అన్ని రకాల రోగాల నుండి అల్లాహ్ శరణు కోరండి [దుఆ]

1485. హజ్రత్‌ అనస్‌ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రార్థించేవారు:

Allahumma inni a'udhu bika minal-barasi, wal- jununi, wal-judhami, wa sayyi'il-asqami

‏اللهم إني أعوذ بك من البرص والجنون، والجذام، وسيئ الأسقام

అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మినల్ బరసి, వల్ జునూని, వల్ జుదామి, వ సయ్యిఇల్ అస్కామ్ 

ఓ అల్లాహ్‌! తెల్లమచ్చల రోగం నుండి, పిచ్చితనం నుండి, కుష్టు వ్యాధి నుండి, ఇతర హీనమైన రోగాల నుండి నేను నీ శరణు వేడుతున్నాను.

(అబూదావూద్‌ 1557. దీనిని దృఢమైన ఆధారాలతో వెలికితీశారు)

250. ప్రార్ధన విశిష్టత [pdf]
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – 2 వ భాగము – ఇమామ్ నవవి

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (30 సెకనులు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

జుమా రోజు స్నానం చేయడం, సువాసన పూసుకోవడం ధర్మం [ఆడియో, టెక్స్ట్]

జుమా రోజు స్నానం చేయడం, సువాసన పూసుకోవడం ధర్మం
https://youtu.be/S94_5Yq3hOA [8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా రోజు ఆచరించాల్సిన పలు సున్నతుల గురించి వివరించారు. ముఖ్యంగా, జుమా రోజు స్నానం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కొన్ని హదీసుల ప్రకారం ఇది ప్రతి ప్రౌఢ వయస్సుకు చేరిన వ్యక్తిపై విధిగా (వాజిబ్) ఉండగా, మరికొన్ని హదీసుల ప్రకారం ఇది అత్యంత ఉత్తమమైన (అఫ్దల్) చర్య. స్నానంతో పాటు, శుభ్రమైన దుస్తులు ధరించడం, అందుబాటులో ఉన్న సువాసన లేదా నూనె రాసుకోవడం, మస్జిద్‌కు తొందరగా వెళ్లడం, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా దొరికిన చోట కూర్చోవడం, మరియు ఇమామ్ ప్రసంగాన్ని (ఖుత్బా) శ్రద్ధగా, మౌనంగా వినడం వంటివి కూడా వివరించబడ్డాయి. ఈ నియమాలను పాటించిన వ్యక్తి యొక్క ఒక జుమా నుండి మరో జుమా మధ్య జరిగిన పాపాలు మరియు అదనంగా మరో మూడు రోజుల పాపాలు క్షమించబడతాయని శుభవార్త ఇవ్వబడింది.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్.

జుమాకు సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సూక్తులు, హదీసుల తెలుగు అనువాదం మనం వింటూ ఉన్నాము. ఇప్పుడు జుమా రోజు స్నానం చేసే ఆదేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన హదీసులు విందాము.

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ ـ رضى الله عنهما ـ أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ ‏ “‏ إِذَا جَاءَ أَحَدُكُمُ الْجُمُعَةَ فَلْيَغْتَسِلْ ‏”‌‏
అన్ అబ్దుల్లా హిబ్ని ఉమర రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “ఇదా జాఅ అహదుకుముల్ జుముఅత ఫల్ యగ్తసిల్”.
(అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: “మీలో ఎవరు జుమాకు హాజరవుతున్నారో, వారు స్నానం చేయాలి”.)
(సహీహ్ బుఖారీ 877, సహీహ్ ముస్లిం 844)

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ ـ رضى الله عنه ـ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ ‏ “‏ الْغُسْلُ يَوْمَ الْجُمُعَةِ وَاجِبٌ عَلَى كُلِّ مُحْتَلِمٍ ‏”‌‏
అన్ అబీ సయీదినిల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “అల్ గుస్లు యౌమల్ జుముఅతి వాజిబున్ అలా కుల్లి ముహ్తలిం”.
(అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు స్నానం చేయడం, ప్రాజ్ఞ వయస్సుకు చేరిన ప్రతి ఒక్కరిపై విధిగా ఉంది”.) (సహీహ్ బుఖారీ 858, సహీహ్ ముస్లిం 846)

عَنْ سَمُرَةَ بْنِ جُنْدَبٍ، قَالَ قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم ‏ “‏ مَنْ تَوَضَّأَ يَوْمَ الْجُمُعَةِ فَبِهَا وَنِعْمَتْ وَمَنِ اغْتَسَلَ فَالْغُسْلُ أَفْضَلُ ‏”‏
అన్ సమురతబ్ని జుందుబిన్ రదియల్లాహు అన్హు ఖాల ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, “మన్ తవద్దఅ యౌమల్ జుముఅతి ఫబిహా వనిఅమత్, వ మనిగ్తసల ఫహువ అఫ్దల్”.

(సముర బిన్ జుందుబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే జుమా రోజు వుదూ చేసుకున్నారో, చాలా మంచి పని చేశాడు అతను. మరెవరైతే స్నానం చేశారో, ఈ స్నానం చేయడం అన్నది చాలా ఉత్తమం”.) (అబూ దావూద్ 354, తిర్మిది 497, నిసాయి 1379, దారిమి 1581. ఇది హసన్ కోవకు చెందిన హదీస్).

عَنْ أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ ثُمَّ أَتَى الْجُمُعَةَ فَدَنَا وَاسْتَمَعَ وَأَنْصَتَ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ وَزِيَادَةُ ثَلاَثَةِ أَيَّامٍ وَمَنْ مَسَّ الْحَصَى فَقَدْ لَغَا

అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు ఖాల్, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, “మన్ తవద్దఅ ఫ అహ్సనల్ వుదూఅ సుమ్మ అతల్ జుముఅత ఫదనా వస్తమఅ వఅన్సత గుఫిర లహు మాబైనహు వబైనల్ జుముఅ వజియాదతు సలాసతి అయ్యామ్, వమన్ మస్సల్ హసా ఫఖద్ లగా”.

(అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఎవరైతే మంచి రీతిలో, ఉత్తమ రీతిలో ప్రవక్త చెప్పినట్లు, చూపినట్లు వుదూ చేశారో, మళ్ళీ జుమాకు హాజరయ్యాడో, మొదటి పంక్తులలో ఇమామ్‌కు చాలా దగ్గరగా కూర్చొని జుమా ప్రసంగం (ఖుత్బా) చాలా శ్రద్ధగా, మౌనంగా విన్నాడో, అలాంటి వ్యక్తికి రెండు జుమాల మధ్యలో, అంటే మొత్తం ఏడు రోజులు, ఇంకా అదనంగా మూడు రోజులు, అంటే మొత్తం పది రోజుల పాపాలు మన్నించబడతాయి. అయితే ఎవరైతే ఈ జుమా ఖుత్బా ప్రసంగం సందర్భంలో కంకర రాళ్లు కూడా ముట్టుకుంటాడో, అతని యొక్క జుమా పుణ్యమంతా కూడా వృధా అయిపోతుంది”.) (అబూ దావూద్ 1050, తిర్మిది 498. హదీస్ సహీహ్).

ఈ నాలుగు హదీసులలో మనకు తెలిసిన సారాంశం ఏమిటంటే, జుమా రోజు స్నానం చేయడం చాలా ఉత్తమమైన విషయం. సహీహ్ బుఖారీ, ముస్లిం హదీసుల ఆధారంగా కొందరు విధి అని కూడా అంటారు, ‘వాజిబున్’ అన్న పదం వచ్చింది గనక. కానీ అబూ దావూద్, తిర్మిది, నసాయి ఇంకా వేరే హదీసు గ్రంథాలలో వచ్చిన హదీసు ఆధారంగా ‘అఫ్దల్’ అన్న పదం వచ్చింది గనుక, విధి కాదు. కానీ మనిషికి అవకాశం ఉండి, సౌకర్యాలు ఉన్నప్పుడు దీనిని ఏమాత్రం వదలకూడదు.

మరొక ముఖ్య విషయం మనం గమనించాల్సింది, సామాన్యంగా మనం జుమా రోజు స్నానం చేసినప్పుడు పరిశుభ్రత కొరకు, స్నానం చేయాలి, ఈ రోజు జుమా అన్నటువంటి ఆలోచనలు, ఇరాదా, నియ్యతులు ఉంటాయి. కానీ వీటితో పాటు అతి ముఖ్యమైనది, జుమా రోజు స్నానం చేయడం విధి లేదా అతి ఉత్తమం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు గనక, ప్రవక్త ఈ ఆదేశాన్ని మనం పాటిస్తున్నాము అన్నటువంటి నియ్యత్ మనసులో ఉండేది ఉంటే, ఈ స్నానం చేయడం ద్వారా కూడా మనకు పుణ్యాలు లభిస్తాయి. ఈ విషయం మనకు నాలుగో హదీసులో కూడా చాలా స్పష్టంగా తెలిసింది. అల్లాహు తఆలా దీనికి బదులుగా ఇంకా వీటితో పాటు మరికొన్ని పుణ్య కార్యాలు ఏదైతే తెలుపబడ్డాయో, తొందరగా రావడం, ముందు పంక్తుల్లో కూర్చోవడం, ఎలాంటి వృధా కార్యకలాపాలు చేయకుండా ఉండడం, శ్రద్ధగా ఖుత్బా వినడం, వీటి ద్వారా అల్లాహు తఆలా పది రోజుల పాపాలు మన్నిస్తాడు.

ఇక జుమా రోజు సువాసన పూసుకోవడం కూడా ఒక పుణ్య కార్యం. అయితే, దీనికి సంబంధించిన ఒక హదీసు విందాము.

عَنْ سَلْمَانَ الْفَارِسِيِّ، قَالَ قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ‏ “‏ لاَ يَغْتَسِلُ رَجُلٌ يَوْمَ الْجُمُعَةِ، وَيَتَطَهَّرُ مَا اسْتَطَاعَ مِنْ طُهْرٍ، وَيَدَّهِنُ مِنْ دُهْنِهِ، أَوْ يَمَسُّ مِنْ طِيبِ بَيْتِهِ، ثُمَّ يَخْرُجُ فَلاَ يُفَرِّقُ بَيْنَ اثْنَيْنِ، ثُمَّ يُصَلِّي مَا كُتِبَ لَهُ، ثُمَّ يُنْصِتُ إِذَا تَكَلَّمَ الإِمَامُ، إِلاَّ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ الأُخْرَى ‏”‌‏

అన్ సల్మానల్ ఫారిసీ రదియల్లాహు అన్హు ఖాల్, ఖాలన్నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం, “లా యగ్తసిలు రజులున్ యౌమల్ జుముఅ, వ యతతహ్హరు మస్తతాఅ మిన్ తుహ్రిన్, వ యద్దహిను మిన్ దుహ్నిహి, అవ్ యమస్సు మిన్ తీబి బైతిహి, సుమ్మ యఖ్రుజు ఫలా యుఫర్రిఖు బైనస్నైన్, సుమ్మ యుసల్లీ మా కుతిబ లహు, సుమ్మ యున్సితు ఇదా తకల్లమల్ ఇమాము, ఇల్లా గుఫిర లహు మా బైనహు వబైనల్ జుముఅతిల్ ఉఖ్రా”.

సల్మాన్ ఫార్సీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు ఎవరైతే స్నానం చేస్తారో, మంచి విధంగా తన శక్తి ప్రకారం పరిశుభ్రత పాటిస్తాడో, మంచి దుస్తులు ధరించుకుంటాడో మరియు తన వద్ద ఉన్నటువంటి నూనె తలకు పూసుకుంటాడో మరియు అలాగే ఇంట్లో ఉన్న సువాసన కూడా పూసుకుంటాడో, ఇంకా మస్జిద్‌కు వెళ్లి మస్జిద్లో ఇద్దరి మధ్యలో విడదీయకుండా, ఎక్కడ అతనికి స్థలం దొరికిందో అక్కడ, అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతుల నమాజులు చేస్తాడో, మళ్ళీ ఇమామ్ ప్రసంగం ఇచ్చినప్పుడు, జుమా ఖుత్బా ఇచ్చినప్పుడు శ్రద్ధగా, మౌనంగా ఖుత్బా వింటాడో, అల్లాహు తఆలా ఈ జుమా నుండి వచ్చే జుమా వరకు ఈ మధ్యలో జరిగిన అతని పాపాలను మన్నిస్తాడు”. (సహీహ్ బుఖారీ 883).

ఈ హదీసులో తెలిపినటువంటి జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి ఎంత గొప్ప శుభవార్త ఇవ్వడం జరిగిందో గమనించండి. కానీ ఈ శుభవార్త ఎవరి కొరకు ఉంది? ఈ హదీసులో తెలుపబడినటువంటి ఈ జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి.

అల్లాహ్ మనందరికీ జుమా యొక్క ఘనతను దృష్టిలో ఉంచుకొని, అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానంలో జుమా కోసం సంసిద్ధతలు, తయారీలు చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక. ఆ రోజు చదవవలసిన సూర కహఫ్ ఇంకా వేరే పుణ్య కార్యాలు చేసేటువంటి సద్భాగ్యం కూడా ప్రసాదించు గాక. ఆమీన్.

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు.
ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

మృతులు (చనిపోయిన వారు) వింటారా? [ఆడియో & టెక్స్ట్]

మృతులు (చనిపోయిన వారు) వింటారా?
https://www.youtube.com/watch?v=96plKtzzef4 (51 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, సమాధులను సందర్శించే ప్రజలు చేసే షిర్క్ గురించి వివరించబడింది. గత ప్రసంగంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోని ముష్రికులు మరియు నేటి సమాధులను సందర్శించే ముస్లింల మధ్య నమ్మకాల పోలికను చర్చించారు. రెండు వర్గాలు అల్లాహ్‌ను ఏకైక సృష్టికర్తగా నమ్మినప్పటికీ, మధ్యవర్తుల ద్వారా ఆయనను చేరుకోవాలని ప్రయత్నించారు, దీనిని ఖుర్ఆన్ షిర్క్‌గా పరిగణిస్తుంది. మృతులు వినగలరనే నమ్మకం కూడా షిర్క్‌కు దారితీస్తుందని, దీనికి సరైన ఆధారం లేదని వక్త తెలిపారు. బద్ర్ యుద్ధం తర్వాత ప్రవక్త మృతులతో మాట్లాడటం మరియు సమాధిలోని వ్యక్తి పాదాల శబ్దాన్ని వినడం వంటి హదీసులు ప్రత్యేక సందర్భాలని, సాధారణ నియమం కాదని స్పష్టం చేశారు. మృతులు వినలేరని, వారికి సహాయం చేసే శక్తి లేదని ఖుర్ఆన్ ఆయతుల ద్వారా నిరూపించారు. ప్రళయ దినాన, ఈసా (అలైహిస్సలాం) మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తమ అనుచరులు తమ తర్వాత ఏమి చేశారో తమకు తెలియదని చెప్పడం, మృతులకు ప్రపంచ విషయాలతో సంబంధం ఉండదనేదానికి నిదర్శనం. ప్రజలు ఖుర్ఆన్ మరియు సహీ హదీసులను చదివి, షిర్క్ నుండి తమను తాము రక్షించుకోవాలని వక్త పిలుపునిచ్చారు.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِيْنَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِيْنَ، أَمَّا بَعْدُ.
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబంపై మరియు వారి అనుచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత.

సోదరులారా, గత పాఠంలో మనం సామాన్యంగా ప్రజలు సమాధుల వద్దకు ఎందుకు వెళ్తారు అనే దాని గురించి కొన్ని కారణాలు తెలుసుకున్నాము. వాటికి ఆధారంగా, నిదర్శనంగా, దలీల్‌గా వారు కొన్ని విషయాలు ఏదైతే ప్రస్తావిస్తారో వాటి యొక్క వాస్తవికత ఖుర్ఆన్ హదీసుల వెలుగులో తెలుసుకున్నాము.

సంక్షిప్తంగా మరోసారి మనం చెప్పుకోవాలంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలం నాటి ముష్రికులు ఏకైక అల్లాహ్‌ను సృష్టికర్తగా, ఉపాధి ప్రధాతగా, సర్వ జగత్తుకు నిర్వాహకారునిగా నమ్మినప్పటికీ, కొందరు వలీలను, ఔలియాలను, బాబాలను నిర్ణయించుకుని, అల్లాహ్‌కు చేయనటువంటి ఆరాధనలు వారికి చేసేవారు. ఎందుకు చేసేవారు? మేము చాలా పాపాత్ములం, డైరెక్ట్ అల్లాహ్ వద్ద వెళ్లడానికి మాకు ముఖం లేదు. ఈ బాబాలు, పీర్లు, ఈ ముర్షదులు, ఈ వలీలు, ఔలియాలు వీరి సాధనంగా, వీరి ఆధారంగా, వీరి యొక్క మధ్యవర్తిత్వం వసీలాతో మేము అల్లాహ్ వద్ద చేరుకుంటాము, వారు మా గురించి అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తారు. వారి యొక్క ఈ సాకు ఏదైతే ఉండినదో, ఈ రోజుల్లో సామాన్యంగా మన ముస్లింలు ఎవరైతే సమాధుల వద్దకు వెళ్తున్నారో, బాబాల వద్దకు వెళ్తున్నారో వారి యొక్క సాకు, వారి యొక్క కారణం కూడా అదే. మేము పాపాత్ములం, డైరెక్ట్ అల్లాహ్ వద్ద వెళ్లడానికి మా దగ్గర ముఖం లేదు. అల్లాహ్ యొక్క ఈ పుణ్యాత్ములు, ఔలియాలు వారి యొక్క మధ్యవర్తిత్వంతోనే మనం పోగలుగుతాము. వారి యొక్క సిఫారసుతోనే మనం అల్లాహ్‌కు సన్నిహితులుగా కాగలుగుతాము.

అయితే, సూరె యూనుస్ ఆయత్ నెంబర్ 18, సూరె జుమర్ ఆయత్ నెంబర్ 3 వీటి ఆధారంగా ఇదే అసలైన షిర్క్. ఇలాంటి షిర్క్‌ను ఖండించడానికే ప్రతీ కాలంలో అల్లాహు త’ఆలా ప్రవక్తలను పంపాడు అని మనం తెలుసుకున్నాము.

అంతేకాకుండా ఈ ఆయతులు, ప్రత్యేకంగా సూరె జుమర్ మరియు సూరె యూనుస్‌లో తెలుపబడిన ఈ ఆయతులను మనం చదివినప్పుడు సామాన్యంగా ఈనాటి ముస్లింలు కొందరు ఏమంటారు, ఈ ఆయతులు మాలాంటి వారి గురించి కాదు అవతరించినవి. ఆ కాలంలో విగ్రహాలను పూజించేవారు. ఆ విగ్రహాలకు వ్యతిరేకంగా ఈ ఆయతులు అవతరించాయి. అయితే మనం ఇందులో మరికొన్ని ఆధారాలు తెలిపి ఉన్నాము. ఉదాహరణకు, సూరె ఆరాఫ్ లోని ఈ ఆయతులో అల్లాహు త’ఆలా చాలా స్పష్టంగా చెప్పాడు,

عِبَادٌ أَمْثَالُكُمْ
(ఇబాదున్ అమ్సాలుకుమ్)
మీలాంటి దాసులు మాత్రమే.

అల్లాహ్‌ను కాకుండా మీరు ఎవరైతే ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు మీలాంటి మానవులు మాత్రమే. మీలాంటి దాసులు మాత్రమే. అల్లాహు త’ఆలా చాలా స్పష్టంగా చెప్పారు, మీలాంటి దాసులు, మీలాంటి మానవులు. అంటే మక్కా యొక్క ముష్రికులు ఎవరినైతే వారికి మరియు అల్లాహ్‌కు మధ్య మధ్యవర్తిత్వంగా, సిఫారసుగా నిర్ణయించుకున్నారో వారు కేవలం విగ్రహాలు మాత్రమే కాదు. రాళ్లతో, చెట్లతో, లేక వేరే వాటితో చేసిన కేవలం మూర్తులు మాత్రమే కాదు. సమాధిలో ఉన్న కొందరు పుణ్యాత్ములు, ఔలియాలు వారిని ప్రవక్తల కాలం యొక్క ముష్రికులు పూజించేవారు.

ఉదాహరణకు, హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు గారి యొక్క హదీస్ కూడా వినిపించడం జరిగింది. తాయిఫ్ నుండి తాయిఫ్‌కు దగ్గర మక్కా మార్గంలో ‘లాత్’ అనే ఒక పుణ్యాత్ముడు హజ్ కు వచ్చే వాళ్లకు సత్తువ ఇట్లా తాగించి తినిపించేవాడు. అతను చనిపోయిన తర్వాత అతను చనిపోయిన స్థలంలోనే అతన్ని సమాధి చేసి అక్కడే కొందరు ముజావర్గా కూర్చొని కొద్ది రోజుల తర్వాత వారిని అదే పూజించడం మొదలుపెట్టారు. ఇది సహీ హదీసులో ఉంది.

అంతేకాకుండా, హజ్రత్ నూహ్ అలైహిస్సలాం కాలంలో ఐదుగురు పుణ్యాత్ములు ఏదైతే చనిపోయారో, వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీరి గురించి హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఏం చెప్పారు? నూహ్ అలైహిస్సలాం కాలంలో వీరు పుణ్యాత్ములు. నూహ్ అలైహిస్సలాం కాలంలో ఉన్నటువంటి ముష్రికులు వీరిని పూజించేవారు. అయితే తర్వాత నూహ్ అలైహిస్సలాం కాలంలో వచ్చిన ఏదైతే తూఫాన్ ఉందో ఆ తూఫాన్ తర్వాత ఈ ఐదు పుణ్యాత్ముల విగ్రహాలు ఏదైతే తయారు చేసి పెట్టుకున్నారో అవి ఎక్కడో దాగిపోయి ఉన్నాయి. కానీ షైతాన్ వాడు అమర్ బిన్ లుహై అనే ఒక నాయకుడు మక్కాలో అతనికి ఏదో రకంగా తెలిపి జిద్దా ఒడ్డున, జిద్దాలో సముద్రం ఉంది కదా, సముద్ర తీరాన ఎక్కడో పాతి ఉన్న ఆ విగ్రహాలను తీసి మళ్లీ మక్కాలో తీసుకొచ్చి వాటి విగ్రహారాధన మరోసారి మొదలుపెట్టారు. అయితే అక్కడ వారు పూజించేది కేవలం విగ్రహం అనే కాదు. వీరు పుణ్యాత్ములు. పుణ్యాత్ముల ఒక ఆకారం, ఒక వారి రూపాన్ని మేము పూజిస్తున్నాము. వీరు మాకు ప్రళయ దినాన సిఫారసు చేస్తారు. అటువంటి నమ్మకాలు వారు ఉంచుకునేవారు.

ఇంతవరకు మనం గత పాఠంలో ఏదైతే కొన్ని విషయాలు తెలుసుకున్నామో వాటి సంక్షిప్త విషయాలు ఇప్పుడు మరోసారి చెప్పడం జరిగింది. ఈరోజు పాఠంలో నేను మరో విషయం మీకు తెలుపబోతున్నాను. దానిని మీరు చాలా శ్రద్ధగా వినాలని ఆశిస్తున్నాను. అదేమిటి, చాలా ముఖ్యమైన విషయం. అనేకమంది ప్రజలు సమాధుల వద్దకు వెళ్ళడానికి ఇది కూడా ఒక కారణం. అదేమిటి, సమాధిలో ఉన్న వాళ్ళు మా యొక్క మొరలను వింటున్నారు. మేము ఏదైనా దుఆ చేస్తే మా దుఆలను వారు ఆలకిస్తారు అని వారి నమ్మకం ఉంది. అయితే వాస్తవానికి చనిపోయిన వారు, మృతులు, సమాధిలో ఉన్న వారు మనం బ్రతికి ఉన్న వాళ్ళు వీరి యొక్క మాటలను వింటారా? ఒకవేళ సమాధి వద్దకు వెళ్లి ఏదైనా మొరపెట్టుకుంటే, ఏదైనా దుఆలు చేస్తే, ఏదైనా అరిస్తే వారికి వినే శక్తి ఉందా? ఈ విషయం ఖుర్ఆన్ హదీస్ ఆధారంగా తెలుసుకుందాం.

అయితే, ఎవరైతే సమాధుల వద్దకు వెళ్తున్నారో వారి యొక్క గట్టి నమ్మకం, విశ్వాసం ఏంటి? సమాధిలో ఉన్న వాళ్ళందరూ వింటూ ఉంటారు. ప్రత్యేకంగా ఔలియా అల్లాహ్ ఈ బాబాలు వాళ్ళు మా యొక్క కష్టసుఖాలను మేము ఏదైతే చెప్పుకుంటామో, మొరపెట్టుకుంటామో వాటిని వింటారు అన్నటువంటి నమ్మకం ఉంది. వారి ఆ నమ్మకానికి ఖుర్ఆన్‌లో హదీసులో ఎక్కడైనా ఏదైనా ఆధారం ఉందా? అయితే హదీసు నుండి ఒక ఆధారం, ఒక దలీల్ వారు చూపిస్తారు. అదేమిటి, సహీ బుఖారీలో హదీస్ ఉంది.

ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వలస పోయి వచ్చిన తర్వాత రెండవ హిజ్రీలో, అంటే వలస పోయి వచ్చిన తర్వాత రెండవ సంవత్సరం, మక్కా యొక్క ముష్రికులతో ఒక యుద్ధం జరిగింది. దాని పేరు బద్ర్ యుద్ధం. గజ్వతె బద్ర్. ఆ యుద్ధంలో అల్హందులిల్లాహ్ అల్లాహ్ యొక్క దయ వల్ల ముస్లింలు జయించారు. ముష్రికులు ఓడిపోయారు. ముష్రికుల వైపు నుండి 70 మంది హతమయ్యారు. మరో 70 మంది ఖైదీలు అయ్యారు. అయితే ఆ బద్ర్ ప్రాంతంలో ఒక చిన్న సంఘటన జరిగింది. అదేంటి, ఆ మృతులను, ఎవరైతే ముష్రికులు హతులయ్యారో, చంపబడ్డారో వారిని పెద్ద పెద్ద గోతులు తవ్వి అందులో వారిని పడేయడం జరిగింది. అలాంటి సందర్భంలో ఒకసారి అబూ జహల్ ఇంకా పెద్ద పెద్ద కొందరు నాయకులను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక బావి లాంటిది లోతుగా కొంచెం తవ్వి అందులో వారిని వేసినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ నిలబడి ‘హల్ వజద్తుమ్ మా వఅద రబ్బుకుమ్ హక్కా’. ఏమిటి, అల్లాహ్ మీతో మీ ప్రభువు మీతో చేసిన వాగ్దానాన్ని మీరు పొందారా? అని వారిని అడిగారు. ఎవరిని అడుగుతున్నారు ప్రవక్త గారు అప్పుడు? ఆ చనిపోయిన వాళ్ళను. ఆ యుద్ధంలో ఎవరినైతే చంపడం జరిగిందో ముష్రికులను, వారిని ఒక బావిలో వేస్తున్నారు. అయితే వారిని వేసిన తర్వాత దాని ఒడ్డున మీద నిలబడి ప్రవక్త వారితో సంబోధిస్తూ, వారిని ఉద్దేశించి ఈ మాట అడుగుతున్నారు. అల్లాహు త’ఆలా, మీ యొక్క ప్రభువు మీతో ఏ వాగ్దానం అయితే చేశాడో దానిని మీరు పొందారా? అయితే కొందరు సహాబాలు అన్నారు, ప్రవక్తా వారు మృతులు కదా మీ మాటలను ఎలా వినగలుగుతారు? అప్పుడు ప్రవక్త అన్నారు,

إِنَّهُمْ الْآنَ يَسْمَعُونَ مَا أَقُولُ
(ఇన్నహుముల్ ఆన యస్మఊన మా అఖూల్)
నిశ్చయంగా వారు ఇప్పుడు నేను చెప్పేది వింటున్నారు.

నేను ఏ మాటనైతే అంటున్నానో ఆ మాటను వారు ఇప్పుడు వింటున్నారు అని ప్రవక్త చెప్పారు కదా. ఈ యొక్క హదీసు తోని ఈనాటి ఆ ముస్లింలు దలీల్ ఆధారం తీసుకుంటారు చూడండి. మృతులు వినరు అని మీరు అంటారు. ఇక్కడ ప్రవక్త స్వయంగా వారికి వినిపిస్తున్నారు. సహాబాలకు అనుమానం కలిగింది. అయితే ప్రవక్త వారికి సమాధానం చెప్పారు వింటున్నారు అని. అందుగురించి మృతులు వింటారు.

