పిల్లల శిక్షణలో తల్లి పాత్ర – సలీం జామయి [వీడియో & టెక్స్ట్]

పిల్లల శిక్షణలో తల్లి పాత్ర
https://youtu.be/4JQEh-fctIQ [30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, పిల్లల శిక్షణలో తల్లి పాత్ర యొక్క ప్రాముఖ్యతను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. పిల్లలు అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహమని, వారిని నరకాగ్ని నుండి కాపాడటం తల్లిదండ్రుల బాధ్యత అని ఖురాన్ ఆయతుతో స్పష్టం చేయబడింది. తండ్రితో పోలిస్తే తల్లికి ఎక్కువ బాధ్యత ఉంటుందని, ఎందుకంటే పిల్లలు ఎక్కువగా తల్లితోనే గడుపుతారని ఒక హదీసు ఉటంకించబడింది. ప్రవక్త నూహ్ మరియు ప్రవక్త ఇబ్రాహీం (అలైహిముస్సలాం)ల కుమారుల ఉదాహరణల ద్వారా తల్లి విశ్వాసం పిల్లలపై ఎలా ప్రభావం చూపుతుందో తెలియజేయబడింది. అలాగే, ఇమామ్ అలీ, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్, ఇమామ్ బుఖారీ, మరియు ఇమామ్ షాఫియీ వంటి గొప్ప ఇస్లామీయ పండితులు మరియు నాయకుల జీవితాలలో వారి తల్లుల పెంపకం, భక్తి మరియు త్యాగాల పాత్రను చారిత్రక సంఘటనలతో వివరించారు. నేటి యువత మార్గభ్రష్టులు కావడానికి ధార్మిక విద్య లోపించడమే కారణమని, సమాజ సంస్కరణ జరగాలంటే బిడ్డలకంటే ముందు తల్లులకు విద్య నేర్పించడం అత్యంత ఆవశ్యకమని నొక్కి చెప్పబడింది.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడు అయిన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా! మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో ‘పిల్లల శిక్షణలో తల్లి పాత్ర’ అనే అంశం మీద ఇన్ షా అల్లాహ్ కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసు వెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులకు అనేక అనుగ్రహాలు ప్రసాదించాడు. ఆయన ప్రసాదించిన అనుగ్రహాలలో సంతానం గొప్ప అనుగ్రహం. ఎవరికైతే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సంతానము ఇవ్వలేదో, అలాంటి దంపతులకు వెళ్ళి కలిసి మాట్లాడి చూడండి, సంతానం కోసం, బిడ్డల కోసం వారు ఎంత తపిస్తూ ఉంటారో వారి మాటలు వింటే అర్థమవుతుంది. తద్వారా, ఎవరికైతే అల్లాహ్ బిడ్డలు ఇచ్చాడో, సంతానము ప్రసాదించాడో, వారు అల్లాహ్ తరఫున గొప్ప అనుగ్రహము పొంది ఉన్నారన్న విషయాన్ని గ్రహించాలి.

అయితే, ఆ సంతానం విషయంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనకు ఈ విధంగా ఆదేశిస్తున్నాడు. ఖురాన్‌లోని 66వ అధ్యాయము 6వ వాక్యంలో అల్లాహ్ ఆదేశించిన ఆ ఆదేశము ఈ విధంగా ఉంది.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا
[యా అయ్యుహల్లజీన ఆమనూ ఖూ అన్ఫుసకుమ్ వ అహ్లీకుమ్ నారా]
ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని అగ్ని బారి నుండి కాపాడుకోండి (66:6)

ఇక్కడ చాలా మంది ఆలోచనలో పడిపోతూ ఉంటారు. మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రపంచంలో ఉన్నవారికి ఆదేశిస్తున్నాడు, నరకాగ్ని ప్రపంచంలో లేదు కదండీ, పరలోకంలో కదా నరకాగ్ని ఉండేది, ప్రపంచంలో నరకాగ్ని నుండి మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని కాపాడుకోండి అని అల్లాహ్ ఆదేశిస్తున్నాడంటే దాని అర్థం ఏమిటి అని ఆలోచించుకుంటూ ఉంటే, ధార్మిక పండితులు తెలియజేసిన విషయము చూడండి, ఏ పనులు చేయడం వలన మనము వెళ్ళి నరకంలో పడిపోతామో, ఏ పాపాలు చేయడం వలన, ఏ దుష్కార్యాలు చేయడం వలన మన కుటుంబీకులు వెళ్ళి నరకంలో పడిపోతారో, ఆ పనుల నుండి, ఆ కర్మల నుండి మనము కూడా దూరంగా ఉండాలని, మన కుటుంబీకుల్ని కూడా దూరంగా ఉంచమని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేస్తున్నాడు, ఈ వాక్యానికి అర్థము అది అని ధార్మిక పండితులు వివరించారు.

ఏ పనులు చేస్తే మనిషి వెళ్ళి నరకంలో పడతాడు అంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేయమని ఆజ్ఞాపించిన పనులు చేయకపోతే నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అలాగే ఏ పనులైతే చేయవద్దు అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారించాడో, ఆ పనులు చేసేస్తే అది పాపం అవుతుంది, అప్పుడు నరకానికి వెళ్ళి పడాల్సి ఉంటుంది. కాబట్టి, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఏ పనులు చేయమని ఆదేశించాడో, ఏ పనులు చేయరాదు అని ఆదేశించాడన్న విషయాన్ని ముందు మనము తెలుసుకోవాలి, మన కుటుంబీకులకు కూడా తెలియపరచాలి, ఆ విధంగా అల్లాహ్ ఆదేశాలు మనము మరియు మన కుటుంబ సభ్యులు కట్టుబడి ఉంటే ఇన్ షా అల్లాహ్ నరకాగ్ని నుండి రక్షించబడతాము, స్వర్గానుగ్రహాలకు అర్హులవుతాము.

ఇక రండి మిత్రులారా. అల్లాహ్ ఆదేశాల గురించి మనము తెలుసుకోవాలి, మన కుటుంబీకులకు తెలియపరచాలి. మన కుటుంబీకులలో ముఖ్యంగా మన సంతానము ఉన్నారు, ఆ మన సంతానానికి అల్లాహ్ ఆజ్ఞలు తెలియజేయాలి. ఒక రకంగా సూటిగా చెప్పాలంటే, ధర్మ అవగాహన, ధార్మిక శిక్షణ వారికి ఇప్పించాలి. అయితే, బిడ్డలకు ధార్మిక శిక్షణ ఇప్పించే బాధ్యత తల్లి, తండ్రి ఇద్దరి మీద ఉంది, ఇందులో ఎలాంటి సందేహము లేదు, కాకపోతే తల్లి మీద కొంత ఎక్కువగా బాధ్యత ఉంది.

చూడండి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఈ విధంగా ప్రవచించారు.

وَالْمَرْأَةُ رَاعِيَةٌ عَلَى بَيْتِ بَعْلِهَا وَوَلَدِهِ وَهِيَ مَسْؤولَةٌ عَنْهُمْ
[వల్ మర్అతు రాఇయతున్ అలా బైతి బాలిహా వ వలదిహీ వహియ మస్ఊలతున్ అన్హుమ్]
మహిళ తన భర్త ఇల్లు మరియు సంతానము పట్ల బాధ్యురాలు. వారి బాధ్యత పట్ల ఆవిడ ప్రశ్నించబడుతుంది. (సహీహ్ బుఖారీ)

పురుషుడు కూడా బాధ్యుడే. ముఖ్యంగా ఇక్కడ మహిళ గురించి తెలియజేస్తూ, భర్త ఇల్లు మరియు సంతానము పట్ల మహిళ బాధ్యురాలు. ఆ బాధ్యత గురించి ఆమెకు ప్రశ్నించబడుతుంది కాబట్టి ఆ బాధ్యత ఆమె ఇక్కడ ప్రపంచంలో నెరవేర్చాలి అన్నారు. అలా ఎందుకన్నారన్న విషయాన్ని వివరిస్తూ ధార్మిక పండితులు తెలియజేశారు, తల్లి బిడ్డల అనుబంధము చాలా పటిష్టమైనది. బిడ్డలు తల్లి వద్ద ఎక్కువగా ఉంటారు. తండ్రి ఉద్యోగ రీత్యా, వ్యాపారము రీత్యా, ఇతర పనుల రీత్యా బయట ఎక్కువగా ఉంటాడు. కాబట్టి, బిడ్డలు తల్లి వద్ద ఎక్కువ ఉంటారు, తల్లి మాటల ప్రభావము, తల్లి చేష్టల ప్రభావము బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే చూడండి పండితులు అంటూ ఉంటారు, ‘తల్లి ఒడి శిశువుకి మొదటి బడి’. అలా ఎందుకంటారంటే బిడ్డలు తల్లి వద్ద ఎక్కువగా నేర్చుకుంటారు, తల్లి మాటల ప్రభావం బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా తెలియపరిచారు. అందుకోసమే తల్లి మీద సంతానం పట్ల కొంచెం బాధ్యత ఎక్కువ అన్న విషయాన్ని తెలియజేయడం జరిగింది మిత్రులారా.

ఇక రండి, తల్లి మాటల ప్రభావము బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది అనటానికి ఖురాన్‌లో ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా, హదీసులలో ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా అని మనం చూచినట్లయితే, ఖురాన్‌లో ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి కుమారుని ప్రస్తావన, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుని ప్రస్తావన మనకు కనిపిస్తుంది.

ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు, తూఫాను వచ్చినప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు పిలవగా, “నాన్నా వచ్చి పడవలో ఎక్కు, విశ్వాసులతో పాటు కలిసిపో, ఈ రోజు ఈ తూఫాను నుండి ఎవ్వరూ రక్షించబడరు” అంటే, పడవలెక్కి కాదండీ, నేను పర్వతం ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటాను అన్నాడు. పర్వతం ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉండగా పెద్ద అల వచ్చి తాకింది. ఆ తాకిడికి నీళ్ళలో పడి, మునిగి మరణించాడు.

ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడ్ని చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వచ్చి, “నా కుమారా, నేను కల ద్వారా ఆదేశించబడ్డాను. నేను నిన్ను బలి ఇవ్వాలని అల్లాహ్ కోరుకుంటున్నాడు, నువ్వేమంటావు?” అంటే, “నాన్నగారండీ, మీకు ఇవ్వబడిన ఆదేశాన్ని వెంటనే మీరు అమలుపరచండి. దానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు నన్ను సహనం పాటించే వారిలో చూస్తారు” అని వెంటనే ఆయన ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైపోయారు. జరిగిన విషయం మనకు తెలుసు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇస్మాయీల్ అలైహిస్సలాం వారిని కాపాడాడు, ఆకాశము నుండి ఒక పశువుని పంపించి ఆయనకు బదులుగా ఆ పశువుని జబా చేయించాడు.

అయితే ఆలోచించి చూడండి. అక్కడ నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు ప్రవక్త పొజిషన్‌లో ఉన్న తండ్రి మాట వినట్లేదు, పర్వతం ఎక్కుతాను అని ప్రయత్నించాడు, చివరికి నీట మునిగి మరణించాడు. ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడు ఇస్మాయీల్ అలైహిస్సలాం, ప్రవక్త పదవిలో ఉన్న తండ్రి మాటను వెంటనే శిరసావహించాడు, బలి అయిపోవటానికి సిద్ధమైపోయాడు. ఎందుకు వచ్చింది ఈ తేడా అంటే, ధార్మిక పండితులు ఆ విషయాన్ని కూడా వివరించారు. ఆ తేడా ఎందుకు వచ్చిందంటే, అక్కడ నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి అవిశ్వాసురాలు, అవిధేయురాలు కాబట్టి, ఆమె అవిశ్వాస ప్రభావము ఆ బిడ్డ మీద కూడా పడింది, ఆ బిడ్డ కూడా అవిశ్వాసుడయ్యాడు. ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సతీమణి హాజిరా అలైహస్సలాం గొప్ప భక్తురాలు. ఆమె భక్తి, ఆమె ఆరాధన, ఆమె ఆలోచన, ఆమె చేష్టలు వాటి ప్రభావము ఇస్మాయీల్ అలైహిస్సలాం వారి మీద పడింది. కాబట్టి ఆయన కూడా ఒక గొప్ప భక్తుడయ్యాడు. భక్తురాలి బిడ్డ భక్తుడయ్యాడు, అవిధేయురాలు బిడ్డ అవిధేయుడయ్యాడు అని ధార్మిక పండితులు తెలియజేశారు. తద్వారా తల్లి ఆలోచనల, తల్లి విశ్వాసాల, తల్లి చేష్టల, తల్లి మాటల ప్రభావము బిడ్డల మీద ఎక్కువగా ఉంటుందన్న విషయం అక్కడ స్పష్టమైపోయింది మిత్రులారా.

ఇక రండి. పూర్వం ఒక తండ్రి బిడ్డలను పిలిచి, వారు పెద్దవారైన తర్వాత సమావేశపరచి ఏమంటున్నాడంటే, “బిడ్డలారా! మీరు పుట్టిన తర్వాత నేను మీ మీద దయ చూపించాను. అలాగే, మీరు పుట్టక ముందు కూడా నేను మీ మీద దయ చూపించాను” అన్నాడు. బిడ్డలు పెరిగి పెద్దవారయ్యారు, ఆలోచించి అర్థం చేసుకునే సామర్థ్యం వారి వద్ద ఉన్నింది కాబట్టి వెంటనే నాన్నగారితో, “నాన్నగారండీ! మేము పుట్టిన తర్వాత మన కోసం మీరు కష్టపడ్డారు. మా ఆరోగ్యము రక్షించడానికి, మనకు మంచి ఆహారము తినిపించడానికి, మంచి బట్టలు ధరింపజేయటానికి, మంచి విద్య నేర్పించటానికి మీరు కష్టపడ్డారు, మా మీద దయ చూపించారు. ఇది అర్థమయింది. కానీ మేము పుట్టక ముందే మా మీద మీరు దయ చూపించారు అంటున్నారేమిటి? అది ఎలా సాధ్యమవుతుంది?” అని ఆశ్చర్యంగా వారు ప్రశ్నించినప్పుడు, ఆ తండ్రి అన్నాడు, “బిడ్డలారా! నా బిడ్డలు విద్యావంతులు, సమర్థవంతులు, క్రమశిక్షణ కలిగిన వారు, విలువలు కలిగిన వారు అవ్వాలంటే, నేను విద్యావంతురాలిని వివాహం చేసుకోవాలి. క్రమశిక్షణ కలిగిన, ధర్మ అవగాహన కలిగిన, భక్తురాలితో నేను వివాహం చేసుకోవాలి. అప్పుడే నా బిడ్డలు కూడా విద్యావంతులు, క్రమశిక్షణ కలిగిన వారు, భక్తులు అవుతారు అని నేను అందగత్తెల వెంట పడకుండా, ధనవంతురాలి వెనక పడకుండా, భక్తురాలు ఎక్కడున్నారని వెతికి మరీ నేను ఒక భక్తురాలితో వివాహం చేసుకున్నాను. అలా నేను వివాహం చేసుకోవడానికి కారణము, మీరు మంచి వారు, ప్రయోజనవంతులు, భక్తులు, సామర్థ్యము కలవారు కావాలనే ముందు చూపుతో అలా చేశాను కాబట్టి, మీరు పుట్టక ముందు కూడా నేను మీ మీద దయ చూపించాను” అని తెలియజేయగా, అప్పుడు ఆ బిడ్డలకు ఆ విషయం అర్థమయింది. తద్వారా ధార్మిక పండితులు తెలియజేసే విషయం ఏమిటంటే, మహిళ భక్తురాలు అయితే, విద్యావంతురాలు అయితే, వారి ఒడిలో పెరిగే బిడ్డలు కూడా గొప్ప భక్తులు అవుతారు, గొప్ప విద్యావంతులు అవుతారు.

దీనికి ఉదాహరణలు కూడా మనకు ఇస్లామీయ చరిత్రలో చాలా ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు ఇన్ షా అల్లాహ్ నేను మీ ముందర ఉంచుతున్నాను, చూడండి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం, అబూ బకర్ రజియల్లాహు అన్హు వారు నాయకులయ్యారు. ఆయన పరిపాలన యుగము ప్రశాంతంగా గడిచిపోయింది. ఆయన మరణానంతరం ఉమర్ రజియల్లాహు అన్హు వారు నాయకులయ్యారు. ఆయన పరిపాలన యుగము కూడా ప్రశాంతంగా గడిచిపోయింది. ఇస్లామీయ సామ్రాజ్యము విస్తరించి చాలా దూరం వరకు వ్యాపించిపోయింది. ఆ తర్వాత ఉస్మాన్ రజియల్లాహు త’ఆలా అన్హు ముస్లిముల నాయకులయ్యారు. ఆయన ప్రారంభంలో ప్రశాంతంగానే పరిపాలన జరిపారు, అయితే చివరి రోజుల్లో పెద్ద పెద్ద ఉపద్రవాలు తలెత్తాయి. చివరికి ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు షహీద్ చేయబడ్డారు. అప్పటికే ఇస్లామీయ సామ్రాజ్యము చాలా దూరం వరకు వ్యాపించి ఉంది. పెద్ద పెద్ద ఉపద్రవాలు తలెత్తి ఉన్నాయి, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు షహీద్ చేయబడ్డారు. ఆ తర్వాత నాయకుని పోస్టు ఖాళీగా ఉంది. ఎవరు బాధ్యతలు చేపడతారు అని ఎవరి వద్దకు వెళ్ళి మీరు బాధ్యతలు చేపట్టండి అంటే, ఎవరూ సాహసించట్లేదు, ఎవరూ ముందుకు వచ్చి ఆ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే పరిస్థితులు అలా క్లిష్టతరంగా మారి ఉన్నాయి కాబట్టి, ఉపద్రవాలు అలా తలెత్తి ఉన్నాయి కాబట్టి, ఎవరూ సాహసించలేకపోయారు.

అలాంటప్పుడు, అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ముందుకు వచ్చి, బాధ్యతలు స్వీకరించి, తలెత్తి ఉన్న ఆ పెద్ద పెద్ద ఉపద్రవాలన్నింటినీ ఆరు నెలల లోపే పూర్తిగా అణచివేశారు. పరిస్థితులన్నింటినీ అల్హందులిల్లాహ్ చక్కదిద్దేశారు.

మరి అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారిలో అలాంటి సామర్థ్యము ఎక్కడి నుంచి వచ్చింది అని మనము కొంచెం ఆయన చరిత్రను వెతికి చూస్తే, అలీ రజియల్లాహు అన్హు వారు జన్మించినప్పుడు, వారి తండ్రి, అనగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చిన్నాన్న, వారి వద్దకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళారు. చిన్నాన్న దగ్గరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళి, చిన్నాన్న గారి వద్దకు, మీ కుటుంబంలో చాలా మంది బిడ్డలు ఉన్నారు, వారందరికీ పోషించే భారం మీ మీద ఎక్కువగా పడిపోతూ ఉంది కాబట్టి, అలీని నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్ళి పెంచుకుంటాను అని చెప్పగా, చిన్నాన్న సంతోషంగా అలీ రజియల్లాహు అన్హు వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతికి ఇచ్చేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారిని, ఆయన పుట్టినప్పుడు పసితనంలో తీసుకొని వచ్చి, విశ్వాసుల మాత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారి చేతికి ఇచ్చి, ఈయనకు మీరు పోషించండి, మంచి బుద్ధులు నేర్పించండి అని చెప్పగా, ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా అలీ రజియల్లాహు అన్హు వారిని తీసుకొని, అలీ రజియల్లాహు అన్హు వారికి మంచి భక్తి, మంచి క్రమశిక్షణ, ఇలాంటి విషయాలు నేర్పించారు. అలా ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వద్ద శిక్షణ పొందిన అలీ రజియల్లాహు అన్హు వారు పెరిగి పెద్దవారయ్యాక, అలాంటి సామర్థ్యవంతులు, ప్రయోగవంతులు అయ్యారు మిత్రులారా. కాబట్టి, తల్లి మాటల, తల్లి భక్తి, తల్లి విశ్వాసపు ప్రభావము బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది అనటానికి ఇది పెద్ద నిదర్శనం.

ఇక రండి, రెండవ ఉదాహరణగా మనం చూచినట్లయితే, నలుగురు ఖలీఫాలు, అబూ బకర్, ఉమర్, ఉస్మాన్, అలీ రజియల్లాహు అన్హుమ్ వారు. వారి పరిపాలన యుగము స్వర్ణయుగం. వారి తర్వాత ప్రపంచంలో కేవలం ఒకే ఒక వ్యక్తి వారి లాంటి పరిపాలన, న్యాయంతో కూడిన పరిపాలన కొనసాగించారు. ఒకే ఒకరు. ఒకే ఒకరికి మాత్రమే అలాంటి పరిపాలన, అంటే నలుగురు ఖలీఫాల లాంటి పరిపాలన చేయటానికి వీలు పడింది. ఆ ఒకరు ఎవరంటే, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లాహ్ వారు. మరి ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లాహ్ వారికి అలాంటి సామర్థ్యము వచ్చిందంటే, ఎలా వచ్చిందన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఆయన జీవిత చరిత్రను ఒకసారి మనము చూచినట్లయితే, ఉమర్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వెళ్ళి ఆ సంబంధము కలుస్తూ ఉంది. అది ఎలాగంటే, ఉమర్ రజియల్లాహు అన్హు వారి పరిపాలన యుగంలో, ఆయన మారువేషంలో రాత్రి పూట గస్తీ చేసేవారు. ఒక రోజు గస్తీలో మారువేషంలో వెళ్తూ ఉంటే ఒక ఇంటి వద్ద తల్లి కూతుళ్ళ మధ్య గొడవ పడుతూ ఉండే శబ్దాన్ని విని, ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందో వినటం ప్రారంభించారు.

అక్కడ తల్లి కుమార్తెతో, “ఈ రోజు పశువులు పాలు తక్కువ ఇచ్చాయి, కాబట్టి పాలలో నీళ్ళు కలుపు. వినియోగదారులందరికీ పాలు దొరికేలాగా పాలలో నీళ్ళు కలుపు,” అంటూ ఉంటే, కుమార్తె మాత్రము, “లేదమ్మా! విశ్వాసుల నాయకులు పాలలో నీళ్ళు కలపరాదు, స్వచ్ఛమైన పాలు మాత్రమే అమ్మాలి అని ఆదేశించి ఉన్నారు కాబట్టి, అలా చేయటము ద్రోహం అవుతుంది, అలా చేయకూడదమ్మా” అంటుంటే, తల్లి మాత్రము కుమార్తె మీద దబాయిస్తూ, “విశ్వాసుల నాయకుడు వచ్చి ఇక్కడ చూస్తున్నాడా? చెప్పింది చెప్పినట్టు చెయ్యి” అని దబాయిస్తూ ఉంటే, అప్పుడు భక్తురాలైన ఆ కుమార్తె తల్లితో, “విశ్వాసుల నాయకుడు చూడట్లేదమ్మా, నిజమే. కానీ ఈ విశ్వానికి నాయకుడు, విశ్వనాయకుడు ఉన్నాడు కదా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా! ఆయన చూస్తున్నాడే, మరి ఆయనకేమని సమాధానం ఇస్తారమ్మా” అని చెప్పారు. ఆ కూతురి, ఆ బిడ్డ మాటలు ఉమర్ రజియల్లాహు అన్హు వారికి చాలా నచ్చాయి. ఆమె భక్తి ఉమర్ రజియల్లాహు అన్హు వారికి చాలా నచ్చింది. వెంటనే ఆ ఇల్లుని గుర్తు పెట్టుకోండి అని చెప్పి, మరుసటి రోజు ఉమర్ రజియల్లాహు అన్హు వారి కుమారుడు ఆసిమ్ అని ఒకరుంటే, ఆయనతో ఆ బిడ్డ వివాహము చేయించటానికి వెంటనే అక్కడికి మనుషుల్ని పంపించగా, వెంటనే ఆ సంబంధము అల్హందులిల్లాహ్ ఒకే అయింది. ఆ ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ అమ్మాయిని, ఆ భక్తురాలిని కోడలుగా చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. అల్లాహు అక్బర్.

