త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (4) – మరణానంతర జీవితం : పార్ట్ 45 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు [4] – [మరణానంతర జీవితం – పార్ట్ 45]
https://www.youtube.com/watch?v=nMRENiqwyCw [21 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ప్రళయ దినాన మంచి పనుల త్రాసును తేలికగా చేసే వివిధ పాప కార్యాల గురించి వివరిస్తున్నారు. (3) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట కంటే ఇతరుల ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం, (4) అల్లాహ్ క్షమించడని ఇతరుల గురించి ప్రమాణం చేయడం, (5) అసర్ నమాజ్‌ను వదులుకోవడం, (6) ఏకాంతంలో అల్లాహ్ నిషేధించిన కార్యాలకు పాల్పడటం మరియు (7) సరైన కారణం లేకుండా కుక్కను పెంచడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ చర్యలు కొండలంత పుణ్యాలను కూడా నాశనం చేసి, వాటిని దుమ్ము ధూళి వలె మార్చేస్తాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో హెచ్చరించారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి కఫా వస్సలాతు వస్సలాము అలా ఇబాదిల్లజీ నస్తఫా అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో మూడవది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటపై, ఆయన ఆదేశంపై ఇతరుల ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం.

మహాశయులారా! ఇది కూడా మహా ఘోరమైన పాపం. దీనివల్ల మన పుణ్యాలన్నీ కూడా, సత్కార్యాల సత్ఫలితాలన్నీ కూడా నశించిపోయి, మన త్రాసు అనేది తేలికగా అయిపోతుంది. సూరె హుజరాత్ ఆయత్ నెంబర్ ఒకటిలో అల్లాహు త’ఆలా విశ్వాసులందరికీ ఇచ్చిన ఆదేశం ఏమిటంటే,

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُقَدِّمُوا بَيْنَ يَدَيِ اللَّهِ وَرَسُولِهِ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుఖద్దిమూ బైన యదయిల్లాహి వ రసూలిహి)
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను మించిపోకండి.  (49:1)

మనం విశ్వాసులం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాలను అనుసరిస్తూ ఉండాలి. కానీ వారి కంటే ముందుగా, ఆదేశం లభించక ముందే తన మన ఇష్టానుసారం ఏదైనా చేయడానికి, ఆదేశం వచ్చిన తర్వాత దాన్ని అనుసరించకుండా మన అభిప్రాయాలను మనం అనుసరించడానికి ఏమాత్రం అనుమతి మనకు లేదు.

ఆ తర్వాత సూరె హుజరాత్‌లోని ఆయత్ నెంబర్ రెండును గమనించండి. అందులో ఇవ్వబడిన హెచ్చరిక ద్వారా భయ కంపితులై, అలాంటి చేష్టలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం మనం చేయాలి.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَن تَحْبَطَ أَعْمَالُكُمْ وَأَنتُمْ لَا تَشْعُرُونَ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్‌ఫఊ అస్వాతకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్‌హరూ లహూ బిల్ ఖౌలి కజహ్రి బఅదికుమ్ లి బఅదిన్ అన్ తహ్‌బత అఅమాలుకుమ్ వ అన్తుమ్ లా తష్ఉరూరున్)
ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే పైన (హెచ్చుగా) ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్ధమైపోవచ్చు. ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియదు..” (49:2)

ఓ విశ్వాసులారా! ప్రవక్త మాట కంటే, ప్రవక్త స్వరం కంటే మీ స్వరం అనేది ఎత్తుగా ఉండకూడదు. మరియు మీరు పరస్పరం ఎలానైతే ఒకరు మరొకరిని పిలుచుకుంటారో అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రవర్తించకండి. చివరికి మీరు, మీరు చేసే ఈ దుష్కార్యం వల్ల, మీరు ప్రవక్త స్వరంపై మీ స్వరాన్ని ఎత్తడం వల్ల, పరస్పరం మీరు ఎలా పిలుచుకుంటారో అలా ప్రవక్తను పిలవడం ద్వారా మీ సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. అది మీకు తెలియకుండానే జరగవచ్చు. అంటే మీ పాపాల, మీ ఈ పాపం వల్ల మీ సత్కార్యాలు నశించిపోతున్నాయి అన్న విషయం మీకు తెలియకుండానే ఇదంతా జరగవచ్చు. అల్లాహు అక్బర్. ఎంత భయంకరమైన విషయమో గమనించండి.

ప్రవక్త స్వరంపై మన స్వరాన్ని ఎత్తడం, ప్రవక్త మాటపై మన మాటను పెంచడం, పరస్పరం పిలుచుకున్నట్లు ప్రవక్తను పిలవడం, దీనివల్ల మనకు తెలియకుండానే మన సత్కార్యాలు వృధా అవుతున్నాయి అంటే, ఇక ఎవరైతే తెలిసి తెలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాన్ని విడనాడుతున్నారో, ప్రవక్త ఆదేశం ఒకటి ఉంది అంటే, తనకిష్టమైన నాయకుడు, తనకిష్టమైన ఇమామ్, తనకిష్టమైన పీర్, తనకిష్టమైన మౌల్వీ సాబ్, వారి యొక్క ఫత్వాలు ఇంకో రకంగా ఉంటే ప్రవక్తను వదిలేసి వారినే అనుసరిస్తున్నారో, వారి యొక్క సత్కార్యాలు వృధా కావా? అలాంటి వారు భయపడే అవసరం లేదా?

ఈ రోజుల్లో మనలోని ఎంతో మంది సోదరులు, ఒకవైపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం, మరోవైపు మన తాత ముత్తాతల విధానం, మన యొక్క దురాచారాలు, మన యొక్క గ్రామ చట్టాలు ఈ విధంగా ఉంటాయి. ప్రవక్తను వదిలేసి వాటిని అనుసరిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారు ఏ నష్టంలో పడరు అని ఏదైనా మన దగ్గర జమానత్ ఉందా? అందు గురించి మనం ఈ ఆయతులు చదివిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి.

మహాశయులారా! మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో, అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు అని ప్రమాణం చేయడం. అల్లాహు అక్బర్. ఒకసారి ఈ హదీసును గ్రహించండి. హజ్రత్ జుందుబ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఒక వ్యక్తి ఇలా అన్నాడు,

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ لِفُلَانٍ
(ఇన్నల్లాహ లా యగ్‌ఫిరు లి ఫులాన్)
నిశ్చయంగా అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు, మన్నించడు.

అప్పుడు అల్లాహు త’ఆలాకు చాలా కోపం వచ్చింది. అల్లాహ్ ఆగ్రహానికి గురి అయ్యాడు. ఫలానా వ్యక్తిని నా అతనికి నా క్షమాపణ లభించదు అని, నా వైపు నుండి అతన్ని కరుణించడం జరగదు అని ప్రమాణాలు చేసేటువంటి అధికారం ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది? నిశ్చయంగా నేను ఫలానా వ్యక్తిని క్షమించాను మరియు ఇలాంటి ప్రమాణాలు చేసే వ్యక్తి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేసేసాను. అల్లాహు అక్బర్. గమనించారా? ఎంత భయంకరమైన విషయమో.

అయితే మహాశయులారా, అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలను, మన్నింపు క్షమాపణలను మనం మన చేతిలో, మన అధికారంలో తీసుకోకూడదు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, “సోదరా! ఇలాంటి తప్పు చేసే వారిని అల్లాహ్ క్షమించడు అని తెలియజేయడం జరిగింది. ఇలాంటి పాపం చేసే వారిని అల్లాహ్ శపిస్తాడని తెలియజేయడం జరిగింది. ఇలాంటి పాపం చేసేది ఉంటే అల్లాహ్ నరకంలో ప్రవేశింపజేస్తాడు అని చెప్పడం జరిగింది. ఇలాంటి పాపం చేసేది ఉంటే అల్లాహ్ స్వర్గంలో పంపడం లేదు అని చెప్పడం జరిగింది.” ఇలాంటి బోధన మనం చేయాలి. కానీ, “నువ్వు ఈ తప్పు చేస్తున్నావా? నిన్ను అల్లాహ్ క్షమించనే క్షమించడు. అల్లాహ్ నీకు ఎప్పుడూ కూడా పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుకునే అధికారమే, అటువంటి భాగ్యమే ప్రసాదించడు.” ఇట్లాంటి ఆదేశాలు మనం జారీ చేయకూడదు. ఒకరిని అల్లాహ్ యొక్క క్షమాపణ పట్ల నిరాశకు గురి చేయకూడదు.

ఒకవేళ ఇదే ప్రమాణాలు చేసుకుంటూ, నిన్ను ఎన్నటికీ అల్లాహ్ క్షమించడు అని అంటే, అల్లాహ్, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అతనికి అతను ఆగ్రహానికి గురై, ఇలాంటి వ్యక్తి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేసేస్తాడు. అల్లాహు అక్బర్. అందు గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

మహాశయులారా! త్రాసును తేలికగా చేసే పాపాల్లో, అసర్ నమాజ్‌ను వదులుకోవడం. అల్లాహు అక్బర్. అసర్ నమాజ్. అల్లాహ్ రేయింబవళ్ళలో, రాత్రి పగళ్ళలో ఐదు వేలల నమాజ్ మనపై విధిగావించాడు. ఐదు నమాజుల్లో ఒకటి మధ్యలో ఉన్న నమాజ్ అసర్ నమాజ్. ఎవరైతే అసర్ నమాజ్ వదిలేస్తారో వారి యొక్క సత్కార్యాలు వృధా అయిపోతాయి. శ్రద్ధ వహించండి ఈ హదీసుపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ
(మన్ తరక సలాతల్ అస్ర్ ఫఖద్ హబిత అమలుహూ)
ఎవరైతే అసర్ నమాజ్‌ను విడనాడతారో వారి యొక్క సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి.

ఈ అసర్ నమాజ్ ఎంత ముఖ్యమైనదంటే,

حَافِظُوا عَلَى الصَّلَوَاتِ وَالصَّلَاةِ الْوُسْطَىٰ
(హాఫిజూ అలస్సలవాతి వస్సలాతిల్ వుస్తా)
“నమాజులను, ప్రత్యేకించి మధ్య నమాజును కాపాడండి.” (2:238)

అని అల్లాహు త’ఆలా ఖురాన్లో ఆదేశం ఇచ్చాడు. మీరు అన్ని నమాజులను పాబందీగా చేస్తూ ఉండండి. కానీ మధ్యలో ఉన్న నమాజు పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇందులో మధ్యలోని నమాజ్ అంటే అసర్ నమాజ్ అని ఎన్నో హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది.

అబూ ములైహ్ రహిమహుల్లాహ్ చెప్పారు, మేము ఒక సందర్భంలో, ఒక యుద్ధంలో ఉన్నాము. గమనించండి, యుద్ధంలో ఉన్నప్పుడు ఎంత మనిషి బిజీగా ఉంటాడో, అటువైపు శత్రువుల నుండి శత్రువుల బాణాలు, ఆయుధాలు మన మీదికి వచ్చి పడే, మన ప్రాణాలు పోయే అటువంటి భయం క్షణం క్షణం ఉంటుంది. అబూ ములైహ్ అంటున్నారు, మేము ఒక యుద్ధంలో హజ్రత్ బురైదా రదియల్లాహు త’ఆలా అన్హు వెంట ఉన్నాము. అసర్ నమాజ్ సమయం ప్రవేశించింది. అప్పుడు బురైదా రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, అసర్ నమాజ్ మీరు చేసుకోండి. ఇందులో ఆలస్యం చేయకండి. ఎందుకంటే నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను,

مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ
(మన్ తరక సలాతల్ అస్ర్ ఫఖద్ హబిత అమలుహూ)
ఎవరైతే అసర్ నమాజ్ విడినాడారో, ఎవరైతే అసర్ నమాజ్ వదిలేశారో వారి యొక్క సర్వ సత్కార్యాలు వృధా అయిపోయాయి.

దీని గురించి మనల్ని భయకంపితులుగా చేసే హదీస్ కూడా ఉంది. సహీహ్ బుఖారీలోని హదీస్. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

الَّذِي تَفُوتُهُ صَلَاةُ الْعَصْرِ كَأَنَّمَا وُتِرَ أَهْلَهُ وَمَالَهُ
(అల్లజీ తఫూతుహూ సలాతుల్ అస్ర్ క అన్నమా వుతిర అహ్లహూ వ మాలహూ)
ఎవరి అసర్ నమాజ్ తప్పిపోయినదో, ఎవరైతే అసర్ నమాజ్ చేయలేకపోయారో వారు ఎలాంటి వారంటే వారి యొక్క సొమ్ము, ధనము, ఆస్తిపాస్తులు, ఆలు పిల్లలు అందరూ నశించిపోయినటువంటి వాడు.

ఎప్పుడైనా ఈ బాధ మనకు కలిగిందా ఒకసారి ఆలోచించండి. అటు నమాజ్ టైం అయింది, ఇటువైపున కొడుకుకు చాలా జ్వరం వచ్చింది అంటే, మనం నమాజ్‌ను వదులుకొని కొడుకును ముందు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అని కోరుకుంటాము. ఇక ఎవరి ఆస్తిపాస్తులు, ఆలు పిల్లలు అందరూ నశించిపోయారో అతని పరిస్థితి ఎలా ఉంటుంది? అసర్ నమాజ్ కూడా తప్పిపోయినప్పుడు అంత బాధ మనకు కలిగిందా? ఎంత బాధనైతే మన ఆస్తిపాస్తులు, మన ఆలు పిల్లలు అందరూ నశించిపోయినప్పుడు కలుగుతుందో, అలాంటి బాధ ఏదైనా ఒక్క నమాజ్ మిస్ అయినప్పుడు మనకు కలిగిందా? అందు గురించి మహాశయులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతర సత్కార్యాలన్నిటినీ కూడా వృధా చేసుకోకుండా నమాజ్ కాపాడుకుంటూ మనం ఇతర సత్కార్యాలను కూడా కాపాడుకోవాలి.

మన త్రాసు బరువును తగ్గించేసి, తేలికగా చేసే పాపాల్లో మరో భయంకరమైన పాపం, ఏకాంతంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడటం లేదు కదా అని భావించుకుంటూ ఉన్నప్పుడు, అల్లాహ్ నిషేధించిన కార్యాలకు పాల్పడడం. దీనివల్ల కూడా మన ఇతర సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. ఈ రోజుల్లో ఎంతమంది మన, మనలోని ఎంతమంది పరిస్థితి ఇలా గురై ఉంది. ఒక్కసారి ఈ హదీసును మీరు చాలా శ్రద్ధగా వినండి. దీనిని అర్థం చేసుకొని ఇందులో చూపబడిన నష్టాలకు దూరంగా ఉండేటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

హజ్రత్ సౌబాన్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించిన ఈ హదీస్, దీనిని మనం మన ఈ చెవులతోనే కాకుండా, హృదయంలో ఉన్నటువంటి చెవులతో శ్రద్ధగా విని ఉంటే, ఈ హదీస్ మనలోని నిద్రలో ఉన్న వారిని నిద్రలో నుండి మేల్కొలుపుతుంది. అశ్రద్ధలో ఉన్నవారి యొక్క అశ్రద్ధతనాన్ని దూరం చేసేస్తుంది. అంతటి భయంకరమైన హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

لَأَعْلَمَنَّ أَقْوَامًا مِنْ أُمَّتِي يَأْتُونَ يَوْمَ الْقِيَامَةِ بِحَسَنَاتٍ أَمْثَالِ جِبَالِ تِهَامَةَ بِيضًا فَيَجْعَلُهَا اللَّهُ عَزَّ وَجَلَّ هَبَاءً مَنْثُورًا
(ల అ’లమన్న అఖ్‍వామన్ మిన్ ఉమ్మతీ య’తూన యౌమల్ ఖియామతి బి హసనాతిన్ అమ్సాల జిబాలి తిహామా బైదా ఫ యజ్అలుహల్లాహు అజ్జవజల్ల హబాఅన్ మన్సూరా)

నేను నా అనుచర సంఘంలోని కొందరిని గుర్తుపడతాను. వారు నాకు తెలుసు. వారు తిహామా నగరంలోని పర్వతాల మాదిరిగా సత్కార్యాలను తీసుకొని ప్రళయ దినాన హాజరవుతారు. (అరబ్బులో తిహామా కొండలు చాలా ఫేమస్. అలాంటి కొండల మాదిరిగా పుణ్యాలు చేసుకొని వస్తారు ప్రళయ దినాన.) కానీ అల్లాహు త’ఆలా వాటిని దుమ్ము ధూళి వలె చేసేస్తాడు.

ఈ భయంకరమైన విషయం విని సౌబాన్ రదియల్లాహు త’ఆలా అన్హు అడిగారు, “ప్రవక్తా, వారు ఎలాంటి వారు? వారి గుణం ఏమిటి? వారి గురించి ఏదైనా స్పష్టంగా తెలపండి. మాకు తెలియకుండానే మేము అలాంటి వారిలో కలిసిపోకుండా ఉండడానికి మేము జాగ్రత్త పడతాము” అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “వారు మీ సోదరులే, మీ వంశం వారే. వారు రాత్రి వేళల్లో నిలబడి తహజ్జుద్ నమాజ్‌లు చేసే అటువంటి వారు. మీరు ఎలా తహజ్జుద్ నమాజ్ చేస్తున్నారో అలా వారు కూడా తహజ్జుద్ నమాజ్ చేసేవారు. కానీ ఒంటరిగా ఉండి అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్పడే అవకాశం దొరికితే, వాటికి దూరంగా ఉండడానికి బదులుగా ఆ నిషిద్ధ కార్యాలకు పాల్పడేవారు.”

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో, మన చేతుల్లోని స్మార్ట్ ఫోన్స్, ఒక హాస్టల్లో ఉన్నవారు కూడా, ఒకచోట పనిచేసేవాళ్ళు కూడా, హెడ్ ఫోన్స్ చెవులలో పెట్టుకున్నారు, పై నుండి దుప్పటి కప్పుకున్నారు. లోపలి నుండి స్మార్ట్ ఫోన్స్ ఆన్ చేసుకుంటూ, ఇష్టమైన చిత్రాలు చూసుకుంటూ, పాప కార్యాలు చూసుకుంటూ, పక్కన ఎవరూ కూడా వినడం లేదు, పక్కన ఉన్నవారు ఎవరూ చూడడం లేదు. ఈ విధంగా సామాన్యంగా ఈరోజు జరుగుతున్న ఇటువంటి పాపాలు, అక్రమ సంబంధాలు పెట్టుకొని వారిలో ఒంటరి తనాల్లో కలుసుకోవడం, ఎవరు చూడడం లేదు కదా అని ప్రత్యేక కోడ్ వర్డ్లలో వారితోని మాట్లాడుకోవడం, ఇంకా ఇలాంటి ఎన్నో దుష్కార్యాలు ఈనాటి సమాజంలో ప్రబలిపోతూ ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా విషయం బయటికి వచ్చినా, దానిని ఏదో రకంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం, అల్లాహు అక్బర్. మహాశయులారా, అల్లాహ్ మనందరికీ సన్మార్గం చూపుగాక. ఇంతటి భయంకరమైన హదీస్ ఇది. చూడడానికి నమాజ్‌లు చేస్తూ ఉండడం, వేరే సత్కార్యాలు చేస్తూ ఉండడం, ఒక మంచివాడుగా ప్రజల్లో పేరు పొందడం, కానీ ఒంటరిగా ఉండి పాపాలు చేసే అవకాశం వస్తే, ఏమాత్రం జంకకుండా, వెనుక ఉండకుండా, అల్లాహ్‍తో భయపడకుండా అలాంటి నిషిద్ధ కార్యాలకు పాల్పడడం, ఇది మన సత్కార్యాలన్నిటినీ వృధా చేసేస్తుంది.

మహాశయులారా, మన సత్కార్యాలను వృధా చేసి మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో ఏడవది, కుక్కను పెంచడం. అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో ఎందరో ముస్లింల ఇళ్లల్లో కూడా పెట్టీ అని, ఇంకా ఏదేదో పేర్లతో, రకరకాల, ఎంతో అందమైన ముద్దుగా ఉన్నటువంటి పేర్లతో కుక్కలను పిలుచుకుంటూ, పెంచుకుంటూ, వారిని తమ ఒడిలో తమ పిల్లల మాదిరిగా ఉంచుకుంటూ ఇలా వారిని పోషిస్తున్నారు.

ఈ రోజుల్లో ఎంతో మంది తమ సొంత పిల్లలను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్నట్లుగా కుక్కను పెంచుకుంటున్నారు. ఎంతో ముద్దు ముద్దు పేర్లతో వారిని పిలుచుకుంటూ, వారిని తమ ఒడిలో కూర్చోబెట్టుకుంటున్నారు. ఈ విధంగా మహాశయులారా, ముందే పుణ్యాలు, సత్కార్యాలు చాలా తక్కువగా మనకు ఉన్నాయి అంటే, ఇలాంటి పాప కార్యాల వల్ల మరింత మనం ప్రళయ దినాన నష్టపోతాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

مَنِ اتَّخَذَ كَلْبًا، إِلَّا كَلْبَ زَرْعٍ أَوْ غَنَمٍ أَوْ صَيْدٍ، يَنْقُصُ مِنْ أَجْرِهِ كُلَّ يَوْمٍ قِيرَاطٌ
(మనిత్తఖద కల్బన్ ఇల్లా కల్బ జర్ఇన్ అవ్ గనమిన్ అవ్ సైదిన్ యన్ఖుసు మిన్ అజ్రిహీ కుల్ల యౌమిన్ ఖీరాత్)
ఎవరైతే కుక్కను పెంచుతారో, వారి యొక్క పుణ్యాల్లో ప్రతి రోజూ ఒక ఖీరాత్ పుణ్యాలు తగ్గుతూ ఉంటాయి.

ఒక ఖీరాత్ పుణ్యాలు అంటే ఎంతో తెలుసా? జనాజా నమాజ్‌కు సంబంధించిన విషయాల్లో మనం తెలుసుకున్నాము. ఒక ఖీరాత్ అంటే ఉహుద్ పర్వతానికి సమానం. రెండు ఖీరాత్‌లు అంటే రెండు ఉహుద్ పర్వతాలు లేదా రెండు పెద్ద పర్వతాలకు సమానం.

ప్రతి రోజూ ఒక ఖీరాత్ పుణ్యం తగ్గుతూ ఉంటుంది ఎవరైతే కుక్కను పెంచుతూ ఉంటారో. కానీ ఇందులో కేవలం మూడు రకాల కుక్కలను పెంచే అనుమతి ఉంది. ఆ కుక్కలు కూడా సాధ్యమైనంత వరకు మన ఇంటి ఆవరణలో ఉండకుండా బయట ఉంచే ప్రయత్నం చేయాలి. ఎలాంటి మూడు కుక్కలు? ఒకటి, మనం మన తోట రక్షణ కొరకు పెంచే కుక్క, అది తోటలోనే ఉండాలి, ఇంటి వద్ద ఉండకూడదు. మరొకటి, మేకల రక్షణ కొరకు మనం పెంచే కుక్క, అది మేకల వద్దనే ఉండాలి, మన ఇంట్లోనికి రానివ్వకూడదు. మూడవది, كَلْبَ صَيْدٍ (కల్బ సైదిన్) వేటాడడానికి, వేరే కొన్ని జంతువులను వేటాడడానికి వేట యొక్క శిక్షణ ఇవ్వబడిన కుక్కలు. సామాన్య కుక్కలు కూడా కాదు. వేట యొక్క శిక్షణ వారికి ఇవ్వబడాలి. అలాంటి కుక్కలు, అవి కూడా ఇంట్లోనికి ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడాలి.

ఈ మూడు రకాల కుక్కలు పెంచడానికి అనుమతి ఉంది. ఈ మూడు ఉద్దేశాలు కాకుండా ఇంకా ఎవరైనా కుక్కను పెంచుతున్నారు అంటే ప్రతి రోజూ వారి యొక్క సత్కార్యాలలో నుండి ఒక ఖీరాత్ సత్కార్యాలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఎంత నష్టానికి గురి అయిపోతామో గమనించండి.

మరికొన్ని పాప కార్యాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా మన త్రాసు అనేది తేలికగా అయిపోతుంది. తరువాయి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41887

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

మానవ సేవ – ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడంలో అల్లాహ్ ప్రసన్నత ఇమిడి ఉంది – కలామే హిక్మత్ 

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు-

“ప్రళయదినం నాడు అల్లాహ్ అవశ్యంగా అడుగుతాడు: ‘ఓ ఆదం కుమారా! నేను వ్యాధిగ్రస్తుడినయ్యాను. నువ్వు నన్ను పరామర్శించలేదు’ అతనంటాడు: ‘ఓ!” ప్రభూ! నేను నిన్ను పరామర్శించడమేమిటి? నువ్వైతే సమస్త లోకాల పాలకుడవు?’ అల్లాహ్ అంటాడు: ‘నా ఫలానా దాసుడు వ్యాధిగ్రస్తుడైన సంగతి నీకు తెలీదా? కాని నువ్వతన్ని పరామర్శించలేదు. నువ్వతన్ని పరామర్శించి ఉంటే నన్నక్కడ పొందేవాడివి కాదా?’

ఓ ఆదం పుత్రుడా! నేను నిన్ను అన్నం అడిగాను. కాని నువ్వు నాకు అన్నం పెట్టలేదు.’ అతనంటాడు : ‘నా దేవా! నేన్నీకు ఎలా అన్నం పెట్టగలను? నువ్వైతే నిఖిల జగతికి పరిపోషకుడివి.’ అల్లాహ్ అంటాడు: ‘నా ఫలానా దాసుడు భోజనం కోసం నిన్ను మొరపెట్టుకున్న సంగతి నీకు తెలీదా? అయితే నువ్వతనికి భోంచేయించలేదు. ఒకవేళ నువ్వతనికి అన్నం పెట్టివుంటే దాని (ఫలాన్ని) నా దగ్గర పొందేవాడివి కాదా?’

‘ఓ ఆదం కుమారుడా! నేన్నిన్ను మంచినీళ్ళడిగాను. నువ్వు నాకు త్రాపలేదు.’ అతనంటాడు : ‘ఓ నా స్వామీ! నేన్నీకు మంచినీళ్ళు ఎలా త్రాపగలను? నువ్వు సకల లోకాల స్వామివి కదా!’ అల్లాహ్ అంటాడు: ‘నా ఫలానా దాసుడు నిన్ను నీరు కోసం వేడుకున్నాడు. కాని నువ్వతనికి నీరు త్రాపలేదు. ఒకవేళ నువ్వతనికి నీరు త్రాగించి ఉంటే దాన్ని బహుమతిని నా వద్ద పొందేవాడివి.” (ముస్లిం)

99. సూరా అజ్ జిల్ జాల్ (భూకంపం) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో & టెక్స్ట్]

99. సూరా అజ్ జిల్ జాల్ (భూకంపం) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం)
https://youtu.be/BaJGDgkkjvc [38 min]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం ఖురాన్‌లోని 99వ అధ్యాయం, సూరతుల్ జిల్జాల్ యొక్క వివరణాత్మక వ్యాఖ్యానం (తఫ్సీర్). భూమి తీవ్రంగా ప్రకంపించబడటం, తనలోని శవాలను, నిధులను బయటకు వెళ్లగ్రక్కడం, మానవుడు నిశ్చేష్టుడై “దీనికేమైంది?” అని ప్రశ్నించడం వంటి ప్రళయదినపు భయానక సంఘటనలను వక్త వివరిస్తారు. ఈ సూరా యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానిని తన నమాజులో పఠించడం, అది సహచరులపై చూపిన గాఢమైన ప్రభావం గురించిన హదీసులను ఉదహరిస్తారు. భూమి స్వయంగా మానవుడు చేసిన ప్రతి చిన్న, పెద్ద కర్మకు సాక్ష్యమిస్తుందని, జవాబుదారీతనం అనే ప్రధాన సందేశాన్ని ఈ సూరా తెలియజేస్తుందని వివరిస్తారు. అణువంత మంచి చేసినా, చెడు చేసినా అది దాని కర్తకు చూపించబడుతుందని, కనుక ఈ జీవితంలో మన కర్మల పట్ల జాగ్రత్త వహించాలని శ్రోతలను హెచ్చరిస్తూ ప్రసంగం ముగుస్తుంది.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.)

اَلْحَمْدُ لِلَّهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ اللَّهِ، أَمَّا بَعْدُ
(అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.)

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అవూజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్)
శాపగ్రస్తుడైన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో (ప్రారంభిస్తున్నాను).

إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا
(ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా)
భూమి చాలా తీవ్రమైన తన ప్రకంపనలతో కంపింపజేయబడినప్పుడు (సూరా అజ్-జిల్జాల్ 99:1)

ఇదా జుల్జిలత్. కంపించ చేయబడినప్పుడు. అల్ అర్ద్, భూమి. మళ్ళీ దాని యొక్క మస్దర్ జిల్జాలహా అని ఏదైతే వచ్చిందో, హా అంటే ఆ భూమి అని దాని వైపునకు సైగ చేయడం జరుగుతుంది. జిల్జాల్ అని వచ్చిన మరోసారి చెప్పబడిన పదానికి తీవ్రమైన రీతిలో. అంటే ఏమిటి? భూమి చాలా తీవ్రమైన తన ప్రకంపనలతో కంపించ చేయబడినప్పుడు.

وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا
(వ అఖ్రజతిల్ అర్దు అస్ఖాలహా)
మరి భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడవేసినప్పుడు, (సూరా అజ్-జిల్జాల్ 99:2)

వ అఖ్రజత్ బయట పడవేసినప్పుడు. అల్ అర్ద్ ఆ భూమి. దేనిని బయట పడేసినప్పుడు? తనలో ఉన్నటువంటి బరువులన్నింటినీ. మరి భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడవేసినప్పుడు,

وَقَالَ الْإِنسَانُ مَا لَهَا
(వ ఖాలల్ ఇన్సాను మాలహా)
“అరె! దీనికేమైపోయిందీ?” అని మనిషి (కలవరపడుతూ)అంటాడు. (సూరా అజ్-జిల్జాల్ 99:3)

మనిషి అంటాడు, మాలహా? అరె! దీనికి ఏమైపోయింది?

يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا
(యౌమఇదిన్ తుహద్దిసు అఖ్బారహా)
ఆ రోజు భూమి తన సంగతులన్నీ వివరిస్తుంది. (సూరా అజ్-జిల్జాల్ 99:4)

యౌమఇదిన్ ఆ రోజు తుహద్దిసు వివరిస్తుంది. అఖ్బారహా. తుహద్దిసు అంటే ఇక్కడ అర్ద్. అరబీలో అర్ద్ స్త్రీలింగం, ఫీమేల్ వర్డ్ గా ఉపయోగించడం జరుగుతుంది. అందుకొరకే తుహద్దిసు వచ్చింది. పురుషలింగం అయితే యుహద్దిసు వచ్చేది. తుహద్దిసు, భూమి వివరిస్తుంది, తెలియజేస్తుంది. అఖ్బారహా తన సంగతులన్నీ, తన సమాచారాలన్నీ.

بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا
(బి అన్న రబ్బక అవ్హాలహా)
ఎందుకంటే నీ ప్రభువు దానికి, ఆ మేరకు ఆజ్ఞాపించి ఉంటాడు.(సూరా అజ్-జిల్జాల్ 99:5)

అలా ఎందుకు చేస్తుంది? ఎందుకు వివరిస్తుంది? ఎందుకంటే బి అన్న, ఎందుకంటే రబ్బక నీ ప్రభువు అవ్హాలహా దానికి ఆజ్ఞాపించి ఉంటాడు అలా చేయాలని.

يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ
(యౌమఇదిన్ యస్దురున్నాసు అష్తాతల్ లియురవ్ అఅమాలహుమ్)
ఆ రోజు జనులు – వారి కర్మలు వారికి చూపబడేందుకుగాను – వేర్వేరు బృందాలుగా తరలి వస్తారు. (సూరా అజ్-జిల్జాల్ 99:6)

యౌమఇదిన్ ఆ రోజు. యస్దురున్నాస్, యస్దురు తరలి వస్తారు, తిరిగి వస్తారు. అన్నాస్ జనులు, ప్రజలు. అష్ తాతా వేరు వేరు బృందాలుగా. లియురవ్ వారికి చూపబడేందుకు అఅమాలహుమ్ వారి యొక్క కర్మలు. ఆ రోజు జనులు వారి కర్మలు వారికి చూపబడేందుకు గాను వేరు వేరు బృందాలుగా తరలి వస్తారు.

فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ
(ఫమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్)
కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. (సూరా అజ్-జిల్జాల్ 99:7)

వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్. కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా. ఫమన్ ఎవడైనా గానీ, ఎవడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. యఅమల్ చేస్తాడో, చేసినా. మిస్ఖాల దర్రహ్ అణువంత. దర్రహ్ చీమల కంటే చిన్నగా, చీమల యొక్క గుడ్లు, చీమల యొక్క పిల్లలు, అంతకంటే మరీ చిన్నది. ఖైరన్ ఏదైనా సత్కార్యం. యరహు దాన్ని అతడు చూసుకుంటాడు. కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.

وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ
(వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ షర్రయ్యరహ్)
మరెవడు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. (సూరా అజ్-జిల్జాల్ 99:8)

మరెవరు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.

సోదర మహాశయులారా! ఖురాన్ సూరతులలోని క్రమంలో ఈ 99వ సూరత్, సూరతుల్ జిల్జాల్, చాలా ప్రాముఖ్యత గల సూరా. ఈ సూరా యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని సందర్భాల్లో, ఎలాగైతే ముస్నద్ అహ్మద్ లో హదీస్ వచ్చి ఉందో, అబూ ఉమామా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు:

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి కాలంలో కొంచెం బరువు పెరిగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విత్ర్ చేసిన తర్వాత కూర్చుండి రెండు రకాతులు ఎప్పుడైనా చేసేవారు. ఆ రెండు రకాతులలోని మొదటి రకాతులో సూరే ఫాతిహా తర్వాత ఇదా జుల్జిలతిల్ అర్ద్ చదివేవారు. మరియు రెండవ రకాతులో సూరే ఫాతిహా తర్వాత ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ (قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ) చదివేవారు.

దీని ప్రాముఖ్యతను గమనించడానికి, అబూ దావూద్ లో వచ్చినటువంటి ఒక హదీస్, 816 హదీస్ నెంబర్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రోజు ఫజర్ నమాజులోని రెండు రకాతుల్లో కూడా ఇదే సూరత్ జిల్జాల్. చదివారు.

సోదర మహాశయులారా! ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, సహాబాల యొక్క జీవితాల్లో, ఈ సూరా పట్ల ఎలాంటి ప్రాముఖ్యత ఉండినది, చాలా భయంకరమైన గొప్ప విషయాలు చెప్పుకోవడానికి, సూక్ష్మమైన విషయాల గురించి ప్రస్తావన చేసుకునేటందుకు, ఏ చిన్న, అతి చిన్న, మరీ చిన్న పుణ్య కార్యమైనా చేసుకోవడానికి ముందుకు రావాలని, ఏ చిన్న, ఏ అతి చిన్న, మరీ చిన్న పాపమైనా తప్పకుండా దానితో దూరం ఉండాలని ఈ సూరా ద్వారా గుణపాఠం తెచ్చుకొని ఇతరులకు బోధించేవారు, నేర్పేవారు ఈ సూరా ఆధారంగా.

సోదర మహాశయులారా! ఈ సూరా యొక్క ప్రాముఖ్యత మరొక హదీస్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఆ హదీసును కొందరు ధర్మవేత్తలు జయీఫ్ (ضَعِيفٌ) అన్నారు కానీ, ముస్నద్ అహ్మద్ ఏదైతే చాలా ఎక్కువ వాల్యూమ్ లో పూర్తి రీసెర్చ్ తో ప్రింట్ అయిందో, 35-40 కంటే ఎక్కువ వాల్యూమ్స్ లో, దాని యొక్క రీసెర్చ్ చేసిన ముహఖ్ఖిఖీన్ (مُحَقِّقِينَ) దానిని బలమైనదిగానే చెప్పారు. ఆ హదీస్ కొంచెం పొడుగ్గా ఉంది, సారాంశం చెబుతున్నాను:

ఆ మనిషి చాలా సంతోషంగా ప్రవక్త వద్ద నుండి తిరిగి వెళ్తూ, అల్లాహ్ యే సత్యంతో మిమ్మల్ని పంపాడో ఆ అల్లాహ్ యొక్క సాక్ష్యంతో చెబుతున్నాను, తప్పకుండా ఈ సూరాను నేను నేర్చుకుంటాను, నేను ఇంతకంటే ఎక్కువగా బహుశా నేర్చుకోలేకపోతాను కావచ్చు కానీ దీనిని అయితే తప్పకుండా నేర్చుకుంటాను అని వెనుతిరిగి పోయాడు అక్కడి నుండి. అతడు వెళ్తున్నది చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “ఇతడు సాఫల్యం పొందాడు, ఇతడు విజయం పొందాడు“.

సోదర మహాశయులారా! గమనిస్తున్నారా? ఇక మీలో ఎవరెవరికైతే ఈ సూరా రాదో, లేక ఈ సూరా యొక్క భావాన్ని ఇంతవరకు అర్థం చేసుకొని ప్రయత్నం చేయలేదో, ఇక శ్రద్ధగా వినండి, ఆయత్ యొక్క వ్యాఖ్యానాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ ఈ హదీస్ మరియు ఇంతకుముందు తెలుసుకున్న హదీసుల ద్వారా దీని యొక్క ప్రాముఖ్యతను గ్రహించండి. మరియు ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి ఈ సూరా ఖురాన్ లోని సగం సూరా, ఈ సూరా ఖురాన్ లోని నాలుగో వంతుకు సమానం, కానీ అలాంటి హదీసులు సహీ లేవు అని ఎందరో ధర్మవేత్తలు చెప్పి ఉన్నారు.

సోదర మహాశయులారా! ఈ సూరాలో పరలోకం పట్ల మన యొక్క విశ్వాసం పెరిగే రీతిలో, పరలోకానికి సంబంధించిన రెండు సందర్భాలను ప్రస్తావించడం జరిగింది. ఒకటి, మొదటి శంఖు ఊదబడినప్పుడు ఈ విశ్వం అంతా చెల్లాచెదురై నాశనమవుతున్న సందర్భాన్ని, మరొకటి రెండవ శంఖు ఊదబడిన తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తారు, గమ్యస్థానాలు ఏమవుతాయి, పరిస్థితి ఏముంటుంది దాని గురించి చెప్పడం జరిగింది.

సోదర మహాశయులారా! ఇక్కడ మీరు చూస్తున్నట్లు, ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా. జుల్జిలత్ అని క్రియ రూపంలో ఉన్న ఒక పదాన్ని చెప్పిన వెంటనే మళ్ళీ జిల్జాలహా అని ఫార్మాట్ చేంజ్ చేసి మస్దర్ రూపంలో తీసుకువచ్చి, అల్లాహ్ త’ఆలా చెప్పదలచినది ఏమిటంటే, ఈ ప్రళయ సమయాన ఏ భూకంపం ఏర్పడుతుందో, ఈ మొత్తం భూమిలో ఏ ప్రకంపనలు స్టార్ట్ అవుతాయో, అవి ఏమో చిన్నవి కావు, చాలా భయంకరమైనవి.

గమనించండి ఒక్కసారి మీరు, ఎక్కడో ఇండోనేషియాకు ఎంతో దూరంలో, అది కూడా సముద్రం లోపలని భూమిలో ప్రకంపనలు మొదలౌతే, వాటి యొక్క ప్రభావమే కాదు, నష్టం వేలాది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన భారతదేశానికి కూడా చేరుకొని, సునామీ అన్న పేరుతో ఈ రోజు కూడా మర్చిపోని స్థితిలో ఉన్నాము కదా. అయితే అది సునామీ అన్నటువంటి పేరు ఏదైతే ఉందో, కేవలం సముద్రాల, సముద్రం యొక్క అలలు, కెరటాలు పెరిగి ఏదో నష్టం జరిగింది కాదు కదా. ఎక్కడ ఇండోనేషియా, ఎక్కడ సముద్రం లోపలి భాగంలో సంభవించిన ప్రకంపన, భూకంపం, అక్కడ భూమి దద్దరిల్లింది. ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో దాని నష్టం ఇంతా అంతా కాదు, కోట్ల కోట్లలో జరిగింది, ప్రాణాలు పోయాయి, ప్రాణ నష్టంతో పాటు ధన నష్టం కూడా జరిగింది. సోదర మహాశయులారా! ఒక్కసారి ఒక్కచోట వచ్చిన ఈ భూకంపం ఎంత దూరం నష్టం చేకూర్చింది, ఇక ప్రళయదినాన్ని గుర్తుంచుకోండి, గుర్తు తెచ్చుకోండి, ఈ మొత్తం భూమిలో ఎక్కడా కూడా ఖాళీ లేకుండా అంతటా ఈ భూకంపం వచ్చినప్పుడు పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో ఆలోచించగలమా మనం?

ఎక్కడైనా ఒకచోట భూకంపం వస్తుంది అంటే రాని చోటకు ప్రజలు పరిగెత్తుతారు. కదా? మరి ఆ రోజు పరిగెత్తడానికి ఎక్కడ స్థలం ఉన్నది? ఎక్కడ స్థలం ఉన్నది? అందుకొరకు సోదర మహాశయులారా! ఖురాన్ ఆయతులను గ్రహించి, గమనించి మన జీవితంలో మార్పు తెచ్చుకునే మనం ప్రయత్నం చేయాలి. లేదా అంటే మన శక్తి ఏం శక్తి? మనం ఏం చేయగలుగుతాము? ఎలాంటి విపత్తులు మనం అడ్డుకోగలుగుతాము?

ఆ రోజు, వ అఖ్రజతిల్ అర్దు అస్ఖాలహా. భూమి తన యొక్క బరువులన్నింటినీ. ఇక్కడ బరువులు అంటే ఒకటి కాదు రెండు కాదు, అనేక విషయాల ప్రస్తావన ఉంది. ఒకటి, ఇక్కడ ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని చివరి మానవుని వరకు ఎవరు ఎక్కడ ఎలా చనిపోయారో, వారిని కాల్చడం జరిగినా, వారిని పూడ్చడం జరిగినా, వారు ఏదైనా జంతువుకి ఆహుతి అయిపోయినా, ఏదైనా అగ్నికి ఆహుతి అయిపోయినా, ఏదైనా జంతు మృగ జీవికి ఒక నివాలా అయిపోయినా, ఏ పరిస్థితిలో చనిపోయినా వారిని సమాధి చేయబడినా, చేయబడకపోయినా అంతా కూడా తిరిగి వచ్చేది మట్టి వైపునకే. 77వ సూరా సూరతుల్ ముర్సలాత్ లో వచ్చిన ఒక ఆయత్ ను గమనించండి,

أَلَمْ نَجْعَلِ الْأَرْضَ كِفَاتًا أَحْيَاءً وَأَمْوَاتًا
(అలం నజ్అలిల్ అర్ద కిఫాతా అహ్యాఅవ్ వ అమ్ వాతా.)
మేము ఈ భూమిని వారి యొక్క జీవుల కొరకు మరియు చనిపోయిన వారి కొరకు అందరి కొరకు సరిపోయేదిగా చేసి ఉంచాము.

గమనించండి, ఈ ఆయత్ లో ఇంకా వేరే ఎన్నో బోధనలు ఉన్నాయి వేరే సందర్భంలో. కానీ చెప్పే ఉద్దేశ్యం ఏమిటి, తిరస్కరించిన వారైనా, నమ్మిన వారైనా, విశ్వాసులైనా, అవిశ్వాసులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, అందరూ కూడా ఈ భూమిలోకి ఏదైతే పోయారో ఏ రీతిలోనైనా వెలికి వస్తారు. తప్పకుండా బయటికి వస్తారు. సూరతుల్ ఇన్షికాఖ్ (سُورَةُ الْإِنْشِقَاقِ) లో చదవండి, ముతఫ్ఫిఫీన్ (مُطَفِّفِينَ) తర్వాత సూరత్,

وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ
(వ అల్ఖత్ మా ఫీహా వ తఖల్లత్.)
ఇక బరువులన్నింటినీ తీసివేస్తుంది బయటికి అని రెండవ భావం, ఈ భూమిలో ఎక్కడెక్కడ ఏ ఖజానాలు ఉన్నాయో, ఏ కోశాగారాలు ఉన్నాయో, ఏ ఏ రకమైన ధాతువులు ఉన్నాయో, వెండి బంగారం రూపులోనైనా, ఇంకా వేరే ఏ రీతిలోనైనా అంతా కూడా బయటికి వచ్చి పడుతుంది. మనిషి ఎటు నడిచినా గానీ బంగారం, వెండి అంతకంటే ఇంకా విలువైనది వేరే ఎంతో సామాగ్రి అతను కళ్ళతో చూస్తాడు. సహీ ముస్లిం లోని ఒక హదీస్ శ్రద్ధగా వినండి, అల్లాహు అక్బర్.

تَقِيءُ الْأَرْضُ أَفْلَاذَ كَبِدِهَا أَمْثَالَ الْأُسْطُوَانِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ
(తఫిల్ అర్దు అఫ్లాద కబిదిహా అమ్సాలల్ ఉస్తువాన్ మిన దహబి వల్ ఫిద్దా.)
ప్రళయదినాన ఈ భూమి తనలో ఉన్నటువంటి ఖజానాలన్నిటినీ బయటికి పడేస్తుంది. పెద్ద పెద్ద గుట్టలు, పర్వతాల మాదిరిగా మనిషి కళ్ళ ముందు వెండి బంగారాలు పడి ఉంటాయి.

అప్పుడు ఒక హంతకుడు వస్తాడు, అయ్యో, ఈ బంగారం వెండి కొరకే కదా నేను ఫలానా వ్యక్తిని చంపి ఈ ధన ఆశలో ఒకరి ప్రాణం తీసుకున్నాను, ఇప్పుడు ఇంతగా నా కళ్ళ ముందు ఉంది కానీ నాకు ఏ ప్రయోజనం చేకూర్చదు ఇది, దీనిని తీసుకొని ఏ లాభం పొందలేను. మరొక వ్యక్తి వస్తాడు, అయ్యో, నేను ఈ డబ్బు ధన ఆశలో బంధుత్వాలను తెంచాను, నా యొక్క సంబంధాలను పాడు చేసుకున్నాను, నేను ఈ యొక్క డబ్బు ధన ఆశలో ఎందరి నా దగ్గర వారిని దూరం చేసుకున్నాను, అయ్యో అని వాపోతాడు. కానీ అది అతనికి ఏ ప్రయోజనం చేకూర్చదు. దొంగ వస్తాడు, అతడు ఇదంతా చూసి, అయ్యో, దీని గురించేనా నా యొక్క చేతులు నరికి వేయబడినవి, ఈ రోజు తీసుకుందాం అంటే కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాత వారి కళ్ళ ముందు ఉంటుంది కానీ ఎవరు దానిని ముట్టరు, ఏమీ తీసుకోలేరు.

ఇదంతా కూడా ఇంత స్పష్టంగా వివరంగా మనకు చెప్పబడినప్పుడు, ఈ రోజుల్లో మనం నా తాత భూమి నా అయ్యకు దొరకలేదు, ఇక ఇప్పుడు నేను ఇంత అధికారంలో వచ్చిన కదా, నా చిన్నాయనలకు, నా పెదనాయనలకు అందరికీ ఇక నేను జైల్లో వేస్తాను, వారి సంతానాలనే వేస్తాను, వారి యొక్క వంశమే గుర్తుంచుకోవాలి అన్నటువంటి పన్నాగలు పన్ని, ఏ ఏ ప్రయత్నాలు చేస్తారో, దౌర్జన్యాలు చేసి ఒకరి భూమిని ఏదైతే ఆక్రమించుకుంటారో, ఏ ఏ రీతిలో చివరికి ఒక మాట ఇక్కడ చెప్పవచ్చు కదా, కట్నకానుకల రూపంలో అమ్మాయిల తల్లిదండ్రులపై దౌర్జన్యాలు చేసి ఏ ఏ సొమ్ము లూటీ చేస్తున్నారో, ఈ సూరత్ యొక్క వ్యాఖ్యానంలో వచ్చిన హదీస్ ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి.

భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడేసినప్పుడు, మనిషి, అయ్యో, అరె దీనికి ఏమైపోయింది, ఇది ఇలా ఎందుకు చేస్తుంది? అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. మనిషి ఇలా మొత్తుకుంటాడు కానీ ఏమీ లాభం.

మరొక వ్యాఖ్యానం, బరువులన్నీ తీసి బయట పడేసినప్పుడు అన్న దానికి ధర్మవేత్తలు, ఖురాన్ వ్యాఖ్యానకర్తలు తెలిపారు, అదేమిటంటే, ఆ రోజు మనిషి ఏ ఏ విషయాలను నమ్మకపోయేదో ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు, ఆ సత్యాలు వాస్తవాలన్నీ కూడా అతని కళ్ల ముందుకు వచ్చేస్తాయి. అప్పుడు అతను ఆ విషయాలన్నింటినీ, వేటినైతే ప్రవక్తలు, ప్రవక్తల యొక్క నాయబులు, వారి యొక్క మార్గంపై ఉన్నటువంటి దాయిలు, ప్రచారకులు ఏ సత్యాలు ఖురాన్ హదీస్ ఆధారంగా తెలిపినప్పటికీ తిరస్కరించేవారో, నమ్మకుండా ఉండేవారో వారికి ఆ వాస్తవాలన్నీ కూడా ముందుకు వచ్చేస్తాయి. సోదర మహాశయులారా! ఈ సందర్భంలో మనిషి చాలా బాధగా అంటాడు, అయ్యో ఇదేమైపోయింది, ఇది ఎలా ఎందుకు జరుగుతుంది, మరియు ఈ సందర్భం అనేది ఖురాన్ లో ఇంకా వేరే సూరాలలో కూడా చెప్పడం జరిగినది. ఉదాహరణకు సూరత్ యాసీన్ చదువుతారు కదా, ఎంత మన దౌర్భాగ్యం గమనించండి, సూర యాసీన్,

لِّيُنذِرَ مَن كَانَ حَيًّا
(లియున్దిర మన్ కాన హయ్యా)
బ్రతికి ఉన్న వారి కొరకు ఇదిగో హెచ్చరిక అని అల్లాహ్ అదే సూరాలో చెబుతున్నాడు.

బ్రతికి ఉన్న వారు చదివి గుణపాఠం నేర్చుకోవడం లేదు, చనిపోయిన వారి మీద చదువుతున్నారు, వారు వినడానికి కూడా ఏ శక్తి వారిలో లేదు. అదే సూరత్ యాసీన్ లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు,

هَٰذَا مَا وَعَدَ الرَّحْمَٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ
(హాదా మా వఅదర్ రహ్మాను వ సదఖల్ ముర్సలూన్.)
అప్పుడు వారి కళ్లు తెరిచినట్లు అవుతాయి, వారి కళ్ల మీద ఉన్నటువంటి ముసుగు తొలగిపోయినట్లు ఏర్పడుతుంది, అప్పుడు అంటారు అయ్యో, మమ్మల్ని మా సమాధుల నుండి ఎక్కడైతే హాయిగా పడుకొని ఉంటిమో, ఎవరు లేపేశారు మమ్మల్ని? రహ్మాన్ చేసిన వాగ్దానం ఇదే కదా అది. ప్రవక్తలు చెప్పుకుంటూ వచ్చినటువంటి విషయాలు ఇప్పుడు నిజంగానే జరుగుతున్నాయి, అవే కదా ఇవి. కానీ అప్పుడు మనిషి వాటన్నిటినీ సత్యంగా నమ్మితే ఏ లాభం ఉండదు.

సోదర మహాశయులారా! ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా, ఇదా దీనిని అరబీ గ్రామర్ ప్రకారంగా ఒక షర్తియా పదం అంటారు, దాని యొక్క సమాధానం నాలుగో ఆయత్ లో అల్లాహ్ ఇస్తున్నాడు, యౌమఇదిన్ తుహద్దిసు అఖ్బారహా. అల్లాహు అక్బర్. ఆయత్ నెంబర్ రెండులో చూశారు మీరు, తన బరువులన్నింటినీ వెలికి తీస్తుంది అని.

ఇక ఆయత్ నెంబర్ నాలుగులో ఉన్న విచిత్రం గమనించండి, ఆ రోజు భూమి తన సంగతులన్నీ వివరిస్తుంది. ఏమిటి ఆ సంగతులు? ఏమిటి ఆ సంగతులు? అల్లాహు అక్బర్. అల్లాహ్ త’ఆలా మనిషిని పుట్టించినప్పటి నుండి కాదు అంతకు ముందు నుండి ఈ భూమి ఉంది. ప్రళయం వరకు ఎక్కడెక్కడ ఏమి జరిగినదో అదంతా కూడా ఈ భూమి అంతా వివరిస్తూ ఉంటుంది. అల్లాహు అక్బర్.

హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం వస్తుంది. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఈ సూరతుల్ జిల్జాల్ తిలావత్ చేశారు. సూరత్ జిల్జాల్ తిలావత్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ ఆయత్ నెంబర్ నాలుగు వరకు చేరుకున్నారో, మీకు తెలుసా దాని యొక్క సమాచారాలన్నీ కూడా ఏమిటి? మీకు తెలుసా దాని యొక్క సంగతులన్నీ ఏమిటి? అది ఏం వివరిస్తుంది? ఆ సమయంలో సహాబాలు సామాన్యంగా జవాబు ఇచ్చినట్లుగానే ఇచ్చారు, అల్లాహ్ మరియు ప్రవక్తకే తెలుసు. అప్పుడు ప్రవక్త తెలిపారు,

فَإِنَّ أَخْبَارَهَا أَنْ تَشْهَدَ عَلَى كُلِّ عَبْدٍ وَأَمَةٍ
(ఫఇన్న అఖ్బారహా అన్ తష్హద అలా కుల్లి అబ్దివ్ వ అమతిన్.)
ప్రతి మానవుడు పురుషుడు అయినా, స్త్రీ అయినా భూమిలోని ఏ చోట ఉండి ఏ పని చేశాడో దాని గురించి ఆ భూమి వివరిస్తుంది. ఫలానా వ్యక్తి ఇక్కడ ఉండి ఇలాంటి పని చేశాడు, ఇక్కడ ఉండి ఇలాంటి పని చేశాడు. అందుకొరకే రబీఆ ఉల్లేఖించిన ఒక ఉల్లేఖనంలో తబరానీ కబీర్ లో వచ్చింది,

تَحَفَّظُوا مِنَ الْأَرْضِ، فَإِنَّهَا أُمُّكُمْ
(తహఫ్ఫదూ మినల్ అర్ద్, ఫఇన్నహా ఉమ్ముకుమ్.)
మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీ యొక్క ఈ భూమి నుండి. ఎందుకంటే ఇది మీ యొక్క తల్లి లాంటిది. మీరు ఈ భూమిపై నివసిస్తున్నారు, దీని లోకే వెళ్ళేవారు ఉన్నారు.

وَإِنَّهُ لَيْسَ مِنْ أَحَدٍ عَامِلٌ عَلَيْهَا خَيْرًا أَوْ شَرًّا إِلَّا وَهِيَ مُخْبِرَةٌ بِهِ
(వఇన్నహూ లైస మిన్ అహదిన్ ఫాయిలున్ అలైహా ఖైరన్ అవ్ షర్రన్ ఇల్లా వహియ ముఖ్బిరా.)
గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి, ఈ భూమి దీనిపై మీరు ఎక్కడ ఉండి ఏ పని చేసినా, మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా ఆ భూమి రేపటి రోజు తప్పకుండా చెప్పనున్నది.

ఈ రెండు హదీసులు ప్రామాణికతలో కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ, ఒకటి మరొకటికి మంచి సపోర్ట్ ఇస్తుంది అని ధర్మవేత్తలు అంటారు. అందుకొరకే వీటిని ప్రస్తావించడం జరిగింది.

సోదర మహాశయులారా! ఇక్కడ మనం భయపడవలసిన విషయం ఏమిటంటే, ఈ భూమిలోని ఏ చోట ఉండి మనం ఏ పని చేస్తున్నామో, అది మన గురించి సాక్ష్యం పలుకుతుంది. వేరే కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది, హజరత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా, ఇంకా వేరే సహాబాల ద్వారా రుజువైనటువంటి కొన్ని హదీసుల ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, మనిషి ఎప్పుడూ కూడా ఏ చిన్న సత్కార్యాన్ని విలువ లేకుండా భావించకూడదు. ఇది ఏమవుసరం అన్నట్లుగా భావించకూడదు. అలాగే ఏ పెద్ద సత్కార్యాన్ని కూడా చేయడంలో వెనక ఉండకూడదు. అలాగే ఏ పాప కార్యం పట్ల కూడా ఇది ఎంత నష్టం చేకూరుస్తుంది అన్నటువంటి ధోరణిలో ఉండకూడదు.

ఈ ఆయతుల ద్వారా మనకు బోధపడుతుంది, మనం ఏ సత్కార్యాలు చేసినా, ఏ పాప కార్యాలు చేసినా వాటి గురించి సాక్ష్యాధారాలు తయారవుతూ పోతూ ఉన్నాయి. ఆ రోజు మనం మన నోటితో ఏ విషయాన్ని తిరస్కరించినా, స్వయం మన యొక్క శరీరం నుండే మనకు దానికి వ్యతిరేకంగా సాక్ష్యాలు వచ్చేస్తాయి. అందుకొరకు అల్లాహ్ తో భయపడుతూ ఉండాలి.

మరియు ఆ తర్వాత ఆయత్ నెంబర్ ఆరులో గమనించండి, ఆయత్ నెంబర్ ఐదులో, ఇదంతా కూడా అల్లాహ్ యొక్క అనుమతితో, అల్లాహ్ యొక్క ఆజ్ఞతోనే భూమి చేస్తుంది. గమనించండి, భూమి యొక్క సృష్టికర్త అల్లాహ్ మరియు అల్లాహ్ త’ఆలా ఆజ్ఞ ప్రకారమే అది మసులుకుంటుంది. అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఒక చోట చెబుతున్నాడు, భూమి మరియు ఆకాశం ఈ రెండిటికీ అల్లాహ్ త’ఆలా మీకు ఇష్టమైనా లేకపోయినా మీరు విధేయులుగానే రావాలి అని అంటే వారు,

أَتَيْنَا طَائِعِينَ
(అతైనా తాయిఈన్)
మేము ఓ అల్లాహ్ నీకు విధేయులుగా హాజరయ్యాము అని చెప్పారు.

ఖురాన్ లోని ఆయత్ భావం. ఇంతటి విధేయత ఈ భూమి ఆకాశాలు పాటిస్తూ, ఎక్కడ ఏం మనం చేశామో అవన్నీ వివరిస్తున్నప్పుడు, మనం ఇంకా ఎంత అశ్రద్ధగా ఉంటాము? ఇంకా ఎన్ని రోజులు ఈ అశ్రద్ధ, ఏమరుపాటులో ఉంటాము?

ఆ తర్వాత అల్లాహ్ త’ఆలా ఆయత్ నెంబర్ ఆరులో తెలియజేస్తున్నాడు,

يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ
(యౌమఇదిన్ యస్దురున్నాసు అష్ తాతల్ లియురవ్ అఅమాలహుమ్)
ఆ రోజు జనులు – వారి కర్మలు వారికి చూపబడేందుకుగాను – వేర్వేరు బృందాలుగా తరలి వస్తారు.

యస్దుర్ (يَصْدُرُ) అని ఏదైతే ఇక్కడ చెప్పడం జరిగిందో, తరలి రావడం, తిరిగి రావడం. సమాధుల నుండి మైదానే మెహషర్ లో లెక్క తీర్పు గురించి మరియు అక్కడ ఎన్నో సంఘటనలు, ఎన్నో ఘట్టాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ రెండవ తిరుగు ఏ గమ్యస్థానం ఉంటుందో ఎవరికి, స్వర్గం నరకం రూపంలో అటువైపున అని. మరియు ఇక్కడ ఏదైతే అష్ తాతా (أَشْتَاتًا), వేరు వేరు బృందాలుగా అని చెప్పడం జరిగిందో దానికి ఖురాన్ లోని ఇంకా ఎన్నో ఆయతులు కూడా సాక్ష్యాధారంగా ఉన్నాయి. దీని యొక్క భావంలో ఎన్నో విషయాలు వస్తాయి. ఒకటి ఏమిటి, అవిశ్వాసులు ఒక బృందం, విశ్వాసులు ఒక బృందం. ఈ విధంగా కూడా చెప్పడం జరిగింది. మరొక భావం ఇక్కడ, ప్రతి ప్రవక్త వారి యొక్క అనుచరుల ప్రకారంగా వేరు వేరు బృందాలు. మరొక భావం ఇందులో, ప్రతి ప్రవక్తతో వారిలో కొందరు విశ్వసించేవారు, మరికొందరు విశ్వసించని వారు. ఈ విధంగా ఖురాన్ లో ఎన్నో సందర్భాల్లో మనకు ఈ విషయాలు తెలుస్తాయి,

وَيَوْمَ نَحْشُرُ مِن كُلِّ أُمَّةٍ فَوْجًا مِّمَّن يُكَذِّبُ بِآيَاتِنَا فَهُمْ يُوزَعُونَ
(వయౌమ నహ్షురు మిన్ కుల్లి ఉమ్మతిన్ ఫౌజన్ మిమ్మన్ యుకద్దిబు బి ఆయాతినా ఫహుమ్ యూజఊన్)
ఆ రోజు మేము ప్రతి మానవ సమాజం నుంచి, మా ఆయతులను ధిక్కరించే ఒక్కొక్క సమూహాన్ని చుట్టుముట్టి మరీ తెస్తాము. ఆ తరువాత వారంతా వర్గీకరించబడతారు.” (27:83)

సూరతున్ నహల్ లో, అలాగే ఇంకా వేరే సూరాలలో కూడా ఈ భావం ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ మరోసారి మీరు గమనించండి, లియురవ్ అఅమాలహుమ్. ఈ పదం, ఈ పదం ఏదైతే లియురవ్ అఅమాలహుమ్ అని ఉందో మనల్ని కంపించి వేయాలి, మనలో భయాన్ని పుట్టించాలి. ఎందుకు? ఏం చెప్పడం జరుగుతుంది, వారి యొక్క కర్మలు వారికి చూపించడానికి. అల్లాహు అక్బర్.

సోదర మహాశయులారా! ఎలాగైతే కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా సీక్రెట్ సీసీటీవీలు, కెమెరాలు ఉంటాయి. ఇక్కడ మనల్ని ఎవరు చూడటం లేదు అని ఏదో నేరానికి పాల్పడతాము. కానీ పట్టుబడిన తర్వాత ఎప్పుడైతే ఆ సీసీ ఫొటేజ్ లను మన ముందు స్పష్టంగా ఒక స్క్రీన్ లో చూపించడం జరుగుతుందో, మనం ఆ ప్రాంతంలో ఎటు నుండి వస్తున్నాము, ఎలా వస్తున్నాము, ఏ ఏ ఆయుధాలతో, ఏ ఏ సాధనాలతో వస్తున్నాము, ఎలా లూటీ, దోపిడీ ఇంకా వేరే నేరాలకు పాల్పడుతున్నాము అదంతా మన కళ్ళారా మనం చూసుకుంటూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఈ లోకంలో ఒక్కసారి గమనించండి. ఇది ఏదో ఒక్కసారి చేసినటువంటి పొరపాటు, అది ఏదో రికార్డ్ అయిపోయింది, కానీ దాని గురించి విని మనం కొన్ని సందర్భాల్లో సిగ్గుకు గురి అవుతాము, ఎంతో సందర్భాల్లో ఛీ ఇలాంటి పనులు ఎందుకు చేయాలి అని అనుకుంటాము.

కానీ ఇక్కడ గమనించండి, అటువైపున భూమి సాక్ష్యం పలుకుతుంది, భూమి అంతా కూడా తెలియజేస్తుంది, మళ్ళీ అల్లాహ్ వద్దకు హాజరవుతున్నాము, అక్కడ ఈ ఫొటో, సీసీటీవీలలో మొత్తం రికార్డ్ అయినటువంటి మన పూర్తి జీవితం యొక్క ఫ్లాష్ బ్యాక్ రికార్డ్ వీడియో మొత్తం బయటికి వస్తుంది, అప్పుడు మనం ఎక్కడ తల దాచుకుంటాము? అప్పుడు మనం ఎక్కడ అల్లాహ్ యొక్క శిక్షల నుండి పారిపోతాము? ఏదైనా అవకాశం ఉందా?

లియురవ్ అఅమాలహుమ్, వారికి వారి కర్మలన్నీ చూపడం జరుగుతుంది అంటే దైవదూతలు రాసుకున్నటువంటి ఆ దఫ్తర్లు, రిజిస్టర్లు ఓపెన్ చేసి చూపిస్తారు అనే ఒక్కటే భావంలో మీరు ఉండకండి. ఆ చూపించడం అనేది మనకు, మనం ఇక్కడ లోకంలో ఏ రీతిలో మనం మసులుకుంటూ ఉంటామో ఆ ప్రకారంగా అక్కడ మనతో పరిస్థితి జరుగుతుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం చేసిన తప్పులను ఒప్పుకొని అల్లాహ్ తో ఆ సమయంలో కూడా ఒకవేళ ఇహలోకంలో విశ్వాసంగా ఉండి కొన్ని పొరపాట్లు జరిగితే, తౌహీద్ పై ఉండి వేరే కొన్ని పాపాలు జరిగితే బహుశా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనల్ని మన్నించేస్తాడు అన్నటువంటి ఆశ ఉంచవచ్చు కూడా. అవును, ఒక హదీస్ ద్వారా కూడా ఈ భావం మనకు కనబడుతుంది. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పి ఉన్నారు కూడా, మీలో ప్రతి ఒక్కడు ఎన్ని పాపాలు చేసినా గానీ విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవాలి, తౌబా ఇస్తిగ్ఫార్ లాంటివి చేసుకుంటూ ఉండాలి, కానీ దానితో పాటు ఏంటి, ఏ పాపం జరిగినప్పటికీ అల్లాహ్ పట్ల సదుద్దేశంతో ఉండాలి. అల్లాహ్ నా విశ్వాసాన్ని స్వీకరించి, నా పుణ్యాలను స్వీకరించి, నా పాపాలను మన్నిస్తాడు అని. కానీ ఆ ఉద్దేశం ప్రకారంగా తన యొక్క విశ్వాసం, ఆచరణ కూడా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అలా ప్రయత్నం చేయకుండా కేవలం బూటకపు అబద్ధపు ఆశలను పెట్టుకొని మనం చెడును చెడుగా భావించి ఛీ అన్నట్లుగా మన మనసులో లేకుంటే ఈ పశ్చాత్తాపం, ఈ ఆశ అనేది మనకు ఏ ప్రయోజనం చేకూర్చదు.

ఆ తర్వాత ఆయత్ నెంబర్ ఏడు మరియు ఎనిమిది, ఇది కూడా చాలా భయంకరమైన విషయం ఇందులో ఉంది. ఏమిటంటే, ఎక్కడ ఏ లోకంలో ఏ చాటున, ఏ గుహలో, ఏ రీతిలో ఎక్కడ ఉండి కూడా రవ్వంత, అణువంత, ఏ చిన్న పుణ్య కార్యం చేసినా అది మనం చూసుకుంటాము. మరియు ఇహలోకంలో ఏ చెడు చేసినా దాన్ని కూడా పరలోకంలో చూసుకుంటాము. ఈ భావంలో కూడా ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి,

وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا ۗ وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا
(వవజదూ మా అమిలూ హాదిరా వలా యద్లిము రబ్బుక అహదా.)
అల్లాహ్ త’ఆలా మీరు చేసిన పూర్తి మీ యొక్క జీవితమంతా ఏ ఏ కార్యాల్లో గడిసిందో దాన్నంతా కూడా హాజరు పరుస్తాడు, అల్లాహ్ ఎవరిపైనా కూడా ఏ కొంచెం అన్యాయం చేయడు.

సహీ బుఖారీలో వచ్చినటువంటి ఒక ఉల్లేఖనం ద్వారా మనం చాలా భయకంపితులైపోవాలి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో విషయాలు తెలియజేస్తూ, గుర్రం గురించి నేను నిన్నటి క్లాస్ లో ఏదైతే ఒక హదీస్ సంక్షిప్త భావం చెప్పానో అది ఒకరి కొరకు అజ్ర్ (أَجْرٌ) ఉంటే మరొకరి కొరకు సిత్ర్ (سِتْرٌ) మరియు ఇంకో వారికి అది పాపంగా ఉంటుంది, మూడు రకాల విషయాలు, రకాల గుర్రాలు ఉన్నాయి అని. ఆ హదీస్ వివరించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఒక సహాబీ అడిగారు, ప్రవక్తా, ఈ గుర్రం గురించి అయితే బాగానే చెప్పారు, మరి ఈ గాడిదల గురించి ఏంటి ప్రస్తావన అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏంటో గమనించండి,

مَا أُنْزِلَ فِيهَا شَيْءٌ إِلَّا هَذِهِ الْآيَةُ الْفَاذَّةُ الْجَامِعَةُ
(మా ఉన్జిల ఫీహా షైఅన్ ఇల్లా హాదిహిల్ ఆయతిల్ ఫాద్దతిల్ జామిఆ.)
మీరు అడిగిన ప్రశ్నకు నా వైపు నుండి నాకు ఏ సమాధానం లేదు, అల్లాహ్ ఏదైతే అవతరింపజేస్తూ ఉంటాడో, వహీ చేస్తూ ఉంటాడో దాని ప్రకారంగా నేను మీకు చెబుతూ ఉంటాను, ఇప్పుడు మీరు దీని గురించి ఏదైతే అడిగారో ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రత్యేకంగా దీని గురించి నాకైతే ఏమీ ఆదేశం రాలేదు, ఏ వహీ రాలేదు, కానీ ఒక జామిఅ ఆయత్, ఒక విచిత్రమైన, ఒక యునీక్ లాంటి ఆయత్ అది మీరు గుర్తుంచుకోండి,

فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ
(ఫమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్, వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ షర్రయ్యరహ్)
కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. మరెవడు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.”

సోదర మహాశయులారా! ఫరజ్దఖ్ అని ఒక చాలా ప్రఖ్యాతి గాంచిన కవి. అయితే ఆ కవి యొక్క బాబాయి ప్రవక్త సల్లల్లాهُ అలైహి వసల్లం వద్దకు వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని ముందు ఈ సూరా చదువుతూ, ఫమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్, వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ షర్రయ్యరహ్ అని తిలావత్ చేశారు. ఆ మనిషి, అతడు కూడా అరబ్, అరబీ భాష పట్ల మంచి అవగాహన. విన్న వెంటనే ఏమన్నాడు, చాలు చాలు చాలు, ఇక మీరు ఆపండి. ఈ విషయమే నాకు సరిపోయింది, మనం గుణపాఠం తెచ్చుకోవడానికి, జీవితంలో ఒక మార్పు తెచ్చుకోవడానికి, ఇక బహుశా దీని తర్వాత ఏది వినే అవసరం ఉండదు అని చెప్పుకొచ్చాడు.

అంటే ఏంటి, మనం ఏదైతే ఇహలోకంలో పుణ్యం చేస్తామో, పరలోకంలో దాని గురించి మనకు తప్పకుండా ప్రతిఫలం లభించడమే కాదు, ఆ పుణ్య కార్యాన్ని కూడా మనం చూస్తాము వీడియో రూపంలో. మరియు ఎక్కడైతే ఏ పాపాలు చేస్తామో వాటిని కూడా వీడియో రూపంలో చూస్తాము. అలాంటి సందర్భంలో మన పరిస్థితి ఏముంటుందో, భయపడాలి అల్లాహ్ తో.

అందుకొరకే సోదర మహాశయులారా! సమయం కూడా కావస్తుంది గనుక, ఈ విధంగా హదీస్ గ్రంథాల్లో ఒక సూరాకు సంబంధించి, ఆ సూరాలోని కొన్ని ఆయతులకు సంబంధించి ఏ ఏ హదీసులు వస్తాయో, వాటిలో ఏ ఏ గుణపాఠాలు ఉంటాయో వాటి ద్వారా మనం మంచి బోధ నేర్చుకొని మన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి. పరలోకం పట్ల విశ్వాసం మనది చాలా బలంగా ఉండాలి మరియు ఇహలోకంలోనే మనం మార్పు తెచ్చుకొని పుణ్యాల వైపునకు రావాలి లేదా అంటే చాలా నష్టంలో ఉంటాము.

అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఖురాన్ ను శ్రద్ధగా చదివి అర్థం చేసుకుంటూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక.

آمِينَ وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ. وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(ఆమీన్ వ ఆఖిరు దఅవాన అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=31951

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కార్యాలు – సద్వర్తన, ఉత్తమ నడవడిక (Good Character) [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 26 D నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కార్యాలు – సద్వర్తన, ఉత్తమ నడవడిక
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

(6) సద్వర్తన, ఉత్తమ నడవడిక

ప్రవక్త ﷺ చెప్పగా విన్నానంటూ ఆయిషా (రదియల్లాహు అన్హా)ఉల్లేఖించారు:

إِنَّ الْـمُؤْمِنَ لَيُدْرِكُ بِحُسْنِ خُلُقِهِ دَرَجَاتِ قَائِمِ اللَّيْلِ، صَائِمِ النَّهَارِ

“నిశ్చయంగా విశ్వాసుడు తన ఉత్తమ నడవడిక ద్వారా రాత్రంతా ఆరాధన చేసే, పగలంతా ఉపవాసముండే వారి స్థానాలకు చేరుకుంటాడు”.

(ముస్నద్ అహ్మద్ పదాలు 24355, అబూదావూద్ 4798, అల్బానీ సహీహుల్ జామి 1620లో సహీ అన్నారు).

దీని వ్యాఖ్యానంలో అబుత్తయ్యిబ్ షమ్సుల్ హఖ్ అజీమాబాదీ (రహిమహుల్లాహ్) ఔనుల్ మఅ’బూద్ లో ఇలా చెప్పారుః

ఉత్తమ నడవడిక గల వ్యక్తికి ఇంతటి గొప్ప ఘనత ఎందుకు ఇవ్వబడిదంటే; ‘సాయిమ్’ (ఉపవాసం ఉండేవాడు), ‘ఖాయిమ్’ (రాత్రి నమాజు చేసేవాడు), తమ మనోవాంఛలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు, కాని ఉత్తమ నడవడిక అవలంబించే వ్యక్తి విభిన్న తత్వాలు, గుణాలు గల ప్రజలతో పోరాడుతూ ఉంటాడు అందుకే అతను సాయిమ్, ఖాయిమ్ ల స్థానాలను అందుకుంటాడు. ఇలా వారు స్థానంలో సమానులవుతారు, ఒకప్పుడు వీరే ఎక్కువ స్థానం పొందుతారు.

(ఔనుల్ మఅ’బూద్ షర్హు సునన్ అబీ దావూద్ 13/ 154, హదీసు నంబర్ 4798).

ప్రజలతో మంచి విధంగా వ్యవహరించడం, వారికి ఏ కష్టం కలిగించకుండా ఉండడమే ఉత్తమ నడవడిక, సద్వర్తన.

నిశ్చయంగా మనిషికి విశ్వాసం తర్వాత సద్వర్తన కంటే ఉత్తమమైన మరే విషయం ఇవ్వబడలేదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువుతో ఉత్తమ నడవడిక ప్రసాదించమని అర్థించేవారు. జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)అలైహి వసల్లం అల్లాహు అక్బర్ అని నమాజు ప్రారంభించాక ఇలా చదివేవారు:

إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لله رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ، وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا مِنَ الْـمُسْلِمِينَ. اللَّهُمَّ اهْدِنِي لِأَحْسَنِ الْأَعْمَالِ وَأَحْسَنِ الْأَخْلَاقِ لَا يَهْدِي لِأَحْسَنِهَا إِلَّا أَنْتَ، وَقِنِي سَيِّئَ الْأَعْمَالِ وَسَيِّئَ الْأَخْلَاقِ لَا يَقِي سَيِّئَهَا إِلَّا أَنْتَ

ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్ యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, లాషరీక లహూ వ బిజాలిక ఉమిర్తు వ అన మినల్ ముస్లిమీన్, అల్లాహుమ్మహ్ దినీ లిఅహ్సనిల్ అఅ’మాలి వ అహ్సనిల్ అఖ్లాక్, లా యహ్ దీ లి అహ్సనిహా ఇల్లా అంత, వ ఖినీ సయ్యిఅల్ అఅమాలి వ సయ్యిఅల్ అఖ్లాక్, లా యఖీ సయ్యిఅహా ఇల్లా అంత.

(భావం: నిశ్చయంగా నా నమాజ్, నా ఖుర్బానీ (బలిదానం), నా జీవన్మరణాలు సర్వ లోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే, ఆయనకు ఎవడూ భాగస్వామి లేడు. ఈ ఆదేశమే నాకు ఇవ్వబడినది, నేను ముస్లిములోని వాడిని. ఓ అల్లాహ్! నాకు సత్పవర్తన మరియు సదాచరణ వైపునకు మార్గదర్శకత్వం చేయు, వాటి వైపునకు మార్గదర్శకత్వం చూపేవాడు నీ తప్ప ఎవ్వడూ లేడు. నన్ను దుష్పవర్త మరియు దుష్కార్యాల నుండి కాపాడు. నన్ను వాటి నుండి కాపాడేవాడు నీ తప్ప ఎవ్వడూ లేడు).

(ముస్లిం 771, తిర్మిజి 3421, నిసాయి 897 హదీసు పదాలు).

అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అద్దంలో చూసినప్పుడల్లా ఇలాగే దుఆ చేసేవారు. ఇబ్ను మస్ఊద్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః ప్రవక్త ﷺ అద్దంలో చూసినప్పుడల్లా ఇలా అనేవారుః

اللَّهُمَّ كَمَا حَسَّنْتَ خَلْقِي فَحَسِّنْ خُلُقِي

అల్లాహుమ్మ కమా హస్సన్ త ఖల్కీ హస్సిన్ ఖులుకీ

“ఓ అల్లాహ్! నీవు నా సృష్టిని (ఆకారాన్ని) సరిదిద్దినట్లు నా నడవడికను కూడా సరిదిద్దు”.

(ఇబ్ను హిబ్బాన్ 959, అహ్మద్ 1/ 403, అబూ యాలా 5075, తయాలిసి 374, తబ్రానీ ఫిద్దుఆ 368, అఖ్లాఖున్నబీః అబుష్షేఖ్ అల్ అస్బహానీ 493, సహీహుల్ జామిః అల్బానీ 1307).

సద్వర్తన గల వ్యక్తి ప్రజల్లో ప్రవక్తకు అతిప్రియుడైనవాడు మరియు ప్రళయదినాన ఆయనకు సమీపాన కూర్చుండేవాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

إِنَّ مِنْ أَحَبِّكُمْ إِلَيَّ وَأَقْرَبِكُمْ مِنِّي مَجْلِسًا يَوْمَ القِيَامَةِ أَحَاسِنَكُمْ أَخْلَاقًا

“నిశ్చయంగా మీలో నాకు అతి ప్రియమైనవాడు మరియు ప్రళయదినాన మీలో నాకు అతి సమీపంగా కూర్చుండేవాడు మీలో అందరికన్నా ఉత్తమ నడవడిక గలవాడు”.

(తిర్మిజి 2018, తబ్రానీ కబీర్ 10424, అదబుల్ ముఫ్రద్: బుఖారీ 272, అల్బానీ సహీహుత్తర్గబ్ 2649లో సహీ అన్నారు).

అల్లాహ్ ఉత్తమ నడవడిక గల వ్యక్తికి, సత్ఫలితార్థం మరియు గౌరవార్థం ఉన్నతస్వర్గంలో ఒక కోట (మంచి ఇల్లు) ప్రసాదిస్తాడు. ప్రవక్త ﷺ సెలవిచ్చారని అబూ ఉమామ బాహిలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

أَنَا زَعِيمٌ بِبَيْتٍ فِي رَبَضِ الْجَنَّةِ لِمَنْ تَرَكَ الْمِرَاءَ وَإِنْ كَانَ مُحِقًّا، وَبِبَيْتٍ فِي وَسَطِ الْجَنَّةِ لِمَنْ تَرَكَ الْكَذِبَ وَإِنْ كَانَ مَازِحًا وَبِبَيْتٍ فِي أَعْلَى الْجَنَّةِ لِمَنْ حَسَّنَ خُلُقَهُ

“నేను బాధ్యత వహిస్తున్నాను స్వర్గం పరిసరాల్లో ఒక గృహం ఇప్పించాడానికి ఎవరైతే ధర్మం తన వైపు ఉన్నప్పటికి వివాదాన్ని విడనాడుతాడో మరియు స్వర్గం మధ్యలో ఒక గృహం ఇప్పంచడానికి ఎవరైతే పరిహాసానికైనా అబద్ధం పలకనివానికి. ఇంకా స్వర్గంలో ఎత్తైన ప్రదేశంలో ఒక గృహం ఇప్పించడానికి ఎవరైతే తమ నడవడికను సరిదిద్దుకుంటారో”.

(అబూదావూద్ పదాలు 4800, బైహఖీ 20965, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 1464లో హసన్ అన్నారు).

నీ ఉత్తమ నడవడిక అనేది నీకు దూర సంబంధికులైన వారి వరకే పరిమితమయి, నీ దగ్గరి సంబంధికులను మరచిపోవడం సమంజసం కాదు. అది నీ తల్లిదండ్రులు, నీ కుటుంబికులకు వ్యాపించి ఉండాలి. కొందరు ప్రజల పట్ల ఉల్లాసంగా, విశాల హృదయం మరియు సద్వర్తనతో ఉంటారు, అదే వారి భార్య పిల్లలతో వాటికి భిన్నంగా ఉంటారు.

తహజ్జుద్‌ కు సరిసమానమైన సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1yihDY9sySKSVkKwefBXfS

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN

మరణానంతర జీవితం – యూట్యూబ్ – ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కార్యాలు – రాత్రి సూర బఖరలోని చివరి రెండు ఆయతుల పఠనం [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 26 C నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కార్యాలు – రాత్రి సూర బఖరలోని చివరి రెండు ఆయతుల పఠనం
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

(5) రాత్రి సూర బఖరలోని చివరి రెండు ఆయతుల పఠనం

2:285  آمَنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ

ఆమనర్రసూలు బిమా ఉన్‌జిల ఇలైహి మిర్రబ్బీహీ్‌ వల్‌ మువ్ మి నూన్‌ కుల్లున్‌ ఆమన బిల్లాహి వమలాయికతిహీ వకుతుబిహీ వరుసులిహ్‌ లా నుఫర్రిఖు బైన అహది మ్మిర్రుసులిహ్‌ వఖాలూ సమిఅ్ నా వఅతఅ్ నా గుఫ్‌రానక రబ్బనా వ ఇలైకల్‌ మసీర్‌

తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. “మేము ఆయన (పంపిన) ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్నీ పాటించము” (అని వారు చెబుతారు). “మేము విన్నాము. విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే” అని అంటారు.

2:286  لَا يُكَلِّفُ اللَّهُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۚ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا اكْتَسَبَتْ ۗ رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِن نَّسِينَا أَوْ أَخْطَأْنَا ۚ رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِن قَبْلِنَا ۚ رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهِ ۖ وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا ۚ أَنتَ مَوْلَانَا فَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ

లాయుకల్లిఫుల్లాహు నఫ్‌ సన్‌ ఇల్లా వుస్‌ అహా లహా మా కసబత్‌ వ అలైహా మక్‌తసబత్‌ రబ్బనా లాతు ఆఖిజ్‌నా ఇన్నసీనా అవ్‌ అఖ్‌తానా రబ్బనా వలా తహ్‌మిల్‌ అలైనా ఇస్‌రన్‌ కమా హమల్‌ తహూ అలల్లజీన మిన్‌ ఖబ్‌లినా రబ్బనా వలా తుహమ్మిల్‌నా మాలా తాఖతలనా బిహ్‌ వఅ్ ఫు అన్నా వగ్‌ఫిర్‌ లనా వర్‌హమ్‌నా అంత మౌలానా ఫన్‌సుర్‌నా అలల్ ఖౌమిల్‌ కాఫిరీన్‌

అల్లాహ్‌ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవి చూస్తుంది. (ఇలా ప్రార్థిస్తూ ఉండండి): “ఓ మా ప్రభూ! మేము మరచిపోయినా, లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభూ! మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభూ! మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయజూపు. నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు.”

ప్రవక్త ﷺ ఇలా తెలిపారని అబూ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ قَرَأَ بِالْآيَتَيْنِ مِنْ آخِرِ سُورَةِ البَقَرَةِ فِي لَيْلَةٍ كَفَتَاهُ
“ఎవరు రాత్రి వేళ సూర బఖరలోని చివరి రెండు ఆయతులు పఠిస్తారో అతనికి అవే చాలు”.
(బుఖారి 5010 పదాలు, ముస్లిం 807).

ఇమాం నవవీ (రహిమహుల్లాహ్) చెప్పారుః అవి సరిపోతాయి అంటే తహజ్జుద్ కు బదులుగా సరిపోతాయి అని భావం. షైతాన్ నుండి, ఆపదల నుండి రక్షణకై అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా కావచ్చు. (సహీ ముస్లిం షర్హ్ నవవీ 6/ 340, హ.న. 807)

ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) పై అభిప్రాయాలకు/ భావాలకు మద్దతు ఇస్తూ ఇలా చెప్పారుః దీనిపై నేను ఇలా అంటానుః పైన పేర్కొనబడిన భావాలన్నియు సరియైనవి కావచ్చు. – అల్లాహ్ యే అందరికంటే ఎక్కువ తెలిసినవాడు- కాని మొదటి భావం గురించి మరో స్పష్టమైన ఉల్లేఖనం ఉంది, అది ఆసిం ద్వారా, అల్ ఖమాతో, ఆయన అబూ మస్ఊద్ తో, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినట్లు తెలిపారు.

مَن قَرَأخَاتِمة الْبَقَرَةِ أَجْزَأَتْ عَنْهُ قِيَامَ لَيْلَةٍ
“ఎవరు సూర బఖరలోని చివరి ఆయతులు పఠిస్తారో అవి అతని వైపు నుండి తహజ్జుద్ కు బదులుగా సరిపోతాయి”.
(ఫత్హుల్ బారీ బిషర్హి సహీహిల్ బుఖారిః ఇబ్ను హజ్ర్ అస్ఖలానీ 8/ 673, హ.న. 5010).

ఈ రెండు ఆయతుల పారాయణం చాలా సులువైన విషయం, అనేక మంది వాటిని కంఠస్తం చేసి ఉంటారు అల్ హందులిల్లాహ్. ముస్లిం వ్యక్తి ప్రతి రాత్రి వాటిని క్రమం తప్పకుండా చదివే ప్రయత్నం చేయాలి. ఇవి సులువుగా ఉన్నాయని కేవలం వీటినే పట్టుకొని, తహజ్జుద్ కు ఉన్నటువంటి పుణ్యం గల ఇతర సత్కార్యాలను వదలకూడదు. ఎందుకనగా విశ్వాసి సాధ్యమైనంత వరకు ఎక్కువ పుణ్యాలు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఏ సత్కార్యం అంగీకరించబడుతుందనేది కూడా అతనికి తెలియదు.

అబ్దుల్లాహ్ బిన్ ఉమైర్ (రహిమహుల్లాహ్) చెప్పారుః అల్లాహ్ విధేయతకు సంబంధించిన విషయాల్లో, ఏదో అతి నీచమైన పని చేస్తున్నట్లుగా అతి సులువైన విషయాలతోనే సరిపుచ్చుకోకు. అలా కాకుండా ఎంతో ఆనందంతో, సంపూర్ణ కాంక్షతో కఠోరంగా శ్రమించే ప్రయత్నం చేయి. (హిల్యతుల్ ఔలియా…: అబూ నుఐమ్ 3/ 354).

తహజ్జుద్‌ కు సరిసమానమైన సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1yihDY9sySKSVkKwefBXfS

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN

మరణానంతర జీవితం – యూట్యూబ్ – ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కార్యాలు – రాత్రి వేళ 100 ఆయతులు పారాయణం [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 26 B నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కార్యాలు – రాత్రి వేళ 100 ఆయతులు పారాయణం
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

(4) రాత్రి వేళ వంద ఆయతులు పారాయణం

ప్రవక్త ﷺ ప్రవచించారని తమీమ్ అద్దారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ قَرَأَ بِمِائَةِ آيَةٍ فِي لَيْلَةٍ، كُتِبَ لَهُ قُنُوتُ لَيْلَةٍ

“ఎవరు ఒక రాత్రిలో వంద ఆయతుల పారాయణం చేస్తారో అతనికి రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం లిఖించబడుతుంది”.

(అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 8/11, దార్మీ 3450, అల్బానీ సహీహుల్ జామి 6468 లో సహీ అన్నారు).

వంద ఆయతుల పారాయణం చాలా సులువు, నీ సమయంలో నుండి కేవలం పది నిమిషాల పాటు మాత్రమే గడుస్తుంది. నీ వద్ద సమయం మరీ తక్కువగా ఉంటే, ఈ ఘనతను పొందాలనుకుంటే సూర సాఫ్ఫాత్ (సూర నం. 37), లేదా సూర ఖలమ్ (68) మరియు సూర హాఖ్ఖా (69) పారాయణం చేయవచ్చు.

ఒకవేళ ఈ వంద ఆయతుల పారాయణం రాత్రి వేళ తప్పిపోతే ఫజ్ర్ మరియు జొహ్ర్ నమాజుల మధ్య పారాయణం చేయు, ఇందులో బద్ధకం వహించకు, ఇన్ షా అల్లాహ్ నీవు దాని పుణ్యం పొందగలవు. ఎలా అనగా ప్రవక్త ﷺ ఇలా శుభవార్త ఇచ్చారని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ نَامَ عَنْ حِزْبِهِ، أَوْ عَنْ شَيْءٍ مِنْهُ، فَقَرَأَهُ فِيمَا بَيْنَ صَلَاةِ الْفَجْرِ، وَصَلَاةِ الظُّهْرِ، كُتِبَ لَهُ كَأَنَّمَا قَرَأَهُ مِنَ اللَّيْلِ

“ఎవరైనా తాను రోజువారీగా పారాయణం చేసే ఖుర్ఆనులోని కొంత ప్రత్యేక భాగం, లేదా ఏదైనా వేరే ఆరాధన చేయలేక నిద్రపోతే, మళ్ళీ దానిని ఫజ్ర్ మరియు జొహ్ర్ నమాజుల మధ్య పూర్తి చేసుకుంటే అతనికి రాత్రివేళ చేసినంత పుణ్యం లిఖించబడుతుంది”. (ముస్లిం 747).

ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) గారి ఈ ఉల్లేఖనం యొక్క వ్యాఖ్యానంలో ముబారక్ పూరి (రహిమహుల్లాహ్) ఇలా చెప్పారుః

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే రాత్రిపూట (నమాజ్, ఖుర్ఆన్ పారాయణం లాంటి) ఏదైనా సత్కార్యం చేయుట, మరియు నిద్ర వల్ల లేదా మరే కారణంగా తప్పిపోతే ‘ఖజా’ చేయుట ధర్మసమ్మతమైనది. ఫజ్ర్ మరియు జొహ్ర్ నమాజుల మధ్య దానిని చేసినవాడు రాత్రి చేసినవానితో సమానం.

ముస్లిం (746), తిర్మిజి (445) మొదలైనవాటిలో హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ద్వారా రుజువైన విషయం ఏమిటంటేః నిద్ర లేదా ఏదైనా అవస్త కారణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తహజ్జుద్ నమాజ్ చేయలేకపోతే పగటి పూట పన్నెండు రకాతులు చేసేవారు.

(తొహ్ఫతుల్ అహ్వజీ షర్హ్ జామి తిర్మిజిః ముబారక్ పూరీ 3/ 185, హ.న. 851).

బహుశా ఈ హదీసు ప్రతి రోజు ఖుర్ఆనులో ఓ ప్రత్యేక భాగ పారాయణం ఉండాలని, ప్రత్యేకంగా రాత్రి వేళ అని నిన్ను ప్రోత్సహిస్తుంది. ఏమీ! మనము అశ్రద్ధవహుల్లో లిఖించబడకుండా ఉండుటకు రాత్రి కనీసం పది ఆయతులైనా పారాయణం చేయాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రోత్సహించిన విషయం మీకు తెలియదా?

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః

مَنْ قَامَ بِعَشْرِ آيَاتٍ لَمْ يُكْتَبْ مِنَ الغَافِلِينَ، وَمَنْ قَامَ بِمِائَةِ آيَةٍ كُتِبَ مِنَ القَانِتِينَ، وَمَنْ قَامَ بِأَلْفِ آيَةٍ كُتِبَ مِنَ المُقَنْطِرِينَ

“పది ఆయతులతో తహజ్జుద్ చేయువారు అలక్ష్యపరుల్లో వ్రాయబడరు. మరెవరయితే వంద ఆయతులతో తహజ్జుద్ చేస్తాడో వినయ విధేయుల్లో వ్రాయబడుతాడు. ఇంకా ఎవరయితే వెయ్యి ఆయతులతో తహజ్జుద్ చేస్తారో ‘ముఖంతిరీన్’లో వ్రాయబడుతాడు”. (ముఖంతిరీన్ అన్న పదం ఖింతార్ నుండి వచ్చింది. ఖింతార్ భావం పై హదీసులో చూడండి).

(అబూదావూద్ 1398, ఇబ్ను హిబ్బాన్ 2572, ఇబ్ను ఖుజైమా 1144, అల్బానీ సహీహుత్తర్గీబ్ 639లో హసన్, సహీ అని అన్నారు).

ఇకనైనా మనం ఖుర్ఆన్ పారాయణం చేయడానికి అడుగు ముందుకు వేద్దామా? మన ఖుర్ఆన్ సంపూర్ణం చేయడమనేది కేవలం రమజాను వరకే పరిమితమయి ఉండకూడదు, సంవత్సరమెల్లా ఉండాలి. తహజ్జుద్ పుణ్యం పొందుటకు ప్రతి రోజు వంద ఆయతుల పారాయణ కాంక్ష అనేది అల్లాహ్ గ్రంథాన్ని బలంగా పట్టుకొని ఉండడానికి శుభప్రదమైన అవకాశం కావచ్చు.

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN

మరణానంతర జీవితం – యూట్యూబ్ – ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కారాలు – తరావీహ్ నమాజు ఇమాంతో సంపూర్ణంగా చేయుట [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 26 A నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కారాలు – తరావీహ్ నమాజు ఇమాంతో సంపూర్ణంగా చేయుట
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

తరావీహ్ నమాజు ఇమాంతో సంపూర్ణంగా చేయుట

అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రమజానులో ఉపవాసమున్నాము. ఆయన ﷺ ఈ మాసంలో సామూహికంగా తరావీహ్ చేయించలేదు. అయితే (ఈ నెల సమాప్తానికి) ఏడు రోజులు మిగిలి ఉండగా, రాత్రి మూడవ వంతు వరకు మాకు తరావీహ్ చేయించారు, మళ్ళీ (నెల చివరి నుండి) ఆరవ రోజు తరావీహ్ చేయించలేదు, ఐదవ రోజు చేయించారు, అందులో అర్థ రాత్రి గడసిపోయింది. అప్పుడు సహచరులు ‘ప్రవక్తా! మిగిలిన రాత్రంతా మాకు ఈ నఫిల్ చేయిస్తే బావుండును’ అని విన్నవించుకున్నారు. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారుః

إِنَّ الرَّجُلَ إِذَا صَلَّى مَعَ الْإِمَامِ حَتَّى يَنْصَرِفَ حُسِبَ لَهُ قِيَامُ لَيْلَةٍ

“ఎవరైనా ఇమాం నమాజు సమాప్తం చేసే వరకు అతనితో నమాజు చేస్తాడో అతనికి పూర్తి ఒక రాత్రి తహజ్జుద్ చేసినంత పుణ్యం లిఖించబడుతుంది”.

(అబూ దావూద్ 1375, తిర్మిజి 806, నిసాయి 1364, ఇబ్ను మాజ 1327, అల్బానీ సహీహుల్ జామి1615లో సహీ అన్నారు).

మస్జిదులలో చాలా మంది ఇమాములు రమజాను మాసములో ఈ విషయం బోధిస్తూ ఉంటారు, ఇమాంతో తరావీహ్ నమాజు సంపూర్ణంగా చేయాలని ప్రోత్సహిస్తున్నది నీవు చూడగలవు. కాని కొందరు బద్ధకం వహించేవారు, అలక్ష్యపరులు,  ఇతర మాసాలకు మరియు రమజానుకు మధ్య వ్యత్యాసం చూపే ఈ గొప్ప చిహ్నాన్ని వదులుకుంటున్నారు. దాని గురించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్త ఇచ్చారుః

مَنْ قَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ

“ఎవరు సంపూర్ణ విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతో రమజానులో నిలబడతారో (తరావీహ్ చేస్తారో), అతని పూర్వ పాపాలు మన్నించబడతాయి”. (బుఖారీ 37, ముస్లిం 759).

అలాగే లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రాత్రి), అందులో సరియైన విధంగా అల్లాహ్ ఆరాధన చేయడం వెయ్యి నెలల ఆరాధన కంటే ఉత్తమం.

 అల్లాహ్ ఇలా తెలిపాడు :                                               

 لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِنْ أَلْفِ شَهْرٍ

“ఘనమైన రేయి వెయ్యి నెలల కంటే శ్రేష్ఠమైనది”. (ఖద్ర్ 97: 3).

ఇంతటి ఘనమైన రాత్రిని గుర్తించక అశ్రద్ధగా గడిపేవారి విషయం చాలా విచారకరమైనది.

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN

మరణానంతర జీవితం – యూట్యూబ్ – ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కారాలు – అధికంగా సుబ్ హానల్లాహి వబిహందిహీ పఠించడం [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 25 నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కారాలు – అధికంగా సుబ్ హానల్లాహి వబిహందిహీ పఠించడం
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN

6వ కార్యం: తహజ్జుద్ కు గల పుణ్యానికి సరిసమానమైన ఇతర సత్కార్యాలు

తహజ్జుద్ నమాజు యొక్క విలువ అల్లాహ్ వద్ద చాలా గొప్పగా ఉంది. ఫర్జ్ నమాజుల తర్వాత ఎక్కువ శ్రేష్ఠతగల నమాజు తహజ్జుదే. దాని ప్రత్యేకతల్లో: అది కేవలం పాపాలను హరించి వేయడమే గాకుండా; దానిని పాటించేవారిని పాపంలో పడకుండా కాపాడుతుంది. ప్రవక్త ﷺ ఇలా తెలిపారని అబూ ఉమామా బాహిలీ t ఉల్లేఖించారుః

عَلَيْكُمْ بِقِيَامِ اللَّيْلِ فَإِنَّهُ دَأَبُ الصَّالِحِينَ قَبْلَكُمْ، وَهُوَ قُرْبَةٌ إِلَى رَبِّكُمْ، وَمَكْفَرَةٌ لِلسَّيِّئَاتِ، وَمَنْهَاةٌ لِلإِثْمِ

“మీరు తహజ్జుద్ నమాజు చేయండి, అది మీకంటే ముందు పుణ్యాత్ముల సద్గుణం, మీ ప్రభువు సాన్నిధ్యానికి చేర్చునది, పాపాలకు పరిహారం మరియు అపరాధాల నుండి వారిస్తుంది”.

(తిర్మిజి 3549, ఇబ్ను ఖుజైమా 1135, సహీహుత్తర్గీబ్ 624లో హసన్ లిగైరిహి అని ఉంది).

పూర్వ పుణ్యపురుషులు రహిమహుముల్లాహ్ యే కాదు, గత సమీప కాలాల్లో మన తాతముత్తాతలు తహజ్జుద్ నమాజులో ఏ కొరతా చూపేవారుకాదు. కాని ఈ కాలంలో అనేక మంది రాత్రులు పగల్లో, నిద్రలు జాగారాల్లో మారిపోయి, రాత్రి వేళల్లో అల్లాహ్ ను వేడుకునే మాధుర్యాన్ని కోల్పోయారు. మరికొందరు ఎంతటి అలసత్వానికి గురి అయ్యారంటే ఫజ్ర్ నమాజు సైతం వదిలేస్తున్నారు.

తన దాసులపై ఉన్న అల్లాహ్ యొక్క గొప్ప కరుణ ఏమిటంటే; ఆయన వారికి చిన్నపాటి కొన్ని కార్యాలు ప్రసాదించాడు, వాటి పుణ్యఫలితం తహజ్జుద్ కు సమానంగా ఉంది. ఎవరికైనా తహజ్జుద్ తప్పిపోతే లేదా ఎవరైనా తహజ్జుద్ చేయలేక పోతే కనీసం ఇలాంటి సత్కార్యాలు తప్పిపోకూడదు, వాటి ద్వారా తన త్రాసు బరువును పెంచుకోవచ్చును. ఇది తహజ్జుద్ చేయలేకపోయినా పరవా లేదు అన్న మాట కాదు, మన పూర్వ పుణ్యపురుషులు ఎన్నడూ అలా భావించలేదు, వారైతే ప్రతి పుణ్య కార్యంలో ముందంజవేసి, చురుకుగా పాల్గొనేవారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులకు కొన్ని సులువైన ఆచరణల గురించి తెలిపారు, ప్రత్యేకంగా ఎవరైతే తమకు తాము కొంత శ్రమ పడి తహజ్జుద్ చేయలేకపోతారో అలాంటి వారి గురించి, ఇలా మనల్ని కూడా సత్కార్యాలు చేసుకొని మన పుణ్యాలను పెంచుకోవాలని ప్రోత్సహించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని అబూ ఉమామా బాహిలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

مَنْ هَالَهُ اللَّيْلُ أَنْ يُكَابِدَهُ، وَبَخِلَ بِالْمَالِ أَنْ يُنْفِقَهُ، وَجَبُنَ عَنِ الْعَدُوِّ أَنْ يُقَاتِلَهُ،

فَلْيُكْثِرْ أَنْ يَقُولَ: سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ، فَإِنَّهَا أَحَبُّ إِلَى اللهِ مِنْ جَبَلِ ذَهَبٍ وَفِضَّةٍ يُنْفَقَانِ فِي سَبِيلِ اللهِ عَزَّ وَجَلَّ

“ఎవరు రాత్రి వేళ మేల్కొని (తహజ్జుద్ కై) శ్రమ పడుటకు భయపడ్డాడో, ధనాన్ని (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేయుట నుండి పిసినారితనం వహించాడో మరియు శతృవుతో పోరాడడానికి పిరికితనం వహించాడో అతను అధికంగా సుబ్ హానల్లాహి వబిహందిహీ అనాలి. ఈ పదాలు అల్లాహ్ కు ఆయన మార్గంలో ఖర్చుపెట్టబడ్డ వెండి, బంగారాల కంటే ఎక్కువగా ఇష్టమైనవి, ప్రియమైనవి”. (తబ్రానీ కబీర్ 7795, అల్బానీ సహీహుత్తర్గీబ్ 1541లో సహీ లిగైరిహీ అని అన్నారు).

ఇతర లింకులు:

[త్రాసును బరువు చేసే సత్కార్యాలు] కనీసం పది ఆయతులైన సరే పఠిస్తూ తహజ్జుద్‌ నమాజు చేయటం [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 24 నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

[3:34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN

5వ కార్యం: కనీసం పది ఆయతులైన సరే పఠిస్తూ తహజ్జుద్ నమాజు చేయటం

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని, ఫుజాలా బిన్ ఉబైద్ మరియు తమీమ్ అద్దారీ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః

مَنْ قَرَأَ عَشْرَ آيَاتٍ فِي لَيْلَةٍ، كُتِبَ لَهُ قِنْطَارٌ، وَالْقِنْطَارُ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا فِيهَا

“ఎవరు ఒక రాత్రిలో పది ఆయతులు పఠిస్తాడో అతని (కర్మల పత్రంలో) ‘ఖింతార్’ వ్రాయబడుతుంది, ‘ఖింతార్’ అన్నది ఈ ప్రపంచం మరియు అందులో ఉన్న సమస్తానికంటే మేలైనది”. (తబ్రానీ కబీర్ 1253, సహీహుత్తర్గీబ్ లో అల్బానీ హసన్ అని అన్నారు).

పైన పేర్కొనబడిన పది ఆయతుల ప్రస్తావన, ఆ ఆయతులు తహజ్జుద్ నమాజులో పఠించాలి. –వాస్తవ జ్ఞానం అల్లాహ్ కే ఉంది- కాని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః

مَنْ قَامَ بِعَشْرِ آيَاتٍ لَمْ يُكْتَبْ مِنَ الغَافِلِينَ، وَمَنْ قَامَ بِمِائَةِ آيَةٍ كُتِبَ مِنَ القَانِتِينَ، وَمَنْ قَامَ بِأَلْفِ آيَةٍ كُتِبَ مِنَ المُقَنْطِرِينَ

“పది ఆయతులతో తహజ్జుద్ చేయువారు అలక్ష్యపరుల్లో వ్రాయబడరు. మరెవరయితే వంద ఆయతులతో తహజ్జుద్ చేస్తాడో వినయ విధేయుల్లో వ్రాయబడుతారు. ఇంకా ఎవరయితే వెయ్యి ఆయతులతో తహజ్జుద్ చేస్తారో ‘ముఖంతిరీన్’లో వ్రాయబడుతాడు”. (ముఖంతిరీన్ అన్న పదం ఖింతార్ తో వచ్చింది. ఖింతార్ భావం పై హదీసులో చూడండి). (అబూదావూద్ 1398, ఇబ్ను హిబ్బాన్ 2572, ఇబ్ను ఖుజైమా 1144, దార్మి 3444, హాకిం 2041, అల్బానీ సహీహుత్తర్గీబ్ 639లో హసన్, సహీ అని అన్నారు).

ఇషా తర్వాత చేయబడే ప్రతి నఫిల్ నమాజ్ తహజ్జుద్ లో లెక్కించబడుతుంది. ఈ నమాజు నీవు రాత్రి  వేళ ఎంత ఆలస్యం చేస్తే అంతే ఎక్కువ పుణ్యం. ఈ గొప్ప ఘనత, చిన్నపాటి సత్కార్యాన్ని నీవు కోల్పోకు. కనీసం ఇషా తర్వాత రెండు రకాతుల సున్నత్ మరియు విత్ర్ నమాజు అయినా సరే.

ఇతర లింకులు:

త్రాసును బరువు చేసే సత్కార్యాలు – జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 24 నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

https://youtu.be/sD68LSbHaFo&rel=0

[6:43 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN

4వ కార్యం: జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం

గొప్ప పుణ్య కార్యాల్లో ఒకటి; జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం, దానిపై లభించే పుణ్యం బరువు మానవుని త్రాసులో ఉహద్ పర్వతం కంటే అధికిమించి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉబై బిన్ కఅబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

مَنْ تَبِعَ جَنَازَةً حَتَّى يُصَلَّى عَلَيْهَا، وَيُفْرَغَ مِنْهَا، فَلَهُ قِيرَاطَانِ، وَمَنْ تَبِعَهَا حَتَّى يُصَلَّى عَلَيْهَا، فَلَهُ قِيرَاطٌ، وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَهُوَ أَثْقَلُ فِي مِيزَانِهِ مِنْ أُحُدٍ

“ఎవరు నమాజు మరియు (ఖననం) అయ్యే వరకు జానాజ వెంట ఉంటాడో అతనికి రెండు ఖీరాతులు, మరెవరయితే కేవలం నమాజు అయ్యే వరకు దాని వెంట ఉంటాడో అతనికి ఒక ఖీరాతు లభిస్తుంది. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన (అంటే అల్లాహ్) సాక్షి! ఒక్క ఖీరాత్ బరువు అల్లాహ్ వద్ద ఉన్న త్రాసులో ఉహద్ పర్వతంకంటే ఎక్కువ ఉండును”. (అహ్మద్ 5/ 131 ఇది సహీ హదీస్).

ప్రవక్త ﷺ తెలిపారని, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ شَهِدَ الجَنَازَةَ حَتَّى يُصَلِّيَ، فَلَهُ قِيرَاطٌ، وَمَنْ شَهِدَ حَتَّى تُدْفَنَ كَانَ لَهُ قِيرَاطَانِ، قِيلَ: وَمَا القِيرَاطَانِ؟ قَالَ: مِثْلُ الجَبَلَيْنِ العَظِيمَيْنِ

“ఎవరు జనాజలో పాల్గొని నమాజు చేస్తాడో అతనికి ఒక ఖీరాత్, మరెవరయితే (నమాజు మరియు) ఖననం అయ్యే వరకు పాల్గొంటాడో అతనికి రెండు ఖీరాతులు లభించును”. రెండు ఖీరాతులంటే ఏమిటి? అని ప్రశ్న వచ్చినప్పుడు, ప్రవక్త చెప్పారుః “రెండు పెద్ద కొండల వంటివి”.

(బుఖారి 1325, ముస్లిం 945, తిర్మిజి 1040, నిసాయి 1940, ఇబ్ను మాజ 1539, అహ్మద్ 2/ 401, ఇబ్ను హిబ్బాన్ 3080)

ముస్లింలో ఉంది: ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు జనాజ నమాజు చేసుకొని వెళ్ళేవారు, ఎప్పుడయితే వారికి అబూహురైరా రజియల్లాహు అన్హు గారి ఈ హదీసు చేరిందో ‘వాస్తవానికి మనం అనేక ఖీరాతులు పోగుట్టుకున్నాము’ అని బాధ పడ్డారు.

ఇతర లింకులు: