ఖుత్బా అంశము:విధివ్రాత పై విశ్వాసం
الحمد لله العلي الأعلى، الذي خلق فسوى، والذي قدّر فهدى، وَأَشْهَدُ أَنْ لَا إلـٰه إِلَّا اللَّهُ وحده لا شريك له، له الحمد في الآخرة والأولى، وأشهد أن محمدًا عبدُ الله ورسوله، بلّغ الرسالة، وأدى الأمانة، ونصح الأمة، وكشف الغمة، صلى الله عليه وعلى آله وأصحابه ومن سار على نهجهم واقتفى، وسلَّم تسليمًا كثيرًا.
మొదటి ఖుత్బా :-
స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లింలారా అల్లాహ్ తో భయపడుతూ ఉండండి. ఆయనకు విధేయత చూపండి. ఆయన అవిధేయత నుంచి దూరంగా ఉండండి. విధేయతతో కూడినటువంటి సదాచరణ చేయండి మరియు అవిధేయతతో కూడిన దురాచారాల నుంచి దూరంగా ఉండండి.
తెలుసుకోండి! విధిరాతపై విశ్వాసం తీసుకురావడం విశ్వాస మూల స్తంభాలలో ఒకటి. విశ్వాసం పరిపూర్ణమవ్వాలంటే విధిరాతపై విశ్వాసము ఉంచడం తప్పనిసరి. విధిరాత అనగా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన జ్ఞానంతో మరియు వివేకంతో ఆయన కోరుకున్న విధంగా జీవుల యొక్క విధి వ్రాతను లిఖించి ఉంచాడు.
1.ఓ అల్లాహ్ దాసులారా! విధివ్రాత పై విశ్వాసంలో నాలుగు అంశాలు ఉన్నాయి. జ్ఞానము, వ్రాత, అభీష్టం, సృష్టి
తన దాసుల పరిస్థితులు ఆయనకు తెలుసు. వారి జీజీవనోపాధి, వారి చావు, వర్షం కురిపించడం లేదా తన దాసుల చర్యలు లేక మాటలు లేక వారి కర్మలు గురించి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు తెలుసు. అల్లాహ్ ఇలా అంటున్నాడు:
﴿وكان الله بكل شيء عليما﴾
వాస్తవంగా అల్లాహ్ యే ప్రతి విషయపు జ్ఞానం కలవాడు
మరొక చోట ఇలా అంటున్నాడు.
﴿وعنده مفاتح الغيب لا يعلمها إلا هو ويعلم ما في البر والبحر وما تسقط من ورقة إلا يعلمها ولا حبة في ظلمات الأرض ولا رطب ولا يابس إلا في كتاب مبين﴾
మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్) వద్దనే ఉన్నాయి. వాటిని ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు భూమిలోనూ, సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు. భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజ, అది పచ్చిది కానీ ఎండినది కానీ అంతా స్పష్టంగా ఒక గ్రంథంలో (వ్రాయబడి ఉంది
2. విధివ్రాత పై విశ్వాసంలో రెండవ అంశము వ్రాతపై విశ్వాసం ఉంచడం.
అనగా ప్రళయం వరకు జరగబోయేటువంటి ప్రతి విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం అల్లాహ్ వద్ద ఉందని, ఆయన దానిని ముందుగానే లిఖితపూర్వకమైన గ్రంథంలో రాసి ఉంచాడని విశ్వాసం ఉంచడం. మరియు ఈ విషయాన్ని ఆయన భూమాకాశాల సృష్టికి 50 వేల సంవత్సరాల మునుపే లిఖించి ఉంచాడు దీని ఆధారం అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు.
﴿قل لن يصيبنا إلا ما كتب الله لنا﴾
వారితో ఇలా అను: “అల్లాహ్ మా కొరకు వ్రాసింది తప్ప మరేమీ మాకు సంభవించదు
ఒకచోట ఈ విధంగా తెలియజేస్తున్నాడు.
﴿ما أصاب من مصيبة في الأرض ولا في أنفسكم إلا في كتاب من قبل أن نبرأها﴾
భూమి మీద గానీ లేదా స్వయంగా మీ మీద గానీ విరుచుకు పడే ఏ ఆపద అయినా సరే! మేము దానిని సంభవింప జేయక ముందే గ్రంథంలో వ్రాయబడకుండా లేదు
అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు “భూమ్యాకాశాల సృష్టికి 50 వేల సంవత్సరాల మునుపే సృష్టి రాశుల యొక్క విధి వ్రాతను లిఖించి ఉంచాడు“. (ముస్లిం-2653)
మరియు అదేవిధంగా ఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) ఇలా తెలియజేశారు: “అన్నిటికంటే ముందు అల్లాహ్ కలమును సృష్టించాడు మరియు దానికి రాయమని ఆజ్ఞాపించాడు. అది ఇలా అన్నది ‘ఓ నా ప్రభువా ఏమి వ్రాయను?’ అప్పుడు అల్లాహ్ ఈ విధంగా అన్నాడు: “ప్రళయం సంభవించేంతవరకు జరిగేటువంటి ప్రతి దాని గురించి (విధివ్రాత) రాయి”. ఆ తర్వాత ఉబాదా (రదియల్లాహు అన్హు) తన కుమారుడితో ఇలా అన్నాడు: ఓ నా కుమారుడా! నిశ్చయంగా నేను ప్రవక్త గారి నోటి ద్వారా విన్నాను – “ఏ వ్యక్తి అయితే ఈ నమ్మకంతో కాకుండా మరో నమ్మకం పై మరణిస్తే వారు వాడు నాలోని వాడు కాదు”. (అబూ దావూద్ 4700, తిర్మీజీ 3319)
3. విధి వ్రాతపై విశ్వాసంలో మూడో అంశము అభీష్టం పై విశ్వాసం ఉంచడం
అనగా ఈ విశ్వములో ఏదైతే జరుగుతుందో అంత అల్లాహ్ ఇష్ట ప్రకారమే జరుగుతుందని నమ్మడం. అది కర్మలకు సంబంధించిన లేక చావు బ్రతుకులకు సంబంధించింది అయినా లేక సృష్టి ప్రక్రియకు సంబంధించిన లేక సృష్టి రాశుల ఆచరణకు సంబంధించింది అయినా. ఉదాహరణకు రావడం, పోవడం, ఏదైనా పని చేయడం, విధేయత, అవిధేయత ఇవే కాదు ఇంకా దాసులకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు వాటిని లెక్కించడం అసంభవం. అవన్నీ కూడా విధి వ్రాతకు సంబంధించినవే.
అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు.
﴿وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَـاء وَيَخْتَارُ﴾
మరియు నీ ప్రభువు తాను కోరిన దానిని సృష్టిస్తాడు మరియు ఎన్నుకుంటాడు.
మరొకచోట ఇలా అంటున్నాడు.
﴿وَيَفْعَلُ اللَّهُ مَا يَشَاء﴾
మరియు అల్లాహ్ తాను కోరినది చేస్తాడు.
మరియు అల్లాహ్ జీవరాసులు పనుల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు
﴿وَلَوْ شَاء اللَّه لَسَلَّطَهُمْ عَلَيْكُمْ فَلَقَاتَلُوكُمْ﴾
మరియు ఒకవేళ అల్లాహ్ కోరితే వారికి మీపై ఆధిక్యత ఇచ్చి ఉండేవాడు మరియు వారు మీతో యుద్ధం చేసి ఉండేవారు.
మరోకచోట ఇలా అంటున్నాడు.
﴿وَلَوْ شَاء رَبُّكَ مَا فَعَلُوهُ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ﴾
మరియు నీ ప్రభువు తలచుకుంటే వారిలా చేసేవారు కాదు. కావును వారిని వారి కల్పనలలో వదిలి పెట్టు.