ఇక్కడికి ఆగలేదండీ, అసలు విషయం ఇప్పుడు వస్తుంది చూడండి. తర్వాత ఆ భక్తురాలికి ఒక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తెకు పుట్టిన బిడ్డే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లాహ్ వారు. ఆ విధంగా ఆ భక్తురాలి మనవడు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్. ఆయన కూడా గొప్ప భక్తుడయ్యాడు, న్యాయంగా పరిపాలన చేసి నలుగురు ఖలీఫాల తర్వాత ఐదవ ఖలీఫాగా ఆయన కీర్తి పొందారు. కాబట్టి మహిళ భక్తురాలు అయితే ఆమె భక్తి ప్రభావము ఎంత వరకు వ్యాపిస్తుందో చూడండి మిత్రులారా.

ఇక రండి మరొక ఉదాహరణ మనం చూచినట్లయితే, ప్రపంచంలో ఖురాన్, అల్లాహ్ వాక్యాలతో నిండిన సురక్షితమైన గ్రంథము. ఖురాన్ తర్వాత ఈ ప్రపంచంలో ఎలాంటి బలహీనమైన వాక్యాలు, కల్పిత వాక్యాలు లేకుండా, పరిశుద్ధమైనది మరియు నమ్మకమైనది, ప్రామాణికమైన మాటలు కలిగి ఉన్న గ్రంథము ఏది అంటే సహీ అల్-బుఖారీ. ‘అసహుల్ కితాబి బాద కితాబిల్లాహి సహీ అల్-బుఖారీ’ అని పూర్తి ప్రపంచము ఆ గ్రంథము ప్రామాణికమైన హదీసులతో నిండి ఉంది అని, పూర్తి ప్రపంచము ఆ గ్రంథాన్ని ‘అసహుల్ కితాబి బాద కితాబిల్లాహ్’, అల్లాహ్ గ్రంథము తర్వాత ప్రామాణికమైన, నిజమైన మాటలతో నిండిన గ్రంథము అని కీర్తిస్తుంది. అలాంటి గ్రంథాన్ని ప్రపంచానికి ఇచ్చి వెళ్ళిన వారు ఎవరంటే ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్, ఇమామ్ బుఖారీ అని ప్రజలందరూ ఆయనను గుర్తు చేసుకుంటూ ఉంటారు.

మరి అలాంటి గొప్ప గ్రంథాన్ని ప్రపంచానికి ఆయన కానుకగా ఇచ్చి వెళ్ళారే, ఆయన అంత ప్రయోజకవంతుడు ఎలా అయ్యాడన్న విషయాన్ని మనము ఆయన చరిత్రలో కొంచెం వెళ్ళి చూస్తే, అర్థమయ్యే విషయం ఏమిటంటే, ఆయన బాల్యంలో కంటి చూపుకి దూరమై అంధుడిగా ఉండేవారు. బాల్యంలో ఆయనకు కంటి చూపు ఉండేది కాదు. మరి, ఆయన తల్లి రాత్రి పూట నిద్ర మేల్కొని తహజ్జుద్ నమాజులో కన్నీరు కార్చి ఏడ్చి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాతో బిడ్డకు కంటి చూపు ఇవ్వాలని ప్రార్థించేది. ఆమె అల్లాహ్ తో ప్రార్థన చేస్తూ ఉంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయతలచి, ఆమె ప్రార్థన ఆమోదించి, అంధుడిగా ఉన్న ఆ బాలుడికి కంటి చూపునిచ్చాడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా. కంటి చూపు వచ్చిన తర్వాత, ఆ బాలుడు పెరిగి పెద్దవాడైన తర్వాత దేశ విదేశాలకు కాలినడకన ప్రయాణాలు చేసి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రామాణికమైన హదీసులన్నింటినీ ప్రోగు చేసి ఒక గ్రంథ రూపంలో పొందుపరిచారు. అదే సహీ అల్-బుఖారీ గ్రంథము. జాబిల్లి వెలుగులో కూర్చొని ఆయన హదీసులు రాసేవారు అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. అలాంటి చూపు అల్లాహ్ ఆయనకు ఇచ్చాడు. అయితే, ఆ చూపు రావటానికి, ఆయన అంత గొప్ప విద్యావంతుడు, భక్తుడు అవ్వటానికి కారణము ఆయన తల్లి. చూశారా? తల్లి భక్తి మరియు తల్లి విద్య యొక్క ప్రభావము బిడ్డల మీద ఎలా పడుతుందో చూడండి.

మరొక ఉదాహరణ మనం చూచినట్లయితే, నలుగురు ఇమాములు ప్రపంచంలో ప్రసిద్ధి చెంది ఉన్నారు. ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్, ఇమామ్ షాఫియీ రహిమహుల్లాహ్, ఇమామ్ అబూ హనీఫా రహిమహుల్లాహ్. ఈ నలుగురు ఇమాములలో ఇమామ్ షాఫియీ వారు గొప్ప విద్యావంతులు అని అందరికీ తెలిసిన విషయం. అందరూ ఆయన గొప్ప విద్యావంతుడన్న విషయాన్ని అంగీకరిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఆయన చాలా పుస్తకాలు రచించి ప్రపంచానికి కానుకలుగా ఇచ్చారు. అందులో ‘అర్-రిసాలా’ అనేది ఒక పెద్ద, మంచి పుస్తకం. అలాంటి పుస్తకము అంతకు ముందు ఎవరూ రాయలేకపోయారు, ఆ తర్వాత కూడా ఎవరూ రాయలేకపోయారు అని ప్రపంచంలో ఉన్న పండితులు ఆ గ్రంథం గురించి తెలియజేస్తూ ఉంటారు, ఆ పుస్తకం గురించి తెలియజేస్తూ ఉంటారు. అలాంటి విద్యతో నిండి ఉన్న పుస్తకము ప్రపంచానికి ఆయన ఇచ్చారు.

మరి అంత విద్యావంతులు, అంత గొప్ప భక్తులు, ఇమాముగా ఆయన ఖ్యాతి పొందారు అంటే, అలా ఎలా సాధ్యమైందన్న విషయాన్ని మనం ఆయన చరిత్రలో వెతికి చూస్తే, ఆయన జన్మించక ముందే లేదా ఆయన జన్మించిన కొద్ది రోజులకే ఆయన తండ్రి మరణించారు. ఆయన అనాథగా ఉన్నప్పుడు, పసితనంలోనే ఆయన అనాథగా ఉన్నప్పుడు, ఆయన జన్మించింది యెమెన్ దేశంలో. ఆయన తల్లి యెమెన్ దేశం నుండి చంటి బిడ్డను ఒడిలో పెట్టుకొని ప్రయాణం చేసుకుంటూ యెమెన్ దేశం నుండి మక్కాకు వచ్చేసింది ఆవిడ. మక్కాకు వచ్చి అక్కడ స్థిరపడి, అక్కడ ఈ ఇమామ్ షాఫియీ రహిమహుల్లాహ్ వారికి మంచి విద్య నేర్పించింది. బిడ్డను ఒడిలో తీసుకొని వచ్చి మక్కాలో పండితుల వద్ద విద్య నేర్పించారు. అక్కడ స్థిరపడి, అక్కడ కష్టపడి బిడ్డకు విద్య నేర్పించారు, ప్రయోజవంతులు చేయటానికి ఆమె కృషి చేశారు. ఆమె కృషికి ఫలితంగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇమామ్ షాఫియీ రహిమహుల్లాహ్ వారికి ఎలాంటి విద్యావంతులుగా తీర్చిదిద్దాడంటే, ఏడు సంవత్సరాల వయసులోనే ఇమామ్ షాఫియీ రహిమహుల్లాహ్ వారు పూర్తి ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసేశారు. ఆ తర్వాత లక్షల సంఖ్యలో హదీసులను ఆయన కంఠస్థం చేసేశారు. ఆ తర్వాత పెద్ద పెద్ద పుస్తకాలు రచించి ప్రపంచానికి ఆయన ఇచ్చారు. ఆ విధంగా అంత పెద్ద ప్రయోజవంతులు, విద్యావంతులు, ఇమాముగా ఆయన ప్రసిద్ధి చెందారు, ఖ్యాతి పొందారు అంటే అక్కడ ఆయన తల్లి యొక్క శ్రమ, ఆయన తల్లి యొక్క కృషి ఉంది అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి.

వీటన్నింటి ద్వారా, ఈ ఉదాహరణలన్నీ మనము దృష్టిలో పెట్టుకుంటే, మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏమిటంటే మిత్రులారా, తల్లి విద్యావంతురాలు అయితే, తల్లి భక్తురాలు అయితే, తల్లి వద్ద సామర్థ్యము ఉంటే, ఆ తల్లి భక్తి ప్రభావము, ఆ తల్లి విశ్వాస ప్రభావము, ఆ తల్లి చేష్టల మాటల ప్రభావము బిడ్డల మీద పడుతుంది. ఆ బిడ్డలు పెద్దవారయ్యి గొప్ప విద్యావంతులు, గొప్ప భక్తులు, పండితులు అవుతారు, ఇమాములు అవుతారు, ఖలీఫాలు అవుతారు, ప్రపంచానికి కానుకలు ఇచ్చి వెళ్తారు అని మనకు వీటి ద్వారా అర్థమవుతుంది. ఈ విధంగా పిల్లల శిక్షణలో తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది. తండ్రి కూడా బాధ్యుడే కానీ, బిడ్డల మీద తండ్రి కంటే తల్లి మాటల, చేష్టల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని ఈ ఉదాహరణ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది.

అలాగే, మానసిక వైద్య నిపుణులు కూడా, వైద్య రంగానికి చెందిన ఈ నిపుణులు కూడా ఏమంటుంటారంటే, తల్లి గర్భంలో బిడ్డ ఉంటున్నప్పటి నుంచి, తల్లి ఆలోచనల, తల్లి మాటల, తల్లి విశ్వాసాల ప్రభావము తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడే పడుతుంది. ఆ బిడ్డ మళ్ళీ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత తల్లి ఒడిలో ఉన్నప్పుడు మరీ ఎక్కువగా తల్లి ఆలోచనల, తల్లి మాటల, తల్లి చేష్టల, తల్లి విశ్వాసాల ప్రభావము మరీ ఎక్కువగా పడుతూ ఉంటుంది అని వైద్యులు, మానసిక వైద్య నిపుణులు కూడా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసి ఉన్నారు.

ఇక నేటి పరిస్థితుల్ని మనం ఒకసారి చూచినట్లయితే, నేటి తరం, నేటి మన యువత, నేటి మన బిడ్డలు మార్గభ్రష్టులయ్యారు, మార్గం తప్పారు, అశ్లీలతకు బానిసయ్యారు, మద్యపానానికి, జూదానికి, ఇంకా వేరే చాలా దుష్కార్యాలకు, అక్రమాలకు వారు పాల్పడుతున్నారు. అలా వారు మార్గభ్రష్టులవటానికి కారణం ఏమిటి అంటే, చాలా కారణాలు దృష్టిలోకి వస్తాయి. అందులో ముఖ్యంగా మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు బిడ్డల ధార్మిక శిక్షణ గురించి శ్రద్ధ తీసుకోవట్లేదు. బిడ్డలకు భక్తి విషయాలు నేర్పించే విషయంలో శ్రద్ధ తీసుకోవటం లేదు. బిడ్డలకు విలువలు నేర్పించాలి, బిడ్డలకు భక్తి నేర్పించాలి, మంచి చెడు అలవాట్లు వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలి అనే విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవట్లేదు. కేవలము ప్రాపంచిక విద్య, ప్రాపంచిక ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నంలోనే ఉన్నారు కానీ, భక్తి, ధర్మ అవగాహన అనే విషయం మీద వారు దృష్టి సారించట్లేదు కాబట్టి నేటి యువత, నేటి మన తరాలు, రాబోయే తరాలు వారు మార్గభ్రష్టులైపోతున్నారు. ఆ విధంగా సమాజంలో అశాంతి, అలజడులు వ్యాపించిపోతున్నాయి అన్న విషయం దృష్టికి వస్తుంది. కాబట్టి, సమాజంలో శాంతి రావాలన్నా, మన బిడ్డలందరూ మంచి క్రమశిక్షణ కలిగిన వారుగా మారాలన్నా, రాబోయే తరాల వారందరూ కూడా ప్రయోజవంతులు కావాలన్నా, వారికి ధార్మిక శిక్షణ ఇప్పించడము తల్లిదండ్రుల బాధ్యత. ముఖ్యంగా, ముఖ్యంగా తల్లులు భక్తురాళ్ళు అవ్వటం చాలా ముఖ్యము. అందుకోసమే ఒక కవి ఉర్దూలో ఈ విధంగా కవిత్వాన్ని తెలియజేశాడు,

اسلاہ معاشرہ آپ کو منظور ہے اگر
بچوں سے پہلے ماؤں کو تعلیم دیجئے

[ఇస్లాహె మాషరా ఆప్కో మంజూర్ హై అగర్,
బచ్చోంసె పెహ్లే మావోంకో తాలీమ్ దీజియే]

మీరు సమాజాన్ని సంస్కరించాలనుకుంటున్నారా?,
అలాగైతే, బిడ్డలకంటే ముందు తల్లులకు మీరు విద్య నేర్పించండి.

తల్లులు సంస్కారవంతులు, విద్యావంతులు అయితే అప్పుడు బిడ్డలు కూడా సంస్కారము కలవారు, విద్యావంతులు అవ్వటానికి మార్గము సుగమం అయిపోతుంది అని తెలియజేశారు.

కాబట్టి, నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మమ్మల్నందరికీ అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యము ప్రసాదించు గాక. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మమ్మల్నందరినీ ధర్మ అవగాహన చేసుకొని మంచి కార్యాలలో చేదోడు వాదోడుగా ముందుకు కొనసాగాలని, అల్లాహ్ మనందరికీ సద్బుద్ధి ప్రసాదించు గాక, దుష్కార్యాల నుండి, పాపాల నుండి అల్లాహ్ మమ్మల్నందరినీ దూరంగా ఉంచు గాక. ఆమీన్.

వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43475

మూత్ర తుంపరల నుండి అజాగ్రత్తగా ఉండుట | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో| టెక్స్ట్]

మూత్ర తుంపరల నుండి అజాగ్రత్తగా ఉండుట (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/3nniRG7Y6vU (12 నిముషాలు)
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో ఇస్లాంలో పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత, ముఖ్యంగా మూత్ర విసర్జన తర్వాత శుభ్రత గురించి వివరించబడింది. మూత్ర తుంపరల విషయంలో అజాగ్రత్తగా ఉండటం అనేది సమాధి శిక్షకు కారణమయ్యే ఒక పెద్ద పాపమని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీథ్ ద్వారా స్పష్టం చేయబడింది. చాడీలు చెప్పడం కూడా సమాధి శిక్షకు మరో కారణమని పేర్కొనబడింది. చిన్న పిల్లల మూత్రం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇస్లామిక్ ధర్మశాస్త్రపరమైన సులభమైన పరిష్కారాలు మరియు ఆధునిక కాలంలో మూత్రశాలల వాడకంలో ఉన్న ధార్మిక పరమైన ప్రమాదాల గురించి కూడా చర్చించబడింది.

ఇస్లాం యొక్క గొప్పతనం ఏమనగా అది మానవునికి మేలు చేయు ప్రతీ విషయం గురించి ఆదేశించింది. ఆ ఆదేశాల్లో మలినాల్ని, అపరిశుభ్రతను దూరం చేసి, మలమూత్ర విసర్జన తర్వాత నీళ్లతో లేక మట్టి పెడ్డలతో పరిశుద్ధ పరచుకోవాలన్న ఆదేశం కూడా ఉంది. పరిశుద్ధత పొందే విధానం సైతం స్పష్టంగా తెలుపబడినది.

అయితే కొందరు అపరిశుభ్రతను దూరం చేయడంలోనూ, సంపూర్ణ పరిశుభ్రతలోనూ అలక్ష్యం చేస్తారు, అంటే అశ్రద్ధ వహిస్తారు. ఆ కారణంగా వారి దుస్తులు, శరీరం అపరిశుభ్రంగా ఉండిపోతాయి. పైగా వారి నమాజు స్వీకరించబడదు. అంతేకాదు, అది సమాధి శిక్షకు కూడా కారణమవుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు.

مَرَّ النَّبِيُّ ﷺ بِحَائِطٍ مِنْ حِيطَانِ الْمَدِينَةِ فَسَمِعَ صَوْتَ إِنْسَانَيْنِ يُعَذَّبَانِ فِي قُبُورِهِمَا فَقَالَ النَّبِيُّ ﷺ يُعَذَّبَانِ وَمَا يُعَذَّبَانِ فِي كَبِيرٍ ثُمَّ قَالَ بَلَى {وفي رواية: وإنه لَكَبِير} كَانَ أَحَدُهُمَا لَا يَسْتَتِرُ مِنْ بَوْلِهِ وَكَانَ الْآخَرُ يَمْشِي بِالنَّمِيمَةِ…

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీన నగరంలోని ఒక తోట నుండి వెళ్తుండగా ఇద్దరు మనుషులకు వారి సమాధిలో శిక్ష పడుతున్నట్లు విన్నారు. అప్పుడు ఇలా చెప్పారు: “వారిద్దరు శిక్షించబడుతున్నారు, వారు శక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు”. మళ్లీ చెప్పారు: “ఎందుకు కాదు. పెద్ద పాపం చేసి నందుకే. వారిలో ఒకడు తన మూత్రతుంపరల నుండి జాగ్రత్త పడేవాడు కాదు. రెండోవాడు, చాడీలు చెప్పుకుంటు తిరిగేవాడు. (సహీ బుఖారీ 216, సహీ ముస్లిం 292)

ఇక్కడ ఈ హదీథ్ లో మీరు, “వారు శిక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు” అని ఒకసారి చదివి, మళ్ళీ వెంటనే “ఎందుకు కాదు? పెద్ద పాపం చేసినందుకే” దీని ద్వారా ఎలాంటి కన్ఫ్యూజన్ కు గురి కాకండి. ఇక్కడ మాట ఏమిటంటే, ఆ మనుషులు ఎవరికైతే సమాధిలో ఇప్పుడు శిక్ష జరుగుతున్నదో, వారు ఈ పాపానికి ఒడిగట్టినప్పుడు, ఇది పెద్ద పాపం అన్నట్లుగా వారు భావించేవారు కాదు. ఆ మాటను ఇక్కడ చెప్పే ఉద్దేశంతో ఇలాంటి పదాలు వచ్చాయి హదీథ్ లో. అర్థమైందా? అంటే, అసలు చూస్తే దానికి ఎంత శిక్ష ఘోరమైనది ఉన్నదో దాని పరంగా అది పెద్ద పాపమే. కానీ చేసేవారు పెద్ద పాపమని భయపడేవారు కాదు. ఆ పాపం చేసేటప్పుడు వారు అయ్యో ఇలాంటి పాపం జరుగుతుంది కదా అని కాకుండా, “ఏ పర్లేదు. ఈ రోజుల్లో ఎంతోమంది లేరా మన మధ్యలో?” అనుకుంటారు.

ప్రత్యేకంగా కాలేజీల్లో, అటు పనులో ఉండేటువంటి పురుషులు, యువకులు, చివరికి ఎన్నోచోట్ల యువతులు, ఇళ్లల్లో తల్లులు. నమాజ్ సమయం అయిపోయి, దాన్ని దాటి పోయే సమయం వచ్చింది. అంటే నమాజ్ సమయం వెళ్ళిపోతుంది. నమాజ్ చదివారా అంటే, లేదండీ కొంచెం తహారత్ లేదు కదా. ఎందుకు లేదు తహారత్? ఏ లేదు మూత్రం పోయినప్పుడు కొంచెం తుంపరలు పడ్డాయి. లేదా మూత్రం పోసిన తర్వాత నేను కడుక్కోలేకపోయాను.

ఇక ఇళ్లల్లో తల్లులు పిల్లల మూత్రం విషయంలో, “ఆ ఇక పిల్లలు మా సంకలోనే ఉంటారు కదా, మాటిమాటికీ మూత్రం పోస్తూ ఉంటారు, ఇక ఎవరెవరు మాటిమాటికీ వెళ్లి చీర కట్టుకోవడం, మార్చుకోవడం, స్నానం చేయడం ఇదంతా కుదరదు కదా అండీ” అని ఎంతో సులభంగా మాట పలికేస్తారు. కానీ ఎంత ఘోరమైన పాపానికి వారు ఒడిగడుతున్నారు, వారు సమాధి శిక్షకు గురి అయ్యే పాపానికి ఒడిగడుతున్నారు అన్నటువంటి విషయం గ్రహిస్తున్నారా వారు?

ఆ బహుశా ఇప్పుడు ఇక్కడ మన ప్రోగ్రాంలో ఎవరైనా తల్లులు ఉండి వారి వద్ద చిన్న పిల్లలు ఉండేది ఉంటే వారికి ఏదో ప్రశ్న కొంచెం మొదలవుతుంది కావచ్చు మనసులో. అయ్యో ఇంత చిన్న పిల్లల, వారి మూత్రముల నుండి మేము ఎలా భద్రంగా ఉండాలి, దూరంగా ఉండాలి? పిల్లలే కదా, ఎప్పుడైనా పోసేస్తారు, తెలియదు కదా. మీ మాట కరెక్ట్, కానీ నా ఈ చిన్న జీవితంలో నేను చూసిన ఒక విచిత్ర విషయం ఏంటంటే, చిన్నప్పటి నుండే పిల్లలకు మంచి అలవాటు చేయించాలి మనం. ఎందరో తత్వవేత్తలు, మాహిరే నఫ్సియాత్, సైకియాట్రిస్ట్, ప్రత్యేకంగా పిల్లల నిపుణులు చెప్పిన ఒక మాట ఏమిటంటే సర్వసామాన్యంగా మీరు గ్రహించండి, ఎప్పుడైనా ఈ విషయాన్ని మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పుట్టిన పిల్లలు అయినప్పటికీ వారు మూత్రం పోసుకున్నారంటే, స్వాభావికంగా వారు ఏడవడమో, అటూ ఇటూ పక్క మార్చడమో, ఇట్లాంటి ఏదో కదలిక చేస్తూ ఉంటారంట. ఎందుకు? తల్లి తొందరగా గుర్తుపట్టి ఆ పిల్లల్ని, చంటి పాపల్ని త్వరగా శుభ్రపరచాలని. అయితే తల్లులు ఈ విషయాన్ని గమనించాలి మరియు వారు పిల్లలకు చిన్నప్పటి నుండే మంచి అలవాటు చేసే ప్రయత్నం చేయాలి. రెండోది, పిల్లలు చెప్పి మూత్రం పోయరు. ఇంకా చిన్న పిల్లలకైతే చెప్పడం కూడా రాదు, కరెక్టే. కానీ ఇక పోస్తూనే ఉంటారు కదా అని, మీరు అదే అపరిశుభ్ర స్థితిలో, అశుద్ధ స్థితిలో ఉండటం ఇది కూడా సమంజసం కాదు. ఎప్పటికి అప్పుడు మీరు అపరిశుభ్రతను దూరం చేసుకోవాలి.

