉన్న ప్రతిఫలం ఎంతో మేలైనదని ఈ ఆయతులు గుర్తుచేస్తున్నాయని బోధించబడింది. ప్రాపంచిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ, అల్లాహ్‌ను నిరంతరం స్మరించుకోవడమే నిజమైన సాఫల్యానికి మార్గమని ప్రసంగం ముగిసింది.
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మాబాద్.
సోదర మహాశయులారా, సోదరీమణులారా, అల్హందులిల్లాహ్, అల్లాహ్ యొక్క దయ వల్ల మనం ఈరోజు తఫ్సీర్ క్లాస్ ప్రారంభం చేయబోతున్నాము. ఈనాటి మన తఫ్సీర్ క్లాస్‌లో మనం ఇన్షాఅల్లాహ్, సూరతుల్ జుముఆ, ఆయత్ నంబర్ తొమ్మిది నుండి చివరి వరకు మూడు ఆయతుల వ్యాఖ్యానం తెలుసుకోబోతున్నాము.
అయితే సోదర మహాశయులారా, సోదరీమణులారా, నేను అల్లాహ్ యొక్క దయతో సూరతుల్ జుముఆ ఆయత్ నంబర్ తొమ్మిది నుండి తిలావత్ ప్రారంభించబోతున్నాను. ఇంతలో మీరు మీ యొక్క బంధుమిత్రులందరినీ కూడా గుర్తు చేసుకోండి, ఈనాటి ఈ శుభప్రదమైన ప్రోగ్రాంలో హాజరవ్వడానికి వారికి ప్రోత్సహించండి.
వాస్తవానికి, మనం ముస్లిముగా, అల్లాహ్‌ను విశ్వసించే వారిగా పుట్టడం లేదా తర్వాత ఇస్లాం ధర్మంలో చేరడం, ఆ తర్వాత ఇస్లాం ధర్మం నేర్చుకోవడానికి ఇలాంటి అవకాశాలు మనకు కలుగుతూ ఉండటం ఇది అల్లాహ్ యొక్క ఎంతో గొప్ప దయ. ఎందుకంటే ధర్మ విద్యనే మనిషికి అల్లాహ్‌కు చాలా దగ్గరగా చేస్తుంది. ధర్మ విద్య అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో మనం నేర్చుకుంటూ ఉంటే మనం నశించిపోయే ఈ లోకం యొక్క వ్యామోహంలో పడకుండా పరలోక చింతలో మనం గడపగలుగుతాము మన యొక్క ఈ ఇహలోక రోజులు. ధర్మ విద్య అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో మనం అభ్యసిస్తూ ఉంటే, అల్లాహ్ ఆదేశించినవి ఏమిటో వాటిని ఆచరిస్తూ, అల్లాహ్‌కు ఇష్టం లేని, ఆయన మన కొరకు నిషేధించినవి ఏమిటో తెలుసుకొని వాటికి దూరంగా ఉండగలుగుతాము.
ఈ రోజుల్లో మనలో అనేక మంది పురుషులు గానీ, స్త్రీలు గానీ ఎన్నో రకాల పాపాల్లో పడి, కరోనా మహమ్మారి యొక్క ఈ కాలంలో ఆర్థిక ఇబ్బందులకు గురియై వారు ఒక రకంగా నష్టపోతున్నారు. కానీ వాస్తవానికి ఇది అంత పెద్ద నష్టం కాదు. మహా భయంకరమైన పెద్ద నష్టం ఆ శాశ్వతమైన పరలోక జీవితాన్ని గుర్తించకపోవడం, అక్కడి ఆ జీవితం మనకు సాఫల్యం, స్వర్గం ప్రాప్తించడానికి ఈ లోకంలో చేసుకునేటువంటి కొన్ని సత్కార్యాలు చేసుకోకపోవడం.
అయితే రండి సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఇప్పుడు అల్లాహ్ యొక్క దయతో ఆ ఆయతుల యొక్క తిలావత్ మనం ప్రారంభం చేస్తున్నాము. ముందు మీరు చాలా శ్రద్ధగా ఖురాన్ ఈ ఆయతులను ఆలకించండి. ఖురాన్ యొక్క తిలావత్ చేయడం ఎలా పుణ్య కార్యమో, పూర్తి శ్రద్ధాభక్తులతో ఖురాన్‌ను వినడం కూడా అంతే పుణ్యం. ఒక్కో అక్షరానికి పదేసి పుణ్యాలు, ఇంకా ఎన్నో రకాల లాభాలు.
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ. (అవూదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్) (శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను)
ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరుగెత్తండి. క్రయవిక్రయాలను వదిలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది.మరి నమాజు ముగిసిన తర్వాత భూమిలో విస్తరించి, అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషించండి. ఎక్కువగా అల్లాహ్‌ను స్మరిస్తూ ఉండండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.
జనుల పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడు ఏ వ్యాపార వస్తువు అమ్మబడుతున్నట్లు చూసినా, ఏ వినోద వస్తువు కనవచ్చినా, వారు దాని వైపుకు పరుగెడుతున్నారు, నిన్ను నిలబడి ఉన్న స్థితిలోనే విడిచిపోతున్నారు. వారికి చెప్పు, అల్లాహ్ దగ్గర ఏదైతే ఉందో అది వినోదం కన్నా, వర్తకం కన్నా ఎంతో మేలైనది. అల్లాహ్ ఉపాధి ప్రదాతలలోకెల్లా ఉత్తముడు.
అల్హందులిల్లాహ్, మీరు సూరతుల్ జుముఆ, సూరా నంబర్ 62, ఆయత్ నంబర్ తొమ్మిది నుండి 11 వరకు మూడు ఆయతుల తిలావత్ మరియు ఈ మూడు ఆయతుల అనువాదం కూడా విన్నారు. ఇక రండి, ఈ ఆయతులలో మనకు బోధపడుతున్న విషయాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం.
సోదర మహాశయులారా, తఫ్సీర్ ఇబ్ను కసీర్, ఖురాన్ యొక్క తఫ్సీర్‌లలో చాలా ప్రఖ్యాతి గాంచిన తఫ్సీర్. ఈ తఫ్సీర్ ధర్మవేత్తలందరూ కూడా ఏకీభవించిన మరియు ఎలాంటి విభేదం లేకుండా దీని యొక్క విషయాలను ఇందులో ఖురాన్ యొక్క వ్యాఖ్యానం ఖురాన్‌తో మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి హదీసులతో ఏదైతే చేయబడినదో దానిని ఏకీభవిస్తారు.
ఈ ఆయతుల యొక్క వ్యాఖ్యానం మనం చూశామంటే, అందులో ఇప్పుడు మనకు ఉపయోగపడే ప్రయోజనకరమైన విషయాలలో, ఈ ఆయతులో అల్లాహు తాలా విశ్వాసులను సంబోధించాడు. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا (యా అయ్యుహల్లజీన ఆమనూ – ఓ విశ్వాసులారా). ఇంతకు ముందు అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది, హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు తాలా అన్హు) వారి గురించి కూడా చెప్పడం జరిగింది.
అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు తాలా అన్హు) చెబుతున్నారు, ఖురాన్‌లో ఎప్పుడు మీరు “యా అయ్యుహల్లజీన ఆమనూ, ఓ విశ్వాసులారా” అని చదివితే, చెవి మాత్రమే కాదు, మీ హృదయంలో ఉన్నటువంటి వినే శక్తిని కూడా ఉపయోగించి పూర్తి శ్రద్ధాభక్తులతో మీరు వినండి. అల్లాహ్ విశ్వాసులకు ఏదైనా ఆదేశం ఇస్తున్నాడు లేదా అల్లాహు తాలా ఏదైనా పాప కార్యం నుండి వారిని ఆపుతున్నాడు. ఈ విధంగా సోదర మహాశయులారా, మనం “యా అయ్యుహల్లజీన ఆమనూ” అని ఎక్కడ చదివినా గానీ అబ్దుల్లా ఇబ్ను మస్ఊద్ (రదియల్లాహు తాలా అన్హు) వారి యొక్క ఈ మాటను గుర్తించుకోవాలి మరియు వెంటనే అల్లాహ్ నాకు ఇస్తున్న ఆదేశం ఏమిటి అన్న యొక్క మాటపై శ్రద్ధ వహించాలి.
ఇందులో అల్లాహ్ ఇచ్చిన ఆదేశం ఏంటి? إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِن يَوْمِ الْجُمُعَةِ (ఇదా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుముఅహ్ – శుక్రవారం నాడు నమాజు కొరకు పిలువబడినప్పుడు). జుమా నమాజుకు మిమ్మల్ని పిలువబడినప్పుడు, దీని ద్వారా ఈ ఆయత్ యొక్క ఆరంభంలోనే విశ్వాసానికి సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన గొప్ప విషయం మనకు తెలుస్తుంది. అదేమిటండీ?
ఈ రోజుల్లో కొంతమంది ఎవరైతే ఖురాన్ తప్ప ఇంకా వేరే హదీస్ అన్నది లేదు అని అంటున్నారో, వారు వాస్తవానికి ఖురాన్‌ను కూడా తిరస్కరిస్తున్నారు. శ్రద్ధ వహించండి, వారు ఖురాన్‌ను నమ్ముతున్నాం అన్నట్లుగా భావిస్తున్నారు కానీ వాస్తవానికి హదీసును తిరస్కరించి ఖురాన్నే తిరస్కరిస్తున్నారు వారు.
ఎలా అంటారా? ఇక్కడ ఈ ఆయతులో “إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِن يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّهِ وَذَرُوا الْبَيْعَ” (ఇదా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుముఅతి ఫస్అవ్ ఇలా జిక్రిల్లాహి వ జరుల్ బైఅ) ఇప్పుడు నేను చదివినంత ఈ ఆయత్ యొక్క భాగం హదీసు లేనిది దీని యొక్క ఆచరణ రూపం మనం దాల్చలేము. అందుకొరకు, ఖురాన్‌లో అనేక సందర్భాలలో అల్లాహు తాలా ఖురాన్‌తో పాటు హదీసును కూడా ప్రస్తావించాడు. ఆ హదీసును నమ్మడం తప్పనిసరి. హదీసును నమ్మనిది ఖురాన్‌ను మనం సరియైన రీతిలో అనుసరించలేము.
ఒక చిన్న ఉదాహరణ గ్రహించండి, మీరు ఇప్పుడు ఇదే ఆయతులో, వేరే బయటి ఉదాహరణలు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు చదువుతున్న ఆయతు గురించి. “ఇదా” (ఎప్పుడైతే), “నూదియ” (పిలువబడుతుందో), “లిస్సలాతి” (నమాజు కొరకు), “మిన్ యౌమిల్ జుముఅహ్” (జుమా రోజున/శుక్రవారం నాడు). “ఫస్అవ్” (ఫస్అవ్ యొక్క శాబ్దిక అర్థం ఇక్కడ ‘పరుగెత్తండి’). “ఇలా జిక్రిల్లాహ్” (అల్లాహ్ యొక్క జికర్ వైపునకు). ఖురాన్‌లో “జికర్” అన్న పదం ఎన్నో సందర్భాలలో వచ్చింది. ఎక్కడ ఏ భావం తీసుకోవాలి? అది హదీస్ ద్వారా స్పష్టం అవుతుంది. “ఫస్అవ్” అన్న పదం ఇక్కడ వచ్చింది. నమాజుకు పరుగెత్తి రావాలా? లేదు, పరుగెత్తి రావడం హదీసులో నిషేధించబడింది. అయితే ఇక్కడ భావం ఏంటి? అది హదీస్ నిర్ధారిస్తుంది. అలాగే “నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుముఅహ్”. జుమా రోజున నమాజు కొరకు పిలువబడినప్పుడు. అంటే ఇక్కడ ఏ నమాజు? ఫజర్ నమాజా? జుమా రోజు ఫజర్ కూడా ఉంది. జుమా రోజు జొహర్ కూడా ఉంది, అస్తగ్ఫిరుల్లాహ్, జుమా రోజు ఫజర్ కూడా ఉంది, జుమా రోజు అసర్ కూడా ఉంది, జుమా రోజు మగ్రిబ్ కూడా ఉంది, జుమా రోజు ఇషా కూడా ఉంది. ఏ నమాజ్ కొరకు? జుమ్మా నమాజ్. జుమ్మా నమాజ్ అన్నట్లుగా హదీస్ ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అర్థమవుతుందా?
ఇక ఇందులో అల్లాహ్ ఇచ్చినటువంటి ఆదేశం, వ్యాపారాన్ని వదలండి. వ్యాపారాన్ని ఎన్నింటికి, ఎన్ని గంటలకు వదులుకోవాలి? ఏంటి వివరం? జుమా కొరకు రావడానికి ఎలాంటి సంసిద్ధతలు అవసరం? జుమా నమాజులో ఎన్ని రకాతులు ఉంటాయి? మరి జుమా నమాజు ఎవరెవరిపై విధిగా ఉంది? జుమా నమాజులో పాల్గొన్న వారు ఆ రోజు జొహర్ నమాజ్ చేయాలా, చేయకూడదా? ఇలాంటి వివరాలన్నీ కూడా ఎక్కడి నుండి దొరుకుతాయండీ? హదీస్ ద్వారా. దేని ద్వారా? హదీస్ ద్వారా. అందుకొరకే ఎవరైతే ఖురాన్‌ను మాత్రమే నమ్మాలి, హదీసును నమ్మే అవసరం లేదు అంటున్నారో, వాస్తవానికి వారు ఖురాన్‌ను కూడా తిరస్కరిస్తున్నారు.
సూరతుల్ ఖియామాలో గనక మీరు చూశారంటే, అల్లాహు తాలా చాలా స్పష్టంగా తెలిపాడు: “إِنَّ عَلَيْنَا جَمْعَهُ وَقُرْآنَهُ، فَإِذَا قَرَأْنَاهُ فَاتَّبِعْ قُرْآنَهُ، ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ” (ఇన్న అలైనా జమ్అహూ వ ఖుర్ఆనహూ, ఫఇదా కరఅనాహు ఫత్తబిఅ ఖుర్ఆనహూ, సుమ్మ ఇన్న అలైనా బయానహూ). ఓ ప్రవక్తా! ఈ ఖురాన్ గ్రంథాన్ని మీ హృదయ ఫలకంపై అవతరించిన తర్వాత, మీ హృదయంలో దానిని మంచి విధంగా భద్రపరచడం, సమకూర్చడం, మీరు ఏ మాత్రం మర్చిపోకుండా ఉండి దానిని కాపాడటం ఇదంతా కూడా మా బాధ్యత. కనుక మీరు ఎప్పుడైతే జిబ్రీల్ వచ్చి మీకు ఖురాన్ చదివిస్తున్నారో మీరు శ్రద్ధగా వినండి. ఆ తర్వాత మీరు అదే విధంగా పఠిస్తూ ఉండండి. ఆ తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడు? “సుమ్మ ఇన్న అలైనా బయానహూ” (ఆ తర్వాత దానిని వివరించే బాధ్యత కూడా మాదే). ఈ ఖురాన్‌ను అవతరించడం ఎలాగైతే మా బాధ్యతో, అలాగే దీనిని విడమరచి తెలపడం, విశదపరచడం, దాని వివరాలను మీకు తెలియజేయడం కూడా మా బాధ్యత.
అందుకొరకే సోదరులారా, సోదరీమణులారా, ఈ రోజుల్లో కొందరు మన సమాజంలో కనబడుతున్నారు. ఒక విచిత్ర విషయం తెలుసా మీకు? ఇప్పటి వరకు ఎంతమంది హదీసును తిరస్కరించే వారు నా దృష్టిలో వచ్చారో, నేను ఎంత మందితోనైతే మాట్లాడానో, వారిలో ఏ ఒక్కరు కూడా ధర్మ విద్యను దాని మూలాధారాలతో నేర్చుకున్న వారు కాదు. దీని ద్వారా ఏం తెలుస్తుంది? విద్య కొరత అనేది మనిషిని పెడమార్గంలో పెడుతుంది. అందుకొరకు, ఈ రోజు మనం సూరతుల్ జుముఆ, సూరా నంబర్ 62, ఆయత్ నంబర్ 9 వ్యాఖ్యానంలో, ఆరంభంలో ఖురాన్‌తో పాటు హదీస్ యొక్క ప్రాముఖ్యతను, ఖురాన్‌ను విశ్వసించినట్లు హదీసును కూడా విశ్వసించాలని, హదీస్ అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా రుజువైన ప్రవక్త వారి వాక్కు, మాట, ఆదేశం గానీ, పలుకులు గానీ, ప్రవచనాలు గానీ, హదీసుల ద్వారా రుజువైన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఆచరణ గానీ, లేదా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు సహాబాలు ఏదైనా చేశారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దానిని ఒప్పుకున్నారు లేదా దానిని ఖండించారు, హదీస్ కౌలీ, ఫెలీ, తఖ్రీరీ (ప్రవచనం, ఆచరణ, లేదా ప్రవక్త వారి అంగీకారం) ఇవన్నీ కూడా సహీ హదీసులతో ఏవైతే రుజువై ఉన్నాయో, వాటన్నిటినీ కూడా నమ్మడం తప్పనిసరి విషయం.
ఇక ఈ ఆయతులలో అల్లాహు తాలా జుమాకు సంబంధించిన కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. కానీ ఆ ఆదేశాల వివరాల్లోకి, జుమాకు సంబంధించిన మసలే మసాయిల్, ఆదేశాలు, అవన్నీ వివరాల్లోకి నేను ఈ రోజు వెళ్ళడం లేదు. ఈ ఆయతుల యొక్క వ్యాఖ్యానం మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి, ఈ సూరా పేరు సూరతుల్ జుముఆ. ఇందులో కేవలం రెండే రెండు రుకూలు ఉన్నాయి. మొత్తం 11 ఆయతులు ఉన్నాయి. నేను తొమ్మిదవ ఆయత్ ఏదైతే మొదలు పెట్టానో, ఇది రెండవ రుకూ. మొదటి రుకూలో యూదుల ప్రస్తావన ఉంది. అయితే, మొదటి రుకూలో యూదుల ప్రస్తావన తర్వాత, మిగతా చివరి మూడు ఆయతుల్లో అల్లాహు తాలా జుమాకు సంబంధించిన ఆదేశాలు ఇచ్చాడంటే, ఇక్కడ ఏదో గొప్ప మర్మం ఉంది. ఇక్కడ ఏదో గొప్ప విషయం ఉంటుంది, దానిని మనం చాలా గ్రహించాల్సిన అవసరం కూడా ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా? నాతో పాటు మీరు విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా? నేను ఏమంటున్నాను? శ్రద్ధ వహించండి. సూరా పేరు సూరతుల్ జుముఆ. అయితే ఈ సూరా మొత్తం జుమా ఆదేశాలు ఇందులో లేవు. చివరి మూడు ఆయతుల్లోనే ఉన్నాయి. ముందు ఎనిమిది ఆయతుల్లో యూదుల ప్రస్తావన ఉంది. అయితే యూదుల ప్రస్తావన తర్వాత జుమా యొక్క ఆదేశాల ప్రస్తావన, జుమా యొక్క ప్రస్తావన వచ్చిందంటే ఇందులో మర్మం ఏమిటి అని మీరు ఏదైనా గ్రహించే ప్రయత్నం చేశారా అని నేను అడుగుతున్నాను.
అయితే దీనిని గ్రహించడానికి రండి సహీ బుఖారీలోని హదీస్, సహీ ముస్లిం షరీఫ్‌లోని హదీస్ మనం వింటే ఇన్షాఅల్లాహ్ ఈ యొక్క మర్మాన్ని, ఈ యొక్క ఔచిత్యాన్ని గ్రహించగలుగుతాం. ఏంటి హదీస్? బుఖారీలోని సహీ హదీస్, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని అబూ హురైరా (రదియల్లాహు తాలా అన్హు) ఉల్లేఖించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు:
نَحْنُ الآخِرُونَ السَّابِقُونَ يَوْمَ الْقِيَامَةِ (నహ్నుల్ ఆఖిరూన అస్సాబిఖూన యౌమల్ ఖియామ) (మనం (కాలంలో) చివరి వాళ్ళం, కానీ ప్రళయ దినాన అందరికంటే ముందుంటాం)
అనుచర సంఘాల ప్రకారంగా, ఈ ప్రపంచంలో వచ్చిన ప్రవక్తల అనుయాయుల ప్రకారంగా చూసుకుంటే మనం చిట్టచివరి వాళ్ళం. అంటే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చిట్టచివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, మనం ప్రవక్త వారి అంతిమ సమాజం. కానీ, అస్సాబిఖూన యౌమల్ ఖియామ (ప్రళయ దినాన అందరికంటే ముందుంటాం). ప్రళయ దినాన అందరికంటే ముందు మనం లేపబడటం, హాజరు చేయబడటం, లెక్క తీర్పు తీసుకోబడటం, స్వర్గంలో ప్రవేశింపబడటం ఇంకా ఎన్నో కార్యాలలో అందరికంటే ముందుగా ఉంటాం. సుబ్ హానల్లాహ్, ఇంత గొప్ప ఘనత అల్లాహ్ ఇచ్చాడు గమనించండి.
అయితే, بَيْدَ أَنَّهُمْ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلِنَا (బైద అన్నహుమ్ ఊతుల్ కితాబ మిన్ కబ్లినా – మనకంటే ముందు వారికి గ్రంథం ఇవ్వబడింది). మనకంటే ముందు గ్రంథం పొందిన వారు ఎందరో ఉన్నారు, యూదులు, క్రైస్తవులు, ఇంకా. అయినా వారి కంటే ముందు మనల్ని లేపడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు, “సుమ్మ హాదా” ఇక ఈ దినం అంటే ఈ జుమ్మా రోజు – يَوْمُهُمُ الَّذِي فَرَضَ اللَّهُ عَلَيْهِمْ (యౌముహుముల్లజీ ఫరదల్లాహు అలైహిమ్ – అల్లాహ్ వారిపై విధిగావించిన రోజు). ఈ జుమా విషయం, జుమా యొక్క ఘనత మనకంటే ముందు జాతి వారికి కూడా ఇవ్వడం జరిగింది. فَاخْتَلَفُوا فِيهِ (ఫఖ్తలఫూ ఫీహి). వారు అందులో విభేదించుకున్నారు. فَهَدَانَا اللَّهُ لَهُ (ఫహదానల్లాహు లహూ). అల్లాహ్ మనకు దాని సన్మార్గం కల్పించాడు, అల్లాహ్ మనకు ఆ రోజు యొక్క భాగ్యం కల్పించాడు.
ఏమైంది? فَالنَّاسُ لَنَا فِيهِ تَبَعٌ (ఫన్నాసు లనా ఫీహి తబఉన్ – కాబట్టి ప్రజలు ఈ విషయంలో మన అనుచరులు). ఇక ప్రజలు మన వెనక ఉన్నారు. الْيَهُودُ غَدًا وَالنَّصَارَى بَعْدَ غَدٍ (అల్-యహూదు గదన్ వన్నసారా బఅద గద్ – యూదులు రేపు, క్రైస్తవులు ఎల్లుండి). యూదుల వారంలోని ఒక పండుగ రోజు మాదిరిగా శనివారం, మరియు క్రైస్తవులు ఆదివారం. వారందరి కంటే ముందు శుక్రవారంలో మనం ఉన్నాము. ఈ ఘనత అల్లాహు తాలా మనకు ప్రసాదించాడు. ముస్లిం షరీఫ్‌లోని ఉల్లేఖనంలో చూస్తే, అల్లాహ్ మనకంటే ముందు జాతి వారిని వారి దుశ్చేష్టలకు కారణంగా అల్లాహ్ ఈ రోజు నుండి వారిని పెడమార్గంలో పడవేశాడు. ఇక్కడ ఒక విషయం గమనించండి, అల్లాహ్ తన ఇష్టంతో వారిని పెడమార్గంలో పడవేశారు అని కాదు. వారి దుశ్చేష్టలకు కారణంగా, వారి అవిధేయతకు కారణంగా. అల్లాహ్ జుమా రోజు వారికి ప్రసాదించాడు, కానీ వారు దానిని విలువ ఇవ్వలేదు, అల్లాహ్ ఆదేశాలను పాటించలేదు. యూదులకు శనివారం, క్రైస్తవులకు ఆదివారం నిర్ణయించాడు. మరియు మనం వారి కంటే వెనక వచ్చినప్పటికీ, వారి కంటే ముందు రోజు, శుక్రవారం రోజు అల్లాహు తాలా మనకు దాని యొక్క భాగ్యం కలుగజేశాడు.
అయితే, ఈ విధంగా రోజుల్లో వారు ఇహలోకంలో మనకు వెనక ఏదైతే ఉన్నారో, అలాగే పరలోకంలో కూడా మనం వారి కంటే ముందుగా ఉంటాము. అందరికంటే ముందు, సర్వ సృష్టిలో అందరికంటే ముందు మన యొక్క తీర్పు జరుగుతుంది అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ హదీసులో మనకు తెలియజేశారు. ఇక్కడ ఇప్పుడు మీకు ఈ రెండు హదీసులు విన్న తర్వాత అర్థమైందా? యూదుల ప్రస్తావన ముందు ఉంది ఈ సూరతుల్ జుముఆలో, తర్వాత జుమా యొక్క ప్రస్తావన వచ్చిందంటే ఇక్కడ మనకు ఒక హెచ్చరిక కూడా ఉంది. అదేమిటి? వారు ఎలాగైతే విభేదాల్లో పడ్డారో, అల్లాహ్ ఆదేశాలను త్యజించారో, తిరస్కరించారో, అలాంటి పరిస్థితి మీది రాకూడదు, మీరు చాలా శ్రద్ధగా మరియు అల్లాహ్‌తో భయపడుతూ, అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించే వారిగా మీరు ఉండండి.
ఆ తర్వాత ఆయతులను మనం గమనిస్తే, ఇమాం ఇబ్ను కసీర్ (రహిమహుల్లాహ్) ఇక్కడ కొన్ని జుమాకు సంబంధించిన ఆయత్ యొక్క వివరణ, వ్యాఖ్యానంలో కొన్ని విషయాలు తెలిపారు. మొదటి విషయం నేను ఇంతకు ముందు తెలిపినట్లు, అల్లాహ్ ఏమంటున్నాడు? فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّهِ (ఫస్అవ్ ఇలా జిక్రిల్లాహ్). అల్లాహ్ యొక్క ధ్యానం, స్మరణ వైపునకు మీరు పరుగెత్తండి. అయితే వాస్తవానికి ఇక్కడ ‘పరుగెత్తండి’ అనువాదం సరియైనది కాదు. ఇక్కడ ఇమాం ఇబ్ను కసీర్ (రహిమహుల్లాహ్) చెప్పినట్లు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ నమాజుకైనా గానీ పరుగెత్తి రావడం నుండి వారించారు. సహీ బుఖారీలోని హదీస్: إِذَا سَمِعْتُمُ الإِقَامَةَ فَامْشُوا إِلَى الصَّلاَةِ وَعَلَيْكُمُ السَّكِينَةُ وَالْوَقَارُ وَلاَ تُسْرِعُوا (ఇదా సమిఅతుముల్ ఇఖామత ఫమ్షూ ఇలస్సలాతి వ అలైకుముస్సకీనతు వల్ వఖారు వలా తుస్రిఊ – మీరు ఇఖామత్ విన్నప్పుడు, నమాజుకు నడిచి రండి, మీపై నిదానం మరియు గంభీరత ఉండాలి, తొందరపడకండి). మీరు ఇఖామత్ విన్నప్పుడు నమాజుకు నడిచి రండి. మీరు ఎలా నడిచి రావాలంటే, మీపై నిదానం, నింపాది మరియు ఒక వఖార్, ఒక మర్యాద అనేది స్పష్టంగా కనబడాలి. “వలా తుస్రిఊ” (తొందరపడకండి) – మీరు పరుగెత్తుకుంటూ రాకండి. మరొక ఉల్లేఖనంలో, మీరు పరుగెత్తుకుంటూ రాకండి, నిదానంగా రండి. ఎన్ని రకాతులు ఇమాంతో పొందుతారో చదవండి, తప్పిపోయిన రకాతులు తర్వాత చేసుకోండి.
కానీ ఇక్కడ ఈ ఆయతులో అల్లాహు తాలా “ఫస్అవ్” అని ఏదైతే చెప్పాడో, దాని భావం ఏంటి? ఇమాం హసన్ బస్రీ (రహిమహుల్లాహ్) చెప్పారు, “అమా వల్లాహి మా హువ బిస్సఅయి అలల్ అఖ్దామ్” (అల్లాహ్ సాక్షిగా, ఇది కాళ్ళపై పరుగెత్తడం కాదు). ఇక్కడ ‘సయీ’ అంటే కాళ్ళ మీద పరుగెడుకుంటూ రావడం కాదు. వారు ఇలా రావడం నుండి వారించడం జరిగింది. వలాకిన్ బిల్ ఖులూబి వన్నియ్యతి వల్ ఖుషూఅ (కానీ హృదయాలతో, సంకల్పంతో మరియు వినమ్రతతో). ఏంటి? వారి యొక్క నియత్, సంకల్పం, వారి హృదయం, సంపూర్ణ ఖుషూ, వినయ వినమ్రతతో రావాలి. కానీ ఇక్కడ భావం ఏంటి? దీనికి సంబంధించి మరొక ఇమాం ఖతాదా (రహిమహుల్లాహ్) వారు తెలిపినట్లు, దాని భావం ఏంటంటే, “అన్ తస్ఆ బిఖల్బిక వ అమలిక” (నీ హృదయంతో మరియు నీ ఆచరణతో ప్రయాసపడు). నీవు జుమా రోజున, జుమా నమాజు కొరకు ముందు నుండే అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ, సంసిద్ధత అనేది పాటిస్తూ, నీవు ముందుకు వచ్చేసేయ్.
ఈ విధంగా సోదర మహాశయులారా, ఇక్కడ మరో విషయం కూడా మీకు అర్థమైంది కదా? ఖురాన్‌ను మనం హదీసు లేకుండా సరియైన రీతిలో అర్థం చేసుకోలేము.
అయితే సోదర మహాశయులారా, ప్రవక్త మహానీయులు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా యొక్క ఘనతలో ఎన్నో విషయాలు తెలిపారు. సహీ బుఖారీలో వచ్చిన హదీస్, నిశ్చయంగా జుమా రోజు చాలా గొప్ప ఘనత గల రోజు. అదే రోజు అల్లాహు తాలా ఆదం (అలైహిస్సలాం)ని పుట్టించాడు, ఆదం (అలైహిస్సలాం)ని స్వర్గంలో పంపాడు, ఆదం (అలైహిస్సలాం) అదే రోజు స్వర్గం నుండి తీయబడ్డారు, అదే రోజు ఆయన మరణించారు, అదే రోజు ప్రళయం సంభవిస్తుంది మరియు అదే రోజున ఒక ఘడియ ఉంది, ఎవరైతే ఆ ఘడియను పొంది దుఆ చేసుకుంటారో, అల్లాహ్ ఆ ఘడియలో చేసిన దుఆని తప్పకుండా స్వీకరిస్తాడు.
మరియు ప్రవక్త మహానీయులు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), శుక్రవారం రోజున మంచి రీతిలో తలంటు స్నానం చేయాలి అని, మంచి దుస్తులు ధరించాలి అని, సాధ్యమైతే సువాసన పూసుకోవాలి అని, మరియు ఎంత తొందరగా ఇంటి నుండి బయలుదేరి మస్జిద్‌కు రాగలుగుతారో, హాజరై మౌనంగా ఉండాలి. ప్రత్యేకంగా ఖుత్బా జరుగుతున్న సందర్భంలో ఎలాంటి వృధా కార్యకలాపాలు, మాటలు మాట్లాడకుండా శ్రద్ధగా ఖుత్బా వింటూ ఉండాలి. ఒకవేళ ఖుత్బా మన భాషలో కాకపోయినప్పటికీ శ్రద్ధగా ఖుత్బా వినాలి. ఈ విధంగా అల్లాహు తాలా వారం రోజే కాదు, ఇంకా మూడు రోజులు అదనంగా మన పాపాలను మన్నిస్తాడు. అంతే కాదు, ఎంతో గొప్ప పుణ్యం ప్రసాదిస్తాడని సహీ హదీసు ద్వారా తెలుస్తుంది. అబూ దావూద్ మరియు తిర్మిజీ, ఇబ్ను మాజాలో వచ్చినటువంటి హదీస్, ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు తాలా అన్హు) ఉల్లేఖించారు:
مَنِ اغْتَسَلَ يَوْمَ الْجُمُعَةِ وَغَسَّلَ، وَبَكَّرَ وَابْتَكَرَ، وَدَنَا وَاسْتَمَعَ وَأَنْصَتَ، كَانَ لَهُ بِكُلِّ خُطْوَةٍ يَخْطُوهَا أَجْرُ سَنَةٍ صِيَامُهَا وَقِيَامُهَا (ఎవరైతే శుక్రవారం రోజున (జనాబత్ నుండి) స్నానం చేసి, త్వరగా బయలుదేరి, (మస్జిద్ కు) దగ్గరగా కూర్చుని, (ఖుత్బాను) శ్రద్ధగా విని, నిశ్శబ్దంగా ఉంటారో, అతను వేసే ప్రతి అడుగుకు ఒక సంవత్సరం ఉపవాసాలు మరియు (రాత్రి) నమాజులు చేసిన పుణ్యం లభిస్తుంది)
ఎవరైతే ఉత్తమ రీతిలో జుమా రోజు స్నానం చేస్తారో, అతి త్వరగా బయలుదేరుతారో, సాధ్యమై నడిచి వెళ్తారో, వాహనం ఎక్కి వెళ్ళరో, మరియు ఇమామ్‌కు దగ్గరగా కూర్చుంటారో, శ్రద్ధగా ఖుత్బా వింటారో, ఎలాంటి వృధా కార్యకలాపాలకు పాల్పడరో, ఏమిటి లాభం? సుబ్ హానల్లాహ్. శ్రద్ధ వహించండి, వారి ఒక్కొక్క అడుగుకు బదులుగా ఒక సంవత్సరం ఉపవాసాలు మరియు ఒక సంవత్సరం తహజ్జుద్‌లు చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది. సుబ్ హానల్లాహ్, ఎంత గొప్ప పుణ్యం చూడండి. సహీ హదీసులో వచ్చిన ఈ శుభవార్త, అందుకొరకు ఎవరూ కూడా జుమా రోజు ఆలస్యం చేయకుండా, జుమా రోజు ఎలాంటి అశ్రద్ధలో ఉండకుండా, ఆటపాటల్లో సమయాలు వృధా చేయకుండా త్వరగా మస్జిద్‌కు వచ్చే ప్రయత్నం చేయాలి. మరియు ఎంతోమంది మస్జిద్‌లో హాజరవుతారు. ఒకవేళ ఖుత్బా వారి భాషలో కాకుంటే వెనక మాట్లాడుకుంటూ ఉంటారు, మొబైల్‌లలో ఆడుకుంటూ ఉంటారు, ఇంకా వేరే వృధా కార్యకలాపాలు చేసుకుంటూ ఉంటారు. అలా చేసే వారికి ఈ గొప్ప పుణ్యం అనేది లభించదు.
మరియు ఎవరైతే ఎంత ముందుగా నమాజుకు హాజరవుతారో జుమా రోజు, సహీ బుఖారీలోని హదీసులో వారికి మరొక గొప్ప శుభవార్త ఇవ్వడం జరిగింది. దాని యొక్క సారాంశం నేను తెలియజేస్తున్నాను, ఎవరైతే మొదటి ఘడియలో వస్తారో వారికి ఒక ఒంటె ఖుర్బానీ చేసినంత పుణ్యం, ఎవరైతే రెండవ ఘడియలో వస్తారో వారికి ఒక ఆవు ఖుర్బానీ ఇచ్చినంత పుణ్యం, ఎవరైతే మూడవ ఘడియలో వస్తారో వారికి ఒక మేక ఖుర్బానీ ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది, మరియు ఎవరైతే నాలుగో ఘడియలో వస్తారో ఒక కోడి అల్లాహ్ మార్గంలో దానం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది, మరియు ఎవరైతే ఐదవ ఘడియలో వస్తారో వారికి ఒక కోడి గుడ్డు అల్లాహ్ మార్గంలో దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇక ఆ తర్వాత, ఎప్పుడైతే ఇమాం వచ్చేస్తారో ఖుత్బా ఇవ్వడానికి, ప్రత్యేకంగా ఎవరైతే దైవదూతలు హాజరవుతారో ఈ ఐదు ఘడియల్లో వచ్చిన వారి పేరు నమోదు చేసుకోవడానికి, ఈ ప్రత్యేక రిజిస్టర్లలో, తర్వాత వచ్చిన వారి యొక్క పేర్లు నమోదు కావు. అందుకొరకు ఎలాంటి ఆలస్యం చేయకూడదు. జుమా రోజున మిస్వాక్ చేయడం, సువాసన పూసుకోవడం, ఎంతో పరిశుభ్రంగా రావడం, ఇది చాలా ఉత్తమ విషయం అని ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు తాలా అన్హు) వారి యొక్క హదీసులో కూడా మనకు ఈ విషయాలు బోధపడుతున్నాయి.
ఇంకా సోదర మహాశయులారా, మీరు గనక ఆయతును గమనిస్తే అక్కడ అల్లాహు తాలా చెబుతున్నాడు, “ఫస్అవ్ ఇలా జిక్రిల్లాహ్“. అల్లాహ్ యొక్క జిక్ర్, ధ్యానం వైపునకు హాజరవ్వండి. ఇక్కడ అల్లాహ్ యొక్క జిక్ర్ అంటే ఏమిటి? అల్లాహ్ యొక్క జిక్ర్ అంటే ఇక్కడ ఖుత్బా. ఇమాం ఏదైతే ఖుత్బా ఇస్తారో ఆ ఖుత్బాలో కూడా రావాలి. అంటే ఏమిటి? ఇమాం మెంబర్ పై వచ్చేకి ముందు వచ్చేస్తే, కనీసం ఒక చాలా గొప్ప పుణ్యం మనం పొందుతాము, ప్రత్యేకంగా దైవదూతలు ఎవరైతే హాజరవుతారో వారి యొక్క రిజిస్టర్లలో కూడా మన పేరు వచ్చేస్తుంది.
అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎవరైతే చాలా చాలా అనారోగ్యంగా ఉన్నారో, మస్జిద్ కు హాజరయ్యే అంతటువంటి శక్తి లేదో, మరియు ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో, ఇంకా చిన్న పిల్లలు మరియు స్త్రీలు, ఇలాంటి వారిపై జుమాలో హాజరు కావడం విధిగా లేదు. కాకపోతే వారిలో ఎవరైనా జుమాలో వచ్చారంటే, జుమాలో వచ్చినటువంటి గొప్ప పుణ్యాలు తప్పకుండా పొందుతారు. మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆ తర్వాత సహాబాలు, తాబియీన్, తబే తాబియీన్, ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు కూడా అల్హందులిల్లాహ్ సహీ హదీసుల్లో వచ్చిన దాని ప్రకారం, స్త్రీలకు కూడా మస్జిద్‌లలో వచ్చేటువంటి అవకాశం కలుగజేయాలి. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కారణంగా అలాంటి సౌకర్యం లేకుంటే అది వేరు విషయం. కానీ వారి కొరకు ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేయడం ఇది ప్రవక్త వారి సాంప్రదాయం, హదీసుల్లో దీనికి నుంచి ప్రత్యేకమైన ఆదేశాలు వచ్చి ఉన్నాయి.
ఆ తర్వాత అల్లాహు తాలా తెలిపాడు, “వ జరుల్ బైఅ” (క్రయవిక్రయాలను వదిలిపెట్టండి). ప్రత్యేకంగా ఈ జుమాకు సంబంధించి ఒక గొప్ప అనుగ్రహం అల్లాహ్ మనపై చేసినది గుర్తు చేసుకోవాలి. అదేమిటి? అల్లాహు తాలా ఇంతకు ముందు జాతులపై కాకుండా ప్రత్యేకంగా మనపై అనుగ్రహించిన ఒక గొప్ప అనుగ్రహం జుమా రోజున ఏమిటంటే, జుమా నమాజు యొక్క మొదటి ఖుత్బా ఆరంభం అయ్యేకి కొంచెం ముందు వరకు మనం వ్యాపారంలో ఉండవచ్చు. జుమా నమాజు పూర్తి అయిపోయిన తర్వాత కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు. కేవలం ఇంత సమయం మాత్రమే అల్లాహు తాలా “వ జరుల్ బైఅ” అని ఆదేశించాడు, కార్యకలాపాలు, వర్తకాలు, వ్యాపారాలు అన్నీ కూడా వదులుకోండి అని. కానీ ఇంతకు ముందు జాతులపై ఎలా ఉండినది? పూర్తి వారి ఆ వారంలో ఒక్క రోజు అన్ని కార్యకలాపాలు, వర్తకాలు, వ్యాపారాలు వదిలేసి అల్లాహ్ యొక్క ఆరాధనలో నిమగ్నులై ఉండటం. ఇది కూడా గమనించండి, అల్లాహ్ యొక్క ఎంత గొప్ప దయ మనపై. అయితే ఎవరైతే ఇమాం వచ్చి మెంబర్ పై ఏదైతే ఎక్కుతాడో మరియు ముఅజ్జిన్ అజాన్ ఇస్తాడో, దాని తర్వాత ఎవరైనా వ్యాపారం చేస్తే, అతడు ఒక హరాం పని చేసిన వాడు అవుతాడు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. చాలా మంది ఎన్నో ప్రాంతాల్లో చూడడం జరుగుతుంది, అటు ఖుత్బా జరుగుతూ ఉంటుంది, ఇటు బయట మస్జిద్ ముంగట ఇత్తర్లు, సుర్మాలు, టోపీలు, మిస్వాకులు, ఇంకా వేరే కొన్ని, ఎవరైతే మస్జిద్ కు దగ్గర దగ్గరగా కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటారో, వారు వ్యాపారాలు నడిపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా చాలా తప్పు విషయం, పొరపాటు.
అల్లాహు తాలా వెంటనే ఏం గుర్తు చేస్తున్నాడు గమనించండి, “జాలికుమ్ ఖైరుల్లకుమ్ ఇన్ కున్తుమ్ తలమూన్” (మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది). అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విషయం, ఖురాన్‌ను మనం చదువుతూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి. అల్లాహ్ ఏమంటున్నాడు? మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది. ఏంటి? వర్తకాన్ని వదిలేసి నమాజు కొరకు హాజరవ్వడం. అయ్యో, నేను డ్యూటీ చేసుకోకుంటే నాకు కూడు ఎక్కడ వస్తది? నేను నా భార్యా పిల్లలకు ఏం తినబెట్టాలి? ఈ విధంగా మనం ఆలోచిస్తాము. కానీ అల్లాహు తాలా పూర్తి జుమ్మా రోజు మొత్తం 12 గంటలు పగలంతా కూడా మీరు వదిలేసుకోండి వ్యాపారాన్ని అనట్లేదు. కనీసం ఈ జుమా యొక్క సమయం ఏదైతే ఉంటుందో, ఎందులోనైతే మనం అల్లాహ్‌ను ఆరాధిస్తామో ఆ కొన్ని నిమిషాలు మాత్రమే. ఇది కూడా అల్లాహ్ కొరకు పాటించని వాడు, అల్లాహ్ కొరకు ఈ నమాజ్ చేయడానికి తన వ్యాపారాన్ని, తన వర్తకాన్ని, తన పనులను, డ్యూటీని, జాబ్‌ని వదులుకొని వాడు, తాను అనుకుంటున్నాడు కావచ్చు, నమాజుకు పోయి ఏం సంపాదిస్తారు, నేను ఇంత మంచి జీతం తీసుకుంటున్నా, ఎంత మంచి పని చేసుకుంటున్నా. కానీ అల్లాహ్ అంటున్నాడు, కాదు, ఎవరైతే తమ యొక్క డ్యూటీని, తమ యొక్క ఉద్యోగాన్ని, తమ యొక్క వ్యాపారాన్ని, తమ యొక్క వర్తకాన్ని వదిలి నమాజు జుమ్మాకు హాజరయ్యారో, “జాలికుమ్ ఖైరుల్లకుమ్”, ఇది మీ కొరకు మంచిది. తెలియకుంటే ధర్మ ఆధారంగా తెలుసుకోండి, “తఅలమూన్”.
ఆ వెంటనే ఏమంటున్నాడో చూడండి అల్లాహు తాలా, “ఫఇదా ఖుదియతిస్సలాహ్“. ఎప్పుడైతే నమాజు పూర్తి అయిపోతుందో, “ఫన్తషిరూ ఫిల్ అర్ద్“. వెళ్ళండి, భూమిలో సంచరించండి. “వబ్తగూ మిన్ ఫద్లిల్లాహ్“. అల్లాహ్ యొక్క ఈ ఫద్ల్, అల్లాహ్ యొక్క అనుగ్రహం, అల్లాహ్ యొక్క దయ, దాన్ని అన్వేషించండి.
ఇరాఖ్ ఇబ్ను మాలిక్ (రదియల్లాహు తాలా అన్హు) ఉల్లేఖనం వచ్చింది. ఆయన జుమా నమాజు చేసుకున్న తర్వాత వెళ్ళేవారు బయటికి. “అల్లాహుమ్మ ఇన్నీ అజబ్తు దఅవతక” (ఓ అల్లాహ్, నేను నీ పిలుపుకు స్పందించాను). ఓ అల్లాహ్ నీవు పిలిచావు, జుమాలో హాజరవ్వని, నేను వచ్చాను. “వ సల్లైతు ఫరీదతక” (మరియు నీవు విధిగావించిన నమాజును నెరవేర్చాను). నేను ఈ ఫర్జ్‌ను నెరవేర్చాను, చదివాను. “వన్తషర్తు కమా అమర్తనీ” (మరియు నీవు ఆదేశించినట్లే విస్తరించాను). నీవు చెప్పావు కదా అల్లాహ్, “ఫన్తషిరూ”, సంచరించండి, బయటికి వెళ్ళండి, బయటికి వచ్చేసాను. “ఫర్జుఖ్నీ మిన్ ఫద్లిక” (కాబట్టి నీ అనుగ్రహంతో నాకు ఉపాధిని ప్రసాదించు). ఓ అల్లాహ్, నీ యొక్క అనుగ్రహం నాకు ప్రసాదించు. “వ అన్త ఖైరుర్రాజిఖీన్” (నీవే ఉత్తమ ప్రదాతవు). నీవే అతి ఉత్తమ ప్రదాతవు. ఇబ్ను అబీ హాతింలో ఈ ఉల్లేఖనం ఉంది.
మరికొందరు ధర్మవేత్తలు, సలఫే సాలెహీన్ చెప్పారు, ఎవరైతే జుమా నమాజు తర్వాత వ్యాపారంలో నిమగ్నులవుతారో, అల్లాహు తాలా వారికి ఎంతో అనుగ్రహం, ఎంతో శుభం కలుగజేస్తాడు. అయితే ఇక్కడ భావం ఏంటి? నమాజు సమయం ఎంతనైతే ఉందో, అందులో పూర్తి శ్రద్ధాభక్తులతో నమాజ్ చదవాలి.
కానీ మళ్ళీ ఇక్కడ గమనించండి మీరు, వెంటనే అల్లాహ్ ఏమంటున్నాడు? وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا (వజ్కురుల్లాహ కసీరన్). అల్లాహ్‌ను మీరు అధికంగా స్మరించండి, అల్లాహ్ యొక్క జికర్ ఎక్కువగా చేయండి. لَّعَلَّكُمْ تُفْلِحُونَ (లఅల్లకుమ్ తుఫ్లిహూన్). అప్పుడే మీరు సాఫల్యం పొందుతారు. గమనిస్తున్నారా? మీరు నమాజ్ చేశారు, తర్వాత వెళ్ళిపోయారు, వ్యాపారంలో నిమగ్నులయ్యారు. కానీ ఆ వ్యాపార సమయంలో కూడా మీరు అల్లాహ్‌ను ధ్యానించండి. మీరు అమ్ముతున్నప్పుడు, కొంటున్నప్పుడు, మీరు ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు, ఎవరి నుండి ఏదైనా తీసుకుంటున్నప్పుడు, అల్లాహ్‌ను అధికంగా స్మరించండి. పరలోక దినాన మీకు లాభం చేకూర్చేది ఏదైతే ఉందో, దాని నుండి మీ ప్రపంచ వ్యామోహం మిమ్మల్ని దూరం చేయకూడదు..
అల్లాహు అక్బర్. ఇక్కడ స్మరించండి, అల్లాహ్‌ను గుర్తుంచుకోండి, “ఉజ్కురూ” – అల్లాహ్‌ను ధ్యానించండి అంటే రెండు భావాలు. ఒకటేమిటి? ఆ వ్యాపారంలో ఉన్నా, మీరు వ్యవసాయంలో ఉన్నా, వేరే ఏదైనా మీ ఉద్యోగంలో వెళ్ళినా, మీరు ఇంకా ఎవరితోనైనా ఏదైనా కార్యకలాపాలు చేస్తూ, పరస్పరం ఏదైనా సంప్రదింపులు చేసుకుంటూ ఉన్నా, అక్కడ అల్లాహ్ ఆదేశం ఏంటి? దానిని మీరు గుర్తుంచుకొని ఆ ప్రకారంగా జీవించండి. ఇదొక భావం. రెండవ భావం, మీరు వ్యాపారంలో ఉన్నప్పటికీ, అల్హందులిల్లాహ్, సుబ్ హానల్లాహ్. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఇచ్చు పుచ్చుకుంటున్నప్పుడు, ఇన్షాఅల్లాహ్. ఈ విధంగా అల్లాహ్ యొక్క స్మరణ అనేది మీ యొక్క నోటిపై రావాలి. అల్లాహ్ యొక్క స్తోత్రం అనేది రావాలి. అల్లాహ్‌ను మీరు గుర్తిస్తూ ఉండాలి. అందుకొరకే ఒక సహీ హదీసులో వచ్చి ఉంది కదా? ఎవరైతే బజార్లో వచ్చినప్పుడు, గుర్తుంచుకోండి ఇది దుఆ, తర్వాత యూట్యూబ్ లోకి, ఫేస్బుక్ లోకి వెళ్లి మళ్ళీ ఈ దుఆను మీరు ఒకవేళ మర్చిపోతే గుర్తు చేసుకోండి, మరోసారి వినండి.
ఎవరైతే బజార్లో వెళ్లి ఈ దుఆ చదువుతారో, అల్లాహు తాలా వారికి పది లక్షల పుణ్యాలు ప్రసాదిస్తాడు, పది లక్షల పాపాలు వారి నుండి మన్నింపజేస్తాడు, మరో ఉల్లేఖనంలో ఉంది, పది లక్షల స్థానాలు వారివి పెంచుతాడు. ఏంటి దుఆ?
لاَ إِلَهَ إِلاَّ اللَّهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ (లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్) (అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు లేడు. ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వామి లేడు. సార్వభౌమత్వం ఆయనదే, స్తోత్రం ఆయనకే చెల్లును, మరియు ఆయన ప్రతి దానిపై శక్తిమంతుడు)
సాధారణంగా ఫర్జ్ నమాజుల తర్వాత అట్లా మనం చదువుతూ ఉంటాము కదా? గుర్తుంచుకోండి.
ఇమాం ముజాహిద్ (రహిమహుల్లాహ్) చెప్పారు, لا يكون العبد من الذاكرين الله كثيرا حتى يذكر الله قائما وقاعدا ومضطجعا (లా యకూనుల్ అబ్దు మినజ్-జాకిరీనల్లాహ కసీరన్ హత్తా యజ్కురల్లాహ ఖాయిమన్ వ ఖాయిదన్ వ ముద్-తజిఆ) “మనిషి నిలబడుతూ, కూర్చుంటూ మరియు పడుకుంటూ అన్ని స్థితుల్లో అల్లాహ్‌ను స్మరించేవాడే వాస్తవంగా అల్లాహ్‌ను అధికంగా గుర్తు చేసిన వాడు.”
సూరతుల్ అహ్‌జాబ్‌లో అల్లాహు తాలా ఒక శుభవార్త ఇచ్చాడు ఇక్కడ, “అజ్-జాకిరీనల్లాహ కసీరన్ వజ్-జాకిరాత్” (అల్లాహ్‌ను అధికంగా స్మరించే పురుషులు మరియు స్త్రీలు). అల్లాహ్‌ను అధికంగా గుర్తు చేసే వారు అంటే ఎవరు? ఇమాం ముజాహిద్ చెబుతున్నారు, “నడుచుకుంటూ, నిలబడుతూ మరియు పడుకుంటూ అన్ని స్థితుల్లో అల్లాహ్‌ను స్మరించేవాడే వాస్తవంగా అల్లాహ్‌ను అధికంగా గుర్తు చేసిన వాడు.”
ఆ తర్వాత సోదరులారా, చివరి ఆయత్ ఏదైతే ఉందో ఈరోజు మన పాఠంలో, సంక్షిప్తంగా దీని యొక్క భావం తెలియజేసి నేను ఈనాటి తఫ్సీర్ క్లాస్‌ను ముగించేస్తున్నాను. అదేమిటంటే, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనా చేరుకున్న ఐదు రోజుల తర్వాతనే జుమా నమాజ్ ప్రారంభం చేసేశారు. మక్కా నుండి వలస వచ్చారు కదా మదీనాకు, సోమవారం వచ్చారు మదీనాలో. ఆ తర్వాత మంగళ, బుధ, గురు, శుక్ర. శుక్రవారం వచ్చింది, ఖుబా నుండి బయలుదేరారు, మధ్యలో బనీ సాలిం బిన్ ఔఫ్ యొక్క ఇళ్ళు వచ్చాయి, అక్కడ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా చేశారు. మస్జిదుల్ జుముఆ అని ఈరోజు కూడా ఉంది, ఖుబా మరియు మస్జిదున్నబవి మధ్యలో.
అయితే, కొన్ని రోజుల తర్వాత సంఘటన ఇది. మీకు తెలిసిన విషయమే, మదీనాలో వచ్చిన తర్వాత సామూహిక పరంగా నమాజుకు సంబంధించి ఇంకా ఎన్నో రకాల ఆదేశాలు అల్లాహు తాలా కొన్ని కొన్ని సందర్భాల్లో అవతరింపజేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. మరియు మక్కా నుండి వచ్చిన వారు మదీనాలో ఆరంభంలో కొన్ని సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులకు కూడా గురయ్యారు, అనారోగ్యం పాలయ్యారు వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల. అయితే ఒక జుమా రోజు ఏం జరిగింది? ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖుత్బా ఇస్తున్నారు. ఆ సందర్భంలో బయట దేశం నుండి ఒక వ్యాపార బృందం వచ్చింది. వ్యాపార బృందం ఒక ఊరిలో వచ్చిన తర్వాత వారు డప్పు లాంటిది కొట్టేవారు ప్రజలకు తెలియాలని. అయితే, ఎప్పుడైతే ఇటు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖుత్బా ఇస్తున్నారో అదే సందర్భంలో వ్యాపార బృందం వచ్చింది. వారికి తెలియదు ఖుత్బా యొక్క ఆదేశాలు, జుమ్మా నమాజుకు సంబంధించిన పద్ధతులు. అయితే ఇక్కడ ప్రవక్త ముందు ఉన్నటువంటి వారిలో కొంతమంది ఆ సరుకులు తీసుకోవడానికి వెంటనే ప్రవక్తను ఖుత్బా ఇస్తుండగా వదిలి వెళ్ళిపోయారు. కొన్ని హదీసుల ద్వారా తెలుస్తుంది, 12 మంది మిగిలి ఉన్నారు ప్రవక్త ముందు. ప్రవక్త ఖుత్బా ఇస్తున్నప్పుడు, చాలా మంది వెళ్ళిపోయారు. అప్పుడు అల్లాహు తాలా ఈ ఆయత్ అవతరింపజేశాడు. చివరి ఆయత్ ఏంటి? “وَإِذَا رَأَوْا تِجَارَةً أَوْ لَهْوًا انفَضُّوا إِلَيْهَا وَتَرَكُوكَ قَائِمًا”. వారు ఏదైనా వ్యాపారాన్ని లేదా ఆటపాటలను చూసినప్పుడు, నిన్ను ఖుత్బా ఇస్తుండగా నిలబడి వదిలి వెళ్తారు, వాటిలో పాలు పంచుకుంటారు. “ఖుల్” (వారికి తెలపండి), “మా ఇందల్లాహి ఖైర్” (అల్లాహ్ వద్ద ఉన్నది ఎంతో మేలైనది).
అల్లాహ్ వద్ద ఉన్నది అది ఎంతో మేలైనది. అల్లాహు అక్బర్. ఇక్కడ ఈ ఆయతులో గమనించండి ఇప్పుడు, ముందు అల్లాహ్ ఏమన్నాడు? “వ ఇదా రఅవ్ తిజారతన్ అవ్ లహ్వన్” (వారు వ్యాపారాన్ని లేదా వినోదాన్ని చూసినప్పుడు). వ్యాపారం ముందు ప్రస్తావించాడు, లహ్వ్ (ఆట, పాటలు, వినోదాలు) తర్వాత. మళ్ళీ ఏమంటున్నాడు అల్లాహు తాలా, అల్లాహ్ వద్ద ఉన్నది ఎంతో మేలైనది “మినల్లహ్వి వ మినత్తిజార” (వినోదం కన్నా మరియు వర్తకం కన్నా). దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఈ రోజుల్లో ఎవరైతే నమాజులు వదిలి టీవీలు చూసుకుంటూ కూర్చుంటారో, ఈ రోజుల్లో ఎవరైతే నమాజులు వదిలి పబ్జీ ఇంకా వేరే ఆటలు, గేమ్స్ ఆడుకుంటూ ఉంటారో, ఎవరైతే నమాజు వదిలి క్రికెట్ మ్యాచెస్, ఫుట్బాల్ మ్యాచెస్, వారికి ఇష్టమైన మ్యాచ్‌లు చూసుకుంటూ ఉంటారో, ఇదంతా కూడా ఆట, వినోదం. ఇందులో మేలు లేదు. అల్లాహ్ ఎప్పుడైతే పిలిచాడో, నమాజు కొరకు రమ్మని చెప్పాడో, అందులో హాజరవ్వడం, అందులో మేలు ఉన్నది. “వల్లాహు ఖైరుర్రాజిఖీన్”. అల్లాహ్ అతి ఉత్తమ ఉపాధి ప్రదాత. అతని కంటే మేలైన ఉపాధిని ప్రసాదించేవాడు ఇంకా ఎవరూ కూడా లేరు.
సోదర మహాశయులారా, చెప్పుకుంటే విషయాలు ఇంకా చాలా ఉంటాయి, కానీ అల్లాహు తాలా ఇందులో మనకు ఇచ్చినటువంటి ఆదేశాలను మనం గ్రహించే ప్రయత్నం చేయాలి. జుమా నమాజు యొక్క ప్రాముఖ్యత ఇక్కడ ఉంది. మొన్న కూడా ఒక మిత్రుడు అడుగుతున్నాడు, ఏమని? ఎంతోమంది ముస్లిములను మనం చూస్తాము, జుమాకు హాజరవుతారు కానీ ఐదు పూటల నమాజులు చేయరు. ఎందుకు ఇలా చేస్తారు? ఇది వారి యొక్క బద్ధకం, అశ్రద్ధత. వాస్తవానికి ఇది ఇలా చేస్తున్నది వారు చాలా తప్పు చేస్తున్నారు. అల్లాహ్‌తో భయపడాలి. అల్లాహ్ ఎలాగైతే జుమా నమాజు మనపై విధిగావించాడో, ఐదు పూటల నమాజు ప్రతి రోజు విధి గావించాడు. ఐదు పూటల నమాజు చేసుకుంటూ ఉండాలి, అల్లాహ్ యొక్క ఆదేశం పాటిస్తూ ఉండాలి.
ఈ రోజుల్లో మనం ఏమంటాము? కూడు లేకుంటే ఏ నమాజులు, ఏం పనికొస్తాయి? ఈ విధంగా అంటారు కొందరు, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. ఇక్కడ కూడా అల్లాహ్ ఏమంటున్నాడో గమనించండి, మీకు తిండి ప్రసాదించేవాడు అల్లాహ్, సంపాదన అనేది, కష్టం అనేది మీరు పడాలి కానీ ఇచ్చేది అల్లాహు తాలా. అందుకొరకు అల్లాహ్ యొక్క ఆదేశాలను ధిక్కరించి మీరు కేవలం ప్రపంచ వ్యామోహంలో పడకండి.
అల్లాహు తాలా మనందరికీ ఇహపరలోకాల మేలు ప్రసాదించుగాక. ఆర్థిక ఇబ్బందుల నుండి దూరం చేయుగాక. ఈ రోజుల్లో మనలో అనేకమంది ఏదైతే నమాజ్ విషయంలో అశ్రద్ధగా ఉన్నారో, అల్లాహు తాలా ఈ అశ్రద్ధతను దూరం చేయుగాక.
జజాకుముల్లాహు ఖైరన్ వ అహసనల్ జజా. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ముందుగా, ఈ ఆడియోలోని ముఖ్య విషయాలు కింద పేర్కొనబడ్డాయి:
శుక్రవారం నమాజు కోసం పిల్లలను మస్జిద్‌కు తీసుకురావడం సరైనదేనా, వారు అల్లరి చేయడం వలన తల్లిదండ్రుల పుణ్యం తగ్గిపోతుందా అనే ప్రశ్నకు ఇందులో సమాధానం ఇవ్వబడింది. పిల్లలకు చిన్నతనం నుండే శుక్రవారం ప్రార్థనల ప్రాముఖ్యతను మరియు మస్జిద్ మర్యాదలను నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పబడింది. పిల్లలు అల్లరి చేయకుండా ఉండటానికి, వారిని ఒకేచోట వెనుక కూర్చోబెట్టడం అనే సాధారణ పొరపాటును సరిదిద్ది, ప్రతి తండ్రి తమ పిల్లలను తమ పక్కనే ఉంచుకోవాలని సూచించబడింది. ఇలా చేయడం ద్వారా పిల్లలు ఒకరితో ఒకరు ఆడుకోకుండా, ప్రశాంతంగా ఉంటారని మరియు మస్జిద్‌లో గందరగోళం జరగదని వివరించబడింది.
ప్రశ్న: షేఖ్, శుక్రవారం నాడు చాలా మంది స్త్రీలు, ఇంకా చాలా మంది పురుషులు కూడా తమ పిల్లలను తీసుకుని మస్జిద్‌కు పోతారు. ఆ మస్జిద్‌లలో ఇంకా పిల్లలు, చిన్న పిల్లలు ఇటు అటు తిరుగుతుంటారు, ఆడుకుంటూ ఉంటారు. సో వాళ్లకు నచ్చజెప్తూ, వాళ్లకు దగ్గర తీసుకుంటూ, వాళ్లతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ల తల్లిదండ్రులు. అలాంటప్పుడు కూడా ఆ శుక్రవారం రోజు పుణ్యాలు కోల్పోతామా?
జవాబు: మంచి ప్రశ్న అడిగారు మీరు, అల్హందులిల్లాహ్ (అన్ని ప్రశంసలు అల్లాహ్‌కే). శుక్రవారం రోజు పిల్లల్ని మన వెంట తీసుకుని వెళ్ళాలి. శుక్రవారం ఘనత వారికి తెలియాలి. శుక్రవారం రోజు ముస్లింల ఆరాధనల గురించి వారికి చిన్నప్పటి నుండే తెలపడం ఇది మన యొక్క బాధ్యత. కానీ, వారు పిల్లలు అయినందుకు ఏ కొన్ని పొరపాట్లు జరుగుతాయో, అందుకని ముందే తల్లిదండ్రులు మస్జిద్‌కు పిల్లల్ని పంపే ముందు పిల్లలకు నేర్పాలి. వేరే ఎవరైనా తెలియని పిల్లలు అల్లరి చేసినా, మీరు అల్లరి చేయకూడదు. మస్జిద్‌ను గౌరవించాలి, జుమా రోజును గౌరవించాలి, ఆ రోజు ఖుత్బా ఇస్తూ ఉంటారు ఖతీబ్ గారు, మనం శ్రద్ధగా వినాలి అర్థం కాకపోయినా. ఇందులో ఉన్నటువంటి ఘనతలు ఏమిటి? అని పిల్లలకు చెప్పాలి. ఇన్షా అల్లాహ్ (అల్లాహ్ తలిస్తే), మనం కూడా పిల్లల క్లాసులో ఈ విషయాలు బోధించే ప్రయత్నం చేస్తాము, ఇన్షా అల్లాహ్.
మరొక చాలా గొప్ప విషయం మనం మర్చిపోతూ ఉంటాము. అందువల్లనే పిల్లలు అల్లరి చేసుకోవడానికి ఎక్కువ అవకాశం కలుగుతుంది. అదేంటి? మన వద్ద ఒక అలవాటు ఏముంది? పిల్లలందరినీ ఒకచోట వెనక్కి పారేయండి. పిల్లలు పిల్లలు అందరూ ఒకచోట కలిసిన తర్వాత, వారికి అంత దూరపు ఆలోచన లేదు, బుద్ధి జ్ఞానాలు లేవు, ధర్మ అవగాహన లేదు. అందుకొరకు పిల్లలు పిల్లలు కలిసినప్పుడు ఇంకా ఎక్కువ అల్లరి జరుగుతుంది.
అందుకొరకు ఏం చేయాలి? ప్రతి బాధ్యుడు తమ పిల్లలను తమ వెంట ఉంచుకోవాలి. ఇదే చాలా మంచి పద్ధతి. దీని ద్వారా పిల్లలు అల్లరి చేయకుండా, ఎలాంటి గలాటా చేయకుండా ఉంటారు. ఇది చాలా మంచి పద్ధతి, దీన్ని అనుసరించే ప్రయత్నం చేయాలి.
జజాకుముల్లాహు ఖైరా (అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[32 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది. శుద్ధి & నమాజు[పుస్తకం]
వ్యాదిగ్రస్తుని నమాజ్:
నిలబడి నమాజ్ చేసే శక్తి రోగిలో లేనప్పుడు దేనికయినా ఆనుకొని నమాజ్ చేయాలి. ఈ శక్తి లేనప్పుడు కూర్చుండి చేయాలి. ఈ శక్తి కూడా లేనప్పుడు ప్రక్కన పడుకొని చేయాలి. ఈ శక్తి కూడా లేనప్పుడు వెల్లకిల పడుకొని పాదములను ఖిబ్లా వైపున ఉంచి నమాజ్ చేయాలి. సజ్దాలో రుకూ కంటే కొంచము ఎక్కువ తలను వంచాలి. రుకూ, సజ్దా చేయు శక్తి లేనప్పుడు తలతో సైగ చేయాలి. ఏ పరిస్థితిలోనయినా నమాజ్ విడనాడకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
{విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకై పిలిచినప్పుడు, అల్లాహ్ సంస్మరణ వైపునకు పరుగెత్తండి; క్రయవిక్రయాలను వదలండి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది}. (62: జుముఅహ్: 9).
జుమా ప్రత్యేకతలు:
స్నానం చేయుట, శుభ్రమైన మంచి దుస్తులు ధరించుట, దుర్వాసన నుండి అతి దూరంగా ఉండుట ఈ నాటి పత్యేక ధర్మాలు.
జుమా ప్రత్యేకతల్లోః జుమా నమాజ్ కొరకు మస్జిద్ కు శీఘ్రముగా వెళ్ళి, ఇమాం వచ్చే వరకు నఫిల్ నమాజులు, ఖుర్ఆన్ పారాయణం, అల్లాహ్ స్మరణాల్లో గడుపుట. ఇమాం ఖుత్బ (జుమా ప్రసంగం) ఇస్తున్నప్పుడు ఏ పని చేయకుండా, నిశబ్దంగా ఉండి ఖుత్బ వినుట. నిశబ్దంగా ఉండనివారు వృధా పని చేసిన వారవుతారు. వృధా పని చేసిన వారికి జుమా ఫలితం లభించదు. ఖుత్బ సందర్భంలో మాట్లాడ్డం నిషిద్ధం.
జుమా ప్రత్యేకతల్లోః ఈ రోజు సూరె కహఫ్ పారాయణం పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః
“ఎవరు సూరె కహఫ్ పఠిస్తారో వారికి తనున్న ప్రాంతం నుండి మక్కా వరకు మరియు ప్రళయం నాటికీ కాంతియే కాంతి ఉండును. ఎవరు దాని చివరి పది ఆయతులు పఠిస్తారో వారికి దజ్జాల్ వచ్చినప్పటికీ ఏమి నష్టం జరగదు”.(అల్ ముఅజముల్ ఔసత్: తబ్రానీ 2/123).
ఇమాం ఖుత్బ ఇస్తుండగా మస్జిదులో ప్రవేశించువారు రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ సంగ్రహంగా చేసుకోవాలి. అప్పటి వరకు కూర్చోకూడదు.
“మీలో ఎవరైనా మస్జిదులో ప్రవేశించినప్పుడు ఇమాం ఖుత్బా ఇస్తున్నచో రెండు రకాతులు సంగ్రహముగా చేసుకోవాలి” అని ప్రవక్త ఖుత్బ ఇస్తూ చెప్పారు. (ముస్లిం 875).
ఎవరికీ సలాం చేయకుండా నిదానంగా కూర్చోని ఖుత్బ వినాలి. ఖుత్బ తనకు తెలిసిన భాషలో కానప్పటికీ మౌనంగా ఉండాలి. ప్రక్కలో కూర్చున్న వారితో ముసాఫహ (కరచాలణం) చేయకూడదు.
ఇమాంతో జూమా నమాజ్ యొక్క ఒక రకాతు పొందినవారు జుమాను పొందినట్లే. అబూ హురైర ఉల్లేఖించిన హదీసులో ఇలా వచ్చిందిః “జుమా యొక్క ఒక రకాతును పొందినతను జుమాను పొందినాడు”. (బైహఖి). ఒక రకాతు కంటే తక్కువ పొందినతను అనగా ఇమాంతో రెండవ రకాతులోని రుకూ పొందనివాని జుమా కానట్లే. అతను జొహ్ర్ నమాజ్ నియ్యతుతో ఇమాం వెనక నమాజులో పాల్గొని ఇమాం సలాం తింపిన తరువాత జొహ్ర్ నమాజ్ పూర్తి చేసుకోవాలి.
పండుగ నమాజ్
పొద్దు పొడిసి సూర్యుడు బల్లెమంత (బారెడంత) పొడుగులో పైకి వచ్చిన తరువాత పండుగ నమాజ్ సమయం ప్రారంభం అవుతుంది. ఈదుల్ అజ్ హా (బక్రీద్ పండుగ) కొంచము ముందుగా మరియు ఈదుల్ ఫిత్ర్ (రమజాను పండుగ) కొంచము ఆలస్యంగా చేయుట మంచిది. ఈదుల్ ఫిత్ర్ కు వెళ్ళే ముందు ఖర్జూరపు పండ్లు తిని వెళ్ళుట, ఈదుల్ అజ్ హాకు వెళ్ళే ముందు ఏమీ తినకుండా వెళ్ళుట ధర్మం. బురైద రజియల్లాహు అన్హు కథనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ కొంచమైనా భుజించని వరకు ఈదుల్ ఫిత్ర్ కు వెళ్ళకపోయేవారు. ఈదుల్ అజ్ హా చేసుకునెంత వరకు ఏమీ తినక పోయేవారు”. (అహ్మద్). పండుగ రోజు మంచి దుస్తులు ధరించుట అభిలషణీయం.
పండుగ నమాజ్ రెండు రకాతులు. ఇవి ఖుత్బకు ముందు చేయాలి. అందులో ఇమాం బిగ్గరగా ఖుర్ఆను పఠించాలి. పండుగ నమాజుకు అజాను, ఇఖామతు ఏదీ లేదు. ముందు తక్బీరె తహ్రీమ చెప్పి సనా చదవాలి. తరువాత ఏడు సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ప్రతీ సారి చేతులు భుజాల వరకు ఎత్తాలి. తరువాత అఊజు బిల్లాహి మినష్షైతా నిర్రజీం, బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం మరియు సూరె ఫాతిహ, దాని తరువాత ఏదైన సూర చదవాలి. మొదటి రకాతు యొక్క రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ నిలబడిన తరువాత ఐదు సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ప్రతీ సారి చేతులు భుజాల వరకు ఎత్తాలి. సూరె ఫాతిహ మరో సూర చదివి రెండవ రకాతు పూర్తి చేయాలి. (మొదటి రకాతులో సూరె ఖాఫ్ లేదా సూరె అఅలా రెండవ రకాతులో సూరె ఖమర్ లేదా సూరె గాషియ చదవడం సున్నత్. (ముస్లిం 878, 891). (మొదటి రకాతులో ఏడు, రెండవ రకాతులో ఐదు తక్బీరుల విషయం అబూదావూదు 1149లో ఉంది).
పండుగ నమాజుకు ముందూ, వెనకా సున్నుతుగానీ, నఫిల్ గానీ ఏమీ లేవు. ఇమాంతో ఒక రకాతు పొందనివారు ఇమాం సలాం తింపిన తరువాత పూర్తి చేసుకోవాలి. ఇమాం ఖుత్బ ఇస్తున్న సమయంలో వచ్చినవారు కూర్చుండి ఖుత్బ వినాలి. ఖుత్బ ముగిసిన తరువాత పైన తెలిపిన విధానంలోనే నమాజ్ చేసుకోవాలి. ఒకరుంటే ఒంటరిగానే చేసుకోవాలి. ఇద్దరు ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే జమాఅతుతో (సామూహికంగా) చేసుకోవాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
493. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కధనం :-
శుక్రవారం రోజు ఎవరు జనాబత్ గుస్ల్ (పూర్తి స్థాయి స్నానం) చేసి (పెందలాడే) జుమా నమాజు చేయడానికి వెళ్తాడో, అతను ఒక ఒంటెను బలి ఇచ్చిన వాడవుతాడు. (తర్వాత) రెండవ వేళలో ఇలా వెళ్ళిన వ్యక్తికి ఒక ఆవును బలి ఇచ్చిన పుణ్యం లభిస్తుంది. మూడవ వేళలో వెళ్ళే వాడికి ఒక పోట్టేలును బలిచ్చిన పుణ్యం, నాల్గవ వేళలో వెళ్ళే వాడికి ఒక కోడిని బలిచ్చిన పుణ్యం లభిస్తుంది. అయిదవ వేళలో వెళ్ళేవాడు దైవమార్గంలో ఒక కోడిగ్రుడ్డును దానం చేసిన వాడవుతాడు. ఆ తరువాత ఇమామ్ మస్జిదులో ప్రవేశించగానే దైవదూతలు కూడా అతని ప్రసంగం వినడానికి వస్తారు. (ఆ తరువాత వచ్చే వారికి దైవదూతలు హాజరు వేయరు).
[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 4 వ అధ్యాయం -ఫజ్లిల్ జూముఆ]
జుమా ప్రకరణం – 2 వ అధ్యాయం – శుక్రవారం రోజు సువాసనలు పూసుకోవడం, మిస్వాక్ చేయటం మంచిది.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
ఇతరములు:
జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగం శుక్రవారం ఖుత్బా (ప్రసంగం) సమయంలో నిశ్శబ్దం పాటించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఖుత్బా జరుగుతున్నప్పుడు ఇతరులను నిశ్శబ్దంగా ఉండమని చెప్పడం కూడా నిషేధించబడినదని, అలా చేయడం శుక్రవారం నమాజ్ యొక్క పుణ్యాన్ని కోల్పోయేలా చేస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. శుక్రవారం నాడు త్వరగా వచ్చి, స్నానం చేసి, నఫిల్ నమాజ్ చేసి, మౌనంగా ఖుత్బా విన్నవారికి పది రోజుల పాపాలు క్షమించబడతాయని చెప్పబడింది. ఖుత్బా వినడం అనేది అజాన్‌కు సమాధానం ఇవ్వడం కంటే ముఖ్యమైనదని, ఆలస్యంగా వచ్చినవారు కూడా సంక్షిప్తంగా రెండు రకాతుల నమాజ్ చేసి ఖుత్బా వినడంలో నిమగ్నం కావాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.
السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله، أما بعد. (అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్.) (అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీపై వర్షించుగాక. సర్వస్తోత్రాలు అల్లాహ్‌కే శోభాయమానం. అల్లాహ్ యొక్క ప్రవక్తపై శాంతి మరియు శుభాలు కలుగుగాక.)
باب الإنصات للخطبة يوم الجمعة (బాబుల్ ఇన్సాతి లిల్ ఖుత్బతి యౌమల్ జుమా) (శుక్రవారం రోజు ఖుత్బాకు మౌనంగా వినడం అనే అధ్యాయం.)
జుమా రోజు ఖుత్బా జరుగుతున్న సమయంలో మౌనం వహించడం, గమ్మున ఉండడం.
عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: إذا قلت لصاحبك يوم الجمعة أنصت والإمام يخطب، فقد لغوت (అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్: ఇదా ఖుల్త లిసాహిబిక యౌమల్ జుముఅతి అన్‌సిత్ వల్ ఇమాము యఖ్తుబు, ఫఖద్ లగౌత)
అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “జుమా రోజు ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో నీవు నీ పక్కన ఉన్న సోదరునితో ‘మౌనం వహించు’ అని అంటే, నీవు ఒక లగ్వ్ (వ్యర్థమైన) పని చేసినవానివి అవుతావు.”
ఈ హదీస్ ద్వారా మనకు బోధపడే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి, ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో, జుమా రోజు, మనం సైలెంట్‌గా ఉండాలి, మౌనం వహించాలి. ఏ కార్యకలాపాలు చేయకూడదు, ఏ మాట మాట్లాడకూడదు.
రెండో బోధ మనకిందులో, మన పక్కన ఎవరినైనా మనం చూస్తున్నాము, కొందరు మాట్లాడుకుంటున్నారు, ఏదైనా వృధా కార్యకలాపాల్లో ఉన్నారు, వారికి కూడా మనం చెప్పకూడదు. “అరే ఇలా చేయకు,” “ఓ బాయ్, ఖామోష్ రహో,” “మౌనం వహించు,” “ప్లీజ్ సైలెంట్‌గా ఉండు” అని మనం చెప్పకూడదు. ఇది ఇమామ్ యొక్క బాధ్యత, ఇమామ్ చెప్పాలి.
ఇక అతి ముఖ్యమైన విషయం ఇందులో మనకు తెలిసింది మరొకటి ఏమిటంటే, ఒకవేళ మనం ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో వేరే ఎవరితోనైనా, “మీరు గమ్మున ఉండండి,” “మాట్లాడకండి,” “ప్లీజ్ సైలెంట్” అని మనం చెప్పామంటే, మనం లగ్వ్ చేసిన వాళ్ళం అయ్యాము అని ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు.
లగ్వ్ అంటే ఇక్కడ ఏంటి? లగ్వ్ అంటే ఇక్కడ పనికిమాలిన, వృధా మాట. అయితే, చూడటానికి ఇక్కడ గమనించండి, గమనించండి, చూడటానికి మనం ఒక మంచి పని చేశామని అనిపిస్తుంది కదా? ఒక ఇద్దరు మాట్లాడుకుంటే, “ష్, సైలెంట్ ప్లీజ్” ఈ విధంగా మెల్లగా చెప్పేశాము. మనం ఒక మంచి పని చేశాము అనే భావన మనకు ఏర్పడింది. కానీ ప్రవక్త ఏమంటున్నారు? فقد لغوت (ఫఖద్ లగౌత) – “నీవు ఒక లగ్వ్ పని చేశావు” అని. మరియు ఇక్కడ లగ్వ్ అన్నదానికి భావం, ఇమామ్ హాఫిజ్ ఇబ్నె హజర్ అస్కలానీ రహ్మతుల్లా అలై తెలిపినట్లు,
خبت من الأجر (ఖిబ్త మినల్ అజ్ర్) నీవు జుమా యొక్క పుణ్యాన్ని కోల్పోయావు.
بطلت فضيلة جمعتك (బతలత్ ఫజీలతు జుముఅతిక్) జుమాకు సంబంధించిన ఏ ఘనత, ఏ గొప్పతనం అయితే ఉందో దాన్ని నీవు కోల్పోయావు అని భావం. అల్లాహు అక్బర్.
حرم فضيلة الجمعة (హురిమ ఫజీలతల్ జుమా) జుమా యొక్క ఫజీలత్ ఏదైతే ఉందో దాని నుండి అతడు మహ్రూమ్ అయిపోయాడు
అందుకొరకు సోదర మహాశయులారా, కొన్ని ప్రాంతాల్లో మనం ఏం చూస్తూ ఉన్నాము, ప్రత్యేకంగా అరబ్ ప్రాంతాల్లో, అనేకమంది మన సోదరులు, మిత్రులు ఖుత్బా అరబీలో జరుగుతుంది, మనకేం అర్థమవుతుంది అది అని చిన్నపాటిగా గుంపులుగా చేసుకొని ఇద్దరు, ముగ్గురు, నలుగురు వెనుక కూర్చుండి పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారు. అల్లాహు అక్బర్, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇది ఇంకా మహా ఘోరమైన విషయం.
గమనించండి ఇక్కడ. ఇద్దరు మాట్లాడుకునే వారిని, “మీరు సైలెంట్‌గా ఉండండి” అని చెప్పడంలోనే పాపం ఉన్నది, జుమా యొక్క సవాబ్ (పుణ్యం) కోల్పోతున్నారంటే, ఇక ఎవరైతే మాట్లాడుతున్నారో వారు ఎంత ఘోరమైన పాపంలో ఉన్నారో గమనించండి. ఈ హదీస్ ఏదైతే మీకు వినిపించానో, సహీ బుఖారీలో ఉంది, హదీస్ నంబర్ 934, అలాగే సహీ ముస్లిం, హదీస్ నంబర్ 851.
ఇక సంక్షిప్తంగా మరొక హదీస్ కూడా మనం విందాము.
عن أبي هريرة رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال: من اغتسل ثم أتى الجمعة، فصلى ما قدر له، ثم أنصت حتى يفرغ من خطبته، ثم يصلي معه، غفر له ما بينه وبين الجمعة الأخرى، وفضل ثلاثة أيام
(అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్: మనిగ్తసల సుమ్మ అతల్ జుముఅత, ఫసల్లా మా ఖుద్దిర లహు, సుమ్మ అన్‌సత హత్తా యఫ్రుగ మిన్ ఖుత్బతిహి, సుమ్మ యుసల్లీ మఅహు, గుఫిర లహు మా బైనహు వ బైనల్ జుముఅతిల్ ఉఖ్రా, వ ఫద్లు సలాసతి అయ్యామ్)
ఎవరైతే మంచి రీతిలో స్నానం చేశారో, జుమా నమాజు కొరకు హాజరయ్యారో మరియు ఖుత్బా కంటే ముందు వచ్చి అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతులు చేశాడో (ఇది జుమా ఖుత్బా కంటే ముందు, సామాన్యంగా వీటిని మనం నఫిల్ అంటాము. జుమా కంటే ముందు ఇన్ని రకాతులు అని ఫిక్స్ లేదు. కనీసం రెండు రకాతులు, కానీ అంతకంటే ఎక్కువగా ఎన్నైనా చదవవచ్చు. ఇమామ్ ఖుత్బా స్టార్ట్ చేసేకి ముందు వరకు), ఆ తర్వాత, ఎప్పుడైతే ఇమామ్ ఖుత్బా మొదలు పెడతాడో అప్పటి నుండి ఖుత్బా పూర్తి అయ్యే వరకు అన్‌సత (أنصت) – సైలెంట్‌గా ఉన్నాడు, మౌనం వహించాడు, గమ్మున ఉండిపోయాడు. ఆ తర్వాత ఇమామ్‌తో నమాజ్ చేశాడు. ఇలాంటి వ్యక్తికి ఈ జుమా నుండి మళ్ళీ వచ్చే జుమా వరకు, అంతకంటే మూడు రోజులు ఇంకా అదనంగా, అంటే మొత్తం పది రోజుల పాపాలు అల్లాహ్‌తాలా మన్నిస్తాడు. అల్లాహు అక్బర్.
గమనించండి, పది రోజుల పాపాలు జుమా రోజు నమాజుకు హాజరై, త్వరగా వచ్చి ఎన్ని రకాతులు అంటే అన్ని చేసుకొని, ఇమామ్‌తో ఖుత్బా వినడంలో శ్రద్ధ వహించడం, మౌనం వహించడం, అలాంటి వారి కొరకు ఈ గొప్ప ఘనత ఉంది. అంటే దీని ద్వారా తెలిసింది ఏమిటి? ఒకవేళ ఎవరైనా మాట్లాడారో, మధ్యలో ఏదైనా వృధా కార్యకలాపాలు చేశారో అంటే వారు జుమా యొక్క సవాబును కోల్పోయారు.
ఇక కొందరు ఒక ప్రశ్న అడుగుతారు. వచ్చేసరికి ఏదైనా ఆలస్యం అయిపోయింది, మేము మస్జిద్‌లోకి వచ్చాము, ఇమామ్ అజాన్ ఇస్తున్నాడు. ఆ సందర్భంలో ఏం చేయాలి? రెండు రకాతులు సున్నతులు చేసుకోవాలా? లేకుంటే అజాన్ అయ్యేవరకు మేము వేచి ఉండాలా, అజాన్ యొక్క జవాబు ఇవ్వడానికి? అయితే సోదర మహాశయులారా, అజాన్ యొక్క జవాబు ఇవ్వడం చాలా పుణ్యకార్యం, కానీ ఇమామ్ యొక్క ఖుత్బా వినడం అనేది అజాన్ యొక్క జవాబు కంటే ఎక్కువ ప్రాముఖ్యత గలది గనక, సంక్షిప్తంగా రెండు రకాతులు చేసుకొని కూర్చోవాలి, ఇమామ్ యొక్క ఖుత్బా శ్రద్ధగా వినాలి.
అల్లాహ్ మనందరికీ మన జీవితంలోని ప్రతీ సమస్యలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపినటువంటి పరిష్కారాన్ని స్వీకరించి ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక.
—
494. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-
“శుక్రవారం రోజు ఇమామ్ జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు గనక మీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అంటే మీరొక పనికిమాలిన పనికి పాల్పడినవారవుతారు.”
[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 36 వ అధ్యాయం – అల్ ఇన్సాతి యౌముల్ జుమా వల్ ఇమాము యఖ్తుబ్]
జుమా ప్రకరణం – 3 వ అధ్యాయం – జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1 సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
ఇతరములు:
జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
జుమా రోజు స్నానం చేయడం, సువాసన పూసుకోవడం ధర్మం https://youtu.be/S94_5Yq3hOA [8 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా రోజు ఆచరించాల్సిన పలు సున్నతుల గురించి వివరించారు. ముఖ్యంగా, జుమా రోజు స్నానం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కొన్ని హదీసుల ప్రకారం ఇది ప్రతి ప్రౌఢ వయస్సుకు చేరిన వ్యక్తిపై విధిగా (వాజిబ్) ఉండగా, మరికొన్ని హదీసుల ప్రకారం ఇది అత్యంత ఉత్తమమైన (అఫ్దల్) చర్య. స్నానంతో పాటు, శుభ్రమైన దుస్తులు ధరించడం, అందుబాటులో ఉన్న సువాసన లేదా నూనె రాసుకోవడం, మస్జిద్‌కు తొందరగా వెళ్లడం, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా దొరికిన చోట కూర్చోవడం, మరియు ఇమామ్ ప్రసంగాన్ని (ఖుత్బా) శ్రద్ధగా, మౌనంగా వినడం వంటివి కూడా వివరించబడ్డాయి. ఈ నియమాలను పాటించిన వ్యక్తి యొక్క ఒక జుమా నుండి మరో జుమా మధ్య జరిగిన పాపాలు మరియు అదనంగా మరో మూడు రోజుల పాపాలు క్షమించబడతాయని శుభవార్త ఇవ్వబడింది.
అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్.
జుమాకు సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సూక్తులు, హదీసుల తెలుగు అనువాదం మనం వింటూ ఉన్నాము. ఇప్పుడు జుమా రోజు స్నానం చేసే ఆదేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన హదీసులు విందాము.
జుమా రోజు స్నానం (ఘుస్ల్) చేయడం
عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ ـ رضى الله عنهما ـ أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ “ إِذَا جَاءَ أَحَدُكُمُ الْجُمُعَةَ فَلْيَغْتَسِلْ ” అన్ అబ్దుల్లా హిబ్ని ఉమర రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “ఇదా జాఅ అహదుకుముల్ జుముఅత ఫల్ యగ్తసిల్”. (అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: “మీలో ఎవరు జుమాకు హాజరవుతున్నారో, వారు స్నానం చేయాలి”.) (సహీహ్ బుఖారీ 877, సహీహ్ ముస్లిం 844)
عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ ـ رضى الله عنه ـ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ “ الْغُسْلُ يَوْمَ الْجُمُعَةِ وَاجِبٌ عَلَى كُلِّ مُحْتَلِمٍ ” అన్ అబీ సయీదినిల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “అల్ గుస్లు యౌమల్ జుముఅతి వాజిబున్ అలా కుల్లి ముహ్తలిం”. (అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు స్నానం చేయడం, ప్రాజ్ఞ వయస్సుకు చేరిన ప్రతి ఒక్కరిపై విధిగా ఉంది”.) (సహీహ్ బుఖారీ 858, సహీహ్ ముస్లిం 846)
వుదూ మరియు స్నానం మధ్య ఆధిక్యత
عَنْ سَمُرَةَ بْنِ جُنْدَبٍ، قَالَ قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم “ مَنْ تَوَضَّأَ يَوْمَ الْجُمُعَةِ فَبِهَا وَنِعْمَتْ وَمَنِ اغْتَسَلَ فَالْغُسْلُ أَفْضَلُ ” అన్ సమురతబ్ని జుందుబిన్ రదియల్లాహు అన్హు ఖాల ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, “మన్ తవద్దఅ యౌమల్ జుముఅతి ఫబిహా వనిఅమత్, వ మనిగ్తసల ఫహువ అఫ్దల్”.
(సముర బిన్ జుందుబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే జుమా రోజు వుదూ చేసుకున్నారో, చాలా మంచి పని చేశాడు అతను. మరెవరైతే స్నానం చేశారో, ఈ స్నానం చేయడం అన్నది చాలా ఉత్తమం”.) (అబూ దావూద్ 354, తిర్మిది 497, నిసాయి 1379, దారిమి 1581. ఇది హసన్ కోవకు చెందిన హదీస్).
జుమా ఆచారాలు మరియు వాటి పుణ్యఫలాలు
عَنْ أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ ثُمَّ أَتَى الْجُمُعَةَ فَدَنَا وَاسْتَمَعَ وَأَنْصَتَ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ وَزِيَادَةُ ثَلاَثَةِ أَيَّامٍ وَمَنْ مَسَّ الْحَصَى فَقَدْ لَغَا
(అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఎవరైతే మంచి రీతిలో, ఉత్తమ రీతిలో ప్రవక్త చెప్పినట్లు, చూపినట్లు వుదూ చేశారో, మళ్ళీ జుమాకు హాజరయ్యాడో, మొదటి పంక్తులలో ఇమామ్‌కు చాలా దగ్గరగా కూర్చొని జుమా ప్రసంగం (ఖుత్బా) చాలా శ్రద్ధగా, మౌనంగా విన్నాడో, అలాంటి వ్యక్తికి రెండు జుమాల మధ్యలో, అంటే మొత్తం ఏడు రోజులు, ఇంకా అదనంగా మూడు రోజులు, అంటే మొత్తం పది రోజుల పాపాలు మన్నించబడతాయి. అయితే ఎవరైతే ఈ జుమా ఖుత్బా ప్రసంగం సందర్భంలో కంకర రాళ్లు కూడా ముట్టుకుంటాడో, అతని యొక్క జుమా పుణ్యమంతా కూడా వృధా అయిపోతుంది”.) (అబూ దావూద్ 1050, తిర్మిది 498. హదీస్ సహీహ్).
ఈ నాలుగు హదీసులలో మనకు తెలిసిన సారాంశం ఏమిటంటే, జుమా రోజు స్నానం చేయడం చాలా ఉత్తమమైన విషయం. సహీహ్ బుఖారీ, ముస్లిం హదీసుల ఆధారంగా కొందరు విధి అని కూడా అంటారు, ‘వాజిబున్’ అన్న పదం వచ్చింది గనక. కానీ అబూ దావూద్, తిర్మిది, నసాయి ఇంకా వేరే హదీసు గ్రంథాలలో వచ్చిన హదీసు ఆధారంగా ‘అఫ్దల్’ అన్న పదం వచ్చింది గనుక, విధి కాదు. కానీ మనిషికి అవకాశం ఉండి, సౌకర్యాలు ఉన్నప్పుడు దీనిని ఏమాత్రం వదలకూడదు.
మరొక ముఖ్య విషయం మనం గమనించాల్సింది, సామాన్యంగా మనం జుమా రోజు స్నానం చేసినప్పుడు పరిశుభ్రత కొరకు, స్నానం చేయాలి, ఈ రోజు జుమా అన్నటువంటి ఆలోచనలు, ఇరాదా, నియ్యతులు ఉంటాయి. కానీ వీటితో పాటు అతి ముఖ్యమైనది, జుమా రోజు స్నానం చేయడం విధి లేదా అతి ఉత్తమం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు గనక, ప్రవక్త ఈ ఆదేశాన్ని మనం పాటిస్తున్నాము అన్నటువంటి నియ్యత్ మనసులో ఉండేది ఉంటే, ఈ స్నానం చేయడం ద్వారా కూడా మనకు పుణ్యాలు లభిస్తాయి. ఈ విషయం మనకు నాలుగో హదీసులో కూడా చాలా స్పష్టంగా తెలిసింది. అల్లాహు తఆలా దీనికి బదులుగా ఇంకా వీటితో పాటు మరికొన్ని పుణ్య కార్యాలు ఏదైతే తెలుపబడ్డాయో, తొందరగా రావడం, ముందు పంక్తుల్లో కూర్చోవడం, ఎలాంటి వృధా కార్యకలాపాలు చేయకుండా ఉండడం, శ్రద్ధగా ఖుత్బా వినడం, వీటి ద్వారా అల్లాహు తఆలా పది రోజుల పాపాలు మన్నిస్తాడు.
జుమా రోజు సువాసన పూసుకోవడం
ఇక జుమా రోజు సువాసన పూసుకోవడం కూడా ఒక పుణ్య కార్యం. అయితే, దీనికి సంబంధించిన ఒక హదీసు విందాము.
సల్మాన్ ఫార్సీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు ఎవరైతే స్నానం చేస్తారో, మంచి విధంగా తన శక్తి ప్రకారం పరిశుభ్రత పాటిస్తాడో, మంచి దుస్తులు ధరించుకుంటాడో మరియు తన వద్ద ఉన్నటువంటి నూనె తలకు పూసుకుంటాడో మరియు అలాగే ఇంట్లో ఉన్న సువాసన కూడా పూసుకుంటాడో, ఇంకా మస్జిద్‌కు వెళ్లి మస్జిద్లో ఇద్దరి మధ్యలో విడదీయకుండా, ఎక్కడ అతనికి స్థలం దొరికిందో అక్కడ, అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతుల నమాజులు చేస్తాడో, మళ్ళీ ఇమామ్ ప్రసంగం ఇచ్చినప్పుడు, జుమా ఖుత్బా ఇచ్చినప్పుడు శ్రద్ధగా, మౌనంగా ఖుత్బా వింటాడో, అల్లాహు తఆలా ఈ జుమా నుండి వచ్చే జుమా వరకు ఈ మధ్యలో జరిగిన అతని పాపాలను మన్నిస్తాడు”. (సహీహ్ బుఖారీ 883).
ఈ హదీసులో తెలిపినటువంటి జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి ఎంత గొప్ప శుభవార్త ఇవ్వడం జరిగిందో గమనించండి. కానీ ఈ శుభవార్త ఎవరి కొరకు ఉంది? ఈ హదీసులో తెలుపబడినటువంటి ఈ జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి.
అల్లాహ్ మనందరికీ జుమా యొక్క ఘనతను దృష్టిలో ఉంచుకొని, అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానంలో జుమా కోసం సంసిద్ధతలు, తయారీలు చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక. ఆ రోజు చదవవలసిన సూర కహఫ్ ఇంకా వేరే పుణ్య కార్యాలు చేసేటువంటి సద్భాగ్యం కూడా ప్రసాదించు గాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
(9 నిముషాలు ) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)వారి 3 హదీసులు వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా Recorded : 29-4-1441
6వ అధ్యాయం – ముస్లిం అనుచర సమాజానికి శుక్రవారం వైపు మార్గదర్శనం
496. హజత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:- “ప్రపంచంలో మనం యావత్తు అనుచర సమాజాల కంటే వెనుక వచ్చాము. అయితే ప్రళయదినాన మనం అందరికన్నా మించిపోతాము. మనకు పూర్వమే యావత్తు అనుచర సమాజాలకు (దైవ) గ్రంధం లభించింది. మనకు వారి తరువాత లభించింది. (అంటే వారు గతంలోనికి పోయారు. మనం వారి వెనుక ఉన్నాం) కాని ఈ రోజు (అంటే శుక్రవారం) విషయంలో వారు దైవాజ్ఞ పాటింపుతో విభేదించారు. (అంచేత ఈ శుభదినం మనకు లభించింది. ఈ కారణంగానే మనం ప్రళయ దినాన వారిని మించిపోతాము) రేపటి దినం (శనివారం) యూదులకు లభించింది. ఎల్లుండి దినం (ఆదివారం) కైస్తవులకు లభించింది.”
1148. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) ఈ విధంగా ప్రవచించారు:
“సూర్యుడు ఉదయించే దినాల్లో అన్నిటికంటే శ్రేష్టమైనది జుమా రోజు. ఆ రోజున ఆదం పుట్టించబడ్డారు. ఆ రోజునే స్వర్గంలోకి గొనిపోబడ్డారు. తిరిగి అదే రోజున అక్కడి నుండి తొలగించ బడ్డారు.”(ముస్లిం )
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.