వారు సహీ బుఖారీలో ఉన్న హదీస్ మరొకటి వినిపిస్తారు. అదేమిటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు,

اَلْعَبْدُ إِذَا وُضِعَ فِي قَبْرِهِ، وَتُوُلِّيَ وَذَهَبَ أَصْحَابُهُ حَتَّى إِنَّهُ لَيَسْمَعُ قَرْعَ نِعَالِهِمْ، أَتَاهُ مَلَكَانِ فَأَقْعَدَاهُ
మనిషి చనిపోయిన తర్వాత అతన్ని సమాధిలో పెట్టి తిరిగిపోతున్న సందర్భంలో, ఎప్పుడైతే వారి బంధుమిత్రులందరూ వెళ్లిపోతూ ఉంటారో వారి చెప్పుల శబ్దాన్ని అతడు సమాధిలో ఉండి అతడు వింటాడు. అప్పుడే ఇద్దరు దేవదూతలు వచ్చి అతన్ని కూర్చోబెట్టి ప్రశ్న అడుగుతారు. 

ఇక్కడ ఏముంది హదీసులో, సమాధిలో ఉన్న ఆ వ్యక్తి అతని యొక్క బంధుమిత్రులు ఎవరైతే వెళ్తున్నారో వారి యొక్క చెప్పుల శబ్దాన్ని వింటారు అని హదీసులో స్పష్టంగా ఉంది. యస్మఉ ఖర్అ నిఆలిహిమ్. వారి చెప్పుల శబ్దాన్ని అతను వింటాడు. అందుగురించే ఈ మన సోదరులు ఎవరైతే సమాధుల వద్దకు వెళ్తూ ఉంటారో, సమాధిలో ఉన్న వాళ్ళు ఔలియాలు బాబాలు వింటారు, అందుగురించి ఈ హదీసులో ఆధారం అని చూపిస్తారు.

కానీ వాస్తవానికి ఈనాటి కాలంలో ఉన్న సమాధులలో లేక సామాన్యంగా ఎవరైనా మృతులు, చనిపోయిన వారు వింటారు అనడానికి ఈ రెండు హదీసులు దలీల్ ఏ మాత్రం కావు. ఎందుకు? మొదటి హదీస్ ఏదైతే ఉందో, ఈ హదీస్ సహీ బుఖారీలో ఇమామ్ బుఖారీ రహమతుల్లాహ్ అలైహ్ నాలుగు చోట్ల ప్రస్తావించారు. అంటే నాలుగుసార్లు వేరే వేరే స్థానాల్లో ఈ హదీసును ప్రస్తావించారు. ఒకటి కితాబుల్ జనాఇజ్‌లో, జనాజా అంతక్రియలకు సంబంధించిన చాప్టర్ ఏదైతే ఉంటుందో అక్కడ, ఇంకా మిగతా మూడుసార్లు కితాబుల్ మగాజి, యుద్ధాల విషయానికి సంబంధించిన హదీసులను ప్రస్తావించాడు ఎక్కడైతే అక్కడ.

అయితే మొదటిసారి కితాబుల్ జనాఇజ్ బాబు అజాబిల్ ఖబ్ర్ హదీస్ నెంబర్ 1370 లో ఎక్కడైతే ఈ హదీస్ వచ్చి ఉందో, ప్రవక్త ఎప్పుడైతే అన్నారో మీరు మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని మీరు పొందారా అని అప్పుడు సహాబాలు అన్నారు, తద్ఊ అమ్వాతన్? మీరు మృతులను పిలుస్తున్నారా? మృతులను సంబోధిస్తున్నారా? దాని యొక్క సమాధానంలో ప్రవక్త ఏం చెప్పారు, ‘మా అన్తుమ్ బి అస్మఅ మిన్హుమ్ వలాకిన్ లా యుజీబూన్’. మీరు వారి కంటే ఎక్కువ ఇప్పుడు వినడం లేదు. అంటే వారు మీ కంటే ఎక్కువ ఇప్పుడు వింటున్నారు. కానీ వారు సమాధానం ఇవ్వలేరు.

ఇదే హదీస్ మరోచోట ఉంది, అక్కడ హదీస్ నెంబర్ అది 4026. అక్కడ సహాబాలు అడిగారు, యా రసూలల్లాహ్ తునాది నాసన్ అమ్వాతా? ఓ ప్రవక్తా, మీరు చనిపోయిన వారిని మృతులను పిలుస్తున్నారా? అయితే ప్రవక్త చెప్పారు, ‘మా అన్తుమ్ బి అస్మఅ లిమా ఖుల్తు మిన్హుమ్’. నేను వారికి చెప్పే విషయం ఏదైతే ఉందో దానిని మీరు వారి కంటే ఎక్కువ వినడం లేదు. అంటే వారు మీ కంటే ఎక్కువ వింటున్నారు.

మూడోచోట హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు అడిగారు అని ఉంది. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు, యా రసూలల్లాహ్ మా తుకల్లిము మిన్ అజ్సాదిన్ లా అర్వాహ లహా. ఆత్మలు లేని ఈ శరీరం వాటితో మీరు సంబోధిస్తున్నారా? వాటికి మీరు వాటితో మీరు వారిని పిలుస్తున్నారా? వారితో మాట్లాడుతున్నారా? అప్పుడు ప్రవక్త ఏమన్నారు, ‘వల్లది నఫ్సు ముహమ్మదిన్ బియదిహ్’. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం ఎవరి చేతిలో ఉందో అతని సాక్షి ‘మా అన్తుమ్ బి అస్మఅ లిమా అఖూలు మిన్హుమ్’. నేను ఇప్పుడు చెప్పే మాటలు మీరు వారి కంటే ఎక్కువ వినలేరు.

అయితే ఇక్కడ ఒక విషయం మనం ఈ హదీస్ ను ఈ ఒక్క హదీస్ నాలుగు చోట్ల నాలుగు స్థానాల్లో ఏదైతే వచ్చి ఉందో అందులో ఏ ఏ పదాలతో విషయం చర్చించబడిందో వాటిని ఒకవేళ మనం శ్రద్ధ వహిస్తే, సహాబాలు ఏదైతే అడుగుతున్నారో, ఓ ప్రవక్తా మీరు మృతులను సంబోధిస్తున్నారా? ప్రాణం ఏమాత్రం లేని ఈ శవాలను, ప్రాణం లేని ఈ శరీరాలతో మీరు మాట్లాడుతున్నారా? అని ఈ అడగడం ద్వారా మనకు ఏం తెలుస్తుంది? అప్పటివరకు సహాబాల విశ్వాసం ఏమిటి? మృతులు వినరు. చనిపోయిన వాళ్ళు వినరు అన్న విశ్వాసమే ప్రబలి ఉండింది. ఇదే మాట అందరికీ తెలిసి ఉండింది. అందుగురించే ఎప్పుడైతే ప్రవక్త మృతులతో మాట్లాడుతున్నారో, ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యంగా వారు అడిగారు.

రెండో విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఇప్పుడు వీరు మీ కంటే ఎక్కువ వింటున్నారు.

اِنَّهُمُ الْآنَ
(ఇన్నహుముల్ ఆన్)
నిశ్చయంగా వారు ఇప్పుడు

అల్ ఆన్ అన్న పదం ఉన్నది అక్కడ. ఇప్పుడు వారు మీ కంటే ఎక్కువ వింటున్నారు. అయితే ఇప్పుడు వారు మీ కంటే ఎక్కువ వింటున్నారు అన్న ఈ పదంలోనే ఇది ఒక ప్రత్యేక సందర్భం అంతే మాత్రం గానీ చనిపోయిన ఏ వ్యక్తి కూడా బ్రతికి ఉన్న వారి, జీవరాశుల మాటలను వినరు అని స్పష్టం అవుతుంది. ఇది ఒక ప్రత్యేక సందర్భం.

మరి ఇదే హదీస్ గురించి హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా గారు ఏం చెప్పారో ఒకసారి వినండి. దాని ద్వారా కూడా సహాబాల యొక్క విశ్వాసం మృతులు వింటారా లేదా అనే విషయం సహాబాలకు ఎలా ఉండింది అది కూడా మనకు తెలుస్తుంది. ఈ హదీస్ హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా వద్దకు వచ్చినప్పుడు, హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారు చెప్పారు, “ప్రవక్త యొక్క ఉద్దేశం ఇక్కడ ఏమిటంటే వారి యొక్క జీవితాల్లో నేను మాటిమాటికి ఏదైతే చెప్పేవాడినో, మీరు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి, అల్లాహ్‌కు ఏ మాత్రం సాటి కల్పించకండి, షిర్క్ చేయకండి అని మాటిమాటికి ఏదైతే నేను చెప్పేవాడినో, ఒకవేళ మీరు నా మాటను వినేది ఉంటే అల్లాహ్ స్వర్గం యొక్క వాగ్దానం మీకు చేస్తున్నాడు, మీరు నన్ను తిరస్కరించేది ఉంటే మీరు నరకంలో వెళ్తారు, ఇలాంటి వారి జీవితంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఏ మాటలైతే చెప్పేవారో అవి సత్యం అని ఇప్పుడు వారికి తెలుస్తుంది. ‘హల్ వజద్తుమ్ మా వఅద రబ్బుకుమ్ హక్కా’. మీ ప్రభువు మీతో చేసిన వాగ్దానం ఏదైతే ఉందో అది నిజం అని మీకు ఇప్పుడు తెలిసిందా? దాన్ని మీరు పొందారా? అది సత్యమే అన్న విషయం ఇప్పుడు తెలిసిందా?”

ఇదే సంఘటన కాకుండా వేరే కొన్ని ఆయతులు ఖుర్ఆన్‌లో ఉన్నాయి. మనిషి చనిపోయినప్పుడు, ఓ దేవా నాకు కొంచెం అవకాశం ఇవ్వు, ఇప్పుడు నాకు తెలిసింది, నాకు కొంచెం అవకాశం దొరికిన గానీ నేను నా ధనాన్ని నీ మార్గంలో ఖర్చు పెడతాను అని కూడా కోరుకుంటారు కొందరు.

ఫిర్ఔన్ చనిపోయేటప్పుడు కూడా ఏమన్నాడు? ఆ, మూసా చెప్పిన మాటలన్నీ కూడా నిజమే. ఇప్పుడు నేను విశ్వాసం మార్గాన్ని అవలంబిస్తాను.

అయితే ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారికి ఆ సందర్భంలో గుర్తు చేస్తున్నారు. అయితే అప్పుడు అల్లాహు త’ఆలా వారికి ప్రవక్త యొక్క మాట వినిపించారు. అదేంటి, ప్రత్యేక సందర్భం. ఈ ప్రత్యేక సందర్భాన్ని మనం ప్రతీ శవం గురించి, ప్రతీ చనిపోయిన వారి గురించి, ప్రత్యేకంగా ఔలియాల గురించి, అంబియాల గురించి ఇంకా వేరే వారి గురించి ఈ మాటలు అక్కడ అతికించవద్దు. ఈ మాటతోని, ఈ యొక్క హదీసుతోని “అందరూ వింటారు” అన్నటువంటి దలీల్ పట్టుకోవడం, దీనిని ఒక ఆధారంగా తీసుకోవడం ఎంత మాత్రం నిజమైనది కాదు. అందుగురించి ఇదే హదీస్ సహీ బుఖారీలో 3976వ హదీస్ లో హజ్రత్ ఖతాదా రహమతుల్లాహ్ అలైహ్ ఏం చెప్తున్నారు,

أَحْيَاهُمُ اللَّهُ حَتَّى أَسْمَعَهُمْ
(అహ్యాహుముల్లాహు హత్తా అస్మఅహుమ్)
వారిని వినిపించేంత వరకు అల్లాహ్ వారికి జీవం పోసాడు

అల్లాహ్ వారిని ఆ సందర్భంలో వారికి జీవం పోసాడు. హత్తా అస్మఅహుమ్, ప్రవక్త యొక్క మాటను వారికి వినిపించాడు. తౌబీఖన్ వ తస్గీరన్ వ నఖీమతన్ వ హసరతన్ వ నదామతన్. ఎందుకు, వారికి ఆ సందర్భంలో బాధ, అయ్యో ప్రవక్త మాటను మేము వినలేదు కదా అన్నటువంటి ఒక బాధ, ఎంతో ఒక షర్మిందాపన్, పశ్చాత్తాపం లాంటిది కలగాలి, ఇంకింత వారికి ఆ ఆవేశం అనేది వారి యొక్క అఫ్సోస్ అనేది పెరిగిపోవాలి అన్న ఉద్దేశంతో ఆ సందర్భంలో అల్లాహు త’ఆలా వారిని మరోసారి లేపి ప్రవక్త యొక్క మాటను వినిపించాడు. అది అంత మటుకు మాత్రమే.

అందుగురించి, ఇప్పుడు నేను కొన్ని ఖుర్ఆన్ ఆయతులు వినిపిస్తాను వాటిని శ్రద్ధగా వినండి. ఖుర్ఆన్ ద్వారా మనకు ఏం తెలుస్తుంది అంటే సామాన్యంగా మృతులు, చనిపోయిన వారు బ్రతికి ఉన్న వారి ఏ మాటను వినలేరు. సూరె నమల్ ఆయత్ నెంబర్ 80లో అల్లాహ్ చెప్పాడు,

إِنَّكَ لَا تُسْمِعُ الْمَوْتَى
(ఇన్నక లా తుస్మిఉల్ మౌతా)
నిశ్చయంగా నువ్వు మృతులకు వినిపించలేవు.

నువ్వు మృతులకు, చనిపోయిన వారికి వినిపించలేవు. అలాగే సూరె రూమ్ ఆయత్ నెంబర్ 52లో ఇలాంటి ఆయతే ఉంది. అక్కడ కూడా ఉంది, ఓ ప్రవక్తా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మృతులకు వినిపించలేవు. అయితే మృతులు వినరు, బ్రతికి ఉన్న వారు తమ ఏ మాటను కూడా మృతులకు వినిపించలేరు అని ఈ ఆయత్ చాలా స్పష్టంగా ఉంది. అంతేకాకుండా అల్లాహు త’ఆలా కోరినప్పుడు, ఏదైనా అవసర సందర్భంగా అల్లాహు త’ఆలాకు ఇష్టమైతే వినిపించవచ్చు. ఆ శక్తి అల్లాహ్‌కు ఉంది. కానీ ఒక సామాన్య నియమం, ఒక రూల్, ఒక పద్ధతి ఏమిటి? మృతులు వినరు. కానీ అల్లాహ్ కోరినప్పుడు వినిపిస్తాడు. అల్లాహ్ స్వయంగా వినిపిస్తాడు. దానికి సాక్ష్యంగా ఈ హదీస్, ఈ ఖుర్ఆన్ యొక్క ఆయతును మనం తెలుసుకోవచ్చు. ఈ ఆయత్ సూరె ఫాతిర్ ఆయత్ నెంబర్ 22.

وَمَا يَسْتَوِي الْأَحْيَاءُ وَلَا الْأَمْوَاتُ
(వమా యస్తవిల్ అహ్యాఉ వలల్ అమ్వాత్)
బ్రతికి ఉన్న వారు, చనిపోయిన వారు ఇద్దరూ సమానులు కాలేరు.

إِنَّ اللَّهَ يُسْمِعُ مَنْ يَشَاءُ
(ఇన్నల్లాహ యుస్మిఉ మన్ యషా)
నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి వినిపిస్తాడు

وَمَا أَنْتَ بِمُسْمِعٍ مَنْ فِي الْقُبُورِ
(వమా అంత బిముస్మిఇన్ మన్ ఫిల్ ఖుబూర్)
మరియు సమాధులలో ఉన్నవారికి నీవు వినిపించలేవు.

ఇక్కడ అల్లాహ్ కోరినప్పుడు వినిపిస్తాడు అని దీంతో కూడా కొందరు పెడమార్గంలో పడిపోతారు. అదేమిటి? అవును ఔలియా అల్లాహ్‌కు వినిపించే శక్తి అల్లాహ్‌కు ఉంది, అందుగురించి మేము మొరపెట్టుకునే మొరలను వారు ఇప్పుడు వింటున్నారు, అల్లాహ్ వినిపిస్తున్నాడు, వారు స్వయంగా వింటారని మేము అనుకుంటలేము. మళ్ళీ ఇలా తిప్పికొట్టి వారు తమ యొక్క విశ్వాసాన్ని మరింత గట్టి పరుచుకునే ప్రయత్నం చేస్తారు. అయితే బుఖారీలోని మొదటి హదీస్ బద్ర్‌లో చనిపోయిన ముష్రికులకు ఏదైతే ప్రవక్త వినిపించారో దానికి ఈ ఆయత్ సాక్ష్యం అవుతుంది.

అంతేకాకుండా చనిపోయిన ప్రతీ వ్యక్తిని సమాధిలో పెట్టినప్పుడు అతన్ని సమాధిలో పెట్టేసి వారి యొక్క బంధుమిత్రులు తిరిగి వస్తున్నప్పుడు అతను ఏదైతే వారి చెప్పుల శబ్దాన్ని వింటాడో, అయ్యో అందరూ నన్ను వదిలేసి నన్ను ఒక్కడిని వదిలేసి పోతున్నారా, నేను ఏకాంతంలో అయిపోయానా, అలాంటి రంది అతనికి కలగడానికి, ఎవరి ఎవరి యొక్క అండదండ నాకు ఉంది అన్న యొక్క ఆలోచనతో నేను ఎంతో అల్లాహ్‌కు వ్యతిరేకంగా కూడా జీవితం గడిపానో, ఇప్పుడు ఈ సమాధిలో నన్ను ఎవరూ కూడా కానడానికి చూడడానికి వస్తలేరు, నేను ఒక్కడిని అయిపోయాను, అలాంటి ఒక ఆవేదన అతనికి కలగడానికి కేవలం వారు వెళ్ళిపోతున్న చెప్పుల శబ్దాన్ని వినిపిస్తాడు, అంతే. ఇంకా వేరే మాటలను వినిపిస్తాడు అని అక్కడ ఇక్కడ లేదు మనకు. అలాంటి విషయం తెలుస్తలేదు.

అందుగురించి సోదరులారా, ఈ రెండు హదీసులను మనం తీసుకొని ఖుర్ఆన్ ఆయతులను మనం తిరస్కరించవద్దు. ఈ రెండు ఆయతులకు రెండు హదీసులను ఈ సూరె ఫాతిర్ యొక్క ఆయత్. ఒకవేళ వీరందరూ వింటున్నారు అని మనం అనుకుంటే, అల్లాహ్ వారిని వినిపిస్తున్నాడు అని అనుకుంటే, ‘ఇన్నల్లాహ యుస్మిఉ మన్ యషా’, అల్లాహ్ తాను కోరిన వారికి వినిపిస్తాడు అని చెప్పేకి ముందు బ్రతికి ఉన్న వారు, చనిపోయిన వారు ఇద్దరూ సమానులు కాజాలరు అని ఏదైతే అంటున్నాడో మరి దాని యొక్క భావం ఏంటి? ఒకవేళ అందరూ వినేది ఉంటే, వారు కూడా బ్రతికి ఉన్న వాళ్ళ మాదిరిగానే అయిపోయారు. అందుగురించి ఈ ఆయతులు ఈ హదీసులను మనం విన్న తర్వాత సామాన్యంగా మృతులు వినరు. ఏదైనా ప్రత్యేక సందర్భంలో, ఏదైనా ఒక ఉద్దేశంతో వినిపిస్తాడు అన్నటువంటి హదీస్ ఎక్కడైనా వచ్చి ఉంటే దానిని అక్కడి వరకే మనం నమ్మాలి గానీ, అంతకంటే ఇంకా ముందుకు వెళ్ళేసి అన్ని విషయాలను వింటారు అని మనం దాంట్లో కలుపుకోవడం ఇది పెడమార్గానికి తీసుకెళ్తుంది.

మరికొందరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఏం విశ్వసిస్తారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో తమ సమాధిలో ఉండి మనల్ని చూస్తున్నారు, మనం చేసే కార్యాలను చూస్తున్నారు, మనం చెప్పే మాట్లాడే మాటలను వింటున్నారు అని కొందరు విశ్వసిస్తారు. అది కూడా ఖుర్ఆన్ హదీసులకు వ్యతిరేకమైన విశ్వాసం.

ఏమిటంటారు తెలుసా వాళ్ళు? ఒక హదీసులో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ చదివినప్పుడు ఆ దరూద్ దేవదూతలు తీసుకెళ్లి ప్రవక్త గారికి వినిపిస్తారు. అయితే సహీ హదీసుల్లో ఇంత విషయమే ఉంది. కానీ మరికొన్ని జయీఫ్ హదీసులలో ఏం వస్తుంది అంటే, ఎవరైనా ప్రవక్త సమాధి వద్దకు వచ్చి దరూద్ సలాం చేస్తే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దరూద్ సలాంకు సమాధానం ఇస్తారు. కానీ ఇది నిరాధారమైన హదీస్. బలమైనది కాదు. అయితే హదీసులు కూడా బలహీనంగా ఉంటాయా? హదీస్ యొక్క పరంపరలో, హదీస్ యొక్క సనదులో పరంపరలో కొందరు అబద్దీకులు, కొందరు తప్పుగా ప్రవక్త వైపునకు మాటలు కల్పించే వాళ్ళు కూడా వస్తారు. హదీస్ యొక్క పండితులు అలాంటి కల్పిత హదీసులను వేరుగా చేసి ఉన్నారు. అయితే సహీ హదీసులో ఎక్కడా కూడా ప్రవక్త డైరెక్ట్ మన యొక్క సలాంను దరూదును వింటారు అని లేదు. ఏ సహీ హదీసులో లేదు. దూరమైనా దగ్గరైనా ఎక్కడ ఉండి మనం దరూద్ చదివినా గానీ ప్రవక్త డైరెక్ట్ గా వింటారు అని ఎక్కడా ఏ హదీసులో కూడా లేదు. అందుగురించి ప్రవక్త కూడా మన మాటలను వింటారు అని మనం ఎప్పుడూ కూడా నమ్మవద్దు విశ్వసించవద్దు.

అయితే, ఇంతవరకు ఈ విషయాలు మనం విన్న తర్వాత నేను ఖుర్ఆన్‌లోని ఒక ఆయత్, ఆ ఆయత్‌కు సాక్ష్యాధారంగా సహీ బుఖారీలోని ఒక హదీస్ వినిపిస్తాను. ఈ ఆయత్ మరియు ఈ హదీస్ విన్న తర్వాతనైనా ఇక మన విశ్వాసాలు కరెక్ట్, నిజమైనవి, శుద్ధమైనవి మరియు ప్రవక్త సహాబాల విశ్వాస ప్రకారంగా ఉండాలి. శవాలు వింటారు అని, వారి సమాధుల వద్దకు వెళ్లి అక్కడ ఎలాంటి షిర్క్ పనులకు, ఎలాంటి మనం తావు ఇవ్వకూడదు, ఎలాంటి మనం అక్కడ మోసాలకు గురికాకూడదు.

అదేవిటండీ ఆ ఆయత్ అంటే, సూరె మాయిదాలో అల్లాహు త’ఆలా ఈసా అలైహిస్సలాం కు సంబంధించిన ఒక సంఘటన తెలిపారు. అదేమిటి, ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త, తండ్రి లేకుండా అల్లాహు త’ఆలా మర్యమ్ అలైహిస్సలాం ద్వారా అతన్ని పుట్టించాడు. ఈ విషయం మనకు తెలిసిందే. అలాగే మనం విశ్వసించాలి. అయితే ఈ రోజుల్లో అనేకమంది క్రైస్తవులు స్వయంగా ఈసా అలైహిస్సలాంనే దేవునిగా పూజిస్తున్నారు. మరికొందరు మర్యమ్ అలైహిస్సలాంను కూడా పూజిస్తున్నారు. ఇంకొందరు ఈసా, పరిశుద్ధాత్మ, యెహోవా అని త్రైత్వ దైవాన్ని (Trinity) పూజిస్తున్నారు. ఇవన్నీ కూడా తప్పుడు విశ్వాసాలు. వారి యొక్క ఈ ఆరాధనలన్నీ కూడా షిర్క్‌లోకి వస్తాయి. స్వయంగా ఈసా అలైహిస్సలాం నన్ను కాదు ఏకైక దేవుణ్ణి పూజించండి అని స్పష్టంగా చెప్పారు. ఖుర్ఆన్ సూరె ఆలి ఇమ్రాన్‌లో ఉంది.

اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ
(ఉ’బుదుల్లాహ రబ్బీ వ రబ్బకుమ్)
నాకు మీకు ప్రభువైన అల్లాహ్‌ను మాత్రమే మీరు ఆరాధించండి.

అలాగే బైబిల్‌లో యోహాను సువార్తలో ఉంది. ఆకాశాల్లో ఉన్న ఆ దేవుణ్ణి పూజించేవారే నిత్య జీవితాన్ని పొందుతారు అని చాలా స్పష్టంగా ఉంది. అయితే ప్రళయ దినాన అల్లాహు త’ఆలా ఈసా అలైహిస్సలాంను పిలుస్తాడు. అక్కడ గట్టిగా ప్రశ్నిస్తాడు. ఆ విషయం ఏంటి? ఆ ప్రశ్నలు ఏంటి? కొంచెం శ్రద్ధగా వినండి.

وَإِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنْتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيْنِ مِنْ دُونِ اللَّهِ
మరియు (ఆ రోజును గుర్తు చేసుకోండి), అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు: ఓ మర్యమ్ కుమారుడవైన ఈసా! నీవు ప్రజలతో, ‘అల్లాహ్‌ను వదలి నన్నూ, నా తల్లినీ ఆరాధ్య దైవాలుగా చేసుకోండి’ అని అన్నావా?

మరియం పుత్రుడైన ఓ ఈసా, అల్లాహ్‌ను వదలి నన్ను నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని నీవు ప్రజలకు చెప్పావా? అని అల్లాహ్ నీలదీసి అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినది. అప్పుడు ఈసా అలైహిస్సలాం ఇలా విన్నవించుకుంటారు. ఏమని,

قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ
ఓ అల్లాహ్, నిన్ను పరమ పవిత్రుడిగా భావిస్తున్నాను. ఏ మాటను అనే హక్కు నాకు లేదో అలాంటి మాటను అనటం నాకే మాత్రం తగదు.

إِنْ كُنْتُ قُلْتُهُ فَقَدْ عَلِمْتَهُ تَعْلَمُ مَا فِي نَفْسِي وَلَا أَعْلَمُ مَا فِي نَفْسِكَ
ఒకవేళ నేను గనక అలాంటిది ఏదైనా అని ఉంటే అది నీకు తెలిసి ఉండేది. నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు. కానీ నీలో ఏముందో నాకు తెలియదు.

إِنَّكَ أَنْتَ عَلَّامُ الْغُيُوبِ
నిశ్చయంగా నీవు సమస్త గుప్త విషయాలను ఎరిగినవాడవు.

مَا قُلْتُ لَهُمْ إِلَّا مَا أَمَرْتَنِي بِهِ أَنِ اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ
నీవు నాకు ఆజ్ఞాపించిన దానిని తప్ప నేను వారికి మరేమీ చెప్పలేదు: ‘అల్లాహ్‌ను ఆరాధించండి, ఆయనే నా ప్రభువు మరియు మీ ప్రభువు.’

وَكُنْتُ عَلَيْهِمْ شَهِيدًا مَا دُمْتُ فِيهِمْ فَلَمَّا تَوَفَّيْتَنِي كُنْتَ أَنْتَ الرَّقِيبَ عَلَيْهِمْ وَأَنْتَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
నేను వారి మధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. కానీ నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత, నీవే వారిపై పర్యవేక్షకుడవుగా ఉన్నావు. మరియు నీవు ప్రతి విషయానికి సాక్షిగా ఉన్నావు.

ఈసా అలైహిస్సలాం ప్రవక్త కదా, అయినా ఇప్పుడు వారందరూ అంటే క్రైస్తవులందరూ వారిని పూజిస్తున్నారు అన్న విషయం ఈసా అలైహిస్సలాంకు తెలుసా? తెలియదు. అందుగురించి ఏమంటున్నారు, నేను వారి మధ్యలో ఉన్నంత వరకే నేను సాక్ష్యంగా ఉన్నాను. ఎప్పుడైతే నీవు నన్ను నీ వద్దకు తీసుకున్నావో, నీవే వారిపై వారిని పర్యవేక్షించి ఉన్నావు. వారు ఏం చేస్తున్నారో నాకేం తెలుసు. ఇది సూరె మాయిదాలోని 116, 117వ ఆయత్.