మూడో విషయం ఇక్కడ గమనించాల్సింది, ఇస్లాం అందుకొరకే చాలా ఉత్తమమైన ధర్మం. మీరు దీని యొక్క బోధనలను చదువుతూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి అని మాటిమాటికీ మేము మొత్తుకుంటూ ఉంటాము. ఎంత ఎక్కువగా ఇస్లాం జ్ఞానం తెలుసుకుంటారో, అల్లాహ్ మనపై ఎంత కరుణ కనుకరించాడో అన్నటువంటి విషయం కూడా మీకు తెలుస్తుంది. ఏంటి? ఎప్పటివరకైతే పిల్లలు కేవలం తల్లి పాల మీదనే ఆధారపడి ఉన్నారో, వేరే ఇంకా బయటి ఏ పోషకం వారికి లభించడం లేదో, అలాంటి పిల్లల విషయంలో మగపిల్లలు అయ్యేదుంటే వారి మూత్రం ఎక్కడ పడినదో మంచంలో గానీ, బొంతలో గానీ, చద్దర్ లో గానీ, మీ యొక్క బట్టల్లో ఎక్కడైనా ఆ చోట కేవలం కొన్ని నీళ్లు చల్లితే సరిపోతుంది. మరియు ఒకవేళ ఆడపిల్ల అయ్యేదుంటే, ఆమె ఎక్కడైతే మూత్రం పోసిందో అక్కడ ఆ మూత్రానికంటే ఎక్కువ మోతాదులో నీళ్లు మీరు దాని మీద పారబోస్తే అంతే సరిపోతుంది. మొత్తం మీరు స్నానం చేసే అవసరం లేదు, పూర్తి చీర మార్చుకునే, పూర్తి షర్ట్ సల్వార్ మార్చుకునే అవసరం లేదు. ఎక్కడైతే ఆ మూత్రం ఎంతవరకైతే మీ బట్టల్లో పడినదో, శరీరం మీద పడినదో అంతవరకు మీరు కడుక్కుంటే సరిపోతుంది.

ఇక పెద్దల విషయానికి వస్తే, వారు మూత్రం పోసే ముందు ఎక్కడ మూత్రం పోస్తున్నారో అక్కడి నుండి తుంపరులు, ఈ మూత్రం యొక్క కొన్ని చుక్కలు తిరిగి మనపై, మన కాళ్లపై, మన బట్టలపై పడే అటువంటి ప్రమాదం లేకుండా నున్నటి మన్ను మీద, లేదా టాయిలెట్లలో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం మూత్రం పోసే ప్రయత్నం చేయాలి. మనం పాటించే అటువంటి జాగ్రత్తలు పాటించిన తర్వాత కూడా ఏమైనా మూత్రం చుక్కలు, తుప్పరులు పడ్డాయి అన్నటువంటి అనుమానమైనా లేక నమ్మకమైనా కలిగితే, ఎంతవరకు పడ్డాయో అంతవరకే కడుక్కుంటే సరిపోతుంది. మొత్తం మనం స్నానం చేయవలసిన, అన్ని బట్టలు మార్చవలసిన అవసరము లేదు.

అయితే ఇలాంటి విషయాల నుండి జాగ్రత్త పడకుండా, ఎవరైతే అశ్రద్ధ వహిస్తున్నారో వారి గురించి మరొక హదీథ్ ఏముంది?

أَكْثَرُ عَذَابِ الْقَبْرِ فِي الْبَوْلِ
(అక్సరు అదాబిల్ ఖబ్రి ఫిల్ బౌల్)
“అధిక శాతం సమాధి శిక్ష మూత్ర విషయంలోనే కలిగేది”. (అహ్మద్:2/326).

మూత్ర విసర్జన పూర్తి కాకముందే నిలబడుట, మూత్ర తుంపరలు తనపై పడవచ్చునని తెలిసి కూడా అదేచోట మూత్ర విసర్జన చేయుట లేక నీళ్లతో లేదా మట్టి పెడ్డలతో పరిశుభ్ర పరచుకోకపోవుట ఇవన్నియు మూత్ర విషయంలో జాగ్రత్త పడకపోవటం కిందే లెక్కించబడతాయి.

ఈ రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళ, అవిశ్వాసుల పోలిక ఎంతవరకు వచ్చేసిందంటే మూత్రశాలల్లో గోడలకు తగిలించి మూత్ర పాత్రలు పెట్టబడ్డాయి. దాని నలువైపులా ఏ అడ్డు ఉండదు. అందరూ వచ్చిపోయే వారి ముందు లజ్జా సిగ్గు లేకుండా మనిషి వచ్చి అందులో మూత్రం చేస్తాడు. మళ్లీ పరిశుభ్రం చేసుకోకుండానే తన బట్టను పైకి లాక్కుంటాడు. అంటే ప్యాంటుని ఈ విధంగా. ఈ విధంగా ఒకే సమయంలో రెండు దుష్ట నిషిద్ధాలకు గురి కావలసి వస్తుంది. ఒకటి, తన మర్మ స్థలాన్ని ప్రజల చూపుల నుండి కాపాడకపోవటం. రెండవది, మూత్ర తుంపరల నుండి జాగ్రత్త వహించకపోవటం.

ఇంతే కాకుండా, అంటే ఈ రెండే కాకుండా, అతను మూత్ర విసర్జన తర్వాత పరిశుభ్రం కాలేదు. అదే స్థితిలో బట్టను పైకి చేసుకున్నందుకు ఆ బట్టలు కూడా అపరిశుభ్రమైనాయి. శరీరము అపరిశుభ్రంగానే ఉంది. అదే స్థితిలో చేయబడే నమాజు అంగీకరింపబడదు. అంతేకాకుండా, సమాధి శిక్షకు కూడా గురి కావలసి వస్తుంది. అల్లాహ్ యే కాపాడాలి. కొంత అలసత్వం, అశ్రద్ధ, అలక్ష్యం వలన ఎన్ని పాపాలు మూటగట్టుకుంటున్నాడు కదా. ఈ విధంగా సోదర మహాశయులారా, ఇంతటి నష్టాలు జరుగుతున్నప్పటికీ మనం ఇంకా అశ్రద్ధగానే ఉండేది ఉంటే గమనించండి, మనకు మనం ఎంత చెడులో పడవేసుకుంటున్నాము.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41051

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

అల్లాహ్ మార్గంలో వదలివేయబడిన ఆవుదూడ – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

బనీ ఇస్రాయీల్ ప్రజల్లో ఒక పుణ్యాత్ముడు నివసించేవాడు. అతను చాలా బీదవాడు. అయినప్పటికీ తన సంపాదన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు. నీతిగా, నిజాయితీగా సంపాదించే వాడు. అతను చేసిన ప్రతి పనీ అల్లాహ్ ప్రసన్నత పొందడానికే చేశాడు. ఎన్నడూ స్వార్థంకోసం, తన అభీష్టాల ప్రకారం నడుచుకోలేదు.

ఆ వ్యక్తి చనిపోతున్నప్పుడు అతని చివరి పలుకులు, “అల్లాహ్! నా భార్యను, పసివాడైన నా కుమారుడిని, నా ఆస్తి అయిన ఆవుదూడను నీ సంరక్షణలో వదులుతున్నాను”. ఈ మాటలు పలికిన ఆ వ్యక్తి విచిత్రంగా తన భార్యతో, “ఆవుదూడను తీసుకువెళ్ళి అడవిలో వదిలేసి రమ్మన్నాడు.” అతను అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఇస్రాయీల్ ప్రజల నడవడి గురించి తెలిసిన ఆ వ్యక్తి వారిని నమ్మదలచుకోలేదు. వారు స్వార్థం, అత్యాశ నిండిన జనం అన్న విషయం అతనికి బాగా తెలుసు.

కొన్ని సంవత్సరాలు గడచిపోయాయి. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు. అప్పుడు అతని తల్లి కుమారుడితో, “మీ నాన్నగారు ఒక ఆవు దూడను అడవిలో వదలివేయమని చెప్పారు. అల్లాహ్ పై భారమేసి వదిలేశాను. ఈ పాటికి ఆ దూడ పుష్టిగా ఎదిగి ఉంటుంది” అని చెప్పింది. ఆ కుమారుడు కాస్త ఆశ్చర్యంగా ఆ ఆవుదూడ ఎక్కడ ఉందని తల్లిని ప్రశ్నించాడు. తల్లి అతడితో, “మీ నాన్న గారి అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నించు. అల్లాహ్ ను విశ్వసిస్తున్నానని చెప్పు. అల్లాహ్ పై  భారం వేసి ఆ ఆవుదూడను వెదుకు” అని చెప్పింది. ఆ కుమారుడు ఒక తాడును తీసుకుని అడవికి బయలుదేరాడు. అడవికి చేరుకున్న తర్వాత అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడి, “అల్లాహ్! ఇబ్రాహీమ్, యాఖుబ్ ల ప్రభువా! నా తండ్రి అప్పగించిన దానిని నాకు తిరిగి అప్పగించు” అని ప్రార్థించాడు. అతను తన చేతిని ఎత్తిన వెంటనే అతనికి ఒక ఆవు తన వైపు వస్తున్నట్లు కనబడింది. ఆ ఆవు అతని వద్దకు వచ్చి మచ్చికైన ఆవు మాదిరిగా నిలబడింది. ఆ ఆవు మెడకు ఒక తాడు కట్టి అతను తనతో ఇంటికి తీసుకువచ్చాడు. ఆ ఆవు కూడా ఆ కుర్రాడిని తప్ప మరెవ్వరినీ తన వద్దకు రానిచ్చేది కాదు.

ఆ కుర్రవాడు కూడా తన తండ్రి మాదిరి పుణ్యాత్ముడు. సన్మార్గాన్ని అవలంబించేవాడు. కట్టెలు కొట్టడం ద్వారా జీవనోపాధి పొందేవాడు. తాను సంపాదించిన దానిని మూడు సమానభాగాలు చేసేవాడు. ఒక భాగాన్ని తన తల్లికి ఇచ్చేవాడు. ఒక భాగాన్ని తన సొంతం కోసం ఉపయోగించుకునేవాడు. ఒక భాగాన్ని దానధర్మాలకు ఉపయోగించేవాడు. రాత్రి సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకునేవాడు. రాత్రి ప్రథమ భాగంలో తన తల్లికి సహాయపడే వాడు. తర్వాతి భాగం ఆరాధనలో గడిపేవాడు. ఆ తర్వాతి సమయం నిద్రకు కేటాయించేవాడు.

ఈ కాలంలో ఒక సంపన్నుడు మరణించాడు. అతనికి ఒకే ఒక్క కుమారుడు. తండ్రి యావదాస్తి ఆ కుమారునికి లభించింది. కాని అతని బంధువులకు కొందరికి కన్నుకుట్టింది. రహస్యంగా ఆ యువకుడిని హత్య చేశారు. ఆ విధంగా ఆ యావదాస్తిని తాము కాజేయాలనుకున్నారు. మరణించిన ఆ యువకుని బంధువుల్లో ఈ హత్యతో ప్రమేయం లేనివారు ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వద్దకు వచ్చారు. హంతకుణ్ణి కనుగొనడానికి సహాయపడమని కోరారు. మూసా (అలైహిస్సలాం) వారికి సలహా ఇస్తూ, ఒక ఆవును కోసి దాని నాలుకను ఆ యువకుడి శరీరంపై ఉంచాలని చెప్పారు. ఆ నాలుక హంతకుని గురించి తెలుపుతుందని అన్నారు. మూసా (అలైహిస్సలాం) పరిహాసమాడుతున్నారని వాళ్ళు ఆయన్ను నిందించారు. మూసా (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, “అల్లాహ్ శరణు! నేను అవివేకంగా వ్యవహరించను” అన్నారు. ఎలాంటి ఆవును కోయాలని వాళ్ళు ఆయన్ను ప్రశ్నించారు. మూసా (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, మరీ లేగదూడ కారాదు. అలా అని పూర్తిగా ఎదిగిన ఆవు కూడా కారాదు అన్నారు. మధ్యస్థంగా ఉన్న దానిని కోయాలని చెప్పారు. కాని వాళ్ళు ఆయన సలహాను పాటించే బదులు, ఆ ఆవు ఎలా ఉండాలని మరిన్ని వివరాలు అడగడం ప్రారంభించారు. “ఆ ఆవు రంగు ఎలా ఉండాలి?” అని అడిగారు. “పసుపు రంగు కలిగినదై ఉండాలి” అన్నారు మూసా (అలైహిస్సలాం). అయినా వారికి తృప్తి కలుగలేదు. మరిన్ని వివరాలు చెప్పమని అడిగారు. “ఆ ఆవు దుక్కి దున్నినది కారాదు. కాడి లాగినది కారాదు. నీళ్ళు తోడడానికి ఉపయోగించినది కారాదు. ఎలాంటి మచ్చలు ఉండరాదు” అన్నారు మూసా (అలైహిస్సలాం).

అలాంటి ఆవు కోసం వాళ్ళు వెదుకుతూ బయలుదేరారు. ఈ లక్షణాలన్నీ ఉన్న ఆవు ఒకే ఒక్కటి దొరికింది. ఆ ఆవు అనాధ యువకుడి వద్ద ఉన్న ఆవు. వాళ్ళు అతని వద్దకు వెళ్ళి ఆ ఆవును ఎంతకు అమ్ముతావని ప్రశ్నించారు. ఆ యువకుడు తన తల్లితో అడిగి చెబుతానని అన్నాడు. వారంతా కలసి అతని ఇంటికి వచ్చి అతని తల్లితో మాట్లాడారు. ఆ ఆవుకు బదులుగా మూడు బంగారు నాణేలు ఇస్తామన్నారు. కాని ఆమె ఆ ప్రతిపాదనకు తిరస్కరించింది. వాళ్ళు ఆ ఆవు ధర పెంచుతూ పోయారు. కాని ఆమె అంగీకరించలేదు. చివరకు వాళ్ళు ఆమెను ఒప్పించమని యువకుడిని కోరారు. కాని అతడు అందుకు ఒప్పుకోలేదు. “నా తల్లి ఒప్పుకోకపోతే ఆవును అమ్మేది లేదు.. మీరు ఆవు ఎత్తు బంగారం ఇచ్చినా అమ్మను” అన్నాడు. ఈ మాటలు విన్న అతడి తల్లి చిరునవ్వుతో, “అంత సొమ్ము ఇవ్వండి.. ఆవు ఎత్తు బంగారం ఇచ్చి అవును తీసుకువెళ్ళండి” అంది. చివరకు వాళ్ళు ఆ గుర్తులన్నీ ఉన్న ఆవు అదొక్కటే కాబట్టి ఆవు ఎత్తు బంగారం ఇచ్చి కొనుక్కున్నారు. (2: 67-74)

అల్లాహ్, ఆ యువకుడి తండ్రి తనకు అప్పగించిన దానిని తల్లి పట్ల సేవా భావం, దానగుణం కలిగి ఉన్న ఆ యువకునికి అనుగ్రహించాడు. అల్లాహ్ ను విశ్వసించాలని కుమారుడికి బోధించిన ఆ తల్లినీ అనుగ్రహించాడు. ఈ పూర్తి వృత్తాంతం – దైవవిశ్వాసం విషయంలో ఇస్రాయీల్ ప్రజలకు, మూసా ప్రవక్తకు ఒక పాఠంగా నిలిచింది.

మరో ముఖ్యమైన పాఠం ఏమంటే, మూసా (అలైహిస్సలాం) వారికి ఒక అవును కోయాలని చెప్పారు. ప్రత్యేకమైన ఆవు అని చెప్పలేదు. కాని వాళ్ళు ఇంకా వివరాలు కావాలని ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనవసరమైన ప్రశ్నలు వేశారు. వాళ్ళు ఈ రంధ్రాన్వేషణ చేయకుండా చెప్పిన విధంగా ఒక ఆవును కోసి ఉన్నట్లయితే వారికి ఎలాంటి సమస్యా ఉండేది కాదు. కాని అనవసరమైన ప్రశ్నల వర్షం వల్ల వారికి ఆ ఆవు చాలా ఖరీదైన ఆవుగా మారింది.

(నీతి: గుచ్చిగుచ్చి అడగడం అన్నది చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది)

ఖురాన్ కథామాలిక – మూలం: షేఖ్ అబూబకర్ నజార్
Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & హాఫిజ్ ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్

https://teluguislam.net/2022/11/12/stories-from-the-quran/

ఇస్లాం మెచ్చిన మహిళలు [పుస్తకం]

ఇస్లాం మెచ్చిన మహిళలు [పుస్తకం]
సంకలనం: మౌలానా ముహమ్మద్ తఖీయుద్దీన్(రహిమహుల్లాహ్)
అనువాదం: ఇఖ్బాల్ అహ్మద్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్,  హైదరాబాద్ -500059.

సంకలనం: మౌలానా ముహమ్మద్ తఖీయుద్దీన్(రహిమహుల్లాహ్)
అనువాదం: ఇఖ్బాల్ అహ్మద్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్ -500059.

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [80 పేజీలు]

నూతన సంవత్సర (న్యూ ఇయర్) ఉత్సవాల వాస్తవికత [వీడియో]

నూతన సంవత్సర (న్యూ ఇయర్) ఉత్సవాల వాస్తవికత
https://youtu.be/oPjBc0636SE [61 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకలను ఇస్లామీయ దృక్కోణంలో విశ్లేషించారు. ముస్లింలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం హరామ్ (నిషిద్ధం) అని, దీనికి అనేక కారణాలున్నాయని వివరించారు. ఇస్లాంకు తనదైన ప్రత్యేక గుర్తింపు ఉందని, అన్యజాతీయుల పండుగలను, ఆచారాలను అనుకరించడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇస్లాంలో కేవలం రెండు పండుగలు (ఈదుల్ ఫితర్, ఈదుల్ అద్’హా) మాత్రమే ఉన్నాయని, వాటిని మినహా వేరే వేడుకలకు అనుమతి లేదని తెలిపారు. ఈ వేడుకలు క్రైస్తవుల క్రిస్మస్ పండుగకు కొనసాగింపుగా జరుగుతాయని, దైవానికి సంతానం ఉందని విశ్వసించే వారి పండుగలో పాలుపంచుకోవడం దైవద్రోహంతో సమానమని హెచ్చరించారు. ఈ వేడుకల సందర్భంగా జరిగే అశ్లీలత, మద్యం సేవనం, సంగీతం, స్త్రీ పురుషుల కలయిక వంటి అనేక నిషిద్ధ కార్యాల గురించి కూడా వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యతగా ఉంటూ, వారిని ఇలాంటి చెడుల నుండి కాపాడాలని, వారికి ఇస్లామీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వాలని సూచించారు.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహ్. అల్’హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్. నబియ్యినా ముహమ్మదివ్ వ’అలా ఆలిహి వ’సహ్బిహి అజ్మ’ఈన్, అమ్మా బా’ద్.

ప్రియ విద్యార్థులారా! ఈరోజు అల్’హమ్దులిల్లాహ్, నిషిద్ధతలు జాగ్రత్తలు అనేటువంటి మన ఈ శీర్షికలో తొమ్మిదవ క్లాస్. అయితే ఈరోజు ఈ తొమ్మిదవ క్లాస్ ఏదైతే జరగబోతుందో, ప్రారంభం కాబోతుందో, ఈనాడు తేదీ డిసెంబర్ 31, 2023.

ఇప్పటి నుండి సమయ ప్రకారంగా చూసుకుంటే సుమారు ఒక 12న్నర గంటల తర్వాత 2024వ సంవత్సరంలో ఫస్ట్ జనవరిలో ప్రవేశించబోతున్నాము. ఈ నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం, న్యూ ఇయర్ కి సంబంధించి కూడా ఎన్నో రకాల నిషిద్ధతలకు పాల్పడతారు. అందుకని మన క్రమంలో, మనం చదువుతున్నటువంటి పుస్తకంలో, ఏ మూడు అంశాలు ఈరోజు ఉన్నాయో, సమయం మనకు సరియైన రీతిలో అందుబాటులో ఉండేది ఉంటే, అనుకూలంగా ఉంటే, అవి మూడు లేదా వాటిలో కొన్ని ఇన్’షా’అల్లాహ్ తెలుసుకుంటాము. కానీ వాటన్నిటికంటే ముందు న్యూ ఇయర్ సెలబ్రేషన్, కొత్త సంవత్సర ఉత్సవాలు జరుపుకోవడం యొక్క వాస్తవికత ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం.

ఎందుకంటే సోదర మహాశయులారా, వీటి వివరాలు మనం తెలుసుకోకుండా ఆ నిషిద్ధతలకు పాల్పడుతూ ఉంటే ఇహలోక పరంగా, సమాధిలో, పరలోకంలో చాలా చాలా నష్టాలకు మనం గురి కాబోతాం. అందుకొరకే వాటి నుండి జాగ్రత్తగా ఉండండి, ఆ నిషిద్ధతలకు పాల్పడకుండా ఉండండి అని చెప్పడం మా యొక్క బాధ్యత. వినడం, అర్థం చేసుకోవడం, మంచిని ఆచరించడం, చెడును ఖండించడం, చెడును వదులుకోవడం మనందరిపై ఉన్నటువంటి తప్పనిసరి బాధ్యత.

అయితే సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కొత్త సంవత్సరం సంబరాలు మనం జరుపుకోవచ్చా? ఉత్సవాలు జరుపుకోవచ్చా? న్యూ ఇయర్ హ్యాపీ ఎవరికైనా చెప్పవచ్చా? అంటే ఇది హరామ్, దీనికి ఎలాంటి అనుమతి లేదు. మరి ఇందులో ఉన్న చెడులు చాలా ఉన్నాయి. కానీ ఆ చెడుల గురించి చెప్పేకి ముందు ఒక విన్నపం, ప్రత్యేకంగా ఏ స్త్రీలు, పురుషులు ఇలాంటి సంబరాలు జరుపుకుంటారో, కొత్త సంవత్సరం యొక్క వేడుకలు జరుపుకుంటారో, వారు ప్రత్యేకంగా పూర్తిగా ఈ ప్రసంగాన్ని వినండి. ఉర్దూ అర్థమైతే ‘నయే సాల్ కా జష్న్’ అని మా ఉర్దూ ప్రసంగం కూడా ఉంది. వినండి, అర్థం చేసుకోండి, కారణాలు తెలుసుకోండి. ఇక వీళ్ళు ఈ మౌల్సాబులు హరామ్ అని చెప్పారు. ఇక మీదట వీళ్ళ మాట వినే అవసరమే లేదు, ఈ విధంగా పెడచెవి పెట్టి, విముఖత చూపి తమకు తాము నష్టంలో పడేసుకోకండి.

మనం ఏ ఇస్లాం ధర్మాన్ని అవలంబించామో, విశ్వసిస్తున్నామో, అది ఎలాంటి ఉత్తమమైన, సంపూర్ణమైన – నా ఈ పదాలను శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి – మనం ఏ ఇస్లాం ధర్మాన్ని అవలంబించి, దీని ప్రకారంగా జీవితం గడపాలన్నట్లుగా పూనుకొని, నిశ్చయించి మనం జీవితం కొనసాగిస్తున్నామో, ఈ ఇస్లాం ధర్మం అత్యుత్తమమైనది, సంపూర్ణమైనది, ప్రళయం వరకు ఉండేది, అన్ని జాతుల వారికి, ప్రతీ కాలం వారికి అనుకూలంగా ఉన్నటువంటి ఉత్తమ ధర్మం. ఈ ఇస్లాం ధర్మం, ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తారో, ఇస్లాం ధర్మాన్ని నమ్ముతారో ఇస్లాం కోరుకుంటున్నది ఏమిటంటే తనదంటూ ఒక వ్యక్తిత్వం, తనదంటూ ఒక ఐడెంటిఫికేషన్, నేను ఒక ముస్లింని అన్నటువంటి తృప్తి, మన యొక్క ప్రత్యేకత మనం తెలియజేయాలి, దానిపై స్థిరంగా ఉండాలి. ఇతరులు కూడా అర్థం చేసుకోవాలి, ముస్లిం అంటే ఇలా ఉంటాడు. ముస్లిం అంటే ఖిచిడీ కాదు, ముస్లిం అంటే బిర్యానీ కాదు, ముస్లిం అంటే ఏదో కొన్ని వస్తువుల, తినే ఆహార పదార్థాల పేర్లు కావు. ముస్లిం తన విశ్వాసంతో, తన ఆరాధనలతో, తన వ్యక్తిత్వంతో, తన యొక్క క్యారెక్టర్ తో అత్యుత్తమ మనిషిగా నిరూపిస్తాడు.

