ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [5:51 నిముషాలు]
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [3 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
1126. ఇంతకు ముందు ఇబ్నె ఉమర్ (రది అల్లాహు అన్హు) వివరించిన “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట నేను జుమా తర్వాత రెండు రకాతుల నమాజ్ చేశానన్న” (బుఖారీ- ముస్లిం) హదీసు ఈ అధ్యాయానికి కూడా వర్తిస్తుంది.
ముఖ్యాంశాలు
గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఈ అధ్యాయంలో జుమా తర్వాత ఎన్ని రకాతుల నమాజ్ చేయాలనే విషయం గురించి వివరిస్తున్నారు. రాబోవు రెండు హదీసుల్లో దానిగురించి ఇంకా వివరంగా విశదీకరిస్తారు. ఇకపోతే జుమాకు ముందు ఎన్ని రకాతులు చేయాలి? అనే విషయమై హదీసుల ద్వారా బోధపడేదేమిటంటే, జుమా నమాజ్ కోసం మస్జిద్ కు వచ్చే వ్యక్తి రెండు రకాతులు చేసిన తర్వాతగాని కూర్చోకూడదు. ఆఖరికి ఖుత్బా (ప్రసంగం) సమయంలో వచ్చినాసరే, సంక్షిప్తంగానయినా రెండు రకాతులు చేసుకోవాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశించారు. అయితే ప్రసంగానికి ముందు రెండు రకాతుల తహియ్యతుల్ మస్జిద్ నమాజ్ తర్వాత రెండేసి రకాతుల చొప్పున నఫిల్ నమాజు ఎన్ని రకాతులైనా చేసుకోవచ్చు.
1127. హజ్రత్ అబూహురైరా (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు:
“మీలో ఎవరయినా జుమా తర్వాత నాలుగు రకాతుల నమాజ్ చేసుకోవాలి”. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని జుమా ప్రకరణం)
1128. హజ్రత్ ఇబ్నె ఉమర్ (రది అల్లాహు అన్హు) కథనం: “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జుమా తరువాత (మస్జిద్ లో) ఎలాంటి నమాజ్ చేసేవారు కాదు. మస్జిద్ నుండి తిరిగి వెళ్ళిన తర్వాతే ఇంట్లో రెండు రకాతులు చేసేవారు.” (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని జుమా వ్రకరణం)
ముఖ్యాంశాలు:
ఒక హదీసులో జుమా తర్వాత నాలుగు రకాతులు చేయాలనీ, మరో హదీసులో రెండు రకాతులు చేయాలని చెప్పబడింది. దీనిద్వారా రెండు పద్ధతులూ సరైనవేనని బోధపడుతోంది. కొంతమంది పండితులు ఈ రెండు హదీనుల్ని సమన్వయ పరచటానికి ప్రయత్నించారు. జుమా తర్వాత మస్జిద్ లోనే నమాజ్ చేయదలచుకునేవారు నాలుగు రకాతులు చేయాలనీ, ఇంట్లో చేసేవారు రెండు రకాతులు చేసుకుంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు.
ఇకపోతే నాలుగు రకాతుల నమాజును ఏ విధంగా చేయాలి? ఈ విషయంలో కూడా రెండు అభిప్రాయాలున్నాయి. ఒక విధానం నాలుగు రకాతులు ఒకే సలాంతో చేయాలనీ, మరొక విధానం రెండేసి రకాతుల చొప్పున చేయాలని. రెండు పద్ధతులూ సమ్మతమైనవే. అయితే రెండేసి రకాతుల చొప్పున చేసుకోవటమే ఉత్తమం. ఎందుకంటే ఒక ప్రామాణిక హదీసులో రాత్రి మరియు పగటిపూట నఫిల్ నమాజులు రెండేసి రకాతులు చేయాలని చెప్పబడింది. ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) కూడా తన గ్రంథంలో “రాత్రి మరియు పగటి పూట (నఫిల్) నమాజులు రెండేసి రకాతులే” అనే శీర్షికతో ఒక అధ్యాయాన్ని ఏర్పరచారు.
జుమా నమాజ్ వేళ చేయబడే సున్నత్ లు – హదీసులు – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ )
364. హజ్రత్ జాబిర్ (రది అల్లాహు అన్హు) ఇలా తెలిపారు: జుమా రోజున ఒక వ్యక్తి మస్జిద్ లో ప్రవేశించాడు. ఆ సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రసంగిస్తున్నారు. వచ్చిన వ్యక్తి నుద్దేశించి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), “నమాజ్ చేశావా?” అని దర్యాప్తు చేశారు. “లేదు’ అని అన్నాడా వ్యక్తి. “మరయితే లే. రెండు రకతుల నమాజ్ చెయ్యి” అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు. (బుఖారీ, ముస్లిం)
సారాంశం:
జుమా ప్రసంగం జరుగుతుండగా రెండు రకతుల నమాజ్ చేయవచ్చునని ఈ హదీసు ద్వారా అవగతమవుతున్నది. ప్రసంగ కర్త మటుకు అవసరం మేరకు మాట్లాడగలడనీ, మస్జిద్ కు వచ్చే నమాజీలకు రెండు రకాతులు నెరవేర్చమని చెప్పగలడని కూడా దీనిద్వారా స్పష్టమవుతున్నది.
367. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రది అల్లాహు అన్హు) తెలిపారు : “మీలో ఎవరయినా జుమా నమాజ్ చేస్తే ఆ తరువాత నాలుగు రకాతులు చదవండి.” (ముస్లిం)
[జుమా నమాజ్ – హదీసులు – హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) నుండి ]
ఇతరములు:
You must be logged in to post a comment.