మరొక చోట అల్లాహ్ ఇలా అంటున్నాడు.
﴿ولو شاء الله ما أشركوا﴾
మరియు అల్లాహ్ సంకల్పించి ఉంటే! వారు అల్లాహ్ కు సాటి కల్పించి ఉండేవారు కాదు.
దీని ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ఈ సృష్టిలో అల్లాహ్ యొక్క ఇష్టం లేకుండా ఏ పని జరగదు. అది ఏదైనా సరే, దేనికి సంబంధించింది అయినా సరే, పనులకు సంబంధించింది అయినా లేక జనులకు సంబంధించింది అయినా. ఎందుకంటే ఈ సృష్టి యొక్క సర్వ అధికారము ఆయన చేతుల్లోనే ఉంది, కనుక ఆయన తలిచిందే అవుతుంది.
4. విధి వ్రాతపై విశ్వాసం యొక్క నాల్గోవ అంశము సృష్టి పై విశ్వాసం ఉంచడం.
అనగా సమస్త జీవులన్నిటిని వాటి గుణాలతో వాటి లక్షణాలతో అల్లాహ్ ఏ సృష్టించాడని విశ్వసించడం. అల్లాహ్ ఇలా అంటున్నాడు.
﴿اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ﴾
అల్లాహ్ యే ప్రతి దాని సృష్టికర్త.
మరొక చోట అల్లాహ్ ఇలా అంటున్నాడు.
﴿وَخَلَقَ كُلَّ شَيْءٍ فَقَدَّرَهُ تَقْدِيرًا﴾
మరియు ఆయన ప్రతి దానిని సృష్టించి, దానికొక విధిని నిర్ణయించాడు.
ఓ అల్లాహ్ దాసులారా! విధి వ్రాత కు సంభందించిన నాలుగు అంశాలు తెలియచేయడం జరిగింది. ఎవరైతే వీటిని అర్థం చేసుకొని ఆచరిస్తారో వారే విధివ్రాత పై విశ్వాసం తెచ్చిన వారవుతారు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత
ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్ పట్ల దైవ భీతి కలిగి ఉండండి. మరియు తెలుసుకోండి విధి వ్రాత మూడు రకాలు.
మొదటిది: అల్లాహ్ ఈ భూమ్యాకాశాల సృష్టికి 50 వేల సంవత్సరాల ముందే జరగబోయేటువంటి ప్రతి విషయాన్ని లిఖించి ఉంచాడు. అల్లాహ్ మొట్టమొదటిగా కలమును సృష్టించాడు. దానితో ప్రళయం వరకు సంభవించే ప్రతి విషయం గురించి వ్రాయమని ఆజ్ఞాపించాడు.
రెండవది: జీవిత కాలనికి సంబంధించిన విధివ్రాత. ఎప్పుడైతే తల్లి గర్భాశయములో అండము ఏర్పడుతోందో అప్పటినుంచి దానికి సంబంధించి విధివ్రాతను వ్రాయడం జరుగుతుంది. అనగా పుట్టేది అబ్బాయి లేక అమ్మాయా, వారి జీవిత కాలం ఎంత, వారి ఆచరణ, వారి ఉపాధి గురించి. ఈ విధంగా ప్రతి దాని గురించి వ్రాయబడుతుంది. అదే విధంగా వారికి ఈ ప్రపంచిక జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి విషయం గురించి లిఖించబడుతుంది.
అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్(రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం వారు ఇలా తెలియజేశారు – మీలో ప్రతి ఒక్కరి పుట్టుక తల్లి గర్భం నుండి అవుతుంది. అయితే అది నలబై రోజుల వరకు ఇంద్రియ బిందువు గా ఉంటుంది. ఆతరువాత అది అంతే సమయం వరకు రక్తపు ముద్దగా మారుతుంది. ఆ తర్వాత అది అదే సమయం లో మాంసపు ముద్దగా ఉంటుంది. ఆ తరువాత అల్లాహ్ ఒక దైవ దూత ను పంపుతాడు మరియు నాలుగు విషయాల ఆజ్ఞ ఇస్తాడు. ఇలా అంటాడు – అతని ఆచరణ , ఉపాది , జీవితకాలం గురించి వ్రాయి. మరియు అతను సద్వర్తునుడా లేక దుర్వర్తునుడా అనేది కూడా వ్రాయి. ఆ తారువాత అందులో ఆత్మ ను ప్రవేశ పెట్టడం జరుగుతుంది. (బుఖారి 3208,ముస్లిం 2643)
3. ప్రతి సంవత్సరం యొక్క విధివ్రాత: ప్రతి సంవత్సరం రంజాన్ యొక్క చివరి దశలో లైలతుల్ ఖద్ర్ రాత్రిలో లిఖించబడుతుంది. ఆ రాత్రిలో సంవత్సరానికి సంబంధించిన విధి నిర్ణయించబడుతుంది. దీని ఆధారం అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు.
﴿إنا أنزلناه في ليلة مباركة إنا كنا منذرين * فيها يفرق كل أمر حكيم * أمراً من عندنا إنا كنا مرسِلين﴾
నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) శుభప్రదమైన రాత్రిలో అవతరింపజేశాము. నిశ్చయంగా, మేము (ప్రజలను) ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ వచ్చాము. దానిలో (ఆ రాత్రిలో), ప్రతి విషయం వివేకంతో విశదీకరించ బడుతుంది; మా ఆజ్ఞానుసారంగా, నిశ్చయంగా మేము (సందేశహారులను) పంపుతూవచ్చాము.
షేక్ అబ్దుర్రహ్మాన్ బిన్ నాసిర్ సాది (రహిమహుల్లాహ్) గారు ఈ వాక్యం యొక్క వివరణలో ఈ విధంగా తెలియజేశారు: విధికి సంబంధించినటువంటి ప్రతి ఆజ్ఞ చట్టబద్ధంగా ఆ రోజున అల్లాహ్ తరపున నిర్ణయించడం జరుగుతుంది. మరియు ఈ విధిని వ్రాసి ఉంచడం జరుగుతుంది కనుక ఇది కూడా మనం ముందు చెప్పుకున్నటువంటి విషయం లాంటిదే. ఈ రాత్రిలో కూడా అల్లాహ్ తఆల సమస్త సృష్టి జీవుల యొక్క విధిని వారి యొక్క జీవితాల గురించి వారి ఉపాధి గురించి వారి ఆచరణ గురించి ఇలా ప్రతి విషయం గురించి లిఖించి ఉంచుతాడు.
ఓ అల్లాహ్ దాసులారా! మీరు తెలుసుకోండి అల్లాహ్ మీపై కరుణించు గాక!. విధివ్రాతపై విశ్వాసం తీసుకురావడం అంటే మనిషి అతని యొక్క చర్యలలో (అతను చేసే మంచి పనులలో లేక చెడు పనులలో) అతనిని బలవంతానికి గురిచేయడం కాదు. అల్లాహ్ మనిషికి ఆలోచించే మేధస్సును ఇచ్చాడు. అతని చిత్తానికి అతన్ని వదిలిపెట్టాడు. మంచి చెడు తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించాడు. అనగా వీటి ద్వారా మానవుడు సన్మార్గం ఏదో అప మార్గం ఏదో తెలుసుకొని నడుచుకోవాలి. అల్లాహ్ మనిషికి మంచిని చేయమని, బంధుత్వాలను కలుపుకోమని, మంచి నడవడిక అలవర్చుకోమని ఆజ్ఞాపించాడు. అశ్లీల కార్యాల నుంచి దూరంగా ఉండమని, చెడు పనులకు దూరంగా ఉండమని దౌర్జన్యం చేయకూడదని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా అల్లాహ్ ప్రతి విషయాన్ని కూడా దాసుని చిత్తానికి వదిలేసాడు. అతను కోరుకుంటే కృతజ్ఞతా భావంతో మసులుకొని విధేయత చూపుతూ దైవ ధర్మంపై స్థిరంగా ఉంటాడు. లేక తన ఇష్ట ప్రకారం అపమార్గాన్ని ఎంచుకొని అవిధేయతతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతాడు. ఆతర్వాత అల్లాహ్ ప్రళయ దినం రోజున అతని జీవితానికి సంబంధించినటువంటి లెక్కను తీసుకుంటాడు. అతని యొక్క ఆచరణ బాగుంటే అతని ప్రతిఫలం బాగుంటుంది. ఒకవేళ అతని ఆచరణ చెడుగా ఉంటే అతనికి దుష్ఫలితమే లభిస్తుంది.
అల్లాహ్ తఆలా దాసుల యొక్క ఇష్టాన్ని గురించి తెలియజేస్తూ ఇలా అంటున్నాడు.
﴿فَمَن شَاء اتَّخَذَ إِلَى رَبِّهِ مَآبًا﴾
కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి!
ఒకచోట ఇలా అంటున్నాడు
﴿فمن شاء فليؤمن ومن شاء فليكفر﴾
కావున ఇష్టపడిన వారు దీనిని విశ్వసించ వచ్చు మరియు ఇష్టపడని వారు దీనిని తిరస్కరించవచ్చు!”
మరియు ఇలా తెలియజేస్తున్నాడు
﴿فَأتُواْ حَرْثَكُمْ أَنَّى شِئْتُمْ﴾
కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు.
ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి. అల్లాహ్ మీపై కరుణించు గాక ! అల్లాహ్ మీకు ఒక పెద్ద సత్కార్యానికై అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు.
(إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما)
నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.
ఓ అల్లాహ్ నీ దాసుడు మరియు నీప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నీ కారుణ్యాన్ని అవతరింప చేయి. ఆయన ఖలీఫాలు,తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు.
ఓ అల్లాహ్! ఇస్లాం, ముస్లిం లకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.
ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారిగా చేయి.
ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు. ఓ అల్లాహ్! మమ్ములను ఆ నరకాగ్ని నుంచి రక్షించు, మాకు మోక్షాన్ని ప్రసాదించు.
ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని, పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు. నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు. ఆమీన్
ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము. మరియు ఆ స్వర్గంలోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము. మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి నీ శరణు కోరుకుంటున్నాము.
ఓ అల్లాహ్! నేను నీ శరణులోకి వస్తున్నాను, ఏ అనుగ్రహాలు నాపై ఉన్నాయో నీ ఆ అనుగ్రహాలు నా నుండి దూరం కాకుండా ఉండటానికి, నీవు నన్ను ఏ సుఖంలో సౌఖ్యంలో ఉంచావో అది కూడా మారిపోకూడదు అని, నీ వైపు నుండి నేను ఏ అకస్మాత్తు ప్రమాదంలో పడకుండా ఉండటానికి, మరియు నీ అన్ని రకాల కోపానికి, ఆగ్రహానికి గురికాకుండా ఉండటానికి .
ఓ అల్లాహ్! మమ్ములను క్షమించు మరియు మా కంటే ముందు గతించిన మా విశ్వాస సోదరుల పాపాలను కూడా క్షమించు. మరియు విశ్వాసుల గురించి మా హృదయాలలో కుళ్లు, కుతంత్రాలు మరియు ద్వేషాన్ని నింపకు. నిశ్చయంగా నీవు కరుణించే వాడవు మరియు క్షమించే వాడవు.
سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ
—
ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
—
తఖ్దీర్ (విధి వ్రాత): (మెయిన్ పేజీ )
https://teluguislam.net/qadr-taqdeer-vidhi-rata/
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.