అందుకొరకే ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనేక సందర్భాలలో ఇచ్చినటువంటి బోధనల్లో ఒక మాట, ఎన్నో సందర్భాల్లో ఉంది. ప్రతి జుమాలో మీరు వింటూ ఉంటారు కూడా. హజ్ లో ఒక సందర్భంలో ప్రవక్త చెప్పారు, ‘హదయునా ముఖాలిఫుల్ లిహదియిహిమ్’. మన యొక్క విధానం, మన యొక్క మార్గదర్శకత్వం అందరిలో నేను కూడా ఒకడినే, అందరి మాదిరిగా నేను అన్నట్లుగా కాదు. మన యొక్క విధానం, మన ఇస్లామీయ వ్యక్తిత్వం, మనం ముస్లింలం అన్నటువంటి ఒక ప్రత్యేక చిహ్నం అనేది ఉండాలి. ఎందుకంటే అందరూ అవలంబిస్తున్నటువంటి పద్ధతులు వారి వారి కోరికలకు తగినవి కావచ్చు కానీ, వారి ఇష్ట ప్రకారంగా వారు చేస్తున్నారు కావచ్చు కానీ, మనం ముస్లింలం, అల్లాహ్ ఆదేశానికి, ప్రవక్త విధానానికి కట్టుబడి ఉంటాము. ప్రతి జుమ్మాలో వింటున్నటువంటి విషయం ఏంటి?

فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ
(ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్)
నిశ్చయంగా అన్నింటికన్నా ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖుర్ఆన్).

وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صلى الله عليه وسلم
(వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం)
అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మార్గం.

ఇది కేవలం జుమ్మా రోజుల్లో చెప్పుకుంటే, కేవలం విని ఒక చెవి నుండి మరో చెవి నుండి వదిలేస్తే ఇది కాదు అసలైన ఇస్లాం. మొదటి కారణం ఏంటి? మన విశ్వాసం నుండి మొదలుకొని, ఆరాధనలు మొదలుకొని, మన జీవితంలోని ప్రతి రంగంలో మనం మనకంటూ ఒక ఇస్లామీయ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాలి, ఆచరించాలి, కనబరచాలి.

శ్రద్ధగా వినండి, న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎందుకు మనం జరుపుకోకూడదు? సెకండ్ రీజన్, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో జాతులు, సమాజాలే కాదు ప్రభుత్వ పరంగా కూడా దేశాలు దీనిని ఏదైతే జరుపుకుంటున్నాయో అది ఒక పండుగ మాదిరిగా అయిపోయింది, కదా? మరియు ఇస్లాంలో మనకు అల్లాహ్ యే ఇచ్చినటువంటి పండుగలు కేవలం రెండే రెండు పండుగలు సంవత్సరంలో.

అబూ దావూద్ లో వచ్చిన హదీస్ ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు?

إِنَّ اللَّهَ قَدْ أَبْدَلَكُمْ بِهِمَا خَيْرًا مِنْهُمَا
(ఇన్నల్లాహ ఖద్ అబ్దలకుం బిహిమా ఖైరమ్ మిన్హుమా)
నిశ్చయంగా అల్లాహ్ ఈ రెండు రోజులకు బదులుగా మీకు వీటికన్నా ఉత్తమమైన రెండు రోజులను ప్రసాదించాడు.

అజ్ఞాన కాలంలో రెండు రోజులు వారు జరుపుకునేవారు, ఆటలాడేవాడు, పాటలాడేవారు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? అల్లాహ్ యే మీకు ఆ రెండు రోజులకు బదులుగా మరో రెండు రోజులు ప్రసాదించాడు. కనుక మీరు ఆ అజ్ఞాన కాలంలో పాటిస్తూ వస్తున్నటువంటి రెండు రోజులను మరిచిపొండి, వాటిని వదిలేయండి, వాటిలో ఏ మాత్రం పాలుపంచుకోకండి, అలాంటి వాటిని జరుపుకోకండి. అల్లాహ్ మీకు వాటికి బదులుగా ఏదైతే ప్రసాదించాడో రెండు రోజులు వాటిలో మీరు మీ పండుగ జరుపుకోండి. ఏంటి అవి? యౌముల్ ఫితర్, వ యౌముల్ అద్’హా. సర్వసామాన్యంగా మనం రమదాన్ పండుగ అని, బక్రీద్ పండుగ అని అనుకుంటూ ఉంటాం.

థర్డ్ రీజన్ ఏంటి? మనం న్యూ సెలబ్రేషన్ ఎందుకు జరుపుకోకూడదు? ఎందుకంటే ఇతరుల యొక్క ఆచారం అది అయిపోయినది. వారు పండుగ మాదిరిగా దానిని జరుపుకుంటున్నారు. అలా మనం జరుపుకోవడం వల్ల వారి యొక్క విధానాన్ని, పద్ధతులను అవలంబించడం ద్వారా వారిలో కలిసిపోయే, ప్రళయ దినాన వారితో కలిసి లేపబడే, వారితో నరకంలో పోయే అటువంటి ప్రమాదానికి గురవుతాం. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్:

مَنْ تَشَبَّهَ بِقَوْمٍ فَهُوَ مِنْهُمْ
(మన్ తషబ్బహ బి’ఖౌమిన్ ఫహువ మిన్హుమ్)
ఎవరైతే ఏ జాతిని పోలి నడుచుకుంటారో వారు వారిలోని వారే అయిపోతారు.

గమనించండి ఎంత చెడ్డ విషయం ఇది.

ఫోర్త్ రీజన్, కారణం, న్యూ సెలబ్రేషన్ జరుపుకోకపోవడానికి, 25వ డిసెంబర్ రోజు ఏ క్రిస్మస్ పండుగలు జరుపుకుంటారో, దానిని అనుసరిస్తూ దాని యొక్క కంటిన్యూషన్ లోనే ఇలాంటి పండుగలు జరుగుతూ ఉంటాయి. ఇంకా వేరే వారు ఏవైతే అందులో చేస్తారో వాటి విషయం వేరు. అయితే, ఎవరైతే మీ తల్లిని తిడతారో, నీవు అతనికి ‘హ్యాపీ, ఎంత మంచి పని చేశావురా’ అని అంటావా? అనవు కదా! అలా మీ తల్లికి తిట్టిన వాడినికి నీవు శుభకాంక్షలు తెలియజేయవు. మరి ఎవరైతే అల్లాహ్ కు సంతానం ఉంది అని, అల్లాహ్ యొక్క సంతానం 25వ డిసెంబర్ నాడు పుట్టాడు అని విశ్వసిస్తున్నారో, దానిని పురస్కరించుకొని పండుగలు జరుపుకుంటున్నారో, అలాంటి వారి ఆ ఉత్సవాలలో మనం ఎలా పాలుపంచుకోగలము? ఎలా వారికి హ్యాపీ చెప్పగలము? విషెస్ ఇవ్వగలము? శుభకాంక్షలు తెలియజేయగలము? ఇదంతా కూడా మనకు తగని పని. ఎందుకంటే అల్లాహ్ ను తిట్టే వారితో మనం సంతోషంగా ఉండి సంబరాలు జరపడం అంటే మనం ఆ తిట్టడంలో పాలు పంచుకున్నట్లు, అల్లాహ్ ను మనం తిడుతున్నట్లు, ఇక మనం ఇస్లాం, మన ఇస్లామీయం ఏమైనా మిగిలి ఉంటుందా?

ఖురాన్ లోనే అల్లాహ్ త’ఆలా ఎంత కఠోరంగా, అల్లాహ్ కు సంతానం అని అన్న వారి పట్ల ఎలాంటి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క కోపం, ఆగ్రహం కురిసింది. అంతేకాదు, ఈ మాట అంటే అల్లాహ్ కు సంతానం ఉంది అనడం ఎంత చెడ్డదంటే ఆకాశాలు దీనిని గ్రహిస్తే బద్దలైపోతాయి. బద్దలైపోతాయి, పగిలిపోతాయి. మరియు భూమి చీలిపోతుంది. అంతటి చెండాలమైన మాట అల్లాహ్ కొరకు ఇది. ఇక అలాంటి వారితో మీరు పాలుపంచుకోవడం, ఇది ఏమైనా సమంజసమేనా?

ఫిఫ్త్ రీజన్, న్యూ సెలబ్రేషన్ జరుపుకోకపోవడానికి, అందులో జరుగుతున్నటువంటి నిషిద్ధ కార్యాలు. ఏమిటి ఆ నిషిద్ధ కార్యాలు? వాటి యొక్క స్థానం ఏమిటి? అందులో ఏమేమి చేస్తారో వాటి యొక్క వాస్తవికత ఏమిటి? రండి, సంక్షిప్తంగా అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొదటి విషయం ఇందులో, ఐదవ రీజన్ కొంచెం పొడుగ్గా సాగుతుంది. ఇందులో మరికొన్ని వేరే పాయింట్స్ చెబుతున్నాను, శ్రద్ధగా అర్థం చేసుకోండి. ఇందుకిగాను ఇది నిషిద్ధం అని మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది.

మొదటి విషయం ఏంటి? 31వ డిసెంబర్ దాటిపోయి ఫస్ట్ జనవరి రావడం, ఇది 30 తర్వాత 31, లేదా ఫస్ట్ జనవరి తర్వాత సెకండ్, సెకండ్ తర్వాత థర్డ్, థర్డ్ తర్వాత ఫోర్, ఎలా దినాలు గడుస్తున్నాయో అదే రీతిలో. దీనికంటూ ఏ ధర్మంలో కూడా ఎలాంటి ప్రత్యేకత లేదు, ఇస్లాం లోనైతే దీని యొక్క ప్రస్తావన ఏ మాత్రం లేదు. ఇక అలాంటి సందర్భంలో మనం రాత్రంతా కాచుకుంటూ వేచి ఉంటూ 11 గంటల 59 నిమిషాల 59 సెకండ్లు పూర్తి అయ్యాయి, 00:00 అని వచ్చిన వెంటనే చప్పట్లు కొట్టడం, కేకలు, నినాదాలు ఇవన్నీ చేసుకుంటూ వెల్కమ్ అన్నటువంటి పదాలు పలకడం, గమనించండి కొంచెం ఆలోచించండి. ప్రతి రాత్రి ఏదైతే 12 అవుతుందో, దినం మారుతుందో, కొత్త సంవత్సరం అని ఏ రీతి మీరు అనుకుంటున్నారో అది 60 సెకండ్ల ఒక నిమిషం, 60 నిమిషాల ఒక గంట, 24 గంటల ఒక రోజు, ఏడు రోజుల ఒక వారం, ఏ ఒక వారం సుమారు నాలుగు వారాలు కొద్ది రోజుల ఒక నెల, 12 నెలల ఒక సంవత్సరం. ఇదే తిరుగుడు ఉంది కదా? ఇందులో కొత్తదనం ఏమిటి? ఇందులో కొత్తదనం ఏమిటి? నీవు ఏదైతే వెల్కమ్ అంటున్నావో, 12 అయిన వెంటనే సంబరాలు జరుపుకుంటున్నావో, దేనికి జరుపుకుంటున్నావు?

మనకు ముస్లింగా గమనించాలంటే అసలు ఆ 12, ఆ సమయంతో మనకు సంబంధమే లేదు. ఇస్లాం పరంగా 24 గంటల దినం ఏదైతే మనం అనుకుంటామో, అది మారుతుంది ఎప్పటినుండి? సూర్యాస్తమయం నుండి. సన్ సెట్ అవుతుంది కదా? అప్పటి నుండి కొత్త తేదీ ప్రారంభమవుతుంది. కొత్త తేదీ అంటున్నాను, కొత్త సంవత్సరం అనడం లేదు. కొత్త రోజు. ముందు రాత్రి వస్తుంది, తర్వాత పగలు వస్తుంది, ఇస్లాం ప్రకారంగా. మరొక విషయం మీరు గమనించండి. బుద్ధిపూర్వకంగా, అల్లాహ్ ఇచ్చిన జ్ఞానంతో ఆలోచించండి.

ఈ జంత్రీ, క్యాలెండర్ మారినంత మాత్రాన ఏ ఏ సంబరాలు జరుపుకోవాలని, ఏ సంతోషాలు వ్యక్తపరచాలని ప్లాన్ చేసుకొని ఈ రాత్రి గురించి వేచిస్తూ ఉంటారో, దీని ప్రస్తావన లేదు అని మనం తెలుసుకున్నాము, అదే చోట మనం గమనిస్తే ఖురాన్ లో, హదీస్ లో, అల్లాహ్ త’ఆలా మనకు ఇస్తున్నటువంటి ఆదేశం ఏమి? ఎప్పుడైనా ఆలోచించామా? ఇలాంటి ఈ వేచి ఉండడం ప్రతి రోజు మన కర్తవ్యం కావాలి. రాత్రి 12 వేచి ఉండడం అంటలేను నేను. ఒక దినం మారుతున్నప్పుడు, ఒక కొత్త రోజు మనకు లభిస్తున్నప్పుడు మన యొక్క కర్తవ్యం ఏమిటి? మన యొక్క బాధ్యత ఏమిటి? ఒక్కసారి సూరతుల్ ఫుర్ఖాన్ లోని ఈ ఆయతును గమనించండి.

وَهُوَ الَّذِي جَعَلَ اللَّيْلَ وَالنَّهَارَ خِلْفَةً لِمَنْ أَرَادَ أَنْ يَذَّكَّرَ أَوْ أَرَادَ شُكُورًا
(వహువల్లజీ జ’అలల్లైల వన్నహార ఖిల్ఫతల్ లిమన్ అరాద అం యజ్జక్కర అవ్ అరాద శుకూరా)
జ్ఞాపకం చేసుకోవాలనుకునే వాని కొరకు, లేక కృతజ్ఞత చూపదలచిన వాని కొరకు రాత్రింబవళ్లను ఒక దాని తరువాత మరొకటి వచ్చేలా చేసినవాడు ఆయనే. (25:62)

రేయింబవళ్లు మీకు ప్రసాదించిన వాడు ఆ అల్లాహ్ యే. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది, రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి, ఎందుకని? మీలో ఎవరు ఎక్కువగా గుణపాఠం నేర్చుకుంటారు, అల్లాహ్ యొక్క అనుగ్రహాలను తలచుకుంటారు, వాటిని ప్రస్తావించుకొని అల్లాహ్ యొక్క షుక్రియా, అల్లాహ్ యొక్క కృతజ్ఞత ఎక్కువగా తెలుపుతూ ఉంటారు. అల్లాహ్ యొక్క ఈ థాంక్స్, షుక్రియా, కృతజ్ఞత,

اعْمَلُوا آلَ دَاوُودَ شُكْرًا
(ఇ’మలూ ఆల దావూద షుక్రా)
ఓ దావూదు సంతతి వారలారా! కృతజ్ఞతాపూర్వకంగా పనులు చేయండి. (34:13)

హృదయంతో, మనసుతో, నాలుకతో, ఆచరణతో, ధన రూపంలో అన్ని రకాలుగా. మరి నేను ఏదైతే చెప్పానో, ప్రతి రోజు ఈ మన బాధ్యత అని, ఎప్పుడైనా మనం గమనించామా? ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? మీలోని ప్రతి వ్యక్తి ఎప్పుడైతే ఉదయాన లేస్తాడో, అతని ప్రతి కీలుకు బదులుగా ఒక దానం తప్పకుండా అతను చేయాలి. అల్లాహ్ త’ఆలా రాత్రి పడుకోవడానికి ప్రసాదించాడు, పగటిని శ్రమించడానికి మనకు అనుగ్రహించాడు. నేను ఒక కొత్త దినాన్ని పొందాను, మేల్కొన్నాను, నిద్రలోనే నేను చనిపోలేదు కదా,

الْحَمْدُ لِلَّهِ الَّذِي أَحْيَانَا بَعْدَ مَا أَمَاتَنَا
(అల్’హమ్దులిల్లాహిల్లజీ అహ్యానా బ’దమా అమాతనా)
మమ్మల్ని మరణింపజేసిన తర్వాత తిరిగి ప్రాణం పోసిన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.

అని అల్లాహ్ యొక్క కృతజ్ఞత చెల్లించుకుంటూ మేల్కోవడం. ఆ తర్వాత ఏమంటున్నారు ప్రవక్త వారు? 360 కీళ్లు మనిషి శరీరంలో ఉన్నాయి. ఈ 360 కీళ్లలో ప్రతి ఒక్క కీలుకు బదులుగా ఒక్క దానం చేయడం, సదకా చేయడం తప్పనిసరి. పేదవాళ్లకు చాలా పెద్ద భారం ఇది ఏర్పడుతుంది కదా? ఎలా మనం రోజుకు 360 దానాలు చేయగలుగుతాము? కానీ అల్లాహ్ త’ఆలా మనకు ప్రవక్త కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా శుభవార్త తెలియజేసి ఎంత సులభతరం ప్రసాదించాడు! ఒక్కసారి సుబ్ హా నల్లాహ్ అంటే ఒక్క సదకా చేసినంత పుణ్యం. ఈ విధంగా ఇంకా విషయాలు ఉన్నాయి. మా జీడీకేనసీర్ YouTube ఛానల్ లో షేక్ జాకిర్ జామి గారు చాలా మంచి ప్రసంగం సదకాల గురించి ఉంది, విని చూడండి. అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, కనీసం రెండు రకాతులు సలాతుద్ దుహా చదివితే 360 దానాలు చేసినటువంటి సదకాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్త తెలియజేశారు. అయితే, ఒక వైపున ఇలాంటి బోధనలు మనకు ఉన్నాయి. ప్రతి రోజు ఒక కొత్త ధనం మనం ఏదైతే పొందుతున్నామో, కొత్త రోజు ఏదైతే పొందుతున్నామో, అందులో ఎలాంటి మనం శుక్రియా అదా చేయాలి, అందులో ఎలాంటి బాధ్యత మనపై ఉన్నది, మరియు రాత్రి ఏ వేళను కాచుకుంటూ వేచి ఉంటూ వెయిట్ చేస్తూ ఉంటారో, ఆ రాత్రి, ప్రత్యేకంగా రాత్రిలోని మూడవ భాగం ఆరంభంలో అల్లాహ్ త’ఆలా ప్రపంచపు ఆకాశం వైపునకు తనకు తగిన రీతిలో వస్తాడు అని, ఎవరు క్షమాపణలు కోరుకుంటారు? ఎవరు దుఆ చేస్తారు? ఎవరికి ఏ అవసరం ఉంది? అల్లాహ్ ను అర్ధిస్తారు, అడుగుతారు అని అల్లాహ్ త’ఆలా కేకలు వేస్తాడు, చాటింపు చేస్తాడు. దాని వైపునకు శ్రద్ధ వహించకుండా, సంవత్సరంలో ఒక్క రాత్రి దాని గురించి సంతోషం వ్యక్తపరచడానికి, దాని పేరున సెలబ్రేట్ చేసుకోవడానికి ఇలా మనం నిద్రను పోగొట్టుకొని వేచి ఉంటూ ఉండడం ఇది అల్లాహ్ యొక్క హకీకత్ లో, వాస్తవంగా శుక్రియా అవుతుందా గమనించండి.

ఇంకా రండి, ఈ విధంగా రాత్రి 12 గంటల కొరకు వేచి ఉంటూ, అప్పుడు ఏ అరుపులు, ఏ కేకలు వేస్తారో, అల్లాహు అక్బర్. దగ్గర ఉన్నవారు కొందరి యొక్క చెవులు గిళ్ళుమనడం కాదు, ఆ శబ్దాలకు ఎవరైనా కొంచెం హార్ట్ లాంటి హార్ట్ పేషెంట్ లాంటి మనుషులు ఉండేది ఉంటే అక్కడ వారి పని పూర్తి అయిపోతుంది. అల్లాహు అక్బర్.

ఈ సంబరాలకు అనుమతి లేదు. ఇంకా ఆ రాత్రి దీపాలు వెలిగించడం, వాటిని ఆర్పడం, క్యాండిల్స్ దానికొక ప్రత్యేకత ఇవ్వడం, ఈ క్యాండిల్స్ కు, మవ్వొత్తులకు ఈ ప్రత్యేకత అగ్ని పూజారులలో ఉంటుంది, మజూసులలో ఉంటుంది. వారి యొక్క పోలిక అవలంబించి మనం ఎటువైపునకు వెళ్తున్నామో ఒకసారి ఇది కూడా ఆలోచించి చూడండి. అంతేకాదు, ఈ రాత్రి వేచి ఉంటూ ఏదైతే ఉంటారో, ఆ తర్వాత కేకులు కట్ చేసుకుంటూ, తినుకుంటూ, వాటి యొక్క క్రీములు తినడమే కాదు, ఆహారం యొక్క ఎంత వేస్టేజ్, మళ్ళీ సంబరాల, సంతోషాల పేరు మీద వాటిని ఎంత అగౌరవ, ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తారంటే క్రీములు తీసుకొని ఒకరు మరొకరికి పూసుకుంటూ ఉంటారు.

ఈ సందర్భంలో గమనించాలి, ఎక్కడెక్కడైతే హోటళ్లలో గాని, పార్కులలో గాని, వేరే కొన్ని ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకొని ఇలాంటి సంబరాలకు ఏదైతే అందరూ హాజరవుతారో, స్త్రీలు, పురుషులు, యువకులు, యువతులు వారి మధ్యలో జరిగేటువంటి ఆ సందర్భంలో అశ్లీల కార్యాలు, అశ్లీల మాటలు, అశ్లీల పనులు ఇవన్నీ కూడా నిజంగా ఏ సోదరుడు తన సోదరి గురించి, ఏ తండ్రి తన బిడ్డ గురించి, ఏ భర్త తన భార్య గురించి సహించలేడు. సహించలేడు. ఏ కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్న కొడుకు తన తల్లి గురించి భరించలేడు. ఇలాంటి విషయాలు వినడం కూడా ఇష్టపడడు. కానీ అలాంటి సందర్భంలో ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? దానికి ఇంకా మించి ఒకరి మీద ఒకరు రంగులు పోసుకోవడం, కలర్స్ రుద్దుకోవడం. ఇంకా ఆ సమయంలో ప్రత్యేకంగా పెద్ద పెద్ద స్పీకర్స్ లాంటివి, బాక్సులు సెట్ చేసుకొని వాటిలో సాంగ్స్, మ్యూజిక్స్ రకరకాలవి పెట్టుకొని ఆనందం వ్యక్తపరచడం. ఈ మ్యూజిక్ విషయంలో ఎప్పుడైనా విన్నారా? ఇది మన కొరకు నిషిద్ధం అన్న విషయం? మరియు ఇలా చేసే వారి గురించి ఎన్ని రకాల హెచ్చరికలు వచ్చాయో వాటి గురించి ఎప్పుడైనా విన్నారా? సూరత్ లుఖ్మాన్ లోని సుమారు ప్రారంభ ఆయత్ లోనే

وَمِنَ النَّاسِ مَنْ يَشْتَرِي لَهْوَ الْحَدِيثِ لِيُضِلَّ عَنْ سَبِيلِ اللَّهِ بِغَيْرِ عِلْمٍ
(వ మినన్నాసి మం యష్తరీ లహ్వల్ హదీసి లియుదిల్ల అన్ సబీలిల్లాహి బిగైరి ఇల్మ్)
ప్రజలలో కొందరు సరైన జ్ఞానం లేకుండా (ఇతరులను) అల్లాహ్ మార్గం నుండి తప్పించటానికి, దానిని (అల్లాహ్ మార్గాన్ని) ఎగతాళి చేయటానికి పనికిరాని విషయాలను కొంటారు. (31:6)

ఇక్కడ లహ్వల్ హదీస్ యొక్క వ్యాఖ్యానంలో, తఫ్సీర్ లో, అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పిన మాటలు అల్లాహ్ యొక్క ప్రమాణం చేసి మూడేసి సార్లు చెబుతున్నారు. మరి ఇటు మనం ముస్లింలమని భావించుకుంటూ ఇలాంటి సంతోషాల పేరు మీద ఇవన్నీ జరుపుకుంటూ ఉండడం, మన ఇస్లాంపై ఇది, మనం ముస్లింలము అని చెప్పుకోవటంపై ఎంత మచ్చ, ఒక చాలా చెడు, ఒక తప్ప పడిపోతుందో గమనించండి.

మిత్రులారా, సోదర సోదరీమణులారా, ప్రత్యేకంగా ఎవరైతే తమ యొక్క యువకులైన బిడ్డల్ని, కొడుకుల్ని 31వ డిసెంబర్ సాయంకాలం వరకు బయటికి వెళ్ళడానికి అనుమతిస్తున్నారో, వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. తెల్లవారేసరికి ఇంటికి వచ్చేవరకు ఎన్ని పాపాలలో వారు కూరుకుపోయి ఉంటారు, ఎన్ని రకాల అశ్లీల కార్యాలకు పాల్పడి తల్లిదండ్రుల యొక్క ఇహలోకపు బద్నామీ, ఇహలోకంలోనే చెడు పేరు కాకుండా వారి యొక్క పరలోక పరంగా కూడా నష్టం చేకూర్చే అటువంటి ఎన్ని కార్యాలకు వారు పాల్పడతారు. అందుకని తల్లిదండ్రులు ఏం చేయాలి? సోదరులు ఏం చేయాలి? తమ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వారి బాధ్యతలో ఉన్నటువంటి పిల్లల్ని ఇలాంటి చెడు కార్యాల్లో వెళ్లకుండా తాళం వేసి ఉంచడం, మొబైల్ తీసుకొని పెట్టడం, ఏదైనా కేవలం బెదిరించి ఎంతవరకైనా చేయగలుగుతారు? అలా చేయకుండా వారు అలాంటి అశ్లీల కార్యాల్లో, ఇలాంటి సెలబ్రేషన్స్ లో పాల్గొనకుండా ఉండడానికి మీరు ఇంట్లోనే మంచి ప్లాన్ చేయండి. మీరు ఒకవేళ ఫలానా ఫలానా పిల్లలు వెళ్లేవారు ఉన్నారు అన్నట్లుగా మీకు ఏదైనా ఐడియా కలిగి ఉండేది ఉంటే, వారిని తీసుకొని ఏదైనా మంచి పుణ్య కార్యానికి, పుణ్యకార్యం కాకపోయినా చెడు నుండి రక్షింపబడడానికి అల్లాహ్ తో మేలును కోరుతూ, దుఆ చేసుకుంటూ ఎక్కడైనా విహారానికి వెళ్ళండి. మంచి విషయాల గురించి, పెద్ద పాపాల నుండి దూరం ఉండడానికి, కానీ ఇలాంటి వాటిలో మాత్రం పాల్గొనకండి.

ఇంకా ఈ సందర్భంలో ఎవరికైనా మనం హ్యాపీ అని చెప్పడం, హ్యాపీ న్యూ ఇయర్ అని దీనికి కూడా అనుమతి లేదు. షేక్ ఇబ్ను ఉథైమీన్ రహమహుల్లాహ్ తో ప్రశ్నించడం జరిగింది, ఎవరైనా మనకు చెప్పేది ఉంటే ఏం చేయాలి? మీకు కూడా మేలు జరుగుగాక అన్నట్లుగా వదిలేయాలి. కానీ అలాంటి వాటి వైపు ఏ శ్రద్ధ వహించకూడదు. ఇక ఇలాంటి శుభకాంక్షలు తెలియజేయకూడదు అన్నప్పుడు, హ్యాపీ న్యూ ఇయర్ లాంటి స్టేటస్ లు పెట్టుకోవడం, రీల్ ముందునుండే తయారు చేసుకొని మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో అప్లోడ్ చేయడం, వాటిని షేర్ చేయడం, వాటిని లైక్ చేయడం లేదా మన యొక్క మిత్రులకు అలాంటివి సందేశాలు, మెసేజ్లు పంపడం, ఇవన్నీ కూడా తన సమయాన్ని వృధా కార్యంలో గడుపుతూ ఇంకా పెద్ద కార్యాలకు, పెద్ద నష్టాలకు పాల్పడే అటువంటి ప్రమాదం ఉంటుంది.

సోదర మహాశయులారా, ఈ సందర్భంలో ఇంకా ఏ ఏ విషయాలు జరుగుతాయో, ఇప్పుడు మనం ఏదైతే పాఠం మొదలు పెట్టబోతున్నామో, మొదటి పాఠంలోనే కొన్ని విషయాలు రాబోతున్నాయి గనుక, ఇక్కడి వరకు నేను నా ఈ న్యూ ఇయర్ కు సంబంధించిన ఏ సందేశం మీకు ఇవ్వాలనుకున్నానో, దానిని సమాప్తం చేస్తాను. కానీ సమాప్తం చేసే ముందు, గత ఎనిమిదవ పాఠంలో, అంతకుముందు పాఠాలలో మనం కొన్ని విషయాలు విన్నాము, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంలో వాటిని గుర్తుంచుకోవడం చాలా చాలా అవసరం.

పర పురుషులు, పర స్త్రీలు ఈ సందర్భంలో ఏదైతే కలుసుకుంటారో, యువకులు, యువతులు, స్టూడెంట్స్ అందరూ కలిసి ఒకరితో ఒకరు ఏదైతే టచ్ అవుతారో, ఈ సందర్భంలో చూపులకు సంబంధించిన నిషిద్ధతలు ఏమిటి, చదివాము. వాటిని ఒకసారి గుర్తు చేసుకోండి. అవన్నీ ఈ రాత్రి జరుగుతాయి. పర స్త్రీని తాకడం ఎంత ఘోరమైన పాపమో, దాని గురించి హదీస్ లు చదివాము, అవి ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఇంకా ఇలాంటి ఈ సందర్భంలో ఒకరు మరొకరికి శుభకాంక్షల పేరు మీద, సంబరాల పేరు మీద ఏ పదాలు పలుకుతూ ఉంటారో, ఆ పదాల్లో కూడా ఎన్నో అశ్లీల పదాలు ఉంటాయి. ఇక్కడ మనం చెప్పుకోవడం కూడా సమంజసం ఉండదు. కానీ కేవలం తెలియజేస్తున్నాను, అలాంటి వాటన్నిటికీ దూరం ఉండాలంటే అలాంటి ప్రోగ్రాంలలో హాజరు కానే కాకూడదు. మరొక చివరి మాట ఈ సందర్భంలో, కొందరు ఏమంటారు? మేము అలాంటి సెలబ్రేషన్స్ జరుపుకోము. మేము అలాంటి సెలబ్రేషన్ లో పాల్గొనము. అలాంటి సెలబ్రేషన్ చేసే వారికి ఎలాంటి హ్యాపీ అనేది మేము చెప్పము. కానీ ఏం చేస్తారు? టీవీలలో లేదా మొబైల్ ద్వారా, స్మార్ట్ ఫోన్ల ద్వారా కొన్ని ప్రత్యేక వెబ్సైట్లు, కొన్ని ప్రత్యేక యూట్యూబ్ లలో లైవ్ కార్యక్రమాలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇంకా వేరే కొన్ని యాప్స్ లలో లైవ్ ప్రోగ్రాములు దీనికి సంబంధించి జరుగుతాయి, కేవలం అవి చూసుకుంటున్నాము అని అంటారు. అర్థమైందా? స్వయంగా మేము ఏమీ పాల్గొనము, మేము మా ఇంట్లోనే ఉంటాము. కానీ ఏం చేస్తాము? లైవ్ ప్రోగ్రాం, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి ఏవైతే వస్తున్నాయో, వాటిని చూసుకుంటూ ఉంటాము. ఇలాంటివి చూసుకొని ఉండడం కూడా యోగ్యం లేదు.

కనీసం రెండు కారణాలు మీరు అర్థం చేసుకోండి. కనీసం రెండు కారణాలు అర్థం చేసుకోండి. ఒకటి, ఒక కారణం, వారు ఏ తప్పు పనులైతే ఆరోజు చేస్తూ ఉంటారో మీరు చూసి వారిని ప్రోత్సహించిన వారు అవుతారు. మీరు ప్రోత్సహించకున్నా మీ పదాలతో, మీరు వారి యొక్క ఆ వెబ్సైట్ ను, వారి యొక్క ఆ అప్లికేషన్ ను, వారి యొక్క ఆ ఛానల్ ను ఓపెన్ చేసి చూడడమే వారికి ఒక ప్రోత్సాహం. ఎందుకంటే వ్యూవర్స్ పెంచిన వారు అవుతారు. అంతే కాకుండా, అందులో ఏ ఏ చెడులు జరుగుతూ ఉంటాయో, అవి చూస్తూ చూస్తూ మనం ఆ పాపంలో మన కళ్ళతో పాల్గొన్న వారిమి అవుతాం. మనసులో ఏ భావోద్వేగాలు జనిస్తాయో, మనసును ఆ జినాలో, ఆ చెడులో, ఆ పాడులో, రంకులో, గుంపులో మనం మన మనసును కూడా వేసిన వారు అవుతాం. ఇంకా ఏమైనా చెడ్డ పేర్లు ఉండేది ఉంటే చెప్పడం ఇష్టం ఉండదు కానీ మీరు గమనించండి, అంత చెడ్డ విషయాలు జరుగుతూ ఉంటాయి. అయితే కేవలం వాటిని చూడడం కూడా యోగ్యం లేదు.

రెండవ కారణం ఇక్కడ ఏమిటంటే, మనిషి ఒక చెడును చెడు అని భావించాడు. కానీ దానిని చూస్తూ ఉన్నాడంటే, షైతాన్ యొక్క ఇవి ‘ఖుతువాతుష్ షైతాన్’ అని ఏదైతే చదివారో ఇంతకు ముందు ఒక పాఠంలో, అలాంటివి ఇవి ఖుతువాత్. అలాంటి ఈ అడుగులు. ఈ అడుగుజాడల్లో మీరు నడుస్తూ ఉన్నందుకు, అయ్యో వారు అంత పాడు చేస్తారు కదా, నేనైతే అంత చేయను కదా అన్నటువంటి ఏ తృప్తి అయితే వస్తూ ఉంటుందో, చెడులో ఉండి ఒక రకమైన చెడు చేస్తలేము అన్నటువంటి తృప్తిపడి తమకు తాము పుణ్యాత్ములని భావిస్తారు. ఇది చాలా తమకు తాము మోసంలో వేసుకున్న వారు అవుతారు.

సోదర మహాశయులారా, అల్లాహ్ మనందరికీ కూడా హిదాయత్ ఇవ్వు గాక, మనలో ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో అల్లాహ్ త’ఆలా వారికి తమ యొక్క సంతానాన్ని ఇలాంటి సందర్భాల్లో ఎలా శిక్షణ ఇవ్వాలో, ఎలా వారి యొక్క మంచి పద్ధతులు నేర్పాలో, ఆ భాగ్యం వారికి ప్రసాదించి ఇలాంటి చెడు కార్యాల నుండి దూరం ఉంచు గాక.

ఇంట్లో సిగ్గుమాలిన పనులను సహించుట

ఇక రండి, మన యొక్క ఈరోజు తొమ్మిదవ పాఠం, నిషిద్ధతలు, జాగ్రత్తలు అనే ఈ పుస్తకం నుండి 28వ అంశం, ఇంట్లో సిగ్గుమాలిన పనులను సహించుట. చూశారా? నేను చెప్పాను కదా, అది అల్లాహ్ వైపు నుండి మన యొక్క ఈ క్రమంలో ఈరోజే ఈ పాఠం వచ్చింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కు సంబంధించి కూడా ఈ అంశాన్ని మనం మంచి రీతిలో అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. చాలా చాలా అవసరం.

ఒక రెండు సెకండ్లు ఉండండి, ఇప్పుడు అజాన్ అవుతుంది.

ఇక్కడ ఎవరైతే యూట్యూబ్ లో చూస్తున్నారో, జూమ్ లో రావాలని కోరుకుంటారో, జూమ్ లో వస్తే ఒకసారి అది ఫుల్ అయిపోయింది అని మీకు తెలుస్తుందో, అక్కడే మీరు ఊరుకోకండి. మరోసారి, మరికొన్ని క్షణాల తర్వాత ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి. ఎందుకంటే జూమ్ లో వచ్చేవారు ఏదో ఒక పని మీద ఒకరిద్దరు ముగ్గురు ఈ విధంగా వస్తూ పోతూ ఉంటారు. ఈ విధంగా 100 కంటే తక్కువ ఎప్పుడైతే ఉంటుందో, మీరు అందులో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది.

శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి. ఇంట్లో సిగ్గుమాలిన పనులను సహించుట. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. ముగ్గురిపై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు, అల్లాహు అక్బర్. ఎంత ఘోరమైన శిక్షనో ఒకసారి గమనించండి. స్వర్గం మనం కోల్పోయామంటే ఇక ఏం మేలు పొందాము మనం? ఏం మంచితనం మనకు దొరికింది? ఇహలోకంలో గాని, పరలోకంలో గాని స్వర్గం కోల్పోయిన తర్వాత ఇక ఏదైనా మేలు ఉంటుందా మిగిలి? ఈ విషయం ముందు గమనించండి మీరు.

ఏంటి ఆ మూడు పాపాలు, దీని కారణంగా స్వర్గం నిషేధమవుతుంది? ఒకటి, మత్తు పానీయాలకు బానిస అయినవాడు. మత్తు పానీయాలకు సంబంధించి మా యొక్క ప్రసంగం కూడా ఉంది, మా జీడీకే నసీహ్ యూట్యూబ్ ఛానల్ లో, మత్తు పానీయాల ద్వారా ఎన్ని నష్టాలు ఉన్నాయి, ఇహపరలోకాలలో ఏ ఏ చెడులు వారి గురించి చెప్పడం అందులో చెప్పడం జరిగింది.

రెండవది, తల్లిదండ్రులకు అవిధేయుడు, అల్లాహు అక్బర్. ఇది కూడా చాలా ఈనాటి కాలంలో, న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంలో ఏ యువకులు, యువతులు, ఏ స్టూడెంట్స్ తమ తల్లిదండ్రులను ఏడిపించి, తల్లిదండ్రులకు బాధ కలిగించి, తల్లిదండ్రులు వద్దు అన్నా గాని వెళ్తూ ఉన్నారో, మీ ఈ నూతన సంవత్సర శుభకాంక్షలు, నూతన సంవత్సరం యొక్క సంబరాలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా ఆనందకరమైనదా? లేక స్వర్గం చాలా ఆనందకరమైనదా? అల్లాహ్ ఇచ్చిన బుద్ధి జ్ఞానంతో ఒక్కసారి ఆలోచించుకోండి. తల్లిదండ్రులను కాదు అని, వారికి అవిధేయత చూపి మీరు ఇలాంటి వాటిలో పాల్గొన్నారు అంటే, స్వర్గాన్ని కోల్పోయారు అంటే, మీ ఈ సంతోషాలు మీకు ఏం లాభం కలుగజేస్తాయో ఒక్కసారి ఆలోచించండి.

ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో మత్తుకు బానిస అయిపోతారు ఎంతోమంది. కొందరు యువకులు, నవ యువకులు, నవ యువతులు వారికి మొదటిసారిగా ‘అరే ఒక్కసారి త్రాగురా, ఒకటే గుటకరా, ఒకే చిన్న పెగ్గురా, అరే ఈ ఒక్కరోజే కదరా మనం ఆనందం జరుపుకునేది’ అని ఒకరు మరొకరికి ఈ విధంగా చెప్పుకుంటూ ఏదైతే తాగిస్తారో, తర్వాత దానికి అలవాటు పడే అటువంటి పునాది ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంలో జరుగుతుంది. కనుక గమనించండి, మహప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఎలాంటి విషయం తెలిపారు?

مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ
(మన్ కాన యు’మిను బిల్లాహి వల్’యౌమిల్ ఆఖిర్)
ఎవరైతే అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసిస్తారో

ఎవరికైతే అల్లాహ్ పై మరియు పరలోక దినంపై విశ్వాసం ఉన్నదో, అలాంటి వారు ఏ దస్తర్ ఖాన్ పై, ఏ ఆహార, అన్నపానీయాలు పెట్టిన ఆచోట, ఎక్కడైతే దావత్ జరుగుతుందో, ఎక్కడైతే నలుగురు కూర్చుని తింటున్నారో, అలాంటి దస్తర్ ఖాన్ పై ఒకవేళ ఏదైనా మత్తు ఉన్నది, ఏదైనా సారాయి ఉన్నది, విస్కీ బ్రాండీ లాంటివి ఉన్నాయి అంటే, అలాంటి ఆ దస్తర్ ఖాన్ లో, ఆ భోజనంలో, ఆ సంబరంలో వారితో కలవకూడదు, వారితో పొత్తు ఉండకూడదు, అందులో హాజరు కాకూడదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారైతే, చెప్పేకి ముందు ఏమన్నారు? ‘మన్ కాన యు’మిను బిల్లాహి వల్’యౌమిల్ ఆఖిర్’. అల్లాహ్ ను ఎవరైతే విశ్వసిస్తున్నారో, పరలోక దినాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో. అంటే ఇక గమనించండి, ఈ సెలబ్రేషన్ సందర్భంగా మీరు వెళ్లారు, అక్కడ ఈ గ్లాసులు కూడా పెట్టబడ్డాయి. మీరు త్రాగకున్నా గాని అలాంటి చోట హాజరు కావడం మీ అల్లాహ్ పై విశ్వాసాన్ని తగ్గిస్తుంది, మీ పరలోక విశ్వాసం దీని ద్వారా తగ్గిపోతుంది. కనుక గమనించండి, ఈ హదీస్ ను శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి.

ముగ్గురు ఉన్నారు, వారికి స్వర్గం లభించదు. ఒకరు, మత్తుకు బానిస అయిన వారు, రెండవ వారు తల్లిదండ్రులకు అవిధేయుడు, మూడవ వాడు తన ఇంట్లో అశ్లీలత, సిగ్గుమాలిన వాటిని సహించేవాడు, వాడినే ‘దయ్యూస్’ అని చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో కొందరు ప్రశ్నిస్తారు, దయ్యూస్ అంటే ఎవరు? హదీస్ లో వచ్చింది దయ్యూస్ అంటే ఎవరు? ఇదే హదీస్ లో దాని పక్కనే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమే వివరించారు. తన ఇంటి వారిలో, ‘అహల్’ అంటే ఇంటి వారిలో. ఇక్కడ ‘ఇంట్లో’ అన్న పదం ఏదైతే మీరు చూస్తున్నారో తెలుగులో, దీని ద్వారా మేము ఇంటి బయటికి వెళ్లి ఇలాంటిది ఏమైనా చేసేది ఉంటే పాపం కాదు కదా అని అనుకోకండి. అర్థం కావడానికి ఒక పదం ‘ఇంట్లో’ అని రాయడం జరిగింది. అంటే ఇంటి వారు. ఉదాహరణకు నేను ఇంటి బాధ్యుడిని. నా యొక్క బాధ్యతలో ఎవరెవరు వస్తారో, వారందరి గురించి నాకు సరియైన ఇన్ఫర్మేషన్ ఉండాలి. వారు ఏదైనా అశ్లీల కార్యంలో పడడం లేదు కదా, సిగ్గుమాలిన మాటలు గాని, పనులు గాని ఏమైనా చేస్తున్నారా? అన్నది నేను తెలుసుకుంటూ ఉండాలి.

ఒకవేళ అలాంటి ఏ కొంచెం అనుమానం వచ్చినా, వారికి మంచి రీతిలో నచ్చచెప్పడం, ఆ చేష్టలకు శిక్ష ఏదైతే ఉందో తెలియజేసి ఆ అశ్లీలతకు దూరంగా ఉంచడం తప్పనిసరి విషయం. ఇంట్లో యజమానికి, అంటే అతడు తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, ఇంటి యొక్క పెద్ద కొడుకు కావచ్చు, సోదరీమణుల కొరకు పెద్ద సోదరుడు కావచ్చు. అందుకొరకే ఒక మాట సర్వసామాన్యంగా మీరు వింటూ ఉంటారు చూడండి. ఒక్క పురుషుడిని నలుగురు స్త్రీలు నరకంలోకి తీసుకెళ్తారు అన్నట్లుగా. ఆ పదంతో ఏదైనా హదీస్ ఉందా, నాకు ఇంతవరకు తెలియదు, దొరకలేదు. కానీ ఇక్కడ మాట కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అన్నట్లుగా అనిపిస్తుంది. ఎలా? ఎవరైనా తండ్రి రూపంలో ఉండి సంతానాన్ని, భర్త రూపంలో ఉండి భార్యలను, ఇంకా సోదరిని రూపంలో ఉండి సోదరీమణులను, కొడుకు రూపంలో ఉండి తల్లిని, చెడు చూస్తూ, వ్యభిచారంలో పడుతూ, సిగ్గుమాలిన చేష్టలు చేస్తూ, తమ యొక్క స్మార్ట్ ఫోన్లలో ఇస్లాంకు వ్యతిరేకమైన, అశ్లీలతను స్పష్టపరిచే అటువంటి ఇమేజెస్ గాని, వీడియోస్ గాని, చాటింగ్స్ గాని ఉన్న విషయాలన్నీ కూడా తెలిసి కూడా వారిని ఆ చెడు నుండి ఆపుటలేదంటే అతడే దయ్యూస్.

అయితే, మరెప్పుడైనా ఏదైనా పెద్ద ఉలమాలతో మీరు ఇంకా దీని గురించి డీప్ గా విన్నప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా, షేక్ బిన్ బాజ్ రహమహుల్లాహ్ తెలిపినటువంటి ఒక విషయం తెలుపుతున్నాను. ఈ హదీస్ యొక్క వ్యాఖ్యానంలో షేక్ బిన్ బాజ్ రహమహుల్లాహ్ తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ ఏదైతే చెప్పారో, దయ్యూస్ అంటే, తన ఇంటిలో, తన ఇంటి వారిలో చెడును, అశ్లీలతను, సిగ్గుమాలిన విషయాలను సహించేవాడు. వాస్తవానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో సభ్యత, సంస్కారం పదాలలో కూడా అశ్లీలత ఏమీ రాకుండా ‘అల్’ఖబస్’ అన్నటువంటి మాట చెప్పారు. కానీ వాస్తవానికి ఇక్కడ ఉద్దేశం, వేరే ఇంకా ఈ టాపిక్ కు సంబంధించిన హదీస్ లు ఏవైతే వచ్చి ఉన్నాయో వాటి ద్వారా, సహాబాల యొక్క వ్యాఖ్యానాల ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే, వ్యభిచారం లాంటి చెడుకు పాల్పడే విషయం, పాల్పడబోతున్న విషయం తెలిసి కూడా మౌనం వహించే అటువంటి బాధ్యుడు, అతడు దయ్యూస్. ఈ మాట చెప్పిన తర్వాత షేక్ బిన్ బాజ్ రహమహుల్లాహ్ చెబుతున్నారు, వాస్తవానికి దయ్యూస్ అనేది ఇది, కానీ ఇక్కడి వరకు చేరిపించడానికి ముందు కొన్ని సాధనాలు ఉంటాయి. అయితే వాటిని చేయకుండా ఉన్నప్పుడే మనిషి వీటికి దూరంగా ఉంటాడు. వాటికి పాల్పడ్డాడంటే ఈ చెడుకు పాల్పడేటువంటి ప్రమాదం ఉంటుంది. మనం కూడా ఇంతకుముందు హదీస్ లో చదివాము కదా, కళ్ళు వ్యభిచారం చేస్తాయి. ఆ యొక్క హదీస్ లోని వివరంలో వేరే హదీస్ ల ఆధారంగా నేను చెప్పాను, హదీస్ లో స్పష్టంగా వచ్చి ఉంది, చేతులు వ్యభిచారం చేస్తాయి, కాళ్ళు వ్యభిచారం చేస్తాయి, పెదవులు వ్యభిచారం చేస్తాయి, నాలుక వ్యభిచారం చేస్తుంది, చెవులు వ్యభిచారం చేస్తాయి. ఇవన్నీ కూడా ‘ముకద్దిమాత్’ అంటారు. అసలైన వ్యభిచారం దేన్నైతే అంటారో, దాని వరకు చేరిపించేటువంటి సాధనాలు ఇవి. అయితే, ‘దయ్యూస్’ అన్నది ఆ చివరి విషయాన్ని సహించేవాడు. కానీ ఇవి కూడా అందులో వచ్చేస్తాయి, ఎందుకంటే ఇవే అక్కడి వరకు చేరిపిస్తాయి గనుక. అక్కడి వరకు చేరిపిస్తాయి గనుక.

రండి, మన పాఠంలోని మరికొన్ని విషయాలు ఉన్నాయి, అక్కడ చదివి ఈ విషయాన్ని ఇంకెంత మంచి రీతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ కాలం నాటి దయ్యూల్స్ రూపాల్లో ఇంట్లో కూతురు లేక భార్య పర పురుషునితో మొబైల్స్ లో సంభాషిస్తూ ఉండగా, అతను అలాంటి వాటిని సహించుట. తన ఇంట్లో ఉన్న స్త్రీలలో ఏ ఒకరైనా పర పురుషునితో ఏకాంతంలో గడుపుతూ ఉండడం చూసి మౌనం వహించుట. లేక ఆమె ఒంటరిగా మహరం కాని డ్రైవర్ తో వాహనంలో వెళ్ళుటను చూచి నిరాకరించకపోవుట. వారు ధార్మిక పరదా లేకుండా అంటే ఇంట్లోని స్త్రీలు ధార్మిక పరదా లేకుండా బయటికి వెళ్లి ప్రతి వచ్చి పోయే వాని విష చూపులకు గురి అవుతూ ఉండడం గమనించి సహించుట. ఇంకా అశ్లీలత, సిగ్గుమాలిన తనాన్ని ప్రచారం చేసేటువంటి ఫిలిం క్యాసెట్లు, డిష్ కేబుల్లు, ఇంకా ఏ పరికరం అయినా, ఏ సాధనం అయినా, ఏ మ్యాగజైన్స్ అయినా ఇంట్లోకి తీసుకురావటాన్ని చూసి వారిని నిరాకరించకపోవుట. అలాగే కొడుకులు పర స్త్రీలతో సంబంధం పెట్టుకోవడాన్ని చూసి మౌనం వహించుట. పిల్లలు తమ రూముల్లో, ఎందుకంటే ఎవరి వద్దనైతే సౌకర్యాలు పెరిగి ఉన్నాయో, ఒక్కొక్క కొడుకుకు ఒక్కొక్క రూమ్ ఇచ్చేస్తారు, లేదా ఒక రూమ్ కొడుకుల కొరకు, మరొక రూమ్ బిడ్డల కొరకు ఇచ్చేస్తారు. ప్రతి ఒక్కరిది ఒక బెడ్. అందులో అతను దుప్పటి వేసుకొని మొబైల్ తీసుకొని ఏమేం చూస్తున్నారో, తమ సంతానం తమ మొబైల్ ని ఏ చెడులో వాడుతున్నారో ఆ విషయాన్ని గమనించకుండా లేదా తెలిసి కూడా మౌనం వహించుట, ఇవన్నీ కూడా దయ్యూస్ అనే విషయంలోనే వచ్చేస్తాయి. కనుక వీటన్నిటికీ దూరం ఉండడం చాలా అవసరం.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఇంకా రెండు అంశాలు ఈనాటి గురించి ఏదైతే మనం అనుకున్నామో, ఉంటాయి, కానీ టైం సరిపడదు గనుక ఇక్కడి వరకే మనం స్టాప్ చేస్తున్నాము. ప్రత్యేకంగా న్యూ ఇయర్ కి సంబంధించి మీ వద్ద ఏమైనా ప్రశ్నలు ఉండేది ఉంటే అవి తీసుకుందాము. ఇన్’షా’అల్లాహ్ మిగతా రెండు పాఠాలు, ఇంకా మరికొన్ని పాఠాలు ఉన్నాయి, తర్వాత రోజుల్లో చదివే ప్రయత్నం చేద్దాము. జజాకుముల్లాహు ఖైరా, విన్న మంచి మాటలను అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. న్యూ ఇయర్ కు సంబంధించి ప్రత్యేకంగా ఏ చెడు విషయాల ప్రస్తావన వచ్చిందో, వాటి నుండి మనం స్వయంగా దూరం ఉండి, మన బాధ్యతలో ఉన్న వారిని దూరం ఉంచేటువంటి సౌభాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్.

బిద్అత్ (కల్పితాచారం) – Bidah (మెయిన్ పేజీ)
https://teluguislam.net/others/bidah/

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో & టెక్స్ట్]

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
వక్త: ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్
https://www.youtube.com/watch?v=QSCd4zG7zUQ [47 నిముషాలు]

ఈ ప్రసంగంలో, మానవ చరిత్రలో విగ్రహారాధన ఎలా ప్రారంభమైందో వివరించబడింది. ఆదం (అలైహిస్సలాం) తరువాత వెయ్యి సంవత్సరాల పాటు మానవజాతి ఏక దైవారాధనపై ఉంది. వద్, సువా, యగూస్, యఊక్, నసర్ అనే ఐదుగురు పుణ్యాత్ముల మరణానంతరం, షైతాన్ వారి విగ్రహాలను తయారుచేయించి, రాబోయే తరాలను వాటి ఆరాధన వైపు మళ్లించాడు. ఈ బహుదైవారాధనను నిర్మూలించడానికి, అల్లాహ్ తన మొదటి రసూల్ (సందేశహరుడు)గా నూహ్ (అలైహిస్సలాం)ను పంపాడు. ఆయన 950 సంవత్సరాలు ఏకదైవారాధన వైపు ప్రజలను పిలిచినా, కొద్దిమంది తప్ప ఎవరూ విశ్వసించలేదు. ప్రజల తిరస్కరణ, ఎగతాళి, మరియు హెచ్చరికల అనంతరం, అల్లాహ్ ఆదేశంతో నూహ్ (అలైహిస్సలాం) ఒక ఓడను నిర్మించారు. మహా జలప్రళయం సంభవించి, అవిశ్వాసులందరూ (నూహ్ కుమారునితో సహా) మునిగిపోయారు మరియు నూహ్, ఆయనతో ఉన్న విశ్వాసులు మాత్రమే రక్షించబడ్డారు. తూఫాను తరువాత, నూహ్ యొక్క ముగ్గురు కుమారుల సంతానం ద్వారా మానవజాతి మళ్ళీ వ్యాపించింది, అందుకే ఆయనను “మానవుల రెండవ పితామహుడు” అని కూడా పిలుస్తారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్.

قَالَ اللّٰهُ تَبَارَكَ وَتَعَالَى فِي الْقُرْآنِ الْمَجِيدِ أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
إِنَّآ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦٓ أَنْ أَنذِرْ قَوْمَكَ مِن قَبْلِ أَن يَأْتِيَهُمْ عَذَابٌ أَلِيمٌ

“నిశ్చయంగా మేము నూహును అతని జాతి వారి వద్దకు పంపాము – నీ జాతి వారిపై వ్యధాభరితమైన శిక్ష వచ్చి పడకముందే వారిని హెచ్చరించు” అని (ఆదేశించి). (71:1)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మీ అందరికీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం, ఈ భూమి మీద మానవులు నివాసం ఏర్పరుచుకున్న తరువాత అందరికంటే ముందు విగ్రహారాధన ఎవరు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? విగ్రహారాధన మానవులు చేయడానికి అసలైన కారణం ఏమిటి? ప్రజలను మళ్ళీ సృష్టితాల ఆరాధన నుండి తప్పించి, సృష్టికర్త ఆరాధన వైపు పిలవటానికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రథమంగా పంపించిన రసూల్ ఎవరు? ఆయన పేరు ఏమిటి? ఎన్ని సంవత్సరాలు ఆయన ఎలా ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు? తరువాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా విశ్వాసులకు ఎలాంటి రక్షణ కల్పించాడు? అవిశ్వాసులకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఏ విధంగా శిక్షించాడు? ఈ విషయాలన్నీ ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇంతకు ముందు ప్రసంగాలలో మిత్రులారా మనం, భూమి మీద మొదటి జంట ఆదం మరియు హవ్వా అలైహిస్సలాం వారిని అల్లాహ్ ఈ భూమి మీదికి పంపిన తర్వాత, వారు బ్రతికి ఉన్నంత కాలము వారి సంతానానికి అల్లాహ్ గురించి, అల్లాహ్ ఆరాధన గురించి నేర్పించి వెళ్లారు. వారి తర్వాత షైతాను కొన్ని కుయుక్తులు పన్ని, ప్రజలలో కొన్ని దురలవాట్లు ఏర్పడేటట్టు చేశాడు. కానీ ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము మానవుల మనుగడ ఈ భూమి మీద ప్రారంభమైన వెయ్యి సంవత్సరాల వరకు, అంటే మానవుని చరిత్ర ఈ భూమి మీద మొదలైన తర్వాత నుండి వెయ్యి సంవత్సరాల వరకు ప్రజలు కేవలం ఒకే ఒక ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే ఆరాధించుకుంటూ వచ్చారు. మధ్యలో షైతాను వలలో చిక్కి కొంతమందిలో కొన్ని దురలవాట్లు వచ్చాయి కానీ వారు మాత్రం ఒక అల్లాహ్ నే నమ్మారు, ఒక అల్లాహ్ నే ఆరాధించుకుంటూ వచ్చారు.

తర్వాత వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత, ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం, ఆది దంపతుల మరణం తర్వాత, షీస్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం వారి మరణం తర్వాత, వెయ్యి సంవత్సరాల మానవ చరిత్ర ఈ భూమి మీద నడిచిన తర్వాత, అప్పుడు ప్రజలు రెండు రకాలుగా మారిపోయారు. ఒక రకం ఎవరంటే అల్లాహ్ ను తలచుకుంటూ, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ, అల్లాహ్ మీద భయభక్తితో జీవితం గడుపుకునే దైవభక్తులు. మరో రకమైన ప్రజలు ఎవరంటే అల్లాహ్ ఆరాధనకు దూరమైపోయిన వారు, దైవ భీతికి, దైవ భక్తికి దూరంగా ఉంటున్న వారు మరి కొంతమంది. ఇలా దైవభక్తితో జీవించుకున్న వాళ్ళు కొందరు, దైవభక్తికి దూరమైపోయిన వారు కొందరు. అలా రెండు రకాలుగా ప్రజలు మారిపోయారు.

అయితే ఇక్కడ మరొక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి అదేమిటంటే, ఎవరైతే దైవ భీతితో భక్తులుగా జీవించుకుంటున్నారో వారిలో ఒక ఐదుగురు ప్రసిద్ధి చెంది ఉన్నారు. వారి ప్రస్తావన ఖురాన్లో కూడా వచ్చి ఉంది, 71వ అధ్యాయం, 23వ వాక్యంలో. వారి పేర్లు వద్, సువా, యగూస్, యఊక్, నసర్. ఈ ఐదు పేర్లు కూడా దైవ భీతితో జీవించుకుంటున్న దైవభక్తుల పేర్లు అని అబ్దుల్లా ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు తెలియజేసి ఉన్నారు.

అయితే ఈ ఐదు మందిని ఎవరైతే దైవ భీతికి దూరంగా ఉంటున్నారో వారు సైతం ఈ ఐదు మందిని అభిమానించేవారు. ప్రజలు వారు దైవభక్తులని గౌరవిస్తూ అభిమానించేవారు.

ఇక షైతాన్ మానవుని బద్ధ శత్రువు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని గురించి ముందే తెలియజేసి ఉన్నాడు, మానవుల బద్ధ శత్రువు, బహిరంగ శత్రువు అని. అతను మానవులను మార్గభ్రష్టత్వానికి గురి చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెంటనే ఎప్పుడైతే ప్రజలు కొంతమంది దైవ భీతితో జీవించుకుంటున్నారో, మరికొంతమంది దైవ భీతికి దూరమైపోయారో అన్న విషయాన్ని గమనించాడో, అతను దైవ భీతికి దూరంగా ఉంటున్న వారి వద్దకు వచ్చాడు. వచ్చి ఈ దైవ భీతి పరులు ఎవరైతే బాగా ప్రసిద్ధి చెందారో, వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీరి మరణానంతరం ప్రజల వద్దకు వచ్చి, ఏమండీ మీ పూర్వీకులు ఈ ఫలా ఫలా వ్యక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జీవించుకునేవారు కదండీ. వారు మరణించిన తర్వాత వారి మీద ఉన్న మీ అభిమానాన్ని మీరు ఎలా చాటుకుంటారండి? అని వాడు ఏం చేశాడంటే కొన్ని ప్రతిమలు తయారుచేసి, ఏమండీ ఇవి మీరు అభిమానించే దైవ భీతిపరుల ప్రతిమలు. ఈ ప్రతిమలు మీరు మీ వద్ద ఉంచుకొని వారి అభిమానాన్ని చాటుకోండి, వారిని తలుచుకోండి అని తెలియజేశాడు.

చూడటానికి మాట చాలా మధురంగా కనిపిస్తుంది కదండీ. ఒక అభిమాని యొక్క ప్రతిమను తీసుకొని వచ్చి మీరు ఇతన్ని అభిమానిస్తున్నారు కాబట్టి ఇతని ప్రతిమను మీ దగ్గర ఉంచుకోండి అని చెప్తే ఎవరు వద్దంటాడండి? అలాగే ఆ ప్రజలు ఏం చేశారంటే, షైతాను మానవుని రూపంలో వచ్చి ఆ విధంగా చెబుతూ ఉంటే, ఇదేదో మంచిగానే ఉంది కదా అనుకొని తీసుకుపోయి వెళ్లి విగ్రహాలను ఇళ్లల్లో ఉంచుకున్నారు. చూడండి, ప్రతిమలు ఇళ్లల్లోకి కేవలం అభిమానం అనే ఒక కారణంతోనే వచ్చాయి. అవి ఆరాధ్యులు, మన కోరికలు తీర్చే దేవుళ్ల రూపాలు అన్న ఆలోచనతో అవి ఇళ్లల్లోకి రాలేదు.

మనం అభిమానించే మన దైవ భీతిపరుల ప్రతిమలు అని అవి ఇళ్లల్లోకి వచ్చాయి. వారు బ్రతికి ఉన్నంత కాలం, ఎవరైతే ఆ విగ్రహాలను, ఆ ప్రతిమలను ఇళ్లల్లోకి తీసుకొని వెళ్లారో వారు జీవించినంత కాలము వాటిని చూసుకుంటూ మన పూర్వీకులు, మన పూర్వీకులు ఒకప్పుడు ఉండేవారు, ఒకప్పుడు భక్తి శ్రద్ధలతో జీవించుకునేవారు అని చెప్పుకుంటూ జీవించారు. ముఖ్యంగా ఆ దైవ భీతిపరులు ఎక్కడైతే దైవ ఆరాధనలో సమయం గడిపేవారో, అదే చోట ఆ విగ్రహాలను ప్రతిష్టించుకున్నారు అని కూడా కొంతమంది ధార్మిక పండితులు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికినీ మానవుల మధ్యకి ప్రతిమలు, విగ్రహాలు వచ్చాయి. ప్రారంభంలో అవి కేవలము అభిమానించబడ్డాయి అంతేగాని ఆరాధించబడలేదు.

రోజులు గడిచాయి. మానవుల ఆయుష్షు ముగిస్తూ పోయింది. ఒక తరం గడిచింది, తర్వాత తరం గడిచింది. ఆ విధంగా తరాలు గడిచిన తర్వాత విగ్రహాలు మాత్రము అవి అలాగే నిలబడి ఉన్నాయి. ఒక రెండు, మూడు తరాలు గడిచిన తర్వాత అవి ఒక పురాతన వస్తువులాగా మారిపోయింది. దాని చరిత్ర ఎవరికీ తెలియదు, తర్వాత వచ్చిన తరాల వారికి.

అప్పుడు షైతాన్ మళ్ళీ మానవుని రూపంలో వారి మధ్యకు వచ్చి, తర్వాతి తరాల వారి వద్దకు వచ్చి, ఏమండీ మీ పూర్వీకులు వీటినే ఆరాధించుకునేవారు, మీరెందుకండి విస్మరిస్తున్నారు వీటిని? మీ పూర్వీకులు వీటిని ఆరాధిస్తుండగా నేను చూశాను అని అతను నమ్మజబితే, తర్వాత తరాల వారు అతని మాటలను నమ్మి వెంటనే ఆ ప్రతిమలను, ఆ విగ్రహాలను ఆరాధించడం ప్రారంభించేశారు.

చూశారా, షైతాను ఎలా క్రమంగా, నెమ్మదిగా ప్రజలను అల్లాహ్ ఆరాధన నుండి తప్పించి విగ్రహారాధన వైపుకి తీసుకెళ్ళిపోయాడో? అభిమానం అన్న ఒక విషయాన్ని ఆయుధంగా మలుచుకున్నాడు. తరువాత ఆ విగ్రహాలను ఇళ్లల్లో తీసుకొని వెళ్లి, ముందు ప్రతిష్టింపజేసి, తర్వాత తరాల వారికి మాత్రము వారే మీ దేవుళ్ళు అన్నట్టుగా చిత్రీకరించి చెప్పగానే తర్వాత తరాల వారు తెలియని వాళ్ళు ఏం చేశారంటే, అమాయకత్వానికి గురయ్యి వారు ఆ విగ్రహాలను పూజించడం ప్రారంభించారు. విగ్రహారాధన వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ భూమండలం మీద ప్రారంభమైంది. షైతాను వలలో చిక్కుకొని ప్రజలు ఆ విధంగా విగ్రహారాధన చేశారు.

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) వారి పిలుపు

అప్పుడు పైనుంచి గమనిస్తున్న అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఇదేమిటండీ మానవులు రాళ్ళను, విగ్రహాలను పూజించడం ప్రారంభించేశారో అని వెంటనే వారిలో నుంచే ఒక ఉత్తమమైన వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకొని వారి మధ్యకు ప్రవక్తగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రభవింపజేశాడు. ఆయన పేరే నూహ్ అలైహిస్సలాం.

నూహ్ అలైహిస్సలాం ప్రవక్త పదవి దక్కిన తర్వాత ప్రజల మధ్యకు ప్రవక్తగా వెళ్లి ముందుగా నూహ్ అలైహిస్సలాం వారి జాతి ప్రజలకు ఇచ్చిన పిలుపు ఏమిటంటే, ఖురాన్ లో ఏడవ అధ్యాయం 59వ వాక్యంలో మనం చూస్తే కనిపిస్తుంది అక్కడ, నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు:

يَٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ

(యా కౌమి అ`బుదుల్లాహ మాలకుమ్ మిన్ ఇలాహిన్ గైరుహూ)
“ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దేవుడు లేడు.” (7:59)

ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన తప్ప వేరెవరూ మీ ఆరాధనకు అర్హులు కారు. అంటే నూహ్ అలైహిస్సలాం ప్రజల వద్దకు వెళ్లి మొదటి దైవ వాక్యం వినిపించింది ఏమిటంటే, మీ ఆరాధనలకు అర్హుడు కేవలం ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి నా జాతి ప్రజలారా మీరు అల్లాహ్ ను ఆరాధించండి, అల్లాహ్ ఆరాధన వైపుకి రండి అని పిలుపునిచ్చారు.

ఇక్కడ ఒక విషయం మనం గుర్తులో పెట్టుకోవాలి అదేమిటంటే, ఈ భూమండలం మీద మానవుని చరిత్ర మొదలైన తర్వాత ప్రజలకు విగ్రహారాధన నుండి తప్పించి అల్లాహ్ ఆరాధన వైపుకి రండి అని పిలిచిన మొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం. ఆ గౌరవం ఆయనకే దక్కింది.

నూహ్ అలైహిస్సలాం కేవలం ప్రజలకు అల్లాహ్ ను ఆరాధించండి అని చెప్పడమే కాదండి, అల్లాహ్ ను ఆరాధించిన వలన మీకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎలాంటి అనుగ్రహాలు ప్రసాదిస్తాడు అన్న విషయాలు కూడా తెలియజేశారు. ఖురాన్లో మనం చూసినట్లయితే 71వ అధ్యాయం 10వ వాక్యము నుండి 12వ వాక్యం వరకు ఆయన చెప్పిన మాటలు తెలపబడ్డాయి. ఆయన ఏమన్నారంటే:

فَقُلْتُ ٱسْتَغْفِرُوا۟ رَبَّكُمْ إِنَّهُۥ كَانَ غَفَّارًا ‎﴿١٠﴾‏ يُرْسِلِ ٱلسَّمَآءَ عَلَيْكُم مِّدْرَارًا ‎﴿١١﴾‏ وَيُمْدِدْكُم بِأَمْوَٰلٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّٰتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَٰرًا ‎﴿١٢﴾‏

(ఫకుల్తుస్తగ్ఫిరూ రబ్బకుమ్ ఇన్నహూ కాన గఫ్ఫారా. యుర్సిలిస్ సమాఅ అలైకుమ్ మిద్రారా. వయుమ్దిద్కుమ్ బి అమ్వాలివ్ వబనీన వయజ్అల్ లకుమ్ జన్నతివ్ వయజ్అల్ లకుమ్ అన్హారా)
“మీరు మీ ప్రభువును క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు. (అలా చేస్తే) ఆయన మీపై ఆకాశం నుండి ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. సిరిసంపదలతో, సంతానంతో మీకు సహాయం చేస్తాడు. మీ కోసం తోటలను ఉత్పాదనం చేస్తాడు, మీ కొరకు కాలువలను ప్రవహింపజేస్తాడు.” (71:10-12)

మీరు బహుదైవారాధన చేసి పాపానికి ఒడిగట్టారు కదా. మీరు అల్లాహ్ తో క్షమాపణ వేడుకోండి. క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. ఆయన నిశ్చయంగా క్షమించేవాడు. క్షమించిన తర్వాత ఆయన మీ కోసం ఏం చేస్తాడంటే, ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని వసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు, ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.

మీ పాపాలు మన్నిస్తాడు, వర్షాలు కురిపిస్తాడు, నదులు ప్రవహింపజేస్తాడు, మీకు సంతానం ప్రసాదిస్తాడు, పంటలు పండిస్తాడు. ఈ విధంగా అల్లాహ్ అనుగ్రహాలు మీకు దొరుకుతూ ఉంటాయి అని నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ ఆరాధన వైపు పిలుస్తూ అల్లాహ్ ప్రజలకు ప్రసాదించే అనుగ్రహాల గురించి కూడా తెలియజేశారు.

జాతి ప్రజల తిరస్కరణ మరియు ఎగతాళి

అయితే ప్రజల స్పందన ఎలా ఉండేది? అది మనం చూసినట్లయితే, ఎప్పుడైతే నూహ్ అలైహిస్సలాం ఈ విషయాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లారో ప్రజలు ఏమనేవారంటే:

إِنَّا لَنَرَىٰكَ فِى ضَلَٰلٍ مُّبِينٍ

(ఇన్నాల నరాక ఫీ దలాలిమ్ ముబీన్)
“మేమైతే నిన్ను స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లు చూస్తున్నాము.” (7:60)
ఓ నూహ్, నువ్వు స్పష్టమైన అపమార్గానికి గురైనట్లు మాకు కనిపిస్తుంది అన్నారు. మరికొంతమంది ఏమన్నారంటే:

مَا سَمِعْنَا بِهَٰذَا فِىٓ ءَابَآئِنَا ٱلْأَوَّلِينَ

(మా సమిఅనా బిహాజా ఫీ ఆబాయినల్ అవ్వలీన్)
“ఇలాంటి మాటను మేము మా తాతముత్తాతల కాలంలో ఎన్నడూ వినలేదు.” (23:24)
అనగా ఇతను చెప్పే దానిని మేము ఇదివరకు ఎన్నడూ మా తాత ముత్తాతల కాలంలో విననేలేదు. మా తాత ముత్తాతల కాలంలో ఇలా ఒక దేవుణ్ణి ఆరాధించాలి, అల్లాహ్ ని దేవుణ్ణి, అల్లాహ్ ని ఆరాధించాలన్న మాటలు మనం విననేలేదే అని కొంతమంది మాట్లాడారు. మరి కొంతమంది ఏమన్నారంటే:

وَلَوْ شَآءَ ٱللَّهُ لَأَنزَلَ مَلَٰٓئِكَةً

(వలౌ షా అల్లాహు లఅన్జల మలాయికతన్)
“అల్లాహ్‌యే గనక తలచుకుంటే దైవదూతలను దించి ఉండేవాడు.” (23:24)
ప్రజలను అల్లాహ్ వైపు పిలవాలనే ఒక ఉద్దేశం అల్లాహ్ కు ఉండినట్లయితే మానవుడిని ఎందుకు పంపిస్తాడు? ఒక దైవదూతను పంపించేవాడు కదా అని అన్నారు.

అప్పుడు నూహ్ అలైహిస్సలాం, చూడండి ప్రజలు నూహ్ అలైహిస్సలాం వారికి నువ్వు మార్గభ్రష్టత్వానికి గురైపోయావు అంటున్నారు, మనిషిగా నువ్వు మా వద్దకు ప్రవక్తగా రావడం ఏంటి, దైవదూత రావచ్చు కదా అంటున్నారు, మా తాత ముత్తాతల కాలంలో ఇలాంటి మాటలు మనం ఎప్పుడూ వినలేదే అంటున్నారు. అయితే నూహ్ అలైహిస్సలాం ఎంతో మృదు స్వభావంతో ప్రజలకు ఎంత మధురమైన మాటలు చెప్తున్నారో చూడండి. ఆయన అన్నారు, “నా జాతి ప్రజలారా, నేను దారి తప్పలేదు. నేను సర్వలోకాల ప్రభువు తరపున పంపబడిన ప్రవక్తను. నేను మీ మేలు కోరేవాడిని.”

ప్రతి జాతిలో కొంతమంది పెద్దలు ఉంటారండి. నూహ్ అలైహిస్సలాం వారి జాతిలో కూడా పెద్దలు ఉండేవారు కదా, వారు నూహ్ అలైహిస్సలాం వారి మాటలు విని ఏమనేవారంటే:

يُرِيدُ أَن يَتَفَضَّلَ عَلَيْكُمْ

(యురీదు అన్ యతఫద్దల అలైకుమ్)
“ఇతను మీపై ఆధిపత్యం చెలాయించాలని కోరుతున్నాడు.” (23:24)
ఇతను మీపై పెత్తరికాన్ని కోరుకుంటున్నాడు. మరికొంతమంది పెద్దలు ఏమనేవారంటే:

إِنْ هُوَ إِلَّا رَجُلٌۢ بِهِۦ جِنَّةٌ

(ఇన్ హువ ఇల్లా రజులుమ్ బిహీ జిన్నతున్)
“ఇతను పిచ్చిపట్టిన మనిషి తప్ప మరెవరూ కారు.” (23:25)
అనగా ఇతనికి పిచ్చి పట్టినట్టుంది. మరికొంతమంది అయితే ఏకంగా నూహ్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి ఒక షరతు పెట్టేశారు. ఏంటి ఆ షరతు? నూహ్ అలైహిస్సలాం ప్రజలకు దైవ వాక్యాలు వినిపిస్తూ ఉంటే కొంతమంది నూహ్ అలైహిస్సలాం వారి మాటలు విని విశ్వసించి ముస్లింలుగా, విశ్వాసులుగా జీవించుకుంటున్నారు. అయితే వారందరూ కూడా హోదాపరంగా, ధనంపరంగా బలహీనులు. వారి గురించి వచ్చి ఈ జాతి పెద్దలు నూహ్ అలైహిస్సలాం వారి వద్ద షరతు పెడుతున్నారు. ఏమంటున్నారంటే:

أَنُؤْمِنُ لَكَ وَٱتَّبَعَكَ ٱلْأَرْذَلُونَ

(అను’మినులక వత్తబఅకల్ అర్జలూన్)
“(ఓ నూహ్‌!) నిన్ను అనుసరిస్తున్న వారంతా అధములే కదా! మరి మేము నిన్ను ఎలా విశ్వసిస్తాము?” (26:111)
అదేమిటంటే, ఓ నూహ్, మేము నీ మాటను విశ్వసిస్తాం, నీ మాటను అంగీకరిస్తామయ్యా, అయితే నీ వద్ద ఉన్న ఈ బలహీనులు, అధములు వీరిని నువ్వు నీ వద్ద నుండి గెంటివేయి.

మేము నిన్ను విశ్వసించాలా? చూడబోతే అధములు మాత్రమే నిన్ను అనుసరిస్తున్నారు. కాబట్టి మేము నీ మాట వినాలంటే ఈ అధములని నీ వద్ద నుండి నువ్వు గెంటేయాలి అన్నారు. చూడండి, చులకనగా చూస్తున్నారు విశ్వాసులను. అహంకారం అండి, హోదాలలో ఉన్నారు కదా, జాతి పెద్దలు కదా, గర్వం. ఆ అహంకారంతో, గర్వంతో ఏమంటున్నారంటే వారిని నువ్వు గెంటేస్తే నేను నీ మాట వింటాము అంటున్నారు.

అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, “ఏమండీ, నేను ఏదో హోదా కోరుకుంటున్నాను, లేదా ధనం కోరుకుంటున్నాను, మీ నాయకుడిని అయిపోవాలి ఇలాంటి కోరికలతో నేను మీకు ఈ వాక్యాలు వినిపిస్తున్నానని మీరు అనుకుంటున్నారా? వాస్తవం ఏమిటంటే:

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ

(వమా అస్అలుకుమ్ అలైహి మిన్ అజ్ర్)
“నేను దీనికై మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు.” (26:109)
నేను ఈ బోధనలకు ప్రతిఫలంగా ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. అలాగే:

وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلْمُؤْمِنِينَ

(వమా అన బితారిదిల్ ము’మినీన్)
“నేను విశ్వాసులను తరిమివేసేవాడను కాను.” (26:114)
నేను మాత్రం విశ్వాసులను ఎట్టి పరిస్థితుల్లో గెంటివేసేవాడిని కాను. విశ్వాసులు వాళ్ళు ధనపరంగా బలహీనులా, బలవంతులా, ఇది కాదు. విశ్వాసం వారిది ఎంత దృఢమైనదనే దానిని బట్టి వారిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా గౌరవ స్థానాలు కేటాయిస్తాడు కాబట్టి నేను మాత్రం వీరిని నా వద్ద నుండి గెంటివేయను అని నూహ్ అలైహిస్సలాం వారు వారికి తెలియజేశారు.

నూహ్ అలైహిస్సలాం వారు జాతి ప్రజల మధ్య ఇంచుమించు 950 సంవత్సరాల వరకు రేయింబవళ్ళు కష్టపడి దైవ వాక్యాలు ప్రజలకు తెలియజేశారు. ఖురాన్లోని 29వ అధ్యాయం 14వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

فَلَبِثَ فِيهِمْ أَلْفَ سَنَةٍ إِلَّا خَمْسِينَ عَامًا

(ఫలబిస ఫీహిమ్ అల్ఫ సనతిన్ ఇల్లా ఖమ్సీన ఆమన్)
“అతను వారి మధ్య యాభై తక్కువ వెయ్యి సంవత్సరాలు ఉన్నాడు.” (29:14)
అనగా 50 తక్కువ వెయ్యి సంవత్సరాలు, 50 తక్కువ వెయ్యి సంవత్సరాలు అంటే 950 సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారి మధ్య ఉన్నాడు. రాత్రిపూట వారికి దైవ వాక్యాలు వినిపించారు, పగలుపూట వారికి దైవ వాక్యాలు వినిపించారు. అందరూ కలిసి ఉన్నచోట వెళ్లి దైవ వాక్యాలు వినిపించారు. ఏకాంతంలో వెళ్లి కలిసి వారికి అల్లాహ్ వైపు పిలిచారు, దైవ వాక్యాలు వినిపించారు. బహిరంగంగా కూడా దైవ వాక్యాలు ప్రకటించారు, ఏకాంతంలో కూడా వెళ్లి వారికి అల్లాహ్ వాక్యాలు తెలియజేశారు. ఇలా నూహ్ అలైహిస్సలాం ఎన్ని రకాలుగా వారికి అల్లాహ్ వాక్యాలు వినిపించినా వారు మాత్రం ఏం చేసేవారంటే, చెవుల్లో వేళ్ళు పెట్టుకునేవారు, తలల మీద బట్టలు కప్పుకునేవారు.

అంతే కాదండి, వారిలో ఎవరికైనా మరణం సమీపిస్తే మరణించే ముందు కుటుంబ సభ్యుల్ని దగ్గరికి పిలిచి హితవు చేసేవారు. ఏమని? ఎట్టి పరిస్థితుల్లో మీరు నూహ్ మాట వినకండి. నూహ్ ఎటువైపు మిమ్మల్ని పిలుస్తున్నాడో అటువైపు మీరు వెళ్ళకండి. నూహ్ మాటల్ని మీరు పట్టించుకోకండి. అలాగే మనం పూజిస్తున్న వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీళ్ళ ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలకండి అని చెప్పేవారు. దీని ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది:

وَقَالُوا۟ لَا تَذَرُنَّ ءَالِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّا وَلَا سُوَاعًا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا

(వకాలూ లా తజరున్న ఆలిహతకుమ్ వలా తజరున్న వద్దవ్ వలా సువాఅవ్ వలా యగూస వయఊక వనస్రా)
“మరియు వారు ఇలా అన్నారు: ‘మీరు మీ దైవాలను ఎంతమాత్రం వదలకండి. వద్దును, సువాను, యగూసును, యఊకును, నస్రును అసలే వదలకండి’.” (71:23)

చివరికి అన్ని సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారు కష్టపడినా ఎంతమంది విశ్వసించారంటే, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము ఇంచుమించు 80 మంది మాత్రమే విశ్వసించారు. 950 సంవత్సరాల కష్టానికి ఫలితంగా కేవలం ఇంచుమించు 80 మంది మాత్రమే విశ్వసించారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం జాతి ప్రజలను హెచ్చరించారు. ఏమని హెచ్చరించారంటే:

إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ

(ఇన్నీ అఖఫు అలైకుమ్ అజాబ యౌమిన్ అజీమ్)
“నిశ్చయంగా నేను మీ విషయంలో ఒక మహత్తర దినపు శిక్షకు భయపడుతున్నాను.” (7:59)
అనగా మీ విషయంలో ఒక మహా దినం నాటి శిక్ష గురించి నాకు భయంగా ఉంది. ఒక శిక్ష మీకు వచ్చి పట్టుకుంటుందన్న భయం నాకు కలుగుతూ ఉంది, కాబట్టి మీరు దైవ శిక్షకు భయపడండి, అల్లాహ్ వైపుకు రండి అని అల్లాహ్ శిక్ష గురించి వారిని హెచ్చరించారు.

అయితే జాతి ప్రజలు, జాతి పెద్దలు ఆ మాట విని నూహ్ అలైహిస్సలాం వారితో ఏమనేవారంటే:

قَالُوا۟ يَٰنُوحُ قَدْ جَٰدَلْتَنَا فَأَكْثَرْتَ جِدَٰلَنَا فَأْتِنَا بِمَا تَعِدُنَآ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ

(ఖాలూ యా నూహు కద్ జాదల్తనా ఫ అక్సర్త జిదాలనా ఫ’తినా బిమా తఇదునా ఇన్ కుంత మినస్ సాదిఖీన్)
“ఓ నూహ్‌! నీవు మాతో వాదించావు. చాలా ఎక్కువగా వాదించావు. నీవు గనక సత్యవంతుడివే అయితే, నీవు మమ్మల్ని భయపెడుతున్న ఆ శిక్షను తీసుకురా చూద్దాం.” (11:32)
అనగా, ఓ నూహ్, నువ్వు మాతో వాదించావు, మరీ మరీ వాదించావు, మరి నువ్వు సత్యవంతుడవే అయితే మమ్మల్ని హెచ్చరించే దానిని అనగా ఆ దైవ శిక్షని తీసుకురా అని చెప్పేవారు. ఎంత పెద్ద మాట అండి! అల్లాహ్ శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది అని ప్రవక్త హెచ్చరిస్తూ ఉంటే, జాతి ప్రజలు, జాతి పెద్దలు ఏమంటున్నారంటే, ఈ హెచ్చరికలు నోటితో చెప్పటం కాదు, ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయితే తీసుకురా చూద్దాం ఆ దైవ శిక్ష ఎలా ఉంటాదో అంటున్నారంటే ఎంతటి అహంకారము. షైతాను వారిని ఎలా అంధులుగా చేసేసాడో చూడండి.

మరి కొంతమంది అయితే ఏకంగా నూహ్ అలైహిస్సలాం వారి మీదకే తిరగబడిపోయారు. వారేమన్నారంటే:

لَئِن لَّمْ تَنتَهِ يَٰنُوحُ لَتَكُونَنَّ مِنَ ٱلْمَرْجُومِينَ

(లఇల్ లమ్ తంతహి యా నూహు లతకూనన్న మినల్ మర్జుమీన్)
“ఓ నూహ్‌! నీవు గనక (ఈ పని నుండి) విరమించుకోకపోతే, నిశ్చయంగా నీవు రాళ్లతో కొట్టి చంపబడతావు.” (26:116)
వారేమంటున్నారంటే, నువ్వు గనుక ఈ పనిని మానుకోకపోతే నిన్ను రాళ్లతో కొట్టడం, చంపడం ఖాయం. దైవ శిక్ష వచ్చి పడుతుంది అని మమ్మల్ని బెదిరించడం కాదు, ఇలాంటి మాటలు నువ్వు మానుకోకపోతే నిన్నే మేమందరం కలిసి రాళ్లతో కొట్టి చంపేస్తాము, ఇది ఖాయం అని చెప్పారు.

దైవ ఆదేశం మరియు ఓడ నిర్మాణం

అలాంటప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఒక మాట తెలియజేశాడు. ఏంటి ఆ మాట?

أَنَّهُۥ لَن يُؤْمِنَ مِن قَوْمِكَ إِلَّا مَن قَدْ ءَامَنَ

(అన్నహూ లయ్ యు’మిన మిన్ కౌమిక ఇల్లా మన్ కద్ ఆమన్)
“ఇంతకు ముందే విశ్వసించిన వారు తప్ప, నీ జాతి వారిలో మరింకెవరూ విశ్వసించరు.” (11:36)
ఓ నూహ్, నీ జాతి వారిలో ఇంతవరకు విశ్వసించిన వారు తప్ప ఇక మీదట ఎవరూ విశ్వసించబోరు. ఇప్పటివరకు ఎంతమంది అయితే విశ్వసించారో వారే విశ్వాసులు. ఇక నీ జాతిలో ఏ ఒక్కడూ కూడా విశ్వసించేవాడు లేడు అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేయగా నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ తో ప్రార్థన చేశారు. ఏమన్నారు?

رَبِّ إِنَّ قَوْمِى كَذَّبُونِ ‎﴿١١٧﴾‏ فَٱفْتَحْ بَيْنِى وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِى وَمَن مَّعِىَ مِنَ ٱلْمُؤْمِنِينَ ‎﴿١١٨﴾‏

(రబ్బి ఇన్న కౌమీ కజ్జబూన్. ఫఫ్తహ్ బైని వబైనహుమ్ ఫత్హవ్ వనజ్జినీ వమన్ మఇయ మినల్ ము’మినీన్)
“నా ప్రభూ! నా జాతి వారు నన్ను ధిక్కరించారు. కనుక నాకూ, వారికీ మధ్య ఒక స్పష్టమైన తీర్పు కావాలి. నాకూ, నాతో పాటు ఉన్న విశ్వాసులకూ మోక్షం ప్రసాదించు.” (26:117-118)
అనగా, నా ప్రభు, నా జాతి వారు నన్ను ధిక్కరించారు, కాబట్టి నీవు నాకూ, వారికి మధ్య ఏదైనా అంతిమ నిర్ణయం చెయ్యి. నన్నూ, నాతో ఉన్న విశ్వాసులను కాపాడు. ఇక నిర్ణయం నీ వైపే వదిలేస్తున్నాను ఓ అల్లాహ్, నీవే ఫలితం తేల్చేయి, నన్ను, నాతో పాటు ఉన్న విశ్వాసులను మాత్రము నువ్వు రక్షించు కాపాడు అని నూహ్ అలైహిస్సలాం వారు దుఆ చేయగా, ప్రార్థన చేయగా అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఒక ఆదేశం ఇచ్చాడు. ఏంటది?

وَٱصْنَعِ ٱلْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا وَلَا تُخَٰطِبْنِى فِى ٱلَّذِينَ ظَلَمُوٓا۟ ۖ إِنَّهُم مُّغْرَقُونَ

(వస్నఇల్ ఫుల్క బిఅ’యునినా వవహ్యినా వలా తుఖతిబ్నీ ఫిల్ లజీన జలమూ ఇన్నహుమ్ ముగ్ రఖూన్)
“నీవు మా కళ్లెదుట, మా ఆదేశానుసారం ఓడను నిర్మించు. దుర్మార్గుల విషయంలో నాతో మాట్లాడకు. వారు ముంచివేయబడటం ఖాయం.” (11:37)
అనగా, మా కళ్ల ముందరే, మా వహీ అనుసారం ఒక ఓడను తయారు చెయ్యి, మా ముందు దుర్మార్గుల ఊసు ఎత్తకు, వారంతా ముంచివేయబడేవారే. అంటే మా ఆదేశాల ప్రకారము ఒక ఓడను నువ్వు తయారు చేసుకో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఆదేశాలు ఇచ్చేశాడు.

నూహ్ అలైహిస్సలాం విషయాన్ని అర్థం చేసుకొని అల్లాహ్ తో మరొక్కసారి ప్రార్థిస్తున్నారు, ఏమన్నారంటే:

رَّبِّ لَا تَذَرْ عَلَى ٱلْأَرْضِ مِنَ ٱلْكَٰفِرِينَ دَيَّارًا ‎﴿٢٦﴾‏ إِنَّكَ إِن تَذَرْهُمْ يُضِلُّوا۟ عِبَادَكَ وَلَا يَلِدُوٓا۟ إِلَّا فَاجِرًا كَفَّارًا ‎﴿٢٧﴾‏

(రబ్బి లా తజర్ అలల్ అర్జి మినల్ కాఫిరీన దయ్యారా. ఇన్నక ఇన్ తజర్హుమ్ యుజిల్లా ఇబాదక వలా యలిదూ ఇల్లా ఫాజిరన్ కఫ్ఫారా)
“నా ప్రభూ! నీవు భూమిపై ఒక్క అవిశ్వాసిని కూడా సజీవంగా వదలొద్దు. ఒకవేళ నీవు వారిని వదిలిపెడితే వారు నీ దాసులను మార్గభ్రష్టుల్ని చేస్తారు. వారు జన్మనిచ్చేది కూడా అవిధేయులకూ, కృతఘ్నులకూ మాత్రమే.” (71:26-27)
నా ప్రభు, నీవు భూమండలంపై ఏ ఒక్క అవిశ్వాసిని సజీవంగా వదిలిపెట్టకు. ఒకవేళ నువ్వు గనుక వీళ్ళను వదిలిపెడితే, వీళ్ళు నీ దాసులను మార్గం తప్పిస్తారు, వీళ్ళకు పుట్టబోయే బిడ్డలు కూడా అవిధేయులు, కరుడుగట్టిన అవిశ్వాసులై ఉంటారు. కాబట్టి అవిశ్వాసుల్ని ఎవరినీ నువ్వు వదలొద్దు, వారు మార్గభ్రష్టత్వానికి గురయ్యిందే కాకుండా వారి సంతానాన్ని కూడా వారు మార్గభ్రష్టులుగా మార్చేస్తున్నారు కాబట్టి ఏ ఒక్కరినీ నువ్వు వదలొద్దు ఓ అల్లాహ్ అని మరొక్కసారి ప్రార్థన చేసేశారు.

అల్లాహ్ ఆదేశం ప్రకారం నూహ్ అలైహిస్సలాం ఓడను నిర్మిస్తున్నారు. నూహ్ అలైహిస్సలాం ఏ ప్రదేశంలో అయితే ఓడ నిర్మిస్తున్నారో, అది సముద్రానికి చాలా దూరంగా ఉండే ప్రదేశం. ధార్మిక పండితులు, ముఖ్యంగా చరిత్రకారులు నూహ్ అలైహిస్సలాం వారి పుట్టుక, నూహ్ అలైహిస్సలాం వారు నివసించిన ప్రదేశం గురించి ఏమన్నారంటే ఇరాక్ లోని కనాన్ ప్రదేశంలో ఆయన జీవించారు, నివసించారు ఆ రోజుల్లో అని తెలియజేశారు. అసలు విషయం అల్లాహ్ కే తెలియాలి. అయితే ఒక విషయం మాత్రము నిజం, అదేమిటంటే నూహ్ అలైహిస్సలాం వారు నివసించిన ప్రదేశము సముద్రానికి దూరమైన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ ఆదేశంతో ఓడను నిర్మిస్తున్నారు. ఓడ నిర్మిస్తూ ఉంటే ఆ జాతి ప్రజలు, ఆ జాతి పెద్దలు అటువైపు నుంచి వస్తూ వెళుతూ ఆ ఓడ నిర్మాణాన్ని చూసి పరస్పరము నవ్వుకునేవారు, విశ్వాసులను చూసి హేళన చేసేవారు. ఇదేంటి ఈ ఎడారిలో మీరు పడవ నడిపిస్తారా? ఇక్కడ మీరు పడవ నిర్మిస్తున్నారు, ఇది మూర్ఖత్వం కాదా? పడవ ఎక్కడైనా ఎడారిలో నడుస్తుందా? అంటూ హేళన చేసేవారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారితో ఒకే మాట అనేవారు. అదేమిటంటే:

إِن تَسْخَرُوا۟ مِنَّا فَإِنَّا نَسْخَرُ مِنكُمْ كَمَا تَسْخَرُونَ

(ఇన్ తస్ఖరూ మిన్నా ఫఇన్నా నస్ఖరు మిన్కుమ్ కమా తస్ఖరూన్)
“ఒకవేళ మీరు మమ్మల్ని చూసి నవ్వితే, మీరు నవ్వుతున్న విధంగానే మేము కూడా మిమ్మల్ని చూసి నవ్వుతాము.” (11:38)
అనగా మీరు మా స్థితిపై నవ్వుతున్నట్లే మేము కూడా ఒకనాడు మీ స్థితిపై నవ్వుకుంటాము. అంటే ఎలాగైతే మీరు మమ్మల్ని చూసి ఈరోజు నవ్వుకుంటున్నారు కదా, ఒకరోజు త్వరలోనే రాబోతోంది, ఆ రోజు మేము నవ్వుతాం, అప్పుడు మీరు ఏడుస్తారు అన్న విషయాన్ని నూహ్ అలైహిస్సలాం వారికి తెలియజేశారు.

అలాగే నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో మరొక్కసారి ప్రార్థించారు. ఏమన్నారంటే:

رَّبِّ ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِمَن دَخَلَ بَيْتِىَ مُؤْمِنًا وَلِلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَٰتِ

(రబ్బిగ్ఫిర్లీ వలివాలిదయ్య వలిమన్ దఖల బైతియ ము’మినవ్ వలిల్ ము’మినీన వల్ ము’మినాత్)
“నా ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులను, విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారినీ, విశ్వాసులైన పురుషులందరినీ, స్త్రీలందరినీ క్షమించు.” (71:28)
నన్నూ, నా తల్లిదండ్రులను విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారందరినీ, విశ్వాసులైన సమస్త పురుషులను, స్త్రీలను క్షమించు.

మహా జలప్రళయం మరియు రక్షణ

ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఒక నిర్ణీత సమయాన్ని నూహ్ అలైహిస్సలాం వారికి తెలియజేశాడు. ఏమన్నాడంటే ఎప్పుడైతే పొయ్యి, పొయ్యిలో నుంచి నీళ్ళు ఉప్పొంగుతాయో అప్పుడు మా ఆదేశము వచ్చి పొయ్యి పొంగినప్పుడు ఈ ఓడలోకి ప్రతి జీవరాశి నుండి రెండేసి, అనగా ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువు చొప్పున ఎక్కించుకో. నీ ఇంటి వారలను కూడా తీసుకో, ఎవరి విషయంలోనైతే ముందుగానే మాట ఖరారైందో వారిని వదిలేయి, ఇంకా విశ్వాసులందరినీ కూడా ఎక్కించుకో. అయితే అతని వెంట విశ్వసించిన వారు బహు కొద్దిమంది మాత్రమే. (11:40).

మా ఆదేశం వచ్చినప్పుడు పొయ్యి ఉప్పొంగినప్పుడు నీళ్లు ఉప్పొంగినప్పుడు ప్రతి జాతిలో నుండి ఒక్కొక్క జంటని ఒక్కొక్క జంటని ఓడలోకి ఎక్కించుకో, విశ్వాసులను కూడా నీతో పాటు తీసుకో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేయగా, నూహ్ అలైహిస్సలాం ఆ రోజు కోసం ఎదురు చూడగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నిర్ణయించిన ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు ఆకాశం నుండి జోరున వాన కురిసింది, నీళ్లలో నుంచి కూడా నీళ్లు ఉప్పొంగి పైకి వచ్చేసాయి. అప్పుడు నూహ్ అలైహిస్సలాం విశ్వాసులందరినీ తీసుకొని పడవ ఎక్కేశారు. అలాగే ప్రతి జాతిలో నుండి, ప్రతి జీవిలో నుండి ఒక్కొక్క జంటని ఒక్కొక్క జంటని పడవలోకి ఎక్కించుకున్నారు.

ఆ తర్వాత చూస్తూ ఉండంగానే నీటి మట్టం పెరుగుతూ పోయింది, పడవ నీటిపై తేలడం ప్రారంభించింది. అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, నూహ్ అలైహిస్సలాం వారితో పాటు కూర్చున్న ఉన్నవారితో అన్నారు,

بِسْمِ ٱللَّهِ مَجْر۪ىٰهَا وَمُرْسَىٰهَآ

(బిస్మిల్లాహి మజ్రేహా వముర్సాహా)
“దీని ప్రయాణం, దీని మజిలీ అల్లాహ్ పేరుతోనే ఉన్నాయి.” (11:41)
అనగా అల్లాహ్ పేరుతోనే ఇది నడుస్తుంది మరియు ఆగుతుంది. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం మరియు విశ్వాసులందరూ అల్లాహ్ తో దుఆ చేశారు.

ٱلْحَمْدُ لِلَّهِ ٱلَّذِى نَجَّىٰنَا مِنَ ٱلْقَوْمِ ٱلظَّٰلِمِينَ

(అల్ హందులిల్లాహిల్ లజీ నజ్జానా మినల్ కౌమిజ్ జాలిమీన్)
“దుర్మార్గులైన జనుల బారి నుండి మమ్మల్ని కాపాడిన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.” (23:28)
దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని రక్షించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు.

ఇలా ఆ పడవ నీటిపై తేలుతున్నప్పుడు నూహ్ అలైహిస్సలాం మరియు విశ్వాసులు దుఆ పఠిస్తూ ఉంటే నూహ్ అలైహిస్సలాం పడవలో నుంచి బయటికి చూడగా బయట నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు కనిపించాడు. అతని పేరు యామ్ లేదా కనాన్. నూహ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నలుగురు బిడ్డల్ని ప్రసాదించాడు. ఆ నలుగురిలో ఒకడు యామ్ లేదా కనాన్. అతను నూహ్ అలైహిస్సలాం వారి మాటను విశ్వసించలేదు. నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యుల్లో నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి కూడా నూహ్ అలైహిస్సలాం వారిని విశ్వసించలేదు. నూహ్ అలైహిస్సలాం వారి నలుగురు కుమారులలో ఒక్క కుమారుడు కనాన్ లేదా యామ్ అతను కూడా విశ్వసించలేదు. అవిశ్వాసులతో స్నేహము చేసి వారి మాటల్లో పడి తండ్రినే, ప్రవక్తనే, బోధకుడినే తిరస్కరించేశాడు. బయట నిలబడి ఉన్నాడు. అవిశ్వాసి కదా, విశ్వాసులతో పాటు పడవలోకి రాలేదు.

బయట నిలబడి ఉంటే నూహ్ అలైహిస్సలాం కుమారుణ్ణి చూసి ఏమన్నారంటే:

يَٰبُنَىَّ ٱرْكَب مَّعَنَا وَلَا تَكُن مَّعَ ٱلْكَٰفِرِينَ

(యా బునయ్యర్కమ్ మఅనా వలా తకుమ్ మఅల్ కాఫిరీన్)
“ఓ నా కుమారా! మాతో పాటు (ఈ ఓడలో) ఎక్కు. అవిశ్వాసులతో చేరిపోకు.” (11:42)
బాబు, మాతో పాటే వచ్చి కూర్చో, అవిశ్వాసులతో వెళ్ళకు నాయనా. తండ్రి తండ్రే కదండీ, రక్త సంబంధీకుడు కదండీ. బిడ్డను చూసి ఏమన్నారంటే బాబు, మాతో పాటు వచ్చి పడవలో కూర్చో నాయనా, విశ్వాసులతో పాటు వచ్చి కలిసిపో నాయనా, అవిశ్వాసులతో పాటు ఉండకు నాయనా అని నూహ్ అలైహిస్సలాం బిడ్డను పిలిస్తే అతను ఏమంటున్నాడో చూడండి. అవిశ్వాసి కదండీ, అవిశ్వాసులతో స్నేహం చేశాడు కదండీ. కాబట్టి మాట కూడా అవిశ్వాసి లాగే అతని నోటి నుంచి వస్తుంది. అతను ఏమన్నాడంటే:

سَـَٔاوِىٓ إِلَىٰ جَبَلٍ يَعْصِمُنِى مِنَ ٱلْمَآءِ

(సఆవీ ఇలా జబలియ్ య’సిమునీ మినల్ మా’)
“నన్ను నీటి నుండి కాపాడే ఏదైనా పర్వతాన్ని ఆశ్రయిస్తాను.” (11:43)
ఏమండీ, ఎంత జోరున వాన కురుస్తా ఉంది అంటే నీటి మట్టం ఎంత తొందరగా పెరుగుతూ ఉంది అంటే ఇలాంటి తూఫానులో ఈ పడవ అసలు నిలుస్తుందా అండి? నేను నా ప్రాణాలు రక్షించుకోవడానికి ఏదైనా ఎత్తైన పర్వతాన్ని ఆశ్రయిస్తాను, అది నన్ను ఈ నీళ్ల నుండి కాపాడుతుంది అని చెప్తున్నాడు. దానికి నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, “లేదు నాయనా, ఈరోజు అల్లాహ్ ఎవరిని రక్షిస్తాడో వారు మాత్రమే రక్షించబడతారు. వాళ్ళు తప్ప మరెవ్వరూ ఈరోజు రక్షించబడే వాళ్ళు ఉండరు. కాబట్టి నా మాట విను నాయనా, వచ్చి మాతో పాటు పడవలో ఎక్కి కూర్చో నాయనా” అంటే అతను మాత్రం ససేమిరా అంటున్నాడు. అంతలోనే చూస్తూ ఉండగా ఒక పెద్ద అల వచ్చింది, ఆ అల తాకిడికి అతను వెళ్లి నీళ్లల్లో పడిపోయినాడు, నీటిలో మునిగి మరణిస్తున్నాడు.

తండ్రి ప్రేమ ఉప్పొంగింది. కళ్ళ ముందరే బిడ్డ నీళ్లల్లో మునిగి మరణిస్తూ ఉంటే చూడలేకపోయారు, చలించిపోయారు. వెంటనే అల్లాహ్ తో దుఆ చేసేసారు, “ఓ అల్లాహ్, నా బిడ్డ, నా సంబంధీకుడు, నా రక్తం, నా కళ్ళ ముందరే మరణిస్తున్నాడు” అంటే అల్లాహ్ తో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వెంటనే నూహ్ అలైహిస్సలాం వారిని హెచ్చరించాడు. ఏమన్నారంటే:

يَٰنُوحُ إِنَّهُۥ لَيْسَ مِنْ أَهْلِكَ

(యా నూహు ఇన్నహూ లైస మిన్ అహ్లిక)
“ఓ నూహ్‌! అతను నీ కుటుంబీకుడు కాడు.” (11:46)
ఓ నూహ్, ముమ్మాటికి వాడు నీ కుటుంబీకుడు కాడు, వాడి పనులు ఏ మాత్రము మంచివి కావు.

إِنِّىٓ أَعِظُكَ أَن تَكُونَ مِنَ ٱلْجَٰهِلِينَ

(ఇన్నీ అఇజుక అన్ తకూన మినల్ జాహిలీన్)
“నీవు అజ్ఞానులలో చేరకుండా ఉండాలని నేను నీకు ఉపదేశిస్తున్నాను.” (11:46)
అవిశ్వాసుల గురించి నువ్వు నాతో ప్రార్థించకు, నేను నీకు… అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అంటున్నాడు, నువ్వు అజ్ఞానులలో ఒకనివి కారాదని నేను నీకు ఉపదేశిస్తున్నాను అన్నాడు.

నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, అతను నీ కుమారుడు కాదు, అతని పనులు మంచివి కావు అంటున్నాడంటే కొంతమంది ఇక్కడ అపార్థం చేసుకున్నారు. అంటే నూహ్ అలైహిస్సలాం ఆ… నూహ్ అలైహిస్సలాం వారి ఆ కుమారుడు నూహ్ అలైహిస్సలాం కు పుట్టినవాడు కాదు, అక్రమ సంపాదము అన్నట్టుగా కొంతమంది అపార్థం చేసుకున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్ సుమ్మ అస్తగ్ఫిరుల్లాహ్. ఎంత మాత్రమూ ఇది సరైన విషయము కాదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రవక్తలకు అలాంటి అసభ్యమైన గుణము కలిగిన మహిళలను సతీమణులుగా ఇవ్వడు. నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి విశ్వసించకపోయినంత మాత్రాన ఆమె నూహ్ అలైహిస్సలాం వారిని ద్రోహం చేసింది అనేది కాదండి ఇక్కడ విషయము. అతను విశ్వాసి కాదు, అవిశ్వాసులతో పాటు ఉండి అవిశ్వాసానికి గురయ్యాడు, సొంత తండ్రినే, దైవ బోధకుడినే తిరస్కరించాడు. కాబట్టి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతన్ని అవిశ్వాసుల జాబితాలో ఉంచుతున్నాడు అన్న విషయం అక్కడ మనం అర్థం చేసుకోవాలి.

నూహ్ అలైహిస్సలాం వారి కళ్ల ముందరే నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు మరణించాడు. నూహ్ అలైహిస్సలాం మరియు నూహ్ అలైహిస్సలాం వారితో పాటు జంతువులు, విశ్వాసులు అందరూ కూడా ఆ ఓడలోనే ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఓడ నీటిపై నడుస్తూ ఉందో అప్పుడు వారందరూ అల్లాహ్ తో దుఆ చేశారు. ఏమని దుఆ చేశారంటే:

رَّبِّ أَنزِلْنِى مُنزَلًا مُّبَارَكًا وَأَنتَ خَيْرُ ٱلْمُنزِلِينَ

(రబ్బి అన్జిల్నీ మున్జలమ్ ముబారకవ్ వఅంత ఖైరుల్ మున్జిలీన్)
“ప్రభూ! నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు అత్యుత్తమంగా దించేవాడవు.” (23:29)
ఓ అల్లాహ్, ఓ మా ప్రభు, నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు ఎంతో సురక్షితంగా దించేవాడవు అని అల్లాహ్ తో దుఆ చేసుకున్నారు. సురక్షితమైన ప్రదేశాన్ని మమ్మల్ని తీసుకొని వెళ్లి దించు అల్లాహ్ అని అల్లాహ్ తో దుఆ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ రోజు ఎలాంటి తూఫాను వచ్చింది, నీటి మట్టం ఎంత పెరిగింది, ఎంతెంత పెద్ద అలలు ఆ రోజుల్లో వచ్చాయి అంటే అది కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో 11వ అధ్యాయం 42వ వాక్యంలో తెలియజేశాడు:

وَهِىَ تَجْرِى بِهِمْ فِى مَوْجٍ كَٱلْجِبَالِ

(వహియ తజ్రీ బిహిమ్ ఫీ మౌజిన్ కల్ జిబాల్)
“ఆ ఓడ పర్వతాల వంటి అలల మధ్య వారిని తీసుకుపోసాగింది.” (11:42)
అనగా ఆ ఓడ వారిని పర్వతాల్లాంటి అలల్లో నుంచి తీసుకుపోసాగింది. ఒక్కొక్క అల పర్వతం అంత పెద్దదిగా ఉండింది అంటే ఎన్ని నీళ్లు వచ్చి ఉంటాయి, ఎంత పెద్దగా నీటి మట్టం పెరిగిపోయి ఉంటుంది. అంత పెద్ద నీటి మట్టంలో నూహ్ అలైహిస్సలాం తో పాటు ఉన్నవారు మాత్రమే, ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు. మిగతా వారందరూ, అవిశ్వాసులందరూ కూడా నీటిలో మునిగి మరణించారు.

తర్వాత ఆ ఓడ ఒక పర్వతం పైకి వచ్చి ఆగింది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయతో, అల్లాహ్ అనుగ్రహంతో వర్షము ఆగింది, నీళ్లు కూడా ఇంకిపోయాయి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అటు ఆకాశాన్ని మరియు ఇటు భూమిని కూడా ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశంతో వర్షం ఆగిపోయింది, నీళ్లు భూమిలోకి ఇంకిపోయాయి. ఆ పడవ నీటి మీద నుంచి తేలుకుంటూ తేలుకుంటూ జూదీ అనే ఒక పర్వతం పైకి వచ్చి ఆగింది.

وَٱسْتَوَتْ عَلَى ٱلْجُودِىِّ

(వస్తవత్ అలల్ జూదియ్యి)
“ఆ ఓడ జూదీ పర్వతంపై నిలిచింది.” (11:44)
ఖురాన్ లో ఆ పర్వతం పేరు ప్రస్తావన వచ్చి ఉంది. వస్తవత్ అలల్ జూదియ్యి అనగా ఓడ జూదీ పర్వతంపై నిలిచింది. మరి ఈ జూదీ పర్వతం ఎక్కడ ఉంది అంటే చరిత్రకారులు తెలియజేసిన విషయం టర్కీ దేశంలో ఆ పర్వతం ఉంది అని తెలియజేశారు.

అలాగే ఎప్పుడైతే ఆ పర్వతం మీద పడవ ఆగిందో, నీళ్లు పూర్తిగా భూమిలోకి ఇంకిపోయాయో, ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం వారితో పాటు నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యులలో ముగ్గురు కుమారులు, వారి పేరు సామ్, హామ్, యాఫిస్, మూడు పేర్లు. నాలుగో కుమారుడు మాత్రం నీటిలో తూఫాన్ లో మునిగిపోయి మరణించాడు. ముగ్గురు కుమారులు విశ్వాసులు. వాళ్ళ సతీమణులు కూడా విశ్వాసులు. ఆ విధంగా నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారులు మరియు ముగ్గురు కోడళ్ళు, అలాగే మిగతా 80 మంది విశ్వాసులు, జంతువులు వారందరూ కూడా నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత, నీళ్లు ఇంకిపోయిన తర్వాత భూమి మీదికి వాళ్ళు ఓడపై నుంచి దిగి వచ్చేశారు.

నూహ్ (అలైహిస్సలాం) వారి వారసత్వం

ఇక్కడ చివరిగా మనము కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి, అదేమిటంటే వారు భూమి మీదికి వచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రణాళిక ప్రకారము వారికి ఎంత ఆయుష్షు ఉండిందో అన్ని రోజులు వారు అల్లాహ్ ను ఆరాధించుకుంటూ జీవించారు. అయితే నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానము మాత్రమే ముందుకు సాగింది. మిగతా వారి ఎవరి సంతానము కూడా ప్రపంచంలో ముందుకు సాగలేదు. వారి ఆయుష్షు పూర్తి అయ్యాక వారు మరణించారు అంతే, కానీ వారి సంతానం మాత్రం ముందుకు సాగలేదు. కేవలం నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానం మాత్రమే ముందుకు సాగింది అని ధార్మిక పండితులు తెలియజేశారు.

ముఖ్యంగా మనం చూచినట్లయితే నూహ్ అలైహిస్సలాం వారి ఒక కుమారుడు సామ్. సామ్ సంతానము తెల్ల రంగు కలవారు. వారు అరబ్బులు, ఇశ్రాయేలు వంశీయులు వీళ్ళందరూ సామ్ సంతానము ప్రపంచంలో వ్యాపించారు. అలాగే రెండవ కుమారుడు హామ్. ఇతని సంతానము నల్ల రంగు గలవారు. ఇథియోపియా, సూడాన్ మరియు ఇతర ఆఫ్రికా దేశాలలో వారి సంతానము వ్యాపించింది. మూడవ కుమారుడు యాఫిస్. ఇతని సంతానము ఎర్ర ఛాయ కలిగినవారు. టర్క్ వాసీయులు మరియు తూర్పు ఆసియా వాసులు వీరందరూ కూడా యాఫిస్ కుమారులు, యాఫిస్ సంతానము అని ధార్మిక పండితులు తెలియజేశారు.

ఆ ప్రకారంగా చూస్తే తూఫాను తర్వాత ఈ భూమండలం మీద నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానమే వ్యాపించింది కాబట్టి నూహ్ అలైహిస్సలాం వారిని ఆదమే సానీ, అబుల్ బషర్ సానీ అని బిరుదు ఇవ్వడం జరిగింది. అనగా మానవుల రెండవ పితామహుడు. అబుల్ బషర్ సానీ మానవుల రెండవ పితామహుడు అని నూహ్ అలైహిస్సలాం వారికి బిరుదు ఇవ్వడం జరిగింది.

అలాగే నూహ్ అలైహిస్సలాం చాలా కష్టపడి జాతి ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనకు ఇచ్చిన ప్రవక్త పదవి బాధ్యతలను చాలా చక్కగా నెరవేర్చారు, కష్టపడ్డారు కాబట్టి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయన కీర్తి ప్రపంచంలో ఉంచాడు. ఖురాన్లో 37వ అధ్యాయం 78వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు, “వతరక్నా అలైహి ఫిల్ ఆఖరీన్” అనగా రాబోయే తరాల వారిలో అతని సత్కీర్తిని మేము మిగిల్చి ఉంచాము అన్నాడు. చూడండి, నేడు కూడా నూహ్ అలైహిస్సలాం వారిని, ఆయన జీవిత చరిత్రని మనము ఎంతో చర్చించుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం.

ఖురాన్లో ఒక ఐదు మంది ప్రవక్తల్ని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని ఒక ప్రత్యేకమైన గౌరవ స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ ఎవరు అంటే ధార్మిక పండితులు తెలియజేశారు, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విధంగా ఈ ఐదు మంది ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని కీర్తి పొందారు. అంటే ఆ ఐదు మందిలో నూహ్ అలైహిస్సలాం వారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కీర్తి ప్రపంచంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఉంచి ఉన్నాడు.

అలాగే ఖురాన్ లో నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన తొమ్మిది సూరాలలో వచ్చి ఉంది. తొమ్మిది సూరాలలో ఒకటి సూర ఆరాఫ్, సూర యూనుస్, సూర హూద్, సూర అంబియా, సూర ము’మినూన్, సూర షుఅరా, సూర అంకబూత్, సూర సాఫ్ఫాత్, సూర కమర్. తొమ్మిది సూరాలలో నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన వచ్చి ఉంది. మరొక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక పూర్తి అధ్యాయం, ఒక పూర్తి సూర, సూర నూహ్ అని 71వ అధ్యాయం, పూర్తి ఒక సూర అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆయన పేరుతో అవతరింపజేసి ఉన్నాడు. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం జీవించినంత కాలం భక్తులతో, విశ్వాసులతో విశ్వాసంగా, భక్తిగా జీవించారు, ఆ తర్వాత ఆయన మరణము సంభవించింది. ఇలా నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ముగిసింది. ఆ తర్వాత జరిగిన విషయాలు ఇన్షా అల్లాహ్ రాబోయే ప్రసంగాలలో విందాం. చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరినీ ఏక దైవారాధన చేసుకుంటూ, షిర్క్ బహు దైవారాధన నుండి దూరంగా ఉంటూ అల్లాహ్ ని నమ్ముకొని, అల్లాహ్ నే ఆరాధించుకుంటూ, అల్లాహ్ నే వేడుకుంటూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

తుదకు మా ఆదేశం వచ్చి, పొయ్యిపొంగినప్పుడు, “ఈ ఓడలోకి ప్రతి (జీవ)రాసి మంచి రెండేసి (ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువ) చొప్పున ఎక్కించుకో.నీ ఇంటివారలను కూడాతీసుకో. ఇంకా విశ్వాసులందరిని కూడా ఎక్కించుకో” అని మేము నూహ్ కు చెప్పాము.(ఖుర్ఆన్ 11 : 40).