దీనికి సాక్ష్యాధారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్ ఏంటి? అది కొంచెం శ్రద్ధగా వినండి. కానీ ఈ హదీసులో తెలిపే ముందు, ఈ రోజుల్లో ప్రపంచమంతటిలో ఎక్కడెక్కడ ఏ పెద్ద పెద్ద ఔలియాలు, పెద్ద పెద్ద బాబాలు, పీరీలు, ముర్షదులు ఎవరెవరైతే ఉన్నారో, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్థానం వారి కంటే గొప్పదా లేకుంటే వారందరూ మన ప్రవక్త కంటే గొప్పవారా? సమాధానం ఇవ్వండి. ప్రవక్తనే గొప్పవారు కదా. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు కదా మనకు. అయితే స్వయంగా ప్రవక్త సంగతి ఈ హదీసులో వినండి. ప్రవక్త ఎలా విన్నవించుకుంటున్నారు? ప్రవక్త తమ తర్వాత జరిగిన విషయాలను నాకు తెలియవు అన్నట్టుగా ఎలా ప్రస్తావిస్తున్నారో. మరి ఈ రోజుల్లో మనం ఎలాంటి తప్పుడు విశ్వాసాల్లో, పెడమార్గాల్లో పడి ఉన్నామో మనం మనకు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ హదీస్ సహీ బుఖారీలో హదీస్ నెంబర్ 4625, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ హదీసును హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసంగించారు. ఖుత్బా ఇచ్చారు. అంటే ఏదో ఒక సహాబీతో ప్రత్యేకంగా చెప్పిన విషయం కాదు. 10 మంది 50 మంది 100 మంది ముంగట ఖుత్బాలో ప్రసంగంలో చెప్పిన విషయం. ఆ ప్రసంగంలో ఇలా చెప్పారు. యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా ఇన్నకుమ్ మహ్షూరున ఇలల్లాహి హుఫాతన్ ఉరాతన్ గుర్లా. మీరు అల్లాహ్ వైపునకు లేపబడతారు. మొదటిసారి పుట్టిన స్థితిలో, శరీరంపై బట్టలు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా, సున్నతీలు చేయబడకుండా. మళ్లీ ప్రవక్త ఖుర్ఆన్ యొక్క ఆయత్ చదివారు. సూరె అంబియా ఆయత్ నెంబర్ 104.

كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُعِيدُهُ وَعْدًا عَلَيْنَا إِنَّا كُنَّا فَاعِلِينَ
తొలిసారిగా మిమ్మల్ని పుట్టించిన రీతిలో మలిసారి మిమ్మల్ని మేము లేపుతాము. ఇది మా యొక్క వాగ్దానం. దీనిని మేము పూర్తి చేసి తీరుతాము.

ఇది సూరె అంబియా ఆయత్ నెంబర్ 104 యొక్క అనువాదం. మళ్లీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, వినండి, వ ఇన్న అవ్వలల్ ఖలాయిఖి యుక్సా యౌమల్ ఖియామతి ఇబ్రాహీమ్ అలైహిస్సలాతు వస్సలాం. అందరూ ఏ స్థితిలో లేస్తారు సమాధుల నుండి? నగ్నంగా. బట్టలు లేకుండా. చెప్పులు లేకుండా. సున్నతీలు చేయబడకుండా. అయితే, మొట్టమొదటిసారిగా హజ్రత్ ఇబ్రాహీమ్ అలైహిస్సలాంకు వస్త్రాలు ధరింపజేయబడతాయి. ఆ తర్వాత మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. అయితే, ఆ మైదానే మహ్షర్‌లో, ఆ పెద్ద మైదానంలో ఎక్కడైతే అందరూ, ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు వచ్చిన ఈ జన సమూహం అంతా ఒకే ఒక మైదానంలో సమూహం అవుతారు, జమా అవుతారు. అక్కడ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, వినండి, వ ఇన్నహు యుజాఉ బిరిజాలిన్ మిన్ ఉమ్మతీ ఫయు’ఖదు బిహిమ్ దాతశ్శిమాల్. నేను నా హౌదె కౌసర్ పై నా ఉమ్మతీయులు, నా అనుచర సంఘం వస్తుంది అని నేను వేచిస్తూ ఉంటాను. వారు కొన్ని కొన్ని గ్రూపుల రూపంలో వస్తూ ఉంటారు. కొందరు నా వైపునకు వస్తూ ఉంటారు, ఫయు’ఖదు బిహిమ్ దాతశ్శిమాల్, వారిని నా వద్దకు రానివ్వకుండా ఎడమ వైపునకు నెట్టేయడం జరుగుతుంది. ఫ అఖూల్, అప్పుడు నేను అంటాను, యా రబ్బీ ఉసైహాబీ, ఓ ప్రభువా వీరు నా యొక్క అనుచరులు, నన్ను విశ్వసించిన వారు. ఫ యుఖాల్, అప్పుడు అనబడడం జరుగుతుంది.

إِنَّكَ لَا تَدْرِي مَا أَحْدَثُوا بَعْدَكَ
(ఇన్నక లా తద్రీ మా అహదసూ బ’అదక)
నిశ్చయంగా, నీ తర్వాత వారు ఏ కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని ధర్మం నుండి దూరమయ్యారో నీకు తెలియదు ఆ విషయం.

ఎప్పుడు అనబడుతుంది? ప్రళయ దినాన. హౌదె కౌసర్ వద్ద. హౌదె కౌసర్ వద్ద ప్రవక్త శుభ హస్తాలతో హౌదె కౌసర్ ఆ శుభ జలాన్ని త్రాగడానికి అందరూ గుంపులు గుంపులుగా వెళ్తూ ఉంటారు. ఒక గుంపు వచ్చినప్పుడు వారిని ప్రవక్త వద్దకు రానివ్వడం జరగదు. ఎడమ వైపునకు నెట్టేయడం జరుగుతుంది. అయ్యో నా వారు వాళ్ళు, రానివ్వండి నా దగ్గరికి అని ప్రభువును వేడుకుంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. కానీ ప్రభువు వైపు నుండి సమాధానం ఏమొస్తుంది? నీవు చనిపోయిన తర్వాత, నీ తర్వాత వారు ఏ కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని ధర్మం నుండి దూరమయ్యారో (ఇన్నక లా తద్రీ) నీకు తెలియదు ఆ విషయం.

ఈ హదీస్ ఇంకా ముందుకు ఉంది. కానీ ఇక్కడ నేను ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాను మరోసారి. ఇన్నక లా తద్రీ. నీకు తెలియదు. నీకు ఆ సందర్భంలో నీకు జ్ఞానం లేదు. నీవు చనిపోయిన తర్వాత నీ యొక్క ఈ నిన్ను విశ్వసించే వారు ఏ పెడమార్గంలో పడిపోయారో నీకు తెలియదు. ఈరోజు మనం ఏమనుకుంటున్నాము? ప్రవక్త మనల్ని చూస్తున్నారు, మనం చెప్పే మాట్లాడే మాటలన్నీ, మనం చేసే ప్రార్థనలన్నీ వింటున్నారు. ఇది తప్పు విషయం ఇది. ఈ హదీసుకి వ్యతిరేకంగా ఉందా లేదా వారి యొక్క ఈ విశ్వాసం? ఆ తర్వాత వినండి, ఫ అఖూల్, ప్రవక్త అంటున్నారు, అప్పుడు నేను అంటాను కమా ఖాలల్ అబ్దుస్సాలిహ్, ఎలాగైతే ఆ పుణ్య పురుషుడైన, సదాచరుడైన దాసుడు ఈసా అలైహిస్సలాం చెప్పాడో

وَكُنْتُ عَلَيْهِمْ شَهِيدًا مَا دُمْتُ فِيهِمْ فَلَمَّا تَوَفَّيْتَنِي كُنْتَ أَنْتَ الرَّقِيبَ عَلَيْهِمْ وَأَنْتَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
నేను వారి మధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. కానీ నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత, నీవే వారిపై పర్యవేక్షకుడవుగా ఉన్నావు. మరియు నీవు ప్రతి విషయానికి సాక్షిగా ఉన్నావు.

నేను వారి మధ్యలో ఉన్నంత మాత్రం నేను వారిపై సాక్ష్యంగా ఉన్నాను. ఫలమ్మా తవఫ్ఫైతనీ, ఎప్పుడైతే నీవు నన్ను చంపివేశావో, ఎప్పుడైతే నువ్వు నన్ను నా ప్రాణం తీసుకున్నావో, కున్త అంతర్రఖీబ అలైహిమ్, నీవే వారిని పర్యవేక్షిస్తూ ఉన్నావు. వ అంత అలా కుల్లి షైఇన్ షహీద్, మరియు నీవే సర్వ విషయాలపై సర్వ జగత్తుపై సత్యమైన సాక్షివి.

అయితే సోదరులారా, ఈ హదీస్ ఎంత స్పష్టంగా ఉంది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైతం ఆయన కూడా ఎవరి ఏ మాట వినరు ఇప్పుడు. ఎవరి యొక్క మొరలను ఆలకించలేరు. అలాంటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే తక్కువ స్థానంలో ఉన్న వారి గురించి వారు వింటారు, వారు చేస్తారు, మనకు అన్ని రకాల అనుగ్రహాలు ప్రసాదిస్తారు, ఇలాంటి విశ్వాసాలు, ఇలాంటి నమ్మకాలు మనల్ని ఎంత షిర్క్ లాంటి లోతుకు తీసుకెళ్తాయో మనమే ఆలోచించాలి. ఇ

లా చెప్పుకుంటూ పోతే సోదరులారా, ఖుర్ఆన్‌లో ఇంకా ఎన్నో ఆయతులు ఉన్నాయి, ఎన్నో హదీసులు ఉన్నాయి. ఇలాంటి తప్పుడు విశ్వాసాలకు వ్యతిరేకంగా. కానీ, కొంత సమయం ఉంది గనుక కేవలం ఒకే ఒక ఆయత్, దాని యొక్క అనువాదం మీ ముందు తెలిపి నేను ఈ యొక్క ప్రసంగాన్ని సమాప్తం చేస్తాను. ఇది సూరె ఫాతిర్. సూరె ఫాతిర్‌లోని ఆయత్ నెంబర్ 13, 14. అల్లాహ్ అంటున్నాడు,

ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ
(దాలికుముల్లాహు రబ్బుకుమ్ లహుల్ ముల్క్)
ఆయనే అల్లాహ్, మీ ప్రభువు, ఆధిపత్యం ఆయనదే.

وَالَّذِينَ تَدْعُونَ مِنْ دُونِهِ مَا يَمْلِكُونَ مِنْ قِطْمِيرٍ
(వల్లదీన తద్ఊన మిన్ దూనిహీ మా యమ్లికూన మిన్ ఖిత్మీర్)
మరియు ఆయనను వదలి మీరు పిలిచేవారు ఖర్జూరపు బీజంపై ఉండే పొరంత కూడా అధికారం కలిగి లేరు.

ఆయన్ని కాకుండా, ఆయన్ని వదలి మీరు ఎవరెవరినైతే మొరపెట్టుకుంటున్నారో, ఎవరెవరినైతే మీరు పిలుస్తున్నారో, దుఆలు చేస్తున్నారో, మా యమ్లికూన మిన్ ఖిత్మీర్, ఖర్జూరపు బీజంపై ఉన్నటువంటి మరీ పలుచని ఆ పొర అంత మాత్రం శక్తి కూడా వారికి లేదు. మీరు అల్లాహ్‌ను కాకుండా ఎవరినైతే పూజిస్తున్నారో, ఎవరినైతే మొరపెట్టుకుంటున్నారో వారి వద్ద ఖర్జూరపు గుట్లి, దాని యొక్క బీజంపై చాలా పలుచని పొర ఏదైతే ఉంటుందో అంత శక్తి కూడా వారి వద్ద లేదు.

إِنْ تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ
(ఇన్ తద్ఊహుమ్ లా యస్మఊ దుఆఅకుమ్)
ఒకవేళ నీవు వారిని మొరపెట్టుకుంటే మీ మొరలను వారు ఆలకించలేరు, వినలేరు.

وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ
(వలవ్ సమీఊ మస్తజాబూ లకుమ్)
ఒకవేళ వారు విన్నా, మీకు సమాధానం ఇవ్వలేరు.

లేదు వింటారు, వింటారు, వింటారు అని ఏదైతే మీ విశ్వాసం ఉందో, ఒకవేళ విన్నా గానీ మస్తజాబూ లకుమ్, మీకు ఎలాంటి జవాబ్, సమాధానం ఇవ్వలేరు. అల్లాహ్ అంటున్నాడు, ఒకవేళ మీ యొక్క బలహీన విశ్వాసం ఉంది కదా లేదు వింటున్నారు అని, ఒకవేళ విన్నా గానీ సమాధానం ఏ మాత్రం ఇవ్వలేరు. సహీ బుఖారీలోని మొదటి హదీస్ ఏదైతే వినిపించానో అక్కడ కూడా ప్రవక్త అదే చెప్పారు. ఇప్పుడు వారు వింటున్నారు కానీ జవాబు ఇవ్వలేరు. సమాధానం ఇవ్వలేరు. బదులు పలకలేరు. అల్లాహ్ ఏమంటున్నాడు ఇక్కడ? ఒకవేళ మీ విశ్వాస ప్రకారంగా, ఏదైనా అవసరం పడి, ఏదైనా సందర్భంలో మేము వారికి వినిపించినా గానీ వారు సమాధానం చెప్పలేరు, ఇవ్వలేరు.

وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ
మరియు ప్రళయ దినాన వారు మీ షిర్క్‌ను తిరస్కరిస్తారు.

మరియు ప్రళయ దినాన యక్ఫురూన బిషిర్కికుమ్. మీరు అల్లాహ్‌తో పాటు వారిని ఏదైతే సాటి కల్పించారో దీనిని వారు తిరస్కరిస్తారు. తిరస్కరిస్తారు. అల్లాహ్ మీరు అల్లాహ్‌తో పాటు మీరు వారిని ఏదైతే సాటి కల్పిస్తున్నారో వాటి దానిని వారు తిరస్కరిస్తారు. అంటే ఏంటి? అంటే వారికి ఈ విషయం తెలియదు. ఒకవేళ తెలిసేది ఉంటే ఎందుకు తిరస్కరిస్తారు? తెలిసేది ఉంటే ఎందుకు తిరస్కరిస్తారు? మీరు ఇక్కడ మొరపెట్టుకున్న విషయం, అల్లాహ్‌ను కాకుండా వారిని మీరు ఏదైతే దుఆ చేస్తున్నారో ఇవన్నీ విషయాలు వాస్తవానికి వారు వినలేరు, వారికి ఏమాత్రం తెలియదు. అందుగురించే ప్రళయ దినాన ఎప్పుడైతే వీరు వెళ్తారో, అక్కడ కూడా వారు వీరి యొక్క ఈ షిర్క్‌ను తిరస్కరిస్తారు. ఈ తిరస్కరిస్తారు అన్న విషయం బహుశా ఇంకొందరికి అర్థం అవతలేదు అనుకుంటా. సూరె బఖరాలో, సూరె అహ్కాఫ్‌లో 26వ పారా స్టార్టింగ్ ఆయతులలోనే ఐదు ఆరు ఆయతులలోనే అక్కడ విషయం ఉంది. సూరె బఖరాలో రెండవ అధ్యాయం అంటే రెండవ పారా ఏదైతే ఉందో, అందులో సగం అయిన తర్వాత ఇంచుమించు సుమారు ఒక క్వార్టర్ పారా అయిపోయిన తర్వాత

إِذْ تَبَرَّأَ الَّذِينَ اتُّبِعُوا مِنَ الَّذِينَ اتَّبَعُوا وَرَأَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْأَسْبَابُ
(ఆ రోజును గుర్తు చేసుకోండి), ఎప్పుడైతే అనుసరించబడిన వారు తమను అనుసరించిన వారి నుండి వైదొలగిపోతారో, మరియు వారు శిక్షను చూస్తారో, మరియు వారి మధ్య సంబంధాలన్నీ తెగిపోతాయో.

ఆ ఆయతుల సంగతి ఆ ఆయతులను దాని యొక్క వ్యాఖ్యానం చదవండి. ఏమవుతుంది, సహీ బుఖారీలో వివరణ ఉంది. ప్రళయ దినాన ప్రజలందరూ ఆ మైదానే మహ్షర్‌లో జమా అవుతారు కదా, అక్కడ అల్లాహు త’ఆలా ఎవరెవరు ఎవరెవరిని మొరపెట్టుకునేవారో వారి వెంట వెళ్ళండి అని అన్నప్పుడు, ఈ ఇమాములను, పీరీలను, ముర్షదులను, బాబాలను వారందరినీ మొరపెట్టుకునేవారు వారి వారిని వెనుకులాడుతూ ఉంటారు. వెనుకులాడి ఆ మీరే కదా పీరానే పీర్ షేఖ్ అబ్దుల్ ఖాదర్ జీలాని, మీరే కదా పెద్ద గుట్ట వాళ్ళు, మీరే కదా ఈ విధంగా వారి వారి వద్దకు వెళ్లి వారి వెంట ఉండి వారి యొక్క సిఫారసు పొందడానికి వారి వెనక వెళ్లే ప్రయత్నం చేస్తారు ప్రళయ దినాన. అప్పుడు వారు వీరిని చూసి ఓ అల్లాహ్ వీరు మమ్మల్ని పూజించే వారు కాదు, మమ్మల్ని మొరపెట్టుకునే వారు కాదు, వీరు మాకు శత్రువులు, మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మాకు వీరికి ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టంగా చెప్తారు.

సోదరులారా, ఖుర్ఆన్‌లో ఈ ఆయతులు, హదీసుల్లో ఈ విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అసలైన రోగం, అసలైన పెద్ద సమస్య ఏంటంటే ఇలాంటి ఆయతులను ఇలాంటి హదీసులను మనం చదవడం లేదు. ఈ సమాధుల వద్ద ఉండే మౌల్వీలు, ఇలాంటి పండితులు మన సామాన్య ప్రజలకు తెలపడం లేదు. అందుగురించి సామాన్య ప్రజలు ఇలాంటి ఘోరమైన షిర్క్‌లో పడిపోతున్నారు.

అల్లాహు త’ఆలా మనందరికీ సరియైన సన్మార్గం మరియు తౌహీద్, ఈ నిజమైన అఖీదా విశ్వాసానికి సంబంధించిన విషయాలు ఖుర్ఆన్ హదీస్ ఆధారంగా మరిన్ని ఎక్కువగా తెలుసుకునే భాగ్యం అల్లాహ్ కలిగించుగాక. ఈ రోజుల్లో ప్రజలు ఏదైతే షిర్క్‌లో పడి ఉన్నారో వాటి నుండి అల్లాహు త’ఆలా వారిని రక్షించుగాక. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=8426

ఇతరములు:

ధర్మ విద్య ఎందుకు నేర్చుకోవాలి? [ఆడియో & టెక్స్ట్]

ధర్మ విద్య ఎందుకు నేర్చుకోవాలి?
https://youtu.be/dkJiN7q3VZA (38నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం ఇస్లాంలో ధార్మిక విద్య యొక్క ప్రాముఖ్యత మరియు దాని విధిగా ఉండటంపై దృష్టి సారిస్తుంది. ప్రపంచ విద్యకు లభించే విలువను, ధార్మిక విద్య పట్ల ప్రజల నిర్లక్ష్యంతో పోల్చి చూపిస్తుంది. కంపెనీ నియమాలు పాటించడం ఉద్యోగానికి ఎలా అవసరమో, సృష్టికర్త నిర్దేశించిన మార్గాన్ని అనుసరించడం మానవ గౌరవాన్ని నిలబెట్టడానికి అంతకంటే ముఖ్యం అని వక్త ఉద్ఘాటించారు. ధార్మిక విద్య అంటే ఒక ఉత్తమ మానవునిగా ఎలా జీవించాలో సృష్టికర్త నేర్పిన పద్ధతి అని నిర్వచించారు. విద్యను అభ్యసించడం మొదలుపెట్టిన క్షణం నుండే పుణ్యాలు లభిస్తాయని, అది స్వర్గానికి మార్గాన్ని సులభతరం చేస్తుందని, మరియు విద్యార్థి కోసం సృష్టిలోని ప్రతి జీవి ప్రార్థిస్తుందని వివరించారు. ఇస్లాం యొక్క మొట్టమొదటి ఆదేశం “ఇఖ్రా” (చదువు) అని గుర్తుచేస్తూ, జ్ఞానం ఇస్లాంకు పునాది అని స్పష్టం చేశారు.

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం)
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబంపై మరియు వారి అనుచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత.

మహాశయులారా, అల్లాహ్ దయతో ఈరోజు మనం, ధర్మ విద్య అభ్యసించడం, ధర్మ జ్ఞానం నేర్చుకోవడం దీనికి సంబంధించిన ఘనతలు ఏమిటి? మరియు ధర్మ జ్ఞానం నేర్చుకోవడం మనపై విధిగా ఉందా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

సామాన్యంగా ఈ రోజుల్లో ప్రజలు, రండి ఒకచోట కూర్చుందాం, ఫలానా రోజు మనం మస్జిద్ లో ఒక కూటమి ఉంది, ఒక ఇజ్తిమా ఉంది, అక్కడికి వెళ్లి ధర్మ విద్య నేర్చుకుందాము, ధర్మ జ్ఞానం నేర్చుకుందాము అని ఎవరికైనా మనం ఆహ్వానిస్తే, ధర్మ విద్య సమావేశాల్లో పాల్గొనడానికి మనసు అంతగా ఆకర్షించదు. అదే వేరే ఏదైనా జనరల్ ప్రోగ్రాం గానీ లేక వేరే ఏదైనా ఆటపాటల ప్రోగ్రాం అయితే, చెప్పకున్నా గానీ కేవలం తెలిస్తే సరిపోతుంది. ప్రజలు తమకు తామే వచ్చేస్తారు.

అంతకు ముందు మనం ధర్మ విద్య నేర్చుకోవడం మనపై విధియా? నేర్చుకోకపోతే నష్టం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాము.

ఈ ప్రశ్నకు సమాధానం డైరెక్ట్ సూటిగా ఖురాన్ మరియు హదీసు ఆధారంగా ఇచ్చే ముందు ఒక చిన్న సంఘటన, ఒక చిన్న విషయం మనం మాట్లాడుకుందాము. అదేమిటంటే, ఈరోజు ఒక వ్యక్తి కలిశాడు, జుహర్ కంటే కొంచెం ముందు. నాకు తెలిసిన వ్యక్తి, అతని బావ గురించి చెప్తున్నాడు. ఏమని?

మొన్న మూడు నాలుగు రోజుల క్రితం నేను ఫోన్ చేశాను అతనికి, అంటే మా బావకు. ఒక ట్రైనింగ్ లో, ఏం ట్రైనింగ్ నాకు తెలియదు కానీ, ఆ ట్రైనింగ్ విషయంలో ఢిల్లీకి వచ్చాడు. ప్రాపర్ అసలు ఉండేది హైదరాబాద్. ఢిల్లీకి వచ్చాడు అని. ఈరోజు నేను ఫోన్ చేశాను, చేసేసరికి ఈరోజు నైట్ లో దమ్మాంకు ఫ్లైట్ ఉంది, అతను ఒక నెల విజిట్ వీసా మీద ఒక ఏదో పెద్ద కంపెనీలో ఏదో సాఫ్ట్వేర్ కు సంబంధించిన మంచి చదువు చదివి ఉన్నారు, మంచి డిగ్రీ చేసి ఉన్నారు. దాని మీద కంపెనీ అతన్ని పంపుతుంది. టికెట్, ఇక్కడికి వచ్చిన తర్వాత జీతం, అన్నీ వాళ్ళే భరిస్తున్నారు.

హైదరాబాద్ నుండి బయలుదేరే లేరి, ఇక్కడ దమ్మాంలో చేరుకునేసరికి ప్రయాణ ఖర్చులు ఏదైతే అంటాం కదా? టికెట్ కాదు, కేవలం జేబు ఖర్చుకు ప్రయాణ ఖర్చులు అంటాం కదా, 300 డాలర్లు ఇచ్చారంట. 300 డాలర్లా? మాషా అల్లాహ్. కేవలం ప్రయాణ ఖర్చులు. హైదరాబాద్ నుండి దమ్మాం వచ్చేసరికి ఎన్ని గంటలు పడుతుంది? మహా ఎక్కువ అంటే ఐదు, ఆరు గంటలు అంతే.

తర్వాత ఏం చెప్పాడంటే, వాస్తవానికి ఎవరు ఎంత గొప్ప విద్య అభ్యసించి, ఎంత పెద్ద డిగ్రీలు సంపాదించి, ఆ ప్రకారంగా జీవితం గడుపుతారో, అతనికి ఇహలోకంలో ఎంత హైఫై, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి.

అయితే అతను చెప్పిన సంఘటన మీద కొంచెం గ్రహిస్తే, ఈ ప్రపంచంలో ప్రపంచానికి సంబంధించిన ఏదైనా విద్య చాలా ఎక్కువ మోతాదులో, పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించి నేర్చుకుంటే, దానికి అనుకూలంగా మంచి హోదా అంతస్తులు, మంచి జీతాలు, మంచి ఉద్యోగాలు లభిస్తాయి అన్నటువంటి ఆశ మనిషికి ఉంటుంది.

దీనిని బట్టి మీరు ఒక విషయం తెలుసుకోండి. ప్రపంచానికి సంబంధించిన విద్య నేర్చుకొని లక్షలు ఖర్చు పెట్టి అంతా నేర్చుకున్న తర్వాత, దానికి తగిన ఫలం కూడా మనకు లభిస్తుంది అన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో, మన సృష్టికర్త పంపించినటువంటి గ్రంథం, దాని యొక్క విద్య మనం నేర్చుకుంటే ఏం లాభం ఉంటుంది అని అనుకోవడం, ఇది మన సృష్టికర్త పట్ల మనకు ఎంతటి గొప్ప భావన మనసులో ఉందో అట్లాగే మనకు అర్థమైపోతుంది. ఆలోచించండి. మనుషులు, ప్రజలు తయారు చేసిన విద్యలు, వారు స్వయంగా పుస్తకాలు రచించి, ఇహలోకంలో కొన్ని విషయాలు కనుక్కొని, వాటికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకొని, మంచి హైఫై ఉద్యోగాలు దొరికినందుకు ఎంత సంతోషించిపోతున్నారు, ఎంత సంబరపడుతున్నారు.

అదే మన సృష్టికర్త అయిన అల్లాహ్ ఆయనకు సంబంధించిన విద్య, ఆయనకు సంబంధించిన విషయాలు, ఆయన ఇచ్చిన ఆదేశాలు, ఆయన తమ అతి గౌరవనీయులైన మహనీయ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చిన ఆదేశాలు నేర్చుకోవడం ఎంతో హీనంగా, ఎంతో తక్కువగా మనం భావిస్తున్నామంటే, మనమే ఆలోచించుకోవాలి, మన మనసులో, మన హృదయంలో అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అదే విధంగా నేను అల్లాహ్ తో కూడా మహబ్బత్ కర్తా హు, నాకు అల్లాహ్ పట్ల పిచ్చి ప్రేమ ఉంది, అని ఏదైతే మనం నోటితో అంటామో, అది ఎంతవరకు నిజమనేది అట్లాగే మనం తెలుసుకోవచ్చు.

రెండో విషయం. దీనికి సంబంధించిందే. ఏదైనా కంపెనీలో మంచి ఉద్యోగం మనం పొందిన తర్వాత, కేవలం ఇప్పుడు ఊహించండి, ఒక వ్యక్తి హైఫై డిగ్రీలు సంపాదించి మంచి ఉద్యోగం అతను పొందాడు. కంపెనీలోని రూల్స్ రెగ్యులేషన్స్, డ్యూటీ టైమింగ్స్, ఆ డ్యూటీ ఎలాంటిదో, దానికి సంబంధించిన మరి కరెక్ట్ గా చేసినప్పుడే కదా అతను అంత జీతం వేసేది? ఒకవేళ ఏమైనా దొంగ గ్యాంబ్లింగ్ చేసి, పని చక్కగా చేయకుంటే, ఏ విధంగా, ఏ పద్ధతిలో చేయాలో అలా చేయకుంటే, ఒక నెల, రెండేళ్లు ఏదైనా అట్లాంటి మిస్సింగ్ చేస్తే, తర్వాత అయినా గాని పట్టుబడవచ్చు కదా? అతని అంతటి గొప్ప ఉద్యోగం అంతా వృధా అయిపోవచ్చు కదా? సంవత్సరం, రెండు సంవత్సరాల క్రితం సత్యం కంప్యూటర్ యొక్క యజమాని, ఏం పేరు మర్చిపోయాను? రామలింగరాజు, అతని పరిస్థితి, కొందరు అంటారు అతను వాస్తవానికి డబ్బులు దోచాడు, దొంగలించడం, ఏదైనా గ్యాంబ్లింగ్ చేయడం అలాంటివి చేయలేదట. ఏదో కేవలం కంపెనీని ఇంకా డెవలప్ చేసే ఉద్దేశంతోనే ఏదో లెక్కలు కొంచెం అటూ ఇటూ చేశారు అని కొందరు అంటారు. వాస్తవం ఏంటో మనకు తెలియదు. కానీ ఒక ఉదాహరణ మీకు చూపిస్తున్నాను. సత్యం కంప్యూటర్ అంటే ఇండియాలోనే కాదు, హైదరాబాద్ లోనే కాదు, వరల్డ్ లెవెల్ లో ఇంత అతనికి హోదా అంతస్తు ఉండేది. కానీ చిన్నపాటి మిస్టేక్ చేసినందుకు, తప్పు చేసినందుకు,

అయితే, దేవుడు అల్లాహ్ త’ఆలా మనల్ని అంటే ముందు మనం మానవుల్ని, ఇహలోకంలో సర్వ సృష్టిలో ఒక అతి ఉత్తమమైన సృష్టిగా మనకు హోదా అంతస్తు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అందులో ఇంకా మనం ఎవరైతే మనకు మనం ముస్లింలము అని అనుకుంటామో, ఇస్లాం పై ఉన్న వాళ్ళం అని మనం భావిస్తామో, మనకు మనుషుల్లోనే, మానవుల్లోనే ఇతర జాతులపై ఒక హోదా అంతస్తు, ఒక గౌరవం అనేది ఉందా లేదా? ఉంది. మరి ఈ గౌరవం, ఈ హోదా అంతస్తు ఎలా వచ్చేస్తుంది? విద్య లేకుండా, ఎలాంటి మనకు జ్ఞానం లేకుండా అలాగే మనం సంపాదించాలంటే ఈ హోదా దానికి మనం అర్హులం అవుతామా? ఎంతమాత్రం కాము.

షరియత్ యొక్క ఇల్మ్, ధర్మ జ్ఞానం, ధర్మశాస్త్ర జ్ఞానం ఎంత మనకు అవసరం ఉన్నదో ఖురాన్, హదీసుల ఆధారంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ అది తెలపడానికి ముందు నేను ఇలాంటి కొన్ని ఉదాహరణల ద్వారా మీకు తెలుపుతున్నాను విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది డైరెక్ట్ ఖురాన్ హదీస్ ఏం చెప్తే, ఆ ఇదేంటి ఖురాన్ హదీస్ తప్ప ఇంకా వేరే రానే రాదా? ఇది మాకు విని విని బోర్ అవుతుందయ్యా అని అంటుంటారు. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం.

వాస్తవానికి ఈ 21వ శతాబ్దంలో సైన్స్, మెడికల్ సైన్స్, ఇంకా వేరే టెక్నాలజీలో ఏ డెవలప్మెంట్ అయితే మనం చూస్తున్నామో, కొందరు శాస్త్రార్థులు ఏమంటారో తెలుసా? సైన్స్, టెక్నాలజీ యొక్క డెవలప్ అనేది ఇంతకుముందు కాలాల్లో ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఎందుకు జరిగింది? దానికి అసలు మూలం ఇది.

అల్లాహ్ పంపినటువంటి దివ్య గ్రంథం. అంటే ఈ బుక్, అంటే ఈ దివ్య గ్రంథం, సైన్స్ బుక్ అని నేను చెప్పడం లేదు. టెక్నాలజీకి సంబంధించిన దీని యొక్క ముఖ్య ఉద్దేశం, మానవుడు ఇహలోకంలో మంచి జీవితం ఎలా గడపాలి, పరలోకంలో స్వర్గం ఎలా పొందాలి. ఆ మార్గం చూపుతుంది. ఇంకా, మనిషి ఏ తప్పుడు మార్గాలను అవలంబిస్తే స్వర్గంను కోల్పోయి నరకం పాలవుతాడో అది తెలుపుతుంది. సంక్షిప్తంగా నేను తెలిపే విషయం. కానీ ఇందులో, ఈనాటి కాలంలో విద్యకు సంబంధించిన ఎన్ని రకాలు ఉన్నాయో వాటన్ని మూల విషయాలు ఇందులో ఉన్నాయి. దీని మీద రీసెర్చ్ చేస్తూ చేస్తూ చేస్తూ ఇంకా ముందుకు సాగుతున్నారు.

కానీ మనం, మనకు మనం ముస్లింలం అని అనుకునే వాళ్ళం, ఇల్లా మన్ రహిమ రబ్బు, చాలా అరుదైన, చాలా తక్కువ మంది తప్ప, అనేక మంది ముస్లింలం ఈ ధర్మ విద్య నుండి, ఖురాన్ యొక్క విద్య నుండి దూరం అయినందుకే దినదినానికి మన పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. ఇలాంటి సందర్భంలోనే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆ హదీసును గుర్తుంచుకోండి.

إِنَّ اللَّهَ يَرْفَعُ بِهَذَا الْكِتَابِ أَقْوَامًا وَيَضَعُ بِهِ آخَرِينَ
(ఇన్నల్లాహ యర్ఫ’ఉ బి హాదల్ కితాబి అఖ్వామవ్ వయద’ఉ బిహి ఆఖరీన్)
నిశ్చయంగా అల్లాహ్ ఈ గ్రంథం ద్వారా కొందరు ప్రజలను ఉన్నత స్థానానికి తీసుకువస్తాడు, మరియు దాని ద్వారానే మరికొందరిని పడగొడతాడు.

అల్లాహ్ త’ఆలా ఈ గ్రంథం ద్వారా ప్రజల్లో కొందరిని పై స్థానానికి తీసుకొస్తాడు. ఎవరు వారు? ఖురాన్ ను చదివేవారు, దీని విద్య అభ్యసించేవారు, దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా ఆచరించేవారు. ఇంకా ఎవరైతే ఈ ఖురాన్, దీని నుండి వెనుతిరుగుతారో, దీన్ని నేర్చుకోకుండా దూరం అవుతారో, దీని మీద ఏ నమ్మకం, ఏ విశ్వాసం, దీని మీద ఎలా ఆచరించాలో అలా ఆచరించకుండా ఉంటారో, వారి గురించి ఏం చెప్పారు?

وَيَضَعُ بِهِ آخَرِينَ
(వయద’ఉ బిహి ఆఖరీన్)
మరియు దాని ద్వారానే మరికొందరిని పడగొడతాడు.

వారిని చాలా అధోగతికి పాలు చేస్తాడు. చాలా తక్కువ స్థానానికి. అందుగురించి సోదరులారా, ఈ హదీస్ ఇలాంటి సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. మనిషికి ధర్మ విద్య, తను ఈ జఠర కడుపు గురించి ఏదైతే తింటాడో, త్రాగుతాడో, బ్రతకడానికి రేపటి రోజు మళ్లీ లేచి నిలబడి మంచి ఏదైనా మనం పని చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నాలుగు ముక్కలు తింటాడో, ఆ కూడు కంటే, ఆ భోజనం కంటే ధర్మ విద్య ఎంతో ముఖ్యమైనది.

ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం రహమతుల్లాహ్ అలైహ్ ఒక సందర్భంలో చెప్తారు, ధర్మ విద్య మనిషికి లభించే దొరికే ఉపాధి కంటే ఎంతో ముఖ్యం. ఒకవేళ మనిషికి తిండి లేకుంటే ఏం నష్టం జరుగుద్ది? ఇహలోకంలో జీవితం కోల్పోతాడు. తింటూ బతికినా గాని, ఉపవాసంతో ఉన్నా గాని ఒక రోజు చనిపోయేదే ఉంది. కానీ ధర్మ విద్య లేకుండా, విశ్వాసపరమైన జీవితం గడపకుండా అతను చనిపోయాడు అంటే, శాశ్వతంగా సదాకాలం నరకంలో ఉండే అలాంటి దుర్భాగ్యం కూడా కలగవచ్చు. అందుగురించి ఈ లోకం మనం సామాన్యంగా తెలుగులో ఎన్నో సామెతలు ఉన్నాయి, నీటి బుగ్గ లాంటిది. ఒక ముస్లిమేతర తెలుగు కవి, క్షణమైన మన జీవితం అని ఒక పాట కూడా పాడాడు.

ఈ తక్కువ వ్యవధి, కొద్ది రోజుల్లో అంతమైపోయే జీవితంలో ధర్మ విద్య నేర్చుకొని, మనం దీని ప్రకారంగా జీవితం గడిపితే, చనిపోయిన తర్వాత జీవితం ఏదైతే శాశ్వతంగా ఉందో అక్కడ మనం బాగుపడతాము.

మరో విషయం. మీరు ఈ ప్రాపంచిక జీవితంలో ఏ పని చేయాలన్నా, మన కడుపు గురించి, పొట్టలో మన కడుపులో రెండు ముక్కలు రావడానికి ఏ పని చేయాలన్నా దానికి సంబంధించిన జ్ఞానం నేర్చుకోవడం తప్పనిసరి. అవునా కాదా? లేనిదే అది మనం ఏమీ చేయలేము. అయితే ఈ నాలుగు ముక్కల గురించి, 50, 60 సంవత్సరాల జీవితం ఏదైతే మనం గడుపుతామో, అందులో కొంచెం సుఖంగా ఉండడానికి మనం ఎంత విద్య నేర్చుకొని, ఎంత సంపాదించి, ఎంత మనం కూడబెట్టుకుంటామో, ఆ సదాకాలమైన, శాశ్వతమైన ఆ జీవితం సుఖపడడానికి మనకు ఏ విద్య, ఎలాంటి ఆచరణ అవసరం లేదా?

ఎవరైతే ధర్మ విద్య అవసరం లేదు అని అనుకుంటున్నారో, వారు ఆలోచించాలి. ఇహలోకంలో ఒక్క పూట అన్నం దొరకడానికి మనం రెక్క ఆడనిది మన డొక్క నిండదు. అలాంటి పరిస్థితిలో పరలోకం, శాశ్వతమైన జీవితం, అక్కడి సుఖం మనం పొందాలంటే ఉక్కెక్కనే దొరకాలి? ఎలాంటి ఖర్చు లేకుండా దొరకాలి? ఏ విద్య అభ్యసించకుండా దొరకాలి? ఏ మంచి ఆచరణ లేకుండా దొరకాలి? కేవలం పేరుకు ముస్లిం అని మనం అనుకుంటే సరిపోతుంది అని అనుకోవడం ఇది ఎంత మూర్ఖత్వమో ఆలోచించాలి.

అందుకే సోదరులారా, బహుశా ఈ జనరల్ టాపిక్, ఇలాంటి కొన్ని ఉదాహరణల ద్వారా ధార్మిక విద్య అనేది ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది.

ధార్మిక విద్య అంటే ఏమిటి? సామాన్యంగా కొందరు ఏమంటారు, అరే నేను ఒక జనరల్ గా ఒక మనిషిగా మంచి మనిషిగా బ్రతకాలనుకుంటా కానీ, మస్జిద్ కి పోవడం, ధర్మ విద్య నేర్చుకోవడం ఈ.. నేను ఇది చాలా క్రిటికల్ ఇవన్నీ, ఇదంతా దీనివల్ల గొడవలు జరుగుతాయి అది ఇది అని కొందరు తప్పుడు భావనలో కూడా పడతారు. అసలు మనం ధార్మిక విద్య, ధర్మ విద్య, ధర్మ జ్ఞానం అని అంటున్నాం కదా, ధార్మిక విద్య అంటే ఏంటి?

వాస్తవానికి సోదరులారా, ధార్మిక విద్య అంటే మనం ఒక ఉత్తమ మనిషిగా, ఉత్తమ మనిషిగా ఎలా జీవించగలుగుతామో ఇహలోకంలో, ఆ పద్ధతి మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త అల్లాహ్ తెలిపాడు. దానిని నేర్చుకొని ఆ ప్రకారంగా జీవితం గడపడమే ధార్మిక విద్య. అదే ధార్మిక జీవితం.

ఇంతకుముందు నేను ఒక విషయం చెప్పాను. ఏ కంపెనీలో పని చేయాలనుకున్నా గాని ఆ కంపెనీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. పాటించకుంటే మనకు దొరికే జీతం అనేది సరిగా రాదు. ఆ కంపెనీ ద్వారా ఏ సుఖం మనం పొందాలనుకుంటున్నామో పొందలేము. అలాగే ఒక ఉత్తమ మనిషిగా, ఉత్తమ మనిషిగా మనం జీవితం గడపాలనుకుంటే, మనకు ఏ డైరెక్షన్, ఏ రూల్స్, ఏ రెగ్యులేషన్స్, ఏ పద్ధతి, ఏ చట్టము, ఏ నియమము అవసరం లేదా? ఆలోచించండి.

ఏ మనం జాబ్ చేస్తామో, ఏ డ్యూటీ చేస్తామో, ఏ ఉద్యోగం చేస్తామో, అక్కడ ఏయే నియమాలు ఉంటాయో, ఏయే చట్టాలు ఉంటాయో, అవన్నీ పాటించడానికి సిద్ధపడతాం మనం. ఎందుకు? జీతం దొరకాలి మనకు.

అయితే, ఉత్తమ మనిషిగా జీవించి పరలోకంలో స్వర్గం పొందడానికి మనకు ఏ పద్ధతి, ఏ డైరెక్షన్స్, ఏ రెగ్యులేషన్స్ అవసరం లేకుండా ఎలా జీవించగలుగుతాము? అయితే ఈ డైరెక్షన్స్, ఈ రూల్స్, రెగ్యులేషన్స్ ఎవరు మనకు మంచి విధంగా చూపించగలుగుతారు? ఎవరైతే మనల్ని పుట్టించారో ఆయనే చూపించగలుగుతాడు. ఉదాహరణకు, మెకానికల్ లైన్ లో పనిచేసేవాళ్లు, టయోటా కంపెనీకి సంబంధించిన బండి, నిస్సాన్ కంపెనీకి సంబంధించిన పార్ట్స్ తీసుకువచ్చి దానిలో పెడితే ఫిట్ అవుతాయా? కావు. చూడడానికి నిస్సాన్ బండి మరియు టయోటా బండి, చూడడానికి సేమ్ ఒకే రకంగా ఉన్నప్పటికీ లోపల కూడా ఎన్నో విషయాలు వేరువేరుగా ఉండవచ్చు. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నా. అది 100% ఈ ఉదాహరణ అక్కడ ఫిట్ అవుతుందా లేదా అది కాదు, నేను చెప్పే విషయం ఏంటంటే, అల్లాహ్ మనల్ని పుట్టించాడు. మన గురించి, మన భవిష్యత్తు గురించి అల్లాహ్ కు ఎంత మంచి విధంగా తెలుసునో, ఇంకా వేరే ఎవరికైనా తెలిసి ఉంటుందా? ఉండదు. ఆయన చూపిన విధానమే అది సంపూర్ణ విధానం అవుతుంది. ఆయన చూపిన విధానం మీద, ఆ ప్రకారం మనం జీవితం గడిపితేనే మనకు ఇహ-పర రెండు లోకాల సుఖాలు అనేటివి ప్రాప్తమవుతాయి. అందుగురించి అల్లాహ్ త’ఆలా, 28వ పారాలో,

يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ
(యర్ఫ’ఇల్లా హుల్లదీన ఆమనూ మిన్కుమ్ వల్లదీన ఊతుల్ ఇల్మ దరజాత్)
మీలో విశ్వసించిన వారికి, మరీ ముఖ్యంగా జ్ఞానం వొసగబడిన వారికి అల్లాహ్ ఉన్నతమైన హోదాలను ప్రసాదిస్తాడు. (58:11)

మీలో ఎవరైతే విశ్వసించారో మరియు ఎవరైతే విద్య అభ్యసిస్తారో, వీరిద్దరి స్థానాలను అల్లాహ్ త’ఆలా పెంచుతూ పోతాడు, హెచ్చింపు చేస్తూ పోతాడు.

يَرْفَعِ اللَّهُ
(యర్ఫ’ఇల్లాహ్)
అల్లాహ్ హెచ్చిస్తాడు.

హెచ్చుతూ పోతాడు, పైకి తీసుకెళ్తూ ఉంటాడు.

الَّذِينَ آمَنُوا مِنكُمْ
(అల్లదీన ఆమనూ మిన్కుమ్)
మీలో ఎవరైతే విశ్వసించారో వారిని

وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ
(వల్లదీన ఊతుల్ ఇల్మ్)
మరియు ఎవరికైతే విద్య ఇవ్వబడ్డారో,

ఎవరికైతే విద్య లభించినదో, వారిద్దరి స్థానాలను, దరజాత్, అల్లాహ్ త’ఆలా పైకి ఎత్తుతూ పోతాడు. ఇంతకుముందు నేను ఫస్ట్ లో, స్టార్టింగ్ లో ఒక ఉదాహరణ చెప్పాను కదా, ఒక వ్యక్తి తన బావ గురించి. అయితే, ఎంత మంచి విద్య నేర్చుకొని, ఎంత మంచి అతని దగ్గర ఒక పని, షార్ప్నెస్ ఉంటే, అతను అంత హాయిగా సుఖంగా జీవిస్తాడు అని ఏదైతే భావిస్తున్నామో, అల్లాహ్ పంపినటువంటి ధర్మ జ్ఞానం, అల్లాహ్ పంపినటువంటి విద్య, అది నేర్చుకొని చాలా నీచంగా ఉంటాము అని మనం ఎలా భావిస్తున్నాము? మరి అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరైతే విశ్వసించి నా విశ్వాస మార్గంలో ఉంటారో, ఎవరైతే నేను పంపిన విద్యను నేర్చుకొని ఆ ప్రకారంగా జీవితం గడుపుతారో, వారి స్థానాలను నేను ఇంకా మీదికి చేస్తూ ఉంటాను, వారికి హోదా అంతస్తులు ప్రసాదిస్తూ ఉంటాను అని అల్లాహ్ త’ఆలా చెప్తున్నాడు. అల్లాహ్ మాటలో ఏమైనా పొరపాటు, అనుమానం అనేది ఉంటుందా? ఉండదు.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందుకే చెప్పారు,

طَلَبُ الْعِلْمِ فَرِيضَةٌ عَلَى كُلِّ مُسْلِمٍ
(తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం)
విద్యాన్వేషణ ప్రతి ముస్లింపై విధిగా ఉంది.

విద్యా అభ్యసించడం ప్రతి ముస్లిం పై, స్త్రీ అయినా, పురుషుడైనా, ప్రతి ఒక్కరిపై విధిగా ఉన్నది. విధిగా ఉన్నది.

فَرِيضَةٌ
(ఫరీదతున్)
విధి

ఈ ఫరీదా, నమాజ్ ఫర్జ్, రోజా ఫర్జ్ హై, జకాత్ ఫర్జ్ హై అని మనం అనుకుంటాం కదా? ఇక్కడ ప్రవక్త ఏమంటున్నారు?

طَلَبُ الْعِلْمِ فَرِيضَةٌ
(తలబుల్ ఇల్మి ఫరీదతున్)
విద్యాన్వేషణ విధి.

ఇల్మ్, విద్య తలబ్, అభ్యసించడం, నేర్చుకోవడం ఫరీదా, అది కూడా ఒక విధి. కానీ ఈ విధి నుండి మనం సామాన్యంగా ముస్లింలు ఎంత దూరం ఉన్నాము?

తొలిసారిగా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన సూరా ఏది? ఇఖ్రా.

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ
(ఇఖ్ర’ బిస్మి రబ్బికల్లదీ ఖలఖ్)
చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో. (96:1)

خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ
(ఖలఖల్ ఇన్సాన మిన్ అలఖ్)
ఆయన మానవుణ్ణి రక్తపు గడ్డతో సృష్టించాడు. (96:2)

اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ
(ఇఖ్ర’ వరబ్బుకల్ అక్రమ్)
చదువు, నీ ప్రభువు పరమ దయాశీలి. (96:3)

الَّذِي عَلَّمَ بِالْقَلَمِ
(అల్లదీ అల్లమ బిల్ ఖలమ్)
ఆయనే కలము ద్వారా జ్ఞానాన్ని నేర్పాడు. (96:4)

عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ
(అల్లమల్ ఇన్సాన మా లమ్ య’అలమ్)
మానవునికి అతను ఎరుగని విషయాలను నేర్పాడు. (96:5)

ఈ ఐదు ఆయతులు తొలిసారిగా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించాయి. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్త పదవి, ప్రవక్త కిరీటం అనేది ప్రసాదించబడింది. ఈ ఆయతుల మీద శ్రద్ధ వహించండి. ఇఖ్రా, ఈ పదమే ఏమున్నది? చదవండి, చదువు. ఇస్లాం లోని మొట్టమొదటి విషయం చదువు. ఈ చదువు నుండి మనం ఎంత దూరం ఉన్నామో ఈ రోజుల్లో చూడండి.

అచ్చా, చదువులో అబ్బాయి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు అతనికి ముందు మనం ఏం నేర్పాలి? పిల్లవాడు స్కూల్ పోవడానికి మూడు, మూడున్నర, నాలుగు సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు స్కూల్ కి పంపుతాము. మొట్టమొదటిసారిగా ఏ చదువు ఇవ్వాలి మనం? ఆ విషయం కూడా దీని ద్వారా నేర్పడం జరిగింది. ఏంటది?

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ
(ఇఖ్ర’ బిస్మి రబ్బికల్లదీ ఖలఖ్)
చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో. (96:1)

ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో ఆ సృష్టికర్త పేరుతో మీ చదువును ఆరంభించండి.

خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ
(ఖలఖల్ ఇన్సాన మిన్ అలఖ్)
ఆయన మానవుణ్ణి రక్తపు గడ్డతో సృష్టించాడు. (96:2)

మనిషి పుట్టుక ఎలా జరిగింది? మనిషి యొక్క సృష్టి ఎలా జరిగింది? ఆ విషయం ఇక్కడ తెలపాడు అల్లాహ్ త’ఆలా. ఆ తర్వాత మరోసారి,

اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ
(ఇఖ్ర’ వరబ్బుకల్ అక్రమ్)
చదువు, నీ ప్రభువు పరమ దయాశీలి. (96:3)

చదువు, అక్రం అంటే ఏంటి? మహా గౌరవనీయుడు. ఇజ్జత్ ఓ ఇక్రాం అన్న పదం ఉర్దూలో కూడా వాడుతూ ఉంటారు. ఇక్రాం, అక్రం అంటే అంతకంటే మించిన కరమ్ చేసేవాడు ఇక లేడు అని.

ఇక్కడ ఖురాన్ వ్యాఖ్యానకర్తలు, ముఫస్సిరీనె కిరామ్ ఒక చాలా సున్నితమైన విషయం అంటారా? బారీక్ నుక్తా ఏం తెలుపుతారో తెలుసా? ఇఖ్రా చదువు, వరబ్బుకల్ అక్రమ్, నీ ప్రభువు చాలా గౌరవప్రదమైనవాడు. అంటే ఏంటి? చదువు వల్ల నీకు గౌరవప్రదము లభిస్తుంది. చదువు లేకుంటే మరి తర్వాత,

الَّذِي عَلَّمَ بِالْقَلَمِ
(అల్లదీ అల్లమ బిల్ ఖలమ్)
ఆయనే కలము ద్వారా జ్ఞానాన్ని నేర్పాడు. (96:4)

ఆ అల్లాహ్ కలము ద్వారా మనిషికి విద్య నేర్పాడు.

عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ
(అల్లమల్ ఇన్సాన మా లమ్ య’అలమ్)
మానవునికి అతను ఎరుగని విషయాలను నేర్పాడు. (96:5)

మనిషికి తెలియని జ్ఞానాలు అల్లాహ్ త’ఆలా పంచి నేర్పాడు.

సోదరులారా, తొలిసారిగా అవతరించిన ఈ ఆయతులో మనం శ్రద్ధ వహిస్తే ఎంత గొప్ప విషయం మన గురించి ఉంది. అంతేకాదు. తొలి మానవుడు ఎవరు? ఆదం అలైహిస్సలాం. స్కూళ్లలో చదివిన డార్విన్ థియరీ, డార్విన్ సిద్ధాంతం, కోతి నుండి మనిషి వచ్చినాడు, అది తప్పుడు విషయం. స్వయంగా డార్విన్ దానిని తిరస్కరించాడు. తిరస్కరించి ఒక పెద్ద బోర్డ్ లాగా రాసి సైన్ కూడా చేశాడు. ఈ సిద్ధాంతం, ఈ థియరీ నేనే సృష్టించాను, కానీ దీనికి ఎలాంటి ఆధారం లేదు, ఇది తప్పు అని ఖండించాడు. కానీ ఈ రోజుల్లో అతని ఆ ఖండనను ముందు తీసుకురాకుండా అతని ఆ తప్పుడు సిద్ధాంతాన్ని ప్రజలకు నేర్పుతున్నారు సైన్స్ బుక్ లో. కానీ అల్లాహ్ యొక్క దయవల్ల మనం ముస్లింలము గాని, అలాగే క్రిస్టియన్లు గాని, వారి విశ్వాసం ఏంటి? తొలి మానవుడు ఆదం అలైహిస్సలాం.

ఆదం అలైహిస్సలాం విషయం చెప్పేకి ముందు, మనలో మనలాంటి, తిని త్రాగి సంభోగించి శ్వాస పీల్చుకొని జీవించే ఇంకా వేరే జీవరాసులు ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. వారిలో మనలో తేడా ఏంటి? మనలో వారిలో వ్యత్యాసం, వారికి లేకుండా మనకు అల్లాహ్ ఏదైతే,

وَلَقَدْ كَرَّمْنَا بَنِي آدَمَ
(వ లఖద్ కర్రమ్నా బనీ ఆదమ)
నిశ్చయంగా మేము ఆదం సంతతికి గౌరవాన్ని ప్రసాదించాము (17:70)

మానవులకు మేము ఒక గౌరవమైన, ఒక మంచి గౌరవం అనేది ప్రసాదించాము అని అల్లాహ్ ఏదైతే అంటున్నాడో, అది మనకు ఆ గౌరవం ఎలా లభించింది? అయితే సూర బఖరాలో చూడండి మీరు,

وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا
(వ అల్లమ ఆదమల్ అస్మా’అ కుల్లహా)
మరియు అల్లాహ్ ఆదమ్ కు అన్ని వస్తువుల పేర్లు నేర్పాడు. (2:31)

అల్లాహ్ త’ఆలా ఆదంకు అన్ని విషయాల పేర్లు నేర్పాడు. తర్వాత ఓ దేవదూతలారా, మీరు ఆదంకు సజ్దా చేయండి అని ఆదేశం ఇచ్చాడు. ఆదంకు ఇతరుల మీద గౌరవం అనేది ఏ విషయంలో ప్రసాదించబడింది? విద్య ద్వారా. అర్థమవుతుందా విషయం? విద్య ప్రసాదించి అల్లాహ్ త’ఆలా ఈ విద్య ద్వారా మానవునికి గౌరవం అనేది ప్రసాదించాడు. ఇలాంటి అల్లాహ్ స్వయంగా ప్రసాదించిన ఈ విద్యను ఈరోజు మనం తిరస్కరిస్తున్నాము అంటే, అనేక మంది అనేక మన ప్రజలు, మన ముస్లిం సోదరులు ప్రత్యేకంగా, సోదరులారా, ఇది మనకు మనం ఎంత నష్టంలో పోతున్నామో చాలా గంభీరంగా ఆలోచించవలసిన విషయం.

ఇంకా చెప్పుకుంటూ పోతే విద్య నేర్చుకోవడంలో ఉన్న ఘనతలు, లాభాలు నేర్చుకుంటే ఏం లాభాలు, అవన్నీ మరో పెద్ద టాపిక్ అవుతుంది. కానీ అవన్నీ విషయాలు చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ ఒకే విషయం చెప్తాను, కొంచెం శ్రద్ధ వహించే ప్రయత్నం చేయండి.

ఇస్లాం ధర్మం చాలా సులభమైనది. మానవుల కొరకు అనుకూలమైనది. అల్లాహ్ ఇస్లాంకు సంబంధించిన ఏ ఆదేశం మనకు ఇచ్చినా, అందులో మన కొరకు ఇహ-పరలోకాల మేలే మేలు ఉన్నది తప్ప నష్టం లేదు. అయితే, ప్రపంచంలో ఏ ఉద్యోగం పొందడానికైనా, ఏ మీరు పని నేర్చుకున్నా, ఏ విద్య నేర్చుకున్నా, కొన్ని సంవత్సరాలు కష్టపడి ఆ పని, ఆ విద్య నేర్చుకున్న తర్వాత కొద్ది రోజులకు, కొన్ని సంవత్సరాలకు దాని ఫలితం మీకు ముందుకు వస్తుంది. అవునా లేదా? ఇప్పుడు ఈయన కంప్యూటర్ మీద పని చేస్తున్నారు, ఈయన వెళ్లి ఏదో ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు, అన్నయ్య గారు ఏదో ఆ పెయింటింగ్ విషయంలో పని చేస్తున్నారు, ఆ పనులు, మెకానిక్ లైన్ పనులు గాని, నేర్చుకోవడానికి కొంత కాలం పడుతుందా లేదా? ఆ నేర్చుకునే సమయం ఏదైతే ఉందో, ఆ నేర్చుకునేటప్పుడే దాని యొక్క ఫలితం మనకు తొందరగా కనబడుతుందా? కనబడదు. కనబడకుండా గానీ, ఉంటుందా అంత తొందరగా ఫలితం? ఉండదు. కానీ ధర్మ విద్య, ఇల్మె దీన్ దీని గురించి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి.

ధర్మానికి సంబంధించిన మీరు విద్య నేర్చుకున్నప్పుడు, నేర్చుకొని ఏ విషయం ఎట్లా ఆచరించాలి అని ఆచరించినప్పుడు ఏదైతే మీకు పుణ్యం దొరుకుతుందో, అది తర్వాత దొరుకుతుంది. కానీ ఈ విద్య నేర్చుకునేటప్పుడు కూడా మీకు పుణ్యం దొరుకుతుంది. ఇప్పుడు ఉదాహరణకు, ఉదాహరణకు అన్నయ్య దగ్గర అనుకోండి ఒక లక్ష రూపాయలు ఉన్నాయి. దాంతో జకాత్ ఇవ్వడం విధి ఉందా లేదా? ఉంది. అరే జకాత్ విషయం నేను నేర్చుకోవాలి, జకాత్ నాపై విధి ఉంది అని అన్నయ్య ఇప్పుడు జకాత్ గురించి నేర్చుకోవడం మొదలుపెట్టాడు. జకాత్ ఇచ్చినప్పుడు జకాత్ ఇచ్చిన పుణ్యం దొరుకుద్ది కదా? కానీ జకాత్ కు సంబంధించిన జ్ఞానం ఏదైతే నేర్చుకుంటున్నారో అప్పుడు కూడా అల్లాహ్ అతనికి ఆ పుణ్యం ప్రసాదిస్తూ ఉన్నాడు. ఏ పుణ్యం? ఆ ఇల్మ్ నేర్చుకునే, ఆ విద్య ఏదైతే నేర్చుకుంటున్నారో, ఆ నేర్చుకునే యొక్క పుణ్యం. అంటే మనం నేర్చుకోవడానికి ఏ సమయం అయితే ఉపయోగిస్తున్నామో, వెచ్చిస్తున్నామో, అది కూడా మనకు వృధా పోతలేదు. అది కూడా మనకు లాభకరంగా ఉంది.

అందుగురించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు? ఒక మహదీసులో,

مَنْ قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ اللَّهِ فَلَهُ بِهِ حَسَنَةٌ، وَالْحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا
(మన్ ఖర’అ హర్ఫమ్ మిన్ కితాబిల్లాహి ఫలహు బిహి హసనతున్, వల్ హసనతు బి అష్రి అమ్సాలిహా)
ఎవరైతే అల్లాహ్ గ్రంథంలోని ఒక్క అక్షరాన్ని పఠిస్తారో, అతనికి ఒక పుణ్యం లభిస్తుంది, మరియు ఆ పుణ్యం పదింతలు చేయబడుతుంది.

ఎవరైతే ఖురాన్ గ్రంథంలోని ఒక్క అక్షరం చదువుతారో, అతనికి ఎన్ని పుణ్యాలు? ఒక్క అక్షరం పై పది పుణ్యాలు. ఇంకా ఎవరికైనా అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ కావొద్దు అని ప్రవక్త ఇంకా ఒక ఉదాహరణ ఇచ్చి చెప్పారు. సూర బఖరా స్టార్టింగ్ లో ఏముంది?

الٓمٓ
(అలిఫ్ లామ్ మీమ్)
(2:1)

ఇన్ని లా అఖూలు అలిఫ్ లామ్ మీమ్ హర్ఫున్, అలిఫ్ లామ్ మీమ్ ఇది మొత్తం ఒక అక్షరం కాదు. అలిఫున్ హర్ఫున్, వ లామున్ హర్ఫున్, వ మీమున్ హర్ఫున్. అలిఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం. అలిఫ్ లామ్ మీమ్ అని మనం చదివితే ఎన్ని పుణ్యాలు దొరుకుతాయి ఇన్షా అల్లాహ్? 30 పుణ్యాలు దొరుకుతాయి. ఆ తర్వాత,

ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ
(దాలికల్ కితాబు లా రైబ ఫీహి, హుదల్లిల్ ముత్తఖీన్)
ఇది అల్లాహ్ గ్రంథం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది దైవభీతి పరులకు మార్గదర్శకత్వం చూపుతుంది. (2:2)

الَّذِينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ
(అల్లదీన యు’మినూన బిల్ గైబి వ యుఖీమూనస్సలాత వ మిమ్మా రజఖ్నాహుమ్ యున్ఫిఖూన్)
వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు. నమాజును స్థాపిస్తారు. మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చు చేస్తారు. (2:3)

సలాత్, నమాజ్. నమాజ్ చేసినప్పుడు నమాజ్ పుణ్యం దొరుకుతుంది. కానీ నమాజ్ ఎలా చేయాలి? ఏయే నమాజులు విధిగా ఉన్నాయి? నమాజు ఏయే నమాజులు సున్నతులు ఉన్నాయి, నఫీల్లు ఉన్నాయి? నమాజ్ యొక్క కంప్లీట్ పద్ధతి ఏంటిది? నమాజ్ లో ఏమేం చదవాలి? ఇవన్నీ నేర్చుకోవటానికి మనం ఏ సమయం అయితే వెచ్చిస్తామో, అవి నేర్చుకునేటప్పుడు కూడా మనకు పుణ్యం లభిస్తూనే ఉంటుంది. అందుగురించి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక్క హదీస్ వినండి, చాలా శ్రద్ధగా వినండి.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు,

مَا اجْتَمَعَ قَوْمٌ فِي بَيْتٍ مِنْ بُيُوتِ اللَّهِ
(మా ఇజ్తమ’అ ఖవ్మున్ ఫీ బైతిమ్ మిన్ బుయూతిల్లాహ్)
అల్లాహ్ యొక్క గృహాలలో ఒక గృహంలో ఎప్పుడైతే ఒక సమూహం సమావేశమవుతుందో,

అల్లాహ్ యొక్క గృహాల్లో నుండి ఏదైనా ఒక గృహంలో కొందరు సమూహమై ఒకచోట వారు జమా అయి,

يَتْلُونَ كِتَابَ اللَّهِ وَيَتَدَارَسُونَهُ بَيْنَهُمْ
(యత్ లూన కితాబల్లాహి వ యతదారసూనహు బైనహుమ్)
వారు అల్లాహ్ గ్రంథాన్ని పఠిస్తూ, దానిని తమలో తాము బోధించుకుంటూ ఉంటారో,

అల్లాహ్ యొక్క గ్రంథాన్ని చదువుతారు, పరస్పరం దాని విద్య ఒకరికి ఒకరు చెప్పుకుంటారు, దానిని పాఠాలు ఒకరికి ఒకరు చెప్పుకుంటారు, ఏమవుతుంది?

إِلَّا نَزَلَتْ عَلَيْهِمُ السَّكِينَةُ
(ఇల్లా నజలత్ అలైహిముస్సకీనహ్)
వారిపై ప్రశాంతత అవతరించకుండా ఉండదు,

వారిపై ఒక శాంతి, ఒక తృప్తి, ఒక నెమ్మది, నిదానం అల్లాహ్ వైపు నుండి అవతరిస్తుంది.

وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ
(వ గషియతుహుముర్రహ్మహ్)
వారిని కారుణ్యం ఆవరిస్తుంది,

అల్లాహ్ యొక్క కారుణ్యం అనేది వారిని చుట్టుకుంటుంది.

وَحَفَّتْهُمُ الْمَلَائِكَةُ
(వ హఫ్ఫత్ హుముల్ మలా’ఇకహ్)
దేవదూతలు వారిని చుట్టుముడతారు,

దేవదూతలు ఆ సమావేశంలో పాల్గొంటారు. ఎన్ని లాభాలని? మూడు కదా? సుకూనత్, రహ్మత్ మరియు దేవదూతలు.

وَذَكَرَهُمُ اللَّهُ فِيمَنْ عِنْدَهُ
(వ దకరహుముల్లాహు ఫీమన్ ఇందహ్)
మరియు అల్లాహ్ తన వద్ద ఉన్నవారి ముందు వారిని ప్రస్తావిస్తాడు.

అల్లాహ్ వద్ద అతి చేరువుగా ఏ దూతలైతే, ఏ గొప్ప సృష్టి అయితే ఉందో, వారి ముందు అల్లాహ్ త’ఆలా వీరిని ప్రశంసిస్తూ ఉంటాడు. ఇంతటి గొప్ప విషయమో, ఇన్ని లాభాలు మనకు ఉన్నాయో చూడండి. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరో హదీస్ లో చెప్పారు,

مَنْ سَلَكَ طَرِيقًا يَلْتَمِسُ فِيهِ عِلْمًا
(మన్ సలక తరీఖన్ యల్తమిసు ఫీహి ఇల్మన్)
ఎవరైతే విద్యాన్వేషణకై ఒక మార్గంలో పయనిస్తారో,

ఎవరైతే ఇల్మ్, విద్య నేర్చుకోవడానికి, అభ్యసించడానికి ఒక దారిలో నడుస్తారో,

سَهَّلَ اللَّهُ لَهُ بِهِ طَرِيقًا إِلَى الْجَنَّةِ
(సహ్హలల్లాహు లహు బిహి తరీఖన్ ఇలల్ జన్నహ్)
అల్లాహ్ దాని ద్వారా అతని కోసం స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని సులభతరం చేస్తాడు.

ఆ దారిని అల్లాహ్ త’ఆలా అతని గురించి స్వర్గం వైపునకు సుగమం చేస్తాడు, సులభం చేస్తాడు. మరో హదీస్ లో చెప్పారు, ఎవరైనా విద్య నేర్చుకోవడానికి ఒక దారి మీద వెళ్తూ ఉంటే దేవదూతలు వారి గురించి తమ రెక్కలను చాచుతారు. అంతేకాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వ సృష్టి, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి, ప్రతి సృష్టి అతని గురించి, ఓ అల్లాహ్ ఇతన్ని క్షమించండి, ఓ అల్లాహ్ ఇతని మీద కరుణించండి, ఓ అల్లాహ్ ఇతని మీద నీ దయ చూపండి, అని దుఆ చేస్తూ ఉంటారు. పక్షులు గాని, చీమలు గాని, చేపలు గాని, ప్రతి సృష్టి. ఎందుకు?

رِضًا لِمَا يَصْنَعُ طَالِبُ الْعِلْمِ
(రిదల్ లిమా యస్న’ఉ తాలిబుల్ ఇల్మ్)
విద్యాన్వేషి చేసే పని పట్ల సంతృప్తితో.

ఈ తాలిబుల్ ఇల్మ్, ఈ ధర్మ విద్య అభ్యసించే ఈ వ్యక్తి ఏ మంచి ఉద్దేశంతో ఈ ధర్మ విద్య నేర్చుకుంటున్నాడో, దానికి సంతోషపడి. అందుగురించి సోదరులారా, చెప్పాలంటే ఇంకా ఘనతలు ఉన్నాయి, కానీ ഇന്നటితో ఇంతటి విషయాలపై మనం శ్రద్ధ వహించి, ఇంకా మనం మన సోదరులకు, మన మిత్రులకు, మన దగ్గరి బంధువులకు అందరికీ ఈ ఘనతలు తెలిపి, వారందరినీ కూడా ఇలాంటి సమావేశాల్లో పాల్గొనడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఇందులో కూడా మనకు ఎంతో గొప్ప పుణ్యం, ఫలితం, అజర్, సవాబ్ ఉంది.

جَزَاكُمُ اللَّهُ خَيْرًا وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ
(జజాకుముల్లాహు ఖైరన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్)
అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక. మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఇతరములు:

సహాబాలు – వారి గొప్పతనం, వారి గురించి మనకు ఉండ వలసిన అఖీదా (విశ్వాసము) [ఆడియో & టెక్స్ట్]

సహాబా : ‘సహాబీ‘కి బహువచనం ‘సహాబా‘. విశ్వాస (ఈమాన్‌) స్థితిలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను కలుసుకుని, విశ్వాసస్థితిలో తనువు చాలించిన వారంతా సహాబా (సహచరులు- రది అల్లాహు అన్హుమ్) అనబడతారు.

వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్టులని, ఇస్లాం వైపు ముందంజవేసిన వారని, ప్రవక్త సహచర్య భాగ్యం పొందినవారని, ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)తో కలిసి జిహాద్‌ చేసినవారని, షరీయత్‌ బరువు బాధ్యతలను మోయటమే గాకుండా దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులని, ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం తప్పనిసరి (వాజిబ్‌). – [నుండి: సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్]


వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

భాగం 01: సహాబా అంటే ఎవరు? (2:06నిముషాలు)

భాగం 02: సహాబా యొక్క ప్రాముఖ్యత  (1:11నిముషాలు)

భాగం 03: ఇస్లాంలో సహాబాల గొప్పతనం (1:43నిముషాలు)

భాగం 04: తౌరాతు మరియు ఇంజీలు గ్రంధాలలో సహాబాల ప్రస్థావన (3:28నిముషాలు)

భాగం 05: సహాబాల గురించి ప్రవక్త గారు ఏమి చెప్పారు? (1:48 నిముషాలు)

భాగం 06: మన మీద సహాబాల హక్కులు ఏమిటి? (2:05 నిముషాలు)

భాగం 07: సహాబాల గురించి ఖురాన్ ఏమి చెబుతుంది? (0:49నిముషాలు)

భాగం 08: సహాబాల స్వర్ణయుగపు రోజులు (1:31నిముషాలు)

భాగం 09: సలఫ్ సాలిహీన్ దృష్టిలో సహాబాల గొప్పతనం (3:21 నిముషాలు)

భాగం 10: సహాబాలను ప్రేమించడం విశ్వాసంలో ఒక భాగం (2:04నిముషాలు)

భాగం 11: ఇమాం అహ్మద్ సహాబాల గురుంచి ఏమి చెప్పారు? (1:09నిముషాలు)

పూర్తి ఆడియో క్రింద వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి 

సహాబా : పూర్తి ఆడియో (21:21నిముషాలు)

ఈ ప్రసంగంలో, సహాబాల (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు) యొక్క నిర్వచనం, వారి ఉన్నత స్థానం మరియు ప్రాముఖ్యత వివరించబడింది. వారి జీవిత చరిత్రను తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమో హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనతో స్పష్టం చేయబడింది. సహాబాల యొక్క సద్గుణాలను మరియు వారి పట్ల అల్లాహ్ యొక్క ప్రసన్నతను సూరతుల్ ఫతహ్ వంటి ఖుర్ఆన్ ఆయతుల ద్వారా వివరించారు. సహాబాలను దూషించడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా ఖండించిన హదీసులు, వారి పట్ల విశ్వాసులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు మరియు వారి మధ్య ఉన్న వివిధ స్థాయిల గురించి చర్చించబడింది. సలఫె సాలెహీన్ (పూర్వపు సత్పురుషులు) సహాబాలను ఎలా గౌరవించేవారో అబ్దుల్లా బిన్ ఉమర్ మరియు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ వంటి వారి ఉదాహరణలతో వివరించబడింది. సహాబాలను దూషించే వారి పట్ల ఇమామ్ అహ్మద్ వంటి ఇస్లామీయ పండితుల కఠినమైన వైఖరిని కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.

సోదర సోదరీమణులారా, సహాబీ ఇది ఏకవచనం, సహాబా ఇది బహువచనం. సహాబియా ఇది ఏకవచనం, స్త్రీలను అంటారు. సహాబియాత్ ఇది బహువచనం, స్త్రీలను అంటారు. ఏ స్త్రీలు? ఏ పురుషులు? సహాబీ అంటే ఎవరైతే విశ్వాస స్థితిలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి, కలిసి, విశ్వాస స్థితిలోనే చనిపోయారో వారిని సహాబీ అంటారు. ఇక ఒక్కరు పురుషులైతే సహాబీ, ఇద్దరు పురుషులైతే సహాబియాన్, అంతకంటే ఎక్కువ వారిని సహాబా లేదా అస్హాబు ముహమ్మద్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మిత్రులు అని అనబడుతుంది. ఒక స్త్రీ అయ్యేది ఉంటే, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిని చూసి, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిపై విశ్వసించి, విశ్వాస స్థితిలో చనిపోయిన స్త్రీ సహాబియా, సహాబియతాన్, సహాబియాత్.

అయితే సోదర సోదరీమణులారా, వారి జీవిత గాథ తెలుసుకోవడం, వారి జీవిత విషయాలు తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము అన్నటువంటి ఒక ప్రశ్న మీరు అడగవచ్చు. అయితే సమాధానం చాలా శ్రద్ధగా వినండి. ఈ సమాధానం నేను నా ఇష్టంతో, నేను నా ఆలోచనతో చెప్పేది కాదు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మిత్రులలో, సహాబాలలో ఒక గొప్ప సహాబీ. ఆయన తెలుపుతున్నారు. ఏమన్నారు ఆయన?

“అల్లాహు తాలా మానవుల హృదయాల పట్ల దృష్టి వేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయాన్ని అందరి హృదయాల కంటే ఎంతో ఉత్తమంగా చూశాడు. ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆ తర్వాత, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రజల హృదయాలను వెతికాడు, చూశాడు. సహాబాల హృదయాలను ఎంతో పరిశుద్ధంగా పొందాడు. అల్లాహ్ ఆ సహాబాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్నేహితులుగా, అండదండగా, వారికి వారి ఈ ప్రచార కార్యక్రమంలో దోహదపడేవారుగా ఎన్నుకున్నాడు

ఈ సహాబాలు ఎంత గొప్పవారు, ఎంత గొప్ప శ్రేణికి చెందినవారు. అల్లాహు తాలా స్వయంగా ప్రళయ దినం వరకు సురక్షితంగా ఉండేటటువంటి సత్య గ్రంథం, దివ్య గ్రంథం ఖుర్ఆన్ లో వంద కంటే పైగా ఆయతులలో వారిని ప్రశంసించాడు. వారి యొక్క ఉన్నత గుణాలను ప్రస్తావించాడు. వారి యొక్క ఎన్నో మంచి విషయాలను ప్రళయం వరకు వచ్చే ప్రజలందరి కొరకు ఒక మంచి ఆదర్శంగా ఉంటాయని కూడా తెలిపాడు.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన ఈ సహాబాలు, వారిని విశ్వసించడం మన విశ్వాసంలోని ఒక ముఖ్యమైన భాగం. మనం అల్లాహ్ ను విశ్వసిస్తున్నాము, అల్లాహ్ యొక్క ప్రవక్తలను, వారిలో ప్రత్యేకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తాము. ఇంకా విశ్వాసానికి సంబంధించిన ఏ ఏ విషయాలు ఉన్నాయో, వాటిలో ఒక ముఖ్యమైన విషయం సహాబాలను కూడా విశ్వసించడం.

హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు చెప్పిన ఒక విషయాన్ని గమనించండి,

أَبَرُّ هَذِهِ الْأُمَّةِ قُلُوبًا
(అబర్రు హాదిహిల్ ఉమ్మతి ఖులూబా)
సహాబాలు సర్వ విశ్వాసులలో, సర్వ విశ్వాసులలో అతి పరిశుద్ధమైన హృదయాలు గలవారు.

وَأَعْمَقُهَا عِلْمًا
(వ అ’మఖుహా ‘ఇల్మా)
చాలా లోతుగల జ్ఞానం, విద్య గలవారు.

وَأَقَلُّهَا تَكَلُّفًا
(వ అఖల్లుహా తకల్లుఫా)
చాలా తక్కువగా వారు ఏదైనా పని చేయడంలో వారి నుండి కావాలని ఏదీ పొరపాటు జరిగేది కాదు మరియు కావాలని ఎలాంటి బాధలలో చిక్కుకునే ప్రయత్నం చేసేవారు కారు.

وَأَقْوَمُهَا هَدْيًا
(వ అఖ్వముహా హద్యా)
సన్మార్గంపై, సన్మాగంపైన అందరికంటే ఎక్కువగా ఉత్తమంగా నడిచేవారు.

وَأَحْسَنُهَا حَالًا
(వ అహ్సనుహా హాలా)
అందరికంటే ఉత్తమ స్థితిలో జీవితం గడిపేవారు.

اخْتَارَهُمُ اللَّهُ لِصُحْبَةِ نَبِيِّهِ وَلِإِقَامَةِ دِينِهِ
(ఇఖ్తారహుముల్లాహు లిసుహబతి నబియ్యిహి వలి ఇఖామతి దీనిహి)
అల్లాహు తాలా వారిని తన ప్రవక్తకు స్నేహితులుగా ఎన్నుకున్నాడు మరియు తన ఈ ధర్మాన్ని స్థాపించబడటానికి వారిని ఎన్నుకున్నాడు

గమనించారా? అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ఉండగానే విశ్వసించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జీవితం గడిపారు. తొలి రోజుల్లో ఇస్లాం స్వీకరించిన సహాబాలను చూశారు. మదీనా వలస వచ్చిన తర్వాత సహాబాలను చూశారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి దశలో ఇస్లాం స్వీకరించిన వారిని కూడా చూశారు. అయితే గమనించండి, వారు సహాబాల గురించి ఎంత గొప్ప విషయం తెలిపారు.

సూరతుల్ ఫతహ్ లో:

مُّحَمَّدٌ رَّسُولُ اللَّهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ ۖ تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ ۚ وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ ప్రవక్త. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణకిస లాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు. (48:29)

గమనించండి, ఈ రోజుల్లో ఎవరైతే సహాబాలను అగౌరవపరుస్తున్నారో, సహాబాలలో ఏ ఒక్కరి ప్రస్తావన వచ్చినా వారి పట్ల అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారో, ఒకసారి ఈ ఖుర్ఆన్ ఆయత్ ల పట్ల శ్రద్ధ వహించాలి. అల్లాహ్ వారిని ప్రశంసిస్తున్నాడు. వారిలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలను ప్రస్తావిస్తున్నాడు. వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు కేవలం ఖుర్ఆన్ లోనే కాదు, ఖుర్ఆన్ కంటే ముందు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో తౌరాత్ మరియు ఇంజీల్, వాటిలో కూడా వీరి ఉత్తమ గుణాలు ఉన్నాయి అని స్వయంగా అల్లాహ్ సాక్ష్యం పలుకుతున్నాడో, అలాంటి వారిని మనం దూషించడం, అలాంటి వారి గురించి మనం చెడుగా ఆలోచించడం, అలాంటి వారి పట్ల మనం ఏదైనా దుర్భాషలాడటం, ఇది మన విశ్వాసంలో కొరత, మన విశ్వాసానికి చాలా భయంకరమైన ముప్పు కలుగజేస్తుంది.

అల్లాహ్ తాలా వారిని ప్రశంసిస్తూ ఇస్లాం మరియు ఇస్లాం స్వీకరించిన వారి పట్ల ఎంత మృదువుగా, ఎంత ఆప్యాయతతో, కరుణా కటాక్షాలతో వారు జీవితం గడుపుతారంటే, అవిశ్వాసానికి సంబంధించిన విషయాలు మరియు సత్య ధర్మమైన ఇస్లాంకు వ్యతిరేకమున్న విషయాలు వారికి ఏమాత్రం ఇష్టం ఉండవు. నీవు వారిని రుకూ చేస్తూ, సజ్దా చేస్తూ చూస్తూ ఉంటావు. వారు అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని, అల్లాహ్ యొక్క సంతృప్తిని కోరుతూ ఉంటారు. మరియు వారి యొక్క సజ్దా గుర్తులు, చిహ్నాలు వారి ముఖాలపై ఎంతో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నాడో గమనించండి అల్లాహు తాలా,

تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ

ఇదంతా వారి గురించి ప్రస్తావించి, ప్రశంసించి, “వారి ఈ ఉపమానం తౌరాతులో ఉంది.” ఈ ఉదాహరణలు, ఈ పోలికలు, ఈ ఉత్తమ గుణాలు వారి గురించి ఏవైతే ప్రస్తావించబడ్డాయో, ఇవన్నీ కూడా తౌరాతులలో కూడా ఉన్నాయి. అంటే వీరి గుణాలు ఇలా ఉంటాయి, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు అని తౌరాత్ లో ప్రస్తావన వచ్చి ఉంది. అంతే కాదు, ఇంజీల్ లో ఎలా ఉంది?

وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు“.” (48:29)

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో స్పష్టంగా తెలిపారు:

لَا تَسُبُّوا أَصْحَابِي
(లా తసుబ్బూ అస్ హాబీ)
నా సహాబాలను మీరు దూషించకండి.

అంతేకాదు, వారి యొక్క స్థానం ఎంత గొప్పదో అది కూడా ఇదే హదీసులో తెలియబరిచారు. అదేమిటి?

“లవ్ అన్ఫఖ అహదు మిన్కుమ్ మిస్ల ఉహుదిన్ జహబా, మా బలగ ముద్ద అహదిహిమ్ వలా నసీఫహు.”
మీలో ఎవరైనా ఉహద్ పర్వతం ఎంత పెద్దగా ఉందో అంత బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసినా, సహాబాలు సామాన్యంగా ఏదైనా విషయం, ఏదైనా వస్తువు, వారు ఒక ముప్పావు కిలో, 600 గ్రాములు, లేదా 300 గ్రాముల వరకు ఏదైతే ఖర్చు పెట్టారో దానికి సమానం కూడా కాజాలదు. అల్లాహు అక్బర్.

గమనించండి సోదరులారా. ఉహద్ పర్వతం ఎంత పెద్దదో తెలుసా? ఇంచుమించు 7 నుండి 8 కిలోమీటర్ల పొడవు, 2 నుండి 3 కిలోమీటర్ల వెడల్పు మరియు 700 మీటర్ల ఎత్తు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీలో ఎవరైనా ఉహద్ పర్వతం అంత బంగారం ఖర్చు పెట్టినా, సహాబాలు ఒక 300 గ్రాముల వరకు లేదా ఒక 600, 650 గ్రాముల వరకు ఏదైనా వస్తువు ఖర్చు పెట్టి ఉంటే, మీ ఈ ఉహద్ పర్వతం లాంటి బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం సహాబాలు చేసిన ఈ పుణ్యానికి, దానానికి సమానంగా కాజాలదు. సహాబాల స్థానంలో, మీ స్థానంలో ఇంత పెద్ద గొప్ప వ్యత్యాసం ఉంది. మీరు ఏ నోట వారిని దూషిస్తారు? ఏ నోట వారిని మీరు చెడుగా ప్రస్తావిస్తారు?

మొదటి హక్కు సహాబాల గురించి మనపై ఉన్నది ఏమిటి? అల్లాహు తాలా లేదా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఏ ఘనతలు తెలిపారో వాటిని నమ్మడం. వారిలో ఎంతో గొప్ప స్థానంలో, వారి స్థానాల్లో హెచ్చుతగ్గులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మొట్టమొదటి స్థానంలో హజ్రత్ అబూబకర్, రెండవ స్థానంలో హజ్రత్ ఉమర్, మూడవ స్థానంలో హజ్రత్ ఉస్మాన్, నాలుగో స్థానంలో హజ్రత్ అలీ రదియల్లాహు అన్హుమ్ వరద్వు అన్. ఇక ఈ నలుగురి తర్వాత, ఇహలోకంలో ఏ పది మంది గురించైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారో వారిలో ఈ నలుగురు వస్తారు, మిగిలిన ఆరుగురు, ఆ తర్వాత బద్ర్ లో పాల్గొన్నవారు. కానీ మొట్టమొదటి హక్కు ఏమిటి? ఎవరి గురించి ఏ ఏ ఘనతలు ఖుర్ఆన్ లో లేదా హదీసుల్లో వచ్చి ఉన్నాయో వాటిని మనం నమ్మాలి. వాటిలో ఏ ఒక్కటిని కూడా తిరస్కరించకూడదు.

ఎందుకో తెలుసా? ఉదాహరణకు, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఘనతలో ఖుర్ఆన్ లో కొన్ని ఆయతులు అవతరింపజేయబడ్డాయి. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో హదీసుల్లో ఆయన గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటిలో ఏ ఒక్కటినీ కూడా మనం తిరస్కరిస్తే, ఇందులో అబూబకర్ స్థానంలో ఏ కొరత ఏర్పడదు. కానీ మనం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటలు తిరస్కరించిన వారిలో, అల్లాహ్ యొక్క ఆయతులను తిరస్కరించిన వారిలో అయిపోతాము. ఎప్పుడైతే మనం వారికి ఏ స్థానం ఇవ్వబడినదో దానిని మనం విశ్వసిస్తున్నామో, నమ్ముతున్నామో, అక్కడే వారిలోని ఏ ఒక్కరి పట్ల కూడా మన మనసులో ఏ కీడు కానీ, ఏ కపటం గానీ, ఎలాంటి దోషం కానీ ఉండకూడదు. మన హృదయంలో ఎలాంటి కపటము, ద్వేషము, జిగస్సు ఏదీ కూడా ఉండకూడదు. మన హృదయం వారి గురించి ఎంతో తేటతెల్లగా, స్పష్టంగా ఉండాలి. ఎలాంటి కీడు లేకుండా ఉండాలి.

సూరతుల్ అహ్జాబ్, ఆయత్ నంబర్ 58లో అల్లాహు తాలా తెలిపాడు:

وَالَّذِينَ يُؤْذُونَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ بِغَيْرِ مَا اكْتَسَبُوا فَقَدِ احْتَمَلُوا بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا

ఎవరైతే విశ్వాస స్త్రీ పురుషులను వారి ఏ పాపం లేకుండా, ఏ కారణం లేకుండా వారిని బాధ పెడతారో, వారికి హాని కలుగజేస్తారో, వారు చాలా భయంకరమైన పాపాన్ని మరియు ఒక భయంకరమైన అపనిందను, స్పష్టమైన పాపాన్ని తమ మెడకు కట్టుకున్నవారైపోతారు.

అందు గురించి అలాంటి వారు భయపడాలి. ఇక్కడ సామాన్యంగా విశ్వాసుల పదం ఏదైతే వచ్చిందో, ఎవరో విశ్వాసులని అనుకోకండి. విశ్వాసుల్లో మొట్టమొదటి స్థానంలో సహాబాలు వస్తారు అన్న విషయం మరవకండి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? సహీ బుఖారీ, సహీ ముస్లిం ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో ఈ హదీస్ ఉంది:

خَيْرُ النَّاسِ قَرْنِي ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ
(ఖైరున్నాసి ఖర్నీ, సుమ్మల్లజీన యలూనహుమ్, సుమ్మల్లజీన యలూనహుమ్)
అన్ని కాలాల్లో అతి ఉత్తమమైన కాలం నాది, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం.

అల్లాహు అక్బర్. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఆ కాలాన్ని అన్ని కాలాల్లో అతి శ్రేష్టమైనదని తెలుపుతున్నారు. ఎందుకు? ఎందుకంటే ప్రజలు తిరస్కరించినప్పుడు ఈ సహాబాలు ఇస్లాంను స్వీకరించారు, విశ్వాస మార్గాన్ని అవలంబించారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వదిలేశారో, చివరికి స్వయంగా వారి కుటుంబంలోని కొందరు, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చేరువుగా అయ్యారు, దగ్గరగా అయ్యారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ ఇంటి నుండి వెళ్లగొట్టారో, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహాయమందజేసి, తమకు దగ్గరగా తీసుకున్నారు. ఈ విధంగా ఇస్లాం పట్ల సహాబాల త్యాగాలు ఇంతా అంతా కావు, ఎంతో గొప్పమైనవి.

మన సలఫె సాలెహీన్ రహిమహుముల్లాహ్ సహాబాలను ఎలా గౌరవించేవారు? సహాబాల గురించి వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ప్రేమ, వారి యొక్క గౌరవ మర్యాదలు ఎలా ఉండేవి? వాటిని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము.

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు, హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారి యొక్క కుమారుడు. ఒక సందర్భంలో అతను తెలిపాడు, “ప్రజలారా, సహాబాలను దూషించకండి. సహాబాలు కొంతసేపు, ఒక చిన్నపాటి గడియ, వారు ఏదైతే అల్లాహ్ ఆరాధనలో గడిపారో, మీరు మీ జీవితాంతం చేసే మీ ఆరాధన వారి ఆ గడియపాటు ఆరాధనకు చేరుకోదు.” వారి స్థానం అంత గొప్పది కనుక మీరు వారిని దూషించకండి.

అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమహుల్లాహ్, చాలా గొప్ప ముహద్దిస్, ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. వచ్చి, ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఎక్కువ ఘనత గలవారా, లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజా అని ప్రశ్నించాడు. అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఏం సమాధానం చెప్పారు? దానికంటే ముందు ఒక విషయం తెలుసుకోండి. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ సహాబీ కాదు, తాబియీన్లలో వస్తారు. ఆయన చాలా ఉత్తమమైన వారు, ఆయన ఒక ఖలీఫా, వారిని ఐదవ ఖలీఫా అని అంటారు. కానీ ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఆయనకు ఎన్నో ఘనతలు ఉన్నాయి. అట్టి ముఖ్యమైన ఘనత ఏమిటి? సహాబీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ కళ్లారా చూశారు, విశ్వసించారు, విశ్వాస స్థితిలో మరణించారు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఏ వహీ వచ్చేదో దానిని రాసేవారు ఏ సహాబాలైతే ఉన్నారో, కాతిబీనె వహీ, వారిలో ఒకరు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బావమరిది. అంటే, హజ్రత్ అమీరె ముఆవియా రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క సోదరి ఉమ్మె హబీబా రదియల్లాహు తాలా అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య. విశ్వాసం మరియు సహాబీ కావడం తో పాటు ఇన్ని రకాల ఇంకా మరెన్నో ఘనతలు కూడా ఉన్నాయి. అయితే అతి ముఖ్యమైన విషయం అతను సహాబీ. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చాలా ఉత్తమమైన వారు కానీ సహాబీ కాదు.

అయితే ఒక వ్యక్తి వచ్చి ఏమడుగుతున్నాడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ తో? అమీరె ముఆవియా ఎక్కువ ఘనత గలవారా లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఎక్కువ ఘనత గలవారా? అప్పుడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమతుల్లాహి అలైహి చెప్పారు, “ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉండగా, ఆయన ముక్కులో పోయినటువంటి దుమ్ము, ధూళి, దాని స్థానానికి కూడా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చేరుకోడు, నీవేం మాట్లాడుతున్నావు?

అల్లాహు అక్బర్. ఇక్కడ గమనించండి, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమతుల్లాహి అలైహి గారికి ఉన్న ఘనత, వారికి ఉన్న విద్య, ఆయన ఒక ఖలీఫా, ఆ విషయాల్లో మనం ఏ కొరత చూపి ఆయన్ని అవమానించడం కాదు. సహాబాల ఘనత ఎంత గొప్పదో అది తెలియజేస్తున్నాము. ఇది మనమే కాదు, మనకంటే ముందు పూర్వీకులు సలఫె సాలెహీన్ రహిమహుల్లాహ్, వారిలో అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఎలాంటి ముహద్దిస్ అంటే, ఎందరో ముహద్దిసులు చెప్పారు, ఈయనపై ఎలాంటి దోషం లేని, జరహ్ లేని ముహద్దిస్ అని.

సహాబాల యొక్క స్థానం, వారి యొక్క ఘనత విషయంలో సహీ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي ، اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي
(అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ, అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ)
నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి. నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి.

ఆ తర్వాత చెప్పారు, “మీరు వారిలో ఏ ఒక్కరిని కూడా తమ మనోవాంఛల కొరకు, తమ మనసులోని చెడు కోరికల కొరకు ఒక సాకుగా తీసుకోకండి”

فَمَنْ أَحَبَّهُمْ فَبِحُبِّي أَحَبَّهُمْ، وَمَنْ أَبْغَضَهُمْ فَبِبُغْضِي أَبْغَضَهُمْ
(ఫమన్ అహబ్బహుమ్ ఫబిహుబ్బీ అహబ్బహుమ్, వమన్ అబ్గదహుమ్ ఫబిబుగ్దీ అబ్గదహుమ్)
ఎవరైతే వారి పట్ల ప్రేమగా ఉంటాడో అతడు నా పట్ల ప్రేమగా ఉన్నట్లు. మరియు ఎవరైతే వారి పట్ల ద్వేషంగా ఉంటాడో, అతడు నా పట్ల ద్వేషంగా ఉన్నట్లు

وَمَنْ آذَاهُمْ فَقَدْ آذَانِي، وَمَنْ آذَانِي فَقَدْ آذَى اللَّهَ، وَمَنْ آذَى اللَّهَ يُوشِكُ أَنْ يَأْخُذَهُ
(వమన్ ఆదాహుమ్ ఫఖద్ ఆదానీ, వమన్ ఆదానీ ఫఖద్ ఆదల్లాహ తబారక వ తాలా)
ఎవరైతే నా సహాబాలను హాని కలిగించాడో, వారికి కీడు కలుగజేశాడో, అతడు నాకు కీడు కలుగజేసినట్లు, నాకు బాధ కలుగజేసినట్లు. మరి ఎవరైతే నన్ను బాధ పెట్టాడో, అతడు అల్లాహ్ ను బాధ పెట్టినవాడవుతాడు.

గమనించారా? సహాబాల యొక్క స్థానం ఎంత గొప్పగా ఉందో? వారిని ప్రేమించడం, వారి పట్ల ద్వేషంగా ఉండకుండా ప్రేమగా ఉండడం ఎంత ముఖ్యమో మన జీవితంలో, అర్థమవుతుంది కదా ఈ హదీసుల ద్వారా?

మరొక హదీస్, హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు దీనిని:

مَنْ سَبَّ أَصْحَابِي فَعَلَيْهِ لَعْنَةُ اللَّهِ وَالْمَلائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ
(మన్ సబ్బ అస్హాబీ ఫఅలైహి ల’నతుల్లాహి వల్ మలాఇకతి వన్నాసి అజ్మయీన్)
ఎవరైతే నా సహాబాలను దూషిస్తాడో, అతనిపై అల్లాహ్ యొక్క శాపం, దైవదూతల శాపం మరియు సర్వ ప్రజల యొక్క శాపం పడుగాక.

ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి, నాలుగు ఇమాములలో ఒక గొప్ప ఇమాం కదా. ఆయన ఏమన్నారో తెలుసా? సహాబాల విషయంలో, “నీవు ఎప్పుడైనా ఏదైనా వ్యక్తిని చూశావు, అతడు సహాబాలలో ఏ ఒక్కరినైనా దూషిస్తున్నాడు అంటే, అతడు నిజమైన ముస్లిమో కాదో అని శంకించవలసి వస్తుంది, అనుమాన పడే అటువంటి పరిస్థితి వస్తుంది.”

ఇలాంటి మాట ఎందుకు చెప్పారు ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి? ఎందుకంటే నిజమైన ముస్లిం, ఖుర్ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీసుల జ్ఞానం ఉన్న ముస్లిం, ఏ సహాబీని కూడా దూషించడు.

ఇంకా మరో సందర్భంలో హజ్రత్ ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్ తెలిపారు, “ఏ వ్యక్తికి కూడా సహాబాలను దూషించడం దూరం, సహాబాలను అగౌరవంగా ప్రస్తావించడం కూడా తగదు. ఎవరైనా అలా చేశాడంటే ఆ వ్యక్తి కాలంలో, ఆ వ్యక్తి ఉన్నచోట ఏ ముస్లిం నాయకుడు ఉన్నాడో అతడు అలాంటి వ్యక్తికి శిక్ష ఇవ్వాలి. ఎందుకంటే సహాబాలను దూషించడం ఇది చిన్నపాటి పాపం కాదు, ఘోర పాపాల్లో లెక్కించబడుతుంది

ఇతరములు:

సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

ఇష్రాఖ్ నమాజ్ & చాష్త్ నమాజ్ ఒకటేనా లేక వేర్వేరా? [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (6:57 నిముషాలు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

దుఆ స్వీకరించబడే సమయంలో ఏ దుఆ చేయడం మంచిది? [ఆడియో]

బిస్మిల్లాహ్

(5:29 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సిగ్గు, బిడియం [ఆడియో & టెక్స్ట్]

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సిగ్గు, బిడియం
https://youtu.be/dZZa0Z0Oh8Y (3 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వారి యొక్క అత్యుత్తమ గుణమైన సిగ్గు, బిడియం (హయా) గురించి వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వద్ద దేవదూతలు కూడా సిగ్గుపడతారని తెలిపిన ఒక సంఘటనను పేర్కొన్నారు. అబూబక్ర్ (రజియల్లాహు అన్హు), ఉమర్ (రజియల్లాహు అన్హు) వచ్చినప్పుడు సాధారణ స్థితిలో ఉన్న ప్రవక్త, ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) రాకతో తమ వస్త్రాలను సరిచేసుకుని కూర్చోవడం ఆయన పట్ల గల గౌరవాన్ని, ఆయన సిగ్గు యొక్క స్థాయిని తెలియజేస్తుంది. అంతేకాకుండా, ఇస్లాం స్వీకరించిన నాటి నుండి తన కుడి చేతిని మర్మాంగాలకు తాకించలేదని ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) స్వయంగా చెప్పిన విషయం ఆయన పవిత్రతకు నిదర్శనం. ఆయన అధికంగా ఖుర్ఆన్ పారాయణం చేసేవారని, చివరికి హంతకుల చేతిలో హత్యకు గురయ్యే సమయంలో కూడా ఖుర్ఆన్ పారాయణంలోనే నిమగ్నమై ఉన్నారని వివరించబడింది.

సోదర సోదరీమణులారా! ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఉత్తమ గుణం, బిడియం, సిగ్గు, లజ్జ దీని గురించి మనం తెలుసుకుంటున్నాము. అందరికంటే ఎక్కువ హయా ఉస్మాన్ రజియల్లాహు అన్హు గలవారని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాక్ష్యం పలికారు.

ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఒక మెత్తకు ఇలా ఆనుకొని, తన ఈ మోకాళ్ళను ఇలా నిలబెట్టి ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ లుంగీ లేదా వస్త్రం అయితే ధరించి ఉన్నారో అది ఇంచుమించు మోకాళ్ళకు దగ్గరగా వచ్చి పిక్క కనబడుతూ ఉన్నది. ఈ స్థితిలో కూర్చుండి ఉన్నారు. కొంతసేపట్లో హజరత్ అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు వచ్చారు. లోపలికి రావడానికి అనుమతి కోరారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే స్థితిలో కూర్చుండి ఉన్నారు, అబూబకర్ రావడానికి అనుమతి ఇచ్చారు. అబూబకర్ వచ్చి ఒక పక్కన కూర్చున్నారు.

మరికొంత సేపటికి హజరత్ ఉమర్ వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే స్థితిలో కూర్చుని ఉన్నారు, హజరత్ ఉమర్ అనుమతి కోరారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇచ్చారు. హజరత్ ఉమర్ లోపలికి వచ్చి ఓ పక్కన కూర్చున్నారు, ప్రవక్త అలాగే ఉన్నారు. మరికొంత సమయం గడిచిన తర్వాత హజరత్ ఉస్మాన్ వచ్చారు. లోపలికి రావడానికి అనుమతి కోరారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ వస్త్రాన్ని మరింత కిందికి దించుతూ, ఒక సరియైన రీతిలో కూర్చుండి, ఉస్మాన్ కు రావడానికి అనుమతి ఇచ్చారు.వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు.

ఆ తర్వాత ఇంట్లో ఈ విషయాన్ని గమనించిన భార్య, అబూబకర్ వచ్చినప్పుడు మీరు అలాగే కూర్చుండి ఉన్నారు, ఉమర్ వచ్చినప్పుడు మీరు అలాగే కూర్చుండి ఉన్నారు, కానీ ఉస్మాన్ ఎప్పుడైతే వచ్చి అనుమతి కోరాడో మీరు మీ వస్త్రాన్ని సరిచేసుకుంటూ, మరి కిందికి దించుకుంటూ, మీ కూర్చుండే స్థితిని మార్చి, మరి మీరు అనుమతించారు, ఎందుకు ఇలా అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “ఏ ఉస్మాన్ తోనైతే దేవదూతలు సిగ్గు పడుతున్నారో ఆ ఉస్మాన్ తో నేను సిగ్గుపడనా?

అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఉస్మాన్ రజియల్లాహు అన్హు సహాబాలలో అందరికంటే ఎక్కువగా సిగ్గు, బిడియం గలవారు. మరియు స్వయంగా ఆయన ఒక సందర్భంలో తెలిపారు, “ఎప్పటి నుండి అయితే నేను నా ఈ కుడి చేతితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో చెయ్యి వేసి శపథం చేశానో, ఇస్లాం స్వీకరించానో, బయఅత్ చేశానో, అప్పటినుండి నేను ఈ కుడి చెయ్యిని నా మర్మాంగానికి తాకనివ్వలేదు”

హజరత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారిలో ఎన్నో రకాల ఉత్తమ గుణాలు ఉండినవి. ఆయన ఖుర్ఆన్ యొక్క పారాయణం చాలా అధికంగా చేసేవారు. చాలా అధికంగా చేసేవారు. మరియు చివరి సమయంలో, ఏ సమయంలోనైతే దుండగులు ఆయన్ని హతమార్చడానికి ప్రయత్నం చేశారో, ఆ సమయంలో కూడా ఆయన ఖుర్ఆన్ పారాయణం చేస్తూ ఉన్నారు, అదే స్థితిలో ఆ దుష్టులు, దుర్మార్గులు వచ్చి ఆయన్ని హతమార్చారు.


ఇతరములు:

త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – ఉసూల్ అత్ తలాత [ఆడియో & పుస్తకం]

బిస్మిల్లాహ్
త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – ఉసూల్ అత్ తలాత- యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zNRaaEnL1ZQB34vY0u2MD

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


క్రింది పుస్తకం హదీసు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన   ఇస్లాం మూల సూత్రాలు (ఉసూల్ అత్ తలాత & ఖవాఇద్ అల్ ఆర్బా) అనే పుస్తకం నుండి తీసుకోబడింది. కొన్ని పదాలలో చిన్న చిన్న మార్పులు చేసాము.

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్‌
(అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్‌ పేరుతో)

వ బిహీ నస్తయీను వస్సలాతు వస్సలాము అలా నబియ్యినా ముహమ్మదిన్ వ్వ అలా ఆలిహీ వ సహ్‌బిహీ అజ్‌ మయిీన్‌.

ప్రశ్న : ప్రతి మనిషీ విధిగా తెలుసుకోవలసిన నాలుగు అంశాలు ఏవి?

జవాబు :

  1. మొదటిది – ఇల్మ్‌ (జ్ఞానం), అంటే దైవాన్ని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను, ఇస్లాం ధర్మాన్ని గురించి క్షుణ్ణంగా, ప్రామాణికమైన ఆధారాల ద్వారా తెలుసుకోవటం.
  2. రెండవది. : ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం.
  3. మూడవది : దీనిని ఇతరులకు తెలియపరచటం.
  4. నాల్గవది : ఈ మార్గంలో ఎదురయ్యే కష్టనష్టాలను ఓపికతో సహించి నిలకడను కనబరచటం.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటీ?

జవాబు : దీనికి ఆధారం ఇది :

وَالْعَصْرِ  إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ

(కాలం సాక్షిగా! నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి లోనై ఉన్నాడు.అయితే విశ్వసించి మంచి పనులు చేసిన వారు, పరస్పరం సత్యాన్ని ప్రబోధిస్తూ ఉండేవారు, సహనస్థయిర్యాలను గురించి ఒండొకరికి ఉపదేశిస్తూ ఉండేవారు మాత్రం నష్టంలో లేరు.) (అల్‌ అస్ర్ సూరా)

ప్రశ్న: ఈ సూరా గురించి ఇమామ్‌ షాఫయి (రహిమహుల్లాహ్) ఏమన్నారో తెలుసా?

జవాబు : అవును. అల్లాహ్‌ తన సృష్టితాల కోసం ఈ చిన్న సూరా నొక్కదానిని అవతరింపజేసినా వారి మార్గదర్శకత్వం కొరకు ఇది సరిపోయేదని ఇమామ్‌ షాఫయి (రహిమహుల్లాహ్) అభిప్రాయపడ్డారు.

ప్రశ్న: ముందు జ్ఞానమా లేక ఆచరణా?

జవాబు : జ్ఞానం తరువాతనే మాటలయినా,చేతలయినా. దీనికి ఆధారం ఏమిటంటే-

فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ

కనుక ఓ ప్రవక్తా! బాగా తెలుసుకో! అల్లాహ్‌ తప్ప ఆరాధనకు అర్హుడైనవాడు ఎవడూ లేడని. నీవల్ల జరిగిన పొరపాట్లకు క్షమాభిక్ష వేడుకో. విశ్వాసులైన స్త్రీ  పురుషుల పొరపాట్లకు కూడా.” (ముహమ్మద్‌  47:19)

ప్రశ్న : ప్రతి ఒక్కరూ తెలుసుకుని తప్పనిసరిగా ఆచరించవలసిన ఆ మూడు ముఖ్యాంశాలు ఏవి?

జవాబు:: మొదటిదేమంటే; మనల్ని అల్లాహ్‌యే పుట్టించాడు. ఆయనే మన జీవికకోసం ఉపాధిని ప్రసాదించాడు. ఆయన మనల్ని ఇట్టే వదలిపెట్టలేదు. మనకు సన్మార్గం చూపడానికని ప్రవక్తల్ని పంపించాడు. ఎవరయితే వారు చెప్పినట్టు వింటాడో అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు. మరెవరయితే ధిక్కరిస్తాడో అతను నరకానికి ఆహుతి అవుతాడు.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటీ?

జవాబు : దీనికి ఆధారం ఇది : అల్లాహ్‌ తన గ్రంథంలో ఏమని సెలవిచ్చాడంటే-

إِنَّا أَرْسَلْنَا إِلَيْكُمْ رَسُولًا شَاهِدًا عَلَيْكُمْ كَمَا أَرْسَلْنَا إِلَىٰ فِرْعَوْنَ رَسُولًا فَعَصَىٰ فِرْعَوْنُ الرَّسُولَ فَأَخَذْنَاهُ أَخْذًا وَبِيلًا

మేము ఫిర్‌ఔను వద్దకు ఒక ప్రవక్తను పంపిన విధంగా ఒక ప్రవక్తను మీపై సాక్షిగా నియమించి మీ వద్దకు పంపాము. (చూడండి) ఫిరౌను ఆ ప్రవక్త మాటను వినకపోవటం వల్ల మేము అతన్ని చాలా తీవ్రంగా పట్టుకున్నాము.” (అల్ ముజ్జమ్మిల్ 73: 15,16)

రెండవదేమిటంటే; ఆరాధన మరియు దాస్యం విషయంలో తనతోపాటు మరెవరికయినా భాగస్వామ్యం కల్పిస్తే, దీనిని అల్లాహ్‌ సుతరామూ సహించడు. ఇది షిర్క్‌ అవుతుంది. షిర్క్‌ చేసేవారు తనకెంత సన్నిహితులయినా, ఆఖరికి దైవదూతలు, దైవప్రవక్తలు ఈ పని చేసినా సరే దేవుడు క్షమించడు.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటీ?

జవాబు : దీనికి ఆధారంగా దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనాన్ని చూడండి –

وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا

మస్జిద్లు అల్లాహ్‌కు మాత్రమే ప్రత్యేకం. కనుక వాటిలో అల్లాహ్‌తో పాటు మరొకరిని పిలవకండి.” (జిన్‌ 72:18)

మూడవదేమిటంటే; దేవుని ఏకత్వాన్ని అంగీకరించి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కి విధేయుడై ఉంటానని ఒప్పుకున్న మీదట దైవం మరియు దైవప్రవక్తల విరోధులతో స్నేహం చేయరాదు. మరి ఆ దైవవిరోధులు తమకు ఆప్తులు, మిత్రులయినాసరే వారితో తెగతెంపులు చేసుకోవలసిందే.

ప్రశ్న : ఆ మేరకు ఏదైనా నిదర్శనం ఉందా?

జవాబు : ఉంది. దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఈ విధంగా సెలవిస్తున్నాడు –

لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ ۚ أُولَٰئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ الْإِيمَانَ وَأَيَّدَهُم بِرُوحٍ مِّنْهُ

అల్లాహ్‌ను, పరలోకాన్ని విశ్వసించేవారు, అల్లాహ్‌ను ఆయన ప్రవక్తనూ వ్యతిరేకించే వారిని ప్రేమించటాన్ని నీవు ఎన్నడూ చూడలేవు. ఆ వ్యతిరేకించేవారు వారి తల్లిదండ్రు లైనా, వారి సోదరులైనా సరే లేదా వారి కుటుంబీకులయినా సరే. వారి హృదయాలలో అల్లాహ్‌ విశ్వాసాన్ని స్థిరంగా నాటాడు. తన తరపు నుండి ఒక ఆత్మను ప్రసాదించి వారికి బలాన్ని ఇచ్చాడు.” (ముజాదల 58:22)

ప్రశ్న : ‘హనీఫియత్‌’ – లేదా ‘మిల్లతె  ఇబ్రాహీం’ అంటే ఏమిటి?

జవాబు: మిల్లతె ఇబ్రాహీం అంటే చిత్తశుద్ధితో, ఏకాగ్ర చిత్తంతో ఒక్కడైన అల్లాహ్‌ను ఆరాధించటం. అల్లాహ్‌ అందరికీ దీని గురించే ఆజ్ఞాపించాడు. ఇందు నిమిత్తమే అందరినీ పుట్టించాడు.

ప్రశ్న : అలా అని ఎక్కడుందీ?

జవాబు : దివ్య గ్రంథమైన ఖుర్‌ఆన్‌లో ఉంది :

నేను జిన్నుల్ని, మానవుల్ని నా దాస్యం చేయడానికి మాత్రమే పుట్టించాను”.

ప్రశ్న : ‘యాబుదూని’ (నా దాస్యమే చేయాలి) అనే మాటలోని ఆంతర్యం ఏమిటీ?

జవాబు : దీని ఆంతర్యం ఏమిటంటే ప్రాణులన్నీ ఆయన ఏకత్వాన్ని అంగీకరించి ఆయన ముందరే తలవంచాలి. ఆయన చేయమన్న దానిని చేయాలి. వద్దన్న దానికి దూరంగా ఉండాలి.

ప్రశ్న : అల్లాహ్‌ ఆజ్ఞాపించిన వాటిలోకెల్లా పెద్ద ఆజ్ఞ ఏది?

జవాబు : తౌహీద్‌ ! అదే ఏకదైవారాధన.

ప్రశ్న : ‘తౌహీద్‌’ అంటే ఏమిటీ?

జవాబు : తౌహీద్‌ అంటే కేవలం ఒక్క అల్లాహ్‌నే పూజించాలి. ఆయన దైవత్వంలో, ఆయన గుణగణాలలో, ఆయన అధికారాలలో వేరొకరికి సహవర్తుల్ని కల్పించ కూడదు. ఆయన అద్వితీయుడనీ, దోషరహితుడనీ, రాగద్వేషాలకు అతీతుడనీ, సృష్టితాలలో ఆయనకు ఏమాత్రం పోలికలేదనీ అంగీకరించాలి. ఇదే స్వచ్భమైన తౌహీద్‌.

ప్రశ్న : అల్లాహ్‌ మనల్ని వారించిన వాటిలోకెల్లా పెద్ద వస్తువు ఏది?

జవాబు : షిర్క్‌.

ప్రశ్న : షిర్క్‌ అంటే?

జవాబు : షిర్క్‌ అంటే అల్లాహ్‌తో పాటు వేరొక దైవేతరుణ్ణి మొర పెట్టుకోవటం, దైవారాధనలో ఇంకొకరికి సాటి కల్పించటం.

ప్రశ్న: దీనికి ఉపమానం గానీ, ఆధారం గానీ ఉందా?

జవాబు : ఉంది. ఉదాహరణకు దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ క్రింది ఆయత్‌ని గమనించండి:

وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا

1. “మీరంతా అల్లాహ్‌కు దాస్యం చెయ్యండి. ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చేయ వద్దు.” (అన్‌ నిసా 4:36)

فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ

2. “ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాహ్‌కు సమానులుగా నిలబెట్టకండి.” (అల్‌ బఖర 2:22)

ప్రశ్న : ప్రతి ఒక్కరూ అవశ్యంగా తెలుసుకోవలసిన మూడు ముఖ్య సూత్రా లేమిటి?

జవాబు :

  • 1. తమ పోషకుని (రబ్‌) తెలుసుకోవటం,
  • 2. తన నిజధర్మమైన ఇస్లాంను తెలుసుకోవటం,
  • 3. తన  ప్రవక్తయగు హజ్రత్‌ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను తెలుసుకోవటం.

ప్రశ్న : నీ ప్రభువు (పోషకుడు) ఎవరు?

జవాబు : నా ప్రభువు అల్లాహ్‌. ఆయనే నన్నూ మరియు సమస్తలోక వాసులను తన అనుగ్రహంతో పోషిస్తున్నాడు. ఆయనే నా ఆరాధ్య దైవం. ఆయన తప్ప నాకు మరో ఆరాధ్యుడు లేడు.

ప్రశ్న : దీనికి నిదర్శనం ఏమిటి?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని తొలి వాక్యమే దీనికి నిదర్శనం –

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ

“ప్రశంసలు, పొగడ్త లన్నీసర్వలోకాలపాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్‌కే శోభిస్తాయి.” (సూరా ఫాతిహా 1:1)

అల్లాహ్‌ తప్ప మిగిలినదంతా లోకంగా పరిగణించడుతుంది. నేను కూడా ఈ లోకంలో ఒక వ్యక్తిని.

ప్రశ్న : నీవు నీ ప్రభువును ఎలా తెలుసుకోగలిగావు?

జవాబు : నేను నా ప్రభువును ఆయన నిదర్శనాల ద్వారా తెలుసుకోగలిగాను. ఆయన సృష్టితాల ద్వారా, రేయింబవళ్ల ద్వారా, సూర్యచంద్రుల ద్వారా, భూమ్యా కాశాల ద్వారా, అందలి ప్రాణుల ద్వారా భూమ్యాకాశాలలో సంచరించే జీవుల ద్వారా తెలుసుకోగలిగాను.

ప్రశ్న : దీనికి నిదర్శనం ఏమిటీ?

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ

“ఈ రేయింబవళ్లూ, ఈ సూర్య చంద్రులు అల్లాహ్‌ సూచనలలోనివే. సూర్యచంద్రులకు సాష్టాంగ పడకండి. వాటిని సృజించిన అల్లాహ్ కు సాష్టాంగ పడండి – నిజంగానే మీరు ఆయనను ఆరాధించేవారే అయితే.” (హామీమ్‌ అస్‌ సజ్‌దా  31:37)

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ

“వాస్తవంగా మీ ప్రభువు అల్లాహ్ యే. ఆయన ఆకాశాలనూ, భూమినీ ఆరు దినాలలో సృష్టించాడు. తరువాత తన రాజ్యపీఠాన్ని అలంకరించాడు. రాత్రిని పగటిపై కప్పి వేస్తాడు. ఆ తరువాత పగలు రాత్రి వెంట పరుగులు తీస్తూ ఉంటుంది. ఇంకా ఆయన సూర్యుణ్జి, చంద్రుణ్ణి, నక్షత్రాలను పుట్టించాడు. అన్నీ ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. తెలుసుకోండి! సృష్టి ఆయనదే. దానిపై ఆధిపత్యమూ ఆయనదే. అల్లాహ్‌ అనంతమయిన  శుభాలు కలవాడు. సకల లోకాలకు ప్రభువు. (అల్‌ అరాఫ్ 7:54)

ప్రశ్న : ‘రబ్‌’ అని ఎవరిని అంటారు?

జవాబు : యజమాని, స్వామి మరియు శూన్యంలో నుంచి అస్థిత్వాన్ని తీసుకువచ్చే వానిని ‘రబ్’ అని అంటారు.అటువంటి శక్తిమంతుడే యదార్దానికి పూజనీయుడు.

ప్రశ్న : ఈ మేరకు ఏదన్నా నిదర్శనం ఉందా?

జవాబు : ఉంది. దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వాక్యాన్ని పరిశీలించండి –

“మానవులారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. దీనిద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మీ కొరకు భూమిని పాన్పు గాను, ఆకాశాన్ని కప్పు గానూ సృష్టించినవాడూ, పైనుండి వర్షాన్ని కురిపించి తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసినవాడూ ఆయనే. ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి.” (అల్‌ బఖర 2:21-22)

అందుచేతఈవస్తువులను ఎవరు సృష్టించాడో అతడే ఆరాధనలు,దాస్యానికి అర్హుడు.

ప్రశ్న : ‘“ఇబాదత్‌’ అని దేనినంటారు?

జవాబు : ఆరాధ్యుని సమక్షంలో అశక్తతతో, అణకువతో, వినమ్రతతో, ప్రేమాతి శయంతో మెలగటాన్ని “ఇబాదత్‌’ అని అంటారు. వేరే మాటల్లో చెప్పాలంటే దాసుడు దేవుని ప్రసన్నతను చూరగొనడానికి, ఆయన్ని సంతృప్తిపరచడానికి చేసే ఇబాదత్‌ లేక ఆరాధన.

ప్రశ్న : అల్లాహ్‌ ఎన్ని రకాల ఆరాధనలు చేయమని ఆజ్ఞాపించాడు?

జవాబు : ఎన్నో రకాల ఆరాధనలు చేయమన్నాడు. వాటిలో ఇస్లాం, ఈమాన్‌, ఇహ్సాన్‌, దుఆ, భయము, దైవాన్ని కలుసుకోవాలన్న కుతూహలం, కఠోర పరిశ్రమ, అభ్యాసం, ఆశ, అణకువ, దైవంపై భారం మోపటం, ఖుర్బానీ, ఉపవాసం, మొక్కుబడి లాంటివే గాకుండా ఇంకా అనేక ఆరాధనలున్నాయి. వాటిని చేయ మని అల్లాహ్‌ ఆదేశించాడు. మరి ఇవన్నీ అల్లాహ్‌కే ప్రత్యేకం అన్న సంగతిని మరువరాదు.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనం గమనించండి.

“మస్జిద్లు అల్లాహ్‌కు మాత్రమే ప్రత్యేకం. కనుక వాటిలో అల్లాహ్‌తో పాటు మరొకరిని వేడుకొనరాదు.” (సూరె జిన్‌-18)

ఇంకా ఇలా అనబడింది :

“నీ ప్రభువు నిర్ణయం చేసేశాడు – మీరు కేవలం ఆయనను తప్ప మరెవరినీ ఆరా ధించకండి.” (బనీ ఇస్రాయీల్‌ – 23)

ప్రశ్న : ఎవరయినా వీటిలో దేనిననయినా దైవేతరుల కోసం ప్రత్యేకించినట్టయితే ఏమవుతుంది?

జవాబు : ఎవరయినా వీటిలో దేనినయినా దైవేతరుల కొరకు ప్రత్యేకిస్తే వారు ముష్రిక్‌లు (బహు దైవోపాసకులు) అయిపోతారు.

ప్రశ్న : ఏమిటీ దీనికీ ఆధారం?

జవాబు : దీనికి ఆధారంగా అల్లాహ్‌ ఈవిధంగా సెలవిచ్చాడు –

“ఎవడయినా అల్లాహ్‌తోపాటు మరొక ఆరాధ్యుణ్జి కూడా వేడుకుంటే, దానికి అతని వద్ద ఏ ప్రమాణమూ లేదు.అతని లెక్క అతని ప్రభువు వద్దఉన్నది. అటువంటి అవిశ్వాసులు ఎన్నటికీ సాఫల్యం పొంద లేరు.” (అల్‌ మూమినూన్‌ – 117)

ప్రశ్న : దుఆ (వేడుకోలు)కూడా ఆరాధనే (దాస్యమే) నన్నదానికి ఏమిటీ నిదర్శనం?

జవాబు : అల్లాహ్‌ దివ్య ఖుర్‌ఆన్‌లో ఈవిధంగా సెలవిచ్చి ఉన్నాడు –

“మీ ప్రభువు స్పష్టంగా చెప్పేశాడు : మీరు నన్ను పిలవండి. నేను మీ మొరను వింటాను మరియు ఆమోదిస్తాను. ఎవరయితే నా ఆరాధన యెడల తలబిరుసుతనం ప్రదర్శిస్తారో వారు త్వరలోనే పరాభవంపాలై నరకంలో ప్రవేశిస్తారు.” (….) ఇదిలా వుండగా “అద్దుఆవు ముఖ్ఖల్‌ ఇబాద” (ఈ హదీస్‌ జయీఫ్‌ ఉన్నది.) (దుఆ ఆరాధన యొక్క సారం) అని మహనీయ ముహమ్మదు (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ప్రబోధించారు. వేరొక సహీ హదీసులో “అద్దుఆవు హువల్‌ ఇబాద‘ (దుఆయే అసలు ఆరాధన) అని ఉంది

ప్రశ్న : ఖౌఫ్‌ (భయము, భీతి) కూడా ఆరాధనే నన్నదానికి నిదర్శనం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనమే దీనికి నిదర్శనం –

“కనుక మీరు నిజమయిన విశ్వాసులే అయితే ఇక ముందు మానవులకు భయ పడకండి. నాకు భయపడండి.” (ఆలి ఇమ్రాన్‌ – 175)

ప్రశ్న : ‘రజా’ (దైవాన్ని కలుసుకునే కుతూహలం) కూడా ఆరాధనే అన్న దానికి నిదర్శనం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని క్రింది వచనమే దీనికి నిదర్శనం –

“కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. ఆరాధనలో తన ప్రభువుతోపాటు మరెవ్వరినీ చేర్చకూడదు.” (అల్‌ కహఫ్‌ – 110)

ప్రశ్న : ‘తవక్కుల్‌ (దైవంపై గల నమ్మకం, దైవంపై భారం వేయటం) కూడా ఆరాధనేనన్న దానికి రుజువు ఏమిటీ?

జవాబు : దీనికి రుజువు ఇది-

1. “మీరు నిజంగానే విశ్వాసులయితే అల్లాహ్‌పై భారం వెయ్యండి.” (అల్ మాయిద – 23)
2. “ఎవరయితే అల్లాహ్‌ పై భారం వేస్తాడో అతని కొరకు ఆయన చాలు.” (తలాక్‌- 5)

ప్రశ్న : కఠోర పరిశ్రమ, అభ్యాసం, ఆశ, అణకువ వంటివి కూడా ఆరాధనే నన్న దానికి ఆధారం ఏమిటీ?

జవాబు : దీనికి ఆధారం ఇదే –

“వారు సత్కార్యాల కోసం ఎంతగానో ప్రయాస పడతారు. ఆశతోనూ, శ్రద్ధాభక్తుల తోనూ మమ్మల్ని ప్రార్థిస్తారు. మా సమ క్షంలో అణగిమణగి ఉంటారు.”(అంబియా – 90)

ప్రశ్న : “ఖషియత్‌’ (భయము, భక్తి) కూడా ఆరాధనే అనే దానికి ఆధారంఏమిటీ?

జవాబు : దీనికి ఆధారం దివ్య గ్రంథంలోని ఈ క్రింది వచనం. ఇందులో అల్లాహ్‌ తన దాసులను ఉద్దేశ్యించి ఏమంటున్నాడో చూడండి –

“కనుక మీరు వారికి భయపడకండి. నాకు భయపడండి.” (అల్‌ మాయిద – 3)

ప్రశ్న : ‘ఇనాబత్’ (మరలటం,రుజువు కావటం) కూడా ఆరాధనే అన్న దానికి నిదర్శనం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ క్రింది వచనం దీనికి నిదర్శనం –

“మీ మీదకు శిక్ష రాకముందే, మీకు ఎవరినుండీ సహాయం లభించని పరిస్థితి ఏర్పడక ముందే మీరు మీ ప్రభువు వైపునకు మరలి, ఆయనకు విధేయత చూపండి.” (అజ్‌ జుమర్‌ – 54)

ప్రశ్న : ‘ఇస్తెఆనత్‌’ (సహాయం అర్థించటం) కూడా ఆరాధనే అనడానికి ఆధారం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ ప్రార్థనే దీనికి నిదర్శనం :

“(దేవా!) మేము నిన్నే ఆరాధిస్తున్నాము. సహాయం కొరకు నిన్నే అర్థిస్తున్నాము.” (అల్‌ ఫాతిహా – 4)

ఇంకా – హదీసులో ఇలా ఉంది :
“నువ్వు ఏదైనా అర్థించటమే జరిగితే అల్లాహ్‌ను అర్ధించు.”

ప్రశ్న : ‘“ఇస్తెఆజ’ (శరణు కోరటం) కూడా ఆరాధనే ననడానికి ఆధారం ఏమిటీ?

జవాబు : ‘ఇస్తెఆజ’ కూడా ఆరాధనే అనడానికి ఆధారం ఇది :

ఇలా అను,”నేను మానవుల ప్రభువు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్‌) శరణు కోరుతున్నాను.

ప్రశ్న : ‘ఇస్తెగాస’ (ఫిర్యాదు లేక విన్నపం చేసుకోవటం) కూడా ఆరాధనే అనడానికి ఏమిటీ నిదర్శనం?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ క్రింది వచనమే దీనికి నిదర్శనం –

“ఇంకా మీరు మీ ప్రభువును నహాయం కొరకు విన్నవించుకున్న సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. సమాధానంగా అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చాడు : “నేను మీ సహాయం కొరకు వెయ్యిమంది దైవదూతలను ఒకరి తరువాత ఒకరిని ఎడతెగకుండా పంపుతున్నాను.” (అన్‌ ఫాల్‌ – 9)

ప్రశ్న : ఒకరి పేరుమీద జిబహ్‌ చేయటం (బలి ఇవ్వటం) కూడా ఆరాధనే అన్న దానికి ఏమిటి ఆధారం?

జవాబు : దేవుని ఈ ఉపదేశమే దీనికి ఆధారం :

“(ఓ ప్రవక్తా!) ఇలా ప్రకటించు : నా నమాజ్‌, నా సకల ఉపాసనా రీతులు, నా జీవనం, నా మరణం-సమస్తమూ సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్‌ కొరకే. ఆయన కు ఏ భాగ స్వామీ లేడు. ఈ ఆజ్ఞయే నాకు ఇవ్వ బడింది. అందరికంటే ముందు విధేయ తతో తలవంచే వాణ్జి నేనే.” (అల్‌ అన్‌ ఆమ్‌ – 162)

ప్రశ్న : మొక్కుకోవటం కూడా ఆరాధనేనన్నదానికి ఆధారమేమిటి?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ ఉపదేశమే దీనికి ఆధారం-

“వారు ఎలాంటి వారంటే (ప్రపంచంలో) మొక్కుబడి చెల్లించేవారు,నలువైవుల నుంచీ ఆపదలు కమ్ముకుని వచ్చే దినానికి భయపడేవారు.” (అల్ ఇన్సాన్  – 7)

ప్రశ్న : రెండవ ప్రధానాంశం ఏమిటీ?

జవాబు : ఇస్లాం ధర్మాన్ని ఆధారాలతో సహా తెలుసుకోవటం.

ప్రశ్న : ఇస్లాం అంటే ఏమిటీ?

జవాబు : ఇస్లాం అంటే స్వచ్భమైన ఏక దైవారాధనతోపాటు, బేషరతుగా అల్లాహ్‌కు లొంగిపోవటం, పూర్తిగా సమర్చించుకోవటం,దైవాజ్ఞాపాలన చేయటం, ఆయనకు విధేయత చూపటం, బహు దైవారాధనతో, బహు దైవారాధకులతో తెగతెంపులు చేసుకోవటం.

ప్రశ్న : ఇస్లాం ధర్మంలో గల అంతస్థులు ఎన్ని? అవి ఏవి?

జవాబు : ఈ అంతస్థులు మూడు. 1. ఇస్లాం 2. ఈమాన్‌ 3. ఇహ్సాన్. ప్రతి అంతస్థు లేక స్థాయిలో కొన్ని ప్రధానాంశాలు ఉన్నాయి.

ప్రశ్న : ఇస్లాంలోని ప్రధానాంశాలు – మౌలికాంశాలు – ఎన్ని?

జవాబు : ఐదు.

  • 1. అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యదైవం లేడనీ, ముహమ్మద్‌ – (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవప్రవక్తయనీ సాక్ష్యమివ్వడం.
  • 2. నమాజ్‌ను నెలకొల్పటం.
  • 3. జకాత్‌ అనే విధిగా చెల్లించవలసిన దానాన్ని చెల్లించటం.
  • 4. రమజాన్‌ నెలలో విధిగా ఉపవాసాలుండటం.
  • 5. (స్థోమత ఉంటే) హజ్‌ చేయటం.

ప్రశ్న : అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్య దైవం లేడన్న  సాక్ష్యానికి నిదర్శనం ఏమిటీ?

జవాబు : దివ్య గ్రంథమైన ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు :

“తాను తప్ప మరొక దైవం లేడు అనే సత్యానికి స్వయంగా అల్లాహ్‌యే సాక్ష్యమిచ్చాడు. దైవదూతలు, సమస్త జ్ఞానులు కూడా ఆ మహాశక్తిమంతుడూ, ఆ మహాజ్ఞానీ తప్ప వాస్తవానికి మరొక  దైవం లేడు అని నిజాయితీగానూ, న్యాయంగానూ సాక్ష్యమిస్తారు.” (ఆలి ఇమాన్‌ – 18)

ప్రశ్న : “లా ఇలాహ ఇల్లల్లాహ్‌” అంటే భావం ఏమిటీ?

జవాబు : అల్లాహ్‌ తప్ప మరొక ఆరాధ్యుడు, పూజ్యుడు లేడనీ, ఆయనే నిజ దైవమనీ భావం.

ప్రశ్న : “లా ఇలాహ్‌” అంటే….?

జవాబు : అల్లాహ్‌ తప్ప ఇతర దైవాలను వదలి వేయటం, త్రోసి పుచ్చటం అని భావం.

ప్రశ్న : “ఇల్లల్లాహ్‌” అంటే భావం ఏమిటీ?

జవాబు : ఆరాధన, దాస్యం, పూజలకు అల్లాహ్‌యే తగినవాడనీ, దాస్యంలో ఆయనకు సహవర్తులు ఎవరూ లేరని ఆచరణ ద్వారా రుజువు చేయటం.

ప్రశ్న : ఈ విషయాన్ని విడమరచి చెప్పేదేమైనా ఉందా?

జవాబు : అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు-

“ఇబ్రాహీమ్‌ తన తండ్రికీ, తన జాతివారికీ ఇలా చెప్పిన ఆ సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో, “మీరు పూజిస్తున్నవాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించిన వానితోనే ఉన్నది. ఆయనే నాకు మార్గం చూపుతాడు.” ఇబ్రాహీమ్‌ ఈ వచనాన్నే తన తరువాత తన సంతానం కోసం విడిచివెళ్లాడు, వారు దాని వైపునకు మరలేందుకు.” (అజ్‌ జుఖ్రుఫ్‌ : 26-28)

మరోచోట ఇలా సెలవిచ్చాడు

“ప్రవక్తా! ఇలా చెప్పు : “గ్రంథం కల ప్రజలారా! మాకూ మీకూ మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి. (అది ఏమి టంటే) మనం అల్లాహ్‌కు తప్ప మరెవరికీ దాస్యం చెయ్యరాదు. ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టరాదు. మనలోని వారెవరూ అల్లాహ్‌ను తప్ప మరెవరినీ తమ ప్రభువుగా చేసుకోరాదు అనేది.”ఈ సందేశాన్ని స్వీకరించటానికి వారు వైముఖ్యం కనబరిస్తే వారితో స్పష్టంగా ఇలా అను:”మేము ముస్లింలము (కేవలం అల్లాహ్‌కే దాన్యం చేసేవారు, విధేయత చూపేవారు) అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి.” (ఆలి ఇమ్రాన్‌ – 64)

ప్రశ్న: ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవప్రవక్త అన్నసాక్ష్యానికి ఆధారం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ దైవోపదేశమే ఇందుకు ఆధారం-

“చూడండి! మీ వద్దకు ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన స్వయంగా మీలోనివాడే. మీరు తీవ్రంగా నష్టానికి గురికావటం అనేది ఆయనకు కష్టం కలిగిస్తుంది. మీ సాఫల్యాన్నిఆయన తీవ్రంగా కాంక్షిస్తాడు. విశ్వాసులపై ఆయన వాత్సల్యం కలవాడు, కారుణ్యం కలవాడు.” (అత్‌ తౌబా – 128)

అల్లాహ్‌ ఇంకా ఈ విధంగా స్పష్టం చేశాడు –

“ముహమ్మద్‌ అల్లాహ్‌ ప్రవక్త. ఆయనవెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులు గానూ ఉంటారు,పరస్పరం కరుణామయులు గానూ ఉంటారు.”(అల్‌ ఫతహ్‌ – 29)

ప్రశ్న: ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవప్రవక్త (రసూలుల్లాహ్‌) అని సాక్ష్యమివ్వ డంలోని మతలబు ఏమిటీ?

జవాబు : దీని మతలబు ఏమిటంటే; ఆయన ఆదేశాలను పాలించాలి, ఆయన ఏ విషయం చెప్పినా దాన్ని సత్యమని ధృవీకరించాలి. ఆయన వారించిన వాటికి దూరంగా ఉండాలి. ఆయన చూపిన షరీయత్‌ కనుగుణంగా దైవారాధన చేయాలి.

ప్రశ్న: నమాజ్‌, రోజా గురించి ఏం ఆధారముంది? తౌహీద్‌కు గల తాత్పర్యం ఏమిటీ?

జవాబు : అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చి ఉన్నాడు :

“వారు అల్లాహ్‌కు దాస్యం చెయ్యాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్నిఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్‌ను స్థాపించాలనీ, జకాత్‌ ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి (గ్రంథ వహులకు) ఆదేశించటం జరిగింది. ఇదే సరియైన, సవ్యమైన ధర్మం (అని వారికి స్పష్టం చేయబడింది). (అల్‌ బయ్యిన – 5)

ప్రశ్న : “రోజా” (ఉపవాసం)కు ఆధారమేమన్నా ఉందా?

జవాబు : ఉంది. దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనం చదవండి :

“విశ్వసించిన ఓ ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది -ఏ విధం గా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడిందో. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.” (అల్‌ బఖర : 183)

ప్రశ్న : హజ్‌ చేయాలి అన్న దానికి ఆధారం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లో హజ్‌ గురించి ఇలా సెలవీయబడింది : “ప్రజలపై అల్లాహ్‌కు ఉన్న హక్కు ఏమిటంటే, ఈ గృహానికి వెళ్ళే శక్తి గలవారు దాని హజ్‌ను విధిగా చేయాలి. ఈ ఆజ్ఞను పాలించడానికి తిరస్కరించేవాడు, అల్లాహ్‌కు ప్రపంచ ప్రజల అవసరం ఎంత మాత్రం లేదు అని స్పష్టంగా తెలుసు కోవాలి.” (ఆలి ఇమ్రాన్‌ – 97)

ప్రశ్న : ఇస్లాం ధర్మం యొక్క  రెండవ అంతస్థు ఏది?

జవాబు : ఈమాన్‌ (విశ్వాసం).

ప్రశ్న: ఈమాన్‌ శాఖలు (విభాగాలు) ఎన్ని?

జవాబు : ఈమాన్‌ శాఖలు డెబ్బయికి పైగా ఉన్నాయి. వాటిలో అన్నిటికన్నా ఉన్నతమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్‌. అన్నిటికన్నా తక్కువ స్థాయిగల శాఖ “దారిలో పడి ఉన్న బాధాకరమైన వస్తువులను తొలగించటం.” లజ్జ మరియు వ్రీడ కూడా ఈమాన్‌లో అంతర్భాగమే.

ప్రశ్న : ఈమాన్‌లోని ప్రధానాంశాలు ఎన్ని? అవి ఏవి?

జవాబు : ఈమాన్‌లోని ప్రధానాంశాలు ఆరు. అవి

  • 1. అల్లాహ్‌పై విశ్వాసం
  • 2. దైవదూతలపై విశ్వాసం
  • 3. దైవం తరఫున అవతరింపజేయబడిన గ్రంథాలపై విశ్వాసం
  • 4. దైవప్రవక్తలపై విశ్వాసం
  • 5. అంతిమ దినంపై విశ్వాసం
  • 6. మంచి జరిగినా, చెడు జరిగినా-అంతా దైవం తరఫుననే జరుగుతుంది అనే దాని (విధి వ్రాత)పై విశ్వాసం.

ప్రశ్న : ఏమిటీ దీనికి ఆధారం?

జవాబు : ఆధారం కావాలంటే దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనాన్ని చదవండి. “సత్కార్యం అంటే మీరు మీ ముఖాలను తూర్పుకో, పడమరకో త్రిప్పటం కాదు, సత్కార్యం అంటే మనిషి అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ, దూతలనూ, అల్లాహ్‌ అవతరింపజేసిన గ్రంథాన్నీఆయన ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించటం.” (అల్‌ బఖర : 127)

ప్రశ్న : ‘విధి’ (తక్‌దీర్‌) అనే దానికి ఆధారం ఏమిటీ?

జవాబు : దీనికి ఆధారం దివ్య గ్రంథంలోని ఈ వచనం –

“మేము ప్రతి వస్తువునూ ఒక విధి నిర్ణయం తోపాటు సృష్టించాము.” (అల్‌ ఖమర్‌ – 49)

ప్రశ్న : ఇస్లాం ధర్మం యొక్క మూడవ అంతస్థు ఏది?

జవాబు : ఇస్లాం మూడవ అంతస్థు ‘ఇహ్సాన్.”

ప్రశ్న : “ఇహ్సాన్’ అంటే అసలేమిటీ?

జవాబు : మీరు అల్లాహ్‌ను చూస్తున్నామన్న భావనతో ఆరాధన చేయండి. లేకుంటే, ఆయన మిమ్మల్నిచూస్తున్నాడన్న తలంపుతోనయినా ఆరాధన చేయండి. అంటే ఏ ఆరాధననైనా ఉత్తమ రీతిలో నిర్వర్తించటమే అసలు ఇహ్సాన్ అన్నమాట.

ప్రశ్న: దీనికి ఆధారం ఏమిటి?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని క్రింది ఆయతే దీనికి ఆధారం.

“భయభక్తులతో పనిచేస్తూ, ఉదాత్త వైఖరి కలిగి ఉండే వారితో అల్లాహ్‌ ఉంటాడు.” (అన్‌ నహ్ల్ -128)

మరో చోట అల్లాహ్‌ ఈ విధంగా ప్రబోధించాడు –

“మహా శక్తిమంతుడైన ఆ అనంతకరుణామయుడిపై భారం మోపు. ఆయన నిన్ను, (నీవు) లేచినవుడు చూస్తాడు, సజ్‌దా చేసేవారిలో నీ రాకపోకలను గమనిస్తాడు. ఆయన అన్నీ వింటాడు, అన్నీ తెలిసిన వాడు.”(అష్‌ షుఅరా: 217-220)

వేరొక చోట ఇలా సెలవీయబడింది-

“ప్రవక్తా! నీవు ఏ స్థితిలో ఉన్నాఖురాను నుండి దేనిని వినిపించినా, మానవులారా! మీరుఏది చేసినా ఆ అన్ని సందర్భాలలోనూ మేము మిమ్మల్నిచూస్తూనే ఉంటాము” (యూనుస్‌-61)

ప్రశ్న: ఇస్లాం ధర్మానికి చెందిన ఈ మూడు మెట్లకు (ఇస్లాం, ఈమాన్‌ ఇహ్సాన్‌)కి సంబంధించి హదీసు లేక సున్నతులో కూడా ఏమైనా ఆధారముందా?

జవాబు : ఉంది. హదీసె జిబ్రయీల్‌గా ఖ్యాతి చెందిన ఆ హదీసును హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రజి అల్లాహు అన్హు) ఈ విధంగా తెలిపారు-

“మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమక్షంలో కూర్చుని ఉన్నాము. అంతలో ఒక వ్యక్తి వచ్చాడు. అతని దుస్తులు ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయి. జుట్టు నల్లగా ఉంది. మరి అతనిలో ప్రయాణ బడలిక కూడా కనిపించలేదు. మాలో ఎవరూ అతన్ని ఎరుగరు. ఆ వ్యక్తి దైవవ్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ఎదుటకూర్చున్నాడు.తన మోకాళ్లను ఆయన మోకాళ్లకు ఆనించి మరీ కూర్చున్నాడు. తన అరచేతులను ఆయన తొడలపై ఉంచి, ‘ఓ ముహమ్మద్‌! నాకు ఇస్లాం గురించి తెలియజేయండి’ అని అన్నాడు. “నీవు అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని సాక్ష్యమివ్వాలి.ముహమ్మద్‌ అల్లాహ్‌ సందేశహరుడని కూడా నీవు సాక్ష్యమివ్వాలి.నమాజ్‌ను స్థాపించాలి. జకాత్‌ ఇవ్వాలి.రమజాన్‌ నెలలో ఉపవాసాలుండాలి. స్థోమత ఉంటే దైవ గృహాన్ని సందర్శించి హజ్‌ చేయాలి’ అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివరించారు.’తమరు చెప్పింది నిజం’ అన్నాడా వ్యక్తి.మాకు ఆశ్చర్యం కలిగించింది అతని ప్రవర్తన. ప్రశ్నించేవాడూ అతనే, సమాధానాన్ని సత్యమని ధృవీకరించేవాడూ అతనే. “నాకు ఈమాన్‌ గురించి వివరించండి’ అని తిరిగి ప్రశ్నించాడా పృచ్చకుడు. దానికాయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), “నీవు అల్లాహ్‌ను,ఆయన దూతలను, ఆయన (గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని, మంచి జరిగినా చెడు జరిగినా అంతా దైవం తరఫుననే జరుగుతుందన్న విధివ్రాతను విశ్వసించు.ఇదే ఈమాన్‌’ అని వివరించారు. “నాకు ఇహ్సాన్‌ గురించి చెప్పండి’ అని మళ్లీ ప్రశ్నించాడా అపరిచితుడు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా విడమరచి చెప్పారు: “నీవు అల్లాహ్‌ను చూస్తున్నానన్న (అల్లాహ్‌ ఎదుట ఉన్నాడన్న) భావంతో ఆయన్ని ఆరాధించు.ఒకవేళ నీవు ఆయన్ని చూడ లేకపోయినా, ఆయన నిన్ను చూస్తున్నాడన్న తలంపు నీలో ఉండాలి.” “నాకు ప్రళయదినం గురించి చెప్పండి” అని అడిగాడు ఆ అపరిచిత వ్యక్తి. ‘దాని గురించి ప్రశ్నించబడే వానికి ప్రశ్నించేవానికన్నా ఎక్కువేమీ తెలీదు” అన్నారాయన (సల్లలాహు అలైహి వ సల్లం) . “పోనీ నాకు దాని సూచనలయినా తెలుపగలరా?!’ అని ఇంకో ప్రశ్న వేశాడు అతను. దానికాయన ఇలా చెప్పారు: “దాసీ (బానిసరాలు, పని మనిషి తన యజమానురాలికి జన్మనిస్తుంది. కాళ్లకు చెప్పులు, శరీరంపై చొక్కా లేకుండానే గొర్రెల్ని కాచే గొర్రెల కాపరులు బ్రహ్మాండమైన కట్టడాలు కట్టడం నీవు చూస్తావు. మరి ఆ వ్యక్తి అక్కణ్ణుంచి నిష్క్రమించాడు. మేము కాస్సేపు మౌనం వహించాము. తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఓ ఉమర్‌! ప్రశ్నలు వేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా?!’అని అడిగారు. ‘దైవానికి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కే తెలిసి ఉండాలి అని మేము విన్నవించుకున్నాము. “ఆయన జిబ్రయీల్‌. మీకుమీ ధర్మాన్ని బోధించే నిమిత్తం ఆయన మీ వద్దకు విచ్చేశారు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు. (సహీహ్‌ ముస్లిం)

ప్రశ్న : మూడవ ముఖ్యాంశం ఏమిటి?

జవాబు : మహనీయ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి గురించి. ఆయన ముహమ్మద్‌ బిన్‌ అబ్దుల్లాహ్  బిన్‌ అబ్దుల్ ముత్తలిబ్‌ బిన్‌ హాషిమ్‌ ఖురైష్‌ తెగకు చెందిన వారు. ఖురైషులు అరబ్బులు. మరి ఈ అరబ్బులు దైవప్రవక్తలయిన హజ్రత్‌ ఇబ్రాహీమ్‌, హజ్రత్‌ ఇస్మాయీల్‌ (అలైహిస్సలాం)ల సంతతికి చెందిన వారు.

ప్రశ్న : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వయస్సు గురించి చెబుతారా?

జవాబు : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) 63 సంవత్సరాలు జీవించి ఉన్నారు.40 ఏళ్ల వయస్సులో దైవప్రవక్తగా నియుక్తులయ్యారు. దైవప్రవక్తగా 23 సంవత్సరాలు మానవ జాతికి మార్గదర్శకత్వం వహించారు. సూరె ‘ఇఖ్రా’తో దైవదౌత్య శుభవార్త అందింది. సూరె ‘ముద్దస్సిర్’ అందిన క్షణం నుంచి సందేశకార్యానికి నడుం బిగించారు.ఆయన మక్కాలో జన్మించారు. మక్కా నుండి మదీనాకు ప్రస్థానం (హిజ్రత్) చేశారు. మదీనాలోనే ప్రభువు వద్దకు మహా ప్రస్థానం చేశారు.

ప్రశ్న : అల్లాహ్‌ ఆయన్ని దేని కొరకు పంపాడు?

జవాబు : మానవ జాతిని షిర్క్‌ (బహు దైవారాధన) నుండి రక్షించడానికి, ఏకేశ్వరోపాసనని బోధించడానికి అల్లాహ్‌ ఆయన్ని పంపాడు.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటి?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని క్రింది వచనాలు దీనికి స్పష్టమైన ఆధారాలు. “వస్త్రం కప్పుకుని పడుకున్న మనిషీ! లే; లేచి హెచ్చరించు. నీ ప్రభువు ఘనతను చాటి చెప్పు. నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో, అశుద్ధతకు దూరంగా ఉండు. ఎక్కువగా పొందాలనే కాంక్షతో ఉపకారం చేయకు.నీ ప్రభువు కొరకు ఓర్పు వహించు.” (అల్‌ ముద్దస్సిర్‌ : 1- 7)

ప్రశ్న : “లే,లేచిహెచ్చరించు” అన్న మాటల్లోని అంతరార్థం ఏమిటి?

జవాబు : దీని అంతరార్థం ప్రజలకు షిర్క్‌ గురించి హెచ్చరించమనీ,తౌహీద్‌ను ఉపదేశించమనీను.

ప్రశ్న: “నీ ప్రభువు ఘనతను చాటిచెప్పు.నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో” అనడంలోని భావం ఏమిటి?

జవాబు : తౌహీద్‌ (ఏకేశ్వరోపాసన) ని స్వీకరించటం ద్వారా ప్రభువు గొప్పతనాన్ని అంగీకరించమనీ, ఆచరణలను షిర్క్‌ అనే మలినం నుండి కాపాడుకోమనీ భావం.

ప్రశ్న :“అశుద్ధతకు దూరంగా ఉండు” అనడంలోని ఔచిత్యం ఏమిటి?

జవాబు : విగ్రహాలను, విగ్రవారాధకులను విడిచిపెట్టేయమనీ, వాటితో తెగత్రెంపులు చేసుకోమనీ భావం.

ప్రశ్న : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా మలినమైన వాతావరణానికి దూరంగా ఎంత కాలం ఉన్నారు?

జవాబు : పదినంవత్సరాలు. ఆతరువాత మేరాజ్‌ యాత్ర ప్రాప్తించింది. ఆ సందర్భంగా ఐదు నమాజులు వొసగబడ్డాయి. నమాజు ద్వారా దైవ సహాయాన్ని అర్థించాలన్నది దీని అభిమతం.ఆ తరువాత ఆయన మదీనాకు వలసపోయారు (హిజ్రత్‌ చేశారు).

ప్రశ్న : హిజ్రత్‌ అంటే ఏమిటి?

జవాబు : హిజ్రత్‌ అంటే ప్రస్థానం చేయటం, ఒక చోటి నుండి మరో చోటికి వలసపోవటం! షిర్క్‌ వాతావరణం నుండి ఏకేశ్వరోపాసనా వాతావరణం వైపునకు, చెడులకు నిలయమైన చోటు నుండి స్వచ్చమయిన భావాల పరివ్యాప్తికి అనువైన చోటుకు, చెడు వ్యవస్థ నుండి సత్య ప్రధానమైన వ్యవస్థ వైపునకు తరలి వెళ్లటమే హిజ్రత్‌!

ప్రశ్న : హిజ్రత్‌ ఆజ్ఞ ఎప్పటికీ ఉంటుందా?

జవాబు : ఉంటుంది. షిర్క్‌, బిద్‌అత్‌ల కాలుష్యం నుండి తౌహీద్‌ మరియు సున్నత్‌ల పరిశుద్ధత వైపునకు, చెడు భావాల నుండి సవ్యమైన భావాల వైపునకు, చెడు సహచర్యం నుండి సద్వర్తనుల సహచర్యం వైపునకు తరలిపోవాలన్న ఆజ్ఞ అంతిమ దినం వరకూ ఉంటుంది సుమా!

ప్రశ్న : ఈ వాదనకు ఏదైనా ఆధారం ఉందా?

జవాబు : ఉంది దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయండి-

తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటూ ఉండేవారి ప్రాణాలను తీసి, దైవదూతలు వారిని,’ఇదేమిటీ మీ స్థితి ఇలా ఉంది?’అని అడిగారు.అప్పుడు వారు ఇలా సమాధానం చెప్పారు; “మేము భూమిపై బలహీనులముగా, నిస్సహాయులముగా ఉండేవారము.”అల్లాహ్‌ భూమి విశాలముగా లేదా మీరు వలస పోవటానికి?’అని దైవదూతలు అడిగారు. వారి నివాసం నరకం. అది మహాచెడ్డ నివాసం.అయితే నిజంగానే నిస్సహాయులై బయలుదేరటానికి ఏ మార్గమూ, ఏసాధన సంపత్తీ లేని పురుషులనూ, స్రీలనూ పిల్లలనూ అల్లాహ్‌ క్షమించవచ్చు.(ఎందుకంటే) అల్లాహ్‌ ఎక్కువగా క్షమించేవాడూ అధికంగా మన్నించేవాడూను.” (అన్‌ నిసా- 97, 98)

ఇంకా ఇలా అనబడింది:

విశ్వసించిన నా దాసులారా! నా భూమి విశాలమైనది, కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి.” (అన్‌కబూత్‌ – 56)

ప్రశ్న : పై రెండు వచనాల అవతరణ యొక్క పూర్వ రంగం ఏమిటి?

జవాబు : మొదటి ఆయతు అవతరణా సందర్భం : మక్కాకు చెందిన కొంత మంది ఇస్లాం స్వీకరించారు. కాని వారు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తో పాటు హిజ్రత్‌ చేయలేక మక్కాలోనే ఉండి పోయారు. అటువంటి వారిలో కొంత మంది తమ విశ్వాసంపై నిలకడ కలిగి ఉండలేక, కాలం వేసే కళ్ళెంలో ఇరుక్కుని, పరిస్థితుల ఇంద్రజాలానికి మోసపోయారు. ఆఖరికి వారు బద్ర్‌ సంగ్రామంలో ముష్రిక్కుల పక్షాన నిలిచారు.అందుచేత అల్లాహ్‌ వారి వినతిని తోసిపుచ్చాడు. వారు ఒడిగట్టిన స్వామి ద్రోహానికి ప్రతిఫలంగా వారి కొరకు నరకాన్ని వొసగాడు. రెండవ వచనానికి పూర్వ రంగం ఏమంటే; మక్కాలో కొంతమంది ముస్లిములు హిజ్రత్ చేయలేక ఉండిపోయారు.అప్పుడు అల్లాహ్‌ వారి విశ్వాసాన్ని (ఈమాన్‌) వారికిజ్ఞాపకం చేసి హిజ్రత్‌ (ప్రస్థానం) వైపునకు పురికొల్పాడు.

ప్రశ్న : ‘హిజ్రత్‌’ ఒక శాశ్విత ప్రాతిపదిక గల ఆజ్ఞ అనడానికి హదీసులో ఆధారం ఏదన్నా ఉందా?

జవాబు : ఉంది. మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:

“పశ్చాత్తాపం (ద్వారం)మూసుకునే దాకా హిజ్రత్‌ (ద్వారం) మూసుకొనదు.సూర్యుడు తను అస్తమించే చోటున ఉదయించే దాకా పశ్చాత్తాపం (ద్వారం కూడా) మూసుకొనదు సుమా!”

ప్రశ్నః మదీనా మునవ్వరాలో స్థిరపడిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు ఇచ్చిన ఆదేశాలు ఏవి?

జవాబు : మదీనాలో స్థిరపడగానే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇస్లాం యొక్క మిగిలిన ఆదేశాలను-అంటే; జకాత్‌, రోజా, హజ్‌, అజాన్‌ మరియు జిహాద్‌ తదితర ఆదేశాల ను జారీ చేశారు.

ప్రశ్న: ఈ విధంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతకాలం మదీనాలో ప్రజల జీవితాలను తీర్చిదిద్దారు?

జవాబు : 10 సంవత్సరాలు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పరమపదించారు. కాని ఆయన నెలకొల్పిన ధర్మం మాత్రం యథాతథంగా ఉంది. ఆయన మనకు అందజేయని శుభం లేదు. అన్ని రకాల హానికరమయిన వాటి నుండి ఆయన తన అనుచర సమాజాన్ని జాగరూకపరచి వాటికి దూరంగా ఉండాలని హెచ్చ రించారు.

ప్రశ్న : ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) మనకు తెలియజేసిన శుభం ఏది?ఆయన ఏ కీడు గురించి హెచ్చరించారు?

జవాబు : ఆయన మనకు తౌహీద్‌ (దేవుని ఏకత్వం) గురించి నొక్కి చెప్పారు. దైవానికి సమ్మతమయిన, ఇష్టకరమయిన వన్తువులేవో స్పష్టం చేశారు. ఇదంతా మన పాలిట మేలుగా, శుభంగా పేర్కొనబడుతుంది.

ఇకపోతే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) , షిర్క్‌ (బహు దైవారాధన) గురించి గట్టిగా హెచ్చరించారు. దైవానికి సమ్మతం కాని, హానికరమయిన వస్తువులు ఏవేవో సూచించి వాటి యెడల మనందరినీ అప్రమత్తం చేశారు.

ప్రశ్న: అల్లాహ్‌ ఆయన్ని ఏదైనా ప్రత్యేక వర్గానికో, తెగకో ప్రవక్తగా చేసి పంపాడా?

జవాబు : అల్లాహ్‌ ఆయన్ని సమస్త మానవాళి కోసం ప్రవక్తగా చేసి పంపాడు. జిన్నులు మానవులంతా ఆయనకు విధేయత చూపటం తప్పనిసరి గావించాడు.

ప్రశ్న: దీనికి ఆధారం ఏమిటి?

జవాబు : దివ్యఖుర్‌ఆన్‌లోని ఈ ఆయత్‌ దీనికి ఆధారం-

(ఓ ముహమ్మద్‌!) ఇలా ప్రకటించు: నేను మీఅందరి వైపునకు వచ్చిన అల్లాహ్‌ సందేశహరుణ్ణి.” (అల్‌ బఖర : 158)

ఇంకా ఇలా అనబడింది –

“ఆ సంఘటన కూడా ప్రస్తావించదగినదే. అప్పుడు మేము జిన్నాతుల ఒక వర్గాన్ని ఖుర్‌ఆన్‌ వినేందుకు నీ వద్దకు తీసుకు వచ్చాము.” (అల్‌ అహ్‌ఖాఫ్‌ – 29)

ప్రశ్న : అల్లాహ్‌ ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ద్వారా ధర్మాన్ని పరిపూర్ణం గావించాడా? లేక ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) తదనంతరం ధర్మాన్ని పూర్తి చేశాడా?

జవాబు : అల్లాహ్‌ ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ద్వారా-ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) బ్రతికి ఉండగానే-ధర్మాన్ని పరిపూర్ణం గావించాడు. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) తదనంతరం ధర్మంలో ఎలాంటి వస్తువునూ చేర్చవలసిన అవసరం లేదు.

ప్రశ్న : దీనికి ఆధారం ఏదన్నా ఉందా?

జవాబు : ఉంది. దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ ఆయత్‌ను చూడండి:

“ఈ రోజు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం గావించాను.ఇక దీనితో నా వరాలను కూడా పూర్తి చేశాను.ఇంకా ఇస్లాంను మీ జీవనధర్మంగా సమ్మతించాను.” (అల్‌ మాయిద – 3)

ప్రశ్న: ఆయన మరణించారనడానికి ఆధారం ఏమిటి?

జవాబు : ఆయన మరణం సత్యమనడానికి దివ్యఖుర్‌ఆన్‌లోని ఈవచనమే నిదర్శనం.

“(ఓ ప్రవక్తా!) నీవూ మరణిస్తావు. వారూ మరణిస్తారు.చివరకు ప్రళయం నాడు మీరంతా మీ ప్రభువు సమక్షంలో మీ మీ వ్యాజ్యాలను వినిపిస్తారు.”(అజ్‌ జుమర్‌ – 30)

ప్రశ్న : మరణించిన పిదప ప్రజలు మళ్లీ  బ్రతికించబడతారా?

జవాబు : అవును. బ్రతికించబడతారు. దివ్యఖుర్‌ఆన్‌లోని ఈ ఆయత్‌ని చూడండి. “ఈ నేల నుండే మేము మిమ్మల్ని సృష్టిం చాము, దాని లోనికే మేము మిమ్మల్ని తిరిగి తీసుకుపోతాము. దాని నుండే మిమ్మల్ని మళ్లీ వెలికి తీస్తాము.” (తాహా-55)

ఇంకా ఈ విధంగా సెలవీయబడింది.

“అల్లాహ్‌ మిమ్మల్ని భూమి నుండి చిత్ర విచిత్రంగా మొలిపించాడు. తరువాత ఆయన మిమ్మల్ని ఈ భూమిలోకే తిరిగి తీసుకుపోతాడు. మళ్లీ దానినుండే ఎకాఎకీ మిమ్మల్ని బయటకు తీసి నిలబెడతాడు.” (నూహ్‌ – 17)

ప్రశ్న : తిరిగి బ్రతికించబడిన తరువాత ప్రజల లెక్క తీసుకోబడుతుందా? వారికి శిక్షాబహుమానాలు లభిస్తాయా?

జవాబు : అవును.ప్రజల లెక్క తేల్చబడుతుంది.వారి కర్మలను బట్టి శిక్ష విధించటమో, బహుమానం ఒసగటమో జరుగుతుంది.దీనికి ఆధారం ఇది: “చెడు చేసే వారికి, అల్లాహ్‌ వారి కర్మలకు ప్రతిఫలం ఇచ్చేందుకు, సదాచరణ వైఖరి అవలంబించిన వారికి మంచి ప్రతిఫలం ప్రసాదించేందుకు (అల్లాహ్‌ ఉన్నాడు)”. (అన్‌ నజ్మ్‌ -31)

ప్రశ్న : మరణానంతర జీవితాన్ని త్రోసిపుచ్చిన వ్యక్తి గురించి ఏమనబడింది?

జవాబు : మరణానంతర జీవితాన్ని త్రోసిపుచ్చిన వాడు అవిశ్వాసి (కాఫిర్‌) అని అనబడింది. దీనికి ఆధారం దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనం –

త్రాము మరణించిన తరువాత మళ్లీ లేపబడటం అనేది ఎంత మాత్రం జరుగదు అని అవిశ్వాసులు పెద్ద సవాలు విసిరారు. వారితో ఇలా అను: ‘కాదు, నా ప్రభువు సాక్షిగా! మీరు తప్పకుండా లేపబడతారు. తరువాత, మీరు (ప్రపంచంలో) ఏమేమి చేశారో అదంతా మీకు తప్పకుండా తెలియ జేయటం జరుగుతుంది. ఇలా చేయటం అల్లాహ్‌కు చాలా సులభం.” (అత్‌ తగాబున్‌ -7)

ప్రశ్న: అల్లాహ్‌ తన ప్రవక్తలకు ఏమని ఉపదేశించి పంపాడు?

జవాబు : దేవునిఏకత్వాన్ని (తౌహీద్‌ను) అవలంబించేవారికి స్వర్గలోకపు శుభవార్తనివ్వమనీ, బహు దైవోపాసన (షిర్క్‌)కు ఒడిగట్టే వారిని నరక యాతన గురించి హెచ్చరించమనీ అల్లాహ్‌ తన ప్రవక్తలకు ఉపదేశించి పంపాడు.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటి?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు –

“ఈ ప్రవక్తలందరూ శుభవార్తను తెలిపే వారుగా, హెచ్చరిక చేసేవారుగా పంప బడ్డారు-వారి ఆవిర్భావం తరువాత అల్లాహ్‌కు ప్రతికూలంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ సాకూ మిగల కూడదని.” (అన్‌ నిసా – 163)

ప్రశ్న : ప్రప్రథమ ప్రవక్త ఎవరు?

జవాబు : హజ్రత్‌ నూహ్‌ అలైహిస్సలాం.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటి?

జవాబు : ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు :

“(ప్రవక్తా!) నూహ్‌ వైవునకు, ఆయన తరువాతి ప్రవక్తల వైపునకు పంపినట్లుగా మేము నీ వైపునకు వహీ (దైవవాణి) ని పంపాము.” (అన్‌ నిసా -163)

ప్రశ్న : దైవప్రవక్త  పంపబడని జాతి ఏదైనా ఉందా?

జవాబు : లేదు. అన్ని జాతుల వద్దకు దేవుని తరఫున ప్రవక్తలు పంపబడ్డారు. దీనికి ఆధారంగా దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ ఆయత్‌ను గమనించండి:

“మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము: “అల్లాహ్‌ను ఆరాధించండి. మిథ్యా దైవాల (తాగూత్‌) ఆరాధ నకు దూరంగా ఉండండి.” (అన్‌ నహ్ల్ – 36)

ప్రశ్న : ‘తాగూత్’ అంటే అసలేమిటి?

జవాబు : ఆరాధన విషయంలో దాసుడు హద్దు మీరి పోవటమే ‘తాగూత్‌. తాగూత్‌ అనేది ఆరాధించే వానికీ, ఆరాధించబడే వానికీ వర్తిస్తుంది.తాగూత్‌ ఒక మిథ్య. ఒక పైశాచిక మార్గం.

ప్రశ్న : తాగూత్ లు ఎన్ని రకాలు?

జవాబు : అనేక రకాలు.అయికతే వాటిలో ఐదు రకాలు ముఖ్యమైనవి.

  • 1) దైవ ధూత్కారి అయిన ఇబ్లీస్‌
  • 2) అల్లాహ్‌ మినహా-ప్రజల చేత కొలవబడే వ్యక్తి
  • 3) తనను పూజించమని ప్రజలను కోరే వ్యక్తి.
  • 4) తనకు అగోచర జ్ఞానం ఉందని ప్రగల్భాలు పలికే వాడు.
  • 5) దైవం తరపున అవతరింపజేయబడిన షరీఅత్‌కు విరుద్ధంగా తీర్పులు చేసేవాడు (ఇటువంటి మిథ్యా దేముళ్ళను తిరస్కరించాలనీ, వారికి దూరంగా ఉండాలనీ, దైవ విధేయులుగా జీవించాలనీ అల్లాహ్‌ మనకు ఆజ్ఞాపించాడు).

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటి?

జవాబు : దివ్యఖుర్‌ఆన్‌లోని ఈ వచనమే దీనికి ఆధారం-

“ధర్మం విషయంలో నిర్బంధం గానీ, బలాత్కారం గానీ లేదు. సత్యవాక్కు అసత్య వాక్కుల నుండి ప్రస్ఫుటం చెయ్యబడింది.ఇక నుండి’తాగూత్‌’ను తిరస్కరించి, అల్లాహ్‌ను విశ్వసించిన వాడు సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆశ్రయం పొందినట్లే. (అతడు ఆశ్రయించిన) అల్లాహ్‌ సర్వమూ వింటాడు, సమస్తమూ తెలిసినవాడు.” (అల్‌ బఖరా – 256)

వేరొక చోట ఇలా సెలవిచ్చాడు :

మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరికచేశాము : “అల్లాహ్‌ను ఆరాధించండి. తాగూత్‌ (మిథ్యాదైవాల) ఆరాధన కు దూరంగా ఉండండి.” (అన్‌ నహ్ల్‌ -36)

ఇంకొక చోట ఇలా చెప్పబడింది.

ఓ ప్రవక్తా! ఇలా చెప్పు : “గ్రంథ ప్రజలారా! మాకూ-మీకూ మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి (అదేమిటంటే) మనం అల్లాహ్‌కు తప్ప మరెవరికీ దాస్యం చెయ్యరాదు. ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టరాదు.మనలోని వారెవరూ అల్లాహ్‌ను తప్ప మరెవరినీ తమ ప్రభువుగా చేసుకోరాదు అనేది”.ఈ సందేశాన్ని స్వీకరించటానికి వారు వైముఖ్యం కనబరిస్తే వారితో స్పష్టంగా ఇలా అను: “మేము ముస్లిములలో (కేవలం అల్లాహ్‌కే దాస్యం చేసేవారు, విధేయత చూపేవారు) అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి.” (ఆలి ఇమ్రాన్‌ – 64)

ఇదీ అసలు”లా ఇలాహ ఇల్లల్లాహ్‌” విసృత భావం హదీసులో ఇలా వుంది : “అసలు విషయం ఇస్లాం. దాని స్తంభం నమాజ్‌.దాని ఉన్నత సోపానం దైవ మార్గంలో పోరాటం.”


జుమా రోజు ఘనత (మూడు హదీసులు) [ఆడియో]

బిస్మిల్లాహ్

(9 నిముషాలు )
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)వారి 3 హదీసులు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
Recorded : 29-4-1441


6వ అధ్యాయం – ముస్లిం అనుచర సమాజానికి శుక్రవారం వైపు మార్గదర్శనం

496. హజత్‌ అబూహురైరా (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:- “ప్రపంచంలో మనం యావత్తు అనుచర సమాజాల కంటే వెనుక వచ్చాము. అయితే ప్రళయదినాన మనం అందరికన్నా మించిపోతాము. మనకు పూర్వమే యావత్తు అనుచర సమాజాలకు (దైవ) గ్రంధం లభించింది. మనకు వారి తరువాత లభించింది. (అంటే వారు గతంలోనికి పోయారు. మనం వారి వెనుక ఉన్నాం) కాని ఈ రోజు (అంటే శుక్రవారం) విషయంలో వారు దైవాజ్ఞ పాటింపుతో విభేదించారు. (అంచేత ఈ శుభదినం మనకు లభించింది. ఈ కారణంగానే మనం ప్రళయ దినాన వారిని మించిపోతాము) రేపటి దినం (శనివారం) యూదులకు లభించింది. ఎల్లుండి దినం (ఆదివారం) కైస్తవులకు లభించింది.”

[సహీహ్‌ బుఖారీ : 60వ ప్రకరణం – అంబియా, 54వ అధ్యాయం – హద్దసనా అబుల్‌ యమాన్‌]

నుండి: జుమా ప్రకరణంఅల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు)


1148. హజ్రత్‌ అబూహురైరా (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) ఈ విధంగా ప్రవచించారు:

“సూర్యుడు ఉదయించే దినాల్లో అన్నిటికంటే శ్రేష్టమైనది జుమా రోజు. ఆ రోజున ఆదం పుట్టించబడ్డారు. ఆ రోజునే స్వర్గంలోకి గొనిపోబడ్డారు. తిరిగి అదే రోజున అక్కడి నుండి తొలగించ బడ్డారు.” (ముస్లిం )

(సహీహ్‌ ముస్లింలోని జుమా ప్రకరణం)
నుండి: జుమానాటి ఘనత , జుమా నమాజుహదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ )


ఇతర లింకులు: