నమాజ్ పాఠాలు: 2 వ పాఠం: నమాజు విధానం [వీడియో]

బిస్మిల్లాహ్

دروس الصلاة -2- صفة الصلاة
నమాజ్ పాఠాలు: 2 వ పాఠం: నమాజు విధానం

వ్యవధి: 15 నిముషాలు

11:21 నిమిషాలు నమాజు విధానం తెలుపడం జరిగింది. తర్వాత 3:36 నిమిషాలు నమాజు చేసి చూపించడం జరిగింది. శ్రద్ధగా విని, చూసి నమాజు విధానం నేర్చుకోండి ఎక్కడ ఏ దుఆ చదవాలో కూడా నేర్చుకోండి

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


 

నమాజ్ చేస్తున్నప్పుడు నియ్యత్ తప్పనిసరి, అలాగే ప్రతి ఆరాధనలో కూడా. అయితే నియ్యత్ మనుస్సులో చేయాలి. నోటితో కాదు.

1- పూర్తి శరీరము మరియు పూర్తి శ్రద్ధాభక్తులతో ఖిబ్లా దిశలో నిలబడాలి. చూపులు, శరీరము అటూ ఇటూ ఉండకూడదు. (చూపులు సజ్దా చేసే చోట కేంద్రికరించాలి).

2- ‘తక్బీరె తహ్రీమ’ అల్లాహు అక్బర్ అంటూ రెండు చేతులు భుజాల వరకు లేదా చెవుల వరకు ఎత్తాలి.

3- కుడి అర చెయ్యిని ఎడమ అర చెయ్యిపై పెట్టి ఛాతిపై కట్టుకోవాలి.

4- దుఆయె ఇస్తిఫ్ తాహ్ చదవాలి:

అల్ హందులిల్లాహి హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్. (ముస్లిం 600).

(الْحَمْدُ لله حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ).

(శుభాలు గల, అనేకానేక మంచి స్తోత్రములన్నీ అల్లాహ్ కే చెందును).

సుబ్ హానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబారకస్ముక వతఆల జద్దుక వలాఇలాహ గైరుక.

سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ وَتَبَارَكَ اسْمُكَ وَتَعَالَى جَدُّكَ وَلَا إِلَهَ غَيْرُكَ

(ఓ అల్లాహ్ నీవు పరమ పవిత్రునివి, నీకే సర్వ స్తోత్రములు, నీ నామము శుభం గలది. నీ మహిమ చాలా ఘనమయినది. నీవు తప్ప సత్య ఆరాధ్యుడెవడూ లేడు.)

ఇవి రెండే గాకుండా ఇతర దుఆలు కూడా చదవవచ్చును. ఎల్లప్పుడూ ఒకే దుఆ కాకుండా వేరు వేరు సమయాల్లో వేరు వేరు దుఆలు చదవడం ఉత్తమం. ఇలా నమాజులో నమ్రత, శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది.

5- అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్ చదవాలి.

6- బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ చదివి, సూరె ఫాతిహ చదవాలిః

అల్ హమ్ దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మానిర్రహీమ్, మాలికి యౌమిద్దీన్, ఇయ్యాక నఅబుదు వఇయ్యాక నస్త ఈన్, ఇహ్ దినస్ సిరాతల్ ముస్తఖీమ్, సిరాతల్లజీన అన్అమ్ త అలైహిమ్, గైరిల్ మగ్ జూబి అలైహిమ్ వలజ్జాల్లీన్. (ఆమీన్).

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ* الْحَمْدُ للهِ رَبِّ العَالَمِينَ* الرَّحْمَنِ الرَّحِيمِ* مَالِكِ يَوْمِ الدِّينِ* إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ* اهْدِنَا الصِّرَاطَ المُسْتَقِيمَ*صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ المَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ

(అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో * ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు, * అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు. * ప్రతిఫల దినానికి (అంటే ప్రళయ దినానికి) యజమాని. * మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము. * మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు. * నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం).

7- కంఠస్తం చేసి ఉన్న ఖుర్ఆనులోని ఏదైనా సూరా లేదా కొన్ని ఆయతులు పఠించాలి.

8- చేతులు భుజాల వరకు ఎత్తి, అల్లాహు అక్బర్ అంటూ రుకూ చేయాలి. రుకూలో అరచేతులతో మోకాళ్ళను పట్టుకోవాలి. వ్రేళ్ళు దగ్గరదగ్గరగా కాకుండా విడిగా ఉండాలి. సుబ్ హాన రబ్బియల్ అజీం మూడు సార్లు చదువుట సున్నత్. అంతకంటే ఎక్కువ చదవవచ్చు. ఒక్కసారి చదివినా సరిపోవును.

9- ఒంటరి నమాజు చేయు వ్యక్తి మరియు ఇమాం రుకూ నుండి తల లేపుతూ సమిఅల్లాహు లిమన్ హమిద అంటూ భుజాల వరకు చేతులెత్తాలి. నిలబడిన తర్వాత ముఖ్తదీ, ఒంటరి వ్యక్తి  సమిఅల్లాహు లిమన్ హమిదహ్ కు బదులుగా రబ్బనా వలకల్ హమ్ ద్ అనాలి.

10- రుకూ తర్వాత నిలబడి ఉన్నప్పుడు ఈ దుఆ కూడా చదవవచ్చును:

అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ దు మిల్ఉస్ సమావాతి వ మిల్ఉల్ అర్జి వ మిల్ఉ మాషిఅత మిన్ షైఇమ్ బఅదు.

اللَّهُمَّ رَبَّنَا لَكَ الْـحَمْدُ مِلْءُ السَّمَاوَاتِ وَمِلْءُ الْأَرْضِ وَمِلْءُ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ

(ఓ అల్లాహ్, మా ప్రభువా! నీకే ఆకాశముల నిండుగాను, భూమి నిండుగాను, అవి గాకా నీవు కోరిన వస్తువుల నిండుగాను స్తుతి గలదు. (ముస్లిం 476).)

11- అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలో వెళ్ళాలి. ఏడు అంగములపై సజ్దా చేయాలిః (1) నొసటి, ముక్కు. (2,3) రెండు అరచేతులు. (4,5) రెండు మోకాళ్ళు. (6,7) రెండు పాదముల వ్రేళ్ళు. చేతులను పక్కల నుండి దూరముంచాలి. కాళ్ళ వ్రేళ్ళను ఖిబ్లా దిశలో ఉంచి, సజ్దాలో సుబ్ హాన రబ్బియల్ అఅలా మూడు సార్లు పలుకుట సున్నత్. ఎక్కువ పలుకుట మంచిదే. ఒక్క సారి చదివినా సరిపోతుంది. ఈ స్థితిలో ఎక్కువ దుఆ చేయాలి. ఎందుకనగా ఇది దుఆ అంగీకార స్థితుల్లో ఒకటి.

12- అల్లాహు అక్బర్ అంటూ సజ్దా నుండి తలెత్తి ఎడమ పాదముపై కూర్చోవాలి. కుడి కాలు పాదమును నిలబెట్టాలి. కుడి చెయ్యి కుడి మోకాలుకు దగ్గరగా తోడపై, ఎడమ చెయ్యి ఎడమ మోకాలుకు దగ్గరగా తోడపై పెట్టాలి. చేతి వ్రేళ్ళను విడిగా పరచి ఉంచాలి. రబ్బిగ్ ఫిర్లీ రబ్బిగ్ ఫిర్లీ అని చదవాలి.

13- రెండవ సజ్దా మొదటి సజ్దా మాదిరిగా చేసి, సజ్దాలో అదే దుఆ చదవాలి.

14- అల్లాహు అక్బర్ అంటూ రెండవ సజ్దా నుండి లేస్తూ నిటారుగా నిలబడాలి.

15- రెండవ రకాత్ మొదటి రకాత్ మాదిరిగా చేయాలి. అందులో చదివిన దుఆలే ఇందులో చదవాలి. దుఆయె ఇస్తిఫ్ తాహ్ మరియు అఊజు బిల్లాహి…. తప్ప. ఈ రెండవ రకాత్ లోని రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ లేచి రెండు సజ్దాల మధ్యలో కూర్చున్న విధంగా కూర్చోని, కుడి చెయి వ్రేళ్ళను ముడుచుకొని నడిమి వ్రేళిని బొటన వ్రేళి మధ్యలో పెట్టి, చూపుడు వ్రేళితో సైగా చేస్తూ, కదలిస్తూ తషహ్హుద్ చదవాలి:

అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహూ అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లా హిస్సాలిహీన్ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహు. (బుఖారి 831).

التَّحِيَّاتُ لله وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ الله وَبَرَكَاتُهُ السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ الله الصَّالِحِينَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

(నా వాక్కు, దేహా, ధన సంబంధమైన ఆరాధనలన్నియూ అల్లాహ్ కొరకే ఉన్నవి. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆయన శుభాలు కురువుగాకా. అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవరడూ లేడని సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు, ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను).

ఇక్కడి వరకు చదివిన తరువాత, చేతులు భుజాల వరకు ఎత్తుతూ అల్లాహు అక్బర్ అంటూ నిలబడాలి, ఒక వేళ మగ్రిబ్ లాంటి మూడు రకాతుల నమాజు లేదా జొహ్ర్, అస్ర్ మరియు ఇషా లాంటి నాలుగు రకాతుల నమాజు చేస్తుంటే, రెండవ రకాతు మాదిరిగా మిగిత నమాజు పూర్తి చేయాలి. అయితే ఖియామ్ (నిలబడి ఉన్న స్థితి)లో కేవలం సూరె ఫాతిహ చదువుతే సరిపోతుంది.

చివరి రకాతు రెండవ సజ్దా నుండి లేచి కూర్చోని తషహ్హుద్, దరూద్ ఇబ్రాహీమ్ మరియు ప్రవక్త నేర్పిన తనికిష్టమైన దుఆలు అధికంగా చదవడం మంచిది. (ఇది కూడా దుఆ అంగీకార సందర్భాల్లో ఒకటి). క్రింద దరూద్ మరియు ఒక దుఆ ఇవ్వబడుతుంది.

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్రి వమిన్ అజాబిన్నారి వమిన్ ఫిత్నతిల్ మహ్ యా వల్ మమాతి వమిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాల్.

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ ، اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَمِنْ عَذَابِ النَّارِ وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ وَمِنْ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَّالِ.

(ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీంను, వారి కుటుంబీకులను కరుణించినట్లు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి, ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి, ఘనుడివి. ఓ అల్లాహ్ నేను సమాధి శిక్షల నుండి, నరక యాతన నుండి, జీవన్మరణ పరీక్షల నుండి మరియు దజ్జాల్ మాయ నుండి రక్షణకై నీ శరణు కోరుతున్నాను).

16- అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటూ కుడి వైపున మెడ త్రిప్పాలి. అలాగే అంటూ ఎడమ వైపున మెడ త్రిప్పాలి.

17- జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా నమాజుల్లోని చివరి తషహ్హుద్ లో కూర్చుండే పద్ధతి ఇలా ఉండాలి. కుడి పాదాన్ని నిలబెట్టి ఎడమ పాదాన్ని కుడి కాలి పిక్క క్రింది నుంచి బైటికి తీయాలి. ఎడమ పిరుదును భూమిపై ఆనించాలి. కుడి చెయ్యి కుడి తోడపై, ఎడమ చెయ్యి ఎడమ తోడపై మోకాలుకు దగ్గరగా పెట్టాలి.

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు

ఇష్రాఖ్ నమాజ్ & చాష్త్ నమాజ్ ఒకటేనా లేక వేర్వేరా? [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (6:57 నిముషాలు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

నమాజ్ పాఠాలు: 1వ పాఠం: నమాజ్ ఆదేశం, మర్యాదలు [వీడియో]

బిస్మిల్లాహ్

حكم الصلاة وآدابها  – నమాజు ఆదేశం, దాని మర్యాదలు

22:39 నిముషాలు

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


నమాజ్ ఇస్లాం మూల స్థంబాలలో రెండవది. అది ప్రాజ్ఞ వయస్సుకు చేరిన, బుద్ధిమంతుడైన ప్రతీ ముస్లింపై విధిగా ఉంది.

అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది:

[إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى المُؤْمِنِينَ كِتَابًا مَوْقُوتًا] [النساء:103]

వాస్తవానికి నమాజ్ విశ్వాసులు నిర్ణీత సమయాలలో పాటించవలసిన ధర్మం. (సూరె నిసా 4: 103).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారని ఇబ్ను ఉమర్ (రదియల్లాహు అన్హు )ఉల్లేఖించారు:

(بُنِيَ الْإِسْلَامُ عَلَى خَمْسٍ شَهَادَةِ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ الله وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ وَالْحَجِّ وَصَوْمِ رَمَضَانَ).

“ఇస్లాం పునాది ఐదు విషయాలపై ఉంది:

  • 1- అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరొకడు లేడు, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట.
  • 2- నమాజు స్థాపించుట.
  • 3- జకాత్ (విధిదానం) చెల్లించుట.
  • 4- హజ్ చేయుట.
  • 5- రమజాను ఉపవాసాలు పాటించుట”.

(బుఖారి 8, ముస్లిం 16).

ప్రాజ్ఞ వయస్సుకు చేరడం అంటే పదిహేను సంవత్సరాలు నిండడం, లేదా మర్మాంగం చుట్టున వెంట్రుకలు మొలవడం, లేదా స్వప్నస్ఖలనం ద్వారా ఇంకే విధంగానైనా ఇంద్రియం వెలువడడం.

బాలికలకు నెలవారి రక్తస్రావం అంటే బహిష్టు రావడం. మనిషికి వీటిలో ఏ ఒక్కటి జరిగినా అతను ప్రాజ్ఞవయస్సుకు చేరినట్లు.

నమాజు విధిని తిరస్కరించే వాడు కాఫిర్ (సత్య తిరస్కారి) అవుతాడని ఏకాభిప్రాయం (ఇజ్మాఅ) ఉంది. ఇక బద్ధకం, నిర్లక్ష్యంతో మొత్తానికే నమాజు చేయనివాడు కూడా కాఫిర్ అవుతాడని సహాబాలు  ఏకీభవించారు (ప్రవక్త సహచరుల ఇజ్మాఅ ఉంది).

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ప్రకారం, నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా విన్నాను:

 (إِنَّ بَيْنَ الرَّجُلِ وَبَيْنَ الشِّرْكِ وَالْكُفْرِ تَرْكَ الصَّلَاةِ).

“ఒక మనిషి మరియు షిర్క్, కుఫ్ర్ (బహుదైవారాధన, సత్యతిరస్కారం) మధ్య ఉన్న వ్యత్యాసం నమాజును విడనాడడం”. (ముస్లిం 82).

ప్రళయదినాన మానవునితో తొలి లెక్క నమాజు గురించే జరుగును. నమాజుకు సంబంధించిన ఖుర్ఆన్ ఆదేశం చదవండి:

నమాజు పాటించడంలో చాలా గొప్ప ఘనతలున్నాయి, వాటిలో కొన్ని: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని, అబూ హురైర (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

 (مَنْ تَطَهَّرَ فِي بَيْتِهِ ثُمَّ مَشَى إِلَى بَيْتٍ مِنْ بُيُوتِ الله لِيَقْضِيَ فَرِيضَةً مِنْ فَرَائِضِ الله كَانَتْ خَطْوَتَاهُ إِحْدَاهُمَا تَحُطُّ خَطِيئَةً وَالْأُخْرَى تَرْفَعُ دَرَجَةً).

“ఎవరైనా తన ఇంట్లో వుజూ చేసుకొని, అల్లాహ్ యొక్క విధుల్లో ఒక విధి నిర్వహించుటకు అల్లాహ్ గృహాల్లోని ఒక గృహం (మస్జిద్)లో ప్రవేశిస్తే, అతను వేసే అడుగుల్లో ఒక దానికి బదులుగా ఒక పుణ్యం లభిస్తే, మరో దానికి బదులుగా ఒక స్థానం పెరుగుతుంది”. (ముస్లిం 666).

అబూహురైర (రది అల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: మహానీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అడిగారు:

 (أَلاَ أَدُلُّكُمْ عَلَى مَا يَمْحُو اللهُ بِهِ الْخَطَايَا ، وَيَرْفَعُ بِهِ الدَّرجَاتِ) قَالُوا: بَلَى يَا رَسُولُ اللهِ. قَالَ: (إِسبَاغُ الْوُضُوءِ عَلَى الْمَكَارِه ، وَكَثْرَةُ الْخُطَا إِلَى الْمَسَاجِد ، وَانْتِظَارُ الصَّلاَةِ بَعدَ الصَّلاَةِ ، فَذَلِكُمُ الرِّبَاط).

“పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో అలాంటి విషయాలు మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారు:

  • “(1) వాతవరణం, పరిస్థితులూ అనుకూలంగా లేనప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం.
  • (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం.
  • (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం, ఇది రిబాత్ తో సమానం(1).

(ముస్లిం 251).

(1)  రిబాత్ అంటే సత్యాసత్యాల మధ్య పోరాటం సాగే రోజుల్లో రాత్రిళ్ళు పహరా కాయడం. శాంతి కాలంలో నమాజ్ పట్ల మక్కువ, పోరాటపు రోజుల్లో ప్రాణాలొడ్డి పహరాకాయడంతో సమానమని అర్థం.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని అబూ హురైర (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

 (مَنْ غَدَا إلَى الْمَسْجِدِ أَو رَاحَ ، أَعَدَّ اللهُ لَهُ فِي الْجَنَّةِ نُزُلاً،كُلَّمَا غَدَا أو رَاحَ).

“మస్జిద్ కు వస్తూ పోతూ ఉండేవారు (ఎంత అదృష్టవంతులంటే), వారు వస్తూ పోతూ ఉన్న ప్రతీసారి అల్లాహ్ వారి కొరకు స్వర్గంలో విందు ఏర్పాటు చేస్తాడు”. (బుఖారి 662. ముస్లిం 669).


నమాజుకు సంబంధించిన ముఖ్య విషయాలు:

1- సామూహికంగా నమాజు చేయడం పురుషులపై విధిగా ఉంది, ఈ హదీసు ఆధారంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం తెలిపారు:

(لَقَدْ هَمَمْتُ أَنْ آمُرَ بِالصَّلَاةِ فَتُقَامَ ثُمَّ أُخَالِفَ إِلَى مَنَازِلِ قَوْمٍ لَا يَشْهَدُونَ الصَّلَاةَ فَأُحَرِّقَ عَلَيْهِمْ).

“నమాజు చేయించడానికి ఒకరిని ఆదేశించి, సామూహిక నమాజులో పాల్గొనని వారి వైపుకు తిరిగి వారు ఇండ్లల్లో ఉండగా వారి గృహాలను తగలబెడదామని ఎన్నో సార్లు అనుకున్నాను”. (బుఖారి 2420, ముస్లిం 651).

2- ముస్లిం వ్యక్తి శాంతి, నిదానంగా త్వరగా మస్జిదుకు రావాలి.

3- మస్జిదులో ప్రవేశిస్తూ కుడి కాలు ముందు వేసి చదవండి:

అల్లా హుమ్మఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక. (ముస్లిం 713).

اللهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ (ఓ అల్లాహ్ నా కొరకు నీ కరుణ ద్వారాలు తెరువు).  

4- కూర్చునే ముందు రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ చేసుకోవడం సున్నత్.

عَنْ أَبِي قَتَادَةَ السَّلَمِيِّ t أَنَّ رَسُولَ الله قَالَ: (إِذَا دَخَلَ أَحَدُكُمْ الْمَسْجِدَ فَلْيَرْكَعْ رَكْعَتَيْنِ قَبْلَ أَنْ يَجْلِسَ).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారని, అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

మీలో ఎవరైనా మస్జిదులో ప్రవేశిస్తే కూర్చునే ముందు రెండు రకాతుల నమాజు చేసుకోవాలి”. (బుఖారి 444, ముస్లిం 714).

5- నమాజులో సతర్ తప్పనిసరి. పురుషుల సతర్ నాభి నుండి మోకాళ్ళ వరకు, స్త్రీల పూర్తి శరీరమే సతర్, నమాజులో కేవలం ముఖము తప్ప.

6- కాబా వైపునకు అభిముఖమై ఉండుట తప్పనిసరి. నమాజు అంగీకారానికి ఇది ఒక షరతు. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప. ఉదాః వ్యాది లేదా మరేదైనా కారణం.

7- ప్రతీ నమాజు దాని సమయములో చేయాలి. సమయానికి ముందు చేయుట సమ్మతం కాదు. సమయం దాటి చేయడం నిషిద్ధం.

8- నమాజుకై శీఘ్రముగా సమయంలో రావడం, తొలి పంక్తిలో చేరుకోవడం, నమాజు కొరకు వేచించడం, ఇవన్నియూ చాలా గొప్ప ఘనతగల కార్యాలు.

عَنْ أَبِي هُرَيرَةَ t أَنَّ رَسُولَ الله قَالَ: (لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَمْ يَجِدُوا إِلَّا أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لَاسْتَهَمُوا وَلَوْ يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ لَاسْتَبَقُوا إِلَيْهِ…).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించారని, అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

“అజాన్ పలకడం మరియు మొదటి పంక్తిలో చేరడం ఎంత పుణ్యకార్యమో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటి (ఖుర్అ) పద్దతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటి వేసుకొందురు. అలాగే వేళ కాగానే తొలి సమయంలో నమాజుకు రావడంలో ఎంత పుణ్యముందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటిపడుదురు. …..”. (బుఖారి 615, ముస్లిం 437).

عَنْ أَبِي هُرَيْرَةَ t أَنَّ رَسُولَ الله قَالَ: (لَا يَزَالُ أَحَدُكُمْ فِي صَلَاةٍ مَا دَامَتْ الصَّلَاةُ تَحْبِسُهُ).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారని, అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

నమాజు కొరకు వేచిస్తూ ఉన్న వ్యక్తికి నమాజు చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది“. (బుఖారి 659, ముస్లిం 649).


నమాజు సమయాలు:

  • జొహ్ర్ నమాజు నమయం: తల నుండి పొద్దు వాలినప్పటి నుండి ప్రతీ వస్తువు నీడ దానంత అయ్యే వరకు.
  • అస్ర్ నమాజు సమయం: ప్రతీ వస్తువు నీడ దానంత అయినప్పటి నుండి సూర్యాస్తమయం వరకు.
  • మగ్రిబ్ నమాజు సమయం: సూర్యాస్తమయమైనప్పటి నుండి ఎర్రని కాంతులు కనుమరుగయ్యే వరకు.
  • ఇషా నమాజు సమయం: ఎర్రని కాంతులు మరుగైన మరుక్షణం నుండీ అర్థ రాత్రి వరకు.
  • ఫజ్ర్ నమాజు సమయం: ఉషోదయము నుండి సూర్యోదయము వరకు.

నమాజు చేయరాని స్థలాలు:

1- ఖననవాటిక: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

(الْأَرْضُ كُلُّهَا مَسْجِدٌ إِلَّا الْحَمَّامَ وَالْمَقْبَرَةَ).

“భూభాగమంతయూ మస్జిదే. స్నానశాల, మరుగుదొడ్లు మరియు ఖనన వాటిక (ఖబరస్తాన్) తప్ప”. (అబూ దావూద్ 492, తిర్మిజి 317).

అయితే జనాజ నమాజు మట్టుకు ఖబరస్తానులో చేయడం ధర్మమే.

అలాగే స్నానాలు చేసే బాత్ రూంలో నమాజు చేయరాదు. మరుగుదొడ్లో నమాజ్ చేయడం కఠినంగా నిషిద్ధం.

2- సమాధి, గోరీల వైపు:

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నాను అని అబూ మర్సద్ గనవీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

(لَا تُصَلُّوا إِلَى الْقُبُورِ وَلَا تَجْلِسُوا عَلَيْهَا).

గొరీలు ఎదురుగా ఉండగా నమాజ్ చేయడం గానీ, వాటిపై కూర్చోవటం గానీ చేయకండి”. (ముస్లిం 972).

3- ఒంటెశాల అంటే ఒంటెలు కట్టే చోటు. అలాగే అశుద్ధ స్థలాల్లో నమాజు చేయరాదు.

జుమా రోజు ఘనత (మూడు హదీసులు) [ఆడియో]

బిస్మిల్లాహ్

(9 నిముషాలు )
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)వారి 3 హదీసులు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
Recorded : 29-4-1441


6వ అధ్యాయం – ముస్లిం అనుచర సమాజానికి శుక్రవారం వైపు మార్గదర్శనం

496. హజత్‌ అబూహురైరా (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:- “ప్రపంచంలో మనం యావత్తు అనుచర సమాజాల కంటే వెనుక వచ్చాము. అయితే ప్రళయదినాన మనం అందరికన్నా మించిపోతాము. మనకు పూర్వమే యావత్తు అనుచర సమాజాలకు (దైవ) గ్రంధం లభించింది. మనకు వారి తరువాత లభించింది. (అంటే వారు గతంలోనికి పోయారు. మనం వారి వెనుక ఉన్నాం) కాని ఈ రోజు (అంటే శుక్రవారం) విషయంలో వారు దైవాజ్ఞ పాటింపుతో విభేదించారు. (అంచేత ఈ శుభదినం మనకు లభించింది. ఈ కారణంగానే మనం ప్రళయ దినాన వారిని మించిపోతాము) రేపటి దినం (శనివారం) యూదులకు లభించింది. ఎల్లుండి దినం (ఆదివారం) కైస్తవులకు లభించింది.”

[సహీహ్‌ బుఖారీ : 60వ ప్రకరణం – అంబియా, 54వ అధ్యాయం – హద్దసనా అబుల్‌ యమాన్‌]

నుండి: జుమా ప్రకరణంఅల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు)


1148. హజ్రత్‌ అబూహురైరా (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) ఈ విధంగా ప్రవచించారు:

“సూర్యుడు ఉదయించే దినాల్లో అన్నిటికంటే శ్రేష్టమైనది జుమా రోజు. ఆ రోజున ఆదం పుట్టించబడ్డారు. ఆ రోజునే స్వర్గంలోకి గొనిపోబడ్డారు. తిరిగి అదే రోజున అక్కడి నుండి తొలగించ బడ్డారు.” (ముస్లిం )

(సహీహ్‌ ముస్లింలోని జుమా ప్రకరణం)
నుండి: జుమానాటి ఘనత , జుమా నమాజుహదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ )


ఇతర లింకులు: 

ఫజ్ర్ కు ముందు సున్నతుల ఘనత [ఆడియో క్లిప్]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (30 సెకండ్లు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


ఫజ్ర్‌ నమాజుకు ముందు రెండు రకాతులు:

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు:

عَنْ عَائِشَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: رَكْعَتَا الْفَجْرِ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا فِيهَا

“ఫజ్ర్‌కు ముందు రెండు రకాతులు ప్రపంచము మరియు అందులో ఉన్నవాటి కంటే ఉత్తమమైనవి”. (ముస్లిం 725).

నాతో పాటు మీరు కూడా ఈ హదీసుపై శ్రద్ధ చూపండి: ఫజ్ర్‌ సున్నతులు ప్రపంచం, వాటిపై ఉన్న డబ్బు, ధనము,బిల్జింగులు, కార్ల కంటే చాలా మేలైనవి.

నమాజు నిధులు (Treasures of Salah) అను పుస్తకం నుండి


ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది; “ఆ రెండు రకాతులు నాకు ప్రపంచమంతటి కన్నా ప్రియమైనవి.”

عَنْ عَائِشَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنَّهُ قَالَ فِي شَأْنِ الرَّكْعَتَيْنِ عِنْدَ طُلُوعِ الْفَجْرِ: «لَهُمَا أَحَبُّ إِلَيَّ مِنَ الدُّنْيَا جَمِيعًا» مسلم 725

 


నమాజులో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ మోగితే ఏమి చేయాలి? [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (4 నిముషాలు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

జుమా నమాజును వదలడం పాపమా? [ఆడియో, టెక్స్ట్]

[5 నిముషాలు]
https://youtu.be/J8IAEgfxvtk
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

జూమా నమాజ్ వదిలివేయడం ఘోరమైన పాపాలలో ఒకటి మరియు కబీరా గునా (పెద్ద పాపం). దీనికి సాధారణ పుణ్యాలు ప్రాయశ్చిత్తం కావు, ప్రత్యేకమైన తౌబా (పశ్చిత్తాపం) అవసరం. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జూమాను విడిచిపెట్టిన వారి ఇళ్లను తగలబెట్టాలని తీవ్రంగా ఆకాంక్షించారు, ఇది ఈ పాపం యొక్క తీవ్రతను సూచిస్తుంది. సరైన కారణం లేకుండా ఉద్దేశపూర్వకంగా వరుసగా మూడు జూమా నమాజ్‌లను వదిలివేసే వారి హృదయాలపై అల్లాహ్ ముద్ర వేస్తాడని మరియు వారు ఏమరుపాటులో పడినవారిలో కలిసిపోతారని కూడా ఆయన హెచ్చరించారు.అందువల్ల, ప్రతి ముస్లిం జూమా నమాజ్‌ను తప్పనిసరిగా పాటించాలి మరియు దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

జూమా నమాజ్‌ను వదలడం పాపమా?

సోదర మహాశయులారా, ఈ రోజుల్లో మనిషి ప్రాపంచిక జీవితంలో లీనమైపోయి మరియు పరలోకాన్ని మరిచిపోయి, ఐదు పూటల నమాజ్‌లను విలువ లేకుండా, ఎలాంటి భయం లేకుండా వదిలేస్తున్నాడంటే, జూమా నమాజ్‌లను కూడా ఎంతోమంది ఎన్నో సాకులు చెప్పుకుంటూ వదిలేస్తున్నారు.

అయితే, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం ఒక విషయం, రెండు హదీసులను మీకు వినిపిస్తాను. దీని ద్వారా మీరు గుణపాఠం నేర్చుకొని ఇక నుండి ఏ ఒక్క రోజు కూడా జూమా వదలకుండా ఉండడానికి జాగ్రత్త పడండి.

ఒక విషయం ఏంటి? సోదర మహాశయులారా, జూమా నమాజ్‌ను వదలడం చిన్న పాపం కాదు. సరైన కారణం లేకుండా జూమా నమాజ్‌ను వదలడం ఘోరమైన పాపాల్లో ఒకటి, ‘కబీరా గునా’ అని ఏదైతే అంటారో. మరియు సామాన్యంగా ఖురాన్ ఆయతులు మరియు హదీసుల ద్వారా మనకు ఏం తెలుస్తుంది?

إِن تَجْتَنِبُوا كَبَائِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنكُمْ سَيِّئَاتِكُمْ
(ఇన్ తజ్తనిబూ కబాయిర మా తున్‌హౌన అన్‌హు నుకఫ్ఫిర్ అన్‌కుం సయ్యిఆతికుమ్)
మీకు నిషేధించబడిన ఘోరమైన పాపాలను మీరు వదిలివేస్తే, మేము మీ చెడులను మీ నుండి తొలగిస్తాము.

ఇంకా వేరే ఇలాంటి ఆయతులు ఈ భావంలో హదీసులు ఉన్నాయి. అంటే ఈ కబీరా గునా, ఘోరమైన పాపాలు అట్లే క్షమింపబడవు. దాని గురించి ప్రత్యేకమైన తౌబా (పశ్చిత్తాపం) అవసరం. కొన్ని సందర్భాల్లో కొన్ని పుణ్యాలు చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని మనం వింటాము కదా? అలాంటి పాపాల్లో ఈ జుమాను వదలడం రాదు. అందు గురించి భయపడండి.

అంతేకాదు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జూమా నమాజ్‌కు ఎంత గొప్ప విలువ ఇచ్చారో గమనించండి. సహీ ముస్లిం షరీఫ్‌లోని హదీస్, హదీస్ నెంబర్ 652.

హజ్రత్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు:

قَالَ لِقَوْمٍ يَتَخَلَّفُونَ عَنِ الْجُمُعَةِ: لَقَدْ هَمَمْتُ أَنْ آمُرَ رَجُلاً يُصَلِّي بِالنَّاسِ، ثُمَّ أُحَرِّقَ عَلَى رِجَالٍ يَتَخَلَّفُونَ عَنِ الْجُمُعَةِ بُيُوتَهُمْ.
(ఖాల లిఖౌమిన్ యతఖల్లఫూన అనిల్-జుముఅతి: లఖద్ హమమ్తు అన్ ఆముర రజులన్ యుసల్లీ బిన్నాసి, సుమ్మ ఉహర్రిక అలా రిజాలిన్ యతఖల్లఫూన అనిల్-జుముఅతి బుయూతహుమ్)

జూమా నమాజ్ నుండి వెనుక ఉండిపోయే ప్రజల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ప్రజలకు నమాజ్ చేయించడానికి నేను ఒక వ్యక్తిని ఆదేశించి, ఆ తర్వాత జూమాకు రాకుండా తమ ఇళ్లలో ఉండిపోయిన వారి ఇళ్లను తగలబెట్టాలని నేను నిశ్చయించుకున్నాను.”

వారి ఇండ్లకు మంట పెట్టాలి అన్నటువంటి కాంక్ష ఉంది. కానీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అలా చేయలేదు. సోదర మహాశయులారా, ప్రవక్త ఇంత భయంకరమైన శిక్ష వారికి తమ జీవిత కాలంలో ఇవ్వాలని, వారు బ్రతికి ఉన్నప్పుడే వారి ఇండ్లను కాలబెట్టాలని కోరారంటే, ఈ పాపం చిన్న పాపమా సోదరులారా?

మరొక హదీసును విన్నారంటే, ఇంకా భయకంపితలు అయిపోవాలి. జుమా ఇక ఎన్నడూ వదలకుండా ఉండడానికి అన్ని రకాల మనం సంసిద్ధతలు ముందే చేసుకొని ఉండాలి. ఈ హదీస్ కూడా సహీ ముస్లింలో ఉంది, హదీస్ నెంబర్ 865.

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ మరియు హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా మేము విన్నాము అని అంటున్నారు. ఏం చెప్పారు ప్రవక్త?

لَيَنْتَهِيَنَّ أَقْوَامٌ عَنْ وَدْعِهِمُ الْجُمُعَاتِ، أَوْ لَيَخْتِمَنَّ اللَّهُ عَلَى قُلُوبِهِمْ، ثُمَّ لَيَكُونُنَّ مِنَ الْغَافِلِينَ.
(లయన్‌తహియన్న అఖ్వామున్ అన్ వద్ఇహిముల్-జుముఆతి, అవ్ లయఖ్తిమన్నల్లాహు అలా ఖులూబిహిమ్, సుమ్మ లయకూనున్న మినల్-గాఫిలీన్)

“ప్రజలు జూమా నమాజ్‌లను వదిలివేయడం మానుకోవాలి, లేకపోతే అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర వేస్తాడు, అప్పుడు వారు ఏమరుపాటులో పడినవారిలో కలిసిపోతారు.”

ఎవరి హృదయాలపై ముద్ర పడిపోతుందో వారు ఏమరుపాటులో గురి అయిన వారిలో కలిసిపోతారు. అల్లాహ్ ఇలాంటి వారి నుండి మనల్ని కాపాడుగాక. ఖురాన్‌లో ‘గఫ్లా’ (ఏమరుపాటు), ‘గాఫిలీన్’ (ఏమరుపాటులో పడినవారు) అన్న పదం ఎక్కడెక్కడ వచ్చిందో చూసి, దాని అనువాదం, దాని వెనకా ముందు ఉన్నటువంటి శిక్షలు చదివి చూడండి.

జుమాలను వదిలినందుకు రెండు శిక్షలు ఇక్కడ ఇవ్వబడుతున్నాయి చూడండి. ఒకటి ఈ హదీసులో మనం ఇప్పుడు తెలుసుకున్న హదీసులో: ఒకటి, అల్లాహ్ ముద్ర వేసేస్తాడు. రెండవది, ఏమరుపాటిలో గురి అయిన వారిలో మనం కలిసిపోతామంటే, భయంకరమైన శిక్ష కాదా?

అల్లాహు తఆలా మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక. ఇకనైనా భయపడండి. ఇన్ని రోజుల జీవితం ఇహలోకంలో. అల్లాహ్ యొక్క ఆదేశాల ప్రకారం జీవితం గడిపి, మనం భక్తుల్లో, నరకం నుండి ముక్తి పొందే వారిలో, సత్పురుషుల్లో చేరే ప్రయత్నం చేద్దాము.

అల్లాహ్ మనందరికీ స్వర్గంలో చేర్పించేటువంటి ప్రతి సత్కార్యం చేసే సద్భాగ్యం ప్రసాదించుగాక. వ ఆఖిరు దావాన అనిల్-హందులిల్లాహ్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

జుమా (శుక్ర వారం) నమాజ్ కు ముందు తరువాత ఎన్ని సున్నతులు? [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [5:51 నిముషాలు]

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [3 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


1126. ఇంతకు ముందు ఇబ్నె ఉమర్‌ (రది అల్లాహు అన్హు) వివరించిన “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట నేను జుమా తర్వాత రెండు రకాతుల నమాజ్‌ చేశానన్న” (బుఖారీ- ముస్లిం) హదీసు ఈ అధ్యాయానికి కూడా వర్తిస్తుంది.

ముఖ్యాంశాలు

గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహిమహుల్లాహ్) ఈ అధ్యాయంలో జుమా తర్వాత ఎన్ని రకాతుల నమాజ్‌ చేయాలనే విషయం గురించి వివరిస్తున్నారు. రాబోవు రెండు హదీసుల్లో దానిగురించి ఇంకా వివరంగా విశదీకరిస్తారు. ఇకపోతే జుమాకు ముందు ఎన్ని రకాతులు చేయాలి? అనే విషయమై హదీసుల ద్వారా బోధపడేదేమిటంటే, జుమా నమాజ్‌ కోసం మస్జిద్ కు వచ్చే వ్యక్తి రెండు రకాతులు చేసిన తర్వాతగాని కూర్చోకూడదు. ఆఖరికి ఖుత్బా (ప్రసంగం) సమయంలో వచ్చినాసరే, సంక్షిప్తంగానయినా రెండు రకాతులు చేసుకోవాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశించారు. అయితే ప్రసంగానికి ముందు రెండు రకాతుల తహియ్యతుల్‌ మస్జిద్ నమాజ్‌ తర్వాత రెండేసి రకాతుల చొప్పున నఫిల్‌ నమాజు ఎన్ని రకాతులైనా చేసుకోవచ్చు.

1127. హజ్రత్‌ అబూహురైరా (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“మీలో ఎవరయినా జుమా తర్వాత నాలుగు రకాతుల నమాజ్‌ చేసుకోవాలి”. (ముస్లిం)

(సహీహ్‌ ముస్లింలోని జుమా ప్రకరణం)

1128. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రది అల్లాహు అన్హు) కథనం: “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  జుమా తరువాత (మస్జిద్ లో) ఎలాంటి నమాజ్ చేసేవారు కాదు. మస్జిద్ నుండి తిరిగి  వెళ్ళిన తర్వాతే ఇంట్లో రెండు రకాతులు చేసేవారు.” (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జుమా వ్రకరణం)

ముఖ్యాంశాలు:

ఒక హదీసులో జుమా తర్వాత నాలుగు రకాతులు చేయాలనీ, మరో హదీసులో రెండు రకాతులు చేయాలని చెప్పబడింది. దీనిద్వారా రెండు పద్ధతులూ సరైనవేనని బోధపడుతోంది. కొంతమంది పండితులు ఈ రెండు హదీనుల్ని సమన్వయ పరచటానికి ప్రయత్నించారు. జుమా తర్వాత మస్జిద్ లోనే నమాజ్‌ చేయదలచుకునేవారు నాలుగు రకాతులు చేయాలనీ, ఇంట్లో చేసేవారు రెండు రకాతులు చేసుకుంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు.

ఇకపోతే నాలుగు రకాతుల నమాజును ఏ విధంగా చేయాలి? ఈ విషయంలో కూడా రెండు అభిప్రాయాలున్నాయి. ఒక విధానం నాలుగు రకాతులు ఒకే సలాంతో చేయాలనీ, మరొక విధానం రెండేసి రకాతుల చొప్పున చేయాలని. రెండు పద్ధతులూ సమ్మతమైనవే. అయితే రెండేసి రకాతుల చొప్పున చేసుకోవటమే ఉత్తమం. ఎందుకంటే ఒక ప్రామాణిక హదీసులో రాత్రి మరియు పగటిపూట నఫిల్‌ నమాజులు రెండేసి రకాతులు చేయాలని చెప్పబడింది. ఇమామ్‌ బుఖారీ (రహిమహుల్లాహ్) కూడా తన గ్రంథంలో “రాత్రి మరియు పగటి పూట (నఫిల్‌) నమాజులు రెండేసి రకాతులే” అనే శీర్షికతో ఒక అధ్యాయాన్ని ఏర్పరచారు.

జుమా నమాజ్ వేళ చేయబడే సున్నత్ లు – హదీసులు – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ )


364. హజ్రత్‌ జాబిర్‌ (రది అల్లాహు అన్హు) ఇలా తెలిపారు: జుమా రోజున ఒక వ్యక్తి మస్జిద్ లో ప్రవేశించాడు. ఆ సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రసంగిస్తున్నారు. వచ్చిన వ్యక్తి నుద్దేశించి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), “నమాజ్‌ చేశావా?” అని దర్యాప్తు చేశారు. “లేదు’ అని అన్నాడా వ్యక్తి. “మరయితే లే. రెండు రకతుల నమాజ్‌ చెయ్యి” అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు. (బుఖారీ, ముస్లిం)

సారాంశం:

జుమా ప్రసంగం జరుగుతుండగా రెండు రకతుల నమాజ్‌ చేయవచ్చునని ఈ హదీసు ద్వారా అవగతమవుతున్నది. ప్రసంగ కర్త మటుకు అవసరం మేరకు మాట్లాడగలడనీ, మస్జిద్ కు వచ్చే నమాజీలకు రెండు రకాతులు నెరవేర్చమని చెప్పగలడని కూడా దీనిద్వారా స్పష్టమవుతున్నది.

367. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్‌ అబూ హురైర (రది అల్లాహు అన్హు) తెలిపారు : “మీలో ఎవరయినా జుమా నమాజ్‌ చేస్తే ఆ తరువాత నాలుగు రకాతులు చదవండి.”  (ముస్లిం)

[జుమా నమాజ్ – హదీసులు – హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) నుండి ]

ఇతరములు:

సూరహ్ అల్ మా’ఊన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [ఆడియో]

బిస్మిల్లాహ్

సూరహ్ అల్ మా’ఊన్ (సూరహ్ నం.107) అనువాదం, వ్యాఖ్యానం

[35 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ సూరాను సూరయె దీన్‌గా, సూరయె అరఐత్‌గా, సూరయె యతీమ్‌గా కూడా వ్యవహరిస్తారు. (ఫత్‌హుల్‌ ఖదీర్‌).

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 7 ఆయతులు ఉన్నాయి. అవిశ్వాసులు, కపట విశ్వాసుల గురించి ఈ సూరా ముఖ్యంగా ప్రస్తావించింది. ఈ సూరా మొదటి ఆయతులో వచ్చిన ‘మాఊన్‌’ (సాధారణ వస్తువులు) అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. రెండు రకాల ప్రజలను ఈ సూరాలో తీవ్రంగా విమర్శించడం జరిగింది.

1 తీర్పుదినాన్ని నిరాకరిస్తున్న అవిశ్వాసులు. వారు అనాధలను కఠినంగా కసరి కొడతారు. నిరుపేదలకు సహాయం చేయడాన్ని వారు ప్రోత్సహించరు

2. కపట విశ్వాసులైన ముస్లిములు – నమాజులకు ఆలస్యం చేస్తారు. వేళకు నమాజు చేయరు. అందరూ చూడాలని మంచిపనులు చేస్తారు. చిన్న చిన్న విషయాలలో కూడా తమ తోటి వారికి సహాయం చేయడానికి ముందుకు రారు.

[అహ్సనుల్ బయాన్ నుండి]

సూరతుల్ మాఊన్ – 107

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో …బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. పరలోకతీర్పును ధిక్కరించేవాడిని నీవు చూశావా?అరఅయ్ తల్లదీ యుకద్దిబు బిద్దీన్أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ
2.వారే అనాథులను కసరి కొట్టేవారు.ఫదాలికల్లదీ యదువ్వుల్ యతీంفَذَلِكَ الَّذِي يَدُعُّ اليَتِيمَ
3. నిరుపేదలకు అన్నం పెట్టమని ప్రోత్సహించని వారువలా యహుద్దు అలా తఆమిల్ మిస్కీన్وَلَا يَحُضُّ عَلَى طَعَامِ المِسْكِينِ
4. ఐతే నమాజు చేసే (అలాంటి) వారూ నాశనమౌతారు.ఫవైలుల్ లిల్ ముసల్లీన్فَوَيْلٌ لِلْمُصَلِّينَ
5. ఎవరైతే తమ నమాజుల పట్ల అశ్రద్ధ చూపేవారోఅల్లదీన హుమ్ అన్ సలాహితిహిం సాహూన్الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ  سَاهُونَ
6. ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో వ్యవహరించేవారో,అల్లదీన హుమ్ యురాఊన్الَّذِينَ هُمْ  يُرَاءُونَ
7. ఎవరైతే చిన్న పాటి సహాయం అర్థించిన వారిని కూడా తిరస్కరించే వారో.వయంన ఊనల్ మాఊన్وَيَمْنَعُونَ المَاعُونَ

 

నమాజు కొరకు మస్జిదుకు వెళ్ళే వారి ఉఫాది మరియు చావు, బ్రతుకుల బాధ్యత⁉️ [ఆడియో]

బిస్మిల్లాహ్

ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి: (9 నిముషాలు)

వక్త : ముహమ్మద్ నసీరుద్దీన్ జామియీ (హఫిజహుల్లాహ్)

నమాజు; ప్రతిరోజు ఐదు పూటల నమాజు చదవటం ప్రతి ముస్లింలకి తప్పనిసరి విధి చేయబడినది. అలాగే ముస్లింలకు నమాజు స్వర్గానికి తాళం చెవి లాంటిది. అలాగే అల్లాహ్ దగ్గర ప్రళయదినాన ముందుగా ప్రశ్నింపబడేది నమాజు గురించే. అందుకే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు నమాజు నా కంటి చలువ అన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎలాంటి క్లిష్టపరిస్ధితులు ఎదురైన ముందుగా నమాజు చదివి అల్లాహ్ తో వేడుకునేవారు.

మస్జిద్ కు వెళ్ళడం; ఎవరైతే నమాజు కొరకు మస్జిద్కు వెళ్తారో వారి ఉఫాది మరియు చావు బ్రతుకుల బాధ్యత (పూచి) కూడా అల్లాహ్ నే స్వయంగా తీసుకున్నాడు.

మిత్రులారా! ధైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీసు నందు ఇలా ఉపదేశించారు;

హదీసు – పరిశీలన;

عَنْ أَبِي أُمَامَةَ ، أَنّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ، قَالَ : ” ثَلاثَةٌ كُلُّهُمْ ضَامِنٌ عَلَى اللَّهِ ، إِنْ عَاشَ رُزِقَ وَكُفِيَ ، وَإِنْ مَاتَ أَدْخَلَهُ اللَّهُ الْجَنَّةَ : مَنْ دَخَلَ بَيْتَهُ فَسَلَّمَ ، فَهُوَ ضَامِنٌ عَلَى اللَّهِ ، وَمَنْ خَرَجَ إِلَى الْمَسْجِدِ ، فَهُوَ ضَامِنٌ عَلَى اللَّهِ ، وَمَنْ خَرَجَ فِي سَبِيلِ اللَّهِ فَهُوَ ضَامِنٌ عَلَى اللَّهِ “

رواه ابن حبان في صحيحه
وأخرجه ابوداود والحاكم والبيهقي وغيرهم

హజ్రత్ అబూ ఉమామా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:

ముగ్గురు; వారిలో ప్రతి ఒక్కరి గురించి అల్లాహ్ పూచి (జమానత్) తీసుకున్నాడు, వారు బ్రతికి ఉంటే అల్లాహ్ ఉపాధి ప్రసాదిస్తాడు, అల్లాహ్ వారికి సరిపోతాడు. ఒకవేళ చనిపోతే అల్లాహ్ వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఆ ముగ్గురిలో ఒకరు: తన ఇంట్లో ప్రవేశిస్తూ సలాం చేసే వ్యక్తి గురించి. రెండవ వ్యక్తి మస్జిద్ వైపునకు వెళ్లేవాడు.మూడవ వ్యక్తి అల్లాహ్ మార్గంలో వెళ్ళినవాడు.

[సహీ ఇబ్ను హిబ్బాన్ 499, సహీహుత్ తర్గీబ్ 321]

పై హదీసు జాగ్రత్తగా గమనించండి! ఎవరైతే నమాజు చదువటకు మస్జిద్ కు బయలుదేరాడో అతడు పూర్తిగా అల్లాహ్ సంరక్షణలో ఉంటాడు.

15/ 3/ 2019 జుమా రోజున, న్యూజిలాండ్ – క్రిస్ట్ చర్చ్ అనే నగరంలో రెండు మస్జిద్ లలో జరిగిన సంఘటన. అది కొందరు ముస్లింలు జుమా నమాజు చదువుటకు మస్జిద్ కి వెళ్ళారు. ముస్లింలు భయభక్తులతో మస్జిద్ లో నమాజు చదువుతుండగా, కొందరు ఉన్మాదులు అనగా కొందరు క్త్రైస్తవ ఉగ్రవాదులు వచ్చి వారి పై పైశాచికంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన లో 50మంది ముస్లింలు అక్కడే వీరమరణం పొందారు. అల్లాహ్ వీరందరికి – ఇన్ షా అల్లాహ్ – స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసులో చెప్పారు. ఎవరైతే నమాజు సలుపుటకు మస్జిద్ కు బయలుదేరి మార్గ మధ్యంలో చావు వస్తే అల్లాహ్ అతడికి స్వర్గం ప్రసాదిస్తాడని. అల్ హందులిల్లాహ్. చాలా బాధగా ఉన్నప్పటికి, ఈ హదీసు గుర్తు రావటంతో నా మనసు కూడా కొంచెం నెమ్మదించింది సహోదరులారా!.

చావు అనేది అది ఎప్పుడైన రావచ్చు ఎక్కడైన రావచ్చు. దానిని ఎవరూ కూడా ఆపలేరు. ఈ లోకంలో చావు అనేది లేకపోతే జంతువులు, మనషుల తప్ప ఎక్కడ ఖాళిగా కనిపించేది కాదు. చావు ఉంది కాని, అది అల్లాహ్ ఏదైతే తన జమానత్ ఇచ్చాడో ఆ దారిలో చనిపోవటం కూడా ఒక మంచి విషయమే.

ఈ హదీసులో మరోక విషయం కూడా చెప్పబడింది. అది ఏమంటే ఏవరైతే నమాజు కొరకు మస్జిద్ వెళ్తారో అతని ఉఫాది పంపిణి అల్లాహ్ పూచి తీసుకున్నాడని. కాని, నేడు మనకి చాలా దగ్గరలో మస్జీద్ లు ఉన్నాయి. వేళకి నమాజు ఆచరించడం లేదు. కొందరు నమాజు సమయంలో అంగడి, దుకాణాల దగ్గర కూర్చోండిపోతారు. ఇవి కొద్దిసేపు విడిచి నమాజు కు వెళ్ళడానికి ప్రయత్నించడం లేదు. ఏదైతే మీరు ఉఫాది కోసం మీ దుకాణాలను తెరచి ఉంచారో అలాంటి మేలైన ఉఫాదిని నేను ప్రసాదిస్తానని అల్లాహ్ అంటున్నాడు. కాని మనం నమాజును వదిలివేస్తున్నాము. ఇది చాలా పెద్ద పొరపాటు కదా!

విశ్వాస సహోదరులారా! నమాజును వదలకండి! వేళకు నమాజు చదవండి! అల్లాహ్ నమాజులో బరకత్ శుభాలను ఉంచాడు. అలాగే నమాజులో ఉఫాది పంపిణి బాధ్యత కూడా ఉంచాడు. నా ప్రియమిత్రులారా!. అల్లాహ్ మనందరికి ఐదు పూటల నమాజు చదివే బాగ్యాన్ని ప్రసాదించుగాక! అల్లాహ్ మార్గంలో చనిపోయిన వారికి స్వర్గాన్ని ప్రసాదించుగాక! ఆమీన్ యా రబ్!!